Activities calendar

06 May 2017

21:38 - May 6, 2017
20:14 - May 6, 2017

హైదరాబాద్: బీసిలకు 50శాతం రిజర్వేషన్లు ఇస్తాం.. మరి ఎమ్మెల్యేల టిక్కెట్లు ఏంది సారూ, జీహెచ్ ఎంసీ ఆఫీసులో చెత్త ఆఫీసర్ల పని...లేని పనులకు దొంగ బిల్లులతో ఖూనీ, ట్విట్టర్లో కాలు జారిన మంత్రి లోకేషం..మండలి ఛైర్మన్ ఫోటో తారుమారు, జ్యూసులు, లస్సీలు తాగేటోల్లు ఇనుండ్రి...అడ్డమైన ఐసు వేస్తున్నరంట తన్నుండ్రి, పిల్లల మీద పగబట్టిన హిందూపురం పంది....సిరిసిల్ల దిక్కు కూడా భయపడుతున్నరు మంది, కాలు మీదికి, చేతులు కింది...ఉల్టాఫల్టా చెట్టెక్కుతున్న ముఖేష్ ఇత్యాది అంశాలతో మల్లన్న మల్లన్నముచ్చట్లు కార్యక్రమంలో మన ముందుకు వచ్చారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

19:12 - May 6, 2017

నందమూరి త్వరలో ఎమ్మెల్యేగా రాబోతున్నారు. పటాస్ తర్వాత మంచి సత్తా ఉన్న స్క్రిప్ట్ కోసం చూస్తున్న కల్యాణ్ రామ్ ఇప్పుడు ఒక కొత్త డైరెక్టర్ చెప్పిన కథకు సై అన్నారు. ఈ చిత్రం మే 10 ప్రారంభంకాబోతోంది. ఈ చిత్రానికి ఎమ్మెల్యే అని పేరు పెట్టారు. ఎమ్మెల్యే అంటే రాజకీయ కథ అనుకునేరు..కాదుకాదు...'మంచి లక్షణాలున్న అబ్బాయి' ఇది పూర్తి ఫ్యామిలీ కథ అని డైరెక్టర్ ఉపేంద్ర మాధవ్ చెపుతున్నారు. కల్యాణ్ రామ్ ఇంతకుముందు కూడా చాలసార్లు కొత్త డైరెక్టర్లతో సనిమాలు చేశారు. కాకపోతే ఈ చిత్రం ఫ్యామిలీ సెంటిమెంట్ అండ్ కామెడీ సమాపాళ్లలో ఉండటంతో ఒకే చెప్పినట్లు తెలుస్తోంది.

 

19:11 - May 6, 2017

హైదరాబాద్: వాళ్లు పంచ్ లకే పంచ్ లు వేస్తారు. ఎక్స్ ప్రెషన్ కే ఎక్స్ ప్రెషన్ చూపిస్తారు. నెటిజన్లను కామెడీతో కడుపుబ్బా నవ్విస్తారు. వాళ్లేవరో కాదు ఫన్ బక్కెట్ టీం. ఆ టీమ్ తో '10టివి' చిట్ చాట్ నిర్వహించింది. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

18:48 - May 6, 2017

ముంబై : టీమిండియా ప్రధనా కోచ్ అనిల్ కుంబ్లే రానున్న కాలంలో తీవ్ర సమస్యలు పడే అవకాశం కనిపిస్తోంది. కుంబ్లే టీమిండియా ఆటగాళ్లు ఛాంపియన్స్ టోఫీలో ఆడాలని కోరుకుంటున్నట్లు కంబ్లే బీసీసీఐకీ లేఖ రాశాడు. ఐసీసీతో నెలకొన్న విభేదాలను పరిష్కరించుకోవడానికి ప్రత్యమ్నాయ మార్గం ఎంచుకోవాలని కూడా తెలిపాడు. అయితే బోర్డు ఇష్టాఇష్టాలకు వ్యతిరేకంగా అభిప్రాయం చెప్పినందుకే అతడు కష్టాల్లో పడే అవకాశం ఉంది. '' నిర్ణయం తీసుకోవాల్సింది బోర్డు , వ్యక్తులు కాదని తాము ఛాంపియన్స్ ట్రోఫీ ఆడాలని కోరుకుంటున్నట్లు కుంబ్లేని బోర్డు లేఖ రాయమని ఎవరూ అడగలేదని, ఇందులో అతడి జోక్యానికి తావు లేదని '' ఓ బీసీసీఐ అధికారి అన్నారు.

 

18:39 - May 6, 2017

ఏరోబ్రిడ్జ్ ను ఢీకొన్న ఫ్లైట్

జైపూర్ : రాజస్థాన్ లోని జయపుర ఎయిపోర్టులో ఇండిగోమ విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఈ రోజు ఉదయం ఢిల్లీ నుంచి జయపురకు చేరుకున్న ఇండిగో ఫ్లైట్ పార్కింగ్ చేస్తున్న సమయంలో ఏరోబ్రిడ్జ్ ను ఢీకొట్టింది. ఫ్లైట్ ఎడమ రెక్క ఏరోబిడ్జ్ కు తగిలింది. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి హాని జరగలేదని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. అలాగే ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు కూడా తెలిపారు.

18:35 - May 6, 2017

విజయనగరం: అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కొమరాడ మండలం కోటిపాములలో మంటలు అంటుకుని.. 25 పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఘటనాస్థలానికి ఫైర్‌ సిబ్బంది చేరుకుని మంటలార్పుతున్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. ప్రమాదంలో 50 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.

 

18:33 - May 6, 2017

అమరావతి: ఏపీ రైతాంగం కష్టాల్లో ఉంటే సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనలు చేయడమేంటని వైసిపి నేత అబంటి రాంబాబు ధ్వజమెత్తారు. పెట్టుబడుల పేరుతో చంద్రబాబు విదేశ టూర్లు తిరగడం పలు అనుమానాలకు తావిస్తోందని ఆయన విమర్శించారు. ఇక్కడ దోచుకున్న కోట్ల రూపాయల్ని అక్కడ వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టేందుకు వెళ్తున్నారని అందరూ భావిస్తున్నట్లు అంబటి ఆరోపించారు. అమరావతి, గుంటూరులలో మిర్చి రైతులు మద్దతు ధర లేక విలవిలాడుతుంటే చంద్రబాబు విదేశీ టూర్ల పేరుతో కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనం వృధా చేస్తున్నారని విరుచుకుపడ్డారు అంబటి.

18:31 - May 6, 2017

అమరావతి: అమెరికా పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీ బిజీగా గడుపుతున్నారు.. రెండోరోజు టూర్‌లో పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు.. పలు కంపెనీలతో ఎంఓయూ కుదుర్చుకున్నారు.. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని.. పురిటిగడ్డను మరచిపోవద్దంటూ యూఎస్‌లో స్థిరపడ్డ భారతీయులకు సూచించారు..

యాపిల్‌ సీఓఓ విలియమ్స్‌తో చంద్రబాబు భేటీ

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. రెండో రోజు పర్యటనలోభాగంగా పలువురు పారిశ్రమికవేత్తలతో సమావేశమయ్యారు.. యాపిల్‌ సీఓఓ విలియమ్స్‌తో భేటీ అయ్యారు.. వృద్ధి, అభివృద్ధి అంశాల్లో సరైన భాగస్వామ్యం కోసం చూస్తున్నామని విలియ్స్‌తో అన్నారు.. ఆంధ్ర ప్రదేశ్‌లో మంచి వనరులనుంచి మానవ వనరులవరకూ అన్నీ అందుబాటులోఉన్నాయని... రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి... మాన్యుఫార్చరింగ్‌ ఫెసిలిటీ ఏర్పాటు చేయాలని కోరారు..

ఈవీఎక్స్‌ సొల్యూషన్స్‌ కంపెనీ ప్రతినిధులతో చంద్రబాబు భేటీ

ఈవీఎక్స్ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌ కంపెనీ ప్రతినిధులతోనూ భేటీఅయిన ఏపీ ముఖ్యమంత్రి.. ప్రభుత్వం తరఫున ఆ సంస్థతో ఎంఓయూ కుదుర్చుకున్నారు.... ఈ ఒప్పందం ద్వారా పదివేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.. అలాగే ఐబ్రిడ్జితో మరో ఎంఓయూ కుదుర్చుకున్నారు.. ఇంక్యుబేటర్‌, కో వర్కింగ్‌ స్పేస్‌ అంశాలలో ఐ బ్రిడ్జి సహకారం అందించనుంది.. ఇన్నో సొల్యూషన్స్‌తోకూడా చంద్రబాబు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.. ఈ ఒప్పందంద్వారా రెండువేలమందికి ఉపాధి దొరకనుంది. స్ట్రాటోస్పియర్‌ బెలూన్స్‌ ద్వారా ఇంటర్‌నెట్‌ కనెక్టివిటీ అందించే సంస్థ ప్రతినిధి అలిస్టర్‌తోనూ బాబు భేటీ అయ్యారు.. అలాగే లాస్‌ ఏంజిలస్‌లో టెస్లా ప్రెసిడెంట్ సీఎఫ్ ఓ ఎలోన్‌ మస్క్‌... చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు..

క్వాల్‌కమ్‌ టెక్నాలజీస్‌ ప్రతినిధులతో చంద్రబాబు భేటీ

అమెరికాలో స్థిరపడ్డ భారత వ్యాపారులు, పెట్టుబడిదారులతో సీఎం భేటీ అయ్యారు.. మాతృభూమికి దూరం కావద్దని.. పురిటిగడ్డపై కూడా వ్యాపారాలను విస్తృతం చేసుకోవాలని సూచించారు.. క్వాల్‌కమ్‌ టెక్నాలజీస్‌ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ గోపి సిరినేని, డైరెక్టర్‌ ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ చందన పైరాల ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు.. రాష్ట్రంలో చేపట్టిన ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టులో భాగస్వామ్యం అయ్యేందుకు ఆసక్తి చూపారు.. అయితే ముందు ప్రాజెక్టును అధ్యయనంచేసి ఏయే అంశాల్లో సహకరించగలరో పరిశీలించి చెప్పాలని గోపికి సీఎం సూచించారు.. పారిశ్రామికవేత్తలతో సమావేశాల తర్వాత డ్రైవర్‌లేని కార్లు, డ్రోన్లద్వారా గృహ అవసరాలకు ఉత్పత్తులు సరఫరాచేసే ప్రదర్శనను చంద్రబాబు తిలకించారు.. యూఎస్‌లో టూర్‌లో బాబుతోపాటు... మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌.. ముఖ్య అధికారులు పాల్గొంటున్నారు.

విజయనగరంలో అగ్నిప్రమాదం

విజయనగరం : జిల్లాలోని కొమరాడ మండలం కోటిపాములో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 25పూరిళ్లు దగ్ధం అవడంతో రూ.50 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది.

17:44 - May 6, 2017

హైదరాబాద్: మిర్చి రైతుకు 8వేల రూపాయలు మద్దతు ధరగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత పొంగులేటి సుధాకరరెడ్డి. రాజకీయాలు పక్కన పెట్టి మానవతా దృక్పథంతో బిజెపి, టీఆర్ఎస్ ప్రభుత్వాలు రైతుల్ని ఆదుకోవాలని ఆయన కోరారు. మరోవైపు ఖమ్మం జైల్లో మగ్గుతున్న 10 మంది రైతుల్ని వెంటనే విడుదల చేయాలని ... ఖమ్మం ఘటనపై అన్ని కోణాల్లో న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు పొంగులేటి.

17:43 - May 6, 2017

హైదరాబాద్: ప్రమాదాలు ఎన్ని జరుగుతున్నా హైదరాబాదీ కుర్రకారు తీరులో మార్పు రావడం లేదు. వారి దుందుడుకు బైక్‌ రైడింగ్‌కు అమాయకులు బలవుతున్నా.. యువతను కట్టడి చేయాల్సిన తల్లిదండ్రుల వైఖరిలోనూ మార్పు రావడం లేదు. మందుకొట్టి .. బైక్ పై రయ్ మంటూ దూసుకుపోతూనే ఉన్నారు... హైదరాబాద్ కుర్రకారు..! తాజాగా భాగ్యనగరంలో నమోదవుతున్న డ్రంకన్ డ్రైవ్ కేసుల్ని గమనిస్తే యూత్ మద్యం మత్తులో ఎంతగా చెలరేగిపోతున్నారో తేటతెల్లమవుతోంది.

తాగి వాహనాలు నడుపుతున్న యువకులు...

హైదరాబాద్ లో మద్యం తాగి వాహనాలు నడిపే వారి సంఖ్య ఎక్కువైంది. మందుబాబుల్లో ఎక్కువమంది యువకులే ఉంటున్నారు. తాగి వాహనాలు నడిపి తమ ప్రాణాల మీదికి తెచ్చుకోవడమే కాదు పలువురి మరణాలకు కూడా కారణమవుతున్నారు. అయినా వారిలో ఎలాంటి మార్పు రావడం లేదు. తల్లిదండ్రుల నిర్లక్ష్యం, వాహనదారుల విచ్చలవిడితనం వెరసి జనం ప్రాణాలకు భరోసా లేకుండా పోతోంది. మరోవైపు ట్రాపిక్ చలాన్లు విధించినా, అవగాహన తరగతులు నిర్వహించినా, కేసులు బుక్ చేసి జైళ్లకు పంపిస్తున్నా ఈ కేసులు అదుపులోకి రాకపోవడం గమనార్హం.

మైనర్‌లు చేసిన యాక్సిడెంట్‌లో ప్రాణాలు కోల్పోయిన రమ్య...

గతంలో మద్యం తాగి మైనర్లు కారు నడిపిన ఘటనలో చిన్నారి రమ్యతో పాటు ఆమె బాబాయి, తాతయ్య చనిపోయారు. తాజాగా మరో ఘటనలో తల్లీకూతుళ్లను కారు ఢీకొట్టడంతో వారు ఆస్పత్రి పాలయ్యారు. అలాగే వారం క్రితం జీహెచ్ఎంసీ వాహనం ఓ ఫ్యామిలీపైకి దూసుకెళ్లి పలువురి మరణానికి కారణం అయ్యింది. మొన్న నారాయణగూడ ఫ్లైఓవర్ పై నుంచి ఓ కారు అదుపు తప్పి కిందకు పడిపోయింది. ఇవన్నీ డ్రైవర్లు తాగి మందు నడపడం వల్ల జరిగిన ప్రమాదాలే. ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా.. వాహనదారుల్లో మాత్రం ఎటువంటి మార్పు రావట్లేదు.

ఏప్రిల్ నెలలో 1177 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు....

ఏప్రిల్ నెలలో పోలీసులు 1177 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. అందులో 444 మందికి శిక్షలు కూడా పడ్డాయి. వీరిలో మద్యం సేవించి టూ వీలర్, ఫోర్ వీలర్ నడిపిన వారే ఎక్కువగా ఉన్నారు. సిటీలోని పలు డివిజన్లలో జనవరి నుంచి ఏప్రియల్ వరకు 827 మంది టూ వీలర్లు, 68 మంది త్రీవీలర్ వాహనదారులు, 282 మంది ఫోర్ వీలర్ వాహనదారులు పట్టుబడిన వారిలో ఉన్నారు. వీరివద్ద నుంచి జరిమానాల రూపంలో 17 లక్షల 39 వేల రూపాయలు వసూలు చేశారు. అయినా డ్రంకన్ డ్రైవ్ ఘటనలు ఆగడం లేదు. పైగా రోజురోజుకీ రెట్టింపు అవుతూనే ఉన్నాయి. రోజుకు పదుల సంఖ్యలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి.

రాత్రి పగలు అనే తేడా లేకుండా స్పెషల్ డ్రంకన్ డ్రైవ్ ..

ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ఇకపై రాత్రి పగలు అనే తేడా లేకుండా స్పెషల్ డ్రంకన్ డ్రైవ్ నిర్వహించాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. కనీసం ఇలా అయినా మద్యం సేవించి వాహనాలు నడిపేవారిలో మార్పు వస్తుందేమో వేచి చూడాలి.

17:27 - May 6, 2017

గ్రౌండ్ లో బ్యాటు, బంతితో నువ్వా నేనా అన్నట్లు తలపడే సన్ రైసర్స్ హైదరాబాద్ జట్టు కాసేపు ఆడిపాడింది. జట్టు సభ్యులందరు ముచ్చటగోలిపే మాటలతో హోరెత్తించారు. అల్ట్రాటెక్ సిమెంట్ రైజర్స్ ప్రకటనదారు అన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారు ''మీట్ అండ్ గ్రీట్ విత్ ఆరెంజ్ ఆర్మీ'2 అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆటగాళ్లు సరదాగా సందడి చేశారు. కెప్టెన్ వార్నర్, భువి, బెన్, నారింజ తలపాగా చుట్టారు. వారితో డైలాగ్ లు పలికించారు. టీమిండియా గబ్బర్ సింగ్ శిఖర్ ఓ రేంజ్ లో తొడగొట్టేశాడు. వీరు పిల్లలతో క్రికెట్ ఆడారు. ఈ ఏడాది వీడియోతో పాటు గతేడాది వీడియోను చూసి సంబరపడ్డారు.

 

17:02 - May 6, 2017

సుకుమార్ దర్శకుడే కాదు... మంచి నిర్మాత కూడా. తెలుగులో ఆయన నిర్మించిన 'కుమారి 21ఎఫ్' చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం అతడి ప్రొడక్షన్ లో 'దర్శకుడు' అనే చిత్రం తెరకెక్కుతోంది. ఆ సినిమా రిలీజయ్యే లోపే సుకుమార్ నిర్మాతగా తన మూడో చిత్రాన్ని మొదలుపెట్టేస్తున్నారు. కానీ అది తెలుగులో కాదు తమిళంలో చేస్తున్నారు. సుక్కు దర్శకత్వంలో బిగ్గెస్ట్ హిట్టయిన ' 100%లవ్' ను తమిళంలో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రానికి చంద్రమౌళి అనే కొత్త దర్శకుడు డైరెక్టు చేస్తున్నారు. 

