Activities calendar

07 May 2017

21:38 - May 7, 2017

ఢిల్లీ : మావోయిస్టుల నియంత్రణకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు కేంద్ర హోంశాఖ రేపు ఢిల్లీలో కీలక సమావేశం ఏర్పాటుచేసింది. ఇటీవల చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దాడిలో 25 మంది సీఆర్ ఫీఎఫ్ జవాన్లు మృతిచెందడంతో... ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలపై మార్పులు చేయాలని కేంద్రం భావిస్తోంది. మావోయిస్టుల కట్టడి వ్యూహంతో పాటు.. ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన అభివృద్ధి పనులపై కూడా చర్చించనున్నారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో.. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల నుంచి 10మంది ముఖ్యమంత్రులు, హోంసెక్రటరీలు, డీజీపీలతో పాటు... పారా మిలిటరీ, నిఘా విభాగాల అధిపతులు హాజరవుతున్నారు.

21:34 - May 7, 2017

ఢిల్లీ : ఆమ్‌ ఆద్మీ పార్టీ ... దేశ రాజధాని ఢిల్లీని ఏలుతున్నరాజకీయ పక్షం. ఆ పార్టీ ఇటీవల కాలంలో వరుస సంక్షోభాలను ఎదుర్కొంటోంది. ఆప్‌ ఆధినేత, ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఒంటెత్తు పోకడలు నచ్చక పార్టీలో ఒక్కో నేత తిరుగుబాటు చేస్తున్నారు. కేజ్రీవాల్‌ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేజ్రీవాల్‌ పనైపోయిందని పార్టీ ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్‌ వ్యాఖ్యానించిన తర్వాత పార్టీ నేతలు ఒక్కొక్కరుగా అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. కేజ్రీవాల్‌పై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. అమనతుల్లా ఖాన్‌ తర్వాత ఆప్‌ నేత కుమార్‌ విశ్వాస్‌, ఇప్పుడు మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన కపిల్‌ మిశ్రా... ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై విరుచుకుపడుతున్నారు. పార్టీలో అసమ్మతి నేతగా ముద్రపడ్డ కుమార్‌ విశ్వాస్‌తో చేతులు కలిపారన్న అభియోగంపై కపిల్‌ మిశ్రాను తన మంత్రివర్గం నుంచి కేజ్రీవాల్‌ తొలగించారు.

కేజ్రీవాల్‌పై తీవ్ర ఆరోపణలు
దీనికి ప్రతీకారంగా కపిల్‌ మిశ్రా.... ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఢిల్లీలో నీటి ట్యాంకర్ల యజమానుల నుంచి కేజ్రీవాల్‌కు రెండు కోట్ల రూపాయల ముడుపులు ముట్టాయన్న ఆరోపణలు ఆప్‌లో సంక్షోభాన్ని మరింత పెంచాయి. ఆరోగ్యం శాఖ మంత్రి సత్రేంద్ర జైన్‌... సీఎం కేజ్రీవాల్‌కు రెండు కోట్ల రూపాయలు అందజేస్తుండగా తాను చూశారన్న వాదాన్ని కపిల్‌ మిశ్రా లేవనెత్తున్నారు. కేజ్రీవాల్‌ బంధువుల కోసం సత్యేంద్ర జైన్‌ 50 కోట్ల రూపాయల విలువైన భూదందాలను పరిష్కరించారన్నది మరో ఆరోపణ. వీటికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌తోపాటు మీడియాకు కూడా అందజేస్తానని చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది. కపిల్‌ మిశ్రా ఇంతటితో ఆగలేదు. కేజ్రీవాల్‌ అవినీతి బండారాన్ని బయపట్టేందుకు ఏసీబీ, సీబీఐలను ఆశ్రయిస్తారని ప్రకటించారు. కేజ్రీవాల్‌పై కపిల్‌ మిశ్రా చేసిన ఆరోపణలు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా తోసిపుచ్చారు. ఇవన్నీ అసత్య ఆరోపణలని కొట్టిపారేశారు. మరోవైపు కేజ్రీవాల్‌పై అవినీతి ఆరోపణలు రావడం పట్ల సామాజిక కార్యకర్త అన్న హజారే విచారం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై కాంగ్రెస్‌, బీజేపీ తీవ్రంగా స్పందించాయి. ఈ వ్యవహారంపై విచారణకు బీజేపీ డిమాండ్‌ చేయగా, కేజ్రీవాల్‌పై కేసు నమోదు చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. 

21:27 - May 7, 2017

హైదరాబాద్ : జాతీయస్థాయిలో వైద్య విద్య కోర్సులైన MBBS, BDS, ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాల కోసం దేశంలోనే తొలిసారిగా నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్‌ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరిగింది. తెలంగాణ రాష్ర్టంలోని హైదరాబాద్, వరంగల్, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖ, తిరుపతి, గుంటూరులో పరీక్షా సెంటర్లను ఏర్పాటు చేశారు. కేంద్రీయ విద్యాలయాలు, ప్రముఖ సీబీఎస్‌ఈ పాఠశాలల్లో మాత్రమే నీట్‌ పరీక్షను నిర్వహించారు. తెలంగాణ, ఏపీ నుంచి లక్షన్నర మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు సమాచారం. తెలంగాణ నుంచి 46 వేలు, ఏపీ నుంచి 85వేల మందికిపైగా నీట్‌ పరీక్షకు హాజరైనట్లు సమాచారం.

తెలుగుతో పాటు పది భాషలు
జాతీయస్థాయిలో దేశవ్యాప్తంగా తొలిసారిగా నిర్వహించిన నీట్‌ను తెలుగుతో పాటు పది భాషల్లో నిర్వహించారు. దేశవ్యాప్తంగా 103 నగరాలు, 2,200 పట్టణాల్లోని కేంద్రాల్లో నీట్‌ పరీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్‌ పరీక్షకు దాదాపు 11 లక్షల 35వేల మంది విద్యార్థులు హాజరైనట్లు సమాచారం. ఒక నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదని అధికారులు తేల్చి చెప్పడంతో విద్యార్థులు ఉరుకులు పరుగులు పెట్టారు. ఇక నీట్‌ పరీక్ష రాసే విద్యార్థుల వస్త్రధారణపై అధికారులు పలు ఆంక్షలు విధించారు. అబ్బాయిలు పొడుగు చేతుల చొక్కా, పైజామా, కుర్తా, బూట్లు, గడియారం ధరించడంపై ఆంక్షలు విధించారు. అమ్మాయిలు పెద్ద గుండీలు ఉన్న దుస్తులు, ఎత్తు చెప్పులు వేసుకురావద్దని సూచించారు. సాధారణ రంగుల్లో ఉండే జీన్స్‌, ప్యాంటు, చొక్కా, చెప్పులు వేసుకురావాలని సూచించడంతో విద్యార్థులు కాస్తా గందరగోళానికి గురయ్యారు.

 ప్రశ్నా పత్రాలు తారుమారు
వరంగల్‌లోని సెయింట్‌ పీటర్స్‌ పరీక్షా కేంద్రంలో ప్రశ్నా పత్రాలు తారుమారు కావడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. తెలుగు మీడియం విద్యార్థులకు హిందీ, ఇంగ్లీష్‌ ప్రశ్నాపత్రం ఇవ్వడంతో విద్యార్థులకు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం జరిగేవరకు కదిలేది లేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి విద్యార్థులను చెదరగొట్టారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయినా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మాత్రం తమకు న్యాయం చేసేంతవరకు కదిలేది లేదని భీష్మించుకుర్చున్నారు. తెలుగుమీడియంలో నీట్‌ ఉంటుందని తెలిసే పరీక్షకు సిద్ధమయ్యామని..తీరా ఇంగ్లీష్‌లో ప్రశ్నాపత్రం ఉంటే ఎలా రాస్తాం అని విద్యార్థులు కన్నీటిపర్యంతమయ్యారు. 

21:18 - May 7, 2017

హైదరాబాద్ : క్యుములో నింబస్‌ మేఘాలతో తెలుగు రాష్ట్రాల్లో అక్కడడక్కడ వర్షాలు పడుతున్నాయి. తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. తెలంగాణలో కరీంనగర్‌, రాజన్న సిరిసిల్లా, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. అలాగే ఏపీలో గుంటూరు, కృష్ణా, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లో వర్షం కురిసింది. జరాజన్న సిరిసిల్లా జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. తోటపంటలు దెబ్బతిన్నాయి. మామిడి నేలపాలయ్యింది. మేములవాడ మార్కెట్‌కు రైతులు తీసుకొచ్చిన ధాన్యం తడిసిముద్దైంది. వందలాది బస్తాల ధాన్యం నీటిపాలైంది. లక్షల్లో రైతులు నష్టపోయారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకుందామని మార్కెట్‌ యార్డుకు తీసుకొచ్చారు. తెచ్చిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు షెడ్లు లేకపోవడంతో యార్డు ఆవరణలోనే ఎండబెట్టారు. కమీషన్‌ ఏజెంట్లు వచ్చి కొనుగోలు చేసేలోపే వర్షం రావడంతో ధాన్యం పూర్తిగా తడిచిపోయింది. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేసే దిక్కులేకుండా పోయిందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వమే కొనుగోలు చేయించాలని కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. దమ్మపేట, ముల్కలపల్లి, అన్నపురెడ్డిపల్లి, అశ్వరావుపేట మండలాల్లో ఉరుములతో కూడిన వర్షం పడింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి మామిడి పంటకు నష్టం వాటిల్లింది. మామిడి కోతకొచ్చిన దశలో భారీ వర్షం కురవడంతో పంట నేలపాటు కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

ఏపీలోను వర్షలు...
ఏపీలోని పలు జిల్లాల్లో వర్షం పడింది. గుంటూరు జిల్లా తెనాలిలో భారీ వర్షం కురిసింది. వేసవి ఎండల తీవ్రత, వడగాల్పులతో అల్లాడుతున్న ప్రజలు ఈ వర్షంతో కొద్దిపాటి ఉపశమనం పొందారు. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి భారీ వృక్షాలు కూకటివేళ్లతో పెకలించుకుని నేలకొరిగాయి. పల్లపు కాలనీలు జలమయమయ్యాయి. రోడ్లపై మోకాలి లోతున వర్షం నీరు చేరింది. వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డ్రెయిన్లు పొంగిపొర్లుతున్నాయి.

కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. మచిలీపట్నం, పెడన, గుడ్లవల్లేరు ప్రాంతాల్లో వర్షం పడింది. ఈదురుగాలులతో కూడిన వర్షాలకు పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. వర్షంనీరు రోడ్లపైకి చేరడంతో వాహనాల రాకపోకలు తీవ్ర అంతరాయం కలిగింది. కూరగాయల తోటలకు నష్టం వాటిల్లింది. మండే ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు వర్షాలతో ఉపశమనం లభించింది. నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. జిల్లాలోని ఉదయగిరి, దత్తలూరు, వరికుంటపాడు, వింజమూరు, మర్రిపాడు మండలాల్లో గంటసేపు ఏకధాటిగా కురిసిన వర్షానికి పల్లపు కాలనీలు జలమయ్యాయి. సైదాపురం మండలం దేవరవేమూరులో పిగుడుపాటుకు వ్యక్తి మరణించాడు. కడప, కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కడప జిల్లా చెన్నూరు మండలం కొక్కరాయపల్లిలో పిడుగుపాటుకు వ్యక్తి మృతి చెందాడు. మద్దికెరలో పిడుగుపాటుకు మరో వ్యక్తి మృతి చెందాడు. అకాల వర్షాలకు కడప జిల్లాలో అరటి, బత్తాయి, బొప్పాయి తోటలకు భారీ నష్టం జరిగింది. కర్నూలు జిల్లా కొలిమిగుండ్లలో పిడుగుపాటుకు ఒక వ్యక్తి మృతి చెందాడు. వేసవి ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ క్యుములో నింబస్‌ మేఘాలతో వర్షాలు పడే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

 

మంత్రి జగదీష్ ఇంటి వద్ద ఉద్రిక్తత

సూర్యాపేట : జిల్లాలోని మంత్రి జగదీష్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆయన ఇంటి ముందు టీఆర్ఎస్ కౌన్సిలర్లు శ్రీనివాస్, తాహేర్ వర్గాల వారు పరస్పరం దాడులు చేసుకున్నారు.

 

చిత్తూరు జిల్లాలో ఈదురుగాలులతో భారీ వర్షం

చిత్తూరు : జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మదనపల్లెలో పిడుగుపాటుకు ఒకరు మృతి చెందారు. కుప్పంలో పిడుగుపాటుకు నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. తిరుపతిలో గాలివాన బీభత్సం సృష్టించింది.

 

19:11 - May 7, 2017

నెల్లూరు : పదోతరగతి పరీక్షా ఫలితాల్లో తమ విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారని రవీంద్రభారతి విద్యాసంస్థల అధిపతి మణి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి ఫలితాల్లో రవీంద్రభారతి తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించిదని ఆయన వెల్లడించారు. నెల్లూరులోని రవీంద్రభారతి స్కూల్ లో మొత్తం 361 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుగాక 34 మంది10 జీపీఏ పాయింట్లు సాధించారని, 78 మంది 9.8 జీపీఎ, 91 మంది 9.7 జీపీఎ, మరో 215 మంది 9.0 జీపీఎను సాధించారన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు, అందుకు శ్రమించిన ఉపాధ్యాయులకు ఆయన అభినందించారు. 

