Activities calendar

04 May 2017

21:33 - May 4, 2017

హైదరాబాద్: జగన్ అక్రమాస్థుల కేసులో ఈడీ మరో ఛార్జ్ షీటు దాఖలు చేసింది. పెన్నా సిమెంట్స్ వ్యవహారంలో ఈడీ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలైంది. జగన్, విజయసాయిరెడ్డి, పెన్నా ప్రతాప్ రెడ్డిలను ఈడీ నిందితులుగా పేర్కొంది. నిందితులు మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు ఈడీ అభియోగం.

21:31 - May 4, 2017

హైదరాబాద్: బాహుబలి 2 కలెక్షన్ల మోత మోగిస్తోంది. జక్కన చెక్కిన గ్రాఫిక్‌ మూవీ..కాసుల పంట పండిస్తోంది. బాలీవుడ్‌ రికార్డులను బద్ధలుకొడుతూ బాక్సాఫిస్‌ను షేక్‌ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 6 రోజుల్లోనే 792 కోట్లు వసూళ్లు చేసి..పీకే, దంగల్‌ చిత్రాల పేరిట ఉన్న రికార్డులను బ్రేక్‌ చేసి దేశంలోనే హయ్యస్ట్ రెవెన్యూ మూవీగా నిలిచింది. హిందీ వర్షెన్‌ విడుదలైన 6 రోజుల్లోనే 375 కోట్లు రాబట్టి.. బాలీవుడ్‌లోనూ బాహుబలి..ది కన్‌క్లూజన్‌ సత్తా చాటింది.

21:29 - May 4, 2017

హైదరాబాద్: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి గజాల స్థలం కేటాయించింది. ఒలింపిక్స్ ర‌జ‌త పతకం సాధించినందుకు సర్కారు నజరానాగా ఈ భూమిని కేటాయించింది. ప్రగతి భవన్లో భూమికి సంబంధించిన పత్రాలను ముఖ్యమంత్రి కేసీఆర్ సింధుకు అందజేశారు. నగరంలో ఇంటి నిర్మాణం కోసం ఈ భూమిని ప్రభుత్వం అందించింది. స్థలం కేటాయించినందుకు సింధు, ఆమె తల్లిదండ్రులు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

21:27 - May 4, 2017

హైదరాబాద్: దర్శకరత్న దాసరి నారాయణరావు జన్మదిన వేడుకలు ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి. సినీ ప్రముఖులు, నటీనటులతో ఆయన నివాసం సందడిగా మారింది. సినీ ప్రముఖులు.. మురళీమోహన్, ఆర్‌ నారాయణమూర్తి, పరుచూరి గోపాలకృష్ణ తదితరులు దాసరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత చిరంజీవి, మోహన్‌బాబు, మంచులక్ష్మీ దాసరికి బర్త్‌ డే విషేస్‌ చెప్పారు. ఈ సందర్భంగా అల్లురామలింగయ్య అవార్డును దాసరి నారాయణరావుకు చిరంజీవి అందజేశారు.

21:26 - May 4, 2017

హైదరాబాద్: స్వచ్ఛ్ సర్వేక్షణ్‌ ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాలు సత్తా చాటాయి.. ఏపీలో 8 పట్టణాలు, తెలంగాణలో నాలుగు సిటీలు టాప్‌ 50లో చోటు దక్కించుకున్నాయి.. విశాఖ, తిరుపతి టాప్‌ టెన్‌ ర్యాంకుల్లో నిలవగా.. హైదరాబాద్‌ 22వన స్థానం సాధించింది...

సర్వేక్షణ్‌లో పోటీపడిన 500 పట్టణాలు

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా దేశవ్యాప్తంగా స్వచ్ఛత పాటించిన పట్టణాలకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ర్యాంకులు విడుదల చేశారు. ఈ ఏడాది సర్వేక్షణ్‌లో 500 పట్టణాలు పోటీపడగా 434 సిటీలు అర్హత సాధించాయి. ఇందులో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ మొదటి ర్యాంక్‌, భోపాల్‌ రెండో ర్యాంక్‌ సాధించాయి. గత రెండు సర్వేల్లో తొలి ర్యాంక్‌ సాధించిన మైసూర్‌ ఈసారి ఐదో స్థానానికి పరిమితమైంది.. ఏపీలో 8 పట్టణాలు, తెలంగాణలో నాలుగు సిటీలు, గుజరాత్‌ నుంచి 12, మధ్యప్రదేశ్‌ నుంచి 11 పట్టణాలు టాప్‌ 50లో స్థానం దక్కించుకున్నాయి.

విశాఖ మూడో స్థానం, తిరుపతి తొమ్మిదో స్థానం

తెలుగు రాష్ట్రాల్లోని పట్టణాలు ఈసారి మెరుగైన ర్యాంకులు సాధించాయి.. ఏపీలోని విశాఖ మూడో స్థానం... తిరుపతి తొమ్మిదవ ర్యాంక్‌తో సత్తాచాటాయి.. విజయవాడ 19, తాడిపత్రి 31, నర్సరావుపేట 40, కాకినాడ 43, తెనాలి 44, రాజమండ్రి 46వ స్థానంతో టాప్‌ 50లో చోటుదక్కించుకున్నాయి.. ఒంగోలు 70, చిత్తూరు 71వ స్థానంలో నిలిచాయి. ఇక తెలంగాణనుంచి హైదరాబాద్‌ 22వ ర్యాంక్‌లో నిలిచింది.. వరంగల్‌ 28, సూర్యాపేట్‌ 30, సిద్ధిపేట్‌ 45వ స్థానం దక్కించుకున్నాయి..

గుజరాత్‌లోని సూరత్‌కు నాలుగో ర్యాంక్‌

గుజరాత్‌లోని సూరత్‌ నాలుగో ర్యాంక్‌లో నిలిచింది. తిరుచురాపల్లి ఆరు, న్యూఢిల్లీ మున్సిపల్‌ కౌన్సిల్‌ ఏడు, నవీ ముంబయి ఎనిమిది, వడోదర పదో స్థానం సాధించాయి. ర్యాంకులు పొందిన పట్టణాలకు వెంకయ్య అభినందనలు తెలిపారు. 2019 నాటికి స్వచ్ఛభారత్‌ లక్ష్యం నెరవేరాలని ప్రధాని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

హైదరాబాద్‌కు 22వ ర్యాంక్‌

హైదరాబాద్‌కు 22వ ర్యాంక్‌ రావడంపై జీహెచ్‌ఎంసీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌, కమిషనర్‌ సంతోషం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది మరింత

స్వచ్ఛ సర్వేక్షణ్‌ జాబితాలో అట్టడుగు స్థానానికి యూపీ....

దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌.... స్వచ్ఛ సర్వేక్షణ్‌ జాబితాలో అట్టడుగు స్థానానికి పడిపోయింది.. ప్రధాని మోదీ నియోజకవర్గమైన వారణాసి మినహా మిగతా పట్టణాలన్నీ చివరి ర్యాంకుల్లోనే ఉన్నాయి. వారణాశి 32వ ర్యాంకు దక్కించుకుంది. యూపీలోని గోండా పట్టణం 434వ ర్యాంకుతో చివరి స్థానంలో నిలిచింది. ఇదే రాష్ట్రంలోని హర్దోయ్‌ 431వ ర్యాంకులో ఉంది. చివరి పది పట్ణణాల్లో ఉత్తరప్రదేశ్‌ నుంచి 5, బిహార్‌ నుంచి 2, పంజాబ్‌ నుంచి 2, మహారాష్ట్ర నుంచి ఒకటి ఉన్నాయి.

21:22 - May 4, 2017

హైదరాబాద్: ఏపీ , తెలంగాణలో మిర్చిఘాటు రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. మార్కెట్లలో రైతన్నల పరిస్థితి దయనీయంగా మారింది. ఖమ్మం మార్కెట్‌ యార్డులో.. మిర్చిని కొనేవాళ్లు లేక... పెట్టుబడిలో సగమైనా తిరిగిరాక రైతులు నరకయాతన అనుభవిస్తున్నారు.. రెండు రోజుల నుంచి మార్కెట్‌లోనే ఉంటున్నారు.. దొరికిందేదో తింటూ మార్కెట్‌లోనే పడుకుంటున్నారు.. మిర్చికి తగిన ధర రావడం లేదంటూ రైతులు మండిపడుతున్నారు.

వరంగల్‌ మార్కెట్‌లో మిర్చి ధర మరింత పడిపోయింది..

వరంగల్‌ మార్కెట్‌లో మిర్చి ధర మరింత పడిపోయింది.. క్వింటాలుకు కేవలం 500మాత్రమే ధర పలుకుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. మార్కెట్‌లోనే తమ పంటకు నిప్పంటించి తగలబెట్టేస్తామని.. 500లకుమాత్రం అమ్మబోమని రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు..

మిర్చి పంట ధరల పతనంతో ఏపీ రైతులు ఆందోళన బాటప...

మిర్చి పంట ధరల పతనంతో ఏపీ రైతులు ఆందోళన బాటపట్టారు... గుంటూరు మార్కెట్‌ యార్డులో ధర్నాకు దిగారు.. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు.. రాష్ట్ర ప్రభుత్వం 1500 రూపాయల సబ్సిడీ ఇచ్చినా.. కేంద్రం 5వేల రూపాయల మద్దతు ధర ప్రకటించినా ఇవేవీ అమలు కావడంలేదని ఆరోపించారు.. ప్రభుత్వాల ప్రకటనల తర్వాత ధర మరింత తగ్గించారని రైతులు చెబుతున్నారు..

బీజేపీ, టీఆర్‌ఎస్‌ల వాగ్వాదం..

మరోవైపు, మిర్చికి కేంద్రం ప్రకటించిన మద్దతు ధర.. బీజేపీ, టీఆర్‌ఎస్‌ల వాగ్వాదాన్ని పెంచింది. కేంద్రం ప్రకటన ఒక మిలీనియం జోక్‌ అని మంత్రి హరీశ్ రావు విమర్శించారు.. కేంద్రం చర్యలు కంటితుడుపుగా ఉన్నాయని ఆరోపించారు.. క్వింటాల్‌ మిర్చిని 7వేల రూపాయలకు కొనాలంటూ కేంద్రానికి లేఖ రాస్తానని తెలిపారు.. దీనికి ప్రతిగా బీజేపీ ఘాటుగానే స్పందించింది.. మిర్చి రైతులకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏంచేసిందో ముందు చెప్పాలని కిషన్‌ రెడ్డి డిమాండ్ చేశారు..

అటు మిర్చి రైతుల అవస్థలపై ప్రతిపక్షాలు విమర్శలు...

అటు మిర్చి రైతుల అవస్థలపై ప్రతిపక్షాలు విమర్శల వాడిని మరింత పెంచాయి.. సీఎం కేసీఆర్‌ సహా మంత్రులు ఢిల్లీకి వెళుతూనేఉంటారని.. అప్పుడు మిర్చి సమస్య చెప్పకుండా... హరీశ్ రావు ఇప్పుడు కేంద్రానికి లేఖ రాయడం విడ్డూరంగా ఉందని వీహెచ్‌ ఫైర్ అయ్యారు.. మొత్తానికి మిర్చి కొనుగోలు వ్యవహారం, రైతుల్లో ఆందోళనను, రాజకీయ నాయకుల్లో వాగ్వాదాన్ని పెంచుతోంది.

రాజేంద్రనగర్ సన్ సిటీలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్: రాజేంద్రనగర్ లో సన్ సిటీలో అగ్ని ప్రమాదం సంభవించింది. 3వ అంతస్తులో ఫర్నీచర్ షాపులో మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపకసిబ్బంది 3 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తోంది.

జగన్ అక్రమ ఆస్తుల కేసులో ఈడీ మరో ఛార్జ్ షీటు దాఖలు

హైదరాబాద్: జగన్ అక్రమాస్థుల కేసులో ఈడీ మరో ఛార్జ్ షీటు దాఖలు చేసింది. పెన్నా సిమెంట్స్ వ్యవహారంలో ఈడీ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలైంది. జగన్, విజయసాయిరెడ్డి, పెన్నా ప్రతాప్ రెడ్డిలను ఈడీ నిందితులుగా పేర్కొంది. నిందితులు మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు ఈడీ అభియోగం.

గురుకుల పోస్టులకు దరఖాస్తు గుడువు పెంపు: టీఎస్ పీఎస్సీ

హైదరాబాద్: తెలంగాణ లో గురుకుల పోస్టులకు టీఎస్ పీఎస్సీ దరఖాస్తు గడువును పొడిగించింది. ఆన్ లైన్ దరఖాస్తులో సాంకేతిక సమస్యలతో ఈ నెల 9 వరకు పొడిగించింది. పీజీటీ, టీజీటీ పోస్టులు, తెలుగు, హిందీ, ఉర్దూ భాషల్లో వేర్వేరుగా నిర్వహించనున్నట్లు తెలిపింది. అంతేకాకుండా పరీక్ష తేలను త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.

చీరాల టీడీపీలో వర్గ విభేదాలు

ప్రకాశం: చీరాల టీడీపీలో వర్గ విభేదాలు రోడ్డెక్కాయి. చీరాల గడియా స్తంభం సెంటర్ లో మాజీ మంత్రి రామారావు నిరాహార దీక్ష చేపట్టారు. టిడిపలోని తమ వ్యతిరేక వర్గానికి పోలీసులు కొమ్ముకాస్తూ తమ వర్గాన్ని వేధిస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు.

20:04 - May 4, 2017

హైదరాబాద్: చెత్తలేని నగరాలల్లో హైదరాబాద్ అదుర్స్.. దరిద్రానికి దండేసినట్లే ఉందంటున్న పబ్లిక్, ఉరితాడునే నమ్ముకున్న రైతులు....తీరుస్తదా ఈ సర్కార్ వారి వెతలు, దుబాయ్, బొంబాయ్, బొగ్గుబాయ్ కథ...రాసి చూస్తే ఉన్నది రామాయణమంతా, గోలివాడ కాడ సురువైన ప్రాజెక్టు కథ...సర్కార్ మెడకు మల్లొక పంచాయతీ, సూసైడ్ అటెంప్ట్ చేసిన చిరుత పులి...అచ్చంపేట అడవిలో బాయిలో భాగోతం, రోడ్డు మీద కూలిపోయిన విమానం...జర్రంతలో తప్పిపోయిన అపాయం అటూ ఈ రోజు మల్లన్న మన ముందుకు మల్లన్న ముచ్చట్లు కార్యక్రమంలో వచ్చారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

పాతబస్తీలో కార్డన్ సర్చ్... ఉద్రిక్తత

హైదరాబాద్: పాతబస్తీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. హుస్సేని ఆలం పార్దీవడాలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 150 మంది పోలీసులను పండ్ల వ్యాపారులు అడ్డుకున్నారు. వ్యాపారులు రోడ్లపై ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

19:28 - May 4, 2017

హైదరాబాద్: నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టే ఉంది పాలకుల వైఖరి. మిర్చికి మద్దతుధర ఇచ్చినట్టే ఇచ్చి.. కొనుగోలుపై పరిమితి విధించడం దేనికి సంకేతం..? ప్రకటించిన మద్దతు ధర మిర్చిరైతుకు ఉపశమనం కల్గించేదేనా..? మద్దతుధర సరిపోదంటూనే.. ఇద్దరు సీఎంలు నోరెందుకు మెదపడంలేదు..? ఇవే అంశాలపై హెడ్ లైన్ షో లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో తెలంగాణ రైతు సంఘం నేత సాగర్, బిజెపి శ్రీధర్ రెడ్డి, టిఆర్ ఎస్ నేత గోవర్థన్ రెడ్డి, టిడిపి నేత దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు. పూర్తి వివరా లకోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

19:25 - May 4, 2017

హైదరాబాద్: ధరలు దారుణంగా పడిపోయి.. ఆత్మహత్యలకు పాల్పడుతున్న మిర్చిరైతులను ఆదుకున్నట్టే.. ఎక్కడలేని హడావిడి చేసిన కేంద్రం.. చివరికి అరకొర మద్దతు ధరను ప్రకటించింది. పైగా కొనుగోలుపై షరతులు పెట్టింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అయ్యోపాపం అంటూనే.. కేంద్రాన్ని నిలదీయకుండా సైలెంట్‌ అయ్యాయి.

పంట పండింది కొండంత కొనేది గోరంత.. అన్నట్టుగా ...

