Activities calendar

08 May 2017

21:52 - May 8, 2017

ముంబై : చాంపియన్స్‌ ట్రోఫీకి బీసిసిఐ టీమిండియాను ప్రకటించింది.బీసిసిఐ చీఫ్‌ సెలక్టర్‌ MSK ప్రసాద్‌ నాయకత్వంలోని సెలక్షన్‌ కమిటీ...ప్రయోగాల జోలికి పోకుండా....స్వదేశంలో ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ ఆడిన జట్టుకే మొగ్గు చూపింది.ఇన్‌ స్టంట్‌ వన్డే ఫార్మాట్‌లో మినీ వరల్డ్‌ కప్‌గా పేరున్న చాంపియన్స్‌ ట్రోఫీకి విరాట్‌ కొహ్లీ నాయకత్వంలోని 15 మంది సభ్యుల భారత జట్టును ఎంపిక చేసింది.సీనియర్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌, వన్డే, టీ 20 కెప్టెన్సీకి గుడ్‌ బై చెప్పిన మహేంద్ర సింగ్‌ ధోనీ చోటు నిలుపుకోగా.... శిఖర్‌ ధావన్‌ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్‌లో నిలకడగా రాణిస్తోన్న సీనియర్‌ ఆటగాళ్లు సురేష్‌ రైనా, గౌతమ్‌ గంభీర్‌కు జట్టులో చోటు దక్కలేదు. దేశవాళీ క్రికెట్‌లో అదరగొట్టిన రిషబ్‌ పంత్‌కు మరోసారి నిరాశే ఎదురైంది.చాంపియన్స్‌ ట్రోఫీకి ఎంపిక చేసిన భారత జట్టులో విరాట్‌ కొహ్లీ, శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ, ధోనీ, మనీష్‌ పాండే, కేదార్‌ జాదవ్‌, యువరాజ్‌ సింగ్‌, అజింక్య రహానే, హార్దిక్‌ పాండ్య, అశ్విన్‌ , జడేజా, మహమ్మద్‌ షమీ, జస్ప్రీత్‌ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, ఉమేష్‌ యాదవ్‌ ఉన్నారు.ఇంగ్లండ్‌,వేల్స్ సంయుక్తంగా ఆతిధ్యమిస్తోన్న చాంపియన్స్‌ ట్రోఫీ జూన్‌ 1 నుంచి ప్రారంభమవుతుంది. 2013 టోర్నీలో విజేతగా నిలిచిన టీమిండియా డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో బరిలోకి దిగనుంది.

 

21:49 - May 8, 2017

శ్రీనగర్ : కశ్మీర్‌లో విద్యార్థులకు భద్రతాదళాలకు మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. పుల్వామా జిల్లాలో భద్రతాదళాలను వ్యతిరేకిస్తూ స్కూలు విద్యార్థులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. శ్రీనగర్‌కు 35 కిలోమీటర్ల దూరంలో త్రాల్‌ ప్రాంతంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఆందోళనను అడ్డుకునేందుకు యత్నించిన భద్రతాదళాలపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు లాఠీఛార్జీ చేసి విద్యార్థులను చెదరగొట్టారు. పోలీసులపై కేసు నమోదు చేయాలని, అరెస్ట్‌ చేసిన స్కూలు విద్యార్థులను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

 

21:47 - May 8, 2017

ఢిల్లీ : మావోయిస్టులను ఎదుర్కొనేందుకు రాష్ర్టాలు మరింత సన్నద్ధం కావాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పిలుపునిచ్చారు. మావోయిస్టుల ఏరివేత కోసం 8 సూత్రాల 'సమాధాన్' పేరుతో ఆయన కొత్త వ్యూహాన్ని ప్రతిపాదించారు. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణంతో పాటు అభివృద్ధి పనులు వేగంగా జరగాల్సిన అవసరం ఉందని సూచించారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన నక్సల్స్ ప్రభావిత రాష్ర్టాల ముఖ్యమంత్రులు, డీజీపీలు, ఇంటెలిజెన్స్ అధికారులతో రాజ్‌నాథ్‌ సమావేశమయ్యారు. మావోయిస్టులను ఎదుర్కొనేందుకు రాష్ర్టాలకు కేంద్రం అన్ని విధాలుగా తోడ్పాటునిస్తుందని హోంమంత్రి స్పష్టం చేశారు. సుక్మా ఘటనలో మరణించిన సిఆర్‌పిఎఫ్‌ జవాన్ల మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.

21:46 - May 8, 2017

ఢిల్లీ : తెలంగాణలో ఖమ్మం, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల్లో కొద్దిగా.. మావోయిస్టుల సమస్య ఉందని తెలంగాణ డీజీపీ అనురాగ్‌శర్మ అన్నారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన అంతరాష్ట్ర మండలి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు సీఆర్ ఫీఎఫ్ బెటాలియన్ ఇవ్వాలని.. అభివృద్ధి కార్యక్రమాల కోసం నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు అనురాగ్‌శర్మ తెలిపారు.

21:43 - May 8, 2017

హైదరాబాద్ :మిర్చికి మద్దతు ధర కోసం ఆందోళన చేపట్టిన రైతులను తెలంగాణ ప్రభుత్వం అరెస్టు చేయడం దారుణమని కేంద్ర మంత్రి దత్తాత్రేయ అన్నారు. తెలంగాణలో మిర్చికి కనీస మద్దతు ధర కల్పించాలని, రహదారుల పునరుద్ధరణ పనులపై కేంద్ర మంత్రులు రాధామోహన్‌సింగ్‌, నితిన్ గడ్కరీకి దత్తాత్రేయ నివేదికలు అందించారు. మిర్చి పంట కొనుగోలుకు ప్రభుత్వం వెంటనే 250 కోట్ల రూపాయలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

 

21:40 - May 8, 2017

హైదరాబాద్  :రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఒకే విధంగా ఉండాలని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. రెసిడెన్సియల్‌ కళాశాలలపై సచివాలయంలో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రులు జగదీష్‌ రెడ్డి, చందూలాల్‌ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అన్ని గురుకులాల్లో ఒకే తరహా ఆహార మెనూ, వసతుల కల్పన ఉండాలన్న కడియం.. గురుకుల విద్యాసంస్థలన్నీ ఉమ్మడి అకాడమిక్‌ క్యాలెండర్‌ను పాటించాలన్నారు. గిరిజనులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో గిరిజన మహిళా డిగ్రీ కళాశాలలు నెలకొల్పుతామని అన్నారు. స్టడీ సర్కిళ్లకు డైరెక్టర్లుగా ఐఏఎస్‌లను నియమిస్తామని కడియం తెలిపారు. లయంలో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రులు జగదీష్‌ రెడ్డి, చందూలాల్‌ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అన్ని గురుకులాల్లో ఒకే తరహా ఆహార మెనూ, వసతుల కల్పన ఉండాలన్న కడియం.. గురుకుల విద్యాసంస్థలన్నీ ఉమ్మడి అకాడమిక్‌ క్యాలెండర్‌ను పాటించాలన్నారు. గిరిజనులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో గిరిజన మహిళా డిగ్రీ కళాశాలలు నెలకొల్పుతామని అన్నారు. స్టడీ సర్కిళ్లకు డైరెక్టర్లుగా ఐఏఎస్‌లను నియమిస్తామని కడియం తెలిపారు.

21:36 - May 8, 2017

హైదరాబాద్ : బాలింతల, శిశు మరణాల నేపథ్యంలో కాంగ్రెస్ మహిళా నేతలు కోఠి మెటర్నిటీ హాస్పిటల్‌ని సందర్శించారు. ఆస్పత్రుల్లోని రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో కనీసం ఫ్యాన్‌లు లేవని... వైద్యానికి అవసరమైన పరికరాలు కూడా లేవన్నారు. లేబర్ రూంలో కూడా సరైన వసతులు లేక రోగులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం పేదలను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్‌ మహిళా నేతలు ఆరోపించారు. బాలింతలు చనిపోతున్నా ముఖ్యమంత్రికి చీమకుట్టినట్టుగా కూడా లేదని వారు విమర్శించారు. ఆసుపత్రిలో జరిగిన ఘటనపై ప్రభుత్వం బాధ్యత వహించాలని... ఆరోగ్యశాఖ మంత్రి రాజీనామా చేయాలని మహిళా కాంగ్రెస్ నేతలు డిమాండ్‌ చేశారు.

ఐద్వా నేతలు ధర్నా...
మరోవైపు కోఠి మెటర్నిటి ఆస్పత్రి ముందు ఐద్వా నేతలు ధర్నా చేశారు. నాసిరకం మందులు వాడి ప్రజల ప్రాణాలను ఫణంగా పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్‌ ఆస్పత్రులకు లాభం చేకూర్చేందుకే ఈ విధంగా చేస్తున్నారని వారు ఆరోపించారు. ప్రభుత్వ ఆస్పత్రులను సీఎం వెంటనే సందర్శించాలని కాంగ్రెస్ నేతలు, ప్రజా సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

21:33 - May 8, 2017

హైదరాబాద్ : హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై బల్దియా ప్రత్యేక దృష్టి పెట్టింది. అక్రమ నిర్మాణాలు కనపడితే కూల్చేయడమే అంటుంది. అయితే ఇప్పటి వ‌ర‌కు శాస్త్రీయ పద్ధతిలో నిర్మాణాలను కూల్చివేస్తు వచ్చింది జీహెచ్‌ఎంసీ. ఈ విధానంతో జీహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మాణాల కూల్చి వేత‌ల్లో ప‌క్షపాతం వ‌హిస్తున్నార‌ని.. దీంతో క్షేత్రస్థాయిలో రోజురోజుకు అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయని ఆరోప‌ణ‌లు వస్తున్నాయి. ఈ ఆరోపణల నుంచి బయటపడటానికి బల్దియా అధికారులు సరికొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టారు. ఒకేసారి భవనం మొత్తం క్షణాల్లో కూల్చివేసే ఇన్ల్ఫోజన్ పద్ధతిని అమలుచేస్తున్నారు. మాదాపూర్‌లో అక్రమంగా నిర్మించిన ఐదు అంతస్తుల భవనం కూల్చివేతల్లో ఈ పద్ధతిని ప్రవేశపెట్టింది బల్దియా. అయితే ఈ ప్రయోగం విఫలమైంది. పూర్తిస్థాయిలో భవనం నిర్మాణం జరగకపోవడం.. పక్కనే మరో భవనం ఉండడంతో ప్రయోగం విజయవంతం కాలేదని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు.

ఉపేక్షించేది లేదు....
గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో అక్రమనిర్మాణాలను ఉపేక్షించేది లేదంటున్నారు మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్. ఇక‌ నుంచి నామమాత్రపు కూల్చివేతలు ఉండవని.. ఇన్ల్ఫోజన్ పద్ధతిలోనే కూల్చివేతలు ఉంటాయని హెచ్చరించారు. ప్రయోగం విఫలం కావడం ఓవంతకు మంచిదేనని.. నివాస ప్రాంతాలు, ఖాళీ ప్రదేశాల్లో భవనాలు ఎలా కూల్చాలో అనుభవం వచ్చిందన్నారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఐదు అంతస్తుల భవనం నిర్మిస్తున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నారని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

21:30 - May 8, 2017

గుంటూరు : ఏపీలో పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమెరికాలో పర్యటిస్తున్నారు. యూఎస్ టూర్‌లో చంద్రబాబుకు సమస్యలు సృష్టించేందుకు వైసీపీ మద్దతుదార్లుగా భావిస్తున్న కొందరు ప్రయత్నించినట్టు రాజకీయ వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఎర్రచందనం స్మగ్లర్లంటూ ఏపీలో పాతిక మందిని చంపించిన చంద్రబాబు అక్రమంగా అమెరికాలో పర్యటిస్తున్నట్టు అమెరికా డాలస్‌ రాష్ట్రంలోని ఇర్వింగ్‌ నగర మేయర్‌ బేతవాన్‌ డ్యూన్‌కు ఓ మెయిల్‌ అందింది. చంద్రబాబు అమెరికాలో అక్రమంగా నిధులు సేకరిస్తున్నారని, దీనిపై విచారణ జరిపి చర్య తీసుకోవాలని కూడా అందులో కోరారు. ఈ-మెయిల్‌తో అప్రమత్తమైన అమెరికా పోలీసు అధికారులు, చంద్రబాబు సమావేశానికి వెళ్లి వాస్తవాన్ని గుర్తించి, సదరు సభకు రక్షణ కూడా కల్పించారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇండియన్స్ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌ పేరిట ఇర్వింగ్‌ మేయర్‌కు ఈ-మెయిల్‌ పంపింది వైసీపీ మద్దతుదారులేనని కూడా టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా, అమెరికాలో రాష్ట్రప్రయోజనాలకు భంగం కలిగించే ప్రయత్నం చేసిన జగన్‌పై దేశద్రోహం నేరం పెట్టాలని కూడా టీడీపీ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే, తెలుగుదేశం నేతల ఆరోపణలను వైసీపీ తిప్పికొట్టింది. చంద్రబాబు పర్యటనను అడ్డుకోవాల్సిన అవసరం తమ పార్టీకి లేదని వైసీపీ నేతలు స్పష్టం చేశారు. చంద్రబాబు అమెరికా పర్యటనను భగ్నం చేసేందుకు కుట్ర జరగడం, దీనిపై వైసీపీ, టీడీపీ నేతల మధ్య సాగుతున్న వాగ్యుద్ధం, రాష్ట్రానికి నష్టం కలిగిస్తుందన్న ఆందోళన అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది.

