Activities calendar

23 May 2017

21:33 - May 23, 2017

ఢిల్లీ : బొగ్గు కుంభకోణంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, కాంగ్రెస్‌ మాజీ ఎంపీ నవీన్‌ జిందాల్‌కు ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. మధ్యప్రదేశ్‌లోని బొగ్గు క్షేత్రం కేటాయింపుకు సంబంధించిన కేసులో కోర్టు ఈ చర్య తీసుకుంది. నవీన్ జిందాల్‌తో పాటు జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ కంపెనీకి చెందిన మాజీ డైరెక్ట్ సుశీల్ మరూ, మాజీ డిప్యూటీ ఎండీ ఆనంద్ గోయల్, సీఈఓ విక్రాంత్ గుజ్రాల్‌లకు కూడా సమన్లు జారీ అయ్యాయి. ఉర్తన్ నార్త్ కోల్ బ్లాకు కేటాయింపులో వీరు మోసానికి పాల్పడ్డారని, నేరపూరిత కుట్ర జరిపారని సీబీఐ ఆరోపించింది. సిబిఐ సమర్పించిన అభియోగపత్రాన్ని విచారణకు స్వీకరించిన ప్రత్యేక కోర్టు ఈ సమన్లను జారీ చేసింది. వీరంతా సెప్టెంబరు 4న జరిగే విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.

21:32 - May 23, 2017

ఢిల్లీ : ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌లో ఉ్రగదాడి జరిగింది. అమెరికా పాప్‌ స్టార్‌ ఏరియానా గ్రాండే షో జరుగుతుండగా భారీ బాంబు పేలుడు సంభవించింది. ఆత్మహుతి దాడిలో 22 మంది మృతి చెందారు. మరో 59 మంది గాయపడ్డారు. ఈ దాడికి పాల్పడింది తామేనని ఐసిస్‌ ప్రకటించింది. ఇలాంటి దాడులు మరిన్ని చేస్తామని బ్రిటన్‌ను హెచ్చరించింది. ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌ నగరంలో సోమవారం రాత్రి అమెరికా పాప్ స్టార్ ఏరియానా గ్రాండ్ కన్సర్ట్‌ జరుగుతోంది. ఏరియాన్ కన్సర్ట్‌ను వీక్షించేందుకు 21వేల మంది అభిమానులు హాజరయ్యారు. కన్సర్ట్‌ షో ముగుస్తుందన్న సమయంలో రాత్రి 10 గంటల 35 నిముషాలకు భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 22 మంది మృతి చెందారు. మరో 59 మంది గాయపడ్డారు. క్షత గాత్రులను వెంటనే ఆసుపత్రులకు తరలించారు. 8 ఆసుపత్రులలో వారికి చికిత్స అందిస్తున్నారు. ఆత్మహుతి దాడిగా పోలీసులు పేర్కొన్నారు. భారీ తీవ్రత కలిగిన పేలుడు పదార్థాలతో ఓ వ్యక్తి కన్సర్ట్‌ వెలుపల ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. దాడి చేసిన వ్యక్తి మృతదేహాన్ని ఘటనాస్థలంలో పోలీసులు గుర్తించారు. వాటి ఆధారంగా అతడి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. దాడికి పాల్పడింది ఒకే వ్యక్తని...దీన్ని ఉగ్రవాద దాడిగానే భావిస్తున్నామని పేర్కొన్నారు. బాంబు వేదిక వెలుపల పేలడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు చెబుతున్నారు.

పాప్ సింగర్ కు తప్పిన ప్రమాదం..
ఈ దాడిలో పాప్‌ సింగర్‌ ఏరియానాకు ఎలాంటి ప్రమాదం జరగలేదని నిర్వాహకులు తెలిపారు. ఏరియానా గ్రాండే షోకు వచ్చిన వాళ్లంతా 20 ఏళ్ల లోపు అభిమానులే. పాప్‌ సంగీత హోరులో ఉర్రూతలూగుతున్న సమయంలో పేలుడు జరుగుతుందని వారు ఏమాత్రం ఊహించలేకపోయారు. మాంచెస్టర్‌ దాడిపై అమెరికా పాప్‌ గాయని, నటి ఏరియానా గ్రాండే దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ఘటన తనను ఎంతోగానో కలచి వేసిందన్నారు. 'నా గుండె పగిలింది. ఐ యామ్‌ సారీ.... ఏం చెప్పాలో మాటలు రావడం లేదని' ఘటన జరిగిన ఐదు గంటల తర్వాత ఏరియానా ట్వీట్‌ చేశారు.

ఖండించిన భారత రాష్ట్రపతి..ప్రధాని..
మాంచెస్టర్‌ దాడిని బ్రిటన్‌ ప్రధాని థెరిసా మే, రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదితో పాటు ప్రపంచవ్యాప్తంగా పలువురు నేతలు ఖండించారు. బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని థెరిసా మే చెప్పారు. ఈ దాడి తనను తీవ్ర మనస్తాపానికి గురి చేసిందని.... క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని మోది ఆకాంక్షించారు. పేలుడులో పాల్గొన్న వారందరూ త్వరగా కోలుకోవాలని బాలీవుడ్‌ నటి ప్రియాంకచోప్రా ఆశించారు. బ్రిటన్‌లో మరికొద్ది వారాల్లో ఎన్నికలు జరగనున్న సమయంలో ఈ పేలుడు ఘటన రాజకీయాలను మరింత వేడెక్కించనున్నాయి.

21:31 - May 23, 2017
21:28 - May 23, 2017
21:24 - May 23, 2017

హైదరాబాద్ : చలపాతి రావు వ్యాఖ్యలపై విమర్శల జడివాన కురుస్తోంది. మహిళా లోకం మండిపడుతోంది. ఈ వ్యాఖ్యలు మహిళలను బహిరంగంగా విమర్శించడమేనని భగ్గుమంటున్నాయి. మరోవైపు టాలీవుడ్‌లో చలపతి కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. అగ్రనటుల నుంచి యువనటుల వరకు తీవ్రంగా ఖండించారు. సీనియర్ నటుడు చలపతిరావు మహిళలపై చేసిన వ్యాఖ్యలు నటులకు మహిళలపై ఉన్న కుంచిత భావాన్ని బయట పెట్టాయి. 'రారండోయ్‌ సందడి చేద్దాం' మూవీ ఆడియో ఫంక్షన్‌లో యాంకర్‌ అడిగిన ప్రశ్నకు చలపతిరావు ఇచ్చిన సమాధానం అక్కడున్న వారినే కాదు.. టీవీల ద్వారా వీక్షిస్తున్న వారినీ తలదించుకునేలా చేశాయి. చలపతిరావు నోటిదురుసుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చలపతిరావు వ్యాఖ్యలపై మహిళా సంఘాలు కన్నెరజేశాయి. ఆడవారంటే అంత చులకనభావమా అంటూ కదం తొక్కాయి. జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో చలపతిరావుపై ఫిర్యాదు చేశారు. సినీ రంగం నుంచి చలపతిరావును వెలేయాలని మహిళా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. చలపతిరావు బహిరంగ క్షమాపణ చెప్పినా.. అంగీకరించేది లేదన్నారు.

ట్వీట్ల వర్షం..
మరోవైపు చలపతిరావు వ్యాఖ్యలకు నిరసనగా అంతర్జాలంలో ట్వీట్ల వర్షం కురుస్తోంది. టాలీవుడ్‌ హీరోలు, హీరోయిన్లు చలపతి కామెంట్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నారు. తాను వ్యక్తిగతంగా మహిళలను గౌరవిస్తానని.. తన సినిమాల్లో కూడా మహిళలకు ఎంతో గౌరవం ఇస్తానని హీరో నాగార్జున ట్వీట్‌ చేశాడు. అమ్మాయిల పట్ల చలపతిరావు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని.. డైనోసర్స్ డునాట్ ఎగ్జిస్ట్ అంటూ పేర్కొన్నాడు. ఇక యువహీరో నాగచైతన్య స్పందిస్తూ మహిళలను గౌరవించడం జీవిత పరమార్థమని తాను నమ్ముతానన్నాడు. మహిళల పట్ల చలపతిరావు కామెంట్స్‌ను తాను ఏకీభవించబోనని ట్వీట్ చేశాడు.

సీరియస్ యాక్షన్ ఉంటుందన్న నరేష్..
చలపతిరావు వ్యాఖ్యలపై హీరోయిన్ రకుల్‌ప్రీత్‌సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సీనియర్ నటుడి స్థాయిలో ఉన్న చలపతిరావు వయసుకు తగినట్లుగా ప్రవర్తిస్తే బాగుంటుందని పలికింది. ఇలాంటి వ్యాఖ్యలు ఇండస్ట్రీకి వచ్చే కొత్త వారిపై చెడు ప్రభావం చూపిస్తాయని రకుల్ ట్వీట్‌చేసింది. చలపతిరావు కామెంట్స్‌ను మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఖండించింది. ఆయన మాటలు దురదృష్టకరమని... చలపతిరావు క్షమించమని కోరినట్టు... మా అధ్యక్షుడు శివాజీరాజా అన్నారు. మహిళా సంఘాలు దయచేసి కేసు వాపసు తీసుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. ఒకవేళ ఇలాంటివి రీపిట్‌ అయితే మా కమిటీ నుంచి సీరియస్‌ యాక్షన్‌ ఉంటుందని హీరో నరేష్‌ హెచ్చరించారు.

21:18 - May 23, 2017

ప్రకాశం : ఎమ్మెల్యే గొట్టిపాటి రవి రెచ్చగొట్టడం వల్లే ఒంగోలు టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని ఎమ్మెల్సీ కరణం బలరాం స్పష్టం చేశారు. గొట్టిపాటి గన్‌మెన్‌ వ్యవహార శైలితోనే సమావేశంలో ఘర్షణ వాతావరణం తలెత్తిందన్నారు. గన్‌మెన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఎమ్మెల్యే గొట్టిపాటి చేసే ప్రతి చర్యకు పార్టీకి ఏ మాత్రం సంబంధం లేదన్నారు.

21:17 - May 23, 2017

ఢిల్లీ : సరిహద్దులో ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతున్న పాకిస్తాన్‌కు భారత్‌ ఆర్మీ గట్టి షాక్‌ ఇచ్చింది. చొరబాట్లను అరికట్టేందుకు మరోసారి సర్జికల్‌ స్ట్రయిక్స్‌ తరహా దాడులు చేసింది. నియంత్రణ రేఖ వద్ద ఉన్న పాకిస్తాన్‌ పోస్టులను భారత్‌ ధ్వంసం చేసింది. నియంత్రణ రేఖవద్ద చొరబాట్లకు ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌కు భారత సైన్యం తగిన రీతిలో బుద్ధి చెప్పింది. ఈనెల 20, 21 తేదీలలో జమ్మకశ్మీర్‌లోని నౌషేరా ప్రాంతంలో జరిపిన దాడుల వివరాలను సైన్యం తాజాగా ప్రకటించింది. పాకిస్తాన్‌ పోస్టులను ధ్వంసం చేస్తున్న దృశ్యాలతో కూడిన వీడియోలను ఆర్మీ బయటపెట్టింది.

నౌషేరా ప్రాంతంలో..
నౌషేరా ప్రాంతంలో ఉన్న పాకిస్తాన్ శిబిరాలపై భారత భద్రతా దళాలు బంకర్‌ బస్టింగ్‌ గన్స్‌, యాంటి టాంక్‌ గైడెడ్‌ మిసైళ్లు, రాకెట్‌ లాంఛర్లు, ఆటోమేటెడ్‌ గ్రెనేడ్‌ లాంచర్లతో విరుచుకుపడ్డాయి. ఈ దాడిలో పాకిస్తాన్‌కు చెందిన పలు సైనిక శిబిరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పాక్‌ ఆర్మీ పోస్టులను ధ్వంసం చేయడం వల్ల ఆ దేశానికి భారీ నష్టం జరిగినట్లు మేజర్‌ జనరల్‌ అశోక్‌ నరూలా తెలిపారు. కొండల్లో మంచు కరుగుతున్న సమయంలో చొరబాట్లు అధికమౌతాయని...అందుకే భారత్‌ ముందస్తు చర్యలు చేపట్టిందని ఆయన వివరించారు. కశ్మీర్‌ లోయలో...నియంత్రణ రేఖ వద్ద శాంతియుత వాతావరణం నెలకొనాల్సిన అవసరం ఉందని నరూలా చెప్పారు.

తోసిపుచ్చిన పాక్..
నౌషేర్‌ సెక్టార్‌లో తమ సైనిక స్థావరాలపై దాడి చేసినట్లు భారత సైన్యం చేసిన ప్రకటనను పాకిస్తాన్‌ తోసిపుచ్చింది. తమకు పాకిస్తాన్‌ ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదని దీనిపై గొప్పలు చెప్పుకోనక్కరలేదని భారత్‌లో పాక్‌ రాయబారి అబ్దుల్‌ బాసిత్‌ అన్నారు. పూంఛ్‌ సెక్టార్‌ సరిహద్దులో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న ఇద్దరు భారత జవాన్లపై పాక్‌ కాల్పులు జరిపి అతి కిరాతాకంగా హత్య చేసింది. తాజా దాడులతో పాక్‌పై భారత్‌ ప్రతీకారం తీర్చుకున్నట్లయిందని విశ్లేషకులు చెబుతున్నారు.

బుధవారం రాయలసీమ బంద్..

కర్నూలు : బుధవారం రాయలసీమ బంద్ కు వామపక్షాలు పిలుపునిచ్చాయి. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ బంద్ లో పాల్గొననున్నారు. బంద్ కు కాంగ్రెస్, రైతు సంఘాలు మద్దతు ప్రకటించాయి.

రాష్ట్రావతరణ వేడుకల నిర్వాహణపై కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్ : రాష్ట్రావతరణ వేడుకల నిర్వాహణపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. జూన్ 2వ తేదీన అమరవీరులకు నివాళులర్పించి జిల్లా కేంద్రాల్లో ఉత్సవాలు ప్రారంభించాలని, అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు వేడుకల్లో పాల్గొనాలని సూచించారు. మండలాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అతిథులుగా పాల్గొంటారని, జూన్ 3న కేసీఆర్ కిట్ల పంపిణీ..4వ తేదీన ఒంటరి మహిళలకు పెన్షన్ అందచేస్తామన్నారు. జిల్లా కేంద్రాల్లో అమరవీరుల స్థూపాలు లేని చోట తాత్కాలికంగా..అన్ని జల్లా కేంద్రాల్లో శాశ్వత అమరవీరుల స్థూపాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలు..కూడళ్లను విద్యుత్ దీపాలతో అలంకరించాలన్నారు.

జూ.కాలేజీల్లో ప్రవేశానికి ఆధార్ కార్డు..

హైదరాబాద్ : 2017-18 సంవత్సరానికి అన్ని ప్రభుత్వ..ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు ఆధార్ కార్డు తప్పనిసరి అని ఇంటర్ బోర్డు ప్రకటించింది.

 

ఉద్యోగుల బకాయిల చెల్లింపులు..

హైదరాబాద్ : ఉద్యోగుల వేతన సవరణ బకాయిలు చెల్లింపుపై ఉత్తర్వులు విడుదలయ్యాయి. ప్రభుత్వం బకాయిలను ప్రస్తుత ఏడాది సగం, వచ్చే ఏడాది మిగతా సగం చెల్లించనుంది. జూలై నుంచి 18 వాయిదాల్లో ఉద్యోగులకు బకాయిల చెల్లింపు జరగనుంది.

