Activities calendar

09 May 2017

21:30 - May 9, 2017

ఢిల్లీ : బ్యాంకు రుణాల ఎగవేతదారు, కింగ్‌ ఫిషర్‌ అధినేత విజయ్‌ మాల్యాకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కోర్టు ధిక్కరణ కేసులో మాల్యాను దోషిగా నిర్ధారించింది. ఆస్తుల వివరాలు పూర్తిగా తెలపనందున జూలై 10న కోర్టుకు హాజరు కావాలని మాల్యాను ఆదేశించింది. ఆస్తుల బదలాయింపుల కేసులో కింగ్‌ ఫిషర్‌ యజమాని విజయ్‌ మాల్యాకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. మాల్యాకు వ్యతిరేకంగా ఎస్‌బిఐ వేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది. కోర్టు ధిక్కరణ కేసులో మాల్యాను దోషిగా నిర్ధారించింది. జూలై 10న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని అత్యన్నత న్యాయస్థానం మాల్యాను ఆదేశించింది.

ఆస్తుల వివరాలు కరెక్టేనా ?
అంతకు ముందు కోర్టుకు సమర్పించిన ఆస్తుల వివరాలు కరక్టేనా...కాదా మాల్యాను ప్రశ్నించింది. కర్ణాటక హైకోర్టు ఆదేశాలను మాల్యా ఉల్లంఘించారా...లేదా అన్నదానిపై కోర్టు ఆరా తీసింది. హైకోర్టు అనుమతి లేకుండా లావాదేవీలు జరిపేందుకు మాల్యాకు వీలులేదు. మాల్యా దేశాన్ని విడిచి పారిపోయినందున్న ఆయనపై జారీ చేసిన ఆదేశాలను ఎలా అమలు చేస్తున్నారని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. మాల్యా 9 వేల 2 వందల కోట్ల రుణాలు బ్యాంకులకు బకాయి పడ్డారని ఈ సందర్భంగా ఎస్‌బిఐ కోర్టుకు చెప్పింది. విజయ్‌మాల్యాను భారత్‌కు తిరిగి రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయాలని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. డియోగోడీల్‌ సంస్థ నుంచి పొందిన 40 మిలియన్ల యూఎస్‌ డాలర్లను సుప్రీంకోర్టులో డిపాజిట్‌ చేసేలా మాల్యాపై చర్యలు తీసుకోవాలని బ్యాంకుల అసోసియేషన్ కోరింది. మాల్యా పెట్టుకున్న పిటిషన్‌పై విచారణ జరపొద్దని కోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఎందుకంటే మాల్యా ప్రతీసారి కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తున్నారని పేర్కొంది.

పలు ఆదేశాలు..
తనకున్న 2 వేల కోట్ల సంపత్తిని బ్యాంకులు ఇప్పటికే జప్తు చేశాయని మాల్యా అన్నారు. 9 వేల 2 కోట్లను తాను చెల్లించే పరిస్థితిలో లేనని కోర్టుకు చెప్పారు. బ్యాంకులు కావాలనుకుంటే తన ఆస్తులను అమ్ముకోవచ్చని మాల్యా సూచించారు. విచారణ సందర్భంగా బ్రిటీష్ కంపెనీ డియేగోడీల్‌ నుంచి వ‌చ్చిన 40 మిలియ‌న్ల యుఎస్‌ డాల‌ర్లను అక్రమంగా మాల్యా త‌న పిల్లల‌కు ట్రాన్సఫ‌ర్ చేసిన‌ట్లు బ్యాంకుల కన్సార్టియం తరపున వాదిస్తున్న అటార్నీ జ‌న‌ర‌ల్ ముఖుల్ రోహ‌త్గీ అన్నారు. ఈ విషయాన్ని మాల్యా కోర్టుకు తెలియజేయలేదన్నారు. 40 మిలియ‌న్ల యుఎస్‌ డాల‌ర్లను వారంలో భారత్‌కు రప్పించేలా ఆదేశాలివ్వాలని బ్యాంకుల కన్సార్టియం కోర్టుకు విజ్ఞప్తి చేసింది. మాల్యా ఒకవేళ డబ్బులు చెల్లించనట్లయితే వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యేలా ఆదేశించాలని కోరింది.

ఎగ్జిబీషన్ గ్రౌండ్ లో టిటిడిపి మహానాడు..

హైదరాబాద్ : ఈనెల 24న నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించే మహానాడు ఏర్పాట్లను టీడీపీ అగ్ర నేతలు పరిశీలించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కూడా హాజరు కానుండడంతో.. మహానాడును సక్సెస్ చేసే పనిలో పడ్డారు తెలుగు తమ్ముళ్లు.

'నిలదీయడం..నిలబెట్టడం జర్నలిస్టుల హక్కు'..

నెల్లూరు : నిలదీయడం..నిలబెట్టడం జర్నలిస్టుల హక్కు అని ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ వాసుదేవ దీక్షితులు పేర్కొన్నారు. కలిసి అడుగేద్దాం..సమస్యలు పరిష్కరించుకుందామని, త్వరలో జర్నలిస్టులకు ట్రైనింగ్ క్లాసులు..సెమినార్ లు నిర్వహిస్తామన్నారు. ప్రెస్ అకాడమీ ఏర్పాటైన ఏడాది తరువాత ప్రభుత్వం సమర్థవంతమైన అధికారులను నియమించిందన్నారు.

 

స్టాన్ ఫోర్డ్ సభ్యుడిని - బాబు..

ఢిల్లీ : తాను స్టాన్ ఫోర్ట్ కుటుంబ సభ్యుడని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సమాజం యొక్క భవితను నిర్ణయించేది విద్య మాత్రమేనని, ప్రస్తుతం ఏపీలో అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టామన్నారు.

లాయిడ్ తో బాబు భేటీ..

అమెరికా : స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ మెడికల్ స్కూల్ డీన్ లాయిడ్ బీ మైనర్ తో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం జరిపారు. వ్యాధులకు చికిత్స చేయడమే కాకుండా ఆరోగ్య పరిరక్షణలో జాగ్రత్తలు సూచించడం తమ ప్రత్యేకత అని మున్ముందు ఏ వ్యక్తి ఏ అనారోగ్య బారిన పడుతున్నాడో పసిగట్టి నివారణ, నియంత్రణ చర్యలు తీసుకోవడం స్టాన్ ఫోర్ట్ మెడికల్ స్కూల్ ప్రత్యేకత అని లాయిడ్ తెలిపారు.

21:21 - May 9, 2017

ఢిల్లీ : కోలకతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్‌ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని సుప్రీంకోర్టు నిర్ధారించింది. ఆయనకు కోర్టు 6 నెలలు జైలు శిక్ష విధించింది. జస్టిస్‌ కర్ణన్‌ను తక్షణమే అరెస్ట్‌ చేయాలని పశ్చిమ బెంగాల్‌ డిజిపిని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. పదవిలో ఉన్న ఓ జడ్జిపై విచారణ జరిపి శిక్ష విధించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జెఎస్‌ ఖేహర్‌తో పాటు....న్యాయమూర్తులకు శిక్ష విధిస్తూ వివాదస్పద తీర్పు చెప్పిన కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిఎస్‌ కర్ణన్‌కు అత్యున్నత న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. కోర్టు ధిక్కారం కేసులో కర్ణన్‌ను దోషిగా పరిగణిస్తూ 6 నెలల జైలుశిక్ష విధించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది.

న్యాయమూర్తా? సామాన్యుడా?
జస్టిస్‌ కర్ణన్‌ను వెంటనే అరెస్ట్‌ చేసి జైలుకు పంపాలని పశ్చిమ బెంగాల్‌ డిజిపిని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఓ సిట్టింగ్‌ న్యాయమూర్తికి జైలుశిక్ష విధించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. జస్టిస్ కర్ణన్ జారీ చేసిన ఆదేశాలను ప్రచురించరాదని మీడియాపై సుప్రీంకోర్టు ఆంక్షలు విధించింది. ఒకవేళ జస్టిస్ కర్ణన్‌ను జైలుకు పంపకపోతే కోర్టు ధిక్కారానికి పాల్పడిన న్యాయమూర్తిని సుప్రీంకోర్టు క్షమించిందనే కళంకం వస్తుందని పేర్కొంది. కోర్టు ధిక్కారానికి పాల్పడిన వ్యక్తి న్యాయమూర్తా? సామాన్యుడా? అని చూడదని సుప్రీంకోర్టు పేర్కొంది. జస్టిస్ కర్ణన్‌కు శిక్ష పడాల్సిందేనని అదనపు సొలిసిటర్ జనరల్ మనీందర్ సింగ్, సీనియర్ అడ్వకేట్ కేకే వేణుగోపాల్ సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో ఏకీభవించారు.

అరెస్టు వారెంట్..
సోమవారం జస్టిస్ కర్ణన్ సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్‌తో పాటు ఏడుగురు న్యాయమూర్తులు జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ జె చలమేశ్వర్, జస్టిస్‌ రంజన్ గోగోయ్, జస్టిస్‌ మదన్‌ బీ లోకుర్, జస్టిస్‌ చంద్రఘోష్, జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌లకు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. మే1న ఏడుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్‌ కర్ణన్‌ మానసిక స్థితిని తెలుసుకునేందుకు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. ప్రభుత్వ మెడికల్ బోర్డు ఆధ్వర్యంలో కర్ణన్‌కు వైద్యపరీక్షలు జరిపి మే 8న నివేదిక సమర్పించాలని పశ్చిమ బెంగాల్‌ డిజిపిని ఆదేశించింది. అయితే వైద్య పరీక్షల నిరాకరించడమే కాకుండా ఏడుగురు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా కర్ణన్‌ నాన్‌బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేశారు.

అవినీతి ఆరోపణలు..
దేశవ్యాప్తంగా 20 మంది సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులపై జస్టిస్‌ కర్ణన్‌ అవినీతి ఆరోపణలు చేశారు. సిబిఐతో విచారణ జరిపించి...ఆ నివేదికను పార్లమెంట్‌కు సమర్పించాలని ఆదేశించారు. కర్ణన్‌ ఆదేశాలు కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని ప్రధాన న్యాయమూర్తి... ఏడుగురు న్యాయమూర్తులతో ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. కోర్టు ధిక్కరణ కేసు కింద సుప్రీం ధర్మాసనం ఆయనపై విచారణ జరిపింది... అంతేకాదు... ఆయన ఎలాంటి న్యాయ, పరిపాలన విధులు నిర్వర్తించకుండా సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. ఇవేమి పట్టించుకోకుండా కర్ణన్‌ సుప్రీంకోర్టుకు ఎదురుతిరిగారు.

21:18 - May 9, 2017

హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే గల్ఫ్‌లో పని చేస్తున్న కార్మికుల సంక్షేమం కోసం బడ్జెట్‌లో వంద కోట్ల రూపాయలు కేటాయిస్తుందని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. గల్ప్‌ బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. టిపిసిసి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ గల్ఫ్‌ భరోసా సదస్సులో వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత గల్ఫ్‌ కార్మికుల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. గల్ఫ్‌ నుంచి నిత్యం ఐదు శవాలు వస్తున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవ్చని ఆవేదన వ్యక్తం చేశారు. గల్ఫ్‌లో పని చేస్తున్న కార్మికుల పేరిట ఉన్న రేషన్‌ కార్డులను ప్రభుత్వం తొలగించడాన్ని టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ తప్పుపట్టారు.

21:16 - May 9, 2017

పశ్చిమగోదావరి : కేంద్ర విమానయాన మంత్రి అశోక గజపతిరాజు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ మీద వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్‌ ఎవరో తనకు తెలియదని తెలిపారు. పవన్ కల్యాణ్ సినిమా నటుడని తనకు తెలిసిందని.. తాను సినిమాలు చూసి చాలా సంవత్సరాలైందన్నారు. దీంతో అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలపై పవర్‌స్టార్ అభిమానులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

21:15 - May 9, 2017

హైదరాబాద్ : తెలంగాణ తెలుగుదేశం పార్టీ.. రాష్ట్రస్థాయి మహానాడు నిర్వహణకు సన్నాహాలు చేసుకుంటోంది. ఈనెల 24 న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో భారీఎత్తున సభ నిర్వహించాలని టీటీడీపీ నిర్ణయించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కూడా హాజరు కానుండడంతో.. మహానాడును సక్సెస్ చేసే పనిలో పడ్డారు తెలుగు తమ్ముళ్లు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ.. రాష్ట్రస్థాయిలో మహానాడు నిర్వహించేందుకు కసరత్తును ప్రారంభించింది. మహానాడు సందర్భంగా, పార్టీ రాష్ట్ర విభాగపు సంస్థాగత ఎన్నికలనూ నిర్వహించనున్నారు. రెండేళ్లకోసారి జరిగే ఈ ఎన్నికల్లో.. గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ కొత్త కమిటీలను ఎన్నుకుంటారు. మహానాడుకు.. తెలంగాణలోని 31 జిల్లాల ప్రతినిధులూ హాజరుకానున్నారు. ఈనెల 24న నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించే మహానాడు ఏర్పాట్లను టీడీపీ అగ్ర నేతలు పరిశీలించారు.

పూర్వ వైభవం వస్తుందా ?
మహానాడు వేదికగా టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల్ని ఎండగట్టేందుకు టీటీడీపీ సిద్ధమవుతోంది. ఇందుకోసం పలు తీర్మానాలు చేయనుంది. వీటిలో టీఆర్ఎస్ హామీలు, వైఫల్యాలు, మద్దతు ధర లేకపోవడం, నిరుద్యోగ సమస్య, అక్రమ వసూళ్లు, పాలనాపరమైన లోపాల వంటి పలు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని టీటీడీపీ భావిస్తోంది. పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహిస్తున్నప్పటికీ, దాదాపుగా ప్రస్తుత కార్యవర్గమే కొనసాగే అవకాశం కనిపిస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎల్‌.రమణ, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా రేవంత్‌రెడ్డి కొనసాగనున్నారు. పెరిగిన జిల్లాల దామాషాలో.. పార్టీ జిల్లాల అధ్యక్షుల సంఖ్యా పెరగనుంది. ఇక అధినేత చంద్రబాబు, తెలంగాణలో నిర్వహించే మహానాడుకు హాజరై.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతూ దిశానిర్దేశం చేస్తారని సీనియర్లు చెబుతున్నారు. తెలంగాణలో మహానాడును గ్రాండ్‌ సక్సెస్‌ చేసి.. సత్తా చాటాలని టీటీడీపీ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. మరి ఈ మహానాడు, తెలంగాణలో తెలుగుదేశానికి పూర్వవైభవాన్ని తెస్తుందా..? ఈ ప్రశ్నకు సమాధానం రావాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.

21:13 - May 9, 2017

హైదరాబాద్ : తెలంగాణ భూసేకరణ కోసం ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం ఆమోదం తుది ఘట్టానికి చేరుకుంది. చట్టం-2013 సవరణ బిల్లుకు ఆమోదం తెలిపిన కేంద్ర హోంశాఖ.. రాష్ట్రపతి ఆమోదం కోసం బిల్లును రాష్ట్రపతి భవన్‌కు పంపింది. ఇవాళో, రేపో రాష్ట్రపతి సంతకంతో ఆమోదం తరువాత ఈ బిల్లు చట్టంగా మారనుంది. సత్వర భూసేకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం 2013 కేంద్ర భూసేకరణ చట్టాన్ని అనుసరించి నూతన చట్టాన్ని 2016 డిసెంబర్‌లో తీసుకొచ్చింది. అయితే ఈ చట్టాన్ని పరిశీలించిన కేంద్ర న్యాయశాఖ ఆరు సవరణలు చేస్తే సరిపోతుందని చెప్పింది. ఈ క్రమంలో ఇరిగేషన్ ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు రాష్ర్ట శాసనసభ, మండలి ప్రత్యేకంగా సమావేశమై... ఏప్రిల్ 30న భూసేకరణ చట్టం -2013 సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది.
కొత్త చ‌ట్టం ద్వారా... రెండు నెల‌ల పాటు చేయాల్సిన సామాజిక ఆర్థిక మ‌దింపు స‌ర్వే నామ‌మాత్రం కానుంది. అయితే ప‌రిహారం విష‌యంలో కేంద్ర చ‌ట్టానికి లోబ‌డే మెరుగైన ప‌రిహారం ఇవ్వాల‌న్న నిబంద‌న‌కు లోబ‌డే ప‌రిహారం చెల్లించ‌టంతో పాటు, వీలైనంత త్వరగా ప్రాజెక్టుల నిర్మాణానికి స‌హ‌క‌రిస్తుంద‌ని పేర్కొంది. ఇక పున‌రావాసం విష‌యంలోనూ... 123జీవోకు అనుబందంగా తెచ్చిన 37,38జీవోల ఆధారంగానే ఈ చ‌ట్టం ద్వారా ప‌రిహారం, పున‌రావాసం కేటాయించ‌నున్నారు. మొత్తం ఐదు సవరణలు చేసి పంపిన బిల్లును ఆమోదించిన కేంద్ర హోం శాఖ.. రాష్ట్రపతి భవన్ కు పంపింది. బిల్లు ఢిల్లీ వెళ్లిన నాటి నుంచి నేటి వరకు కూడా ప్రభుత్వ ముఖ్య సలహాదారు మీజీ సీఎస్ రాజీవ్ శర్మ ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తూ వచ్చారు. ఇప్పటికే కేసీఆర్, రాజీవ్ శర్మలు ఢిల్లీలో ఉన్న నేపథ్యంలో రాష్ట్రపతి ఆమోదంతో ఏ క్షణంలో అయినా బిల్లు చట్టంగా మారే ప్రకటన వెలువడవచ్చు.

