Activities calendar

16 May 2017

21:30 - May 16, 2017

ఢిల్లీ : మోది సర్కార్‌ విపక్షాలను టార్గెట్‌ చేస్తోందా? ఔనంటున్నారు మాజీ కేంద్రమంత్రులు చిదంబరం, లాలూ ప్రసాద్‌ యాదవ్. తాజాగా తమ నివాసాలపై సిబిఐ, ఐటి దాడులు నిర్వహించడమే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. ఓ మీడియా గ్రూప్‌కు అక్రమంగా అనుమతులిప్పించారన్న కారణంతో చిదంబరం ఇళ్లపై సిబిఐ దాడులు చేయగా... బీహార్‌ మాజీ సిఎం లాలూ కుటుంబం వెయ్యికోట్ల బినామీ ఆస్తులున్నాయన్న ఆరోపణలపై ఐటి సోదాలు నిర్వహించింది. ఈ రెండు ఘటనలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించాయి. చెన్నైలో మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం నివాసంతో పాటు 14 ప్రాంతాల్లో సిబిఐ సోదాలు జరిపింది. చిదంబరం నివాసంతో పాటు ఆయన కుమారుడు కార్తీ చిదంబరం ఇంట్లోనూ సిబిఐ అధికారులు తనిఖీలు చేశారు. విదేశీ పెట్టుబడులు తీసుకునేందుకు ఓ మీడియా గ్రూపునకు లంచం తీసుకుని అనుమతులు ఇప్పించినట్లు కార్తి చిదంబరం సంస్థ ఆరోపణలు ఎదుర్కొంటోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త పీటర్‌ ముఖర్జియా ఆయన భార్య ఇంద్రాణి ముఖర్జియాకు చెందిన ఐఎన్‌ఎక్స్‌ మీడియాకు దొడ్డిదారిలో అనుమతులు మంజూరుచేయించినట్టు కార్తిపై ఆరోపణలున్నాయి. 2008లో అప్పటి ఆర్థికమంత్రిగా ఉన్న చిదంబరం ఈ మీడియా సంస్థకు క్లియరెన్స్‌ ఇచ్చారు. చిదంబరం, ఆయన కుమారుడు భారీగా ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో సిబిఐ కేసు నమోదు చేసింది.

రాజకీయ కక్ష - చిదంబరం..
రాజకీయ కక్షతోనే కేంద్ర ప్రభుత్వం తమను టార్గెట్‌ చేసిందని చిదంబరం ఆరోపించారు. తన గొంతు నొక్కేందుకే దర్యాప్తుల పేరుతో కేంద్ర సిబిఐతో దాడులు చేయించి కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. సిబిఐ దాడులకు తాను భయపడడనని...ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను మాట్లాడుతూనే ఉంటానని చిదంబరం స్పష్టం చేశారు. తానెప్పుడూ చట్టాన్ని ఉల్లంఘించలేదన్నారు. ఇంతకుముందు ఎయిర్ సెల్ , మ్యాక్సిస్ ఒప్పందాల వ్యవహారం కేసులో కార్తీ చిదంబరంపై ఐటీ, ఈడీ వర్గాలు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే.

లాలూ యాదవ్ నివాసంపై..
మరోవైపు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ నివాసాలపై ఆదాయపు పన్నుశాఖ దాడులు నిర్వహించింది. వెయ్యి కోట్ల విలువైన అక్రమ భూ ఒప్పందం జరిగిందన్న ఆరోపణలు రావడంతో ఢిల్లీ గుర్గావ్‌తో పాటు 22 ప్రాంతాల్లో ఐటీశాఖ ఏకకాలంలో సోదాలు చేపట్టింది. లాలూ, ఆయన కుటుంబసభ్యులకు వెయ్యి కోట్ల వరకు బినామీ ఆస్తులున్నాయని బిజెపి నేతలు సుశీల్‌ మోది, కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఆరోపించిన నేపథ్యంలో దాడులు జరగడం గమనార్హం. ఐటి దాడులపై లాలూ ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. బిజెపి కూటమికి శుభాకాంక్షలు...లాలూ దేనికి లొంగడు... భయపడడు...కొన ఊపిరి ఉన్నంతవరకు ఫాసిస్టువాద శక్తులతో తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. బిజెపి లాలూ గొంతు నొక్కాలని చూస్తే... దేశంలో కోట్లాది మంది లాలూలు పుట్టుకొస్తారని మరో ట్వీట్‌ ద్వారా హెచ్చరించారు. బిజెపికి తొత్తుగా వ్యవహరించే మీడియాపై కూడా లాలూ విరుచుకుపడ్డారు. లాలూ వ్యాఖ్యలతో బిహార్‌ మహాకూటమిలో చీలిక తప్పదనికి రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. నితీష్‌ సర్కార్‌ ప్రమాదంలో పడినట్లేనని చెబుతున్నారు. బిహార్‌లో జెడియు, ఆర్జేడి, కాంగ్రెస్‌ మహాకూటమిగా ఏర్పడి నితీష్‌ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. నితీష్‌ ఎన్డీయేలో భాగస్వామి కావాలని బిజెపి ఉవ్వీళ్లూరుతోంది.

తెలంగాణ సచివాలయంలో ఇంటర్నెట్ నిలిపివేత..

హైదరాబాద్ : తెలంగాణ సచివాలయంలో ఇంటర్నెట్ ను అధికారులు నిలిపివేశారు. ర్యాన్సమ్ వేర్ సైబర్ వైరస్ 150 దేశాలను వణికించిన సంగతి తెలిసిందే.

21:21 - May 16, 2017

హైదరాబాద్ : నిరంకుశ, ఫాసిస్టు ఎత్తుగడలతో ... ఉద్యమాలను, ప్రజాస్వామిక గొంతులను అణచడానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అఖిలపక్షం నేతలు మండిపడ్డారు. కుట్రలతో... పోరాటాలు ఆగవని... ప్రభుత్వ వైఖరిని మార్చుకోకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ధర్నాచౌక్‌ వద్ద ఉద్యమకారులపై దాడిని అన్ని వర్గాలు ఖండించాయి. దాడిని వ్యతిరేకిస్తూ మంగళవారం అన్ని జిల్లాల్లో వామపక్ష నేతలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులో సీపీఎం ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో పోలీసులు సీపీఎం కార్యకర్తలను అరెస్ట్‌ చేశారు.

ఆదిలాబాద్..నిజామాబాద్..సిద్ధిపేట..
అలాగే ఆదిలాబాద్‌ జిల్లాలో...వామపక్షాలు, ప్రజా సంఘాలు...స్థానిక బస్టాండ్‌ ఎదురుగా రాస్తారోకో నిర్వహించి..కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రభుత్వ తీరుపై నిజామాబాద్‌లో వామపక్ష నేతలు మండిపడ్డారు. ధర్నా చౌక్‌ ఉద్యమంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, నాయిని నర్సింహారెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అటు సిద్దిపేట జిల్లా కేంద్రం అంబేద్కర్‌ విగ్రహం వద్ద..సీపీఎం నాయకులు నోటికి నల్లగుడ్డ కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.

శ్రీదేవి బదిలీ..
సేవ్‌ ధర్నాచౌక్‌ ఉద్యమానికి...పోటీగా ప్రభుత్వమే మరో కార్యక్రమాన్ని నిర్వహించి.. ప్రజల మధ్య యుద్ధంగా చిత్రించే ప్రయత్నం చేసిందని వామపక్ష నేతలు విమర్శించారు. సీపీఎం కార్యకర్తలపై దాడి సిగ్గు చేటని అన్నారు. హక్కులపై, ఉద్యమాలపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని అన్నారు. ఇదిలాఉండగా... ధర్నా చౌక్ ఆందోళనలో పాల్గొన్న లేక్ వ్యూ పోలీస్ స్టేషన్ సీఐ శ్రీదేవిపై తెలంగాణ పోలీసు శాఖ బదిలీ వేటు వేసింది. మఫ్టీలో పోలీసు విధులు నిర్వహించకుండా ప్లకార్డులు పట్టుకోవడంతో శ్రీదేవిని బదిలీ చేసినట్లు సెంట్రల్ జోన్ డీజీపీ జోయల్ డేవిస్ చెప్పారు. పూర్తి నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు.

21:18 - May 16, 2017

హైదరాబాద్ : కావాల్సినప్పుడు అప్పులిచ్చారు...కావాల్సినంత వడ్డీ తీసుకుంటున్నారు...అప్పు తిరిగి ఇవ్వమంటూ వేధిస్తున్నారు...భర్త లేని సమయంలో వెళ్లిన కాల్‌మనీ కేటుగాళ్లు ఆ ఇల్లాలిని కిడ్నాప్ చేశారు...ఇది ఎక్కడో కాదు...హైదరాబాద్‌ నగరంలో..హైదరాబాద్‌లో మరో కాల్‌మనీ కేసు కలకలం రేపింది...తీసుకున్న అప్పు చెల్లించలేదని ఏకంగా ఆ ఇంటి ఇల్లాలిని కిడ్నాప్ చేశారు వడ్డీ వ్యాపారులు...హైదరాబాద్‌ అంబర్‌పేటలోని ఆర్కిట్‌ అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్‌గా శ్రీనివాస్‌ పనిచేస్తున్నాడు...వడ్డీ వ్యాపారి శ్రీనివాస్‌ వద్ద అవసర నిమిత్తం నాలుగు లక్షల దాకా అప్పు తీసుకున్నాడు..దీనికి వడ్డీ చెల్లిస్తూ వస్తున్నాడు..ఈ మధ్యకాలంలో వడ్డీ చెల్లించలేకపోవడంతో వ్యాపారి నుంచి ఒత్తిడి పెరిగింది..దీంతో తన స్వంత ఊళ్లో రావాల్సిన డబ్బు కోసం వెళ్లగా అదే సమయం చూసుకున్న వడ్డీవ్యాపారి శ్రీనివాస్ తన అనుచరులతో కలిసి వచ్చి వాచ్‌మెన్ భార్య నాగమణిని కిడ్నాప్ చేశారు..కారులో తీసుకువెళ్లగా వారి కొడుకు నుంచి వచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి ప్రత్యేక బృందాలతో శోధించారు..సీసీ ఫుటేజీ ఆధారంగా గుర్తించి వడ్డీ వ్యాపారి శ్రీనివాస్‌తో పాటు ముగ్గురు అనుచరులను అదుపులోకి తీసుకుని.. నాగమణిని విడిపించారు. నగరంలో పెరుగుతున్న వడ్డీ వ్యాపారుల ఆగడాలకు కళ్లెం లేకుండా పోతుంది..ఇందులో కొందరు స్థానిక పోలీసుల సహకారం తీసుకుని మరీ దుర్మార్గాలకు పాల్పడుతున్న ఘటనలు కూడా వెలుగుచూస్తున్నాయి.

21:16 - May 16, 2017

నల్లగొండ : జిల్లా గంధంవారి గూడెంలో టీఆర్‌ఎస్‌ -కాంగ్రెస్‌ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బత్తాయి మార్కెట్‌ శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భారీ ర్యాలీగా రావడంతో.. అక్కడ ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు కోమటిరెడ్డి గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. ఈ ఘటనలో పలు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. జిల్లా ఎస్పీ ప్రకాష్‌రెడ్డి ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఇరువర్గాలను పోలీసులు నియంత్రించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. టీఆర్‌ఎస్‌ కార్యకర్తల దాడిని నిరసిస్తూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్యకర్తలతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. దీంతో సాగర్‌ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. కోమటిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.

21:08 - May 16, 2017

ఖమ్మం : పోలీసులు ప్రతికారం తీర్చుకున్నారు. తమ జవాన్లను పొట్టన పొట్టుకున్న మావోయిస్టులపై ఉక్కుపాదం మోపారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో 15 మంది మావోయిస్టుల హతమయ్యారు. బీజాపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవలే 350 మంది మావోయిస్టులు దాడి జరిపి 25 మందికి పైగా జవాన్లను హతమార్చిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రతికారం తీర్చుకుంటామని కేంద్రం పేర్కొన్న సంగతి తెలిసిందే. మంగళవారం పోలీసులు బీజాపూర్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. కోబ్రా దళానికి చెందిన మావోయిస్టులు ఎదురు పడ్డారు. సుమారు 50 మంది మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం. ఇరువర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. 350 మంది జవాన్లు ఒక్కసారిగా కాల్పులు దాడి జరిపారు. ఇందులో 15 మంది మావోయిస్టులు..ఒక సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందారని, మరొక సీఆర్పీఎఫ్ జవాన్ కు గాయాలైనట్లు ఐజీ దేవేంద్ర చౌహాన్ ప్రకటించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కుప్పంలో పిడుగు పడే అవకాశం..!

