Activities calendar

05 May 2017

21:31 - May 5, 2017

హైదరాబాద్: ప్రపంచానికి కమ్యూనిజాన్ని పరిచయం చేసిన కారల్‌ మార్క్స్ జన్మించి సరిగ్గా 200ఏళ్లు.. కమ్యూనిజానికి కాలం చెల్లిందన్న వ్యాఖ్యలు తప్పని రుజువుచేస్తూ 21వ శతాబ్దంలో మార్క్సిజం కొత్త వెలుగులు విరజిమ్ముతోంది.. నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, పారిశ్రామికోత్పత్తి పడిపోయి నవతరం దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు.. ఇదే సమయంలోనే మళ్లీ జనానికి మార్క్స్‌ కనిపిస్తున్నారు..

2017 సంవత్సరానికి మూడు ప్రత్యేకతలు

2017 సంవత్సరం కమ్యూనిజానికి చాలా ప్రత్యేకమైన ఏడాది.. అక్టోబర్‌ మహా విప్లవానికి ఏడాదితో నూరేళ్లు పూర్తికాగా.... మార్క్స్‌ పెట్టుబడి గ్రంథం రాసి నూటయాభై ఏళ్లు... మార్క్స్‌ జన్మించి రెండు వందల ఏళ్లయింది.. ఈ మూడు మహా ఘటనలు ప్రపంచాన్ని 20వ శతాబ్దంలో గొప్ప మలుపు తిప్పాయి.

21వ శతాబ్దంలో కొత్త వెలుగులు విరజిమ్ముతున్న మార్క్సిజం

కమ్యూనిజం పని అయిపోయిందన్న విమర్శలు తప్పని రుజువుచేస్తూ... 21వ శతాబ్దంలో మార్క్సిజం తిరిగి కొత్త వెలుగులు విరజిమ్ముతోంది. 2008 నుంచి ఆరంభమైన పెట్టుబడిదారి సంక్షోభంతో కమ్యూనిస్టు వ్యతిరేకతకు కాలం చెల్లింది. పెట్టుబడిదారీ వ్యవస్థ, ప్రపంచీకరణ ఆత్మరక్షణలో పడ్డాయి. తద్వారా మార్క్స్‌ సిద్ధాంతం సజీవమని నిరూపితమైంది.

నవతరాన్ని వెంటాడుతున్న పెట్టుబడిదారి సంక్షోభం ...

నిజానికి నేడు, కమ్యూనిస్టు వ్యతిరేకత కన్నా పెట్టుబడిదారి సంక్షోభం నవతరాన్ని వెంటాడుతోందన్నది విశ్లేషకుల భావన. నిరుద్యోగానికి తోడు వ్యవసాయ సంక్షోభం, పారిశ్రామికోత్పత్తి పడిపోవడం దేశాన్ని పీడిస్తున్న తరుణంలో మళ్లీ జనం మార్క్స్‌ సిద్ధాంతం వైపు ఆకర్షితులవుతున్నారన్నది విశ్లేషకుల అభిప్రాయం.

1818 మే 5న జర్మనీలోని ట్రయర్‌ పట్టణంలో మార్క్స్ జననం...

కమ్యూనిజం సిద్ధాంతాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మార్క్స్‌ జన్మించి సరిగ్గా 200ఏళ్లయింది.. మార్క్స్ 1818 మే 5న జర్మనీలోని ట్రయర్‌ పట్టణంలో జన్మించారు. తన చదువును, మేధావిత్వాన్ని ప్రపంచ మానవాళి విముక్తి కోసం ఉపయోగించాలనుకున్నారు. పాలకుల ఆగ్రహానికి గురయ్యారు. భార్య జెన్నీవాన్‌ వెస్ట్‌ఫాలెన్‌ సహా దేశ బహిష్కరణకు గురయ్యారు. బెల్జియం, ఫ్రాన్స్‌ తదితర దేశాలు తిరిగి అక్కడ నిలువనీడ కోల్పోయి లండన్‌లో స్థిరపడ్డారు. నాటి నిరంకుశ దోపిడీ పాలకులపై దండయాత్ర చేసి పేదరికాన్ని కోరి తెచ్చుకున్నారు . పిల్లలకు పోషకాహారం లేక తాను అమితంగా ప్రేమించే కొడుకును కోల్పోయారు. చనిపోయిన కొడుక్కి అంత్యక్రియలకు కూడా డబ్బులేక ఇంట్లో సామాను అమ్మేశారు.

మార్క్స్‌కు వెన్నంటి నిలిచిన జెన్నీ ....

ధనిక కుటుంబంలో జన్మించిన జెన్నీ అన్నీ తానై మార్క్స్‌ వెన్నంటి నిలిచింది. స్నేహితుడు, సహచర సిద్ధాంతవేత్త ఎంగెల్స్‌ తన ఆదాయంతో మార్క్స్‌ కుటుంబానికి అండగా నిలబడ్డారు. మార్క్స్‌ తన 64వ యేట 1883 మార్చి 14న చనిపోయారు. ఆయన అంత్యక్రియలకు ఎంగెల్స్‌ సహా పదకొండు మంది మాత్రమే హాజరయ్యారంటే, నాటి పాలకుల దుర్నీతి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.

తనకు తాను ప్రపంచ పౌరుడిగా చెప్పుకున్న మార్క్స్‌ ...

చనిపోయేనాటికి ఏ దేశపౌరసత్వమూ లేని మార్క్స్‌ తనకు తాను ప్రపంచ పౌరుడినని చెప్పుకున్నారు. బ్రిటిషు మ్యూజియం గ్రంథాలయంలో కూర్చొని నిరంతరం అధ్యయనం చేశారు. భారతదేశాన్ని గురించి అప్పటికి అందుబాటులో ఉన్న సమాచారాన్ని క్షుణ్ణంగా చదివారు. తన వ్యాసాలు, గ్రంధాలలో ప్రస్తావించారు.. భారతదేశం బ్రిటిష్‌ శృంఖలాలు తెంచుకొని విముక్తి సాధిస్తుందని ఆయన ఘంటాపథంగా చెప్పాడు. మార్క్స్ తాను జీవించిన కాలంలో సోషలిజాన్ని చూడలేకపోయారు. 20వ శతాబ్దపు తొలి సంధ్యలో సోవియట్‌ యూనియన్‌ అవతరించింది. ఆపై వరుసగా చైనా, వియాత్నం, క్యూబా... ఇలా అనేక దేశాల్లో సోషలిజం ఆవిర్భవించింది.

నిర్దిష్ట పరిస్థితిని నిర్దిష్టంగా విశ్లేషించడమే మార్క్సిజంఅన్న లెనిన్‌...

నిర్దిష్ట పరిస్థితిని నిర్దిష్టంగా విశ్లేషించడమే మార్క్సిజం యొక్క సజీవ సిద్ధాంతమని లెనిన్‌ చెప్పారు. దాన్ని ఆయన రష్యాలో అమలుచేసి చూపించారు. వివిధ రకాల జాతులున్న రష్యాలో మార్క్సిజం వర్తించదన్న ప్రచారాన్ని ఆయన పటాపంచలు చేశాడు. అలాగే మావో బాగా వెనుకబడిన చైనాలో నిర్దిష్టంగా అమలు చేశారు. అక్కడ ప్రజలు కన్ఫ్యూసియస్‌ సిద్ధాంతం, బౌద్ధ మతాల ప్రభావం నుంచి బయటపడి చైనాను విముక్తి చేశారు. లాటిన్‌ అమెరికాది మరో అనుభవం. ఇలా వివిధ దేశాల్లో అనేక రకాల అనుభవాలు. కానీ అన్నింటి సారం ఒక్కటే. మార్క్సిజం ప్రపంచ సిద్ధాంతం. ఆయా దేశాల నిర్దిష్ట పరిస్థితులకు దాన్ని వర్తింపజేసే విధానాన్ని బట్టి దాని విజయం ఆధారపడి ఉంటుంది. భవిష్యత్తులో భారతదేశమూ అదే బాటలో నడుస్తుంది. అదే నడుస్తోన్న చరిత్ర సారం.

21:27 - May 5, 2017

నెల్లూరు: భాతర అంతరిక్ష పరిశోధనా సంస్థ మరోసారి సత్తా చాటింది. దక్షిణాసియా ఉపగ్రహాన్ని సక్సెస్‌ఫుల్‌గా లాంచ్‌ చేసింది. జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ద్వారా నింగిలోకి దూసుకెళ్లిన జీశాట్‌ ఉపగ్రహం భారత కీర్తి పతాకను దిగంతాల్లో సగర్వంగా రెపరెపలాడించింది.

జీశాట్-9 ప్రయోగం విజయవంతం

శాటిలైట్‌ ప్రయోగంలో ఎదురు లేకుండా దూసుకు పోతున్న భారత్‌ మరో విజయం సాధించింది. దక్షిణాసియాలో స్నేహ వారధిగా నిలవనున్న జీశాట్‌-9 ఉపగ్రహాన్ని సక్సెస్‌ఫుల్‌గా ప్రయోగించింది. సాయంత్రం 4గంటల 57 నిముషాలకు నిప్పులు చిమ్ముతూ దూసుకెల్లిన జీఎస్‌ఎల్వీ - ఎఫ్ 09 రాకెట్‌ ..ఇస్రో ఘనతను మరోసారి చాటి చెప్పింది.

మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ. 450కోట్లు

దక్షిణాసియా ఉపగ్రహం ప్రాజెక్టుకోసం 450కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఇస్రో.. కేవలం జీశాట్‌-9 శాటిలైట్‌ కోసమే 235 కోట్ల రూపాయలు వెచ్చించింది. మొత్తం 2230 కిలోల బరువైన ఈ ఉపగ్రహం 12 ఏళ్లపాటు సేవలు అందించనుంది. ఆఫ్గానిస్థాన్‌, నేపాల్‌, భూటాన్‌, బంగ్లాదేశ్‌తోపాటు శ్రీలంక, మాల్దీవులకు జీశాట్‌ -9 ఉపయోగపడనుంది. పాకిస్థాన్‌ మినహా దక్షిణాసియా దేశాల్లో సమాచార రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టెలీకం రంగంతోపాటు, విద్య, టెలీమెడిసిన్‌, ప్రకృతి విపత్తుల హెచ్చరికలు తదితర విభాగాల్లో జీశాట్‌ సమాచారం ఉపయోగపడనుంది,

ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించిన ప్రధాని మోదీ

జీశాట్‌-9ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధాని మోదీ అభినందించారు. ఈ ప్రయోగం భారత్‌ను దక్షిణాసియాలో నాయకత్వ స్థానంలో నిలిపిందన్నారు.

అగ్రరాజ్యాలతో పోటీపడుతున్న భారత్‌..

అంతరిక్ష పరిశోధనల్లో అగ్రరాజ్యాలతో పోటీపడుతున్న భారత్‌.. ఇరుగు పొరుగు దేశాలకూ ఆ ఫలాలు అందిస్తోందని .. ఆఫ్గనిస్థాన్‌ అధ్యక్షుడు అష్రాఫ్‌ఘనీ, నేపాల్‌ ప్రాధాని పుష్పకమ్‌దహల్‌ ప్రశంశలు కురిపించారు.

ప్రాంతీయంగా భారత్‌ స్నేహ వారధిని నిర్మించిందని...

జీశాట్‌ -9తో ప్రాంతీయంగా భారత్‌ స్నేహ వారధిని నిర్మించిందని భూటాన్‌, బంగ్లాదేశ్‌ ప్రధానులు కృతజ్ఞతలు చెప్పారు. అటు శ్రీలంక , మాల్దీవుల అధ్యక్షులు కూడా జీశాట్‌-9 సక్సెస్‌పై హర్షం ప్రకటించారు. భారత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మొత్తానికి జీశాట్‌-9 సక్సెస్‌తో సార్క్‌దేశాల్లో భారత్‌ ప్రతిష్ట మరింత పెరిగినట్టైంది. మనతోపాటు మన ఇరుగు పొరుగువారూ బాగుండాలనే భారత్ ప్రయత్నంపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంశలు కురుస్తున్నాయి.

21:23 - May 5, 2017

హైదరాబాద్: ప్రగతి భవన్ లో ఆశ కార్యకర్తలతో, ఏఎన్ఎంలతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆశావర్కర్లు సమాజంలో గౌరవంగా బ్రతకాలని.. వారితో వెట్టి చాకిరి చేయించడం సరైంది కాదని కేసీఆర్ అన్నారు. త్వరలో భర్తీ చేయనున్న 1200 ఏఎన్ఏం పోస్టుల్లో ఆశవర్కర్లకు ప్రాధాన్యతను ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఇక నుంచి ఆశవర్కర్ల జీతం రూ.6 వేలు ఇవ్వనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.

ఆశా కార్యకర్తలు తెలంగాణ సంరక్షకులు కావాలన్న కేసీఆర్

నిరుపేదలకు ఆసుపత్రి గురించి అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఆశావర్కర్లదే అన్నారు సీఎం కేసీఆర్. ఆశా కార్యకర్తలు తెలంగాణ సంరక్షకులు కావాలని పిలుపునిచ్చారు. వచ్చే బడ్జెట్ నాటికి ఆశ కార్యకర్తలను అంగన్ వాడీల స్థాయికి తీసుకెళ్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. కేంద్రంతో సంబంధం లేకుండా ఆశ కార్యకర్తల సేవల్ని రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా వినియోగించుకుంటుందన్న కేసీఆర్ ..దీనికి తగిన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

ఆశా వర్కర్లకు అభినందనలు : తమ్మినేని వీరభద్రం

హైదరాబాద్: ఆశా వర్కర్లకు సీపీఎం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అభినందనలు తెలిపారు. ఉద్యోగ భద్రత, హక్కుల సాధనకు ఐక్యంగా ముందు కు సాగాలని పిలుపునిచ్చారు. జీతాల పెంపు కోసం పట్టుదలగా నిలబడి జీతాల పెంపు కోసం పట్టుదలగా నిలబడిన ఆశా వర్కర్లకు సీపీఎం తరపున విప్లవ జేజేలు తెలిపారు. ఎన్ ఆర్ హెచ్ ఎంమ్ స్కీంను కాపాడుకోవడానికి చట్టబద్ధమైన హక్కుల కోసం ఆశా వర్కర్లు ఐక్యంగా ఉండాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరుల హక్కులు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. అహంభావంతో వ్యవహరిస్తే ఎవరైనా మూల్యం చెల్లించుకోవాలని హెచ్చరించారు.

