Activities calendar

17 May 2017

21:29 - May 17, 2017

బిహార్‌ : మాజీ సిఎం లాలూపై ఐటి శాఖ దాడులను వ్యతిరేకిస్తూ బిహార్‌ రాజధాని పట్నాలో ఆర్జేడి కార్యకర్తలు వీరంగం సృష్టించారు. బిజెపి నేత సుశీల్‌ కుమార్‌ మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బిజెపి కార్యాలయంపై రాళ్లతో దాడి చేశారు. పార్కింగ్‌ వాహనాలు ధ్వంసం చేశారు. బీజేపీ కార్యకర్తలు వారిని అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆర్జేడీ, బీజేపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగడంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జీ జరిపారు. ఆర్జేడీ అధిపతి లాలూప్రసాద్‌ యాదవ్‌ వెయ్యికోట్లు భూ బినామీ వ్యవహారాలు నడిపారంటూ ఏకకాలంలో 22 ప్రాంతాల్లో ఐటీ శాఖ దాడులు జరపిన విషయం తెలిసిందే. ఆర్జేడి కార్యకర్తలు దాడి చేస్తుంటే పోలీసులు ప్రేక్షకుల్లా వ్యవహరించారని బిజెపి నేత సుశీల్‌ కుమార్‌ మోదీ విమర్శించారు. ఇలాంటి దాడులను సహించేది లేదన్నారు. 

21:27 - May 17, 2017

హైదరాబాద్: మాజీ నేవీ అధికారి కుల్‌ భూషణ్‌ జాదవ్‌ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం రేపు తుది తీర్పు ఇవ్వనుంది. భారత కాలమానం ప్రకారం.. రేపు మధ్యాహ్నం మూడున్నరకు ఇంటర్నేషనల్‌ కోర్టు తీర్పు వెల్లడించనుంది. నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌కు పాకిస్తాన్ సైనిక కోర్టు మరణశిక్ష విధించడాన్ని వ్యతిరేకిస్తూ భారత్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్‌, పాకిస్తాన్‌లు తమ తమ వాదనలు వినిపించాయి. ఇరాన్‌లో వ్యాపారం చేసుకుంటున్న కుల్‌భూషణ్‌ను కిడ్నాప్‌ చేసి గూఢచర్యం ఆరోపణల కింద పాకిస్తాన్‌ ఆర్మీకోర్టు ఉరిశిక్ష విధించిందని భారత్‌ వాదించింది. జాదవ్‌ ఉరిశిక్షను వెంటనే రద్దు చేయాలని భారత్‌ అంతర్జాతీయ న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది. జాదవ్‌ విషయంలో భారత్‌ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని రాజకీయంగా వినియోగించుకుంటోదని పాకిస్తాన్‌ ఆరోపించింది. జాదవ్‌ గూఢచర్యానికి పాల్పడ్డట్లు తమవద్ద ఆధారాలున్నయని పేర్కొంది. ఈ కేసులో కోర్టు తుదితీర్పుపై ఆసక్తిగా మారింది.

21:23 - May 17, 2017

యూపీ : పెళ్లి మండపం నుంచి వధువును కిడ్నాప్‌ చేయడం లాంటి ఘటనలు సినిమాల్లోనే కాదు...నిజ జీవితంలోనూ చూస్తూ ఉంటాం. ఇందుకు విరుద్ధంగా ఓ యువతి పెళ్లి మండపం నుంచి వరుడిని కిడ్నాప్‌ చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో హల్‌చల్‌ సృష్టించింది. హమీర్‌పూర్‌ జిల్లాలో ఓ ఆసుపత్రిలో కంపౌండర్‌గా పనిచేస్తున్న అశోక్‌ అక్కడే పనిచేస్తున్న అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. జీవితాంతం కలిసి ఉండాలని వారు ప్రమాణం కూడా చేశారు. ఇంతలోనే అశోక్‌కు భవానీపూర్‌ గ్రామానికి చెందిన అమ్మాయితో పెద్దలు పెళ్లి కుదిర్చారు. ఈ విషయం తెలుసుకున్న ప్రేమికురాలు సుమోలో ఇద్దరు వ్యక్తులతో కలిసి పెళ్లి మండపానికి వచ్చింది. ఇతడు తన ప్రేమించాడని...వేరే అమ్మాయితో పెళ్లిజరగనివ్వనని వరుడి తలకు తుపాకి గురిపెట్టి కిడ్నాప్‌ చేసింది. ఈ ఘటనతో షాక్‌కు గురైన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అబ్బాయిని కిడ్నాప్‌ చేసిన యువతి ధైర్యానికి మెచ్చుకున్న ఓ పోలీస్ అధికారి ఆమెను ఓ రివాల్వర్‌ రాణిగా పేర్కొన్నారు. పెళ్లి ఆగిపోవడంతో వధువు తీవ్ర ఆవేదనకు లోనైంది.

21:16 - May 17, 2017

కృష్ణా : విజయవాడ నగరంలో డాక్టర్ల హవాలా దందా కలకలం రేపుతుంది...ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది...ఈ దందాలో సహకరించిన పోలీసులపై కూడా వేటుపడింది...తక్కువ వడ్డీకి ఆశపడి లక్షలు పొగొట్టుకున్న డాక్టర్లు ఇందుకు కారణమైన ఓ ఏజెంటును కిడ్నాప్ చేయడంతో దారుణాలు వెలుగుచూస్తున్నాయి...కిడ్నాప్ చేసిన ఏజెంట్‌ను మామిడితోటకు తీసుకువెళ్లి కిరాతకంగా దాడికి పాల్పడ్డారు...

మొన్నటివరకు కుదిపేసిన కాల్‌మనీ...

సింగ‌పూర్ కాల్ మ‌నీకి ముఖ్య కేంద్రంగా మారింది బెజవాడ....ఈ రాకెట్‌లో ఒక‌ కార్పొరేట్ ఆసుప‌త్రికి చెందిన కొంద‌రు వైద్యులు, దానికి సంబంధించి వారు కూడా సింగ‌పూర్ నుంచి అతి త‌క్కువ వ‌డ్డీకి న‌గ‌దు అందిస్తామ‌ని చెపుతున్న బ్రోక‌ర్ చేతిలో మోస‌పోయారు...ప‌ట‌మ‌ట‌కు చెందిన శివ‌బ్రహ్మాజీ కాల్ మ‌నీ వ్యాపారం చేసేవాడు...ఆ తర్వాత కాల్‌మనీ దందాపై పోలీసులు కొరఢా ఝుళిపించడంతో ఈ దందా తగ్గింది...దీంతో రూటు మార్చిన బ్రహ్మాజీ సింగపూర్‌ నుంచి తక్కువ వడ్డీకి కోట్ల రూపాయలు వస్తాయంటూ కార్పోరేట్ డాక్టర్లను నమ్మించాడు...దీంతో గవర్నర్‌పేట హెల్ప్ ఆస్పత్రి ఎండి పువ్వాడ రామకృష్ణ, అశోక్ న‌గ‌ర్ లోని టైమ్స్ ఆసుప‌త్రిలో ఒక న్యూరాల‌జిస్టు, అదే ఆసుప‌త్రికి చెందిన ఎండి మైనేని హేమంత్ కుమార్ లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టారు..

మోసం జరిగిందని తెలుసుకున్న డాక్టర్లు...

ఇదిలా ఉంటే బ్రహ్మాజీ చెప్పినదాంట్లో మోసం ఉందని గ్రహించినవారిలో ఆవేశం కట్టలు తెంచుకుంది..వెంటనే ఏజెంట్‌ బ్రహ్మాజీని కిడ్నాప్ చేసి మామిడితోటకు తీసుకువెళ్లి చెక్కులు..బాండ్‌ రాయించుకుని తీవ్రంగా కొట్టారు..దీంతో బ్రహ్మాజీ వారి దెబ్బలకు తట్టుకోలేక అపస్మారకస్థితికి చేరడంతో ఆస్పత్రిలో చేర్పించి చేతులు దులుపుకున్నారు...

ఇద్దరు అధికారులపై వేటు..

బెజవాడలోని కొందరు డాక్టర్ల హవాలా దందా బయటపడ్డంతో పాటు పోలీసులపై కూడా ఆరోపణలు వచ్చాయి..దీంతో వెంటనే కమిషనర్ గౌతం సవాంగ్ దీనిపై విచారణ చేస్తే నిజాలు బయటపడ్డాయి...వెంటనే ఇందుకు సంబంధించిన పటమట సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్ కెన్నడీని వీఆర్‌కు పంపిస్తూ ఆదేశాలు జారీ చేశారు...డివిజన్ ఏసీపీ రామచంద్రరావును విధులనుంచి తప్పించి డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు...డాక్టర్ల హవాలా వ్యాపారంపై పోలీసులు విచారణ ను వేగవంతం చేస్తున్నారు...

కిడ్నాప్ కేసులో కారు స్వాధీనం...

మరోవైపు ఈ వ్యవహారం పెద్దది కావడంతో పోలీసులు వెంట వెంటనే చర్యలకు రంగంలోకి దిగారు... కిడ్నాప్ కు యత్నించిన కార్ ను స్వాధీనం చేసుకొని డాక్టర్ పువ్వాడ రామకృష్ణతో సహా 7 గురిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు..

కేసు నీరుగార్చే యత్నాలు షురూ..

డాక్టర్ల హవాలా దందా బయటపడ్డంతో ప్రముఖులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది...ఈ వ్యవహారం ఇక ఇంతటితో ముగించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది...హవాలా దందాతో ఎందరికో ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది...బయటపడ్డ వాస్తవాలను కప్పిపుచ్చుతూ...కేసును నీరుగార్చేయత్నాలు మొదలయినట్లు తెలుస్తోంది...

21:13 - May 17, 2017

హైదరాబాద్: అక్టోబర్ 22 నుంచి 28 వరకు తెలంగాణ ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి సెప్టెంబర్ 30 విజయదశమి పర్వదినం రోజు అంకురార్పణ నిర్వహించనున్నారు. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ పాటు సమావేశమైన ప్రభుత్వ సలహాదారు కెవి.రమణాచారి, ఇతర సాహితీ పెద్దలు మహాసభలపై చర్చలు జరిపారు. దేశ, విదేశాల నుంచి తెలుగు సాహితీ రంగ ప్రముఖులను ఆహ్వానించడంతో పాటు ఏర్పాట్లను ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. 

21:10 - May 17, 2017

అమరావతి: కొత్త రాజధానిలో శాసనసభా భవనం నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. రాజధాని నిర్మాణాల్లోనే తలమానికంగా ఉండేలా భవనాన్ని నిర్మిస్తామంటోంది ప్రభుత్వం. అందుకు 160 ఎకరా స్థలాన్ని కేటాయిస్తున్నారు. ఇందులో 140 ఎకరాల్లో ప్రాంగణం కోసం కేటాయిస్తున్నారు. ప్రాంగణంలో జల, హరిత అవసరాలకోసం వదిలేస్తున్నారు. మొత్తం నగరానికే వన్నెతెచ్చేలా కొత్త అసెంబ్లీ బిల్డింగ్‌ నిర్మాణం జరగాలని సీఎం చంద్రబాబు సూచనలు చేసినట్టు తెలుస్తోంది. అమరవాతి నగర నిర్మాణంపై వెలగపూడి సచివాలయం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. 

21:09 - May 17, 2017

హైదరాబాద్: కరీంనగర్‌ అభివృద్ధిపై ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. కరీంనగర్‌ పట్టణాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కరీంనగర్‌లో హైదరాబాద్‌ తరహా కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నిర్మాణం చేపడతామన్నారు. 1200 మంది కూర్చునేలా పట్టణంలో టౌన్‌హాల్‌ నిర్మిస్తామని స్పష్టం చేశారు. కరీంనగర్‌ పరిస్థితిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలని ఉన్నతాధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈసారి హరితహారం కార్యక్రమాన్ని కరీంనగర్‌ నుంచే ప్రారంభించనున్నట్లు కేసీఆర్‌ తెలిపారు. ఒకేసారి లక్ష మొక్కలు నాటుతామన్నారు. 

21:08 - May 17, 2017

ప్రకాశం: తమది క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, గీత దాటితే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని నిత్యం చెప్పుకునే టీడీపీ అధినేతకు ప్రకాశం జిల్లా రాజకీయాలు చుక్కలు చూపిస్తున్నాయి. పార్టీలో పాత, కొత్తనేతల మధ్య నిత్యం కస్సుబుస్సుల పంచాయతీలు జిల్లా పాలిటిక్స్‌ను హీటెక్కిస్తున్నాయి.

జిల్లా పార్టీ అధ్యక్షుడు దామరచర్ల జనార్దనరావు కేంద్రంగా వర్గపోరు

ప్రకాశంజిల్లా టీడీపీలో అసమ్మతిసెగలు మేనెల ఎండ వేడిని మించిపోతున్నాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు దామరచర్ల జనార్దనరావు కేంద్రంగా వర్గపోరు చాపకింద నీరులా విస్తరిస్తోంది. పార్టీ అధ్యక్షునిగా ఆయన అందరినీ కలుపుకుని పోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దామరచర్ల తీరుపై ఏకంగా ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీఅధినేతకు ఫిర్యాదు చేయడంతో.. వర్గపోరు పీక్‌స్టేజ్‌కు చేరుకుంది. పాత,కొత్త నేతల మధ్య పొసగకపోవడమే దీనికి అసలు కారణం.. అంటున్నారు పార్టీక్యాడర్‌. ఆకర్ష్‌ ఆపరేషన్‌తో పార్టీలోకి చేరిన కొత్తనేతల హడావిడిని పాతలీడర్లు జీర్ణించుకోలే పోతున్నట్టు సమాచారం. పార్టీ కార్యక్రమాలు, పనుల్లో జిల్లా అధ్యక్షుడు సమన్వయంగా వ్యవహరించడంలేదని కస్సుబుస్సులాడుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఈ కుమ్ములాటలు కొట్లాటలకు కూడా దారితీస్తున్నాయి. మరికొన్ని చోట్ల నాయకులు జిల్లా అధ్యక్షుడితో సంబంధంలేకుండా సొంతంగా కార్యక్రమాలు నిర్వహిన్నారు. అసలు జిల్లాపార్టీ అధ్యక్షుడే వర్గాలను ప్రోత్సహిస్తూ.. పార్టీలో కుంపట్లు రాజేస్తున్నారని టీడీపీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు.

కొండెపీ లో జిల్లాపార్టీ అధ్యక్షుడు - స్థానిక మ్మెల్యే కుమ్ములాట

ప్రధానంగా కొండెపి నియోజకవర్గంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దామరచర్ల జనార్థనరావు- స్థానిక ఎమ్మెల్యే బాలాంజనేయులుకు మధ్య కుమ్ములాటలతో పసుపుపార్టీ కేడర్‌ నలిగిపోతున్నారు. ఒంగోలు శాసనసభ్యుడు తన నియోజవర్గంలో పెత్తనం చేయడంపై ఎమ్మెల్యే బాలాంజనేయులు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి దామరచర్ల ప్రోద్బలం ఉన్నట్టు బాలాంజనేయులు వర్గం ఆరోపిస్తోంది. దీనిపై పార్టీ అధినేత చంద్రబాబుకు ఫిర్యాదులు కూడా వెళ్లిడంతో దామరచర్లకు బాబు ఓమోస్తరు క్లాసు తీసుకున్నట్టు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

కరణం - దామరచర్ల మధ్య వర్గపోరు..!

ఇక జిల్లాలో మరో బలమైన నేత కరణంబలరాంతో దామరచర్లకు పొసగడమే లేదని తెలుస్తోంది. కరణానికి జిల్లాలో ఏనాటినుంచో ఒక ప్రత్యేక వర్గముంది. ఆ వర్గం పూర్తిగా ఆయన కనుసన్నల్లోనే కొనసాగుతుంది. అయితే జిల్లా రాజకీయాలపై చాకచక్యంగా పట్టునిలుపుకున్న జనార్దరావుతో కరణం వర్గానికి అంతర్గత కుమ్ములాటలు సెగలు పుట్టిస్తున్నాయి. జిల్లాపార్టీ అధ్యక్షుడిగా ఉండికూడా తన మాట చెల్లుబాటు కావడంలేదని దామరచర్ల లోలోపల ఉడికి పోతున్నట్టు తెలుస్తోంది.

రెండు వర్గాలు చీలిపోయి తన్నుకున్న జిల్లా అధ్యక్షుడి వర్గీయులు

పార్టీ జిల్లా అధ్యక్షుడు దామరచర్ల అనుచరులు స్వయంగా.. తామే రెండు వర్గాలుగా చీలిపోయి తన్నులాటకు దిగుతున్నారు. ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకుని పోలీస్టేషన్లలో పార్టీ పంచాయతీలు రక్తికట్టిస్తున్నారు. అటు చీరాలతోపాటు ఇతర నియోజకవర్గాల్లోనూ ఈతరహా కుమ్ములాటలే జరుగుతున్నాయి. చీరాల్లో అయితే పూర్తిగా ముక్కోణపు పోరు నడుస్తోంది. నియోజకవర్గాల్లో పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల అమలు బాధ్యత ఎమ్మెల్యేలకే అని అధినేత.. ప్రకటించిన తర్వాత కూడా.. తమకు ప్రాధాన్యత లేకుండా పోయిందని ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈవిషయంలో పార్టీ పరిశీలకులకు కూడా ఆయన ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అటు పార్టీ నేతలు పాలేటిరామారావు , పోతులసునీత వర్గీయులు పదవులు దక్కినా గ్రూపు రాజకీయాలతో కాకపుట్టిస్తూనే ఉన్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా తమ పట్టును నిరూపించుకునేందుకు ఈనేతలు పథకాలు రచిస్తూనే వున్నారు. ఇక అద్దంకి, కందుకూరు, గిద్దలూరు, మార్కాపురం, వై పాలెం , సంతనూతలపాడు నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్ల మధ్య అంతర్గత కుమ్ములాటలు రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి.