17:02 - May 6, 2017

నిజామాబాద్ : నిజమాబాద్‌ జిల్లా వ్యవసాయ మార్కెట్‌లో.. ఏళ్లు గడుస్తున్నా పాలక వర్గ నియామకం జరగడం లేదు. మార్కెట్‌లో రైతులు సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతున్నా.. పట్టించుకునే నాథుడే కనిపించడం లేదు. అన్నదాతలు తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారు.

ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోని వైనం

తెలంగాణలో అతి పెద్ద మార్కెట్‌గా నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌కు పేరుంది. కానీ ఇక్కడ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పాలక వర్గాన్ని ఏళ్లు గడుస్తున్నా నియమించడం లేదు. మార్కెట్‌లో అధికారులు కాకుండా, ప్రజా ప్రతినిధులు అందుబాటులో లేకపోవడంతో.. రైతులు ఆవేదనకు గురవుతున్నారు.

ప్రభుత్వం వచ్చి మూడేళ్లు

ఇక్కడ మార్కెట్‌లో పాలక వర్గం లేకపోవడంతో.. మద్దతు ధర లేకపోయినా పంటను అమ్ముకునే దుస్థితి కలుగుతోందని రైతులు చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి దాదాపు మూడేళ్లు పూర్తి కావస్తోంది. అయినా ఇక్కడ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పాలక వర్గాన్ని మాత్రం ఇప్పటికీ నియమించలేదు. బీసీ మహిళలకు రిజర్వ్‌ చేసినా.. రాజకీయ కారణాలతో వాయిదా వేస్తున్నారు. రాష్ట్రంలోని మెజారిటీ మార్కెట్లకు పాలక వర్గాన్ని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ మార్కెట్‌పై మాత్రం దృష్టి సారించడం లేదు.

ఏడాది 7.2 లక్షల క్వింటాళ్ల పసుపు

నిజామాబాద్ జిల్లాలో పసుపు పంటను వేలాది ఎకరాల్లో పండించారు. ఈ ఏడాది 7.2 లక్షల క్వింటాళ్ల పసుపు అమ్మకాలు మార్కెట్‌లో జరిగాయి. మార్కెట్ పాలక వర్గం లేకపోవడం వలన రైతులు తక్కువ ధరలకే పసుపు కొమ్ములను అమ్మారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్‌లో.. క్వింటాలుకు 9 వేలకు పైగా ధర పలుకుతోంది. ఇక్కడ క్వింటాలుకు 6 వేలు పలికిన పసుపు ధర.. గత మూడు రోజుల నుంచి కేవలం మూడున్నర వేల ధర మాత్రమే పలుకుతోంది. పాలకవర్గం ఉంటే కొంత మేర రైతులకు మేలైన ధర వచ్చేది.

యేటా రూ. 15 నుంచి రూ. 20 కోట్ల ఆదాయం

ప్రతీ యేడు నిజామాబాద్ మార్కెట్‌ యార్డుకు 15 నుంచి 20 కోట్ల ఆదాయం వస్తున్నా ప్రజా ప్రతినిధులు మాత్రం మార్కెట్‌పై దృష్టి పెట్టడం లేదు. ఈ మార్కెట్ పరిధిలో నాలుగు నియోజకవర్గాలు ఉండటం వలన ఈ దుస్థితి ఎదురవుతోంది. నలుగురు ఎమ్మెల్యేలు తమకు కావాల్సిన వారిని నియమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఎంపీ కవిత ఎన్నోసార్లు చర్చలు జరిపినా..

ఎంపీ కవిత ఎన్నోసార్లు చర్చలు జరిపినా.. అవి ఓ కొలిక్కి రాకపోవడంతో ఇప్పటివరకూ పాలకవర్గ నియామకం జరగలేదు. ఈ మధ్యనే సీఎంను కలిసిన కొందరు నేతలు విషయం ఆయన దృష్టికి తీసుకు వెళ్లగా.. పరిశీలిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా పాలకవర్గాన్ని నియమిస్తే రైతులకు తమకు మంచి జరుగుతుందని చెబుతున్నారు.

16:59 - May 6, 2017

తూర్పుగోదావరి :టెంకవరం మండలం కత్తిపూడి గ్రామంలో విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇద్దరు చిన్నారులతో సహా దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో గ్రామంలో తీవ్రవిషాదం నెలకొంది. కాగా... వీరి ఆత్మహత్యకు ఆర్ధిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది.

16:58 - May 6, 2017

విజయవాడ: దేశంలో అణగారిన వర్గాల ప్రజలకు, మైనార్టీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతోందని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. సామాజిక హక్కుల వేదిక, కేవీపీఎస్‌, దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో 11న నిర్వహించబోయే రాష్ట్ర సదస్సు పోస్టర్‌ను విజయవాడలో ఆవిష్కరించారు. కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపైన, మైనార్టీలపైన దాడులు పెరిగిపోయాయని రామకృష్ణ ఆరోపించారు. ఏపీలో కూడా బలహీన వర్గాల పట్ల సీఎం చంద్రబాబునాయుడు నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారని మండిపడ్డారు.

16:56 - May 6, 2017

విశాఖ : దేశ వ్యాప్తంగా టూరిస్టులకు మెరుగైన సేవలందిస్తున్న సదరన్ ట్రావెల్స్ సంస్థ తొలిసారిగా విశాఖపట్నంలో నూతన శాఖను ఏర్పాటు చేసింది. ద్వారకానగర్ లో ఏర్పాటు చేసిన కొత్త బ్రాంచ్ ను మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ హరిబాబు , జాయింట్ కలెక్టర్ హాజరయ్యారు. భవిష్యత్ లో టూరిజంను మరింత ప్రమోట్ చేసేందుకు సదరన్ ట్రావెల్స్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు మంత్రి గంటా. టూరిస్టులకు మంచి సర్వీసులు అందించేందుకు కృషి చేస్తామని సంస్థ ఛైర్మన్ చెప్పారు.

16:54 - May 6, 2017
16:53 - May 6, 2017

విజయవాడ: వైసిపికి అవినీతి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు టిడిపి నేత వర్ల రామయ్య. దేశంలోనే అత్యంత అవినీతి పరుడు వైఎస్.జగన్ అని సిబిఐ చార్జిషీట్ల ప్రకారం వెల్లడవుతోందని ఆయన ఆరోపించారు. వైసిపి నేతలు ఏ ముఖం పెట్టుకుని అవినీతి గురించి మాట్లాడున్నారని వర్ల రామయ్య ప్రశ్నించారు. వైసిపి ప్లీనరీలో జగన్ అవినీతి గురించి చర్చించాలని నారా లోకేశ్ గురించి ఆరోపణలు చేయడం సరికాదన్నారాయన.

16:52 - May 6, 2017

ప్రకాశం : వలేటివారిపాలెం మండలం మాలకొండ శ్రీలక్ష్మినర్సింహా దేవస్థానం ఘాట్‌రోడ్డులో లారీ బోల్తా పడింది. ఒకరు మృతి చెందగా.. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వీరంతా నెల్లూరు జిల్లాకు చెందినవారుగా గుర్తించారు.

తూర్పు గోదావరి జిల్లాలో విషాదం

తూర్పు గోదావరి : జిల్లాలోని టెంకవరం మండలం కత్తిపూడిలో విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. మృతుల్లో దంపతులు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఆత్మహత్యలకు ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

16:33 - May 6, 2017

యంగ్ హీరో, అక్కినేని నాగర్జున తనయుడు నాగచైతన్య నటిస్తోన్న కొత్త చిత్రం ' రారండోయ్ వేడుక చూద్దాం' చిత్రం టైటిల్ సాంగ్ ఈ రోజు విడుదలైంది. అక్కినేని నాగర్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో చైతు పక్కన రకుల్ ప్రీత్ సింగ్ కథానాయకగా నటిస్తోంది. 'బుగ్గన చుక్క పెట్టుకుంది సీతమ్మ కంటి నిండ ఆశలతో ...రారాండోయ్ వేడుక చూద్దాం' అంటూ సాగుతున్న ఈ చిత్ర పాట అభిమానులకు అదిరిపోయేలా అనిపిస్తోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 

ప్రకాశంలో రోడ్డు ప్రమాదం

ప్రకాశం : జిల్లా వలేటివారిపాలెం మండలం మాలకొండ శ్రీలక్ష్మినర్సింహా దేవస్థానం ఘాట్ రోడ్డులో లారీ బోల్తా పడి ఒకరు మృతి చెందారు. ఐదుగురు గాయాపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

16:03 - May 6, 2017

'బాహుబలి' సినమాలో కీలకమైన సన్నివేశాల్లో కనిపించిన తమన్నా 'బాహుబలి 2' మాత్రం కొన్ని సన్నివేశాలకే పరిమితమైంది. నిజానికి రెండోమ భాగంలో కూడా తాను చాలా సన్నివేశాల్లో కనిపిస్తానని ప్రమోషన్ కార్యక్రమాల్లో తమన్నా చెప్పింది. కానీ ఆమె చెప్పినట్టు కాకుండా ఒకటి, రెండు సీన్లకే పరిమితమైంది. వాస్తవానికి కొన్ని పోరాట దృశ్యాలను తమన్నాతో దర్శకుడు రాజమౌళి చిత్రీకరించాడట. అయితే ఈ సీన్లకు సంబంధించి గ్రాఫిక్స్ ఆశించిన స్థాయిలో రాలేదట దీంతో క్వాలిటీ విషయంలో వెనక్కి తగ్గకూడదని భావించిన రాజమౌళి...ఆ షాట్స్ ను కట్ చేసేశాడట.

 

15:36 - May 6, 2017

హైదరాబాద్ : వరుస విజయాలతో దూసుకుపొతున్న యువ కథానాయకుడు నాని ఆయన నటించిన చిత్రం నేను లోకల్ లో ఎంబీఏ చేసిన నాని ఇప్పుడు 'ఎంసీఏ'కు శ్రీకారం చుట్టారు. వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్న నాని ఇప్పుడు ఎంసీఏ చేయడం ఎందుకనుకుంటున్నారా...? ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం పేరిది. ఈ సినిమా షుటింగ్ ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం దర్శకుడు వంశీ పైడిపెల్లి నాని సినిమాకు క్లాప్ కొట్టారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కథానాయకగా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.

 

15:19 - May 6, 2017

విశాఖ : ఏపీ పదో తరగతి ఫలాతాలను విశాఖ లో మంత్రి గంటా శ్రీనివాస్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మొత్తం ఈ ప‌రీక్ష‌కు మొత్తం 6,22,538 మంది హాజ‌రయ్యారు. వారిలో 5,60,253 మంది ఉత్తీర్ణుల‌య్యారు. ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం 91.92 శాతంగా ఉంది. గ‌త ఏడాది ఉత్తీర్ణత శాతం 94.52గా ఉంద‌ని, అంత‌కు ముందు ఏడాది 91.42 వ‌చ్చిందని గంటా శ్రీ‌నివాస‌రావు చెప్పారు. చివ‌రి సంవ‌త్స‌రం కంటే ఈ సారి 2.6 శాతం త‌గ్గిందని అన్నారు. ఈ ప‌రీక్ష‌ల్లో తూర్పు గోదావ‌రి జిల్లా నుంచి 97.99 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి టాప్ ప్లేస్ లో నిలవగా, చిత్తూరు జిల్లా నుంచి 80.55 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని అత్య‌ల్పంగా ఉత్తీర్ణుల‌య్యారని వెల్ల‌డించారు. బాలికల ఉత్తీర్ణ‌త శాతం 91.97 గా ఉంద‌ని, బాలుర ఉత్తీర్ణ శాతం 91.87 గా ఉంద‌ని అన్నారు. ఈ సారి కూడా బాలికలే పైచేయి సాధించారని గంటా పేర్కొన్నారు. ఫలితాలను www.andhrajyothy.com వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

ఏపీలో టెన్త్ ఫలితాలు విడుదల

విశాఖ : మంత్రి గంటా శ్రీనివాసరావు ఏపీ పదోవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేశారు.6,22, 530 పరీక్షలు రాస్తే 5,60,253 మంది పాస్ అయ్యారు. మొత్తం 91. 92 ఉత్తీర్ణత సాధించారు. తూర్పు గోదావరి మొదటి స్థానంలో చిత్తూరు చివరి స్థానంలో నిలిచాయి.

 

14:46 - May 6, 2017

విజయవాడ : అసలే మే నెల..ఓవైపు భానుడి ఉగ్రరూపం..మరోవైపు ఉక్కపోత..వెరసి జనం ఉడికిపోతున్నారు. ఏపీలో సూర్యుడు విజృంభిస్తుండటంతో..జనం సతమతమవుతున్నారు. ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు కొబ్బరి బొండాలు, పళ్ల రసాలు, తాటిముంజలు లాగించేస్తున్నారు. భానుడి దెబ్బకుశ్రీకాకుళం జిల్లాలో తాటిముంజలకు గిరాకి పెరిగింది. పల్లెల్లో విరివిగా లభించే తాటిముంజలు పట్టణాల్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. పిల్లలనుండి పెద్దల వరకు వేసవిలో తాటిముంజల రుచులను ఆస్వాదిస్తున్నారు. మరోవైపు తాటిముంజల్లో ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు ఉండటం.. వేడిలో చల్లదనానివ్వడంతో తాటిముంజలను ఇష్టంగా తింటున్నారు జనం.

శ్రీకాకుళం జిల్లా తాటిచెట్లు అధికంగా....

ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో తాటి చెట్లు అధికంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో తాటి కల్లు విక్రయించే గీత కార్మికులు ఏప్రిల్,మే నెలల్లో తాటి కాయలు,ముంజలు అమ్ముతూ జీవనం సాగిస్తారు. వేసవిలో తాటిముంజలకు గిరాకి ఉండటంతో.. పట్టణాల్లో వాటిని విక్రయిస్తున్నారు. తాటిముంజలను ఒలిచి డజన్లలో అమ్ముతున్నారు. ఎండాకాలంలో మాత్రమే వచ్చే తాటి ముంజలు ఎండ వేడిమిని తగ్గించి శరీరానికి చలవ చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. మొత్తంగా సిక్కోలు వాసులు తాటిముంజలు తింటూ భానుడి భగభగల నుంచి ఉపశమనం పొందుతుంటే... వీటి విక్రయాలతో గీత కార్మికులు అదనపు ఆదాయం పొందుతున్నారు.

14:42 - May 6, 2017

విజయవాడ : ఏపీ రాజధాని ప్రాంతంలో రోడ్లు, ఫ్లైఓవర్ల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ ప్రాంతంలో రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం దాదాపు మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు కేటాయించింది. కనకదుర్గ గుడి ఫ్లై ఓవర్, విజయవాడ పశ్చిమ బైపాస్, బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్, విజయవాడ-మచిలీపట్నం రోడ్డు పనులైతే ఎప్పటికి పూర్తవుతాయో అంతుపట్టని పరిస్థితి. ఈ ప్రాజెక్టులకి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా.. కాంట్రాక్టర్లతో పనులు చేయించడంతో పనులు జాప్యం అవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

దుర్గగుడి ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం గతంలో ధర్నాలు చేసిన ఏపీ సీఎం....

దుర్గగుడి ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పడు ధర్నాలు చేశారు. అయితే అధికారంలోకొచ్చి మూడేళ్లు గడుస్తున్నా దుర్గగుడి ప్లై వోవర్ నిర్మాణం పూర్తికాలేదు. భవానీపురం నుంచి కనకదుర్గ వారధి వరకు 3.2 కిలోమీటర్ల మేర ఫ్లై ఓవర్ తోపాటు రోడ్ లెవల్ బ్రిడ్జి, నాలుగు, ఆరు లైన్ల విస్తరణ చేపట్టాలి. ఇందుకు రూ.456 కోట్ల అంచనాతో 2015 డిసెంబర్ నెలలో పనులు ప్రారంభించారు. ఈ పనులని దక్కించుకున్న సోమా కంపెనీ 2016 పుష్కరాలకు పనులు పూర్తి చేయాల్సి ఉన్నా 2017 సెప్టెంబర్ వరకు పూర్తి చేసే పరిస్థితి కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు, సదరు సంస్థ నిర్దేశించుకున్న తాజా గడువుకన్నా మరో మూడు నెలలు అధికంగా ఇస్తూ... 2018 జనవరి నాటికి ఎట్టి పరిస్థితుల్లో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అయితే, వాస్తవ పరిస్థితిని గమనించిన వారు మాత్రం, అప్పటికి కూడా దుర్గగుడి ఫ్లైఓవర్‌ పూర్తయ్యేలా లేదని అభిప్రాయపడుతున్నారు.

అతీగతీ లేని బెంజ్ సర్కిల్ ఆరు వరుసల ఫ్లై ఓవర్ పనులు ...

ఇక బెంజ్ సర్కిల్ వద్ద ఆరు వరుసల ఫ్లై ఓవర్ సంగతి అతీగతీ లేకుండా ఉంది. గతంలో మంజూరైన డిజైన్ల ప్రకారం కాకుండా ఇంటిగ్రేటెడ్ ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టాలని, ఇది రాజధాని ప్రాంతానికి ఓ ఐకాన్ లా ఉండాలని సీఎం చంద్రబాబు ఇటీవల అధికారుల్ని ఆదేశించారు. అయితే ఎన్ హెచ్ ఎఐ ఇంటిగ్రేటెడ్ ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టలేమని చేతులెత్తేసింది. 2011లోనే ఫ్లై ఓవర్ నిర్మాణానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా రూ.1,462 కోట్లు మంజూరు చేసింది. ఇందులోనే విజయవాడ-మచిలీపట్నం రోడ్డు విస్తరణతోపాటు ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టాలి. రూ.740 కోట్లను మచిలీపట్నం-విజయవాడ రోడ్డు విస్తరణకు కేటాయించారు. అయితే రకరకాల కారణాలతో ప్రతిపాదనలతో నిర్మాణం చేపట్టలేదు. దీంతో దేశంలోనే అతిపెద్ద చెన్నై-కోల్ కతా జాతీయ రహదారిపై విజయవాడలో ట్రాఫిక్ కష్టాలతోపాటు భారీగా వాహనాలు నిలిచిపోతున్నాయి.