20:09 - May 5, 2017

హైదరాబాద్: మళ్లా మైకందుకున్న వర్లా రామయ్య...పాత చింతకాయనే నూరుతున్నడయ్యా...,ప్రగతి భవన్ లో పరవశించిపోతున్న పబ్లిక్.. గా ముచ్చట్లు చెప్పరాదా ఈ సార్ కు, నెల్లూరు కాడ ఆనం రెడ్ల ఆగమాగాలు...అడ్డమైన మాటలనుకుంటున్న అన్నదమ్ములు, ఏఎన్ ఎం అక్కలూ అందుకోండి స్కూటర్లు...టీకాల బండ్లు ఇవ్వబోతున్న ప్రభుత్వం, తిరుపతి వెంకన్న ఉండిలో చెయ్యేసిండు...పోలీసోళ్ల పోరని చెయ్యికి బేడీలు వేసింన్రు.. ఇలాంటి అంశాలతో మల్లన్న మల్లన్నముచ్చట్లు కార్యక్రమంలో మన ముందుకు వచ్చాడు. పూర్తి వివరాలను చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

19:57 - May 5, 2017

ఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఎట్టకేలకు దోషులకు సుప్రీంకోర్టు ఉరిశిక్షణను ఖరారు చేసింది. దోషులైన ముఖేష్‌, వినయ్‌, పవన్‌, అక్షయ్‌కు ఢిల్లీ హైకోర్టు విధించిన ఉరిశిక్షను అత్యున్నత న్యాయస్థానం సమర్ధించింది. నలుగురికీ ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పును దేశ ప్రజలంతా స్వాగతిస్తున్నారు. ఇదే అంశంపై హెడ్ లైన్ షో లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో ప్రముఖ న్యాయవాది పార్వతి, సీఐ లక్ష్మీ మాధవి, ఐద్వా నేత రమాదేవి పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

గొలివాడ భూ నిర్వాసితులను పరామర్శించిన జీవన్ రెడ్డి.. అరెస్ట్

పెద్దపల్లి : పీఎస్ లో వున్న గొలివాడ భూ నిర్వాసితులను కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మృత్యుంజయ పరామర్శించారు. నిర్వాసితులకు మద్దతుగా ప్రాజెక్టు వద్ద ఆందోళన చేపట్టారు. ఆందోళన చేపట్టిన నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని గోదావరిఖని ఎన్టీపీసీ పీఎస్ కు తరలించారు.

'గ్రూప్ -2 పరీక్షను 2 నెలల పాటు వాయిదా వేయాలి'

విశాఖ : ఏయూ దూర విద్యా కేంద్రం వద్ద వాటర్ ట్యాంక్ ఎక్కి గ్రూప్ -2 అభ్యర్థులు నిరసన తెలియజేశారు. గ్రూప్ -2 పరీక్షను 2 నెలల పాటు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.

ఆప్ పార్టీకి కేంద్ర హోంశాఖ నోటీసులు

ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి కేంద్ర హోంశాఖ నోటీసులు జారీ చేసింది. విదూశీ పిధేలసౌ వివరాలు తెలియజేయాలని ఆదేశించింది.

 

19:08 - May 5, 2017

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ నాలాల పూడికతీత పనుల అక్రమాల కేసులో సీసీఎస్‌ పోలీసులు వేగం పెంచారు. సెంట్రల్‌ జోన్‌ పరిధిలో అక్రమ బిల్లులు పెట్టి డబ్బులు డ్రా చేసిన కాంట్రాక్టర్లకు సహకరించిన 12 మంది ఏఈలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

19:05 - May 5, 2017

విశాఖ : వీఆర్‌ చిట్స్‌ బాధితులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆపేది లేదని సీపీఎం నాయకులు సీహెచ్‌ నరసింగరావు అన్నారు. వీఆర్‌ యాజమాన్యాన్ని తక్షణమే అరెస్ట్‌ చేసి 200 కోట్లు అవినీతి పై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. జిల్లా కోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పులను ఉల్లంఘిస్తూ వన్ టైమ్ సెటిల్ మెంట్ పేరుతో బాధితులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. బాధితులకు వడ్డీతో సహ చెల్లించేంత వరకు తమ పోరాటం ఆగదని అన్నారు.

19:03 - May 5, 2017

ప్రకాశం: కనిగిరిలో సీపీఎం, ప్రజాసంఘాలు ఎమ్మార్వో ఆఫీసును ముట్టడించాయి. ఇళ్లస్థలాల ముంజూరు , మంచినీటి సమస్యలపై స్థానిక పేదలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. అధికారపార్టీ నాయకులు కనున్నల్లో పనిచేస్తున్న అధికారులు.. పేదలకు అన్యాయం చేస్తున్నారని సీపీఎం నేతలు విమర్శించారు. అర్హులైన వారికి ఇళ్లస్థలాల పట్టాలు వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు.

19:02 - May 5, 2017

విజయవాడ: సంస్థాగతంగా బలపడేందుకు వైసీపీ ప్రణాళికలు సిద్ధం చేసింది. దీన్లో భాగంగా విస్తృత స్థాయిలో పార్టీ ప్లీనరీ సమావేశాలు నిర్వహిచడానికి ఆపార్టీ నేతలు రంగం సిద్ధం చేశారు. మూడు అంచెల్లో ప్లీనరీలు నిర్వహిస్తామని వైసీపీ సీనియర్‌నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. నియోజవర్గం, జిల్లా, స్థాయిలతోపాటు విజయవాడలో జాతీయస్థాయి సమావేశాలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. మే చివరి వారం నుంచి ప్రారంభం కానున్న ప్లీనరీ సమావేశాలు, జూలై 8. 9 తేదీల్లో జరిగే జాతీయస్థాయి సమావేశాలతో ముగుస్తాయన్నారు. ఈ ప్లీనరీల్లో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీబలోపేతంపై చర్చలు జరుగుతాయన్నారు ఉమ్మారెడ్డి.

19:00 - May 5, 2017

హైదరాబాధ్: మిర్చి కొనుగోళ్లపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ స్పందించారు. మిర్చి కొనుగోలులో వివక్ష చూపొద్దని పవన్‌ బహిరంగ లేఖ రాశారు. కేంద్రం మిర్చికి మద్దతు ధర కేవలం ఐదు వేలు ప్రకటించడం శోచనీయమన్నారు. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు తప్పించుకోవద్దన్నారు. పారిశ్రామికవేత్తలకు సబ్సిడీలు ఇచ్చే ప్రభుత్వాలు.. రైతులపై ఎందుకు కరుణ చూపడం లేదన్నారు. మిర్చి కొనుగోలులో తెలంగాణపై వివక్ష చూపడం సరికాదన్న పవన్‌.. తెలుగు రాష్ట్రాలను సమానంగా చూడాలన్నారు. రాష్ట్రాల మధ్య గొడవలు పెట్టొద్దన్నారు. రెండు రాష్ట్రాల్లో మద్దతు ధర పెంచి మిర్చిని కొనుగోలు చేయాలని పవన్‌కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు.

18:58 - May 5, 2017

ఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఎట్టకేలకు దోషులకు సుప్రీంకోర్టు ఉరిశిక్షణను ఖరారు చేసింది. దోషులైన ముఖేష్‌, వినయ్‌, పవన్‌, అక్షయ్‌కు ఢిల్లీ హైకోర్టు విధించిన ఉరిశిక్షను అత్యున్నత న్యాయస్థానం సమర్ధించింది. నలుగురికీ ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పును దేశ ప్రజలంతా స్వాగతిస్తున్నారు.

16 డిసెంబర్‌ 2012 నిర్భయ ఘటన

2012 డిసెంబర్‌ 16వ తేదీ సాయంత్రం నిర్భయ తన స్నేహితుడితో కలిసి సినిమా చూసి తిరిగి వస్తూ.. ఆరుగురు ప్రయాణికులు ఉన్న బస్సును ఎక్కారు. అప్పటికే పీకలదాకా మద్యం సేవించి ఉన్న ఆరుగురు... నిర్భయ స్నేహితుడిని చితకబాది ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కదులుతున్న బస్సులోనే గంటకుపైగా పాశవికంగా లైంగిక దాడికి పాల్పడి.. చివరకు వారిద్దరినీ బస్సులోనుంచి బయటకు తోసివేశారు. అటువైపు వెళ్తున్న కొందరు వివస్త్రంగా, అచేతనంగా పడిఉన్న నిర్భయను చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆమెను సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రిలో చేర్చారు. డిసెంబర్‌ 26న నిర్భయను మెరుగైన చికిత్స కోసం సింగపూర్‌లోని మౌంట్‌ ఎలిజబెత్‌ ఆస్పత్రికి తరలించారు. చివరికి చికిత్స తీసుకుంటూ డిసెంబర్‌ 29న నిర్భయ తుది ప్రాణాలు విడిచింది.

భారతదేశాన్ని కుదిపేసిన నిర్భయ ఘటన

నిర్భయ ఘటన యావత్‌ భారతదేశాన్ని ఓ కుదుపు కుదిపివేసింది. కేంద్ర సర్కార్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు దేశవ్యాప్తంగా జరిగాయి. ఈ ఘటన అమ్మాయిలు, మహిళలపట్ల జరుగుతున్న లైంగిక దాడిని మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. మహిళలపై లైంగిక దాడికి పాల్పడే కామాంధులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా ఒక్కటై గొంతెత్తి నినదించారు. నిర్భయ నిందితులను ఉరితీయాలంటూ విద్యార్ధి, యువజన, మహిళా , ప్రజా సంఘాలు భారీ ఎత్తున ఆందోళనలు నిర్వహించాయి. మహిళ చట్టాలను కఠినతరం చేయాలని డిమాండ్‌ చేశారు.

ఆరుగురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

ప్రజాందోళనలతో నాటి మన్మోహన్‌ సర్కార్‌ నిర్భయ కేసు నిందితుల్లో 6గురిని అరెస్ట్‌ చేసింది. నిందితుల్లో ఒకరైన రామ్‌సింగ్‌ తీహార్‌ జైల్‌లో 2013 మార్చిలో ఆత్మహత్య చేసుకున్నాడు. మరో నిందితుడు మైనర్‌ కావడంతో కేవలం మూడేళ్ల శిక్ష అనుభవించి స్వేచ్ఛగా బయటకు వెళ్లిపోయాడు. ఈ కేసును విచారించిన ఢిల్లీ హైకోర్టు 2013 సెప్టెంబర్‌ 13న తీర్పు వెలువరించింది. నిర్భయపై అత్యంత హేయంగా అత్యాచారం చేసి, కిరాతకంగా హింసించి చంపిన నరరూప రాక్షసులను చనిపోయే వరకు ఉరితీయడమే సరైన శిక్షని న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఇక నాటి యూపీఏ సర్కార్‌ నిర్భయ పేరుతో చట్టాన్ని కూడా తీసుకొచ్చింది.

ఢిల్లీ కోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలుకెళ్లిన దోషులు

ఢిల్లీ హైకోర్టు తీర్పుపై దోషులైన అక్షయ్‌ ఠాకూర్‌, వినయ్‌శర్మ, పవన్‌గుప్తా, ముఖేష్‌ సుప్రీంలో అప్పీలు చేశారు. దీనిపై పలుమార్లు విచారించిన సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. ఢిల్లీ హైకోర్టు తీర్పును సమర్ధించింది. నలుగురికీ ఉరిశిక్ష ఖరారు చేసింది. నిర్భయ మరణ వాంగ్మూలాన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఈ ఘటనను నేరపూరిత కుట్రగా ధృవీకరించింది. సీసీ టీవీ ఫుటేజ్‌ను సరైన సాక్ష్యంగా సుప్రీంకోర్టు పరిగణించింది. అమానుషంగా వ్యవహరించిన దోషులకు ఉరే సరైందని... భవిష్యత్‌లోనూ ఎవరూ ఇలాంటి నేరం చేయకూడదని వ్యాఖ్యానించింది. కోర్టు రూమ్‌లో ఉన్న లాయర్లు, నిర్భయ తల్లిదండ్రులు చప్పట్లతో ఈ తీర్పును స్వాగతించారు. కేవలం వారే కాదు... యావత్‌ దేశప్రజంతా సుప్రీం తీర్పుపై హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

18:53 - May 5, 2017

హైదరాబాద్: టుడే అవర్ రీసెంట్ రిలీజ్ "బాబు బాగా బిజీ " రైటర్ కం డైరెక్టర్ కం హీరో అవసరాల శ్రీనివాస్ హీరోగా నటించిన ‘బాబు బాగా బిజీ ’ సినిమా ఇవాళ్టి మన నేడే విడుదల రివ్యూ టైం లో ఉంది.లేట్ లేకుండ ‘ బాబు బాగా బిజీ " టాక్ ఏంటో తెలుసుకుందాం.

స్వచ్ఛమైన కామెడీ తో...

స్వచ్ఛమైన కామెడీ తో హెల్ది ఫిలిం మేకర్ అంటూ తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు అవసరాల శ్రీనివాస్ .తన శైలి కి బిన్నంగా ఇప్పుడు రొమాంటిక్ కామెడీ తో తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చాడు అవసరాల .హిందీ లో హిట్ టాక్ తెచ్చుకున్న హంటర్ సినిమా కి రీమేక్ ఈ బాబు బాగా బిజీ సినిమా .

మిస్తీ ,తేజస్విని ,శ్రీముఖి వంటి అందమైన బామలు...

మిస్తీ ,తేజస్విని ,శ్రీముఖి వంటి అందమైన బామలు నటించిన రొమాంటిక్ కామెడీ ఫిలిం బాబు బాగా బిజీ ఆడియన్స్ కి కొత్త తరహా అనుభవం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అని చెప్పొచ్చు ..నవీన్ మేడారం డైరెక్షన్ లో వచ్చిన ఫస్ట్ ఫిలిం కావడం తో డైరెక్టర్ చాల కేర్ తీసుకొని ఉంటాడు అని ట్రైలర్ చూస్తేనే అర్ధం అవుతుంది .

