Activities calendar

12 May 2017

21:42 - May 12, 2017

కొలంబో : శ్రీలంకలోని తమిళులకు ప్రధానమంత్రి నరేంద్రమోది వరాలజల్లు కురిపించారు. తమిళులు ఎక్కువగా నివసించే డికోయలో 150 కోట్ల భారత ఆర్థిక సహాయంతో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు. నూర్వుడ్‌ మైదానంలో జరిగిన సభలో తమిళుల ఉద్దేశించి మోది ప్రసంగించారు. తేయాకు ఎగుమతుల్లో శ్రీలంక మూడో స్థానంలో ఉందంటే అదంతా తమిళ కార్మికులు చేస్తున్న కృషేనని కొనియాడారు. లంకలో నివసిస్తున్న తమిళుల సంరక్షణ కోసం భారత ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. తమిళులకు 10వేల ఇళ్లను కట్టిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. ప్రస్తుతం శ్రీలంకలోని ఉత్తర, దక్షిణ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న 1990 ఎమర్జెన్సీ అంబులెన్స్ సేవలను దేశ వ్యాప్తంగా విస్తరిస్తామని మోదీ హామీ ఇచ్చారు. శ్రీలంక పర్యటనలో భాగంగా ప్రధాని తొలుత కొలంబోలో జరిగిన బౌద్ధుల అంతర్జాతీయ వెసక్‌ పర్వదిన వేడుకల్లో పాల్గొన్నారు. మోదీకి శ్రీలంక ప్రధాని రాణిల్‌ విక్రమసింఘే సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. నేటితో ప్రధాని రెండు రోజుల శ్రీలంక పర్యటన ముగియనుంది.

 

21:39 - May 12, 2017

 హైదరాబాద్ : తెలంగాణలో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్‌ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 10 గంటలకు జరిగిన ఇంజినీరింగ్‌ పరీక్షకు రెండు రాష్ట్రాల్లో కలిసి 2,20,248 మంది విద్యార్థులు హాజరయ్యారైనట్లు సమాచారం. రెండు రాష్ట్రాల్లో కలిపి 400 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. ఇందులో ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లో 246 సెంటర్లు, అగ్రికల్చర్‌ మెడికల్ స్ట్రీమ్‌లో 154 సెంటర్లలో పరీక్ష నిర్వహించారు. అలాగే ఏపీలో మూడు, తెలంగాణలో 24 రీజినల్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇంజనీరింగ్‌ విభాగానికి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు,.అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసి విభాగాలకు మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి సాయంత్రం ఐదున్నర వరకు ఎంసెట్‌ను నిర్వహించారు. గత ఎంసెట్‌ అనుభవాల దృష్ట్యా ఈ సారి అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

వన్ మినిట్ నిబంధన...
చేతి గడియారం, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులపై నిషేధం విధించారు. బయోమెట్రిక్ అటెండెన్స్‌ ఉన్నందున విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకున్నారు. ఇక ఎప్పటిలాగే ఈసారి కూడా వన్‌ మినిట్‌ లేట్‌ నిబంధనను ఖచ్చితంగా అమలు చేయడంతో విద్యార్థులు ఉరుకులు పరుగులు పెట్టారు. కొంతమంది విద్యార్థులు వివిధ కారణాలతో సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోలేక కన్నీళ్ల పర్యంతమయ్యారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

21:34 - May 12, 2017

హైదరాబాద్ : ఖమ్మం జిల్లాలో రైతులకు బేడీలు వేసిన ఘటనపై టీకాంగ్రెస్‌ నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ నరసింహన్‌ను కోరారు. వరి, మిర్చి, సోయా, కంది, మొక్కజొన్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకలో మాదిరిగా గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరినట్లు చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు వెయ్యికోట్లతో నిధి ఏర్పాటు చేయాలని కోరినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.

21:32 - May 12, 2017

నెల్లూరు : టీడీపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి ఇంటిపై సీబీఐ దాడులు చేసింది. ప్రాజెక్టుల పేరుతో లోన్లు తీసుకుని ఎగ్గొట్టి మోసం చేశారంటూ ఇండస్ట్రీయల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫిర్యాదుతో సీబీఐ ఈ దాడులు చేసింది. వివిధ స్థిరాస్తులను తాకట్టుపెట్టి వాకాటికి చెందిన బీఎన్నార్ ఇన్ఫ్రా స్ట్రక్చర్స్ 2014-15లో 190 కోట్ల రుణాన్ని పొందింది. ఆ తర్వాత ఎగ్గొట్టింది. దీంతో తమకు 205 కోట్ల నష్టం వచ్చిందని ఐఎఫ్‌సీఐ లిమిటెడ్ సీబీఐకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు..నెల్లూరుతోపాటు హైదరాబాద్, బెంగుళూరులో వాకాటికి చెందిన నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. సోదాల్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. వీఎన్ఆర్‌ ఇన్‌ఫ్రా తదితర కంపెనీల పేరుతో ఆయన సుమారు 450 కోట్ల వరకు రుణాలు తీసుకుని, డీఫాల్టర్‌గా మారడంతో బ్యాంకులు నోటీసులు పంపాయి.

21:29 - May 12, 2017

రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా యాచారం మండలం సాగర్‌ రోడ్డుపై ప్రయాణిస్తున్న కారులో మంటలంటుకున్నాయి.. ఇండికా కారుపై 11 కేవీ విద్యుత్‌ వైరు తెగిపడింది. వెంటనే మంటలు అంటుకోవడంతో కారులోఉన్న మహిళ సజీవదహనమైంది.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

ఏషియన్ రెజ్లింగ్ లో సాక్షిమాలిక్ కు రజితం

ఢిల్లీ : ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియనషిప్ లో భారత రెజ్లర్ సాక్షి మాలిక్ రజితం గెలుచుకుంది. 60 కిలోల ఫీస్టైల్ విభాగంలో ఫైనల్లో ఓడిన సాక్షి మాలిక్ , జపాన్ రెజ్లర్ రిసాకో కవాయ్ చేతిలో 0-10 తేడాతో ఓటమి చెందింది.

 

హయత్ నగర్ లో దారుణం

రంగారెడ్డి : జిల్లా హయత్ నగర్ మండలం కోహెడలో దారుణం జరిగింది. బావ యాదగిరిపై బావమరిది కత్తితో దాడి చేశాడు. అడ్డుకోవడానికి యత్నించిన శ్రీశైలం అనే వ్యక్తిపైనా దాడి చేశాడు. అక్కడికక్కడే బావ యాదగిరి మృతి చెందాడు. శ్రీశైలంకు తీవ్రగాయాలు అయ్యాయి. బావ రెండో పెళ్లి చేసుకోవడం సిద్ధం అవుతుండడంతో ఈ దాడి చేశాడని తెలుస్తోంది.

యాచారంలో రోడ్డు ప్రమాదం

 రంగారెడ్డి : జిల్లాలోని యాచారంలో మండలం సాగర్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. రోడ్డుపై 11కేవీ విద్యుత్ వైర్ ఇండికా కారుపై తెగిపడింది. ఈ ఘటనలో కారు దగ్ధం అవడంతో ఓ మహిళ సజీవదహనం అయింది. నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి.

నగరంలో హోర్డింగ్ లు, ఫ్లెక్సీలపై నిషేధం

 హైదరాబాద్ : నగరంలో హోర్డింగ్ లు, ఫ్లెక్సీల జీహెచ్ ఎంసీ నిషేధించంది. భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉండటంతో జూన్ 15 వరకు ఫ్లెక్సీలను నిషేధిస్తూ నిర్ణయం.

 

ఏపీ పోలీసు కానిస్టేబుల్ ఫలితాలు విడుదల

తూర్పు గోదావరి : ఏపీ పోలీసు కానిస్టేబుల్ ఫలితాలను హోం మంత్రి చనరాజప్ప రాజమహేంద్రవరంలో విడుదల చేశారు. కానిస్టేబుల్ పోస్టులకు 5,342 మంది ఎంపిక అయినట్టు మంత్రి తెలిపారు. కొత్త కానిస్టేబుళ్లకు త్వరలో శిక్షణ ప్రారంభిస్తామని ఆయన అన్నారు.

 

తూర్పుగోదావరిలో పైపు లైన్ లీకేజీ

తూర్పు గోదావరి : జిల్లాలోని సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెంలో ఓఎన్జీసీ పైపు లైన్ లీకేజీ అయింది. లీకేజీతో క్రూడ్ ఆయిల్ ఎగిసిపడుతోంది. లీకేజీ అదుపు చేసేందుకు ఓఎన్జీసీ సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు.

తిరుమల వరాహస్వామి అతిథి గృహం వద్ద ప్రమాదం

చిత్తూరు : తిరుమలలోని వరాహస్వామి అతిథి గృహం వద్ద ప్రమాదం జరిగింది. ఓ టాటాసూమో 10 ఏళ్ల బాలుడిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలు కావటంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

బాన్సువాడలో ఈదురుగాలులతో వర్షం

కామారెడ్డి : జిల్లాలోని బాన్సువాడలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. వర్షంతో మార్కెట్ యార్డులో ధాన్యం తడిసి ముద్దయింది. ధాన్యం తడవడంతో రైతులు ఆందోళనతో ఉన్నారు.

20:04 - May 12, 2017

పోరాటం అంటే ఎలా ఉండాలో ఆమె ఓ ఉదాహరణ..ఆకాశం విరిగి మీదపడుతున్నా...ఎలా తట్టుకుని నిలబడాలో ఆమెజీవితం చెప్తుంది. కాళ్ల కింద భూమి కదిలిపోతున్నా, ఎలా బలపడాలో ఆమె స్థైర్యం చెప్తుంది.. ఈ దేశంలో అభాగ్య మహిళకు న్యాయం జరగాలంటే ఎంత కష్టసాధ్యమో ఆమె సల్పిన పోరాటం చెప్తుంది. బిల్కిస్ బానో.. స్వతంత్ర భారతంలో తమకు జరిగే దారుణాలపై పోరాటం సల్పే అభాగ్య మహిళలందరికీ ఓ రోల్ మోడల్. చెరగని స్ఫూర్తి. 15ఏళ్లు పోరాడి గెలిచింది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

20:00 - May 12, 2017

తెలంగాణ రాష్ట్రం వచ్చినంక అసలు ధర్నాలే ఉండొద్దు అసొంటి గొప్పతెలంగాణను నిర్మించుకుందామంటే..ఓహో ప్రజల అవసరాలన్ని తీరుస్తడేమో ఇగ తీర్చినంక ధర్నాలెందుకని ఆడున్నోళ్లు సప్పట్లు గొట్టిండ్రు...తెలంగాణల అన్నదాత ఆకలి మంట ఆరుతట్టులేదు ఇప్పట్ల.. ఏదో ఒక జిల్లాల ఏదో ఒక జాగ రోజు రైతు రగిలిపోతనే ఉన్నడు.. ఈవీఎం మిషీన్ల పంచాది ఇయ్యాళ మళ్ల లేశింది.. మనదేశంల వాడుతున్న ఈవీఎంలు ఆగమాగమున్నయ్..మన మల్లన్న ముచ్చట్లు జూస్తున్న పబ్లీకు జర్ర గీ ముచ్చట మీరు బాగ ఇనాలే.. వర లక్ష్మీకి.. వీరలక్ష్మీకి.. ఏం తేడా ఉన్నది.. వకు గుడి దీర్గం వచ్చి వీర లక్ష్మీ అయ్యింది గదా..? సోషల్ మీడియా వచ్చినంక.. ఒక్కొక్క సెల్ ఫోన్ ఒక టీవీ ఛానెల్ అయిపోయింది..అరే పొన్నం ప్రభాకరన్న ముచ్చట యాదికొస్తె ఫస్టు మనకు గుర్తుకొచ్చేది ఏంది మాన దిమాకంత పార్లమెంటుకు ఉర్కుతది...

19:41 - May 12, 2017

దేశంలో ఐటీ ఉద్యోగుల తొలగింపు పై టెన్ టివిలో చర్చ జగిరింది. అటోమెషన్ తో ఐటీ ఉద్యోగులు తొలగిస్తున్నారని ఆర్థిక నిపుణుడు పాపరావు అన్నారు. టాలెంట్ ఉన్న ఉద్యోగులన తొలించడం దారుణమని ఐటీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు కిరణ్ అన్నారు. ఐటీ ఉద్యోగుల తొలగింపు సాధారణమై చర్య గ్లోబల్ ప్రెసిడెంట్ రాణా ప్రకాష్ అన్నారు. ఐటీ ఉద్యోగుల్లో అభద్రత భావం నెలకొందని ఫోరం ఆఫ్ ఐటీ ఫ్రొఫెషనల్ లళిని కాంత్ అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

19:36 - May 12, 2017
19:14 - May 12, 2017

చైనా : చైనాలో టూ వీలర్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి ట్రక్‌ను ఢీకొన్న ఘటనలో తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. చైనాలోని జియాంగ్జి ప్రావిన్స్‌ నాన్‌చాంగ్‌ వద్ద రోడ్డుపైకి వస్తున్న ఓ ట్రక్‌ను ద్విచక్రవాహనం ఢీకొట్టింది. టూ వీలర్‌ను నడుపుతున్న వ్యక్తి నియంత్రణ కోల్పోవడంతో ఆ ట్రక్‌కి దిగువభాగంలో ఉన్న ఆయిల్‌ ట్యాంక్‌ను ఢీకొట్టడంతో క్షణాల్లో మంటలు చెలరేగాయి. ట్రక్‌తో పాటు టూవీలర్‌ నడిపిన వ్యక్తికీ మంటలు అంటుకున్నాయి. వెంటనే తేరుకున్న అతను పక్కకు దూకేశాడు. మంటల్లోంచి పక్కకు దూకడం ఏమాత్రం ఆలస్యమైనా అతను సజీవ దహనం అయ్యేవాడు. ఈ ఘటన మొత్తం సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయింది.

 

19:10 - May 12, 2017

చెన్నై : తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు ముంబై నుంచి బెదిరింపులు వచ్చాయి. హాజి మస్తాన్‌ కుమారుడు సుందర్‌ శేఖర్‌ రజనీకాంత్‌కు లేఖ రాశాడు. హాజిమస్తాన్‌ జీవితం ఆధారంగా రజనీకాంత్‌ 'గాడ్‌ఫాదర్‌' సినిమా తీస్తున్నారని...ఈ పాత్రలో ఏమాత్రం తేడాలున్న పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సుందర్‌ శేఖర్‌ హెచ్చరించాడు. హాజీ మస్తాన్‌ను అండర్‌ వరల్డ్‌ డాన్, స్మగ్లర్‌గా చిత్రీకరించడాన్ని ఆయన తప్పు పట్టారు. హాజీమస్తాన్‌ను ఇంతవరకు కోర్టు కూడా దోషిగా నిలబెట్టలేదని శేఖర్‌ గుర్తుచేశాడు. హాజీమస్తాన్‌ ఓ రాజకీయ పార్టీ ఏర్పాటు చేశారని... ఆ పార్టీ ఇప్పటికీ ఉందన్నారు. హాజీమస్తాన్‌ వ్యక్తిత్వానికి భిన్నంగా సినిమా తీస్తే ఊరుకునేది లేదని...అందుకు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించాడు.

19:07 - May 12, 2017

కడప : ఆరుగాలం శ్రమ పడి సాగు చేసిన పసుపు పంటకు గిట్టుబాటు ధర రాక కడప రైతాంగం అల్లాడుతుంది. జిల్లాలో మైదుకూరు నియోజక వర్గంలో పసుపును అత్యధికంగా పండిస్తారు. అయితే ఈ సారి తగిన ధర లేకపోవడంతో పసుపు నిల్వలతో గోదాములు నిండిపోయాయి. మద్దతు ధర ఇచ్చి..పసుపు కొనుగోలు చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు వాపోతున్నారు. రాష్ట్రంలోని ముఖ్యమైన వ్యవసాయ మార్కెట్‌ కమిటీల్లో కడప ఒకటి. అయితే పసుపు ధర అమాంతంగా పడిపోవడంతో ఇక్కడ కొనేవాళ్లు కరువయ్యారు. రైతుల కష్టాలు తీర్చే నేపథ్యంలో గిట్టుబాటు ధర ఇచ్చి పసుపును కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చినా...రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోళ్లు చేసేందుకు సంకల్పించింది. నాణ్యతను బట్టి పసుపును రెండు గ్రేడ్లుగా నిర్ణయించింది. మొదటి రకం 6వేల 500 ... రెండో రకం 6000 రూపాయల ప్రకారం కొనుగోళ్లును ప్రారంభించింది. అది మొదటి రకం పసుపును మాత్రమే అధికారులు తీసుకుంటున్నారు. దీంతో రెండో రకం పసుపు ఏమి చేయాలో రైతులకు అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.

బి గ్రేడ్‌ తీసుకునేవారు ఎవరు...
బి గ్రేడ్‌ రకం తీసుకోమంటే ఉన్నతాధికారుల నుంచి ఇంకా సంకేతాలు రాలేదని ఇక్కడి అధికారులు చెబుతున్నారు. బి గ్రేడ్‌ రకం పసుపును సాధారణ వ్యాపారులు కూడా తీసుకోవడం లేదు. అంతేకాకుండా కొనుగోళ్ల వ్యవహారంలో పెట్టిన నిబంధనలు రైతులకు ఆవేదన మిగుల్చుతున్నాయి. పసుపు కొనుగోళ్లకు సంబంధించి రైతుల నుంచి అధికారులు పలు ధ్రువీకరణ పత్రాలను తీసుకుంటున్నారు. దీంతో కౌలు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. కాగా రోజుకు రెండు వేల క్వింటాళ్లు పసుపును కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చినా .. గురువారం కేవలం 180 క్వింటాళ్లు మాత్రమే అధికారులు తీసుకున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని...రైతులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది.

