Activities calendar

14 May 2017

21:31 - May 14, 2017

ఢిల్లీ : ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మరోసారి కలకలం రేపారు. ట్రంప్ జారీ చేస్తున్న యుద్ధ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ.. బాలిస్టిక్ మిసైల్ ప్రయోగించారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం ఐదున్నర గంటల సమయంలో ఓ బాలిస్టిక్ మిసైల్‌ లాంచ్ చేశారు. 450 మైళ్లు ప్రయాణించిన మిసైల్ జపాన్, రష్యా సముద్ర తీరంలో కూలింది. దక్షిణకొరియాకు నూతన అధ్యక్షుడుగా ఎన్నికైన మూన్‌పై ఒత్తిడి పెంచేందుకే ఈ చర్య తీసుకున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రయోగం అనంతరం... మూన్.. తన నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సభ్యుతో అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ పరిణామాలపై చైనా, రష్యాలు ఎలాంటి ప్రకటన చేయలేదు.

21:29 - May 14, 2017

ఢిల్లీ : ముంబై దాడుల మాస్టర్‌ మైండ్.. జమాతుద్ ద‌వా చీఫ్ హ‌ఫీజ్ స‌యీద్‌.. జిహాద్ పేరుతో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నాడ‌ని పాకిస్థాన్ ఆరోపించింది. ఈ కారణంతోనే... అత‌నితో పాటు న‌లుగురు స‌హ‌చ‌రుల‌ను అందుకే నిర్బంధించామ‌ని ప్రకటించింది. దీనిపై విచార‌ణ జ‌రుపుతున్న బోర్డు ముందు స‌యీద్ హాజ‌ర‌య్యాడు. క‌శ్మీరీల త‌ర‌ఫున తాను పోరాడుతున్నందుకే పాక్ త‌న‌ను అదుపులోకి తీసుకుంద‌ని తెలిపాడు. అయితే పాక్ ప్రభుత్వం అత‌ని వాద‌నను తోసిపుచ్చింది. జిహాద్ పేరుతో ఉగ్రవాదాన్ని వ్యాపింప‌జేస్తున్నాడ‌నే అత‌న్ని అదుపులోకి తీసుకున్నట్లు.. బోర్డు సభ్యులకు తెలిపింది. దీనిపై రేపు కూడా విచార‌ణ జ‌రుపుతామ‌న్న బోర్డు.. అటార్నీ జ‌న‌ర‌ల్ కూడా హాజ‌రు కావాల‌ని స్పష్టం చేసింది. హఫీజ్‌ ఈ ఏడాది జనవరి 30 నుంచి గృహనిర్బంధంలో ఉన్నాడు.

21:28 - May 14, 2017

ఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా మరో సైబర్ దాడి జరగనుందని హెచ్చరిస్తున్నారు సాఫ్ట్‌వేర్ నిపుణులు. ఈ దాడి సోమవారమే జరిగే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. పాత మాల్‌వేర్‌ కోడింగ్‌లో స్వల్పమార్పులతో మళ్లీ దాడి జరిగే అవకాశముంది. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న రామ్సమ్‌వేర్‌ దుష్పరిణామాన్ని తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ఇప్పుడు మరో దాడిని ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. నిన్న జరిగిన వాన్నక్రై ప్రభావాన్ని తగ్గించామని.. కానీ రాబోయే వైరస్‌ను ఎదుర్కోవటం కష్టమని భావిస్తున్నారు. నిన్న జరిగిన దాడితో.. హ్యాకర్లు బాధితుల నుంచి 300 డాలర్ల వరకు డిమాండ్‌ చేశారు.

21:26 - May 14, 2017
21:25 - May 14, 2017
21:24 - May 14, 2017

విజయవాడ : నాన్నంటే కూతురికి కొండంత అండ. . కూతురంటే నాన్నకు బాధ్యత. అలాంటిది ఓ కూతురికి రాకూడని కష్టం వచ్చింది. అయినా ఓ తండ్రి మనసు కరగలేదు. తనను బ్రతికించమని వేడుకున్నా ఆ తండ్రికి వినబడలేదు. విజయవాడ భూకబ్జా కేసులో క్యాన్సర్ బాధిత చిన్నారి సాయిశ్రీ మరణం అందరినీ కలచివేస్తోంది. నన్ను బ్రతికించు నాన్నా.. అంటూ తండ్రికి కడసారి ఆమె పంపిన వీడియో చూస్తే అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఆమె మాటలు విన్న ఆ తండ్రి గుండె కరిగిందో? లేదో? తెలియలేదు కానీ.. అలసిపోయిన చిన్నారి సాయిశ్రీ గుండె మాత్రం ఆగిపోయింది. నన్ను బ్రతికించు నాన్నా... ఏ కూతురు ఏ తండ్రిని అడగని కోరిక ఇది. విజయవాడ భూకబ్జా కేసులో క్యాన్సర్ బాధిత చిన్నారి సాయిశ్రీ చివరిసారిగా తండ్రికి పంపిన వీడియోలో కోరిన కోరిక ఇది. తనకు స్కూల్ కి వెళ్లాలని ఉందని.. ఫ్రెండ్స్ తో ఆడుకోవాలని ఉందని ఆ వీడియోలో ఆశగా చెప్పింది. ఆ తండ్రి మనసు కరగలేదు కానీ.. మృత్యువుతో పోరాడి అలసిపోయిన సాయిశ్రీ శాశ్వత నిదురలోకి వెళ్లిపోయింది.

15 ఏళ్ల క్రితం..
విజయవాడకు చెందిన సుమశ్రీ.. కృష్ణలంకకు చెందిన రౌడీషీటర్ మాదంశెట్టి శివకుమార్ కు 15 ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరి కుమార్తె సాయిశ్రీ. మనస్పర్థల కారణంగా భార్యాభర్తలు విడిపోయారు. అయితే శివకుమార్ కూతురు సాయిశ్రీ కోసం సిటీలోని దుర్గాపురంలో ఒక ఇల్లు కొనిచ్చాడు. ఆ ఇంటిని అద్దెకు ఇచ్చిన సుమశ్రీ కూతురితో పాటు హైదరాబాద్ లో తన పేరెంట్స్ దగ్గర ఉంటోంది. అయితే సాయిశ్రీ కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతోంది. కూతురి ట్రీట్ మెంట్ కి డబ్బులు సరిపోక సుమశ్రీ భర్త ఇచ్చిన ఇంటిని విక్రయించాలని విజయవాడకు వచ్చింది. అప్పుడు తెలిసొచ్చింది తన ఇల్లు కబ్జా అయిందని. అది కూడా ఎమ్మెల్యే అనుచరులే కబ్జాకోరులని. దీంతో సుమశ్రీ హతాశురాలైంది. క్యాన్సర్‌తో బాధపడుతున్న కూతురితో పాటు తన ఇంటిముందే ఆందోళనకు దిగింది. కొన్నిరోజులుగా ఇంటి బయటనే కూతురితో పాటు నరకయాతన అనుభవించింది. సాయిశ్రీ ఆరోగ్యం మరింత విషమించడంతో ఈరోజు మరణించింది. మదర్స్ డే రోజు తల్లి సుమశ్రీకి కొండంత విషాదాన్ని నింపింది. తన భర్త నిర్లక్ష్యమే తన కూతురు మరణానికి కారణమని.. కఠినాత్ముడైన తన భర్తకు శిక్ష పడాలని సుమశ్రీ అంటోంది. ఓ వైపు కర్కశుడైన తండ్రి.. మరోవైపు అరకొరా వైద్యంతో చిన్నారి సాయిశ్రీ ప్రాణాలు కోల్పోయింది.

21:21 - May 14, 2017

వరంగల్ : కాసేపట్లో పెళ్లి.. కల్యాణ మండపమంతా వచ్చిపోయే వారితో కళకళలాడుతోంది.. మహూర్తం దగ్గరకు వచ్చేసింది.. ఇక వధూవరులు రావడమే ఆలస్యం.. ఇంతలో పెళ్లికూతురుకు వచ్చిన ఓ మెసేజ్‌ అందరినీ షాక్‌కు గురిచేసింది.. పీటలదాకావచ్చిన పెళ్లి ఆగిపోయేలా చేసింది. ఒక అమ్మాయితో ప్రేమాయణం నడిపి మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడో వరుడు.. చివరినిమిషంలో ఈ విషయం తెలుసుకున్న వధువు తల్లిదండ్రులు వివాహాన్ని ఆపేశారు.... విజయవాడకు చెందిన భరత్‌ శ్రీనివాస్‌కు, వరంగల్‌ మట్టెవాడకు చెందిన యువతితో వివాహం కుదిరింది.. శనివారం రాత్రి పదకొండున్నర గంటలకు ముహూర్తం పెట్టుకున్నారు. పెళ్లికి గంట ముందు వధువుకు వాట్సప్‌లో ఓ మెసేజ్‌ వచ్చింది.. భరత్‌ శ్రీనివాస్‌ తనతో ఐదేళ్లు సహజీవనం చేశాడంటూ పెళ్లికొడుకు లవర్‌ వధువుకు మెసేజ్‌ పంపింది.. దీంతో వధువు తల్లిదండ్రులు విషయం ఏంటా అని ఆరాతీశారు. అన్ని వివరాలు తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అటు వధువు బంధువులు భరత్‌ శ్రీనివాస్‌ను ఈ విషయంపై నిలదీశారు. తలాతోకాలేని సమాధానం చెప్పిన పెళ్లికొడుక్కి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. వరుడిపై చీటింగ్ కేసు నమోదుచేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లికిముందు కట్నంగా 15లక్షల రూపాయల కట్నం, కొన్న సామాన్లను ఇచ్చామని వాటిని తిరిగి ఇప్పించాలని పెళ్లికూతురు తల్లిదండ్రులు పోలీసుల్ని కోరుతున్నారు. దీంతో పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు మహూర్తం సమయానికి జైలుపాలయ్యాడు.

21:18 - May 14, 2017

హైదరాబాద్ : ఎన్ని ఆటంకాలు ఎదురైనా అనంతపురం జిల్లా నుంచి పోటీ చేయడం ఖాయమని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. త్వరలో అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేస్తానని ప్రకటించిన జనసేనాని ప్రజాసమస్యల కోసం అవసరమైతే సినిమాల్ని మానేస్తానని ప్రకటించారు. జనసేన సైనికులతో ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ సమావేశమయ్యారు. జనసేన పార్టీ కోసం స్పీకర్లు, కంటెంట్‌ రైటర్లు, అనలిస్టులుగా సేవలు అందించేందుకు అనంతపురం జిల్లా నుంచి వచ్చిన దాదాపు 150మందితో భేటీ అయ్యారు.. ఈ ప్రతినిధులంతా తమ ప్రాంతాల్లోని సమస్యలను పవన్‌కు వివరించారు... సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరినీ పేరు పేరునా పలకరించిన పవర్‌స్టార్... ఉద్వేగభరితంగా వారు చేసిన ప్రసంగాలను విన్నారు.

తుది శ్వాసవరకూ..
తుది శ్వాసవరకూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తానని గబ్బర్‌ సింగ్ స్పష్టంచేశారు. తనను కొందరు పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిని కాదని విమర్శిస్తున్నారనీ, అసలు పూర్తిస్థాయి రాజకీయ నాయకులు ఎవరున్నారో తెలియజేయాలని ఫైర్ అయ్యారు. ఒక్కో నాయకుడు వేల కోట్ల ఆదాయాన్ని రాజకీయాల్లో సంపాదించి ఇంట్లో కూర్చున్నారని ఆరోపించారు. తాను మాత్రం తన కుటుంబం కోసం, తనపై ఆధారపడిన సిబ్బంది కోసమే సినిమాల్లో నటిస్తున్నానని స్పష్టం చేశారు.. తనకు సినిమాలన్నా, సినీ పరిశ్రమ అన్నా అపారమైన గౌరవం ఉందని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే సినిమాల్లో నటించడం మానేస్తానని తెలిపారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా తాను అనంతపురం జిల్లా నుంచి పోటీచేయడం ఖాయమని పవన్‌ చెప్పారు. అనంతపురంలో నిర్వహించిన జనసేన శిబిరంలో పాల్గొన్న వారందరినీ కలిసేందుకు కొద్ది రోజుల్లో జిల్లాకు వస్తానని చెప్పారు. త్వరలో అనంత జిల్లాలో పాదయాత్ర చేస్తానని పవన్‌ చెప్పడంతో ప్రతినిధులంతా ఆనందం వ్యక్తంచేశారు.

