Activities calendar

21 May 2017

21:31 - May 21, 2017

హైదరాబాద్: ఉత్తర కొరియా మరోమారు మధ్యశ్రేణి క్షిపణిని పరీక్షించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా సైన్యం ధ్రువీకరించింది. ఈ క్షిపణి 500 కిలోమీటర్లు ప్రయాణించి జపాన్‌ సముద్రంలో కూలిపోయింది. గత మూడు పరీక్షల్లో వాడిన క్షిపణి కంటే ఇది తక్కువ దూరం ప్రయాణించింది. ఇటీవల కొత్త శ్రేణి రాకెట్‌ పరీక్షించామని ఉత్తర కొరియా ప్రకటించిన వారం రోజుల్లోనే ఈ పరీక్షను నిర్వహించడం గమనార్హం. మరోమారు క్షిపణి పరీక్షలు నిర్వహించవద్దని ఐక్యరాజ్యసమితి ఇప్పటికే ఉత్తరకొరియాను హెచ్చరించింది.

21:29 - May 21, 2017

హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌లో లోకమాన్య తిలక్‌ రైలు పట్టాలు తప్పింది.. 11బోగీలు పట్టాలనుంచి పక్కకువెళ్లాయి.. ఉన్నవ్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో ఈ ఘటన జరిగింది.. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు.. రైలు పట్టాలు తప్పడం వెనక కారణాల్ని ఆరాతీసేందుకు ఉత్తర్‌ ప్రదేశ్ యాంటి టెర్రరిజం స్క్వాడ్‌ ఘటనాస్థలానికి వెళ్లింది. పూర్తి వివరాలు సేకరిస్తోంది..

21:28 - May 21, 2017

హైదరాబాద్: గూఢచర్యం ఆరోపణలతో పాక్‌ సైన్యం చేతుల్లో బంధీగా ఉన్న భారత మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ కేసు ఓ కొలిక్కి రాకముందే మరో భారతీయుడిని పాక్ అరెస్టు చేయడం కలకలం రేపుతోంది. ఇవాళ ఇస్లామాబాద్‌లో సరైన పత్రాలు లేవంటూ ఒక భారతీయుడిని అరెస్టు చేశారు. అరెస్టైన వ్యక్తిని ముంబయికి చెందిన షేక్‌ నబీగా గుర్తించారు. ఆర్టికల్‌ 14 విదేశీ చట్టం కింద నబీపై కేసు నమోదు చేసినట్లు పాక్‌ పోలీసులు వెల్లడించారు. విచారణ నిమిత్తం నబీని 14రోజుల పాటు జ్యూడిషియల్‌ రిమాండ్‌కు తరలించారు.

21:27 - May 21, 2017

హైదరాబాద్: జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లా నౌగామ్‌ ప్రాంతం కాల్పులతో అట్టుడికింది. భారత్‌ భూభాగంలోకి ప్రవేశించేందుకు ఉగ్రవాదులు యత్నిస్తుండగా.. ఆర్మీ బృందాలు అడ్డుకున్నాయి. దీంతో ఉగ్రవాదులు, సైన్యం మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులు, ముగ్గురు జవాన్లు మృతిచెందారు. దీంతో 36 గంటలుగా సాగిన ఎన్‌ కౌంటర్ ముగిసింది. ఎల్‌ఓసీ వద్ద ఉగ్రవాదుల కోసం కూంబింగ్‌ చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతంలో సైనికులు భారీగా ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

 

21:20 - May 21, 2017

హైదరాబాద్: తెలుగురాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఎండల తీవ్రతకు తోడు వడగాడ్పులు కూడా జనం ప్రాణాలు తీస్తున్నాయి. ప్రతిరోజు రెండు రాష్ట్రాల్లో పలువురు వృద్ధులు వడదెబ్బ తగిలి మృతి చెందుతున్నారు. బెంబేలెత్తిస్తున్న ఎండలతో జనం ఇళ్లలో నుంచి బయటికి రావడానికి భయపడుతున్నారు.

పిట్టల్లా రాలుతున్న జనం....

తెలగు రాష్ట్రాలపై భానుడు చండ్ర నిప్పులు కురిపిస్తున్నాడు. తీవ్రమైన ఎండతో పాటు, వడగాల్పులకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు సూర్యుడి ప్రతాపానికి బలైపోతున్నారు.

నిప్పుల కుంపటిని తలపిస్తున్న మేనెల...

నిప్పుల కుంపటిని తలపిస్తున్న మేనెల ఎండలు జనం ప్రాణాలను హరిస్తున్నాయి. ఏపీలో పలు ప్రాంతాల్లో వృద్ధులు వడదెబ్బ తగిలి చనిపోతున్నారు. ఇప్పటికే కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలో వడదెబ్బకు 36 మంది ప్రాణాలు కోల్పోగా.. ఒక్క గుంటూరు జిల్లాలోనే 13 మంది మృత్యువాత పడ్డారు. తాజాగా గుంటూరుజిల్లా చీరాలలో రిక్షాకార్మికుడు విగత జీవుడైనాడు.

ఏపీలో పలు జిల్లాల్లో 40 డిగ్రీలకు మించిన ఉష్ణోగ్రతలు

అటు ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో 40 డిగ్రీలకు మించిన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాజధాని అమరావతి సమీప ప్రాంతాల్లో ఉష్టోగ్రతలు మండిపోతున్నాయి. గన్నవరంలో 43.5 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదయ్యింది. విజయవాడలో 41.6, తుని 41.5 డిగ్రీలు, అమరావతి, తిరువూరు, కావలిలో 41 డిగ్రీలు నమోదు కాగా.. నందిగామ 40.8 డిగ్రీలు, మైలవరం 40 డిగ్రీలు, వెలగపూడిలో 39.4 డిగ్రీల ఉష్ణోగ్రతులు నమోదవుతున్నాయి. అటు రాజమహేంద్రవరంలో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు జనాన్ని వణికిస్తుండగా .. ఒంగోలులో 43 డిగ్రీలు, ఏలూరులో 38.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

తెలంగాణ నిప్పులు కక్కుతున్న ఎండలు ...

ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఎండలు నిప్పులు క్కుతున్నాయి. పగలు ఎండలు , రాత్రి పొద్దుపోయేదాకా వడగాడ్పులతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. తాజాగా ఆదివారం రోజు నల్లగొండ పట్టణంలో భానుడు సెగలు పుట్టించాడు. 46.2డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడంతో జనం విలవిల్లాడుతున్నారు.

తెలంగాణలో వేసవి ప్రారంభం నుంచి ఇప్పటి వకు 171 మంది మృతి

తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వేడిసెగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలతో రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. వేసవి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 171 మంది వడదెబ్బకు గురై మృతి చెందారని విపత్తు నిర్వహణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. ఆదిలాబాద్, భద్రాచలం, రామగుండంలలో 45 డిగ్రీల చొప్పున.. హన్మకొండ, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లలో 44, ఖమ్మంలో 43, హైదరాబాద్‌లో 42, హకీంపేటలో 41 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

రెండు రాష్ట్రాల్లో వడదెబ్బ మరణాలు పెరుగుతున్నాయి

మరోవైపు వడగాడ్పులు పెరగడంతో రెండు రాష్ట్రాల్లో వడదెబ్బ మరణాలు పెరుగుతున్నాయి. వైద్య , ఆరోగ్యశాఖ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. జిల్లా, మండల, గ్రామస్థాయిల్లో ఆరోగ్యకేంద్రాల్లో .. వడదెబ్బ నివారణకు మందులు, ఉపశమన ఔషదాలు ఏవీ అందుబాటులో ఉంచడంలేదు. కనీసం ఓ ఆర్‌ఎస్‌ ప్యాకేట్లను కూడా అందించడంలేదని ప్రజలు వాపోతున్నారు. వడదెబ్బ తిన్న వారికి చికిత్స అందించే కనీస సౌకర్యాలు కూడా ప్రభుత్వ ఆస్పత్రుల్లో లోపించాయి. ఎండత్రీవతతో పాటు మరో మూడు రోజుల పాటు వడగాలుల ఉధృతి కూడా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని , వృద్ధులు, చిన్నారులు, వ్యవసాయ కూలీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రెండు రాష్ట్రాల్లో వైద్యా ఆరోగ్యశాఖలు సూచిస్తున్నాయి.

21:17 - May 21, 2017

విజయవాడ : రాయలసీమలో తిరిగి ఫ్యాక్షనిజం తలెత్తిందని... ఏపీ హోంమంత్రి నిమ్మకాల చినరాజప్ప అన్నారు.. ఫ్యాక్షనిజాన్ని రూపుమాపే అంశంపై రాజకీయ నేతలు, పోలీసు అధికారులతో సమీక్షిస్తామని చెప్పారు.. కర్నూల్‌ జిల్లా కప్పట్రాళ్లలో హత్యపై స్పందించిన మంత్రి... ఇటువంటి ఘటనలు పునరావృతంకాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు..

