Activities calendar

22 May 2017

21:47 - May 22, 2017

మేడ్చల్ : మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రతిపక్షాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.. అప్పుడెప్పుడో కాంగ్రెస్‌వాళ్లు దిక్కుమాలిన జీవోలిచ్చారంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.. కాంగ్రెస్‌ దిక్కుదివానంలేని కార్యక్రమాలే చేస్తారని మండిపడ్డారు.. రంగారెడ్డి జిల్లా షాద్‌ నగర్‌లోగొర్రెల అభివృద్ధి పథకంపై అవగాహన సదస్సుకు హాజరయ్యారు.

 

21:46 - May 22, 2017

నల్లగొండ : మూడు రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్‌ వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అటు నుంచి నల్లగొండ జిల్లా వెళ్లిన అమిత్‌షా.. చండూరు మండలం తెరట్‌పల్లి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా తెరట్‌పల్లిలో బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఇంటింటికీ తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలును అమిత్‌షా అడిగి తెలుసుకున్నారు. మావోయిస్టుల చేతిలో హతమైన గుండగోని మైసయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం బూత్‌స్థాయి కార్యకర్తలతో సమావేశమయ్యారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతోందన్న అమిత్‌ షా.. కేంద్రం మంజూరు చేసిన పథకాలు తెలంగాణలోని గ్రామాల్లో అమలు కావడం లేదన్నారు. ప్రపంచంలోనే బీజేపీ అతిపెద్ద పార్టీ అని.. 13 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నామని, 11 కోట్ల మంది సభ్యులు ఉన్నారని అమిత్‌ షా వెల్లడించారు. తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆవాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ అందరి అభివృద్ధి కోసం పనిచేస్తున్నారని.. కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అమిత్‌షా పిలుపునిచ్చారు. అనంతరం అమిత్‌ షా.. తెరట్‌పల్లిలో దళితులతో కలిసి సహాపంక్తి భోజనం చేశారు.

ఆప్‌ కార్యకర్తలు ఆందోళన

మరోవైపు బీజేపీ మతతత్వ రాజకీయాలు చేస్తుందంటూ.. చౌటుప్పల్‌లో ఆప్‌ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆ దారి వెంట వస్తున్న అమిత్‌షాను అడ్డుకుంటామంటూ నల్లజెండాలను ప్రదర్శిస్తుండగా.. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు నల్లగొండ క్లాక్‌ టవర్‌వద్ద ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పార్లమెంట్‌లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టకుండా.. దళిత వాడల్లో భోజనాల పేరుతో తమను వంచిస్తున్నారని ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు ఆరోపించారు. అమిత్‌షా గో బ్యాక్‌ అంటూ డప్పు వాయిద్యాలతో నిరసన తెలిపారు. ఆందోళన చేస్తున్న ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇక మంగళవారం అమిత్‌షా వెలుగుపల్లి, చిన్నమందారం, పెద్దదేవురపల్లిలో పర్యటించనున్నారు. బుధవారం చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో పర్యటిస్తారు. రజాకార్ల దాడిలో మృతి చెందిన కుటుంబాలను అమిత్‌షా పరామర్శిస్తారు. అటు నుంచి పర్యటన ముగించుకుని ఢిల్లీకి బయలుదేరుతారు. 

 

21:04 - May 22, 2017

మహానాడు భద్రత ఏర్పాట్లు పరిశీలించిన ఏపీ డీజీపీ

 

విశాఖ : ఏపీ డీజీపీ సాంబశివరావు విశాఖలో జరగబోయే మహానాడు భద్రత ఏర్పాట్లును పరిశీలించారు.

టీడీపీ ఎమ్మెల్యేలు, ఎస్పీకి మధ్య వివాదం

పశ్చిమ గోదావరి : టీడీపీ ఎమ్మెల్యేలు ఎస్పీకి మధ్య వివాదం నెలకొంది. సమన్వయ లోపం కారణంగా తలెత్తిందని సీఎం చంద్రబాబు అన్నారు.

నార్మన్ ప్రతినిధులతో చంద్రబాబు భేటీ

గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబుతో నార్మన్ పోస్టర్ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ భేటీలో రాజధాని డిజైన్లపై నార్మన్ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

20:44 - May 22, 2017

కరువుతో సీమ గగ్గోలు పెడుతోంది..విలవిల్లాడుతోంది. చుక్కనీటికోసం విలపిస్తోంది. బీళ్లు బారుతున్న బతుకులు, నెర్రెలిచ్చిన పొలాలు.. పాతాళంలో వెదకినా కనిపించని నీటి జాడ... నిరుపయోగంగా మారుతున్న ప్రాజెక్టులు.. వట్టిమాటలుగా మిగులుతున్న సర్కారుహామీలు.. వెరసి రాయలసీమను అటు ప్రభుత్వం, ఇటు ప్రకతి ఏక కాలంలో దగా చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. కరువు వలసలకు కారణంగా మారుతోంది. లక్షలాదిమంది బతుకు దెరువు కోసం వెతుకుతున్న పరిస్థితి. భూమిని నమ్ముకుని, వర్షాలపై ఆధారపడి చివరికి బతుకు ప్రశ్నార్ధకమై పల్లెల్లో ఉండలేక, వదల్లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కడప, కర్నూలు, చిత్తూరు అనంతపురం జిల్లాల్లో ఈ దృశ్యం దయనీయంగా కనిపిస్తోంది. 

20:40 - May 22, 2017

తెలంగాణల అప్పుడే ఓట్ల సందడి సూరువైయినట్టు అనిపిస్తాలేదు.. మంత్రాలకు చిత్తకాయాలు రాల్తాయా రాలయిగదా మూతి పండ్లు రాలుతాయి...శెరువు మీద కొంగ అలిందే అనుకో కొంగది ఎండుతదా శెరువుది ఎండుతదా....జీతం భత్తం లేకుండా తోడేలు గొర్లను గాస్తాని ఒచ్చిందట అగో గట్లానే ఉన్నది ఏపీ మంత్రి నారాయణ సంగతి....మదం, బలుపు, కువరకం, లపంగి ఇవన్ని కలిపితే శినిమా నటుడు చలపతిరావు...ఎంది మల్లన్న గంత పెద్ద మాట అంటుండు గంత పెద్ద నటున్ని వాంటుకుని అంటారా...వీహరయాత్రలు, జూపార్క్ లు, జలపాతలు, నదులు, సరస్సుల పోంటా సరద జేసుకునే పబ్లిక్ జర గీ ముచ్చట బాగా జూడాలే...అల్ ఇండియా మొత్తంలా అసలు అంటీ ఎవలో తెలుసా మొగోళ్లకు గూడ బుర్ర కరవయ్యే స్కూటర్ స్టట్ల్ జెస్తున్నాది...

20:21 - May 22, 2017

కెనడా : దేశంలో ఓ చిన్నారికి తృటిలో ప్రమాదం తప్పింది. వెస్టర్న్‌ కోస్ట్‌లోని స్టీవెస్టన్‌ సముద్ర తీరానికి కొందరు పర్యాటకులు వచ్చారు. అక్కడ సముద్ర అందాలను చూస్తుండగా.. వంతెన సమీపానికి ఓ సీల్‌ వచ్చింది. దాన్ని చూడగానే కొందరు వ్యక్తులు నీళ్లలోకి ఆహారాన్ని విసిరారు. ఓ చిన్నారి నీటిలోకి చూస్తుండగా.. సీల్‌ చిన్నారి సమీపానికి వచ్చి ఎగిరి మళ్లీ వెంటనే వెనక్కి వెళ్లిపోయింది. ఆ చిన్నారి వంతెనపై కూర్చోగా.. మళ్లీ వచ్చిన సీల్‌ ఆ చిన్నారి డ్రెస్‌ పట్టుకుని నీటిలోకి లాక్కెళ్లింది. ఇది చూసిన ఓ వ్యక్తి వెంటనే దూకి చిన్నారిని రక్షించి పైకి తీసుకొచ్చాడు. ఈ ప్రమాదంలో చిన్నారికి గానీ ఆ వ్యక్తికి గానీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఊహించని పరిణామానికి చిన్నారి కుటుంబం షాక్‌కు గురైంది. వెంటనే వారంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనంతా ఓ వ్యక్తి వీడియో తీసి యూట్యూబ్‌లో పోస్టు చేయగా.. ఇది కాస్తా వైరల్‌గా మారింది. 

20:19 - May 22, 2017

కరీంనగర్ : తెలంగాణ ఎంసెట్‌ ఫలితాల్లో కరీంనగర్‌ జిల్లాలోని ఆల్పోర్స్ కళాశాల విద్యార్ధులు జయకేతనం ఎగురవేశారు. ఆల్ఫోర్స్‌ విద్యార్ధులు అత్యుత్తమ ఫలితాలు నమోదు చేశారు. 67 మంది విద్యార్ధులు ఉత్తమ ర్యాంక్‌లు సాధించారు. ఇంజనీరింగ్‌ విభాగంలో సాయిశివారెడ్డి 216 ర్యాంక్‌ సాధించగా... అగ్రికల్చర్‌, ఫార్మా విభాగంలో నితీష్‌ 610 ర్యాంక్‌ను సాధించారు. వీరితోపాటు అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్ధులను ఆల్ఫోర్స్ కళాశాల డైరెక్టర్‌ నరేందర్‌రెడ్డి అభినందించారు. మున్ముందు తమ విద్యార్ధులు మరిన్ని ఉత్తమ ఫలితాలు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

20:18 - May 22, 2017

హైదరాబాద్ : హైదరాబాద్‌ ప్రగతినగర్‌ చెరువు సుందరీకరణ పనులను గ్రామస్తులే చేపట్టారు. గ్రామస్తులంతా ముందుకొచ్చి చెరువులోని గుర్రపుడెక్కను తొలగించారు. ఇందుకు ప్రభుత్వ నిధులపై ఆధారపడకుండా ప్రతికుటుంబానికి 500 రూపాయలు చందావేసుకుని 50లక్షలతో గుర్రపుడెక్క తొలగింపు పూర్తి చేశారు. ఈ కార్యక్రమం వెనుక గ్రామ పంచాయతీ పెద్దలు దయాకర్‌రెడ్డి, సర్పంచ్‌, ఎంపీటీసీ విశేషకృషి చేశారు. గ్రామస్తులతోకలిసి అహర్నిశలు శ్రమించి నెలరోజుల్లోపూర్తి చెరువులోని గుర్రపుడెక్క తొలగింపు పూర్తి చేశారు. గ్రామస్తులే చందాలువేసుకుని పూర్తి చేయడం అభినందనీయమని ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు గాంధీ, వివేకానంద్‌ ప్రశంసించారు. ప్రగతినగర్‌కు తన నిధుల నుంచి కోటి రూపాయలు కేటాయిస్తున్నట్టు మల్లారెడ్డి ప్రకటించారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యేలు హామీనిచ్చారు. ప్రగతి నగర్‌ గ్రామస్తుల స్ఫూర్తితో నగరంలోని ఇతర చెరువుల సుందరీకరణకు ప్రణాళికలు రూపొందిస్తామన్నారు.

20:16 - May 22, 2017

గుంటూరు : రాష్ట్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా... సీఐటీయూ ఆధ్వర్యంలో ఏపీలోని వివిధ జిల్లాలో కార్మికులు కదం తొక్కారు. విజయవాడలో మున్సిపల్‌ కార్మికులు ఒక్కరోజు సమ్మె చేశారు. మున్సిపల్‌ కార్యాలయం ఎదుట బైఠాయించి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. జీవో 279ని రద్దు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్‌ చేశారు. కార్మికులను రోడ్డు పాలు చేయడానికి ప్రయత్ని‌స్తే సహించేది లేదని హెచ్చరించారు. మున్సిపల్‌ కార్మికులను రోడ్డు పాలు చేసే 279 జీవోను రద్దు చేయాలంటూ నెల్లూరు కార్పొరేషన్ ఎదుట కార్మికులు ధర్నా చేశారు. కనీస వేతనాల పెంపు కోసం జారీ చేసిన 151 జీవోను మున్సిపల్‌ కార్మికులకు కూడా వర్తింప చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే కడప నగరపాలక సంస్థ కార్యాలయం ముందు కార్మికులు ఒక్కరోజు సమ్మెకు దిగారు. కనీస హక్కులైన పీఎఫ్‌, ఈఎస్‌ఐ లాంటి కనీస సదుపాయాలకు కూడా మున్సిపల్‌ కార్మికులకు కల్పించడం లేదని వాపోయారు.

ఉద్యోగులు వినూత్న నిరసన
అనంతపురం జిల్లాలో మున్సిపల్‌ ఉద్యోగులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఉరితాళ్లతో ర్యాలీ నిర్వహించారు. 279 జీవోను రద్దు చేయాలంటూ మున్సిపల్‌ అధికారులకు వినతిపత్రాన్ని అందించారు. అలాగే మున్సిపల్‌ కార్యాలయం ముందు కూడా ధర్నా చేశారు. జీవోను రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. అటు విజయనగరం జిల్లా పార్వతీపురంలో 279 GOను రద్దు చేయాలంటూ మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. మున్సిపల్‌ కార్యాలయం ముందు బైఠాయించారు.. దాదాపు గంటన్నరసేపు ఉద్యోగులు ఆఫీస్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసులు కార్మికులను అరెస్ట్ చేశారు.. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఇప్పటికైనా టీడీపీ ప్రభుత్వం కార్మికుల విషయంలో తన వైఖరిని మార్చుకోవాలని కార్మిక నాయకులు హెచ్చరించారు. లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

20:14 - May 22, 2017

పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా సింగరేణిలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో కార్మికులు ఇబ్బందులు పడకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

20:13 - May 22, 2017

కర్నూలు : కర్నూలు జిల్లాలో కరువు విలయతాండవం చేస్తోంది. వర్షాభావ పరిస్థితులతో పంటలు ఎండిపోయి జిల్లా రైతులు అప్పులపాలయ్యారు. తాము మన్నుతిని.. జనానికి అన్నంపెట్టేందుకు తపనపడే అన్నదాతలు కరువు రక్కసి చిక్కి విలవిల్లాడుతున్నారు. దాదాపు 50ఏళ్లనాడు జనం ప్రాణాలు తీసిన కరువు పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయని కర్నూలుజిల్లా ప్రజలు అంటున్నారు. చివరికి తాగునీరు కూడా లేక కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒటి రెండు బోర్ల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు.

ట్యాంకర్లు, ఆటోల ద్వారా నీరు
అక్కడక్కడా అకరొరగా టొమాటో పంటను సాగు చేసిన అన్నదాతలు.. పైరును కాపాడుకోడానికి ట్యాంకర్లు, ఆటోల ద్వారా నీటిని తీసుకొచ్చి మొక్కల దాహాన్ని తీరుస్తున్నారు. పంటను కాపాడుకోడానికి పొద్దున్నే లేచింది మొదలు బిందెలు, చెంబులు తీసుకుని పొలంబాట పడుతున్నారు. ఇంత కష్టపడినా పంటను కాపాడుకోలేక ఇలా పశువులకు మేతగా వదిలేస్తున్నారు. ప్రతి ఏడాది వర్షాలు ముఖం చాటేస్తుండటంతో.. దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. ఇక్కడే ఉండి తమవారిని పోషించుకోలేక కర్నూజిల్లా రైతులు విలవిల్లాడుతున్నారు. కుటుంబపోషణకోసం పలు గ్రామాల్లో ఇలా ఇళ్లకు తాళ్లాలు వేసి వలసలు పోతున్నారు. పంటల సంగతి పక్కనపెడితే కనీసం పశువులను కూడా కాపాడుకోలేక పోతున్నామని కర్నూజిల్లా అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. వ్యవసాయంలో ఆసరాగా నిలిచే కాడెద్దులు, పాడిపపశువులను కరువు కాటేసిందని కన్నీరు పెట్టుకుంటున్నారు. పశువులను పోషించలేక కబేళాలకు అమ్ముకుంటున్నామని ఆవేదన చెందుతున్నారు.

వర్షాభావ పరిస్థితులు
వర్షాభావ పరిస్థితులతో జిల్లాలో బోర్లు, బావులో ఎపుడో ఎండిపోయాయి. జలశయాలన్నీ నీరులేక వెలవెలబోతున్నాయి. ఖరీఫ్‌కోసం భూమిని సిద్ధం చేసిన రైతులు ఖాళీ ప్రాజెక్టులను చూసి భారంగా నిట్టూరుస్తున్నారు. ఈసారి పంటలు సాగయ్యే పరిస్థితులు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్లే కర్నూలజిల్లా అన్నదాలు పంటభూములకు, పాడిపశువులకు దూరం అయ్యారని వామపక్షనేతలు అంటున్నారు. జిల్లాలో నెలకొన్న తాగు, సాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించడంతోపాటు పెండింగ్‌ ప్రాజెక్ట్‌ లను పూర్తిచేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

అమరావతి జపం చేస్తూ..
ముఖ్యమంత్రి చంద్రబాబు లేస్తే అమరావతి జపం చేస్తూ.. రాయలసీమను పట్టించుకోవడం లేదని రైతులు మండిపడుతున్నారు. కరువు పరిస్థితుల్లో ప్రభుత్వం పట్టనట్టే వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు. ఈనెల 24న రాయలసీమ బంద్‌తో ప్రభుత్వంపై నిరసన తెలపాలని రైతుసంఘాలు పిలుపునిచ్చాయి.  