21:15 - May 14, 2017

హైదరాబాద్ : ధర్నాచౌక్‌ ఉద్యమం ఉధృతమవుతోంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఖరిపై విపక్షాలు, ప్రజాసంఘాలు సమరంశంఖం పూరించాయి. సోమవారం చలో ఇందిరాపార్క్‌ కార్యక్రమానికి కదులుతున్నాయి. మరోవైపు విపక్షాలను ఎలాగైనా అడ్డుకోడానికి ప్రభుత్వం రెడీ అయింది. పెద్ద ఎత్తున పోలీసు బలగాలను రంగంలోకి దించింది. ఇందిరాపార్క్‌ పరిసరాలు పోలీసు క్యాంపును తలపిస్తోంది. ధర్నా చౌక్ పరిరక్షణకోసం ఉద్యమిస్తున్న విపక్షపార్టీలు ప్రభుత్వ మొండి వైఖరిపై తాడోపేడో తేల్చుకోడానికి సిద్ధం అయ్యాయి. చలో ఇందిరాపార్క్‌ కార్యక్రమానికి పిలుపు నిచ్చాయి. వామపక్షాలు , టీజేయేసీ , కాంగ్రెస్ ,బీజేపీ ,టీడీపీలు ఉద్యమబాట పట్టాయి. అటు జనసేన, ఆప్, లోక్ సత్తాతో పాటు పలు విద్యార్థి, యువజన, రైతు సంఘాలు నిరసనగళం విప్పాయి. వ్యవసాయ కార్మికులు, మహిళా సంఘాలు, దళిత సంఘాలు కూడా ఉద్యమానికి కదులుతున్నాయి. అటు కవులు, కళాకారులు, భూ నిర్వాసితులు, స్వాతంత్ర సమరయోధులు, ట్రాన్స్ జెండర్‌ సంఘాలు కూడా చలో ఇందిరాపార్క్‌ అంటున్నాయి.


సీపీఐ కార్యాలయంలో...
మరోవైపు ధర్నాచౌక్‌ పరిరక్షణ కోసం హైదరాబాద్‌ సీపీఐ కార్యాలయంలో నెలరోజులుగా కొనసాగిన దీక్షలు ఆదివారం ముగిశాయి. ఈసందర్భంగా గన్ పార్కు వద్ద విపక్షాల నేతలు మౌన దీక్ష నిర్వహించారు. అనంతరం డీజీపీకి వినతి పత్రం సమర్పించారు . ధర్నా చౌక్ పునరుద్దరణ న్యాయమైన డిమాండ్ అని.. అది అక్కడే కొనసాగాలని టీజేఏసీ చైర్మన్‌ కోదండరామ్ అన్నారు. అటు విపక్షాల చలో ఇందిరాపార్క్‌ కార్యక్రమానికి మేథావులు నుంచి కూడా మద్దతు లభిస్తోంది. బలవంతంగా ప్రజాఉద్యమాలను అణచడం నియంతృత్వమే అన్నారు ప్రొఫెసర్‌ హరగోపాల్‌. ఎటువంటి నిరసనలు, ఉద్యమాలు లేకుండా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందా అని హరగోపాల్‌ ప్రశ్నించారు. ధర్నాచౌక్‌ జరిపి తీరుతామని విపక్షాలు తేల్చి చెబుతుంటే.. ఇందిరాపార్క్‌ పరిసరాలను పోలీసులు బలగాలు దిగ్బంధించాయి. పార్క్‌ పరిసరాలతో పాటు అశోక్‌నగర్‌, ఆర్టీసీ ఆక్రాస్‌రోడ్స్‌, సుందరయ్య విజ్జానకేంద్రం, కూడళ్లలో పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు విధించినా వెనక్కి తగ్గిది లేదని విపక్షాలు తేల్చి చెబుతున్నాయి.

గురుకుల ఉపాధ్యాయ ప్రాథమిక పరీక్ష కేంద్రాలు..

హైదరాబాద్ : ఏడు జిల్లాలో గురుకుల ఉపాధ్యాయ ప్రాథమిక పరీక్ష నిర్వహించనున్నారు. హైదరాబాద్ తో పాటు 6 జిల్లాల్లో నిర్వహించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, మంచిర్యాలలో గురుకుల ఉపాధ్యాయ ప్రాథమిక పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు రేపటిలోగా ఆన్ లైన్ లో జిల్లా కేంద్రాలను ఎంచుకోవాలని సూచించారు. ఈనెల 15 తరువాత పరీక్ష కేంద్రాల ఎంపిక ఉంటుందని, మార్పునకు అవకాశం ఉండదని సూచించారు.

ప్రతొక్కరూ చదువుకోవాలి - మంత్రి హరీష్ రావు..

సిద్ధిపేట : ముస్లింలలో పేదరికాన్ని నిర్మూలించాలంటే ప్రతి ఒక్కరినీ చదివించాలని మంత్రి హరీష్ రావు సూచించారు. కుట్టుమిషన్లు సద్వినియోగం చేసుకోవాలని, అమ్ముకోవద్దన్నారు. దేశంలో ఏ సీఎం పనిచేయని విధంగా ముస్లిం కోసం 200 గురుకులాలను ఏర్పాటు చేశారన్నారు. సిద్ధిపేటలో తాగునీటి సమస్య లేకుండా చేశామన్నారు. త్వరలో ప్రశాంత్ నగర్ లో ఇంటింటికి తాగునీరందిస్తామన్నారు.

 

నగరంలో రెండు భారీ ఫ్లై ఓవర్లు - మంత్రి కేటీఆర్..

హైదరాబాద్ : రెండు భారీ ఫ్లై ఓవర్ల పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్, అంబర్ పేట ఫ్లై ఓవర్ పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. రెండు నెలల్లో భూ సేకరణ పనులు పూర్తి చేయాలని, ఉప్పల్ నుండి హైదరాబాద్ కు సులువుగా చేరేలా ఫై ఓవర్లు ఉపయోగపడుతాయన్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ భూ సేకరణ ప్రకటన జారీ చేసిందని, సుమారు రూ. 960 కోట్లతో 6.4 కి.మీ. మేర ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఉప్పల్ నుండి నందనవనం భాగ్యనగర్ వరకు ఎలివేటెడ్ కారిడార్ ను నిర్మిస్తామన్నారు.

20:03 - May 14, 2017
19:34 - May 14, 2017
19:32 - May 14, 2017

విజయవాడ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమల అధిపతులకు తొత్తులుగా మారాయని సీపీఎం ఏపీ కార్యదర్శి మధు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ముత్తూకూరు మండలం పైనాపుపరంలో పరిశ్రమల బాధితులతో మధు మాట్లాడారు. కృష్ణపట్నం పోర్టు, థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు, పామాయిల్‌ కంపెనీలు వెంటనే కాలుష్య నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.. స్థానికులకు ఉద్యోగాలివ్వాలన్నారు.

19:29 - May 14, 2017

విజయవాడ : నాన్న ఇంత కఠినంగా ఉంటారా ? తాను త్వరలోనే చనిపోతానని..ఇళ్లు అమ్మి తనను బతికించాలని..కాపాడాలని ఆ చిన్నారి వేదన ఆ నాన్న మనస్సు కరిగించలేదు. చివరకు ఆ చిన్నారి కన్నుమూసింది. ప్రాణం పోవడానికంటే ముందు ఆ పాప మాట్లాడిన వాట్సాప్‌ వీడియో అందరినీ కంటతడిపెట్టిస్తోంది. వివరాల్లోకి వెళితే.. మాదంశెట్టి శివకుమార్‌, సుమశ్రీ దంపతులు విడిపోయాడు. మాదంశెట్టి బెంగళూరులో నివాసం ఉంటున్నాడు. ఇతనికి ఎమ్మెల్యే బోండా ఉమతో అండదండలున్నట్లు తెలుస్తోంది. దుర్గాపురంలో ఓ ఇంటిని సాయిశ్రీకి రాసిచ్చాడు. అయితే అనూహ్యంగా సాయి శ్రీకి క్యాన్సర్ వ్యాధి సోకింది. తనకు చికిత్స చేయించాలని వేడుకుంది. వాట్సప్ లో వీడియోలు తీసి పంపించింది. ఇంటిని అమ్మి వచ్చిన డబ్బుతో తనకు వైద్యం చేయించాలని, స్కూల్ కు వెళ్లి ఆడుకోవాలని ఉందని వేడుకుంది. కానీ ఆమె కన్నీళ్లకు ఆ తండ్రి కరగలేదు. చివరకు సాయి శ్రీ కన్నుమూసింది. చిన్నారితోనే అసభ్యకరంగా ప్రవర్తించాడని తల్లి ఆరోపిస్తోంది. దీనిపై తనకు న్యాయం చేయాలని..మాదంశెట్టిని కఠినంగా శిక్షించాలని తల్లి కోరుతోంది.

19:03 - May 14, 2017
18:52 - May 14, 2017

అనంతపురం : పిడుగు ఐదుగురు ప్రాణాలు తీసింది. జిల్లాలోని గుమ్మగట్ట మండలం కలుగోడులో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురవడంతో పలువురు గొర్రెల కాపరులు పాతబడిన బంగ్లాలో తలదాచుకున్నారు. అకస్మాత్తుగా బంగ్లాపై పిడుగు పడడంతో ఐదుగురు అక్కడికక్కడనే మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతి చెందిన కుటుంబీకులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కరీమ్, ఓబన్న, జయన్న, శివన్న, గిరిరెడ్డిలుగా గుర్తించారు.

18:48 - May 14, 2017

విజయనగరం : వన్ టౌన్ పీఎస్ లో ఏసీబీ అధికారులు అకస్మిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో రూ. 3 లక్షలు లంచం తీసుకుంటున్న సీఐ శోభన్‌బాబును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెండ్ గా పట్టుకున్నారు. అనంతరం కేసు నమోదు చేశారు.
మే 5వ తేదీన విజయనగరం పట్టణంలో ప్రదీప్ నగర్ లో ఓ రియల్టర్ కు గురయ్యాడు. ఈ కిడ్నాప్ కు ఇద్దరు కానిస్టేబుల్ సహకరించినట్లు, అనంతరం వారిని సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. కిడ్నాప్ సమయంలో రియల్టర్ చే బలవంతంగా కొన్ని సంతకాలు చేయించుకున్నట్లు సమాచారం. తన భర్తను కిడ్నాప్ చేశారని సతీమణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం ఆస్తులను తిరిగి వెనక్కి ఇప్పించేందుకు విడుదలైన రియల్టర్ తో సీఐ శోభన్ బాబు లంచం డిమాండ్ చేశాడు. రూ. 5లక్షల్లో కొంత డబ్బును ముందుగానే తీసుకున్నాడు. మిగతా డబ్బును ఆదివారం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు సీఐ శోభన్ బాబు చిక్కాడు. అతని నివాసంలో కూడా సోదాలు నిర్వహించగా రూ. 2 లక్షల స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

18:43 - May 14, 2017

విజయవాడ : 'బ్రతకాలని ఉంది.. నన్ను బ్రతికించండి నాన్న’ అంటూ పది రోజుల పాటు అతడి ఇంటికి తిరిగినా కనికరించకపోవడంతో క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న ఆ చిన్నారి చివరకు ప్రాణాలు కోల్పోయింది. ప్రాణం పోవడానికంటే ముందు ఆ పాప మాట్లాడిన వాట్సప్‌ వీడియో అందరినీ కంటతడిపెట్టిస్తోంది.
విజయవాడ భూకబ్జా కేసులో క్యాన్సర్ బాధిత చిన్నారి సాయిశ్రీ మృతి చెందింది. మరణానికి ముందురోజు వాట్సాప్‌లో తండ్రికి సాయిశ్రీ వీడియో పంపింది. తన పేరిట ఉన్న ఇంటిని అమ్మితే వచ్చే డబ్బులతో.. చికిత్స చేయించవచ్చని అందుకు సహకరించాలని కోరింది. దుర్గాపురంలో తమ ఇంటిని ఎమ్మెల్యే బొండా అనుచరులు కబ్జా చేశారంటూ... గత పదిరోజులుగా తల్లి సుమశ్రీతో సాయిశ్రీ కలిసిన ఆందోళన చేస్తోంది.

