Activities calendar

15 May 2017

21:32 - May 15, 2017

ఢిల్లీ : భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ కేసుపై అంతర్జాతీయ న్యాయస్థానంలో వాదనలు కొనసాగుతున్నాయి. జాదవ్‌కు పాకిస్తాన్ సైనిక కోర్టు మరణశిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పును తక్షణమే నిలిపివేయాలని భారత్‌ కోరింది. జాదవ్‌ విషయంలో భారత్‌ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని రాజకీయంగా వినియోగించుకుంటోదని పాకిస్తాన్‌ ఆరోపించింది. నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌కు పాకిస్తాన్ సైనిక కోర్టు మరణశిక్ష విధించడాన్ని వ్యతిరేకిస్తూ భారత్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్‌, పాకిస్తాన్‌లు తమ తమ వాదనలు వినిపించాయి. భారత్‌ తరపున ప్రసిద్ధ న్యాయవాది హరీష్‌ సాల్వే వాదించారు.

ప్రాణాలకు ముప్పు..
ఇరాన్‌లోని చాబహార్‌ నగరంలో వాణిజ్యం కోసం వెళ్లిన కుల్‌భూషణ్‌ను పాక్‌ గూఢచారులు కిడ్నాప్‌ చేసి రహస్యంగా పాక్‌కు తరలించినట్టు భారత్‌ ఆరోపించింది. గూఢచర్యానికి పాల్పడ్డట్లు ముద్రవేసిన పాకిస్తాన్‌ సైనిక న్యాయస్థానం- జాదవ్‌కు ఉరిశిక్ష విధించినట్టు భారత్‌ వెల్లడించింది. నిందితుడికి కనీస న్యాయసాయం అందించేందుకు భారత్‌ ఎన్ని ప్రయత్నాలు చేసినా పాక్‌ అందుకు అనుమతించలేదని పేర్కొంది. వియన్నా ఒప్పందాన్ని పాకిస్తాన్‌ ఉల్లంఘించిందని, కనీస ప్రాథమిక మానవహక్కులను అతిక్రమించిందని భారత్‌ ఆరోపించింది. పాకిస్తాన్‌ నిర్బంధంలో ఉన్న కులభూషణ్‌ జాదవ్‌ ప్రాణాలకు ముప్పుందని దీనిపై తక్షణమే జోక్యం చేసుకుని ఉరిశిక్ష నిలిపివేయాలని హరీష్‌ సాల్వే కోర్టుకు విజ్ఞప్తి చేశారు. పరిస్థితి తీవ్రంగా ఉండడం వల్లే అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని చెప్పారు.

పాక్ ఆరోపణలు..
జాదవ్‌ విషయంలో భారత్‌ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని రాజకీయంగా వినియోగించుకుంటోదని పాకిస్తాన్‌ ఆరోపించింది. జాదవ్‌ ఇరాన్‌ నుంచి పాకిస్తాన్‌లోకి చొరబడి గూఢచర్యానికి పాల్పడ్డారని... ఇందుకు సంబంధించిన వీడియో ఆధారాలు తమ వద్ద ఉన్నాయని కోర్టుకు తెలిపింది. జాదవ్ వద్ద రెండు నకిలీ పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకున్నట్లు పాకిస్తాన్‌ పేర్కొంది. జాదవ్‌పై 6 నెలల పాటు విచారణ జరిపాకే సైనిక కోర్టు మరణశిక్ష విధించడం జరిగిందని స్పష్టం చేసింది. జాదవ్‌ అంశంలో భారత్‌ వేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేసింది.

21:29 - May 15, 2017

చెన్నై : తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ స్పష్టం చేశారు. ఒకవేళ దేవుడు ఆజ్ఞపిస్తే రాజకీయాల్లోకి వస్తానన్నారు. తనని నటించడం కోసమే భగవంతుడు ఆదేశించారని చెప్పారు. కొంత మంది రాజకీయ లబ్ది కోసం తన పేరును దుర్వినియోగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణ మంటపం తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ అభిమానులతో కోలాహలంగా కనిపించింది. దాదాపు ఎనిమిదేళ్ల విరామం తరువాత సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తన అభిమానులతో​ ప్రత్యక్షంగా సమావేశం అయ్యారు. తన భవిష్యత్‌ ప్రణాళికను వారితో పంచుకున్నారు.

ముత్తురామన్ తో..
సీనియర్‌ దర్శకుడు ముత్తురామన్‌తో కలిసి రజనీకాంత్‌ అభిమానుల నుద్దేశించి మాట్లాడారు. అభిమానుల ఆకాంక్షలను ఎట్టి పరిస్థితుల్లో వమ్ము చేయని చెప్పారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి రావడానికి రజనీ భయపడుతున్నాడు...తనను పిరికివాడంటున్న కొందని విమర్శలను పట్టించుకునే అవసరం లేదని రజనీకాంత్‌ అన్నారు. కొన్ని పరిస్థితుల దృష్ట్యా 1996లో డీఎంకేకు మద్దతు ఇవ్వాల్సి వచ్చిందని... కొంతమంది తమ రాజకీయ లబ్ధి కోసం తన పేరును వాడుకుంటున్నారని మండిపడ్డారు. నేను ఏ పార్టీలోనూ చేరను. ఇప్పటివరకు తనని నటించమనే దేవుడు ఆదేశించాడు. ఆ పనే చేస్తాను. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదని రజనీ చెప్పారు. నా అభిమానులు నిజాయితీగా జీవించాలని రజనీకాంత్‌ ఆకాంక్షించారు. మద్యపానం, ధూమ పానానికి దూరంగా ఉండి మానసిక ప్రశాంతత పొందాలని రజనీకాంత్ సూచించారు. ఈ నెల 28 నుంచి కొత్త సినిమా షూటింగ్‌లో పాల్గొంటానని చెప్పారు. అనంతరం ఆయన నాలుగు జిల్లాలకు చెందిన అభిమానులతో ఆయన ఫొటోలు దిగారు.

21:24 - May 15, 2017

సూర్యాపేట : జిల్లా...నేరేడుచర్ల మండలం..నర్సయ్యగూడంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తమ పొలాల్లో పైపులు వేయొద్దంటూ మిషన్‌ భగీరథ పనులను రైతులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి రైతులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ మేరకు గ్రామస్థులు... పోలీసులను అడ్డుకున్నారు. కాగా గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు.

21:23 - May 15, 2017

చిత్తూరు : స్నానం చేయకుండా 24 గంటలపాటు రాష్ట్ర ప్రజల కోసమే విదేశీ పర్యటనలు చేస్తున్నానని చంద్రబాబునాయుడు అన్న మాటలకు జనం నవ్వుకుంటున్నారని వైసీపీ నాయకురాలు, ఎమ్మెల్యే రోజా అన్నారు. సోమవారం ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దోచుకున్న సొమ్మును దాచుకోవడానికి.. విరాళాల కోసమే బాబు పర్యటనలు చేస్తున్నారని ప్రజలు భావిస్తున్నారని రోజా అన్నారు. విదేశీ పర్యటన నుంచి వచ్చిన అనంతరం చంద్రబాబు ఢిల్లీలో 6 గంటలు ఎక్కడికి వెళ్లారో చెప్పాలన్నారు.

21:22 - May 15, 2017

విజయవాడ : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఈరోజు జనసేన సేవదళ్‌ను ప్రారంభించారు. హైదరాబాద్‌ జనసేన పరిపాలన కార్యాలయంలో ఆవిర్భావ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్‌.. పది అంశాలతో కూడిన నియమావళిని ప్రకటంచారు. సభ్యులంతా ఈ నియమావళిని పాటించాలని.. ప్రజలకు సేవ చేయడానికే సేవాదళ్‌ను ఏర్పాటు చేశామని పవన్‌ అన్నారు. మొదట 100 మంది కార్యకర్తలతో కార్యక్రమాలు నిర్వహిస్తామని...తర్వాత మండల, గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తామని పవన్‌ వెల్లడించారు.

21:20 - May 15, 2017

విజయవాడ : ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. స్టార్టప్‌ ఏరియా అభివృద్ధికోసం సింగపూర్‌ ప్రభుత్వంతో ప్రభుత్వం ఎంఓయూ కుర్చుకుంది. ఇందులో భాగంగా 1691 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్‌ కన్సార్టియంకు అప్పగిస్తుంది. ఈ సందర్భంగా స్టార్టప్‌ ప్రాంతాభివృద్ధికి ఏపీ సీఎం చంద్రబాబు, సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ శిలాఫలకం ఆవిష్కరించారు. రాజధాని నిర్మాణంలో భాగంగా సింగపూర్‌ ప్రభుత్వంతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. స్టార్టప్‌ ప్రాంతాభివృద్ధికి శిలాఫలకం ఆవిష్కరించారు.

జాయింట్‌ స్టీరింగ్‌ కమిటీ..
అమరావతి స్టార్టప్‌ ఏరియా అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం జాయింట్‌ స్టీరింగ్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఏపీ తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు, సింగపూర్ తరపున ఈశ్వరన్‌ చైర్మన్లుగా ఉంటారు. సభ్యులుగా ఏపీ తరపున ఆర్థిక, పురపాలక శాఖల మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు మౌలిక వసతుల శాఖ కార్యదర్శి కూడా ఉంటారు. అటు సింగపూర్ తరపున ఈశ్వరన్‌తో పాటు మరో నలుగురు సభ్యులను కూడా నియమించారు. స్టీరింగ్‌ కమిటీ ఆరు నెలలకోసారి సమావేశం అవుతుంది. స్టార్టప్‌ ఏరియా అభివృద్ధికి ఫైనాన్సియల్ కన్సల్టెంట్‌గా మెకన్సీ, నగర రూపకర్తగా నార్మన్ ఫోస్టర్ సంస్థలు వ్యవహరిస్తున్నాయి.

తొలి సమావేశం..
ఇవాళ జరిగిన తొలి సమావేశంలో కమిటీ చైర్మన్లు సీఎం చంద్రబాబు, సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ మాట్లాడారు. అమరావతిలో వీలైనంత త్వరగా తమ కార్యాలయాన్ని ప్రారంభిస్తామన్నారు ఈశ్వరన్‌. స్విస్ ఛాలెంజ్‌ పద్ధతిలో సింగపూర్ కన్సార్టియం ఎంపిక కాగానే మంత్రిమండలి సమావేశంలో చర్చించామని, దీనికి తమ ప్రధానమంత్రి కూడా పూర్తి మద్దతు ఇచ్చారని ఈశ్వరన్‌ అన్నారు. 2018లో భారత్ పర్యటన సందర్భంలో సింగపూర్ ప్రధాని అమరావతిని సందర్శించే అవకాశం ఉందని ఈశ్వరన్ తెలిపారు. ఈ ఎంవోయూలో భాగంగా 1691 ఎకరాలను ఏపీ ప్రభుత్వం సింగపూర్‌ కన్సార్టియానికి అప్పగించింది. రాజధాని నిర్మాణ ఆకాంక్షను బలంగా వ్యక్తం చేసిన ప్రజలు ఎటువంటి ఇబ్బందుల్లేకుండా ప్రభుత్వానికి 33వేల ఎకరాలు అప్పగించారని సీఎం చంద్రబాబు అన్నారు. సింగపూర్‌ ప్రభుత్వం ఒక్క పైసా తీసుకోకుండా ఉచితంగా మాస్టర్‌ప్లాన్‌ రూపొందించి ఇచ్చిందని బాబు అన్నారు. గతంలో మలేషియా నుంచి విడిపడిన సింగపూర్‌ ఆర్ధికంగా ఎదిగి ప్రపంచ వ్యాప్తంగా ఘనతను సాధించిందన్నారు. అదేస్ఫూర్తితో ఏపీ రాజధాని అమరావతినీ తీర్చి దిద్దుతామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు.

21:17 - May 15, 2017

విజయవాడ : ప్రధాని మోదీతో ఆంధ్ర ప్రదేశ్‌ సమస్యలగురించే మాట్లాడానని వైసీపీఅధినేత జగన్‌ స్పష్టం చేశారు.. ప్రతిపక్ష నేత హోదాలో ప్రధానిని కలిస్తే తప్పా అని ప్రశ్నించారు... అధికారులను ప్రలోభపెట్టి చంద్రబాబు తప్పులు చేయిస్తున్నారని విజయవాడలో ఆరోపించారు.

21:16 - May 15, 2017

విజయవాడ : జీఎస్టీ బిల్లుకు ఆమోదం తెలిపేందుకు మంగళవారం ఏపీ అసెంబ్లీ సమావేశం కాబోతోంది.. ఈ సమావేశంపై అసెంబ్లీ కమిటీ హాల్‌లో జీఎస్టీపై ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు అవగాహన సదస్సు నిర్వహించారు. జీఎస్టీ బిల్లును వివరించడంతో పాటు... సభ్యుల సందేహాలకు పార్లమెంట్ రీసర్చ్ సర్వీస్‌ అధికారులు సమాధానమిచ్చారు. పన్నుల్లో కేంద్ర, రాష్ట్ర వాటాలను వివరించారు.. ఈ బిల్లును రైతులకు, పారిశ్రామికవేత్తలకు మేలుకలిగే రీతిలో అనకాపల్లి బెల్లంకు మినహాయింపు ఇచ్చేట్లుగా రూపొందించాలని సభ్యులు సూచించారు.. ఈ కార్యక్రమానికి మండలి చైర్మన్‌ చక్రపాణి, స్పీకర్‌ కోడెల హాజరయ్యారు..