విజయవాడ : రాగల 30 నిమిషాల్లో చిత్తూరు జిల్లాలోని కుప్పం (మం) కాకిమడుగు, కొత్తపల్లి గ్రామాల్లో పిడుగు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వాహణ శాఖ హెచ్చరించింది. కుప్పం మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

20:34 - May 16, 2017

ఆరోపణలు వినిపిస్తున్నాయి..కేసులు తిరగతోడుతున్నారు..ఐటీ శాఖ దాడులు చేస్తోంది..అవినీతి అవినీతి అంటూ విరుచుకుపడుతున్నారు..ఇవన్నీ మరొకరి ప్రయోజనాల కోసం జరుగుతున్నాయా? లేక వాటికవే సందర్బానికి తగినట్టు తెరపైకి వస్తున్నాయా? ఏ అడుగుల వెనుక ఎవరి ప్రయోజనాలున్నాయి? విపక్షాలే టార్గెట్ గా పరిణామాలు సాగుతున్నాయా? దీనిపై ప్రత్యేక కథనం..రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువ ఉండదు.. అధికార పక్షం పూనుకుంటే కేసులకు లెక్కాపత్రం ఉండదు.. ఇప్పుడు కనిపిస్తున్న సీన్ ఇదేనా? బీహార్ లో లాలూ, ఢిల్లీలో కేజ్రీవాల్.., తమిళనాట చిదంబరం..ఇలా వరుసకడుతున్న పరిణామాలు ఏం చెప్తున్నాయి? ఏ సంకేతాలిస్తున్నాయి? ఎవరి ప్రయోజనాలు కనిపిస్తున్నాయి? ఎలాంటి సందేహాలు వస్తున్నాయి? చిదంబరం పరిస్థితి ఇలా ఉంటే.. లాలూ ఫ్యామిలీ చిక్కులు మరింత బలంగా కనిపిస్తున్నాయి. ఓ పక్క ఐటి దాడులు... మరోపక్క తిరగదోడుతున్న కేసులు లాలూ కుటుంబాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరి ఇదంతా పద్ధతి ప్రకారం జరుగుతున్నదేనా? లేక అసందర్భంగా కనిపిస్తోందా? ఆరోపణలు వస్తే విచారణ జరగాలి..స్కాముల్లో ఇరుక్కుంటే నిజాల నిగ్గు తేల్చాలి..అక్రమాలు చేస్తే విచారించి నేరం నిరూపణైతే జైల్లో పెట్టాలి.. ఈ విషయాలు ఎవరూ కాదనరు. కానీ, అవి జరుగుతున్న సమయం సందర్భం.. జరుగుతున్న తీరు ఇప్పుడు అనేక ప్రశ్నలకు కారణం అవుతోంది. అటు చిదంబరం అయినా... ఇటు లాలూ కుటుంబమైనా..ఢిల్లీలో కేజ్రీవాల్ అయినా... ఎవరి విషయంలో అయినా.. ఇలాంటి సందేహాలే వస్తున్నాయి. ఈ ఆరోపణల తీరును, వరుసగా జరుగుతున్న దాడిని పరిశీలిస్తే...దీనివెనుక ఎవరి ప్రయోజనాలున్నాయా అనే ప్రశ్నలు రావటం సహజం. అవినీతికి పాల్పడితే.. ఆ నేత ఎంతటివారైనా విచారించి శిక్షించాలి. కానీ, కేంద్రంలో మోడీ సర్కారుపై విరుచుకు పడే నేతలను.. బీజెపీని తట్టుకుని తమ హవా కొనసాగించగల సామర్ధ్యం ఉన్న నేతల చుట్టూ ఇలాంటి ఆరోపణలు ఒక్కసారిగా రావటం.. సీబీఐ, ఐటీ దాడులు, అవినీతి ఆరోపణల గందరగోళం ఏర్పడటంపై అనేక ప్రశ్నలు వస్తున్నాయి. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి..

20:27 - May 16, 2017

తప్పుజేశేది ప్రభుత్వమే.. అధికార్లతోని చేపిచ్చేది ప్రభుత్వమే.. చేయకపోతె చర్యలు దీస్కునేది ప్రభుత్వమే.. కేసీఆర్ను గానీ.. ఆళ్ల కొడ్కును గానీ.. బిడ్డను గానీ.. అల్లున్ని గానీ.. ఏమన్న అన్నరే అన్కో.. మీ నాల్కె శీరేస్తరట..తెలంగాణ కాంగ్రెసోళ్ల పుణ్యాన వాళ్లకు జీవనోపాధికి పర్శానొచ్చిపడ్డది..ప్రతిపక్షాలోళ్లు గడ్కోపారి ఈటెలతోని వొడ్వవట్టే.. అని మన కేసీఆర్ సారు ఏం ప్లాన్ జేశిండో తెల్సా..? సూడుండ్రి..మీర్చీ, వరి, పత్తి అన్నిటిపని అయిపోయింది ఇప్పుడు మామిడి ఒర్గుకొచ్చింది..అత్తగారి ఊరికి వొయ్యి ఎంపీ కవిత ఎట్ల జేశిందో సూడుండ్రి..మెట్రో రైలు స్టేషన్లు.. పట్టాలు.. ఆ బ్రిడ్జిలు అన్ని జూస్తె భయమనిపిస్తున్నదిగదా..? మన క్రీడారంగానికి పోలియో వచ్చిందేమో అనిపిస్తది..గీ గరం గరం ముచ్చట్లు చూడాలంటే వీడియో క్లిక్ చేయండి.

20:23 - May 16, 2017

కల్వకుంట్ల కవితమ్మకు నిజాంబాదు జిల్లా అంటె ఎందుకో ఏమో.. మస్తు ప్రేమ అక్కకు.. ఏ జిల్లాల ఉన్నా... నా నిజాంబాదు జనం ఎట్లున్నరో తిన్నరో లేదో అనే కల్వర పడ్తుంటదట.. నిజమో కాదో తెల్వదిగని.. అక్క పనితనం జూస్తుంటే నిజాంబాదు మీద నిజంగనే ప్రేమున్నట్టుగనిపిస్తుంటది.. అత్తగారి ఊరికి వొయ్యి ఎట్ల జేశిందో వీడియోలో సూడుండ్రి..

20:11 - May 16, 2017

తెలంగాణ భక్త జనులారా..? తెరాసా కార్యకర్తలారా... విపక్ష కుట్రదారులారా..? మూగ జనులారా..? అందరికి ఒక్కటే పారి జేప్తున్న ఇనుండ్రి.. ఇద్వర్ సంది మీరు ఎవ్వలైనా సరే.. కేసీఆర్ను గానీ.. ఆళ్ల కొడ్కును గానీ.. బిడ్డను గానీ.. అల్లున్ని గానీ.. ఏమన్న అన్నరే అన్కో.. మీ నాల్కె శీరేస్తరట.. తెలంగాణ పోరాట యోధుడు తలసాని శీనన్న హెచ్చరిస్తున్నడు ఇని తగు జాగ్రత్తలు దీస్కోండ్రి..

20:04 - May 16, 2017

ఇందిరాపార్కు వద్ద సోమవారం నాడు లాఠీఛార్జీని నిరసిస్తూ సీపీఎం ఆందోళన చేపట్టింది. తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సర్కార్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. లాఠీఛార్జీ చేయడంపై విపక్షాలు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో ఎం.శ్రీనివాస్ (సీపీఎం నగర కార్యదర్శి), తాడూరి శ్రీనివాస్ (టీఆర్ఎస్), విద్యాసాగర్ (టిడిపి), మల్లు రవి (కాంగ్రెస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

20:00 - May 16, 2017

హైదరాబాద్‌ : ధర్నాచౌక్‌ వద్ద పోలీసుల లాఠీచార్జీకి నిరసనగా.. తెలంగాణ వ్యాప్తంగా సీపీఎం కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పలు ప్రాంతాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. సీపీఎం కార్యకర్తలపై దాడులు చేయడం దారుణమని నేతలు ఆరోపించారు. పలుచోట్ల సీపీఎం నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ధర్నా చౌక్‌ ఉద్యమానికి పోటీగా.. ప్రభుత్వం కుట్రతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని సీపీఎం నేతలు ఆరోపించారు. లాఠీచార్జీకి బాధ్యులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం నేతలు డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. భవిష్యత్‌లో టీఆర్‌ఎస్‌కు ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ధర్నా చౌక్‌ వద్ద ధర్నాలు నిర్వహించుకునేందుకు అవకాశాలు కల్పించాలని లేకపోతే.. ధర్నా చౌక్‌ను పరిరక్షించుకునేందుకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నేతలు హెచ్చరిస్తున్నారు.

18:47 - May 16, 2017
18:45 - May 16, 2017

శ్రీకాకుళం : భానుడు విజృంభిస్తున్నాడు. ఎండలు మండుతున్నాయి. భారీ స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఫలితంగా భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. నదులు, బావులు ఎండిపోతున్నాయి. తడి లేక భూములు నోళ్లు తెరుస్తున్నాయి. నీరు లేక ప్రజలు అల్లాడుతున్నారు. సూర్యుడి ప్రతాపానికి... శ్రీకాకుళం జిల్లాలో నదులు ఎడారులుగా మారుతున్నాయి. నదులు, చెరువులు, బావులు నీరు లేక వెలవెలబోతున్నాయి. మూడు నెలల ముందు నీటితో కళకళలాడిన వంశధార, నాగావళి, మహేంద్ర తనయ, బాహుదా నదులు ప్రస్తుతం ఎండిపోయాయి. అలాగే హిరమండలంలోని గొట్టా బ్యారేజీతో పాటు, ఇతర జలాశయాల్లో నీటి నిల్వలు పూర్తిగా పడిపోయాయి. దీంతో జిల్లా వాసులు తాగునీటికి, సాగునీటికి విలవిల్లాడుతున్నారు. నీటి కొరత ఏర్పడిందని జిల్లావాసులు అంటున్నారు. భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు.

భూగర్భ జలాలు..
తీవ్రమైన ఎండలు కారణంగా రణస్థలం, పొందూరు, నరసన్నపేట, లావేరు, ఎచ్చెర్ల లాంటి మండలాల్లో గణనీయంగా భూగర్భజలాలు అడుగంటిపోయాయి. వర్షాభావం వల్ల రెండో పంటలకు పూర్తిగా బోరుబావులు, మోటారు పంపు సెట్లపై ఆధారపడ్డారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. నీటి నిల్వలను ప్రణాళికాబద్ధంగా వాడుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో నీటి నిల్వలను జలాశయాల్లోని స్టోరేజి చేసి...నీటి సంరక్షణ చర్యలు చేపట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని పలువురు అంటున్నారు. ప్రభుత్వం అట్టహాసంగా ఏర్పాటు చేసిన ఇంకుడుగుంతలు, పొలంబడులు, ఇతర జలాశయ నిర్మాణ పనులు కాగితాలకు... కాకిలెక్కలకే పరిమితమవుతున్నాయి. ఇప్పటికైనా నీటి సంరక్షణకు చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

18:29 - May 16, 2017

విజయవాడ : ఎండలు మండుతున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో రెండు రాష్ట్రాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ప్రతిరోజు సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ సచివాలయం అమరావతిలో పచ్చదనం ఉన్నప్పటికీ.. పెద్ద చెట్లు లేకపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో నీడ కోసం ఉద్యోగులు, సిబ్బంది పరుగులు తీస్తున్నారు. భగభగ మండే ఎండల వివరాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

18:28 - May 16, 2017

విజయవాడ : ప్రతిపక్ష వైసీపీ సభ్యులు నిరసనలు, నినాదాల మధ్యే ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీలో రెండు బిల్లులకు ఆమోదం లభించింది. జీఎస్‌టీ బిల్లుతోపాటు రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన టెన్నిస్‌ క్రీడాకారిణి పీవీ సింధుకు గ్రూప్‌ వన్‌ సర్వీసులో ఉద్యోగం ఇచ్చేందుకు వీలు కల్పించే ఏపీ పబ్లిక్‌ సర్వీసెస్‌ అపాయింట్‌మెంట్స్‌ చట్ట సవరణ బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ 45 నిమిషాల్లో ముగిసింది. ఉదయం 9.45 గంటలకు ప్రారంభమైన సభ పదిన్నర గంటలకు ముగిసింది. ముప్పావు గంటపాటు జరిగిన సభలో రెండు బిల్లులకు ఆమోదం లభించింది. జీఎస్‌టీ బిల్లుతోపాటు, ఏపీ పబ్లిక్‌ సర్వీసెస్‌ అపాయింట్‌మెంట్స్‌ చట్ట సవరణ బిల్లును ఆమోదించింది. అలాగే ఇటీవల మరణించిన మాజీ శాసనసభ్యులు దేవినేని నెహ్రూ, ఆరేటి కోటయ్య, రుక్మిణి, బీ నారాయణరెడ్డిలకు అసెంబ్లీ సంతాపం ప్రకటించింది.

చర్చలో పాల్గొనని వైసీపీ..
రైతు సమస్యలను సభలో చర్చించాలని కోరుతూ ప్రతిపక్ష వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు తిరస్కరించారు. దీనిని నిరసిస్తూ ప్రతిపక్ష సభ్యులు స్పీకర్‌ పొడియం వద్దకు వెళ్లిన ప్లకార్డులు ప్రదర్శించి, నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. ప్రతిపక్ష సభ్యుల నినాదాల మధ్యే ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు జీఎస్‌టీ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. బీజేపీ, టీడీపీ సభ్యులు చర్చలో పాల్గొన్నారు. ముందుగా రైతు సమస్యలను చర్చించాలని పట్టుపడుతూ సభా కార్యక్రమాలను అడ్డుకున్న వైసీపీ సభ్యులు చర్చలో పాల్గోలేదు. ప్రతిపక్ష సభ్యుల నినాదాల మధ్యే ఈ బిల్లుపై జరిగిన చర్చకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత ఈ బిల్లును ఆమోదించింది.  జీఎస్‌టీ బిల్లును ఆమోదించిన తర్వాత ఏపీ పబ్లిక్‌ సర్వీసెస్‌ అపాయింట్‌మెంట్స్‌ చట్ట సవరణ బిల్లును ఆర్థిక మంత్రి యనమల సభలో ప్రవేశపెట్టారు. రియో ఒలింపిక్స్‌ టెన్నిస్‌లో రజత పతకం సాధించిన పీవీ సింధుకు గ్రూప్‌ వన్‌ సర్వీసులో డిప్యూటీ కలెక్టర్‌గా నియమించేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. ప్రతిపక్ష వైసీపీ సభ్యులు నినాదాల మధ్యే ఈ బిల్లును కూడా అసెంబ్లీ ఆమోదించింది. ఏపీ పబ్లిక్‌ సర్వీసెస్‌ అపాయింట్‌మెంట్స్‌ చట్ట సవరణ బిల్లును ఆమోదించిన తర్వాత స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేశారు.