18:41 - May 14, 2017

నల్గొండ : గ్యాంగ్‌స్టర్‌ నయీం కేసులో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. నయీంతో అంటకాగిన పోలీసు అధికారులపై సస్పెన్షన్‌ వేటు పడటంతో ఇప్పుడు రాజకీయ నాయకులకు టెన్షన్‌ పట్టుకుంది. ఇక తమ వంతు వస్తుందేమోనన్న భయంలో వణికిపోతున్నారు. నయీం సొంత జిల్లా నల్లగొండకు చెందిన నేతల్లో కొందరికి గ్యాంగ్‌స్టర్‌తో సంబంధాలున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఇలాంటి నేతలు ఎక్కువ ఒత్తిడికి గురుతున్నారు. నయీంతో నల్లగొండ జిల్లాకు చెందిన నాయకులతో సంబంధాలపై 10 టీవీ ప్రత్యేక కథనం. గ్యాంగ్‌స్టర్‌ నయీం... మావోయిస్టు ఉద్యమం నుంచి బయటకొచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని విస్తరించాడు. పోలీసులు, రాజకీయ నాయకుల అండదండలతో హత్యలు, సెటిల్‌మెంట్లు, భూకబ్జాల దందాలతో తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఒక దశలో.. ప్రభుత్వ పెద్దలనే శాసించే స్థాయికి ఎదిగాడు. అటువంటి నయీం గత ఏడాది ఆగస్టు 8న షాద్‌నగర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు.
నయీంతో సంబంధాలున్న పోలీసులపై హోం శాఖ చర్యలు తీసుకుంది. ఐదుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్‌ వేటు పడింది. మరో నలుగురి పాత్రపై విచారణకు తెలంగాణ డీజీపీ అనురాగ్‌ శర్మ ఆదేశించారు. ఇంకో 16 మందిపై శాఖాపరమైన చర్యలు తీసుకొంటున్నారు. నయీం డైరీలోని వివరాల అధారంగా పోలీసులపై చర్యలు తీసుకున్నారు. ఇదే క్రమంలో నయీంతో సంబంధాలున్న రాజకీయ నాయకులు కూడా వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.

నయీం డైరీ..
నయీం డైరీలోని వివరాల ఆధారంగా ఇతగాడితో సంబంధాలున్న రాజకీయ నాయకులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కొంతమంది నేతలను సిట్‌ అధికారులు ప్రశ్నించి, ఎవరెవరు ఏ విధంగా సహకరించారన్న అంశాలపై ఆధారాలు సేకరించింది. ఇప్పుడు ప్రభుత్వం అనుమతితో చర్యలకు దిగుతోందన్న ప్రచారం ఊపందుకోవడంతో ఇలాంటి నేతల గండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో గజగజలాడుతున్నారు. ఇటువంటి వారిలో ఇటు అధికార, టీఆర్‌ఎస్‌తోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్‌, టీడీపీ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. కొందరు రాష్ట్ర స్థాయి రాజకీయ నేతలు, ఒక ఎమ్మెల్యే, మరో ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నట్టు చర్చ జరుగుతోంది. ఇక వీరి అరెస్టు తప్పదని వినిపిస్తోంది. దీంతో వీరికి కంటిమీద కునుకు ఉండటంలేదు.

ఎమ్మెల్సీకి సంబంధాలు ?
నయీం ఎన్‌కౌంటర్‌ తర్వాత ఒక వ్యాపారవేత్త ఫిర్యాదుతో ఈ గ్యాంగ్‌స్టర్‌తో అధికార పార్టీ ఎమ్మెల్సీకి ఉన్న సంబంధాలు బయటపడ్డాయి. టీఆర్ఎస్‌కు చెందిన మరో ప్రజాప్రతినిధి రాజకీయ ఎదుగుదలతోపాటు పెళ్లికి కూడా నయీం సహాయ, సహకారాలు అందించినట్టు దర్యాప్తులో తేలింది. భువనగిరి ప్రాంతానికి చెందిన టీఆర్‌ఎస్‌ నేత కూడా నయీం దందాలకు సహకరించినట్టు పోలీసు వర్గాల్లో వినిపిస్తోంది. నయీం అనుచరులపై పీడీ చట్టం కింద కేసు నమోదు చేయడంలో జాప్యం జరగడానికి పోలీసు అధికారులపై ఈ నేత తెచ్చిన ఒత్తిడే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. నయీంతో సంబంధాల వ్యవహారం బయపడిన తర్వాత ఎమ్మెల్సీని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దూరంగా పెట్టినట్టు సమాచారం. ఈ ఎమ్మెల్సీకి మంత్రి జగదీశ్‌రెడ్డి సన్నిహితుడు. మావోయిస్టు మాజీ నేత, టీఆర్‌ఎస్‌ నేత కోనపురి రాములు హత్య కేసులో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ ప్రమేయం ఉన్నట్టు పోలీసు దర్యాప్తులో బయటపడ్డట్లు తెలుస్తోంది.

మరో ఎమ్మెల్యే ?
నల్గొండ జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యేకి కూడా నయీంతో సంబంధాలు ఉన్న అంశం దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. దీంతో ఇతని అరెస్టు కూడా తప్పదని భావిస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో మావోయిస్టులకు కొరియర్‌గా పని చేస్తున్నారంటూ ఒక ఎమ్మెల్యే సోదరుణ్ని పోలీసులు అరెస్టు చేయడం కలకలం సృష్టించింది. దీంతో నయీంతో సంబంధాలున్నాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజా ప్రతినిధుల మదిలో కలవరం ప్రారంభమైంది. గ్యాంగ్‌స్టర్‌ నయీంతో సంబంధాలున్న అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను అరెస్టు చేస్తే జిల్లాలో టీఆర్‌ఎస్‌ ప్రతిష్ఠ మసకబారే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే మరో రెండేళ్లలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో నయీంతో సంబంధాలున్న టీఆర్‌ఎస్‌ నేతలపై ప్రభుత్వం ఎంతవరకు చర్య తీసుకుంటుందన్నది అనుమానమే.

18:36 - May 14, 2017

నల్గొండ : ఆ ఇద్దరూ ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకున్నారు. ఓ అందమైన జీవితం తమకే సొంతమని కలలు కన్నారు. కానీ చివరకు వాళ్ల కథ ప్రశ్నార్థకంగా మిగిలింది. ఊహా లోకంలో విహరించిన ఆ యువతీ యువకులకు.. వాస్తవం చేదు అనుభవాలను మిగిల్చింది. ఇద్దరిలో ఒకరు ఉన్నారో లేదో తెలియదు.. మరొకరు రెండో వారి కోసం చావు దాకా వెళ్లొచ్చారు. మరి ఆ ప్రేమకథ ఏమైంది? నరేశ్, స్వాతి ఇద్దరూ కలిసి చదువుకున్నారు. ప్రేమించుకుని... పెళ్లి చేసుకున్నారు. కానీ పెద్దోళ్ల తీరు వీళ్ల కథను.. ఎన్నో మలుపులు తిప్పింది. కుల రక్కసి వల్ల వీరు విడిపోయారు. ప్రేమికుడు ఉన్నాడో లేడో తెలియని అనుమానాలు తలెత్తుతున్నాయి.

కులాంతర వివాహం..
యాదాద్రి భువనగిరి జిల్లా, ఆత్మకూరు(ఎం) మండలం పల్లెర్లకు చెందిన అంబోజు వెంకటయ్య.. 2001లో జీవనోపాధి కోసం ముంబయికి వలస వెళ్లారు. అయితే వెంకటయ్య తన కొడుకు నరేశ్‌ను.. తాత పెద్ద ఎల్లయ్య వద్ద గ్రామంలోనే వదిలి వెళ్లాడు. డిగ్రీ చదివే సమయంలో.. పక్క గ్రామమైన లింగరాజుపల్లికి చెందిన క్లాస్‌మేట్ తుమ్మల స్వాతి, నరేశ్‌లిద్దరూ ప్రేమించుకున్నారు. 2015లో డిగ్రీ పూర్తయ్యాక.. నరేశ్‌ ముంబయిలోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లాడు. ఇద్దరూ దూరమైనా ప్రేమ మాత్రం కొనసాగింది. మార్చి 16న నల్లగొండ జిల్లా, చిట్యాలలో ఓ శుభకార్యానికి వెళ్లిన నరేశ్‌.. తిరిగెళ్లేటప్పుడు స్వాతిని కూడా వెంట తీసుకెళ్లాడు. మార్చి 25న బాంద్రా కోర్టును ఆశ్రయించి కులాంతర వివాహం చేసుకున్నారు. కోర్టు సూచన మేరకు రక్షణ కోసం అంటాఫిల్‌ సైన్ గోలివాడ పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించారు. దీంతో పోలీసులు వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. మార్చి 26న వారికి నరేశ్‌, స్వాతిలను అప్పగించారు.

ఆత్మకూర్ పీఎస్ ఫిర్యాదు..
అప్పటికే స్వాతి తన తండ్రికి ఫోన్‌లో విషయం చెప్పింది. దీంతో తన కుమార్తెను కిడ్నాప్‌ చేశారంటూ.. ఆత్మకూరు పోలీస్‌ స్టేషన్‌లో నరేశ్‌తో పాటు అతని బంధువులు, స్నేహితులపై స్వాతి తండ్రి శ్రీనివాస రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నరేశ్‌ తండ్రి వెంకటయ్య రామన్నపేట సీఐని ఆశ్రయించి.. వారిద్దరూ మేజర్లని.. పెళ్లి జరిగినట్లు ఉన్న పత్రాలను అందజేశారు. ఆ తర్వాత పోలీసులు.. నరేశ్‌ కుటుంబ సభ్యులను పలు రకాలుగా ఇబ్బంది పెట్టారు. దీంతో ప్రేమ వివాహాన్ని రద్దు చేసుకునేందుకు అంగీకరించి.. ఇరువైపుల పెద్దలు ఎవరి పిల్లలను వారు తీసుకెళ్లారు.

నరేష్ ఏమయ్యాడు ?
కానీ ప్రేమికులిద్దరూ పెద్దలకు తెలియకుండా మళ్లీ కలుసుకున్నారు. ఏప్రిల్ 2న స్వాతి తిరిగి ముంబయి వెళ్లింది. తల్లిదండ్రులకు తెలియకుండా నరేశ్‌.. మొదట వేరే చోట కాపురం పెట్టాడు. 2, 3 రోజుల తరువాత విషయం తెలియడంతో.. నరేశ్‌ తల్లిదండ్రులు వారిని ఇంటికి తీసుకెళ్లారు. ఇంతలో స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డి పెళ్లిని ఒప్పుకుంటామని ఫోన్‌ చేశాడు. ఊరికి రావాలంటూ పదే పదే ఫోన్లు చేశాడు. ఈ నేపథ్యంలోనే నరేశ్‌, స్వాతి మే 2న ముంబయి నుంచి భువనగిరికి బయల్దేరారని నరేశ్‌ తల్లిదండ్రులు చెబుతున్నారు. అయితే భువనగిరి వచ్చినప్పటి నుంచి.. నరేశ్‌ ఏమయ్యాడో తెలియడం లేదని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ఫోన్ స్విచ్చాఫ్..
భువనగిరి వచ్చాక స్వాతిని తండ్రి శ్రీనివాసరెడ్డి.. ఊరికి తీసుకెళ్లాడు. భువనగిరికి వచ్చిన విషయాన్ని.. నరేశ్‌ తన స్నేహితుడికి ఫోన్‌ చేసిచెప్పినట్లు తెలిసింది. అయితే తరువాత నరేశ్‌ ఏమయ్యాడన్నది సస్పెన్స్‌గా మారింది. ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా ఎత్తకపోవడంతో.. స్నేహితుడు నరేశ్‌ తండ్రికి ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. ఆ రోజు రాత్రి 10 గంటల నుంచి మే 3న ఉదయం 11 గంటల వరకు ఫోన్‌ రింగ్ అయ్యిందనీ చెప్పాడు. కానీ ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదని.. తరువాత ఫోన్‌ స్విచ్చాఫ్‌ వస్తోందని కుటుంబ సభ్యులు తెలిపారు.

పోలీసుల పక్షపాతం ?
రెండు రోజులు వెతికిన తరువాత భువనగిరి పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో.. నరేశ్ తండ్రి వెంకటయ్య ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు చేసి 8 రోజులు కావస్తున్నా నరేశ్‌ ఆచూకీ మాత్రం దొరకలేదు. దీంతో ప్రజా సంఘాల నాయకులతో కలిసి.. నరేశ్‌ కుటుంబ సభ్యులు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిశారు. వీళ్లంతా స్వాతి తండ్రి శ్రీనివాస్‌రెడ్డిపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస్‌ రెడ్డిపై గతంలో హత్యానేరం ఆరోపణలు ఉన్నాయి. దీంతో నరేశ్‌ను పరువు హత్య చేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కేవలం కులం తక్కువనే కారణంతోనే.. స్వాతి తండ్రి పెళ్లిని అంగీకరించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసులు కూడా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.