20:33 - May 15, 2017

అఖిలపక్షం చేపట్టిన చలో ఇందిరాపార్క్‌ విజయవంతమైంది. ప్రభుత్వ కుట్రను భగ్నం చేసిన ప్రతిపక్ష నేతలు, ప్రజాసంఘాలు నిరసన ద్వారా తమ వాదనను గట్టిగా వినిపించారు. పోలీసులు లాఠీచార్జ్‌ చేసినా... వెనకడుగు వేయక అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. స్థానికుల ముసుగులో గులాబీనేతలు, పోలీసులు చేసిన హంగామా వీడియో ఫుటేజ్‌ ద్వారా బయటపెట్టారు. సేవ్ ధర్నా చౌక్ లో మల్లన్న కూడా తిరిగి నేతల అభిప్రాయాలు తెలుకున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

20:30 - May 15, 2017

సేవ్ ధర్నా చౌక్ కోసం అనుమతినిచ్చి పోలీసులు లాఠీలు పట్టుకున్నారని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ‘సేవ్ ధర్నా చౌక్' ఆందోళనలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ్మినేనితో 'మల్లన్న' ముచ్చటించారు. తమ్మినేని మాటల్లోనే..’సీపీ పర్మిషన్ ఇచ్చిండు. సంతోష పడినం..కానీ లాఠీలు పట్టుకున్నారు..నెత్తురు చిందుతున్నా..కాలు..చేతులు విరుగుతున్నా..ఇక్కడే కూర్చొన్నరు. కుట్ర ప్రతిపక్షాలది కాదు..ప్రతిపక్షాల మధ్య చీలిక తెప్పించేందుకు కుట్ర చేసిండ్రు. కేసీఆర్ మరోసారి కుట్ర బుద్ధిని బయటపెట్టుకున్నరు..తమకు సహకరించినందుకు లోకల్ ప్రజలకు అభినందనలు..మమ్మల్ని దెబ్బతీయాలని కుట్ర చేసిండ్రు..వారు తీసిన గోతిలో వారు పడ్డారు..ధర్నా జరిగితే విషయాలు తెలుస్తయి..వాళ్ల భాగోతం తెలుస్తుంది..వాకర్స్ కోసం పోరాటం చేసింది మేమే. కాలనీలకు ఇళ్లు..స్థలాలు కావాలని పోరాడింది మేము'. అని తమ్మినేని తెలిపారు. మరిన్ని విషయాలకు వీడియో క్లిక్ చేయండి.

20:15 - May 15, 2017

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడుతున్నడని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ పేర్కొన్నారు. ‘సేవ్ ధర్నా చౌక్' లో భాగంగా ఆయనతో మల్లన్న ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఆయన తనదైన శైలిలో సర్కార్ పై నిప్పులు చెరిగారు. జనం చూసి కేసీఆర్ భయపడుతున్నడని..మేజర్ పార్టీ మాదేనని..రీజినల్ పార్టీలు ఎక్కువుండవని తెలిపారు. రాష్ట్రంలో కుటుంబ పాలన జరుగుతోందని విమర్శించారు. 30 మంది గులాబీ నేతలున్నారని, తాము ఏడు వేల మంది ఉన్నారని వీహెచ్ పేర్కొన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి...

రేపటి అసెంబ్లీని అడ్డుకుంటాం - జగన్..

విజయవాడ : మంగళవారం నాడు జరిగే ఏపీ అసెంబ్లీని అడ్డుకుంటామని వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రకటించారు. రైతుల సమస్యలు తీర్చకుండా బాబు కాలయాపణ చేస్తున్నారని, రైతుల సమస్యలపై గళం ఎత్తుతామని పేర్కొన్నారు.

19:51 - May 15, 2017

అఖిలపక్షం చేపట్టిన చలో ఇందిరాపార్క్‌ విజయవంతమైంది. ప్రభుత్వ కుట్రను భగ్నంచేసిన ప్రతిపక్ష నేతలు, ప్రజాసంఘాలు నిరసన ద్వారా తమ వాదనను గట్టిగా వినిపించారు. పోలీసులు లాఠీచార్జ్‌ చేసినా... వెనకడుగు వేయక అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. స్థానికుల ముసుగులో గులాబీనేతలు, పోలీసులు చేసిన హంగామా వీడియో ఫుటేజ్‌ ద్వారా బయటపెట్టారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో జూలకంటి (సీపీఎం), అద్దంకి దయాకర్ (టి.కాంగ్రెస్), పాతూరి సుధాకర్ రెడ్డి (ప్రభుత్వ చీప్ విప్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

టీఆర్ఎస్ క్షమాపణలు చెప్పాలి - తమ్మినేని..

హైదరాబాద్ : టీఆర్ఎస్, ఎంఐఎం తప్ప అన్ని పార్టీలు ధర్నా చౌక్ పరిరక్షణకు కదిలివచ్చాయని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. మంత్రులకు తలలు తీస్తామన్న భాష మాత్రమే తెలుసని, నాయినీ స్థాయి తగ్గించుకుని మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ధర్నా చౌక్ వద్దన్న వారికి, ధర్నా చౌక్ పరిరక్షణ కమిటీకి కావాలనే ఒకే ప్రదేశంలో నిరసనలకు అనుమతినిచ్చారని, ప్రభుత్వం అతి తెలివి ప్రదర్శించినందు వల్లే ఘర్షణ చోటు చేసుకుందని, పోలీసులు హింసకు పాల్పడ్డారని తెలిపారు. ఘర్షణ సృష్టించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, ఏసీనీ నర్సయ్య లాఠీ పట్టుకుని కార్యకర్తలు కొట్టారని పేర్కొన్నారు.

19:38 - May 15, 2017
19:35 - May 15, 2017

హైదరాబాద్ : అఖిలపక్షం చేపట్టిన చలో ఇందిరాపార్క్‌ విజయవంతమైంది.. ప్రభుత్వ కుట్రను భగ్నంచేసిన ప్రతిపక్ష నేతలు, ప్రజాసంఘాలు... నిరసన ద్వారా తమ వాదనను గట్టిగా వినిపించారు. పోలీసులు లాఠీచార్జ్‌ చేసినా... వెనకడుగు వేయక అనుకున్న లక్ష్యాన్ని సాధించారు.. స్థానికుల ముసుగులో గులాబీనేతలు, పోలీసులుచేసిన హంగామా వీడియో ఫుటేజ్‌ద్వారా బయటపెట్టారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన చలో ఇందిరాపార్క్‌ నిరసన రణరంగాన్ని తలపించింది. వాకర్స్‌ రూపంలో బైఠాయించిన టీఆర్‌ఎస్‌ నేతలు, పోలీసులు... అఖిలపక్షం, ప్రజాసంఘాల మధ్య తోపులాట జరిగింది.. పోలీసుల లాఠీచార్జ్‌లో పలువురు గాయపడ్డారు. చలో ధర్నా చౌక్‌ అంటూ పదిరోజుల క్రితమే పిలుపునిచ్చిన ప్రతిపక్షాలు నిరసన తెలిపేందుకు సోమవారం ఉదయం ఇందిరాపార్క్‌కు కదిలాయి. అయితే ఈ ఆందోళనకు ముందునుంచీ అనుమతి లేదన్న పోలీసులు హఠాత్తుగా సోమవారం ఉదయంమాత్రం పర్మిషన్ ఇచ్చేశారు. నెలరోజులుగా ధర్నాచౌక్‌లో ఎలాంటి నిరసనలకు అనుమతి ఇవ్వని పోలీసులు. సడన్‌గా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం అందరిలో సందేహం పెంచింది.

ఉదయం ఎనిమిది గంటలు..
చలో ధర్నా చౌక్‌ను విజయవంతం చేసేందుకు ఉదయం ఎనిమిది గంటలకు అఖిలపక్ష నేతలు, ప్రజాసంఘాలు ధర్నాచౌక్‌వైపు కదిలాయి. అంతకుముందే ఇందిరాపార్క్‌ముందు అసలు నాటకం మొదలైంది. వాక‌ర్స్ అసోసియేష‌న్... స్థానిక కాల‌నీల పేరుతో తెల్లవారేసరికి అక్కడ టెంట్లు వెలిశాయి. ధర్నా చౌక్‌లతో తమకు ఇబ్బంది కలుగుతోందని. ధర్నా చౌక్‌ను ఇక్కడినుంచి తరలించాలంటూ స్థానికుల పేరుతో బ్యానర్లు వెలిశాయి. సాధారణంగా ధర్నాచౌక్‌ దగ్గర నిరసనలు తెలపాలంటే పెద్ద ప్రాసెస్‌ ఉంటుంది.. రోడ్డుకు ఇబ్బంది కాకుండా నిరసనల్లో పాల్గొనేందుకు ఎంతమంది వస్తారు? ఎంత టైం ధర్నా చేస్తారో అన్ని వివరాలను పోలీసులకు ఇవ్వాలి. ఆ తర్వాత టెంట్‌లకు అనుమతిఇస్తారు. ఇక్కడమాత్రం సీన్‌ రివర్స్ అయింది. ధర్నాకు అనుమతి ఇచ్చిన వారికి బదులు సడన్‌గా వచ్చిన వాకర్స్‌ అసోసియేషన్‌ టెంట్లు అక్కడ ప్రత్యక్షమయ్యాయి... పైగా ధర్నాచౌక్‌ వద్దన్నవారు ట్యాంక్‌బండ్‌వైపు సిగ్నల్‌ దగ్గర కవాడిగూడవైపు రోడ్డుపూర్తిగా మూసివేసి టెంట్‌ వేశారు. దీంతో ధర్నా చౌక్‌ అక్కడే ఉంచాలన్న వారికి లోపలికివెళ్లే అవకాశం లేకుండా పోయింది.

నేతలు..కార్యకర్తలకు గాయాలు..
అటు పోలీసుల నుంచి అనుమతి దొరకడంతో ప్రశాంతంగా నిరసన తెలపాలని భావించిన ప్రతిపక్ష నేతలు పార్క్‌ దగ్గర పరిస్థితిచూసి షాక్‌ తిన్నారు. ధర్నాచౌక్‌ దగ్గరకు వెళ్లే పరిస్థితిలేక ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ దగ్గరే నిరసనలు చేపట్టారు. అక్కడినుంచి నెమ్మదిగా పార్క్‌ దగ్గరకు చేరేసరికి వారికి స్థానికులు ఎదురుపడ్డారు. రెండువర్గాలవారు ఒకరు ధర్నా చౌక్‌కు అనుకూలంగా మరొకరు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈలోపు అఖిలపక్షం నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఇద్దరిమధ్యా తోపులాట జరిగింది. ఆ వెంటనే పోలీసులు.. వామపక్ష కార్యకర్తలు, ప్రజాసంఘాల ప్రతినిధులే లక్ష్యంగా తమ లాఠీలకు పనిచెప్పారు.. దొరికినవారిని దొరికినట్లు చితకబాదారు.. ఈ లాఠీచార్జిలో పలువురు నేతలు, కార్యకర్తలకు గాయాలయ్యాయి.. సిపియం గ్రేటర్‌ హైద‌రాబాద్ కార్యదర్శి శ్రీనివాస్‌ త‌లకు తీవ్ర గాయాలుకావడంతో ఆయన్ని ఆస్పత్రికి తరలించారు..

స్థానికుల ముసుగులో..
అటు వాకర్స్‌ అసోసియేషన్‌, స్థానికులంటూ హల్‌చల్‌ చేసిన వారెవరో వీడియోల్లో తేలిపోయింది. స్థానికుల ముసుగులో టీఆర్‌ఎస్‌ నేతలు ఈ కార్యక్రమం నడిపించారంటూ వీడియోలు అసలు నిజాన్ని బయటపెట్టాయి. ఎల్‌బీనగర్‌కు చెందిన నేతలు ప్లకార్డులతో ఈ నిరసనలో దర్శనమిచ్చారు.. పైగా కొందరు పోలీసులు కూడా సివిల్‌ డ్రెస్‌లతో ఆందోళనల్లో కూర్చున్నారు. ఈ కార్యక్రమాన్ని హుసేన్‌సాగర్‌ లేక్‌ పీఎస్‌ సీఐ శ్రీదేవి దగ్గరుండి చేయించారని వామపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఆందోళనలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిని పార్టీ కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు శ్రీనివాసరావు, సున్నం రాజయ్య పరామర్శించారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా నిరసనలో విజయం సాధించామని టీ జేఏసీ చైర్మన్‌ కోదండరాం స్పష్టం చేశారు.. ప్రభుత్వం ఇప్పటికైనా ధర్నా చౌక్‌ తరలింపుపై వెనక్కితగ్గాలని డిమాండ్ చేశారు.. ప్రశాంతంగా సాగాల్సిన ధర్నాను... పోలీసులే ఉద్రిక్తంగా మార్చారని ఆరోపించారు.