20:19 - May 9, 2017

భారతదేశంల ఈ ఈవీఎంల సంగతి ఏంది అని అనుమానమొచ్చిన ఆమాద్మీ పార్టీ ఇగో ఆ మిషిన్ల బాగోతం గిదని సూపెట్టింది...ఇయ్యాళ నగతిచ్చి కొన్కపోయి రేపు ఉద్దెర కొచ్చినా మళ్ల ఇయ్యాళ నగతే అని కనిపిస్తది..తెలంగాణ ప్రజల నెత్తిల తేనెతెట్టె వెట్టినట్టే గొడ్తున్నది... అదురుష్టమంటే వాళ్లదే అని బైటి రాష్ట్రాలోళ్లు గూడ ఆసూపడె యవ్వారం గావోతున్నదట.. బంగారు తెలంగాణ రాష్ట్రంల పాలమూరు జిల్లాతోని.. సంగారెడ్డి జిల్లా గూడ పోటీ వడ్తున్నది.. దున్నెటోనిదే భూమిరా..? నడ్మ దొరోడు ఏందిరా అని ఆర్ నారాయణ మూర్తి సారు సీన్మల ఒక పాట ఉండే.. భక్తులను మోసం జేశ్న బాబాలున్నరుగని.. బాబాలను మోసం జేశ్న భక్తులను ఏడనన్న సూశిండ్రా మీరు..? న్యాయం కోసం పోలీసాయిననే.. న్యాయస్థానం ముంగట కత్తితోని పొడ్సుకోని సచ్చిపోదామని ప్రయత్నం జేశిన ముచ్చట మన బెల్లంపల్లి కాడ అయ్యింది.. చారణ కోడికి బారణ మసాల అంటె గిదే గావొచ్చు ముచ్చట...గిసొంటి గరం గరం ముచ్చట్లు వినాలంటే వీడియో క్లిక్ చేయండి.

 

20:17 - May 9, 2017

దున్నెటోనిదే భూమిరా..? నడ్మ దొరోడు ఏందిరా అని ఆర్ నారాయణ మూర్తి సారు సీన్మల ఒక పాట ఉండే.. ఆ పాటల పల్లవులు, చరణాలు మార్చవల్సిన అవుసరమొచ్చింది.. ఎందుకంటె దున్నెటోంది గాదు భూమి.. కబ్జావెట్టినోందే అని క్లారిటీ వచ్చేశింది.. ఒక టీఆర్ఎస్ పార్టీ లీడరు.. ఒక్కటి గాదు రెండు గాదు.. అర్వై ఎక్రాల ముప్పై గుంటల భూమీ అప్పనంగ మింగేశిండట. మొత్తం విషయానికి వీడియో క్లిక్ చేయండి.

20:16 - May 9, 2017

తెలంగాణ ప్రజల నెత్తిల తేనెతెట్టె వెట్టినట్టే గొడ్తున్నది. అదురుష్టమంటే వాళ్లదే అని బైటి రాష్ట్రాలోళ్లు గూడ ఆసూపడె యవ్వారం గావోతున్నదట. మన ముఖ్యమంత్రి కేసీఆర్ సారూ ఇన్నొద్దులు ప్రగతి భవన్లనే ముచ్చట్లు జెప్పిండుగదా.? ఇగ ఇద్వర్ సంది.. వాడవాడకు జెప్తడట.. పదిహేను దినాలకోపారి మీరు పనులు పక్కకు వెట్టి చౌరస్తకాడికి రాండ్రి.. ఎందుకనేది తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

20:04 - May 9, 2017

చిత్తూరు : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దెబ్బకు భారత ఐటీ ఉద్యోగులు విలవిలలాడుతున్నారు. వీసా నిబంధనలు కఠినతరం చేసిన తరువాత యూఎస్ లోని స్థానికులను నియమించుకోవాలని భారత ఐటీ దిగ్గజ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అందులో భాగంగా వేలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఇన్ఫోసిస్ తో పాటు కాగ్నజెంట్ నాలుగు వేల మంది ఉద్యోగస్తులను తొలగించింది. దీనికి వ్యతిరేకంగా ఐటీ ఉద్యోగులు ఉద్యమానికి సిద్ధమౌతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఫోరం ఫర్ ఐటీ ఎంప్లాయిస్, న్యూ డెమోక్రటిక్ లేబర్ ఫ్రంట్ లు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆశ్రయించాయి. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల ప్రయోజనాలను కాపాడాలంటూ తమిళనాడు కార్మిక శాఖలో పిటిషన్ దాఖలు చేశాయి. తమిళనాడులో ప్రారంభమైన ఈ ఉద్యమాన్ని కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. మరోవైపు ఉద్యోగులను తొలగిస్తున్నారన్న వార్తలను ఐటీ సంస్థలు తోసిపుచ్చుతున్నాయి. నైపుణ్యంలేని ఉద్యోగులు కంపెనీలను వీడి వెళుతున్నారని పేర్కొంటున్నాయి. ఈ హాట్ టాపిక్ పై మరింత విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి.

టవర్ ఎక్కిన ఎస్కే యూనివర్సిటీ విద్యార్థులు..

విశాఖపట్టణం : ఎస్కే యూనివర్సిటీ వద్ద సెల్ టవర్ ఎక్కి హాస్టల్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. హాస్టల్ ను ఖాళీ చేయాలని వీసీ ఆదేశించడంపై వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయం చూపేంత వరకు టవర్ దిగమని వారు ఖరాఖండిగా చెబుతున్నారు.

వ్యాపార వేత్త భార్యను కిడ్నాప్ చేసేందుకు..

తూర్పుగోదావరి : ఓ పారిశ్రామిక వేత్త భార్యను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. వీరిని మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. బ్లాక్ మెయిల్ చేసి రూ. 50 లక్షలు డిమాండ్ చేయాలని అనుకున్నట్లు పోలీసులకు వెల్లడించారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

తెలంగాణ రవాణ శాఖ సర్వీస్ ఛార్జీలు పెరిగాయి..

హైదరాబాద్ : సర్వీస్ ఛార్జీలను తెలంగాణ రవాణా శాఖ భారీగా పెంచింది. రూ. 500లోపు ట్యాక్స్ కు సర్వీస్ ఛార్జీ రూ. 5 నుండి రూ. 25లకు..రూ. 500 పై ట్యాక్స్ కు సర్వీస్ చార్జెస్ రూ. 10 నుండి రూ. 50లకు పెంచారు. లెర్నింగ్ లైసెన్స్ సర్వీస్ ఛార్జీ రూ. 33 నుండి రూ. 100కు పెరిగింది. లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కు రూ. 50 నుండి రూ. 200లకు..పెద్ద వాహనాల డ్రైవింగ్ లైసెన్స్ కు రూ. 100 నుండి రూ. 200లకు పెంచారు. నాన్ ట్రాన్స్ పోర్టు డ్రైవింగ్ లైసెన్స్ కు రూ. 150 నుండి రూ. 300లకు..టూవీలర్ ఆర్సీకి సర్వీస్ ఛార్జీ రూ. 100 నుండి రూ. 200లకు పెంచారు. నాన్ ట్రాన్స్ పోర్టు వాహనాల ఆర్సీలకు రూ.

మహిళా క్రికేటర్ వరల్డ్ రికార్డ్..

ఢిల్లీ : భారత మహిళా క్రికేటర్ ఝులన్ గోస్వామి వరల్డ్ రికార్డు నెలకొల్పింది. వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన మహిళా క్రికేటర్ గా నిలిచింది. 180 వికెట్లతో ఆస్ట్రేలియా బౌలర్ కేథరిన్ రికార్డును ఝులన్ అధిగమించింది.

ముగ్గురు నిందితులకు ఉరి శిక్ష..

ఢిల్లీ : పుణె టెక్కీపై అత్యాచారం, హత్య కేసులో తీర్పు వెల్లడైంది. ముగ్గురు నిందితులకు ఉరి శిక్ష విధిస్తూ శివాజీనగర్ కోర్టు తీర్పును చెప్పింది. 2009 సాఫ్ట్ వేర్ ఇంజినీర్ నయపుజారీపై అత్యాచారం..హత్య జరిగిన సంగతి తెలిసిందే.

19:41 - May 9, 2017
19:39 - May 9, 2017

విజయవాడ : ఏపీ ప్రత్యేక రైల్వే జోన్ పై టిడిపి ఎంపీ రాయపాటి సంచలన వ్యాఖ్యలు చేశారు. రైల్వే జోన్ విషయంలో దేవుడు వరమిచ్చినా పూజారీ కరుణించ లేదన్న చందంగా అధికారులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై చర్చించేందుకు దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్ కుమార్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. విజయవాడలో నిర్వహించిన ఈ సమావేశానికి ఎంపీ రాయపాటి హాజరయ్యారు. అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు. ఒకనొక దశలో వాకౌట్ చేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

అధికారుల తీరును తప్పుబట్టిన రాయపాటి..
రైల్వే జోన్ పై ప్రధాన మంత్రి మోడీ, రైల్వే మంత్రి సురేష్ ప్రభు సానుకూలంగా ఉన్నా అధికారులు అడ్డుపడుతున్నారని, అధికారులే పవర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. రైల్వే జోన్ రావడం అధికారులకు ఇష్టం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
విజయవాడ - చెన్నై డే ట్రైన్ అధికారులు పట్టించుకోవడం లేదని, వివిధ ప్రాజెక్టులను కూడా స్పందించడం లేదని ఆయన పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు పది సార్లు ప్రధానిని కలిసినా లాభం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు మీటింగ్..విందు భోజనాలు పెడుతున్నారు కానీ పనులు చేయడం లేదని మండిపడినట్లు సమాచారం.

రైల్వే జీఎం స్పందన..
దీనిపై రైల్వే జీఎం వినోద్ కుమార్ స్పందించారు. అధికారులు అందరూ సహకరిస్తున్నారని, పెండింగ్ ప్రాజెక్టుల పనులు మందగమనంలో ఉండడం వాస్తవమేనని ఒప్పుకున్నారు. దీనిపై కేంద్రంతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఎంపీ రాయపాటి చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆచితూచి స్పందించారు. కేంద్రం ఇవ్వాల్సి ఉంటుందని, ఇందుకు సహాయ సహకారాలు రైల్వే అధికారులు చేస్తారని చెప్పుకొచ్చారు.

19:31 - May 9, 2017

ఢిల్లీ : రాష్ట్ర అసెంబ్లీ మంగళవారం ప్రత్యేకంగా సమావేశమైంది. వస్తున్న ఆరోపణలపై సీఎం కేజ్రీవాల్ వివరణ ఇస్తారని మీడియాలో ప్రచారమైంది. కానీ ఈవీఎంలో వస్తున్న ట్యాపరింగ్ అంశంపై చర్చను చేపట్టడం విశేషం. ఈ సమావేశానికి జేడీయూ, టీఎంసీ పార్టీ ప్రతినిధులను ప్రత్యేకంగా ఆహ్వానించడం గమనార్హం. ట్యాంపరింగ్ పై ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ డెమో ద్వారా వివరించారు. ఈవీఎంల ట్యాపరింగ్ ఏ విధంగా జరుగుతుంది ? ఈవీఎం మిషన్ లో మార్పు ఎలా చేస్తారు ? మనిషి సృష్టించిన ఈ మెషిన్ లో మనిషే మార్పు ఎలా చేస్తారు ? తదితర అంశాలపై ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు. ఓటు ఎవరికి వేసినా బీజేపీ పడేలా మెషిన్ లో సీక్రెట్ కోడ్ మార్చారని ఆరోపణలు గుప్పించారు. తొలి రెండు గంటలు సరిగ్గానే పడుతాయని ఆ తరువాత బీజేపీ పడేలా సీక్రెట్ కోడ్ పెట్టారని తెలిపారు. ఇందుకోసం ఓ బొమ్మలాంటి ఈవీఎంను తీసుకొచ్చి సభ్యులకు ప్రత్యక్షంగా చూపించే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే వాటర్ కుంభకోణంపై చర్చించాలంటూ బీజేపీ పట్టుబట్టింది. సభను అడ్డుకున్న బీజేపీ ఎమ్మెల్యే విజయేంద్ర గుప్తాను స్పీకర్ సస్పెన్షన్ చేశారు.
గతంలో ప్రజా సంఘాలు..ఇతర నేతలు ఈవీఎం ట్యాపరింగ్ అంశంపై చర్చ చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిని ఈసీ తోసిపుచ్చింది. ఆమ్ ఆద్మీ చేస్తున్న ఆరోపణలు

సీఎం కేజ్రీవాల్ వస్తున్న అవినీతి ఆరోపణలు కప్పిపుచ్చుకొనేందుకు ఈవీఎం ట్యాంపరింగ్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఆప్ నుండి బహిష్కృతమైన మాజీ మంత్రి కపిల్ మిశ్రా ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం అఖిలపక్ష సమావేశాన్ని ఈసీ ఏర్పాటు చేసింది. ఈవీఎంల ట్యాంపరింగ్ పై ఈసీ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

19:18 - May 9, 2017

హైదరాబాద్ : టిటిడి ఈవోగా సింఘాల్ నియామకం రగడ ఇంకా చెలరేగుతోంది. ఇటీవలే పలువురు ఆయన నియామకంపై పలు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ట్విట్టర్ ద్వారా స్పందించారు. తాజాగా సినీ నటుడు మోహన్ బాబు స్పందించారు. సింఘాల్ కు మద్దతు తెలియచేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. సింఘాల్ కు ఆయన శుభాకాంక్షలు తెలియచేశారు. మరింత విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి.

19:09 - May 9, 2017
19:08 - May 9, 2017
19:07 - May 9, 2017

విశాఖపట్టణం : వేసవిలోనూ వైరస్‌ విజృంభిస్తోంది. విశాఖను స్వైన్‌ఫ్లూ హడలెత్తిస్తోంది. గడచిన నాలుగు నెలల్లోనే 47 కేసులు నమోదవగా.. ఎండలు దంచికొడుతోన్న ఏప్రిల్‌ నెలలో ఏకంగా 31 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ వ్యాధి.. వైద్య ఆరోగ్యశాఖకు సవాల్‌గా మారింది. స్వైన్‌ఫ్లూ నియంత్రణపై వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఏడాది విరామం తర్వాత విశాఖ జిల్లాలో మళ్లీ స్వైన్‌ ఫ్లూ పంజా విసిరింది. నగర పరిధిలో ఎనిమిది మంది స్వైన్‌ ఫ్లూ బారిన పడ్డారు. అలాగే జిల్లా పరిధిలో గడచిన నాలుగు నెలల్లోనే 47 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే స్వైన్‌ఫ్లూ కారణంగా ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కూడా కోల్పోయారు. విశాఖ జిల్లాలోనే కాదు... శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు, సరిహద్దుల్లోని ఒడిశా, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లోని జిల్లాల్లోనూ స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోంది. సాధారణంగా చలికాలంలోనే తొందరగా వ్యాప్తి చెందే స్వైన్‌ఫ్లూ వైరస్‌.. ఎండాకాలంలోనూ విజృంభిస్తుండడం.. వైద్య ఆరోగ్యశాఖను కలవరానికి గురిచేస్తోంది. దీని నియంత్రణపై అధికారులు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని.. వ్యాధి లక్షణాలను గుర్తించి రోగులను వెంటనే ఆస్పత్రిలో చేర్పించాలని వైద్యులు సూచిస్తున్నారు.