మే 2న ..
మే 2న నరేశ్ చెల్లెలు.. రాత్రి 10 గంటలకు ఫోన్‌ చేసింది. హయత్ నగర్‌లో ఉన్నా.. బాబాయి ఇంటికి వెళ్తున్నా.. మరో 10 నిమిషాల్లో చేరుకుంటానని చెప్పిన మాటలే నరేశ్‌ చివరి మాటలు. ఆ తర్వాత నరేశ్‌ ఏమయ్యాడో తెలియలేదు. నరేశ్‌ ఫోన్‌ సిగ్నల్స్‌ మాత్రం, మౌలాలి, బంజారాహిల్స్‌, సికింద్రాబాద్, నాచారం, చెర్లపల్లిలో తిరిగినట్లు చూపిస్తున్నాయి. చివరకు అడవి ప్రాంతానికి వెళ్లి అక్కడ స్విచ్చాఫ్‌ అయినట్లు ఉంది. మరి నరేశ్‌ను కిడ్నాప్‌ చేశారా.. లేక అటవీ ప్రాంతంలో హత్యా చేశారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

కుల వివక్ష..
పోలీసులు మేజర్లు అయిన నరేశ్‌, స్వాతిల ప్రేమకు రక్షణగా నిలవాల్సింది పోయి.. కుల వివక్షతో వ్యవహరిస్తున్నారని ప్రజా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్వాతి.. తన భర్త ఆచూకీ లభించకపోవడంతో ఇప్పటికే 2 సార్లు ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఏదేమైనా నరేశ్ అదృశ్యం అతని కుటుంబ సభ్యుల్లో తీరని వేదన మిగిల్చింది. నరేశ్ కనిపిస్తే గానీ వారు మామూలు మనుషులయ్యేలా.. పరిస్థితి కనిపించడం లేదు.

చిన్నారి సాయిశ్రీ కన్నుమూత..

విజయవాడ : క్యాన్సర్ తో బాధ పడుతున్న చిన్నారి సాయి శ్రీ మృతి చెందింది. దుర్గాపురంలో తన ఇంటిని ఎమ్మెల్యే బోండా అనుచరులు కబ్జా చేశారని పది రోజులుగా తల్లితో కలిసి సాయిశ్రీ ఆందోళన చేసింది. సాయిశ్రీ తండ్రి మాదంశెట్టి రవికుమార్ రౌడీషీటర్ అని తెలుస్తోంది. కన్నతండ్రే తనను పట్టించుకోవడం లేదని, సరైన వైద్యం చేయించడం లేదని సాయిశ్రీ సెల్ఫీ వీడియోలో తన ఆవేదన వ్యక్తం చేసింది. తన పేరు మీదున్న ఇంటిని అమ్మి తనను బతికించాలని సాయి శ్రీ వేడుకుంది.

18:07 - May 14, 2017

హైదరాబాద్ : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులకు షాకింగ్ న్యూస్ వినిపించారు. ప్రజల కోసం సినిమాలు మానేస్తానని సంచలన ప్రకటన చేశారు. ఇటీవలే ఎంపికయిన జనసైనికులు పవన్ ను కలిశారు. ఈ సందర్భంగా వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవన్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను ఖచ్చితంగా అనంతపురం నుండి పోటీ చేస్తానని చెప్పడంతో 2019 ఎన్నికల్లో పవన్ బరిలో ఉంటారని ఖాయమైంది. అంతేగాకుండా తాను త్వరలోనే అనంతలో పాదయాత్ర చేపడుతానని స్పష్టం చేశారు. తుదిశ్వాస వరకు ప్రజా సమస్యలపై పోరాడుతానని, తనను పూర్తి స్థాయి రాజకీయ నాయకుడు కాదని అంటున్నారని పవన్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పూర్తిస్థాయి నాయకులు ఎవరున్నారని, నాయకులు రూ. కోట్లు సంపాదించుకుని ఇంట్లో కూర్చుకుంటున్నారని తెలిపారు. తనపై ఆధారపడిన వారి కోసమే సినిమాలు చేయడం జరుగుతోందని, అవసరమైతే ప్రజల కోసం సినిమాలు మానేస్తానని సంచలన ప్రకటన చేశారు.

17:57 - May 14, 2017
17:56 - May 14, 2017

పిడుగుపాటుకు గొర్రెల కాపరుల మృతి..

అనంతపురం : గుమ్మగుట్ట మండలం కలుగోడులో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపాటుకు ఐదుగురు గొర్రెల కాపరులు మృతి చెందారు. కరీమ్, ఓబన్న, జయన్న, శివన్న, గిరిరెడ్డిలుగా గుర్తించారు.

పవన్ సంచలన ప్రకటన..

హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఎంపికైన జనసేన సైనికులు కలిశారు. వారి అభిప్రాయాలను పవన్ అడిగి తెలుసుకున్నారు. తుదిశ్వాస వరకు ప్రజా సమస్యలపై పోరాడుతానని, తనను పూర్తి స్థాయి రాజకీయ నాయకుడు కాదని అంటున్నారని పవన్ వ్యాఖ్యానించారు. పర్సఉ్తతం పూర్తిస్థాయి నాయకులు ఎవరున్నారని, నాయకులు రూ. కోట్లు సంపాదించుకుని ఇంట్లో కూర్చుకుంటున్నారని తెలిపారు. తనపై ఆధారపడిన వారి కోసమే సినిమాలు చేయడం జరుగుతోందని, అవసరమైతే ప్రజల కోసం సినిమాలు మానేస్తానని సంచలన ప్రకటన చేశారు. అనంతపురం నుండి తప్పకుండా పోటీ చేయడం జరుగుతుందని, త్వరలోనే అనంతలో పాదయాత్ర చేపడుతానన్నారు.

రుతుపవనాలు వచ్చేశాయి..

ఢిల్లీ : అండమాన్ తీరాలకు రుతుపవనాలు తాకాయి. వారం రోజుల ముందుగానే రుతుపవానాలు ప్రవేశించడం గమనార్హం. రానున్న 48గంటల్లో అండమాన్ దీవుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

16:47 - May 14, 2017

ఢిల్లీ : పాకిస్తాన్‌ మరోసారి బరితెగించింది. మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్‌ ఉల్లంఘించింది. జమ్ము కశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. చింగస్ ప్రాంతం చిత్తి బాక్రి ప్రాంతంలోని 7 గ్రామాలు లక్ష్యంగా పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడ్డారు. భారత బలగాలతో పాటు, పౌర నివాస ప్రాంతాలు లక్ష్యంగా పాక్ రేంజర్లు కాల్పులు జరుపుతున్నారు. అప్రమత్తమైన భారత బలగాలు ఎదురు కాల్పులను ప్రారంభించాయి. సరిహద్దులోని వెయ్యిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

16:39 - May 14, 2017

నిజామాబాద్ : తల్లిదండ్రులు ఎవరో తెలియని అభాగ్యలు వారు. అమ్మా... అన్న కమ్మని పదానికి నోచుకోని అనాథలు. పేగు బంధం దూరమైనా ఆ అభాగ్యులను అక్కున చేర్చుకుని అమ్మలేని లోటును తీర్చుతున్నారు... నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా. డిచ్‌పల్లిలో మానవతా సదన్‌ను ఏర్పాటు చేసి అనాథ బాలలకు ఆశ్రయం కల్పిస్తున్నారు. మదర్స్‌ డే సందర్భంగా మానవతా సదన్‌ మాతృమూర్తిపై 10 టీవీ ప్రత్యేక కథనం..ఇది నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లిలోని మానవతా సదన్‌. ఎందరో అనాథలకు ఆశ్రయం కల్పిస్తోంది. పాడుబడిన పోలీసు స్టేషన్‌ భవనాన్ని అనాథాశ్రమంగా మార్చారు. ఇక్కడకు వచ్చిన బాలలకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ సమాజంలో అందరిలా తలెత్తుకుని తిరిగేలా చేస్తున్నారు నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా. అమ్మా.. అన్న కమ్మని పదానికి నోచుకోని అనాథలు వీరు. ఈ పసిహృదాలకు జిల్లా కలెక్టర్‌ యోగితా రాణానే సర్వస్వం. ఈమెనే అమ్మగా పిలుచుకుని.. తల్లిలేని లోటును తీర్చుకుంటున్నారు. తల్లిలేదన్న భావాన్ని వీరి మనసుల్లో నుంచి తొలగించి, ఈ పసిహృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ప్రత్యేక అనుబంధాన్ని పెంచుకున్నారు.

మానవతా సదన్ లో..
డిచ్‌పల్లి మావనతా సదన్‌లో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో జీవితంలో పైకి వచ్చే విధంగా చేస్తారు. పదవ తరగతిలో మంచి మార్కులు సాధించిన బాలలను కార్పొరేట్‌ కాలేజీల్లో చదివించే ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఎనిమిది నుంచి పదవ తరగతి వరకు బోధన్‌లోని ప్రైవేటు పాఠశాల్లో చదవించే ఏర్పాటు చేశారు. మానవతా సదన్‌లో తమకు ఏ లోటూ లేకుండా చూసుకుంటున్నారని ఇక్కడ ఆశ్రయం పొందుతున్న బాలబాలికలు చెబుతున్నారు. మానవతా సదన్‌ నిర్వహణకు దాతలు సహాయ, సహకారాలు అందిస్తున్నారు. పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ 96 లక్షల రూపాయలు అందచేసింది. మానవతా సదన్‌లో ఆశ్రయం పొందుతున్న బాలల జీవితంలో ఏలోటూ రాకండా చూసుకుంటున్నారు. స్వచ్ఛంద సేవా సంస్థల సహకారంతో బర్త్‌ డేలు నిర్వహిస్తారు. ఉల్లాసంగా జీవించే విధంగా చూస్తారు. అమ్మలేదు అన్న బాధ వీరి ముఖాల్లో కనిపించకుండా చేయడమే మానవతా సదన్‌ లక్ష్యం. జిల్లాలో 21 మనవతా సదనాల ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు పంపిస్తే డిచ్‌పల్లి కేంద్రానికి మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీని నిర్వహణను పరిశీలించిన పాలకులు మరికొన్నింటికి అనుమతించే అవకాశం ఉందన్న అశాభావంతో నిర్వాహకులు ముందుకు సాగుతున్నారు.

16:35 - May 14, 2017

హైదరాబాద్ : పేదవారి అభివృద్ధి కోసం పీపుల్స్ ప్రోగ్రేసివ్‌ ట్రస్టు ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్య. రెసిడెన్షియల్ స్కూల్ లో ప్రవేశాల కోసం ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్ష ప్రశ్నా పత్రాలను ఆయన విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జరుగుతున్న పరీక్షకు అనూహ్య స్పందన వచ్చినట్లు ట్రస్ట్ కోఆర్డినేటర్ డిజి.నర్సింహారావు చెప్పారు. 350 సీట్లకు గానూ 32 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 11 వేల మంది విద్యార్ధులు హాజరైనట్లు ఆయన తెలిపారు.

16:31 - May 14, 2017
16:29 - May 14, 2017

గుంటూరు : వైసీపీ అధినేత జగన్‌.. ప్రధానితో భేటీ నేపథ్యంలో బీజేపీ -టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతోంది. తాజాగా మంత్రి మాణిక్యాలరావుపై మంత్రి అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. విశాఖలో టీడీపీ మహానాడు ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. టీడీపీ తమపై కుట్రచేస్తోందని మంత్రి మాణిక్యాలరావు అనడం ఏంటని ఆయన పశ్నించారు. మంత్రి మాణిక్యాలరావు స్థాయికి తగ్గట్టుగా మాట్లాడాలని మంత్రి అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు.

16:25 - May 14, 2017

వరంగల్ : జిల్లా హన్మకొండలో పీటలపై పెళ్లి ఆగిపోయింది. ఇవాళ వివాహ మహూర్తం ఉండగా... వధువుకు వరుడి లవర్‌ మెసేజ్‌ పంపింది.. ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని అందులో పేర్కొంది. ఈ మెసేజ్‌ చూసిన పెళ్లికూతురు వివాహానికి నిరాకరించింది. వధువు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు వరుడితో పాటు... అతని బంధువులను అదుపులోకి తీసుకున్నారు.

టిడిపి కార్పొరేటర్ పై కేసు నమోదు..

పశ్చిమగోదావరి : ఏలూరు వన్ టౌన్ పీఎస్ లో పదో డివిజన్ టిడిపి కార్పొరేటర్ పసుపులేటి తులరీరాంపై కేసు నమోదు అయ్యింది. తనపై అత్యాచారం చేశాడని ద్వారకా తిరుమల పీఎస్ లో మహిళ ఫిర్యాదు చేసింది. ఏలూరు వన్ టౌన్ పీఎస్ కు బదిలీ చేశారు.