20:10 - May 22, 2017

అనంతపురం : అన్నదాతలు కన్నీరు పెట్టుకుంటున్న రాజ్యం సింగపూర్‌ అవుతుందా..! పాలకుల డాబుసరి మాటలు రాజధాని అమరావతి చుట్టే పరిభ్రమిస్తుంటే.. గొంతు తడుపుకోను చుక్కనీరు లేక రాయలసీమ కన్నీరుపెట్టుకుంటోంది. చివరకు పశువులకు కూడా మేత కొరత ఏర్పడటంతో కబేళాలకు తరలుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టిన చిత్తూరుజిల్లాలో కరవు విలయతాండవం చేస్తోంది. జిల్లాలో పడమటి మండలాలు అయిన మదనపల్లె, తంబళ్లపల్లి, బి.కొత్తకోట, ములకలచెరువు, వి.కోట. పలమనేరు, పుంగనూరు తదితర చోట్ల కరవు రక్కసి కాటేసింది. నీటి కోసం 1200 అడుగులకు పైగా బోరు తవ్వినా పాతళగంగ జాడేలేకుండా పోయింది. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో బావులు, బోర్లు ఎండిపోయాయి. నీళ్లు లేక పంటలు వడలిపోయాయి.

రెయిన్ గన్స్ ప్రచారం
పంటకుంటలు, రెయిన్‌గన్‌లు అంటూ తెగ ప్రచారం , హడావిడి చేసిన సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఒక్క ఎకరా పంటను కూడా కాపాడడం లేదు. మరోవైపు పండిన అరకొర పంటలకు కూడా కనీస గిట్టుబాటు ధరలు లభించడంలేదు. పడిపోయిన ధరలతో మామిడి, వేరుశనగ,టొమేటో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మదనపల్లె మార్కెట్లో కిలో టొమోటో 50 పైసలకు అమ్ముకుని ప్రభుత్వాన్ని శాపనార్ధాలు పెట్టారు కర్షకులు. కేంద్రం నుంచి కరువు బృందాలు ఎన్నిసార్లు సీమలో పర్యటించినా.. ఉపయోగం లేకుండా పోతోందని చిత్తూరు రైతులు ఆవేదన వ్యవక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్వాకంతో జిల్లా వ్యాప్తంగా పరిశ్రమలు కూడా వరుసగా మూతపడుతున్నాయని వామపక్షాల నేతలు విమర్శిస్తున్నారు.

అదిగో హంద్రీనీవా, ఇదిగోనీళ్లు అంటూ
ఇదిలావుంటే.. అదిగో హంద్రీనీవా, ఇదిగోనీళ్లు అంటూ పాకులు చేస్తున్న ప్రచారం ఆర్భాటంగానే మిగిలిపోతోంది. హంద్రీనివాతోపాటు గాలేరు-నగరి పనులు నత్తడనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులు పూర్తయితే అంతా సస్యశ్యామలం అవుతుందనుకున్న కర్షకుల ఆశలు అడియశలుగానే మిగిలిపోతున్నాయి. కుప్పం నియోజకవర్గానికి హంద్రినీవా జలాలు, తిరుపతికి గాలేరు-నగరలి జలాలను తీసుకొస్తానన్న చంద్రబాబు హామీలు బీడుభూముల్లోనే తచ్చాడుతున్నాయి. ఇప్పటికీ భూసేకరణే పూర్తి కాలేదు.. ఇక కృష్ణమ్మ ఈనేలకు ఎలా చేరుతుందని వామపక్షాల నేతలు ప్రశ్రిస్తున్నారు. మరోవైపు పట్టిసీమ ఎత్తిపోతలతో సీమకు ఒనగూరిన ప్రయోజనం శూన్యంగా మారింది. ప్రాజెక్టు పూర్తయినా..అదనంగా ఒక్క చుక్క నీరు కూడా సీమకు చేరలేదు. బాబు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే.. చిత్తూరుజిల్లా కరువుకోరల్లో చిక్కుకుందన్న విమర్శిలు వెల్లువెత్తుతున్నాయి. 

చిత్తూరుజిల్లా తోపాటు
చిత్తూరుజిల్లా తోపాటు మొత్తం రాయలసీమ ప్రాంతమే కరువతో అల్లాడి పోతోంది. ఈనేపథ్యంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించడానికే ఈనెల 24న సీమజిల్లాల బంద్‌కు పిలుపు ఇచ్చినట్టు ఉభయకమ్యూనిస్ట్‌ పార్టీలు చెబుతున్నాయి. బాబు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కలిసి రావాలని ప్రజలను కోరుతున్నారు. తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల్లో కూరుకుపోయిన రాయలసీమ జిల్లాలకు ఇప్పటికైనా చేయూతనివ్వాలని రైతుసంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. పెండింగ్‌ ప్రాజెక్ట్‌లు సత్వరమే పూర్తిచేయాలి, సీమనాలుగు జిల్లాల్లో పశుగ్రాసం ప్రభుత్వంమే అందించాలని, దాంతోపాటు ఉపాధి హామీ కూలిబకాయిలను వెంటనే మంజూరు చేయాలని వామపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.అభివృద్ధి అంటే రాజధాని అమరావతి చుట్టుపట్టు ప్రాంతాలే కాదని.. రాయలసీమ జిల్లాల ప్రజల బాధలు కూడా పట్టించుకోవాలని సీఎం చంద్రబాబును ప్రజలు కోరుతున్నారు. ఈనెల 24న వామపక్షాల అధ్వర్యంలో నిర్వహించనున్న బంద్‌కు పూర్తి సహకారం అందించి టీడీపీ ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక పంపిస్తామంటున్నారు సీమజిల్లాల ప్రజలు.

20:09 - May 22, 2017

విజయవాడ : టీడీపీ ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని... సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు.. కార్పొరేట్లు, కాంట్రాక్టర్లే లక్ష్యంగా పనిస్తోందని... మండిపడ్డారు.. కరవుతో సీమవాసులు అల్లాడిపోతున్నా పట్టించుకోవడంలేదని ఆరోపించారు.. సర్కారుతీరుకు నిరసనగా ఈ నెల 24న సీమలో బంద్‌కు పిలుపునిచ్చారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

20:07 - May 22, 2017

నల్లగొండ : తెలంగాణలో అధికారంలోకి వస్తామని.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఆశాభావం వ్యక్తం చేశారు. మూడురోజుల నల్లగొండ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన చండూరు మండలం తెరట్‌పల్లి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఇంటింటికీ తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలును అడిగి తెలుసుకున్నారు. మావోయిస్టుల చేతిలో హతమైన గుండగోని మైసయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం బూత్‌స్థాయి కార్యకర్తలతో సమావేశమయ్యారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతోందన్న అమిత్‌షా.. కేంద్రం మంజూరు చేసిన పథకాలు తెలంగాణలోని గ్రామాల్లో అమలు కావడం లేదన్నారు.

 

20:06 - May 22, 2017

హైదరాబాద్ : ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ నీటిపారుదల శాఖపై సమీక్షించారు. ప్రాజెక్టు పనుల పురోగతి, భూసేకరణ అంశాలపై మంత్రులు, అధికారులతో చర్చించారు. ఎల్లంపల్లి నుంచి మల్లన్నసాగర్ వరకు ఉన్న మార్గంలో.. 81 కిలోమీటర్ల మేర సొరంగమార్గం తవ్వాల్సి ఉండగా... ఇప్పటికే 78 కిలోమీటర్లు పూర్తికావడంపై కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే స్పూర్తితో మిగతా పనులు కూడా వేగంగా పూర్తి చేసి.. రైతులకు వీలైనంత త్వరగా సాగునీరు అందించాలని కోరారు. ఎస్ఆర్ఎస్పీ సహా.. ఇతర కాల్వల మరమ్మత్తులు, నీటి ప్రవాహ సామర్థ్యం పెంపు తదితర పనులు జరగాలని సూచించారు.

 

19:37 - May 22, 2017

గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబుతో నార్మన్ పోస్టర్ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ భేటీలో రాజధాని డిజైన్లపై నార్మన్ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 900 ఎకరాల అడ్మినిస్ట్రేటివ్ సిటీపై మెరుగులు దిద్దిన ప్లాన్ ను నార్మన్ ప్రతినిధులు చంద్రబాబుకు అందించారు. అసెంబ్లీ, హైకోర్టు డిజైన్స్ పైనా సీఎంకు నార్మన్ ప్రతినిధులు సీఎంకు వివరిస్తున్నారు. అడ్మిస్ట్రేటివ్ సిటీ డిజైన్స్ కు సీఎం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. పూర్తి వివరాలకు విడియో చూడండి.

19:20 - May 22, 2017

విజయనగరం : జిల్లాలోని పార్వతీపురంలో 279 GOను రద్దు చేయాలంటూ మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. మున్సిపల్‌ కార్యాలయం ముందు బైఠాయించారు.. దాదాపు గంటన్నరసేపు ఉద్యోగులు ఆఫీస్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు.. ఉద్యోగుల ఫిర్యాదుతో అక్కడికివచ్చిన పోలీసులు... వారిని లోపలికి పంపించే ప్రయత్నంచేశారు.. దీంతో ఆగ్రహించిన కార్మికులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కార్మికులను బయటకు ఈడ్చుకుంటూ వచ్చిన పోలీసులు వారందరినీ అరెస్ట్ చేశారు.. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.

19:19 - May 22, 2017

విశాఖ : జిల్లాలోని ఏజెన్సీలో మృగాళ్లు బరితెగించారు. ఇద్దరు అడవిబిడ్డలపై లైంగికదాడికి తెగబడ్డారు. చింతపల్లి మండలం తాజంగి గ్రామానికి చెందిన ఇద్దరు యువతులు 2 రోజుల క్రితం పోతురాజు జాతరకు వెళ్లారు. తిరిగి వచ్చే క్రమంలో తాజంగి స్కూల్లో విశ్రాంతి తీసుకుంటుండగా.. ఏడుగురు యువకులు పంజా విసిరారు. పైశాచికంగా సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. గ్రామ పెద్దల తీర్మానంతో అధికారపార్టీ నేతలు బాధిత యువతులకు 50 వేలతో సెటిల్‌మెంట్‌కు యత్నించారన్న ఆరోపణలున్నాయి. ఈ ఘటనపై మీడియాలో కథనాలు రావడంతో.. బాధితులు జరిగిన దారుణంపై చింతపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం వేట ప్రారంభించారు. 

19:16 - May 22, 2017

విశాఖ : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి.. మూడురోజులనుంచి భారీస్థాయిలో పెరిగిన ఉష్ణోగ్రతలు జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి.. మరో మూడురోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని విశాఖ వాతావరణ అధికారులు చెబుతున్నారు.. తీవ్ర వడగాలులు వీస్తాయని... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

19:15 - May 22, 2017

విజయవాడ : హత్యా రాజకీయాలకు నేను.. నా కుటుంబం దూరంగా ఉంటామని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. నారాయణరెడ్డిని హత్య చేసింది ఎవరో తెలుసుకోకుండా వైసీపీ నేతలు తనపై బురద జల్లేందుకు చూడటం మంచిది కాదన్నారు. హత్యకు గురైన నారాయణ రెడి తనకు ఏ రకంగాను సమ ఉజ్జి కాదని, అనవసరంగా ఆరోపణలు చేయడం తగదని అన్నారు. ఈ విషయంలో ఏ విచారణకైనా అడ్డుపడబోనని కేఈ స్పష్టం చేశారు. 

19:12 - May 22, 2017

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు, హత్య రాజకీయాలపై గవర్నర్‌ నరసింహన్‌కు వైసీపీ అధినేత జగన్‌ ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని టీడీపీ ప్రభుత్వం ఖూనీ చేస్తుందని జగన్‌ ఆరోపించారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ఫ్యాక్షన్‌ రాజకీయాలను ప్రోత్సహించదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కర్నూలు జిల్లాలో జరిగిన ఫ్యాక్షన్‌ హత్యలను సీఎం తీవ్రంగా ఖండించారు. హత్యకు హత్య సమాధానం కాదన్న ఆయన.. కర్నూలు ఫ్యాక్షన్‌ హత్యలకు ప్రతిపక్ష నేత జగనే కారణమన్నారు.

19:10 - May 22, 2017

హైదరాబాద్ : ప్రగతినగర్‌ చెరువు సుందరీకరణ పనులను గ్రామస్తులే చేపట్టారు. గ్రామస్తులంతా ముందుకొచ్చి చెరువులోని గుర్రపుడెక్కను తొలగించారు. ఇందుకు ప్రభుత్వ నిధులపై ఆధారపడకుండా ప్రతికుటుంబానికి 500 రూపాయలు చందావేసుకుని 50లక్షలతో గుర్రపుడెక్క తొలగింపు పూర్తి చేశారు. ఈ కార్యక్రమం వెనుక గ్రామ పంచాయతీ పెద్దలు దయాకర్‌రెడ్డి, సర్పంచ్‌, ఎంపీటీసీ విశేషకృషి చేశారు. గ్రామస్తులతోకలిసి అహర్నిశలు శ్రమించి నెలరోజుల్లోపూర్తి చెరువులోని గుర్రపుడెక్క తొలగింపు పూర్తి చేశారు. గ్రామస్తులే చందాలువేసుకుని పూర్తి చేయడం అభినందనీయమని ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు గాంధీ, వివేకానంద్‌ ప్రశంసించారు. ప్రగతినగర్‌కు తన నిధుల నుంచి కోటి రూపాయలు కేటాయిస్తున్నట్టు మల్లారెడ్డి ప్రకటించారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యేలు హామీనిచ్చారు. ప్రగతి నగర్‌ గ్రామస్తుల స్ఫూర్తితో నగరంలోని ఇతర చెరువుల సుందరీకరణకు ప్రణాళికలు రూపొందిస్తామన్నారు.

19:09 - May 22, 2017

హైదరాబాద్ : ఎండల్లో విధులు నిర్వహించలేక అల్లాడిపోతున్న ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు కూల్‌ జాకెట్స్ రాబోతున్నాయి.. ముందు పైలట్‌ ప్రాజెక్టుగా రెండువందలమంది కానిస్టేబుళ్లకు ఈ జాకెట్లు ఇచ్చారు.. వీటి పనితీరుబట్టి మిగతా పోలీసులకూ జాకెట్లు అందజేయనున్నారు.. ఏషియన్‌ ఇన్ఫో టెక్నాలజీవారు ఈ జాకెట్స్‌ను స్పాన్సర్‌ చేశారు.. మరిన్ని వివరాలకు వీడియో చూడండి.

19:08 - May 22, 2017

హైదరాబాద్ : తెలంగాణ ఈ-సెట్‌ ఫలితాల్లో గందరగోళం నెలకొంది. దీంతో విద్యార్ధులు జేఎన్‌టీయూ ఎదుట ఆందోళనకు దిగారు. భారీగా వచ్చిన విద్యార్ధులు జేఎన్‌టీయూ ఆడిటోరియం ఎదుట ధర్నా నిర్వహించారు. దీనిపై మరింత సమాచారం కోసం వీడియో చూడండి. 

19:07 - May 22, 2017

ఢిల్లీ : బాలికా విద్యపై ఢిల్లీలో జరిగిన సెంట్రల్‌ అడ్వైజరీ బోర్డ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ సబ్‌ కమిటీ రెండో సమావేశం ముగిసింది. బాలికలకు నాణ్యమైన విద్య అందించాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చించినట్టు మంత్రి కడియం శ్రీహరి చెప్పారు . బాలికల భద్రత, ఆరోగ్య పరిస్థితులపై కూడా చర్చించడం జరిగిందన్నారు. బాలికా విద్యపై తీసుకుంటున్న చర్యలు గురించి తెలంగాణా, అస్సాం, ఝార్ఖండ్‌ రాష్ట్రాల కార్యదర్శులను అడిగి తెలుసుకున్నామని. ఆడపిల్లల చదవుపై దృష్టి సారించిన రాష్ట్రాలలో ఉప సంఘం పర్యటించాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పారు.

19:05 - May 22, 2017

నల్లగొండ : తెలంగాణలో అధికారంలోకి వస్తామని.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఆశాభావం వ్యక్తం చేశారు. మూడురోజుల నల్లగొండ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన చండూరు మండలం తెరట్‌పల్లి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఇంటింటికీ తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలును అడిగి తెలుసుకున్నారు. మావోయిస్టుల చేతిలో హతమైన గుండగోని మైసయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం బూత్‌స్థాయి కార్యకర్తలతో సమావేశమయ్యారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతోందన్న అమిత్‌షా.. కేంద్రం మంజూరు చేసిన పథకాలు తెలంగాణలోని గ్రామాల్లో అమలు కావడం లేదన్నారు.

 

19:04 - May 22, 2017

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా రామానూజవరంలో విషాదం చొటుచేసుకుంది. కాసేపట్లో పెళ్లి జరుగుతుందనగా పెళ్లికూతురు తల్లి సైదానీబేగం వడదెబ్బతో మృతి చెందారు.సోమవారం మధ్యాహ్నం 12.35 పెళ్లి ఉండగా పెళ్లి పనుల్లో సైదానీకి వడదెబ్బ తగలడంతో మృతి చెందడంతో పెళ్లింట విషాదం నెలకొంది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

 

16:52 - May 22, 2017

పశ్చిమగోదావరి : జిల్లా దెందులూరులో ప్రమాదవశాత్తూ చెరువులోపడి ఇద్దరు చిన్నారులు మృతిచెందారు.. మోటపర్తివారి కోనేరు చెరువు దగ్గర ఐదేళ్ల గౌతం, నాలుగేళ్ల దింపు ఆడుకునేందుకు వెళ్లారు.. కాలుజారి చెరువులోపడిపోయి చనిపోయారు.