డోలాయమానంలో కాజ-గుండుగొలను రహదారి ప్రాజెక్టు...

మరోవైపు కాజ-గుండుగొలను నాలుగు వరుసల రహదారి ప్రాజెక్టు పరిస్థితీ డోలాయమానంగానే ఉంది. చెన్నై-కోల్ కతా, చెన్నై-ముంబై జాతీయ రహదారుల మధ్య నిడివి తగ్గించేందుకు, విజయవాడలో ట్రాఫిక్ సమస్యల్ని నియంత్రించేందుకు కేంద్రం ఐదేళ్ల క్రితం మంజూరు చేసిన ప్రాజెక్ట్ ఇది. 1680 కోట్లు మంజూరు చేసిన ఈ ప్రాజెక్టును గామన్ ఇండియా కంపెనీ దక్కించుకుంది. ఆ రోడ్డుకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియ పూర్తయినా కాంట్రాక్ట్ సంస్థ నాలుగేళ్లుగా పనులు ప్రారంభించలేదు. 2016 ఆగస్టులో ఆ కంపెనీని తొలగిస్తున్నట్టు ఎన్ హెచ్ ఎఐ ప్రకటించింది. ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించే దిశగా ఏపీ ప్రభుత్వం ఫ్లై ఓవర్ నిర్మాణాల పూర్తిపై దృష్టి సారిస్తేనే కానీ బెజవాడ వాసుల కష్టాలు గట్టేక్కేలా కనిపించట్లేదు.

14:39 - May 6, 2017

ఖమ్మం : కొత్తగూడెంలో సీపీఐ నిర్వహించాలనుకున్న రైతు దీక్ష శిబిరం టెంట్‌ తొలగింపుతో.. ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీస్‌ బలగాలను మోహరించి దీక్షా స్థలం వద్ద ఆంక్షలు విధించడంతో.. సీపీఐ నేతలు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సీపీఐ దీక్షకు సంఘీభావం తెలుపుతూ అఖిల పక్ష నాయకులు తరలివచ్చారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అక్కడికి చేరుకొని.. అరెస్ట్‌ చేసినా దీక్ష చేసి తీరుతామని స్పష్టం చేశారు. మండుటెండలో రైతులు, అఖిల పక్ష నేతలతో కలిసి దీక్ష కొనసాగించారు. మిర్చి రైతులపై అక్రమకేసులు ఎత్తివేయాలని.. మద్దతు ధర కల్పించాలని సీపీఐ నేతలు దీక్షకు ఏర్పాట్లు చేశారు. కానీ ఒక్కరోజు దీక్షకు కూడా అనుమతి ఇవ్వకపోవడంపై సీపీఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

14:38 - May 6, 2017

తిరుమల: అనిల్‌కుమార్‌ సింఘాల్‌ శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద.. టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఒకరోజు ముందే తిరుమల చేరుకొని.. సామాన్యుడిలా శ్రీవారిని దర్శించుకున్న సింఘాల్.. టీటీడీ 25వ ఈవోగా నియమితులయ్యారు. ఇది మహాభాగ్యమని సింఘాల్ అన్నారు. భక్తులు ఆశించిన విధంగా సేవలు అందిస్తానని తెలిపారు. శ్రీహరి కొలువులో పని చేయడం తనకెంతో సంతృప్తినిచ్చిందని.. మాజీ ఈవో డి. సాంబశివరావు అన్నారు. మరెక్కడా ఇంతటి సంతృప్తినిచ్చే ఉద్యోగం ఉండదని చెప్పారు.

14:36 - May 6, 2017

.గో: క్రికెట్‌ ఆడనివ్వకపోవడంతో పాటు ఇంటికొచ్చి తన తల్లిదండ్రులుకు ఫిర్యాదు చేశాడన్న కోపంతో ఓ బాలుడు మరో బాలుడ్ని బ్యాట్‌తో కొట్టి చంపేశాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా తణుకులో జరిగింది. తణుకులోని కొమ్మాయి చెరువుగట్టులో ఉన్న కమ్యూనిటీ హాల్‌ దగ్గర కొందరు పిల్లలు క్రికెట్‌ ఆడుకుంటున్నారు. అయితే తనను ఆటలోకి తీసుకోలేదన్న కోపంతో 16 ఏళ్ల గణేశ్‌ వికెట్లు పడేశాడు. దీంతో సందీప్‌ మరికొందరు పిల్లలు గణేశ్‌ ఇంటికి వెళ్లి అతని తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. దీంతో మరింత కోపోద్రేకుడైన గణేశ్‌ సంజీవ్‌కుమార్‌ మెడపై క్రికెట్‌ బ్యాట్‌తో బలంగా కొట్టాడు. దీంతో సంజీవ్‌కుమార్‌ అక్కడికక్కడే కుప్పకూలాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే సందీప్‌ను తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు.

 

14:34 - May 6, 2017

అమరావతి: సుస్థిరవృద్ధి ఫలితాలు సాధిస్తూ బలీయమైన దేశంగా ఎదుగుతున్న భారత్‌లో పెట్టుబడులు పెట్టి వ్యాపారాన్ని విస్తృతం చేసుకోవాలని ఆపిల్‌ సీవోవో జెఫ్‌ విలియమ్స్‌కు సీఎం చంద్రబాబు ఆహ్వానం పలికారు. ఇండియాలో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ అత్యుత్తమ రాష్ట్రంగా ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో అపారమైన వనరులతో పాటు మానవ వనరులకు కొదవేలేదని చెప్పారు. మరోవైపు క్వాల్‌కమ్‌ టెక్నాలజీస్‌ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ గోపి సిరినేనితో చంద్రబాబు సమావేశమయ్యారు. సంస్థ ప్రతినిధులు ఏపీ ఫైబర్‌గ్రిడ్‌పై ఆసక్తి కనబరచడంతో..ఏ విషయాల్లో తమకు సహకరించగలరో ముందు ప్రాజెక్టుపై అధ్యయనం చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. డ్రైవర్‌ రహిత కార్లు, డ్రోన్ల ద్వారా డోర్ డెలివరీ ప్రదర్శనను సీఎం తిలకించారు.

14:32 - May 6, 2017

హీరోలతో పాటు సమాన స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న హీరోయిన్ కంగనా రౌనాత్. తను వెడ్స్ మను...క్వీన్..రివాల్వర్ రాణి లాంటి సినిమాలతో ఆమె ఇమేజ్ పెరిగిపోయింది. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో ' మణికర్ణిక' అనే భారీ బడ్జెట్ చిత్రం మొదలైయింది. ఈ సినిమా అక్ష్మీబాయి కథతో తెరకెక్కతోంది. ఈ చిత్రానికి దర్శకుడు క్రిష్. అయితే ఈ సినిమా తర్వాత కంగనా హీరోయిన్ గా కొనసాగలని అనుకోవట్లేదట. కంగనా స్వీయ దర్శకత్వంలో సినిమా చేస్తుందట...తనకు 15 ఏళ్ల వయస్సు లో ఇంటి నుంచి వచ్చేశానని.. తను ఏడో సాధిస్తానని అనుకోలేదని అన్నారు. కేవలం నటన మీదే దృష్టి పెట్టి సమయం వృథా చేసుకోవడం ఇష్టం లేదని తెలిపారు. అందుకే తనతో సినిమా చేసే చివరి దర్శకుడు మీరే అంటూ క్రిష్ కు కూడా చెప్పేశాను అని నౌరత్ తెలిపింది.

 

తణుకులో దారుణం

పశ్చిమగోదావరి : క్రికెట్‌ ఆడనివ్వకపోవడంతో పాటు ఇంటికొచ్చి తన తల్లిదండ్రులుకు ఫిర్యాదు చేశాడన్న కోపంతో ఓ బాలుడు మరో బాలుడ్ని బ్యాట్‌తో కొట్టి చంపేశాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా తణుకులో జరిగింది. 

13:58 - May 6, 2017

హైదరాబాద్ : తెలంగాణా పాలిసెట్ ఫలితాలను ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1లక్షా 28వేల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా .. లక్షా 9వేల మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.  85.13శాతం ఉత్తీర్ణత సాధించారు. సీట్ల భర్తీకి మే మూడో వారంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు కడియం చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 58 ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 12 వందల 250 సీట్లున్నాయి. 149ప్రైవేటు రెండో షిఫ్ట్ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ కాలేజీల్లో 41వేల 220 సీట్లు కలవు. 

 

13:56 - May 6, 2017

పశ్చిమగోదావరి : క్రికెట్‌ ఆడనివ్వకపోవడంతో పాటు ఇంటికొచ్చి తన తల్లిదండ్రులుకు ఫిర్యాదు చేశాడన్న కోపంతో ఓ బాలుడు మరో బాలుడ్ని బ్యాట్‌తో కొట్టి చంపేశాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా తణుకులో జరిగింది. తణుకులోని కొమ్మాయి చెరువుగట్టులో ఉన్న కమ్యూనిటీ హాల్‌  దగ్గర కొందరు పిల్లలు క్రికెట్‌ ఆడుకుంటున్నారు. అయితే తనను ఆటలోకి తీసుకోలేదన్న కోపంతో 16 ఏళ్ల  గణేశ్‌ వికెట్లు పడేశాడు. దీంతో సందీప్‌  మరికొందరు పిల్లలు గణేశ్‌ ఇంటికి వెళ్లి అతని తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. దీంతో మరింత కోపోద్రేకుడైన గణేశ్‌ సంజీవ్‌కుమార్‌ మెడపై క్రికెట్‌ బ్యాట్‌తో బలంగా కొట్టాడు. దీంతో సంజీవ్‌కుమార్‌ అక్కడికక్కడే కుప్పకూలాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే సందీప్‌ను తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు.

13:54 - May 6, 2017

హైదరాబాద్ : ఉస్మానియా హాస్పిటల్‌లో మంత్రి లక్ష్మా రెడ్డికి అడుగడుగునా ఇబ్బందులు ఎదురయ్యాయి. కొత్త పరికరాలను ప్రారంభించేందుకు వచ్చిన మంత్రిని స్టాఫ్ నర్సులు, శానిటేషన్ సిబ్బంది అడ్డుకున్నారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రోగ్రాం మధ్యలోనే మంత్రి లక్ష్మా రెడ్డి వెళ్లిపోయారు. 

13:48 - May 6, 2017
13:46 - May 6, 2017
13:45 - May 6, 2017
13:44 - May 6, 2017
13:43 - May 6, 2017

మహబూబ్ నగర్ : పాలమూరు జిల్లా .. పేరు పెద్దదే.. కానీ  ప్రజలకు తినడానికి తిండి.. ఉండటానికి గూడు.. తాగడానికి గుక్కెడు నీరు కరువైన ప్రాంతమిది. రికార్డు స్ధాయి వలసల జిల్లాగా దేశంలోనే పాలమూరుకు పేరుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. బంగారు తెలంగాణ దిశగా రాష్ట్రం అడుగులు వేస్తోంది. ఎడారి జిల్లా రూపురేఖల్ని మార్చి పారేస్తామన్న పాలకుల మాటలు మాత్రం గతంలో మాదిరిగానే, నీటిమూటలయ్యాయి. ఏళ్లు గడుస్తున్నా తలరాత మారని మహబూబ్ నగర్ జిల్లా వాసుల కష్టాలపై 10 టీవీ స్పెషల్ ఫోకస్
కరువుకాటకాలకు నిలయంగా పాలమూరు 
తెలంగాణలో వలసల జిల్లా అనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు పాలమూరు జిల్లా. కరువు కాటకాలకు నిలయంగా.. ఈ జిల్లా స్థిరపడడానికి ఎన్నో కారణాలు. గత పాలకుల నిర్లక్ష్యం... ప్రస్తుత పాలకులు పాలమూర ఉదాసీన వైఖరి, పాలమూరు కష్టాలను పరిష్కరించలేక పోయాయి. 42 లక్షల మంది జనాభా ఉన్న జిల్లాలో లక్షలాది మంది యువకులు, విద్యార్థులు పనుల కోసం ఊరు విడిచి వలస వెళ్లిపోయారు. 
జిల్లా గుండా జీవనదులు...
జిల్లా గుండా జీవనదులు ప్రవహిస్తాయి. కానీ, ఆ నీటిని ఒడిసిపట్టుకుని పొలాలకు పారించే పరిస్థితి లేకపోవడం జిల్లాలోని దయనీయ దుస్థితి. మ‌హ‌బూబ్ న‌గ‌ర్  జిల్లాలో వ‌రి, ప‌త్తి, మిర్చి ఇత‌ర పంట‌లు సాగుచేస్తారు. పాలకుల నిర్లక్ష్యం కారణంగా కొన్నేళ్లుగా ఇక్కడ పంట దిగుబడి గణనీయంగా పడిపోయింది. వేసిన పంట చేతికందక చేసిన అప్పులు పేరుకుపోవడంతో  పేరుకుపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కాలాన్ని వెళ్లదీస్తున్నారు. అప్పుల వాళ్లకు మొహం చూపించలేక కొంతమంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. మరికొందరు మనసు చంపుకొని, భుక్తి కోసం ఉపాధి కూలీలుగా మారిపోతున్నారు. 
వ్యవసాయ పనులు మాని ఉపాధి హామీ పనులకు 
వ్యవసాయ పనులు మాని ఉపాధి హామీ పనులకు వెళ్లే రైతుల దుస్థితి మాటల్లో చెప్పేది కాదు. పని ప్రదేశంలో నీడా, నీరు లాంటి సౌకర్యాలు కల్పించాలని నిబంధనలు ఉన్నా అవి ఈ జిల్లాలో అమలు కావడం లేదు. ఫలితంగా వడదెబ్బ సోకి కూలీలు అర్ధంతరంగా మరణిస్తున్నారు. అయినా, అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారనే విమర్శలున్నాయి. 
నీరు లేక వెలవెలబోతోన్న జూరాల  
పాలమూరు జిల్లాలో అతిపెద్ద ప్రాజెక్టు జూరాల ప్రియదర్శిని. ఈ ప్రాజెక్టు కింద దాదాపు లక్షల ఎకరాల పంట సాగు అవుతుంది. కానీ కావాల్సిన సమయానికి నీరు విడుద‌ల కాక పోవ‌డంతో సీజ‌న్ లోపంట‌లు పండించలేని దుస్థితి అక్కడి రైతులది. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పాటు వరద లేకపోవడంతో ఒక్కోసారి ప్రాజెక్ట్ లో నీరు డెడ్ స్టోరీజీకి చేరిపోతుంది. దీంతో సాగునీటితో పాటు తాగునీటికి కూడా కష్టమౌతుంది జిల్లావాసులకి. జిల్లావాసులకు సాగునీరందించే జూరాల నీరు లేక వెలవెలబోతోంది. 
గుక్కెడు నీటి కోసం వందల కిమీ 
ఉండటానికి గూడు లేదు.. తినడానికి తిండి లేదు.. దిక్కుతోచని స్థితిలో పొట్ట చేతబట్టుకుని ఊరు దాటాల్సిన పరిస్థితి పాలమూరు జిల్లా వాసులది. గుక్కెడు నీటి కోసం వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సిన పరిస్థితి. ఆఖరికి కన్నబిడ్డల్లా చూసుకున్న పశువుల్ని సైతం తెగనమ్ముకునే దుస్థితి. ఒకటి కాదు.. రెండు కాదు పాలమూరు వాసుల కష్టాల చిట్టా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. 
సగానికి పైగా ప్రజలకు గూడు లేదు
పాలమూరు జిల్లాలో 14 నియోజ‌క‌వ‌ర్గాల్లోని సగానికి పైగా ప్రజలకు గూడు లేదు.. పని లేదు.. తిండి లేదు. దీంతో  చాలా కుటుంబాలు పనికోసం ముంబయి, బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాల బాట పడుతున్నాయి. ఎక్కువగా కొండగల్, నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల్లోని ప్రజలు, బతుకుతెరువు కోసం కాంక్రీట్ జంగల్‌కు తరలిపోతున్నారు. 
సాగు, తాగునీటికి కటకట 
పాలమూరు జిల్లా వాసులు దశాబ్దాలుగా సాగు, తాగునీటికి కటకటలాడుతూనే ఉన్నారు. జిల్లాకు చెందిన ఆర్డీఎస్ లాంటి ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు పెండింగ్‌లోనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా  మిషన్ కాకతీయ కార్యక్రమం చేపట్టింది. దీని ద్వార ఉమ్మడి పాలమూర్ జిల్లాలో 1400 చెరువులకు పైగా పనులు చేపట్టినా  దాదాపు సగం చెరువులకు పైగా చుక్క నీరు లేదు. దీంతో చెరువు ఆయకట్టు పై ఆధారపడిన రైతులకు పెద్ద సమస్యగా మారడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లా పూడుర్ సమీపంలో వున్న నాగులు చెరువుకు దాదాపు 23 లక్షలు కేటాయించిన అది ఇప్పుడు ఎడారిని తలపిస్తోంది. అధికారులు, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంతోనే మిషన్ కాకతీయ పధకంలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. 
కబేళాలకు పశువులు 
వ్యవసాయానికి ఆయువుపట్టైన పశువులు కబేళాలకు తరలిపోతున్నాయి. జిల్లాలోని కరువు వాటి పాలిట శాపంగా మారుతోంది.  తమకే తిండి లేక అల్లాడుతున్న రైతులు పశువులను పోషించలేక అంగట్లో అమ్ముతున్నారు. వేల కొద్ది పశువులు తరలివెళ్తున్నాయి. ఏళ్ల తరబడి  పెంచుకున్న పశువులను పుట్టెడు దుఃఖంతో కబేళాలకు అమ్మేసుకుంటున్నారు పాలమూర్  జిల్లాల్లో రైతులు. వారాంతపు సంతల్లో ఎక్కడచూసినా ఈ జిల్లాలో పశువులు విక్రయిస్తున్న దృశ్యాలే కనిపిస్తాయి. 50 వేల రూపాయల ధరలు పలికే పశువుల జతలు..  కేవలం 15 నుండి 20 వేల రూపాయల ధరకే అమ్ముకుంటున్నారు. ఇక సంతలో సౌకర్యాలు లేకపోవడంతో ఎండలకు అల్లాడిపోతూ కొన్ని మూగజీవాలు అక్కడే ప్రాణాలు కోల్పోతున్నాయి.
సాగు, తాగునీటికీ తీవ్ర అగచాట్లు 
సాగునీటికే కాదు, తాగునీటికీ జిల్లా వాసులు తీవ్ర అగచాట్లు పడుతున్నారు. దాదాపుగా ప్రతి నియోజకవర్గంలోనూ తాగునీటి కోసం భగీరథ యత్నాలే జరుగుతున్నాయి. గుక్కెడు నీటి కోసం వందల కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిన దుస్థితి ఇక్కడి వారిది. కొడంగల్, అచ్చంపేట నియోజకవర్గాల్లోని ధర్మాపూర్ బి.కె.ఉప్పునూతలలో తాగు నీరు దొరకడం లేదని ఆ ప్రాంతాల్లో యువకులకు పెళ్లిళ్లు కాని పరిస్థితి. ఆ ప్రాంతాల వారికి పిల్లనిచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కేసీఆర్ సర్కార్ ఏ పథకాలు చేపట్టినా అవి తమ జిల్లాలో సరిగా అమలు కావడం లేదని జిల్లా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటింటికి నల్లా నీరు అందిస్తామన్న ఉద్దేశంతో మొదలైన మిషన్ భగీరథ ఇంకా నత్తనడకన నడుస్తూనే ఉంది. చెప్పుకుంటూ పోతే జిల్లాలో అన్నీ సమస్యలే దర్శనం ఇస్తున్నాయి. 
అధికారులు మొహం చాటేస్తున్నారు: జిల్లా వాసులు
ఇక మహబూబ్ నగర్ జిల్లాను సారా రహిత జిల్లాగా మారుస్తాం అని ప్రభుత్వం ప్రకటనలు చేసింది. సారా వ్యాపారం మానేసిన వారికి 2 లక్షల రూపాయల ఆర్ధిక సాయం కూడా అందిస్తామని హామీ ఇచ్చింది. సాయం అందించకపోగా అధికారులు మొహం చాటేస్తున్నారని జిల్లా వాసులు చెబుతున్నారు. తమ వ్యాపారాన్ని ఆపుచేయించి, ప్రత్యామ్నాయ ఉపాధిని చూపకుండా, ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని, స్థానికులు వాపోతున్నారు. 
అమలు తీరులో ఉన్న లోపాలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పాలమూరు జిల్లాకు అది చేస్తాం.. ఇది చేస్తాం.. అంటూ తెలంగాణ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది. ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. కానీ అవి అమలు తీరులో ఉన్న లోపాలను సరిచేసుకుంటేనే కానీ జిల్లా పరిస్థితి మారే అవకాశం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం జిల్లా అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. జిల్లావాసుల్ని ఆదుకుని వలసలను అరికట్టాల్సి ఉంది. చరిత్రలో పాలమూరు జిల్లా అంటే వలసల జిల్లా అనే పేరును రూపుమాపాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. 