ప్రకాశంజిల్లాలో బెడిసికొట్టి బాబు చాణక్యం..!

పదవులను ఎరవేసి పార్టీని బలోపేతం చేయాలనుకున్న చంద్రబాబు చాణక్యం ప్రకాశంజిల్లాలో బెడిసి కొట్టిందనే అభిప్రాయాలు వనిపిస్తున్నాయి. దీనికి నేతల మధ్య సమన్వయ లోపమే కారణమని అంటున్నారు టీడీపీ శ్రేణులు . అటు వైసీపీకి దీటుగా జిల్లాల్లో ఓ నేతను తయారు చేసుకోవాలనుకున్న సీఎం పాచిక మాగుంట శ్రీనివాస్‌రెడ్డి రూపంలో మరో విఫల యత్నంగా మిగిలిపోయిందనే విమర్శలు వస్తున్నాయి. మాగుంటకు ఎమ్మెల్సీ ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని బాబు సైతం పెదవి విరిచినట్టు విశ్వనీయ సమాచారం. అందుకే మాగుంటకు మంత్రి పదవి చేజారిపోయిందని కూడా పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మంత్రి శిద్ధా పై ప్రజల్లో అసంతృప్తి

ఇక జిల్లా మంత్రి శిద్ధా రాఘవరావు పనితీరుపైకూడా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఆయనకు మంత్రిపదవి అలంకారప్రాయంగానే మిగిలిందనే ఆరోపణలొస్తున్నాయి. పార్టీలోని ఒకరిద్దరు నాయకులకు తప్పితే మంత్రి వల్ల జిల్లాకు ఒరిగిందేం లేదని సొంతపార్టీ క్యాడరే విమర్శలు గుప్పిస్తున్నారు. చివరికి సొంత నియోజకవర్గం దర్శికి కూడా చుట్టపుచూపుగా వస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీంతో నియోజవర్గంలో మంత్రిశిద్ధా పట్టుకోల్పోయారన్న విషయం పార్టీవేగుల ద్వారా సీఎంకు చేరినట్టు తెలుస్తోంది. అటు బాపట్ల ఎంపీ మాల్యాద్రి శ్రీరాం వ్యవహారంకూడా పార్టీకి ఉపయోగం లేకుండా పోయిందని పార్టీ అధినేత భావిస్తున్నట్టు సమాచారం.

సీనియర్ లీడర్ల వర్గపోరుతో సెగలుకక్కుతున్న ప్రకాశంజిల్లా

మొత్తమ్మీద సీనియర్ లీడర్ల వర్గపోరుతో సెగలుకక్కుతున్న ప్రకాశంజిల్లా పార్టీరాజకీయాన్ని ఎలా దారికి తేవాలన్న దానిపై అధినేత చంద్రబాబు సతమతం అవుతున్నట్టు సమాచారం. పార్టీని బలోపేతం చేయాలనుకుని వలసల్ని ప్రోత్సహిస్తే .. చివరికి పార్టీభవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారిందని ప్రకాశం జిల్లా తెలుగుతమ్ముళ్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  

20:44 - May 17, 2017
19:48 - May 17, 2017

నిజామాబాద్‌ : నగరం నడిబొడ్డున ఉన్న అశోక్‌నగర్‌ కాలనీ బొందల గడ్డ ప్రాంతం. నగరపాలక సంస్థ పదవ డివిజన్‌ పరిధిలోకి వచ్చే ఇక్కడ వివిధ వర్గాలకు చెందిన ఐదు శ్మశాన వాటికలు ఉన్నాయి. సమాధులు, శవ దహన వాటికలు. ఇరవై నాలుగు గంటలూ ఎడ్పులు, పెడబొబ్బలతోనే ఈ ప్రాంత నిండి ఉంటుంది. వీటి మధ్యే అశోక్‌నగర్‌ కాలనీ బస్తీ వాసులు సహజీవనం చేస్తున్నారు.

ప్రాతఃకాలంలో ప్రార్థనలు

ఉదయం నిద్ర లేచింది మొదలు, రాత్రి పడుకునే వరకు పూడ్చిపెతున్న శవాలు, దహన సంస్కారాలు చేస్తున్న మృతదేహాలను చూడాల్సిందే. ప్రాతఃకాలంలో కొందరు ఇక్కడకు వచ్చిన ప్రార్థనలు చేస్తారు. సాయం సంధ్యవేళ కొందరు వచ్చి పూజలు నిర్వహిస్తారు. ఇంకొందరు రాత్రికి కొవ్వొత్తులు వెలిగిస్తారు. ఎవరి ఆచార, వ్యవహారాలు, సంప్రదాయాల ప్రకారం వారు కర్మకాండలు నిర్వహిస్తుంటారు. అశోక్‌నగర్‌ బస్తీ వాసులు కళ్లాపి చల్లినా, ముగ్గులు వేసినా బొందల గడ్డ సమాధుల మధ్యే. బయటకొచ్చి విశ్రాంతి తీసుకోవాలంటేనే సమాధుల మీదే కూర్చోవాలి. కాటికాపర్ల కంటే తమ బతుకులు హీనంగా మారినా ఎవరూ పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుళ్లిపోయిన శవాల దుర్వాసనలు, కాలుతున్న మృతదేహాల కమురు కంపు భరించలేక అనారోగ్యం పాలవుతున్నా తమ గోడు వినిపించుకుని, మొర ఆలకించే నాథులే లేరని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు రోజుకు జీవనం దుర్భరంగా మారుతోందని బాధ పడుతున్నారు.

గాలితో దుమ్ము రేగుతున్న శ్మశాన బూడద

అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడూ ఏదో ఒక గృహ నిర్మాణ పథకాన్ని అమలు చేస్తూనే ఉన్నాయి. గాలితో దుమ్మురేగుతున్న స్మశాన బూడిద నుంచి తమను బయటపడేయాలని అటు ప్రజా ప్రతినిధులు, ఇటు అధికారులకు ఎన్నోసార్టు మొరపెట్టుకున్న ప్రయోజనం లేకపోయిందని నిజామాబాద్‌ అశోక్‌నగర్‌ బస్తీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ఇళ్లు కట్టిస్తాం, స్థలాలు ఇప్పిస్తామని హామీతో ఊదరగొట్టి, ఓట్లు దండుకని నెగ్గిన తర్వాత ఇటువైపు ముఖం కూడా చూపించడంలేదని బాధ పడుతున్నారు.

పిండ ప్రదానాల కోసం కాకులు, కుక్కులు

ఈ శ్మశానంలో రాబందులు, గద్దలు వాలుతుంటాయి. పితృ దేవతలకు చేసిన పిండ ప్రదానాల కోసం కాకులు, కుక్కలు వస్తుంటాయి. ఇన్ని సమస్యల మధ్య సహజీవనం చేస్తున్న తమ ఇళ్లకు బంధువులు రావాలంటేనే భయపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ఇళ్లలో పుట్టిన ఆడపిల్లలను పెళ్లి చేసుకునేందుకు యువకులు ఎవరూ ముందురావడంలేదని ఆవేదన వెలిబుచ్చుతున్నారు. కాలనీకి, శ్మశానాలకు మధ్య ప్రహరీగోడైనా నిర్మించాలని ఎన్నోసార్లు విన్నవించినా ఎవరూ పట్టించుకోని దయనీయ పరిస్థితులు ఉన్నాయి. డీ శ్రీనివాస్‌ నిజామాబాద్‌ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రహరీగోడ నిర్మాణానికి చేసిన శంకుస్థాపన శిలాఫలకం నేటికీ వెక్కిరిస్తూనే ఉంది. ఇప్పటికైనా పాలకులు, అధికారులు తమ గోడు పట్టించుకని ఈ బొందల గడ్డ బాధ నుంచి తమకు విముక్తి కల్పించాలని నిజామాబాద్‌ అశోక్‌నగర్‌ బస్తీ వాసులు కోరుతున్నారు. 

హెచ్‌సీఏ కార్యాలయం ఎదుట క్రికెట్‌ అభిమానులు ఆందోళన

హైదరాబాద్: ఈ నెల 21న హైద‌రాబాద్ శివారులోని ఉప్ప‌ల్ స్టేడియంలో ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్ ను ప్ర‌త్య‌క్షంగా చూడాల‌ని క్రికెట్ అభిమానులు వెయ్యి క‌ళ్ల‌తో ఎదురు చూస్తున్నారు. అయితే, స్టేడియం వ‌ద్ద ఇప్ప‌టికీ టికెట్ల విక్ర‌యాలు ప్రారంభం కాలేదు. మ‌రోవైపు ఈ నెల 15 నుంచే టిక్కెట్ల‌ను విక్ర‌యిస్తామ‌ని హెచ్‌సీఏ ప్ర‌క‌టించింది. హెచ్‌సీఏ ఆఫీసు దగ్గరకి వెళ్లిచూస్తే 'సోల్డ్‌ అవుట్' అంటూ ఓ బోర్డు క‌న‌ప‌డింది. ఈ విష‌యం గురించి మాట్లాడ‌డానికి కార్యాలయ అధికారులు అందుబాటులో లేరు.

మడ్డువలస జలాశయంలో ఇద్దరు విద్యార్థులు గల్లంతు

శ్రీకాకుళం : జిల్లాలోని వంగర మండలంలోని మడ్డువలస జలాశయంలో ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. పెళ్లి కోసం విజయనగరం జిల్లా నుంచి వచ్చిన రమణ, దిలీప్‌లు సరదాగా ఈతకు వెళ్లగా ప్రమాదం జరిగింది. గల్లంతైన వారి కోసం గత ఈతగాళ్లు గాలిస్తున్నారు. 

నిరుద్యోగ భృతి హామీని త్వరలోనే అమలు చేస్తాం: మంత్రి కొల్లు

అమరావతి: నిరుద్యోగ భృతి హామీని త్వరలోనే అమలు చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. దీనికి సంబంధించిన విధివిధానాలపై సమావేశం కూడా జరిగిందన్నారు. బడ్జెట్లో కేటాయించిన 500 కోట్లతో పాటు.. ఇతర శాఖల నుంచి కూడా నిధులు సమకూర్చుకుని నిరుద్యోగ భృతిని అమలు చేస్తామని స్పష్టం చేశారు.

జనగామలో రిమాండ్ ఖైదీ పరార్

హైదరాబాద్: జనగామలో రిమాండ్ ఖైదీ పరారయ్యాడు. ఖైదీని తరలిస్తుండగా.. జనగామ-యశ్వంత్‌పూర్‌ మధ్య పోలీసుల కళ్లుగప్పి చంద్రమోహన్‌ పరారయ్యాడు. దీంతో చంద్రమోహన్‌ను పట్టుకునేందుకు పోలీసులు ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు. తప్పించుకున్న ఖైదీ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. 

19:34 - May 17, 2017

హైదరాబాద్: జనగామలో రిమాండ్ ఖైదీ పరారయ్యాడు. ఖైదీని తరలిస్తుండగా.. జనగామ-యశ్వంత్‌పూర్‌ మధ్య పోలీసుల కళ్లుగప్పి చంద్రమోహన్‌ పరారయ్యాడు. దీంతో చంద్రమోహన్‌ను పట్టుకునేందుకు పోలీసులు ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు. తప్పించుకున్న ఖైదీ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.

 

19:30 - May 17, 2017

శ్రీకాకుళం : జిల్లాలోని వంగర మండలంలోని మడ్డువలస జలాశయంలో ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. పెళ్లి కోసం విజయనగరం జిల్లా నుంచి వచ్చిన రమణ, దిలీప్‌లు సరదాగా ఈతకు వెళ్లగా ప్రమాదం జరిగింది. గల్లంతైన వారి కోసం గత ఈతగాళ్లు గాలిస్తున్నారు. 

19:27 - May 17, 2017

మహబూబ్‌నగర్‌ : జిల్లా....రాజకీయ విలక్షణతకు మారు పేరు. ప్రజా తీర్పు ఎప్పుడూ విలక్షణంగా, ఏకపక్షంగా ఉంటుంది. 2014 ఎన్నికల్లో ఏడుగురు టీఆర్‌స్‌ ఎమ్మెల్యేలు, ఎంపీని గెలిపించుకున్నారు. ఎన్నికల తర్వాత నారాయణపేట టీడీపీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, మఖ్తల్‌ ఎమ్మెల్య చిట్టెం రామ్మోహన్‌రెడ్డి గులాబీ గూటికి చేరడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఇంత మంది శాసనసభ్యులు ఉన్నా జిల్లాలో టీఆర్‌ఎస్‌కు సొంత కార్యాలయంలేని లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.

పార్టీ సొంత భవనాల్లో ప్రతిపక్ష నేతలు

పాలమూరు జిల్లాలో టీఆర్‌ఎస్‌ బలపడుతోంది. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు జిల్లా కేంద్రంలో సొంత కార్యాలయాలు ఉన్నాయి. కాంగ్రెస్‌, టీడీపీకి సొంతగా పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నాయి. సీపీఎం, సీపీఐలకు సొంత భవనాలు ఉన్నాయి. ఇటీవలే బీజేపీ కూడా సొంతంగా భవనాన్ని నిర్మించుకుంది. ప్రతిపక్ష పార్టీల నేతలు సొంత భవాల్లో కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నా... అధికార టీఆర్‌ఎస్‌ నేతలు మాత్రం ఇందుకు భిన్నం. పార్టీ ప్రజా ప్రతినిధులు జిల్లా కేంద్రానికి వస్తే కనీసం కూర్చునేందుకు అవకాశం లేదు. పార్టీ కార్యాలయం కోసం ఓ భవాన్ని కూడా అద్దెకు తీసుకోలేదు. దీంతో రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహమే దిక్కవుతోంది. పార్టీ సమావేశాల నుంచి నేతల సమాలోచనల వరకు అన్నీ ఇక్కడే జరుగుతున్నాయి. అధికార పార్టీకి సొంత కార్యాలయం లేకపోవడం ఇబ్బందిగా మారిందని నేతలు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కేసీఆర్‌ మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానం నుంచి పార్లమెంటుకు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానం నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం జీతేందర్‌రెడ్డి ఎంపీగా ఉన్నారు. ఇద్దరూ కూడా సొంత పార్టీ కార్యాయలం ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ నేటికీ నెరవేరకపోవడంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు నిట్టూర్చుకుంటున్నారు. 2019 ఎన్నికల లోపైనా టీఆర్‌ఎస్‌కు సొంత కార్యాలయ భవనం నిర్మాణంపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. 

19:23 - May 17, 2017

హైదరాబాద్: తెలంగాణలో పాగా వేసేందుకు బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. యూపీలో అనుసరించిన వ్యూహాన్ని తెలంగాణలోనూ అనుసరించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే యూపీ ఎన్నికల ప్రచారంలో ఉపయోగించిన ద్విచక్ర వాహనాలను హైదరాబాద్‌ బీజేపీ కార్యాలయానికి తరలించారు. ఈనెల 22న రాష్ట్రంలో పర్యటించనున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా.. క్రియాశీల కార్యకర్తలకు వాహనాలను అందజేసి.. దిశానిర్దేశం చేయనున్నారు. 

19:17 - May 17, 2017

అమరావతి: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏపీ సర్కార్ నిరుద్యోగ భృతిని అమలు చేస్తామని మంత్రి కొల్లు రవీందర్ తెలిపారు. ఆయన '10టివి'తో మాట్లాడుతూ.. దీనికి సంబంధించిన విధివిధానాలపై సమావేశం కూడా జరిగిందన్నారు. బడ్జెట్లో కేటాయించిన 500 కోట్లతో పాటు.. ఇతర శాఖల నుంచి కూడా నిధులు సమకూర్చుకుని నిరుద్యోగ భృతిని అమలు చేస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వెళుతన్నామని తెలిపారు. ప్రత్యేకించి భృతి ని ఎలా అమలు చేయాలని, దానికి ఫండ్స్ ఎలా సేకరించాలో విధి విధానాలు రూపొందించుకునేందుకు ఈ రోజు కమిటీలో చర్చించినట్లు తెలిపారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

 

ఏపీ సచివాలయంలో హ్యాకింగ్ కలకలం..

అమరావతి: ఏపీ స‌చివాల‌యంలో కొన్ని కంప్యూట‌ర్లు హ్యాకింగ్ కు గుర‌య్యాయ‌ని గుర్తించిన ఐటీ నిపుణులు వాటిని స‌రిచేసేందుకు కుస్తీ ప‌డుతున్నారు. హ్యాకింగ్‌కు గురైన కంప్యూట‌ర్ల‌లో కొత్త హార్డ్ డిస్కులను ఇన్‌స్టాల్ చేస్తున్నారు. హ్యాకర్లు పంపించిన ఈ వైర‌స్ వ‌న్నా క్రై వైర‌సేనా? అనే అంశం తెలియాల్సి ఉంది. సుమారు 20 నుంచి 30 కంప్యూట‌ర్‌లు హ్యాకింగ్ కు గురైన‌ట్లు తెలుస్తోంది. 

19:12 - May 17, 2017
19:11 - May 17, 2017
19:10 - May 17, 2017

ఖమ్మం: మండుతున్న ఎండలు.. మద్యం విక్రయాలను భారీ స్థాయిలో పెంచేశాయి. ముఖ్యంగా చల్లచల్లని బీర్‌ల కోసం వినియోగదారులు ఎగబడుతున్నారు. దీంతో ప్రస్తుత వేసవిలో.. కోట్లాది రూపాయల మద్యం అమ్ముడవుతోంది.

