Activities calendar

13 May 2017

21:37 - May 13, 2017

హైదరాబాద్ : మాదాపూర్‌లో స్పార్పియో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన కారు..ముందున్న రెండు కార్లను, 4 బైక్‌లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా..నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

 

21:35 - May 13, 2017

నెల్లూరు : మరోవైపు టిడిపి సీనియర్ నేత హరికృష్ణ కూడా నెల్లూరు వెళ్లారు. నారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. బిడ్డ పోయిన బాధ ఎలా ఉంటుందో ఓ తండ్రిగా తనకు తెలుసని.. నారాయణ కోలుకుని ముందుకు రావాలని ఆకాంక్షించారు హరికృష్ణ.

21:34 - May 13, 2017

హైదరాబాద్ : విదేశాలకు వెళ్లే భారతీయులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ, తెలంగాణ ప్రభుత్వం విదేశీ సంపర్క్‌ సదస్సు ఏర్పాటుచేసింది.. హైదరాబాద్‌ హెచ్ఐసీసీ లో నిర్వహించిన ఈ సదస్సుకు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి కె సింగ్, మంత్రులు కే టి ఆర్, నాయిని, డి జి పి అనురాగ్ శర్మ తెలంగాణ నుండి ఎక్కువమంది విదేశాలకు వలస వెళుతున్నారని వీకే సింగ్‌ అన్నారు. విదేశాల్లోని భారతీయుల సంక్షేమం, రక్షణ, పాస్‌పోర్ట్‌ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు... దశలవారిగా 800 హెడ్‌పోస్టాఫీసుల్లో పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఉద్యోగాల కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి కేసుల్లో చిక్కుకున్న శ్రామికులకు న్యాయ సహాయం అందించాలని కేటీఆర్‌ కేంద్రాన్ని కోరారు.. అవసరమైతే తెలంగాణ ప్రభుత్వం తరపున న్యాయవాదులను నియమించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.. కేంద్రమంత్రిగా సుష్మాస్వరాజ్‌ బాధ్యతలు చేపట్టాక విదేశాల్లో ఉంటున్న లక్షల మంది భారతీయులు భద్రంగా ఉంటున్నారని కేటీఆర్‌ ప్రశంసించారు. ఈ సందస్సులో ప్రవాస భారతీయుల పాస్‌పోర్టు సమస్యలు తదితర అంశాలపై చర్చించారు. గల్ఫ్ దేశాలకు వెళ్లే వారు తప్పకుండా... తమ వివరాలు విదేశాంగశాఖలో ఇచ్చి వెళ్లాలని విదేశాంగ శాఖ ప్రతినిధులు సూచించారు.

 

21:32 - May 13, 2017

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌ని నాలెడ్జ్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు సీఎం చంద్రబాబు. వారం రోజుల అమెరికా పర్యటన విశేషాలను సీఎం చంద్రబాబు మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా స్పందిస్తూ..ప్రపంచంలో ఏ దేశంలోని ఐటీ రంగంలో చూసిన నలుగురు భారతీయులు ఉంటున్నారని ఆ నలుగురిలో ఒకరు తెలుగువారు ఉండడం గర్వంగా ఉందన్నారు. అమెరికాలో తాను అనేక మంది కంపెనీల సీఈవోలతో భేటీ అయ్యాయని వారిని ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరానన్నారు.

21:29 - May 13, 2017

విజయవాడ : టిడిపి ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిపై సస్పెన్షన్‌ వేటు పడింది. నెల్లూరులోని వాకాటి ఇంట్లో నిన్న సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించిన నేపథ్యంలో..వాకాటిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు విజయవాడలో ప్రకటించారు. తప్పుడు ధృవీకరణ పత్రాలతో వివిధ బ్యాంకుల్లో వాకాటి కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ పేరుతో వాకాటి నారాయణరెడ్డి దాదాపు 400 కోట్ల రూపాయలు రుణాలు తీసుకున్నాడు. అయితే వాటిని తిరిగి చెల్లించకపోవడంతో.. ఐఎఫ్‌సీఐ ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ.. వాకాటి నివాసాలు, కార్యాలయాల్లో నిన్న ఏకకాలంలో దాడులు నిర్వహించింది. నెల్లూరుతో పాటు హైదరాబాద్‌, బెంగళూరు, సుళ్లూరుపేటలో దాడులు నిర్వహించి పలు కీలక పత్రాలను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాకాటిపై చీటింగ్‌ కేసు కూడా నమోదు చేశారు. అయితే సీబీఐ దర్యాప్తులో నిజానిజాలు తేలేవరకు వాకాటిపై సస్పెన్షన్ కొనసాగుతుందని సీఎం చంద్రబాబు స్పష్టం చెప్పారు.

 

మాదాపూర్ లో కారుబీభవత్సం

హైదరాబాద్ : నగరంలోని మాదాపూలో కారు బీభవత్సం సృష్టించింది. స్కార్పియో వాహానం అదుపుతప్పి రెండు కార్లను, 4బైక్ లను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

డిమాండ్ తగ్గట్టుగా పంటల సాగు : కేసీఆర్

హైదరాబాద్ : తెలంగాణ వ్యవసాయాభివృద్ధి కోసం ప్రభుత్వం ఆచరణాత్మక ధోరణితో పని చేస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. అందరూ ఒకే పంట వేసి నష్టపోకుండా.. మార్కెట్ ఉన్న డిమాండ్, మన అవసరాలకు తగ్గట్లు సాగు చేసేలా ప్రణాళికలు రూపొందించాలని కేసీఆర్ పేర్కొన్నారు.

నా వంతు కృషి చేస్తా : తరుణ్ భాస్కర్

హైదరాబాద్ : కేసీఆర్ అశిస్తున్న తెలంగాణ కోసం తన వంతు కృషి చేస్తానని జాతీయ అవార్డు గ్రహీత తరుణ్ భాస్కర్ అన్నారు.

 

నా పాటలకు కేసీఆర్ మాటలే స్ఫూర్తి : అశోక్ తేజ

హైదరాబాద్ : తన పాటలకు కేసీఆర్ మాటలే స్ఫూర్తి అని గేయ రచత సుద్దాల అశోక్ తేజ అన్నారు. గెలంగాణ బాగుపడటం కోసం కేసీఆర్ నిండు మనుసుతో పని చేస్తున్నారని ఆయన తెలిపారు.

19:20 - May 13, 2017

పుసుక్కున నరేంద్రమోడీ గన్క ఈ ముచ్చట జూస్తె మట్టుకు.. మళ్ల ఏ మీటింగుల గూడ.. నా చాతీ కొల్త గింత.. నా గుండె కాయ కొల్త గింత.. అబ్బా తెలంగాణ ప్రభుత్వాన్ని జూస్తె కంట్లె నిప్పులు వోస్కుంటరు వా ఈ కాంగ్రెస్ పార్టోళ్లు.. అయ్యా జనసేనా అధ్యక్షుడా..? భావి తెల్గు బాటసారి.. పవన్ కళ్యాణ్ సారూ.. ఏడున్నవో గని.. ఒక్కపారి గుంటురు జిల్లాకాడికంట వో.. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు కండ్లు సరిగ పనిజేస్తలేవంటే.. కారం పోడి అభిషేకం జేస్తున్నరు రైతులు.. వాళ్లకు ఎంత కడ్పుమండిందో ఏమో.. హైద్రావాదు శివార్ల పొంటి ఎవ్వలియన్న.. బర్లు, గొర్లు, మ్యాకలు పోయినయా..? బాయికాడ కట్టేస్తె మాయమైన బాపతు కథ అయ్యిందా ఎవ్వలికన్నా.? పిల్లలు లేనోళ్లకు... పచ్చి మాంసం దింటె పిల్లలు అయితరా నుల్లా..? ఏడనన్న అయ్యిండ్రా ఇట్ల భూమ్మీద.?ఇద్వర్ సంది బ్యాంకుల కెళ్లి పైకం ఏశినా తీశినా.. ఛార్జీలు గట్టాలే అని బ్యాంకులోళ్లు జెప్తున్నరుగదా..?కుక్కకాటుకు చెప్పుదెబ్బా అంటరు.. మరి మన్షికి కాటుకు ఏ దెబ్బ..

19:17 - May 13, 2017

టీడీపీ ఎమ్మెఎల్సీ వాకాటి సస్పెన్షన్

గుంటూరు : టీడీపీ నుంచి ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి సస్పెన్షన్ చేశారు. వాకాటి ఆస్తులపై సీబీఐ దర్యాప్తు కారణంగా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తునట్లు చంద్రబాబు ప్రకటించారు.

 

 

19:00 - May 13, 2017
18:41 - May 13, 2017

గుంటూరు : ఏపీ సచివాలయంలో ఏర్పాటు చేసిన గ్రీన్ పార్క్ సెంటరాఫ్ అట్రాక్షన్ గా మారింది. అసెంబ్లీ భవనాల మధ్య సుమారు రెండున్నర ఎకరాల్లో నిర్మించిన ఈ పార్క్ ఇటు ఉద్యోగులు, అటు సందర్శకుల్లో జోష్ నింపుతోంది. సాయంత్రం వేళ సేద తీరడానికి వచ్చిన సందర్శకులతో కోలాహలంగా మారుతున్న వెలగపూడి సచివాలయంలోని పార్క్ పై టెన్ టీవీ చుట్టూ పచ్చని చెట్లు.. మధ్యలో వాటర్ ఫౌంటెన్లు.. మధ్యలో అందమైన పార్క్ వెలగపూడిలో నిర్మించే సచివాలయాన్ని హరిత సచివాలయంగా నిర్మిస్తామని గతంలో ఏపీ సర్కార్ ప్రకటించింది. అన్నట్లుగానే పచ్చదనం కోసం ప్రత్యేక ప్రణాళికలను రూపొందించారు అధికారులు. ముందుగా భవనాల నిర్మాణం పూర్తి చేసిన ప్రభుత్వం, ఆ తరువాత పచ్చదనంపై దృష్టి పెట్టింది. అందులో భాగంగానే సచివాలయం భవనాల మధ్య అందమైన పార్క్ ను రూపొందించారు.

మూడుకోట్ల రూపాయలు ఖర్చు
ఈ పార్క్ ను అందంగా తీర్చి దిద్దడం కోసం ప్రభుత్వం మూడుకోట్ల రూపాయలు ఖర్చు చేసింది. పార్క్ లో ముందుగా బెర్ముడా గడ్డిని ఏర్పాటు చేశారు. దాంతో పాటు పార్క్ లోపల వివిధ రకాల మొక్కలను నాటారు. బెంగళూరు, కడియం నర్సరీల నుంచి మొక్కలను తీసుకొచ్చారు. వీటితో పాటు మరికొన్ని ప్రాంతాల నుంచి ప్రత్యేకతలు కలిగిన మొక్కలను పార్క్ లో ఏర్పాటు చేశారు. పార్క్ లో కొంత భాగాన్ని వాకింగ్ ట్రాక్ కోసం ఉపయోగించారు. వీటితో పాటు మధ్యలో ఏర్పాటు చేసిన పెద్ద ఫౌంటెన్ పార్క్ మొత్తానికే హైలైట్ గా నిలుస్తుంది. పార్క్ మొదట్లో ఏర్పాటు చేసిన చిన్నపాటి వాటర్ ఫాల్ అదనపు ఆకర్షణ. ఇక సచివాలయానికి వచ్చే ఉద్యోగులతో పాటు సందర్శకులు పార్క్ లో సేద తీరుతున్నారు. వాటర్ ఫౌంటెన్ వద్ద సెల్ఫీలు దిగి సంబరపడుతున్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన ఈ పార్క్ చాలా బాగుందని సందర్శకులు చెబుతున్నారు. మొత్తానికి ఏపీ సెక్రటేరియట్ లోని ఏర్పాటు చేసిన గ్రీన్ పార్క్ పచ్చదనంతో ప్రకృతి ప్రేమికుల్ని అలరిస్తోంది.

 

18:39 - May 13, 2017

పశ్చిమ గోదావరి : భీమవరం వైసీపీ నియోజకవర్గ కన్వీనర్‌ గ్రంధి శ్రీనివాస్‌ కుమారుడు సాగర్‌ దంపతులను వైసీపీ అధినేత జగన్‌ ఆశీర్వదించారు. ఈనెల తొమ్మిదో తేదీన సాగర్‌, సుధల వివాహం జరిగింది. అయితే అనుకోని కారణాల వల్ల ఆ పెళ్లికి జగన్‌ హాజరుకాలేకపోయారు. ఈరోజు వారి ఇంటికి వెళ్లి నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

 

18:36 - May 13, 2017

విశాఖ : విశాఖ కేంద్రంగా మనీ లాండరింగ్‌ కేసును ఛేదించిన పోలీసులు. ఇక్కడ ఫోటోలో కన్పిస్తున్న ఇతని పేరు వడ్డి మహేష్‌. వయసు 24 ఏళ్లు. వయసులో చిన్నోడే అయినా.. ఇతగాడి బుర్ర మాత్రం పెద్దదే. ఈ వయసుకే, హవాలా లావాదేవీలు నడిపించడంలో మహేష్‌ ఆరితేరాడు. ఏ మాత్రం అనుమానం రాకుండా బ్యాంకు ఖాతాల ద్వారానే డబ్బును నేరుగా విదేశాలకు పంపించేయడంలో దిట్టగా మారాడు. కోట్లాది రూపాయలను డొల్ల కంపెనీల ద్వారా చైనా, సింగపూర్‌, హాంకాంగ్‌ దేశాలకు పంపి..నల్లకుబేరుల ధనాన్ని తెలుపు చేసి పెడుతున్నాడు. ప్రతిఫలంగా భారీగా కమీషన్లు దండుకుంటున్నాడు. ఒక్క డాలర్‌కు 85 పైసలు కమీషన్‌ తీసుకుంటున్నాడు. వడ్డి మహేష్‌ హవాలా వ్యాపారానికి పలువురు బ్యాంకు అధికారులు కూడా సహకరించినట్టు తెలుస్తోంది.

