Activities calendar

18 May 2017

21:31 - May 18, 2017

ఢిల్లీ : వివాదస్పదంగా మారిన ట్రిపుల్‌ తలాక్‌ అంశంపై సుప్రీంకోర్టులో మే 11న ప్రారంభమైన విచారణ ముగిసింది. ఆరు రోజుల విచారణ అనంతరం అత్యున్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. ట్రిపుల్‌ తలాక్‌పై మహిళల అభిప్రాయం తెలుసుకుని నిఖా నామాలో చేర్చేందుకు కాజీలందరికీ సూచిస్తామని ఆల్‌ ఇండియా పర్సనల్‌ లా బోర్టు కోర్టు సమక్షంలో ఒప్పుకుంది.

ముస్లిం పర్సనల్ లా బోర్డు ఒక పాపంగా ఆమోదించాలని

ట్రిపుల్ తలాక్‌ను ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఒక పాపంగా ఆమోదించాలని షయారా బానో తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది అమిత్ ఛద్దా కోరారు. ట్రిపుల్ తలాక్‌ విశ్వాసానికి, నమ్మకానికి సంబంధించిన విషయమన్న సీనియర్‌ న్యాయవాది కపిల్ సిబల్ వాదనను ఛద్దా తిప్పికొట్టారు. ట్రిపుల్‌ తలాక్‌ ఖురాన్‌లో ఎక్కడా లేదని..అది ఆమోదయోగ్యం కాదని పర్సనల్‌ లా చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఛద్దా వాదనపై జోక్యం చేసుకున్న జస్టిస్‌ నారీమన్‌..

ఛద్దా వాదనపై జోక్యం చేసుకున్న జస్టిస్‌ నారీమన్‌..ట్రిపుల్‌ తలాక్‌ మతంలో భాగం కాదనేగా మీ ఉద్దేశమని ప్రశ్నించారు. ఛద్దా అవునని సమాధానం ఇవ్వడంతో ఈ కేసులో వాదనలు ముగిసినట్లేనని రాజ్యాంగ ధర్మాసనం ప్రకటించింది.

ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఆరు రోజుల పాటు విచారణ

ట్రిపుల్‌ తలాక్‌పై కేంద్రం, ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు, ఆల్‌ ఇండియా ముస్లిం వుమెన్‌ పర్సనల్‌ లా బోర్డు దాఖలు చేసిన పలు పిటీషన్‌లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సీజే.ఖెహర్‌ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఆరు రోజుల పాటు విచారణ జరిపింది. ఈ బెంచ్‌లో సిక్కు, క్రైస్తవ, పార్శీ, హిందు, ముస్లిం మతస్థులు సభ్యులుగా ఉన్నారు. ట్రిపుల్‌ తలాక్‌ రాజ్యాంగబద్ధమైన అంశమా...? మతపరమైన హక్కా..? అన్న కోణంలో విచారణ జరిపారు... నిఖా, హలాలా, బహుభార్యత్వంపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

21:28 - May 18, 2017

హైదరాబాద్: జమ్ముకశ్మీర్‌ శ్రీనగర్‌లో జిఎస్టీ కౌన్సిల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జీఎస్టీ రేట్లను దాదాపుగా ఖరారు చేసినట్లే కనిపిస్తోంది. మొత్తం 1,211 రకాల వస్తువులపై ఎంత పన్ను విధించాలో కౌన్సిల్‌ నిర్ణయించింది. నిత్యావసర వస్తువుల ధరలు చాలావరకు తగ్గే అవకాశం ఉంది. ఇకపై పాల అమ్మకాలపై ఎలాంటి పన్ను ఉండదు. ఆహారధాన్యాలపై 5 శాతంగా ఉన్న పన్నును పూర్తిగా మినహాయించారు. బొగ్గు మీద ప్రస్తుతం 11.69% పన్ను ఉండగా, జీఎస్టీని 5%కు పరిమితం చేశారు. అలాగే పంచదార, టీ, కాఫీ, వంటనూనెల మీద కేవలం 5% పన్ను మాత్రమే పడుతుంది. దాదాపు 60 శాతం వరకు వస్తువులు 12-18% శ్లాబు పరిధిలోకే వస్తున్నాయి. తలనూనెలు, సబ్బులు, టూత్‌పేస్టుల మీద ప్రస్తుతం 28% ఉన్న పన్ను జీఎస్టీతో 18%కు తగ్గుతుంది. 81% వస్తువులు 18% కంటే తక్కువ పన్ను పరిధిలోకే వస్తాయని రెవెన్యూ కార్యదర్శి హస్‌ముఖ్ ఆది చెప్పారు. జీఎస్టీలోని ఏడు నిబంధనలను కౌన్సిల్ ఆమోదించిందని, మిగిలిన రెండింటిటిని మాత్రం ఒక లీగల్ కమిటీకి నివేదించామని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. 

21:27 - May 18, 2017

హైదరాబాద్: అంతర్జాతీయ న్యాయస్థానంలో కుల్‌భూషణ్ జాదవ్‌కు గొప్ప ఊరట లభించింది. పాకిస్తాన్‌ ఆర్మీకోర్టు విధించిన ఉరిశిక్షపై ఐసిజె స్టే విధించింది. గూఢచర్యం ఆరోపణలపై కుల్‌భూషణ్‌ జాదవ్‌కు పాక్‌ మిలటరీ కోర్టు మరణశిక్ష విధించడంపై అంతర్జాతీయ న్యాయస్థానంలోని 11 మంది న్యాయమూర్తుల ధర్మాసనం సమీక్షించింది. ఈ కేసు ఐసిజే పరిధిలోకి రాదన్న పాక్‌ అభ్యంతరాలను ధర్మాసనం తోసిపుచ్చింది. జాదవ్ కేసును విచారించే అధికారం అంతర్జాతీయ న్యాయస్థానానికి ఉందని స్పష్టం చేసింది. తుది తీర్పు వెలువడే వరకు జాదవ్‌ను ఉరితీయమని పాకిస్తాన్‌ హామీ ఇవ్వాలని ఐసిజే ఆదేశించింది.

భారత్‌ డిమాండ్‌ సరైనదేనని...

జాదవ్‌ ఉరిశిక్షపై స్టే విధించాలన్న భారత్‌ డిమాండ్‌ సరైనదేనని కోర్టు వ్యాఖ్యానించింది. ఆగస్టు వరకు జాదవ్‌కు ఉరిశిక్ష విధించమని పాకిస్తాన్‌ చెప్పిన విషయాన్ని కోర్టు గుర్తు చేసింది. వియన్నా ఒప్పందం ప్రకారం జాదవ్‌ను కలుసుకునే హక్కు భారత్‌కు ఉందని స్పష్టం చేసింది. జాదవ్‌కు పాకిస్తాన్ సైనిక కోర్టు విధించిన మరణశిక్షను నిలుపుదల చేయాలని కోరుతూ భారత్‌ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై ఈ నెల 15న ఐసిజే విచారణ చేపట్టింది. భారత్‌, పాకిస్తాన్‌లు తమ తమ వాదనలు వినిపించాయి. జాదవ్‌ను ఇరాన్‌లో కిడ్నాప్‌ చేసి రహస్యంగా పాకిస్తాన్‌కు తీసుకెళ్లి గూఢచర్యానికి పాల్పడ్డట్లు ముద్రవేసిందని భారత్‌ పేర్కొంది... ఎలాంటి ఆధారాలు చూపకుండానే జాదవ్‌కు ఉరిశిక్ష విధించిందని భారత్‌ వాదించింది. పాకిస్తాన్‌ వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించిందని కోర్టుకు తెలిపింది

భారత్‌ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని రాజకీయంగా వినియోగించుకుంటోదని...

జాదవ్‌ విషయంలో భారత్‌ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని రాజకీయంగా వినియోగించుకుంటోదని పాకిస్తాన్‌ ఆరోపించింది. జాదవ్‌ ఇరాన్‌ నుంచి పాకిస్తాన్‌లోకి చొరబడి గూఢచర్యానికి పాల్పడ్డారని... ఇందుకు సంబంధించిన వీడియో ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొంది. గూఢాచారులకు అంతర్జాతీయ ఒప్పందాలు వర్తించవని పాకిస్తాన్‌ ప్రతివాదన చేసింది. ఈ కేసులో భారత్‌ తరఫున హరీశ్‌ సాల్వే, పాక్‌ తరఫున అస్తర్‌ అలీ వాదనలు వినిపించారు. ఈ కేసులో వాదించేందుకు సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది హరీష్ సాల్వే నామమాత్రంగా ఒక్క రూపాయి ఫీజు మాత్రమే తీసుకున్నారు.

పాకిస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బ...

అంతర్జాతీయ న్యాయస్థానంలో పాకిస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 18 ఏళ్ల తర్వాత మరోసారి పాకిస్తాన్ మీద భారత్ పైచేయి సాధించింది. 1999లో పాకిస్తాన్‌ యుద్ధ విమానాన్ని కుచ్‌ ప్రాంతంలో భారత్‌ కూల్చివేసింది. ఈ ఘటనలో 16 మంది సిబ్బంది మృతి చెందారు. తమ గగనతలంలో ఉండగా భారత్‌ అక్రమంగా విమానాన్ని కూల్చివేసిందని... భారీ నష్ట పరిహారం కోరుతూ పాకిస్తాన్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. పాక్‌ పిటిషన్‌పై విచారణ జరిపిన 16 మంది న్యాయమూర్తుల ధర్మాసనం 14-2 తేడాతో కొట్టివేసింది. ఈ కేసు అంతర్జాతీయ న్యాయస్థానం పరిధిలోకి రాదన్న భారత్‌ వాదనను కోర్టు సమర్థించింది.

21:24 - May 18, 2017

హైదరాబాద్‌: నగరంలోని సింగరేణి భవన్‌ నినాదాలతో హోరెత్తింది.. తాడిచెర్ల గనులను ప్రైవేటీకరించొద్దంటూ వామపక్షాలు, ట్రేడ్‌ యూనియన్ల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.. ఈ ఆందోళనలో సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్‌, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, ట్రేడ్‌ యూనియన్‌ నేతలు పాల్గొన్నారు..

వైఎస్‌ఆర్‌, రోశయ్య హయాంలోనూ...

వైఎస్‌ఆర్‌, రోశయ్య హయాంలోనూ గనులను ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నించారని చాడ వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ప్రతిపక్షాల పోరాటంవల్లే వెనక్కితగ్గిన రోశయ్య... పీఎల్‌ఆర్‌కు ఇచ్చిన తాడిచర్ల కోల్‌బ్లాక్‌ టెండర్లను రద్దుచేసి సింగరేణికి అప్పజెప్పాలంటూ ఆదేశించారని గుర్తు చేశారు. టీఆర్‌ఎస్‌ కూడా తాము అధికారంలోకి వస్తే సింగరేణిని ప్రభుత్వం తరపున స్వంతంగా నిర్వహిస్తామంటూ హామీ ఇచ్చిందని .. ఇప్పుడు ఆమాట తప్పిందని చాడ విమర్శించారు.. సింగరేణితో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దుచేసి ఏఎమ్‌ఆర్‌ కంపెనీకి ఇవ్వాలని చూస్తోందని ఆరోపించారు..

అధికారంలోకి రాగానే ఆ సంస్థను నిర్లక్ష్యం చేస్తున్నారని....

ఎన్నికలకు ముందు సింగరేణి జపం చేసిన సీఎం కేసీఆర్‌... అధికారంలోకి రాగానే ఆ సంస్థను నిర్లక్ష్యం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు మండిపడ్డారు.. ప్రైవేటీకరణ చేస్తే ఉద్యోగులతో పాటు నిరుద్యోగులకూ భారీగా నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తానికి తాడిచెర్ల బొగ్గు గనుల ప్రైవేటీకరణపై వామపక్షాలు కదం తొక్కాయి.. గనుల్ని ప్రైవేటుపరం చేయొద్దంటూ సీఎస్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. 

21:22 - May 18, 2017

హైదరాబాద్‌: నగరంలోని ఎంబీ భవన్‌లో రెండు రోజుల పాటు జరిగిన సీపీఎం రాష్ట్రకమిటీ సమావేశాల్లో పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇటీవల నిర్వహించిన మహాజన పాదయాత్ర విజయవంతం అయిందని పార్టీ అభిప్రాయపడింది. యాత్ర సందర్భంగా నేతల దృష్టికి వచ్చిన ప్రజాసమస్యలపై భవిష్యత్‌ ఉద్యమాలు నిర్మించాలని నిర్ణయించారు. సామాజిక న్యాయసాధనకు వామపక్ష , సామాజిక సంఘాల ఐక్య ఉద్యమాలు నిర్మించడానికి కార్యాచరణను సిద్ధం చేయాలని పార్టీ నిర్ణయం తీసుకుంది.

దేశంలో ఆర్థిక అసమానతలు...

మోదీపాలనలో దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. కార్పొరేట్‌ శక్తులకు ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వ విధానాలు మార్చేశారని విమర్శించారు. ధనవంతులు లక్షల కోట్లకు పడగలెత్తుతుంటే.. పేద, మధ్యతరగతి ప్రజలు మరింత పేదలుగా మారుతున్నారని ఆయన ఆందోళన వెలిబుచ్చారు. మరోవైపు దేశంలో రోజురోజుకీ పెరిగిపోతున్న మత అసహనంపై ఏచూరి ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గో రక్షణ సంఘాల ఆగడాలు మితిమీరాయన్నారు. దళితులు, ముస్లీంలపై దాడులు జరుగుతున్నా.. ప్రధాని మోది మౌనంగా ఉంటున్నారని ఏచూరి విమర్శించారు.

భావసారూప్య శక్తులతో ఐక్య వేదిక ఏర్పాటుకు

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల సమస్యల పరిష్కారానికి, భావసారూప్య శక్తులతో ఐక్య వేదిక ఏర్పాటుకు ప్రయత్నించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ధర్నాచౌక్ ఉద్యమంలో అన్ని పార్టీలు ఒకే వేదిక పై వచ్చి పోరాటం చేశాయని .. ఇదే స్ఫూర్తిని భవిష్యత్‌ ఉద్యమాల్లో కూడా కొనసాగించాలని నిర్ణయించింది. అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో స్నేహ పూర్వక చర్చలపైనా పార్టీ చర్చించింది. ఈ సమావేశాల్లో సీతారాం ఏచూరితోపాటు , సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీరాఘవులు, ప్రకాశ్‌కారత్‌ కూడా పాల్గొన్నారు. 

20:34 - May 18, 2017

హైదరాబాద్ : పిడుగు పడుద్ది..కానీ అంతకు ముందే మొబైల్ మోగుద్ది. అవును మరి పిడుగు ఆకాశాన్ని చీల్చుకుని రాకముందే అలర్ట్ బీ కేర్ ఫుల్ అంటోంది. జాగ్రత్తలు తీసుకుంటున్నారని గుర్తుచేస్తుంది. ఇప్పటి వరకు ప్రమాద వశాత్తూ ఎన్నో ప్రాణాలు పిడుగుల పాలిట పడ్డాయి. కానీ ఇక ముందు ఆ పరిస్థితి రాదు. ఏపీలో ప్రవేశ పెట్టిన టెక్నాలజీతో ఇపుడు సీన్ మారనుంది. మేఘాలు పిడుగుకు సై అనకముందే ఇక్కడ సేఫ్ ప్లేస్ లో సర్దుకునే అవకాశం వస్తోంది. ఇదే అంశం పై నేటి వైడాంగిల్ స్టోరి. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

వైద్య ఆరోగ్యశాఖలో 660 పోస్టుల భర్తీకి అనుమతి

హైదరాబాద్: వైద్య ఆరోగ్యశాఖలో 660 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టుల నియామక ప్రక్రియను టీఎస్‌పీఎస్సీకి అప్పగించింది. వైద్య విద్య విభాగంలో 148, డీహెచ్ పరిధిలో 457 పోస్టులు, వీవీపీ పరిధిలో 50 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వం టీఎస్‌పీఎస్సీకి ఆదేశాలు ఇచ్చింది.