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీర్‌లకు డిమాండ్‌

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ... భానుడు ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. దీంతో ప్రజలు ఉపశమనం కోసం వివిధ ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ జాబితాలో చల్లచల్లని బీర్‌లు అగ్రస్థానంలో నిలిచాయి. ఉష్ణతాపం నుంచి ఉపశమనం కోసం.. ప్రజలు బీర్‌ సేవనంపై అమితాసక్తిని కనబరుస్తున్నారు.

డిమాండ్‌కు సరిపడా బీర్‌ కేసులు లేకపోవడంతో..

ప్రజల నుంచి వస్తున్న డిమాండ్‌కు సరిపడా బీర్‌ కేసులు లేకపోవడంతో.. మద్యం విక్రయదారులు.. బీర్ల ధరలను అమాంతంగా పెంచేశారు. మద్యం ప్రియులు కూడా.. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరను చెల్లించి మరీ బీర్‌ సీసాలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో మద్యం అమ్మకాలు ఆశించిన దానికంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. రెండు నెలల వ్యవధిలో, కేవలం బీర్లను విక్రయించడం ద్వారానే.. జిల్లా ఎక్సైజ్‌ శాఖ 45 కోట్ల 50 లక్షల రూపాయల మేర ఆదాయాన్ని సముపార్జించింది.

రెండు జిల్లాలో 144 వైన్‌ షాపులు, 44 బార్లు, 3 క్లబ్‌లు...

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 144 వైన్‌షాపులు, 44 బార్లు, మూడు క్లబ్‌ల్లో మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. రెండు జిల్లాలలోనూ.. మార్చిలో ఒక లక్షా 82 వేల 7 వందల 47 కేసుల బీర్‌ విక్రయం ద్వారా.. మొత్తం రూ.19.77కోట్ల ఆదాయం వచ్చింది. ఏప్రిల్లో 2 లక్షల 34వేల 161 కేసుల బీర్‌ అమ్మకాల ద్వారా రూ.25.30 కోట్లు సమకూరింది. గత ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో 4 లక్షల 24 వేల 428 బీరు కేసులు అమ్ముడుపోయాయి. అయితే ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌ నెలల్లో 4 లక్షల 16 వేల 908 కేసులు విక్రయించారు.ప్రజల నుంచి వస్తున్న డిమాండ్‌ దృష్ట్యా టీఎస్‌బీసీఎల్‌ అధికారులు వైరాలోని డిపోకు గతంకంటే అదనంగా బీర్లను సరఫరా చేయిస్తున్నారు. గత ఏడాది రెండు నెలలతో పోలిస్తే.. ఈ సంవత్సరం దాదాపు ఏడు వేల 5 వందల 20 కేసుల బీర్‌ విక్రయాలు తగ్గాయి. కానీ మద్యం రేట్లను భారీగా పెంచడం వల్ల.. ఎక్సైజ్‌ శాఖకు ఆదాయమూ గణనీయంగా పెరిగింది.

మే నెలలో 16 రోజుల్లోనే అత్యధిక మద్యం విక్రయాలు...

ఉభయ జిల్లాలో కేవలం మే నెలలోని 16రోజుల్లోనే మద్యం విక్రయాలు చాలా అధికంగా జరిగాయి. అందులో రూ.14 కోట్ల వరకు బీర్‌ విక్రయాలు ఉండటం విశేషం. గతేడాది మే నెలలో ఉమ్మడి జిల్లాలో రూ.86 కోట్ల విక్రయాలు జరగ్గా ఈ ఏడాది ఆ మొత్తం వంద కోట్లకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

 

19:09 - May 17, 2017

హైదరాబాద్‌ :కేపీహెచ్‌బీలో క్రికెట్‌ బెట్టింగ్‌ గ్యాంగ్ పట్టుబడింది. బెట్టింగ్‌ను నిర్వహిస్తున్న ముగ్గురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి ఆరు మొబైల్స్‌, లక్షా 50 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. రోడ్డు నెంబర్‌ -2లో గణేష్‌ బాయ్స్‌ హాస్టల్లో శ్రీనివాసరెడ్డి, చెన్నకేశవరెడ్డి, సుధీరకుమార్‌లు ఐపీఎల్‌ మ్యాచ్‌లపై బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అరెస్ట్‌ చేశారు. కాగా ప్రధాన నిందితుడు సూర్యనారాయణ పరారీలో ఉన్నట్టు పోలీసులు చెప్పారు.

 

19:08 - May 17, 2017

నిజామాబాద్: ఓవైపు మిర్చి, పసుపు పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు సతమతమవుతుంటే మరో వైపు నిజామాబాద్ జిల్లాలో ఆమ్ చూర్ రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. తెచ్చిన సరుకు అమ్మకుందామంటే పెట్టుబడి కూడా రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దళారుల నిలువుదోపిడి.. అధికారుల నిర్లక్ష్యంతో ఆవేదన చెందుతున్న నిజామాబాద్ ఆమ్ చూర్ రైతుల దయనీయ పరిస్థితిపై టెన్ టీవీ ప్రత్యేక కథనం.

నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్...
హైదరాబాద్ తరువాత ఆమ్‌చూర్ కొనుగోళ్లకు ప్రసిద్ధి చెందింది నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్. ఇక్కడకు అనేక ప్రాంతాల నుంచి రైతులు వచ్చి సరుకును అమ్ముతుంటారు. ఏటా అంతంత మాత్రంగా ఉంటే ఆమ్ చూర్ ధర ఈసారి సగానికి సగం పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పెట్టుబడులు కూడా రావడం లేదని ఆవేదన చెందుతున్నారు.

ఉత్తరాది రాష్ట్రాల్లో ఆమ్‌చూర్ కు గిరాకి ఎక్కువ......
ఆమ్‌చూర్ కు ఉత్తరాది రాష్ర్టాల్లో గిరాకి ఎక్కువగా ఉంటుంది. డిల్లీ, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహర్, హర్యానా, హిమచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్ధాన్ రాష్ట్రాల్లో చింతపండుకు బదులు ఈ ఆమ్ చూర్ ను వంటలలో వినియోగిస్తారు. మామిడికి ధర లేని సమయంలో రైతులు ఆమ్ చూర్ తయారు చేస్తారు. మామిడికాయల పొడుగ్గా ముక్కలుగా చేసి ఎండబెడతారు. పూర్తిగా ఎండిన మామిడి ముక్కలను మార్కెట్ కు తీసుకువస్తారు. ఈ ఏడాది మామిడి కాయలకు పెద్దగా గిట్టు బాటు ధర లేకపోవడంతో చాలామంది రైతులు ఆమ్ చూర్ ను తయారు చేసి పెద్ద మొత్తంలో సరుకును నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కు తీసుకువచ్చారు.

నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ లో ఇష్టారాజ్యంగా కొనుగోళ్లు
నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు వారం రోజులుగా అంచూర్ పంట తరలి వస్తోంది. అయితే ఇక్కడ కొనుగోళ్లు ఇష్టారాజ్యంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఈ పంటకు ఎక్కడా కూడా పెద్దగా మార్కెట్ లేకపోవడంతో దాదాపుగా పది జిల్లాల నుండి రైతులు నిజామాబాద్ కు వచ్చి ఆమ్ చూర్ అమ్ముతున్నారు. అయితే ఈ పంటకు కొనుగోలు దారులు తక్కువగా ఉండటంతో దళారులుగా మారిన కొందరు వ్యాపారులు రైతుల్ని నిలువునా ముంచుతున్నారు. గతేడాది క్వింటా ఆమ్ చూర్ 26 నుండి 28 వేలు ధర పలికింది. దాంతో ఆశపడ్డ రైతులు పెద్ద మొత్తంలో మామిడి కాయలు ఆమ్ చూర్ గా మార్చేసారు. ప్రస్తుతం క్వింటాలు 13 నుంచి 17 వేల ధర పలుకుతుండటంతో తాము పెట్టిన పెట్టుబడి కూడా రావట్లేదని రైతులు వాపోతున్నారు.

క్వింటాకు నాలుగు కిలోలు తగ్గించి ...
మరోవైపు వ్యాపారులు సంచి బరువు పేరుతో క్వింటాకు నాలుగు కిలోలు తగ్గించి లెక్కకడుతుండటంతో రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ లెక్కన రోజుకు లక్ష రూపాయల వరకు సొమ్ము చేసుకుంటున్నారు. ఇక దూర ప్రాంతాల నుండి వచ్చే రైతులకు అప్పటికప్పుడు చెల్లింపులు చేస్తేనే ఇంటికి వెళ్లె పరిస్థితి. రైతుల బలహీనతను సాకుగా తీసుకుని పలికిన ధరకంటే తగ్గించి డబ్బులు ఇస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు తమకు న్యాయం చేయాలని ఆమ్ చూర్ రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. దళారులను కట్టడి చేసి తమకు గిట్టుబాటు ధర ఇప్పించేలా చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు. 

17:56 - May 17, 2017

హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ ప్రాంతంలోని ఏఓసీ సెంటర్ చౌరస్తాకు అనుసంధానంగా చాలా రహదారులు ఉన్నాయి. ఇది వేల సంఖ్యలో వాహనాలకు ప్రధాన రహదారిగా మారింది. ఉన్నట్టుండి మిలిటరీ అధికారులు ఏఓసి సెంటర్‌ చౌరస్తాకు అనుగుణంగా ఉన్న గాఫ్‌ రోడ్డును.. జూన్ ఒకటో తేదీ నుంచి పూర్తిగా మూసేస్తామనడంతో వాహనదారులు విస్మయానికి గురవుతున్నారు.

ఈసీఐఎల్, సైనిక్‌పురి, నేరెడ్‌మెట్‌

ఈసీఐఎల్‌, సైనిక్‌పురి, నేరెడ్‌మెట్‌ తదితర ప్రాంతాల నుంచి.. రామకృష్ణాపురం బ్రిడ్జి, కేవీ జంక్షన్‌, గాఫ్‌ రోడ్డు, ఏఓసీ చౌరస్తా మీదుగా నగరంలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. జూన్‌ 1న ఈ రహదారులు మూసి వేస్తున్నారంటూ వెలువడుతున్న వార్తలు.. స్థానికులకు కలవరానికి గురి చేస్తున్నాయి.

2014లో ఆదేశించిన కేంద్ర ప్రభుత్వం

దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాద దాడులు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో మిలిటరీ స్టేషన్‌ల గుండా సామాన్య పౌరుల రాకపోకలను నిలిపివేయాలని.. 2014లో అప్పటి కేంద్రప్రభుత్వం ఆదేశించినట్లు రక్షణ శాఖ పేర్కొంది. 2014 మే 30 నుంచి సికింద్రాబాద్ ఏఓసీ సెంటర్‌ చౌరస్తాకు అనుసంధానంగా ఉన్న ఐదు రహదారులను మూసివేస్తున్నట్లు.. అప్పట్లో మిలిటరీ అధికారులు ప్రకటించారు. ఈ విషయంలో రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు, స్థానిక నేతలతో పలుమార్లు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. పైగా స్థానికులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. ఆర్‌డబ్ల్యూఏ ప్రతినిధులు స్థానిక ఎంపీ మల్లారెడ్డి నేతృత్వంలో రక్షణ శాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌ను కలిసి గోడును వెళ్లబుచ్చారు.

రక్షణ శాఖ మంత్రి దృష్టికి..

ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్‌ కూడా రక్షణ శాఖా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రత్యామ్నాయ దహదారుల అభివృద్ధి పైనా జీహెచ్‌ఎంసీ అధికారులతో చర్చలు జరిపారు. జీహెచ్‌ఎంసీ, మిలిటరీ, కంటోన్మెంట్ బోర్డు అధికారులు కలిసి ప్రత్యామ్నాయ రహదారుల అభివృద్ధిపై సర్వేలు కూడా చేశారు. రహదారులను దశలవారీగా మూసి వేస్తున్నట్లు మిలిటరీ అధికారులు తెలిపారు. దీంతో వాహనదారులు ఇక్కట్లు ఎదురుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

ఎంపీలు జితేందర్‌ రెడ్డి, వినోద్‌కుమార్‌

మే 11న ఎంపీలు జితేందర్‌ రెడ్డి, వినోద్‌కుమార్‌ రక్షణ శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీని కలిసి.. ఏఓసి రహదారులను మూసి వేయడం వల్ల తలెత్తే ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గాఫ్‌ రోడ్డును పూర్తిగా మూసేస్తే రాకపోకలు సాగించే వాహనాల భారం తిరుమలగిరి చౌరస్తాపై పడుతుంది. కేవీ జంక్షన్ నుంచి తిరుమలగిరి చౌరస్తాకు వచ్చి.. ఎడమవైపు వెళ్లే మార్గంలో విద్యుత్‌ టవర్‌ ఉండడం వల్ల.. ఎడమవైపుకు వెళ్లే అవకాశం లేదు. ఎంపీల విజ్ఞప్తి మేరకు రక్షణ శాఖ మంత్రి ఈ సారి గడువును పొడిగించాలని.. అధికారులను ఆదేశిస్తారా లేదా వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. 

స్టాక్ మార్కెట్లు..నష్టాల్లో నుండి లాభాల్లో

ముంబై : మార్కెట్లు నష్టాల నుండి లాభాల బాట పట్టాయి. బుధవారం మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 76 పాయింట్లు లాభపడి 30,659, నిఫ్టీ 14 పాయింట్ల లాభంతో 9526 వద్ద రికార్డు స్థాయిలో ముగిశాయి.

16:46 - May 17, 2017
16:43 - May 17, 2017

ఢిల్లీ: ట్రిపుల్ తలాక్‌పై సుప్రీంకోర్టులో ఐదోరోజు విచారణ కొనసాగుతోంది. ట్రిపుల్ తలాక్‌ను తిరస్కరించే హక్కు మహిళలకు ఉంటుందా అని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డును సుప్రీంకోర్టు ప్రశ్నించింది. స్వల్ప కాలంలో ట్రిపుల్ తలాక్‌ చెప్పి, వివాహాన్ని రద్దు చేసే అవకాశం భర్తకు లేకుండా నిఖానామాలో నిబంధనను చేర్చవచ్చునని బోర్డు తరపున వాదనలను వినిపిస్తున్న కపిల్ సిబాల్ కోర్టుకు తెలిపారు. బోర్డు సూచనలను కాజీలు తప్పనిసరిగా పాటిస్తారా అని కోర్టు ప్రశ్నించింది. బోర్డు సూచనలు తప్పనిసరిగా అనుసరించాల్సిన అవసరం కాజీలకు లేదని బోర్డు తరపున వాదిస్తున్న మరో న్యాయవాది యూసఫ్‌ ముచాలా సమాధానమిచ్చారు. ట్రిపుల్ తలాక్‌ ఓ పాపమని...దీన్ని పాటించిన వారిని బహిష్కరించాలని ఏప్రిల్‌ 14న ముస్లిం పర్సనల్‌ లా బోర్డు చేసిన తీర్మానాన్ని కోర్టుకు సమర్పించారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఖేహార్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ట్రిపుల్‌ తలాక్‌పై గత నాలుగురోజులుగా విచారణ కొనసాగిస్తోంది. 

16:41 - May 17, 2017

హైదరాబాద్: తెలంగాణలో మెడికల్ పీజి అడ్మిషన్లను ప్రైవేటు మెడికల్ కాలేజీలు నిరాకరించడం వివాదాస్పదమవుతోంది. కౌన్సెలింగ్‌లో కేటాయించిన కాలేజీలో చేరేందుకు యాజమాన్యాలు అంగీకరించకపోవడం విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో పేద, మధ్యతరగతి విద్యార్ధులకు పీజి మెడికల్ విద్య అందని ద్రాక్షలా మారింది. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

16:40 - May 17, 2017

పెద్దపల్లి : మంథని చర్చిలో బాల్య వివాహాన్ని ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్నారు. గుంజపడుగుకు చెందిన ఇల్లెందుల వసంత, కూచిరాజ్‌పల్లికి చెందిన నక్క వివేక్‌లు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వివాహం చేయకపోతే.. ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించడంతో వారిద్దరికి పెళ్లి చేసేందుకు పెద్దలు నిర్ణయించారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు మంథని చర్చిలో వివాహం జరుపుతుండగా అడ్డుకున్నారు. అనంతరం వారిద్దరికి కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

16:32 - May 17, 2017

హైదరాబాద్: ఆఫ్ఘనిస్తాన్‌లో టీవీ, రేడియో స్టేషన్లపై ముగ్గురు ఆగంతకులు దాడికి పాల్పడ్డారు. న‌న్‌గ‌ర్హర్‌ ప్రావిన్సు రాజ‌ధాని జ‌లాలాబాద్‌లో ఉన్న జాతీయ రేడియో స్టేష‌న్‌లోకి ముగ్గురు సాయుధులు చొర‌బ‌డ్డారు. సూసైడ్ మాస్క్‌లు ధ‌రించిన ముగ్గురూ ఏకే-47 రైఫిళ్లతో రేడియో స్టేష‌న్‌లోకి ఎంట‌ర్ అయ్యారు. ఇద్దరు ఆగంత‌కులు సూసైడ్ బెల్టుల‌ను పేల్చుకున్నట్లు సమాచారం. మ‌రొక‌రు పోరాడున్నాడు. రాష్ట్ర గ‌వ‌ర్నర్ కార్యాల‌యానికి స‌మీపంలో ఉన్న టీవీ స్టేష‌న్‌పై దాడి చేయ‌డంతో అక్కడ ప‌రిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఆగంతకులు టీవీ భవనంలోకి ప్రవేశించారని వారి టార్గెట్‌ ఏంటో ఇంతవరకు తెలియలేదని అధికార వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్‌ సరిహద్దులో ఉన్న నన్‌గర్హర్‌ ప్రావిన్స్‌లో ఐసిస్‌, తాలిబన్ల ప్రభావం తీవ్రంగా ఉంది.

