Activities calendar

19 May 2017

21:34 - May 19, 2017

ఢిల్లీ: జీఎస్‌టీ పరిధి నుంచి కీలకమై ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగాలకు మినహాయింపు నిచ్చినట్లు ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ తెలిపారు. జమ్ముకశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌లో జరిగిన జిఎస్‌ కౌన్సిల్‌ సమావేశం సర్వీస్‌ టాక్స్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. సేవా రంగానికి వర్తించే నాలుగు పన్ను రేట్లను కౌన్సిల్‌ నిర్ణయించింది. పన్ను రేట్లు 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం ఉన్నట్లు జైట్లీ తెలిపారు. ట్రాన్స్‌పోర్టు సర్వీసులకు 5 శాతం, లగ్జరీ సర్వీసులపై 28 శాతం పన్ను విధిస్తారు. కొత్త విధానం ప్రకారం రైలు, విమాన, రోడ్డు రవాణా సేవలపై 5 శాతం పన్ను విధిస్తారు. నాన్ ఏసీ రెస్టారెంట్ల సేవలపై 12 శాతం, బార్‌ అండ్‌ రెస్టారెంట్ల సేవలపై 18 శాతం, ఫైవ్ స్టార్‌ హోటళ్ళపై 28 శాతం పన్ను విధిస్తారు. రేస్‌క్లబ్‌, బెట్టింగ్‌, సినిమా హాల్స్‌పై 28 శాతం పన్ను ఉంటుంది. అయితే వెయ్యి కన్నా తక్కువ టారిఫ్‌గల హోటళ్ళను జీఎస్‌టీ నుంచి మినహాయించారు. బంగారంపై విధించాల్సిన పన్ను రేటును జూన్‌3న జరిగే జిఎస్‌టి కౌన్సిల్‌ సమావేశం నిర్ణయిస్తుందని జైట్లీ చెప్పారు. జిఎస్‌టి జూలై 1 నుంచి అమలులోకి తేవాలని కేంద్రం భావిస్తోంది. 

21:33 - May 19, 2017

ఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం మరిన్ని ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కార్తీపై మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసింది. కార్తీతో పాటు ఐఎన్‌ఎక్స్‌ మీడియా డైరెక్టర్స్‌ పీటర్‌ ముఖర్జియా, ఆయన భార్య ఇంద్రాణీ ముఖర్జియాపై ఈడీ కేసు నమోదు చేసింది. ఇంద్రాణీ, పీటర్‌ ముఖర్జీయాలకు చెందిన ఐఎన్‌ఎక్స్‌ మీడియాకు దొడ్డిదారిలో అనుమతులు మంజూరు చేయించినట్టు కార్తిపై ఆరోపణలున్నాయి. 2007లో అప్పటి ఆర్థికమంత్రిగా ఉన్న చిదంబరం ఈ మీడియా సంస్థకు క్లియరెన్స్‌ ఇచ్చారు. చిదంబరం, ఆయన కుమారుడు భారీగా ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో సిబిఐ కేసు నమోదు చేసింది. ప్రస్తుతం కార్తీ చిదంబరం లండన్‌లో ఉన్నారు.

21:32 - May 19, 2017

ఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌ స్కాంలో మాజీ బొగ్గు గనుల శాఖ కార్యదర్శి హెచ్‌సీ గుప్తాతో పాటు మరో ఇద్దరిని సీబీఐ కోర్టు దోషులుగా నిర్ధారించింది. మధ్యప్రదేశ్‌లోని ఓ ప్రైవేటు కంపెనీకి నిబంధనల ప్రకారం బొగ్గు తవ్వకాలకు అనుమతులు ఇవ్వకుండా అవినీతికి పాల్పడి ఇష్టానుసారంగా మరో కంపెనీకి కేటాయింపులు జరిపినందుకు గాను గుప్తాపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసును విచారించిన న్యాయస్థానం గుప్తాతో పాటు అప్పటి బొగ్గు గనులశాఖ ఉమ్మడి కార్యదర్శి కెఎస్‌.కోప్రా, బొగ్గు కేటాయింపుల డైరెక్టర్‌ కెసీ సమారియాను సీబీఐ దోషులుగా నిర్థారించింది. మే 22న కోర్టు దోషులకు శిక్షను ఖరారు చేయనుంది. హెచ్‌సి గుప్తా యూపీఏ హయాంలో బొగ్గు మంత్రిత్వ కార్యదర్శిగా పనిచేశారు. బొగ్గు కేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో గుప్తాపై 8 కేసులు నమోదయ్యాయి.

21:26 - May 19, 2017

హైదరాబాద్: మోదీ, కేసీఆర్‌ ప్రభుత్వాలపై సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌ ఫైర్‌ అయ్యారు. కేంద్రం రైతువ్యతిరేక విధానాలు అవవలంబిస్తోందన్నారు. రైతుల సమస్యలపై కేంద్రం నిర్లక్ష్యపూరింతంగా వ్యవహరించడం వల్లే .. దేశవ్యాప్తంగా అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు తెలంగాణలో మిర్చిరైతులు, ఉపాధిహామీ కూలీల సమస్యలపై బృందాకరత్‌ గళమెత్తారు. ఉపాధి హామీకూలీల పట్ల కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు నిర్దయగా ప్రవర్తిస్తున్నాయని ఆమె మండిపడ్డారు. జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు తెలంగాణలో 36శాతం మంది ఉపాధి హామీ కూలీలకు డబ్బులివ్వలేదని బృందాకరత్‌ అన్నారు. ఓవైపు తమ రాష్ట్రంలో 98శాతం ఆధార్‌కార్డులు ఇచ్చేశామని కేసీఆర్‌ ప్రభుత్వం చెప్పుకుంటోంది. కాని.. కేవలం ఆధార్‌కార్డు లేదన్న సాకుతో నిరుపేదల కడుపులు కొడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

21:25 - May 19, 2017

హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటయ్యాక తొలిసారిగా రాష్ట్ర పోలీస్‌ శాఖ విస్తృతస్థాయి సమావేశం జరిగింది.. హైదరాబాద్‌లోని నోవాటెల్ హొటల్‌లో ఈ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు.. ఎస్‌ఐ నుంచి డీజీ స్థాయివరకూ పోలీసులంతా ఈ సమావేశంలో పాల్గొన్నారు.. తెలంగాణ పోలీస్‌ లోగో జెండాను కేసీఆర్‌ ఆవిష్కరించారు..

పోలీస్‌ శాఖలో అమలవుతున్న విధివిధానాలపై...

పోలీస్‌ శాఖలో అమలవుతున్న విధివిధానాలు, అధునాతన పరికరాలు, షీటీమ్స్ పనితీరు, శాంతిభద్రతలు, కంట్రోల్‌ సిస్టమ్ వివరాలతో ఏర్పాటుచేసిన శిబిరాలను కేసీఆర్‌, మంత్రి నాయిని పరిశీలించారు.. ఉన్నతాధికారులను అడిగి పరికరాల పనితీరును తెలుసుకున్నారు. ఈ ప్రదర్శనలో ఓ పోలీసు శునకం కేసీఆర్‌కు పూల బొకె ఇవ్వడం ప్రత్యేక ఆకర్శణగా నిలిచింది.

పోలీసుల సహకారంవల్లే తెలంగాణ రాష్ట్రం...

ఉద్యమ సమయంలో పోలీసుల సహకారంవల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని కేసీఆర్‌ అన్నారు.. పోలీసులు తమ విలువైన సూచనలు, సలహాలు నిర్మొహమాటంగా తమకు అందజేయాలని సూచించారు.. త్వరలో పోలీసు శాఖలో ఖాళీగాఉన్న 15వేల పోస్టులను భర్తీచేస్తామని ప్రకటించారు.. హోంగార్డులను స్కేల్‌ ఎంప్లాయీస్‌గా పరిగణిస్తామని హామీ ఇచ్చారు..

శాంతి భద్రతలకు విఘాతం జరగకుండా...

శాంతి భద్రతలకు విఘాతం జరగకుండా పోలీసులు పకడ్బందీగా విధుల నిర్వహిస్తున్నారని మంత్రి నాయిని ప్రశంసించారు.. పోలీసుల అధునాతన వాహనాలు చూస్తే గుండాలు, రౌడీలకు దడ పుడుతోందని చెప్పారు.. సీసీ కెమెరాలతో నేరాలు తగ్గాయని తెలిపారు..తెలంగాణ పోలీసులు అద్భుతంగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు డీజీపీ అనురాగ్‌ శర్మ.. మంచి పనితీరువల్లే దేశవ్యాప్తంగా తెలంగాణ పోలీసులకు పేరువచ్చిందని అభినందించారు.. సీఎం సూచించినట్లుగా గుండుంబా, గుట్కా, పేకాటలను నిర్మూలించాలన్నారు.. మొత్తానికి పోలీసు అధికారులతో సమావేశమైన కేసీఆర్‌.. పోలీసుశాఖకు అన్నివిధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు..

20:09 - May 19, 2017

హైదరాబాద్: పోలీసోళ్లను ఆకాశానికి ఎత్తిన సీఎం కేసీఆర్.. అంతకంటే గొప్పోళ్లు లేరని అంటున్నారట, విశాఖలో ముగిసిన జనసేన సెట్ పరీక్ష...ఫలితాల విడుదల మీద పెరిగిన ఉత్కంఠ, తెలంగాణకు సరికొత్త సచివాలయమట...అమరవీరుల ఆత్మకు అసలైన శాంతట, ఆంధ్ర రాష్ట్రం ఆడోళ్లకు లోకేశం బంపర్ ఆఫర్....జలమణి పథకం కొలాయించిన అయ్యా, కొడుకు, మళ్లా మాట తప్పిన తెలంగాణ ప్రభుత్వం...15 రోజుల డీఎస్సీకి కడియం పాతర, ఎండలల్లోనే ఆమ్లేట్ వేసుకోని తింటున్న జనం...ఉష్ణోగ్రత కొలతకు మారిపోయిన ప్రమాణం. ఇత్యాది అంశాలతో మల్లన్న 'మల్లన్న ముచ్చట్లు కార్యక్రమంలో మన ముందుకు వచ్చారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

ఉత్తరాఖండ్‌లో విరిగిపడ్డ కొండచరియలు:చిక్కుకున్న 15వేల మంది

ఉత్తరాఖండ్: ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. విష్ణుప్రయాగ్-బద్రీనాథ్ మార్గం వెంబడి కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడటంతో ఆయా ప్రాంతాల్లో సుమారు 15 వేల యాత్రికులు చిక్కుకున్నారు. సమాచారమందుకున్న రెస్యూటీం అక్కడికి చేరుకుని సహాయక చర్యలను కొనసాగిస్తున్నది.

నీలోఫర్ ఆస్పత్రికి ప్రభుత్వం 569 పోస్టులు మంజూరు

హైదరాబాద్: నీలోఫర్ ఆస్పత్రికి ప్రభుత్వం 569 పోస్టులు మంజూరు చేసింది. 500 పడకల ఇంటెన్సివ్ కేర్ బ్లాక్ నిర్మాణానికి అనుమతి నేపథ్యంలో.. పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో అత్యధికంగా 281 స్టాఫ్ నర్స్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది.

19:50 - May 19, 2017

హైదరాబాద్: మోదీ హయాంలో మైనార్టీల పై దాడులు జరుగుతున్నాయని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బృందా కరత్ అన్నారు. బాగ్ లింగం పల్లిలో ని సుందరయ్య విజ్ఞాన్ కేంద్రంలో సుందరయ్య వర్ధంతి సభ జరిగింది.ఈ సభలో 'ప్రజా సమస్యలు ఎన్నికల సంస్కరణలు'సుందరయ్య స్మారక ఉపన్యాసం లో బృందాకారత్ మాట్లాడారు. ఈ సభలో సీపీఎం నేత రాఘవులు, ఎస్ వి కె ట్రస్ట్ చైర్మన్ ఎస్ వినయ్ కుమార్, సీపీఎం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. ఈ సందర్భంగా బృందా కరత్ మాట్లాడుతూ..ఉత్తేజకరమైన వ్యక్తి ఎవరన్నా వున్నారంటే సుందరయ్యే అని పేర్కొన్నారు. సుందరయ్య అధ్యయనం చేయడం అనేది ఒక ముఖ్యమైన విషయం. అంతే కాకుండా అనేక సమస్యలపై పోరాడారు. సుందరయ్య జీవితం నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాని పేర్కొన్నారు. సుందరయ్య లేని తెలంగాణ ఉద్యమాన్ని వూహించుకోలేమన్నారు. సుందరయ్యకు ఘన నివాళులు అర్పించేందుకు అవకాశం కల్పించిన ఎస్ వీకే కి ధన్యావాదాలు తెలిపారు. భారతదేశంలో హింస పెరిగిపోతోంది. మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయి. మోదీ ప్రధాని అయ్యాక ఆర్థిక అసమానతలు 10 శాతం పెరిగిపోయింది. జాతీయ సంపద సంపన్న వర్గాల చేతిలోకి వెళుతోంది అన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

19:08 - May 19, 2017

అమరావతి: ఓ వినూత్నమైన కార్యక్రమానికి నాంది పలికింది ఏపీ ప్రభుత్వం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో... మౌలిక సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబునాయుడు చర్యలు చేపట్టారు. తాజాగా రాష్ట్రంలో తాగునీటి సమస్యకు చెక్‌ పెట్టేందుకు జలవాణి పేరుతో కాల్‌సెంటర్‌ను ప్రారంభించారు.

కాల్‌సెంటర్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబునాయుడు....

ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండాగా ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దీనికోసం సరికొత్త విధానాలను అవలంబిస్తోంది. ఆధునిక టెక్నాలజీతో రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటుంది. గ్రామాల్లో నీటి సమస్యల పరిష్కారానికి జలవాణి పేరుతో శుక్రవారం కాల్‌సెంటర్‌ను ప్రారంభించారు. ఉండవల్లిలోని తన నివాసంలో చంద్రబాబునాయుడు ఈ కాల్‌సెంటర్‌ను ప్రారంభించారు. మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో రూపొందిన రియల్‌ టైం అలెర్ట్‌ మ్యానెజ్మంట్‌ సిస్టమ్‌ ద్వారా ఈ కాల్ సెంటర్‌ పనిచేయనుంది. కాల్‌సెంటర్‌ పనివిధానాన్ని పంచాయతీ రాజ్‌ శాఖ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు మానిటరింగ్‌ చేయనున్నారు.

గుంటుపల్లిలోనే జలవాణి కాల్‌ సెంటర్.....

గుంటుపల్లిలో ఏర్పాటు చేసిన కాల్‌సెంటర్‌లోనే, జలవాణి కాల్‌ సెంటర్‌ కూడా పనిచేయనుంది. 1800-425-1899 అనే టోల్‌ ఫ్రీ నెంబర్‌కు కాల్‌ చేసి ఫిర్యాదు చేస్తే... నీటి సమస్యను పరిష్కరించేందుకు సత్వర చర్యలు తీసుకుంటారు. కాల్‌సెంటర్‌కు వచ్చిన ప్రతి సమస్య పరిష్కారమైనది లేనిదీ క్షేత్రస్థాయి అధికార యంత్రాంగం...పై అధికారులకు సంబంధిత ఫొటోతో సహా నివేదించాల్సి ఉంటుంది. పైలెట్‌ప్రాజెక్ట్‌లో భాగంగా సుమారు 200 వందల కాల్స్‌ వచ్చాయని వాటిని పరిష్కరించడం జరిగిందని మంత్రి నారా లోకేష్‌ చెప్పారు. సమస్య ఉందని కాల్‌ చేస్తే వెంటనే నీరు అందిస్తామని...ఎలాంటి వ్యక్తిగత వివరాలు చెప్పాల్సిన పనిలేదని మంత్రి అన్నారు. అన్ని రకాలుగా ధ్రువీకరించుకున్న తర్వాతే... పై స్థాయి అధికారులు సమస్య పరిష్కారమైనట్టు నిర్ధారిస్తారు. ఈ కాల్‌ సెంటర్ విధానం సమగ్రంగా పనిచేస్తే.. గ్రామాల్లో నీటిసమస్య చాలా వరకు తీరుతుందని నిపుణులు భావిస్తున్నారు. 