21:16 - May 21, 2017

కర్నూలు : పత్తికొండ వైసీపీ ఇంఛార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కర్నూల్‌ జిల్లాలో సంచలనం రేపింది. నంద్యాలలో సూర‍్యనారాయణరెడ్డి కూతురు వివాహానికి హాజరై ఉదయం 10.30 గంటలకు ఫార్చునర్‌ కారులో స‍్వగ్రామానికి నారాయణరెడ్డి బయల్దేరారు. వీరి వెనకాలే మరో నలుగురు అనుచరులు టవేరాలో వెళ్లారు. కృష‍్ణగిరి మండలం రామకృష్ణాపురం గ్రామ శివారులోని కల్వర్టు వద్ద ప్రత్యర్థులు అటాక్‌ చేశారు. నారాయణరెడ్డి ప్రయాణిస్తున‍్న కారు కల‍్వర్టు వద‍్ద స్లో కావడంతో అక‍్కడే కాపు కాసిన ప్రత‍్యర్థులు ట్రాక‍్టర్‌తో కారును ఢీకొట్టారు. ఆ తర్వాత నారాయణరెడ్డి, ఆయన అనుచరుడు సాంబశివుడిపై విరుచుకుపడ్డారు. వేటకొడవళ‍్లతో నరికి క్రూరంగా హతమార్చారు. తొలుత బాంబులు విసిరిన ​ప్రత‍్యర్థులు కారును చుట్టుముట్టి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

పక్కా పథకం ప్రకారమే హతమార్చారా?

నారాయణరెడ్డి హత్య ఘటనలో దుండగులు పక్కాపథకం ప్రకారం వ్యవహరించినట్లు తెలిస్తోంది. నారాయణరెడ్డి దగ్గర ఎలాంటి ఆయుధాలు లేవని నిర్ధారించుకున్న తర్వాతే దాడికి తెగబడినట్లు సమాచారం. తన ప్రాణాలకు ముప్పు ఉందని, ఇటీవల తన లైసెన్స్‌డ్‌ రివాల్వర్‌ రెన్యువల్‌ కోసం పోలీసులకు నారాయణరెడ్డి ఇచ్చారు. గన్‌ లైసెన్స్‌ రెన్యూవల్‌ చేయాల్సిందిగా పలుమార్లు అభ్యర్థించినా పోలీసులు పట్టించుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు నారాయణరెడ్డి హత్య బాధాకరమైన ఘటన అని.. బాధ్యులపట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ రవికృష్ణ అన్నారు. గత కొంత కాలంగా కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్‌ తగ్గుముఖం పట్టిందని, ఈ హత్యకుగల కారణాలను శోధిస్తామని తెలిపారు. నారాయణరెడ్డి గన్‌ లైసెన్స్‌ రెన్యూవల్‌ చేయని విషయం తనకు తెలియదని, అధికారుల నుంచి సమాచారం తీసుకుంటానని చెప్పారు.

నారాయణ రెడ్డి హత్యను తీవ్రంగా ఖండించిన వైసీపీ

నారాయణ రెడ్డి హత్యను వైఎస్‌ఆర్‌సీపీ తీవ్రంగా ఖండించింది. ఈ హత్య వెనుక సీఎం చంద్రబాబు, మంత్రి కేఈ కృష్ణమూర్తి ఉన్నట్లు ఆరోపించింది. హత్యకు నిరసనగా సోమవారం కర్నూలు జిల్లా బంద్‌కు పార్టీ పిలుపునిచ్చింది. నారాయణ రెడ్డి హత్య వార్తను తెలుసుకున్న జగన్‌ మోహన్‌ రెడ్డి కడప పర్యటనను రద్దు చేసుకొన్నారు. సోమవారం జరగబోయే అంత్యక్రియలకు ఆయన హాజరవుతారు.

20:05 - May 21, 2017

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్

హైదరాబాద్: ఐపీఎల్ -10 ఫైనల్ రూజింగ్ పుణే వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఎంచుకుంది.

19:49 - May 21, 2017

భారీగా పాత నోట్లు పట్టివేత...

గుజరాత్: రద్దైన పాతనోట్లు దాదాపు రూ. 6 కోట్లను పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. ఈ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. రద్దైన పాత నోట్లపై సమాచారం అందుకున్న సూరత్ పోలీసులు రైడ్ చేసి రూ. 5,81,70,500 లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

18:57 - May 21, 2017

విశాఖ : ఆంధ్రప్రదేశ్‌ కేంద్రం న్యాయం చేసేంతవరకూ పోరాడతామని... సీపీఎం ఏపీ కార్యదర్శి మధు స్పష్టం చేశారు.. ఉత్తరాంధ్రకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ, ప్రత్యేక రైల్వే జోన్‌ ఇస్తామన్న హామీ ఇంతవరకూ అమల్లోకి రాలేదని ఆరోపించారు.. ఉత్తరాంధ్ర వెనకబాటుతనం, ప్రజల ఆకాంక్షలు అంశంపై విశాఖలో ఏర్పాటుచేసిన సదస్సుకు మధుతో పాటు.. లోక్‌సత్తా జాతీయ నేత జయప్రకాశ్ నారాయణ్, ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి హాజరయ్యారు..

18:56 - May 21, 2017

పశ్చిమగోదావరి :జిల్లాలో పోలీసులు, ప్రజాప్రతినిధులమధ్య వివాదం మరింత మదురుతోంది.. తణుకు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసినందుకు జిల్లాకుచెందిన 12మంది ఎమ్మెల్యే లు, ఇద్దరు ఎమ్మెల్సీ లు గుర్రుగా ఉన్నారు.. ఎమ్మెల్యేపై కేసుకు నిరసనగా గన్‌మెన్లను వెనక్కిపంపారు...

18:37 - May 21, 2017
18:35 - May 21, 2017

విశాఖ : విశాఖ పోర్టు మరో ఘనత సాధించింది. దేశంలోకెల్ల మేజర్‌పోర్టుల్లో రెండో క్లీన్‌ పోర్టుగా విశాఖ నిలిచింది. స్వచ్చ అభియాన్‌ పథకాన్ని పక్కాగా అమలు చేసినందుకు ఈ అవార్డు లభించింది. మార్చి 16 నుంచి 30 వరకు విశాఖ పోర్టులో స్వచ్ఛ అభియాన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వచ్చ అవార్టుల కోసం మొత్తం 19 పోర్టులు పోటీపడగా విశాఖ రెండో క్లీనెస్ట్‌ పోర్టుగా నిలిచంది. ఈ సందర్భంగా పోర్టు ట్రస్ట్‌ చైర్మన్‌ కృష్ణబాబు ఏమన్నారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

18:33 - May 21, 2017

విజయవాడ : ఫేస్ బుక్ చాటింగ్ ఓ మైనర్ బాలిక భవిష్యత్తును అంధకారం చేసింది. తొమ్మిదో తరగతిలోనే యువకుడితో చాటింగ్ చేస్తూ ప్రేమలో పడింది. ప్రేమికుడిని రహస్యంగా కలిసి వస్తూ మరో నలుగురు యువకులకు చిక్కి గ్యాంగ్ రేప్‌కు గురైంది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన విజయవాడలో సంచలనం కలిగిస్తోంది.

బాలికకు ఫేస్‌బుక్‌ ద్వారా అజయ్‌ పరిచయం

విజయవాడలో మైనర్ బాలిక గ్యాంగ్ రేప్‌ కేసులో పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు.. నగరంలోని మాచవరంకు చెందిన పదహారేళ్ళ బాలికకు అజయ్‌ అనే యువకుడు ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమయ్యాడు. ఈ నెల 16న స్నేహితురాలి ఇంటికి వెళుతున్నానంటూ బాలిక ఉదయం ఇంటినుంచి బయలుదేరింది.. అజయ్‌ అతని స్నేహితుడు అఖిల్‌ ఆమెను ముస్తాబాద్‌కు తీసుకువెళ్లారు.. అక్కడ అందరూ మద్యం తాగారు. బాలిక మద్యంమత్తులోఉండగానే బిఆర్ టిఎస్ రోడ్‌లో వదిలేశారు..

మద్యం తాగించి ఆమెపై గ్యాంగ్ రేప్...

మద్యం మత్తులోఉన్న బాలికకు ఆ రాత్రి ఎటువెళ్లాలో అర్థం కాలేదు.. అలాంటి పరిస్థితిలోఉన్న బాలికను జాగ్రత్తగా ఇంటిదగ్గర దించాల్సింది పోయి మరో నలుగురు యువకులు ఘాతుకానికి తెగబడ్డారు. ఇంటి దగ్గర వదిలేస్తామంటూ శ్రీకాంత్, అభిషేక్, పవన్, సునీల్ అనే యువకులు ఆమెను నమ్మించారు. మధురానగర్‌లో నలుగురు మద్యంతాగారు. బాలికకూ మద్యం తాగించి ఆమెపై గ్యాంగ్ రేప్ చేశారు. ఉదయం ఆమెను రోడ్డుపై వదిలేశారు. అక్కడినుంచి తన ఇంటికి వెళ్ళిన బాలిక జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పింది.. వారితో కలిసి పోలీసులకు ఫిర్యాదుచేసింది.. బాలిక చెప్పిన బైక్‌ నెంబర్‌ ఆధారంగా పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేశారు.. వీరిపై నిర్భయ, ఫోక్సా యాక్ట్‌కింద కేసులు నమోదుచేశారు.. బాలికను వైద్య పరీక్షలకు పంపిన పోలీసులు... కేసు దర్యాప్తు చేస్తున్నారు..

