Activities calendar

20 May 2017

21:31 - May 20, 2017

హైదరాబాద్: ఏ సమయంలో యుద్ధం వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని వాయు సేన చీఫ్ బిఎస్‌ ధనోవా అధికారులకు పిలుపునిచ్చారు. మార్చి 30న ఆయన అధికారులకు ఓ లేఖ రాసినట్లు ఆలస్యంగా మీడియా ద్వారా తెలిసింది. ధనోవా ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన 3 నెలలకే ఆయన ఈ లేఖ రాశారు. తన అభిప్రాయాలను 12 వేల మంది అధికారుల ముందు ఉంచారు. పక్షపాతం, అత్యాచారం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఎయిర్‌ చీఫ్‌ తన ఆలోచనలను లేఖ ద్వారా అధికారులకు తెలియజేయడం ఇదే తొలిసారి. పాకిస్తాన్‌ తరచూ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతుండడం, సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆయన అధికారులను అప్రమత్తం చేశారు.

21:29 - May 20, 2017

హైదరాబాద్: కుల్‌భూషణ్‌ జాదవ్‌ కేసులో అంతర్జాతీయ కోర్టులో పాకిస్తాన్‌కు చుక్కెదురైనా ఓటమిని అంగీకరించడం లేదు. ఐసిజేలో పాకిస్తాన్‌ ఓడిపోయిందని చెప్పడం తప్పని ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్‌కు విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ అన్నారు. ఐసీజే కేవలం జాదవ్ మరణ శిక్ష అమలును మాత్రమే నిలిపేసిందని, జాదవ్‌కు కాన్సులార్ యాక్సెస్‌ను ఇవ్వాలని ఆదేశించలేదని పేర్కొన్నారు. ఇంతకుముందు తమకు సమయం లేకపోయిందని... తదుపరి విచారణ సమయానికి పాకిస్థాన్ తరపున న్యాయవాద బృందాన్ని బలోపేతం చేస్తామని ఆయన చెప్పారు. ఐసీజేలో జాదవ్‌ కేసుపై వాదనలు వినిపించేందుకు పాకిస్థాన్ తన న్యాయవాదిని మార్చింది. ఖవార్ ఖురేషీకి బదులుగా అటార్నీ జనరల్ అష్తర్ ఔసఫ్ అలీని నియమించింది. ఐసీజే తీర్పు నేపథ్యంలో పాకిస్తాన్‌ పూటకో మాట మారుస్తోంది.

21:27 - May 20, 2017

కడప : కేంద్ర ప్రభుత్వతీరుపై ఫైర్ అయ్యారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి.. విభజన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.. కడప జిల్లాలో లాభనష్టాలతో ప్రమేయంలేకుండా స్టీల్‌ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టాలన్నారు.. దుగరాజపట్నం ఓడరేవును నిర్మిస్తామని హామీ ఇచ్చిన కేంద్రం.. ఎందుకు వెనక్కి తగ్గిందని ప్రశ్నించారు.. రాష్ట్రం విడిపోయేటప్పుడు 16వేల 500కోట్ల లోటుబడ్జెట్‌ ఉంటే ఇప్పటివరకూ కేవలం 2వేల 300కోట్లు మాత్రమే ఇచ్చారని సోమిరెడ్డి మండిపడ్డారు.... కడపలో నిర్వహించిన టిడిపి మిని మహానాడులో సోమిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.. ఈ కార్యక్రమానికి మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎంపీ సీఎం రమేశ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు..

21:25 - May 20, 2017

హైదరాబాద్: టిఆర్ ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.. ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి.. గ్యాంగ్‌స్టర్‌ నయీంతో సంబంధం ఉన్న రాజకీయ నేతల్ని వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే లక్షమందితో సీఎం కేసీఆర్‌ ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. తమ ఒంట్లో ప్రవహిస్తోంది కాంగ్రెస్‌ రక్తమని... తాము బిజెపి లో చేరతామన్న వార్తల్లో నిజంలేదని స్పష్టం చేశారు.

 

21:23 - May 20, 2017

హైదరాబాద్‌ : అఫ్జల్‌గంజ్‌ మొజంజాహి మార్కెట్‌ రోడ్డుపై రోడ్డు ప్రమాదం జరిగింది.. రాయల్‌ ట్రావెల్స్ బస్సు బ్రేక్‌ ఫెయిల్ కావడంతో 3 కార్లు, రెండు ఆటోలు, ఓ బస్సును ఢీకొట్టింది.. ఈ వాహనాలన్నీ ధ్వంసంకాగా.. ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.. ప్రమాద సమయంలో రాయల్‌ ట్రావెల్స్‌ బస్సులో 30మంది పర్యాటకులు ఉన్నారు..

విజయనగరం జిల్లాలో పిడుగుల బీభత్సం

విజయనగరం: సీతానగరం మండలం పూలు బుచ్చమ్మ పేటలో పిడుగుపడి 11 పూరిళ్లు, 40 పశువుల పాకలు దగ్ధం అయ్యాయి. బొబ్బిలి మండలం వాకడవలసలో పిడుగు పడి ఐదు పూరిళ్లు, 10 పశువుల పాకలు దగ్ధం అయ్యాయి.

20:09 - May 20, 2017

హైదరాబాద్: బేడీలు వేసుకున్న రైతులతోని కాంగ్రెసోళ్ల ఆట...సంగారెడ్డి మీటింగ్ లో వాళ్లను చూపెడతారంట, పోలీసులను అరెస్ట్ చేసిన తణుకు ఎమ్మెల్యే....న్యాయం కోసం పోరాడుతున్న ఎస్సై, రైటర్, రాజకీయం కోసం జనాన్ని గోస పెడుతున్న లీడర్లు...నల్లగొండ కాడ నలుగుతున్న అమాయకులు, ఇజ్జత్ కే సవాల్ అంటున్న ఈవీఎం మిషీన్లు...దమ్ముంటే చెరబట్టమని ఢిల్లీలో సవాళ్లు, పెస్తె కట్టి పారిపోయిన పెళ్లి కొడుకు...ఫేస్ బుక్ లో బుక్కయిపోయిన ఆడపిల్ల,శంషాబాద్ ఎయిర్ పోర్టులో పెద్ద పాము..ఏడికి కట్టిందో కదా దాని ప్రయాణము... ఇత్యాది అంశాలతో మల్లన్న 'మల్లన్న ముచ్చట్లు' కార్యక్రమంలో మన ముందుకు వచ్చారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

 

 

19:31 - May 20, 2017

ప్రకాశం : జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్‌ పడగవిప్పింది. బల్లికురువ మండలం వేమవరం సమీపంలో కరణం బలరాం వర్గానికి చెందిన వారిపై ప్రత్యర్థులు విచ్చు కత్తులతో విరుచుకుపడ్డారు. బైక్‌పై వెళ్తున్న వారిపై కిరాతకంగా దాడి చేశారు. ఈ ప్రమాదంలో గోరంట్ల అంజయ్య, రామ కోటేశ్వరరావులు మృతి చెందగా.. పేరయ్య, వెంకటేశ్వర్లు, ముత్యాలు, రాఘవులు అనే నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

మృతదేహాలను సందర్శించిన మంత్రి పత్తిపాటి...

వేమవరం ఘటనలో చనిపోయినవారి దేహాలను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, కరణం బలరాం సందర్శించారు. చిలకలూరిపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులనూ కరణం బలరాం పరామర్శించి.. ఘటనకు సంబంధించి వివరాలు తెలుసుకున్నారు. జంట హత్యలకు గొట్టిపాటి రవికుమారే కారణమని కరణం బలరాం బలంగా ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత చంద్రబాబు తీరునూ బలరాం తీవ్రంగా ఆక్షేపించారు. గొట్టిపాటిని పార్టీలో చేర్చుకోవద్దని చెప్పినా తన మాట వినకుండా చేర్చుకున్నారని, ఫలితంగా తాము ఇలా మూల్యం చెల్లించాల్సి వచ్చిందని అన్నారు. జరిగిన ఘటనకు పార్టీయే సమాధానం చెప్పాలని కరణం బలరాం డిమాండ్‌ చేశారు.

వాదన మరోలా గొట్టిపాటి వాదన....

గొట్టిపాటి రవికుమార్‌ వాదన మరోలా ఉంది. వేమవరం జంట హత్యలు, రాజకీయాలకు, పార్టీకి అస్సలు సంబంధం లేదని ఆయనన్నారు. అనవసరంగా తప్పుడు ఆరోపణలు చేసి ప్రజలను రెచ్చగొట్టవద్దంటూ కరణం బలరాంకు సూచించారు. గ్రామాల్లోని చిన్నపాటి వివాదాల వల్లే ఈ ఘటన జరిగిందని గొట్టిపాటి అభిప్రాయపడ్డారు.

జంట హత్యలతో ఒక్కసారిగా ఉద్రిక్తత..

కొంత కాలంగా ప్రశాంతంగా ఉన్న గ్రామంలో జంట హత్యలతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌ ప్రజలను వెంటాడుతోంది. ప్రస్తుతం ఎన్నికలు లేకపోయినా ఇలాంటి ఘటన జరగడంపై గ్రామస్థులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఒకే పార్టీలో ఇరువర్గాలు నిలదొక్కుకోలేక.. ఆధిపత్యం కోసం ఇలాంటి ఘటనకు పాల్పడి ఉండవచ్చంటున్నారు.

జంటహత్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్‌...

వేమవరం జంటహత్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్‌ అయ్యారు. చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకున్నా సహించేది లేదన్నారు. తక్షణమే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. మరోవైపు, ఫ్యాక్షన్‌ హత్యల నేపథ్యంలో వేమవరం గ్రామంలో పోలీసులు బందోబస్తును భారీగా పెంచారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్పీ త్రివిక్రమవర్మ వేమవరంలోనే మకాం వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులంటున్నారు.

ఇరు వర్గాల మధ్య ఉన్న విభేదాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలని...

ఇరు వర్గాల మధ్య ఉన్న విభేదాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలని గొట్టిపాటి, కరణంలకు చంద్రబాబు సూచించినా.. ఈ ఘటన జరగడం సంచలనంగా మారింది. మరి సీఎం చంద్రబాబు ఇప్పటికైనా కరణం, గొట్టిపాటి వర్గాల మధ్య ఫ్యాక్షనిజాన్ని రూపుమాపే చర్యలకు ఉపక్రమిస్తారా..? లేక పోలీసు చర్యకే పరిమితమవుతారా..? వేచి చూడాలి.

19:26 - May 20, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో భానుడి దెబ్బకు జనం ప్రాణాలు కోల్పోతున్నారు. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గాలిలో తేమ శాతం గణనీయంగా తగ్గి.. పెద్ద ఎత్తున వడగాడ్పులు వీస్తున్నాయి. దీంతో చాలామంది అస్వస్థతకు గురై.. ప్రాణాలు కోల్పోతున్నారు. ఎండల ధాటికి పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలోనే రెండు రోజుల్లో ఐదుగురు వడదెబ్బతో మృతిచెందారు.

తూ.గో జిల్లాలో నలుగురు మృతి

అలాగే వడగాల్పులకు తూర్పు గోదావరి జిల్లాలోనూ నలుగురు మృతి చెందారు. జిల్లాలోని 14 మండలాల్లో తీవ్ర ఎండలు ఉన్నాయని...ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... కలెక్టర్‌ కార్తీకేయ మిశ్రా సూచించారు.

చిట్యాలలో తండ్రి, కొడుకులు మృతి...

అలాగే నల్గొండ జిల్లా చిట్యాలలో భానుడి ఉగ్ర రూపానికి తండ్రి, కొడుకులు బలయ్యారు. జ్యోతిష్యం చెప్పుకుంటూ జీవనం సాగించే కొండే దశరథ, కొండే శివ వడదెబ్బ ధాటికి కుప్పకూలిపోయారు. ఆస్పత్రికి తరలించే లోపే చనిపోయారు.

వరంగల్ లో ఓ బాలుడు మృతి...