 

20:12 - May 18, 2017
20:08 - May 18, 2017

అమరావతి: పెరుగుతున్న ఎండల నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఉష్ణోగ్రతలను నమోదు చేస్తున్నామని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కమిషనర్‌ శేషగిరిరావు తెలిపారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రాంతాల అధికారులను అప్రమత్తం చేస్తున్నామని శేషగిరిరావు తెలిపారు. పూర్తి వివరాలకోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

20:06 - May 18, 2017

హైదరాబాద్: జూన్ 1న రాబోతున్న రాహుల్ గాంధీ...గాంధీ భవన్ లో గర్జిస్తున్న కాంగ్రెస్ గడ్డం సాబ్, కథ మారిపోబోతున్న కరీంనగర్ పట్టణం...సరిచేసిండు సీఎంసార్ నిధుల కట్నం, బూతు లెవల్ కు బైకు మీద పోతున్న పువ్వు...కమలవోళ్లను చూస్తుంటే రానేబట్టే నవ్వు, మానకొండూరులో మసకబారుతున్న ఎమ్మెల్యే....రసమయి పాలన మీద జనం రుసరుస, పెట్రోలు బంకుల వెంటన అద్భుతమైన మోసం...కోట్ల రూపాయలు మింగుతున్న జనం గాసం, కామారెడ్డి మీద కాయిసుపడ్డ బుడ్డేనుగు..పట్టుకోని ఎక్కిచ్చేటందుకు పరుగో పరుగు ఇత్యాది అంశాలతో మల్లన్న 'మల్లన్న ముచ్చట్లు ' కార్యక్రమంలో మన ముందుకు వచ్చాడు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

19:59 - May 18, 2017

హైదరాబాద్: అవినీతి, నియంతృత్వం, అక్రమాలు టీఆర్ఎస్ ట్రేడ్ మార్క్ గా మారాయని విమర్శించారు టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. గాంధీభవన్ లో జరిగిన టీపీసీసీ సమావేశంలో పాల్గొన్న ఆయన... జూన్ 1న సంగారెడ్డిలో తెలంగాణ ప్రజా గర్జన సభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కేసీఆర్ మూడేళ్ల పాలనలోని వైఫల్యాలను ఎండగట్టడమే ఎజెండా నిర్వహిస్తున్నట్లు ఉత్తమ్ చెప్పారు. ఎన్నో ఆశలతో ప్రజలు టీఆర్ఎస్ కు అధికారం ఇస్తే కేసీఆర్ ప్రజల ఆశలు అడియాశలు చేశారని ఉత్తమ్‌ విమర్శించారు. 

19:57 - May 18, 2017

హైదరాబాద్‌ : ఔటర్‌ రింగ్‌రోడ్డుపై కారు దగ్ధమైంది. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ మండలం బ్రాహ్మణపల్లి వద్ద కారులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్‌ పక్కకు దూకడంతో పెను ప్రమాదం తప్పింది. 

19:54 - May 18, 2017

జగిత్యాల: మల్యాల మండలం ముత్యంపేట్‌లో మంటల్లో చిక్కుకొని రైతు సజీవదహనమయ్యాడు.. పొలంలో ఆదిరెడ్డి అనే రైతు చెత్తకాలుస్తుండగా ప్రమాదవశాత్తూ బాధిత రైతుకు మంటలు అంటుకున్నాయి.. అవే మంటల్లో రైతు కాలిబూడిదయ్యాడు..

19:51 - May 18, 2017
19:50 - May 18, 2017

అమరావతి: పిడుగు ప్రమాదాల్ని అరికట్టే ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ ద్వారా ఈ టెక్నాలజీని తొలిసారి చిత్తూరు జిల్లాలో ప్రయోగించి సక్సెస్ అయ్యింది. అమెరికాకు చెందిన ఎర్త్ నెట్ ఈ పరిజ్ఞానాన్ని అందిస్తోంది. సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడంతో.. దేశంలోనే తొలిసారిగా పిడుగుపాటును గుర్తించి, ప్రాణాపాయాన్ని నివారించే వీలు కలిగింది. పిడుగుపాటుకు సంబంధించిన హెచ్చరికల్ని ఫోన్‌ మెసేజ్‌లు సహా... పలు మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

ఎర్త్ నెట్ వర్క్ తో పాటు సహకారం అందించిన ఇస్రో

ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాల్లో పిడుగుపాటు అతి సహజం. అయితే పిడుగు ఎప్పుడు.. ఎక్కడ పడుతుందన్నది గుర్తించే సాంకేతితక ఇంతకాలం ఉండేది కాదు. అమెరికాకు చెందిన ఎర్త్ నెట్ వర్క్ తో పాటు.. ఇస్రో సహకారంతో పిడుగులు పసిగట్టే పరిజ్ఞానాన్ని ఏపీ సొంతం చేసుకుంది. ఆకాశంలో ఉష్ణోగ్రతల మార్పుల సమయంలో మేఘాల మధ్య ఉత్పత్తి అయ్యే ఎలక్ట్రికల్ కరెంట్ మరీ ఎక్కువగా ఉంటే అది పిడుగుగా మారి భూమిపై పడుతుంది. ఈ ఎలక్ట్రికల్ కరెంట్ ఏ స్ధాయిలో ఉందనే దానిని లెక్కించి పిడుగుపాటు, దాని తీవ్రతను అంచనా వేస్తారు. మేఘాల మధ్య ఎలక్ట్రికల్ ఛార్జ్ ఎంత ఉంది? అది పిడుగుగా మారి భూమిపై వచ్చే అవకాశం ఉందా? అనేది పసిగట్టే పరిజ్ఞానం ఎర్త్ నెట్ వర్క్ వద్ద ఉంది. ఈ పరిజ్ఞానాన్ని తొలిసారి చిత్తూరుజిల్లాలో ప్రయోగించిన అధికారులు కుప్పం, పలమనేరు మండలాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో అధికారులు అప్రమత్తమై దండోరా వేయించి, ప్రజలను అప్రమత్తం చేసి, ప్రాణాపాయాన్ని నివారించారు.

ఎర్త్ నెట్ వర్క్ ద్వారా రాష్ట్రంలో 14 సెన్సర్ల ఏర్పాటు

ఇక ఎర్త్ నెట్ వర్క్ ద్వారా రాష్ట్రంలో 14 సెన్సర్లను ఏర్పాటు చేశారు. ఒక్కో సెన్సర్ 1,040 కిలోమీటర్ల పరిధి వరకు పనిచేస్తుంది. ఆ పరిధిలో పిడుగుపాటుకు అవకాశం ఉంటే అరగంట ముందే చెప్పేస్తుంది. మరోవైపు కుప్పం ఇంజినీరింగ్ కాలేజ్ విద్యార్ధులు పిడుగుపాటును ముందుగా తెలిపే యాప్ ను సిద్ధం చేశారు. దీనికి వజ్రపథ్ అని పేరు పెట్టారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వరదరాజు, ఇస్రో శాస్త్ర వేత్త శ్రీకాంత్ నేతృత్వంలో ఈ వజ్రపథ్ యాప్ ను విద్యార్ధులు రూపొందించారు. దీనిని ఉపయోగించడం ద్వారా కుప్పం, బైరెడ్డిపల్లె మండలాల్లో పిడుగుపాటు సమాచారాన్ని ప్రజలకు అందించి ప్రాణ, ఆస్తి నష్టం నుంచి కాపాడగలిగారు. ఏపీలో అమలులోకి వచ్చిన ఈ పరిజ్ఞానంపై అనేక రాష్ట్రాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. తమ రాష్ట్రాల్లో ఈ టెక్నాలజీ అమలుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ పరిజ్ఞానం అన్ని చోట్ల అమలులోకి వస్తే పిడుగు ప్రమాదాల నుంచి జనం ప్రాణాలు కాపాడవచ్చు. 

19:46 - May 18, 2017

హైదరాబాద్: జనసేన పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టింది. రానున్న సార్వత్రిక ఎన్నికలకు జనసేన పార్టీ సిద్దమవుతోంది. 2019 ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇప్పటికే ప్రకటించారు. పార్టీ తరపున నిలబెట్టే అభ్యర్ధులు గెలవాలంటే కేవలం అభిమానులుంటేనే సరిపోదని.. పార్టీ నిర్మాణం కూడా అవసరమని భావిస్తోంది. అందుకే జనసేన సంస్థాగతంగా పార్టీ నిర్మాణంపై ఫోకస్‌ పెట్టింది. జనసైనికుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది. ఇప్పటికే అనంతపురం జిల్లాలో కార్యకర్తల ఎంపికను పూర్తి చేసింది. స్పీకర్స్‌, కంటెంట్‌ రైటర్స్‌తోపాటు విశ్లేషకులను ఎంపిక చేసింది. ఇప్పుడు ఉత్తరాంధ్రలో పార్టీ నిర్మాణంపై పవన్‌ కల్యాణ్‌ దృష్టి సారించారు.

విశాఖలో జనసేనకు బలమైన నాయకత్వం

ఉత్తరాంధ్రలో జనసేనకు మొదటి నుంచి విశాఖలో పార్టీ క్యాడర్‌ ఉంది. ఇప్పటి వరకు పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చిన ప్రతీ కార్యక్రమాన్ని విశాఖనగరంతోపాటు ఉత్తరాంధ్రలో నిర్వహించారు. దీంతో ఉత్తరాంధ్రలో పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేసుకోవాలని పవన్‌ భావిస్తున్నారు. అనంతపురంలో జనసైనికుల ఎంపిక చేసినట్టుగానే ఉత్తరాంధ్రలోనూ పార్టీ కార్యకర్తల ఎంపిక చేపట్టాలని ఉత్తరాంధ్ర నాయకత్వానికి సూచించారు. దీంతో పార్టీ సీనియర్లు ఉత్తరాంధ్రలో పలుచోట్ల పరీక్షా కేంద్రాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఉత్తరాంధ్ర నుంచి జనసేనకు 6వేల దరఖాస్తులు

ఉత్తరాంధ్రలో ఇప్పటి వరకు దాదాపుగా 6 వేలకుపైగా క్రీయాశీల కార్యకర్తల కోసం దరఖాస్తులు వచ్చాయి. ఇందులో విశాఖ నుంచే సగానికిపైగా దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు చేసుకున్న వారందరికీ శ్రీకాకుళం జిల్లాలోని బాపూజీ మందిరంలో ఇంటర్వ్యూలను నిర్వహించారు. విజయనగరం జిల్లాలో ఈనెల 20,21న రెండు రోజులపాటు క్రియాశీల కార్యకర్తలను ఎంపిక చేయనున్నారు. ఈనెల 19,20న విశాఖలో కూడా దరఖాస్తు చేసుకున్న వారందరికీ మూడు విభాగాల్లో పరీక్ష నిర్వహించనున్నారు.

కమ్యూనిస్టుల్లాగా బలమైన క్యాడర్‌ను నిర్మించుకునే

మొత్తానికి జనసేన పార్టీ జనసైనికులను రిక్రూట్‌ చేసుకునే పనిలో పడింది. కమ్యూనిస్టుల్లాగా బలమైన క్యాడర్‌ను నిర్మించుకునే ప్రక్రియను ప్రారంభించింది. త్వరలోనే మిగతా జిల్లాల్లోనూ పార్టీ నిర్మాణం బలోపేతం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. 

19:42 - May 18, 2017

అమరావతి: విశాఖ, విజయవాడలలో వెలుగుచూసిన హవాలా దందాల కేసులను సీఐడీకి అప్పగిస్తున్నట్టు ఏపీ హోం మినిష్టర్‌ నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. విశాఖపట్నంలో రూ.600 కోట్లకుపైగా హవాలా రూపంలో సొమ్ము తరలివెళ్లిందన్నారు. ఈ కేసులో తండ్రి, కొడుకులను అరెస్ట్‌ చేశారని చెప్పారు. అలాగే విజయవాడలో వ్యాపారిపై...డాక్టర్ల దాడి కేసులో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.  

19:40 - May 18, 2017

అమరావతి: కళాశాల విద్య పూర్తికాగానే యువతకు ఉద్యోగం అందేలా నైపుణ్యాన్ని అభివృద్ధి చేయాలన్నారు మంత్రి నారా లోకేశ్‌. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అధికారులతో లోకేశ్‌ సమీక్ష నిర్వహించారు. త్వరలో విశాఖ ఐటీ హబ్‌గా,.. రాయలసీమ మాన్యుఫాక్చరింగ్‌ హబ్‌గా మారబోతున్నాయన్నారు. ఇందుకుగాను యువతను సిద్దం చేయాలన్నారు లోకేశ్‌. 

కోమటిరెడ్డి పై జరిగిన దాడి ఓ దుస్పంఘటన: జానారెడ్డి

హైదరాబాద్: తెలంగాణ సీఎల్పీ సమావేశం ముగిసింది. నల్గొండలో కోమటిరెడ్డి పై జరిగిన దాడి ఓ దుస్పంఘటన అని దీనిని సీఎల్పీ ఖండిస్తోందని సీఎల్పీ నేతా జానారెడ్డి తెలిపారు. బత్తాయి మార్కెట్ ఏర్పాటు ఘనత కాంగ్రెస్ దే అని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమంలో ప్రోటో కాల్ పాటించలేదని, ప్రభుత్వ కార్యక్రమంలో టీఆర్ ఎస్ మీటింగ్ లు ఎలా పెడతారని ప్రశ్నించారు. ఈ ఘటనలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, వెంటనే జ్యుడీషియల్ విచారణ జరిపించాలని జానారెడ్డి డిమాండ్ చేశారు.

ముత్యం పేట్ లో రైతు సజీవదహనం

జగిత్యాల: మల్యాల మండలం ముత్యం పేట్ లో రైతు సజీవదహనం అయ్యాడు. పొలంలో ఆదిరెడ్డి అనే రైతు చెత్త కాలుస్తుండగా ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకుని రైతు మృతి చెందినట్లు సమాచారం.

పీజీ వైద్య సీట్ల పెంపుపై మధ్యంతర ఉత్తర్వులు

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో పీజీ వైద్య సీట్ల పెంపుపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన ఫీజుల ప్రకారం ప్రవేశాలు చేపట్టేందుకు కళాశాలలకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం 50 శాతం ఫీజునే విద్యార్థుల నుంచి తీసుకోవాలని, మిగతా 50 శాతం బ్యాంకు హామీతో వ్యక్తిగత పూచీకత్తు స్వీకరించాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించింది. ఫీజుల పెంపు అమలును నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం సవరించింది.

18:57 - May 18, 2017

నిజమాబాద్‌ : జిల్లా కేంద్రంలో ఆర్టీఏ కార్యాలయం.. అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారింది. ఇక్కడ సరైన సిబ్బంది లేదు. దీంతో కిందిస్థాయి సిబ్బంది ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. ఈ కార్యాలయానికి పనుల కోసం వచ్చి వెళ్లే ప్రజలు ఆవేదనకు గురవుతున్నారు.

మెరుగైన సేవలు అందిస్తామని చెప్పిన నేతలు

జిల్లా విభజన తరువాత ఈ కార్యాలయంలో తగినంత సిబ్బందిని నియమించి.. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని నేతలు చెప్పారు. ఇంతవరకూ ఈ కార్యాలయంలో సిబ్బందిని నియమించకపోగా.. ఉన్న కాస్త సిబ్బంది విధులకు రావటం లేదు. డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ అధికారి ఈ కార్యాలయానికి ఉన్నతాధికారి. కానీ ఆయన ఎప్పుడు కార్యాలయానికి వస్తాడో.. ఎప్పుడు వెళ్తాడో ఎవ్వరికీ తెలియదు. ఇప్పటికీ ఆఫీస్‌ సూపరింటెండెంట్ పోస్టు ఖాళీగానే ఉంది.

ఇంచార్జ్‌ అధికారిగా వ్యవహరిస్తున్న మోటార్‌ వెహికిల్ ఇన్స్పెక్టర్

మోటార్‌ వెహికిల్ ఇన్స్పెక్టర్ ఈ కార్యాలయంలో ఇంఛార్జ్‌ అధికారిగా వ్యవహరిస్తున్నారు. దీంతో అదనపు పని భారం ఆయనపై పడుతోంది. ఈ కార్యాలయంలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉండటంతో.. వివిధ పనుల కోసం కార్యాలయానికి వచ్చే వారికి ఇబ్బందులు తప్పటం లేదు. అయితే కొత్త వాహనం కొన్న తరువాత ఆ వాహనాన్ని రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి తీసుకు వచ్చి రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. వాహనాల ఫిట్‌నెస్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కావాలన్నా ఈ కార్యాలయానికి రావాల్సిందే. కానీ ఇక్కడ సిబ్బంది లేరు. దీంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోతున్నాయి.