టీజర్ కు మంచి రెస్పాన్స్

ఈ చిత్రం ఫస్ట్ లుక్ మరియు టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.ట్రైలర్ లోనే ఆసక్తి కరమైన డైలాగ్స్ ని చూపించిన డైరెక్టర్ ఈ సారి అడల్ట్ కామెడీ తో అన్ని వర్గాల ఆడియన్స్ మీద పెట్టిన ఫోకస్ స్పష్టంగా కనిపిస్తుంది . మరి ఈ బాబు బాగా బిజీ ’ సినిమా తెలుగు ఆడియన్స్ ని ఏమాత్రం ఎంటర్ టైన్ చేసిందో, ఎంత వరకు రీచింగ్ ఉందొ చూడాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియోను క్లిక్ చేయండి...

ప్లస్ పాయింట్స్ :

అవసరాల శ్రీనివాస్

హీరోయిన్స్

సినిమాటోగ్రఫీ

ప్రొడక్షన్ వాల్యూస్

 

మైనస్ పాయింట్స్ :

మ్యూజిక్

కంఫ్యూజుడ్ స్క్రీన్ ప్లే

కనెక్ట్ కానీ క్లైమాక్

బలం లేని ఎమోషన్స్

 

 

రేటింగ్ 1 .5

సివిల్స్ పరీక్ష సరిగా రాయలేదని తుపాకీతో కాల్చుకుని

కర్నూలు: సివిల్స్ పరీక్ష సరిగా రాయలేదని సుచరిత అనే విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. తుపాకితో కాల్పుచుని ఆత్మహత్యాయత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది.తన తండ్రి రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి అని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. అయితే సచరిత పరిస్థితి ఆందోళన కరంగా ఉందని డాక్టర్లు తెలిపారు.

కుషాయిగూడ పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం

హైదరాబాద్: కుషాయిగూడ పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం సంభవించింది. నిషా ప్లాస్టిక్ కంపెనీలో భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 3 ఫైరింజన్లతో మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నాయి.

రెండు రాష్ట్రాలను సమానంగా చూడాలి: పవన్ కల్యాణ్

హైదరాబాద్: మిర్చికి గిట్టుబాటు ధర రూ.5వేలు ప్రకటించడం శోచనీయమని జనసేన అధినేత పవన్ కల్యాన్ మండిపడ్డారు. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పించుకోకూడదని హెచ్చరించారు. పారిశ్రామిక వేత్తలకు సబ్సిడీలు ఇస్తున్న ప్రభుత్వాలు రైతులకు ఎందుకు కరుణ చూపడం లేదని ప్రశ్నించారు. మిర్చి కొనుగోలులో తెలంగాణ పై కేంద్రం వివక్ష సరికాదని పవన్ పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలను సమానంగా చూడాలని, ఇరు రాష్ట్రాల మధ్య గొడవలు పెట్టొదని పవన్ సూచించారు.

రైతులు ఆందోళన చెందవద్దు: సీఎం చంద్రబాబు

అమరావతి: ఏపీలో మిర్చి కొనుగోళ్లపై అమెరికా నుంచి సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. చివరి బస్తా వరకు కొనుగోలు జరిగేలా చూస్తామన్నారు. కర్నూలు, ఒంగోలు, చిలకలూరిపేటలో వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని సూచించారు. శని, ఆదివారల్లో కూడా మర్చి కొనుగోళ్లు చేయాలన్నారు. ఇందుకు హమాలీలకు అదనపు భత్యం ఇవ్వాలన్నారు. గొనుగోళ్లకు గడువు పెంచాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. క్వింటాలుకు మద్ధతు ధర రూ.8వేలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

18:01 - May 5, 2017

నెల్లూరు : షార్ నుంచి ఈ రోజు ఇస్రో చేసిన‌ జీశాట్‌-9 ఉపగ్రహ ప్ర‌యోగం విజ‌య‌వంత‌మైంది. జీఎస్ఎల్వీ-ఎఫ్‌09 ద్వారా ఆకాశంలోకి వెళ్లిన‌ జీశాట్-9 నిర్ణీత క‌క్ష్య‌లో ప్ర‌వేశించిన‌ట్లు ఇస్రో తెలిపింది. జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌09 వాహకనౌక ద్వారా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి 28గంటల కౌంట్‌డౌన్‌ ప్రక్రియ అనంతరం జీశాట్‌-9 నింగిలోకి దూసుకెళ్లింది. 2230 కిలోల బరువైన ఈ సమాచార ఉపగ్రహం తయారీకి ఇస్రో రూ.235కోట్లు ఖర్చు చేసింది. మొత్తం ఈ ప్రాజెక్టుకు రూ.450కోట్లు వెచ్చించింది. 12 ఏళ్లు పాటు ఈ ఉపగ్రహం సేవలందించనుంది. ఈ ఉపగ్రహం ద్వారా భారత్‌ సహా దక్షిణాసియా దేశాలైన ఆఫ్గానిస్థాన్‌, భూటాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌, శ్రీలంక, మాల్దీవులు లబ్ధి పొందనున్నాయి.

17:49 - May 5, 2017

కృష్ణా : జగ్గయ్యపేట మండలం చిల్లకల్లులో భారీగా గంజాయి పట్టుబడింది. ఓ వ్యానులో అడుగు భాగాన ప్రత్యేకంగా ఏర్పాటు చేసి.. గంజాయి ప్యాకెట్లు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన గంజాయి 600 కిలోలు ఉంటుందని పోలీసులంటున్నారు. ఇది నందిగామ నుంచి మహారాష్ట్రకు వెళ్తుందని.. అయితే దీని వెనక ఎవరు ఉన్నారనేది విచారణలో తేలుతుందన్నారు పోలీసులు.

విజయవంతమైన జీశాట్ 9 ఉపగ్రహ ప్రయోగం

నెల్లూరు : జిల్లాలోని శ్రీహరికోట షార్ నుంచి పీఎస్ ఎల్వీ రాకెట్ ద్వారా జీశాట్ 9 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. ఈ ఉపగ్రహంతో దక్షణాసియా దేశాలకు ఉపయోగపడనుంది. ఈ ప్రయోగాన్ని 4.57 నిమిషాలకు ప్రయోగించారు.

 

17:44 - May 5, 2017

అమరావతి: మిర్చి రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గుంటూరు మార్కెట్‌ యార్డ్‌ సెలవులను 40 రోజుల నుంచి 20 రోజులకు తగ్గిస్తున్నామని .. మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌, ఆదినారాయణ రెడ్డి చెప్పారు. గిట్టుబాటు ధరల విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని అన్నారు. రైతుల విషయంలో రాష్ట్రం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని ...మంచి క్వాలిటీ ఉన్న మిర్చికి ఆరు వేల ధర కేటాయించిందని చెప్పారు. రైతులను ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయని మంత్రి ఆదినారాయణరెడ్డి ఆరోపించారు.

17:40 - May 5, 2017

నిర్భయ కేసులో తీర్పు వెల్లడించిన సుప్రీం కోర్టు

ఢిల్లీ : నర్భయ కేసులో సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించింది. దోషులకు ఉరిశిక్షను విధిస్తూ క్రింది కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్ట సమర్ధించింది. నలుగురు దొషులు అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మ, పవన్ గుప్త, ముకేష్ లకు ఉరిశిక్ష ఖరారు.  

16:39 - May 5, 2017
16:35 - May 5, 2017

హైదరాబాద్: ప్లాస్టిక్‌ బాటిల్స్‌లో వాటర్‌ తాగి అనారోగ్యాల పాలవుతున్న తరుణంలో .. ఎమ్‌ఎస్‌ఆర్‌ గ్రూప్‌ పూర్తి కాపర్‌తో తయారు చేసిన వాటర్‌ బాటిళ్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి పూర్తి సురక్షిత బాటిళ్లను రూపొందించామని సంస్థ ఎండీ రాజశేఖర్‌రెడ్డి చెప్పారు. డాక్టర్‌ కాపర్‌ పేరుతో విడుదల చేసిన బాటిళ్లు కేవలం 799 రూపాయలకే అన్ని సూపర్‌ మార్కెట్లలో అందుబాటులో ఉన్నాయని ఎమ్‌ఎస్‌ఆర్‌ సంస్థ తెలిపింది. మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో సినీతార రాశీఖన్నా డాక్టర్‌కాపర్‌ వాటర్‌ బాటిల్స్‌ను విడుదల చేశారు.

16:34 - May 5, 2017

విశాఖ : సమాజంలో జరుగుతున్న దోపిడీని, రావలసిన మార్పును శాస్త్రీయంగా వివరించి చెప్పిన మేధావి కార్ల్‌ మార్క్స్‌ అని ఎంవీఎస్‌ శర్మ అన్నారు. కార్ల్ మార్క్స్ 200వ జయంతి వేడుకలు విశాఖలో ఘనంగా జరిగాయి. కార్ల్ మార్క్స్‌ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పౌర గ్రంథాలయం అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో మార్స్కిజం -సాహిత్యం అనే అంశంపై సభ నిర్వహించారు. ప్రపంచ కార్మికులను ఏకం చేయాలన్న మార్క్స్‌ లక్ష్యానికి అనుగుణంగా అందరూ నడవాలని ఎంవీఎస్‌ శర్మ అన్నారు.

16:32 - May 5, 2017

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో సీపీఎం మహిళా నాయకురాలు కాసాని లక్ష్మీ మృతికి సీపీఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం సంతాపం తెలిపారు. సుజాతానగర్‌లో జరిగిన లక్ష్మీ అంతమయాత్రలో పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈసందర్భంగా జరిగిన సంతాపసభలో తమ్మినేని మాట్లాడారు. కాసాని లక్ష్మీ పార్టీకి ఎనలేని సేవచేశారని నివాళులర్పించారు. లక్ష్మీ కుటుంబానికి పార్టీ, కార్యర్తలు అండగా ఉంటారని తమ్మినేని అన్నారు.

16:31 - May 5, 2017

విశాఖపట్నం: ఉక్కు సిటీ విశాఖలో చిల్లరగోల నడుస్తోంది. పది రూపాయల నాణేలలో నకిలీవి ఉన్నాయంటూ విస్తృతంగా వదంతులు రావడంతో.... పెద్ద ఎత్తున పది రూపాయల నాణేలను జనం బ్యాంకుల్లో జమ చేస్తున్నారు. ఈ మేరకు ఆరు లక్షల పది రూపాయల నాణేలను జమ చేశారు. బయట ఎవరూ పది రూపాయలు తీసుకోవడం లేదని కస్టమర్లు అంటున్నారు. అయితే ఇవన్నీ వదంతులని .. పది రూపాయలు నాణేలు చెల్లుతాయని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.

16:29 - May 5, 2017

హైదరాబాద్: ఆశావర్కర్ల జీతాలను 6 వేల రూపాయలకు పెంచుతూ తెలంగాణ సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ప్రగతి భవన్‌లో ఆశావర్కర్లతో సమావేశమైన ఆయన.. ఏఎన్ ఎంల నియామకాల్లోనూ ప్రాధాన్యం ఇస్తామన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

16:28 - May 5, 2017

హైదరాబాద్: కన్నడ, తమిళ టీవీ ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటి రేఖా సింధు కారు ప్రమాదంలో మృతి చెందారు. చెన్నై-బెంగళూరు హైవేపై ఈ ప్రమాదం జరిగింది. వెల్లూర్‌ జిల్లాలోని పరణంపట్టు ప్రాంతం దగ్గర కారు అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న రాయిని ఢీకొని పల్టీలు కొట్టింది.ఈ ప్రమాదంలో నటి రేఖా సింధుతో పాటు ఆమె ముగ్గురు స్నేహితులు ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను త్రిపుత్తూర్‌ గవర్నమెంట్‌ ఆస్పత్రికి తరలించారు.

ఆశావర్కర్ల జీతం ఇక రూ.6వేలు

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఆశావర్కర్లకు నెలకు రూ.6వేల జీతాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల మంచి చెడు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని అన్నారు. ఏఎన్ఎం భర్తీలో ఆశావర్కర్లకు ప్రాధాన్యత ఇస్తామని...ఆశా కార్యకర్తల విధులను అధికారులతో చర్చించి త్వరలో ఖరారు చేస్తామని తెలిపారు.

 

 

15:30 - May 5, 2017
15:28 - May 5, 2017

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ఎంసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. తొలిసారిగా ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఏపీ ఎంసెట్‌-2017 ఫలితాలను విజయవాడలో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కామినేని శ్రీనివాస్, సోమిరెడ్డి చంద్రమోన్ రెడ్డి లు పాల్గొన్నారు.ఇంజ‌నీరింగ్‌ విభాగంలో 1,23,974 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణ‌త శాతం 79.74 గా ఉంది. ఇక అగ్రిక‌ల్చ‌ల్, ఫార్మ‌సీ విభాగంలో మొత్తం 69,683 మంది ప‌రీక్ష‌కు ద‌రఖాస్తు చేసుకోగా వారిలో 65,675 మంది హాజ‌రయ్యారు. మొత్తం 55,289 మంది అర్హ‌త సాధించారు.తొలిసారిగా ఎంసెట్‌ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించామని, దీని వల్ల పారదర్శకత ఉంటుందన్నారు. ఎక్కడా కూడా లీకేజీకి ఆస్కారం లేకుండా పరీక్ష నిర్వహించామని తెలిపారు. ఏపీలో 124 పరీక్షా కేంద్రాలు, హైదరాబాద్‌లో నాలుగు పరీక్షా కేంద్రాల్లో ఎంసెట్‌ నిర్వహించినట్లు మంత్రి గంటా తెలిపారు. అలాగే ర్యాంకుల సమాచారాన్ని ఆయా అభ్యర్థుల ఫోన్‌ నంబర్లకు పంపించనున్నారు. ఎంసెట్‌ ప్రాథమిక ‘కీ’ లోని 11 ప్రశ్నలకు ఇచ్చిన ఆన్సర్‌ ఆప్షన్లలో మార్పులు జరిగాయి. మరో 9 ప్రశ్నలకు మల్టిపుల్‌ ఆన్సర్‌ ఆప్షన్లు ఉన్నాయని, ఇంజనీరింగ్‌, మెడికల్‌ విభాగాల్లో 8 సెషన్లలో ఇచ్చిన మొత్తం 1280 ప్రశ్నలూ సరైనవేనని ఎంసెట్‌ కమిటీ తేల్చినట్లు పేర్కొన్నారు.

ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల

విజయవాడ : మంత్రి గంటా శ్రీనివాసరావు ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల చేశారు. ఇంజినీరింగ్ లో 79.74 శాతంతో లక్షా 23వేల మంది ఉత్తీర్ణత సాధించారు. 

14:54 - May 5, 2017

హైదరాబాద్: టీవీ ఆర్టిస్ట్‌ ప్రదీప్‌ ఆత్మహత్య కేసులో పోస్టుమార్టం నివేదిక వచ్చాకే చర్యలు తీసుకుంటామని నార్సింగ్‌ సీఐ రామ్‌చందర్‌ రావు అన్నారు. తగిన ఆధారాలు లభిస్తే.. ఈకేసుతో సంబంధం ఉన్న అందరినీ విచారిస్తామన్నారు. 174 సీఆర్పీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు చెప్పారు.

14:51 - May 5, 2017

ఢిల్లీ: విమానాల్లో అనుచితంగా ప్రవ‌ర్తించే ప్రయాణికుల‌కు చెక్ పెట్టేందుకు పౌర‌విమానయాణ శాఖ కొత్త నియ‌మావ‌ళిని ప్రక‌టించింది. విమానాల్లో అనుచితంగా ప్రవ‌ర్తించే ప్రయాణికుల‌కు మూడు నెల‌ల నుంచి రెండేళ్ల వ‌ర‌కు విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించ‌నున్నట్లు పౌర‌విమానయాణ శాఖ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు వెల్లడించారు.తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించినా, విమానాశ్రయంలో గానీ, విమానంలో గానీ, సిబ్బందితో ఘర్షణకు దిగినా ఆ వ్యక్తి నేరం చేసినట్లుగా భావించి అతని పేరును 'నో ఫ్లై లిస్టు'లో నమోదు చేస్తారు. దీంతో అతను విమాన టికెట్లు బుక్‌ చేసుకునే వీలుండదు. ఆధార్‌ తదితర వివరాల ద్వారా లిస్టులో ఉన్న వారిని గుర్తిస్తారు. ప్రజల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకున్న తర్వాత కొత్త నిబంధనలు జూన్‌ నుంచి అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఇటీవ‌ల శివ‌సేన ఎంపీ ర‌వీంద్ర గైక్వాడ్ ఇండియన్‌ ఎయిర్‌లైన్ ఉద్యోగిపై దాడి చేసిన నేప‌థ్యంలో విమాన‌యాణ‌శాఖ ఈ కొత్త రూల్స్‌ను రూపొందించింది. దేశంలోని విమానయాన సర్వీసులకు మాత్రమే ఈ నిబంధనలు వర్తిస్తాయి.

14:49 - May 5, 2017

తూ.గో : కాకినాడ వీబీ ఎక్స్‌పో ఆక్వా కంపెనీలో అమోనియా గ్యాస్‌ లీకేజ్‌ కలకలం రేపింది. ఈ ఘటనలో 10 మంది మహిళా కార్మికులకు అస్వస్థతకు గురయ్యారు. వీరిని కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించడంతో.. వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

14:47 - May 5, 2017

హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నలుగురు దోషులకు ఉరిశిక్షను సమర్థించింది. 2012 డిసెంబర్‌ 12న దేశ రాజధాని దిల్లీలో కదిలే బస్సులో 23 ఏళ్ల యువతిపై ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో కిందికోర్టులు నిందితులకు ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే.మొత్తం ఈ ఘటనలో ఆరుగురికి శిక్ష పడగా.. ఒకరు జైల్లోనే సూసైడ్‌ చేసుకున్నారు. మరొకరు మైనర్‌ కావడంతో మూడేళ్లు శిక్ష అనుభవించి బయటకు వచ్చాడు. అక్షయ్‌ ఠాకూర్‌, వినయ్‌శర్మ, పవన్‌గుప్తా, ముఖేష్‌లు సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకున్నారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈరోజు వారి పిటిషన్‌ను కొట్టివేసింది.

అనకాపల్లిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన

విశాఖ : అనకాపల్లిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఏడాదిలో గ్రామ పంచాయితీల్లో సీసీ రోడ్లు ఏర్పాటు చేస్తామని లోకేష్ అన్నారు. జగన్ ప్రాంతాలు, కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. రానున్న రెండేళ్లలో లక్షా ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. 

 

13:50 - May 5, 2017

పెద్దపల్లి : తెలంగాణలో పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రత్యేక ఉంది. కోల్‌బెల్టు ఏరియాలో ఉన్న ఈ స్థానం పరిధిలోని ఓటర్లు రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరు. ఎన్నికల్లో తీర్పు విషయంలో తమ ప్రత్యేకతను చాటుకుంటారు. ఇటువంటి లోక్‌సభ నియోజకవర్గంలో ఇప్పుడు రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పెద్దపల్లి లోక్‌సభ స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ తరుపున బాల్కసుమన్‌ పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి రాజకీయాలను నడిపిన బాల్క సుమన్‌కు 2014 ఎన్నికల్లో కేసీఆర్‌ పెద్దపల్లి సీటు ఇవ్వడంతో రాజకీయ జీవితం ప్రారంభమైంది. సుమన్‌కు సీటు ఇచ్చే విషయంలో పలు రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అప్పటి వరకు ఈ స్థానం నుంచి కాంగ్రెస్‌ తరుపున వివేక్‌ ప్రాతినిధ్యం వహించారు. 2009లో ఈ స్థానం నుంచి కాంగ్రెస్‌ తరుపున గెలిచిన వివేక్‌, 2012లో టీఆర్‌ఎస్‌లో చేరారు. 2014 ఎన్నికలకు ముందు యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఇవ్వడంతో, రాజకీయంగా కాంగ్రెస్‌కు అనుకూలిస్తుందన్న ఉద్దేశంతో వివేక్‌ టీఆర్‌ఎస్‌ను వీడి మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చారు. సుమన్‌పై పోటీ చేసి ఓడిపోయారు. దీంతో నియోజకవర్గంపై వివేక్‌ పట్టు కోల్పోవడం, సుమన్‌ పట్టు సాధించడం జరిగిపోయాయి. మంచిర్యాలలో మకాంవేసిన బాల్క సుమన్‌..... రామగుండం, మంథని, ధర్మపురి, పెద్దపల్లి, మంచిర్యాల అసెంబ్లీ స్థానాల్లో తనదైన రాజకీయ ముద్ర వేసుకున్నారు.

సుమన్‌ రాజకీయ జీవితానికి అనూహ్య పరిణామం
మూడేళ్లుగా ఎదురులేని నేతగా గుర్తింపు పొందిన బాల్క సుమన్‌ రాజకీయ జీవితానికి అనూహ్య పరిణామం ఎదురైంది. వివేక్‌ మళ్లీ టీఆర్‌ఎస్‌లో చేరడంతో విస్మయం చెందడం సుమన్‌ వంతైంది. సుమన్‌కు ప్రాధాన్యత కూడా తగ్గిందని పార్టీ నేతలే చెబుతున్నారు. టీఆర్‌ఎస్‌లో చేరిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌..వివేక్‌కు ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో పెద్దపల్లి లోక్‌సభకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిత్వంపై కూడా స్పష్టమైన హామీ లభించిందని ప్రచారం జరుగుతోంది. దీంతో వివేక్‌ ఈ ప్రాంతంలో ఎక్కువగా పర్యటిస్తూ తన పాత రాజకీయ పరిచయాలను పునరుద్ధరించుకుంటున్నారు. పెద్దపల్లి పార్లమెటు స్థానం పరిధిలోకి వచ్చే మంచిర్యాల, ఆసిఫాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలతోపాటు, కోల్‌ బెల్టులో కార్మిక నేతలను కలుసుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. సొంత డబ్బు వెచ్చిస్తూ పలు సహాయ కార్యక్రమాలు అమలు చేస్తూ వివేక్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. దీంతో ప్రస్తుత ఎంపీ సుమన్‌ రాజకీయ ప్రాధాన్యత క్రమక్రమంగా తగ్గుతోందని విశ్లేషిస్తున్నారు.

వివేక్‌ టీర్‌ఎస్‌లోకి
వివేక్‌ టీర్‌ఎస్‌లోకి రాకతో వచ్చే ఎన్నికల్లో పెద్దపల్లి లోక్‌సభ స్థానానికి టీఆర్‌ఎస్‌ టిక్కెట్‌ తనకు వచ్చే అవకాశంలేదని భావిస్తున్న బాల్క సుమన్‌ ఇటువైపు రాకుండా ముఖం చాటేస్తున్నారు. ఢిల్లీ, హైదరాబాద్‌, జిగిత్యాలకే పరిమితం అవుతున్నారు. ఐదు నెలలుగా పెద్దపల్లి వైపు కన్నెత్తి చూడలేదని పార్టీ నేతలు చెబుతున్నారు. అధికార కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ అధికారులు కూడా సుమన్‌ కంటే ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వివేక్‌ మాటకే ఎక్కువ విలువ ఇస్తున్నారని వినిపిస్తోంది. పెద్దపల్లి లోక్‌సభ స్థానం పరిధిలోని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో సైతం సుమన్‌కు సక్యతలేదు. సుమన్‌పై పలు ఆరోపణలు కూడా లేకపోలేదు. సెటిల్‌మెంట్లు చేస్తూ డబ్బు సంపాదిస్తూ, భూ కబ్జాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రతి చిన్న విషయంలో జోక్యం చేసుకోవడంతోపాటు, తనకు అనుకూలమైన వారికి కాంట్రాక్టులు ఇప్పించుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివేక్‌ రాకతో తనకు స్థాన చలనం తప్పదని భావిస్తున్న సుమన్‌..తన సొంత జిల్లా జగిత్యాలపై దృష్టి పెట్టారన్న చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసే ఉద్దేశంతో ఉన్న సుమన్‌కు జగిత్యాలలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని ఎదుర్కోవడం కష్టమేనని భావిస్తున్నారు. జగిత్యాల అనుకూలం కాదనుకుంటే చొప్పదండి, మెట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయొచ్చని ప్రచారం జరుగుతోంది. ఏదైనా సుమన్‌ రాజకీయ భవిష్యత్‌ను నిర్ణయించాల్సింది ముఖ్యమంత్రి కేసీఆరే. ఏం జరుగుతుందో వేచి చూడాలి.

13:47 - May 5, 2017

తూర్పు గోదావరి : కోనసీమ రైల్వే లైన్ నిర్మాణం కోసం శంకుస్థాపన జరిగి 18 ఏళ్లవుతోంది. బాలయోగి స్పీకర్ గా ఉన్నప్పుడు అప్పటి రైల్వే మంత్రి మమతా బెనర్జీ రైల్వే లైన్ కి శంకుస్థాపన అయితే చేశారు. పునాది రాయి పడింది కానీ అప్పటి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కోనసీమ ప్రధానంగా వ్యవసాయ ప్రాంతం. ఇక్కడ రైల్వే లైన్ ఏర్పాటైతే వివిధ ఉత్పత్తుల రవాణాకు రైలు మార్గం తోడ్పడుతుందని అంతా ఆశించారు. అయితే కోనసీమ రైల్వే లైన్‌కు పలు బడ్జెట్ లలో కేటాయింపులు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ప్రతి ఒక్కరి ఎన్నికల మ్యానిఫెస్టోలోనూ ఉండే ఈ అంశం ఆ తరువాత చిత్తశుద్ధి లోపించి మాయమౌతోంది.

కాకినాడ నుంచి కోటిపల్లి
మరోవైపు కాకినాడ నుంచి కోటిపల్లి వరకు వేసిన రైల్వే లైన్ ఎందుకు పనికి రాకుండా పోతోంది. కోటిపల్లి నుంచి ఆ లైన్ పొడిగిస్తేనే ప్రయోజనం ఉంటుందని అంతా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనూ రెండు బడ్జెట్ లలో కోటిపల్లి వద్ద గోదావరిపై వంతెన నిర్మాణానికి నిధులు సాధించినట్లు ఎంపీ పండుల రవీంద్రబాబు జోరుగా ప్రచారం చేసుకున్నారు. అయితే ఆచరణలో ఒక్క అడుగు ముందుకు పడటం లేదు. ఇప్పుడు టెండర్ల వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. ప్రభుత్వం కోట్ చేసిన రేటు కన్నా ఏకంగా 150 కోట్లకు అదనంగా టెండర్లు నమోదు కావడంతో అధికారులకు ఏమీ పాలుపోని పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ టెండర్లు పూర్తి చేసినా పనులు మొదలుపెట్టాలంటే వచ్చే వరదల సీజన్ తరువాతే సాధ్యం అయ్యేలా కనిపిస్తోంది. ఇక టెండర్ల జాప్యం పలు అనుమానాలకు కూడా తావిస్తోంది. ప్రభుత్వ పెద్దలే ఇలాంటి వ్యవహారాలను తెరపైకి తెస్తున్నారని కోనసీమ వాసులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా రైల్వే లైన్ విషయంలో ప్రభుత్వం జాప్యం చేయకుండా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.

 

 

చిత్తూరు జిల్లాలో నాటుబాంబు పేలుడు

చిత్తూరు : కలకడం మండలం నడించర్లలో నాటుబాంబు పేలుడు సంభవించింది. చెట్టు పొదలచాటున బాలుడికి నాటు బాంబు దొరికింది. ఆడుకుంటుండగా చేతిలోనే బాంబు పేలడంతో వెంకటరమణ అనే బాలుడు చేతి ఐదువేళ్లను కోల్పోయాడు. 