20:57 - May 23, 2017

ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా.. ఇప్పుడు....ప్రపంచాన్ని వణికించబోతోందా? జరుగుతున్న పరిణామాలు ఏ సంకేతాలిస్తున్నాయి? మాంచెస్టర్ తరహా దాడులు మరిన్ని జరగబోతున్నాయా? అసలీ మంటలను రగిలించిందెవరు? ఎవరి పాపం ఇది? ప్రశాంతమైన ఇరాకీలు, సిరియన్ల బతుకుల్ని నరకప్రాయం చేసిందెవరు? ఇందులో ఎవరి ప్రయోజనాలున్నాయి? ఇప్పుడు జరుగుతున్న దాంట్లో అమెరికా పాత్ర ఎంత? పగడవిప్పిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదం గురించి ప్రత్యేక కథనం.. గ్లోబల్ టెర్రరిజమ్ ఇండెక్స్.. ప్రపంచాన్ని మేల్కొనమని చెప్తోంది. టెర్రరిజం ఎలాంటి విధ్వంసం కలిగిస్తోందో కళ్లకు కడుతోంది. లెక్కలతో సహా రుజువులు కళ్లముందుంచుతోంది. భారత్ తో పాటు అనేక దేశాలకు ఉగ్రవాద ముప్పు బలంగా ఉందనే అంశాన్ని స్పష్టం చేస్తోంది. ఇస్లామిక్ స్టేట్ సవాల్ విసురుతున్న సందర్భంలో ప్రపంచం జాగ్రత్త పడాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తోంది.

దేశం ఏదైనా..
ఇప్పుడు మాంచెస్టర్..గతంలో ఢాకా, బాగ్దాద్‌ అంతకు ముందు.. పారిస్‌, బ్రసెల్స్‌, లండన్ దేశం ఏదైనా.. ప్రాంతంఏదైనా...ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. తుపాకులు, బాంబులతో మారణహోమం సృష్టిస్తున్నారు . ప్రపంచవ్యాప్తంగా పంజావిసురుతున్న ఉగ్రభూతం... దేశాలన్నిటిని భయపెడుతోంది . అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ... ఐసిస్‌ సపాగిస్తున్న నెత్తుటి క్రీడ మెత్తం మానవ సమాజాల మనుగడనే విషాదంలో నింపుతోంది. మాంచెస్టర్ లో లేటెస్ట్ పరిణామాలు చూశాం. యూరప్ లో జరుగుతున్న దాడులను గమనిస్తున్నాం.. ఓవరాల్ గా అనేక ప్రపంచ దేశాల్లో ఇస్టామిక్ స్టేట్ ఉగ్రవాదులు సృష్టిస్తున్న విధ్వంసం, చూస్తున్నాం.. ఇదంతా పక్కన పెడితే అసలు ఈ ఉగ్రవాదుల మూలాలెక్కడున్నాయి? ఎవరు వాళ్లు? వాళ్ల లక్ష్యం ఏంటి? ఐఎస్ ప్రొఫైల్ చూశాం. కానీ ఐఎస్ పుట్టుకకు కారణాలేంటి? సద్దాం హయాంలో ప్రశాంతంగా ఉన్న దేశం ఇప్పుడు ఉగ్రవాదుల నరకకూపంలా ఎందుకు తయారయింది.

ఈ పాపం ఎవరిది ?
ఉన్మాదులకు సిరియా, ఇరాక్ లు స్థావరాలుగా ఎలా మారుతున్నాయి. ఈ పాపం ఎవరిది? ఇప్పుడు మరిన్ని దాడులు పొంచి ఉన్నాయా? ఇది ఏ ఒక్క దేశానికి పరిమితమైన సమస్య కాదు.. ప్రపంచ సమస్య... అంతర్జాతీయ సమాజానికి వచ్చిన ముప్పు ఇది. అమెరికా సాయుధ జోక్యం చేసుకున్న దేశమేదీ ప్రశాంతంగా లేదు. ఇరాక్‌, లిబియా ఆఫ్ఘన్ లాంటివన్నీ దీనికి ఉదాహరణలే. ఒక్కమాటలో చెప్పాలంటే మంటలు రగిలించింది అమెరికా.. ఫలితంగా ఉగ్రవాదులు, విధ్వంసానికి తెగబడుతుంటే, లక్షలాది అమాయక బతుకులు తగలబడుతున్నాయి. వనరుల దోపిడీ లక్ష్యంగా సాగే ఇలాంటి కుట్రలు ప్రపంచ భవిష్యత్తుకి ఏ మాత్రం క్షేమకరం కాదు.. ఇటు మతరాజ్యం కోసమైనా, అటు ఆధిపత్యదాహం కోసం చేసే కుట్రలనైనా ప్రపంచం ప్రతిఘటించాల్సి ఉంది. పూర్తి విశ్లేషణకు వీడియో క్లిక్ చేయండి.

20:39 - May 23, 2017

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ పోరాట యోధుల మహాసభ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఎన్నో సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆకాంక్ష ప్రత్యేక రాష్ట్ర సాధనతో నెరవేరిందని... నేడు తెలంగాణ వచ్చింది గనుకనే అభివృద్ధి చెందుతుందని సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందినీ సిదారెడ్డి అన్నారు. 1969లో 379 మంది ఉద్యమంలో అమరులయ్యారని... వారి త్యాగాలకు గుర్తింపు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆనాటి ఉద్యమకారులు, పలువురు సాహితీవేత్తలు, కవులు పాల్గొన్నారు.

20:38 - May 23, 2017

ఢిల్లీ : ర‌ష్యాలో ఓ న్యూస్‌రీడ‌ర్ న్యూస్ బులిటెన్ చదువుతుండగా.. వింత పరిస్థితి ఎదుర్కొంది. అకస్మాత్తుగా స్టూడియోలోకి వచ్చిన ఓ కుక్క.. డెస్క్ కిందికి చేరింది. ఆ కుక్క అక్కడి నుంచి వెళ్లకపోగా.. న్యూస్ యాంక‌ర్ పక్కనే డెస్క్‌పైకి ఎక్కి కూర్చుంది. దీంతో 15 సెకన్లపాటు... వార్తలకు అంతరాయం కలిగింది. సోషల్‌ మీడియాలో ఇప్పుడీ వీడియో వైరల్‌గా మారింది.

20:36 - May 23, 2017
20:35 - May 23, 2017
20:32 - May 23, 2017

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ పారిశుధ్య కార్మికుల వేతనాలు పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు వారు పడుతున్న శ్రమను గుర్తించిన కేసీఆర్ గతంలో ఒకసారి వేతనాలు పెంచారు. అదే సమయంలో ఇచ్చిన హామీ మేరకు మరోసారి పెంచుతున్నట్లు కేసీఆర్ చెప్పారు. ప్రగతిభవన్ లో పారిశుధ్య కార్మికుల వేతనాల పెంపునకు సంబంధించి జరిగిన సమీక్షా సమావేశంలో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ వచ్చేనాటికి పారిశుధ్య కార్మికుల వేతనం రూ.8500 ఉండేది. గతంలో కేసీఆర్ వారి వేతనాన్ని రూ.12,500 కు పెంచారు. ఇప్పుడు మరోసారి రూ.1500 పెంచి.. మొత్తం జీతాన్ని రూ.14000 చేశారు. రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీలలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు పెంచే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు ఈ సందర్భంగా కేసీఆర్ చెప్పారు.

20:30 - May 23, 2017

నల్గొండ : తనకు అమిత్‌ షా క్లాస్‌ ఇచ్చారన్నది అవాస్తవమని బీజేపీ నాయకుడు కిషన్‌ రెడ్డి అన్నారు. తనపై ఎవరో దుష్ప్రచారం చేశారని ...దీనిని ఖండిస్తున్నానని టెన్ టివికి తెలిపారు. ఇంకా ఎలాంటి అంశాలు మాట్లాడారో వీడియో క్లిక్ చేయండి.

20:28 - May 23, 2017

నల్గొండ : దక్షిణాదిన పార్టీ బలోపేతంపై దృష్టిసారించామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా అన్నారు. 2019 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లాలో రెండోరోజూ పర్యటించిన అమిత్‌షా.. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే మోదీ లక్ష్యమని చెప్పారు. నల్లగొండ జిల్లాలో రెండోరోజూ... బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా పర్యటన బిజీబిజీగా సాగింది. నల్లగొండ, కనగల్‌ మండలాల్లోని వెలుగుపల్లి, చిన్నమాదారం, పెద్దదేవులపల్లిలో ఆయన పర్యటించారు. వెలుగుపల్లిలో దీన్‌దయాల్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడి దళితవాడకు దీన్‌ దయాళ్‌ బస్తీగా నామకరణం చేశారు. అక్కడి నుంచి చిన్నమాదారం వెళ్లిన అమిత్‌షా....గ్రామస్థులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు.

ఏపీలో పొత్తు..తెలంగాణలో ?
అనంతరం అమిత్‌షా, చిన్నమాదారంలో వివేకానందుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. గ్రామంలో ఇంటింటికి తిరిగి కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరును తెలుసుకున్నారు. తర్వాత, పెద్దదేవులపల్లిలో జరిగిన సభలో మాట్లాడిన అమిత్‌షా ... తెలంగాణలో బూత్‌స్థాయి నుంచి బీజేపీ బలోపేతానికి కృషి చేస్తున్నామన్నారు. దక్షిణ భారతదేశంలో కచ్చితంగా బీజేపీ పాగా వేస్తుందన్నారు. అది తెలంగాణ నుంచే ప్రారంభమవుతుందని చెప్పారు. 2019 ఎన్నికల్లో తెలంగాణలో అధికారం బీజేపీదేనని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో పొత్తులపైనా అమిత్‌షా మాట్లాడారు. ఏపీలో టీడీపీతో పొత్తు కొనసాగుతుందని చెప్పారు. అయితే తెలంగాణలో మాత్రం టీడీపీతో పొత్తుపై ఆయన క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం అంతవరకే చెప్పదల్చుకున్నానంటూ సమాధానాన్ని దాటవేశారు. తెలంగాణలో బీజేపీని బలమైన రాజకీయశక్తిగా తయారు చేస్తున్నామన్నారు. తెలంగాణ కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందని అమిత్‌షా చెప్పారు. 60ఏళ్లలో ఇంతకుముందెన్నడూ లేనివిధంగా ఎక్కువ నిధులు ఇచ్చామన్నారు. వేర్వేరు పథకాల కోసం తెలంగాణకు దాదాపు లక్ష కోట్ల నిధులు ఇచ్చామన్నారు. తెలంగాణకు ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థలను ఇచ్చామని చెప్పారు.

20:17 - May 23, 2017

సీనియర్‌ తెలుగు నటుడు చలపతిరావు మహిళలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు యాక్టర్ల వరుస పిచ్చి ప్రేలాపనలతో ఆడియో ఫంక్షన్లు గబ్బు కొడుతున్నాయి. నోటికి అడ్డూ అదుపు లేకుండా నటులు మహిళలను కించపరుస్తూ చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో లయన్ సాయి వెంకట్ (నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ), పద్మిని (ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ), అనురాధ (మహిళా సంఘం నేత) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అలాగే పలువురు కాలర్స్ కూడా తమ అభిప్రాయాలు తెలియచేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

ఓయూ సెట్ పరీక్షల షెడ్యూల్..

హైదరాబాద్ : ఓయూ సెట్ పరీక్షల షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. జూన్ 5 నుండి 13 వరకు ఓయూ సెట్ పరీక్షలు జరగనున్నాయి. 1వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి వెబ్ సైట్ లో హాల్ టికెట్లు తీసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.

షా క్లాసు తీసుకోలేదు - కిషన్ రెడ్డి..

హైదరాబాద్ : అమిత్ షా క్లాసు తీసుకున్నారన్నది అవాస్తవమని ఎమ్మెల్యే కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తనకు సీఎం కావాలన్నది లేదని, పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యమని టెన్ టివితో కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీలో చేరేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారని, సెప్టెంబర్ అమిత్ షా పర్యటనలో చేరికలుంటాయని వెల్లడించారు.

దేవాదాయ శాఖ కార్యాలయంపై ఏసీబీ దాడి..

కర్నూలు : దేవాదాయ శాఖ కార్యాలయంపై ఏసీబీ దాడి నిర్వహించింది. లంచం తీసుకుంటున్న ఎస్ఐ వెంకటేశ్వర్లు, జానియర్ అసిస్టెంట్ బిందూ బాయిలను పట్టుకున్నారు. చనిపోయిన పూజారీ కుటుంబానికి ఎక్స్ గ్రేషియా చెల్లింపు కోసం వారు లంచం డిమాండ్ చేశారు.

అసిస్టెంట్ ప్రొఫెసర్ అనుమానాస్పద మృతి..

పశ్చిమగోదావరి : అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రావణలక్ష్మి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కాలేజీ హాస్టల్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రావణలక్ష్మీ స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం.

19:19 - May 23, 2017

జీహెచ్ఎంసీ కార్మికులకు శుభవార్త...

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికుల వేతనాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. రూ. 12,500 నుండి రూ. 14 వేలకు పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ఇతర మున్సిపాల్టీల కార్మికుల వేతనాల పెంపునకూ సీఎం సానుకూలం వ్యక్తం చేశారు. ఆయా మున్సిపాల్టీల ఆర్థిక పరిస్థితి పన్నుల వసూళ్ల వివరాలను సమర్పించాలని మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శికి సీఎం కేసీఆర్ ఆదేశించారు.

విద్యా వాలంటీర్ల వేతనాల పెంపు - కడియం..

హైదరాబాద్ : యూనివర్సిటీల్లో 1551 పోస్టులు భర్తీ చేస్తామని, తొలి దశలో 1061 పోస్టుల భర్తీ చేస్తామని డిప్యూటి సీఎం కడియం శ్రీహరి వెల్లడించారు. విద్యా వాలంటీర్ల వేతనాన్ని పెంచుతున్నట్లు, రూ. 8వేల నుండి రూ. 12వేలకు పెంచుతున్నట్లు పేర్కొన్నారు. డీఎస్సీ విధి విధానాలపై కసరత్తు జరుగుతోందని, టెట్ నిర్వాహణపై న్యాయశాఖను సంప్రదిస్తున్నట్లు తెలిపారు. డీఎస్సీ, టెట్ ఒకేసారి నిర్వహించాలా ? లేదా ? అనే దానిపై ఆలోచన చేస్తున్నట్లు పేర్కొన్నారు.

దొంగల ముఠా అరెస్టు..

హైదరాబాద్ : జంటనగరాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యులు దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. రూ. 13 లక్షల నగదు..14 బంగారు గొలుసులు..450 గ్రాముల బంగారం..రెండు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు.

ధర్నా చౌక్ పరిరక్షణ కమిటీ సమావేశం..

హైదరాబాద్ : సీపీఐ కార్యాలయంలో ధర్నా చౌక్ పరిరక్షణ కమిటీ సమావేశం ప్రారంభమైంది. చాడ, తమ్మినేని, కోదండరాం..తదితర నేతలు హాజరయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు.

 

మాంచెస్టర్ ఆత్మహుతి దాడుల బాధ్యత ఐసీస్..

ఢిల్లీ : మాంచెస్టర్ ఆత్మాహుతి దాడులకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించింది. ఈ దాడిలో 20 మందికి పైగా మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.