బాబు ప్రభుత్వాన్ని తొలగించాలన్న కట్జూ..

ఢిల్లీ :పొలిటికల్ పంచ్ అడ్మినిస్ట్రేటర్ రవికిరణ్ అరెస్టును సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ కట్జూ తీవ్రంగా ఖండించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని, కార్టూన్లు భావా ప్రకటనా హక్కులో భాగమని కట్జూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఆర్టికల్ 19 (1) ఏ కింద ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు పౌరులకు ఉంటుందని, సోషల్ మీడియా కార్యకర్తల విషయంలో ఏపీ ప్రభుత్వ తీరు అనాగకరికంగా, అప్రజాస్వామికంగా ఉందన్నారు. దీనిపై రాష్ట్రపతి, ప్రధానికి కట్జూ లేఖ రాశారు. చంద్రబాబు ప్రభుత్వంపై ఆర్టికల్ 356ని ప్రయోగించి తక్షణం ప్రభుత్వాన్ని తొలగించాలని కట్జూ డిమాండ్ చేశారు.

ఆందోళనకు వైద్య విద్యార్థులు సిద్ధం..

హైదరాబాద్ : ప్రైవేటు మెడికల్ కాలేజీలు ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైద్య విద్యార్థులు ఆందోళనకు సిద్ధమౌతున్నాయి.

 

15:43 - May 17, 2017

విశాఖ :రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హవాలా కేసులో.. సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. సీఐడీ ఉన్నతాధికారులు ఇప్పటికే విశాఖలో మఖాం వేశారు. దీంతో పాటు మహేశ్‌ నుంచి సమాచారాన్ని రాబట్టే పనిలో పడ్డారు.

రూ. 569 కోట్లకే పరిమితం అనుకున్నా కూడా...

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హవాలా కేసు డొంక కదులుతోంది. మొదట 569 కోట్లకే పరిమితం అనుకున్నా.. ఆ తరువాత ఇది ఇంకా పెద్ద కేసు అని తేలింది. మొత్తం విశాఖపట్టణం, శ్రీకాకుళం, కోల్‌కత్తా లాంటి ప్రదేశాలలో.. 12 బోగస్‌ కంపెనీలు ఏర్పాటు చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. విశాఖ కోల్‌కత్తా, హైదరాబాద్‌లోని అన్ని ప్రధాన బ్యాంకులలో.. దాదాపు 30 అకౌంట్లు ఏర్పాటు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. మొదట ఈ కేసులో 569 కోట్లను విదేశాలకు మళ్లించారని పోలీసులు భావించారు. అయితే కోల్‌కత్తా సిండికేట్‌ బ్యాంక్‌ శాఖలో 800 కోట్లు చేరడాన్ని పోలీసులు గమనించారు.

సింగపూర్‌, మలేషియా, హాంకాంగ్‌, చైనా

సింగపూర్, మలేషియా, హాంకాంగ్‌, చైనా వంటి దేశాలలోని బ్యాంక్ ఖాతాలకు.. డబ్బు తరలి వెల్లినట్లుగా ఇప్పటికే విశాఖ పోలీసులు గుర్తించారు. విదేశాలతో ముడిపడిన వ్యవహారం కావడం.. రానున్న 2, 3 నెలలు మహానాడుతో పాటు.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు విశాఖలో ఉండటంతో పోలీసులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంది. అందువల్ల తామే సీఐడీకి కేసును అప్పగించాలని కోరామని.. విశాఖ పోలీసు కమిషనర్ యోగానంద్ ఇప్పటికే స్పష్టం చేశారు.

తన పనిని ముమ్మరం చేసిన సీఐడీ

ఇప్పటికే సీఐడీ శాఖ తన పనిని ముమ్మరం చేసింది. సీఐడీ ఐజీ అమిత్‌ గార్గ్‌ గత రెండు రోజులుగా విశాఖలో ఉండి కేసును పర్యవేక్షిస్తున్నారు. ప్రధాన నిందితుడు మహేశ్‌తో పాటు..మరి కొందరు నిందితులను కూడా సీఐడీ వారు ప్రశ్నించే అవకాశం ఉంది. ముఖ్యంగా చైనా, సింగపూర్‌, హాంకాంగ్‌ వంటి దేశాలకు చెందిన బ్యాంక్‌ అకౌంట్లలో డబ్బు వేయడం జరిగింది. అయితే మహేశ్.. ప్రెషర్‌ కుక్కర్లు, సిగరెట్లు, మద్యం వంటి వాటిని కస్టమ్స్‌ సుంకం తగ్గించడానికే డబ్బులను ఎకౌంట్ల ద్వారా విదేశీయులను పంపామని చెప్పాడు. నోట్ల రద్దు సమయంలో ఎటువంటి లావాదేవీలు జరపలేదని స్పష్టం చేశాడు.

సింగపూర్‌, మలేషియా, మలేషియా, హాంకాంగ్, చైనా

ఓ సాఫ్ట్‌ వేర్‌ను సింగపూర్, మలేషియా, హాంకాంగ్‌, చైనా నుంచి కొన్నామని చెప్పి ఆయా దేశాలకు.. బ్యాంకులలో వందల కోట్లు వేయడం జరిగింది. సాఫ్ట్‌వేర్‌ స్థానంలో కస్టమ్స్‌ డ్యూటీ ఎగ్గొట్టి మద్యం, సిగరెట్లు, ప్రెషర్‌ కుక్కర్లు వంటివి తీసుకురావడం జరిగిందంటున్నారు. అయితే మహేశ్‌ వెనక ఓ బడా వస్త్ర వ్యాపారి, బేరింగ్ వ్యాపారితో పాటు.. మరొక ప్రముఖ వ్యక్తి ఉన్నారని తెలుస్తోంది. వారందరి గురించి విచారణ జరుగుతుందని అధికారులు తెలిపారు. 

15:40 - May 17, 2017

హైదరాబాద్: కులాంతర వివాహం చేసుకున్న నరేష్‌ ఆచూకీ తెలపాలని... స్వాతి మృతికి కారకులైన వారిని శిక్షించాలని కోరుతూ ఎస్వీకేలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. కేవీపీఎస్, ఎంబీసీ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి జస్టిస్‌ చంద్రకుమార్‌, ప్రజాసంఘాల నేతలు హాజరయ్యారు. నరేష్‌ అదృశ్యం, స్వాతి మృతి వెనుక పలు అనుమానాలున్నాయని పలువురు అభిప్రయాపడ్డారు. కులాంతర వివాహం చేసుకున్నందుకే నరేష్‌ను కిడ్నాప్‌ చేశారని.. దీనిపై న్యాయపోరాటం చేస్తామని నేతలు తెలిపారు. 

15:38 - May 17, 2017

హైదరాబాద్: తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశాలు ఎంబీ భవన్‌లో కొనసాగుతున్నాయి. ఈ సమావేశాలకు సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాష్‌ కరత్‌, బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం హాజరయ్యారు. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, మహాజన పాదయాత్ర జరిగిన తీరు, పార్టీ నిర్మాణం, భవిష్యత్‌ ఉద్యమ కార్యాచరణ వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. 

కోమటిరెడ్డిపై దాడిని ఖండించిన మల్లు రవి..

హైదరాబాద్ : నల్గొండలో ఎమ్మెల్యే కోమటిరెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు టిపిసిసి ఉపాధ్యక్షుడు మల్లు రవి పేర్కొన్నారు. నిన్నటి ఘటనకు పోలీసుల వైఫల్యం..టీఆర్ఎస్ నేతల అత్యుత్సాహమే కారణమన్నారు. అదుపు చేయకుండా అరెస్టులకే పోలీసులు పరిమితమయ్యారని, టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పు చేతల్లో పోలీసు రాజ్యం నడుస్తోందన్నారు. రాష్ట్రంలో పోలీసుల వైఫల్యాలకు నైతిక బాధ్యతగా హోం మంత్రి రాజీనామా చేయాలని, కోమటిరెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

ఎస్సీ కార్పొరేషన్ యాక్షన్ ప్లాన్‌..

విజయవాడ : 2017-18 ఆర్ధిక సంవత్సరానికిగానూ ఎస్సీ కార్పొరేషన్ యాక్షన్ ప్లాన్‌ను కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్‌రావు బుధవారం విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడ్తూ.... ఒక్కో దళిత వ్యక్తి రూ. 30 వేలు సంపాదించేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. ఈ ఏడాది ఎస్సీ కార్పొరేషన్‌కు రూ. 2177 కోట్ల నిధులు కేటాయించామన్నారు. అలాగే ప్రతి జిల్లాలో అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తామని జూపూడి తెలిపారు.

14:50 - May 17, 2017

హైదరాబాద్: కర్ణాటక కేడర్‌కు చెందిన ఓ ఐఏఎస్‌ అధికారి లక్నోలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. హజ్రత్‌జంగ్‌ మీరాబాయి గెస్ట్‌హౌస్‌ సమీపంలోని రోడ్డు పక్కన అనురాగ్‌ తివారీ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఒంటిపై ఉన్న గుర్తులతో పాటు ఘటనా స్థలంలో లభించిన ఐడీ కార్డు ఆధారంగా ఐఏఎస్‌ అధికారి అనురాగ్‌ తివారీగా పోలీసులు గుర్తించారు. గత రెండు రోజులుగా ఆయన మీరాబాయి అతిథిగృహంలోనే ఉంటున్నారు. యూపీలోని బహర్చికి చెందిన తివారి 2007లో ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఆయన మృతిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

14:48 - May 17, 2017

జమ్ముకశ్మీర్‌ : షోపియాన్‌ జిల్లాలో భద్రతా బలగాలు భారీ ఆపరేషన్‌ చేపట్టాయి. షోపియా జిల్లాలోని ఓ గ్రామంలో ఉగ్రవాదులు చొరబడ్డారని సమాచారం అందడంతో వెయ్యిమంది భారత బలగాలు రంగంలోకి దిగాయి. దాదాపు 500 నివాసాలను జెల్లెడ పట్టారు. హెఫ్‌ షిర్మాల్‌ అనే గ్రామంలో తెల్లవారు జామున 3గంటల ప్రాంతంలో తొలి సెర్చింగ్‌ ఆపరేషన్‌ పూర్తయింది. ఆర్మీ, కేంద్ర బలగాలు, సిఆర్‌పిఫ్‌ పోలీసులు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఉదయం 10గంటలకు కార్డన్‌ సెర్చ్‌ పూర్తయిందని పేర్కొన్నారు. గత పది హేను రోజుల్లో ఇది రెండో పెద్ద కార్డన్‌ సెర్చ్ అని పోలీసులు చెప్పారు. ఇంతకు ముందు మే 3, 4 తేదీల్లో షోపియాన్‌, పుల్వామా జిల్లాల్లో యాంటీ టెర్రర్‌ ఆపరేషన్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు బహిరంగంగా తిరుగుతున్నట్లు వీడియో బయటకి రావడంతో భద్రతా దళాలు 24 గ్రామాల్లో సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించాయి.

14:47 - May 17, 2017

ఖమ్మం : జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాలన్నీ తాగునీటికి కటకటలాడుతున్నాయి. వేసవి కారణంగా వెంకటాపురం, చర్ల, వాజేడు మండలాల పల్లెల్లో నదులు, బావులు అడుగంటాయి. అరకొరగా ఉండే బోర్లు మరమ్మతులకు గురయ్యాయి. దీంతో గిరిజనులు నీటి కోసం నానా అవస్థలు పడుతున్నారు. ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉండే నీటి చెలమలే వారికి ఆధారంగా మారాయి. చిన్న చిన్న గుంతల్లో ఊరిన నీరు తోడుకుని... బిందెల్లో నింపుకుని నీళ్లు తెచ్చుకుంటున్నారు. దిక్కులేని పరిస్థితిలో ఆ నీటినే తాగి.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా.. అధికారులు, పాలకులు మాత్రం పట్టించుకోవడం లేదు.

భద్రాచలం పట్టణంలోనూ...

గిరిజన గ్రామాల్లోనే కాకుండా... భద్రాచలం పట్టణంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అధికారుల అలసత్వం కారణంగా గుక్కెడు నీళ్లకు దిక్కు లేకుండా పోయింది. బోర్లు మొరాయించడంతో పట్టణ ప్రజలు నీటి కొరతతో సతమతమవుతున్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పట్టణంలో మూడో వాటర్‌ ట్యాంక్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే అది ఇప్పటి వరకు పూర్తి కాలేదు. పనులు నత్త నడకన సాగుతున్నాయి. దీంతో చాలిచాలని నీటితో పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. పాడైన బోర్లను బాగు చేయించాలని... ఏజెన్సీ ప్రజల దాహార్తిని తీర్చాలని స్థానికులు కోరుతున్నారు. కనీసం ట్యాంకర్ల ద్వారానైన తాగునీరు అందించాలని వేడుకుంటున్నారు. 

14:44 - May 17, 2017

హైదరాబాద్: ఎన్నికలకు మరో రెండేళ్ల గడువు ఉంది. అయినా తెలంగాణలో అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంది. రాజకీయ పార్టీలు ఎన్నికల రణ నినాదాన్ని వినిపిస్తున్నాయి. ప్రభుత్వంపై సమర శంఖాన్ని పూరిస్తున్నాయి. అన్ని పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అధికారం దక్కించుకోవాలన్న లక్ష్యంతో ఉన్న తెలంగాణ కాంగ్రెస్‌, టిడిపి, బిజెపి లు ప్రచారం కోసం పార్టీ అధినేతలను రంగంలోకి దింపుతున్నాయి. తెలంగాణలో రాజకీయ పార్టీల ఎన్నికల రణతంత్రంపై 10 టీవీ ప్రత్యేక కథనం...

వాడీవేడీ విమర్శలతో అధికార, ప్రతిపక్షాలు...

వాడీవేడీ విమర్శలతో అధికార, ప్రతిపక్షాలు నాయకులు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. రాష్ట్రంలో విజయ బావుటా ఎగరేయాలన్న లక్ష్యంతో వ్యూహ, ప్రతివ్యూహాలతో తెలంగాణ కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీలు ముందుకు సాగుతున్నాయి.

 

లీడర్‌ నుంచి క్యాడర్‌ వరకు ఎన్నికల చర్చే

అన్ని పార్టీల లక్ష్యం అధికారమే. అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ను దెబ్బకొట్టాలన్న లక్ష్యంతో కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీలు పావులు కదపుతున్నాయి. లీడర్‌ నుంచి క్యాడర్‌ వరకు... ఎవరు కలిసినా ఎన్నికలు గురించే చర్చించుకుంటున్నారు. గతంలో చేజారిన అధికారాన్ని ఈసారి దక్కించుకోవాలన్న లక్ష్యంతో కాంగ్రెస్‌ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఊరిస్తున్న విజయాన్ని సొంతం చేసుకోవాలన్న ఉద్దేశంతో కమలనాథులు ఉన్నారు. గత వైభవాన్ని తిరిగి పొందలన్న ఆశయంలో టీడీపీ నేతలు పయనిస్తున్నారు.

ఒంటరిపోరుకు సిద్ధమవుతున్న బీజేపీ

దేశమంతా ప్రధాని మోదీ మ్యానియాతో ఊగిపోతున్న తరుణంలో బీజేపీ తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టింటి. ఎప్పుడూ పొత్తులతో చిత్తవుతున్న కమలనాథులు ఈసారి ఒంటరిపోరుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నారు. 2019లో అధికారంలోకి రాకపోతే, ఎప్పటికీ పవర్‌లోకి రాలేమన్న భావిస్తున్న బీజేపీ జాతీయ నాయకత్వం దక్షిణాదిలో తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా కమలదళాధిపతి అమిత్‌ షా ఈనెల 22 నుంచి 24 వరకు మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. అమిత్‌ షా పార్టీ రాష్ట్ర నేతలతో సమావేశమై, దిశా, నిర్దేశం చేస్తారు. జిల్లాల్లో పర్యటించి ప్రజాభిప్రాయాన్ని బీజేపీకి అనుకూలంగా మలిచేందుకు వీలుగా బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు.

ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్న కాంగ్రెస్‌

మరో వైపు తెలంగాణ ఇచ్చిన ఘనతను సొంతం చేసుకోలేకపోయిన కాంగ్రెస్‌ నేతలు... అధికారం దక్కించుకోవాలన్న లక్ష్యంతో ఎత్తులు, పైఎత్తులు వేస్తున్నారు. అధికార టీఆర్‌ఎస్‌ వ్యూహాన్ని చిత్తు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ దూసుకుపోతున్నారు. సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ నుంచి మిర్చి రైతులు సమస్యల వరకు సర్కారు విధానాలను ఎండగడుతూ దూకుడు ప్రదర్శిస్తున్న కాంగ్రెస్‌ నేతలు దీనిని మరింత పెంచాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చే నెల 1న సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీని తీసుకురావలని నిర్ణయించారు. రాహుల్‌ పర్యటనతో ఎన్నికల వేడిని మరింత రగల్చాలన్న ఉద్దేశంతో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు మందుకు సాగుతున్నారు.

