Activities calendar

10 May 2017

గ్రామీణ ఐటీ పాలసీని విడుదల చేసిన టీఎస్ ప్రభుత్వం

హైదరాబాద్ : టీఎస్ ప్రభుత్వం గ్రామీణ ఐటీ పాలసీని ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో నెలకొల్పే పరిశ్రమలకు రాయితీలు, ప్రోత్సాహకాలు, పెట్టుబడిలో 50శాతం సబ్సిడీ, 25 శాతం రెంటల్ సబ్సిడీ ప్రకటిచింది. మూడేళ్లలో 10 జిల్లాల్లో గ్రామీణ సాంకేతిక కేంద్రాలు ఏర్పాటు.

 

21:52 - May 10, 2017

ఏలూరులో దారుణం

పశ్చిమ గోదావరి : జిల్లాలోని ఏలూరు దారుణం జరిగింది. గ్రాండ్ ఆర్యహోటల్ లో పార్శిల్ తప్పుగా ఇచ్చారని యాజమాన్యం యువకుడిని నిర్భంధించి 2 రోజులుగా చితకబాదడం యువకుడు నీరసించిపోయడు. ఇంటికి రాకపోవడంతో యాజమాన్యాన్ని తల్లి నిలదీయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.

 

21:42 - May 10, 2017
21:35 - May 10, 2017

దిహెగ్ : గూఢచర్యం కేసులో పాకిస్తాన్‌ ఆర్మీ కోర్టు మరణశిక్ష విధించిన భారత నేవీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ను కాపాడేందుకు భారత్‌ అంతర్జాతీయ కోర్టును ఆశ్రయించింది. నేవీ నుంచి పదవీ విరమణ పొందిన తర్వాత ఇరాన్‌లో వ్యాపారం చేసుకుంటున్న జాదవ్‌ను కిడ్నాప్‌ చేశారని హేగ్‌లో ఉన్న అంతర్జాతీయ కోర్టుకు భారత్‌ సోమవారం అప్పీలు చేసింది. దీంతో జాదవ్‌కు పాకిస్థాన్‌ విధించిన ఉరిశిక్షపై అంతర్జాతీయ కోర్టు స్టే విధించింది. జాదవ్‌ తరపున సీనియర్‌ న్యాయవాది హరీష్‌ సాల్వే వాదించనున్నారు. ఈ కేసు మే 15న విచారణకు రానుంది. ఈ కేసులో భారత్‌ అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్లడం ద్వారా పాకిస్తాన్‌తో పాటు ప్రతిఒక్కరూ ఆశ్చర్యానికి గురి చేసింది. భారత్ విజ్ఞప్తిపై ఇంటర్నేషనల్‌ కోర్టు ఆఫ్‌ జస్టిస్‌ తక్షణం స్పందించడమే కాకుండా జాదవ్‌ ఉరిశిక్షపై స్టే ఇస్తూ ఆదేశించింది. దీంతో మే 19కి ముందు జాదవ్‌కు ఉరిశిక్ష ను అమలు చేయడం పాకిస్తాన్‌కు అసాధ్యంగా మారింది. కోర్టు నిర్ణయం జాదవ్‌తో పాటు భారత్‌కు కొంత ఊరటనిచ్చింది. ఇరుదేశాలు కుదుర్చుకున్న వియన్నా ఒప్పందాన్ని పాకిస్తాన్‌ ఉల్లంఘించిందన్న కారణంతో భారత్‌ అంతర్జాతీయ కోర్టుకు వెళ్లింది.

సుష్మాస్వరాజ్‌ హర్షం...
అంతర్జాతీయ కోర్టు తీర్పుపై కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ హర్షం వ్యక్తం చేశారు. కోర్టు నిర్ణయాన్ని కులభూషణ్‌ జాదవ్‌ తల్లికి చెప్పినట్లు ఆమె ట్వీట్‌ చేశారు.గూఢచర్యం, విద్రోహచర్యలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో జాదవ్‌కు పాకిస్తాన్‌ ప్రభుత్వం ఇటీవల మరణశిక్ష విధించింది. గతేడాది మార్చిలో జాదవ్‌ను బలూచిస్థాన్‌లో అరెస్టు చేసినట్లు పాక్‌ చెబుతోంది. ఇరాక్‌లో వ్యాపారం చేసుకుంటున్న జాదవ్‌ను కిడ్నాప్‌ చేసి, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పాకిస్తాన్‌పై భారత్‌ మండిపడింది. జాదవ్‌కు మరణశిక్ష అమలు చేస్తే పథకం ప్రకారం చేసిన హత్యగా భావించాల్సి వస్తుందని పాకిస్థాన్‌ను హెచ్చరించింది. జాదవ్‌ గూఢచర్యానికి పాల్పడ్డట్లు తమవద్ద ఆధారాలున్నాయని పాకిస్తాన్‌ తన చర్యలను సమర్థించుకుంటోంది.

 

21:30 - May 10, 2017

జమ్మూకాశ్మీర్ : జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో లెఫ్ట్‌నెంట్‌ ర్యాంక్‌ ఆర్మీ అధికారి ఉమర్‌ ఫయ్యాజ్‌ దారుణ హత్యకు గురయ్యారు. ఉమర్‌ను గతరాత్రి ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. 22 ఏళ్ల ఫయ్యాజ్‌ మృతదేహం షోపియాన్‌లో లభించింది. కుల్గాం జిల్లాకు చెందిన ఫయ్యాజ్ 2016లో ఆర్మీలో చేరారు. సెలవులపై ఇంటికి వచ్చిన ఆయన కుల్గాంలోని తమ బంధువుల ఇంట్లో పెళ్లి వేడుకలకు వెళ్లారు. అక్కడ ఉగ్రవాదులు తుపాకితో బెదిరించి ఫయ్యాజ్‌ను కిడ్నాప్ చేశారు. అనంతరం ఆయనను కాల్చి చంపినట్లు పోలీసులు వెల్లడించారు.

 

 

21:28 - May 10, 2017

ఢిల్లీ :ఆమ్‌ ఆద్మీ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఢిల్లీ మాజీ మంత్రి కపిల్‌ మిశ్రా తన ఇంటివద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు బహిరంగ లేఖ రాశారు. ఆప్‌కు చెందిన ఐదుగురు నేతల విదేశీ పర్యటనల వివరాలు బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆప్‌ నేతలు ఆశిష్‌ కేతన్‌, సంజయ్‌ సింగ్‌, రాఘవ్‌ చద్దా, దుర్గేశ్‌ పతక్‌, సత్యేంద్ర జైన్‌ విదేశీ పర్యటనల వివరాలు వెల్లడించేదాకా దీక్ష విరమించబోనని కపిల్‌ మిశ్రా స్పష్టం చేశారు. వీరంతా పార్టీ ఫండ్‌ను దుర్వినియోగం చేసి విదేశీ పర్యటనలు చేస్తున్నారని మిశ్రా ఆరోపిస్తున్నారు. తనను చంపేస్తానని బెదిరిస్తున్నారని, అంతర్జాతీయ ఫోన్‌ నంబర్‌ నుంచి కూడా తనకు బెదిరింపు కాల్స్‌ వచ్చాయని ఆరోపించారు. అయితే తాను దేనికీ భయపడనని తెలిపారు. ఆమరణ దీక్ష చేస్తున్న కపిల్‌ మిశ్రాపై దాడికి యత్నించాడన్న కారణంతో ఓ యువకుడిని పోలీసులకు అప్పగించారు.

21:25 - May 10, 2017

విజయవాడ : రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అభ్యర్థిని బలపరచాలన్న వైసీపీ నిర్ణయాన్ని సీపీఎం కమిటీ తప్పుపట్టింది. మతోన్మాదాన్ని పెంచిపోషిస్తున్న బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇస్తామని వైసీపీ అధినేత జగన్‌ ప్రకటించడం లౌకకి స్ఫూర్తికి విరుద్ధమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు వ్యాఖ్యానించారు. వైసీపీ అవకాశవాద రాజకీయాలకు జగన్‌ ప్రకటన నిదర్శమని విమర్శించారు.

21:21 - May 10, 2017

ఢిల్లీ : రాష్ట్రపతి అభ్యర్థికి పూర్తి మద్దతు ఇస్తామని వైసీపీ అధినేత జగన్‌ స్పష్టం చేశారు. ప్రధాని మోదీతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీకి పూర్తి మెజార్టీ ఉన్నందున రాష్ట్రపతి అభ్యర్థి గెలుస్తారని.. అలాంటి ఉన్నత పదవికి పోటీ పెట్టడం సరికాదని జగన్‌ అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా అంశం మినహా అన్ని అంశాల్లో బీజేపీకి మద్దతిస్తున్నామని జగన్‌ స్పష్టం చేశారు.

21:18 - May 10, 2017

హైదరాబాద్ : హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ, అతడి స్నేహితుడు రాజా రవివర్మ ప్రాణాలు కోల్పోయారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో నిషిత్‌ నారాయణ, రాజా రవివర్మ ఇద్దరు కలిసి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వైపు నుంచి పెద్దమ్మ గుడి వైపు బెంజ్‌ కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ నుంచి అతి వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి.. మెట్రో పిల్లర్‌ నెం-9ను బలంగా ఢీకొట్టింది. కారు ఎయిర్‌ బ్యాగులు తెరుచుకున్నప్పటికీ ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని తీవ్రగాయాలైన వారిద్దరిని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వారిద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు అపోలో ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

నిషిత్‌ ఛాతికి కారు స్టీరింగ్‌ బలంగా తగలడంతోనే
నిషిత్‌ ఛాతికి కారు స్టీరింగ్‌ బలంగా తగలడంతోనే చనిపోయినట్టు అపోలో ఫోరెన్సిక్‌ వైద్యుడు సురేందర్‌రెడ్డి తెలిపారు. ప్రమాద సమయంలో నిషిత్‌ డ్రైవింగ్‌ చేశాడని..కారు మెట్రోపిల్లర్‌ను ఢీకొట్టడంతో స్టీరింగ్‌ అతడికి బలంగా తగిలిందన్నారు. ప్రమాద తీవ్రతకు నిషిత్‌ లివర్‌ ముక్కలు ముక్కలైందని తెలిపారు. ప్రమాదం జరిగిన 10 నిమిషాలలోపే నిషిత్‌ అతని స్నేహితుడు చనిపోయి ఉంటారని అపోలో వైద్యులు తెలిపారు. ఇద్దరికీ ఛాతిబాగంలో బలంగా దెబ్బలు తగలడంతోనే చనిపోయారని స్పష్టం చేశారు. కారు ప్రమాదంలో మృతిచెందిన నిషిత్‌ నారాయణ, అతని స్నేహితుడు రాజా రవివర్మ మృత దేహాలకు అపోలోలో పోస్టుమార్టం నిర్వహించారు. అయితే పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు.. ఇద్దరి డెడ్‌బాడీల్లో మద్యం సేవించిన ఆనవాళ్లు ఏమీలేవని రిపోర్టులో పేర్కొన్నారు. దీంతో ప్రమాదానికి కారు అతివేగంతో పాటు సీటు బెల్టు పెట్టుకోకపోవడమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. మంత్రి నారాయణ కుమారుడి మరణ వార్త తెలుసుకున్న ప్రముఖులు.. జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. తెలంగాణ, ఏపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు అపోలో అసుపత్రికి చేరుకొని నారాయణ కుటుంబసభ్యులను పరామర్శించారు. తెలంగాణ మంత్రి హరీష్‌రావు, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, ఏపీ హోంమంత్రి చిన్న రాజప్ప, గంటా శ్రీనివాసరావు అపోలో ఆసుపత్రికి వచ్చి నిషిత్‌ కుటుంబసభ్యులను పరామర్శించారు.

హెలీకాప్టర్‌లో నెల్లూరుకు
నిషిత్‌ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైన తర్వాత.. డెడ్‌బాడీని ప్రత్యేక హెలీకాప్టర్‌లో నెల్లూరుకు తరలించారు. ఇక కొడుకు మరణవార్త తెలుసుకున్న మంత్రి నారాయణ.. తన విదేశీ పర్యటనను అర్థాంతరంగా ముగించుకొని హుటాహుటిన భారత్‌కు బయలుదేరారు. కెనడా నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరిన మంత్రి నారాయణ రాత్రి చెన్నై ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా నెల్లూరుకు వెళతారు. ఇప్పటికే నిషిత్‌ మరణ వార్తతో నెల్లూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి. నెల్లూరులోని మంత్రి నారాయణ నివాసానికి ప్రముఖులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఆ జిల్లాకు చెందిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నారాయణ నివాసం వద్ద ఏరాట్లను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు గురువారం జరిగే అంత్యక్రియలకు కూడా నెల్లూరులో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్బ్రాంతి
నిషిత్‌ మరణవార్త తెలుసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు.. తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అమెరికా పర్యటనలో తనతో పాటు ఉన్న మంత్రి నారాయణను ఓదార్చారు. నిషిత్‌ మృతిపై నారా లోకేష్‌ దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుని హైదరాబాద్‌ వచ్చి కుటుంబసభ్యులను పరామర్శించారు. నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ ప్రస్తుతం..నారాయణ విద్యాసంస్థలకు డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. దీంతో నారాయణ విద్యాసంస్థలన్నింటికి మూడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించారు. మంత్రి నారాయణకు కొడుకు నిషిత్‌తో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తెను మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడికి ఇచ్చి పెళ్లిచేశారు.

 

20:40 - May 10, 2017

పిల్లర్ కి గుద్దారు కాబట్టి ఇద్దరు చనిపోయారు.. ఏ వాహనాన్నో, ఫుట్ పాత్ పై ఉన్నవారిపైనో ఎక్కించి ఉంటే ఎవరు సమాధానం చెప్పేవాళ్లు?అసలు రెండొందల కిలోమీటర్ల వేగం హైదరాబాద్ రోడ్లపై ఊహించగమా?తాగి నడిపారా? డ్రగ్స్ తీసుకుని నడిపారా? లేక ఏదీ లేకుండానే నడిపారా? ఏదైనా కావచ్చు..రోడ్లపై నియంత్రణ లేకుండా ఇంపోర్టెడ్ వాహనాలు తిరుగుతున్నాయి. అడ్డూ అదుపు లేకుండా మితిమీరిన వేగంతో స్పోర్ట్స్ బైకులు దూసుకెళ్తున్నాయి. వీటికి సర్కారు అడ్డుకట్ట వేయలేదా....? పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

జగిత్యాల జిల్లాలో అగ్నిప్రమాదం

జగిత్యాల : జిల్లాలో తాటిపల్లి శివారులోని రాజరాజేశ్వర రైస్ మిల్లులో అగ్నిప్రమాదం జరుగుతోంది. మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రమాద స్థలి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు.

 

జనసేన నిబద్ధతను ప్రశ్నించలేరు : జనసేన ఉపాధ్యక్షుడు

హైదరాబాద్ : దేశ సమగ్రత విషయంలో జనసేన నిబద్దతను ఎవరూ ప్రశ్నించలేరని జనసేన ఉపాధ్యక్షుడు మహేంద్రరెడ్డి అన్నారు. టీటీడీ ఈవోగా ఉత్తరాది అధికారి నియామకాన్ని జనసేన వ్యతిరేకించలేదని తెలిపారు. పవన్ విమర్శించే ముందు ఆయన ట్వీట్లను అర్థం చేసుకోవాలని అన్నారు.