పంట పండింది కొండంత కొనేది గోరంత.. అన్నట్టుగా తయారైంది పరిస్థితి. తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది క్వింటాళ్ల మిర్చిపంట పోగుపడి ఉంటే.. కేవలం కొన్ని వేల క్వింటాళ్లను మాత్రమే కొనాలంటూ షరతులు విధించడంపై అన్నదాతల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అసలు మొదటి నుంచి మిర్చిరైతులపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు మొసలికన్నీరే కార్చాయి. మిర్చికి మద్దతుధర కేంద్రమే ప్రకటించాలని.. తమ చేతుల్లే ఏమీ లేదని చెప్పుకుంటూ ఏపీ, తెలంగాణ సీఎంలు తమ బాధ్యతను దులపరించుకునే ప్రయత్నం చేశారు. దీంతో మిర్చి రైతులు ఆందోళనలతో రెండు రాష్ట్రాలు అట్టుడికిపోయాయి.

క్వింటాలుకు రూ. 5వేలు , ఇతర ఖర్చుకులకు మరో రూ.1250 ...

ఈనేపథ్యంలో మిర్చికి క్వింటాలుకు 5వేలు, రవాణా, కమీషన్‌లాంటి ఇతర ఖర్చుల కోసం మరో 1250 రూపాయలను ఇస్తున్నట్టు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించారు. దాంతో పాటు కొనుగోలు చేసిన మొత్తం మిర్చిలో నష్టం వస్తే ఆ భారాన్ని రాష్ట్రం, కేంద్రం చెరిసగం భరిస్తాయని వెంకయ్య చెప్పారు. ఆ నష్టం కూడా 25శాతానికి మించితే తమకు బాధ్యత లేదన్నట్లుగా వెంక్యయ మెలికపెట్టారు. దీనిపై మిర్చి రైతుల్లో నిరసన వ్యక్తం అవుతోంది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతుధర తమకు ఏమాత్రం ఉపశమనం కాదంటున్నారు. కనీసం గతంలో ఇచ్చినట్టుగా క్వింటాలుకు 8వేల రూపాయలైనా ఇస్తారనుకుంటే.. తమ ఆశలపై కేంద్రం నీళ్లు చల్లిందని మిర్చి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏపీలో 88వేల 300 మెట్రిక్‌ టన్నుల కొనుగోలు...

మద్దతుధర ప్రకటించిన కేంద్రం మరో ట్విస్ట్‌ ఇచ్చింది. ఈ మద్దతుధర వర్తించేది కొన్ని వేల క్వింటాళ్లకు మాత్రమేని, అదీ ఈనెలాఖరు వరకే కొనుగోళ్లు చేపట్టాలని రాష్ట్రాలకు తేల్చి చెప్పింది. ఏపీలో 88వేల 300 టన్నులు, తెలంగాణలో కేవలం 33వేల 700 టన్నులు మాత్రమే కొనాలని షరతులు పెట్టింది. అయితే వాస్తవానికి ఒక్క తెలంగాణరాష్ట్రంలోనే 3లక్షల 35వేల టన్నుల మిర్చిపంట దిగుబడి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వమే అంచానా వేసింది. అటు ఏపీలో అయితే దిగుబడి ఏకంగా 12 నుంచి 15లక్షల క్వింటాళ్ల వరకు ఉంటోంది. ఇక్కడ మరోవిషయం ఏంటంటే.. కేంద్రం ప్రకటించిన మద్దతుధర, కొనుగోలు పరిమితి.. కేవలం గ్రేడ్‌వన్‌ మిర్చికి మాత్రమే. మరి.. మిగతా గ్రేడ్ 2, గ్రేడ్ 3రకాలకు ఎవరు జవాబు దారీ అంటున్నారు రైతులు. దీంతో మిర్చిరైతుల సమస్యలపట్ల కేంద్రానిది మొసలి కన్నీరే ననేది స్పష్టం అవుతోందని విపక్షాలు అంటున్నాయి. అటు కేంద్రం నిర్ణయంపై మార్కెటింగ్‌శాఖ అధికారులు కూడా విస్మయం ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం వస్తున్న మిర్చిపంట మొత్తాన్ని కొనుగోలుచేయడం వల్ల దాదాపు 600 కోట్ల నష్టం వచ్చే అవకాశముందని, కానీ కేంద్రం మాత్రం ఆ నష్టం 150 కోట్లకు మించకూడదనే రీతిలో ప్రకటన చేసిందని అంటున్నారు. కేంద్రం విధించిన కొనుగోలు పరిమితి ప్రకారం తెలంగాణలో రెండు రోజుల్లో, ఏపీలో నాలుగు రోజుల్లో కొనుగోళ్లు పూర్తవుతాయని చెబుతున్నారు. దీంతో కేంద్రం ప్రకటించినట్టు ఈనెలాఖరు వరకు కొనుగోళ్లకు అవకాశమే లేదని అధికారులు తేల్చిచెబుతున్నారు.

మద్దతు ధరలు ప్రకటించిన కేంద్రం .. కొనుగోళ్లపై కొర్రిలు...

మద్దతు ధరలు ప్రకటించిన కేంద్రం .. కొనుగోళ్లపై కొర్రిలు పెట్టిందని తెలుగు రాష్ట్రాలు విమర్శిస్తున్నాయి. కేంద్రం నిర్ణయం మిలీనియం జోక్‌ అని తెలంగాణ మార్కెటింగ్‌ శాఖామంత్రి హరీశ్‌రావు అన్నారు.

రూ. 8వేలు మద్దతు ధర ఇవ్వాలన్ని గతంలో చంద్రబాబు హడావిడి...

అటు ఏపీ ముఖ్యమంత్రికూడా మద్దతు ధరను 8వేలుగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. 8వేల కంటే తక్కువ ధరలు లభిస్తే.. క్వింటాలుకు గరిష్టంగా 15వందల రూపాయలు ఇవ్వాలని.. ఆ పరిహారం కూడా ఒక్కో రైతుకు 20క్వింటాళ్ల వరకు వర్తింపజేయాలని కేంద్రానికి గొప్పగా సూచించారు సీఎం చంద్రబాబు . దీనికోసం 120 నుంచి 150 కోట్ల వరకు ఖర్చవుతాయని.. కేంద్రం ఉదారంగా సాయం చేయాలని కోరారు. అయితే.. సీఎం చంద్రబాబు కేంద్ర వ్యవసాయమంత్రి రాధామోహన్‌సింగ్‌ను కలిసిన కొద్దిగంటల్లోనే మిర్చికి మద్దతుధర 5వేలే నంటూ కేంద్రం ప్రకటించడంతో రైతుల ఆశలపై నీళ్లు చల్లినట్టైంది.

రూ. 1500 పరిహారంపై ఏపీ సర్కార్‌ వెనుకంజ..!

ఇదిలావుటే .. కేంద్రం సాయం ప్రకటించింది కాబట్టి.. తాము ఇంతకు ముందు ప్రకటించిన 15 వందల రూపాయిల సాయం విషయంలో వెనక్కి తగ్గాలని ఏపీ సర్కార్ ఆలోచిస్తున్నటు వార్తలు వస్తున్నాయి. దీంతో మరోసారి గుంటూరులో మార్కట్‌లో రైతుల ఆందోళన మొదలైంది. అటు వరంగల్ జిల్లా ఎనుమాముల, ఖమ్మం మిర్చి మార్కెట్ లలో కూడా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అసలు ఈ పరిస్థితి ఇక్కడి దాకా రావడానికి కారణం ఎవరు...? పత్తిపంటకు బదులుగా మిర్చి వేసుకోవాలని చెప్పింది ఎవరు.. ? కేంద్రం ఎగుమతులను ఆపేసిందంటూ చెబుతూ వస్తున్న టీడీపీ నేతలు, ఏపీ సీఎం.. ఈ విషయమై ఎందుకు కేంద్రాన్ని నిలదీయలేకపోయారు...? అని మిర్చిరైతులు ప్రశ్రిస్తున్నారు.

సర్పంచ్ ల గౌరవ వేతనాలు చెల్లించేందుకు నిధులు విడుదల

హైదరాబాద్: తెలంగాణ లో సర్పంచ్ ల గౌరవ వేతనాలు చెల్లించేందుకు ముప్పైతొమ్మిది కోట్ల ఏడు లక్షల ఎనభై వేల రూపాయలను తెలంగాణ సర్కార్ మంజూరు చేసింది.

19:02 - May 4, 2017

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు తన కొడుకు లోకేశ్‌ జపం చేస్తున్నారని వైసీపీ నేత పార్థసారధి విమర్శించారు.. పాలన వదిలేసి లోకేశ్‌ ప్రమోషన్‌పైనే ఎక్కువ దృష్టిపెట్టారని ఆరోపించారు.. లోకేశ్‌కు ఏం అనుభవం ఉందని అతి తక్కువ సమయంలోనే ముఖ్యమైన పదవులన్నీ ఇస్తున్నారని ప్రశ్నించారు..

19:00 - May 4, 2017

గుంటూరు : నగరంలోని మిర్చి యార్డు ఎదుట రైతులు ఆందోళన చేస్తున్నారు. కేంద్రం ప్రకటించిన 5 వేలు మద్దతు ధర సరిపోదని నిరసన తెలుపుతున్నారు. మద్దతు ధర 10 వేలు ప్రకటించాలని రైతుల డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు మార్కెట్‌కు మిర్చి భారీ ఎత్తున చేరుకుంది. రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహించిన రైతులు రోడ్లపై మిర్చిని పోసి నిప్పంటించారు. దీంతో మార్కెట్‌ యార్డులో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

నటుడు కమల్ హాసన్ కు కోర్టులో ఊరట

చెన్నై: విలక్షణ నటుడు కమల్‌హాసన్‌ కు మద్రాస్‌ హైకోర్టులో ఊరట లభించింది. కింద కోర్టు ఇచ్చిన సమన్లపై న్యాయస్థానం గురువారం స్టే విధించింది. కాగా హిందువులు పవిత్రంగా భావించే మహాభారతాన్ని అవమానించారంటూ కమల్‌హాసన్‌ పై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. దీనిపై కమల్‌ హాసన్‌ హైకోర్టు ఆశ్రయించడంతో వలియూర్‌ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చింది. కాగా ఈ ఏడాది మార్చి 12న ఓ తమిళ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్‌ హాసన్‌ మహాభారతంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసినట్టు నరుంబూనాథర్‌ ఆలయ భక్తుల సమాఖ్య కార్యదర్శి ఆదినాథ సుందరం ఫిర్యాదు చేశారు.

18:34 - May 4, 2017

తండ్రిని పొడిచిన కొడుకు...కొపంతో గొంతు కోసిన అన్న

యాదాద్రి : గాంధీనగర్ లో అన్నదమ్ముల మధ్య ఘర్షణను అడ్డుకున్న తండ్రిని పగిలిన బీరుసీసాతో తమ్ముడు పొడిచాడు. ఆగ్రహంతో అన్న హరీష్, తమ్ముడు నర్సింహ గొంతు కోశాడు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. ఘర్షణకు ఆస్తి తగాదాలే కారణమని తెలుస్తోంది.

 

17:55 - May 4, 2017

హైదరాబాద్: అవినీతి పరుడైన ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ ను సీఎం ఎలా పక్కన పెట్టుకుంటారని ఫైరయ్యారు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు. ఆయనపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు తీర్పు ఇచ్చినా కేసీఆర్ ఎందుకు పట్టించుకోవట్లేదని ఆయన ప్రశ్నించారు. మరోవైపు మిర్చి రైతులకు క్వింటాల్ కు కనీసం 10వేల రూపాయలు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మిర్చి సమస్య నుంచి దృష్టి మరల్చేందుకే దిగ్విజయ్ సింగ్ పై కేసు నమోదుచేశారన్నారు వి.హెచ్.

17:54 - May 4, 2017

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో విద్యుత్‌ ఉద్యోగులు పనిచేయాలని సీఎం కేసీఆర్ అన్నారు. 24 వేల ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామన్నారు. అంతేకాదు రాష్ట్రంలో ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ అన్న విధానం ఉండకూడదన్నారు. ఒకవేళ కాంట్రాక్ట్‌ పద్ధతిన తీసుకున్నా వారికి పనికి తగ్గ వేతనం ఇవ్వాలన్నారు. వచ్చే ఎన్నికలలోపే వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ ఇస్తామన్నారు.

ఫ్లిప్ కార్ట్ లో విక్రయాలను నిలివేసిన బీపీఎల్

ముంబై : ప్రముఖ ఈ కమర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో విక్రయాలు జరిపే, వైట్ గూడ్స్ తయారీ సంస్థ బీపీఎల్ అమెజాన్ ప్లాట్ ఫామ్ పైకి వెళ్లింది. గురవారం నుంచి తమ ఉత్పత్తులను ఎక్స్ క్లూజివ్ గా అమ్మనున్నట్టు ఈ కంపెనీ ప్రకటించింది. 1990లో మోస్ట్ పాపులర్ టెలివిజన్ బ్రాడ్స్ లో బీపీఎల్ ఉండేది. తర్వాత ఈ కంపెనీ 2006లో ఎలక్ట్రానిక్స్ ను విక్రయించడం ఆపివేసింది. కానీ గతడాదే ఆ కంపెనీ మళ్లీ మార్కెట్లోకి రీఎంట్రీ ఇచ్చింది.

 

17:52 - May 4, 2017

కామారెడ్డి : జిల్లాలోని వంద పడకల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి అనేక సమస్యలకు నిలయంగా మారింది. తగినంతమంది వైద్యులు లేరు.. సదుపాయాలు లేవు. దీంతో పేదలకు మెరుగైన సేవలు అందడం లేదు. హాస్పటల్‌కి నిత్యం 400 వందల ఓపీ... పది నుంచి 20 వరకు ఇన్‌పేషంట్లు వస్తుంటారు. కానీ ఇక్కడ తొమ్మిది మంది వైద్యులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు.. గైనకాలజిస్ట్‌ ఒకరే ఉండడంతో ఆస్పత్రిలో ప్రసవాల నిర్వహణకు ఇబ్బందిగా మారింది. అలాగే పిల్లల వైద్యులు నలుగురు మాత్రమే ఉన్నారు. మూడు వార్డులకు ఒకే స్టాఫ్‌ నర్స్‌ పనిచేస్తున్నారు. ఉన్నవారిపైనే అదనపు పనిభారం పడడంతో డ్యూటీలు చేయడానికి భయపడుతున్నారు.

ఆందోళనలో రోగులు...

ఆస్పత్రిలో సరిగా సేవలందకపోవడంతో... రోగులు ఆందోళనకు దిగుతున్నారు. వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో ఒకే రోజు జరిగిన 16 ప్రసవాలలో... పుట్టిన ఇద్దరు మగబిడ్డలు చనిపోయారు. దీంతో వారు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. అయితే వైద్యుల కొరత కారణంగానే ఇలా జరిగిందని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు సిబ్బందిని, వైద్యులను నియమించాలని కోరుతూ గత కొన్ని రోజుల నుంచి ఉదయం గంట సేపు వైద్యులు విధులు బహిష్కరించి..ఆందోళన చేస్తున్నారు. రాబోయే రోజుల్లో రోగుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికైనా సిబ్బంది కొరతను తీర్చాలని వైద్యులు, ప్రజలు కోరుతున్నారు.

17:51 - May 4, 2017

హైదరాబాద్: బహిరంగ సభల కోసం వ్యాపారుల దగ్గర డబ్బులు వసూలు చేసిన కేసీఆర్ సర్కార్ రైతుల్ని మాత్రం గాలికొదిలేసిందని విమర్శించారు బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి. మిర్చి ధర విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసిన పరిస్థితుల్లో రైతుల్ని ఆదుకునేందుకు కేంద్రం ముందుకు వచ్చిందని ఆయన అన్నారు. రైతు సమస్యల్ని పట్టించుకునే ఓపిక కేసీఆర్ కి లేదని కిషన్ రెడ్డి ఆరోపించారు.

17:45 - May 4, 2017

విజయవాడ: కేఎల్‌ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశానికి దేశవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షా ఫలితాలను యూనివర్సిటీ ఉపాధ్యక్షులు కోనేరు రాజా హరీన్ గురువారం విడుదల చేశారు. 31 వేల 232 మంది అర్హత సాధించారని, 30 వేల ర్యాంకుల వరకు మొదటి కౌన్సెలింగ్‌కు పిలవనున్నట్టు ఆయన తెలిపారు. 14 నుంచి 17వరకు నాలుగురోజుల పాటు కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు www.kluniversity.in వెబ్ సైట్ ద్వారా ర్యాంక్ కార్డులను పొందవచ్చన్నారు.