19:09 - May 7, 2017

కడప : జిల్లా మైదుకూరు మండలం ఒనిపెంటంలో కారు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పిన కారు.. పొలం పనులకు వెళ్తున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు వృద్ధులు మృతిచెందగా... మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. అదే సమయంలో బ్రహ్మంగారి మఠం నుంచి మైదుకూరు వస్తున్న ఎంపీ అవినాశ్ రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ప్రమాదం గురించి ఆరాతీశారు. గాయపడిన వారిని ప్రొద్దుటూరు తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

మైదుకూరులో కారు బీభత్సం

కడప : జిల్లా మైదుకూరు మండలం వనిపెంట వద్ద కారు బీభత్స సృష్టించింది. కారు పాదచరులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ప్రొద్దుటూరు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

17:47 - May 7, 2017

పశ్చిమ గోదావరి : జిల్లాలోని ద్వారకా తిరుమల గోవింద నామస్మరణతో మారుమోగింది. శ్రీవేంకటేశ్వరస్వామి వైశాఖ మాస తిరు కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈరోజు గ్రామోత్సవం నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో చిన వెంకన్న స్వామి సూర్యప్రభవాహనంపై దర్శనం ఇచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ గ్రామోత్సవం వైభవంగా జరిగింది. 

17:23 - May 7, 2017
17:21 - May 7, 2017

వరంగల్ : నేడు నీట్ పరీక్షలో భాగంగా వరంగల్ సెంటర్ లో 2000 వేల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. సేయింట్ పీటర్స్ పరీక్షా కేంద్రంలో తెలుగు పేపర్ బదులు హిందీ పేపర్ ఇవ్వడంతో విద్యార్థులు కంగుతీన్నారు. ఇన్వీజిలేటర్ దృష్టికి తీసుకెళ్లిన వారు సమాధానం ఇవ్వకపోవడంతో పరీక్ష అనంతరం తమ భవిష్యత్ ఏంటో తేల్చేవరకు వెళ్లేది లేదంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. పోలీసులు రంగంలోకి దిగి విద్యార్థులను చెదరగొట్టారు. తమకు న్యాయం చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై టెన్ టివి అధికారులను వివరణ కోరగా  సీబీఎస్ ఈ ఫిర్యాదు చేశామని వారు తెలిపారు. 

16:35 - May 7, 2017
16:27 - May 7, 2017

ఆధునిక తెలుగు కథా సాహిత్యం లోకి కొత్తగా కొందరు రచయితలు ప్రవేశిస్తున్నారు.నూరేళ్ల తెలుగు సాహిత్యంలో ఎందరో కథారచియితలు తళుక్కుమన్నారు. వస్తు శైలీ విన్యాసాలతో అద్భుత కథలు సృష్టించారు.ఇటీవలి కాలంలో తెలుగు కథకుల సంఖ్య పెరుగుతోంది.కొత్తగా కలం పడుతూ ఎందరో కథారచయితలు ముందుకొస్తున్నారు.తమ ప్రాంతం ,తాము చూసిన జీవతం ,సమాజం గురించి కథలు రాస్తున్నారు.అలాంటి వారిలో ఆచార్య తానిపర్తి నారాయణరావు ఒకరు....పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

16:09 - May 7, 2017

హైదరాబాద్ : ప్రజల పోరాట పటిమ ముందు కేసిఆర్ తలొగ్గక తప్పదన్నారు తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. ధర్నా చౌక్‌ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షల్లో పాల్గొన్న ఉద్యోగ సంఘాల నేతలకు ఆయన సంఘీభావం తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉద్యమాలపై అణిచివేత సాగుతున్నప్పటికీ ఎక్కడా నిరసన తెలిపే హక్కు లేకుండా చేయలేదన్నారు. కేవలం తెలంగాణలో మాత్రమే నిరసన తెలిపే వేదిక లేకుండా చేశారన్నారు తమ్మినేని. ప్రజాస్వామిక వాదులంతా ధర్నా చౌక్‌ పరిరక్షణ కోసం ఈనెల 15న జరిగే పోరాటంలో పాల్గొనాలని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరాం పిలుపునిచ్చారు.

16:07 - May 7, 2017

గుంటూరు : జిల్లాలోని తెనాలిలో భారీ వర్షం కురిసింది. వేసవి ఎండల తీవ్రత, వడగాల్పులతో అల్లాడుతున్న ప్రజలు ఈ వర్షంతో కొద్దిపాటి ఉపశమనం పొందారు. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి భారీ వృక్షాలు కూకటివేళ్లతో పెకలించుకుని నేలకొరిగాయి. పల్లపు కాలనీలు జలమయమయ్యాయి. రోడ్లపై మోకాలి లోతును వర్షం నీరు చేరింది. వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

16:05 - May 7, 2017

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని అశ్వరావుపేట నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. దమ్మపేట, ముల్కలపల్లి, అన్నపురెడ్డిపల్లి, అశ్వరావుపేట మండలాల్లో ఉరుములతో కూడిన వర్షం పడింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి మామిడి పంటకు నష్టం వాటిల్లింది. మామిడికాయలు కోతకొచ్చిన దశలో భారీ వర్షం కురవడంతో పంట నేలపాటు కావడంతో రైతుల నష్టపోయారు. 

పాత నోట్ల మార్పిడి ముఠా అరెస్టు..

హైదరాబాద్ : పాత నోట్లను మార్పిడి చేస్తున్న 13 మంది ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. రూ. 18.5 లక్షల పాత నోట్లు, 2 కార్లు, 4 సెల్ ఫోన్లను నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ డీసీపీ స్వాధీనం చేసుకున్నారు.

సంతం వేలం విషయంలో ఘర్షణ..

సూర్యాపేట : జిల్లాలోని నూతన్ కల్ మండలం మిర్యాల గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సంతం వేలం విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు.

15:40 - May 7, 2017

చిత్తూరు : జిల్లాలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో విషాదం చోటుచేసుకుంది. ప్రభుత్వ ఈత కొలనులో పడి 12ఏళ్ల బాలుడు మృతి చెందాడు. జిల్లా కీడాభివృద్ది అధికారి అనంత లక్ష్మీ ఈత వచ్చే పిల్లలు ఒంటరిగా రావాలని ఆదేశాలివ్వడంతో పిల్లలు ఒంటరిగా ఈత నేర్చుకుంటున్నారు. ఈతకొలను వద్ద పర్యవేక్షణ లేక ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.  దీంతో అనంతలక్ష్మీపై కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేశారు.  నెల్లూరు జిల్లాకు చెందిన రిషి వేసవి కావడంతో బాబాయి ఊరు చిత్తూరుకు వచ్చాడు. 

15:31 - May 7, 2017

సూర్యాపేట : జిల్లా నూతన్ కల్ మండలం మిర్యాల గ్రామంలో ఉంద్రిక్తత నెలకొంది. సంత వేలం విషయాంలో గత కొంత కాలంగా రెండు వర్గాల మధ్య గొడవ నడుస్తోంది. తాజాగా నీన్న ఓ వర్గం సంతను వేలంలో రూ.19 లక్షలకు సొంతం చేసుకుంది. వారు డబ్బు కట్టకపోడంతో వేలం రద్దు చేశారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. 

15:11 - May 7, 2017

అక్కినేని నాగార్జున తనయుడు 'నాగ చైతన్య' మెగా ఫ్యామిలీ వారు వెళుతున్న దారిలో వెళుతున్నాడా ? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇటీవలే మెగా హీరోలు నటించిన పలు చిత్రాల ఆడియో వేడుకలు నిర్వహించకుండానే యూ ట్యూబ్ లలో రోజుకొకటి..రెండు రోజుల ఒకటి విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా 'నాగ చైతన్య' నటిస్తున్న 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమా పాటలను కూడా ఆన్ లైన్ లో విడుదల చేస్తున్నారు. 'బుగ్గచుక్క పెట్టుకుంది సీతమ్మా. సీతమ్మా!.. కంటి నిండా ఆశలతో మా సీతమ్మ... తాళిబొట్టు చేతబట్టి.. రామయ్యా!.. రారండోయ్ వేడుక చూద్దాం. సీతమ్మను, రామయ్యను ఒకటిగా చేద్దామంటూ'.. .సాగే టైటిల్‌ సాంగ్‌ను శనివారంనాడు ఆన్‌లైన్‌లో ఆవిష్కరించారు.
నాగచైతన్య, రకుల్‌ప్రీత్‌సింగ్‌ జంటగా నటించిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియో బేనర్‌లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 'సోగ్గాడే చిన్నినాయన' ఫేమ్‌ కళ్యాణ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈనెల 19న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు ఈ పాటకు సంబంధించిన 30 సెకన్ల టీజర్‌ రిలీజ్‌ చేస్తామని, త్వరలోనే ఇదే పాటకు 90 సెకన్ల వీడియోను విడుదల చేస్తామని నిర్మాత నాగార్జున వెల్లడించారు.

15:09 - May 7, 2017

కడప : రాయలసీమలో ప్రభుత్వం కరువు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలు పోరు బాట పట్టనున్నాయి. ఈనెల 16, 17 తేదీల్లో అనంతపురం కలెక్టరేట్ ఎదుట 48 గంటలపాటు నిరసన దీక్ష చేపట్టనున్నట్లు సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.నారాయణ, జి.ఓబులేసులు ప్రకటించారు. ఈ దీక్షలకు సీమ వ్యాప్తంగా ఉన్న రైతులు తరలి రావాల్సిందిగా పిలుపునిచ్చారు.

 

నీట్ అభ్యర్థుల ఆందోళన..

వరంగల్ : హన్మకొండ సెయింట్ పీటర్స్ స్కూల్లో నీట్ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. తమకు హిందీ, ఇంగ్లీష్ లో ప్రశ్నాపత్రం ఇచ్చారని తెలుగు మీడియం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. న్యాయం జరిగేంత వరకు స్కూల్ ను వదిలిపెట్టి వెళ్లమని ఖరాఖండిగా చెబుతున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని బయటకు పంపేందుకు ప్రయత్నిస్తున్నారు.

15:01 - May 7, 2017

సిరిసిల్ల : ఓ కూతురు పోలీస్‌ అమ్మకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. దత్తత తీసుకున్న సీఐకి మరచిపోలేని బహుమతి ఇచ్చింది.. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనకరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామానికిచెందిన భార్గవి, విష్ణులకు ముగ్గురు కూతుళ్లు.. అనారోగ్యంతో తల్లిదండ్రులిద్దరూ చనిపోయారు.. వీరిని వేములవాడ సీఐ మాధవి దత్తత తీసుకున్నారు.. పెద్ద కూతురు భవానీని కస్తూరిబా పాఠశాలలో చదివించారు.. పదో తరగతిలో భవానీ 9.7 జీపీఏ సాధించి జిల్లాలో రెండో స్థానంలో నిలిచింది.. భవానీకి సీఐ మాధవి కంగ్రాట్స్ చెప్పారు.. ఇలాగే మరిన్ని విజయాలు సాధించాలని ఆశీర్వదించారు..

14:59 - May 7, 2017

ఢిల్లీ : ఛాంపియన్స్‌ ట్రోఫీలో టీమిండియా ఆడుతుందని.. బీసీసీఐ స్పష్టం చేసింది. ఇవాళ జరిగిన స్పెషల్ జనరల్‌ మీటింగ్‌లో.. బోర్డు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రేపు సెలక్షన్‌ కమిటీ సమావేశమై టోర్నీ కోసం టీమ్‌ను ప్రకటించనున్నట్లు బోర్డు తెలిపింది. ఐసీసీతో ఆదాయ పంపిణీలో నెలకొన్న వివాదం కారణంగా.. టీమ్‌ను ప్రకటించకుండా బీసీసీఐ ఆలస్యం చేసింది. అసలు చాంపియన్స్‌ ట్రోఫీలో ఆడకుండా నిరసన తెలపాలని కూడా భావించింది. అయితే సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేటర్స్‌ ఆదేశాల మేరకు.. టోర్నీలో పాల్గొనాలని నిర్ణయించింది. జూన్‌ 1 నుంచి ఇంగ్లండ్‌లో టోర్నీ జరగనుంది. టీమిండియా డిఫెండింగ్‌ చాంపియన్‌గా టైటిల్‌ వేట మొదలు పెట్టనుంది. 2013లో చివరిసారి జరిగిన చాంపియన్స్‌ ట్రోఫీని ఇండియానే గెలుచుకుంది. 

14:57 - May 7, 2017

హైదరాబాద్ :  ప్రధాని మోదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం పేదలను కోలుకోలేని దెబ్బతీసింది. అసంఘటిత కార్మికులకు పనిదొరకక నానా ఇబ్బందులు పడుతున్నారు. మోదీ నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నాక.. ఫ్యాక్టరీలలో పని చేస్తున్న 2 లక్షల మంది ఉద్యోగాలు గల్లంతయ్యాయి. మరో 46 వేల మంది పార్ట్‌ టైమ్‌ ఉద్యోగాలకు కోత పడింది. 2016 అక్టోబర్‌ నుంచి 2017 జనవరి మధ్య కార్మికులు.. ఉపాధి కోల్పోయినట్టు ప్రభుత్వ నివేదికే వెల్లడించింది. నోట్ల రద్దు తర్వాత తీవ్ర నగదు కొరత ఏర్పడింది. ఈ ప్రభావం చిన్న తరహా పరిశ్రమలపై పడిందని నివేదికలో బయటపడింది. వ్యవసాయేతర రంగాలైన తయారీ, నిర్మాణ, కార్మిక, రవాణా, వసతి, రెస్టారెంట్లు, ఐటీ, బీపీఓ, విద్య, ఆరోగ్య రంగాలకు సంబంధించి వివరాలు సేకరించారు. నిర్మాణ రంగంలో సుమారు 1.10 లక్షల మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు. ఈ కాలంలో పార్ట్‌టైమ్‌కు సంబంధించి 46 వేల మంది ఉద్యోగాలను కోల్పోయారు. నోట్ల రద్దు ప్రభావంతో కార్మికుల జీతాల్లో భారీగా కోతలు పెట్టాల్సి వచ్చినట్టు తేలింది. ఐటీ, బీపీఓల్లో కూడా ప్రభావం కనిపించింది.