18:21 - May 16, 2017

యాదాద్రి భువనగిరి : జిల్లా పల్లెర్లకు చెందిన నరేశ్ మిస్సింగ్ కేసు అనూహ్యంగా మలుపు తిరిగింది. నరేశ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న స్వాతి మంగళవారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మరణించింది. నరేశ్ ఆచూకీ కనిపెట్టాలని అతని తల్లితండ్రులు కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో స్వాతి మరణం ఇప్పుడు సంచలనంగా మారింది. నరేశ్ అదృశ్యం నుంచి స్వాతి మరణం వరకు యువతి తండ్రిపైనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా పల్లెరకు చెందిన నరేశ్ మిస్సింగ్ కేసు కొత్త మలుపు తిరిగింది. నరేశ్ ప్రేమించి పెళ్లాడిన స్వాతి అనుమానాస్పద స్థితిలో మరణించింది. తమ కుమార్తె మంగళవారం తెల్లవారు ఝామున బాత్రూమ్ లో చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని స్వాతి తల్లిదండ్రులు చెబుతున్నారు. స్వాతి ఆత్మహత్యకు యత్నించినట్లు చెబుతున్న బాత్రూమ్ ఎత్తు తక్కువగా ఉండటం.. చున్నీ కూడా కిందవరకూ వేలాడుతూ ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. మొదట్నుంచి స్వాతి ప్రేమ వ్యవహారం గిట్టని ఆమె తండ్రి శ్రీనివాసరెడ్డిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వివాహం.. ఆ తరువాత రద్దు..
యాదాద్రి భువనగిరి జిల్లా పల్లెరకు చెందిన నరేశ్, లింగరాజుపల్లికి చెందిన స్వాతి డిగ్రీ చదువుకునేటప్పుడు ప్రేమలో పడ్డారు. 2015లో డిగ్రీ పూర్తి చేసిన నరేష్ ముంబయిలోని తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లాడు. ఆ తర్వాత కూడా స్వాతితో ప్రేమను కొనసాగించాడు. ఈ క్రమంలో మార్చి 16న.. నల్లగొండ జిల్లా , చిట్యాలలో ఓ శుభకార్యానికి వచ్చిన నరేశ్‌.. అదే పెళ్లికి వచ్చిన స్వాతిని ముంబై తీసుకెళ్లాడు. మార్చి 25న బాంద్రా కోర్టును ఆశ్రయించి కులాంతర వివాహం చేసుకున్నాడు. స్వాతి తండ్రి మాత్రం.. తన కూతుర్ని కిడ్నాప్ చేశారంటూ నరేశ్‌పైనా, అతని తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులపైనా ఫిర్యాదు చేశాడు. అంతటితో ఆగకుండా, నరేశ్‌ కుటుంబ సభ్యులను పలురకాలుగా ఇబ్బంది పెట్టారని తెలుస్తోంది. దీంతో, స్వాతి, నరేశ్‌లు వివాహాన్ని రద్దు చేసుకునేందుకు అంగీకరించినట్లు సమాచారం.

స్వాతి మరణం..
ఏప్రిల్‌ 2న స్వాతి ముంబై వెళ్లిపోయి భర్త నరేశ్‌తో కలిసి వేరుకాపురం పెట్టించింది. విషయం తెలిసి నరేశ్‌ తల్లిదండ్రులు వారిని తమ ఇంటికే తీసుకు వెళ్లారు. ఈ క్రమంలో.. వారి పెళ్లిని తానూ అంగీకరిస్తున్నానని, ఊరికి రమ్మనడంతో, నరేశ్‌, స్వాతిలు మే 2న ముంబై నుంచి భువనగిరి బయలుదేరారు. అంతే, స్వాతి పుట్టిల్లు చేరింది కానీ, నరేశ్‌ ఆచూకీ లేకుండా పోయాడు. ఆందోళన చెందిన నరేశ్‌ తల్లిదండ్రులు, కోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేశారు. నరేశ్‌ మిస్సింగ్‌ కేసు నివేదికను సమర్పించడంతో పాటు, స్వాతినీ కోర్టులో హాజరుపరచాలని హైకోర్టు పోలీసు శాఖను ఆదేశించింది. బుధవారం కోర్టుకు హాజరు కావాల్సిన తరుణంలో.. స్వాతి అనుమానాస్పద స్థితిలో మరణించింది. నరేశ్ మిస్సింగ్ కేసులో అతని తల్లితండ్రులు సైతం స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డి పైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కులం తక్కువనే కారణంతోనే.. స్వాతి తండ్రి నరేశ్‌, స్వాతిల పెళ్లిని అంగీకరించలేదని వారు ఆరోపిస్తున్నారు ఏదేమైనా నరేశ్ అదృశ్యం గుట్టు తేలకముందే.. స్వాతి మరణం మరో మిస్టరీకి తెరలేపింది.

సోనియాతో మమత భేటీ..

ఢిల్లీ : కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సమావేశమయ్యారు. రాష్ట్రపతి ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆమె సోనియాతో చర్చిస్తున్నారు.

17:25 - May 16, 2017

నల్గొండ : బత్తాయి మార్కెట్ శంకుస్థాపనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీఆర్ఎస్ కార్యకర్తలు..కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్ల దాడి చేసుకోవడంతో పరిస్థితి అదుపుతప్పింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.
బత్తాయి మార్కెట్ జిల్లాకు మంజూరైంది. శంకుస్థాపనకు మంగళవారం ముహూర్తం నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు హాజరు కానున్నారు. ఈ సభకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భారీ ర్యాలీగా తరలివచ్చారు. బత్తాయి మార్కెట్ రావడానికి చాలా కాలంగా పోరాటం చేశానని పేర్కొంటూ ర్యాలీ నిర్వహించారు. సభా వేదిక వద్దకు రాగానే ఒక్కసారిగా టీఆర్ఎస్ కార్యకర్తలు కోమటిరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నినదించారు. దీనితో శంకుస్థాపన చేసే స్థలం వద్ద కోమటిరెడ్డి బైఠాయించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి కోమటిరెడ్డికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. చివరకు ఎస్పీ ఫోన్ లో ఎమ్మెల్యే కోమటిరెడ్డితో మాట్లాడారు. అక్కడ నుండి కోమటిరెడ్డి వెళ్లిపోతుండగా టీఆర్ఎస్ కార్యకర్తల శిబిరం నుండి రాళ్లు పడ్డాయి. ఏమి జరుగుతుందో అర్థం కాలేదు. తొక్కిసలాట జరగడంతో కోమటిరెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతిదాడి జరిపారు. దాడుల్లో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.

17:18 - May 16, 2017

హైదరాబాద్ : కాల్ మనీ కేసులు అప్పుడప్పుడూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అప్పు చెల్లించలేదని ఓ వ్యక్తి భార్యను వడ్డీ వ్యాపారి ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన అంబర్ పేట పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. అంబర్ పేటో ఓ అపార్ట్ మెంట్ లో వాచ్ మెన్ గా శ్రీనివాస్, నాగమణి దంపతులు నివాసం ఉంటున్నారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా శ్రీనివాస్ అనే వడ్డీ వ్యాపారి వద్ద రూ. 4లక్షలు తీసుకున్నాడు. పది శాతం వడ్డీతో ఈ డబ్బును శ్రీనివాస్ తీసుకున్నాడు. నెల నెలా వడ్డీ చెల్లిస్తూ వస్తున్నాడు. కానీ కొన్ని ఇబ్బందులతో వడ్డీని శ్రీనివాస్ చెల్లించకపోయాడు. వడ్డీ చెల్లించాలని శ్రీనివాస్ వాచ్ మెన్ పై వత్తిడి తెచ్చాడు. తాను త్వరలోనే డబ్బు చెల్లిస్తానని వాచ్ మెన్ పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో అతను నివాసం ఉంటున్న ప్రాంతానికి వడ్డీ వ్యాపారి..తన అనచరులతో చేరుకున్నాడు. ఆ సమయంలో తన భర్త ఊర్లో లేడని వచ్చిన తరువాత మాట్లాడుతాడని నాగమణి చెప్పింది. తీవ్ర ఆగ్రహానికి గురైన వడ్డీ వ్యాపారి శ్రీనివాస్..నాగమణిని బలవంతంగా కారులో తీసుకెళ్లాడు. ఇదంతా చూసిన నాగమణి కుమారుడు అంబర్ పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజ్ లు పరిశీలించారు. నిజామాబాద్ వైపుకు వెళుతోందని గ్రహించి అక్కడకు వెళ్లి
నాగమణిని విడిపించారు. వడ్డీ వ్యాపారి శ్రీనివాస్ ను అతని అనచురులను అదుపులోకి తీసుకున్నారు.

బత్తాయి మార్కెట్ శంకుస్థాపన ఉద్రిక్తత..

నల్గొండ : బత్తాయి మార్కెట్ శంకుస్థాపన సభ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సభకు భారీ ర్యాలీగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేరుకున్నారు. అక్కడనే ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలకు కోమటిరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి.

వేములవాడలో రైతుల ఆగ్రహం..

రాజన్న సిరిసిల్ల : వేములవాడలో రైతులు ఆగ్రహించారు. లారీలు లేక ధాన్యం కొనుగోళ్లు చేయకపోవడంతో కోనరావుపేట మండల రైతుల ఆందోళన నిర్వహిస్తున్నారు. వేములవాడ - నాంపల్లి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఇసుక లారీలను అడ్డుకుంటున్నారు.

 

16:45 - May 16, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో రెండు రాష్ట్రాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ప్రతిరోజు సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 45 డిగ్రీలు, రాత్రివేళల్లోనూ 35 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రత ఉంటోంది. తీవ్రమైన పగటి ఉష్ణోగ్రతల కారణంగా భూమి సెగలు కక్కుతోంది. దీంతో ప్రజలు బయటకు వచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10 గంటల నుంచే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. మరోవైపు బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు తదితర ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వం.. అవేమీ పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఖమ్మం జిల్లాలో ఎండలు మండతున్నాయి. సింగరేణి ప్రాంతంలో 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు ఎండలు మండుతున్నా.. ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ప్రజలు వాపోతున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

16:43 - May 16, 2017

ఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరం నివాసాల్లో సీబీఐ దాడులు చేసింది. చెన్నైలోని చిదంబరం, కార్తీ నివాసాలతో పాటు మొత్తం 14 చోట్ల దాడులు నిర్వహించింది. 2008లో చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో ఐఎన్‌ఎక్స్‌ మీడియా గ్రూప్‌కు ఫారిన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డ్ క్లియరెన్స్‌ ఇవ్వడంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఇందుకోసం చిదంబరం, ఆయన కుమారుడు భారీగా ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో సీబీఐ కేసు నమోదు చేసింది. ప్రభుత్వం కావాలనే తనను టార్గెట్‌ చేసిందని చిదంబరం ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకుండా సీబీఐని తీసుకొచ్చి తన నోరు నొక్కేస్తోందని విమర్శించారు. ఇలాంటి దాడులకు తాను భయపడడనని...ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను మాట్లాడుతూనే ఉంటానని చిదంబరం స్పష్టం చేశారు.

16:41 - May 16, 2017

ఢిల్లీ : కేంద్రంలో మోది ప్రభుత్వం మూడేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బిజెపి నిర్వహించనున్న సంబరాలపై కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు. మూడేళ్లలో ఏం సాధించారని మీరు సంబరాలు జరుపుకోవాలని అనుకుంటున్నారని ఆయన ట్విట్టర్‌లో ప్రశ్నించారు. ఓవైపు ఉద్యోగాల కోసం యువత నిరీక్షిస్తోంది.. మరోవైపు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు... దేశ సరిహద్దులో జవాన్లు ప్రాణాలు కోల్పోతున్నారు... పరిస్థితి ఇలా ఉంటే సంబరాలు జరపడమేంటని రాహుల్‌ మండిపడ్డారు. ఈ మూడేళ్లలో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని... పేలవ ప్రదర్శనతో ప్రజలకు ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగ మోదీ ఫెస్ట్‌ పేరుతో సంబరాలు నిర్వహిస్తామని బిజెపి ప్రకటించింది. మే 26న ప్రధాని నరేంద్రమోదీ గువహటిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

16:24 - May 16, 2017

కామారెడ్డి : తెలంగాణ రాష్ట్రంలో రైతుల మరణాలు పెరిగిపోతున్నాయి. గిట్టుబాటు ధర లేక..ధాన్యం అమ్ముడుపోక..ఇతరత్రా కారణాలతో తీవ్ర మనస్థాపానికి గురైన రైతుల గుండెలు ఆగిపోతున్నాయి. ఎంపీ కవిత ఇలాఖాలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పసుపు రైతు మృతి చెందిన వార్త మరిచిపోకముందే మరో రైతు మృత్యువాత పడ్డాడు. బీబీపేట మండలం జనగామకు చెందిన ఆకుల పోచయ్య తాను పండించిన పంటను విక్రయించడానికి కొనుగోలు కేంద్రానికి వచ్చాడు. కానీ అక్కడ ధాన్యం కొనుగోలు చేయడం లేదు. ఇదే విషయాన్ని అధికారులకు తెలియచేసినట్లు సమాచారం. కోనుగోలు కేంద్రం వద్ద ఆరు రోజులుగా పడిగాపులు పడ్డాడు. ఇటీవలే భారీ వర్షం పడడంతో వడ్లు తడిచిపోవడంతో ఆకుల పోచయ్య తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. తన ధాన్యం కొనుగోలు అవుతుందో లేదో అని తీవ్ర మనస్థాపానికి గురి కావడం..ఎండల తీవ్రతతో వడదెబ్బతో వరి కుప్పలపైనే కుప్పకూలిపోయాడు. ఆకుల పోచయ్య రైతు మృతి చెందాడని తెలుసుకున్న రైతులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్ర వద్ద ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయడం లేదని, ధాన్యం కొనుగోలు చేయాలని..మరో రైతుకు ఇలాంటి పరిస్థితి రాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన ఆకుల పోచయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని, రూ. 10 లక్షల పరిహారం అందించాలని కోరుతున్నారు.

16:16 - May 16, 2017

విజయవాడ : ప్రకాశం బ్యారేజీ వద్ద మంగళవారం మధ్యాహ్నం గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎలాంటి సమాచారం లేకుండానే గేట్లను ఎత్తివేయడం..నీరు కిందకు పోతుండడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఈ గేట్లను ఓ అపరిచిత వ్యక్తి ఎత్తివేశాడు. వివరాల్లోకి వెళితే...ప్రకాశం బ్యారేజీ వద్ద విధులు నిర్వహిస్తున్న అధికారులు భోజనానికని మధ్యాహ్నం వెళ్లారు. ఇదే సమయంలో ఓ వ్యక్తి కంట్రోల్ ప్యానల్ లోకి ప్రవేశించాడు. స్విచ్ లు ఆన్ చేయడంతో 58 ,59 గేట్లు తెర్చుకుని నీరు కిందకు ప్రవేశించింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆ గేట్లను మూయించారు. అప్పటికే నీరు దిగువకు చేరింది. దిగువ ప్రాంతంలో ఉన్న గుడిసెలు నీటిలో కొట్టుకపోయాయి. రాకపోకలు స్తంభించిపోయాయి. వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గేట్లను ఎత్తివేసిన వ్యక్తిని పట్టుకుని వన్ టౌన్ పీఎస్ లో అప్పగించారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన బంగారు బాబుగా గుర్తించారు. ఇతనికి మతిస్థిమితం లేదని తెలుస్తోంది.

కామారెడ్డిలో రైతు మృతి..