18:54 - May 23, 2017
18:53 - May 23, 2017

హైదరాబాద్ : టిడిపి మహానాడుకు సమయం దగ్గరపడుతోంది. ఓవైపు మహానాడుకు వచ్చే అతిథులకు ఏర్పాట్లు చేస్తూనే మరోవైపు కీలకమైన తీర్మానాలపైనా తెలుగుదేశం అధిష్టానం దృష్టిపెట్టింది. ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీగా.. తెలంగాణలో ప్రతిపక్షపార్టీగా ఉన్న తెలుగుదేశానికి ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఈ మహానాడు రాజకీయంగా ఎంతో కీలకం కానుంది. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడుకు విశాఖ ముస్తాబవుతోంది. ఈనెల 27,28,29 తేదీల్లో జరగనున్న మహానాడులో అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక కమిటీలు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాయి. టిడిపి అధినేత చంద్రబాబు సచివాలయంలో విధులు ముగించుకుని ఇంటికి చేరాక మహానాడు నిర్వహణకు సంబంధించి ప్రత్యేకంగా పార్టీ నేతలతో సమావేశమై చర్చిస్తున్నారు. మరోవైపు మహానాడులో చేసే తీర్మానాలపైనా అధిష్టానం దృష్టిపెట్టింది. ఈసారి ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తీర్మానాలతో సిద్ధం అవుతున్నట్లు సమాచారం.

పలు తీర్మానాలు...
ఎన్టీఆర్ పార్టీ ఏర్పాటు చేసిన దగ్గర్నుంచి.. జాతీయ రాజకీయాల్లో టిడిపి పాత్ర ఏ విధంగా ఉందనే అంశాలపై తీర్మానాలు చేయనున్నారు. ఇక ఏపీలో ప్రభుత్వ విధానాలను వివరించడంతోపాటు పలు రంగాల్లో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను గురించి తీర్మానాలు చేయనున్నారు. పోలవరం, రాజధాని నదుల అనుసంధానం, రైతు రుణమాఫీ, యూత్ పాలసీ, నిరుద్యోగభృతి వంటి అంశాలపై కూడా తీర్మానాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటితో పాటు ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెస్తున్న అంశాన్ని ప్రస్తావించనున్నారు. అలాగే కాపు రిజర్వేషన్లు వంటి సున్నితమైన అంశాలతో పాటు రాజకీయంగా ప్రతిపక్ష పార్టీ వైసిపి వైఖరి గురించి కూడా చర్చించనున్నట్లు సమాచారం.

తెలంగాణ..
ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు.. రాష్ట్రంలో పార్టీ బలోపేతం చేసే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై పలు తీర్మానాలు చేయనున్నారు. తెలంగాణలో పార్టీ నిర్ణయాత్మక శక్తిగా మారాలంటే ఏం చేయాలనే అంశాలపైనా మహానాడు వేదికగా కీలకచర్చ జరగనుంది. తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పడిన క్రమంలో సంస్థాగతంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి.. కొత్త వారికి అవకాశమిస్తూ పార్టీని తెలంగాణలో ఎలా పరుగులు పెట్టించాలనే దిశగా మహానాడు వేదికపై రెండోరోజు చర్చ జరిగే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో ఏపీలో మిత్రపక్షంగా ఉన్న బిజేపి, జనసేనతో టిడిపి ఎలా ముందుకెళ్తుందనే అంశంపై పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ అంశంపై కూడా మహానాడు చర్చ జరిగే అవకాశం ఉంది.

18:51 - May 23, 2017

ప్రకాశం : జిల్లా కందుకూరులో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గతరాత్రి 19 మందిపై దాడిచేయడంతో గాయాలపాలైన వారంతా ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పిచ్చికుక్కలకు భయపడి జనం బయటకు రావడానికి హడలిపోతున్నారు. అధికారులకు విన్నవించినా ఫలితం ఉండట్లేదని స్ధానికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా కుక్కల బెడద నుంచి తమని కాపాడాలని స్ధానికులు కోరుతున్నారు.

18:50 - May 23, 2017

కడప : మండిబజారులో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో సజీవదహనమైంది. కటిక వీధిలోని ఓ ఇంటిపై నివాసం ఉంటున్న ఫరీదా బేగం మంటల్లో కాలిపోగా.. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. మంటలకు ఇంటి పైకప్పు ధ్వంసమైంది. ఫరీదాకు 7 నెలల క్రితమే పెళ్లైనట్లు తెలుస్తోంది. బయట నుంచి వచ్చి స్విచ్ వేయగానే షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగిందని ఆమె భర్త చెబుతున్నాడు. అయితే ఫరీదా మంటల్లో సజీవ దహనం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

18:49 - May 23, 2017

అనంతపురం : రాయలసీమ..! నిత్య క్షామపీడిత ప్రదేశం. పాలకులు నిర్లక్ష్యానికి గురైన ప్రాంతం. ఈ జిల్లాల్లో పదేళ్ల సగటు తీసుకుంటే.. ఏడేళ్లు కరవు కరాళ నృత్యం చేస్తుంటుంది. ఈ ఏడాది కూడా కరవు.. వరుసగా ఆరోసారి పిలవని చుట్టంలా వచ్చేసింది. ఫలితంగా వ్యవసాయం కుదేలైంది. ఉపాధి కరవైంది. తాగునీటికీ కటకట ఏర్పడింది. వలసలు మొదలయ్యాయి. ప్రజల కష్టాలు పాలకుల చెవికెక్కడం లేదు. రాష్ట్ర విభజన వేళ ఈ ప్రాంతాన్ని నందనవనం చేస్తామన్న హామీ ఎప్పుడో అటకెక్కేసింది. ఈ దశలో, అలో లక్ష్మణా అని అలమటిస్తోన్న సీమ గోడును.. సర్కారు దృష్టికి తెచ్చేందుకు.. వామపక్ష, ప్రజాసంఘాలు.. రేపు రాయలసీమ బంద్‌ను పాటించబోతున్నాయి. రతనాల సీమ.. నేడు కరవు కోరల్లో విలవిలలాడుతోంది. పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా.. సీమవాసులు తీవ్ర దుర్భిక్షంతో తల్లడిల్లుతున్నారు. ముఖ్యంగా సీమలోని నాలుగు జిల్లాల పశ్చిమ ప్రాంతాలైతే.. దుర్భర క్షామాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ ప్రాంతంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆదుకోక.. చేసిన పనులకూ డబ్బులు రాక కూలీలు ఆకలితో నకనకలాడుతున్నారు. వీరిని ఆదుకోవాల్సిన సర్కారు కానీ, అధికార యంత్రాంగం కానీ మౌన ప్రేక్షక పాత్ర పోషిస్తోంది. సాగునీటి ప్రాజెక్టులు తగినన్ని లేనికారణంగా ఇక్కడి రైతులు అత్యధికం వర్షంపైనే ఆధారపడి సేద్యం చేస్తారు. హంద్రీనీవా, గాలేరు నగరి లాంటి బృహత్తర ప్రాజెక్టులు దశాబ్దాలుగా నత్తనడకన సాగుతున్నాయి. నదుల అనుసంధానంలో భాగంగా పట్టిసీమ ద్వారా, సీమకు, కొంతమేర కృష్ణా నీటిని మళ్లించే ప్రయత్నం చేసినా.. అది ఈ ప్రాంత అవసరాల్లో ఒక్క శాతం కూడా తీర్చలేని పరిస్థితి. వరుణుడి కరుణ లేక కొంత.. ప్రకృతి ప్రకోపానికి మరికొంత.. పంటలు నాశనమయ్యాయి. దీంతో రైతులకు పెట్టుబడులే కాదు, కనీసం పశువులకు గ్రాసమూ దొరకని పరిస్థితి ఏర్పడింది. ఉపాధి దొరక్క, యువత వలసబాటన సాగుతోంది.

హామీల మీద హామీలు..
రాయలసీమ తలరాతను మారుస్తామని, పాలకులు ఎన్నో హామీలు గుప్పించారు. రాష్ట్ర విభజన వేళ.. కడపలో స్టీల్‌ ఫ్యాక్టరీని ప్రారంభిస్తామన్నారు. జలవనరులను ఎంతెంతగానో పెంచుతామన్నారు. అంతెందుకు ఈ ప్రాంతానికి బుందేల్‌ఖండ్‌ తరహాలో ప్రత్యేక ప్యాకేజీని ఇస్తామన్నారు. కానీ, ఇవేవీ నెరవేరలేదు. రాయలసీమపై ప్రభుత్వ ఉదాసీనతను నిరసిస్తూ.. వామపక్ష, ప్రజాసంఘాలు బుధవారం రాయలసీమ బంద్‌ను పాటిస్తున్నాయి. బంద్‌కు ప్రజలను చైతన్య పరిచేందుకు, ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్నాయి. అనంతపురం నగరంలో ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు, తలపై బిందెలు, వంటపాత్రలు, దుస్తుల మూటలతో.. వలస పరిస్థితులను ప్రతిబింబించేలా ర్యాలీ నిర్వహించారు. అటు కడప నగరంలోనూ వామపక్షనాయకులు బైక్‌ ర్యాలీని నిర్వహించారు. బంద్‌కు ప్రజలను చైతన్యపరచడంలో భాగంగా... సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు.. మంగళవారం, అనంతపురం జిల్లా కదిరి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం, అక్కడి గొర్రెల సంతను సందర్శించి, పశుగ్రాసం కొరత వల్ల.. జీవాలను అమ్ముకుంటున్న రైతుల వెతలను తెలుసుకున్నారు. అక్కడి నుంచి ఉపాధి హామీ పథకం కింద పనులు చేస్తున్న వారి కష్టాలనూ తెలుసుకున్నారు. కూలీలకు రెండు వందల రోజులు పని దొరికేలా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. బుధవారం నాటి రాయలసీమ బంద్‌కు, ప్రతిపక్ష వైసీపీ కూడా మద్దతు ప్రకటించింది. ఉదయం నుంచే బంద్‌లో పాల్గొనాలని తద్వారా రైతులు, ఇతర ప్రజల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాలని వామపక్ష, ప్రజాసంఘాలు పిలుపునిచ్చాయి.

18:46 - May 23, 2017

ఢిల్లీ : కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్‌ కడప, బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీల ఏర్పాటుపై స్పందించారు. నాలుగు నెలల క్రితమే స్టీల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుపై టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేశానని.. నెలరోజుల్లో నివేదిక వస్తుందని మంత్రి బీరేంద్ర సింగ్‌ అన్నారు. స్క్రాప్‌ ఆధారిత స్టీల్‌ ఫ్యాక్టరీనైనా ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించమని టాస్క్‌ ఫోర్స్‌కి చెప్పానని అన్నారు. తెలుగు రాష్ట్రాల మంత్రులతో సమావేశమై దీనిపై వీలైనంత త్వరగా దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

18:46 - May 23, 2017

విజయవాడ: నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన గ్రీన్‌ఫీల్డ్‌ రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్‌ చెప్పారు. ఇందుకు అవసరమైన ప్రణాళికలు, ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో సీఎస్‌ అధ్యక్షతన ఏపీ క్యాపిటల్‌ రీజియన్‌ యూనిఫైడ్‌ ట్రాన్స్‌ఫోర్టు అధారిటీ సమావేశం జరిగింది. సెన్సార్‌ ఆధారిత ట్రాఫిక్‌ సిగ్నలింగ్‌ విధానం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. విజయవాడలో ట్రాఫిక్‌ రద్దీని అధిగమించేందుకు ప్రతిపాదిత బైపాస్‌ రహదారి నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు. బెంజ్‌ సర్కిల్‌ ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులు కూడా త్వరితగతిన జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. అమరావతి ప్రాంతంలో చేపట్టనున్న రహదారులు, రవాణా వ్యవస్థపై సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. 2050 నాటికి పెరిగే జనాభా అవసరాలను దృష్టిలో పెట్టుకుని గ్రీన్‌ఫీల్డ్‌ రవాణా వ్యవస్థ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తీసుకుంటున్న చర్యలు వివరించారు.

18:39 - May 23, 2017

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో భీమవరంలో నిర్వహించనున్న ర్యాలీకి రాహుల్‌ గాంధీ వస్తానని చెప్పారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో ఏపీ కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. జూన్‌ రెండో వారంలో భీమవరంలో ర్యాలీ నిర్వహిస్తున్నామని...ఆ కార్యక్రమానికి రాహుల్‌ గాంధీని ఆహ్వానించామని రఘువీరారెడ్డి చెప్పారు. ఢిల్లీలోని మరికొంతమంది పెద్దలను కూడా ఆహ్వానిస్తామని అన్నారు.

18:38 - May 23, 2017

అనంతపురం : జిల్లా గార్లదిన్నె మండలం ముకుందాపురంలోని పంట పొలాల్లో రైతులు నిర్మించుకున్న నీటి కుంటలను పరిశీలించారు గవర్నర్ నరసింహన్. రైతుల ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన నీటి కుంటల వల్ల కలిగే ఉపయోగాలను రైతుల్ని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఉపాధి హామీ కూలీలతో వారి సమస్యలపై చర్చించారు. హార్టీ కల్చర్ వైపు మొగ్గుచూపాలని .. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని నరసింహన్ రైతులకు సూచించారు. మరోవైపు గార్లదిన్నె ప్రభుత్వ వైద్యశాల హెచ్ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు ఏసిన కార్యక్రమంలోనూ గవర్నర్ నరసింహన్ పాల్గొన్నారు. గవర్నర్ వెంట ఎమ్మెల్సీ శమంతకమణి, ఎమ్మెల్యే యామిని బాల, కలెక్టర్ వీరపాండ్యన్ తో పాటు పలువురు అధికారులు ఉన్నారు.

18:31 - May 23, 2017

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో భీమవరంలో నిర్వహించనున్న ర్యాలీకి రాహుల్‌ గాంధీ వస్తానని చెప్పారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో ఏపీ కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. జూన్‌ రెండో వారంలో భీమవరంలో ర్యాలీ నిర్వహిస్తున్నామని...ఆ కార్యక్రమానికి రాహుల్‌ గాంధీని ఆహ్వానించామని రఘువీరారెడ్డి చెప్పారు. ఢిల్లీలోని మరికొంతమంది పెద్దలను కూడా ఆహ్వానిస్తామని అన్నారు.

18:31 - May 23, 2017

ప్రకాశం : కరణం, గొట్టిపాటి వర్గాలు మళ్లీ తలపడ్డాయి. ఏకంగా వర్గాల నేతలే బాహాబాహీకి సిద్ధపడ్డారు. దీంతో టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం రసాబాసగా మారింది. వేమవరం హత్యల నేపథ్యంలో, ఇరు వర్గాలు ఈ సమావేశంలో ఆవేశంతో ఊగిపోయాయి. మంత్రులు పరిటాల సునీత, నారాయణ, శిద్దా రాఘవరావు సమక్షంలోనే నాయకులు రెచ్చిపోయారు. పరిస్థితి అదుపులో వుంచేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లాలో గొట్టిపాటి, కరణం వర్గాల మధ్య వార్‌ అంతకంతకు ముదురుతోంది. ఇటీవలి వేమవరం జంట హత్యల అనంతరం.. మంగళవారం జరిగిన ఒంగోలు టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం.. ఈ రెండు వర్గాల కొట్లాటకు వేదికైంది. మంత్రి నారాయణ, శిద్దా రాఘవరావు, పరిటాల సునీత ముందే పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ సమావేశానికి ముందుగానే చేరుకున్న కరణం బలరాం వర్గీయులు అనంతరం వచ్చిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవిని.. వేమవరం హత్యలకు కారకుడంటూ అడ్డుకున్నారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గొట్టిపాటి రవి వర్గీయులు వారిని అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రెండు వర్గాలూ బాహాబాహీకి దిగాయి.

