Activities calendar

11 May 2017

21:36 - May 11, 2017

ఢిల్లీ : ట్రిపుల్‌ తలాక్‌....దేశ వ్యాప్తంగా ఈ అంశం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ముస్లిం మ‌త సాంప్రదాయంలో మూడు సార్లు త‌లాక్ అంటే భార్యాభ‌ర్తల మ‌ధ్య బంధం తెగిపోయిన‌ట్లే. ఈ ఆచారం పట్ల ముస్లిం మహిళలు సైతం వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ముస్లింలలో బహుభార్యత్వం, ట్రిపుల్‌ తలాక్‌ రాజ్యాంగబద్ధతను సవాల్‌ చేస్తూ దాఖలైన ఏడు పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. చీఫ్‌ జస్టిస్‌ ఖేహర్‌ నేతృత్వంలోని ఐదుగురు విభిన్న మతాల సభ్యులతోకూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. ధర్మాసనంలోని ఐదుగురు సీనియర్‌ న్యాయమూర్తులు హిందు, ముస్లిం, పార్సీ, క్రిస్టియన్‌, సిక్కు మతాలకు సంబంధించిన వారు కావడం విశేషం. దీనిపై ఆరు రోజుల పాటు విచారణ కొనసాగనుంది.

సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ట్రిపుల్‌ తలాక్‌పై విచారణ ప్రారంభించిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ట్రిపుల్‌ తలాక్‌ ఇస్లాం మతానికి సంబంధించిన ప్రాథమిక అంశమా? కాదా...అన్నదానిపై ఓ నిర్ణయానికి వచ్చాకే విచారిస్తామని పేర్కొంది. ఇస్లాం మూలసూత్రాల్లో ట్రిపుల్‌ తలాక్‌కు ఉన్న ప్రాధాన్యతను పరిశీలిస్తామని జస్టిస్ ఖేహార్‌ స్పష్టం చేశారు. బహుభార్యత్వంపై విచారణ జరిపేది లేదని కోర్టు

ట్రిపుల్ త‌లాక్ రాజ్యాంగ విరుద్ధమ‌ని కేంద్రం పేర్కొంది. ఈ అంశంలో తాము ఎవ‌రి వైపునా లేమ‌ని, లింగ స‌మాన‌త్వం కోసం పోరాటం చేస్తామ‌ని కోర్టుకు తెలిపింది. మ‌హిళ‌ల హుందాత‌నానికి ట్రిపుల్ త‌లాక్ వ్యతిరేకంగా ఉంద‌ని కేంద్రం చెప్పింది.

వ్యక్తిగత అంశం..
ట్రిపుల్‌ తలాక్‌ అన్నది భార్యా భర్తలకు సంబంధించిన వ్యక్తిగత అంశమని దీన్ని వివాదస్పదం చేయడం సరికాదని మాజీ కేంద్ర మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ అన్నారు. భార్యా భర్తలు ఓ అవగాహనకు రాకుండా తలాక్‌ ఇవ్వడం సాధ్యం కాదని కోర్టుకు ఆల్ ఇండియా ముస్లిం ప‌ర్సన‌ల్ లా బోర్డు త‌ర‌పున ప్రముఖ న్యాయ‌వాది కపిల్ సిబ‌ల్ మాట్లాడారు. ట్రిపుల్ త‌లాక్ విశ్వాసానికి సంబంధించిన అంశ‌మ‌ని అందుకే అది న్యాయ‌ప‌రిధిలోకి రాదన్నారు. పార్లమెంట్ చ‌ట్టాలు చేయ‌వ‌చ్చు కానీ, కోర్టులు వాటిలో జోక్యం చేసుకోలేవ‌న్నారు.

 

 

 

21:34 - May 11, 2017

హైదరాబాద్ : రైల్వే ప్రాజెక్టుల అమల్లో జరుగుతున్న జాప్యంపై తెలంగాణ ఎంపీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పథకాల అమలుపై చర్చించేందుకు దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ వినోద్‌కుమార్‌ యాదవ్‌ తెలంగాణ ఎంపీలతో సమావేశం నిర్వహించారు. కొత్త మార్గాల నిర్మాణం, కొత్త ప్రాజెక్టుల సర్వేలపై జరుగుతున్న జాప్యంపై ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి సమావేశాలు కేవలం మొక్కుబడి తంతుగా జరుగుతున్నాయని మండిపడ్డారు. రైల్వే లైన్లపై రోడ్డు ఓవర్‌ బ్రిడ్జిల నిర్మాణానికి ఇచ్చిన ప్రతిపాదలను అండ్‌బ్రిడ్జిగా మార్పు చేస్తున్న అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

21:30 - May 11, 2017

విజయనగరం : రాష్ట్రపతి ఎన్నికలలో బిజెపికి వైసిపి మద్దతు ప్రకటించడాన్ని ఆత్మహత్య చేసుకోవడంగా అభివర్ణించారు ఏపిసిపి చీఫ్ రఘువీరారెడ్డి. 2014 ఎన్నికలలో టిడిపి, బిజెపిలు జతకట్టడాన్ని మతతత్వ పార్టీల కలయికగా విమర్శించిన జగన్ తాజాగా మోడీలో ఏ మార్పు చూసి మద్దతు ఇస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. విజయనగరంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో రఘువీరారెడ్డి పాల్గొన్నారు.

21:28 - May 11, 2017

హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ సకల సదుపాయాలతో కొత్త జిల్లాల కలెక్టరేట్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. నూతనంగా నిర్మించనున్న కలెక్టరేట్ల డిజైన్లను తుమ్మల ఆవిష్కరించారు. పాత కొత్త కలిపి 26 జిల్లాలకు వెయ్యి కోట్ల బడ్జెట్ అంచనా వేసామని.. వచ్చే నెలలో టెండర్లు ఖరారు చేయడంతో పాటు.. ఏడాదిలోపు నిర్మాణాలు పూర్తయ్యేలాగ చర్యలు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. మరోవైపు జిల్లా పోలీస్ ఆఫీసర్స్ హెడ్ క్వార్టర్స్ నిర్మాణం చేయాలనే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తుమ్మల తెలిపారు.

21:25 - May 11, 2017

వాషింగ్టన్ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమెరికా పర్యటన ముగిసింది. ఏడు రోజుల టూర్‌లో 15 నగరాలను సందర్శించారు. ఏడువేల కిలో మీటర్లకు పైగా ప్రయాణించారు. ముప్పైకి పైగా సమావేశాల్లో పాల్గొన్నారు. తొంబైకి పైగా కంపెనీల ప్రముఖులు, ప్రతినిధులను కలుసుకున్నారు. అమెరికాకు చెందిన పలు కంపెనీలు ఏపీలో యూనిట్లను పెట్టడానికి అంగీకరించాయని చంద్రబాబు ట్వీట్‌ చేశారు. వ్యవసాయం, విద్య, ఫింటెక్‌, హార్డ్‌వేర్‌, ఐటీ, ఇంటర్నెట్‌, ఆరోగ్యం, ఆటోమేషన్‌ రంగాలకు చెందిన పరిశ్రమలు ఏపీకి రావడానికి అంగీకరించాయని పేర్కొన్నారు. దీని వలన 12,500 పై చిలుకు ఉద్యోగాలు లభిస్తాయని చంద్రబాబు తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

21:21 - May 11, 2017

హైదరాబాద్ : .గ్యాంగ్‌స్టర్ నయీం కేసు మరో కొత్త మలుపు తిరిగింది...ఈ కేసులో ఐదుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేస్తూ తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ ఆదేశాలు జారీ చేశారు...సస్పెండ్ అయిన వారిలో సీఐడీ అదనపు ఎస్పీ మద్దిపాటి శ్రీనివాసరావు, మీర్‌చౌక్ ఏసీపీ మలినేని శ్రీనివాస్‌, సీసీఎస్ ఏసీపీ చింతమనేని శ్రీనివాస్, కొత్తగూడెం సీఐ రాజగోపాల్, సంగారెడ్డి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ మస్తాన్‌లను సస్పెండ్ చేశారు...వీరిలో మద్దిపాటి శ్రీనివాస్ పేరు చాలా సందర్భాల్లో బహిరంగంగానే వినిపించింది...ఇక మిగతా ఆఫీసర్లు కూడా నయీంతో లబ్దీ పొందారన్న ఆరోపణలున్నాయి..ఇప్పటికే ఓ కేసులో వీరందరిపై ఆరోపణలు రాగా..చార్జిషీట్‌ దాఖలు చేసే ముందే వీరిపై విచారణ జరిపారు...పూర్తిగా నయీంతో తత్సంబంధాలు కొనసాగించారన్న విషయం తేలిపోవడంతో చర్యలు తీసుకున్నారు.

మరెందరో పోలీసు అధికారులు
గ్యాంగ్‌స్టర్‌ నయీంతో అంటకాగినట్లు వచ్చిన అరోపణల్లో మరెందరో పోలీసు అధికారులున్నారు... మొత్తం 25 మంది మీద శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నారు...ఇందులో తాజాగా ఐదుగురిని సస్పెండ్ చేయగా, మరో నలుగురిపై మౌఖిక విచారణ జరగనుంది...ఇందులో మహబూబ్‌నగర్‌ డీటీసీ సాయిమనోహర్‌...ఇల్లందు DSP ప్రకాశ్‌రావు, జెన్‌కో DSP వెంకటనర్సయ్య,..గద్వాల ఇన్‌స్పెక్టర్‌ వెంకటయ్యల పై విచారణకు డీజీపీ శర్మ ఆదేశించారు...మరో 16 మంది పోలీసు అధికారులపై కూడా స్వల్ప చర్యలు తీసుకోనున్నారు...వీరిలో వీరిలో అడిషనల్‌ ఎస్పీ చంద్రశేఖర్‌,..సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న,..మలక్‌పేట ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటరెడ్డి,..హయత్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ నరేందర్‌గౌడ్‌లపై చర్యలు తీసుకోనున్నారు...చాలా కాలం తర్వాత నయీం కేసులో వెలుగులోకి వస్తూనే పోలీసులపై చర్యలు తీసుకోవడం ఒక్కసారి డిపార్ట్‌మెంట్లో చర్చనీయాంశంగా మారింది.

21:17 - May 11, 2017

ఖమ్మం : ఆరుగాలం కష్టించి పంట పండించిన రైతుల చేతులకు బేడీలు పడ్డాయి.... దోపిడీ దొంగల్లా.. కాదు కాదు.. అంతకన్నా ఎక్కువగా.. పొరుగుదేశపు ఉగ్రవాదుల్లా సంకెళ్లతో బంధించారు. ఈ మానవహక్కుల ఉల్లంఘన.. ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ఇటీవల ఖమ్మం మిర్చిమార్కెట్‌యార్డుపై దాడి ఘటనలో కొందరు రైతులను జైలుకు పంపిన పోలీసులు.. వారిని కోర్టుకు హాజరు పరిచే సమయంలో.. ఇలా చేతులకు బేడీలు వేసి తీసుకురావడం తీవ్ర విమర్శలకు ఆరుగాలం కష్టపడ్డ మిర్చి రైతులు.. రెండున్నర వేల రూపాయలకే క్వింటాలు మిర్చిని కొంటామన్న వ్యాపారుల మాటలతో కొయ్యబారి.. ఉద్రేకంతో తిరగబడ్డారు. పెట్టుబడిలో సగమైనా తిరిగిరాక.. చేసిన అప్పులుతీర్చే పరిస్థితి కనిపించక, ఆవేశంలో.. వందలాదిమంది రైతులు ఖమ్మం మార్కెట్‌ యార్డు కార్యాలయంపై దాడి చేశారు. రైతుల ఆగ్రహానికి వెనకున్న వేదనను అర్థం చేసుకోలేని సర్కారు.. వారిని ఆదుకోవడం మాట అటుంచి పదిమంది రైతులను జైలు పాల్జేసింది. ప్రభుత్వమే రైతుల పట్ల ఇంత కక్షసాధింపుతో వ్యవహరిస్తే.. తామేమీ తక్కువ తినలేదన్నట్లుగా వ్యవహరించారు పోలీసులు. రైతులకు బేడీలు వేసి మరీ కోర్టు వాయిదాకు తీసుకు వచ్చారు. మద్దతు ధర కావాలంటూ ప్రశ్నించినందుకు ఇలా టెర్రరిస్టులకు వేసినట్లు బేడీలు వేస్తారా అంటూ ప్రజాసంఘాలు, మానవహక్కుల నేతలు మండిపడుతున్నారు..రైతులకు బేడీలుచూసిన వారి కుటుంబసభ్యులూ తీవ్ర ఆవేదన చెందారు..

ప్రతిపక్షాలూ తీవ్రంగా మండిపడ్డాయి
రైతులకు బేడీలు వేసి తీసుకొచ్చిన ఘటనపై ప్రతిపక్షాలూ తీవ్రంగా మండిపడ్డాయి. ఇదేం పద్దతంటూ సర్కారును నిలదీశాయి.. రైతులపై పెట్టిన కేసుల్ని వెంటనే ఉపసంహరించుకోవాలంటూ విపక్షాలు డిమాండ్‌ చేశాయి. షబ్బీర్‌ ఆలీ హోంమంత్రి, డీజీపీలతో మాట్లాడి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.రైతులకు సంకెళ్లువేయడాన్ని సీపీఎం ఖండించింది.. పోలీసుల తీరును నిరసిస్తూ ఖమ్మం బైపాస్‌ రోడ్డులో సీపీఎం, అనుబంధ రైతు సంఘాల నేతలు, సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు.. బోనకల్‌ మండలంలో వెయ్యిమంది రైతులు పాదయాత్రచేసిన నిరసన తెలిపారు.. మండలకేంద్రం దగ్గర ధర్నా చేపట్టారు..రైతులకు సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకువచ్చిన ఘటనపై ఖమ్మం నగర పోలీస్‌ కమిషనర్‌ ఇక్బాల్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ఘటనకు బాధ్యులైన ఇద్దరు పోలీసుల్ని సస్పెండ్ చేశారు..

పంటకు గిట్టుబాటు ధర
మరోవైపు, పంటకు గిట్టుబాటు ధర రాక అవస్థలు పడుతున్న రైతులను ప్రభుత్వమే జైలు పాల్జేయడంతో.. కొందరు మానవత్వమున్న న్యాయవాదులు రైతులకు అండగా నిలిచారు. దాదాపు 66మంది న్యాయవాదులు అన్నదాతల పక్షాన వాదించారు.. వీరి వాదనల నేపథ్యంలో న్యాయస్థానం... 10మంది రైతులకు గురువారం బెయిల్‌ మంజూరుచేసింది.. ఈ నెల 8న ఒక కేసులో బెయిల్‌ మంజూరుచేసిన న్యాయస్థానం.. ఇవాళ మిగిలిన మరో రెండు కేసుల్లోనూ బెయిల్‌ ఇస్తున్నట్టు తెలిపింది.. మద్దతు ధర, రైతుల అరెస్టులతో ఇరుకునపడ్డ సర్కారుకు రైతులకు బేడీల ఘటన అప్రతిష్ట తెచ్చిపెట్టింది.. రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. సర్కారు ఈ వివాదానికి ఎలాంటి ముగింపు పలుకుతుందో వేచి చూడాలి.

 

నయీమ్ కేసులో సస్పెండైన పోలీసు అధికారులు

హైదరాబాద్ : నయీమ్ కేసులో సీఐడీ అడిషనల్ ఎస్పీ మద్దిపాటి శ్రీనివాసరావు, మీర్ చైక్ ఏసీపీ శ్రీనివాసరావు, సీసీఎస్ ఏసీపీ చింతమనేని శ్రీనివాస్, కొత్తగూడెం ఇన్ స్పెక్టర్ రాంగోపాల్, సంగారెడ్డి ట్రాఫిక్ ఎస్ఐ మస్తాన్ డీజీపీ సస్పెండ్ చేసింది. మరో నలుగురు అధికారులపై విచారణకు డీజీపీ ఆదేశించారు. వారిలో మహబూబునగర్ డీటీసీ సాయిమనోహర్, ఇల్లందు డీఎస్పీ ప్రకాశ్ రావు, జెన్ కో డీఎస్పీ వెంకటనర్సయ్య, గద్వాల ఇన్ స్పెక్టర్ వెంకటయ్య ఉన్నారు.