19:03 - May 12, 2017

ఖమ్మం : మిర్చి రైతుల సమస్యపై ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని తెలంగాణ టీడీపీ నిర్ణయించింది. దీనిలో భాగంగా శనివారం ఖమ్మం కలెక్టరేట్‌ దగ్గర తెలుగుదేశం నేతలు ఒకరోజు దీక్ష చేపడతారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు పలువురు నేతల ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మిర్చి యార్డు ఘటనలో రైతులకు బేడీలు వేయడంపై టీఆర్ఎస్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని, రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని తెలంగాణ టీడీపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

19:00 - May 12, 2017

హైదరాబాద్ : ధర్నా చౌక్‌ను తరలించొద్దంటూ తెలంగాణలో ఆందోళనలు మరింత ఉధృతమవుతున్నాయి. ధర్నాచౌక్‌ పరిరక్షణ కోసం ఏకమైన ప్రతిపక్షాలు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి. హైదరాబాద్‌లో 28 రోజులుగా నిరసనదీక్షలు చేస్తున్న పలువురు నేతలు.. శుక్రవారం మౌనదీక్ష చేపట్టారు.. అమరవీరుల స్థూపం దగ్గర నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌ రమణ, బీజేపీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌, వీహెచ్‌, పలు ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు..

ఊరుకునేది లేదు...
ధర్నా చౌక్‌ను వేరే ప్రాంతానికి మారిస్తే ఊరుకునేది లేదని.. తమ్మినేని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రతిపక్షాలను అణచివేయడం ఎక్కువకాలం సాగదంటూ ఫైర్ అయ్యారు. ప్రభుత్వాన్ని ఖూనీచేసేలా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వ్యవహరిస్తోందని... ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మండిపడ్డారు. ఈ నెల 15న చేపట్టబోయే ధర్నా చౌక్‌ ఆక్రమణకు పార్టీలకతీతంగా అందరూ కదిలిరావాలని ఎల్‌ రమణ కోరారు. ధర్నా చౌక్‌ పరిరక్షణకోసం నెలరోజులుగా పోరాటం చేస్తున్నామని... కోదండరాం తెలిపారు.. ధర్నా చౌక్‌ మూసివేస్తే నగరమంతా ధర్నాలు విస్తరిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని. ధర్నా చౌక్‌ను ఎత్తివేయడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందనిధర్నాచౌక్‌ అంశంపై ఏకమైన ప్రతిపక్షాలు సర్కారుపై ఒత్తిడి పెంచుతున్నాయి.. ధర్నా చౌక్‌ తరలింపుపై వెనక్కితగ్గేవరకూ ఊరుకునేదిలేదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి.. ఈ నెల 15న ధర్నాచౌక్‌ ఆక్రమణకు సిద్ధమవుతున్నాయి..

18:57 - May 12, 2017

విజయనగరం : వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నదంతా.. ఉత్తదేనని ఏపీ మంత్రి సుజయకృష్ణ రంగారావు అన్నారు. హోదా విషయంలో కేంద్రంలో ఉన్న టీడీపీ మంత్రులను రాజీనామా చేయాలనే జగన్‌.. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతిస్తామనడం మోదీకి దగ్గరవ్వడానికేనన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించక ముందే మద్దతిస్తూ ప్రధానిపై ఒత్తిడి తెస్తున్నారని సుజయకృష్ణ రంగారావు అన్నారు.

 

18:54 - May 12, 2017

విశాఖ : ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కాలేజీ మైదానంలో టీడీపీ మహానాడుకు అనుమతి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. తమ కాలేజీ గ్రౌండ్‌లో మహానాడు నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ విశాఖ త్రీ టౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. యూనివర్సిటీ మైదానాల్లో రాజకీయ సభలను నిషేధిస్తూ ప్రభుత్వం గతంలో జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయాలని కోరారు.

18:52 - May 12, 2017

ఢిల్లీ : ఢిల్లీలో ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌ పర్యటిస్తున్నారు. కాసేపటి క్రితమే HCL చైర్మన్‌ శివనాడర్‌ను మంత్రి లోకేష్‌ కలిశారు. 5వేల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా HCL కంపెనీతో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా లోకేస్‌ స్పందిస్తూ కేవలం 45 రోజుల్లోనే హెచ్‌సీఎల్‌ కంపెనీకి కావాల్సిన భూమితో పాటు అన్ని అనుమతులు ఇచ్చామన్నారు. దేశవ్యాప్తంగా ఐటీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న సమయంలో హెచ్‌సీఎల్‌ కంపెనీ అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం అభినందనీయమని లోకేష్‌ అన్నారు.

18:49 - May 12, 2017
18:48 - May 12, 2017

హైదరాబాద్ : ప్రవేశ పరీక్షల నిర్వహణ కోసం ఉన్నత విద్యామండలి తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు విద్యార్ధుల పాలిట శాపంగా మారుతున్నాయి. నెలల తరబడి విద్యార్థుల పడ్డ కష్టాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి. భావిభారత పౌరుల భవితవ్యాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. తెలంగాణ ఎంసెట్ 2017 పరీక్షకు ఒక్క నిమిషం నిబంధన కారణంగా పలువురు విద్యార్ధులు తమ విద్యాసంవత్సరాన్ని కోల్పోవాల్సి వచ్చింది. హైదరాబాద్‌తో పాటు అనేక చోట్ల విద్యార్ధులు ఆలస్యంగా రావడంతో పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించలేదు. ఉన్నత విద్యామండలి నిర్ణయంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని.. ప్రవేశపరీక్షల్లో ఒక్క నిమిషం నిబంధనను ప్రభుత్వం తొలగించాలని వారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

ట్రాఫిక్ చక్రబంధం
హైదరాబాద్‌ మహానగరం ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకోవడం.. మెట్రో పనులు ఆ సమస్యను మరింత జఠిలం చేస్తున్నాయి. విద్యార్థులు ముందుగానే బయల్దేరినా..రోడ్లపై భారీ ట్రాఫిక్‌ జామ్‌లు విలువైన సమయాన్ని వృధా చేస్తున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. గ్రేస్ పీరియడ్‌గా ఐదు నిమిషాలైనా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పరీక్ష కేంద్రాలు వెత్తుకోవడంలో విలువైన సమయం వృధా కాకుండా..ముందుగానే ఎగ్జామ్‌సెంటర్‌ అడ్రస్‌ పంపే యాప్‌ను అందుబాటులోకి తీసుకురావాలని పేరెంట్స్‌ సూచిస్తున్నారు. ఎప్పుడూ ఆదివారం నిర్వహించే ఎంసెట్ పరీక్ష.. ఈ సారి పనిదినాల్లో నిర్వహించడం వల్లే ట్రాఫిక్ సమస్యతో సమయానికి విద్యార్థులు చేరుకోలేకపోయారని చెబుతున్నారు. కేవలం ఒక్క నిమిషం ముందుగా రాకపోవడం వల్ల.. ఏడాది మొత్తం విద్యార్థి పడ్డ కష్టం వృధా అవుతుందని వారి పేరెంట్స్‌ అంటున్నారు. ప్రభుత్వం స్పందించి వచ్చే ఏడాది నుంచి ఈ నిబంధనను ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

 

18:46 - May 12, 2017

ఆదిలాబాద్ : జిల్లా కేంద్రాంలో దుండగులు చెలరేగిపోయారు. ఇళ్ల ముందు నిలిపివుంచిన కార్లను ధ్వంసం చేశారు. పట్టణంలోని హౌసింగ్‌ బోర్డు , రవీంద్రనగర్‌, శాంతినగర్‌, ద్వారకానగర్‌ కాలనీల్లో ఇళ్ల ముందు పార్కు చేసివున్న కార్లపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనల్లో పలు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ టీవీల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా నిందితుల వివరాలను తెలుసుకునేందకు ప్రయత్నిస్తున్నారు.

18:45 - May 12, 2017

ఢిల్లీ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమెరికా పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్నారు. ఈ రాత్రికి విజయవాడ తిరిగివస్తారు. రేపు ఉదయం విజయవాడ నుంచి నెల్లూరు వెళతారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమారుడు నిషిత్‌ను పోగొట్టుకుని దుఃఖసాగరంలో మునిగివున్న మున్సిపల్‌ మంత్రి నారాయణను పరామర్శిస్తారు. ఆ తర్వాత విజయవాడ తిరిగి వస్తారు. ప్రభుత్వ కార్యకలాపాలపై అధికారులతో సమీక్షిస్తారు. ఈనెల 15న అమరావతిలోని తాళ్లాయపాలెంలో జరిగే స్టార్టప్‌ ఏరియా భూమి పూజ కార్యక్రమం ఏర్పాట్లపై అధికారులతో సమావేశం అవుతారు. స్టార్టప్‌ ఏరియా అభివృద్ధిపై సింగపూర్‌ కన్సార్టియంతో కుదుర్చుకునే ఒప్పందం గురించి సమీక్షిస్తారు. ఈ నెల 16న జరిగే ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీపై కూడా చంద్రబాబు అధికారులతో సమావేశం అవుతారు.

18:41 - May 12, 2017

నెల్లూరు : జిల్లాలోని వేదాయపాలెంలో టీడీపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ ఇంటిలో సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి. వాకాటి సెట్ ఫోన్ ను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్సీగా గెలుపొందారు. వాకాటి 2014లో తప్పుడు ధృవీకరణ పత్రాలతో రూ. 190 కోట్లు రుణం తీసుకున్నారు. తప్పుడు పత్రాలు సమర్పించారని ఐఎఫ్ సీఐ ఫిర్యాదుతో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. ఒకేసారి బెంగళూరు, హైదరాబాద్, నెల్లూరులో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వాకాటికి వీఎన్ఆర్ కనస్ట్రక్చన్, వీఎన్ఆర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, వీఎన్ఆర్ లాజిస్టిక్స్ కంపెనీలు ఉన్నాయి. ఆయనకు రైల్వే ఆలిండియా ఏ క్లాస్ కాంట్రాక్టర్ గా గుర్తింపు ఉంది. ఆయన కృష్ణపట్నం పోర్టుతో పాటు జటయజ్ఞం కింద మేజర్ ప్రాజెక్టులను చేపట్టారు. ఆయన పలు బ్యాంకులకు రూ.400కోట్లకుపైగా రుణాలు ఎగ్గొట్టారనే ఆరోపణలు ఉన్నాయి.ఇప్పటికే వాకాటి ఆస్తులను ఎస్బీఐ జప్తు చేసినట్లు సమాచారం. ఆయన ఇంటిలోకి ఇప్పటివరకు మీడియాను అనుతించలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కేసీఆర్ కు తమ్మినేని లేఖ..

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ కు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం లేఖ రాశారు. బాలింతల మరణాలను తగ్గించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని, నీలోఫర్, గాంధీ వంటి ప్రధాన ఆసుపత్రుల్లో కూడా సరిపడా వైద్యులు..నర్సులు లేరని తెలిపారు. పీహెచ్ సీలతో సౌకర్యాలను కల్పించి అభివృద్ధి చేయాలని, అంబులెన్స్ లను అందుబాటులో ఉంచి 24గంటలు వైద్యం అందేలా చూడాలన్నారు. తమిళనాడు రాష్ట్ర వైద్య విధానంపై అధ్యయనం చేసి రాష్ట్రంలో అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.

16:51 - May 12, 2017

ఢిల్లీ : పాకిస్తాన్‌ ఉగ్రవాదులు భారత్‌, ఆఫ్గనిస్తాన్‌లలో దాడులు చేసే అవకాశముందని అమెరికా హెచ్చరించింది. టెర్రరిస్టులు ఎప్పుడైనా దాడి చేసే అవకాశముందని జాగ్రత్తగా ఉండాలని రెండు దేశాలకు అమెరికా సూచించింది. తమ దేశంలో ఉగ్రవాదులను తుద ముట్టించడంలో పాకిస్తాన్ విఫలమైందని అమెరికా ఇంటిలిజెన్స్‌ విభాగం డైరెక్టర్‌ డేనియల్‌ కోట్స్‌ ధ్వజమెత్తారు. 'ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద ముప్పు' అనే అంశంపై అమెరికా ఇంటిలిజెన్స్‌కు చెందిన సెనేట్‌ కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... భారత్‌, ఆఫ్గనిస్తాన్‌లకు ఉగ్రవాద ముప్పు పొంచి ఉందన్నారు. భారత్‌, పాక్‌ మధ్య సంబంధాలు బెడిసికొట్టడానికి పాకిస్థానే కారణమని అమెరికా పేర్కొంది. పాక్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలు భారత్‌లో దాడులు చేస్తూనే ఉన్నాయని, ఇలాగే కొనసాగితే.. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారుతాయని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది.

 

16:48 - May 12, 2017

ఢిల్లీ : ఈవీఎంల వివాదంపై కేంద్ర ఎన్నికల సంఘం ఛాలేంజ్‌ చేసింది. ఎవరైనా సరే దమ్ముంటే ఈవీఎంను హ్యాకింగ్‌ చేయడం లేదా ట్యాంపరింగ్‌ చేసి చూపించాలని సవాల్‌ విసిరింది. ఎన్నికల్లో ఉపయోగిస్తున్న ఈవీఎంను ఈ నెలాఖరులోగా ఇస్తామని ఈసీ పేర్కొంది. ఈవీఎం మిషన్లలో ట్యాంపరింగ్‌ జరుగుతోందంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై సందేహాలను నివృత్తి చేసేందుకు ఈసీ అఖిలపక్ష భేటీని నిర్వహించింది. ఈ సమావేశానికి ఏడు జాతీయ పార్టీలతో పాటు 48 ప్రాంతీయ పార్టీల నేతలు హాజరయ్యారు. ఈవీఎంలపై ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయారని..అందువల్ల బ్యాలెట్‌ పత్రాలను ఉపయోగించాలని 16 పార్టీలు డిమాండ్‌ చేశాయి. దీంతో ఈసీ ఈవీఎంను టాంపరింగ్‌ చేసి చూపించాలని విపక్షాలకు సవాల్‌ విసిరింది.

16:46 - May 12, 2017

అహ్మదబాద్ : గుజరాత్‌లో ఓ పెళ్లి విషాదంగా మారింది. పెళ్లి అనంతరం జరిగే బరాత్‌ ఊరేగింపు కార్యక్రమంలో పెళ్లి కొడుకుతో పాటు అతని స్నేహితులు ఉల్లాసంతో డాన్స్‌ చేశారు. పెళ్లి కొడుకు సూరజ్‌ సోలంకీని తమ భుజాలపై ఎక్కించుకుని స్నేహితులు మరీ గంతులేశారు. స్నేహితుని భుజాలపై కూర్చున్న పెళ్లి కొడుకు కూడా అదే జోష్‌లో కేకలు పెడుతూ ఊగిపోయారు. డాన్స్‌ చేస్తూ ఊగిపోతూన్న పెళ్లికొడుకు ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలి కిందపడిపోవడం బరాత్‌లో కలకలం రేపింది. తీవ్ర గుండెపోటు రావడంతో సూరజ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. వధువు ఇంటికి ఊరేగింపుగా వెళుతున్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

'హోదా రాదని తెలిసినా తప్పుదోవ పట్టిస్తున్నారు'..

విజయనగరం : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని వైసీపీ అధ్యక్షుడు జగన్ కలవడంలో టిడిపి ఎలాంటి అభ్యంతరం లేదని మంత్రి సుజయ కృష్ణ రంగారావు పేర్కొన్నారు. ఒకవైపు ప్రత్యేక హోదాపై మాట్లాడుతూ మరోవైపు రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిస్తామనడం అనుమానాలు తావిస్తోందని తెలిపారు. ఇబ్బందుల నుండి గట్టెక్కేందుకే జగన్ ఇలా వ్యవహరిస్తున్నారని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదని తెలిసినా ప్రజలన తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.

16:43 - May 12, 2017

ఖమ్మం : జిల్లాలోని  మిర్చియార్డు ఘటనలో రైతులకు బేడీలు వేసిన సంఘటనను కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఖమ్మం కాంగ్రెస్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే ప్రత్తి పంటకు బదులు మిర్చి వేయాలని చెప్పడంతో ఈనాడు మిర్చి అధిక దిగుబడి వచ్చిందన్నారు. రైతులకు బేడీలు వేసిన ఘటనలో ప్రభుత్వం తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటుందని..దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

కర్నూలులో ఫుడ్ పాయిజన్..

కర్నూలు : మాధవనగర్ లోని దీన్ దయాల్ యువజన పథకం కింద శిక్షణ పొందుతున్న విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

16:40 - May 12, 2017

ఖమ్మం : ఖమ్మం మిర్చి యార్డు ఘటనలో రైతులకు సంకెళ్లు వేయడాన్ని నిరసిస్తూ ఖమ్మంలో వామపక్షాలు ఆందోళన నిర్వహించాయి. సీపీఎం ఆధ్వర్యంలో సిరిపురం నుండి మధిర వరకు రైతులు పాదయాత్ర నిర్వహించారు. మధిరలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి కారంతో అభిషేకం నిర్వహించి కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం రైతుల మీద పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించారు. మిర్చికి గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతుంటే..కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించడంలేదని వామపక్షనేతలు మండిపడ్డారు.

16:36 - May 12, 2017

కర్నూలు : జిల్లా కేంద్రంలోని మాధవ నగర్ లో కలుషిత ఆహారం తిని 30 విద్యార్థులు అస్వస్థతకు గురైయ్యారు. వీరిని వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందస్తున్నారు. దీన్ దయాల్ యువజనపథకం కింద విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. ఉదయం తిన్న సాంబార్ రైస్ తో వారు అస్వస్థతకు లోనయ్యారని తెలుస్తోంది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

16:30 - May 12, 2017

నెల్లూరు : జిల్లాలోని వేదాయపాలెంలో టీడీపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ ఇంటిలో సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి. వాకాటి సెట్ ఫోన్ ను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆయనకు వీఎన్ఆర్ కన్స్ ట్రాక్షన్, వీఎన్ఆర్ ఇన్ ఫస్ట్రక్చర్ కంపెనీలు ఉన్నాయి. వాకాటి 2014లో తప్పుడు ధృవీకరణ పత్రాలతో రూ. 190 కోట్లు రుణం తీసుకున్నారు. తప్పుడు పత్రాలు సమర్పించారని ఐఎఫ్ సీఐ ఫిర్యాదుతో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. ఒకేసారి బెంగళూరు, హైదరాబాద్, నెల్లూరులో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

వాకాటి సెల్ ను తీసుకున్న సీబీఐ అధికారులు..