బాబుకు నివేదికలు..
పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. గొట్టిపాటి రవిని సమావేశం నుంచి పంపేయాలంటూ పోలీసులతో పాటు, సమావేశ మందిరంలోనే ఉన్న మంత్రులతోనూ కరణం వర్గీయులు వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు గొట్టిపాటి రవిని అక్కడి నుంచి పంపేశారు. మరోవైపు తాను ఎలాంటి హత్యా రాజకీయాలకు పాల్పడలేదని, ఒక వేళ తనది తప్పని తేలితే రాజకీయాల నుండి తప్పుకుంటానన్నారు ఎమ్మెల్యే గొట్టిపాటి రవి. వేమవరం హత్యలపై ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నారు. బలరాం వర్గీయులు ప్రతిసారి ఇలానే చేస్తున్నారని గతంలో మహానాడులోనూ అడ్డుకునే ప్రయత్నం చేశారని తెలిపారు. తనది సర్దుకుపోయే మనస్తత్వమని, బలరాం పదే పదే రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. పార్టీకి చెడ్డ పేరు తెచ్చే వారు ఎవరో సీఎం చంద్రబాబుకు తెలుసని, ఈ విషయాలన్నీ ఆయనే చూసుకుంటారని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై.. అధినేత చంద్రబాబు, పార్టీ వర్గాల నుంచి నివేదికను తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లా నేతల నడవడికపై చర్యలకు ఉపక్రమించే ముందు.. ఇరువర్గాల వారితోనూ చంద్రబాబు భేటీ కావచ్చని తెలుస్తోంది.

17:56 - May 23, 2017
17:30 - May 23, 2017

హైదరాబాద్ : టీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలను మహానాడులో చర్చిస్తామని టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను గద్దె దింపడమే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు. కొద్ది రోజుల్లో టిడిపి మహానాడు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టెన్ టివి ఆయనతో ముచ్చటించింది. తాను పార్టీ వీడుతున్నానంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. టీఆర్ఎస్ కావాలనే దుష్రప్రచారం చేస్తోందన్నారు. మహానాడు వేదికగా 2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తామన్నారు. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

17:28 - May 23, 2017

హైదరాబాద్ : నక్సల్ బరి ఉద్యమాన్ని స్మరిస్తూ అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు వాల్ పోస్టర్లు వేశారు. నక్సల్ బరి ఉద్యమానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 23 నుండి 29వ తేదీ వరకు వారోత్సవాలు జరుపుకోవాలంని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా ప్రాంతాల్లో పోస్టర్లు దర్శనమిచ్చాయి.

 

17:11 - May 23, 2017

బొగ్గు స్కాంలో సీబీఐ ఛార్జీషీట్..

ఢిల్లీ : బొగ్గు స్కాం కేసులో సీబీఐ ఛార్జీషీట్ దాఖలు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు నవీన్ జిందాల్ తో పాటు మరో నలుగురిపై ఛార్జీషీట్ నమోదు చేసింది.

కొనసాగుతున్న అధిక ఉష్ణోగ్రతలు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. రామగుండం, హన్మకొండలో 45 డిగ్రీలు.. భద్రాచలం, నిజామాబాద్, ఆదిలాబాద్ లో 44 డిగ్రీలు..మెదక్, నల్గొండ, మహబూబ్ నగర్ లో 43 డిగ్రీలు..హైదరాబాద్ 42 డిగ్రీలు, ఖమ్మం 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీపై బీరేంద్ర సింగ్ స్పందన..

ఢిల్లీ : కడప..బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీల ఏర్పాటుపై కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్ స్పందించారు. స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యం కాదని నివేదికలు వచ్చాయని, ఆ నివేదికలపై తాను అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగిందన్నారు. అందుకే నాలుగు నెలల క్రితం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారని, మరో నెల రోజుల్లో నివేదిక వస్తుందన్నారు. కనీసం స్క్రాప్ ఆధారిత స్టీల్ ఫ్యాక్టరీ అయినా ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని టాస్క్ ఫోర్స్ కి చెప్పినట్లు తెలిపారు.

 

16:34 - May 23, 2017
16:32 - May 23, 2017

నల్గొండ : అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ఎన్నో కార్యక్రమాలు..సంక్షేమాలు చేపట్టినట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వెల్లడించారు. నల్గొండ జిల్లాలో రెండో రోజు ఆయన పర్యటిస్తున్నారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ ప్రభుత్వం చేపట్టిన..చేపడుతున్న పలు సంక్షేమ పథకాలను వివరించారు. పనిలో పనిగా విపక్షాలపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రానికి అన్ని విధాలుగా సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. తమను విరోధించే వారు తమపై అవినీతి ఆరోపణలు చేయలేదని, పారదర్శకంగా పాలించడం జరుగుతోందన్నారు. జీడీపీ, ఆర్థిక వృద్ధి అధిగమించడం జరిగిందన్నారు. ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతోందని, నోట్ల రద్దు తో నల్లధనం అరికట్టడం జరిగిందన్నారు. జన్ ధన్ యోజన కింద ఎంతో మందికి బ్యాంకు అకౌంట్లు ఓపెన్ చేయడం జరిగిందని, 5 కోట్ల మంది పేదలకు ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్లు అందించినట్లు తెలిపారు. సామాన్య కుటుంబాలకు లోన్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో పలు కార్యక్రమాలు చేయడం జరుగుతోందన్నారు. 104 శాటిలైట్ల ప్రయోగంతో భారత్ పేరు మారుమోగిందన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ ముట్టుకోలేదని, తమ ప్రభుత్వం దీనికి పరిష్కారం చూపెట్టడం జరిగిందన్నారు. 13వేల గ్రామాల్లో విద్యుత్ అందించడం జరిగిందని, ఇంకా 13వేల గ్రామాలకు 2018లోగా విద్యుత్ అందిస్తామన్నారు. పెద్దనోట్లు రద్దు అనంతరం డిజిటల్ లావాదేవీలను ప్రోత్సాహిస్తూ ముందుకెళుతున్నట్లు, రైతుల కోసం పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మోడీ హాయాంలో అవినీతి రహిత పాలన నడుస్తోందని, మూడేళ్ల పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ రాలేదన్నారు. యూపీఏ హాయాంలో భారీ అవినీతి జరిగిందని, తెలంగాణ రాష్ట్రానికి ఏ ప్రభుత్వం చేయని సహాయం బీజేపీ ప్రభుత్వం చేస్తోందన్నారు.

16:10 - May 23, 2017

జమ్మూ కాశ్మీర్ : తరచూ సరిహద్దు వద్ద దాడులకు దిగుతూ రెచ్చగొడుతున్న పాక్ కు భారత సైన్యం బుద్ధి చెప్పింది. సరిహద్దులోంచి ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడేందుకు యత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు..భారత ఆర్మీకి మధ్య కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. కాల్పుల్లో పలువురు ఉగ్రవాదులు హతం అవుతుండగా ఆర్మీ జవాన్లు వీరమరణం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో పాక్ బంకర్లపై దాడులు నిర్వహించినట్లు మేజర్ జనరల్ అశోక్ నరూ వెల్లడించారు. నౌషెరా ప్రాంతంలోని పాక్ శిబిరాలపై ఈనెల 20, 21 తేదీల్లో స్పెషల్ టెర్రర్ ఆపరేషన్ పేరిట దాడులు నిర్వహించినట్లు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ లో శాంతిభద్రతలను పరిరక్షించడడమే తమ ఉద్ధేశ్యమని, అందులో భాగంగానే దాడులు చేశామని చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను కూడా విడుదల చేశారు.

 

పాక్ బంకర్లపై భారత సైన్యం దాడులు..

ఢిల్లీ : పాక్ బంకర్లపై భారత సైన్యం దాడులు నిర్వహించింది. ఈనెల 21న స్పెషల్ టెర్రర్ ఆపరేషన్ నిర్వహించినట్లు భారత సైన్యం ప్రకటించింది. చొరబాట్లకు మద్దతిస్తుండడం వల్లే దాడులు నిర్వహించినట్లు, ఈ చొరబాట్లను అడ్డుకున్నట్లు ప్రకటించింది.

15:47 - May 23, 2017

హైదరాబాద్ : సినీ నటుడు చలపతిరావు వ్యాఖ్యలపై మహిళా సంఘాల నేతలు భగ్గుమన్నారు. సినీ రంగం నుంచి చలపతిరావును వెలేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు మహిళలను బహిరంగంగా అవమానించడమే అని.. మానవ హక్కులపై దాడి అంటూ ధ్వజమెత్తారు. మహిళలను కించపరిచేవారిపై ఇకనుంచి కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చారు. చలపతిరావు బహిరంగ క్షమాపణ చెప్పినా.. అంగీకరించేది లేదన్నారు.

15:46 - May 23, 2017

కామెడీ కంపుకొడుతోంది...చలాకి డైలాగుల పేరిట కూస్తున్న కూతలు చిర్రెత్తిస్తున్నాయి. నటుల హద్దు మీరిన పదజాలంతో సినీ ఆడియోఫంక్షన్లు మహిళలను కించపరుస్తూ సాగుతున్నాయి. కామెడీ యాక్టర్‌ మొదలు.. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ వరకు.. చాలామంది, చాలా సందర్భాల్లో తమ నోటి దురదను ప్రదర్శిస్తున్నారు. తాజాగా సీనియర్‌ తెలుగు నటుడు చలపతిరావు మహిళలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు యాక్టర్ల వరుస పిచ్చి ప్రేలాపనలతో ఆడియో ఫంక్షన్లు గబ్బు కొడుతున్నాయి. నోటికి అడ్డూ అదుపు లేకుండా నటులు మహిళలను కించపరుస్తూ చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. సహ నటీమణులు అని లేదు.. మహిళలు అన్న మినిమమ్‌ మర్యాద లేదు..మైకు దొరికింది కదా అని పిచ్చి కూతలు కూస్తున్నారు. హద్దులు దాటి డైలాగులు విసురుతున్నారు. క్యారెక్టర్‌ ఆర్టిస్టులే కాదు సూపర్‌ స్టార్‌లు కూడా మహిళలను అసభ్యపదజాలంతో సంభోదిస్తూ కించపరుస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే సరదా కదా సర్దుకుపోండి అంటున్నారు. తాజాగా సీనియర్ నటుడు చలపతిరావు మహిళలపై చేసిన వ్యాఖ్యలు నటులకు మహిళలపై ఉన్న కుంచిత భావాన్ని బయట పెట్టాయి. కార్యక్రమంలో యాంకర్‌ అడిగిన ప్రశ్నకు చలపతిరావు ఇచ్చిన సమాధానం అక్కడున్న వారినే కాదు.. ఆడియో ఫంక్షన్‌ని టీవీల ద్వారా వీక్షిస్తున్న ప్రతివారినీ తలదించుకునేలా చేశాయి.

అనుష్కపై ఆలీ వివాదాస్పద వ్యాఖ్యలు..
గతంలో, స్టార్‌ కమేడియన్ ఆలీ హీరోయిన్ అనుష్కపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. అనుష్క అవయవాల గురించి అలీ చేసిన కామెంట్‌ సామాన్యులకే కాదు సినీ ప్రముఖులకు కూడా చిర్రెత్తించింది. చివరకు నోటిని అదుపులో పెట్టుకోమని అలీకి ఓ హీరో వార్నింగ్ ఇచ్చే వరకు వచ్చింది.

అమ్మాయిలపై స్టార్‌ హీరో అసభ్యపదాలు..
పాపం అలీ కామెడీ మూడ్‌లో ఏదో అనేశాడు అనుకుంటే స్టార్‌ హీరో కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఓ ఆడియో ఫంక్షన్లో అమ్మాయిలు వెంట పడితే ఎలా ఊరుకుంటామా అంటూ అసభ్యంగా మాట్లాడారు. దీనిపై మహిళా సంఘాలు కస్సుమన్నాయి. చివరకు హీరోగారు తాను మాట్లాడిందేమిటో ఒక్కసారి వెనక్కి తీసుకొని మహిళా లోకానికి సారీ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

నిస్సిగ్గుగా వ్యాఖ్యలు..
ఇదీ మన నటులకు మహిళలపై ఉన్న మర్యాద... అదీ అందరిసమక్షంలో నిస్సిగ్గుగా చేస్తున్న వ్యాఖ్యలు ఇవి. ఏంటి ఇది అని ప్రశ్నిస్తే అంతా తూచ్ సరదా మాత్రమే అని కనీస పశ్చాత్తాపం లేకుండా ప్రవర్తిస్తున్నారు. చలపతిరావు చేసిన వ్యాఖ్యలపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మహిళలను కించపరిచినందుకు చలపతిరావుపై చర్యలు తీసుకోవాలని బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశాయి. సినిమాల్లో మాత్రం స్త్రీని దైవంగా అభివర్ణించే డైలాగులతో ఊదరగొట్టే.. నటులు అటు సహ నటీమణులను, యావత్‌ స్ర్తీలోకాన్ని చిన్నచూపు చూడటం సిగ్గుచేటు. ఇలాంటి పిచ్చి కూతలకు ఆడియో ఫంక్షన్లు కేరాఫ్‌ అడ్రస్‌గా మారాయి. ఇప్పటికైనా సినీ నటులు నోటిని అదుపులో పెట్టుకుని తమతో పాటు ఇండస్ట్రీ హూందాతనాన్నీ కాపాడాల్సిన అవసరం ఉంది.

15:43 - May 23, 2017

చిత్తూరు : శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చిన భక్తుల కారును దొంగలు దోచేశారు. రంగారెడ్డి జిల్లా కొండాపూర్‌కు చెందిన ఆర్మీ జవాన్ గజేంద్రారెడ్డి ఫ్యామిలీతో కలిసి ఈనెల 20 న తిరుమలకు వచ్చాడు. రాత్రి కారును యాత్రికుల సముదాయంలో పార్క్ చేశారు. దర్శనం అనంతరం బయటకు వచ్చేసరికి కారు కనిపించలేదు. లబోదిబోమంటూ భక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కారు ఖరీదు 9 లక్షలు కాగా.. కారులో రూ.25 వేల నగదు, 7 సెల్ ఫోన్లు ఉన్నాయని గజేంద్రారెడ్డి చెబుతున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

15:41 - May 23, 2017

అనంతపురం : బుధవారం జరిగే రాయలసీమ బంద్‌ను విజయవంతం చేయాలని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి. మధు ప్రజలకు పిలుపునిచ్చారు. రాయలసీమలో కరువు విలయతాండవం చేస్తోంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మధు మండిపడ్డారు. వెంటనే కరువు నివారణ చర్యలు చేపట్టాలన్నారు. అనంతపురం జిల్లా కదిరిలో బంద్‌ను విజయవంతం చేయాలంటూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కదిరి మార్కెట్‌యార్డులో జరుగుతున్న గొర్రెల సంతను సందర్శించారు. పశుగ్రాసంలేని కారణంగా వాటిని తక్కువ ధరకే విక్రయిస్తున్నట్టు రైతులు మధుతో మొరపెట్టుకున్నారు. ఆ తర్వాత ఉపాధి హామీ పథకం పనులు నిర్వహిస్తున్న మహిళలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఉపాధి కూలీ దినాలను 200 రోజులకు పెంచాలని మధు డిమాండ్‌ చేశారు.