కామారెడ్డి : జిల్లాలో ఓ రైతు మృతి చెందడం తీవ్ర కలకలం రేగింది. ఆరు రోజులుగా ధాన్యం అమ్మేందుకు బీబీపేట మండలం జనగామకు చెందిన ఆకుల పోచయ్య రైతు కొనుగోలు కేంద్రం వద్ద వేచి చూస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం ఆకుల పోచయ్య తీవ్రమైన వడదెబ్బతో మృతి చెందాడు.

పోలవరం స్పెషల్ కలెక్టర్ ఆఫీసుపై ఏసీబీ దాడి..

తూర్పుగోదావరి : పోలవరం స్పెషల్ కలెక్టర్ కార్యాలయంపై ఏసీబీ దాడులు నిర్వహించింది. రూ. 3 లక్షలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా సీనియర్ అసిస్టెంట్ ప్రకాష్ పట్టుబట్టాడు.

కమర్షియల్ ట్యాక్స్ శాఖపై కేసీఆర్ సమీక్ష..

హైదరాబాద్ : కమర్షియల్ ట్యాక్స్ శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష జరిపారు. ఈ సమావేశాల్లో మంత్రి ఈటెల, సీఎస్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. బోధన్ సర్కిల్ లో ఫోర్జరీ మ్యానువల్ చలాన్ల ఘటనపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. సమగ్ర దర్యాప్తు దోషులను శిక్షించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు టి.బడ్జెట్ !..

హైదరాబాద్ : కేంద్రం ఆలోచనా విధానానికి అనుగుణంగా జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు బడ్జెట్ ప్రవేశ పెట్టాలని తెలంగాణ సర్కార్ యోచిస్తోంది. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ చర్చలు జరిపారు. ఇప్పటికే ఈ విధానాన్ని మధ్యప్రదేశ్ అమలు చేస్తోంది. ఈ విధానంపై అధ్యయనానికి మధ్యప్రదేశ్ వెళ్లాలని మంత్రి ఈటెల, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణరావు, ఇతర అధికారుల బృందానికి కేసీఆర్ సూచించారు.

పవన్ కు అవగాహన లేదంట..

విజయవాడ : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మార్కెటింగ్ శాఖ మంత్రి ఆది నారాయణరెడ్డి విమర్శించారు. మిర్చి రైతుల విషయంలో మార్కెటింగ్ శాఖ వైఫల్యం చెందలేదని, 40 రోజుల ట్రేడింగ్ హాలిడేను 20 రోజులకు కుదించినట్లు, కేంద్ర ప్రభుత్వం 8 లక్షల క్వింటాళ్లను మాత్రమే రూ. 5వేలకు కొనుగోలు చేస్తామని చెప్పిందన్నారు. వైసీపీ ఎంపీలు రాజీనామా చేసి తిరిగి పోటీ చేస్తే కడప ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డిని కూడా ఓడిస్తామన్నారు.

 

ప్రకాశం బ్యారేజీ గేట్లను ఎత్తిన వ్యక్తి..

విజయవాడ : ప్రకాశం బ్యారేజీ గేట్లను ఓ అపరిచిత వ్యక్తి ఎత్తివేశాడు. స్థానికులు ఇరిగేషన్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే బ్యారేజీ గేట్లను కిందకు దించడంతో బ్యారేజీ దిగువ ప్రాంతానికి ముప్పు తప్పింది. గేట్లను ఎత్తిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

15:29 - May 16, 2017

హైదరాబాద్ : సీఎం క్యాంప్‌ ఆఫీస్ సమీపంలో ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గద్వాల జోగులంబ జిల్లా గట్టు మండలం ఆలూరు గ్రామానికి చెందిన మల్లేష్‌.. తనకు ఉన్న రెండెకరాలలో ఐదు బోర్లు వేసినా చుక్కనీరు పడలేదు. మరోవైపు వ్యవసాయానికి 5 లక్షల రూపాయలు అప్పు అయ్యింది. కలెక్టర్‌ దగ్గర న్యాయం జరగకపోవడంతో.. సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు హైదరాబాద్‌ వచ్చాడు. ఎన్నిసార్లు ప్రయత్నించినా సీఎంను కలిసే అవకాశం రాకపోవడంతో.. క్యాంప్‌ ఆఫీసు ఎదుట ఉన్న ఫ్లైఓవర్‌ కింద పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది మల్లేష్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్యాయత్నం చేశానని మల్లేష్‌ తెలిపాడు.

 

15:27 - May 16, 2017

బీహార్ : లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఇళ్లపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. బీహార్‌లో మొత్తం 22 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. లాలూ కుటుంబం బినామీ ఆస్తులపై ఐటీ సోదాలు చేస్తోంది. ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి సోదాలు కొనసాగుతున్నాయి.

15:25 - May 16, 2017

ఢిల్లీ : ట్రిపుల్‌ తలాక్‌ సంప్రదాయం 14 వందల ఏళ్లుగా కొనసాగుతున్న ఓ విశ్వాసమని ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు నేడు సుప్రీంకోర్టుకు తెలిపింది. ముస్లిం లా బోర్డు తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబాల్‌ తన వాదనలు వినిపించారు. 14 వందల ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం ఇస్లాంకు ఎలా వ్యతిరేకమవుతుందని సిబాల్‌ వాదించారు. ఇది మతవిశ్వాసాలకు సంబంధించిన అంశమని అలాంటప్పుడు రాజ్యంగ బద్ధత, సమానత్వం అనే ప్రశ్నే తలెత్తదని కపిల్‌ సిబాల్‌ పేర్కొన్నారు. భగవంతుడైన రాముడు అయోధ్యలో జన్మించారని హిందువులు ఎలా నమ్ముతున్నారో.. అలాగే ట్రిపుల్‌ తలాక్‌ను కూడా ముస్లింలు విశ్వసిస్తున్నారని సిబాల్‌ అన్నారు. ట్రిపుల్‌ తలాక్‌పై సుప్రీంకోర్టులో నాలుగో రోజు విచారణ కొనసాగుతోంది. భారత ప్రధాన న్యాయమూర్తి ఖేహార్‌ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఆరు రోజుల పాటు ఈ అంశంపై విచారించనుంది.

15:24 - May 16, 2017

చిత్తూరు : గంగమ్మ జాతర వేడుకలు వైభవంగా జరిగాయి. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో చిత్తూరు బజారు వీధి సందడిగా మారింది. పలు వేషధారణలతో వచ్చిన భక్తులు అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు ఇబ్బంది పడకుండా ఆలయ అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు.

గుంటూరులో @47 డిగ్రీలు..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగలు అధికమయ్యాయి. గుంటూరు, విజయవాడలో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యధికంగా 47 డిగ్రీల ఎండ నమోదు కావడం గమనార్హం. బయటకు రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు. గంట..గంటకూ ఎండల తీవ్రత అధికమౌతోంది. గుంటూరు 47, విజయవాడ 45, ఒంగోలు, నెల్లూరులో 44, ఏలూరు, రాజమండ్రిలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

 

అనకాపల్లిలో @42 డిగ్రీలు..

విశాఖపట్టణం : ఈ సీజన్ లో గరిష్టంగా అనకాపల్లిలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీనితో అనకాపల్లి పట్టణ వీధులు నిర్మానుష్యంగా మారిపోయాయి.

మరో రెండు రోజులు వడగాలులు..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో మరో 24గంటల పాటు ఎండలు అధికం కానున్నాయి. మరో రెండు రోజులు వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. సాధారణం కన్నా 2 నుండి 5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు అధికం కానున్నాయి.

 

సోమేష్ కుమార్ కు సీఎం కేసీఆర్ ఆదేశాలు..

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాల్లోని ఉద్యోగులను బదిలీ చేయాలని సోమేష్ కుమార్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. అవినీతి విషయంలో రాజీ పడొద్దని, అక్కడక్కడ అవినీతి ఘటనలు జరుగుతున్నాయన్నారు. అవి గత ప్రభుత్వాల నిర్వాకమేనని, మంచితనాన్ని అలసత్వంగా తీసుకోవద్దన్నారు. భవిష్యత్ లో అవినీతికి ఆస్కారం లేని సమాజాన్ని తీసుకరావాలని సూచించారు.

 

విద్యను వ్యాపారం చేశారు - వంశీచంద్ రెడ్డి..

హైదరాబాద్ : పేద, మధ్య తరగతి విద్యార్థులకు విద్యనందుకుండా ప్రభుత్వం చేస్తోందని, కేసీఆర్ కుటుంబం విద్యను వ్యాపారంగా మార్చిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం విద్యా సంస్థలను నిర్వీర్యం చేశారని, ఇందులో భాగంగానే ప్రయివేటు వర్సిటీ బిల్లు తెచ్చారన్నారు. వీసీల నియామకంలో గవర్నర్ కు హక్కు లేకుండా చేశారని తెలిపారు.

 

పోచారం డ్యాన్సులు సిగ్గు చేటు - జీవన్ రెడ్డి..

జగిత్యాల : ధాన్యం కేంద్రాల్లో రైతులు పడిగాపులు కాస్తుంటే మంత్రి పోచారం డ్యాన్సులు చేయడం సిగ్గు చేటని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో అదనపు ఛార్జీలను తొలగించాలని, మార్కెట్ కు వచ్చిన ప్రతి గింజను కొనుగోలు చేసి ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలని సూచించారు.

15:03 - May 16, 2017

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ 'ప్రభాస్' రేంజ్ ‘బాహుబలి -2’ సినిమా అనంతరం ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రపంచస్థాయిలో ఆయన పేరు మారుమాగుతోంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే రూ. వేయి కోట్లు వసూలు చేసిన 'బాహుబలి -2’ సినిమా రూ. 1500 కోట్ల వైపుకు పరుగులు తీస్తోంది. ఈ సినిమా అనంతరం సుజీత్ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాకు సైన్ చేశాడు. ఈ సినిమాకు 'సాహో' అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఇటీవలే చిత్ర టీజర్ కు భారీ స్పందన వచ్చింది. కానీ 'ప్రభాస్' సరసన ఏ హీరోయిన్ నటించబోతోందునేది తెలియ రావడం లేదు. రోజుకో హీరోయిన్ పేరు తెరమీదకు వస్తోంది. బాలీవుడ్ నటిని ఎంపిక చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. కత్రినా కైఫ్..పూజాహెగ్గే ఇలా చాలా మంది పేర్లు వినిపించాయి. తాజాగా శద్ధకపూర్..దిశా పటానీని పేర్లు వినిపించాయి. వీరు ఎక్కువగా పారితోషకం డిమాండ్ చేస్తుండడంతో టాలీవుడడ్ నటీమణులనే ఎంపిక చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందని టాక్.

14:35 - May 16, 2017

రైతు సమస్యలు పట్టవా - జగన్..

విజయవాడ : అసెంబ్లీ లాబీల్లో మీడియాతో వైఎస్ జగన్ ముచ్చటించారు. జీఎస్టీకి ఎవరూ వ్యతిరేకం కాదని, ప్రభుత్వానికి పి.వి.సింధుపై ఉన్న ప్రేమ రైతులపై లేదన్నారు. రైతు సమస్యలు ప్రభుత్వానికి పట్టవా అని సూటిగా ప్రశ్నించారు. పద్ధతి ప్రకారమే గుంటూరు మిర్చి యార్డును మూసివేశారని, రైతుల కష్టాల్లో ఉంటే మిర్చియార్డుకు సెలవు ఎలా ఇస్తారన్నారు. చంద్రబాబు రైతులను నట్టేట ముంచారని, రైతులు రోడ్డున పడి ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిపారు. రూ. 5వేల కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ హాయాంలో వ్యవసాయం అస్తవ్యస్థం - బాబు..

విజయవాడ : కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం అస్తవ్యవస్థమైందని, ఆదర్శరైతులుగా ఎవరెవరినో రైతులుగా చూపారని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. విద్యుత్ సంస్కరణల తరువాతే మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఏపీ తయారైందని, ప్రపంచంలోనే పెద్ద సోలార్స్ పార్క్ కర్నూలులో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సోలార్ వద్ల యూనిట్ విద్యుత్ రూ. 2.45కే వస్తోందని, వ్యవసాయరంగంలో కొత్త టెక్నాలజీలు వస్తున్నాయన్నారు.

టి. సచివాలయం వద్ద యువకుడు ఆత్మహత్యాయత్నం..

హైదరాబాద్ : సచివాలయం వద్ద యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం సృష్టించింది. ఆలూరుకు చెందిన యువకుడు మల్లేష్ గా గుర్తించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది.

కాంగ్రెస్ నేతల భిక్షాటన..

హైదరాబాద్ : బ్యాంకులు..ఏటీఎంలలో డబ్బులు లేవని గన్ ఫౌండ్రీ ఎస్ బీఐ వద్ద కాంగ్రెస్ నేతలు భిక్షాటన చేశారు. సుధీర్ రెడ్డి, ప్రసాద్, భిక్షపతి, శ్రీశైలం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సీబీఐకి నజీమ్ అహ్మద్ మిస్సింగ్ కేసు

ఢిల్లీ : జేఎన్ యూ విద్యార్థి నజీమ్ అహ్మద్ అదృశ్యం కేసు విచారణనను సీబీఐకి ఢిల్లీ హైకోర్టు అప్పగించింది. తదుపరి విచారణ జులై 17కి వాయిదా పడింది.

నరేష్ సతీమణి స్వాతి అనుమానాస్పద మృతి..

యాదాద్రి : పల్లెర్లకు చెందిన నరేష్ అదృశ్యం కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. నరేష్ భార్య స్వాతి అనుమానాస్పదంగా మృతి చెందింది. ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. నరేష్ అదృశ్యం తరువాత స్వాతి రెండుసార్లు ఆత్మహత్యకు పాల్పడింది. 11 రోజులుగా నరేష్ కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. మార్చి 25వ తేదీన స్వాతి - నరేష్ లు ప్రేమ వివాహం చేసుకున్నారు. నరేష్ ఆచూకీ తెలపాలంటూ హైకోర్టును ఆయన తల్లిదండ్రులు ఆశ్రయించారు.

ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా..

విజయవాడ : ఏపీ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. జీఎస్టీ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. వైసీపీ సభ్యుల ఆందోళన మధ్యే జీఎస్టీకి సభ ఆమోద ముద్ర వేసింది. పీవీ సింధుకు ఉద్యోగం ఇచ్చేందుకు చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది.

42 నిమిషాల్లో అసెంబ్లీ పూర్తి - రోజా..