 

తాటి చెట్టు ఎక్కిన ఎంపీ..!

యాదాద్రి  : టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తాటి చెట్టు ఎక్కారు. ఆయన భువనగిరి మండలం నందనం గ్రామ సమీపంలో ఉన్న గౌడ పారిశ్రామిక కేంద్రంలో యంత్రం సహాయతో తాటి చెట్టు ఎక్కేందుకు ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా యంత్రం సాయంతో ఎంపీ తాటి చెట్టు ఎక్కారు. ఈ కార్యక్రమానికి అనితా రామచంద్రన్, ఎక్స్చైజ్ శాఖ అధికారి కృష్ణ ప్రియ, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణా రెడ్డి తదితరులు హాజరైయ్యారు.

 

 

తెలంగాణ పాలిసెట్ పరీక్ష ఫలితాలు విడుదల

హైదరాబాద్ : తెలంగాణలో పాలిసెట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను మంత్రి కడియ శ్రీహరి విడుదల చేశారు. 

13:23 - May 6, 2017

సన్ రరైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్ లో చోటే అక్ష్యంగా శనివారం రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ తో తలపడనుంది.ఈ మ్యాచ్ హైదరాబాద్ వేదికగా రాజీవ్ గాంధీ స్టేడియంలో సాయంత్రం 4గంటలకు ప్రారంభమౌతోంది. ఐపీఎల్ 10 లో సొంత గడ్డపై ఓటమన్నది లేకుండా సాగుతున్న హైదరాబాద్ బుధవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్ లో అద్భుతంగా రాణించి 185 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఢిల్లీ బ్యాట్స్ మెన్స్ ముందు అత్యత్తమ బౌలింగ్ లైనప్ ఉన్న హైదరాబాద్ తెలిపోయింది. ఇలాంటి పోరపాట్లు జరకుండా చూడాలని జట్టు కృతనిశ్చయంతో ఉంది. బ్యాటింగ్ విషయానికొస్తే డేవిడ్ వార్నర్ జట్టుకు మూల స్తంభంలా నిలిచాడు. యువరాజు సింగ్ చివరి మ్యాచ్ తో ఫామ్ లోకి వచ్చాడు. ఓవరాల్ గా 11 మ్యాచ్ లు ఆడిన వార్నర్ సేన ఆరు విజయాలు. నాలుగు పరాజయాలతో పాయిట్ల పట్టికలో 13 పాయిట్లతో 4వ స్థానంలో కొనసాగుతోంది.

పుణే జైత్రయాత్ర

మరోవైపు ఈ సీజనల్ పుణే జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ప్రధానంగా రైజింగ్ పుణే సూపర్ జెయింట్ చివరిగా ఆడిన ఏడు మ్యాచ్ ల్లో ఆరు మ్యాచ్ ల్లో విజయం సాధించింది. గత మ్యాచ్ ల్లో పటిష్టమైన కోల్ కత్తా నైట్ రైడర్స్, ముంబై ఇండియాన్స్ జట్లపై గెలుపొందింది. పుణే ఆడిన 11 మ్యాచ్ ల్లో ఏడు విజయాలతో, నాలుగు పరాజయాలతో పాయిట్ల పట్టికలో 14 పాయిట్లతో మూడవ స్థానంలో కొనసాగుతోంది.

 

13:21 - May 6, 2017

హైదరాబాద్ : జనసేన తరఫున క్షేత్రస్థాయిలో చురుకుగా పాల్గొనేవారిని గుర్తించడానికి ఆ పార్టీ ఇప్పటికే ఎంపిక ప్రక్రియను చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌, ఉత్తరాంధ్రలో తదుపరి ఎంపికలు చేపట్టాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. దరఖాస్తులకు ఈ నెల 13 చివరి తేది అని చెప్పారు. 

 

నయాపూల్ ఆస్పత్రిలో ఐసీయూను ప్రారంభం

హైదరాబాద్ : నయాపూల్ ఆస్పత్రిలో ఐసీయూను మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. తప్పులు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఇకపై ఆస్పత్రుల పనితీరు మెరుగు పరుస్తామని చెప్పారు. ఆస్పత్రుల్లో సీసీ కెమెరాల సంఖ్యను పెంచుతామన్నారు. 

కోఠి ప్రసూతి ఆస్పత్రి వద్ద బీజేపీ ఆందోళన

హైదరాబాద్ : కోఠి ప్రసూతి ఆస్పత్రి వద్ద బీజేపీ ఆందోళన చేపట్టింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మరణాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి లక్ష్మారెడ్డి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేశారు. 

 

12:47 - May 6, 2017

ఐపీఎల్ 10 సీజన్ లో ఢిల్లీ యువ కెరటం, బుల్లెట్ రిషబ్ పంత్ గుజరాత్ తో ఫిరోజ్ షా కోట్ల మైదానంలో 43 బంతుల్లో 97 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ పై ప్రపంచ క్రికెటర్లు ప్రశంసల జడివాన కురిపిస్తున్నారు. పంత్ రాణించడంతోనే గుజరాత్ నిర్ధేశించిన 209 పరుగుల లక్ష్యాన్ని 17.3ఓవర్లలో ఛేదించింది. విధ్వంసక ఆటతీరు ప్రదర్శించి, గొప్ప క్రికెటర్లును అవాక్కయ్యేలా 19 సంవత్సరాల పంత్ చేసిన పోరాటానికి క్రికెటర్లతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా అభినందనలు తెలిపారు.

ట్విట్టర్లో క్రికెటర్ల, సెలబ్రటీల ప్రశంసలు

సచిన్ : ఐపీఎల్ 10 సీజన్లలో తను చూసిన గొప్ప ఇన్నింగ్స్ ఇదొకటి అని అన్నారు.

అమితాబ్ బచ్చన్ : ఉఫ్...రిషబ్ పంత్ గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. శతకం చేజారిందన్న విషయాన్ని ఏం పట్టించుకోకు, మా అందరికి నీ ఆట అంతకన్నా ఎక్కువే

రవిశాస్త్రి : రెండు రోజుల క్రితం త్రిపాఠి, గురువారం రాత్రి పంత్, శాంసన్ ప్రతిభను చూస్తుంటే భారత టీ20జట్టుకు కొత్త వెలుగులు వచ్చినట్లుంది. ఐపీఎల్ జిందాబాద్.

 

 

 

12:38 - May 6, 2017

ఢిల్లీ : విమాన ప్రయాణానికి సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. విమానంలో గానీ...విమానాశ్రయంలో గానీ... సిబ్బందితో ఘర్షణకు దిగితే నేరం చేసినట్లుగా భావిస్తారు. మూడు నెల‌ల నుంచి రెండేళ్ల వ‌ర‌కు విమాన ప్రయాణంపై నిషేధం విధిస్తారు. 
దురుసుగా, అసభ్యంగా ప్రవర్తిస్తే భారీ మూల్యం
ఇకపై విమానాల్లో ప్రయాణించేటపుడు దురుసుగా, లేదా అసభ్యంగా ప్రవర్తించే వారు భారీ మూల్యాన్నే చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పౌర విమానాయాన శాఖ కొత్త నిబంధనలు రూపొందించింది. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించినా.... విమానంలో గానీ, విమానాశ్రయంలో గానీ,  సిబ్బందితో ఘర్షణకు దిగినా ఆ వ్యక్తిని నేరం చేసినట్లుగా భావిస్తారు. అతని పేరును 'నో ఫ్లై లిస్టు'లో నమోదు చేస్తారు. ముందుగా ప్రజల నుంచి వీటిపై ఫీడ్‌బ్యాక్ తీసుకుని, తర్వాత జూన్ నుంచి వీటిని అమలుచేస్తామని పౌర విమానాయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు ప్రకటించారు.
వేర్వేరు నేరాలకు 3 నెలల నుంచి రెండేళ్ల వరకు నిషేధం   
ఇందులో వేర్వేరు నేరాలకు గాను 3 నెలల నుంచి రెండేళ్ల వరకు విమానాల్లో ప్రయాణించకుండా నిషేధించే అవకాశం ఉంది. లెవెల్ 1లో శారీరక చేష్టల ద్వారా అంతరాయం కలిగించేవారికి 3 నెలలు, లెవెల్ 2లో భౌతిక దాడులు లేదా లైంగిక వేధింపులకు పాల్పడేవారికి 6 నెలలు, లెవెల్ 3లో ప్రాణాలకు ముప్పు తెచ్చే రీతిలో బెదిరింపులు,  విమాన ఆపరేటింగ్ సిస్టమ్స్‌ను నష్టపరచేవారికి రెండేళ్లు విమానాల్లో ప్రయాణించే వీలుండదు. ఈ నిబంధనలు దేశీయ విమానయాన సర్వీసులకు మాత్రమే వర్తిస్తుంది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకునే తాము ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నట్లు అధికారులు చెప్పారు.
విమానంలో ప్రయాణించకుండా గ్వైక్వాడ్‌పై నిషేధం 
శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఎయిరిండియా విమానంలో ఓ ఉద్యోగిని కొట్టాడు. దీంతో ఎయిర్‌ ఇండియాతో పాటు ఇతర సంస్థలు విమానంలో ప్రయాణించకుండా గ్వైక్వాడ్‌పై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై పార్లమెంటు ఉభయ సభల్లో  గందరగోళం చెలరేగడంతో కేంద్ర విమానాశాఖ ఈ కొత్త నిబంధనలను రూపొందించింది.

 

టీఎస్ 2017 పాలీసెట్ ఫలితాల విడుదల

హైదరాబాద్ : డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలంగాణ 2017 పాలీసెట్ ఫలితాలను విడుదల చేశారు. పాలీసెట్ లో 85.3 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆయన అన్నారు. గత ఏడాది కంటే ఉత్తీర్ణత శాతం పెరిగిందని కడియం తెలిపారు. ఈ నెల 3వ వారంలో పాలీసెట్ కౌన్సిలింగ్ ఉంటుందని ఆయన ప్రకటించారు.

 

నిబంధనలు పాటించని బస్సులు సీజ్

రంగారెడ్డి : శంషాబాద్ లో ఆర్టీఏ దాడులు నిర్వహించారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ బస్సుల తనిఖీలు చేశారు. నిబంధనలు పాటించని బస్సులను సీజ్ చేశారు. దాడుల్లో మూడు బస్సులు సీజ్ చేశారు. మరో 12 బస్సులపై కేసులు నమోదు చేశారు. 

 

ఐసీయూ ప్రారంభించిన లక్ష్మారెడ్డి

హైదరాబాద్ : నయాపూల్ ఆసుపత్రిలో ఆరోగ్య శాఖ మంత్రి అక్ష్మారెడ్డి ఐసీయూ వార్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్పులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇకపై ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు మెరుగు పరుస్తామని ప్రకటించారు. ఆసుపత్రుల్లో సీసీ కెమెరాల సంఖ్య పెంచుతామని అన్నారు.

12:15 - May 6, 2017

హైదరాబాద్ : మొండి బకాయిల సమస్య పరిష్కారం దిశగా పెద్ద ముందడుగు పడింది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న బ్యాంకింగ్ నియంత్రణ చట్టానికి సవరణ జరిగింది. ఈ మేరకు కేంద్రం రూపొందించిన ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ప్రజల సొమ్మును రుణాల రూపంలో తీసుకొని ఎగ్గొట్టే సంస్థలకు ఈ చట్టంతో ముకుతాడు పడనుంది. 
ఆర్‌బీఐకి మరిన్ని చట్టబద్ధమైన అధికారాలు
మొండి బకాయిలు-ఎన్ పీఏల సమస్య పరిష్కారం దిశగా ఆర్‌బీఐకి మరిన్ని చట్టబద్ధమైన అధికారాలను కేంద్రం కట్టబెట్టింది. ఇందుకు సంబంధించి బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టం 1949లోని సెక్షన్‌ 35కి సవరణలు ప్రతిపాదిస్తూ కేంద్రం రూపొందించిన ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు. మొండిబకాయిల వసూళ్ల విషయంలో ఇదే విప్లవాత్మకమైన అవుతుందని నిపుణులు భావిస్తున్నారు. 
ఎన్‌పీఏల పరిష్కారంలో కీలక అడుగు
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎన్‌పీఏలు 6 లక్షల కోట్లకు పైగా పెరిగిపోయిన నేపథ్యంలో కేంద్రం తాజా చర్యలను దిగింది. మొత్తం దేశీయ బ్యాంకింగ్‌ రంగంలో 2016 డిసెంబర్‌ నాటికి ఎన్‌పీఏలు 7లక్షల కోట్లను దాటాయి. విద్యుత్తు, స్టీల్, మౌలిక సదుపాయాలు, టెక్స్‌టైల్స్‌ రంగాలకు ఇచ్చిన రుణాలు ఎక్కువగా మొండి బకాయిలుగా మారాయి. తాజా ఆర్డినెన్స్‌తో ''రుణ ఎగవేత దారుల విషయంలో 'ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బాంక్రప్టసీ కోడ్‌ 2016' నిబంధనల కింద దివాలా పరిష్కార చర్యలు చేపట్టాలని ఏ బ్యాంకునైనా ఆర్‌బీఐ ఆదేశించగలదు'' అని కేంద్రం విడుదల చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ పేర్కొంది. దీంతో నిర్ణయంతో... ఎన్‌పీఏల సమస్య పరిష్కారానికి బ్యాంకులకు సూచనలు ఇచ్చేందుకు ఒకటికి మించిన యంత్రాంగాలను ఏర్పాటు చేసే అధికారం ఆర్‌బీఐకి ఇచ్చినట్టు ప్రభుత్వం తెలిపింది. ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు ఇక తాజా రుణాలు లభించడం కష్టమే. వారిపై నిషేధం విధించాలని బ్యాంకులను ఆర్‌బీఐ కోరవచ్చు. అంతేకాదు, రుణ ఎగవేతదారులను కంపెనీల బోర్డుల్లో డైరెక్టర్లుగా నియమించుకోవడం కూడా ఇకపై కుదరదు. మొండి బకాయిల సమస్య పరిష్కారానికి బ్యాంకర్లు తీసుకునే నిర్ణయాల విషయంలో సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్, సీబీఐ, కాగ్, ఈడీ తదితర దర్యాప్తు సంస్థల నుంచి బ్యాంకర్లకు కొత్త చట్టం రక్షణ కల్పి స్తోంది. దర్యాప్తు సంస్థల విచారణ భయాలతో బ్యాంకర్లు.. ఎన్‌పీఏల పరిష్కారానికి చొరవ చూపించడం లేదు. తాజా ఆర్డినెన్స్‌తో ఆ భయాలు తొలగుతాయి. మొండి బకాయిల ఖాతాల విషయంలో పరిష్కార చర్యలు చేపట్టేందుకు బ్యాంకులకు మరింత నియంత్రణ లభిస్తుంది. కొత్త చట్టంతో రుణ ఎగవేతదారులను కంపెనీల యాజమాన్యం, ఓటింగ్‌ హక్కుల నుంచి తప్పుకోవాలని బ్యాంకులు ఆదేశించగలవు. వారి స్థానంలో కొత్త యాజమాన్యాన్ని ఏర్పాటు చేసి నిర్దేశిత కాలంలోగా పునరుద్ధరణ బాట పట్టించే చర్యలు చేపట్టొచ్చు. 
రూ.6లక్షల కోట్లకు పెరిగిన మొండిబకాయిలు
ప్రస్తుతం బ్యాంకింగ్‌ సవరణలు ఆర్డినెన్స్‌ రూపంలోనే ఉండటంతో దీని గడువు ఆరు నెలలు మాత్రమే. దీంతో వీలైనంత త్వరగా చట్టంలో సవరణలకు సంబంధించిన బిల్లు పార్లమెంటు ముందుకు రావాలని కేంద్రం భావిస్తోంది. ఈ వర్షాకాల సమావేశాల్లోనే సవరణ బిల్లు పార్లమెంటులో చర్చకు వచ్చే అవకాశముంది. మొత్తానికి దేశ ఆర్థిక వ్యవస్థకు చీడపీడగా మారిన మొండిబకాయిల సమస్య పరిష్కారానికి బ్యాంకులకు కొత్త అస్త్రం దొరికిందంటున్నారు బ్యాంకింగ్ రంగ నిపుణులు.  