 

రాజమండ్రిలో ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్వాకం

తూర్పు గోదావరి : జిల్లాలోని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది వీరలక్ష్మి, వరలక్ష్మి అనే మహిళలకు ఒకేసారి కాన్పు చేశారు. కానీ శిశువులను తారుమారయ్యారని ఇద్దరు బాలింతల ఆరోపిస్తున్నారు. మగపిల్లడి కోసం ఇద్దరూ పట్టుబగడుతుండంతో వివాదం రాజుకుంది. దీని పై డీఎన్ఏ పరీక్ష ద్వారా నిర్ణయిస్తామని డాక్టర్లు తెలిపారు.

 

20:21 - May 11, 2017

ఆలూ లేదు చూలూ లేదు అన్నట్టుంటు ది వైసీపీ అధినేత తీరు. ఓ నోటిఫికేషన్ లేదు.. ఓ ప్రకటనా లేదు.. ఆ మాటకొస్తే అసలు మద్ధతే అవసరం లేదు. వైసీపీ సపోర్ట్ లేకపోతే బీజెపీకి వచ్చే నష్టమూ లేదు. కానీ, మేం రాష్ట్రపతి ఎన్నికకు బీజెపీకి సపోర్ట్ చేస్తాం అని ప్రకటించేశారు. మరోపక్క ఆ ఒక్క అంశం తప్ప అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తాం అంటూ, బీజెపీకి తామెంత వీరవిధేయులమో స్పష్టంగా తేల్చి చెప్పేశారు. ఇప్పటికే అధికార టీడీపీ బీజెపీతో అంటకాగుతుంటే , విపక్షం కూడా అదే పరిస్థితిలోకి వెళ్లటం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్న అంశం. ఇవన్నీ రాబోయే ఎన్నికల కోసం, తమ తమ ప్రయోజనాలకోసం వేసే ఎత్తులు తప్ప మరొకటి కావా..? పూర్తి వివరాలకు వీడియో చూడండి.

20:18 - May 11, 2017

ఈ సుక్కురారం నాడు ఎంసెట్ పరీక్షలు రాస్తందుకు తయ్యారైతున్న పోరగాళ్లు బొట్టగాళ్లు అందరికి ముందస్తు శుభాకాంక్షలు.. పవన్ కళ్యాణ్ సారు నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ మీదనే అంటున్నడు.. అమలాపురం ఎంపీ రవీంద్రబాబు సారుకు మన తెలంగాణ ముఖ్యమంత్రి సారు క్యాంపు ఆఫీసు గురించి పూరాగ తెల్వనట్టుంది.. తెలంగాణల రైతులంటె.. సర్కారుకు మరి ఎట్ల గనిపిస్తున్నరో ఏమో.. ఉగ్రవాదులు, సంఘవిద్రోహ శక్తుల కంటె హీనంగ గనవడ్తున్నట్టున్నరు..ఒక్క రాష్ట్రానికి ఒక్కడే ముఖ్యమంత్రి ఉంటడు గని ఇద్దరు ముఖ్యమంత్రులు ఉంటరా..?కాలానికి ఉల్టా నడ్సే మన్షి రాంగోపాల్ వర్మ.. ఆ మన్షి.. మాటలే ఉల్టా ఉంటయనుకున్నంగని.. చొప్పదండి ఎమ్మెల్యే బొడిగ శోభక్క ఉన్నదిగదా..? ఆ ఎక్కకు బాడీ గార్డు ఉండడా..? అదే గన్ మెన్.. అగో గన్ మెన్ లవ్వుల వడ్డడట..పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

20:00 - May 11, 2017

ఖమ్మంలో పోలీసులు బెడీ వేయడంపై టెన్ టీవీలో చర్చ కార్యక్రమం నిర్వహించింది. రైతులకు బెడీలు వేయడం అత్యంత అమానుష చర్చ అని సీపీఎం నేత మల్లారెడ్డి, కాంగ్రెస్ నేత ఇందిరా శోభన్ అన్నారు. టీఆర్ఎస్ నేత గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ చట్ట తన పని తను చేసుకుపోతోంది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

దుండిగల్ లో దారుణం

హైదరాబాద్ : దుండిగల్ లో దారుణం జగిరింది. నీన్న రాత్రి ఓ యువతిపై కారులో అత్యాచారం చేశారు. యువతి ఇంటర్వ్యూ కోసం ఖమ్మం నుంచి వచ్చింది. యువతి స్నేహితుడిపై దాడి చేసి దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. సూరారం నుంచి బౌరసేటకు వెళ్లే దారిలో ఘటన జరిగింది. యువతి ఫిర్యాదుతో ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. కాసేపట్లో వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

జైలు నుంచి విడుదలైన మిర్చి రైతులు

ఖమ్మం : జిల్లా జైలు నుంచి10మంది మిర్చి రైతులు విడుదలయ్యారు. వీరికి జిల్లా కోర్టు షరతులతోర కూడిన బెయిల్ మంజూరు చేశారు. గత నెల 28 తేదీన మార్కెట్ పై దాడి కేసులో రైతులను అరెస్ట్ చేశారు. ఇది ఇలా ఉంటే రైతులను బెడీలతో కోర్టుకు తీసుకురావడం తీవ్ర దూమరాన్ని లేపింది. దీనిపై వాపక్షాలు, ప్రజాసంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఖమ్మం సీపీ బాధ్యులపై చర్యలు తీసుకున్నారు. ఎస్ఐలు వెంకటేశ్వరరావు, పూర్ణానాయక్ లను సీపీ సస్పెండ్ చేశారు.

నయీమ్ కేసులో పోలీసు అధికారుల సస్పెన్షన్

హైదరాబాద్ : నయీమ్ కేసులో పోలీసు అధికారులను డీజీపీ అనూరాగ్ శర్మ సస్పెండ్ చేశారు. ఐదుగురిని సస్పెండ్ చేస్తునట్టు ఆదేశాలు కూడా జారీ చేశారు. మరో 16 మందిపై చర్యలకు ఆదేశించారు. నయీమ్ తో కలిసి సెలిల్మెంట్లకు పాల్పడ్డారంటూ పలువురు పోలీసులపై అభియోగాలు ఉన్న విషయం తెలిసిందే. ఆధారలు సేకరించిన తర్వాతే సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది.

 

19:50 - May 11, 2017

హైదరాబాద్ : దుండిగల్ లో దారుణం జగిరింది. నీన్న రాత్రి ఓ యువతిపై కారులో అత్యాచారం చేశారు. యువతి ఇంటర్వ్యూ కోసం ఖమ్మం నుంచి వచ్చింది. యువతి స్నేహితుడిపై దాడి చేసి దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. సూరారం నుంచి బౌరసేటకు వెళ్లే దారిలో ఘటన జరిగింది. యువతి ఫిర్యాదుతో ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. కాసేపట్లో వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

19:47 - May 11, 2017
19:46 - May 11, 2017

ప్రకాశం : 2014 ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా నిలిచింది. జిల్లాలో ఉన్న 12 శాసన సభ సీట్లలో ఆరు వైసిపి కైవసం చేసుకోగా.. ఐదు టిడిపి, ఒక ఇండిపెండెంట్ గెలుచుకున్నారు. జిల్లాలో పార్టీని జగన్ తన సమీప బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డికి అప్పగించారు. ఇప్పుడు ఆయనపైనే సొంత పార్టీనేతలు గుర్రుగా ఉన్నారు. ఒంగోలు శాసనసభ ఎన్నికల్లో భంగపడినప్పటి నుంచి ఆయన నియోజకవర్గంవైపు కన్నెత్తి చూడటం లేదని, జిల్లాలో అసలు పర్యటించి ప్రజల బాగోగులు తెలుసుకోవట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ఇక్కడ రాజకీయ పరిస్థితుల్ని టిడిపికి అనువుగా మారుస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. వైసిపి నుంచి గెలిచిన పోతల రామారావు, గొట్టిపాటి రవికుమార్, పాలపర్తి డేవిడ్ రాజు, ముత్తుముల అశోక్ రెడ్డిలు టిడిపిలోకి చేరడం పెద్ద దుమారమే రేపింది. వారిని బాలినేని దగ్గర్నుండి సాగనంపారనే ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని పార్టీ ఫిరాయింపుల వేళ నాటి వైసిపి ఎమ్మెల్యే పోతల రామారావు బహిరంగంగా చెప్పారు కూడా. ఇక అప్పటి వైసిపి జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలాజీ, ప్రస్తుత టిడిపి నేత జూపూడి ప్రభాకరరావులు పార్టీని వీడింది బాలినేని రాజకీయాలు తట్టుకోలేకేనని బహిరంగంగా ప్రకటించారు.

బాలినేని వల్లే వెనకడుగు
ఇక చాలామంది హేమాహేమీలు పార్టీలో చేరడానికి సంసిద్ధంగా ఉన్నా.. బాలినేని వల్లే వెనకడుగు వేస్తున్నారని తెలుస్తోంది. మాజీమంత్రి మానుగుంట మహీధర రెడ్డి, ముక్కు కాసిరెడ్డి, ఉగ్ర నరసింహారెడ్డితోపాటు మరికొంతమంది నేతలతో వైసిపి అధిష్టానంతో చర్చలు జరిపినా బాలినేని నాయకత్వం పట్ల వారు సుముఖంగా లేరనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక కార్యకర్తల పరిస్థితి ఇదే తీరుగా ఉంది. బాలినేని చేష్టలకు వారు తలలు పట్టుకుంటున్నారు. మళ్లీ ఎన్నికలకు పార్టీలన్నీ సమాయత్తమవుతున్న వేళ జిల్లా వైసిపిలో చలనం కనిపించడం లేదు. పార్టీకి బలమైన కేడర్ ఉన్నా నాయకత్వ లోపంతో పార్టీ ప్రతిష్ట మసకబారుతోందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే వైసిపి అధినేత జగన్ కు బాలినేనిపై పిర్యాదుల మీద పిర్యాదులు అందటంతో జగన్ ఆయనను కొన్ని బాధ్యతల నుంచి తప్పిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. లేదంటే జిల్లాలో వైసిపికి మనుగడ ఉండదనేది సొంత పార్టీ నేతల వాదన.

19:44 - May 11, 2017

శ్రీకాకుళం : జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఒకరు రాష్ట్ర రవాణా శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు.. మరొకరు రాష్ట్ర విద్యుత్‌ శాఖా మంత్రి కిమిడి కళా వెంకటరావు . అయితే ఈ ఇద్దరు జిల్లాలోనే ఉంటే ఆనందించాల్సిన ప్రజలు... హడలిపోతున్నారు. జిల్లాకు వచ్చిన వీరు సుదూర ప్రాంతాల్లో బస చేస్తారు. దీంతో వీరిని దర్శించుకోవడమే ప్రజలకు ,అధికారులకు గగనంగా మారుతుంది.

పూర్తిస్థాయిలో అందుబాటులో లేరు
ఇద్దరు మంత్రులు ఇంత వరకూ ఎప్పుడు జిల్లా కేంద్రంలో పూర్తిస్థాయిలో అందుబాటులో లేరు. అచ్చెన్నాయుడు క్యాంపు కార్యాలయం పేరుతో ఎంపీ రామ్మోహన్ నాయుడు నివాసంలో ఉన్నా... నిమ్మాడ నుంచే రాకపోకలు సాగిస్తుంటారు. ఇక కళా వెంకటరావు సొంత నియోజికవర్గం ఎచ్చెర్ల అయినప్పటికీ రాజాంలోని సొంతింటి నుంచే రాకపోకలు సాగిస్తుంటారు. నిమ్మాడ, రాజాం ప్రాంతాలు జిల్లా కేంద్రానికి డెబ్బై కిలోమీటర్లు దూరంలో ఉన్నాయి. దీంతో పనుల నిమిత్తం వీరిని కలవాలంటే ఒక పూట ప్రయాణం తప్పనిసరి అవుతుంది. మంత్రులు సొంతింటి నుంచే సమీక్షలు జరిపిస్తుండడంతో ఆయా శాఖల ఉన్నతాధికారులు మంత్రులు నివాసాల చుట్టూ ప్రదక్షణలు చేయడం తప్పడం లేదు. దీంతో వీరి వ్యవహార శైలిపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందరికీ అందుబాటులో ఉండాలని కోరుతున్నారు.

అధికారులు, ప్రజలు, పార్టీ నాయకుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మంత్రులు జిల్లా కేంద్రానికి మకాం మారిస్తే బాగుంటుందని జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు.

 

19:43 - May 11, 2017

గుంటూరు : ఏపీ అసెంబ్లీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు ఎట్టకేలకు రిలీవ్ అయ్యారు. రాష్ట్రం విడిపోయాక కామన్ అసెంబ్లీ నుంచి ఏపీకి వచ్చిన 90 మంది తెలంగాణ ఉద్యోగులు కొంతకాలంగా తమను రిలీవ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వీరిలో ముందుగా 53 మందిని రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 30 ఏళ్లుగా కామన్ అసెంబ్లీలో .. తరువాత ఏపీ అసెంబ్లీలో కలిసి పనిచేసిన ఆంధ్రా, తెలంగాణ ఉద్యోగులు మరోసారి విభజన అనంతరం విడిపోతున్నందుకు కన్నీరు పెట్టుకున్నారు. తాము తెలంగాణకు వెళ్లడానికి కృషి చేసిన స్పీకర్ కోడెలకు ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు.

19:41 - May 11, 2017

హైదరాబాద్ : హ్యాపీడేస్ లో టైసన్ అనే పాత్రలోమ కనిపించిన రాహుల్ ప్రస్తుతం వెంకటాపురం చిత్రంతో హీరోగా రాబోతున్నాడు. వేణు మడికంఠి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాకి అచ్చు సంగీతం అందించారు. ఇక మహిమ మక్వానా వెంకటాపురం చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు.

19:25 - May 11, 2017

ఖమ్మం : ఖమ్మం జైలు నుంచి10మంది మిర్చి రైతులు విడుదలయ్యారు. వీరికి జిల్లా కోర్టు షరతులతోర కూడిన బెయిల్ మంజూరు చేశారు. గత నెల 28 తేదీన మార్కెట్ పై దాడి కేసులో రైతులను అరెస్ట్ చేశారు. ఇది ఇలా ఉంటే రైతులను బెడీలతో కోర్టుకు తీసుకురావడం తీవ్ర దూమరాన్ని లేపింది. దీనిపై వాపక్షాలు, ప్రజాసంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఖమ్మం సీపీ బాధ్యులపై చర్యలు తీసుకున్నారు. ఎస్ఐలు వెంకటేశ్వరరావు, పూర్ణానాయక్ లను సీపీ సస్పెండ్ చేశారు.

19:16 - May 11, 2017

హైదరాబాద్ : నయీమ్ కేసులో పోలీసు అధికారులను డీజీపీ అనూరాగ్ శర్మ సస్పెండ్ చేశారు. ఐదుగురిని సస్పెండ్ చేస్తునట్టు ఆదేశాలు కూడా జారీ చేశారు. మరో 16 మందిపై చర్యలకు ఆదేశించారు. నయీమ్ తో కలిసి సెలిల్మెంట్లకు పాల్పడ్డారంటూ పలువురు పోలీసులపై అభియోగాలు ఉన్న విషయం తెలిసిందే. ఆధారలు సేకరించిన తర్వాతే సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది.

19:14 - May 11, 2017

కరీంనగర్ : వైద్యుల నిర్లక్ష్యంవల్లే తల్లీబిడ్డ చనిపోయారంటూ మృతురాలి బంధువులు మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిముందు ఆందోళనకు దిగారు.. ప్రసవంకోసం బొమ్మనపల్లికి చెందిన బట్టు పద్మ మంచిర్యాల ఆస్పత్రిలో చేరింది.. బుదవారం పద్మ ఆడపిల్లకు జన్మనిచ్చింది. డెలివరీ తర్వాత తల్లీబిడ్డల ఆరోగ్యం క్షీణించడంతో కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. వెంటనే ఇద్దరినీ అక్కడికి తరలించినా వారి ప్రాణాలు దక్కలేదు.. తల్లీబిడ్డలు ప్రాణాలు కోల్పోవడంతో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. తమకు న్యాయం చేయాలంటూ ఆస్పత్రి ముందు నిరసన చేపట్టారు.