పార్ట్‌ టైమ్‌ అధిక ప్రభావం
నోట్ల రద్దు ప్రభావం నిర్మాణ రంగంలో పని చేస్తున్న పార్ట్‌ టైమ్‌ ఉద్యోగాలపై అధిక ప్రభావం పడింది. 2017లో నిర్మాణ, రవాణా, బీపీఓ, విద్య, ఆరోగ్య విషయాల్లో పురోగమన మార్పులు వచ్చాయని గుర్తించింది. అయితే వసతి, రెస్టారెంట్లలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఇందులో కార్మికుల సంఖ్య 1.39 లక్షలు కాగా, కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య 1.24 లక్షలుగా నమోదైంది. ప్రతీ యేటా 2.5 కోట్ల మందికి ఉద్యోగాలిస్తామని ఎన్నికల్లో మోదీ వాగ్దానం చేశారు. ప్రస్తుతం దేశంలో ప్రతీ యేటా 1.2 కోట్ల మంది కార్మికులు కొత్తగా చేరుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అసంఘటిత రంగంతో పాటు కాంట్రాక్టు కార్మికులకు ఉపాధి దొరకటం కష్టమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే నోట్ల రద్దు ప్రభావంతో కోట్లాది సంఖ్యలో కార్మికులు, కాంట్రాక్టు ఉద్యోగులతో పాటు.. పలు రంగాలకు చెందినవారు ఉపాధిని కోల్పోయారని ప్రజా ఉద్యోగ పంఘాలు ఆరోపిస్తున్నాయి. 

గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠికి అస్వస్థత..

కోల్ కతా : పశ్చిమ బెంగాల్ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం ముక్కులో నుండి రక్తం రావడంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

14:55 - May 7, 2017

సిరిసిల్ల : అకాలంలో కురిసిన వర్షాలకు చేతికి వచ్చిన పంట తడిసి ముద్దయ్యింది. జిల్లాలోని వేములవాడ మార్కెట్ యార్డ్‌లో నిలువ చేసిన వరిధాన్యం.. వర్షం కారణంగా తడిసిపోయింది. ధాన్యం తడిచి నష్టం వాటిల్లడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. చేతికి వచ్చిన పంట మార్కెట్‌ యార్డు అధికారుల నిర్లక్ష్యం కారణంగా.. తడిచి కొట్టుకుపోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు.

 

14:53 - May 7, 2017
14:48 - May 7, 2017

ముగిసిన 'నీట్'...

హైదరాబాద్ : 'నీట్' పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుండి లక్షా యాభై వేల మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు తెలుస్తోంది.

జగన్ లేఖ రాసే అర్హ త లేదు - బుద్ధా వెంకన్న..

విజయవాడ : అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు కష్టపడుతుంటే జగన్ అవాకులు చెవాకులు పేలుస్తున్నారని, 12 కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్ కు సీఎంకు లేఖ రాసే అర్హత లేదని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. బాబుపై ఉన్న నమ్మకంతో యూపిల్ వంటి కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయని, వైసీపీ రాజకీయ నిరుద్యోగుల పార్టీ అని ఆయన అభివర్ణించారు. ఎప్పటికి అలాగే ఉండిపోతుందని, జగన్ దోచుకున్న లక్ష కోట్లు నిరుద్యోగులకు పంచితే ఒక్కొక్కరికి రూ. 60వేలు ఇవ్వవచ్చని తెలిపారు.

తాండూరు బస్ డిపోలో రాజధాని ఏసీ బస్సుల ప్రారంభం..

వికారాబాద్ : తాండూరు ఆర్టీసీ బస్ డిపోలో నాలుగు రాజధాని ఏసీ బస్సులను మంత్రి మహేందర్ రెడ్డి ప్రారంభించారు. రూ. 350 కోట్లతో 1400 కొత్త బస్సులను కొనుగోలు చేసినట్లు, రాష్ట్రంలో ప్రతి కాలనీ, పల్లెకు ప్రగతి చక్రాలు అందుబాటులోకి వస్తాయని మంత్రి తెలిపారు.

సెల్ ఫోన్ పేలింది..యువకుడు మృతి..

నల్గొండ : శాలిగౌరారం (మం) అంబారీపేటలో మాట్లాడుతుండగా సెల్ ఫోన్ పేలింది. ఈ ఘటనలో దేశబోయిన మల్లేష్ అనే యువకుడు మృతి చెందాడు.

13:57 - May 7, 2017

కడప : జిల్లాలో ప్రేమ జంటపై పోలీసులు తమ ప్రతాపం చూపించారు. కడప నగరం ఆకుల వీధికి చెందిన ఓ బాలిక, అశోక్‌ నగర్‌కు చెందిన ఓ బాలుడు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న అబ్బాయి తండ్రి, బంధువులు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని వివరించారు. దీంతో పోలీసులు వెంటనే ప్రేమజంటను స్టేషన్‌కు పిలిపించారు. అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ మైనర్లు కావడంతో.. కౌన్సెలింగ్‌ చేయాల్సి ఉంది. కానీ సీఐ రామకృష్ణ బాలికను చితకబాదాడని.. అమ్మాయి బంధువులు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. దెబ్బలకు సొమ్మసిల్లిపడిపోయిన బాలికను హాస్పిటల్‌కు తీసుకువెళ్లాలని ప్రాధేయపడినా.. పోలీసులు స్పందించలేదని ఆరోపించారు. పైగా తమ మీద కేసులు నమోదు చేస్తామని.. బెదిరిస్తూ దాడికి దిగబోయాడని బాధితులు వాపోయారు. 108కి సమాచారం ఇచ్చినా.. పోలీసులు వాహనాన్ని తిప్పి పంపేశారు. అయితే తాము ఎవరి పట్లా దురుసుగా ప్రవర్తించలేదని సీఐ తెలిపారు. మైనర్లు కావడంతో కౌన్సెలింగ్‌కు పిలిచామని అన్నారు. 

 

13:53 - May 7, 2017

ఢిల్లీ : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై మాజీ మంత్రి కపిల్‌ మిశ్రా అవినీతి ఆరోపణలు చేశారు. మంచినీటి ట్యాంకర్ల స్కామ్‌లో కేజ్రీవాల్‌ డబ్బులు తీసుకున్నారని మిశ్రా ఆరోపించారు. కేజ్రీవాల్‌కు సత్యేంద్రజైన్‌ 2.5 కోట్లు ఇచ్చారన్నారు. కేజ్రీవాల్‌ డబ్బులు తీసుకుంటుండగా తాను చూశానని మిశ్రా చెప్పారు. అంతకు ముందు కపిల్‌ మిశ్రా ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌తో భేటీ అయ్యారు. 

 

13:50 - May 7, 2017

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నిరుద్యోగులకు కోటి 22 లక్షల రూపాయలు బాకీ పడ్డారని ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు నిరుద్యోగులకు చంద్రబాబు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ చంద్రబాబుకు జగన్‌ బహిరంగ లేఖ రాశారు.

 

13:47 - May 7, 2017
13:44 - May 7, 2017

హైదరాబాద్ : బాహుబలి 2 కలెక్షన్స్ రికార్డ్ సృష్టించింది. ఇండియన్ సినిమా హిస్టరీలో సరికొత్త రికార్డు సృష్టించింది. కలెక్షన్ల పరంగా వెయ్యికోట్ల మార్క్ దాటింది. వెయ్యికోట్లు కలెక్ట్ చేసిన తొలి భారతీయ చిత్రంగా బాహుబలి 2రికార్డు సృష్టించింది. 10 రోజుల్లో వెయ్యి కోట్లు వసూలు చేసింది. ఈ విషయాన్ని ఆర్కా మీడియా ధృవీకరించినా ధృవీకరించింది. చిత్రం హీరో ప్రభాస్ ఫ్యాన్స్ కు కృతజ్ఞతలు తెలిపారు. బాహుబలి టీంకు సినీ వర్గాలు అభినందనలు తెలుపుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:35 - May 7, 2017

స్మార్ట్ ఫోన్ ఉంటే అరచేతిలో ప్రపంచం ఉన్నట్టే..ఇంటర్నెట్ సదుపాయంతో మార్కెట్ లో రోజుకో ఫోన్ అందుబాటులో వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో గేమ్స్..యాప్స్ ఇతరత్రా ఉంటున్నాయి. ఇవి యువతను..పిల్లలను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. కానీ ఓ ఆండ్రాయిడ్ గేమ్ మాత్రం ప్రాణాలను తీసుకొనే విధంగా ప్రేరేపిస్తోందంట. దాని పేరే 'బ్లూ వేల్ ఛాలెంజ్'. దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ గేమ్ ఆడిన వారిలో చాలా మంది ఆత్మహత్యకు పాల్పడ్డారని పుకార్లు షికారు చేస్తున్నాయి. 'మొదటి రిజిష్టర్ అవగానే 50 రోజుల పాటు టాస్క్ చేయాల్సి ఉంటుంది. ప్రతి రోజు ఏదో ఒక టాస్స్ చేయాలి. అంతేగాకుండా చేసిన పనికి ప్రూఫ్ కూడా చూపించాలి. రాను రాను ఇవి నరకాన్ని చూపిస్తాయని, భయానక వీడియోలు చూడాలని...చేతి మీద కోసుకోవాలని..ఇలా భయానకంగా చెబుతుంటాయి. అనేక విధాలుగా చేయాల్సిన టాస్కులు లిస్టు ఉంటుంది. 50వ రోజు వచ్చేసరికి చనిపోవాలని చెప్పేస్తుంది' అని ఆయా వార్తలు పేర్కొంటున్నాయి. ఇంట్లో పిల్లలకు మొబైల్ ఇచ్చే ముందు ఇలాంటివి లేకుండా చూడాలని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రపంచం ఆట స్థలం వంటిది....

ముంబై : ప్రపంచం తనకో ఆట స్థలం లాంటిని ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ గ్రహిత ఏ.ఆర్ రెహ్మన్ అన్నారు. ఇటీవల 'లీ మస్క్' అనే ఆంగ్ల అఘు చిత్రంలో దర్శకుడిగా మారిన రెహ్మన్ తన అనుభవాలను ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ' కళాకారుడి ఆలోచనలకు పరిమితులు ఉండకూడదని, భారత్ లోనే చేయాలి, లేదా అమెరికాలోనే చేయాలి అనే ఆలోచనలు పెట్టుకోకూడదన్నారు. తనకైతే ఈ ప్రపంచం మొత్తం మైదానం లాంటిదని తెలిపారు. మనం ఏదైనా పని చేస్తే అది అందరికి నచ్చాలి. మనం చేసే పని అందరికి నచ్చకపోవచ్చు అని చెప్పుకొచ్చారు.  

13:32 - May 7, 2017
13:31 - May 7, 2017
13:26 - May 7, 2017

విజయవాడ : ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు. సమన్వయంతో ముందుకు వెళ్తానని తెలిపారు. ఈమేరకు ఆయన 10 టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. అందరి ఆమోదంతోనే భూ సేకరణ చేస్తామని స్పష్టం చేశారు. బెంజ్ సర్కిల్ ఫ్లైవోవర్ నిర్మాణానికి సర్వే జరుగుతుందన్నారు. కృష్ణా జిల్లా అభివృద్ధికి పటిష్టమైన చర్యలు తీసుకున్నామని చెప్పారు. జిల్లా తలసరి ఆదాయం పెరిగే విధంగా ప్రణాళికలు తయారు చేశామని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని తెలిపారు. 

 

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్..

ఢిల్లీ : ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాల్గొననుంది. బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

 

'గుర్తొస్తే దీక్షలు..ఖాళీగా ఉంటే లేఖలు'..

విజయవాడ : జగన్ కు గుర్తొస్తే దీక్షలు..ఖాళీగా ఉంటే లేఖలు రాస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. జగన్ లేఖల్లో ఒక్కటి కూడా వాస్తవం లేదని, నిరుద్యోగ భృతికి రూ. 500 కోట్లు కేటాయించడం..యువత సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనివ్వడం జరుగుతోందన్నారు. యువతను తప్పుదారి పట్టించేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని, గతంలో లేని విధంగా రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చామన్నారు. మూడేళ్లలో 3.50 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పుకొచ్చారు. పెద్ద ఎత్తున్న ఐటీ కంపెనీలు తీసుకొచ్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు అమెరికాలో పర్యటిస్తున్నట్లు తెలిపారు.