లైసెన్స్‌లు లేవని జరిమానాలు విధిస్తున్న ట్రాఫిక్ పోలీసులు

గత వారం రోజుల కిత్రం ఇక్కడ ప్రింటర్ చెడిపోయింది. స్టేషనరీ కొరత కూడా తీవ్రంగా ఉంది. కానీ ఇక్కడ అడిగేవారు లేరు. ట్రాఫిక్ పోలీసులు వాహనాలకు రిజిస్ట్రేషన్‌ లేదని డ్రైవింగ్ లైసెన్స్‌ లేదని జరిమానాలు విధిస్తున్నారు. దీంతో వాహనదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆర్టీవో కార్యాలయానికి వెళ్లితే అక్కడ సిబ్బది లేరు. తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన చెందుతున్నారు.

వాహనాలకు రిజిస్ట్రేషన్‌ చేయని అధికారులు

గత వారం రోజులుగా కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్‌ చేయటం లేదు. కొత్తగా లైసెన్స్‌లు మంజూరు చేయడం లేదు. ఆర్‌.సి లైసెన్స్‌ ఇచ్చే ప్రింటర్‌ చెడిపోయింది. కార్డులకు సంబంధించిన స్టేషనరీ లేదు. దీంతో ఈ కార్యాలయం పరిస్థితి దారుణంగా ఉంది. ప్రభుత్వానికి అధికంగా రెవెన్యూ తీసుకొని వచ్చే శాఖలలో ఆర్టీఏ కార్యాలయం ఒకటి.. కానీ ఇలాంటి కార్యాలయంలోనే పరిస్థితి ఇలా ఉంటే తాలూకాలో ఉండే కార్యాలయంలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఊహించవచ్చు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కార్యాలయాలకు వచ్చే వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు. 

18:57 - May 18, 2017

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలకు సాధ్యం కానీ హామీలను ఇచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారని కరీంనగర్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు. మానేరు రివర్ ఫ్రంట్‌ పేరుతో సీఎం, మంత్రి ఈటెల రాజేందర్‌లు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారారిని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. 

18:55 - May 18, 2017

హైదరాబాద్: ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అలజడి సృష్టించడం ద్వారా తాను హీరో అనిపించుకోవాలని ప్రయత్నించి విలన్‌గా మారాడని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఏద్దేవా చేశారు. బత్తాయి మార్కెట్‌ శంకుస్థాపనను చెడగొట్టడానికే కోమటిరెడ్డి ...జన సమీకరణ చేసి అరాచకం చేశాడని విమర్శించారు.  

18:54 - May 18, 2017

హైదరాబాద్: బంగారు తెలంగాణ సాధించాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి అనుగుణంగా కొత్త పథకాలు, ప్రాజెక్టులను ప్రారంభిస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో వీటిని అమలు చేసేందుకు అధికార యంత్రాంగం లేక పాలకులు అల్లాడుతున్నారు. బంగారు తెలంగాణ లక్ష్య సాధనకు తూట్లు పడుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పాలకులు తీసుకునే నిర్ణయాల అమలు బాధ్యత అధికారులదే

ప్రభుత్వ పాలనలో కార్యనిర్వాహక వర్గానిదే కీలకపాత్ర. పాలకులు తీసుకునే నిర్ణయాలను అమలు చేసే బాధ్యత అధికార యంత్రానిదే. ప్రభుత్వ పథకాలు అమల్లో వీరిదే ముఖ్య భూమిక. దిగువ స్థాయిలో అటెండర్‌ నుంచి కార్యనిర్వాహక వర్గం అధిపతిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకు ఎవరి బాధ్యతలు వారికి ఉన్నాయి. అందరూ సమన్వయంతో పని చేస్తేనే ఫలితాలు వస్తాయి. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరతాయి. ప్రాజెక్టులు అమలవుతాయి. కానీ తెలంగాణ పాలన ఇందుకు విరుద్ధంగా సాగుతోంది. అధికారుల కొరతతో పాలన కుంటుపడుతోంది.

ఆసరా పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబాకర్‌...

పథకాలు, ప్రాజెక్టులు పెరుగుతున్న విధంగా అధికారులు పెరగడంలేదు. ఆసరా పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబాకర్‌, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు..ఇలా పథకాలన్నీ ప్రజలతో ముడిపడి ఉన్నవే. వీటి అమల్లో రెవెన్యూ యంత్రాంగానిదే కీలక బాధ్యత. అటువంటి రెవెన్యూ శాఖలో గ్రామ స్థాయిలో గ్రామ పరిపాలనాధికారి, గ్రామ రెవెన్యూ అధికారి నుంచి రాష్ట్ర స్థాయిలో భూ పరిపాలన శాఖ ప్రధాన కమిషనర్‌ వరకు చాలా ఖాళీలు ఉన్నాయి. సీసీఎల్‌ఏ లేకపోవడంతో ఈ బాధ్యతలను కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ సింగ్‌ చూస్తున్నారు. దీంతో రెవెన్యూ వ్యవస్థలో పాలన అస్తవ్యస్తంగా మారిందని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.

ఐఏఎస్‌లలో జూనియర్లకు పదోన్నతి కల్పించి కలెక్టర్లుగా నియామకం

గత ఏడాది అక్టోబర్‌లో తెలంగాణలో కొత్తగా 21 జిల్లాలను ఏర్పాటు చేశారు. ఐఏఎస్‌ అధికారుల్లో జూనియర్లకు పదోన్నతి కల్పించి, జిల్లా కలెక్టర్లుగా నియమించారు. వీరికి సరైన పరిపాలన అనుభవం లేకపోవడంతో ప్రభుత్వ పథకాల అమల్లో సమస్యలు ఎదురవుతున్నాయని సచివాలయ అధికారులు చెబుతున్నారు. అనుభవంలేని ఐఏఎస్‌లను కలెక్టర్లుగా నియమించడంతో ఉద్యోగులు, వీరికి మధ్య సమన్యయం ఉండటంలేదంటున్నారు. ప్రభుత్వ ఆదేశాలను వెంటనే అమలు చేయాలని చెబుతున్న కలెక్టర్లు, వీకిటి సంబంధించిన మార్గదర్శకాలు గురించి అడిగే తెలియదని చెప్పే పరిస్థితి ఉంది. దీంతో అటు అధికారులు, ఉద్యోగులు, ఇటు జిల్లా కలెక్టర్ల మధ్య అంతరం పెరుగుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో పథకాల అమల్లో జాప్యం జరుగుతోందని ఉద్యోగ సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోరిన 30 మంది ఐఏఎస్‌ అధికారులను కేంద్రం మంజూరు చేస్తే ఇలాంటి పరిస్థితులు ఉండవంటున్నారు.

ఐఏఎస్‌లపై పెరుగుతున్న పని ఒత్తిడి....

ఒక్కో ఐఏఎస్‌ అధికారి రెండు నుంచి మూడేసి శాఖల బాధ్యత చూడాల్సి వస్తోంది. దీంతో పని ఒత్తిడి పెరుగుతోంది. ఏ శాఖపైనా ప్రత్యేకంగా దృష్టిపెట్టే అవకాశంలేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 27 విభాగాలకు అధిపతులు లేరు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ కూడా సీసీఎల్‌ఏతోపాటు, పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో సీఎస్‌ కూడా ఊపిరిసల్పని పని ఒత్తిడితో సతమతమవుతున్నారు. తెలంగాణ కేడర్‌ నుంచి కేంద్ర సర్వీసుకు వెళ్లిన ఐఎస్‌ఎస్‌ అధికారులను వెనక్కి రప్పించినా కొంత వరకు అధికారులపై పనిభారం తగ్గే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ప్రభుత్వ పాలనలో ముఖ్య భూమిక నిర్వహించే ఐఏఎస్‌ అధికారుల కొరత తీరాలంటే మరో రెండేళ్లు పట్టొచ్చు. అప్పటి వరకు ఆగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే ప్రభుత్వ పథకాలు సజావుగా సకాలంలో అమలు కావడంతోపాటు, ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని ఉద్యోగ సంఘాల నేతలు సూచిస్తున్నారు. ఈ దిశగా ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

18:53 - May 18, 2017
18:52 - May 18, 2017
17:00 - May 18, 2017

హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లా పల్లెర్లకు చెందిన నరేశ్‌ అదృశ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. నరేశ్‌ అచూకీ తెలసుకుని కోర్టులో హాజరుపరచాలని తెలంగాణ డీజీపీ అనురాగ్‌ శర్మను బెంచ్‌ ఆదేశించింది. నరేశ్‌ను వెతికే బాధ్యతలను ప్రత్యేక అధికారికి అప్పగించాలని చెప్పింది. యాదాద్రి జిల్లా ఆత్మకూరుకు చెందిన నరేశ్‌... అదే గ్రామంలోని వేరే కులానికి చెందిన స్వాతిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ముంబైలో నరేశ్‌ స్నేహితులు వీరిద్దరికీ వివాహం చేశారు. ఆ తర్వాత భువనగిరి వచ్చిన నరేశ్‌ గత నెల 2 నుంచి కనిపించకుండా పోయాడు.. పోలీసులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోవడం లేదంటూ నరేశ్‌ తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. ఇదే అంశంపై '10టివి'లో చర్చను చేపట్టింది. ఈ చర్చడలో నరేశ్ తల్లిదండ్రులు వెంకటయ్య, ఇందర, ఎంబీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆశయ్య పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈవీడియోను క్లిక్ చేయండి..

కుల్ భూషణ్ యాదవ్ ఇంటి వద్ద సంబరాలు..

మహారాష్ట్ర : కుల్ భూషణ్ యాదవ్ ఇంటి వద్ద సంబరాలు జరుపుకుంటున్నారు. మరణశిక్షను తాత్కాలికంగా రద్దు చేయాలని, తుది తీర్పు వెలువడే వరకు శిక్షను అమలు చేయవద్దన ఐసీజే కొద్దిసేపటి క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే.

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

ముంబై : స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 223 పాయింట్లు నష్టపోయి 30,434 వద్ద..నిఫ్టీ 96 పాయింట్లు నష్టపోయి 9,429 వద్ద నష్టాల్లో ముగిశాయి.

హర్షవర్ధన్ కు అదనపు బాధ్యతలు..

ఢిల్లీ : కేంద్ర మంత్రి హర్షవర్ధన్ కు అదనపు బాధ్యతలను అప్పచెప్పారు. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న హర్షవర్ధన్ కు పర్యావరణ..అటవీ శాఖను అదనపు బాధ్యతగా అప్పగించారు. కేంద్ర అటవీ శాఖ మంత్రి అనిల్ మాధవ్ దవే హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే.

 

16:28 - May 18, 2017

హైదరాబాద్: ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ రోడ్డు ప్రమాదంపై.. బెంజ్‌ కంపెనీ విచారణ చేయనుంది. ఈ విషయమై జర్మనీ నుంచి బెంజ్‌ ప్రతినిధులు హైదరాబాద్‌కు వచ్చారు. ప్రమాదం జరిగిన చోటును బెంజ్‌ ప్రతినిధులు పరిశీలించారు. కారును షెడ్‌కు తరలించి.. అందుకు గల కారణాలను పరిశీలిస్తున్నారు. కారులోని బెలూన్స్‌ ఎందుకు తెరుచుకోలేదు, ఇంజన్‌లో లోపాలున్నాయా అని గమనించనున్నారు. పూర్తి విచారణ చేసి రేపు జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో రిపోర్టు అందించనున్నారు. కుదిరితే బెంజ్‌కంపెనీకి కూడా రిపోర్టు అందిస్తామని తెలిపారు. 

16:27 - May 18, 2017

హైదరాబాద్: సింగరేణి ని ప్రైవేటు కంపెనీలకు అప్పజెప్పవద్దని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి సూచించారు. సింగరేణి లో ప్రైవేటు భాగస్వామ్యానికి సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి రాకముందు ఒకలాగా, వచ్చాక మరోలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సహజ వనరుల్ని తిరిగి కార్పొరేట్ శక్తులకు వశం చేయడం దారుణం అన్నారు. దీంతో ఉద్యోగాలు ఊడిపోయే పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అహంభావ పూరిత వ్యవహారాన్ని మానుకోవాలని హెచ్చరించారు. 

16:09 - May 18, 2017

హైదరాబాద్: మాజీ నేవీ అధికారి కుల్‌ భూషణ్‌ జాదవ్‌ కు పాకిస్థాన్ ఆర్మీ కోర్టు విధించిన మరణ శిక్షణ ను అంతర్జాతీయ న్యాయస్థానంలో స్టే విధించింది. అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానంలో ఈ రోజు మధ్యంతర తీర్పు వెలువ‌డింది. 'ది హేగ్' ‌నగరంలోని అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానంలో ఈ తీర్పును 11 మంది న్యాయ‌మూర్తుల ధ‌ర్మాస‌నం వెల్ల‌డించింది. కుల్‌భూష‌ణ్ జాద‌వ్ కేసు అంశంపై పాకిస్థాన్ చేస్తోన్న వాదనలు సరికావని అంతర్జాతీయ న్యాయస్థానం అధ్యక్షుడు రోన్నే అన్నారు. వియన్నా ఒప్పందం ప్రకారం కుల్‌భూష‌ణ్ జాద‌వ్‌ను క‌లిసే హ‌క్కు భార‌త్‌కు ఉంద‌ని తెలిపారు. వియన్నా ఒప్పందంపై భారత్, పాకిస్థాన్ భాగస్వాములని ఆయన గుర్తు చేశారు. ఈ కేసు అంతర్జాతీయ న్యాయస్థానం పరిధిలోకి రాదన్న పాకిస్థాన్ వాదనను తాము తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. పాకిస్థాన్ లో జాదవ్ ను కలుసుకునేందుకు భారత దౌత్య అధికారులకు అనుమతి ఇవ్వాలని తెలిపారు. తమ నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు స్టే కొనసాగుతుందని చెప్పారు.

అంతర్జాతీయ కోర్టు లో భారత్ విజయం.

ఢిల్లీ : అంతర్జాతీయ కోర్టు లో భారత్ విజయం సాధించింది. కుల్ భూషణ్ మరణశిక్షను తాత్కాలికంగా ఐసీజే నిలిపివేసింది. తుది తీర్పు వెలువడే వరకు శిక్షను అమలు చేయవద్దని ఆదేశించింది. కుల్ భూషణ్ భారతీయుడని ఇరు దేశాలు అంగీకరించాయని ఐసీజే జడ్జి వ్యాఖ్యానించారు. వియన్నా ఒప్పదం ప్రకారం జాదవ్ ను కలుసుకొనే హక్కు భారత్ కు ఉందని, కుల్ భూషణ్ ను అరెస్టు చేసిన పరిస్థితులు వివాదాస్పదంగా ఉన్నాయన్నారు.

 

15:56 - May 18, 2017
15:40 - May 18, 2017

అనంతపురం : జిల్లాలోని డీ హీరేహల్ మండలం తమ్మేపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లికి వెళ్లి వస్తూ ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు, మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరిలించారు. ప్రమాదం జరిగినడప్పుడు ట్రాక్టర్ లో 14 మంది ప్రయాణిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

15:38 - May 18, 2017

హైదరాబాద్: బయోమెట్రిక్‌ విధానం అమల్లో మూడు అడుగులు ముందుకు...రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా తయారైంది బల్దియా అధికారుల పరిస్థితి. ఈ విధానాన్ని అమలు చేసేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. హైదరాబాద్‌లో 19 వేల మంది పారిశుధ్య కార్మికులు ఉన్నారు. జీహెచ్‌ఎంసీ వీరికి ఏడాదికి 350 కోట్లు ఖర్చు చేస్తుంది. అయితే కార్మికులు రెగ్యులర్‌గా వచ్చి విధులు నిర్వహించేలా.. బయోమెట్రిక్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ యంత్రాల సమీకరణ, మెయింటెనెన్స్‌కు అనలాజిక్స్‌ సంస్థతో మూడేళ్ల కోసం ఒప్పందం కూడా చేసుకుంది. అందుకోసం ప్రతి ఏటా కోటి 70 లక్షలు చెల్లించాలని నిర్ణయించారు.