 

కార్ల్ మార్క్స్ ద్విశతాబ్ధి ఉత్సవాలు

విజయవాడ : కార్ల్ మార్క్స్ ద్విశతాబ్ధి ఉత్సవాల్లో భాగంగా మార్క్సిజం సమకాలిన ప్రపంచం అంశంపై సదస్సులో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి,సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణ పాల్గొన్నారు.

 

20:06 - May 10, 2017

హైదరాబాద్ : హైదరాబాద్‌ రహదారులు.. మృత్యు మార్గాలుగా మారుతున్నాయి. యేటా రోడ్డు ప్రమాదాల్లో వందల సంఖ్యలో యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మృతుల్లో ఎక్కువ మంది ఇంజినీరింగ్‌, వైద్య విద్యార్ధులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు ఉంటున్నారు. వీరిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నవారు, ఆధారపడినవారి అవస్తలు వర్ణనాతీతం. క్షతగాత్రులు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. వీరి జీవితం నరకప్రాయంగా మారుతోంది. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని అధ్యయనాలు చెబుతున్నాయి. బైక్‌లు, కార్లలో వెళుతున్న యువకులు వేగంగా వెళ్లడాన్ని థ్రిల్స్‌గా భావిస్తున్నారు.. కానీ స్పీడ్‌ థ్రిల్స్.. బట్‌ కిల్స్ అన్న విషయాన్ని మర్చిపోతున్నారు. అదుపుతప్పి డివైడర్లను ఢీ కోవడమో, ఆగివున్న వాహనాలను ఢీ కొట్టడమో జరగుతోంది. బైక్‌లతో రేసింగ్‌ చేస్తూ చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మొదట్లో రేసింగ్‌కు కళ్లెం వేసిన పోలీసులు ఆతర్వాత ఉదాసీనంగా వ్యవహరించడంతో మళ్లీ ప్రమాదాలు పెరిగాయి. మితిమీరిన వేగంతోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. విదేశీ రహదారి పరిస్థితులను అనుగుణంగా తయారు చేసిన వాహనాలను మన రోడ్లపైకి అనుమతించడం కూడా ప్రమాదాలకు మరో కారణమవుతోంది.

అక్రమ పార్కింగ్‌........రోడ్లపైన వాహనాల అక్రమ పార్కింగ్‌ కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. అలాగే ప్రమాద సూచికలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్‌ నారాయణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం కన్నవారిని శోక సంద్రంలో ముంచింది. సినీనటులు కోట శ్రీనివాసరావు, బాబుమోహన్‌, మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి ప్రముఖుల తనయులు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. 2010 జూన్‌ 20 న జరిగిన ప్రమాదంలో కోట శ్రీనివాసరావు కుమారుడు కోట ప్రసాద్‌ను రోడ్డు బలి తీసుకుంది. 2011 సెప్టెంబర్‌ 11 న అజారుద్దీన్‌ తనయుడు అయాజుద్దీన్‌ అశువులు బాశాడు. 2011 డిసెంబర్‌ 20 కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు సహా ముగ్గురు అవుటర్‌రింగ్‌ రోడ్ పై జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. సెంట్రల్‌ ఎక్సైజ్‌ అధికారి సూర్యనారాయణ కుటుంబం రోడ్డు ప్రమాదంలో బలైంది. మాజీ డీజీపీ పేర్వారం రాములు మనవడు పవన్‌ పవార్‌ సైతం రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చేంతాడంత ఉంటుంది. రోడ్లపై తరచు జరుగుతున్న ప్రమాదాల నివారణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నగరం రోడ్లతో పాటు శివారు గ్రామాలకు వెళ్లే సర్వీస్‌ రోడ్లను అభివృద్ధి చేస్తే చాలా వరకు యాక్సిడెంట్లు తగ్గించవచ్చని పలువురు సూచిస్తున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు సమీక్షలతో సరిపెట్టకుండా.. వాహనచోదకులు రోడ్డు నిబంధనలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఎంపీల రాజీనామా ఏది...?

విజయవాడ : పార్లమెంట్ సమావేశాలుఅయిపోగానే ఎంపీలతో రాజీనామా చేయిస్తానన్న జగన్ ఇప్పుడు మోడీ కాళ్లు పై పడ్డారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా, భూసేకరణ తప్ప మిగిలిన అన్ని విషయాల్లో జగన్ కేంద్రనికి మద్దతు పలికారని, కేంద్రంలో మా వాళ్లు ఇద్దరు, ఇక్కడ బీజేపీ వాళ్లు ఇద్దరు మంత్రులుగా ఉన్నారని మంత్రి దేవినేని అన్నారు.

 

19:54 - May 10, 2017

రోడ్డు ప్రమాదలు కేవలం నిర్లక్ష్యంతోనే జరుగుతున్నాయని జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పాండు రంగరావు అన్నారు. ఆయన టెన్ టివి చర్చలో పాల్గొని మాట్లాడారు. 15 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య యువత రోడ్డు యాక్సిడెంట్ లో చనిపోతున్నారు. దీని పై తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాలి. లక్షలు పెట్టి వాహనాలు కొనడం, ఆ వాహనాలకు మన రోడ్లు పనికిరాకపోవడం ప్రమాదాలకు కారణం అయ్యాయి. రిషిత్ కు యాక్సిడెంట్ జరిగిన సమయంలో వారి 180 కిలోమీటర్ వేగంతో ప్రయాణిస్తున్నట్టు మనకు తెలుస్తోంది. ట్రాన్స్ పోర్ట్ వాహనాలకు స్పీడ్ లిమిట్ ఉంటుంది. కానీ ప్రైవేట్ వాహనాలకు వేగానికి లిమిట్ లేదు. వేగాన్ని కంట్రోల్ చేయడానికి ఔటర్ రింగ్ రోడ్డులపై స్పీడ్ గన్స్ వాడుతున్నారని తెలిపారు. విశ్లేషకులు వీవీఎస్ రవికుమార్ మాట్లాడుతూ విదేశి వాహనాలకు భారత్ లో పర్మీసన్ ఇవ్వకూడదని అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

జగన్ సమాధానం చెప్పాలి : అచ్చెనాయిడు

గుంటూరు : బీజేపీ టీడీపీ పొత్తులోమ ముస్లింలకు అన్యాయం జరుగుతుందని ప్రచారం చేసిన జగన్ ఇప్పుడు సమాధానం చెప్పాలని మంత్రి అచ్చెనాయుడు డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా ఇస్తేనా రాష్ట్రపతి ఎన్నికల్లో ఏన్డీఏ కు మద్దతిస్తామని జగన్ ఎందుకు షరతు పెట్టలేదు అని ఆయన ప్రశ్నించారు.

 

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబై : స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 315 పాయింట్లు లాభంతో 30,248 వద్ద ముగిసింది. నిఫ్టీ తొలిసారిగా 9,400 మార్క్ ను దాటింది.

 

18:59 - May 10, 2017

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ కొడ్కు మబ్బుల యాక్సిడెంట్ల సచ్చిపోయిండు...ఆ హైద్రావాదు పబ్లీకు రాత్రి నిద్రవొయ్యిండ్రా మీరూ..? ఇంటి దీపమని ముద్దువెట్టుకుంటె మూతి మీసాలు గలినట్టే ఉన్నది మా పని అంటున్నరు వరంగల్ పట్నంలున్న ఎస్ఆర్ నగర్ కాడ బత్కే పబ్లీకు.. తెలంగాణనే గాదు.. ఆంధ్రప్రదేశ్ గూడ అద్భుతంగ రైతులను ఆగం జేస్తున్నది అంటున్నరు అక్కడి దిక్కు రైతు సంఘాలోళ్లు.. చాచాచాచా అన్యాయం పాడుగాను.. గీ తీర్గనా..? సొంత భూమిల గుడ్సెను కూలగొట్టి..ఒకతాన ఆడామెను కిడ్నాప్ జేశి.. కార్ల తీస్కోని పోతున్నరు.. కలిశొచ్చె కాలానికి నడిశొచ్చె కొడ్కు వుడ్తడని అంటుంటరు పెద్దమన్సులు...గివన్ని ముచ్చట్ల కోసం వీడియో క్లిక్ చేయండి.

18:56 - May 10, 2017
18:54 - May 10, 2017

చిత్తూరు : ప్రతి ఏడాది నిర్వహించే...తిరుపతి గంగమ్మ జాతర మంగళవారం రాత్రి చాటింపు కార్యక్రమంతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ జాతర వారం రోజుల పాటు కొనసాగనుంది. వెంకన్న సోదరిగా భావించే తిరుపతి గంగమ్మకు శ్రీవారి తరపున పట్టు వస్త్రాలు, సారె సమర్పించడం ఆనవాయితీ. జాతర చివరి రోజున శ్రీవారి సారెను తిరుమల మాఢ వీధుల్లో ఊరేగించి... అమ్మవారికి సమర్పిస్తారు. అనంతరం పంచామృతాలతో, సకల ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి...ప్రత్యేక అర్చనలు..విశేష పూజలు నిర్వహిస్తారు. జాతర సందర్భంగా గంగమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. చిత్తూరు జిల్లా వాసులే కాకుండా రాయలసీమలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు జాతరకు తరలివస్తున్నారు. విచిత్ర వేషదారణలతో గంగమ్మను దర్శించుకుంటే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ మేరకు రోజుకో వేషాన్ని ధరించి భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. అమ్మవారికి మేకలు, కోళ్లు బలి ఇచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు.ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు.

18:53 - May 10, 2017

గుంటూరు : అమరావతిలో... నిర్మించబోయే ప్రభుత్వ భవనాల సముదాయాలకు సంబంధించి డిజైన్స్‌పై సూచనలు చేయడానికి నలుగురు మంత్రులతో కూడిన ప్రత్యేక కమిటీని ప్రభుత్వం నియమించింది. ఆర్ధిక శాఖ మంత్రి యనమల, పురపాలక శాక మంత్రి నారాయణతో పాటు పంచాయితీ రాజ్ శాఖ మంత్రి లోకేష్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనంద బాబు... ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి కన్వీనర్ గా ఉండనున్నారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి మాస్టర్ ప్లాన్,అర్బన్ డిజైనింగ్ కు సంబంధించి గైడ్ లైన్స్ తో పాటు ముఖ్యమైన అసెంబ్లీ, సచివాలయం, హై కోర్ట్, హెచ్ వోడీ కార్యాలయాలు, వీఐపీ హౌసింగ్ డిజైన్స్ కు సంబంధించి మంత్రుల కమిటీ పర్యవేక్షణ చేసి, ప్రభుత్వానికి పలు సూచనలు చేయనుంది. అమరావతి డిజైన్స్ కు సంబంధించి ఇప్పటికే నార్మన్ పోస్టర్ ప్రతినిధులు రెండు రకాల డిజైన్స్ ను ప్రభుత్వానికి అందించారు. తాజాగా నియమించిన సబ్‌కమిటీ ఈ డిజైన్స్ తో పాటు పరిపాలన నగరంలో నిర్మించబోయే ఇతర ప్రభుత్వ భవనాలకు సంబంధించిన డిజైన్స్ పై పర్యవేక్షణ చేయనుంది. అయితే ఇప్పటికే సీఆర్డఈఏ పరిధిలోని భూ కేటాయింపుల కమిటిలో ఉన్న నారా లోకేష్ కు... తాజాగా డిజైన్స్ కు సంబంధించి కమిటీలో కూడా స్థానం కల్పించడం విశేషం.

18:52 - May 10, 2017

గుంటూరు : ఏపీ రాజధాని అమరావతిలో సీడ్‌ క్యాపిటల్‌ నిర్మాణానికి ఈనెల 15న భూమిపూజ జరుగనుంది. ప్రధాన రాజధానిని నిర్మించనున్న సింగపూర్‌ కన్సార్టియంతో అదే రోజు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోపాటు, సింగపూర్‌ ప్రతినిధి బృందం ఈ కార్యక్రమంలో పాల్గొంటుంది. సీడ్‌ క్యాపిటల్‌కు భూమిపూజ నిర్వహించే ప్రాంతాన్ని గుంటూరు జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌, పోలీసు, రెవెన్యూ అధికారులు పరిశీలించారు. ప్రధాన రాజధానికి భూమిపూజ జరిగే ప్రాంతంలో సభ నిర్వహిస్తారు.

18:50 - May 10, 2017
18:49 - May 10, 2017
16:53 - May 10, 2017
16:50 - May 10, 2017

ఢిల్లీ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున ఉద్యమించాలని సీపీఎం నిర్ణయించింది. దీనిలో భాగంగా ఈనెల 15 నుంచి 30 వరకు ప్రజా సమస్యలపై దేశవ్యాప్తంగా ప్రచారోద్యమం నిర్వహిస్తారు. ధరల పెరుగుదల, రైతాంగ సమస్యలు, ప్రజా పంపిణీ వ్యవస్థ నుంచి ప్రభుత్వం తప్పుకోవడం వంటి అంశాలపై ఉద్యమాలు చేపట్టాలని సీఎం నిర్ణయించింది.

16:41 - May 10, 2017

యాదాద్రి : రెండు రోజుల క్రితం మోత్కూరు మండలం పనకబండలో యాదగిరి అనే ఆర్ఎంపీ డాక్టర్ ఓ వివాహిత గొంతు కోసి తాను కూడా గొంతుకోసుకున్నాడు. రెండు రోజుల నుంచి ఉస్మానియాలో చికిత్స పొందుతున్న యాదగిరి వైద్యులకు చెప్పకుంగా పరిపోయి తన మరణానికి ఎవరు కారణం కాదని లేటర్ రాసి భువనగిరి హుస్నాబాద్ రైల్వేగేట్ వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేకున్నాడు.

సెన్సెక్స్ కొత్త రికార్డులు..

ముంబై : సెన్సెక్స్ కొత్త రికార్డులు సృష్టించింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 314.92 పాయింట్లు లాభ పడి 30,248.17 వద్ద స్థిరపడగా నిఫ్టీ 90.45 పాయింట్లు లాభ పడి తొలిసారిగా 9,400 మార్క్ ను దాటింది.

16:16 - May 10, 2017

గుంటూరు : అమరావతిలో ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం అసెంబ్లీ సమావేశం అవుతోంది. ఈ నెల 16న ఉదయం 9.45 నిమిషాలకు సభ ప్రారంభం కానుంది. సభ ఎన్ని రోజులు నిర్వహించలనే దానిపై అదే రోజు బీఏసీలో నిర్ణయించనున్నారు. ప్రభుత్వ మొదట 16,17 తేదీల్లో సభ నిర్వహించలనుకున్నా ఒకే రోజుకు పరితమితం అయినట్టు నోటిషికేషన్ లో విడుదల చేసింది. మరో వైపు ప్రతిపక్ష వైసీపీ మిర్చి రైతుల సమస్యల చర్చలని డిమాండ్ చేస్తున్నారు.