అలాగే వరంగల్లో నగరంలో వడదెబ్బకు ఓ బాలుడు మృతి చెందాడు. పెరుక‌వాడ‌కు చెందిన ల‌క్ష్మీ, లక్ష్మణ్‌ల మూడో సంతానం శివ ఎండలకు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతడిని ఎంజీఎం ఆస్పత్రిలో చూపించి... ఇంటికి తీసుకువ‌స్తుండగా.. మార్గమధ్యలో ప్రాణాలు వదిలాడు.

47 డిగ్రీల వరకు....

మొత్తమ్మీద తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. రామగుండం, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్‌, మంచిర్యాల జిల్లాలో, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లోనూ... అత్యధికంగా 47 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే మూడు నాలుగు రోజుల్లో తీవ్రస్థాయిలో వడగాల్పులుంటాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

19:23 - May 20, 2017

ఢిల్లీ: జూన్‌ 3 నుంచి అన్ని రాజకీయ పార్టీలు ఈవీఎంల లోపాలు ఉంటే నిరూపించవచ్చని కేంద్ర ఎన్నికల కమిషన్‌ చైర్మన్ జైదీ ప్రకటించారు. ఎనిమిదేళ్ల తర్వాత ఈవీఎంల పనితీరుపై సందేహాలను నివృతి చేసేందుకు ఎన్నికల కమిషన్‌ డెమో నిర్వహించింది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలు టాంపరింగ్‌ గురయ్యాయని ఆరోపించిన విపక్షాలు-ఇంతవరకు ఎలాంటి ఆధారాలు చూపలేకపోయాయని ప్రధాన ఎన్నికల అధికారి నసీమ్‌ జైదీ అన్నారు. ఈవీఎంలలో టాంపరింగ్‌ జరిగే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఈసీ ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతికతను వినియోగించుకుంటూ ముందుకెళ్లొందని జైదీ చెప్పారు. 2019 ఎన్నికల్లో వివిప్యాట్....ఓటు రసీదు యంత్రాలతో కూడిన ఈవీఎంలను వినియోగించనున్నట్టు జైదీ తెలిపారు. పారదర్శక ఎన్నికల నిర్వహణపై ఈసీకి ప్రపంచస్థాయిలో గుర్తింపు ఉందని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు 2009లో ఇవే ఆరోపణలపై ఈసీ డెమో నిర్వహించింది.

18:48 - May 20, 2017

ప.గో జిల్లాలో ఇద్దరు మహిళల దారుణ హత్య

పశ్చిమగోదావరి: జిల్లా చింతలపూడి సరిహద్దుల్లో దారుణం చోటు చేసుకుంది. టి.నరసాపురం మండలం గండిగూడెంకు చెందిన మంగమ్మ, మహాలక్ష్మి అనే ఇద్దరు అక్కా చెల్లెళ్ళు చింతలపూడి మండలం తీగలవంచ గ్రామ సరిహద్దుల్లో జీడి మామిడి గింజలు ఏరడానికి వెళ్లిన వారిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు హత్యల వెనుక ఉన్న కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు వివాహితులు కావడంతో రెండు కుటుంబాల్లోనూ విషాద ఛాయలు నెలకొన్నాయి.

 

18:42 - May 20, 2017

పశ్చిమగోదావరి: జిల్లా చింతలపూడి సరిహద్దుల్లో దారుణం చోటు చేసుకుంది. టి.నరసాపురం మండలం గండిగూడెంకు చెందిన మంగమ్మ, మహాలక్ష్మి అనే ఇద్దరు అక్కా చెల్లెళ్ళు చింతలపూడి మండలం తీగలవంచ గ్రామ సరిహద్దుల్లో జీడి మామిడి గింజలు ఏరడానికి వెళ్లిన వారిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు హత్యల వెనుక ఉన్న కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు వివాహితులు కావడంతో రెండు కుటుంబాల్లోనూ విషాద ఛాయలు నెలకొన్నాయి.

కారు ఢీకొని రెండేళ్ల చిన్నారి మృతి

రంగారెడ్డి : శంషాబాద్‌ మండలం శాతంరాయ్‌లో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు డ్రైవర్‌ చందు.. రెండేళ్ల చిన్నారిని ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడ్డ చిన్నారి శశిని ఆస్పత్రికి తరలిస్తుండగా.. మృతిచెందింది. స్థానికులు డ్రైవర్‌ను చితకబాది పోలీసులకు అప్పగించారు.

18:39 - May 20, 2017

రంగారెడ్డి : శంషాబాద్‌ మండలం శాతంరాయ్‌లో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు డ్రైవర్‌ చందు.. రెండేళ్ల చిన్నారిని ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడ్డ చిన్నారి శశిని ఆస్పత్రికి తరలిస్తుండగా.. మృతిచెందింది. స్థానికులు డ్రైవర్‌ను చితకబాది పోలీసులకు అప్పగించారు.

18:37 - May 20, 2017

చిత్తూరు : తన పిలుపునకు స్పందించి రైతులు రాజధాని నిర్మాణానికి 40 వేల కోట్ల విలువైన భూములు ఇవ్వడం అభినందనీయన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా రొంపిచర్లలో నీరు-ప్రగతి సభలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో శ్రీ సిటీ వస్తుందని.. తిరుపతి ఎయిర్‌పోర్ట్‌ పక్కనే సెల్‌ కంపెనీలు వస్తున్నాయన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తాను ఎంతో కష్టపడుతుంటే.. కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

18:36 - May 20, 2017

విజయవాడ: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే ధ్యేయంగా పనిచేస్తామంటున్నారు ఆ పార్టీ ఎంపీ మునియప్ప. తనను ఎన్నికలయ్యే వరకు పీఆర్వోగా నియమించినందుకు రాహుల్, సోనియాలకు మునియప్ప కృతజ్ఞతలు చెప్పారు. రాయలసీమ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 24న వామపక్షాలు చేపట్టబోయే బంద్ కు కాంగ్రెస్ పూర్తి మద్దతునిస్తుందన్నారు ఏపిసిసి చీఫ్‌ రఘువీరారెడ్డి. 25న అమిత్ షా విజయవాడ పర్యటించనున్న నేపథ్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో జరిగిన ప్రెస్ మీట్ లో మునియప్ప, రఘువీరాలు మాట్లాడారు.

18:34 - May 20, 2017

తూ.గో : కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్ట్‌లోని కన్వినర్‌ బెల్ట్‌లో పడి ఓ కార్మికుడు ప్రమాదవశాత్తూ మృతిచెందాడు. మైలపల్లి వాసు అనే కార్మికుడు పోర్ట్‌లో రోజులాగే విధుల్లోకి వచ్చాడు.. షిప్‌ నుండి ముడిసరుకును కన్వేయర్‌ బెల్ట్‌ ద్వారా బయటకు తీస్తుండగా వాసు బెల్ట్‌లో చిక్కుకున్నాడు.. మృతుడు మత్స్యకారుడిగా గతంలో పనిచేసేవాడు.. ప్రభుత్వం చేపలవేటను నిషేధించడంతో కుటుంబపోషణ కోసం సీపోర్ట్‌లో డైలీ లేబర్‌గా చేరాడు.. వేట నిషేధ సమయంలో ప్రభుత్వం ఇస్తానని ప్రకటించిన పరిహారమూ అతని కుటుంబానికి రాలేదు.. వాసుకు భార్య, ఇద్దరు పిల్లలుఉన్నారు.. మృతుడికి 25లక్షల పరిహారం ఇచ్చి ఆదుకోవాలని యూనియన్‌ నాయకులు డిమాండ్ చేస్తున్నారు..

వేమవరం సంఘటనపై స్పందించిన ఐజీ సంజయ్ కుమార్

ప్రకాశం: వేమవరం సంఘటనపై గుంటూర్ రేంజ్ ఐజీ సంజయ్ కుమార్ స్పందించారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను గుర్తించినట్లు పేర్కొన్నారు. వారు తక్షణమే లొంగిపోవాలని హెచ్చరించారు. నిందితులకు ఆశ్రయం ఇచ్చిన వారిపైనా కేసులు పెడతామని హెచ్చరించారు. శాంతి భద్రతల విషయంలో ఎవరినీ ఉపేక్షించం అని ఐజీ స్పష్టం చేశారు.

అంతర్జాతీయ కోర్టు తీర్పును ధిక్కరిస్తోన్న పాక్

హైదరాబాద్: అంతర్జాతీయ కోర్టు తీర్పును పాక్ ధిక్కరిస్తోంది. గూఢచర్యం కేసులో అంతర్జాతీయ కోర్టు తీర్పు వర్తించదని తెలిపింది. పాక్ చట్టం ప్రకారం కుల్ భూషణ్ జాదవ్ కు శిక్ష పడుతుందని పాక్ ప్రధాని విదేశీ వ్యవహారాల సలహాదారు సత్ రాజ్ అజీజ్ స్పష్టం చేశారు. ఐసీజే తదుపరి విచారణకు పాక్ నుంచి బలమైన న్యాయబృందాన్ని పంపుతామన్నారు.

ఈవీఎంల ట్యాంపరింగ్ కు అవకాశం లేదు : ఈసీ

న్యూఢిల్లీ: ఈవీఎంల పనితీరు అంశంలో ట్యాంపరింగ్‌కు అవకాశం లేదని నిరూపించేందుకు కేంద్రం ఎన్నికల సంఘం నమూనా ప్రదర్శన నిర్వహించింది. ఈ సందర్భంగా నసీమ్ జైదీ మాట్లాడుతూ ఈవీఎంలను తయారుచేసేటపుడే ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు టెక్నాలజీపై ఆధారపడుతున్నట్లు చెప్పారు. అత్యున్నత ప్రమాణాలను పాటించటమే తమ లక్ష్యమని నసీమ్ జైదీ స్పష్టం చేశారు. ఓటు రసీదు యంత్రాలపై కొన్ని పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయన్నారు. ఇకపై ఓటు యంత్రాలతో కూడిన ఈవీఎంలు వినియోగిస్తామని తెలిపారు.

యాదాద్రిలో భారీ అగ్ని ప్రమాదం...

హైదరాబాద్: యాదాద్రిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సాయిపావని కన్‌స్ట్రక్షన్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ టెంపుల్‌ సిటీ పరిధిలో కార్మికులు ఉంటున్న 20 గుడిసెలు కాలి బూడిదయ్యాయి. అక్కడే ఉన్న రెండు ఆవులు మంటలకు సజీవ దహనమయ్యాయి. స్థానికంగా ఫైరింజన్లు లేకపోవడంతో.. సాయిపావని కన్‌స్ట్రక్షన్‌కు చెందిన వాటర్‌ ట్యాంకర్లతో మంటలను అదుపుచేశారు.

17:55 - May 20, 2017

హైదరాబాద్: యాదాద్రిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సాయిపావని కన్‌స్ట్రక్షన్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ టెంపుల్‌ సిటీ పరిధిలో కార్మికులు ఉంటున్న 20 గుడిసెలు కాలి బూడిదయ్యాయి. అక్కడే ఉన్న రెండు ఆవులు మంటలకు సజీవ దహనమయ్యాయి. స్థానికంగా ఫైరింజన్లు లేకపోవడంతో.. సాయిపావని కన్‌స్ట్రక్షన్‌కు చెందిన వాటర్‌ ట్యాంకర్లతో మంటలను అదుపుచేశారు.

 

17:54 - May 20, 2017

హైదరాబాద్: యాదాద్రి జిల్లా పల్లెర్ల గ్రామానికి చెందిన నరేష్ మిస్సింగ్ కేసులో మరో ట్విస్ట్ వెలుగుచూసింది. నరేష్ ఇంట్లోంచి బయటకు వచ్చే ముందు చివరగా తల్లిదండ్రులకు లేఖ రాశాడు. నమ్మివచ్చిన స్వాతి కోసం మిమ్మల్ని వదిలి వెళ్తున్న క్షమించండి అంటు లేఖలో రాశాడు... చావైనా బతుకైనా తనతోనే అని పేర్కొన్నాడు.