అప్రమత్తమైన వైద్యాధికారులు..
విశాఖ జిల్లాలో స్వైన్‌ఫ్లూ వైరస్‌ వ్యాప్తి చెందుతుండంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా వ్యాప్తంగా 11 స్క్రీనింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పెదవాల్తేరులోని శ్వాసకోశ వైద్యశాలలో ప్రత్యేక వార్డుని అందుబాటులోఉంచారు. అలాగే జనవరిలో కేజీహెచ్‌లోనే వ్యాధి నిర్ధరణ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ కేంద్రాల్లో వ్యాధి నిర్ధరణ కిట్లకు కొరత ఏర్పడింది... స్వైన్‌ఫ్లూ నిర్ధరణ కిట్లను తెప్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్వైన్‌ఫ్లూ వ్యాధి నిర్ధరణ కిట్లకు కొరత ఏర్పడడంతో, రోగులు కార్పొరేట్‌ ఆస్పత్రులను, ప్రైవేటు ల్యాబొరేటరీలను ఆశ్రయిస్తున్నారు. అక్కడ వ్యాధి నిర్ధరణకు ఐదున్నర వేల నుంచి 7 వేల రూపాయలు వరకు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్‌మెంట్‌ ఆస్పత్రుల్లో కిట్లను అందుబాటులో ఉంచాలని రోగుల బంధువులు కోరుతున్నారు.

19:06 - May 9, 2017

పశ్చిమగోదావరి : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతి రాజు పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో పర్యటించారు. విర్డ్‌ ఆస్పత్రిలో 27 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ఆర్థోపెడిక్‌ వైద్య పరికరాలను అశోక్‌గజపతి రాజు ప్రారంభించారు. భారత విమానాశ్రయాల సంస్థ సీఎస్ ఆర్ గ్రాంటుతో వీటీని కొనుగోలు చేశారు. అనంతరం ద్వారకాతిరుల వెంకటేశ్వరస్వామిని అశోక్‌గజపతి రాజు దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితులు తీర్థప్రసాదాలు అందజేశారు.

19:05 - May 9, 2017

పశ్చిమగోదావరి : జిల్లా ద్వారకాతిరుమల వెంకటేశ్వరస్వామి కల్యాణోత్సవంలో భాగంగా ఎదుర్కోలు వేడుకను వైభవోపేతంగా నిర్వహించారు. వేదపండితులు మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాలతో నిర్వహించిన ఎదుర్కోలు వేడుకలో పాల్గొనేందుకు భక్తులు తరలివచ్చారు. శ్రీదేవి, భూదేవి సహిత వెంకటేశ్వరస్వామిని వెండిశేషవాహనంపై ఉంచి, ద్వారకాతిరుమల పురవీధుల్లో విహరిస్తూ, భక్తులకు దర్శనం ఇచ్చారు. ద్వారకాతిరుమల ఆలయాన్ని పూలు, విద్యుత్‌ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు.

19:03 - May 9, 2017

విజయవాడ : అమెరికాలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టుబడుల వేట కొనసాగిస్తున్నారు. పలు కంపెనీలతో వరుస భేటీలు జరుపుతూ బిజీబిజీగా గడుపుతున్నారు. ఏపీ పెట్టబడులకు స్వర్గధామమని... పెట్టుబడులు పెట్టేవారికి అన్ని విధాలా సహకరిస్తామని చంద్రబాబు ఇన్వెస్టర్లకు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబుకు యునైటెడ్‌ స్టేట్స్‌ ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌.... ట్రాన్స్‌ఫార్మేటివ్‌ సీఎం పురస్కారం అందజేసింది. అమెరికాలో చంద్రబాబు ఐదోరోజూ బిజీబిజీగా గడుపుతున్నారు. ఏపీకీ పెట్టుబడులే లక్ష్యంగా పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. మొదట అప్లయిడ్‌ మెటీరియల్స్‌ ప్రతినిధులతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీతో అప్లయిడ్‌ మెటీరియల్స్‌ కంపెనీని భాగస్వామిగా చేసేందుకు రోడ్‌మ్యాప్‌ రూపొందించాలన్నారు. ఇందుకోసం అప్లయిడ్‌ మెటీరియల్స్‌ సంస్థ నుంచి ముగ్గురు, ఏపీ ప్రభుత్వం నుంచి ముగ్గురు బృందంగా ఏర్పడి సమన్వయం చేసుకోవాలని నిర్ణయించారు. మరోవైపు ఏపీని క్లౌడ్‌హబ్‌గా రూపొందించడంలో ప్రభుత్వానికి సహకారం అందించేందుకు నుటనిక్స్‌ సంస్ధ ముందుకొచ్చింది. మరో రెండు నెలల్లో దీనిపై స్పష్టమైన రోడ్‌మ్యాప్‌, ప్రాజెక్ట్‌ రిపోర్టుతో వస్తామని నుటనిక్స్‌ ప్రతినిధి ధీరజ్‌పాండే తెలిపారు.

యూఎస్‌ఐబీసీ సదస్సుల్లో పాల్గొన్న చంద్రబాబు
యునైటెడ్‌ స్టేట్స్ ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ రెండవ వార్షిక పశ్చిమ తీర సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. పట్రాకార్ప్‌ సీఈవో జాన్‌ ఎస్‌ సింప్సన్‌తో బాబు భేటీ అయ్యారు. విశాఖలో ఇప్పటికే కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఈ అమెరికన్‌ బీపీవో సంస్థ విస్తరణపట్ల ఆసక్తి కనబరుస్తోంది. విశాఖలో ఇప్పటికే 1500 ఉద్యోగాలు కల్పించిన బీపీవో సంస్థ.. స్థలం కొరత కారణంగా నయా రాయ్‌పూర్‌కు 500 ఉద్యోగాలు తరలిపోయాయని ప్రస్తావించింది. విశాఖలో తగిన స్థలం ఉంటే మరో 500 ఉద్యోగాలు కల్పించేవాళ్లమని స్పష్టం చేసింది. దీనిపై స్పందించిన చంద్రబాబు వెంటనే ఈ సంస్థకు టెక్‌ మహీంద్రా బిల్డింగ్‌ కేటాయించాలని ఏపీఐఐసీని ఆదేశించారు. ఆ తర్వాత వీసాకార్డ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అంబాసిడర్‌ డెమెట్రియస్‌ మరంటీస్‌, బెల్‌ కర్వ్‌ల్యాబ్స్‌, మొబిలిటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ గ్రూప్‌ ప్రతినిధులతోనూ చంద్రబాబు భేటీ అయ్యారు.

చంద్రబాబుకు ట్రాన్స్‌ఫర్మేటివ్‌ చీఫ్‌ మినిస్టర్‌ అవార్డు..
చంద్రబాబుకు ట్రాన్స్‌ఫార్మేటివ్‌ చీఫ్‌ మినిస్టర్‌ అవార్డు దక్కింది. యుఎస్‌ఐబీసీ తరపున జాన్‌ చాంబర్స్‌ ఈ అవార్డును చంద్రబాబుకు అందజేశారు. ఈ అవార్డు తనకు కాదని, తన రాష్ట్రానికి దక్కిన గౌరవంగా చంద్రబాబు తెలిపారు. ఈ పురస్కారాన్ని అమెరికన్‌ ఇన్వెస్టర్ల నుంచి ఏపీకి ఇస్తున్న మద్దతుగా భావిస్తున్నానని అన్నారు. ప్రతి యూఎస్‌ పారిశ్రామికవేత్త ఏపీకి వచ్చి ఒక పరిశ్రమను స్థాపించాలని ఈ సందర్భంగా కోరారు. అనంతరం సన్‌రైజ్‌ ఏపీ ట్రాన్స్‌ఫర్మషనల్‌ జర్నీ టూ వర్డ్స్‌ ఏ హ్యాపీ స్టేట్‌ అనే అంశంపై ప్రజెంటేషన్‌ ఇచ్చారు. అంతకు ముందు సిస్కో ప్రతినిధులతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో చిన్న తరహా వ్యాపారాలు మరింత సులభతరం చేసుకోవడంలో, విజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవడాన్ని సరళతరం చేయడంలో సహకారం అందిస్తామని సిస్కో ప్రకటించింది. ఏపీలో సాంకేతికత అనుసంధానించే ప్రక్రియ వేగంగా జరుగుతోందని, అందుకు తగిన వాతావరణాన్ని మెరుగుపర్చాలని భావిస్తున్నట్టు చంద్రబాబు స్పష్టం చేశారు.

19:03 - May 9, 2017

తిరుపతి : మునగలపాలెంలో బొజ్జలకు చేదు అనుభవం ఎదురైంది. బొజ్జలకు స్థానికుల నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఇసుక మాఫియాను పెంచి పోషించింది నువ్వేనంటూ బొజ్జలపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బొజ్జల ప్రసంగాన్ని స్థానికులు అడ్డుకున్నారు. ఏర్పేడు లారీ ప్రమాద ఘటనలో క్షతగాత్రులకు ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేసేందుకు బొజ్జలతో పాటు వచ్చిన మంత్రి అమర్నాథరెడ్డిపై పలు విమర్శలు గుప్పించారు.

18:30 - May 9, 2017

గుంటూరు : ఆంధ్రాయూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కాలేజీ మైదానంలో టిడిపి మహానాడు నిర్వహణకు అనుమతి ఇవ్వడాన్ని నిరసిస్తూ విద్యార్థి సంఘాలు ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి. యూనివర్సిటీల్లో రాజకీయ కార్యకలాపాల నిర్వహణను నిషేధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోకు విరుద్ధంగా మహానాడు నిర్వహణకు యూనివర్సిటీ ప్రాంగణాన్ని అనుమతి ఇవ్వడాన్ని విద్యార్థి సంఘాలు తప్పుపడుతున్నాయి. దీనిపై కోర్టును ఆశ్రయిచాలని విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నిర్ణయించింది. మహానాడు వేదిక మార్చుకోవాలని టిడిపికి సూచించింది. వెంటనే వేదిక మార్చుకోవాలని, లేనిపక్షంలో న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు.

18:29 - May 9, 2017

విశాఖపట్టణం : పరవాడ మండలం లంకెలపాలెం హైవేపై ఆర్‌టీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వస్తున్న స్పీడ్ డ్రైవింగ్, సరైన ధ్రువపత్రాలు లేని పలు వాహనాలను స్వాధీనం చేసుకుని వాహనదారులపై కేసులు నమోదుచేశారు. అలాగే అదనపు డ్రైవర్ లేకుండా నడుపుతున్న 16 బస్సులపైనా కేసులు పెట్టామని ఆర్‌టీఏ అధికారి ఖాన్ చెప్పారు.

18:26 - May 9, 2017

విజయవాడ : సీఎం చంద్రబాబునాయుడు ఎర్రచందనం కూలీల ప్రాణాలు తీశారంటూ పోస్ట్‌ చేసిన ఈ మెయిల్‌ వ్యవహారాన్ని ... వైసీపీ కుట్రగా చిత్రీకరించేందుకు ..టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపై దృష్టి సారించకపోగా దానిని అడగడమే నేరం.. కుట్ర అంటున్నారని ఆమె మండిపడ్డారు.

18:21 - May 9, 2017

హైదరాబాద్ : కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తరువాత కూడా.. అధికారానికి దూరమై ప్రతిపక్షానికే పరిమితమైంది. ఎన్నికలు తరుముకొస్తుండటంతో కాంగ్రెస్‌పై మరింత ఒత్తిడి పెరిగింది. గతంలో చేజారిన పవర్‌ను 2019లో దక్కించుకొని.. సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్న హస్తం నేతలను ఒక సవాల్‌ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రాష్ట్రంలో కేసీఆర్‌ను సమర్థవంతగా ఢీ కొడితేనే 2019లో అధికారం సాధ్యమవుతుందని కాంగ్రెస్‌ నేతలు నమ్ముతున్నారు. ఇందుకోసం చేయాల్సిన పనులపై దృష్టి పెట్టారు. కేసీఆర్‌ సంక్షేమ ప్రచారానికి ధీటుగా మ్యానిఫెస్టోను రూపొందించడంతో పాటు.. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఒక లీడర్‌ కావాలనే నిర్ణయానికి హస్తం నేతలు వచ్చారు.

అందరూ సీనియర్లే..
ప్రస్తుతం పార్టీలో ఉన్న వారంతా సీనియర్లే. అందరూ మంత్రులుగా పని చేసి.. సుదీర్ఘ కాలం పదవుల్లో ఉన్న వారే కావడంతో పార్టీలో నాయకులకు కొదవ లేదు. ఇదే ఇప్పుడు పార్టీకి సవాల్‌గా మారింది. అందరూ నాయకులే కావడం.. నేతల మధ్య ఆధిపత్య పోరు తోడు కావడంతో.. ఎవరికి వారు యమునా తీరు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వీటన్నింటికీ చెక్‌ పెట్టేందుకు ఢిల్లీ పెద్దల ముందు తమ ప్రతిపాదనల చిట్టాను పెట్టినట్లు తెలుస్తోంది.

సీఎం రేసులో దాదాపు 12 మంది నేతలు..
ప్రస్తుతం రాష్ట్రంలో సీఎం రేసులో దాదాపు 12 మంది నేతలున్నారు. వారిలో ఉత్తమ్, జానారెడ్డి, దామోదర రాజనర్సింహా, డికే అరుణ, షబ్బీర్‌ అలీ, మధుయాష్కీ ఇలా మరి కొందరు నేతలు.. అవకాశం వస్తే తామే సీఎం అన్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. ఇలా ఎన్నికలకు వెళ్లడం ద్వారా లాభం లేదని అంచనా కొచ్చిన నేతలు.. ఇప్పుడు సింగిల్ లీడర్ బెటర్ అన్న ఆలోచనలో ఉన్నారు. దీనికోసం.. తమలో ఎవరినైనా సరే.. సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే.. అతని నాయకత్వంలో వెళ్తామని చాలా మంది నేతలు రాహుల్‌కు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. దీనికోసం పార్టీకి ఎవరైతే లాభమనుకుంటే.. వారినే ఎంపిక చేయండని రాష్ట్ర నేతలు అధిష్టానానికి వివరించినట్లు తెలుస్తోంది.

18:16 - May 9, 2017

హైదరాబాద్ : అది దేశంలోనే ఎంతో పేరు ప్రతిష్టలున్న యూనివర్శిటీ. ఎన్నో శక్తులు ఆ యూనివర్శిటీ పేరును దిగజార్చేందుకు ప్రయత్నించాయి. అయినా ఆ విశ్వవిద్యాలయం వన్నె కొంచెం కూడా తగ్గలేదు. ఎప్పుడూ లేని విధంగా ఈ విద్యాసంవత్సర ప్రవేశ పరీక్షలకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. గత రెండేళ్లుగా ఆందోళనలతో హాట్ టాపిక్‌గా నిలిచిన హెచ్‌సీయూ.. విద్యార్థులు రారు అని జరిగిన ప్రచారాలను పటా పంచలు చేసింది. అడ్మిషన్ల వెల్లువతో యూనివర్శిటీ కళకళలాడుతోంది. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు కొన్ని శక్తులు తీవ్రంగా ప్రయత్నించాయి. కానీ వారి వ్యూహాలేవీ ఇక్కడ పని చేయలేదు. యూనివర్శిటీ ఇప్పటికీ అదే చరిష్మాతో ముందుకు సాగుతోంది. రోహిత్ వేముల ఆత్మహత్య ముందు తరువాత జరిగిన అనేక ఘటనలు విశ్వ విద్యాలయ ప్రతిష్టను దెబ్బ తీశాయని.. ఇక ఈ యూనివర్శిటీకి విద్యార్థుల రాక తగ్గుతుందని ప్రచారం జరిగింది. కానీ వాటన్నింటినీ తిప్పికొడుతూ ప్రస్తుతం సెంట్రల్ యూనివర్సిటీకి ప్రవేశాల కోసం దరఖాస్తుల వెల్లువ వస్తోంది.