12:11 - May 6, 2017
12:09 - May 6, 2017
12:08 - May 6, 2017

తమిళనాడు : చెన్నైలో రోడ్ మరోసారి కుంగింది. మెట్రో పనుల కారణంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో నేల కుంగింది. ఇవాళ తాజాగా రోడ్డుపై పెద్ద గుంత ఏర్పడటంతో...చెన్నై వాసులు ఆందోళనకు గురవుతున్నారు. 

 

12:05 - May 6, 2017

నెల్లూరు : జిల్లాలోని తడ మండలం భీములవారిపాలెం ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టు అవినీతికి అడ్డాగా మారింది. జిల్లా ఏసీబీ అధికారులు ఎన్ని సార్లు దాడులు చేసినా ఇక్కడ అవినీతి భాగోతానికి అడ్డుకట్ట పడటం లేదు.  దీంతో చెక్‌పోస్టుపై రాజధానికి చెందిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ రాత్రంతా నిఘా పెట్టింది. ప్రైవేటు వ్యక్తులతో కలెకక్షన్ల దందా నిర్వహిస్తున్న వాణిజ్య పన్నుల శాఖకు చెందిన ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుంది. వీరి నుంచి 86 వేలకుపైగా నగదును స్వాధీనం చేసుకుంది.

 

11:56 - May 6, 2017

రంగారెడ్డి : శంషాబాద్ లో ఆర్టీఏ దాడులు నిర్వహించారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ బస్సుల తనిఖీలు చేశారు. నిబంధనలు పాటించని బస్సులను సీజ్ చేశారు. దాడుల్లో మూడు బస్సులు సీజ్ చేశారు. మరో 12 బస్సులపై కేసులు నమోదు చేశారు. 

11:54 - May 6, 2017

సినిమా ప్రచారంలో భాగంగా సినిమా విడుదలకు ముందు పాటలను యూట్యూబ్ లో విడుదల చేయడం అనవాయితీగా మారింది. తాజాగా యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ సాధించిన హిందీ పాట 'నషేసి చడ్ గయి'. అదిత్య చోప్రా దర్శకత్వంలో రూపొందిన 'బేఫికర్' సినిమాలోని ఈ పాట రికార్డు సాధించింది. సినిమాకి విశాల్ శేఖర్ సంగీతం అందించారు. ఈ పాట విడుదల చేసిన 24 గంటల్లో దాదాపు 234 మిలియన్ వీక్షణలతో తొలి స్థానంలో నిలిచింది. అంతేకాదు అత్యంత వేగంగా 200 మిలియన్ వ్యూస్ దాటిన పాటగానూ రికార్డు సృష్టించింది. యూట్యూబ్ చరిత్రలో 2.8 బిలియన్ వ్యూస్ సాధించిన పాటగా గంగ్నమ్ స్టైల్ గీతం తొలి స్థానంలో ఉన్న విషయం తెలిసిందే.

11:48 - May 6, 2017

హైదరాబాద్ : గవర్నెన్స్ విత్ డిఫరెన్స్ శీర్షికతో తాను రాసిన పుస్తకం తొలి ప్రతిని సి.పి.ఆర్.ఓ. వనం జ్వాలా నర్సింహరావు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి తీసుకున్న నిర్ణయాలను, వాటి అమలు కోసం చేసిన ప్రత్యేక చొరవను ఈ పుస్తకంలో జ్వాలా పొందుపరిచారు. ఈ సందర్భంగా జ్వాలాను సిఎం కేసీఆర్ అభినందించారు.

 

11:38 - May 6, 2017

గుంటూరు : ఏపీ రాజకీయాల్లో మంత్రి లోకేశ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా మారారు. రాజకీయాలన్నీ లోకేశ్‌ చుట్టూనే తిరుగుతున్నాయి. పరస్పర విమర్శలు, ఆరోపణలకు కూడా లోకేశ్‌ కేంద్ర బిందువుగా మారారు. ప్రతిపక్ష వైసీపీ నేతలు లోకేశ్‌ను టార్గెట్‌ చేస్తే, అధికార పక్షం  జగన్‌పై ముప్పేట దాడి చేస్తోంది. ఏపీ రాజకీయాలు ఇప్పుడు లోకేశ్‌ చట్టూ తిరుగుతున్నాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు లోకేశ్‌ అంత క్రియాశీలకంగా లేదన్న వాదనలు ఉన్నాయి. ఎమ్మెల్సీ అయి, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత క్రియాశీలకంగా మారడంతో, ఏపీ రాజకీయమంతా లోకేశ్‌ చుట్టూనే నడుస్తోంది. 
జగన్ కు టీడీపీ కౌంటర్‌ 
ప్రతిపక్ష నేత జగన్‌ గుంటూరులో రైతు దీక్ష సందర్భంగా టీడీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దీనికి టీడీపీ కౌంటర్‌ ఇచ్చింది. జగన్‌ దీక్షను ఒంగోలు గిత్త సినిమాలో ప్రకాశ్‌రాజ్‌ పాత్రను గుర్తు చేసేవిధంగా ఉందని టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు.  
లోకేశ్‌ను టార్గెట్‌ చేసినా వైసీపీ నేతలు  
జగన్‌ దీక్షలో వైసీపీ నేతలు లోకేశ్‌ను టార్గెట్‌ చేశారు. లోకేశ్‌ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. లోకేశ్‌తోపాటు టీడీపీ నేతలు కూడా వైసీపీ  ఆరోపణలకు దీటైన జవాబే ఇచ్చారు.  ఆతర్వాత కూడా విమర్శల యుద్ధం ఆగలేదు. రెండు పార్టీల నేతల మధ్య లోకేశ్‌ కేంద్రంగా మాటల తూటాలు పేలూతూనే ఉన్నాయి. ఏపీలో భూకేటాయింపులు జరిపేందుకు ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం నుంచి రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తిని తొలగించి, నారా లోకేశ్‌కు స్థానం కల్పించారు. దీనిని ఆధారంగా చేసుకుని వైసీపీ నేతలు లోకేశ్‌ను టార్గెట్‌ చేస్తున్నారు. 
పార్థసారధి విమర్శలపై స్పందించిన టీడీపీ నేతలు 
పార్థసారధి విమర్శలపై టీడీపీ నేతలు ఘాటుగానే స్పందించారు. లోకేశ్‌ అభివృద్ధి ఏనుగుతో పోలిస్తే, జగన్‌ను అవినీతి ఏనుగుతో పోల్చారు టీడీపీ నేత వర్ల రామయ్య. లోకేశ్‌ అభివృద్ధి వైపు పరుగులు తీస్తుంటే, జగన్‌ జైలు వైపు పరుగుపెడుతున్నారని వ్యాఖ్యానించి, ఏపీలో రాజకీయ విమర్శల వేడిని మరింత పెంచారు. చంద్రబాబు, లోకేశ్‌పై వైసీపీ నేతలు, జగన్‌ పై టీడీపీ నేతలు చేస్తున్న పరస్పర విమర్శలు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

11:38 - May 6, 2017

ఇండియా బాక్సాసును షేక్ చేసిన అమీర్ ఖాన్ సినిమా 'దంగల్' చైనాలతో సైతం డుమ్ము రేపుతోంది. చైనాలో శనివారం విడుదలైన 'దంగల్' తొలిరోజే రూ. 15కోట్లు వసూలు చేసింది. అమీర్ ఖాన్ కు చైనాలో మంచి మార్కెట్ ఉంది. అమీర్ నటించిన 'పీకే' సినిమా చైనాలో 100 కోట్ల రూపాయలను వసూలు చేసిన విషయం తెలిసిందే. ‘3 ఇడియట్స్ సినిమా చైనీస్ లోకి డబ్ చేసి, విడుదల చేసినప్పటి నుంచి చైనా సినీ అభిమానులు ఖాన్ కు దగ్గరయ్యారు. అయితే చైనా కూడా అక్కడా ప్రదర్శించే భారతీయ సినిమాల సంఖ్యను రెండు నుంచి నాలుగు పెంచింది.

11:29 - May 6, 2017

 

రిలయన్స్ జియో మరో దిమ్మదిరిగే ఆఫర్లను తన వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. ప్రత్యర్థులు ఆఫర్ చేస్తున్న పాత డోంగిల్, డేటా కార్డు, వైఫై రూటర్లను జియో వైఫై 5జీ రూటర్ తో ఎక్స్ఛేంజ్ చేసుకుంటే 100 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ చేయనున్నట్టు ప్రకటించింది. రెండు ప్లాన్స్ తో సంచలన ఆఫర్ ప్రకటించింది. ఒకటి ప్రస్తుత డేటా కార్డు,య డోంగిల్, హాట్ స్పాట్ రూటర్ ను జియో డిజిటల్ స్టోర్ లో ఎక్కడ ఎక్స్ఛేంజ్ చేసుకున్నా 100 శాతం క్యాష్ బ్యాక్లఏదా డివైజ్ ఎక్స్చేంజ్ కు రూ.2010 విలువైనమ 4జీ డేటాను ఆఫర్ చేయనున్నట్టు తెలిపింది. జియోపై రూటర్ పొందడానికి కస్టమర్లు రూ.1,999 చెల్లించాల్సి ఉంటుంది. దాంతో పాటు 309మ కింద కచ్చితంగా మొదటిసారి 408 రూపాయలతో రీఛార్జ్ చేసుకోవాలి. రూ.99తో ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకుని ఉండాలి. కస్టమర్లు చెల్లించిన రూ.1,999లతోమ 2010రూపాయలను మైనస్ చస్తే కస్టమర్లకు ఇంటర్నెట్ కనెక్షన్ దాదాపు ఉచితంగా లభించనుంది.

11:29 - May 6, 2017

హైదరాబాద్ : ప్రభుత్వ ఆస్పత్రిలో బాలింతలు మరణాలు ఆగడం లేదు. నీలోఫర్, కోటి ప్రసూతి ఆస్పత్రుల్లో ఐదుగురు బాలింతల పరిస్థితి విషమంగా ఉంది. పలు ఇన్ జక్షన్ లు, మత్తు మందులు స్వాధీనం చేసుకున్నారు. నాసిరకం సెలైన్లు, మందుల వల్లే బాలింత8లకు అధిక రక్తహీనత ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

11:23 - May 6, 2017

మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని వక్తలు కోరారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీపీఎం సీనియర్ నేత, టీఆర్ ఎస్ నేత నందికొండ శ్రీనివాస్, బీజేపీ ప్రేమేందర్ పాల్గొని, మాట్లాడారు. మిర్చి రైతులకు గిట్టుబాటు ధర రూ.12 వేలు ప్రకటిస్తే రైతుకు న్యాయం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వాలకు రైతులపై చిత్తశుధ్ది ఉంటే రైతులను ఆదుకోవాలన్నారు. మరిన్ని వివరాను వీడియోలో చూద్దాం... 

11:12 - May 6, 2017

 

ఐపీఎల్ జట్లలలోనే సత్తా ఉన్న జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.… కానీ పేరులో ఉన్న రాయల్టీ ఏమాత్రం కనబడని జట్లు ఐపీఎల్ 10 ఘోరంగా విఫలం చెందుతోంది. ప్రపంచ స్థాయి బ్యాట్స్ మెన్స్ విరాట్ కోహ్లి, విధ్వంసక ఆటగాడు గేల్, ఒంటి చేతితో మ్యాచ్ ను గెలిపించగల డివిలియర్స్, అల్ రౌండర్ షేన్ వాట్సన్ ఇంత మంది ఉన్న ఈ జట్టుకు ఓటమి మాత్రం తప్పలేదు. తాజాగా పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు 139 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదింకలేకపోయింది. జట్టులో ఇంత పెద్ద ఆటగాళ్లు ఉండి ప్రయోజనం లేక ప్రేక్షకులు వాపోతున్నారు. అసలు ఈ జట్టు ఏమైంది దిష్టి తగిలిందా లేక మరెదైనా ఉందా అని అనుమానాలు ప్రేక్షకులకు వస్తున్నాయి.

 

11:11 - May 6, 2017

హైదరాబాద్‌ : పాతబస్తీలో మత్తు మందు ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పలు ఇంజక్షన్‌లు, మత్తు మందులను స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్‌ ప్రిస్కిప్షన్‌ లేకుండానే ఈ ముఠా మత్తు మందులు విక్రయిస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

11:08 - May 6, 2017

ఢిల్లీ : నగరంలో విషవాయువు కలకలం సృష్టించింది. దక్షిణ తుగ్లకాబాద్‌లోని రాణి ఝాన్సీ సర్వోదయ స్కూల్ సమీపంలో కంటైనర్‌ నుంచి గ్యాస్‌ లీకైంది. దీంతో స్కూల్‌లోని విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.  సుమారు 100 మంది విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు.

 

11:01 - May 6, 2017

వారు గొప్ప నటులు, సినీ రంగానికి ఎంతో సేవ చేసిన వారు... ఎన్నో ఏళ్ళు పరిశ్రమలో శ్రమించిన వారు.. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న వారు... ఎందుకో తెలియదు... కారణాలు రకరకాలు. తెలియకుండానే తెరమరుగు అయిపోయారు... కనిపించకుండా కనుమరుగు అయిపోయారు...ఇలా మయమైపోయిన వాళ్లు చాలా మంది ఉన్నా, ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో కొంత మందిని మనం గుర్తు చేసుకుందాం...

అలనాటి అందాల తారలు... వయసు పెరిగినా కూడా గ్లామర్ తగ్గని హీరోయిన్స్... తరువాత తరువాత క్యారక్టర్ ఆర్టిస్టులుగా మారి ఎన్నో పాత్రలు చేసిన వారు... చేయగలిగే ఓపిక ఉన్నా... అవకాశాలు వెతుక్కుంటూ వచ్చినా సరే ఇంట్రస్ట్ ఉన్నా సరే చేయకుండా మానేసిన వారు ఎంతో మంది.. ఉన్నారు.. కుటుంభానికి అంకితమై కనీసం కనిపించ కుండా మరుగున పడిపోయారు.

జయంతి గుర్తుందా... ఆ తరం నటీమణుల్లో ఆణిముత్యం ఆమె హీరోయిన్ దగ్గర నుండి క్యారక్టర్ ఆర్టిస్ట్ వరకు ఆమె చేసిన పాత్రలన్ని వన్నెతెచ్చినవే...ఎంతో మంది హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు జయంది. డాన్సర్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేసిన జయంతి అనుకోకుండా నటి అయ్యారు.హీరోయిన్ గానే కాకుండా వదినగా, తల్లిగా, భామ్మగా ఇలా రకరకాల పాత్రలను పండించి తెలుగు ప్రేక్షకులను అలరించారు జయంతి. రాను రాను సినిమాలు తగ్గడంతో జయంతి కనుమరుగైపోయారు.. ఎప్పుడు ఏ సినమా ఫంక్షన్ లో కూడా కనిపించని జయంది.. బెంగుళూరులో కుటుంబంతో కలిసి ఉంటున్నట్టు సమాచారం..
జయచిత్ర ఈ పేరు వింటే అందానికి అర్ధం గుర్తుకు వస్తుంది. ఆకాలం హీరోయిన్స్ లో టాప్ మోస్ట్ బ్యూటీఫుల్ హీరోయిన్ అంటే జయచిత్రానే గుర్తుకు వస్తుంది...  హీరోయిన్ గా చేసే రోజుల నుండి క్యారక్టర్ ఆర్టిస్టుగా.. చివరికి అమ్మ క్యారక్టర్లు వేసే వరకు ఆమె ఎప్పటిలాగానే అందంగా మెరిసి పోయింది... 1972 లో తమిళ  సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన జయచిత్ర తమిళ స్టార్ హీరోలు అందరితో సినిమాలు చేసింది.. 1972 లో సోగ్గాడుతో తెలుగు చిత్ర రంగ ప్రవేశం చేశారు... అప్పటి నుండి ఎన్టీఆర్, ఎఎన్నార్, శోభన్ బాబు, కృష్ణం రాజు, లాంటి స్టార్ల పక్కన హీరోయిన్ గా చేసింది.. ఆతరువాత బాలకృష్ణ వెంకటేష్ లాంటి స్టార్ హీరోలకు మొదట్లో తల్లి పాత్రలు వేశారు జయచిత్ర. అబ్బాయిగారు మూవీలో వెంకటేష్ తల్లిగా.. లేడివిలన్ గా ఆమె పండించిన నటన అద్భుతం.. 2005  వరకు నటించిన జయచిత్రం ఆ తరువాత తెరమరుగు అయ్యారు.. చెన్నైలో ఉంటున్నట్టు తెలిసిన ఎక్కువగా ఎవరికి కనిపించరు జయచిత్ర.