16:51 - May 22, 2017

హైదరాబాద్ : ప్రతి 5 వేల ఎకరాలకు ఒక అగ్రికల్చర్‌ ఎక్స్‌టెన్షన్‌ అధికారి ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండి రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వాలని ఆదేశించారు. సచివాలయంలో అధికారులతో సమావేశమైన పోచారం.. విస్తరణ అధికారులకు లాప్‌టాప్‌లను అందించారు.

 

16:49 - May 22, 2017

చిత్తూరు : రాయలసీమలో తీవ్ర కరవు తాండవిస్తున్నా సర్కారు ట్టించుకోవడంలేదంటూ వామపక్షాలు ఆందోళనకు దిగాయి.. తిరుపతిలో బైక్‌ ర్యాలీ చేపట్టాయి.. సీమలో కరవుతో జనాలు అల్లాడిపోతున్నా... కనీసం తాగునీటి సౌకర్యం కల్పించలేదని మండిపడ్డాయి.. ప్రభుత్వతీరుకు నిరసనగా ఈ నెల 24న వామపక్షాల ఆధ్వర్యంలో బంద్‌ చేపడతామని...సీపీఎం ఏపీ కార్యదర్శి మధు ప్రకటించారు.

16:48 - May 22, 2017

ఢిల్లీ : ఆప్‌ బహిష్కృత నేత, ఢిల్లీ మాజీ మంత్రి కపిల్‌మిశ్రా చేస్తున్న అవినీతి ఆరోపణలపై ఎట్టకేలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పందించారు. మిశ్రా చేస్తున్న ఆరోపణలే నిజమై ఉంటే.. తాను ఈ పాటికే జైల్లో ఉండేవాడినని స్పష్టం చేశారు. కేజ్రీవాల్‌ 2కోట్లు లంచం తీసుకోవడం తాను కళ్లారా చూశానంటూ కపిల్‌ మిశ్రా ఆరోపించడంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. ఆప్‌ నేతల విదేశి ప్రయాణాల ఖర్చును బహిర్గతం చేయాలని కూడా ఆయన డిమాండ్‌ చేశారు. అప్పటి నుంచి నిరాహార దీక్ష చేపట్టిన మిశ్రా.. కేజ్రీవాల్‌పై వరుస ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. మిశ్రా చేస్తున్న ఆరోపణలు ఎవరూ నమ్మరని...ప్రతిపక్షాలు కూడా నమ్మవని అందుకే తాను ఇన్ని రోజులు స్పందించ లేదన్నారు.

16:47 - May 22, 2017

ఢిల్లీ : పరువునష్టం దావా కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ మరిన్ని కష్టాల్లో చిక్కుకున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కేజ్రీవాల్‌పై మరో 10 కోట్లకు దావా వేశారు. పరువునష్టం కేసు విచారణలో భాగంగా గురువారం....కేజ్రీవాల్ తరపు న్యాయవాది రాంజఠ్మాలానీ జైట్లీని క్రుక్‌ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను జైట్లీ సీరియస్‌గా తీసుకోవడంతో ఆయన తరపు న్యాయవాది కేజ్రీవాల్‌పై మరో పరువునష్టం దావా వేశారు. కేజ్రీవాల్‌ చెప్పడం వల్లే తాను అలా వ్యాఖ్యానించానని రాంజెఠ్మలాని చెప్పారు.

బాలికా విద్యపై ముగిసిన అడ్వయిజరీ సమావేశం..

ఢిల్లీ : బాలికా విద్య పై రెండవ అడ్వయిజరీ సమావేశం ముగిసింది. దేశంలో బాలికా విద్య పెంపు అంశాలపై పూర్తి నివేదికను డిసెంబర్ లో కేంద్రానికి అందచేస్తామని మంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. తెలంగాణ అసోం, ఝార్ఖండ్ రాష్ట్రాల కార్యదర్శులతో బాలికా విద్యకు తీసుకుంటున్న చర్యలపై చర్చించినట్లు తెలిపారు. బాలికల భద్రత, ఆరోగ్య పరిస్థితులపై తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశలో చర్చించామని చెప్పారు. బాలికా విద్యపై దృష్టి సారించిన రాష్ట్రాలలో ఉపసంఘం పర్యటించాలని నిర్ణయించామని తెలిపారు. భగవద్గీతను పాఠ్యాంశాలలో చేర్చే అంశంపై కేంద్ర నుండి ఎటువంటి సూచనలు రాలేదన్నారు.

16:42 - May 22, 2017

కోల్ కత్తా : పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. రైతులు, తదితర సమస్యలపై వామపక్ష కార్యకర్తలు బెంగాల్‌ సెక్రటేరియట్‌ను ముట్టడించే యత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. సిపిఎం కార్యకర్తలపై పోలీసులు భాష్పవాయువు ప్రయోగించి లాఠీ చార్జీ చేశారు. సిపిఎంకు చెందిన మాజీ మంత్రి కాంతి గంగూలీతో పాటు పలువురు వామపక్ష కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఐదుగురు సిపిఎం ఎమ్మెల్యేలు, మరో ఇద్దరు నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మమతబెనర్జీ సర్కార్‌కు వ్యతిరేకంగా రైతుల సమస్యలపై శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బిమల్‌బోస్‌ ఆరోపించారు. మమతాబెనర్జీ బెంగాల్‌ను పోలీస్‌ స్టేట్‌గా మారుస్తున్నారని సిపిఎం ఎంపి సలీం ధ్వజమెత్తారు. అరెస్ట్‌ చేసిన ఎమ్మెల్యేలను వెంటనే విడుదల చేయాలని సిపిఎం డిమాండ్‌ చేసింది.

ట్రిపుల్ తాలాఖ్ పై సుప్రీం కోర్టులో తలాఖ్

ఢిల్లీ : ట్రిపుల్ తాలాఖ్ పై సుప్రీం కోర్టులో ఏఐఎంపీఎల్ బి అఫిడవిట్ దాఖలు చేసింది. 13 పేజీలలో అఫిడవిట్ ను ముస్లిం లాబోర్డు దాఖలు చేసింది. ఎలాంటి కారణం లేకుండా ట్రిపుల్ తలాఖ్ ఇచ్చిన వారిని సాంఘి బహిష్కరరణ చేస్తామని ముస్లిం లాబోర్డు పేర్కొంది.

 

నల్గొండ జిల్లాలో కొనసాగుతున్న అమిత్ షా పర్యటన

నల్గొండ : జిల్లాలో అమిత్ షా పర్యటన కొనసాగుతొంది. గుండుకొని మైసయ్య విగ్రహాన్ని అమిత్ షా ఆవిష్కరించారు. తేరటుపల్లి హరిజనవాడలో దళితులతో కలిసి అమిత్ షా సహపంక్తి భోజనం చేశారు. దేశంలో బిజెపి కి ఎందురు లేదు అని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ లో బిజెపి దే అధికారం అని తెలిపారు. తెలంగాణ లో కేంద్ర పథకాలు సరిగా అమలు కావడం లేదన్నారు. బిజెపి కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి మోదీ పథకాలపై ప్రచారం చేయాలన్నారు.

ఎయిరిండియా విమానం కాక్ పీట్ లో పొగలు

హైదరాబాద్: ముంబై - భువనేశ్వర్ ఎయిరిండియా విమానం కాక్ పీట్ లో పొగలు రావడంతో ముంబై ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది.

నీటి పారుదల శాఖ పై సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్: నీటి పారుదల శాఖ పై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు పనుల పురోగతి, భూసేకరణ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

ఉగ్రవాదుల వద్ద 1.30 నగదు స్వాధీనం...

జమ్ముకశ్మీర్: నౌగాంలో ఉగ్రవాదులకు చెందిన రూ.1.30 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద భారీ మొత్తంలో ఆయుధ సామాగ్రిని సీజ్ చేశారు.

తెలంగాణ లో కొనసాగుతున్న అధిక ఉష్ణోగ్రతలు

హైదరాబాద్: తెలంగాణ లో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో 44 డిగ్రీలు, రామగుండంలో 43, నల్గొండ, వరంగల్ లలో 42, హైదరాబాద్, మహబూబ్ గనర్ లలో 41, నిజామాబాద్ 40. మెకద్ 39, రంగారెడ్డి 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

 

15:40 - May 22, 2017

రంగారెడ్డి : జిల్లాలో ఓ పెళ్లి ఇంట్లో విషాదం నెలకొంది. ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారానికి చెందిన టేకుమట్లు జంగయ్య తన కూతురి పెళ్లికి ఏర్పాట్లు చేశారు. బంధువుల రాకతో ఇళ్లంతా సందడిగా మారింది. మరికొద్ది సేపట్లో పెళ్లి అనగా జంగయ్య ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్తుండగానే చనిపోయాడు. విషయం తెలిస్తే పెళ్లి ఆగిపోతుందని భావించిన కుటుంబ సభ్యులు ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత తండ్రి మరణవార్త తెలుసుకున్న వధువు భోరునా విలపించింది. జంగయ్య మృతితో పెళ్లింట విషాదం నెలకొంది.

15:39 - May 22, 2017

పశ్చిమ గోదావరి : పోలవరం ప్రాజెక్టు గేట్ల నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు పరిశీలించారు. స్పిల్‌వే పనులను పర్యవేక్షించారు. పనులు ఏ మేరకు జరిగాయో ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ వెంకటేశ్వరరావు, ఎస్‌ఈ రమేష్‌లను అడిగి తెలుసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు, పునరావాస ప్యాకేజీ తదితర అంశాలపై జనవనరుల శాఖ,రెవిన్యూ, కాంట్రాక్టర్లతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. 

15:38 - May 22, 2017

చెన్నై : తమిళ పాలిటిక్స్‌లోకి రజనీకాంత్‌ ఎంట్రీ ఇస్తున్నారన్న ఊహాగానాలతో.. చెన్నైలో తమిళ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. రజనీ కన్నడికుడని తమిళ సంఘాలు అంటున్నాయి. తలైవాకు వ్యతిరేకంగా తమిళ సంఘాలు ఆయన ఇంటి ఎదుట నిరసన చేపట్టాయి. రజనీకి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. కబాలి రాజకీయాల్లోకి రావొద్దంటూ నినదించారు. దీంతో పోలీసులు నిరసన కారులను అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులతో ఆందోళనకారులు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తమిళ సంఘాల ఆందోళనల నేపథ్యంలో రజనీకాంత్‌ నివాసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

15:32 - May 22, 2017

కర్నూలు : జిల్లా చెరుకులపాడులో కాసేట్లో వైసీపీ నేత నారాయణరెడ్డి అంత్య క్రియలు జరగనన్నాయి. ఆయన అంతిమ యాత్రకు రాయలసీమ నుంచి కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. వైసీపీ అధ్యక్షడు వైఎస్ జగన్ చెరుకులపాడు చేరుకున్నారు. పూర్తి వివరాలు వీడియోలో చూడండి. 

15:27 - May 22, 2017

ఢిల్లీ : కోల్ స్కాంలో కేసులో నిందితులకు సీబీఐ కోర్టు శిక్షలు ఖరారు చేసింది. మాజీ బొగ్గు గనుల శాఖ కార్యదర్శి హెచ్ సీ గుప్తాతో మరో ఇద్దరికి కోర్టు రెండేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. బొగ్గు గనుల కేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడ్డారని వారి ఆరోపణలు రావడంతో విచారించిన సీబీఐ కోర్టు గుప్తాతో పాటు మరో ఇద్దరు అధికారులను దోషులుగా తెల్చింది. 

15:19 - May 22, 2017

పశ్చిమ గోదావరి : జిల్లా దెందులూరులోని గౌడ కాలనీలో విషాదం చొటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ మోటపర్తివారి కోనేరు చెరువులో ఇద్దరు చిన్నారులు ఐదేళ్ల మోర్ల గౌతమి, నాలుగేళ్ల కొండేటి దింపు మునిగి చనిపోయారు. గౌడ కాలనీలో ఇంటి ప్రక్కనే మంచినీటి చెరువు ఉండడంతో పిల్లలు అక్కడి ఆడుకోవాడానికి వెళ్లినట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులు రెండు గంటల తర్వాత పిల్లలు లేరని గుర్తించి వెతకటంతో వారు చెరువులో పడినట్లు తెలుసుకొని అధికారులకు సమాచారం అందించారు. దీంతో రెవెన్యూ అధికారులు వచ్చి పిల్లల మృతదేహలను బయటకు తీయించారు. పిల్లలు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరౌతున్నారు. 

నారాయణ రెడ్డి అంత్యక్రియలకు జగన్ హాజరు

కర్నూలు : వెల్దుర్తి మండలం చెరుకులపాడులో వైసీపీ నేత నారాయణ రెడ్డి అంత్యక్రియలు జరిగాయి. ఈ కార్యక్రమాలు వైసీపీ అధినేత జగన్ హాజరయ్యారు.

నారాయణ రెడ్డి హత్య కేసులో ఇద్దరి అరెస్ట్

కర్నూలు: వైసీపీ నేత నారాయణ రెడ్డి హత్య కేసులో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతే కాకుండా ఓ ట్రాక్టర్ ను కూడా సీజ్ చేశారు.

గనుల శాఖ మాజీ కార్యదర్శికి 2ఏళ్ల జైలు శిక్ష

ఢిల్లీ: బొగ్గు స్కాం కేసులో గనుల శాఖ మాజీ కార్యదర్శికి 2ఏళ్ల జైలు శిక్ష పడింది. అంతే కాకుండా మరో ఇద్దరు అధికారులకూ 2 ఏళ్ల జైలు శిక్ష పడింది.

కోల్ కత్తా సచివాలయం వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్: కోల్ కత్తా లో రైతు సమస్యలపై వామపక్షాలు ర్యాలీ నిర్వహించాయి. అనంతరం కోల్ కతా సచివాలయాన్ని ముట్టడించేందుకు యత్నించాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ర్యాలీని పోలీసులు అడ్డుకునేందుకు యత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కార్యకర్తలను అడ్డుకునేందుకు దాదాపు 2 వేల మంది పోలీసులు మోహరించారు. వామపక్ష, రైతు సంఘం కార్యకర్తలపై భాష్పవాయువు ను ప్రయోగించారు.

14:22 - May 22, 2017

తమిళనాడు : చెన్నైలోని రజనీకాంత్ నివాసం వద్ద ఉద్రిక్తత చొటుచేసుకుంది. తలైవాకు వ్యతిరేకంగా తమిళ సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. వారు రజనీకాంత్ రాజకీయాల్లోకి రావొద్దంటూ నినాదాలు చేస్తూ ఆయన నివాసాన్ని ముట్టడించే ప్రయత్నాం చేశారు. రజనీకాంత్ కన్నడికుడని నిరసన తెలుపుతున్నారు. తమిళనాడులోని రెండు సంఘాలు ఉదయం నుంచి ఆందోళనలు చేస్తున్నాయి. వందల మంది ఆందోళనలో పాల్గొనడంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. రజనీ ఇంటి వద్ద పోలీసులను భారీగా మోహరించారు. గతంలో రజనీకాంత్ తను 43 ఏళ్లుగా ఉంటూన్నాని చెప్పిన కూడా తమిళ సంఘాలు ప్రెస్ మీట్ పెట్టి రజనీ కన్నడ వ్యక్తి అని తెలిపారు. రజనీపై కన్నడిగా ముద్రవేసి రాజకీయాలకు రాకుండా చేస్తున్నారని ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

మంత్రి జూపల్లి, సీఎప్ ఎస్పీ సింగ్ భేటీ

హైదరాబాద్: పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ పై సచివాలయంలో మంత్రి జూపల్లి, సీఎప్ ఎస్పీ సింగ్ సమీక్షించారు. ఆసరా పింఛన్లు, ఉపాధి హామీ అమలు, మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణాలపై సమీక్షించారు.

ఇద్దరు గిరిజన యువతలపై సామూహిత అఘాయిత్యం

విశాఖ : చింతపల్లి మండలం లంబసింగి పంచాయతీ తాజంగిలో ఇద్దరు గిరిజన యువతులపై సామూహితక అత్యాచారం జరిగింది. రెండు రోజుల క్రితం పోతురాజు తీరునాళ్లకు వచ్చారు. చింతపల్లి పీఎస్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

అమిత్ షాను అడ్డుకున్న ఆప్ నేతలు.. అరెస్ట్

యాదాద్రి: చౌటుప్పల్ లో అమిత్ షాను అడ్డుకునేందుకు ఆప్ కార్యకర్తలు యత్నించారు. దీంతో అప్రమత్తమయిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

తేరట్ పల్లిలో అమిత్ షా పర్యటన

నల్గొండ: చుండూరు మండలం తేరట్ పల్లిలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు.

13:24 - May 22, 2017

హైదరాబాద్: కర్నూలు జిల్లాలో కరువు విలయతాండవం చేస్తోంది. వర్షాభావ పరిస్థితులతో పంటలు ఎండిపోయి జిల్లా రైతులు అప్పులపాలయ్యారు. తాము మన్నుతిని.. జనానికి అన్నంపెట్టేందుకు తపనపడే అన్నదాతలు కరువు రక్కసి చిక్కి విలవిల్లాడుతున్నారు.

దాదాపు 50ఏళ్లనాడు జనం ప్రాణాలు తీసిన కరువు...