కాకినాడలో మహిళ కిడ్నాప్ కు యత్నం

 తూర్పుగోదావరి : జిల్లాలోని కాకినాడలో మహిళ కిడ్నాప్ కు విఫలయత్నం చేశారు. యాక్ట్ షిప్పింగ్ యజమాని ధనలక్ష్మిని కిడ్నిప్ చేయాడానికి మిత్రులతో కలిసి డ్రైవర్ దయ యత్నం చేశారు. కోనపాపపేటలో పోలీసులు నిందితులను అరెష్ట చేశారు.

డీఈఈ ప్రవేశ పరీక్ష ప్రకటన విడుదల

హైదరాబాద్ : డీఈఈ ప్రవేశ పరీక్ష ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 10 నుంచి 23వరకు ఆన్ లైన్ దరఖాసుల్ స్వీకరించానున్నారు. త్వరలో డీసెట్ పరీక్ష తేదీని ప్రకటిస్తామని  కన్వీనర్ తెలిపారు.

భూ వివాదంలో ఎమ్మెల్యే మంచిరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కమీషన్ ఆగ్రహం

హైదరాబాద్ : భూ వివాదంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి చెందిన సంస్థ బూకబ్జాలపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు ఎస్సీ,ఎస్టీ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.

కాళేశ్వరం టన్నెల్ పరిశీలించిన హరీష్

 

సిద్దిపేట : మంత్రి హరీష్ రావు, పోచారం ఎన్సాన్ పల్లి దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టు టన్నెల్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ కోటి ఎకరాలకు నీళ్లిస్తామని తెలిపారు. తెలంగాణ సస్యశ్యామలం చేస్తామని అన్నారు.

 

పురుషోత్తపట్నం పనుల పరిశీలించిన దేవినేని

తూర్పు గోదావరి : మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పనులను పరిశీలించారు. ఆగస్టు నాటికి ప్రాజెక్టు ద్వారా నీరు అందిస్తామని ఆయన ప్రకటించారు.

 

ఫారెస్టు అధికారులతో మంత్రి సమీక్ష

గుంటూరు : పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఫారెస్టు అధికారులతో మంత్రి శిద్ధా రాఘవరావు సమీక్ష నిర్వహించారు. అటవీశాఖ అధికారులకు ఆయుధాల ఇచ్చేందుకు సిద్ధం అన్నారు. దానికి ఢిల్లీ నుంచి అనుమతి రావాల్సి ఉందని అన్నారు.

 

20:20 - May 8, 2017

తెరపైకి బీసీ రిజర్వేషన్ డ్రామా పరిస్థితులు సర్వే చేయమన్న ప్రభుత్వం.....పవన్ కల్యాణ్ మీద ఫైర్ అయిన వర్ల మార్పు వచ్చతట్లూ లేదు రామయ్య తీర్లా....సిరిసిల్లల ముగబోయిన పవర్ లూమ్ అపుతాలేదంటూ యాజమాన్యం జూలుం...యువతిని చర పట్టిన ఎమ్మెల్సీ కొడుకు కేసు నిలవడతదో లేదో మీఅందరికి తెలుసు....ప్రేమ జంట తాళ్లి తెంపిన సీఐ రామకృష్ణ ఎట్ల బుద్దస్తాదో కృష్ణ కృష్ణ....పార్టీ మారకుంటే పదవి ఉషిపోవాల్సిందే అలేరు ఎమ్మెల్యే ఆగమగం పని పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

పెద్దపల్లిలో మంత్రి లక్ష్మారెడ్డి పర్యటన

పెద్దపల్లి : జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆరోగ్యా శాఖ మంత్రి లక్ష్మారెడ్డి సందర్శించారు. రోగులకు దుప్పట్లు అందించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో 4వేల డాక్టర్ పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు.

19:38 - May 8, 2017

హైదరాబాద్ : ప్రియుడు మోసం చేశాడని ఆరోపిస్తూ మెట్టుగూడలో మహేశ్వరి అనే యువతి న్యాయపోరాటానికి దిగింది. ప్రియుడి ఇంటి ముందు బైఠాయించింది. మహేశ్వరి, శ్రీకాంత్ లు ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కాగా.. ఇటీవల శ్రీకాంత్ మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధపడినట్లు మహేశ్వరి చెబుతోంది. తనకు న్యాయం చేయమంటూ చిలకలగూడ పోలీసులకు పిర్యాదు చేసింది. శ్రీకాంత్ అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో పోలీసులు పట్టించుకోవట్లేదని మహేశ్వరి ఆరోపిస్తోంది. మహేశ్వరి పోరాటానికి మహిళా సంఘాలు మద్దతు పలికాయి.

19:36 - May 8, 2017

హైదరాబాద్ : ప్రజాస్వామ్యంలో తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేసే వేదికైన ధర్నాచౌక్ ను ఎత్తివేయడం హక్కులను కాలరాయడమేన్నారు సిఐటియు నేత సాయిబాబు. ఇందిరాపార్క్ ధర్నా చౌక్ ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ బీడీ కార్మికులు చేపట్టిన నిరసనలను ఆయన ప్రారంభించారు. ధర్నా చౌక్‌ పరిరక్షణ కోసం ఈ నెల 15న చేపట్టే సమరంలో అన్ని రంగాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని సాయిబాబు పిలుపునిచ్చారు. .

 

19:35 - May 8, 2017

ఖమ్మం : ఎర్ర బంగారాన్ని సాగు చేసిన రైతు కంట కన్నీరు కారుతోంది. ఆరుగాలం కష్టించి పండించిన మిర్చి పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో.. కడుపు మండి గత నెల 28న ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయాన్ని రైతులు ధ్వంసం చేశారు. ఈ ఘటనలో 10 మంది రైతులపై 8 కేసులు నమోదు చేసి 14 రోజులు రిమాండ్‌కు తరలించారు. 11 రోజులుగా జైలుకు వెళ్లిన తమ వాళ్లను చూడనివ్వటం లేదని రైతుల కుటుంబాలు అవేదన వ్యక్తం చేస్తున్నాయి.

 

 

19:32 - May 8, 2017

గుంటూరు : తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా ఏపీ కేడర్‌కు చెందిన ఉత్తరాది ఐఏఎస్‌ అధికారి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ నియామకం వివాదాస్పదమౌతోంది. ప్రభుత్వం ప్రకటన తరువాత.... 3రోజుల క్రితం ఈవో సింఘాల్‌ బాధ్యతలు కూడా తీసుకున్నారు. ఈ తరుణంలో సింఘాల్‌ నియమాకంపై వివిధ వర్గాల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతోంది. నిన్న విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, నేడు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. టీటీడీ ఈవో నియమామకంపై ప్రశ్నలు సంధించారు. టీటీడీ ఈవోగా అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ నియామకంపై ట్విటర్‌ ద్వారా స్పందించిన పవన్‌ కల్యాణ్‌... పలు ప్రశ్నలు సంధించారు. ఉత్తరాదికి చెందిన ఐఏఎస్‌ అధికారిని ఈవోగా ఎందుకు నియమించాల్సి వచ్చిందో దక్షిణాది ప్రజలకు ఏపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. టీటీడీ ఈవోగా ఉత్తరాదికి చెందిన అధికారి భాధ్యతలు చేపట్టడాన్ని వ్యతిరేకించనని అంటూనే... ఉత్తరభారతంలోని అమర్‌నాథ్‌, వారణాసి, మథుర వంటి దేవాలయాల్లో దక్షిణాదికి చెందిన వారిని అధికారులుగా ఎందుకు నియమించడంలేదని జనసేనాని ప్రశ్నించారు.

టీడీపీ నేతలు తీవ్ర స్పందన...
టీటీడీ ఈవో విషయంలో పవన్‌ కల్యాణ్‌ చేసిన ట్వీట్‌పై రాష్ట్ర మంత్రులు, టీడీపీ నేతలు తీవ్రంగా స్పదిస్తున్నారు. ఈవోగా ఎవర్ని నియమించాలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు బాగా తెలుసని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత వ్యాఖ్యానించారు. ఎవరు బాగా పని చేస్తారో ముఖ్యమంత్రికి బాగా తెలుసన్నారు. పవన్‌ విమర్శలపై టీడీపీ ఎమ్మెల్సీ బాబూరాజేంద్ర ప్రసాద్‌ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి విషయాలపై తన అభిప్రాయాలను తెలిపేముందు పవన్‌ కల్యాణ్‌ వాస్తవాలు అధ్యయనం చేయాలని సూచించారు. ఐఏఎస్‌ అధికారులను ఎక్కడైనా నియమించవచ్చని, అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ మంచి భక్తుడన్న విషయాన్ని ప్రస్తావించారు. ఐఏఎస్‌ అధికారులను కులాలు, మతాలు, ప్రాంతాల వారీగా విభజించడం సరికాదని హితవు పలికారు. టీడీపీ నేత వర్ల రామయ్య కూడా పవన్‌ ట్వీట్‌పై మండిపడ్డారు. భారతీయులంతా ఒకటేనని, ఆలిండియా సర్వీసు అధికారులను ఎక్కడైనా నియించుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని గుర్తు చేశారు. దక్షిణాదికి చెందిన వ్యక్తి ప్రధానులు, రాష్ట్రపతులుగా పని చేసిన విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. సున్నితమైన అంశాలపై వ్యాఖ్యలు చేసే ముందు పూర్వాపరాలు, పర్వవసానాలు గురించి ఆలోచించాలని దేశం నేతలు పవన్‌ కల్యాణ్‌కు సూచిస్తున్నారు.

19:25 - May 8, 2017

గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబుపై వైసిపి తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు మంత్రి సోమిరెడ్డి. పెట్టుబడుల కోసం చంద్రబాబు అమెరికా వెళ్తే పార్టీ నిధులు సేకరించడానికి వెళ్లాడని.. ఆయనను అరెస్ట్ చేయమని అమెరికా పోలీసులకు వైసిపి నేతలు మెయిల్స్ పెట్టారని సోమిరెడ్డి ఆరోపించారు. వైసిపి పెట్టిన మెయిల్స్ కారణంగా చంద్రబాబుకు సెక్యూరిటీ పెంచారని, మెయిల్స్ పెట్టిన వారి వివరాలను అమెరికన్ పోలీసులు సేకరిస్తున్నారని ఆయన చెప్పారు. చంద్రబాబు పర్యటన నుంచి వచ్చాక ప్రభుత్వం తరపున మెయిల్స్ పంపిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని సోమిరెడ్డి చెప్పారు.