16న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక మీటీంగ్..

విజయవాడ : ఈనెల 16వ తేదీన ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది. ఉదయం 9.45గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం ఈ సమావేశాలు జరనున్నాయి. సభ ఎన్ని రోజులు జరపాలన్న దానిపై అదే రోజు జరిగే బీఏసీలో నిర్ణయం తీసుకోనున్నారు.

మావోయిస్టు ప్రభావిత జిల్లాలో అదనపు సిబ్మంది..

విజయవాడ : మావోయిస్టు ప్రభావిత నాలుగు జిల్లాల్లో అదనపు పోలీసు సిబ్బంది నియామకానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. 800 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి కూడా అనుమతులు జారీ చేసింది.

కురిసిన వర్షంపై జీహెచ్ఎంసీ లెక్కలు..

హైదరాబాద్ : నగరంలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 140-150 కి.మీటర్ల వేగంతో గాలులు వీచాయని, గంటలోనే 96.మీ.మీ. వర్షపాతం నమోదైందని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు. సెంట్రల్ జోన్ పరిధిలోని 70-ఎ, బి, సి, 7 సర్కిళ్లలో సమస్యలు తలెత్తాయని, 290 చెట్లు, 27 ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకూలయన్నారు. రోడ్డుపై పడిన చెట్లను తొలగించినట్లు, 56 ప్రాంతాల్లో నీళ్లు నిలిచినట్లు తెలిపారు.

15:52 - May 10, 2017

హైదరాబాద్ : తెలంగాణ మంత్రులకు జూన్‌ టెన్షన్‌ పట్టుకుంది. మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు జరుగుతాయని నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులపై ఆరోపణలు రావడం.. సర్వేలో మంత్రుల పనితనం బయటపడడంతో మార్పులు, చేర్పులు చేయనున్నారు. ఇప్పటికే కొంతమంది మంత్రులకు పనితీరు మార్చుకోవాలని కేసీఆర్‌ సూచించారు. అదే సర్వేల ఆధారంగా మంత్రుల శాఖల మార్పులతో పాటు.. కొత్తవారికి అవకాశం కల్పించే అవకాశం ఉందని నేతలంటున్నారు. ఇక మార్పులు చేర్పుల తర్వాతే.. ఎప్పటినుంచో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఎదురుచూస్తున్న నామినేటెడ్‌ పదవులను భర్తీ చేసే అవకాశం కనిపిస్తుంది.

రాష్ట్ర అవతరణ దినోత్సవం...
రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి కేబినెట్‌ పునర్వ్యవస్థీకరిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికోసం కేసీఆర్‌ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కేబినెట్‌లో మహిళలకు ప్రాధాన్యం లేకపోవడంతో ఈసారి మహిళలకు అవకాశం కల్పించే అవకాశం కనిపిస్తోంది. మహిళల కోటాలో మంత్రి పదవి కోసం కోవా లక్ష్మి, కొండా సురేఖల పేర్లు వినిపిస్తున్నాయి. ఇక హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డిని మంత్రి పదవి నుంచి తప్పించే అవకాశాలున్నాయని సమాచారం. ఈ పదవి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన జగదీశ్‌రెడ్డికి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని తప్పించి.. అదే జిల్లాకు చెందిన ప్రశాంత్‌రెడ్డికి మంత్రి పదవి కట్టబెట్టే అవకాశం కనిపిస్తోంది. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న కడియం శ్రీహరికి కూడా పదవీ గండం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక మంత్రి పదవిలోకి మండలి చైర్మన్‌గా ఉన్న స్వామిగౌడ్‌ను తీసుకోనున్నట్లు సమాచారం.

మొత్తానికి రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ఎవరి పదవి ఉంటుందో.. ఊడుతుందోనన్న టెన్షన్‌లో మంత్రులు ఉన్నారు. ఇక మంత్రివర్గంలో మార్పులు, చేర్పుల అనంతరమే నామినేటెడ్‌ పోస్టులను భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది.

15:50 - May 10, 2017

హైదరాబాద్ : నగరంలో వర్షం బీభత్సం సృష్టించింది. గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల ప్రచండ వేగంతో ఈదురు గాలులు వీచాయి. ఈ గాలివాన బీభత్సానికి పలు ప్రాంతాల్లో ఇళ్ల పై కప్పులు దెబ్బ తిన్నాయి. పెద్ద సంఖ్యలో చెట్లు, భారీ హోర్డింగ్‌లు, విద్యుత్‌ స్థంభాలు విరిగిపడ్డాయి. పలు చోట్ల ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోయాయి. నగరంలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయి.. అంధకారం అలుముకుంది. తిరుమలగిరి, బేగంపేట, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, అమీర్‌పేట్‌, ఎస్‌ఆర్‌నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్‌బీ నగర్‌, మెహదీపట్నం తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. యూసుఫ్‌ గూడ ప్రాంతంలో వంద గ్రాములకు పైగా బరువున్న వడగళ్లు పడ్డాయి.

ఉరుములు, మెరుపులు...
ఉరుములు, మెరుపులు, తీవ్ర వేగంతో ఈదురుగాలులు వీయడంతో.. జనం భయాందోళనలకు గురయ్యారు. ఒక్కసారిగా కురిసిన వర్షంతో పలు చోట్ల నాలాలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పాత భవనాల్లో ఉన్నవారు బిక్కుబిక్కుమంటూ గడిపారు. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఇక వడగళ్ల వాన కారణంగా రహదారులపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి.. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వడగళ్ల ధాటికి పలువురు ద్విచక్ర వాహనదారులు గాయపడ్డారు. రానున్న 24 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు బేగంపేటలోని వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షంతో ఇబ్బందులు తలెత్తడంతో చాలా మంది నెటిజన్లు తమ ప్రాంతాల్లోని సమస్యలను మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. వాటిపై వెంటనే స్పందించిన మంత్రి.. సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. ఎమర్జెన్సీ బృందాలు వెంటనే రంగంలోకి దిగాలని ఆదేశించారు. మరోవైపు వర్షంలో చిక్కుకున్న తమను ఆదుకోవాలంటూ జీహెచ్‌ఎంసీ ఎమర్జెన్సీ కాల్‌ సెంటర్‌కు వెల్లువలా ఫోన్లు వచ్చాయి.

 

15:45 - May 10, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరిగింది. మద్యం తాగి వాహనం నడపడం, అతివేగంగా నడపడంతో చోటు చేసుకునే ప్రమాదాలతో పాటు చీకట్లో కనిపించక ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి. హైవేలపై ప్రయాణించేటపుడు భారీ వాహనాలకు అన్ని వైపులా రేడియం టేపు అతికించాలనే నిబంధన ఉంది. దానిని పట్టించుకోకపోవడంతో పాటు రహదారులపై ఇష్టానుసారంగా వాహనాలను నిలిపివేస్తున్నారు. ఫలితంగా రాత్రి వేళ వచ్చే వాహనాలకు అవి కనబడక అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రక్కులు, లారీలు నడిపేవారు కాలకృత్యాలు తీర్చుకోవాలంటే జాతీయ రహదారులపై ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. కొన్ని రహదారులపై ఇవి సక్రమంగా ఉండకపోవడంతో డ్రైవర్లు తమ వాహనాలను ఎక్కడపడితే అక్కడ నిలిపేస్తున్నారు. అలా నిలిపిన లైట్లు ఆన్‌లో ఉంచాల్సి ఉన్నా బ్యాటరీ వృథా అవుతుందనే ఉద్దేశంతో వారు వాటిని ఆన్ చేయడం లేదు. అలాగే ట్రక్కులు, లారీల్లాంటి భారీ వాహనాలకు పసుపురంగు రేడియ స్టిక్కర్లు అతికించాలని కేంద్ర మోటారు వాహనాల చట్టం పేర్కొంది. అది అతికించేందుకు అనుసరించాల్సిన విధి విధానాలు కూడా ఉన్నాయి. వీటిని పాటించడం వల్ల చిమ్మచీకట్లో వెళ్తున్న వాహనం జాడ తెలుస్తుంది. అయితే ఇవేమీ పాటించకపోవడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. స్పాట్..

రోడ్డుపైనే వాహనాల పార్కింగ్...
ఇక దూర ప్రయాణం చేసే లారీలు, ట్రక్కుల డ్రైవర్లు ఎక్కువగా దాబాల దగ్గర ఆగిపోతుంటారు. పార్కింగ్ సౌకర్యం లేక వాహనాలను రోడ్డుపై ఆపేస్తుంటారు. హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిలో ఉండే దాబాల పక్కనే నిత్యం పెద్ద సంఖ్యలో లారీలు ఆగుతుంటాయి. విజయవాడ-విశాఖ పట్నం జాతీయ రహదారిలోనూ పలుచోట్ల ఇదే పరిస్థితి. ఇలాంటి వాహనాల్ని వెనుక నుంచి వస్తున్నవారు గమనించలేక, ఆఖరి నిమిషంలో చూసినా.. బండిని నియంత్రించ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి ప్రమాదాలు ఏపీ, తెలంగాణాల్లో 2015 లో 1213 ప్రమాదాలు సంభవిస్తే 373 మంది చనిపోయినట్లు కేంద్ర ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి.

కేంద్ర మోటారు వాహనాల చట్ట నిబంధన 104 ప్రకారం ఆటోలు, టూవీలర్లు మినహా ఇతర వాహనాలకు వెనుక భాగంలో రెండు రెడ్ రిఫ్లెక్టర్లు ఉండాలి. చిన్న వెహికిల్స్ కు కనీసం ఒకటి ఉండాలి. వెనుక నుంచి వాహనం పడ్డప్పుడు ఇవి వెలుగుతుంటాయి. అదే విధంగా రిఫ్లెక్టివ్ టేపు వెనుక భాగంలో ఒక మూల నుంచి మరో మూల వరకు ఉండాలి. భారీ వాహనాలకు ముందుభాగంలో తెలుపు, వెనుక భాగంలో ఎరుపు రంగు టేపు ఉండాలి. బస్సులకు ఎడమ, కుడివైపు పసుపు రంగు టేపు ఉండాలి.

పశువుల నుంచి కూడా ప్రమాదాలు..
జాతీయ రహదారిపై వాహనదారులకు అనూహ్యంగా పశువుల నుంచి కూడా ప్రమాదాలు ఎదురవుతున్నాయి ఈ తరహా ప్రమాదాల్ని నిలువరించేందుకు మధ్యప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో పోలీసులు జాతీయ రహదారుల వెంట ఉండే గ్రామాల్లో పశువుల కొమ్ములకు రేడియం స్టిక్కర్లు అతికించారు. రాత్రి వేళల్లో అవి రోడ్లపైకి వచ్చినా కనిపిస్తాయనే ఉద్దేశ్యంతో వారు చేసిన ప్రయత్నం మంచి ఫలితాన్నిచ్చిందని అధికారులు చెబుతున్నారు. కర్ణాటకలోని హుబ్లీలో కొందరు వ్యాపారులు కూడా ఇదే పద్ధతి పాటించారు. ఏపీలో గత ఏడాదిలో పశువుల వల్ల 63 ప్రమాదాలు జరగ్గా 14 మంది చనిపోయారు. తెలంగాణలో 5 ప్రమాదాలు జరిగితే ఇద్దరు చనిపోయారు. నిబంధనలు పాటించని వాహనాలు నిత్యం పోలీసు, రవాణా అధికారుల తనిఖీల్లో పట్టుబడుతూనే ఉన్నాయి. అప్పటికి చలాన్లు కట్టి బయటపడుతున్నారు తప్ప ఆ తరువాత నిబంధనలు అమలు చేస్తున్న దాఖలాలు లేవు. ఇప్పటికైనా రవాణా అధికారులు వాహనదారులపై నిబంధనలు మరింత కఠినతరం చేస్తే తప్ప ఇలాంటి పరిస్థితులు చక్కబడేటట్లు కనిపించట్లేదు.

15:40 - May 10, 2017

హైదరాబాద్ : ఏపీ పురపాలకశాఖ మంత్రి పి. నారాయణ కుమారుడు నిషిత్‌ హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. జూబ్లీహిల్స్ రోడ్‌ నంబర్‌ -36లో ఈ ప్రమాదం జరిగింది. నిషిత్‌ ప్రయాణిస్తోన్న బెంజ్‌కారు అతివేగంగా వచ్చి మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న నిషిత్‌, అతని స్నేహితుడు రాజా రవిచంద్రకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. ఇది గమనించిన జీహెచ్‌ఎంసీ సిబ్బంది అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే వారు అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. నిషిత్‌ ప్రస్తుతం నారాయణ విద్యాసంస్థలకు డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ ఏడాదే నిషిత్‌ నారాయణ గ్రూప్స్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.నిషిత్ ప్రయాణించిన కారు నెంబర్‌ TS 07 FK 7117గా ఉంది... మరోవైపు మంత్రి నారాయణ ప్రస్తుతం లండన్‌ పర్యటనలో ఉన్నారు. కొడుకు మరణవార్త తెలుసుకొని హుటాహుటిన హైదరాబాద్‌ బయలుదేరారు.. నిషిత్‌ మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు..

సీటు బెల్టు ధరించలేదు...
అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.. ప్రమాద సమయంలో నిషిత్‌ సీటు బెల్టు ధరించలేదని తెలుస్తోంది.. మితిమీరిన వేగంవల్లే కారు అదుపుతప్పిందని ఈ ప్రమాదాన్ని చూసిన స్థానికులు చెబుతున్నారు. నిషిత్‌ మృతిపై సీఎం చంద్రబాబు, ఏపీ మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. మంత్రులు చినరాజప్ప, గంటా శ్రీనివాసరావు విజయవాడనుంచి హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రికి బయలుదేరారు.. మంత్రి సోమిరెడ్డి నారాయణ కుటుంబసభ్యులకు సానుభూతి ప్రకటించారు.. అటు తెలంగాణ మంత్రులుకూడా నారాయణ కుటుంబానికి సానుభూతి తెలిపారు.. మంత్రి హరీశ్‌ రావు అపోలో ఆస్పత్రికివచ్చి నిషిత్‌ కుటుంబసభ్యులను పరామర్శించారు.

గంజాయి తరలిస్తున్న వాహనాల స్వాధీనం..

రంగారెడ్డి : ఆదిభట్ల పీఎస్ పరిధిలోని ఓఆర్ఆర్ పై గంజాయి తరలిస్తున్న రెండు బొలెరో వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

ఏపీ - సింగపూర్ మధ్య కీలక ఎంవోయూ..

గుంటూరు : 15వ తేదీన ఏపీ - సింగపూర్ మధ్య కీలక ఎంవోయూ జరగనుంది. తుళ్లూరు (మం) తాళ్లాయపాలెం రెవెన్యూ పరిధిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధిలో భాగంగా మొదటి దశలో 100 ఎకరాల కేటాయింపునకు సంబంధించి ఎంవోయూ జరగనుంది.

కొలతల విభాగంలో టోల్ ఫ్రీ నెంబర్ - ప్రత్తిపాటి..