18:30 - May 21, 2017

కాకినాడ: భూసేకరణ చట్టంలో సవరణలకు వ్యతిరేకంగా కాకినాడ సెజ్ పరిధిలోని... రమణక్కపేటలో సదస్సు జరిగింది. సీపీఎం, రైతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో... ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోవాలని నేతలు కోరారు. ఓ వైపు నేతలు మాట్లాడుతుండగానే... పోలీసులు సదస్సును అడ్డుకున్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి శేషబాబ్జి, రైతు సంఘం నేత అప్పారెడ్డిని అరెస్ట్ చేశారు.

17:47 - May 21, 2017

హైదరాబాద్: వివాదాలకు కేంద్రబిందువుగా మారిన తెలంగాణ విశ్వవిద్యాలయంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కొత్త వివాదానికి తెరలేపింది. వీసీ సాంబయ్య లంచం తీసుకుని నియామకాలు చేపట్టారని విద్యార్ధి సంఘాలు ఆందోళనకు దిగాయి. వీసీకి .. విద్యార్ధి సంఘాలకు మధ్య ముదురుతున్న వివాదంలో వర్సిటీ ప్రతిష్ఠ మసకబారుతోంది.

అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల నియామకంలో వివాదం

ఇది నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ విశ్వవిద్యాలయం. ఈ యూనివర్సిటీలో మొదటి నుంచి వివాదాలే. తాజాగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల నియామకంలో వివాదం తలెత్తింది. ఇటీవల ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్, అటెండర్, సెక్యూరిటీ గార్డుల పోస్ట్ లను భర్తీ చేశారు. అయితే వీసీ సాంబయ్య ఒక్కో పోస్టుకు 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు డబ్బులు వసూలు చేశారని ఆరోపిస్తూ విద్యార్ధి సంఘాలు ఆందోళనకు దిగాయి. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని విద్యార్థి సంఘ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

ఉద్యోగాల భర్తీలో నిబంధనలు తుంగలో తొక్కారని ఆరోపణలు....

అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీలో అభ్యర్ధులు రాత పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. అయితే వర్సిటీ అధికారులు నిబంధనలను తుంగలో తొక్కారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండానే ప్రజా ప్రతినిధులకు చెందిన వ్యక్తులను ఉద్యోగాల్లో భర్తీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో విద్యార్థి సంఘాలకు, విసికి మధ్య వివాదం ముదరడంతో పంచాయితీ నిజామాబాద్ ఎంపీ కవిత వద్దకు చేరినట్లు సమాచారం. దీనిపై కవిత వీసీని వివరణ కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు విద్యాశాఖ అధికారులకు సమాచారం లేకుండా ఎలా నియామకాలు చేశారంటూ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఆ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జేఏసీ రంజన్‌ను నివేదిక కోరినట్లు తెలుస్తోంది. ఇక జరిగిన అవకతవకలపై ఇంటెలిజెన్స్ నిఘా విభాగం పూర్తి స్ధాయిలో ఆరా తీస్తున్నారు.

ఏజెన్సీ టెండర్ ప్రకారమే నియామకాలు చేశామన్న విసి....

ఇక ఈ విషయంపై వీసీ సాంబయ్యని ప్రశ్నిస్తే ఏజెన్సీ టెండర్ ప్రకారమే నియామకాలు చేశామని చెప్పారు. ఉద్యోగాల కోసం ఎవరైనా డబ్బులు ఇచ్చినట్లు ఆధారాలుంటే చూపించాలని ఆయన అన్నారు.ఏది ఏమైనా ఈ వివాదంపై అధికారులు పూర్తి స్ధాయిలో విచారణ జరపాల్సిన అవసరం ఉంది..లేదంటే వర్సిటీ అధికారులు మరింత అభాసుపాలయ్యే ప్రమాదం ఉంది.

 

17:45 - May 21, 2017

హైదరాబాద్: డ్రగ్స్‌ మత్తుకు యువత చిత్తవుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు మాదకద్రవ్యాలకు బానిసవుతున్నారు. మత్తులో తూగుతూ వారి అందమైన భవిష్యత్‌ను చేజేతులా పాడుచేసుకుంటున్నారు. నిషా నషాలానికి ఎక్కడంతో క్షణికావేశంలో అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. అయితే డ్రగ్స్‌కు వ్యతిరేకంగా యువతలో అహగాహన పెంచేందుకు నార్త్ జోన్ పోలీసులు ప్లాష్ మాబ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

డ్రగ్స్‌కు బానిసైతే అంతే.

డ్రగ్స్‌కు బానిసైతే అంతే. ఎప్పుడు మత్తు లోకంలో విహరించాలని పరితపిస్తుంటారు. ఉచ్చనీచాలు మరిచిపోతారు. సమయానికి మాదకద్రవ్యాలు దొరక్కపోతే ఎంతకైనా తెగిస్తారు. డ్రగ్స్‌ మత్తు కోసం దొంగతనాలే కాదు.. చివరకు ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరు. ఇక డ్రగ్స్‌ పెడ్లర్స్‌ విద్యార్థులే టార్గెట్‌గా తమ దందా నడుపుతున్నారు. ఒకరి నుంచి ఒకరికి మాదకద్రవ్యాల మత్తును అలవాటు చేస్తుంటారు. మొదట తక్కువ మొత్తానికి డ్రగ్స్ అమ్మి.. ఒకసారి ఆ ఊబిలో దిగాక ఇష్టారాజ్యాంగా ధరలు పెంచేస్తారు. మరికొందరికి డబ్బు ఎరవేసి డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ చేయిస్తుంటారు. ఈజీ మనీ వేటలో పడి యువకులు బంగారు భవిష్యత్‌ను పాడుచేసుకుంటున్నారు. చివరకు నేరగాళ్లుగా ముద్రపడి జైలు జీవితం గడుపుతున్నారు. ఎప్పటికప్పుడు పోలీసులు స్మగ్లర్లపై కొరడా ఝుళిపిస్తున్నా ..పట్టణాలు, నగరాల్లో డ్రగ్స్‌ దందాకు మాత్రం బ్రేకులు పడటం లేదు. ఈనేపథ్యంలో డ్రగ్స్‌ మహమ్మారిని తరిమికొట్టడానికి నార్త్‌ జోన్‌ పోలీసులు వినూత్నంగా ప్లాష్‌ మాబ్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఈ అవగాహన కార్యక్రమంలో ..

ఈ అవగాహన కార్యక్రమంలో యువతీ యువకుల డ్యాన్సులు, డ్రామాలు, పాటలు ఆకట్టుకున్నాయి. నో డ్రగ్స్‌ అంటూ వారిచ్చిన నినాదాలు అందరినీ ఆకర్షించాయి. డ్రగ్స్‌ సేవించి యువకులు తమ ఆరోగ్యాని పాడుచేసుకుంటున్నారని..హైదరాబాద్‌లో మాదకద్రవ్యాల ప్రభావాన్ని తగ్గించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని డీసీపీ సుమతి అన్నారు. నగరంలోని ప్రధానకూడళ్లలో పోస్టర్‌, ప్లే కార్డు క్యాంపెయిన్‌, సిగ్నేచర్‌ క్యాంపెయిన్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

తమ పిల్లలు ఏం చేస్తున్నారో గమనించాలి...

తమ పిల్లలు ఏం చేస్తున్నారు.. ఎవరిని కలుస్తున్నారనే దానిపై తల్లిదండ్రులు కూడా నిఘా వేయాలని పోలీసులు సూచిస్తున్నారు. హైదరాబాద్ మహానగరం నుంచి డ్రగ్స్‌ మహమ్మారిని తరిమేసేందుకు పోలీసులతో పాటు ప్రతిఒక్కరూ కృషిచేయాలంటున్నారు.

17:41 - May 21, 2017

హైదరాబాద్: తెలంగాణలో మరో మూడురోజుల పాటు వడగాలులు వీస్తాయని, ఎండ వేడిమి తీవ్రంగా ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. సూర్యుడు చెమటలు కక్కిస్తుండటంతో జనం ఇండ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. పదిరోజులుగా ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇవాళ నల్లగొండలో అత్యధికంగా 46.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అటు రామగుండంలో 45.8 డిగ్రీలు, ఖమ్మంలో 45.7, భద్రాచలం 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి. మధ్యాహ్నం వేళ నిప్పుల వర్షం కురుస్తుండటంతో... రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. మరో మూడు రోజులపాటు వడగాలులు వీచే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం సమయం ఎండలో ఉండవద్దని సూచించారు.

ప.గో జిల్లాలో గన్ మెన్లను ఉపసంహరించుకున్న ప్రజాప్రతినిధులు

పశ్చిమగోదావరి : జిల్లాలో పోలీసులు-ప్రజాప్రతినిధుల మధ్య వివాదం ముదురుతోంది. 12మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు తమ గన్ మెన్లను ఉపసంహరించుకుంటామని అంటున్నారు. తణుకు ఎమ్మెల్యేపై కేసు నమోదుకు నిరసనగా ప్రజాప్రతినిధులు ఈ ప్రకటన చేశారు. కాగా, తణుకు ఎమ్మెల్యే అరమిల్లి రాధాకృష్ణ తన ఇంటికి ఎస్ఐ, రైటర్లను పిలిపించి నిర్బంధించారని ఆరోపిస్తూ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఇరగవరం ఎస్ఐ శ్రీనివాస్ ఈ మేరకు తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

 

17:33 - May 21, 2017
16:41 - May 21, 2017

తిరుమల : ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ఆయన కుటుంబ సభ్యులు.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ ఉన్నతాధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు మనవడు దేవాన్ష్‌కు అక్షరాభ్యాసం చేశారు. దేవాన్ష్‌ చేత నూతన సంప్రదాయానికి అంకురార్పణ చేయించారు. శ్రీవారు తమ కుల దైవమని చంద్రబాబు అన్నారు. తిరుపతిని గ్రేటర్‌ తిరుపతిగా అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు.