13:12 - May 7, 2017

నిజామాబాద్ : ఒకటి కాదు.. రెండు కాదు.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో టన్నుల కొద్దీ చేపలు మృత్యువాత పడ్డాయి. మత్స్యకారుల కడుపుకొట్టాయి. దీంతో మత్స్యకార కుటుంబాలు జీవనాధారాన్ని కోల్పోయాయి. ఇంతకీ చేపలు ఎందుకు చనిపోయాయి.? 
అంతుచిక్కని వ్యాధితో చేపలు మృతి
నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలో సుమారుగా 10 వేల మత్స్యకార కుటుంబాలు జీవిస్తున్నాయి. చేపల వేటే వీరికి జీవనాధారం. ప్రాజెక్టులో భారీగా నీరు నిల్వ ఉండటంతో అధికారులు ప్రాజెక్టులోకి కోటి చేప పిల్లల్ని వదిలారు. దీంతో రిజర్వాయర్‌లో చేపలు బాగా పెరిగాయి. అంతలోనే అంతుచిక్కని వ్యాధితో చేపలు చనిపోవడం మొదలయ్యాయి. అసలు టన్నుల కొద్దీ చేపలు ఎందుకు చనిపోతున్నాయో మత్స్యకారులకు అర్థం కాక తీవ్ర ఆవేదన చెందారు. అధికారులకు ఫిర్యాదు చేశారు. తాము జీవనాధారం కోల్పోతున్నామని తమను ఆదుకోవాలని వేడుకున్నారు. చేపలు చనిపోవడానికి కారణమేంటో తెలుసుకునే పనిలో పడ్డారు అధికారులు. నీటి నమూనాలను సేకరించి కాకినాడలోని రాష్ట్ర మత్స్య సాంకేతిక కేంద్రానికి పంపారు. వీటిని పరీక్షించిన నిపుణులు 'రెడ్ డిసీజ్' అనే వ్యాధి కారణమని తేల్చి చెప్పారు. 
బ్యాక్టీరియా శాతం 32.10 సిఎఫ్యుకి చేరడంతో చేపల మనుగడపై తీవ్ర ప్రభావం 
శ్రీరాంసాగర్ జలాశయంలో లీటర్ నీటిలో బ్యాక్టీరియా శాతం 10.10 సిఎఫ్యు ఉండాలి. అయితే 32.10 సిఎఫ్యుకి చేరడంతో చేపల మనుగడపై తీవ్ర ప్రభావం చూపింది. సూడోమోనస్, ఏరోమోనస్ బ్యాక్టీరియాల కారణంగా చేపలకు రెడ్ డిసీజ్ సోకినట్లు నిపులు తేల్చారు. మరోవైపు జలాశయంలో సహజ సిద్ధ చేపల స్ధానంలో 2.20 కోట్ల చేప విత్తనాలను వేశారు. ఇవి పెరిగి పెద్దవైనా వీటి సంఖ్యకు అనుగుణంగా జలాశయ విస్తీర్ణం సరిపోలేదు. అంత భారీ సంఖ్యలో చేప విత్తనాలు వేయకుండా ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. సాంద్రత పెరిగి చేపలు గుంపులుగా ఉండాల్సి రావడంతో వ్యాధి సోకి  భారీ సంఖ్యలో చేపల మరణాలకు కారణమైంది. కాగా.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టును నిజామాబాద్.. నిర్మల్ జిల్లాల మత్స్య  శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు సందర్శించారు. రాష్ట్ర కమిషనర్ ఆదేశాల మేరకు నివేదిక అందిస్తామని తెలిపారు. మరోవైపు జీవనాధారం కోల్పోయిన మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. 

 

హెల్మెట్ ఉన్నా.... తల పగిలింది.....

హైదరాబాద్ : నగర శివారు అత్తాపూర్ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థిని మృతి చెందింది. మెహదీపట్నం నుంచి రాజేంద్రనగర్ వైపు పల్సర్ పై వెళ్తున్న శ్రీ వర్ష అనే విద్యార్థి అతివేగంగా డివైడర్ ను ఢీకొట్టాడు. హెల్మెట్ ధరించినప్పటికీ డివైడర్ ను బలంగా ఢీకొనడంతో హెల్మెట్ పగిలి తలకు దెబ్బ తగలడంతో శ్రీవర్ష అక్కడికక్కడే మృతి చెందాడు. మెహదీపట్నం ఓ ఆసుపత్రి తల్లిని పరామర్శించి తిరిగి వస్తూండగా ఈ ఘటన జరిగింది.   

నయీం అనుచరుల విడుదల..

హైదరాబాద్ : చర్లపల్లి జైలు నుండి నయీం అనుచరులు కృష్ణారెడ్డి, తోగుంట అంజయ్యలు విడుదలయ్యారు. చినకోడూరు వ్యాపారులను బెదిరించిన కేసులో సిద్ధిపేట కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

13:08 - May 7, 2017

దాదా సాహెబ్ ఫాల్కె అవార్డు గ్రహీత, ప్రముఖ డైరెక్టర్ కె.విశ్వనాథ్ తో 10 టివి ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. ఆ వివరాలను వీడియోలో చూద్దా... 

 

ఒడిశా మంత్రివర్గం పునర్ వ్యవస్థీకరణ..

ఒడిశా : నవీన్ పట్నాయక్ మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించారు. 9 మంది మంత్రులకు ఉద్వాసన పలికారు. కొత్తవారికి చోటు కల్పించారు.

 

అవినీతిపై పోరాడుతా - కపిల్ మిశ్రా..

ఢిల్లీ : తనపై ఎలాంటి ఆరోపణలు లేవని కపిల్ మిశ్రా వెల్లడించారు. కపిల్ మిశ్రాను నిన్న మంత్రివర్గం నుండి కేజ్రీవాల్ తప్పించిన విషయం తెలిసిందే. ఆదివారం కేజ్రీపై కపిల్ మిశ్రా పలు ఆరోపణలు గుప్పించారు. తాను పార్టీలోనే ఉంటూ అవినీతిపై పోరాడుతానని స్పష్టం చేశారు. కేజ్రీవాల్ అవినీతిపై సీబీఐని ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు.

12:31 - May 7, 2017

రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి -2’ బాక్సాపీస్ వద్ద దూకుడు కొనసాగిస్తోంది. విడుదలైన కొన్ని రోజుల్లోనే కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తూ ముందుకెళుతోంది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 1000 కోట్లను కొల్లగొట్టిందని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నాయి. ఈ సందర్భంగా నటుడు 'ప్రభాస్' తన అభిమానలకు ధన్యవాదాలు తెలియచేశారు. ఈమేరకు సామాజిక మాధ్యమైన ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. తన ఫ్యాన్స్ అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నాని, భారత్ లోనే కాకుండా విదేశాల్లో సైతం ప్రేక్షకుల ఆదరణ పొందడానికి తన వంతు ప్రయత్నం చేశానని తెలిపారు. చూపెడుతున్న ఆదరణతో సంతోషంతో ఉప్పొంగిపోతున్నానని, తనపై నమ్మకంతో జీవితంలో ఒక్కసారి లభించే ఇలాంటి అవకాశాన్ని ఇచ్చి ప్రయాణాన్ని జీవితాంతం గుర్తుండిపోయేలా చేసిన రాజమౌళికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు వెల్లడించారు.
'బాహుబలి'..’బాహుబలి-2’ సినిమా కోసం సంవత్సరాల తరబడి 'ప్రభాస్' కష్టపడిన సంగతి తెలిసిందే. ఇతర చిత్రాలను ఒప్పుకోకుండా కేవలం ఈ చిత్రం కోసం పనిచేశారు. ‘బాహుబలి' సినిమాతో తెలుగు సినిమా సత్తాను రాజమౌళికి చాటిచెప్పాడు. మొదటి పార్ట్ లో కొన్ని ప్రశ్నలు లేవనెత్తాడు. బాహుబలిని కట్టప్పను ఎందుకు చంపాడన్న సస్పెన్స్ 'బాహుబలి-2’ తెరదించాడు. దీనితో ఈ సినిమాపై ప్రేక్షకుల ఆసక్తిని ప్రదర్శించారు.

12:25 - May 7, 2017

ఢిల్లీ : దేశవ్యాప్తంగా నీట్‌ ప్రారంభమైంది.. ఈ పరీక్షకూ వన్‌ మినట్‌ రూల్‌ విద్యార్థులపాలిట శాపంగా మారింది.. ఉదయం 9గంటల 45 నిమిషాలకువచ్చినా విద్యార్థులను పరీక్షాకేంద్రంలోకి అనుమతించలేదు.. పరీక్ష పదింటికైనా తొమ్మిదిన్నరకే సమయం ముగిసిందని అధికారులు స్పష్టం చేశారు.. దీంతో తీవ్ర ఆవేదనకుగురైన విద్యార్థులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

12:23 - May 7, 2017

గుంటూరు : ప్రముఖ ఎలక్ట్రానిక్‌ వస్తువుల తయారీ సంస్థ డెల్‌.. ఆంధ్రప్రదేశ్‌లో డేటా సెంటర్‌ ఏర్పాటుకు ముందుకొచ్చింది. అమెరికా పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు.. డల్లాస్‌లో డెల్‌ ప్రతినిధి శ్రీకాంత్‌ సత్యతో భేటీ అయ్యారు. అమెరికా పర్యటనలో భాగంగా.. చంద్రబాబు బెల్‌ హెలికాప్టర్‌ డైరెక్టర్‌ చాద్‌ స్పార్క్‌తో భేటీ అయ్యారు. ఏపీలో తయారీ కేంద్రం ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలిస్తామని చాద్‌ హామీ ఇచ్చారు. తరవాత ఐటీ సేవల రంగంలో పేరొందిన 28 సంస్థలకు చెందిన ప్రతినిధులతో.. చంద్రబాబు భేటీ అయ్యారు. అమరావతి, విశాఖ నగరాల్లో లీజ్‌ స్థలాల్లో కార్యకలాపాలకు ఆయా సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. దీంతో మొదటి దశలో 310 ఉద్యోగాలు విశాఖలో.. అమరావతిలో 65 ఉద్యోగాలు కల్పించనున్నారు.

 

12:19 - May 7, 2017

ఢిల్లీ : దేశవ్యాప్తంగా నీట్‌ ప్రారంభమైంది.. ఈ పరీక్షకూ వన్‌ మినట్‌ రూల్‌ విద్యార్థులపాలిట శాపంగా మారింది.. ఉదయం 9గంటల 45 నిమిషాలకువచ్చినా విద్యార్థులను పరీక్షాకేంద్రంలోకి అనుమతించలేదు.. పరీక్ష పదింటికైనా తొమ్మిదిన్నరకే సమయం ముగిసిందని అధికారులు స్పష్టం చేశారు.. దీంతో తీవ్ర ఆవేదనకుగురైన విద్యార్థులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

12:14 - May 7, 2017

పశ్చిమగోదావరి : మొగల్తూరు ఆనంద్‌ ఆక్వా ప్లాంట్‌లో ఐదుగురు కార్మికుల మృతికి.. కరెంట్‌ షాక్‌ కారణం కాదని తేలిపోయింది. సంస్థలో వెలువడిన విషవాయువులే కార్మికుల ప్రాణాలు బలిగొన్నాయని ఫోరెన్సిక్‌ నివేదిక తేల్చింది. విషవాయువులు వెదజల్లే ఇలాంటి ఫ్యాక్టరీల వల్ల పరిసర ప్రాంతాల ప్రజలకు ప్రమాదకరమని చెబుతోన్న సీపీఎం వాదనే నిజమని నిరూపితమైంది. 
ఐదుగురు కార్మికులు మృత్యువాత 
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులోని ఆనంద్ ఆక్వా ప్లాంట్ లో.. మార్చి 30న.. ఐదుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు. తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనకు.. షార్ట్‌సర్క్యూటే కారణమని మసిపూసే ప్రయత్నాలు జరిగాయి. అయితే.. ఫోరెన్సిక్‌ విభాగం.. ఈ ప్రయత్నాలను ఎండగట్టేలాంటి నివేదికను వెలువరించింది. కార్మికులు అమ్మోనియా కెమికల్, హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువుల వల్లే ఉక్కిరిబిక్కిరై మరణించినట్లు ఫోరెన్సిక్ నిపుణులు నివేదిక ఇచ్చారు. 
ఆక్వా ఘటనలో పోలీసులపై విమర్శలు
ఆనంద్‌ ఆక్వా సంస్థలో... ఐదుగురు కార్మికులు మరణించి 37 రోజులు పూర్తయ్యాయి. అయితే, ఇప్పటి వరకు ఈ కేసులో పోలీసులు ఎలాంటి ముందడుగు వేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఘటన జరిగిన రోజు మంత్రులు అయ్యన్నపాత్రుడు, పీతల సుజాత, మాణిక్యాలరావు లు నరసాపురం ప్రభుత్వాసుపత్రికి వచ్చి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్లాంట్ యజమానులపై చర్యలు తీసుకుంటామని.. వెంటనే అరెస్ట్ చేయిస్తామని ప్రకటించారు. తర్వాత మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించడం.. హడావిడిగా పోస్టుమార్టం నిర్వహించడం జరిగిపోయాయి. ఆ తరువాత యాజమాన్యానికి సంబంధించి ఏ ఒక్కరినీ పిలవడం కానీ, విచారించడం కానీ చేయలేదు. దీనిపై విపక్షాలు, ప్రజాసంఘాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో.. ఫోరెన్సిక్ నివేదిక వస్తేనే కానీ, ఏమీ చెప్పలేమంటూ పోలీసులు చెప్పుకొచ్చారు. ఈ తరుణంలో, విషవాయువులే కార్మికులను బలిగొన్నాయని నివేదిక రావడం విశేషం. 
యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి..
మరోవైపు ఐదుగురు కార్మికుల మరణానికి కారణమైన ఆక్వా ప్లాంట్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఎం శ్రేణులు.. నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన చేపట్టాయి. ఆక్వా ప్లాంట్ యజమానులపై చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ఆక్వా కార్మికులు కరెంటు షాకుతో చనిపోయారని చెబుతూ వచ్చిన నేతలు ఇప్పుడు ఫోరెన్సిక్ రిపోర్ట్ చూసి ఏం సమాధానం చెబుతారని సీపీఎం నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనను పరిగణలోకి తీసుకుని, తుందుర్రులో నిర్మిస్తున్న గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఘటన జరిగి నెలన్నర కావస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లున్న అధికారులు.. ఇప్పుడు ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన నేపథ్యంలో, ప్లాంట్ యజమానిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.  