ఐటీశాఖ నిఘా...
వడ్డి మహేష్‌ ఖాతాలపై అనుమానం వచ్చిన ఐటీశాఖ అతనిపై నిఘా పెట్టింది. విశాఖ, శ్రీకాకుళం, కోల్‌కతాల్లో ఈనెల 9 నుంచి తనిఖీలు నిర్వహించింది. దీంతో వడ్డి మహేష్‌ అక్రమాలు వెలుగుచూశాయి. విశాఖలోని ఒకే బ్యాంకు ఖాతాలో ఏకంగా 570 కోట్ల నగదు వివిధ ఖాతాల నుంచి జమ అయినట్టు ఐటీ సోదాల్లో తేలింది. అదే ఖాతాకు మరో 90 కోట్లు ఒకేసారి జమ అయ్యింది. ఇప్పటి వరకు మహేష్‌ 1500 కోట్ల వరకు హవాలా నడిపించినట్టు ప్రాథమికంగా తేల్చారు విశాఖ పోలీసులు. ఈ క్రమంలోనే లేనివి ఉన్నట్లుగా 12 డొల్ల కంపెనీలను సృష్టించిన మహేష్‌..హైదరాబాద్‌, విశాఖ, కోల్‌కత్తాలోని అన్ని ప్రధాన బ్యాంకులలో 30 అకౌంట్లను తెరిచి వాటిలో 680.94 కోట్లను జమచేశాడు. ఆ తర్వాత 569. 93 కోట్లు సింగపూర్‌, చైనా, హాంకాంగ్‌ దేశాలకు తరలించాడు. అయితే ఇటీవల ఆదాయపు పన్ను శాఖ వారు ఈ ఖాతాలను పరిశీలించగా.. అవన్నీ డొల్ల కంపెనీలే అని తేలింది. ఇప్పటికే పోలీసులు ఫోర్జరీ, చీటింగ్ వంటి చట్టాల క్రింద కేసులు నమోదు చేశారు. మొత్తం 9 మందిపై పోలీసులు కేసులను నమోదు చేశారు.ఈ కేసులో A-1 గా వడ్డి మహేష్‌ ఉండగా అతని తండ్రి శ్రీనివాసరావు రెండో ముద్దాయిగా ఉన్నారు. A-4 వరకూ ఈ కంపెనీలలో డైరెక్టర్లుగా ఉన్నారు. A-5 నుంచి A-7 వరకూ ఛార్టెడ్‌ ఎకౌంట్లు ఉండగా డబ్బులు పెట్టుబడులు పెట్టిన వారు మిగతా వారుగా ఉన్నారు. ప్రస్తుతం మహేష్‌ను అరెస్టు చేసిన పోలీసులు..మిగతా వారి కోసం గాలిస్తున్నారు.

జయలలిత వంట మనిషిపై దుండగుల దాడి

చెన్నై : దివంగత ముఖ్యమంత్రి జయలలిత వంట మనిషి పంచవర్ణంపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. ఈ దాడి ఆమె తీవ్రంగా గాయపడడంతో ఆసుపత్రికి తరలించారు.

జగిత్యాల జిల్లా వడగళ్ల వాన

జగిత్యాల : జిల్లా మేడిపల్లి మండలంలో వడగళ్ల వాన కురిసింది. గోవింరాం, మోత్కురావుపేట ఐకేపీ కేంద్రాల్లో ఉన్న వరి ధన్యం తడిసి ముద్దయింది.

18:00 - May 13, 2017

కామారెడ్డి : నిజామాబాద్ జిల్లాలో కురిసిన అకాల వర్షం రైతులకు కన్నీరు మిగిల్చింది. ప్రధానంగా కామారెడ్డి మార్కెట్ యార్డ్ లోనూ, బాన్సువాడ కొనుగోలు కేంద్రాల్లో వేల క్వింటాళ్ల వరి ధాన్యం తడిసి ముద్దైంది. కాలువల్లోకి కొట్టుకుపోయింది. దీంతో చేతికందిన పంట నీటిపాలైదంటూ... రైతులు లబోదిబోమంటున్నారు.

పెద్ద మొత్తంలో వరి ధాన్యం...
కామారెడ్డి మార్కెట్ యార్డుకు వారం రోజుల నుంచి పెద్ద మొత్తంలో వరి ధాన్యం వస్తోంది. యార్డులో ఎప్పటికప్పుడు కాంటాలు జరగకపోవడంతో రైతులు ధాన్యాన్ని కుప్పలుగా పోసి ఉంచారు. మరికొందరు యార్డు ఆవరణలోనే ధాన్యాన్ని ఆరబెట్టుకున్నారు. ఇదే క్రమంలో వర్షం కురియడంతో ధాన్యం కాస్తా నీటి పాలైంది. మరోవైపు వర్షాలకు ధాన్యం తడవకుండా టార్పాలిన్ లాంటివి అధికారులు అందుబాటులో ఉంచలేదు. దీంతో ఒక్క కామారెడ్డి మార్కెట్ యార్డ్ లో సుమారు 500 క్వింటాళ్లపైనే వరి ధాన్యం తడిసిపోయినట్లు రైతులు చెబుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ఎవరు కొంటారని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ముందుకు వచ్చి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు.. తూకాలను వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు.

17:58 - May 13, 2017

నిజామాబాద్ : నిజామాబాద్‌ జిల్లాలో... 30 ఏళ్లుగా ఎదురుచూసిన... పెద్దపల్లి-నిజామాబాద్‌ రైల్వే లైన్‌ ఇటీవల ప్రారంభమైంది. అయితే ఈ రైల్వే లైన్‌ను సాధించిన ఘనత తమదంటే...తమదంటూ... బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు కొట్టుకుంటున్నాయి. ఎవరికి వారే ఈ క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. దీనికోసం చాలా కృషి చేశామంటూ.. పార్టీల నాయకులు.. ఒకర్ని ఒకరు దూషించుకుంటున్నారు. రైల్వేలైన్‌ ప్రారంభం రోజే ఈ గొడవ మొదలైంది. డెమో రైలు ప్రారంభం కోసం ఏర్పాటు చేసిన సభలోనే బీజేపీ, టీఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తొలుత బీజేపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఎండెల లక్ష్మీనారాయణను వేదికపైకి పిలవకపోవడంతో వివాదం మొదలైంది. అనంతరం బీజేపీ నాయకులు విద్యాసాగర్‌రావు, పీఎం నరేంద్ర మోదీ వల్లే రైల్వే లైన్‌ పూర్తైందని వివరిస్తున్న సమయంలో రైల్వే బోర్డు మెంబర్‌ అరుణను టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అడ్డుకుని..మైక్‌ లాగేసుకున్నారు. అలాగే ఎంపీ కవిత కృషి వల్లే ఈ ప్రాజెక్ట్‌ పూర్తైందన్న టీఆర్‌ఎస్‌ నాయకులను ...బీజేపీ వాళ్లు అడ్డుకున్నారు. కాగా కాంగ్రెస్‌ పార్టీ కూడా దీనిపై తీవ్రంగా స్పందించింది. గత ప్రభుత్వాల కృషి వల్లే ఇది సాధ్యమైందని కాంగ్రెస్‌ నాయకులు అంటున్నారు.

టీఆర్‌ఎస్‌.. బీజేపీ పోటాపోటీ....
రాబోయే ఎన్నికలే లక్ష్యంగా రైల్వే లైన్‌ ఘనత కోసం టీఆర్‌ఎస్‌.. బీజేపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నిజామాబాద్‌ పార్లమెంట్ నియోజకవర్గాన్ని గెలుచుకోవడానికి బీజేపీ వ్యూహాలు రచిస్తుంది. ఎన్నడూ లేని విధంగా ఇక్కడ క్యాడర్‌ను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ కవిత బీజేపీపై ఘాటైన విమర్శలు చేస్తున్నారని స్థానికులు అంటున్నారు. ఈ అభివృద్ధిని బీజేపీ ఎగురవేసుకుని పోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

17:52 - May 13, 2017

హైదరాబాద్ : తెలంగాణలో వెనుకబడిన తరగతుల జనాభా గణనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొత్తగా ఏర్పాటైన బీసీ కమిషన్‌ దీనికి సంబంధించిన కసరత్తు చేస్తోంది. బీసీలకు రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో.. బీసీ కమిషన్‌ వేగాన్ని పెంచింది. ఆరునెలల్లోగా బీసీల, ఆర్థిక, సామాజిక స్థితిగతులను అధ్యయనం చేసి.. సర్కారుకు నివేదించేందుకు సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బీసీ రిజర్వేషన్లు అమలవుతున్న తీరును పరిశీలించాలని నిర్ణయించింది. అలాగే, బీసీల సామాజిక స్థితి గతులపై, గత కమిషన్‌లు జరిపిన అధ్యయనాంశాలనూ పరిగణలోకి తీసుకుంటూ.. బీసీ జనగణన చేపట్టాలని తెలంగాణ బీసీ కమిషన్‌ నిర్ణయించింది.

కాలేష్కర్‌, మండల్‌ కమిషన్‌ రిపోర్ట్‌లు
బీజీ జనగణనలో భాగంగా, దేశంలోనే మొదటి బీసీ కమీషన్‌ కాలేష్కర్‌ కమిషన్‌ రిపోర్ట్‌, మండల్‌ కమిషన్‌ రిపోర్ట్‌లతో పాటు.. అనంతరాములు, మురళీధర్‌ రావు నివేదికలు, తమిళనాడు రిజర్వేషన్ల పెంపు రిపోర్ట్‌లను.. బీసీ కమీషన్‌ అధ్యయనం చేయనుంది. అంతేకాదు 98 బీసీ కులాలు, 25 సంచార జాతులపై అధ్యయనం చేయనుంది. దీనికోసం ఆయా కుల సంఘాల ప్రతినిధులతో పాటు, బీసీ వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులతోనూ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. జనగణన వ్యవహారంలో, రాష్ట్రంలోని ఉస్మానియా, తెలంగాణ, పాలమూరు, శాతవాహన, కాకతీయ వంటి విశ్వవిద్యాలయాల సహకారాన్నీ కోరుతోంది. ప్రస్తుతం.. రాష్ట్రంలో బీసీలకు 25 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. కానీ బీసీ జనాభా 52 శాతం వరకు ఉందని ఓ అంచనా. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలన్న డిమాండ్‌ బీసీల్లో బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో, బీసీ కమిషన్‌ నివేదిక ఎలా ఉండబోతోందో.. సామాజిక తెలంగాణ నినాదంతో ముందుకు వెళుతోన్న కేసీఆర్‌ సర్కారు, బీసీలకు రిజర్వేషన్లను ఏ స్థాయిలో పెంచుతుందో వేచి చూడాలి.

17:48 - May 13, 2017

ఖమ్మం : టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఫైర్‌ అయ్యారు తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డి. మంత్రి హరీశ్‌ రావు ఐదున్నర లక్షలకు ఐస్‌ క్రీం అమ్ముతారని... రైతులకు పదివేల రూపాయల మద్దతు ధరమాత్రం ఇవ్వలేరని విమర్శించారు. ప్లీనరీ పేరు మీద వెయ్యికోట్ల రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు. రైతులకు మద్దతుధర ఇచ్చి పంట కొనలేని సన్నాసి సీఎం కేసీఆర్ అని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.. ఖమ్మంలో మిర్చి రైతులను ఆదుకోవాలంటూ కలెక్టరేట్ ముందు టీటీడీపీ రైతు పోరు దీక్ష నిర్వహించింది.. ఈ కార్యక్రమంలో రేవంత్‌రెడ్డితో పాటు, పెద్దిరెడ్డి, సండ్ర, వేం నరేందేర్‌రెడ్డి, సీతక్క పాల్గొన్నారు. మిర్చి రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

17:47 - May 13, 2017

 హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం, భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో విదేశ్‌ సంపర్క్‌ కార్యక్రమం జరిగింది. ఉద్యోగం, విద్య, ఇతర అవకాశాల కోసం విదేశాలకు వెళ్తోన్న... విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు సరైన అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ఉద్దేశం. విదేశ్‌ సంపర్క్‌ కార్యక్రమాన్ని విదేశీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి డాక్టర్‌ వి.కె. సింగ్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్‌అలీ, మంత్రులు కేటీఆర్‌, నాయిని నర్సింహారెడ్డి పాల్గొన్నారు.

 

17:39 - May 13, 2017
17:07 - May 13, 2017

ఎవరో చేసిన పనికి మరోకరు బలి అయినట్లు, ఆ మధ్య టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ చేతిలో చాలా బ్రాండ్లు ఉన్నాయనడానికి సూచికగా ఓ మ్యాగజైన్ అతడిని దేవుడి తరహాలో మార్చి చేతిలో ఓ బ్రాండెడ్ షూ పెట్టడంపై పెద్ద ఎత్తున దూమరం రేగిన సంగతి తెలిసిందే.. తాజాగా తమిళ హీరో విజయ్ కూడా ఇలాంటి అనవసర వివాదంతో ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తంది. ఓ అభిమాని అత్యుత్సాహం విజయ్ తలకు చుట్టుకుంది.

సోషల్ మీడియా యాక్టివ్ అయ్యాక తమ ఫోటో షాప్ ద్వారా తమ అభిమాన హీరోల్ని రకరకాల వేషాల్లో తీర్చిదిద్దడం అభిమానులకు అలలవాటైంది. ఇలాగే ఓ అభిమాని విజయ్ చేతికి త్రిశూలాన్ని పెట్టి ఒక ఇమేజ్ రెడీ చేశాడు. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫోటో పై హిందూ మక్కల్ మున్నవి పార్టీ దీనిపై మండపడింది. హిందువుల మనోభావాలను దెబ్బతీసెలా ఈ ఫోటో ఉందని విజయ్ మీద కేసు పెట్టింది.

 

16:41 - May 13, 2017

హైదరాబాద్ :ధర్నా చౌక్‌ పరిరక్షణ కోసం హైదరాబాద్‌లోని సీపీఐ కార్యాలయంలో నిరసనదీక్షలు కొనసాగుతున్నాయి. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబ సభ్యులు ఈ దీక్షల్లో కూర్చున్నారు.. ఈ దీక్షలను టీజేఏసీ  చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం, ప్రొఫెసర్‌ సూరేపల్లి సుజాత ప్రారంభించారు.. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ధర్నా చౌక్‌ను ప్రజల భాగస్వామ్యంతో సాధించుకుంటామని కోదండరాం స్పష్టం చేశారు.

16:36 - May 13, 2017

పెద్దపల్లి : సింగరేణిని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలను విరమించుకోవాలని ...లేదంటే ఆందోళనలు చేస్తామని మాజీ మంత్రి శ్రీధర్‌బాబు హెచ్చరించారు. తాడిచెర్ల 1,2 బ్లాక్‌లను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చేపట్టిన జై సింగరేణి బస్సు యాత్ర పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చేరుకుంది. ఈ యాత్రకు శ్రీధర్‌బాబు మద్దతు తెలిపారు. ఎన్నికల ముందు సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా ప్రభుత్వం నెరవేర్చలేదని ఆయన అన్నారు. కార్మికులను ప్రభుత్వం దగా చేస్తుందని ఆరోపించారు.