నెల్లూరు : జిల్లాలోని వేదాయపాలెంలోని టిడిపి ఎమ్మెల్సీ వాకాటి నివాసంలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. వాకాటి సెల్ ఫోన్ ను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఐఎఫ్ సీఐ ఫిర్యాదుతో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. 2014లో తప్పుడు ధృవీకరణ పత్రాలతో రూ. 190 కోట్ల రుణం తీసుకున్నట్లు తెలుస్తోంది. బెంగళూరు, హైదరాబాద్, నెల్లూరులో సోదాలు జరుగుతున్నాయి.

రైతుల చేతులకు బేడీలపై హెచ్చార్సీ స్పందన..

హైదరాబాద్ : ఖమ్మం రైతులకు బేడీలు వేసిన ఘటనపై ఓ న్యాయవాది హెచ్చార్సీని ఆశ్రయించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన హెచ్చార్సీ వచ్చే నెల 5లోపు విచారించిన నివేదిక ఇవ్వాలని ఖమ్మం ఎస్పీని ఆదేశించింది.

16:06 - May 12, 2017

మానవత్వం చచ్చిపోతోందా ? దేశంలోని పలు ప్రాంతాల్లో తమ కళ్లెదుటే ఘోరాలు చోటు చేసుకుంటున్నా కనీసం స్పందించడం లేదు. తమ సెల్ ఫోన్ లో బంధించి షేర్ చేయడానికి మాత్రం ఇష్ట పడుతున్నారు. తాజాగా మహారాష్ట్రలోన బీడ్ జిల్లాలో ఓ వ్యక్తి సజీవదహనం అవుతున్నా ఎవరూ స్పందించకపోవడం దారుణం. రోడ్డున పోయే వారు ఒక్కరూ కూడా కనికరించలేదు. ఏ ఒక్కరూ కనికరించినా ప్రాణాలతో బయటపడేవాడు. బీడ్ జిల్లాలో ఓ రహదారిపై రెండు బైక్ లు ఢీకొన్నాయి. ఓ బైక్ ఉన్న వ్యక్తి అవతలివైపుకు ఎగిరిపడగా..మరొక వ్యక్తి బైక్ కిందే చిక్కుకపోయాడు. ఇంతలో బైక్ కు మంటలు అంటుకున్నాయి. కింద చిక్కుకపోయేసరికి అతను పైకి లేవలేకపోయాడు. ఆర్తనాదాలు పెట్టాడు. రోడ్డుపై వెళుతున్న వారు ఏ ఒక్కరూ మానవత్వం చూపలేదు. వారి కళ్ల ఎదుటే సజీవదహనమై పోయాడు. బైక్ కు మంటలు అంటుకోవడానికి కారణం ఏంటో తెలియరాలేదు.

15:56 - May 12, 2017

'సుకుమార్' ‘100 % లవ్ ' సినిమా తరువాత సరైన హిట్ లేక తడబడుతున్నాడు అని చెప్పొచ్చు. ఫాస్ట్, ఫ్యూచర్ ఒకేసారి గుర్తొచ్చే హీరో రోల్ 'నేనొక్కడినే' సినిమాలో 'మహేష్ బాబు'కి ఇచ్చాడు. ప్రతి అంశాన్ని ఆఖరికి కాఫీ కూడా లెక్కలేసుకొని తాగాలి అని 'నాన్నకు ప్రేమ'తో సినిమాలో ఎన్ టిఆర్ తో చెప్పించాడు సుకుమార్. డైరెక్టర్ 'సుకుమార్' ఇంటిలిజెంట్ స్టోరీ లైన్స్ తో ఆడియన్స్ ని అట్రాక్ట్ చెయ్యాల్సింది పోయి కంప్యూజ్ చేస్తున్నాడు అనే టాక్ కూడా ఉంది. డైరెక్టర్ సుకుమార్ హీరో రాంచరణ్ తేజ్ ఇద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు సుకుమార్ తమిళ్ ఇండస్ట్రీ మీద ఫోకస్ పెడుతున్నాడు.

తమిళంలో..
తెలుగులో తొలి సినిమా 'కుమారి 21 ఎఫ్'తోనే సూపర్ సక్సెస్ అందుకున్నాడు సుకుమార్. ఇప్పుడు అతడి ప్రొడక్షన్ లో 'దర్శకుడు' అనే సినిమా తెరకెక్కుతోంది. ఆ సినిమా రిలీజయ్యే లోపే సుక్కు నిర్మాతగా తన మూడో సినిమాను మొదలుపెట్టేస్తున్నాడు. కానీ ఆ సినిమా తెలుగులో కాదు.. తమిళంలో కావడం విశేషం. సుక్కు కెరీర్ బిగ్గెస్ట్ హిట్లలో ఒకటైన ‘100 పర్సంట్ లవ్'ను తమిళంలో రీమేక్ చేస్తుండటం.. దానికి సుకుమారే నిర్మాత కావడం విశేషం. చంద్రమౌళి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాడు. సో తమిళ్ ఇండస్ట్రీ లో ఆయన లక్కేలా ఉంటుందో చూడాలి మరి.

15:49 - May 12, 2017

విజయనగరం : విజయనగరం జిల్లా వైసిపిలో ముసలం మొదలైంది. పార్టీ జిల్లా నేతలు ఎవరికి వారే అన్న చందంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలతో కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసేవారు కరువయ్యారు. పార్టీని ముందుండి నడిపించే నేతలు సైతం పార్టీ శ్రేణులకు దూరంగా ఉండటంతో.. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలపై పోరాడాల్సింది పోయి ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన కోలగంట్ల
గతంలో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి కొనసాగారు. అయితే ఆయన వర్గానికి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వర్గంతో విభేదాలు ఉండేవి. ఈ నేపథ్యంలోనే కోలగట్ల అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దీంతో చీపురుపల్లికి చెందిన వైసీపీ నేత, బొత్స అనుచరుడైన బెల్లాన చంద్రశేఖర్ రావుకి అధిష్టానం జిల్లా పార్టీ పగ్గాలను అప్పగించి.. కోలగట్లకు ఉత్తరాంధ్ర కన్వీనర్ బాధ్యతలను అప్పగించింది. అయితే బెల్లాన చంద్రశేఖర్ పదవి నామ్ కే వాస్తేగా మారడంతో ఆయన తరపున పార్టీ కార్యకలాపాలు అన్నీ బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు చక్కబెడుతున్నట్లు సమాచారం. దీంతో బెల్లాన చంద్రశేఖర్ చీపురుపల్లికే పరిమితమయ్యారు. గతంలో బొత్సకు చెందిన లాడ్జిలో తరచూ పార్టీ సమావేశాలు, ప్రెస్ మీట్లు నిర్వహించినా.. ఇప్పుడు అక్కడ ఎటువంటి సందడి కనిపించకపోవడంతో జిల్లాలో పార్టీ కార్యకలాపాలు మందగించాయనే విమర్శలు వస్తున్నాయి.

బొత్స హైదరాబాద్ కే పరిమితం
మరోవైపు బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు టిడిపిలో చేరడంతో పార్వతీపురం డివిజన్ లో వైసిపికి గట్టి దెబ్బ తగిలింది. పార్టీ కేడర్ కూడా ఆయనతో వెళ్లిపోవడంతో పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. పార్టీకి పెద్ద దిక్కుగా నిలుస్తారని భావించిన బొత్స హైదరాబాద్ కే పరిమితం కావడంతో జిల్లాలో ఆయన లేని ప్రభావం పార్టీపై పడింది. కోలగట్ల వీరభద్రస్వామి అధ్యక్ష పదవి వీడిన తరువాత సైలెంట్ అయిపోయారు. కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొరలు నిత్యం ప్రజల్లో ఉంటూ పార్టీని బలోపేతం చేసే ప్రయత్నాలు చేస్తున్నా... మిగిలిన నేతల్లో మాత్రం స్పందన కరువైంది. ఇదే అదనుగా అధికార పక్షం చాప కింద నీరులా తన పని తాను చేసుకుపోతోంది. దిక్కుతోచని స్థితిలో పార్టీ భవిష్యత్ ఉండటంతో వైసిపి కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు నేతల వ్యవహారా శైలి కూడా అనుమానాస్పదంగా మారడంతో వచ్చే ఎన్నికల నాటికి ఎవరు పార్టీలో ఉంటారో..ఉండరో అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం విజయనగరం జిల్లావైపు దృష్టి సారించకపోతే వచ్చే ఎన్నికల్లో భంగపాటు తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

15:47 - May 12, 2017

గోదావరి పల్స్ ని పట్టుకొని హిట్ సినిమాలు కొట్టిన డైరెక్టర్ వంశి, ఈ మధ్య కాలంలో ట్రెండ్ ని క్యాచ్ చెయ్యడం లో కొంచం వెనుకపడ్డాడు అని చెప్పాలి. కానీ హిట్ లు ప్లాప్ లు పట్టించుకోకుండా మరో గోదావరి ఫ్లేవర్ తో రాబోతున్నాడు. 'ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు' తరువాత డైరెక్టర్ వంశీకి మంచి హిట్ పడలేదు అనే చెప్పాలి. ఎన్నో హిట్ సినిమాలు తీసి 'రవితేజ' లాంటి మాస్ ఆడియన్స్ ఉన్న హీరోని పెట్టి క్లాస్ టచ్ తో 'ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు' అని లవ్ స్టోరీ ని నవల లాగ ప్రెజెంట్ చేసి హిట్ అందుకున్నాడు వంశి. 'రవితేజ' కెరీర్ లో కూడా మంచి సినిమాగా నిలిచిపోయింది. మరి తరువాత వంశీ వెంట వెంటనే సినిమాలు చేస్తున్నా ఏ సినిమా కూడా ఆడియన్స్ ని ఆకట్టుకోలేక పోయిందా అనే డౌట్ రాక మానదు.

టీజర్..
వంశీ తీస్తున్న ''ఫ్యాషన్ డిజైనర్ S/o లేడీస్ టైలర్'' సినిమా మీద అంచనాలన్నీ ఒకలా ఉన్నాయి. అయితే ఇప్పుడు మాత్రం ఆ అంచనాలు ఇంకో తరహాగా మారిపోయాయ్. ఈ సినిమా తాలూకు తొలిపాటను రిలీజ్ చేశాడు వంశీ. అయితే వంశీ మరోసారి గోదారినే ఎంచుకోవడం చూస్తుంటే.. ఈ సీక్వెల్ కూడా ఒరిజినల్ 'లేడీస్ టైలర్' తరహాలో గ్రామీణ నేపథ్యంలో సాగే కథ అని చెప్పొచ్చేమో. ఇకపోతే మణిశర్మ కంపోజ్ చేసిన పాటల్లోని తొలి సింగిల్ ఇంప్రెసివ్ గానే ఉంది. సుమంత్ అశ్విన్ హీరోగా.. అనీషా ఆంబ్రోస్.. మానస హిమవర్ష.. మనాలి రాథోడ్ హీరోయిన్లుగా రూపొందుతున్న ఈ సినిమాను.. మే 3వ వారంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.

15:45 - May 12, 2017

కరీంనగర్ : అక్రమ వడ్డీ వ్యాపారంతో ప్రజలను నిలువు దోపిడీ చేసిన కరీంనగర్‌ ఎఏస్సై మోహన్‌రెడ్డిపై పిడి యాక్టు కింద కేసు పెట్టాలని మోహన్‌రెడ్డి బాధితులు డిమాండ్‌ చేస్తున్నారు. మోహన్‌రెడ్డిపై 60కి పైగా కేసులు ఉన్నా పిడి చట్టం కింద కేసు నమోదు చేయకపోడాన్ని బాధితులు తప్పుపడుతున్నారు. గుండుబా ప్యాకెట్‌ దొరికిగా పేదలపై పిడి యాక్టు కింద కేసులు పెడుతున్న పోలీసులు... మోహన్‌రెడ్డిపై ఇదే చట్టం కింద కేసు ఎందుకు నమోదు చేయడంలేదని ప్రశ్నిస్తున్నారు. మోహన్‌రెడ్డికి గ్యాంగ్‌స్టర్‌ నయీంతో సంబంధాలున్నాయని ఆరోపిస్తున్నారు.

15:42 - May 12, 2017

వరంగల్ : జిల్లా కేంద్రంలోని ఎస్‌ఆర్‌ న‌గ‌ర్‌లో రెండు రోజుల క్రితం పేదల ఇండ్లు కూల్చి వేయాడాన్ని సీపీఎం, సీపీఐ తీవ్రంగా తప్పుబట్టాయి. ఇండ్ల కూల్చివేతను నిర‌సిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. కాశిబుగ్గ సెంట‌ర్లో ప్రభుత్వ దిష్టిబొమ్మ ద‌గ్దం చేస్తుండ‌గా పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వం పేదలకు ఇండ్లు నిర్మిస్తామ‌ని హామీ ఇచ్చి రెండేళ్లవుతున్నా ఇప్పటి వ‌ర‌కు ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదని..వెంట‌నే ప్రభుత్వం స్పందించి జీవో నెంబర్‌ 50 ప్రాకారం వ్యక్తిగత ఇండ్లు నిర్మించాల‌ని డిమాండ్ చేశారు.

 

హరీష్..తుమ్మలను బర్తరఫ్ చేయాలి - రేవంత్..

హైదరాబాద్ : మంత్రులు ఎవరూ మార్కెట్ యార్డుల్లో పర్యటించలేదని టిడిపి నేత రేవంత్ పేర్కొన్నారు. దళారులు..వ్యాపారవేత్తలు కుమ్మక్కై ధరలు తగ్గించారని, ఖమ్మం జిల్లాలో అరెస్టయిన వారు చిన్న రైతులన్నారు. రైతే రాజు అంటున్న కేసీఆర్..రైతులకు బేడీలు వేయిస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో నిరసన హక్కు లేకుండా పోతోందని, రైతులపై పెట్టిన కేసులను బేషరతులగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ జడ్జీతో విచారణ జరిపించి తుమ్మల..హరీష్ లను విచారించాలని, రైతులను రౌడీలని తుమ్మల..హరీష్ అన్నది నిజం కాదా అని ప్రశ్నించారు.

15:30 - May 12, 2017

నల్లగొండ : జిల్లాలోని మోతె మండలం రాయపాడులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాయపాడులోని సీపీఎం కార్యాలయాన్ని టీఆర్ఎస్ అక్రమించుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. టీఆర్ఎస్ తీరుకు నిరసనగా సీపీఎం ఆందోళన నిర్వహించింది. కార్యాలయంపై సీపీఎం కార్యకర్తలు ఎర్రజెండా ఎగరవేయకుండా పోలీసులు అడ్డుకున్నారు. విషయం తెలుకుని రాయపాడుకు వస్తున్న జూలకంటి రంగారెడ్డి, మల్లు అక్ష్మిని గ్రామ పొలిమేరలోనే అరెస్ట్ చేశారు. దీంతో గ్రామంలో భారీగా పోలీసులను మోహరించారు.
 

అన్యాయం - జూలకంటి..
అనేక మంది దాతలతో కార్యకర్తలు కష్టపడి అమరవీరుల పేరిట ఆఫీసు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని సీపీఎం నేత జూలకంటి టెన్ టివితో తెలిపారు. సీపీఎం పార్టీలో ఉన్న ఓ వ్యక్తి టీఆర్ఎస్ లో చేరడం జరిగిందని, అనంతరం ఆ వ్యక్తి దౌర్జన్యంగా ఆఫీసును ఆక్రమించుకోవడం జరిగిందన్నారు. రెవెన్యూ అధికారులు, పోలీసులకు ఈ విషయం తెలిపినా పట్టించుకోలేదని, కార్యకర్తలతో మాట్లాడాలని సీపీఎం నేతలు ప్రయత్నించారని తెలిపారు. కానీ పోలీసులు ముందుగానే తనను, జిల్లాలో ఉన్న నేతలను అరెస్టు చేయడం జరిగిందన్నారు. ఆత్మకూరు పీఎస్ లో తనను ఉంచడం జరిగిందని, ఇది చాలా అన్యాయమన్నారు.

జూలకంటి..మల్లు లక్ష్మీల అరెస్టు..

సూర్యాపేట : మోతే మండలం రాయపాడులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీపీఎం కార్యాలయాన్ని దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని సీపీఎం నేతలు ఆందోళన చేపట్టారు. సీపీఎం కార్యాలయంపై ఎర్రజెండా ఎగురవేయకుండా పోలీసులు అడ్డుకున్నారు. గ్రామ పొలిమేరలోనే జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మీలను పోలీసులు అరెస్టు చేశారు. గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు.

చికిత్సకు ఖైదీ నిరాకరణ.

 

హైదరాబాద్ : గాంధీ ఆసుపత్రిలో చికిత్స చేయించుకొనేందుకు ఖైదీ నిరాకరించాడు. గురువారం చర్లపల్లి సెంట్రల్ జైల్లో ఇనుప కడ్డీలను మింగి ఆత్మహత్యకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. జైలు అధికారుల వేధింపులు భరించలేను..చనిపోతానని ఖైదీ పేర్కొంటున్నట్లు తెలుస్తోంది.