ప్రకాశం : ఒంగోలు కలెక్టరేట్ లో మంత్రి ప్రత్తిపాటి అధ్యక్షతన రేషన్ డీలర్లతో సమావేశం జరిగింది. రేషన్ డీలర్లు సకాలంలో సరుకులు పంపిణీ చేయాలని, తూకం విషయంలో అవకతవకలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తూకం విషయంలో కొలతల విభాగాన్ని పటిష్ట పరుస్తున్నట్లు, ఇందుకోసం టోల్ ఫ్రీ నెంబర్ 1800 ను అందరికీ అందుబాటులో ఉంచుతున్నట్లు వెల్లడించారు.

తెలుగు వారంతా ఒక్కటే - అచ్చెన్నాయుడు..

విజయవాడ : రాష్ట్రాలు విడిపోయినా తెలుగు వారంతా ఒక్కటేనని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల రవాణాశాఖాధికారుల సమావేశం కొనసాగుతోంది. రెండు రాష్ట్రాల్లో తెలుగు వారు బాగుండాలన్నదే రెండు ప్రభుత్వాల లక్ష్యమని, రెండు రాష్ట్రాల మధ్య సమస్యలను సమావేశాల ద్వారానే పరిష్కరించుకోవచ్చన్నారు. తెలంగాణ చెందిన వారు ఏపీలో...ఏపీకి చెందిన వారు తెలంగాణలో పనిచేస్తున్నారని, వీరి విషయంలో కూడా ఒక అంగీకారానికి వచ్చామన్నారు. ఆర్టీసీ విభజనకు రోడ్ మ్యాప్ ఏర్పాటు చేస్తామన్నారు.

ఎన్డీయేకు మద్దతు తెలిపిన జగన్..

ఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఎన్డీయే ప్రభుత్వానికే తమ మద్దతని వైసీపీ అధ్యక్షుడు జగన్ వెల్లడించారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో ఎన్డీయేకు మద్దతిస్తున్నామని, ఓడిపోతామని తెలిసినప్పుడు అభ్యర్థిని పెట్టడం ఉపయోగం లేని పని అని ఆయన అన్నారు.

వెలిమెలలో హరీష్ పర్యటన..

సంగారెడ్డి : రామచంద్రాపురం (మం) వెలిమెలలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో విద్యుత్ వస్తే ప్రజలు ముచ్చటించుకొనే వారని, తమ పర్భఉత్వంలో కరెంటు పోతే ఆశ్చర్యపోతున్నారని తెలిపారు. పల్లెలు..పట్టణాలు..తేడా లేకుండా విద్యుత్ ఇచ్చిన ఘనత కేసీఆర్ దని తెలిపారు.

14:41 - May 10, 2017

నిజామాబాద్ : పూల దండలు కాదు.. పుస్తకాలు తెండి. పట్టు వస్త్రాలు కాదు.. పలకలు, పెన్నులు తెండి. అవి నా పిల్లలకు ఎంతగానో ఉపకరిస్తాయి. వారిని మేటి పౌరులుగా తీర్చిదిద్దుతాయి. ఇవీ ఓ జిల్లా కలెక్టర్‌.. తనను కలిసేందుకు వచ్చే వారికి చేస్తున్న విన్నపం..! కాస్తంత ఆశ్చర్యంగా అనిపించినా.. ఇది అక్షరాలా నిజం...! ఆమె నా పిల్లలు అని సంబోధించింది.. సొంత పిల్లల గురించి కాదు. అంతకన్నా ఎక్కువగా చూసుకుంటున్న అనాథ పిల్లల గురించే..! తన విశిష్టశైలితో రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపును పొందిన ఆ ఐఏఎస్‌ యోగితారాణా ఆగస్టు 14, 2015 లో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించింది మొదలు.. తనదైన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్నారు. అధికారులతో వరుస సమీక్షలు.. వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా జిల్లా అభివృద్ధికి అలుపెరుగని శ్రమ ఓవైపు, ప్రతి సోమవారం ప్రజావాణి ద్వారా ఆర్తుల వెతలు శాశ్వతంగా పరిష్కరించే క్రమం మరోవైపు..! వీటితోపాటే, ఆకస్మిక తనిఖీల ద్వారా అక్రమార్కుల భరతం పడుతున్నారు. ఐఏఎస్‌ కాకముందు వైద్యురాలిగా పనిచేసిన యోగితారాణా, నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించగానే, ప్రభుత్వ ఆసుపత్రులను సంస్కరించే ప్రయత్నం మొదలుపెట్టారు. ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వాసుపత్రులుండాలన్న ఆమె కృషి క్రమంగా ఫలించింది. గతంలో ప్రభుత్వాసుపత్రుల్లో 16శాతం మాత్రమే ఉన్న ప్రసవాలు.. ప్రస్తుతం 70శాతానికి చేరడం దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. ఇదే క్రమంలో వైద్యుల కొరతనూ అధిగమించారు కలెక్టర్‌ యోగిత.

అక్రమాలకు అవకాశం ఇవ్వరాదని లక్ష్యం..
ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అర్హులకు చేరాలని.. అక్రమాలకు అవకాశం ఇవ్వరాదని లక్ష్యంగా పెట్టుకున్న యోగితారాణా, ప్రతిసారీ బెస్ట్‌గానే నిలిచారు. ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకం హరితహారంలో రాష్ట్రంలోనే అత్యధిక మొక్కలు నాటిన జిల్లాగా నిజామాబాద్‌ను నిలిపి, ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతులమీదుగా అవార్డును అందుకున్నారు. ఉపాధిహామీ పథకం అమలులో జిల్లాను దేశంలోనే ప్రథమస్థానంలో నిలిపి, ఢిల్లీలో అవార్డును స్వీకరించారు. ఇక ఈనాం అమలులో నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్ యార్డును దేశంలోనే అగ్రగామిగా నిలిపి, ప్రధాని మోదీ చేతుల మీదుగా ఢిల్లీలో అవార్డు అందుకున్నారు. ఏపని చేసినా ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్న యోగితారాణా అభిమతం... జిల్లాలోని చాలామంది ప్రజాప్రతినిధులకు మింగుడుపడలేదు. వారికి కొందరు అధికారులూ తోడయ్యారు. వీరంతాకలిసి, యోగితారాణాకు అడుగడుగునా ఆటంకాలు సృష్టించే ప్రయత్నం చేశారు. జెడ్పీ భేటీలో నిలదీశారు.. ఏకంగా ముఖ్యమంత్రికే ఫిర్యాదు చేశారు. ఈ దశలో స్థానిక ఎంపీ కవిత జోక్యం చేసుకుని.. అధికారులు, ప్రజాప్రతినిధుల దూకుడును నియంత్రించి.. పరిస్థితిని చక్కదిద్దారు. ఇది విధినిర్వహణలో యోగితారాణాకు చెందిన ఓ కోణం. కలెక్టర్‌ యోగితారాణాలో మానవీయ కోణం కూడా మరోటుంది.

యోగితా అందుకు భిన్నం....
సాధారణంగా, అవిశ్రాంతంగా విధులు నిర్వహించే ఎంతటివారైనా, కాస్తంత సమయం దొరికితే, కుటుంబంతో గడపాలనుకుంటారు. కానీ కలెక్టర్‌ యోగిత అందుకు భిన్నం. కాస్త టైం దొరికితే చాలు.. డిచ్‌పల్లి మండల కేంద్రంలోని 'మానవతా సదన్ ' కి, తన బిడ్డలతో పాటు వెళ్తారు. అక్కడ కన్నబిడ్డల్లా చూసుకుంటున్న 80 మంది అనాథ పిల్లలతో ఉల్లాసంగా గడుపుతారు. ఇక్కడ ఉండే చాలామంది పిల్లలు.. తల్లిదండ్రుల ద్వారా హెచ్.ఐ.వి సోకినవారే ఉన్నారు. వారి పరిస్థితి చూస్తే చలించిపోతుందంటారు యోగిత. తన విజ్ఞప్తిని మన్నించి సందర్శకులు తెచ్చిచ్చే పుస్తకాలు, పెన్నులు, పలకలను వాళ్లకు అందజేసి.. వారిలో విద్యాస్ఫూర్తిని రగిలిస్తుంటారు. మానవతా సదన్ ఏర్పాటులో ఎంపీ కవిత సాయం, జిల్లాలోని వదాన్యుల సహకారం మరువలేనిదంటారు యోగితారాణా.

ఇంతటి సేవాగుణం కలిగిన వ్యక్తి తమ జిల్లా కలెక్టర్ కావడం తమ అదృష్టం అంటున్నారు నిజామాబాద్ జిల్లా ప్రజలు. తమ సమస్యల పరిష్కారం కోసం ఆమె చేస్తున్న కృషిని కొనియాడుతున్నారు.

 

'బాబు వ్యాఖ్యలు స్కూల్ పిల్లాడిలా ఉన్నాయి'..

విజయవాడ : అమెరికాలో చంద్రబాబు వ్యాఖ్యలు స్కూల్ పిల్లాడిలా ఉన్నాయని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు నిరంతరం ఎన్నికల గురించి మాట్లాడడం సరి కాదని అమెరికా వెళ్లింది పెట్టుబడుల కోసమా ? ఎన్నికల ప్రచారం కోసమా అని నిలదీశారు.

అధికమైన గోరక్షణ దళాల దాడులు - సురవరం..

విజయవాడ : ప్రజలపై గోరక్షణ దళాల దాడులు పెరిగాయని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వమే సమర్థించడం దారుణమని, పశువుల వ్యాపారులపై అక్రమ కేసులు పెట్టి భయబ్రాంతులకు గురి చేస్తునారని పేర్కొన్నారు. మైనార్టీలపై దాడులు దేశ సమైక్యతను దెబ్బతీస్తాయని, తక్షణమే బీజేపీ విధానాలు మార్చుకోవాలని సూచించారు. ఉత్తరాది..దక్షిణాది అనే బేధాలు రాకుండా బీజేపీ చూడాలని, జమిలి ఎన్నికల విధానం దేశానికి సరిపోదని..దామాషా పద్ధతిలోనే ఎన్నికలు జరగాలని సూచించారు. మోడీ ఏ విషయంలోనూ ఏకాభిప్రాయానికి ప్రయత్నించలేదన్నారు.

మోడీ పాలనను మెచ్చుకున్న దామోదర..

మెదక్ : మోడీ పాలనపై మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ మంచి మార్కులు వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన పాలన ప్రశంసా విధంగానే ఉందని, మిషన్ భగీరథలో పైపుల కుంభకోణం జరిగిందన్నారు. దేశంలో అవినీతి సీఎం కేసీఆర్ అని అమిత్ షా విమర్శించారని, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు భద్రత లేని బతుకులిచ్చిందని విమర్శించారు. కొనుగోలు కేంద్రంలో రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు.

14:32 - May 10, 2017

హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా ఏటా 12.5 లక్షల మంది రహదారి ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. 40 నుంచి 50 శాతం వరకు మితిమీరిన వేగంతో నడపడం వల్లే ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వాహనదారుల్లో చాలామంది యువకులు మద్యం మత్తులో ఉండటమే ప్రమాదాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. భారత్ లో 2015 లో 5, 01,423 ప్రమాదాలు సంభవిస్తే, 1,46,133 మంది ప్రాణాలు కోల్పోయారు. 2014తో పోలిస్తే ప్రమాదాల్లో 2.5 శాతం.. మృతుల సంఖ్యలో 4.6 శాతం పెరుగుదల నమోదైంది. 2015లో 24,258 ప్రమాదాలతో ఆంధ్రప్రదేశ్ ఏడో స్ధానంలో, 21,252 ప్రమాదాలతో తెలంగాణ పదో స్ధానంలో నిలిచాయి.

జీడీపీలో 3 శాతం నుంచి 5 శాతం....
రహదారి ప్రమాదాల కారణంగా ఆయా దేశాలు తమ జీడీపీలో 3 శాతం నుంచి 5 శాతం మేర కోల్పోవాల్సి వస్తోంది. దీనికి తోడు కొన్ని కుటుంబాలు పేదరికంలో కూరుకుపోతున్నాయి. ఇక రహదారి ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో 90 శాతం మంది స్వల్ప, మధ్యస్త ఆదాయం ఉన్న దేశాల్లోని వారే. ప్రతి లక్ష జనాభాలో రహదారి ప్రమాదాల్లో మరణిస్తున్న వారి సంఖ్య ఐరోపాలో తక్కువగా.. ఆఫ్రికాలో అధికంగా ఉంది.

అవగాహన కల్పించడం....రహదారి ప్రమాదాలపై అవగాహన కల్పించడం కోసం ఐక్యరాజ్య సమితి ఈనెల 8 నుంచి 14 వరకు ప్రపంచ రహదారి భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ 'వేగ నియంత్రణ' పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది. దీంతో పాటు 'ప్రాణాలను కాపాడుదాం' అనే పేరుతో వెలువరించిన నివేదికలో పలు సూచనలు చేసింది. జాతీయ స్ధాయి నుంచి స్ధానిక సంస్థల వరకు వేగానికి సంబంధించిన పటిష్టమైన చట్టాలను రూపొంది అమలు చేయడం.. రహదారులను నిశ్శబ్ద రవాణా ప్రాంతాలుగా మార్చి .. వేగ నిరోధకాలు, హెచ్చరిక గుర్తులు ఏర్పాటు చేయడం లాంటి పలు సూచనలను అందులో పొందుపరిచింది. నిదానమే ప్రధానమని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నా.. ఎన్నో చర్యలు చేపడుతున్నా కుర్రకారు స్పీడుకి బ్రేకులు వేయలేకపోతున్నారు. ఇక పేరెంట్స్ నిర్లక్ష్య వైఖరి కూడా వారికి పట్టపగ్గాలు లేకుండా చేస్తోంది. ప్రాణాల మీదకు తెస్తోంది. ఇకనైనా యువత అతి వేగంతో కాకుండా సావధానంగా ప్రయాణించడం వారికే కాదు.. రోడ్లపై ప్రయాణించే మరెందరికో మేలు.

14:11 - May 10, 2017
13:53 - May 10, 2017

వడ్డీ వ్యాపారుల వేధింపులు ఒకవైపు..పోలీసుల నుండి ఒత్తిళ్లు మరోవైపు..వీరిద్దరి మధ్య నలిగిన సామాన్యుడు. కాల్ మనీ బాధితుడు ఆత్మహత్యాయత్నం..

హైదరాబాద్ లో కాల్ మనీ దందాలు పెరిగిపోతున్నాయి. రహస్యంగా కొనసాగుతున్న ఈ వ్యవహారం గురించి పోలీసులకు తెలిసినా ఏమీ చేయలేకపోతున్నారు. వత్తిళ్లు తెస్తూ కాల్ మనీ కేటుగాళ్లను తమ పని చేసుకుంటున్నారు. మరో ఉదంతం పోలీసులకు సవాల్ గా మారింది. కాల్ మనీ కేటుగాళ్ల వేధింపులకు భయపడి దిల్ నగర్ కు చెందిన వెంకట రమణ ఆత్మహత్య చేసుకొనేందుకు ప్రయత్నించాడు. ఘటనకు సంబధించి పూర్తి వివరాలు వీడియో క్లిక్ చేయండి. 