19:03 - May 8, 2017

విశాఖ : చాలాకాలంగా ప్రశాంతంగా కనిపించిన విశాఖ ఏజెన్సీలో.. ఉన్నట్టుండి మావోయిస్టులు ఉనికిని చాటుకోవడం.. పోలీసు శాఖను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఏవోబీలో మావోయిస్టుల జాడే లేదని.. వారి కార్యకలాపాలు పూర్తిగా ఆగిపోయాయని భావిస్తోన్న పోలీసులు.. చింతపల్లి మండలం, నారాయణపురం వద్ద, మావోయిస్టులు భారీ మందుపాతరను పేల్చడంతో ఉలిక్కిపడ్డారు. పైగా, ముఖ్యమంత్రి తనయుడు, రాష్ట్ర పంచాయతీరాజ్‌ మంత్రి నారా లోకేశ్‌ పర్యటిస్తున్న సమయంలో మందుపాతర పేలడం.. పోలీసు శాఖను కలవరానికి గురి చేసింది. నిజానికి నిరుడు అక్టోబర్ 23న జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఆర్కే తనయుడు మున్నా సహా 24 మంది మావోయిస్టులు మరణించారు. ఆ ఘటనలో మావోయిస్టు అగ్రనేత ఆర్కే త్రుటిలో తప్పించుకున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌ తర్వాత, మావోయిస్టుల నుంచి దాదాపు ఎలాంటి ప్రతిఘటనా లేకపోవడంతో, పోలీసు శాఖ పూర్తిగా రిలాక్స్‌ అయింది. ఈ తరుణంలో, నారాయణపురం వద్ద మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో.. పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఈ ఏరియాలో మావోయిస్టుల కార్యకలాపాల నియంత్రణపై ప్రత్యేక దృష్టిని సారించింది.

పార్టీ అగ్రనేతలు....
ఈ నెల 27 నుంచి 29 వరకు విశాఖలో జరిగే టిడిపి మహానాడుకు పార్టీ అగ్రనేతలు హాజరుకానున్నారు. వీరిలో చాలామంది మావోల హిట్ లిస్ట్ లో ఉన్నారు. వీరిపై ఎటువైపు నుంచైనా మావోయిస్టుల దాడులు జరిగొచ్చన్న అనుమానాలూ ఉన్నాయి. దీంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. వాస్తవానికి, మందుపాతర పేలిన మర్నాడే డిజిపి సాంబశివరావు ఉత్తరాంధ్ర పోలీసు అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. మహానాడుకి వచ్చే నేతలకు భద్రత కల్పించే అంశంతో పాటు ఏవోబీలో మావోల ప్రాబల్యం ఏవిధంగా అరికట్టాలనే అంశాలపై సమావేశంలో చర్చించారు. అటు ప్రభుత్వం కూడా, మావోయిస్టుల ఏరివేతలో ఎక్స్‌పర్ట్‌గా భావించే ఐపీఎస్ రిటైర్డ్ అధికారి కోడె దుర్గా ప్రసాద్ ను మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల రోడ్ల నిర్మాణం సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏవోబీలో మావోయిస్టులను నియంత్రించడమే కోడె దుర్గాప్రసాద్ నియామకం వెనుక ప్రధాన ఉద్దేశమన్న భావన వ్యక్తమవుతోంది. మొత్తానికి, ఈనెల 27 నుంచి జరిగే మహానాడుకు భద్రత కల్పించడాన్ని పోలీసులు సవాల్‌గా తీసుకున్నా

18:59 - May 8, 2017

శ్రీకాకుళం : జిల్లాకు ఏనుగుల భయం పట్టుకుంది. పదేళ్లుగా సీతంపేట ఏజెన్సీ పరిధిలో నాలుగు ఏనుగులు కలవరపెడుతుంటే... ఇప్పుడు మందస ఏజెన్సీ ప్రాంతంలో ఒడిశా నుంచి ప్రవేశించిన ఏడు ఏనుగులు స్థానికులను భయపెడుతున్నాయి. ఇప్పటికే కౌసల్య కొండ పరిసర ప్రాంతాల్లోకి చేరి జీడి, మామిడి, అరటి తోటలను, చోడి పంటలను ధ్వంసం చేశాయి. దీంతో స్థానికులు భీతిల్లిపోతున్నారు. ఏనుగుల అలజడితో అప్రమత్తమైన స్థానిక అటవీ అధికారులు ఏనుగులను తిరిగి వచ్చిన దారిలో పంపించే ప్రయత్నం చేస్తున్నారు. వేసవికాలంలో అటవీ ప్రాంతంలో నీటి లభ్యత తక్కువగా ఉండడంతో.. నీటిని వెతుక్కుంటూ ఏనుగులు ఇక్కడకు వచ్చి ఉంటాయని అధికారులు అంటున్నారు.

కవ్వింపు చర్యలు....
అయితే స్థానికులు ఏనుగుల గుంపుపై ఎలాంటి కవ్వింపు చర్యలు చేయకుండా ఉంటే.. ఎటువంటి ప్రమాదం ఉండదని అంటున్నారు. అయితే ఈ సమస్య తీవ్రమవ్వకముందే... దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లావాసులు కోరుతున్నారు. పదేళ్లుగా ఇక్కడ తిష్ట వేసిన ఏనుగుల గుంపు వల్ల ఇప్పటికే ఇద్దరు మృతి చెందగా.. వేలాది ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. ఆ ఏనుగులకే చెక్‌ పెట్టలేని అధికారులు ... ఈ ఏడు ఏనుగుల బారీ నుంచి తమను రక్షించగలరా అని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

18:56 - May 8, 2017

అనంతపురం : మాజీ ఎమ్మెల్యే నారాయణరెడ్డి భౌతిక కాయాన్ని.... వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి సందర్శించి... నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. నారాయణరెడ్డికి దివంగత నేత వైఎస్సార్‌తో సన్నిహిత సంబంధాలుండేవి. నారాయణరెడ్డి మూడు సార్లు అనంతపురం ఎమ్మెల్యేగా పనిచేశారు.

18:54 - May 8, 2017

అనంతపురం : జిల్లాలో అప్పుల బాధతో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పెదవడుగూరు మండలం, మిడుతూరు గ్రామానికి చెందిన కాయపాటి పుల్లన్న తన పొలంలో పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు. నాలుగు లక్షలు వెచ్చించి..సాగు చేసిన పత్తి పంటకు గిట్టుబాటు ధర లేక..పెట్టుబడి కూడా తిరిగి రాలేదు. దీంతో అప్పులు తీర్చే దారి లేక పుల్లన్న ఆత్మహత్యకు పాల్పడ్డాడని..మొత్తం ఆరు లక్షలు అప్పులు ఉన్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

18:52 - May 8, 2017

ఢిల్లీ : తూర్పు గోదావరి జిల్లా, విశాఖ రూరల్, విజయనగరంలో మావోయిస్టుల సమస్య ఉందని ఏపీ డీజీపీ సాంబశివరావు అన్నారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన అంతరాష్ట్ర మండలి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అలాగే ఆయా ప్రాంతాల్లో సీఆర్ ఫీఎఫ్ బెటాలియన్ ఇవ్వాలని.. అభివృద్ధి కార్యక్రమాల కోసం 1200 కోట్ల రూపాయల నిధులు కేంద్రాన్ని కోరామన్నారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో గ్రేహౌండ్స్ ఏర్పాటు చేయాలని కోరగా.. కేంద్రం సానుకూలంగా స్పందించిందని డీజీపీ చెప్పారు.

18:49 - May 8, 2017

గుంటూరు : వినియోగదారులు మోసపోకుండా... అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. తూనికల్లో జరుగుతున్న అక్రమాలపై మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమీక్షించారు. తూనికలు, కొలతల్లో అక్రమాలకు అరికట్టేందుకు త్వరలో టోల్‌ ఫ్రీ నెంబర్‌ ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. 16 వందల 71 చౌక ధరల షాపుల్లో కొలతలు తేడాలు ఉన్నట్టు తెలిసిందని.. వారిపై చర్యలు తీసుకున్నామని చెప్పారు.

18:47 - May 8, 2017

ఢిల్లీ : దేశ రాజధానిలో ఏపీ, తెలంగాణ అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. ఏపీ రెసిడెంట్‌ కమిషనర్‌ నివాసం తమకు అప్పగించాలంటూ తెలంగాణ అధికారులు గదికి తాళాలు వేశారు. విభజన చట్టం ప్రకారం ఆంధ్రాకు 58 శాతం, తెలంగాణకు 42 శాతం భవనాలు రావాలని తెలంగాణ అధికారులు వాదిస్తుండగా.. మొదటి నుంచి తమ ఆధీనంలోనే ఉన్న భవనాన్ని ఇప్పుడు ఎలా ఇస్తామని ఆంధ్రా అధికారులు ప్రశ్నించారు. తెలంగాణ అధికారులు వేసిన తాళాన్ని ఆంధ్రా అధికారులు పగుల గొట్టడంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

18:44 - May 8, 2017

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌ పాలిసెట్, ఎడ్ సెట్‌, లాసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విజయవాడలోని ప్రభుత్వ అతిథి గృహంలో విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదలచేశారు. పాలిసెట్ పరీక్షకు లక్షా 22 వేల మంది హాజరవ్వగా 96155 మంది అర్హత సాధించారని గంటా శ్రీనివాసరావు తెలిపారు. పాలిసెట్ 1st ర్యాంకు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సాయి ప్రవీణ్ గుప్తా.. 2nd ర్యాంకు కృష్ణా జిల్లాకు చెందిన మధు మురళి సాధించారు. జూన్ మొదటి వారంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు.

18:40 - May 8, 2017
18:33 - May 8, 2017

నెల్లూరు : జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాలలో దారుణం జరిగింది. భార్యభర్తల గొడవలో భర్తపై భార్య కాగే నూనెపోసింది. భర్తకు తీవ్ర గాయాలు అవడంతో ఆసుపత్రికి తరలించారు. మహ్మద్ మరియమ్మలకు 9 సంత్సరాల క్రితం పెళ్లి అయింది. మహ్మద్ మద్యానిక బానిస అవడంతో మరియమ్మ భర్త మహ్మద్ తో గొడవ పడేది. నీన్న రాత్రి తాగి వచ్చి మరియమ్మ ను భర్త మహ్మద్ కొట్టడంతో ఆమె ఈ దారుణానికి పాల్పడింది.

 

18:27 - May 8, 2017

గుంటూరు : గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలంటూ కొద్దిరోజులుగా నిరుద్యోగుల ఆందోళనకు ప్రభుత్వం దిగివచ్చింది. ప్రీలిమ్స్ మెయిన్స్ కు కేవలం 30 రోజుల ఉండడంతో మెటీరియల్ కూడా అందుబాటులో లేకపోమడంతో ఏపీపీఎస్ సీ గ్రూప్2మెయిన్స్ పరీక్షలు వాయిదా వేసింది. మళ్లి పరీక్షలు జూలై 15, 16 తేదీల్లో పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయంచారు. పంచాయితీ కార్యదర్శి పరీక్షను జూలై 30వ తేదీకి వాయిదా వేశారు.

 

18:01 - May 8, 2017

హైదరాబాద్ : హోమియోకేర్ ఇంటర్నేషనల్.. తమ కాన్టిట్యూషనల్ హోమియోపతి.. హ్యాపీ పేషెంట్స్‌ పేరుతో విజయోత్సవ వేడుకను హైదారాబాద్‌లో ఘనంగా నిర్వహించింది. ప్రారంభించిన కొద్దికాలంలోనే కాన్టిట్యూషనల్ హోమియోపతి కోటిన్నర మందికి చికిత్స అందించామని సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఈ వేడుకలో సినీ నిర్మాత అల్లు అరవింద్ పాల్గొన్నారు. హోమియోకేర్ ట్రీట్‌మెంట్స్ ద్వారా దీర్ఘకాలిక వ్యాధులకు సరైన వైద్యం పొంది.. ప్రస్తుతం ఉత్సాహంగా ఉన్న వారు, వారి కుటుంబసభ్యులు తమ అనుభవాలు పంచుకున్నారు. 

17:58 - May 8, 2017

సిరిసిల్ల : జిల్లాలో టెక్స్‌టైల్ కార్మికులు కదంతొక్కారు. గతేడాది మంత్రి కేటీఆర్ సమక్షంలో చేసుకున్న కూలీ ఒప్పందాన్ని యాజమాన్యాలు తుంగలో తొక్కుతున్నాయని సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లె కలెక్టరేట్ ఎదులు కార్మికులు నిరవధిక బంద్ పాటిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మాజీ ఎమ్మెల్సీ సీతారామ్ పాల్గొని కార్మికులకు మద్దతు తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని కార్మికులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.   

17:55 - May 8, 2017

సిద్దిపేట : జిల్లా నంగనూర్‌ మండలం గట్లమల్యాల గ్రామానికి చెందిన రైతు వెంకటేశ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటేశ్‌ తనకు ఉన్న రెండు ఎకరాల భూమికి తోడు మరో రెండెకరాలు కౌలుకు తీసుకుని మొక్కజొన్న సాగు చేశాడు. బోరుబావిలో నీరు లేకపోవడంతో పంట ఎండిపోయింది. దీంతో సాగుకోసం చేసిన అప్పు తీరే మార్గంలేదన్న మనస్తాపంతో పొలంలోని వ్యవసాయ బావి వద్ద పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో వెంకటేశ్‌ భార్య లక్ష్మి, ఆరు నెలల పాప లిఖిత రోడ్డున పడ్డారు. వెంకటేశ్‌ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బంధువులు కోరుతున్నారు.