15:31 - May 14, 2017

నిజామాబాద్ : ఎంపీలకు కేంద్రం ఇచ్చే రూ. 5కోట్ల నిధులు నియోజకవర్గ అభివృద్ధికి ఏమాత్రం సరిపోవని పార్లమెంట్‌ సభ్యురాలు కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లా నవీపేట్‌ మండలం పోతంగల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్ని కవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... పలు పథకాలను తెలంగాణ ప్రభుత్వ నిధులతోనే అమలు చేస్తున్నామని ప్రకటించారు.

15:28 - May 14, 2017

హైదరాబాద్ : ధర్నాచౌక్‌ పరిరక్షణకోసం తలపెట్టిన చలో ఇందిరాపార్క్‌ కార్యక్రమానికి ప్రతిపక్షాలు రెడీ అయ్యాయి. వామపక్షాలు, ప్రజాసంఘాలు, టీజేఏసీతోపాటు జనసేన పార్టీకూడా చలో ఇందిరాపార్క్‌కు మద్దతిచ్చాయి. ఈనేపథ్యంలో ఇందిరపార్క్‌ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

15:26 - May 14, 2017

గుంటూరు : జిల్లా మంగళగిరి అంబేద్కర్‌ సెంటర్‌లో ఎమ్మెల్యే ఆర్‌కే రూ. 4లకే భోజనం పథకాన్ని ప్రారంభించారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 12గంటలనుంచి రాజన్న క్యాంటిన్‌లో భోజనం చేయొచ్చని ఆర్‌కే ప్రజలకు సూచించారు. రాష్ట్రంలో అన్నా క్యాంటీన్‌లు పెడతామన్న సీఎం చంద్రబాబు... వెలగపూడిలో తప్ప ఎక్కడా పెట్టలేదని ఆర్‌కే విమర్శించారు.

15:24 - May 14, 2017

విశాఖపట్టణం : హవాలా కేసును సీఐడికి అప్పగించారు. ఏపీ డీజీపీ సాంబశివరావు నుంచి కాసేపటి క్రితమే సీఐడికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో రంగంలోకి దిగిన సీఐడి కేసును పరిశీలిస్తున్నారు. ఇప్పటికే హవాలా కేసులో ప్రధాన నిందితుడు వడ్డీ మహేష్‌ను విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. విశాఖ, శ్రీకాకుళం, కోల్‌కతాలో బోగస్‌ కంపెనీలను గుర్తించారు పోలీసులు. నకిలీ ధృపపత్రాలతో 30 బ్యాంకులకు కుచ్చుటోపి వేసి దాదాపు 650 కోట్ల రూపాయలను విదేశాలకు తరలించాడు మహేష్‌. కోల్‌కతాలో విశా్ఖ పోలీసులు విస్త్రంతగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు కోల్‌కతాలో 43 ఖాతాలను గుర్తించారు.

15:09 - May 14, 2017

ఢిల్లీ : మళ్లీ ఛత్తీస్ గఢ్ అటవీ ప్రాంతం కాల్పులతో దద్దరిల్లింది. మావోస్టులు..పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. గత కొన్ని రోజులుగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కొంత ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. సీఆర్పీఎఫ్ బలగాలు..పోలీసులపై కాల్పులకు తెగబడుతున్న సంగతి తెలిసిందే. దీనితో మావోయిస్టులపై ఉక్కుపాదం మోపాలని కేంద్రం భావిస్తూ అందుకనుగుణంగా చర్యలు తీసుకొంటోంది. తాజాగా ఆదివారం పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. బాసగూడ అటవీ ప్రాంతంలో పోలీసులపైకి మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. దీనితో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఇద్దరు హెడ్ కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్ లకు గాయాలయ్యాయి. హెడ్ కానిస్టేబుల్ రాజు కుడ్మల్, కానిస్టేబుల్ సురేష్ మార్కంలు గుర్తించారు. వీరిని జగదల్ పూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాల్పుల నేపథ్యంలో సమీప గ్రామాల వాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

బాసగూడ అటవీ ప్రాంతంలో కాల్పులు..

ఖమ్మం : ఛత్తీస్ గఢ్ బీజాపూర్ జిల్లా బాసగూడ అటవీ ప్రాంతంలో పోలీసులు - మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇద్దరు పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని జగదల్ పూర్ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో హెడ్ కానిస్టేబుల్ రాజు కుడ్మల్, కానిస్టేబుల్ సురేష్ మార్కంలు గుర్తించారు.

పీటలపై ఆగిన పెళ్లి..

వరంగల్ : హన్మకొండలో పీటలపై పెళ్లి ఆగిపోయింది. వధువు ఫోన్ కు వరుడి లవర్ మేసెజ్ పంపింది. ప్రేమ పేరిట తనను మోసం చేశాడని యువతి మేసేజ్ లో పేర్కొంది. ఆ మేసెజ్ ను చదివిన వధువు పెళ్లికి నిరాకరించింది. సుబేరీది పీఎస్ లో ఫిర్యాదు చేయడంతో వరుడితో పాటు బంధువులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

14:11 - May 14, 2017

చిత్తూరు : సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో శాంతిభద్రతలు క్షీణించాయి. టిడిపి..కాంగ్రెస్ నేతలు ఘర్షణకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘటనలో కుప్పం కాంగ్రెస్ ఇన్ ఛార్జీ సురేష్ కు తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. ఇటీవలే కుప్పం లో 1400 మందికి ఇళ్ల కేటాయింపు జరిగింది. ఈ కేటాయింపుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయనే విమర్శలు వెల్లువెత్తాయి. టిడిపి నేతలు అక్రమాలకు పాల్పడ్డారని, బినామీలకు ఇళ్లను కేటాయించారని కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆరోపణలు గుప్పించారు. దీనిపై తాము బహిరంగ చర్చకు సిద్ధమని కాంగ్రెస్ సవాల్ విసిరింది. గంగమ్మ ఆలయం ఇందుకు వేదికగా నిర్ణయించారు. ఆదివారం ఉదయం టిడిపి..కాంగ్రెస్ నేతలు వందల సంఖ్యలో అక్కడకు వచ్చారు. తొలుత ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తోపులాట..చివరకు ఘర్షణకు దారి తీసింది. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. దీనితో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను శాంతింప చేసే ప్రయత్నం చేశారు. కానీ ప్రయత్నాలు విఫలం కావడంతో పోలీసులు స్వల్ప లాఠీఛార్జీ చేశారు. కుప్పం సర్పంచ్..ఎంపీటీసీ..సర్పంచ్ ఇతరులు బినామీ పేర్లతో ఇళ్లను సొంతం చేసుకున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దీనిపై ఇరుపక్షాల అగ్ర నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 

'ప్రతిపక్ష పార్టీలు లేవు..ముఠా నాయకులే ఉన్నారు'..

ఖమ్మం : కల్లూరు, టేకుపల్లిలో సబ్ స్టేషన్ లకు మంత్రులు జగదీష్ రెడ్డి, తుమ్మలలు శంకుస్థాపన చేశారు. పేద విద్యార్థులకు సన్నబియ్యం పెట్టిన ఘనత కేసీఆర్ దని, తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలు లేవని, ముఠా నాయకులే ఉన్నారని విమర్శించారు.

చీరాలలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు..

ప్రకాశం : చీరాల కనక దుర్గ బార్ అండ్ రెస్టారెంట్ లో క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. 8 సెల్ ఫోన్ లు, రూ. 97వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు.

మార్పు తెచ్చేందుకు మోడీ కృషి - రాంమాధవ్..

ఢిల్లీ : రాజకీయ వ్యవస్థలో మార్పు తెచ్చేందుకు ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారని రాంమాధవ్ వ్యాఖ్యానించారు. ఆయన ఎన్డీటీవీతో మాట్లాడారు.

నర్సీపట్నం సబ్ జైలులో..

విశాఖపట్టణం : నర్సీపట్నం సబ్ జైలులో రామకృష్ణ అనే రిమాండ్ ఖైదీ అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. పోలీసులే కొట్టి చంపారని బంధువులు ఆందోళన చేపట్టారు.

క్రికేట్ లో ఘర్షణ..బాలుడు మృతి..

ముంబై : ధారావీ గాంధీ మైదాన్ లో ఘర్షణ చెలరేగింది. బాలుడిని బ్యాట్ ..వికెట్ తో కొందరు యువకులు కొట్టారు. దీనితో బాలుడు అమీర్ హుస్సేన్ అక్కడికక్కడనే మృతి చెందాడు. పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు.

 

13:28 - May 14, 2017

అనంతపురం : రాయలసీమ జిల్లాలో నెలకొన్న కరవు పరిస్థితులపై ఈనెల 16, 17 తేదీలలో అనంతపురంలో మహాధర్నా చేపడుతున్నట్లు సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు గపూర్‌ తెలిపారు. రైతాంగం తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని విమర్శించారు. రాయలసీమ వ్యాప్తంగా అనేక జిల్లాలలో ఉపాధిహామీ బిల్లులు చెల్లించకపోవడంతో గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం చేశారంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు.

13:26 - May 14, 2017

తిరుమల : టీటీడీ చైర్మన్‌ అభ్యర్థి ఎంపికపైన.. ఉత్కంఠ కొనసాగుతోంది. టీడీపీలో ఈ పదవి కోసం పోటీ తీవ్రంగా పెరిగిపోతోంది. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు ఎంపీలు పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. టీటీడీ చైర్మన్ పదవి అవకాశం ఇవ్వాలని ఎంపీలు రాయపాటి సాంబశివరావు, మురళీ మోహన్‌లు సీఎంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా ఇద్దరు ఎంపీలు వేరు వేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు.

టీటీడీ చైర్మన్‌ పదవీకాలం ముగిసి 20 రోజులు ...

టీటీడీ చైర్మన్‌ పదవీకాలం ముగిసి 20 రోజుల కావస్తున్నా.. కొత్త పాలక వర్గాన్ని సీఎం ఇంకా నియమించలేదు. అమెరికా పర్యటనకు ముందే దీని మీద నిర్ణయం తీసుకుంటారని అందరూ భావించినా.. తాత్కాలికంగా సీఎం దానిని వాయిదా వేశారు. సీఎం యుఎస్‌ పర్యటన ముగించుకొని తిరిగి రావడంతో టీడీపీలోని పెద్దలు.. టీటీడీ చైర్మన్‌ పదవి కోసం తమ లాబీయింగ్‌ను మొదలు పెట్టారు.

చంద్రబాబుతో ఎంపీలు రాయపాటి, మురళీమోహన్‌ భేటీ ....

అమెరికా పర్యటన నుంచి వచ్చిన సీఎం చంద్రబాబుతో ఎంపీలు రాయపాటి సాంబశివరావు, మురళీమోహన్‌లు భేటీ అయ్యారు. ముఖ్యమంత్రితో ఈ ఇరువురు నేతలు టీటీడీ చైర్మన్‌ పదవిపై చర్చించినట్టు తెలుస్తోంది. మరోవైపు టీడీపీ మిత్రపక్షం బీజేపీ కూడా టీటీడీ చైర్మన్‌ పదవి కోసం పట్టు పడుతున్నట్టు తెలుస్తోంది. పార్టీ అధినాయకత్వం ఈ విషయంపైన సీఎం చంద్రబాబుతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

ముఖ్యమంత్రితో భేటీ తరువాత ఎంపీలు మురళీమోహన్‌, రాయపాటి.

మరోవైపు ముఖ్యమంత్రితో భేటీ తరువాత ఎంపీలు మురళీమోహన్‌, రాయపాటి.. తిరుమలేశుని సేవ చేయటం అదృష్టమని.. ఎప్పటి నుంచో దానికోసం ఎదురు చూస్తున్నామని చెప్పుకొచ్చారు. అంతేకాదు టీటీడీ చైర్మన్‌గా పని చేయాలనేది తన చిన్న నాటి కోరికని.. చైర్మన్‌ ఎంపికపైన సీఎంపై ఒత్తిళ్లు ఉన్న మాట వాస్తవమేనని మురళీమోహన్‌ తెలిపారు.

ఈ పదవి కట్టబెడతారనే అంశం ఇప్పుడు అందరిలో..

చంద్రబాబు ఎవరికి ఈ పదవి కట్టబెడతారనే అంశం ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరి చంద్రబాబు ఎంపీలలో ఎవరో ఒకరికి ఇస్తారా.. లేదంటే బీజేపీ ప్రయత్నాలు చేస్తుందనే ఊహాగానాలను నిజం చేస్తారో చూడాలి.