19:05 - May 19, 2017

అమరావతి: జూన్ 2 నుండి 8వరకు జరగనున్న నవ నిర్మాణ దీక్ష ఏర్పాట్లను పరిశీలించడానికి ప్రభుత్వం మంత్రుల కమిటీని నియమించింది. మంత్రులు అచ్చెన్నాయుడు, సోమిరెడ్డి , కాల్వ శ్రీనివాసులు, గంటా శ్రీనివాస్, కామినేని కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీకి ప్లానింగ్ డిపార్ట్ మెంట్ సెక్రటరీ కన్వీనర్ గా ఉంటారు. నవ నిర్మాణ దీక్షకు సంబంధించిన వేదిక ఎంపిక, ఏర్పాట్లు, సూచనలపై ఈ కమిటి నిర్ణయం తీసుకోనుంది. 2015 లో గుంటూరులో, 2016లో తిరుపతిలో నవ నిర్మాణ దీక్షలను ప్రభుత్వం నిర్వహించింది. ఈ ఏడాది ఎక్కడ నిర్వహించాలనేది కమిటీ నిర్ణయించనుంది. 

19:04 - May 19, 2017

ప్రకాశం : చీరాల మండలం వాడరేవులో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మత్స్యకారులకు చెందిన 9 ఇళ్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. 5 లక్షల మేర నష్టం వాటినట్లు తెలుస్తోంది. పాకల దిబ్బ ప్రాంతంలోని ఓ ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. మరోవైపు వేడిగాలులు తోడవడంతో పక్కనే ఉన్న ఇళ్లకు మంటలు వ్యాపించాయి. సమయానికి అగ్నిమాపక సిబ్బంది ప్రమాదస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనా స్థలాన్ని పోలీసులతో పాటు రెవెన్యూ అధికారులు పరిశీలించారు. 

19:02 - May 19, 2017

క‌డ‌ప‌: అగ్రిక‌ల్చరల్‌ కాలేజీ విద్యార్థిని నాగ‌మ‌ల్లిక ఆత్మహ‌త్య కలకలం రేపింది. గురువారం రాత్రి హాస్టల్‌ రూంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. గమనించిన తోటి విద్యార్థినులు కళాశాల అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు, సిబ్బంది వచ్చేసరికే నాగ‌మ‌ల్లిక ప్రాణాలు కోల్పోయింది. ప్రస్తుతం కడప రిమ్స్ మార్చురీలో మృత‌దేహాన్ని ఉంచారు. నాగ‌మ‌ల్లికది అనంతపురం జిల్లా తాడిపత్రి మండ‌లం కొండాపురం గ్రామం. విద్యార్థిని ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియలేదు. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. 

19:01 - May 19, 2017

శ్రీకాకుళం : జిల్లాలో గార మండలంలో ట్రాన్ వరల్డ్ కంపెనీలో పనిచేసే గార్నెట్ కార్మికులు ఆందోళన బాట పట్టారు. కనీస సౌకర్యాలు కల్పించకుండా కంపెనీ నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ సిఐటియూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ను ముట్టడించారు. ప్రభుత్వం తమ సమస్యలపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో భారీ ఎత్తున కార్మికులు, సిఐటియూ నేతలు పాల్గొన్నారు. కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద నిరసన తెలుపుతున్న కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

19:00 - May 19, 2017

కడప : రాయచోటి నియోజకవర్గంలో టీడీపీ రోజురోజుకీ బలహీనపడుతోంది. పార్టీలోని సమస్యలు పరిష్కరించుకొని.. వచ్చే ఎన్నికలకు పార్టీని పటిష్టం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా పార్టీ నాయకులకు సూచించారు. అయితే రాయచోటిలో మాత్రం పార్టీలోని వర్గ విబేధాలు తారా స్థాయికి వెళ్లేలా కనిపిస్తోంది

రాయచోటి టీడీపీ బాధ్యుడిగా ఉన్న రమేశ్ రెడ్డి

పార్టీ నేతల మధ్య విబేధాలు కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. మరోవైపు ఈ విబేధాలే వైసీపీకి అనుకూలంగా మారుతున్నాయి. ప్రస్తుతం రాయచోటి టీడీపీ బాధ్యుడిగా ఉన్న రమేశ్‌ రెడ్డి.. మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు వర్గాల మధ్య పరిస్థితి ఉప్పు, నిప్పులా తయారైంది.

రమేశ్‌ రెడ్డికి రాయచోటి టీడీపీ బాధ్యతలు

కాంగ్రెస్‌ నుంచి టీడీపీలోకి వచ్చిన రమేశ్ రెడ్డికి రాయచోటి టీడీపీ బాధ్యతలు అప్పగించారు. రమేశ్‌ రెడ్డి తమ్ముడు శ్రీనివాస రెడ్డికి టీడీపీ జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు ఇచ్చారు. అయితే రమేశ్ రెడ్డి రాయచోటి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి.. మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు వర్గాన్ని దూరం పెడుతూ వచ్చాడు. దీంతో పార్టీలో తమకు ప్రాధాన్యత తగ్గుతోందని పాలకొండ్రాయుడు వర్గం భావిస్తోంది. అధిష్టానానికి ఫిర్యాదు చేసినా.. పెద్దగా ఫలితం లేకపోవడం పాలకొండ్రాయుడిని మరింత నిరాశకు గురి చేసింది. దీంతో పార్టీ మారాలనే ఆలోచనకు వచ్చినట్టు.. ఆయన వర్గీయులు చెబుతున్నారు.

పాలకొండ్రాయుడితో జగన్‌ మంతనాలు జరిపినట్టు వార్తలు

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జగన్‌.. పాలకొండ్రాయుడితో మంతనాలు జరిపినట్టు వార్తలొచ్చాయి. టీడీపీ నేతలు చొరవ తీసుకొని పాలకొండ్రాయుడిని బుజ్జగించారు. దీంతో కాస్త తగ్గిన పాలకొండ్రాయుడి వర్గం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీటెక్‌ రవికే మద్దతు తెలిపారు. కానీ పార్టీలో మాత్రం తమ ప్రాధాన్యత పెరగలేదన్న అసంతృప్తి పాలకొండ్రాయుడి వర్గంలో ఉంది. పనుల విషయంలో కూడా తమ పట్ల వివక్ష చూపుతున్నారన్న ఆందోళన ఉంది. వాస్తవంగా పాలకొండ్రాయుడు రాయచోటి నియోజకవర్గంలో మంచి సంబంధాలున్న నేత. సామాజికంగా కూడా పాలకొండ్రాయుడి వర్గానిది గెలుపోటములు శాసించే స్థాయి. పాలకొండ్రాయుడు పార్టీ మారితే టీడీపీ గెలవడం అసాధ్యమన్నది తెలుగు తమ్ముళ్ల మాటగా తెలుస్తోంది.

వైసీపీకి లాభిస్తోన్న టీడీపీ నేతల విబేధాలు

పార్టీ అధినేత మాత్రం కడప జిల్లా మీద ప్రత్యేక దృష్టి పెట్టి పని చేస్తోంటే.. నియోజకవర్గాల్లో నేతలు కుమ్ములాటలతో కాలం వెళ్లదీస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా టీడీపీలో ఇదే పరిస్థితి ఉంది. రాయచోటిలో వైసీపీ బలపడటానికి తెలుగుదేశం నేతలే కారణమన్నది పరిశీలకుల వాదన. టీడీపీ నేతల కుమ్ములాటలే.. వైసీపీకి లాభిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అధిష్టానం జోక్యం చేసుకోకుండా విస్మరిస్తే.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు రాయచోటిలో అంత సులువు కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

18:58 - May 19, 2017

అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై వైసీపీ ఎంపీలు రాజీనామాలకు సిద్ధపడతారా? పార్టీ అధినేత గతంలో చెప్పినట్టుగా రాజీనామాస్త్రం ప్రయోగిస్తారా? తాజాగా జరుగుతున్న పరిణామాలతో వైసీపీ ఎంపీలు.. రాజీనామాపై వెనక్కి తగ్గే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి జగన్‌ యూ టర్న్ తీసుకోవడానికి కారణాలు ఏంటనే అంశంపై ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి.

ఆసక్తికరంగా మారిన రాజీనామా అస్త్రం

నవ్యాంధ్ర ప్రత్యేక హోదాపై మొదటి నుంచి పోరాటం చేస్తున్న వైసీపీ ఎంపీలు.. రాజీనామా అంశంపై ఎటువైపు ప్రయాణం చేస్తున్నారు? ఇప్పుడు ఈ విషయం ఆసక్తికరంగా మారింది. హోదాపై కేంద్రప్రభుత్వం చేతులు ఎత్తేయడంతో.. వైసీపీ ఆందోళనలు, ధర్నాలు చేపట్టింది. అంతిమ అస్త్రంగా రాజీనామాస్త్రాలు ప్రయోగించేందుకు సిద్ధమయ్యింది.

రాజీనామాల కోసం ఎంపీలను ప్రిపేర్‌ చేసిన జగన్‌

వచ్చే పార్లమెంట్ సమావేశాల తర్వాత రాజీనామా చేసేందుకు రెడీ కావాలని.. ఎంపీలను జగన్‌ ప్రిపేర్ చేయడం కూడా జరిగింది. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలు వైసీపీ వ్యూహాలను మార్చినట్టుగా తెలుస్తోంది. అంతిమ అస్త్రంగా ఎంపీలతో రాజీనామాల అస్త్రం ప్రయోగించాలి అనుకున్న జగన్.. ఈ అంశంపై పూర్తిగా వెనక్కి తగ్గారు. హోదాపై తమ ఎంపీలు రాజీనామా చేస్తే పార్లమెంట్‌లో పోరాడేది ఎవరు అని జగన్ అంటున్నారు.

ప్రధాని మోదీని కలిసిన జగన్

గతంలో అరు నూరయినా ఎంపీలతో రాజీనామా చేయించి.. కేంద్రప్రభుత్వంపై పోరాడతామన్న జగన్‌ తాజాగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనక కొత్త ఎత్తుగడ ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల జగన్‌ ప్రధాని మోదీని కలిసిన తరువాత ఇద్దరి మధ్య.. రాజీనామాల అంశం కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. హోదాపై కేంద్రానికి ఉన్న అభ్యంతరాలు జగన్‌కు ప్రధాని వివరించారు. జగన్‌కు సంబంధించిన ఇతర వ్యక్తిగత అంశాలపై ఏనాడు లేని విధంగా పీఎం ప్రాధాన్యత ఇవ్వడంతో.. జగన్ వైఖరిలో మార్పు వచ్చినట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం మీద రాజీనామాల పై రూట్ మార్చిన జగన్‌ వ్యూహం.. ఏ విధంగా మలుపు తిరుగుతోందనే అంశం ఆసక్తికరంగా మారింది. 

18:55 - May 19, 2017

చిన్న సినిమాలకు పెద్ద హీరోగా మారి ..తన బ్లాక్ బస్టర్ రన్ ని కంటిన్యూ చేస్తున్న నిఖిల్ కేశవ అనే ఇంటెన్సిఫైడ్ సబ్జెక్ట్ తో ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పోస్టర్స్, టీజర్స్ తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథవిషయానికొస్తే..హీరో ఫ్యామిలీ మొత్తాన్ని ఒక యాక్సిడెంట్ ద్వారా నాశనం చేసిన పోలీసుల మీద పగతీర్చుకోవడం అనే సింగిల్ ఎలిమెంట్. వినడానికి ఇంత సింపుల్ గా ఉన్న ఈ కథని తన స్క్రీన్ ప్లేతో కొత్తగా మార్చి .. ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చెయ్యాలని చూశాడు డైరెక్టర్ సుధీర్ వర్మ. కథనం గురించి క్లుప్తంగా చెప్పాలంటే..కేశవ అనే లా స్టూడెంట్ చిన్నప్పుడే ఒక యాక్సిడెంట్ లో తన తల్లితండ్రులనుకోల్పోతాడు. ఆ యాక్సిడెంట్ కి కారణమైన పోలీస్ ఆఫీసర్స్ ని చంపుతూ.. ఒక్క క్లూ కూడా వదలకుండా..పోలీస్ డిపార్ట్ మెంట్ కి తలనొప్పిగా మారతాడు. అతని కేస్ ని ఇన్వెస్టిగేట్ చెయ్యడానికి స్పెషల్ ఆఫీసర్ గా అపాయింట్ అయిన ఈషాకొప్పికర్ తన తెలివితేటలతో.. ఆ హత్యలు చేసింది కేశవ అని కనుక్కొని అతన్ని అరెస్ట్ చేస్తుంది. ఇంటర్వెల్ లోనే హంతుకుడు అని తెలిసిన కేశవని స్పెషల్ ఆఫీసర్ ఈషా ఎలా డీల్ చేసింది..? అరెస్టయిన కేశవ ఎలా విడుదల అయ్యాడు..? తన పగను తీర్చుకున్నాడా లేదా అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటుల విషయానొకస్తే.. తన పర్ ఫార్మెన్స్ తో సినిమాను నిలబెట్టే సత్తా ఉన్న నిఖిల్ ఈ సినిమాకు కూడా బ్యాక్ బోన్ లా నిలిచాడు. ఓపెనింగ్ టూ ఎండింగ్ ఇంటెన్సిటీ నిండిన చూపులతో , మెచ్యూర్డ్ యాక్టింగ్ తో అద్బుతమైన హావభావాలను పలికిస్తూ.. కేశవ క్యారెక్టర్ ను ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చేశాడు. ఓపక్క తన పగ తీర్చుకుంటూ.. మరోపక్క రైట్ సైడ్ హార్టెడ్ పర్సన్ గా తన స్ట్రగుల్ చూపిస్తూ.. రెండు షేడ్స్ ని బాగా పోషించి మెప్పించాడు. పెళ్లిచూపులు సినిమాతో మంచి పర్ఫార్మర్ గా పేరుతెచ్చుకున్న రీతూవర్మకి ఈ సినిమాలో లిమిటెడ్ క్యారెక్టర్ దక్కినప్పటికీ ..దానిక పూర్తి న్యాయం చేసింది. ఇక ప్రియదర్శి, వెన్నెలకిషోర్, సత్య, కామెడీతో నవ్వించారు. ఇక ఒకప్పుడు తన బ్యూటీతో ఆడియన్స్ ని తెగ మెప్పించిన ఈషా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా మెప్పించడానికి ట్రై చేసింది. అయితే పూర్తిగా సక్సెస్ కాలేకపోయింది. ఇక రావురమేష్ , అజయ్, బ్రహ్మాజీ, రవిప్రకాష్ , జీవా తదితరులు అందరూ తమ పాత్ర పరిధిమేరకు 100పర్సెంట్ నటించారు.