14:53 - May 12, 2017

రంగారెడ్డి : తెలంగాణలో వరుస రోడ్డు ప్రమాదాలతో రహదారులు రక్తమోడాయి. రంగారెడ్డి జిల్లాలో జరిగిన రెండు ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందారు. మరికొంతమంది చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. రంగారెడ్డి జిల్లాలోని నందిగామలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు మృతి చెందారు. నలుగురు స్పాట్ లో చనిపోయారు. మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. మృతులు నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలుస్తోంది. మృతుల కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఔటర్‌రింగ్‌ రోడ్డుపై వేగంగా దూసుకొచ్చిన కారు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. శంషాబాద్ నుంచి అబంర్ పేట వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఏపీలోను రోడ్డు ప్రమాదాలు
మరోవైపు ఏపీలో శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి వద్ద చెట్టును ఢీకొట్టి డబుల్‌డెక్కర్‌ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. జాతీయ రహదారి పక్కనే ఉన్న లోయలోకి జారిపోయింది. అదృష్టవశాత్తు చెట్లు అడ్డుపడటంతో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ఘటనలో డ్రైవర్‌తో పాటు 11 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఇచ్ఛాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రథమచికిత్సచేశారు. అనంతరం బ్రహ్మపురం ఆసుపత్రికి తరలించారు. ఇచ్ఛాపురం రూరల్‌ ఎస్సై చెన్నమనాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశాఖపట్టణం నుంచి ఒడిశాలోని బ్రహ్మపురంకు 40మంది ప్రయాణికులతో వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాద ఘటనలకు అతివేగమే కారణంగా తెలుస్తోంది. అధికారులు ఎంత అవగాహన కలిగిస్తున్నా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా వాహనదారులు నిర్లక్ష్యం వీడి వాహనాలు నడపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 

14:49 - May 12, 2017

విశాఖ : ఈనెల 27 నుంచి 29 వరకు విశాఖపట్నంలో జరగనున్న టిడిపి మహానాడుకు మంత్రులు చిన రాజప్ప, కళా వెంకట్రావు ఈరోజు భూమి పూజ నిర్వహించారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ వేదికగా జరగనున్న మహానాడుకు ఇప్పటికే అధికారుల నుంచి అన్ని పర్మిషన్లు వచ్చినట్లు వారు తెలిపారు. మరోవైపు జగన్ పై మండిపడ్డారు మంత్రి కళా వెంకట్రావు. సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తుంటే జగన్ అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

 

14:47 - May 12, 2017

హైదరాబాద్ : ధర్నా చౌక్‌ పరిరక్షణ కోసం గన్‌పార్క్‌ దగ్గర కోదండరాం.. మౌన దీక్ష ప్రారంభమైంది. దీక్షలో సున్నం రాజయ్య, ఎల్‌. రమణ, చెరుకుపల్లి సీతారాములు, గుమ్మడి నర్సయ్య, అజిద్‌ బాషా, పలువురు ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ సర్కార్‌ అనుసరిస్తున్న నియంతృత్వ ధోరణులను తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని అన్నారు. నియంతృత్వ పోకడలు అనుసరించేవాళ్లు కాలగర్భంలో కలిసిపోయారన్నారు. స్వరాష్ట్రంలో ప్రజల హక్కులను కాలరాసేలా కేసీఆర్‌ ప్రభుత్వం వ్యవహరిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఆక్రోశం వ్యక్తం చేశారు. ధర్నా చౌక్‌లో ఆందోళనలకు అనుమతించకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పేదల గొంతుకగా ఉన్న ధర్నా చౌక్‌లో.. కేసీఆర్‌ ప్రభుత్వం కావాలనే నిరసనలకు అనుమతించడం లేదని టీటీడీపీ నేత రమణ ఆరోపించారు. ఆరునూరైనా ధర్నాచౌక్‌ను కాపాడుకుంటామన్నారు.

14:42 - May 12, 2017

నెల్లూరు : జిల్లాలోని వేదాయపాలెంలో టీడీపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి ఇంటిపై ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. నారాయణ ప్రముఖ వ్యాపారవేత్త . ఆయన ఈ మధ్యే టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలుపొందారు. ఆయన ఇంటిలో అధికారులు ఉదయం నుంచి సోదాలు కొనసాగిస్తున్నారు. ఆయనకు ఉత్తరాదిన పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. నారాయణపై బ్యాంక్ లనుంచి అప్పు తీసుకుని కట్టలేదని ఆరోపణలు ఉన్నాయి. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

14:33 - May 12, 2017

సూర్యాపేట : మరో చిట్ ఫండ్ మోసం బయటపడింది. సూర్యాపేటలో వెంకటలక్ష్మీ చిట్ ఫండ్ కంపెనీ ఉంది. ఈ కంపెనీ రెండు వేల మంది ఖాతాదారుల దగ్గర రూ. 2కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్మును మధ్యతరగతి వర్గాల ప్రజలు ఈ చిట్ ఫండ్ లో సొమ్మును దాచుకున్నారు. రెండు రోజులుగా కార్యాలయం తెరవకపోవడంతో ఖాతాదారులకు అనుమానాలు కలిగాయి. శుక్రవారం పరారయ్యారని తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు పీఎస్ లో ఫిర్యాదు చేశారు.

 

'మోహన్ రెడ్డిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు'...

కరీంనగర్ : మాజీ ఏఎస్ఐ మోహన్ రెడ్డి బాధితులు ప్రెస్ మీట్ నిర్వహించారు. మోహన్ రెడ్డి పై పీడీ యాక్టు నమోదు చేయాలని, నయీం కే సులో అధికారులను సస్పెండ్ చేసిన ప్రభుత్వం మోహన్ రెడ్డిని ఎందుకు ఉపేక్షిస్తున్నారని ప్రశ్నించారు.

సూర్యాపేటలో బోర్డు తిప్పేసిన చిట్ ఫండ్..

సూర్యాపేట : వెంకటలక్ష్మీ చిట్ ఫండ్స్ బోర్డును తిప్పేసింది. 2వేల మంది ఖాతాదారుల నుండి రూ. 2 కోట్లు వసూలు చేశారు. ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. పీఎస్ లో బాధితులు ఫిర్యాదు చేశారు.

 

నెల్లూరులో ఐటీ దాడులు..

నెల్లూరు : జిల్లాలో ఐటీ దాడులు కలకలం రేగుతున్నాయి. వేదాయపాలెంలో టిడిపి ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహించింది.

13:44 - May 12, 2017

ఢిల్లీ : నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలకు ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. తాజాగా ఈ కేసుకు సంబంధించి ఐటితో విచారణ జరిపించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశంతో సోనియా, రాహుల్‌ తదితరులకు ఐటి విచారణ ఎదుర్కోక తప్పదు. సోనియాగాంధీ ఆదాయపు పన్ను నిబంధనలను ఉల్లంఘించారని... పార్టీ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించారు. నేషనల్‌ హెరాల్డ్‌కు చెందిన కంపెనీ అసోసియేట్ జనరల్‌ లిమిటెడ్‌కు కాంగ్రెస్‌ పార్టీ 2011లో 90 కోట్ల రుణమిచ్చింది. అనంతరం 5 లక్షల రూపాయలతో యంగ్‌ ఇండియా కంపెనీని స్థాపించింది. 90 కోట్ల రుణాన్ని కాంగ్రెస్‌ మాఫీ చేసింది. 90 కోట్ల రుణాలకు సంబంధించి హవాలా రూపంలో సమకూర్చారని సుబ్రహ్మణ్యస్వామి ఆరోపిస్తున్నారు.

13:42 - May 12, 2017

ఢిల్లీ : రెండు రోజుల శ్రీలంక పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం అంతర్జాతీయ వేసాక్‌ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. మోదీకి శ్రీలంక ప్రధాని రాణిల్‌ విక్రమసింఘే సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరూ బుద్దుడిని ఆదర్శంగా తీసుకోవాలని ప్రధాని కోరారు. కొలంబో నుంచి వారణాసికి విమాన సేవలు ప్రారంభిస్తామన్నారు. ఈ ఏడాది ఆగస్టు నుంచే వీటిని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. బౌద్దుల అతిపెద్ద ఉత్సవం అయిన వేసాక్‌ డే సెలబ్రేషన్స్‌ ఈ ఏడాది ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో తొలిసారిగా కొలంబోలో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి చైనా, భారత్‌, జపాన్‌, థాయ్‌లాండ్‌, కంబోడియా, వియత్నాం, మయన్మార్‌, లావోస్‌, టిబెట్‌ , భూటాన్‌తోపాలు పలు దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు.

13:40 - May 12, 2017

హైదరాబాద్ : కొంచెం ఆసక్తి.. కాస్త సృజనాత్మకత తోడుగా ఉండాలే కానీ ఎన్నో అద్భుతాలను సృష్టించొచ్చు. ప్రపంచంలో ఏ వస్తువూ పనికిరానిది కాదు. ఏదైనా ఏదో ఒక రకంగా ఉపయోగపడేదే. అరుణ, ప్రశాంత్‌లు వేస్ట్‌ వాటర్‌ బాటిల్స్‌తో చేసిన బస్టాండ్‌ను చూస్తే ఇవి అక్షర సత్యాలనిపించక మానదు. మరింకే మనమూ ప్లాస్టిక్‌ బస్టాండ్‌పై ఓ లుక్కేయ్యండి..హైదరాబాద్‌లో పర్యావరణ పరిరక్షణ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ప్లాస్టిక్‌ వేస్టేజ్‌తో.. నగరవాసులు పలు నూతన సంస్కరణలు తీసుకువస్తున్నారు. హైదరాబాద్‌లో, ఉప్పల్‌, స్వరూప్‌నగర్‌కు చెందిన అరుణ, ప్రశాంత్‌లు ప్లాస్టిక్‌ వేస్ట్ మెటీరియల్స్‌తో అద్భుతాన్ని సృష్టించారు. గతంలో వెదురు బొంగులతో కళాత్మక వస్తువులను రూపొందించిన అరుణ, ప్రశాంత్‌లు.. పాత ట్యూబ్‌ టైర్లతో సోఫాలను అందంగా తయారు చేశారు. తాజాగా వేస్ట్‌ వాటర్‌ బాటిల్స్‌తో ఒక బస్టాప్‌ను తయారు చేశారు. ఇందుకోసం 15 రోజులు కష్టపడ్డామనీ.. దాదాపు 15 వేల రూపాయలు సొంతంగా ఖర్చు చేశామన్నారు. వేస్ట్‌ ప్లాస్టిక్‌ను నిర్లక్ష్యంగా వదిలేయకుండా.. సరైన రీతిలో ఉపయోగిస్తే భవిష్యత్తులో ప్లాస్టిక్‌ వల్ల అనర్థాలు జరగవని చెబుతున్నారు.

13:37 - May 12, 2017

విశాఖపట్టణం : ఆ గ్రామంలో అందరికీ ఆధార్‌కార్డులు ... బ్యాంక్‌ అకౌంట్లు ... ప్రతిచోట నగదు రహిత లావాదేవీలు...అంతా డిజిటల్‌మయం. నగరాలకు ధీటుగా డిజిటల్‌ చెల్లింపులతో అందరినీ అబ్బురపరుస్తోంది ఆ గ్రామం. అనతికాలంలోనే ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుని...డిజిటల్‌ విలేజ్‌గా ఖ్యాతి సంపాదించిన కోలవానిపాలెంపై స్పెషల్ స్టోరీ. విశాఖ జిల్లాలోని ... ఆనందపురం మండలంలో ఉన్న కోలవానిపాలెం డిజిటలైజేషన్‌ వైపు పరుగులు తీస్తోంది. గ్రామస్థులు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకుని... ముందుకు అడుగులు వేస్తున్నారు. ఈ గ్రామంలో దాదాపు 250 కుటుంబాలు ఉన్నాయి. వీరంతా వ్యవసాయం పైనే ఆధారపడ్డారు. ఇటీవల కాలంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు తమ శాఖను ఇక్కడ ఏర్పాటు చేయడంతో పాటుగా ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.. దీంతో గ్రామంలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో పూర్తి డిజిటలైజేషన్‌ అయిన తొలి గ్రామంగా కోలవానిపాలెం కీర్తి కెక్కింది. బ్యాంక్‌ వారు అందించిన సేవలను పలువురు రాజకీయనాయకులు అభినందించారు.

ప్రతిచోట నగదు రహిత లావాదేవీలు
తొలుత బ్యాంక్ అధికారులు డిజిటలైజేషన్‌ విధానంపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. దాని వల్ల కలిగే ప్రయోజనాలకు వివరించారు. అలాగే గ్రామస్థులందరికీ బ్యాంక్ ఖాతాలు తెరిచారు. ఆధార్‌కు అనుసంధానం చేసిన రూపే కార్డులను అందజేశారు. అలాగే పీవోఎస్‌ మిషన్లు అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో గ్రామస్థులు రేషన్‌ డిపోలలో కూడా పీవోఎస్‌ మిషన్ల ద్వారానే సరుకులను తీసుకుంటున్నారు. అలాగే ప్రతిచోట నగదు రహిత లావాదేవీలనే జరుపుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. కాగా కేంద్రం అందించే ముద్ర రుణాలు గురించి కూడా తెలుసుకుని ...చాలామంది ఆ రుణాలు పొంది ఉపయోగించుకుంటూ ప్రగతి బాటలో పయనిస్తూ... అందరికి ఆదర్శవంతం అవుతున్నారు.

13:35 - May 12, 2017

హైదరాబాద్ : నీట్‌... విద్యార్థుల ఆశలపై నీళ్లు జల్లింది... భవిష్యత్తును నిర్మిస్తుందనుకుంటే... ఆందోళనను మిగిల్చింది. ఒక్కో భాషలో...ఒక్కో ప్రశ్న పత్రం రావడంతో... అందరూ గందరగోళానికి గురవుతున్నారు. ప్రాంతీయ భాషల్లో రాసిన విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, ఆయుష్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల ఏడో తేదీన నీట్‌ ఎగ్జామ్‌ను నిర్వహించారు. పరీక్షకు 11లక్షల 38వేల 890 మంది హాజరయ్యారు. రాష్ట్రం నుంచి 56వేల 804 మంది ఈ పరీక్ష రాశారు. అయితే ఈ పరీక్ష నిర్వహణపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ఒకటి కన్న ఎక్కువ భాషల్లో పరీక్ష నిర్వహిస్తే అవే ప్రశ్నలను ఇతర భాషల్లోకి ట్రాన్స్‌లేట్ చేయాల్సి వుంటుంది. కానీ సీబీఎసీఈ ఇంగ్లీషు మీడియం విద్యార్థులకు ఒకలాగా, ఇతర భాషల్లో మరోలా వేర్వేరు ప్రశ్నాపత్రాలు తయారు చేసింది. కాగా ఇంగ్లీషు మీడియం విద్యార్థులకు చాలా ఈజీగా, ప్రాంతీయం వారికి కఠినంగా ప్రశ్నాపత్రాలను రూపొందించారని విద్యావేత్తలు ఆరోపిస్తున్నారు.

కార్పొరేట్ ప్రమేయం..
తెలుగుకు ,ఇంగ్లీషుకు పొంతన లేకుండా రావడంతో విద్యార్థుల్లో కలవరం మొదలైంది. ఈ సమస్య ఒక్క తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి. దీనిపై గుజరాత్‌, పశ్చిమబెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌, హర్యానా, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో విద్యార్థుల తల్లిదండ్రులు నిరనసలు కూడా చేపట్టారు. కాగా నీట్ వంటి ప్రతిష్టాత్మకమైన పరీక్షలో ఇటువంటి తప్పులు జరగటం సరైంది కాదని విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. అదే నిజమైతే మాతృభాషలో పరీక్ష రాసిన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు డాక్టర్‌ చదువును దూరం చేసినట్టేనని వారు అంటున్నారు. విద్యార్థులు...వారి తల్లిదండ్రుల ఆందోళనల నేపథ్యంలో దీనిపై సీబీఎస్‌ఈ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఎంతైన ఉంది. కాగా ఈ ప్రశ్నాపత్రాల తయారీలో కార్పొరేట్‌ , ప్రైవేట్‌ విద్యా సంస్థల ప్రమేయం ఉందని విద్యావేత్తలు సందేహిస్తున్నారు..

13:33 - May 12, 2017

హైదరాబాద్ : సాఫ్ట్‌వేర్‌ కల చెదురుతోందా? ఐటీ కంపెనీలు ఉద్యోగాల్లో కోత పెడుతున్నాయా? ఉన్న ఉద్యోగులను తగ్గించే పనిలో పడ్డాయా? ఐటీ రంగంలో యంత్రీకరణ మానవ వనరులకు సవాళ్లు విసురుతోందా ? సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల్లో కలవరం మొదలైందా? దీనిపై ప్రత్యేక కథనం..సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ అంటేనే యవతలో యమా క్రేజ్‌. లక్షల్లో వేతనం, హైఫై లైఫ్‌. అంతేనా.. లక్షల్లో బ్యాంక్‌ బ్యాలెన్స్‌, వీకెండ్‌లో పబ్‌లు, పార్టీలు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి లైఫ్ యమ సాఫీగా సాగిపోయేది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి పిల్లను ఇవ్వడానికీ ఎగబడేవారు. బ్యాంకులు సైతం ఏలోన్‌నైనా వెనుకాముందు ఆలోచించకుండా ఇచ్చేవి. కానీ ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌ లైఫ్‌ కల క్రమంగా చెదిరిపోతోంది. ఐటీ ఉద్యోగులకూ కష్టాలు మొదలయ్యాయి.

ఉన్న ఉద్యోగాలకు ముప్పు..
గత సంవత్సరం కాలంగా హైదరాబాద్‌లో ఐటీరంగంలో కొత్త నియామకాల జోరు తగ్గింది. అంతేకాదు ఉన్న ఉద్యోగాలకూ ముప్పు వచ్చిపడుతోంది. పలు ఐటీ కంపెనీలు ఉద్యోగులను తప్పించే పనిలో పడ్డాయి. ప్రాజెక్టులు లేవంటూ కొన్ని సంస్థలు తమ ఉద్యోగులకు ఇచ్చే సేవల్లో క్రమంగా కోతపెడుతున్నాయి. హైదరాబాద్‌లోని పలు ఐటీ కంపెనీలు ఇప్పటికే క్యాబ్‌ సేవలను నిలిపివేశాయి. హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగాల్లో క్రమంగా కోతలు మొదలయ్యాయి. దీంతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల్లో కలవరం మొదలయ్యింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన వారిని భయపెడుతోంది.