12:07 - May 7, 2017

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఓ స్కూల్‌ సమీపంలో గ్యాస్‌ లీక్‌ కలకలం రేపింది. ఈ ఘటనలో 3 వందలకు పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు ప్రమాదమేమీ లేదని ఆసుపత్రి వర్గాలు తెలపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గ్యాస్‌ లీకేజీపై ఢిల్లీ ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశించింది.
రాణి ఝాన్సీ సర్వోదయ కన్యా విద్యాలయంలో ప్రమాదం  
దక్షిణ ఢిల్లీ తుగ్లకాబాద్‌లోని రాణి ఝాన్సీ సర్వోదయ కన్యా విద్యాలయం సమీపంలో ఉదయం గ్యాస్‌ లీకేజీ కావడం స్థానికంగా కలకలం సృష్టించింది. రసాయనిక కంటెయినర్‌ నుంచి  గ్యాస్‌ దట్టంగా వ్యాపించడంతో విద్యార్థులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. గ్యాస్‌ లీకేజీ కారణంగా 3 వందలకు పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అస్వస్థతకు గురైన విద్యార్థులను అంబులెన్స్‌లో సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.
విద్యార్థులు క్లాసులో ఉండగా ఘటన
ఉదయం ఏడున్నర ప్రాంతంలో విద్యార్థులు క్లాసులో ఉండగా ఈ ఘటన జరిగింది. గ్యాస్‌ లీకేజీతో విద్యార్థులు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందులు పడ్డారు. కొందరికి కళ్లు, గొంతు మండినట్లు స్కూలు వైస్‌ ప్రిన్సిపల్‌ తెలిపారు...మరికొందరు విద్యార్థులు స్పృహ కోల్పోయారు. వెంటనే స్కూళ్లో ఉన్న విద్యార్థులను ఖాళీ చేయించి మూడు ఆసుపత్రుల్లో చేర్పించారు. 9 మంది టీచర్లు కూడా ఆసుపత్రిలో చేరారు. విద్యార్థులు ప్రమాదం నుంచి బయటపడ్డారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
గ్యాస్‌ కంటెయినర్‌ డిపో గ్యాస్‌ లీకేజీ..? 
స్కూలు సమీపంలో ఉన్న గ్యాస్‌ కంటెయినర్‌ డిపో నుంచి గ్యాస్‌ లీకేజీ అయినట్లు అనుమానిస్తున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు జరుపుతున్నారు. పెస్టిసైడ్స్‌లో ఉపయోగించే క్లోరో మిథైల్‌ పైరిడిన్‌ లీకైనట్లు గుర్తించారు. ఈ ఘటనపై జిల్లా మెజిస్ట్రేట్‌తో దర్యాప్తు జరిపించనున్నట్లు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా తెలిపారు. దీనిపై ఢిల్లీ పోలీసులు కేసు రిజిస్టర్‌ చేశారు. ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్ అనిల్‌ బైజల్‌ విద్యార్థులను పరామర్శించారు.

 

స్విమ్మింగ్ పూల్ లో పడి బాలుడు మృతి..

చిత్తూరు : మిట్టూరులోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో విషాదం చోటు చేసుకుంది. స్విమ్మింగ్ ఫూల్ లో పడి 12 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ప్రభుత్వ ఈత కొలను వద్ద సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడంతోనే బాలుడు మృతి చెందాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఘటనకు బాధ్యులు చేస్తూ జిల్లా క్రీడాభివృద్ధి అధికారి అనంతలక్ష్మిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

సంగం బారేజీ పనుల పురోగతిపై మంత్రి నారాయణ తనిఖీలు..

నెల్లూరు : సంగం బారేజీ పనుల పురోగతిని మంత్రి నారాయణ, ఎమ్మెల్సీ రవిచంద్ర, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిలు తనిఖీలు జరిపారు. బారేజీ పనులు 55 శాతం పూర్తయ్యిందని, సాగునీటి ప్రాజెక్టులకే తొలి ప్రాధాన్యతనివ్వనున్నట్లు పేర్కొన్నారు.

బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం..

ఢిల్లీ : బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. ఛాంపియన్స్ ట్రోఫిలో భారత్ పాల్గొనడంపై బీసీసీఐ నిర్ణయం తీసుకోనుంది.

కేజ్రీపై కపిల్ మిశ్రా సంచలన ఆరోపణలు..

ఢిల్లీ : సీఎం కేజ్రీవాల్ పై కపిల్ మిశ్రా సంచలన ఆరోపణలు గుప్పించారు. మంచినీటి ట్యాంకర్ల యజమానుల నుండి కేజ్రీవాల్ డబ్బులు తీసుకున్నారని, డబ్బులు తీసుకుంటుండగా తాను ప్రత్యక్ష సాక్షినని పేర్కొన్నారు.

 

11:58 - May 7, 2017

జమ్మూకాశ్మీర్ : కశ్మీర్‌లో మరోసారి విద్యార్థులకు భద్రతాదళాలకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. హంద్వారా, పుల్వామా జిల్లాలో ఈ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. భద్రతాదళాలను వ్యతిరేకిస్తూ విద్యార్థులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులను ఆందోళన విరమించి వెళ్లిపోవాలని సైనికులు హెచ్చరించినా వినకుండా భద్రతాదళాలపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు లాఠీఛార్జీ చేసి భాష్పవాయువు ప్రయోగించారు. విద్యార్థులు రాళ్లు రువ్వడం వల్ల పోలీసులకు బలప్రయోగం చేయాల్సి వస్తోందని అధికారులు తెలిపారు. ఏప్రిల్ 15న పుల్వామాలోని డిగ్రీ కళాశాలపై పోలీసులు దాడి చేయడాన్ని నిరసిస్తూ విద్యార్థులు తమ ఆందోళనను ఉధృతం చేశారు.

11:57 - May 7, 2017

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న 12 ఏళ్ల బాలుడిని భారత ఆర్మీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ బాలుడిని పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని దంగర్‌ పేల్‌  గ్రామానికి చెందిన ఓ పదవీ విరమణ పొందిన బాలోచ్‌ రెజిమెంట్‌ సోల్జర్‌ కుమారుడిగా గుర్తించారు. రెక్కీ నిర్వహించేందుకే ఆ బాలుడిని పాక్‌ ఆర్మీ పంపించినట్లు అధికారులు భావిస్తున్నారు. ఎక్కడెక్కడ చొరబాట్లకు అవకాశం ఉందో తెలుసుకునేందుకే ఆ బాలుడు వచ్చినట్లు అనుమానిస్తున్నామని అతడిని పోలీసులకు అప్పగించనున్నట్లు సైనిక అధికారులు చెప్పారు. 12 ఏళ్ల బాలుడిని పంపడం ద్వారా పాకిస్తాన్ మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడిందని పేర్కొన్నారు.

 

11:45 - May 7, 2017

తూర్పు గోదావరి : కోటి కలలతో దుబాయ్ వెళ్లాడు.. అనుకోని ప్రమాదం అతడిని జీవచ్ఛవాన్ని చేసింది. ఎనిమిదేళ్లుగా మంచానికే పరిమితమైపోయాడు. ఇటీవలే తండ్రి మరణం.. కంటికి రెప్పలా చూసుకుంటున్న తల్లి తనలాగే మంచానికి పరిమితం కావడంతో.. జీవితంపై ఆశలు కోల్పోయాడు. తనను చంపేయమంటూ కనిపించిన ప్రతివారినీ అభ్యర్థిస్తున్నాడు. ఇంతకీ ఎవరా వ్యక్తి..? అతనికి వచ్చిన కష్టం ఏంటి..? వాచ్‌ దిస్‌ స్టోరీ. 
కంటికి రెప్పలా కాచుకుంటున్న తల్లి.. 
మంచానికే అతుక్కుపోయిన యువకుడు.. కంటికి రెప్పలా కాచుకుంటున్న తల్లి.. జీవచ్ఛవమైన తనను చంపేయాలని కోరుతున్న నాగేశ్వరరావు.. తూర్పుగోదావరి జిల్లా గొంది గ్రామానికి చెందిన నాగేశ్వరరావు 2016లో పనికోసం దుబాయ్ వెళ్లాడు. అక్కడ ఓ ప్రైవేటు సంస్థలో రెండు సంవత్సరాలు పనిచేశాడు. మరికొన్ని రోజుల్లో సొంతవూరికి వెళ్లాలని ఏర్పాట్లు చేసుకున్నాడు. అంతలోనే అనుకోని ఉపద్రవం అతడి జీవితాన్ని అగాధంలోకి నెట్టేసింది. అతను ఉంటున్న గదిలో కాలు జారి పడిపోయాడు. యాజమాన్యం అతనికి ప్రాథమిక చికిత్స చేయించి స్వగ్రామానికి పంపించేసింది. నాగేశ్వరరావు హైదరాబాద్ చేరేసరికి పరిస్థితి విషమించడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు నాగేశ్వరరావు వెన్నెముకకు ఇన్ ఫెక్షన్ సోకిందని .. ఇక జీవితంలో నడవలేడని.. ఆజన్మాంతమూ మంచానికే పరిమితం కాక తప్పదనీ తేల్చి చెప్పారు. 
నాగేశ్వరరావుకు తల్లిదండ్రులే దిక్కు
స్వగ్రామానికి వచ్చిన నాగేశ్వరరావుకు తల్లిదండ్రులు వెంకట్రావు, గంగమ్మలు దిక్కయ్యారు. ఇద్దరు తోబుట్టువులకి పెళ్లిళ్లు కావడంతో వారు అత్తవారింట ఉన్నారు. ఇక నాగేశ్వరరావుకు అన్నీ తామే అయ్యి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు అతని తల్లిదండ్రులు. 8 సంవత్సరాలు గడిచాయి. నాగేశ్వరరావు పరిస్థితిలో మార్పులేదు. ఇంతలో అనుకోని ఘటన ఆ కుటుంబాన్ని మరింత కృంగదీసింది. 
కాలు జారి పడిపోయిన తల్లి 
తనయుడికి అన్నీ తానై సేవ చేస్తున్న నాగేశ్వరరావు తల్లి గంగమ్మ కూడా కాలు జారి పడిపోయింది. వైద్యం కోసం ఆసుపత్రికి తీసుకువెళితే, పరీక్షించిన వైద్యులు.. ఆమె గుండెకు రంధ్రం ఉన్నట్లు గుర్తించారు. ఆపరేషన్ చేయకపోతే ప్రమాదమని హెచ్చరించారు. దీంతో భార్య గంగమ్మతో పాటు, తనయుడు నాగేశ్వరరావుకు సేవలు చేసే భారం.. తండ్రి వెంకట్రావుపై పడింది. అంతలోపే మరో ఘటన ఆ తల్లీకుమారులను అనాథలుగా మార్చింది. 
తండ్రి గుండెపోటుతో మృతి
ఓవైపు కన్న కొడుకు.. మరోవైపు కట్టుకున్న భార్య .. ఇద్దరూ మంచానికే పరిమితం కావడంతో.. ఆ ఇంటి పెద్ద గుండె తట్టుకోలేకపోయింది. భార్యపుత్రులకు సేవలు చేస్తూనే నాగేశ్వరరావు తండ్రి గుండెపోటుతో మరణించాడు. వెంకట్రావు మరణంతో అతని భార్య, కొడుకు నాగేశ్వరరావులకు సేవలు చేసే వారు లేక అనాథలయ్యారు. 
జీవచ్ఛవాల్లా మారిన తల్లీతనయులు.. 
జీవచ్ఛవాల్లా మారిన తల్లీతనయులు.. పరామర్శకు ఎవరొచ్చినా తమను చంపేయమంటూ ప్రాధేయపడుతున్న తీరు ఎంతటి కఠినుల మనసునైనా చలింపచేయక మానదు. నాగేశ్వరరావుకి చెల్లెళ్లు అత్తవారింట ఉండటంతో అప్పుడప్పుడు వచ్చి వారి బాగోగులు చూసుకుంటున్నారు. తమ కుటుంబానికి వచ్చిన కష్టం ఎవరికీ రాకూడదని గుండెలవిసేలా రోదిస్తున్నారీ తల్లీతనయులు. దాతలు సాయం చేసి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంటున్నారు. . 
వసుధ ఫౌండేషన్ ఆర్థిక సాయం 
వారి దయనీయ స్థితిని తెలుసుకున్న వదాన్యులు కొంతమేర చేయూతను అందించేందుకు ముందుకొచ్చారు. వసుధ ఫౌండేషన్ ప్రతినిధి బొనంరాజు, గంగమ్మ, నాగేశ్వరరావులకు మందులు ఇప్పించడంతోపాటు, కొంత ఆర్థిక సాయాన్నీ అందించారు. కొంతకాలంగా ఈ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారు. తల్లీతనయుల దుస్థితి గ్రామస్థులనూ కదిలిస్తోంది. ప్రభుత్వమే వీరి కష్టం తీరేలా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాఉ. 
ఆర్థిక సాయం అందిస్తే..కోలుకునే అవకాశం 
నాగేశ్వరరావు దయనీయ స్థితిని చూసిన వారి కళ్లు చెమర్చక మానవు. అతని కుటుంబానికి తగిన ఆర్థిక సాయం అందిస్తే ఆ కుటుంబం కొంత వరకూ కోలుకునే అవకాశం ఉంది. ప్రజాప్రతినిధులు మానవతాహృదయంతో ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యతను నెరవేరుస్తారని ఆశిద్దాం. 

 

11:18 - May 7, 2017

ఎండకాలం వచ్చిందంటే చర్మ సంబంధిత సమస్యలతో పాటు చెమట కాయల సమస్య కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ చెమట కాయల నుండి బయటపడటానికి వివిధ పౌడర్లు..క్రీములు వాడుతుంటారు. ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలతో చెమటకాయలకు చెక్ ఎలా పెట్టవచ్చో చూద్దాం...
టిష్యూ పేపర్ ను తీసుకుని వెనిగర్ లో ముంచి చెమటకాయలున్న చోట అద్దాలి. ఇలా చేయడం వల్ల చెమటకాయలు త్వరగా తగ్గుముఖం పడుతాయి.
బ్లాక్ టీని తీసుకుని చర్మంపై రాసి చూడండి. చర్మానికి సంరక్షణ కూడా అందుతుంది.
కాటన్ బాల్ ని తీసుకుని లవంగనూనెలో ముంచి చెమటకాయలున్న చోట రాయాలి. ఇలా రోజు చేయడం వల్ల చెమట కాయల సమస్య నుండి బయటపడవచ్చు.
చల్లటి పాలలో కాటన్ బాల్స్ ను తడపి చెమటకాయలపై మృదువుగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల ఆ పొక్కుల వల్ల వచ్చే మంట తగ్గే అవకాశం ఉంది.
మజ్జిగ, సబ్జా నీళ్లు, బార్లీ వంటివి రోజూ తాగుతూ ఉంటే సమస్య తగ్గుముఖం పడుతుంది.
గంధం, రోజ్ వాటర్ కలిపి చెమటకాయలు ఉన్నచోట రాయాలి. అనంతరం పది నిమిషాల తర్వాత కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.