15:37 - May 23, 2017

సుఖోయ్ 30 జెట్ విమానం అదృశ్యం..

ఢిల్లీ : ఐఏఎఫ్ కు చెందిన సుఖోయ్ -30 జెట్ విమానం అదృశ్యమైంది. చైనా సరిహద్దులో ఈ విమానం అదృశ్యమైనట్లు తెలుస్తోంది. అసోం, అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. విమానంలో ఇద్దరు పైలట్లున్నారు.

ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్ నేతలు..

ఢిల్లీ : దేశ రాజధానిలో ఏపీ కాంగ్రెస్ నేతలు పర్యటిస్తున్నారు. ప్రత్యేక హోదాకు మద్దతిచ్చే జాతీయ నాయకులను ఏపీ కాంగ్రెస్ నేతలు కలువనున్నారు. రాష్ట్రపతితో కూడా భేటీ అవుతారని తెలుస్తోంది.

రాహుల్ తో రఘువీరా భేటీ..

ఢిల్లీ : ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు..పార్టీ బలోపేతం ప్రత్యేక హోదా సాధన అంశాలపై రాహుల్ తో చర్చించారు.

లాలూ కూతురు సీఏపై ఆరోపణలు..

ఢిల్లీ : లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు మీసా భారతి చార్టెడ్ అకౌంటెంట్ ను ఈడీ అరెస్టు చేసింది. రూ. 8వేల కోట్లను దారి మళ్లించినట్లు సీఏ రాజేష్ అగర్వాల్ పై ఆరోపణలున్నాయి. మీసా భారతికి షెల్ కంపెనీతో ఉన్న సంబంధాలపై సీఏ రాజేష్ అగర్వాల్ ను ఈడీ ప్రశ్నించనుంది.

స్కూల్ ఫీజుల నియంత్రణపై నివేదిక..

హైదరాబాద్ : స్కూల్ ఫీజుల నియంత్రణపై ఈనెల 29న ప్రభుత్వానికి నివేదిక అందచేస్తామని ప్రీ రెగ్యులేషన్ కమిటీ ఛైర్మన్ తిరుపతి రావు పేర్కొన్నారు. కమిటీ రూపొందించిన డ్రాఫ్ట్ పై అభ్యంతరాలు చెప్పేందుకు ఈనెల 25 వరకు గడవు పెంచామని, అన్ని అభిప్రాయాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. ఫీజుల నియంత్రణపై ప్రభుత్వానిదే తుది నిర్ణయమన్నారు.

వైసీపీ ప్లీనరీకి ఏర్పాట్లు - పార్థసారధి..

విజయవాడ : వైసీపీ ప్లీనరీ కోసం ఏర్పాట్లు చేయడం జరుగుతోందని, జూన్ 18,19 తేదీల్లో జిల్లా స్థాయి ప్లీనరీలు నిర్వహించనున్నట్లు వైసీపీ నేత పార్థసారధి వెల్లడించారు. ఈనెలాఖరులోగా బూత్ స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా ప్లీనరీల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతామని పేర్కొన్నారు.

మంత్రి దేవినేని జోగి రమేష్ సవాల్..

విజయవాడ : తోటపల్లి ప్రాజెక్టుపై బహిరంగ విచారణకు మంత్రి దేవినేని ఉమ సిద్ధమా అని వైసీపీ నేత జోగి రమేష్ సవాల్ విసిరారు.

రుజువు చేస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా - గొట్టిపాటి..

ప్రకాశం : తన వైపు నుండి ఎలాంటి తప్పు లేదని, తప్పు చేసినట్లు రుజువు చేస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని గొట్టిపాటి ప్రకటించారు. ఆయన టెన్ టివితో మాట్లాడారు. తాను సర్దుకపోతున్నట్లు, కరణం వర్గీయులు కావాలనే రెచ్చగొడుతున్నారని తెలిపారు. తాను హత్యా రాజకీయాలకు పాల్పడడం లేదని తెలిపారు.

15:20 - May 23, 2017

నల్గొండ : దక్షిణ భారతదేశంలో బీజేపీ పాగా వేస్తుందని..అది తెలంగాణ నుండి ప్రారంభం అవుతుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా జోస్యం చెప్పారు. నల్గొండ జిల్లాలో రెండో రోజు ఆయన పర్యటించారు. పెద్దపల్లి దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకల్లో పాల్గొని ఆయన మాట్లాడుతూ...2019లో తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని అందుకని ప్రతి ఏటా తెలంగాణ రాష్ట్రానికి రూ. 20వేల కోట్లు కేంద్రం ఇస్తోందని తెలిపారు. బీజేపీ అధికారంలోకి రావడానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు.

15:06 - May 23, 2017
14:36 - May 23, 2017

ఢిల్లీ : బాలీవుడ్‌ నటుడు, బిజెపి ఎంపి పరేష్‌ రావెల్‌ వివాదస్పద ట్వీట్‌పై స్పందించడానికి ప్రముఖ రచయిత్రి, సామాజిక కార్యకర్త అరుంధతిరాయ్‌ నిరాకరించారు. ప్రస్తుతం తన కొత్త పుస్తకం పనిలో బిజీగా ఉన్నానని అరుంధతిరాయ్‌ ఓ ఛానల్‌తో మాట్లాడుతూ అన్నారు. అరుంధతి రాయ్‌ రాసిన 'ద మినిస్ట్రీ ఆప్‌ ఎట్‌మోస్ట్‌ హ్యాపీనెస్‌' పుస్తకాన్ని వచ్చేనెల మార్కెట్‌లోకి తేనున్నారు. 30 దేశాల్లో ఒకేసారి ఈ పుస్తకం విడుదల అవుతోంది. కశ్మీర్‌లో రాళ్లు విసిరే యువకుడికి బదులుగా అరుంధతిరాయ్‌ను ఆర్మీ జీప్‌కు కట్టాలని పరేష్‌ రావెల్‌ ట్వీట్‌ చేయడంపై దుమారం చెలరేగింది. కశ్మీర్‌ యువకుడిని జీప్‌కు కట్టిన తర్వాత అరుంధతి రాయ్‌ కశ్మీర్‌ వెళ్లారని పాక్‌కు మద్దతుగా ప్రకటన చేశారని వార్తొలొచ్చాయి. ఇది పూర్తిగా తప్పడు ప్రచారమని ఆమె ఖండించారు. పరేష్‌ రావెల్‌ ట్వీట్‌ చేసిన కొన్ని గంటలకే కశ్మీరీ యువకుడిని జీప్‌కు కట్టిన ఆర్మీ మేజర్ లితుల్‌ గోగొయ్‌కు అవార్డు వరించడం గమనార్హం.

14:33 - May 23, 2017

ఢిల్లీ : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వేసిన పరువునష్టం దావా కేసులో ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు హైకోర్టు నోటీసు జారీ చేసింది. జులై 26 వరకు దీనిపై సమాధానం చెప్పాలని ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్‌ను ఆదేశించింది. కేజ్రీవాల్‌పై సోమవారం మరో 10 కోట్లకు దావా వేశారు. పరువునష్టం కేసు విచారణలో భాగంగా మే 17న...కేజ్రీవాల్ తరపు న్యాయవాది రాంజఠ్మాలానీ జైట్లీని క్రుక్‌ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను జైట్లీ సీరియస్‌గా తీసుకోవడంతో ఆయన తరపు న్యాయవాది కేజ్రీవాల్‌పై మరో పరువునష్టం దావా వేశారు. కేజ్రీవాల్‌ చెప్పడం వల్లే తాను అలా వ్యాఖ్యానించానని రాంజెఠ్మలాని చెప్పారు. కేజ్రీవాల్‌పై పరువునష్టం దావా కేసు వేయడం ఇది రెండోసారి. ఇంతకుముందు డిడిసిఎ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జైట్లీ అక్రమాలకు పాల్పడ్డారని ఆప్‌ ఆరోపించింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న జైట్లీ కేజ్రీవాల్‌తో పాటు ఐదుగురు ఆప్‌ నేతలపై పది కోట్ల పరువునష్టం దావా కేసు వేసిన విషయం తెలిసిందే.

14:31 - May 23, 2017

కర్నూలు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయలసీమను వివక్షకు గురి చేస్తున్నాయని సీపీఎం పార్టీ కేంద్రకమిటీ సభ్యులు గఫూర్‌ పర్కొన్నారు. కర్నూలులోని సుందరయ్య భవన్‌లో ఆయన మాట్లాడారు. రాయలసీమలోని కరవు పట్ల చంద్రబాబు పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బుధవారం రాయలసీమ బంద్‌ పాటిస్తున్నామని.. దీనిని ప్రజలందరూ జయప్రదం చేయాలని గఫూర్‌ కోరారు.

14:29 - May 23, 2017

కడప : నారాయణరెడ్డి సెక్యూరిటీ కావాలని అడిగినా ప్లానింగ్‌ ప్రకారమే ఇవ్వలేదని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. పత్తికొండలో వైసీపీ అభ్యర్థి 50 వేల మెజారిటీతో గెలుస్తుందన్నారు. పోలీసుల మీద నమ్మకం లేదని.. పోలీసు డిపార్ట్ మెంట్ తో విచారణ జరిపితే న్యాయం ఎలా జరుగుతుందని..సీబీసీఐడీ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తప్పు ఎవరిదైనా శిక్షించి జైలుకు పంపాలన్నారు. పోలీసు డిపార్ట్ మెంట్ సహకారంతో ఈ హత్య జరిగిందన్నారు.

14:25 - May 23, 2017

ప్రకాశం : జిల్లాలో టిడిపి నేతల మధ్య ఘర్షణలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఫ్యాక్షన్ గొడవలు..హత్యలు ఎక్కువవుతున్నాయి. ఇటీవలే టిడిపి ఎమ్మెల్సీ కరణం బలరాం వర్గీయులను దారికాచి దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ హత్య చేసింది ఎమ్మెల్యే గొట్టిపాటి వర్గీయులేనంటూ కరణం బలరాం ఆరోపణలు గుప్పించారు. గొడవలు..హత్యలు మరువక ముందే మరోసారి గొట్టిపాటి - కరణం వర్గీయులు మరోసారి గొడవకు దిగారు. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ను కరణం వర్గీయులు అడ్డుకున్నారు. ఒంగోలు టిడిపి సంస్థాగత ఎన్నికల సమావేశం రసాభాసగా మారింది. మంత్రి పరిటాల సునీత సమక్షంలోనే ఇదంతా జరగడం గమనార్హం. చివరకు మంత్రులు గొట్టిపాటికి సర్దిచెప్పి వెనక్కి పంపించడంతో గొడవ కాస్త సద్దుమణిగింది.

14:13 - May 23, 2017

విజయనగరం : ఏపీ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు అధికమౌతున్నాయి. గత కొన్ని రోజులుగా పలు ప్రమాదాల్లో నిండు జీవితాలు గాలిలో కలిసిపోతున్నాయి. నిర్లక్ష్యంగా..అతివేగంగా వాహనాలు నడపడంతోనే ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో లారీ ఢీకొనడంతో ఐదుగురు మృత్యువాత పడ్డారు. డెంకాడ మండలం నాతవలస వద్ద ఆటో జాతీయ రహదారిపైకి వస్తుండగా వేగంగా వస్తున్న లారీ ఢీకొంది. దీనితో ఆటో నుజ్జునుజ్జైంది. ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణీకులు మృతి చెందగా మరికొంతమందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఆటో..లారీ డ్రైవర్ల అజాగ్రత్తల వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. మృతుల్లో ఇద్దరు మహిళలున్నట్లు తెలుస్తోంది.

అప్ఘన్ ఆర్మీ బేస్ క్యాంప్ పై ఉగ్ర దాడి..

ఢిల్లీ : అప్ఘనిస్తాన్ ఆర్మీ బేస్ క్యాంప్ పై ఉగ్రవాదులు దాడి జరిపారు. ఈ దాడిలో 11 మంది అప్ఘన్ సైనికులు మృతి చెందారు.

నారాయణరెడ్డిది ప్రభుత్వ హత్య - జగన్..

కడప : నారాయణరెడ్డిది ప్రభుత్వ హత్య అని వైసీపీ నేత వైఎస్ జగన్ పేర్కొన్నారు. పథకం ప్రక ఆరమే నారాయణరెడ్డి గన్ లైసెన్స్ ను పోలీసులు పెండింగ్ లో ఉంచారని, నారాయణరెడ్డి హత్యలో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని ఆరోపించారు. దీనిపై సీబీసీఐడీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

కేజ్రీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ..

ఢిల్లీ : సీఎం కేజ్రీవాల్ పై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పరువు నష్టం దావా వేశారు. రూ. 10 కోట్లు పరువు నష్టం దావా వేశారు. జులై 26న కోర్టుకు హాజరు కావాలని సీఎం కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేశారు.

చిన్నమాదారంలో బీజేపీ సభ..

నల్గొండ : చిన్నమాదారంలో బీజేపీ సభ నిర్వహించింది. ఇద్దరు మహిళలకు గ్యాస్ స్టవ్ లను పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అందచేశారు. చిన్నమాదారం సర్పంచ్ భాగ్యమ్మ చేస్తున్న కార్యక్రమాలు ఆనందం..ఆశ్చర్యం కలిగించాయన్నారు. గ్రామంలో 100 శాతం గ్యాస్ కనెక్షన్లు..జన్ ధన్ యోజన బ్యాంకు ఖాతాలు..పెన్షన్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. త్వరలో మరుగుదొడ్ల నిఆర్మణం పూర్తవుతుందని, మోడీ సర్కార్ చేపట్టిన 103 పథకాలను పేదలకు చేరేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

 

గాలిపై కేసు నమోదు..

కడప : ప్రొద్దుటూరు త్రీ టౌన్ పీఎస్ లో గాలి జనార్ధన్ రెడ్డిపై 420 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. గాలి తనకు రూ. 5 కోట్లు ఎగ్గొట్టాడని గుజరాత్ కు చెందిన బాలాభాయ్ పటేల్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు.

గొట్టిపాటి -కరణం వర్గీయుల ఘర్షణ..

ప్రకాశం : ఒంగోలు ఏ1 కన్వెన్షన్ లో గొట్టిపాటి - కరణం వర్గీయుల మధ్య మళ్లీ ఘర్షణ చెలరేగింది. వేమవరం హత్యలకు గొట్టిపాటి కారణమంటూ ఆయనపై కరణం వర్గీయులు దూసుకెళ్లారు. తోపులాటలో గొట్టిపాటి చొక్కా చినిగిపోయింది. గొట్టిపాటిని ఘటనా స్థలం నుండి పార్టీ పెద్దలు తరలించారు.

బీజేపీ విస్తరిస్తోంది - షా..

నల్గొండ : ప్రధాని మోడీ నేతృత్వంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు బీజేపీ విస్తరిస్తోందని, దక్షిణ భారతదేశంలో బీజేపీని బలతోపేం చేస్తామని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమీత్ షా ప్రకటించారు. రైతులు, మహిళలు, బలహీన వర్గాల అభ్యున్నతికి మోడీ సర్కార్ ఎన్నో పథకాలు అమలు చేస్తోందని తెలిపారు.