నైపుణ్యం పెంచుకున్నారా..లేకపోతే కట్..
హైదరాబాద్‌లో ఐటీ కొలువులు తగ్గడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నిర్ణయాల ప్రభావం కూడా ఉంది. ఐటీ కంపెనీలను ఒకవైపు ట్రంప్‌ నిర్ణయాలు.. మరోవైపు ఈ రంగంలో ఆటోమేషన్‌ వేగంగా విస్తరిస్తుండడం భయపెడుతోంది. ఐటీ కంపెనీల్లో యంత్రీకరణ మానవ వనరులకే సవాళ్లు విసురుతోంది. ఎప్పటికప్పుడు సాంకేతికత మారిపోతుండడంతో అదేస్థాయిలో సాఫ్ట్‌వేర్‌ ఎంప్లాయీస్‌ స్కిల్స్‌ పెరగడం లేదు. దీంతో ఇప్పుడున్న ఐటీ ఉద్యోగుల్లో 39 లక్షలమంది ఉద్యోగుల స్కిల్స్‌ వచ్చే నాలుగేళ్లలో అక్కరకు రాకుండా పోతాయని అంతర్జాతీయ కన్సల్టెన్సీ మెకిన్సీ తన నివేదికలో స్పష్టం చేసింది.

కోతలకు కారణం..
ఐటీ కంపెనీలు ఉద్యోగులకు మొదట కొన్నేళ్లపాటు కోడింగ్‌, చిన్నపాటి ప్రాజెక్టులను అప్పగిస్తుంటాయి. అయితే వీటితో ఐటీ ఉద్యోగులు పెద్దగా తమ స్కిల్స్‌ను పెంచుకునే అవకాశం లభించదు. ఆ తర్వాత వీరు 10 నుంచి 15 మందికి నాయకత్వం వహించే స్థాయికి చేరుకుంటారు..మేనేజర్లు అవుతారు. మేనేజర్‌ స్థాయిలో కొంతమంది ఎప్పటికప్పుడు తమ స్కిల్స్‌ పెంచుకుంటూ జాబ్‌లో ముందుకెళ్తోంటే.. మరికొందరు అప్పటి వరకు ఉన్న నైపుణ్యాలనూ కోల్పోతున్నారు. దీంతో మధ్యస్థాయి మేనేజర్లకు ఉద్యోగ గండం పొంచి ఉంటుంది. ఐటీ బూమ్‌ తగ్గుతుండడం, కొత్త ప్రాజెక్టులు తగ్గుతుండడంతో కంపెనీలు ఉద్యోగులను తగ్గించే పనిలో పడ్డాయి. వీటికి తోడు ఐటీ రంగంలో ఆటోమేషన్‌ వేగంగా విస్తరిస్తుండడం కూడా ఉద్యోగుల కోతకు కారణమవుతోంది.

డిమాండ్‌కు తగినంతగా లేని ఐటీ కొలువులు..
ఏటా లక్షలాది మంది ఇంజనీరింగ్‌ పట్టభద్రులు బయటకు వస్తున్నారు. వీరంతా ఐటీ ఉద్యోగాల కోసం వెతుక్కుంటున్నారు. అయితే వీరి డిమాండ్‌కు తగినంతగా కొలువులు మాత్రం ఉండటం లేదు. దీంతో వారికి నిరాశే ఎదురవుతోంది. నైపుణ్యం ఉన్న అభ్యర్ధుల్లోనూ కొందరికే ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఎక్కువ మందికి ఉద్యోగాలు దొరకకపోవడానికి వారు చదువుకున్న విద్యకు, నేర్చుకున్న నైపుణ్యాలకూ.. మార్కెట్‌ అవసరాలకు మధ్య పొంతన ఉండడంలేదు. కొత్త సాంకేతికతపై మార్కెట్లో పుస్తకాలు అందుబాటులో లేకపోవడం విద్యార్ధులకు ఇబ్బందిగా మారింది.

30 వేల మందికి స్కిల్స్‌ పెంచడంపై విప్రో కసరత్తు..
ఐటీ జాబ్‌లో నైపుణ్యమే కీ రోల్‌ పోషిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఐటీ ఉద్యోగుల నైపుణ్యాలను మారుతున్న సాంకేతికతలకు తగ్గట్టు పెంపొందించుకునే పనిలో అగ్రశ్రేణి ఐటీ సంస్థలు ట్రైనింగ్‌ ప్రోగ్రామ్స్‌ నిర్వహిస్తున్నాయి. డిజిటల్‌ టెక్నాలజీపై టీసీఎస్‌ లక్షమంది ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడంపై దృష్టిపెట్టింది. విప్రో కూడా 30వేల మంది ఉద్యోగులకు స్కిల్స్‌ పెంచడంపై కసరత్తు ప్రారంభించింది. ఐటీ ఉద్యోగులు తమ కొలువులు ఉండాలంటే... ఎప్పటికప్పుడు స్కిల్స్‌ పెంచుకోవడం తప్పనిసరి అన్నమాట. వారు నైపుణ్యాన్ని పెంచుకుంటూ పోతేనే జాబ్‌ గ్యారంటీ. లేదంటే ఇక సాఫ్ట్‌వేర్‌ కల చెదిరిపోయినట్టే.

13:29 - May 12, 2017

గుంటూరు : ఈ నెల 15న తాళ్లాయపాలెం గ్రామ రెవెన్యూ పరిధిలో.. స్విస్ చాలెంజ్‌ విధానంలో స్టార్టప్ ఏరియాకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి దశలో భూముల కేటాయింపులకు సంబంధించిన కార్యక్రమం ఎంఓయూ.. సీఎం చంద్రబాబు, సింగపూర్, ప్రతినిధుల సమక్షంలో జరగనుంది. తరువాత దీనికి సంబంధించిన భూమి పూజ, శంఖుస్థాపన కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

 

ఆ సెట్..ఆ ఎట్ -2017 ఫలితాలు..

విశాఖపట్టణం : ఆ సెట్..ఆ ఎట్ -2017 ఫలితాలు విడుదలయ్యాయి. ఆ సెట్ కు 17,473, ఆ ఎట్ కు 2315 మంది హాజరయ్యారు. ఆంధ్రా యూనివర్సిటీ వెబ్ సైట్ లో ఫలితాలు చూసుకోవచ్చు.  జూన్ 1 నుండి అడ్మిషన్లు..జులై 1 నుండి తరగతులు ప్రారంభం కానున్నాయి.

12:43 - May 12, 2017

ప్రెజెంట్ ఉన్న పరిస్థితులను చూస్తే టాలీవుడ్ ట్రెండ్ మారుతుందా అని డౌట్ రాక మానదు. ఇంతకు ముందు వరకు ఉన్న రెగ్యులర్ స్టోరీస్ పక్కన పెట్టేస్తున్నట్టు ఉన్నారు ఫిలిం మేకర్స్. 'బాహుబలి' సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ కి షాక్ అయ్యారు. ఇదే తరహా కధలకు ఇంపార్టెంట్ ఇస్తూ పురాణ ఇతిహాసాల మీద ఫోకస్ పెట్టారు ఫిలిం మేకర్స్. వెండితెర మీద 'రామాయణం' వంటి మహా కావ్యాలను చూపించాలంటే ఒక ఛాలెంజ్. అలాగే 'మహాభారతం' కూడా అంతే. ఇప్పటివరకు ఇలాంటి కావ్యాలను టివి సీరియల్స్ రూపంలో చూశామే తప్పించి.. వెండితెరపై అద్భుతమైన గ్రాఫిక్స్ పరిజ్ఞానంతో ఒక హాలీవుడ్ సినిమా తరహాలో చూడలేదు. అందుకే ఇప్పుడు 'అల్లు అరవింద్' 'రామాయణ' మహాకావ్యాన్ని తెరకెక్కించడానికి కంకణం కట్టుకున్నారట. అయితే ఈ ప్రాజెక్ట్ కి కేవలం 500 కోట్లు ఖర్చు పెట్టాలని మాత్రమే ప్రస్తుతానికి ఫిక్సయ్యారు. ఓ రెండు భాగాలుగా 'సంపూర్ణ రామాయణాన్ని' సినిమాగా తీయాలని అల్లు అరవింద్.. మధు మంతెన.. నమిత్ మల్హోత్రా నిర్ణయించుకున్నారట. స్వయంగా అరవిందే ఈ విషయాన్ని ఒక ముంబయ్ మీడియా వారికి ప్రకటించారు. అయితే ఇది మేజర్ గా హిందీ సినిమా అని.. లోకల్ భాషల్లోకి డబ్ చేస్తారని కొందరు అంటుంటే.. తన కొడుకు 'అల్లు అర్జున్' తో వీరాంజనేయుడి వేషం వేయించే ఛాన్సుందని ఇంకో టాక్ కూడా వినిపిస్తోంది. ఈ కథలో కథనం అండ్ విజువల్స్ చాలా ముఖ్యం. అసలు డైరక్టర్ ఎవరు.. హీరో ఎవరు.. క్యాస్టింగ్ ఎవరెవరు.. అనే విషయాలు తెలిస్తేనే ఈ ప్రాజెక్టుపై ఒక క్లారిటీ వచ్చేది.

12:41 - May 12, 2017
12:39 - May 12, 2017

హైదరాబాద్: మానవసేవయే మాధవ సేవగా భావిస్తూ ప్రార్థించే పదవులకన్నా సేవలు చేసే చేతులే మిన్నా అన్న మాటలు నిజం చేస్తూ నిరంతరం అంకిత భావంతో రోగులకు సేవలు అందిస్తుంటారు అమలు కాని అమ్మలు. బాధితులను మేము ఉన్నాం అంటూ ఓదార్చుతూ.. సపర్యలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆత్మీయమైన పలకరింపు, స్ఫూర్తిదాయకమైన సేవలతో రోగికి స్వాంతన చేకూర్చడంలో కూలక భూమిక పోషిస్తున్నారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ తమకు ఆదర్శం అంటూ ఆమెని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతున్నారు. యుద్ధంలో, ప్రకృతి వైపరీత్యాలలో గాయపడిన క్షతగాత్రులను ప్రేమతో ఆప్యాయంగా ఆదరించి, సేవలందించి, బాధితులలో మానసిక ధైర్యాన్ని నింపిన ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి. మే12న నర్సుల దినోత్సవం నిర్వహిస్తోన్న సందర్భంగా అమ్మలు కాని అమ్మలుగా రోగులకు సేవలందిస్తున్న నర్సమ్మలకు మానవి శుభాకాంక్షలు.

మహానాడుకు భూమి పూజ..

విజయవాడ : ఏయూలో నిర్వహించే మహానాడుకు టిడిపి నేతలు భూమి పూజ చేశారు. మంత్రులు కళా వెంకట్రావు, చిన రాజప్ప, తదితరులు పాల్గొన్నారు. ఈనెల 27-29 తేదీల వరకు మహానాడు జరగనుంది.

జగన్ లో మార్పు రావాలి - కళా వెంకట్రావు..

విశాఖపట్టణం : జగన్ ఇంకా ఫ్యాక్షినిస్టులా ఆలోచిస్తున్నారని, జగన్ లో మార్పు రావాలని మంత్రి కళా వెంకట్రావు పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు ప్రయత్నిస్తుంటే జగన్ అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

11:57 - May 12, 2017

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఔటర్‌రింగ్‌ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. శంషాబాద్‌ నుంచి పెద్ద అంబర్‌పేట్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 5గురు మృతి చెందారు.

11:53 - May 12, 2017

శ్రీకాకుళం : ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి వద్ద చెట్టును ఢీకొట్టి డబుల్‌డెక్కర్‌ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. జాతీయ రహదారి పక్కనే ఉన్న లోయలోకి జారిపోయింది. అదృష్టవశాత్తు చెట్లు అడ్డుపడటంతో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ఘటనలో డ్రైవర్‌తో పాటు 11 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఇచ్ఛాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రథమచికిత్సచేశారు. అనంతరం బ్రహ్మపురం ఆసుపత్రికి తరలించారు. ఇచ్ఛాపురం రూరల్‌ ఎస్సై చెన్నమనాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశాఖపట్టణం నుంచి ఒడిశాలోని బ్రహ్మపురంకు 40మంది ప్రయాణికులతో వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

శ్రీలంకలో మోడీ పర్యటన..

ఢిల్లీ : భారత ప్రధాని నరేంద్ర మోడీ శ్రీలంక పర్యటన కొనసాగుతోంది. బుద్ధపూర్ణిమ వేడుక 'వేసక్' ను మోడీ ప్రారంభించారు. సమాజంలో ప్రతొక్కరూ బుద్ధుడిని ఆదర్శంగా తీసుకోవాలని, సంస్కృతి, సంప్రదాయాలు, సిద్ధాంతాలు ప్రముఖుల నుండి వచ్చినవేనన్నారు. భారత్ - శ్రీలంక మధ్య బంధం మరింత బలోపేతమౌతోందని తెలిపారు. కొలంబో నుండి వారణాసికి నేరుగా విమన సేవలు అందుబాటులో తేనున్నట్లు, ఈ ఏడాది ఆగస్టు నుండే కొలంబో - వారణాసి విమాన సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు.

ఎంసెట్..ఆలస్యంగా వచ్చిన విద్యార్థులు..

ఖమ్మం : ఎస్ఎన్ మూర్తి పాలిటెక్నిక్ కాలేజీలో ఎంసెట్ పరీక్ష కొనసాగుతోంది. ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను లోనికి అనుమతించలేదు.

మహానాడు ఏర్పాటుకు అనుమతులు - చినరాజప్ప..

విశాఖపట్టణం : ప్రస్తుతం సెలవులు కాబట్టే ఏయూలో మహానాడు నిర్వహించాలని నిర్ణయించినట్లు, ఇందుకు అనుమతులు కూడా వచ్చినట్లు హోం మంత్రి చిన రాజప్ప పేర్కొన్నారు. అన్నీ ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.

రాజకీయ పార్టీలతో ఈసీ సమావేశం..

ఢిల్లీ : రాజకీయ పార్టీ ప్రతినిధులతో కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం సమావేశమైంది. ఈవీఎంల విశ్వసనీయతపై ఈసీ తన అభిప్రాయాలను తెలియచేసింది. ఈ భేటీకి ఏడు, 48 ప్రాంతీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు.

11:37 - May 12, 2017

హైదరాబాద్:  అమీర్‌పేటలో రిజర్వ్ బ్యాంకు ఉద్యోగిని ఆత్మహత్య కలకలం రేపింది. కోల్‌కతాకు చెందిన నితిన్ జైన్ , శ్వేతాజైన్ దంపతులు. అమీర్‌పేట లాల్‌బంగ్లా ఎదురుగా ఉన్న నాబార్డ్ వసతి గృహాల్లో ఉంటున్నారు. నితిన్ నాబార్డ్‌లో అసిస్టెంట్ మేనేజర్ కాగా, శ్వేత రిజర్వ్ బ్యాంక్ ఉద్యోగిని. కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన శ్వేత ఇంట్లోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న ఎస్సార్‌నగర్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

11:34 - May 12, 2017

ప్రపంచ వ్యాప్తంగా పలు నగరాల్లో ట్రాఫిక్ జాం ఏర్పడడం మాములే. గంటల తరబడి ట్రాఫిక్ జాం ఏర్పడితే ఏం చేస్తారు ? ఏముంది పక్కనే ఉన్న హోటల్ లోకి వెళ్లడం..షాపింగ్ చేయడం వంటివి చేస్తుంటాం..ట్రాఫిక్ క్లియర్ కాగానే వెళుతాం అంటారా ? కానీ ఓ మహిళ అలా చేయలేదు. ట్రాఫిక్ జాం ఎంత దారుణంగా ఉందో బాహ్య ప్రపంచానికి తెలియచేసే ప్రయత్నం చేసింది. ఫ్లోరిడాకు చెందిన క్రిస్టిస్ బిజార్సెన్ గత బుధవారం మిమామీ రహదారిపై కారులో వెళుతోంది. కొద్ది దూరం వెళ్లిన అనంతరం ఆమె వెళుతున్న లైన్ లో తీవ్ర ట్రాఫిక్ జాం ఏర్పడింది. తీవ్ర అసహానికి లోనైన ఆమె వెంటనే ఓ మ్యాట్ తీసింది. రోడ్డు మీద పరిచింది. వెంటనే 'యోగా' చేయడం ఆరంభించింది. తోటి ఫ్రెండ్స్ ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. క్షణాల్లో ఫొటో వైరల్ అయిపోయింది. ఎందుకిలా చేశావ్ అనే ప్రశ్నలు వచ్చాయి. 'మిమామీలో ట్రాఫిక్ సమస్యలు హైలెట్ చేసేందుకు తాను ఈ పని చేశానని, ట్రాఫిక్ కంట్రోల్ చేసేందుకు ఒక సొల్యూషన్ చూడాలి' అని తన ఉద్ధేశ్యాన్ని వ్యక్తపరిచారు.

11:24 - May 12, 2017

ఢిల్లీ : బుద్దుణ్ణి ఆదర్శంగా తీసుకోవాలని ప్రధాని మోదీ అన్నారు. శ్రీలంకలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. బుద్ధపూర్ణిమ వేడుక 'వేసక్' ను మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలు, సిద్ధాంతాలు ప్రముఖలనుంచి వచ్చినవే అని తెలిపారు. భారత్ -శ్రీలంక మధ్య బంధం మరింత బలోపేతం అవుతోందన్నారు. ఈ ఏడాది ఆగస్టు నుంచే కొలంబో- వారణాసి విమాన సేవలు ప్రారంభం అవుతాయన్నారు. అనంతరం భారత్ అందించిన రూ. 150 కోట్లతో నిర్మించిన ఆసుపత్రిని మోదీ ప్రారంభించనున్నారు. భారత సంతతి తమిళులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

 

సిక్కోలులో లోయలో పడిన ప్రైవేటు బస్సు..