 

17:52 - May 8, 2017

కామరెడ్డి : పుట్టిన బిడ్డతో పాటు బాలింత మృతి చెందిన విషాద ఘటన జిల్లాలోని మండలం ఆరేపల్లిలో జరిగింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు నజీరాబేగం, ఏఎన్ఎం అనితల నిర్లక్ష్యమే అందుకు కారణమంటూ మృతురాలి బంధువులు కామారెడ్డి ఏరియా ఆసుపత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు. రేణుక అనే గర్భిణిని ముందుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఏఎన్ఎం అనితకు డెలివరీ చేసేందుకు ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి రేణుకను తరలించారు. వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేసినా అప్పటికే బిడ్డ చనిపోయింది. అధిక రక్తస్రావంతో బాధపడుతున్న రేణుకను హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి గాంధీ ఆసుపత్రిలో రేణుక మృతి చెందింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు రేణుక మృతదేహంతో కామారెడ్డి ఏరియా ఆసుపత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు. 

17:39 - May 8, 2017
17:37 - May 8, 2017
17:35 - May 8, 2017

బాబుకు మధు లేఖ..

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబుకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు లేఖ రాశారు. విద్యుత్ శాఖలో 23వేల మంది కాంట్రాక్టు కార్మికుల రెగ్యులరైజ్ హామీని నెరవేర్చాలని..ఆశా వర్కర్లకు రూ. 6వేల వేతనం ఇవ్వాలని, ఆశా వర్కర్ల అదనపు పనికి పారితోషకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సుల్తాన్ పూర్ లో 144 సెక్షన్..

పెద్దపల్లి : ఎలిగేడు (మం) సుల్తాన్ పూర్ లో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. దీనితో పోలీసులు 145 సెక్షన్ విధించారు. సమస్య పరిష్కారమయ్యేంత వరకు వివాదాస్పద స్థలంలో నిర్మాణాలు చేపట్టవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

 

17:21 - May 8, 2017

హైదరాబాద్ : నగరంలోని  అక్రమ కట్టడాలను జీహెచ్ ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. మాదాపూర్‌లో ఐదంతస్తుల భవనాన్ని కూల్చివేశారు. కూల్చివేతల్లో ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఇంప్లోజన్‌ టెక్నాలజీతో భవనాలను ఒకే సారి కూల్చివేస్తున్నారు. కొత్తవిధానం సత్పలితాలను ఇస్తుందని.. మరిన్ని ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఉందని నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ చెప్పారు.

17:17 - May 8, 2017

జమ్మూకాశ్మీర్ : పాకిస్థాన్‌ ఆర్మీపై మన సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. గతవారం పాకిస్థాన్‌ సైనికులు ఇద్దరు భారత జవాన్లను శిరచ్ఛేదం చేసిన ఘటనకు బదులు తీర్చుకుంది. నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్‌ సైనిక బంకర్లపై మన ఆర్మీ దాడులు చేసినట్టు ఒక వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. లక్ష్యాలను ఛేదించే క్షిపణులతో పాక్‌ సైనిక బంకర్లపై దాడి చేసిన తర్వాత యుద్ధ ట్యాంకులు విరుచుకుపడిన దృశ్యాలు వీడియోలో సష్టంగా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత భారీ పేలుళ్లు సంభవించిన దృశ్యాలు ఉన్నాయి. అయితే ఈ వీడియో ఎప్పటిదన్న అంశంపై స్పష్టతలేదు. దీనిపై మన సైనిక దళం కూడా స్పష్టమైన ప్రకటన చేయలేదు. 

17:15 - May 8, 2017

సంగారెడ్డి : జిల్లాలో కబ్జా రాయుళ్లు రెచ్చిపోతున్నారు. ఈదులనాగులపల్లిలో కోట్లాది రూపాయల విలువైన భూములని కొందరు ఆక్రమించుకున్నారు. దీనిపై సంబంధిత భూముల యజమానులైన గౌతమి నగర్‌ సొసైటీ సభ్యులు కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశారు.పూర్తి వివరాలకు వీడియో చూడండి.  

17:11 - May 8, 2017

హైదరాబాద్‌ : నగరంలో  అక్రమ కట్టడాలను జీ హెచ్ ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. మాదాపూర్‌లో ఐదంతస్తుల భవనాన్ని కూల్చివేశారు. కూల్చివేతల్లో ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. డిటోనేటర్లు పెట్టి భవనాలను ఒకే సారి కూల్చివేస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

17:06 - May 8, 2017

హైదరాబాద్ : ఈ రోజు కోఠి ప్రభుత్వ ఆసుపత్రిని మహిళ కాంగ్రెస్ నేతలు సందర్శించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరుగుతున్న బాలింతల మరణాలపై తెలంగాణ కాంగ్రెస్ మహిళా నేతలు భగ్గుమన్నారు. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ మరణాలు సంభవిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి బాధ్యత వహిస్తూ లక్ష్మారెడ్డి వెంటగనే రాజీనామా చేయాలని డికే అరుణ డిమాండ్ చేశారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.  

16:59 - May 8, 2017

గుంటూరు : ఏపీ సచివాలయం ఉద్యోగి కరుణం సాయికుమార్‌ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలు రావడంతో సాయికుమార్‌ బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. తాడేపల్లి పట్టణంలో ఉన్న అతని తమ్ముడు వెంకటేశ్వరరావు ఇంట్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

ఆయా జిల్లాల్లో మావోయిస్టుల ప్రభావం - ఏపీ డీజీపీ...

ఢిల్లీ : తూ.గో, విశాఖ ఏజెన్సీ, విజయనగరం జిల్లాల్లో మావోయిస్టుల ప్రభావం ఉందని ఏపీ డీజీపీ సాంబశివరావు పేర్కొన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఏపీ గ్రే హౌండ్స్ ఏర్పాటుకు కేంద్ర నిధులు..ఏపీకి సీఆర్పీఎఫ్ బెటాలియన్ ఏర్పాటుకు కేంద్రం అంగీకారం తెలిపింది. మావోయిస్టుల అంశంపై తెలుగు రాష్ట్రాల సమన్వయంతో పనిచేస్తున్నాయని, ఏపీ పోలీసు వ్యవస్థ బలోపేతానికి కేంద్రం హామీనిచ్చిందని డీజీపీ వెల్లడించారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలన్నీ మరింత సమన్వయంతో సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవాలని నిర్ణయించామని తెలిపారు.

16:54 - May 8, 2017
16:46 - May 8, 2017

తూర్పు గోదావరి : జిల్లాలోకాకినాడ కలెక్టరేట్‌ సీపీఎం ఆధ్వర్యంలో వద్ద మజ్జిగ కేంద్రం ఏర్పాటు చేశారు. సోమవారం గ్రీవెన్స్‌ డే సందర్భంగా పెద్దసంఖ్యలో వచ్చే ప్రజల కోసం ఈ చలివేంద్రం నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి వీడియో క్లిక్ చేయాండి.

కూల్చివేతలకు అత్యాధునిక టెక్నాలజీ - మేయర్ బొంతు..

హైదరాబాద్ : అక్రమాల కట్టడాల కూల్చివేతకు ఇంప్లోజన్ టెక్నాలజీ వాడుతున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ వెల్లడించారు. గ్రేటర్ లో అక్రమ కట్టడాలను సమూలంగా తొలగిస్తామని, భవిష్యత్ లో దీనిని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఎస్ బీఐ వడ్డీ రేట్లు స్వల్ప తగ్గింపు..

ఢిల్లీ : భారతీయ స్టేట్ బ్యాంక్ వడ్డీ రేట్లను స్వల్పంగా తగ్గించింది. రూ. 30 లక్షల వరకు గృహ రుణాలపై వడ్డీ రేటు పావుశాతం..రూ. 30 లక్షల వరకు గృహ రుణాలపై వడ్డీరేటు 8.35 శాతం తగ్గించింది. తగ్గించిన వడ్డీ రేట్లు రేపటి నుండి అమల్లోకి రానున్నాయి.

16:42 - May 8, 2017

యాదాద్రి :  జిల్లా వలిగొండ మండలం ఆరూర్‌ గ్రామంలె విషాదం నెలకొంది. పంచాయతీ పరిధిలోని జంగారెడ్డిపల్లి చెరువులో నీట మునిగి ముగ్గురు యువకులు చనిపోయారు. మృతులను లింగోటానికి చెందిన శ్రీనివాస్‌, సర్వేలుకు చెందిన గణేష్‌, శ్రీకాంత్‌గా గుర్తించారు. వీరంతా జంగారెడ్డిపల్లలో జరుగుతున్న దుర్గమ్మ పండుగకోసం శివరాత్రి నర్సింహా ఇంటికి వచ్చారు. ఈ ఉదయం ఈత కోసం వెళ్లి ప్రమాదవశాత్తూ నీటమునిగి చనిపోయారు. దీంతో జంగారెడ్డిపల్లిలో విషాదం నెలకొంది.

 

తెలుగు రాష్ట్రాల అధికారుల వాగ్వాదం...

ఢిల్లీ : ఏపీ, తెలంగాణ భవన్ లో అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఏపీ రెసిడెంట్ కమిషనర్ నివాసంపై వివాదం నెలకొంది. ఇప్పటి వరకు రెసిడెంట్ కమిషనర్ నివాసాన్ని ఏపీ వాడుకొంటోంది. తమకూ వాటా ఉందని తెలంగాణ అధికారులు వాదిస్తూ నివాసానికి తాళాలు వేశారు. పరస్పరం ఇరు రాష్ట్రాల అధికారులు వాగ్వాదానికి దిగారు.

ఐదంతస్తుల భవనం కూల్చివేత..

హైదరాబాద్ : మాదాపూర్ సున్నం చెరువులో ఐదంతస్తుల అక్రమ కట్టడాన్ని జీహెచ్ఎంసీ కూల్చివేసింది. ఇంప్లోజన్ పద్ధతిలో భవనాన్ని కూల్చివేశారు.

తూనికలు..కొలతలపై మంత్రి ప్రత్తిపాటి సమీక్ష..

విజయవాడ : తూనికలు, కొలతలపై మంత్రి ప్రత్తిపాటి సమీక్ష నిర్వహించారు. పెట్రోల్, ఎరువుల కొనుగోలులాంటి విషయాలలో వినియోగదారులు మోసపోతున్నారని పేర్కొన్నారు. మోసం చేసే పెట్రోల్ బంకులు, కంపెనీలపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. 26 వే బ్రిడ్జిలలో కొలతలు సరిగ్గా లేవని తేలిందని, 1671 చౌక ధరల షాపుల్లో కొలతలు తేడాలున్నట్లు, డీలర్లపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

ఏపీలో డిప్యూటి కలెక్టర్ల బదిలీ...

విజయవాడ : రాష్ట్రంలో పలువురు డిప్యూటి కలెక్టర్లు బదిలీ అయ్యారు. చిత్తూరు జాయింట్ కలెక్టర్ గా వీఆర్ చంద్రమౌళి, తెలుగు గంగ ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ గా పి.ప్రశాంతి, కర్నూలు ఆర్డీవోగా హుస్సేన్ సాహెబ్, ఆత్మకూరు ఆర్డీవోగా టి.బాపిరెడ్డి నియమితులయ్యారు.

వైసీపీవి తప్పుడు మెయిల్స్ - మంత్రి సోమిరెడ్డి...

విజయవాడ : చంద్రబాబు అంతర్జాతీయ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసేందుకు వైసీపీ తప్పుడు మెయిల్స్ పెట్టిందని మంత్రి సోమిరెడ్డి తెలిపారు. ఐదు కోట్ల మంది ఎన్నుకున్న సీఎంని అరెస్టు చేయాలంటూ వైసీపీ నాయకులు మెయిల్స్ పెట్టారని పేర్కొన్నారు. అమెరికన్ పోలీసులు చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం తరపు ఎలాంటి ఫిర్యాదు చేయాలనే దానిపై చంద్రబాబు వచ్చాక నిర్ణయం తీసుకుంటామన్నారు.