13:31 - May 23, 2017

టాలీవుడ్ రెబల్ స్టార్ 'ప్రభాస్' తాజా చిత్రంపై ఇప్పటి నుండే భారీ అంచనాలు నెలకొంటున్నాయి. 'బాహుబలి', 'బాహుబలి -2' చిత్రాల కోసం సంవత్సరాల తరబడి ప్రభాస్ కష్టపడి నటించిన సంగతి తెలిసిందే. ఆ మధ్యలో ఎలాంటి చిత్రాలకు ప్రభాస్ సంతకం చేయలేదు. బాహుబలి 2 చిత్రం అనంతరం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కబోయే 'సాహో' చిత్రానికి సంతకం చేశాడు. బాహుబలి..బాహుబలి 2 చిత్రాలు తెలుగు..తమిళ..హిందీ భాషల్లో రిలీజ్ చేశారు. ఆయా భాషల్లో డబ్బింగ్ చెప్పారు. కానీ 'సాహో' చిత్రాన్ని తెలుగు..హిందీ భాషల్లో తెరకెక్కించాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తోందంట. ఇందుకోసం డార్లింగ్ ప్రభాస్ హిందీలో డైలాగులు ప్రాక్టిస్ చేస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ సంస్థ సుమారు రూ. 150 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ప్రభాస్ సరసన నటించబోతున్న హీరోయిన్ ఎవరు అన్నది తేలలేదు. 

13:28 - May 23, 2017
13:26 - May 23, 2017

ప్రకాశం: వేమవరంలో జరిగిన జంట హత్యలను ఎమ్మెల్యే గొట్టిపాటే చేయించారని ఎమ్మెల్సీ కరణం బలరామకృష్ణమూర్తి తనయుడు కరణం వెంకటేష్ ఆరోపించారు. ఆయన '10టివి 'తో మాట్లాడుతూ తెలుగు దేశం కార్యకర్తలకు అన్యాయం జరగకుండా చూడాలని చంద్రబాబును కోరనున్నట్లు తెలిపారు. ఎవరు ఎలాంటి వారో అధిష్టానానికి తెలుసునని పేర్కొన్నారు. ఇంకా అనేక విషయాలను వివరించారు. పూర్తి వివరాలకోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

13:25 - May 23, 2017

ప్రముఖ రచయిత 'అరుంధతి రాయ్'పై సినీ నటుడు, బీజేపీ నేత పరేష్ రావల్ చేసిన ట్వీట్ తీవ్ర వివాదస్పదమైంది. కాశ్మీర్ లో రాళ్ల దాడుల నుండి అడ్డుకోవడానికి ఆర్మీ జీపు ముందు అరుంధతి రాయ్ ను కట్టేయాలని పరేష్ ట్వీట్ చేశారు. గత నె లలో ఓ ఆర్మీ జీపుకు రాళ్ల దాడికి పాల్పడిన వ్యక్తిని కట్టేసి ఊరేగించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన మిలిటరీ కోర్టు ఇందులో తప్పేమిలేదని పేర్కొంది. అంతేగాకుండా పౌరుడిని జీపుకు కట్టేసి రోడ్లపై తిప్పిన మేజర్ గగోయ్ ని ఆర్మీ సన్మానించింది కూడా. అరుంధతి రాయ్ పై చేసిన ట్వీట్స్ పై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. పీడీపీ..బీజేపీ మధ్య సయోధ్యకు ఆయనను ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నించారు.
ఇంతకు అరుంధతి రాయ్ ఏమన్నారు..
పాకిస్తాన్ ఏఆర్ వై న్యూస్ ఛానెల్ కు అరుంధతి రాయ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఏడు లక్షల మంది కాదు..70 లక్షల మంది సైన్యం వచ్చినా కాశ్మీరీల గొంతు నొక్కలేరని..భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు దుందుడుకు వంటివని అభివర్ణించారు. జర్నలిస్టులపై భారత సైన్యం కూడా అతిగా ప్రవరిస్తోందని ఆరోపణలు గుప్పించారు. 

13:24 - May 23, 2017

ప్రకాశం : వేమవరం జంట హత్యలకు మాకు ఎలాంటి సంబంధం లేదని అద్ధంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి స్పష్టం చేశారు. ఆయన '10టివి'తో మాట్లాడారు...ఆయన ఈ రోజు ఒంగోలులోని ఏ1 కన్వెన్షన్ హాల్ లో పాల డైరీకి చెందిన సభ జరిగింది. ఈ సభకు ఇరు వర్గాల వారు హాజరయ్యారు. ఇరు వర్గాల మధ్యఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో గొట్టిపాటి రవి చొక్కి చినిగిపోయినట్లు సమాచారం. అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను శాంతింపచేసి... గొట్టిపాటి వర్గాన్ని బయటకు తీసుకెళ్లారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

13:07 - May 23, 2017
13:03 - May 23, 2017

టాలీవుడ్ ప్రిన్స్ తాజా చిత్రం షూటింగ్ లో ఉండగానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ తెరకెక్కిస్తున్న 'స్పైడర్' చిత్రంలో మహేష్ నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఇంకా కొనసాగుతోంది. శ్రీమంతుడు బ్లాక్ బస్టర్ చిత్రాన్ని ఇచ్చిన 'కొరటాల శివ' దర్శకత్వంలో 'మహేష్ బాబు' చిత్రం చేయనున్నాడు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో 'మహేష్' సరసన 'కైరా అద్వానీ' హీరోయిన్ గా నటిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. రెగ్యులర్ షూటింగ్ చెన్నైలో సోమవారం నుండి ప్రారంభమైంది. 'భరత్‌ అనే నేను' అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది జనవరి 11న సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.

12:55 - May 23, 2017

టాలీవుడ్ కు చెందిన పలువురు సినీ నటులు..యాంకర్స్ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వివాదాలు కొని తెచ్చుకుంటున్నారు. అనంతరం క్షమాపణలు చెప్పి ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నారు. ఇటీవలే కామెడీ యాక్టర్ ఆలీ, సినీ హీరో బాలకృష్ణ..తదితరులు మహిళలపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సీనియర్ నటుడు 'చలపతిరావు' అమ్మాయిలనుద్దేశించి చులకన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం సాయంత్రం 'రారండోయ్ వేడుక చూద్దాం' ఆడియో ఫంక్షన్‌ జరిగింది. ఈ ఫంక్షన్ కు చలపతిరావు విచ్చేశారు. ఈ సందర్భంగా యాంకర్‌ ఒక ప్రశ్న అడిగారు. 'అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా మీరు చెప్పండి'..? అడిగింది. మైక్ తీసుకున్న 'చలపతిరావు'... అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం కాదు గానీ.. పక్కలోకి మాత్రం పనికొస్తారు' అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ పై తీవ్ర దుమారం రేగుతోంది. 

12:46 - May 23, 2017
12:45 - May 23, 2017

హైదరాబాద్: తెలంగాణా రాష్ట్రంలో రెండేళ్ల ముందుగానే ఎన్నికల సందడి మొదలైంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలపై ఆందోళనలు తీవ్రం అవుతుండడం, విపక్ష పార్టీలు ఏకం అయ్యే ప్రయత్నాలు మొదలు కావడం జాతీయ పార్టీలు తమ ప్రాబల్యాన్ని చాటుకునేందుకు తెలంగాణాపై దృష్టి పెట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో ఎన్నికల వేడి రగులుకుంటోంది.

రాష్ట్రంలో మొదలైన ఎన్నికల వేడి ...

ఇప్పటికే రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ గత 3 నెలలుగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ మధ్యనే జరిగిన ప్లీనరీ, బహిరంగ సభలతో పార్టీ హడావుడి చేసింది. దీంతో జాతీయ పార్టీలు కూడా ఇప్పుడిప్పుడే తెలంగాణాలో పట్టు నిలుపుకునే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉండి వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీని ఢీకొట్టేందుకు సిద్ధం అవుతోంది. మరోవైపు ఐదుగురు ఎమ్మెల్యేలున్న బీజేపీ కూడా రాబోయే ఎన్నికల్లో అధికారాన్ని దక్కించు కోవడంపై దృష్టి సారించింది. పార్టీ జాతీయ అధ్యక్షులు అమీత్ షా నల్గొండ జిల్లాలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంటోంది. మరో వారం రోజుల వ్యవధిలో కాంగ్రెస్ అగ్రనేత రాహూల్ గాంధీ కూడా సంగారెడ్డిలో నిర్వహించే భారీ బహిరంగ సభకు హాజరవుతున్నారు.

3 నెలలుగా పార్టీ సభ్యత్వ నమోదు .....

ఈ నేపథ్యంలో జాతీయ పార్టీలను ఎదుర్కొనేందుకు గులాబీ దళపతి కేసీఆర్‌..ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారన్న ప్రచారం పార్టీలో మొదలైంది. ప్రధాన పార్టీలు ప్రజాక్షేత్రంలోకి దిగడంతో ప్రభుత్వ పరంగా,..పార్టీ పరంగా కార్యక్రమాలను చేపట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ భావిస్తున్నట్లు పార్టీ నేతలు అంటున్నారు. జాతీయ పార్టీలు అనుసరించే విధానాలకు అనుగుణంగా వ్యవహరించాలన్న అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తం అవుతోంది. అయితే బీజేపీతో ఇటీవల కాలంలో సత్సంబంధాలను కొనసాగిస్తున్న టీఆర్‌ఎస్‌..బీజేపీ నేతల టూర్లపై ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ కృతజ్ఙతతో ఉంటామని ప్రకటన చేసిన కేసీఆర్‌..ఆ పార్టీ జాతీయ నాయకుల వైఖరిపై ఎలా వ్యవహరిస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.

12:40 - May 23, 2017

హైదరాబాద్: ప్రస్తుతం మనం శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందాం. ఒకప్పుడు చూసుకుంటే శిశుమరణాలు కావచ్చు, బాలింతల మరణాలు కావచ్చు ఎక్కువగా ఉండేవి. కానీ ఈ మధ్య కాలంలో చూసుకుంటే మళ్లీ రిపీట్ అవుతున్నాయా అన్న సందేహం కలుగుతోంది. గణాంకాల మరణాల ప్రకారం బాలింతల మరణాలు చూసుకుంటే ఇపుడు ఎక్కువగా ఉంటున్నాయి. అస్సలు బాలింతల మరణాలు ఎందుకు జరుగుతున్నాయి? ప్రభుత్వాసుపత్రుల్లో ఇలాంటి మరణాలు జరగడానికి గల కారణాలు ఏమిటి? ఇదే అంశంపై మానవి 'వేదిక'లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో జనవిజ్ఞాన వేదిక నుండి డాక్టర్ రమాదేవి,టి.కాంగ్రెస్ నేత ఇందిర శోభన పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

బిలాస్ పూర్ లో 49 డిగ్రీల ఉష్ణోగ్రత

హైదరాబాద్: ఛత్తీస్ గఢ్ లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బిలాస్ పూర్ లో 49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది.

నటుడు సూర్యకు అరెస్ట్ వారెంట్

చెన్నై : నటుడు సూర్యకు అరెస్ట్ వారెంట్ జారీఅయ్యింది. 2009 లో జర్నలిస్టుల పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసు లో సూర్య కోర్టుకు హాజరు కాలేదు. సూర్యతో పాటు మరో 8 మందికి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

తిరుమలలో పార్కు చేసిన కారులో చోరీ

చిత్తూరు : తిరుమలలో పార్క్ చేసిన కారులో చోరీ జరిగింది. యాత్ర సముదాయం వద్ద పార్కు చేసిన కారు నుంచి రూ. 25వేలు, రూ.9.75 లక్షల విలువైన 7 సెల్ ఫోన్లు చోరీకి గురయ్యాయి. భక్తులు స్వామివారి దర్శనానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

మీసా భారతి ఛార్టె డ్ అకౌంటెంట్ ను అరెస్ట్

ఢిల్లీ : లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతి ఛార్టె డ్ అకౌంటెంట్ ను ఈడీ అరెస్ట్ చేసింది. రూ. 8వేల కోట్లను దారిమళ్లించినట్లు సీఏ రాజేష్ అగర్వాల్ పై ఆరోపణలు వచ్చాయి. మీసా భారతికి షెల్ కంపెనీతో ఉన్న సంబంధాలపై సీఏ రాజేష్ అగర్వాల్ ను ఈడీ ప్రశ్నించనుంది.

మంత్రి నారా లోకేష్ పై సీబీఐకి ఫిర్యాదు

విశాఖ : మంత్రి నారా లోకేష్ పై వైసీపీ సీబీఐకి ఫిర్యాదు చేసింది. దస్పల్లా భూముల వ్యవహారంలో లోకేష్ పాత్ర ఉందని ఆరోపిస్తూ సీబీఐకి వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వానికి చెందిన దస్పల్లా భూముల్లో టిడిపి కార్యాలయం ఎలా నిర్మిస్తారు అని వైసీపీ నేత అమర్ నాథ్ ప్రశ్నించారు.

ఒంగోలులో మళ్లీ ఉద్రిక్తత

ప్రకాశం : జిల్లా రాజధాని ఒంగోలులో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. ఏ వన్ కన్వెన్షన్ హాల్ లో కరణం బలరాం, గొట్టిపాటి రవికుమార్‌ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. జిల్లా టీడీపీ అధ్యక్షుడి ఎన్నిక నేపథ్యంలో ఈ వివాదం తలెత్తింది. దీంతో ఇరువర్గాలు బాహాబాహికి దిగాయి. ఈ ఘటనలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికి చొక్కా చినిగిపోయింది. అప్రమత్తమైన పోలీసులు, పార్టీ పెద్దలు సమస్యను పెద్దది కాకుండా చేసే ప్రయత్నం చేశారు.

11:53 - May 23, 2017

హైదరాబాద్: సికింద్రాబాద్‌ జింఖానా గ్రౌండ్‌ దగ్గర వాకర్స్‌ నిరసన చేపట్టారు. 'సేవ్‌ పరేడ్‌ గ్రౌండ్‌' అంటూ ప్లకార్డుల ప్రదర్శించారు. తెలంగాణ ప్రభుత్వం జింఖానా గ్రౌండ్‌లో కొత్త సచివాలయాన్ని నిర్మించవద్దని వాకర్స్‌ విజ్ఞప్తి చేశారు. ఈ గ్రౌండ్‌ను తరలిస్తే ఆడుకునేందుకు తమకు స్థలమే ఉండదంటున్నారు. ప్రభుత్వం మరోసారి ఈ నిర్ణయంపై పునరాలోచించాలంటున్నారు.

11:50 - May 23, 2017

హైదరాబాద్: సికింద్రాబాద్‌ జింఖానా గ్రౌండ్‌ దగ్గర వాకర్స్‌ నిరసన చేపట్టారు. 'సేవ్‌ పరేడ్‌ గ్రౌండ్‌' అంటూ ప్లకార్డుల ప్రదర్శించారు. తెలంగాణ ప్రభుత్వం జింఖానా గ్రౌండ్‌లో కొత్త సచివాలయాన్ని నిర్మించవద్దని వాకర్స్‌ విజ్ఞప్తి చేశారు. ఈ గ్రౌండ్‌ను తరలిస్తే ఆడుకునేందుకు తమకు స్థలమే ఉండదంటున్నారు. ప్రభుత్వం మరోసారి ఈ నిర్ణయంపై పునరాలోచించాలంటున్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

11:48 - May 23, 2017

ప్రకాశం : జిల్లా రాజధాని ఒంగోలులో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. కరణం బలరాం, గొట్టిపాటి రవికుమార్‌ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. జిల్లా టీడీపీ అధ్యక్షుడి ఎన్నిక నేపథ్యంలో ఈ వివాదం తలెత్తింది. దీంతో ఇరువర్గాలు బాహాబాహికి దిగాయి.