శ్రీకాకుళం : ప్రైవేటు ఓల్వా బస్సు బోల్తా కొట్టింది. బస్సు చెట్టును ఢీకొట్టి లోయలో పడిపోయింది. చెట్టును ఢీకొని ఆగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బస్సులో 40 మంది ప్రయాణీకులున్నారు. విశాఖపట్టణం నుండి ఒడిశాలోని బ్రహ్మాపురానికి బస్సు వెళుతోంది. ఇచ్చాపురం వద్ద అదుపుతప్పి చెట్టును ఢీకొట్టి లోయలోకి దూసుకెళ్లింది. చెట్లు అడ్డురావడంతో బస్సులో ఉన్న వారికి ప్రాణాపాయం తప్పింది. 11 మందికి గాయాలయ్యాయి.

తుక్కుగూడలో రోడ్డు ప్రమాదం..

రంగారెడ్డి : తుక్కుగూడలో రోడ్డుప్రమాదం చోటు చూసుకుంది. అతివేగంగా వచ్చిన ఓ కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. శంషాబాద్ నుండి పెద్ద అంబర్ పేట వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

రిజర్వ్యు బ్యాంకు ఉద్యోగిని ఆత్మహత్య..

హైదరాబాద్ : అమీర్ పేట నాబార్డ్ వసతి గృహంలో రిజర్వు బ్యాంకు ఉద్యోగిని శ్వైతా జైన్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సార్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భార్య భర్తలిద్దరూ బ్యాంకు ఉద్యోగులు కావడం గమనార్హం.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు - ఉత్తమ్..

హైదరాబాద్: తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉందని టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వంపై అన్ని వర్గాలు అసంతృప్తితో ఉన్నాయన్నారు.

ధర్నా చౌక్ ఎత్తివేయడం వ్యతిరేకిస్తున్నాం - బీజేపీ..

హైదరాబాద్ : ధర్నా చౌక్ ను ఎత్తివేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు బీజేపీ ఎమ్మెల్యే ప్రభాకర్ పేర్కొన్నారు.

ధర్నా చౌక్ ఎత్తివేయడం దుర్మార్గం - ఎల్.రమణ..

హైదరాబాద్ : 20 ఏళ్లుగా ఉన్న ధర్నా చౌక్ ను ఎత్తివేయడం దుర్మార్గమని టిడిపి నేత ఎల్.రమణ పేర్కొన్నారు. సబ్బండవర్గాల సమస్యలను వినిపించేందుకు ధర్నా చౌక్ అని, కేసీఆర్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తానన్నారు.

10:52 - May 12, 2017

హైదరాబాద్: ఇందిరాపార్క్ వద్ద ధర్నా చౌక్‌ పరిరక్షణ కోసం గన్‌పార్క్‌ దగ్గర కోదండరాఈం మౌన దీక్ష ప్రారంభమైంది. దీక్షలో సున్నం రాజయ్య, ఎల్‌. రమణ, చెరుకుపల్లి సీతారాములు, గుమ్మడి నర్సయ్య, అజిద్‌ బాషా, పలువురు ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు.

 

10:50 - May 12, 2017

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ పరీక్ష ప్రారంభమైంది. ప్రశ్నాపత్రానికి సంబంధించిన టీఎస్ ఎంసెట్ కోడ్ జే 1ను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి విడుదల చేశారు. మధ్యాహ్నం 2.30 గం.లకు అగ్రికల్చరల్‌, మెడిసిన్‌ విభాగాలకు పరీక్ష జరగనుంది. 2,20,248 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు.

10:47 - May 12, 2017

సంగారెడ్డి : తెలంగాణలో రాళ్ల ఏడారి ప్రాంతమది. కరవు కరాళ నృత్యం చేస్తోంది. అక్కడి వారి జీవితాలను అతలాకుతలం చేస్తోంది. గుక్కెడు నీటి కోసం మైళ్లదూరం నడవాల్సిన దుస్థితి. సాగునీటి వనరు లేని దయనీయస్థితి. కరవు కాటకాలకు నిలయంగా..వలసలకు చిరునామాగా మారిన సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్‌ నియోజకవర్గం దుస్థితిపై ప్రత్యేక కథనం.

ఆకాశం నుంచి రాళ్ల వర్షం కురిసినట్లుగా.

ఆకాశం నుంచి రాళ్ల వర్షం కురిసినట్లుగా..ఇక్కడ ఎటుచూసినా రాళ్లే కనిపిస్తాయి. కోటి రతనాల వీణ తెలంగాణలో..రాళ్లు మాత్రమే దర్శనమిచ్చే ప్రాంతం. సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో ఏళ్లుగా కరవు ఉరుముతూ..ఇక్కడి వారి జీవితాలను అగమ్యగోచరంగా మార్చేసింది. దశాబ్దాలుగా పాలకుల నిర్లక్ష్యానికి గురవుతూ.. ఈ ప్రాంత రైతులు బక్కచిక్కిపోతున్నారు.

మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దులోని...

మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దులోని నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో కరవు విలయతాండవం చేస్తోంది. నాగుల్‌గిద్ద మండలంలోని ఏ గ్రామాన్ని చూసినా..ఇళ్లకు తాళాలే కనిపిస్తాయి. తాగు,సాగునీరు లేకపోవడంతో.. పొట్టచేత్తోపట్టుకుని బతుకుజీవుడా అంటూ ముంబాయి, బీదర్‌,హైదరాబాద్‌కు వలసపోతున్నారు. తమ కుటుంబాలను బతికించుకోవడం కోసం యువకులు వలసబాటపడుతున్నారు. అమ్మనాన్నల ఆప్యాయతకు దూరంగా బతుకుజట్కా బండిని లాగుతున్నారు. చదువుకు తగ్గ ఉద్యోగం రాకపోయినా..నెరవకుండా చమటలు చిందిస్తున్నారు. అటు తమ కొడుకులు పంపే డబ్బులు ఎప్పుడొస్తాయా అని తల్లిదండ్రులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

యువకులు ఉపాధి వెత్తుకుంటూ పట్టణాల బాటపడితే...

యువకులు ఉపాధి వెత్తుకుంటూ పట్టణాల బాటపడితే..గ్రామాల్లో ఉంటున్న వృద్ధుల పరిస్థితి దయనీయంగా ఉంది. జబ్బు చేసినా చూసే దిక్కులేక మౌనంగా రోదిస్తున్నారు. తమ గోడు వినే నాథుడే కరువయ్యాయడని విలపిస్తున్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో వలసలు తగ్గిస్తామని..తాగు,సాగు నీరు అందించి సస్యశ్యామలం చేస్తామని 2009 సాధారణ ఎన్నికలతో పాటు 2016 ఉప ఎన్నికల్లోనూ సాక్షత్‌ సీఎం కేసీఆర్‌ వరాల జల్లు కురిపించారు. జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ మరో అడుగు ముందుకేసి పారిశ్రామిక ప్రాంతంగా మార్చి ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుతామని హామీలు గుప్పించారు. కానీ నాయకుల ఆకట్టుకునే హామీలు రాళ్ల ఏడారిలో ఒయాసిస్‌గా మారాయని జనం మండిపడుతున్నారు.

పలు తండాలు అభివృద్ధికి ఆమడదూరంలో

ఇక ఈ ప్రాంతం అభివృద్ధిలోనూ బాగా వెనుకబడిపోయింది. నారాయణఖేడ్‌ నియోజకవర్గంలోని నాగుల్‌గిద్ద మండలంలోని ఊట్‌పల్లి, ఎనక్‌పల్లి గ్రామాలు, పదులసంఖ్యలో తండాలు అభివృద్ధికి ఆమడదూరంలో అలమటిస్తున్నాయి. కనీసం రోడ్డు మార్గం, రవాణా సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాగునీటి వనరులు లేక జనం అల్లాడిపోతున్నారు. పంటభూములన్నీ బీడు భూములుగా మారిపోయాయి. వర్షాధార పంటలే దిక్కవడంతో ఆశగా ఆకాశంవైపు ఎదురుచూస్తున్నారు. మిషన్‌ కాకతీయ పథకం కింద చెరువులు ఏర్పాటైతే.. రాళ్ల ప్రాంతం జలసిరులతో సస్యశ్యామలమవుతుందనుకున్నారు. కానీ ఏలికల ఆర్భాట ప్రకటనలు...వీరి తలరాతలను మార్చలేకపోయాయి.

ఆశ నిరాశే అయ్యిందని

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో తమ బతుకులు మారుతాయన్న ఆశ నిరాశే అయ్యిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కరవు కోరలకు చిక్కి అల్లాడిపోతున్న నారాయణఖేడ్‌ రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని రైతు సంఘాలు, మేధావులు కోరుతున్నారు.

కరవును తరిమికొట్టే మార్గమే లేదా?

రాళ్ల ఏడారిగా మారిన నారాయణఖేడ్‌ నియోజకవర్గం సుభిక్ష ప్రాంతంగా ఎప్పుడు మారుతుందా అని ఇక్కడి ప్రజలు ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. తలాపునే సింగూరు ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ ఉన్నా..ఈ ప్రాంతానికి నీటి కష్టాలు తీరడం లేదు. కేవలం నాలుగు కిలోమీటర్లు కాలువలు తవ్వితే.. జలసిరులు పరవళ్లు తొక్కే అవకాశం ఉంది. బీడు భూములు పంట పొలాలుగా మారనున్నాయి. ధాన్యపురాసులతో రైతుల లోగిళ్లు శోభిళ్లనున్నాయి. కానీ అది ఏళ్లుగా కలగానే మిగిలిపోయింది. ఎన్నికల ముందు వాగ్దానాలు ఇచ్చిన నాయకులు మాటలు నీటిమూటలుగా మారిపోతున్నాయి. కరవును తరిమేస్తామని ఆర్భాటంగా చేసే ప్రకటనలు కాగితాలకే పరిమితమవుతున్నాయి.

బతుకులు మారాలంటే కరవు రక్కసిని తరిమేయాలంటే ...

రాళ్ల ఏడారిలోని ప్రజల బతుకులు రోజు రోజుకు దుర్భరమవుతున్నాయి. ఇక్కడి వారి బతుకులు మారాలంటే కరవు రక్కసిని తరిమేయాలంటే సాగునీటి వనరుల వినియోగం జరగాలని రైతుసంఘాల నాయకులు చెబుతున్నారు. పాలకులు సింగూరు జలాల తరలింపునకు ఎందుకు పూనుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. మిషన్‌ కాకతీయ కింద ఎందుకు పనులు చేపట్టడం లేదని నిలదీస్తున్నారు. పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ఉన్న అవకాశాలను వివరిస్తున్నారు. మొక్కజొన్న, కందులు, సోయాబిన్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలు ప్రారంభిస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెబుతున్నారు. బోదన్‌-నారాయణఖేడ్‌-బీదర్‌ మీదుగా రైల్వే లైన్‌ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలంటున్నారు.

కావాలనే నారాయణ ఖేడ్‌ ప్రాంతాన్ని వెనకబాటుకు గురిచేస్తున్నారని..

ఏళ్లుగా పాలకులు కావాలనే నారాయణ ఖేడ్‌ ప్రాంతాన్ని వెనకబాటుకు గురిచేస్తున్నారని సీపీఎం నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వాలు మారినా వారి వెతలు మాత్రం తీరడం లేదంటున్నారు. 2006లోనే పాదయాత్ర ద్వారా నీటివనరులు గురించి వివరాలు అందించామని..చిన్న చిన్న కుంటలు అభివృద్ధి చేయాలని సూచించామంటున్నారు. 11 ఏళ్లు గడిచినా ఎవరూ స్పందించకపోవడం దారుణమని మండిపడుతున్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం స్పందించి నారాయణ ఖేడ్‌ నియోజకవర్గానికి సింగూరు జలాలను తరలించాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు. మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులు, కుంటలు అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

10:43 - May 12, 2017

బాహుబలి-2 సినిమా కనకవర్షం కురిపిస్తోంది. రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి-2' సినిమా ఇటీవలే ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. రికార్డులు సృష్టిస్తూ దూసుకెళుతోంది. ఇప్పటికే వేయి కోట్ల క్లబ్ లో చేరిపోయి అందనంత ఎత్తులో నిలిచింది. 12 రోజుల్లో రూ. 1200 కోట్లు కలెక్ట్ చేసి రూ. 1500 కోట్ల దిశగా ముందుకెళుతోంది. హిందీలో ఈ సినిమా హక్కులను దర్శక, నిర్మాత కరణ్ జోహార్ రూ. 80కోట్లకు కొనుగోలు చేసి..సినిమా ప్రచారానికి రూ. 10 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఈ సినిమా హిందీలో రూ. 375.37 కోట్లు కలెక్షన్లు చేసినట్లు తెలుస్తోంది. పెట్టింది రూ. 90 కోట్లు అయితే లాభాలు రూ. 285.37 కోట్లు వచ్చినట్లు సమాచారం. దీనిపై చిత్ర యూనిట్, కరణ్ జోహార్ అధికారికంగా వెల్లడిస్తేగానే పూర్తి వివరాలు తెలియదు.

శ్రీలంకలో ప్రధాని మోదీ పర్యటన

ఢిల్లీ : శ్రీలంకలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. బుద్ధపూర్ణిమ వేడుక 'వేసక్' ను మోదీ ప్రారంభించారు. అనంతరం భారత్ అందించిన రూ. 150 కోట్లతో నిర్మించిన ఆసుపత్రిని మోదీ ప్రారంభించనున్నారు. భారత సంతతి తమిళులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

టి.సర్కార్ కు తమ్మినేని హెచ్చరికలు..

హైదరాబాద్ : నియంతృత్వ ధోరణిలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభధ్రం పేర్కొన్నారు. గన్ పార్క్ వద్ద జరుగుతున్న మౌన దీక్షలో ఆయన పాల్గొని మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలను అణిచివేస్తూ..విమర్శలను అణిచివేస్తూ పద్ధతలును పాటిస్తూ ప్రజాస్వామ్యంలో ఈ రకమైన పాలన సాధించడం అసాధ్యమన్నారు. నియంతృత్వ ధోరణి అవలింబిచిన వారందరూ నామరూపాలు లేకుండా పోయారని, ఈ రకంగా ప్రవర్తిస్తే కేసీఆర్ కూడా ఈ గతి పట్టకతప్పదని హెచ్చరించారు.

10:31 - May 12, 2017

హైదరాబాద్: ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతూ, నియంతృత్వ ధోరణిని అవలంభిస్తోన్న కేసీఆర్ కు పతనం తప్పదని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. ఇందిరా పార్క్ వద్ద ధర్నాచౌక్ ను పరిరక్షించాలని కోరుతూ నేడు గన్ పార్క్ వద్ద వివిధ పక్షాల నేతలు మౌన దీక్షను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీజేఏసీ, కాంగ్రెస్, బిజెపి, సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ, ఇతర ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భం తమ్మినేని మాట్లాడుతూ..ఏకపత్యంగా పరిపాలించాలనుకునేవారు పాలనను ప్రజారంజకం చేయాలని సూచించారు. ప్రజాఉద్యమాలను ఎంత దారుణంగాఅణచివేయాలని చూస్తే అంత పెద్దఎత్తున ఎగిసి పడుతుందని హెచ్చరించారు. 15న సేవ్ ధర్నా చౌక్ కార్యక్రంలో సీపీఎం కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.

10:31 - May 12, 2017

ప్రముఖ హీరోలు తమ తమ సినిమాల్లోనే పాటలు పాడడమే కాకుండా ఇతరుల సినిమాలకు తమ గొంతును వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా 'బాలకృష్ణ' కూడా ఈ జాబితాలో చేరిపోయారు. తన తాజ చిత్రంలో ఓ పాట పాడారు. 100వ సినిమా 'గౌతమి పుత్ర శాతకర్ణి' ఘన విజయం సాధించిన అనంతరం తదుపరి చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 101వ సినిమా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందబోయే చిత్రంలో 'బాలయ్య' నటిస్తున్నారు. భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి.ఆనందప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం కోసం బాలకృష్ణ సింగర్‌గా మారారు. ఆ విశేషాలను దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తెలియచేశారు. ఈ చిత్రంలో 'మావా ఏక్‌ పెగ్‌ లావో.. ' అనే పాట పాడటం చాలా ఆనందంగా ఉందని తెలియచేశారు. అత్యంత తక్కువ సమయంలో అంత గొప్పగా పాడటాన్ని చూసి యూనిట్‌ ఆశ్చర్యపోయిందని, స్వతహాగా బాలకృష్ణకు సంగీతం పట్ల మంచి అభిరుచి ఉందన్నారు. ఆడియో విడుదలైన తర్వాత పాట విన్న ప్రతి ఒక్కరూ ఆయన స్వరాన్ని విని ఆనందిస్తారు. అభినందిస్తారని తెలిపారు. ఇప్పటికే షూటింగ్‌ కొంత భాగం పూర్తయ్యిందని, గురువారం సాయంత్రం యూనిట్‌ పోర్చుగల్‌కు ప్రయాణమైందన్నారు. దసరా కానుకగా చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది.

ప్రారంభమైన తెలంగాణ ఎంసెట్ పరీక్ష

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ పరీక్ష ప్రారంభం అయ్యింది. ఈ పరీక్ష మధ్యాహ్నం ఒంటిగంటల వరకు జరగనుంది. ముందుగా హెచ్చరించిన విధంగా ఒక్క నిమిషం ఆలస్యం అయినా విద్యార్థులను అధికారులు అనుమతించడం లేదు.

సీపీఎం కార్యాలయాన్ని ఆక్రమించుకున్న టీఆర్ ఎస్ నేతలు

సూర్యాపేట : మోతె మండలం రాయపాడులో సీపీఎం కార్యాలయాన్ని టీఆర్ ఎస్ నేతలు ఆక్రమించుకున్నారు. సీపీఎం కార్యాలయం పై జెండా ఎగరేసేందుకు వెళ్తున్న సీపీఎం నేతలను సూర్యాపేటలో పోలీసులు అడ్డుకున్నారు.