17:44 - May 4, 2017

హైదరాబాద్: పదో తరగతి ఫలితాల్లో బ్రిలియంట్‌ విద్యా సంస్థల విద్యార్థులు విజయ దుందుభి మోగించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు.. సంస్థ అధినేత కసిరెడ్డి నారాయణరెడ్డి ..విద్యార్థులకు అభినందనలు తెలిపారు. 45 మందికి పదికి పది పాయింట్లు సాధించారని..99శాతం ఉత్తీర్ణత సాధించడం జరిగిందని కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్పారు. ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల సహాయ సహకారాలతోనే ఇది సాధ్యమైందని ఆయన అన్నారు.

ఒక తలకు వంద తలలు

ఢిల్లీ : భారత్ పాక్ సరిహద్దులో ఎల్ వోసీ వద్ద పాక్ దుశ్చర్యను దేశప్రజలంతా ముక్తకంఠంతో ఖండించారు. భారత్ చెందిన ఇద్దరు సైనిలకు తలలను నరకడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నారు. తాజాగా యోగా గురువు బాబా రాందేవ్ పాక్ సైనికుల తీరుపై తీవ్రంగా స్పందించారు. ఒక తలకు వంద తలలు తీసుకురావాలని వ్యాఖ్యనించారు.

టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్

గుంటూరు : తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గా అనిల్ కుమార్ సింఘాల్ నియమిస్తు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

యూపీ లో రూ.5లకే భోజనం

లక్నో : నిరుపేద ప్రపజల ఆకలిని తీర్చేందుకు యూపీ ప్రభుత్వం రూ.5 భోజనాన్ని అందించే పథకాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఉదయం టిఫిన్ గా పకోడా, పోహ, ఓట్స్ తో తయారు చేసిన పదార్థాలు, టీ అన్ని కలిపి రూ.3లకే ఇవ్వనున్నారు. మధ్యాహ్నం, రాత్రి వేళల్లో అన్నం, చపాతీ, కూరగాయల కూర, పప్పు కలిపి రూ.5లకే ఇవ్వనున్నారు.

16:44 - May 4, 2017
16:42 - May 4, 2017

గుంటూరు : అవి చూడగానే నోరూరించే రుచులు. ఒక్కసారైనా రుచి చూడాలనిపించే సంప్రదాయ వంటలు. ఆ అవ్వ చేతి మహత్యం ఏంటో గానీ... ఏది వండినా అమృతమే. గుంటూరు జిల్లా, తెనాలి మండలంలోని గుడివాడ గ్రామం. ఈ అవ్వ పేరు మస్తానమ్మ. వయస్సు 106 ఏళ్లు. తన వంట రుచులతో అందరినీ మైమరచిపోయేలా చేస్తోంది. ప్రపంచం మొత్తాన్ని తన వైపుకు తిప్పుకుంది. రొయ్యల ఫ్రై, పుచ్చకాయ చికెన్‌, ఫిష్ ఇలా ఏదైనా సరే.. ఈ అవ్వ చెయ్యి తగిలిందంటే అమృతమవ్వాల్సిందే.

రకరకాల మాంసాహరా వంటలు...

మస్తానమ్మ బిర్యాణి.. రకరకాల మాంసాహార వంటలు అద్భుతంగా చేస్తుంది. ఇంత వయస్సు వచ్చినా తానే స్వయంగా వంట చేసుకొని తింటుంది. అందరికీ తినిపిస్తుంది. తన 1000 రూపాయల పెన్షన్‌తోనే రోజులు వెళ్లదీస్తుంది. ఇప్పటికీ పొలం పనులు చేస్తుంది. మస్తానమ్మ 22వ యేటనే తన భర్త చనిపోయాడు. ఈమె సంతానంలో ఒక్క కొడుకు మాత్రమే ఉన్నాడు.

మస్తానమ్మ మనవడు తన స్నేహితులతో కలిసి...

మస్తానమ్మ మనవడు తన స్నేహితులతో కలిసి ఈ వీడియోలు తీశాడు. కంట్రీఫుడ్స్‌ పేరుతో గతేడాది ఆగస్టులో ఓ ఛానెల్‌ను ప్రారంభించాడు. అందులో మస్తానమ్మ చేతి వంటలన్నీ పెట్టారు. ఈమె వండిన వంటల వీడియోలు 40 దాకా అప్‌లోడ్ చేశారు. ఈ ఛానెల్‌కి 2.30 లక్షల సబ్‌స్క్రైబర్స్‌ ఉన్నారు. 43 మిలియన్ల మంది ఈ వీడియోలను వీక్షించారు.

తన చేతితో వంట చేసి అందరికీ పెడితే..

తన చేతితో వంట చేసి అందరికీ పెడితే.. తనకి చాలా ఆనందంగా ఉంటుందని మస్తానమ్మ తెలిపింది. ఎవరిమీద ఆధారపడకుండా జీవించడమే తనకు ఇష్టమని తెలిపింది. తాను సరదాగా చేస్తున్న ఈ వంటలకు ఇంత ప్రచారం కలుగుతుందని ఊహించలేదని మస్తానమ్మ తెలిపింది. వేరే దేశాల నుంచి బర్త్‌డే గ్రీటింగ్ కార్డులు వచ్చాయని.. ఫోన్లు వస్తుంటాయని మస్తానమ్మ తెలిపింది.

పూరి గుడిసెలో ఉంటూ రాళ్ల పొయ్యిపై వంట చేస్తూ ...

మస్తానమ్మ ఒక పూరి గుడిసెలో ఉంటూ రాళ్ల పొయ్యిపై వంట చేస్తూ ఉంటుంది. అయితే తనకు ఈ మధ్యనే కళ్లలో శుక్ల కణాలు వచ్చాయని చెప్పింది. వీడియోలు చూసిన ప్రేక్షకులు ఆపరేషన్ చేయిస్తామని అడుగుతుంటారని చెప్పింది. వాళ్ల అభిమానం చూస్తే చాలా సంతోషంగా ఉంటుందని ఆమె తెలిపింది.

స్వశక్తితో జీవిస్తోన్న మస్తానమ్మ జీవితం ...

ఈ తరం యువతీయువకులు చిన్న చిన్న విషయాలకే నిరాశలో కూరుకుపోతున్నారు. ప్రతీ చిన్నపనికీ మరొకరిపై ఆధారపడుతున్నారు. అలాంటివారికి ఇప్పటికీ స్వశక్తితో జీవిస్తోన్న మస్తానమ్మ జీవితం ఆదర్శమనే చెప్పాలి. ఈ వయస్సులోనూ ఇంత చురుగ్గా పని చేస్తోన్న మస్తానమ్మను ఇప్పటి యువత రోల్‌మోడల్‌గా తీసుకోవాల్సిందే.

16:39 - May 4, 2017

నాగర్‌కర్నూల్‌ : జిల్లాలో ప్రమాదవశాత్తు బావిలో పడిపోయిన ఓ చిరుతను ఫారెస్ట్‌ అధికారులు రక్షించారు. అచ్చంపేట మండలం .. భక్కలింగాయపల్లి గ్రామ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చిరుత బావిలో పడిపోయిన విషయాన్ని గుర్తించిన రైతులు సమాచారం ఇవ్వడంతో...వరంగల్‌ రెస్క్యు టీం రంగంలోకి దిగి..చిరుతపులిని రక్షించారు.

 

16:37 - May 4, 2017

కృష్ణా : విజయవాడ పాతబస్తీ వాగు సెంటర్‌లో రోడ్డు కుంగి... వాటర్‌ లీకేజ్‌ అయింది. దీంతో ఆ ప్రాంతంలో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. రోడ్ల నిర్మాణంలో నాణ్యత లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని.. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

16:36 - May 4, 2017

అనంతపురం : పెనుగొండలో కార్ల పరిశ్రమకు భూములిచ్చినవారికి ఒకేసారి పరిహారం ఇవ్వాలంటూ నిర్వాసితులు డిమాండ్ చేశారు.. అలాగే తమ పిల్లలకు ఉద్యోగాల కల్పనలో ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. పెనుగొండ మండలంలో కియా కార్ల పరిశ్రమ ఏర్పాటుకాబోతోంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఈ పరిశ్రమకోసం 350మంది రైతులు 596 ఎకరాల భూమిని ఇచ్చారు.

విద్యుత్ ఉద్యోగుల క్రమబద్దీకరణ

హైదరాబాద్ : ఔట్ సోర్సింగ్ లో ఉన్న 24వేల మంది కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని ఆదేశించామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.

 

16:34 - May 4, 2017

అమరావతి: మిర్చిరైతులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయని వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మిర్చి మద్దతుధర 10వేలకు తగ్గకుండా ఇవ్వాలని డిమాండ్ చేశారు. గుంటూరు మార్కెట్‌యార్డ్‌లో మిర్చిని అమ్ముకోవడానికి వారం పది రోజులు రైతులు పడిగాపులు కాస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అగ్రోప్రాసెస్‌ ఇండస్ట్రిలను అభివృద్ధి చేయాలన్నారు.

16:33 - May 4, 2017

శ్రీనగర్ : కశ్మీర్‌లో భారీ హిమపాతం బీభత్సం సృష్టించింది. మంచుపెళ్లలు విరిగిపడటంతో బస్సు లోయలోకి పడిపోయింది. దీంతో బస్సు 1500 అడుగుల లోతులో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. ముగ్గురు గాయపడ్డారు. మరో నలుగురు ప్రయాణికుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

విద్యుత్ ఉద్యోగుల క్రమబద్దీకరణ

హైదరాబాద్ : ఔట్ సోర్సింగ్ లో ఉన్న 24వేల మంది కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని ఆదేశించామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.

 

విద్యుత్ ఉద్యోగుల క్రమబద్దీకరణ

హైదరాబాద్ : ఔట్ సోర్సింగ్ లో ఉన్న 24వేల మంది కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని ఆదేశించామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.

 

విద్యుత్ ఉద్యోగులతో సీఎం కేసీఆర్ భేటీ

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ విద్యుత్ ఉద్యోగులతో సమావేశం అయ్యారు. విద్యుత్ ఉద్యోగుల కృషి వల్లే ఈ రోజు విద్యుత్ కోతలు లేని తెలంగాణ సాధ్యమైందన్నారు. విద్యుత్ రంగంలో అద్భుతమైన విజయం సాధించామని అన్నారు.

16:01 - May 4, 2017

శ్రీనగర్ : కశ్మీర్‌ లోయలో ఇటీవల ఉగ్రవాద ఘటనలు పెరిగిపోతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. వరుస దాడులతో చెలరేగిపోతున్న ఉగ్రవాదులను ఉక్కుపాదంతో అణిచివేసేందుకు సైన్యం దక్షిణ కశ్మీర్ లోని షోపియన్ జిల్లాలో భారీ యాంటీ టెర్రరిస్టు ఆపరేషన్ చేపట్టింది. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్న వీడియో ఒకటి వెలుగు చూడడంతో ఆర్మీ సెర్చ్‌ ఆపరేషన్‌ మొదలెట్టింది.

సుమారు 3 వేల మంది ఆర్మీ జవాన్లు, సిఆర్‌పిఎప్‌ బలగాలు,...

సుమారు 3 వేల మంది ఆర్మీ జవాన్లు, సిఆర్‌పిఎప్‌ బలగాలు, జమ్ముకశ్మీర్‌ పోలీసులు సెర్చ్‌ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. మిలిటెంట్లను పట్టుకునేందుకు షోపియన్ జిల్లాలోని 20 గ్రామాలను ఖాళీ చేయించారు. మరో 10 గ్రామాలను దిగ్బంధించారు. భద్రతా దళాల భారీ ఆపరేషన్ నేపథ్యంలో కొన్ని గ్రామాల్లో మిలిటెంట్లకు రక్షణగా యువకులు జవాన్లపై రాళ్లు రువ్వే అవకాశం ఉండడంతో వీటికి తగ్గట్టుగా ఆర్మీ చర్యలు చేపట్టింది.

పోలీసులపై మిలిటెంట్లు దాడి చేసి....

బుధవారం అర్ధరాత్రి దాటాకా దక్షిణ షోపియన్ జిల్లాలో ఓ కోర్టు కాంప్లెక్స్‌కు భద్రతగా ఉన్న పోలీసులపై మిలిటెంట్లు దాడి చేసి.. ఐదు సర్వీస్ రైఫిళ్లు ఎత్తుకెళ్లారు. గత మూడు రోజులుగా దక్షిణ కశ్మీర్‌లోని బ్యాంకులపై మిలిటెంట్లు వరసగా దాడులు చేస్తున్నారు. బుధవారం ఒక్కరోజే రెండు గంటల వ్యవధిలో పుల్వామా జిల్లాలో రెండు వేర్వేరు బ్యాంకుల్లోకి ఉగ్రవాదులు చొరబడి నగదుతో పరారయ్యారు. సోమవారం కుల్గామ్‌ జిల్లాలో జమ్ముకశ్మీర్‌ బ్యాంక్‌కు చెందిన క్యాష్‌ డెలివరీ వ్యాన్‌పై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు పోలీసులు, ఇద్దరు బ్యాంకు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఉగ్రవాదులు క్యాష్‌ వ్యాన్‌లో ఉన్న 50 లక్షల నగదు, ఆయుధాలు తీసుకుని పరారయ్యారు. ఆయుధాలు, డబ్బే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులు తీవ్రం చేయడంతో అప్రమత్తమైన ఆర్మీ ఆపరేషన్‌ మొదలెట్టింది.

15:58 - May 4, 2017

విశ్వనాథ్ కు ఘన స్వాగతం పలికిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహిత కె. విశ్వనాథ్ కు తెలంగాణ ప్రభుత్వం తరుపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘన స్వాగతం పలికారు.

శ్రీవారి హుండీ చోరికి విఫలయత్నం

చిత్తూరు : తిరుమల శ్రీవారి హుండీ చోరీకి దొంగ విఫయత్నం చేశాడు. చోరికి పాల్పడుతుండగా సీసీ కెమెరాల ఆధారంగా వేలాయుదం అనే పాత నేరస్థుడిని విజిలెన్స్ అధకారులు పట్టుకున్నారు.

 

15:44 - May 4, 2017

విజయవాడ : రాజధాని ప్రాంతంలో కృష్ణానదిని కబ్జా చేసి ... మధ్యలో కృత్రిమ ద్వీపాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించిన ప్రాంతాన్ని వైసీపీ నాయకులు పరిశీలించారు. నదిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తే.. అధికారులు స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని వైసీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

15:43 - May 4, 2017

కృష్ణా : విజయవాడ వాంబేకాలనీలోని డిస్నీల్యాండ్‌ భూముల్లో పేద ప్రజలకు ప్రభుత్వం ఇళ్లు కట్టించివ్వాలని సీపీఎం ఏపీ రాష్ట్రకార్యదర్శివర్గసభ్యులు బాబూరావు డిమాండ్ చేశారు. నిరూపయోగంగా ఉన్న డిస్నీల్యాండ్‌ భూములను సీపీఎం నేతలు పరిశీలించారు. కొందరు బడాబాబులు లీజు పేరుతో స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని.. కార్పొరేషన్‌ అధికారులు వెంటనే భూములను స్వాధీనం చేసుకోవాలని బాబూరావు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలతో కలిసి పెద్దఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు.

15:41 - May 4, 2017

పెద్దపల్లి : ఈ నేతన్న వృత్తినే నమ్ముకున్నాడు. ఏళ్ల తరబడి మగ్గం నేశాడు. వృత్తికోసం ఉన్న ఊరును వదిలి.. దశాబ్దాలుగా వివిధ ప్రాంతాల్లో మగ్గాలు నేశాడు. అక్కడ లాభం లేదనుకొని తిరిగి తన స్వగ్రామానికి కుటుంబంతో సహా వచ్చాడు. అయితే గ్రామంలో తనకంటూ ఇల్లు లేదు. ఊర్లోని వారు ఇంటిని అద్దెకు ఇవ్వడం లేదు. దీంతో దిక్కు తోచక గ్రామంలోని బస్టాండును నివాసంగా మార్చుకున్నాడు.