బయోమెట్రిక్‌ విధానానికి అడ్డుతగులుతున్న ఎస్‌ఎఫ్‌ఏలు

అయితే బయోమెట్రిక్‌ విధానాన్ని ప్రవేశపెట్టి మూడు నెలలు కావస్తున్నా.. ఫలితం మాత్రం కనిపించడం లేదు. పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. కొన్ని బయోమెట్రిక్‌ మిషన్లు మొరాయిస్తుంటే... మరికొన్నిచోట్ల క్షేత్ర స్థాయిలో పనిచేసే ఎస్‌ఎఫ్ఏలే బయోమెట్రిక్‌ అమలుకు అడ్డు తగులుతున్నారు. వివిధ సమస్యలు సృష్టిస్తూ హాజరు తీసుకోవడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఒకరి మిషన్‌తో మరొకరు హాజరు వేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. అలాగే హాజరు తీసుకునే క్రమంలో కార్మికులను ఇబ్బందులు పెడుతున్నారు. బయోమెట్రిక్‌ వద్దు అనేలా కార్మికులతో చెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.

అరకొరగా అమలవుతున్న చోట బయటపడ్డ నిజాలు

ఇదిలా ఉండగా కొన్ని చోట్ల అమలవుతున్న బయోమెట్రిక్‌ విధానంతో కార్మికుల హాజరుపై కొన్ని నిజాలు బయటకి వచ్చాయి. ఈ లెక్కల ప్రకారం ...19 వేల మందిలో... 2 వేల 700 మంది వారాంతపు సెలవులో ఉండగా 16వేల 300 మంది విధుల్లో ఉండాలి. కానీ 13 వేల మంది కూడా విధుల్లో ఉండడం లేదని బయోమెట్రిక్ ద్వారా బయటపడింది. ఇప్పటి వరకు వచ్చిన వివరాల ప్రకారం ఉదయం మూడు వేల మంది గైర్హాజరు అవుతుండగా...మధ్యాహ్నానికి మరో 500 మంది కూడా విధులకు దూరంగా ఉంటున్నారు.

బయోమెట్రిక్‌ విధానం సక్రమంగా అమలైతే..

ఇలా ప్రతిఏడాది గైర్హాజరవుతున్న కార్మికుల వేతనాలన్నీ పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బయోమెట్రిక్‌ విధానం సక్రమంగా అమలైతే.. బల్దియా ఖజానాకు ఏటా 63 కోట్లు లబ్ధిచేకూరుతుంది. లేదా అందరూ విధుల్లోకి వస్తే సిటీలో శానిటేషన్‌ మెరుగవుతుంది. ఈ అంశాలపై బల్దియా ఉన్నతాధికారులు స్టడీ చేస్తున్నారు. ఎప్పుడు హాజరైతే అప్పుడే... వేతనం చెల్లించేలా ప్లాన్‌ చేస్తున్నారు.   

పెద్ద మొత్తంలో విదేశీ మద్యం స్వాధీనం..

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో విదేశీ మద్యం మాఫియా గుట్టు బయటపడింది. డ్యూటీ ఫ్రీ షాపులపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. పెద్ద మొత్తంలో పన్ను చెల్లించని విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

15:33 - May 18, 2017

వరంగల్‌ : నగరంలో పసుపు రైతులు ఆందోళనకు దిగారు. పసుపు కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ పరిపాలన భవనాన్ని ముట్టడించారు. మార్కెట్‌ అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. దీంతో పెద్దెఎత్తున పోలీసులు అక్కడకు చేరుకున్నారు. కాగా పసుపు కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకుంటామని చైర్మన్‌ ధర్మరాజు రైతులకు హామీ ఇచ్చారు. ఈ మేరకు రైతులు ఆందోళన విరమించారు. 

చెన్నైలో భారీగా పట్టుబడిన పాతనోట్లు..

చెన్నై : ఓ వస్త్ర దుకాణంలో రద్దయిన నోట్లు భారీగా పట్టుబడడం కలకలం రేపుతోంది. స్వాధీనం చేసుకున్న నోట్లు రూ. 45 కోట్లు ఉన్నాయని తెలుస్తోంది.

దవేకు స్పీకర్..మోడీ నివాళులు..

ఢిల్లీ : కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అనిల్ మాధవ్ దవేకు ఉపరాష్ట్రపతి హామీద్ అన్సారీ, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహజన్, ఉ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీలు నివాళులర్పించారు. వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు.

15:18 - May 18, 2017

ఎక్కడైనా రోడ్డుపై వెండి గోళీలు కనబడితే ఏం చేస్తారు.. ? ఇంకే చేస్తాం చక్కగా ఏరుకుని జేబులో వేసుకుంటాం..అంటారా..ఇలాగే చేశారు. ఓ ప్రాంతలోని రోడ్డుపై వెండి గోళీలు పడడంతో వాటిని ఏరుకొనేందుకు జనాలు తండోపతండాలుగా రావడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ట్రాఫిక్ ను క్లియర్ చేయలేక పోలీసులకు తల ప్రాణం తోకకొచ్చింది. ఈఘటన పశ్చిమ బెంగాల్ లోని భాంగర్ లో చోటు చేసుకుంది. మే 16వ తేదీ ఉదయం ఓ వ్యాపారి ద్విచక్రవాహనంపై ఐదు కిలోల వెండి గోళీలున్న బ్యాగును తీసుకెళుతున్నాడు. హఠాత్తుగా ఆ బ్యాగుకు రంధ్రం పడిపోవడం..వెండి గోళీలు రోడ్డుపై పడిపోవడం జరిగిపోయాయి. అక్కడనే ఉన్న స్థానికులు దీనిని గమనించి వెండి గోళీలను తీసుకొనేందుకు పరుగులు తీశారు. దీనితో ట్రాఫిక్ స్తంభించింది. విషయం తెలుసుకున్న వ్యాపారి వెనక్కి తిరిగి వచ్చాడు. కానీ అప్పటికే ప్రజలు వెండి గోళీలను తీసుకుని వెళ్లిపోయారు. 2 లక్షల 25 వేల రూపాయల సొమ్ము నేలపాలు కావడంతో ఆ వ్యాపారి లబోదిబోమన్నాడంట. ఎవరెవరు, ఎంత వెండి తీసుకెళ్లారో కనుక్కొని, తిరిగి స్వాధీనం చేసుకోవడం పోలీసులకు కష్టమైన పనే. పోలీసులు 300 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకోగలిగారు.

15:07 - May 18, 2017

వర్షాలు పడాలంటూ ఓ యువకుడు ఏకంగా ముళ్ల చెట్టుపై పడుకున్నాడు. ఏకంగా నాలుగు రోజుల పాటు పడుకుని కఠోర దీక్ష చేస్తున్నాడు. ఈ ఘటన కర్ణాటక బెళగావిలో చోటు చేసుకుంది. బెళగావిలో అత్యంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. రెండేళ్ల నుండి వర్షాలు లేకపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. జంభావి అనే గ్రామానికి చెందిన సదాశివ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. వరుణుడి కోసం పూజలు..యాగాలు చేయకుండా ఏకంగా ముళ్ల చెట్టుపై పడుకునేందుకు నిర్ణయం తీసుకున్నాడు. నాలుగు రోజులూ జుల్లి ఫ్లోర ముళ్ల చెట్టుపై పడుకుని దీక్ష చేపట్టాడు. ఈ విషయం పోలీసులకు చేరింది. రంగంలోకి దిగిన పోలీసులు ముళ్ల చెట్టుపై పడుకుంటున్న అతడిని కిందకు దించారు. కానీ అక్కడి గ్రామస్తులు మాత్రం సదాశివకు మహిళలున్నాయని పేర్కొంటున్నారు.

కొద్దిగంటల్లో కుల్ భూషణ్ తీర్పు..

ఢిల్లీ : భారత నేవీ మాజీ అధికారి కుల్ భూషణ్ పై కొద్దిగంటల్లో తీర్పు వెలువడనుంది. పదహారు మంది న్యాయమూర్తులతో కూడిన ఐసీజే ధర్మాసనం నేటి మధ్యాహ్నం మూడున్నర గంటలకు తీర్పును వెలువరించనున్నట్టు ప్రకటించింది. హేగ్ లోని పీస్ ప్యాలెస్ లో న్యాయస్థానం అధ్యక్సుడు రోన్నే అబ్రహాం తీర్పు చదువనున్నారు.

 

నాలుగో రోజు అభిమానులతో రజనీ..

చెన్నై : తమిళ సూపర్ స్టార్ వరుసగా నాలుగో రోజు అభిమానులతో భేటీ అయ్యారు. కోడంబాక్కంలోని రాఘవేంద్ర వెడ్డింగ్ హాల్ లో ఈ భేటీ జరుగుతోంది. ఈ రోజు కూడా అభిమానులతో ఫొటోలు దిగారు.

షాక్ కు గురయ్యాం - అమీర్ ఖాన్..

ముంబై : బాలీవుడ్ నటి రీమాలగూ మృతి చెందడంపై తాము షాక్ కు గురయ్యామని బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ పేర్కొన్నారు. ఆమె మృతికి నివాళులర్పించారు.

'కార్పొరేట్ సంస్థలకు లాభాలు..పేదలపై భారాలు'

హైదరాబాద్ : కార్పొరేట్ సంస్థలకు లాభాలు..పేదలపై భారాలు మోపుతోందని కేంద్ర ప్రభుత్వంపై సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శలు గుప్పించారు. బ్యాంకుల మొండిబకాయిలు 11 లక్షల కోట్లకు చేరాయని, విజయ్ మాల్యాను రప్పించడంలో ప్రభుత్వం విఫలం చెందిందని, గో సంరక్షణ పేరిట దళితులపై దాడులు అధికమయ్యాయన్నారు. కాశ్మీర్ లో బీజేపీ విధానాలు పూర్తిగా విఫలం చెందాయని, అక్కడ పరిస్థితి పూర్తిగా అదుపు తప్పిందన్నారు. సెక్యులర్, సోషల్ శక్తులను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు, ప్రతిపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెట్టేందుకు ఇతర పార్టీలతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు.

14:25 - May 18, 2017

హైదరాబాద్: మోదీ పాలనలో ఆర్థిక అసమానతలు మరింత పెరిగాయని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి ఆరోపించారు. ఆయన హైదరాబాద్ ఎంబీ భవన్ లో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశాలకు హాజరయ్యి ప్రసంగించారు. ఆయన మాటల్లో 'మోదీ పాలనలో ధనికులు మరింత లాభపడుతున్నారని, పేదల పరిస్థితి దిగజారింది. మోదీ ప్రభుత్వం వచ్చాక ఏడాదికి 12 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎడ్యుకేషన్, ఎంప్లాయిమెంట్, పారిశ్రామిక రంగం దెబ్బతిన్నాయి. సర్జికల్ స్ట్రైక్ తరువాత కశ్మీర్ లో ఆర్మీపై దాడులు పెరిగాయి. బిజెపి విదేశాంగ విధానం పూర్తిగా విఫలం అయ్యింది. బిజెపి పాలనలో దేశ అంతర్గత భద్రత ప్రమాదంలో పడింది. కార్పొరేట్ సంస్థలకు లాభాలు, ప్రజలపై భారాలు మోపుతున్నారు. బ్యాంకులు మొండిబకాయిలు 11 లక్షల కోట్లకు చేరాయి. విజయ్ మాల్యాను రప్పించడంలో ప్రభుత్వం విఫలం అయ్యింది. గో సంరక్షణ పేరుతో దళితులపై దాడులు పెరుగుతున్నాయి. దేశ సమైక్యతకు ప్రమాదం వాటిల్లుతోంది' అని పేర్కొన్నారు.

 

12వేల మంది రైతుల ఆత్మహత్యలు - ఏచూరి..

హైదరాబాద్ : మోడీ ప్రభుత్వం వచ్చాక ఏడాదికి 12వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. ఎంబీ భవన్ లో జరుగుతున్న సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు అధికంగా జరుగుతున్నాయని, ప్రజల్లో ఆర్థిక భారాలు పెరుగుతున్నాయని, 2014కంటే ముందు ఇండ్రస్ట్రీ గ్రోత్ 6 శాతం ఉంటే తరువాత 2.75 శాతానికి పడిపోయిందని తెలిపారు.

ఎనుమాముల మార్కెట్ లో రైతుల ఆందోళన..

వరంగల్ : ఎనుమాముల మార్కెట్ లో రైతులు ఆందోళన చేపట్టారు. వ్యవసాయ మార్కెట్ పరిపాలన భవన్ ను రైతులు ముట్టడించారు. పసుపు కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు.

13:42 - May 18, 2017

అనంతపురం : జిల్లాలోని డీ హీరేహల్ మండలం తమ్మేపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లికి వెళ్లి వస్తూ ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు, మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరిలించారు. ప్రమాదం జరిగినడప్పుడు ట్రాక్టర్ లో 14 మంది ప్రయాణిస్తున్నారు.

 

13:40 - May 18, 2017

గుంటూరు : జిల్లాలో బుడంపాడు జాతీయ రహదారిపై మిర్చి లారీ దగ్ధం అయింది. లారీకి విద్యుత్ తీగలు తగలడంతో క్షణాల్లో మంటలు అంటుకున్నాయి. మంటల్లో మిర్చి కాలిబూడిదైయింది. డ్రైవర్ చాకచక్యంతో లారీని ప్రక్క అపడంతో ప్రమాదం తప్పింది. లారీ నుంచి మంటలు రావడంతో రహదారిపై వెళ్లేవారు ఆందోళన చెందారు. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు.

 

13:26 - May 18, 2017

హైదరాబాద్ : యాదాద్రి జిల్లా పల్లెర్లకు చెందిన నరేష్ అదృశ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. నరేష్ ఆచూకీ తెలుసుకొని కోర్టులో హాజరుపరచాలని డీజీపీని కోర్టు ఆదేశించింది. నరేష్ ను వెతికే బాధ్యతను ప్రత్యేక అధికారికి అప్పగించాలని హైకోర్టు సూచించింది. స్వాతి తండ్రిని అన్ని కోణాల్లో విచారించారా..? అని బెంచ్ ప్రశ్నించింది. నరేష్ అదృశ్యం వెనుక స్వాతి వాదానలు విన్న నరేష్ కనిపించకుండాపోతే పోలీసులు ఎం చేశారని ప్రశ్నించింది. నరేష్ అదృశ్యం వెనుక స్వాతి తండ్రి ప్రమేయంపై పోలీసుల దర్యాప్తు జరుగుతోందని న్యాయవాది శరత్ తెలిపారు. గత మార్చి 25 స్వాతి, నరేష్ పెళ్లి చేసుకున్నారు. మే 2న స్వాతిని ఆమె తండ్రి శ్రీనివాసరెడ్డి పుట్టింటి తీసుకొచ్చాడు. ఆ తర్వాత నుంచి నరేష్ అదృశ్యం అయ్యాడు. దీని పై పోలీసుల స్పందిచకపోవడంతో నరేష్ తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. 

మిర్చి లారీ దగ్ధం..

గుంటూరు : బుడంపాడు సమీపంలో మిర్చి లోడుతో వెళుతున్న లారీ అగ్నిప్రమాదానికి గురైంది. విద్యుత్ తీగలు అంటుకోవడంతో మంటలు అంటుకుని మిర్చి అగ్నికి ఆహుతైంది.

12:58 - May 18, 2017

విజయవాడ : కృష్ణా, గోదావరి డెల్టాల్లో అక్రమంగా తవ్విన రొయ్యల చెరువుల ధ్వంసానికి సీపీఎం ఉద్యమం చేపట్టింది. ఇవాళ్టి నుంచి పది రోజులపాటు జీపు జాతాలు నిర్వహిస్తోంది. జనం నెత్తిన ఆక్వా పిడుగు పేరుతో సీపీఎం ప్రచురించిన పుస్తకాన్ని మధు ఆవిష్కరించారు. చట్ట విరుద్ధంగా తవ్విన రొయ్యల చెరువులతో ప్రజారోగ్యం, పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతోందని సోదాహరణంగా గణాంకాలతో సహా ఈ పుస్తకంలో వివరించారు. సముద్ర మట్టం నుంచి రెండు కిలోమీటర్ల లోపే రొయ్యల చెరువులను తవ్వాలన్న నిబంధనలు ఉన్నాయి. అయితే యాభై నుంచి వంద కిలో మీటర్ల వరకు కూడా రొయ్యల చెరువులును తవ్వుతున్న విషయాన్ని జనం నెత్తిన ఆక్వా పిడుగు పుస్తకంలో వివరించారు. అక్రమంగా రొయ్యల చెరువుల తవ్వకానికి ముఖ్యమంత్రి చంద్రబాబును బాధ్యుణ్ని చేస్తూ కేసు వేయాలని సీపీఎం నిర్ణయించింది.