13:52 - May 10, 2017

హైదరాబాద్ : నగరంలో మద్యం తాగి వాహనాలు నడిపే వారి సంఖ్య ఎక్కువైంది. మందుబాబుల్లో ఎక్కువమంది యువకులే ఉంటున్నారు. తాగి వాహనాలు నడిపి తమ ప్రాణాల మీదికి తెచ్చుకోవడమే కాదు పలువురి మరణాలకు కూడా కారణమవుతున్నారు. అయినా వారిలో ఎలాంటి మార్పు రావడం లేదు. తల్లిదండ్రుల నిర్లక్ష్యం, వాహనదారుల విచ్చలవిడితనం వెరసి జనం ప్రాణాలకు భరోసా లేకుండా పోతోంది. మరోవైపు ట్రాపిక్ చలాన్లు విధించినా, అవగాహన తరగతులు నిర్వహించినా, కేసులు బుక్ చేసి జైళ్లకు పంపిస్తున్నా ఈ కేసులు అదుపులోకి రాకపోవడం గమనార్హం.

మైనర్‌లు చేసిన యాక్సిడెంట్‌లో ప్రాణాలు కోల్పోయిన రమ్య...

గతంలో మద్యం తాగి మైనర్లు కారు నడిపిన ఘటనలో చిన్నారి రమ్యతో పాటు ఆమె బాబాయి, తాతయ్య చనిపోయారు. తాజాగా మరో ఘటనలో తల్లీకూతుళ్లను కారు ఢీకొట్టడంతో వారు ఆస్పత్రి పాలయ్యారు. అలాగే వారం క్రితం జీహెచ్ఎంసీ వాహనం ఓ ఫ్యామిలీపైకి దూసుకెళ్లి పలువురి మరణానికి కారణం అయ్యింది. మొన్న నారాయణగూడ ఫ్లైఓవర్ పై నుంచి ఓ కారు అదుపు తప్పి కిందకు పడిపోయింది. ఇవన్నీ డ్రైవర్లు తాగి మందు నడపడం వల్ల జరిగిన ప్రమాదాలే. ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా.. వాహనదారుల్లో మాత్రం ఎటువంటి మార్పు రావట్లేదు.

ఏప్రిల్ నెలలో 1177 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు.....

ఏప్రిల్ నెలలో పోలీసులు 1177 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. అందులో 444 మందికి శిక్షలు కూడా పడ్డాయి. వీరిలో మద్యం సేవించి టూ వీలర్, ఫోర్ వీలర్ నడిపిన వారే ఎక్కువగా ఉన్నారు. సిటీలోని పలు డివిజన్లలో జనవరి నుంచి ఏప్రియల్ వరకు 827 మంది టూ వీలర్లు, 68 మంది త్రీవీలర్ వాహనదారులు, 282 మంది ఫోర్ వీలర్ వాహనదారులు పట్టుబడిన వారిలో ఉన్నారు. వీరివద్ద నుంచి జరిమానాల రూపంలో 17 లక్షల 39 వేల రూపాయలు వసూలు చేశారు. అయినా డ్రంకన్ డ్రైవ్ ఘటనలు ఆగడం లేదు. పైగా రోజురోజుకీ రెట్టింపు అవుతూనే ఉన్నాయి. రోజుకు పదుల సంఖ్యలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ఇకపై రాత్రి పగలు అనే తేడా లేకుండా స్పెషల్ డ్రంకన్ డ్రైవ్ నిర్వహించాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. కనీసం ఇలా అయినా మద్యం సేవించి వాహనాలు నడిపేవారిలో మార్పు వస్తుందేమో వేచి చూడాలి.

13:51 - May 10, 2017
13:45 - May 10, 2017

వరంగల్ :నగరంలోని ఎస్‌ఆర్‌ నగర్‌లో ఇళ్ల కూల్చివేత తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అధికారులు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా నిర్మాణాలు కూల్చివేయడానికి రావడంతో స్థానికులు నిలదీశారు. కూల్చివేతలను నిలిపివేయాలని ఆందోళన చేపట్టారు. అధికారులు తీసుకొచ్చిన జేసీబీపై రాళ్లు విసిరావు. స్థానికుల ఆందోళనకు కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే శ్రీధర్‌ మద్దతు తెలిపారు. కూల్చివేతలను నిలిపివేయాలంటూ యాసిన్‌ అనే యువకుడు కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. మరో యువతి ఇంట్లోనే ఉరివేసుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం కాలనీవాసులను పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేసి పీఎస్‌కు తరలించారు.

13:42 - May 10, 2017

బెల్టుషాపు నిర్వహిస్తున్నారని దాడులు..తండ్రీ కొడుకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు..కేసులు పెడుతామంటూ హెచ్చరికలు..అవమాన భారంతో ఆత్మహత్యకు ప్రయత్నించడం..

బెల్ట్ షాపులు ఉండకూడదని ఆందోళనలు జరుగుతున్నవి తెలిసిందే. కానీ ఓ గ్రామంలో ఉన్న బెల్టుషాపును మాత్రం ఎవరూ వ్యతిరేకించలేదు. పోలీసులు వచ్చి దాడులు చేసి పట్టుకొంటే మాత్రం గగ్గొలు పెడుతున్నారు. నిర్వాహకులు ఆత్మహత్య చేసుకోవడంతో ఎస్ఐ పై తగిన చర్యలు తీసుకోవాలని నానా యాగీ చేస్తున్నారు. అసలు తప్పు చేసింది ఎవరు ? ఆ తప్పును ప్రోత్సాహించింది ఎవరు ? పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

13:41 - May 10, 2017

ఖమ్మ: ఎర్రబంగారం సాగు చేసిన రైతు విత్తన దశ నుంచే నష్టపోతున్నాడు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకపోగా.. మార్కెట్‌కు తెచ్చిన మిర్చి బస్తాలు తడిసి ముద్దయి.. ఆటో చార్జీలు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు బాధపడుతున్నారు. దీనిపై మరిన్ని వివరాల లకోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

13:29 - May 10, 2017

హైదరాబాద్: నగరంలో అర్ధరాత్రి కురిసిన భారీవర్షానికి హైదరాబాద్‌ అతలాకుతలమైంది.. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడి రాకపోకలకు అంతారాయం కలిగింది.. ఈదురుగాలులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.. మధురానగర్‌లో పలు భవనాలు నీటమునిగాయి.. వర్ష బీభత్సం ఎక్కువగా ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ కమిషనర్‌ జనార్ధన్‌ రెడ్డి పర్యటిస్తున్నారు.. సహాయక చర్యల్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.. మరిన్ని వివరాలు కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

మోడీతో ముగిసిన జగన్ సమావేశం..

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో వైసీపీ అధ్యక్షుడు జగన్ జరిపిన భేటీ కొద్ది సేపటి క్రితం ముగిసింది. ఈసందర్భంగా మీడియాతో జగన్ మాట్లాడారు. అగ్రిగోల్డ్ బాధితల సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలనని, విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని కోరడం జరిగిందన్నారు. మిర్చి రైతులకు మద్దతు ధర పెంచాలని, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. గత సభ ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరినట్లు జగన్ పేర్కొన్నారు. 

13:27 - May 10, 2017

హైదరాబాద్: నెల్లూరులోని నారాయణ విద్యాసంస్థల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మంత్రి నారాయణ తనయుడు నిషిత్‌ మరణంతో.. నారాయణ విద్యా సంస్థల విభాగాల అధిపతులు మూడు రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. మరోవైపు హైదరాబాద్‌ నుంచి ఇవాళ మధ్యాహ్నానానికి నిషిత్ పార్థివ దేహం ప్రత్యేక హెలికాప్టర్‌లో.. నెల్లూరుకు చేరుకోనుంది. నారాయణ ఆసుపత్రి ప్రాంగణంలోని మంత్రి నారాయణ నివాసం వద్ద.. పార్థివదేహాన్ని సందర్శనార్థం ఉంచనున్నారు. రేపు ఉదయం అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా.. ఇప్పటికే జిల్లాకు చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి ఇక్కడకు చేరుకొని ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. మంత్రులు, ప్రముఖులు ఇక్కడకు రానున్నారు.

పలు అభివృద్ధి కార్యక్రమాలకు హరీష్ శంకుస్థాపన..

సంగారెడ్డి : పటన్ చెరు, రామచంద్రాపురం మండలాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఎంపీ కొత్తా ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డిలు పాల్గొన్నారు. 

'జనసేనతో కలిసే విషయం రాష్ట్ర పార్టీ చూసుకొంటుంది'...

విజయవాడ : లౌకిక పార్టీలతో కలిసి రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టడం పై చర్చలు జరుగుతున్నాయని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. జాతీయస్థాయిలో మహా కూటమి ఏర్పాటు, రాష్ట్రపతి ఎన్నికల అంశంపై ఆధారపడి ఉంటుందన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా అద్వానీ పేరు రాగానే బాబ్రీ మసీదు కూల్చివేత కేసు తెరపైకి వచ్చిందన్నారు. టిడిపి దారి తప్పి బీజేపీలోకి వెళ్లిందని, బీజేపీతో జట్టుకట్టే పదేళ్లు టిడిపి ప్రతిపక్షంలో ఉందన్నారు. జనసేనతో కలిసి పనిచేసే అంశంపై రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్నారు.

13:06 - May 10, 2017
12:42 - May 10, 2017

హైదరాబాద్: నిషిత్‌ ఛాతికి స్టీరింగ్‌ బలంగా తగలడంతోనే చనిపోయినట్టు అపోలో ఫోరెన్సిక్‌ వైద్యుడు సురేందర్‌రెడ్డి తెలిపారు. ప్రమాద సమయంలో నిషిత్‌ డ్రైవింగ్‌ చేశాడని.... కారు మెట్రోపిల్లన్‌ను ఢీకొట్టడంతో స్టీరింగ్‌ అతడికి బలంగా తగిలిందన్నారు. ప్రమాద తీవ్రతకు నిషిత్‌ లివర్‌ ముక్కలు ముక్కలైందని స్పష్టం చేశారు. ప్రమాదం జరిగిన 10 నిమిషాలలోపే నిషిత్‌ , అతని స్నేహితుడు చనిపోయి ఉంటారని తెలిపారు. ఇద్దరికీ ఛాతిబాగంలో బలంగా దెబ్బలు తగలడంతోనే చనిపోయారని స్పష్టం చేశారు.

12:39 - May 10, 2017

గుంటూరు : అమరావతిలో తెలుగు రాష్ట్రాల రవాణా శాఖలమంత్రులు భేటీ అయ్యారు.. రెండు రాష్ట్రాలమధ్య రవాణా రంగ సమస్యలపై ఇద్దరు మంత్రులు చర్చించారు... చర్చలకోసం అమరాతికివచ్చిన మహేందర్‌ రెడ్డికి ఎదురెళ్లి అచ్చెన్నాయుడు స్వాగతం పలికారు.. పుష్పగుచ్చం ఇచ్చి సమావేశానికి తీసుకువెళ్లారు.. రెండు రాష్ట్రాలమధ్య సమస్యలు పరిష్కరించుకునేందుకు ఇలాంటి సమావేశాలు చాలా ఉపయోగపడతాయని మంత్రులు తెలిపారు.. ఇప్పటికే కొన్ని సమస్యలు పరిష్కారమయ్యాయని చెప్పారు. పెండింగ్‌ సమస్యలపై మరో వారంరోజుల్లో మళ్లీ భేటీ అవుతామని తెలిపారు.. రెండు రాష్ట్రాల ఆర్టీసీ బస్సులపై చర్చించేందుకు ఎగ్జిక్యూటివ్‌ కమిటీ వేశామని మంత్రులు స్పష్టం చేశారు..

12:33 - May 10, 2017

హైదరాబాద్: మహిళలకు సంబంధించి ఎన్నో రకాల చట్టాలు ఉన్నాయి. గృహ హింస నిరోధక చట్టం (డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్) వల్ల ఉపయోగాలు ఏమిటి? ఇదే అంశంపై మానవి 'మైరైట్' లో ప్రముఖ న్యాయవాది పార్వతి విశ్లేషణ చేశారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

12:24 - May 10, 2017

హైదరాబాద్: ఏపీమంత్రి కుమారుడు నిషిత్‌ మృతిపై ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నిషిత్‌ మృతివార్త తెలిసినవెంటనే ఆయన హుటాహుటిన హైదరాబాద్‌కు బయలుదేరి వచ్చారు. అపోలో ఆస్పత్రి దగ్గర నిషిత్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిషిత్‌కు పోస్టుమార్టం పూర్తికాగానే మృతదేహాన్ని నెల్లూరు తరలిస్తామన్నారు. మంత్రి నారాయణకు కూడా సమాచారం చేరవేశామని..... సాయంత్రానికి నారాయణ నెల్లూరుకు చేరుకుంటారని ఆయన చెప్పారు.

నితీష్ మద్యం సేవించలేదంట..

హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏపీ మంత్రి నారాయణ తనయుడు నితీష్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయ్యింది. అతివేగంతో ప్రయాణించడంతో జరిగిన ప్రమాదం వల్లే నితీష్ మృతి చెందారని, మద్యం తాగినట్లు లేదని స్పష్టం చేశారు. 

12:12 - May 10, 2017

వ్యాయామం..ప్రతి మనిషికి ఇది అవసరం. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వ్యాయామం పట్ల అసలు దృష్టి సారించడం లేదు. ఉదయం మొదలుకొని రాత్రి పడుకొనే వరకు ఉరుకుల..పరుగులతో సాగుతోంది..ఇంకా వ్యాయామం చేసే టైం ఎక్కడి అని పలువురు నిట్టూర్పు విడుస్తుంటారు. కానీ ఈ పది వాస్తవాలు చదవండి..

  1. బరువు తగ్గించుకోవడానికి మాత్రమే వ్యాయామం అని అనుకోవద్దు.
  2. వ్యాయామం శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది.
  3. వ్యాయామం శరీరాన్ని ఫిట్ గా ఉంటుంది.
  4. వ్యాయామం అనేది మెదడుకు బూస్ట్ లాంటిది.
  5. వ్యాయామం ఒత్తిడిని అధిగమించేలా చేస్తుంది.
  6. వ్యాయామం అనేక రుగ్మతల నుండి కాపాడుతుంది.
  7. వ్యాయామం చేయడం వల్ల ఇష్టమైన ఆహారం తీసుకోవచ్చు.
  8. వ్యాయామం గుండె పని విధాన్ని మెరుగు పరుస్తుంది.
  9. వ్యాయామం నైపుణ్యాన్ని పెంచి కొత్త ఆలోచనలు చేయడానికి సహకరిస్తుంది.
  10. వ్యాయామం చేయడం వల్ల మానవ సంబంధాలను పెంచడంలో దోహదం చేస్తుంది. 
12:10 - May 10, 2017
12:06 - May 10, 2017

ముల్తాని మట్టీ..సౌందర్యానికి వాడుతుంటారు. చర్మం పలు రకాలుగా ఉంటుంది. ఒకరికి పొడి చర్మ..మరొకరికి ఆయిల్ చర్మం ఇలా ఉంటుంది. ఈ ముల్తాని మట్టిని ఉపయోగించి వారు మరింత అందంగా తయారు కావచ్చు. ముల్తానీ మట్టి..తేనే..పసుపు..అన్నీ ఒక దగ్గర కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ గా వేసుకోవాలి. అనంతరం 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడుక్కోవాలి.
మూడు స్పూన్ల ముల్తాని మట్టీ..ఒక టేబుల్ స్పూన్ పెరుగు..దోసకాయ గుజ్జు..కొద్దిగా శనగపిండిని తీసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌ గా వేసుకుని 20 నిమిషాల తరువాత చల్లని లేదా గోరువెచ్చని నీటితో కడగాలి.
రెండు టేబుల్‌ స్పూన్ల ముల్తానీ మట్టి, టేబుల్‌ స్పూన్‌ గంధం పొడి, చిటికెడు పసుపు తీసుకుని అన్నింటినీ బాగా కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌ వేసుకోవాలి. ఆరిన తరువాత నీటితో శుభ్ర పరచాలి. ఇది ఆయిలీ, పొడి చర్మాలకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. మీ చర్మాన్ని కాంతివంతం చేస్తుంది.