 

13:16 - May 5, 2017

విశాఖపట్నం : జిల్లా చింతపల్లి మండలం రాళ్లగడ్డ వద్ద మావోయిస్టులు కల్వర్టును పేల్చివేశారు. ఈ ఘనటలో జీపు దగ్ధం అయింది, హోం గార్డు మృతి చెందారు. మిగిలిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తలించారు. మావోయిస్టులు ఆ గ్రామంలో ఆ నెల 24 నుంచి జరిగే వారోత్సవాలు విజయవంతం చేయాలని బ్యానర్లు కట్టారు. విసయం తెలుకుసుకున్న పోలీసులు గ్రామానిక రావడంతో మావోయిస్టులు ఈ చర్యకు పాల్పడ్డారు.

13:11 - May 5, 2017

ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టుల మృతి

ఛత్తీస్ గఢ్ : బీజాపూర్ లోని భంగపాల్ అటవీప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఓ జవానుకు గాయాలయ్యాయి. 

ఆక్వా కంపెనీలో గ్యాస్ లీక్.. 10 మంది కార్మికులకు అస్వస్థత

తూర్పుగోదావరి : కాకినాడ సమీపంలోని ఆక్వా కంపెనీలో అమోనియా గ్యాస్ లీక్ 10  మంది మహిళా కార్మికులకు అస్వస్థతకు గురయ్యారు. 

 

ప్రదీప్ భార్య పావని, స్నేహితుడు శ్రవణ్ ను విచారిస్తున్న పోలీసులు

హైదరాబాద్ : టీవీ నటుడు ప్రదీప్ ఆత్మహత్య కేసులో ప్రదీప్ భార్య పావని, స్నేహితుడు శ్రవణ్ ను నార్సింగ్ పీఎస్ లో పోలీసులు విచారిస్తున్నారు.

12:55 - May 5, 2017

తూర్పు గోదావరి : జిల్లా రామచంద్రాపురం రాజకీయాలు రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఇటీవలే జరిగిన మున్సిపల్‌ వార్డు ఎన్నికల సందర్భంగా రామచంద్రాపురం నియోజకవర్గ కేంద్రంలో 3 వార్డులకు ఎన్నికలు జరిగాయి. అయితే మూడు చోట్లా వైసిపికి కనీసం డిపాజిట్‌ కూడా దక్కలేదు. దీంతో వైసీపీలో ముసలం మొదలైంది. ఓటమికి అధికార పార్టీ టిడిపియే కారణమంటూ ప్రతిపక్ష వైసీపీ ఆరోపిస్తోంది. దీంతో రామచంద్రాపురం రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.

ఇద్దరి నేతల మధ్య హోరాహోరి
1989 నుంచి ఇక్కడ ఇద్దరి నేతల మధ్య హోరాహోరి పోటీనెలకొంది. ప్రస్తుతం టిడిపి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో వైసిపి ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అటు అధికార టిడిపి తరపున తోట త్రిముర్తులు ఉన్నారు. దీంతో ఈ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు తీవ్రమైంది. ఇద్దరు నేతలు పార్టీలు మారినా..స్వతంత్ర్యంగా పోటీచేసినా పోరుమాత్రం తీవ్రస్థాయిలో ఉంటుంది. 2019లో ఐదోసారి అసెంబ్లీలో అడుగు పెట్టాలని తోట త్రిమూర్తులు భావిస్తున్నారు. దానికి తగ్గట్లుగా ఆయన ఇప్పటినుంచే పావులు కదుపుతున్నారు. అటు వైసీపీ కూడా వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తీవ్రంగా కృషిచేస్తున్నారు..అయితే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలపై ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో వారసుడు సూర్యప్రకాశ్‌ను రంగంలోకి దింపాలని పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయత్నిస్తున్నారని సమాచారం. అయితే దీనికి అడ్డుకట్ట వేయాలని పలువురు ప్రయత్నిస్తున్నారు. దీంతో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందనేది ఆసక్తిగా మారింది.

12:42 - May 5, 2017

టెన్త్, ఇంటర్ పరీక్షలు జరిగి ఫలితాలు కూడా వచ్చాయి...మరి తర్వాతా ఏం చేయాలి... జాహ్నవి మహిళ కాలేజీ ప్రిన్సిపాల్ శాంతి గారి సలహాలు, సూచనలు ఇవ్వడానికి వచ్చారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

ఇసుక అక్రమ తవ్వకాలపై ఎన్ జీటీ విచారణ

ఢిల్లీ : ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిషా రాష్ట్రాల్లో ఇసుక అక్రమ తవ్వకాలపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ విచారణ చేపట్టింది. ఇసుక తవ్వకాలపై ఏపీ, తెలంగాణపై ఎన్ జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ, తెలంగాణలో ఇసుక అక్రమ తవ్వకాలపై మరోసారి తనిఖీలు చేయిస్తామన్న నేషనల్ ట్రైబ్యునల్ తెలిపింది. ఇసుక తవ్వకాలపై వ్యాపార లావాదేవీల వివరాలు చెప్పాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను ఎన్ జీటీ ఆదేశించింది. ఇసుక తవ్వకాలపై కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సమర్పించిన నివేదికను ఎన్ జీటీ తిరస్కరించింది. 

 

12:02 - May 5, 2017

నెల్లూరు : ఇస్రో మరో అద్భుత ప్రయోగానికి సమాయత్తమైంది. ఇవాళ జీఎస్‌ఎల్‌వి ఎఫ్‌-9 వాహక నౌక ద్వారా ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సిద్ధమైంది. సార్క్‌ దేశాల సమాచార వ్యవస్థకు కీలకం కానున్న ఈ ఉపగ్రహ ప్రయోగంపై 10 టీవీ స్పెషల్‌ స్టోరీ. 
నింగికెగరనున్న జీఎస్ఎల్వీ ఎఫ్‌ 9
భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. సార్క్‌ దేశాలన్నీ ఉపయోగించునేందుకు వీలుగా ఓ ఉపగ్రహాన్ని ప్రయోగించాలంటూ..ప్రధాని నరేంద్రమోదీ 2014 జూన్‌ 30న తనను కలిసిన శాస్త్రవేత్తలకు సూచించారు. ఆయన ఆదేశాల మేరకు, ఇస్రో శాస్త్రవేత్తలు సమాచార వ్యవస్థకు ఉపకరించే ఉపగ్రహాన్ని సిద్ధం చేశారు. ఈ శాటిలైట్‌ను, జీఎస్‌ఎల్‌వి ఎఫ్‌-9 వాహక నౌక ద్వారా, ఇవాళ సాయంత్రం ప్రయోగించనున్నారు. 
జీశాట్ 9 ద్వారా ముందుగానే భూకంపాలు, సునామీల సమాచారం
ప్రస్తుతం నింగిలోకి పంపనున్న జీ శాట్‌ ఉపగ్రహాన్ని 2,230 కిలోల బరువుతో రూపొందించారు. ఈ ప్రయోగానికి భారత ప్రభుత్వం 235 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది. జీశాట్‌ ప్రయోగం ద్వారా భార‌త్‌తో పాటు నేపాల్‌, భూటాన్‌, మాల్దీవులు, బంగ్లాదేశ్‌, శ్రీలంక‌, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో..స‌మాచార వ్యవస్థ కొత్తపుంతలు తొక్కనుంది. ఈ ఉపగ్రహంలో 12 కేయూ బ్యాండ్ ట్రాన్స్‌పాండ‌ర్లు ఉంటాయి. టెలీక‌మ్యునికేష‌న్, డీటీహెచ్‌, వీశాట్స్‌, టెలీ ఎడ్యుకేషన్‌, టెలీమెడిసిన్‌, విప‌త్తుల స‌మ‌యాల్లో నిర్వహణ సాయం వంటి సేవ‌లను ఈ ఉపగ్రహం ద్వారా పొందవచ్చు. అలాగే ద‌క్షిణాసియాలో భూకంపాలు, తుపాన్లు, వ‌ర‌ద‌లు, సునామీల వంటి ప్రమాదాలను ముందుగా తెలుసుకునే వీలుంటుంద‌ని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 
జీశాట్ 9 ప్రయోగానికి సిద్ధమైన శ్రీహరికోట
సార్క్‌ దేశాలకు మేలు కలిగేలా భారతదేశం ప్రయోగిస్తోన్న జీశాట్‌ ఉపగ్రహంపై పాక్ మినహా అన్ని దేశాలూ ఇప్పటికే హర్షం వ్యక్తం చేశాయి. తమ దేశ సున్నితమైన సమాచారం భారత్‌కు తెలిసిపోతుందని పాకిస్థాన్ అభ్యంతరం తెలిపింది. ఈ ఉపగ్రహానికి గతంలో పెట్టిన సార్క్ శాటిలైట్ పేరును దక్షిణాసియా ఉపగ్రహంగా మార్చారు. రాకెట్ ప్రయోగానికి శ్రీహరికోటలోని షార్ సెంటర్‌లో గురువారం మధ్యాహ్నం 1.57 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. 27 గంటలపాటు కౌంట్‌డౌన్‌ కొనసాగుతోంది. ఈ ప్రయోగంపై సార్క్ దేశాలన్నీ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. 

 

మావోయిస్టుల దుశ్చర్య...

విశాఖ : చింతపల్లి మండలంలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. లోతుగడ్డ వద్ద కల్వర్టును మావోయిస్టులు పేల్చి వేశారు. ఓ జీపు దగ్ధం అయింది. ఒకరు మృతి చెందినట్లు సమాచారం. 

మహాత్మగాంధీ వర్సిటీలో విద్యార్థుల ఆందోళన

నల్లగొండ : మహాత్మగాంధీ వర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. గేటు ముందు బైఠాయించి వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యూనిర్సిటీ ఉత్సవాలు బయట నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అనుమతించకపోవడంపై ఎస్ ఎఫ్ ఐ నిరసన తెలిపింది. 

 

11:50 - May 5, 2017

హైదరాబాద్ : ధరలు దారుణంగా పడిపోయి.. ఆత్మహత్యలకు పాల్పడుతున్న మిర్చిరైతులను ఆదుకున్నట్టే.. ఎక్కడలేని హడావిడి చేసిన కేంద్రం.. చివరికి అరకొర మద్దతు ధరను ప్రకటించింది. పైగా కొనుగోలుపై షరతులు పెట్టింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అయ్యోపాపం అంటూనే.. కేంద్రాన్ని నిలదీయకుండా సైలెంట్‌ అయ్యాయి. పంట పండింది కొండంత కొనేది గోరంత.. అన్నట్టుగా తయారైంది పరిస్థితి. తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది క్వింటాళ్ల మిర్చిపంట పోగుపడి ఉంటే.. కేవలం కొన్ని వేల క్వింటాళ్లను మాత్రమే కొనాలంటూ షరతులు విధించడంపై అన్నదాతల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అసలు మొదటి నుంచి మిర్చిరైతులపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు మొసలికన్నీరే కార్చాయి. మిర్చికి మద్దతుధర కేంద్రమే ప్రకటించాలని.. తమ చేతుల్లే ఏమీ లేదని చెప్పుకుంటూ ఏపీ, తెలంగాణ సీఎంలు తమ బాధ్యతను దులపరించుకునే ప్రయత్నం చేశారు. దీంతో మిర్చి రైతులు ఆందోళనలతో రెండు రాష్ట్రాలు అట్టుడికిపోయాయి.

క్వింటాలుకు 5వేలు.......
ఈనేపథ్యంలో మిర్చికి క్వింటాలుకు 5వేలు, రవాణా, కమీషన్‌లాంటి ఇతర ఖర్చుల కోసం మరో 1250 రూపాయలను ఇస్తున్నట్టు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించారు. దాంతో పాటు కొనుగోలు చేసిన మొత్తం మిర్చిలో నష్టం వస్తే ఆ భారాన్ని రాష్ట్రం, కేంద్రం చెరిసగం భరిస్తాయని వెంకయ్య చెప్పారు. ఆ నష్టం కూడా 25శాతానికి మించితే తమకు బాధ్యత లేదన్నట్లుగా వెంక్యయ మెలికపెట్టారు. దీనిపై మిర్చి రైతుల్లో నిరసన వ్యక్తం అవుతోంది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతుధర తమకు ఏమాత్రం ఉపశమనం కాదంటున్నారు. కనీసం గతంలో ఇచ్చినట్టుగా క్వింటాలుకు 8వేల రూపాయలైనా ఇస్తారనుకుంటే.. తమ ఆశలపై కేంద్రం నీళ్లు చల్లిందని మిర్చి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కేంద్రం మరో ట్విస్ట్‌.....
మద్దతుధర ప్రకటించిన కేంద్రం మరో ట్విస్ట్‌ ఇచ్చింది. ఈ మద్దతుధర వర్తించేది కొన్ని వేల క్వింటాళ్లకు మాత్రమేని, అదీ ఈనెలాఖరు వరకే కొనుగోళ్లు చేపట్టాలని రాష్ట్రాలకు తేల్చి చెప్పింది. ఏపీలో 88వేల 300 టన్నులు, తెలంగాణలో కేవలం 33వేల 700 టన్నులు మాత్రమే కొనాలని షరతులు పెట్టింది. అయితే వాస్తవానికి ఒక్క తెలంగాణరాష్ట్రంలోనే 3లక్షల 35వేల టన్నుల మిర్చిపంట దిగుబడి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వమే అంచానా వేసింది. అటు ఏపీలో అయితే దిగుబడి ఏకంగా 12 నుంచి 15లక్షల క్వింటాళ్ల వరకు ఉంటోంది. ఇక్కడ మరోవిషయం ఏంటంటే.. కేంద్రం ప్రకటించిన మద్దతుధర, కొనుగోలు పరిమితి.. కేవలం గ్రేడ్‌వన్‌ మిర్చికి మాత్రమే. మరి.. మిగతా గ్రేడ్ 2, గ్రేడ్ 3రకాలకు ఎవరు జవాబు దారీ అంటున్నారు రైతులు. దీంతో మిర్చిరైతుల సమస్యలపట్ల కేంద్రానిది మొసలి కన్నీరే ననేది స్పష్టం అవుతోందని విపక్షాలు అంటున్నాయి. అటు కేంద్రం నిర్ణయంపై మార్కెటింగ్‌శాఖ అధికారులు కూడా విస్మయం ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం వస్తున్న మిర్చిపంట మొత్తాన్ని కొనుగోలుచేయడం వల్ల దాదాపు 600 కోట్ల నష్టం వచ్చే అవకాశముందని, కానీ కేంద్రం మాత్రం ఆ నష్టం 150 కోట్లకు మించకూడదనే రీతిలో ప్రకటన చేసిందని అంటున్నారు. కేంద్రం విధించిన కొనుగోలు పరిమితి ప్రకారం తెలంగాణలో రెండు రోజుల్లో, ఏపీలో నాలుగు రోజుల్లో కొనుగోళ్లు పూర్తవుతాయని చెబుతున్నారు. దీంతో కేంద్రం ప్రకటించినట్టు ఈనెలాఖరు వరకు కొనుగోళ్లకు అవకాశమే లేదని అధికారులు తేల్చిచెబుతున్నారు. మద్దతు ధరలు ప్రకటించిన కేంద్రం .. కొనుగోళ్లపై కొర్రిలు పెట్టిందని తెలుగు రాష్ట్రాలు విమర్శిస్తున్నాయి. కేంద్రం నిర్ణయం మిలీనియం జోక్‌ అని తెలంగాణ మార్కెటింగ్‌ శాఖామంత్రి హరీశ్‌రావు అన్నారు.