30 శాతం పెరిగిన దరఖాస్తులు..
గత రెండేళ్లుగా హెచ్‌సీయూ.. విద్యార్థుల ఆందోళనలతో అట్టుడికింది. అనేక పోరాటాలకు కేంద్రబిందువైంది. ఈ క్రమంలో ఆందోళనలతో యూనివర్శిటీ పరువు పోతుందనీ కొందరంటే.. ప్రతిష్ట దిగజారుతుందనీ మరికొందరు మాట్లాడారు. అయితే భారీగా వచ్చిన దరఖాస్తులు వారందరి నోళ్లకు తాళం పడేలా చేశాయి. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీలో మొత్తం 124 కోర్సుల్లో దాదాపు 2 వేల సీట్లున్నాయి. వీటిలో ప్రవేశాల కోసం ఏప్రిల్ 3 నుంచి మే 5 వరకు యూనివర్శిటీ అధికారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. అయితే ఎప్పుడూ లేని విధంగా విద్యార్థుల నుంచి 58 వేల 34 దరఖాస్తులు ఈ విద్యా సంవత్సరానికి వచ్చాయి. గతేడాది 44 వేల దరఖాస్తులు వచ్చాయి. అంటే దాదాపు 30 శాతానికి పైగా దరఖాస్తులు పెరిగాయి. వీటిలో 37 శాతం మహిళా అభ్యర్థుల నుంచి రావడం విశేషమనే చెప్పాలి.

విద్యార్థి సంఘాల హర్షం..
ఈ దరఖాస్తుల్లో ఓబీసీ అభ్యర్థులవి 35.9 శాతం, ఎస్సీ అభ్యర్థులవి 15.83 శాతం, ఎస్టీ అభ్యర్థులవి 9.60 శాతం ఉన్నాయి. అత్యధికంగా తెలంగాణ రాష్ట్రం నుంచి 19 వేల 9 దరఖాస్తులు రాగా, తర్వాతి స్థానాల్లో కేరళ 6 వేల 515 దరఖాస్తులు, ఆంధ్రప్రదేశ్‌ నుంచి 5 వేల 918 దరఖాస్తులు ఉన్నాయి. హెచ్‌సీయూ ప్రవేశపరీక్షలు దేశవ్యాప్తంగా 37 కేంద్రాల్లో జూన్ 1 నుంచి 5 వరకు జరగనున్నాయి. విద్యార్థులు హాల్ టికెట్లను ఈ నెల 25 నుంచి హెచ్‌సీయూ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని యూనిర్శిటీ అధికారులు చెబుతున్నారు. యూనివర్శిటీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక్కో సీటుకు 29 మంది అభ్యర్థులు పోటీ పడనున్నారు. దీని పట్ల యూనివర్సిటీ అధికారులతో పాటు విద్యార్థి సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

18:07 - May 9, 2017

చిత్తూరు : నకిలీకి కాదేది కనర్హం.. తినే ఆహార పదార్థాలను నకిలీ చేస్తూ అక్రమార్గాన సంపాదించుకుంటున్నారు. చివరకు కోడిగుడ్లను కూడా కల్తీ చేసేస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని కుప్పంలో పాస్టిక్ కోడిగుడ్లు కలకలం సృష్టించాయి. ఓ ఇంటి వారు సమీపంలో ఉన్న దుకాణం నుండి కోడిగుడ్లను తెచ్చుకున్నారు. ఆమ్లేట్ చేద్దామని ప్రయత్నించగా వారికి ఎందుకో అనుమానం వచ్చింది. పైనున్న పెంకును లాగగా ప్లాస్టిక్ లాగా సాగింది. తెల్లసొనను కాల్చగా వెంటనే అది కాలిపోయిందని, లోపల ఉన్న పచ్చ సోనను కృతిమంగా తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం అక్కడా..ఇక్కడా పాకిపోయింది. దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.

18:02 - May 9, 2017

హైదరాబాద్ : కల్వకుర్తి ఎత్తిపోత పథకం పరిధి నుంచి తొలగించిన 37 వేల ఎకరాల ఆయకట్టును వెంటనే పునరుద్ధరించాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. వచ్చే ఏడాదికి కల్వకుర్తి ద్వారా సాగునీరు అందించాలని కోరారు. లేకపోతే ప్రభుత్వంతో యుద్ధం తప్పదని వంశీచంద్‌రెడ్డి హెచ్చరించారు.

17:52 - May 9, 2017

హైదరాబాద్ : మహిళలపై జరుగుతున్న దాడులకు కారణమైన అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. నిర్భయ నేరస్థులకు ఉరిశిక్ష-మహిళలపై జరుగుతున్న దాడులు - భవిష్యత్తు కర్తవ్యాలు అనే అంశంపై బహిరాబాగ్‌ ప్రెస్‌ క్లబ్‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. సమాజంలో పెరిగిపోతున్న అశ్లీలాన్ని నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని అఖిల భారత మహిళా సాంస్కృతిక సంఘం నాయకురాలు ప్రమీల కోరారు. అలాగే చాలామంది మద్యం మత్తులో...మహిళలపై దాడులకు పాల్పడుతున్నారని..మద్యం అమ్మకాలను నియంత్రించాలని డెమెక్రటిక్‌ యూత్‌ నాయకుడు భరత్‌ అన్నారు.

17:46 - May 9, 2017

కడప : బద్వేలు టిడిపిలో మూడు ముక్కలాట నడుస్తోంది. ఆ పార్టీలోని ముగ్గురు నేతల కుమ్ములాటలతో కార్యకర్తలు నలిగిపోతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు అసాధ్యం అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఇంతకీ ఎవరా ముగ్గురు నేతలు? ఎందుకు వారి మధ్య గొడవలు? బద్వేలు ఎమ్మెల్యే జయరాములు, టిడిపి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ విజయమ్మ.. పోయిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన విజయజ్యోతి.. కడపజిల్లా బద్వేలు టిడిపి నేతలైన వీరి మధ్య తీవ్రస్ధాయిలో అంతర్గత పోరు నడుస్తోంది. ఎంతగా అంటే ఒకరి కార్యక్రమాలను మరొకరు అడ్డుకునే స్ధాయిలో వివాదాలు ముదిరిపోయాయి. అధిష్టానం వీరి విషయంలో జోక్యం చేసుకున్నా పరిస్థితుల్లో ఎటువంటి మార్పు రాలేదు.

ముగ్గురు నేతల విభేదాలతో చీలిపోయిన కార్యకర్తలు..
వైసిపి నుంచి ఎమ్మెల్యే జయరాములు టిడిపిలో చేరకముందే బద్వేలు టిడిపిలో కుమ్ములాటలు ఉన్నాయి. ఆయన వచ్చిన తరువాత పోరు ముగ్గురి మధ్య మొదలైంది. టిడిపి ఇన్ ఛార్జ్ విజయమ్మ, గత ఎన్నికల్లో ఓడిపోయిన విజయజ్యోతికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్ధాయిలో విభేదాలున్నాయి. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమికి పార్టీ ఇన్ ఛార్జ్ విజయమ్మే కారణమన్నది విజయజ్యోతి ఆరోపణ. వీరు ముగ్గురి మధ్య విభేదాలతో కార్యకర్తలకు కూడా ఎవరి మాట వినాలో అర్థం కాక వాళ్లు కూడా మూడు గ్రూపులుగా విడిపోయారు.

ప్రాధాన్యం తగ్గిపోతోందని భావిస్తున్న విజయమ్మ..
ఎమ్మెల్యే జయరాములు రాకను మొదట్లో విజయమ్మ, విజయజ్యోతి వ్యతిరేకించారు. కానీ అధిష్టానం ఒత్తిడితో మెత్తబడ్డారు. జయరాములు ఎమ్మెల్యే కావడంతో కార్యకర్తలు ఆయనతో సఖ్యతగా మెలిగారు. అభివృద్ధి విజయంలో జయరాములు బాగా పనిచేస్తున్నారనే పేరు సంపాదించడంతో ఇక్కడే పార్టీ ఇన్ ఛార్జ్ విజయమ్మకు ఆయనకు పోరుకు అంకురార్పణ జరిగింది. తనకు ప్రాధాన్యం తగ్గుతోందని భావించిన విజయమ్మ సందర్భం వచ్చినప్పుడల్లా ఆయనతో కయ్యానికి కాలు దువ్వడం మొదలుపెట్టారు. వీరి మధ్యా వివాదాలతో పార్టీ తీవ్రంగా నష్టపోతోందని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇక బద్వేల్ లో వైసిపి నుంచి జయరాములు టిడిపిలోకి వచ్చేయడంతో వైసిపికి నాయకుడు లేని పరిస్థితి ఏర్పడింది. అయితే టిడిపిలోని విబేధాలు బద్వేల్ లో సరైన ప్రతిపక్ష నేతలు లేని లోటును తీరుస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. బద్వేల్ లో పరిస్థితిని అధిష్టానం సీరియస్ గా తీసుకోకపోతే వచ్చే ఎన్నికల్ని ఎదుర్కోవటం కష్టం అని కార్యకర్తలు స్పష్టం చేస్తున్నారు. ఎవరో ఒక్కరికో పూర్తి స్ధాయిలో బాధ్యతలు అప్పగించకపోతే మరోసారి ఓటమి తథ్యం అంటున్నారు. ఈ ముగ్గురి కుమ్ములాటలపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

గురుకుల టీచర్ల దరఖాస్తుల్లో మార్పులు..

హైదరాబాద్ : గురుకుల టీచర్ల దరఖాస్తుల్లో మార్పులకు టీఎస్పీఎస్సీ అవకాశం లభించింది. ఈనెల 12,13 తేదీల్లో అభ్యర్థులు ఎడిట్ ఆప్షన్ తో మార్పులు చేసుకోవచ్చని సూచించింది. గురుకుల టీచర్ల దరఖాస్తుకు నేటితో గడువు ముగియనుంది. క్రాఫ్ట్ టీచర్ పోస్టుల దరఖాస్తు గడువు ఈనెల 11వరకు పెంచారు. టీఎస్ పీఎస్సీ వెబ్ సైట్ లో క్రాఫ్ట్ టీచర్ పోస్టుల ప్రకటన సవరించింది.

దోమల నివారణకు కొత్త విధానం..

విజయవాడ : ఏపీలో దోమల నివారణకు కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. స్మార్ట్ మస్కిటో డెన్సిటీ మానిటరింగ్ విధానానికి శ్రీకారం చుట్టనున్నారు. పైల్ ప్రాజెక్టుగా విజయవాడ మున్సిపాల్టీలో ప్రారంభించనున్నారు.

స్టీల్ ప్లాంట్ కేకే1 యూనిట్ లో ప్రమాదం..

విశాఖపట్టణం : స్టీల్ ప్లాంట్ కేకే1 యూనిట్ లో ప్రమాదం చోటు చేసుకుంది. ముగ్గురు కాంట్రాక్టు కార్మికులకు గాయాలయ్యాయి.

మాజీ ఎంపీ పొన్నం పిటిషన్ తిరస్కరణ..

ఢిల్లీ : పార్లమెంట్ లో పెప్పర్ స్ప్రే ఘటనలో లగడపాటిపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో మాజీ ఎంపీ పొన్నం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను జస్టిస్ చలమేశ్వర్ ధర్మాసనం కొట్టివేసింది. మూడేళ్ల తరువాత కోర్టుకు ఎందుకు వచ్చారని పిటిషన్ ను ధర్మాసనం తోసిపుచ్చింది.

కర్నూలులో సుజనా చౌదరి పర్యటన..

కర్నూలు : జిల్లాలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి పర్యటించారు. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ ఛార్జీలతో ఆయన భేటీ అయ్యారు. టిడిపి పాలనలో ఫ్యాక్షన్ కు చరమగీతం పడిందని, చంద్రబాబు అమెరికా పర్యటనపై ప్రతిపక్షాల విమర్శలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు.

 

సింఘాల్ కు మోహన్ బాబు మద్దతు..

హైదరాబాద్ : టిటిడి నూతన ఈవోగా నియమితులైన ఏకే సింఘాల్ కు సినీ నటుడు మోహన్ బాబు మద్దతు పలికారు. తెలుగు రాష్ట్రాల్లో కలెక్టర్ ఘా సింఘాల్ మంచి పేరు తెచ్చుకున్నారని, నిజాయితీ పరుడు..అంకిత భావం కలవడాని కితాబిచ్చారు. వెంకటేశ్వరస్వామి ఒక ప్రాంతానికో..భాషకో పరిమితం కాదన్నారు.

బొజ్జలకు చేదు అనుభవం..

తిరుపతి : మునగలపాలెంలో బొజ్జలకు చేదు అనుభవం ఎదురైంది. బొజ్జలకు స్థానికుల నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఇసుక మాఫియాను పెంచి పోషించింది నువ్వేనంటూ బొజ్జలపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బొజ్జల ప్రసంగాన్ని స్థానికులు అడ్డుకున్నారు. ఏర్పేడు లారీ ప్రమాద ఘటనలో క్షతగాత్రులకు ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేసేందుకు మంత్రి అమర్నాథరెడ్డి, బొజ్జలు అక్కడకు వచ్చారు.

ఏసీబీ అదుపులో చెల్లూరు పంచాయతీ కార్యదర్శి..

విజయనగరం : రూ. 15వేలు లంచం తీసుకుంటున్న చెల్లూరు పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

రాష్ట్ర బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే...

హైదరాబాద్ : మిర్చిపై కేంద్ర ప్రకటన తరువాత తెలంగాణ జేఏసీ నేతలు రోజుకో మాట మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని, రాష్ట్ర బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే రైతు సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని సూచించారు.

16:07 - May 9, 2017

ప్రకాశం : జిల్లాలోని బల్లికురవలోని శ్రీనివాస గ్రానైట్ క్వారీలో కొందరు కూలీల బతుకులు సమాధి అయ్యాయి. క్వారీలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు కూలీలు దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి యాజమాన్య నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. బండరాళ్లను తరలించే ప్రక్రియలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని సమాచారం. పెద్ద పెద్ద బండరాళ్లు మీద పడడంతో కూలీల శరీరాలు ఛిద్రమయ్యాయి. తీవ్రగాయాలైన యువకుడిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కానీ క్వారీ యాజమాన్యం ఇంకా స్పందించలేదని తెలుస్తోంది.

నిరసన తెలిపే హక్కును కాలరాయడమే - సీతక్క..

హైదరాబాద్ : ధర్నా చౌక్ ను ఎత్తివేయడమంటే నిరసన తెలిపే హక్కును కాలరాయడమేనని సీతక్క పేర్కొన్నారు. ధనిక రాష్ట్రమని చెప్పుకుంటున్న కేసీఆర్ మిర్చి రైతులకు ఎందుకు మద్దతు ధర ప్రకటించలేదని, 12,13 తేదీల్లో రైతుల కోసం దీక్ష చేయాలని అనుకుంటే అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం డ్రామాలాడుతోందన్నారు.

తాము అధికారంలోకి వస్తే...

హైదరాబాద్ : గల్ఫ్ బాధితుల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది శూన్యమని టిపిసిసి చీఫ్ ఉత్తమ్ విమర్శించారు. గల్ఫ్ లో ప్రతి రోజు ఐదుగురు కార్మికులు చనిపోతున్నారని, తాము అధికారంలోకి వస్తే గల్ఫ్ బాధితుల కోసం ప్రతి ఏటా రూ. 100 కోట్లు కేటాయిస్తామన్నారు. గల్ఫ్ లో చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. కేరళ తరహాలో గల్ఫ్ కార్మికుల కోసం ప్రవాసీ బీమా అందిస్తామని పేర్కొన్నారు.

రూ. 1479 కోట్లు బ్యాంకుల్లో జమ - దేవినేని..

విజయవాడ : ఏపీ జలవనరుల శాఖ అధికారులతో మంత్రి దేవినేని ఉమ సమీక్ష నిర్వహించారు. బ్రోకర్ల ప్రమేయం లేకుండా నష్టపరిహారం ఇస్తున్నామని, ప.గో. జిల్లాలోని నిర్వాసితులకు రూ. 1,479 కోట్లు బ్యాంకుల్లో జమ చేయడం జరిగిందన్నారు. ఎకరాకు రూ. 10 లక్షలకు పైగా చెల్లించినట్లు, 2018 జూన్ నాటికి గ్రావిటీ ద్వారా నీరు ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. వచ్చే వారం కాపర్ డ్యాం పనులను ప్రారంభించనున్నట్లు, నిర్వాసితులకు ఇళ్ల నిర్మాణంపై దృష్టి పెడుతామన్నారు. ప్రతిపక్ష నేత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, రాబోయే రోజుల్లో జగన్ ప్రతిపక్షంలోనూ ఉండరన్నారు.