17:46 - May 20, 2017

హైదరాబాద్ :వందమంది అమిత్‌శాలు వచ్చినా.... తెలంగాణలో బిజెపి అధికారంలోకి రాదని... సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ అన్నారు.. మోదీ అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా దళితులపై దాడులు, గోరక్షణ పేరుతో దాడులు కొనసాగుతూనే ఉన్నాయని ఆరోపించారు.. సీఎం తలకు వెలకట్టడం తాను ఇప్పటివరకు చూడలేదని... అలాంటి ప్రకటనలు చేసిన భజరంగ్ దళ్ వారిని ఇప్పటికి అరెస్ట్ చేయలేదని నారాయణ ఫైర్ అయ్యారు.. పోలీసులు దేవుళ్ళలా వ్యవహరించాలని కేసీఆర్ అనడం హాస్యాస్పదమని... చాడా వెంకట రెడ్డి అన్నారు. ప్రజా ఉద్యమాలను అణచివేస్తున్నందుకే పోలీసులను కేసీఆర్ పొగుడుతున్నారని మండిపడ్డారు..

17:43 - May 20, 2017

భద్రాద్రి కొత్తగూడెం : సుజాత నగర్‌లో సీపీఎం జిల్లా కార్యదర్శి కాసాని ఐలయ్య భార్య కాసాని లక్ష్మి సంస్మరణ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు, ఇతర నేతలు హాజరయ్యారు. కాసాని లక్ష్మి చిత్రపటానికి పూలమాలలు వేసి రాఘవులు నివాళులు అర్పించారు.

17:41 - May 20, 2017

భద్రాచలం : శ్రీరామచంద్రస్వామివారి ఆలయం వద్ద 5 పంచవటి బస్సులను ప్రారంభించారు ఈవో ప్రభాకర్ శ్రీనివాస్. పూజా కార్యక్రమాలు నిర్వహించి జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. భక్తులు భద్రాచలం నుంచి నేరుగా పర్ణశాలకు వెళ్లేందుకు ప్రతిరోజు ఉదయం 4 గం. 30 ని.. నుంచి రాత్రి 9 గం. 30ని. ల వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంచుతున్నట్లు ఆర్టీసీ డీఎం నరసింహారావు తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఈ బస్సులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన చెప్పారు.

17:39 - May 20, 2017

మహబూబ్ నగర్ : కాలం మారుతూ ఉంటుంది. దానికి అనుగుణంగా సాగు విధానంలో రైతులు.. కొత్త ఒరవడి చూపుతున్నారు. ఆరుగాలం కష్టపడినా పెట్టుబడులు రాకపోవడంతో.. శాస్త్రీయ విధానాల వైపు కర్షకులు ఆసక్తి చూపుతున్నారు. మహబూబ్‌నగర్‌లో హైబ్రిడ్ పూల తోటలు సాగు చేస్తూ.. అద్భుతమైన ఫలితాలను చూస్తున్నారు.

శాస్త్రీయ విధానాలపై మక్కువ

మహబూబ్‌నగర్‌ జిల్లా, షాద్‌ నగర్‌ ఉద్యాన రైతులు.. శాస్త్రీయ విధానాలపై మక్కువ చూపుతున్నారు. తక్కువ పెట్టుబడి, తక్కువ సమయంలో పంట చేతికి వచ్చే విధంగా.. పూల పంటలు పండిస్తున్నారు. ఉద్యాన పంటలు పండించడంలో షాద్‌ నగర్‌ రైతులు సిద్ధహస్తులు. బెంగళూర్‌లో సాగే చేసే హైబ్రిడ్ పూల తోటలు.. షాద్ నగర్‌లోనూ సాగు చేయడానికి రైతులు మొగ్గు చూపిస్తున్నారు. రైతులు స్వయంగా పొలంలో తయారు చేసుకున్న పచ్చిరొట్ట ఎరువులను, పశువుల ఎరువులను ఎక్కువగా వాడుతున్నారు. దీంతో ఖర్చు తక్కువగా రావడంతో పాటు.. దిగుబడి బాగా వస్తోందని రైతులు చెబుతున్నారు.

రబీ సీజన్‌లో సాగు చేస్తే పూలకు డిమాండ్‌

ఈ పువ్వులను రబీ సీజన్‌లో సాగు చేస్తేనే పెళ్లిళ్లు, పేరంటాలు అధికంగా ఉంటాయి కాబట్టి.. మార్కెట్‌లో పూలకు డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. రూబీస్టార్, టైగర్ గులాబీ, ఫైస్టార్, ఎల్లోగులాబీ, సెంట్ గులాబీ వంటి పూలు బెంగుళూర్‌లోనే సాగు చేసేవారు. బెంగళూర్‌కే పరిమితమైన ఈ సాగు.. ఇప్పుడు మహబుబ్ నగర్ జిల్లాకు వచ్చేసింది. రైతులు బెంగుళూర్‌లోని నర్సరీలకు వెళ్లి, మొక్కలను సరఫరా చేసే ఏజెంట్లను ఆశ్రయించారు. ఒక మొక్కను 10 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. కొందరు రైతులు ఏజెంట్ల ద్వారా 12 రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తున్నారు.

రూబీస్టార్‌, టైగర్‌ గులాబీ, ఫైస్టార్‌, ఎల్లో గులాబీ, సెంట్ గులాబీ

రూబీస్టార్‌, టైగర్‌ గులాబీ, ఫైస్టార్‌, ఎల్లో గులాబీ, సెంట్ గులాబీ పూల సాగు చేసే రైతులు.. సాధారణంగా ప్రతీ నెల 20 నుంచి 30 వేల వరకూ లాభాలు గడిస్తున్నారు. అన్‌ సీజన్‌లో కిలో పూల ధర 30 నుంచి 40 రూపాయలు ఉంటుంది. సీజన్‌లో మాత్రం ప్రతీ నెల 50 వేలు తగ్గకుండా లాభాలు పొందుతున్నారు.

ఆధునిక పద్ధతిలో వ్యవసాయం

డ్రిప్‌, స్ప్రింకర్లు, పాలీ హౌజ్‌, మల్చింగ్ కవర్‌లతో ఆధునీకరణ పద్ధతిలో వ్యవసాయంలో దూసుకుపోతున్నారు. షాద్‌ నగర్‌ వ్యవసాయ శాఖ ఏడీఏ పరిధిలో రబీలో ఎక్కువగా ఉద్యాన పంటలపైనే దృష్టి సారిస్తూ.. షాద్ నగర్‌, ఫరూక్‌నగర్‌, కొత్తూరు మండలాల ఉద్యాన రైతులు ఈ దిగుబడిలో జిల్లాలోనే అగ్రస్థానంలో నిలిచారు.

17:37 - May 20, 2017

హైదరాబాద్‌ : నగరంలో హోర్డింగ్‌లు... నగరవాసులకు ప్రాణసంకటంగా మారాయి. నగరంలో మొత్తం 2,651 హోర్డింగ్స్‌ ఉన్నాయి...అందులో అనుమతులు లేనివి 333 ఉన్నాయి . చిన్న గాలులకే ఈ హోర్డింగ్స్‌ వంగుతున్నాయి.. ఈదురు గాలులకు కూలిపోతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. హోర్డింగ్స్‌ పట్ల అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం వచ్చిన గాలీ వర్షానికి హైదరాబాద్‌లో నాలుగు హోర్డింగ్స్‌ కూలిపోయాయి. దీంతో హోర్డింగ్స్‌ పటుత్వంపై మళ్లీ చర్చ మొదలైంది. అయితే ఏదైనా జరిగినప్పుడు మాత్రమే హడావిడి చేయడం... తర్వాత దానిని మరిచిపోవడం అధికారులకు అలవాటుగా మారింది.

గతేడాది జూబ్లీహిల్స్‌ వద్ద కూలిన భారీ హోర్డింగ్‌

గతేడాది జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ వద్ద భారీ హోర్డింగ్‌ కూలిపోవడంతో అప్పట్లో మూడు నెలల పాటు హోర్డింగ్స్‌ను నిషేదించారు. హోర్డింగ్స్‌ అన్ని పరీక్షించి అనుమతులు ఇస్తామని ప్రకటించింది బల్దియా.. దానికోసం స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టింది. ప్రత్యేక కమిటీలు కూడా ఏర్పాటు చేసి...ప్రైవేట్‌ ఏజెన్సీలను రంగంలోకి దింపింది. ఈ మేరకు పూర్తిస్థాయిలో ప్రమాదకరంగా ఉండే హోర్డింగ్స్‌ను, అనుమతులు లేని హోర్డింగ్స్‌ను తొలగించాలని... చిన్న చిన్న మార్పులు అవసరమైతే వాటిని రిపేర్లు చేసిన తర్వాత అనుమతులు ఇవ్వాలని నిర్ణయించారు. నిర్ణయాలు మాత్రం చేశారు. కానీ వాటిని అమలు చేయడంలో బల్దియా పూర్తిగా విఫలమైంది. తొమ్మిదో తేదీన కూలిన హోర్డింగ్స్‌తో అధికారుల నిర్లక్ష్యం బట్టబయలైంది.

కూలిన వాటిలో అధికారులు సర్టిఫై చేసిన హోర్డింగ్‌లు మూడు

విచిత్ర మేమిటంటే కూలిన నాలుగు హోర్డింగుల్లో.. అధికారులు సర్టిఫై చేసిన హోర్డింగ్‌లే మూడు ఉన్నాయి. శ్రీ యాడ్స్‌కు చెందిన రెండు హోర్డింగ్‌లు బంజార హిల్స్‌లో వాటర్‌ బోర్డు స్థలంలో గ్రౌండ్‌పై ఉన్నాయి. మరొకటి బాలానగరంలో కల్యాణ్‌ యాడ్స్‌కు చెందినది. ఈ మూడింటికి అన్ని అనుమతులు ఉన్నాయి. వీటి వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని అధికారులు ధ్రువీకరించారు. అలాగే మెహదిపట్నంలో ఎలాంటి అనుమతులు లేని హోర్డింగ్‌ కూలిపోయినా...అధికారులు ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో అధికారులు..ఏజెన్సీలు కుమ్మక్కువుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

17:32 - May 20, 2017

శ్రీకాకుళం జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం

శ్రీకాకుళం : జిల్లాలో పలు చోట్ల ఈదురుగాలుల వర్షం పడింది. నరసన్నపేట, పాలకొండ, శ్రీకాకుళం నగరంలో భారీ వర్షం కురిసింది.

వడదెబ్బతో చనిపోయిన తండ్రి కొడుకులు

నల్గొండ: చిట్యాలలో భానుడి ఉగ్ర రూపానికి తండ్రి, కొడుకులు బలయ్యారు. జ్యోతిష్యం చెప్పుకుంటూ జీవనం సాగించే కొండే దశరథ, కొండే శివ వడదెబ్బ ధాటికి కుప్పకూలిపోయారు. ఆస్పత్రికి తరలించే లోపే చనిపోయారు. దీంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

వడదెబ్బకు బాలుడు మృతి

వరంగల్‌ : నగరంలో వడదెబ్బకు ఓ బాలుడు మృతి చెందాడు. పెరుక‌వాడ‌కు చెందిన ల‌క్ష్మీ, లక్ష్మణ్‌ల మూడో సంతానం శివ ఎండలకు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఈ మేరకు ఎంజీఎం ఆస్పత్రిలో చూపించి... తిరిగి ఇంటికి తీసుకువ‌చ్చిన క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు.