లాఠీఛార్జీని ఖండిస్తున్నాం - ప్రొ.కోదండరాం..

హైదరాబాద్ : ధర్నా చౌక్ వద్ద లాఠీఛార్జీని ఖండిస్తున్నట్లు ప్రొ. కోదండరాం పేర్కొన్నారు. లాఠీఛార్జీలో 34 మందికి గాయాలయ్యాయని తెలిపారు. ధర్నా చౌక్ ను ఎత్తివేయవద్దనే తమ డిమాండ్ అని పేర్కొన్నారు. నిరసన తెలిపే హక్కును కాలరాయొద్దు అని, తలసానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని తెలిపారు. నాలుక కోస్తాం వంటి వ్యాఖ్యలు చేయడం మంత్రులకు తగదన్నారు.

 

ప్రభుత్వం బాధ్యత వహించాలి - విమలక్క..

హైదరాబాద్ : ఇందిరాపార్కు వద్ద మహిళపై లాఠీఛార్జీ చేశారని, ధర్నా చౌక్ ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలని విమలక్క సూచించారు.

ధర్నాచౌక్ తరలింపును ఒప్పుకోం - పీఎల్ విశ్వేశ్వరావు..

హైదరాబాద్ : ఇందిరాపార్క్ వద్దే ధర్నా చౌక్ కావాలని, మరో చోటుకు తరలిస్తామంటే ఒప్పుకోమని ప్రొ.పీఎల్ విశ్వేశ్వరరావు పేర్కొన్నారు.

టి.డిగ్రీ అడ్మిషన్లకు నోటిఫికేషన్..

హైదరాబాద్ : తెలంగాణ డిగ్రీ అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ విడుదల చేసిన ఉన్నత విద్యా మండలి రూ. 100 రిజిస్ట్రేషన్ తో రాష్ట్రంలోని ఏ యూనివర్సిటీ కాలేజీకైనా దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించింది. ఈనెల 18 నుండి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ లు జూన్ 4 చివరి తేదీ అని నిర్ణయించారు. ఫైన్ తో జూన్ 5,6 వరకు గడవు విధించారు. జూన్ 10న సీట్ల కేటాయించనున్నారు. జూన్ 19 నుండి తరగతులు ప్రారంభం కానున్నాయి. జూన్ 18,19 తేదీల్లో రెండో విడత సీట్లను కేటాయించనున్నారు.

19:12 - May 15, 2017

అనంతపురం : 2022 నాటికి ఆరు వేల కోట్ల టర్నోవర్‌ చేయడమే తమ లక్ష్యమని హెరిటేజ్ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి అన్నారు. అనంతపురం జిల్లా..లేపాక్షిలో హెరిటేజ్ 25 రజతోత్సవాల్లో నారా బ్రాహ్మణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు ప్రోత్సాహక బహుమతులు అందించారు. రైతుల సంక్షేమం కోసం రైతు నిధిని ఏర్పాటు చేయడం జరిగిందని.. రైతు ప్రమాదవశాత్తు చనిపోతే సంక్షేమ నిధి నుంచి 2 లక్షల రూపాయలు అందిస్తామని నారా బ్రాహ్మణి అన్నారు.

19:11 - May 15, 2017

విజయవాడ : ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. స్టార్టప్‌ ఏరియా అభివృద్ధికోసం సింగపూర్‌ ప్రభుత్వంతో ప్రభుత్వం ఎంఓయూ కుర్చుకుంది. దీన్లో భాగంగా 1691 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్‌ కన్సార్టియంకు అప్పగిస్తుంది. ఈసందర్భంగా స్టార్టప్‌ ప్రాంతాభివృద్ధికి ఏపీ సీఎం చంద్రబాబు, సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. ప్రపంచంలోనే దిబెస్ట్‌ సిటీగా రాజధానిని నిర్మించడానికి కృషిచేస్తున్నమాని చంద్రబాబు అన్నారు. స్విస్‌చాలెంజ్‌ పద్దతిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధి జరుగుతుందని సీఎం తెలిపారు.

19:09 - May 15, 2017

విశాఖపట్టణం : సింహాచలం పంచగ్రామాల భూ సమస్యను పరిష్కరించాలని కోరుతూ విశాఖపట్నంలో వైసీపీ సంకల్ప దీక్ష పేరుతో ఆందోళన చేపట్టింది. పెందుర్తి నియోజకవర్గ సమన్వయ కర్త అన్నెంరెడ్డి అదీప్‌రాజ్‌ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సంకల్ప్‌ దీక్షను వైసీపీ రాష్ట్ర నాయకుడు బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. ఈ దీక్షకు కాంగ్రెస్, వామపక్షాలు మద్దతు పలికాయి.

19:07 - May 15, 2017

విజయవాడ : క్యాన్సర్‌తో బాధపడుతూ మృతిచెందిన సాయిశ్రీ అంత్యక్రియలు విజయవాడలో ముగిశాయి. కడుపుకోతతో తల్లడిల్లుతోన్న సాయిశ్రీ తల్లి సుమనశ్రీని అఖిలపక్ష నాయకులు పరామర్శించారు. తన కూతురు మృతికి కారణమైన తన భర్త మాదాల శివకుమార్‌, ఆయనకు పరోక్షంగా సహకరించిన ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుపై చర్యలు తీసుకోవాలని సుమనశ్రీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈమేరకు ఆమె విజయవాడ సీపీ గౌతమ్‌సవాంగ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. క్యాన్సర్‌తో బాధపడుతూ.. వైద్యం కోసం తండ్రిని అభ్యర్థించి.. ఆయన కరుణ లభించక.. నిస్సహాయంగా ప్రాణాలు వదిలిన బెజవాడ చిన్నారి సాయిశ్రీ అంత్యక్రియలు సోమవారం విజయవాడలో ముగిశాయి. కుమార్తె మరణంతో తల్లడిల్లుతోన్న తల్లి సుమనశ్రీకి వామపక్షాలు, వైసీపీ, కాంగ్రెస్‌ నాయకులు అండగా నిలిచారు. సుమనశ్రీ అఖిలపక్షం నాయకులతో కలిసి.. బెజవాడ పోలీస్‌ కమిషనర్‌ గౌతం సవాంగ్‌ను కలిశారు. సాయిశ్రీ మృతికి కారణమైన తన భర్త మాదాల శివకుమార్‌, ఆయనకు పరోక్షంగా సహకరించిన ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు.

ఎమ్మెల్యే బోండా అనుచరులు..
ఎమ్మెల్యే బొండా ఉమా అనుచరుల నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని సుమనశ్రీ ఆరోపించారు. తన ఇంటిని కబ్జాచేయాలని ప్రయత్నిస్తున్నారని.. తనకు ప్రాణహాని ఉందని ఆమె సీపీకి ఫిర్యాదు చేశారు. సుమనశ్రీ ఫిర్యాదుపై సీపీ స్పందించారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని త్వరలోనే నిందితుడు శివకుమార్‌ను అదుపులోకి తీసుకుంటామని తీసుకుంటామన్నారు. మరోవైపు, బాలిక సాయిశ్రీ మృతిపై బాలలహక్కుల సంఘం, మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన మానవహక్కుల కమిషన్‌.. ఈనెల 20వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని విజయవాడ పోలీస్‌కమిషనర్‌ ను ఆదేశించింది. అటు, అఖిలపక్షం నాయకులు కూడా.. సాయిశ్రీ తల్లి సుమనశ్రీకి పూర్తి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.

19:04 - May 15, 2017

విశాఖపట్టణం : హవాలా కేసులో అరెస్టైన వడ్డి మహేశ్‌ను విశాఖ పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. అనంతరం కోర్టులో కూడా హజరుపరిచారు. సూట్‌ కంపెనీల పేరుతో వందల కోట్ల రూపాయల నల్లధనాన్ని అక్రమంగా విదేశాలకు తరలించిన కేసులో మహేశ్‌ ప్రధాన నిందితుడు. కేసుతో సంబంధం ఉన్న మహేష్‌ తండ్రి శ్రీనివాసరావును, అచంట హరీష్‌ను, అచంట రాజేష్‌లను కూడా ప్రశ్నించామని విశాఖ పోలీస్‌ కమిషనర్‌ చెప్పారు. కాగా ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సీఐడీకి అప్పజెప్పడం జరిగిందని ఆయన చెప్పారు.

18:23 - May 15, 2017

జనసేన 'సేవాదళ్' ఏర్పాటు..

హైదరాబాద్ : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సేవాదళ్ ను ఏర్పాటు చేశారు. పది అంశాలతో కూడిన నియామవళితో రూపొందింది. ప్రజలకు సేవ చేయడానికే సేవాదళ్ ఏర్పాటు చేసినట్లు, సేవాదళ్ నియామవళిని సభ్యులంతా పాటించాలని, త్వరలో మండల..గ్రామ స్థాయిలో కమిటీలు నియమించనున్నట్లు వెల్లడించారు.

18:05 - May 15, 2017

హైదరాబాద్‌ : పాతబస్తీలో కాల్పులు కలకలం సృష్టించాయి.. పలక్‌నుమాలో ఏర్పాటుచేసిన బర్త్‌డే వేడుకల్లో సోంహెల్‌ అనే యువకుడు రివాల్వర్‌తో ఆరు రౌండ్లు గాల్లో కాల్పులు జరిపాడు. ఈ దృశ్యాలకు అతని స్నేహితుడు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. ఈ వీడియో వాట్సప్‌లో అప్‌లోడ్‌ చేయడంతో ఈ విషయం బయటకొచ్చింది.. సోంహెల్‌ను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. గతంలోకూడా అలియాబాద్‌లో పెట్రోల్‌ బంక్‌ యజమాని కుమారుడు పెళ్లి బరాత్‌లో కాల్పులతో హల్‌చల్‌ చేశాడు.

ట్రిపుల్ తలాక్ పై సుప్రీంలో వాదనలు..

ఢిల్లీ : ట్రిపుల్ తలాక్ పై సుప్రీంలో వాదనలు జరిగాయి. ఒకవేళ ట్రిపుల్ తలాక్ విధానం ఆగిపోతే కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలని సుప్రీం ఆదేశించింది. ముస్లింల వివాహం, విడాకుల అంశాన్ని క్రమబద్ధీకరణకు కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకొస్తుందని అటార్నీ జనరల్ పేర్కొన్నారు. ప్రస్తుతం ట్రిపుల్ తలాఖ్ అంశాన్ని పరిష్కరించి ఆ తరువాత బహుభార్యత్వం, నిఖా హలాలా వంటి విషయాల సంగతి భవిష్యత్ లో చూస్తామని సుప్రీం పేర్కొంది.

17:55 - May 15, 2017

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టును ఏడాదిన్నరలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా పది లక్షల ఇళ్లకు బ్రాడ్‌ బ్యాండ్‌ సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. ఐటీసీ 4డీ టెక్నాలజీపై హైదరాబాద్‌లో జరిగిన సదస్సులో సమాచార, సాంకేతిక శాఖ మంత్రి కేటీఆర్ ఈ విషయాన్ని చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తైతే విద్య, వైద, ప్రభుత్వ సేవల రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయంటున్నారు.

17:46 - May 15, 2017

ప్రకాశం : మంత్రాలకు చింతకాయలు రాలవు. నిమ్మకాయలను పూజిస్తే వ్యాధులు నయంకావు. ఇది జగమెరిగిన సత్యం. కానీ ఆ గ్రామ ప్రజలకు మూఢాచారాలే మూలధనం. ఆచార, సంప్రదాయాల పేరుతో చిన్న పిల్లలను ముళ్లకంపపై దొర్లిస్తే సకలదోష నివారణ జరుగుతుందని నమ్ముతారు. గావు పేరుతో గావు కేకలు పెడదారు. మేకలు, గొర్రెలను నోటితో కొరికి బలిస్తే గ్రామ దేవతలు శాంతించి, ఊరికి ఉపకారం చేస్తారని విశ్వసిస్తారు. ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం చిన గొల్లపల్లిలో లక్ష్మీ చెన్నకేశవస్వామి జాతరపై 10 టీవీ ప్రత్యేక కథనం. ప్రకాశం జిల్లా హనుమంతునిపాలెం మండలం చినగొల్లపల్లిలోని లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయం. శతాబ్దాల చరిత్ర కలిగిన గుడి. ఇక్కడ ఏటా వైశాఖ మాసంలో లక్ష్మీ చెన్నకేశవస్వామి తిరునాళ్లు జరుగుతాయి. వారం రోజులపాటు జరిగే ఈ జారతలో చెన్నకేశవునికి పూజలు నిర్వహించినా, అడుగడుగునా మూఢాచారాలు రాజ్యమేలుతుంటాయి. అంకురార్పణ, కల్యాణం, పంచామృతాలతో అభిషేకం, అలంకరణ, సుదర్శణ హోమం...ఇలా రెండు రోజులు పాటు అన్నీ ఆగమ శాస్త్రయుక్తంగానే జరుగుతాయి. ఇక మూడో రోజు నుంచి జరిగే క్రతువులు మాత్రం ఇందుకు భిన్నం. పోతురాజుల వీరంగం... శూలాలతో నాట్యం చేస్తూ కత్తులతో శరీరానికి గాట్లు పెట్టుకుంటారు. శరీరం రక్తమోడుతున్నా లెక్కచేయరు. అనాధిగా వస్తున్న ఆచారాన్ని పాటించే క్రమంలో అన్ని విషయాల్లో చెన్నకేశవుడే తమను కాపాడతాడని నమ్ముతారు.