నేత కార్మికునిగా జీవనం ప్రారంభం

పెద్దపల్లి జిల్లా, ఓదెల మండలంలోని మడక గ్రామానికి చెందిన నేత కార్మికుడు ఆముదం రాజేశానికి.. కొంచెం కూడా స్థలం లేదు. గ్రామంలో కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రాజేశానికి భార్య సత్తెమ్మ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భార్య సత్తెమ్మకు కొంత కాలంగా మానసిక స్థితి సరిగా లేదు. రాజేశం గత 20 ఏళ్ల క్రితం మహారాష్ట్రలోని భీమండి పట్టణంలో.. నేత కార్మికునిగా జీవనం ప్రారంభించాడు. సూరత్‌లోని బట్టల మిల్లులో కూడా పని చేశాడు. అక్కడ కొంత కాలం ఉన్న తరువాత తిరిగి సిరిసిల్లలోనే చేనేత కార్మికునిగా పని చేశాడు. ఇన్ని ప్రాంతాలలో పని చేసినా కూడా అతని సంపాదన వారి కుటుంబ అవసరాలకు మాత్రమే సరిపోయేది.

ఇల్లు అద్దెకు ఇవ్వడానికి ముందుకు రాని గ్రామస్తులు ...

చేనేత వృత్తి కుంటుపడడం.. కుటుంబ పోషణ భారం కావడంతో తిరిగి స్వగ్రామం మడకకు చేరుకున్నాడు. పెద్ద కూతురు ఇదే గ్రామానికి చెందిన యువకుడిని ఆదర్శ వివాహం చేసుకుంది. ఊర్లో ఇల్లు అద్దెకు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో బస్‌ షెల్టర్‌కి పరదాలు కట్టుకొని నివాసంగా మార్చాడు. రాజేశం చిన్న కూతురు సౌజన్య.. ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పూర్తి చేసింది. కూలి పని చేసిన డబ్బులతో పాటు.. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న వృద్దాప్య పింఛనుతో.. కుటుంబ పోషణ భారంగా గడుపుతున్నట్టు రాజేశం ఆవేదన వ్యక్తం చేశాడు.

సౌజన్య పై చదువులకు సహాయం చేస్తానని కేటీఆర్‌ హామీ ...

వీరి గురించి తెలుసుకున్న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ వెంటనే స్పందించారు. రాజేశం కుటుంబ వివరాలను సేకరించి ప్రభుత్వం తరపున న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లును మంజూరు చేయాలని సూచించారు. రాజేశానికి ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగంతో పాటు.. కూతురు సౌజన్య పై చదువుల కోసం కేటీఆర్‌ సహాయం చేస్తానని హామీ ఇచ్చినట్టు అధికారులు తెలిపారు. వెంటనే స్పందించి రాజేశం కుటుంబాన్ని ఆదుకునేందుకు చర్యలు చేపట్టిన మంత్రి కేటీఆర్‌కు.. గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు.

తమ కుటుంబాన్ని ఆదుకోవడానికి చర్యలు చేపట్టిన మంత్రి కేటీఆర్‌కు.. జీవితాంతం రుణపడి ఉంటానని నేత కార్మికుడు రాజేశం చెప్పాడు.

వాషింగ్టన్‌లో విమానం ప్రమాదం

అమెరికా : వాషింగ్టన్‌లో ఓ చిన్న విమానం ప్రమాదానికి గురైంది. ముకుల్‌టియా పట్టణంలోని ఓ రోడ్డులో ట్రాఫిక్‌ సిగ్నల్‌ పడడంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. డ్రైవర్లందరూ సిగ్నల్‌ కోసం వెయిట్‌ చేస్తుండగా ఉన్నట్టుండి ఆకాశం నుంచి ఓ చిన్న విమానం దూసుకొచ్చి రోడ్డుపై కుప్పకూలింది. విమానం నేలపై పడకముందే మధ్యలో కరెంట్‌ పోల్‌కు వైర్లు తగలడంతో గాలిలోనే అగ్ని గోళాలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదం నుంచి పైలెట్‌, ప్రయాణికుడు క్షేమంగా బయటపడడం గమనార్హం. ఈ ప్రమాదంలో కొన్ని కార్లు ధ్వంసమయ్యాయి.

15:21 - May 4, 2017

నాగర్‌ కర్నూల్ : జిల్లాలోని కల్వకుర్తి పేరు వింటేనే వర్గపోరు రాజకీయాలు గుర్తుకొస్తాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. ఇక్కడి ప్రాంత రాజకీయాలు మాత్రం తారా స్థాయిలో ఉంటాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డికి...ప్రస్తుత ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి మధ్య వర్గపోరు నడిచేది. ఇప్పుడు టీఆర్‌ఎస్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ టీఆర్‌ఎస్‌ మూడు వర్గాలుగా పనిచేస్తుంది. ఒక వర్గానికి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌, మరో వర్గానికి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఇంకో వర్గానికి టీఆర్‌ఎస్‌ నియోజకవర్గం మాజీ ఇంచార్జీ బాలాజీ సింగ్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ ముగ్గురు మధ్య అంతర్గత పోరు కొనసాగుతుంది. ఎన్నికలకు ముందే ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ... ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.

ఒకప్పుడు పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్‌గా వ్యవహరించిన బాలాజీసింగ్‌...

రాష్ట్రం ఏర్పడక ముందు పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్‌గా బాలాజీసింగ్ వ్యవహరించేవారు. అయితే రాష్ట్రం ఏర్పడ్డాక టీడీపీలో ఉన్న జైపాల్‌ యాదవ్‌ టీఆర్‌ఎస్‌లో చేరారు. ఎన్నికల్లో పార్టీ టిక్కెట్‌ను జైపాల్‌ యాదవ్‌కు ఇవ్వడంతో బాలాజీసింగ్‌ దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ టిక్కెట్ ఆశించిన బాలాజీ సింగ్‌కి టీఆర్ఎస్ పార్టీ హ్యాండ్ ఇచ్చి... బ్రిలియంట్‌ గ్రామర్‌ హై స్కూల్‌ యజమాని కసిరెడ్డి నారాయణరెడ్డికి ఎమ్మెల్సీ టిక్కెట్ ఇచ్చింది. భారీ మెజార్టీతో ఆయన గెలుపొందారు. దీంతో కల్వకుర్తి నియోజకవర్గంలో ఈ ముగ్గురు నేతల మధ్య విభేదాలు నెలకొన్నాయి.

ప్రొటోకాల్‌ రగడతో తెరపైకి వచ్చిన విభేదాలు...

ఈ మధ్య జరిగిన ప్రొటోకాల్‌ రగడతో ఈ విభేదాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. గత నెల 27న జరిగిన ఆవిర్భావ సభ నేపథ్యంలో ఐదు మండలాల కార్యకర్తల సమావేశాన్ని ఆమనగల్‌ పట్టణంలో మార్కేండేయ దేవాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కల్వకుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారయణ రెడ్డి హాజరయ్యారు. అయితే తనకు సమాచారం ఇవ్వలేదని కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్‌ చైర్మన్‌ ద్యాప విజితారెడ్డి ఆరోపించారు. తనకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని కన్నీటితో వెనుదిరిగారు. దీంతో వర్గపోరు, గ్రూపు తగాదాలు మళ్లీ తెరపైకి వచ్చాయి.

అధికార పార్టీ నాయకులు మధ్య వర్గపోరు ...

అధికార పార్టీ నాయకులు మధ్య వర్గపోరు నడుస్తుండడంతో ఇదే అదనుగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వంశీచంద్‌ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో కూడా నియోజకవర్గం సమస్యలను గట్టిగా వినిపించడంలో వంశీచంద్‌ సఫలమయ్యారు. దీంతో పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలపై అధిష్ఠానం సీరియస్‌ అయినట్టు సమాచారం.

15:19 - May 4, 2017

సంగారెడ్డి : జడ్పీ కార్యాలయంలో స్వర్గీయ ఇందిరాగాంధీ, టంగుటూరి అంజయ్య లాంటి వారు ఇక్కడ అడుగుపెట్టిన వారే. 46 మండలాలకు సంబంధించిన సమస్యలపై చర్చించుకునేందుకు ఈ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఇక సభకు ఎక్స్ అఫిషియో సభ్యులుగా మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు ఉండనే ఉంటారు. వారిలో ఇటువైపు వచ్చేవారే లేరనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక వచ్చిన వారైనా తమ ప్రాంత సమస్యలను సభ దృష్టికి తీసుకువస్తారా? అంటే అదీ లేదు. ప్రతిపక్ష సభ్యులు ఏదైనా సమస్య లేవనెత్తితే అధికార పక్ష సభ్యులు అంతా ఒక్కటై తమ గొంతులు మూయించే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ సభ్యులు ఆరోపిస్తున్నారు.

అధికారుల తీరుపైనా విమర్శలు...

ఇక అధికారులదీ అదే తీరుగా ఉంది. సభ్యులు అడిగే ప్రశ్నలకు పొడిపొడి సమాధానాలతో సరిపుచ్చుతున్నారు. దీంతో ప్రజా సమస్యలపై చర్చించే వాతావరణం లేకుండా అధికార పక్షం చేస్తోందని ప్రతిపక్ష సభ్యులు వాపోతున్నారు. తమను ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్ధానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఇలా సమావేశాలను నిర్వీర్యం చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమే. ఇప్పటికైనా సభ్యులందరూ తమ ప్రాంత సమస్యలతో కూడిన ఎజెండాతో సభకు హాజరై చర్చలు జరపాలని ప్రజలు కోరుతున్నారు.

15:13 - May 4, 2017

హైదరాబాద్ : నగరంలో పారిశుధ్యంపై బల్దియా స్పెషల్ ఫోకస్ పెడుతోంది. జీహెచ్‌ఎంసీ ఆటోవాలాలు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే.. ఆటోలను వెనక్కి తీసుకోవాలని అధికారులు డిసైడ్ అయ్యారు. నగర పారిశుధ్యం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న కార్మికుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోనుంది.

1, 116 ఓపెన్‌ డంపింగ్‌ యార్డుల తొలగింపు .....

గ్రేటర్ హైదరాబాద్ పారిశుధ్యంపై జీహెచ్‌ఎంసీ ఫోకస్‌ చేస్తోంది. స్వచ్‌ సర్వేక్షన్‌లో మంచి ర్యాంకు సాధించడమే లక్ష్యంగా పనిచేసిన బల్దియా.. మొత్తం శానిటేషన్‌పై ఫోకస్ చేసింది. ముందుగా సిటీలోని 1,116 ఓపెన్ డంపింగ్ యార్డులను బల్దియా తొలగించింది. అక్కడ చెత్త పడకుండా చేయడానికి ముగ్గులు వేయడం.. మొక్కలు నాటడం వంటి చర్యలు చేపట్టింది.

తడి, పొడి చెత్త సేకరణకు ఏర్పాట్లు .....

మార్కెట్ ప్రాంతాలు, ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పారిశుధ్యంపై.. బల్దియా అధికారులు దృష్టి పెట్టారు. ప్రతీ ఇంటి నుంచి చెత్త సేకరించడంతో పాటు తడిపొడి చెత్తను వేరుగా సేకరించడానికి.. అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. సిటీ పారిశుధ్యంపై జోనల్ కమీషనర్లు, మెడికల్ అధికారులతో.. జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్థన్‌ రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నగరంలో పారిశుధ్యాన్ని రక్షించడానికి అన్ని విధాలుగా కృషి చేయాలని ఆదేశించారు.

ఘన వ్యర్థ పధార్థాల నిర్వహణ చట్టం 2016

ఘన వ్యర్థ పధార్థాల నిర్వహణ చట్టం 2016.. మార్గదర్శక సూత్రాలను విధిగా పాటించాలని మెడికల్ అధికారులను కమిషనర్ ఆదేశించారు. ఇక నగరంలో తడి, పొడి చెత్త తరలింపుకు ఇచ్చిన 2000 స్వచ్ఛ ఆటో ట్రాలీలను.. పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ట్రాలీ డ్రైవర్లు సక్రమంగా విధులకు హాజరు కానివారికి నోటీసులు ఇవ్వాలన్నారు. 2000 ఆటోలలో 1480 ఆటోలు మాత్రమే.. ట్రాన్స్‌ ఫర్ స్టేషన్లకు చెత్తను తరలిస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. మరో 500 స్వచ్ఛ ఆటోలను కొనడానికి ప్రభుత్వం అంగీకరించిందని కమిషనర్ తెలిపారు.

రూ. 2 యూజర్ ఛార్జీల వసూలు

ఎక్కువగా చెత్తను ఉత్పత్తి చేసే మార్కెట్లు.. ఫంక్షన్‌హాల్‌.. తదితరవాటిని గుర్తించి.. కంపోస్ట్‌ ఎరువును తయారు చేసుకోవడానికి ప్రోత్సహించాలని బల్దియా డిసైడ్ చేసింది. నగరాన్ని బహిరంగ మలమూత్ర విసర్జన రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం.. తగిన ఫలితాలను ఇవ్వలేదని కమిషనర్ భావిస్తున్నారు. సిటీలో వ్యక్తిగత సామూహిక మరుగుదొడ్ల నిర్మాణంలో వేగం పెంచాలన్నారు.

కార్మికుల సంక్షేమంపై దృష్టి పెట్టాలని ఆలోచన

గ్రేటర్ హైదరాబాద్‌ను క్లీన్‌గా ఉంచుతున్న.. కార్మికుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని బల్దియా ఆలోచిస్తోంది. శానిటేషన్‌ కార్మికులకు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కమిషనర్ ఆదేశించారు. ప్రతీ నెలా వారి ఆరోగ్య స్థితిపై సలహాలు సూచనలు ఇ్వవ్వాలని మెడికల్ అధికారులకు కమిషనర్ సూచించారు. ప్రతీ ఒక్కరికీ భీమా సౌకర్యాన్ని కల్పించడంతో పాటు.. అర్హులైనవారందరికీ దీపం పథకంలో భాగంగా గ్యాస్ కనెక్షన్లు అందేలా చూడాలని యూసిడి విభాగాన్ని ఆదేశించారు.

15:11 - May 4, 2017

హైదరాబాద్: కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్‌ కార్యక్రమానికి.. ర్యాంకులను ప్రకటించారు. స్వచ్ఛ సర్వేక్షన్‌ ర్యాంకులో భాగంగా.. హైదరాబాద్‌కు మెట్రో నగరాల్లో మొదటి స్థానం వచ్చింది. ఒక్కసారి మొదటిస్థానం వచ్చాక దాన్ని నిలబెట్టుకోవడం కష్టమని జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్థన్‌ రెడ్డి అన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

ప్రజల ముందుకు బస్సులు

హైదరాబాద్ : ప్రగతి భవన్ లో ప్రజల ముందుకు బస్సుల ఆర్టీసీ ప్రత్యేక యాప్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం వజ్ర బస్సులను ప్రారంభించారు.

 

15:06 - May 4, 2017

హైదరాబాద్: తెలంగాణ పోలీసులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌పై జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. టీఆర్‌ఎస్‌ నేతల ఫిర్యాదు మేరకు.. న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న పోలీసులు.. ఐపీసీ 505 (1), 505(2) సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు.

కృష్ణా జలాలపై బ్రిజేష్ ట్రిబ్యునల్ లో విచారణ

ఢిల్లీ : కృష్ణా జలాల వివాదంపై బ్రిజేష్ ట్రిబ్యునల్ లో విచారణ జరిగింది. ట్రిబ్యునల్ కేసును వాయిదా వేసింది.

 

దిగ్విజయ్ పై కేసు నమోదు

హైదరాబాద్ : తెలంగాణ పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర వ్యవరాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ జూబ్లీహిల్స్ పీఎస్ లో కేసు నమోదు చేశారు. న్యాయనిపుణుల సలహా మేరకే దిగ్విజయ్ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

మత్స్యరంగ అభివృద్ధిపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ

హైదరాబాద్ : రాష్ట్రంలో మత్స్యరంగ అభివృద్ధిపై మంత్రి తలసాని అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ భేటీ జరిగింది. ఈ భేటీకి మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, జోగు రామన్న, అధికారులు హాజరైయ్యారు.

గంజాయి కేసులో విద్యార్థులు అరెస్ట్

రంగారెడ్డి : జిల్లాలోని ఇబ్రహీంపట్నం గంజాయి కేసులో 9 మంది విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. వారి వద్ద నుంచి 1,100 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

ఎనుమాముల మార్కెట్ లో రైతుల పడిగాపులు

వరంగల్ : ఎనుమాముల మార్కెట్ లో రైతులు పడిగాపులు గాస్తున్నారు. కేంద్రం నిన్న ప్రకటించిన గిట్టుబాటు ధరకు సంబంధించి తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని అధికారులు చెప్పారు. మిర్చి కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. గిట్టుబాటు ధర కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. 