మహిళా సంఘాల బలోపేతానికి చర్యలు - మంత్రి పరిటాల సునీత..

విజయవాడ : మహిళా సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. ప్రతి మహిళకు నెలకు రూ. 10వేల ఆదాయం తీసుకరావడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు, మహిళా సంఘాల ద్వారా ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో అమలయ్యేలా చూస్తున్నట్లు తెలిపారు. చంద్రన్న బీమా, పెన్షన్లు సక్రమంగా అమలయ్యే విధంగా చూస్తున్నట్లు, డ్వాక్రా రుణాలను కొందరు సొంత ఖర్చులకు వాడుకుంటున్నారన్నారు.

 

14:46 - May 8, 2017

మెగాస్టార్ కుటుంబంపై సోషల్ మాధ్యమాల్లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఆయన ఇంట్లో త్వరలోనే పెళ్లి భాజాలు మోగనున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. మెగా కాంపౌండ్ నుండి వచ్చి హీరోగా స్థిరపడిన హీరోల్లో 'సాయి ధరమ్ తేజ' ఒకరు. ఇటీవలే 'నాగబాబు' తనయ 'నిహారిక' కూడా హీరోయిన్ గా స్థిరపడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇదిలా ఉంటే వీరిద్దరిపై సోమవారం పలు వార్తలు సందడి చేశాయి. త్వరలోనే 'నిహారిక' -'సాయిధరమ్ తేజ' లు ఒక్కటి కాబోతున్నారని..వీరి వివాహానికి 'మెగాస్టార్' గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. వారిద్దరి పెళ్లి వార్తలు పుకార్లేనని కొందరు వాదిస్తున్నారు. మరి అసలు విషయం ఏంటో మెగా ఫ్యామిలీ స్పందిస్తే కాని తెలియదు..అంత వరకు ఇలాంటి వార్తలు వస్తూనే ఉంటాయి.

14:38 - May 8, 2017

చలన చిత్ర పరిశ్రమల్లో అగ్ర కథానాయకుల సరసన నటించాలని పలువురు హీరోయిన్లు ఆసక్తి కనబరుస్తుంటారన్న సంగతి తెలిసిందే. వారితో కనీసం యాక్ట్ చేయాలని...వారితో కనీసం డ్యాన్స్ అయినా చేయాలని తహతహలాడుతుంటారు. అందులో కొంతమంది హీరోయిన్స్ కు మాత్రమే ఛాన్స్ దొరుకుతుంది. తమిళ సూపర్ స్టార్ 'రజనీకాంత్' సరసన నటించాలని చాలా మంది అనుకుంటుంటారు. కానీ బాలీవుడ్ నటి ఆయన సరసన నటించేందుకు 'నో' చెప్పిందని సోషల్ మాధ్యమాల్లో తెగ ప్రచారం జరుగుతోంది. ఇటీవలే పా. రంజిత్ దర్శకత్వంలో వచ్చిన 'కబాలి' విజయం సాధించింది. ఆయన దర్శకత్వంలోనే మరో చిత్రంలో నటించేందుకు 'రజనీ' గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో 'రజనీ' సరసన బాలీవుడ్ నటి 'విద్యా బాలన్' నటించనున్నారని ప్రచారం జరిగింది. ఈ విషయంపై త్వరలో ప్రకటిస్తానని పేర్కొన్నట్లు సోషల్ మాధ్యమాల్లో వార్తలు వెలువడ్డాయి. కానీ ఇప్పుడు డేట్లు కుదరక ఏకంగా సినిమా నుండే తప్పుకున్నట్లు సమాచారం. దీనితో వేరే కథానాయిక ఎంపిక చేసే యోచనలో ఉన్నట్లు టాక్. మరి ఈ సినిమాపై త్వరలోనే అన్ని వివరాలను తెలియనున్నాయి.

13:55 - May 8, 2017

వివిధ భాషల్లో వచ్చిన సినిమాలు తెలుగులో రీమెక్ అవుతున్న సంగతి తెలిసిందే. పేరొందిన చిత్రాలు..ఘన విజయం సాధిస్తాయని అనుకున్న చిత్రాలను రీమెక్ చేసేందుకు అగ్ర హీరోలు సైతం ముచ్చట పడుతుంటారు. ఇలాంటి కోవలో 'వెంకటేష్', 'చిరంజీవి' తదితరులున్నారు. ప్రధానంగా 'వెంకీ' రీమెక్ చిత్రాల పట్ల ఆసక్తి కనబరుస్తుంటారు. ఇటీవలే వచ్చిన 'గురు' కూడా 'సాలా ఖదూస్' కు రీమెక్. తాజాగా మరో రీమెక్ చిత్రం పట్ల ఆసక్తి కనబరుస్తున్నట్లు టాక్. 'అక్షయ్ కుమార్' లీడ్ రోల్ లో వచ్చిన 'జాలీ ఎల్ఎల్ బీ 2'ని రీమెక్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటికే రూ. 1.75 కోట్లకు రీమెక్ రైట్స్ ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

13:30 - May 8, 2017

హైదరాబాద్ : కోఠి ప్రసూతి కేంద్రం వైపు రాజకీయ నేతలు అడుగులు వేశారు. గత కొన్ని రోజులుగా ఇక్కడ బాలింత మరణాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో రాజకీయ నేతలు, మహిళా నేతలు ప్రసూతి కేంద్రానికి క్యూ కట్టారు. గర్భిణీలను వారు పరామర్శిస్తూ పాలకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం నాడు మహిళా కాంగ్రెస్ నేతలు డీకే అరుణ, సబితా ఇంద్రారెడ్డి తో పాటు పలువురు నేతలు ప్రసూతి ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్భిణీలకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ఐద్వా నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నా చేపట్టారు. వెంటనే దీనిపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.

ఏపీలో డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు

గుంటూరు : ఏపీలో పలువురు డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేశారు. చిత్తూరు జాయింట్ కలెక్టర్ గా వీఆర్ చంద్రమౌళి, తెలుగు గంగ ప్రాజెక్ట్ స్పెషల్ కలెక్టర్ గా పి. ప్రశాంతి, కర్నూఉ ఆర్డీవోగా హుస్సేన్ సాహెబ్, నెల్లూరు జిల్లాడీఆర్వోగా వి. వెంకట సుబ్బయ్య, ఆత్మకూరు ఆర్డీవోగా టి. బాపిరెడ్డిని నియామించారు.

బాబు పర్యటన అడ్డుకునేందుకు కుట్ర : లోకేష్

గుంటూరు : బాబు పర్యటను అడ్డుకునేందుకు ప్రతిపక్షనేత జగన్ క్రిమినల్ తెలివిని వాడుతున్నారని మంత్రి లోకేష్ ఆరోపించారు. జగన్ కుట్ర అంతర్జాతీయ వేదికపై బయటపడిందని, ఉద్యోగ అవకాశాల కోసం సీఎం ప్రయత్నిస్తుంటే జగన్ ఉద్యోగాలు రాకూడదని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాని అన్నారు.

 

తీరుమారని గాంధీ ఆసుపత్రి సిబ్బంది

హైదరాబాద్ : సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి సిబ్బంది తీరు మారడం లేదు. తాగా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువతి స్ట్రెచర్ కోసం అరగంట పాటు వేచి చూసిన సిబ్బంది స్ట్రెచర్ ఇవ్వలేదు. దీంతో బంధువులు  108 స్ట్రెచర్ లాక్కునిఎమర్జెన్సీకి తరలించారు.

13:13 - May 8, 2017

హైదరాబాద్ : పాతబస్తీ..మదీనా..చెత్త బజార్...నిత్యం కిక్కిరిసి ఉంటుంది. అలాంటి బజార్ లో సోమవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. చుట్టుపక్కల ప్రాంతాల వాసులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. చెత్త బజార్ లో మూడంతస్తుల భవనం ఉంది. అందులో చెప్పుల దుకాణాలున్నాయి. సోమవారం ఈ భవనంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అండర్ గ్రౌండ్ లో చెలరేగిన మంటలు మూడంతస్తుల భవనం మొత్తం వ్యాపించాయి. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమీపంలో దుకాణలు ఉండడంతో తీవ్ర ఆందోళన చెలరేగింది. వెంటనే ఈ సమాచారాన్ని అగ్నిమాపక శాఖకు అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకొనే లోపే భవనం మొత్తం మంటలు వ్యాపించాయి. మూడు గంటల పాటు మంటలను అదుపులోకి తెచ్చేందుకు సిబ్బంది ప్రయత్నించారు. ఈ ఘటనలో భారీగానే ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఉదయం దుకాణం తెరవగానే పొగలు అలుముకుంటున్న వాసన వచ్చిందని, వెంటనే అప్రమత్తమయ్యేలోపు మంటలు భవనం మొత్తం వ్యాపించాయని ఓ దుకాణ దారుడు పేర్కొన్నారు. తన దుకాణానికి తీవ్ర నష్టం వాటిల్లిందని మరో దుకాణ దారుడు పేర్కొన్నారు. దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

13:01 - May 8, 2017
12:54 - May 8, 2017

బిడ్డకు జన్మనివ్వడం అంటే మహిళ మరో జన్మ ఎత్తినట్లే..గర్భిణీతో ఉన్న మహిళ 9 నెలల పాటు గర్భంలో ఉన్న శిశువు ఆరోగ్యంగా ఉండాలంటే తల్లి ఆరోగ్యంగా ఉండాల్సి ఉంటుంది.. ఇందుకు ప్రత్యేక శద్ధ కనబర్చాలి. ఇలాంటి శ్రద్ధ తీసుకోవడానికి మేమున్నాం...అంటూ 'పాంపర్ట్ మామ్ అండ్ పాంపర్ట్ కిడ్స్' నిర్వాహకులు..మరి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి...

12:41 - May 8, 2017
12:37 - May 8, 2017

ఢిల్లీ : ఛాంపియన్ ట్రోఫికి భారత్ జట్టు ఎంపికైంది. బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం క్రికెట్ సంబంధాలకే ఓటేసిన సంగతి తెలిసిందే. ఐసీసీతో తీవ్ర విబేధాలున్నప్పటికీ జూన్ 1 నుండి ఇంగ్లాండ్ లో జరుగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనాలని ఆదివారం నిర్ణయించింది. ఎమ్మెస్కే నేతృత్వంలో సీనియర్ సెలక్షన్ కమిటీ నేడు న్యూఢిల్లీలో సమావేశం ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే జట్టును ఎంపిక చేశారు. అందరూ ఊహించినట్లుగానే 'కోహ్లీ'ని కెప్టెన్ గా ఎంపిక చేశారు. ఆయనతో పాటు 15 మందిని ఎంపిక చేశారు. ధావన్, యువరాజ్, రోహిత్, రహానే, మనీష్ పాండే, ధోని, జాదవ్, హార్థిక్ పాండే, జడేజా, అశ్విన్, బుమ్రా, షమీ, ఉమేశ్, భువనేశ్వర్ కుమార్ లున్నారు.

ఛాంపియన్ ట్రోఫికి భారత్ జట్టు ఎంపిక

హైదరాబాద్: ఛాంపియన్ ట్రోఫికి భారత్ జట్టు ఎంపికైంది. జట్టు లో కోహ్లీ, ధావన్,యువీ, రోహిత్, రహానే, మనీష్ పాండే ధోని, హార్ధిక్ పాండే జడేజా, అశ్విన్, బూమ్రా, షమీ, ఉమేశ్, జాదవ్ ఎన్నికయ్యారు.

12:19 - May 8, 2017

కడప: ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో టిడీపి పాగా వేసింది. మున్సిపల్ ఛైర్మన్ రఘురామరెడ్డి ఏకగ్రీవం అయ్యారు. అయితే వైసీపీ కౌన్సిలర్లు ఎన్నికలో పాల్గొనకుండా దూరంగా ఉన్నారు.

12:16 - May 8, 2017

హైదరాబాద్: టిటిడి ఈవో నియామకం పై ట్విట్టర్ లో జనసేన అధినేత పవన్ కల్యాన్ ఫైర్ అయ్యారు. అమర్ నాథ్, వారణాషి, మధుర ఆలయాల్లో దక్షిణాది అధికారులను నియమిస్తారా అని ప్రశ్నించారు. అలాంటిది ఉత్తరాది అధికారులను దక్షిణ భారతీయులు ఎందుకు అంగీకరిస్తారు అన్ని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు నిర్ణయం నాకు ఆశ్చర్యం వేసిందని పవన్ పేర్కొన్నారు. ఉత్తరాది ఏఐఎస్ ను టీటీడీ ఈవోగా నియమించబడంపై చంద్రబాబు సమాధానం చెప్పాలని సూచించారు.