దాదాపు 50ఏళ్లనాడు జనం ప్రాణాలు తీసిన కరువు పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయని కర్నూలుజిల్లా ప్రజలు అంటున్నారు. చివరికి తాగునీరు కూడా లేక కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒటి రెండు బోర్ల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు.

అకరొరగా టొమాటో పంటను సాగు ...

అక్కడక్కడా అకరొరగా టొమాటో పంటను సాగు చేసిన అన్నదాతలు.. పైరును కాపాడుకోడానికి ట్యాంకర్లు, ఆటోల ద్వారా నీటిని తీసుకొచ్చి మొక్కల దాహాన్ని తీరుస్తున్నారు. పంటను కాపాడుకోడానికి పొద్దున్నే లేచింది మొదలు బిందెలు, చెంబులు తీసుకుని పొలంబాట పడుతున్నారు. ఇంత కష్టపడినా పంటను కాపాడుకోలేక ఇలా పశువులకు మేతగా వదిలేస్తున్నారు. ప్రతి ఏడాది వర్షాలు ముఖం చాటేస్తుండటంతో.. దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. ఇక్కడే ఉండి తమవారిని పోషించుకోలేక కర్నూజిల్లా రైతులు విలవిల్లాడుతున్నారు. కుటుంబపోషణకోసం పలు గ్రామాల్లో ఇలా ఇళ్లకు తాళ్లాలు వేసి వలసలు పోతున్నారు.

కనీసం పశువులను కూడా కాపాడుకోలేక ...

పంటల సంగతి పక్కనపెడితే కనీసం పశువులను కూడా కాపాడుకోలేక పోతున్నామని కర్నూజిల్లా అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. వ్యవసాయంలో ఆసరాగా నిలిచే కాడెద్దులు, పాడిపపశువులను కరువు కాటేసిందని కన్నీరు పెట్టుకుంటున్నారు. పశువులను పోషించలేక కబేళాలకు అమ్ముకుంటున్నామని ఆవేదన చెందుతున్నారు.

వర్షాభావ రిస్థితులతో జిల్లాలో ...

వర్షాభావ రిస్థితులతో జిల్లాలో బోర్లు, బావులో ఎపుడో ఎండిపోయాయి. జలశయాలన్నీ నీరులేక వెలవెలబోతున్నాయి. ఖరీఫ్‌కోసం భూమిని సిద్ధం చేసిన రైతులు ఖాళీ ప్రాజెక్టులను చూసి భారంగా నిట్టూరుస్తున్నారు. ఈసారి పంటలు సాగయ్యే పరిస్థితులు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్లే కర్నూలజిల్లా అన్నదాలు పంటభూములకు, పాడిపశువులకు దూరం అయ్యారని వామపక్షనేతలు అంటున్నారు. జిల్లాలో నెలకొన్న తాగు, సాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించడంతోపాటు పెండింగ్‌ ప్రాజెక్ట్‌ లను పూర్తిచేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

చంద్రబాబు లేస్తే అమరావతి జపం చేస్తూ..

ముఖ్యమంత్రి చంద్రబాబు లేస్తే అమరావతి జపం చేస్తూ.. రాయలసీమను పట్టించుకోవడం లేదని రైతులు మండిపడుతున్నారు. కరువు పరిస్థితుల్లో ప్రభుత్వం పట్టనట్టే వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు. ఈనెల 24న రాయలసీమ బంద్‌తో ప్రభుత్వంపై నిరసన తెలపాలని రైతుసంఘాలు పిలుపునిచ్చాయి.  

13:22 - May 22, 2017

జీలకర్ర..వంటల్లో వాడుతుంటారు..పోపు పెట్టే సమయంలో ఆవాలతో పాటు జీలకర్రను ఉపయోగిస్తుంటారు. రుచిని..వాసన అందించే ఈ జీలకర్ర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జీలకర్రతో తయారు చేసిన నీటిని ఉదయాన్నే సేవించడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. పరగడుపున తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. పాత్రలో గ్లాస్ నీటిని తీసుకుని వేడి చేయాలి. అందులో జీలకర్ర వేసి మరికొంత సేపు మరిగించాలి. అనంతరం ఈ నీటిని వడగట్టి గోరు వెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఉదయాన్నే పరగడుపున తాగేయాలి. ఇలా చేయడం వల్ల జీర్ణ సంబంధిత వ్యాధులు నయం అవుతాయి. జీర్ణక్రియ ప్రక్రియ మెరుగవుతుంది. కడుపులో ఉన్న పరుగులు చనిపోతాయి. డయాబెటిక్ పేషెంట్లకు జీలకర్ర నీరు మంచి ఔషధం. రోజు తాగితే రక్తంలోని షుగర్ స్థాయిలు తగ్గుతాయి. ఆకలి సరిగ్గా లేని వారు ఈ నీటిని తాగే ఫలితం ఉంటుంది.

13:21 - May 22, 2017

హైదరాబాద్: కర్నాటక బీజేపీ చీఫ్‌ యడ్యూరప్పకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. తుముకూరు జిల్లాలో ఓ ఇంట్లో దళితుడి ఇంట్లో భోజనానికి వచ్చిన యడ్యూరప్ప.. హోటల్‌ నుంచి తెప్పించుకున్న ఇడ్లీలు తిన్నారని వెలుగుచూసింది. ఇప్పుడు ఆ విజువల్స్‌ బయటకు రావడంతో యడ్యూరప్పపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ సీఎం అయిన యడ్యూరప్ప ఇంకా అంటరానితనాన్ని పాటిస్తున్నారని.. ఆయనపై కేసు నమోదు చేయాలని పలువురు పోలీసులను ఆశ్రయించారు.

దళితులను ఆకట్టుకునేందుకు ...

దళితులను ఆకట్టుకునేందుకు ఇటీవల యడ్యూరప్ప, బీజేపీ సీనియర్‌ నాయకుడైన కేఎస్‌ ఈశ్వరప్ప తదితరులు దళితుల ఇంట్లో అల్పాహారం తీసుకున్నారు. అయితే, ఈ సందర్భంగా యడ్యూరప్ప తిన్న ఇడ్లీలలను సమీపంలోని ఓ రెస్టారెంట్‌ నుంచి తెప్పించుకున్నవని తర్వాత తేలడం వివాదం రేపింది. ఈ వివాదంలో యడ్యూరప్పను బీజేపీ నేతలు వెనకేసుకొస్తున్నారు. దళితుల అభివృద్ధి కోసం బీజేపీ ఎంతగానో పాటుపడుతున్నదని, ఈ విషయంలో తమ చిత్తశుద్ధిని శంకించవద్దని ఆ పార్టీ నేతలు అంటున్నారు. బీజేపీ కర్ణాటక మీడియా ఇన్‌చార్జి దగ్గే శివప్రకాశ్‌ మాట్లాడుతూ అవి హోటల్‌ నుంచి తెప్పించిన ఇడ్లీలేనని అంగీకరించారు. అయితే, యెడ్డీకి ఇడ్లీ, వడ అంటే ఇష్టమని, అందుకే వాటిని తిన్నారని, అంతేకాకుండా దళితుల ఇంట్లో వండిన పులావు కూడా ఆయన రుచి చూశారని ఆయన చెప్పారు. అయితే, దళితుల ఇంట్లో యెడ్డీ భోజనం చేయడం ఒక రాజకీయ జిమ్మిక్కని, దళితుల ఓట్ల కోసం ఇలాంటి జిమ్మిక్కులు చేయకూడదని కాంగ్రెస్‌ నేతలు విమర్శిస్తున్నారు.

13:18 - May 22, 2017

చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని రోజుల్లో రాజకీయ రంగ ప్రవేశంపై ఊహాగానాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో రజనీకాంత్ స్థానికత అంశాన్ని ఆందోళనకారులు లేవనెత్తారు. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా రజనీకాంత్ ఇంటి ముందు భారీగా పోలీసులను మోహరించారు. కాగా, రజనీకాంత్ స్థానికతపై ఇప్పటికే పలు విమర్శలు వచ్చాయి. ఇదిలా ఉండగా రజనీ కాంత్, ప్రధాని నరేంద్ర మోదీని త్వరలో కలవనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

13:17 - May 22, 2017

ఉదయం బ్రేక్ ఫాస్ట్ కంపల్సరీగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. కొంతమంది టిఫిన్ అంటే ఉప్మా..పూరీ..దోస..ఇడ్లీ..ఇలాంటి తింటుంటారు. మరికొంతమంది టిపిన్ తినరు. కానీ చద్దన్నం తినే వారు తక్కువయ్యారు. ఒకప్పుడు చద్దన్నం ఎంతో ఇష్టంగా తినేవారు. రాత్రి మిగిలిన అన్నం దాచుకుని పొద్దున తినేదే 'చద్దన్నం'. పోషక విలువలు కూడా ఎక్కువగానే ఉంటాయి. రాత్రి వండిన అన్నాన్ని తెల్లారి ఆవకాయ..పెరుగు కలుపుకుని పచ్చిమిరప..ఉల్లిగడ్డ నంజుకుని ఒకప్పుడు తినేవారు. రోజంతా ఉత్తేజంగా..శక్తివంతంగా ఉండేవారని పెద్దలు చెబుతుంటారు. ఐరన్, పోటాషియం, క్యాల్షియం, విటమిన్లు దాదాపు 20 రెట్లు ఎక్కువగా ఉంటాయి. పెరుగు..ఉల్లిపాయ..పచ్చిమిరప కాయలతో చద్దన్నం తింటే వేడితత్వం తగ్గి శరీరానికి చలువ చేస్తుంది. శరీరానికి కావాల్సిన శక్తి ఇస్తుంది. కడుపులో ఉండే అనారోగ్య సమస్యలు తగ్గిస్తాయి. హై పటర్ టెన్షన్ ను గణనీయంగా తగ్గిస్తుంది. చద్దన్నం తింటే మంచిదే కదా అని తెల్లారిన తర్వాత కూడా ఎక్కువ సమయం అలా ఉంచేస్తే పాచిపోయి వాసన వస్తుంది. అలాంటి అన్నం తినడంవల్ల ఆరోగ్యానికి కొత్త సమస్యలు వస్తాయి, అందువల్ల చద్దన్నాన్ని ఉదయాన్నే తినేయాలి.

13:02 - May 22, 2017

బాలీవుడ్ బాద్ షా 'షారూఖ్ ఖాన్' నివాసానికి హీరోయిన్ 'అలియా భట్' వెళ్లి క్షమాపణలు చెప్పిందని సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. దీనితో షారూఖ్ కోపం పోయి అలియా నిజాయితీకి..ఆమె వివరణ ఇచ్చుకున్న తీరుకు బాద్ షా ఇంప్రెస్ అయ్యారని టాక్. షారూఖ్ ఖాన్ హీరోగా ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో ఓ మూవీ తెరకెకిక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో షారూఖ్ సరసన హీరోయిన్ ఎవరినీ ఎంపిక చేయాలని చిత్ర యూనిట్ ఆలోచించింది. దీపికా పదుకొనే కు తొలి ఛాన్స్ ఇచ్చారని ప్రచారం జరిగింది. అనంతరం కత్రినా కైఫ్ ను సంప్రదించారని పుకార్లు షికారు చేశాయి. చివరకు 'అలియా భట్'ను చిత్ర యూనిట్ సంప్రదించిందంట. కానీ మూవీలో నటించేందుకు 'అలియా' నో చెప్పిందని తెలుస్తోంది. దీనిపై బాద్ షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని గుస గుసలు వినిపించాయి. స్టార్ డైరెక్టర్ కరణ్ జోహార్ సలహా మేరకు నేరుగా 'షారూఖ్' ఇంటికి అలియా వెళ్లిందని తెలుస్తోంది. నో చెప్పడానికి గల కారణాలు తెలియచేసినట్లు బాలీవుడ్ టాక్. రణ్ వీర్ సింగ్ తో 'గల్లీ బాయ్', రణ్ బీర్ కపూర్ తో 'డ్రాగన్' మూవీలకు తాను ఇచ్చిన కాల్షీట్లను షారూఖ్ చేతిలో పెట్టిందని..అందుకే నో చెప్పినట్లు..తనకు ఛాన్స్ ఇవ్వాలని భావిస్తే డేట్స్ అడ్టస్ట్ చేసుకోవాలని..ఇందుకు సారీ చెబుతున్నట్లు అలియా పేర్కొన్నట్లు సమాచారం. దీనికి షారూఖ్ సంతృప్తి చెందినట్లు తెలుస్తోంది.

12:49 - May 22, 2017

హైదరాబాద్: మార్కెట్ లో ఎన్నో రకాల జ్యువలరీలు ఆకట్టుకుంటున్నా స్వయంగా తయారు చేసుకున్న వాటిని ధరిస్తే మరింత హ్యాపీగా ఉంటుంది కదా. ఆపాలిమర్ క్లేతో పెండెంట్ తయారీ... చేసే విధానాన్ని 'సొగసు'లో చూద్దా పూర్తి వివరాలకు ఈ వీడియోను క్లిక్ చేయండి..

12:47 - May 22, 2017

బాలీవుడ్ లో ప్రత్యేకమైన గుర్తింపు పొందిన నటీమణుల్లో 'కంగనా రనౌత్' ఒకరు. పలు వివాదాస్పద అంశాల్లో చిక్కుకున్నారు. ఈమె చేసే వ్యాఖ్యలన్నీ కుండబద్ధలు కొట్టే విధంగా ఉంటాయి. నటిగా కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మకు దర్శకత్వం చేయాలని ఆలోచన వచ్చిందంట. ఈ నేపథ్యంలో 'తేజు' అనే చిత్రానికి కంగనా దర్శకత్వం వహించబోతోంది. ఈ చిత్ర టైటిల్ పాత్రలో ‘కంగనా’ నటించనుంది. మహిళా సాధికారిత కోసం పోరాడే పాత్రలో ఆమె కనిపించబోతోంది. 80 ఏళ్ల వృద్ధురాలి పాత్రలో మెప్పించబోతుంది. ఓ గ్లామర్‌ హీరోయిన్‌ గా ముద్ర పడిన కంగా ఇలాంటి పాత్ర ఎలా చేస్తుందా ? అనే చర్చ జరుగుతోంది. క్రిష్ దర్శకత్వంలో 'మణికర్ణిక' సినిమా చేయడానికి కంగనా రెడీ అవుతోంది. 'ఝాన్సీ లక్ష్మీ బాయి' జీవితచరిత్రగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. శరీరానికి ముసలితనం వచ్చినా .. ఆ పాత్ర మనసు మాత్రం పడుచుగానే ఉంటుందని ఆమె చెప్పుకొచ్చింది. ఇక దర్శకురాలిగా కంగనా చేసే ప్రయోగం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

12:38 - May 22, 2017

హైదరాబాద్: భారతీయులు భోజన ప్రియులు. భారతీయ వంటకాలు మంచి పేరు ప్రఖ్యాతలు పొందాయి. దేశంలోని వంటకాలకు ఒక్కో ప్రాంతానికి ఒక్కో రుచి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాగే తను చేసే వంటలకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకుంది వందేళ్ల పై బడిన బామ్మ. తన వంటలతో నెట్టింట్లో ఘుమఘుమలాడించేస్తున్న గూగుల్ బామ్మ కథనంతో మీ ముందుకు వచ్చింది ఈ నాటి మానవి. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

యూపీలో పెట్రోల్ బంక్ ల్లో చిప్ ల వినియోగం..

ఉత్తర్ ప్రదేశ్ : రాష్ట్రంలో పెట్రోల్ బంక్ ల్లో చిప్ ల స్కాం బయటపడడం కలకలం రేగుతోంది. యూపీ ఎస్టీఎఫ్ అధికారులు పుణె, థానే ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. ఇద్దరిని అరెస్టు చేయగా, చిప్ కు సంబంధించిన సామాగ్రీని స్వాధీనం చేసుకున్నారు.

కల్తీ మద్యం సేవించి నలుగురు మృతి..?

మధ్యప్రదేశ్ : గోస్ పూర్ లో కల్తీ మద్యం సేవించి నలుగురు మృత్యువాత పడినట్లు వార్తలు వెలువడ్డాయి. నలుగురికి తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

12:34 - May 22, 2017

హైదరాబాద్: ఎంసెట్ 2017 ఫలితాలు విడుద‌ల‌య్యాయి. ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి విడుదల చేశారు. ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం ఈ నెల 12న ప్రవేశ పరీక్ష నిర్వహించారు. 2,20,251 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా ఇంజినీరింగ్ విభాగంలో 1,39,100 మంది విద్యార్థులు, వ్యవసాయ, ఫార్మసీ విభాగంలో 73,501 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఇంజినీరింగ్ విభాగంలో 74.75 శాతం ఉత్తీర్ణత నమోదైంది. జయంత్ (156 మార్కులు), సెకండ్ ర్యాంకు రాంగోపాల్ (156 మార్కులు), థర్డ్ ర్యాంకు - సాయి యశస్వి భరద్వాజ్ (155 మార్కులు), ఫోర్త్ ర్యాంకు దొట్టి ప్రసాద్ (155 మార్కులు), ఐదో ర్యాంకు (155 మార్కులు) సాధించారు. కాసేపటి క్రితం ఉన్నత విద్యామండలి ఛైర్మన్ తెలంగాణ ఎంసెట్ ఫలితాలను విడుదల చేశారు.ఎంసెట్- 2017 పరీక్షా ఫలితాలను ntnews లో చూడవచ్చు.

ఢిల్లీలో బెట్టింగ్ ముఠా అరెస్టు..