చిత్తూరు జిల్లాలో 'నీరు-ప్రగతి' కార్యక్రమం

చిత్తూరు: తన పిలుపునకు స్పందించి రైతులు రాజధాని నిర్మాణానికి 40 వేల కోట్ల విలువైన భూములు ఇవ్వడం అభినందనీయన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా రొంపిచర్లలో నీరు-ప్రగతి సభలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో శ్రీ సిటీ వస్తుందని.. తిరుపతి ఎయిర్‌పోర్ట్‌ పక్కనే సెల్‌ కంపెనీలు వస్తున్నాయన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తాను ఎంతో కష్టపడుతుంటే.. కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

అడ్డాకుల మండల కేంద్రంలోని చికెన్ ఫ్యాక్టరీ ముందు జనం ధర్నా

మహబూబ్ నగర్ : జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలో స్నేహ చికెన్ ఫ్యాక్టరీ నుంచి దుర్వాసన వస్తోందని ఆరోపిస్తూ ప్రజలు ఆందోళనకు దిగారు. వెల్టూర్, బలిదపల్లి, కన్మనూర్, చిల్కతోనిపల్లి, గట్ల ఖానాపూర్ నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు ఫ్యాక్టరీ ముందు ధర్నా చేశారు. పండ్లతోటలు పెడతామని మాయమాటలు చెప్పి భూమి కొనుగోలు చేసిన యజమానులు చికెన్ ఫ్యాక్టరీ పెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు.

16:47 - May 20, 2017

విజయవాడ: వచ్చే ఎన్నికల్లో బిజెపి అధికారంలోకివచ్చేందుకు అమిత్‌ షా పర్యటన ఎంతగానో ఉపయోగడుతుందని... కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు... ఈ నెల 25న విజయవాడలో నిర్వహించబోయే రాష్ట్ర కార్యకర్తల సమావేశంలో అమిత్‌ షా పాల్గొని ప్రసంగిస్తారని చెప్పారు.. గ్రామస్థాయినుంచే కార్యకర్తల్ని తయారుచేసేందుకు ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేశామని వెంకయ్య వివరించారు..

16:45 - May 20, 2017

హైదరాబాద్: ప్రజల ఆకాంక్షను టీఆర్‌ఎస్‌ పార్టీ నెరవేర్చడం లేదని వామపక్ష, ప్రజాసంఘాల నేతలు ఆరోపించారు. హైదరాబాద్‌లో ద వాయిస్‌ ఆఫ్‌ పీపుల్‌ ఆధ్వర్యంలో జరిగిన 'తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష-ప్రస్తుత పరిస్థితి'పై చర్చాగోష్టి జరిగింది. ఈ కార్యక్రమానికి పలు పార్టీల నేతలు, ప్రజాసంఘాల నేతలు హాజరయ్యారు. కేసీఆర్‌ మూడేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆరోపించారు. ప్రజల ఆందోళనలను వినని ప్రభుత్వం... వారి గొంతును నొక్కడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చకపోతే మరో ఉద్యమానికి కూడా వెనకాడబోమని నేతలు హెచ్చరించారు.

16:42 - May 20, 2017

ఈ.గో : తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణపై కేసు నమోదైంది. ఇరగవరం ఎస్సైతో పాటు రైటర్‌ను నిర్భంధించారనే ఆరోపణలపై ఎమ్మెల్యే రాధాకృష్ణతో పాటు 8 మందిపై కేసులు నమోదయ్యాయి. వీరిపై 341, 342, 353 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

 

తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ పై కేసు

ప.గో : తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణపై కేసు నమోదైంది. ఇరగవరం ఎస్సైతో పాటు రైటర్‌ను నిర్భంధించారనే ఆరోపణలపై ఎమ్మెల్యే రాధాకృష్ణతో పాటు 8 మందిపై కేసులు నమోదయ్యాయి. వీరిపై 341, 342, 353 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

 

15:38 - May 20, 2017

హైదరాబాద్: న్యూయార్క్ టైమ్ స్క్వేర్ లో జరిగిన ఓ ప్రమాదం తాలూకు సిసి ఫుటేజ్ ఇప్పుడు సంచలనం రేపుతోంది. రిచార్డ్ రోజాస్ అనే యువకుడు తన ర్యాష్ డ్రైవింగ్ తో జనాలపై కారు తోలడంతో ఒకరు స్పాట్‌లో చనిపోయారు. 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. నిందితుడు కావాలని కారు స్పీడ్ గా డ్రైవ్ చేశాడా? లేక వాహనం అదుపు తప్పి ప్రమాదం జరిగిందా? అనే కోణంలో న్యూయార్క్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

15:36 - May 20, 2017

హైదరాబాద్: చార్‌ధామ్‌ యాత్రీకులంతా క్షేమంగా ఉన్నారని ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌ ప్రకటించారు. రిషికేష్‌ నుంచి బద్రీనాథ్‌కు వెళ్లే మార్గంలో విష్ణుప్రయాగ వద్ద కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదన్నారు. మీడియాలో వార్తలు వచ్చినట్లు 15 వేల మంది భక్తులు చిక్కుకుపోలేదని, 18 వందల మంది మాత్రం కొంత ఇబ్బంది పడ్డారని రావత్‌ చెప్పారు. శిథిలాల తొలగింపు కూడా పూర్తవుతోందని...కొన్ని గంటల్లో రహదారి క్లియర్‌ అవుతుందని తెలిపారు. ఇదిలా ఉంటే... హిమాచల్‌ప్రదేశ్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 3.6గా నమోదయింది. భూకంపం వల్ల ఎలాంటి నష్టం సంభవించలేదని అధికారులు పేర్కొన్నారు.

15:35 - May 20, 2017

కేరళ : తనపై అత్యాచారం చేసేందుకు యత్నించిన బాబాకు ఓ యువతి తగిన బుద్ధి చెప్పింది. కేరళలోని కొల్లాంకు చెందిన 23 ఏళ్ల లా విద్యార్థిని బాబాను ధైర్యంగా ఎదుర్కోవడమే కాకుండా అతడి మర్మాంగాన్ని కోసేసింది. కొల్లాంలోని పద్మనలో ఆ యువతి తన తల్లిదండ్రులతో కలిసి గణేషానంద తీర్థపద స్వామి అలియాస్ హరి ఆశ్రమంలో ఉంటోంది. గత కొంతకాలంగా ఆ యువతిపై కన్నేసిన దొంగబాబా వేధింపులకు గురిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి ఒంటరిగా ఉన్న సమయంలో బాబా యువతిపై అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. బాబాను ధైర్యంగా ఎదుర్కొన్న లా విద్యార్థిని అతడి మర్మాంగాన్ని కోసేసింది. వెంటనే తిరువనంతపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోస్కో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తీవ్రంగా గాయపడ్డ స్వామిని ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు అతనికి ప్లాస్టిక్‌ సర్జరీ నిర్వహించారు. ప్రస్తుతం స్వామి కోలుకుంటున్నారు. యువతిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొన్న లా విద్యార్థినిని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రశంసించారు.

 

15:33 - May 20, 2017
15:32 - May 20, 2017

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో భానుడి దెబ్బకు జనం పిట్టల్లా రాలుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో రెండు రోజుల్లో ఐదుగురు వడదెబ్బతో మృతిచెందారు. యార్లగడ్డ ఏసురత్నం, కామేశ్వరరావుతో పాటు మరో ముగ్గురు మృతి చెందారు. వీరిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గతంలో కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతోనే జనం మృత్యువాత పడుతున్నారని వైద్యులు చెప్పారు.

చిట్యాలలో...

నల్గొండ జిల్లా చిట్యాలలో భానుడి ఉగ్ర రూపానికి తండ్రి, కొడుకులు బలయ్యారు. జ్యోతిష్యం చెప్పుకుంటూ జీవనం సాగించే కొండే దశరథ, కొండే శివ వడదెబ్బ ధాటికి కుప్పకూలిపోయారు. ఆస్పత్రికి తరలించే లోపే చనిపోయారు. దీంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

15:30 - May 20, 2017

విశాఖ : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు.. ఉద్దానం కిడ్నీ బాధితులను కలిశారు. జగతి గ్రామంలో కిడ్నీ బాధితులను కలిసి, వారి సమస్యలను, కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు తమ గోడును వైఎస్‌ జగన్‌ ఎదుట వెళ్లబోసుకున్నారు. డయాలసిస్‌ చేయించుకునేందుకు నెలకు ఒక్కొక్కరికి 15 వేల నుంచి 20వేలు అవుతోందని తెలిపారు. అంత ఆర్థిక స్తోమత తమకు లేదని.. చావే దిక్కని కిడ్నీ బాధితులు వాపోయారు. ప్రభుత్వం కూడా తమ సమస్యను పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేస్తామన్న విషయాన్ని కూడా మర్చిపోయారని తెలిపారు. విశాఖ వెళ్లి వైద్యం చేయించుకోలేకపోతున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా బాధితులకు అండగా ఉంటామని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.

15:27 - May 20, 2017

ఆదిలాబాద్‌ : జిల్లాలో భానుడి భగభగలకు జనం విలవిల్లాడుతున్నారు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్‌, మంచిర్యాల జిల్లాలో అత్యధికంగా 48 డిగ్రీల ఉష్ణోగ్ర

14:38 - May 20, 2017

హైదరాబాద్: బాహుబలి-2 సినిమాను పైరసి చేసేందుకు ప్రయత్నించిన పైరసి నిందితులను అరెస్టు చేసినందుకు సీసీఎస్‌ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు దర్శకులు రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ. బాహుబలి-2 చిత్రాన్ని పైరసి చేస్తామని ఆర్కే మీడియాను బెదిరించి 15 లక్షలు డిమాండ్ చేశారని సైబర్‌ క్రైం పోలీసులకు రాజమౌళి తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు..ఎంతో కష్టపడి పైరసి నిందితులను పట్టుకున్నారని వారిని అభినందించారు. నిందితులు తొలుత హిందీ ప్రొడ్యూసర్‌ కరన్‌ జోహర్‌ను డబ్బులు డిమాండ్ చేసి ఆ తర్వాత ఆర్కే ఆఫీసుకు ఫోన్‌ చేశారని రాజమౌళి తెలిపారు. బీహార్‌ రాజధాని పాట్నా పక్కన ఉన్న గ్రామంలో ఉన్న థియేటర్‌ సర్వర్‌ ద్వారా సినిమాను డౌన్‌లోడ్‌ చేసి పైరసికి పాల్పడ్డ ఆరుగురు నిందితులను సైబర్‌ క్రైం పోలీసులు అరెస్ట్‌ చేసి పైరసికి అడ్డుకట్ట వేశారని వారిని రాజమౌళి అభినందించారు.

 

14:36 - May 20, 2017
14:34 - May 20, 2017

హైదరాబాద్: తెలంగాణాలో అధికార పగ్గాల కోసం టీడీపీ కసరత్తు ప్రారంభించింది. దీనికోసం నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో 15 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నా... ప్రస్తుతం ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. మిగిలినవారంతా టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. అలాగే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా టీడీపీ ఖంగుతింది. దీంతో తెలుగుదేశం పార్టీలో స్తబ్దత నెలకొంది.

పార్టీ పునర్‌వైభవానికి టీటీడీపీ నాయకుల కృషి...

ఈ నేపథ్యంలో పార్టీకి పునర్‌ వైభవాన్ని తెచ్చేందుకు టీటీడీపీ నాయకులు కృషి చేస్తున్నారు. జిల్లాలలో మినీ మహానాడులను నిర్వహించి... పార్టీపై, రాష్ట్రంలోని సమస్యలపై అభిప్రాయాలను సేకరించనున్నారు. మండలానికి పది మంది చొప్పున... ఐదు వందల మండలాల్లో... ఐదు వేల మందిని పార్టీలోకి తీసుకోనున్నారు. వీరికి శిక్షణ ఇచ్చి... గ్రామస్థాయిలో టీడీపీ కార్యక్రమాలు జరిగేలా వ్యూహాలు రచిస్తున్నారు. అలాగే 24న తెలంగాణ మహానాడును నిర్వహించి... టీడీపీ కార్యకర్తల్లో ఉత్తేజం నింపనున్నారు. విశాఖలో 27 నుంచి జరిగే టీడీపీ జాతీయ మహానాడులో తెలంగాణ టీడీపీ నుంచి తొమ్మిది తీర్మానాలను ప్రవేశ పెట్టాలని పార్టీ నాయకులు నిర్ణయించారు. అలాగే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలపై కూడా ఇక్కడ ప్రస్తావించాలని భావిస్తున్నారు. కాగా భవిష్యత్తులో తెలంగాణాలోని కరవు, రైతుల కష్టాలు, విద్య, వైద్యం, కులవృత్తులు వంటి తదితర సమస్యలపై పోరాటాలు చేయాలని టీడీపీ డిసైడ్‌ అయింది.