14:04 - May 4, 2017

ఢిల్లీ : కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్వచ్ఛ సర్వేక్షన్‌ అవార్డులను ప్రకటించారు. 434 మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో శానిటేషన్‌పై నిర్వహించిన సర్వే ప్రకారం అవార్డులను ప్రకటించారు. ఈసారి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ తొలిస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో మధ్యప్రదేశ్‌కు చెందిన భోపాల్‌ నిలిచింది. ఇక ఏపీకి చెందిన విశాఖ మూడవ స్థానంలో.. తిరుపతి 9వ స్థానంలో నిలిచాయి. హైదరాబాద్ 22వ స్థానంలో సిద్దిపేట 45వ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో ఉన్న మైసూరు 5వ స్థానానికి పడిపోయింది. ఘన వ్యర్థాల నిర్వాహణ, మలవిసర్జణ పరిగలోకి తీసుకుని ర్యాంకులు ప్రటించారు.

 

స్వచ్ఛ్ సర్వేక్షణ్ ర్యాంకులను ప్రకటించిన కేంద్రం

ఢిల్లీ : స్వచ్ఛ్ సర్వేక్షణ్ ర్యాంకులను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. మధ్యప్రదేశ్ కు చెందిన ఇండోర్ క్లీన్ సిటీగా తొలి ర్యాంకు వచ్చింది. భోపాల్ కు రెండో స్థానం, విశాఖకు మూడో స్థానం, ఐదో స్థానానికి మైసూరు నగరం పడిపోయింది. స్వచ్ఛ్ సర్వేక్షణ్ లో హైదరాబాద్ కు 22వ ర్యాంకు లభించింది. మెట్రో నగరాల్లో జీహెచ్ ఎంసీకి మొదటి ర్యాంకు వచ్చింది. 

 

14:00 - May 4, 2017

హైదరాబాద్ : గ‌తేడాది కుండ‌పోత‌గా కురిసిన వ‌ర్షాల కార‌ణంగా హైద‌రాబాద్ అస్తవ్యస్థమైంది. గ‌తంలో ఎప్పుడు లేనంత‌గా వ‌చ్చిన బ‌ల‌మైన‌ ఈదురుగాలులు హైద‌రాబాద్ న‌గ‌రంలో బీభత్సాన్ని సృష్టించాయి. వేలాది చెట్లు నెల‌కొరిగాయి. వంద‌లాది విద్యుత్ స్థంభాలు నేలకూలిపోయి విద్యుత్ స‌ర‌ఫ‌రాకు తీవ్రస్థాయిలో అంత‌రాయం క‌ల్పించింది. అంతే కాకుండా కొద్ది సమ‌యంలోనే భారీగా కురిసిన వ‌ర్షాలు రాజ‌దాని వాసుల‌ను కంటిమీద కునుకు లేకుండా చేశాయి. గ్రేట‌ర్ ప‌రిధిలో చాలా ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరి రోజుల త‌ర‌బ‌డి నిలిచిపోయింది. వంద‌లాది కాల‌నీలు నీటమునిగాయి.

బల్దియా సరికొత్త ప్రణాళికల....
అయితే అలాంటి ఇబ్బందులు రాకుండా చేయడం కోసం బల్దియా సరికొత్త ప్రణాళికలను రచిస్తోంది. భారీ వ‌ర్షాలు వ‌చ్చిన‌ప్పుడు వ‌ర్షం నీరు నాలాల‌గుండా మూసిలోకి చేరే వ్యవస్థ సక్రమంగా లేదు. డ్రైనేజి పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందకపోవడంతో పాటు సిటిలో స‌హ‌జంగా ఉన్న నాలాలన్నీ క‌బ్జాల‌కు గుర‌య్యాయి. దాంతో వ‌రద నీరు కాల‌నీలు, బ‌స్తీల‌ను ముంచెత్తింది. దాంతో ఒక్కసారిగా నాలాల ఆక్రమణ‌ల‌పై జీహెచ్‌ఎంసీ కోర‌డా ఝళిపించి నాలాలపై ఉన్న ఇళ్లను కూల్చి వేసింది. వర్షాలు త‌గ్గిన త‌రువాత నాలాల‌నూ పూర్తి స్థాయిలో స‌ర్వే చేసిన అధికారులు 12వేల వ‌ర‌కు అక్రమ నిర్మాణాలు ఉన్నాయ‌ని గుర్తించారు.

14 ప్రాంతాల్లోని 8,535 మీటర్ల మేర నాలాల‌ను వెడల్పు
ఇక గ్రేట‌ర్ ప‌రిధిలో వెస్ట్ జోన్‌లో అత్యధికంగా 14 ప్రాంతాల్లోని 8,535 మీటర్ల మేర నాలాల‌ను వెడల్పు చేయనున్నారు. అందుకోసం 88.73 కోట్లు ఖ‌ర్చు అవుతుంద‌ని అంచ‌నావేశారు అధికారులు. ఈస్ట్ జోన్ ప‌రిధిలో 1,580 మీట‌ర్ల మేర 4 ప్రాంతాల్లో 20.35 కోట్లతో,.సెంట్రల్‌ జోన్‌లోని 5 నాలాల్లో 1,900 మీట‌ర్లు వెడ‌ల్పు చేయడానికి 20 కోట్లు వెచ్చించ‌నున్నారు. అలాగే నార్త్‌జోన్ పరిధిలో నాలాల్లో 11చోట్ల 2,268మీట‌ర్ల మేర వైడ‌నింగ్ చేయడానికి 20కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇక సౌత్ జోన్ ప‌రిధిలోని 9 చోట్ల 2,376 మీట‌ర్ల మేర నాలాలను 24.20 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. అంటే గ్రేట‌ర్ ప‌రిధిలో మొత్తం 16 కిలోమీట‌ర్ల 659 మీట‌ర్లు నాలాల‌ను వెడల్పు చేయడానికి 173.28 కోట్లు అంచ‌నా వ్యయంగా డిసైడ్ చేశారు. ఇక ఈ మార్గంలో ఉన్న యూటిలిటిసిఫ్టింగ్ కోసం 25 కోట్లు ఖ‌ర్చుచేయనుండగా..భూ సేక‌ర‌ణతోపాటు ప్రస్తుతం ఉన్న నిర్మాణాల‌కు 30 కోట్ల మేర న‌ష్టపరిహారం చెల్లించ‌డానికి అవుతుంది. ఇక ప‌నిలో ప‌నిగా న‌గ‌రంలోని హోర్డింగ్స్ పై కూడా స్పెష‌ల్ ఫోక‌స్ చేయనుంది బల్దియా. గ‌తేడాది వ‌ర్షాకాంలో జ‌రిగిన ప్రమాదాల దృష్ట్యా వాటిపై దృష్టి పెట్టింది. గతేడాది బ‌ల్దియా ఏర్పాటు చేసిన జెఎన్టీయు నిపుణుల క‌మిటి గ్రౌండ్ మ‌రియు రూఫ్‌టాప్‌పై ఉన్న హోర్డింగ్స్ మాత్రమే సేఫ్ అంటూ నివేదిక ఇచ్చింది. అవికూడా ఎప్పటి క‌ప్పుడు స్ట్రక్చరల్‌ స్టెబిలిటి ఉండేలా చూసుకోవాల‌ని సూచించింది. ఇక కొత్తవాటికి అనుమ‌తులు ఇచ్చే ప్రసక్తే లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

 

బిలీస్ బానో అత్యాచారం కేసు..సీబీఐ పిల్ తిరస్కరణ

ముంబై : బిలీస్ బానో అత్యాచారం కేసులో ముగ్గురు దోషులకు ఉరిశిక్ష విధించాలన్న సీబీఐ పిల్ ను బాంబే హైకోర్టు తిరస్కరించింది. 2002 మార్చిలో గుజరాత్ అల్లర్లలో బిలీస్ బానో పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

 

 

13:50 - May 4, 2017

ఖమ్మం : జిల్లాలోని మిర్చి మార్కెట్‌లో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మిర్చి మద్దతు ధర ప్రభుత్వం 5 వేలు ప్రకటించిన నేపథ్యంలో.. కేంద్రప్రభుత్వం ఆదేశాలను మార్కెట్ యార్డు అధికారులు లెక్క చేయడం లేదు. సీఎం కేసీఆర్‌ వైఖరిపై మిర్చి రైతులు మండిపడుతున్నారు. 3 వేలకు మాత్రమే మిర్చిని కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రైతులు మాట్లాడుతూ మిర్చి ధర కేవలం రూ. 3వేలకు కొనడం దారుణమన్నారు. కేసీఆర్ మాటల తప్ప చేతలు లేవన్నారు.

రైతులను ఆదుకోవడంలో కేంద్రం విఫలం : మంత్రి హరీష్ రావు

హైదరాబాద్ : రైతులను ఆదుకోవడంలో కేంద్రం విఫలం అయిందని మంత్రి హరీష్ రావు విమర్శించారు. కేంద్రం ప్రకటన వల్ల రాష్ట్రానికి లాభం లేదని అన్నారు. 

13:28 - May 4, 2017
13:21 - May 4, 2017

హైదరాబాద్ :  ప్రస్తుతం డిజిటైలేజేషన్ లో ముఖ్యంగా సోషల్ మీడియాలో మహిళలు ఏ విధంగా ఉన్నారు ఈనాటి ఫోకస్ సోషల్ మీడియా నేడు యువత చేతిలో ఉన్న పెద్ద ఆయుధం...ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుకోవడం, దాని పై అభిప్రాయాలు తెలపడం... గ్రూపులుగా స్నేహితులతో భావాలను పంచుకోవడం జరుగుతోంది. మరి ఈ వేదిక పై మహిళల పాత్ర ఎలా ఉంది... సర్వేలు ఏం చెబుతున్నాయి....డిజిటల్ ప్రపంచాన్ని ఏలుతున్న మహిళలు...సోషల్ మీడియా చర్చల్లో చురుగ్గా మహిళలు...మరక్కడ వారికి రక్షణ ఉందా..? పూర్తి వివరాలను వీడియోలో చూడండి.

 

13:07 - May 4, 2017

ఢిల్లీ : కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్వచ్ఛ సర్వేక్షన్‌ అవార్డులను ప్రకటించారు. 434 మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో శానిటేషన్‌పై నిర్వహించిన సర్వే ప్రకారం అవార్డులను ప్రకటించారు. ఈసారి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ తొలిస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో మధ్యప్రదేశ్‌కు చెందిన భోపాల్‌ నిలిచింది. ఇక ఏపీకి చెందిన విశాఖ మూడవ స్థానంలో.. తిరుపతి 9వ స్థానంలో నిలిచాయి. హైదరాబాద్ 22వ స్థానంలో సిద్దిపేట 45వ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో ఉన్న మైసూరు 5వ స్థానానికి పడిపోయింది. ఘన వ్యర్థాల నిర్వాహణ, మలవిసర్జణ పరిగలోకి తీసుకుని ర్యాంకులు ప్రటించారు. 

13:04 - May 4, 2017
12:57 - May 4, 2017

హైదరాబాద్ : కేంద్ర ప్రకటన వల్ల రాష్ట్రానికి ఎటువంటి లాభం లేదని మార్కెటింగ్, భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. కేంద్రం 33 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని ప్రకటించిందని, కానీ 33 వేల టన్నులు ఒక్క రోజులో కొనోచ్చు అన్నారు. వ్యాపారలు మంచి క్వాలిటీ మాత్రమే కొంటున్నారని పేర్కొన్నారు. క్వింటాకు రూ.7 వేలు ఇవ్వలని కేంద్రానికి లేఖ రాశామని తెలిపారు. 

12:51 - May 4, 2017

గుంటూరు : మిర్చి యార్డు ఎదుట రైతులు ఆందోళన చేస్తున్నారు. కేంద్రం ప్రకటించిన 5 వేలు మద్దతు ధర సరిపోదని నిరసన తెలుపుతున్నారు. మద్దతు ధర రూ.10 వేలు ప్రకటించాలని రైతుల డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు మార్కెట్‌కు మిర్చి భారీ ఎత్తున చేరుకుంది. రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహించిన రైతులు రోడ్లపై మిర్చిని పోసి నిప్పంటించారు. దీంతో మార్కెట్‌ యార్డులో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రైతులు మాట్లాడుతూ మార్కెట్ లో క్వింటాకు రూ.1800 నుంచి రూ. 2వేలు పలుకుంతుందని ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు.

 

12:45 - May 4, 2017

వరంగల్‌ : జిల్లాలోని ఏనుమాముల మార్కెట్‌ యార్డులో రైతులు అవస్థలు పడుతున్నారు. కేంద్రం ప్రకటించిన గిట్టుబాటు ధరకు సంబంధించిన తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని అధికారులంటున్నారు. దీంతో మార్కెట్‌లో మిర్చి కొనుగోళ్లు నత్తనడకన కొనసాగుతున్నాయి. గిట్టుబాటు ధర కోసం రైతులు మార్కెట్‌లో పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు మార్కెట్‌కు భారీ ఎత్తున మిర్చి తరలివస్తోంది. దీంతో మార్కెట్‌ యార్డు వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. రైతులు మాట్లాడుతూ నిన్న రూ.1500 అన్న వ్యాపారులు, నేడు 700 అంటున్నారని వాపోతున్నారు. ఎకరాకు రూ. 20 పెట్టుబడి అయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

 

12:01 - May 4, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల యాభై వేల మంది విద్యార్ధులు డిగ్రీ పరీక్షలు రాయడానికి సిద్ధం అవుతున్నారు. ఈరోజు తెలంగాణ యూనివర్సిటీలో డిగ్రీ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. ఈనెల 5 నుంచి కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలకు, 9న మహాత్మాగాంధీ యూనివర్సిటీ, 11 నుంచి శాతవాహన యూనివర్సిటీ, 23 నుంచి ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలకు, 19 నుంచి పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల్లోనూ డిగ్రీ పరీక్షలు మొదలు కావాల్సి ఉంది. అయితే ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చడం లేదంటూ ప్రైవేటు కాలేజ్ యాజమాన్యాలు డిగ్రీ పరీక్షలను బహిష్కరిస్తామని ప్రకటించాయి. దీంతో ఇవాళ జరగాల్సిన తెలంగాణ యూనివర్సిటీ పరీక్షల్ని అధికారికంగా వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ఇంకా ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులను వసూలు చేస్తూ కాలేజీలు నడుపుతున్నాయి. అయితే అవి సరిపోకపోవడంతో కాలేజీలు నడపలేక రోడ్డున పడ్డామని వారు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో ఏ విధంగా ఫీజులు చెల్లిస్తారో అదే విధంగా చెల్లిస్తేనే నాణ్యమైన విద్య అందించగలమని చెబుతున్నాయి. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకు పరీక్షలు అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాయి. 2016-17 విద్యా సంవత్సరంలో ప్రారంభమైన డీఓఎస్ టీ డిగ్రీ ఆన్ లైన్ సర్వీస్ తెలంగాణ ద్వారా అడ్మిషన్లు నిర్వహించారు. అయితే కొన్ని కాలేజీలు ఈ డీఓఎస్ టీలో భాగం అవ్వబోమని స్పష్టం చేసి వాటి ఇష్టానుసారం ఫీజులు వసూలు చేశాయి. ఇందులో భాగం అయిన కాలేజీలు మాత్రం ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులనే వసూలు చేస్తూ కాలేజీలు నడుపుతున్నాయి. తాజాగా వీటికి రావాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను కూడా విడుదల కాకపోవడంతో కాలేజీలు నడపడమే గగనంగా మారిందని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే తమ ఫీజులు చెల్లించమని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ కి వినతిపత్రం సమర్పించాయి. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే డీఓఎస్ టీ నుంచి బయటకు వచ్చేస్తామని హెచ్చరిస్తున్నాయి. మరి వీరి డిమాండ్లపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. 