19:01 - May 11, 2017

హైదరాబాద్ : ధర్నా చౌక్ ను ఇందిరాపార్క్ నుంచి తరలించడాన్ని నిరసిస్తూ ఈనెల 15 న ' చలో ధర్నా చౌక్' కార్యక్రమానికి పిలుపునిచ్చారు టిజెఎసి మరియు అఖిలపక్ష నేతలు. ఈ కార్యక్రమానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ తో పాటు అఖిలపక్షం నేతలు డిజిపిని కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనిపై డిజిపి సానుకూలంగా స్పందించినట్లు కోదండరాం చెప్పారు. ఈ నిరసనలో భాగంగా రేపు ఉదయం 9 గంటలకు గన్ పార్క్ వద్ద మౌనదీక్ష చేపడుతున్నట్లు కోదండరామ్ తెలిపారు.

19:00 - May 11, 2017

హైదరాబాద్ : ఐటీ ఉద్యోగులు ఉద్యమం బాట పట్టారు. ఉద్వాసనకు గురైన కాగ్నిజెంట్‌ టెక్నాలజీస్‌ ఎంప్లాయీస్‌ కార్మిక శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. తమను అకారణంగా తొలించారని ఆరోపిస్తూ తెలంగాణ ఐటీ ఉద్యోగుల అసోసియేషన్‌ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిగింది. కార్మిక శాఖ జాయింట్‌ కమిషనర్‌ సమక్షంలో జరిగిన విచారణకు కాగ్నిజెంట్‌ టెక్నాలజీస్‌లో ఉద్వాసనకు గురైన ఉద్యోగులతో పాటు కంపెనీ యాజమాన్య ప్రతినిధులతో పాటు కార్మిక, ఉద్యోగ సంఘాల నేతలు హాజరయ్యారు. ఎవరి వాదనలు వారు వినిపించారు. పనితీరు మదింపు ఆధారంగా ఉద్యోగులు తొలగింపు ఏటా జరిగే సాధారణ ప్రక్రియేనని యాజమాన్యం ప్రతినిధులు కార్మిక శాఖ అధికారుల దృష్టికి తెచ్చారు. అయితే ఉద్యోగులు మాత్రం ఈ వాదాన్ని తోసిపుచ్చారు. మరోవైపు ఐటీ రంగ సంక్షోభంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కార్మిక సంఘాల నేతలు కోరుతున్నారు.

18:59 - May 11, 2017

కామారెడ్డి : మున్సిపల్‌ కమిషనర్‌ పోస్టు గత రెండు నెలల నుంచి ఖాళీగా ఉంది. అంతే కాకుండా కార్యాలయ పాలన చేసే మేనేజర్ ఇంజనీరింగ్‌లో, డిఈ, ఏఈ సీనియర్‌ అసిస్టెంట్లు, అలాగే చెత్త సమస్యలకు శానిటేషన్‌ విభాగంలో ఇద్దరు శానిటరీ ఇన్స్పెక్టర్లు ఉండాల్సి ఉండగా.. ఒక్కరు కూడా లేరు. దీంతో శానిటరీ జవాన్‌తో నెట్టుకొస్తున్నారు. అవినీతి ఆరోపణలు ఎదురుకుంటున్న శానిటరీ ఇన్స్పెక్టరు వెంకటేశ్వర్లు ఇక్కడి నుంచి డిప్యుటేషన్‌పై వెళ్లారు. ఒక హెల్త్‌ అసిస్టెంట్‌ పోస్టు ఖాళీగా ఉంది. టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో ఇద్దరు టిపివోలు ఉండాల్సి ఉండగా ఒక్కరే ఉన్నారు. టీపీఎస్‌లు, టీపీవోలు నలుగురు చొప్పున ఉండాల్సి ఉండగా ఇద్దరు మాత్రమే ఉన్నారు. వాటర్‌ వర్క్స్‌లో ఎఫ్‌.బి.ఒ పోస్టు ఖాళీగా ఉండటంతో.. కాంట్రాక్ట్ పద్ధతిలో ఒకరిని తీసుకున్నారు. రికార్డు అసిస్టెంట్‌లు లేరు. ఇలా ప్రధాన శాఖలన్నింటిలో పోస్టులు ఖాళీగా ఉండటంతో పట్టణంలో అభివృద్ధి పనులు పెండింగ్‌లో ఉన్నాయి.

శానిటేషన్‌ విభాగంలో అధికారులు లేరు...
శానిటేషన్‌ విభాగంలో అధికారులు లేక.. పట్టణంలో చెత్త సమస్య తీవ్రంగా ఉంది. కార్మికులను అదుపులో పెట్టేవారు లేక కార్మికులు విధులకు హాజరు కావడం లేదు. అధికారులు లేకపోవడంతో ఉన్నవారిపై అదనపు పని భారం పడుతోంది. అక్రమ కట్టడాలు పెరిగిపోతున్నాయి. అనుమతి ఫైల్లు చాలా వరకు పెండింగ్‌లో ఉంటున్నాయి. మున్సిపల్‌ కొత్త భవనం పనులు పూర్తి కావటం లేదు. మున్సిపల్ కమిషనర్‌గా ఉన్న విజయలక్ష్మి ఇక్కడ నుంచి వేటు పడి బదిలీపై వెళ్లింది. దీంతో ఇంచార్జ్‌ కమిషనర్‌గా ఆర్డీవో శ్రీను, కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే రెవెన్యూ శాఖలో విధులు నిర్వహిస్తుండటంతో ఆర్డీవో మున్సిపల్‌ పాలనపై దృష్టి సారించలేకపోతున్నారు. మేనేజర్ లేకపోవడంతో కార్యాలయంలో ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదు. వారు ఆడింది ఆట, పాడింది పాటగా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. గాడి తప్పుతున్న మున్సిపల్ పాలనపై దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.

18:57 - May 11, 2017

నెల్లూరు : జిల్లాలో రాజకీయ విమర్శలు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య.. శ్రీహరి కోటలో విడిచిపెట్టే రాకెట్లను తలపిస్తున్నాయి. ఆనం వివేకానందరెడ్డి ఏ పార్టీలో ఉన్నా.. ప్రత్యర్థులపై తన వ్యంగ్యాస్త్రాలతో, కవ్వింపు మాటలతో తనదైన స్టైల్లో విరుచుకుపడతాడు. ఎదుటివాళ్లే మనకెందుకులే అనుకునేలా చేస్తాడు. అయితే ఈ సారి వివేక్‌ పాచిక పారలేదు. ఆ మధ్య వివేక్‌ పార్టీ మారుతున్నట్టు అటు సోషల్ మీడియాలో, ఇటు జిల్లాలోనూ విస్తృతంగా ప్రచారం జరిగింది. ఆనం వివేక్‌కు టీడీపీలో తగిన ప్రాధాన్యం లభించడం లేదని.. దీంతో వివేక్‌ తనకు సముచిత స్థానం ఇవ్వకపోతే పార్టీ మారడమే ఉత్తమంగా భావించినట్టు వార్తలు వినిపించాయి. దీంతో తనపై వస్తున్న వార్తలను కొట్టి పారేస్తూ.. సీఎం ఎదుట వివరణ ఇచ్చేందుకు వచ్చి.. వివేక్‌ వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డిపై ఓ సినిమా కథనాన్ని ప్రస్తావిస్తూ చేసిన విమర్శలతో గొడవ చెలరేగింది.

అసభ్య పదజాలంతో
తమ నేతను అసభ్య పదజాలంతో ఆనం వివేక్‌ విమర్శించడాన్ని.. నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులు తీవ్రంగా ఖండించారు. వివేక్‌ నీచమైన భాషను వాడుతున్నారని.. నీతిమాలిన విమర్శలకు పూనుకుంటున్నాడని ఆనం విజయకుమార్ రెడ్డి వివేక్‌పై మండిపడ్డారు. ఇటు స్థానిక నెల్లూరు సిటీ శాసన సభ్యులు అనిల్‌కుమార్‌ యాదవ్‌ మరో అడుగు ముందుకేసి.. వివేక్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. తమ నాయకుడిని విమర్శిస్తే ఊరుకోమని మండిపడ్డారు. వివేకానందరెడ్డి నీ భాషను మార్చుకోకపోతే నీ ఇంటి మీదకొచ్చి దొమ్మి చేయడానికైనా నేను సిద్దమంటూ బహిరంగంగా హెచ్చరించడంతో.. విషయం పెద్దదైంది. తన తండ్రి వివేక్‌ను విమర్శించడంతో.. నెల్లూరు 14వ డివిజన్ కార్పొరేటర్, వివేక్‌ తనయుడు ఆనం రంగ మయూర్‌.. అనిల్‌కుమార్‌ యాదవ్‌పై విరుచుకుపడ్డాడు. అవసరమైతే వివేక్‌ ఇంటిపై దొమ్మీ చేస్తానంటూ ఎమ్మెల్యే చేసిన ప్రకటనతో.. రంగ మయూర్‌ అనిల్‌కుమార్‌ యాదవ్‌పై మండిపడ్డారు. అనిల్‌యాదవ్‌ను మయూర్‌ విమర్శించడంతో.. వైసీపీ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌ ఫ్లోర్‌ లీడర్‌ రూప్‌ కుమార్‌ యాదవ్‌ ఆనం వివేకానందరెడ్డిని బిచ్చలదేవుడిగా పోలుస్తూ విమర్శించారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. మొత్తానికి నెల్లూరు రాజకీయాలు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

 

వైద్య విద్యాశాఖలో పోస్టులకు మంజూరు..

హైదరాబాద్ : వైద్య విద్యాశాఖలో 931 పోస్టులు మంజూరయ్యాయి. ఈ మేరకు గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

పవన్ తో గ్రూప్ 2 విద్యార్థుల భేటీ..

హైదరాబాద్ : జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో ఏపీ గ్రూప్ 2 అభ్యర్థులు భేటీ అయ్యారు. గ్రూప్ -2 వాయిదా పడినందుకు పవన్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఇంజినీరింగ్ కాలేజీల సమస్యలను వారు తెలియచేశారు. ప్రైవేటు కాలేజీలు తమల్ని దోచుకుంటున్నాయని పేర్కొన్నారు.

 

మీడియాతో పవన్ ఏం మాట్లాడారంటే...

హైదరాబాద్ : ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే జనసేన ఉద్ధేశ్యమని, ధర్నా చౌక్ ను తొలగించారనే అంశంపై తమ్మినేని వీరభద్రం తనను కలవడం జరిగిందన్నారు. శాంతియుతంగా జరిగే ధర్నాలను అడ్డుకోవడం సరికాదని, ఇందుకు జరుగుతున్న పోరాటంలో జనసేన పాల్గొంటుందని స్పష్టం చేశారు. మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించని ప్రభుత్వాలు వాళ్లను అరెస్టు చేయడం సరికాదని, తాను ప్రతి విషయం ఆచితూచి మాట్లాడుతానని స్పష్టం చేశారు. హిందీకి..ఉత్తర భారతానికి వ్యతిరేకం కాదని, దక్షిణాది వారిని సెకండ్ క్లాస్ సిటిజన్స్ గా చూడకూడదన్నదే తన ఉద్ధేశ్యమన్నారు.

బెయిల్ వచ్చిన రైతులు వీరే..

ఖమ్మం : మిర్చి యార్డు ధ్వంసం కేసులో అరెస్టయిన పది మంది రైతులకు బెయిల్ లభించింది. సత్తుకొండయ్య, ఇస్లావత్ బాబు, భూక్యా అశోక్, భూక్యా నరసింహరావు, భూక్యా శ్రీను, బానోతు సైదులు, తేజావత్ బావాసింగ్, బానోతు ఉపేందర్ తో పాటు మరో ఇద్దరు ఉన్నారు.

మెడికల్ సీట్ల ఫీజుపై మధ్యంతర ఉత్వర్వులు..

హైదరాబాద్ : పెరిగిన మెడికల్ సీట్ల ఫీజుపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఫీజుల్ని బ్యాంక్ గ్యారెంటీగా ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టులో పీజీ మెడికల్ విద్యార్థులు లంచ్ మోహన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

17:12 - May 11, 2017

గుంటూరు : ఏపీ రాజధాని అమరావతి.. తరచూ వివాదాల్లో నలుగుతోంది. రాజధాని ప్రాంతంలో, నిత్యం ఏదో కేసు నమోదవుతూనే ఉంది. సుప్రీం కోర్టులోను, జాతీయ హరిత ట్రైబ్యునల్‌ స్థాయిలోనూ రాజధాని నిర్మాణం వ్యవహారంపై ప్రతి రోజు వాయిదాలు నడుస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకూ సుమారుగా మూడు వేల మంది రైతులు ప్రభుత్వంపై కేసులు వేశారు. వీటిలో 16 వందల కేసులు నడుస్తూనే ఉన్నాయి. అమరావతి నిర్మాణానికి చేసిన భూ సేకరణే పెద్ద వివాదస్పదంగా మారింది. భూములు ఇవ్వలేమని కొందరు... తమ భూములకు సరైన ప్యాకేజీ లేదని మరికొందరు, అసలు సీఆర్డీఏ అనే వ్యవస్థ మీదే నమ్మం లేదంటూ మరొకరు ఇలా వందలమంది రైతులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. అలాగే లంక, అసైన్డ్‌ భూముల రైతులు ప్యాకేజీ కోసం పోరాటం చేస్తున్నారు. ఈ విషయంలో రాజకీయ నాయకులు, సామాజిక వేత్తలు రైతులకు మద్దతుగా నిలుస్తున్నారు.

రైతులకు సానుకూలంగా కూడా నిర్ణయాలు..
రాజధానిపై వేసిన కొన్ని కేసుల్లో రైతులకు సానుకూలంగా కూడా నిర్ణయాలు వచ్చాయి. భూ సేకరణపై పెనుమాక రైతులు హై కోర్ట్‌ను ఆశ్రయిస్తే.. వారికి అనుకూలంగా స్టే ఆర్డర్‌ వచ్చింది. అలాగే తమ భూములపై ఎలాంటి హక్కు లేకుండా స్విస్‌ ఛాలెంజ్‌ విధానంలో టెండర్‌ పిలవడంపై కోర్టును ఆశ్రయించిన లింగాయపాలెం రైతులకూ సానుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో చాలామంది రైతులు కోర్టుల ద్వారా పోరాటాలకు సిద్ధమవుతున్నారు. పచ్చని పంటలు పండే భూముల్లో రాజధాని నిర్మాణం సరికాదంటూ ... రాజధానికి వరద ముప్పు ఉందంటూ మరికొందరు జాతీయ హరిత ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. సారవంతమైన భూములను తీసుకోవద్దని... శ్రీమన్నారాయణ , మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావులు ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు . అయితే ఇన్ని కేసులు నడుస్తున్నా.. సీఆర్డీఏ అధికారులు కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ కేసుల విచారణ కోసం సీఆర్డీఏ భారీ మొత్తం ఖర్చు చేస్తోంది. 2015 నుంచి ఇప్పటి వరకు సుమారు 90 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు సమాచారం. అంతే కాదు ఒకసారి విచారణకు హాజరయ్యే న్యాయవాదికి పది లక్షలు వరకు డబ్బులు చెల్లిస్తున్నట్టు సమాచారం. అలాగే రాజధాని నిర్మాణానికి డిజైన్స్‌ కోసం మాకీ అసోసియేట్స్‌ సంస్థను సంప్రదించి.. చివరికి వారు ఇచ్చిన డిజైన్స్‌ను తిరస్కరించారు. దీంతో ఆ సంస్థ అధినేత పుమహికో కూడా ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో అమరావతి అద్భుతమంటూ పొగిడిన సంస్థలు కూడా ఇప్పుడు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

17:02 - May 11, 2017

'ప్రజా సంఘాలు కలవడం చరిత్రలో ఇదే ప్రథమం'..

ఢిల్లీ : సామాజిక న్యాయం కోసం అన్ని ప్రజా సంఘాలు కలవడం రాజకీయ చరిత్రలో ఇదే ప్రథమమని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. రిజర్వేషన్లకు మోడీ ప్రభుత్వం తూట్టు పొడుస్తోందని, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల కోసం సీపీఎం పోరాడుతోందన్నారు. దళిత విద్యార్థులకు రెండేళ్లుగా స్కాలర్ షిప్ లు నిలిచిపోవడం వల్ల చదువు మానేసే పరిస్థితి తలెత్తిందని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై దాడులు..పరువు హత్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. పాతనోట్లు ఎన్ని జమయ్యాయో మోడీ వద్ద సమాచారం లేదని ఏచూరి తెలిపారు.