విజయవాడ : అసెంబ్లీని కనీసం గంట కూడా నిర్వహించకుండా 42 నిమిషాల్లో పూర్తి చేశారని, అసెంబ్లీలో రైతు సమస్యలపై మాట్లాడేందుకు ఈ ప్రభుత్వానికి నోరు రాలేదని ఎమ్మెల్యే రోజా విమర్శించారు. రైతులకు న్యాయం చేయకుండా పథకం ప్రకారం జీఎస్టీ బిల్లుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు.

బునాదిగాని కాల్వ ఆధునీకరణ పనులు..

యాదాద్రి : అనాజీపురంలో బునాదిగాని కాల్వ ఆధునీకరణ పనులను మంత్రుల హరీష్..జగదీష్ లు ప్రారంభించారు. రూ. 100 కోట్లతో బునాదిగాని కాల్వ ఆధునీకరణ పనులు చేపట్టనున్నట్లు, కాల్వ పేరిట గత పాలకులు ఓట్లు దండుకున్నారని మంత్రులు తెలిపారు.

 

 

బునాదిగాని కాల్వ ఆధునీకరణ పనులు..

యాదాద్రి : అనాజీపురంలో బునాదిగాని కాల్వ ఆధునీకరణ పనులను మంత్రుల హరీష్..జగదీష్ లు ప్రారంభించారు. రూ. 100 కోట్లతో బునాదిగాని కాల్వ ఆధునీకరణ పనులు చేపట్టనున్నట్లు, కాల్వ పేరిట గత పాలకులు ఓట్లు దండుకున్నారని మంత్రులు తెలిపారు.

 

 

చంపడానికే హోం మంత్రి ఉన్నారా - వీహెచ్..

హైదరాబాద్ : ప్రభుత్వం నిరంకుశత్వంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ పేర్కొన్నారు. సోమవారం ధర్నా చౌక్ లో ఆందోళనలో స్థానికులు లేరని, అంతా టీఆర్ఎస్ కార్యకర్తలు, పోలీసులున్నారని తెలిపారు. హోం మంత్రి రెచ్చిపోతే చచ్చిపోతారని అంటున్నారని చంపపాడినికే హోం మంత్రి ఉన్నారా అని ప్రశ్నించారు.

13:58 - May 16, 2017
13:57 - May 16, 2017
13:49 - May 16, 2017

గుంటూరు : కాంగ్రెస్‌ పార్టీలో చక్రం తిప్పిన సీనియర్‌ నేతలు చాలామంది.. 2014 ఎన్నికల తర్వాత, తెలుగుదేశం పార్టీలోకి చేరిపోయారు. ఆ జాబితాలో మాజీ కేంద్ర మంత్రులు, మాజీ రాష్ట్ర మంత్రులు కూడా ఉన్నారు. పాలకపక్షంలో చేరితే.. ఏదో ఒక పదవి వరిస్తుందని వీరంతా ఎంతో ఆశగా టీడీపీలో చేరారు. కానీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటై మూడేళ్లైనా ఏ పదవీ దక్కక, ఇలాంటి వారంతా, సీఎం చుట్టూ ప్రదక్షణలు చేస్తురు ఉన్నారు. కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలిగి.. ఆ మధ్య టీడీపీలో చేరిన నెల్లూరు జిల్లా సీనియర్‌ నాయకులు.. ఆనం రామ్‌నారాయణ రెడ్డి, ఆయన సోదరుడు ఆనం వివేకా రెడ్డి.. కీలక పదవి దక్కుతుందని చాలాకాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఇంత వరకు ఏ పదవి రాకపోవడంతో టెన్షన్ పడుతున్నారు. సమయం దొరికినప్పుడల్లా సీఎం చంద్రబాబును కలుస్తున్నారు. గవర్నర్‌ కోటాలోనైన ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కోరుతున్నారు.

చంద్రబాబునాయుడు కరుణ
అలాగే కడప జిల్లాకు చెందిన సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి, సాయి ప్రతాప్‌ సైతం టీడీపీ గూటికి చేరారు. పార్టీలో చేరిన కొద్దిరోజులు యాక్టివ్‌గా కనిపించిన సాయి ప్రతాప్‌ ఇప్పుడు పెద్దగా చురుగ్గా కనిపించడం లేదు. అలాగే శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా పనిచేసిన మహ్మద్‌ జానీ, చెంగల్‌ రాయుడు, రుద్రరాజు పద్మరాజు కూడా టీడీపీలోనే ఉన్నారు. వీరంతా ఏదో ఒక పదవి ఇవ్వాలని అడుగుతున్నా... చంద్రబాబునాయుడు కరుణ మాత్రం వీరిపై ఇంకా పడలేదు. ఒక్క డొక్కా మాణిక్య వరప్రసాద్‌కు మాత్రమే ఇటీవల ఎమ్మెల్సీ పదవి వరించింది. కాంగ్రెస్‌ నుంచి టీడీపీలోకి వచ్చి పదవులు ఆశిస్తున్న వారి జాబితా చాలా పెద్దగానే ఉంది. వారంతా తమకు సీఎం ఏదో ఒక పదవిని కట్టబెట్టక పోతాడా అని ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. అయితే, చంద్రబాబు కనీసం కీలక కార్పొరేషన్‌లనూ భర్తీ చేయకపోవడంతో.. ఇలాంటి వారంతా ఉస్సురని నిట్టూరుస్తున్నారు. మరి ఇలాంటి నేతలపై చంద్రబాబు కరుణ కురిపించేదో ఎన్నడో..? కాలమే తేల్చి చెప్పాలి.

 

 

 

13:36 - May 16, 2017

ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఉద్రిక్తత

హైదరాబాద్ : నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద ఉద్రిక్తత నెలకొంది. సోమవారం జరిగిన లాఠీ చార్జ్ కు నిరసనగా సీపీఎం ఆధ్యర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడానికి యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.

మహిళ సీఐ శ్రీదేవిపై వేటు

హైదరాబాద్ : లేక్ వ్యూ పోలీస్ స్టేషన్ శ్రీదేవిపై పోలీస్ శాఖ వేటు వేసింది. లేక్ పోలీస్ స్టేషన్ నుంచి కంట్రోల్ రూంకు శ్రీదేవిని బదిలీ చేశారు. సోమవారం జరిగిన ధర్నా చౌక్ వద్ద సీఐ శ్రీదేవి తీరుపై విచారణకు ఆదేశించామని సెంట్రల్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు.

13:28 - May 16, 2017

సూర్యాపేట : జిల్లాలోని నేరేడుచర్లలో మిషన్ భగీరథ పనులను స్థానిక రైతులు గత రెండు రోజులుగా అడ్డుకుంటున్నారు. ప్రభుత్వ భూములు వదిలిపెట్టి తమ భూముల నుంచి పైపులు వేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైపులు లీకేజీ జరిగితే తమ పంటలు మునిగిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఘటన స్థలానికి జేసీ, ఆర్డీవో, డీఎస్పీ చేరుకుని భద్రత మధ్య పనులు చేయిస్తాన్నారు. మరోవైపు అధికారులు మాత్రం ఎటువంటి నష్టం ఉండదని చెబుతున్నారు.

13:27 - May 16, 2017

హైదరాబాద్ : నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద ఉద్రిక్తత నెలకొంది. సోమవారం జరిగిన లాఠీ చార్జ్ కు నిరసనగా సీపీఎం ఆధ్యర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడానికి యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులు, సీపీఎం కార్యకర్తల వాగ్వాదం జరిగింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను అరెస్ట్ చేయడం దారుణమని సీపీఎం కార్యకర్తలు అన్నారు.

 

13:26 - May 16, 2017

హైదరాబాద్ : లేక్ వ్యూ పోలీస్ స్టేషన్ శ్రీదేవిపై పోలీస్ శాఖ వేటు వేసింది. లేక్ పోలీస్ స్టేషన్ నుంచి కంట్రోల్ రూంకు శ్రీదేవిని బదిలీ చేశారు. సోమవారం జరిగిన ధర్నా చౌక్ వద్ద సీఐ శ్రీదేవి తీరుపై విచారణకు ఆదేశించామని సెంట్రల్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు. విధులు నిర్వహింకుండా ప్లకార్డులు పట్లుకోవడంతో శ్రీదేవిని బదిలీ చేశామని, పూర్తి స్థాయి నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని డీసీపీ పేర్కొన్నారు.

పీవి సింధుపై ఉన్న ప్రేమ రైతుల లేదా : జగన్

గుంటూరు : చంద్రబాబుకు పీవి సింధుపై ఉన్న ప్రేమ రైతులపై లేదని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నారు. జీఎస్టీకి ఎవరూ వ్యతిరేకం కాదన్నారు. పథకం ప్రకారమే గుంటూరు మిర్చి యార్డును మూసివేశారని, రైతులు కష్టాల్లో ఉంటే మిర్చియార్డుకు సెలవు ఎలా ప్రకటిస్తారని ఆయన ప్రశ్నించారు.

 

 

12:54 - May 16, 2017

ఉరుకుల పరుగుల జీవితంలో ఇక వ్యాయామానికి టైం ఎక్కడిది అని చాలా మంది అంటుంటారు. కానీ కొద్ది సమయంలోనైనా వ్యాయామాలు చేస్తే ఆరోగ్యం కొద్దిగానైనా బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రత్యేకంగా టైం కేటాయించకుండానే

సులభమైన వ్యాయామాలు చేస్తే సరిపోతుందని సూచిస్తున్నారు. మరి ఆ సులభమైన వ్యాయామాలు ఏంటీ ? ఎలా చేయాలి .
ముఖ్యమైన పని నడవాలి. ఇందుకు ప్రత్యేకంగా టైం కేటాయించాల్సినవసరం లేదు. దీని కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. మీ ఆఫీసు దగ్గరలోనే ఉంటే నడుచుకుంటూ వెళ్లండి. లిఫ్ట్ ఎక్కువ శాతం ఉపయోగించకండి. మెట్ల ద్వారా నడుచుకుంటూ వెళ్లండి. ఇలా చేయడం వల్ల క్యాలరీల శక్తి ఖర్చు అవుతుంది. కొవ్వు కూడా కరిగిపోయే అవకాశం ఉంది.
కేవలం వంట స్త్రీలే చేయాలా ? మగవారు చేయవద్దా ? ట్రై చేయండి. వంట చేయడం వల్ల 105 క్యాలరీల ఖర్చు అవుతుంది. కూరగాయాలు తీసుకోవడం..కట్ చేయడం..వంటివి చిన్న చిన్న పనులు చేయండి. ఒక రకంగా ఇది ఒక వ్యాయామం లాంటిదే.
మీరు ఉండే గదిని పని వారు..ఇతరులు క్లీన్ చేయడం కంటే మీరే చేసుకోండి. గదిలో ఉండే పుస్తకాలు..బట్టలు..అలంకరణ వస్తువులు శుభ్రంగా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల 100 క్యాలరీల శక్తి ఖర్చు అవుతుంది.
పని చేసే సమయంలో ప్రతి 15 నిమిషాలకు ఓ సారి కూర్చొన్న చోటనే 108 డీగ్రిల కోణంలో అటూఇటూ కదిలితే సరిపోతుంది. దీని వల్ల శరీరంలో క్యాలరీలు ఖర్చవటంతో పాటు మానసికంగా ఒత్తిడికి దూరం అవుతారు.

12:51 - May 16, 2017

హైదరాబాద్ : మానవి వేదికలో ట్రిపుల్ తలాక్ పై చర్చలో జమిలా, సలీమా పాల్గొన్నారు. జమిలా నిషత్ మాట్లాడుతూ ట్రిపుల్ అంటే మెదటగా తలాక్ చెప్పిన తర్వాత కుటుంబాలు మాట్లాడుకోవాలి. తర్వాత వివిధ సమయాల్లో మిగిలిన రెండు తలాక్ చెప్పాలి, 90 రోజల టైమ్ తీసుకోవాలని తెలిపారు. పూర్వం రోజుల్లో తలాక్ తర్వాత భార్య కు వదిలేసి భర్త వెళ్లేవారు కానీ అది మారిందన్నారు. సలీమా మాట్లాడుతూ ముస్లిం మహిళల్లో విద్య లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది పురుషధిక్యం కోసమే ట్రిపుల్ తలాక్ ఉందన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

12:48 - May 16, 2017

బేకింగ్ సోడా..కేవలం వంటల్లో మాత్రం ఉపయోగిస్తారా ? క్లీనింగ్ కూడా ఉపయోగించుకోవచ్చు. వంటింట్లో మరకలు..జిడ్డు మరకలు..ఇతరత్రా సమస్యలు దూరం చేసుకోవడానికి దీనిని ఉపయోగించుకోవచ్చు. మరి బేకింగ్ సోడాను ఎక్కడ ? ఎలా ? ఉపయోగించుకోవచ్చో చదవండి...

  • ఇల్లు కడిగిన తరువాత కూడా శుభ్రంగా అనిపించడం లేదా ? మళ్లీ ఓ సారి ఓ బకెట్ నీటిలో నాలుగు కప్పుల బేకింగ్ సోడాను వేసి కలపండి. శుభ్రమైన క్లాత్ తో గాని స్పాంజ్ తో తుడిస్తే సరి.
  • వంట గదిలో ఎక్కువగా చీమల సమస్య అధికంగా ఉంటుంది. చీమలు ఎక్కడ ఉంటే అక్కడ ఒక లైన్ గీయాలి. దాని వెంట బేకింగ్ సోడా వేసి చూడండి.
  • బాత్ రూమ్..కిచెన్ మూలలు శుభ్రంగా ఉంచడానికి కూడా ఉపయోగపడుతుంది. ఒక కప్పు బేకింగ్ సోడాలో సగం కప్పు వెనిగిర్ ను వేసి కలిపి పది నిమిషాలు అలాగే ఉంచాలి. ఓ శుభ్రమైన క్లాత్ తీసుకుని అందులో ముంచి దుమ్ము ఉన్న ప్రాంతాన్ని శుభ్రంగా తుడిచి తేడాను గమనించండి.
  • ఇక కిటికీ అద్దాలను..కిటికీలను కూడా శుభ్రం చేసుకోవచ్చు. స్పాట్‌లెస్‌ స్ప్రే, లేదా పొడి వెనిగర్‌లో బేకింగ్‌ సోడాను కలిపి పేస్టులా తయారు చేసుకుని అద్దాలపై గట్టిగా రుద్దాలి. ఆ తరువాత నీటితో శుభ్రంగా కడిగితే ఎంతో కొత్తవిగా కనిపిస్తాయి.
  • కంటెనర్లు..ప్లాస్టిక్ బాటిళ్లను కడిగే ముందు అందులో ఒక గ్లాసు నీరు..ఒక చెంచా బేకింగ్ సోడాను వేసి శుభ్రంగా కడుక్కోవాలి.
  • వంటగదిలో సింక్‌ను శుభ్రం చేసే ముందు సింక్‌లో కొంచెం పొడి బేకింగ్‌ సోడాను చల్లి 15-20 నిమిషాల తరువాత శుభ్రంగా నీటితో కడిగితే మంచిది. సింక్‌లో ఉండే జిడ్డు మరకలు, దుర్వాసన, బ్యాక్టీరియ వంటివి తొలగిపోతాయి.
12:46 - May 16, 2017

గుంటూరు : సీఎం చంద్రబాబునాయుడిపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పక్క పార్టీ ఎమ్మెల్యేలను కోట్లు పెట్టి కొనడంలో చూపించిన చిత్తశుద్ధి.. రైతులు పండించిన పంటను కోట్లు పెట్టి ఎందుకు కొనడం లేదని రోజా ప్రశ్నించారు. రెక్కలు ముక్కలు చేసుకొని పంటలు పండిస్తున్న రైతులకు లాభాలు రావడం లేదు.. కానీ రైతుల శ్రమను దోచుకుంటున్న హెరిటేజ్‌ లాభాల్లో ఎలా నడుస్తుందని ప్రశ్నించారు.