15:44 - May 9, 2017
15:28 - May 9, 2017

ప్రకాశం : జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ గ్రానైటీ క్వారీలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మృతి చెందడం కలకలం రేగింది. ప్రమాదం జరిగినా క్వారీ యాజమాన్యం స్పందిచలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. బల్లికురవలోని శ్రీనివాస గ్రానైట్ క్వారీలో పలువురు పనిచేస్తున్నారు. పెద్ద పెద్ద బండరాళ్లను లారీల్లో ఎక్కించే పనిలో పలువురు కార్మికులు నిమగ్నమయ్యారు. ఆ పక్కనే ఇతర కూలీలు పనిచేస్తున్నారు. కూలీలంతా భోజనం వెళ్లబోయే ముందు ఒక్కసారిగా లారీల్లో ఎక్కించిన పెద్ద పెద్ద బండరాళ్లు కిందపడిపోయాయి. అక్కడనే ఉన్న కూలీలపై పడడంతో ముగ్గురు కూలీలు మృతి చెందారు. బండరాళ్ల కింద పలువురు కూలీలున్నారా ? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇంత జరిగినా క్వారీ యాజమాన్యం స్పందించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ప్రమాదంపై అధికారులు స్పందిస్తారా ? లేదా ? అనేది చూడాలి.

15:23 - May 9, 2017

అనంతపురం : జిల్లాలో నెలకొన్న కరవు పరిస్థితులు చూస్తుంటే తీవ్ర ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయని రైతు స్వరాజ్య వేదిక కేంద్రం సభ్యురాలు కవిత పేర్కొన్నారు. జిల్లాలోని కరవు పరిస్థితిపై ప్రజా సంఘాల నిజనిర్ధారణ కమిటీ పర్యటించింది. ఈసందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు. గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులపై అంచనా వేయడం జరిగిందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యవసరంగా స్పందించకపోతే పరిస్థుతులు దారుణంగా ఉంటాయన్నారు. బీమా చెల్లింపుతో పాటు రైతులపై బ్యాంకుల వత్తిడి లేకుండా చూడాలని, ఉపాధి హామీ, వేతనాలు..తాగునీటి కల్పించాలని డిమాండ్ చేశారు. కొన్ని గ్రామాల్లో తాగునీరు లేకపోవడం..పెద్ద ఎత్తున వలసలు వెళ్లిపోవడం..పెద్ద ఎత్తున్న బోర్లు ఎండిపోవడం ఇవన్నీ వాస్తవమన్నారు. పశువులు..జీవాలు చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రానైట్ క్వారీలో ఘోర ప్రమాదం..

పశ్చిమగోదావరి : బల్లికురవలోని శ్రీనివాస గ్రానైట్ క్వారీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బండరాళ్లు మీద పడి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. బండరాళ్ల కింద ఇంకా మృతదేహాలు ఉండివచ్చునని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. క్వారీ యాజమాన్యం స్పందించడం లేదని తెలుస్తోంది.

 

15:14 - May 9, 2017

జగిత్యాల : తెలంగాణ రాష్ట్రంలో ఏదో ఒక జిల్లాలో రైతులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. మద్దతు ధర కల్పించాలని కొందరు..గిట్టుబాటు కావడం లేదని మరికొందరు..ఇలా సమస్యలపై రైతులు ఆందోళన బాట పడుతున్నారు. తాజాగా జిల్లాలోని చల్ గల్ లోని వ్యవసాయ మార్కెట్ ఎదుట మంగళవారం రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యాన్ని సకాలంలో తూకం వేయడం లేదని, తూకం వేసిన ధాన్యాన్ని తరలించేందుకు లారీలు లేవని పేర్కొంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇదే విధంగా ఉంటే ధాన్యం సేకరణకు మరో నెల రోజులు పాటు పడుతుందని, ఈలోగా వర్షం పడితే ఎలా అని ప్రశ్నించారు. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

15:11 - May 9, 2017

ఢిల్లీ అసెంబ్లీలో గందరగోళం..

ఢిల్లీ : రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. సమావేశమైన కొద్దిసేపటికే గందరగోళం చెలరేగింది. ఆప్ - బీజేపీ ఎమ్మెల్యేలు పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్నారు. సభ నుండి ఓ బీజేపీ ఎమ్మెల్యేను స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు.

పెళ్లి ట్రాక్టర్ బోల్తా..

మధ్యప్రదేశ్ : షియోపూర్ వద్ద పెళ్లి బృందంతో వెళుతున్న ఓ ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 6గురు మృతి చెందగా 16 మందికి గాయాలయ్యాయి.

రఘువీరా జైలుకెళ్లడం ఖాయమంటున్న బుద్ధా..

విజయవాడ : రఘువీరా రైతుల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని, వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు కోట్లు దోచుకున్నారని టిడిపి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. అడ్రస్ లేని పార్టీకి రఘువీరా అధ్యక్షుడని, రైతుల సొమ్ము కాజేసిన రఘువీరా జైలుకెళ్లడం ఖాయమన్నారు. మిర్చి యార్డుకు వెళ్లే నైతిక అర్హత రఘువీరాకు లేదని, రఘువీరా..జగన్ కోవర్టు అని, వైసీపీలోకి వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. చంద్రబాబుపై అబద్దపు ప్రచారాలు మానుకోకుంటే తగురీతిలో బుద్ధి చెబుతామన్నారు.

రాజధాని సలహా కమిటీలో మరో ఇద్దరు సభ్యులు...

విజయవాడ : రాజధాని సలహా కమిటీలో మరో ఇద్దరిని సభ్యులుగా చేరుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సభ్యులుగా బెంగలూరు జనగ్రూప్ కో ఫౌండర్ రామనాథన్, కేకేఈఆర్ గౌతమ్ విద్యా సంస్థల అధినేత కోటేశ్వరరావులకు అవకాశం దక్కింది.

ఎన్ని లేఖలు రాసినా స్పందనలేదు - షబ్బీర్..

హైదరాబాద్ : కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ గల్ఫ్ భరోసా సెమినార్ నిర్వహించారు. గల్ఫ్ బాధితులపై ప్రేమ కురిపిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం మూడేళ్లయినా ఎన్ఆర్ఐ పాలసీ తీసుకరాలేదని, మైనార్టీ డిపార్ట్ మెంట్ ఫండ్స్ ను ఎందుకు కేటాయించలేదన్నారు. బాధితుల సమస్యలపై కేసీఆర్ కు ఎన్ని లేఖలురాసినా స్పందించలేదని, మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ ను గల్ఫ్ లో ఇబ్బందులు పడుతున్న 1260 మంది కార్మికులను నాటి ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు.

 

కాసేపట్లో ఢిల్లీ ప్రత్యేక అసెంబ్లీ సమావేశం..

ఢిల్లీ : కాసేపట్లో రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ మేరకు సభ్యులకు ఆప్ విప్ జారీ చేసింది. తనపై వస్తున్న ఆరోపణలకు కేజ్రీవాల్ వివరణ ఇచ్చే అవకాశం ఉంది.

మహిళలను 'భరోసా' ఆదుకోంటోంది - సీపీ...

హైదరాబాద్ : హాకా భవన్ లో 'భరోసా' సెంటర్ వార్షికోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో సీపీ పాల్గొన్నారు. మహిళలను ఆదుకోవడంలో భరోసా కేంద్రం విజయవంతంగా పనిచేస్తోందని కితాబిచ్చారు. ఏడాది కాలంలో 1931 మంది బాధితులకు సహాయం...1432 వరకట్న కేసులు పరిష్కారం చేశారని తెలిపారు. 51 అత్యాచార కేసుల్లో బాధితులకు న్యాయ, వైద్య, వసతి సహాయం కల్పించిందని తెలిపారు.

 

కేంద్ర, రాష్ట్ర పాలనలో కార్మికుల దోపిడి - రఘువీరా..

విజయవాడ : ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ 70వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. కార్మికుల హక్కులు పరిరక్షించిన పార్టీ కాంగ్రెస్ అని రఘువీరా పేర్కొన్నారు. బీజేపీ, టీడీపీ పాలనలో కార్మికులు దోపిడీకి గురవుతున్నారని, ఉపాధి హామీ కార్మికుల నిధులు జన్మభూమి కమిటీల ద్వారా దోచేస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తున్నాయని విమర్శించారు. చంద్రబాబు చంద్రమండలం..సూర్యమండలం తిరిగినా పరిశ్రమలు తీసుకరాలేరని, ప్రత్యేక హోదాతోనే పరిశ్రమలు వస్తాయన్నారు.

 

13:28 - May 9, 2017

విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్‌ డీలా

గుంటూరు : రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్‌ గట్టి ఎదురుదెబ్బే తగిలింది. సీమాంధ్రప్రజలు వద్దని వేడుకుంటున్నా రాష్ట్రాన్ని విభజించడంతో కాంగ్రెస్‌ పార్టీపై ప్రజలు కన్నెర్రజేశారు. దీంతో 2014 ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క ఎమ్మెల్యే సీటునూ గెల్చుకోలేకపోయింది. ఇప్పట్లో కాంగ్రెస్‌ కోలుకునే సూచనలు కూడా కనిపించడం లేదు.

ఏపీలో కాంగ్రెస్‌కు భవిష్యత్‌ లేనట్లేనా?

ఏపీలో కాంగ్రెస్‌కు భవిష్యత్‌ లేదని భావించిన పలువురు కాంగ్రెస్‌ నేతలు ఇరత పార్టీలను ఆశ్రయిస్తున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలిగిన నేతలు ఇతర పార్టీల్లో చేరుతున్నారు. గుంటూరు జిల్లాలో రాజకీయ ఉద్దండులుగా పేరుగాంచిన రాయపాటి సాంబశివరావు టీడీపీలో, కన్నా లక్ష్మీనారాయణ బీజేపీలో చేరారు. వీరేకాదు... డొక్కా మాణిక్యవరప్రసాద్‌ టీడీపీ కండువా కప్పుకున్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉండడంతో నేతలంతా ఆ పార్టీల్లోనే చేరిపోతున్నారు. మరి కొద్ది మంది వైసీపీలో కూడా చేరారు. ఇతర పార్టీల్లో చేరిన నేతలు రాజకీయ భవిష్యత్‌కు ఇప్పట్లో ఢోకాలేనట్టే. ఇక ఎటొచ్చి కాంగ్రెస్‌లో ఉన్న నాయకుల పరిస్థితే అటుఇటు కాకుండాపోయింది. నేటికీ కాంగ్రెస్‌ పుంజుకోకపోవడంతో వారి రాజకీయ భవిష్యత్‌పై ఆందోళన మొదలైంది. ముందస్తు ఎన్నికలకు ఎన్డీఏ సర్కార్‌ వెళ్తోందని ప్రచారం ఊపందుకోవడంతో... తమ పొలిటికల్‌ కెరీర్‌ను తిరిగి నిలుపుకోవాలన్న తపన వారిలో మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఏ పార్టీలో చేరితే తమకు ప్రయోజనమని సన్నిహితులతో మంతనాల్లో మునిగిపోయారు.

కొత్తదారులు వెతుక్కుంటున్న నాదెండ్ల మనోహర్‌

గుంటూరు జిల్లాకు చెందిన మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కుమారుడు... మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ కూడా కొత్తదారులు వెతుక్కునే పనిలో పడ్డారు. ఆయన వైసీపీలోకి వెళ్తారన్న ప్రచారం జోరందుకుంది. అటు వైసీపీ అధినేత జగన్‌ కూడా నాదెండ్ల మనోహర్‌ను వైసీపీలో చేర్చుకునేందుకు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. గుంటూరు జిల్లాలోని కమ్మ సామాజిక వర్గాన్ని తమవైపు తిప్పుకోవాలంటే మనోహర్‌ అవసరం తప్పనిసరని వైసీపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే మనోహర్‌తో మంతనాలు సాగిస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అటు నాదెండ్ల మనోహర్‌ కూడా తన పొలిటికల్‌ కెరీర్‌కు పుల్‌స్టాప్‌ పడకుండా ఉండాలంటే వైసీపీలో చేరాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది

కాంగ్రెస్‌ వీడే యోచనలో మక్కెలన మల్లికార్జునరావు

గుంటూరు జిల్లా ప్రస్తుత కాంగ్రెస్‌ అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు కూడా పార్టీ మారే యోచనలోఉన్నారు. కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు ఆయన అనేక ప్రయత్నాలు చేసినా అవి సత్ఫలితాలను ఇవ్వడం లేదు. దీంతో ఆయన పార్టీ మారాలనే ఆలోచనకు వచ్చారు. అయితే ఏపార్టీలో చేరాలన్నది సన్నిహితులతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఇక మాజీమంత్రి కాసు క్రిష్ణారెడ్డి కూడా కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నా కార్యక్రమాల్లో మాత్రం అంత చురుకుగా పాల్గొనడం లేదు. దీనికి ఆయన కుమారుడు కాసు మహేష్‌రెడ్డి ఇప్పటికే వైసీపీలో చేరారు. దీంతో కాసు కుటుంబం ఇక వైసీపీలో ఉన్నట్లేనని పల్నాడు ప్రాంతంలో ప్రచారం సాగుతోంది. వీరితోపాటు మరికొంతమంది కాంగ్రెస్‌ నేతలు కూడా కాంగ్రెస్‌ను వీడే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ముందస్తు ఎన్నికలు రానున్నాయన్న ప్రచారంతో కాంగ్రెస్‌ నేతలు పార్టీని వీడేందుకు సిద్దమవుతున్నారు. మరి ఎవరెవరు ఏ పార్టీలోకి వెళ్తున్నారో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

13:23 - May 9, 2017

మెదక్ : ఎస్ఐ కొట్టాడన్న అవమానం తట్టుకోలేక సంజీవులు అనే వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. బూర్గుపల్లికి చెందిన సంజీవులు పర్మిషన్ లేకుండా బెల్ట్ షాపు నిర్వహిస్తున్నాడన్న సమాచారంతో ఘణపూర్ ఎస్ఐ శ్రీకాంత్ అక్కడికి వెళ్లాడు. మద్యం విక్రయిస్తున్న సంజీవులును చేయి చేసుకోవడమే కాకుండా అసభ్య పదజాలంతో దూషించి అరెస్ట్ చేసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఇంటికి వచ్చిన సంజీవులు అవమాన భారం తట్టుకోలేక ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్ర గాయాల పాలైన సంజీవులును గ్రామస్తులు స్ధానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. తమ గ్రామంలో వీరంగం సృష్టించిన ఎస్ఐ శ్రీకాంత్ ను వెంటనే అరెస్ట్ చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

13:21 - May 9, 2017

ఖమ్మం :జిల్లాలో కిరణ్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. స్నేహితుల మధ్య జరిగిన వివాదమే హత్యకు కారణంగా తెలుస్తోంది. ఇల్లెందుకు చెందిన కిరణ్, రాజ్ కమల్, అజయ్ లు స్నేహితులు. ముగ్గురు మద్యం తాగడానికి అటవీ ప్రాంతానికి వెళ్లారు. పీకల్దాక తాగిన ముగ్గురికి పాత గొడవలపై వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే రాజ్ కమల్, అజయ్ కిరణ్ పై దాడికి దిగారు. మద్యం బాటిల్ పగులగొట్టి అతి కిరాతకంగా చంపినట్లు సమాచారం. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సీబీఐ ఆఫీసుకు కపిల్ మిశ్రా

ఢిల్లీ : సీఎం కేజ్రీవాల్ వాల్ పై బహిరంగ లేఖ రాసిన కపిల్ మిశ్రా చెప్పిన విదంగా సీబీఐ ఆఫీసుకు చేరుకున్నారు. కేజ్రీవాల్ అవినీతిపై సీబీఐకి ఫిర్యాదు చేయనున్నారు. మరో వైపు కేజ్రీవాల్ ఇంటి ఎదుట బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. బిజెపి కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు వాటర్ కెనన్లతో చెదరగొట్టారు.