16:39 - May 21, 2017

హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ డ్యాన్సర్‌గా మారారు. తొలిసారి సౌదీ అరేబియాలో పర్యటిస్తున్న ట్రంప్‌కు అర‌బ్ సంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం లభించింది. ట్రంప్‌తో పాటు ఇత‌ర వైట్‌హౌజ్ అధికారులు ఇందులో పాల్గొని డ్యాన్సర్లతో కలిసి స్టెప్పులేశారు. మొహంపై చిరున‌వ్వుతో ట్రంప్ చేసిన డ్యాన్స్ అక్కడి వారందరినీ ఆకట్టుకుంది. ఈ సంప్రదాయ డ్యాన్స్‌ను సౌదీలో అర్దా అంటారు. గ‌తంలో అమెరికా అధ్యక్షుడిగాఉన్న జార్జ్ డ‌బ్ల్యూ. బుష్ కూడా ఈ డ్యాన్స్ చేశారు..

16:31 - May 21, 2017

రేపు నారాయణ రెడ్డి అంత్యక్రియలు..

కర్నూలు : పత్తికొండ వైసీపీ ఇన్ చార్జి నారాయణరెడ్డిని హత మార్చింది డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుటుంబీకులేనని నారాయణరెడ్డి సోదరుడు ప్రదీప్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసుపై పోలీసులు సమగ్ర విచారణ నిర్వహించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, చెరుకులపాడులో నారాయణరెడ్డి అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నారు. వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.

ఇస్లామాబాద్ లో భారతీయుడి అరెస్ట్

హైదరాబాద్: ఇస్లామాబాద్ లో భారతీయుడిని అరెస్ట్ చేశారు. సరైన పత్రాలు లేవని అభియోగంతం విదేశీ చట్టం కింద కేసు నమోదు చేశారు.

కాకినాడ సెజ్ వద్ద ఉద్రిక్తత

తూ.గో : కాకినాడ సెజ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. భూసేకరణ చట్ట సవరణకు వ్యతిరేకం సీపీఎం సదస్సు నిర్వహించ తలపెట్టింది. సదస్సు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. రమణక్క పేట సహా ఎస్ ఈజెడ్ పరిసర గ్రామాల్లో స్థానికులను సైతం పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

15:49 - May 21, 2017

పశ్చిమగోదావరి : జిల్లా ఏలూరులో జిల్లా సంస్థాగత ఎన్నికల సమావేశం రసాబాసాగా మారింది. టీడీపీ కార్యకర్తల నిరసనలతో హోరెత్తింది. ఇరగవరం ఎస్సై, రైటర్‌ను నిర్బంధించిన కేసులో తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణపై పెట్టిన కేసును వెంటనే తొలగించి, జిల్లా ఎస్పీని సస్పెండ్‌ చేయాలంటూ డిమాండ్ చేశారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కార్యకర్తలను బుజ్జగించే ప్రయత్నం చేసినా.. నిరసనకారులు వెనక్కి తగ్గకుండా ఎస్పీ గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు. రాధాకృష్ణకు మద్దతుగా తాను రాజీనామాకు సిద్ధమని మరో ఎమ్మెల్యే బూరుగుపల్లి ప్రకటించారు. తన సెక్యూరిటీకి కేటాయించిన పోలీస్‌ సిబ్బందిని వెనక్కి పంపిస్తున్నానని చెప్పారు.

 

15:47 - May 21, 2017

కర్నూలు : పత్తికొండ ఇంచార్జి నారాయణరెడ్డి హత్యపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పత్తికొండ వైసీపీ ఇంచార్జి హత్య సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం కేఈలు చేయించినదేనని వైసీపీ నేతలు ఆరోపించారు. చంద్రబాబు అరాచక పాలన నారాయణరెడ్డి హత్యతో ఉగ్రవాద స్థాయికి చేరిందన్నారు. హత్యకు నిరసనగా రేపు కర్నూల్ జిల్లా బంద్ కు వైసీపీ పిలుపునిచ్చింది.

ఏపీ, తెలంగాణలో కొనసాగుతున్న అధిక ఉష్ణోగ్రతలు

హైదరాబాద్: ఏపీ, తెలంగాణాల్లో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. గన్నవరం 43.5, వినుకొండ 43.5, రాజమహేంద్రవరం 43.4, ఒంగోలు 43, నర్సరావుపేట 2.8, రెంటచింతల 42.4, మాచర్ల 42.3, విజయవాడ 41.6, అమరావతి, తిరువూరు, కావలి 41, బాపట్ల 40.9, నందిగామ 40.8 డిగ్రీల ఉష్నోగ్రత నమోదయ్యాయి.

15:22 - May 21, 2017

తూర్పుగోదావరి :కాకినాడ కబ్జా కోరల్లో చిక్కుకుంది. నగరంలోని విలువైన ఖాళీ స్థలాలన్నీ ఆక్రమణకు గురవుతున్నాయి. సాక్షాత్తు ప్రజాప్రతినిధులే స్థలాలపై కన్నేసి కాజేసే ప్రయత్నంలో ఉన్నారు. దీంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ భూములకు... స్థానికుల స్థలాలను రక్షణ లేకుండా పోయిందని వాపోతున్నారు.

కాకినాడలో కబ్జాలకు సుదీర్ఘ చరిత్ర

కాకినాడలో కబ్జాలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ... ఆ నాయకుడే కబ్జాల పర్వానికి తెరలేపడం ఆనవాయితీగా మారింది. ఇదే కోవలో తాజాగా ఓ ప్రభుత్వ స్థలాన్ని కాజేయడానికి ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అనుచరులు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు మహాలక్ష్మినగర్‌ ప్రాంతంలో విలువైన ప్రభుత్వ స్థలం చుట్టూ భారీ ఫెన్సింగ్ వేశారు... వాటిని అమ్ముకుని సొమ్ము చేసుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.

ఇదే స్థలం కోసం ఉద్యమించిన పేదలు

గతంలో... ఇదే స్థలంలో పేదలు ఇళ్ల స్థలాల కోసం ఉద్యమం చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో అందరూ కలిసికట్టుగా వెళ్లి...అక్కడ జెండాలు పాతి...తమకు ఇవ్వాలంటూ డిమాండ్‌ చేశారు. దీంతో పోలీసులు వారిపై కేసులు పెట్టి...అరెస్ట్‌లు కూడా చేశారు. రెవెన్యూ సిబ్బంది ఫిర్యాదు చేయడంతో... కోర్టులో సుమారు పదేళ్లపాటు దీనికి సంబంధించిన కేసు నడిచింది. ఇప్పుడు అదే స్థలాన్ని ఎమ్మెల్యే సోదరుడు వనమాడి సత్యన్నారాయణ, ఆయన బంధువులు సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఎమ్మెల్యే కొండబాబును ప్రశ్నిస్తే తాను ఆక్రమణలకు పాల్పడ్డానని తెలిస్తే.... నిరూపించాలంటూ ఎదురుదాడికి దిగుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కబ్జాలపై పోరాడానని అంటున్నారు. ఇక్కడ ఆక్రమణ వివాదాలు ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశాలుగా ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు దీనిపై దృష్టి పెట్టకపోతే ఈ ప్రాంతంలో కబ్జాలు శృతిమించిపోయే ప్రమాదం కనిపిస్తోంది.

పట్టాలు తప్పిన లోకమాన్య ఎక్స్ ప్రెస్

యూపీ: లోకమాన్య ఎక్స్‌ప్రెస్‌ ఆదివారం పట్టాలు తప్పింది. యూపీలో ఉన్నవ్‌ రైల్వే స్టేషన్‌ వద్ద ఈ ఘటన జరిగింది. రైల్లోని నాలుగు బోగీలు స్టేషన్‌ దాటుతుండగా పట్టాలు తప్పినట్లు తెలిసింది. ప్రమాదంలో ఎవరికీ గాయాలుకాలేదు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సివుంది.