ఇక టెక్నీషియన్స్ విషయానొకస్తే.. స్వామిరారాతో సెన్సేషనల్ హిట్ , దోచెయ్ తో డిజాస్టర్ అందుకున్న డైరెక్టర్ సుధీర్ వర్మ మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి, కసిగా, పకడ్బందీగా కేశవ స్క్రిప్ట్ ను తయారుచేసుకున్నాడు. ఈ ధ్రిల్లర్ మూవీని అవసరమైన మేరకు కామెడీతో టచప్ చేస్తూనే .. బాగానే డీల్ చేశాడు. అయితే ఫస్టాఫ్ వరకూ చాలా పక్కాగా , గ్రిప్పింగ్ గా నడిచిన సినిమా.. సెకండాఫ్ లో గాడి తప్పింది. సింగిల్ పాయింట్ తో స్టోరీ అల్లుకోవడం వల్ల, ఇంటర్వెల్ తోనే కథ క్లైమాక్స్ కి చేరుకోవడంతో, ఛాలెంజింగ్ గా మారిన సెకండాఫ్ ని కాస్త తడబడుతూ నడిపించాడు. తాను అనుకున్నంత స్తాయిలో సినిమా అవుట్ పుట్ లేకపోయినా.. చాలావరకూ మేనేజ్ చేశాడు. కెమెరామెన్ దివాకర్ మణి.. ఈ సినిమా డైరెక్టర్ కి చాలా సపోర్ట్ గా నిలిచాడు, కామెడీని, థ్రిల్లర్ మూడ్ ని అతను బ్లెండ్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. సినిమాలో చాలాచోట్ల అతని పనితనం కనిపిస్తుంది. ఇక సుధీర్ వర్మ కి పర్మెనెంట్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన సన్నీ.m.r పాటలకు స్కోప్ తక్కువగా ఉండడంతో.. ఉన్నంతలోనే తన మార్క్ ఎలివేట్ అయ్యేలా మ్యూజిక్ ఇచ్చాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన ప్రశాంత్ పిళ్లై సినిమాకి హార్ట్ లాంటి నేపధ్య సంగీతంతో చాలా ప్రయోగాలు చేశాడు. అవన్నీ బాగా వర్కవుట్ అయ్యి సినిమా మూడ్ ని కాపాడాయి. ప్రొడ్యూసర్ అభిషేక్ నామా.. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాకు అవసరమైన మేర ఖర్చు చేశారు. కష్ణచైతన్య, అర్జున్ కార్తీక్ ఇద్దరూ కలిసి సుధీర్ వర్మ పాయింట్ ఆఫ్ వ్యూ లో కరెక్ట్ గా సింక్ అయ్యేలా తక్కువ మాటలతో ఎక్కువ భావాలు కన్వే అయ్యేలా చేశారు. మిగతా డిపార్ట్ మెంట్స్ అన్నీ.. డైరెక్టర్ విజన్ ను ఎలివేట్ చేస్తూ.. హండ్రెడ్ పర్సెంట్ అవుట్ పుట్ ఇచ్చాయి.

ఓవరాల్ గా చెప్పాలంటే.. ఈ సినిమాకు ఫుల్ ఫామ్ లో ఉన్న నిఖిల్ తో పాటు.. గంటా 59 నిమిషాల షార్ట్ రన్ టైమ్ బాగా హెల్ప్ అయ్యింది. బి, సి సెంటర్స్ లో కాస్త్ అటూ, ఇటూ గా రిసీవింగ్ ఉన్నా,, మల్టీప్లెక్స్ లో మాత్రం బాగా ఫేర్ చేస్తుంది అనడంలో మాత్రం నోడౌట్. థ్రిల్లర్ ఎలిమెంట్స్, కామెడీ పంచెస్, కరెక్ట్ గా కనెక్ట్ అయితే.. సినిమా రేంజ్ మరో విధంగా ఉంటుంది.

 

ప్లస్

నిఖిల్ పర్ఫార్మెన్స్

గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే

సినిమాటోగ్రఫీ

కామెడీ

బ్యాక్ గ్రౌండ్ స్కోర్

 

మైనస్..

స్పాన్ లేని కథ

సెకండాఫ్ లో గాడి తప్పిన కథనం

రాంగ్ కాస్టింగ్

తేలిపోయిన క్లైమాక్స్

 

రేటింగ్ కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

18:48 - May 19, 2017

హైదరాబాద్‌ : నగరవాసులను హోర్డింగ్స్‌ భయపెడుతున్నాయి. నగరవ్యాప్తంగా భారీ ఎత్తున హోర్డింగ్స్‌ ఏర్పాటు చేయడంతో.. చిన్న గాలి దుమారానికే కూలిపోతున్నాయి. ఏ క్షణాన ఏ హోర్డింగ్‌ కూలుతుందోనన్న టెన్షన్‌ ప్రజలను వెంటాడుతోంది. యాడ్‌ ఏజెన్సీలతో అధికారులు కుమ్మక్కై విచ్చలవిడిగా అనుమతులిస్తున్నారనే ఆరోపణలున్నాయి. గతేడాది హోర్డింగ్స్‌ కూలడంతో హడావుడి చేసిన జీహెచ్‌ఎంసీ.. నాలుగైదు హోర్డింగ్స్‌ కూల్చివేసి మూడు నెలల పాటు అనుమతులు ఇవ్వకుండా నిషేధం విధించారు. దీంతో జీహెచ్‌ఎంసీకి 10 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. తాజాగా గాలి దుమారానికి బంజారాహిల్స్‌, బాలానగర్‌లో హోర్డింగ్స్‌ కూలాయి. అయితే.. అధికారులు పరిశీలించిన హోర్డింగ్స్‌ కూలడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు హోర్డింగ్స్‌కు అనుమతులు మరో నెలపాటు నిషేధించారు. దీంతో మళ్లీ జీహెచ్‌ఎంసీకి నష్టం వాటిల్లే అవకాశం ఉంది. మరోవైపు హోర్డింగ్స్‌ కూలుతున్నా అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు. హోర్డింగ్‌ నిర్మాణ సామర్ధ్యాన్ని పరిశీలించిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  

16:45 - May 19, 2017
16:44 - May 19, 2017
16:42 - May 19, 2017

అమరావతి: ఉన్నత విద్యా మండలి విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుందని మంత్రి కాల్వ విమర్శించారు.. కేంద్ర హోంశాఖ నిర్ణయం రద్దు చేయాలని కోరుతూ లేఖ రాయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ పునర్విభజన చట్టం... కేంద్రం ఇచ్చిన హామీల ఆమలుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కాల్వ మాట్లాడుతూ... ఉన్నత విద్యా మండలి విషయంలో సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా కేంద్ర హోం శాఖ నిర్ణయం పై మంత్రి కాల్వ జూన్‌లో ఢిల్లీ వెళతామన్నారు.-కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలని కోరతామని, కేంద్రం నిర్ణయం అనుకూలంగా లేకుంటే సుప్రీంకోర్టుకు వెళతాం- కాల్వ స్పష్టం చేశారు. స్థానికతను మరో రెండేళ్లు పొడిగించాలని కేంద్రానికి లేఖరాయనున్నట్లు తెలిపారు. 

16:39 - May 19, 2017

పెద్దపల్లి : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. బయటకు రావాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. మధ్యాహ్నం సమయంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. అసలు ఎండలు ఎంతగా మండుతున్నాయంటే.. రోడ్డుపై ఉన్న వేడితోనే ఆమ్లేట్‌ వేసుకునే పరిస్థితికి చేరాయి. పెద్దపల్లి జిల్లా మంథనిలో ఎండలు ఎంతగా మండుతున్నాయో అధికారులకు తెలియజేసేందుకు కొంతమంది యువకులు రోడ్డుపైనే ఆమ్లేట్‌ వేసి చూపించారు. ఇది చూసిన ప్రజలంతా.. బాబోయ్‌ ఇవేమీ ఎండలురా బాబు అని భయపడుతున్నారు. ఇప్పటికైనా ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలు, మజ్జిగ ప్యాకెట్లు అందించాలని కోరుతున్నారు. 

16:37 - May 19, 2017

భద్రాద్రి : మంటలు అంటుకొని స్కూటర్‌ దగ్ధమైంది.. కృష్ణా జిల్లా బండిపాలెంకు చెందిన దంపతులు వివాహంకోసం భద్రాద్రి జిల్లా పాల్వంచకు వస్తున్నారు.. జూలూరుపాడు వచ్చాక ఎండ వేడికి స్కూటర్‌కు మంటలు అంటుకున్నాయి.. ఈ విషయం గమనించిన దంపతులు బండి దిగారు.. అంతలోనే మంటలు వేగంగా వ్యాపించి స్కూటర్‌ డిక్కీలోఉన్న 6వేల రూపాయలు కాలిబూడిదయ్యాయి.. 

16:35 - May 19, 2017

కర్నూలు : జిల్లాలోన ఓ కారులో మంటలు అంటుకున్నాయి.. నందనవనం దగ్గర ఎండవేడికి కారులో మంటలు చెలరేగాయి. మంటల్ని గమనించిన ప్రయాణికులు వెంటనే కారులో నుంచి కిందకు దిగారు. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది కారులో మంటల్ని అర్పేశారు. అప్పటికే కారు కాలిబూడిదైంది. ప్రయాణికులు మంత్రాలయం నుంచి ఎమ్మిగనూరు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. 

16:34 - May 19, 2017

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగభగ మండుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే ఎండలు భారీగా ఉండడంతో ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా తిరువూరులో అత్యధికంగా 47.75 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలోని చాలా ప్రాంతాల్లో 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఇక తెలంగాణలోని మంచిర్యాలలో అత్యధికంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. కొత్తగూడెంలో 46 డిగ్రీలు, ఖమ్మంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లోనూ ఎండలు ఇదేవిధంగా మండుతున్నాయి. ఇక హైదరాబాద్‌లో 41 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఎండలు భారీగా ఉండడంతో ప్రజలెవరూ మధ్యాహ్న సమయంలో బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. 

16:32 - May 19, 2017

అనంతపురం: రాయలసీమ రైతులు కరువుతో విలవిల్లాడుతుంటే.. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సీఐటీయూ ఏపీ రాష్ట్ర కార్యదర్శి ఎంఏ గఫూర్‌ విమర్శించారు. రాయలసీమ రైతులకు మద్దతుగా ఈనెల 24న బంద్‌కు అన్ని కార్మిక వర్గాలు మద్దతు ఇస్తున్నాయని చెప్పారు. విజయవాడలో జరిగిన ప్రెస్‌మీట్‌లో వామపక్ష కార్మిక సంఘం నాయకులు మాట్లాడారు. చంద్రబాబు పాలనలో రైతులు, కూలీలు గ్రామాలను వదిలి వలసలు పోతున్నారని ఎంఏగఫూర్‌ అన్నారు. 

16:29 - May 19, 2017

హైదరాబాద్: రైతులకు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నగదు సాయాన్ని కౌలు రైతులకు కూడా నేరుగా అందించాలని కౌలు రైతుల సంఘం డిమాండ్‌ చేసింది. స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం రుణాలు అందించాలని కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పలువురు డిమాండ్‌ చేశారు. కౌలు రైతుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. కౌలు రైతులకు రుణాలివ్వాలని.. ఇందుకోసం బ్యాంకుల ఎదుట ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించినట్లు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్‌ తెలిపారు.

 

జూన్ లో ఢిల్లీకి - కాల్వ శ్రీనివాసులు..

విజయవాడ : ఏపీ పునర్ విభజన చట్టం..కేంద్రం ఇచ్చిన హామీల అమలుపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఉన్నత విద్యా మండలి విషయంలో సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుందని, కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతామని మంత్రి కాల్వ శ్రీనివాసులు వెల్లడించారు. జూన్ లో ఢిల్లీ వెళుతామని, కేంద్రం నిర్ణయం అనుకూలంగా లేకుంటే సుప్రీంకోర్టుకు వెళుతామన్నారు. స్థానికతను మరో రెండేళ్లు పొడిగించాలని కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

15:37 - May 19, 2017

జూనియర్ ఎన్టీఆర్ మరోసారి అదరగొట్టేందుకు రెడీ అవుతున్నాడు. ‘జనతా గ్యారేజ్' విజయం అనంతరం 'జై లవకుశ'తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాణంలో తెరకెక్కుతున్న 'జై లవకుశ' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటిస్తున్నాడని..అందులో ఒక పాత్ర విలన్ అయి ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 20వ తేదీన ఎన్టీఆర్ జన్మదిన శుభసందర్బంగా కొద్దిసేపటి క్రితం ఈ చిత్రానికి సంబంధించిన లుక్స్ విడుదల చేశారు. ఎన్టీఆర్ మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఒక చేతిలో సంకెళ్లు..మరొక చేతిలో గ్లాసెస్ పట్టుకుని దండం పెడుతున్నట్లుగా మరొక ఫొటోలో ఎన్టీఆర్ కనిపిస్తున్నాడు. ఈ రెండు చిత్రాల్లో ఎన్టీఆర్ వెనుక వైపున రావాణాసురుడి బొమ్మ కనిపిస్తోంది. కానీ ఈ సినిమాలో మూడు పాత్రలు పోషిస్తున్నారా ? లేదా ? అనేది తెలియరావడం లేదు. బాబీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

15:27 - May 19, 2017

మెగాస్టార్ 'చిరంజీవి' రీ ఎంట్రీ అనంతరం పలువురు దర్శక, నిర్మాతలు ఆయన కాల్షిట్ల కోసం వేచి చూస్తున్నారంట. ఇందు కోసం పక్కా స్ర్కిప్ట్ లు సైతం తయారు చేస్తున్నారని తెలుస్తోంది. చాలా ఏళ్ల తరువాత 'చిరంజీవి' ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చి తన సత్తా ఏంటో చూపెట్టాడు. అనంతరం 151సినిమా కోసం 'చిరు' ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాడు. సురేంద్ రెడ్డి దర్శకత్వంలో 'ఉయ్యాలవాడ నరసింహరెడ్డి' జీవిత కథను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. తాజాగా 'చిరంజీవి' కోసం బోయపాటి పవర్ ఫుల్ స్ర్కిప్ట్ ను రాస్తున్నట్లు సోషల్ మాధ్యమాల్లో వార్తలు వెలువడుతున్నాయి. గతంలో 'భద్ర’, 'తులసి’, 'సింహ’, 'దమ్ము’, 'లెజెండ్’, 'సరైనోడు' వంటి మాస్ ఎంటర్‌టైనర్స్‌ని బోయపాటి తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా 'చిరంజీవి'ని ఇంతకు ముందెప్పుడూ లేనంత పవర్‌ఫుల్ పాత్రలో చూపించనుందని తెలుస్తోంది.

15:06 - May 19, 2017

పలు రకాల కూరగాయల్లో వివిధ పోషకాలు లభ్యమౌతుంటాయన్న సంగతి తెలిసిందే. అందులో బీన్స్ కూడా ఒకటి. బీన్స్ తినడం ఎంతో మంచిదని..ఎముకలు ధృడంగా ఉండేందుకు దోహదం చేస్తాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. బీన్స్ లో విటమిన్ బీ 6, థయామిన్‌, విటమిన్‌ సి లభిస్తాయి. దీనితో బీన్స్ తినడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరగడమే కాకుండా ఎముకలకు బలం చేకూరుతుంది. రక్త ప్రసరణను మెరుగు పరుసాతయి..మధుమేహం దరిచేరదు..రక్తంలోని కొలెస్ట్రాల్ తగ్గుతుంది..జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది..వాయు సంబంధిత రోగాలను దూరం చేస్తుంది..ఇలా ఎన్నో లాభాలున్నాయి. బీన్స్‌లో పీచు, విటమిన్‌ ఎ, బి, కె, ఫోలేట్‌, మెగ్నీషియం వంటివి ఉంటాయి. మధుమేహ సమస్య ఉన్నవారు రోజుకు ఒక కప్పు బీన్స్‌ తీసుకుంటే వ్యాధి తీవ్రతను తగ్గించుకోవచ్చు.

ముగిసిన జీఎస్టీ సమావేశాలు..

శ్రీనగర్ : రెండు రోజుల పాటు జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశాలు కొద్దిసేపటి క్రితం ముగిశాయి. జూన్ 3వ తేదీన ఢిల్లీలో మరోసారి జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. జీఎస్టీ నుండి వైద్య, విద్య రంగాలకు మినహాయింపు ఇచ్చారు.

శ్రీకాకుళం బస్తీలో అగ్నిప్రమాదం..

హైదరాబాద్ : కూకట్ పల్లి శ్రీకాకుళం బస్తీలోని స్ర్కాప్ గౌడోన్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంటలు ఎగిసి పడుతున్నాయి.

14:58 - May 19, 2017

టాలీవుడ్ నటి 'సమంత'కు వడదెబ్బ తగిలిందని తెలుస్తోంది. దీనితో సినిమా షూటింగ్ వాయిదా వేశారని టాక్. రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్ లో ఓ చిత్రం తెరెకెక్కుతున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఈ షూటింగ్ జరుగుతోంది. అధిక ఉష్ణోగ్రతల నడుమ షూటింగ్ లో హీరో రామ్ చరణ్ పాల్గొంటుండడం విశేషం. కానీ మొదటి షెడ్యూల్ లో 'సమంత'కు వడదెబ్బ తగలడంతో రాజమండ్రి షెడ్యూల్ ను నిర్మాతలు వాయిదా వేశారు. చిత్ర యూనిట్ జూన్ 1 నుండి రాజమండి పరిసర ప్రాంతాల్లో ఏకధాటిగా చిత్రీకరణ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో జగపతిబాబు, ప్రకాష్ రాజ్, ఆది కీలక పాత్రలు పోషిస్తున్నారు.