ఇదో మూఢాచారం..
గావు... ఇదో మూఢాచారం. పోతురాజులు నోటితో మేక, గొర్రె పిల్లలను కొరికి బలి ఇవ్వడమే గావు. పోతు రాజులు చేసే దృశ్యాలను చూస్తే నరమాంస భక్షకులను తలపిస్తాయి. మేక తలను చెన్నకేశవుని నైవేధ్యంగా సమర్పిస్తారు. రక్త, మాంసాలను పొంగళ్లలో కలిపి సంతానంలేని మహిళల కొంగులో వేస్తారు. దీన్ని ప్రసాదంగా స్వీకరిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని నమ్మకం. ఇక కంపకళ్లి విషయానికి వస్తే... ముళ్లకంపను ఎత్తుగా పేర్చి, తాటాలకు కప్పుతారు. కొద్దిగా ఎక్కేందుకు తలుపుచెక్క ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత ముళ్లపై నడుస్తూ పైకి చేరకురని పొర్లు దండాలు పెడుతూ కిందకు జారుతారు. శరీరం ముళ్లతో చీరుకుపోయి, రక్తం కారుతున్నా... ఆచారాన్ని మించింది లేదని భక్తులు చెబుతారు. ముక్కపచ్చలారని పిల్లలను సైతం కంపకళ్లి మీద నుంచి కిందకు దొర్లిస్తారు. పదహారేళ్లలోపు ఉన్న వారిని ఈదురాచారానికి దూరంగా ఉంచాలన్న ఆదేశాలు ఉన్నా ఎవరూ పట్టించుకోరు. పోలీసుల పహారా ఉంటుంది. దీనికి వ్యతిరేకంగా స్త్రీ, శిశుసంక్షేమ శాఖ ప్రచారం చేస్తుంది. అయినా మూఢనమ్మకాల ముందు అన్నీ బలాదూర్‌.

ప్రజల నమ్మకం..
చిన గొల్లపల్లి లక్ష్మీ చెన్నకేశవస్వామి ఎంతో మహిమాన్వితుడని ఇక్కడి ప్రజల నమ్మకం. కోరిన కోర్కెలు తీరుస్తాడని విశ్వసిస్తారు. మొక్కులు మొక్కుకుంటారు. ఈ దేవుణ్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటే అన్ని సవ్యంగా జరుగుతాయని నమ్మకం. శాస్త్ర విజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా గ్రామాల్లో మాత్రం మూఢనమ్మకాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. శాస్త్ర విజ్ఞానాన్ని ప్రోత్సహించాలన్న మన రాజ్యాంగ మూల సూత్రాలకు విరుద్ధంగా గ్రామీణ ప్రాంత దేవాలయాల్లో వ్యవహారాలు సాగుతున్నాయంటే మూఢాచారాలు ఎంత బలీయంగా వేళ్లూనుకున్నాయో అర్థం చేసుకోవచ్చు.

ట్రిపుల్ తలాక్ పై సుప్రీంలో వాదనలు..

ఢిల్లీ : ట్రిపుల్ తలాక్ పై సుప్రీంలో వాదనలు జరిగాయి. ఒకవేళ ట్రిపుల్ తలాక్ విధానం ఆగిపోతే కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలని సుప్రీం ఆదేశించింది. ముస్లింల వివాహం, విడాకుల అంశాన్ని క్రమబద్ధీకరణకు కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకొస్తుందని అటార్నీ జనరల్ పేర్కొన్నారు. ప్రస్తుతం ట్రిపుల్ తలాఖ్ అంశాన్ని పరిష్కరించి ఆ తరువాత బహుభార్యత్వం, నిఖా హలాలా వంటి విషయాల సంగతి భవిష్యత్ లో చూస్తామని సుప్రీం పేర్కొంది.

'స్టార్టప్ ఏరియా శంకుస్థాపన జరగడం సంతోషం'..

విజయవాడ : భూమిలిచ్చిన రైతులకు ప్లాట్లు ఇచ్చి స్టార్టప్ ఏరియా శంకుస్థాపన చేసుకోవడం గర్వంగా ఉందని, ఇదంతా చంద్రబాబు పనితీరుకు నిదర్శనమన్నారు. రాజధాని అభివృద్ధిపై విమర్శలు చేస్తున్న వారికి స్టార్టప్ ఏరియా శంకుస్థాపనే సమాధానమన్నారు.

 

17:30 - May 15, 2017

హైదరాబాద్ : ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జరిపిన భేటీ కాసేపటి క్రితం ముగిసింది. సుమారు రెండు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. ఇటీవలే కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పర్యటన నేపథ్యం..తదితర అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. భూ సేకరణ చట్టం అనుకూలంగా కేంద్రం సానుకూలంగా స్పందించడం..రాష్ట్రపతి కూడా సంతకం పెట్టడంపై చర్చించారు. అంతేగాకుండా రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కేసీఆర్ కోరినట్లు తెలుస్తోంది. సోమవారం ఇందిరాపార్కు వద్ద జరిగిన ఉద్రిక్త పరిస్థితులపై కేసీఆర్ వివరించినట్లు సమాచారం.

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

ముంబై : స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. 113 పాయింట్లు లాభంతో 30,322 వద్ద సెన్సెక్స్ ముగియగా 44 పాయింట్లు లాభంతో 9,445 వద్ద నిప్టీ ముగిసింది.

16:55 - May 15, 2017
16:35 - May 15, 2017

ఉత్తరప్రదేశ్‌ : 17వ అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజే గందరగోళం నెలకొంది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే గవర్నర్ రామ్‌నాయక్‌ ప్రసంగాన్ని విపక్షాలు అడ్డుకున్నాయి. గవర్నర్‌పై పేపర్‌ బాల్స్‌ విసురుతూ ప్రతిపక్ష సభ్యులు హంగామా సృష్టించారు. ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. సభకు సహకరించాలని స్పీకర్‌ నారాయణ్‌ దీక్షిత్‌ చేసిన విజ్ఞప్తిని విపక్షాలు పట్టించుకోకపోవడంతో సభ్యుల నినాదాల మధ్యే గవర్నర్‌ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ చేపట్టిన పథకాలను గవర్నర్‌ వివరించారు. ఉత్తరప్రదేశ్‌లో 14 ఏళ్ల తర్వాత బిజెపి అధికారంలోకి వచ్చింది. జిఎస్‌టి బిల్లుపై రేపు చర్చ జరగనున్న నేపథ్యంలో యూపీలో శాంతి భద్రతల పరిస్థితిపై విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో శాంతి భద్రతల పరిస్థితిపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఎస్పీ ఇదివరకే ప్రకటించింది.

16:34 - May 15, 2017

ఢిల్లీ : హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ కేసు విచారణ ప్రారంభమైంది. జాదవ్‌కు పాకిస్థాన్ సైనిక కోర్టు మరణ శిక్ష విధించిన నేపథ్యంలో న్యాయం కోసం భారత్ ఇంటర్నేషనల్‌ కోర్టును ఆశ్రయించింది. ఉరిశిక్ష రద్దు కోరుతూ జాదవ్‌ తరపున భారత్‌ తన వాదనలు వినిపించనుంది. ఇరుదేశాలు 90 నిముషాల చొప్పున తమ వాదనలు వినిపించడానికి కోర్టు అవకాశమిచ్చింది. ముందుగా భారత్ తన వాదనలు ప్రారంభించింది. 18 ఏళ్ల తర్వాత భారత్‌, పాకిస్తాన్‌లు అంతర్జాతీయ కోర్టులో తలపడుతున్నాయి. జాదవ్ విషయంలో పాకిస్థాన్‌తో అన్ని రకాల దౌత్య ప్రయత్నాలు విఫలం కావడంతో వియన్నా ఒప్పందాన్ని కాలరాసిందని ఆరోపిస్తూ మే8న భారత్, ఐక్యరాజ్యసమితిలో ఫిర్యాదు చేసింది. జాదవ్‌కు విధించిన ఉరిశిక్షపై ఐసిజే స్టే విధించిన విషయం తెలిసిందే.

16:32 - May 15, 2017

ఢిల్లీ : రాన్స్‌మ్‌వేర్‌ సైబర్‌ దాడులు ఇవాళ కూడా కొనసాగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. శుక్రవారంనాడు ప్రపంచ వ్యాప్తంగా వంద దేశాల్లో రాన్స్‌మ్‌వేర్‌ సైబర్‌ దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఇవాళ జరగబోయే సైబర్‌ దాడులు శుక్రవారం నాటికన్నా తీవ్రస్థాయిలో ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. తాజాగా కేరళలోని పంచాయితీ కార్యాలయంపై సైబర్‌ దాడులు జరిగినట్లు అనుమానిస్తున్నారు. నాలుగు కంప్యూటర్లు స్తంభించిపోయినట్లు సమాచారం. మరోవైపు ఈ దాడుల నుంచి భద్రత కల్పించేందుకు సైబర్‌ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్‌ రాత్రనక...పగలనక తీవ్రంగా శ్రమిస్తున్నారు. వానాక్రై పేరుతో ఈ వైరస్‌ కంప్యూటర్లకు చొచ్చుకుపోయి క్షణాల్లో వ్యవస్థను స్తంభింపజేస్తుంది. కంప్యూటర్లు తిరిగి పనిచేయాలంటే 3 వందల నుంచి 6 వందల డాలర్లు ఇవ్వాలని హాకర్స్‌ డిమాండ్‌ చేస్తున్నారు. మొన్న జరిగిన సైబర్‌ దాడులు 150 దేశాలపై ప్రభావం చూపాయి. కంప్యూటర్లు హ్యాకింగ్‌ గురికావడంతో అత్యవసర సేవలు స్తంభించిపోయాయి. విశ్వవ్యాప్తంగా ఇప్పటివరకు జరిగిన సైబర్‌ దాడుల్లో రాన్స్‌మ్‌వేర్‌ దాడులే అతిపెద్ద సైబర్‌దాడిగా భావిస్తున్నారు.

16:27 - May 15, 2017

హైదరాబాద్ : ధర్నా చౌక్‌ దగ్గర శాంతియుతంగా ఆందోళన చేస్తున్నవారిపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. విచక్షణారహితంగా రక్తం కారేలా కొట్టారు. పోలీసుల దెబ్బలతో పలువురు ఆస్పత్రి పాలయ్యారు. సేవ్ ధర్నా చౌక్.. కోసం వివిధ జిల్లాల నుండి వేలాది మంది సీపీఎం శ్రేణులు..ప్రజా సంఘాల నేతలు ఇందిరాపార్కుకు తరలివచ్చారు. కానీ ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. మఫ్టీలో పోలీసులు..గూండాలు పెట్టి రాళ్లతో దాడి చేయించారని ఖమ్మం జిల్లాకు చెందిన ఓ నేత పేర్కొన్నారు. విచక్షణారహితంగా కొట్టారని, తన వీపుపై లాఠీలతో బాదారని వాపోయాడు. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

16:25 - May 15, 2017

చెన్నై : భయం నా బ్లడ్ లో లేదు, రాజకీయ ఆదాయం కోసమే కొందరు రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. రాజకీయాల్లోకి రావాలని దేవుడు ఆదేశిస్తే వస్తాను అని సూపర్ స్టార్ రజనీకాంత్ మనసులోని మాటలను తేటతెల్లం చేశారు. చెన్నైలో ఆయన మనసువిప్పి అభిమానులతో మాట్లాడారు. చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణ మండపంలో తన అభిమానులతో సమావేశమైన రజనీకాంత్ తన భవిష్యత్తు ప్రణాళికలను స్పష్టం చేశారు. సీనియర్ దర్శకుడు ముత్తురామన్‌తో కలిసి అభిమానులను కలుసుకున్న రజనీ వారిని ఉద్దేశించి మాట్లాడారు. ఈ నెల 20 నుంచి తన కొత్త సినిమా షూటింగ్‌ ప్రారంభమవుతుందని ప్రకటించారు. ఇక తాను ఏ పార్టీలో చేరేది లేదని..ఏ పార్టీకి మద్దతు ఇచ్చేది లేదని రజనీ స్పష్టం చేశారు. నటనే తన వృత్తి అని అది దేవుడు ఆదేశించాడు కాబట్టి..దానినే పాటిస్తున్నానని సూపర్‌స్టార్ స్పష్టం చేశారు. ఒకవేళ రాజకీయాల్లోకి రావాలని దేవుడు ఆదేశిస్తే..తప్పకుండా వస్తానన్నారు. తన అభిమానులు నిజాయితీగా జీవించాలని ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి చేశారు.