ఈనెల 24 తెలంగాణ టీడీపీ మహానాడుకు చంద్రబాబు రాక

ఇక టీడీపీ కూడా తెలంగాణలో కోల్పోయిన ప్రాభవాన్ని తిరిగి పొందలని తహతహలాడుతోంది. ఈనెల 24న హైదరాబాద్‌లో జరిగే తెలంగాణ టీడీపీ మహానాడుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రాబోతున్నారు. 2019 ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణ టీడీపీ నేతలుకు దిశా, నిర్దేశం చేస్తారు. ఎన్నికల కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తారు. ఈ విధంగా మూడు ప్రతిపక్షాలు కూడా అధికారమే లక్ష్యంగా వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నాయి. ఎక్కువగా ప్రజా క్షేత్రంలో ఉండేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి.

--------------------------------------------------

చెప్పాల్సింది ఏమీ లేదన్న రజనీ..

చెన్నై : తాను చెప్పాల్సింది ఏమీ లేదని సినీ నటుడు రజనీకాంత్ వ్యాఖ్యానించారు. ఏం చెప్పాలని అనుకుంటున్నానో అభిమానులకు తాను చెప్పడం జరిగిందని, ఇక ఇప్పుడు చెప్పేందుకు ఏమీ లేదని పేర్కొన్నారు.

14:40 - May 17, 2017

ప్రకాశం : తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో దారుణం జరిగింది. నడుస్తున్న ట్రైన్లోంచి భార్యను కిందకు తోసేయడంతో అక్కడికక్కడే భార్య మృతిచెందిన ఘటన ప్రకాశం జిల్లా చిన్నగంజాం మండలం కడవకుదురు దగ్గర చోటుచేసుకుంది. బీహార్‌కు చెందిన కల్పన, సంతోష్‌కుమార్‌లిద్దరూ తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నారు. అయితే భార్య కల్పన ఫ్లోన్లో ప్రియుడితో మాట్లాడుతుందన్న అనుమానంతో భార్యను రైల్లోంచి తోసేశాడు. వీళ్లు బీహార్‌ వాసులుగా పోలీసులు గుర్తించారు. 

మండుతున్న ఎండలు..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఎండ‌లు మండిపోతున్నాయి. సాధారణం కంటే నాలుగు నుంచి ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదున్నట్లు తెలుస్తోంది. గుంటూరు, విజయవాడలో 47 డిగ్రీలు, ఒంగోలు, ఏలూరు, కాకినాడలలో 45 డిగ్రీలు, నెల్లూరులో 44 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్‌, ఖమ్మం, నల్లగొండలలో 45 డిగ్రీలు, నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌-లలో 44 డిగ్రీలు, హైదరాబాద్‌లో - 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ట్రైన్ నుండి భార్యను తోసేసిన భర్త..

ప్రకాశం : చినగంజాం (మం) కడవకదురు వద్ద ఘోరం చోటు చేసుకుంది. తమిళనాడు ఎక్స్ ప్రెస్ లో భార్య కల్పన (22)ను భర్త సంతోష్ కుమార్ తోసేశాడు. వీరు బీహార్ కు చెందిన వారు. కల్పన అక్కడిక్కడనే మృతి చెందింది. భార్య ఫోన్ లో మాట్లాడడంపై సంతోష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ప్రియుడితో మాట్లాడుతోందని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఈ ఘటనకు పూనుకున్నాడు. విజయవాడ రైల్వే స్టేషన్ లో సంతోష్ కుమార్ ను జీఆర్పీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని చీరాల ఆసుపత్రికి తరలించారు.

13:48 - May 17, 2017

హైదరాబద్ : గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో అవినీతి రాజ్యమేలుతోంది. ఏ విభాగంలో వెతికినా అవినీతి మరకలే. బల్దియాలో రోజురోజుకు అవినీతి పెరిగిపోతుండడంతో కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి ప్రత్యేక నిఘా పెట్టారు. అవినీతిపై ప్రజల నుంచి అందిన ఫిర్యాదులపై ఆయన స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. చిన్నపాటి ఆరోపణలు వచ్చినా అంతర్గతంగా దర్యాప్తు చేయిస్తున్నారు. ఆరోపణలు నిజమనితేలితే చర్యలకు ఉపక్రమిస్తున్నారు.

బల్దియా బాస్‌కు ఫిర్యాదులు
స్వీపింగ్‌ యంత్రాల బిల్లులపైనా బల్దియా బాస్‌కు ఫిర్యాదులు అంతాయి. దీంతో దాని అంతుతేల్చేందుకు సిద్దమయ్యారు. ప్రతిరోజు ఒక్కో స్వీపింగ్‌ యంత్రం 60 కిలోమీటర్ల లైన్‌ రోడ్లనును ఉడ్చాల్సి ఉంటుంది. ఇందుకోసం గంటకు బల్దియా 2,457 రూపాయలు చెల్లిస్తుంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు అంటే ప్రతి రోజు పది గంటలు పనిచేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఒక్కోమిషన్‌కు రోజుకు దాదాపు 24వేల 570 రూపాయలను జీహెచ్‌ఎంసీ చెల్లిస్తుంది. అంటే నెలకు 7, 37,100 రూపాయలు చెల్లిస్తుందన్నమాట. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇలాంటి ప్రైవేట్‌ స్వీపింగ్‌ యంత్రాలు 25 ఉన్నాయి. వీటికి నెలకు కోటి 84 లక్షల 27,500 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇక బల్దియాకు 26 స్వీపింగ్‌ మిషన్లు ఉన్నాయి. వీటిలో ఆరు పెద్దవికాగా.... 20 చిన్నవి. వీటి నిర్వహణ రాజరాజేశ్వరి ఎంటర్‌ ప్రైజెస్‌కు అప్పగించింది బల్దియా. ఇందుకు ప్రతి నెల 72 లక్షల 30వేల రూపాయలు ఖర్చు చేస్తోంది. అంటే ప్రైవేట్‌, ప్రభుత్వ స్వీపింగ్‌ యంత్రాల కోసం బల్దియా నెలకు 2కోట్ల 56 లక్షల 57వేల 500 రూపాయలు ఖర్చు చేస్తోంది. అంటే ఏడాదికి 30కోట్ల, 78 లక్షల 90వేలు ఖర్చు చేస్తోందన్నమాట.

ఖజానాను ఊడ్చేస్తున్నారు
అవినీతికి బాగా అలవాటుపడ్డ బల్దియా అధికారులు స్వీపింగ్‌ యంత్రాల వినియోగంలోనూ అక్రమాలకు తెరలేపారు. నిబంధనలకు నీళ్లు వదలి స్వీపింగ్‌ యంత్రాల పేరుతో ఖజానాను ఊడ్చేస్తున్నారు. స్వీపింగ్‌ మెషీన్‌ పనిచేస్తున్నా లేకున్నా.. అధికారులు బిల్లులు మాత్రం చెల్లించేస్తున్నారు. దీంతో వారికి ముడుపులు అందుతున్నాయన్న విమర్శలు బహిరంగానే ఉన్నాయి. కాంట్రాక్టర్లు ఎంత బిల్లుపెడితే వాటిని బల్దియా అధికారులు మంజూరు చేస్తూ ఖజానాకు కన్నం పెడుతున్నారు. దీంతో కమీషనర్‌ సమగ్ర విచారణకు ఆదేశించారు. స్వీపింగ్‌ యంత్రాల బిల్లుల్లో 40శాతానికిపైగా అవినీతికి పాల్పడ్డట్టుతెలుస్తోంది. కమిషనర్‌ తీసుకుంటున్న చర్యలతోనైనా పరిస్థితిలో మార్పు వస్తుందా లేదా అన్నది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.

నిరుద్యోగ భృతిపై ముగిసిన సబ్ కమిటీ భేటీ..

విజయవాడ : నిరుద్యోగ భృతిపై సబ్ కమిటీ భేటీ ముగిసింది. నెల రోజుల్లో నిరుద్యోగ భృతి విధి విధానాలను ఖరారు కానున్నాయని, అవసరమైతే ఇతర శాఖల నిధులను తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఎస్సీ, బీసీ సబ్ ప్లాన్ నిధులను కూడా నిరుద్యోగ భృతికి కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. పల్స్ సర్వే, ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజీ కార్యాలయాల నుండి వివరాలు సేకరించి లబ్దిదారులను ఎంపిక చేస్తామని మంత్రి పేర్కొన్నారు. లబ్దిదారుల వివరాల సేకరణకు బ్యూరో ఏర్పాటు చేస్తామని, నిరుద్యోగ భృతి అమలు చేస్తున్న రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి నుండి అనుభవాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు.

13:42 - May 17, 2017

చిత్తూరు : తిరుమలలో ఈ నెల 29 నుంచి జూన్‌ 2 వరకూ.. తిరుమలలో కరీరిస్థి వరుణ యాగం చేయనున్నట్టు జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు. రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురవాలని కోరుతూ ఈ వరుణ యాగం చేస్తున్నామన్నారు.

 

13:40 - May 17, 2017

కృష్ణా : విజయవాడ నగరంలో దారుణం చోటుచేసుకుంది. ఓ వడ్డి వ్యాపారి బ్రహ్మజీపై ...డాక్టర్లు దాడికి పాల్పడ్డారు. వ్యాపారిని నగర శివార్లలోని మామిడి తోటలోకి తీసుకువెళ్లి తీవ్రంగా కొట్టారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. బ్రహ్మజీ నగరానికి చెందిన డాక్టర్ల దగ్గర లక్షల రూపాయాలు వడ్డీ పేరుతో తీసుకుని మోసం చేయడంతో డాక్టర్లు కోపంతో బ్రహ్మజీని చితకబాదినట్టు తెలుస్తోంది. డాక్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడంతో వైద్యులు ఈ పని చేశారు. దీనిపై ఫిర్యాదు అందడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రముఖ ఆస్పత్రికి చెందిన వైద్యులతో పాటు మరో ఇద్దరిని విచారిస్తున్నారు. బ్రహ్మజీకి సహకరించిన సీఐపై, డివిజన్‌ ఏసీపీపై చర్యలు తీసుకున్నారు.

 

13:30 - May 17, 2017

హైదరాబాద్ : సికింద్రాబాద్‌ మహిళ కిడ్నాప్‌ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కిడ్నాప్ కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు నిందితుల కోసం గాలింపె చేపట్టారు. త్వరలోనే వారిని పట్టుకుంటామని స్పష్టం చేశారు. నగరానికి చెందిన వడ్డీ వ్యాపారి శ్రీనివాస్ అంబర్ పేటకు చెందిన శ్రీనివాస్ కు రూ.5లక్షలు అప్పు ఇచ్చాడు. అప్పు చెల్లించమని నిన్న రాత్రి శ్రీనివాస్ దగ్గరకు వెళ్లారు. శ్రీనివాస్ లేకపోవడంతో అతని భార్యను బలవంతంగా ఎత్తుకెళ్లారు. అయితే నిందితుల కోసం పోలీసులు విస్త్రతంగా గాలిస్తుండగా..సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా వారిని గుర్తించారు పోలీసులు. 

కేజ్రీ కారును అడ్డుకున్న మాజీ ప్రభుత్వాసుపత్రి ఉద్యోగులు..

ఢిల్లీ : ప్రభుత్వ ఆసుపత్రి మాజీ ఉద్యోగులు సీఎం కేజ్రీవాల్ ఎదుట నిరసన తెలియచేశారు. ఆయన ప్రయాణిస్తున్న కారును అడ్డుకున్నారు. దీనితో భద్రతా సిబ్బంది బలవంతంగా ఆందోళనకారులను పక్కకు తప్పించారు.

టి. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశాలు

హైదరాబాద్ : సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశాలు కొనసాగుతున్నాయి. సీపీఎం నేతలు సీతారాం ఏచూరి, ప్రకాశ్ కారత్, బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రంలు హాజరయ్యారు. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, మహాజన పాదయాత్ర జరిగిన తీరు, పార్టీ నిర్మాణం, భవిష్యత్ ఉద్యమ కార్యాచరణపై సమావేశంలో చర్చిస్తున్నారు.

పెట్రోల్ బంక్ లపై దాడులు..

హైదరాబాద్ : నగరంలోని పలు పెట్రోల్ బంక్ లపై తూనికలు కొలతలు..టాస్క్ ఫోర్స్ సంయుక్త దాడులు నిర్వహించింది. ఎలక్ట్రానిక్ చిప్ ల వాడకంపై తనిఖీలు చేస్తున్న, అధికారులు నగరంలోని అన్ని పెట్రోల్ బంకుల్లో సోదాలు కొనసాగుతున్నాయి.

13:14 - May 17, 2017

అనంతపురం : అనంతపురం : జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. రైతు సమస్యలపై సీపీఎం, సీపీఐ చేపట్టిన రెండు రోజుల దీక్షను పోలీసులు అడ్డుకోవడంతో సీపీఎం కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జగరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఏపీ సీపీఎం కార్యదర్శి మధు, సీపీఐ నేత నారాయణతో పాటు 500 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొంత మంది కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. సాయంత్రంలోగా రైతు సమస్యలపై ప్రభుత్వం ప్రకటన చేయకపోతే 24న రాయలసీమ బంద్ కు వామపక్షాల పిలుపునిస్తామని హెచ్చరించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసుల దారుణంగా వ్యవహరిస్తున్నారని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. 

మహిళ కిడ్నాప్ ఘటనలో అరెస్టులు..

హైదరాబాద్ : అంబర్ పేట మహిళ కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. రూ. 5 లక్షలు అప్పు చెల్లించనందుకు శ్రీనివాస్ భార్యను బలవంతంగా వడ్డీ వ్యాపారి శ్రీనివాస్ ఎత్తుకెళ్లిన సంగతి తెలిసిందే. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను అరెస్టు చేశారు.

జులాలాబాద్ టీవీ స్టేషన్ పై ఉగ్ర దాడి..

అప్ఘనిస్తాన్ : జులాలాబాద్ లో టీవీ స్టేషన్ పై ఉగ్రవాదులు దాడి జరిపారు. బిల్డింగ్ పై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో కలకలం రేగింది. బిల్డింగ్ లో ఉద్యోగులు చిక్కుకున్నారు. భద్రతా బలగాలు, ఉగ్రవాఉల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.

విజయవాడలో డాక్టర్ల హవాలా దందా..

విజయవాడ : జిల్లాలో డాక్టర్ల హవాలా దందా వెలుగు చూసింది. విదేశాల నుండి విజయవాడ డాక్టర్లకు డబ్బులు అందుతున్నాయి. డబ్బు ఆలస్యమవడంతో ఏజెంట్ బ్రహ్మాజీని డాక్టర్లు కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. టైమ్ ఆసుపత్రి ఎండీ మైనేని హేమంత్, హెల్స్ ఆసుపత్రి ఎండీ చలపాటి రవి, పటమట సీఐ జాన్ కెన్నడీని వీఆర్ కు కమిషనర్ పంపించారు. ట్రాఫిక్ ఏసీపీ సూర్యచంద్రారావును విధుల నుండది తప్పించి డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు.

అనంతపురం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత

అనంతపురం : జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. రైతు సమస్యలపై సీపీఎం, సీపీఐ చేపట్టిన దీక్షను పోలీసులు అడ్డుకోవడంతో సీపీఎం కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జగరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.  

బీజేపీ ఆఫీసు ఎదుట ఆర్జేడీ నేతల ఆందోళన..

పాట్నా : బీజేపీ కార్యాలయం ఎదుట ఆర్జేడీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈనేపథ్యంలో బీజేపీ, ఆర్జేడీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. లాలూ ప్రసాద్ యాదవ్ నివాసంపై ఐటీ దాడులు జరిన సంగతి తెలిసిందే.

12:49 - May 17, 2017

హైదరాబాద్ : 498 చట్టంపై నేటి మై రైట్ ఈ చట్టం ఒక వివాహిత అత్తింటి వారి నుంచి వేధింపులపై ఎదుర్కొంటే ఈ కేసు పెట్టావచ్చు. మానిసిక, శరీరక వేధింపులు, అదనపు కట్నం కోసం వేధించిన 498 కేసు బుక్ చేయవచ్చు ఇది నిరూపిస్తే మూడేళ్లు జైలు శిక్ష పడుతుంది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

12:37 - May 17, 2017

ప్రకాశం : జిల్లాలోని చీరాలలో హైకోర్టు న్యాయవాది అనిల్ హల్ చల్ చేశాడు. రైల్వే స్టేషన్ ఎదురుగా హైకోర్టు న్యాయవాది అన్నవరపు అనిల్ కుమార్ కత్తి గాయలతో వీరంగం సృష్టించాడు. అర్దరాత్రి పోలీసులే తనపై దాడి చేసారంటూ..పోలీసులపై మండిపడ్దాడు. సుమారు గంట సేపు జనం అంతా చూస్తుండగానే పోలీసులపై తిరగబడ్డాడు. ఈ సంఘటనపై చీరాల టూటౌన్‌ సీఐ స్పందిస్తూ..2015 సంవత్సరంలో అడ్వకేట్‌ అనిల్ భార్య మందకిని..తన భర్త అదనపు కట్నం అడుగుతున్నాడని..అంతేకాకుండా చంపేందుకు కూడా ప్రయత్నించాడని పీఎస్‌లో ఫిర్యాదు చేసిందన్నారు. దీంతో అనిల్‌పై అదనపుకట్నం 307 సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారని..అప్పటి నుండి చీరాల కోర్టు వాయిదాకి వచ్చినప్పుడల్లా మద్యం సేవించి భార్య, పోలీసులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని సీఐ డఆరోపించారు. దీనిలో భాగంగానే మద్యం మత్తులో పోలీస్ స్టేషన్‌కు వచ్చి కత్తితో డ్యూటిలో ఉన్న పోలీసులపై తిరగబడ్డాడన్నారు. పోలీలసులు తనపై కత్తితో దాడిచేశారని అనిల్ ఆరోపిస్తున్నారు. అయితే అనిల్ తనను తాను పోడుచుకున్నారని పోలీసులు అన్నారు. 2015లో అదనపు కట్నం తేవాలంటూ చిత్రహింసలు పెట్టాడని ఆరోపిస్తూ ఆయన భార్య మందాకిని చీరాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు.