11:16 - May 7, 2017

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం 'ఎవరెస్టు'..ఈ పర్వతాన్ని అధిరోహించాలని చాలా మంది ప్రయత్నిస్తుంటారు. అందులో కొందరు మాత్రమే పర్వతాన్ని ఎక్కుతుంటారు. ఇందులో యువకులతో పాటు వృద్ధులు కూడా ఉండడం విశేషం. తాజాగా మిన్ బహదూర్ శెర్ చాన్ (86) అనే వృద్ధుడు మరోసారి ఎవరెస్టు శిఖరం ఎక్కాలని యోచించాడు. 76 ఏళ్ల వయస్సులో ఒకసారి పర్వతాన్ని అధిరోహించాడు. మరోసారి ఎక్కాలని అనుకున్న అతని ప్రయత్నాలు సఫలం కాలేదు. కలల్ని సాకారం చేసుకోకుండానే అనంతలోకాలకి వెళ్లిపోయారు. అయితే, సముద్రమట్టానికి 5వేల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఎవరెస్టు బేస్ క్యాంపులోనే ఆయన తుదిశ్వాస విడవడం గమనార్హం. 2008లో ఎవరెస్టును అధిరోహించిన అత్యంత వృద్ధ అధిరోహకుడిగా గిన్నిస్ లో ఎక్కారు.

10:50 - May 7, 2017

సూపర్ స్టార్ 'రజనీ కాంత్' వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా మారనున్నారు. గత ఏడాది ఆయన 'కబాలి' తో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న 'రోబో 2’ లో రజనీ నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి ప్రారంభంలో రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే తాజాగా మరో చిత్రానికి రజనీ సైన్ చేశారని టాక్. 'కబాలి' సినిమాను తెరకెక్కించిన పా.రంజిత్ దర్శకత్వంలో మరోసారి 'రజనీ' నటించనున్నారు. ధనుష్ కు చెందిన వండర్ బాయ్ ఫిలిమ్స్ సంస్థ దీనిని నిర్మించనుంది. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం వహించనున్నట్లు తెలుస్తోంది. మళ్లీ పా.రజింత్, సంతోష్ నారాయణన్, రజనీ కాంబినేషన్ లో రూపొందబోయే ఈ చిత్రంపై ఇప్పుడే భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. మే 28న ఈ చిత్రం ప్రారంభం కానుందని టాక్. ముంబై బ్యాక్ గ్రౌండ్ లో ఈ చిత్రం రూపొందనుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. మరి ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

ట్రాక్టర్ బోల్తా..6గురు చిన్నారుల మృతి..

రాజస్థాన్ : సవాయ్ మదోపూర్ ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు చిన్నారులు మృతి చెందగా 21 మందికి గాయాలయ్యాయి. ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

గడ్చిరోలిలో ఘోర రోడ్డు ప్రమాదం..

మహారాష్ట్ర : గడ్చిరోలిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ట్రక్కును జీపు ఢీకొనడంతో ఆరుగురు మృత్యువాత పడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాకినాడలో కాపు జేఏసీ సమావేశం..

తూర్పుగోదావరి : కాకినాడలో కాపు జేఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముద్రగడ, సినీ నటి హేమ, కాపు జేఏసీ నేతలు హాజరయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.

10:25 - May 7, 2017

గ్రాఫిక్స్‌ మాయాజాలంతో వచ్చిన బాహుబలి-2 రికార్డులను రోబో 2.0 ఓవర్‌టేక్‌ చేయబోతోందా? రజనీ, శంకర్‌ల కాంబినేషన్‌లో వస్తున్న రోబో సీక్వెల్‌ దేశచరిత్రలోనే మరో విజువల్ వండర్‌ కానుందా? బాహుబలి-2 వర్సెస్‌ రోబో 2.0 పై స్పెషల్ స్టోరీ..   
రికార్డులను తిరగరాస్తోన్న బాహుబలి 2 
దేశంలో సంచలనం సృష్టిస్తున్న బాహుబలి 2.. రికార్డులను తిరగరాస్తోంది. అందులోని విజువల్స్ వండర్‌కు సినీ అభిమానులు ఫిదా అయిపోయారు. విడుదలైన వారంలోనే బాహుబలి కలెక్షన్ల రికార్డుల్ని తిరగరాసింది. తొలివారంలోనే 792 కోట్లు కలెక్ట్‌చేసి బాలీవుడ్ మూవీలు పీకే, దంగల్‌ను దాటేసింది... వెయ్యికోట్ల దిశగా వేగంగా సాగిపోతోంది.
బాహుబలి మించిన మూవీ లేదా?
బాహుబలి సరే... మరి ఈ సినిమాను మించిన మూవీలేదా? అంటే అందరినోటా వినిపిస్తున్న ఒకే మాట రోబో 2.0. శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్‌ కానుంది. విడుదలతేదీ ఖరారు కాకపోయినా... ట్రైలర్‌, షూటింగ్, ప్రపంచస్థాయి టెక్నీషియన్లతో ఈ చిత్రం కూడా మరో రికార్డు క్రియేట్‌ చేస్తుందని సినీవర్గాలు అంటున్నాయి. 
బాహుబలి 2 వర్సెస్‌ రోబో 2.0 
బాహుబలి 2 వర్సెస్‌ రోబో 2.0 మధ్య కంపారిజన్‌లో రోబోకే ఎక్కువ ప్లస్‌ పాయింట్లున్నట్లు అర్థమవుతోంది.. బాహుబలిలో హీరో, విలన్‌ తెలుగువాళ్లు.. బాహుబలికి ముందు వీరికి దేశస్థాయిలో పేరులేదు. దర్శకుడు రాజమౌళి, మ్యూజిక్‌ డైరెక్టర్‌ కీరవాణిలుకూడా టాప్‌లో లేరు.. బాహుబలితోనే వీరికి క్రేజ్ వచ్చింది. రోబో విషయానికి వస్తే శంకర్‌ దేశంలోనే టాప్‌మోస్ట్ డైరెక్టర్‌.. ఇండియన్ స్పీల్‌బర్గ్‌గా అభిమానులు పిలుచుకునే శంకర్‌.. జంటిల్‌మెన్‌ నుంచి రోబో వరకూ ఎన్నో అత్యుత్తమ చిత్రాలు తీశాడు.... కొత్త కొత్త వెరైటీ కాన్‌సెప్ట్‌లతో సినిమాలుతీసే శంకర్‌ అంటే దేశవ్యాప్తంగా ఎంతో క్రేజ్‌. 
రజనీకాంత్‌కూ ఫ్యాన్స్ ఫాలోయింగ్ విపరీతం
రోబో 2.0లో నటిస్తున్న రజనీకాంత్‌కూ ఫ్యాన్స్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంది... భాషా నుంచి రోబోవరకూ సూపర్‌స్టార్‌ స్టైల్‌ చూసి జనాలంతా పండగ చేసుకున్నారు... ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న రజనీ సినిమాలు ఎప్పుడూ కలెక్షన్ల సునామీని సృష్టిస్తూనేఉన్నాయి. రోబో2.0కు సూపర్‌ స్టార్‌ ఇమేజ్‌ మరింత కలిసివచ్చే అవకాశముంది..  
రోబో 2.0లో విలన్‌గా అక్షయ్‌ కుమార్‌   
రోబో 2.0లో యాక్షన్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ విలన్‌గా చేస్తున్నాడు.. ఇది మూవీ సక్సెస్‌కు మరింత ఉపయోగపడే అవకాశముంది.. అక్షయ్‌కుమార్‌కూ దేశవ్యాప్తంగా అభిమానులున్నారు.. రుస్తుంలాంటి మూవీలు అక్షయ్‌ మరింత గ్రాండ్‌ ఇమేజ్‌ను తెచ్చాయి.. భారత్‌లోని టాప్‌ హీరోల జాబితాలోఉన్న అక్షయ్‌.. రోబో 2.0లో విలన్‌గా చేస్తున్నాడన్న వార్తలతో మూవీకి హైప్‌ మరింత పెరిగింది..  
బాహుబలి జానపద చిత్రం...
బాహుబలి జానపద చిత్రం... ఈ మూవీ గ్రాఫిక్స్ విషయంలో రాజమౌళి కి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. విమానాలు, హెలికాప్టర్లు, రోబోలు, గన్స్ లాంటివి బాహుబలిలో చూపించలేరు. అదే రోబో 2 సైన్స్ ఫిక్షన్ మూవీ.. శంకర్ ఊహాశక్తికి పరిమితులు లేవు.  ఏం కావాలంటే అది చూపించొచ్చు.. ఎలాంటి గ్రాఫిక్స్‌తోనైనా అబ్బురపరిచేలా చేయొచ్చు.. ఇదికూడా రోబో 2.0 సక్సెస్‌కు యాడ్‌ అయ్యే అంశమే.
రోబో 2.0కు రూ. 450 కోట్ల బడ్జెట్‌
రోబో 2.0 భారీ బడ్జెట్‌ చిత్రం కావడం కూడా మూవీపై అంచనాల్ని పెంచేస్తోంది.. ఈ సినిమాకు 450కోట్ల వరకూ ఖర్చు చేస్తున్నారని సినీవర్గాల టాక్‌.. బాహుబలి రెండు భాగాల ఖర్చుకంటే రోబో2.0కే ఖర్చు ఎక్కువ. తక్కువ ఖర్చుతోనే రాజమౌళికి అంతటి సక్సెస్‌ వస్తే ఇంత భారీ బడ్జెట్‌తో వస్తున్న రోబో 2.0లో ఎంతటి స్థాయిలో గ్రాఫిక్స్ ఉంటాయోనని సినీ అభిమానులు చూడకముందే త్రిల్ అవుతున్నారు.  
గ్రాఫిక్స్ అందిస్తున్న లెగసీ ఎఫెక్ట్స్‌ 
రోబో 2.0 గ్రాఫిక్స్‌దే కీలక పాత్ర. ప్రముఖ హాలీవుడ్‌ సంస్థ లెగసీ ఎఫెక్ట్స్‌ ఈ సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్‌ అందిస్తోంది. అవతార్‌, జురాసిక్‌ పార్క్‌, జురాసిక్‌ వరల్డ్‌వంటి చిత్రాలకు విజువల్ ఎఫెక్ట్స్ ను అందించింది లెగసీ. అంతేకాదు రోబో 2.0ను పూర్తిస్థాయి త్రీడీ చిత్రంగా మలుస్తున్నారు శంకర్‌. మెన్‌ ఇన్‌ బ్లాక్‌, బ్యాట్‌మెన్‌ రిటర్న్స్‌ వంటి హాలీవుడ్‌ చిత్రాలకు వర్క్ చేసిన మేరీ ఇ వోగ్‌ ఈ చిత్రానికి కాస్ట్యూమ్‌ డిజైనర్‌. విజువల్స్ ఎఫెక్ట్స్‌లో హాలీవుడ్‌ లో మంచి పేరున్న జాన్ హ్యూజెస్‌తోపాటు మరో హాలీవుడ్‌ వీఎఫ్‌ఎక్స్‌ సంస్థ టౌగ ఫిలిమ్స్‌కు చెందిన వాల్ట్స్‌ రోబోలో పని చేస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్స్‌ కు యాక్షన్‌ డైరెక్టర్‌గా పనిచేసిన కెన్నే బేట్స్‌ 2.0కు యాక్షన్ ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఇండియన్ సినిమా లెజెండరీ టీమ్ తో పాటు హాలీవుడ్ టాప్ టెక్నీషియన్స్ రోబో 2.0కి వర్క్ చేస్తుండటంతో మూవీపై ఎక్స్‌పెక్టేషన్స్ మరింత పెంచేస్తున్నాయి..
రెహమాన్‌ మ్యూజిక్‌ తో రోబో 2.0కు మరింత క్రేజ్ 
ఏఆర్‌ రెహమాన్‌ మ్యూజిక్‌ కూడా రోబో 2.0కు మరింత క్రేజ్ తెస్తోంది.. రోబోలో సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చిన మ్యూజిక్ మాంత్రికుడు సీక్వెల్ కోసం కూడా మంచి ట్యూన్స్ సిద్ధం చేశాడట.. ఆర్‌ఆర్‌, పాటలు అదిరిపోతాయంటూ ముందే మూవీ యూనిట్‌ హింట్ ఇచ్చేస్తున్నారు.. 
అభిమానుల్ని విపరీతంగా త్రిల్ చేసిన రోబో  
రోబో 2.0కు ముందు రూపొందించిన రోబో సినీ అభిమానుల్ని విపరీతంగా త్రిల్ చేసింది.. ఇటు దక్షిణాదిలోనూ, అటు ఉత్తరాదిలోనూ కలెక్షన్ల రికార్డును తిరగరాసింది.. దాదాపు 130 కోట్లతో భారీ బడ్జెట్‌ తో నిర్మాణమైన రోబో అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంది. 2010 అక్టోబర్ 1న విడుదలై కోట్లాదిమంది ప్రేక్షకులను మైమరపించింది... 
హైప్‌ క్రియేట్ చేస్తోన్న రోబో 2.0  
రోబోకు సీక్వెల్‌గా వస్తున్న రోబో 2.0 మరింత హైప్‌ క్రియేట్ చేస్తోంది.. రోబో 2.0 సినిమా ప్రి రిలీజ్  బిజినెస్ విష‌యంలో ఇప్పటికే కొత్త రికార్డు క్రియేట్ చేసింది. శాటిలైట్ రైట్స్  110 కోట్లకు అమ్ముడ‌య్యింది... రోబో 2.0, బాహుబలి 2 రెండూ ఒకేసారి షూటింగ్‌ స్టార్ట్ అయినా బాహుబలి ముందుగా రిలీజైంది.. బాహుబలి 2నుచూసిన సినీ అభిమానులు... అంతకంటే అద్భుతమైన గ్రాఫిక్స్‌తో రూపొందిస్తున్న రోబో 2.0కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.. మూవీ రిలీజ్‌ తర్వాతగానీ రోబో వర్సెస్‌ బాహుబలిలో ఏది సూపర్‌ సక్సెస్‌ అవుతుందో తేలిపోనుంది.
 