12:39 - May 9, 2017

ఢిల్లీ:నిర్భయ ఉదంతం, పరియవసానాలు, మే5 న సుప్రీం తీర్పుతో ఆ ఘటనలు ఆగుతాయా ? అన్న అంశంపై 'వేదిక' లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో ఐద్వా నేత ఆశాలత, ప్రముఖ న్యాయవాది గీత పాల్గొన్నారు. పూర్తి వివరా లకోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

12:37 - May 9, 2017

ఆదిలాబాద్‌ : బెల్లంపల్లి కోర్టు ముందు హోంగార్డు నారాయణ ఆత్మహత్యాయత్నం చేశారు. తనకు న్యాయం జరగడం లేదంటూ .. కత్తితో పొడుచుకున్నాడు. నారాయణ పరిస్థితి విషమంగా ఉండటంతో.. పోలీసులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. నాకు న్యాయం జరిగే వరకు ఆసుపత్రికి రానని ఆవేదన వ్యక్తం చేశారు.

12:35 - May 9, 2017

హైదరాబాద్: తెలంగాణ భూసేకరణ చట్టం-2013 సవరణ బిల్లుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ రాష్ట్రపతి ఆమోదం కోసం బిల్లును రాష్ట్రపతి భవన్‌కు పంపింది. రెండు, మూడు రోజుల్లో భూసేకరణ చట్ట సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపనున్నారు. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఈ బిల్లు చట్టంగా మారనుంది. సత్వర భూసేకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం 2013 కేంద్ర భూసేకరణ చట్టాన్ని అనుసరించి నూతన చట్టాన్ని 2016 డిసెంబర్‌లో తీసుకువచ్చింది. అయితే ఈ చట్టాన్ని పరిశీలించిన కేంద్ర న్యాయశాఖ ఆరు సవరణలు చేస్తే సరిపోతుందని చెప్పింది. ఈ క్రమంలో భూసేకరణ చట్టం -2013 సవరణ బిల్లుకు రాష్ర్ట శాసనసభ, మండలి ఏప్రిల్ 30న ఆమోదం తెలిపింది. ఇరిగేషన్ ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసి రాష్ర్ట ప్రభుత్వం ఈ బిల్లును ఆమోదించింది. రాష్ర్టపతి ఆమోదం అనంతరం భూసేకరణ ప్రక్రియ వేగవంతంగా జరగనుంది.

 

12:34 - May 9, 2017

ఢిల్లీ : భారతదేశ చరిత్రలో మొదటిసారి హైకోర్టు న్యాయమూర్తికి సుప్రీంకోర్టు జైలుశిక్ష విధించింది. కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కర్ణన్‌కు 6నెలలపాటు రాజ్యాంగ ధర్మాసనం జైలుశిక్ష విధించింది. జస్టిస్‌ కర్ణన్‌ వ్యాఖ్యలను ఇక నుంచి పేపర్లు ప్రచురించవద్దని, ప్రసారం చేయొద్దని ఆదేశించింది. కర్ణన్‌ వ్యాఖ్యలను ఒకవేళ ప్రచురించినా, ప్రసారం చేసినా కోర్టు ధిక్కరణగా పరిగణిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వెంటనే జస్టిస్‌ కర్ణన్‌ను అరెస్ట్‌ చేయాలని పశ్చిమ బెంగాల్‌ డీజీపీని సుప్రీం ఆదేశించింది.

హాకా భవన్ లో 'భరోసా' సెంటర్ వార్షికోత్సవం

హైదరాబాద్: హాకా భవన్ లో 'భరోసా' సెంటర్ వార్షికోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన సీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ...మహిళలను ఆదుకోవడంలో భరోసా కేంద్రం విజయవంతంగా పనిచేస్తోందని అన్నారు. ఏడాది కాలంలో 1031 మంది బాధితులకు సహాయం, 1432 వరకట్న కేసులు పరిష్కరించినట్లు తెలిపారు.

బెల్లంపల్లిలో హోంగార్డు ఆత్మహత్యాత్నం

మంచిర్యాల: బెల్లంపల్లిలో హోంగార్డు నారాయణ ఆత్మహత్యాయత్నం చేశాడు. కోర్టు ఎదుట కత్తితో పొడుచుకుని ఆత్మహత్యకు యత్నించాడు. అప్రమత్తమైన అధికారులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందింస్తున్నారు.

టీకాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ గల్ఫ్ భరోసా సెమినార్

హైదరాబాద్: కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ గల్ఫ్ భరోసా సెమినార్ జరుగుతోంది. ఈ కార్యక్రమానికి టీఎస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్, జానారెడ్డి హాజరయ్యారు.

'ఐకాసా ఆపా అధ్యక్ష పదవికి భారత్ ఎంపిక'

హైదరాబాద్ : ఐక్యరాజ్య సమితి ఆపా పాలకమండలి అధ్యక్ష పదవికి భారతదేశం ఎంపిక కావడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు భారతదేశం తరపున అధ్యక్ష పదవిలో కొనసాగి దేశ ప్రతిష్టను ఇనుమడింపజేయగలరని కేసీఆర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

పలాస ఎమ్మెల్యే శ్యామసుందర్ కు అస్వస్థత

శ్రీకాకుళం : పలాస ఎమ్మెల్యే శ్యామసుందర్ శివాజీఅస్వస్థతకు గురయ్యాడు.విశాఖ కేర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

11:41 - May 9, 2017

మెదక్ : ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లాలో అధికార పార్టీ నేతలే పేదల భూములకు ఎసరు పెడుతున్నారు. మెదక్ జిల్లా, నర్సాపూర్‌ మండలం ధర్మారంలో 69 ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. తమ గ్రామాన్ని దత్తత తీసుకున్న పెద్ద మనిషే.. తమ భూముల్ని కాజేశాడని ధర్మారం రైతులు చెబుతున్నారు. దీనిపై మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

11:38 - May 9, 2017

ఢిల్లీ : వివిధ బ్యాంకులకు 9వేల కోట్లు రుణాలు ఎగ్గొట్టి యూకేలో ఉన్న లిక్కర్ కింగ్విజయ్‌ మాల్యాకు సుప్రీంకోర్టు మరోషాక్‌ ఇచ్చింది. కోర్టు ధిక్కరణ కింద విజయ్‌మాల్యాకు సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. జూలై 10న హాజరుకావాలని ఆదేశించింది.

తెలంగాణ భూసేకరణ బిల్లుకు కేంద్రం ఆమోదం

ఢిల్లీ: తెలంగాణ భూసేకరణ బిల్లుకు కేంద్రం ఆమోదించింది. రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్ర హోంశాఖకు పంపింది. 2,3 రోజుల్లో రాష్ట్రపతి ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాష్ట్రపతి ఆమోదం తర్వాత బిల్లు చట్టంగా మారనుంది.

జస్టిస్ కర్ణన్ కు 6 నెలల జైలు శిక్ష

ఢిల్లీ: జస్టిస్ కర్ణన్ కు సుప్రీం కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. కోర్టు ధిక్కరణ కేసులో జైలు శిక్ష ను సుప్రీం కోర్టు విధించింది.

సీఎం కేజ్రీవాల్ కు కపిల్ మిశ్రా బహిరంగ లేఖ

ఢిల్లీ : సీఎం కేజ్రీవాల్ కు మాజీ మంత్రి కపిల్ మిశ్రా బహిరంగ లేఖ రాశారు. ‘కేజ్రీవాల్‌ జీ.. నేను మీపైనా.. మీ పార్టీ సభ్యులపైనా కేసు పెట్టేందుకు వెళ్తున్నాను. నన్ను దీవించండి ప్లీజ్‌. ఈ విషయంపై నేను సీబీఐకి ఫిర్యాదు చేయబోతున్నా. వారికి అన్ని విషయాలు చెప్పేస్తాను’ అని మిశ్రా అన్నారు. ట్యాంకర్‌ స్కామ్‌ గురించిన అన్ని వివరాలు ఏసీబీకి అందించానని, ఇప్పుడు సీబీఐకి కూడా చెబుతానని హెచ్చరించారు.

మాల్యాకు కోర్టు ధిక్కరణ కింద సుప్రీం సమన్లు

ఢిల్లీ: వివిధ బ్యాంకుల వద్ద 9వేల కోట్లు రుణాలు ఎగ్గొట్టి యూకేలో ఉన్న లిక్కర్ కింగ్ విజయమాల్యాకు కోర్డు ధిక్కరణ కింద సుప్రీం కోర్టు సమన్లు జారీ చేసింది. జులై 10న కోర్టుకు హాజరు కావాలని విజయ్ మాల్యాకు సుప్రీం ఆదేశించింది.

జపాన్‌లో భారీ భూకంపం

హైదరాబాద్: జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. భూకంప లేఖినిపై దీని తీవ్రత 6.0గా నమోదైంది. మయాకో ద్వీపం సమీపంలోని జలాల్లో భూమికి 10 కిలోమీటర్ల లోతులు ఈ ప్రకంపనల కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని అమెరికా భూభౌతిక పరిశోధనా కేంద్రం కూడా గుర్తించినట్లు సమాచారం. ఈ భూకంపంతో సముద్రమట్టాల్లో స్వల్ప తేడాలు వస్తాయి కానీ సునామీ వచ్చే అవకాశం లేదని అధికారులు తెలిపారు.

10:58 - May 9, 2017

శ్రీకాకుళం : నంబర్ వన్ జీడిపప్పుకు ఆ జిల్లా పెట్టింది పేరు.. కానీ ఆ పప్పును అందించే కార్మికుల కష్టాలు మాత్రం మాటల్లో చెప్పేవి కావు. జీడిపిక్క తొక్కలో ఉండే ప్రమాదకర రసాయనం వారి చేతుల్ని అనారోగ్యానికి గురిచేస్తున్నా.. బతుకుదెరువు కోసం పడరాని పాట్లు పడుతున్నారు. జీడి పరిశ్రమలో కార్మికులు ఎదుర్కొంటోన్న సమస్యలపై 10 స్పెషల్ స్టోరీ.

జీడిపప్పుకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు....

జిల్లాలోని పలాస, కాశీబుగ్గల్లోని జీడిపప్పు పరిశ్రమలో పనిచేసే కార్మికుల వెతలివి. ఇక్కడ లభించే జీడిపప్పుకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరుంది. కేవలం పలాస-కాశీబుగ్గ ఇండస్ట్రియల్ ఏరియా, మందస, మెళియాపుట్టి ప్రాంతాల్లో 170 వరకు జీడి పరిశ్రమలున్నాయి. ఇక్కడి నుంచే దేశ, విదేశాలకు టన్నుల కొద్దీ జీడిపప్పు ఎగుమతి అవుతుంది. అయితే ఈ పరిశ్రమ... కార్మికులను మాత్రం కష్టాల ఊబిలోకి నెడుతోంది.

10 వేల మంది మహిళలు 7 వేల మంది పురుషులు ...

ఇక్కడ పరిశ్రమల్లో దాదాపుగా 10 వేల మంది మహిళలు 7 వేల మంది పురుషులు నిత్యం పనిచేస్తుంటారు. జీడిపిక్కల నుంచి పప్పును వేరు చేస్తుంటారు. ఈ పప్పును చేతితో ఒలవడం వల్ల తొక్కలో ఉండే ప్రమాదకర రసాయనం వీరి చేతి వేళ్లకు అంటుకుంటోంది. సాధారణంగా ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే చేతికి గ్లౌజులు తొడగాలి. అయితే జీడి పరిశ్రమ యాజమాన్యం ఎలాంటి తొడుగులు అందివ్వకపోవడంతో ఇక్కడి కార్మికులంతా నేరుగా చేతితోనే పనిచేస్తున్నారు. దాంతో కార్మికులు చర్మ వ్యాధులబారిన పడుతున్నారు. పైగా జీడి తొక్క రసాయనం అంటడం వల్ల కార్మికుల వేళ్లపైని ముద్రలూ మాయం అవుతున్నాయి. దీంతో కార్మికులకు పెన్షన్, ఇతర సంక్షేమ పథకాలను అందుకోలేని దయనీయ స్థితి ఏర్పడింది. బయోమెట్రిక్‌ మిషన్‌లో వీరి వేలిముద్రలు నమోదు కాని కారణంగా, అధికారులు వీరిని సంక్షేమ పథకాల లబ్దికి అనర్హులుగా ప్రకటిస్తున్నారు. దీంతో కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కార్మికుల చేతుల పరిరక్షణకు గ్లౌజులు అందించేలా ...

ఇప్పటికైనా అధికారులు, జీడిపరిశ్రమల యాజమాన్యం కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సి ఉంది. కార్మికుల చేతుల పరిరక్షణకు గ్లౌజులు అందించేలా చర్యలు చేపట్టడంతో పాటు, ఈ ప్రాంతంలో వేలిముద్రలు కనుమరుగైన వారికి సంక్షేమ పథకాల లబ్ది అందేలాగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

10:53 - May 9, 2017

అమరావతి: ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. ఈ నెలలో జరగాల్సిన మెయిన్స్ పరీక్షను జూలై 15,16వ తేదీల్లో నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. అలాగే జూలై 30వ తేదీకి పంచాయితీ కార్యదర్శి పరీక్షను వాయిదా వేసింది. వాయిదా వేయాలంటూ కొద్దిరోజులగా నిరుద్యోగుల ఆందోళనచేస్తున్నారు. అభ్యర్థుల ఆందోళనతో ప్రభుత్వం దిగివచ్చింది.

10:52 - May 9, 2017

హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్రాన్స్‌ఫార్మేటివ్‌ సీఎం పురస్కారాన్ని అందుకున్నారు. అమెరికా పర్యటనలో ఉన్న చంద్రబాబుకు... యునైటెడ్‌ స్టేట్స్ ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ ఈ అవార్డును అందజేసింది. USIBC రెండో వార్షిక పశ్చిమ తీర సదస్సులో చంద్రబాబు ఈ అవార్డును స్వీకరించారు. అనంతరం చంద్రబాబు వరుస ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించారు. ఏపీని క్లౌడ్‌ హబ్‌గా రూపొందించడంలో ప్రభుత్వాన్నికి సహకారం అందించేందుకు నుటనిక్స్‌ సంస్థ ముందుకొచ్చింది. ఆ తర్వాత కార్ఫ్‌ సీఈవో జాన్‌ ఎస్‌ సింప్సన్‌తో చంద్రబాబు సమావేశమయ్యారు. అనంతరం వరుసగా బెల్‌ కర్వ్‌ ల్యాబ్స్‌ ప్రతినిధులు, మొబిలిటీ ఇన్ఫాస్ట్రక్షర్‌ గ్రూప్‌ సీఎండీ డాక్టర్‌ రవీంద్ర వర్మతోనూ సమావేశమయ్యారు.

బంజారాహిల్స్ రోడ్ నెం.12లో అగ్నిప్రమాదం

హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెం.12లో అగ్నిప్రమాదం సంభవించింది. ఓ అపార్ట్ మెంట్ లోని ఐదో అంతస్తులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు మూడు ఫైరిజన్ల సహాయంతో ప్రయత్నిస్తోంది.

ఏపీ క్లౌడ్ హబ్ కి నుటనిక్స్ సహకారం

అమరావతి: ఏపిని క్లౌడ్ హబ్ గా రూపొందించడంలో నుటనిక్స్ సంస్థ ముందుకొచ్చింది. సీఎం చంద్రబాబు అమెరికా పర్యటనలో భాగంగా నుటనిక్స్ సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ప్రభుత్వానికి సహకారం అందించేందుకు నుటనిక్స్ సంస్థ ముందుకొచ్చింది. రెండు నెలల్లో స్పష్టమైన మార్గదర్శక ప్రణాళిక ప్రాజెక్టు నివేదికతో వస్తామని ధీరజ్ పాండే తెలిపారు. క్లౌడ్ కు సంబంధించిన మౌలిక సదుపాయాలను నుటనిక్స్ సంస్థ కల్పించనుంది.

చంద్రబాబుకు 'ట్రాన్స్ఫార్మేటీవ్ చీఫ్ మినిష్టర్' అవార్డు

హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు 'టాన్స్ ఫార్మేటీవ్ చీఫ్ మినిష్టర్' అవార్డు అందుకున్నారు. యూఎస్ ఐబీసీ తరపున జాన్ ఛాంబర్స్ నుంచి ఈ అవార్డు చంద్రబాబుకు అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈ పురస్కారం నా రాష్ట్రానికి దక్కిన గౌరవంగా భావిస్తానన్నారు. ప్రత ఇయూఎస్ పారిశ్రామిక వేత్త ఏపీలో పరివ్రమ స్థాపించాలని కోరుతున్నాని పేర్కొన్నారు. ఏళ్ల తరబడి భారత్, యూస్ మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయని, భారత్ లో అపార అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ పురస్కారం అమెరికన్ ఇన్వెస్టర్ల నుంచి ఏపీకి ఇస్తున్న మద్దతుగా భావిస్తున్నాని తెలిపారు.