 

16:33 - May 13, 2017

చిత్తూరు : తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామివారికి నైవేద్యంగా సమర్పించే ప్రసాదాలు ఎన్నిరకాలు? ఆ ప్రసాదాల్లో స్వామివారికి ఇష్టమైనవిఏవి?లాంటి అంశాలతో శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు ఇంగ్లీషులో ది సేక్రడ్‌ ఫుడ్‌ ఆఫ్ గాడ్‌ పేరుతో పుస్తకం రాశారు.. ఈ పుస్తకానికి సంబంధించి రమణదీక్షితులతో టెన్ టివితో మాట్లాడారు పూర్తి వివరాలకు వీడియో చూడండి.

16:27 - May 13, 2017

విజయనగరం : ఏపీ మంత్రి సుజయకృష్ణ రంగారావు విజయనగరంలో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా ప్రజా పరిషత్ సమావేశ భవనంలో తొలిసారిగా ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తనకు వచ్చిన ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి సుజయ కృష్ణ రంగారావు హామీ ఇచ్చారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన ఫిర్యాదు దారులు తమ సమస్యలను చెప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వివేక్, ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి నాయుడు పాల్గొన్నారు.

16:25 - May 13, 2017

అనంతపురం : కరువు కోరల్లో చిక్కుకున్న జిల్లా రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని అనంతపురం జిల్లా వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు ఆలూరు సాంబశివారెడ్డి ఆరోపించారు. గార్లదిన్నె మండలం బూదేడు గ్రామంలోని ఎండిన చీనీ తోటలను ఆయన పరిశీలించారు. వివరాలకు రైతులను అడిగి తెలుసుకున్నారు. వర్షాలు లేక బోర్లు ఎండిపోవడం వల్ల సుమారు 60 శాతం చీనీ తోటలు ఎండిపోయాయని సాంబశివారెడ్డి అన్నారు. రైతులను కాపాడతామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని ...ఆచరణలో అది కనబడడం లేదని విమర్శించారు.

16:23 - May 13, 2017

శ్రీకాకుళం : మెట్ట శంకర్‌రావు.. ఈ పేరు చెబితే చాలు శ్రీకాకుళం జిల్లా ఉలిక్కిపడుతుంది. భయంతో వణికిపోతుంది. జలుమూరు మండలం, మెట్టపేట గ్రామానికి చెందిన ఈ మాజీ జవాను.. ఏడుగురిని పొట్టన పెట్టుకున్న హంతకుడు. శంకర్‌రావు 2005లో తన భార్య హత్య కేసులో.. ఏడేళ్ల జైలు శిక్షను అనుభవించాడు. అప్పట్లో తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పవద్దని గ్రామస్తులను వేడుకున్నాడు. కానీ వారు శంకర్‌రావుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు. దీంతో అతను గ్రామస్తులపై కక్ష పెంచుకున్నాడు. బెయిల్‌పై బయటకు వచ్చిన తరువాత 2010 నవంబర్‌ 30న.. తన ఇద్దరు పిల్లలతో సహా ఏడుగురిని అతి కిరాతకంగా హత్య చేశాడు.

వరుస హత్యలు...
సైకో శంకర్‌రావు వరుస హత్యలు చేయడంతో.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2011 జనవరిలో విచారణ ప్రారంభమయ్యింది. ఈ విచారణలో 48 మందిని దర్యాప్తు చేసిన జిల్లా కోర్టు చివరకు ఉరిశిక్ష ఖరారు చేసింది. దీనిపై శంకర్‌రావు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో.. అక్కడ ఊరట లభించింది. మానసిక ఒత్తిడి కారణంగా జరిగిన ఘటన అంటూ 2014 మే 15న కేసును కొట్టేసింది. 2014 జూలై 19న శంకర్‌రావు విడుదలయ్యాడు. విజయనగరం జిల్లా, బొబ్బిలి పరిసర ప్రాంతాల్లో.. ప్రైవేట్‌ పరిశ్రమలో సెక్యూరిటీ ఉద్యోగిగా చేరాడు. ఉరిశిక్ష రద్దయ్యిందని తెలియగానే.. మెట్టపేట గ్రామస్తులలో ఆందోళన మొదలయ్యింది. ఈ నేపథ్యంలో శుక్రవారం బొబ్బిలిలో అపహరణకు గురైన శంకర్‌రావు.. ఎల్.ఎన్‌ పేట మండలం, దబ్బపేట గ్రామంలో శవమై కనిపించాడు. పోలీసులకు సమాచారం ఇచ్చిన ఇద్దరు వ్యక్తులు.. తామే ఈ హత్య చేశామంటూ పోలీసుల ఎదుట లొంగిపోవడంతో.. వారిని అదుపులోకి తీసుకొన్నారు. వాళ్లిద్దరి వివరాలు గోప్యంగా ఉంచి.. దర్యాప్తు ప్రారంభించారు. ఏడుగురిని హత్య చేసి జిల్లాలో సంచలనం సృష్టించిన శంకర్‌రావు.. చివరకి తాను కూడా మరొకరి చేతుల్లో హతమయ్యాడు.

16:22 - May 13, 2017

శ్రీకాకుళం : మెట్ట శంకర్‌రావు.. ఈ పేరు చెబితే చాలు శ్రీకాకుళం జిల్లా ఉలిక్కిపడుతుంది. భయంతో వణికిపోతుంది. జలుమూరు మండలం, మెట్టపేట గ్రామానికి చెందిన ఈ మాజీ జవాను.. ఏడుగురిని పొట్టన పెట్టుకున్న హంతకుడు. శంకర్‌రావు 2005లో తన భార్య హత్య కేసులో.. ఏడేళ్ల జైలు శిక్షను అనుభవించాడు. అప్పట్లో తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పవద్దని గ్రామస్తులను వేడుకున్నాడు. కానీ వారు శంకర్‌రావుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు. దీంతో అతను గ్రామస్తులపై కక్ష పెంచుకున్నాడు. బెయిల్‌పై బయటకు వచ్చిన తరువాత 2010 నవంబర్‌ 30న.. తన ఇద్దరు పిల్లలతో సహా ఏడుగురిని అతి కిరాతకంగా హత్య చేశాడు.

వరుస హత్యలు...
సైకో శంకర్‌రావు వరుస హత్యలు చేయడంతో.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2011 జనవరిలో విచారణ ప్రారంభమయ్యింది. ఈ విచారణలో 48 మందిని దర్యాప్తు చేసిన జిల్లా కోర్టు చివరకు ఉరిశిక్ష ఖరారు చేసింది. దీనిపై శంకర్‌రావు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో.. అక్కడ ఊరట లభించింది. మానసిక ఒత్తిడి కారణంగా జరిగిన ఘటన అంటూ 2014 మే 15న కేసును కొట్టేసింది. 2014 జూలై 19న శంకర్‌రావు విడుదలయ్యాడు. విజయనగరం జిల్లా, బొబ్బిలి పరిసర ప్రాంతాల్లో.. ప్రైవేట్‌ పరిశ్రమలో సెక్యూరిటీ ఉద్యోగిగా చేరాడు. ఉరిశిక్ష రద్దయ్యిందని తెలియగానే.. మెట్టపేట గ్రామస్తులలో ఆందోళన మొదలయ్యింది. ఈ నేపథ్యంలో శుక్రవారం బొబ్బిలిలో అపహరణకు గురైన శంకర్‌రావు.. ఎల్.ఎన్‌ పేట మండలం, దబ్బపేట గ్రామంలో శవమై కనిపించాడు. పోలీసులకు సమాచారం ఇచ్చిన ఇద్దరు వ్యక్తులు.. తామే ఈ హత్య చేశామంటూ పోలీసుల ఎదుట లొంగిపోవడంతో.. వారిని అదుపులోకి తీసుకొన్నారు. వాళ్లిద్దరి వివరాలు గోప్యంగా ఉంచి.. దర్యాప్తు ప్రారంభించారు. ఏడుగురిని హత్య చేసి జిల్లాలో సంచలనం సృష్టించిన శంకర్‌రావు.. చివరకి తాను కూడా మరొకరి చేతుల్లో హతమయ్యాడు.

16:15 - May 13, 2017

కవులు, సినీ ప్రముఖులతోమ సీఎం కేసీఆర్ భేటీ

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో కవులు, సినీరంగ ప్రముఖులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రపంచ తెలుగు మహాసభల గురించి చర్చించారు.

 

15:49 - May 13, 2017

ఢిల్లీ : మాజీ మంత్రి కపిల్‌ మిశ్రా ఆమరణ నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరింది. ఆప్‌ నేతల విదేశీ పర్యటనల వివరాలు బహిర్గతం చేయాలని కోరుతూ కపిల్‌ మిశ్రా తన ఇంటివద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌కు మరో లేఖాస్త్రం సంధించారు. ఐదుగురు ఆప్‌ నేతల విదేశీ పర్యటన వివరాలు ఇవ్వడానికి ఎందుకు భయపడతున్నారని ప్రశ్నించారు. నిజాలను దాచి పెట్టడానికి నాటకాలు ఎందుకు ఆడుతున్నారని కేజ్రీవాల్‌ను నిలదీశారు. తనపైకి ఉసిగొల్పిన సంజీవ్‌ సోదరుడు లాంటివాడని...ఏదో ఒకరోజు అతడూ కళ్లు తెరుస్తాడని కపిల్‌ మిశ్రా అన్నారు. ఆప్‌ నేతల విదేశీ పర్యటనల వివరాలు బహిర్గతం చేసేవరకు తన దీక్ష కొనసాగుతుందని లేఖలో స్పష్టం చేశారు.

 

 

 

 

15:48 - May 13, 2017

జమ్మూకాశ్మీర్ : జమ్ముకశ్మీర్‌లో నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ మళ్లీ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. రాజౌరిలోని నౌషెరా సెక్టార్‌లో పాక్‌ సైనికులు కాల్పులకు తెగబడ్డారు. పాక్‌ జరిపిన కాల్పుల్లో ఓ మహిళతో పాటు ఓ బాలుడు మృతి చెందాడు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఇవాళ ఉదయం 7 సమయంలో లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌ వద్ద పాకిస్తాన్‌ ఉన్నట్టుండి మోర్టార్లు, తుపాకులతో కాల్పులు జరిపినట్లు ఆర్మీవర్గాలు తెలిపాయి. పాకిస్తాన్‌ కాల్పులకు భారత్‌ దీటైన సమాధానం చెప్పినట్లు ఆర్మీ పేర్కొంది.

15:47 - May 13, 2017

ఖమ్మం : ఈ అమ్మాయి పేరు సుమలత. పుట్టింది పేద కుటుంబంలోనైనా.. పేదరికం తన చదువుకు అడ్డం కాదని నిరూపించింది. డబ్బు, హోదా, అవకాశాలు అన్నీ ఉండీ చదవలేని వారికి ఈ చదువుల తల్లి రోల్‌మోడల్‌గా నిలుస్తోంది. ఖమ్మం జిల్లాకు చెందిన మణి తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఉంటోంది. కూలీ పనులు చేస్తూ ఇద్దరు కూతుళ్లను చదివించింది. పెద్ద కూతురు సుమలత చదువులో ఎంతో రాణిస్తోంది. సుమలత 8 వ తరగతి వరకూ.. టేకుల పల్లిలోని సాంఘిక సంక్షేమ పాఠశాలలో చదువుకుంది. 9, 10 వ తరగతులు అల్గనూరు సాంఘిక సంక్షేమ పాఠశాలలో పేద, దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాల విద్యార్థినీ విద్యార్థులు.. అమెరికాలో చదివే అవకాశం కల్పించాలని గురుకులాల కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్ ప్రభుత్వానికి విన్నవించారు. దీనికి సాంఘిక సంక్షేమ శాఖ అంగీకరించి ఉపకార వేతనం ఇచ్చేందుకు ఒప్పుకుంది.

తెలంగాణ నుంచి ఆరుగురు విద్యార్థులు
పాఠశాలలో 5 రకాల పరీక్షలు నిర్వహించి.. విద్యార్థుల్లో ఉత్తమ ప్రతిభని కనబర్చిన వారిని ఎంపిక చేశారు. మన దేశం నుంచి మొత్తం 40 మంది విద్యార్థులు వెళ్తుండగా.. మన తెలంగాణ నుంచి ఆరుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. అందులో ఇద్దరు అల్గనూరు సాంఘిక సంక్షేమ పాఠశాల విద్యార్థులే కావడంతో సుమలత చాలా సంతోషంగా ఉంది. రెక్కాడితే గానీ డొక్కనిండని పరిస్థితి వీరిది. అమ్మ, అమ్మమ్మలు కూలీ పని చేస్తూ.. ఇంటిని లాక్కొస్తున్నారు. తమ కూతురు.. అమెరికా పర్యటనకు ఎంపిక కావడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె తల్లి చెబుతోంది. కానీ ఖర్చులకు చేతిలో ఒక్క రూపాయి లేకపోవడం చాలా బాధగా ఉందని చెబుతోంది. ఎవరైనా దాతలు వచ్చి.. సహాయం చేయాలని కోరుతోంది. తమ కూతురు ముందు ముందు ఎన్నో విజయాలు సాధిస్తుందని మణి చెబుతోంది. కుటుంబ పోషణే భారంగా ఉన్న ఈ తరుణంలో పిల్లల ఉన్నత చదువులు.. వారి ఖర్చు తన వల్ల కాదని సుమలత అమ్మమ్మ చెబుతోంది. ప్రభుత్వం తమకు సహాయం చేయాలని వీళ్లంతా కోరుతున్నారు. చదువుకు పేదరిక అడ్డు కాదు. కాస్త చేయూత ఉంటే చాలు అని సుమలత నిరూపించింది. చిన్న వయస్సులోనే.. పేదరికంతో నరకం అనుభవిస్తున్నా సరే! వాటన్నింటినీ సుమలత అధిగమించింది. పట్టుదల ఉంటే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని.. ఈ చదువుల బంగారు తల్లిని చూస్తే తెలిసిపోతుంది. అయితే సుమలత ఉన్నతికి ధాతలు ఎవరైనా సహాయం చేస్తే.. అమెరికా పర్యటనకు వెళ్లడానికి అడ్డంకులు తొలగిపోయినట్టే.