నల్గొండ జిల్లా మట్టపల్లిలో విషాదం

నల్గొండ : జిల్లాలోని మట్టపల్లిలో విషాదం చోటుచేసుకుంది. కృష్ణానదిలో స్నానానికి వెళ్లి నలుగురు గల్లంతయ్యారు. వీరిలో ముగ్గురిని స్ధానికులు కాపాడారు. ఈ ఘటనలో నేరేడుచర్లకు చెందిన దేవిక అనే యువతి మృతి చెందింది. దేవికకు మూడురోజుల క్రితమే ప్రేమ వివాహం జరిగినట్లు తెలుస్తోంది. దేవిక మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

 

కాంగ్రెస్ ప్రతిష్టకు భంగం కలిగేలా బిజెపి వ్యవహరిస్తోంది: రఘువీరారెడ్డి

విశాఖ : దేశంలో కాంగ్రెస్ ప్రతిష్టకు భంగం కలిగించేలా బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు ఏపిసిసి చీఫ్ రఘువీరారెడ్డి. అందులో భాగంగానే అనేక తప్పుడు కేసులు, ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యల్ని ఎప్పుడో గాలికి వదిలేశాయని.. ఒక్క కాంగ్రెస్ మాత్రమే ప్రజా సమస్యలపై పోరాడుతుందని రఘువీరా చెప్పారు. విశాఖపట్నంలో జరిగిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న రఘువీరా.. రాజీవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

రాజీవ్‌ గాంధీ పాలన స్వర్ణయుగం-షబ్బీర్ అలీ

హైదరాబాద్: రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని సోమాజిగూడ స్కిల్‌లో ఉన్న రాజీవ్‌ గాంధీ విగ్రహానికి.. కాంగ్రెస్‌ నాయకులు ఘన నివాళులర్పించారు. షబ్బీర్‌ అలీ, దానం నాగేందర్‌, పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్‌, ఎమ్మెల్సీలు, ఆకుల లలిత రాజీవ్‌ గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి.. నివాళి అర్పించారు. రాజీవ్‌ గాంధీ 5 ఏళ్ల పాలన స్వర్ణయుగమని షబ్బీర్‌ అలీ కొనియాడారు.

15:08 - May 21, 2017

అమరావతి : ఉద్దానం కడ్నీ బాధితులకు మినరల్‌ వాటర్‌ సప్లై చేస్తామన్న సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ ఏమయిందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు ప్రశ్నించారు. విశాఖలో మహానాడు సందర్భంగా టీడీపీ ప్రభుత్వానికి మధు సూటిగా ప్రశ్నలు సంధించారు. ఉత్తరాంధ్రలో మూతపడుతున్న ప్రభుత్వ పాఠశాలలు తెరిపిస్తారా..? కరువు మండలాల్లో ఉపాధి హామీ బకాయిల్ని ఎపుడు చెల్లిస్తారు..? విశాఖకు రైల్వేజోన్‌ సంగతేంటి..? విభజన చట్టంలో ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీపై సీఎం మౌనం ఎందుకు.. ? ఈ సమస్యలను పరిష్కంచిన తర్వాతే విశాఖలో మహానాడు పెట్టుకుంటే ..బాగుండేదన్నారు.

15:06 - May 21, 2017
15:03 - May 21, 2017

హైదరాబాద్: ఆయనో బిజెపి ఎంపీ.. మన రాష్ట్రం కాదు.. కానీ తెలంగాణ కాంగ్రెస్ లో గుబులు పుట్టిస్తున్నారు. గాంధీభవన్ లో ఏ ఇద్దరూ నేతల్ని కదిలించినా ఆయన మాటే.. ఇంతకీ ఆ ఎంపి ఎవరు? తెలంగాణ కాంగ్రెస్ నేతల్ని ఎందుకు టార్గెట్ చేశారు? వాచ్ ది స్టోరి. ఈయనే బిజెపి ఎంపి భగవంత్ కూబా. కర్నాటకలోని బీదర్ పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపిన బిజెపి

ఈయన గురించి టి కాంగ్రెస్ నేతలు చర్చించుకోవడమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కారణం ఏంటంటే దేశ వ్యాప్తంగా ముందస్తు ఎన్నికలు వస్తున్నాయన్న నేపథ్యంలో తెలంగాణపై దృష్టి పెట్టిన బిజెపి ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. అందుకోసం బీదర్ ఎంపీ అయిన భగవంత్ కూబాను ఎంచుకుందట. దీనిలో భాగంగా ఈ ఎంపీగారు హైదరాబాద్ లో మకాం వేసి కాంగ్రెస్ నేతలతో రహస్య మంతనాలు జరపడమే ఇప్పుడు హస్తం పార్టీలో కలకలం రేపుతోంది.

మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అసంతృప్తి నేతలే భగవంత్ టార్గెట్

భగవంత్ కూబా తెలంగాణ కాంగ్రెస్ కి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీతో అసంతృప్తిగా ఉన్న నేతలకు ఫోన్ లో చేస్తున్నట్లు భోగట్టా.ఇప్పటికే ఓ డజనుకు పైగా నేతలతో మంతనాలు నడపడంతో పాటు.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు మాజీ మంత్రులు, ఓ మాజీ ఎంపీ, ఓ మహిళా కాంగ్రెస్ నేతలను బిజెపి ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ తో కలిపించినట్లు తెలుస్తోంది. కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి పార్టీలోకి వస్తే .. పార్టీ టికెట్ కన్ఫామ్ చేయడంతో పాటు ఎలక్షన్ ఖర్చు కూడా బిజెపి చూసుకుంటుందని హామీ ఇచ్చారని టాక్. ఈ విషయాలన్నీ తెలిసిన టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అగ్గిమీద గుగ్గిలం అయినట్లు తెలుస్తోంది. ఎలాగైనా భగవంత్ కూబాను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ప్రజల ముందు నిలబెట్టేలా ఆయన వ్యూహాలు రచిస్తున్నారట. టికాంగ్ నేతలు బిజెపి ఆకర్ష్ వలలో పడతారో.. ఈ ఎంపీగారికే ఝలక్ ఇస్తారో వెయిట్ అండ్ సీ.

ఐపీఎల్‌ 10వ సీజన్‌ ఫైనల్‌కు కౌంట్‌డౌన్‌-

హైదరాబాద్: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 10వ సీజన్‌లో ఆఖరాటకు రంగం సిద్ధమైంది.టైటిల్‌ ఫైట్‌లో రెండు సార్లు చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ , రైజింగ్‌ పూణే సూపర్‌ జెయింట్‌ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియం వేదికగా జరుగనున్న ఈ సమరంలో నెగ్గి 3వ సారి ఐపీఎల్‌ చాంపియన్‌గా నిలవాలని ముంబై జట్టు తహతహలాడుతుండగా.....తొలి సారిగా విజేతగా నిలిచి చరిత్ర సృష్టించాలని పూణే జట్టు పట్టుదలతో ఉంది.

హత్యకు నిరసనగా రేపు కర్నూలు జిల్లా బంద్ : వైసీపీ

కర్నూలు : పత్తికొండ వైసీపీ ఇన్ ఛార్జి నారాయణరెడ్డి హత్యను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం కేఈ లే పథకం ప్రకారం ఈ హత్య చేయించారని వైసీపీ ఆరోపించింది. ప్రజల మనసులను గెలుచుకోవడం టీడీపీకి చేతగావడం లేదని, గత మూడేళ్ల టీడీపీ అరాచకపాలనకు ఇది పరాకాష్ట అని మండిపడింది. హత్యా రాజకీయాలకు టీడీపీ తెరలేపిందని, భయానక వాతావరణం సృష్టించి, హత్యలు చేయించి ప్రతిపక్షం నోరు మూయించేందుకు టీడీపీ సర్కార్ బరితెగించిందని వైఎస్సార్సీపీ ఆరోపించింది. నారాయణరెడ్డి హత్యతో ఏపీ రాక్షస పాలన ఉగ్రవాద స్థాయికి చేరిందని, ఈ హత్యకు నిరసనగా రేపు కర్నూలు జిల్లా బంద్ కు పిలుపు నిస్తున్నట్టు ఆ ప్రకటనలో తెలిపింది.

పత్తికొండ వైసీపీ నేత నారాయణ రెడ్డి హత్య

కర్నూలు : పత్తికొండ వైఎస్సార్సీపీ ఇన్ ఛార్జీ చెరుకూరిపాడు నారాయణ రెడ్డిని ప్రత్యర్థులు హతమార్చారు. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న నారాయణ రెడ్డిని దారి కాసిన ప్రత్యర్థులు కృష్ణగిరి సమీపంలోకి వచ్చేసరికి బాంబులు వేసి భయబ్రాంతులకు గురిచేశారు. అనంతరం వాహనం పంటపొలాల్లోకి దిగిపోవడంతో వాహనం దిగి పరుగెత్తుతున్న నారాయణ రెడ్డిని వేటకొడవళ్లతో నరికి చంపారు. నారాయణ రెడ్డితోపాటు అతని ప్రధాన అనుచరుడు సాంబశివుడిని కూడా హతమార్చారు. కాగా, నారాయణ రెడ్డి గత ఎన్నికల్లో ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తిపై పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

11:53 - May 21, 2017

తూర్పుగోదావరి జిల్లా ;  జెడ్పీ చైర్మన్ పదవి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ పదవి కోసం సీనియర్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కుటుంబం తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. నెహ్రూ తనయుడు జ్యోతుల నవీన్ గత ఎన్నికల్లో జెడ్పీటీసీగా వైసిపి తరపున పోటీ చేసి గెలుపొందారు. అయితే ఏడాదిన్నర క్రితం తండ్రితో పాటు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. ఆ సందర్భంలో ఇచ్చిన హామీ ప్రకారం జెడ్పీ చైర్మన్ పదవి కోసం ఇప్పుడు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 

ఒకవేళ జెడ్పీ చైర్మన్ పదవి వీలుకాక పోతే ఖాళీగా ఉన్న జిల్లా టిడిపి అధ్యక్ష పదవి అయినా కేటాయించాలని నెహ్రూ సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీలు మారిన నెహ్రూని ప్రెసిడెంట్ చేయడాన్ని జిల్లాకు చెందిన మంత్రులు , ఎమ్మెల్యేలు వ్యతిరేకించడంతో జెడ్పీ పీఠం ఖాయం అయ్యేలా కనిపిస్తోంది. అందులో భాగంగానే ప్రస్తుతం జెడ్పీ చైర్మన్ గా ఉన్న నామన రాంబాబుని ఆ సీటు నుంచి తప్పించి ఆయన స్ధానంలో నెహ్రూ తనయుడు నవీన్ కి కేటాయించబోతున్నట్లు తెలుస్తోంది. నామన రాంబాబు సుదీర్ఘకాలంగా టిడిపిలో కొనసాగుతున్న కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. అంతేకాకుండా కోనసీమలో పార్టీకోసం చాలాకాలంగా పనిచేస్తున్నారు. అలాంటి నేతను తప్పించడం కుదరని కోనసీమకు చెందిన నేతలు పట్టుబట్టినా ఫలితం దక్కలేదని సమాచారం. 