8వేలుగా ప్రకటించాలని డిమాండ్‌....
అటు ఏపీ ముఖ్యమంత్రికూడా మద్దతు ధరను 8వేలుగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. 8వేల కంటే తక్కువ ధరలు లభిస్తే.. క్వింటాలుకు గరిష్టంగా 15వందల రూపాయలు ఇవ్వాలని.. ఆ పరిహారం కూడా ఒక్కో రైతుకు 20క్వింటాళ్ల వరకు వర్తింపజేయాలని కేంద్రానికి గొప్పగా సూచించారు సీఎం చంద్రబాబు . దీనికోసం 120 నుంచి 150 కోట్ల వరకు ఖర్చవుతాయని.. కేంద్రం ఉదారంగా సాయం చేయాలని కోరారు. అయితే.. సీఎం చంద్రబాబు కేంద్ర వ్యవసాయమంత్రి రాధామోహన్‌సింగ్‌ను కలిసిన కొద్దిగంటల్లోనే మిర్చికి మద్దతుధర 5వేలే నంటూ కేంద్రం ప్రకటించడంతో రైతుల ఆశలపై నీళ్లు చల్లినట్టైంది. ఇదిలావుటే .. కేంద్రం సాయం ప్రకటించింది కాబట్టి.. తాము ఇంతకు ముందు ప్రకటించిన 15 వందల రూపాయిల సాయం విషయంలో వెనక్కి తగ్గాలని ఏపీ సర్కార్ ఆలోచిస్తున్నటు వార్తలు వస్తున్నాయి. దీంతో మరోసారి గుంటూరులో మార్కట్‌లో రైతుల ఆందోళన మొదలైంది. అటు వరంగల్ జిల్లా ఎనుమాముల, ఖమ్మం మిర్చి మార్కెట్ లలో కూడా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అసలు ఈ పరిస్థితి ఇక్కడి దాకా రావడానికి కారణం ఎవరు...? పత్తిపంటకు బదులుగా మిర్చి వేసుకోవాలని చెప్పింది ఎవరు.. ? కేంద్రం ఎగుమతులను ఆపేసిందంటూ చెబుతూ వస్తున్న టీడీపీ నేతలు, ఏపీ సీఎం.. ఈ విషయమై ఎందుకు కేంద్రాన్ని నిలదీయలేకపోయారు...? అని మిర్చిరైతులు ప్రశ్రిస్తున్నారు.

కల్నల్ పురోహిత్ బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ

ఢిల్లీ : మాలేగావ్ పేలుళ్ల కేసులో కల్నల్ పురోహిత్ బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. మహారాష్ట్ర ప్రభుత్వం, ఎన్ ఐఏకు నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లో సమాధానం చెప్పాలని కోర్టు ఆదేశించింది. 

నిర్భయ కేసులో నేడు సుప్రీంకోర్టు కీలక తీర్పు

ఢిల్లీ : నిర్భయ కేసులో నేడు సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించనుంది. 5ఏళ్ల క్రితం ఢిల్లీలో యువతిపై గ్యాంగ్ రేపు జరిగింది. ఈకేసులో నలుగురు నిందితులకు కోర్టు ఉరిశిక్ష విధించింది. 2013 మార్చిలో తీహార్ జైల్లో రామ్ సింగ్ ఆత్మహత్యకు చేసుకున్నాడు. 

 

11:20 - May 5, 2017

ఢిల్లీ : నిర్భయ కేసులో సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పు ఇవ్వనుంది. త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించనుంది. ఈ కేసులో ప్రత్యేక కోర్టు నలుగురు నిందితులకు ఉరిశిక్ష విధించింది. వీరు ఆ తీర్పును హైకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టు కూడా క్రింది కోర్టు తీర్పును సమర్ధించింది. దీంతో వారు సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఈ మధ్యలో నిందుతుల్లో రామ్ సింగ్ 2013 మార్చిలో తీహర్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మరో నిందితుడు, మైనర్ మూడేళ్ల శిక్షను అనుభవించాడు. 2012లో ఢిల్లీలో యువతిని అత్యంత పాశవికంగా అత్యచారం, హత్య చేసిన విషయం తెలిసిందే.

 

 

గోలివాడలో భూ నిర్వాసితుల ఆందోళన

పెద్దపల్లి : గోలివాడలో భూ నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. సుందిళ్ల పంప్ హౌజ్ నిర్మాణం తవ్వకాలను రైతులు అడ్డుకున్నారు. పోలీసులు రైతులను అరెస్టు చేసి రామగుండం పోలీసు స్టేషన్ కు తరలించారు. 

 

వీసా రెన్యూవల్ కాకపోవడంతో వివాహిత సూసైడ్

హైదరాబాద్ : పచ్చటికాపురంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వీసా చిచ్చురేపింది. భర్త వీసా రెన్యూవల్ కాకపోవడంతో మనస్తాపం చెందిన భార్య ఆత్మహత్యకు పాల్పడింది. 

 

విశాఖ జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేష్

విశాఖ : జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. నూకాంబిక అమ్మవారిని మంత్రి దర్శించుకున్నారు. 

11:00 - May 5, 2017

ఆదిలాబాద్ : బీజీ...అంబలి దాత కోనేరు కోనప్ప... రోజుకు 20 వేల లీటర్ల అంబలి పంపిణి.... నిత్యం 50 వేల రూపాయలకు పైగా ఖర్చు. ఉదయం 4 గంటలకే అంబలి తయారీలో కుటుంబ సభ్యులతో పాటు 10మంది ప్రత్యేకమైన సిబ్బంది. ఇక్కడ అందరికి అంబలిని పంపిణీ చేస్తున్న ఈయనే కోనేరు కోనేరప్ప. ఆదిలాబాద్‌ జిల్లా సిర్పూర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన కోనేరు కోనప్ప గత నాలుగేళ్లుగా అంబలిని ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తూ అందరికి ఆదర్శప్రాయుడిగా నిలుస్తున్నారు. నాలుగేళ్ల క్రితం 3వేల లీటర్లతో ప్రారంభమైన అంబలి పంపిణీ నేడు..20వేల లీటర్లకు చేరుకుంది. ఈ ఏడాది ఎండలు మండిపోతుండడంతో...ప్రజలకు ఎండదెబ్బ తగలకుండా ఉండేందుకు ఈ అంబలిని పంపిణీ చేస్తున్నారు.

కాగజ్‌నగర్‌కే పరిమితం కాకుండా...
ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రారంభించిన ఈ అంబలి పంపిణీ ఒక్క ఆదిలాబాద్‌ జిల్లాలోని కాగజ్‌నగర్‌కే పరిమితం కాకుండా...హైదరాబాదులోని నిమ్స్, గాంధీ, ఉస్మానియా, నీలోఫర్ ఆసుపత్రులలో కూడా పంపిణీ చేస్తున్నారు. అంబలి తయారు, పంపిణీకి స్వచ్ఛందంగా వందలాది అభిమానులు, కార్యకర్తలు ముందుకొచ్చి సాయం చేస్తున్నారని కోనేరు కోనప్ప తెలిపారు. అంబలి తయారీకి సంవత్సరానికి నాణ్యత గల 150 క్వింటాళ్ళు జొన్నలు, మామిడి పచ్చడికి 5వేల మామిడి కాయలు అవసరం అవుతాయన్నారు. అంబలి తయారు చేసిన తర్వాత వాటిని తీసుకెళ్లడానికి ప్రత్యేకంగా మూడు వాహనాలను కూడా సమకూర్చారు.

కోనేరు చారిటబుల్‌ ట్రస్ట్‌.....
ఒక్క అంబలి పంపిణే కాదు..కోనేరు చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం సిర్పూర్‌ నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రయివేటు జూనియర్ కాలేజీ విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్నం భోజనం, సుమారు 2,500 మంది విద్యార్థులకు ఏడాది పాటు భోజనం, స్కూలు, హాస్టల్ విద్యార్థులకు ఉచితంగా స్పోకెన్ ఇంగ్లీషు పుస్తకాలు, దుప్పట్లను ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పంపిణీ చేస్తున్నారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చేస్తున్న సేవా కార్యక్రమాలను సీఎం కేసీఆర్‌ కొనియాడారు.

10:53 - May 5, 2017

హైదరాబాద్ : తెలంగాణలో బిజెపి నేతల వ్యవహార శైలిపై టిటిడిపి నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తాము ప్రజల పక్షాన పోరాటాలు చేస్తుంటే కలిసి రాకపోగా ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ బిజెపి నేతలు వ్యవహరిస్తున్నారని దేశం నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రంలోని ప్రధాన సమస్య అయిన మిర్చి రైతుల కష్టాలపై తాము ఉద్యమిస్తుంటే బిజెపి నేతలు కలిసి రావడంలేదనేది టీడీపీ నేతల ఆరోపణ. ఇలాంటి పరిస్థితుల్లో బిజెపితో కలిసి ఉంటే లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుందనేది టిటిడిపి నేతల వాదన.
టీడీపీతో కలిసి పనిచేయడంపై బీజేపీ అగ్రనేతలు అయిష్టత
2014 సార్వత్రిక ఎన్నికల టైంలో తెలంగాణలో టీడీపీతో కలిసి పనిచేయడంపై కిషన్ రెడ్డి లాంటి అగ్రనేతలు సైతం అయిష్టత ప్రదర్శించారు. బహిరంగంగానే చంద్రబాబుపై విమర్శలు చేశారు. అయితే పార్టీ అధిష్టానం ఆదేశాల ప్రకారం కలిసి పోటీ చేశారు. అందుకు ప్రతిగా సగం సీట్లను మాత్రమే బిజెపికి అప్పగించింది టిటిడిపి. ఎన్నికల తర్వాత కూడా టిడిపికి వ్యతిరేకంగా నడుచుకుంటూ వచ్చారు రాష్ట్ర బిజెపి నేతలు. దీంతో రెండు పార్టీల మధ్య సఖ్యత తగ్గుతూ వచ్చింది. ఈ క్రమంలోనే వరంగల్ కార్పోరేషన్ ఎన్నికల్లో రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి.
అధినేత చంద్రబాబుకు ఫిర్యాదు
ఈ నేపథ్యంలో బీజేపీ నేతల వ్యవహార శైలిపై తెలుగు తమ్ముళ్లు తమ అధినేత చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. అయితే తెలంగాణలో బీజేపీతో పొత్తు అంశంపై తొందరపడొద్దని చంద్రబాబు దేశం నేతలకు తేల్చి చెప్పినట్లు సమాచారం. ఎన్నికల సమయం సమీపించినపుడు అధినేత నిర్ణయాన్ని శిరసావహిస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రావుల చంద్రశేఖరరెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఇక వచ్చే ఎన్నికల్లో బిజెపితో టిడిపి పొత్తు ఉంటుందా? లేదా? అనే విషయం భవిష్యత్ లో తేలాల్సి ఉంది.

 

 

10:44 - May 5, 2017

హైదరాబాద్ : ఎన్ ఆర్ఐ కుటుంబంలో ట్రంప్ వీసా నిబంధనలు విషాదం నింపాయి. పుప్పాలగూడలో భర్త వీసా రెన్యూవల్ కాకపోవడంతో భార్య రష్మీ ఆత్మహత్య చేసుకుంది. వీసా గడువు ముగియడంతో సంజీవ్ దంపతులు ఇటీవలె అమెరికా నుంచి తిరిగొచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

10:41 - May 5, 2017

గోలివాడ నిర్వాసితుల ఆందోళన

పెద్దపల్లి : జిల్లాలోని గోలివాడ భూ నిర్వాసితుల ఆందోళన చేస్తున్నారు. సుందిళ్ల పంఫ్ హౌస్ నిర్మాణ తవ్వకాలను రైతులు అడ్డుకున్నారు. పోలీసులు రైతులను అరెస్ట్ చేసి రామగుండం పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఎర్రకోట వద్ద గ్రెనేడ్ కలకలం

ఢిల్లీ : దేశ రాజధానిలోని ఎర్రకోట వద్ద గ్రెనేడ్ లు కలకలం రెపుతున్నాయి. ఎర్రకోటను శుభ్రం చేసే సమయంలో  గ్రెనేడ్ లను సిబ్బంది గుర్తించారు. ఎర్రకోట వద్దకు ఎన్ఎస్ జీ బృందం చేరుకున్నారు. దీంతో ఎర్రకోట వద్ద భద్రతా వైఫల్యం బయటపడింది.

 

నిరర్ధక ఆస్తుల నియంత్రణ ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ఆమోదం

ఢిల్లీ : నిరర్ధక ఆస్తుల నియంత్రణ ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు.