15:45 - May 13, 2017

హైదరాబాద్ : తెలంగాణ భౌగోళిక, రాజకీయ, ఆర్థిక, సామాజిక, చారిత్రాత్మకతను ప్రపంచ దేశాలకు పరిచయం చేయాలని ప్రణాళిక సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరో ముందడుగు వేయనుంది. గత 10, 15 ఏళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైన ఈ అంశం.. నేడు కార్యరూపం దాల్చబోతుంది. కేంద్ర ప్రభుత్వ విదేశాంగ అధికారులు, మంత్రిత్వశాఖతో తెలంగాణ టూరిజం శాఖ ఒప్పందం కుదుర్చుకోనుంది.

వందల ఏళ్ల క్రితం.....
వందల ఏళ్ల క్రితం ఆఫ్రికన్‌ దేశాలకు వివిధ పనుల మీద, జీవనాధారం కోసం వలస వెళ్లి అక్కడే స్థిరపడిన భారతీయులు అనేకమంది ఉన్నారు. అక్కడ వారు ఆ దేశ పౌరసత్వమే కాదు.. ప్రభుత్వాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. వాళ్లు అక్కడ స్థానికులైనప్పటికీ.. వారి పూర్వీకులు భారతదేశానికి చెందినవారే. అందుకే వారికి భారతదేశ చరిత్రను పరిచయం చేయాలని కేంద్ర ప్రభుత్వం దశాబ్ధ కాలం క్రితమే సంకల్పించింది. అయితే.. ఇందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో ఆ ప్రతిపాదన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మిగిలిపోయింది.

నో ఇండియా...
తాజాగా ఇదే ప్రతిపాదనను కేంద్ర విదేశాంగ శాఖ పరిశీలనకు తీసుకురాగా.. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఆర్గనైజ్‌ చేసేందుకు ముందుకువచ్చింది. దీనికి నో ఇండియా అని నామకరణం చేసి ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. మారిషస్‌, పిజి, గయానా, ట్రెనిడాడ్‌, టొబోగో, సురినార్‌ దేశాలలో చదువుతున్న 18 నుంచి 35 ఏళ్లలోపు విద్యార్థులలో ఐదుగురిని ఎంపిక చేసి.. మొత్తం 40 మంది బృందానికి భారతదేశానికి తీసుకురానున్నారు. మొత్తం 40 రోజులపాటు ఇండియాలోనే ఉండేటట్లు ఏర్పాట్లు చేయనున్నారు. వీరికి చారిత్రక, పర్యాటక కేంద్రాల పరిశీలన, గ్రామాల సందర్శన, యోగా, సంస్కృతి-సాంప్రదాయాలు తెలియజేస్తారు. అలాగే వివిధ యూనివర్సిటీ విద్యార్థులతో ముఖాముఖిలు ఏర్పాటు చేస్తారు. ముఖ్యమంత్రి, గవర్నర్‌ వంటి వారితో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి.. పరిపాలన విధానాన్ని వివరించేందుకు కసరత్తు చేస్తున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్ర చారిత్రక నేపథ్యంతో పాటు.. పర్యాటక రంగం బాగా వృద్ధి చెందే అవకాశం ఉందని టూరిజం శాఖ భావిస్తోంది.

15:42 - May 13, 2017

హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం మందుల సరఫరా కోసం మెడ్‌ ప్లస్‌ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్‌ చేసింది. అత్యవసర మందులు అందుబాటులో ఉండటం లేదనే పేరుతో కోట్లాది రూపాయలను దోచి పెట్టే విధంగా ఒప్పందం చేసుకన్నారని నేతలు విమర్శించారు. ఈ ఒప్పందాన్ని రద్దు చేసి కార్మికులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆస్పత్రిలో సౌకర్యాలను కల్పించాలని వారు డిమాండ్ చేశారు.

15:41 - May 13, 2017

నెల్లూరు : రాష్ట్రంలో భయంకరమైన కరువు పరిస్థితి ఏర్పడినా... ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. ప్రభుత్వం వెంటనే కరువు సహాయక చర్యలు చేపట్టాలని, రైతులకు 1700 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే 500 కోట్ల ఉపాధి హామీ బకాయిలు చెల్లించాలని కూడా మధు డిమాండ్‌ చేశారు.

 

చిత్తూరులో కంప్యూటర్ల హ్యాకింగ్

చిత్తూరు : జిల్లా పోలీసు శాఖలోని 8 కంప్యూటర్లపై మాల్ వేర్ అటాక్ జరగడంతో అవి హ్యాకింగ్ గురయ్యాయని తిరుపతి అర్బన్ ఎస్పీ జయలక్ష్మి తెలిపారు. హ్యాకింగ్ వల్ల పోలీసు విధులకు ఎలాంటి ఆటంకం కలగలేదని ఆమె పేర్కొన్నారు.

15:11 - May 13, 2017

హైదరాబాద్ : బాహుబలి 2 రిలీజ్ తర్వాత రాజమౌళి తర్వాత సినిమా ఎవరితో చేస్తారని ఇండస్ట్రీలో పెద్ద చర్చ జరుగుతోంది. యువ హీరోలతో చిన్న ప్రాజెక్టు చేస్తారని... బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫక్ట్ ఆమిర్ హీరోగా సినిమా చేయబోతున్నారని...ఆయన డ్రీమ్ ప్రాజెక్టు మహాభారతాన్ని తెరకెక్కిరస్తాడని ఇలా రకరకాలుగా వార్తాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాజమౌళి లండన్ లో ఉన్నారు. ఇప్పుడు తాజాగా సమాచారం ప్రకారం జక్కన్న తన తర్వాత చిత్రాన్ని మహేష్ హీరోగా చేయాలని భావిస్తున్నాడట...చాలా రోజుల కింద మహేష్ బాబు హీరోగా కెయల్ నారాయణ నిర్మాణంలో సినిమా చేసేందుకుకు రాజమౌళి అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆ ఒప్పందం ప్రకారం చిత్రాన్ని చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్ మారింది. ప్రస్తుతం మురగదాస్ డైరెక్షన్ లో మహేష్ స్ఫైడర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా మహేష్ సినిమా చేయనున్నాడు.

మరి రాజమౌళి తో మహేష్ తో సినిమా చేయాలనుకుంటే ఆ ప్రాజెక్టు ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ...లేక కొరటాలతో సినిమా పక్కన పెట్టి రాజమౌళితో సినిమా చేస్తాడా...? లేక మహేష్ కొరటాల సినిమా పూర్తయ్యే వరకు అగుతాడా చూడాలి మరి....!

తిరుమల....సాంబార్ లో బొద్దింక

చిత్తూరు : తిరుమలోని యాత్రికుల వసతి సమూదాయం వద్ద ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో ఇడ్లీ సాంబార్ లో బొద్దింక రావడంతో భక్తుల ఆందోళన చెందారు. వెంటనే వారు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పై చర్యలు తీసుకోవాలంటూ ఆరోగ్య శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

14:45 - May 13, 2017

రంగారెడ్డి : రాజేంద్రనగర్‌లో పశువైద్య కళాశాల విద్యార్థులతో ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. విద్యార్ధులు 20 రోజలుగా ఆందోళన చేస్తున్నాపట్టించుకోకపోవడం దారుణమని ఆయన అన్నారు. పశువైద్య కళాశాల విద్యార్ధులు చేస్తున్న దీక్షలకు ఆయన మద్దతు తెలిపారు. పశువైద్యుల భర్తీలో కాంట్రాక్టు వ్యవస్థను ఎత్తివేసి శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు నియమించాలని తమ్మినేని డిమాండ్ చేశారు.

 

14:38 - May 13, 2017

కరీంనగర్ : తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణానికి కాంగ్రెస్‌ పార్టీ అడ్డుపడుతోందని హరీశ్‌రావు పదేపదే అనడం సరికాదని కాంగ్రెస్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు సిద్ధమా అని ఆయన సవాల్‌ విసిరారు. 2016 వరకు టీఆర్‌ఎస్‌ అసలు ప్రాజెక్టుల ఊసే ఎత్తలేదని.. ఆ తర్వాత రాత్రికి రాత్రే ప్రాజెక్టుల జపం అందుకున్నారని పొన్నం విమర్శించారు.

14:35 - May 13, 2017

నెల్లూరు : జిల్లాలోని మంత్రి నారాయణ కుటుంబసభ్యులను ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు పరామర్శించారు. మూడు రోజుల క్రితం మరణించిన నిషిత్ చిత్ర పటానికి నివాళులు అర్పించారు. నిషిత్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. నిషిత్ ప్రమాదవార్త తననెంతో బాధించిందని.. అతని ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు.

14:23 - May 13, 2017

చిత్తూరు : తిరుమలోని యాత్రికుల వసతి సమూదాయం వద్ద ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో ఇడ్లీ సాంబార్ లో బొద్దింక రావడంతో భక్తుల ఆందోళన చెందారు. వెంటనే వారు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పై చర్యలు తీసుకోవాలంటూ ఆరోగ్య శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

13:31 - May 13, 2017
13:18 - May 13, 2017

అనంతపురం : ప్రభుత్వ ఆస్పత్రి గైనిక్ వార్డులో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. కాన్పు కథ అటుంచితే ముందు బెడ్స్‌ను చేజిక్కించుకోవడం ఇక్కడ పెద్ద సమస్యగా మారింది. వార్డులో అధికారికంగా అరవై పడకలున్నాయి. వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో అదనంగా మరో అరవై పడకలను డాక్టర్లు ఏర్పాటు చేశారు. కానీ అవి కూడా సరిపోవడం లేదు. దీంతో ఒక్కో బెడ్‌పై ఇద్దరిని, ముగ్గురిని పడుకోబెడుతున్నారు. దీంతో బాలింతలు, గర్భిణులు నానా అవస్థలు పడుతున్నారు. చాలిచాలని పడకలపై.. రోజుల పిల్లలతో ఇబ్బందులు పడుతున్నారు. వారికి సహాయంగా వచ్చే వారు కిందనే కూర్చోవాల్సిన పరిస్థితి. ఇబ్బందిగా ఉన్న తప్పడం లేదని బాలింతలు వాపోతున్నారు.

ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు అందుతున్న..

ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు అందుతున్న.. సౌకర్యాలు లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. ఆస్పత్రికి ఒకేసారి ఎక్కువ మంది రావడంతో ఈ సమస్య తలెత్తితందని వైద్యులు అంటున్నారు. 120 బెడ్స్‌ ఉంటే.. 180 మంది ఆస్పత్రిలో ఉన్నారన్నారు. వచ్చిన వారిని వెనక్కి పంపించడం ఇష్టం లేక.. ఉన్న బెడ్స్‌పైనే పడుకోబెట్టి ట్రీట్‌మెంట్ ఇస్తున్నామని చెబుతున్నారు. ఆస్పత్రిలో సిబ్బంది సంఖ్యను పెంచి... సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఆహారంలో బొద్దింక

తిరుమల: యాత్రికుల వసతి సముదాయం వద్ద ఓఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో సాంబర్ లో బొద్దింక ప్రత్యక్షం అయ్యింది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పై చర్యలు తీసుకోవాలంటూ ఆరంగ్య శాఖ అధికారులకు భక్తులు ఫిర్యాదు చేశారు.

నిషిత్ చిత్రపటానికి చంద్రబాబు నివాళులు

నెల్లూరు: మంత్రి నారాయణ కుటుంబ సభ్యులను సీఎం చంద్రబాబు దంపతులు పరామర్శించారు. నిషిత్ చిత్రపటానికి చంద్రబాబు నివాళులర్పించారు.

12:44 - May 13, 2017

శ్రీకాకుళం : పలాస కాశీబుగ్గ పారిశ్రామిక వాడలో.. 170 జీడి పరిశ్రమలు కార్మికుల సమ్మెతో మూత పడ్డాయి. వేతనం పెంపుపై కార్మికులు, యాజమాన్యాల వాదన వేరుగా ఉంది. 50 శాతం కూలీ ధర పెంచాలని కార్మిక సంఘాలు పట్టు బడుతున్నాయి. అయితే 9 శాతమే పెంచేందుకు ఇండస్ట్రీ యాజమాన్యాలు అంగీకరిస్తున్నాయి.

జీడి ఇండస్ట్రీస్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్‌తో చర్చలు విఫలం ....

పలాస జీడి ఇండస్ట్రీస్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్‌తో.. కార్మిక సంఘాలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో కార్మికులు సమ్మె బాట పట్టడంతో పలాస జీడి పరిశ్రమలు మూత పడ్డాయి. జీడి కర్మాగారాలు మూత పడటంతో ఇటు కార్మికులు, అటు యాజమాన్యాలకు ఇబ్బందులు తప్పేలా కనబడటం లేదు. రెండేళ్లకు ఒక్కసారి ఈ విధంగా వేతన ఒప్పందం ఆనవాయితీగా ఉంది.

తహసీల్దార్‌, స్థానిక ఎమ్మెల్యేకు వినతిపత్రం

రెండేళ్ల కిందట వేతన ఒప్పందం చర్చలు విఫలం కావడంతో.. గరిష్టంగా నలభై అయిదు రోజులు సమ్మె కొనసాగింది. ఇలాంటి పరిస్థితుల్లో జీడి పరిశ్రమ కార్మికుల సమ్మె ఎంతవరకూ వెళ్తుందోనన్న ఆందోళన.. సర్వత్రా వ్యక్తమవుతోంది. మరోవైపు సమస్యలను పరిష్కరించి కార్మికులకు న్యాయం చేయాలని.. కార్మిక సంఘాలు పలాస తహసీల్దార్‌కు, స్థానిక ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించారు. 

170 జీడి పరిశ్రమలు

మరోవైపు పలాస తరువాత అనంతపురం ఇండస్ట్రియల్ ఏరియాలో.. 170 జీడి పరిశ్రమలు మూత పడ్డాయి. కార్మికుల సమ్మెతో మూత పడిన జీడి పరిశ్రమలతో యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గతంలో కార్మికుల డిమాండ్‌లు నెరవేర్చాలని 50 శాతం వేతనం పెంచాలంటే యాజమాన్యాలు నష్టాల్లోకి వెళ్లడం ఖాయమని వ్యాపారులు వాపోతున్నారు.

2015 మే నెలలో అప్పటి కార్మిక శాఖా మంత్రి...

2015 మే నెలలో అప్పటి కార్మిక శాఖా మంత్రి అచ్చెంనాయుడు ఆధ్వర్యంలో కుదిరిన వేతన ఒప్పందం.. మే 9 వరకూ కొనసాగింది. మళ్లీ చర్చలు విఫలం కావడంతో సమ్మె అనివార్యమైంది. ఈ విషయంలో జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు కార్మిక శాఖ జోక్యం చేసుకుంటే తప్ప.. కార్మికులు, యాజమాన్యాలు వెనక్కి తగ్గేట్టు కనబడటం లేదు. 