ఢిల్లీ : రోహిణి ఏరియాలో ఐపీఎల్ 10 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా బెట్టింగ్ నిర్వహించిన 9 మంది బుకీలను పోలీసులు అరెస్టు చేశారు. 10 మొబైల్ ఫోన్లను రికవరీ చేసుకున్నారు.

12:29 - May 22, 2017

కర్నూలు : వైసీపీ నేత నారాయణరెడ్డి హత్యకు నిరసనగా కర్నూలు జిల్లాలో బంద్‌ కొనసాగుతోంది. మరోవైపు నారాయణరెడ్డి మృతదేహానికి అంత్యక్రియలు పూర్తయ్యాయి. మధ్యాహ్నం నారాయణరెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి వైఎస్‌ జగన్‌ హాజరుకానున్నారు. ఇక బంద్‌ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

ఇంజినీరింగ్ లో ర్యాంకుల వివరాలు..

హైదరాబాద్ : ఇంజినీరింగ్ విభాగంలో 74.75 శాతం ఉత్తీర్ణత నమోదైంది. జయంత్ (156 మార్కులు), సెకండ్ ర్యాంకు రాంగోపాల్ (156 మార్కులు), థర్డ్ ర్యాంకు - సాయి యశస్వి భరద్వాజ్ (155 మార్కులు), ఫోర్త్ ర్యాంకు దొట్టి ప్రసాద్ (155 మార్కులు), ఐదో ర్యాంకు (155 మార్కులు) సాధించారు. కాసేపటి క్రితం ఉన్నత విద్యామండలి ఛైర్మన్ తెలంగాణ ఎంసెట్ ఫలితాలను విడుదల చేశారు.

 

800 కేజీల గంజాయి స్వాధీనం..

విశాఖపట్టణం : చోడవరంలో రెండు ఆటోల్లో తరలిస్తున్న రూ. కోటిన్నర విలువైన 800 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఒకరిని అరెస్టు చేయగా ఇద్దరు పరారయ్యారు.

రజనీ నివాసం వద్ద ఉద్రిక్తత..

చెన్నై : సినీ నటుడు రజనీకాంత్ నివాసం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రజనీకాంత్ రాజకీయ ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ తమిళ సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. దీనితో పోలీసులు రజనీ నివాసం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.

ట్రిపుల్ తలాక్ త్వరలో చట్టం: వెంకయ్యనాయుడు

హైదరాబాద్: ముస్లిం మహిళలకు ప్రాణాంతకంగా అవతరించిన ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే చట్టాన్ని తీసుకురానుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. అయితే ముస్లింలు దీనిపై సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తేనే అమలు చేస్తామని చెప్పారు. 

11:32 - May 22, 2017
11:28 - May 22, 2017

హైదరాబాద్: ప్రకాశం జిల్లా ఫ్యాక్షన్‌ గొడవలు చంద్రబాబుకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. హత్యా రాజకీయాలు సహించబోననే అధినేతకు... పార్టీలోని నేతల తీరు ఆగ్రహం తెప్పిస్తోంది. మరోవైపు తాజా ఘటనకు గొట్టిపాటిని టీడీపీలో చేర్చుకోవడమే కారణమని కరణం ఆరోపించడం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే.. ఈ ఘటనపై చంద్రబాబు ఎలా వ్యవహరిస్తారు ? పార్టీ సీనియర్లు ఏమంటున్నారు ?

ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ వర్గ విభేదాలతో...

ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్సీ కరణం బలరాం, ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ వర్గ విభేదాలతో చంద్రబాబుకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ఎన్నో ఏళ్లుగా ఈ రెండు వర్గాల మధ్య దాడులు జరుగుతున్నా.. తాజాగా గొట్టిపాటి రవికుమార్‌ టీడీపీలో చేరడంతో అవి తీవ్రస్థాయికి చేరాయి. నివురుగప్పిన నిప్పులా ఉన్న కక్షలు.. ప్రస్తుతం బయటపడ్డాయి. దీంతో కరణం వర్గానికి చెందిన వారిపై ప్రత్యర్థులు కత్తులతో దాడి చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.

టీడీపీ ఆవిర్భావ సమయంలో ...

కరణం వర్సెస్‌ గొట్టిపాటి వర్గాల మధ్య వార్‌ కొన్ని దశాబ్ధాలుగా కొనసాగుతోంది. టీడీపీ ఆవిర్భావ సమయంలో కరణం బలరాం, గొట్టిపాటి హనుమంతరావు అదేపార్టీలో చేరారు. ఆ తర్వాత ఇరువర్గాల మధ్య వైరుద్యాలతో గొట్టిపాటి కాంగ్రెస్‌ గూటికి చేరారు. అయితే అనంతరం కరణం కూడా కాంగ్రెస్‌లో చేరారు. దీంతో గొట్టిపాటి హనుమంతరావు కాంగ్రెస్‌ను వీడి.. టీడీపీలో చేరడమే కాకుండా.. చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేశారు. ఆయన మరణానంతరం గొట్టిపాటి నర్సయ్య ఆయన వారసత్వాన్ని స్వీకరించి.. మార్టూరు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అప్పటి పరిస్థితుల నేపథ్యంలో కరణం కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరి.. నర్సయ్య గెలుపునకు సహకరించారు. అయితే వీరి సయోధ్యను అంగీకరించిన గొట్టిపాటి వర్గీయులు రవికుమార్‌ను తెరపైకి తెచ్చారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుండి రవిని గెలిపించారు. అనంతరం 2009లో మార్టూరు నియోజకవర్గం రద్దు కావడంతో.. అద్దంకి నియోజకవర్గం నుండి పోటీ చేసి కరణం బలరాంను ఓడించి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

2014 ఎన్నికలకు ముందు ఇరువర్గాల మధ్య మళ్లీ దాడులు ...

ఇదిలావుంటే.. 2014 ఎన్నికలకు ముందు ఇరువర్గాల మధ్య మళ్లీ దాడులు మొదలయ్యాయి. అయితే.. కరణం బలరాం కుమారుడు వెంకటేష్‌పై రవికుమార్‌ విజయం సాధించారు. దీంతో అప్పటినుంచి పరిస్థితి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా మారింది. అయితే ఇలాంటి తరుణంలోనే గొట్టిపాటి రవికుమార్‌ వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. ఈ చేరికను బలరాం తీవ్రంగా వ్యతిరేకించారు. ఫ్యాక్షన్‌ పరిస్థితుల నేపథ్యంలో నేతలు ఒప్పుకున్నా.. క్యాడర్‌ అంగీకరించదని చంద్రబాబుకు తెలిపారు. కానీ.. ఇరువర్గాలు కలిసి పని చేయాల్సిందేనని చంద్రబాబు స్పష్టం చేశారు. దీంతో ఇష్టం లేకపోయినా.. కరణం అంగీకరించారు. ఇక ఇరు వర్గాల మధ్య సయోధ్య కోసం చంద్రబాబు కృషి చేశారు. కరణం బలరాంకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి.. అద్దంకి నియోజకవర్గ బాధ్యతలు గొట్టిపాటికి అప్పగించారు. అయినప్పటికీ అక్కడక్కడ చిన్న చిన్న విభేదాలు చెలరేగుతూనే ఉండేవి. కానీ తాజాగా జరిగిన హత్యలతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

వైసీపీ నుంచి టీడీపీలో చేరినవారే కార్యకర్తలను చంపారని..

ఇదిలావుంటే... వైసీపీ నుంచి టీడీపీలో చేరినవారే కార్యకర్తలను చంపారని కరణం బలరాం ఆరోపించడం ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేయకుండా చంద్రబాబు గొట్టిపాటిని పార్టీలో చేర్చుకున్నారని కరణం ఆరోపించారు. దీంతో చంద్రబాబు ఇరకాటంలో పడ్డారు. మరోవైపు ఫ్యాక్షన్‌ హత్యలపై ప్రతిపక్షాలు సైతం విమర్శలు గుప్పిస్తున్నాయి. అలాగే పార్టీ సీనియర్‌ నేతలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా నాయకులు వ్యవహరించాలంటున్నారు. పరిస్థితి చేయదాటకముందే వీలైనంత త్వరగా అధినేత ఈ వ్యవహారాన్ని చక్కదిద్దాలంటున్నారు. మరి ఈ ఫ్యాక్షనిజాన్ని రూపుమాపేందుకు చంద్రబాబు ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తారో..? వేచి చూడాలి. 

లాభాల్లో స్టాక్ మార్కెట్లు..

ముంబై : స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 227 పాయింట్లకు పైగా లాభంలో..నిప్టీ 9500 మార్క్ కు సమీపంలో ట్రేడవుతున్నాయి.

11:25 - May 22, 2017

హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని జగన్‌ ఆరోపించారు. గవర్నర్‌ నరసింహన్‌తో వైఎస్‌ జగన్‌ భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు, హత్య రాజకీయాలపై గవర్నర్‌కు జగన్‌ ఫిర్యాదు చేశారు. కర్నూలులోని పరిస్థితులపై గవర్నర్‌కు వివరించినట్లు జగన్‌ తెలిపారు. తమ ప్రలోభాలకు లొంగకపోతే మనుషులను చంపే వరకు వెళ్తున్నారు. ప్రభుత్వ తీరును గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. నారాయణ రెడ్డి వచ్చే ఎన్నికల్లో గెలుస్తారనే హత్య చేశారని, రాజకీయ ప్రత్యర్థులు లేకుండా చేసుకుంటున్నారని మండిపడ్డారు. టిడిపి నేతలపై వున్న కేసులను మాఫీ చేసేందుకు 132 జీవోలు జారీ చేశారని జగన్ విమర్శించారు. తనకు ప్రాణ హాని ఉందని చెప్పినా నారాయణ రెడ్డికి భద్రత కల్పించలేదన్నారు. టిడిపి మండల స్థాయి నేతలకు ఇద్దరు, ముగ్గురు గన్ మెన్లతో భధ్రత కల్పిస్తున్నారని ఆరోపించారు. స్విస్ ఛాలెంజ్ పేరు తో మోసం, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా మట్టిమాఫియా చేసినా కేసులేదన్నారు. తన షూటింగ్ కోసం పుష్కరాల్లో 29 మందిని చంద్రబాబు చంపేశాడు. చిత్తూరులో లేబర్ ను 24 మందిని చంపేశాడు. ఇలాంటి సీఎం పరిపాలించడం దారుణం అన్నారు. కరెప్షన్ నుండి సంపాదించిన డబ్బుతో తెలంగాణ లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అడ్డంగా దొరికినా కేసులు పెట్టలేదని మండిపడ్డారు. ఇలాంటి అంశాలపై గవర్నర్ జోక్యం చేసుకుంటారేమోనన్న ఆశతో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. కట్జూ కూడాఏపీ సీఎంను భర్తరఫ్ చేయాలని పేర్కొన్నారని తెలిపారు. చంద్రబాబు లాంటి వ్యక్తులను జైలు పంపాలని డిమాండ్ చేశారు.

తివారీ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలి - కుటుంబీకులు..

ఉత్తర్ ప్రదేశ్ : ఐఏఎస్ ఆఫీసర్ అనురాగ్ తివారీ మృతిపై సీబీఐ ఎంక్వయిరీ చేయించాలని మృతుడి కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు. సోమవారం సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలిసేందుకు కుటుంబీకులు వచ్చారు. సీబీఐచే విచారణ చేయించాలని తల్లి, సోదరుడు డిమాండ్ చేస్తున్నారు.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు - జగన్..

హైదరాబాద్ : ఏపీ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, మాఫియా రాజ్యం నడుస్తోందని వైసీపీ అధ్యక్షుడు జగన్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను జగన్ కలిశారు. కర్నూలు జిల్లా వైసీపీ నేత నారాయణ రెడ్డి హత్యపై గవర్నర్ కు జగన్ ఫిర్యాదు చేశారు. భేటీ అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. ఇసుక మాఫియా..లిక్కర్..కాంట్రాక్టర్ల మాఫియా రాజ్యం నడుస్తోందని విమర్శించారు. ఇటీవలే సీఎం చంద్రబాబు నాయుడిపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కట్జూ పలు వ్యాఖ్యలు చేశారని జగన్ తెలిపారు.

బాబు జైలుకు వెళ్లాల్సిన వ్యక్తి - జగన్..

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లాల్సిన వ్యక్తి అని వైసీపీ అధ్యక్షుడు జగన్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను జగన్ కలిశారు. కర్నూలు జిల్లా వైసీపీ నేత నారాయణ రెడ్డి హత్యపై గవర్నర్ కు జగన్ ఫిర్యాదు చేశారు. భేటీ అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. ప్రలోభాలకు లొంగకపోతే చంపేస్తున్నారని, 132 జీవోలు ప్రవేశ పెట్టి కేసులు ఉపసంహరించుకుంటున్నారని తెలిపారు. ఇటీవలే జరిగిన కృష్ణా పుష్కరాల్లో ఎంతో మంది చనిపోయినా కేసులు పెట్టలేదన్నారు.

ప్రత్యర్థులు లేకుండా చేస్తున్నారు - జగన్..

హైదరాబాద్ : నారాయణరెడ్డి వచ్చే ఎన్నికల్లో గెలుస్తాడనే హత్య చేశారని, రాజకీయ ప్రత్యర్థులు లేకుండా చేస్తున్నారని వైసీపీ అధ్యక్షుడు జగన్ తెలిపారు. సోమవారం ఉదయం ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను జగన్ కలిశారు. కర్నూలు జిల్లా వైసీపీ నేత నారాయణ రెడ్డి హత్యపై గవర్నర్ కు జగన్ ఫిర్యాదు చేశారు. భేటీ అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. తనకు ప్రాణహాని ఉందని చెప్పినా నారాయణరెడ్డికి భద్రత కల్పించలేదని, టిడిపి మండల స్థాయి నేతలకు ఇద్దరు - ముగ్గురు గన్ మెన్లతో భద్రత కల్పిస్తున్నారని తెలిపారు.

ప్రభుత్వ తీరును గవర్నర్ దృష్టికి - జగన్..

హైదరాబాద్ : కర్నూలు జిల్లా వైసీపీ నేత నారాయణ రెడ్డి హత్యపై గవర్నర్ కు జగన్ ఫిర్యాదు చేశారు. కర్నూలు లో జరిగిన పరిణామాలను గవర్నర్ కు వివరించడం జరిగిందని జగన్ తెలిపారు. ప్రలోభాలకు లొంగకపోతే మనుషులను చంపే వరకు వెళుతున్న ప్రభుత్వ తీరును గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

కాంగ్రెస్ కార్యకర్తలపై మైనంపల్లి అనుచరుల దాడి...

హైదరాబాద్ :నగరంలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలపై టిఆర్ ఎస్ నేత ఎమ్మెల్సీ మైనంపల్లి హనుమంతరావు అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఓ విషయమై పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ లో కాంగ్రెస్ కార్యకర్తలు, ఎమ్మెల్సీ అనుచరులు గొడవ పడ్డారు. ఈ క్రమంలో వారి మధ్య మాటామాటా పెరగడంతో హనుమంతరావు అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త డోల రమేష్ సహా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

గులాబీ కండువా కప్పుకోనున్న రమేష్ రాథోడ్?!

హైదరాబాద్: తెలంగాణ లో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన టీడీపీ నేత రాథోడ్ రమేష్ గులాబీ కండువా కప్పుకోనున్నట్టు సమాచారం. ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ద్వారా సీఎం కేసీఆర్ ను కలిశారని తెలుస్తోంది. ఈ నెల 29న రాథోడ్ రమేష్ తన కుమారుడు రితీష్, తన వర్గీయులతో కలిసి టీఆర్ఎస్ లో చేరతారని ప్రచారం జరుగుతోంది. 

సహపంక్తి భోజనంలో యడ్యూరప్ప హోటల్ భోజనం..!

కర్నాటక : రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప వివాదంలో చిక్కుకున్నారు. దళితులతో జరిగిన సహపంక్తి భోజనంలో హోటల్ నుండి ఫుడ్ తెప్పించుకుని యడ్యూరప్ప తిన్నారనే వార్తలు ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

10:39 - May 22, 2017

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ 'అల్లు అర్జున్' తన చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ‘సరైనోడు' చిత్ర విజయం అనంతరం 'డీజే..దువ్వాడ జగన్నాథమ్' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో 'బన్నీ' సరసన 'పూజా హెగ్డే' హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన లుక్స్..టీజర్ ఇటీవలే విడుదలయ్యాయి. సినిమాలో బన్నీ రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నట్లు టాక్. బ్రాహ్మణుడి వేషం..మాస్ పాత్రలో మరొక పాత్రలో అల్లు అర్జున్ మెప్పించనున్నాడని తెలుస్తోంది. ఇదిలా ఉంటే సినిమాకు సంబంధించిన పాటలను యూ ట్యూబ్ ద్వారా రిలీజ్ చేయనున్నారు. సోమవారం సాయంత్రం 6గంటలకు 'డీజే శరణం భజే భజే'...పాటను రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. జూన్ 23న సినిమా రిలీజ్ కానుంది.

హత్య కేసులో మంత్రి కేఈ తనయుడిపై కేసు నమోదు

కర్నూలు : వైఎస్సార్సీపీ నేత నారాయణరెడ్డి, ఆయన అనుచరుడు సాంబశివుడు హత్య కేసుకు సంబంధించి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తనయుడు శ్యామ్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. శ్యామ్ బాబు సహా 13 మందిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. కాగా, ఈ కేసులో ప్రధాన నిందితుడు శ్యామ్ బాబు అని, అయినప్పటికీ అతన్ని ఎ-14గా చేరుస్తూ కేసు నమోదు చేశారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ కేసు నుంచి శ్యామ్ బాబును తప్పించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు.