11:55 - May 4, 2017

తూర్పు గోదావరి : శ్రీకాకుళం జిల్లాలో డీటీసీ గా పనిచేస్తున్న హైమారావు ఇంటిపై ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. రాజహేంద్రవరంలోని ఆయన ఇంటిలో, బంధువులు, స్నేహితుల ఇండ్లల్లో అధికారలు దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో భారీగా అక్రమాస్తులను గుర్తించినట్టు తెలుస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు ముందస్తు సమాచారంతో సోదాలు చేస్తున్నారు. తనిఖీల్లో భారీగా ఆస్తులు బయటపడడంతో హైమారావు తీవ్ర అవినీతికి పాల్పపడినట్లు తెలస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 

11:52 - May 4, 2017

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్‌కు మరోసారి వలసల ప్రమాదం పొంచివుందన్న ప్రచారం జరుగుతోంది. ఇతర పార్టీల నేతలు తమతో రాయబారాలు నడుతున్నారని పార్టీ నేతలు చెబుతన్న మాటల్లో నిజంలేదనిపిస్తోందని కాంగ్రెస్‌ నేతలే అంటున్నారు. కాంగ్రెస్‌ను వీడి వేరే పార్టీల్లో చేరాలనుకుంటున్న నేతల్లో పలువురు ఎమ్మెల్యేలతోపాటు, కొందరు మాజీలు కూడా  ఉన్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది.
వలసలతో నష్టపోయిన తెలంగాణ కాంగ్రెస్‌ 
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వలసలతో తెలంగాణ కాంగ్రెస్‌ బాగా నష్టపోయింది. 2014 ఎన్నికల నుంచి వరుసగా ఎదురైన ఓటములతో నిరాశ, నిస్పృహలకు లోనైన కొందరు ప్రజా ప్రతినిధులు గులాబీ గూటికి చేరారు. దీంతో వలసల కుదుపు నుంచి తేరుకోడానికి కాంగ్రెస్‌కు చాలా టైము పట్టింది. అయితే ఇప్పుడు ఇలాంటిదే మరో ముప్పు పొంచివుందన్న ప్రచారంతో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు కలవరానికి గురవుతున్నారు. ఈసారి బీజేపీలోకి భారీగా వలసలు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. 
భారీగా వలసపోయే ప్రమాదం 
వలసల సునామీ తెలంగాణ కాంగ్రెస్‌ను తాకబోతోందన్న ప్రచారంతో నేతల్లో  కలవరం ప్రారంభమైంది. ఈసారి కూడా భారీగానే వలసలు జరిగే అవకాశం ఉందన్న ప్రచారం ఊపందుకుంది. పార్టీలో ఏ ఇద్దరు నేతలు కలిసినా, ఇదే అంశం చుట్టూ చర్చ సాగుతోంది. వలసపోయే నేతల్లో పలువురు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారన్న సమాచారంతో ఏమి చేయాలో పాలుపోక కాంగ్రెస్‌ నేతలు తలలుబాదుకుంటున్నారు. ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు గుడ్‌ బై చెప్పి, బీజేపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారన్న ప్రచారం ఊపందుకుంది. పార్టీ నేతల్లో 30 మంది వరకు కమలదళం  గూటికి  వెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారుని వినిపిస్తోంది. కాషాయదళంతో సంబంధాలు పెట్టుకున్న కాంగ్రెస్‌ నేతలకు జూన్‌ వరకు వేచి ఉండాలని బీజేపీ అధిష్టానం సూచించినట్టు ప్రచారం జరుగుతోండటంతో అంతా గుంబనంగా ఉన్నారు. 
రామ్‌ మాధవ్‌తో సిటీ కాంగ్రెస్‌ నేతల భేటీ ? 
హైదరాబాద్‌కు చెందిన కొందరు కాంగ్రెస్‌ నేతలు బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్‌తో రహస్యంగా భేటీ అయ్యారన్న సమాచారం బయటకు పొక్కడంతో హస్తం పార్టీ నేతలు కంగుతిన్నారు. సిటీలో బలమైన నేతలుగా ముద్రపడ్డ కాంగ్రెస్‌ నేతలు శంషాబాద్‌లోని ఓ హోటల్లో రామ్‌ మాధవ్‌తో సమావేశమై చర్చలు జరిపారని ప్రచారం జరుగుతోంది. బీజేపీలో చేర్చుకునేందుకు రామ్‌ మాధవ్‌ నుంచి స్పష్టమైన హామీ లభించిన తర్వాత నుంచి ఈ నేతలంతా కాంగ్రెస్‌ వ్యవహరాల పట్ల అంటీముట్టనట్టుగా ఉంటున్నారని వినిపిస్తోంది. 
ఇతర  పార్టీల నేతలు టచ్‌లో ఉన్నారంటున్న ఉత్తమ్‌ 
మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ నేతల వలసల ప్రచారాన్ని తోసిపుచ్చుతున్నారు. ఇతర పార్టీలకు చెందిన నేతలే తమతో టచ్‌లో ఉన్నారని చెబుతున్నారు. ఇలాంటి వారిలో అధికార టీఆర్‌ఎస్‌ నేతలు కూడా ఉన్నారన్న వాదాన్ని వినిపిస్తున్నారు.  సమయం వచ్చినప్పుటు కాంగ్రెస్‌లో చేరతారన్న ధీమాతో ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఉన్నారు. అయితే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ మాటలు చెప్పిన 24 గంటలకు తిరగక  ముందే మాజీ ఎమ్మెలే నందీశ్వర్‌గౌడ్‌ బీజేపీ గూటికి చేరడంతో టీపీసీసీ అధ్యక్షుడికి చేదు అనుభవం ఎదురైంది. పక్క చూపులు చూస్తున్న నేతలను బుజ్జగించి,  దారికి తెచ్చుకోపోతే వలసల సునామీ కాంగ్రెస్‌ను ముంచెత్తే ప్రమాదం లేకపోలేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది.  వలసల వ్యవహారాన్ని కాంగ్రెస్‌ నేతలు ఎలా  డీల్‌ చేస్తారో చూడాలి. 

11:45 - May 4, 2017

సంగారెడ్డి : మిషన్ కాకతీయ పథకం కింద సంగారెడ్డి జిల్లా, ఆందోల్‌లో చేపట్టిన పనులు.. సంతృప్తినిచ్చాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. త్వరలోనే 50 వేల ఎకరాలకు నీరిచ్చి.. రైతుల రుణం తీర్చుకుంటామని ఆయన చెప్పారు. రైతులు సింగూరు ప్రాజెక్టు కింద తొలిసారి పంట పండించి సంతోషంగా ఉన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు రైతులతో ముఖాముఖి మాట్లాడి.. వారి సంతోషాన్ని పంచుకున్నారు.  

 

11:42 - May 4, 2017
11:40 - May 4, 2017
11:39 - May 4, 2017
11:38 - May 4, 2017
11:37 - May 4, 2017
11:35 - May 4, 2017
11:33 - May 4, 2017

హైదరాబాద్ : బుల్లితెర ప్రముఖ నటుడు ప్రదీప్‌ ఆత్మహత్యపై గంటగంటకు అనుమానాలు పెరుగుతున్నాయి. ప్రదీప్‌ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదంటూ పేరెంట్స్..స్నేహితులు ఖచ్చితంగా చెబుతున్నారు..మరోవైపు ప్రదీప్‌ డెత్‌పై పోలీసులు రకరకాల ప్రశ్నలు వేస్తే భార్య పావని కూడా దాటవేసినట్లు తెలుస్తోంది..దీన్నిబట్టి ప్రదీప్‌ మరణంపై అనుమానాలున్నాయంటున్న ఆరోపణలకు బలం చేకూరుతుంది. అసలు ప్రదీప్ కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకున్నాడా..? లేక మరేదైనా జరిగిందాన్న అనుమానాలు తలెత్తడంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
స్వగృహంలో ప్రదీప్ అత్మహత్య
పుప్పాలగూడ, ఆల్కాపురం కాలనీ గ్రీన్‌ హోం అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న టీవీ నటుడు ప్రదీప్‌ తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రదీప్‌ సప్తమాత్రిక సీరియల్‌లో హీరోగా నటించి.. కొద్ది రోజుల్లోనే మంచి నటుడిగా గుర్తింపు పొందాడు...ప్రదీప్‌ సప్తమాత్రిక సీరియల్‌లో నటిస్తుండగా...అదే సమయంలో అగ్నిపూలు సీరియల్‌లో పావని మంచి నటిగా గుర్తింపు పొందింది..వీరిద్దరి మధ్య పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది...గతేడాది ఆగస్టులో ప్రేమ వివాహం చేసుకున్న ప్రదీప్,పావనిలో గ్రీన్‌హోం అపార్ట్‌మెంట్లో ఉంటున్నారు...
శ్రావన్ ఎంట్రీ ....
ఇక బిజీ ఆర్టిస్టులుగా మారిన ప్రదీప్‌ పావనిలు బాగానే ఉంటుండగా రెండు నెలల క్రితం వీరి ఇంటికి వచ్చిన పావని బంధువు..ఫ్రెండ్‌గా చెబుతున్న శ్రావన్ ఎంట్రీ ఇచ్చాడు...వీరితో పాటే ఉంటున్న శ్రావణ్‌తో పావని చనువుగా ఉండడం ప్రదీప్‌కు నచ్చలేదు...ఈ విషయంలోనే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి గొడవలుగా మారాయి. పావని సోదరుడి బర్త్‌డే పార్టీకి వెళ్లిన తర్వాత ఇద్దరి మద్య చిన్న మాటల యుద్ధం గొడవగా మారినట్లు తెలుస్తోంది. ఇంటికి వచ్చాక కూడా ఇద్దరూ ఘర్షణ పడ్డట్లు సమాచారం..ఆ తర్వాత ప్రదీప్‌ కోపంలో అద్దాన్ని పగులగొట్టి రూంలోకి వెళ్లి పడుకున్నాడని పావని చెబుతుంది. తెల్లవారుజామున చూస్తే ఉరేసుకుని కన్పించాడని పావని చెబుతుంది. అయితే తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని...క్షణికావాశంలోనే ప్రదీప్‌ ఆత్మహత్య చేసుకున్నాడని పావని అంటోందిజరిగిన ఘటనపై పోలీసులు ఆత్మహత్యగా కేసు నమోదు చేసినా ఆ తర్వాత వస్తున్న ఆరోపణల నేపథ్యంలో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు..ప్రదీప్‌ డెత్‌ మిస్టరీగా మిగిలింది...పోలీసుల దర్యాప్తులో వాస్తవాలు వెలుగుచూడనున్నాయి.

మందుపాతర పేల్చిన మావోయిస్టులు

మహారాష్ట్ర : గడ్చిరోలి జిల్లా బూమ్రాగడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ మృతి చెందారు. 
మరో 11 మందికి గాయాలయ్యాయి. 

వెంకయ్యనాయుడు నివాసంలో కె.విశ్వనాథ్ దంపతులకు సన్మానం

ఢిల్లీ : కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు నివాసంలో కళాతపస్వి విశ్వనాథ్ దంపతులకు వెంకయ్య సన్మానం చేశారు. కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు, నటుడు కృష్ణంరాజు దంపతులు, నిర్మాత దిల్ రాజు హాజరయ్యారు. 

 

11:11 - May 4, 2017

గుంటూరు : మిర్చియార్డుకు మిర్చి లారీలు భారీగా వచ్చాయి. యార్డులోపలికి లారీలను అధికారులు అనుమతించలేదు. చిలకలూరి పేట..సత్యనవల్లి రహదారుల్లో మిర్చి రైతులు బారులు తీరాయి. సరైన గడ్ లైన్స్ లేకపోవడంతో రైతులు అయోమయంలో ఉన్నారు. మిర్చి రైతులకు తిప్పలు తప్పడం లేదు. 
అన్నదాతకు అడుగడుగున ఆంక్షలు విధించారు. మార్కెట్ లోకి వెళ్లేందుకు గుర్తింపు కార్డులు తప్పనిసరని అంటున్నారు. పోలీసుల కనుసన్నల్లో మార్కెట్లు నడుస్తున్నాయి. 

 

11:09 - May 4, 2017

గుంటూరు మిర్చియార్డుకు భారీగా మిర్చి లారీలు

గుంటూరు : మిర్చియార్డుకు మిర్చి లారీలు భారీగా వచ్చాయి. యార్డులోపలికి లారీలను అధికారులు అనుమతించలేదు. చిలకలూరి పేట..సత్యనవల్లి రహదారుల్లో మిర్చి రైతులు బారులు తీరాయి. రైతులు అయోమయంలో ఉన్నారు.  

10:08 - May 4, 2017

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో సీపీఎం నేత నంద్యాల నర్సింహ్మారెడ్డి, విశ్లేషకులు నగేష్ కుమార్, టీడీపీ నేత వర్ల రామయ్య పాల్గొని, మాట్లాడారు. రైతులను కష్టకాలంలో ఆదుకోవాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...
 

09:56 - May 4, 2017

మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆంధ్రప్రదేశ్‌ కౌలు రైతు సంఘం నాయకులు అజయ్‌ కుమార్‌ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'మిర్చి రైతులకు కేంద్ర ప్రభుత్వం కొంత ఊరటనిచ్చింది. క్వింటాకు 5వేల రూపాయల మద్దతు ధర ప్రకటించింది. అదనపు ఖర్చుల కింద మరో 1200 రూపాయలు ప్రకటించింది. ప్రభుత్వ ఏజెన్సీలకు నష్టం వస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సమానంగా భరించాలంటూ నిర్ణయించారు. అయితే, కేంద్రం చేసిన తాజా ప్రకటన మిర్చి రైతులను కష్టాల నుంచి గట్టెక్కిస్తుందా? అసలు మిర్చి ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు రావడానికి కారణం ఏమిటి? మిర్చి మార్కెట్‌ లో మార్కెట్‌ శక్తుల ఇష్టారాజ్యం ఎందుకు నడుస్తోంది? మిర్చి రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వాలు ఇంకా తీసుకోవాల్సిన చర్యలేమిటి? అంశాలపై ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

09:46 - May 4, 2017

విశాఖ : జిల్లాలోని పరవాడ ఫార్మా సిటీ కర్మాగారాల్లో పారిశ్రామిక ప్రమాదాలు నిత్యకృత్యమవుతున్నాయి. మొన్న దక్కన్‌ కెమికల్స్‌, నిన్న శ్రీకర్‌ ఫార్మా, ఇవాళ అజికో బయో ఫార్మా..ఇలా రోజుకో ప్రమాదం చోటు చేసుకుంటోంది. పరిశ్రమల్లో  భద్రతా చర్యలు మృగ్యం కావడంతో  తరచు జరుగుతున్న ప్రమాదాల్లో ఎన్నో విలువైన కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.  విశాఖ ఫార్మా కంపెనీలు, రసాయన పరిశ్రమల్లో  జరుగుతున్న ప్రమాదాలపై 10 టీవీ ప్రత్యేక కథనం... 
వీధినపడుతున్న కార్మిక కుటుంబాలు 
విశాఖ జిల్లా పరవాడ... ఫార్మా పరిశ్రమలకు ప్రసిద్ధి. పరవాడ ఫార్మా సిటీ ఫ్యాక్టరీల్లో భద్రతా చర్యలు అంతంత మాత్రమే. కంపెనీ యాజమాన్యాల లాభాపేక్ష, కార్మిక శాఖ అధికారుల అవినీతి... కార్మికులు భద్రతను గాలికొదిలేస్తున్నారు.  తరచు జరుగుతున్న ప్రమాదాలతో ఎన్నో కార్మిక కుటుంబాలు వీధినపడుతున్నాయి. 
రాజవరం దక్కన్‌ కెమికల్స్‌లో ప్రమాదం
సాగర నగరం చుట్టుపక్కల 90కిపైగా రసాయన, ఫార్మా పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమలో సరైన భద్రతా చర్యలు చేపట్టకపోవడంతో రియాక్టర్లే బాంబుల్లా పేలిపోతున్నాయి. 2016 జనవరిలో రాజవరంలోని దక్కన్‌ కెమికల్స్‌లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.  దువ్వాడ ప్రత్యేక ఆర్థిక మండలిలో ఉన్న బయోమాక్స్‌లో గత ఏడాది జరిగిన ప్రమాదంలో 12 డీజిల్‌ ట్యాంకులు కాలిపోయాయి. 2016 మేలో పరవాడ ఫార్మాసిటీలోని శ్రీకర్‌ ఇండస్ట్రీస్‌లో చోటుచేసుకున్న ప్రమాదంలో కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. గత ఏడాది నవంబర్‌ 10న లారస్‌ ల్యాబ్స్‌లో రియాక్టర్‌ పేలిన ఘటనలో కార్మికుడు దుర్మణం పాలయ్యాడు. గత డిసెంబర్‌లో ఎస్‌వీఆర్‌ డ్రగ్స్‌లో జరిగిన ప్రమాదంలో ఆరుగురు కార్మికులు గాయపడ్డారు. తాజాగా లంకెలపాలెం అజికో బయో ఫార్మాలో చోటుచేసుకున్న ప్రమాదంలో ఇద్దరు కార్మికులు చనిపోయారు. ఇలా చెప్పుకుంటూపోతే ఈ జాబితా కొండవీటి చేతాండత ఉంటుంది.  రసాయన , ఫార్మా కంపెనీల్లో తరచు ప్రమాదాలు జరగుతున్నా ఫ్యాక్టరీల యాజమాన్యాలు, కార్మిక శాఖ అధికారులు కళ్లు తెరవడంలేదన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. 
యాజమాన్యాలు, అధికారులు నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు 
ఫార్మా కంపెనీల యాజమాన్యాలు, అధికారులు నిర్లక్ష్యంతోనే తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మిక నాయకులు మండిపడుతున్నారు. ఫార్మా కంపెనీల్లో భద్రత డొల్లగా మారడంతో  రోజు రోజుకు ప్రమాదాలు పెరిగిపోతున్నాయని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫార్మా కంపెనీల యాజమాన్యాలు, కార్మిక శాఖ అధికారుల నిర్లక్ష్యంతో  ఫ్యాక్టరీల్లో జరిగే ప్రమాదాల్లో ఎన్నో విలువైన ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
భద్రత పాటించాలి..
విశాఖలో పారిశ్రామిక ప్రమాదాలు పెరుగుతున్నా ప్రభుత్వం, ఫ్యాక్టరీల యాజమాన్యాలు కళ్లు తెవరడంలేదు. ఇకనైనా పాలకులు, అధికారులు కళ్లు  తెరచి ఫ్యాక్టరీలను తనిఖీ చేసి, భద్రతకు విస్మరించిన యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. భద్రతా లోపాలతో మరిన్ని ప్రాణాలు పోకముందే భద్రత పాటించే విధంగా చూడాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