12:42 - May 13, 2017

హైదరాబాద్: ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద సైబర్‌ దాడి జరిగింది. భారత్‌ సహా 74 దేశాల్లో సైబర్‌ దాడులు జరిగాయి. 45వేల కంప్యూటర్లను నేరగాళ్లు హ్యాక్‌ చేశారు. దీంతో అత్యవసర సేవలు స్తంభించాయి. ఈమెయిల్‌ ద్వారా మాల్‌వేర్‌ను ఎన్‌క్రిప్టెడ్‌ ఫైల్‌లో పంపించారు. ఒకసారి డౌన్‌లోడ్‌ చేసిన వెంటనే కంప్యూటర్లు పనిచేయడం ఆగిపోయాయి. దీంతో ఐటీ వ్యవస్థ కుప్పకూలింది. రష్యా రాజధాని మాస్కోలోని సైబర్‌ సెక్యూరిటీ సంస్థ కాస్పర్‌స్కై ల్యాబ్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. మైక్రోసాఫ్ట్‌ విండోస్‌లో ఎస్‌ఎంబీవీ2 అనే రిమోట్‌కోడ్‌తో ‘వానా క్రై’ అనే రాన్సమ్‌వేర్‌తో హ్యాకర్లు దాడి చేసినట్లు తెలుస్తోంది. మొదట బ్రిటన్‌లోని పలు ఆస్పత్రులు సైబర్‌ దాడికి గురై.. చాలా ఆసుపత్రిల్లోని అత్యవసర సేవలు స్తంభించాయి. ఆ తర్వాత టర్కీ, వియత్నాం, ఫిలిప్పీన్స్‌, జపాన్‌, చైనా, స్పెయిన్‌, ఇటలీ, తైవాన్‌, రష్యాల్లో సైబర్‌ దాడులు జరిగాయి. రామ్‌సమ్‌వేర్‌ ద్వారా కంప్యూటర్లను హ్యాక్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు ఏపీలోని పలు పోలీస్‌స్టేషన్లలోనూ సైబర్‌ దాడి చేశారు. . తెలుగు రాష్ట్రాల్లోని చిత్తూరు జిల్లాలో 8 పోలీస్‌ స్టేషన్లలోని కంప్యూటర్లు స్తంభించిపోయాయి. దీంతో విధులకు ఆటంకం కలిగింది. కంప్యూటర్లను డీకోడ్‌ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ దాడులు ఎవరు చేశారన్నది మాత్రం ఇంతవరకు అంచనాకు రాలేకపోతున్నారు. 

'స్పైడర్ మాన్ ' సినిమా షూటింగ్ అనుమతి రద్దు

యాదాద్రి: బీబీనగర్ నిమ్స్ లో 'స్పైడర్ మాన్ ' సినిమా షూటింగ్ అనుమతి రద్దు అయ్యింది. ఆస్పత్రిలో షూటింగ్ కు అనుమతి ఇవ్వవద్దని స్థానికుల నిరసనతో అధికారులు షూటింగ్ ను రద్దు చేశారు.

విశాఖలో హవాల స్కాం పై డీసీపీ వివరణ

విశాఖ: విశాఖలో వెలుగు చూసిన హవాలా స్కామ్ పై డీసీపీ నవీన్ గులాటి మీడియాకు వివరాలు తెలియజేశారు. హైదరాబాద్, విశాఖపట్నం, కోల్ కతాల్లో 30 ఖాతాలలో రూ. 680 కోట్ల నగదు ఉంది. 9 మంది పై ఫోర్జరీ, 429 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. 12 బోగస్ కంపెనీలు ఏర్పాటు చేశారని, రూ. 569 కోట్లు, చైనా, సింగపూర్, హాంకాంగ్ లకు తరలించినట్లు పేర్కొన్నారు. మహేశ్ తండ్రి కోల్ కతాలో మధ్యవర్తిగా వ్యవహరించారని తెలిపారు.

11:59 - May 13, 2017

నిజామాబాద్: ఓ గ్రామ పంచాయితీ.. అభివృద్ధికి దిక్సూచిగా మారింది. చక్కని ప్రణాళికలతో ఆదాయ వనరుల్ని పెంచుకుంటూ ముందుకు సాగుతోంది. అధికారులు, ప్రజల మధ్య సమన్వయంతో అభివృద్ధిలో దూసుకుపోతున్న ఆ గ్రామం ఇప్పుడు జాతీయ స్ధాయిలో గుర్తింపు పొందింది. స్వశక్తి కరణ్ పురస్కారానికి సైతం ఎంపికై ఆదర్శంగా నిలిచింది. ఇంతకీ ఆ గ్రామం ఏది..? అక్కడ సాగిన అభివృద్ధి కార్యక్రమాలేవి?

అందరి ప్రశంసలు అందుకుంటోన్న వేల్పూరు గ్రామం...

నిజామాబాద్‌ జిల్లాలోని వేల్పూరు గ్రామ పంచాయతీ.. ఇప్పుడు అందరి ప్రశంసలనూ అందుకుంటోంది. జాతీయ స్థాయిలో స్వశక్తి కరణ్ పురస్కారాన్ని పొందడం ద్వారా.. ఇప్పుడీ వేల్పూరు.. రాష్ట్రంలోని ఇతర గ్రామాల దృష్టిని ఆకర్షిస్తోంది.

అధికారులు, ప్రజల మధ్య సమన్వయం..

అధికారులు, ప్రజల మధ్య సమన్వయం.. ఉన్నతస్థాయి పాలకుల సహకారం.. వేల్పూరు గ్రామాన్ని విశిష్టంగా నిలిపాయి. దాదాపుగా రెండున్నర వేల కుటుంబాలున్న ఈ గ్రామ పంచాయతీకి అసలు నికర ఆదాయమే ఉండేది కాదు. బొటాబొటి ఆదాయం కూడా సిబ్బంది వేతనాలు, చిన్నాచితకా పనులకే సరిపోయేది. ఈ దశలో, పంచాయతీ ఆదాయాన్ని పెంచడం ద్వారానే గ్రామాన్ని గణనీయంగా అభివృద్ధి చేసుకోవచ్చని, పంచాయతీ సభ్యులు నిర్ధరించుకున్నారు. ఈ దిశగా.. ప్రజలే స్వచ్చందంగా వందశాతం పన్నులు చెల్లించేలా వారిని చైతన్య పరిచారు. అంతేకాదు, నికర ఆదాయం కోసం.. గ్రామంలో 15 వాణిజ్య సముదాయాలను నిర్మించి, అద్దెలకిచ్చారు. దాతల సహాయంతో స్థానికంగా ఓ కల్యాణ మంటపాన్నీ నిర్మించారు. వీటన్నింటి కారణంగా, 2015-16 ఆర్థిక సంవత్సరంలో గ్రామ పంచాయితీ ఆదాయం గణనీయంగా 42 లక్షలకు చేరింది. దీంతో వేల్పూరు గురించి జిల్లా స్థాయిలో చర్చ ప్రారంభమైంది. నిరుడు ఉత్తమ పంచాయతీగానూ అవార్డును అందుకుందీ గ్రామం.

హరిత హారంలో భాగంగా వేల్పూరుకి వచ్చిన సీఎం కేసీఆర్‌,...

హరిత హారంలో భాగంగా వేల్పూరుకి వచ్చిన సీఎం కేసీఆర్‌, స్థానికుల వినతిని మన్నించి, పంచాయితీ భవన నిర్మాణానికి 50 లక్షల నిధులు మంజూరు చేశారు. దీంతో గ్రామస్థులు కొత్త పంచాయితీ భవనాన్ని నిర్మించుకున్నారు. ఇక ఈ గ్రామంలో.. అక్షరాస్యతను పెంచే చర్యలూ సత్ఫలితాలనిస్తున్నాయి. అందరినీ బడిబాట పట్టించడంతో, బాల కార్మికులే లేని మండలంగా వేల్పూరు 2001లో జాతీయ అవార్డును గెలుచుకుంది. ఇప్పుడు పంచాయితీ అభియాన్ లో భాగంగా వేల్పూరు పంచాయితీ స్వశక్తి కరణ్ అవార్డుకు ఎంపికైంది. పంచాయితీ రాజ్ శాఖ దినోత్సవం రోజున, ఉత్తరప్రదేశ్ లోని లక్నోలొ నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి తోమర్, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ చేతుల మీదుగా వేల్పూరు గ్రామ సర్పంచ్ నీరడి భాగ్య ఈ అవార్డును అందుకున్నారు.

జాతీయ స్ధాయిలో గుర్తింపు రావడం పట్ల గ్రామస్తులు హర్షం...

తమ గ్రామానికి జాతీయ స్ధాయిలో గుర్తింపు రావడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంచాయితీ అధికారుల పని తీరు తమ గ్రామ అభివృద్ధికి కారణమంటున్నారు. ఇదీ వేల్పూరు గ్రామ అభివృద్ధి మంత్రం. ప్రజలు అధికారుల మధ్య సమన్వయం కుదిరితే అభివృద్ధి సాధ్యమనడానికి చక్కని ఉదాహరణ. ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగితే దేశానికి పట్టుకొమ్మలైన గ్రామాలు అన్నిరంగాల్లోనూ అభివృద్ధిని సాధిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. 

11:56 - May 13, 2017

కరీంనగర్ : ఆరుగాలం శ్రమించి అన్నదాతలు పండించిన పంట ఇప్పుడు కొనుగోలు కేంద్రాల్లో మగ్గిపోతోంది. తాను పండించిన పంటకు తానే కాపలాదారుడిగా మారిన పరిస్థితి రైతన్నది. మరోవైపు కొనుగోలు చేసిన పంటకు 48 గంటల్లో డబ్బులు చెల్లిస్తామని హామీ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఆచరణలో అది అమలు చేయకపోవడంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దే కాలం వెళ్లదీస్తున్నారు అన్నదాతలు.

కుప్పలు, తెప్పలుగా పడి ఉన్న ధాన్యపు రాశులు..

కుప్పలు, తెప్పలుగా పడి ఉన్న ధాన్యపు రాశులు.. కరీంనగర్ జిల్లాలోని గ్రామ, మండల స్ధాయిలో ఎక్కడ చూసినా ఇలాంటి ధాన్యపు రాశులే. ఆ ధాన్యపు రాశుల ముందు కొనుగోలు దారుడి కోసం దీనంగా ఎదురుచూస్తూ రైతులు కనిపిస్తారు.

కరీంనగర్‌లో మునుపెన్నడూ లేని విధంగా పంటల సాగు....

కరీంనగర్ జిల్లాలో మునుపెన్నడూ లేని విధంగా రైతులు పంటల్ని సాగు చేశారు. ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, ఎల్ఎండీలలో ఉన్న నీటిని ప్రణాళిక బద్ధంగా పంటలకు విడుదల చేయడంతో చాలావరకు పంటలు చేతికొచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో చివరి ఆయకట్టుకు నీరందక పంటలకు నష్టం జరిగినా.. కరీంనగర్ , పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలో కెనాళ్ల ద్వారా నీటిని విడుదల చేసి పంటకు నీరివ్వడంతో రైతులు సంతోషపడ్డారు. అంతా బాగానే ఉంది.. చివరికి పండించిన పంటకు మాత్రం మార్కెట్లో చుక్కెదురవుతోంది. వాతావరణం కరుణించినా.. రైతుల్ని అధికారులు కనికరించట్లేదు. ేకొనుగోళ్లు ఆలస్యం అవుతుండటంతో ఎర్రటి ేఎండలో ధాన్యం బస్తాల వద్ద రైతన్నలు పడిగాపులు కాస్తున్నారు.

కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోతున్న ధాన్యం బస్తాలు

వ్యవసాయ మార్కెట్ యార్డులు, ఐకెపి, ఫాక్స్, డిసిఎంస్ కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. దాంతో ఎప్పటికప్పుడు బస్తాలను మిల్లులకు పంపించాల్సి ఉంటుంది. అయితే ఏ ఒక్క మార్కెట్లో ఆ విధంగా జరగడం లేదు. రోజుల తరబడి ధాన్యం బస్తాలు కొనుగోలు కేంద్రాల్లో పేరుకు పోతుండటంతో గోనె సంచులకు చెదలు పట్టి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోది. ఇక కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ధాన్యం నిండటం తరువాయి అధికారులు నాలుగురోజులు సెలవులు ప్రకటిస్తున్నారు. దీంతో రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో ఉండాలంటే ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేసేలా చర్యలు చేపట్టాలని అధికారుల్ని కోరుతున్నారు.

ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతు ఖాతాలో పడని సొమ్ము

ఇక ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతు ఖాతాకు డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం చెప్పినప్పటికి క్షేత్ర స్థాయిలో అది అమలు కావడం లేదు. కరీంనగర్ జిల్లాలో ఐకెపి కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన 2,88,392 క్వింటాళ్ల ధాన్యానికి రూ.43.54 కోట్లు చెల్లించాల్సి ఉండగా రూ.15 కోట్లు మాత్రమే రైతుల ఖాతాలోకి చేరాయి. ప్రాథమిక సహకార సంఘాల ద్వారా 5,81,903 క్వింటాళ్లు కొనుగోలు చేయగా రూ.87.85 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. కేవలం రూ.31.35 కోట్లు మాత్రమే జమ చేశారు అధికారులు..

ధాన్యం విక్రయించినా మార్కెట్ యార్డ్ లో రైతుల పడిగాపులు

ఇక ధాన్యం కొనుగోలు జరిగాక మార్కెట్ యార్డ్ లో రైతులకు పని ఉండదు. ఇక్కడ సీన్ రివర్స్.. ధాన్యం విక్రయించిన తరువాత అక్కడే ఉండి లారీల్లో లోడ్ చేసే వరకు ధాన్యాన్ని కాపాడాల్సిన పరిస్థితి వారికి ఎదురౌతోంది. అందుకు విరుద్ధంగా ఎవరైనా ధాన్యాన్ని వదిలి వెళ్తే కొనుగోలు చేసినట్లుగా స్లిప్ లు ఇవ్వకుండా రైతుల్ని కొనుగోలు దారులు ముప్పు తిప్పలు పెడుతున్నారు. దీనికి తోడు కొనుగోలు కేంద్రాల్లో గోనె సంచుల కొరత, హమాలీలు దొరక్కపోవడం.. లారీలు అందుబాటులో లేకపోవడం లాంటి సమస్యలతో రైతుల ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు పిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సకాలంలో పంటకు డబ్బు చెల్లిస్తే ఖరీఫ్ సాగు చేసుకుని ఆర్ధికంగా నిలదొక్కుకుంటామని వేడుకుంటున్నారు.. ప్రభుత్వం వారి దయనీయ పరిస్థితి చూసి ఎంతవరకు స్పందిస్తుందో వేచి చూడాలి. 