గన్ పార్క్ వద్ద ప్రారంభమైన మౌనదీక్ష

హైదరాబాద్: ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ ను యధావిధిగా కొనసాగించాలని గన్ పార్క్ వద్ద మౌనదీక్ష ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమంలో జేఏసీ ఛైర్మన్ ప్రొ.కోదండరామ్, సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, చెరుకుపల్లి సీతారాములు, విద్యావేత్త చుక్కా రామయ్య, గుమ్మడి నర్సయ్య, టిడిపి నేత ఎల్. రమణ, కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమారెడ్డి. సీపీఐ నేత అజీజ్ భాషా పలువురు ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు.

09:51 - May 12, 2017

గత రెండు మాసాలుగా ఎండలు..ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు చల్లని కరుబు. త్వరలోనే నైరుతి రుతుపవనాలు వచేస్తాయేని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 15 లోపు దక్షిణ అండమాన్‌, నికోబార్‌ దీవులల్లోకి నైరుతి రుతు పవనాలు ప్రవేశిస్తాయని ప్రకటించింది. దక్షిణ అండమాన్‌లో అల్పపీడనం తర్వాత వాయుగుండం ఏర్పడే అవకాశముందని అంచనా. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం మూడు రోజుల ముందే కేరళను నైరుతి రుతుపవనాలు తాకే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం పేర్కొంది. సాధారణంగా దక్షిణ అండమాన్ లోకి ఈనెల 20 కల్లా నైరుతి రావాల్సి ఉందని..జూన్ 1న కేరళను తాకాలని నిపుణులు పేర్కొంటున్నారు. నైరుతి రుతు పవనాలు హిందూ మహా సముద్రం నుండి బయలుదేరి మడగాస్కర్‌ మీదుగా సాగుతాయి. భూ మధ్య రేఖా ప్రాంతాన్ని దాటిన తర్వాత రెండు శాఖలుగా విడిపోతాయి. ఒకటి నైరుతి శాఖ దక్షిణ అండమాన్‌ మీదుగా బంగాళాఖాతాన్ని, మరోకటి అరేబియా మీదుగా కేరళను తాకుతాయి. తర్వాత ఇవి రెండూ భారతదేశంలో ఏకమవుతాయి.

09:43 - May 12, 2017

అండర్ 21 జాతీయ కరాటే పోటీల్లో తెలంగాణ చిన్నోడు సత్తా చాటాడు. 30 కిలోల విభాగంలో పాల్గొన్న హైదరాబాద్ కు చెందిన దుర్గాసాయి తనిష్క బంగారు పతకం సాధించాడు. ఢిల్లీలో సబ్‌జూనియర్‌, క్యాడెట్‌, జూనియర్‌, అండర్‌ 21 జాతీయ కరాటే పోటీలు జరిగాయి. ఇందులో తనిష్క కూడా పాల్గొన్నాడు. గురువారం తాల్కటోరా స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో తమిళనాడుకు చెందిన ప్రకాశ్ దాస్ తో తనిష్క పోటీ పడ్డాడు. వీరిద్దరి మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. ఐదు రౌండ్ల హోరాహోరీ మ్యాచ్‌లో ప్రకాశ్‌ దాస్‌ను తనిష్క ఓడించాడు. జాతీయ కరాటే సంఘం అధ్యక్షుడు త్యాగరాజన్‌, ప్రధాన కార్యదర్శి భరత్‌శర్మ, తెలంగాణ కరాటేసంఘం అధ్యక్షుడు మహేష్‌కుమార్‌ గౌడ్‌లు తనిష్క్‌కు బంగారు పతకం, సర్టిఫికేట్‌ను అందజేశారు. ఎనిమిది నెలలుగా పట్టుదలతో కరాటే ప్రాక్టీసు చేయడంతో నేడు తెలంగాణకు బంగారు పతకం సాధించాడని కోచ్‌లు కే కీర్తన్‌, మహమ్మద్‌ షఫీ చెప్పారు. తనిష్కకు కరాటే అంటే చాలా ఇష్టమని తల్లిదండ్రులు రవిశంకర్, సులక్షణా తెలిపారు.

కాసేపట్లో ప్రారంభం కానున్న తెలంగాణ ఎంసెట్

హైదరాబాద్: ఈ ఉదయం 10 గంటలకు తెలంగాణ ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ పరీక్ష ప్రారంభం కానుంది. ప్రశ్నాపత్రానికి సంబంధించిన టీఎస్ ఎంసెట్ కోడ్ జే 1ను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి విడుదల చేశారు. మధ్యాహ్నం 2.30 గం.లకు అగ్రికల్చరల్‌, మెడిసిన్‌ విభాగాలకు పరీక్ష జరగనుంది. 2,20,248 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించేది లేదని అధికారులు చెబుతున్నారు.

09:39 - May 12, 2017

హైదరాబాద్: కాసేపట్లో గన్‌పార్క్‌ వద్ద ధర్నా చౌక్‌ పరిరక్షణకై మౌనదీక్ష జరగనుంది. దీక్షలో ప్రొఫెసర్‌ కోదండరాం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, వామపక్ష, కాంగ్రెస్‌, ప్రజా సంఘాల నేతలు పాల్గొననున్నారు. గత 28 రోజులుగా ముగ్ధుం భవన్ నిరసన దీక్షలు చేపట్టినా ఫలితం లేకపోవడం నేటి నుండి గన్ పార్క్ వద్ద మౌన దీక్షలు చేపట్టారు. ఈ దీక్షకు టిజేఏసీ, కాంగ్రెస్, టిడిపి, వామపక్షాలు మద్దతు ప్రకటించారు.ఈ సందర్భంగా ప్రొ.కోదండరాం మాట్లాడుతూ వీలైనంత మంది ఐక్యమైతే తప్ప ఇలాంటి అంశాలను సాధించడం సాధ్యమౌతుందన్నారు. ఈ కార్యక్రమానికి వివిధ వర్గాల నుండి ఊహించని మద్దతు వస్తోందని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

09:36 - May 12, 2017

ల్యాప్ టాప్ ప్రస్తుతం ఇది లేనిదే కొంతమందికి పని జరగదు. ఎక్కడికైనా తీసుకెళాల్సి ఉంటుంది. వ్యాపార వేత్తలు, కీలక బాధ్యతల్లో ఉండే ఉద్యోగులు..ఇతరులు ఎక్కువ ల్యాప్ టాప్ లను వినియోగిస్తుంటారు. వివిధ పనులపై వివిధ దేశాలకు వెళ్లే సమయంలో తప్సనిసరిగా దీనిని తీసుకెళుతుంటారు. కానీ ప్రస్తుతం విమానాల్లో ల్యాప్ టాప్ లను తీసుకెళ్లడం నిషేధించినట్లు వార్తలు వెలువడుతన్నాయి. కమర్షియల్‌ విమానాల్లో ల్యాప్‌టాప్‌లు తీసుకెళ్ళడంపై ట్రంప్‌ ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధాన్ని కొన్ని యురోపియన్‌ దేశాలకు కూడా విస్తరించే అవకాశాలు వున్నాయని తెలుస్తోంది. విమానం గాల్లో ఉండగా లగేజీలో ఉండే లిధుయం బ్యాటరీలు పేలిపోకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు సమీక్షిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ల్యాప్ టాప్ లను నిషేధిస్తే ఈ ప్రభావం యునెటైడ్ ఎయిర్ లైన్స్, డెల్టా, అమెరికన్ ఎయిర్ లైన్స్ గ్రూపులపై పడుతుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే హోం లాండ్‌ సెక్యూరిటీ విభాగం ప్రకటన చేయనుందని తెలుస్తోంది. యుఎఇ, సౌదీ అరేబియా, కతార్‌, టర్కీలతో సహా మొత్తంగా 10 విమానాశ్రయాల నుండి వచ్చే విమానాల్లో ల్యాప్‌టాప్‌లు తీసుకురావడంపై మార్చిలో అమెరికా ఆంక్షలను విధించింది.

కాసేపట్లో గన్ పార్క్ వద్ద మౌనదీక్ష

హైదరాబాద్: కాసేపట్లో గన్‌పార్క్‌ వద్ద ధర్నా చౌక్‌ పరిరక్షణకై మౌనదీక్ష జరగనుంది. దీక్షలో ప్రొఫెసర్‌ కోదండరాం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, వామపక్ష, కాంగ్రెస్‌, ప్రజా సంఘాల నేతలు పాల్గొననున్నారు.

09:35 - May 12, 2017

రంగారెడ్డి : నందిగామలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని కారు ఢీ కొనడంతో.. ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. మృతుల్లో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వాళ్లు కావడంతో.. అక్కడ వాతావరణం ఉద్వేగంగా మారిపోయింది. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

09:30 - May 12, 2017

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కంటే తానే బాగా పని చేస్తానని ప్రముఖ హాలీ వుడ్‌ నటుడు, మాజీ రెజ్లర్‌ 'డ్వెయిన్‌ జాన్సన్‌(ద రాక్‌)' పేర్కొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాక్ అంటే అందరికీ తెలుసే. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ లో ఫైటర్ గా గుర్తింపు పొందాడు. ఆయన సినిమాల్లో కూడా తన ప్రతిభను చాటుడుతున్నాడు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాశంమౌతున్నాయి. 2020లో అమెరికా అధ్యక్ష బరిలో ఉంటానని, అధ్యక్షుడిగా ఉండటమంటే మామూలు విషయం కాదని ఇది తనకు సాధ్యమయ్యే విషయమేనని కుండబద్దలు కొడుతున్నాడు. '2016లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నేను ట్రంప్‌, హిల్లరీలలో ఎవరికీ ఓటెయ్యలేదు. నేను కానీ అధ్యక్షుడినై ఉంటే ఓ నాయకుడిగా ప్రజల పట్ల బాధ్యతగా ఉంటాను. నేను వ్యతిరేకించేవారి పట్ల కూడా తప్పుగా ప్రవర్తించను...వాళ్లని కూడా నాతో కలుపుకుంటాను. చెప్పాలంటే ఓ అధ్యక్షుడిగా ట్రంప్‌ కంటే నేనే బాగా పనిచేస్తాను' అని చెప్పుకొచ్చాడు. 'బేవాచ్' సినిమాలో ఇతను నటిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కూడా నటిస్తోంది.

డివైడర్ ను ఢీకొట్టిన కారు : ఇద్దరి మృతి

రంగారెడ్డి : తుక్కుగూడ సమీపంలో ఔటర్‌ రింగ్‌రోడ్‌పై టోల్‌గేట్‌ వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కారు మితిమీరిన వేగంతో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులు విజయవాడకు చెందినవారుగా సమాచారం.

ఈవీఎంలపై నేడు ఈసీ భేటీ

హైదరాబాద్: ఈవీఎం లపై అనేక రకాల విమర్శలు వస్తున్ నేపథ్యంలో 55 రాజకీయ పార్టీ ప్రతినిధులతో ఎన్నికల సంఘం శుక్రవారం సమావేశమవుతోంది. ఈ అంశంపై తన అభిప్రాయాలను వారి ముందుంచనుంది. ఈ భేటీలో ఏడు జాతీయ, 48 ప్రాంతీయ పార్టీలు పాల్గొంటున్నాయి.

09:10 - May 12, 2017

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రైతులను టెర్రరిస్టులుగా చూస్తోంది. వారిని జైళ్లలో వేయడమే కాదు.. వారి హక్కులనూ దారుణంగా కాలరాస్తోంది. అన్నదాతల చేతులకు సంకెళ్లు వేసి మరీ వేధిస్తోంది. అవును, ఖమ్మం జిల్లాలో మిర్చిరైతులను పోలీసులు టెర్రరిస్టుల మాదిరిగానే పరిగణించారు. వారి చేతులకు బేడీలు వేసి మరీ కోర్టుకు హాజరుపరిచారు. ప్రజాసంఘాలు, మానవహక్కుల సంఘాలు, ప్రతిపక్షాలు ముక్తకంఠంతో పోలీసుల అమానుష చర్యను తీవ్రంగా ఖండించాయి. ఇదే అంశంపై 'న్యూస్ మార్నింగ్'లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో నవతెలంగాణ ఎడిటర్ ఎస్ వీరయ్య, టిఆర్ ఎస్ నేత రాకేష్, టిడిపి నేత విద్యాసాగర్ పాల్గొన్నారు. పూర్తి వివరా లకోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

 

07:17 - May 12, 2017

హైదరాబాద్: వైసీపీ రూటు మార్చింది. పార్టీ అధినేత జగన్‌.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేకి మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో.. బీజేపీ మాట తప్పిందని పదే పదే విమర్శిస్తూ వచ్చిన వైఎస్‌ జగన్మోహనరెడ్డి.. హఠాత్తుగా, అనూహ్యంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకి మద్దతునివ్వడం వెనుక వ్యూహం ఏంటి..? పైగా ప్రధాని మోదీని కలిసి బయటకు వచ్చిన మరుక్షణమే.. ఈ ప్రకటన చేయడంలోని ఆంతర్యం ఏంటి..? ఇప్పుడీ ప్రశ్నలే రాష్ట్ర ప్రజల మెదళ్లను తొలుస్తున్నాయి.

కమలదళానికి చేరువయ్యేందుకు ఫ్యాన్‌ పార్టీ తహతహ...

ఎన్డీయేకి మద్దతునివ్వనున్నట్లు జగన్‌ చేసిన ప్రకటన.. కమలదళానికి చేరువయ్యేందుకు ఫ్యాన్‌ పార్టీ ఎంతగా తహతహలాడుతోందో చెబుతోందని పరిశీలకులు అంటున్నారు. బీజేపీ అధికారికంగా కోరకపోయినప్పటికీ రాష్ట్రపతి ఎన్నికలో తమ మద్దతు ఎన్డీయే కే అంటూ జగన్ బహిరంగంగా ప్రకటించారు. ఒకవైపు జాతీయంగా ఎన్డీయేకు వ్యతిరేకంగా ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టేందుకు విపక్షాలన్నీ శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎన్డీఏ గూటిలో లేని ఇతర పార్టీలన్నిటినీ ఒకే వేదికపై చేర్చేందుకు సంప్రతింపులు సాగతున్నాయి. ఈ దశలో, జగన్ తీసుకున్న నిర్ణయం విపక్షాల ప్రయత్నాలపై నీళ్లు చల్లినట్లయింది.

రాష్ట్రపతి ఎలెక్టోరల్‌ కాలేజీలో 11 లక్షలకు పైగా ఓట్ల విలువ...

దాదాపు పదకొండు లక్షల ఓట్ల విలువతో కూడిన రాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీలో వివిధ శాసనసభల ఎమ్మెల్యేలు, పార్లమెంటు ఉభయసభల ఎంపీలు ఓటర్లుగా ఉన్నారు. రాష్ట్ర జనాభా, ఎమ్మెల్యేల సంఖ్యను అనుసరించి ఆయా ఎమ్మెల్యేలకు ఓటు విలువ ఉంటుంది. కేంద్రంలోని ఎన్డీఏకు అయిదు లక్షల పైచిలుకు ఓట్లు ఉన్నాయి. మరో 25 వేల ఓట్లు మాత్రమే లోటు ఉంది. ఈ నేపథ్యంలో ఏదో ఒక పెద్ద పార్టీ మద్దతు కూడగట్టుకోవాల్సిన అగత్యం బీజేపీది. ఇటు టీఆర్ఎస్ లేదా ఏఐడీఎంకే మద్దతు తీసుకుని ఎన్డీఏ గట్టెక్కుతుందని అందరూ భావిస్తున్నారు. ఎన్డీఏకు ఝలక్ ఇవ్వడానికి, విపక్ష ఐక్యతను చాటి చెప్పడానికి ప్రత్యామ్నాయ అధ్యక్ష అభ్యర్థిని రంగంలోకి తీసుకురావాలని విపక్షాలు గడచిన నెలరోజులుగా ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ ప్రయత్నాలు ఫలిస్తే పోటీ రసవత్తరంగా మారుతుంది. సమాఖ్య వ్యవస్థకు , ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్న మోడీ ప్రభుత్వానికి చెక్ చెప్పేందుకూ దోహదపడుతుందని విపక్షాలు భావించాయి.

విపక్షాల ప్రయత్నాలకు ఆటంకంగా జగన్‌ నిర్ణయం

మోదీ విధానాలకు వ్యతిరేకంగా బలాన్ని పుంజుకుని.. రాష్ట్రపతి ఎన్నికల్లో చెక్‌పెడదామని భావించిన విపక్షాల ప్రయత్నాలకు జగన్ నిర్ణయం ఆటంకంగా మారింది. ఎందుకంటే జగన్ తీసుకున్న నిర్ణయం వల్ల... వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు చెందిన 20 వేల పైచిలుకు ఓట్లు ఎన్డీఏ కిట్టీలో చేరిపోయినట్లే. రాష్ట్రపతిగా ఎన్డీఏ ఎంపిక చేసిన అభ్యర్థి ఎన్నిక ఇక లాంఛనప్రాయమే. ఇతర పార్టీలన్నీ ఒకే వేదికమీదకు వచ్చినా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ రకంగా చూస్తే జగన్ ను కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో రాజకీయంగా తురుపుముక్కగా వాడుకొందనే చెప్పవచ్చు. విపక్షాల యత్నాలను విఫలం చేసేందుకు జగన్ రాజకీయ అవసరాలను బీజేపీ చక్కగా వినియోగించుకుందన్న భావన రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.