12:44 - May 16, 2017

గుంటూరు : ప్రతిపక్ష వైసీపీ సభ్యుల నిరసనలు, నినాదాలతో ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. జీఎస్‌టీ బిల్లుతోపాటు, టెన్నిస్‌ క్రీడాకారిణి పీవీ సింధుకు గ్రూప్‌ వన్‌ ఉద్యోగం ఇచ్చేందుకు వీలు కల్పించే ఏపీ పబ్లిక్‌ సర్వీసెస్‌ అపాయింట్‌మెంట్స్‌ చట్ట సవరణ బిల్లుకు ఆమోదించేందుకు ప్రత్యేక భేటీ జరిగింది. అయితే రైతుల సమస్యలపై వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు తిరస్కరించారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు స్పీకర్‌ పొడియం వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. మర్చి రైతులకు న్యాయం చేయాలని నినిదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.

మిషన్ భగీరథ అడ్డుకున్న రైతులు

సూర్యాపేట : జిల్లాలోని నేరేడుచర్లలో మిషన్ భగీరథ పనులను స్థానిక రైతులు అడ్డుకున్నారు. ప్రభుత్వ భూములు వదిలిపెట్టి తమ భూముల నుంచి పైపులు వేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటన స్థలానికి జేసీ, ఆర్డీవో, డీఎస్పీ చేరుకున్నారు.

 

12:23 - May 16, 2017

కధకు ప్రాధాన్యం ఇచ్చి ఆడియన్స్ తో ఔరా అనిపించుకున్న ఫిలిం రాజమౌళి స్క్రీన్ మ్యాజిక్ ఇండియా అంతా ఎంతో ఆత్రంగా చూసిన బాహుబలి ది కంక్లూజన్ మూవీ. మొదటి భాగంలో వదిలేసిన ఎన్నో పజిల్స్ కు ఆన్సర్ తెలుసుకునేందుకు జనాలు ఆత్రంగా థియేటర్లకు క్యూ కట్టేశారు. 'బాహుబలి2' దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. మర్చిపోలేని రికార్డ్స్ ని క్రియేట్ చేసింది ఈ 'బాహుబలి' సినిమా మర్చిపోలేని పాత్ర ఏంటి అని అడిగితే బాహుబలి సినిమా చూసిన ఎవరైనా వారు చెప్పే సమాధానం రమ్యకృష్ణ అని. అంటే శివగామి పాత్రలో రమ్యకృష్ణ ప్రవేశించి జీవించింది. 'శివగామి'అంటే రమ్యకృష్ణ..రమ్య కృష్ణ అంటే శివగామి. ఇప్పుడు ఆ శివగామి మాతంగిగా వస్తోంది. మలయాళ దర్శకుడు కన్నన్ తమరక్కులమ్ రూపొందించిన 'మాతంగి' చిత్రంలో జయరామ్, సంపత్, అక్షర కిశోర్, ఏంజెలీనా అబ్రహమ్ తో పాటు దేశం గర్వించే నటుడు, స్వర్గీయ ఓంపురి కీలక పాత్ర పోషించారు. మదర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీ మలయాళంలో ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యమైన విషయం ఏమంటే... వెయ్యి ఎసిసోడ్స్ తో రమ్యకృష్ణ ప్రధాన పాత్రధారిగా ‘వంశం’ సీరియల్ ను నిర్మించిన రమ్యకృష్ణ సోదరి శ్రీమతి వినయ్ కృష్ణన్ 'మాతంగి' చిత్రాన్ని డబ్ చేయబోతున్నారు. రమ్యకృష్ణకు లక్షలాది అభిమానులు ఉన్న తెలుగులో ఈ సినిమా జూన్ మాసంలో రాబోతోంది.

12:20 - May 16, 2017

కొన్ని సార్లు ఫిలిం ఇండస్ట్రీ లో హిట్ కాంబినేషన్స్ మంచి ఇంటరెస్ట్ ని జెనరేట్ చేస్తాయి. ఆల్రెడీ ఒక సినిమాతో హిట్ కొట్టిన డైరెక్టర్ కొంచం గ్యాప్ తీస్కొని మళ్ళీ అదే హీరో తో సినిమా ఒకే చేసుకున్నాడు. లవ్ సబ్జెక్టు ని ఫ్యామిలీ వాల్యూస్ తో స్క్రీన్ మీద పండించిన ఈ డైరెక్టర్ ఎవరు ? అతను రిపీట్ చెయ్యబోయే హీరో ఎవరు ? ప్రెసెంట్ జెనరేషన్ లో లవ్ ఎలా ఉంది, అమ్మాయిలు అబ్బాయిల దగ్గర నుండి ఏమి కోరుకుంటున్నారు, అబ్బాయిలు ఎలా బెహేవ్ చేస్తున్నారు అనే ట్రెండీ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా 'సెకండ్ హ్యాండ్'. ఈ 'సెకండ్ హ్యాండ్' అనే టైటిల్ తో సినిమా తీసి తెలుగు తెరకి పరిచయం అయిన డైరెక్టర్ కిషోర్ తిరుమల. యూత్ కి కనెక్ట్ అయ్యేలా లవ్ స్టోరీ ని ప్రెసెంట్ చేసి ఇంప్రెస్స్ చేసాడు కిషోర్. ఈ సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకుని లాస్ట్ ఇయర్ మరో పెద్ద హిట్ ఇచ్చాడు ఈ యంగ్ డైరెక్టర్. హీరో 'రామ్' కెరీర్ లో చాల గ్యాప్ తరువాత వచ్చిన హిట్ ఫిలిం 'నేను శైలజ'. ఈ సినిమా తో లక్కీ హీరోయిన్ 'కీర్తి సురేష్' 'రామ్' తో జత కట్టింది. మంచి సెంటిమెంట్ ని లవ్ ఫీల్ ఎక్కడ మిస్ అవ్వకుండా చూపించిన 'నేను శైలజ' సినిమాని డైరెక్ట్ చేసి 'రామ్' కి హిట్ ఇచ్చిన డైరెక్టర్ కిషోర్ తిరుమల. ఈ సినిమా తరువాత హిట్ ట్రాక్ లో పడ్డ కిషోర్ కి మాత్రం నెక్స్ట్ ఛాన్స్ రావడానికి మళ్ళీ టైం పట్టింది. 'నేను శైలజ' చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ సాధించిన కిషోర్‌ తిరుమల మలి చిత్రాన్ని 'వెంకటేష్‌'తో చేయాల్సి వుంది. 'ఆడాళ్లూ మీకు జోహార్లు' అనే సినిమా అనౌన్స్‌ అయింది, ఆరుగురు హీరోయిన్లుంటారని వార్తలు వచ్చాయి. కానీ 'వెంకీ' ఆ చిత్రం చేయడానికి ఆసక్తి చూపించకపోవడంతో కిషోర్‌ వేరే హీరోల దగ్గరకి వెళ్లాడు. 'నితిన్' తో కూడా సినిమా అనుకుని మళ్ళీ డ్రాప్ అయ్యేడు కిషోర్ . మరి వాట్ నెక్స్ట్ ..??

మరో సినిమా..
ఇప్పుడు హాట్ న్యూస్ గా తిరుమల కిషోర్, రామ్ కలిసి మరో సినిమా చెయ్యబోతున్నారు. 'నేను శైలజ' కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవ్వబోతుంది. ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం షూటింగ్ ఇటీవల వైజాగ్ లో జరిగింది. కృష్ణచైతన్య సమర్పణలో స్రవంతి మూవీస్, పి.ఆర్‌. సినిమాస్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. 'నేను శైలజ' ఫేమ్‌ కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో 'స్రవంతి' రవికిశోర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో 'అనుపమా పరమేశ్వరన్', మేఘా ఆకాశ్‌ కథానాయికలు. మే 15న సోమవారం రామ్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ రామ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ చిత్రానికి సంబంధించిన డీటైల్స్ ను వెల్లడించారు.

12:18 - May 16, 2017

మంచు లక్ష్మి విభిన్నమైన కధలు ఎంపిక చేసుకోవడం లో ఇంటరెస్ట్ చూపించే నటి. ఎన్నో సినిమాలు నిర్మించి నటించిన ఈ మంచు వారి అమ్మాయి ఇప్పుడు ఒక మంచి కంటెంట్ ఉన్న కథతో వచ్చింది. స్త్రీలు వారి ప్రాబ్లెమ్స్ మీద స్పందించే సోషల్ యాక్టీవిస్ట్ గా కూడా పేరు గడించింది. కొత్త వాళ్ళను ప్రోత్సహించడం లో ఎప్పుడు ముందే ఉంటుంది మంచు లక్ష్మి. అదే వే లో 'దొంగాట' అనే సినిమాతో కొత్త డైరెక్టర్ కి ఛాన్స్ కూడా ఇచ్చింది. 'దొంగాట' సినిమాలో పాట కూడా పడింది మంచు లక్ష్మి. కామెడీ జోనర్ లో సాగిపోయే సీరియస్ సెంటిమెంట్ సినిమా 'దొంగాట'. ఈ సినిమా తో పాటు రీసెంట్ గా 'లక్ష్మి బాంబ్' అంటూ పవర్ ఫుల్ సినిమాతో వచ్చింది మంచు లక్ష్మి. ఇలా డిఫరెంట్ జోనర్ లో సినిమాలు చేస్తూ తనకంటూ ఒక స్పెషల్ ప్లేస్ ని ఏర్పరుచుకుంది. ఇటు సినిమాల విషయంలోనే అయినా.. కేరక్టర్స్ ఎంచుకోవడంలో అయినా.. మంచు లక్ష్మి వైవిధ్యత ప్రదర్శిస్తూ ఉంటుంది. సామాజిక సేవ కూడా ప్రాధాన్యత ఇవ్వడం ఈమె స్పెషాలిటీ. ఇప్పుడు ఓ షార్ట్ ఫిలింలో కూడా నటించేసి ఆశ్యర్యపరిచిన మంచు లక్ష్మి.. ఆ మూవీ థీమ్ తో పాటు తన నటనతో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇంతకు ముందు కూడా ఆర్ జి వి డైరెక్షన్ లో ఒక షార్ట్ ఫిలిం చేసింది లక్ష్మి. శ్రీను పంద్రంకి దర్శకత్వంలో రూపొందిన 'ది డిసెషన్' అనే షార్ట్ ఫిలింలో మంచు లక్ష్మి నటించింది. దీని నిడివి 21 నిమిషాలు కాగా.. ఒక బిడ్డకు జన్మనివ్వడం విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సిన యువతిగా మంచు లక్ష్మి నటించింది. ఓ అమ్మగా ఆలోచన చేయబట్టే.. ఈ పాత్రను చేయగలిగానని చెబుతోందీమె. 'ఇలాంటి మల్టిపుల్ షేడ్స్ ఉన్న కేరక్టర్ చేయడం ఏ ఆర్టిస్ట్ అయినా ఛాలెంజింగ్ గానే ఉంటుంది. ఒక తల్లిగా ఈ స్టోరీ లైన్ కు నేను ఫ్లాట్ అయిపోయాను. ప్రతీ పేరెంట్ ఈ షార్ట్ ఫిలిం నుంచి తెలుసుకోవాల్సిన విషయం ఏదో ఒకటి కచ్చితంగా ఉంటుంది' అని చెప్పింది మంచు వారసురాలు.

 

11:55 - May 16, 2017

గుంటూరు : టెన్నిస్‌ క్రీడాకారిణి పీవీ సింధుకు గ్రూప్‌ వన్‌ సర్వీసులో ఉద్యోగ అవకాశం కల్పిస్తూ ఏపీ పబ్లిక్‌ సర్వీస్‌ అపాయింట్‌మెంట్స్‌ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ఆమోదం ద్వారా సింధుకు సబ్‌ కలెక్టర్‌ ఉద్యోగం ఇస్తారు. అమరావతిలో ఇవాళ జరిగిన ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీలో ఆర్థిక మంత్రి యనమల ప్రవేశపెట్టిన ఈ బిల్లును సభ ఆమోదించింది.

 

 

11:53 - May 16, 2017

గుంటూరు : ప్రతిపక్ష వైసీపీ సభ్యులు నినాదాల మధ్య ఏపీ ప్రత్యేక భేటీలో రెండు బిల్లులకు ఆమోదం తెలిపింది. కేంద్రం ఆమోదించిన జీఏస్టీ బిల్లును అసెంబ్లీ ధ్రువీకరించింది. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై జరిగిన చర్చలోబీజేపీ, టీడీపీ సభ్యులు పాల్గొన్నారు. దీనిపై జరిగిన చర్చకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమాధానం చెప్పిన తర్వాత బిల్లును ఆమోదించారు.