తెలుగు ఇండస్ట్రీలో చామన ఛాయలో ఉన్నా కాని  నేచ్యూరల్ గ్లామర్ ఉన్న హీరోయిన్ వాణి శ్రీ... ఆమె అంత అందంగా ఉంటుందని వాణి శ్రీకి మెకప్ వేయకుండా సినిమా తీశారు బాపు రమణలు.. ఎన్నో సినిమాలు మరెన్నో పాత్రలు హీరోయిన్ గా ఎలాంటి షేడ్ ఉన్న అన్ని రకాల హావభావాలు పలికించేది వాణిశ్రీ.. గంగ మంగ లాంటి సినిమాలో డ్యూయల్ రోల్ చేసి, అటు అమాయకురాలిగా... ఇటు గడుసు పిల్లగా తన నట విశ్వరూపంచూపించారు వాణిశ్రీ... ఆ తరువాత క్యారక్టర్ ఆర్టిస్టుగా బిజీ అయిన వాణిశ్రీ... తల్లి పాత్రలను అద్భుతంగా పండించారు.. భద్రాద్రి రాముడు  సినిమాలో  హీరోయిన్ తల్లిగా నటించిన కళాభినేత్రి ఆతరువాత సినిమాలు చేయలేదు.. తెలుగు ఇండస్ట్రీమీద కోపంగా ఉన్నారు అని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నా... ఆరోగ్యం సహకరించకపోవడం, ఇండస్ట్రీమీద కోపంగా ఉండటంతో బయట కనిపించడంలేదు అని టాక్...

సినిమాలు ఆపేసిన నటులు మనకు చాలా మంది తెలుసు. కాని వారు అప్పుడప్పుడు ఏదో ఒక ఫంక్షన్ లో... సినిమా కార్యక్రమాలలోనో అలా మెరిసి అందరిని పలకరించి వెళ్ళిపోతుంటారు.. కాని కొంత మంది నటులు సినిమాలు మానేసిన తరువాత మళ్ళీ కెమెరాకి దొరకడంలేదు.. అసలు బయటకు రాకుండా అజ్ఞాతంలో బ్రతుకుతుంటారు.... మీకు వై.విజయ గుర్తుందా... 1970 నుండి  మొన్నటి వరకు లేడీ విలన్ గా  కొన్ని వందల సినిమాలలో నటించింది విజయ. లేడీ విలన్ గా, లేడీ కమెడియన్ గా, గయ్యాలి అత్తగా ఇలా రకరకాల పాత్రలు పోషించింది విజయ. తెలుగు తమిళ సినిమాలో తనదైన ముద్ర వేసిన విజయ మొదటి నుండి ఫిల్మ్ ఫంక్షన్స్ లో కాని బయట జరిగే కార్యక్రమల్లో పెద్దగా కనిపించేది కాదు.. కొన్ని సీరియల్స్ లో కూడా తళుక్కున మెరిసిన విజయ, ఆ తరువాత సినిమాల నుండి మాయమై పోయారు. 2001 లో వచ్చిన బడ్జెట్ పద్మనాభం మూవీ తరువాత విజయ ఎక్కడా కనిపించలేదు... 
బ్రహ్మానందంతో జంట కామెడియన్ గా కనిపించిన లేడీ కమెడియన్స్ లో పాకీజా కూడా ఒకరు.. ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా చేసి తెలుగు ప్రేక్షకులను నవ్వించిన పాకీజా ఆతరువాత సినిమాల్లోనుండి మాయమై పోయారు.. బ్రహ్మానందంతో పాకీజా కాంభినేషన్ అంటే అప్పట్లో బాగా క్రేజ్ ఉండేది.. బాత్రూమ్స్ క్లీన్ చేసే లేడీగానే ఎక్కువ సినిమాల్లో చేసింది పాకీజా... అసెంబ్లీ రౌడీ, పెదరాయుడు లాంటి సినిమాల్లో ఆమె చేసిన కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది.. పాకీజా కూడా పెద్దగా బయట కనిపించే వారు కదు.. ఇండస్ట్రీకి నటీనటులుగా  సేవ చేసినా కాని గుర్తిపు పొందలేకపోయిన పాకీజా లాంటి నటులకు గుర్తింపు రావాలి … మళ్ళీ వారు తెరపై కనిపించాలి...


మీరు సీతకోకచిలుక సినిమా చూశారా భారతీ రాజా డైరక్షన్ లో వచ్చిన ఈ మూవీలో ముచ్చటగా కనిపించే హీరోయిన్ ముచ్చర్ల అరుణ. అరుణ తెలుగమ్మాయి.. అయినా సరే అరుణకు మొదటి అవకాశం వచ్చింది తమిళంలోనే.. తెలుగు తమిళ, మలయాళ కన్నడ పరిశ్రమలలో ఎన్నో సినిమాలు చేసిన అరుణ 1990 తరువాత కనిపించడం మానేశారు... పెళ్ళి చేసుకుని కుటుంబ జీవితానికి ప్రిఫరెన్స్ ఇచ్చిన అరుణ తన అన్న స్నేహితుడిని పెళ్ళి చేసుకున్నారు...  అరుణ కు నలుగు ఆడపిల్లు. హీరోయిన్ గా ఎన్నో సక్సెస్ లు అందుకున్న అరుణకూడా ఎక్కువగా కనిపించరు... ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు అనే అనుకోవాలి...

చాలా మంది నటులు ఇండస్ట్రీ మీద కోపంతో ఉన్న వారు ఉన్నారు.. మనకు ఇక ఉపయోగం లేదు కదా.. ఇంకెందుకు తెర మీదకు అని.... కనిపించకుండా వారి పనులు వారు సైలెంట్ గా చేసుకునే వారు ఉన్నారు... ఇలా రకరకాల కారణాలతో తెరమరుగై … ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు సినీనటులు...
ప్రిన్స్ గా, సూపర్ స్టార్ గా వెలిగిపోతున్న టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు గుర్తున్నాడా... మహేష్ కంటే ముందుగా ఇండస్ట్రీకి వచ్చిన రమేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా, హీరోగా, చేసి కొన్ని సినమాలు క్యారక్టర్ ఆర్టిస్ట్ గా చేశాడు.. రాను రాను సినిమాల మీద ఇంట్రస్ట్ పోవడం.. దానితో పాటు అవకాశాలు తగ్గడంతో, సినిమాల నుండి బిజినెస్ వైపు అడుగులు వేశాడు రమేష్ బాబు.. ఇప్పుడు కంప్లీట్ బిజినెస్ మాన్ గా మారిన రమేష్ బాబు.. నిర్మాతగా చాలాసినిమాలు నిర్మించారు... దూకుడు ఆగడు లాంటి  కొన్ని సినిమాలకు ప్రొడ్యూసర్ రమేష్ బాబే.. కాని రమేష్ సినిమాలు వదిలేసిన తరువాత బయట కనిపించడం మానేసారు... మూవీ కార్యక్రమాలకులో కూడా కనిపించడంలేదు.
కాస్ట్యూమ్ కృష్ణ ఈ పేరు కొంత మందికి మాత్రమే తెలుసు. ఆ పేరు చెప్పగానే  కొంత మంది మాత్రమే గురర్తుపట్టగలరు ఆనటుడిని. నిజానికి ఆయన చాల గొప్ప నటుడు. కాస్ట్యూమర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కృష్ణ, నిర్మాతగా మారారు.  మెల్లగా సినిమాల్లోకి అడుగు పెట్టాడు... కమెడియన్ గా, విలన్ గా, కామెడీ విలన్ గా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, పీనాసి ఇంటి యజమానిగా ఇలా రకరకాల క్యార్టర్ లు పండించారు కాస్ట్యూమ్ క్రిష్ట. ఆయన ముఖంలో విలనిజం ఎంత బాగా పండేదో... కామెడీ కూడా అంతే విధంగా చేసేవారు కృష్ణ. సినిమాల్లో నుండి సడెన్ గా మాయమైన ఈయన ఎప్పుడు మూవీకి సంబంధించిన సభల్లో కూడా కనిపించరు... లాస్ట్ ఇయర్ శతమానంభవతి ఆడియో వేడుకల్లో కస్ట్యూమ్ కృష్ణ ను సత్కరించారు దిల్ నిర్మాత దిల్ రాజు...

ఇప్పుడు ఇండస్ట్రీలో లవర్ బాయ్ లు, మిల్క్ బాయి లు కామన్ అయ్యారు.. కాని అప్పట్లో మిల్క్ బాయ్, లవ్వర్ బాయ్ ఇమేజ్ ఉన్న ఏకైక హీరో హరీష్. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేశారు, 1983 వరకు తెలుగు  తమిళ కన్నడ మళయాల హిందీ సినిమాలలో చైల్డ్ ఆర్డిస్ట్ గా చేసిన హరీష్, ఆ తరువాత హీరోగా మారి లవ్వర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్నాడు... హీరోగా 1995 వరకు కొనసాగిన హరీష్, ఆ తరువాత సినిమాలకు దూరం అయ్యాడు.. హరీష్ ఏజ్ లో ఉన్న హీరోలు క్యారక్టర్ ఆర్టిస్టులుగా కొనసాగుతున్నా.. హరీష్ మాత్రం సినిమాలకు దూరమయ్యారు.. కనిపించకుండా కనుమరుగయ్యారు.... ఇప్పటి వరకు ఎటువంటి మూవీ ఫంక్షన్స్ లో కూడా కనిపించడు హరీష్..

ఇప్పటి వరకు మనం చూసిన వీరే కాదు. ఎందరో నటీనటులు పరిశ్రమకు దూరంగా వారి పనులు వారు చేసుకుంటూ కనిపించకుండా తిరిగే వారు చాలా మంది ఉన్నారు... అవకాశాలు  లేక కొంత మంది ఉంటే... ఇక చాలు పరసనల్ లైఫ్ ను ఎంజాయ్ చేద్దాం అనుకుని, సినిమాల ఊసు లేకుండా బ్రతికే నటులు ఎంతో మంది ఉన్నారు. నటించే సత్తా ఉన్నా కూడా  సినిమాకు దూరంగా బ్రతుకుతున్న సినీ కళామతల్లి బిడ్డలు, ఎప్పుడో ఒకప్పుడు తమ అభిమానులకు కనిపించాలని ఆశిద్దాం... ఇది ఈ రోజు స్పెషల్ మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం.... 

10:56 - May 6, 2017

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనాలు నమోదు చేస్తున్న దర్శకుడు రాజమౌళి. హీరోయిజాన్ని పీక్స్ లో చూపించే జక్కన్న తన హీరోలకు మెమరబుల్ హిట్స్ అందించాడు. అయితే అదే సమయంలో జక్కన్న సినిమాల్లో నటించిన హీరోలను ఓ బ్యాడ్ సెంటిమెంట్కూడా వెంటాడుతోంది. ఏంటా సెంటిమెంట్..? ఆ ఎఫెక్ట్స్ ప్రభాస్ మీద కూడా పడనుందా.?

రాజమౌళి సిల్వర్ స్క్రీన్ మీద ప్రస్తుతం ఓ బ్రాండ్. తన సినిమాల రికార్డ్ లను తానే బ్రేక్ చేసుకుంటూ వస్తున్న జక్కన్న బాహుబలి 2తో బాలీవుడ్ దర్శక నిర్మాతలకు చెమటలు పట్టిస్తున్నాడు. బాహుబలి సృష్టిస్తున్న ప్రభంజనం తెలుగు సినిమాను, ప్రభాస్ ఇమేజ్ ను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టింది. అయితే అదే సమయంలో ఓ బ్యాడ్ సెంటిమెంట్ యంగ్ రెబల్ స్టార్ అభిమానులను బయపెడుతోంది. 

రాజమౌళి దర్శకత్వంలో హీరోలుగా నటించిన వారికి ఆ తరువాత సక్సెస్ రావటం చాలా కష్టం.. రాజమౌళి ఆ హీరోల ఇమేజ్ ను పీక్స్ లో చూపించటంతో ఆ తరువాత అదే స్థాయి సినిమాలు పడకపోవటం, లేదా జానర్ మార్చి సినిమా చేద్దాం నిర్ణయంతో హీరోలే కోరి ఫ్లాప్ తెచ్చుకోవటం లాంటి పోరపాట్లు జరగుతున్నాయి. జక్కన్న తొలి హీరో నుంచి ఇది కంటిన్యూ అవుతుంది.
స్టూడెంట్ నెం.1 సినిమాతో దర్శకుడిగా రాజమౌళి 
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన స్టూడెంట్ నంబర్ వన్ సినిమాతో రాజమౌళి దర్శకుడిగా మారాడు. ఎన్టీఆర్ కూడా పెద్దగా అనుభవం ఉన్న నటుడు కాకపోవటంతో ఇద్దరికీ ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా మారింది. అనుకున్నట్టుగా స్టూడెంట్ నంబర్ 1 సినిమాను సూపర్ హిట్ గా నిలబెట్టిన జక్కన్న హీరోగా ఎన్టీఆర్ కు తిరుగులేని ఇమేజ్ తెచ్చిపెట్టాడు. అయితే ఆ ఇమేజ్ ఎన్టీఆర్ కు ఎంత ప్లస్ అయ్యిందో.. అంతే ప్లస్ అయ్యింది. స్టూడెంట్ నంబర్ వన్ తో స్టార్ గా ఎదిగిన ఎన్టీఆర్ ఆ తరువాత చేసి సుబ్బు సినిమాతో నిరాశపరిచాడు. 

ఎన్టీఆర్ ను సక్సెస్ ట్రాక్ ఎక్కించడానికి మరోసారి ముందుకు వచ్చాడు రాజమౌళి. ఈ సారి మరింత భారీ హీరోయిజంతో ఎన్టీఆర్ ను సింహాద్రి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. భారీ యాక్షన్ సీన్లతో పాటు మాస్ మాసాలా యాక్షన్ డ్రామాతో సింహాద్రి సినిమాను పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దిన రాజమౌళి, ఎన్టీఆర్ కెరీర్ లో బిగెస్ట్ హిట్ ను అందించాడు. ఈ సినిమాతో ఎన్టీఆర్ మాస్ ప్రేక్షకుల ఆరాధ్య దైవంగా మారిపోయాడు.

సింహాద్రి ఇమేజ్ తో ఎన్టీఆర్ తరువాత  ఏస్థాయి సినిమా చేసినా వర్క్ అవుట్ కాలేదు. సింహాద్రి తరువాత పూరి దర్శకత్వంలో ఆంద్రవాలా సినిమాతో నిరాశపరిచాడు. ఆ తరువాత కూడా వరుసగా సాంబ, నా అల్లుడు సినిమాలతో ఎన్టీఆర్ అభిమానులకు షాక్ ఇచ్చాడు. సింహాద్రి పాత్రలో ఎన్టీఆర్ ను చూసిన అభిమానులు తరువాత రెగ్యులర్ మాస్ పాత్రల్లో చూడలేకపోయారు. అందుకే జూనియర్ ను వరుస ఫ్లాప్ లు ఇబ్బంది పెట్టాయి.

కెరీర్ లో వరుస ఫ్లాప్ లతో ఇబ్బందుల్లో ఉన్న నితిన్ ను కూడా సక్సెస్ ట్రాక్ ఎక్కించే ప్రయత్నం చేశాడు. రాజమౌళి అప్పటికే ఫ్లాప్ లతో సతమతమవుతున్న నితిన్ హీరోగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సై సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా జక్కన్న గత సినిమాల స్థాయిలో ఆడకపోయినా.. హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ సై హిట్ నితిన్ కెరీర్ కు ఉపయోగపడలేదు.. ఆ తరువాత నితిన్ హీరోగా తెరకెక్కిన సినిమాలు కూడా ఫ్లాప్ గా నిలిచాయి.

రాజమౌళి టాప్ డైరెక్టర్ గా ఎదిగిన తరువాత సెంటిమెంట్ మరింత ఎక్కువయ్యింది. జక్కన్న సినిమా ఎంత పెద్ద విజయం సాధిస్తే ఆ హీరో అన్నేళ్ల పాటు సక్సెస్ లకు దూరమవుతూ వచ్చాడు. టాప్ స్టార్లను కూడా జక్కన్న సెంటిమెంట్ వెంటాడింది.

ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన సినిమా ఛత్రపతి. అప్పటి వరకు ప్రభాస్ ను ఎవరూ చూపించనంత పవర్ ఫుల్ గా ఈ సినిమాలో చూపించాడు రాజమౌళి. ప్రభాస్ లోని మాస్ అపీల్ ను హీరోయిజాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లాడు. అందుకే ఈ సినిమా తరువాత మామూలు పాత్రల్లో ప్రభాస్ ను యాక్సప్ట్ చేయడానికి అభిమానులకు చాలా సమయం పట్టింది.

ఛత్రపతి తరువాత ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చాలా సినిమాలు ఫ్లాప్ గా మిగిలిపోయాయి. పౌర్ణమి, మున్నా లాంటి సినిమాలు పరవాలేదనిపించినా.. ఛత్రపతి లాంటి మాస్ సబ్జెక్ట్ ముందు తేలిపోయాయి. యోగితో ఛత్రపతి తరహా హీరోయిజాన్ని ట్రై చేసినా అది కూడా వర్క్ అవుట్ కాలేదు. దీంతో మరో సక్సెస్ కోసం ప్రభాస్ చాలా కాలం ఎదురుచూడాల్సి వచ్చింది.