10:22 - May 7, 2017

‘బాహుబలి'..’బాహుబలి-2’ సినిమాలు ఘన విజయం సాధించడంతో నటుడు 'ప్రభాస్' క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ చిత్రాలకు సంవత్సరాల టైం కేటాయించిన 'ప్రభాస్' ప్రస్తుతం తన న్యూ మూవీపై నజర్ పెట్టాడు. సుజీత్ దర్శకత్వంలో 'సాహో' చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. కానీ ఈ చిత్రంలో ఎవరు నటిస్తారనే విషయం ఇంతవరకు తెలియడం లేదు. డార్లింగ్ పక్కన ఎవరు హీరోయిన్ గా నటిస్తారు ? ఎవరు విలన్ గా నటిస్తారు ? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది. కానీ 'తమన్నా' పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 'ప్రభాస్' సరసన పలు మూవీల్లో 'తమన్నా' నటించిన సంగతి తెలిసిందే. ఇక విలన్ గా 'అరవింద్ స్వామి' అయితేనే సరిగ్గా సరిపోతాడని చిత్ర యూనిట్ భావిస్తోందంట. తెలుగు..తమిళ..హిందీ భాషల్లో చిత్రం తెరకెక్కుతోంది కాబట్టి అతను విలన్ అయితే బాగుంటుందని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 'అరవింద్' విలన్ గా నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. చిత్రం గురించి పలు వార్తలు త్వరలోనే తెలియనున్నాయి.

మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీ..

సిద్ధిపేట : మిర్ దొడ్డి (మం) మల్లపల్లిలో మిషన్ భగీరథ పైపులైన్ లీకేజ్ అయ్యింది. వారం రోజులుగా నీరు వృధాగా పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

భద్రాద్రిలోని పలు మండలాల్లో కురిసిన వర్షం...

భద్రాద్రి : అశ్వాపురం మనుబోలు, పినపాక మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పాల్వంచ, ముల్కలపల్లి మండలాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసింది.

చెరువులో చేపల లూఠీలు..

నల్గొండ : మనుగోడు చెరువులో స్థానికులు చేపలు లూఠీలు చేస్తున్నారు. సొసైటీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పట్టించుకోకవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రూ. లక్షల్లో నష్టం వస్తోందిన సొసైటీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నీట్ పరీక్ష ప్రారంభం..

ఢిల్లీ : దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష ప్రారంభమైంది. ఈ పరీక్షకు 11.35 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు పరీక్ష జరుగనుంది. 107 నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరించనున్నారు.

09:54 - May 7, 2017
09:53 - May 7, 2017

చెన్నై : తమిళనాడులో అమ్మ జయలలిత మరణం తర్వాత రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటికే అన్నాడీఎంకే రెండు వర్గాలుగా చీలిపోయి..రాష్ట్ర రాజకీయాల్ని మరింత రసకందాయంలో పడేశాయి. మరోవైపు శశికళ జైలుకు వెళ్లగా..అమె శిష్యుడు పళనీస్వామి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. అటు పన్నీరు సెల్వం సీఎం పదవి కోల్పోయిన తర్వాత ..ప్రజాక్షేత్రంలో తన బలమెంతో నిరూపించుకునే పనిలో పడ్డారు. ఇదే అదనుగా సీఎం పళనిస్వామి కూడా పన్నీరు సెల్వానికి ధీటుగా తన బలాన్ని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఓపీఎస్‌, ఈపీఎస్‌ల మధ్య వర్గపోరు మరింత ముదిరింది.   
అర్థాంతరంగా ముగిసిన విలీన ప్రక్రియ 
అమ్మ జయలలిత మరణానంతరం అన్నాడిఎంకే రెండు వర్గాల విలీన ప్రక్రియ అర్ధాంతరంగా ముగిసింది. దీంతో ఇరు వర్గాలు ఇప్పుడు తమ బలాన్ని నిరూపించుకునే ప్రయత్నంలో పడ్డాయి. శశికళ కుటుంబం కూడా పార్టీకి దూరం కావటంతో అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలోని రెండు వర్గాలు ప్రజల్లో తమ బలమెంతో తెలుసుకునే ప్రయత్నంలో బహిరంగసభలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఒకవైపు పన్నీరుసెల్వం వర్గం, మరోవైపు ముఖ్యమంత్రి పళనిస్వామి వర్గం బహిరంగసభల్లో భారీగా ప్రజలను తరలించే ప్రయత్నంలో ఎవరికివారే అన్నవిధంగా ముందుకు సాగుతున్నారు. అమ్మ విశ్వాసపాత్రుడినంటూ, అమ్మ ఆత్మ తనతో మాట్లాడినట్లు కార్యకర్తల సానుభూతిని పొందే ప్రయత్నం చేస్తున్నారు పన్నీరు సెల్వం. దీంట్లో భాగంగానే బహిరంగసభలను నిర్వహిస్తున్నారు. ప్రజా బలంతో మళ్లీ సీఎం పదవిని దక్కించుకునేందుకు పన్నీరు సెల్వం శతవిధాలా ప్రయత్నిన్నారు. చెన్నైలోని కొట్టివాక్కంలో జరిగిన బహిరంగ సభకు సుమారు 10 లక్షల మంది కార్యకర్తలు తరలిరావటం ద్వారా రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టిన పన్నీరుసెల్వం భారీ అంచనాలతో ముందుకెళ్తున్నారు. అమ్మకు నిజమైన వారసుడిని తానేనన్న భావనను కల్పించేందుకు పన్నీరు సెల్వం ప్రయత్నిస్తున్నారు. 
ప్రజా బలంతో సీఎం పదవి..? 
ఇక పన్నీరు సభలకు వచ్చే జనాన్ని చూసిన పళనిస్వామి ప్రభుత్వానికి తాము కూడా ధీటుగా జవాబు ఇవ్వాలనే ఆలోచన మొదలైంది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి పళనిస్వామి తాజాగా మధురైలో భారీ బహిరంగసభను ఏర్పాటు చేశారు. ఈ సభకు కూడా భారీగా కార్యకర్తలు తరలిరావటంతో తమదే అసలు సిసలైన అన్నాడిఎంకె అంటూ ప్రచారం మొదలు పెట్టారు. మొత్తానికి అన్నాడిఎంకెలోని రెండు చీలిక వర్గాలు విలీన ప్రక్రియకు పుల్ స్టాప్ పెట్టి బలబలాలపై దృష్టిసారించటం తమిళ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.

 

కాసేపట్లో 'నీట్‌' పరీక్ష

హైదరాబాద్ : దేశంలో తొలిసారిగా జరగబోతున్న నీట్‌ ఎగ్జామ్‌కి  సీబీఎస్సీ సర్వం సిద్ధం చేసింది. కాసేపట్లో పరీక్ష ప్రారంభం కానుంది. మెడికల్‌ కాలేజీల్లో  సీట్ల భర్తీ చేసేందుకు నిర్వహించే ఈ పరీక్షకు  పెద్దసంఖ్యలో విద్యార్థులు హాజరుకానున్నారు. దీనికనుగుణంగా అధికారులు పగడ్భందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా జరిగే నీట్‌ పరీక్షను 11లక్షల 35వేల మంది విద్యార్థులు హాజరవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో లక్షా 50 వేల మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఈ మేరకు  ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఆరు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

09:37 - May 7, 2017

చిత్తూరు : తిరుమలలోని మఠాలు ఆధ్యాత్మిక కేంద్రాలని, అక్కడ నిత్యం శ్రీవారి భజనలు, కీర్తనలు, వేద పారాయణాలు జరుగుతుంటాయని అందరూ ఊహిస్తుంటారు. అది భక్తుల ఊహమాత్రమే మఠాలన్ని స్టార్ హోటళ్లను తలపిస్తున్నాయి. మ్యారేజీ కాంట్రాక్టర్లు మఠాలను తమ చేతుల్లో ఉంచుకొని పూర్తిగా వ్యాపార కేంద్రాలుగా మార్చేసి కోట్లు గడిస్తున్నారు. తిరుమల మఠాలలో జరుగుతున్న అక్రమాలపై 10 టీవి ప్రత్యేక కథనం..
వ్యాపార కేంద్రాలుగా మఠాలు
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో 32 వరకు మఠాలు ఉన్నాయి. ఇవన్ని ఒకప్పుడు ఆలయం మాడ వీధుల్లో ఇరుకైన సందుల్లో ఉండేవి. తిరుమల మాస్టర్ ప్లాన్ లో భాగంగా మఠాలను మాడ వీధుల్లో నుంచి తొలగించి రింగ్ రోడ్డులో స్థలాలు కేటాయిచింది టీటీడీ. అప్పటి నుంచి మఠాల దశతిరిగింది. కళ్యాణమండపం, ఏసీ గదులు, డీలక్స్ గదులు తదితర ఆధునాతన సౌకర్యలతో మఠాలు నిర్మించుకున్న నిర్వాహకులు వాటిని భక్తులకు కేటాయిస్తూ వ్యాపార కేంద్రాలుగా మార్చేశారు. 
అందినకాడికి దోచుకుంటున్న మఠాల నిర్వహకులు 
స్వామివారి సన్నిదిలో వివాహం చేసుకుని ఒక్కటైతే కలకాలం హాయిగా ఉండవచ్చనే తలంపుతో తిరుమలలో వివాహాలు చేసుకోవాలని ఎక్కవ మంది భావిస్తుంటారు. ఈ రకంగా భక్తుల్లో ఉన్న సెంటిమెంటును మఠాల నిర్వాహకులు బాగానే సొమ్ము చేసుకుంటున్నారు. టిటిడికి సంబంధించి తిరుమలలో సామూహిక వివాహాలు నిర్వహించే కళ్యాణవేదిక, మరికొన్ని మ్యారేజీ కాటేజీలు తప్పా చెప్పుకోదగ్గ స్థాయిలో కళ్యాణమండపాలు లేవు. దీంతో వివాహాలు జరుపుకునే వారు పెద్ద సంఖ్యలో మఠాలను ఆశ్రయిస్తుంటారు. దీంతో మఠాల నిర్వహకులు భక్తులను అందినకాడికి దోచుకుంటున్నారు. 
మఠాధిపతుల వైపు కన్నెత్తి చూడని అధికారులు  
ఒక్కో వివాహానికి స్థాయికి తగ్గట్లు నాలుగు లక్షల నుంచి పది లక్షల వరకు వసూలు చేస్తున్నారు. తొలుత ఈ మఠాలకు ఏటా రూ.వెయ్యి కనీస లీజు చెల్లించే షరతుపై స్థలాలను దేవస్థానం కేటాయించింది. ఆ తరువాత విమర్శలు రావడంతో అద్దెను పెంచి నెలకు 5 వేల రూపాయలు చేశారు. టీటీడీ ఏ లక్ష్యంతో అయితే మఠాలకు స్థలం కేటాయించిందో ఆ ఉద్దేశాలు ఏమాత్రం నెరవేరడం లేదు. మఠాల్లో ఇలాంటి వ్యాపార పోకడలు ఎక్కువైనా.. మఠాధిపతుల నుంచి ఒత్తిడి వస్తుందన్న భయంతో టీటీడీ అధికారులు వాటివైపు కన్నెత్తి చూడడం లేదు.

 

09:28 - May 7, 2017

అనంతపురం : తెలుగుదేశం పార్టీకి ఆ జిల్లా కంచుకోట..ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీడీపీకి అక్కడి ప్రజలు బ్రహ్మరథం పడతారు. అదే అనంతపురం జిల్లా. అనేక పదవులను ఆ జిల్లాకు కట్టబెట్టారు సీఎం చంద్రబాబు.. అయితే ఇప్పుడు ఆ పదవులే పార్టీ అధినాయకత్వానికి తలనొప్పిగా మారాయి.
కంచుకోటలో అలజడి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి అనంతపురం జిల్లాలో ఓప్రత్యేక స్థానం ఉంది. ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ ఈ జిల్లానుంచే ప్రాతినిధ్యం వహించారు. పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఇక్కడి ప్రజలు టీడీపీకి బ్రహ్మరథం పడుతున్నారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 14 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా 12స్థానాలతో పాటు జిల్లాలో ఉన్న రెండు పార్లమెంటు సీట్లను ఆ పార్టీకి కట్టబెట్టారు.
టిడిపికి తిరుగులేని మెజారిటీ 
ఇవికాక..అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌, ఇతర మున్సిపాలిటీలు, జిల్లాపరిషత్ విషయంలోనూ టిడిపికి తిరుగులేని మెజారిటీ అందించారు. దీంతో టీడీపీ నేతల్లో పదవుల పందేరం మొదలైంది. ఎవరికీ వారే తమ వారికి పదవులు దక్కేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇదే ఇప్పుడు ఆ పార్టీ నేతల మధ్య విభేదాలకు దారితీస్తుంది. జడ్పీ చైర్మన్ విషయంలో పోటీ పార్టీ అధిష్టానానికి తలనొప్పులు తెచ్చిపెడుతోంది. 
మద్దతును కూడగట్టే పనిలో చమన్ 
ప్రస్తుతం జడ్పీ చైర్మన్ గా కొనసాగుతున్న దూదేకుల చమన్‌ను ఆ పదవి నుంచి తప్పించి గుమ్మగట్ట జడ్పీటీసీ పూల నాగరాజుకు కట్టబెట్టేందుకు కొందరు నేతలు పావులు కదుపుతున్నారు. దీంతో ప్రస్తుత చైర్మన్ చమన్ తనకు మద్దతును కూడగట్టే పనిలో పడ్డారు. దివంగత నేత పరిటాల రవికి అత్యంత సన్నిహితుడైన చమన్ పార్టీ కోసం తాను అన్నీ కోల్పోయానని....ఇప్పుడు పదవి కోల్పోతే తన రాజకీయభవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. మరోవైపు అధిష్టానం ఇచ్చిన హామీ మేరకు పూల నాగరాజుకు చైర్మన్ పదవి ఇవ్వాలని ఆ వర్గం నేతలు పట్టుబడుతున్నారు. చైర్మన్ పదవి నిర్ణయాన్ని సీఎం చంద్రబాబుకే ఇరు వర్గం నేతలు వదిలేశారు. బాబు అమెరికా పర్యటన అనంతరం ఈ విభేదాలకు చెక్ పడుతోందని జిల్లా టీడీపీ క్యాడర్ ఆశిస్తోంది. 