13:40 - May 20, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. గత వారంరోజులుగా భారీగా నమోదవుతున్న ఊష్ణోగ్రతలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. వచ్చే మూడు నాలుగు రోజుల్లో తీవ్రస్థాయిలో వడగాల్పులుంటాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. తూ.గో జిల్లాలో రాబోయే 3,4 రోజుల్లో భారీ ఊష్ణోగ్రతలు నమోదవుతాయని జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిత్ర తెలిపారు. దీంతో అందరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మ.12.30 నుంచి మ.3 వరకు షాపులు మూసివేయాలని కలెక్టర్‌ సూచించారు. వారం రోజులుగా అన్ని తెలుగు రాష్ట్రాల్లోని చాలో చోట్ల దాదాపు 43 నుంచి 45 డిగ్రీల ఊష్ణోగ్రత నమోదువుతోంది. ఇక రామగుండం, భద్రాద్రి కొత్తగూడెం, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో అయితే 47 డిగ్రీలకు పైనే టెంపరేచర్‌ నమోదవుతోంది. దీంతో ఎండల ధాటిని తట్టుకోలేక జనం విలవిలల్లాడిపోతున్నారు. ముఖ్యంగా ఎండల ధాటికి తట్టుకోలేక వృద్ధులు, పిల్లలు తీవ్ర పిట్టల్లా రాలిపోతున్నారు. ఎండవేడి నుంచి ఉపశమనం పొందేందుకు కూలర్లు, ఏసీలు ఉన్నా..ఉక్కపోత మాత్రం తగ్గడంలేదు. ఇళ్లల్లో ఉక్కపోత తట్టుకోలేక జనం బెంబేలెత్తిపోతున్నారు. ఎండవేడితో పళ్ల రసాలు, కొబ్బరిబోండాలు, కూల్‌ డ్రింక్‌లకు విపరీతంగా గిరాకీ పెరిగింది. 

13:38 - May 20, 2017

ప్రకాశం : జిల్లాలో వర్గవిబేధాలలో గాయపడినవారిని.. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, కరణం బలరాం పరామర్శించారు. హత్యకు గురైన వారి మృతదేహాలను సందర్శించారు. మార్చురీలో ఉన్న మృతదేహాలను పరిశీలించారు. 

13:14 - May 20, 2017

కిడ్నీ బాధితులతో జగన్ ముఖాముఖి

శ్రీకాకుళం : ఉద్దానం కిడ్నీ బాధితులతో జగన్ ముఖాముఖి నిర్వహించారు. జగతి గ్రామంలో సమస్యలను అడిగి తెలుకున్నారు. ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులు తీవ్ర అవస్థలు పడుతున్న వారిని పట్ల ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించాలని జగన్ అన్నారు. 

న్యూయార్క్ లో భారతీయ విద్యార్థి లభ్యం

అమెరికా : న్యూయార్క్ లో భారతీయ విద్యార్థి మృతదేహం లభ్యమయింది. కార్నెల్ యూనివర్సిటీలో విద్యార్థి చదువుతున్నాడు.

యాదగిరిగుట్టలో అగ్నిప్రమాదం

యాదాద్రి భువనగిరి : యాదగిరిగుట్టలో అగ్నిప్రమాదం జరిగింది. సాయి పవన్ డెవలప్ మెంట్ ఆఫ్ టెంపుల్ సిటీ ప్రాజెక్టు కార్మికుల 15 గుడిసెలు దగ్ధం అయ్మాయి, 2 ఆవులు మృతి చెందాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు.

 

 

12:51 - May 20, 2017

రంగారెడ్డి : శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో పాము కలకలం సృష్టించింది. ఎయిర్‌పోర్ట్‌లోని ఎయిర్‌ క్రాఫ్ట్‌ పార్కింగ్ వద్ద ఆగి ఉన్న విమానంలోకి.. 10 ఫీట్లు ఉన్న విషసర్పం ఎక్కడానికి ప్రయత్నించింది. ఇంతలో ఎయిర్‌ పోర్ట్‌ సిబ్బంది గమనించి.. విష సర్పాన్ని పాములు పట్టేవారితో పట్టించారు. పామును జూ పార్కుకు తరలించారు. ఎయిర్‌ పోర్టు చుట్టూ అడవి ఉండడంతో పాము విమానాశ్రయంలోకి వచ్చి ఉండవచ్చని.. ఎయిర్ పోర్టు అధికారులు భావిస్తున్నారు. 

12:48 - May 20, 2017

రంగారెడ్డి : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేవెళ్ల మండలంలో, ముదిమాయల్‌గేట్ సమీపంలో లారీ-ఆటో ఢీ కొన్నాయి. దీంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. 

12:47 - May 20, 2017
11:53 - May 20, 2017
11:51 - May 20, 2017

ప్రకాశం : వైసీపీ నుంచి వచ్చిన గొట్టిపాటి రవికుమార్‌ చిన్న చిన్న గొడవలను పెద్దగా చేసి హత్యాకాండకు తెర లేపుతున్నాడని ఎమ్మెల్సీ కరణం బలరాం ఆరోపిస్తున్నారు. తన వర్గీయులపై గొట్టిపాటి వర్గీయులు చేసిన దాడిపై కరణం బలరాం తీవ్రంగా మండిపడుతున్నాడు. గొట్టిపాటి ఓ దుర్మార్గుడని ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. వైసీపీ నుంచి టిడిపిలోకి వచ్చిన గొట్టిపాటి దొంగల ముఠా..పార్టీలోకి ప్రవేశించాక యంత్రాంగం అండతో కార్యకర్తలపై దాడి చేస్తున్నారని కరణం మండిపడ్డారు. దీనికి సీఎం చంద్రబాబే సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. టిడిపిలోకి వచ్చిన తర్వాత..గొట్టిపాటి రవికుమార్‌కు పెత్తనం వచ్చిందని విర్రవీగుతున్నారని కరణం బలరాం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుధీర్ఘకాలం నుంచి కరణం బలరాం, గొట్టిపాటి మధ్య వైరుద్ధ్యం ఉంది. గత ఏప్రిల్‌లోలోనే వైసీపీ నుంచి టిడిపిలో చేరిన గొట్టిపాటి రవికుమార్‌ చేరికను కరణం బలరాం తీవ్రంగా వ్యతిరేకించారు. తీరా గొట్టిపాటి టిడిపిలోకి చేరిన తర్వాత వీరిద్ధరి మధ్య పలు అంశాల్లో విభేదాలు తలెత్తాయి. అయితే ఇద్దరూ కలిసి పనిచేయాలని అనేకసార్లు సీఎం చంద్రబాబు సూచించారు. అయినా కాని అధిష్టానం సూచనలను ఇటు కరణం, అటు గొట్టిపాటి పట్టించుకోలేదు. చిన్న చిన్న అంశాలకే ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యేవి. గొట్టిపాటి నియోజకవర్గంలో జోక్యం చేసుకోకూడదని కరణంను చంద్రబాబు హెచ్చరించారు. అటు గొట్టిపాటికి కూడా రెండు వర్గాలను కలుపుకొని వెళ్లాలంటూ సూచించినట్లు తెలుస్తోంది. 

11:48 - May 20, 2017

ప్రకాశం : జంట హత్యలతో ప్రకాశం జిల్లా బల్లికురువ మండలం వేమవరం గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గొట్టిపాటి రవికుమార్‌ కరణం బలరాం వర్గీయుల మధ్య రాత్రి జరిగిన వర్గ విబేధాలు దాడిలో ఇద్దరు మృతిచెందడంపై సీఎం చంద్రబాబు సీరియస్‌ అయ్యారు. కె.రాజుపాలెంలో ఓ వివాహానికి హాజరై ద్విచక్ర వాహనాలపై వస్తున్న కరణం వర్గీయులపై..గొట్టిపాటి వర్గీయులు కర్రలు, కత్తులతో మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో అంజయ్య, రామ కోటేశ్వరరావులు ఇద్దరు తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. దాడిలో తీవ్రంగా గాయపడిన పేరయ్య, వెంకటేశ్వర్లు, ముత్యాలు, రాఘవులు చిలకలూరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పాతకక్షల నేపథ్యంలో కరణం బలరాం వర్గీయులపై..గొట్టిపాటి వర్గీయులు దాడి చేసినట్లు తెలుస్తోంది. బాధితులను ఎమ్మెల్సీ కరణం బలరాం పరామర్శించారు. జంట హత్యల నేపథ్యంలో బల్లికురువ మండలంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రంగంలోకి దిగిన ఎస్పీ త్రివిక్రమ్‌..భారీ ఎత్తున పోలీసులను మోహరించి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. తన వర్గీయులపై దాడి నేపథ్యంలో స్పందించిన కరణం..గొట్టిపాటి రవికుమార్‌ను పార్టీలో చేర్చుకొని తప్పుచేశారని సీఎం చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జరిగిన దాడిపై చంద్రబాబు ఏం సమాధానం చెప్తారో చూస్తామన్నారు.


 

11:36 - May 20, 2017
11:35 - May 20, 2017

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటనతోనే కాదు గాత్రంతోని కూడా ప్రేక్షులను అలరిస్తున్నాడు. అన్ని రకాల భావోద్వేగాలను తెరపై పండించగల నటుల్లో తారక్ ఒకరు. ఆయనను అభిమానులే కాకుండా సిని పరిశ్రమకు చెందిన వారు అభిమానిస్తుంటారు. డాన్స్ లోను తారక్ తన ప్రత్యేకతను చటుకుంటున్నాడు. తాజా కన్నడ ఫిల్మ్ ఫెర్ అవార్డ్స్లో ఉత్తమ గాయకుడి విభాగంలో యంగ్ టైగర్ నామినేట్ అయ్యారాని వార్తలు విన్పిస్తున్నాయి. 'చక్రవూహ్' సినిమాలో ఆయన ఆలపించిన 'గలెయా....గలెయా' పాట ప్రజాదరణ పొందింది. ఈ పాటకే తారక్ కు అవార్డు వస్తుందని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.

మంగళగిరి టీడీపీ కార్యకర్తల బాహాబాహి

గుంటూరు : జిల్లా మంగళగిరి టీడీపీ కార్యాలయంలో రెండు వర్గాల మధ్య బాహాబాహి. తాడేపల్లి మడల టీడీపీ అధ్యక్ష పదవి విషయంలో గొడవ జరిగింది. టీడీపీ మండల అధ్యక్ష పదవి ఎన్ని వాయిదా వేశారు.

 

ఉత్తప్రదేశ్ లో బస్సులో మంటలు

లక్నో : బాండా జిల్లాలో బస్సులో మంటలు చేలరేగాయి. మంటల్లో నలుగురు మృతి చెందారు. 15 మందికి గాయాలు అయ్యాయి. హైటెన్షన్ విద్యత్ తీగలు తగిలి బస్సులో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.

 

10:42 - May 20, 2017
10:39 - May 20, 2017
10:28 - May 20, 2017

ప్రకాశం : జిల్లా బలికూర మండలం వేమవరంలో దారుణం జరిగింది. జంట హత్యలతో వేమవరం ఉలిక్కిపడ్డారు. రెండు వర్గాల మధ్య విభేధాలు భగ్గుమన్నాయి. నిన్న రాత్రి 9 గంటలకు స్పీడ్ బ్రేక్ వద్ద పెళ్లి వెళ్లి వస్తున్న ఓ కరణం వర్గం పై మరో గొట్టిపాటి వర్గీయులు దాడి చేశారు. ఈ దాడిలో ఏగినేటి రామకోటేశ్వరరావు, గోరంట్ల అంజయ్య మృతి చెందారు. ఏగినేటి వీర రాఘవులు, ఏగినేటి ముత్యాలుకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చిలకలూరి పేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గోరంట్ల వెంకటేశ్వర్ల పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. గొట్టిపాటి వర్గీయులు వేట కొడవళ్లు, కత్తులతో దాడి చేశారు. ఎమ్మెల్సీ కరణం బలరాం బాధితులను పరామర్శించారు. ఈ దాడి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎవరిని పడితే వారిని పార్టీ చేర్చుకుంటే ఇలానే ఉంటుందన్నారు. దీని పై స్పందించిన సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. వేమవరంలో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులతో పికెటింగ్ నిర్వహిస్తున్నారు. ఏస్పీ త్రివ్రిమ్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.  