09:38 - May 9, 2017

అమరావతి: అవినీతి నిరోధక శాఖ ఆంధ్రప్రదేశ్‌లో దూకుడు పెంచింది....ఇప్పటికే ఎందరో ఉన్నతాధికారుల అవినీతి బాగోతాలను బయటపెట్టిన ఏసీబీ మరో ఉన్నతాధికారి అక్రమాస్తుల చిట్టాను విప్పింది...ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలన విభాగం సంయుక్త కార్యదర్శి కరణం వెంకట సాయికిషోర్‌ అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారన్న అభియోగంపై దాడులు చేసింది...

ఏకకాలంలో ఎనిమిది చోట్ల సోదాలు..

ఏసీబీ సాయి కిశోర్‌ అక్రమాస్తుల చిట్టాను తయారు చేసి ఏకకాలంలో ఎనిమిది చోట్ల సోదాలు నిర్వహించింది..ఉన్నత స్థానంలో ఉన్న సాయి కుమార్‌ హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో నివాసం.. ఉదయం ఆరు గంటల నుంచి ఖైరతాబాద్‌లోని ఆయన ఇంటితో పాటు కడప, గుంటూరు, రాజమహేంద్రవరం, కర్నూలు, బెంగళూరులోని సాయికుమార్‌ బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో తనిఖీలు కొనసాగించారు...

గతంలో మంత్రుల వద్ద కార్యదర్శిగా...

వాయిస్..సాయికిశోర్‌ గతంలో మంత్రుల వద్ద కార్యదర్శిగానూ, ఆదాయం వచ్చే విభాగాల్లో కీలక స్థానంలో విధులు నిర్వర్తించారు.. కొన్ని గంటలపాటు ఏకకాలంలో కొనసాగిన సోదాల్లో కోట్లాది రూపాయల ఆస్తులు బయటపడ్డట్లు తెలుస్తోంది..

09:36 - May 9, 2017
09:33 - May 9, 2017

హైదరాబాద్: టీఆర్ ఎస్ లో నేతలకు పార్టీ పదవులు.. అందని ద్రాక్షగానే మిగులుతున్నాయి. మూడుళ్లుగా పదవులు నేతలను ఊరిస్తున్నా.. నేడు, రేపు అంటూ వాయిదా పడుతూనే ఉన్నాయి. ఇటీవల నిర్వహించిన ప్లీనరీలో కూడా మార్పులకు ఆమోదం తెలిపినా.. పదవులు ఎప్పుడు దక్కుతాయో గులాబీ నేతలకు అంతు చిక్కడం లేదు.

పార్టీ సంస్థాగత నిర్మాణంపై సీఎం దృష్టి

గులాబి పార్టీ సంస్థాగత నిర్మాణంపై సీఎం కేసీఆర్‌ దృష్టి సారించారు. సంస్థాగత పదవుల భర్తీ.. ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం తర్వాత నియోజకవర్గాలు, జిల్లా కమిటీలకు మోక్షం కలుగుతుందని భావించినా.. ఇప్పటివరకూ పార్టీ పదవులకు సంబంధించిన ఊసే వినిపించడం లేదు. గత నెల 21న పార్టీ ప్రతి నిధుల సభలో.. కార్యకర్తలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకుంటామని సీఎం ప్రకటించారు. అయినా పార్టీ పదవుల భర్తీపై ఇంకా నిర్ణయాలు తీసుకోవడం లేదన్న ఆవేదన నేతల్లో కనిపిస్తోంది.

20 నుంచి 30 మందికి స్థానం

పార్టీని సంస్థాగతంగా మార్పులు చేయాలని సీఎం నిర్ణయం తీసుకోవడంతో.. ప్లీనరీలో ఇందుకు సంబంధించిన తీర్మానానికి పార్టీ ఆమోదం తెలిపింది. ఎమ్మెల్యేల నాయకత్వంలోనే నియోజకవర్గ కమిటీలను ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి ముఖ్యమంత్రి వచ్చారు. ఒక్కో నియోజక వర్గ కమిటీలో 20 నుంచి 30 మందికి స్థానం దక్కుతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. జిల్లా స్థాయిలో గతంలో 12 కమిటీలు ఉన్నా.. ఇప్పుడు జిల్లా కమిటీల స్థానంలో జిల్లా కో ఆర్డినేటర్లు గానీ.. జిల్లా కన్వినర్లను గానీ పార్టీని నియమించే అవకాశం ఉంది. మొత్తం 31 జిల్లాలు రావడంతో జిల్లా కమిటీ స్థానం ఒక్కరిద్దరికి మాత్రమే అప్పగించే అవకాశం కనిపిస్తోంది.

10 మంది లోపే పొలిట్ బ్యూరోలో నేతలకు అవకాశం...

రాష్ట్ర కార్యవర్గం, పొలిట్‌ బ్యూరోలపై సీఎం కేసీఆర్‌ స్వయంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. పొలిట్ బ్యూరో సభ్యుల సంఖ్యను బాగా తగ్గిస్తారన్న ప్రచారం జరుగుతోంది. 10 మంది లోపే పొలిట్ బ్యూరోలో నేతలకు అవకాశం దక్కుతుందనే వాదనలు బాగా వినిపిస్తున్నాయి. పార్టీ ప్రతినిధుల సభ తరువాత పదవులు భర్తీ ఉంటుందని అంచనా వేసుకున్నా.. సీఎం కేసీఆర్‌ కంటి పరీక్షల కోసం ఢిల్లీ వెళ్లడం.. ఇంకా ఆపరేషన్‌పై అధికారికంగా ఎలాంటి స్పష్టత లేకపోవడంతో పార్టీ పదవులు ఇప్పట్లో దక్కుతాయన్న ధీమా నేతల్లో కనిపించడం లేదు. గులాబి పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతోంది. పార్టీ పదవులు ఇప్పటికీ దక్కకపోవడంతో రాబోయే రోజుల్లో పదవులు దక్కుతాయో లేవోనన్న అనుమానాలు నేతలను వెంటాడుతున్నాయి.

09:28 - May 9, 2017

హైదరాబాద్: విశాఖ మన్యంలో మావోయిస్టుల అలికిడి.. పోలీసు శాఖను ఉలిక్కిపడేలా చేసింది. ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి నారా లోకేశ్‌ పర్యటన వేళ.. మావోయిస్టులు మన్యంలో మందుపాతరను పేల్చడాన్ని.. తీవ్రంగా పరిగణిస్తున్నారు. పైగా మే 27 నుంచి 29 వరకు విశాఖలోనే టిడిపి మహానాడు జరగబోతోంది. ఈ పరిస్థితుల్లో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా.. పోలీసు శాఖ గాలింపును ముమ్మరం చేస్తోంది. మావోయిస్టుల హిట్‌లిస్ట్‌లో ఉన్న వారికి అదనపు భద్రతను కల్పిస్తోంది.

చాలాకాలంగా ప్రశాంతంగా కనిపించిన విశాఖ ఏజెన్సీలో....

చాలాకాలంగా ప్రశాంతంగా కనిపించిన విశాఖ ఏజెన్సీలో.. ఉన్నట్టుండి మావోయిస్టులు ఉనికిని చాటుకోవడం.. పోలీసు శాఖను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఏవోబీలో మావోయిస్టుల జాడే లేదని.. వారి కార్యకలాపాలు పూర్తిగా ఆగిపోయాయని భావిస్తోన్న పోలీసులు.. చింతపల్లి మండలం, నారాయణపురం వద్ద, మావోయిస్టులు భారీ మందుపాతరను పేల్చడంతో ఉలిక్కిపడ్డారు. పైగా, ముఖ్యమంత్రి తనయుడు, రాష్ట్ర పంచాయతీరాజ్‌ మంత్రి నారా లోకేశ్‌ పర్యటిస్తున్న సమయంలో మందుపాతర పేలడం.. పోలీసు శాఖను కలవరానికి గురి చేసింది.

నిరుడు అక్టోబర్ 23న జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ...

నిజానికి నిరుడు అక్టోబర్ 23న జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఆర్కే తనయుడు మున్నా సహా 24 మంది మావోయిస్టులు మరణించారు. ఆ ఘటనలో మావోయిస్టు అగ్రనేత ఆర్కే త్రుటిలో తప్పించుకున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌ తర్వాత, మావోయిస్టుల నుంచి దాదాపు ఎలాంటి ప్రతిఘటనా లేకపోవడంతో, పోలీసు శాఖ పూర్తిగా రిలాక్స్‌ అయింది. ఈ తరుణంలో, నారాయణపురం వద్ద మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో.. పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఈ ఏరియాలో మావోయిస్టుల కార్యకలాపాల నియంత్రణపై ప్రత్యేక దృష్టిని సారించింది.

27 నుంచి 29 వరకు విశాఖలో జరిగే టిడిపి మహానాడుకు ...

ఈ నెల 27 నుంచి 29 వరకు విశాఖలో జరిగే టిడిపి మహానాడుకు పార్టీ అగ్రనేతలు హాజరుకానున్నారు. వీరిలో చాలామంది మావోల హిట్ లిస్ట్ లో ఉన్నారు. వీరిపై ఎటువైపు నుంచైనా మావోయిస్టుల దాడులు జరిగొచ్చన్న అనుమానాలూ ఉన్నాయి. దీంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. వాస్తవానికి, మందుపాతర పేలిన మర్నాడే డిజిపి సాంబశివరావు ఉత్తరాంధ్ర పోలీసు అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. మహానాడుకి వచ్చే నేతలకు భద్రత కల్పించే అంశంతో పాటు ఏవోబీలో మావోల ప్రాబల్యం ఏవిధంగా అరికట్టాలనే అంశాలపై సమావేశంలో చర్చించారు.

ఏరివేతలో ఎక్స్‌పర్ట్‌గా భావించే ఐపీఎస్ ...

అటు ప్రభుత్వం కూడా, మావోయిస్టుల ఏరివేతలో ఎక్స్‌పర్ట్‌గా భావించే ఐపీఎస్ రిటైర్డ్ అధికారి కోడె దుర్గా ప్రసాద్ ను మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల రోడ్ల నిర్మాణం సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏవోబీలో మావోయిస్టులను నియంత్రించడమే కోడె దుర్గాప్రసాద్ నియామకం వెనుక ప్రధాన ఉద్దేశమన్న భావన వ్యక్తమవుతోంది. మొత్తానికి, ఈనెల 27 నుంచి జరిగే మహానాడుకు భద్రత కల్పించడాన్ని పోలీసులు సవాల్‌గా తీసుకున్నారు.

09:26 - May 9, 2017

అమరావతి: ఏపీ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌కు రంగం సిద్దమైంది. పది రోజుల్లో ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని ఏపీ ఎంసెట్‌ కన్వీనర్‌ సాయిబాబా తెలిపారు. ఇంతకుముందెన్నడూ లేనివిధంగా ఎంసెట్‌ పరీక్ష రాసిన వారం రోజుల్లోనే రిజల్ట్స్‌ ఇచ్చామన్నారు. కౌన్సెలింగ్‌ పూర్తికాగానే క్లాసులు నిర్వహిస్తామని సీహెచ్‌ సాయిబాబా తెలిపారు. పూర్తి వివరా లకోసం ఈ వీడియోను క్లిక్ చేయండి

09:18 - May 9, 2017

నెల్లూరు : నెల్లూరు రైల్వే పోలీసులు, చైల్డ్‌లైన్‌ సంస్థ సిబ్బంది బాలకార్మికులకు విముక్తి కల్పించారు. వెట్టిచాకిరీ కోసం ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న 7మంది చిన్నారులను రైల్వేస్టేషన్‌లో పట్టుకున్నారు. వీరిని ఓ వ్యక్తి జార్ఖండ్‌ నుంచి బెంగళూర్‌కు తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో తరలిస్తుండగా దాడి చేసి చిన్నారులను రక్షించారు.

 

గుంటూరు మిర్చి యార్డు ఎదుట కాంగ్రెస్ ఆందోళన

అమరావతి: గుంటూరు మర్చి యార్డు ఎదుట కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, కునుమూరి బాపిరాజు పాల్గొన్నారు. వీరు రైతలు సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

08:48 - May 9, 2017

హైదరాబాద్: టిటిడి కార్యనిర్వహణాధికారిగా అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ నియమాకం వివాదాస్పదంగా మారుతోంది. ఉత్తరాదికి చెందిన సింఘాల్‌ను ఈఓగా నియమించండం పట్ల కొన్ని వర్గాల నుంచి అభ్యంతరం వ్యక్తం అవుతోంది. ఈ నియామకాన్ని నిన్న విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద తప్పుపట్టగా... తాజాగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కూడా ఈవ్యవహారంపై స్పందించారు. దీనిపై ప్రభుత్వం దక్షిణ భారత ప్రజలకు సమాధానం చెప్పాలని ట్విటర్‌ ద్వారా డిమాండ్‌ చేయడం రాజకీయంగా కలకలం సృష్టిస్తోంది. ఇదే అంశంపై 'న్యూస్ మార్నింగ్' లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో సామాజిక వేత్త బైరా దిలీప్, సీపీఎం నేత బాబురావు,టిడిపి నేత దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

07:13 - May 9, 2017

కర్నూలు: శివరామాపురంలో దారుణం జరిగింది. భార్య వివాహేతర సంబంధం పెట్టుకుని.. వేరే వ్యక్తితో వెళ్లిపోవటంతో మనస్తాపానికి గురైన భర్త.. తన ఇద్దరు చిన్నారులను గొంతు నులిమి చంపి.. ఆత్మహత్య చేసుకున్నాడు.

కాకినాడలో మహిళ కిడ్నాప్‌కు విఫలయత్నం

తూర్పుగోదావరి : కాకినాడలో మహిళ కిడ్నాప్‌కు విఫలయత్నం జరిగింది. యాక్ట్‌ షిప్పింగ్‌ కంపెనీ యజమాని ధనలక్ష్మిని కిడ్నాప్‌ చేసేందుకు కారు డ్రైవర్ తన మిత్రులతో కలిసి ప్రయత్నించారు. కోనపాపపేటలో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

టీటీడీ ఈవో నియామకంపై విమర్శలు

హైదరాబాద్: టిటిడి కార్యనిర్వహణాధికారిగా అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ నియమాకం వివాదాస్పదంగా మారుతోంది. ఉత్తరాదికి చెందిన సింఘాల్‌ను ఈఓగా నియమించండం పట్ల కొన్ని వర్గాల నుంచి అభ్యంతరం వ్యక్తం అవుతోంది. ఈ నియామకాన్ని నిన్న విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద తప్పుపట్టగా... తాజాగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కూడా ఈవ్యవహారంపై స్పందించారు. దీనిపై ప్రభుత్వం దక్షిణ భారత ప్రజలకు సమాధానం చెప్పాలని ట్విటర్‌ ద్వారా డిమాండ్‌ చేయడం రాజకీయంగా కలకలం సృష్టిస్తోంది. పవన్‌ ట్వీట్‌పై ఏపీ మంత్రులు, టిడిపి నేతలు మండిపడుతున్నారు.

07:03 - May 9, 2017

హైదరాబాద్‌: నగరంలో అక్రమ నిర్మాణాలపై బల్దియా ప్రత్యేక దృష్టి పెట్టింది. అక్రమ నిర్మాణాలు కనపడితే కూల్చేయడమే అంటుంది. అయితే ఇప్పటి వ‌ర‌కు శాస్త్రీయ పద్ధతిలో నిర్మాణాలను కూల్చివేస్తు వచ్చింది జీహెచ్‌ఎంసీ. ఈ విధానంతో జీహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మాణాల కూల్చి వేత‌ల్లో ప‌క్షపాతం వ‌హిస్తున్నార‌ని.. దీంతో క్షేత్రస్థాయిలో రోజురోజుకు అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయని ఆరోప‌ణ‌లు వస్తున్నాయి. ఈ ఆరోపణల నుంచి బయటపడటానికి బల్దియా అధికారులు సరికొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టారు. ఒకేసారి భవనం మొత్తం క్షణాల్లో కూల్చివేసే ఇన్ల్ఫోజన్ పద్ధతిని అమలుచేస్తున్నారు.