స్టార్టప్ ఏరియాకు బాబు భూమి పూజ..

విజయవాడ : తాళ్లాయపాలెంలో స్టార్టప్ ఏరియా అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు భూమి పూజ చేశారు. చంద్రబాబుతో పాటు సింగపూర్ మంత్రి ఈశ్వరన్, కాన్సార్టియం ప్రతినిధులు పాల్గొన్నారు.

15:38 - May 15, 2017

హైదరాబాద్ : నగరంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది. అందుకనుగణంగా అత్యాధునిక టెక్నాలజీని వినియోగించింది. కానీ ప్లాన్స్ వర్కవుట్ కావడం లేదు. మాదాపూర్ సున్నం చెరువులో ఓ భవంతిని ఇటీవలే అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి కూల్చివేయడానికి ప్రయత్నించింది. ఐదో అంతస్తు అలాగే ఉండిపోయింది. సోమవారం దీనిని కూల్చివేయడానికి డన్నీ ఇనోఫ్లోజన్ ఉపయోగించారు. భవనం కూల్చివేస్తుండగా ముగ్గురికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కూల్చివేతల్లో లోపాలు ఉన్న కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని తెలుస్తోంది.

కూల్చివేతల్లో ముగ్గురికి గాయాలు..

హైదరాబాద్ : మాదాపూర్ సున్నం చెరువులో అక్రమంగా నిర్మించిన డన్నీ ఇనోఫ్లోజన్ పద్ధతిలో జీహెచ్ఎంసీ కూల్చివేసింది. భవనం కూల్చివేస్తుండగా ముగ్గురికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గత సోమవారం భవనం కూల్చివేత విఫలం కావడంతో ఇన్ ఫ్లోజన్ పద్ధతిలో కూల్చివేశారు. అయినా ఐదో అంతస్తు కూలలేదు.

15:27 - May 15, 2017

కర్నూల్‌ : కలెక్టరేట్‌లో రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. బండి ఆత్మకూరు మండలం ఈర్నపల్లి గ్రామానికి చెందిన రైతు శ్రీనివాసులు తనకున్న ఎకరా పొలాన్ని కబ్జా చేశారని వాపోయాడు. తహశీల్దార్‌ శేశుబాబు అండతోనే లింగయ్య అనే వ్యక్తి తన పొలాన్ని దొంగ డాక్యుమెంట్లు సృష్టించి ఆక్రమించారని రైతు శ్రీనివాసులు ఆరోపించారు. కలెక్టరేట్‌లో ప్రజాదర్బార్‌ సందర్భంగా రైతు శ్రీనివాసులు పురుగుల మందు తాగడంతో వెంటనే స్పందించిన కలెక్టర్‌ ఆఫీసు సిబ్బంది రైతును ఆస్పత్రికి తరలించారు. దీనిపై స్పందించిన కలెక్టర్‌ సత్యనారాయణ బాధితుడికి న్యాయం చేయాలని నంద్యాల ఆర్డీఓను ఆదేశించారు.

15:22 - May 15, 2017

హైదరాబాద్ : ధర్నా చౌక్‌ తరలింపును నిరసిస్తూ అఖిలపక్షం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. అఖిలపక్షానికి వ్యతిరేకంగా స్థానికులు నిరసన చేపట్టడంతో ఘర్షణ తలెత్తింది. ఇందిరాపార్క్‌ లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించిన అఖిలపక్ష నేతలను పోలీసులు అడ్డుకొని.. ఆందోళనకారులపై లాఠీఛార్జి చేసి చెదరగొట్టారు. ఈ ఘర్షణలో పలువురు సీపీఎం, కార్యకర్తలు గాయపడ్డారు. ఈ ఘర్షణల వెనుక ప్రభుత్వం, పోలీసుల హస్తం ఉందని అఖిలపక్ష నేతలు ఆరోపించారు. ప్రశాంతంగా నిర్వహిస్తున్న ఆందోళనలో అలజడి రేపి శాంతిభద్రతల సాకుతో తమ నిరసనను అడ్డుకోవాలని చూస్తున్నారని నేతలు ఆరోపించారు. పలువురు పోలీసులు సైతం సివిల్‌ డ్రెస్‌లో వచ్చి ధర్నాచౌక్‌ను తరలించాలంటూ ఫ్లకార్డులు పట్టుకుని నిరసన తెలపడం విమర్శలకు తావిస్తోంది.
ధర్నాచౌక్‌ ఆందోళనల్లో స్థానికుల ముసుగులో టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ధర్నాచౌక్‌దగ్గర వామపక్ష నేతలపై స్థానికులంటూ దాడులచేసినవారి ఫొటోలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి.. ధర్నాచౌక్‌ దగ్గర ఎల్ బి నగర్‌కు చెందిన రాంకోటి, మాజీ కౌన్సిలర్‌ శాలిని ధర్నాచౌక్‌ను అక్కడినుంచి తొలగించాలంటూ డిమాండ్ చేసినవారిలో ఉన్నారు

గవర్నర్ తో కేసీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్ భవన్ కు వెళ్లారు. అక్కడ ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తో భేటీ అయ్యారు. భేటీకి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

వైసీపీ స్టాండ్ ఏంటో చెప్పాలి - మంత్రి సోమిరెడ్డి..

విజయవాడ : ప్రధాన మంత్రి మోడీతో జగన్ భేటీ కావడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని మంత్రి సోమిరెడ్డి పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై కలిశానని చెప్పి రాజకీయం మాట్లాడారని, మిర్చి రైతుల సమస్యలపై అసెంబ్లీ సమావేశాలు జరగనివ్వనన్న జగన్ ఆ విషయాలను ప్రధాని దగ్గర కనీసం ప్రస్తావించలేదన్నారు. వైసీపీ స్టాండ్ ఏంటో చెప్పాల్సిన బాధ్యత జగన్ పై ఉందని, అవినీతి పరుల విషయంలో మోడీ చండశాసనుడని..కాళ్లు మొక్కితే కనికరం లభించదన్నారు.

 

సాయిశ్రీ మృతిపై సీపీకి ఫిర్యాదు..

విజయవాడ : సాయి శ్రీ మృతిపై సీపీకి బాలిక తల్లి, అఖిలపక్ష నేతలు ఫిర్యాదు చేశారు. ఘటనపై విచారణ జరిపి భర్త, కుమారుడు, మొదటి భార్యపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన ఇంటిని కబ్జా చేసేందుకు ఎమ్మెల్యే బోండా అనుచరులు ప్రయత్నిస్తున్నారంటూ సాయిశ్రీ తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు.

14:33 - May 15, 2017

హైదరాబాద్ : 'సేవ్ ధర్నా చౌక్' కోసం జరుగుతున్న ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పోరాటం చేస్తున్న నేతలు..కార్యకర్తలపై అసాంఘిక శక్తులు దాడి చేశాయి. దీనితో పలువురు గాయాలపాలయ్యారు. మరికొంతమందికి తీవ్రగాయాలయ్యాయి. రక్తస్రావంతో ఉన్న వారిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. అడుగడుగునా ఆటంకాలు సృష్టించడంతో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పాడ్డాయి. తాము శాంతియుతంగానే నిర్వహించామని, పోలీసులే తమపై లాఠీలతో విచక్షణారహితంగా దాడి చేశారని సీపీఎం..ఎస్ఎప్ ఐ నేతలు టెన్ టివికి తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

14:28 - May 15, 2017

హైదరాబాద్ : ధర్నాలు చేసుకొనే స్థలం కోసం ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది..గత కొన్ని రోజులుగా జరుగుతున్న 'సేవ్ ధర్నా చౌక్' పోరాటం జరుగుతున్న సంగతి తెలిసిందే.. సీపీఐ కార్యాలయంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న దీక్షలు ఆదివారంతో ముగిశాయి..దీనితో 15వ తేదీన చలో ఇందిరాపార్కు ఇచ్చిన పిలుపుకు టీఆర్ఎస్ మినహా అన్ని పార్టీలు..ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. కానీ ఈ ధర్నాలో మఫ్టీలో పోలీసులు..ఇతరులు ఉండడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఇందిరాపార్కు వామపక్ష నేతలపై అసాంఘిక శక్తులు దాడి చేయడం తీవ్ర కలకలం రేగింది.
చలో ఇందిరాపార్కుకు అనుమతి లేదని చెప్పిన పోలీసులు సోమవారం ఒక్క రోజుకు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. ఉదయం ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఇక్కడ ధర్నాలు వద్దు..ఇందిరాపార్కు ముద్దు అంటూ స్థానికుల పేరిట టెంటులు వేసుకుని ధర్నా చేపట్టారు. మరోవైపు ఇందిరాపార్కుకు వెళ్లే రెండు మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి ఇలా చేయడం సబబు కాదని పలువురు విమర్శలు గుప్పించారు. ఉదయం 6.30గంటలకు అనుమతినిస్తున్నామని తమకు చెప్పి వాకర్స్ అసోసియేషన్ కు ముందుగానే ఎలా అనుమతినిచ్చారని పలువురు ప్రశ్నిస్తున్నారు. మఫ్టీలో కానిస్టేబుళ్లు ఉండడం పలు విమర్శలకు దారి తీస్తోంది. సీఐ శ్రీదేవి, ఇతర మహిళా కానిస్టేబుళ్లు ధర్నాలో కూర్చొవడం గమనార్హం. జరిగిన ఘర్షణలో సీపీఎం నేత శ్రీనివాస్, ఎస్ఎఫ్ఐ స్టేట్ సెక్రటరీ కోటా రమేష్ లకు తీవ్రగాయాలయ్యాయి.

టెన్ టివి రిపోర్టర్..కెమెరామెన్ లకు గాయాలు..

హైదరాబాద్ : ఇందిరాపార్కు వద్ద జరిగిన తోపులాటలో టెన్ టివి రిపోర్టర్ నారాయణ, కెమెరామెన్ రవికి గాయాలయ్యాయి.

ఇందిరాపార్కు వద్ద ఉద్రిక్తత..

హైదరాబాద్ : ఇందిరాపార్కు వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కుర్చీలు విసురుకుని..కర్రలతో ఇరువర్గాలు కొట్టుకున్నాయి. సీపీఎం నగర కార్యదర్శి శ్రీనివాస రెడ్డి, ఎస్ఎఫ్ఐ స్టేట్ సెక్రటరీ కోటా రమేష్ లకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని కేర్ ఆసుపత్రికి తరలించారు.

అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి - కోదండరాం..

హైదరాబాద్ : స్థానిక సమస్యలు పరిష్కరించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని వారం క్రితమే పోలీసులకు లేఖ ఇవ్వడం జరిగిందని, పోలీసులు తమకు సంబంధం లేన్నట్లు వ్యవహరించడం అన్యాయమన్నారు. తమకు..స్థానికులకు మధ్య గొడవలు లేవన్నారు.

14:00 - May 15, 2017

హైదరాబాద్ : ఇందిరా పార్కు ధర్నా చౌక్‌ పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న వామపక్షాలపై అసాంఘిక శక్తులు దాడి చేయడాన్ని సీపీఐ నేతలు తప్పుపట్టారు. ఈ దాడి వెనుక అధికార టీఆర్ఎస్ నేతల హస్తం ఉందని ఆరోపిస్తున్నారు.

 

13:57 - May 15, 2017

వధువుకు ఘోర అవమానం కలిగింది. వరుడు చేసిన ఆరోపణలు నిజం కాదని వధువు నిరూపించుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని మహోబా జిల్లాలో చోటు చేసుకుంది. ఇటీవల పలు వివాహాలు కొన్ని కొన్ని కారణాలతో ఆగిపోతున్న సంగతి తెలిసిందే. మహోబా జిల్లాకు చెందిన జైహింద్ అనే యువకుడికి..ఓ యువతితో వివాహం కుదిరింది. కాసేపట్లో వధువు మెడలో తాళి కట్టాల్సిన జైహింద్ పెళ్లి వద్దని చెప్పడంతో అందరూ హతాశులయ్యారు. పెళ్లి కూతురికి బొల్లి వ్యాధి ఉందని..అందుకే తనకీ పెళ్లి వద్దని ఖరాఖండిగా చెప్పాడు. తనకు ఎలాంటి చర్మ వ్యాధి లేదని..ఆరోగ్యవంతంగా ఉన్నానని వధువు నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. అమ్మాయి తరపు వారు కూడా నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. కానీ వరుడు ఎంతమాత్రం వినలేదు. పెళ్లి రద్దు చేయాలని వరుడు డిమాండ్ చేయడంతో వధువు తండ్రి వీరిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇరు కుటుంబాలు పీఎస్ కు చేరాయి. వరుడు కుటుంబానికి చెందిన మహిళలతో వధువును ఒక గదిలోకి పంపి తనిఖీ చేయించారు. ఆమెకు ఎలాంటి ల్యూకోడెర్మా లేదని వారు గుర్తించడంతో వరుడు పెళ్లికి అంగీకరించాడు. వధువుపై ఆరోపణలు చేసిన జైహింద్ క్షమాపణలు చెప్పాడు. అతడిపై పెట్టిన కేసును కూడా వాపస్ తీసుకోవడంతో వివాహం జరిగిందని స్టేషన్ హౌస్ ఆఫీసర్ రీటా సింగ్ పేర్కొన్నారు.