10:17 - May 20, 2017

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా ఇల్లెందు మండలం మాణిక్యరం గ్రామంలో విషాదం నెలకొంది. నిన్న సాయంత్రం కారు డోర్ లాక్ అయి రెండేళ్ల పాప అభిదిక మృతి చెందింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో పాప జ్ఞాన శ్రీ మృతి చెందింది. తల్లిదండ్రులు చాలా సేపటి వరకు గమనించకపోవడంతో కారులో ఊపిరి అడక పిల్లలు మృతి చెందినట్లు తెలుస్తోంది. రోడ్డు పై వెళ్తున్న వార గమనించడంతో కారు డోర్ అద్దలు పగలగొట్టి పిల్లలను బయటకు తీశారు. ఇద్దరు పిల్లలు మృతి చెందడంతో తల్లిదండ్రుల రోధనలతో మాణిక్యరం గ్రామలో విషాద ఛాయాలు నెలకొన్నాయి.


 

09:45 - May 20, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలకు జనం విలవిలలాడిపోతున్నారు. మునుపెన్నడు లేన్నంతగా రికార్డు స్ధాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో కాలు బయట పెట్టాలంటేనే జనం హడలిపోతున్నారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా తిరువూరులో అత్యధికంగా 47.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలోని చాలా ప్రాంతాల్లో 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఇక తెలంగాణలోని మంచిర్యాలలో అత్యధికంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. కొత్తగూడెంలో 46 డిగ్రీలు, ఖమ్మంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

కారులో మంటలు....
ఎండ తీవ్రతకు వాహనాలు కూడా హీటెక్కిపోతున్నాయి. కర్నూలు జిల్లాలో ఓ కారులో మంటలు అంటుకున్నాయి.. నందనవనం దగ్గర ఎండవేడికి కారులో మంటలు చెలరేగాయి. మంటల్ని గమనించిన ప్రయాణికులు వెంటనే కారులో నుంచి కిందకు దిగారు. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది కారులో మంటల్ని అర్పేశారు. అప్పటికే కారు కాలిబూడిదైంది. ప్రయాణికులు మంత్రాలయం నుంచి ఎమ్మిగనూరు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. తెలంగాణలో మరో ఘటన జరిగింది. కృష్ణాజిల్లా బండిపాలెంకి చెందిన భార్యాభర్తలు... వివాహంకోసం భద్రాద్రి జిల్లా పాల్వంచకు బైక్ పై వస్తున్నారు.. జూలూరుపాడు వచ్చాక ఎండ వేడికి స్కూటర్‌కు మంటలు అంటుకున్నాయి.. ఈ విషయం గమనించిన దంపతులు బండి దిగారు.. అంతలోనే మంటలు వేగంగా వ్యాపించి స్కూటర్‌ డిక్కీలోఉన్న 6వేల రూపాయలు కాలిబూడిదయ్యాయి

రోడ్డుపై ఉన్న వేడితోనే ఆమ్లేట్‌
ఎండలు ఎంతగా మండుతున్నాయంటే.. రోడ్డుపై ఉన్న వేడితోనే ఆమ్లేట్‌ వేసుకునే పరిస్థితికి చేరాయి. పెద్దపల్లి జిల్లా మంథనిలో ఎండలు ఎంతగా మండుతున్నాయో అధికారులకు తెలియజేసేందుకు కొంతమంది యువకులు రోడ్డుపైనే ఆమ్లేట్‌ వేసి చూపించారు. ఇది చూసిన ప్రజలంతా.. బాబోయ్‌ ఇవేమీ ఎండలురా బాబు అని భయపడుతున్నారు. మధ్యాహ్నం వేళ ఎండలో బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలు, మజ్జిక ప్యాకెట్లు లాంటివి అందించాలని జనం కోరుతున్నారు.

 

09:43 - May 20, 2017

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావొస్తోంది. అయితే ఇప్పటి వరకు చంద్రబాబు కొన్ని నామినేటెడ్‌ పోస్టులనే భర్తీ చేశారు. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు చాలానే నామినేటెడ్‌ పోస్టులు మిగిలిపోయాయి. ఎన్నికలు సమీపిస్తుండడంతో చంద్రబాబు ఇప్పుడు వాటిని భర్తీ చేయడంపై దృష్టి సారించారు. పార్టీలో ఉత్సాహంగా పనిచేస్తున్న వారికి నామినేటెడ్‌ పోస్టులు ఇచ్చి సార్వత్రిక సమరానికి సిద్దం చేయాలని యోచిస్తున్నారు. పార్టీకోసం అహర్నిశలు కష్టపడ్డవారి లిస్ట్‌ను చంద్రబాబు తయారు చేస్తున్నారు. అయితే నామినేటెడ్‌ పోస్టులు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇవ్వబోమని చంద్రబాబు ఇప్పటికే తేల్చి చెప్పారు. దీంతో వారంతా సైడైపోయారు.

అధికారంలోకి వచ్చి మూడేళ్లు
జూన్‌ 8వ తేదీ నాటికి టీడీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తవుతుంది. ఈలోగా అన్ని నామినేటెడ్‌ పోస్టులను భర్తీ చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. నామినేటెడ్‌ పోస్టులన్నింటిలోకెల్లా అత్యంత ప్రదానమైనది టీటీడీ చైర్మన్‌. దీనికోసం ఇప్పటికే ఎంపీలు మురళీమోహన్‌, రాయపాటి సాంబశివరావు తనకే ఇవ్వాంటూ చంద్రబాబు కలిసి కోరారు. ప్రజాప్రతినిధులకు నాటినేటెడ్‌ పోస్టులు ఇవ్వబోమని తేల్చి చెప్పడంతో మిగతా నేతలు టీటీడీ చైర్మన్‌ పదవి కోసం పోటీ పడుతున్నారు. నెల్లూరు జిల్లా సీనియర్‌నేత , మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు పోటీలో ఉన్నట్టు తెలుస్తోంది. బీద మస్తాన్‌రావు ఇప్పటికే సీఎంను కలిసి టీటీడీ చైర్మన్‌ పదవి తనకే ఇవ్వాలని కోరారు. టీటీడీ బోర్డు సభ్యులుగా కూడా తమకు అవకాశం కల్పించాలంటూ చాలామంది నేతలే పోటీపడుతున్నారు. నిన్నటి వరకు టీటీడీ బోర్డు సభ్యునిగా ఉన్న ఎ.వి. రమణ, బాపట్ల మాజీ ఎమ్మెల్యే అనంతవర్మ ఈ పోటీలో ఉన్నారు.

ఆర్టీసీ చైర్మన్‌ రేసులో పుష్పరాజ్‌..
ఆర్టీసీ చైర్మన్‌ రేసులో గుంటూరు జిల్లాకు చెందిన మాజీమంత్రి పుష్పరాజ్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. పుష్పరాజ్‌కు నామినేటెడ్‌ పదవి ఇస్తానని చంద్రబాబు హామీనివ్వడంతో ఆయన గంపెడాశలు పెంచుతున్నారు. ఇదే జిల్లాకు చెందిన చందూ సాంబశివరావుకు కూడా ఏదో ఒక నామినేటెడ్‌ పదవి దక్కుతుందన్న ప్రచారం సాగుతోంది. నెల్లూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీ చైర్మన్‌ రేసులో కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, డాక్టర్‌ శివప్రసాద్‌ పేర్లు వినిపిస్తున్నాయి. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డిని రికమండ్‌ చేస్తున్నట్టు సమాచారం. ఇక 15 నెలలపాటు మద్దిపట్ట సూర్యప్రకాశ్‌, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్‌, రామ్‌గోపాల్‌రెడ్డి, దాసరి రాజామాస్టార్‌ పేర్లు చంద్రబాబు ప్రాధాన్యతలో ఉన్నట్టు తెలుస్తోంది. శోభా హైమావతి, సత్యవాణిలకు చంద్రబాబు న్యాయం చేయాలని చూస్తున్నారు. మరి వీరందరిలో అదృష్టం ఎవరిని వరిస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

 

09:41 - May 20, 2017

కొత్తగూడెం : జిల్లా సుజాత నగర్‌ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేపల గడ్డ, మంగపేట మధ్య బస్సు, లారీ ఎదురెదురుగా ఢీ కొన్నాయి. దీంతో లారీ క్లీనర్‌ కాళ్లు లారీలో ఇరుక్కొని రెండు కాళ్లు నుజ్జు నుజ్జు కాగా.. బస్సు కండక్టర్‌కు గాయాలయ్యాయి. గాయపడిన వారిని కొత్త గూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

రాజన్న సిరిసిల్లలో దారుణం

సిరిసిల్ల : జిల్లాలోని వేములవాడలో నెహ్రూనగర్ లో దారుణం జరిగింది. పెళ్లి బరాత్ లో ఘర్షణ జరగడంతో రౌడీ షీటర్ మోయిజ్ అర్ధరాత్రి ఇంటికి వెళ్లి కత్తులతో దాడి చేశాడు. ఈ దాడిలో ఇద్దరికి కత్తిపోట్లు పడ్డాయి, వారిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 

భద్రాద్రి కొత్తగూడెంలో విషాదం

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా ఇల్లెందు మండలం మాణిక్యరం గ్రామంలో విషాదం నెలకొంది. నిన్న సాయంత్రం కారు డోర్ లాక్ అయి రెండేళ్ల పాప అభిదిక మృతి చెందింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో పాప పరిస్థితి విషమంగా ఉంది.

09:24 - May 20, 2017

సిరిసిల్ల : జిల్లాలోని వేములవాడలో నెహ్రూనగర్ లో దారుణం జరిగింది. పెళ్లి బరాత్ లో ఘర్షణ జరగడంతో రౌడీ షీటర్ మోయిజ్ అర్ధరాత్రి ఇంటికి వెళ్లి కత్తులతో దాడి చేశాడు. ఈ దాడిలో ఇద్దరికి కత్తిపోట్లు పడ్డాయి, వారిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మోయిజ్ పాటు మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

09:23 - May 20, 2017

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా ఇల్లెందు మండలం మాణిక్యరం గ్రామంలో విషాదం నెలకొంది. నిన్న సాయంత్రం కారు డోర్ లాక్ అయి రెండేళ్ల పాప అభిదిక మృతి చెందింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో పాప పరిస్థితి విషమంగా ఉంది. తల్లిదండ్రులు చాలా సేపటి వరకు గమనించకపోవడంతో కారులో ఊపిరి అడక పాప మృతి చెందినట్లు తెలుస్తోంది. రోడ్డు పై వెళ్తున్న వార గమనించడంతో కారు డోర్ అద్దలు పగలగొట్టి పిల్లలను బయటకు తీశారు.