12:55 - May 18, 2017

మహబూబ్ నగర్ : జిల్లా రాజకీయ విలక్షణతకు మారు పేరు. ప్రజా తీర్పు ఎప్పుడూ విలక్షణంగా, ఏకపక్షంగా ఉంటుంది. 2014 ఎన్నికల్లో ఏడుగురు టీఆర్‌స్‌ ఎమ్మెల్యేలు, ఎంపీని గెలిపించుకున్నారు. ఎన్నికల తర్వాత నారాయణపేట టీడీపీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, మఖ్తల్‌ ఎమ్మెల్య చిట్టెం రామ్మోహన్‌రెడ్డి గులాబీ గూటికి చేరడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఇంత మంది శాసనసభ్యులు ఉన్నా జిల్లాలో టీఆర్‌ఎస్‌కు సొంత కార్యాలయంలేని లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.

బలపడుతున్న టీఆర్ఎస్
పాలమూరు జిల్లాలో టీఆర్‌ఎస్‌ బలపడుతోంది. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు జిల్లా కేంద్రంలో సొంత కార్యాలయాలు ఉన్నాయి. కాంగ్రెస్‌, టీడీపీకి సొంతగా పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నాయి. సీపీఎం, సీపీఐలకు సొంత భవనాలు ఉన్నాయి. ఇటీవలే బీజేపీ కూడా సొంతంగా భవనాన్ని నిర్మించుకుంది. ప్రతిపక్ష పార్టీల నేతలు సొంత భవాల్లో కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నా... అధికార టీఆర్‌ఎస్‌ నేతలు మాత్రం ఇందుకు భిన్నం. పార్టీ ప్రజా ప్రతినిధులు జిల్లా కేంద్రానికి వస్తే కనీసం కూర్చునేందుకు అవకాశం లేదు. పార్టీ కార్యాలయం కోసం ఓ భవాన్ని కూడా అద్దెకు తీసుకోలేదు. దీంతో రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహమే దిక్కవుతోంది. పార్టీ సమావేశాల నుంచి నేతల సమాలోచనల వరకు అన్నీ ఇక్కడే జరుగుతున్నాయి. అధికార పార్టీకి సొంత కార్యాలయం లేకపోవడం ఇబ్బందిగా మారిందని నేతలు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానం నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం జీతేందర్‌రెడ్డి ఎంపీగా ఉన్నారు. ఇద్దరూ కూడా సొంత పార్టీ కార్యాయలం ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ నేటికీ నెరవేరకపోవడంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు నిట్టూర్చుకుంటున్నారు. 2019 ఎన్నికల లోపైనా టీఆర్‌ఎస్‌కు సొంత కార్యాలయ భవనం నిర్మాణంపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.

 

12:50 - May 18, 2017

రోజురోజుకి మహిళల మీద హింస పెచ్చరిల్లుతుంది. న్యాయం కోసం వెళ్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి ధైర్యం చాలదు. బాధితులు తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో...న్యాయం కోసం ఎవరిని ఆశ్రయించాలో అనే ప్రశ్నలు వెంటాడుతుంటాయి. ఇలాంటి వారి కోసం అవిర్భావించిందే ''భరోసా''హెల్ప్ లైన్ పై నేటి 'ఫోకస్' పూర్తి వివరాల కోసం వీడియో చూడండి.

 

పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తా ఇద్దరు మృతి..

అనంతపురం : డి.హిరేహాళ్ (మం) తమ్మేపల్లి వద్ద పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. 8మందికి గాయాలయ్యాయి.

హైకోర్టులో నరేష్ మిస్సింగ్ కేసు విచారణ..

యాదాద్రి : పల్లెర్లకు చెందిన నరేష్ అదృశ్యం..స్వాతి ఆత్మహత్యపై నెలకొన్న అనుమానాలపై హైకోర్టులో విచారణ జరిగింది. నరేష్ జాడ కనిపెట్టి హాజరు పరచాలని డీజీపీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

12:12 - May 18, 2017

సీఐ గంగారంపై విచారణకు సీపీ ఆదేశం..

హైదరాబాద్ : కల్తీ పాల వ్యవహారం కేసులో మంచాల సీఐ గంగారంపై విచారణకు సీపీ ఆదేశాలు జారీ చేశారు. విచారణ అధికారిగా ఇబ్రహింపట్నం ఏసీపీని నియమించారు. ప్రధాన నిందితుడిని తప్పించేందుకు సీఐ గంగారం యత్నించారని ఆరోపణలున్నాయి.

‘జనం నెత్తిన ఆక్వా పిడుగు' పుస్తకావిష్కరణ..

విజయవాడ : ‘జనం నెత్తిన ఆక్వా పిడుగు' పుస్తకాన్ని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆవిష్కరించారు. 22 దేశాల్లో ఆక్వా సాగుని నిషేధించినా ఏపీలో విచ్చలవిడిగా సీఎం చంద్రబాబు ప్రోత్సాహిస్తున్నారని, కృష్ణా..గోదావరి డెల్టాలో రొయ్యల చెరువులను రైతులు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఆక్వా పరిశ్రమను వెనకేసుకొస్తున్న సీఎంపై కేసు పెడుతామని, సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపడం రాజ్యాంగ ఉల్లంఘననేనని తెలిపారు. అధికార పార్టీ అండదండలతోనే హవాలా మాఫియా నడుస్తోందని, దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

హరిహరా కళాభవన్ లో జీహెచ్ఎంసీ జాబ్ మేళా

హైదరాబాద్ : సికింద్రాబాద్ లోని హరిహరా కళాభవన్లఓ జీహెచ్ఎంసీ జాబ్ మేళా మేయర్ రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి ప్రారంభించారు. ఈ జాబ్ మేళాలో 50కంపెనీలు, 4వేలకు పైగా ఉద్యోగాలను ఆఫర్ చేయనున్నారు. జాబ్ మేళా సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది.

సింగరేణి భవన్ ముందు వామపక్షాల ఆందోళన

హైదరాబాద్ : నగరంలోని సింగరేణి భవన్ ముందు వామపక్షాల ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళనకు దిగారు. ఈ నిరసన కార్యక్రమాంలో సీపీఐ నేతలు గుండా మల్లేష్, చాడ వెంకటరెడ్డి పాల్గొన్నారు. తాడిచర్లలో బొగ్గుగనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ ఆందోళన చేపట్టారు.

 

జైట్లీతో జమ్మూ కాశ్మీర్ సీఎం భేటీ..

శ్రీనగర్ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శ్రీనగర్ కు చేరుకున్నారు. కాసేపటి క్రితం జైట్లీతో జమ్మూ కాశ్మీర్ సీఎం మెహబూబా భేటీ అయ్యారు.

చెన్నైలో భారీగా రద్దైన పాతనోట్లు

తమిళనాడు : చెన్నైలో భారీగా రద్దైన పాతనోట్లు పట్టుబడ్డాయి. కోడంబాకంలో రూ.45కోట్ల 500, 1000నోట్లను పోలీసులు స్వాదీనం చెసుకున్నారు.  

11:37 - May 18, 2017
11:35 - May 18, 2017

హైదరాబాద్ : మక్కా మసీదులో జరిగిన పేలుళ్లకు నేటితో పదేళ్లు పూర్తి అయ్యాయి. దీంతో పాతబస్తీలో భారీ పోలీస్‌ బందోబస్త్‌ను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చార్మినార్‌, మక్కా మసీదు ప్రాంతాల్లో పోలీసు బలగాలను భారీగా మోహరించారు. సౌత్‌జోన్‌ డీసీపీ నేతృత్వంలో షాడో టీమ్స్‌ పహారా కాస్తున్నాయి. మరోవైపు అనుమానంగా తిరుగుతున్న వ్యక్తులపై నిఘా పెట్టారు. 

నిషిత్ మృతి విచారణకు వచ్చిన బెంజ్ ప్రతినిధులు..

హైదరాబాద్ : ఏపీ మంత్రి నారాయణ కుమారుతు నిషిత్ రోడ్డు ప్రమాదంపై బెంజ్ కంపెనీ విచారణ ప్రారంభించింది. జర్మని నుండి హైదరాబాద్ కు వచ్చిన బెంజ్ ప్రతినిధులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ప్రమాదానికి గురైన కారును షెడ్ కు తరలించారు.

వ్యవసాయ అనుబంధ రంగాలపై బాబు సమీక్ష..

విజయవాడ : వ్యవసాయ అనుబంధ రంగాలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై బాబు సూచనలు..ఆదేశాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.

బెంజ్ ప్రతినిధుల విచారణ

హైదరాబాద్ : ఏపీ మంత్రి నారాయణ కొడుకు నిషిత్ నారాయణ రోడ్డు ప్రమాదంపై బెంజ్ కంపెనీ విచారణ చేపట్టింది. బెంజ్ ప్రతినిధులు జర్మనీ నుంచి హైదరాబాద్ వచ్చి సంఘటనలో స్థలంలో విచారణ ప్రారంభించారు. ప్రమాదానికి గురైన కారును షెడ్ తరలించారు.  

సంగారెడ్డికి రానున్న రాహుల్..

హైదరాబాద్ : ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్ర పర్యటన ఖరారైంది. జూన్ 1వ తేదీన సంగారెడ్డిలో నిర్వహించే బహిరంగసభలో ఆయన పాల్గొననున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న తేదీన రాహుల్ ను రప్పించేందుకు కొంతకాలంగా టి.కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.

శ్రీనగర్ లో జీఎస్టీ సమావేశాలు..

జమ్మూ కాశ్మీర్ : జీఎస్టీ కౌన్సిల్ సమావేశాలు శ్రీనగర్ లో ప్రారంభమయ్యాయి. ఏ వస్తువుకు, సేవకు పన్ను ఉండాలనే అంశంపై చర్చ జగరనుంది. ఈ సమావేశంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు ఆర్థిక మంత్రులు, అధికారులు పాల్గొనననున్నారు.

11:03 - May 18, 2017

ఫ్రాన్స్ : ప్రతిష్టాత్మక 70వ కేన్స్ చలన చిత్రోత్సవ సందడి షురూ అయ్యింది. తొలి రోజు బాలీవుడ్ 'మస్తానీ' దీపిక పదుకొనె ర్యాంప్ వ్యాక్ చేసింది. పర్పుల్ రంగు మార్చెసా గౌన్ లో దీపిక ఆకట్టుకొంది. 2017 కేన్స్ ఉత్సవంలో తొలి రోజు ర్యాంప్ వాక్ చేసిన భారతీయ నటి దీపి కావడం విశేషం. బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బుధవారం రాత్రి కేన్స్ కు బయలుదేరారు. 2002లో ఆమె నటించిన 'దేవ్ దాస్' సినిమాను ప్రదర్శించబోతున్నారు. 15 ఏళ్లుగా కేన్స్ ఉత్సవాలకు ఆమె హాజరవుతున్న సంగతి తెలిసిందే. ఐశ్వర్యతో పాటు సోనమ్ కపూర్, కత్రినా కైఫ్ లు కూడా పాల్గొననున్నారు. బాలీవుడ్ హాట్ నటి మల్లికా శెరావత్ కూడా పాల్గొననుంది. ఈ వేడుకకు దక్షిణ భారతీయ చిత్ర పరిశ్రమ నుండి శృతి హాసన్ హాజరు కానుంది. ఈ ముద్దుగుమ్మ నటించిన 'సంఘమిత్ర' ఫస్ట్ లుక్ ను కేన్స్ లో విడుదల చేయనున్నారు.

వరుడిని ఎత్తుకెళ్లిన 'తుపాకి' రాణి అరెస్టు..

ఉత్తర్ ప్రదేశ్ : తుపాకితో బెదిరించి వరుడిని కిడ్నాప్ చేసిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం రాత్రి బందేల్ ఖండ్ కు చెందిన ఓ యువకుడి వివాహం జరగాల్సి ఉంది. బండాకు చెందిన ఓ యువతి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మరో పెళ్లి చేసుకుంటున్నాడని ఆ యువకుడిని తుపాకితో బెదిరించి తీసుకెళ్లింది. గురువారం ఆమెను అరెస్టు చేసి యువకుడిని విడిపించారు.

దవే హాఠాన్మరణంపై మోడీ దిగ్ర్భాంతి..

ఢిల్లీ : కేంద్ర పర్యావరణ, అటవీ శాఖల మంత్రి అనిల్ మాధవ్ దవే హఠాన్మరణంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన్ను కోల్పోవడం తనకెంతో బాధను కలిగిస్తోందని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నట్లు తెలిపారు.

10:48 - May 18, 2017

‘కంగ్రాట్స్ కోడలా' అంటూ 'సమంత'ను టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున అభినందించారు. నాగార్జున తనయుడు 'నాగ చైతన్య'..’సమంత'లు త్వరలో ఒక్కటి కాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వీరి ఎంగేజ్ మెంట్ జరిగింది. అనంతరం ఇరువురు పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా మారారు. నాగ చైతన్య, రకూల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న 'రారండోయ్ వేడుక చూద్దాం' అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమా సాంగ్స్ ను యూ ట్యూబ్ లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి నాగార్జున..సమంతల మధ్య ఫోన్ లో చాటింగ్ జరిగింది. ఈ చాటింగ్ జరిగిన తీరును నాగార్జున సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 'కంగ్రాట్స్‌ కోడలా..' అని నాగార్జున పేర్కొంటే, 'లవ్‌ మామా' అని సమంత మెసేజ్‌ చేసింది. 'రారండోయ్‌ వేడుక చూద్దాం' సినిమాలో అక్కినేని నాగచైతన్య చాలా బాగున్నాడనీ, 'ఎవ్రిథింగ్‌ వర్క్స్‌' అని సమంత చెప్పుకొచ్చింది.

10:44 - May 18, 2017

ఢిల్లీ : కేంద్ర అటవీపర్యావరణ సహాయ మంత్రి అనిల్ మాధవ్ దవే కన్నుమూశారు. ఈ రోజు ఉదయం క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న దవే ఎయిమ్స్ లో చిక్సిత పొందుతూ తుదిశ్వాస విడిచారు. మధ్యప్రదేశ్ రాజ్యసభకు ఎంపీగా 2009 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2016 జులై 5న కేంద్ర మంత్రివర్గంలో పని చేశారు. 1956 జులై 6న మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లా బాద్‌నగర్‌లో జన్మించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి బీజేపీలోకి వచ్చిన దవే, పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. దవే మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు. నిన్నటి వరకు తమతో పర్యావరణ శాఖ గురించి చర్చించారని మోడీ తెలిపారు. కేంద్రమంత్రులు ఆయన మృతదేహన్ని సందర్శించి సంతాపం తెలుపుతున్నారు. 

 

10:43 - May 18, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల మధ్య పగటి ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. వడదెబ్బకు నల్గొండ జిల్లాలో ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో దామచర్ల వ్యవసాయ విస్తరణాధికారి నాగరాజు ఉన్నారు. ఖమ్మం జిల్లాలో ఐదుగురు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముగ్గురు మృతి చెందారు. తీవ్ర రూపం దాల్చిన వేసవితో వడగాల్పులు వీస్తున్నాయి. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

సుశాంత్ కు పితృ వియోగం..

హైదరాబాద్ : టాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్‌కు పితృవియోగం కలిగింది. సుశాంత్‌ తండ్రి అనుమోలు సత్య భూషణరావు గురువారం కన్నుమూశారు. గత రెండేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది.