11:46 - May 23, 2017

హైదరాబాద్: మాంచెస్టర్‌ దాడిని ప్రపంచవ్యాప్తంగా పలువురు ఖండించారు. మృతులకు సోషల్‌ మీడియా ద్వారా సంతాపం తెలిపారు. మాంచెస్టర్‌ పేలుడు దాడి తనను షాక్‌ గురి చేసిందన్నారు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇక ఈ దాడి తనను తీవ్ర మనస్తాపానికి గురి చేసిందన్నారు ప్రధాని నరేంద్రమోదీ. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. పేలుడులో పాల్గొన్న వారందరూ త్వరగా కోలుకోవాలని ఆశించారు బాలీవుడ్‌ నటి ప్రియాంకచోప్రా.

11:36 - May 23, 2017

అనంతపురం : గార్లదిన్నె మండలం ముకుందాపురంలో పంట కుంటలను గవర్నర్ నరసింహన్ పరిశీలించారు. పంట కుంటల గురించి రైతులను గవర్నర్ నరసింహన్ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యామినీబాల, కలెక్టర్, పీడీ తదితరులు పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

11:34 - May 23, 2017

అమరావతి : ఏపీలో టీడీపీ జిల్లాల అధ్యక్షుల ఎంపిక దాదాపు పూర్తయింది. శ్రీకాకుళం జిల్లా అధ్యక్షురాలిగా గౌతు శిరీష, విశాఖ సిటీ-వాసుపల్లి గణేష్‌, విశాఖ రూరల్‌-పి.రమేశ్‌బాబు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులుగా నామన రాంబాబు, పచ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులుగా తోట సీతారామలక్ష్మి, కృష్ణా జిల్లాకు బొచ్చుల అర్జునుడు, విజయవాడ అర్బన్‌-బుద్దా వెంకన్న, గుంటూరు జిల్లాకు జీవీ ఆంజనేయులు, ప్రకాశం జిల్లాకు దామచర్ల జనార్దన్‌, నెల్లూరు జిల్లాకు బీద రవిచంద్ర, చిత్తూరుకు పులవర్తి నాని,అనంతపురం జిల్లాకు బీకే పార్థసారథి, కడప జిల్లాకు శ్రీనివాస్‌రెడ్డి పేర్లు ఖరారయ్యాయి.

11:32 - May 23, 2017

నల్గొండ : కిషన్ రెడ్డిని గెస్ట్ హౌస్ కు పిలిపించుకుని బిజెపి జాతీయ నేత అమిత్ షా క్లాసు పీకినట్లు సమాచారం. అలకలు ఎందుకు-ఎవరికివారు కాదు, అందిరినీ కలుపుకుని పోవాలని కిషన్ రెడ్డికి సూచించినట్లు సమాచారం.

 

11:28 - May 23, 2017

హైదరాబాద్: సికింద్రాబాద్‌ జింఖానా గ్రౌండ్‌ దగ్గర వాకర్స్‌ ఆందోళన చేపట్టారు. 'సేవ్‌ పరేడ్‌ గ్రౌండ్‌' అంటూ ప్లకార్డుల ప్రదర్శించారు. తెలంగాణ ప్రభుత్వం పరేడ్‌ గ్రౌండ్‌లో కొత్త సచివాలయ నిర్మాణ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వాకర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేత వీహెచ్‌ పాల్గొన్నారు.

కిషన్ రెడ్డి కి అమిత్ షా క్లాసు

నల్గొండ : కిషన్ రెడ్డిని గెస్ట్ హౌస్ కు పిలిపించుకుని బిజెపి జాతీయ నేత అమిత్ షా క్లాసు పీకినట్లు సమాచారం. అలకలు ఎందుకు-ఎవరికివారు కాదు, అందిరినీ కలుపుకుని పోవాలని కిషన్ రెడ్డికి సూచించినట్లు సమాచారం.

గుజరాత్ లో ప్రధిని మోదీ పర్యటన

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ లో పర్యటిస్తున్నారు. గాంధీనగర్ లో ఆఫ్రికన్ డెవలప్ మెంట్ బ్యాంక్ వార్షిక సమావేశాన్ని ప్రధాని ప్రారంభించారు.

ముకుందాపురంలో పంట కుంటలను పరిశీలించిన గవర్నర్

అనంతపురం : గార్లదిన్నె మండలం ముకుందాపురంలో పంట కుంటలను గవర్నర్ నరసింహన్ పరిశీలించారు. పంట కుంటల గురించి రైతులను గవర్నర్ నరసింహన్ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యామినీబాల, కలెక్టర్, పీడీ తదితరులు పాల్గొన్నారు.

మేడిపల్లి పీఎస్ పరిధిలో దారుణం

మేడ్చల్ : మేడిపల్లి పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. గత అర్థరాత్రి నడుచుకుంటూ వెళ్తున్న మహిళపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. మహిళకు తీవ్రగాయాలు కావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుప్రారంభించారు.

భారత కన్పోలేట్ నగేష్ సింగ్ తో మంత్రి మహేందర్ రెడ్డి భేటీ

అమెరికా: అట్లాంటాలో భారత కన్పోలేట్ నగేష్ సింగ్ తో తెలంగాణ రవాణ శాఖ మంత్రి మహేందర్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో హైదరాబాద్ నుంచి ఎయిర్ ఇండియా విమానాలను నడిపే అంశంపై చర్చ జరిగినట్లు సమాచారం. ఈ అట్లాంటాలోని ఆటా, గేట్స్ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఐటీ, పంచాతీరాజ్,గ్రామీణాభివృద్ధి శాఖలపై చంద్రబాబు సమీక్ష

అమరావతి: ఈ రోజు ఉదయం 11 గంటలకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ మంత్రిత్వ శాఖలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించనున్నారు.

జీడిపల్లికి కాల్వ పనులను పరిశీలించిన మంత్రులు...

అనంతపురం : బైరవానతిప్ప ప్రాజెక్టు నుంచి జీడిపల్లికి కాల్వ పనులను మంత్రి దేవినేని, కాల్వ శ్రీనివాసులు పరిశీలించారు.

గవర్నర్ ను కలిసిన మాజీ మంత్రి పల్లె

అనంతపురం: ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో గవర్నర్ నరసింహన్ ను మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

ఆగివున్న లారీని ఢీ కొట్టిన వ్యాన్ : ఇద్దరి మృతి

ప్రకాశం : ఒంగోలు బైపాస్ రోడ్డు పై ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని వ్యాన్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలుతో సహా ఎనిమిది మందికి గాయాలయ్యాయి. పెళ్లి బృందం తిరుపతి నుండి గుంటూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

09:13 - May 23, 2017

హైదరాబాద్‌ : కూకట్‌పల్లి ఆర్టీఏ కార్యాలయంలో తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్‌సర్క్యూట్‌తోనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో కంప్యూటర్లు, సర్వర్లతో పాటు.. పలు ఫైళ్లు దగ్దమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని మంటలార్పారు.

 

09:10 - May 23, 2017

హైదరాబాద్: తెలంగాణలో బీజేపీని పటిష్టపరిచే బాధ్యతలను భుజానికి ఎత్తుకున్న అమిత్‌ షా... నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. మొదటి రోజు జిల్లాలోని తేరట్‌పల్లిలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న కమలదళాధిపతి..నల్గొండలో జరిగిన పార్టీ పదాధికారుల సమావేశంలో తెలంగాణ బీజేపీ నేతలకు దిశా, నిర్దేశం చేశారు. మరో వైపు తెలంగాణ లో వచ్చే ఎన్నికల్లో బిజెపి గెలుపు ఖాయం అని స్పష్టం చేశారు. ఇదే అంశం పై 'న్యూస్ మార్నింగ్' లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో సీపీఎం నేత నంద్యాల నర్శింహయ్య, కాంగ్రెస్ కోసుల శ్రీనివాస్ యాదవ్, బిజెపి నేత ఆచార్య పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

09:06 - May 23, 2017

హైదరాబాద్: ప్రధానిగా నరేంద్రమోడీ వెయ్యిరోజుల పాలన పూర్తి చేసుకున్నారు. ఈ నెల 26వ తేదీకి ఆయన అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తవుతుంది. రెండేళ్లలో మళ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. గడిచిన మూడేళ్ల కాలంలో నరేంద్రమోడీ ప్రభుత్వ పాలనలో జరిగిన మంచి చెడులపై విశ్లేషించుకోవాల్సిన సమయమిది. నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ మీద దాడులు పెరిగాయన్న ఆందోళన దళితవర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితికి కారణమేమిటి? ఈ మూడేళ్ల కాలంలో దళితులకు ఎదురైన అనుభవాలేమిటి? గ్రామాల్లోనో, యూనివర్సిటీలలోనో జరిగే దాడులను నరేంద్రమోడీ ప్రభుత్వానికి అంటగట్టడం ధర్మమేనా? దళితులు ఎదుర్కొంటున్న విభిన్న సమస్యలకు పరిష్కారం ఏమిటి? ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో కెవిపిఎస్ నాయకులు మాల్యాద్రి పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

 

09:03 - May 23, 2017

హైదరాబాద్: మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని కంప్యూటరీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలోని వ్యవసాయ క్షేత్రాలు, రైతుల వివరాలు, సాగు పరిస్థితులన్నింటినీ సమగ్రంగా కంప్యూటరైజేషన్‌ చేసేందుకు రెడీ అవుతోంది. ఇందుకోసం మాభూమి యాప్‌ తీసుకొచ్చింది. ఈ యాప్‌ను వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆవిష్కరించారు. వ్యవసాయ విస్తరణాధికారులకు ట్యాబ్‌లను అందజేశారు.

మాభూమి యాప్‌లో వ్యవసాయ రంగ సమగ్ర సమాచారం

మాభూమి యాప్‌ ద్వారా వ్యవసాయానికి సంబంధించి సమగ్ర సమాచారం ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. వ్యవసాయశాఖ క్షేత్రస్థాయి ఉద్యోగులకు, వ్యవసాయ విస్తరణ అధికారులకు ట్యాబ్‌లను అందజేసి.. ఎప్పటికప్పుడు పూర్తి సమాచారాన్ని సేకరించి ఆన్‌లైన్‌ చేసే దిశగా అడుగులేస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర రైతు సర్వే నిర్వహిస్తోంది. అస్తవ్యస్తంగా ఉన్న వ్యవసాయ రికార్డులను సరిచేసి... యావత్‌ తెలంగాణ వ్యవసాయ సంపూర్ణ సమాచారాన్ని సేకరిస్తోంది. సాగుభూమి విస్తీర్ణం, రైతుల సామాజిక ఆర్దిక పరిస్థితులు, వ్యవసాయవనరులు, భూసారం వంటి వివరాలతో కూడిన సర్వే శరవేగంగా జరుగుతోంది. ఈ సర్వేలో సేకరించిన సమాచారాన్ని కంప్యూటరైజేషన్‌ చేయనున్నారు.

రాష్ట్రంలో 2500 మంది వ్యవసాయ విస్తరణాధికారులు

రాష్ట్రంలో ప్రస్తుతం 2500 మంది వరకు వ్యవసాయ విస్తరణాధికారులు పనిచేస్తున్నారు. వీరందరికీ విడతల వారీగా ట్యాబ్స్‌ను అందించి... వ్యవసాయరంగ పరిస్థితులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌ చేసేలా తర్ఫీదు ఇవ్వాలని నిర్ణయించారు. కచ్చితమైన సమాచారం ప్రభుత్వానికి వేగంగా అందడం వలన సమస్యలను గుర్తించడం, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం ప్రభుత్వ ఉద్దేశం. అంతేకాదు.. వ్యవసాయరంగానికి సంబంధించిన సంక్షేమ పథకాలనూ పారదర్శకంగా అమలు పర్చవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

తెలంగాణలో వ్యవసాయరంగం కంప్యూటరీకరణకు శ్రీకారం

హైదరాబాద్: సాంకేతిక సహకారంతో వ్యవసాయాన్ని కొత్తపుంతలు తొక్కించేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతోంది. ఇందులో భాగంగా వ్యవసాయానికి సంబంధించి సమగ్ర సమాచారం తెలిపేందుకు మాభూమి యాప్‌ను రూపొందించింది. పంటల పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ... తగిన సమాచారాన్ని సేకరించి కంప్యూటరీకరణ చేసేందుకు సిద్దమవుతోంది.

09:00 - May 23, 2017

హైదరాబాద్: తెలంగాణా రాష్ట్రంలో రెండేళ్ల ముందుగానే ఎన్నికల సందడి మొదలైంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలపై ఆందోళనలు తీవ్రం అవుతుండడం, విపక్ష పార్టీలు ఏకం అయ్యే ప్రయత్నాలు మొదలు కావడం జాతీయ పార్టీలు తమ ప్రాబల్యాన్ని చాటుకునేందుకు తెలంగాణాపై దృష్టి పెట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో ఎన్నికల వేడి రగులుకుంటోంది.

3 నెలలుగా పార్టీ సభ్యత్వ నమోదు...

ఇప్పటికే రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ గత 3 నెలలుగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ మధ్యనే జరిగిన ప్లీనరీ, బహిరంగ సభలతో పార్టీ హడావుడి చేసింది. దీంతో జాతీయ పార్టీలు కూడా ఇప్పుడిప్పుడే తెలంగాణాలో పట్టు నిలుపుకునే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉండి వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీని ఢీకొట్టేందుకు సిద్ధం అవుతోంది. మరోవైపు ఐదుగురు ఎమ్మెల్యేలున్న బీజేపీ కూడా రాబోయే ఎన్నికల్లో అధికారాన్ని దక్కించు కోవడంపై దృష్టి సారించింది. పార్టీ జాతీయ అధ్యక్షులు అమీత్ షా నల్గొండ జిల్లాలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంటోంది. మరో వారం రోజుల వ్యవధిలో కాంగ్రెస్ అగ్రనేత రాహూల్ గాంధీ కూడా సంగారెడ్డిలో నిర్వహించే భారీ బహిరంగ సభకు హాజరవుతున్నారు.

ఎన్నికల వ్యూహాలను సిద్ధం చేస్తున్న కేసీఆర్

ఈ నేపథ్యంలో జాతీయ పార్టీలను ఎదుర్కొనేందుకు గులాబీ దళపతి కేసీఆర్‌..ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారన్న ప్రచారం పార్టీలో మొదలైంది. ప్రధాన పార్టీలు ప్రజాక్షేత్రంలోకి దిగడంతో ప్రభుత్వ పరంగా,..పార్టీ పరంగా కార్యక్రమాలను చేపట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ భావిస్తున్నట్లు పార్టీ నేతలు అంటున్నారు. జాతీయ పార్టీలు అనుసరించే విధానాలకు అనుగుణంగా వ్యవహరించాలన్న అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తం అవుతోంది. అయితే బీజేపీతో ఇటీవల కాలంలో సత్సంబంధాలను కొనసాగిస్తున్న టీఆర్‌ఎస్‌..బీజేపీ నేతల టూర్లపై ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ కృతజ్ఙతతో ఉంటామని ప్రకటన చేసిన కేసీఆర్‌..ఆ పార్టీ జాతీయ నాయకుల వైఖరిపై ఎలా వ్యవహరిస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.