పార్టీ ఓటు బ్యాంకు దెబ్బతింటుందని నేతల్లో ఆందోళన

బీజేపీకి మద్దతు ఇస్తానని జగన్‌ ప్రకటించడం.. వైసీపీలోనూ చర్చనీయాంశంగా మారింది. బీజేపీ చేతిలో పావుగా మారిన పార్టీకి.. అత్యంత మూలమైన ఓటు బ్యాంకు దెబ్బతినే ప్రమాదం ఉందనే ఆందోళన ఆ వర్గాల్లో వ్యక్తమవుతోంది. దళిత, ముస్లిం మైనారిటీలు వై.ఎస్.ఆర్ .పార్టీకి అండదండగా ఉంటూ వస్తున్నారు. రాష్ట్ర జనాభాలో వీరి వాటా 28 శాతం వరకూ ఉంది. ఇందులో మొత్తంగా 20 శాతం ఓటు బ్యాంకు వై.ఎస్.ఆర్. పార్టీది అని ఒక అంచనా. ఈ వర్గాలకు చెందిన 8 శాతం మాత్రమే టీడీపీ, బీజేపీ కూటమి కి గత ఎన్నికల్లో మద్దతు పలికినట్లు విశ్లేషణలు ఉన్నాయి. అందులోనూ ముస్లిం మైనారిటీలు గంపగుత్తగా వై.ఎస్.ఆర్ పార్టీకే మద్దతుగా నిలిచారనే భావన ఉంది. ఈ స్థితిలో దీర్ఘకాలపరిణామాలు యోచించకుండా రాజకీయంగా రాష్ట్రంలోని 20 శాతం ఓటు బ్యాంకుకు జగన్ ఎసరు పెట్టుకున్నారంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం ద్వారా బలపడాల్సింది పోయి దళిత వర్గాల ఓటు బ్యాంకు కోల్పోవడం పార్టీ ప్రాబల్యాన్ని క్షీణింపచేస్తుందన్నది వైసీపీ నేతల ఆందోళన. కేసుల ఒత్తిడిలో జగన్ రాజకీయంగా తప్పటడుగు వేశారనే భావన కూడా పార్టీలో వ్యక్తమవుతోంది. భవిష్యత్ రాజకీయాల కోసం పరిరక్షించుకోవాల్సిన ప్రజామద్దతును పణంగా పెట్టడమనేది వ్యూహాత్మక తప్పిదమేనన్నది వారి భావన.

ప్రత్యేకహోదాతో ఏపీ సర్కారును ఇరుకున పెడుతోన్న జగన్‌

ఇంతకాలం చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు.. ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తుతూ వచ్చిన జగన్‌.. ఎన్డీయేతో సయోధ్య కారణంగా, ఇకపై ఆ అంశంపై మాట్లాడే అవకాశం ఉండదన్నది వైసీపీ వర్గాల భావన. పైగా, ప్రత్యేక హోదా అజెండాపై తమ ఎంపీలు రాజీనామా చేసి, ఎన్నికలకు వెళతారని గతంలో జగన్ మోహన్ రెడ్డి పదే పదే ప్రకటించారు. పార్లమెంటు బడ్జెట్ సెషన్ తర్వాత ఈ నిర్ణయం ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. నిజానికి ప్రత్యేక హోదాను తొక్కిపట్టింది కేంద్రప్రభుత్వమేనన్నది జగద్వితం. ఇప్పుడు అదే పార్టీ అభ్యర్థికి రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వడం అంటే వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ క్రెడిబిలిటీ ప్రజల్లో పలచన కావడం ఖాయమని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఎంపీల రాజీనామాతో ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచే , వేడి రగిలించే అవకాశాన్ని చేజేతులారా వదిలేసుకుని సరెండర్ అయిపోవడం, సాగిలపడిపోవడం వై.సి.పి. రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బందికరమేనన్నది నిస్సందేహం. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరచూ వల్లె వేసే విశ్వసనీయత, విలువలకు.. ఇక చెల్లుచీటి పాడేసినట్లే అంటున్నారు ప్రత్యర్థులు.

07:09 - May 12, 2017

హైదరాబాద్: తెలంగాణాలో శుక్రవారం నిర్వహించే ఎంసెట్‌కు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రెండు లక్షల 20 వేల 248 మంది హాజరు కాబోతున్నారు. మొత్తం నాలుగు వందల ఎగ్జామ్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లో 246 సెంటర్లు... అగ్రికల్చర్‌ మెడికల్ స్ట్రీమ్‌లో 154 సెంటర్లలో పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే ఏపీలో మూడు, తెలంగాణలో 24 రీజినల్ సెంటర్లను ఏర్పాటు చేశారు.

పరీక్షా కేంద్రాల వద్ద బయోమెట్రిక్‌ అటెండెన్స్‌...

ఇంజనీరింగ్‌ విభాగానికి ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు... అగ్రికల్చరల్‌ అండ్‌ మెడిసిన్‌ విభాగాలకు మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి సాయంత్రం ఐదున్నర వరకు... ఎంసెట్‌ జరగనుంది. బయోమెట్రిక్ అటెండెన్స్‌ ఉంటున్నందున విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు కాస్త త్వరగానే చేరుకోవాలని అధికారులు సూచించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు.

అవాంఛనీయ సంఘటనలు జరగకుండా...

పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.

07:02 - May 12, 2017

హైదరాబాద్:ప్రజా సమస్యలపై పోరాటాల విషయంలో కలిసి పనిచేయాలని సీపీఎం, జనసేన పార్టీలు నిర్ణయించారు. ధర్నాచౌక్‌ పరిరక్షణ ఉద్యమానికి జనసేనాని పవన్‌ కల్యాణ్‌ మద్దతు ప్రకటించారు. ఇందిరా పార్క్‌ ధర్నాచౌక్‌ పరిరక్షణ కోసం ఈ నెల 15న జరిగే పోరాటంలో జనసేన పూర్తి మద్దతునిస్తుందని పవన్‌కల్యాణ్‌ ప్రకటించారు. సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం..జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో భేటీ సందర్భంగా..తెలుగు రాష్ట్రాలో ఉన్న ప్రజా సమస్యలు, రాజకీయ పరిణామాలు, జాతీయ అంశాలపై ఇరువురూ చర్చించారు.

ధర్నా చేక్ ఉద్యమానికి జనసేన మద్దతు....

ధర్నాచౌక్‌ పరిరక్షణ కమిటి ఆధ్వార్యాన ఈనెల 15న హైదరాబాద్‌లో నిర్వహించతలపెట్టిన ధర్నాచౌక్‌ కార్యక్రమానికి జనసేన పార్టీ పూర్తి మద్దతు తెలిపింది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్‌కల్యాణ్‌ ప్రకటించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో భేటీ సందర్భంగా పవన్‌కల్యాణ్‌ ఈ ప్రకటన చేశారు. తెలుగు రాష్ట్రాలో ఉన్న ప్రజా సమస్యలు, రాజకీయ పరిణామాలు, జాతీయ అంశాలపై ఇరువురు చర్చించారు.

ఇకపై కలిసి పనిచేయాలని...

ప్రజా సమస్యలపై పోరాటాల విషయంలో ఇకపై కలిసి పనిచేయాలని సీపీఎం, జనసేన పార్టీలు నిర్ణయించారు. ఏ రాష్ట్రంలోని ప్రజలకైనా ప్రభుత్వాల పట్ల అసంతృప్తి తలెత్తితే దాన్ని వెలిబుచ్చుకునే స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, హక్కు ప్రజలకు ఉంటుందని ఈ సందర్భంగా పవన్‌ అన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఒకప్పుడు ధర్నాచౌకే కీలక వేదికగామారిందని...అలాంటి ధర్నాచౌక్‌ను ప్రభుత్వం తిరిగి అనుమతి ఇవ్వాలని విజ్జప్తి చేశారు. ఈ విషయంలో సీపీఎం చేస్తున్న పోరాటానికి జనసేన పూర్తి మద్దతునిస్తుందని ప్రకటించారు. సీపీఎం ఆలోచనా విధానం తనకు ఎంతో నచ్చిందని..ప్రజా సమస్యలపై ఆ పార్టీ నిర్ధిష్ట కార్యాచరణతో ఆందోళణలు నిర్వహిస్తుందని పవన్‌ అన్నారు. దీంతో పాటు ఇటీవల తెలంగాణలో మహాజన పాదయాత్ర నిర్వహించడం ద్వారా తమ్మినేని అనేక ప్రజా సమస్యల్ని వెలికి తీశారని తెలిపారు.

ఈ మైత్రి ఆందోళనవరకే పరిమితం అవుతుందా ..

సీపీఎంతో గానీ..వామపక్షాలతోగానీ ఈ మైత్రి ఆందోళనవరకే పరిమితం అవుతుందా లేక ఎన్నికల వరకు కొనసాగుతుందా అన్న విలేఖరులు ప్రశ్నించగా..ప్రస్తుతం తమ పార్టీకి సంబందించి మండల, జిల్లా స్థాయిలో నిర్మాణంపై దృష్టి కేంద్రీకరించామన్నారు పవన్‌. అందువల్ల ఈ ప్రక్రియ పూర్తయి శక్తి, సామర్థ్యాలను అంచనా వేసుకున్న తర్వాతే దీనిపై స్పందిస్తానన్నారు పవన్‌కల్యాణ్‌.

.తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయస్థాయి రాజకీయ పరిస్థితుల గురించి...

ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ..తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయస్థాయి రాజకీయ పరిస్థితుల గురించి పవన్‌కల్యాణ్‌తో చర్చించామన్నారు. ఇలాంటి చర్చలు భవిష్యత్‌లో కూడా కొనసాగుతాయన్నారు. ప్రజాహితం కోసం చేస్తున్న ధర్నాచౌక్‌ కార్యక్రమానికి జనసేన మద్దతు తెలపడం మంచి పరిణామన్నారు తమ్మినేని వీరభద్రం. ఇతర ప్రజా సమస్యలపై వామపక్షాలు, ఇతర ప్రజాతంత్ర, అభ్యుదయ శక్తులతో కలిసి పనిచేసేందుకు పవన్‌ సానుకూలతను వ్యక్తం చేశారని తమ్మినేని అన్నారు. ప్రస్తుతం ప్రజా సమస్యలపై పోరాటాలకే పరిమితమైన ఈ చర్చలకు భవిష్యత్‌లో ఎన్నికల్లో పొత్తువరకు తీసుకెళ్లాలన్న ఆశాభావంతో జనసేన,సీపీఎం పార్టీలు ఉన్నాయి.

06:58 - May 12, 2017

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రైతులను టెర్రరిస్టులుగా చూస్తోంది. వారిని జైళ్లలో వేయడమే కాదు.. వారి హక్కులనూ దారుణంగా కాలరాస్తోంది. అన్నదాతల చేతులకు సంకెళ్లు వేసి మరీ వేధిస్తోంది. అవును, ఖమ్మం జిల్లాలో మిర్చిరైతులను పోలీసులు టెర్రరిస్టుల మాదిరిగానే పరిగణించారు. వారి చేతులకు బేడీలు వేసి మరీ కోర్టుకు హాజరుపరిచారు. ప్రజాసంఘాలు, మానవహక్కుల సంఘాలు, ప్రతిపక్షాలు ముక్తకంఠంతో పోలీసుల అమానుష చర్యను తీవ్రంగా ఖండించాయి.

మద్దతు ధర అడిగిన పాపానికి ప్రతిఫలం ఇది.....

ఆరుగాలం కష్టించి పంట పండించిన రైతుల చేతులకు బేడీలు పడ్డాయి.... దోపిడీ దొంగల్లా.. కాదు కాదు.. అంతకన్నా ఎక్కువగా.. పొరుగుదేశపు ఉగ్రవాదుల్లా సంకెళ్లతో బంధించారు. ఈ మానవహక్కుల ఉల్లంఘన.. ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ఇటీవల ఖమ్మం మిర్చిమార్కెట్‌యార్డుపై దాడి ఘటనలో కొందరు రైతులను జైలుకు పంపిన పోలీసులు.. వారిని కోర్టుకు హాజరు పరిచే సమయంలో.. ఇలా చేతులకు బేడీలు వేసి తీసుకురావడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి..

ఏకమైన వందలాదిమంది రైతులు....

ఆరుగాలం కష్టపడ్డ మిర్చి రైతులు.. రెండున్నర వేల రూపాయలకే క్వింటాలు మిర్చిని కొంటామన్న వ్యాపారుల మాటలతో కొయ్యబారి.. ఉద్రేకంతో తిరగబడ్డారు. పెట్టుబడిలో సగమైనా తిరిగిరాక.. చేసిన అప్పులుతీర్చే పరిస్థితి కనిపించక, ఆవేశంలో.. వందలాదిమంది రైతులు ఖమ్మం మార్కెట్‌ యార్డు కార్యాలయంపై దాడి చేశారు. రైతుల ఆగ్రహానికి వెనకున్న వేదనను అర్థం చేసుకోలేని సర్కారు.. వారిని ఆదుకోవడం మాట అటుంచి పదిమంది రైతులను జైలు పాల్జేసింది. ప్రభుత్వమే రైతుల పట్ల ఇంత కక్షసాధింపుతో వ్యవహరిస్తే.. తామేమీ తక్కువ తినలేదన్నట్లుగా వ్యవహరించారు పోలీసులు. రైతులకు బేడీలు వేసి మరీ కోర్టు వాయిదాకు తీసుకు వచ్చారు. మద్దతు ధర కావాలంటూ ప్రశ్నించినందుకు ఇలా టెర్రరిస్టులకు వేసినట్లు బేడీలు వేస్తారా అంటూ ప్రజాసంఘాలు, మానవహక్కుల నేతలు మండిపడుతున్నారు..రైతులకు బేడీలుచూసిన వారి కుటుంబసభ్యులూ తీవ్ర ఆవేదన చెందారు..

మండిపడ్డ ప్రతిపక్షాలు...

రైతులకు బేడీలు వేసి తీసుకొచ్చిన ఘటనపై ప్రతిపక్షాలూ తీవ్రంగా మండిపడ్డాయి. ఇదేం పద్దతంటూ సర్కారును నిలదీశాయి.. రైతులపై పెట్టిన కేసుల్ని వెంటనే ఉపసంహరించుకోవాలంటూ విపక్షాలు డిమాండ్‌ చేశాయి. షబ్బీర్‌ ఆలీ హోంమంత్రి, డీజీపీలతో మాట్లాడి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఖమ్మం బైపార్‌ రోడ్డులో సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మ దహనం

రైతులకు సంకెళ్లువేయడాన్ని సీపీఎం ఖండించింది.. పోలీసుల తీరును నిరసిస్తూ ఖమ్మం బైపాస్‌ రోడ్డులో సీపీఎం, అనుబంధ రైతు సంఘాల నేతలు, సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు.. బోనకల్‌ మండలంలో వెయ్యిమంది రైతులు పాదయాత్రచేసిన నిరసన తెలిపారు.. మండలకేంద్రం దగ్గర ధర్నా చేపట్టారు..

రైతులకు సంకెళ్ల ఘటనపై స్పందించిన ఖమ్మం సీపీ

రైతులకు సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకువచ్చిన ఘటనపై ఖమ్మం నగర పోలీస్‌ కమిషనర్‌ ఇక్బాల్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ఘటనకు బాధ్యులైన ఇద్దరు పోలీసుల్ని సస్పెండ్ చేశారు..

రైతులకు అండగా నిలిచిన లాయర్లు...

మరోవైపు, పంటకు గిట్టుబాటు ధర రాక అవస్థలు పడుతున్న రైతులను ప్రభుత్వమే జైలు పాల్జేయడంతో.. కొందరు మానవత్వమున్న న్యాయవాదులు రైతులకు అండగా నిలిచారు. దాదాపు 66మంది న్యాయవాదులు అన్నదాతల పక్షాన వాదించారు.. వీరి వాదనల నేపథ్యంలో న్యాయస్థానం... 10మంది రైతులకు గురువారం బెయిల్‌ మంజూరుచేసింది.. ఈ నెల 8న ఒక కేసులో బెయిల్‌ మంజూరుచేసిన న్యాయస్థానం.. ఇవాళ మిగిలిన మరో రెండు కేసుల్లోనూ బెయిల్‌ ఇస్తున్నట్టు తెలిపింది..

ఇరుకున పడ్డ సర్కార్...

మద్దతు ధర, రైతుల అరెస్టులతో ఇరుకునపడ్డ సర్కారుకు రైతులకు బేడీల ఘటన అప్రతిష్ట తెచ్చిపెట్టింది.. రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. సర్కారు ఈ వివాదానికి ఎలాంటి ముగింపు పలుకుతుందో వేచి చూడాలి.

06:55 - May 12, 2017

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మిషన్ కాకతీయ మూడవ విడత మొదలవుతోంది. ఇప్పటికే రెండు విడతలుగా చెరువుల్లో పూడికతీత, మరమ్మత్తు లాంటి కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణలో 45వేల చెరువులుండగా, ఏడాదికి తొమ్మిదివేల చొప్పున అయిదేళ్లలో అన్ని చెరువుల పూడికతీత పూర్తి చేయాలన్నది తెలంగాణ ప్రభుత్వ సంకల్పం. అయితే, గత రెండు విడతల్లో 18వేల చెరువుల్లో పూడికతీత పనులు పూర్తి కావాల్సి వుండగా, కేవలం 7వేల చెరువుల్లో మాత్రమే మిషన్ కాకతీయ పనులు చేపట్టారు. వాటిలోనూ ఎన్నెన్ని అవకతవకలు జరుగుతున్నాయో, ఏ స్థాయిల్లో నిధుల దుర్వినియోగం అవుతున్నదో ఆయా ప్రాంతాల్లోని స్థానికులకు తెలుసు. తెలంగాణలోని చెరువులకీ మత్స్యకారులకీ వున్న సంబంధం విడదీయరానిది. గత సంవత్సరం చేపట్టిన చేప పిల్లల పంపిణీ కార్యక్రమం కూడా అవినీతి అనకొండగా మారిపోయినట్టు ఆరోపణలొస్తున్నాయి. మూడో విడత మిషన్ కాకతీయ పనులు ప్రారంభమవుతన్న నేపథ్యంలో తెలంగాణ మత్స్యకారుల సంఘం నేత లెల్లల బాలకృష్ణ తో ఇవాళ్టి జనపథం లైవ్ షో. పూర్తి వివరా లకోసం ఈవ వీడియోను క్లిక్ చేయండి...

ఎంసెట్ ప్రశ్నా పత్రం కోడ్ విడుదల

హైదరాబాద్: ఎంసెట్ ప్రశ్నాపత్రం కోడ్ ను విడుదల చేశారు. ఇంజనీరింగ్ ప్రశ్న పత్రం కోడ్ 'జే-1' స్టేట్ కౌన్సిల్ ఛైర్మన్ పాపిరెడ్డి విడుదల చేశారు.

Don't Miss