11:23 - May 16, 2017
11:19 - May 16, 2017

యాదాద్రి : జిల్లాలోని పల్లెర్లకు చెందిన నరేష్ అదృశ్యం కేసులో నరేష్ భార్య స్వాతి అనుమానాస్పదంగా మృతి చెందింది. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు అంటున్నారు. మార్చి 25న స్వాతి నరేష్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ వివాహనికి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో వారు ముంబై వెళ్లారు. స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డి మే 2 న ఆమెను పుట్టింటికి తీసుకోచ్చాడు. ఆ తర్వాత నరేష్ అదృశ్యం అయ్యాడు. నరేష్ అదృశ్యాం కేసును పోలీసులు పట్టించుకోకపోవటంతో నరేష్ తల్లిదండ్రులు హై కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు డీజీపీ నోటీస్ జారీ చేసింది. మరో రెండు రోజుల్లో నరేష్ గురించి తెలిసే అవకాశం ఉన్న సమయంలో అతని భార్య స్వాతి మృతి పలు అనుమానాలు రెకేతిస్తున్నాయి.

10:53 - May 16, 2017
10:41 - May 16, 2017

జీఏస్టీ బిల్లు ఆమోదం తెలిపిన ఏపీ అసెంబ్లీ

గుంటూరు : జీఏస్టీ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. వైసీపీ నినాదాల మధ్యే సభ బిల్లుకు ఆమోదం తెలిపింది.

లాలూ ప్రసాద్ యాదవ్ ఇళ్లపై ఐటీ దాడులు

పాట్నా : బీహర్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఇళ్లపై ఐటీ దాడులు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 22 చోట్ల ఐటీ సోదాలు కొనసాగుతోన్నాయి.

 

ఏపీ అసెంబ్లీ వైసీపీ నినాదాలు

గుంటూరు : సభలో వైసీపీ నినాదాలు చేస్తూ రైతుల సమస్యలపై చర్చించాలంటూ సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. వైసీపీ సభ్యుల నినాదాలతో సభలో గందరగోళం నెలకొంది. కొంత మంది వైసీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వచ్చి నిరసన తెలుపుతున్నారు.

 

09:57 - May 16, 2017

ఏపీ అసెంబ్లీ సమావేశం ప్రారంభం

గుంటూరు : ఏపీ అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది. సభలో వైసీపీ మిర్చి రైతులను అదుకోవాలని నినాదాలు చేస్తోంది. వారి నినిదాల మధ్య ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు జీఎస్టీ బిల్లు ప్రవేశపెట్టారు.

ముగిసిన బీఏసీ సమావేశం

గుంటూరు : ఏసీ బీఏసీ సమావేశం ముగిసింది. సమావేశంలో పీవి సింధుకు గ్రూప్ 1 ఉద్యోగం కల్పిస్తూ చట్ట సవరణ చేయాలని బీఏసీ నిర్ణయించింది. వైసీపీ మిర్చి రైతుల సమస్యలపై చర్చించాలని పట్టుపటింది.

09:52 - May 16, 2017

గుంటూరు : ఏసీ బీఏసీ సమావేశం ముగిసింది. సమావేశంలో పీవి సింధుకు గ్రూప్ 1 ఉద్యోగం కల్పిస్తూ చట్ట సవరణ చేయాలని బీఏసీ నిర్ణయించింది. వైసీపీ మిర్చి రైతుల సమస్యలపై చర్చించాలని పట్టుపటింది.

భర్త అదృశ్యం... భార్య ఆత్మహత్య

యాదాద్రి : జిల్లాలోని పల్లెర్లకు చెందిన నరేష్ అదృశ్యం కేసులో నరేష్ భార్య స్వాతి అనుమానాస్పద మృతి చెందింది. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు అంటున్నారు. నరేష్ అదృశ్యం తర్వాత స్వాతి రెండు సార్లు ఆత్మహత్యకు యత్నించింది. నరేష్ గత 10 రోజులుగా కనిపిచటంలేదు. మార్చి 25న స్వాతి నరేష్ ప్రేమ వివాహం చేసుకున్నారు.

09:35 - May 16, 2017
09:33 - May 16, 2017

హైదరాబాద్ : పేదల నుంచి ఒక్క రూపాయి తీసుకోకుండా.. డబుల్ బెడ్‌ రూమ్‌ ఇళ్లను కట్టించి ఇస్తున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. పేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యమని ఆయన చెప్పారు. సికింద్రాబాద్‌లోని బన్సీలాల్ పేటలో డబుల్ బెడ్‌ రూం ఇళ్లకు కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఈ ఏడాది లక్ష బెడ్ రూమ్ ఇళ్లను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌ను స్లం ఫ్రీ సిటీగా మారుస్తామని కేటీఆర్‌ చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో పాటు.. డిప్యూటి మేయర్ బాబా ఫసియోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

చిదంబరం ఇంటిపై సీబీఐ దాడి

చెన్నై : కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ఇంటి పై సీబీఐ దాడి చేస్తోంది. చిదంబరంతో పాటు ఆయన కుమారుడు కార్తీ చిదంబరం నివాసంలోని సీబీఐ తనిఖీలు నిర్వహిస్తోంది. చెన్నై వ్యాప్తంగా ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లతో సహ 14 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.

09:23 - May 16, 2017

చెన్నై : కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ఇంటి పై సీబీఐ దాడి చేస్తోంది. చిదంబరంతో పాటు ఆయన కుమారుడు కార్తీ చిదంబరం నివాసంలోని సీబీఐ తనిఖీలు నిర్వహిస్తోంది. చెన్నై వ్యాప్తంగా ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లతో సహ 14 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. చిదంబరం మంత్రిగా ఉన్నప్పుడు ఆయన తనయుడు కార్తి చిదంబరం ఆర్థిక అక్రమాలకు పాల్పపడ్డారని ఆరోపణల నేపథ్యంలో ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సీబీఐ సోదాలు చేస్తునట్టు తెలుస్తోంది.

 

09:11 - May 16, 2017
09:09 - May 16, 2017

నేడు నల్లగొండ జిల్లాలో హరీష్, జగదీష్ పర్యటన

నల్లగొండ : నేడు నల్లగొండ జిల్లాలో మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి పర్యటించనున్నారు. మంత్రులు బత్తాయి మార్కెట్ ప్రారంభించనున్నారు.

ఖమ్మంలో నిలిచిన మిర్చి కొనుగోళ్లు

ఖమ్మం : జిల్లా మార్కెట్లో మిర్చి కొనుగోళ్లు నిలిచిపోయాయి. మార్కెట్ అధికారులు జూన్ 3 వరకు యార్డుకు సెలవులు ప్రకటించారు.

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో చంద్రబాదు భేటీ

గుంటూరు : పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. సంక్షేమ పథకాలు, గ్రామాల్లో తాగునీటి సమస్య చర్చంచే అవకాశం ఉంది.

నేడు ఏపీ అసెంబ్లీ సమావేశం

గుంటూరు : నేడు ఏపీ అసెంబ్లీ సమావేశం కానుంది. ఉదయం 9.45 అసెంబ్లీ ప్రారంభం అవుతుంది. జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం అసెంబ్లీ సమావేశం జరుగబోతుంది.

08:53 - May 16, 2017

గుంటూరు : కాసేపట్లో ఏపీ బీఏసీ సమావేశం జరగనుంది. బీఏసీ అనంతరం 9.45 గంటలకు శాసన సభ, 10.15 గంటలకు శాసన మండల సమావేశం కానున్నాయి. సభను ఎన్ని రోజులు నడపలన్నది బీఏసీలో నిర్ణయిస్తారు. ప్రభుత్వం మాత్రం జీఏస్టీ బిల్లు ఆమోదంకే ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పరిమితం చేయాలనుకుంటుంది. మరో ప్రతిపక్షం వైసీపీ రైతుల సమస్యలపై చర్చకు పట్టుపట్టాలని చూస్తుంది.

08:47 - May 16, 2017

హైదరాబాద్ : నగరంలో మేయర్ బోంతు రామ్మోహన్ పర్యటించారు. ముషీరాబాద్ లో రోడ్లను పరిశీలించారు. వచ్చేది వర్షకాలం కావడంతో రోడ్లపై ఉన్న గుంతులను పూడ్చాలని మేయర్ అధికారులను ఆదేశించారు. మేయర్ కార్పొరేటర్లతో కలిసి స్థానికులకు రోడ్డపై ఇసుక వేయవద్దని చెప్పారు. మేయర్ తన ద్విచక్ర వహనంపై పర్యటిస్తున్నారు.

08:41 - May 16, 2017

హైదరాబాద్ : గత 15 ఏళ్లగా ధర్నా చౌక్ నడుస్తోందని, ప్రజల గొంతు వినబడకుండా ప్రభుత్వం చేస్తోందని న్యూస్ మార్నింగ్ లో పాల్గొన్న సీపీఎం నేత నరసింహారెడ్డి, కాంగ్రెస్ నేత ఇందిరా శోభన్ అన్నారు. సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు ఇంత దారుణంగా జగలేదని ఇందిరా అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

08:38 - May 16, 2017

ఉద్యోగ భద్రత లేదని ఏపీ కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బాలకాశి అన్నారు. టెన్ టివి జనపథంలో పాల్గొని మాట్లాడారు. ఆ కారణంగా 120 కాంట్రాక్ట్ , తొలిగించారని ఆయన తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

 

08:36 - May 16, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాలకు షెడ్యూల్‌ విడుదలైంది. ఈ నెల 18 నుంచి రిజిస్ట్రేషన్లు జూన్‌ 4వరకు, వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రక్రియకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. విద్యార్థులు 100 రూపాయల రిజిస్ట్రేషన్‌ ఫీజుతో రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల పరిధిలో కళాశాలలకు దరఖాస్తు చేసుకొనే సదుపాయం కల్పించారు. 200 ఆలస్య రుసుంతో జూన్‌ 5, 6 తేదీల్లో వెబ్‌ ఆప్షన్లకు అవకాశమిచ్చారు. ఈసేవ, మీ సేవలతో హెల్ప్‌లైన్‌ కేంద్రాల్లో తప్పనిసరిగా బయోమెట్రిక్‌ వివరాలు నమోదుచేశాకే.. వెబ్‌ఆప్షన్లు ఇచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

జూన్‌ 10న మొదటి విడత డిగ్రీ సీట్ల కేటాయింపు
జూన్‌ 10న మొదటి విడత డిగ్రీ సీట్ల కేటాయింపు, జూన్‌ 18, 19 తేదీల్లో రెండో విడత వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. జూన్‌ 22న రెండో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు ప్రక్రియను చేపట్టనున్నారు. జూన్‌ 29, 30 తేదీల్లో తుది విడత వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తున్నట్టు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. జులై 3న తుది విడత డిగ్రీ సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు. ఓయూ మినహా అన్ని వర్సిటీల పరిధిలో డిగ్రీ ఫీజులను పెంచనున్నట్టు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య పాపిరెడ్డి తెలిపారు. పట్టణ పరిధిలో రూ.7,500, గ్రామీణ ప్రాంతాల్లో రూ.5వేలు పెంచుతున్నట్టు చెప్పారు. పెరిగిన మొత్తం ఫీజు రియంబర్స్‌మెంట్‌ పరిధిలోకి రాదని ఆయన స్పష్టంచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 130 గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలున్నాయి.. వీటిలో అటానమస్ కాలేజీలు 16, ప్రైవేటు ఎయిడెడ్ కాలేజీలు 63, ప్రైవేటు అన్‌ఎయిడెడ్ కాలేజీలు 940,సోషల్ వెల్పేర్ కాలేజీలు 23 ఉన్నాయి.. అన్ని కాలేజీల్లో 4 లక్షల 7 వేల 266మంది విద్యార్ధుల ఇన్‌టేక్ ఉంది. అయితే అడ్మిషన్ల విషయంలో ఏ చిన్న తప్పులు దొర్లినా విద్యార్ధులను ప్రలోభాలకు గురిచేసినా ప్రైవేట్‌ కాలేజీ యాజమాన్యాలపై కఠిన చర్యలు తప్పవని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హెచ్చరించారు.

08:28 - May 16, 2017

విజయవాడ : క్యాన్సర్‌తో బాధపడుతూ.. వైద్యం కోసం తండ్రిని అభ్యర్థించి.. ఆయన కరుణ లభించక.. నిస్సహాయంగా ప్రాణాలు వదిలిన బెజవాడ చిన్నారి సాయిశ్రీ అంత్యక్రియలు సోమవారం విజయవాడలో ముగిశాయి. కుమార్తె మరణంతో తల్లడిల్లుతోన్న తల్లి సుమనశ్రీకి వామపక్షాలు, వైసీపీ, కాంగ్రెస్‌ నాయకులు అండగా నిలిచారు. సుమనశ్రీ అఖిలపక్షం నాయకులతో కలిసి.. బెజవాడ పోలీస్‌ కమిషనర్‌ గౌతం సవాంగ్‌ను కలిశారు. సాయిశ్రీ మృతికి కారణమైన తన భర్త మాదాల శివకుమార్‌, ఆయనకు పరోక్షంగా సహకరించిన ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు.

ఎమ్మెల్యే అనుచరుల బెదిరింపులు
ఎమ్మెల్యే బొండా ఉమా అనుచరుల నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని సుమనశ్రీ ఆరోపించారు. తన ఇంటిని కబ్జాచేయాలని ప్రయత్నిస్తున్నారని.. తనకు ప్రాణహాని ఉందని ఆమె సీపీకి ఫిర్యాదు చేశారు. సుమనశ్రీ ఫిర్యాదుపై సీపీ స్పందించారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని త్వరలోనే నిందితుడు శివకుమార్‌ను అదుపులోకి తీసుకుంటామని తీసుకుంటామన్నారు. మరోవైపు, బాలిక సాయిశ్రీ మృతిపై బాలలహక్కుల సంఘం, మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన మానవహక్కుల కమిషన్‌.. ఈనెల 20వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని విజయవాడ పోలీస్‌కమిషనర్‌ ను ఆదేశించింది. అటు, అఖిలపక్షం నాయకులు కూడా.. సాయిశ్రీ తల్లి సుమనశ్రీకి పూర్తి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.

07:57 - May 16, 2017

ఢిల్లీ : అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో కేంద్ర ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెట్రోలు, డీజిల్‌ ధరలను తగ్గించాయి. పెట్రోలు లీటర్‌పై రూ.2.16, డీజిలు లీటర్‌పై రూ.2.10 తగ్గింది. తగ్గిన ధరలు సోమవారం అర్థరాత్రి నుంచి అమలులోకి వచ్చాయి.