13:24 - May 14, 2017

ఆదిలాబాద్‌ :కాగజ్‌నగర్‌లో దారణ హత్య జరిగింది. నిద్రిస్తున్న బావమరిదిపై బావ మోహన్‌ కత్తితో గొంతు కోసి చంపేశాడు. కొద్ది రోజులుగా బావ, తన చెల్లెలి మధ్య గొడవలు జరుగుతుండడంతో..బావపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు బావమరిది. దీంతో బామ్మర్థిపై కక్ష పెంచుకున్న బావ మోహన్‌...ఇవాళ తెల్లవారుజామున నిద్రిస్తుండగా..బామ్మర్థిపై కత్తితో గోంతుకోసం చంపేశాడు. అనంతరం పోలీసులకు ఎదుట లొంగిపోయాడు.

కుప్పంలో టీడీపీ- కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ

చిత్తూరు: కుప్పంలో టీడీపీ- కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. హౌసింగ్ అక్రమాలపై ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో పీసీసీ నేత సురేష్ కు గాయాలయ్యాయి.

ధర్నా చౌక్ తరలింపు పై అఖిలపక్షం వేయాలి: ప్రొ.హరగోపాల్

హైదరాబాద్: ధర్నా చౌక్ తరలింపు పై అఖిలపక్షం వేసి అన్ని పార్టీల నిర్ణయం తీసుకోవాలని, ఉద్యమాలను అణిచివేడయం సరికాదని ప్రొ. హరగోపాల్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ధర్నా చౌక్ ని నాగ్ ల్ లో పెట్టుకోమంటే ఇదే టీఆర్ ఎస్ ఉద్యమ పార్టీగా వ్యతిరేకించింది అని హరగోపాల్ గుర్తు చేశారు.

పోలీసుల ఆధీనంలో ధర్నా చౌక్

హైదరాబాద్: ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నారు. ఇందిరా పార్క్ వద్ద బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. ధర్నా చౌక్ తరలింపునకు వ్యతిరేకంగా పలు ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు రేపు చలో ధర్నా చౌక్ కార్యక్రమాన్ని చేపట్టాయి.

ఆప్ ఈసీకి తప్పుడు బ్యాంక్ డిక్లరేషన్ సమర్పించింది: కపిల్ మిశ్రా

ఢిల్లీ : కేజ్రీవాల్ అవినీతి ఆరోపణలపై కమిల్ మిత్ర ప్రెస్ మీట్ పెట్టారు. సీఎం కేజ్రీవాల్ పై ఆరోపణలు చేస్తూ కపిల్ మిశ్రా స్పృహ తప్పి పడిపోయారు. కేజ్రీవాల్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేజ్రీవాల్ అవినీతి పై సీపీబీఐకి మరిన్ని ఆధారాలు సమర్పిస్తాం అని, ఆప్ ఈసీకి తప్పుడు బ్యాంక్ డిక్లరేషన్ సమర్పించిందని తెలిపారు. ఈసీకి ఫేక్ డొనేషన్స వివరాలను అందించిందని కపిల్ తెలిపారు. 16 సెల్ కంపెనీలు స్థాపించి మూడేళ్లుగా బ్లాక్ మనీని, దానికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర వున్నాయన్నారు.

12:46 - May 14, 2017

హైదరాబాద్: సమాజం బాగుపడాలంటే మంచి సాహిత్యం రావాలి. ప్రజలను చైతన్య పరిచే సాహిత్యాన్ని ఎందరో రచయితలు సృష్టిస్తున్నారు. ప్రజా ఉద్యమాల్లో కవులు, కళాకరుల పాత్రలను మరువలేము. అలాగే కవిత్వం, గేయాలు ప్రజలకు రసానందాన్ని కలిగిస్తూ ఆలోచింప చేస్తాయి. అలాంటి సాహిత్యాన్ని సృష్టిస్తోన్న కవియిత్రి శైలజా మిత్ర ప్రత్యేక కథనంతో పాటు.. గేయకవి వీరభద్రం జనం పాటతో ఈ వారం మీ ముందుకు వచ్చింది 'టెన్ టివి' 'అక్షరం'. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

12:37 - May 14, 2017

హైదరాబాద్: వేసవి సెలవులు సందర్భంగా...బల్దియా ఈ ఏడాది కూడా వివిధ ప్రాంతాల్లో విద్యార్థులకు సమ్మర్‌ కోచింగ్‌ క్యాంపులు ఏర్పాటు చేసింది. 51 క్రీడాంశాల్లో ఇస్తున్న శిక్షణకు లక్షకుపైగా విద్యార్థులు పాల్గొంటున్నారు. వేసవి శిబిరానికి మంచి రెస్పాన్స్‌ వస్తోందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుతం సమ్మర్‌ క్యాంపుల్లో 2 వేల 65 మంది ...

ప్రస్తుతం సమ్మర్‌ క్యాంపుల్లో 2 వేల 65 మంది పాటు పలువురు సీనియర్‌ కోచ్‌లు కూడా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ఆరు సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలలోపు బాలబాలికలు ఈ శిక్షణ పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ ఇస్తున్న కోచింగ్‌ చాలా ఉపయోగకరంగా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. అతి తక్కువ ఫీజుతో పిల్లలకు మంచి కోచింగ్‌ లభిస్తుందని అంటున్నారు. ఈ సెలవుల్లో బల్దియా ఇస్తున్న ఈ కోచింగ్‌ను ఎంతో ఎంజాయ్ చేస్తున్నామని విద్యార్థులు అంటున్నారు. మంచి శిక్షణ లభిస్తోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

32 లక్షల మంది వివిధ క్రీడాంశాల్లో శిక్షణ..

ఇప్పటి వరకూ బల్దియా నిర్వహించిన ఈ శిబిరాల ద్వారా 32 లక్షల మంది వివిధ క్రీడాంశాల్లో శిక్షణ పొందారు. వీరిలో జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నవారు ఎందరో ఉన్నారు. అజారుద్దీన్‌, పీవీ సింధు కూడా ఇక్కడే తమ ప్రస్థానాన్ని ప్రారంభించారు.

 

12:33 - May 14, 2017

ఖమ్మం: సీఎం కేసీఆర్‌ కుటుంబ రాజకీయాల వల్ల మిర్చి రైతులు నలిగిపోతున్నారని విమర్శించారు టిడిపి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి. మిర్చి రైతులకు న్యాయం చేయాలంటూ ఖమ్మంలో ఒక్కరోజు దీక్ష చేసిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అన్నంపెట్టే రైతులను కేసీఆర్‌ పట్టించుకోవడంలేదని..గిట్టుబాటు ధరలేక రైతులు విలవిలలాడిపోతుంటే స్పందించడంలేదని విమర్శించారు. ఇప్పటివరకు మార్కెటింగ్‌శాఖ మంత్రి మిర్చియార్డు సందర్శించలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. పూర్తి వివరా లకోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

12:26 - May 14, 2017

హైదరాబాద్: అణచివేత ద్వారా ఉద్యమాలు ఆగవని ప్రొ.హరగోపాల్ హెచ్చరించారు. ధర్నా చౌక్ ఎత్తివేతకు నిరసనగా ముగ్ధుం భవన్ లో జరుగుఉన్న నిరసన దీక్షలో ప్రసంగించారు. ఈ సందర్భంగ ఆయన '10టివి'తో మాట్లాడుతూ... నిరసన లను ప్రభుత్వం అణచాలని చూస్తే ప్రజలు మరో మార్గం చేసుకుంటారని తెలిపారు. ఉద్యమాలను అణచి వేయాలనుకున్నా, లేదా బలప్రయోగం చేయాలన్నా ప్రభుత్వాలు రాజకీయ సలహాలు తీసుకుంటారని, లేదా అఖిల పక్షం వేసి చర్చించడం ప్రజాస్వామ్య పద్ధతి అన్నారు. తన నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉండే ప్రజల అభిప్రాయాలను పక్కన పెట్టడం నియంత పాలన అవుతుందన్నారు. గత చరిత్రను మర్చిపోవద్దని, ఉద్యమాలు అణచివేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా అని ప్రశ్నించారు. బలప్రయోగాన్ని ఉపయోగిస్తే హింసను ప్రేరేపించే విధంగా తయారవుతుందన్నారు.

మహానడు వేదిక ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి అయ్యన్న

విశాఖ : ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలో మహానడు వేదిక ఏర్పాట్లను మంత్రి అయ్యన్న పాత్రుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మిత్రపక్షంలో మంత్రిగా ఉన్న మాణిక్యాలరావు బిజెపి పై కుట్ర చేస్తున్నారనడం సరికాదని అన్నారు. అయ్యన్న మంత్రిగా ఉండి బాధ్యతారాహిత్యంగా మాట్లాడున్నారని బిజెపి సహకారంతోనే టిడిపి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తోందని అన్నారు.

చెన్నై లో తొలి భూగర్భ మెట్రో రైలు ప్రారంభం..

తమిళనాడు : చెన్నై లో తొలి భూగర్భ మెట్రో రైలును కేంద్ర మంత్రి వెంకయ్య ప్రారంభించారు. తరుమంగళం నుంచి నెహ్రూ పార్క్ వరకు భూగర్భ మెట్రో లైన్ ఏడున్నర కిలోమీటర్ల మేర భూగర్భ మెట్రో రైలు నడవనుంది.

ఢిల్లీ ముండ్యా ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం...

ఢిల్లీ : ముండ్యా ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 20 పైరింజన్లతో మంటలను అదుపు చేసే ప్రయత్నిస్తున్నారు.

11:33 - May 14, 2017
11:32 - May 14, 2017
11:25 - May 14, 2017

యాదాద్రి భువనగిరి : జిల్లాలో నరేశ్‌ అనే యువకుడి అదృశ్యం కలకలం రేపుతోంది. నరేశ్‌ అనే యువకుడు అగ్రకులానికి చెందిన స్వాతి అనే యువతిని కులాంతర వివాహం చేసుకున్నాడు. ఇది నచ్చని స్వాతి కుటుంబసభ్యులు నరేశ్‌ కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురి చేశారు. ప్రేమ వివాహాన్ని రద్దు చేసుకునేందుకు నరేశ్‌, స్వాతి అంగీకరించారు. అయితే పెద్దలకు తెలియకుండా ప్రేమికులు పారిపోయారు. పెళ్లిని అంగీకరిస్తామని ఊరికి రమ్మని స్వాతి తల్లిదండ్రులు కోరారు. తర్వాత భువనగిరి వచ్చాక నరేశ్‌ ఆచూకీ తెలియడం లేదు. స్వాతి అగ్రకులానికి చెందిన యువతి కావడంతో నరేశ్‌ మిస్సింగ్‌పై అనుమానాలు పెరుగుతున్నాయి. నరేశ్‌ను పరువు హత్య చేశారా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. అమ్మాయి కుటుంబ సభ్యులపై అనుమానం వ్యక్తం చేస్తున్న యువకుడి తల్లిదండ్రులు హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. మరోవైపు భర్త ఆచూకీ తెలియకపోవడంతో స్వాతి రెండు సార్లు ఆత్మహత్యాయత్నం చేసింది. ఎంబీసీ రాష్ట్ర కార్యదర్శి ఆశయ్య మాట్లాడుతూ... ఇప్పటికైనా నరేష్ ఎక్కడ ఉన్నాడో తెలపాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ విషయాన్ని హోంమంత్రి నాయిని దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.

10:47 - May 14, 2017

హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లు ఆలస్యమవుతూ ఇప్పటికే నానా అగచాట్లు పడుతున్న అన్నదాతలపై ప్రకృతి కూడా కత్తి గట్టింది. నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో కురిసిన భారీ వర్షానికి ధాన్యం నీటి పాలవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకునే చోటు లేక.. ఇచ్చే టార్పాలిన్ లు సరిపోక రైతులు ఎదుర్కుంటున్న తీవ్ర ఇబ్బందులపై టెన్ టీవీ ప్రత్యేక కథనం.

నిజామాబాద్ జిల్లాలో...

నిజామాబాద్ జిల్లాలో కురిసిన అకాల వర్షం రైతులకు కన్నీరు మిగిల్చింది. ప్రధానంగా కామారెడ్డి మార్కెట్ యార్డ్ లోనూ, బాన్సువాడ కొనుగోలు కేంద్రాల్లో వేల క్వింటాళ్ల వరి ధాన్యం తడిసి ముద్దైంది. కాలువల్లోకి కొట్టుకుపోయింది. దీంతో చేతికందిన పంట నీటిపాలైదంటూ... రైతులు లబోదిబోమంటున్నారు.