'రైతులకు బేడీలు వేయడాన్ని ఖండిస్తున్నాం'..

హైదరాబాద్ : రైతులకు బేడీలు వేయడానికి ఖండిస్తున్నట్లు టిపిసిసి చీఫ్ ఉత్తమ్ పేర్కొన్నారు. ఆయన టెన్ టివితో మాట్లాడారు. ప్రభుత్వంపై రైతులు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని, కాంగ్రెస్ నేతలతో బీజేపీ బేరసారాలు జరపడం సిగ్గు చేటన్నారు. సీఎం అభ్యర్థి ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుందని, తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా జూన్ 1న సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సభకు రాహుల్ ని ఆహ్వానిస్తున్నట్లు, టీఆర్ఎస్ వైఫల్యాలను సభలో ఎండగడుతామన్నారు.

కేంద్ర నిధులు పక్కదారి - అనంత కుమార్..

మహబూబ్ నగర్ : కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని స్వయంగా కేంద్ర మంత్రి అనంతకుమార్ పేర్కొన్నారు. జిల్లాలో కేంద్ర మంత్రి పర్యటిస్తున్నారు. కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందివ్వడం లేదని, తెలంగాణకు రెండున్నర లక్షల ఇళ్లను కేంద్ర మంజూరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం 1400 ఇళ్లనే నిర్మించిందని తెలిపారు.

16:38 - May 11, 2017

నెంబర్ 2గా పేరొందిన దేవేందర్ గౌడ్ అమెరికాలో ఉన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనలో ఆయన్ను కలిశారు. కొన్ని రోజులు పార్టీ కార్యక్రమాల్లో కనిపించిన ఆయన చాలా అరుదుగా కనిపించడం మొదలు పెట్టారు. కొన్ని నెలలుగా ఆయనపై ఎలాంటి వార్తలు రాలేదు. తాజాగా ఆయన ఆయన ఎక్కడున్నారో తెలిసింది. అమెరికాలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు ఆయన్ను కలిశారు. కొన్ని రోజులుగా అక్కడ క్యాన్సర్ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అమెరికాలోని రాచెస్టర్ లోని మేయో క్లినిక్ లో ఆయనకు చికిత్స సాగుతున్నట్లు, అందుకే ఆయన్ను పరామర్శించడానికి బాబు వెళ్లినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హోం మంత్రిగా దేవేందర్ గౌడ్ పనిచేసిన సంగతి తెలిసిందే. అనంతరం 'నవ తెలంగాణ' పేరిట పార్టీ కూడా పెట్టి అనంతరం దానిని మూసివేసి 'చిరంజీవి' పెట్టిన ప్రజారాజ్యంలోకి వెళ్లిపోయారు. అక్కడ ఇమడలేక మళ్లీ సొంతగూటు (టిడిపి)లోకి వచ్చేశారు.

16:20 - May 11, 2017

ఖమ్మం : గత నెల 28తేదీన మిర్చియార్డులో ఘటనలో 10రైతులకు ఖమ్మం జిల్లా కోర్టు షరుతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పొందిన రైతులు ప్రతీ వారం కోర్టకు హాజరై సంతకం చేయాలి, ఖమ్మం దాటివెళ్లాకడాదని షరతులతో బెయిల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.14రోజుల జైలు జీవతం తర్వాత రైతులకు బెయిల్ రావడంతో వారి కుటుంబాల్లో ఆనందం నిడింది. కానీ దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఉగ్రవాదిల బేడీలు వేసి కోర్ట తీసురావడంపై తీవ్ర ఆవేదనకు లోనైయ్యారు. పోలీసులు ఈ రోజు ఉదయం రైతులకు బేడీలు వేసి తీసుకొచ్చారు. రైతులకు సంకెళ్లు వేయడంపై ప్రజాసంఘాలు, నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు బేడీలు వేయడాన్ని నిరసిస్తూ సీపీఐ నేతలు సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు. మద్దతు ధర అడిగితే సంకెళ్లు వేస్తారా అంటూ నేతలు మండిపాడుతున్నారు. ఖమ్మం కమిషనర్ ఇక్బాల్ రైతులకు బేడీలు వేయడంపై విచారణకు ఆదేశించారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

16:20 - May 11, 2017

సూపర్ స్టార్ 'రజనీకాంత్' మేనియా ఎంటో అందరికీ తెలిసిందే. ఆయన సినిమా వస్తుందంటే చాలు అభిమానుల సందోహం అంతా ఇంతా కాదు. ఆయన్ను ఒక దేవుడిలా భావిస్తుంటారు. అభిమానిస్తుంటారు..ఆరాధిస్తుంటారు..అక్కడున్న యువత 'రజనీ' రాజకీయాల్లోకి రావాలని..రాష్ట్రాన్ని ఏలాలని ఎన్నోసార్లు వత్తిడి కూడా తీసుకొచ్చారు. కానీ వీటిని సున్నితంగా 'రజనీ' తోసిపుచ్చారు. జయ మరణం అనంతరం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభంతో ఈ డిమాండ్స్ మరింత ఊపందుకున్నాయి. ఇటీవలే తన అభిమానులతో 'రజనీ' ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నట్లు..ఆయన రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రచారం జరిగింది. దీనిని 'రజనీ' ఖండించారనే వార్తలు కూడా వెలువడ్డాయి. తాజాగా మరోసారి చెన్నైలో పోస్టర్లు వెలువడడం కలకలం రేపుతోంది. 'సమయం ఆసన్నమైంది తలైవా. రాజకీయాలా? సినిమాలా? సరైన నిర్ణయం తీసుకునే తరుణం ఇదే. తమిళ ప్రజలకు మంచి జరగాలంటే మీరు పాలించాలి. ఇది అభిమానులుగా మా ఆకాంక్ష, అభిమతం' అంటూ వాల్‌పోస్టర్లు వెలిశాయంట. ఈ నెల 15వ తేదీ నుండి 19వ తేదీ వరకు అభిమానులను 'రజనీ' కలువనున్నారు. కోడంబాక్కంలోని శ్రీ రాఘవేంద్ర కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం జరగనుంది. 15వ తేదీ నుంచి 19 తేదీ వరకూ రోజుకు మూడు జిల్లాల చొప్పున ఐదు రోజుల్లో 15 జిల్లాలకు చెందిన అభిమానులను రజనికాంత్‌ కలసుకుని వారితో విడి విడిగా ఫొటోలు దిగి విందు ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఈ భేటీల్లో రాజకీయ పరమైన అంశాలు చర్చకు వస్తాయా ? రావా ? అనేది తెలియాల్సి ఉంది.

 

16:11 - May 11, 2017

ఉత్తర ప్రదేశ్ : రాష్ట్రంలో పలు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మనుషుల్లో మానవత్వం చచ్చిపోతుందనే ఘటనలు నిరూపిస్తున్నాయి. తాజాగా పోలీసులు మానవత్వం మరిచి ఓ 70 ఏళ్ల వృద్ధురాలిని ఇంట్లో నుండి ఈడ్చుకెళ్లిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటన తాలూకు వీడియో బయటకు పొక్కడంతో పోలీసుల చర్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యూపీలోని అమ్రోహాలో వృద్ధురాలు సైరా బానో తన కుమారుడితో కలిసి నివాసం ఉంటున్నారు. గత 15 ఏళ్లుగా ఈమె ఇంటిని ఖాళీ చేయించాలంటూ సుధీర్ సింఘాల్ కోర్టులో పిటిషన్ వేశాడు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఆ ఇంటిని ఖాళీ చేయించేందుకు మహిళా సిబ్బందిని తీసుకుని వచ్చారు. తాము ఎప్పటినుంచో అదే ఇంట్లో నివసిస్తున్నామనీ... ఖాళీ చేయమని సైరా బానో స్పష్టం చేశారు. వెంటనే ఆమె కాళ్లు..చేతులు పట్టుకుని ఇంట్లో నుండి బయటకు లాక్కొచ్చారు. ఈడ్చుకుంటూ పోలీసు వాహనంలో పడేశారు. అక్కడనే ఉన్న వారందరూ ఈ ఘటనను చూస్తూ తమ చరవాణిలో బంధించే ప్రయత్నం చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అడ్డువచ్చిన చిన్న పిల్లల్ని సైతం పోలీసులు అవతలికి నెడుతున్నట్టు వీడియోలో కనిపించింది. తాము కోర్టు ఆదేశాల ప్రకారమే వారిని ఖాళీ చేయించామని స్థానిక పోలీసులు పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. కానీ తీసుకెళ్లిన విధానం మాత్రం సరైంది కాదని, ఘటనపై విచారణ జరిపిస్తామని స్థానిక పోలీసు అధికారి సంతోష్ కుమార్ మిశ్రా పేర్కొన్నారు.

ఆ రైతులకు బెయిల్...

ఖమ్మం : మిర్చి యార్డు ధ్వంసం కేసులో అరెస్టు చేసిన పది మంది రైతులకు జిల్లా కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రైతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకరావడం పట్ల పలు విమర్శలు చెలరేగాయి.

అసంతృప్తితో ఉన్నాం - ఎంపీ సీతారాం నాయక్..

హైదరాబాద్ : హైదరాబాద్ - విజయవాడ మధ్య మరో ఎక్స్ ప్రెస్ రైలును నడపాల్సినవసరం ఉందని, రెండు దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న నల్గొండ - మాచర్ల లైన్ విషయంలో అసంతృప్తిగా ఉన్నామని ఎంపీ సీతారాం నాయక్ వ్యాఖ్యానించారు. వరంగల్ కు రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్ష్చరింగ్ యూనిట్ కలగానే మిగిలిందన్నారు. సింగరేణి కోసం ప్రత్యేక రైలును ఏర్పాటు చేయాలని, ద.మ.రైల్వేకు జరుగుతున్న అన్యాయంపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లౄలని కోరినట్లు తెలిపారు

ద.మ.జీఎం సమావేశం ఒరిగేందిమీ లేదు - ఎంపీ గుత్తా..

హైదరాబాద్ : గత బడ్జెట్ సమావేశాల సమయంలో తీసుకున్న అభ్యర్థలను మరోసారి తీసుకోవడం తప్ప ఈ సమావేశం వల్ల ఒరిగింది ఏమీ లేదని ఎంపీ గుత్తా వ్యాఖ్యానించారు. నాలుగు దశాబ్దాలుగా ప్రాజెక్టుల పెండింగ్ రైల్వే పనితీరు అద్దం పడుతోందన్నారు.

 

అవగాహన లేకుండా ఆర్ యూబీల నిర్మాణం - ఎంపీ కొత్త ప్రభాకర్..

హైదరాబాద్ : ఆర్ యూబీలను అవగాహన లేక ఉండా నిర్మిస్తున్నారని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. మాసాయిపేట బస్ ప్రమాదం జరిగిన చోట రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తేనే అండర్ బ్రిడ్జి నిర్మిస్తామని రైల్వే అధికారులు పేర్కొంటున్నారని తెలిపారు.
 

రైలు మార్గాలు వేయాలి - ఎంపీ నంది ఎల్లయ్య..

హైదరాబాద్ : గద్వాల - మాచర్ల కొత్త రైల్వే లైన్ కు రూ. 190 కోట్లు మంజూరు చేయాలని ఎంపీ నంది ఎలయ్య కోరారు. రైలు మార్గాలు వేస్తేనే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందని, నిధుల మంజూరులో చొరవ చూపాలని సీఎంను కోరుతామన్నారు. నాంపల్లి వంటి స్టేషన్ లో ఎక్స్ లేటర్లు, మౌలాలి లో రైళ్లను ఆపాలని 12 ఏళ్లుగా కోరుతున్నట్లు తెలిపారు.

'రైల్వే ఉద్యోగాల్లో టి. యువతకు ప్రాధాన్యత ఇవ్వాలి'..

హైదరాబాద్ : హైదరాబాద్ -దేవరకొండ రైల్వే లైన్ వేయాలని పాల్వాయి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ లైన్ వల్ల వలస కూలీల కష్టాలు తీరుతాయని, రైల్వే ఉద్యోగాల్లో తెలంగాణ యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

15:37 - May 11, 2017

విశాఖపట్నం : ప్రతీ సారీ తెలుగు దేశం పార్టీ ఉత్సాహంగా.. మహానాడు నిర్వహిస్తుంది. దాదాపు 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత.. విశాఖలో మహానాడు కార్యక్రమం జరుగనుంది. దీనికి ఎయూ ఇంజనీరింగ్‌ కాలేజీ గ్రౌండ్స్‌ను తెలుగుదేశం ఎంపిక చేసింది. అయితే దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతున్నాయి. రాజకీయ సంబంధ, మత పరమైన సమావేశాలకు.. ఏయూను ఉపయోగించకూడదని టీడీపీ ప్రభుత్వమే ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల వల్ల గతంలో ఓ మత సంబంధ కార్యక్రమానికి అడ్వాన్సులు తీసుకొని.. ఎయూ అధికారులు మళ్లీ వెనక్కి ఇచ్చారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎయూ ఇంజనీరింగ్ కాలేజీలో జరపాలనుకున్న కార్యక్రమానికి.. అనుమతులు నిరాకరించారు. కానీ ఇదే సమయంలో ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని ఆంధ్రా యూనివర్శిటీ యాజమాన్యం.. మధ్యలో ఓ ఫ్యాషన్‌ షోకు అనుమతిచ్చింది.

విద్యార్థి సంఘాలు మండిపపాటు...
గతంలో రాజకీయ కార్యక్రమాలకు అనుమతివ్వవద్దని చెప్పిన తెలుగుదేశం ప్రభుత్వమే.. ఇప్పుడు ఆంధ్రా యూనివర్శటీ ఇంజనీరింగ్ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో మహానాడును నిర్వహించాలనుకుంటోంది. దీనిపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ముఖ్యంగా అకడమిక్ ఇయర్‌ మొదట్లో.. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు తప్పవని అంటున్నారు. అవసరమైతే ఈ విషయంలో కోర్టుకు వెళ్లడానికి కూడా తాము సిద్ధమని స్పష్టం చేశారు. టీడీపీ మాత్రం ఎన్ని విమర్శలు వచ్చినా.. ఎయూలోనే మహానాడును నిర్వహించాలనుకుంటోంది. ఈ గ్రౌండ్‌ను అత్యంత అనుకూలమైన స్థలంగా ప్రభుత్వం చెబుతోంది. హైదరాబాద్‌లో నిజాం గ్రౌండ్స్‌ ఎలా ఉపయోగపడుతుందో.. విశాఖలో కూడా ఇంజనీరింగ్‌ కాలేజీ గ్రౌండ్స్‌ అలా ఉపయోగపడుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు. తమకు ఇంతవరకూ మహానాడును ఎయూలో నిర్వహించడానికి అనుమతులు కోరుతూ.. ఎలాంటి లేఖలు రాలేదని ఎయూ అధికారులు చెబుతున్నారు.గతంలో ఉన్న జీవోను తెలుపుతూ.. గవర్నర్‌కు లేఖ రాశామని చెప్పారు. గవర్నర్‌ నుంచి ఏ సమాధానం వస్తే దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం.. ఇప్పటికే మహానాడు కోసం ముందస్తు ఏర్పాట్లలో మునిగిపోయారు.

రైల్వే జీఎంతో టి.ఎంపీల సమావేశం..

సికింద్రాబాద్ : రైల్వే జీఎంతో తెలంగాణ ఎంపీల సమావేశం ముగిసింది. ఎక్స్ ప్రెస్ రైళ్లను చిన్న స్టేషన్ లలో కూడా ఆపాలని ఎంపీలు ఎక్కువగా కోరుతున్నారని ద.మ.రైల్వే జీఎం పేర్కొన్నారు. ఎక్కువ స్టేషన్ లలో ఎక్స్ ప్రెస్ రైళ్లను ఆపడం సాధ్యం కాదని, ఎంఎంటీఎస్ రెండో దశ జనవరిలోగా పూర్తవుతుందన్నారు.