ఏపీ జీఏడీ జాయింట్ సెక్రటరీ ఇంటిపై ఏసీబీ దాడి

అమరావతి: ఏపీ జీఏడీ జాయింట్ సెక్రటరీ సాయికుమార్ ఇంటి పై ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. హైదరాబాద్, ఖైరతాబాద్, కడప, గుంటూరు, కర్నూలు, రాజమండ్ి, బెంగళూరులోని సాయికుమార్ ఇళ్లలో ఏసీబీ సోదాలు చేస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యం ఏసీబీ తనిఖీలు చేపట్టింది.

11:47 - May 8, 2017

ఢిల్లీ : లాలూప్రసాద్‌ యాదవ్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. దాణా కుంభకోణంలో లాలూ ప్రత్యేక విచారణ ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దాణా స్కాంలో వేర్వేరు కేసుల్లో విచారించాలని ఆదేశించింది. ఇప్పటికే దాణా స్కాంలో ఓ కేసులో లాలూప్రసాద్‌ యాదవ్‌ దోషిగా తేలాడు.

11:44 - May 8, 2017

హైదరాబాద్: బల్దియా పరిధిలో అక్రమ నిర్మాణాలపై జీహెచ్‌ఎంసీ కొరడా ఝుళిపిస్తోంది. మాదాపూర్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతకు రంగం సిద్ధం చేసింది. సున్నం చెరువు బఫర్‌జోన్‌లో అక్రమంగా నిర్మిస్తున్న ఐదంతస్తుల భవనాన్ని అధికారులు తొలిసారిగా ఇంప్లోషన్‌ పద్దతిలో కూల్చేయనున్నారు.

11:42 - May 8, 2017

హైదరాబాద్: తెలుగువారు ఒక్కక్కరు ఒక్కో బాహుబలిగా తయారై... ప్రపంచపటంలో తెలుగువారి సత్తా చాటాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. అమెరికాలో పర్యటిస్తున్న ఆయన... శాన్‌హూజ్‌లో ప్రవాసాంధ్రులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. తెలుగుబిడ్డ రాజమౌళి బాహుబలి చిత్రం ద్వారా తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటారని ప్రశంసించారు. విదేశాల్లో స్థిరపడ్డ వారంతా మాతృగడ్డను మరచిపోవద్దన్నారు. అమరావతి రాజధాని నగరం కూడా బాహుబలిలా తయారవుతుందని చమత్కరించారు.

11:34 - May 8, 2017

టిటిడీ ఈవో నియామకం పై స్పందించిన పవన్ కల్యాన్

హైదరాబాద్: టిటిడి ఈవో నియామకం పై ట్విట్టర్ లో జనసేన అధినేత పవన్ కల్యాన్ స్పందించారు. అమర్ నాథ్, వారణాషి, మధుర ఆలయాల్లో దక్షినాది అధికారులను నియమిస్తారా అని ప్రశ్నించారు. అలాంటిది ఉత్తరాది అధికారులను దక్షిణ భారతీయులు ఎందుకు అంగీకరిస్తారా అన్ని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు నిర్ణయం నాకు ఆశ్చర్యం వేసిందని పవన్ పేర్కొన్నారు. ఉత్తరాది ఏఐఎస్ ను టీటీడీ ఈవోగా నియమించబడంపై చంద్రబాబు సమాధానం చెప్పాలని సూచించారు.

ఎనుమాముల మార్కెట్ వద్ద ఉద్రిక్తత

వరంగల్ : ఎనుమాముల మార్కెట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మార్కెట్ లోకి వెళ్లేందుకు బిజెపి నేతలు యత్నించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సహా పలువురు అరెస్ట్ అయ్యారు.

ప్రొద్దుటూరు మున్సిపల్ ఛైర్మన్ గా ఆనం రగురాంరెడ్డి

కడప: ప్రొద్దుటూరు మున్సిపల్ ఛైర్మన్ గా ఆనం రగురాంరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

పాతబస్తీ మదీనాలో అగ్నిప్రమాదం

హైదరాబాద్: పాతబస్తీ మదీనాలో అగ్నిప్రమాదం సంభవించింది. ఐదంతస్తుల చెప్పుల గోదాంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తోంది.

హైదరాబాద్ శివారులో దారుణం

హైదరాబాద్: నగర శివారు ప్రాంతంలో దారుణం జరిగింది. బంజారాహిల్స్ కు చెందిన బ్యూటీషియన్ పై ముగ్గురు యువకులు ఆత్యాచార యత్నం చేశారు. నిందితుల్లో నిజామాబాద్ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి కుమారుడు ప్రీతం రెడ్డి కూడా ఉన్నాడు. నిందితులు ప్రీతం రెడ్డి, అరవరెడ్డిపై యువతి స్టేట్ మెంట్ రికార్డు చేసిన పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

సుప్రీంలో లాలూ ప్రసాద్ యాదవ్ కు చుక్కెదురు

ఢిల్లీ : బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కు దాణా కుంభకోణంలో సుప్రీం కోర్టు చుక్కెదురయ్యింది. దాణా స్కాంలో వేర్వేరు కేసులో విచారణ చేయాలని, లాలూ పై కుట్ర కోణంలో విచారించాలని సుప్రీం ఆదేశించింది. 2014లో లాలూ ఆరోపణలను జార్ఖండ్ హైకోర్టు కొట్టేసింది.

11:02 - May 8, 2017

నెల్లూరు: ఆత్మకూరులోని ముంబై హైవేపై అర్దరాత్రి రెండు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో ముగ్గురు చనిపోగా... మరో 7మందికి గాయాలయ్యాయి. ధాన్యం లోడుతో వెళ్తోన్న ట్రాక్టర్‌ను వెనుక వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయ్యింది. ఈ ప్రమాదంలో ఉదయ్‌కుమార్‌, కిరణ్‌, సిద్దయ్య అనే ముగ్గురు చనిపోయారు. మృతులును ఉదయగిరి మండలం బసినేనిపల్లికి చెందిన వారిగా గుర్తించారు. ఉదయ్‌కుమార్‌కు ఈనెల 11న పెళ్లి నిశ్చయమైంది. ముగ్గురి మృతదేహాలు కారులో ఇరుక్కుపోగా... పోలీసులు బయటకు తీశారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే వెనుక వస్తో న్న లారీ ఆగిపోగా.. ఇది గమనించని క్వాలీస్‌ లారీని ఢీకొట్టింది. క్వాలీస్‌లోని ఏడుగురికి గాయాలయ్యాయి.

 

కామారెడ్డి ప్రభుత్వాస్పత్రిలో బాలింత మృతి

హైదరాబాద్: కామారెడ్డి ప్రభుత్వాస్పత్రిలో బాలింత మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతిచెందిందని ఆసుపత్రి వద్ద మృతిరాలి బంధువులు ఆందోళన చేపట్టారు. బాధితురాలు రేణక మాచారెడ్డి మండలం ఆర్పెల్లి వాసి అని తెలుస్తోంది.

10:17 - May 8, 2017

ప.గో:దెందులూరు పీఎస్ లో ఎమ్మెల్యే చింతమనేని పై కేసు నమోదు అయ్యింది. గుండుగోలను వద్ద ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న పోలీసులపై చేయిచేసుకున్నాడు. ఎమ్మెల్యే ఏఎస్ ఐ పాపారావు ఫిర్యాదు చేశారు. చింతమనేని పై 323, 353,506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గతంలో కూడా ఇసుక మాఫియాను అడ్డుకునేందుకు వెళ్లిన ముసునూరు తహశీల్దార్ వనజాక్షిపై చింతమనేని, తన అనుచరులతో కలిసి దాడి చేసిన సంగతి తెలిసిందే.

అంధుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్:ఒకరి మృతి

తూ.గో: రాజమహేంద్రవరం అంధుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యింది. ఈ ఘటనలో ఓ విద్యార్థిని మృతి చెందగా 8 మందికి అవస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురయిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

09:36 - May 8, 2017

హైదరాబాద్: అంతన్నారు .. ఇంతన్నారు.. చివరికి మొండిచెయ్యి చూపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా హామీల వర్షం కురిపించిన పాలకులు సైలెంట్‌ అయ్యారు. పదోన్నతులపై గంపెడాశలు పెట్టుకున్న .. పాఠశాల ఉపాధ్యాయులు నిరాశలో ముగినిపోయారు. కోర్టు ఉత్వర్వులున్నా..తెలంగాణ సర్కార్‌ లెక్కచేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అటకెక్కిన ప్రభుత్వ ఉత్వర్వులు

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హడావిడిగా ఇచ్చిన ఉత్తర్వులు అటకెక్కాయి. స్కూల్‌టీచర్లు, పీఈటీల అప్‌గ్రేడేషన్‌లు కల్పించిన ప్రభుత్వం.. ఎస్‌జీటీలను పట్టించుకోలేదు. దీంతో వారు కోర్టుమెట్లెక్కారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. సర్వీస్‌రూల్స్‌ మార్చి పదోన్నతులు ఇవ్వొచ్చని స్పష్టం చేసింది. కోర్టు ఉత్తర్వులను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

భాషాపండితులు, పీఈటీలకు అప్‌గ్రేడ్‌ ఇస్తూ ఫిబ్రవరి 3న జీవోలు 17, 18 జారీ

ఉపాధ్యాలయు పోరాట ఫలితంగా ఉపాధ్యాయ పోస్టుల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. భాషాపండితులను స్కూల్‌ అసిస్టెంట్లుగా, వ్యాయామ టీచర్ల పోస్టులను పీడీలుగా మారుస్తూ ఫిబ్రవరి 3న జీవో నంర్‌లు 17, 18లను జారీ చేసింది. ఈ ఉత్వర్వుల ప్రకారం.. రాష్ట్రంలోని మొత్తం 2487 లాంగ్వేజ్‌ పండితులు, 1047 పీఈటీ పోస్టులు అప్‌గ్రేడ్‌ అయ్యాయి. అయితే.. ఇక్కడ ఆర్థిక శాఖ కొంత ఉత్సాహాన్ని ప్రదర్శించిందనే విమర్శలు వస్తున్నాయి. అప్‌గ్రెడేషన్‌ ఉత్వర్వులతోపాటు పాఠశాల విద్యాశాఖ ఇవ్వాల్సిన అర్హతలు, సీనియారిటీ లిస్టును కూడా ఆర్థికశాఖే ఇచ్చేసింది. దీంతో ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న పదోన్నతులకు సాంకేతిక సమస్యలు సృష్టించినట్టైంది.

ఆర్థికశాఖ నిర్వాకంపై కోర్టుకెళ్లిన సెకండరీ గ్రేడ్‌ టీచర్లు

ఆర్థికశాఖ నిర్వాకాన్ని వ్యతిరేకిస్తూ రెండు నెలల కిందటనే సెకండరీ గ్రేడ్‌ టీచర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై స్పందించిన కోర్టు .. పదోన్నతులు ఇవ్వాలనుకుంటే.. అంతకు ముందున్న సర్వీస్‌రూల్స్‌ మార్చుకోవచ్చిన ప్రభుత్వానికి సూచించింది. అయితే ప్రభుత్వంలో మాత్రం చలనం లేకుండా పోయిందని ఎస్జీటీలు అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో హామీలు గుప్పించిన మంత్రులు, తర్వాత పట్టనట్టే వ్యవహరిస్తున్నారని భాషాపండితులు, పీఈటీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

సర్వీస్‌రూల్స్‌ సవరించి అప్‌గ్రేడేషన్‌ ఇవ్వాలని టీఎస్‌యూటీఎఫ్‌ డిమాండ్‌

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి .. ఈవేసవి సెలవులు ముగిసేలోగా తమకు న్యాయం చేయాలని భాషాపండితుల, వ్యాయామ ఉపాధ్యాలు కోరుతున్నారు. తాత్కాలిక సర్వీసు నిబంధనలను సవరించి .. అపగ్రేడ్‌ పోస్టులకు పదోన్నతులు కల్పించాలని టీఎస్‌యూటీఎఫ్‌ డిమాండ్‌ చేస్తోంది.

09:32 - May 8, 2017

తమిళనాడు : చెన్నై నగరంలోని వడపళినిలో ఓ అపార్ట్‌మెంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు భారీగా చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు చినపోగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులు మీనాక్షి, పెల్వి, షాలిని, సంజయ్‌గా గుర్తించారు. అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లో ఉంచిన 21 ద్విచక్రవాహనాలు దగ్దమయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతోంది.