 

09:09 - May 7, 2017
09:08 - May 7, 2017
09:06 - May 7, 2017
08:56 - May 7, 2017

హైదరాబాద్ : బంజారాహిల్స్ లో రేసర్లు రెచ్చిపోయారు. అర్ధరాత్రి బైకులు, కార్లపై దూసుకెళ్తూ హల్ చల్ చేశారు. కేబీఆర్ పార్క్ నుంచి జూబ్లిహిల్స్ చెక్ పోస్టు వరకు రేసింగ్ నిర్వహించారు. పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. 23 మందిని అరెస్టు చేశారు. వీరి నుంచి 19 బైకులు, 4 కార్లు స్వాధీనం చేసుకున్నారు. 
రేసర్లలో పలువురు ప్రముఖుల పిల్లలున్నారు. మరిన్ని వీడియోలో చూద్దాం...

 

పోలీసులు స్పెషల్ డ్రైవ్

హైదరాబాద్ : బంజారాహిల్స్ లో రేసర్లు రెచ్చిపోయారు. అర్ధరాత్రి బైకులు, కార్లపై దూసుకెళ్తూ హల్ చల్ చేశారు. కేబీఆర్ పార్క్ నుంచి జూబ్లిహిల్స్ చెక్ పోస్టు వరకు రేసింగ్ నిర్వహించారు. పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. 23 మందిని అరెస్టు చేశారు. వీరి నుంచి 19 బైకులు, 4 కార్లు స్వాధీనం చేసుకున్నారు. 

ఐపీఎల్ 10 లో నేటి మ్యాచ్ లు

హైదరాబాద్ : ఐపీఎల్ 10 లో భాగంగా నేడు బెంగళూరు, కోల్ కతా మధ్య మ్యాచ్ జరుగనుంది. బెంగళూరు వేదికగా సాయంత్రం 4 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మోహాలీ వేదికగా రాత్రి 8 గంటలకు పంజాబ్, గుజరాత్ తలపడనున్నాయి.

నేడు బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం

ముంబై : నేడు బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం జరుగనుంది. ఐసీసీ ఆదాయ పంపిణీ విషయంపై ప్రధాన చర్చ జరుగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఆడే విషయంపై స్పష్టత రానుంది. 

 

08:41 - May 7, 2017

హైదరాబాద్ : తెలంగాణలో ప్రభుత్వ ఆస్పత్రులంటేనే భయం పుడుతోంది. రోజురోజుకు బాలింతల మరణాల పెరగడంతో.. ఆస్పత్రికి వచ్చేందుకు గర్భిణీలు బెంబేలెత్తుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులను మెరుగుపరుస్తామని పాలకులు చెబుతున్నా.. ఆ పరిస్థితే కనిపించడం లేదు. మరోవైపు నియామకాలు చేపట్టకపోవడంతో తమపై భారం పెరుగుతుందని.. ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రిలో ఆరోగ్యశాఖ మంత్రిని స్టాఫ్‌నర్సులు అడ్డుకున్నారు. 
పెద్దాసుపత్రులంటేనే వణికిపోతున్న జనం 
తెలంగాణలో పెద్దాసుపత్రులంటేనే జనం వణికిపోతున్నారు. మరీ ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ప్రభుత్వాస్పుత్రులంటే భయపడుతున్నారు. గత మూడు నెలలుగా నీలోఫర్‌ హాస్పిటల్‌, పేట్ల బురుజు హాస్పిటల్‌, ఉస్మానియా, కోఠి మెటర్నిటీ హాస్పిటల్‌లో వరుస బాలింత మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో గవర్నమెంట్‌ ఆస్పత్రులకు రావాలంటేనే గర్భిణీలు భయపడిపోతున్నారు. 
బాలింతలు మృతి
ఆపరేషన్‌ సమయంలో అధిక రక్తస్రావం కావడం వల్ల బాలింతలు మృతి చెందుతున్నారు. అయితే.. అధిక రక్తస్రావాన్ని అరికట్టేందుకు వాడే ఇంజక్షన్‌ నాసిరకం కావడంతో.. మరణాలు సంభవిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. అయితే గతంలోనే ఈ ఇంజక్షన్‌ను బ్యాన్‌ చేయాలని ప్రభుత్వం చెప్పింది. మరోవైపు ప్రైవేట్‌ ఆస్పత్రులలో వాడే మెడిసిన్‌ను ప్రభుత్వ ఆస్పత్రులలో వాడుతున్నామని.. అయినా కూడా ఇన్‌ఫెక్షన్‌ సోకుతుండడంతో ఇంటర్నేషనల్‌ మెడిసిన్‌ను కూడా బ్యాన్‌ చేసి.. కొత్త మందులను వాడేందుకు రంగం సిద్దం చేస్తున్నామన్నారు మంత్రి లక్ష్మారెడ్డి. అయితే ఇది ఎప్పటినుండి అమలు చేస్తారనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. 
కోఠి మెటర్నిటీ ఆస్పత్రిలో మరో శిశువు మృతి 
మరోవైపు కోఠి మెటర్నిటీ ఆస్పత్రిలో మరో శిశువు మృతి చెందింది. గుర్రంగూడకు చెందిన రాధకు జన్మించిన శిశువు తీవ్ర జ్వరంతో ఫిట్స్‌ వచ్చాయి. నీలోఫర్‌కు తరలిస్తుండగా శిశువు మృతి చెందింది. దీంతో శిశువు కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు, వైద్యులు లేకపోవడం వల్లే శిశువు మృతి చెందిందని కుటుంబ సభ్యులు, మహిళా సంఘాలంటున్నాయి. 
మంత్రికి లక్ష్మారెడ్డికి చేదు అనుభవం 
ఇక ఉస్మానియా, పేట్ల బురుజు హాస్పిటల్స్‌ను సందర్శించిన మంత్రికి చేదు అనుభవం ఎదురైంది. ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రిలో స్టాఫ్‌నర్సులు, శానిటరీ ఉద్యోగులు మంత్రిని అడ్డుకున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. దీంతో మంత్రి వెనుదిరిగారు. అయితే గేటు వద్ద మహిళా మోర్చా నేతలు కూడా లక్ష్మారెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్‌ చేశారు. ఇప్పటివరకు మృతి చెందిన 12 మంది బాలింత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, ప్రభుత్వాస్పత్రులలో సౌకర్యాలు మెరుగుపర్చాలని డిమాండ్‌ చేశాయి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే.. ఉద్యమాలు మరింత ఉధృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

 

08:35 - May 7, 2017

హైదరాబాద్ : సైనికులను సమకూర్చుకునే పనిని జన సేన వేగవంతం చేసింది. అనంతపురంలో కార్యకర్తల ఎంపిక పూర్తికాగా..ప్రస్తుతం గ్రేటర్‌ హైదరాబాద్‌, ఉత్తరాంధ్రలో జన సైనికుల ఎంపిక ప్రారంభమైంది. దీనికి సంబంధించి పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ఓ పత్రికా ప్రకటనను కూడా విడుదల చేశారు.
ప్రణాళిక బద్ధంగా ముందుకెళ్తున్న జనసేనాని
క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తల కోసం జనసేన అధినేత ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్తున్నారు. నిజాయితీగా కష్టపడి పనిచేసే యువత కోసం గాలిస్తున్నారు. తాజాగా  గ్రేటర్‌ హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో కార్యకర్తల కోసం రెండో పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి గలవారు స్పీకర్‌, అనలిస్ట్‌, కంటెంట్‌ రైటర్‌ విభాగాలకు  దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా పంపాలని కోరుతూ యూఆర్‌ఎల్‌ను అందించారు. శనివారం నుంచి ఈ నెల 13 వతేదీ రాత్రి 8 గంటల వరకు దరఖాస్తులు పంపవచ్చని జనసేనాని పవన్‌ వెల్లడించారు.
విజయవంతంగా అనంతపురంలో అభ్యర్థుల ఎంపిక
కొద్దిరోజుల క్రితం అనంతపురం జిల్లాలో నిర్వహించిన కార్యకర్తల ఎంపిక ప్రక్రియను జనసేన విజయవంతంగా పూర్తి చేసింది. దరఖాస్తు చేసుకున్న వారికి పరీక్ష  నిర్వహించింది. ఈ పరీక్షలో 3,800 మంది యువతి, యువకులు పాల్గొన్నారు. అయితే దీనిని పోటీ పరీక్షగా భావించవద్దని.. ప్రతిభ, శక్తియుక్తులను గుర్తించడానికి మాత్రమేనని  పవన్‌ వివరణ కూడా ఇచ్చారు. కాగా జనసేన తరపున రాజకీయ యజ్ఞంలో పాల్గొనదలిచిన జన సైనికులకు, యువతకు, మేధావులకు పవన్‌ కళ్యాణ్‌ శుభాభినందనలు తెలిపారు. 

08:30 - May 7, 2017

హైదరాబాద్ : నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్‌ తీపి కబురు చెప్పింది. విద్యుత్‌శాఖలో ఖాళీగా ఉన్న 13,357 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసింది. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని కేసీఆర్‌ ప్రకటించిన రెండు రోజులకే ఉత్తర్వులు వెలువడడం విశేషం. మరోవైపు ఎంతోకాలంగా ఉద్యోగాలు కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు ఈ జీవోతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

 

08:27 - May 7, 2017

కర్నూలు : జిల్లాలో పాతకక్షలు భగ్గుమన్నాయి. శిరువెల్ల మండలం గోవిందపల్లెలో మాజీ ఎంపీపీ ఇందూరు ప్రభాకర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డిలను దారుణంగా హత్య చేశారు. పాతకక్షలతో ప్రత్యర్థులు వేటకొడవళ్లతో నరికి చంపారు. మృతులిద్దరూ వైసీపీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి అనుచరులుగా గుర్తించారు. ఈ ఘటనతో గోవిందపల్లెలో ఉద్రిక్తత నెలకొంది. 

 

08:23 - May 7, 2017

హైదరాబాద్ : దేశంలో  తొలిసారిగా జరగబోతున్న నీట్‌ ఎగ్జామ్‌కి  సీబీఎస్సీ సర్వం సిద్ధం చేసింది . మెడికల్‌ కాలేజీల్లో  సీట్ల భర్తీ చేసేందుకు నిర్వహించే ఈ పరీక్షకు  పెద్దసంఖ్యలో  విద్యార్థులు హాజరుకానున్నారు. దీనికనుగుణంగా అధికారులు పగడ్భందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. 
11 లక్షల 35 వేల మంది విద్యార్థులు హాజరు
దేశ వ్యాప్తంగా జరిగే నీట్‌ పరీక్షను 11లక్షల 35వేల మంది విద్యార్థులు హాజరవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో లక్షా 50 వేల మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఈ మేరకు  ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఆరు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం 10గంటల నుంచి ఒంటి గంట వరకు ఈ పరీక్ష  జరగనుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలో అనుమతించేది  లేదని అధికారులు తేల్చి చెప్పారు. అలాగే  విద్యార్థులు పరీక్షా కేంద్రంలోకి ఎటువంటి వస్తువులను తీసుకువెళ్లడానికి వీలు లేదు. పెన్ను, పెన్సిల్, రబ్బరు వంటి వస్తవులను కూడా హాల్లో విద్యార్థులకు తామే అందజేస్తామని అధికారులు చెబుతున్నారు.
వస్త్రధారణ విషయంలోనూ నిబంధనలు
విద్యార్థుల వస్త్రాధారణ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. అమ్మాయిలు రంగురంగుల  వస్ర్తాలు, డిజైనర్ వేర్స్, హైహీల్స్ ధరించడానికి వీలు లేదు. అబ్బాయిలు పైజామా, ఫుల్‌ హ్యండ్స్ షర్ట్, షూస్‌ ధరించకూడదు. వీలైనంత వరకు  లైట్ కలర్ జీన్స్, ప్యాంట్లు, హాఫ్ హ్యాండ్స్ షర్ట్‌లు, కాళ్లకి చెప్పులు మాత్రమే ధరించాలని  సూచిస్తున్నారు.
నిఘా నీడలో నీట్‌
గతంలో మెడిసిన్ ఎంట్రన్స్ పరీక్షల్లో మాస్‌కాపీయింగ్ కేసులు నమోదైన నేపథ్యంలో నిఘా నీడలో నీట్‌ను నిర్వహించేందుకు  సన్నాహాలు చేస్తున్నారు. గతంలో జరిగిన అవకతవకలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని సీబీఎస్‌సీ చెబుతోంది. 

 

నేడు టీఎస్ పీసీబీలో అనలిస్టు గ్రేడ్ 2 పోస్టుల పరీక్ష

హైదరాబాద్ : టీఎస్ పీసీబీలో అనలిస్టు గ్రేడ్ 2 పోస్టులకు ఇవాళ పరీక్ష జరుగనుంది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ లో కలిసి 62 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. దాదాపు 20, 153 అభ్యర్థులు హాజరుకానున్నారు. 

నేడు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష

ఢిల్లీ : నేడు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు 11.35 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు పరీక్ష జరుగనుంది. 107 నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరించనున్నారు. 

 

Don't Miss