11:53 - May 13, 2017

అమరావతి: రాజధాని నిర్మాణంలో కీలకమైన స్టార్టప్ ఏరియా అభివృద్ధిని వేగవంతం చేయడంపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా రాయపూడి, లింగాయపాలెం, ఉద్దండ్రాయినిపాలెం, తాళ్లాయపాలం గ్రామాల్లో 16 వందల 91 ఎకరాల్లో స్టార్టప్ ఏరియాను అభివృద్ధి చేయనున్నారు. దీనికోసం సింగపూర్ ప్రభుత్వ సంస్థలైన అసెండాస్, సింబ్ బ్రిడ్జి, సెంబ్ కార్ప్ కన్సార్టియంతో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ చేసుకోనుంది. ఈనెల 15న.. 30 మంది సింగపూర్‌ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమావేశం కానున్నారు. మొత్తం మూడు దశల్లో సింగపూర్ కన్సార్టియానికి ప్రభుత్వం భూమి కేటాయించబోతుంది.

ఎంవోయూ అనంతరం భూమిపూజ, శంకుస్థాపన...

ఎంవోయూ అనంతరం మొదటి దశలో కేటాయించిన భూముల అభివృద్ధికి సంబంధించిన భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఈ సందర్భంగా ఐదు వేల మందితో సభను ఏర్పాటు చేస్తున్నారు. తాళ్లాయపాలె గ్రామ రెవెన్యూ పరిధిలో దీనికి సంబంధించిన ఏర్పాట్లను సీఆర్డీఏ చేస్తోంది..అయితే స్విస్‌ ఛాలెంజ్‌ విధానంపై ఇప్పటికే చాలా విమర్శలు ఉన్నాయి. స్టార్టప్‌ ఏరియా అభివృద్ధికి సంబంధించిన వివరాలను పూర్తిస్థాయిలో బహిర్గతం చేయకుండా... ఇలా ఎంవోయూలు చేసుకోవడం పట్ల విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. 

11:51 - May 13, 2017

జోగులాంబ గద్వాల : జిల్లా కేంద్రంలో మంత్రి హరీశ్‌రావు.. పెండింగ్‌ ప్రాజెక్ట్‌లపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. హరీశ్‌రావు, మార్కెట్ యార్డు చైర్మన్‌ పటేల్ విష్ణువర్ధన్‌ రెడ్డి ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. తరువాత ఆలంపూర్‌ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి.. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్‌ల సందర్శనకు బయల్దేరారు. ముందుగా చిన్నోనిపల్లి గ్రామం దగ్గర మంత్రి కాన్వాయ్‌ రాగానే.. పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. అక్కడి నుంచి వాహనాలలో 42 కిలో మీటర్ల కాలువ వెంట ప్రయాణించారు. అక్కడక్కడా ఆగి కాలువ నాణ్యతను పరిశీలిస్తూ ముందుకు సాగారు. 

11:49 - May 13, 2017

చిత్తూరు : తిరుపతి పోలీస్‌ నెట్‌వర్క్‌పై సైబర్‌ దాడి జరిగింది. తిరుమల క్రైమ్‌ పీఎస్‌, తిరుపతి మహిళా పీఎస్‌, ఏర్పేడు, కలికిరి, చిత్తూరు టౌన్‌, అర్బన్‌ ఎస్పీ కార్యాలయాల్లో కంప్యూటర్లు హ్యాక్‌ అయ్యాయి. పోలీస్‌ కంప్యూటర్లను ఎన్‌క్రిప్ట్‌ లాక్‌ చేశారు హ్యాకర్లు. తిరుపతి వెస్ట్‌ పీఎస్‌లో కేసు నమోదు నమోదు చేశారు. 

11:48 - May 13, 2017

శ్రీకాకుళం : జిల్లాలో సైకో శంకర్‌రావు హత్యకు గురయ్యాడు. ఎల్‌ఎన్‌ పేట మండలంలో శంకర్‌రావు శవమై తేలాడు. 2010 నవంబర్‌ 30న ఏడుగురిని శంకర్‌రావు హత్యచేశాడు. పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న శంకర్‌రావును ప్రత్యర్థులు చంపేశారు. ఈ కేసులో పోలీసులకు ఇద్దరు సరైండర్‌ అయినట్లు తెలుస్తోంది

11:45 - May 13, 2017

హైదరాబాద్: విస్తరణ పేరుతో వేలాది గ్రామాలు, లక్షల ఎకరాల భూమిని మింగేసి సింగరేణి కాలరీస్‌ కంపెనీ కళ్లు ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టులపై పడింది. ఉపరితల బొగ్గు గనుల కోసం కుమ్రం భీమ్‌ జిల్లాలోని వట్టివాగు ప్రాజెక్టును పూడ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలు కూడా సింగరేణి భూకబ్జాలకు వత్తాసు పలికేలా ఉన్నాయన్న విమర్శలు వినవస్తున్నాయి. వేలాది ఎకరాలను నీరందిస్తున్న నిండుకుండలాంటి వట్టివాగు ప్రాజెక్టును మింగేయాలని చూస్తున్న సింగరేణి భూదాహంపై 10 టీవీ ప్రత్యేక కథనం....

కబ్జా కోరల్లో వట్టివాగు...

సింగరేణి కాలరీస్‌ కంపెనీ.... తెలంగాణలో నల్ల బంగారాన్ని వెలికితీస్తోన్న సంస్థ. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని పలు విద్యుత్‌ ప్రాజెక్టులకు బొగ్గు సరఫరా చేస్తూ వెలుగులు విరజిమ్మేందుకు తన వంతు సహకారం అందిస్తోంది. ఎప్పటికప్పుడు విస్తరణ ప్రణాళికలు రచిస్తున్న సింగరేణి కాలరీస్‌ కంపెనీ... ఇప్పటి వరకు వేలాది గ్రామాలను స్వాధీనం చేసుకుని, లక్షలాది మందిని నిరాశ్రయులను చేసింది. అడవులను ఆక్రమించుకుంది. వ్యవసాయ భూములను కబ్జా చేసింది. చెరువులు సింగరేణి కాలగర్భంలో కలిపేసిన సంస్థ కళ్లు ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టులపై పడ్డాయి.

పాతికవేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న వట్టివాగు

నీళ్లతో నిండుకుండలా కనిపిస్తున్న ఇది వట్టివాగు ప్రాజెక్టు. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని పాతిక వేల ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. ఈ ప్రాజెక్టు ప్రాంతంలోనే డోర్లి ఉపరితల బొగ్గు గునులు ఉన్నాయి. ఓపెన్‌కాస్ట్‌లో తవ్వుతున్న మట్టిని వట్టివాగులో పోస్తున్నారు. దీంతో ఈ జలాశయం వట్టిపోయే పరిస్థితి వస్తోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. డోర్లి ఉపరితల బొగ్గు గనుల మట్టితో వట్టివాగు జలాశయాన్ని పూడ్చేస్తే తమ భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారుతుందని ప్రాజెక్టు పరిధిలోని ఆయనట్టు రైతులు భయపడుతున్నారు.

వట్టివాగు ప్రాజెక్టు గర్భంలో అపార బొగ్గు నిక్షేపాలు

వట్టివాగు జలాశయంపై సింగరేణి కాలరీస్‌ కన్ను పడటానికి కారణాలు లేకపోలేదు. ఈ ప్రాజెక్టు గర్భంలో అపార బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని గుర్తించారు. దీంతో జలాశయాన్ని పూడ్చేస్తే, ఈ భూములను కూడా ఉపరితల బొగ్గు గనుల కోసం తీసుకోవచ్చన్న ఉద్దేశంతో సింగరేణి యాజమాన్యం ఉందని ఈ ప్రాంత రైతులు ఆరోపిస్తున్నారు

నీటిపారుదల శాఖ, రాష్ట్ర ప్రభుత్వం మౌనప్రేక్షక పాత్ర

డోర్లి ఓపెన్‌ కాస్ట్‌ బొగ్గు తవ్వకంలో వస్తున్న మట్టిని వట్టివాగు ప్రాజెక్టులో పోసి పూడ్చివేయడం నింబధనలను విరుద్ధం. ఇటు నీటిపారుదల శాఖ అధికారులకు, అటు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయం తెలిసినా.... ఇద్దరూ కూడా మౌనప్రేక్షక పాత్ర పోషిస్తుండటంపై ఈ ప్రాంత ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి యాజమాన్యం చట్టాలను ఉల్లంఘిస్తున్నా పాలకులు నోరు మెదపకపోవడాన్నిజనం తప్పుపడుతున్నారు. వట్టివాగు ప్రాజెక్టును కొల్లగొట్టే ప్రయత్నాలను సింగరేణి యాజమాన్యం విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. లేకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు.

1998-2000 మధ్య నిర్మాణం పూర్తి

ఆసిఫాబాద్‌లో రెండు దశల్లో 190 కోట్ల రూపాయల వ్యయంతో వట్టివాగు ప్రాజెక్టు నిర్మించారు. 1998లో నిర్మాణం ప్రారంభించి, 2000 సంవత్సరంలో పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా అందుతున్న సాగునీరుతో పంటలు పండించుకుంటూ వేలాది మంది జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు డోర్లీ ఉపరితల బొగ్గు గనుల మట్టిని వట్టివాగులో పోస్తుండటంతో తమ భవిష్యత్‌ పశ్నార్థకంగా మారుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2005లో ఒకసారి ఈ ప్రాజెక్టు కట్ట కొట్టుకు పోయింది. అయితే ఎప్పటి నుంచో ఈ ప్రాజెక్టు భూములపై కన్నేసిన సింగరేణి కాలరీస్‌.... జలాశయాన్నికబ్జా చేసే క్రమంలోనే ఉద్దేశపూర్యంగా కరకట్టకు గండికొట్టిందన్న ఆరోపణలు వినిపించాయి. కబ్జాల పర్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఇప్పుడు ఎవరూ అడిగేవారు లేరన్న ధీమాతో వట్టివాగు జలాశయాన్ని డోర్లి ఓపెన్‌కాస్ట్‌ మట్టితో నిపించేస్తోందన్నఆ ప్రాంత వాసులు చెబుతున్నారు. పాలకులు పట్టించుకుని సింగరేణి కబ్జా కోరల నుంచి వట్టివాగు జలాశయాన్ని కాపాడాలని కోరుతున్నారు. 

11:42 - May 13, 2017

హైదరాబాద్: ఖమ్మంలోని ధర్నాచౌక్‌లో టీడీపీ.. రైతు దీక్ష జరగనుంది. దీక్షలో తెలుగుదేశం పార్టీ వర్కింగ్‌ ప్రెస్‌డింట్‌ రేవంత్ రెడ్డి పాల్గొంటారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సైదులు అందిస్తారు.

కేంద్రమంత్రి వెంకయ్యకు ఆత్మీయ సన్మానం

హైదరాబాద్: కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడికి ఆత్మీయ సన్మానం జరిగింది. హాబిటాటఖ గవర్నింగ్ కౌన్సిల్ కు ప్రెసిడెంట్ గా ఎన్నికయినందుకు సన్మానం జరిగింది. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ... నాకు రాజకీయ వారసత్వం లేదని, మంచి మిత్రుల వల్లే ఈ స్థాయికి వచ్చానన్నారు. నిమ్మన సిద్ధాంతాన్ని ఎపుడూ వదలదేన్నారు.

10:47 - May 13, 2017

హైదరాబాద్: ధర్నా చౌక్‌ను తరలించొద్దంటూ తెలంగాణలో ఆందోళనలు మరింత ఉధృతమవుతున్నాయి. ధర్నాచౌక్‌ పరిరక్షణ కోసం ఏకమైన ప్రతిపక్షాలు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి. హైదరాబాద్‌లో 28 రోజులుగా నిరసనదీక్షలు చేస్తున్న పలువురు నేతలు.. శుక్రవారం మౌనదీక్ష చేపట్టారు. 15వ తేదీన ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇదే అంశం పై 'న్యూస్ మార్నింగ్'లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో సీనియర్ రాజకీయ విశ్లేషకులు వినయ్ కుమార్, నరేంద్ర గౌడ్ టీఆర్ ఎస్ నేత, బెల్లానాయక్ కాంగ్రెస్ నేత పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

100 దేశాల్లో కంప్యూటర్లపై హ్యాకర్లు సైబర్ దాడులు

హైదరాబాద్: 100 దేశాల్లో కంప్యూటర్లపై హ్యాకర్లు సైబర్ దాడులు చేశారు. దీంతో ప్రపంచం వ్యాప్తంగా సమాచార, ఐటీ, బ్యాంకింగ్ రంగాలు కుప్పకూలుతున్నాయి. హ్యాకర్ల ధాటికి లండన్ లో వైద్య ఆరోగ్య సేవలు స్థంభించాయి. ఏపీలోని 25 శాతం పోలీస్ వ్యవస్థకు చెందిన కంప్యూటర్లను హ్యాక్ చేసినట్టు ర్యాన్సమ్ వేర్ ప్రకటించింది. 

10:36 - May 13, 2017

విజయవాడ: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పోలీసు నెట్ వర్క్ హ్యాకింగ్ కు గురయ్యింది. పోలీసు కంప్యూటర్లను హ్యాకర్లు ఎన్ క్రిప్ట్ లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఏపీలోని దాదాపు 25శాతం పోలీస్‌ స్టేషన్లలో కంప్యూటర్లు హ్యాకింగ్‌కు గురయ్యాయి. చిత్తూరు జిల్లాలో తిరుమల క్రైమ్, మహిళా పీఎస్, ఏర్పేడు, కలికిరి, చిత్తూరు టౌన్, అర్బన్ ఎస్పీ ఆఫీసులో కంప్యూటర్ (8 పీఎస్ లలో కంప్యూటర్లు హ్యాకింగ్) జరగ్గా, గుంటూరు, విజయనగరం, శ్రీకాకుళంతో పాటు పలు ప్రాంతాల్లోని పోలీస్ నెట్ వర్క్ ను దుండగులు హ్యాక్ చేశారు. దీంతో ఆయన పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసుల కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. కంప్యూటర్లు ఓపెన్ కాకపోవడంతో పోలీసుల విధులకు ఆటంకం కలిగింది. దీనికి సంబంధించి తిరుపతి వెస్ట్ పీఎస్ లో సైబర్ క్రైమ్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీస్ నెట్ వర్క్ పై సైబర్ దాడినిపుణులు వీటిని డీకోడింగ్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తన కంప్యూటర్‌లో ఐవోఎస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఉన్నందున హ్యాకింగ్‌కు గురికాలేదని ఏపీ డీజీపీ సాంబశివరావు తెలిపారు. ఎక్కువ శాతం విండోస్‌కు వాడుతున్న కంప్యూటర్లే హ్యాకింగ్‌కు గురయ్యాయని అన్నారు.