ప్రధాని నివాసంలో జగన్..

ఢిల్లీ : ఏపీ ప్రతిపక్ష నేత జగన్ ప్రధాన మంత్రి నివాసానికి చేరుకున్నారు. ప్రధాన మంత్రి మోడీతో జగన్ భేటీ కానున్నారు. ప్ర‌త్యేక హోదా, రైల్వేజోన్‌, క‌డ‌ప స్టీల్‌ప్టాంట్, మిర్చి రైతుల సమ‌స్య‌లు, రాజ‌ధానిలో సాయం, కేబినెట్‌లో వైసీపి స‌భ్యుల‌కు చోటుపై ప్ర‌ధాని మోడీకి జ‌గ‌న్ ఫిర్యాదు చేయ‌నున్నారు.

11:35 - May 10, 2017

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ 'అల్లు అర్జున్' తాజా చిత్రం 'డీజే..దువ్వాడ జగన్నాథమ్' చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకొంటోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే చిత్రానికి సంబంధించిన లుక్స్..టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. పాటలు కూడా త్వరలో విడుదల కానున్నాయి. ప్రమోషనల్‌ కార్యక్రమాల్లో భాగంగా సోమవారం ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. త్వరలో ఈ చిత్రం గీతాలను విడుదల చేయబోతున్నట్టు వెల్లడించింది. ఇందులో 'అల్లు అర్జున్‌' ఒకటి బ్రాహ్మణుడిగా, మరొకటి కిల్లర్‌గా రెండు విభిన్నమైన పాత్రల్లో చేశాడని, హాస్య సన్నివేశాల్లో 'బన్ని' రెచ్చిపోయాడని టాక్. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఈనెల 23వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

11:33 - May 10, 2017

హైదరాబాద్: మంత్రి నారాయణ కుమారుడు నిషిత్‌ మృతదేహానికి అపోలో మెడికల్‌ కళాశాలలో ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నారు. తెలంగాణ మంత్రి హరీశ్‌ రావు...దగ్గరుండి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అనంతరం భౌతికకాయాన్ని నెల్లూరు తరలించనున్నట్లు తెలుస్తోంది. రేపు నెల్లూరులో నిషిత్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం.

11:32 - May 10, 2017

విజయవాడ: తెలుగు రాష్ట్రాల రవాణ మంత్రుల సమావేశం ప్రారంభం అయ్యింది. ఈ సమావేశానికి ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు, టీఎస్ మంత్రి మహేందర్ రెడ్డి, ఆర్టీసీ ఎండీలు, కమిషనర్లు, అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో అంతర్ రాష్ట్ర ఆర్టీసీ సర్వీసుల ఒప్పందాలు, రవాణ వాహనాల కౌంటర్ పర్మిట్ల జరిమానాల పై కీలక చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.

11:30 - May 10, 2017

హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో మరణించిన మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ పోస్టుమార్టం పూర్తయ్యింది. అపోలో మెడికల్ కాలేజీలో ఉస్మానియా వైద్యులు నిషిత్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని నారాయణ నివాసానికి తరలించిషిత్‌ భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్‌ నుంచి నెల్లూరుకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏర్పాట్లను మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బీద రవిచంద్ర పర్యవేక్షిస్తున్నారు. అంతకుముందు అపోలో ఆస్పత్రి దగ్గర పలువురు రాజకీయ ప్రముఖులు నిషిత్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఏపీ హోంమంత్రి చినరాజప్ప, తెలంగాణ మంత్రి హరీశ్‌రావు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌, సీపీఐ జాతీయనేత నారాయణతోపాటు పలువురు మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. మరోవైపు లండన్‌ నుంచి మంత్రి నారాయణ ఏపీకి బయలుదేరారు. ఈ సాయంత్రం చెన్నైకి వచ్చి అక్కడి నుంచి నెల్లూరుకు వస్తారు. నిషిత్‌ అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నారు. నిషిత్‌ మృతితో అటు నారాయణ విద్యాసంస్థల్లో విషాద చాయలు అలుముకున్నాయి. మూడు రోజులపాటు నారాయణ విద్యాసంస్థలకు యాజమాన్యం సెలవు ప్రకటించింది.

 

11:28 - May 10, 2017

అక్కినేని నాగార్జున కుమారుడు అక్కినేని నాగచైతన్య క్షమించాలని కోరడం ఏంటీ ? అని అనుకుంటున్నారా ? ఓ సినిమాను ఆలస్యంగా చూసినందుకు క్షమాపణలు చెప్పారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి -2' సినిమా విడుదలై విజదుందుంభి మ్రోగించిన సంగతి తెలిసిందే. చరిత్రలో ఏ సినిమా సాధించని రికార్డులు ఈ సినిమా సాధించింది. ఏకంగా వెయ్యి కోట్లు కొల్లగొట్టింది. ఈ చిత్రాన్ని చూసిన పలువురు చిత్ర ప్రముఖులు రాజమౌళి దర్శకత్వ ప్రతిభ..నటులపై ప్రశంసల జల్లుకు కురిపించారు. ఇటీవలే 'నాగచైతన్య' ఈ చిత్రాన్ని చూసి చిత్ర యూనిట్ ను అభినందించారు. ట్విటర్‌ వేదికగా ఆ చిత్ర యూనిట్‌ సభ్యులకు సెల్యూట్‌ చేశారు. ఆలస్యమైనందుకు క్షమించమన్నారు. ప్రస్తుతం ఆయన కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో 'రారండోయ్‌ వేడుక చూద్దాం' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయికగా నటిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

11:27 - May 10, 2017

ఢిల్లీ : ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ తో వైసీపీ నేత జగన్ భేటీ కానున్నారు. వీరి భేటీలో ప్రత్యేక హోదా, రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్, మర్చి రైతుల సమస్యలు, రాజధానికి సాయం, ఏపీ కేబినెట్ వైసీపీ సభ్యులకు చోటు పై ఫిర్యా చేయనున్నట్లు సమాచారం.

నితీష్ పోస్టుమార్టం పూర్తి..

హైదరాబాద్ : ఏపీ మంత్రి నారాయణ తనయుడు నితీష్ పోస్టుమార్టం పూర్తయ్యింది. జూబ్లీహిల్స్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నితీష్ తో పాటు పలువురు మృతి చెందిన సంగతి తెలిసిందే. అపోలో ఆసుపత్రిలో ఉస్మానియా వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేశారు. కాసేపటి క్రితం ఆయన మృతదేహాన్ని నెల్లూరు జిల్లాకు తరలించారు. 

దక్షిణకొరియా 19వ అధ్యక్షుడిగా...

సియోల్ : దక్షిణ కొరియా 19వ అధ్యక్షుడిగా మూన్ జై ఇన్ ప్రమాణ స్వీకారం చేశారు. సియోల్ లోని జాతీయ అసెంబ్లీ నివాసంలో ఆయన పదవీబాధ్యతలు చేపట్టారు. 

కొత్త రికార్డులు..

ఢిల్లీ : బుధవారం రికార్డు స్థాయిలో స్టాక్ మార్కెట్లు పెరుగుదలను నమోదు చేశాయి. నిఫ్టీ 68 పాయింట్లతో 9384 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 247 పాయింట్లు పెరిగి 30,180 వద్ద ట్రేడవుతోంది. 

నిషిత్ పోస్టుమార్టం పూర్తి

హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో మరణించిన మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ పోస్టుమార్టం పూర్తయ్యింది. అపోలో మెడికల్ కాలేజీలో ఉస్మానియా వైద్యులు నిషిత్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం నిషిత్ మృతదేహాన్ని నెల్లూరుకు తరలించానున్నారు.

ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన కపిల్ మిశ్రా

ఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన దిల్లీ మాజీ మంత్రి కపిల్‌ మిశ్రా నేడు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆప్‌ నేతల విదేశీ పర్యటనల వివరాలు వెల్లడించాలని డిమాండ్‌ చేస్తూ మిశ్రా దీక్ష ప్రారంభించారు.

కాసేపట్లో ప్రధానితో వైఎస్ జగన్ భేటీ

ఢిల్లీ : ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ తో వైసీపీ నేత జగన్ భేటీ కానున్నారు. వీరి భేటీలో ప్రత్యేక హోదా, రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్, మర్చి రైతుల సమస్యలు, రాజధానికి సాయం, ఏపీ కేబినెట్ వైసీపీ సభ్యులకు చోటు పై ఫిర్యా చేయనున్నట్లు సమాచారం.

జగన్ ఢిల్లీ పయనం..

హైదరాబాద్ : వైసీపీ అధ్యక్షుడు జ‌గ‌న్ ఢిల్లీకి బయలుదేరనున్నారు. నేడు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీని క‌లువ‌నున్నారు. ప్ర‌త్యేక హోదా, రైల్వేజోన్‌, క‌డ‌ప స్టీల్‌ప్టాంట్, మిర్చి రైతుల సమ‌స్య‌లు, రాజ‌ధానిలో సాయం, కేబినెట్‌లో వైసీపి స‌భ్యుల‌కు చోటుపై ప్ర‌ధాని మోడీకి జ‌గ‌న్ ఫిర్యాదు చేయ‌నున్నారు.

అపోలో ఆసుపత్రికి చేరుకున్న పవర్ స్టార్..

హైదరాబాద్ : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. మంత్రి నారాయణ కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు. ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నితీష్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. నారాయణ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం పోలీసులను ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

కేసీఆర్ విచారం..

హైదరాబాద్ : ఏపీ మంత్రి నారాయణ తనయుడు నితీష్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నారాయణ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు. 

కులభూషణ్‌ జాదవ్‌ మరణశిక్షపై అంతర్జాతీయ కోర్టు స్టే

హైదరాబాద్:  ఇండియన్ నేవీ మాజీ అధికారి కులభూషణ్‌ జాదవ్‌కు పాక్ విధించిన మరణశిక్షపై అంతర్జాతీయ కోర్టు స్టే విధించింది. నేవీ నుంచి పదవీ విరమణ పొందిన తర్వాత ఇరాన్‌లో వ్యాపారం చేసుకుంటున్న జాదవ్‌ను కిడ్నాప్‌ చేశారని అంతర్జాతీయ కోర్టుకు భారత్‌ సోమవారం అప్పీలు చేసుకుంది. దీనిపై నివేదిక అందించింది. దీంతో అతడి మరణశిక్షపై న్యాయస్థానం స్టే విధించింది. ఈ మేరకు పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు లేఖ పంపించినట్లు అధికార వర్గాల సమాచారం.

భారీ వర్షం..సహాయక చర్యల్లో జీహెచ్ఎంసీ..

హైదరాబాద్ : సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. చెట్లు కూలిపోయాయి. విద్యుత్ వ్యవస్థ నిలిచిపోయింది. జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నారు. 

పలు రాష్ట్రాల్లో బుద్ధ జయంతి....

ఢిల్లీ : నేడు బుద్ధ జయంతి సందర్భంగా పలు రాష్ట్రాల్లో కార్యక్రమాలు జరుగుతున్నాయి. బీహార్ లోని పాట్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం నితీష్ కుమార్ పాల్గొన్నారు. 

కన్నీరుమున్నీరుగా నిషీత్ తల్లి రమాదేవి...

హైదరాబాద్: ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిశీత్‌ మృతితో ఆయన కుటుంబలో విషాదఛాయలు అలుముకున్నాయి. నిశీత్‌ తల్లి రమాదేవి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆమెను ఓదార్చడం ఎవరి వల్లా కావట్లేదు. కొద్దిసేపటి క్రితం సినీనటుడు చిరంజీవి భార్య సురేఖ, మాజీ మంత్రి దానం నాగేందర్‌ దంపతులు, నిర్మాత అశోక్‌కుమార్‌ సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు నారాయణ నివాసానికి చేరుకుని కుటుంబసభ్యులను ఓదారుస్తున్నారు.

10:36 - May 10, 2017

టాలీవుడ్ ప్రిన్స్ 'మహేష్ బాబు' చిత్రం ఎప్పుడు చూస్తామా ? ట్రైలర్ ఎప్పుడు విడుదలవుతుందా ? అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఏ ఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన రకూల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సినిమా లుక్స్ ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. కానీ చిత్రానికి సంబంధించిన ఇతర విషయాలు మాత్ర బయటకు పొక్కడం లేదు. ఇదిలా ఉంటే 'స్పైడర్' చిత్ర టీజర్ సూపరన్ స్టార్ కృష్ణ బర్త్ డే అయిన మే 31వ తేదీన విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. జూన్ 9వ తేదీన ఆడియో లాంచ్ చేయాలని యోచిస్తున్నట్లు టాక్. ఈ చిత్రంలో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా 'మహేష్' కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. సామాజిక అంశాలతో తెరకెక్కించే మురుగదాస్ ఈ చిత్రంలో ఎలాంటి సామాజిక అంశాన్ని సృశించారో తెలియరాలేదు. ఆగస్టు 11న రిలీజ్ చేయాలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఓ అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది. 

రవాణ మంత్రుల సమావేశం ప్రారంభం

విజయవాడ: తెలుగు రాష్ట్రాల రవాణ మంత్రుల సమావేశం ప్రారంభం అయ్యింది. ఈ సమావేశానికి ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు, టీఎస్ మంత్రి మహేందర్ రెడ్డి, ఆర్టీసీ ఎండీలు, కమిషనర్లు, అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో అంతర్ రాష్ట్ర ఆర్టీసీ సర్వీసుల ఒప్పందాలు, రవాణ వాహనాల కౌంటర్ పర్మిట్ల జరిమానాల పై కీలక చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.

కొనసాగుతున్న నితీష్ పోస్టుమార్టం..

హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏపీ మంత్రి నారాయణ తనయుడు నితీష్ మృతదేహానికి పోస్టుమార్టం జరుగుతోంది. అపోలో ఆసుపత్రిలో పోస్టుమార్టాన్ని ఉస్మానియా వైద్యులు నిర్వహిస్తున్నారు. నితీష్ మృతి చెందడం పట్ల పలువురు నేతలు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. నారాయణ కుటుంబసభ్యులకు సంతాపాన్ని తెలియచేశారు. 

కులభూషణ్ మరణశిక్షపై స్టే..