నీరు - ప్రగతిపై బాబు టెలీకాన్ఫరెన్స్...

విజయవాడ : నీరు - ప్రగతిపై సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. నీరు అందుబాటులో ఉంటే 15 శాతం వృద్ధి రేటు సాధించవచ్చని, ఈ కార్యక్రమంలో ఇంజినీరింగ్ విద్యార్థులు పాల్గొనడం సంతోషమని, పిడుగు పడే సమాచారం ముందస్తుగా ఇస్తే చాలదని ప్రాణనష్టం నివారించాలని సూచించారు. విపత్తు నిర్వహణ, వాతావరణ శాఖలు, కాల్ సెంటర్ సేవలు వినియోగించుకోవాలన్నారు. చెరువు కట్టల పనులు పూర్తి చేయాలని, మహిళా సంఘాల ద్వారా 50వేల ఎకరాల్లో పశుగ్రాసం సాగు చేయాలన్నారు.

 

పెళ్లి బృందం బస్సు బోల్తా..

మహారాష్ట్ర : ఔరంగాబాద్ లో పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు మృత్యువాత పడగా మరో 12 మందికి గాయాలయ్యాయి.

గవర్నర్ ను కలిసిన జగన్..

హైదరాబాద్ : వైసీపీ అధ్యక్షుడు జగన్ రాజ్ భవన్ కు చేరుకున్నారు. కాసేపటి క్రితం తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తో ఆయన భేటీ అయ్యారు. కర్నూలు జిల్లా వైసీపీ నేత నారాయణరెడ్డి దారుణ హత్యపై గవర్నర్ కు జగన్ ఫిర్యాదు చేశారు.

10:21 - May 22, 2017

హైదరాబాద్: కర్నూలు జిల్లా వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. ఆదివారంనాడు వైసీపీ నేత నారాయణ రెడ్డి హత్యకు గురయ్యారు. ఆయన అంత్యక్రియలు నేడు జరగనున్న నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ హాజరు కానున్నారు. అంతే కాకుండా నేడు జిల్లా వ్యాప్తంగా వైసీపీ బంద్ కు పిలుపునిచ్చింది. దీంతో అల్లర్లు జరిగే అవకాశం ఉందన్న సమాచారంతో కర్నూలు జిల్లా వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు.

10:20 - May 22, 2017

అరటి పండు..పండ్లలో సంవత్సరం పాటు దొరికే పండు. దీనిని తీసుకోవడం వల్ల ఎన్నో పోషకాలు లభిస్తాయి. టిఫిన్ లో ఏదో ఒక ఆహారంతో పాటు అరటిపండును తీసుకొంటే బెటర్ అని పలువురు ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చక్కెర స్థాయిలు తక్కువగా ఉండే ఈ అరిటపండు ముక్కలను ఉదయం మార్నింగ్ డైట్ లో తీసుకుంటే చాలా మంచిది. తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. అంతేగాకుండా మంచి యాంటీ ఆక్సిడెంట్. పోటాషియం..విటమిన్ బి ఉంటాయి. కొలెస్ట్రాల్ ఉండదు. కాబట్టి పండును ప్రతిరోజు డైట్ ను తీసుకుంటే బాగుంటుందని పేర్కొంటున్నారు. అరటి పండ్లను ఎప్పటికప్పుడు తాజాగా కట్ చేసుకుని తినాలి. లేదా కట్ చేసుకున్న వెంటనే ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే అరటి ముక్కలను బ్యాగ్ లో పెట్టి ఫ్రిజర్ లో పెడితే పోషకాలు కోల్పోకుండా ఉంటాయి.

10:17 - May 22, 2017

హైదరాబాద్: ఇరు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తో వైసీపీ అధినేత జగన్, వైసీపీ నేతలు రాజ్ భవన్ లో భేటీ అయ్యారు. ఈ భేటీ లో టిడిపి హత్యా రాజకీయాలపై జగన్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆదివారం కర్నూలు జిల్లా పత్తిపాడు నియోకవర్గం ఇన్ ఛార్జి నారాయణ రెడ్డిని ప్రత్యర్థులు నరికి చంపిన విషయం తెలిసిందే. ఈ అంశంపై గవర్నర్ కు జగన్ వివరించినట్లు సమాచారం.

10:13 - May 22, 2017

ఎండకాలం ఎండలతో పాటు ధరలు కూడా మండిపోతున్నాయి. మాంసాహారులకు చికెన్ చుక్కలు చూపెడుతోంది. ఎండదెబ్బకు కోడి ధర అమాంతం పెరిగిపోయింది. పెరిగిపోయిన ధర చూసి చికెన్ అభిమానులు బెంబేలెత్తిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపాన్ని చూపెడుతున్నాడు. ఏకంగా 45-50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనితో కేజీ చికెన్ ధర రూ. 234 నుండి రూ. 240 ఎకబాకడం గమనార్హం. వారం వ్యధిలో రూ. 70 రూపాయలు పెరిగింది. ఒక్కసారిగా రేటు పెరగడంతో చికెన్ వ్యాపారం తగ్గుముఖం పట్టింది. రానున్న రోజుల్లో మరింత ధరలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. నగరంలో స్నేహ..వెన్ కాబ్..సుగుణ తదితర బ్రాండ్ల పేరిట..హోల్ సెల్..రిటైల్ చికెన్ వ్యాపారాలు సాగుతున్నాయి. ఒక్కో చికెన్ సెంటర్ లో వంద కిలోల నుండి వెయ్యి కిలోల వ్యాపారం సాగేంది. కానీ చికెన్ ధరలు పెరగడంతో అమ్మకాలు అమాంతం పడిపోయాయి. పెండ్లిడ్ల సీజన్ కావడంతో ఆర్డర్లు కూడా రావడం లేదని పలువురు చికెన్ దుకాణ యజమానులు వాపోతున్నారు. దీనికంతటికీ కారణం కోళ్లు మృత్యువాత పడడమే. 40-45 డిగ్రీల ఉష్ణోగ్రతలకు తట్టుకోలేక రక్తవిరేచనాలతో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఫలితంగా చికెన్‌ ధరలపై ప్రభావం పడింది.

రాజ్ భవన్ కు జగన్..

హైదరాబాద్ : వైసీపీ అధ్యక్షుడు జగన్ రాజ్ భవన్ కు చేరుకున్నారు. కాసేపట్లో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తో భేటీ కానున్నారు. టిడిపి హత్యా రాజకీయాలపై ఫిర్యాదు చేయనున్నారు.

09:26 - May 22, 2017

నల్గొండ : తెలంగాణ రాష్ట్రంపై కమల నాథులు ఫోకస్ పెట్టారు. పార్టీ బలోపేతంపై కీలక నేతలు చర్చిస్తున్నారు. అందులో భాగంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు షా పర్యటన కొనసాగనుంది. అమిత్ షా పర్యటనతో పార్టీ బలోపేతం అవుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న అనంతరం షా నేరుగా నల్గొండ జిల్లాకు వెళ్లనున్నారు. మునుగోడు, నాగార్జున సాగర్, నకిరేకల్ నియోజకవర్గాల్లో పర్యటించిన అనంతరం భువనగిరికి వెళ్లనున్నారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశం..పార్టీ మేధావులతో షా చర్చించనున్నారు. తేరేడు పల్లికి చేరుకున్న అనంతరం దళితులతో సహపంక్తి భోజనం చేయనున్నారు. ఇతర పార్టీల నేతలను వలలో వేసుకోవాలని కాషాయ నేతలు భావిస్తున్నారు. మరి వారి ప్లాన్స్ వర్కవుట్ అవుతాయా ? లేదా ? అనేది చూడాలి.

09:23 - May 22, 2017

సౌందర్యాన్ని ఇనుమడింప చేసుకోవాలని పలువురు మహిళలు బ్యూటీషియన్లను ఆశ్రయిస్తుంటారు. పలు మాస్క్ లు వేసుకుని అందాన్ని ద్విగుణీకృతం చేసుకొనేందుకు ప్రయత్నిస్తుంటారు. పండ్లు..కూరగాయాలతో మాస్క్ లు తయారు చేస్తుండడం తెలిసిందే. పచ్చి కొబ్బరితో కూడా మాస్క్ లు తయారు చేస్తుంటారు. ఈ మాస్క్ ను వేసుకోవడం ద్వారా చర్మం మృదువుగా..తాజాగా కనిపిస్తుంది.
ఎండకాలంలో వేడిమి నుండి తప్పించుకోవడానికి కొబ్బరి మాస్క్ ఎంతగానో ఉపయోగ పడుతుంది. పచ్చి కొబ్బరిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ముఖానికి పది నిమిషాలు పట్టించిన అనంతరం కడుక్కోవాలి.
ఒక కప్పు కొబ్బరి నీళ్లలో ఒక చెంచా కొబ్బరి పాలు, దోసకాయ జ్యూస్, రెండు లేదా మూడు చుక్కల కలబంద రసంతో ప్యాక్ తయారు చేసుకోవాలి. ఈ ప్యాక్ ను ముఖానికి కాటన్ క్లాత్ తో ముఖానికి పెట్టుకోవాలి. పది నిమిషాల అనంతరం చల్లటి నీటితో కడుక్కోవాలి.
టమాట గుజ్జులో రెండు చెంచాల కొబ్బరి పాలు..సగం కప్పు కొబ్బరి నూనెను వేసి బాగా కలుపుకోవాలి. ముఖానికి..మెడకు పది నిమిషాలు పట్టించిన అనంతరం చల్లటి నీటితో కడిగితే సరిపోతుంది. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ఫలితం కనబడుతుంది. ట్రై చేసి చూడండి.

09:12 - May 22, 2017

కర్నూలు : పత్తికొండ వైసీపీ ఇన్ ఛార్జీ నారాయణరెడ్డి హత్యకు గురికావడంపై వైసీపీ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ హత్య పక్కా పథకంతో జరిగిందని, ప్రభుత్వ కుట్ర ఉందని వైసీపీ ఆరోపిస్తోంది. నారాయణరెడ్డి..సాంబశివుడులను ప్రత్యర్థులు దారుణంగా హత మార్చిన సంగతి తెలిసిందే. ఈ హత్యలను నిరసిస్తూ సోమవారం కర్నూలు జిల్లా బంద్ కు వైసీపీ పిలుపునిచ్చింది. బస్ డిపోల ఎదుట వైసీపీ నేతలు..కార్యకర్తలు ఆందోళనకు దిగుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఉండేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో పికెటింగ్ లు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే వైసీపీ అధ్యక్షుడు జగన్ గవర్నర్ ను కలిసి హత్యా రాజకీయాలపై ఫిర్యాదు చేయనున్నారు. అనంతరం కర్నూలుకు జగన్ పయనం కానున్నారు. నారాయణరెడ్డి అంత్యక్రియల్లో జగన్ పాల్గొననున్నారు. నిందితులు ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తామని పోలీసులు పేర్కొంటున్నారు. ఇప్పటికే కృష్ణగిరి పీఎస్ లో నారాయణరెడ్డి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. 15 మందిపై వారు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

కాసేపట్లో నారాయణరెడ్డి మృతదేహానికి పోస్టుమార్టం..

కర్నూలు : పత్తికొండ వైసీపీ ఇన్ చార్జి నారాయణరెడ్డి మృతదేహానికి కాసేపట్లో పోస్టుమార్టం జరగనుంది. ఆయన హత్యకు నిరసనగా వైసీపీ కర్నూలు జిల్లా బంద్ కు పిలుపునిచ్చింది.

09:08 - May 22, 2017

హైదరాబాద్ : ఏపీ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న హత్యలపై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వ మద్దతుతోనే ఈ హత్యలు జరుగుతున్నట్లు ఆరోపిస్తోంది. ఆళ్లగడ్డలో ఇద్దరు ఫ్యాక్షనిస్టులు హతమైన సంగతి తెలిసిందే. తాజాగా పత్తికొండ వైసీపీ ఇన్ ఛార్జీ నారాయణ రెడ్డి హత్యకు గురి కావడం సంచలనం రేకేత్తించింది. ఈ నేపథ్యంలో ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను వైసీపీ అధ్యక్షుడు జగన్ కలువనున్నారు. ఉదయం 10గంటలకు ఈ భేటీ జరగబోతోంది. టిడిపి హత్యా రాజకీయాలపై గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు. అనంతరం కర్నూలు జిల్లాకు బయలుదేరనున్నారు. మధ్యాహ్నం జరిగే నారాయణరెడ్డి అంత్యక్రియల్లో జగన్ పాల్గొననున్నారు. జగన్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా హాజరు కానున్నారు.

కొనసాగుతున్న కర్నూలు బంద్..

కర్నూలు : పత్తికొండ వైసీపీ ఇన్ చార్జి నారాయణరెడ్డి హత్యకు గురైన నేపథ్యంలో కర్నూలు జిల్లా బంద్ కు ఆ పార్టీ పిలుపు నిచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని బస్ డిపోల ఎదుట వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

కేఈ తనయుడిపై కేసు నమోదు..

కర్నూలు : డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తనయుడు శ్యామ్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ నేత నారాయణరెడ్డి, ఆయన అనుచరుడు సాంబశివుడు హత్య కేసుకు సంబంధించి శ్యామ్ బాబు తో సహా 13 మందిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు.

08:57 - May 22, 2017

మార్కెట్ లో పలు కంపెనీలు...వ్యాపార వేత్తలు..దుకాణ దారులు తమ వ్యాపారాన్ని విస్తరించడం కోసం..వినియోగదారులను ఆకట్టుకోవడం కోసం పలు ఆఫర్స్ ప్రకటిస్తుండడం తెలిసిందే. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ..అని..ఏదైనా వస్తువు కొంటే బహుమతులు ఇస్తామని ప్రకటనలు వెలువడుతుంటాయి. తాజాగా ఓ పానీపురీ విక్రయించే యువకుడు వినూత్న ఆఫర్స్ ప్రకటించడం అందర్నీ ఆకట్టుకొంటోంది. గుజరాత్ లోని పోరుబందర్ లో రవి జగదాంబ అనే యువకుడు పానీ పురీ వ్యాపారం నిర్వహిస్తుంటాడు. తన వ్యాపారం మరింతగా రాణించాలంటే ఆఫర్స్ ప్రకటించాలని నిర్ణయించుకున్నాడు. ‘జియో' పేరిట ఆఫర్స్ ప్రకటించాడు. రూ. 100 చెల్లిస్తే ఎన్ని అయినా పానీ పురీలు తినొచ్చని పేర్కొన్నాడు. అంతే కాకుండా నెల ప్లాన్ కూడా అందుబాటులోకి తెచ్చాడు. రూ. 1000 చెల్లిస్తే 30 రోజులు పానీ పురీని ఉచితంగా తినొచ్చనే ఆఫర్ ప్రకటించాడు. తనకు సాధారణంగా వచ్చే గిరాకీ కంటే 'జియో' ఆఫర్ పెట్టాక వచ్చే గిరాకీ అధికమైందని రవి జగదాంబ సంతోషంగా తెలుపుతున్నాడు.

08:45 - May 22, 2017

అధిక బరువుతో చాలా మంది బాధ పడుతుంటారు. బరువు తగ్గడం కోసం వ్యాయామాలు..హెల్త్ ఇనిస్టిట్యూట్స్ దగ్గరకు పరుగెడుతుంటారు. కానీ తినే ఆహారంలో మార్పులు చేసుకోరు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడమే కాకుండా కొన్ని రకాల పండ్లు తింటే బరువు అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

క్యారెట్ : బీటా కెరోటిన్స్..ఫైబర్ లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరంలోకి ఫ్రీ రాడికల్స్ ను విడుదల చేస్తాయి.
పాలకూర : ఇందులో న్యూట్రిన్లు సమృద్ధిగా లభిస్తాయనే సంగతి తెలిసిందే. విటమిన్స్..ఐరన్ లు పుష్కలంగా లభిస్తుండడంతో శరీరంలోని మలినాలను తొలగిస్తుంది.
ఆపిల్ : ఈ పండును రోజు తీసుకుంటే వైద్యుడి దగ్గరకు వెళ్లాల్సినవసరం ఉండదు. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి.
స్టాబెర్రీ : ఎక్కువ శాతం న్యూట్రీన్లు ఉంటాయి. మంచి యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. శరీరంలోని మలినాలను తొలగిస్తుంది.
క్యాప్సికం : విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. శరీర బరువును అదుపులో ఉంచుతుంది. ఇది వ్యాధి నిరోధకతను పెంచడంతో పాటు శరీర బరువును అదుపులో ఉంచుతుంది.

ఢిల్లీకి డిప్యూటి సీఎం కడియం..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర డిప్యూటి సీఎం కడియం శ్రీహరి హస్తినకు బయలుదేరి వెళ్లారు. ఆయన అధ్యక్షతనలో ఏర్పాటైన బేటీ బచావో ఉప కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు.

గుజరాత్ లో మోడీ పర్యటన..

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోమ..మంగళవారాల్లో గుజరాత్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. రెండు బహిరంగ సభల్లో మోడీ ప్రసంగించనున్నారు. కచ్, గాంధీ నగర్ లో జరిగే కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.