ఎమ్మెల్యే చింతమనేనిపై కేసు నమోదు

ప.గో: దెందులూరు పీఎస్ లో ఎమ్మెల్యే చింతమనేని పై కేసు నమోదు అయ్యింది. గుండుగోలను వద్ద ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న పోలీసులపై దాడి చేశారని ఎమ్మెల్యే ఏఎస్ ఐ పాపారావు ఫిర్యాదు చేశారు. చింతమనేని పై 323, 353,506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

సెంట్రల్ చైనా బొగ్గుగనిలో ప్రమాదం: 18 మంది మృతి

హైదరాబాద్: సెంట్రల్ చైనాలోని బొగ్గునిలో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

అమెరికాలో కొనసాగుతున్న చంద్రబాబు పర్యటన

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. బయోవా స్టేట్ యూనివర్శిటీలో సీడ్ సైన్స్ సెంటర్ ను చంద్రబాబు బృందం సందర్శించనుంది.సీడ్ సైన్స్ సెంటర్ లో సమావేశంలో మెగా సీడ్ పార్క్ ప్రాజెక్టుకు ఆంకురార్పణ చేయనున్నారు.

08:29 - May 8, 2017

ఢిల్లీ: మావోయిస్టుల నియంత్రణకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు కేంద్ర హోంశాఖ ఇవాళ ఢిల్లీలో కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఇటీవల చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దాడిలో 25 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతిచెందడంతో... ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలపై మార్పులు చేయాలని కేంద్రం భావిస్తోంది. మావోయిస్టుల కట్టడి వ్యూహంతో పాటు.. ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన అభివృద్ధి పనులపై కూడా చర్చించనున్నారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో.. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల నుంచి 10మంది ముఖ్యమంత్రులు, హోంసెక్రటరీలు, డీజీపీలతో పాటు... పారా మిలిటరీ, నిఘా విభాగాల అధిపతులు హాజరవుతున్నారు.

చెన్నైలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం: నలుగురు మృతి

తమిళనాడు : చెన్నైలోని ఓ అపార్ట్‌మెంట్‌లో సోమవారం అగ్నిప్రమాదం సంభవించి నలుగురు మృతి చెందారు. నగరంలోని వడపళని ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతి చెందినవారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మరోవైపు అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లో పార్క్‌ చేసి ఉన్న బైక్‌లు దగ్ధం అయ్యాయి. కాగా ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూటే కారణమని భావిస్తున్నారు.

08:09 - May 8, 2017

హైదరాబాద్: లంగర్‌హౌస్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. టిప్పుఖాన్‌పూల్‌ వంతెనపై పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళ్తోన్న స్పెషల్‌ బ్రాంచ్‌ ఎస్సై కృష్ణయ్య అక్కడికక్కడే చనిపోయాడు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే నిందితుడు కారుతో సహా పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. సీపీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

07:59 - May 8, 2017

హైదరాబాద్: బీసీ కమిషన్ రిజర్వేషన్ల పై కేంద్రం చేతిలో ఉండబోతోందా? బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం పెత్తనం చేయబోతోందా, పరిపాలన వికేంద్రీకరణ ఉండాల్సిన అవసరం లేదా?పాలన ఏకీకృతమేనా? రిజర్వేషన్ల అంశం రాష్ట్ర పరిధిలోనే ఉండాల్సిన అవసరం లేదా? రిజర్వేష్ల అంశం చాలా రాష్ట్రాలో పెండింగ్ లోఉంది. బిజేపి రిజర్వేషన్ల తేనె తుట్టెను కలిపి మతవిశ్వాసాన్ని కల్గించేందుకు ప్రయత్నిస్తోందా? ఇవే అంశాలపై 'న్యూస్ మార్నింగ్' లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో సీనియర్ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి, బిజెపి పాదూరి కరుణ, తెలంగాణ ఎంబీ కార్పొరేషన్ ఛైర్మన్ తాడూరి శ్రీనివాస్, టిడిపి నేత విజయ్ కుమార్ పాల్టొన్నారు. వారు ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

లంగర్ హౌస్ లో కారు బీభత్సం: ఎస్ఐ మృతి

హైదరాబాద్: లంగర్ హౌస్ లో కారు బీభత్సం సృష్టించింది. టిఫ్పుఖాన్ పూల్ బ్రిడ్జి పై పాదచారులపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ కిష్టయ్య మృతి చెందాడు.

07:00 - May 8, 2017

సూర్యాపేట: సూర్యాపేటలో ఇద్దరు టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్ల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై మరొకరు దాడిచేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వీరి ఘర్షణలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. మంత్రి జగదీశ్‌రెడ్డి ఇంటి ముందే ఈ ఘటన జరగడం విశేషం. ఇద్దరి మధ్య కొన్నాళ్లుగా పాతకక్షలు ఉన్నాయని...వాటివల్లే తాజా ఘటన జరిగిందని సమాచారం.

06:59 - May 8, 2017

ఆదిలాబాద్ : ఉట్నూర్ లో చిన్న వివాదం పెద్ద గొడవకు దారి తీసింది. ఘర్షణపై ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేపట్టాయి. నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశాయి. పోలీస్ స్టేషన్ ముందు ఇరువర్గాలు వాగ్వాదానికి దిగడంతో పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. జిల్లా ఎస్పీ, కలెక్టర్‌ ఉట్నూర్ చేరుకొని ఇరు వర్గాలతో చర్చలు జరిపారు. అయినప్పటికీ పరిస్థితి చేయిదాటడంతో మరోసారి పోలీసులు లాఠీచార్జ్‌ చేసి టియర్ గ్యాస్‌ను ప్రయోగించి అల్లరి మూకలను చెదరగొట్టారు. ఇరువర్గాలలో గొడవలకు కారణమైన వారిని అరెస్టు చేసి 144 సెక్షన్ విధించారు. జరిగిన ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

06:57 - May 8, 2017

హైదరాబాద్‌ : బేగంపేటలోని హాకీ మైదానం దగ్గర పాత కరెన్సీ నోట్ల మార్పిడికి యత్నించిన ఒక ముఠాను నార్తజోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా నుంచి కోటి 85 లక్షల రూపాయల విలువైన పాత 500, వెయ్యి నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న కమల్‌ కాబ్ర, కన్నేలాల్‌, విశాల్‌, నరేంద్ర అగర్వాల్‌, నరేశ్‌, దీపక్‌లను అరెస్టు చేశారు. నిందితులు నగరంలో వివిధ రకాల వ్యాపారాలు చేస్తున్నారు. ఆర్బీఐ అధికారుల సహకారంతో పాత నోట్లను మార్పిస్తామని పలువురిని నమ్మించి, 20 శాతం కమీషన్‌కు వీటిని సేకరించారు.

06:56 - May 8, 2017

హైదరాబాద్‌ :జూబ్లీహిల్స్‌ సంజయ్‌నగర్‌లో వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్న అమేర్‌ఖాన్‌ను దుండగులు హత్య చేశారు. హత్యకు పాతకక్షలే కారణంగా తెలుస్తోంది. అమేర్‌ఖాన్‌ రెండేళ్ల క్రితం జరిగిన ఓ హత్య కేసులో నిందితుడు. ఒడిశాలో ఉంటున్న అమేర్‌ఖాన్‌... కేసుకు సంబంధించి నెల రోజుల క్రితం నగరానికి వచ్చాడు.

06:50 - May 8, 2017

ఢిల్లీ : దేశీయ బొగ్గుగని కార్మికుల వేతన సవరణపై నీలినీడలు కమ్ముకున్నాయి. కోల్‌ ఇండియా ఆస్తుల్ని స్వాధీనం చేసుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్న ప్రస్తుత తరుణంలోనే.. వేతన సవరణ ఒప్పందంపై చర్చలూ సాగనున్నాయి. ఢిల్లీలో జరగనున్న ఈ సమావేశం పురోగతిపై ఇప్పటికే కార్మికుల్లో సందేహాలు నెలకొన్నాయి. అందుకే, ఒకవేళ ఒప్పందం విఫలమైతే, సమ్మెకు దిగాలని కూడా కార్మిక సంఘాలు ఇప్పటికే నిర్ణయించాయి. ఈ దశలో వేతన సవరణ ఒప్పంద సమావేశాలు అత్యంత కీలకంగా మారాయి.

దేశవ్యాప్తంగా 4.5 లక్షల మంది బొగ్గుగని కార్మికులు.....

దేశీయ బొగ్గు గని కార్మికుల్లో వేతన సవరణపై ఉత్కంఠ నెలకొంది. కేంద్ర వైఖరిపై ఇప్పటికే ఆగ్రహంగా ఉన్న కార్మిక సంఘాలు.. నిర్ణయం తమకు అనుకూలంగా రాకుంటే సమ్మెకు దిగాలనీ భావిస్తున్నాయి. నిజానికి దేశ వ్యాప్తంగా బొగ్గు గనుల్లో పనిచేస్తున్న 4.5 లక్షల మంది కార్మికులకు 2016 జూలై నుంచి 10వ వేతన సవరణ అమలు కావాల్సి ఉంది. కానీ వివిధ కారణాల వల్ల నిర్ణయం వాయిదా పడుతూ వస్తోంది. దీనిపై జాతీయ కార్మిక సంఘాలు, కోల్ ఇండియా యాజమాన్యం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధుల మధ్య నిరుడు డిసెంబర్‌ 6 నుంచి ఇప్పటి వరకూ నాలుగు విడతల చర్చలు జరిగాయి. ఇందులో రిటైర్డ్‌ కార్మికులకు పెన్షన్‌, మెడికల్‌ స్కీం అమలుపై మాత్రమే ఒప్పందం కుదిరింది. వేతన సవరణ అంశంపై చర్చల్లో ఒక్క అడుగూ ముందుకు పడలేదు.

వేతన సవరణకు కోల్ ఇండియా వ్యతిరేకం -కార్మిక సంఘాలు.....

వేతన సవరణకు 3వేల కోట్లే కేటాయిస్తామనడం ద్వారా.. కోల్ ఇండియా యాజమాన్యం తమకు వ్యతిరేకంగా ఉందన్నది కార్మిక సంఘాల వాదన. పైగా నాలుగు విడతల చర్చలూ విఫలం కావడంతో, కార్మిక సంఘాల నాయకులు, తదుపరి చర్చలపై ఆసక్తిని చూపడం లేదు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో వేతన సవరణ ఒప్పందాలు జరుగుతున్నాయి. తొలిరోజు జెబిసిసిఐ ఉప సంఘం సభ్యులు, మిగిలిన రెండు రోజులు జెబిసిసిఐ పూర్తి కమిటి సభ్యులు కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరుపుతారు. 9వ వేతన సవరణలో 25 శాతం పెంపుదలకు అంగీకరించిన కార్మికులు ఈసారి 50 శాతం కంటే తక్కువ కాకుండా సవరణ జరిగాలని కోరుతున్నారు.

. అక్కడికక్కడే సమ్మె నోటిసు ఇచ్చేందుకు....

ప్రస్తుత చర్చలు విఫలమైనా.. లేక ఏ కారణం చూపి వాయిదా వేసినా.. అక్కడికక్కడే సమ్మె నోటిసు ఇచ్చేందుకు జాతీయ కార్మిక సంఘాల నేతలు సమాయత్తమయ్యారు. ఈ దశలో.. వేతన సవరణపై చర్చలు ఏ కొలిక్కి వెళతాయోనని కార్మికుల్లో తీవ్ర ఆసక్తి కనిపిస్తోంది.

06:47 - May 8, 2017

రాజన్న సిరిసిల్ల : జిల్లా కేంద్రంలోని.. బి. వై నగర్‌కు చెందిన శాప మధు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక నేతన్న ఉరి వేసుకొని.. బలవన్మరణానికి పాల్పడ్డాడు. మధుకు తల్లి, భార్య, ఇద్దరు చెల్లెల్లు ఉన్నారు. చెల్లెల్ల పెళ్లికి చేసిన అప్పులు.. ఆదాయం వచ్చే మార్గం లేక మధు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. పైగా అప్పులు ఇచ్చినవాళ్లు డబ్బులు చెల్లించమని ఒత్తిడి చేయడంతో మానసికంగా కుంగిపోయి ఉరి వేసుకున్నాడు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న మధు చనిపోవడంతో.. ఆ కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది.