దేశవ్యాప్తంగా పోలీసు నెట్ వర్క్ హ్యాకింగ్

విజయవాడ: దేశవ్యాప్తంగా పోలీసు నెట్ వర్క్ హ్యాకింగ్ కు గురయ్యింది. ఏపీలోని దాదాపు 25శాతం పోలీస్‌ స్టేషన్లలో కంప్యూటర్లు హ్యాకింగ్‌కు గురయ్యాయి. నిపుణులు వీటిని డీకోడింగ్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తన కంప్యూటర్‌లో ఐవోఎస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఉన్నందున హ్యాకింగ్‌కు గురికాలేదని ఏపీ డీజీపీ సాంబశివరావు తెలిపారు. ఎక్కువ శాతం విండోస్‌కు వాడుతున్న కంప్యూటర్లే హ్యాకింగ్‌కు గురయ్యాయని అన్నారు.

10:16 - May 13, 2017

హైదరాబాద్‌ : నగరంలోని అఫ్జల్‌గంజ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సుల్తాన్‌షాహీలోని ఇంజినీరింగ్‌ వర్క్‌షాప్‌లో మంటలు భారీగా చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైర్‌ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్నారు. భారీగా ఆస్తినష్టం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణమని పోలీసులు చెబుతున్నారు. అగ్నిప్రమాదం కారణంగా అఫ్జల్‌గంజ్‌లో ట్రాఫిక్‌ జాం అయ్యింది. పోలీసులు వాహనాలను ఇతర రూట్లలో మళ్లిస్తూ ట్రాఫిక్‌ను క్లియర్‌ చేస్తున్నారు. 

10:14 - May 13, 2017

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇవాళ నెల్లూరుకు వెళ్తున్నారు. రోడ్డు ప్రమాదంలో కుమారుడిని కోల్పోయిన మంత్రి నారాయణను చంద్రబాబు పరామర్శించనున్నారు. అనంతరం నెల్లూరు నుంచి వెలగపూడిలోని సచివాలయానికి వెళ్తారు. నారాయణ కుమారుడు నిషిత్‌ ప్రమాదంలో చనిపోయినప్పుడు చంద్రబాబు అమెరికా పర్యటనలో ఉన్నారు. నిషిత్‌ అంత్యక్రియలకు చంద్రబాబు హాజరుకాలేదు. అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన చంద్రబాబు.. ఇవాళ నారాయణ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. 

10:13 - May 13, 2017

మెదక్‌ : నర్సాపూర్‌ మండలం ధర్మారం గ్రామంలో భూకబ్జాదారుల ఆగడాలకు అడ్డేలేకుండాపోతోంది.. గ్రామంలో సర్వేనెంబర్‌ ఒకటి నుంచి 30వరకు 630 ఎకరాల భూములున్నాయి. ఈ భూములకు వారసులంటూ ఎవరూలేరు.. కొన్ని దశాబ్దాలనుంచి గ్రామ రైతులు ఈ భూముల్లో పంటలు సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు...

భూములపై కన్నేసిన కొందరు గులాబీ నేతలు...

వారసుల్లేని భూములపై కన్నేసిన కొందరు గులాబీ నేతలు భూముల ఆక్రమణకు స్పెషల్ ప్లాన్‌ వేశారు.. నలుగురు నకిలీ వారసుల్ని సృష్టించారు. ఈ భూములకు యజమానులంటూ కొందరు స్థానికులపేర్లతో వారికి తెలియకుండానే పత్రాలు సృష్టించారు.. దీనికి ఓ తహసీల్దార్‌ కూడా సహకారం అందించాడు.. ఆ తర్వాత ఈ భూముల్ని తమకు అమ్మినట్లుగా మళ్లీ పత్రాలు

గజం జాగాలేని నిరుపేద..

వంగల లక్ష్మాగౌడ్‌... పూరిగుడిసె తప్ప గజం జాగాలేని నిరుపేద.. కూలీచేస్తేనే రోజుగడవని పరిస్థితి.. అలాంటిది కబ్జాదారుల పుణ్యమాని లక్ష్మాగౌడ్‌పేరుమీద 69 ఎకరాల భూమి వచ్చిచేరింది.. ఈ భూమి ఎక్కడిదని అడిగితే తమకు ఈ విషయమే తెలియదని ఈ పేద దంపతులు అమాయకంగా సమాధానమిస్తున్నారు..

సీఎం సొంత జిల్లాలోనే గులాబీ నేతలు ఇలా..

సీఎం సొంత జిల్లాలోనే గులాబీ నేతలు ఇలా రెచ్చిపోయి భూముల ఆక్రమణకు తెరతీశారు.. ఎకరాలకు ఎకరాలు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నా పట్టించుకునేవారే లేకుండాపోయారు.. ఈ అక్రమాలపై కలెక్టర్‌, ఆర్‌డీవోల దృష్టికితెచ్చినా ఫలితంలేదు.. ఈ భూములు తమకే చెందాలంటూ స్థానిక రైతులు తమ పోరాటం కొనసాగిస్తూనేఉన్నారు. ప్రస్తుతం ఈ భూముల వ్యవహారం కోర్టు పరిధిలోఉంది.. అయినా కబ్జారాయుళ్లు వెనకడుగువేయడంలేదు.. భూముల్ని కాజేసేందుకు పలురకాలుగా ప్రయత్నిస్తున్నారు..  

ఏపీ పోలీస్ నెట్ వర్క్ హ్యాక్

అమరావతి: ఏపీ పోలీస్ నెట్ వర్క్ హ్యాకింగ్ కు గురైంది. చిత్తూరు, గుంటూరు, విజయనగరం, శ్రీకాకుళంతో పాటు పలు ప్రాంతాల్లోని పోలీస్ నెట్ వర్క్ ను దుండగులు హ్యాక్ చేశారు. దీంతో ఆయన పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసుల కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. కంప్యూటర్లు ఓపెన్ కాకపోవడంతో పోలీసుల విధులకు ఆటంకం కలిగింది. దీనికి సంబంధించి తిరుపతి వెస్ట్ పీఎస్ లో సైబర్ క్రైమ్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 

అఫ్జల్‌గంజ్‌ పరిధి లో అగ్నిప్రమాదం...

హైదరాబాద్:అఫ్జల్‌గంజ్‌ పరిధి సుల్తాన్‌షాహీలోని 4దుకాణాల్లో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు.

09:34 - May 13, 2017

తమిళనాడులో కారు-లారీ ఢీ:ఏడుగురు మృతి

తమిళనాడు : కరూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు- లారీ ఢీ కొని ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటనలో పలువురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

09:06 - May 13, 2017

హైదరాబాద్: ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలైన నేషనల్‌, న్యూ ఇండియా, ఓరియంటల్‌, యునైటెడ్‌ జనరల్‌ ఇన్స్యూరెన్స్‌ కార్పొరేషన్‌ లోని వాటాలను 49శాతంవరకూ అమ్మేయాలని కేంద్రం నిర్ణయించింది.. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీమారంగంలోని అన్ని సంఘాలు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని తీర్మానించాయి.. ఇందులోభాగంగా శుక్రవారం అబీడ్స్‌లోని ప్రబాత్‌ టవర్స్‌లో జాయింట్‌ ఫోరం ఆఫీసర్స్, ఎంప్లాయీస్‌ అసోసియేషన్ యూనియన్‌ ఆధ్వర్యంలో సమావేశమయ్యాయి.. ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణపై వెనక్కి తగ్గాలని డిమాండ్ చేశాయి..

09:02 - May 13, 2017

హైదరాబాద్: విశాఖపట్నం కేంద్రంగా నడుస్తోన్న హవాలా స్కామ్‌ బయటపడింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన వడ్డి మహేష్‌ అనే యువకుడు 1500 కోట్ల హవాలా స్కామ్‌కు పాల్పడ్డాడు. విశాఖపట్నం, శ్రీకాకుళం, కోల్‌కతా ప్రధాన కేంద్రాలుగా మహేష్‌ తన అక్రమదందాను నడిపాడు. రకరకాల కంపెనీల పేరుతో స్థానికంగా 30 బ్యాంకుల్లో ఖాతాలు ప్రారంభించాడు. ఎవరికి ఏమాత్రం అనుమానం రాకుండా, గుట్టుచప్పుడు కాకుండా బ్యాంకు ఖాతాల ద్వారానే డబ్బును నేరుగా విదేశాలకు పంపించాడు. కోట్లాది రూపాయలను డొల్ల కంపెనీల ద్వారా చైనా, సింగపూర్‌, హాంకాంగ్‌ దేశాలకు పంపి... నల్లకుబేరుల ధనాన్ని తెలుపు చేసి పెడుతున్నాడు. ఇందుకు ప్రతిఫలంతా భారీగా కమీషన్లు దండుకుంటున్నాడు. ఒక్క డాలర్‌కు 85 పైసలు కమీషన్‌ తీసుకుంటున్నాడు. వడ్డి మహేష్‌ హవాలా వ్యాపారానికి పలువురు బ్యాంకు అధికారులు కూడా సహకరించినట్టు తెలుస్తోంది. వడ్డి మహేష్‌ ఖాతాలపై అనుమానం వచ్చిన ఐటీశాఖ అతనిపై నిఘా పెట్టింది. విశాఖ, శ్రీకాకుళం, కోల్‌కతాలో ఈనెల 9 నుంచి తనిఖీలు నిర్వహించింది. దీంతో వడ్డి మహేష్‌ అక్రమ వ్యాపారం బయటపడింది. విశాఖలోని ఒకే బ్యాంకు ఖాతాలో ఏకంగా 570 కోట్ల నగదు వివిధ ఖాతాల నుంచి జమ అయినట్టు ఐటీ సోదాల్లో తేలింది. అదే ఖాతాకు మరో 90 కోట్లు ఒకేసారి జమ అయ్యింది. ఇప్పటి వరకు మహేష్‌ 1500 కోట్ల వరకు హవాలా నడిపించినట్టు ప్రాథమికంగా తేల్చారు. దీంతో వడ్డి మహేష్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడిని విచారిస్తోన్న పోలీసులు వడ్డి మహేష్‌ నోరు విప్పితే మరిన్ని వివరాలు తెలిసే అవకాశముంది.

 

నౌషెరా సెక్టార్ లో రాజౌరి వద్ద పాక్ బలగాలు కాల్పులు

జమ్మూకశ్మీర్ : పాక్ మరోసారి కాల్పుల వివమరణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. నౌషెరా సెక్టార్ లో రాజౌరి వద్ద పాక్ బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. పాక్ బలగాల కాల్పులను భారత్ సైన్యం తిప్పి కొడుతోంది.

విశాఖ లో భారీ కుంభకోణం

విశాఖ : భారీ కుంభకోణం వెలుగుచూసింది. రూ.1500 కోట్ల హవాలా స్కామ్ ను ఐటీ శాఖ పట్టేసింది. స్థానిక బ్యాంకులో 30 ఖాతాలు ప్రారంభించి డొల్ల కంపెనీల పేరుతో అక్రమ లావాదేవీలు చేసినట్లు ఐటీ శాఖ నిర్థారించింది. 12 కంపెనీల పేర్లతో అకౌఐంట్లలో రూ.680.94 కోట్లు జమయినట్లు చెప్పింది. సాఫ్ట్ వేర్ కొనుగోలు పేరుతో రూ.569.93 కోట్లు అక్రమంగా విదేవాలకు చెలామణి చేసినట్లు ఐటీ శాఖ గుర్తించింది. చైనా, సింగపూర్, హాంకాంగ్ లోని ఐదు కంపెనీలతో లింకులు వున్నాయని ఎంవీపీ పీఎస్ లో ఐటీ శాఖ ఫిర్యాదు చేసింది.

వారసత్వ ఉద్యోగాల పేరుతో మోసం: మాజీ మంత్రి శ్రీధర్ బాబు

పెద్దపల్లి : గోదావరిఖని సింగరేణి 1వ గనికి 'సేవ్ సింగరేణి బస్సు యాత్ర' చేరుకుంది. ఈ యాత్రకు సిఐటియు నేతలు, మాజీ మంత్ి శ్రీధర్ బాబు స్వాగతం పలికారు. తాడిచర్ల బ్లాకులను ప్రైవేటుపరం చేస్తే ఆందోళన తప్పదని హెచ్చరించారు. వారసత్వ ఉద్యోగాల పేరుతో కార్మికులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేశాయని మాజీ మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు.

ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి

మహబూబ్ నగర్ : బయ్యారంలో విషాదం నెలకొంది. అలుగు ఏరు బ్రిడ్జి వద్ద ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతి చెందారు. మృతులు చరణ్ (11), యశ్వంత్ (11) లుగా గుర్తించారు.

ఖమ్మంలో టీడిపి నేతల ముందస్తు అరెస్టులు

ఖమ్మం: టీడీపీ రైతు దీక్ష సందర్భంగా ఖమ్మం నగరంలో 144 సెక్షన్ విధించారు. ముందస్తుగా పలువురు టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

07:02 - May 13, 2017

హైదరాబాద్: తెలంగాణ భూసేకరణ, పునరావాస బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. ఏప్రిల్‌ 30న అసెంబ్లీ ఆమోదించి పంపించిన బిల్లుకు సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్‌పై రాష్ట్రపతి సంతకం చేశారు. న్యాయ నిపుణులను సంప్రదించి బిల్లుకు ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది.

శాసనశాభ, మండలి ఆమోదించిన ఈ బిల్లు...

తెలంగాణ శాసనశాభ, మండలి ఆమోదించిన ఈ బిల్లు కేంద్ర హోంశాఖకు చేరింది. కేంద్ర న్యాయశాఖ సూచించిన సవరణలు జరిగాయో లేదో పరిశీలించిన కేంద్ర హోంశాఖ.. అనంతరం ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది. కేంద్ర హోంశాఖ, న్యాయశాఖ దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవడంతో రాష్ట్రపతి ఈ ఫైల్‌పై సంతకం చేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా శుక్రవారం సాయంత్రం గెజిట్‌ నోట్‌పై కూడా సంతకం చేసినట్లు తెలుస్తోంది.