08:33 - May 22, 2017

విజయ్ 61వ సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఈ చిత్రంలో ఏకంగా విజయ్ మూడు పాత్రలను పోషిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మూడు పాత్రలకు ముగ్గురు హీరోయిన్లను ఎంపిక చేసింది. కాజల్..నిత్యా మీనన్ లను ఎంపిక చేసిన చిత్ర యూనిట్ తాజాగా 'సమంత'ను కూడా ఎంపిక చేసింది. గ్రామ పెద్దగా..వైద్యుడిగా..ఇంద్రజాలకుడిగా..విజయ్ కనిపించబోతున్నారు. విజయ్ తో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉందని, కథ..కథనం..తనకెంతో నచ్చాయన్నారు. తన పాత్ర చాలా ఫ్రెష్ గా సమ్ థింగ్ స్పెషల్ గా ఉంటుందని సమంత పేర్కొన్నారు. రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉంటుందని, చిత్రంలో మూడు భిన్న గెటప్స్‌తో విజయ్ ప్రేక్షకులను అలరిస్తారని తెలిపింది. ఎస్‌.జె.సూర్య ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి ఏ.ఆర్‌.రెహ్మాన్‌ సంగీతం అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి దీపావళి కానుకగా ఈచిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

08:32 - May 22, 2017

జన్మదినాలు..పండుగలు..ఇతరత్రా వేళల్లో టాలీవుడ్..బాలీవుడ్ హీరో..హీరోయిన్లు నటించే చిత్రాలకు సంబంధించిన లుక్స్..టీజర్స్..రిలీజ్ చేస్తుండడం తెలిసిందే. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన 'మంచు మనోజ్' జన్మదినం సందర్భంగా ఆయన నటిస్తున్న 'ఒక్కడు మిగిలాడు' చిత్రానికి సంబంధించిన ఓ లుక్ ను విడుదల చేశారు. ఆండ్రూస్‌ నూతక్కి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మనోజ్ సరసన అనీషా ఆంబ్రోస్‌, మిలింద్‌ గునాజీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మనోజ్‌ ప్రభాకరన్‌గా నటిస్తున్న ఓ లుక్‌ ఇప్పటికే విడుదలై విశేష ఆదరణ పొందిందని నిర్మాతలు పేర్కొన్నారు. తాజాగా మనోజ్‌ విద్యార్థిగా నటిస్తున్న మరో పాత్రకు సంబంధించిన లుక్‌ను ఆయన పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్‌ చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. మిలిటెంట్‌ లీడర్‌ కోసం మంచు మనోజ్ భారీగా బరువు పెరిగి, స్టూడెంట్‌ లుక్‌ కోసం బరువు తగ్గారన్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ చివరి దశకు చేరుకుందని, జూన్‌ మొదటి వారంలో ఆడియోను, నెలాఖరుకు సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. మంచు మనోజ్‌... ఎల్‌.టి.టి.ఈ మిలిటెంట్‌ అధినేత ప్రభాకరన్‌గా, బాధ్యతగల యువ విద్యార్థిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు.

08:31 - May 22, 2017

ఎన్టీఆర్..కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన 'జనతా గ్యారేజ్' చిత్రం ఎంతటి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతోంది. ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన విషయాన్ని అనౌన్స్ చేశారు. యువసుధ ఆర్ట్స్ పతాకంపై నిర్మించనున్న చిత్రానికి సుధాకర్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. స్నేహితుడు కొరటాల దర్శకత్వంలో తన తొలిచిత్రాన్ని నిర్మించడం..అందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించడం చాలా ఆనందంగా ఉందని నిర్మాత సుధాకర్ తెలిపారు. ‘జనతా గ్యారేజ్' చిత్రాన్ని మించేలా..ఎన్టీఆర్ కెరీర్ లో ఓ మైలురాయిలా నిలిచిపోయేలా చిత్రాన్ని తెరకెక్కిస్తామన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియచేస్తామని నిర్మాత సుధాకర్ పేర్కొన్నారు.

08:30 - May 22, 2017

తెలుగు రాష్ట్రాల్లో రైతులు దీనావస్థలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇబ్బందులు తాళలేక పలువురు రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. వీరికి తోడుగా ఉండేందుకు కొంతమంది నటులు పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా మంచు మనోజ్ కూడా రైతులకు అండగా నిలవాలని అనుకున్నారు. పుట్టిన రోజు సందర్భంగా మనోజ్ నిర్ణయం తీసుకున్నారు. రైతుల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నామని, ఇందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామన్నారు. పుట్టిన రోజంటే ఒక ప్రత్యేకమైన డే కాబట్టి ఏదైనా మంచి సేవా కార్యక్రమాలు చేయాలని తన అభిమానులకు పిలుపునివ్వడం జరిగిందన్నారు. వారికి ఏ విధంగా అండగా ఉండబోతున్నామనే పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని, తన పుట్టిన రోజుకు అభినందనలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు వెల్లడించారు. అభిమానుల ప్రేమ ఎప్పటికీ ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాను అని మంచు మనోజ్ పేర్కొన్నారు.

08:29 - May 22, 2017

కేన్స్ లో తారలు మెరిసిపోతున్నారు. ప్రధానంగా బాలీవుడ్ తారలు కేన్స్ తళుక్కుమంటున్నారు. ఇప్పటికే పలువురు బాలీవుడ్ హీరోయిన్స్ అక్కడకు వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా అందాల తార ఐశ్వర్య రాయ్ రెడ్‌ కార్పెట్‌పై వాక్‌ చేస్తూ అందర్నీ మెస్మరైజ్‌ చేసింది. కలర్‌ఫుల్‌ రెడ్‌ గౌన్‌ (రాల్ఫ్‌ అండ్‌ రుస్సో గౌన్‌) ధరించి హోయలు ఒలికించింది. '120 బీట్స్‌ పర్‌ మినిట్‌' చిత్ర ప్రీమియర్‌లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఐష్‌ రెడ్‌కార్పెట్‌ వాక్‌ చేశారు. కేన్స్ లో ఆమె 16వ సారి పాల్గొంటుండడం విశేషం. రెండు రోజులపాటు పాల్గొనే ఈ వేడుకలో ఐష్‌ మొదటి రోజు శుక్రవారం ఫ్లోర్‌ స్వీపింగ్‌ పౌడర్‌ బ్లూ బాల్‌రూమ్‌ గౌన్‌ ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, రెండవ రోజు శనివారం రెడ్‌ గౌన్ తో అలరించింది. ఆమెతోపాటు ఇతర హాలీవుడ్‌ నటీనటులు ఈ వేడుకల్లో పాల్గొని ఆకట్టుకోగా, పలువురు నటీమణులు ఎర్రతివాచీపై హోయలు పోతూ అలరించారు. ఫొటోకాల్‌, స్క్రీనింగ్‌, ప్రీమియర్‌లో భాగంగా నాల్గవ రోజు '120 బీట్స్‌ పర్‌ మినిట్‌', 'ది స్క్వెర్‌' చిత్రాలతోపాటు 'విండ్‌ రివర్‌', 'ది లాస్‌ హిజస్‌ డి అబ్రిల్‌', 'లే వెనరబుల్‌ డబ్ల్యూ', 'వాకింగ్‌ పాస్ట్‌ ది ఫ్యూచర్‌' చిత్రాలను ప్రదర్శించారు. ఇదిలా ఉంటే, రాబోయే రెండు రోజులు కేన్స్‌ రెడ్‌కార్పెట్‌పై సోనమ్‌ కపూర్‌ సందడి చేయనుంది.

08:08 - May 22, 2017

నెల్లూరు : అతివేగం..నిర్లక్ష్యంగా నడపడం..తదితర కారణాలతో తెలుగు రాష్ట్రాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా ఓ ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో పది మందికి గాయాలయ్యాయి. తిరుపతి నుండి కావలికి ఓ ఆర్టీసీ బస్సు వెళుతోంది. నాయుడుపేట వద్ద ఎదురుగా వెళుతున్న ఓ వాహనాన్ని ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఓవర్ టేక్ చేయబోయాడు. ఎదురుగా ప్రైవేటు ట్రావెల్స్ కు చెందిన బస్సు రావడంతో ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడు. దీనితో బస్సులో ఉన్న 20 మందిలో పది మందికి గాయాలయ్యాయి. వీరిని నాయుడుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. అతివేగంగా నడపడమే కాకుండా డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపాడని ప్రయాణీకులు పేర్కొంటున్నారు.

07:57 - May 22, 2017

పత్తికొండ వైసీపీ ఇంఛార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కర్నూల్‌ జిల్లాలో సంచలనం రేపింది. నారాయణరెడ్డి హత్య ఘటనలో దుండగులు పక్కాపథకం ప్రకారం వ్యవహరించినట్లు తెలుస్తోంది. మరో వైపు తెలంగాణలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ లో భయం నెలకొందని చర్చ జరుగుతోంది. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో దుర్గా ప్రసాద్ (టిడిపి), అద్దెపల్లి శ్రీధర్ (బీజేపీ), సీ.హెచ్.బాబురావు (సీపీఎం), తాడూరి శ్రీనివాస్ (టీఆర్ఎస్), కరణం ధర్మశ్రీ (వైసీపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు..

నెల్లూరు : నాయుడు పేటలో లారీని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో పది మందికి గాయాలు కాగా వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. తిరుపతి నుండి కాళహస్తికి ఆర్టీసీ బస్సు వెళుతోంది.

రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ...

సిరిసిల్ల : వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. దీనితో ఆలయ అధికారులు ఆర్జిత సేవలను రద్దు చేశారు.

 

నలుగురు ఉగ్రవాదుల హతం..

జమ్మూ కాశ్మీర్ : భారత్ లోకి చొరబడేందుకు యత్నించిన నలుగురు ఉగ్రవాదులను భారత జవాన్లు మట్టుబెట్టారు. ఉత్తర కాశ్మీర్ ప్రాంతంలోని నౌగమ్ సెక్టార్ పరిధిలో ఉగ్రవాదులు, జవాన్లకు మధ్య కాల్పులు జరిగాయి. ముగ్గురు భారత జవాన్లు వీర మరణం పొందారు.

06:52 - May 22, 2017

ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ వర్కర్లు, ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. 279, 159, 160 జీవోలను రద్దు చేయాలన్నది మున్సిపల్ వర్కర్ల, ఉద్యోగుల ప్రధాన డిమాండ్. సిఐటియు, ఏఐటియుసి, ఐఎన్ టియుసితో పాటు మరికొన్ని సంఘాలు ఇవాళ్టి సమ్మెలో పాల్గొంటున్నాయి. మున్సిపల్ కార్మికుల సమ్మెపై మాట్లాడేందుకు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు డేవిడ్ విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

06:48 - May 22, 2017

ముంబై : దాదాపు 85వారాలు.. చిన్న చెత్త ముక్క లేకుండా ఊడ్చేశారు.. చెత్తకుండీగా ఉన్న బీచ్‌ను ఎంతో సుందరంగా మార్చేశారు. ఓ న్యాయవాది చొరవ.. వాలంటీర్ల ఏడాదిన్నర శ్రమతో ముంబయిలోని వెర్సోవా బీచ్‌ రూపురేఖలే మారిపోయాయి.. ఒకప్పుడు దుర్వాసనతో అక్కడికి వెళ్లాలంటేనే భయపడేలా ఉన్న బీచ్‌.. ఇప్పుడు అందరికీ ఎంతో ఆహ్లాదం పంచుతోంది. వాయువ్య ముంబయిలోని వెర్సోవా బీచ్‌ ఎక్కడచూసినా మురికితో నిండివుంటుంది. ఈ ప్రాంతాన్ని బీచ్‌ అనడం కన్నా చెత్త కుండీ అనేవాళ్లే ఎక్కువ. స్థానికులంతా తమ నివాసాల్లోని చెత్తను ఇక్కడ తెచ్చి వేసేవారు. ఇలా కొన్నేళ్లుగా చెత్త వేయడంతో ఈ ప్రాంతమంతా దుర్వాసనతో నిండిపోయింది.

షాపై ప్రశంసలు..
తన చిన్నతనంలో సుందరంగా ఉన్న బీచ్‌ ఇలా మురికిమయం కావడాన్ని తట్టుకోలేకపోయాడు స్థానిక న్యాయవాది అఫ్రోజ్‌ షా. కొందరు యువకులతో కలిసి బీచ్‌ను శుభ్రంచేసే పనికి ముందుకు కదిలాడు.. వీరికి నగరపాలక కార్పొరేషన్‌ చేయూత ఇచ్చింది.. అలా వేలాదిమంది యువతీ, యువకులు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు ఏడాదిన్నర పాటు కష్టపడి దాదాపు 50వేల టన్నుల ప్లాస్టిక్‌ చెత్తను అక్కడ నుంచి తొలగించారు. చెత్త మొత్తం తొలగింపు ఆదివారంతో ముగిసింది. ఈ క్లీనింగ్‌తో బీచ్‌ సుందరంగా మారింది.. సాయంత్రం పిల్లలు పెద్దలంతాకలిసి ఆహ్లాదంగా సాగరతీరంలో ఆడుకుంటున్నారు. బీచ్‌ శుభ్రతకోసం కృషిచేసిన షాకు ఐక్యరాజ్యసమితి ప్రత్యేకమైన పురస్కారాన్ని అందజేయనుంది. ఎవరో వస్తారని ఎదురు చూడకుండా షా బీచ్‌ శుభ్రతకోసం ముందుకు కదిలిన షాపై ప్రశంసలు జల్లు కురుస్తోంది.. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి..

06:43 - May 22, 2017

క‌డ‌ప‌ : జిల్లా కరువుకోరల్లో చిక్కుకుంది. కనీసం తాగునీరు లేక పల్లె ప్రజలు విలవిల్లాడతున్నారు. బావులు, బోర్లు వట్టిపోవడంతో జిల్లావ్యాప్తంగా పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. మరోవైపు మేత లేక పశుసంపద కబేళాలకు తరలుతోంది. జిల్లా వ్యాప్తంగా పలుగ్రామాలు తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. మంచినీటి కోసం జనం వీధి పోరాటాలకు దిగుతున్నారు. దాదాపుగా 9నెలలుగా వర్షాల జాడే లేకుండా పోవడంతో జిల్లా దాహంతో అల్లాడి పోతోంది. బావులు, బోర్లలో నీరు అడుగంటిపోవడంతో తాగునీటికోసం గ్రామీణులు అవస్థలు అన్నీ ఇన్నీ కావు. మరోవైపు తీవ్రమైన వ‌ర్షాభావ పరిస్థితులతో సేద్యం జూదంలా త‌యారయ్యిందని కడప జిల్లా రైతులు వాపోతున్నారు. జిల్లాలో ప్రధాన పంటలైన వ‌రి, చీనీ, మామిడి తోటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. రాయ‌చోటి, పులివెందుల‌, క‌మలాపురం, ల‌క్కిరెడ్డిప‌ల్లె, జ‌మ్మల‌మ‌డుగు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో తీవ్రమైన క‌రువు పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు 1300 అడుగుల లోతు బోర్లు వేసినా చుక్కనీరు రాని పరిస్థితి ఈ ప్రాంతాల్లో నెలకొంది. మరోవైపు జిల్లాలోని తూర్పు ప్రాంతాలైన రాజంపేట‌, రైల్వే కోడూరుల్లో గతంలో 100 నుంచి 200 అడుగుల లోతులోనే నీళ్లు ప‌డేవి. దాదాపు 9నెలలుగా వానచినుకే లేకుండా పోవడంతో ఈ ప్రాంతాల ప‌రిస్థితి కూడ దుర్భరంగా మారింది. రాష్ట్ర విభజన చట్టంలో రాయలసీమకు ఇచ్చిన హామీని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వామపక్షాలు విమర్శిస్తున్నాయి.

వలసలు..
నీటితో క‌ళ‌క‌ళ‌లాడే వ‌రిమ‌ళ్లు బీట‌లు వారిన దృశ్యం జిల్లాలో వ‌ర్షాభావ‌స్థితిని ప్రతిబింబిస్తున్నాయి. చీనీతోట‌ల‌కైతే.. ట్యాంక‌ర్‌తో నీటి స‌ర‌ఫ‌రా చేస్తూ రైతులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కో ట్యాంక‌రు ధ‌ర 1000 లు ప‌లుకుతోంది. మరోవైపు జిల్లాలో పశుసంపదకు కటకట పరిస్థితులు దాపురించాయి. పశుగ్రాసం కొరతతో జిల్లాలో వ్యవవసాయ, పాడిపశువులు కబేళాలకు తరలుతున్నాయని జిల్లా రైతులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాకు ప్రధాన నీటి పారుద‌ల సౌకర్యాన్ని అందించే కేసీ కెనాల్ ఆయ‌క‌ట్టు ప్రాంతం త‌ప్ప... మిగతా ప్రాంతం మొత్తం తీవ్రమైన క‌రువును ఎదుర్కొంటోంది. జిల్లాకు స‌రైన నీటి పారుద‌ల వ్యవ‌స్థ లేక‌పోవ‌డం.. నీటి కేటాయింపుల్లో ఈ ప్రాంతానికి జ‌రిగిన అన్యాయం కార‌ణంగా రైతులు నిరంత‌రం కరువుబారిన పడుతున్నారు. ఈ ఏడాది కేసీ కెనాల్ కు కూడ పూర్తి స్థాయిలో నీరు అంద‌క రైతులు తీవ్రంగా ఇబ్బంది ప‌డుతున్నారు. పులివెందుల బ్రాంచ్ కెనాల్ ఉన్నప్పటికీ.. అడ‌పాద‌డ‌పా నీటి స‌ర‌ఫ‌రానే ఉంటోంది. వ్యవ‌సాయం భార‌మైన రైతులు.. వ‌ల‌స‌బాట ప‌డుతున్నారు. ప్రధానంగా జిల్లా నుంచి గ‌ల్ప్ దేశాల‌కు పొట్టకూటి కోసం జ‌నం తరలివెళుతున్నారు.