15:31 - May 11, 2017

చండీగఢ్ : పంజాబ్‌ ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ టీవీ షోలో పాల్గొంటున్న మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సిద్దూ కామెడి షోలో పాల్గొనడంపై కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. చట్టాన్ని గౌరవించాల్సిన మీకు నైతిక బాధ్యత లేదా అంటూ హైకోర్టు సిద్ధూను ప్రశ్నించింది. మంత్రిగా ఉంటూ సిద్ధూ టీవీ షోలా ఎలా పాల్గొంటారని హైకోర్టులో ప్రజావ్యాజ్యం దాఖలైంది. ప్రజలకు బాధ్యతగా ఉండాల్సిన మంత్రి కామెడి షోలో పాల్గొనడంపై విపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి. టీవీ షోలో పాల్గొనడం చట్టాన్ని అతిక్రమించినట్లు కాదని సిద్ధూ వాదిస్తున్నారు. పగలంతా మంత్రిగా విధులు నిర్వహిస్తానని... సాయంత్రం ఆరు తర్వాత తాను టీవీలో షో షూటింగ్‌లో పాల్గొంటే అభ్యంతరమెందుకని ప్రశ్నిస్తున్నారు. బిజెపికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన సిద్ధూ పంజాబ్‌ ఎన్నిక్లలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన విషయం తెలిసిందే.

విచారం వ్యక్తం చేసిన గవర్నర్..

హైదరాబాద్ : మంత్రి నారాయణ కుమారుడు నితీష్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల గవర్నర్ గవర్నర్ విచారం వ్యక్తం చేశారు. మంత్రి నారాయణ కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలిపారు.

15:29 - May 11, 2017

ఢిల్లీ : ట్రిపుల్‌ తలాక్‌పై విచారణ ప్రారంభించిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ట్రిపుల్‌ తలాక్‌ ఇస్లాం మతానికి సంబంధించిన ప్రాథమిక అంశమా? కాదా అనే విషయాన్ని మాత్రమే విచారిస్తామని పేర్కొంది. ఇస్లాం మూలసూత్రాల్లో ట్రిపుల్‌ తలాక్‌కు ఉన్న ప్రాధాన్యతను పరిశీలిస్తామని...బహు భార్యత్వంపై విచారణ చేపట్టమని తెలిపింది. చీఫ్‌ జస్టిస్‌ ఖేహర్‌ నేతృత్వంలోని ఐదుగురు విభిన్న మతాల సభ్యులతోకూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. ధర్మాసనంలోని ఐదుగురు సీనియర్‌ న్యాయమూర్తులు హిందు, ముస్లిం, పార్సీ, క్రిస్టియన్‌, సిక్కు మతాలకు సంబంధించిన వారు కావడం విశేషం. ముస్లింలలో బహుభార్యత్వం, ట్రిపుల్‌ తలాక్‌ రాజ్యాంగబద్ధతను సవాల్‌ చేస్తూ దాఖలైన ఏడు పిటిషన్లపై సుప్రీంకోర్టులో వాదనలు మొదలయ్యాయి. దీనిపై వారం రోజుల పాటు విచారణ జరగనుంది. ట్రిపుల్‌ తలాక్‌ రాజ్యాంగ విరుద్ధమని కేంద్రం వాదిస్తోంది.

జగన్ పార్టీ ఆత్మహత్య చేసుకుంది - రఘువీరా..

విజయనగరం : ప్రధానిని జగన్ కలవడాన్ని తప్పుబట్టడం లేదని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రపతి ఎన్నిక నోటిఫికేషన్ రాకుండానే మద్దతిస్తామనడం సబబు కాదని, జగన్ పార్టీ ఆత్మహత్య చేసుకుందన్నారు. ఎవరిని మభ్యపెట్టడానికి జగన్ మోడీని కలిశారని తెలిపారు. జగన్ రాజీకొస్తున్నారని, ఆయన పని అయిపోయిందని పేర్కొన్నారు. వైఎస్ ఫొటో పెట్టుకొనే అర్హత జగన్ కు లేదని తెలిపారు.

వచ్చే నెల నుండే గొర్రెల పంపిణీ..

హైదరాబాద్ : గొల్లకురుమ కులాలకు 20 గొర్రెలు, ఒక పొట్టేలు పంపిణీ చేయనున్నట్లు మంత్రి తలసాని పేర్కొన్నారు. మొత్తం 80 లక్షల గొర్రెల పంపిణీ చేయనున్నట్లు, కుల వృత్తులను ప్రోత్సాహిస్తున్నామన్నారు. వచ్చే నెల నుండే గొర్రెల పంపిణీ చేస్తామని, తొలి, రెండో ఏడాది 42 లక్షల చొప్పున గొర్రెలను పంపిణీ చేస్తామన్నారు. లాటరీ ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుందన్నారు.

జగన్ పార్టీ ఆత్మహత్య చేసుకుంది : రఘువీరా

విజయనగరం : జగన్ పార్టీ వైసీపీ ఆత్మహత్య చేసుకుందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అన్నారు.జగన్ ప్రధానిని కలవడం తప్పుబట్టడం లేదు కానీ రాష్ట్రపతి ఎన్నిక నోటిఫికేషన్ రాకుండానే ఎన్డీఏ మద్దతిస్తామనడం దురదృష్టకరమని పేర్కొన్నారు.

14:54 - May 11, 2017

టాలీవుడ్ కండలవీరుడు 'రానా'పై ఓ వార్త సోషల్ మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. మెగాస్టార్ 'చిరంజీవి' నటించబోయే 151వ సినిమాలో 'రానా' విలన్ గా నటించనున్నారని ప్రచారం జరిగింది. బ్రిటీష్ పాలకులను ఎదిరించిన వీర యోధుడు 'ఉయ్యాల వాడ నర్సింహరెడ్డి' కథ ఆధారంగా 'చిరు' 151వ చిత్రం తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం 100 కోట్ల ఖర్చుతో రామ్ చరణ్ నిర్మించనున్నాడని టాక్. ఈ చిత్రంలో విలన్ గా 'రానా'ను సెలక్ చేశారని టాక్ వచ్చింది. దీనిపై రానా స్పందించారు. 'ఉయ్యాలవాడ నర్సింహరెడ్డి'లో నటించడం అనేది అవాస్తవమని, ఆ చిత్ర యూనిట్ కనీసం నన్ను సంప్రదించలేదు కూడా అని స్పష్టం చేశారు. 'బాహుబలి'..'బాహుబలి-2' సినిమాలతో క్రేజ్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఈ నటుడు 'నేనే రాజు నేనే మంత్రి' అనే సినిమాతో పాటు మరో పీరియాడియకల్ మూవీలో నటిస్తున్నాడు.

14:48 - May 11, 2017

కోలీవుడ్ లో స్టార్ హీరోల్లో ఒకరైన 'అజిత్' తాజా చిత్రం 'వివేగం'పై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఇటీవలే విడుదలైన టీజర్ అంచనాలు మించి వ్యూస్ వస్తున్నాయి. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో 'అజిత్' సరసన 'కాజల్' నటిస్తోంది. భారీ యాక్షన్ సీన్స్ తో రూపొందిన టీజర్ అభిమానులను విశేషంగా ఆకర్షిస్తోంది. 'అజిత్' ఇంటర్ పోల్ అధికారిగా నటిస్తుండగా బాలీవుడ్ హీరో 'వివేక్ ఒబెరాయ్' విలన్ గా నటిస్తున్నారు. రిలీజ్ అయిన 12 గంటల్లో ఈ చిత్ర టీజర్ కి 5 మిలియన్ల పైనే వ్యూస్ లభించాయి. ఇప్పటి వరకు 'కబాలి' చిత్రంపైనే ఈ రికార్డు ఉంది. తాజాగా 'వివేగం' టీజర్ దీనిని బ్రేక్ చేసి సౌత్ ఇండియన్ మూవీకి ఓ బెంచ్ మార్క్ ని సెట్ చేసింది. మరి చిత్ర విడుదలయైన తరువాత ఎలాంటి రికార్డ్స్ సృష్టిస్తుందో వేచి చూడాలి.

హైకోర్టులో పీజీ విద్యార్థుల లంచ్ మోషన్..

హైదరాబాద్ : టీఎస్ మెడికల్ కాలేజీల్లో ఫీజు పెంపుపై హైకోర్టులో పీజీ విద్యార్థుల లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కాసేపట్లో పిటిషన్ విచారణకు రానుంది.

రైతులకే బేడీలు వేస్తారా - సాగర్..

ఖమ్మం : రైతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకరావడాన్ని ఖండిస్తున్నట్లు రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి సాగర్ పేర్కొన్నారు.

శుక్రవారం కోదండరాం మౌన దీక్ష..

హైదరాబాద్ : డీజీపీని కోదండరాం, అఖిలపక్ష నేతలు కలిశారు. ఇందిరాపార్కు వద్ద ధర్నా చౌక్ ఎత్తివేయవద్దని విన్నవించారు. ఈ నెల 15లోగా నిర్ణయం తెలుపాలని కోరారు. శుక్రవారం ఉదయం గన్ పార్క్ వద్ద మౌన దీక్ష చేపట్టనున్నట్లు కోదండరాం పేర్కొన్నారు. సానుకూల నిర్ణయం వచ్చేంత వరకు నిరసన చేపట్టనున్నట్లు వెల్లడించారు.

చర్లపల్లిలో ఖైదీ ఆత్మహత్యాయత్నం..

హైదరాబాద్ : చర్లపల్లి సెంట్రల్ జైల్లో ఇనుప కడ్డీలు మింగి ఖైదీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అధికారి వేధింపులు భరించలేక ఖైదీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చర్లపల్లి జైలులో గడిచిన మూడు నెలల కాలంలో 12 మంది ఖైదీలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

ఐటీలో ఉద్యోగుల తొలగింపుపై కేటీఆర్ కీలక సమావేశం..

హైదరాబాద్ : ఐటీ రంగంలో ఉద్యోగుల తొలగింపు నేపథ్యంలో మంత్రి కేటీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఇన్ఫరేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా), కార్మిక శాఖ ఉన్నతధికారులు, ఐటీ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. భాగస్వాములందరినీ పరిగణలోకి చర్చించాలని, రాష్ట్ర పథకాల్లో ఐటీ ఉద్యోగులకు చోటు కల్పించాలని..ఐటీ ఉద్యోగులు నైపుణ్యత పెంచుకోవాలని టీటా అభిప్రాయం వ్యక్తం చేసింది.

13:40 - May 11, 2017
13:40 - May 11, 2017
13:36 - May 11, 2017

హైదరాబాద్ : 'సేవ్ ధర్నా చౌక్'కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు తెలియచేశారని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలియచేశారు. గురువారం జనసేన పార్టీ కార్యాలయానికి తమ్మినేని బృందం వచ్చింది. ఈసందర్భంగా ఇరువురు పలు అంశాలపై చర్చించారు. భేటీ అనంతరం టెన్ టివితో తమ్మినేని ప్రత్యేకంగా మాట్లాడారు. రాష్ట్రంలో, పక్క రాష్ట్రంలో, జాతీయ స్థాయిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై పరస్పర అభిప్రాయాలు తెలియచేయడం జరిగిందన్నారు. ఎన్నికలు..పొత్తులపై ప్రస్తుతం చర్చ జరగలేదని, భవిష్యత్ లో అలాంటి చర్చలు వస్తాయన్నారు. ఇటీవలే తాము నిర్వహించిన 'మహాజన పాదయాత్ర'లో వచ్చిన అంశాలు..ప్రభుత్వం తీసుకొన్న చర్యలపై చర్చలు జరిగాయని, వీటిపై 'పవన్' సానుకూలంగా స్పందించారని తెలిపారు. పాదయాత్ర మంచి ఫలితాలు ఇస్తుందని, ఇలాంటివి కొనసాగించాలని పవన్ అభిలాషించారని తెలిపారు. 'సేవ్ ధర్నా చౌక్' కు మద్దతిస్తామని స్పష్టం చేశారని, ఇందుకు ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. సీపీఎం, సీపీఐ, ఇతర వామపక్షాలు, కోదండరాం, చంద్రకుమార్, గద్దర్ తదితర సంస్థలు కలిపి ఐక్యంగా 'సేవ్ ధర్నా చౌక్' పై ఉద్యమిస్తున్నాయని, పవన్ కలవడం ద్వారా ఉద్యమం బలోపేతం అవుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజాహితం కోసం జరిగే కార్యక్రమాల కోసం పరసర్పం అవగాహనతో ముందుకు సాగుతామన్నారు. ప్రజాసమస్యలు..పోరాటాల దానిపై సుదీర్ఘంగా చర్చించడం జరిగిందని, పార్టీ నిర్మాణంలో 'జనసేన' ఉందని అనంతరం పొత్తులపై చర్చిస్తామని చెప్పారని తెలిపారు. ప్రస్తుతం 'ధర్నా చౌక్'...మిర్చీ రైతుల ఉద్యమం జరుగుతోందని, ఇటీవలే భూ నిర్వాసితుల ఉద్యమం నడిచిందని ఈ పోరాటాలు భవిష్యత్ లో కొనసాగుతాయన్నారు. ఎన్నికల హామీలు ఇంతవరకు నోచుకోలేదని, జూన్ లో ప్రజా సంఘాల ఐక్యవేదిక ఏర్పాటయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీనిపై 'పవన్' తో చర్చించడం జరిగిందని 'తమ్మినేని' వెల్లడించారు.

13:26 - May 11, 2017

హైదరాబాద్ : 'తమ్మినేని అన్నా..సీపీఎం పార్టీ అన్నా తనకు గౌరవం..వారి ఆలోచన విధానం నిర్ధిష్టంగా ఉంటుంది..తనకు తెలంగాణ..ఆంధ్రా వేరే కాదు..తొందరలో ఈ రాష్ట్రంలో దృష్టి పెడుతున్నాం' అని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గురువారం సీపీఎం బృందం ఆయన్ను కలిసింది. ఈ సందర్భంగా టెన్ టివితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. తమ్మినేని అంటే తనకు అపార గౌరవం ఉందని, అంతేగాకుండా సీపీఎం పార్టీపై కూడా గౌరవం ఉందన్నారు. వీరి ఆలోచన విధానం నిర్ధిష్టం ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వం పట్ల అసంతృప్తి ఉంటే దానిని వెల్లుబుచ్చుకొనే హక్కు ఉంటుందని అందుకే ధర్నా చౌక్ లో ధర్నా..నిరసన కార్యక్రమాలు చేపడుతారని తెలిపారు. కానీ ఇక్కడ నిరసన తెలియ చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేశారు. గతంలో భీమ్ రావ్ వాడాపై చెలరేగిన ఆందోళనలో తాము (పీఆర్పీ) ఆందోళన చేయడం జరిగిందన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో ఇందిరాపార్కు వద్ద ఉద్యమాలు జరిగాయని, ఆందోళనలు వేరే దగ్గర చేస్తే ప్రభుత్వ దృష్టికి ఎలా వస్తుందని ప్రశ్నించారు. 'సేవ్ ధర్నా చౌక్' కోసం జరిగే ఆందోళనలో తమ బృందం పాల్గొంటుందని స్పష్టం చేశారు. వీరి ఆందోళనకు మద్దతు తెలియచేయడం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ నిర్మాణం జరిగిన అనంతరం తదితర వాటిపై దృష్టి పెట్టడం జరుగుతుందన్నారు. తనకు తెలంగాణ, ఆంధ్రా వేరే కాదని..ఇక్కడ ప్రజా సంఘాలు బలంగా ఉన్నాయని, అక్కడ అంతగా లేకపోవడం వల్ల తాను అక్కడ దృష్టి నెలకొల్పడం జరిగిందని పవన్ స్పష్టం చేశారు.

13:20 - May 11, 2017

హైదరాబాద్ : జనసేన పార్టీ కార్యాలయానికి సీపీఎం నేతలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. గురువారం సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బృందం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో చర్చలు జరిపాయి. రాష్ట్ర రాజకీయాలు..దేశ రాజకీయాలు..సీపీఎం పోరాటం తదితర అంశాలపై వారు చర్చించారు. ఇటీవలే ధర్నా చౌక్ విషయంలో ప్రభుత్వ చర్యలపై కూడా చర్చించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఇందిరాపార్కు వద్ద ధర్నాలు చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు..పోరాటాలపై పవన్ తో చర్చించినట్లు తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. ఎన్నికలపై పొత్తు చర్చ జరగలేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలపై జనసేనతో కలిసి పోరాటం చేస్తామన్నారు. 15న ఇందిరాపార్కు వద్ద జరిగే ధర్నా కార్యక్రమానికి జనసేన మద్దతు తెలపడం పై కృతజ్ఞతలు తెలియచేయడం జరిగిందని తమ్మినేని పేర్కొన్నారు.