సీఎం కేజ్రీవాల్ పై పార్టీ నేతల తిరుగుబాటు

ఢిల్లీ : ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీలో రాజకీయ సంక్షోభం రోజు రోజుకు ముదురుతోంది. మొన్న అమనతుల్లా ఖాన్‌, నిన్న కుమార్‌ విశ్వాస్, ఇవాళ కపిల్‌ మిశ్రా... ఇలా రోజుకో నేత ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై తిరుగుబాటు బావుటా ఎగురు వేస్తున్నారు. అసంతృప్తి నేతలు చేస్తున్న ఆరోపణలతో ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

06:43 - May 8, 2017

ఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ ... దేశ రాజధాని ఢిల్లీని ఏలుతున్నరాజకీయ పక్షం. ఆ పార్టీ ఇటీవల కాలంలో వరుస సంక్షోభాలను ఎదుర్కొంటోంది. ఆప్‌ ఆధినేత, ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఒంటెత్తు పోకడలు నచ్చక పార్టీలో ఒక్కో నేత తిరుగుబాటు చేస్తున్నారు. కేజ్రీవాల్‌ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

కేజ్రీవాల్‌పై ఆరోపణలు చేస్తున్న అసంతృప్తి నేతలు ....

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేజ్రీవాల్‌ పనైపోయిందని పార్టీ ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్‌ వ్యాఖ్యానించిన తర్వాత పార్టీ నేతలు ఒక్కొక్కరుగా అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. కేజ్రీవాల్‌పై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. అమనతుల్లా ఖాన్‌ తర్వాత ఆప్‌ నేత కుమార్‌ విశ్వాస్‌, ఇప్పుడు మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన కపిల్‌ మిశ్రా... ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై విరుచుకుపడుతున్నారు. పార్టీలో అసమ్మతి నేతగా ముద్రపడ్డ కుమార్‌ విశ్వాస్‌తో చేతులు కలిపారన్న అభియోగంపై కపిల్‌ మిశ్రాను తన మంత్రివర్గం నుంచి కేజ్రీవాల్‌ తొలగించారు.

నీటి ట్యాంకర్ల యజమానుల నుంచి కేజ్రీవాల్‌కు రూ.2 కోట్ల ముడుపులు -మిశ్రా

దీనికి ప్రతీకారంగా కపిల్‌ మిశ్రా.... ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఢిల్లీలో నీటి ట్యాంకర్ల యజమానుల నుంచి కేజ్రీవాల్‌కు రెండు కోట్ల రూపాయల ముడుపులు ముట్టాయన్న ఆరోపణలు ఆప్‌లో సంక్షోభాన్ని మరింత పెంచాయి. ఆరోగ్యం శాఖ మంత్రి సత్రేంద్ర జైన్‌... సీఎం కేజ్రీవాల్‌కు రెండు కోట్ల రూపాయలు అందజేస్తుండగా తాను చూశారన్న వాదాన్ని కపిల్‌ మిశ్రా లేవనెత్తున్నారు. కేజ్రీవాల్‌ బంధువుల కోసం సత్యేంద్ర జైన్‌ 50 కోట్ల రూపాయల విలువైన భూదందాలను పరిష్కరించారన్నది మరో ఆరోపణ. వీటికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌తోపాటు మీడియాకు కూడా అందజేస్తానని చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది. కపిల్‌ మిశ్రా ఇంతటితో ఆగలేదు. కేజ్రీవాల్‌ అవినీతి బండారాన్ని బయపట్టేందుకు ఏసీబీ, సీబీఐలను ఆశ్రయిస్తారని ప్రకటించారు. కేజ్రీవాల్‌పై కపిల్‌ మిశ్రా చేసిన ఆరోపణలు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా తోసిపుచ్చారు. ఇవన్నీ అసత్య ఆరోపణలని కొట్టిపారేశారు.

అవినీతి ఆరోపణలపై అన్న హజారే విచారం ...

మరోవైపు కేజ్రీవాల్‌పై అవినీతి ఆరోపణలు రావడం పట్ల సామాజిక కార్యకర్త అన్న హజారే విచారం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై కాంగ్రెస్‌, బీజేపీ తీవ్రంగా స్పందించాయి. ఈ వ్యవహారంపై విచారణకు బీజేపీ డిమాండ్‌ చేయగా, కేజ్రీవాల్‌పై కేసు నమోదు చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది.

06:40 - May 8, 2017

హైదరాబాద్:ఫ్రాన్స్‌ అధ్యక్ష ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఇమ్మాన్యుయెల్‌ మేక్రాన్‌ ఘన విజయం సాధించారు. ఆదివారం జరిగిన రెండో విడత ఎన్నికల్లో మేక్రాన్‌కు 65.1 శాతం ఓట్లు, ప్రత్యర్థి లిపెన్‌కు 34.9 శాతం ఓట్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. 39 ఏళ్ల మేక్రానే అధ్యక్షుల్లో పిన్న వయస్కులు కానున్నారు. యూరోపియన్‌ యూనియన్‌కు అనుకూలంగా వ్యవహరించే ఆయన ఎన్‌ మార్చ్‌ అనే రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించారు. కార్మిక చట్టాలను సరళీకరించడం, వెనకబడిన ప్రాంతాల్లో విద్యా సౌకర్యాలను పెంచడం, స్వయం ఉపాధి పొందుతున్న వారికి రక్షణ కల్పించడం అన్న హామీలతో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు.

06:39 - May 8, 2017

హైదరాబాద్: ఐపీఎల్‌ మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌పై గుజరాత్‌ లయన్స్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. 190 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్‌ ప్రారంభించిన గుజరాత్‌ మరో రెండు బంతులు మిగిలివుండగానే గెలిచింది. ఓపెనర్‌ డ్వెయిన్‌ స్మిత్‌ 39 బంతుల్లో 74 పరుగులు చేసి గెలుపునకు బాటలు వేశాడు. ఇక పంజాబ్‌ టీమ్‌లో ఆమ్లా చేసిన సెంచరీ వృదా అయ్యింది. గుజరాత్‌ మ్యాచ్‌ గెలుపునకు కృషి చేసిన డ్వెయిన్‌ స్మిత్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ లభించింది.

06:37 - May 8, 2017

హైదరాబాద్: బాహుబలి మూవీ ఓ విజువల్‌ వండర్‌. దర్శకధీరుడు రాజమౌళి డ్రీమ్‌ ప్రాజెక్ట్‌. బాహుబలి సినిమాతో రాజమౌళి తెలుగోడి సత్తా ప్రపంచానికి చాటిచెప్పారు. ఇందులో నటించిన నటీనటులకూ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. వీరికి విదేశాల్లోనూ ఫ్యాన్స్‌ దొరికారు. అంతేకాదు.. బాహుబలి -2 మూవీ భారత సినీ రికార్డులన్నీ తిరగారాసింది.

సినీ పరిశ్రమలో 1000 కలెక్షన్స్‌ ఎవరూ ఊహించని టార్గెట్‌...

ఇప్పటి వరకు ఇండియన్‌ సినీ పరిశ్రమలో 1000 కలెక్షన్స్‌ ఎవరూ ఊహించని టార్గెట్‌. అసలు ఆ మార్క్‌ అనేది ఎవరూ అందుకోని బ్రహ్మాండంగానే ఉండిపోయింది. కానీ జక్కన్న చెక్కిన విజువల్‌ వండర్‌కు మాత్రం వెయ్యికోట్ల కలెక్షన్స్‌ మార్క్‌ పెద్ద కష్టమనిపించలేదు. బాహుబలి-2 కలెక్షన్స్ ముందు అతి పెద్ద టార్గెట్‌గా కూడా నిలువలేదు. ఏప్రిల్‌ 28న విడుదలైన బాహుబలి -2 బాక్సాఫీస్‌ దగ్గర కలెక్షన్ల మోత మోగించింది. కేవలం ఆరు రోజుల్లోనే 792 కోట్లు సాధించి సత్తా చాటింది. తొలి 9 రోజుల్లో 925 కోట్లు సాధించింది. ఇక పదవ రోజైన ఆదివారం వెయ్యికోట్ల మార్క్‌ను అవలీలగా దాటి భారత సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప చిత్రంగా అవతరించింది.

పీకే సినిమా 792 కోట్లు ...

అమీర్‌ఖాన్‌ నటించిన పీకే సినిమా 792 కోట్లు సాధించి ఇండియన్‌ సినిమా చరిత్రలో రికార్డుగా నిలిచింది. ఆతర్వాత దంగల్‌ సినిమా 730 కోట్లు సాధించి సెకండ్‌ ప్లేస్‌లో నిలిచింది. పీకీ సినిమా రికార్డులను బాహుబలి-2 కేవలం 6 రోజుల్లోనే దాటింది. ఆదే ఊపుతో ఎవరికీ అందనంతగా 1000 కోట్ల మార్క్‌ను దాటిపోయింది.

బాహుబలి -2 వెయ్యికోట్లు సాధించడంతో...

బాహుబలి -2 వెయ్యికోట్లు సాధించడంతో ఆ సినిమా యూనిట్‌ సంబరాల్లో మునిగిపోయింది. హీరో ప్రభాస్‌ అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. బాహుబలి-2ను ఇంతగా ఆదరించిన అభిమానులకు ఎప్పుడూ కృతజ్ఞుడనై ఉంటానన్నారు. ఇక జక్కన కూడా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.

వెయ్యి కోట్ల బాహుబలి

హైదరాబాద్: భారతీయ సినీ చరిత్రలోనే బాహుబలి -2 సరికొత్త రికార్డు క్రియేట్‌ చేసింది. ఇంతకుముందున్న రికార్డులన్నీ తిరగరాసింది. బాక్సీఫీస్‌ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించింది. మొదటి వారంలో 792 కోట్లు సాధించిన బాహుబలి-2 ఇప్పుడు వెయ్యికోట్ల మార్క్‌ను దాటి భారత సినీ చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని సృష్టించింది. వెయ్యి కోట్లు కలెక్ట్‌ చేసిన తొలి భారతీయ చిత్రంగా బాహుబలి-2 చరిత్ర పుటల్లోకెక్కింది.

06:34 - May 8, 2017

హైదరాబాద్: ఆశా వర్కర్ల పోరాటం ఫలించింది. ఆలస్యంగానైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్ల డిమాండ్లపై స్పందించింది. ఆశా వర్కర్ల జీతం నాలుగు వేల రూపాయల చొప్పున పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. దీంతో తెలంగాణలో ఆశా వర్కర్ల జీతం ఆరు రూపాయలకు చేరినట్టయ్యింది. ఆశా వర్కర్లు కనీస వేతనం అమలు చేయాలంటూ 2015 సెప్టెంబర్ లోనే సమ్మెకు దిగారు. అప్పుట్లో 106 రోజుల పాటు ఈ సమ్మె సాగింది. సమ్మె జరుగుతున్న సమయంలో ఆశా వర్కర్ల సమస్యలపై అనేక జనపథం లైవ్ షోలు నడిచాయి. అనేక మంది ఆశా వర్కర్లకు సంఘీభావం ప్రకటించారు. 18 నెలల తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించడంతో ఆశా వర్కర్లకు కొంత ఊరట లభించినట్టయ్యింది. ఇదే అంశంపై నేటి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో 106 ఉద్యమానికి నాయకత్వం వహించిన ఆశా వర్కర్ల యూనియన్ నాయకులు జయలక్ష్మి పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

పంజాబ్ పై గుజరాత్ లయన్స్ విజయం...

హైదరాబాద్: ఐపీఎల్ -10 లో పంజాబ్ పై గుజరాత్ లయన్స్ విజయం సాధించింది. పంజాబ్ పై 6 వికెట్ల తేడాతో గుజరాత్ గెలుపొందింది. పంజాబ్ 189/3, గుజరాత్ 192/4 గా స్కోర్లు నమోదయ్యాయి.

జూబ్లీ హిల్స్ లో వ్యక్తి దారుణ హత్య

హైదరాబాద్: జూబ్లీ హిల్స్ సంజయ్ నగర్ లో వ్యక్తి దారుణ హత్య జరిగింది. అమేర్ ను గుర్తు తెలియని కత్తులతో నరికి చంపారు.

ట్రాక్టర్ ను ఢీకొట్టిన కారు: ముగ్గురు మృతి

నెల్లూరు : ఆత్మకూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ ను కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఏడుగురకి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రి కి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Don't Miss