మాదాపూర్ లో 5అంతస్థుల భవన కూల్చివేతలో...

మాదాపూర్‌లో అక్రమంగా నిర్మించిన ఐదు అంతస్తుల భవనం కూల్చివేతల్లో ఈ పద్ధతిని ప్రవేశపెట్టింది బల్దియా. అయితే ఈ ప్రయోగం విఫలమైంది. పూర్తిస్థాయిలో భవనం నిర్మాణం జరగకపోవడం.. పక్కనే మరో భవనం ఉండడంతో ప్రయోగం విజయవంతం కాలేదని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు.

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో అక్రమనిర్మాణాలను...

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో అక్రమనిర్మాణాలను ఉపేక్షించేది లేదంటున్నారు మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్. ఇక‌ నుంచి నామమాత్రపు కూల్చివేతలు ఉండవని.. ఇన్ల్ఫోజన్ పద్ధతిలోనే కూల్చివేతలు ఉంటాయని హెచ్చరించారు. ప్రయోగం విఫలం కావడం ఓవంతకు మంచిదేనని.. నివాస ప్రాంతాలు, ఖాళీ ప్రదేశాల్లో భవనాలు ఎలా కూల్చాలో అనుభవం వచ్చిందన్నారు.

నిబంధనలకు విరుద్ధంగా ఐదు అంతస్తుల...

అయితే నిబంధనలకు విరుద్ధంగా ఐదు అంతస్తుల భవనం నిర్మిస్తున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నారని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

07:00 - May 9, 2017

విశాఖ : మహా విశాఖ నగర పాలక సంస్థలో గుర్తింపు యూనియన్‌ ఎన్నికలకు అధికారులు అన్నిఏర్పాట్లు పూర్తి చేశారు. 2001 నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి ఈ ఎన్నికలను నిర్వహిస్తున్నారు. మొత్తం 3,255 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉద్యోగులు, కార్మిక సంక్షేమంపై నేతలు ఎవరికి వారు హామీలు గుప్పిస్తున్నారు.

సీఐటీయూ, ఇంటాక్‌ వంటి కార్మిక సంఘాల మద్దతుతో

సీఐటీయూ, ఇంటాక్‌ వంటి కార్మిక సంఘాల మద్దతుతో 2014 ఎన్నికల్లో జీవీఎంసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ విజయం సాధించింది. అయితే కార్మిక సంక్షేమం విషయంలో గుర్తింపు సంఘంలో విభేదాలు తలెత్తడంతో సీఐటీయూ ఈసారి స్వతంత్రంగా బరిలో దిగింది. జీవీఎంసీ ఎంప్లాయూస్‌ యూనియన్‌ పేరుతో నక్షత్రం గుర్తుపై పోటీ చేస్తోంది.

టీడీపీకి అనుబంధంగా ఉన్న...

టీడీపీకి అనుబంధంగా ఉన్న మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ కాగడా గుర్తుపై పోటీ చేస్తోంది. మహా విశాఖ నగర పాలక సంస్థలో ప్రస్తుతం ఇదే గుర్తింపు యూనియన్‌గా ఉంది. బీజేపీకి అనుబంధంగా ఉన్న వీఎంస స్టాప్‌ అండ్‌ వర్కర్స్ యూనియన్‌ గంట గుర్తుతో బరిలో దిగింది. గతంలో తామే కార్మిక సమస్యలను పరిష్కరించామని యూనియన్‌ నేతలు చెబుతున్నారు. ఎన్నికల బరిలో ఉన్న మూడు యూనియన్లు ఓటర్లను ఆకర్షించేందుకు పోటీపోటీగా ప్రచారం నిర్వహించాయి. మరి మంగళవారం జరిగే ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరిస్తుందో చూడాలి.

జీవిఎంసీ గుర్తింపు ఎన్నికల్లో సిటీఐయు పోటీ

విశాఖ : మహా విశాఖ నగరపాలక సంస్థలో గుర్తింపు యూనియన్‌ ఎన్నికల పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. మంగళవారం జరిగే పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏపీలో అధికారం పంచుకుంటున్న టిడిపి, బిజెపిలు రెండు వేర్వేరు యూనియన్లకు నాయకత్వం వహిస్తున్నాయి. జీవీఎంసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ పేరుతో సిఐటియు ప్యానెల్‌ మొదటిసారి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోంది.

కోఠి మహిళా ఆసుపత్రిని సందర్శించిన కాంగ్రెస్ నేతలు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల తీరు మరీ దారుణంగా తయారైందని రాజకీయ పక్షాలు... ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి.ఇవాళ కోఠి మహిళా ఆసుపత్రిని సందర్శించిన కాంగ్రెస్ నేతలు.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బాలింతలు చనిపోయినా.. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

మిర్చి రైతుల అరెస్టు దారుణం- దత్తాత్రేయ

హైదరాబాద్: మిర్చికి మద్దతు ధర కోసం ఆందోళన చేపట్టిన రైతులను తెలంగాణ ప్రభుత్వం అరెస్టు చేయడం దారుణమని కేంద్ర మంత్రి దత్తాత్రేయ అన్నారు. తెలంగాణలో మిర్చికి కనీస మద్దతు ధర కల్పించాలని, రహదారుల పునరుద్ధరణ పనులపై కేంద్ర మంత్రులు రాధామోహన్‌సింగ్‌, నితిన్ గడ్కరీకి దత్తాత్రేయ నివేదికలు అందించారు. మిర్చి పంట కొనుగోలుకు ప్రభుత్వం వెంటనే 250 కోట్ల రూపాయలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

06:55 - May 9, 2017

హైదరాబాద్: ఢిల్లీలో ఏపీ, తెలంగాణ అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. ఏపీ రెసిడెంట్‌ కమిషనర్‌ నివాసం తమకు అప్పగించాలంటూ తెలంగాణ అధికారులు గదికి తాళాలు వేశారు. విభజన చట్టం ప్రకారం ఆంధ్రాకు 58 శాతం, తెలంగాణకు 42 శాతం భవనాలు రావాలని తెలంగాణ అధికారులు వాదిస్తుండగా.. మొదటి నుంచి తమ ఆధీనంలోనే ఉన్న భవనాన్ని ఇప్పుడు ఎలా ఇస్తామని ఆంధ్రా అధికారులు ప్రశ్నించారు. తెలంగాణ అధికారులు వేసిన తాళాన్ని ఆంధ్రా అధికారులు పగుల గొట్టడంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

'మావోయిస్టుల ఏరివేత కు 8 సూత్రాల 'సమాధాన్''

ఢిల్లీ: మావోయిస్టులను ఎదుర్కొనేందుకు రాష్ర్టాలు మరింత సన్నద్ధం కావాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పిలుపునిచ్చారు. మావోయిస్టుల ఏరివేత కోసం 8 సూత్రాల 'సమాధాన్' పేరుతో ఆయన కొత్త వ్యూహాన్ని ప్రతిపాదించారు. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణంతో పాటు అభివృద్ధి పనులు వేగంగా జరగాల్సిన అవసరం ఉందని సూచించారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన నక్సల్స్ ప్రభావిత రాష్ర్టాల ముఖ్యమంత్రులు, డీజీపీలు, ఇంటెలిజెన్స్ అధికారులతో రాజ్‌నాథ్‌ సమావేశమయ్యారు.

06:50 - May 9, 2017

హైదరాబాద్: బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను దాణా స్కాం వీడడం లేదు. లాలూపై అభియోగాలను జార్ఖండ్‌ హైకోర్టు కోట్టివేయడాన్ని సవాలు చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణ జరిపింది. 950 కోట్ల దాణా స్కాంకు సంబంధించి లాలూపై విచారణ కొనసాగించాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసును అత్యంత ప్రాధాన్యమైనదిగా భావించాలని సూచించింది. 9 నెలల్లోగా దాణా స్కాం కేసులన్నింటిలో విచారణ పూర్తి చేయాలని సిబిఐని ఆదేశించింది.

1996లో దాణా కుంభకోణం వెలుగులోకి ...

1996లో దాణా కుంభకోణం వెలుగులోకి వచ్చింది. పశుగ్రాసం పేరుతో 950 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని లాలూ ప్రసాద్‌ యాదవ్‌తో సహా 45 మంది నేతలపై 4 కేసులు నమోదయ్యాయి. ఒక కేసులో లాలూ దోషిగా తేలడంతో 2013 అక్టోబర్‌లో ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష విధించారు. అదే ఏడాది డిసెంబర్‌లో ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. మిగతా మూడు కేసుల్లో లాలూను విచారించాల్సి ఉంది. 2014లో ఈ మూడు కేసుల నుంచి ఝార్ఖండ్‌ హైకోర్టు లాలూకు వూరటనిచ్చింది. ఒక కేసులో దోషిగా తేలిన వ్యక్తిని అదే సాక్ష్యాలు, ఆధారాలతో మరో కేసుల్లో విచారించరాదని కోర్టు చెప్పింది. హైకోర్టు తీర్పును వ్యతిరేకించిన సీబీఐ... మిగతా కేసుల్లోనూ లాలూపై విచారణ కొనసాగించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు విచారణ చేపట్టిన న్యాయస్థానం సీబీఐ వాదనలతో ఏకీభవించింది.

రెండు దశాబ్దాలుగా దాణా స్కాంతో ఉక్కిరి బిక్కిరి...

రెండు దశాబ్దాలుగా దాణా స్కాంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న లాలూప్రసాద్‌ యాదవ్‌కు తాజాగా జైలులో ఉన్న షహబుద్దీన్‌తో లాలూ జరిపిన సంభాషణలు కలకలం సృష్టించాయి. 2016 ఏప్రిల్‌లో జైలులో ఉన్న షహబుదీన్‌కు, బయట ఉన్న లాలూకు మధ్య జరిగిన సంభాషణను రిపబ్లికన్‌ టీవీ ప్రసారం చేసింది. ఈ టేపుల్లో ఉన్నది వాస్తవం కాదని లాలూ గొంతును అనుకరించారని ఆర్జేడి ఆరోపించింది.

లాలూ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో...

లాలూ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో రైల్వే హోటళ్లను ఓ పారిశ్రామికవేత్తకు అప్పగించినందుకు బదులుగా పట్నాలో 200 కోట్ల విలువైన రెండు ఎకరాల స్థలాన్ని తీసుకున్నారని బిజెపి ఆరోపించింది. లాలూ తనయుడు తేజ్‌ ప్రతాప్‌ 90 లక్షల మట్టి కుంభకోణానికి పాల్పడ్డారని బిజెపి నేత సుశీల్‌ మోది ఆరోపించారు. ఆ ఆరోపణలను లాలూ ఇప్పటికే కొట్టి పారేశారు.

బిహార్‌పై పట్టు సాధించాలనుకుంటున్న బిజెపి...

బిహార్‌పై పట్టు సాధించాలనుకుంటున్న బిజెపి- ముఖ్యమంత్రి నితీష్‌ను దువ్వే ప్రయత్నం చేస్తోంది. జెడియు లాలూ పార్టీతో తెగతెంపులు చేసుకుంటే తాము మద్దతిస్తామని సుశీల్‌ మోది ఆఫర్‌ ఇచ్చారు. దీనిపై నితీష్‌కుమార్‌ ఇంతవరకు స్పందించలేదు.

పాకిస్థాన్‌ ఆర్మీపై ప్రతీకారం తీర్చుకున్న భారత సైన్యం

హైదరాబాద్: పాకిస్థాన్‌ ఆర్మీపై మన సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. గతవారం పాకిస్థాన్‌ సైనికులు ఇద్దరు భారత జవాన్లను శిరచ్ఛేదం చేసిన ఘటనకు బదులు తీర్చుకుంది. నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్‌ సైనిక బంకర్లపై మన ఆర్మీ దాడులు చేసినట్టు ఒక వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. లక్ష్యాలను ఛేదించే క్షిపణులతో పాక్‌ సైనిక బంకర్లపై దాడి చేసిన తర్వాత యుద్ధ ట్యాంకులు విరుచుకుపడిన దృశ్యాలు వీడియోలో సష్టంగా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత భారీ పేలుళ్లు సంభవించిన దృశ్యాలు ఉన్నాయి. అయితే ఈ వీడియో ఎప్పటిదన్న అంశంపై స్పష్టతలేదు.

06:43 - May 9, 2017

హైదరాబాద్: చాంపియన్స్‌ ట్రోఫీకి బీసిసిఐ టీమిండియాను ప్రకటించింది.బీసిసిఐ చీఫ్‌ సెలక్టర్‌ ఎంఎస్ కె ప్రసాద్‌ నాయకత్వంలోని సెలక్షన్‌ కమిటీ...ప్రయోగాల జోలికి పోకుండా....స్వదేశంలో ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ ఆడిన జట్టుకే మొగ్గు చూపింది.

ఇన్‌ స్టంట్‌ వన్డే ఫార్మాట్‌లో....

ఇన్‌ స్టంట్‌ వన్డే ఫార్మాట్‌లో మినీ వరల్డ్‌ కప్‌గా పేరున్న చాంపియన్స్‌ ట్రోఫీకి విరాట్‌ కొహ్లీ నాయకత్వంలోని 15 మంది సభ్యుల భారత జట్టును ఎంపిక చేసింది.సీనియర్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌, వన్డే, టీ 20 కెప్టెన్సీకి గుడ్‌ బై చెప్పిన మహేంద్ర సింగ్‌ ధోనీ చోటు నిలుపుకోగా.... శిఖర్‌ ధావన్‌ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్‌లో నిలకడగా రాణిస్తోన్న సీనియర్‌ ఆటగాళ్లు సురేష్‌ రైనా, గౌతమ్‌ గంభీర్‌కు జట్టులో చోటు దక్కలేదు. దేశవాళీ క్రికెట్‌లో అదరగొట్టిన రిషబ్‌ పంత్‌కు మరోసారి నిరాశే ఎదురైంది.

చాంపియన్స్‌ ట్రోఫీకి ఎంపిక చేసిన భారత జట్టులో...

చాంపియన్స్‌ ట్రోఫీకి ఎంపిక చేసిన భారత జట్టులో విరాట్‌ కొహ్లీ, శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ, ధోనీ, మనీష్‌ పాండే, కేదార్‌ జాదవ్‌, యువరాజ్‌ సింగ్‌, అజింక్య రహానే, హార్దిక్‌ పాండ్య, అశ్విన్‌ , జడేజా, మహమ్మద్‌ షమీ, జస్ప్రీత్‌ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, ఉమేష్‌ యాదవ్‌ ఉన్నారు. ఇంగ్లండ్‌,వేల్స్ సంయుక్తంగా ఆతిధ్యమిస్తోన్న చాంపియన్స్‌ ట్రోఫీ జూన్‌ 1 నుంచి ప్రారంభమవుతుంది. 2013 టోర్నీలో విజేతగా నిలిచిన టీమిండియా డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో బరిలోకి దిగనుంది.

06:41 - May 9, 2017

హైదరాబాద్: రాయలసీమ కరవు కష్టాలు చూస్తే గుండె తరక్కుపోతుంది. కరవు నివారణ చర్యలు ఉత్తుత్తి మాటలుగానే మిగిలిపోతున్నాయి. 233 మండలాలున్న రాయలసీమలో 184 మండలాల్లో కరవు వున్నట్టు రాష్ట్ర ప్రభుత్వమే ప్రకటించింది. అనంతపురంలో 345 గ్రామాల్లోనూ, కడపలో 416 గ్రామాల్లోనూ, కర్నూలులో 1200 గ్రామాల్లోనూ నీటి సమస్య తీవ్రంగా వుంది. అసలే కరవు కష్టాలకు తోడు పసుపు, మిర్చి, చీని, టమోట ధరలు కూడా పడిపోవడంతో రాయలసీమ రైతుల పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. రాయలసీమలో కరవు నివారణ చర్యలు చేపట్టాలంటూ వామపక్ష పార్టీలు 16, 17 తేదీలలో అనంతపురం కలెక్టరేట్ దిగ్భంధం కు పిలుపునిచ్చాయి. రాయలసీమలో కరవు పరిస్థితులపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు పెద్దిరెడ్డి విజయవాడ 10టీవీ నుండి పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

Don't Miss