12:48 - May 11, 2017
12:47 - May 11, 2017

నెల్లూరు : రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ అంత్యక్రియలు ముగిశాయి. నెల్లూరులోని బోడిగాడితోటలో అంత్యక్రియలు జరిగాయి. అంతకుముందు నారాయణ కళాశాల నుండి నిషిత్ అంతిమయాత్ర జరిగింది. మంత్రి నారాయణ అంత్యక్రియలు నిర్వహించి కొడుకు చితికి నిప్పు పెట్టారు. నిషిత్ భౌతికకాయాన్ని కడసారి చూసేందుకు నారాయణ విద్యాసంస్థల ఉద్యోగులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. నిశిత్ అంతిమయాత్రలో పాల్గొన్న వీరందరూ.. నివాళులర్పించారు. అంతిమయాత్రలో లోకేశ్ సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో జరిగిన రోడ్డుప్రమాదంలో నిశిత్, అతడి స్నేహితుడు రవివర్మ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

12:43 - May 11, 2017

ఒక ఘటన సంచలంన రేకేత్తించింది...దేశాన్ని కదిలించింది..దేశ ప్రజలను పోరుబాట పట్టించింది...దేశ రాజధాని ఢిల్లీ నగరంలో జరిగిన నిర్భయ ఘటన..దోషులను కఠినంగా శిక్షించాలంటూ దేశ ప్రజలు పోరాట బాట పట్టారు...పోలీసు నిర్భందాలను సైతం బేఖాతర్ చేస్తూ న్యాయం కోసం దేశం యావత్తు డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించింది..ఏడేళ్ల పాటు కొనసాగినా చివరకు న్యాయమే గెలిచింది. దోషులకు దేశ అత్యున్నత న్యాయస్థానం మరణ శిక్షను విధించింది. ఈ అంశంపై 'మానవి' ప్రత్యేక కథనం తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

రైల్వే జీఎం సమావేశం..

హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్ కుమార్ సమావేశమయ్యారు. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ఎంపీలు హాజరయ్యారు. పెండింగ్..కొత్త రైల్వే ప్రాజెక్టు పనులపై చర్చించారు.

 

కేసీఆర్ కు రేవంత్ బహిరంగ లేఖ..

హైదరాబాద్ : గిట్టుబాటు ధర అడిగిన రైతులపై రాజద్రోహం కేసు పెట్టారని, రైతులకు దొంగల్లా బేడీలు వేసి కోర్టుకు తీసుకొచ్చి పైశాచిక ఆనందం పొందుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్ కు ఆయన బహిరంగ లేఖ రాశారు. ఉద్యమ సమయంలో వలస పాలకులు కూడా ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడుతున్నాయని పేర్కొన్నారు.

 

12:27 - May 11, 2017

ఖమ్మం : మిర్చి యార్డు ధ్వంసం కేసులో పది మంది రైతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకరావడం పట్ల తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. వెంటనే సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని..రైతులను వెంటనే విడుదల చేయాలని టిడిపి నేత రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకరావడం పట్ల ఆయన టెన్ టివితో మాట్లాడారు. చిల్లర..మల్లర మాటలు మానేసి తక్షణమే రైతులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, ముక్కు నేలకు రాసినా ప్రజలు క్షమించరని తెలిపారు. రైతులపై వేసిన కేసులు ఎత్తివేయాలని, వెంటనే మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. 12,13వ తేదీల్లో రైతుల కోసం ఖమ్మంలో దీక్ష చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్లు, కానీ అనుమతినివ్వడం లేదన్నారు. అధికార దర్పానికి ఇదొక నిదర్శమని, రాజద్రోహులుగా చిత్రీకరించి చేతులకు బేడీలు వేసి తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎదురు మాట్లాడితే ఎలాంటి గతి పడుతుందో చూపెట్టడానికే ఇలా చేస్తున్నారని తెలిపారు. మార్కెట్ యార్డు ధ్వంసంలో రౌడీలున్నారని తుమ్మల నాగేశ్వర్ గతంలో పేర్కొన్నారని మరి రైతులను ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు. ఒక అధికారిని నియమించి సమస్యలు పరిష్కరించాల్సింది పోయి అర్ధరాత్రి అరెస్టులు చేస్తారా అని సూటిగా ప్రశ్నించారు. రిజర్వేషన్ల విషయంలో అధికారం ఇవ్వాలని సర్కార్ అడుగుతోందని, రైతుల కోసం వేయి కోట్లు కేటాయించలేదా ? పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడానికి నిధులు లేవా ? అని ప్రశ్నించారు. ప్రభుత్వ నిధులు యదేచ్చగా ఖర్చు పెట్టలేదా ? అని నిలదీశారు. రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదా ? అని నిలదీశారు. ఇటీవలే జిల్లాలో పర్యటించి ఆ రైతులకు ఆర్థిక సహాయం అందించామని, న్యాయవాదులను నియమించి బెయిల్ వచ్చేందుకు కృషి చేయడం జరుగుతోందన్నారు.

12:22 - May 11, 2017

ఖమ్మం : తమకు న్యాయం చేయాలని..మిర్చికి మద్దతు ధర కల్పించాలని ఆందోళన చేసిన రైతులపై పోలీసులు అత్యుత్యాహం ప్రదర్శించారు. రైతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకరావడం తీవ్ర దుమారం రేపుతోంది. గత నెల 28వ తేదీన మిర్చికి మద్దతు ధర కల్పించాలని కోరుతూ రైతులు ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డు వద్ద ఆందోళన చేపట్టారు. ఈ దశలో మార్కెట్ యార్డును ధ్వంసం చేశారు. దీనితో పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేసి పీఎస్ కు తరలించారు. 10 మంది రైతులతో పాటు సత్తుపల్లి ఎమ్మెల్యేపై కేసులు నమోదు చేశారు. గురువారం సత్తుపల్లి ఎమ్మెల్యేను మినహాయించి పది మంది రైతులకు బెయిల్ వేసి కోర్టుకు తీసుకొచ్చారు. అక్కడనే ఉన్న ప్రజా సంఘాలు..అరెస్టయిన రైతు కుటుంబాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతులకు బేడీలు వేసి తీసుకొస్తారా ? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను బెయిల్ తీసుకొచ్చేందుకు పలువురు న్యాయవాదులు..ఇతర ప్రజా సంఘాలు పోరాటం చేస్తున్నారు. మార్కెట్ త్రీ టౌన్ పీఎస్ లో కేసు నమోదు చేయాల్సి ఉండగా మూడు పీఎస్ లో కేసులు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. తాము మార్కెట్ యార్డును ధ్వంసం చేయలేదని రైతులు పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. వీరికి బెయిల్ వస్తుందా ? లేదా ? అనేది కాసేపట్లో తేలనుంది. ఈ ఘటనపై రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బండి రమేష్ టెన్ టివితో మాట్లాడారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

తెలంగాణలో పార్టీ నిర్మాణంపై దృష్టి - పవన్..

హైదరాబాద్ : తెలంగాణలో పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సీపీఎం నేతలు తమ్మినేని, చెరుపల్లి ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడుతూ..పార్టీ నిర్మాణం అనంతరం పొత్తులపై ఆలోచిస్తామన్నారు.

సమస్యలు..పోరాటాలపై పవన్ తో చర్చలు - తమ్మినేని..

హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రజా సమస్యలు..పోరాటాలపై పవన్ తో చర్చించినట్లు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. జనసేన అధినేత పవన్ తో తమ్మినేని, చెరుపల్లిలు భేటీ అయ్యారు. భేటీ అనంతరం తమ్మినేని మీడియాతో మాట్లాడారు. ఎన్నికలపై పొత్తు చర్చ జరగలేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలపై జనసేనతో కలిసి పోరాటం చేస్తామన్నారు. 15న ఇందిరాపార్కు వద్ద జరిగే ధర్నా కార్యక్రమానికి జనసేన మద్దతు తెలపడం పై కృతజ్ఞతలు తెలియచేయడం జరిగిందని తమ్మినేని పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యంలో నిరసన తెలియచేయడం ఒక హక్కు - పవన్..

హైదరాబాద్ : ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుందని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఇందిరాపార్కు వద్ద ధర్నాలు చేశారని గుర్తు చేశారు.

 

11:32 - May 11, 2017
11:27 - May 11, 2017

ఎవరైనా ప్రమాదంలో..బాధలో ఉంటే ఏం చేస్తారు ? వెంటనే కాపాడుతారు కదా..కానీ కొంతమంది సెల్ఫీలు తీసుకుంటూ..ఆనందం పొందుతున్నారు. ఇటీవలే పలు ఘటనలు కూడా చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ బీజేపీ ఎమ్మెల్యే చేసిన నిర్వాకం విమర్శలకు దారి తీస్తోంది. పేదల ఇండ్లు తగులబడుతుంటే ఆ మంటలను ఆర్పడానికి నీళ్లు పోయకుండా..చర్యలు తీసుకోకుండా..సెల్ఫీలు దిగారు. అంతటితో ఆగారా..ఈ సెల్ఫీలను ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేయడం వివాదాస్పదమైంది. రాజస్థాన్ లోని నగలా మొరోలీ ప్రాంతంలో ఉన్న గుడిసెలకు నిప్పంటుకుంది. ఒకటి తరువాత మరొకటి మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న బీజేపీ ఎమ్మెల్యే బచ్చు సింగ్ బన్సీవాల్ అక్కడకు చేరుకన్నారు. వెంటనే తహశీల్దార్ ను రావాల్సిందిగా సూచించారు. అనంతరం కాలిపోతున్న ఇండ్ల ముందు నిలబడి సెల్ఫీలు తీసుకోవడం మొదలు పెట్టారు. బాధితులు మాత్రం నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. ఈ ఫొటోలపై వ్యతిరేక కామెంట్లు పోస్టు చేస్తున్నారు. పేదలకు అండగా నిలబడి ఎమ్మెల్యే ఏదైనా చర్యలు తీసుకుంటే బాగుండేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తాను ప్రమాదస్థలిలో ఉన్నానని తెలియచేయడానికే సెల్ఫీ దిగానని సదరు ఎమ్మెల్యే వివరణనిచ్చే ప్రయత్నం చేశారు.

నాగర్ కర్నూలులో టి. మంత్రులు..

నాగర్ కర్నూలు : తిమ్మాజీపేట (మం) మానేపల్లిలో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మంత్రులు హరీష్ రావు, జూపల్లి, లక్ష్మారెడ్డిలు సందర్శించారు. కేఎల్ ఐ కాల్వలపై వంతెన నిర్మాణ పనుల్లో అధికారుల నిర్లక్ష్యంపై మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

ఫరూఖ్ నగర్ లో కేంద్ర మంత్రి అనంతకుమార్..

రంగారెడ్డి : ఫరూఖ్ నగర్ అంబేద్కర్ కాలనీలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అనంతకుమార్ పాల్గొన్నారు. బీజేపీ ఎమ్మెల్యే కె.లక్ష్మణ్, నాగం జనార్ధన్ రెడ్డిలు పాల్గొన్నారు.

ఫరూఖ్ నగర్ లో కేంద్ర మంత్రి అనంతకుమార్..

రంగారెడ్డి : ఫరూఖ్ నగర్ అంబేద్కర్ కాలనీలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అనంతకుమార్ పాల్గొన్నారు. బీజేపీ ఎమ్మెల్యే కె.లక్ష్మణ్, నాగం జనార్ధన్ రెడ్డిలు పాల్గొన్నారు.

నిశీత్ అంతిమ క్రియలు..

నెల్లూరు : మృతి చెందిన మంత్రి నారాయణ కుమారుడు నితీష్ అంతిమ క్రియలు పూర్తయ్యాయి. పెన్నా నది తీరం వద్ద ప్రత్యేక ఘాట్ ను ఏర్పాటు చేసి అంతిమ కార్యక్రమాలు నిర్వహించారు.

10:37 - May 11, 2017

రంగారెడ్డి :, కుత్బుల్లాపూర్‌లో దారుణం జరిగింది. అతి కిరాతకంగా ఓ యువకుడిని చంపి పాతి పెట్టిన ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మొండెం, తలను వేరు చేసి.. భూమిలో పాతిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. చంద్రనగర్‌లోని మహదేవ్ గుప్త అనే వ్యక్తి ఇంట్లో.. బీహార్‌కు చెందిన యువకులు అద్దెకుంటున్నారు. అయితే వారం రోజుల నుంచి వీరు కనిపించడం లేదు. వీళ్లుంటున్న పక్కింట్లోని బ్యాచ్‌లర్స్‌ కూడా రెండు రోజులుగా ఊర్లో లేరు. ఇంటి యజమాని ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు స్పందించారు. గది తాళం తీసి.. రక్తపు మరకల శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించారు. అలాగే డాగ్‌ స్క్వాడ్‌ను రప్పించారు. ఘటన జరిగిన ఇంట్లో క్షణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులు.. ఓ చోట శవాన్ని పాతిపెట్టినట్లు గుర్తించారు. దుర్వాసన వస్తున్న ప్రాంతంలో తవ్వితే.. మృతుడి తల, రెండు చేతులు లభ్యమయ్యాయి. వాటిని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు తరలించారు. ఈ కేసులో బెంగళూరుకు చెందిన రెండు ఐడీలు, రెండు కత్తులు, ఓ ఆక్సాబ్లేడ్‌ లభ్యమయ్యాయి. మిగతా శరీర భాగాలు లభ్యం కావాల్సి ఉంది.

10:32 - May 11, 2017

మహబూబ్‌నగర్‌ : నవాబ్‌పేట మండల కేంద్రంలో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఆర్‌ఎంపీ వైద్యుడు లక్ష్మీనారాయణ, అతని భార్య అలివేలమ్మ కలిసి.. గురుకుంట దారిలో గుళికల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కూతురు సుప్రజ ఇంట్లోనే చనిపోయి ఉంది. మొదట కూతురికి విషమిచ్చి చంపి.. భార్యభర్తలు విషం తాగినట్లు తెలుస్తోంది. గ్రామంలో డాక్టర్‌గా మంచి పేరు ఉన్న ఆయనకు ముగ్గురు కూతుళ్లు.. ఓ కుమారుడు ఉన్నారు. వీరిలో ఇద్దరు కూతుళ్ల పెళ్లి జరిగింది. కొడుకు కూడా ఉద్యోగం చేస్తూ చక్కగా స్థిర పడ్డాడు. కానీ ఇంతటి దారుణానికి పాల్పడటం వెనక కారణం తెలియరాలేదు.

పవన్ తో తమ్మినేని భేటీ..

హైదరాబాద్ : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని భేటీ అయ్యారు. భేటీకి సంబంధించిన వివరాలు తెలియరాలేదు.

10:29 - May 11, 2017

పెరుగు..ఆహారంలో దీనిని ఒక భాగంగా చేసుకుంటే అద్భుత ఫలితాలు పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు పేర్కొంటూ ఉంటుంటారు. కానీ కొంతమంది పెరుగును చూస్తేనే అసహ్యంగా ఫీలవుతుంటారు. కానీ దీనివల్ల ఎన్ని లాభాలు కలుగుతాయో ఒకసారి చూద్దాం..

  • ఓ కప్పు పెరుగులో కొద్దిగా జీల‌క‌ర్ర‌ పొడిని కలుపుకుని తింటే త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతారు.
  • కొద్దిగా పెరుగులో చ‌క్కెర క‌లుపుకుని తినాలి. ఇలా చేయడం వల్ల శ‌రీరానికి శక్తి అందడమే కాకుండా మూత్రాశ‌య సంబంధ స‌మ‌స్య‌లు కూడా పోతాయి.
  • ఓ క‌ప్పు పెరుగులో కొంత న‌ల్ల మిరియాల పొడిని క‌లిపి తినాలి. దీని వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం దూరం కావడం..తిన్న ఆహారం సరిగ్గా జీర్ణ‌మ‌వుతుంది.
  • ఓ క‌ప్పు పెరుగులో నల్ల ఉప్పు క‌లుపుకుని తాగాలి. దీంతో జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. ప్ర‌ధానంగా గ్యాస్‌, అసిడిటీ వంటివి త‌గ్గుతాయి.
  • కొంత వాము తీసుకుని ఓ క‌ప్పు పెరుగులో క‌లిపి తినాలి. దీని వ‌ల్ల నోటి పూత, దంతాల నొప్పి, ఇత‌ర దంత సంబంధ స‌మ‌స్య‌లు పోతాయి.
  • పెరుగులో వివిధ ర‌కాల పండ్ల‌ను క‌లిపి తింటే శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌టిష్ట‌మ‌వుతుంది.
  • పెరుగులో తేనె క‌లిపి తీసుకుంటే క‌డుపులో ఉన్న అల్స‌ర్ల సమస్యల తీరుతుంది.