ఢిల్లీ : భారత నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్ కు పాక్ విధించిన మరణశిక్షపై అంతర్జాతీయ కోర్టు స్టే విధించింది. అంతర్జాతీయ కోర్టుకు భారత్ సోమవారం అప్పీల్ చేసుకుంది. దీనిపై నివేదిక అందించింది. దీనితో అతడి మరణశిక్షపై న్యాయస్థానం స్టే విధించింది.

 

నితీష్ మృతి పట్ల పలువురు దిగ్ర్భాంతి..

హైదరాబాద్ : ఏపీ మంత్రి నారాయణ తనయుడు నితీష్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల పలువురు నేతలు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మంత్రి నారాయణ లండన్ లో పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. విషయం తెలుసుకున్న ఆయన హుటాహుటిన హైదరాబాద్ కు బయలుదేరారు. సహచర మంత్రులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. నితీష్ మృతిపై మంత్రి లోకేష్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పలువురు మంత్రులు హైదరాబాద్ కు బయలుదేరారు.

రేపు నెల్లూరులో నిషిత్ అంత్యక్రియలు

హైదరాబాద్: మంత్రి నారాయణ కుమారుడు నిషిత్‌ మృతదేహానికి అపోలో మెడికల్‌ కళాశాలలో ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నారు. తెలంగాణ మంత్రి హరీశ్‌ రావు...దగ్గరుండి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అనంతరం భౌతికకాయాన్ని నెల్లూరు తరలించనున్నట్లు తెలుస్తోంది. రేపు నెల్లూరులో నిషిత్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం.

09:54 - May 10, 2017

హైదరాబాద్: నగరంలో మంగళవారం అర్థరాత్రి కురిసిన భారీ వర్షం వల్ల పలు కాలనీలు అంథకారంలో వున్నాయి. రాత్రి 11 గంటల సమయంలో ప్రారంభమైన వర్షం అర్ధరాత్రి దాటే వరకు కొనసాగింది. ఖైరాతాబాద్‌, హిమాయత్‌నగర్‌, నాగోలు, పంజాగుట్ట, మియాపూర్‌, మొయినాబాద్‌, కాప్రా, అల్వాల్‌, రామంతాపూర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, బోయినపల్లి.. ఇలా అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రహదారులపై నీరు నిలిచిపోయింది. ప్రధాన రహదారులపై వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. రోడ్లపై నీరు నిలవడంతో అర్ధరాత్రి వేళ పలుచోట్ల ట్రాఫిక్‌ స్తంభించింది. పలు ప్రాంతాల్లో వడగళ్లు కూడా పడ్డాయి. వర్షం కారణంగా నగరంలో చాలా చోట్ల విద్యుత్‌ సరఫరా నిలిచిపోయి అంధకారం అలుముకొంది. ఉరుములు, మెరుపులకు గాలి దుమారం తోడవడంతో అనేక చోట్ల చెట్లు, కరెంటు స్తంభాలు నేలకూలాయి. ఈదురు గాలుల ధాటికి కొన్నిచోట్ల కిటికీల అద్దాలు పగిలిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో క్లియర్ కాగా మరికొన్ని ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

09:44 - May 10, 2017

హైదరాబాదు : జూబ్లిహిల్స్, రోడ్ నెంబర్ 36లో మెట్రో పిల్లర్ ను ఢీ కొట్టిన ఘటనలో మృతి చెందిన నిషిత్ నారాయణ(22), రాజారవివర్మ(23) మృతదేహాలకు పంచనామా, ఇతర ఫార్మాలిటీస్ అపోలో ఆసుపత్రిలో పూర్తి చేస్తున్నారు. అనంతరం నెల్లూరుకు తరలించనున్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి మితిమీరిన వేగమే కారణమని తెలుస్తోంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో నిశిత్‌ నారాయణ, రాజా రవివర్మ జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వైపు నుంచి పెద్దమ్మ గుడి వైపు బెంజ్‌ కారు(టిఎస్‌ 07ఎస్‌కే 7117)లో వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి మెట్రో పిల్లర్‌ నెం-9 బలంగా ఢీకొట్టింది. కారు ఎయిర్‌ బ్యాగులు తెరుచుకున్నప్పటికి ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. జీహెచ్ ఎంసీ సిబ్బంది అపోలో ఆసుపత్రికి తరలించారు.

అపోలో ఆసుపత్రికి పలువురు...

తెలంగాణ మంత్రి హరీష్ రావు, నామా నాగేశ్వరరావు అపోలో ఆసుపత్రికి చేరుకుని నారాయణ కుటుంబ సభ్యులను ఓదార్చుతున్నారు. అనంతరం అపోలోకు చేరుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం కూడా అపోలోలో నిషిత్ నారాయణ మృతదేహాన్ని జూబ్లిహిల్స్ లోని నారాయణ నివాసానికి చేర్చే ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

పలువురి సంతాపం...

నిషిత్ నారాయణ ఆత్మకు శాంతి కలగాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమెరికా నుంచి సంతాపం ప్రకటించారు. నిషిత్ నారాయణ మృతిపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి, నారాయణ కుటుంబానికి సంతాపం తెలిపారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ కూడా మంత్రి నారాయణకు తన సంతాపం తెలిపారు. మంత్రి లోకేష్ ఈ విషయం తెలియగానే ఢిల్లీ పర్యటనను అర్థాంతరంగా రద్దు చేసుకున్నారు. వెంటనే ఢిల్లీ నుంచి హైదరాబాదు బయల్దేరారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మంత్రులు నారాయణ కుటుంబానికి సంతాపం తెలిపారు. పలువురు ఆయన నివాసానికి బయల్దేరారు.

లండన్ నుండి బయలుదేరిన నారాయణ...

ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న పీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ.. తనయుడి మరణ వార్త వినడంతో, హుటాహుటీన హైదరాబాదు బయల్దేరారు. రాత్రికి చెన్నై వచ్చి అక్కడ నుండి నెల్లూరు కు చేరుకోనున్నారు.

09:38 - May 10, 2017
09:26 - May 10, 2017

జూనియర్ ఎన్టీఆర్ తన తాజా చిత్రం 'జై లవకుశ' షూటింగ్ కొనసాగుతోంది. 'టెంపర్' ఘన విజయం అనంతరం ఈ చిత్రంలో నటిస్తుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాబీ దర్శకత్వంలో సోదరుడు కళ్యాణ్ రామ్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అనేక విశేషాలు కలిగి ఉన్నాయి. ఎన్టీఆర్ త్రిపాత్రాభియనం చేస్తున్నట్లు టాక్ రావడంతో అభిమానుల్లో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. మూడు పాత్రల్లో ఎలా ఉంటారనే దానిపై టాలీవడ్ లో చర్చ జరుగుతోంది. ఓ పాత్ర పూర్తిగా నెగటివ్ గా ఉంటుందని, ఇందుకు హాలీవుడ్ మేకప్ మెన్ ఎన్టీఆర్ కు మేకప్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే విడుదల చేసిన మోషన్ పోస్టర్ సినిమాపై అంచనాలు మరింత పెంచేసింది. మే 20వ తేదీన తారక్ తన పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులను మెస్మరైజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. 'జై లవకుశ' మూడు పాత్రల లుక్స్ ని విడుదల చేస్తారని తెలుస్తోంది. మరి ఆ పాత్రలు ఎలా ఉండనున్నాయి తెలువాలంటే కొద్ది రోజులుగా వేచి చూడాల్సిందే. 

లెఫ్టినెంట్ ర్యాంక్ ఆర్మీ అధికారి హత్య

జమ్మూకశ్మర్: లెఫ్టినెంట్ ర్యాంక్ ఆర్మీ అధికారి హత్య జరిగింది. కుల్గామ్ లో ఆర్మీ అధికారిని ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. షోపియాన్ లో ఆర్మీ అధికారి ఉమర్ మృతదేహం లభ్యం అయ్యింది. ఇటీవలే ఆర్మీలో ఉమర్ ఫయాజ్ చేరారు.

08:59 - May 10, 2017

మెగా కుటుంబంపై ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేయడంపై నటుడు సాయి ధరమ్ తేజ్ తీవ్రంగా కలత చెందారని వార్తలు వెలువడుతున్నాయి. సాయి ధరమ్ తేజ - నిహారికలకు వివాహం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. దీనిపై సాయి ధరమ్ తేజ స్పందించారు. ఆయన కార్యాలయం నుండి ఓ నోట్ వెలువడింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. 'చిన్నతనం నుంచి ఒకే కుటుంబంలో కలిసిమెలిసి పెరిగాం. ఒకరికొకరు అన్నాచెల్లెళ్లుగా భావిస్తారు. ఓ అమ్మాయికి సంబంధించిన ఇలాంటి సున్నితమైన అంశాలపై వార్తలు రాసేముందు ధృవీకరించుకోవాల్సింది. ఈ వదంతులపై తీవ్ర కలత చెందా. ఇద్దరి కుటుంబాల్లో మనోవేదనకు కారణం అయ్యింది' అంటూ వివరణ ఇచ్చారు. దీనితో ఈ పుకార్లకు చెక్ పడినట్లే. ప్రస్తుతం ఇద్దరు ఆయా సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

08:54 - May 10, 2017
08:48 - May 10, 2017

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు వరుసగా జరుగుతున్నాయి. అంతేకాకుండా ఈ ప్రమాదాల్లో రాజకీయ, సినీ ప్రముఖుల పిల్లలు గురవుతున్నారు. ఈరోజు మంత్రి నారాయణ కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఎందుకు అలా జరుగుతున్నాయి? సీనియర్ రాజకీయ విశ్లేషకులు నడిపల్లి సీతారామరాజు, టిడిపి నేత చెందూ సాంబశివరావు, సీపీఎం నేత కె.ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

07:08 - May 10, 2017

 అమరావతి: అమెరికాలో చంద్రబాబు ఐదోరోజూ బిజీబిజీగా గడుపుతున్నారు. ఏపీకీ పెట్టుబడులే లక్ష్యంగా పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. మొదట అప్లయిడ్‌ మెటీరియల్స్‌ ప్రతినిధులతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీతో అప్లయిడ్‌ మెటీరియల్స్‌ కంపెనీని భాగస్వామిగా చేసేందుకు రోడ్‌మ్యాప్‌ రూపొందించాలన్నారు. ఇందుకోసం అప్లయిడ్‌ మెటీరియల్స్‌ సంస్థ నుంచి ముగ్గురు, ఏపీ ప్రభుత్వం నుంచి ముగ్గురు బృందంగా ఏర్పడి సమన్వయం చేసుకోవాలని నిర్ణయించారు. మరోవైపు ఏపీని క్లౌడ్‌హబ్‌గా రూపొందించడంలో ప్రభుత్వానికి సహకారం అందించేందుకు నుటనిక్స్‌ సంస్ధ ముందుకొచ్చింది. మరో రెండు నెలల్లో దీనిపై స్పష్టమైన రోడ్‌మ్యాప్‌, ప్రాజెక్ట్‌ రిపోర్టుతో వస్తామని నుటనిక్స్‌ ప్రతినిధి ధీరజ్‌పాండే తెలిపారు.

యూఎస్‌ఐబీసీ సదస్సుల్లో పాల్గొన్న చంద్రబాబు....

యునైటెడ్‌ స్టేట్స్ ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ రెండవ వార్షిక పశ్చిమ తీర సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. పట్రాకార్ప్‌ సీఈవో జాన్‌ ఎస్‌ సింప్సన్‌తో బాబు భేటీ అయ్యారు. విశాఖలో ఇప్పటికే కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఈ అమెరికన్‌ బీపీవో సంస్థ విస్తరణపట్ల ఆసక్తి కనబరుస్తోంది. విశాఖలో ఇప్పటికే 1500 ఉద్యోగాలు కల్పించిన బీపీవో సంస్థ.. స్థలం కొరత కారణంగా నయా రాయ్‌పూర్‌కు 500 ఉద్యోగాలు తరలిపోయాయని ప్రస్తావించింది. విశాఖలో తగిన స్థలం ఉంటే మరో 500 ఉద్యోగాలు కల్పించేవాళ్లమని స్పష్టం చేసింది. దీనిపై స్పందించిన చంద్రబాబు వెంటనే ఈ సంస్థకు టెక్‌ మహీంద్రా బిల్డింగ్‌ కేటాయించాలని ఏపీఐఐసీని ఆదేశించారు. ఆ తర్వాత వీసాకార్డ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అంబాసిడర్‌ డెమెట్రియస్‌ మరంటీస్‌, బెల్‌ కర్వ్‌ల్యాబ్స్‌, మొబిలిటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ గ్రూప్‌ ప్రతినిధులతోనూ చంద్రబాబు భేటీ అయ్యారు.

చంద్రబాబుకు ట్రాన్స్‌ఫర్మేటివ్‌ చీఫ్‌ మినిస్టర్‌ అవార్డు....

చంద్రబాబుకు ట్రాన్స్‌ఫార్మేటివ్‌ చీఫ్‌ మినిస్టర్‌ అవార్డు దక్కింది. యుఎస్‌ఐబీసీ తరపున జాన్‌ చాంబర్స్‌ ఈ అవార్డును చంద్రబాబుకు అందజేశారు. ఈ అవార్డు తనకు కాదని, తన రాష్ట్రానికి దక్కిన గౌరవంగా చంద్రబాబు తెలిపారు. ఈ పురస్కారాన్ని అమెరికన్‌ ఇన్వెస్టర్ల నుంచి ఏపీకి ఇస్తున్న మద్దతుగా భావిస్తున్నానని అన్నారు. ప్రతి యూఎస్‌ పారిశ్రామికవేత్త ఏపీకి వచ్చి ఒక పరిశ్రమను స్థాపించాలని ఈ సందర్భంగా కోరారు. అనంతరం సన్‌రైజ్‌ ఏపీ ట్రాన్స్‌ఫర్మషనల్‌ జర్నీ టూ వర్డ్స్‌ ఏ హ్యాపీ స్టేట్‌ అనే అంశంపై ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

సిస్కో కంపెనీ ప్రతినిధులతో చంద్రబాబు సమావేశం

అంతకు ముందు సిస్కో ప్రతినిధులతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో చిన్న తరహా వ్యాపారాలు మరింత సులభతరం చేసుకోవడంలో, విజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవడాన్ని సరళతరం చేయడంలో సహకారం అందిస్తామని సిస్కో ప్రకటించింది. ఏపీలో సాంకేతికత అనుసంధానించే ప్రక్రియ వేగంగా జరుగుతోందని, అందుకు తగిన వాతావరణాన్ని మెరుగుపర్చాలని భావిస్తున్నట్టు చంద్రబాబు స్పష్టం చేశారు.