13:56 - May 15, 2017

హైదరాబాద్ :ప్రజల పై ప్రభుత్వం దమణకాండ కొనసాగిస్తుందని అరుణోదయ సంస్థ నాయకురాలు విమలక్క ఆరోపించారు. సివిల్‌ డ్రెస్సుల రూపంలో ఉన్న పోలీసులే వామపక్ష కార్యకర్తలపై దాడులు చేశారని, వామపక్షాల కార్యకర్తలు దాడిచేశారనడంలో ఏమాత్రం వాస్తవంలేదని..ఇదంతా ప్రభుత్వమే కుట్ర చేస్తోందన్నారు ఆమె. ఇందిరాపార్క్‌ దగ్గర ఉంటున్న స్థానికులకు ఎలాంటి ఇబ్బంది లేకున్నా ప్రభుత్వం అంతా చేపిస్తుందని విమలక్క ఆరోపించారు.

 

13:49 - May 15, 2017

హైదరాబాద్ : ధర్నా చౌక్ సమస్య ప్రభుత్వమే పరిష్కారించాలని టీ జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. దీని పై ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కోరారు. ఈ రోజు జరిగిన దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పోలీసులు మప్టిలో వచ్చి దాడి చేయడం దారుణమని తెలిపారు. దాడిలో 10 మందికి తీవ్ర గాయాలు అయ్యినట్టు పేర్కొన్నారు. స్థానికులతో తమకు ఎటువంటి విభేదాలు లేవని కోదండరాం తెలిపారు.

13:44 - May 15, 2017

టాలీవుడ్ ప్రిన్స్ 'మహేష్ బాబు' నటిస్తున్న న్యూ ఫిల్మ్ 'స్పైడర్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన లుక్స్ మాత్రమే విడుదలయ్యాయి. షూటింగ్ జరుపుకుని చాలా రోజులు అవుతున్నా చిత్రానికి సంబంధించిన టీజర్ మాత్రం విడుదల కావడం లేదు. దీనితో చిత్రంపై మరింత ఆసక్తిని కలిగిస్తోంది. తాజాగా సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ షూటింగ్ ను పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే 'స్పైడర్' టీజర్ ను మే 31వ తేదీన విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందంట. ఎందుకంటే ఆ రోజు మహేష్ తండ్రి కృష్ణ పుట్టిన రోజు కావడం. అదే రోజున విడుదల చేసి అభిమానులను సంతృప్తి పరచాలని చిత్ర యూనిట్ యోచిస్తున్నట్లు సమాచారం. హేరిస్ బైరాజ్ స్వరాలిందిస్తున్న ఈ చిత్రంలో మహేష్ సరసన రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆ రోజున టీజర్ విడుదలవుతుందా ? లేదా ? అనేది చూడాలి.

13:43 - May 15, 2017
13:41 - May 15, 2017

హైదరాబాద్ : ప్రభుత్వం నిర్బంధ కాండను కొనసాగించినా ధర్నా చౌక్‌ పరిరక్షణ ఉద్యమం ఆగదని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. లాఠీలనైనా, తూటాలనైనా ఎదిరించిన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళతామంటున్నారు.

13:36 - May 15, 2017

మెగాస్టార్ 'చిరంజీవి' మళ్లీ సినిమాలతో బిజీ బిజీగా మారుతుండడంతో అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోతున్నాయి. కొన్ని ఏళ్ల తరువాత ఆయన మళ్లీ మేకప్ వేసుకుని 150వ సినిమా 'ఖైదీ నెంబర్ 150’ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అభిమానులను ఎంతగానే అలరించిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. దీనితో 'చిరు' నెక్ట్స్ సినిమా ఏమై ఉంటుందబ్బా అని అభిమానులే కాక చాలా మంది ఆలోచించారు. చివరకు 'ఉయ్యాలవాడ నరసింహరెడ్డి' జీవిత గాథలో నటించబోతున్నాడని, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ జరుగుతోందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా 'చిరంజీవి' జపాన్ టూర్ కు వెళుతున్నట్లు సోషల్ మాధ్యమాల్లో వార్తలు వెలువడుతున్నాయి. విశ్రాంతి కోసమే ఆయన అక్కడకు వెళుతున్నట్లు టాక్. బుల్లితెరపై వస్తున్న 'మీలో ఎవరు కోటీశ్వరుడు'కి కార్యక్రమానికి సైతం కొద్దిగా విరామం ప్రకటించినట్లు తెలుస్తోంది. అక్కడి నుండి తిరిగి వచ్చిన అనంతరం చిత్ర షూటింగ్ లో పాల్గొననున్నట్లు టాలీవుడ్ టాక్. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్నట్లు కూడా రామ్ చరణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. మరి జపాన్ టూర్ అనంతరం చిరు లుక్ ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయో చూడాలి.

13:30 - May 15, 2017

వరుస హిట్స్ తో తనదైన శైలిలో నటనతో అలరిస్తున్న సీనియర్ హీరో 'అజిత్' న్యూ మూవీ 'వివేగం' రికార్డులు సృష్టిస్తోంది. మాస్ స్పెషలిస్టు శివ దర్శకత్వంలో 'వివేగం' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయస్థాయిలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 11వ తేదీ అర్ధరాత్రి 12.01 గంటలకు విడుదలైన టీజర్ 12 గంటల వ్యవధిలోనే 'కబాలి' టీజర్ వ్యూస్ రికార్డును బద్ధలు కొట్టింది. తాజాగా 'కబాలి' టీజర్ కు సంబంధించిన మరో రికార్డూను సైతం దాటేసింది. ‘కబాలి' టీజర్ విడుదలైన 72గంటల్లో కోటి మంది వీక్షించారు. 68గంటల్లోనే కోటి మంది వ్యూయర్స్ 'వివేగం' టీజర్ ను తిలకరించారు. హాలీవుడ్ స్థాయిలో అద్భుతంగా రూపొందిన ఈ చిత్రంలో అజిత్ లుక్..డైలాగ్స్ లకు అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ‘వివేగం' సృష్టిస్తున్న హంగామాతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ సోషల్ మాధ్యమాల్లో పలు పోస్టులు చేస్తున్నారు. ఆగస్టులో వస్తున్న ఈ చిత్రం ఇంకా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి.

13:29 - May 15, 2017

హైదరాబాద్ : ఛలో ధర్నా చౌక్ ఉద్రిక్తతంగా మారింది. కొంత మంది దుండగులు స్థానికుల ముసుగులో వచ్చి వామపక్షాలపై దాడులు చేశారు. దాడుల్లో వామపక్షాల కార్యకర్తలు గాయాపడ్డారు. దాడి చిత్రికరించడానికి వెళ్లిన టెన్ టివి ప్రతినిధులపై కూడా దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో రిపోర్టరు నారాయణకు, కెమెరామన్ కు తీవ్ర గాయాలయ్యాయి.

కాసేపట్లో అంతర్జాతీయ కోర్టులో కుల్ భూషణ్ కేసు

దీహెగ్ : కాసేపట్లో దీహెగ్ లోని అంతర్జాతీయ కోర్టులో కుల్ భూషణ్ కేసు విచారణకు రానుంది. ఈ కేసును 11 మంది జడ్జీల ఉన్న బెంచ్ విచారించనుంది. భారత్ తరుపున హరీష్ సల్వే వాదించనున్నారు. పాక్ తరపున తహ్ మీన జంజువా వాదానలు వినిపించనున్నారు.

13:19 - May 15, 2017

టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన 'నిఖిల్' వైవిధ్యభరితమైన కథా చిత్రాలు ఎంచుకుంటూ ముందుకెళుతున్నాడు. పెద్ద నోట్ల రద్దు తరువాత రిలీజ్ అయి ఘన విజయం సాధించిన తొలి సినిమా 'ఎక్కడికీ పోతావు చిన్నవాడా’. 'నిఖిల్' హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మంచి వసూళ్లను సాధించటంతో పాటు ఈ యంగ్ హీరో కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ గా నిలిచింది. తన కెరీర్ ను మలుపు తిప్పిన 'స్వామి రారా' చిత్ర దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో 'కేశవ' అనే క్రైం థ్రిల్లర్ తో ముందుకు రాబోతున్నాడు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన లుక్స్..టీజర్ రిలీజయి పిక్చర్ పై మరింత క్యూరియాసిటీ పెంచేసింది. ఈ నెల 19వ తేదీన చిత్ర విడుదలకు ముహూర్తం ఖరారు చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో సినిమాను విడుదల చేయనున్నారు. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'కి ఓవర్సీస్ లో మంచి ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. అందువల్లనే 'కేశవ' పై అక్కడ క్రేజ్ ఎక్కువగా వుంది. మరి ఈ 'కేశవ' ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో వేచి చూడాలి.

12:57 - May 15, 2017

హైదరాబాద్ : ప్రభుత్వం కావాలని అశాంతి సృష్టిస్తుందని సీపీఎం పక్ష నేత సున్నం రాజయ్య అన్నారు. ఈ దాడులకు ప్రభుత్వమే కారణమని అని ఆయన తెలిపారు. ధర్నా చౌక్ తరలించడంపై అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చినట్టు రాజయ్య గుర్తు చేశారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రమేష్ పై దాడిని ఖండిస్తున్నామని అన్నారు.

హవాలా కేసులో మహేష్ అరెస్ట్

విశాఖ : హవాలా కేసులో ఏ1 నిందితుడు మహేష్ ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఇప్పటి వరకు సుమారు రూ.1369 కోట్లు లావాదేవీలు జరిపినట్లు పోలీసులు నిర్ధారణ చేశారు.

12:20 - May 15, 2017

హైదరాబాద్ : ప్రజలకు మధ్య ఘర్షణ చేటుచేసుకునేలా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని టెన్ టివి చర్చలో పాల్గొన్న నవతెలంగాణ ఎడిటర్ వీరయ్య, ప్రొ. హరగోపాల్ అన్నారు. ఇరు వర్గాలకు ఒకేసారి అనుమతివ్వడం వెనక ప్రభుత్వం కుట్ర ఉందని వీరయ్య  తెలిపారు. టీఆర్ఎస్ తప్ప ఏ పార్టీ కూడా ధర్నా చౌక్ ఎత్తివేయాలని కోరలేదని హరగోపాల్ అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

12:15 - May 15, 2017

హైదరాబాద్ : ఛలో ధర్నా చౌక్ భాగంగా వామపక్షా ఆధ్వర్యంలో ర్యాలీ ఇందిరా పార్క్ చేరుకోగానే అక్కడ ఉన్న అసాంఘిక శక్తులు వామపక్షాల పై దాడి చేశాయి. దాడిలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రమేష్ తలకు తీవ్ర గాయం కావడంతో రమేష్ ను ఆసుపత్రికి తరలించారు.

11:57 - May 15, 2017

హైదరాబాద్ : ఇందిరాపార్క్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. స్థానిక ముసుగులో వామపక్షాలపై అసాంఘిక శక్తులు దాడులు చేశారు. కార్యకర్తల పై దాడులకు వ్యతిరేకంగా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నేతలు ఇందిరా పార్క్ చేరుకుంటున్నారు. దాడి అన్ని పార్టీల నేతలు ఖండిస్తున్నారు. ప్రభుత్వం రెండు వర్గాల వారికి ఒకేసారి అనుమతి ఇవ్వడం పై నేతలు గర్షిస్తున్నారు.

 

11:44 - May 15, 2017
11:21 - May 15, 2017
10:48 - May 15, 2017
10:47 - May 15, 2017
10:44 - May 15, 2017
10:41 - May 15, 2017

 హైదరాబాద్ : ఇందిరా పార్కు ధర్నా చౌక్‌ తరలింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీపీఎం డిమాండ్‌ చేసింది. లేకపోతే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించింది. ధర్నా చౌక్‌ తరలిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం అప్రజాస్వామికమని సీపీఎంనేతలు విమర్శిస్తున్నారు.

10:22 - May 15, 2017

హైదరాబాద్ : ఇందిపార్క్ కు పెద్ద ఎత్తున టీ జేఏసీ, వామపక్ష, ప్రజాసంఘాలు ర్యాలీగా బయల్దేరాయి. పోలీసులు ఇవాళ ఒక్కరోజే టీ జేఏసీ ధర్నాకు అనుతిచ్చారు. ఇరువర్గాలు శాంతియుతంగా నిరసన తెలుపుకోవచ్చని సీపీ మహేందర్ రెడ్డి అన్నారు. అలాగే అవాంఛనీయ ఘటనలు జరిగితే మాత్రం చర్యలు తప్పవని సీపీ తెలిపారు. మరోవైపు పోటాపోటీగా టీజేఏసీ, వాకర్స్ అసోషియేసన్ ఆందోళన చేస్తున్నారు. ధర్నా చౌక్ ఎత్తివేయాలని వాకర్స్ అసోషియేషన్ డిమాండ్ చేస్తున్నారు.

నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం

నెల్లూరు : జిల్లా కొడవలూరు మండలం రాజుపాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి గుంటూరు వెళ్తున్న వినాయక ట్రావెల్స్ చెందిన బస్పు ఆగిఉన్న లారీని ఢీ కొట్టింది. బస్సు ఇంజన్ భాగం లారీని ఢీ కొట్టాడంతో బస్సు ఇంజన్ లో మంటు చెలరేగాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు

09:59 - May 15, 2017

నెల్లూరు : జిల్లాలోని విక్రమ సింహపురి యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. గతంలో యూనివర్సిటీ సమస్యల పై విద్యార్థులు పాదయాత్ర చేపట్టారు. పాదయాత్ర చేస్తూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పిలుపు మేరకు పాదయాత్ర అపి పవన్ ను కలిసి సమస్యలు తెపిపారు. స్పందించిన పవన్ ప్రభుత్వం మాట్లాడారు. అయితే యూనిర్సిటీకి వీసీ వచ్చినప్పుడు కారు అడ్డుకున్నారు. దీంతో 14 మంది విద్యార్థులపై కేసులు పెట్టారు. తమపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తూ పెట్రోల్ బాటిళ్లతో ఈ ఆందోళనకు పునుకున్నారు.

09:57 - May 15, 2017

నెల్లూరు : జిల్లా కొడవలూరు మండలం రాజుపాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి గుంటూరు వెళ్తున్న వినాయక ట్రావెల్స్ చెందిన బస్పు ఆగిఉన్న లారీని ఢీ కొట్టింది. బస్సు ఇంజన్ భాగం లారీని ఢీ కొట్టాడంతో బస్సు ఇంజన్ లో మంటు చెలరేగాయి. రోడ్డు పై వెళ్తున్న వారు మంటలను అర్పడంతో పెను ప్రమాదం తిప్పింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ఐదుగురికి గాయాలయ్యాయి. వారిని అసుపత్రికి తరలించారు. డ్రైవర్ బస్సును స్పీడ్ తో నడపటం వల్ల ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

సీఎం చంద్రబాబు పై రోజా ఫైర్

చిత్తూరు : తిరుమలలో సీంఎ చంద్రబాబు పై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. దోచుకున్న సొమ్ము దాచుకునేందుకే సీఎం అమెరికా పర్యటన చేశారని రోజా విమర్శించారు.

భారత్ లో చొరబాటుకు పాక్ యత్నం

పంజాబ్ : గురుదాస్ పూర్ లో చొరబాటుకు పాక్ యత్నం చేసింది. బీఎస్ఎఫ్ జవాన్ల కాల్పుల్లో పాక్ చెందిన చొరబాటుదారుడు మృతి చెందాడు.

 

నేటి నుంచి ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు

హైదరాబాద్ : నేటి నుంచి ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.

09:26 - May 15, 2017
09:25 - May 15, 2017

హైదరాబాద్ : ఇందిరా పార్క్ కు టీ జేఏసీ, వామపక్ష, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున బయలుదేరారు. ఇవాళ ఒక్క రోజు టీ జేఏసీ ధర్నాకు పోలీసులు అనుమతి ఇచ్చారు. మరోవైపు ధర్నాచౌక్ ఎత్తివేయాల్సిందే అంటూ వాకర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. ఇరువర్గాలు పోటాపోటీ ఆందోళన దిగారు.

09:01 - May 15, 2017
08:58 - May 15, 2017
08:57 - May 15, 2017

హైదరాబాద్ : ఇందిరా పార్కు వద్ద టీజేఏసీ ఛలో ధర్నా చౌక్ పోలీసులు అనుమతి ఇచ్చారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు పోలీసులు అగీంకరించారు. ఇవాళ ఒక్క రోజు మాత్రమే ధర్నా చేసుకునేందుకు అనుమతినిచ్చారు. ఇందిరా పార్కు నుంచి పోలీసుల బలగాల ఉపసంహరించారు. ధర్నా చేసే నేతలను అరెస్టులు ఉండవని పోలీసులు ప్రకటించారు.

08:55 - May 15, 2017

ధర్నా చౌక్ సామాన్యుల పోరాట స్ఫూర్తి అని, ప్రభుత్వం ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తున్నారని టెన్ టివిలో పాల్గొన్న వక్తలు అన్నారు. ఈ చర్చలో విశ్లేషకులు తెలపల్లి రవి, టీడీపీ నేత దుర్గాప్రసాద్, వైసీపీ నేత ధర్మశ్రీ, టీఆర్ఎస్ నేత గోవర్థన్ రెడ్డి పాల్గొన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

08:54 - May 15, 2017

ప్రజల అభిప్రాయలను ప్రభుత్వాలు పట్టించుకోకుంటే ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉందని న్యూడెమోక్రసీ నేత రంగారావు అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ధర్నా చౌక్ ద్వారా తెలియజేయాలనికుంటే ప్రభుత్వం మాత్రం ధర్నా చౌక్ లెకుండా చేస్తుందని టెని టివి జనపథంలో పాల్గొన్న ఆయన తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

08:52 - May 15, 2017

విజయవాడ : ఇదే విజయవాడలోని జక్కంపూడి వైఎస్సార్ కాలనీ. అరకొరా సౌకర్యాలతో కాలనీ వాసులు నెట్టుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కాలనీలో ఒక వైన్, ఒక బార్ షాపుకు మద్యం టెండర్లను దక్కించుకున్నారు కొందరు టిడిపి నేతలు. అప్పటి నుంచి కాలనీ వాసుల కష్టాలు మొదలయ్యాయి. భర్తలు సంపాదించిన డబ్బంతా మద్యానికే తగలేయడం.. తాగి హింసించడంతో కాలనీ మహిళలు తట్టుకోలేకపోయారు. రెండు మద్యం దుకాణాలను మూసివేయాలని పెద్ద ఉద్యమమే నిర్వహించారు. రోజుల తరబడి ఆందోళన నిర్వహించినా ఫలితం లేకుండా పోయింది. స్ధానిక ఎమ్మెల్యే, జిల్లా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కూడా మద్యం సిండికేడ్లకే వత్తాసు పలకడంతో అధికారులు కూడా చేతులెత్తేశారు. దీంతో చేసేది లేక కొందరు మహిళలు భర్తల హింస ఓర్చుకుంటే మరికొందరు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు.

సీఎం చంద్రబాబు మాట...
ఈక్రమంలోనే వైఎస్సార్ కాలనీలో జరిగిన జన్మభూమి కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఇదే సమయంగా భావించిన కాలనీ మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి తమ కాలనీలో మద్యం షాపుల ద్వారా పడే బాధలను వివరించారు. వీరి మొర ఆలకించిన చంద్రబాబు తక్షణమే రెండు మద్యం దుకాణాలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో కాలనీ మహిళలు సంబరపడిపోయారు. సరిగ్గా 20 రోజులు కూడా వారికి ఆనందం నిలువలేదు. మళ్లీ మద్యం దుకాణాలు దగ్గరుండి మరీ తెరిపించారు అధికారులు. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేతో పాటు.. జిల్లా మంత్రి చక్రం తిప్పడంతో మళ్లీ షాపులకు అనుమతులు తెచ్చుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో అధికారులు కూడా మద్యం సిండికేట్లనే వెనకేసుకురావడంతో కధ మళ్లీ మొదటికి వచ్చింది. మరోవైపు మద్యం షాపులకు లైసెన్స్ పోతుందని షాపులు తెరిచారని .. మరో మూడు నెలల్లో షాపుల్ని కాలనీ బయటకు షిఫ్ట్ చేస్తారని టిడిపికే చెందిన స్ధానిక సర్పంచ్ రవి చెబుతున్నారు. అధికారులు, నేతలకు ముడుపులు అందాయనే మాట అవాస్తవమని రవి అన్నారు.

మళ్లీ మహిళలకు కష్టాలు
ఇక వైఎస్సార్ కాలనీలో మహిళలకు కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. రోజూ కూలి చేస్తేనే కాని పూట గడవని కుటుంబాల్లో సంపాదించిన డబ్బులు మద్యానికే తగలేస్తుంటే తమ పరిస్థితి దారుణంగా ఉందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబే మాట తప్పితే తమ గోడు ఇంకెవరికి చెప్పుకోవాలని వారు ప్రశ్నిస్తున్నారు. దీనిపై స్ధానిక సీపీఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జన్మభూమి వేదికగా సీఎం చంద్రబాబు తొలగించాలని చెబితే మరలా మద్యం షాపులకు ఎలా అనుమతి ఇచ్చారో సమాధానం చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం సీఎం చంద్రబాబు వరకు వెళ్లిందో ? లేదో? వెళ్తే తిరిగి తన మాటను నిలబెట్టుకుంటారో? లేక లైట్‌గా తీసుకుంటారో? వేచి చూడాలి.

 

08:49 - May 15, 2017

కర్నూలు : కర్నూలు జిల్లా టిడిపి నేత మధ్య వర్గపోరు నడుస్తోంది. జిల్లాకు చెందిన ఐదుగురు వైసిపి ఎమ్మెల్యేలు టిడిపిలో చేరిన తరువాత కోల్డ్ వార్ ముదిరి పాకాన పడింది. మరోవైపు టిడిపి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లు ప్రత్యేకంగా గ్రూపులు కట్టారు. తెలుగుతమ్ముళ్ల గ్రూపు రాజకీయాల వల్ల కర్నూలులో టిడిపి గాడి తప్పే పరిస్ధితులు కనిపిస్తున్నాయి. కర్నూలులో డిప్యూటి సియం కేఈ కృష్ణమూర్తి, రాజ్యసభ సభ్యుడు టిజీ వెంకటేష్, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిలు పైకి కలిసి ఉన్నట్లు కనిపించినా అంతర్గతంగా వార్ నడుస్తోంది. వీరి మధ్య నెలకొన్న కలహాల కారణంగానే ప్రభుత్వం కర్నూలు కార్పొరేషన్ ఎన్నికలను నిర్వహించేందుకు సాహసం చేయట్లేదనే విమర్శలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. రాజ్యసభ టికెట్ విషయంలో టిజీ వెంకటేశ్, మాజీమంత్రి కేఈ ప్రభాకర్ మధ్య నడిచిన వార్ టిడిపిలో కలకలం రేపింది. కేఈ ప్రభాకర్ జిల్లా టిడిపి కార్యాలయం దగ్గర తన అనుచరవర్గంతో ఆందోళనకు దిగడమే కాదు.. పార్టీ అధినేత ..సీఎం చంద్రబాబుపై తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. డిప్యూటీ సీఎం జోక్యంతో ఈ వివాదం సద్దుమణిగినా.. టిజి, కేఈ, ఎస్వీ మోహన్ రెడ్డి వర్గాల మధ్య అంతర్గత పోరు నడుస్తూనే ఉంది.

అఖిల ప్రియ, రాంపుల్లారెడ్డి మధ్య పోరు
అటు ఆళ్లగడ్డలో పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ, ఇరిగెల రాంపుల్లారెడ్డి వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. నంద్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అకాల మరణం తర్వాత పర్యాటక శాఖమంత్రి భూమా అఖిల ప్రియ, ఎమ్మెల్సీ శిల్పా చక్ర పాణి రెడ్డి, శిల్పా మోహన్ రెడ్డిల మధ్య వైరం మరింత పెరిగింది. నంద్యాల ఉపఎన్నిక టికెట్ విషయంలో భూమా, శిల్పా కుటుంబాల మధ్య విపరీతమైన పోటీ నెలకొనడంతో వర్గ విబేధాలు తారా స్దాయికి చేరాయి. మరోవైపు టిడిపి సీనియర్ నేత, మాజీమంత్రి ఎన్.ఎమ్.డి ఫరూక్, శిల్పా బ్రదర్స్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ నంద్యాల రాజకీయాల్లో అగ్గి రాజేస్తోంది.