మాస్ మహరాజ్ రవితేజను కూడా రాజమౌళి సెంటిమెంట్ ఇబ్బంది పెట్టింది. జక్కన్న దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన సినిమా విక్రమార్కుడు. రవితేజ మార్క్ కామెడీ టైమింగ్ తో పాటు రాజమౌళి స్టైల్ టేకింగ్ తో ఆకట్టుకున్న ఈసినిమా రవితేజ కెరీర్ లోనే బిగెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. అప్పటి వరకు కామెడీ ఇమేజ్ మాత్రమే ఉన్న రవితేజను సీరియస్ పోలీస్ ఆఫీసర్ గా చూపించిన రాజమౌళి, ఈమాస్ హీరో రేంజ్ ను టాప్ కు తీసుకెళ్లాడు.

విక్రమార్కుడు సక్సెస్ రవితేజను ఇండస్ట్రీలో మరింత బిజీ హీరోగా మార్చేసింది. అయితే ఆ సినిమా వెంటనే తన మార్క్ ఎంటరైటైన్మెంట్ కోసం ఓ కామెడీ సినిమా చేశాడు రవితేజ. విక్రమార్కుడి పాత్రలో మాస్ మహరాజ్ ను చూసిన ఆడియన్స్ ఒక్కసారిగా కామెడీ పాత్రలో చూడలేకపోయారు. అందుకే విక్రమార్కుడు తరువాత చేసిన ఖతర్నాక్, రవితేజ కెరీర్ లో బిగెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.

రాజమౌళి సెంటిమెంట్ కు మూడోసారి కూడా బలైన హీరో జూనియర్ ఎన్టీఆర్. జక్కన్న డైరెక్షన్ లో ఎన్టీఆర్ చేసిన హ్యాట్రిక్ సినిమా యమదొంగ. ఎన్టీఆర్ ను యంగ్ యముడిగా చూపిన రాజమౌళి, మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ తో అలరించాడు. అంతేకాదు లుక్ విషయంలోనూ ఎన్టీఆర్ ను సరికొత్తగా ప్రజెంట్ చేసి ఆకట్టుకున్నాడు. సోషియో ఫాంటసీగా తెరకెక్కిన యమదొంగ ఎన్టీఆర్ కెరీర్ కు మరో స్పీడ్ బ్రేకర్ గా మారింది.

యమదొంగ సినిమా సూపర్ హిట్ అయినా.. ఆతరువాత ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన సినిమా బోల్తా కొట్టింది. యమదొంగ తరువాత మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన కంత్రి ఎన్టీఆర్ కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. అంతేకాదు కంత్రిలో ఎన్టీఆర్ లుక్ పై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి.

రాజమౌళి సినిమా స్థాయి పెరుగుతున్న కొద్ది హీరోలకు కష్టాలు ఎక్కువయ్యాయి. రాజమౌళి సినిమాతో పది మెట్లు ఎక్కామన్న సంతోషం ఒక్క సినిమాతోనే ఆవిరైపోయింది. ఈ లిస్ట్ స్టార్ వారసులు యంగ్ హీరోలు కూడా ఉన్నారు.

తన రెండో సినిమానే రాజమౌళి లాంటి గ్రేట్ డైరెక్టర్ తో చేశాడు. రామచరణ్ హీరోగా రాజమౌళి మగధీర సినిమాను తెరకెక్కించాడు. 400 ఏళ్ల క్రితం ప్రేమను గెలిపించుకునేందుకు మళ్లీ పుట్టిన ప్రేమికుల కథతో తెరకెక్కిన ఈ సినిమాలో సంచలన విజయం సాధించింది. అంతేకాదు 50 కోట్ల మార్క్ ను దాటిన తొలి తెలుగు సినిమాగా నిలిచింది. ఈ సినిమా విజయం చరణ్ ను ఒక్కసారిగా టాప్ స్టార్ గా మార్చేసింది.

మగధీర సినిమా తరువాత మాస్ ఇమేజ్ ను బయట పడాలని చరణ్ చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. వరుసగా రెండు మాస్ యాక్షన్ సినిమాలు చేసిన చరణ్ మగధీర తరువాత ఓ లవ్ స్టోరి చేశాడు. బొమ్మరిళ్లు భాస్కర్ దర్శకత్వంలో ఆరెంజ్ సినిమాలో హీరోగా నటించాడు. పూర్తిగా ఫారిన్ బ్యాక్ డ్రాప్ లో క్యూట్ లవ్ స్టోరిగా తెరకెక్కిన ఆరెంజ్ చరణ్ కెరీర్ లో బిగెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.

ఈగ సినిమాతో నానికి కూడా ఇదే అనుభవం ఎదురైంది. ఈగలో నాని పూర్తి స్థాయి హీరోగా నటించకపోయినా.. హీరో అన్న ట్యాగ్ పడటంతో రాజమౌళి సెంటిమెంట్ నానిని వెంటాడింది. అందుకే ఈగ తరువాత నాని చేసిన ఎటో వెళ్లిపోయింది మనసు, పైసా సినిమాలు డిజాస్టర్ గా లు నిలిచాయి. ఆ తరువాత కూడా నానిని ఫ్లాప్స్ వెంటాడాయి.

ఇప్పుడు బాహుబలి తరువాత ప్రభాస్ పరిస్థితి ఏంటి అన్న చర్చ మొదలైంది. రాజమౌళి సినిమాలన్నింటిలోకి బాహుబలి భారీ విజయం.. దాదాపు ఐదేళ్ల పాటు శ్రమించి రెండు భాగాలుగా బాహుబలి చిత్రాన్ని తెరకెక్కించాడు జక్కన్న. ప్రభాస్ కూడా మరో సినిమా అంగకీరించకుండా నాలుగేళ్ల పాటు బాహుబలి మీదే కాలం గడిపాడు. ఫైనల్ గా బాహుబలి సినిమా నేషనల్ లెవల్ పాత రికార్డ్ లను చేరిపేస్తూ సరికొత్త రికార్డ్ లను సెట్ చేస్తూ దూసుకుపోతుంది.

మరి రాజమౌళి సెంటిమెంట్ ప్రకారం ప్రభాస్ నెక్ట్స్ సినిమాఫ్లాప్ అవుతుందా అన్న భయం యంగ్ రెబల్ స్టార్ అభిమానులను వేదిస్తోంది. ఇప్పటికే సుజిత్ దర్శకత్వంలో మరో భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్రారంభించాడు ప్రభాస్. వంద కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రభాస్ అసలు స్టామినాను ప్రూవ్ చేయనుంది. మరి ప్రభాస్, రాజమౌళి సెంటిమెంట్ ను బ్రేక్ చేసి సక్సెస్ సాధిస్తాడా..? లేక గత హీరోల మాధిరి నిరాశపరుస్తాడా..? చూడాలి.

10:52 - May 6, 2017

బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ కబీర్ ఖాన్ '’ బాహుబలి 2 తెలుగు సినిమా కాదని అది మన భారత్ సినిమా అన్నారు. బాహుబలి విజయం తనకు ఎంతో ఆనందాన్ని బలాన్ని ఇచ్చిందని తెలిపారు. తన కొత్త ప్రాజెక్టు సల్మాన్ ఖాన్ హీరో నిర్మస్తున్న మూవీ ట్యూబ్ లైట్ టీజర్ విడుదల కార్యక్రమంలో బాహుబలి గురించి ఆయన పై విధంగా స్పందించారు. కబీర్ ఖాన్ ట్యూబ్ లైట్ సినిమా సల్మాన్ ఖాన్ సొంత ప్రొడక్షన్ లో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కబీర్ ఖాన్ సోదరుడు సొహైల్ ఖాన్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.

పాతబస్తీలో మత్తుమందు ముఠా అరెస్టు

హైదరాబాద్ : పాతబస్తీలో మత్తుమందు ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పలు ఇంజక్షన్ లు, మత్తు మందులు స్వాధీనం చేసుకున్నారు. 

 

నీలోఫర్, కోటి ప్రసూతి ఆస్పత్రుల్లో ఐదుగురు బాలింతల పరిస్థితి విషమం

హైదరాబాద్ : ప్రభుత్వ ఆస్పత్రిలో బాలింతలు మరణాలు ఆగడం లేదు. నీలోఫర్, కోటి ప్రసూతి ఆస్పత్రుల్లో ఐదుగురు బాలింతలు పరిస్థితి విషమంగా ఉంది. పలు ఇన్ జక్షన్ లు, మత్తు మందులు స్వాధీనం చేసుకున్నారు. 
 

కరెంట్ షాక్ తగిలి బాలుడు మృతి

సిరిసిల్ల : పెద్దూరు గిరిజన తండాలోని 25 ఇళ్లలో హై వోల్టేజీతో విద్యుత్ సరఫరా అయింది. ఫీజులు తీసివేసినా విద్యుత్ ప్రసారం కావడంతో కరెంట్ షాక్ తగిలి గణేష్ (15) అనే బాలుడు మృతి చెందారు. రాత్రి సమాచారం అందించిన అధికారులు స్పందించలేదు. తండా వాసులు ఆందోళన చెందుతున్నారు. 

రాణి ఝాన్సీ స్కూల్ లో గ్యాస్ లీక్

ఢిల్లీ : రాణి ఝాన్సీ స్కూల్ లో గ్యాస్ లీక్ అయింది. దీంతో 70 మంది విద్యార్థులు అస్వస్థత గురయ్యారు. చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించారు. 

భర్తపై భార్య ఘాతుకం

గుంటూరు : జిల్లాలోని తెనాలిలో దారుణం జరిగింది. తాలికట్టిన భర్తనే ఇల్లాలు కడతేర్చింది. అర్ధరాత్రి గాఢనిద్రలో ఉన్న భర్త శ్రీరామ్‌ను క్రూరంగా గొంతుకోసి భార్య సుజాత హతమార్చింది. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయింది. చెంచుపేట ఎస్‌విఎస్‌ సప్లయర్‌లో శ్రీరామ్‌ పనిచేస్తున్నాడు. 

08:49 - May 6, 2017

గుంటూరు : జిల్లాలోని తెనాలిలో దారుణం జరిగింది. తాలికట్టిన భర్తనే ఇల్లాలు కడతేర్చింది. అర్ధరాత్రి గాఢనిద్రలో ఉన్న భర్త శ్రీరామ్‌ను క్రూరంగా గొంతుకోసి భార్య సుజాత హతమార్చింది. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయింది. చెంచుపేట ఎస్‌విఎస్‌ సప్లయర్‌లో శ్రీరామ్‌ పనిచేస్తున్నాడు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

08:45 - May 6, 2017

హైదరాబాద్‌ : నగరంలో బంజారాహిల్స్ కేబీర్ పార్క్ వద్ద ర్యాష్ డ్రైవింగ్‌పై బంజారాహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. బైక్ రేసింగ్‌లు చేస్తున్న వారి దగ్గరి నుండి 13 స్పోర్ట్స్ బైక్స్‌, ఒక కార్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మితిమీరిన వేగంతో వెళ్తూ ఇతర వాహనదారులను భయపెట్టిస్తున్న వీరందరికి తల్లి తండ్రులు సమక్షంలో బంజారాహిల్స్ సిఐ విద్యాసాగర్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. 

 

08:34 - May 6, 2017

హైదరాబాద్ : తెలంగాణ‌లో బీజేపీ క‌ద‌లిక‌ల‌పై కాంగ్రెస్ ఏమ‌నుకుంటోంది..? ఈ విష‌యంలో హ‌స్తిన నేత‌లు రాష్ట్ర కాంగ్రెస్‌కు చెబుతున్నదేంటి..? రాష్ట్రంలో నామ‌మాత్రంగా ఉన్న బీజేపీ గురించి బెంగ ప‌డాల్సిన అవ‌స‌రం కాంగ్రెస్‌కు ఉందా..? అంటే అక్కడే ఉంది అస‌లైన ట్విస్ట్‌ అంటున్నారు హ‌స్తం నేత‌లు. ఇంత‌కీ ఏమిటా ట్విస్ట్..?
బీజేపీకి భయపడుతున్న హస్తం
తెలంగాణ కాంగ్రెస్‌కు బీజేపీ ఫివ‌ర్ ప‌ట్టుకుందా..? ప్రధాన‌ప్రతిప‌క్షంగా ఉన్న హ‌స్తం పార్టీ తెలంగాణ‌లో నామ‌మాత్రంగా ఉన్న బీజేపీకి ఎందుకు భ‌య‌ప‌డుతుంద‌నుకుంటున్నారా..? అక్కడే ఉంది అస‌లు ట్విస్ట్. 2019 నాటికి రాష్ట్రంలో నిర్ణయాత్మక శ‌క్తిగా ఎదుగుతామ‌న్న క‌మ‌ల ద‌ళ‌ప‌తి మాట‌ల‌పై హ‌స్తం నేత‌లు సీరియ‌స్‌గానే ఆలోచిస్తున్నారు. రాష్ట్ర నాయ‌కులు ఈ విష‌యంలో పెద్ధగా దృష్టి సారించ‌క‌పోయినా..ఢిల్లీ హైక‌మాండ్ మాత్రం సీరియ‌స్‌గానే ఆలోచిస్తున్నట్లు క‌నిపిస్తుంది.
కాంగ్రెస్ ముఖ్యనేతలకు సూచనలు
ఢిల్లీ వెళ్ళిన రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యనేతలకు హ‌స్తిన పెద్దలు బీజేపీ విష‌యంలో అనుస‌రించాల్సిన అంశాల‌పై ప‌లు సూచ‌న‌లు చేసిన‌ట్లు తెలుస్తోంది. తెలంగాణలో నామ‌మాత్రంగా ఉన్న బీజేపీ గురించి ఏఐసీసీ అంత‌గా టెన్షన్‌ పడాల్సిన అవ‌స‌రం ఏంట‌నే ప్రశ్న వ‌స్తుంది. అయితే దీనికి కార‌ణం లేక‌పోలేదు. ఇటీవ‌ల అసెంబ్లీలో ఆమోదం పొందిన ముస్లిం రిజ‌ర్వేష‌న్స్ బిల్లే దీనికి ప్రధాన కార‌ణంగా తెలుస్తోంది. ముస్లిం రిజ‌ర్వేష‌న్స్ అంశం తెరపైకి వ‌చ్చాక బీజేపీ సైలెంట్‌గా హిందువుల సెంటిమెంట్‌ను రెచ్చగొట్టేపనిలో ఉంద‌ని,.రాబోయే రోజుల్లో ఇది కాంగ్రెస్‌కు ప్రమాదమని కాంగ్రెస్ హైక‌మాండ్ భావిస్తుంది. ఈ ఎపిసోడ్‌లో టీఆర్ఎస్ వ‌ర్సెస్ బీజేపీగా ఇష్యూ రేజ్ అయ్యే చాన్స్ ఉంద‌ని...అదే జ‌రిగితే త‌మ‌కు ఊహించ‌ని విధంగా న‌ష్టం వాటిల్లుతుంద‌ని ఢిల్లీ నాయ‌క‌త్వం భావిస్తోంది. ఇదే విష‌యాన్ని ఏఐసిసి నేత‌లు రాష్ట్ర ముఖ్యుల‌కు హిత‌బోధ చేసిన‌ట్లు స‌మాచారం.
ఆపరేషన్‌ తెలంగాణ మొదలుపెట్టిన బీజేపీ 
ఇప్పటికే బీజేపీ హైక‌మాండ్ ఆప‌రేష‌న్ తెలంగాణ మొద‌లు పెట్టిన నేప‌థ్యంలో..అందులో తాము న‌ష్టపోకుండా నష్టనివారణ చర్యలు తక్షణం చేప‌ట్టాల‌ని ఢిల్లీ పెద్దలు పీసీసీ చీఫ్‌కు సూచించిన‌ట్లు తెలుస్తోంది. ఇప్పటికే  కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌ గౌడ్ బీజేపీ గూటికి చేరిన నేప‌థ్యంలో..మ‌రికొంద‌రు అమిత్‌షా కు ట‌చ్‌లో ఉన్నార‌న్న వార్తల నేప‌థ్యంలో మిగ‌తా నేత‌లు చేజార‌కుండా చూసుకోవాల‌ని అధిష్టానం పీసీసీ చీఫ్‌కు తేల్చిచెప్పింద‌ని సమాచారం. 
బీజేపీ క‌ద‌లిక‌ల‌పై దిశానిర్దేశం 
ప్రత్యేక స‌మావేశం కోసం రాష్ట్ర కాంగ్రెస్ నేత‌ల‌ను ఢిల్లీకి పిలిచిన పార్టీ అధిష్టానం..ఆ భేటిలో ఎక్కువ స‌మ‌యం బీజేపీ క‌ద‌లిక‌ల‌పైనే దిశానిర్దేశం చేశారని సమాచారం. సో..ముస్లిం రిజ‌ర్వేష‌న్స్ సెంటిమెంట్‌పై టీఆర్ఎస్,  బీజేపీ పోటాపోటీ ప‌డుతుండ‌టంతో ఈ క్రెడిట్ రేస్‌లో తాము న‌ష్టపోకుండా కాంగ్రెస్ జాగ్రత్త ప‌డుతోంది.
 