07:02 - May 10, 2017

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం అర్ధరాత్రి భారీ వర్షం బీభత్సం సృష్టించింది. అకాల వర్షంతో పలు జిల్లాల్లో పంటలకు భారీ నష్టం సంభవించింది. హైదరాబాద్‌, విజయవాడలో అర్ధరాత్రి వడగండ్ల వర్షం బీభత్సం సృష్టించింది. మరోవైపు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంగా గాలులు వీచడంతో పలుచోట్ల ఇళ్ల పైకప్పులు దెబ్బతిన్నాయి. గాలి వాన బీభత్సానికి హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. భారీ హోర్డింగులు కూలిపోయాయి. విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో నగరంలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. డ్రైనేజీలన్నీ పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పలు చోట్ల ఇళ్లలోకి నీళ్లు చేరాయి. నగరవాసులు మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్‌ ద్వారా తమ ప్రాంత సమస్యలను వివరించారు. దీంతో హుటాహుటిన అధికారులను అప్రమత్తం చేసిన కేటీఆర్‌.. ఎమర్జెన్సీ బృందాలను రంగంలోకి దింపారు.

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల బీభత్సం...

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం అర్ధరాత్రి భారీ వర్షం బీభత్సం సృష్టించింది. అకాల వర్షంతో పలు జిల్లాల్లో పంటలకు భారీ నష్టం సంభవించింది. హైదరాబాద్‌, విజయవాడలో అర్ధరాత్రి వడగండ్ల వర్షం బీభత్సం సృష్టించింది. మరోవైపు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంగా గాలులు వీచడంతో పలుచోట్ల ఇళ్ల పైకప్పులు దెబ్బతిన్నాయి. గాలి వాన బీభత్సానికి హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. భారీ హోర్డింగులు కూలిపోయాయి. విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో నగరంలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. డ్రైనేజీలన్నీ పొంగిపొర్లుతున్నాయి.

07:00 - May 10, 2017

అమరావతి: మంత్రి పదవి చేపట్టిన తర్వాత తొలిసారి నారా లోకేశ్‌ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఈరోజు, రేపు రెండు రోజుల పాటు ఢిల్లీలో గడపనున్న లోకేశ్‌.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు పెండింగ్‌ అంశాలపై కేంద్రమంత్రులను కలవనున్నారు. అదేవిధంగా రెండేళ్లలో లక్ష ఐటీ ఉద్యోగాలు, ఐదు లక్షల తయారీ రంగ ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్న లోకేశ్‌.. ఆ దిశగా అడుగులు వేయబోతున్నారు.

నవ్యాంధ్రను ఐటీకి వేదిక చేయాలని లోకేశ్‌ కృషి...

ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశంతో నవ్యాంధ్రను ఐటీకి వేదిక చేయాలని లోకేశ్‌ కృషి చేస్తున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల్లోనే గన్నవరం మేధా టవర్స్‌లో ఏడు ఐటీ కంపెనీలను ప్రారంభించి... సుమారు 1600 మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించారు. అలాగే మరో 5 వేల మందికి ఉపాధి కల్పించే ఉద్దేశంతో హెచ్‌సిఎల్‌ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. 45 రోజుల్లోనే కంపెనీ ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుమతులు, భూమిని లోకేశ్‌ సిద్దం చేశారు. వెంటనే కార్యకలాపాలు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సంబంధిత శాఖల మంత్రులు, అధికారులతో వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసి రియల్‌ టైమ్‌లో హెచ్‌సిఎల్‌ కంపెనీ కోరిన అనుమతులు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. నిరంతర విద్యుత్‌ సరఫరా, రవాణా సౌకర్యం కల్పించడంతో పాటు పన్ను రాయితీలు ఇవ్వనున్నారు. అలాగే కంపెనీ కోసం 17.86 ఎకరాల భూమి పత్రాలను సిద్దం చేశారు.

గతంలోనే హెచ్‌సిఎల్‌ కంపెనీ ప్రతినిధులు...

గతంలోనే హెచ్‌సిఎల్‌ కంపెనీ ప్రతినిధులు చైర్మన్‌ శివనాడర్‌ను కలవాలని లోకేశ్‌ను ఆహ్వానించారు. అయితే.. కంపెనీకి పూర్తిస్థాయి అనుమతి పత్రాలతో వస్తానని తెలిపారు. వారికి ఇచ్చిన మాట ప్రకారం బుధవారం మధ్యాహ్నం శివనాడర్‌ను కలిసి అనుమతిపత్రాలు అందజేయనున్నారు. దీంతో ఈజ్‌ ఆప్‌ డూయింగ్‌ బిజినెస్‌లో భాగంగా సింగిల్‌ విండో విధానంలో అనుమతులు అన్నీ ఒకేసారి ఇచ్చి రాష్ట్రానికి ఐటీ కంపెనీలు తీసుకువచ్చేందుకు మొదటి అడుగుపడనుంది. మొత్తానికి అసమర్ధుడని ప్రత్యర్ధులు వేసిన ముద్రను తొలగించుకునేందుకు లోకేశ్‌ తన పనితనంతో సమాధానం చెప్పేందుకు సిద్దమవుతున్నారు.

06:57 - May 10, 2017

హైదరాబాద్: రాజకీయంగా పలుకుబడి సాధించేందుకు ఎన్నో ఏళ్లు ప్రజాజీవితంలో తలమునకలైన నేతలకు అధికార దర్పం దక్కడంతో కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వంలో జోక్యం విషయం ఎలా ఉన్నా.. ప్రైవేట్‌ వ్యవహారాలు నేతలకు కొత్త ఇబ్బందులు తీసుకువస్తున్నాయి. నేతల కుటుంబ సభ్యులు నేరుగా వివాదాల్లో జోక్యం చేసుకుంటున్న సంఘటనలు తెలంగాణలో ఏదో ఒక చోట వెలుగుచూస్తునే ఉన్నాయి. తాజాగా ఓ ఎమ్మెల్సీ కొడుకు నిర్వాకం అధికార పార్టీ నేతల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది.

కొంతమంది అమాత్యుల కుమారులపై వివాదాలు...

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి కొంతమంది అమాత్యుల కుమారులపై వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ఈ మధ్యనే ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన జోగు రామన్న కుమారుడు ఓ హత్యకేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. బాధితుల ఆందోళనతో జోగు రామన్న కొడుకుపై పోలీసులు కేసు నమోదు చేయక తప్పలేదు. ఇక గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ కుమారుడు ఓ మహిళ విషయంలో చేసుకున్న జోక్యం.. తీవ్ర దుమారం లేపింది. మరో మంత్రి పద్మారావు తనయుడు ఓ వ్యాపారి కుటుంబాన్ని చితకబాదడంతో సౌమ్యుడిగా పేరున్న మంత్రికి కూడా ఇబ్బందులు తప్పలేదు. మరోవైపు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి కూడా వివాదాల్లో తలదూర్చడం అధికార పార్టీ నేతల్లో ఆందోళన కలిగిస్తోంది.

నియోజకవర్గాల్లో నేతల కుటుంబ సభ్యులు,తనయుల జోక్యం...

ఇక నియోజకవర్గాల్లో నేతల కుటుంబ సభ్యులు, తనయుల జోక్యం దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఉన్నా.. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం శృతిమించడంతో వివాదాలు తీవ్రమవుతున్నాయి. మంత్రులు పోచారం, జూపల్లి తనయులు నియోజకవర్గాలతో పాటు రాజధానిలో కూడా సెటిల్‌మెంట్లు చేస్తున్నట్లు ఆరోపణలతో వారిద్దరూ విమర్శలు ఎదుర్కొంటున్నారు.

అదుపులో పెట్టుకోకపోతే.. పదవులకే ఎసరు వచ్చే అవకాశం...

అయితే.. నేతల కుటుంబ సభ్యుల వ్యవహారాలు వివాదస్పదమవుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు తమకు అనుకూలంగా మలుచుకుంటుండడంతో ఆరోపణలకు పెద్దగా బలం లేకుండాపోతుందని పరిశీలకులంటున్నారు. ఏది ఏమైనా నేతలు.. తమ కుటుంబ సభ్యులను అదుపులో పెట్టుకోకపోతే.. పదవులకే ఎసరు వచ్చే అవకాశం ఉందంటున్నారు.

06:51 - May 10, 2017

ఢిల్లీ: ఈవీఎంలపై గత కొంత కాలంగా ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రధానంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ రిగ్గింగ్‌ చేసి.. విజయం సాధించిందని ఆప్‌ ఆరోపణలు చేస్తోంది. ఈవీఎం మిషన్లను ఎలా ట్యాంపరింగ్‌ చేయవచ్చో.. చేసి చూపించింది. ఇందుకోసం ఢిల్లీలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేశారు.

ఆప్‌ ఎమ్మెల్యే సౌరభ భరద్వాజ్‌...

ఆప్‌ ఎమ్మెల్యే సౌరభ భరద్వాజ్‌ ఈవీఎంలను ఎలా ట్యాంపరింగ్‌ చేయవచ్చో డెమో ఇచ్చారు. తాను కంప్యూటర్‌ ఇంజనీర్‌నని.. ఎమ్మెల్యే కాక ముందు పదేళ్లు కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీర్‌గా పని చేశానన్నారు. కేవలం 90 సెకండ్లలో మదర్‌బోర్డును మార్చడంతో ట్యాంపరింగ్‌ చేయవచ్చన్నారు. ఓ సీక్రెట్‌ కోడ్‌ ఎంటర్‌ చేస్తే ఈవీఎంలను బోల్తా కొట్టించవచ్చన్నారు భరద్వాజ్‌. డెమోలో భాగంగా ఆయన సాధారణ మెషిన్‌లో ఐదు పార్టీలకు ఓటు వేయగా.. అవన్నీ సరిగ్గానే వచ్చాయి. అయితే ఆ తర్వాత ఆయన ఓ సీక్రెట్‌ కోడ్‌ ఎంటర్‌ చేయగానే.. తర్వాత వేసిన ఓట్లన్నీ ఒకే అభ్యర్థిగా వెళ్లడాన్ని ఆయన చేసి చూపించారు.

ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా చర్చ..

ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలన్నారు భరద్వాజ్‌. విదేశాల్లో సైతం ఈవీఎంలను వినియోగించడం మానివేశారన్నారు. విదేశీ టెక్నాలజీతో మన ప్రజాస్వామ్యాన్ని పరహసించడం సరైంది కాదన్నారు. బ్యాలెట్‌ పద్ధతిని తిరిగి ప్రవేశపెట్టాలన్నారు. గుజరాత్‌ ఎన్నికల్లో మూడు గంటలు తమకు ఈవీఎంలు అప్పగిస్తే బీజేపీకి ఒక్క సీటు రాకుండా చేస్తామని ఆయన సవాల్‌ విసిరారు.

ఆప్ డెమోను కొట్టిపారేసిన ఈసీ...

ఇక ఆప్‌ ప్రదర్శించిన ఎన్నికల డెమోను ఎన్నికల సంఘం కొట్టిపారేసింది. ఆప్‌ ఓ డమ్మీ ఈవీఎంపై డెమో చూపించిందని.. ట్యాంపరింగ్‌ చేయడం ముమ్మాటికీ కుదరదని తేల్చి చెప్పింది. ఈవీఎంల పనితీరుపై ఈనెల 12న అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో టాంపరింగ్‌ను నిరూపించాలని సవాల్‌ విసిరింది. ఇదిలావుంటే.. ఈసీ సవాల్‌ను స్వీకరిస్తామని డిల్లీ డిప్యూటీ సీఎం మనిష్‌ సిసోడియా చెప్పారు. అయితే.. తమకు ఒరిజినల్‌ ఈవీఎం ఇచ్చి.. కొంత సమయం ఇస్తే.. ట్యాంపరింగ్‌ను నిరూపిస్తామన్నారు. ఆప్‌ డెమోతో వెంటనే స్పందించిన ఈసీ.. ఆల్‌ పార్టీ మీట్‌కు పిలుపునివ్వడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈవీఎంల ట్యాంపరింగ్ పై ఆప్ డెమో

ఢిల్లీ: కొన్ని రోజులుగా ఈవీఎంలపై ఆప్‌ చేస్తున్న ఆరోపణలకు పదును పెట్టింది. ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేయొచ్చని డెమో ద్వారా నిరూపించింది. ఇందుకోసం ఏకంగా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలనే ఏర్పాటు చేయడం గమనార్హం. ట్యాంపరింగ్‌ ద్వారానే యూపీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని.. తమకు 3 గంటలు ఈవీఎంలు అప్పగిస్తే గుజరాత్‌ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క ఓటు రాకుండా చేస్తామని ఆప్‌ సవాల్‌ విసిరింది.

జస్టిస్‌ కర్ణన్‌కు 6 నెలల జైలు శిక్ష విధించిన సుప్రీంకోర్టు

ఢిల్లీ : కోలకతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్‌ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని సుప్రీంకోర్టు నిర్ధారించింది. ఆయనకు కోర్టు 6 నెలలు జైలు శిక్ష విధించింది. జస్టిస్‌ కర్ణన్‌ను తక్షణమే అరెస్ట్‌ చేయాలని పశ్చిమ బెంగాల్‌ డిజిపిని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. పదవిలో ఉన్న ఓ జడ్జిపై విచారణ జరిపి శిక్ష విధించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి.

06:46 - May 10, 2017

హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మరోసారి పోరుబాటపట్టేందుకు సమాయత్తమవుతున్నారు. 2016 ఫిబ్రవరిలో కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 16ను హై కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారిస్తున్నారు. 2016 అక్టోబర్ లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమానవేతనం సాధించుకునే విషయంపై మేథోమథనం సాగిస్తున్నారు. ఈ నెల 11న కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో నేటి జనపథంలో ఇదే అంశం పై చర్చనుచేపట్టింది. ఈ చర్చలో తెలంగాణ ప్రభుత్వ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్యదర్శి జె. కృష్ణారెడ్డి పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

06:36 - May 10, 2017

హైదరాబాద్: నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్‌ నారాయణతో పాటు మరోవ్యక్తి మృతిచెందారు. స్నేహితుడు రాజా రవివర్మతో కలిసి నిషిత్ బెంజ్ కారులో వెళ్తుండగా, జూబ్లీహిల్స్ రోడ్డు నెం.36లో వీరి వాహనం మెట్రో పిల్లర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నిషిత్ నారాయణతో పాటు ఆయన స్నేహితుడు రాజా రవివర్మ మృతిచెందాడు. నిషిత్ ప్రయాణించిన బెంజ్ కారు నెంబర్ టీఎస్ 07 ఎఫ్‌కే 7117 అని సమాచారం. ఈ ఏడాదే నారాయణ గ్రూప్స్ డైరెక్టర్‌గా నిషిత్ బాధ్యతలు చేపట్టారు. మరోవైపు నిషిత్ తండ్రి ఏపీ మంత్రి నారాయణ ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నారు. మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాధమిక సమాచారం.

ఏపీ మంత్రి నారాయణ కుమారుడు మృతి

హైదరాబాద్: జూబ్లీహిల్స్ రోడ్ నెం 36 లో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి మెట్రో పిల్లర్ ను కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మృతులు విజిత్ నారాయణ, రాజారావుగా గుర్తించారు. మృతుల్లో నిషిత్ నారాయణ ఏపీ మంత్రి నారాయణ కుమారుడుగా గుర్తించినట్లు సమాచారం.

మెట్రో పిల్లర్ ను ఢీ కొట్టిన కారు:ఇద్దరి మృతి

హైదరాబాద్: జూబ్లీహిల్స్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి మెట్రో ప్లిర్ ను కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.

Don't Miss