 

ఎల్ బీనగర్ లో రోడ్డు ప్రమాదం

హైదరాబాద్ : ఎల్ బీ నగర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం అదుపుతప్పి మెట్రో పిల్లర్ ను ఢీకొట్టింది. డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కట్టెల లోడుతో ఖమ్మం నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 

ప్రకాశం జిల్లాలో దారుణం

ప్రకాశం : జిల్లా బలికూర మండలం వేమవరంలో దారుణం జరిగింది. రెండు వర్గాల మధ్య విభేధాలు భగ్గుమన్నాయి. ఓ వర్గం పై మరో వర్గ దాడి చేశారు. ఈ దాడిలో ఏగినేటి రామకోటేశ్వరరావు, గోరంట్ల అంజయ్య మృతి చెందారు. ఏగినేటి వీర రాఘవులు, ఏగినేటి ముత్యాలుకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చిలకలూరి పేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

08:26 - May 20, 2017

హైదరాబాద్ : ఎల్ బీ నగర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం అదుపుతప్పి మెట్రో పిల్లర్ ను ఢీకొట్టింది. డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కట్టెల లోడుతో ఖమ్మం నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుడు కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన ఎస్.కె సర్దార్ గా పోలీసులు గుర్తించారు. డ్రైవర్ నిద్ర మత్తు ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

08:25 - May 20, 2017

ప్రకాశం : జిల్లా బలికూర మండలం వేమవరంలో దారుణం జరిగింది. రెండు వర్గాల మధ్య విభేధాలు భగ్గుమన్నాయి. ఓ వర్గం పై మరో వర్గ దాడి చేశారు. ఈ దాడిలో ఏగినేటి రామకోటేశ్వరరావు, గోరంట్ల అంజయ్య మృతి చెందారు. ఏగినేటి వీర రాఘవులు, ఏగినేటి ముత్యాలుకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చిలకలూరి పేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గోరంట్ల వెంకటేశ్వర్ల పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. పెళ్లికి వెళ్లి వస్తుండగా స్పీడ్ బ్రేక్ వద్ద మరో వర్గం వారు వేట కొడవళ్లు, కత్తులతో దాడి చేశారు. ఎమ్మెల్సీ కరణం బలరాం బాధితులను పరామర్శించారు. ఈ దాడి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎవరిని పడితే వారిని పార్టీ చేర్చుకుంటే ఇలానే ఉంటుందన్నారు. దీని పై స్పందించిన సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. 

08:07 - May 20, 2017

హైదరాబాద్ : బాహుబలి... ది కంక్లూజన్ వసూళ్ల మోత మోగిస్తూనే ఉంది. కేవలం 10 రోజుల్లోనే వెయ్యి కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. ఇప్పుడు పదిహేను వందల కోట్ల మార్క్‌నూ సునాయాసంగా దాటేసింది. వెయ్యికోట్ల క్లబ్‌లోకి చేరిన దంగల్‌.. ఓ దశలో బాహుబలికి పోటీ అవుతుందని భావించారు. అయితే, బాహుబలి -2, కలెక్షన్లలో అన్ని రికార్డులనూ బద్దలు కొట్టడమే కాదు.. సరికొత్త హిస్టరీ క్రియేట్‌ చేసింది. బాహుబలి-2 కలెక్షన్ల రికార్డులను బద్దలు కొడుతోంది. వసూళ్లలో ప్రభంజనం సాగిస్తూ సత్తా చాటుతోంది. బాహుబలి..ది కన్‌క్లూజన్‌ సునామీకి బాక్సాఫీసు షేక్‌ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన తొలి పదిరోజుల్లోనే వెయ్యి కోట్లు సాధించిన ఈ మూవీ 22 రోజుల్లో రూ.1500 కోట్ల మార్కును చేరుకుంది. భారత్‌లో బాహుబలి... ది కన్‌క్లూజన్‌ విడుదలైన అన్ని భాషల్లో రూ.1,227 కోట్లు, విదేశాల్లో రూ.275 కోట్లు కలిపి మొత్తం రూ.1502 కోట్లు వసూలు చేసింది. హిందీలో తొలి మూడురోజులకు రూ.128 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ ఓవరాల్ గా రూ.500 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాల సమాచారం. దంగల్ వసూలు చేసిన 1,275 కోట్లు, పీకే కలెక్షన్లు రూ.792 కోట్ల రికార్డుల్ని బాహుబలి-2 దాటేసింది. బాహుబలి-2 రూ. 1500 కోట్లు వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా ప్రకటించింది. ఈ సందర్భంగా దేవసేన, శివగామి పాత్రలతో ఉన్న పోస్టర్ ను బాహుబలి టీం సోషల్ మీడియాలో రిలీజ్ చేసి అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది.

భారతదేశ సినీ చరిత్రలో రికార్డు..
భారతదేశ సినీ చరిత్రలో ఇప్పటివరకు అమీర్ ఖాన్ నటించిన దంగల్ మూవీ 1,227 కోట్లే అత్యధిక వసూళ్లు. ఈ రికార్డును బాహుబలి-2 బ్రేక్ చేసింది. ఓపెనింగ్ వీకెండ్‌లోనే 505 కోట్లు కొల్లగొట్టింది. అటు అమెరికా బాక్సాఫీసులో కూడా ఈ సినిమా రికార్డులు బద్దలు కొట్టింది. ఓపెనింగ్ వీకెండ్‌లో 65.65 కోట్లు కొల్లగొట్టింది. హిందీలోనే తొలి మూడు రోజుల్లో 120 కోట్ల రూపాయలు నెట్ వసూలుచేసి తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది బాహుబలి-2. మార్కెట్ అనలిస్టుల అంచనాలకు మించి 1500 కోట్ల మార్కును అందుకుంది బాహుబలి-2. బాహుబలి-2 వసూళ్లను చూస్తుంటే త్వరలోనే మరిన్ని రికార్డులను నెలకొల్పే పరిస్థితి కనిపిస్తోంది. అంతేకాదు, ఈ సినిమా రికార్డుని సమీప భవిష్యత్తులో మరే మూవీ అందుకోలేదన్న భావన వ్యక్తమవుతోంది. 

08:00 - May 20, 2017

బెంగళూరు : ఐపీఎల్‌ ఫైనల్‌కు ముంబై ఇండియన్స్‌ దూసుకెళ్లింది. క్వాలిఫయర్‌ -2లో కోల్‌కతాపై ఆ జట్టు ఘన విజయం సాధించింది. కరణ్‌శర్మ మాయాజాలం, బుమ్రా కట్టుదిట్టమైన బంతులకు గంభీర్‌ సేన కేవలం 107 పరుగులకే కుప్పకూలింది. ముంబై బౌలర్ల విజృంభణతో 18.5 ఓవర్లలోనే కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆలౌట్‌ అయ్యింది. కోల్‌కతా నిర్దేశించిన 108 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం 14.3 ఓవర్లలోనే 4వికెట్లు కోల్పోయి సాధించింది. దీంతో కోల్‌కత్తాపై 6 వికెట్ల తేడాతో ముంబై విజయం సాధించింది. ఇక ఆదివారం హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో జరిగే తుదిపోరులో రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్‌తో రోహిత్‌ సేన అమీతుమీ తేల్చుకోనుంది.

07:59 - May 20, 2017

చెన్నై : చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణమంటపంలో అభిమానులతో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ భేటి చివరి రోజున కూడా కొనసాగింది. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. తమిళనాడులో మంచి నేతలున్నా వ్యవస్థలో మార్పు రావడంలేదని మండిపడ్డారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ అధ్వానంగా తయారైందని రజనీ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని... ప్రజల ఆలోచనల్లో మార్పు వచ్చినప్పుడే దేశం సరైన మార్గంలో పయనిస్తుందని రజనీకాంత్‌ చెప్పారు. యుద్ధం ఆరంభమయ్యేనాటికి మనమంతా సిద్ధంగా ఉందామని అభిమానులకు పిలుపునివ్వడం ద్వారా తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు చెప్పకనే చెప్పారు.

పక్కా తమిళుణ్ణే...
తన స్థానికతపై వస్తున్న విమర్శలను రజనీకాంత్‌ తిప్పికొట్టారు. తాను పక్కా తమిళుణ్ణేనని స్పష్టతనిచ్చారు. ఇరవైమూడేళ్లపాటు కర్నాటకలో ఉన్నా, 43 ఏళ్లుగా తమిళనాడులో నివసిస్తున్న విషయాన్ని రజనీకాంత్‌ గుర్తు చేశారు. కర్నాటక నుంచి వచ్చిన తనను తమిళుడిగానే ప్రజలు ఆదరించారని చెప్పారు. తాను ఉంటే మంచిమనసులున్న తమిళనాడులో ఉంటానని, లేకుంటే రుషులు సంచరించే హిమాలయాల్లో ఉంటానని చెప్పుకొచ్చారాయన. దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత అభిమానులతో రజనీకాంత్‌ భేటీ అయ్యారు. చెన్నైలో గత ఐదురోజులుగా అభిమానులను కలుసుకున్నారు. తనతో కలిసి ఫోటోలు దిగేందుకు అభిమానులకు అవకాశం ఇచ్చారు. 

07:57 - May 20, 2017

హైదరాబాద్ : ఉన్న ఊరిలోనే పనికల్పించి .. వలసలు నివారించడమే లక్ష్యంగా నాటి యూపీఏ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. వలసలు నివారించడానికి సదుద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ పథక లక్ష్యం.. తెలంగాణలో నీరుగారుతోంది. ఉపాధి హామీ పథకం కింద కూలీలు చేసిన పనులకు ప్రభుత్వం సక్రమంగా విడుదల చేయకపోవడంతో వారికి కష్టాలు మొదలయ్యాయి. ఒకటి, రెండు రోజులు కాదు.. ఏకంగా నెలల తరబడి బకాయిలు పేరుకుపోతున్నాయి. దీంతో ఉపాధి కూలీలు బతుకుదెరువు కోసం వలసబాట పడుతున్నారు.

14 రోజుల్లోపే బిల్లులు చెల్లించాలి
నిబంధనల ప్రకారం పనులు చేసిన 14 రోజుల్లోపే బిల్లులు చెల్లించాలి. కానీ తెలంగాణలో మాత్రం నెలలు గడుస్తున్నా కూలీ పనులే ఇవ్వడం లేదు. తెలంగాణ మొత్తంగా ఇప్పటి వరకు కూలీలకు ప్రభుత్వం 345 కోట్ల రూపాయలు బకాయి పడింది. నాలుగు నెలలుగా వీటిని విడుదల చేయకపోవడంతో కూలీలు అష్టకష్టాలు పడుతున్నారు. తెలంగాణలో 31 జిల్లాల్లోని 436 మండలాల్లో దాదాపు 8570 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పనులను ప్రభుత్వం చేపడుతోంది. ఇందుకుగాను 56 లక్షల జాబ్‌ కార్డులను జారీ చేసింది. 26 జిల్లాల్లో పనులు చేయడానికి అనుమతులు జారీ చేసింది. ఎండలు దంచి కొడుతుండడంతో ఆయా ప్రాంతాల్లో పనులు మందకొడిగా సాగుతున్నాయి. గత ఆర్దిక సంవత్సరం లక్ష్యానికి మించి ఉపాధి హామీ పనులు సాగాయి. మొత్తంగా 10 కోట్ల పనిదినాల్లో 9 కోట్లకుపైగానే పనిదినాలు ఉపయోగించుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఫలితంగా 24.3 లక్షల కుటుంబాలకు ఉపాధి హామీ పనులు కల్పించింది. వీటిలో లక్షా 5వేల 224 కుటుంబాలు వందరోజుల పని దినాలను పూర్తి చేసుకున్నాయి.

బకాయిలు విడుదల చేయాని కేంద్రం
గతేడాది పథకం అమలు లక్ష్యాన్ని చేరినప్పటికీ అందుకుగాను రాష్ట్రానికి రావాల్సిన 400 కోట్ల రూపాయల ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్‌ నిధులు కేంద్రం విడుదల చేయలేదు. వీటితో కలిపి మొత్తంగా 941 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. దీంతో ఈ ఏడాది జరుగుతున్న ఉపాధి హామీ పనులపై నిధుల కొరత ప్రభావం చూపుతోంది. పెండింగ్‌ నిధుల విడుదల కోసం గత నెలలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కేంద్ర పంచాయతీరాజ్‌ మంత్రితో భేటీ అయ్యారు. పెండింగ్‌ నిధులను విడుదల చేయాలంటూ వినతిపత్రం అందజేశారు. అయినా ఇంతవరకు నిధులు విడుదల కాలేదు.కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సకాలంలో రాకపోవడానికి తోడు.. రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు విడుదల చేయకపోవడంతో కూలీలకు కూలీడబ్బులు అందడం లేదు. దీంతో వారు పూటగడవక నానా ఇబ్బందులు పడుతున్నారు. రెక్కాడితేకానీ డొక్కాడని పేదలు.. చేసిన పనికి కూలీ అందక అగచాట్లు పడుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఉపాధి నిధులను వెంటనే విడుదల చేయాలని కూలీలు కోరుతున్నారు.