14:52 - May 19, 2017

హైదరాబాద్: ఆదర్శ లక్షణాలు మూర్తీభవించిన నేత సుందరయ్య అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కొనియాడారు. సుందరయ్య వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సైద్ధాంతిక క్రమశిక్షణ గల నేత సుందరయ్య అని తమ్మినేని అన్నారు. ప్రపంచంలోనే గొప్ప నాయకుల్లో సుందరయ్య ఒకరని, నేటి తరానికి ఆయన జీవితం ఆదర్శప్రాయమని అన్నారు. ఆయన స్ఫూర్తితో తెలంగాణలో ప్రజారాజ్య స్థాపనకు కృషి చేస్తామన్నారు. 

14:50 - May 19, 2017

హైదరాబాద్: కూకట్‌పల్లి శ్రీకాకుళం బస్తీలో అగ్నిప్రమాదం జరిగింది. స్క్రాప్ గోడౌన్‌లో భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. 

 

14:48 - May 19, 2017

హైదరాబాద్: గ్రామీణ రహదారులు..నరకానికి నకళ్లు. ఎక్కడ చూసినా గుంతలే. బైక్‌ మీద వెళ్లినా, ఆటోలు, బస్సులో ప్రయాణించినా నడుములు విరిగే పరిస్థితి. ఇటువంటి రోడ్లకు ఇకపై మహర్దశ పట్టనుంది. అన్ని రహదారులను అద్దంలా మెరిసిపోయేలా అందంగా తీర్చి దిద్దాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

రోడ్లు సౌకర్యంలేని పంచాయతీలు 423 ......

తెలంగాణలో ఇంకా చాలా గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు. మొత్తం 423 గ్రామ పంచాయతీలకు రహదారులు లేవు. అలాగే 5,534 కాలనీలకు రోడ్డు సౌకర్యంలేదు. కొత్త రోడ్లు మంజూరులో వీటికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ యోజన కింద కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి. కానీ రోడ్ల నిర్మాణంలో మాత్రం జాప్యం జరుగుతోంది. దీంతో గ్రామాల్లో రోడ్ల పరిస్థితి మెరుగుపడంలేదు. ఇకపై ఈ దుస్థితికి స్వస్తి పలికేందుకు గ్రామీణ రహదారుల అభివృద్ధి సంస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పీఎంజీఎస్‌వై కింద 2001 నుంచి ఇప్పటి వరకు 2,496 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. మొత్తం 10,184 కి.మీ. రోడ్లు నిర్మించారు. మరో 51 రోడ్లు, 26 వంతెనల నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉంది. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ యోజన పథకం కింది 2016-17లో మంజూరైన 205.65 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. వీటితో చేపడుతున్న 37 రోడ్లు, 117 వంతెనల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాణ్యతతో పనులు చేపట్టేందుకు ప్రత్యేక నిఘా పెడతారు.

రోడ్ల నిర్మాణానికి బ్యాంకు రుణాలు .....

కొత్తగా నిర్మించాల్సిన రహదారులకు సమగ్ర ప్రాజెక్టు నివేదికలను వారం రోజుల్లో రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంచనాలు పెంచకుండా చూసేందుకు ప్రత్యేక అధికారులకు బాధ్యతలు అప్పగిస్తారు. నిధుల కొరత ఉంటే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని రోడ్లను నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు జారీ చేసింది. రోడ్లు వేసే కాంట్రాక్టర్లకే నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గుంతలు పడినా కాంట్రాక్టర్లే మరమ్మతులు చేసేలా నిబంధనలను రూపొందించారు. వర్షాకాలం ప్రారంభమయ్యేలోగా ప్రస్తుతం ఉన్న రోడ్లకు రిపేర్లు చేయాలని సర్కారు నిర్ణయించింది. 

14:43 - May 19, 2017

సిద్ధిపేట: తెలంగాణలో ధాన్యం రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పండించిన వరి ధాన్యాన్ని మార్కెట్‌ యార్డులకు తీసుకొస్తున్నా వ్యాపారాలు, అధికారులు కొగుగోలు చేయడంలేదు. వీరి తీరును నిరిసిస్తూ సిద్దిపేట జిల్లా పుల్లూరు రైతులు రాస్తో రోకో చేశారు. అధికారులు, వ్యాపారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

14:41 - May 19, 2017

నిజామాబాద్: ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు, అధికారులు ముందుకు రాకపోవడంతో కడపుమండిన నిజామాబాద్‌ జిల్లా నవీపేట రైతులు రోడ్డెక్కారు. రోడ్డపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారులు, వ్యాపారుల నిర్లక్ష్యంతో ఎండబెట్టిన ధాన్యం వర్షానికి నష్టపోవాల్సి వస్తోందని అన్నదాతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

14:40 - May 19, 2017

విశాఖ:జనసేన కార్యకర్తల ఎంపిక ప్రక్రియలో భాగంగా ఈరోజు విశాఖపట్నంలో పరీక్ష నిర్వహించారు. ఈ టెస్ట్‌కి పెద్దసంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. ఈ పరీక్షా ఫలితాలను జనసేన హెడ్‌ ఆఫీస్‌లో పరిశీలించి యువకులను ఎంపిక చేయడం జరుగుతుందని నిర్వాహకులు చెప్పారు. కాగా ఈ పరీక్షలు 'టాలెంట్‌'కి కొలమానంలా భావించవద్దని, మంచి ఆలోచనలున్నవారినిరాజకీయాల్లోకి తీసుకురావడమే తమ ఉద్దేశమని పవన్‌ కల్యాణ్‌ ప్రకటించడంతో ఈ పరీక్షలు చర్చానీయాంశంగా మారాయి.

తెలంగాణలో అధిక ఉష్ణోగ్రతలు..

హైదరాబాద్ : తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం నాటికి నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు విడుదల చేశారు. కొత్తగూడెం, ఖమ్మంలో 46 డిగ్రీలు..నల్గొండ, ఆదిలాబాద్, మంచిర్యాలలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

14:00 - May 19, 2017

‘బాహుబలి-2’ మరో రికార్డును సొంతం చేసుకుంది. 'బాహుబలి’ సినిమాతో తెరకెక్కించిన రాజమౌళి టాలీవుడ్ సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాడు. మొదటి పార్ట్ లో పలు సందేహాలను 'బాహుబలి -2’ సినిమాలో నివృత్తి చేశాడు రాజమౌళి. మూడు వారాల కింద ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన ఈసినిమా రికార్డులు సృష్టించింది. రిలీజ్ అయిన కొద్ది రోజులకే వేయి కోట్ల మైలు రాయిని దాటి కొత్త రికార్డును నెలకొల్పింది. బాలీవుడ్ ఇటీవలే విడుదలైన ప్రముఖ హీరోల చిత్రాలను సైతం 'బాహుబలి-2’ సినిమా దాటి వేసింది. రాజమౌళి దర్శకత్వ ప్రతిభ..ప్రభాస్..రానా..అనుష్క..నాజర్..రమ్యకృష్ణ నటనపై ఎంతో మంది ప్రశంసల జల్లు కురిపించారు. తాజాగా ఈ సినిమా కలెక్షన్లు రూ. 1500 కోట్లను దాటాయని ఇండస్ట్రీ ట్రాకర్ రమేష్ బాలా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించాడు. ఇండియాలో రూ. 1,227 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 275 కోట్లను వసూలు చేసిందని మొత్తం రూ. 1,502 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయని ఆయన వెల్లడించారు, వేసవి సెలవులు కొనసాగుతూ ఉండటంతో ఇక రూ. 2 వేల కోట్ల కలెక్షన్స్ సాధిస్తుందని టాలీవుడ్ విశ్లేషకుల అంచనా.

13:45 - May 19, 2017

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్రస్థాయి పోలీస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎస్ఐ నుంచి డీజీపీ స్థాయి వరకు అధికారులు హాజరైయ్యారు. కేసీఆర్ తెలంగాణ పోలీస్ పతాకం, లోగోను ఆవిష్కరించారు. సమావేశంలో శాంతిభద్రతలు, టెక్నాలజీ సహా పలు అంశాలపై చర్చ జరపనున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తెలంగాణ పోలీస్ శాఖ పనితీరు దేశంలోనే నెంబర్ వన్ గా ఉందన్నారు. తెలంగాణ పోలీసులపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తుందని తెలిపారు. ఈ పనితీరు ఇంకా మెరుగుపడాలని అన్నారు. లంచాలు లేకుండా పోలీసులు ప్రజలకు సేవలు అందించాలని కోరారు. పోలీస్ శాఖలో ప్రమోషన్లు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. ప్రమోషన్లలె ఉన్నతాధికారులు నిర్లక్ష్యం వహించరాదని తెలిపారు. పెన్షన్ ల కోసం ఆఫీస్ ల చుట్టూ తిరగకుండా ఉండాలని..వెంటనే మంజూరు చేయాలని కోరారు. నిటైర్మెంట్ కంటే ముందే పెన్షన్ జాబితాను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.

13:42 - May 19, 2017

నిజామాబాద్ : ధర్మపురి శ్రీనివాస్‌... నిజామాబాద్‌ జిల్లా రాజకీయాలను మూడు దశాబ్దాలపాటు శాసించిన నేత. ఉమ్మడి ఏపీలో పీసీసీ అధ్యక్షుడిగా 2004, 2009లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చిన విజయసారధి. తెలంగాణ వచ్చిన తర్వాత అధికార టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇప్పుడు పార్టీలో ప్రాధాన్యతలేని నేతగా ముద్ర వేసుకున్నారు. టీఆర్‌ఎస్‌లో చేరిన తర్వాత డీఎస్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చారు. ఆ తర్వాత రాజ్యసభకు పంపారు. ఉమ్మడి ఏపీలో అటు రాష్ట్రంతోపాటు, ఇటు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన డీఎస్‌కు టీఆర్‌ఎస్‌లో అంత ప్రాధాన్యత లేకుండా పోయింది. జిల్లాలో పవర్‌ పాలిటిక్స్‌ ఎంపీ కవిత కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. దీంతో ఇప్పుడు డీఎస్‌ కిమ్మనండంలేదు. ఒప్పుడు డీఎస్‌ చెప్పిందే వేదం. అధికారులైనా, నేతలైనా శ్రీనివాస్‌ చెప్పినట్డు నడుచుకునేవారు. ఇప్పుడంతా కవిత ఆధిపత్యం కొనసాగుతోంది. డీస్సైనా, మరొకరైనా కవిత చెప్పినట్టు వినాల్సిందే. టీఆర్‌ఎస్‌లో ప్రాధాన్యత లేకపోవడంతో అటు ఢిల్లీ, ఇటు హైదరాబాద్‌కే పరిమితం అవుతున్నారు. ఏదైనా శుభకార్యం జరిగితే నిజామాబాద్‌ వచ్చిన హాజరై వెళ్తారు. తెలిసిన వారు ఎవరైనా చనిపోతే పరామర్శించి పోతారు. అధికార కార్యక్రమంల్లో పాల్గొనడం చాలా అరుదు.

అగమ్యగోచరంగా పరిస్థితి
డీఎస్సే కాదు, డీఎస్‌తోపాటు కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరిన అనుచరులకు కూడా టీఆర్ఎస్‌లో పెద్దగా ప్రధాన్యత లేకపోవడంతో ఇద్దరూ బాధపడుతున్నారు. కాంగ్రెస్‌ అధినాయకులు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలతో సన్నిహిత సంబధాలు నిర్వహించిన డీఎస్‌కు ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో ఒక్కసారిగా ప్రాధాన్యత తగ్గడంతో ఇతని అనుచరులు పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని భావిస్తున్నారు. డీఎస్‌ చెప్పినా పనులు కావడంలేదు, కవితతో చెప్పించుకునే పరిస్థితి లేకపోవడంతో వీరి పరిస్థితి అడకొత్తెరలో పోకచక్కచందగా మారిందన్న వాదనలు వినిపిస్తున్నారు. డీఎస్‌ను నమ్ముకున్న చోటా మోటా నేతలు... టీఆర్‌ఎస్‌ జిల్లా కమిటీల్లో స్థానం, జిల్లా స్థాయిలో ఉండే నామినేటెడ్‌ పదవులపై ఆశలు పెంచుకున్నారు. కానీ ఇప్పుడు కవిత చక్రం తిప్పుతోండటంతో తమ ఆశలు అడియాశలవుతున్నాయని బాధపడుతున్నారు. రెండికీ చెడ్డ రేవడి చందంగా మారిందని, అటు ఇంటి కూటికి, ఇటు బంతి కూటికి నోచుకోని పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

 

13:40 - May 19, 2017

కర్నూలు : తాళి కట్టి రాత్రికి రాత్రే పెళ్లికొడుకు పరారైన ఘటన.. కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. జూపాడు బంగ్లా గ్రామంలో వధువు నివాసంలో పెళ్లి చేసుకొని.. పెళ్లి కొడుకు పరారయ్యాడు. దీంతో పెళ్లి కూతురు తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఎంత వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో పోలీస్‌ స్టేషన్‌లో వరుడిపై.. పెళ్లికూతురు మిస్సింగ్‌ కేసు పెట్టింది. గతంలో కురుమూర్తికి వెస్ట్‌ గోదావరికి చెందిన అమ్మాయితో.. ఇది వరకే పెళ్లి జరిగింది. 5 లక్షల కట్నం, 10 తులాల బంగారంతో కురుమూర్తి ఉడాయించాడు. కురుమూర్తి మహబూబ్‌నగర్‌ జిల్లా, కొల్లపురం నివాసిగా తెలుస్తోంది. 

13:38 - May 19, 2017

నిజామాబాద్ : ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు, అధికారులు ముందుకు రాకపోవడంతో కడపుమండిన నిజామాబాద్‌ జిల్లా నవీపేట రైతులు రోడ్డెక్కారు. రోడ్డపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారులు, వ్యాపారుల నిర్లక్ష్యంతో ఎండబెట్టిన ధాన్యం వర్షానికి నష్టపోవాల్సి వస్తోందని అన్నదాతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అటు సిద్దిపేటలో కూడా రైతుల ధర్నా
తెలంగాణలో ధాన్యం రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పండించిన వరి ధాన్యాన్ని మార్కెట్‌ యార్డులకు తీసుకొస్తున్నా వ్యాపారాలు, అధికారులు కొగుగోలు చేయడంలేదు. వీరి తీరును నిరిసిస్తూ సిద్దిపేట జిల్లా పుల్లూరు రైతులు రాస్తో రోకో చేశారు. అధికారులు, వ్యాపారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

13:31 - May 19, 2017
13:30 - May 19, 2017

ట్రిపుల్ తలాక్ అంశం దాఖలైన అర్జిలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనంవిచారణ చేపట్టింది..... తండ్రి అంటే ఓ బాధ్యత కన్నతల్లి రూపన్ని కూతురిలో చూసుకుంటారు తండ్రులు మరి అటువంటి కూతురికి కష్టం వచ్చింది....అక్లాండ్ జరిగిన వరల్డ్ మాస్టర్స్ గేమ్ లో వంద మీటర్ల స్ప్రీంట్ లో బంగారు పథకం గెలుచుకున్నా 101 సంవత్సరాల బామ్మ మాన్ కౌర్ గుర్తున్నారా ఆమె మరో పోటీకి సిద్దమైయ్యారు... ట్రిపుల్ తలాక్ విచారిస్తున్న సుప్రీంకోర్టు ధర్మసనంలో మహిళలకు చోటు లేకపోవడం విచారకరమని జాతీయ మహిళ కమిషన చైర్మన్ లలితా కుమార్ మంగళం అన్నారు...ప్రముఖ బాలీవుడ్ నటి రీమా లాగ్ కన్నుమూశారు. బాలీవుడ్ అమ్మ పాత్రలకు వన్నే తెచ్చిన ఆమె గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాదపడుతున్నారు....వెండి కొండ పీవి సింధును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సబ్ కలెక్టర్ గా నియామించనుంది. 