 

09:12 - May 4, 2017

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌కు మిర్చి ఘాటు తీవ్రంగా తగులుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుల ఆందోళనలతో..సొంత పార్టీ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పరిస్థితులు అదుపుతప్పుతుండడం గులాబీ నేతలకు కొత్త చిక్కులు తెచ్చి పెడుతోంది.
మిర్చి రైతుల విషయంలో సర్కారు ఫేయిల్‌ 
తెలంగాణలో మిర్చి రైతుల సమస్యలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. రైతులకు పెద్ద పీఠ వేస్తున్నామని ప్రభుత్వం చెప్పుకుంటున్నా..క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా తయారవుతున్నాయి. రైతు రుణామాఫి ఇటీవలే  పూర్తి కావడం,.వచ్చే ఏడాది నుంచి రైతులకు ఉచిత ఎరువుల లాంటి పథకాలతో రైతులకు మరింత దగ్గరయ్యేందుకు గులాబి బాస్ పావులు కదుపుతున్నారు. పార్టీ అంతర్గత వేదికలు సహా..బహిరంగ సభల్లో కూడా ఇవే అంశాలను సీఎం కేసీఆర్‌ ప్రాధాన్యతనిస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామన్న ధీమా కల్పిస్తున్నారు. 
చేతులేత్తేసిన గులాబీ నేతలు 
అయితే గత 15 రోజులుగా రాష్ట్రంలో పరిస్థితులు అధికార పార్టీ నేతలకు ఏమాత్రం కలిసి రావడం లేదు. గతంలో పత్తి రైతుల సమస్యలను కొలిక్కి తెచ్చినా..మిర్చి రైతుల విషయంలో అధికార పార్టీ నేతలు కూడా చేతులెత్తేస్తున్నారు. ప్రభుత్వ పరంగా మద్దతు ధర అంతంత మాత్రంగా ప్రకటించడం తమకు సమస్యలు సృష్టిస్తోందన్న అభిప్రాయాన్ని అధికార పార్టీ నేతలు వ్యక్తం  చేస్తున్నారు. దీనికి తోడు మార్కెట్ యార్డుల్లో రైతులు చేస్తున్న ఆందోళనలు తీవ్రం అవుతండడం గులాబి పార్టీ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
గులాబీ బాస్ ఆగ్రహం 
ఖమ్మం జిల్లాలో జరిగిన పరిణామాలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని కేసులు నమోదు చేయడం,.దాడి చేసిన వారిలో మెజార్టీ కార్యకర్తలు టీఆర్‌ఎస్ సభ్యత్వం ఉన్న వారే అన్న ఆధారాలు బయటపడడంతో గులాబీ బాస్ కేసీఆర్‌ మరింత ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. ప్రతిపక్ష పార్టీలు రైతు బాట పట్టడంతో అధికార పార్టీ నేతలు వారికి ధీటుగా సమాధానం ఇవ్వడం లేదని ముఖ్యమంత్రి  అభిప్రాయపడుతున్నట్లు సమచారం. రైతుల్లో ఉన్న అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నాలను నేతలు ఎందుకు చేయలేదని వారిపై కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. 
నేతలకు కొత్త చిక్కులు 
ఓ వైపు మిర్చి ఘాటుతో పాటు ఇటీవల చోటు చేసుకుంటున్న రైతు ఆత్మహత్యల వ్యవహారం అధికార పార్టీ నేతలకు కొత్త చిక్కులు తెస్తోందన్న ఆందోళన గులాబి నేతల్లో వ్యక్తం అవుతోంది. మరి ఈ సమస్యలు ఎప్పుడు కొలిక్కి వస్తాయో చూడాలి. 

 

09:06 - May 4, 2017

గుంటూరు : టీడీపీ యువనేత లోకేశ్‌ అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అటు పార్టీ, ఇటు తనకు కేటాయించిన ప్రభుత్వ శాఖలకు సంబంధించి ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. జిల్లా పర్యటనలకు వెళ్లినప్పుడు అధికార కార్యక్రమాల్లో పాల్గొంటూనే, టీడీపీ సమావేశాలకూ హాజరవుతున్నారు. ఏపీ పంచాయతీరాజ్‌, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌  అటు పార్టీ, ఇటు ప్రభుత్వ వ్యవహారాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. అన్నింటా తన ప్రత్యేకతను చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ వ్యవహారాల్లో తలమునకలవుతూనే, పార్టీకి తగిన సమయం కేటాయిస్తూ,.తన ప్రత్యేకతను నిరూపించుకుంటున్నారు. 
నేతల మధ్య విభేదాల పరిష్కారానికి ప్రాధాన్యత 
జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడు అధికార కార్యక్రమాలకే పరిమితం కాకుండా, పార్టీ సమావేశాలకూ హాజరవుతున్నారు. నేతలు, కార్యకర్తలను కలసుకుంటూ, సీనియర్‌ మంత్రులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయా జిల్లాల్లో నేతల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. తనతో పరిష్కారం కాని సమస్యలను టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టికి తెస్తున్నారు. ఇది పార్టీ పటిష్టతకు దోహదం చేస్తుందని భావిస్తున్నారు. 
మహానాడు ఏర్పాట్ల పరిశీలన 
టీడీపీ మహానాడు జరుగనున్న విశాఖ జిల్లాలో ఈనెల 5,6 తేదీల్లో లోకేశ్‌ పర్యటిస్తారు. ఆంధ్రాయూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కాలేజీ ఆవరణలో జరిగే మహానాడు ఏర్పాట్లను పరిశీలించడంతోపాటు, టీడీపీ నేతలు, కార్యకర్తలతో భేటీ అవుతారు. విశాఖ జిల్లాకు చెందిన మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింతకాయల  అయ్యన్నపాత్రుడు మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించేందుకు ప్రయత్నించే అవకావం ఉందని భావిస్తున్నారు. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  పరిపాలనా వ్యవహారాల్లో తలమునకలై ఉండటంతో పార్టీని  పటిష్టపరిచేందుకు జిల్లాల్లో ఎక్కువగా పర్యటించేందుకు వీలుగా చినబాబు లోకేశ్‌  ప్రణాళికలు రూపొందిస్తున్నారు. చంద్రబాబుపై పార్టీ పని ఒత్తిడి తగ్గించాలని భావిస్తున్నారు.  పార్టీ నేతల మధ్య నెలకొన్న విభేదాలతో టీడీపీకి జరిగే నష్టాన్ని నివారించే బాధ్యతలను లోకేశ్‌ భుజానికి ఎత్తుకున్నారని ప్రచారం జరుగుతోంది. నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటూ, అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. మొత్తం మీద మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత లోకేశ్‌లో కొత్త చైతన్యం కనిపిస్తోంది. గతంలో కంటే భిన్నంగా అందరిని కలుపుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీలో క్రమశిక్షణ గాడితప్పకుండా చూస్తున్నారు. లోకేశ్‌ అన్ని విషయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తుండటంతో  టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. 

08:54 - May 4, 2017

గుంటూరు : స్విస్‌ ఛాలెంచ్‌ విధానంపై మొత్తానికి చంద్రబాబు ప్రభుత్వం పంతం నెగ్గించుకుంది. హైకోర్టులో అడ్డుకులు ఎదురైనా.. రాజధాని పేరుతో రియల్‌ వ్యాపారానికి ప్లాన్‌ చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శించినా వెనక్కి తగ్గలేదు. రెవెన్యూ వాటాలో కొత్త మార్పులతో స్విస్ చాలెంజ్‌లో మాస్టర్ డెవలపర్‌ను ఎంపిక చేసింది. సింగ‌పూర్ ప్రభుత్వ సంస్థలైన అసెండాస్ సింగ్ బ్రిడ్జి, సెంబ్ కార్ప్ సంస్థల క‌న్సార్టియం ప్రతిపాదనలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
స్విస్‌ ఛాలెంజ్‌ విధానంలో అభివృద్ధి
అమరావతి రాజధాని ప్రాంతంలో స్టార్టప్‌ ఏరియాను స్విస్‌ ఛాలెంజ్‌ విధానంలో అభివృద్ధి చేసేందుకు సింగపూర్‌ కన్సార్టియం సమర్పించిన ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్‌ ఆమోదించడం రాష్ట్రంలో పొలిటికల్‌ హీట్‌ను పెంచుతోంది. రెండేళ్లుగా వివాదాలు ఎదుర్కొంటున్న స్విస్ ఛాలెంజ్ విధానంలో మాస్టర్ డెవలపర్‌ను ప్రభుత్వం ఎంపిక చేయడం చర్చనీయాంశంగా మారింది. రెవెన్యూ వాటా విషయంలో విమర్శలు ఎదుర్కొన్న ప్రభుత్వం, అదే వాటాలను కొనసాగిస్తూ..ప్రభుత్వానికి అదనపు ఆదాయం వచ్చేలా కొత్త ప్రతిపాదనలతో సింగ‌పూర్ ప్రభుత్వ సంస్థలైన అసెండాస్-సింగ్ బ్రిడ్జి, సెంబ్ కార్ప్ సంస్థల క‌న్సార్టియంను మాస్టర్ డెవలపర్‌గా ఎంపిక చేసింది. 
కేబినెట్‌ నిర్ణయంపై ప్రతిపక్షాల విసుర్లు  
స్విస్‌ ఛాలెంజ్‌ విధానంలో.. స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్ట్ కింద రాజధాని కోర్ ఏరియాలో 1,691 ఎకరాలను సింగపూర్ కన్సార్టియంకు అప్పగిస్తారు. కన్సార్టియం, రాష్ట్ర ప్రభుత్వం తరపున అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కలిసి 15 ఏళ్లలో మూడు దశల్లో ఈ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తారు. మొదటి దశలో 656, రెండో దశలో 514, మూడో దశలో 521 ఎకరాలను కన్సార్టియంకు అప్పగిస్తారు. మొదట 50 ఎకరాలను నామమాత్రపు ధరకే ఇస్తారు. లాభాల్లో 42:58 శాతం వాటాలు పంచుకోవడంతోపాటు భూమికి సంబంధించిన గ్రాస్ టర్నోవర్‌లో మొదటి విడత 5 శాతం, రెండో విడత 7.5 శాతం, మూడో విడత 12 శాతం ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్, సింగపూర్ కన్సార్టియం కలిసి అమరావతి డెవలప్‌మెంట్ పార్ట్‌నర్‌గా ఏర్పడి ఈ ప్రాజెక్ట్ ను చేపడతాయి. అభివృద్ధి చేసిన ప్లాట్లను వేలం ద్వారా ప్రపంచంలోని కంపెనీలకు ఏడీపీ కేటాయిస్తుంది. 
మౌలిక సదుపాయాలకు ఏడీపీ 2,118 కోట్ల పెట్టుబడి 
మరోవైపు మౌలిక సదుపాయాలకు ఏడీపీ 2,118 కోట్లను పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. స్టార్టప్ ఏరియాలో మొదటి దశలో 8-9 లక్షల చదరపు అడుగుల మేర నిర్మాణం చేపడతారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి త్వరలో ఏడీసీ, సింగపూర్ కన్సార్టియం ఒక ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. ఏడీపీ కంపెనీ కేంద్ర రాజధాని ప్రాంతంలో భూమిని అభివృద్ధి చేసి, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించనుంది. క్వీన్ బీలను, ఉద్యోగావకాశాలను పెంచే సంస్థలను ఆకర్షించే విధంగా మార్కెటింగ్ చేయనుంది. ఈ సంస్థ అభివృద్ధి చేసిన ప్లాట్లను విక్రయించే అధికారం ఏపీ సీఆర్డీకే ఉంటుంది. అలాగే భూమిపై హక్కులన్నీ పూర్తిగా ప్రభుత్వం చేతిలోనే ఉంటాయి. ఆ ప్లాట్లను వేలం ద్వారా అత్యధిక పెట్టుబడులు పెట్టి, ఉద్యోగాలను అందించగలిగే సంస్థలకు విక్రయిస్తారు. తొలిదశలో రిజర్వు ధర ఎకరాకు 4 కోట్లుగా నిర్ణయించారు. ఏడీపీ, ప్రభుత్వ కమిటీ ద్వారా మిగతా దశల్లో విక్రయ ధరలను నిర్ణయిస్తారు. 
ప్రభుత్వానికే భూమిపై హక్కులు 
మెకన్సీ అండ్ కో సంస్థ అంచనాల ప్రకారం ఈ ప్రాజెక్ట్‌తో 15 ఏళ్లలో అమరావతిలో 1.25 లక్షల కుటుంబాలు స్థిరపడతాయి. 2.50 లక్షల ఉద్యోగాలు వస్తాయి. రాష్ట్ర జి.ఎస్.డి.పి 1,15,000 కోట్లు లభిస్తుంది. ప్రభుత్వానికి పన్నుల రూపంలో రూ.8 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్లు రాబడి వస్తుంది. తొలి మూడేళ్లలో చేపట్టనున్న 8.07 లక్షల చదరపు అడుగుల నిర్మాణాలు అభివృద్ధికి దోహదకరంగా మారనున్నాయి. స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్ట్ తో నగదు రూపంలో సర్కార్ కు రూ.1246 కోట్లు 53 శాతం, సింగపూర్ కన్సార్టియంకు రూ.1105 కోట్లు (47 శాతం) ఆదాయాల వాటా లభిస్తుంది. అభివృద్ధి చేసిన మౌలిక సదుపాయాలను పొందడం ద్వారా రూ.2118 కోట్లు ప్రభుత్వానికి సమకూరుతుంది. మొత్తంగా ఈ ప్రాజెక్ట్ తో ప్రభుత్వానికి రూ.3364 కోట్లు 75.3 శాతం, సింగపూర్ కన్సార్టియానికి 24.7 శాతం ఆదాయం సమకూరనుంది. 
కేబినెట్‌ నిర్ణయాలు వెల్లడి 
స్విస్‌ ఛాలెంజ్ విధానాన్ని 2015లో ప్రభుత్వం ప్రకటించి, దానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత 2016 మేలో సింగపూర్‌కు చెందిన అసెండాస్, సెంబ్ బ్రిడ్డి, సెంబ్ కార్ప్ కన్సార్టియం ఇచ్చిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2016 జూలైలో స్విస్ చాలెంజ్ విధానంలో సింగపూర్ కన్సార్టియంను ఉంచి, పోటీ బిడ్లు దాఖలు చేయాలంటూ ప్రకటన జారీ చేసింది..ఈ పోటీలో గతంలో చెన్నైకి చెందిన ఆదిత్య కన్‌స్ట్రక్చర్, ఎన్.వి.ఎన్. ఇంజినీర్స్ సంస్థలు పోటి పెట్టాయి. అయితే బిడ్డింగ్ మొత్తం వేరే సంస్థలకు వెళ్లకుండా, సింగపూర్‌ సంస్థలకు అనుకూలంగా ఉన్నాయంటూ గతేదాడి ఆగస్ట్‌లో హై కోర్టులో పిటిషన్ వేశారు.దాంతో పాటు రెవెన్యూ షేర్ విషయాలను బహిర్గతం చేయకపోవడం పట్ల కూడా పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈ పిటిషన్లపై విచారించిన ఉన్నతన్యాయస్థానం స్విస్ చాలెంజ్ విధానంలో లోపాలు ఉన్నాయని, ఆదాయ వివరాలను బహిర్గతం చేయాల్సిందేనంటూ, అదే ఏడాది అక్టోబర్ట్‌లో స్టే విధించింది. దీంతో భ్యవిష్యత్‌లో న్యాయసమస్యలు తలెత్తకుండా..ఏపీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపింగ్ ఎనేబ్లింగ్ యాక్ట్‌లో సవరణలు చేసి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆమోదం తెలిపింది. అంతకన్న ముందు ఫిబ్రవరిలో మరోసారి స్విస్ ఛాలెంజ్ విధానంలో బిడ్డింగ్ ఓపెన్ చేసింది. అయితే ప్రభుత్వం ఇచ్చిన గడువులోపు పోటి బిడ్లు రాకపోవడంతో, సింగపూర్ కన్సార్టియంను మాస్టర్ డెవలపర్‌గా ఎంపిక చేసింది.
స్విస్‌ ఛాలెంజ్‌ విధానంలో లొసుగులు
అయితే స్విస్ చాలెంజ్ ప్రతిపాదనలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలడంపై ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ విధానం రాష్ట్రానికి లాభం కన్నా నష్టమే ఎక్కువ అని ఆరోపిస్తున్నాయి. స్విస్‌ ఛాలెంజ్‌ విధానంలో లొసుగులు ఉన్నాయని, రాజధానికి, ప్రజా శ్రేయస్సుకు ఇది ఏ మాత్రం లాభసాటిగా ఉండదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. భూములను అప్పనంగా అప్పగించడమే కాకుండా అభివృద్ధి పేరుతో ప్రైవేట్ కంపెనీలకు ధారాదత్తం చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నాయి.  