అధిష్టానం తీసుకున్ననిర్ణయం పట్ల నామన వర్గీయులు, ఇతర నేతలు గుర్రుగా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని చెబుతుండటంతో ఇరువర్గాలు సర్దుబాటులో ఉన్నట్లు కనిపిస్తోంది. 

10:36 - May 21, 2017

మేడ్చల్‌ శామీర్‌పేట చెరువులో ఈ ఘటన చోటు చేసుకుంది.ఈ చెరువులో రసాయనాలు కలవడం వల్లే చేపలు మృత్యువాడపడ్డాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు చేపలు మృతి చెందడంతో 2 కిలోమీటర్ల మేర దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.

 

09:41 - May 21, 2017

అనంతపురం : జిల్లాలోని పుట్టపర్తిలో వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశం జరిగింది. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ప్రభుత్వ పని తీరుపై నేతలు దుమ్మెత్తి పోశారు. హంద్రీనీవాకు భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం ఇవ్వడంలో విఫలమయ్యిందని విమర్శించారు. ఈ విషయంలో పల్లె రఘునాథ రెడ్డి తీరుపై మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరబోతోందని.. జగనే ముఖ్యమంత్రి అని పార్టీ నేతలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు. 

09:38 - May 21, 2017

అనంతపురం : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనంతపురం జిల్లాను తనకు రెండో కన్నుగా అభివర్ణిస్తుంటారు. ఇదే విషయాన్ని చాలాసార్లు మీటింగ్‌లలో బహిరంగంగానే చెప్పారు. టీడీపీ అధికారంలోకి రావడానికి అనంతపురం జిల్లా కీలకపాత్ర పోషించింది. 12 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబుకు అందించింది. దీంతో అనంతపురం జిల్లా అభివృద్దిపై ప్రత్యేక దృష్టి పెడతానంటూ చంద్రబాబు పదేపదే చెబుతూవస్తున్నారు.

నేతల మధ్య విభేదాలు 
చంద్రబాబు అనంతపురం జిల్లా అభివృద్ధికి కృషిచేస్తోంటే... జిల్లాలోని టీడీపీనేతల మధ్య వర్గపోరు ఇందుకు అడ్డుగా మారింది. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ఆధిపత్యం కోసం ఇరువురూ అభివృద్ధికి అడ్డుతగులుతున్నారు. ప్రతి చిన్న విషయంలోనూ గొడవకు దిగుతుండడం ఇబ్బందికరంగా మారింది. అనంతపురం పాత ఊరులోని గాంధీబజార్‌లో రోడ్లు ఇరుకుగా ఉన్నాయి. దీంతో ఇక్కడ నిత్యం ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతోంది. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి రోడ్డు విస్తరణ పనులను మొదలు పెట్టగా... వాటిని స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి అడ్డుకున్నారు. స్థానికులు తనకు ఓటు వేసి గెలిపించారని.. వారికి రోడ్డు వైండింగ్‌ చేయబోనని మాటిచ్చానని చెబుతూ పనులకు అడ్డుపడ్డారు. దీంతో రోడ్డు విస్తరణ పనులు ఆగిపోయాయి. ఈ విషయం సీఎం దగ్గరికి వెళ్లినా పనులు మాత్రం జరుగలేదు. రామ్‌నగర్‌లోని రైల్వేట్రాక్‌పై ప్లైఓవర్‌ బ్రిడ్జి నిర్మించాలని ఎంపీ జేసీ నిర్ణయించారు. పనులు ప్రారంభిస్తుండగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి ఆ పనులను అడ్డుకున్నారు. చివరికి ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకోవడంతో సమస్య సద్దుమణిగి ఫ్లైఓవర్‌ పనులు నడుస్తున్నాయి. అనంతపురం నగరంలో పారిశుద్య సమస్య తీవ్రంగా ఉండటంతో.. ప్రజలు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ సమస్యను అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఒక్క సిమెంట్‌ రోడ్డు
అనంతపురంలో ఇప్పటి వరకు ఒక్క సిమెంట్‌ రోడ్డు కూడా వేయలేదు. కనీసం పాతవాటికి మరమ్మతులు కూడా చేయలేదు. ఎక్కడ చూసినా గుంతల రోడ్లే దర్శనమిస్తున్నాయి. దీంతోపాటు నగరంలో తాగునీటి సమస్య తాండవిస్తోంది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రజాప్రతినిధులు ఆధిపత్యపోరు మాని చిత్తశుద్ధితో పనిచేయాలని అనంతపురం నియోజకవర్గ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 

09:35 - May 21, 2017
09:34 - May 21, 2017

జగిత్యాల : కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం.. హనుమాన్ జయంతి ఉత్సవ వేడుకలకు సిద్ధమయ్యింది. హనుమాన్‌ దీక్షా పరులతో కొండగట్టు ప్రాంతమంతా కాషాయమయంగా మారిపోయింది. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు హనుమంతుడిని దర్శించుకునేందుకు.. పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో భక్తుల రద్దీ పెరిగిపోతోంది. ఈ సందర్భంగా అర్చకులు మూడు రోజులుగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తొలిసారి భద్రాచలం నుంచి అధికారికంగా ఉత్సవ మూర్తికి.. ఆలయాధికారులు పట్టు వస్త్రాలు సమర్పించారు. 

09:32 - May 21, 2017

హైదరాబాద్ : తెలంగాణలో నూతన జిల్లాలు ఏర్పాటు కావడంతో ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలు చేపట్టాల్సి ఉంది. జిల్లాల సంఖ్య 10 నుంచి 31కి అమాంతం పెరగడంతో ప్రస్తుత ఉద్యోగులందరినీ ఆర్డర్‌ టూ సర్వ్‌ ప్రకారం నూతన జిల్లాలకూ తాత్కాలికంగా ఉద్యోగులను ప్రభుత్వం సర్దుబాటు చేసింది. ఇప్పుడు ట్రాన్స్‌ఫర్స్‌పై నిషేదం ఎత్తివేసి..స్థానికత ఆధారంగా వారివారి జిల్లాల్లో నియమించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలను సిద్దం చేయడంలో మాత్రం జాప్యం జరుగుతుందనేది ఉద్యోగుల వాదన. గైడ్‌లైన్స్‌కు తుదిరూపు ఇవ్వడంలో అలసత్వం కారణంగా బదిలీలు ప్రస్తుతం ప్రభుత్వం తీసుకొస్తున్న బదిలీల నూతన మార్గదర్శకాల ప్రకారం... ఉద్యోగులే తాము ఏ జిల్లాల్లో పనిచేయడానికి సిద్దంగా ఉంటారో చెప్పాల్సి ఉంటుంది. ఉద్యోగులకు ఆప్షన్‌ ఇచ్చి.. వారు ఎక్కడ పనిచేస్తారన్నది తెలుసుకొని... వారికి అక్కడే శాశ్వత కేటాయింపులు చేసేలా గైడ్‌లైన్స్‌ ఉండనున్నాయి. ఫలితంగా ఉమ్మడి జిల్లా ఎన్ని జిల్లాలుగా విడిపోతే అన్ని జిల్లాల పరిధిలో తానుకోరుకున్న చోట స్థానికత పొందే వెసులుబాటు ఉద్యోగికి రానుంది.

అభ్యంతరాలు
ఉమ్మడి జిల్లా నుంచి విడిపోయి...... పొరుగు జిల్లాలో విలీనమైన ప్రాంతాల ఉద్యోగులు కోరుకున్న చోట శాశ్వత కేటాయింపులు జరపాలని మార్గదర్శకాల్లో పొందుపర్చనున్నారు. ఈ ప్రక్రియ అంతా కొలిక్కి తెచ్చేందుకు ఆలస్యం అవుతోందనేది ప్రభుత్వ వాదన. తుదిరూపు వచ్చిన తర్వాతే ఇందుకు మార్గదర్శకాల డ్రాఫ్ట్‌ను విడుదల చేసి.. ఉద్యోగ సంఘాల నుంచి అభ్యంతరాలు స్వీకరించనుంది ప్రభుత్వం. అనంతరం అభ్యంతరాలు పరిశీలించి శాశ్వత మార్గదర్శకాలు రూపొందించనుంది. ఈ ప్రక్రియనంతా పూర్తిచేసి జూన్‌ మొదటి వారానికి శాశ్వత గైడ్‌లైన్స్‌ విడుదల చేసి... జూన్‌ చివరికల్లా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం డిసైడ్‌ అయ్యింది. కాబట్టి ఉద్యోగుల బదిలీలు జూన్‌ చివరి నుంచే ఉంటాయన్నమాట.