13:29 - May 19, 2017

గుంటూరు : నవ్యాంధ్ర ప్రత్యేక హోదాపై మొదటి నుంచి పోరాటం చేస్తున్న వైసీపీ ఎంపీలు.. రాజీనామా అంశంపై ఎటువైపు ప్రయాణం చేస్తున్నారు? ఇప్పుడు ఈ విషయం ఆసక్తికరంగా మారింది. హోదాపై కేంద్రప్రభుత్వం చేతులు ఎత్తేయడంతో.. వైసీపీ ఆందోళనలు, ధర్నాలు చేపట్టింది. అంతిమ అస్త్రంగా రాజీనామాస్త్రాలు ప్రయోగించేందుకు సిద్ధమయ్యింది.

వచ్చే పార్లమెంట్ సమావేశాల తర్వాత రాజీనామా చేసేందుకు రెడీ కావాలని.. ఎంపీలను జగన్‌ ప్రిపేర్ చేయడం కూడా జరిగింది. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలు వైసీపీ వ్యూహాలను మార్చినట్టుగా తెలుస్తోంది. అంతిమ అస్త్రంగా ఎంపీలతో రాజీనామాల అస్త్రం ప్రయోగించాలి అనుకున్న జగన్.. ఈ అంశంపై పూర్తిగా వెనక్కి తగ్గారు. హోదాపై తమ ఎంపీలు రాజీనామా చేస్తే పార్లమెంట్‌లో పోరాడేది ఎవరు అని జగన్ అంటున్నారు.

జగన్ కొత్త ఎత్తుగడ....
గతంలో అరు నూరయినా ఎంపీలతో రాజీనామా చేయించి.. కేంద్రప్రభుత్వంపై పోరాడతామన్న జగన్‌ తాజాగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనక కొత్త ఎత్తుగడ ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల జగన్‌ ప్రధాని మోదీని కలిసిన తరువాత ఇద్దరి మధ్య.. రాజీనామాల అంశం కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. హోదాపై కేంద్రానికి ఉన్న అభ్యంతరాలు జగన్‌కు ప్రధాని వివరించారు. జగన్‌కు సంబంధించిన ఇతర వ్యక్తిగత అంశాలపై ఏనాడు లేని విధంగా పీఎం ప్రాధాన్యత ఇవ్వడంతో.. జగన్ వైఖరిలో మార్పు వచ్చినట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం మీద రాజీనామాల పై రూట్ మార్చిన జగన్‌ వ్యూహం.. ఏ విధంగా మలుపు తిరుగుతోందనే అంశం ఆసక్తికరంగా మారింది.

 

 

13:28 - May 19, 2017

శ్రీకాకుళం : ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధినేత.. జగన్‌ శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళ్లాడు. విశాఖ ఎయిర్‌ పోర్టు నుంచి రోడ్డు మార్గంలో జగన్‌ శ్రీకాకుళానికి చేరుకున్నారు. పాతపట్నం నియోజకవర్గంలోని హీర మండలంలో.. వంశధార ప్రాజెక్ట్ నిర్వాసితులతో ఆయన ముఖాముఖిలో పాల్గొన్నారు. 

13:26 - May 19, 2017

గుంటూరు : గ్రామాల్లో మంచినీటి సమస్య పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసింది. జలవాణి పేరుతో గుంటూరులో ఏర్పాటు చేసిన కాల్‌ సెంటర్‌ను పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి లోకేశ్‌ ప్రారంభించారు. ఈ కాల్‌ సెంటర్‌కు 18004251899 టోల్‌ ఫ్రీ నంబర్‌ను కేటాయించారు. 

13:25 - May 19, 2017

గుంటూరు : ప్రశాంత్ కిషోర్.. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ... 2014 ఎన్నికల్లో మోదీ విజయానికి కారణమైన ఈ పొలిటికల్‌ మైండ్.. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో తన ట్రిక్స్ ప్లే చేయడానికి సిద్ధమైపోయారు.. వైసీపీ, ప్రశాంత్‌ కిశోర్ ను ఈమధ్యే వ్యూహకర్తగా నియమించుకుంది. వైసీపీ అధినాయకత్వం ఆయనతో చేసుకున్న ఒప్పందం ప్రకారం నవంబర్‌ నుంచి పని మొదలు పెట్టాల్సి ఉన్నా.. ముందస్తు ఎన్నికల ప్రచారం.. రోజు రోజుకు మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ ఈ నెల రెండో వారం నుంచే తన పని మొదలు పెట్టారంటున్నారు... గోదావరి జిల్లాల్లో ఒక జిల్లాతో పాటు ఉత్తరాంధ్రలో రెండు జిల్లాలు.. రాయలసీమలో చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ప్రశాంత్ కిశోర్ అండ్ టీం పర్యటించినట్టు సమాచారం. పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్న ప్రశాంత్ అండ్ టీం ప్రస్తుత ప్రభుత్వ పథకాల అమలు తీరు... ప్రజలు ...ప్రభుత్వంపై ఏఏ విషయాల్లో సంతృప్తిగా ఉన్నారు.. ఏఏ అంశాలపై వ్యతిరేకతతో ఉన్నారో తెలుసుకునే సర్వే చేపట్టినట్టు సమాచారం. అన్ని వర్గాల ప్రజల స్పందన కనుగోనే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది... వైసీపీకి జిల్లాల్లో ఎంత బలం ఉందో అనే అంశాలు కాకుండా.. చంద్రబాబు పాలనపై, బీజేపీ పాలన, మోదీ చరిష్మా పై ప్రజల్లో స్పందన ఎలా ఉందో అన్న అంశాలపైనా ఆరా తీస్తున్నట్టు సమాచారం.

ప్రజా స్పందన....
పాలనపై అన్ని జిల్లాల నుంచి ప్రజా స్పందన తీసుకున్న తర్వాత... కులాల వారీగా.. అవి ప్రభావితం చేస్తున్న జిల్లాలు.. కులాల్లో బలమైన నాయకులు.. బూత్ ల వారీగా విశ్లేషణను ప్రశాంత్ టీం చేపట్టనుందంటున్నారు.. దీనిలో భాగంగా కాపు రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ, బీసీలు, మైనార్టీ వర్గాల్లో స్పందన .. ఎన్నికలపై ప్రభావం అనే అంశాలపై సర్వే నిర్వహిస్తారని తెలుస్తోంది. ఆ తర్వాత వైసీపీ కి గట్టి పట్టున్న ప్రాంతాలు... పట్టు లేని ప్రాంతాల్లో.. ఏం చేస్తే బలాన్ని పెంచుకోవచ్చు.. జగన్ వ్యకిగత ఇమేజ్, చరిష్మాను ఎలా పెంచడం అనే అంశాలపై దృష్టి పెడతారని చెబుతున్నారు.... ఈ తరహా సర్వేలు కంటిన్యూ గా చేసుకుంటూ ప్రతి నెలలో నాలుగోవారం మొత్తం కేవలం సమీక్షకే కేటాయించి... దాని బట్టి ప్రశాంత్‌ స్ట్రాటజీలో భాగంగా పొత్తులపై ప్రభావాన్ని ఎన్నికలకు ముందు మాత్రమే అంచనా వేస్తారు... కానీ బీజేపీతో చేతులు కలపడానికి తాము సిద్ధమనే సంకేతాలు జగన్ ఇచ్చిన సందర్భంలో ... వైసీపీ, బీజేపీ పొత్తుపై, వైసీపీ ఓటు బ్యాంకుతో పాటు, జనరల్‌ ఓటర్లలో ఎలాంటి ప్రభావం ఉందో కనుగోనే ప్రయత్నాన్ని టీం చేపట్టిదని తెలుస్తోంది.. 2014 ఎన్నికల్లో మోదీ అధికారంలోకి రావడానికి ప్రశాంత్ స్ట్రాటజీ వర్కవుట్ అయ్యింది.. అలాగే బీహార్ లో నితీష్ కోసం కూడా ప్రశాంత్ వ్యూహాలు రచించారు.... అయితే మొన్నటి ఎన్నికల్లో పంజాబ్ తప్పిస్తే యూపీతో పాటు మిగతా రాష్ట్రాల్లో ప్రశాంత్ కిశోర్ స్ట్రాటజీ కాంగ్రెస్ కు వర్కవుట్ కాలేదు.. ఈ దశలో వైసీపీ బలోపేతానికి ప్రశాంత్ స్ట్రాటజీ ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

 

అనిల్ ధవే అంత్యక్రియలు పూర్తి..

భోపాల్ : కేంద్ర మంత్రి అనిల్ మాధవ్ దవే అంత్యక్రియలు శుక్రవారం ముగిశాయి. మధ్యప్రదేశ్ లోని బంద్రభన్ నర్మదా నది తీరాన ఆయన అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించారు.

రణస్థలంలో జగన్..

శ్రీకాకుళం : రణస్థలం వద్ద జగన్ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే వరదా రామారావు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. 25 మంది సర్పంచ్..ఎంపీటీసీలు వైసీపీ కండువా కప్పుకున్నారు.

సీవీ ఆనంద్ పై కేసీఆర్ ప్రశంసలు..

హైదరాబాద్ : సివిల్ సప్లయి అధికారి, గతంలో సైబరాబాద్ కమిషనర్ గా పని చేసిన సీవీ ఆనంద్ పై సీఎం కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. ఆయన నిజాయితీ..పనిచేసే విధానం చూసి సివిల్ సప్లయి అధికారిగా నియమించే విధంగా చేయడం జరిగిందని, ఆయన నియామకం తరువాత ప్రభుత్వానికి రూ. 850 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే విధంగా చేశారని కితాబిచ్చారు.

పోలీసు శాఖకు రూ. 500 కోట్లు - కేసీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖకు అదనంగా రూ. 500 కోట్లు అందచేయనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. 806 పీఎస్ లు..716 సర్కిల్స్..సబ్ డివిజనన్లు 162...9 పోలీసు కమిషనరేట్స్..ఉన్నాయని, మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సిటీ పోలీసులను బాగా పనిచేస్తున్నట్లు వారిని అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. టీఎస్ ఐపాస్ విధానం కింద 3600 ఇండ్రస్ట్రీలకు 15 రోజుల్లో అనుమతి లభించడం జరిగిందని, 1500 పరిశ్రమలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఆరు నెలల్లో ప్రొడక్షన్ వచ్చే పరిస్థితి తెలంగాణలోనే ఉందని, హైదరాబాద్ సిటీలో పోలీసులు లంచాలు అడగడం లేదని ఇటీవలే జరిగిన ఓ వ్యాపారుల సమావేశం కితాబిచ్చిందన్నారు.

రిటైర్డ్ పోలీసుల సమస్యలు తీర్చాలి - కేసీఆర్..

హైదరాబాద్ : రిటైర్ అయిన అనంతరం పెన్షన్ కోసం పైరవీలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడడం సమాజానికి మంచిది కాదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఏ పోలీసు రిటైర్ అయ్యే సమయానికి ఆయనకు సంబంధించిన ఫైల్ రెడీగా ఉండే విధంగా చూడాలని డీజీపీకి సూచించారు. అధికారికంగా డిపార్ట్ మెంట్ వాహనంలో ఆయన ఇంటి వద్ద దింపే నూతన సంప్రదాయం కల్పించే విధంగా చూడాలన్నారు.

సంగారెడ్డిలో ఉత్తమ్..

సంగారెడ్డి : పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంగారెడ్డికి చేరుకున్నారు. జూన్ 1వ తేదీన నిర్వహించే బహిరంగసభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ‘తెలంగాణ ప్రజా గర్జన' పేరిట సభ నిర్వహించనున్నట్లు, తెలంగాణ మంచి కోరే వారు ప్రతొక్కరూ సభకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. మూడేళ్లలో 3వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, రైతులు పండించిన ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదని పేర్కొన్నారు.

టి.పోలీసు పతాకం..లోగో ఆవిష్కరణ..

హైదరాబాద్ : తెలంగాణ పోలీసు పతాకం..లోగోను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఆయన అధ్యక్షతనలో రాష్ట్ర స్థాయి పోలీసు విస్తృత స్థాయి సమావేశం జరుగుతోంది. ఎస్ఐ నుండి డీజీపీ స్థాయి వరకు అధికారులు హాజరయ్యారు. శాంతిభద్రతలు..టెక్నాలజీతో సహా పలు అంశాలపై చర్చ జరుగుతోంది.

 

11:43 - May 19, 2017
11:41 - May 19, 2017

కర్నూలు : జిల్లా జూపాడు మండలం బంగ్లాలో నవ వరుడి కురుమూర్తి పెళ్లైయిన కొన్ని గంటలకే పరారు. రూ. 5లక్షల కట్నం, 10 తులాల బంగారంతో ఉడాయించారు. తాళి కట్టి రాత్రికి రాత్రే పెళ్లికొడుకు పరారు అవడంతో వరుడిపై పెళ్లికూతురు కేసు పెట్టింది. రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో వరుడు ఉండాయించినట్లు తెలుస్తోంది. కురుమూర్తి సినిమా డైరక్టర్ గా చెప్పుకుని పెళ్లి చేసుకున్నారు.  

11:27 - May 19, 2017

చెన్నై : నేడు రజనీ అభిమానులతో చివరి సమావేశం నర్వహించనున్నారు. చివరి రోజు భేటీకి భారీగా అభిమానులు తరలివచ్చారు. ఈ సంద్భరంగా రజనీకాంత్ తమిళనాడు రాజకీయాలపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో మంచి నేతలు ఉన్నా వ్యవస్థలో మార్పు రాలేదని, ప్రస్తుతం రాజకీయ వ్యవస్థ అధ్వానంగా తయారైందని అన్నారు. రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలని ఆయన ఆకాక్షించారు. కర్ణాటకలో 23 ఏళ్లు ఉన్నా, తమిళనాడులో 43ఏళ్ల నుంచి ఉంటున్నానని తెలిపారు. కర్ణాటక వాడినైనా తమిళనాడు ప్రజలు ఆదరించారని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

11:25 - May 19, 2017

ఢిల్లీ : భారత సైనిక అమ్ములపొదిలో అత్యాధునిక ఆయుధాలు చేరనున్నాయి. అమెరికా నుంచి కొనుగోలు చేసిన అత్యంత శక్తివంతమైన హోయిట్జర్‌ శతఘ్నులు ఈ వారంలోనే మన దేశానికి రానున్నాయి. ముందు రెండు హోయిట్జర్‌ గన్‌లు మన సైన్యానికి అందుతాయి. మొత్తం 145 ఎం-777 అల్ట్రాలైట్‌ ఆర్టిలరీ గన్స్‌ను కొనుగోలుకు భారత్‌ అమెరికాల మద్య గత ఏడాది నవంబర్‌ 30న ఒప్పందం కుదిరింది. దీనిలో భాగంగా 25 శతఘ్నులను అమెరికాకు చెందిన బీఏఈ సిస్టమ్స్‌ సరఫరా చేస్తుంది. మిగిలిన 120 అల్ట్రాలైట్‌ ఆర్టిలరీ గన్‌లను మన దేశంలో కూర్పు చేస్తారు. ఈ శతఘ్నలు 30 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను చేధిస్తాయి. 1980లో స్వీడన్‌కు చెందిన వివాదాస్పద బోఫోర్స్‌ గన్స్‌ తర్వాత ఇలాంటి శతఘ్నలు మన దేశంలోకి రానున్నాయి. ఒప్పందం కంటే నెల రోజులు ముందుగానే బీఏఈ సిస్టమ్స్‌ హోయిట్జర్‌ శతఘ్నులను సరఫరా చేస్తోంది. 