అభిమానులతో రజనీకాంత్..

చెన్నై : అభిమానులతో వరుసగా రెండో రోజు రజనీ భేటీ అయ్యారు. రాఘవేంద్ర కళ్యాణ మండపంలో అభిమానులతో కలిసి ఫొటోలు దిగుతూ సందడి చేశారు. తమ అభిమాన నటుడితో ఫొటో దిగినందుకు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

12:29 - May 17, 2017

చిత్తూరు : తిరుమల తిరుపతి దేవస్థానంలో కంప్యూటర్లు వైరస్‌ బారిన పడినట్టు టీటీడీ గుర్తించింది. వాన క్రై వైరస్‌ వల్ల 30 కంప్యూటర్ల వరకు వైరస్‌ సోకిన మాట వాస్తవమేనని ఆలయ ఈవో సింఘాల్‌ అన్నారు. పరిపాలనా పరమైన పనులకు కొంత విఘాతం ఏర్పడిందని ఆయన తెలిపారు. భక్తుల సేవలకు సంబంధించిన పోర్టల్స్ సమాచారం అంతా సురక్షితంగా ఉందన్నారు. సంబంధిత అధికారులతో సమీక్షించి తగిన చర్యలు తీసుకుంటామని సింఘాల్‌ తెలిపారు.  

12:25 - May 17, 2017

ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పలు రకాల ఆకు కూరల్లో వివిధ పోషకాలు లభ్యమౌతుంటాయి. అలాంటి ఆకు కూరల్లో పొన్నంగంటి కూడా ఒకటి. ఇందులో విటమిన్ ఏ, బి 6, సి, ఫొలేట్, రైబో ఫ్లెవిన్, పొటాషియం, ఇనుము, మెగ్నీషియం వంటివి పుష్కలంగా లభిస్తాయి. ఆహారంలో దీనిని భాగం చేసుకుంటే ఎన్నో లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా కంటి చూపుకు ఎంతో దోహదం చేస్తుంటుంది. గంటల కొద్దీ కంప్యూటర్ల ముందు కూర్చునే వారికి కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడతాయనే సంగతి తెలిసిందే. పొన్నగంటి ఆకులను ఓ
గ్లాస్‌ నీటిలో ఉడికించి, మిరియాల పొడిని కలుపుకొని తాగితే ఆ సమస్య నుండి దూరం కావచ్చు.
శరీరానికి మేలు చేయడంతో పాటు పొన్నగంటి కూరను తీసుకోవడం ద్వారా శరీర ఛాయను మెరుగుపరుచుకోవచ్చు.
పొన్నగంటి కూరలో లభించే క్యాల్షియం ఎముకల ఎదుగుదలకూ..ఆస్టియో పోరోసిస్ ను దూరం చేయడానికి ఉపయోగపడుతుంది.
ఇందులో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ ఆకులో లభించే నూనె పదార్థాలు రక్తపోటును తగ్గించి, గుండె సమస్యలను అదుపులో ఉంచుతాయి.
బరువు పెరగాలనుకునే వారు కందిపప్పు, నెయ్యితో పొన్నగంటి కూరను కలిపి తీసుకుంటే బరువు పెరుగుతారు.

అనంత కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత..

అనంతపురం :కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రైతు సమస్యలపై సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో దీక్ష జరిగింది. వామపక్షాల దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. దీనితో ఇరువర్గాల మధ్య వాగ్వాదం..తోపులాట చోటు చేసుకుంది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మదు, సీపీఐ నేత నారాయణలను పోలీసులు అరెస్టు చేశారు.

ఉత్తరాఖండ్ లో తెరుచుకోనున్న మద్యం దుకాణాలు..

ఉత్తరాఖండ్ : డెహ్రాడూన్, ఉద్దమ్ సింగ్ నగర్, హరిద్వార్, నైనిటాల్ ప్రాంతంలో మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి. ఇతర జిల్లాల్లో కూడా మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 6గంటల వరకు దుకాణాలు తెరుచుకోనున్నాయి.

లుథియానాలో అగ్నిప్రమాదం..

పంజాబ్ : లుథియానాలోని ఓ ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బట్టల దుకాణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పది అగ్నిమాపయంత్రాలతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

12:09 - May 17, 2017

ప్రస్తుతం సినిమా ప్రపంచంలో కొత్త ట్రెండ్ మొదలైంది. తమ అభిమాను నటులకు అభిమానులకు విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రముఖులు బతికి ఉండగానే విగ్రహాలు ఏర్పాటు చేసే ట్రెండ్ కొనసాగుతోంది. మొన్న దర్శకుడు పూరీ జగన్నాథ్ విగ్రహాన్ని..నిన్న లారెన్స్ తన అమ్మ కోసం ఓ గుడిని కట్టించిన సంగతి తెలిసిందే. తాజాగా కలకత్తాలో బిగ్ బి 'అమితాబ్ బచ్చన్' విగ్రహం ఏర్పాటు కావడం చర్చనీయాశంమైంది. అభిమానులు ఓ గుడి కట్టి అందులో 'సర్కార్' విగ్రహాన్ని ఏర్పాటు చేయడం విశేషం. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో 'సర్కార్ -3' చిత్రంలో అమితాబ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన చేసిన సుభాష్ నగ్రే పాత్రలో ఆయన ఎలా ఉన్నారో అలాంటి ప్రతిమనే ఏర్పాటు చేశారు. ఆ పాత్ర వేషధారణలో అభిమానులంతా మాల ధరించి విగ్రహాన్ని ఇటీవలే ఆవిష్కరించారు. ఆరు అడుగుల రెండు అంగుల పొడవు గల ఈ విగ్రహాన్ని ఫైబర్‌ గ్లాస్‌లతో తయారు చేశారు. ఈ ఏడాది అక్టోబర్‌ 11వ తేదీతో అమితాబ్‌ 75 వసంతాలు పూర్తి చేసుకుంటారని ఆ సందర్భంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని చెబుతున్నారు.

5 ఎంఎంటీఎస్ రైళ్ల రద్దు..

హైదరాబాద్ : హుస్సేన్ సాగర్ జంక్షన్ లో సిగ్నలింగ్ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తింది. జంక్షన్ మీదుగా వెళ్లే రాళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. 5 ఎంఎంటీఎస్ రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. 4 ఎంఎంటీఎస్ సర్వీసులను పాక్షికంగా రద్దు చేశారు. 3 రైళ్లు దారి మళ్లించారు.

11:57 - May 17, 2017

హైదరాబాద్ : ఏపీ , తెలంగాణలలో పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా పెరిగాయి. సాధారణం కంటే నాలుగు నుంచి ఆరు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రతి ప్రాంతంలోనూ 40డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. ఏపీలోని గుంటూరు, విజయవాడలలో 47 డిగ్రీలు, ఒంగోలు, ఏలూరు, కాకినాడలలో 45 డిగ్రీలు, నెల్లూరులో 44 డిగ్రీలు నమోదయ్యాయి. అలాగే తెలంగాణలోని ఆదిలాబాద్‌, ఖమ్మం, నల్లగొండలో 45 డిగ్రీలు, నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌లో 44 డిగ్రీలు, హైదరాబాద్‌లో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రివేళలోనూ 35 డిగ్రీలకు అధిక ఉష్ణోగ్రతల కారణంగా..భూమి సెగలు కక్కుతోంది. వేడి గాలులు వీస్తున్నాయి... వడగాలులతో ప్రజలు అల్లాడుతున్నారు.

మరో నాలుగు రోజుల..
మరో నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తరాది తీర ప్రాంతం నుంచి వీస్తున్న వేడిగాలుల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. అలాగే ఏపీలోని కోస్తా తీర ప్రాంతం జిల్లాల్లో సగటు ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయని అంటున్నారు. వాడ గాల్పుల కారణంగా జనాలు హడలెత్తిపోతున్నారు. ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టాలంటేనే భయపడుతున్నారు. రోడ్లపైకి వచ్చే సాహసం చేయలేకపోతున్నారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఏదైనా పనిపై వచ్చిన వారు... వడగాలుల వల్ల తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు.

 

11:53 - May 17, 2017

హైదరాబద్ : తెలంగాణ ఉద్యమ దళపతిగా అందరికీ అందుబాటులో ఉన్న కేసీఆర్..ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టాక ప్రజా ప్రతినిధులకు, నియోజకవర్గ నేతలకు అంటిముట్టనట్లుగా ఉంటున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అధికారులతో సమీక్షలంటూ.. ప్రభుత్వ వ్యవహారాల్లో బిజిగా ఉన్నట్లు సంకేతాలు ఇస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సుమారు మూడేళ్లుగా రాష్ట్రంలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

పార్టీల నేతలు
పార్టీని బలోపేతం చేసే దిశగా కేసీఆర్.. ఇతర పార్టీల నేతలను పెద్ద ఎత్తున కారెక్కించుకున్నారు. పార్టీలో చేరిన నాటి నుంచి ముఖ్యమంత్రి వారిని ఒకటి, రెండు సార్లకంటే ఎక్కువగా అపాయింట్ మెంట్ ఇవ్వలేదని తెలుస్తోంది. నియోజకవర్గ సమస్యలను నేరుగా సీఎం కేసీఆర్ ముందుకు తీసుకెళ్లే అవకాశం తమకు దక్కకుండా పోతోందని వారు వాపోతున్నారట. మంత్రులు, ఎమ్మెల్యేల పరిస్థితి దాదాపు ఒకేలా ఉందని ఫీలవుతున్నారట. మరోవైపు రాబోయే ఎన్నికలకు సిద్ధమవుతున్న విపక్ష పార్టీలు అసంతృప్త నేతలను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారట. ఇప్పటికే పలువురు అధికార పార్టీ నేతలు బిజెపి జాతీయ నేతలతో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గ నేతల పరిస్థితి కూడా ఇందుకు ఏమాత్రం భిన్నంగా లేదని తెలుస్తోంది. గతంలో ఉన్న ముఖ్యమంత్రులు నియోజకవర్గ నేతలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేవారని.. సీఎం కేసీఆర్‌ ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని అధికార పార్టీ నేతలు లోలోపలే మదనపడుతున్నారట.

 

11:50 - May 17, 2017

హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు, రిటైర్డ్‌ ఉద్యోగులకు వైద్య సేవలందిస్తోంది తార్నాకలోని ఆర్టీసి ప్రధాన ఆస్పత్రి. అంతా కలిపి దాదాపు రెండు లక్షల మందికి ఈ ఆస్పత్రే పెద్ద దిక్కు. రోజుకు 1500మందికి పైగా ఔట్‌ పేషంట్లు వస్తున్నారంటే ఎంత ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇంతటి ప్రాముఖ్యత కలిగిన హస్పిటల్‌ అనేక సమస్యలతో సతమతమవుతోంది. కార్మికులకు మెరుగైన వైద్యం అందించాల్సిన సంస్థ.. తన బాధ్యతలనుండి వైదొలిగే ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా మందుల సరఫరా ప్రైవేట్‌ సంస్థకు అప్పజెప్పింది.

అత్యవసర మందులు...
అత్యవసర మందులు అందుబాటులో ఉండటం లేదన్న సాకుతో మందుల సరఫరాను మెడ్‌ప్లస్‌ సంస్థకు అప్పగించారు. మెడిసిన్‌ సరఫరా , రోగులకు పంపిణీ చేసినందుకు ఒక కోటీ ఇరవై లక్షల రూపాయలను ఫీజుగా చెల్లించడానికి ఒప్పందం కుదిరింది. ఆస్పత్రి సేవలను ప్రైవేట్‌ పరం చేసేప్లాన్‌లో భాగంగానే ముందుగా మెడిసిన్‌ సరఫరాను ప్రైవేట్‌ సంస్థకు అప్పగించారని కార్మికసంఘాలు మండిపడుతున్నాయి. అసలు మందుల సరఫరా కోసం ఇప్పటికే ఆర్టీసీకి ప్రత్యకే సిబ్బంది ఉన్నారు. పైగా వారికి మందుల కొనుగోలు, సరఫరాలో నాలుగు దశాబ్దాల అనుభవంకూడా ఉంది. దాంతోపాటు ఎటువంటి మెడిసిన్‌ అయినా.. ఆన్‌లైన్‌లో బుక్‌చేస్తే.. మూడు గంటల్లోనే అందుబాటులోకి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇపుడు మెడ్‌ప్లస్‌సంస్థతో ఒప్పందం చేసుకోవడంలో మర్మమేంటని కార్మికసంఘం నేతలు ప్రశ్నిస్తున్నారు.

 ప్రైవేట్‌ సంస్థకు అప్పగింత 
మందుల సరఫరాను ప్రైవేట్‌ సంస్థకు అప్పగించడంవల్ల సంస్థకు నష్టం జరగుతుందని కార్మికసంఘాలు అంటున్నాయి. రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ కోనుగోలు చేస్తున్న మందుల ధరతో పోలిస్తే మెడ్‌ప్లస్‌ ఒప్పందంలో మందుల ధరకు చాలా వ్యత్యాసం వుంది. బహిరంగ మార్కెట్‌తో పోల్చినా ధరలో భారీగా తేడా ఉంది. ఒక్క ట్రాస్ట్‌జంబ్‌ అనే ఇంజక్షన్‌ ధరను పరిశీలిస్తే 5,200 రూపాయల తేడా ఉంది. ఇన్‌ హేలర్‌ ధరలో కూడా 115 రూపాయల వ్యత్యాసం ఉంది. ఇవి కేవలం మచ్చుకు మాత్రమే. ఇలా పది రూపాయల నుండి ఆరు వేల వరకు అత్యధిక ధరకు మందుల సప్లై చేసేలా చేసుకున్న ఒప్పందం సంస్థకు ఎలా లాభం చేకూరుస్తుందని కార్మికసంఘాలు మండిపడుతున్నాయి. ప్రైవేటు వారికి అప్పగించిన తరువాత మందుల పంపిణీ గతం కంటే ఏమైనా మెరుగుపడిందా అంటే.. లేదనే సమాధానమే వస్తోంది. ఇప్పటికీ మెడిసిన్‌కోసం దాదాపు మూడు గంటలు క్యూలో నిలబడాల్సి వస్తోందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే వైద్య సేవలను, వైద్య పరిక్షలను రిఫరల్‌ ఆస్పత్రులకు పంపుతున్న ఆస్పత్రి యాజమాన్యం మందుల సరఫరాను కూడా ప్రైవేట్‌ వారికి అప్పజెప్పి బాధ్యతను దులపరించుకుంటోందని ఆర్టీసీ కార్మికులు అంటున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ యాజమాన్యం.. సంస్థకు నష్టం వాటిల్లే పనులు మానుకోవాలని కార్మికసంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

 

 

బ్రీత్ ఆనలైజర్లు..స్పీడ్ గన్లను ఆవిష్కరించిన డీజీపీ..

హైదరాబాద్ : బొంగులూరు టోల్ ప్లాజా వద్ద బ్రీత్ ఆనలైజర్లు..స్పీడ్ గన్లను డీజీపీ అనురాగ్ శర్మ ఆవిష్కరించారు. హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు, రాచకొండ సీపీ, మద్యం సేవించి ఓఆర్ఆర్ పై ఎంజాయ్ చేసేందుకు వస్తున్నారని, ఓఆర్ఆర్ పై స్పీడ్ గన్స్..డ్రంక్ అండ్ డ్రైవ్ ఏర్పాటుతో ప్రమాదాలు నివారించే అవకాశం ఉందని డీజీపీ అనురాగ్ శర్మ పేర్కొన్నారు.

 

11:33 - May 17, 2017

మంచినీరు..ఆరోగ్యానికి మంచిది. చాలా మంది నీరు ఎక్కువ సేవించకపోవడం వల్ల పలు అనారోగ్యాలకు గురవుతుంటారు. ముఖ్యంగా వేసవికాలంలో ఈ సమస్య అధికంగా ఉంటుంది. చెమట రూపంలో నీరు బయటకు వెళ్లే సరికి డీ హైడ్రేషన్ తో బాధ పడుతుంటారు. కొంతమంది నీళ్ల తాగే విషయంలో జాగ్రత్తలు పాటించరు. మరి నీళ్లు ఎప్పుడెప్పుడు తాగాలి..
పగటి వేళ రెండున్నర లీటర్ల నీరు తాగితే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
నీరు సేవించే సమయంలో ఒక పద్ధతి ప్రకారం తాగాల్సి ఉంటుంది.
ఉదయం నీరు తాగిన అనంతరం 25..30 నిమిషాల గ్యాప్ ఇచ్చి ఏదనా టిఫిన్ తినాల్సి ఉంటుంది.
ఇక టిఫిన్ తినే సమయంలో నీరు తీసుకపోవడమే మంచిది. తిన్న రెండు గంటల తరువాత నీటిని ఒకేసారి తాగకుండా మెల్లి మెల్లిగా తాగాలి.
ఇక మధ్యాహ్న భోజనం చేసే అరగంట ముందు వరకు నీరు తాగవద్దు. ఇక భోజన సమయంలో మంచినీరు తాగవద్దు.
మాత్రలు మింగడానికి గానీ, గొంతు బాగా పట్టినపుడు గానీ ఒక గుక్కెడు నీరు తాగితే బెటర్.