10:26 - May 18, 2017

టాలీవుడ్ హీరోల్లో ప్రయోగాత్మక చిత్రాలతో దూసుకపోతున్న నటుడు 'నిఖిల్'. తాజాగా ఆయన నటించిన 'కేశవ' చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంలో నిఖిల్ ఓ వైవిధ్యమైన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నిఖిల్ 'కిర్రాక్ పార్టీ' సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. తాజాగా తమిళ సినిమా రీమెక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. తమిళంలో అధర్వ హీరోగా రూపొందిన 'కణితన్' సినిమాను తెలుగులో రీమెక్ చేసేందుకు ప్లాన్స్ చేస్తున్నారు. కోలీవుడ్ లో ఈ సినిమాను డైరెక్ట్ చేసిన టి.ఎన్.సంతోష్ తెలుగులో కూడా డైరెక్ట్ చేసేందుకు రెడీ అవుత్నునట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో 'నిఖిల్' అయితే కరెక్టు అని భావించిన డైరెక్టర్ ఆయనతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. బిబిసిలో రిపోర్టర్ గా పనిచేయాలని అనుకున్న కుర్రాడు అనుకోని పరిస్థితుల్లో ఓ మర్డర్ కేసులో ఇరుక్కొంటాడు. ఆ కేసు నుండి ఎలా బయటపడ్డాడనే నేపథ్యంలో చిత్ర కథ ఉండనుంది. ప్రస్తుతం చర్చల దశల్లో ఉన్న ఈ ప్రాజెక్టు విషయాలు త్వరలో తెలియనున్నాయి.

రెండో రోజు సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు..

హైదరాబాద్ : ఎంబీ భవన్ లో రెండో రోజు సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ప్రకాష్ కారత్, బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం హాజరయ్యారు.

10:18 - May 18, 2017

హైదరాబాద్ : నగరంలోని పాతబస్తీలో మక్కా మసీదు పేలుళ్లకు నేటితో పదేళ్లు పూర్తయిన సందర్భంగా పాతబస్తీ పోలీసుల భారీ బందోబస్త్ నిర్వహిస్తున్నారు. చార్మినార్, మక్కామసీదు ప్రాంతాల్లో పోలీసు బలగాలను భారీగా మోహరించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. సౌత్ జోన్ డీసీపీ నేతృత్వంతో షాడో టీమ్స్, ర్యాపిడ్ యాక్షన్ టీమ్స్ పహారా నిర్వహిస్తున్నాయి. మెటల్ డిటెక్టర్ ద్వారా మక్కా మసీదులోకి అనుమతిస్తున్నారు. 2007 మే 18 మక్కామసీదులో పేలుళ్లు జరిగాయి. 

10:17 - May 18, 2017

తమిళ సూపర్ స్టార్ 'రజనీకాంత్' ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా..ఇంతా కాదు. ఆయన దేశ..విదేశాల్లో సైతం ఆయనకు విశేషమైన అభిమానులున్నారు. ముఖ్యంగా తమిళనాడులో ఆయనకు ఎంతో మంది వీరాభిమానులున్నారు. తాజాగా ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు సోషల్ మాధ్యమాల్ల చక్కర్లు కొడుతున్నాయి. జయలలిత మరణం తరువాత ఆ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 'రజనీ' రాజకీయాల్లోకి రావాలని తీవ్ర వత్తిడి వస్తోంది. దీనితో 'రజనీ' కొన్ని సంవత్సరాల తరువాత అభిమానులతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఓ ఫంక్షన్ హాల్ లో అభిమానులతో ఆయన మాట్లాడారు. ‘దేవుడు ఏది శాసిస్తే అదే చేస్తాను' అంటూ ఆయన పేర్కొన్నారు. అభిమానులు నిజాయితీగా ఉండాలని, రాజకీయాల్లోకి రావాలని దేవుడు ఆదేశిస్తే వస్తానని స్పష్టం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అభిమానులతో సమావేశమైన సందర్భంలో ఒక పువ్వుపై బాబా గుర్తు ఫొటో ఉండడం గమనార్హం. రజనీ పార్టీ పెడితే ఇదే గుర్తు ఉంటుందా ? అనే సందేహాలు వెలువడుతున్నాయి. ఈనెల 19వ తేదీన రజనీ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. 'రజనీ' రాజకీయాల్లోకి రావాలని కాంగ్రెస్, డీఎంకే, బీజేపీ తమిళనాడు శాఖలు కోరుతున్నాయి. అయితే సొంతపార్టీ పెట్టాలని అభిమానులు 'రజనీకాంత్‌'పై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. సరైన సమయంలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని రజనీ పేర్కొన్నట్లు తెలుస్తోంది.

10:07 - May 18, 2017

బాలీవుడ్ లో అమ్మ పాత్రలకు ఆమె వన్నె తెచ్చారు. ప్రముఖ హీరోలకు అమ్మగా నటించి మెప్పించారు. ఆమెనే బాలీవుడ్ అలనాటి నటి రీమా లగూ. ఈమె తుది శ్వాస విడిచారు. ఆమె కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ముంబాయిలోని కోకిలా బెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం 'మైనే ప్యార్ కియా'లో సల్మాన్ కు తల్లిగా నటించిన సంగతి తెలిసిందే. 1970, 80 దశకంలో బాలీవుడ్ లో అగ్రతారగా ఈమె వెలుగొందారు. హిందీ, మరాఠీ భాషల్లో పలు ధారావాహికల్లో ఈమె నటించారు. ఖయామత్ సే ఖయామత్ తక్, సాజన్, దిల్ వావలే, కుచ్ కుచ్ హోతాహై, కల్ హోన హో, ఆక్రోష్, ఆషిఖీ, హమ్ ఆప్కే హై కౌన్, దిల్ తేరా దివానా తదితర సినిమాలో రీమ లగూ నటించారు.
1958లో జన్మించారు. బుల్లి తెరపై వచ్చిన 'శ్రీమాన్ శ్రీమతి' లో నటించి ఎంతో మంది అభిమానుల సంపాదించుకున్నారు. కామెడీ సీరియల్ 'తు తు మై మై'లో కూడా నటించారు. సపోర్టింగ్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డులను గెలుచుకున్నారు.
1990 మైనే ప్యార్ కియా చిత్రానికి సపోర్టింగ్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డు.
1991 ఆషికి చిత్రానికి సపోర్టింగ్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డు.
1995 హహ్ ఆప్ కే హై కౌన్ చిత్రానికి సపోర్టింగ్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డు.
2000 వాస్తవ్ చిత్రానికి సపోర్టింగ్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డు.

కేంద్రమంత్రి అనిల్ మాధవ్ దవే కన్నుమూత

ఢిల్లీ : కేంద్ర పర్యావరణ మంత్రి అనిల్ మాధవ్ దవే కన్నుమూశారు. లంగ్ క్యాన్సర్ తో అనిల్ మృతి చెందారు. అనిల్ దవే మృతి ప్రధాన మంత్రి మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

పెళ్లి బృందం కారును ఢీకొన్న లారీ..

పశ్చిమగోదావరి : దేవరపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. కారులో వెళుతున్న పెళ్లి బృందాన్ని లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో పెళ్లి కుమారుడికి స్వల్పగాయాలు కాగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.

విశాఖలో రోడ్డు ప్రమాదం..

విశాఖపట్టణం : పెందుర్తి మండలం చినగదడి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ ప్రయాణిస్తున్న వారిని లారీ ఢీకొనడంతో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు.

తెలుగు రాష్ట్రాల్లో ఠారెత్తిస్తున్న ఎండలు

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నిప్పుల కుంపటిలా మారాయి. సాధరాణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పెరిగిన ఉష్ట్రాగతతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.

టీఎస్ ఐసెట్ కు ప్రశ్నపత్రం కోడ్ విడుదల

వరంగల్ : ఐసెట్ ప్రశ్నపత్రం కోడ్ విడుదల చేశారు. ప్రశ్నపత్రం 'ఎ' సెట్ ను ఉన్నతవిద్యమండలి చైర్మన్ పాపిరెడ్డి విడుదల చేశారు.

 

మంథనిలో మాజీ గవర్నర్ సంస్మరణ సభ

కరీంనగర్ : జిల్లా మంథనిలో మాజీ గవర్నర్ దివంగత జస్టిస్ పి.శివశంకర్ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సభకు మాజీ మంత్రి శ్రీధర్ బాబు, శివశంకర్ కుమారుడు వినయ్ కుమార్ హాజరుకనున్నారు. 

09:33 - May 18, 2017

కామారెడ్డి : జిల్లాలోని గర్గుల్‌ గ్రామంలో ఎలుగుబంటి హల్‌చల్‌ చేసింది. సుమారు ఆరు గంటలపాటు గ్రామంలోని ఎస్సీ కాలనీలో చొరబడింది. దీంతో భయాందోళనకు గురైన గ్రామస్థులు కర్రలతో కొట్టి తరిమేశారు. తరువాత గర్గుల్‌లో పొదల మధ్య ఎలుగుబంటి తల దాచుకుంది. వెంటనే గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి ఎఫ్‌డీవో రేఖ సిబ్బందితో చేరుకొని.. పరిస్థితిని సమీక్షించారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో వన్యప్రాణుల రక్షణ సిబ్బంది.. పొద చుట్టూ వల బిగించారు. దీంతో ఎలుగుబంటి గ్రామ శివారులోకి పరుగులు పెట్టించింది. చివరకు గొల్లపల్లి గ్రామ శివారులో వలలు వేసి ఎలుగుబంటిని బందించారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఆరు గంటలు శ్రమించి అధికారులు ఎట్టకేలకు ఎలుగుబంటిని పట్టుకున్నారు. ఎలుగుబంటికి ప్రథమ చికిత్స చేసి అటవీ ప్రాంతంలో వదిలి పెడతామని.. అటవీశాఖ డివిజనల్ అధికారి రేఖ తెలిపారు.

 

09:31 - May 18, 2017

హైదరాబాద్ : పాతబస్తీలోని పలు పెట్రోల్‌ బంకులలో తనిఖీలు జరిగాయి. పౌరసరఫరాల శాఖ, తూనికలు, కొలతల శాఖ ఆధ్వర్యంలో ఈ రైడ్స్‌ జరిగాయి. పెట్రోల్‌ బంకుల్లో కల్తీ, కొలతలలో తేడాలు జరుగుతున్నట్టు.. పలువురు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రెండు శాఖల అధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులను వెంటబెట్టుకొని తనిఖీలు చేపట్టారు. చంద్రాయణ గుట్ట, బండ్లగూడ, బాబానగర్‌ ప్రాంతాల్లోని పలు పంపుల్లో తనిఖీలు చేపట్టారు.  

09:26 - May 18, 2017

హైదరాబాద్ : నిత్యం సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ బిజిగా గడుపుతున్నాని అవకాశం వచ్చినప్పుడల్లా సీఎం కేసీఆర్‌ మూడేళ్లుగా చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే తాను ఎవరినీ కలవలేకపోతున్నాననే ఆందోళనను వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వ పరంగా ఇస్తున్న హామీల విషయం ఎలా ఉన్నా ఇటీవల వెలుగులోకి వచ్చిన సమస్యలు మాత్రం అధికార పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.

ఖమ్మం, వరంగల్‌లో మిర్చి ఘాటు
రైతును రాజుగా మారుస్తామంటూ గొప్పలు చెప్పుకునే గులాబీ దళపతికి ఖమ్మం, వరంగల్‌లో మిర్చి ఘాటు బాగా తగిలింది. మిర్చి రైతుల ఆందోళనలు ప్రభుత్వాన్ని కుదిపేశాయి. దీంతో రైతుల ఆందోళనలకు రాజకీయ అండ ఉందన్న ప్రచారం చేసి తప్పించుకునే ప్రయత్నాన్ని అధికార పార్టీ నేతలు చేస్తున్నారు. ఇక రైతుల ఆందోళనలు మరువక ముందే ఆక్యుపై ధర్నాచౌక్‌ నిరసన గులాబీ నేతలకు కొత్త చిక్కులే తెచ్చిపెట్టాయి. పోలీసులు, అధికార పార్టీ నేతల మద్దతుతో విపక్షాలపై దాడి జరగడంతో TRS నేతలు ఆత్మరక్షణలో పడ్డారు. ఈ పరిణామాలు కేసీఆర్‌ ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించిన ఇలాంటి అంశాలపై అధికార పార్టీ నేతలు తమ చర్యలను సమర్థించుకుంటూ విపక్షాల వైఖరిని తప్పుబడుతున్నారు. సీఎం కేసీఆర్‌ ఇప్పటి వరకు ఈ సంఘటనలపై స్పందించక పోవడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ పరంగా ఏ తప్పు చేయకపోతే..ఖమ్మం మిర్చియార్డ్‌, ధర్నాచౌక్‌ దాడులపై ముఖ్యమంత్రి కెసిఆర్ ఎందుకు స్పదించడం లేదనే ప్రశ్నలు మొదలయ్యాయి. కేసీఆర్‌ వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారా? లేక మరేదైనా కారణం ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి మౌనం దేనికి సంకేతం అని పార్టీ వర్గాల్లోనూ చర్చమొదలైంది. మరి ఈ ప్రశ్నలకు సీఎం కేసీఆర్‌ ఎలాంటి సమాధానమిస్తారో చూడాలి.

 

 

 

 

09:23 - May 18, 2017

హేగ్ : మాజీ నేవీ అధికారి కుల్‌ భూషణ్‌ జాదవ్‌ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం ఇవాళ తుది తీర్పు ఇవ్వనుంది. భారత కాలమానం ప్రకారం.. ఇవాళ మధ్యాహ్నం మూడున్నరకు హేగ్‌లో ఉన్న ఇంటర్నేషనల్‌ కోర్టు తీర్పు వెల్లడించనుంది. నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌కు పాకిస్తాన్ సైనిక కోర్టు మరణశిక్ష విధించడాన్ని వ్యతిరేకిస్తూ భారత్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్‌, పాకిస్తాన్‌లు తమ తమ వాదనలు వినిపించాయి. ఇరాన్‌లో వ్యాపారం చేసుకుంటున్న కుల్‌భూషణ్‌ను కిడ్నాప్‌ చేసి గూఢచర్యం ఆరోపణల కింద పాకిస్తాన్‌ ఆర్మీకోర్టు ఉరిశిక్ష విధించిందని భారత్‌ వాదించింది. జాదవ్‌ ఉరిశిక్షను వెంటనే రద్దు చేయాలని భారత్‌ అంతర్జాతీయ న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది. జాదవ్‌ విషయంలో భారత్‌ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని రాజకీయంగా వినియోగించుకుంటోదని పాకిస్తాన్‌ ఆరోపించింది. జాదవ్‌ గూఢచర్యానికి పాల్పడ్డట్లు తమవద్ద ఆధారాలున్నయని పేర్కొంది. ఈ కేసులో కోర్టు తుదితీర్పుపై ఆసక్తిగా మారింది.

సిరిసిల్లా జిల్లాలో చిరుత సంచారం

రాజన్న సిరిసిల్ల : జిల్లా తంగళ్ల మండలం చింతల్ ఠాణాలో చిరుత సంచరిస్తునట్లు ఆనవాళ్లు కనపడడంతో గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు. స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

09:20 - May 18, 2017

వరంగల్ : జిల్లాలోని ఎల్కతుర్తి మండలం పెంచికలపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోజు తెల్లవారుజామున సైదాపూర్ నుంచి, చినపాపయ్యపల్లికి పశుగ్రాసం తీసుకురావడానికి కొందరు ట్రాక్టర్ లో వెళుతున్నారు. కరీంనగర్ నుంచి వరంగల్ వెళ్తున్న లారీ వారు ప్రయాణీస్తున్న ట్రాక్టర్ ను ఢీకొంది. దీనితో ఇద్దరు మృతి చెందారు. గాయపడిన ఐదుగురిని వరంగల్ ఏంజీఎం ఆసుపత్రికి తరలించారు. మృతులు రాజయ్య, నారాయణలుగా పోలీసులు గుర్తించారు. లారీ అతి వేగం ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. ఇద్దరు మృతి చెందడంతో ఆ ఊరిలో విషాదం నెలకొంది. ఈ ప్రమాదంపై పోలీసులు విచారణ చేపట్టారు.