11:22 - May 19, 2017

లక్నో : బాలీవుడ్‌ సినిమా మాదిరి త‌ల‌కు తుపాకీ పెట్టి పెళ్లి కుమారుడిని ఎత్తుకెళ్లిన రివాల్వర్ రాణి వ‌ర్షా సాహూను పోలీసులు బుందేల్‌ఖండ్‌లో అరెస్టు చేశారు. వ‌రుడు అశోక్ యాద‌వ్‌ త‌ర‌పున బంధువులు ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి కుమారుడి వద్దకు తాను పిస్తోల్‌తో వెళ్లాననడం అబద్ధమని ఆమె పోలీసుల‌కు చెప్పింది. అశోక్ త‌న‌ను ప్రేమించాడ‌ని, ఇష్టపూర్వకంగానే అత‌ను త‌న‌తో వ‌చ్చిన‌ట్లు వర్షా సాహు స్పష్టం చేసింది. ఇంతవరకు అశోక్ ఆచూకీ లభించలేదని పోలీసులు తెలిపారు.. ఇద్దరు వ్యక్తుల‌తో క‌లిసి ఎస్‌యూవీ కారులో వెళ్లిన వ‌ర్షా సాహూ పెళ్లి పీట‌ల మీద ఉన్న అశోక్‌ను ఎత్తుకెళ్లిన ఘ‌ట‌న ఉత్తరప్రదేశ్ హమీర్‌పూర్‌ జిల్లాలో సంచ‌ల‌నం రేపిన విషయం తెలిసిందే.

 

తాళి కట్టి వరుడు పరార్..

కర్నూలు : తాళి కట్టి రాత్రి రాత్రే వరుడు పరారయ్యాడు. ఈ ఘటన జుపాడు బంగ్లా గ్రామంలో చోటు చేసుకుంది. వరుడు కురుమూర్తిపై వధువు పోలీసులకు ఫిర్యాదు చేసింది. రూ. 5 లక్షల కట్నం, 10 తులాల బంగారంతో ఉడాయించాడు.

11:13 - May 19, 2017

టాలీవుడ్ లో ఓ జంటపై సోషల్ మాధ్యమాల్లో రకరకాలైన వార్తలు వైరల్ అవుతుంటాయి. వారి సంబంధించని విషయాలపై అభిమానులు ఆసక్తి కనబరుస్తుంటారు. టాలీవుడ్ మన్మథుడు 'నాగార్జున' తనయుడు 'నాగ చైతన్య'..’సమంతల' వివాహం ఈ సంవత్సరంలో జరగనుందని తెలుస్తోంది. ఇటీవలే వారి నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. అయితే పలు సందర్భాల్లో దిగిన ఫొటోలను 'సమంత' సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తోంది. కానీ తనకు మాత్రం అలా చేయడం నచ్చదని 'నాగ చైతన్య' పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో పంచుకోవడం నచ్చదని, కానీ శ్యామ్ మాత్రం ఫొటోలూ తీస్తూ పోస్టు చేస్తూ ఉంటోందన్నారు. కానీ అలా నచ్చకపోయినా తాను మాత్రం ఎంజాయ్ చేస్తున్నట్లు, పెళ్లికి ముందు ఈ ఎమోషన్స్..సెలబ్రేషన్స్ జీవితంలో ఒక్కసారి మాత్రమే వస్తాయని ఓ ఇంటర్వ్యూలో నాగ చైతన్య పేర్కొన్నట్లు సమాచారం. నాగ చైతన్య, రకూల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమా ఈనెల 26న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.

పోలీసు అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశం..

హైదరాబాద్ : వివిధ శాఖల అధికారులతో సమావేశాలు జరుపుతూ బిజీ బిజీగా ఉంటున్న సీఎం కేసీఆర్ నేడు పోలీసు శాఖ అధికారులతో సమావేశమయ్యారు. శాఖ పని తీరుపై ప్రత్యేకంగా సమీక్షిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్ ఐలతో సీఎం నేరుగా మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.

లాభాల్లో స్టాక్ మార్కెట్..

ముంబై : స్టాక్ మార్కెట్ శుక్రవారం లాభాల్లో పయనిస్తోంది. సెన్సెక్స్ 227 పాయింట్ల లాభంతో 30,662.37, నిఫ్టీ 71 పాయింట్ల లాభంతో 9,500 వద్ద కొనసాగుతున్నాయి.

 

సుందరయ్యకు తమ్మినేని ఘన నివాళి..

హైదరాబాద్ : సుందరయ్య వర్ధంతి సందర్భంగా సుందరయ్య పార్కులో ఆయన విగ్రహానికి సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నివాళులర్పించారు. ఆదర్శ లక్షణాలు మూర్తిభవించిన నేత సుందరయ్య అని, ఆయన స్పూర్తితో తెలంగాణలో ప్రజారాజ్యం స్థాపనకు కృషి చేయాలన్నారు. ప్రపంచంలోని గొప్ప నేతల్లో సుందరయ్య ఒకరని కొనియాడారు.

 

రాజకీయ వ్యవస్థ మారాలి - రజనీ..

చెన్నై : రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థ మారాల్సి ఉందని సినీ నటుడు రజనీకాంత్ పేర్కొన్నారు. ఆయన అభిమానులతో వరుసగా ఐదో రోజు భేటీ అయ్యారు. కాసేపటి క్రితం కీలక ప్రసంగం చేశారు. యుద్ధం ఇప్పుడు కాదని యుద్ధం వచ్చినప్పుడు చూద్దామని, తనకు అభిమానులే బలమని, వారు వెన్నంటి ఉంటే తనకు అపజయం కలగదని పేర్కొన్నారు.

రెండు గ్రామాలకు భూ సేకరణ నోటిఫికేషన్..

విజయవాడ : రహదారుల నిర్మాణానికి రాజధాని ప్రాంతంలోని రెండు గ్రామాలకు భూ సేకరణ నోటిఫికేషన్ ను అధికారులు విడుదల చేశారు. లింగాయపాలెం గ్రామానికి చెందిన 106 మంది రైతులకు సంబంధించిన 110.60 ఎకరాలు..నవలూరు 1లో 183.56 ఎకరాలకు నోటిఫికేషన్ ను జారీ చేశారు. నవలూరులో 1101 మంది భూ యజమానులు, 106 మంది నిర్వాసితులపై భూ సేకరణ ప్రభావం చూపనంది. మాస్టర్ ప్లాన్..రోడ్ల నిర్మాణంలో కుటుంబాలు నష్టపోనున్నాయి. 60 రోజుల్లోగా అభ్యంతరాలు తెలపాలని ప్రభుత్వం పేర్కొంది.

పాలిటెక్నిక్ విద్యార్థిని ఆత్మహత్య..

కడప : పాలిటెక్నిక్ విద్యార్థిని నాగమల్లికి సూసైడ్ చేసుకుంది. హాస్టల్ లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అగ్రికల్చర్ పాలిటెక్నిక్ సెకండియర్ చదువుతోంది.

బాలికపై కాంట్రాక్టర్ అత్యాచారం..

భద్రాద్రి కొత్తగూడెం : బాలికపై ఓ కాంట్రాక్టర్ అత్యాచారానికి ఒడిగట్టాడు. ఇల్లందు దాసరిగడ్డకు చెందిన వెంకయ్య కుటుంబాన్ని కూలీ పని కోసం అల్వాల్ కు కాంట్రాక్టర్ సురేష్ తీసుకెళ్లాడు. వెంకన్న కూతురిపై ఉమేష్ అత్యాచారానికి పాల్పడ్డాడు. అల్వాల్ పీఎస్ లో బాలిక తండ్రి వెంకన్న ఫిర్యాదు చేశాడు. పెద్ద మనుషుల సమక్షంలో సమస్యను పరిష్కరించుకోవాలని అల్వాల్ సీఐ, ఎస్ఐలు ఉచిత సలహా ఇచ్చారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కరెంటు పోల్ ను ఢీకొన్న కారు..

నాగర్ కర్నూలు : కొల్లాపూర్ (మం) అంకిరావుపల్లి వద్ద అదుపు తప్పి కరెంటు పోల్ ను కారు ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. మృతులు పెద్దకొత్తపల్లి (మం) కల్వకోలు వాసులుగా గుర్తించారు.

 

పుచ్చలపల్లికి బాబు నివాళి..

విజయవాడ : పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. ‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం' నినాదంతో పుచ్చలపల్లి తెలుగు జాతి ఐక్యతకు ఎంతో కృషి చేశారని, నీటి పారుదల రంగంలో సుందరయ్యకు ఎంతో పరిజ్ఞానం ఉందని కొనియాడారు. రాజకీయ సిద్ధాంతాలు ఏవైనా తుదిశ్వాస విడిచే వరకు సుందరయ్య నిజాయితీగా జీవించారన్నారు. విలువలతో కూడిన రాజకీయాలకు ప్రతినిధి అని ఆయన పీడిత ప్రజల కోసం పోరాడారని బాబు పేర్కొన్నారు.

11:06 - May 19, 2017

హైదరాబాద్ : హైదరాబాద్‌లోని ఫలక్‌నామా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దారుణం జరిగింది. ఒక మహిళ కాలిన గాయాలతో.. అనుమానాస్పదంగా చనిపోయింది. మహమ్మద్‌ హఫీజ్‌ భార్య.. జరీనా బేగం కాలిన గాయాలతో దారుణంగా చనిపోయింది. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

11:02 - May 19, 2017

కృష్ణా : కాసులపై తప్ప ప్రయాణీకులపై వారి అవసరాలపై ఎటువంటి చిత్త శుద్ధి.. ట్రావెల్ యజమానులకు ఉండదని మరోసారి స్పష్టమైంది. కృష్ణాజిల్లా, కంచికచర్ల మండలం కీసర టోల్గేట్ సమీపంలో హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్న ఎస్‌వీకేడీటీ బస్సు రాత్రి 2 గంటల సమయంలో సాంకేతిక కారణాల వల్ల జాతీయ రహదారిపై నిలిచిపోయింది. అప్పటి నుంచి ట్రావెల్ యజమానులకు విషయం చేరవేసేటప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని.. పరీక్షలు రాజేందుకు, ఇంటర్వ్యూ జాబ్‌లకు తదితర విలువయిన అవసరాలకు వెళ్తున్నామని కొందరు రిటర్న్‌ జర్నీ కూడా బుక్‌ చేసుకున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. అందరూ కలిసి స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

11:01 - May 19, 2017

కథనంతో ఎప్పటికప్పుడు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కొత్తదనం పంచుతున్న 'నిఖిల్' ‘కేశవ'తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కమర్షియల్ హీరోగా రాణిస్తూనే..వైవిధ్యభరితమైన కథలు ఎంచుకుంటూ 'స్వామిరారా'..’కార్తికేయ'..’ఎక్కడకు పోతావు చిన్నవాడా' వంటి డిఫరెంట్ కంటెంట్ ఉన్న మూవీల్లో నటించిన 'నిఖిల్' మరోసారి థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ముందుకొచ్చాడు. ఇక ఈ చిత్రానికి సంబంధించి వస్తే సెన్సార్ బోర్డు సభ్యులు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. సినిమా చూసినంత సేపు ప్రేక్షకులు థ్రిల్ అవడం ఖాయమని చిత్ర యూనిట్ నమ్మకంగా చెబుతోంది. ‘నిఖిల్' సినిమాల కోసం ఆసక్తిగా చూస్తున్న అభిమానులు ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుందని ధీమాతో ఉన్నారంట. 'కేశవ' సినిమాలో ఇంటర్వెల్ ట్విస్ట్ సినిమాకి టర్నింగ్ పాయింటు అవుతందని టాక్ వినిపిస్తోంది. ప్రేక్షకుడి ఊహకందకుండా ఇంటర్వెల్ ఉండబోతుందని, అనవసరపు సన్నివేశాలతో ప్రేక్షకులకు ఇబ్బంది కలుగకుండా దర్శకుడు పకడ్బందీ స్క్రీన్ ప్లేతో కథను నడిపించిచారని తెలుస్తోంది.
కానీ 'బాహుబలి -2’ ప్రభంజనం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో 'కేశవ' తట్టుకోగలుగుతాడా ? అనేది చూడాలి. ‘గొప్ప‌గా కొత్త‌గా చెప్ప‌టానికి నాది క‌థ కాదు బాధ.. నాకో ప్రాబ్ల‌మ్ వుంది. అంద‌రికి ఎడ‌మ వైపు వుండాల్సిన గుండె నాకు కుడి వైపు వుంది" అంటూ ‘కేశవ’ సినిమా ట్రైలర్‌తో 'నిఖిల్' అంచనాలు పెంచేశాడు. మరి 'కేశవ' సినిమా ఆకట్టుకుందా ? లేదా ? అనేది కొద్ది గంటల్లో తేలనుంది.

11:00 - May 19, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు 1720 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా గుర్తించిన లెక్క. పైగా ఆత్మహత్య చేసుకున్న వారిలో 680 కుటుంబాలకు తాము పరిహారం అందించామన్నది సర్కారు మాట. నిజానికి ఈ సంఖ్య దాదాపుగా రెట్టింపులోనే ఉందన్నది ప్రజాసంఘాల వాదన. ఈ మూడేళ్లలో 2600 మందికిపైగా రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని రైతు సంఘాలు పేర్లతో సహా ప్రకటిస్తున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం.. 13 రకాల పత్రాలు సమర్పిస్తే.. అవన్నీ అనుమానరహితంగా ఉంటే.. అప్పుడు మాత్రమే, ఆత్మహత్యగా గుర్తిస్తామంటోంది. అన్ని రకాల పత్రాలను సమర్పించినా మళ్లీ త్రిసభ్య కమిటీ విచారణ పేరుతో కాళ్లరిగేలా తిప్పుతున్నారు.

అధిక వడ్డీలు.....
రైతన్నల ఆత్మహత్యలకు ఆర్థిక పరమైన కారణాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కేవలం భారత దేశంలో మాత్రమే వ్యవసాయం చేసేందుకు ఎక్కువగా ప్రయివేటు అప్పులపై ఆధారపడుతున్నారు రైతులు. బ్యాంకులు ఇచ్చే రుణం ఏమూలకు సరిపోక పోవడంతో రైతులు వడ్డీవ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. అయితే ప్రైవేటు రుణాలపై నియంత్రణ సరిగ్గా లేక పోవడంతో అధిక వడ్డీలు చెల్లించాల్సి వస్తోంది. రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం రైతులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ప్రతి పంటసీజన్‌ ప్రారంభంలో టార్గెట్లు నిర్ణయించుకుంటాయి. దీనికోసం ప్రతిఏడాది రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశమై రైతు రుణాల మంజూరుపై చర్చలు జరుపుతుంది. కాని.. ఆచరణలో బ్యాంకుల పనితీరు రిజర్వ్‌బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా ఉంటోంది. నిబంధనల ప్రకారం బ్యాంకులు తమ వద్ద ఉన్న నిల్వల్లో 18 శాతాన్ని రైతులకు రుణాలు ఇవ్వాల్సి ఉంది. కాని ఏఒక్క బ్యాంకు కూడా నిబంధనలను పాటించడంలేదు. దేశంలోని బ్యాంకుల్లో ఉన్న మొత్తం 86లక్షల కోట్ల రూపాయల నిల్వల్లో .. రిజర్వ్‌బ్యాంకు నిబంధనల ప్రకారం రైతులకు 16 లక్షల కోట్ల రూపాయల రుణాలు ఇవ్వాలి. కాని గతఏడాది ఇచ్చింది కేవలం 6.20 లక్షల కోట్లు మాత్రమే. పంట సాగు చేయడానికి సరిపడా ధనం అందుబాటులో లేకపోవడంతో రైతులు ప్రైవేటు రుణాలపై ఆధార పడి.. చెల్లింపుల్లో కనీసం వడ్డీ కూడా కట్టలేక.. ఒత్తిళ్లు పెరిగి, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

కరువు పరిస్థితులు.....
మరోవైపు వరుసగా తలెత్తున్న కరువు పరిస్థితులు కూడా అన్నదాతలను కుంగదీస్తున్నాయి. కరవు వల్ల గత మూడెళ్లలోఒక్క తెలంగాణలోనే దాదాపు 18వేల కోట్ల రూపాయల పంట నష్టం వాటిల్లింది. అయితే కరవు సాయంగా కేంద్రాన్ని రాష్ట్రం అడిగింది కేవలం నాలుగు వేల కోట్ల రూపాయలే. అటు కేంద్రంకూడా ఇవ్వలేదు అనకుండా.. కేవలం 790 కోట్ల రూపాయలు విదిల్చి బాధ్యతను దులపరించుకుంది. మరోవైపు 14 ఆర్థికసంఘం నిధులు, ఈ కరువు సాయం అంతా కలిపి 1300 కోట్ల రూపాయలు రాష్ట్రానికి వచ్చాయి. అయినా .. తమది రైతు ప్రభుత్వం అని తెగ ప్రచారం చేసుకుంటున్న టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఇంతవరకు కరువు సాయాన్ని పంపిణీ చేయలేదు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను రైతన్నల ఆత్మహత్యలను నివారించడానికి చిత్తశుద్ధిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అదుగో రైతులకు సాయం.. ఇదిగో వందలకోట్లు అనే పొల్లుమాటలు మాని.. సకాలంలో బ్యాంకురుణాలు అందేలా చూసి అన్నదాతను అప్పుల పాలు కాకుండా చూడాలని రైతుసంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

ప్రతిచోట దగపదుతున్న రైతన్న....
పకృతి బాధలకు తట్టుకుని పంటరాసులను బస్తాలకు నింపిన కర్షకులు .. వ్యాపారులు, దళారుల చేతిలో మాత్రం దారుణంగా మోసపోతున్నారు. దాంతోపాటు నకిలీ విత్తనాలు, ఎరువులు రైతులను నిలువునా ముంచుతున్నాయి. అన్ని కష్టనష్టాలకు ఓర్చి మార్కెట్‌కు వెళితే .. అరకొర ధరలు వెక్కిరిస్తున్నాయి. దీంతో పెట్టుబడులు కూడా రాక రైతన్నలు అప్పుల పాలవుతున్నారు. పెట్టుబడికి తగిన విధంగా పంట దిగుబడి రాకపోవడంతో రైతు కుదేలవుతున్నాడు. నకిలీ విత్తనాలు, కల్తీ ఎరువులు, పురుగుల మందులు గోరుచుట్టుపై రోకటి పోటులా తయారయ్యాయి.