 

పఠాన్ కోట్ మిలటరీ బేస్ లో కలకలం

పంజాబ్ : పఠాన్ కోట్ మిలటరీ బేస్ లో కలకలం రేగింది. రెండు అనుమానాస్పద బ్యాగులను గుర్తించారు. 
బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. 

రాజమహేంద్రవరంలో ఏసీబీ దాడులు

తూర్పుగోదావరి : రాజమహేంద్రవరంలో ఏసీబీ దాడులు నిర్వహించింది. శ్రీకాకుళం డిప్యూటీ ట్రాన్స్ పోర్టు కమిషనర్ హైమరావు ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో సోదాలు నిర్వహించారు. ఏలూరులో 10 ఎకరాలు పొలం, 3 ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. 

 

08:32 - May 4, 2017

ఢిల్లీ : 64వ  జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. జాతీయ ఉత్తమ చిత్రంగా మరాఠీ సినిమా 'కాసవ్' అవార్డు అందుకోగా.. ఉత్తమ హిందీ చిత్రంగా నీర్జాకు అవార్డు దక్కింది. ఉత్తమ దర్శకుడిగా రాజేష్, ఉత్తమ నటుడుగా అక్షయ్ కుమార్, ఉత్తమ నటిగా సురభిలక్ష్మి అవార్డులు అందుకున్నారు. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా పెళ్లిచూపులు, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా శతమానం భవతి సినిమాలకు అవార్డులు దక్కాయి. ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో 64వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. పురస్కారాలను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు, తారాలోకం తరలివచ్చింది. 
ఈసారి తెలుగు వెండితెర వెలుగు  
జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ఈసారి తెలుగు వెండితెర వెలుగులీనింది. తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా పెళ్లి చూపులకు అవార్డు దక్కింది. ఈ చిత్రానికే.. ఉత్తమ సంభాషణలకు గానూ దర్శకుడు తరుణ్ భాస్కర్ జాతీయ పురస్కారం అందుకున్నారు. ఇక ఉత్తమ ప్రజాధరణ పొందిన చిత్రంగా శతమానం భవతి సినిమా అవార్డు అందుకుంది. ఈ అవార్డును దిల్ రాజు అందుకున్నారు. 
ఉత్తమ చిత్రాలుగా కాసవ్, నీర్జా 
జాతీయ పురస్కారాలలో ఈసారి ఉత్తమ చిత్రంగా మరాఠీ సినిమా కాసవ్, హిందీలో నీర్జా సినిమాలు అవార్డులు అందుకున్నాయి. ఉత్తమ నటీనటులుగా రుస్తుం సినిమాకు గానూ అక్షయ్ కుమార్, మిన్నా మినుంగు సినిమాకు గానూ సురభి లక్ష్మిలు అవార్డులు అందుకున్నారు. డైరెక్షన్ విభాగంలో వెంటిలేటర్ సినిమా దర్శకుడు రాజేష్ అవార్డు దక్కించుకున్నారు. జాతీయ అవార్డుల కార్యక్రమంలో కళాతపస్వి కె. విశ్వనాథ్ దాదాసాహెబ్ పాల్కే అవార్డు అందుకున్నారు. ఇక అవార్డులు పొందినవారికి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, కేంద్రమంత్రులు అభినందనలు తెలిపారు.

 

08:28 - May 4, 2017

హైదరాబాద్ : డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. నిర్దేశించిన గడువులోగా పూర్తి చేసేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే పలు జిల్లాల్లో ఇళ్ల నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. టెండర్ల ప్రక్రియ పూర్తయిన ప్రాంతాల్లో..లబ్ధిదారుల ఎంపిక వేగంగా పూర్తి చేయాలని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. 
ఇళ్ల నిర్మాణ ప్రక్రియ వేగవంతం 
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప‌ట్టిన డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ ప్రక్రియలో వేగం పెంచింది. అనుకున్న టార్గెట్‌లోగా ఇళ్లను నిర్మించేందుకు కృషి చేస్తోంది. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో పురోగ‌తి, రాజీవ్ స్వగృహ, హౌజింగ్ బోర్డుపై గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి తన ఛాంబర్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో విభాగాల వారీగా అధికారులు పవ‌ర్ పాయింట్ ప్రజంటేషన్‌ ద్వారా మంత్రికి వివ‌రించారు.
ఇళ్లు నిర్మించేందుకు కాంట్రాక్టర్లు ముందుకు వ‌స్తున్నార‌న్న ఇంద్రకరణ్ రెడ్డి  
డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మించేందుకు కాంట్రాక్టర్లు కూడా ముందుకు వ‌స్తున్నార‌ని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. ఇప్పటివరకు 94,250 ఇళ్ల నిర్మాణానికి పాల‌న‌ప‌ర‌మైన అనుమ‌తులు వ‌చ్చాయ‌ని..వాటిలో 83,087 ఇళ్లకు టెండ‌ర్లు పిలవ‌గా 41,925 ఇళ్లకు టెండ‌ర్లు ఖరారైన‌ట్లు అధికారులు చెప్పారు. వీటిలో 20,986 డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు కొన‌సాగుతున్నాయ‌ని..1629 ఇళ్లు పూర్తయినట్లు వివ‌రించారు. ఇప్పటివరకు రెండు పడకగదుల నిర్మాణానికి 202.85 కోట్లు ఖ‌ర్చు చేసిన‌ట్లు మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి వెల్లడించారు. టెండ‌ర్లు ఖరారైన చోట్ల ల‌బ్ధిదారుల ఎంపిక‌ను త్వరితగతిన పూర్తి చేసి, జాబితాను త‌యారు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. 
94,250 ఇళ్ల నిర్మాణానికి పాల‌న‌ప‌ర‌మైన అనుమ‌తులు 
50,959 డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి మొద‌ట విడ‌త‌లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజ‌న కింద 190.66 కోట్లు విడుద‌ల చేసిన‌ట్లు మంత్రి తెలిపారు.ఈ స‌మీక్ష స‌మావేశంలో గృహ నిర్మాణ శాఖ స్పెష‌ల్ చీఫ్ సెక్రటరీ చిత్ర రామ‌చంద్రన్‌తో పాటు హౌజింగ్ కార్పొరేష‌న్ సీఈ స‌త్యమూర్తి, ఇత‌ర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

 

నేడు 'ప్రజల ముంగిట బస్సులు' ప్రారంభం

హైదరాబాద్ : తెలంగాణలో నేడు 'ప్రజల ముంగిట బస్సులు' ప్రారంభం కానున్నాయి. బస్సులను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. 

08:03 - May 4, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో మిర్చిరైతుల సమస్యలపై కేంద్రం స్పందించింది. మిర్చికొనుగోళ్ల కోసం మార్కెట్‌ ఇంట్రవెన్షన్‌ స్కీంను ప్రకటించింది. కొత్త స్కీంద్వారా మద్దతు ధరను ప్రకటించిన కేంద్రం.. స్కీం వెంటనే అమల్లోకి వస్తుందని వెల్లడించింది. 
మార్కెట్‌ ఇంట్రవెన్షన్‌ స్కీం 
ధరలు పడిపోవడంతో.. తీవ్ర ఆందోళనలో ఉన్న  మిర్చి రైతులకు కేంద్రం  ఊరట కలిగించే చర్యలు చేపట్టింది. మిర్చి కొనుగోళ్లను రాష్ట్ర ప్రభుత్వాలే కొనేలా మార్కెట్‌ ఇంట్రావెన్షన్‌ స్కీంను ప్రకటించింది.  కేంద్ర వ్యవసాయశాఖా మంత్రి రాధామోహన్‌ సింగ్‌తో కలిసి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కొత్త స్కీమ్‌ను ప్రకటించారు. 
మే 31వరకు ఇంట్రవెన్షన్‌ స్కీం ద్వారా కొనుకోళ్లు 
మార్కెట్‌ ఇంట్రవెన్షన్‌ స్కీమ్‌ ద్వారా మిర్చిని కొనుగోలు చేయాలని నిర్ణయించిన కేంద్రం.. కొనుగోళ్లలో దళారుల ప్రమేయం లేకుండా చూడాలని తెలుగు రాష్ట్రాలకు సూచించింది.  ఈనెల 31 వరకు కొత్తపథకం ద్వారా  మిర్చిని కొనుగోలు చేయనున్నట్టు వెంకయ్యనాయుడు తెలిపారు. ఇంట్రవెన్షన్‌ స్కీమ్‌ ద్వారా క్వింటాలుకు 5వేల రూపాయల మద్దతు ధర ప్రకటించిన కేంద్రం.. లోడింగ్‌, అన్‌లోడింగ్‌, కమీషన్లు తదితర ఖర్చుల కింద మరో 1250 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. మిర్చి కొనుగోళ్ల విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టానికే వదిలేస్తున్నట్టు వెంకయ్య తెలిపారు.  రాష్ట్రాల్లో ఉన్న మార్కెఫెడ్ల ద్వారా గాని, ఇతర మార్గాల ద్వారా అయినా కొనుగోళ్లు జరపవచ్చన్నారు.  అయితే .. దళారుల ద్వారా కొనుగోలు చేస్తే మాత్రం కొత్త స్కీం వర్తించదని  కేంద్ర మంత్రి తేల్చి చెప్పారు. 
రైతులను ఆదుకోవాలనే కొత్తపథకం : రాధామోహన్ సింగ్  
ధరలు పడిపోవడంతో తీవ్ర ఆందోళనలో తెలుగు రాష్ట్రాల రైతులును ఆదుకోవాలన్న ఉద్దేశంతోనే కొత్తపథకం తీసుకొచ్చామని కేంద్ర మంత్రి రాధామోహన్‌సింగ్‌ అన్నారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు మార్కెట్‌ ఇంట్రావనెన్షన్‌ స్కీమ్‌ను తీసుకొచ్చామన్నారు. 
ఏపీ నుంచి 88,300 మెట్రిక్‌ టన్నులు 
ఇంట్రవెన్షన్‌ స్కీం ద్వారా ఏపీలో  88వేల 3వందల మెట్రిక్‌ టన్నుల  మిర్చిని కొనుగోలు చేయనున్నట్టు వెంకయ్య వెల్లడించారు.  అటు తెలంగాణనుంచి 33వేల 7వందల మెట్రిక్‌న్నుల కొనుగోలుకు అవకాశం ఉందన్నారు.  ఒకవేళ ఇంట్రావెన్షన్‌ స్కీం ద్వారా కొనే మిర్చిపై నష్టం  వస్తే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50శాతం చొప్పున భరిస్తాయని  వెంకయ్యనాయుడు తెలిపారు. 
దళారులకు అట్టుకట్ట  పడేనా..!
ధరలు దారుణంగా పడిపోవడంతో.. ఇటీవల ఖమ్మం మార్కెట్లో మిర్చి రైతుల ఆగ్రహంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్రంలోనూ కదలిక వచ్చిందంటున్నారు.. మిర్చి రైతులు . అయితే.. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని.. కేంద్రం తేల్చిచెప్పడంతో.. దళారుల ఆగడాలకు ఇకనైనా అడ్టుకట్ట పడేనా అని.. రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

 

07:33 - May 4, 2017

గుంటూరు : పదిరోజుల అమెరికా పర్యటనకు వెళ్లిన చంద్రబాబు..రాష్ట్ర అభివృద్ధి అంశాలపై కేంద్ర మంత్రులను కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు.. పలు కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్ర ఆర్థికలోటును పూడ్చేందుకు రెండేళ్లకు ఇచ్చే నిధులను ఒకేసారి విడుదల చేయాలని కోరారు.
ఢిల్లీలో బిజీబిజీగా గడిపిన చంద్రబాబు
గురువారం అమెరికా పర్యటనకు వెళ్తున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బిజీబిజీగా గడిపారు. పలువురు కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులను కలిసి పలు కీలక అంశాలపై చర్చించారు. 
రెండేళ్ల నిధులను ఒకేసారి విడుదలకు విజ్ఞప్తి  
తొలుత కేంద్ర ఆర్ధికశాఖమంత్రి అరుణ్‌జైట్లీని కలిసిన చంద్రబాబు.. రాష్ట్ర ఆర్థికలోటును పూడ్చేందుకు ఇచ్చే రెండేళ్ల నిధులను ఒకేసారి విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌తో భేటీ అయి.. ఉపాధి హామీ నిధుల అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రం ఉపాధి హామీ పనుల్లో ఆదర్శంగా ఉందని కొనియాడారు. ఆ తర్వాత నీతి అయోగ్‌ వైస్‌ చైర్మన్‌ అరవింద్‌ పనగారియాతోనూ బాబు భేటీ అయ్యారు. చెత్తను కంపోస్టుగా మార్చేందుకు రాష్ట్రంలో 700 యూనిట్లు నెలకొల్పినట్లు సీఎం వివరించారు. అలాగే రాష్ట్రానికి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి విధి విధానాలు ఖరారు చేయడంతో పాటు.. యాక్షన్‌ ప్లాన్‌ అమలు చేయాలని జైట్లీని కోరినట్లు చంద్రబాబు తెలిపారు. 
తిరుపతిలో జీఎస్టీ ఆఫీస్‌ నిర్మాణం
తిరుపతిలో జీఎస్టీ ఆఫీస్‌ నిర్మాణం అంశంతోపాటు.. పర్మినెంట్‌ సచివాలయానికి నిధులు విడుదల చేసే అంశంపై అరుణ్‌జైట్లీతో చర్చించినట్లు సుజనాచౌదరి తెలిపారు. మొత్తానికి అమెరికా పర్యటనకు వెళ్తున్న చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించారు.

నేడు మంత్రి తలసానితో వెరట్నరీ వర్సిటీ విద్యార్థుల చర్చలు

హైదరాబాద్ : నేడు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో రాజేంద్రనగర్ వెరట్నరీ వర్సిటీ విద్యార్థులు చర్చలు జరుపనున్నారు. పలు అంశాలపై చర్చించనున్నారు. 

 

నేడు ఢిల్లీ వర్సెస్ గుజరాత్ మ్యాచ్

ఢిల్లీ : ఐపీఎల్ 10 లో భాగంగా నేడు ఢిల్లీ వర్సెస్ గుజరాత్ మ్యాచ్ జరుగనుంది. ఢిల్లీ వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 

నేటి నుంచి జీఎస్ ఎల్ వీ...ఎఫ్ 09 కౌంట్ డౌన్

హైదరాబాద్ : నేటి నుంచి జీఎస్ ఎల్ వీ...ఎఫ్ 09 కౌంట్ డౌన్ మొదలవనుంది. నేడు 1.57 కు కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. 

నేటి నుంచి చంద్రబాబు అమెరికా పర్యటన

హైదరాబాద్ : నేటి నుంచి సీఎం చంద్రబాబు అమెరికా పర్యటించనున్నారు. పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన లక్ష్యంగా సీఎం పర్యటించనున్నారు. 

 

Don't Miss