కూతురికి విషమిచ్చి తల్లిదండ్రుల ఆత్మహత్య..

మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నవాబ్ పేట మండల కేంద్రంలో ఓ కుటుంబం ఆత్హహత్యకు పాల్పడింది. ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్న లక్ష్మీనారాయణ, ఆలివేలమ్మకు నలుగురు సంతానం. కూతురికి విషమిచ్చి తల్లిదండ్రులు గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

10:23 - May 11, 2017

టాలీవుడ్ ప్రముఖ నటుల్లో ఒకరైన 'బాలకృష్ణ' అటు రాజకీయ కార్యక్రమాల్లో బిజీబిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. తన 100వ సినిమా 'గౌతమిపుత్ర శాతకర్ణి' ఘన విజయం సాధించిన అనంతరం ఇతర చిత్రాలపై దృష్టి సారించారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 101 సినిమాకు ఒకే చెప్పిన బాలయ్య తాజాగా 102వ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహించనున్న చిత్రాన్ని సి.కె.ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సి.కళ్యాణ్ నిర్మించనున్నారు. బాలకృష్ణ కెరీర్ లో ఈ చిత్రం నిలిచిపోతుందని, జూన్ నెలాఖరున మొదలు కానుందని సి.కళ్యాణ్ పేర్కొన్నారు. భారీ హంగులతో కె.ఎస్.రవికుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు, ఎం.రత్నం కథ..మాటలు సిద్ధం చేశారని వెల్లడించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలు త్వరలో తెలియనున్నాయి.

10:14 - May 11, 2017

మంథని మార్కెట్ లో మాజీ మంత్రి శ్రీధర్ బాబు..

పెద్దపల్లి : మంథని మార్కెట్ యార్డును మాజీ మంత్రి శ్రీధర్ బాబు సందర్శించారు. రైతుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం చెందిందని, 20 రోజులైనా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

కల్లుతాగి ఒకరు మృతి..

యాదాద్రి : ఆత్మకూరు (ఎం) మండలం తుక్కపురంలో కల్లు తాగి ఐదుగురు అస్వస్థతకు గురయ్యారు. వీరిని హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పత్తిమందు కలిపే కుండలో కల్లు తాగడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది.

తక్కపురంలో కల్లుతాగిన 5గురికి తీవ్రఅస్వస్థత: ఒకరి మృతి

యాదాద్రి: ఆత్మకూరు(ఎం) మండలం తక్కపురంలో కల్లు తాగిన ఐదుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పత్తిమందు కలిపే కుండలోని కల్లు తాగడంతో అస్వస్థతకు గురైనట్లు అనుమానం వ్యక్తం అవుతోంది.

లుధియానాలో అగ్నిప్రమాదం..

పంజాబ్ : లుధియానలోని విజయనగర్ లో ఉన్న ఓ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు శకటాలతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

తెలంగాణ భూసేకరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

హైదరాబాద్: తెలంగాణ భూసేకరణ బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర పడింది. రెండు రోజుల క్రితం కేంద్ర హోంశాఖ అమోదించి, రాష్ట్రపతి పంపిన విషయం తెలిసిందే.

నిషిత్ నారాయణ అంతిమయాత్ర ప్రారంభం

నెల్లూరు: నిషిత్ నారాయణ అంతిమయాత్ర ప్రారంభం అయ్యింది. ఈ అంతిమయాత్ర 11 కి.మీ మేర కొనసాగనుంది. ఈ అంతిమ యాత్రలో టిడిపి నేతలు, మంత్రులు పాల్గొన్నారు. కాసేపట్లో పెన్నా నది సమీపంలో నిషిత్ అంత్యక్రియలు జరగనున్నాయి.

 

09:45 - May 11, 2017

కోల్ కత్తా : కోర్టు ధిక్కారం కేసులో కోల్‌కతా హైకోర్టు జస్టిస్‌ కర్ణన్‌ను అరెస్ట్‌ చేసేందుకు పశ్చిమ బెంగాల్‌ పోలీసులు చెన్నైకి చేరుకున్నారు. అయితే కర్ణన్‌ కాళహస్తికి వెళ్లినట్లు సమాచారం. చెన్నైకి రాగానే కర్ణన్‌ను ఏ క్షణంలోనైనా పోలీసులు అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది. కోర్టు ధిక్కారం కేసులో కర్ణన్‌ను దోషిగా పరిగణిస్తూ సుప్రీంకోర్టు 6 నెలల జైలుశిక్ష విధించిన విషయం తెలిసిందే. జస్టిస్‌ కర్ణన్‌ను వెంటనే అరెస్ట్‌ చేసి జైలుకు పంపాలని పశ్చిమ బెంగాల్‌ డిజిపిని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌ పోలీసులు కర్ణన్‌ను అరెస్ట్‌ చేసేందుకు చెన్నైకి వచ్చారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జెఎస్‌ ఖేహర్‌తో పాటు....ఏడుగురు న్యాయమూర్తులకు ఐదేళ్ల శిక్ష విధిస్తూ వివాదస్పద తీర్పు చెప్పడం ద్వారా జస్టిస్ సిఎస్‌ కర్ణన్‌ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు. దేశ వ్యాప్తంగా 20 మంది న్యాయమూర్తులు అవినీతికి పాల్పడ్డారని కర్ణన్‌ ఆరోపణలు చేశారు.

09:41 - May 11, 2017

హైదరాబాద్: రేపు జరిగే ఎంసెట్ కు ఏర్పాట్లు పూర్తి అయ్యాయని, పరీక్ష రాసేందుకు ఒక్క నిమిషం ఆలస్యం అయినా అనుమతించం అని జేఎన్ టీయూ రిజిస్ట్రార్, ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ యాదయ్య తెలిపారు. ఆయన '10టివి'తో మాట్లాడుతూ ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుందన్నారు. హాల్‌ టికెట్లతో పాటు డౌన్‌లోడ్‌ అప్లికేషన్స్‌ వెంట తెచ్చుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

రాజా రవిచంద్ర మృతదేహాన్ని స్వస్థలం టంగుటూరుకు తరలింపు

ప్రకాశం : టంగుటూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి. మంత్రి నారాయణ కుమారుడితో పాటు చనిపోయిన రాజారవిచంద్ర మృతదేహాన్ని.. స్వస్థలం టంగుటూరు తీసుకురావడంతో అక్కడి వారంతా దుఃఖ సాగరంలో మునిగిపోయారు. కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు అందరినీ కలిచివేశాయి. రాజా రవిచంద్ర పార్థివ దేహానికి స్థానిక శాసన సభ్యుడు స్వామితో పాటు.. టీడీపీ నాయకుడు దామచర్ల సత్య నివాళులు అర్పించారు. రవిచంద్ర కుటుంబ సభ్యులను పరామర్శించారు.

మరికాసేపట్లో నిషిత్‌ అంతిమయాత్ర ప్రారంభం

నెల్లూరు : మరికాసేపట్లో నిషిత్‌ అంతిమయాత్ర ప్రారంభం కానుంది. నారాయణ కళాశాల నుంచి బోడిగాడితోటలోని శ్మశానవాటిక వరకు 8 కిలోమీటర్ల మేర సాగే అంతిమయాత్రలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీడీపీ నేతలు పాల్గొననున్నారు. నిషిత్‌ను కడసారి చూసేందుకు చాలామంది తరలివస్తున్నారు. ఇప్పటికే అనేక మంది ప్రముఖులు నిషిత్‌ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.

మూసాపేటలో ఫ్లైవుడ్ షాపులో దుకాణం

హైదరాబాద్‌: నగరంలోని మూసాపేటలో గల గోవర్థన్‌ ప్లైవుడ్‌, హార్డ్‌వేర్‌ హోల్‌సేల్‌ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చాయి. దుకాణంలో 80శాతం సామాగ్రి అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది. సుమారు రూ.50లక్షల మేర ఆస్తినష్టం సంభవించి ఉండొచ్చని ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు సమాచారం.

09:26 - May 11, 2017

బాహుబలి -2 సినిమా రికార్డుల సృష్టిస్తూ దూసుకపోతోంది. కలెక్షన్ల పరంగా ఎవరికీ అందనంత ఎత్తులో నిలుస్తోంది. విడుదలైన కొద్ది రోజులకే హయ్యస్ట్ గ్రాస్ సాధించిన చిత్రంగా నిలిచింది. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'బాహుబలి' తో టాలీవుడ్ సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాడు. ఈ చిత్రంలో కొన్ని ప్రశ్నలు లేవనెత్తాడు. ఈ ప్రశ్నలకు 'బాహుబలి-2' దొరకుతుందని చెప్పడంతో మరింత ఉత్కంఠ పెరిగిపోయింది. సంవత్సరాల తరబడి షూటింగ్ చేసుకున్న ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. రాజమౌళి దర్శక ప్రతిభకు..ప్రభాస్..ఇతర నటీ నటుల ఫెర్మామెన్స్ కు ప్రశంసలు కురిపిస్తున్నారు. విడుదలైన 12 రోజుల్లోనే ఈ సినిమాకు 12వందల కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. మొన్నటికి మొన్న వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. కేవలం 3 రోజుల్లోనే మరో 2వందల కోట్ల రూపాయల్ని తన ఖాతాలో వేసుకోవడం విశేషం. విదేశాల్లో సైతం ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. మరో ఐదు రోజుల్లో 15 వందల కోట్ల రూపాయల క్లబ్ లోకి చేరుకోవడం సులువేనని విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

09:21 - May 11, 2017

'రక్షకభటుడు' అనే సినిమాలో హనుమంతుడు వేషధారణలో ఉన్న అతను ఎవరు ? అనే దానిపై కొందరు చర్చించుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకపోతున్న 'సుఖీభవ' అధినేత ఏ. గురురాజ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహించారు. 'రక్షకభటుడు' ఎవరనేది 12 న తెలియనుందని చిత్ర యూనిట్ పేర్కొంది. రిచాపనయ్, కాలకేయ ప్రభాకర్, సుప్రీత్, బ్రహ్మానందం, పోసాని ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా తప్పకుడా అందర్నీ అలరిస్తుందని చిత్ర యూనిట్ తెలిపింది. గ్రాఫిక్స్..హార్రర్‌..సస్పెన్స్..అంశాలు ఉత్కంఠను కలిగిస్తాయని నిర్మాత గురురాత్ పేర్కొన్నారు. 'రక్షక భటుడు' టైటిల్‌ మాకు దొరకడం అదృష్టమని, ఆంజనేయ స్వామి పాత్ర కథలో కీలకంగా ఉంటుంది దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ల తెలిపారు. మరి రక్షకభటుడు ఎవరు అనేది 12న తేలిపోనుంది.

09:10 - May 11, 2017
07:15 - May 11, 2017

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్ష పార్టీలైన తెలుగుదేశం, వైఎస్సార్‌సీపీలు ప్రధాని మోదీని ప్రసన్నం చేసుకునేందుకు పోటీ పడుతున్నాయి. ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన టీడీపీకి.. ఎన్డీయేలో ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే.. ప్రతిపక్షమైన వైసీపీ ఇప్పుడు ఎన్డీయేతో సన్నిహితం మెలిగేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీంతో రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారుతాయోనన్న చర్చ మొదలైంది. రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. తమ మద్దతు ఎన్డీయే పక్షానికే ఉంటుందని జగన్‌ ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థిని రంగంలోకి దించకుంటే మంచిదన్న ఉచిత సలహా ఇవ్వడం ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. ఇదే అంశం పై 'న్యూస్ మార్నింగ్' షోలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో టిడిపి నేత దినకర్, వైసీపీ నేత అరుణ్ కుమార్, సీపీఎం నేత ఎంఏ గఫూర్ పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

 

'ఎర్రచందనం స్మగ్లర్లతో చంద్రబాబుకు ముప్పు'

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలపై రాష్ట్ర నిఘా విభాగం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎర్రచందనం స్మగ్లర్లతో చంద్రబాబుకు ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. ఈ మేరకు ఏపీ రెసిడెంట్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు ఢిల్లీ పర్యటనల్లో ఇకపై మెట్రో రైలులో ప్రయాణం మంచిది కాదని, జెడ్ ప్లస్ భద్రత ఉన్నప్పటికీ ‘మెట్రో’ ప్రయాణం ప్రమాదకరమని నిఘా విభాగం హెచ్చరించింది.

పాక్ కాల్పుల్లో మహిళ మృతి

జమ్ముకశ్మీర్‌: దాయాది పాకిస్థాన్‌ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి జిల్లా నౌషెరా సెక్టార్‌లో కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతిచెందింది. ఆమె భర్తకు గాయాలయ్యాయి. కాల్పుల ఘటన కొనసాగుతోంది.

07:00 - May 11, 2017
06:59 - May 11, 2017

మెదక్ : కేంద్రంలో మోదీ పాలన బాగుందని మాజీ డిఫ్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా అన్నారు. తెలంగాణలో బీజేపీ స్టాండ్‌ ఎలా ఉంటుందో చూస్తున్నామని చెప్పారు. మెదక్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. దేశంలో అత్యధిక అవినీతి సీఎం కేసీఆర్‌ అని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షానే చెప్పారన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతు ప్రభుత్వం కాదని రాక్షస ప్రభుత్వమని దామోదర రాజనర్సింహ అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన ఎస్పీ సింగ్‌

జయశంకర్ భూపాలపల్లి : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ సింగ్‌ పరిశీలించారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌ మండలంలో జరుగుతున్న మేడిగడ్డ రిజర్వాయర్‌ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ ప్రాజెక్టు పనులను ఏడాదిన్నరలో పూర్తి చేయాలని నిర్ణయించినట్టు ఎస్‌పీ సింగ్‌ చెబుతున్నారు.

06:57 - May 11, 2017

జయశంకర్ భూపాలపల్లి : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ సింగ్‌ పరిశీలించారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌ మండలంలో జరుగుతున్న మేడిగడ్డ రిజర్వాయర్‌ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ ప్రాజెక్టు పనులను ఏడాదిన్నరలో పూర్తి చేయాలని నిర్ణయించినట్టు ఎస్‌పీ సింగ్‌ చెబుతున్నారు.

06:52 - May 11, 2017

గుంటూరు: అమరావతిలో ఈనెల 16నుంచి ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 9గంటల 45 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సభ ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. జీఎస్టీ బిల్లుపై ప్రధానంగా చర్చ జరగనుంది.

06:50 - May 11, 2017

అమరావతి: టిటిడి చైర్మన్‌ పదవి...తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ పదవంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కేబినెట్‌ మంత్రి పదవి కంటే పదింతలు ఉన్నతంగా భావించే టిటిడి చైర్మన్‌ పదవిని దక్కించుకునేందుకు అనేకమంది పోటీపడుతుంటారు. అయితే ప్రస్తుత టిటిడి పాలకమండలి రెండేళ్ల గడువు ఇప్పటికే ముగియడంతో ప్రభుత్వం కొత్త పాలకమండలి కోసం కసరత్తును ముమ్మరం చేసింది. దీంతో చైర్మన్‌ పదవిని దక్కించుకునేందుకు నేతలు పోటీపడుతున్నారు. అయితే ప్రధానంగా చైర్మన్ రేసులో ముగ్గురు నేతల పేర్లు ప్రముఖంగా విన్పిస్తున్నాయి. వారిలో ఎంపీలు రాయపాటి సాంబశివరావు, మురళీ మోహన్‌ ఉండగా..ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు సైతం పోటీపడుతున్నారు.

ప్రయత్నాలు చేస్తున్న ముగ్గురు ప్రముఖ నేతలు .....