24న బంద్..
రైతు సంక్షేమం గురించి గొప్పగా ప్రక‌టించుకుంటున్న పాల‌కుల మాటలు ఆచ‌ర‌ణ‌లో ఒట్టిపోతున్నాయి. క‌రువు నుంచి విముక్తి చేయ‌డానికి శాశ్వత నీటి పారుద‌ల వ్యవ‌స్థ ఏర్పాటు చేయ‌కుండా.. తాత్కాలికంగా ప‌శుగ్రాసం, గంజి కేంద్రాలు లాంటి స‌హాయ‌క చ‌ర్యల‌తో సరిపెడుతున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క‌రువు స‌హాయ‌క చ‌ర్యలు చేప‌ట్టడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫ‌ల‌మైంద‌ని వామ‌ప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి. రాయ‌ల‌సీమ‌లో క‌రువు పరిస్థితులపై ప్రభుత్వం కళ్లుతెరిపంచాడినికే ఈనెల 24న సీమ జిల్లాల బంద్‌కు పిలుపునిచ్చామని వామపక్షాలు అంటున్నాయి. అన్ని వ‌ర్గాల ప్రజ‌లు బంద్ లో పాల్గొని పాల‌కుల క‌ళ్లు తెరిపించాల‌ని రైతుసంఘాల నేత‌లు కోరుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కరువుకోరల్లో చిక్కుకున్న తమను ఆదుకోవాలని కడప జిల్లా రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

06:39 - May 22, 2017

నల్లగొండ : జిల్లాపై కమలనాధులు ఫోకస్‌ పెట్టారు. పార్టీని బలోపేతం చేసేదిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మూడు రోజుల పాటు నల్లగొండలో మకాం వేయనున్నారు. దళితులతో సహపంక్తి బోజనాలతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొని.. నియోజవర్గంలో బూత్ స్థాయి పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. నల్లగొండ, మునుగోడు, నాగార్జునసాగర్, నకిరేకల్ నియోజకవర్గాలతో పాటు భువనగిరి లో అమిత్ షా పర్యటనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణలో కొత్త ఎత్తుగడతో పాగా వేసేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. పవర్‌ పాలిటిక్స్‌కు వ్యూహాలు రచిస్తోంది. ఇతర పార్టీల్లో ప్రజాదరణ, ఆర్థిక పరిపుష్టి ఉన్న నేతల్ని ఆకర్షించేందుకు పావులు కదుపుతోంది. అమిత్‌ షా ఈ నెల 22, 23, 24 తేదీల్లో జిల్లాలో మకాం వేయనున్నారు. బలమైన పునాది కల్గిన కాంగ్రెస్‌ పార్టీపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి బ్రదర్స్‌తో ఆ పార్టీ నేతలు ఇప్పటికే చర్చలు జరిపినట్లు సమాచారం. ఒకరికి కేంద్రంలో ఇంకొరికి రాష్ట్రంలో కీలక పదవులు ఇస్తామన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే కోమటిరెడ్డి బ్రదర్స్‌ పెద్దగా స్పందించలేదని వాళ్ల సన్నిహితులు చెబుతున్నారు. అలాగే యాదాద్రిభువనగిరి జిల్లాలో జిట్టా బాలకృష్ణారెడ్డిని పార్టీలో చేర్చుకునే దిశగా కూడా సమాలోచనలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

షా పావులు..
అమిత్ షా పర్యటించనున్న చండూర్ మండలం తెరట్ పల్లిలో అమిత్‌ షా పర్యటించనున్నారు. నాటి తెలంగాణ సాయుధ పోరాటయోధుల కుటుంబ సభ్యులను అమిత్ షా కలిసే అవకాశం ఉంది. అమిత్ షా పర్యటన తర్వాత జిల్లాలో పార్టీకి మరింత వైభవం పెరగనుందని బిజెపి జిల్లా అద్యక్షుడు నూకల మధుసుధన్ రెడ్డి చెబుతున్నారు. అమిత్ షా పర్యటనలో ఆ పార్టీ బూత్ స్థాయి కమిటీలతో భేటీ కావడంతో పాటు.. ఆయా గ్రామాలలో దళితులతో సహపంక్తి బోజనాలు, తర్వాత వీధి వీధి తిరిగే అవకాశం ఉంది. 22న శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా చండూర్ మండలం తెరటుపల్లికి చేరుకొని అక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం నల్లగొండ జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకొని హైదరాబాద్, నల్లగొండ జిల్లాలకు సంబంధించిన పార్టీ అనుబంధ మేధావులతో సమావేశమవుతారు. అనంతరం పార్టీ రాష్ట్ర కార్యవర్గం, తెలంగాణ జిల్లాల అధ్యక్షులతో సమావేశమవుతారు. మరుసటి రోజు వెలుగుపల్లి, చిన్నమాధారం, పెద్దదేవలపల్లిలో నిర్ణయించిన కార్యక్రమాలకు హాజరై సాయంత్రం.. తిరిగి జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతారు. చివరిరోజు గుండ్రాంపల్లిలో పర్యటించిన అనంతరం భువనగిరి చేరుకుంటారు. అక్కడ నల్లగొండ, హైదరాబాద్ మినహా అన్నీ జిల్లాల పార్టీ అనుబంధ మేధావులతో సమావేశవుతారు. అనంతరం హైదరాబాద్ వెళ్ళిపోతారు. మొత్తంగా తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు బలమైన ప్రత్యర్థిగా ఎదగాలనే వ్యూహంతో అమిత్‌ షా పావులు కదుపుతున్నట్లు పొలిటికల్‌ పండిట్లు విశ్లేషిస్తున్నారు.

06:37 - May 22, 2017

అనంతపురం : జిల్లా తెలుగుదేశంలో వింత పరిస్థితులు నెలకొన్నాయి. పదవుల్లో ఉన్నవారు ఆ పదవులు తమకొద్దని అంటున్నారు. కొత్త వారు తమకు కావాలంటున్నారు. పార్టీ అధినాయకత్వం మాత్రం ప్రస్తుతం పదవుల్లో ఉన్నవారినే కొనసాగించాలన్న యోచనలో ఉంది. ఇవాళ జరిగే జిల్లా మినీ మహానాడుతో ఈ వ్యవహారం ఒకకొలిక్కి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అనంతపురం జిల్లా టీడీపీకి కంచుకోట. ఇలాంటి జిల్లా టీడీపీలో ఇప్పుడు విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం జిల్లా కమిటీలో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా పార్థసారధి, వరదాపురం సూరి ఆ పదవులు తమకొద్దంటునన్నారు. కొత్తవారు తమకు కువాలంటున్నారు. తెలుగుదేశం అధినాయకత్వం మాత్రం ప్రస్తుతం పార్థసారథి, పరదాపురం సూరిలను ఆ పదువుల్లో కొనసాగించాలని భావిస్తోంది.

పార్థసారథిని కొనసాగించే యోచనలో టీడీపీ..
ఎన్నికలకు ఇంకా రెండేళ్ల వ్యవధి కూడా లేదు. జిల్లా అధ్యక్షుడుగా ఉన్న పెనుకొండ ఎమ్మెల్యే పార్థసారథి నియోజకరవ్గం ప్రజలతో ఎక్కువగా మమేకయ్యేందుకు వీలుగా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించాలని కోరుతున్నారు. 2010 నుంచి పార్థసారథి జిల్లా అధ్యక్షుడుగా ఉన్నారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పు కూడా పార్థసారథి సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వహించారు. దీంతో బీకే పార్థసారథినే అధ్యక్ష పదవిలో కొనసాగించాలన్న యోచనలో టీడీపీ అధికాయకత్వం ఉంది. కానీ పార్థసారథి ఇందుకు సుముఖంగా లేరు. పార్టీ అధ్యక్షుడిగా కొనసాడం వలన నియోజకవర్గంలో పర్యటించేందుకు కూడా సమయం ఉండటంలేదని పార్టీ నాయకత్వం వద్ద పార్థసారథి మొరపెట్టుకున్నారు.

సూరి మరోసారి కొనసాగించే యోచనలో టీడీపీ..
ఇక పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న వరదాపురం సూరి కూడా కొత్త కమిటీలో స్థానం వద్దంటున్నారు. ధర్మవరం ఎమ్మెల్యే ఉన్న సూర్యనారాయణ ఏడేళ్లుగా జిల్లా కమిటీలో ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధమయ్యేందుకు వీలుగా జిల్లా కమిటీ నుంచి తప్పించాలని సూరి....టీడీపీ అధినాయకత్వాన్ని కోరారు. అయితే అధిష్టానం మాత్రం ఇందుకు సుముఖంగాలేదు. పార్టీ అధికారంలోలేని సమయంలో కష్టపడిన నేపథ్యంలో మరోసారి కూడా కొనసాగాలని తెలుగుదేశం అధినాయకత్వం కోరుతోంది. ఎన్నికల సమయంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కీలకం. ఇద్దరికీ ముఖ్యమైన బాధ్యతలు ఉంటాయి. దీంతో సమర్థులు పేరు తెచ్చుకున్న పార్థసారథి, సూరిలను ఈ పదవుల్లో కొనసాగించాలని తెలుగుదేశం నాయకత్వం భావిస్తుంటే, వీరు మాత్రం వద్దనడం పార్టీ నాయకత్వానికి ఇబ్బందికర పరిణామంగా మారింది.

అసంతృప్తితో పార్థసారథి..
అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవాలని బీకే పార్థసారథి చూస్తున్న తరుణంలో చాలా మంది ఆశావహులు ఈ పదవిపై కన్నేశారు. అనంతపురం నగర ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి, కళ్యాణదుర్గం శాసనసభ్యుడు హనుమంతరాయచౌదరి, జడ్పీ చైర్‌మన్ చమన్‌, హిందూపుం ఎంపీ నిమ్మల కిష్టప్ప, కదిరి పార్టీ ఇన్‌చార్జ్‌ కందికుంట ప్రసాద్‌, ఎమ్మెల్సీ తిప్పేస్వామి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. రెండేళ్ల క్రితం జరిగిన పార్టీ సంస్థాగత ఎన్నికల్లో జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలను తీసుకోడానికి ప్రభాకర్‌చౌదరి సుముఖత వ్యక్తం చేసినా, అప్పట్లో ఎక్కువ మంది బీకే నే కొనసాగించాలని కోరడంతో పార్థసారథికే సారథ్య బాధ్యతలు దక్కాయి. బీసీ నేతగా పార్థసారథి మంత్రి పదవి ఆశించారు. కానీ కాలవ శ్రీనివాసులుకు స్థానం కల్పించారు. దీంతో అప్పటి నుంచి పార్థసారథి కొంత అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఇప్పుడు జిల్లా సారథ్య బాధ్యతల నుంచి కూడా తప్పించడం భావ్యంకాదని తెలుగుదేశం అధినాయకత్వం భావిస్తోంది. పార్థసారథి పార్టీ సీనియర్లలో ఒకరు కావడంతో జిల్లా కమిటీ అధ్యక్షుడిగా కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. ఇవాళ జరిగే జిల్లా మహానాడులో ఈ వ్యవహారం ఒకకొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

06:34 - May 22, 2017

చిత్తూరు : తిరుపతిలో మరో ఆసుపత్రి రోగులకు అందుబాటులోకి రానున్నంది. శ్రీవెంకటేశ్వర నేత్ర వైద్యశాలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. 2018 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఆస్పత్రికి ప్రభుత్వం తరుపున సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు.

06:31 - May 22, 2017

హైదరాబాద్ : ధనా ధన్‌ ట్వంటీ ట్వంటీ లీగ్‌...ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 10వ సీజన్‌ ఆఖరాటలో ముంబై ఇండియన్స్ జట్టు అదరగొట్టింది.టైటిల్‌ ఫైట్‌లో రైజింగ్‌ పూణె సూపర్‌ జెయింట్‌కు రోహిత్‌ శర్మ అండ్ కో షాకిచ్చింది.బ్యాట్స్‌మెన్‌ తేలిపోయినా....బౌలర్లు సమిష్టిగా చెలరేగడంతో ముంబై జట్టు పెద్ద సంచలనమే సృష్టించింది. లో స్కోరింగ్‌ మ్యాచ్‌లో థ్రిల్లింగ్‌ విక్టరీ నమోదు చేసి మూడో సారి ఐపీఎల్‌ చాంపియన్‌గా నిలిచింది. రైజింగ్‌ పూణె సూపర్‌ జెయింట్‌తో జరిగిన ఫైనల్‌లో , బ్యాట్స్‌మెన్‌ తేలిపోయినా....బౌలర్లు సమిష్టిగా చెలరేగడంతో ముంబై జట్టు పెద్ద సంచలనమే సృష్టించింది. టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై పూణె బౌలర్లు చెక్‌ పెట్టారు.మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫమైనా...బాధ్యతాయుతంగా ఆడిన కృనాల్‌ పాండ్య మెరుపు ఇన్నింగ్స్‌తో ముంబై జట్టును పోటీలో నిలిపాడు. 79 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేయడం కూడా కష్టమనుకున్న ముంబై జట్టును కృనాల్‌ ఆదుకున్నాడు. పాండ్య 38 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్స్‌లతో 47 పరుగులు చేయడంతో .ముంబై 20 ఓవర్లలో 129 పరుగులు చేయగలిగింది.

130 పరుగులు..
ముంబై బౌలర్ల ధాటికి 130 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించడంలో పూణె విఫలమైంది. జస్ప్రీత్‌ బుమ్రా , లసిత్‌ మలింగా.....కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ముంబై జట్టు అనూహ్యంగా మ్యాచ్‌పై పట్టుబిగించింది. చివరి ఓవర్‌లో మిషెల్‌ జాన్సన్‌ తన అనుభవాన్నంతా ఉపయోగించి బౌలింగ్‌ చేశాడు. జాన్సన్‌, పర్‌ఫెక్ట్ లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో మనోజ్‌ తివారీ, స్టీవ్‌ స్మిత్‌లకు వరుస బంతుల్లో చెక్‌ పెట్టడంతో పూణె జట్టుకు ఓటమి తప్పలేదు. ఒక్క పరుగు తేడాతో సంచలన విజయం సాధించిన ముంబై ఇండియన్స్‌ జట్టు ఐపీఎల్‌ 10వ సీజన్‌ టైటిల్‌ ఎగరేసుకుపోయింది. 10 ఏళ్ల ఐపీఎల్‌ ట్రాక్‌ రికార్డ్‌లోనే మూడు సార్లు ఐపీఎల్‌ చాంపియన్‌గా నిలిచిన ఏకైక జట్టుగా ముంబై ఇండియన్స్ జట్టు చరిత్ర సృష్టించింది. ఐపీఎల్‌ హిస్టరీలో అత్యంత ప్రజాదరణ పొందిన జట్టు...అత్యంత విజయవంతమైన జట్టు ముంబై మాత్రమే. కనీవినీ ఎరుగని రికార్డ్‌లు క్రియేట్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు ....ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లోనే అత్యుత్తమ జట్టు అనడంలో అనుమానమే లేదు.

నేడు కర్నూలు జిల్లా బంద్..

కర్నూలు : నేడు జిల్లా బంద్ కు వైసీపీ పిలుపునిచ్చింది. నారాయణ రెడ్డి హత్యకు నిరసనగా కర్నూలు జిల్లా బంద్ కు వైసీపీ నేతలు పిలుపునిచ్చారు.

 

గవర్నర్ ను కలువనున్న జగన్..

హైదరాబాద్ : నేడు ఉదయం తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను వైసీపీ అధ్యక్షుడు జగన్ కలువనున్నారు. టిడిపి హత్యా రాజకీయాలపై ఫిర్యాదు చేయనున్నారు.

పట్టాలెక్కనున్న తేజస్ ఎక్స్ ప్రెస్ రైలు..

ముంబై : నేడు తేజస్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు ఎక్కనుంది. ముంబై నుండి గోవాలోని కర్మాలీ వరకు మొదటి సర్వీసు ప్రారంభం కానుంది. ఈ రైలును రైల్వే శాఖ మంత్రి జెండా ఊపి ప్రారంభించనున్నారు.

ఐపీఎల్ 10 విజేత ముంబై ఇండియన్స్..

ఢిల్లీ : ఐపీఎల్ 10 విజేతగా ముంబై ఇండియన్స్ అవతరించింది. మూడోసారి ఐపీఎల్ ఛాంపియన్ గా నిలవడం గమనార్హం. ఫైనల్ మ్యాచ్ లో ఒక పరుగు తేడాతో పుణె జట్టుపై గెలుపొందింది. ముంబై -129/8, పుణె 128/6. ముంబై బ్యాటింగ్ : కృనాల్ పాండ్యా -47, రోహిత్ శర్మ -24, రాయుడు -12, హర్ధిక్ పాండ్యా -10, పోలార్డ్ -7, పార్థివ్ పటేల్ -4. పుణె బౌలింగ్ : ఉన్నదత్, జంపా, క్రిస్టియాన్ కు రెండేసి వికెట్లు సాధించారు. పుణె బ్యాటింగ్ : స్మిత్ -51, రహానే -44, ధోని -10. ముంబై బౌలింగ్ : జాన్సన్ 3 , బుమ్రా 2.

Don't Miss