ఎన్టీపీసీలో సాంకేతిక లోపం

పెద్దపల్లి : జిల్లాలోని ఎన్టీపీసీలో సాంకేతిక లోపం తలెత్తింది. 5వ యూనిట్ లో బాయిలర్ ట్యూబ్ లీకేజీ కావడంతో 500 మె.వా విద్యుత్పత్తికి అంతరాయం కల్గింది. 

ఏయూలో ఉత్తరాంధ్ర వెనుకబాటు సదస్సు

విశాఖ : నేడు ఏయూలో ఉత్తరాంధ్ర వెనుకబాటు పై సదస్సు నిర్వహించనున్నారు. సదస్సుకు పీసీసీ చీఫ్ రఘువీరా, సీపీఎం నేత మధు, జేపీ హాజరు కానున్నారు. 

నేడు గుంటూరు జిల్లాలో మంత్రుల పర్యటన

గుంటూరు : జిల్లాలో నేడు మంత్రులు కామినేని, ప్రత్తిపాటి, ఆనంద్ పర్యటించనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో జనరిక్ మెడికల్ షాపు, క్యాన్సర్ వార్డుకు శంకుస్థాన చేయనున్నారు. 

లంగర్ హౌస్ లో ఘోర రోడ్డు ప్రమాదం

హైదరాబాద్ : నగరంలోని లంగర్ హౌస్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు యువకులు లారీని ఢీకొట్టారు. డ్రంకన్ డ్రైవ్ తప్పించుకునేందకు రాంగ్ రూట్ లో బైక్ నడిపి లారీ ఢీకొట్టి మృతి చెందారు.

07:55 - May 21, 2017

హైదరాబాద్ : నగరంలోని లంగర్ హౌస్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు యువకులు లారీని ఢీకొట్టారు. డ్రంకన్ డ్రైవ్ తప్పించుకునేందకు రాంగ్ రూట్ లో బైక్ నడిపి లారీ ఢీకొట్టి మృతి చెందారు. మృతులను రాజేంద్రనగర్ కు చెందిన శ్రీనివాస్, రాజేష్ గా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

07:45 - May 21, 2017

హైదరాబాద్ : ధనా ధన్‌ ట్వంటీ ట్వంటీ లీగ్‌...ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 10వ సీజన్‌ క్లైమాక్స్‌ ఫైట్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. ముంబై ఇండియన్స్‌ , పటిష్టమైన రైజింగ్‌ పూణే సూపర్‌ జెయింట్‌ జట్ల మధ్య అసలు సిసలు సమరానికి రంగం సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య టైటిల్‌ ఫైట్‌...క్రికెట్‌ అభిమానులకు ఇంతకు మించి కావాల్సిందేముంటుంది. గత సీజన్‌లో పాయింట్స్‌ టేబుల్‌ ఆఖరి స్థానానికే పరిమితమైన రైజింగ్‌ పూణే సూపర్‌ జెయింట్‌ జట్టు...ఈ సీజన్‌లో అంచనాలకు మించి అదరగొట్టింది. ఎక్స్‌పెక్టేషన్స్‌కు ఏ మాత్రం తగ్గకుండా అదరగొట్టిన పూణే జట్టు ఫైనల్‌కు అర్హత సాధించి అందరినీ ఆశ్చర్యపరచింది.ఐపీఎల్‌ 10వ సీజన్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆధిపత్యం ప్రదర్శించిన జట్టు ముంబై ఇండియన్స్‌ జట్టు 4వ సారి ఫైనల్‌కు అర్హత సాధించింది.అంబటిరాయుడు, పార్థీవ్‌ పటేల్‌, నితీష్ రానా, రోహిత్‌ శర్మ, కీరన్ పోలార్డ్ , లెండిల్‌ సిమ్మన్స్‌, కృనాల్‌ పాండ్య, హార్దిక్ పాండ్య వంటి టాప్‌ క్లాస్‌ బ్యాట్స్‌మెన్‌తో పాటు ...మిషెల్‌ జాన్సన్‌,మలింగా, హర్భజన్‌ సింగ్‌,కరణ్‌ శర్మ వంటి బౌలర్లతో ముంబై జట్టు ఎప్పటిలానే పవర్‌ఫుల్‌గా ఉంది.

ఆరంభ మ్యాచ్‌ల్లో తడబడ్డ పూణే 
ఆరంభ మ్యాచ్‌ల్లో తడబడ్డ పూణే జట్టు...చివరి 10 మ్యాచ్‌ల్లో 8 విజయాలు సాధించి టైటిల్‌ రేస్‌లో నిలిచింది.తొలి క్వాలిఫైయర్‌లో ముంబై జట్టునే ఓడించి ఫైనల్‌లో ఎంటరైంది. స్టీవ్‌స్మిత్‌, రహానే,రాహుల్‌ త్రిపాఠీ, ధోనీ,వంటి టాప్‌ క్లాస్‌ బ్యాట్స్‌మెన్‌తో పాటు....డానియల్‌ క్రిస్టియన్‌ వంటి హార్డ్‌ హిట్టింగ్‌ ఆల్‌రౌండర్‌తో పూణే బ్యాటింగ్‌ బలంగా ఉంది. జయదేవ్‌ ఉనద్కత్‌ 11 మ్యాచ్‌ల్లోనే 22 వికెట్లు తీసి పూణే జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. కానీ ఫేస్ టు ఫేస్‌ రికార్డ్‌లో మాత్రం పూణె జట్టుదే పై చేయిగా ఉంది. ఇప్పటివరకూ ముంబై ఇండియన్స్‌తో 5 సార్లు పోటీపడిన పూణె జట్టు 4 మ్యాచ్‌ల్లో నెగ్గింది. ప్రస్తుత సీజన్‌లో ముంబై జట్టును మూడు సార్లు ఓడించిన పూణే జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నా....ఆల్‌రౌండ్‌ పవర్‌తో పవర్‌ఫుల్‌గా ఉన్న రోహిత్‌ సేనను తక్కువ అంచనా వేయలేం. మరి రెండు సార్లు చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌,తొలి సారి ఫైనల్‌ ఆడబోతోన్న రైజింగ్‌ పూణె సూపర్ జెయింట్‌ జట్లలో ఐపీఎల్ టైటిల్‌ నెగ్గే జట్టేదో తెలియాలంటే మరికొద్ది గంటలు వెయిట్‌ చేయాల్సిందే.

 

07:42 - May 21, 2017

హైదరాబాద్ : జూన్‌ -2న తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించేందుకు కేసీఆర్‌ ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఉత్తరాఖండ్‌లోని మౌంట్‌రుత్‌ గౌరా పర్వతంపై కూడా తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించేందుకు రంగం సిద్దమైంది. అడ్వెంచర్‌ క్లబ్‌ ఆఫ్‌ తెలంగాణ ఆధ్వర్యంలో 8మంది పర్వతారోహకులు ఇందుకు సిద్దమయ్యారు. శనివారం వీరంతా సచివాలయం నుంచి బయలుదేరారు. సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం జెండా ఊపి పర్వతారోహణ బృందం యాత్రను ప్రారంభించారు. మౌంట్‌రుత్‌ గౌరా పర్వతం 5819 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఈ పర్వతాన్ని అధిరోహించి జూన్‌ -2న జాతీయ జెండాతోపాటు తెలంగాణ రాష్ట్ర చిత్రపటాన్ని పర్వతారోహణ బృందం సభ్యులు ఎగురవేస్తారని తెలంగాణ టూరిజం, సాంస్కృతికశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేషం తెలిపారు.కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో టూరిజం ప్రమోషన్‌లో భాగంగా ఈ కార్యక్రమాన్ని అడ్వంచర్‌ క్లబ్‌ ఆఫ్‌ తెలంగాణ ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. అడ్వంచర్‌ క్లబ్‌ ఆఫ్‌ తెలంగాణ 2015లో జమ్మూకశ్మీర్‌లోని స్టాక్‌ కాంగ్రీ పర్వతంపై, 2016లో హిమాచల్‌ ప్రదేశ్‌లోని మౌంట్‌ నార్బ్‌పర్వతంపై తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ క్లబ్‌ నిర్వహించింది. మూడో సంవత్సరం కొనసాగింపుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. 

07:40 - May 21, 2017

హైదరాబాద్ : ఈయనే బిజెపి ఎంపి భగవంత్ కూబా. కర్నాటకలోని బీదర్ పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయన గురించి టి కాంగ్రెస్ నేతలు చర్చించుకోవడమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కారణం ఏంటంటే దేశ వ్యాప్తంగా ముందస్తు ఎన్నికలు వస్తున్నాయన్న నేపథ్యంలో తెలంగాణపై దృష్టి పెట్టిన బిజెపి ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. అందుకోసం బీదర్ ఎంపీ అయిన భగవంత్ కూబాను ఎంచుకుందట. దీనిలో భాగంగా ఈ ఎంపీగారు హైదరాబాద్ లో మకాం వేసి కాంగ్రెస్ నేతలతో రహస్య మంతనాలు జరపడమే ఇప్పుడు హస్తం పార్టీలో కలకలం రేపుతోంది.