ఫరూక్ వర్గం....
మరోవైపు మాజీమంత్రి ఎన్.ఎమ్.డి ఫరూక్ వర్గం టిడిపి అధిష్టానం తమ నాయకుడికి ఎటువంటి పదవి ఇవ్వలేదని అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇక కోడుమూరులో ఎమ్మెల్యే మణిగాంధీ, నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ విష్ణువర్దన్ రెడ్డి వర్గాలు నిప్పు ఉప్పులా ఉన్నాయి. టిడిపి సమావేశాలు, ప్రభుత్వ కార్యక్రమాలను మణిగాంధీ, విష్ణువర్దన్ రెడ్డిలు వేరు వేరుగా నిర్వహించడం పార్టీలో చర్చనీయాంశమౌతోంది. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి ల మధ్య కొంతకాలంగా అంతర్గతంగా నెలకొన్న వైరం ఇంకా సద్దుమణగలేదు. దీంతో రెండు వర్గాల మధ్య విబేధాల జ్వాల ఇంకా మండుతూనే ఉంది. మిగిలిన నియోజక వర్గాల్లో టిడిపి ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జులు, ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య విబేధాలు భగ్గుమంటున్నాయి. ఓ వైపు నామినేటెడ్ పదవులు రాక సీనియర్ నేతల్లో నెలకొన్న అసంతృప్తి, మరోవైపు కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు మార్కెట్ యార్డు ఛైర్మెన్ ల ఎంపిక, జెడ్పీ ఛైర్మెన్ మల్లెల రాజశేఖర్ పదవీ కాలం ముగియడంతో, జెడ్పీ పీఠంపై జిల్లా టిడిపి ముఖ్య నేతలు కన్నేశారు. తన వర్గానికే పదవి లక్ష్యంతో పావులు కదపడం వల్ల టీడీపీ నేతల మధ్య వైరం మరింత పెరుగుతోంది. కర్నూలు జిల్లాలో ప్రతికూల పరిస్థితుల మధ్య పార్టీని పట్టాలపైకి ఎక్కించడం ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సవాల్ గా మారింది. మరో రెండేళ్లలో సాదారణ ఎన్నికలు రానున్న నేపథ్యంలో జిల్లా నేతల తీరుపై టిడిపి అధినేత ఎలాంటి సీరియస్ చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

08:47 - May 15, 2017

విశాఖ : విశాఖ కేంద్రంగా బయటపడ్డ హవాలా కుంభకోణం విచారణను సిఐడికి ప్రభుత్వం అప్పగించింది. జాతీయ ఆర్థిక నేరంగా పరిగణించి.. ఫెరా చట్టాన్ని ప్రయోగించారు. దీంతో ప్రపంచంలోని పలు దేశాల్లో విచారణ జరుపుతున్నట్లు విశాఖ పోలీస్‌ ఉన్నతాధికారులు వెల్లడిస్తున్నారు. కేసులో అరెస్టయిన ప్రధాన నిందితుడు వడ్డి మహేష్‌ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. హవాలా వ్యవహారంలో తొమ్మిది మంది 12 బోగస్‌ కంపెనీల పేర 30 బ్యాంకు అకౌంట్లను తెరిపించి 680.94 కోట్లు ఖాతాల్లో వేయించిన విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇంకా ఖాతాల సంఖ్య ఉందా? దీనికి మూలాలేమైనా ఉన్నాయా అన్నది విచారిస్తున్నారు.

20 ఏళ్ల క్రితమే కోల్‌కతాకు
పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం తిరుపతిపురానికి చెందిన వడ్డి శ్రీనివాసరావు 20 ఏళ్ల క్రితమే కోల్‌కతాకు వలస వెళ్లాడు. అక్కడ ఉల్లిపాయల ఏజెంట్‌గా పనిచేసి సంపాదించిన డబ్బుతో శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం కురిడిలో కొంతకాలంగా శ్రీ పద్మప్రియ స్టోన్‌ క్రషర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట క్రషర్‌ నిర్వహిస్తున్నాడు. ఇతని కొడుకు వడ్డి మహేష్‌ కోల్‌కతాలోనే ఉంటూ హవాలా లావాదేవీలు నిర్వహిస్తున్నాడు. బ్యాంకు ఖాతాల ద్వారా డబ్బును విదేశాలకు పంపడంలో దిట్టగా పేరొందాడు.హవాలా వ్యాపారంలో ఆరితేరిన మహేష్‌ విశాఖ కేంద్రంగా బ్యాంకు ఖాతాలు తెరవడం, ఇక్కడి నుంచే వందల కోట్ల డబ్బు పంపడం వెనుక కచ్చితంగా ఉత్తరాంధ్ర రాజకీయ నేతల హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మహేష్‌ తండ్రి శ్రీకాకుళంలోనే ఎందుకు మకాం వేశాడు? కోల్‌కతా నుంచి శ్రీకాకుళానికి ఎందుకు మకాం మార్చాడు? క్రషర్‌ పేరిట అక్కడ ఆయన చేస్తున్న వ్యవహారాలేమిటి? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తునారు. మహేష్, అతని తండ్రి శ్రీనివాసరావుల ఫోన్‌ కాల్‌ లిస్టును పరిశీలిస్తున్నారు.

08:45 - May 15, 2017

గుంటూరు : మంగళవారం నాడు ఏపీ శాసనసభ ప్రత్యేకంగా సమావేశమవుతోంది. జీఎస్టీ బిల్లుకు ఇందులో ఆమోదం తెలుపనున్నారు. అయితే ప్రధాన ప్రతిపక్షం వైసీపీ సభలో ప్రజాసమస్యలపై చర్చకు పట్టుబట్టే అవకాశం కనిపిస్తోంది. అసెంబ్లీ సమావేశాలను పొడిగించాలని... రైతు సమస్యలపై చర్చించాలని ప్రతిపక్ష వైసీపీ డిమాండ్‌ చేస్తోంది. ప్రధానంగా మిర్చి రైతులకు గిట్టుబాటు ధర, ధరల స్థిరీకరణ నిధి కోసం జగన్‌ గతంలో గుంటూరులో రెండురోజుల దీక్ష చేశారు. అసెంబ్లీ సమావేశాల్లోపు మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోతే శాసనసభ సమావేశాలను కూడా జరుగనివ్వబోమని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సభలో మిర్చి రైతుల సమస్యలపై చర్చకు పట్టుబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రత్యేక హోదాపై..
ఏపీకి ప్రత్యేక హోదాపై తీర్మానానికి పట్టుబట్టాలని వైసీపీ యోచిస్తోంది. గతంలోనే ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ శాసనసభ రెండుసార్లు తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. అయితే కేంద్రం మాత్రం ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చే ప్రసక్తే లేదని, ప్రత్యేక సాయాన్ని ప్రకటించింది. అయినప్పటికీ ప్రత్యేక హోదాతోనే ఏపీకి పెట్టుబడులు వస్తాయని, ప్రత్యేక హోదా కేంద్రం ఇచ్చి తీరాల్సిందేనని వైసీపీ పోరాటం చేస్తోంది. అసెంబ్లీ వేదికగా ప్రత్యేక హోదా కోసం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని వైసీపీ భావిస్తోంది. మొత్తానికి ఏపీ ప్రత్యేక సమావేశం వాడీవేడీగా జరిగే అవకాశం కనిపిస్తోంది.

07:05 - May 15, 2017

గుంటూరు :జీఎస్టీ బిల్లుకు ఆమోదం తెలిపేందుకు ఏపీ మంత్రివ‌ర్గం సాయంత్రం ప్రత్యేకంగా సమావేశం కానుంది. జిఎస్టీ బిల్లు ఆమోదం అనివార్యం కావ‌డంతో మొద‌ట ఈ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెల‌పనుంది. ఆ తర్వాత అసెంబ్లీ ఆమోదం కోసం జిఎస్టీ బిల్లును ప్రభుత్వం మంగళవారం సభలో ప్రవేశపెట్టనుంది. అయితే అదే సమయంలో ప్రతిపక్షం ఇత‌ర అంశాల‌పై చ‌ర్చకు ప‌ట్టుప‌డితే అనుస‌రించాల్సిన వ్యూహాలపైనా మంత్రివ‌ర్గ స‌మావేశంలో చ‌ర్చించనున్నారు. జిఎస్టీ బిల్లుతో పాటు మ‌రో రెండు బిల్లులను సభలో ప్రవేశపెట్టే అంశంపైనా కేబినెట్‌ భేటీలో తుదినిర్ణయం తీసుకోనున్నారు. అయితే అసెంబ్లీని ఒక‌రోజే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంగ‌ళ‌వారం ఉద‌యం జ‌రిగే బిఏసి భేటీలో ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశముంది. టీడీపీ శాస‌న స‌భాప‌క్ష స‌మావేశం ఉద‌యం జ‌ర‌గ‌నుంది.

అమెరికా టూర్‌ వివరాలు..
ఇక సీఎం చంద్రబాబు తన అమెరికా టూర్‌ వివరాలు.. అక్కడ కుదుర్చుకున్న ఒప్పందాలు మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రుల‌కు వివ‌రించ‌నున్నారు. వీటితో పాటు రాష్ట్రంలో నెల‌కొన్న నీటి సమస్య పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చ‌ర్చించ‌నున్నారు. మిర్చి ధ‌ర‌ల ప‌త‌నంతో ప్రభుత్వం క‌ల్పించిన మ‌ద్దతు ధ‌ర అందుతున్న తీరును ప్రస్తావిస్తారని సమాచారం. ఇక సిబిఐ కేసును ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ వాకాటి నారాయ‌ణ రెడ్డి స‌స్పెండ్‌పైనా చర్చిస్తారని తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకు జగన్‌ మద్దతిస్తున్నట్లు తెలపడం..తదనంతర పరిణామాలు, బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై చర్చిస్తారని సమాచారం. మరోవైపు ఈనెల 17,18 తేదీల్లో నిర్వహించాల్సిన క‌లెక్టర్ల స‌మావేశ తేదీల్లో మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం . ఈ సమావేశం మ‌హానాడుకు ముందా లేక త‌రువాత అన్నది కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

07:02 - May 15, 2017

గుంటూరు : ఏపీ రాజధాని నిర్మాణంలో కీలకమైన స్టార్టప్ ఏరియా అభివృద్ధిని వేగవంతం చేయడంపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే స్టార్టప్ ఏరియా అభివృద్ధికి స్విస్ చాలెంజ్ విధానానికి పచ్చజెండా ఊపిన సర్కార్.. దానిని ఆచరణలో పెట్టడానికి సిద్దమైంది. రాయపూడి, లింగాయపాలెం, ఉద్దండరాయునిపాలెం, తాళ్లాయపాలం గ్రామాల్లో 1691 ఎకరాల్లో స్టార్టప్ ఏరియాను డెవలప్‌చేసేందుకు.. సింగపూర్ ప్రభుత్వ సంస్థలైన అసెండాస్, సింబ్ బ్రిడ్జి, సెంబ్ కార్ప్ కన్సార్టియంతో ఒప్పందం చేసుకోనుంది. ఇవాళ ఉదయం11 గంటలకు విజయవాడలోని గేట్ వే హోటల్లో సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో, సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్, సింగపూర్ ప్రతినిధులు ఎం.వో.యూ చేసుకోనున్నారు. ఈ కార్యక్రమంలో సింగపూర్ పరిశ్రమల శాఖ మంత్రి ఈశ్వరన్ తో పాటు మరో 30 మంది సింగపూర్ ప్రతినిధులు హాజరవుతున్నారు.

సింగపూర్ కన్సార్టియం
స్టార్టప్ ఏరియా అభివృద్ధిలో భాగంగా 1691 ఎకరాల్లో మౌలిక వసతుల కోసం సింగపూర్ కన్సార్టియం 2118 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయనుంది. మౌలిక వసతుల ఏర్పాటు ద్వారా ప్రపంచంలో వివిధ కంపెనీలను ఇక్కడికి తీసుకోచ్చి ఉద్యోగ కల్పన చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. 3 దశల్లో సింగపూర్ కన్సార్టియానికి ప్రభుత్వం భూమి కేటాయించనుంది. సింగపూర్ కన్సార్టియంతో పాటు ఎపీ ప్రభుత్వం కూడా కొంత మొత్తంలో మౌలిక వసుతుల ఏర్పాటుకు నిధులు ఖర్చు చేయనుంది. అయితే మొదటి దశలో కేటాయించబోయే భూములకు సంబంధించి సింగపూర్ ప్రతినిధులతో ప్రభుత్వం ఎంవోయూ చేసుకోనుంది. ఎంవోయూలు చేసుకున్న తర్వాత స్టార్టప్ ఏరియాలో అభివృద్ధిపనులకు సీఎం చంద్రబాబు భూమి పూజ చేయనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. ఇందుకు సంబంధించి తాళ్లాయపాలెం గ్రామపరిధిలో బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేశారు.

 

తమిళనాడులో ఆర్టీసీ కార్మికుల నిరసనలు

చెన్నై : నేటి నుంచి తమిళనాడులో ఆర్ఠీసీ కార్మిక సంఘాల నిరసనలు తెలపనున్నారు. రూ.7వేల కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ తో ఆందోళన నిర్వహించనున్నారు.

నేడు వైసీఎల్పీ సమావేశం

విజయవాడ : నేడు సాయంత్రం 6 గంటలకు వైసీఎల్పీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు

నేడు మధ్యప్రదేశ్ లో ప్రధాని మోడీ పర్యటన

భోపాల్ : నేడు మధ్యప్రదేశ్ లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. నర్మదానది పునరుద్ధరణ మార్గసూచీని మోడీ అవిష్కరించనున్నారు.

Don't Miss