 

ఎర్రకోట వద్ద గ్రెనేడ్ కలకలం

ఢిల్లీ : ఎర్రకోట వద్ద గ్రెనేడ్ కలకలం రేగింది. ఎర్రకోట క్లీనింగ్ సమయంలో సిబ్బంది గ్రెనేడ్ ను గుర్తించారు. ఎన్ ఎస్ జీ బృందం ఎర్రకోట వద్దకు చేరుకుంది. ఎర్రకోట వద్ద భద్రతా వైఫల్యం బయటపడింది. 

'మన తెలంగాణ..మన వ్యవసాయం' కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి పోచారం

మెదక్ : అంబాజీపేటలో 'మన తెలంగాణ..మన వ్యవసాయం' కార్యక్రమాన్ని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. 

 

09:50 - May 5, 2017

మిర్చికి మద్దతు ధర రూ.10 వేలు ఇవ్వాలని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీపీఎం రాష్ట్రకార్యదర్శివర్గసభ్యులు మల్లారెడ్డి, బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ రెడ్డి, టీఆర్ ఎస్ సీనియర్ నేత రాజమోహన్ పాల్గొని, మాట్లాడారు. మిర్చికి 10 వేల రూపాయలు ఇచ్చి కేంద్రం గానీ రాష్ట్ర ప్రభుత్వం గాని కొనుగోలు చేయాలని కోరారు. రైతులకు పెట్టిన పెట్టుబడిలో పదో వంతు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

09:36 - May 5, 2017

విజయవాడ : వీఆర్వో, వీఆర్ఏ ఉద్యోగాల పేరుతో ఓ వ్యక్తి టోకరా వేశాడు. వీఆర్వో, వీఆర్ఏ ఉద్యోగాలు ఇప్పిస్తానని జనార్ధన్ రెడ్డి అనే వ్యక్తి జి.కొండూరు మండలం మునగపాడుకు చెందిన 8 మంది నుంచి రూ.50 వేల చొప్పున వసూలు చేశాడు. బాధితులు జనార్ధన్ ను పట్టుకుని నిర్బంధించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనార్ధన్ పై గతంలోనూ కేసులున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.....

 

09:14 - May 5, 2017

ఖమ్మం : జిల్లాలో మిర్చి మంటలు ఆరడం లేదు. మిర్చికి గిట్టుబాటు ధర కోసం రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈనేపథ్యంలో మార్కెట్ యార్డుకు వెళ్తున్న బీజేపీ నేత కిషన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

పోలీసుల అదుపులో కిషన్ రెడ్డి

ఖమ్మం : జిల్లాలో మిర్చి మంటలు ఆరడం లేదు. మిర్చికి గిట్టుబాటు ధర కోసం రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈనేపథ్యంలో మార్కెట్ యార్డుకు వెళ్తున్న బీజేపీ నేత కిషన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

నేడు జీఎస్ ఎల్వీ...ఎఫ్ 09 రాకెట్ ప్రయోగం

నెల్లూరు : నేడు జీఎస్ ఎల్వీ...ఎఫ్ 09 రాకెట్ ప్రయోగం చేయనున్నారు. సాయంత్రం 4.75 కి జీఎస్ ఎల్వీ...ఎఫ్ 09 రాకెట్ ప్రయోగం ప్రారంభం కానుంది. 

 

నేడు విశాఖ జిల్లాలో మంత్రి లోకేష్ పర్యటన

విశాఖ : నేడు మంత్రి లోకేష్ జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. 

నేడు తెలంగాణకు మంత్రి చౌదరి జుల్ఫీకేర్ అలీ బృందం

హైదరాబాద్ : నేడు తెలంగాణకు జమ్మూకాశ్మీర్ పౌరసరఫరాల శాఖ మంత్రి చౌదరి జుల్ఫీకేర్ అలీ బృందం రానుంది. తెలంగాణ పౌరసరఫరాల శాఖలో అమలవుతున్న ఈపాస్, ఈపీడీఎస్ వంటి విధానాలపై అధ్యయంన చేయనున్నారు. 

ఉద్యోగాల పేరుతో టోకరా

విజయవాడ : వీఆర్వో, వీఆర్ఏ ఉద్యోగాల పేరుతో ఓ వ్యక్తి టోకరా వేశాడు. వీఆర్వో, వీఆర్ఏ ఉద్యోగాలు ఇప్పిస్తానని జనార్ధన్ రెడ్డి అనే వ్యక్తి జి.కొండూరు మండలం మునగపాడుకు చెందిన 8 మంది నుంచి రూ.50 వేల చొప్పున వసూలు చేశాడు. బాధితులు జనార్ధన్ ను పట్టుకుని నిర్బంధించారు.
పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనార్ధన్ పై గతంలోనూ కేసులున్నాయి. 

08:40 - May 5, 2017

ప్రయివేట్ డిగ్రీ కాలేజీ యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని ప్రయివేట్ డిగ్రీ కాలేజీ యాజమాన్యాల అసోసియేషన్ నాయకులు రమణారెడ్డి డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'తెలంగాణలో డిగ్రీ పరీక్షలకు బ్రేక్ పడింది. ఇప్పటికే తెలంగాణ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ పరీక్షలు వాయిదాపడ్డాయి. ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభమయ్యే మహాత్మాగాంధీ యూనివర్సిటీ, 11 నుంచి ప్రారంభం కావాల్సిన శాతావహన యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ పరీక్షలు కూడా ప్రశ్నార్ధకంగా మారాయి. ఈ నెల 19 నుంచి పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని, 23 నుంచి ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ పరీక్షలు ప్రారంభం కావాల్సి వుంది. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రయివేట్ డిగ్రీ కాలేజీ యాజమాన్యాలు పరీక్షల బాయ్ కాట్ కి పిలుపునివ్వడంతో ఆయా యూనివర్సిటీలు పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటిస్తున్నాయి. ప్రయివేట్ డిగ్రీ కాలేజీ యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? పరీక్షల బాయ్ కాట్ కి దారితీసిన కారణాలేమిటి? ప్రభుత్వం నుంచి ప్రయివేట్ డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు ఆశిస్తున్నదేమిటి? ఇదే అంశంపై ఆయన మాట్లాడారు. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

08:34 - May 5, 2017

తెలంగాణ యూనివర్సిటీలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలకు బ్రేక్ పడింది. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చడం లేదంటూ ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు పరీక్షల్ని బహిష్కరించాయి. అధికారులు స్పందించకపోతే ఇకపై ఆన్ లైన్ లో అడ్మిషన్లను సైతం నిర్వహించబోమని తేల్చిచెప్పాయి. 
డిగ్రీ సెమిస్టర్ పరీక్ష వాయిదా
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల యాభై వేల మంది విద్యార్ధులు డిగ్రీ పరీక్షలు రాయడానికి సిద్ధం అవుతున్నారు. ఈరోజు తెలంగాణ యూనివర్సిటీలో  డిగ్రీ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. ఈనెల 5 నుంచి కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలకు, 9న మహాత్మాగాంధీ యూనివర్సిటీ, 11 నుంచి శాతవాహన యూనివర్సిటీ, 23 నుంచి ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలకు, 19 నుంచి పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల్లోనూ డిగ్రీ పరీక్షలు మొదలు కావాల్సి ఉంది. అయితే ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చడం లేదంటూ ప్రైవేటు కాలేజ్ యాజమాన్యాలు డిగ్రీ పరీక్షలను బహిష్కరిస్తామని ప్రకటించాయి. దీంతో ఇవాళ జరగాల్సిన తెలంగాణ యూనివర్సిటీ పరీక్షల్ని అధికారికంగా వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. 
పరీక్షలు అడ్డుకుంటామని హెచ్చరికలు
ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ఇంకా ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులను వసూలు చేస్తూ కాలేజీలు నడుపుతున్నాయి. అయితే అవి సరిపోకపోవడంతో కాలేజీలు నడపలేక రోడ్డున పడ్డామని వారు ఆరోపిస్తున్నారు.  ప్రభుత్వ కాలేజీల్లో ఏ విధంగా ఫీజులు చెల్లిస్తారో అదే విధంగా చెల్లిస్తేనే నాణ్యమైన విద్య అందించగలమని చెబుతున్నాయి. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకు పరీక్షలు అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాయి. 
డిగ్రీ ఆన్ లైన్ సర్వీస్ తెలంగాణ ద్వారా అడ్మిషన్లు
2016-17 విద్యా సంవత్సరంలో ప్రారంభమైన డీవోఎస్ టీ డిగ్రీ ఆన్ లైన్ సర్వీస్ తెలంగాణ ద్వారా అడ్మిషన్లు నిర్వహించారు. అయితే కొన్ని కాలేజీలు ఈ డీవోఎస్ టీలో భాగం అవ్వబోమని స్పష్టం చేసి వాటి ఇష్టానుసారం ఫీజులు వసూలు చేశాయి. ఇందులో భాగం అయిన కాలేజీలు మాత్రం ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులనే వసూలు చేస్తూ కాలేజీలు నడుపుతున్నాయి. తాజాగా వీటికి రావాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను కూడా విడుదల కాకపోవడంతో కాలేజీలు నడపడమే గగనంగా మారిందని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. 
డిమాండ్లపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో.? 
ఇప్పటికే తమ ఫీజులు చెల్లించమని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ కి వినతిపత్రం సమర్పించాయి. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే డీవోఎస్ టీ నుంచి బయటకు వచ్చేస్తామని హెచ్చరిస్తున్నాయి. మరి వీరి డిమాండ్లపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. 

 

08:27 - May 5, 2017

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపేందుకు సైన్యం సిద్ధమైంది. దక్షిణ కశ్మీర్‌లో వరుస బ్యాంకు లూటీలు, దాడులతో చెలరేగిపోతున్న టెర్రరిస్టుల భరతం పట్టేందుకు ఆర్మీ పెద్ద ఆపరేషన్ ప్రారంభించింది. ఇందుకోసం షోపియా జిల్లా సుమారు 30 గ్రామాలను దిగ్బంధం చేసింది. దక్షిణ కశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతాదళాలకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి.
ఆర్మీ సెర్చ్‌ ఆపరేషన్‌ 
కశ్మీర్‌ లోయలో ఇటీవల ఉగ్రవాద ఘటనలు పెరిగిపోతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. వరుస దాడులతో చెలరేగిపోతున్న ఉగ్రవాదులను ఉక్కుపాదంతో అణిచివేసేందుకు సైన్యం దక్షిణ కశ్మీర్ లోని షోపియన్ జిల్లాలో భారీ యాంటీ టెర్రరిస్టు ఆపరేషన్ చేపట్టింది. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్న వీడియో ఒకటి వెలుగు చూడడంతో ఆర్మీ సెర్చ్‌ ఆపరేషన్‌ మొదలెట్టింది.
మిలిటెంట్లను పట్టుకునేందుకు చర్యలు 
సుమారు 3 వేల మంది ఆర్మీ జవాన్లు, సిఆర్‌పిఎప్‌ బలగాలు, జమ్ముకశ్మీర్‌ పోలీసులు సెర్చ్‌ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. మిలిటెంట్లను పట్టుకునేందుకు షోపియన్ జిల్లాలోని 20 గ్రామాలను ఖాళీ చేయించారు. మరో 10 గ్రామాలను దిగ్బంధించారు. భద్రతా దళాల భారీ ఆపరేషన్ నేపథ్యంలో కొన్ని గ్రామాల్లో మిలిటెంట్లకు రక్షణగా యువకులు జవాన్లపై రాళ్లు రువ్వే అవకాశం ఉండడంతో వీటికి తగ్గట్టుగా ఆర్మీ చర్యలు చేపట్టింది.
పోలీసులపై మిలిటెంట్లు దాడి 
బుధవారం అర్ధరాత్రి దాటాకా దక్షిణ షోపియన్ జిల్లాలో ఓ కోర్టు కాంప్లెక్స్‌కు భద్రతగా ఉన్న పోలీసులపై మిలిటెంట్లు దాడి చేసి.. ఐదు సర్వీస్ రైఫిళ్లు ఎత్తుకెళ్లారు. గత మూడు రోజులుగా దక్షిణ కశ్మీర్‌లోని బ్యాంకులపై మిలిటెంట్లు వరసగా దాడులు చేస్తున్నారు. బుధవారం ఒక్కరోజే రెండు గంటల వ్యవధిలో పుల్వామా జిల్లాలో రెండు వేర్వేరు బ్యాంకుల్లోకి ఉగ్రవాదులు చొరబడి నగదుతో పరారయ్యారు.  సోమవారం కుల్గామ్‌ జిల్లాలో జమ్ముకశ్మీర్‌ బ్యాంక్‌కు చెందిన క్యాష్‌ డెలివరీ వ్యాన్‌పై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు పోలీసులు, ఇద్దరు బ్యాంకు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఉగ్రవాదులు క్యాష్‌ వ్యాన్‌లో ఉన్న 50 లక్షల నగదు, ఆయుధాలు తీసుకుని  పరారయ్యారు. ఆయుధాలు, డబ్బే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులు తీవ్రం చేయడంతో అప్రమత్తమైన ఆర్మీ ఆపరేషన్‌ మొదలెట్టింది.