గిట్టుబాటు ధర.....
అష్టకష్టాలు పడి పంట పండించి మార్కెట్‌ కు తీసుకువెళితే గిట్టుబాటు ధర లభించక అన్నదాతలు నష్టపోతున్నారు. దీనికి తోడు వరుసగా రెండున్నరేళ్లు రాష్ట్రంలో కరవు విలయతాండవం చేయడంతో పంటలు సరిగ్గా పండలేదు. అప్పులు మాత్రం కొండల్లా పేరుకుపోయాయని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. చేసిన అప్పులు తీరే మార్గం కనిపించక బలవన్మరణానికి పాల్పడుతున్నాడు రైతన్న. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 85 శాతం మంది రైతులు వరి, మొక్క జొన్న , పత్తి, మిరప, కంది పంటలే వేస్తున్నారు. విత్తనం వేసినప్పుడు ఉన్న ధర పంట చేతికి వచ్చాక ఉండటం లేదు. ఇక మద్దతు ధరల విషయంలో కేంద్రపాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి. మార్కెట్లో పంట కుప్పలుగా పేరుకు పోయేవరకు.. మద్దతు ధరలు ప్రకటించకపోవడంతో.. దళారులు, వ్యాపారుల ఇష్టారాజ్యంగా మారుతోంది.

ఇప్పటికీ అశాస్త్రీయ పద్దతి.....
అసలు పంటలకు మద్దతు ధర నిర్ణయించడంలో ఇప్పటికీ అశాస్త్రీయ పద్దతే కొనసాగుతుంది. సాగుకు అవుతున్న ఖర్చు, వస్తున్న ఆదాయంలో వ్యత్యాసం భారీగా ఉంటోంది. దేశప్రజలకు అన్నంపెడుతున్న రైతుల ఆదాయం , ఇతర రంగాల ఆదాయంతో పోలిస్తే.. నక్కకు నాగలోకానికి అన్నంతగా వ్యత్యాసం ఉంది. గత నాలుగు దశాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆదాయం 150 రెట్లు, టీచర్ల ఆదాయం 250 రెట్లు పెరగ్గా.. రైతుల ఆదాయం 40ఏళ్లలో పెరిగింది 20 రెట్లు మాత్రమే. మరో విషయం ఏంటంటే.. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఆదాయం ఏకంగా 3వేల రెట్లు పెరగ్గా.. వ్యవసాయం చేస్తున్న కర్షకుల సంపాదన మాత్రం పాతాళంలోనే తచ్చాడుతోంది. రైతుల ఆత్మహత్యలను ఆపాలంటే వడ్డీ లేని రుణాలు, ప్రకృతి వైపరిత్యాల సందర్భంగా పంట నష్టపోతే పరిహారం అందించాలని, గిట్టుబాటు ధర నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలే చేయాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.

నోరుమెదపని ప్రభుత్వం....
అనుక్షణం రైతుజపం చేస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వం.. వందలాది రైతుల ఆత్మహత్యలపై నోరుమెదపడంలేదు. వచ్చేఏడా నుంచి చేయబోయే సాయం గురించి ఊదరగొడుతున్న సర్కార్‌ .. గత ఏడాది ప్రకటించిన కరువుసాయంపై మాత్రం సైలెంట్‌గా ఉంటోంది. దీంతో రైతులబాధల పట్ల టీఆర్‌ఎస్‌ పాలకులది మొసలి కన్నీరేననేది తేటతెల్లం అవుతోందని రైతుసంఘాలు అంటున్నాయి. ఇప్పటికైనా రైతు ఆత్మహత్యల పట్ల తక్షణమే స్పందించి కుంగిపోయిన అన్నదాతలకు చిత్తశుద్ధితో చేయూత నివ్వాల్సి అవసరం ఉంది.

 

10:56 - May 19, 2017

పనాజీ : దక్షిణగోవాలో సన్వొర్‌డెమ్ నదిపై ఫుట్‌బ్రిడ్జ్ కూలి 50 మంది గల్లంతైన ఘటనలో 15 మందిని రెస్క్యూ టీం కాపాడింది. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఒక మృతదేహాన్ని నీటి నుంచి వెలికి తీశారు. ఫుట్‌బ్రిడ్జ్‌పై నుంచి ఓ యువకుడు నదిలో దూకడంతో అతడిని కాపాడేందుకు పోలీసులు యత్నిస్తుండగా వంతెన కూలిపోయింది. ఈ వంతెన పోర్చుగీసు కాలం నాటిది. మరోవైపు ఫుట్‌బ్రిడ్జ్‌ కూలిన ఘటనపై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గోవా సిఎం మనోహర్ పారికర్‌తో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సహాయకచర్యలు కొనసాగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.

10:55 - May 19, 2017

చెన్నై : అంతర్జాతీయ సముద్ర సరిహద్దుల పహారా నౌకగా.. ప్రపంచ గుర్తింపు పొందిన ఆస్ట్రేలియన్‌ బోర్డర్‌ ఫోర్స్‌ కట్టర్‌ ఓషియన్‌ షీల్డ్‌ చెన్నైకి వచ్చింది. మూడు రోజుల పాటు భారత్‌లో సరిహద్దు భద్రతపై అవగాహన కోసం.. చెన్నై ఫోర్ట్‌లో అధికారులతో చర్చించనుంది. కమాండర్‌ అలెన్‌ చంప్కిన్‌ ఈ నౌకకు నేతృత్వం వహిస్తున్నారు. 16 మంది అధికారులు, 36 మంది సహాయకులు ఇందులో విధులు నిర్వర్తిస్తున్నారు. శ్రీలంకలోని ట్రికోనమలై ఫోర్ట్‌లో విధులు ముగించుకొని రెండురోజుల పర్యటనలో భాగంగా గురువారం చెన్నై చేరిన ఈ నౌక గతంలో సముద్రంలో కూలిన మలేషియా ఎయిర్‌ లైన్స్‌ విమానం ఆచూకీ కోసం గాలింపు చర్యల్లో ప్రధాన పాత్రను పోషించారు. 

10:53 - May 19, 2017

హైదరాబాద్ : మండుతున్న ఎండల తీవ్రతతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటలు దాటితే చాలు.. ఎండ మంట, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రోడ్లపై జన సంచారం కనిపించడం లేదు. నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. సూర్యుడి కర్ఫ్యూకి.. జనం బయటకు రావాలంటేనే జడుసుకుంటున్నారు. ఈ వేసవి నిప్పుల కొలిమేనని భారత వాతావరణ విభాగం మార్చి నెలలో ప్రకటించింది. అన్నట్లుగానే వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 45 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఈ ఎండలు రానున్న రోజుల్లో మరింత ముదరనున్నాయి.

నిర్మానుష్యంగా వీధులు
నిత్యం రద్దీగా కనిపించే వీధులు కూడా నిర్మానుష్యంగా మారుతున్నాయి. వడగాలుల ప్రభావంతో రాత్రి ఏడైనా భూగర్భం నిప్పుల కొలిమిలా ఉంటోంది. వాతావరణ శాఖ నిపుణుల అంచనా ప్రకారం తెలంగాణలోని భూ ఉపరితల వాతావరణం వేడెక్కటం.. ఉత్తర భారతదేశం నుంచి వేడిగాలులు తెలంగాణ వైపు వీస్తుండటంతో అత్యంత వేడి నెలకొంటోంది. ఎండ వేడి వల్ల కళ్లు తిరగడం, శరీరం త్వరగా అలసిపోవడం జరుగుతుంది. నీళ్లు ఎక్కువగా తాగకపోయినా.. చల్లని పదార్థాలను తీసుకోకపోయినా ఈ ఎండలను తట్టుకోవడం చాలా కష్టం. నిమ్మకాయ, పుచ్చకాయ, కొబ్బరిబోండాం, మజ్జిగ ఒంట్లో వేడిని తగ్గించడానికి ఎంతో శ్రేష్టం. కాబట్టి ద్రవ పదార్థాలను తీసుకుంటూనే ఉండటం మంచిది. ఇక ఈ వేసవి తాపానికి పెద్దలే తట్టుకోలేకపోతోంటే.. ఇక చిన్నారుల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. ముఖ్యంగా అంగన్‌వాడీ సెంటర్లలో.. ఎండల వేడికి పిల్లలు కుతకుతలాడిపోతున్నారు. ఎలాంటి సదుపాయాలు లేని అద్దె భవనాల్లో అంగన్‌వాడీ సెంటర్లు నిర్వహిస్తున్నారు. కట్టెల పొయ్యిపై వంట చేస్తుండటంతో అటు ఎండ, ఇటు మంట వేడికి పిల్లలు అల్లాడిపోతున్నారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

09:34 - May 19, 2017

గుంటూరు : రహదారుల నిర్మాణానికి కావల్సిన భూమి కోసం రాజధాని ప్రాంతంలోని రెండు గ్రామాలకు భూ సేకరణ నోటిఫికేషన్ విడుదల చేశారు. లింగాయపాలెం గ్రామానికి చెందిన 106 మంది రైతులకు సంబంధించిన 110ఎకరాలకు, నవలూరు గ్రామనికి చెందిన 367 మంది రైతులకు సంబంధించి 183.56 ఎకరాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. 60 రోజుల్లోగా అభ్యంతరాలు ఆంటే తెలపాలని నోటిఫికేషన్ పేర్కొంది. గత మార్చిలో సీఎం చంద్రబాబు 7 రహదారులకు శంకుస్థాపన చేశారు, ఆరోడ్లు పూర్తి కావాలంటే భూమి అవసరం కావడంతో ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

09:28 - May 19, 2017

'జనతా గ్యారేజ్' సినిమా విజయంతో మంచి జోరు మీదున్న జూ.ఎన్టీఆర్ అదే జోష్ తో ముందుకెళుతున్నాడు. సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాణంలో తెరకెక్కుతున్న 'జై లవకుశ' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటిస్తున్నాడని..అందులో ఒక పాత్ర విలన్ అయి ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఓ లుక్ ను సోషల్ మాధ్యమాల్లో రిలీజ్ చేసింది. కానీ ఎన్టీఆర్ ఎలా కనిపిస్తాడన్న దానిపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. తాజాగా 'జై లవకుశ' కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను నేడు విడుదల చేయనున్నారు. ఈనెల 20వ తేదీన 'ఎన్టీఆర్' జన్మదినం కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకుని 19న ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. మధ్యాహ్నం 3గంటల 15 నిమిషాలకు ఫస్ట్ లుక్ ను వదులనున్నారు. మరి ఆ లుక్ కోసం కొద్ది గంటలు వెయిట్ చేయాల్సిందే.

09:25 - May 19, 2017

కృష్ణా : జిల్లాలోని కీసర టోల్ గేట్ సమీపంలో సాంకేతిక కారణాల వల్ల ప్రవేట్ ట్రావేల్స్ చెందిన బస్సు జాతీయ రహదారిపై నిలిచిపోయింది. ఎస్ వీకేడీటీ ట్రావేల్స్ బస్సు రాత్రి 2గంటల నుంచి నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. కొంత మంది రిటర్న్ జర్నీ కూడా బుక్ చేసుకున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. సహనం నశించిన ప్రయాణికులు స్థానిక కంచికచెర్ల పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ బస్సు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తుతుంది.

 

08:41 - May 19, 2017

హైదరాబాద్ : తెలంగాణ సచివాలయ నిర్మాణానికి సికింద్రాబాద్‌లోని 60 ఎకరాల బైసన్ ఫోలో గ్రౌండ్ స్థలం ఇచ్చేందుకు కేంద్రం సూత్ర ప్రాయంగా అంగీకరించింది. ఈ విషయాన్ని రోడ్లు భవనాల శాఖ అధికారులు తెలిపారు. కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తున్నామని చెప్పారు. స్థలం అప్పగింతకు 2,3 నెలల సమయం పట్టే అవకాశం ఉందన్నారు. ప్యారడైజ్ నుంచి బోయిన్ పల్లి చౌరస్తా వరకు, ప్యారడైజ్ నుండి శామిర్ పేట వరకు 2 ఎక్స్‌ప్రెస్ హైవేల నిర్మాణానికి రక్షణ శాఖకు చెందిన 100 ఎకరాలు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించినట్లు సెక్రటేరియట్ అధికారులు వెల్లడించారు. ఈ 100 ఎకరాలతో పాటు బైసన్ ఫోలో గ్రౌండ్స్‌కు చెందిన 60 ఎకరాలు కలిపి మొత్తం 160 ఎకరాలు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు చెప్పారు. అయితే ఇందుకు ప్రతిగా 1000 ఎకరాలు ఇవ్వాలని రక్షణ శాఖ కోరినట్లు తెలిపారు. రక్షణశాఖకు చెందిన 160 ఎకరాల స్థలం సిటి మధ్యలో ఉండటం..విలువైన భూమి కావడంతో..1000 ఎకరాలు వారు అడుగుతున్నట్లు సచివాలయ అధికారులు భావిస్తున్నారు.

రక్షణశాఖకు వెయ్యి ఎకరాలు
రక్షణశాఖకు వెయ్యి ఎకరాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపిన మాట వాస్తవమేనని అర్‌ అండ్‌ బి అధికారులు చెబుతున్నారు. ఈ 1000 ఎకరాలు వనపర్తి, వికారాబాద్ జిల్లాల్లో కేటాయిస్తామని చెప్పినట్లు వెల్లడించారు. ఇప్పటికే ఈ వెయ్యి ఎకరాలు ఒకే చోట ఎక్కడ ఇవ్వాలనేదానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని విపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. సచివాలయ తరలింపు నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి. 