కామారెడ్డి మార్కెట్ యార్డులో పెద్ద మొత్తంలో వరి ధాన్యం

కామారెడ్డి మార్కెట్ యార్డుకు వారం రోజుల నుంచి పెద్ద మొత్తంలో వరి ధాన్యం వస్తోంది. యార్డులో ఎప్పటికప్పుడు కాంటాలు జరగకపోవడంతో రైతులు ధాన్యాన్ని కుప్పలుగా పోసి ఉంచారు. మరికొందరు యార్డు ఆవరణలోనే ధాన్యాన్ని ఆరబెట్టుకున్నారు. ఇదే క్రమంలో వర్షం కురియడంతో ధాన్యం కాస్తా నీటి పాలైంది. మరోవైపు వర్షాలకు ధాన్యం తడవకుండా టార్పాలిన్ లాంటివి అధికారులు అందుబాటులో ఉంచలేదు. దీంతో ఒక్క కామారెడ్డి మార్కెట్ యార్డ్ లో సుమారు 500 క్వింటాళ్లపైనే వరి ధాన్యం తడిసిపోయినట్లు రైతులు చెబుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ఎవరు కొంటారని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ముందుకు వచ్చి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు.. తూకాలను వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు.

 

10:43 - May 14, 2017

విశాఖ: పరవాడ ఫార్మాసిటీ సమీపంలో లారీ ప్రమాదం జరిగింది. కెమికల్‌ లోడుతో వెళ్తున్న లారీ దగ్ధమైంది. లారీలోంచి డ్రైవర్‌, క్లీనర్‌ సురక్షితంగా బయటపడ్డారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పారు.

10:33 - May 14, 2017

ఇందిరా పార్క్ వద్ద వాకర్స్ అసోసియేషన్ ధర్నా

హైదరాబాద్: ఇందిరా పార్క్ వద్ద వాకర్స్ అసోసియేషన్ ధర్నా చేపట్టింది. ధర్నా చౌక్ ఎత్తివేయాలని వాకర్స్ కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు.

పొన్నాపురం రైల్వే ట్రాక్ వద్ద రెండు మృతదేహాలు

కర్నూలు: నంద్యాల మండలం పొన్నాపురం రైల్వే ట్రాక్ వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పరిస్థితి ని సమీక్షిస్తున్నారు.

09:35 - May 14, 2017

7గ్రామాలను టార్గెట్ చేసిన పాక్ బలగాలు!

జమ్మూకశ్మీర్ : రాజౌరీ సెక్టార్ భారత్ -పక్ బలగాలు మోహరించాయి. 2 రోజుల్లో పాక్ బలగాలు మూడోసారి కాల్పులకు తెగబడ్డాయి. 7 గ్రామాలను టార్గెట్ గా పాక్ బలగాలు కాల్పు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

 

బోల్తా కొట్టిన ప్రైవేటు బస్సు...5గురికి గాయాలు..

నల్గొండ: కట్టంగూరు మండలం ఏటిపాముల వద్ద ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై ఏపీ 16 టిఇ 0777 నెంబర్ గల సాయికృష్ణా ట్రావెల్స్ కు చెందిన గరుడా బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 5గురు ప్రయాణీకులకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణీకులు ఉన్నారు.

07:17 - May 14, 2017

హైదరాబాద్: చైనాలోని గాజు స్కైవేపై నడకంటే పెద్దవాళ్లకే గుండెలు అదిరిపోతాయి.. అలాంటిది ఓ బాలుడు ఏమాత్రం టెన్షన్‌లేకుండా ఈ దారిపై బుడి బుడి అడుగులతో సింపుల్‌గా నడిచేశాడు.. పైగా అక్కడినుంచి ముందుకు నడవలేక వణికిపోతూ కూలబడిపోయిన తండ్రికి ధైర్యం చెప్పాడు.. చైనాలో పెద్ద పెద్ద పర్వతాల చుట్టూ కిందనుంచి గాజుపలకలతో ఫుట్‌పాత్‌పై మాదిరిగా స్కైవేలుంటాయి.. వాన్‌షెన్‌ నేషనల్‌ పార్క్‌లోని పర్వతంచుట్టూ ఏర్పాటుచేసిన గాజు స్కైవేపై నడిచేందుకు ఈ తండ్రికొడుకులు వెళ్లారు.. అక్కడికివెళ్లాక కేవలం రెండు అడుగులు మాత్రమే వేసిన తండ్రి అక్కడి నుంచి కిందకు చూసి వణికిపోయాడు.. ఇక తాను ఇంచు కూడా కదలలేనంటూ రాతికి అతుక్కుపోయాడు... ఈ సమయంలో అతడి కుమారుడు ఏం కాదని, తనతో రావాలని చేతిని, కాలును పట్టుకొని లాగుతూ తండ్రికి ధైర్యం చెప్పాడు.

07:15 - May 14, 2017

హైదరాబాద్: ఏ కష్టమొచ్చిందో ఏమోకానీ.. ఓ యువతి ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. రైలు కిందపడి చనిపోవాలనుకుంది. ప్లాట్‌పామ్‌పైకి రైలు వస్తుండడంతో దానికింద పడేందుకు పరుగులు తీసింది. ఇది గమనించిన ఓ వ్యక్తి ఆమెను కాపాడాడు. రైలు కిందపడకుండా అడ్డుకున్నాడు. దీంతో ఆ యువతి ప్రాణాలతో బయటపడింది. చైనాలోని పుటియన్‌ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

 

07:14 - May 14, 2017

హైదరాబాద్: అల్‌ఖైదా మాజీ చీఫ్‌ ఒసామా బిన్‌ లాడెన్‌ హత్యపై ఆయన కుమారుడు హంజా పగతో రగిలిపోతున్నాడు. తన తండ్రి స్థానంలో అల్‌ఖైదా చీఫ్‌గా పగ్గాలు చేపట్టి అమెరికాపై ప్రతీకారం తీర్చుకోవాలని తహతహలాడుతున్నాడు. ఈ విషయాన్ని అమెరికా నిఘాసంస్థ ఎఫ్‌బీఐ మాజీ ఏజెంట్‌ అలీ సౌఫన్‌ తెలిపారు. 2011లో పాకిస్థాన్‌లోని అబొతాబాద్‌లో అమెరికా జరిపిన దాడుల్లో లాడెన్‌ హతమైన విషయం తెలిసిందే. ఆ సమయంలోని కొన్ని లేఖలను స్వాధీనం చేసుకున్నట్లు సౌఫన్‌ అన్నారు. తండ్రి హత్యపై ప్రతీకారం తీర్చుకోవాలని హంజా రాసిన ఉత్తరాల్లో ఉందని పేర్కొన్నారు. 22 ఏళ్ల వయసులో హంజా ఈ లేఖ రాశారు. ఇపుడు హంజా వయసు 28 ఏళ్లు.

07:11 - May 14, 2017

హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా సైబర్‌ దాడి కలకలం సృష్టించింది. రాన్స్‌మ్‌వేర్‌ సైబర్‌ దాడుల్లో సుమారు వంద దేశాల్లోని కంప్యూటర్లు హ్యాకింగ్‌ గురికావడంతో అత్యవసర సేవలు స్తంభించిపోయాయి. బ్రిటన్‌లోని హెల్త్‌ సిస్టం, అమెరికాలో అంతర్జాతీయ కొరియర్‌ సర్వీస్‌ ఫెడెక్స్‌పై తీవ్ర ప్రభావం చూపింది.

రాన్స్‌మ్‌వేర్‌ సైబర్‌ దాడులు..

బ్రిటన్‌, అమెరికా, చైనా, రష్యా, టర్కీ, వియత్నాం, ఫిలిప్పీన్స్‌, జపాన్‌, స్పెయిన్‌, ఇటలీ, తదితర దేశాల్లో రాన్స్‌మ్‌వేర్‌ సైబర్‌ దాడులు జరిగినట్లు సమాచారం. కేవలం పది గంటల వ్యవధిలో 74 దేశాల్లో 45వేల సైబర్‌ దాడులు జరిగినట్లు నిపుణులు గుర్తించారు. సుమారు 60 వేల కంప్యూటర్ల సమాచారాన్ని తస్కరించారు.

బ్రిటన్‌లోని ఆసుపత్రులపై సైబర్‌ దాడి...

తొలుత బ్రిటన్‌లోని ఆసుపత్రులపై సైబర్‌ దాడి జరిగింది. ఇంగ్లాండ్‌లోని నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ సైబర్‌ దాడికి గురై.. చాలా ఆసుపత్రిల్లోని అత్యవసర సేవలు స్తంభించాయి. కంప్యూటర్లు తిరిగి పనిచేయాలంటే డబ్బులు చెల్లించాలన్న సందేశం తెరలపై కనిపించిందని ఆసుపత్రివర్గాలు తెలిపాయి. చేసేదిలేక అత్యవసర సేవలను ఇతర ఆసుపత్రులకు తరలించారు.

వానాక్రై పేరుతో ఈ వైరస్‌ ...

వానాక్రై పేరుతో ఈ వైరస్‌ కంప్యూటర్లకు చొచ్చుకుపోయి క్షణాల్లో వ్యవస్థను స్తంభింపజేస్తుంది. వైరస్‌ ఎంటర్‌ కాగానే కంప్యూటర్లు తిరిగి పనిచేయాలంటే 3 వందల నుంచి 6 వందల డాలర్లు ఇవ్వాలన్న సందేశం తెరపై కనిపిస్తుంది. ఆ వెంటనే ఐటి వ్యవస్థ కుప్పకూలుతుందని నిపుణులు చెబుతున్నారు.

భారత్‌లోనూ...

ప్రపంచ దేశాలతో భారత్‌లోనూ ఈ దాడులు జరిగాయి. దేశవ్యాప్తంగా పలు పోలీస్‌ స్టేషన్లలోని కంప్యూటర్లు హ్యాకింగ్‌కు గురైనట్లు సమాచారం. చిత్తూరు జిల్లాలో 8 పోలీస్‌ స్టేషన్లలోని కంప్యూటర్లు స్తంభించిపోయాయి. కంప్యూటర్లను డీకోడ్‌ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

హ్యాకింగ్‌ టూల్స్‌ను దొంగిలించి సైబర్‌ దాడులకు ...

అత్యంత భద్రత కలిగిన అమెరికా జాతీయ సెక్యూరిటీ సంస్థ ఉపయోగించే హ్యాకింగ్‌ టూల్స్‌ను దొంగిలించి సైబర్‌ దాడులకు పాల్పడడం గమనార్హం. ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద రాన్స్‌మ్‌వేర్‌ సైబర్‌ దాడిగా నిపుణులు పేర్కొన్నారు. ఈమెయిల్‌ ద్వారా మాల్‌వేర్‌ వైరస్‌ ఎపుడైతే కంప్యూటర్లోకి ప్రవేశిస్తుందో ఇక దాన్ని ఆపడం అసాధ్యమని చెబుతున్నారు. ఈ దాడులు ఎవరు చేశారన్నది మాత్రం ఇంతవరకు అంచనాకు రాలేకపోతున్నారు.

07:07 - May 14, 2017

హైదరాబాద్: ఇంటర్ అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ పరీక్షలకు ఒక్క నిముషం ఆలస్యం అయినా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించేది లేదన్నారు తెలంగాణ ఇంటర్ బోర్డు సెక్రటరీ అశోక్. ఈనెల 15 నుంచి జరగబోతున్న ఇంటర్ అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి ఆయన విద్యార్ధులకు పలు సూచనలు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 4 లక్షల 78 వేల 290 మంది విద్యార్ధులు ఈ పరీక్షలు రాయనున్నారు. మొత్తం 872 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 8 గంటల 45 నిమిషాల నుంచి 12 గంటల వరకు ఇంటర్ ఫస్టియర్ మధ్యాహ్నం రెండు యాభై నుంచి ఐదున్నర వరకు సెకండియర్ ఎగ్జామ్ ఉంటుంది. 15 నిముషాల గ్రేస్ పీరియడ్ తరువాత మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది.

ఖమ్మం జిల్లాలో స్వైన్ ఫ్లూతో వ్యక్తి మృతి

ఖమ్మం : నేలకొండపల్లిలో స్వైన్‌ ఫ్లూతో ఓ వృద్ధుడు కన్నుమూశాడు.. కిలాడు నాగభూషణం అనే వ్యక్తి 20రోజులుగా జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నాడు.. స్థానిక ఆస్పత్రిలో చూపించినా ఫలితంలేకపోవడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు.. అక్కడ వ్యాధినిర్ధారణ పరీక్షలు చేసిన వైద్యులు స్వైన్‌ ఫ్లూగా తేల్చారు.. చికిత్స అందించినప్పటికీ నాగభూషణం కోలుకోలేదు.. స్వైన్‌ఫ్లూతో శనివారం మృతిచెందాడు..