బిజెపి ఆకర్ష్
భగవంత్ కూబా తెలంగాణ కాంగ్రెస్ కి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీతో అసంతృప్తిగా ఉన్న నేతలకు ఫోన్ లో చేస్తున్నట్లు భోగట్టా.ఇప్పటికే ఓ డజనుకు పైగా నేతలతో మంతనాలు నడపడంతో పాటు.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు మాజీ మంత్రులు, ఓ మాజీ ఎంపీ, ఓ మహిళా కాంగ్రెస్ నేతలను బిజెపి ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ తో కలిపించినట్లు తెలుస్తోంది. కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి పార్టీలోకి వస్తే .. పార్టీ టికెట్ కన్ఫామ్ చేయడంతో పాటు ఎలక్షన్ ఖర్చు కూడా బిజెపి చూసుకుంటుందని హామీ ఇచ్చారని టాక్. ఈ విషయాలన్నీ తెలిసిన టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అగ్గిమీద గుగ్గిలం అయినట్లు తెలుస్తోంది. ఎలాగైనా భగవంత్ కూబాను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ప్రజల ముందు నిలబెట్టేలా ఆయన వ్యూహాలు రచిస్తున్నారట. టికాంగ్ నేతలు బిజెపి ఆకర్ష్ వలలో పడతారో.. ఈ ఎంపీగారికే ఝలక్ ఇస్తారో వెయిట్ అండ్ సీ.

 

07:39 - May 21, 2017

నిజామాబాద్ : ఇది నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ విశ్వవిద్యాలయం. ఈ యూనివర్సిటీలో మొదటి నుంచి వివాదాలే. తాజాగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల నియామకంలో వివాదం తలెత్తింది. ఇటీవల ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్, అటెండర్, సెక్యూరిటీ గార్డుల పోస్ట్ లను భర్తీ చేశారు. అయితే వీసీ సాంబయ్య ఒక్కో పోస్టుకు 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు డబ్బులు వసూలు చేశారని ఆరోపిస్తూ విద్యార్ధి సంఘాలు ఆందోళనకు దిగాయి. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని విద్యార్థి సంఘ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

రాత పరీక్ష....
అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీలో అభ్యర్ధులు రాత పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. అయితే వర్సిటీ అధికారులు నిబంధనలను తుంగలో తొక్కారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండానే ప్రజా ప్రతినిధులకు చెందిన వ్యక్తులను ఉద్యోగాల్లో భర్తీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో విద్యార్థి సంఘాలకు, విసికి మధ్య వివాదం ముదరడంతో పంచాయితీ నిజామాబాద్ ఎంపీ కవిత వద్దకు చేరినట్లు సమాచారం. దీనిపై కవిత వీసీని వివరణ కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు విద్యాశాఖ అధికారులకు సమాచారం లేకుండా ఎలా నియామకాలు చేశారంటూ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఆ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జేఏసీ రంజన్‌ను నివేదిక కోరినట్లు తెలుస్తోంది. ఇక జరిగిన అవకతవకలపై ఇంటెలిజెన్స్ నిఘా విభాగం పూర్తి స్ధాయిలో ఆరా తీస్తున్నారు. ఇక ఈ విషయంపై వీసీ సాంబయ్యని ప్రశ్నిస్తే ఏజెన్సీ టెండర్ ప్రకారమే నియామకాలు చేశామని చెప్పారు. ఉద్యోగాల కోసం ఎవరైనా డబ్బులు ఇచ్చినట్లు ఆధారాలుంటే చూపించాలని ఆయన అన్నారు. ఏది ఏమైనా ఈ వివాదంపై అధికారులు పూర్తి స్ధాయిలో విచారణ జరపాల్సిన అవసరం ఉంది..లేదంటే వర్సిటీ అధికారులు మరింత అభాసుపాలయ్యే ప్రమాదం ఉంది. 

07:36 - May 21, 2017

హైదరాబాద్ : భానుడి ప్రతాపానికి కండక్టర్లు , డ్రైవర్లు విలవిల్లాడుతున్నారు. ఎండల కారణంగా విధి నిర్వహణలో వారికి తిప్పలు తప్పడం లేదు. రెండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు డ్యూటీలో ఉండేవారు.. సాయంత్రం ఆరు వరకు ఎండ వేడిమిలోనే డ్యూటీ చేయాల్సి వస్తోంది. అలాగే ఉదయం ఆరుగంటలకు వచ్చే కార్మికులు తొమ్మిది గంటల నుంచే ఎండ బారిన పడుతున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు మండుటెండలో ఇళ్లకు చేరుతున్నారు. దీంతో ఆర్టీసీ కార్మికులు వడదెబ్బకు గురవుతున్నారు. ఈ మండుటెండలకు విధులు నిర్వహించడం చాలా కష్టంగా ఉందని కండక్టర్లు అంటున్నారు. వేసవితాపం నుంచి నగర కండక్టర్లను, డ్రైవర్లను రక్షించేందుకు చర్యలు తీసుకున్నామని ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. మజ్జిగ, ఓఆర్‌ఎస్‌, చల్లని నీరు అందుబాటులో ఉంచుతున్నామని వెల్లడించింది. కానీ ఆ ఏర్పాట్లన్నీ అరకొరగానే ఉన్నాయి. కనీసం మంచినీరు కూడా అందుబాటులో లేదని డ్రైవర్లు, కండక్టర్లు వాపోతున్నారు. ఇప్పటికైనా మంచినీరు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. ఎండలను లెక్క చేయకుండా... ఆర్టీసీ కార్మికులు తమ విధులు నిర్వహిస్తున్నారు. వారి సంరక్షణకు... ఆర్టీసీ యాజమాన్యం పూర్తిస్థాయి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

07:34 - May 21, 2017

హైదరాబాద్ : వర్షాకాలం సమస్యలపై బల్దియా అధికారులు ముందుజాగ్రత్తలు చేపట్టడంపై దృష్టిపెట్టారు. గత ఏడాది ఎంత అప్రమత్తంగా ఉన్నా వర్షాల సమయంలో రోడ్లు నగరవాసులకు చుక్కలు చూపించాయి.. ఈ ఏడాది ఆ పరిస్థితి రాకుండా అధికారులు ఇప్పటినుంచే పరిష్కారాలు వెతికే పనిలో పడ్డారు. ఈసారి భారీవర్షాల సమయంలో నీరు నిలిచే వర్నలబుల్‌ పాయింట్లను వెంటనే పునరుద్ధరించేలా అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు.

స్థానికుడిని వాలంటీర్‌గా
గ్రేటర్‌ పరిధిలోని వివిధ విభాగాల అధికారులతో కమిషనర్‌ జనార్దన్‌ రెడ్డి సమావేశమయ్యారు. వర్షాకాలంలో ట్రాఫిక్‌ జాంలు లేకుండా... నగరవాసులు సురక్షితంగా గమ్యం చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.. ప్రతి సమస్యకు స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రోడ్లపై గుంతలు ఏర్పడితే వెంటనే పూడ్చివేయాలని సూచించారు. ఈ పనుల కోసం ప్రతి వంద మీటర్లకు ఒక స్థానికుడిని వాలంటీర్‌గా నియమించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన జాబితాను వెంటనే రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు.. అన్ని రకాల పనులకు ఆయా సర్కిళ్ల పరిధిలో ట్రాఫిక్, జీహెచ్‌ఎంసీ, జలమండలి శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని కమిషనర్‌ సూచించారు.

పైప్‌లైన్లను వేగంగా పూర్తి
శివార్లలో హడ్కో లోన్‌తో చేపట్టిన తాగునీటి పైప్‌లైన్లను వేగంగా పూర్తిచేయాలని గ్రేటర్‌ అధికారులు నిర్ణయించారు... 2వేల కిలోమీటర్ల వరకూ వేస్తున్న పైప్‌లైన్‌ పనుల్లో 850 కిలోమీటర్లవరకూ రోడ్డు పనులు పునరుద్ధరించాలని కమిషనర్‌ అధికారుల్ని ఆదేశించారు.. అలాగే రోడ్డు మధ్యలో ట్రాఫిక్‌కు ఇబ్బందిగా ఉన్న 656 విద్యుత్‌ స్తంబాలను వెంటనే తొలగించాలని సూచించారు.. నగరంలోని అన్ని ప్రధాన రహదారుల్లో రోడ్డు మార్కింగ్‌లు, రిఫ్లెక్టర్లు, డివైడర్‌ బ్లాక్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మొత్తానికి వర్షాలకుముందే అలర్ట్‌ అవుతున్న అధికారులు తీరా అసలు సమయంలో ఏం చేస్తారో వేచిచూడాలి.

 

06:49 - May 21, 2017

జీవ ఎరువుల పాత్ర వ్యవసాయంలో చాలా ముఖ్యమైంది. ఎక్కువ ఖర్చుపెట్టి నష్టపోయే బదులు జీవ ఎరువులు వాడడం మంచిది. అలాగే భూమి తన స్వభావాన్ని కోల్పోతుంది. భూసార పరీక్షాలు చేస్తే భూమికి ఎంత మొత్తంలో ఎరువులు వాడలని తెలుస్తోందని ప్రతిభ బయోటెక్ సీఈవో రాజశేఖర్ రెడ్డి అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

Don't Miss