రెండు మూడు రోజుల్లో అసెంబ్లీ...

రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన ఈ బిల్లు రెండు మూడు రోజుల్లో అసెంబ్లీ కార్యదర్శికి చేరనుంది. ఆ తర్వాత గవర్నర్‌ నరసింహన్‌ ఆమోదంతో చట్టంగా మారుంది. ఈ ప్రక్రియ మొత్తం మంగళవారం లోగా పూర్తయ్యే అవకాశం ఉంది. కొత్త భూసేకరణ చట్టంతో రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులకు భూసేకరణ ప్రక్రియలో ఆటంకాలు తొలగిపోతాయి. ప్రాజెక్ట్‌ పనులు మరింత వేగవంతం కానున్నాయి. నిర్వాసితులుకు జాప్యం లేకుండా పరిహారం అందించేందుకు ఈ చట్టం ఉపకరించనుంది. ఈ బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారడంతో టీఆర్‌ఎస్‌ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

తెలంగాణ భూసేకరణ బిల్లు రాష్ట్రపతి ఆమోదముద్ర

హైదరాబాద్: తెలంగాణ భూసేకరణ బిల్లు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. గత బిల్లుకు కేంద్ర న్యాయశాఖ కొన్ని సవరణలు సూచించగా.. ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి వాటికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అనంతరం కేంద్ర హోంశాఖకు పంపగా.. రాష్ట్రపతి అన్ని అంశాలను పరిశీలించి గెజిట్‌పై సంతకం చేశారు. 

ధర్నాచౌక్‌ పరిరక్షణ కోసం ఏకమైన ప్రతిపక్షాలు

హైదరాబాద్: ధర్నాచౌక్‌ పరిరక్షణ కోసం ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి.. ధర్నా చౌక్‌ను తరలిస్తే ఊరుకోమంటూ కదంతొక్కాయి.. ధర్నాచౌక్‌పై ప్రభుత్వం స్పందించకపోతే మే 15న ధర్నా చౌక్‌ ఆక్రమణ కార్యక్రమం చేపడతామని హెచ్చరించాయి..

06:58 - May 13, 2017

హైదరాబాద్: తెలంగాణ భౌగోళిక, రాజకీయ, ఆర్థిక, సామాజిక, చారిత్రాత్మకతను ప్రపంచ దేశాలకు పరిచయం చేయాలని ప్రణాళిక సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరో ముందడుగు వేయనుంది. గత 10, 15 ఏళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైన ఈ అంశం.. నేడు కార్యరూపం దాల్చబోతుంది. కేంద్ర ప్రభుత్వ విదేశాంగ అధికారులు, మంత్రిత్వశాఖతో తెలంగాణ టూరిజం శాఖ ఒప్పందం కుదుర్చుకోనుంది.

వందల ఏళ్ల క్రితం ఆఫ్రికన్‌ దేశాలకు ..

వందల ఏళ్ల క్రితం ఆఫ్రికన్‌ దేశాలకు వివిధ పనుల మీద, జీవనాధారం కోసం వలస వెళ్లి అక్కడే స్థిరపడిన భారతీయులు అనేకమంది ఉన్నారు. అక్కడ వారు ఆ దేశ పౌరసత్వమే కాదు.. ప్రభుత్వాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. వాళ్లు అక్కడ స్థానికులైనప్పటికీ.. వారి పూర్వీకులు భారతదేశానికి చెందినవారే. అందుకే వారికి భారతదేశ చరిత్రను పరిచయం చేయాలని కేంద్ర ప్రభుత్వం దశాబ్ధ కాలం క్రితమే సంకల్పించింది. అయితే.. ఇందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో ఆ ప్రతిపాదన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మిగిలిపోయింది.

తెలంగాణ రాష్ట్రం ఆర్గనైజ్‌ చేసేందుకు ...

తాజాగా ఇదే ప్రతిపాదనను కేంద్ర విదేశాంగ శాఖ పరిశీలనకు తీసుకురాగా.. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఆర్గనైజ్‌ చేసేందుకు ముందుకువచ్చింది. దీనికి KNOW INDIA అని నామకరణం చేసి ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. మారిషస్‌, పిజి, గయానా, ట్రెనిడాడ్‌, టొబోగో, సురినార్‌ దేశాలలో చదువుతున్న 18 నుంచి 35 ఏళ్లలోపు విద్యార్థులలో ఐదుగురిని ఎంపిక చేసి.. మొత్తం 40 మంది బృందానికి భారతదేశానికి తీసుకురానున్నారు. మొత్తం 40 రోజులపాటు ఇండియాలోనే ఉండేటట్లు ఏర్పాట్లు చేయనున్నారు. వీరికి చారిత్రక, పర్యాటక కేంద్రాల పరిశీలన, గ్రామాల సందర్శన, యోగా, సంస్కృతి-సాంప్రదాయాలు తెలియజేస్తారు. అలాగే వివిధ యూనివర్సిటీ విద్యార్థులతో ముఖాముఖిలు ఏర్పాటు చేస్తారు. ముఖ్యమంత్రి, గవర్నర్‌ వంటి వారితో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి.. పరిపాలన విధానాన్ని వివరించేందుకు కసరత్తు చేస్తున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్ర చారిత్రక నేపథ్యంతో పాటు.. పర్యాటక రంగం బాగా వృద్ధి చెందే అవకాశం ఉందని టూరిజం శాఖ భావిస్తోంది. ఇక అన్ని అనుకూలిస్తే..ఈ కార్యక్రమం సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో కార్యరూపం దాల్చనుంది. 

06:55 - May 13, 2017

ఢిల్లీ : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుకోసం హస్తం పార్టీ సరికొత్త పాలసీతో రంగంలోకి దిగింది.. రెండేళ్ల ముందు నుంచే పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది.. పంజాబ్‌లో విజయవంతమైన ఎల్డీఎమ్మార్సీ ని తెలంగాణతో పాటు కర్ణాటకలో అమలు చేయబోతోంది.. ఎల్డీఎమ్మార్సీ అంటే ఏంటి? ఇప్పుడు చూద్దాం..

త్వరలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి

వరుస ఓటములతో డీలాపడ్డ కాంగ్రెస్‌లో జవసత్వాలు నింపేందుకు ఏకంగా పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీయే రంగంలోకి దిగారు.. పార్టీని ప్రక్షాళనచేయడంపై సీరియస్‌గా దృష్టిపెట్టారు.. దీనిపై ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టిన రాహుల్‌.. త్వరలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలపై ఫోకస్‌ పెట్టారు.. అందులోనూ కాంగ్రెస్‌కు కంచుకోటలుగా ఉన్న రిజర్వ్‌డ్ నియోజకవర్గాల్లో ప్రత్యేక ప్లాన్‌ అమలు చేయబోతున్నారు.. అదే ఎల్డీఎమ్మార్సీ

లీడర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ మిషన్‌ రిజర్వ్‌డ్ కాన్‌స్టిట్యుయన్సీస్‌...

ఎల్డీఎమ్మార్సీ అంటే లీడర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ మిషన్‌ రిజర్వ్‌డ్ కాన్‌స్టిట్యుయన్సీస్‌.. పంజాబ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఈ పాలసీనే అమలుచేసి 33 నియోజకవర్గాలకుగాను 23 స్థానాల్లో విజయం సాధించింది.. ఇప్పుడు తెలంగాణలోనూ ఇదే పాలసీ అమలు చేయాలని తీర్మానించింది..

ఎస్‌సీ, ఎస్‌టీ నియోజకవర్గాల్లో ఎల్డీఎమ్మార్సీ అమలు

గ్రౌండ్‌లెవల్‌నుంచి పార్టీకి లీడర్లను తయారుచేస్తేనే విజయం సాధ్యం.. ఇదే రూల్‌ ఫాలో అవుతున్న కాంగ్రెస్‌.. ప్రధానంగా ఎస్‌సీ, ఎస్‌టీ నియోజకవర్గాల్లో ఎల్డీఎమ్మార్సీ ని అమలు చేయబోతోంది.. నేరుగా ఏఐసీసీ పర్యవేక్షణలో నడిచే ఈ పాలసీకి ఢిల్లీకిచెందిన ప్రసాద్‌ను ప్రతినిధిగా... తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్‌గా ప్రొటోకాల్‌ చైర్మన్‌గా ఉన్న వేణుగోపాల్‌రావును నియమించింది.. పాలసీ అమలులోభాగంగా 31 ఎస్‌సీ, ఎస్‌టీ నియోజకవర్గాల్లో పార్టీ తమపని మొదలుపెట్టింది.. ఇందులోభాగంగా ప్రతి నియోజకవర్గంనుంచి పదిమందిని ఎంపిక చేసింది.. అలా సెలక్టయిన 310మందికి ఢిల్లీలో రెండురోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు.. వీరికి రాహుల్‌గాంధీకూడా పాఠాలు చెప్పనున్నారు..

నియోజకవర్గంలో టీం లీడర్ల పర్యటన...

ఢిల్లీలో శిక్షణ తర్వాత ఈ కాంగ్రెస్‌ టీం లీడర్లు నియోజకవర్గంలో పర్యటిస్తారు.. పార్టీకోసం పనిచేసేందుకు ప్రతి గ్రామం నుంచి ఐదునుంచి పదిమందిని ఎంపిక చేస్తారు.. ఈ టీం మొత్తం ఆ నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థికి పూర్తి సహాకారం అందిస్తుంది.. నియోజకవర్గంలో ఏ అభ్యర్థి బలాలు ఎలా ఉన్నాయి? ప్రస్తుతం ఉన్న ఇంచార్జీలపై అనుకూలత, వ్యతిరేకతపై ఎప్పటికప్పుడు అధిష్ఠానానికి నివేదిక ఇవ్వనుంది..

ఎల్డీఎమ్మార్సీ కి ఆర్థికంగా సహకారం అందించనున్న పార్టీ

క్షేత్రస్థాయినుంచి లీడర్లను తయారుచేసే ఎల్డీఎమ్మార్సీ కార్యక్రమానికి పార్టీయే ఆర్థికంగా సహకారం అందిస్తుంది.. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థికీ డబ్బు సర్దుబాటు చేస్తుంది.. ఈ విధానాన్ని తెలంగాణ, కర్ణాటకలో ప్రారంభించిన హస్తంపార్టీ.. పకడ్బందీగా అమలుచేసేందుకు ప్రయత్నిస్తోంది... మొత్తానికి ఓ కొత్త పాలసీని అమలు చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ... ఇందులో ఎంతవరకు విజయవంతమవుతుందో వేచిచూడాలి.. 

06:47 - May 13, 2017

వనపర్తి : కొత్తకోట మండలం పాలెం జాతీయ రహదారిపై బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతులు మోజెర్ల గ్రామానికి చెందిన రాములు, బాల్‌రెడ్డిగా గుర్తించారు. మరో వ్యక్తి రామకృష్ణకు తీవ్రగాయాలు కావడంతో.. ఆస్పత్రికి తరలించారు. రాత్రి డ్యూటీ ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.

 

రాబోయే కాలంలో ఎన్నికలు వివిప్యాట్‌ల ద్వారానే: ఈసీ

ఢిల్లీ: ఈవీఎంల వివాదంపై కేంద్ర ఎన్నికల సంఘం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈవీఎంలపై ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయరని...బ్యాలెట్‌ పత్రాలు వినియోగించాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. ఎవరైనా సరే... దమ్ముంటే ఈవీఎంను హ్యాకింగ్‌ చేయడం లేదా ట్యాంపరింగ్‌ చేసి చూపించాలని ఈసీ సవాల్‌ విసిరింది. రాబోయే కాలంలో ఎన్నికలు వివిప్యాట్‌ల ద్వారానే నిర్వహిస్తామని పేర్కొంది. 

06:44 - May 13, 2017

ఢిల్లీ : ఈవీఎం మిషన్లలో ట్యాంపరింగ్‌ జరుగుతోందంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై సందేహాలను నివృత్తి చేసేందుకు ఎన్నికల కమిషన్‌ ఢిల్లీలో అఖిలపక్ష భేటీని నిర్వహించింది. ఈ సమావేశానికి ఏడు జాతీయ పార్టీలతో పాటు 48 ప్రాంతీయ పార్టీలకు చెందిన 55 మంది రాజకీయ ప్రతినిధులు హాజరయ్యారు.

బ్యాలెట్‌ పత్రాలను ఉపయోగించాలని విపక్షాలు డిమాండ్‌ ...

ఈవీఎంలపై ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయారని..అందువల్ల బ్యాలెట్‌ పత్రాలను ఉపయోగించాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి.

విపక్షాల వాదనపై స్పందించిన ఈసీ...

విపక్షాల వాదనపై ఎన్నికల కమిషన్ స్పందించింది. ఈవీఎంలలో ఎలాంటి టాంపరింగ్‌ జరిగే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఈవిఎం భద్రతకు సంబంధించి అధికారులు ప్రజెంటేషన్‌ కూడా ఇచ్చారు. ఈ నెలాఖరులో ఓపెన్ చాలెంజ్ నిర్వహిస్తామని, అందులో ఎవరైనా సరే తాము ఎన్నికల్లో ఉపయోగిస్తున్న ఈవీఎంలను హ్యాకింగ్‌ చేయడమో లేదా ట్యాంపరింగ్‌ చేసి చూపించాలని విపక్షాలకు ఈసీ సవాల్‌ విసిరింది. 2019 లోక్‌సభ ఎన్నికల నాటికి వివిప్యాట్‌ వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని ఈసీ తెలిపింది. ఈ వ్యవస్థ ద్వారా ఓటరు ఈవీఎం బటన్‌ నొక్కగానే రిసిప్ట్‌ వస్తుంది.

ఈసీని కలిసి ఓ విజ్ఞాపన ...

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంలు ట్యాంపరింగ్‌కు గురవుతున్నాయని విపక్షాలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆప్‌, ఎస్పీ, బిఎస్పీ ఈ అంశాన్ని లేవనెత్తాయి. ఈవీఎంల స్థానంలో తిరిగి బ్యాలెట్ పేపర్లను ఉపయోగించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే 16 పార్టీల విపక్ష నేతల బృందం ఈసీని కలిసి ఓ విజ్ఞాపన కూడా అం‍దజేసింది.

06:33 - May 13, 2017

Don't Miss