 

08:26 - May 6, 2017

కృష్ణా : విజయవాడలో 700 కోట్ల రూపాయల విలువ చేసే నగరపాలక సంస్థ భూమిపై టీడీపీ పెద్దల కన్ను పడింది. 57 ఎకరాల సిబార్‌ డిస్నీ ల్యాండ్‌ భూమిని 99 సంవత్సరాల లీజు పేరుతో దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఈ భూమిలో భారీ వాణిజ్య సముదాయాలు నిర్మించి, కోట్లు దండుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఒకవైపు నగరంలో భూమి అందుబాటులో లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం మంజూరు  చేసిన వేలాది ఇళ్లు రద్దవుతుంటే,..మరోవైపు ఎంతో విలువవైన వీఎంసీ భూమిని లీజు పేరుతో గద్దల్లా తన్నుకుపోయేందుకు  ప్రభుత్వ పెద్దలు చేస్తున్న ప్రయత్నాలు వివాదస్పదమవుతున్నాయి.
శరవేగంగా విస్తరిస్తోన్న నగరం 
విజయవాడ... ఏపీ రాజధాని అమరావతికి కేంద్ర బిందువుగా ఉన్న ప్రదేశం. రాష్ట్ర విభజన తర్వాత నగరం శరవేగంగా విస్తరిస్తోంది. ఎన్నో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు అమరావతితోపాటు, విజయవాడలో కార్యాలయాల ఏర్పాటుకు భూమి కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఒకవైపు  బెజవాడలో స్థలం దొరక్క ఇబ్బందుల పడుతుంటే, మరోవైపు నగరపాలక సంస్థలకు చెందిన వందల కోట్ల రూపాయల విలువైన 57 ఎకరాల భూమిని లీజు పేరుతో గద్దలా తన్నుకు పోయేందుకు ప్రభుత్వ పెద్దలు పావులు కదపడం వివాదాస్పదంగా మారుతోంది. 
ఏడు ఎకరాల్లో వాటర్‌ వరల్డ్‌ ఏర్పాటు 
విజయవాడ నగర పాలక సంస్థకు చెందిన 57.66 ఎకరాల భూమిని సిబార్‌ డిస్నీ ల్యాండ్‌కు 1999లో 20 ఏళ్లకు లీజుకు ఇచ్చారు. వినోదం కోసం గోకులం, అడ్వెన్చెర్‌పార్క్‌, అవుట్‌డోర్‌ సినిమా థియేటర్‌ ఏర్పాటు చేస్తామని ఒప్పందం కుదుర్చుకుంది. కానీ ఏడు ఎకరాల్లో వాటర్‌ వరల్డ్‌ మాత్రమే ఏర్పాటు చేసిన ఈ సంస్థ  లీజు నిబంధనలను ఉల్లంఘించిందన్న విమర్శలున్నాయి. క్రాంటాక్టు సంస్థ కొంతభాగంలో డిస్నీల్యాండ్‌ ఏర్పాటు చేసినా, ప్రజాదరణకు నోచుకోవడంతో కొద్ది కాలానికే మూతపడింది. దాదాపు దశాబ్దంన్నర కాలంగా నిరుపయోగంగా ఉంది. దీనిని స్వాధీనం చేసుకునేందుకు నగరపాలక సంస్థ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మొటల్లో మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ఈ భూమి అంతగా అవసరంకున్నా..ఇప్పుడు స్థలాల కొరత ఏర్పడింది. పలు ప్రాజెక్టులకు భూమి దొరకని పరిస్థితి ఉంది. 
99 ఏళ్ల కాలానికి లీజు పొడిగించుకునే యత్నం 
1999లో ఇచ్చిన ఈ భూమి లీజు గడువు మరో రెండేళ్లలో పూర్తి కావస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త లీజు నిబంధనల ప్రకారం 99 ఏళ్ల కాలానికి లీజును పొడిగింపుకు ప్రభుత్వ పెద్దలు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. బాహ్యవలయ రహదారి, అంతర్వలయ రహదారి ఈ ప్రాంతం నుంచే వెళ్తుండటంతో  డిస్నీల్యాండ్‌ ప్రాంతం బాగా అభివృద్ధి చెందింది.  దీంతో లీజు పొడిగించుకుని భారీ వాణిజ్య సముదాయాలు నిర్మిస్తే కోట్లు గడించవచ్చన్న ఉద్దేశంతో కొందరు పెద్దలు పైరవీలు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. 
డిస్నీల్యాండ్‌ భూమిని స్వాధీనం చేసుకోవాలి : ప్రజా సంఘాలు 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేస్తున్న గృహ నిర్మాణ పథకాలకు భూమి లేక మంజూరైన ఇళ్లను రద్దు చేస్తున్న నేపథ్యంలో డిస్నీల్యాండ్‌ భూమిని వెంటనే స్వాధీనం చేసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. పేదల గృహ నిర్మాణ పథకాల కోసం డిస్నీల్యాండ్‌ భూమిని స్వాధీనం చేసుకోపోతే ప్రజా ఉద్యమం తప్పదని నేతలు హెచ్చిరిస్తున్నారు. సిబార్‌ డిస్నీల్యాండ్‌  2003 నుంచి 2011 వరకు మున్సిపల్‌ కార్పొరేషన్‌కు 21 లక్షల రూపాయలకుపైగా బకాయలు చెల్లించాల్సి వున్నా...మళ్లీ ఇదే సంస్థకు లీజు పొడిగించేందుకు జరుగుతున్న యత్నాలను ప్రజా సంఘాలు తప్పుపడుతున్నాయి. 

 

08:15 - May 6, 2017

హైదరాబాద్ : నాలాల పూడికతీతలో అక్రమాలకు పాల్పడిన వారి భరతం పడుతోంది జీహెచ్‌ఎంసీ. తప్పుడు బిల్లులతో కోట్లు కొట్టేసిన వ్యవహారంలో ఇప్పటికే 18 మంది కాంట్రాక్టర్లు జైలు పాలు కాగా.. తాజాగా 12 మంది ఇంజనీర్లను అరెస్ట్‌ చేశారు సీసీఎస్‌ పోలీసులు. అయితే వాళ్లు స్టేషన్‌ బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ వ్యవహారంలో ఇంకెంత మంది పాత్ర ఉందనే అంశం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. 
ప్రతి ఏడాది రూ.25-30 కోట్ల పనులు 
హైదరాబాద్‌లో ప్రతి ఏడాది వర్షాకాలానికి ముందు వరద కాలువల్లో పూడిక తీయిస్తుంది జీహెచ్‌ఎంసీ. ఇందుకోసం 25 నుంచి 30 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. అయితే ఈ పనులపై అనేక ఆరోపణలు వస్తుంటాయి. పనులు చేయకుండానే బిల్లులు నొక్కేస్తారనే విమర్శలున్నాయి. తాజాగా సెంట్రల్‌జోన్‌ పరిధిలో 12 మంది ఏఈలను అరెస్ట్‌ చేయడంతో ఈ ఆరోపణలకు మరింత బలం చేకూరుతోంది. 
గతేడాది 72 పనులకు రూ.కోటి 45 లక్షలు 
సెంట్రల్‌ జోన్‌ పరిధిలో గతేడాది నాలాలో పూడిక తీసేందుకు 72 పనులకు అధికారులు కోటి 45 లక్షలు కేటాయించారు. ఈ పనులు దక్కించుకున్న 27 ఏజెన్సీలు జూన్‌ 2016 నాటికి పనులు పూర్తి చేసినట్లు.. జులైలో జీహెచ్‌ఎంసీకి బిల్లులు అందజేశాయి. అయితే ఆడిట్‌లో అనేక విషయాలు బయటపడ్డాయి. ద్విచక్ర వాహనాలు, త్రీవీలర్‌, ఫోర్‌ వీలర్‌ లైట్‌ వెహికల్స్‌ నెంబర్‌తో బిల్లులు సృష్టించారని గుర్తించారు. బల్దియా ఇంటర్నల్‌ ఎంక్వయిరీలో కూడా ఇదే విషయం బయటపడింది. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌కు ఫిర్యాదు చేశారు. ముందుగా ఆరుగురు కాంట్రాక్టర్లపై కేసు నమోదు చేసిన సీసీఎస్‌ పోలీసులు.. విచారణ అనంతరం 18 మందిని అరెస్ట్‌ చేశారు. అయితే వీరిలో రాజకీయ నాయకులు కూడా ఉండడం విశేషం. అంబర్‌పేట నియోజకవర్గానికి చెందిన బీజేపీనేత ఎక్కాల నందు అలియాస్‌ విజయ్‌కుమార్‌ ఉన్నారు. నందు భార్య గత కార్పొరేషన్‌ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా పోటీ చేశారు. 
బిల్లులను పరిశీలించిన సీసీఎస్‌ పోలీసులు 
ఇక ఈ ఘటనలో అధికారుల ప్రమేయం కూడా ఉన్నట్లు గుర్తించిన సీసీఎస్‌ పోలీసులు.. సెంట్రల్‌ జోన్‌ ఇంజనీరింగ్‌ విభాగంలోని బిల్లులను పరిశీలించారు. బిల్లుల చెల్లింపులో సర్కిల్‌ 7ఎ, 7బి, సర్కిల్‌ 9ఎ, 9బి, సర్కిల్‌ 10ఎ, 10బిల అసిస్టెంట్‌ ఇంజనీర్ల పాత్ర ఉందని గుర్తించారు. 12 మంది ఇంజనీర్లను విచారించిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకున్నారు. 
తప్పులను ప్రశ్నించడంపై అనుమానాలు 
అయితే ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మరోవైపు గతేడాది జూన్‌లో పెట్టిన బిల్లులను 10 నెలలు పెండింగ్‌లో పెట్టిన ఆడిట్‌ అధికారులు.. ఇప్పుడు తప్పులను ప్రశ్నించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇక కాంట్రాక్టర్లు కూడా ఆడిట్‌ అధికారులపై ఆరోపణలు చేస్తున్నారు. అయితే.. ఈ కేసును పరిశీలిస్తున్న సీసీఎస్‌ పోలీసులు ఆడిట్‌ అధికారులను కూడా విచారిస్తారా ? లేదా అనేది కొద్దిరోజుల్లో తేలనుంది. 

 

08:01 - May 6, 2017

విజయవాడ : మిర్చి కొనుగోళ్లలో ప్రభుత్వాలు అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. రైతుల దగ్గర మిర్చిని మూడు వేలకు క్వింటా చొప్పున కొంటున్న వ్యాపారులు..అదే మిర్చిని సూపర్‌ మార్కెట్లలో 34వేలకు విక్రయిస్తున్నారన్నారు. విజయవాడలోని రిలయన్స్‌ మార్ట్‌ను సందర్శించిన నారాయణ అక్కడి కూరగాయలు, వివిధ నిత్యావసర వస్తువుల ధరలను పరిశీలించారు. మిర్చికి ధరలేక రైతులు అల్లాడిపోతుంటే..సూపర్‌ మార్కెట్లు మాత్రం..జనాలను దోచుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ముందుకొచ్చి రైతుల దగ్గర ఉన్న మిర్చి మొత్తాన్ని కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

 

07:54 - May 6, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో మిర్చి మంటలు కొనసాగుతూనే ఉన్నాయి. మిర్చికి కేవలం 5వేల మద్దతు ధర నిర్ణయంపై రైతులు మండిపడుతున్నారు. అటు  విపక్షాలు సైతం  కేంద్రం నిర్ణయంపై విరుచుకు పడుతున్నాయి. మద్దతు ధర పెంచి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి.
మిర్చికి మద్దతు ధర రూ.5వేల ప్రకటించడంపై పవన్‌ 
మిర్చికి కేంద్రం మద్దతు ధర ప్రకటించినా మిర్చి మంటలు చల్లారలేదు. మిర్చికి మద్దతు ధరగా కేవలం 5వేల రూపాయాలను ప్రకటించడంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మండిపడ్డారు. మిర్చి కొనుగోలు లోనూ కేంద్రం వివక్ష చూపుతోందని  ధ్వజమెత్తారు. ఏపీలో 88,300 మెట్రిక్‌ టన్నుల మిర్చి కొనుగోలు చేస్తోన్న కేంద్ర ప్రభుత్వం... తెలంగాణలో 33,700 మెట్రిక్‌ టన్నులే కొనుగోలు చేస్తామని ప్రకటించడం ఎంత వరకు సబబని నిలదీశారు. రెండు రాష్ట్రాలను సమానంగా చూడాలని, తెలుగు ప్రజల మధ్య తగవులు పెట్టవద్దని పవన్‌ కోరారు. రైతు కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత నుంచి ప్రభుత్వాలు తప్పించుకోరాదని సూచించారు. పారిశ్రామిక వేత్తలకు కోట్లాది రూపాయలను వివిధ రూపాల్లో సబ్సిడీలుగా అందిస్తూ...  సంపన్నులకు ప్రభుత్వాలు  వెన్నుదన్నుగా నిలుస్తున్నాయన్నారు.  మరి రైతుల దగ్గరికి వచ్చే సరికి  ఎందుకు వారికి  అండగా ఉండడం లేదని ప్రశ్నించారు. 
ఖమ్మంలో కిషన్‌రెడ్డి అరెస్ట్‌
అటు, బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి.. ఖమ్మం మిర్చి మార్కెట్‌ యార్డు సందర్శన ఉద్రిక్తంగా మారింది. మిర్చి మార్కెట్‌కు  కిషన్‌రెడ్డి ర్యాలీగా వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.  దీంతో కిషన్‌రెడ్డికి పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం కిషన్‌రెడ్డిని అరెస్ట్‌ చేసి ఖమ్మం రూరల్‌ పీఎస్‌కు తరలించారు.  ఖమ్మంలో 144 సెక్షన్‌ అమలులో ఉన్నందున కిషన్‌రెడ్డిని అరెస్ట్‌ చేసినట్టు పోలీసులు తెలిపారు.  మిర్చి రైతులను ఆదుకోవడంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని కిషన్‌రెడ్డి అన్నారు.  మిర్చి రైతుల కోసం కేసీఆర్‌ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. మొత్తానికి మిర్చికి కేంద్రం మద్దతు  ధరను పెంచాలన్న డిమాండ్‌ బలంగా వినిపిస్తోంది.  తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా కేంద్రం ఒత్తిడి తీసుకొచ్చి మద్దతు ధర పెంపునకు చొరవ తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

 

07:44 - May 6, 2017

ఢిల్లీ : రెండు రోజుల పర్యటన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులతో ఇవాళ భేటీ కానున్నారు. రాష్ట్ర విభజన అంశాలతో పాటు, పెండింగ్‌ ప్రాజెక్టులపై చర్చిస్తారు. మిర్చి రైతులకు మద్దతు ధరలు కల్పించేందుకు కేంద్రం నుంచి మరింత ఆర్థిక సాయం కోరనున్నారు. 
ఇంకా పరిష్కారం కాని విభజన సమస్యలు 
తెలంగాణ ఆవిర్భవించి మూడేళ్లు పూర్తి కావస్తోంది. కానీ ఇంకా విభజన సమస్యలు పరిష్కారం కాలేదు. హైదరాబాద్‌లోవున్న ఉమ్మడి హైకోర్టును విభజించాలని మూడేళ్ల నుంచి తెలంగాణ ప్రభుత్వం కోరుతున్నా, ఈ అంశం ఇంకా కొలిక్కిరాలేదు. అలాగే పునర్వస్థీకరణ చట్టంలోని 9,10 షెడ్యూళ్లలో ఉన్న సంస్థల విభజన, ఆస్తుల పంపిణీ వంటి అంశాలు అపరిష్కృతంగానే ఉన్నాయి. ప్రధాని మోదీతో భేటీలో కేసీఆర్‌ ఈ అంశాలను ఆయన దృష్టికి తీసేకెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. గవర్నర్‌ నరసింహన్‌ పదవీకాలం పొడిగించినందున ఆయన ద్వారా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని సమస్యలు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని కేసీఆర్‌..ప్రధాని మోదీకి సూచించే అవకాశం ఉందని అధికార వర్గాల్లో వినిపిస్తోంది. 
కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలి
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఎక్కువ  నిధులు రాబట్టే అంశంపై  ప్రధాని మోదీతోపాటు, కేంద్ర మంత్రులతో చర్చిస్తారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని కోరే అవకాశం ఉంది. ఏపీలో విలీనం చేసిన ఖమ్మం జిల్లా భద్రాచలం మండలంలోని గ్రామాలను తిరిగి తెలంగాణకు అప్పగించమని కోరే అవకాశం ఉందని భావిస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై కూడా చర్చించే అవకాశం ఉంది. 
పలువురు కేంద్రమంత్రులతో భేటీకి కేసీఆర్‌ ప్లాన్‌ 
పలువురు కేంద్ర మంత్రులతో భేటీకి కేసీఆర్‌ ప్లాన్‌ చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గ్రామాలకు మంచినీరు అందించే మిషన్‌ భగీరథ, చెరువుల పునరుద్ధరణకు చేపట్టిన మిషన్‌ కాకతీయ కార్యక్రమాలకు కేంద్ర నిధుల కోసం కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశం ఉంది. కష్టాల్లో ఉన్న మిర్చి రైతులను ఆదుకునేందుకు కేంద్రం ఉంచి సహాయం కోరనున్నారు. మరోవైపు కేసీఆర్‌ ఢిల్లీలో ఉన్న సమయంలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నేత్ర చికిత్స చేయించుకునే అవకాశం ఉందని సమాచారం. 

 

బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ వద్ద ర్యాష్ డ్రైవింగ్

హైదరాబాద్ : బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ వద్ద ర్యాష్ డ్రైవింగ్ పాల్పడ్డారు. బైక్ రేసింగ్ లకు పాల్పడిన వారి నుండి 13 స్పోర్ట్స్ బైకులు ఒక కారును బంజారాహిల్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

 

ఐపీఎల్ 10లో నేటి మ్యాచ్ లు

హైదరాబాద్ : ఐపీఎల్ 10లో భాగంగా ఇవాళ హైదరాబాద్, పుణె మధ్య మ్యాచ్ జరుగనుంది. ఉప్పల్ వేదికగా సాయంత్రం 4 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. రాత్రి 8 గంటలకు ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఢిల్లీ, ముంబై మధ్య మ్యాచ్ జరుగనుంది. 

 

Don't Miss