07:35 - May 16, 2017

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఇవాళ ప్రత్యేక సమావేశం అవుతోంది. జీఎస్టీ బిల్లుకు ఆమోదం తెలపడానికే ప్రభుత్వం అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తోంది. సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో జీఎస్టీ బిల్లుకు ఆమోదం లభించింది. ఇవాళ ఉదయం 10.15కు అసెంబ్లీ సమావేశం కానుంది. అసెంబ్లీ సమావేశం కాగానే జీఎస్టీ బిల్లుకు ఆమోదం తెలపాలని అధికార టీడీపీ భావిస్తోంది. జీఎస్టీ బిల్లు ఆమోదానికే ఈ సమావేశాన్ని పరిమితం చేయాలని యోచిస్తోంది. ఇతర ప్రజా సమస్యలను చర్చకు రానీయకుండా వ్యూహం రచించింది. ప్రతిపక్షం లేవనెత్తే అంశాలను ఎలా తిప్పికొట్టాలన్న దానిపై అధికారపార్టీ నేతలు ఇప్పటికే చర్చించారు. జీఎస్టీ బిల్లును ఆమోదించి... సభను నిరవధిక వాయిదా వేయాలని అధికారపార్టీ యోచిస్తోంది.

ప్రజా సమస్యలపై చర్చ...
నేడు జరిగే ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ప్రజా సమస్యలపై చర్చకు పట్టుబట్టాలని వైసీపీ భావిస్తోంది. అసెంబ్లీ సమావేశాలను పొడిగించాలని వైసీపీ కోరుతోంది. ప్రధానంగా మిర్చి రైతుల సమస్యలు, ఏపీ ప్రత్యేక హోదాపై ప్రభుత్వాన్ని సభలో నిలదీయాలని వైసీపీ వ్యూహం రచించింది. ఇక ఏపీకి ప్రత్యేక హోదాపై సభలో తీర్మానం చేయించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలనుకుంటుంది. మొత్తానికి అధికార, ప్రతిపక్ష పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలతో అసెంబ్లీలో ఏం జరుగుతుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

07:24 - May 16, 2017

గుంటూరు : సోమవారం సాయంత్రం ఏపీ కేబినెట్‌ సుదీర్ఘంగా భేటీ అయ్యింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జీఎస్టీ డ్రాఫ్టు బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల వేతనాలను 50శాతం పెంచాలన్న ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. కొత్త పీఆర్సీ ప్రకారం కనీస వేతనం 12వేలు ఉండనుంది. దీనివల్ల ప్రభుత్వానికి 200 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. ఏప్రిల్‌ 1 నుంచి పీఆర్సీ అమల్లోకి వస్తుంది.

స్పోర్ట్స్‌ పాలసీ 2017....

ఏపీ స్పోర్ట్స్‌ పాలసీ 2017-22కి ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పౌరుల్లో ఆనందం, క్రీడల్లో నైపుణ్యం సాధించడానికి అవసరమయ్యే సాధన సంపత్తిని సమకూర్చడే లక్ష్యంగా క్రీడల పాలసీని రూపొందించారు. నూతన క్రీడా పాలసీతో ఏపీలో క్రీడలకు తగిన ప్రోత్సాహం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఏపీ డిజాస్టర్‌ రికవరీ ప్రాజెక్టు అమలుకు పోస్టులను మంజూరు చేస్తూ ఏపీ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. భావదేవరపల్లి పిషరీస్‌ అండ్‌ పాలిటెక్నిక్‌ కాలేజీలో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలకు మంత్రిమండలి పచ్చజెండా ఊపింది. కొత్త మంత్రుల పేషీల్లో కొత్తగా 88 మంది సిబ్బందిని నియమిస్తూ ఇచ్చిన జీవో నంబర్‌ 69కి ఏపీ కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. నీరు - ప్రగతి పథకంపై ఏపీ కేబినెట్‌లో చర్చ జరిగింది. ఈ కార్యక్రమ అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్లు, మంత్రులు బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. పాలసీల అమలు సరిగ్గా ఉండేలా చూసుకోవాలన్నారు. కర్నూలులో అయోవా యూనివర్సిటీ, విత్తనోత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయనున్నట్టు చంద్రబాబు తెలిపారు.

07:06 - May 16, 2017

హైదరాబాద్ : ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ధర్నాచౌక్‌ను పరిరక్షించుకుంటామని వామపక్షాలు, టీజేఏసీ నేతలు స్పష్టం చేశారు. ధర్నాచౌక్‌ను రక్షించుకునే వరకు తమ ఉద్యమం ఆగబోదని తేల్చి చెప్పారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలియజేస్తే.... పోలీసులను తమపైకి ప్రభుత్వం ఉసిగొల్పిందని మండిపడ్డారు. ప్రజాస్వామ్య హక్కులను కేసీఆర్‌ కాలరాస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. ప్రజా హక్కుల పరిరక్షణకు సంఘటితంగా ఉద్యమిస్తామని టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం అన్నారు. ధర్నా చౌక్‌లో స్థానికుల పేరుతో పోలీసులు ధర్నాకు దిగడంపై హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి సమాధానం చెప్పాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు.

07:03 - May 16, 2017

హైదరాబాద్ : ధర్నాచౌక్‌ తరలింపును నిర్ణయాన్ని..వ్యతిరేకిస్తూ.. కొంతకాలంగా ఆందోళనలు సాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం కూడా ఆందోళన కార్యక్రమం జరిగింది. ధర్నా చౌక్‌ వద్ద తెలంగాణ జేఏసీ, వామపక్షాలు నిరసన తెలిపేందుకు చేసిన ప్రయత్నం.. ఊహించని విధంగా.. ఉద్రిక్తంగా మారింది. వామపక్ష నాయకులపై దాడులు జరిగాయి. కొంతమంది తలలు పగిలాయి. మరి కొంతమంది శరీరాలు లాఠీల దెబ్బలకు కమిలిపోయాయి. ప్రశాంతంగా సాగుతున్న నిరసన ఇలా ఉద్రిక్తంగా మారడానికి కారకులెవరు..? అసలు ధర్నాచౌక్‌ను ఇక్కడినుంచి తరలించాలని నిజంగానే స్థానికులు కోరుకుంటున్నారా..? వాకర్స్‌ అసోసియేషన్‌ ముసుగులో హడావుడిగా ధర్నాకు ప్లాన్‌ చేసింది ఎవరు..? విధ్వంసాన్ని సృష్టించింది ఎవరు..? ఈ ప్రశ్నలకు.. పాలకపక్ష ప్రేరేపిత ఆరాచక శక్తులేనన్న సమాధానం వస్తోంది. ధర్నాచౌక్‌ను ఎత్తివేయాలంటూ నిరసనకు దిగిన వాకర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు కూడా... అనూహ్యంగా మధ్యలో దూరిన కొందరు విద్రోహులే ఈ దాడులకు పాల్పడ్డారని చెబుతున్నారు. జరిగిన హింసాత్మక ఘటనలపై.. వాకర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దాడులకు తమకు ఎలాంటి సంబంధం లేదని వారు స్పష్టం చేశారు.

ఎల్ఐసీ అసోసియేషన్ మద్దతు..
అసలు ధర్నాచౌక్‌ తరలింపు నిర్ణయమే అప్రజాస్వామికమని నగర వాసులు అంటున్నారు. అనేక ఉద్యమాలకు ఊపిరిపోసిన ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌ను తెలంగాణ ప్రభుత్వం తరలించడం సరైంది కాదని సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ ఆల్‌ ఇండియా ఎల్‌ఐసీ అసొసియేషన్‌ సభ్యులు అంటున్నారు. ధర్నా చౌక్‌ వల్ల తమకు ఎటువంటి ఇబ్బంది లేదని స్థానికులు ముక్తకంఠంతో చెబుతున్నారు. ధర్నా చౌక్‌ తరలించాలని డిమాండ్‌ చేస్తూ వచ్చిన వారెవరనేది అర్థంకాకుండా ఉంది. దీని వెనుక కేసీఆర్‌ ప్రభుత్వ కుట్ర దాగుందని.. టీఆర్‌ఎస్‌ పార్టీకి వత్తాసు పలికే గూండాలే ఈ దాడులకు దిగారంటూ ప్రజాస్వామికవాదులు ఆరోపిస్తున్నారు.

06:50 - May 16, 2017

హైదరాబాద్ : అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన చలో ఇందిరాపార్క్‌ నిరసన రణరంగాన్ని తలపించింది. పోలీసుల లాఠీచార్జ్‌లో పలువురు గాయపడ్డారు. చలో ధర్నా చౌక్‌ అంటూ పదిరోజుల క్రితమే పిలుపునిచ్చిన ప్రతిపక్షాలు... నిరసన తెలిపేందుకు సోమవారం ఉదయం ఇందిరాపార్క్‌కు కదిలాయి.. అయితే ఈ ఆందోళనకు ముందునుంచీ అనుమతి లేదన్న పోలీసులు... హఠాత్తుగా సోమవారం ఉదయంమాత్రం పర్మిషన్ ఇచ్చేశారు.. నెలరోజులుగా ధర్నాచౌక్‌లో ఎలాంటి నిరసనలకు అనుమతి ఇవ్వని పోలీసులు. సడన్‌గా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం అందరిలో సందేహం పెంచింది.

ఇందిరాపార్క్‌ముందు అసలు నాటకం
చలో ధర్నా చౌక్‌ను విజయవంతం చేసేందుకు ఉదయం ఎనిమిది గంటలకు అఖిలపక్ష నేతలు, ప్రజాసంఘాలు ధర్నాచౌక్‌వైపు కదిలాయి. అంతకుముందే ఇందిరాపార్క్‌ముందు అసలు నాటకం మొదలైంది.. వాక‌ర్స్ అసోసియేష‌న్... స్థానిక కాల‌నీల పేరుతో తెల్లవారేసరికి అక్కడ టెంట్లు వెలిశాయి.. ధర్నా చౌక్‌లతో తమకు ఇబ్బంది కలుగుతోందని... ధర్నా చౌక్‌ను ఇక్కడినుంచి తరలించాలంటూ స్థానికుల పేరుతో బ్యానర్లు వెలిశాయి. సాధారణంగా ధర్నాచౌక్‌ దగ్గర నిరసనలు తెలపాలంటే పెద్ద ప్రాసెస్‌ ఉంటుంది.. రోడ్డుకు ఇబ్బంది కాకుండా నిరసనల్లో పాల్గొనేందుకు ఎంతమంది వస్తారు? ఎంత టైం ధర్నా చేస్తారో అన్ని వివరాలను పోలీసులకు ఇవ్వాలి.. ఆ తర్వాత టెంట్‌లకు అనుమతిఇస్తారు.. ఇక్కడమాత్రం సీన్‌ రివర్స్ అయింది... ధర్నాకు అనుమతి ఇచ్చిన వారికి బదులు సడన్‌గా వచ్చిన వాకర్స్‌ అసోసియేషన్‌ పేరుతో టెంట్లు అక్కడ ప్రత్యక్షమయ్యాయి... పైగా ధర్నాచౌక్‌ వద్దన్నవారు ట్యాంక్‌బండ్‌వైపు సిగ్నల్‌ దగ్గర.. కవాడిగూడవైపు రోడ్డుపూర్తిగా మూసివేసి టెంట్‌ వేశారు.. దీంతో ధర్నా చౌక్‌ అక్కడే ఉంచాలన్న వారికి లోపలికివెళ్లే అవకాశం లేకుండా పోయింది.

ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ దగ్గరే నిరసనలు
అటు పోలీసుల నుంచి అనుమతి దొరకడంతో ప్రశాంతంగా నిరసన తెలపాలని భావించిన ప్రతిపక్ష నేతలు పార్క్‌ దగ్గర పరిస్థితిచూసి షాక్‌ తిన్నారు.. ధర్నాచౌక్‌ దగ్గరకు వెళ్లే పరిస్థితి లేక ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ దగ్గరే నిరసనలు చేపట్టారు.. అక్కడినుంచి నెమ్మదిగా పార్క్‌ దగ్గరకు చేరేసరికి వారికి స్థానికుల ముసుగులో ఉన్న టీఆర్ఎస్ నేతలు, పోలీసులు ఎదురుపడ్డారు.... రెండువర్గాల వారు ఒకరు ధర్నా చౌక్‌కు అనుకూలంగా... మరొకరు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. ఈలోపు అఖిలపక్షం నేతలను పోలీసులు అడ్డుకున్నారు.. ఇద్దరిమధ్యా తోపులాట జరిగింది.. ఆ వెంటనే పోలీసులు... వామపక్ష కార్యకర్తలు, ప్రజాసంఘాల ప్రతినిధులే లక్ష్యంగా తమ లాఠీలకు పనిచెప్పారు.. దొరికినవారిని దొరికినట్లు చితకబాదారు.. ఈ లాఠీచార్జిలో పలువురు నేతలు, కార్యకర్తలకు గాయాలయ్యాయి.. సిపియం గ్రేటర్‌ హైద‌రాబాద్ కార్యదర్శి శ్రీనివాస్‌ త‌లకు తీవ్ర గాయాలుకావడంతో ఆయన్ని ఆస్పత్రికి తరలించారు.

స్థానికుల ముసుగులో...
అటు వాకర్స్‌ అసోసియేషన్‌, స్థానికులంటూ హల్‌చల్‌ చేసిన వారెవరో వీడియోల్లో తేలిపోయింది.. స్థానికుల ముసుగులో టీఆర్‌ఎస్‌ నేతలు ఈ కార్యక్రమం నడిపించారంటూ వీడియోలు అసలు నిజాన్ని బయటపెట్టాయి.. ఎల్‌బీనగర్‌కు చెందిన నేతలు ప్లకార్డులతో ఈ నిరసనలో దర్శనమిచ్చారు.. పైగా కొందరు పోలీసులు కూడా సివిల్‌ డ్రెస్‌లతో ఆందోళనల్లో కూర్చున్నారు. ఈ కార్యక్రమాన్ని హుసేన్‌సాగర్‌ లేక్‌ పీఎస్‌ సీఐ శ్రీదేవి దగ్గరుండి చేయించారని వామపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఆందోళనలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిని పార్టీ కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు శ్రీనివాసరావు, సున్నం రాజయ్య పరామర్శించారు..ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా నిరసనలో విజయం సాధించామని టీ జేఏసీ చైర్మన్‌ కోదండరాం స్పష్టం చేశారు.. ప్రభుత్వం ఇప్పటికైనా ధర్నా చౌక్‌ తరలింపుపై వెనక్కితగ్గాలని డిమాండ్ చేశారు.. ప్రశాంతంగా సాగాల్సిన ధర్నాను... పోలీసులే ఉద్రిక్తంగా మార్చారని ఆరోపించారు..మొత్తానికి చలో ఇందిరాపార్క్‌ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

Don't Miss