09:17 - May 18, 2017

హైదరాబాద్ : ఉపాధి హామీ పథకం కింద రూ.259 కోట్లు బకాయిలు, ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వలేదని, రాయలసీమలో నెలకొన్న కరువుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవటం లేదని న్యూస్ మార్నింగ్ లో పాల్గొన్న సీపీఎం నేత గఫూర్, ద హిందు మాజీ అసిస్టెంట్ ఎడిటర్ నగేష్, కాంగ్రెస్ నేత రామ శర్మ అన్నారు. అనంతపురంలో కరవు మామూలే అని టీడీపీ నేత విజయ్ కుమార్  అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

09:15 - May 18, 2017

హైదరాబాద్ : కార్మికుల నిధులతో తార్నాక ఆసుపత్రి నిర్మించిందని. రూ.30 ఉన్న రోజుల్లో రూ.2 ఆసుపత్రి కోసం సవత్సరాలు తరాబడి ఇచ్చారని తెలంగాణ ఆర్టీసీ స్టాప్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు పీ.ఎస్ రావు అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

09:12 - May 18, 2017

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత చెరువులు పునరుద్దరణపై దృష్టి పెట్టింది. మిషన్‌ కాకతీయ పేరుతో 5ఏళ్ల కాలంలో రాష్ట్రంలోని 48,413 చెరువులను పునరుద్దరించడం లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని భావిస్తోంది. ఇందుకోసం అవసరమైన నిధులనూ ఎప్పటికప్పుడు మంజూరు చేస్తూనే ఉంది. అయినా ఈ పథకం అమల్లో మాత్రం ఆశించినంతగా ఫలితాలు మాత్రం రావడంలేదు. ప్రభుత్వ నిర్ణయం మంచిదైనా.. అమలు విషయంలోనే అంతులేని నిర్లక్ష్యం కొనసాగుతోంది. దీంతో మిషన్‌ కాకతీయ పథకం నీరుగారుతోంది. రెండేళ్ల క్రితం ప్రారంభించిన మొదటి దశ పనులే నేటికీ పూర్తికాలేదంటేనే పథకం ఎంత నిర్లక్ష్యానికి గురవుతుందో అర్ధమవుతోంది.

మొదటి దశలో 8,032 చెరువులు
మిషన్‌ కాకతీయ పథకంలో భాగంగా మొదటి దశలో ప్రభుత్వం 8,032 చెరువుల పునరుద్ధరణ కోసం కాంట్రాక్టర్లతో ఒప్పందం కుదుర్చుకుంది. వీటి విలువ 1609 కోట్లు కాగా వీటిలో 8,012 చెరువుల్లో పనులు పాక్షికంగా పూర్తయ్యాయి. మొదటి సంవత్సరం మంజూరు చేసిన చెరువుల పనుల కోసం రెండున్నరేళ్ల కాలంలో 1334 కోట్లు ఖర్చుపెట్టారు. మొదటి దశ పనుల్లో జరిగిన జాప్యం రీత్యా.. రెండవ దశ పనుల్లో వేగం పెంచాలని, సకాలంలో పనులు పూర్తి చేయాలని మంత్రి హరీశ్‌రావు ఆ శాఖ అధికారులను పదేపదే హెచ్చరిస్తూ వస్తున్నారు. అయినప్పటికీ అధికారుల పనితీరులో మాత్రం పెద్దగా మార్పేమీలేదు. రెండవ దశలో 3,325 కోట్ల వ్యయంతో 11,184 చెరువులను పునరుద్దరించాలని లక్ష్యంగా పెట్టుకుంటే... కేవలం 7,944 చెరువుల పునరుద్దరణ కోసం పాలనాపరమైన అనుమతులు జారీ చేశారు. మిగిలిన చెరువుల పునరుద్దరణ అతీగతీలేకుండా పోయింది.

మూడవ దశలో గందరగోళం...
ఇక మూడవ దశ పనుల్లో పూర్తిగా గందరగోళం ఏర్పడింది. కొత్త ఆర్థిక సంవత్సరం రాకముందే జనవరి నెలాఖరులోగా మూడవదశ పనులను గుర్తించాలని, ప్రతిపాదనలు పంపాలని నీటిపారుదలశాఖ అధికారులతోపాటు ప్రభుత్వం కూడా పలుమార్లు ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ మూడవదశ పనుల్లో అదే నిర్లక్ష్యం కొనసాగుతోంది. ఆర్ధిక సంవత్సరం ప్రారంభమై 40 రోజులు గడిచినా ఇంకా పాలనాపరమైన అనుమతులు జారీ చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు మూడోదశ పనుల కింద 6,362 చెరువులను గుర్తించగా.. వీటిలో 6,137 చెరువులకు మాత్రమే పాలనాపరమైన అనుమతులు జారీ అయ్యాయి. అనుమతులు జారీ అయిన చెరువుల్లోనూ 2,751 చెరువుల్లో మాత్రమే పనులు ప్రారంభమయ్యాయి. మిషన్‌ కాకతీయలో భాగంగా చేపట్టిన చెరువుల పునరుద్దరణలో కేవలం పూడికలు తీయడానికే నీటిపారుదలశాఖ ప్రాధాన్యతనిస్తోంది. చెరువు కట్టలను బలోపేతం చేయడం, కాల్వలు, ఫీడర్‌ చానల్స్‌ మరమ్మతు పనులు పట్టించుకోవడమే లేదనే ఆరోపణలున్నాయి. ఫలితంగా చెరువుల్లో నీటి నిల్వ సామర్ధ్యం పెరిగినా రైతుల పొలాలకు ఆశించిన విధంగా నీరందడం లేదని తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం లక్ష్యం నీరుగారుతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా పనుల్లో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని గ్రహించి.. శరవేగంగా పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

09:10 - May 18, 2017

కృష్ణా : విజయవాడలో కొందరు డాక్టర్ల హవాలా దందాలో నిజనిజాల బయటపడుతున్నాయి. పోలీసులపై కూడా ఆరోపణలు రావడంపై కమిషనర్ గౌతం సవాంగ్ విచారణ చేపట్టారు. దీనితో వాస్తవాలు బయటపడుతున్నాయి. వెంటనే ఇందుకు సంబంధించిన పటమట సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్ కెన్నడీని వీఆర్‌కు పంపిస్తూ ఆదేశాలు జారీ చేశారు...డివిజన్ ఏసీపీ రామచంద్రరావును విధులనుంచి తప్పించి డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు...డాక్టర్ల హవాలా వ్యాపారంపై పోలీసులు విచారణ ను వేగవంతం చేస్తున్నారు. మరోవైపు ఈ వ్యవహారం పెద్దది కావడంతో పోలీసులు వెంట వెంటనే చర్యలకు రంగంలోకి దిగారు... కిడ్నాప్ కు యత్నించిన కార్ ను స్వాధీనం చేసుకొని డాక్టర్ పువ్వాడ రామకృష్ణతో సహా 7 గురిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు డాక్టర్ల హవాలా దందా బయటపడ్డంతో ప్రముఖులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది...ఈ వ్యవహారం ఇక ఇంతటితో ముగించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది...హవాలా దందాతో ఎందరికో ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది...బయటపడ్డ వాస్తవాలను కప్పిపుచ్చుతూ...కేసును నీరుగార్చేయత్నాలు మొదలయినట్లు తెలుస్తోంది.

09:09 - May 18, 2017

విశాఖ : జనసేన పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టింది. రానున్న సార్వత్రిక ఎన్నికలకు జనసేన పార్టీ సిద్దమవుతోంది. 2019 ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇప్పటికే ప్రకటించారు. పార్టీ తరపున నిలబెట్టే అభ్యర్ధులు గెలవాలంటే కేవలం అభిమానులుంటేనే సరిపోదని.. పార్టీ నిర్మాణం కూడా అవసరమని భావిస్తోంది. అందుకే జనసేన సంస్థాగతంగా పార్టీ నిర్మాణంపై ఫోకస్‌ పెట్టింది. జనసైనికుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది. ఇప్పటికే అనంతపురం జిల్లాలో కార్యకర్తల ఎంపికను పూర్తి చేసింది. స్పీకర్స్‌, కంటెంట్‌ రైటర్స్‌తోపాటు విశ్లేషకులను ఎంపిక చేసింది. ఇప్పుడు ఉత్తరాంధ్రలో పార్టీ నిర్మాణంపై పవన్‌ కల్యాణ్‌ దృష్టి సారించారు.

మొదటి నుంచి విశాఖలో పార్టీ క్యాడర్‌
ఉత్తరాంధ్రలో జనసేనకు మొదటి నుంచి విశాఖలో పార్టీ క్యాడర్‌ ఉంది. ఇప్పటి వరకు పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చిన ప్రతీ కార్యక్రమాన్ని విశాఖనగరంతోపాటు ఉత్తరాంధ్రలో నిర్వహించారు. దీంతో ఉత్తరాంధ్రలో పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేసుకోవాలని పవన్‌ భావిస్తున్నారు. అనంతపురంలో జనసైనికుల ఎంపిక చేసినట్టుగానే ఉత్తరాంధ్రలోనూ పార్టీ కార్యకర్తల ఎంపిక చేపట్టాలని ఉత్తరాంధ్ర నాయకత్వానికి సూచించారు. దీంతో పార్టీ సీనియర్లు ఉత్తరాంధ్రలో పలుచోట్ల పరీక్షా కేంద్రాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.

6 వేలకుపైగా క్రీయాశీల కార్యకర్తలు
ఉత్తరాంధ్రలో ఇప్పటి వరకు దాదాపుగా 6 వేలకుపైగా క్రీయాశీల కార్యకర్తల కోసం దరఖాస్తులు వచ్చాయి. ఇందులో విశాఖ నుంచే సగానికిపైగా దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు చేసుకున్న వారందరికీ శ్రీకాకుళం జిల్లాలోని బాపూజీ మందిరంలో ఇంటర్వ్యూలను నిర్వహించారు. విజయనగరం జిల్లాలో ఈనెల 20,21న రెండు రోజులపాటు క్రియాశీల కార్యకర్తలను ఎంపిక చేయనున్నారు. ఈనెల 19,20న విశాఖలో కూడా దరఖాస్తు చేసుకున్న వారందరికీ మూడు విభాగాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తానికి జనసేన పార్టీ జనసైనికులను రిక్రూట్‌ చేసుకునే పనిలో పడింది. కమ్యూనిస్టుల్లాగా బలమైన క్యాడర్‌ను నిర్మించుకునే ప్రక్రియను ప్రారంభించింది. త్వరలోనే మిగతా జిల్లాల్లోనూ పార్టీ నిర్మాణం బలోపేతం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. 

09:06 - May 18, 2017

అనంతపురం : వామపక్ష పార్టీల ఆందోళనలతో అనంతపురం కలెక్టరేట్ దద్దరిల్లింది. తాగునీటి సమస్య, రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ, పెండింగ్ లో ఉన్న ఉపాధి హామీ బిల్లుల చెల్లింపు, లతో పాటు పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలనే డిమాండ్ తో వామపక్షాలు కలెక్టరేట్ ను ముట్టడించాయి. అయితే వామపక్షాలు తలపెట్టిన 48 గంటల కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకుని.. నేతలను బలవంతంగా అరెస్ట్ చేశారు. రాయలసీమ సమస్యల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆరోపిస్తూ అనంతపురంలో వామపక్ష పార్టీలు 48 గంటల పాటు ఆందోళనకు పిలుపునిచ్చాయి. అనంతపురం కలెక్టరేట్ వద్ద భారీ ఆందోళన చేపట్టాయి. వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులకు పార్టీ నేతలకు తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆందోళన చేస్తున్న నేతలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్టైన వారిలో సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధుతో పాటు.. సీపీఐ జాతీయ నేత నారాయణతో పాటు 500 మంది కార్యకర్తలు ఉన్నారు.

సొమ్మసిల్లిన నేతలు....
పోలీసులకు వామపక్ష నేతలకు జరిగిన పెనుగులాటలో పలువురు నేతలు సొమ్మసిల్లి పడిపోయారు. కరువు కారణంగా ప్రజలు రాయలసీమను ఖాళీ చేసి వెళ్తున్నా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆరోపించారు. పెండింగ్ లో ఉన్న ఉపాధి హామీ బకాయిలతో పాటు ఇన్ పుట్ సబ్సిడీ చెల్లించకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉపాధి కూలీలతో పనులు చేయించుకుని వారికి బిల్లులు చెల్లించకపోవడం దారుణమన్నారు సీపీఐ జాతీయ నేత నారాయణ. కేంద్రం నుంచి డబ్బులు వచ్చినా.. కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించి పేదలకు చెల్లించకపోవడం అన్యాయమని విమర్శించారు. అనంతపురం జిల్లాలోనే 250 కోట్ల రూపాయలు బకాయిలు ఉంటే.. రాయలసీమ మొత్తంలో 500 కోట్లకు పైనే ప్రభుత్వం బకాయిలు చెల్లించాల్సి ఉందని నారాయణ చెప్పారు. ఈనెల 24 న అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో తాము చేపట్టబోయే బంద్ కు అందరూ సహకరించాల్సిందిగా వామపక్ష నేతలు పిలుపునిస్తున్నారు.

09:02 - May 18, 2017

హైదరాబాద్ : తెలంగాణలో భూసేకరణ సవరణ చట్టం -2017 అమలులోకి వచ్చింది. సవరణల అనంతరం అసెంబ్లీ నుంచి వచ్చిన బిల్లుకు ఆమోదం తెలుపుతూ ఇటీవల రాష్ట్రపతి సంతకం చేశారు. అధికారిక ప్రక్రియలన్నీ పూర్తయి ఆ బిల్లు బుధవారం తిరిగి అసెంబ్లీకి చేరింది. రాష్ట్రపతి ఆమోదముద్ర పడిన బిల్లును స్వీకరించిన రాష్ట్ర ప్రభుత్వం... గెజిట్‌ విడుదల చేసింది. సవరణ బిల్లు ఇప్పుడు 2017 చట్టం 21గా మారింది. గెజిట్‌ విడుదలతో భూసేకరణ, పునరావాసం, న్యాయమైన పరిహారం, పారదర్శకమైన హక్కు చట్టం -2017 తెలంగాణ రాష్ట్రంలో అమలులోకి వచ్చింది.

గతంలో జీవో నంబర్‌ 123....
భూసేకరణ కోసం తెలంగాణ సర్కార్‌ గతంలో జీవో నంబర్‌ 123 తీసుకొచ్చింది. ఈ జీవో ప్రకారం దాదాపు 49వేల ఎకరాలకుపైగా భూమిని సేకరించింది. దీనిపై బాధితులు కోర్టుల్లో 29 కేసులు వేశారు. 2013 చట్టం ప్రకారమే తమకు పరిహారం ఇవ్వాలని కోరారు. బాధితుల న్యాయమైన డిమాండ్‌ విన్న రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది. జీవో నంబర్‌ 123 ప్రకారం భూసేకరణ చేపట్టకూడదని, 2013 చట్టం ప్రకారం బాధితులకు పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. హైకోర్టులో చుక్కెదురు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా భూసేకరణ సవరణ బిల్లును రూపొందించింది. 2016 డిసెంబర్‌ 28న ఈ బిల్లును రాష్ట్ర శాసనసభ, మండలి ఆమోదించాయి. అనంతరం రాష్ట్రపతి ఆమోదానికి ఈ బిల్లును పంపింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఈ బిల్లుకు కేంద్రం పలు సవరణలు సూచిస్తూ రాష్ట్రానికి తిరిగి పంపించింది. కేంద్రం సూచించిన విధంగా సవరణలు చేస్తూ ఏప్రిల్‌ 30న ఉభయసభలు ప్రత్యేకంగా సమావేశమై సవరణల బిల్లును ఆమోదించాయి. అనంతరం ఈ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపింది. రాష్ట్రపతి గత శుక్రవారం రాజముద్ర వేయగా అధికారిక ప్రక్రియలను పూర్తిచేసుకుని రాష్ట్రానికి చేరింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం గెజిట్‌ ప్రచురించడంతో నూతన భూసేకరణ చట్టం అమల్లోకి వచ్చింది. తెలంగాణలో అనేక నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిన నేపథ్యంలో ఈ బిల్లుకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది.

భూసేకరణ సరవణ చట్టం అమలు
రాష్ట్రపతి ఆమోదంతో అమలులోకి వచ్చిన భూసేకరణ సరవణ చట్టం అమలుకు అధికారులు ప్రస్తుతం నిబంధనలు రూపొందించే పనిలో ఉన్నారు. న్యాయపరమైన చిక్కులు ఏర్పడకుండా ఈ నిబంధనల జీవోను ఇవాళ విడుదల చేసే అవకాశముంది. ఈ జీవో విడుదల కాగానే రెవెన్యూ అధికారులు ప్రాజెక్టులు నిర్మించే ప్రాంతాల్లో భూసేకరణ ప్రారంభిస్తారని సమాచారం. కేవలం రెండు నెలల వ్యవధిలోనే భూసేకరణ పూర్తిచేయడానికి అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.