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం అమెరికా నుంచి తిరిగొచ్చిన తర్వాతే.. దీనిపై ఓ క్లారిటీ రానుంది. అయితే ఇప్పటికే ఈ పదవిని దక్కించుకునేందుకు ఈ ముగ్గురు నేతలు తమ ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తున్నారు. వీరిలో మొదటి వరుసలో ఎంపీ రాయపాటి సాంబశివరావు ఉన్నారు. టిటిడికి చైర్మన్‌గా సేవ చేయడమే తన జీవిత ధ్యేయం అంటూ రాయపాటి ఎన్నోసార్లు బహిరంగంగా ప్రకటించారు. ఇక మిస్టర్‌ క్లీన్‌గా పేరొందిన ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు కూడా చైర్మన్‌ రేసులో ముందున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన గాలికి ఆరుస్తార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడమే కాకుండా తిరుమలలో గట్టి పట్టున్న నేతగా పేరు సంపాదించారు. ఇటీవల మంత్రి వర్గ విస్తరణలో చోటు దక్కకపోవడంతో చైర్మన్‌ పదవి ఇస్తే మంచిదనే అభిప్రాయం మొదలైంది. ఇక మరో ఎంపీ మురళీ మోహన్‌..కూడా చైర్మన్‌ పదవి కోసం చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. అయితే స్వతహాగా..మురళీ మోహన్‌ ఎవరికి అందుబాటులో ఉండడనే పేరుంది. దీంతో ఆయనకు చైర్మన్‌గిరి దక్కడం అంత సులువుకాదనే విషయం పార్టీలో బలంగా వినిపిస్తోంది.

ఆ ఇద్దరిని తిరిగి నియమించే అవకాశం....

ఇదిలా ఉంటే బోర్డు సభ్యులు ఏవీ రమణతో పాటు తెలంగాణకు చెందిన సండ్ర వెంకట వీరయ్యను బోర్డు సభ్యులుగా తిరిగి నియమించే అవకాశం ఉంది. ఇక భారత్‌ బయోటిక్‌కు చెంది సుచిత్ర ఎల్లా, కళా రంగం నుంచి రాఘవేంద్రరావులను మరోమారు పాలకమండలి సభ్యులుగా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఓవైపు పాలకమండలి ఏర్పాటుపై కసరత్తు కొనసాగుతుంటే..మరోవైపు టిటిడికి కొత్త ఈఓగా ఉత్తరాదికి చెందిన సింఘాల్‌ను నియమించడంపై కొందరు స్వామిజీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలుగు ఐఏఎస్‌లు అయితే ఇక్కడి సాంప్రదాయాలు, భక్తుల విన్నపాలపై అవగాహన ఉంటుందని చెప్తున్నారు. ఏది ఏమైనా...టిటిడి పాలకమండలి నియామకం అనేది సీఎం చంద్రబాబు అమెరికా నుంచి తిరిగొచ్చిన తర్వాతే ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కన్నీటి పర్యంతం అయిన మంత్రి నారాయణ...

నెల్లూరు : కుమారుడు నిషిత్‌ పార్థివ దేహాన్ని చూసి మంత్రి నారాయణ కన్నీటి పర్యంతమయ్యారు. నిషిత్‌ మరణవార్త తెలుసుకుని.. లండన్‌ పర్యటనలో ఉన్న నారాయణ హుటాహుటిన నెల్లూరు తరలివచ్చారు. నిషిత్‌ పార్థివదేహాన్ని చూసి ఒక్కసారి ఉద్వేగానికి లోనయ్యారు. ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదంటూ విలపించారు. సహచర మంత్రులు, కుటుంబ సభ్యులు నారాయణను ఓదార్చారు. మరో వైపు ఈ రోజు ఉదయం 10.30 నిమిషాలకు నిషిత్ అంతిమయాత్ర ప్రారంభం కానుందని కుటుంబ సభ్యులు తెలిపారు.

06:46 - May 11, 2017

హైదరాబాద్: పాఠశాలల రేషనలైజేషన్‌కు తెలంగాణ సర్కార్‌ శ్రీకారం చుడుతోంది. విద్యార్థులు తక్కువగా ఉన్న స్కూళ్లను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలలు పునః ప్రారంభమయ్యే నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు రంగం సిద్దం చేస్తోంది. అయితే.. ప్రభుత్వ నిర్ణయాన్ని విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు తప్పుపడుతున్నారు.

స్కూళ్ల రేషనలైజేషన్ కు టీ.సర్కార్ శ్రీకారం

హైదరాబాద్: తెలంగాణలో ఉపాధ్యాయ, విద్యార్థుల నిష్పత్తి ఆధారంగా.. ప్రభుత్వ స్కూళ్ల ప్రక్షాళనకు సర్కార్‌ నడుం బిగించింది. విద్యార్థుల సంఖ్య నామమాత్రంగా ఉన్న స్కూళ్లను మూసివేయాలని నిర్ణయించింది. 20 మంది మాత్రమే విద్యార్థులున్న స్కూళ్లను రద్దు చేస్తూ.. ఆ విద్యార్థులను సమీపంలోని పాఠశాలలో చేర్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పాఠశాలలు పునః ప్రారంభమయ్యేనాటికి రేషనలైజేషన్‌ ప్రక్రియ పూర్తి చేసేందుకు సర్కార్‌ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు అధికారులకు ఉత్తర్వులందాయి.

రాష్ట్రంలో 25,966 ప్రభుత్వ పాఠశాలలుండగా..

రాష్ట్రంలో 25,966 ప్రభుత్వ పాఠశాలలుండగా.. 2016-17 విద్యా సంవత్సరం అధికారిక లెక్కల ప్రకారం 460 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. మరో 4,137 బడుల్లో 20 లోపు విద్యార్థులు మాత్రమే ఉన్నట్లు విద్యాశాఖ గుర్తించింది. అయితే ఈ పాఠశాలల్లో 6,109 మంది ఉపాధ్యాయులున్నారు. గతేడాదే పాఠశాలల విలీనం, టీచర్ల రేషనలైజేషన్‌ నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గింది. కానీ ఈ ఏడాది తప్పనిసరిగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఆ జాబితాలో ఎక్కువ శాతం ప్రాథమిక పాఠశాలలే ..

అయితే.. సర్కార్‌ రేషనలైజేషన్‌ జాబితాలో ఎక్కువ శాతం ప్రాథమిక పాఠశాలలే ఉన్నాయి. దీనికి ఆయా గ్రామాల సర్పంచులు, పాఠశాల నిర్వహణ కమిటీలతోనూ మాట్లాడి.. విలీనానికి సహకరించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అందుకోసం మూతబడనున్న గ్రామాల నుంచి పక్క గ్రామాలకు వెళ్లేందుకు విద్యార్థులు ట్రావెలింగ్‌ చార్జీలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అలాగే రాష్ట్రంలోని 3,240 ప్రాథమికోన్నత పాఠశాలలుండగా.. 40 మంది విద్యార్థులు ఉన్న 358 పాఠశాలలను దగ్గరలోని హైస్కూళ్లలో విలీనం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉపాధ్యాయులను అవసరమైతే విలీనం చేసే స్కూళ్లలో.. లేకుంటే వేరే పాఠశాలలకు బదిలీ చేయాలని యోచిస్తోంది.

రేషనలైజేషన్‌తో ఉపాధ్యాయ ఖాళీలపై ప్రభావం పడే అవకాశం...

రేషనలైజేషన్‌తో ఉపాధ్యాయ ఖాళీలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో 7,892 టీచర్‌ పోస్టులను భర్తీ చేస్తామని పాలకులు చెబుతున్నా.. క్రమబద్దీకరణ జరిగితే సగం పోస్టులు తగ్గే అవకాశం ఉందని అధికారులంటున్నారు. ఇదిలావుంటే.. సర్కారు బడుల్లో సరైన వసతులు కల్పించి.. వాటి బలోపేతానికి కృషి చేయకుండా.. బడులను మూసివేతకు ఆదేశాలివ్వడాన్ని విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నేతలు తప్పుపడుతున్నారు.

స్కూళ్ల రేషనలైజేషన్ కు టీ.సర్కార్ శ్రీకారం

హైదరాబాద్: పాఠశాలల రేషనలైజేషన్‌కు తెలంగాణ సర్కార్‌ శ్రీకారం చుడుతోంది. విద్యార్థులు తక్కువగా ఉన్న స్కూళ్లను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలలు పునః ప్రారంభమయ్యే నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు రంగం సిద్దం చేస్తోంది. అయితే.. ప్రభుత్వ నిర్ణయాన్ని విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు తప్పుపడుతున్నారు.

06:44 - May 11, 2017

హైదరాబాద్: ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ.. ప్రతిపక్షానికి ప్రత్యేక గౌరవం ఉంటుంది. అసెంబ్లీలో సభానాయకుడికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో.. ప్రతిపక్ష నేతకు అంతే ప్రాధాన్యత ఉంటుంది. దీన్ని ప్రతిపక్షం ఎంత ఉపయోగించుకుంటే.. అది ఆ పార్టీకి అంత లాభం చేకూరుస్తుంది. ఇప్పుడు ఇదే అంశం తెలంగాణ కాంగ్రెస్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రభుత్వ పనితీరును ఎప్పటికప్పుడు ఎండగట్టాల్సిన సీఎల్పీ.. ఆ విధంగా వ్యవహరించడం లేదనే అభిప్రాయం హస్తం నేతలను వెంటాడుతోంది.

జానారెడ్డి ఆ దిశగా వ్యవహరించడం లేదనే అభిప్రాయం...

టీఆర్‌ఎస్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం లేదని కాంగ్రెస్‌ నేతలు ప్రతిరోజు విమర్శిస్తున్నారు. కేసీఆర్‌ ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. అయితే.. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లి.. తమ పార్టీ బలాన్ని పెంచుకోవాల్సిన సీఎల్పీ ఆ పని చేయడం లేదని నేతలు భావిస్తున్నారు. సీఎల్పీ లీడర్‌గా ఉన్న జానారెడ్డి ఆ దిశగా వ్యవహరించడం లేదనే అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది.

జానారెడ్డి పనితీరుపై హస్తం నేతల్లో చర్చ...

ప్రస్తుతం సీఎల్పీ నేత జానారెడ్డి పనితీరుపై హస్తం నేతలు చర్చించుకుంటున్నారు. గతంలో సీఎల్పీ నేతలుగా పని చేసిన పీజేఆర్‌, వైఎస్‌ఆర్‌లు ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడితే.. జానారెడ్డి అందివచ్చిన అవకాశాలను సైతం వదిలేస్తున్నారని నేతలు గుసగుసలాడుకుంటున్నారు. పీజేఆర్‌, వైఎస్‌ఆర్‌లు ప్రతిరోజు సీఎల్పీ కార్యాలయానికి వచ్చి.. అంశాలవారీగా ప్రభుత్వ తీరును ఎండగట్టిన విధానాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు జానారెడ్డి మాత్రం అసెంబ్లీ సమావేశాలు ఉన్న సమయంలో తప్ప.. మిగతా రోజుల్లో సీఎల్పీ కార్యాలయానికి రాకపోవడాన్ని పార్టీ వర్గాలు తప్పుపడుతున్నాయి. ఎంతో అనుభవం ఉన్న జానారెడ్డి.. ఎమ్మెల్యేలకు అనేక అంశాల్లో అవగాహన కల్పించి ప్రభుత్వంపై పోరాటం చేసే విధంగా చూడాల్సింది పోయి.. ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారో అర్ధం కావడం లేదని నేతలంటున్నారు. ఇక అసెంబ్లీలోనైనా దూకుడుగా ఉంటారా ? అంటే అది కూడా లేదని నిరాశ చెందుతున్నారు.

సీఎల్పీ దూకుడుతో అధికారాన్ని సొంతం చేసుకున్న హస్తం..

గతంలో సీఎల్పీ దూకుడుతో అధికారాన్ని సొంతం చేసుకున్న హస్తం నేతలకు.. ప్రస్తుత పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. పార్టీ నేతల అసంతృప్తి నేపథ్యంలో జానారెడ్డి తన తీరును మార్చుకుంటారా ? లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

06:41 - May 11, 2017

హైదరాబాద్: తెలంగాణలో 4637 ప్రభుత్వ స్కూళ్ల మూసివేతకు రంగం సిద్ధమైనట్టు వస్తున్న వార్తలు వస్తుండడంతో విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. ఇలాంటి ఆలోచనలను విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణలో 25,966 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. 4137 స్కూళ్లల్లో 20మంది కంటే తక్కువ విద్యార్థులున్నట్టు తెలుస్తోంది. వీటిలో ఆరువేలమందికి పైగా టీచర్లు పనిచేస్తున్నారు. 20 కంటే తక్కువ మంది విద్యార్థులన్న స్కూళ్లను ఇతర స్కూళ్లల్లో కలిపేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. సర్కారీ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడానికి కారణం ఏమిటి? తక్కువ మంది విద్యార్థులున్న స్కూళ్లను మూసివేయడాన్ని విద్యార్థి సంఘాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో తెలంగాణ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కోట రమేష్ పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

06:40 - May 11, 2017

నెల్లూరు : కుమారుడు నిషిత్‌ పార్థివ దేహాన్ని చూసి మంత్రి నారాయణ కన్నీటి పర్యంతమయ్యారు. నిషిత్‌ మరణవార్త తెలుసుకుని.. లండన్‌ పర్యటనలో ఉన్న నారాయణ హుటాహుటిన నెల్లూరు తరలివచ్చారు. నిషిత్‌ పార్థివదేహాన్ని చూసి ఒక్కసారి ఉద్వేగానికి లోనయ్యారు. ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదంటూ విలపించారు. సహచర మంత్రులు, కుటుంబ సభ్యులు నారాయణను ఓదార్చారు. మరో వైపు ఈ రోజు ఉదయం 10.30 నిమిషాలకు నిషిత్ అంతిమయాత్ర ప్రారంభం కానుందని కుటుంబ సభ్యులు తెలిపారు. నారాయణ కళాశాల నుంచి బోడిగాడితోటలోని శ్మశానవాటిక వరకు 8 కిలోమీటర్ల మేర సాగే అంతిమయాత్రలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీడీపీ నేతలు పాల్గొననున్నారు. నిషిత్‌ను కడసారి చూసేందుకు చాలామంది తరలివస్తున్నారు. ఇప్పటికే అనేక మంది ప్రముఖులు నిషిత్‌ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.

06:39 - May 11, 2017

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్ష పార్టీలైన తెలుగుదేశం, వైఎస్సార్‌సీపీలు ప్రధాని మోదీని ప్రసన్నం చేసుకునేందుకు పోటీ పడుతున్నాయి. ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన టీడీపీకి.. ఎన్డీయేలో ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే.. ప్రతిపక్షమైన వైసీపీ ఇప్పుడు ఎన్డీయేతో సన్నిహితం మెలిగేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీంతో రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారుతాయోనన్న చర్చ మొదలైంది.

ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీని కలిసిన వైఎస్‌ జగన్‌..

ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీని కలిసిన వైఎస్‌ జగన్‌.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. అలాగే రైతు సమస్యలను కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఇక రాష్ట్ర రాజకీయాలతో పాటు.. జాతీయ రాజకీయాలను కూడా ప్రధానితో వైసీపీ నేతలు చర్చించారు. రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. తమ మద్దతు ఎన్డీయే పక్షానికే ఉంటుందని జగన్‌ ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థిని రంగంలోకి దించకుంటే మంచిదన్న ఉచిత సలహా ఇవ్వడం ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది.

సాధారణ ఎన్నికల నాటికి రాష్ట్రంలో పరిస్థితులు ఎలా మారినా..

సాధారణ ఎన్నికల నాటికి రాష్ట్రంలో పరిస్థితులు ఎలా మారినా.. తాము ఎన్డీయేకు అనుకూలంగా ఉన్నామనే సంకేతాలను వైసీపీ ఇస్తోంది. అదేవిధంగా కేంద్రంతో సయోధ్యగా ఉంటే.. ఎలాంటి ఇబ్బందులు ఉండవనే అభిప్రాయం కూడా ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. అయితే.. ఆంధ్రప్రదేశ్‌లో తాము బలహీనపడినా.. జాతీయ రాజకీయాల్లో వైసీపీ మద్దతు కూడా పొందవచ్చని బీజేపీ స్నేహహస్తం అందించేందుకు రెడీగా ఉందన్న ప్రచారం ఎప్పటినుంచో జరుగుతోంది. ఇప్పుడు జగన్‌ పర్యటనతో అది బలపడినట్లయింది. మరోవైపు అన్ని వ్యవహారాల్లో దూకుడుగా కనిపించే జగన్‌.. ప్రధానితో భేటీ అనంతరం చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే... అంతర్మథనంలో పడ్డారా ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి వైసీపీ, బీజేపీ స్నేహబంధంతో ఎవరికి లాభం చేకూరుతుందో చూడాలి!

Don't Miss