11:24 - May 17, 2017

బాహుబలి -2 సినిమాతో టాలీవుడ్ సత్తా ఏంటో రాజమౌళి ప్రపంచానికి చాటి చెప్పాడు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుంది. కలెక్షన్లలలో రికార్డులు సృష్టిస్తోంది. ప్రభాస్..రానా..ఇతర నటీ నటులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా బాక్సాపీస్ బద్ధలు కొడుతోంది. 'బాహుబలి' చిత్రానికి సీక్వెల్ గా 'బాహుబలి 2' సినిమా తెరకెక్కింది. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరి చరిత్ర సృష్టించింది. ఏప్రిల్ 28వ తేదీన విడుదల ఈ సినిమా ప్రస్తుతం రూ. 1500 కోట్ల మైలు రాయిని చేరుకొనేందుకు దూసుకెళుతోంది. 17 రోజుల్లో రూ. 1,390 కోట్లు వసూలు చేసినట్లు సినీ విశ్లేషకుడు రమేశ్‌బాలా ట్వీట్‌ చేశారు. ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌ కేవలం హిందీ భాషలో రూ. 432.80 కోట్లు రాబట్టినట్లు బాలీవుడ్‌ సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశారు.

టిడిపి కార్యకర్తపై దాడి..మృతి..

గుంటూరు : వెల్దుర్తి మండలం కండ్లకుంటలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు టిడిపి కార్యకర్త పాపిరెడ్డిపై దాడి జరిపారు. ఆసుపత్రికి తరలిస్తుండగా ఆయన మృతి చెందారు.

గుంటూరులో దారుణం

గుంటూరు : జిల్లాలోని వెల్దుర్తి మండలం కండ్లకుంటలో దారుణం జరిగింది. టీడీపీ కార్యకర్త పాపిరెడ్డిపై గర్తుతెలియాని దుండగులు దాడి చేశారు. దాడిలె పాపిరెడ్డకి తీవ్రగాయాలు అయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుండా మృతి చెందాడు.

 

11:06 - May 17, 2017

విక్టరీ వెంకటేష్...భిన్నమైన పాత్రలు చేస్తూ అభిమానుల అలరిస్తున్నాడు. ఇతర భాషల్లో మంచి పేరొందిన చిత్రాల రీమెక్ ల్లో హీరోగా నటిస్తున్నాడు. ఇటీవలే ఆయన నటించిన 'గురు' సినిమా మంచి పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అనంతరం ఏ సినిమాకు 'వెంకటేష్' సైన్ చేయలేదని తెలుస్తోంది. తాజాగా వెంకటేష్ - ప్రియదర్శన్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. మలయాళం..బాలీవుడ్ సినిమాల దర్శకుడైన ప్రియదర్శన్ చాలా విరామం తరువాత తెలుగులో ఓ సినిమా చేయబోతున్నాడన్న ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగా ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయని తెలుస్తోంది. క్రిష్ దర్శకత్వంలో వెంకీ ఓ సినిమా చేస్తారని, జాలీ ఎల్ ఎల్ బీ -2 సినిమాలో వెంకీ నటిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఈ చిత్రాలపై మాత్రం స్పష్టత రాలేదు. వెంకటేష్‌తో దర్శకుడు ప్రియదర్శన్‌ చర్చలు జరుపుతున్నట్లు, ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ స్టోరీ లైన్‌ వెంకీకి చెబితే గ్రీన్‌సిగల్‌ ఇచ్చాడని టాలీవుడ్ టాక్. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు : బాల్క సుమన్

పెద్దపల్లి : జిల్లాలోని గోదావరిఖని సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని పెద్దపల్లి ఎంపీ బాల్క సమన్ అన్నారు. మెడికల్ బోర్డు ద్వారా కార్మికుల పిల్లలకు ఉద్యోగాఉ కల్పిస్తామని ఆయన తెలిపారు.

10:58 - May 17, 2017

చాలా ఏళ్ల తరువాత రీ ఎంట్రీ ఇచ్చి 'ఖైదీ నెంబర్ 150'తో తన సత్తా ఏంటో 'చిరంజీవి' చూపెట్టాడు. దీనితో నెక్ట్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంపైనే చిరు పూర్తిగా దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. కానీ చిత్రం ఎప్పుడు ప్రారంభమవుతుందా ? విలన్..హీరోయిన్ ఎవరనే దానిపై అప్పుడే చర్చలు ప్రారంభమయ్యాయి. 'రామ్‌ చరణ్‌' మొన్న 'నాన్నగారి 151వ చిత్రం ఆగస్టులో ప్రారంభిస్తాం' అని స్వయంగా ప్రకటించినా నిర్ధిష్టమైన తేదీని మాత్రం వెల్లడించలేదు. తాజాగా ముహూర్తం ఖరారు చేసినట్లు టాక్. చిరంజీవి బర్త్ డే అయిన ఆగస్టు 22వ తేదీన చిత్రానికి క్లాప్ కొట్టవచ్చునని ప్రచారం జరుగుతోంది. రెగ్యులర్‌ షూటింగ్‌ మాత్రం సెప్టెంబర్‌ నుంచి మొదలు కానుందని, తెలుగు, తమిళ్‌ భాషల్లో నిర్మాణమయ్యే ఈ చిత్రానికి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

మెదక్ డీఆర్ డీఏలో అగ్నిప్రమాదం

మెదక్ : జిల్లాలోని డీఆర్ డీఏ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఫర్నిచర్, ఫైళ్లు దగ్ధం అయ్యాయి. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని అధికారులు చెబుతున్నారు. 

10:53 - May 17, 2017

చిత్తూరు : వానక్రై దెబ్బకు పలు కంప్యూటర్లు మొరాయిస్తున్నాయి. ఇప్పటికే పలు దేశాల్లో వైరస్ వ్యాప్తి చెందడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో సైతం ఈ భయం వెంటాడుతోంది. అనుకున్నట్లుగానే వానక్రై ప్రభావం కనిపిస్తోంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన 'తిరుమల'పై వానక్రై ప్రభావం చూపిస్తోంది. టిటిడిలోని పలు కంప్యూటర్లు వానక్రై బారిన పడిపోయాయి. 30 కంప్యూటర్లు వైరస్ సోకినట్లు తెలుస్తోంది. కానీ భక్తులకు సేవలందించే సిస్టమ్స్ మాత్రం సురక్షితంగా ఉన్నట్లు ఆలయ ఈవో సింఘాల్ వెల్లడించారు. పాలనపరమైన పనులకు కొంత విఘాతం ఏర్పడిందని, సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. టీటీడీకి సంబంధించిన పోర్టల్స్ మొత్తం టాటా కన్సల్టేన్సీ చూసుకుంటున్న సంగతి తెలిసిందే.

 

పోలీసులే పొడిచారంటున్న హైకోర్టు లాయర్..

ప్రకాశం : కత్తిపోట్లతో చీరాలా రైల్వేస్టేషన్ కు హైకోర్టు లాయర్ అనీల్ కుమార్ చేరుకున్నారు. పోలీసులు తనను పొడిచారని లాయర్ అంటుండగా ఈ ఆరోపణలను టూ టౌన్ పోలీసులు ఖండిస్తున్నారు.

10:35 - May 17, 2017

వారసత్వ ఉద్యోగాలకు సర్కార్ సానుకూలం - ఎంపీ సుమన్..

పెద్దపల్లి : గోదావరిఖని సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఎంపీ బాల్క సుమన్ వెల్లడించారు. మెడికల్ బోర్డు ద్వారా కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తామని, రామగుండంలో త్వరలోనే భారీ పరిశ్రమ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిపారు.

10:33 - May 17, 2017

హైదరాబాద్ : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాన్ ట్విట్టర్ ఖాతాను హ్యాకర్లు బ్లాక్ చేశారు. గత మూడు రోజులుగా ట్విట్టర్ ఖాతా అంతరాయం కలిగించినట్లు తర్వాత ఈ రోజు ఉదయం ధర్నా చౌక్ పై ట్వీట్ చేసేందుకు ట్విట్టర్ ఓపెన్ కాకపోవడంతో బ్లాక్ అయినట్టు గుర్తించారు. దీనిపై పవన్ కార్యాలయ సిబ్బంది నిపుణులతో చర్చిస్తున్నారు. పవన్ ఇక నుంచి ట్విట్టర్ ద్వారా వచ్చే ట్వీట్ కు తనకు సంబంధలేదని ప్రకటించారు. పవన్ కల్యాన్ దేశ వ్యాప్తంగా 18 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఖాతా బ్లాక్ పై సైబర్ క్రైంలో ఫిర్యాదు చేయనున్నారు. హ్యాకింగ్ ను కుట్రగా జనసేన వర్గాలు భావిస్తున్నాయి. పవన్ కల్యాణ్ ప్రజా సమస్యలపై ట్విట్టర్ ద్వారా స్పందిస్తారు. ఖాతా బ్లాక్ కావడంతో అభిమానులు, కార్యకర్తలు ఆందోళనగా ఉన్నారు. ప్రస్తుతం దేశావ్యాప్తంగా హ్యాకింగ్ జరుగుతున్న సమయంలో పవన్ ట్విట్టర్ ఖాతా బ్లాక్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

10:29 - May 17, 2017

వరుస హిట్స్ తో మంచి జోరు మీదున్న 'నాని' వైవిధ్యమైన కథా చిత్రాలు ఎంచుకుంటూ దూసుకెళుతున్నాడు. లవర్ బాయ్..ఫ్యామిలీ హీరోగా ముద్ర పడిన ఈ హీరో నచ్చిన పలు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు. 'నిన్ను కోరి'..'ఎమ్ సీఏ' సినిమాలతో బిజీగా ఉన్న 'నాని' ఓ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. మల్టిస్టారర్ సినిమాకు 'నాని' ఓకే చెప్పినట్లు సోషల్ మాధ్యమల్లో తెగ వార్తలు వచ్చేస్తున్నాయి. యంగ్ హీరోలతో పోట నటిస్తున్న సీనియర్ హీరో 'నాగార్జున' సరసన నటించేందుకు 'నాని' అంగీకరించినట్లు టాక్. ప్రస్తుతం నాగ్ 'రాజు గారి గది-2' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో 'నిఖిల్' తో కలిసి 'నాగార్జున' మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడనే వార్తలు వచ్చాయి. అదే సినిమాను 'నిఖిల్' కు బదులుగా 'నాని'తో చేస్తున్నాడా ? అనేది తెలియరావడం లేదు. దీనికి సంబంధించిన విషయాలు త్వరలోనే తెలియనున్నారు.

10:22 - May 17, 2017

గుంటూరు : గత కొద్ది రోజులుగా మిర్చ రైతుల అందోళన దృష్టిలో ఉంచుకుని గుంటూరు మిర్చి యార్డుకు మార్కెట్ అధికారులు సెలువులు రద్దు చేశారు. సెలవులు రద్దు చేయడంతో కొనుగోళ్లు యథాతథం కొనసాగుతాయని అధికారులు తెలిపారు.ఈ రోజు ఉదయం నుంచి మిర్చి కొనుగోళ్లు మందకొండిగా సాగుతున్నాయి. అయితే ఎండ వేడికి హమాలీలు ముందుకు రావడంలేదు. యార్డు చైర్మన్ హమాలీలకు నచ్చజెప్తున్నారు. మిర్చి కొనుగోళ్లు ఉదయం 10 వరకు, తర్వాత సాయంత్ర కొనుగోళ్లు చేయాలని హమాలీలు కోరుతున్నారు. 

10:18 - May 17, 2017

టాలీవుడ్ లో నటించిన కొన్ని చిత్రాల్లో అయినా మంచి పేరు తెచ్చుకున్న హీరోల్లో 'రానా' ఒకరు. వైవిధ్యభరితమైన కథా చిత్రాలు ఎంచుకుంటూ ముందుకెళుతున్నాడు. తాజాగా ఆయన నటించిన 'బాహుబలి -2' సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. దీనితో తదుపరి సినిమాలను ఆచితూచి ఎంచుకుంటున్నాడు. తేజ దర్శకత్వంలో వస్తున్న 'నేనే రాజు నేనే మంత్రి'లోనూ కొత్త తరహా పాత్రలో కనిపించబోతున్నాడు. తాజాగా మరో చిత్రానికి సైన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగు, తమిళ, హిందీ, మళయాళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో 'రానా' సీబీఐ అధికారిగా నటించబోతున్నట్లు టాక్. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు నేపథ్యంలో చిత్రం తెరకెక్కనుందని, ఈ హత్య కేసులో పోలీసు అధికారిగా డా.కార్తికేయన్ ప్రధాన అధికారిగా వ్యవహహరించిన సంగతి తెలిసిందే. ఆయన పాత్రలో 'రానా' నటించనున్నారని సమాచారం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

10:12 - May 17, 2017

టాలీవుడ్ లో 'నాగ చైతన్య'..'సమంత'లు నటించిన '100% లవ్' ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం మంచి పేరు తెచ్చుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని తమిళంలో రీమెక్ చేయనున్నారని తెలుస్తోంది. కోలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న హీరో జి.వి.ప్రకాష్ కుమార్ ఇందులో హీరోగా నటించనున్నారని టాక్. ఈ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరగుతున్నాయని సోషల్ మాధ్యమాల్లో వార్తలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉంటే హీరోయిన్ గా 'తమన్నా'నే తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా టైటిల్ మాత్రం ఖరారు చేయలేని ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

డీఆర్డీఏ కార్యాలయంలో ఫైర్ ఆక్సిడెంట్..

మెదక్ : డీఆర్డీఏ కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఫర్నీచర్, ఫైళ్లు దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూటే కారణమని తెలుస్తోంది.

వైరస్ బారిన టిటిడి కంప్యూటర్లు..

చిత్తూరు : టిటిడి కంప్యూటర్లు వైరస్ బారిన పడ్డాయి. వనక్రై వైరస్ తో 30 కంప్యూటర్లకు వైరస్ సోకిందని, పరిపాలనపరమైన పనులకు విఘాతం కలిగిందని ఈవో పేర్కొన్నారు. భక్తుల సేవలకు చెందిన పోర్టల్స్ సమాచారం సురక్షితంగా ఉందని వెల్లడించారు.

గుంటూరు మిర్చి యార్డుకు సెలవులు రద్దు..

గుంటూరు : మిర్చి యార్డుకు సెలవులు రద్దు చేశారు. కొనుగోళ్లు యథాతథంగా జరగనున్నాయి. హామాలీలకు యార్డు ఛైర్మన్ నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రైతులకు ఇబ్బంది కలుగకుండా కొనుగోళ్లు జరపాలన్నదే తమ ఉద్ధేశ్యమని పేర్కొన్నారు.

09:36 - May 17, 2017

బాలీవుడ్ సినిమాల్లో హీరోలు వారి చిత్రాల్లోనే కాకుండా ఇతరుల చిత్రాల్లో కూడా నటిస్తుంటారు. ఏమాత్రం భేషజాలకు పోకుండా ప్రముఖుల హీరోలతో సైతం నటిస్తూ అభిమానులను మెప్పిస్తుంటారు. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్..షారూఖ్ ఖాన్ త్రయం నటించారంటే అభిమానులు ఆనందానికి అవధులు ఉండవు. తాజాగా 'సల్లూ భాయ్' నటిస్తున్న 'ట్యూబ్ లైట్' చిత్రంలో 'షారూఖ్' ఓ ముఖ్యమైన పాత్ర పోషించాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకొంటోంది. సినిమాకు సంబంధించిన లుక్స్ ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. సోహైల్ ఖాన్, చైనా నటి చూచూ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రం వ్యక్తిగత ఎమోజి కలిగిన తొలి బాలీవుడ్ చిత్రంగా గుర్తింపు పొందడం విశేషం. ఈ విషయాన్ని కబీర్ ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. ట్విట్టర్ లో 'ట్యూబ్ లైట్ కీ ఈద్' అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేసినప్పుడు ఈ ఎమోజీ కనిపిస్తుంది. సల్మాన్ మెడకు బూట్లు ధరించి సెల్యూట్ చేస్తూ బొమ్మ రూపంలో కనబడుతాడు. భారత్ - చైనా సరిహద్దు నేపథ్యంలో సినిమా ఉంటుందని, రంజాన్ కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

09:36 - May 17, 2017

ముంబై : వాన్నా క్రై.. ఇపుడు ఈ పేరు చెబితేనే ప్రపంచం వణికి పోతోంది. ఈ కొత్త ఇ-వైరస్‌ దెబ్బకు బ్యాంకులు కంపించి పోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఏటీఎంలపై వాన్నాక్రై ఎఫెక్ట్‌ పడనుందన్న హెచ్చరికలతో ఆర్బీఐ అప్రమత్తమైంది. సెక్యూరిటీ అప్‌డేట్స్‌ వచ్చేవరకు ఏటీఎంలు ఓపెన్‌ చేయొద్దని బ్యాంకులకు సూచించింది. దీంతో నిన్నటిదాకా పెద్దనోట్ల రద్దు ఎఫెక్ట్‌తో మూతపడిన ఏటీఎంలు.. ఇపుడు వాన్నాక్రై ఎఫెక్ట్‌తో వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ వాన్నాక్రై.. ఎఫెక్ట్‌ ఇండియన్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థల మీద పడొచ్చన్న హెచ్చరికలతో.. ఆర్బీఐ బ్యాంకులను వేకప్‌ చేస్తోంది. వాన్నాక్రై వైరస్ బారి నుండి బ్యాంకింగ్ నెట్ వర్క్ ను రక్షించేందుకు చర్యలు చేపట్టింది. మాల్ వేర్ నుండి రక్షించేందుకు విండోస్ అప్ డేషన్ వచ్చేవరకు ఎటిఎంలను మూసి వేయాలని ఆదేశించింది. ఆర్బీఐ సూచనలతో దేశవ్యాప్తంగా ఏటీఎంలు మూతపడ్డాయి. ఇటు హైదరాబాద్‌లో కూడా ఏటీఎంల షటర్లు క్లోజయ్యాయి.