08:38 - May 19, 2017

హైదరాబాద్ : నల్లగొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై దాడిని ఖండిస్తూ..కేసీఆర్‌ సర్కార్‌ను కాంగ్రెస్‌ నేతలు టార్గెట్‌ చేశారు. విమర్శనాస్త్రాలతో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై దాడులను సీరియస్‌గా పరగణిస్తామని టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే.. సామాన్యుడి పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పోలీసులను వాడి అణచివేయాలనుకుంటే ఎలా సమాధానం చెప్పాలో అలాగే చెబుతామన్నారు. నల్గొండ ఘటనను స్పీకర్ సుమోటోగా తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో స్పీకర్ మౌనంగా ఉండటం దురదృష్టమన్నారు. తాము అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా వసూల్ చేస్తామన్నారు. నల్గొండలో రౌడీయిజం ఎక్కువగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంత్రి హరీశ్‌రావు ఆహ్వానించినందుకే కార్యక్రమానికి వెళ్లానన్నారు. పోలీసులు తనను ఒక్కడినే రమ్మనడంతోనే ఆశ్చర్యం వేసిందన్నారు. పథకం ప్రకారమే తనపై దాడి చేశారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు.

న్యాయ విచారణ జరిపించాలి
నల్గొండ దాడి ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని జానారెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలు జరిగేచోట టీఆర్ఎస్ సభలు పెడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ సమావేశాలుగా మారుస్తున్నారని విమర్శించారు. పోలీసులు పక్షపాతంగా వ్యవహరించారని ఆరోపించిన ఆయన.. ఘటనకు బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రభుత్వం అవమానిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసిన జానారెడ్డి.. కార్యకర్తల కోసం అవసరమైతే జైళ్లకు వెళ్లడానికైనా సిద్ధమన్నారు.మొత్తంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై దాడిని సీఎల్పీ సమావేశం తీవ్రంగా ఖండించింది. దాడి ఘటనను స్పీకర్‌ సుమోటోగా తీసుకోవాలని డిమాండ్ చేసింది. 

08:36 - May 19, 2017

గుంటూరు : వ్యవసాయం వాటి అనుబంధ రంగాల‌పై సీఎం చంద్రబాబు నాయుడు స‌చివాల‌యంలో స‌మీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వ్యవ‌సాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, వ్యవ‌సాయ‌,ఇరిగేష‌న్ అధికారులు పాల్గొన్నారు. ఖరీప్ సీజన్ నెల ముందుగా ప్రారంభించాలని అన్నారు. వ్యవసాయంలో మూస‌పద్ధతులను వ‌దిలి రైతులను ఆధునిక‌త వైపు మ‌ల్లించాల‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించారు. వ్యవసాయ యాంత్రీకరణకు ఉద్దేశించిన 200 కస్టమ్ హైరింగ్ సెంటర్ల ఏర్పాటు వేగంగా సాగుతున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. తుఫాన్ల కార‌ణంగా పంట చివ‌ర్లో న‌ష్టాన్ని ఎదుర్కొంటున్న గోదావ‌రి డెల్టా రైతాంగాన్ని ఆదుకునేందుకు జూన్ మొద‌టి వారంలో ఏడు టిఎంసిల నీరు విడుద‌ల చేయాల‌ని సీఎం ఆదేశించారు. సెరిక‌ల్చర్‌లో ఖాళీగా ఉన్న 50 శాతం ఉద్యోగాల భ‌ర్తీకి గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చారు.

ల్యాండ్ లీడింగ్ యాక్ట్‌
కౌలు రైతులను ఆదుకునేందుకు మోడ‌ల్ అగ్రిక‌ల్చర్ ల్యాండ్ లీడింగ్ యాక్ట్‌ను తెచ్చేందుకు ఉన్న అవ‌కాశాల‌ను ప‌రిశీలించాల‌ని సీఎం ఆదేశించారు. అగ్రీవాచ్ పేరిట ఏ కాలంలో ఏ పంట ఎంత విస్తీర్ణంలో వేయాల‌నే దానిపై సూచ‌న‌లు ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు తమ వ్యవసాయ అవసరాల కోసం సేవలు అందించేందుకు అగ్రిస్మార్టు సర్వీస్ సెంటర్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతోంది. న‌కిలీ విత్తనాలు విక్రయిస్తే ఎంత పెద్ద కంపెనీ అయినా ఉపేక్షించకుండా చ‌ర్యలు తీసుకోవాల‌ని సీఎం ఆదేశించినట్లు మంత్రి సోమిరెడ్డి వెల్లడించారు.

జూన్ 2 నుంచి 8 వరకు ఇన్‌పుట్ సబ్సిడీ
ఇక రాష్ట్రంలో పంట నష్టపోయిన రైతులకు జూన్ 2 నుంచి 8 వరకు ఇన్‌పుట్ సబ్సిడీ పంపిణీ చేయాలని సీఎం వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. అర్హులైన రైతులు అందరికీ ఇన్‌పుట్ సబ్సిడీ సకాలంలో, సక్రమంగా అందాలని సూచించారు. ఉత్తర కోస్తా జిల్లాల్లో అదనంగా 221 మంది ఎంపీఈవోలను నియమించుకునేందుకు సంబంధించిన ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. 

నేడు చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

 

చిత్తూరు : జిల్లాలో నేడు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఇవాళ తిరుపతి, పుత్తూరులో పర్యటిస్తారు. చిత్తూరు జిల్లాలో బాబు పర్యటన మూడు రోజులుమ కొనసాగుతోంది. 

బాలికను అత్యాచారం చేసిన కాంట్రాక్టర్

భద్రాద్రి కొత్తగూడెం : బాలికపై కాంట్రాక్టర్ అత్యాచారం చేశాడు. ఇల్లందు దాసరిగడ్డకు చెందిన కుటుంబాన్ని కాంట్రాక్టర్ ఉమేష్ కూలీ పనుల కోసం అల్వాలు తీసుకొచ్చాడు. వెంకన్న కూతురిపై కాంట్రాక్టర్ ఉమేష్ అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక తండ్రి వెంకన్న అల్వాల్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు కానీ పెద్దమనుషుల సమక్షంలో సమస్యల పరిష్కరించకోవాలని అల్వాల్ సీఐ, ఎస్ఐ సలహా ఇచ్చారు.

పోలీసులతో సీఎం కేసీఆర్ సమావేశం

హైదరాబాద్ : నేడు హైటెక్స్ లో పోలీసులతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో శాంతిభద్రతలు, మహిళ భద్రత, ఫ్రెండ్లీ పోలీసింగ్ పై చర్చించనున్నారు. సమావేశంలో 1500 పాల్గొననున్నారు. 

నేడు ఐపీఎల్ లో క్వాలిఫయిర్ 2 మ్యాచ్

ఐపీఎల్ 10 : ఐపీఎల్ లో క్వాలిఫయిర్ 2 మ్యాచ్ లో ముంబై వర్సెస్ కోల్ కత్తా మ్యాచ్ బెంగళూరు వేదికగా రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది.

30 ఏళ్ల తర్వాత సైన్యంలోకి శతఘ్నులు

ఢిల్లీ : దాదాపు మూడు దశాబ్దాల తర్వాత భారత సైన్యంలోకి శతఘ్నులు రానున్నాయి. నేడు అమెరికా నుంచి భారత్ చేరునున్నాయి. 

నేడు, రేపు శ్రీకాకుళంలో జగన్ పర్యటన

శ్రీకాకుళం : నేడు, రేపు శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగర్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలోమ జగన్ వంశధార నిర్వసితులు. ఉద్ధానం కిడ్నీ బాదితులతో భేటీ కానున్నారు. 

07:36 - May 19, 2017

చర్చల ద్వారా సమస్యలను పరిష్కారించాలని, విజ్ఞాతతో ప్రపంచం నుంచి మద్దతు తీసుకోవాలని న్యూస్ మార్నింగ్ లో పాల్గొన్న సీనియర్ విశ్లేషకులు నవతెలంగాణ ఎడిటర్ వీరయ్య, టీఆర్ఎస్ నేత గోవర్ధన్ రెడ్డి అన్నారు. దేశ సమగ్రాతను బీజేపీ కాపాడుతోందని బీజేపీ నేత కట్రాగడ్డ ప్రసన్న అన్నారు. మోడీ మూడేళ్ల పాలన అనుకున్న స్థాయిలో లేదని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఏడాదికి 2కోట్ల మందికి ఉపాధి ఇస్తామని చెప్పి ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవటంలేదని వీరయ్య అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

07:32 - May 19, 2017

ఢిల్లీ : వివాదస్పదంగా మారిన ట్రిపుల్‌ తలాక్‌ అంశంపై సుప్రీంకోర్టులో మే 11న ప్రారంభమైన విచారణ ముగిసింది. ఆరు రోజుల విచారణ అనంతరం అత్యున్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. ట్రిపుల్‌ తలాక్‌పై మహిళల అభిప్రాయం తెలుసుకుని నిఖా నామాలో చేర్చేందుకు కాజీలందరికీ సూచిస్తామని ఆల్‌ ఇండియా పర్సనల్‌ లా బోర్టు కోర్టు సమక్షంలో ఒప్పుకుంది. ట్రిపుల్ తలాక్‌ను ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఒక పాపంగా ఆమోదించాలని షయారా బానో తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది అమిత్ ఛద్దా కోరారు. ట్రిపుల్ తలాక్‌ విశ్వాసానికి, నమ్మకానికి సంబంధించిన విషయమన్న సీనియర్‌ న్యాయవాది కపిల్ సిబల్ వాదనను ఛద్దా తిప్పికొట్టారు. ట్రిపుల్‌ తలాక్‌ ఖురాన్‌లో ఎక్కడా లేదని..అది ఆమోదయోగ్యం కాదని పర్సనల్‌ లా చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ట్రిపుల్‌ తలాక్‌ మతంలో భాగం కాదు
ఛద్దా వాదనపై జోక్యం చేసుకున్న జస్టిస్‌ నారీమన్‌..ట్రిపుల్‌ తలాక్‌ మతంలో భాగం కాదనేగా మీ ఉద్దేశమని ప్రశ్నించారు. ఛద్దా అవునని సమాధానం ఇవ్వడంతో ఈ కేసులో వాదనలు ముగిసినట్లేనని రాజ్యాంగ ధర్మాసనం ప్రకటించింది.ట్రిపుల్‌ తలాక్‌పై కేంద్రం, ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు, ఆల్‌ ఇండియా ముస్లిం వుమెన్‌ పర్సనల్‌ లా బోర్డు దాఖలు చేసిన పలు పిటీషన్‌లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సీజే.ఖెహర్‌ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఆరు రోజుల పాటు విచారణ జరిపింది. ఈ బెంచ్‌లో సిక్కు, క్రైస్తవ, పార్శీ, హిందు, ముస్లిం మతస్థులు సభ్యులుగా ఉన్నారు. ట్రిపుల్‌ తలాక్‌ రాజ్యాంగబద్ధమైన అంశమా...? మతపరమైన హక్కా..? అన్న కోణంలో విచారణ జరిపారు... నిఖా, హలాలా, బహుభార్యత్వంపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

07:30 - May 19, 2017

ఢిల్లీ : అనిల్‌ దవే హఠాన్మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఇకలేరనే వార్త వ్యక్తిగతంగా తనను ఎంతగానో వేదనకు గురిచేస్తోందన్నారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులుకూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోరెండు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించారు. అనిల్‌ మాధవ్‌ దవే.. 1956 జులై 6న మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లా బాద్‌నగర్‌లో జన్మించారు. గుజరాత్‌లో ప్రాథమిక విద్యను పూర్తిచేసిన దవే.. రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌లో ఎంకామ్ చేశారు. ఆ సమయంలో కాలేజ్‌ ప్రెస్‌డెంట్‌గా ఎన్నికయ్యారు. నర్మద సమగ్ర అనే ఆర్గనైజేషన్‌ను ప్రారంభించి.. నది సంరక్షణ కోసం, పర్యావరణ రక్షణకోసం పోరాడారు. అలాగే రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘంలో చేరారు. అక్కడ నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి బీజేపీలోకి వచ్చిన దవే, పార్టీలో వివిధ హోదాల్లో పని చేశారు. దవే 2009 నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. పాలనా యంత్రాంగంలోనూ దవే కీలక బాధ్యతలు చేపట్టారు. వక్స్‌బోర్డు, వాటర్‌బోర్డు కోల్‌మైన్‌ కమిటీల్లో సభ్యులుగా వ్యవహరించారు. 2016 జులైలో కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రిగా నియమితులయ్యారు. అలాగే దవేకు రచయితగా కూడా మంచి పేరుంది. రాజకీయాలు, పరిపాలన, చరిత్ర, పర్యావరణం, వాతావరణ మార్పులపై ఆయన పలు పుస్తకాలు రచించారు. 

07:28 - May 19, 2017

గుంటూరు : జగన్‌కు రైతు సమస్యల పట్ల అవగాహన లేదన్నారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. రైతుల కోసం తాము ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని... కౌలు రైతులకు పంట రుణాల విషయంలో కొత్త చట్టాన్ని తీసుకువస్తామన్నారు. ఎంపీగా ఉన్నప్పుడు లోక్‌సభలో రైతు సమస్యలపై ఎప్పుడూ మాట్లాడని జగన్‌.. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారని అన్నారు.

07:27 - May 19, 2017

రంగారెడ్డి : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా పావులు కదుపుతున్నారు హస్తం నేతలు. ఇప్పటికే కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ వస్తున్న టికాంగ్రెస్ ఈ స్పీడ్‌ను మరింత పెంచాలని డిసైడ్ అయ్యింది. ఇప్పటికే ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల రీడిజైన్, ధర్నాచౌక్ తరలింపు, రైతుల సమస్యలపై ఆందోళన బాట పట్టిన ఆ పార్టీ నేతలు .. ఇప్పుడు వీటికి తెలంగాణ సెంటిమెంట్ ను జోడించేందుకు సిద్ధమయ్యారు.

రిపీట్ కాకూడదని
తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఉన్నా.. ప్రతిపక్షానికే పరిమితం కావడంపై కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతోంది. ఇదే సీన్ భవిష్యత్‌లో రిపీట్ కాకూడదని భావిస్తోంది. దీనికి తోడు ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ప్రచారం సాగుతుండటంతో కాంగ్రెస్ పార్టీ మరింత అలర్ట్ అవుతోంది. ఏకంగా పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీనే రంగంలోకి దించుతోంది. జూన్ 1న సంగారెడ్డి వేదికగా తెలంగాణ ప్రజా గర్జన సభ నిర్వహించాలని టికాంగ్రెస్ నిర్ణయించింది. అందుకు తెలంగాణ ఆవిర్భావ వేడుకలను వేదికగా చేసుకోవాలని నిర్ణయించారు. కేసీఆర్ మూడేళ్ల పాలనలోని వైఫల్యాలను ఎండగట్టడమే ఎజెండాగా సభ నిర్వహిస్తున్నట్లు టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. అవినీతి, నియంతృత్వం, అక్రమాలు టీఆర్ఎస్ ట్రేడ్ మార్క్ గా మారాయని .. ఎన్నో ఆశలతో ప్రజలు టీఆర్ఎస్ కు అధికారం ఇస్తే కేసీఆర్ ప్రజల ఆశల్ని అడియాశలు చేశారని విమర్శించారు.

ప్రజా గర్జన వేదికగా
ఈ ప్రజా గర్జన వేదికగా రాహుల్ ఇటు కేసీఆర్ అటు మోడీ పాలనను ఎండగట్టనున్నారు. మూడేళ్ల పాలనలో రెండు ప్రభుత్వాలు చేపట్టిన ప్రజా వ్యతిరేక విధనాలను ఏకీపారేస్తూ.. తాము ఎందుకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చామో.. ప్రజలకు మరోసారి గుర్తు చేయనున్నారు. అంతేకాదు మూడేళ్ల కేసీఆర్ పాలన వైఫల్యాలపై కాంగ్రెస్ పార్టీ ఛార్జ్ షీట్ విడుదల చేయనుంది.

06:53 - May 19, 2017

ఇచ్చిన హామీల అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, అలాగే డబుల్ బెడ్ రూంలు ఇస్తామని చెప్పిన ఇవ్వలేదని, తక్షణమే వీఆర్ఏల జీవో విడుదల చేయాలని తెలంగాణ వీఆర్ఏలు అధ్యక్షడు వంగూలు రాములు అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

 

Don't Miss