 

08:21 - May 5, 2017

నల్గొండ : పదేళ్ల ప్రస్థానంలో నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ మొదటి స్నాతకోత్సవానికి సిద్ధమైంది. దశాబ్దకాలంలో ఎన్నో ఆటుపోట్లు, అవాంతరాలను ఎదుర్కొంది ఈ ఉన్నత విద్యా సంస్థ. సమస్య సుడిగుండంలో కొట్టుమిట్టాడుతూనే దేశానికి విలువైన మానవ వనరులను అందించేందుకుకు ఎంజీయూ కృషి చేస్తోంది. మహాత్మాగాంధీ యూనివర్సిటీ మొదటి స్నాతకోత్సవంపై 10 టీవీ ప్రత్యేక కథనం..
2007లో ఎంజీ యూనివర్సిటీ ఏర్పాటు
జిల్లాకు ఒక విశ్వవిద్యాలయం ఉండాలన్న అప్పటి ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా 2007లో నల్గొండ జిల్లాలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఏర్పాటైంది. పదేళ్ల ప్రస్థానం తర్వాత ఇవాళ మొదటి స్నాతకోత్సవం జరుగనుంది. యూనివర్సిటీ చాన్స్‌లర్‌ హోదాలో  గవర్నర్‌ నరిసింహన్‌ స్నాతకోపన్యాసం చేస్తారు.  
స్నాతకోత్సవంపై విద్యార్థుల్లో ఉత్సుకత 
తొలిసారి జరుగనున్న స్నాతకోత్సవంపై విద్యార్థుల్లో ఉత్సుకత నెలకొంది. విద్యలో ప్రతిభ కనపరిచిన పలువురు విద్యార్థులు  బంగారు పతకాలు అందుకోబోతున్నారు. ఆర్గానికి కెమిస్ట్రీలో సాహితీ గోల్డ్‌ మెడల్‌ సాధించారు. మేథమేటిక్స్‌లో అత్యధిక మార్కులు సాధించిన పురుషోత్తం బంగారు పతకం అందుబోతున్నారు. ఎంజీఏలో ఎక్కువ మార్కులు సాధించి, అ్రగస్థానంలో నిలిచిన శైలేష్‌ గోల్డ్‌ మెడల్‌కు ఎంపికయ్యారు. 
యూనివర్సిటీ బాలారిష్టాలు
ప్రారంభించిన పదేళ్లైనా మహాత్మాగాంధీ యూనివర్సిటీ బాలారిష్టాలను అధిగమించలేదు. ఇన్‌చార్జ్‌ వైస్‌ చాన్సలర్లతో కాలం వెల్లదీసింది. పదేళ్లలో పదిమంది వీసీలుగా బాధ్యతలు నిర్వహించారు. పూర్తి స్థాయి వీసీలు లేకపోవడంతో యూనివర్సిటీ అభివృద్ధి కుంటుపడింది. విద్యా ప్రమాణాలు పెరగలేదు. విద్యార్థుల సంఖ్యకు తగిన విధంగా శాశ్వత ప్రాతిపదికపై పనిచేసే అధ్యాపక వర్గంలేదు. బోధనా సహాయకులతోనే నడిపిస్తున్నారు. ఇటీవలే ప్రొఫెసర్‌ ఖాజా అల్తాఫ్‌ హుస్సేన్‌ పూర్తి స్థాయిలో వీసీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇకనైనా ఈ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని విద్యార్థి సంఘాల నేతలు కోరుతున్నారు. 
విద్యార్థులకు ప్రవేశం లేకపోవడంపై అభ్యంతరం 
మరోవైపు మొదటి సారి నిర్వహిస్తున్న స్నాతకోత్సవానికి విద్యార్థులకు ప్రవేశం లేకపోవడంపై వీరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పట్టాలు, పతకాలు తీసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నవారికే పరిమితం చేశారు. స్నాతకోత్సవాన్ని కూడా యూనివర్సిటీ ఆవరణలో కాకుండా బయట ఫంక్షన్‌ హాల్లో నిర్వహిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. 

 

08:11 - May 5, 2017

నిజామాబాద్ : తెలంగాణలో పసుపు రైతులకు కష్టకాలం వచ్చింది. గిట్టుబాటు ధర కోసం వ్యాపారుల కాళ్లావేళ్లా పడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో.. దళారుల దోపిడికి అడ్డేలేకుండా పోయింది. దిగుబడి ఎక్కువగా రావడంతో.. వ్యాపారులు ఒక్కసారిగా రేట్లు తగ్గించేశారు. పంటపై చేసిన అప్పులు తీరే మార్గం కనిపించక.. నిజామాబాద్‌జిల్లాలో పసుపురైతు ప్రాణం విడిచాడు. 
పసుపు రైతులు కన్నీరు 
నిజామాబాద్‌ జిల్లాలో పసుపు రైతులు కన్నీరు పెడుతున్నారు. ఒక్కసారిగా ధరలు పడిపోవడంతో.. దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. పంటను మార్కెట్‌కు తీసుకొచ్చి.. వ్యాపారుల కటాక్షం కోసం ఎదురు చూస్తున్నారు. వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలు భారీగా తగ్గించడంతో.. పసుపు రైతులు గుండెలు పగిలాయి. ఇబ్రహీంపట్నం ఎద్దండ గ్రామానికి రైతు చెందిన చిన్నగంగారాం  పసుపు పంటను నిజామామార్కెట్‌కు తీసుకొచ్చాడు. క్వింటాలుకు ఐదువేల వరకు ఉన్న ధర ఒక్కసారిగా  తగ్గిపోయింది. దీంతో కలత చెందిన చినగంగారాం పుసుపు కుప్పపై పడుకుని అక్కడే ప్రాణాలు విడిచాడు.  
ఒక్కసారిగా తగ్గిన ధరలు               
పది రోజుల కిందట 4500 నుంచి 6500 వరకు పలికిన మిర్చిధరలు.. రైతులు పంటను మార్కెట్‌కు తీసుకురాగానే ఒక్కసారిగా ధరలు తగ్గిపోయాయి. సిండికేట్‌గా మారిన వ్యాపారులు..క్వింటా పసుపు ధరను 4వేల లోపుకు తగ్గించారు. 2012లో 17వేల రూపాయలు పలికిన క్వింటాలు ధర ఇపుడు నాలుగు వేలుకూడా పలకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   
వ్యాపారుల ఇష్టారాజ్యం
అటు మహరాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్‌లో మంచి ధరలు పలుకుతుండగా..నిజామాబాద్‌ మార్కెట్లో మాత్రం గరిష్టధర 5వేలకు మించడంలేదు. మార్కెట్‌కు పాలకవర్గం లేకపోవడంతో.. వ్యాపారులదే ఇష్టారాజ్యంగా మారింది. వ్యాపారులందరూ కూడబలుక్కుని ధరలు తగ్గించి వేశారని పసుపు రైతులు అంటున్నారు.  వాస్తవానికి ఒక్క నిజామాబాద్‌జిల్లా నుంచే కాకుండా జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, కరీంనగర్‌ తదిర ప్రాంతాలనుంచి ఇక్కడికి పుసుపు పంటను తీసుకొస్తున్నారు. రాష్ట్రంలో నిజామాబాద్‌ మార్కెట్‌ తప్పించి.. మరో చోట పసుపు అమ్ముకోడానికి అవకాశం లేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు నిజామాబాద్‌ మార్కెట్‌నే ఆశ్రయిస్తున్నారు. దీంతో పెద్దమొత్తంలో పసుపు ఇక్కడకు వస్తోంది.  ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకున్న వ్యాపారులు, దళారులు రైతన్నను నిలువునా ముంచుతున్నారు. పసుపు బోర్టును ఏర్పాటు చేసి.. దళారులు, వ్యాపారుల అగడాలకు అడ్డకట్టవేయాలని రైతులు కోరుతున్నారు. 
మార్కెట్‌ వైపు చూడని అధికారి 
ఇంత జరుగుతున్నా ఒక్క అధికారి కూడా మార్కెట్‌ వైపు కన్నెత్తి చూడ్డంలేదు. చివరికి రైతు మృతి చెందినా జిల్లా అధికారుల్లో చలనమే లేకుండా పోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిజామాబాద్‌ మార్కెట్‌లో జరుగుతున్న దోపిడీకి అట్టుకట్ట వేయాలని పసుపు రైతులు కోరుతున్నారు. 

 

07:59 - May 5, 2017

హైదరాబాద్ : దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత, కళా తపస్వి కె.విశ్వనాథ్‌కు శంషాబాద్‌లో ఘనస్వాగతం లభించింది. ఢిల్లీలో బుధవారం జరిగిన 64వ జాతీయ చలనచిత్ర ఉత్సవ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్‌ చేతుల మీదుగా ఫాల్కే అవార్డును విశ్వనాథ్‌ అందుకున్నారు. ఇవాళ ఢిల్లీ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం చేరుకున్న ఆయనకు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఘనస్వాగతం పలికారు. 

 

07:57 - May 5, 2017

హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నానని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు అన్నారు. ప్రజల ముంగిట బస్సులు పేరుతో ఆర్టీసీ ప్రవేశపెట్టిన వజ్ర మినీ బస్సులను సీఎం ప్రారంభించారు. దీంతోపాటు పల్లెవెలుగు, బయో డీజిల్‌తో నడిచే సూపర్‌లగ్జరీ బస్సులను ఆవిష్కరించారు. సంస్థను ఆదుకునేందుకు ఇక నుంచి జీహెచ్‌ఎంసీ నుంచి ఆర్టీసీకి నిధులు ప్రతినెలా వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. 
బస్సు సర్వీసులను ప్రారంభించిన సీఎం కేసీఆర్ 
ఆర్టీసీ వజ్ర మినీ బస్సు సర్వీసులను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఆర్టీసీ ప్రత్యేక మొబైల్ యాప్‌ను ఆయన ఆవిష్కరించారు. తొలి దశలో హైదరాబాద్, నిజామాబాద్ మధ్య 30 బస్సులు, హైదరాబాద్ వరంగల్ మధ్య 30 బస్సులు నడవనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ సేవలను ప్రజల ముంగిటకు చేర్చేందుకు.. హైదరాబాద్‌లోని కొన్ని కాలనీల నుంచి వజ్ర బస్సులు నడుస్తాయన్నారు. త్వరలోనే మరిన్ని నగరాలకు వజ్ర బస్సు సర్వీసులు విస్తరిస్తామని తెలిపారు. ఆర్టీసీని కాపాడుకునే బాధ్యత ఉద్యోగులందరిపైనా ఉందన్నారు. 
ఆర్టీసీపై ఆధారపడిన కోట్ల మంది ప్రజలు  
ఆర్టీసీపై కోట్ల మంది ప్రజలు ఆధారపడి ఉన్నారని..అందుకే ఈ సంస్థను దేశంలోనే ఉన్నత స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరముందన్నారు. టీఎస్‌ఆర్టీసీని చూసి ఇతర రాష్ర్టాలు నేర్చుకోనేలా తీర్చిదిద్దాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీ నెత్తిమీద ఎప్పుడూ కత్తి వేలాడుతుండేదని.. ప్రైవేటుపరం చేస్తారేమోనని ఆందోళన ఉండేదన్నారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను కాపాడేందుకు బడ్జెట్‌లో వెయ్యి కోట్లు కేటాయించామన్నారు కేసీఆర్. వ్యక్తిగత వాహనాలు ఎన్ని పెరిగినా ఆర్టీసీ ప్రయాణికుల సంఖ్య పెరుగుతూనే ఉందన్నారు. హైదరాబాద్ పరిధిలో ఆర్టీసీ నష్టాలను జీహెచ్‌ఎంసీ నిధులతో పూడ్చాలని నిర్ణయించామని..ఇక నుంచి ప్రతి నెలా జీహెచ్‌ఎంసీ నుంచి ఆర్టీసీకి కొన్ని నిధులు వచ్చేలా చేస్తామన్నారు. 
వజ్ర బస్సులు దేశంలోనే వినూత్నంగా నిలవాలి : సీఎం కేసీఆర్  
వజ్ర బస్సులు దేశంలోనే వినూత్నమైనవిగా నిలవాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు. కార్మికులు, యజమానులు అన్న విభేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి పనిచేయాలన్నారు. అధికారులు కార్మికులను వేధింపులకు గురిచేయకుండా ప్రేమపూర్వక వాతావరణంలో విధులు నిర్వహించేలా చూడాలన్నారు. ప్రతి ఒక్కరూ కేసీఆర్‌ కావాలని కోరుతున్నట్లు తెలిపారు.

 

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం

యూపీ : ఈటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జలేశ్వర్ లో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందారు. మరో 26 మందికి గాయాలయ్యాయి. 

07:43 - May 5, 2017

గుంటూరు : పెళ్లి వేడుకకు వెళ్లి తిరిగివస్తుండగా విషాదం నెలకొంది. మృత్యువు వారిని కబళించింది. ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. భీమినేనివారిపాలెం వద్ద లారీ, బొలెరో వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. పాత గుంటూరుకు చెందిన పలువురు బొలెరో వాహనంలో హైదరాబాద్ కు పెళ్లి వేడుకకు వెళ్లారు. పెళ్లి వేడుక ముగిసిన అనంతరం బొలెరోలో గుంటూరుకు తిరుగు ప్రయాణం అయ్యారు. మార్గంమధ్యలో భీమినేనివారిపాలెం-మేడికొండూరు గ్రామాల మధ్య బొలెరో, లారీ ఢీకొన్నాయి. దీంతో బొలెరోలో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు ప్రమాద స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరొకరిని గుంటూరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. శవపరీక్ష కోసం మృత దేహాలను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు పోసా వెంకటరమణ, ముప్పూరి శ్రీనివాసరావు, దాసరి కిరణ్, మాదాసు రాజారావు, వెంకట సుబ్బారెడ్డి. మృతులు పాత గుంటూరు వారసులుగా గుర్తించారు. 

 

నేడు నల్లగొండ, సూర్యాపేటలో గవర్నర్ నరసింహన్ పర్యటన

నల్లగొండ : నేడు నల్లగొండ, సూర్యాపేటలో గవర్నర్ నరసింహన్ పర్యటించనున్నారు. మహాత్మగాంధీ వర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్ పాల్గొననున్నారు. 

నేడు పీసీసీ విస్తృత స్థాయి సమావేశం

హైదరాబాద్ : నేడు పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరుగనుంది. సాయంత్రం 4 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి కుంతియా పాల్గొననున్నారు. ఈ భేటీలో పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత అంశాలపై చర్చించనున్నారు. 

 

రోడ్డు ప్రమాదం...ఆరుగురి మృతి

గుంటూరు : భీమినేనివారిపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, బొలేరో వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో 6 మంది మృతి చెందారు. 
మృతులు పాత గుంటూరు వారసులుగా గుర్తించారు. రెంటచింతలలో పెళ్లికి వెళ్లి తిరిగివస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. 

 

Don't Miss