60 శాతం ఏటిఎంలు విండోస్ ఆపరేటింగ్ సిస్టంతోనే 
వాన్నాక్రై వైరస్‌ విండోస్ ఆపరేటింగ్ సిస్టం పైనే ప్రతాపాన్ని చూపిస్తోంది. దేశంలో ఉన్న 60 శాతం ఏటిఎంలు విండోస్ ఆపరేటింగ్ సిస్టం పైనే నడిచేవే కావడంతో .. ఆ ప్రభావం దేశ ఇండియన్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థపై అధికంగా ఉంది. దీంతో తమ విండో ప్యాచ్‌లను అప్‌డేట్‌ చేసుకోవాలని ఆర్బీఐ సూచించింది.దీంతో తమ విండోప్యాచ్‌ల అప్‌డేట్‌కోసం బ్యాంకులు తమ సర్వీస్ ప్రొవైడర్లకు ఆప్పీల్‌ చేసుకుంటున్నాయి. అయితే వాన్నక్రై గురించి అంతగా భయడాల్సిన పనిలేదంటున్నారు ఏటిఎం ఆపరేటర్లు చేపుతున్నారు. ఎటి ఎం యంత్రాల్లో ఎలాంటి డేటా నిల్వ చేసే అవకాశం లేనందున వన్నా క్రై ప్రభావం పడే అవకాశం లేదంటున్నారు. మరో వైపు ఆర్ బి ఐ మాత్రం దీనిపై ఎలాంటి వివరణ కూడా ఇవ్వడం లేదు. పెద్ద నోట్ల రద్దు అయి.. 6 నెలలు గడచినా .. ఇప్పటికీ ఎటిఎంల్లో క్యాష్ కష్టాలు తొలగిపోలేదు. తాజాగా వాన్నక్రై వైరస్‌ భయంతో అరకొరగా పనిచేస్తన్న ఏటీఎంలు కూడా మూతపడ్డంతో వినియోగదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకులు సమస్యలను త్వరగా పరిష్కరించాలని కోరుతున్నారు. 

09:27 - May 17, 2017

యాదాద్రి : జిల్లాలోని బీబీనగర్ వద్ద పెళ్లిబృందం డీసీఎం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలు అయ్యాయి. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. వీరు జగద్గీరిగుట్ట నుంచి యాదాగిరి నరసింహా దర్శనానికి వెళ్తున్నట్లు తెలుస్తోంది. డ్రైవర్ వేగంగా డీసీఎం నడపడంతో అదుపు తిప్పి బోల్తా పడినట్టు స్థానికులు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

09:20 - May 17, 2017

సూర్యాపేట : జిల్లాలోని మోతే వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ కూకట్ పల్లి నుంచి కొత్తగూడెం జిల్లా చెర్లకు పెళ్లి బృందంతో వెళ్తున్న డీసీఎంను వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ పెళ్లి బృందం కాలకృత్యాల తీర్చుకోవడం కోసం డీసీఎంను రోడ్డు ప్రక్కన నిలిపిన తర్వాత ముందుగా మహిళలు కిందికి దిగుతుండగా లారీ ఢీకొనడంతో పెళ్లి కొడుకు వెంకట శేషసాయితో పాటు మరోకరు మృతి చెందారు. 15 మందికి తీవ్ర గాయాలు అవడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో డీసీఎంలో 26 మంది ఉన్నారు. కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి అఖిల్, సత్యనారాయణ మృతి చెందడంతో మృతుల సంఖ్య నాలుగు చెరింది. మరి కొద్ది క్షణాల్లో పెళ్లి పీఠలు ఎక్కబోయే వరుడు మరణంతో వరుడు, వధువు ఇళ్లలో విషాదం నెలకొంది.

09:17 - May 17, 2017

హైదరాబాద్ : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాన్ ట్విట్టర్ ఖాతాను హ్యాకర్లు బ్లాక్ చేశారు. గత మూడు రోజులుగా ట్విట్టర్ ఖాతా ఇబ్బంది పెట్టి ఈ రోజు ఉదయం పూర్తి బ్లాక్ అయినట్టు గుర్తించారు. దీనిపై పవన్ కార్యాలయ సిబ్బంది నిపుణులతో చర్చిస్తున్నారు. ఖాతా బ్లాక్ పై సైబర్ క్రైంలో ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. హ్యాకింగ్ ను కుట్రగా జనసేన వర్గాలు భావిస్తున్నాయి. పవన్ కల్యాణ్ ప్రజా సమస్యలపై ట్విట్టర్ ద్వారా స్పందిస్తారు. ఖాతా బ్లాక్ కావడంతో అభిమానులు, కార్యకర్తలు ఆందోళనగా ఉన్నారు. ప్రస్తుతం దేశావ్యాప్తంగా హ్యాకింగ్ జరుగుతున్న సమయంలో పవన్ ట్విట్టర్ ఖాతా బ్లాక్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

పవన్ కల్యాణ్ ట్విట్టర్ ఖాతా హ్యాక్

హైదరాబాద్ : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్  ట్విట్టర్ ఖాతాను హ్యాకర్లు హ్యాక్ చేశారు. దీనిపై పవన్ కార్యాలయ సిబ్బంది నిపుణులతో చర్చిస్తున్నారు. హ్యాకింగ్ ను కుట్రగా జనసేన వర్గాలు భావిస్తున్నాయి.

08:24 - May 17, 2017

హైదరాబాద్ : నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లు పెరిగిపోతున్నాయి...మద్యం సేవించి వాహనాలు నడపవద్దని..ఇతరుల ప్రాణాలు..జీవితాలు బలి తీసుకోవద్దని పోలీసు అధికారులు చేస్తున్న హెచ్చరికలు యువత పెడచెవిన పెడుతోంది...ఇటీవలే నగరంలో పలు ఘటనలు చోటు చేసుకుంటున్నా వారిలో మార్పు రావడం లేదు. తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఇద్దరు అమ్మాయిలతో కలిసి కారుతో యువకుడు హల్ చల్ చేశాడు. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 10 వద్ద రాంగ్ రూట్లో ప్రయాణించాడు. ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రెడు కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి. యువకుడికి, ఇద్దరు అమ్మాయిలకు తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మద్యం మత్తులోనే యువకుడు కారు నడిపినట్లు పోలీసులు నిర్థారించారు. యువకుడు..యువతులు ఎవరో తెలియాల్సి ఉంది.

08:15 - May 17, 2017

సూర్యాపేట : జిల్లాలోని మోతే వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ కూకట్ పల్లి నుంచి కొత్తగూడెం జిల్లా చెర్లకు పెళ్లి బృందంతో వెళ్తున్న డీసీఎంను వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ పెళ్లి బృందం కాలకృత్యాల తీర్చుకోవడం కోసం డీసీఎంను రోడ్డు ప్రక్కన నిలిపిన తర్వాత ముందుగా మహిళలు కిందికి దిగుతుండగా లారీ ఢీకొనడంతో పెళ్లి కొడుకు వెంకట శేషసాయితో పాటు మరోకరు మృతి చెందారు. 15 మందికి తీవ్ర గాయాలు అవడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి అఖిల్, సత్యనారాయణ మృతి చెందడంతో మృతుల సంఖ్య నాలుగుకు చెరింది. వరుడు మరణంతో వరుడు, వధువు ఇళ్లలో విషాదం నెలకొంది. 

బీబీనగర్ వద్ద డీసీఎం బోల్తా

యాదాద్రి : జిల్లాలోని బీబీనగర్ వద్ద పెళ్లిబృందం డీసీఎం బోల్తా పడింది. 20 మందికి గాయాలు అయ్యాయి. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు.

 

07:33 - May 17, 2017

హైదరాబాద్ : ప్రజల మధ్య వైరుధ్యాలు సృష్టిస్తున్నారని, నిజాం వరుసుడిలా సీఎం వ్యవరిస్తున్నారని, నిరసన తెలపడం ప్రజల హక్కు ఉందని న్యూస్ మార్నింగ్ పాల్గొన్న న్యూడెక్రసీ నేత గోవర్దన్, కాంగ్రెస్ నేత రజనీష్ గౌడ్, బీజేపీ నేత ఆచారి అన్నారు. ధర్నా చౌక్ పెద్ద సమస్య కాదని టీఆర్ఎస్ నేత శ్రీనివాస్ అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

07:29 - May 17, 2017

విత్తనాల నిర్వహన మొత్తం బహుళజాతి కంపెనీల చేతికి వెళ్తున్నాయి. నకిలీ విత్తనాలు అమ్మితే వారిపై కేసుపెట్టకుండా తెలుగు దేశం పార్టీ అడ్డుకుంటుందని జన పథంలో పాల్గొన్న ఏపీ రైతు సంఘం అధ్యక్షుడు కేశవరావు అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

07:15 - May 17, 2017

బెంగళూరు : అత్యుత్తమ పాలనలో దేశంలోనే కేరళ నంబర్‌వన్‌ స్థానంలోనిలిచినట్టు పీఏఐ - 2017 నివేదిక స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎం.వి. వెంకటాచలయ్య ఈనివేదికను బెంగళూరులో విడుదల చేశారు. మొత్తం 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సర్వేనిర్వహించిన పబ్లిక్‌ ఎఫైర్స్‌ ఇండెక్స్‌ .. అత్యుత్తమ పాలన అందిస్తున్న రాష్ట్రాలకు ర్యాంకులు ప్రకటించింది. కేరళ మొదటిస్థానంలో నిలవగా, తమిళనాడు, గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లు వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. అత్యవసర మౌలిక సదుపాయాల కల్పన, మానవాభివృద్ధి, సమానత్వం, మహిళలు, చిన్నారుల రక్షణ, అణగారిన వర్గాల సామాజిక రక్షణ, నేరాల అదుపు, న్యాయం అమలు, శాంతిభద్రతల మెరుగుదల అంశాల్లో పీఏఐ సర్వే నిర్వహించింది. వీటితోపాటు పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక నిర్వహణ, పారదర్శకత, ప్రభుత్వ జవాబుదారీతనం లాంటి మొత్తం 26 ముఖ్యవిషయాలు, 82 సూచికలతో ఈ సర్వే నిర్వహించింది పీఐఏ. ఈ అంశాలన్నింటిలో కేరళ, త్రిపురలు ప్రథమస్థానంలో నిలిచి దిబెస్ట్‌ పాలన అందిస్తున్న రాష్ట్రాలుగా కితాబు అందుకున్నాయి.

అట్టడుగున బీజేపీ రాష్ట్రాలు..
పీఏఐ ర్యాంకుల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు అట్టడుగున నిలిచాయి. మానవాభివృద్ధి ర్యాంకుల్లో గుజరాత్‌ 21స్థానంతో బాగా వెనుబడింది. ఇక గత ఏడాది నాలుగోస్థానంలో ఉన్న మహరాష్ట్ర ఈసారి ఆరో స్థానానికి దిగజారింది. గత ఏడాది బీహార్‌ 18, జార్ఖండ్‌ 17, ఒడిశా 16, అసోం 15 స్థానల్లో నిలవగా.. ఈసారి మాత్రం చివరి నాలుగు స్థానాలకు పడిపోయాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. అత్యుత్తమ పాలనలో గతేడాది 13వస్థానంలో ఉన్న తెలంగాణ ఈసారి 20 స్థానానికి పడిపోయింది. గత ఏడాది 9వర్యాంకులో నిలిచిన ఏపీ ఈసారి 14వ స్థానంతో సరిపెట్టుకుంది. అయితే.. ఆర్థిక వనరుల నిర్వహణలో తెలంగాణ ప్రథమస్థానంలో నిలవగా.. ఏపీ మాత్రం 28 వ ర్యాంకుకు దిగజారింది.

రెండో స్థానంలో నిలిచిన త్రిపుర
మొత్తం 26 అంశాల్లో ప్రథమ స్థానంలో నిలిచిన కేరళ, రెండో స్థానంలో నిలిచిన త్రిపుర రాష్ట్రాల్లో పోలీస్‌ వ్యవస్థ పనితీరు బాగుందని పీఐఏ తన నేవిదికలో ప్రశంసించింది. బెటర్‌ పోలీసింగ్‌లో ఒడిశా, కర్నాటక రాష్ట్రాలు ఫర్వాలేదనిపించగా.. బీజేపీ పాలిత రాష్ట్రాలైన జార్ఖండ్‌, హర్యానా, మహారాష్ట్రలు చిట్టచివరి స్థానంలో నిలిచాయి. అటు సమానత్వంలో కేరళ, న్యాయంలో త్రిపుర రాష్ట్రాలు టాప్‌ప్లేస్‌లో నిలిచాయని.. పీఏఐ నివేదిక స్పష్టం చేసింది. మొత్తానికి ప్రజారంజక పాలన అందించడంలో లెఫ్ట్‌పార్టీలు తమకు తామే సాటి అని నిరూపించుకోగా.. బీజేపీ, దాని మిత్రపక్షాలు మాత్రం ఇంకా చాలా విషయాల్లో మెరుగు పడాల్సి ఉందని పీఏఐ- 2017 సర్వే తేటతెల్లం చేసింది.

07:10 - May 17, 2017

హైదరాబాద్ : తెలంగాణలో మెడికల్ పీజి విద్యార్ధుల భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారుతోంది. పీజి సీట్ల కేటాయింపు జరిగినా కాలేజీల్లో అడ్మిషన్ ఇవ్వకపోవడానికి ప్రభుత్వ తీరే కారణమంటూ విద్యార్థులు భగ్గుమంటున్నారు. మరోవైపు రాష్ట్ర ఫీజుల నియంత్రణ కమిటితో సంబంధం లేకుండా ప్రభుత్వం ఫీజులు ఇష్టానుసారంగా పెంచేసిందని ఆరోపిస్తున్నారు. ప్రైవేటు మెడికల్ కాలేజీల ఒత్తిడికి తలొగ్గి ఫీజులు 1500శాతం పెంచారని మండిపడుతున్నారు. కౌన్సెలింగ్ పూర్తి చేసుకున్న విద్యార్ధులకు కాలేజీలు కేటాయించినా..వారిని ఆయా యాజమాన్యాలు చేర్చుకునేందుకు నిరాకరిస్తున్నాయని వాపోతున్నారు.

ప్రైవేటు మెడికల్ కాలేజీలు ప్రభుత్వంతో కుమ్మక్కు
రాష్ట్రంలోని 15 ప్రైవేటు మెడికల్ కాలేజీలు ప్రభుత్వంతో కుమ్మక్కై ఫీజులు పెంచుకున్నాయని.. దీన్ని వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించామని విద్యార్థులు అంటున్నారు. కోర్టులో కేసు నడుస్తుండగానే ప్రభుత్వం అలాట్‌మెంట్ చేసుకోవాలని జీవో జారీ చేసింది. కానీ ప్రైవేటు కాలేజీలు ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తూ అడ్మిషన్లు ఇవ్వడం లేదని.. అందుకే ఆందోళన బాటకు సిద్ధమయ్యామని విద్యార్థులు అంటున్నారు. ప్రభుత్వం ఒకవైపు విద్యార్ధులను చేర్చుకోవాలని చెబుతున్నా కాలేజీ యాజమాన్యాలు పట్టించుకోకపోవడం ధిక్కారం అవుతోందని జూడాల తరుపు న్యాయవాదులు అంటున్నారు. దీనిపై తీవ్రంగా చర్యలు తీసుకునేందుకు ఆస్కారం వుంటుందని చెబుతున్నారు. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని ప్రైవేటు కాలేజీల ఫీజు దోపిడిని అరికట్టాలని మెడికల్‌ పీజీ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కోర్టులో కేసు విచారణలో వుందని తీర్పు వచ్చేంత వరకు పాత ఫీజులనే కొనసాగించాలని కోరుతున్నారు. 

06:57 - May 17, 2017

సూర్యాపేట : జిల్లాలోని మోతే వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ కూకట్ పల్లి నుంచి ఖమ్మం జిల్లా చెర్లకు పెళ్లి బృందంతో వెళ్తున్న డీసీఎంను వేగంగా వచ్చిని లారీ అదుపు తప్పి ఢీకొంది. ఈ పెళ్లి బృందం విరామం కోసం డీసీఎంను రోడ్డు ప్రక్కన అపిన తర్వాత ముందుగా మహిళలు కిందికి దిగుతుండగా లారీ ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. 20 మందికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో పెళ్లికొడుకు శేషసాయి ఉండడంతో పెళ్లింట విషాదం నెలకొంది.  

నేడు వరంగల్ నీట్ రీఎగ్జామ్

వరంగల్ : నేడు జిల్లా కేంద్రంలోని సెయింట్ పీటర్స్ నీట్ రీఎగ్జామ్ జరగనుంది. గతంలో ప్రశ్నపత్రం తారుమరరైన 144 మంది విద్యార్థులకు ఈ రీఎగ్జామ్ నిర్వహిస్తుంది.

సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం

సూర్యాపేట : జిల్లాలోని మోతే వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ కూకట్ పల్లి నుంచి ఖమ్మం జిల్లా చెర్లకు పెళ్లి బృందంతో వెళ్తున్న డీసీఎంను వేగంగా వచ్చిని లారీ అదుపు తప్పి ఢీకొంది.

నేడు కోల్ కత్తా సన్ రైజర్స్ ఎలిమినేటర్ మ్యాచ్

ఐపీఎల్ ­10­ : నేడు కోల్ కత్తా ­సన్ రైజర్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. బెంగళూరు వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది.

 

Don't Miss