09:00 - May 18, 2017

హైదరాబాద్ : యాదాద్రి పవర్‌ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతులు రావడం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణను మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా మార్చే ప్రక్రియలో యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ అత్యంత ముఖ్యమైనదని, దాని నిర్మాణానికి అన్ని అడ్డంకులు తొలగడం సంతోషకరమని సీఎం అన్నారు. నాలుగువేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ను 27వేల కోట్ల వ్యయంతో టీఎస్‌ జెన్‌కో చేపట్టనుంది. ఆర్‌ఈసీ దీనికోసం 21వేల కోట్ల ఆర్థిక సహకారం అందిస్తోంది. అన్ని రకాల అనుమతులు, ఆర్థిక సహకారం అందుతుండటంతో యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ నిర్మాణానికి మార్గం సుగమమైంది. వెంటనే పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సీఎండీ ప్రభాకర్‌రావుకు సూచించారు.

సదరన్ రీజనల్ పవర్‌ కమిటీ చైర్మన్‌గా ప్రభాకర్ రావు!
తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్ కో సిఎండి ప్రభాకర్ రావు సదరన్ రీజనల్ పవర్‌ కమిటీ చైర్మన్‌గా నియామకం కావడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభాకర్ రావుకు స్వయంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. విద్యుత్ రంగంలో దశాబ్దాల అనుభవం కలిగిన ప్రభాకర్ రావు, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి ఎంతో శ్రమించి కోతల్లేని విద్యుత్ అందించడంలో కీలక పాత్ర పోషించారని సిఎం కొనియాడారు. ప్రతిభకు, పనితీరుకు దక్కిన గౌరవంగా సిఎం అభివర్ణించారు. ఇప్పటిదాకా సదరన్‌ పవర్‌ కమిటీ చైర్మన్‌గా కేరళ ట్రాన్స్ కో సిఎండి కొనసాగుతున్నారు. ట్రాన్స్ కో సిఎండి హోదాలో ప్రభాకర్ రావు సదరన్ కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తారు. సదరన్ పవర్ కమిటీలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాలు సభ్యులుగా ఉంటాయి. దక్షిణాది రాష్ట్రాల మధ్య జరిగే విద్యుత్ పంపిణీ, పవర్ గ్రిడ్ ఆపరేషన్, విద్యుత్ వినియోగం, అంతర్రాష్ట్ర విద్యుత్ బిల్లుల చెల్లింపులు, కేంద్ర ప్రభుత్వంతో దక్షిణాది రాష్ట్రాల తరుఫున సంప్రదింపులు, విద్యుత్ రంగానికి సంబంధించిన అంతర్రాష్ట్ర వివాదాలు... తదితర అంశాల్లో ఎస్.ఆర్.పి.సి. కీలకంగా వ్యవహరిస్తుంది. బెంగులూరు కేంద్రంగా నడిచే ఎస్.ఆర్.పి.సి.లో సభ్య రాష్ట్రాలతో పాటు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ప్రతినిధులు కూడా ఉంటారు. 

08:57 - May 18, 2017

హైదరాబాద్ : కరీంనగర్‌ అభివృద్ధిపై ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ విస్తృతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్‌, ఎంపీ వినోద్‌ కుమార్‌, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్‌, రసమయి బాలకిషన్‌, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌ రావు, ఇతర అధికారులు హాజరయ్యారు. కరీంనగర్‌ నగరాన్ని సౌకర్యవంతంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు..

కరీంనగర్ నుంచి హరితహారం...
హరితహారం కార్యక్రమం ఈసారి కరీంనగర్ నుంచి ప్రారంభించనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.. కరీంనగర్‌లో 4 నుంచి 5 లక్షల మొక్కలు పెంచుతామన్నారు. కరీంనగర్ అభివృద్ధి కోసం కరీంనగర్ పట్టణాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేస్తామని తెలిపారు. కరీంనగర్‌తోపాటు ఇతర పట్టణాలకు అభివృద్ధి సంస్థలు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.. మున్సిపల్ కార్పొరేషన్, పోలీస్ కమిషనరేట్లు ఉన్న వాటికి పట్టణాభివృద్ధి సంస్థలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడంతోపాటు బస్‌బేలు, షెల్టర్ల నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. కరీంనగర్‌లో హైదరాబాద్ తరహా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం చేపడతామన్నారు. 1200 మంది కూర్చునేలా కరీంనగర్‌లో టౌన్‌హాల్ నిర్మాణం చేపడతామని కేసీఆర్‌ అన్నారు..

అంతర్జాతీయ స్థాయిలో కళాభారతి
హెలిపాడ్‌కోసం వినియోగిస్తున్న పదెకరాల స్థలంలో అంతర్జాతీయ స్థాయిలో కరీంనగర్‌ కళాభారతి నిర్మిస్తామని కేసీఆర్‌ ప్రకటించారు.. నగరంలోని ఐదు ప్రాంతాల్లో వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్లు నిర్మించాలని అధికారుల్ని ఆదేశించారు.. మానేరు రివర్‌ఫ్రంట్ సుందరీకరణకోసం బడ్జెట్‌లో కేటాయించిన 506కోట్లలో 25కోట్లను కేసీఆర్‌ విడుదల చేశారు.. డ్యాంపై టూరిస్ట్ స్పాట్‌, వ్యూపాయింట్, రెస్టారెంట్, బోటింగ్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.. నగరంలో పచ్చదనం పెంచే కార్యక్రమం పర్యవేక్షణకోసం ఐఎఫ్‌ఎస్‌ అధికారిని నియమిస్తున్నామని తెలిపారు. కరీంనగర్ పరిస్థితిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ను కేసీఆర్‌ ఆదేశించారు.

08:55 - May 18, 2017

గుంటూరు : వెలగపూడి సచివాలయంలో రహదారులు, భవనాల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. జాతీయ రహదారులు సహా రాష్ట్రంలోని రహదారుల నిర్వహణకు పటిష్ట వ్యవస్థ ఏర్పాటు ఎంతవరకు వచ్చిందో అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. మధ్యప్రదేశ్‌లో రహదారుల నిర్వహణ బావుందని, ఆ వ్యవస్థను అధ్యయనం చేసి రాష్ట్రంలోనూ నెలకొల్పాలని అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ రహదారుల నిర్వహణ వ్యవస్థ కోసం ఇప్పటికే 13 జిల్లాల్లో 41,300 కి.మీ మేర రహదారుల సమాచార సేకరణ పూర్తికాగా, 10 జిల్లాలు ప్రణాళిక అమలు దశకు చేరుకున్నాయి. మిగిలిన మూడు జిల్లాలు జూన్ 15 నాటికి సిద్ధం కానున్నాయి.

ముఖ్యమంత్రి ఆదేశాలు...
వర్షాకాలం వచ్చేనాటికి రహదారుల మరమ్మతులు పూర్తి కావాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. గోతులను, గుర్తించిన 1,013 ప్రమాదకర ప్రాంతాలను ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. 2022 నాటికి అత్యున్నత రహదారుల విషయంలో రాష్ట్రం దేశంలో మొదటి మూడు రాష్ట్రాలలో ఒకటిగా వుండాలని స్పష్టం చేశారు. అనంతపురం-అమరావతి నేషనల్ ఎక్స్‌ప్రెస్‌ వేకు సంబంధించి రహదారి మార్కింగ్ అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పూర్తికాగా ప్రకాశం, గుంటూరు, కడప జిల్లాల్లో ఇంకా కొనసాగుతున్నట్టు ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. వచ్చే ఐదేళ్లలో స్టేట్ హైవేలు అన్నింటినీ రెండు వరుసల రహదారులుగా విస్తరించాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్దేశించారు. ఇంకా విశాఖ-చెన్నయ్ ఇండస్ట్రియల్ కారిడార్‌ మౌలిక వసతుల కల్పనలో భాగంగా 372 కి.మీ మేర మొత్తం 11 రోడ్లను రూ.3,806 కోట్లతో అభివృద్ధి చేసేందుకు గుర్తించినట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. కృష్ణా పుష్కరాల నాటికి పూర్తిచేయాలని భావించిన విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని పూర్తి చేయకపోవడంపై నిర్మాసంస్థపై ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. అక్టోబర్ 2న ఎట్టి పరిస్థితుల్లో ఫ్లైఓవర్ నిర్మించి తీరాలని డెడ్‌లైన్ విధించారు. 

08:53 - May 18, 2017

గుంటూరు : ఏపీ సచివాలయంలో నిరుద్యోగ భృతిపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం అయ్యింది. ఈ భేటీకి ఆర్థికశాఖ మంత్రులు యనమల రామకృష్ణుడు, నారా లోకేష్ , అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర హాజరయ్యారు.. నిరుద్యోగ భృతి విధి విధానాలపై చర్చించారు. ఎన్నికలకు ముందు నిరుద్యోగభృతి ఇస్తామని టీడీపీ హామీ ఇచ్చింది.. ఈ అంశాన్ని మేనిఫెస్టోలోకూడా చేర్చింది.. ఆ తర్వాత అధికారంలోకివచ్చినా ఈ హామీని అమలు చేయలేదు.. ఇదే అంశంపై ప్రతిపక్ష వైసీపీ ఎన్నోసార్లు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసింది.. నిరుద్యోగభృతి ఎప్పుడు అమలు చేస్తారని గట్టిగా ప్రశ్నించింది.. అటు నిరుద్యోగుల నుంచికూడా అసంతృప్తి వ్యక్తమైంది.. ఆ తర్వాత ఈ విషయంపై సీరియస్‌గా దృష్టిపెట్టిన ప్రభుత్వం.... నిరుద్యోగభృతికోసం బడ్జెట్‌లో ఐదువందల కోట్ల రూపాయల్ని కూడా కేటాయించింది.. అయితే ఈ డబ్బు నిరుద్యోగభృతికి ఏమాత్రం సరిపోదు.. దీంతో నిధుల సమీకరణకోసం ఇతర శాఖలపై కేబినెట్‌ సబ్‌కమిటీ దృష్టిపెట్టింది.. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ సబ్‌ప్లాన్‌ నిధులను నిరుద్యోగ భృతివైపు దారిమళ్లించాలని మంత్రులు నిర్ణయించారు..

సబ్‌ప్లాన్‌ నిధులు మళ్లింపు....
గతంలోకూడా సబ్‌ప్లాన్‌ నిధులను ప్రభుత్వాలు దారిమళ్లించాయి.. దళిత కాలనీళ్లో జరిగే పనులకు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులే ఖర్చుచేశారు.. గత సీఎం వైఎస్ కూడా పలు అభివృద్ధి పనులకు సబ్‌ప్లాన్‌ డబ్బే వాడారు.. ఇప్పుడు నిరుద్యోగభృతి కోసమూ ఇవే నిధుల్ని వాడాలని చూస్తున్నారు. సబ్‌ప్లాన్‌ నిధుల మళ్లింపు నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. నిరుద్యోగ భృతికి సబ్‌ప్లాన్‌ డబ్బు ఎలా ఖర్చుచేస్తారని పలువురు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.. ఈ నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

08:51 - May 18, 2017

గుంటూరు : ఏపీ కొత్త రాజధానిలో శాసనసభా భవనం నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. రాజధాని నిర్మాణాల్లోనే తలమానికంగా ఉండేలా భవనాన్ని నిర్మిస్తామంటోంది ప్రభుత్వం. అందుకు 160 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తున్నారు. ఇందులో 140 ఎకరాలు ప్రాంగణం కోసం కేటాయిస్తున్నారు. ప్రాంగణంలో జల, హరిత అవసరాలకోసం వదిలేస్తున్నారు. మొత్తం నగరానికే వన్నెతెచ్చేలా కొత్త అసెంబ్లీ బిల్డింగ్‌ నిర్మాణం జరగాలని సీఎం చంద్రబాబు సూచనలు చేసినట్టు తెలుస్తోంది. అమరావతి నగర నిర్మాణంపై వెలగపూడి సచివాలయం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.

90శాతం పూర్తయిన డిజైన్లు
కొత్త రాజధానిలో పరిపాలనా నగర ప్రణాళికలు, డిజైన్లు రూపొందించే పని 90శాతం పూర్తయిందని సీఆర్‌డీఏ కమిషనర్‌ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈనెల 12 నుంచి 16 వరకు రాజధాని నగర నిర్మాణ డిజైన్లపై లండన్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ముఖ్యంగా అసెంబ్లీ బిల్డింగ్‌, పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌, జలవనరులపై నార్మన్‌బృందంతో విస్తృతంగా చర్చించినట్టు అధికారులు చెప్పారు. అటు ఈనెల 20న మలివిడత ఆకృతులు కూడా అందుతాయని సీఆర్‌డీయే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చింది. క్రిస్‌బెర్గ్‌ ఆధ్వర్యంలో అమరావతి నగర నిర్మాణ ప్రణాళిక ఇప్పటికే 90 శాతం పూర్తయినట్టు చెప్పారు. రాజధాని నగర నిర్మాణంలో సచివాలయ భవనం మరింత ప్రతిష్టాత్మకంగా ఉండేలా డిజైన్లు ఉండాలని సీఎం అధికారులకు సూచించారు. సెక్రెటేరియట్‌ బిల్డింగ్‌ 8 నుంచి 10 అంతస్తుల్లో కనీసం 5లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుందని సీఆర్‌డీఏ కమిషనర్‌ ముఖ్యమంత్రికి వివరించారు. మొత్తం 26 వేల మంది ఉద్యోగులకు కార్యస్థానంగా ఉండేలా సచివాలయ నిర్మాణం ఉంటుందన్నారు. సచివాలయం పరిసరాల్లో జల, హరిత ఆకర్షణలు కనువిందు చేస్తాయని తెలిపారు. భవిష్యత్తులో రాజధానిలో ఎలక్ట్రికల్‌ కార్లునడుస్తాయన్నారు. హైపర్‌లూప్‌ టెక్నాలజీ, మెట్రోరైలు , జలరవాణా, బిఆర్‌టీఆస్‌ వ్యవస్థలు ఉండేలా ప్రజారవాణా వ్యవస్థకు బృహత్‌ ప్రణాళికను రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.

మౌలిక సదుపాయాలు...
రాజధాని నగర నిర్మాణం, మౌలిక సదుపాయాలు, తదితర అంశాలతో త్వరలో అమరావతి పోర్టల్‌ను ప్రారంభిస్తున్నట్టు సీఆర్‌డీఏ కమిషనర్‌ తెలిపారు. దాంతోపాటు నగరంలో సౌరవిద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడంలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాంకేతిక పద్ధతులపై కూడా అధ్యయనం చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కి తెలిపారు. మరోవైపు రాజధానితోపాటు రాష్ట్ర వ్యాప్తంగా సౌరవిద్యుత్‌ వ్యవస్థలను ఏర్పాటు చేయడానికి సంకల్పిస్తున్నట్టు ముఖ్యమత్రి తెలియజేశారు. అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేస్తున్న ఇంధన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుకు అన్ని సన్నాహాలు పూర్తిచేయాలని ఇంధనశాఖ కార్యదర్శిని ఆదేశించారు సీఎం చంద్రబాబు. 

నేడు సీఎల్పీ భేటీ

హైదరాబాద్ : నేడు సాయంత్రం 5గంటలకు తెలంగాణ సీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ భేటీలో కోమటిరెడ్డిపై దాడి, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, ప్రస్తుతం రాజకియ పరిణామాలపై చర్చినున్నారు. 

నేడు, రేపు శ్రీనగర్ లో జీఎస్టీ సమావేశాలు

జమ్మూకాశ్మీర్ : నేడు, రేపు శ్రీనగర్ లో జీఎస్టీ మండలి సమావేశాలు నిర్వహించనున్నారు. ఏ వస్తువుకు, సేవకు పన్ను ఉండాలనే అంశంపై చర్చ జగరనుంది. ఈ సమావేశంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు ఆర్థిక మంత్రులు, అధికారులు పాల్గొనననున్నారు. 

Don't Miss