07:04 - May 14, 2017

ఖమ్మం : నేలకొండపల్లిలో స్వైన్‌ ఫ్లూతో ఓ వృద్ధుడు కన్నుమూశాడు.. కిలాడు నాగభూషణం అనే వ్యక్తి 20రోజులుగా జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నాడు.. స్థానిక ఆస్పత్రిలో చూపించినా ఫలితంలేకపోవడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు.. అక్కడ వ్యాధినిర్ధారణ పరీక్షలు చేసిన వైద్యులు స్వైన్‌ ఫ్లూగా తేల్చారు.. చికిత్స అందించినప్పటికీ నాగభూషణం కోలుకోలేదు.. స్వైన్‌ఫ్లూతో శనివారం మృతిచెందాడు..

07:03 - May 14, 2017

హైదరాబాద్ : కృష్ణానగర్ లోని ఓ అపార్ట్ మెంట్ లో అడ్వకేట్ రవికుమార్ కొంతకాలంగా నివాసం ఉంటున్నాడు. భార్య పుట్టింటికి వెళ్లడంతో ఒంటరిగా ఉంటున్న రవికుమార్ శుక్రవారం తన గదిలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. గదిలో రక్తపు మరకలు ఉండటంతో అతనిని ఎవరైనా హత్య చేసి ఉంటారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

నందికొట్కూరు నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన రవికుమార్

ఇక 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో రవికుమార్ కర్నూలు జిల్లా నందికొట్కూరు నుండి ఇండిపెండెంట్ అభ్యర్ధిగా పోటీ చేశాడు. తరువాత ఎన్నికల్లో విజయం సాధించిన ఐజయ్యపై కోర్టుకు వెళ్లాడు రవికుమార్. తప్పుడు ఎస్సీ ధృవీకరణ పత్రంతో ఎన్నికల్లో నిలబడి విజయం సాధించాడని ఆరోపిస్తూ కోర్టులో రవికుమార్ వేసిన పిటిషన్ కు ఇటీవలే అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ క్రమంలో హైదరాబాద్ లోని తన గదిలో రవి మృతి చెందడం వెనుక ప్రత్యర్ధుల హస్తం ఏమైనా ఉందా? అనే అనుమానాలు లేకపోలేదు.

రవికుమార్ శుక్రవారం మధ్యాహ్నం చనిపోతే ...

రవికుమార్ శుక్రవారం మధ్యాహ్నం చనిపోతే శనివారం వెలుగులోకి వచ్చింది. రవికుమార్ ఉంటున్న అపార్ట్ మెంట్ వాసులు కిటికీలో నుంచి రవికుమార్ పడిపోయి ఉండటాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రవికుమార్ బ్లడ్ మోషన్స్ తో చనిపోయినట్లు పోలీసులు చెబుతున్న మాట. అయితే అతనికి ఎలాంటి అనారోగ్యం లేదని అతని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఏది ఏమైనా అడ్వకేట్ రవికుమార్ అనుమానాస్పద మృతి కేసులో అతని పోస్టు మార్టం రిపోర్టు ఇప్పుడు కీలకం కానుంది.

కృష్ణానగర్‌లో అడ్వకేట్ రవికుమార్ అనుమానాస్పద మృతి

హైదరాబాద్ : న్యాయవాది రవికుమార్ అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం సృష్టిస్తోంది. రవికుమార్ ఇటీవలే గెలిచిన కేసుకు సంబంధించి ప్రత్యర్థులు ఏమైనా చేశారా? రవికుమార్ శుక్రవారం చనిపోతే శనివారం వరకు ఎవరికీ ఎందుకు తెలియలేదనేది పలు అనుమానాలకు తావిస్తోంది.

07:00 - May 14, 2017

హైదరాబాద్: బీజేపీతో ఎలా వ్యవహరించాలో తేల్చుకోలేకపోతోంది టీఆర్‌ఎస్‌. కేంద్రం నిర్ణయాలకు మద్దతిస్తున్నప్పటికీ.. కొన్ని విషయాల్లో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇక రాష్ట్ర బీజేపీ నేతలు వ్యవహరిస్తున్న తీరును మాత్రం ఎండగడుతూనే ఉంది. కేంద్రంతో ఒకలా.. రాష్ట్ర బీజేపీతో మరోలా వ్యవహరించడంతో టీఆర్‌ఎస్‌ వైఖరి ఎంటి అనే చర్చ మొదలైంది.

ఎన్డీయే భాగస్వామ్య పక్షం కాకపోయినా..

తెలంగాణా రాష్ట్ర సమితి కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే భాగస్వామ్య పక్షం కాకపోయినా.. మూడేళ్లుగా ఆచితూచి వ్యవహరిస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కేంద్రంతో సన్నిహిత సంబంధాలు లేకపోయినా.. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రధాని మోదీతో సాన్నిహిత్యం పెంచుకోగలిగారు. గ్రేటర్ ఎన్నికల అనంతరం గులాబి పార్టీ కేంద్ర ప్రభుత్వంలో చేరుతుందని ఎన్నో ఊహాగానాలు కూడా వినిపించాయి. కానీ అది ఇప్పటివరకైతే కార్యరూపం దాల్చలేదు.

తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించిన బిజెపి...

ఇక ఇటీవల కాలంలో బీజేపీ తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించడంతో గులాబీ పార్టీ నేతలు అప్రమత్తమయ్యారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్లో తప్పులను వెతికే పనిలో పడ్డారు. ఇటీవల మిర్చి పంటకు కేంద్రం ఐదు వేల రూపాయలు మద్దతు ధర ప్రకటించింది. అయితే.. ఈ వ్యవహారం తమ మెడకు చుట్టుకుంటుందని గ్రహించిన టీఆర్‌ఎస్‌ నేతలు.. కేంద్రంపై ఎదురుదాడికి దిగారు. ఇప్పటివరకు మిర్చికి కేంద్రం ఎందుకు మద్దతు ధర ప్రకటించలేదన్న అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. మరోవైపు రాష్ట్ర బీజేపీ నేతలు వ్యవహరిస్తున్న తీరును టీఆర్‌ఎస్‌ పార్టీ ఎండగడుతోంది.

ఇరుపార్టీల్లోని నేతలు ఆరోపణలు, ప్రత్యారోపణలు...

అయితే.. ఇరుపార్టీల్లోని నేతలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నా.. బీజేపీ అగ్రనాయకత్వం, టీఆర్‌ఎస్‌ కీలక నేతలు సైలెంట్‌గా ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఇరు పార్టీల్లోని కీలక నేతలు వ్యూహాత్మకంగానే మౌనం పాటిస్తున్నారన్న వాదన తెరపైకి వస్తోంది.

చౌక్‌ పరిరక్షణకోసం కొనసాగుతున్న నిరసన దీక్షలు

హైదరాబాద్: ధర్నా చౌక్‌ పరిరక్షణ కోసం హైదరాబాద్‌లోని సీపీఐ కార్యాలయంలో నిరసనదీక్షలు కొనసాగుతున్నాయి. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబ సభ్యులు ఈ దీక్షల్లో కూర్చున్నారు.. ఈ దీక్షలను టీజాక్ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం, ప్రొఫెసర్‌ సూరేపల్లి సుజాత ప్రారంభించారు.. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ధర్నా చౌక్‌ను ప్రజల భాగస్వామ్యంతో సాధించుకుంటామని కోదండరాం స్పష్టం చేశారు..

పశువైద్య కళాశాల విద్యార్ధుల సమస్యలుపరిష్కరించాలి: తమ్మినేని

హైదరాబాద్: రాజేంద్రనగర్‌లో పశువైద్య కళాశాల విద్యార్ధులు 20 రోజలుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. వెంటనే వారితో ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. పశువైద్య కళాశాల విద్యార్ధులు చేస్తున్న దీక్షలకు ఆయన మద్దతు తెలిపారు. పశువైద్యుల భర్తీలో కాంట్రాక్టు వ్యవస్థను ఎత్తివేసి శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు నియమించాలని తమ్మినేని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిపై సస్పెన్షన్‌ వేటు

అమరావతి: టీడీపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిపై సస్పెన్షన్‌ వేటు పడింది. సీబీఐ దాడుల నేపథ్యంలో వాకాటిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. సీబీఐ దర్యాప్తులో నిజనిజాలు తేలేవరకు సస్పెన్షన్‌ కొనసాగుతుందని బాబు స్పష్టం చేశారు.

06:53 - May 14, 2017

అమరావతి: తన అమెరికా పర్యటన చాలా తృప్తినిచ్చిందన్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం అనేక కంపెనీల సీఈవోలను కలిశామని.. అమెరికాలో స్థిరపడ్డ తెలుగువాళ్లు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరామన్నారు. భవిష్యత్‌లో సోలార్‌ విద్యుత్‌ను అభివృద్ధి చేస్తే విద్యుత్‌ ధరలు భారీగా తగ్గుతాయన్నారు చంద్రబాబు.

అనేక మంది కంపెనీల సీఈవోలతో భేటీ...

ఆంధ్రప్రదేశ్‌లో సంపద సృష్టి కోసమే అమెరికాలో పర్యటించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో అమెరికా పర్యటన వివరాలను వెల్లడించారు. అమెరికాలో తాను అనేక మంది కంపెనీల సీఈవోలతో భేటీ అయ్యాయని వారిని ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరానన్నారు చంద్రబాబు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకున్నామన్నామన్నారు. గతంలో వారసత్వంగా వచ్చిన ఆస్తులే సంపదగా ఉండేవని.. ప్రస్తుతం తెలివితేటలు ఉన్నవారే ఎంతైనా సంపాదించగలుగుతున్నారన్నారు. ప్రపంచంలోనే తెలుగువాళ్లు అత్యున్నత స్థాయిలో ఉండాలన్నారు చంద్రబాబు.

ఏపీని నాలెడ్జ్ హబ్ గా తయారు చేయడమే లక్ష్యం...

ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జ్‌ హబ్‌గా తయారు చేయడమే లక్ష్యమన్నారు చంద్రబాబు. ఐటీ రంగంలో ప్రపంచంలో ఉన్న ప్రతి నలుగురిలో ఒక భారతీయుడు ఉన్నారన్నారు. ప్రతి నలుగురు భారతీయుల్లో ఒక తెలుగువాడున్నారు.. తెలుగు రాష్ట్రాల నుంచి ఇంజీనీర్లు, వైద్యులు అమెరికా వెళ్లారన్నారు.

సోలార్‌, పవన విద్యుత్‌పై దృష్టి ...

అమెరికా పర్యటనలో సోలార్‌, పవన విద్యుత్‌పై దృష్టి పెట్టామన్నారు చంద్రబాబు. సోలార్‌లో నూతన ప్రయోగానికి శ్రీకారం చుట్టిన టెస్లాను సంప్రదించామన్నారు. టెస్లాలో భాగంగా ఇళ్లపై సోలార్‌ పవర్‌ ప్యానళ్ల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేయొచ్చు. ఇంటిపైన సోలార్‌ ప్యానెల్‌ పెట్టుకుంటే గృహావసరాలు, కార్లకు వాడుకోవచ్చన్నారు. భారత్‌లో విద్యుత్‌ రంగాన్ని మార్చబోతున్నామన్నారు.

ఎక్కువ సమయాన్ని వ్యవసాయ రంగానికి కేటాయించినట్లు...

ఇక పర్యటనలో ఎక్కువ సమయాన్ని వ్యవసాయ రంగానికి కేటాయించినట్లు చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో 28 శాతం వర్షాభావం ఉన్నా.. 14 శాతం వృద్ధి రేటు సాధించామన్నారు. ఇక తాను ఎన్నో పర్యటనలకు వెళ్లినప్పటికీ ఈ పర్యటన ఎంతో తృప్తినిచ్చిందని చంద్రబాబు తెలిపారు.

06:49 - May 14, 2017

నల్లగొండ : కట్టంగూరు మండలం అన్నారం స్టేజి దగ్గర ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడింది. డ్రైవర్‌ నిద్రమత్తులో సడన్‌ బ్రేక్‌ వేయడంతో బస్సు బోల్తాపడింది. ఐదుగురు ప్రయాణికులకు మాత్రమే గాయాలు కావడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులున్నారు. హైదరాబాద్‌ నుంచి ఏలూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకుని పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మిగతా ప్రయాణికులను గమ్యస్థానాలకు పంపించారు.

06:34 - May 14, 2017

Don't Miss