07:54 - May 20, 2017

నల్లగొండ : సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. నల్లగొండలో తనపై రాళ్లదాడికి సీఎం కేసీఆర్‌ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రొటోకాల్‌ ప్రకారం ఆహ్వానించి తనను రాళ్లతో కొట్టించారని మండిపడ్డారు.. కేసీఆర్‌..... నిన్నూ జనాలు ఓట్లతో కొట్టేరోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు.. రాళ్లతో దాడిచేసిన టీఆర్‌ఎస్‌ రౌడీలపై ఒక్క కేసుకూడా నమోదు చేయరా? అని పోలీసుల్ని ప్రశ్నించారు.. శనివారంలోగా కేసులు పెట్టకపోతే ఆధారాలతో సహా కోర్టుకు వెళతామని హెచ్చరించారు. 

07:53 - May 20, 2017

సంగారెడ్డి : ప్రధాని మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మూడేళ్లుగా ప్రజలను మోసం చేస్తున్నారన్నారు టీ-పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు జూన్‌ 1న సంగారెడ్డిలో 'తెలంగాణ ప్రజాగర్జన' పేరిట బహిరంగ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ వస్తున్నారని తెలిపారు. సంగారెడ్డిలో బహిరంగ సభ జరిగే ప్రదేశాన్ని ఉత్తమ్‌తో పాటు పలువురు నేతలు పరిశీలించారు. 

07:41 - May 20, 2017

విజయవాడ : టీడీపీ ప్రభుత్వం ఏక ప్రజా సమస్యను పరిష్కరించడం లేదని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి. మధు అన్నారు. పేదలు కట్టుకున్న ఇళ్లనూ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉండవల్లి పరిసర ప్రాంతాల్లో ఒక్క గుడిసెను తొలగించినా ఆందోళనకు దిగుతామని ఆయన హెచ్చరించారు. అక్టోబర్‌లో విజయవాడలో మహాయాత్ర నిర్వహిస్తామన్నారు. ఈనెల 24న రాయలసీమ్‌ నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. విజయవాడలో జరిగిన సుందరయ్య వర్దంతి సభలో ఆయన పాల్గొన్నారు. సుందరయ్య స్ఫూర్తితో రాబోయే రోజుల్లో ఉద్యమాలు మరింత తీవ్రతరం చేస్తామన్నారు. అంతకుముందు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. 

07:39 - May 20, 2017

హైదరాబాద్ : ఎన్నికల సంస్కరణలపై మోదీ సర్కార్‌ తలకిందుల చర్యలకు పాల్పడుతోందని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందాకారత్‌ అన్నారు. ఎన్నికల విరాళాలపై రూపొందించిన సంస్కరణలు రాజకీయ అవినీతిని మరింత ప్రోత్సహించేలా ఉన్నాయని మండిపడ్డారు. ప్రస్తుతం కార్పొరేట్‌ శక్తుల గుప్పిట్లో ఎన్నికలు బంధీ అయిపోయాయని విమర్శించారు. కమ్యూనిస్టు పార్టీలకు రాజకీయంగా ఇది ఓ పెద్దసవాల్‌ వంటిదన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, కమ్యూనిస్టు ఉద్యమనేత సుందరయ్య వర్ధంతి సందర్భంగా ప్రజాస్వామ్యం - ఎన్నికల సంస్కరణలు అన్న అంశంపై నిర్వహించిన సభలో ఆమె స్మారకోపన్యానం చేశారు. దేశంలో నేడు ఈవీఎంల విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారిందన్నారు. అందువల్ల ఈవీఎమ్‌ల పనితీరుపై ప్రజల్లో విశ్వసనీయ పెంచేందుకు చర్యలు చేపట్టాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రతి ఓటరు ఓటు వేసిన తర్వాత వారు ఏగుర్తుకు ఓటేశారో తెలిపేలా స్లిప్లులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేనితోపాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

07:35 - May 20, 2017

గుంటూరు : అమరావతిలోని సచివాలయంలో మంత్రి నారా లోకేశ్ ఐటీ శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎం చంద్రబాబు యూఎస్‌ పర్యటన, అంతకుముందు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన కంపెనీలపై ఈ సమావేశంలో చర్చించారు.. వీలైనంత త్వరగా ఐటీ కంపెనీలు మొదలయ్యేందుకు అవసరమైన అనుమతులు, భూకేటాయింపులు పూర్తిచేయాలని అధికారుల్ని లోకేశ్ ఆదేశించారు.. కంపెనీలకు కల్పించాల్సిన మౌళిక సదుపాయాలను వెంటనే కల్పించాలన్నారు.. కంపెనీల ఏర్పాటుకు అనుమతుల విషయంలో ఇబ్బందులు రాకుండా ముఖ్య అధికారులతో వాట్సప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేయాలన్నారు.. ఐటీ శాఖ అంతర్గత వెబ్‌సైట్‌లో రియల్‌ ట్రాకింగ్ సిస్టమ్‌ మరింత మెరుగుపరిచి సమస్యలు పరిష్కరించాలని అధికారులకు మంత్రి సూచించారు.

రెండేళ్లలో లక్ష ఐటీ ఉద్యోగాలు
వచ్చే రెండేళ్లలో లక్ష ఐటీ ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారుల్ని మంత్రి ఆదేశించారు.. ప్రతి 15రోజులకు ఒక పెద్ద కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవాలని సూచించారు. వీలైనంత త్వరగా కంపెనీల కార్యకలాపాలు ప్రారంభించేలా అధికారులు కృషి చేయాలన్నారు.. విశాఖను ఐటీ హబ్‌గా తయారుచేసేందుకు కావాల్సిన రోడ్‌ మ్యాప్‌ సిద్ధం చేయాలని ఆదేశాలు జారీచేశారు.. అలాగే వైజాగ్‌ను ప్రమోట్ చేయడానికి కార్యక్రమాలు డిజైన్‌ చేయాలన్నారు. ఐటీ కంపెనీలు రాష్ట్రానికి రావాల్సిన రాయితీలు, వసతులు, నూతన భవన నిర్మాణాలపై కూడా ఈ భేటీలో చర్చించారు.. సమస్యల పరిష్కారంపై దృష్టిసారించాలని అధికారుల్ని ఆదేశించారు

07:30 - May 20, 2017

హైదరాబాద్ : తెలంగాణాలో అధికార పగ్గాల కోసం టీడీపీ కసరత్తు ప్రారంభించింది. దీనికోసం నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో 15 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నా... ప్రస్తుతం ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. మిగిలినవారంతా టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. అలాగే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా టీడీపీ ఖంగుతింది. దీంతో తెలుగుదేశం పార్టీలో స్తబ్దత నెలకొంది.

పార్టీకి పునర్‌ వైభవం...
ఈ నేపథ్యంలో పార్టీకి పునర్‌ వైభవాన్ని తెచ్చేందుకు టీటీడీపీ నాయకులు కృషి చేస్తున్నారు. జిల్లాలలో మినీ మహానాడులను నిర్వహించి... పార్టీపై, రాష్ట్రంలోని సమస్యలపై అభిప్రాయాలను సేకరించనున్నారు. మండలానికి పది మంది చొప్పున... ఐదు వందల మండలాల్లో... ఐదు వేల మందిని పార్టీలోకి తీసుకోనున్నారు. వీరికి శిక్షణ ఇచ్చి... గ్రామస్థాయిలో టీడీపీ కార్యక్రమాలు జరిగేలా వ్యూహాలు రచిస్తున్నారు. అలాగే 24న తెలంగాణ మహానాడును నిర్వహించి... టీడీపీ కార్యకర్తల్లో ఉత్తేజం నింపనున్నారు. విశాఖలో 27 నుంచి జరిగే టీడీపీ జాతీయ మహానాడులో తెలంగాణ టీడీపీ నుంచి తొమ్మిది తీర్మానాలను ప్రవేశ పెట్టాలని పార్టీ నాయకులు నిర్ణయించారు. అలాగే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలపై కూడా ఇక్కడ ప్రస్తావించాలని భావిస్తున్నారు. కాగా భవిష్యత్తులో తెలంగాణాలోని కరవు, రైతుల కష్టాలు, విద్య, వైద్యం, కులవృత్తులు వంటి తదితర సమస్యలపై పోరాటాలు చేయాలని టీడీపీ డిసైడ్‌ అయింది.

07:26 - May 20, 2017

గుంటూరు : ఏపీ పునర్విభజన చట్టం.. కేంద్రం ఇచ్చిన హామీలపై సీఎం చంద్రబాబు అమరావతిలో సమీక్షించారు.. ఈ సమావేశానికి మంత్రి కాల్వ, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌, ఇతర అధికారులు హాజరయ్యారు.. ఉన్నత విద్యామండలి విషయంలో సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుందని కాల్వ ఆక్షేపించారు. 9, 10 షెడ్యూల్‌లో 231 విద్యాసంస్థలు ఉంటే, షీలాబేడీ కమిటీ 64 సంస్థలకు సంబంధించి మాత్రమే నిర్ణయాలు తీసుకుందని అన్నారు. హెడ్‌ క్వార్టర్స్‌పై నిన్న కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులు సుప్రీంకోర్టు స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని కాల్వ తెలిపారు.. 9, 10 షెడ్యూల్‌ ఆస్తుల విషయంలో కేంద్ర నిర్ణయం అనుకూలంగా లేకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పుకొచ్చారు.. ఆస్తుల పంపిణీ, ఇతర సమస్యల పరిష్కారానికి సెక్షన్‌ 108ని మరో రెండేళ్లు కొనసాగించాలని కేంద్రానికి లేఖ రాస్తామన్నారు .

జూన్‌ 1తో ముగుస్తోన్న స్థానికత...
రెండు రాష్ట్రాలమధ్య స్థానికత అంశం జూన్‌ 1తో ముగుస్తోంది.. దీన్ని మరో రెండేళ్లు పొడిగించాలని కేంద్రాన్ని కోరతామని పరకాల ప్రభాకర్‌ చెప్పారు.. దీనితోపాటు.. సెక్షన్‌ 108, 66లను మరో రెండేళ్లు అమలు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నామని వివరించారు. విభజన చట్టంలోని హక్కులు సాధించుకోవడంలో రాజీపడబోమని కాల్వ స్పష్టం చేశారు.. ఈ విషయంలో కేంద్రం సరిగా వ్యవహరించకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు.

 

07:19 - May 20, 2017

రైతులకు సంకెళ్లు వేసిన పోలీసులు గొప్ప పోలీసులా...పోలీసులు సాధారణ ప్రజల పట్ల ఎలా ఉన్నారో అనేది ముఖ్యమని, పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని న్యూస్ మార్నింగ్ పాల్గొన్న ప్రముఖ విశ్లేషకులు వినయ్, కాంగ్రెస్ నేత రామచంద్రారెడ్డి అన్నారు. 

శ్రీకాకుళంలో రెండో రోజు జగన్ పర్యటన

శ్రీకాకుళం : జిల్లాలో వైసీపీ అధ్యక్షుడు జగన్ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఉద్దానం కిడ్నీ బాధితులను పరామర్శించనున్నారు.

చిత్తూరులో రెండో రోజు సీఎం చంద్రబాబు పర్యటన

చిత్తూరు : జిల్లాలో నేడు రెండో రోజు సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగనుంది. రొంపిచర్లలో బహిరంగసభలో సీఎం పాల్గొంటారు. అరవవాండ్లలో పంటకుంటలను పరిశీలించనున్నారు.

06:46 - May 20, 2017

ఎక్కువ సంఖ్యల పశువులుంటే దానికి ప్రణాళిక అవసరం, డెయిరీ శుభ్రత ఉండేలా చూసుకోవాలని  జనగాం జిల్లా భారతి డెయిరీ అధినేత మనోజ్ రెడ్డి అన్నారు. వాక్సినేషన్ కరెక్ట్ గా ఉండాలని. పిల్లల కోసం ప్రత్యేక పాలను తీసుకోస్తున్నామని ఆయన తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

Don't Miss