తెలంగాణ లో మొదలైన ఎన్నికల వేడీ

హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా..రాష్టంలో మాత్రం ముందే ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. అటు జాతీయ పార్టీలు సైతం తెలంగాణలో పాగా వేసేందుకు పావులు కదుపుతుంటే..ఇటు గులాబీ పార్టీ కూడా రెండేళ్ల ముందుగానే ఎన్నికల వ్యూహాలకు పదునుపెడుతోంది.

08:55 - May 23, 2017

హైదరాబాద్: తెలంగాణలో అధికార పార్టీ నేతలను గ్యాంగ్‌స్టర్‌ నయీం భయం వెంటాడుతోంది. నయీంతో సంబంధాలున్న నేతల్లో రోజురోజుకు టెన్షన్ పెరుగుతోంది. నయీంగ్యాంగ్‌తో తమ పార్టీ నేతలకు సంబంధాలు లేవని అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ ప్రకటన చేసినా...పోలీసులపై చర్యలు తీసుకోవడంతో మరోసారి గులాబీ నేతల్లో గుబులు రేగుతోంది.

సోదాల్లో బయటపడ్డ ఆదారాలు ...

తెలంగాణాలో ప్రధాన రాజకీయ పార్టీల నేతలు, పోలీసుల సహకారంతో గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగిన నయీం ఆగడాలకు గతేడాది ఆగస్టులోనే పోలీసులు తెరదించారు. షాద్‌నగర్‌లో జరిగిన ఎన్ కౌంటర్‌లో నయీం హతంకాగా..తదనంతర జరిగిన పరిణామాలు పోలీసులకు, రాజకీయ నేతలకు మింగుడుపడడంలేదు. పోలీసుల సోదాల్లో లభ్యమైన ఆధారాలు, కొంత మంది ఫిర్యాదు ఆధారంగా ప్రభుత్వం సిట్ నియమించి ఈ కేసును ప్రత్యేకంగా దర్యాప్తు చేయించింది. సిట్ విచారణలో మరిన్ని ఆసక్తి కరమైన విషయాలు వెల్లడైనా..పెద్దగా బయటికి పొక్కకుండా జాగ్రత్త పడింది పోలీసు శాఖ. అయితే..నయీం ముఠాకు సహకరించారన్న ఆరోపణలపై ఇప్పటికే పోలీసు అధికారులపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే రాజకీయ నాయకుల అండ కూడ ఉండడంతో వారిపైనా చర్యలుంటాయన్న సంకేతాలు ప్రభుత్వం నుంచి వస్తున్నాయి.

మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్‌రావు

నయీంగ్యాంగ్‌తో కలిసి భారీగా సెటిల్ మెంట్లు చేశారన్న ఆరోపణలను అధికార పార్టీలో నల్గొండ జిల్లాకు చెందిన నేతలు ఎదుర్కొంటున్నారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎమ్మెల్యే గాదరి కిషోర్ మరో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ కూడా నయీం ముఠాతో సన్నిహితంగా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. వీరందరిపై పార్టీ అధినేత కేసీఆర్‌,.సీరియస్‌గా ఉన్నట్లు పార్టీలో ప్రచారం కూడా జరుగుతోంది. అయితే..ఇప్పటి వరకు చర్యలు తీసుకోవడంపై ఆచితూచి వ్యవహరిస్తున్న కేసీఆర్‌,.ప్రభుత్వ అధికారులపై చర్యలు చేపట్టి రాజకీయ నేతలపై చర్యలు తీసుకోకపోతే తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లవుతుందని భావిస్తున్నట్లు సమాచారం.

గ్యాంగ్‌స్టర్‌తో కలిసి సెటిల్మెంట్లు చేసిన నేతలకు

ఇటీవలి కాలంలో ప్రభుత్వ పరంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించేందుకు పార్టీ పరంగా నేతలపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అవినీతిని సహించేది లేదంటూ సీఎం చేస్తున్న ప్రకటనలకు మరింత బలాన్నిచ్చే విధంగా చర్యలుండే అవకాశం ఉందని పార్టీ నేతలు అంటున్నారు. మొత్తంమీద గ్యాంగ్‌స్టర్‌తో కలిసి సెటిల్మెంట్లు చేసిన నేతలకు నయీం భయం ఇంకా వెంటాడుతూనే ఉంది.

08:52 - May 23, 2017

హైదరాబాద్: రాయలసీమ జిల్లాల్లో కరవు విలయతాండవం చేస్తోంది. తీవ్ర దుర్భిక్షంతో జనం తల్లడిల్లుతున్నారు. అన్నమో... చంద్రబాబు.. అంటూ కూలీలు అకలి కేకలు వేస్తున్నారు. గ్రామీణ ఉపాధి హమీ పథకం కింద చేసిన పనులకు కూలైనా ఇస్తే కాస్త గంజితాగి ప్రాణం నిలబెట్టుకుంటామని వేడుకుంటున్నా అటు పాలకులు కానీ, ఇటు అధికారులు కానీ కూలీల మొర అలకించని పరిస్థితి ఉంది. పశువులను పోషించలేక కబేళాలకు తరలించే దుస్థితి నెలకొంది. వీటన్నింటిని నిరసిస్తూ వామపక్షాలు రాయలసీమ బంద్‌కు పిలుపు ఇచ్చాయి.

నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో విఫలం...

కరవుతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం కావడంతో అన్నదాతలు ఆత్మహత్యల బాట పట్టారు. కరవు సమస్యను శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలంటూ ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేసినా ఫలితంలేదు. సాగునీటి ప్రాజెక్టులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో కరవు సమస్య మరింత తీవ్రరూపం దాల్చింది. కరవు సమస్యల పరిష్కారంలో పాలకులు వైఖని నిరసిస్తూ ఈనెల 24న రాయలసీమ బంద్‌కు వామపక్షాలు పిలుపునిచ్చాయి.

బంద్‌ సందర్భంగా ఎలాంటి పరిణామాలు జరిగినా...

రాయలసీమ బంద్‌ సందర్భంగా ఎలాంటి పరిణామాలు జరిగినా అందుకు ముఖ్యమంత్రి చంద్రబాయునాయుడు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని వామపక్ష నేతలు హెచ్చరిస్తున్నారు. నాలుగు ప్రధానమైన డిమాండ్లలో వామపక్షాలు రాయలసీమ బంద్‌కు పిలుపునిచ్చాయి. రాయలసీమ బంద్‌ను విజయవంతం చేసేందుకు వామపక్షాలు నాలుగు జిల్లాల్లో గ్రామ గ్రామాన పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నాయి.

రేపు రాయసీమ బంద్ కు వామపక్షాల పిలుపు

హైదరాబాద్: కరవుతో రాయలసీమ జిల్లాలు అల్లాడుతున్నాయి. వ్యవసాయం కుదేలైంది. ఉపాధి లేక కూలీలు గ్రామాలను వదలి ఇతర రాష్ట్రాలకు వలస పోతున్నారు. గుక్కెడు మంచినీరు దొరక్క ప్రజల గొంతు ఎండిపోయే దుస్థితి దాపురించింది. సమస్య తీవ్రతను గుర్తించి, వెంటనే పరిష్కరించాలని వామపక్షాలు, ప్రజా సంఘాలు ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన చెవిటివాని ముందు శంఖం ఊదిన చందంగా మారింది. కరవు నివారణ చర్యలు చేపట్టడంతో ప్రభుత్వ వైఫల్యాలన్ని నిరసిస్తూ రేపు రాయలసీమ బంద్‌కు వామపక్షాలు పిలుపు ఇచ్చాయి.

08:48 - May 23, 2017

అమరావతి: మహానాడు ప్రాంగణాన్ని 26 సాయంత్రానికి టీడీపీ ఆధీనంలోకి తీసుకుంటుందన్నారు మంత్రి అయ్యన్నపాత్రుడు. మహానాడులో భవిష్యత్‌ కార్యాచరణ, అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చిస్తామన్నారు. ఉత్తరాంధ్ర గురించి ప్రత్యేకంగా చర్చించాలని సీఎం చంద్రబాబును కోరినట్లు చెప్పారు. మూడు రోజుల పాటు జరగనున్న మహానాడు సమావేశాల్లో 30 తీర్మానాలు ప్రవేశపెడుతారని పేర్కొన్నారు. 28న ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను పండుగలా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

08:47 - May 23, 2017

హైదరాబాద్: ఇంగ్లాండ్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 19 మంది మృతి చెందగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. మాంచెస్టర్‌ అరెనాలో సంగీత కచేరి జరుగుతున్న ప్రాంతంలో ఈ ఆత్మహుతి దాడి జరిగింది. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంగీత కచేరి ప్రాంతంలో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భద్రతా దళాలు సంఘటన స్థలికి చేరుకొని సహాయక చర్యలను చేపడుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

08:45 - May 23, 2017

హైదరాబాద్: తెలంగాణలో బీజేపీని పటిష్టపరిచే బాధ్యతలను భుజానికి ఎత్తుకున్న అమిత్‌ షా... నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. మొదటి రోజు జిల్లాలోని తేరట్‌పల్లిలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న కమలదళాధిపతి..నల్గొండలో జరిగిన పార్టీ పదాధికారుల సమావేశంలో తెలంగాణ బీజేపీ నేతలకు దిశా, నిర్దేశం చేశారు.

బలపడే అవకాశాలను చేజార్చుకుంటున్న రాష్ట్ర నేతలు

బీజేపీ కార్యవర్గ సమావేశంలో తెలంగాణ నేతలకు అమిత్‌ షా అక్షింతలు వేశారు. రాష్ట్రంలో పార్టీ బలపడేందుకు మంచి అవకాశాలు, అనుకూల పరిస్థితులు ఉన్నా, అన్నింటినీ చేజార్చుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. డుబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణాన్ని గాలికొదిలేసిన కేసీఆర్‌ సర్కారు విధానాలను ప్రజల్లోకి సరిగా తీసుకెళ్లలేకపోయారని అసంతృప్తి వ్యక్తం చేశారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ముఖ్యమంత్రి నివాసం కోసం కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి రాజప్రాసాదం లాంటి ప్రగతి భవన్‌ నిర్మిస్తే, నిలదీయకుండా చూస్తూ ఊరుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారని ప్రచారం జరుగుతోంది. తిరుమల శ్రీవారు, బెజవాడ కనకదుర్మమ్మ, కురవి వీరభద్రడుకి కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి బంగారు ఆభరణాలు సమర్పించిన విషయాన్ని అమిత్‌ షా ప్రస్తావించారు. ఇందంతా ఎవడబ్బ సొమ్మని ప్రశ్నించలేకపోయిన తెలంగాణ బీజేపీ నేతల తీరును పార్టీ పదాధికారుల సమావేశంలో ఎండగట్టారని కమలనాథుల్లో ప్రచారం జరుగుతోంది.

పార్టీకి కలిసివచ్చే అవకాశాలను వదులుకుంటున్న రాష్ట్ర నేతలు

ముస్లిం రిజర్వేషన్ల 12 శాతానికి పెంచుతూ ప్రభుత్వ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేయడంలో విఫలమైన బీజేపీ నేతల తీరుపై అమిత్‌ షా ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. పార్టీకి అన్ని విధాల కలిసివచ్చే అవకాశాలను వదులుకోవడంపై అసంతృప్తి వెళ్లగక్కారు. ఇలాగైతే తెలంగాణలో బీజేపీ ఎలా అధికారంలోకి వస్తుందంటూ నిలదీయడంతో.. సమాధానం చెప్పలేక రాష్ట్ర బీజేపీ నేతలు మౌనం వహించారని వినిపిస్తోంది. టీఆర్‌ఎస్‌ పాలకులు పెద్ద ఎత్తన పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నా... కోర్టుకు ఈడ్చని బీజేపీ నేతల తీరును అమిత్‌ షా తప్పుపట్టారు. హైదరాబాద్‌ గోషామల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌... తెలంగాణ బీజేపీలో ఉన్న గ్రూపుల అంశాన్ని ప్రస్తావించారు. పార్టీ ఎమ్మెల్యేలకు కనీసం సమాచారం లేకుండా కమిటీలు వేస్తున్న విషయాన్ని అమిత్‌ షా దృష్టికి తెచ్చారని సమాచారం. దీనిపై స్పందిన కమలదళాధిపతి... తెలంగాణ బీజేపీ ముఖ్యనేతలు తీరు మార్చుకోవాలని హెచ్చరించనట్టు ప్రచారం జరుగుతోంది. 2019 ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక అంశంపై కూడా బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో చర్చకు వచ్చింది. 2018 నాటికి అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయాలని రాష్ట్ర నేతలను ఆదేశించారు. గెలుపు గుర్రాలను గుర్తించి, ఎంపిక ప్రక్రయను ప్రారంభించాలని కోరారు.

సెప్టెంబర్‌లో మరోసారి తెలంగాణ పర్యటనకు

ఈ ఏడాది సెప్టెంబర్‌లో మరోసారి తెలంగాణ పర్యటనకు వస్తానని అమిత్‌ షా పార్టీ నేతల దృష్టికి తెచ్చారు. అప్పటికల్లా పార్టీ పరిస్థితి మెరుగుపడాలని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడం ద్వారా ప్రజాభిప్రాయాన్ని బీజేపీకి అనుకూలంగా మలిచేందుకు ప్రయత్నించాలని సూచించారు. అమిత్‌ షా ఆదేశాలను బీజేపీ నేతలు ఎంతవరకు ఆచరణలో పెడతారో చూడాలి.

తెలంగాణ బీజేపీ నేతల తీరుపై అమిత్‌ అసంతృప్తి

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో విఫలమైన రాష్ట్ర బిజెపి నాయకులకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా తలంటిపోశారు. గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి, ప్రజాధనాన్ని మంచినీటి ప్రాయంగా ఖర్చు చేస్తున్నా ఎందుకు ప్రశ్నించలేకపోయారని అమిత్‌ షా ప్రశ్నించడంతో నీళ్లు నమలడం రాష్ట్ర బిజెపి నేతల వంతైంది. తెలంగాణ కమలనాథుల తీరుపై అమిత్‌ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. టిఆర్ ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై చార్జిషీటు ఎందుకు పెట్టలేదని నిలదీయడంతో రాష్ట్ర కమలనాథులు కిమ్మనలేదని సమాచారం.

కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వేగం.. సీఎం సంతృప్తి

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఎల్లంపల్లి నుంచి మల్లన్నసాగర్ వరకు నిర్మిస్తోన్న సొరంగమార్గం పనులకు కితాబిచ్చారు. ఇదే స్పూర్తితో మిగతా పనులు కూడా వేగంగా పూర్తి చేసి.. రైతులకు వీలైనంత త్వరగా సాగునీరు అందించాలని కోరారు.

08:41 - May 23, 2017

అమరావతి: అమరావతి పరిపాలనా నగరం ఆకృతులను రూపొందిస్తున్న బ్రిటన్‌కు చెందిన నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఇప్పటి వరకు తయారు చేసిన డిజైన్లలో కొన్ని మార్పులు, చేర్పులు సూచించారు. తుది అకృతులను మాత్రం మరో రెండు వారాల్లో అందించాలని ఫోస్టర్‌ ప్రతినిధులను చంద్రబాబు ఆదేశించగా, ఇందుకు వారు అంగీకరించారు.

వివిధ నిర్మాణాలు రాజధానికి తలమానికంగా ఉండాలని

అమరావతిలో నిర్మించే అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం సహా వివిధ నిర్మాణాలు రాజధానికి తలమానికంగా ఉండాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. హైకోర్టు భవనం ఆకట్టుకునే విధంగాలేదని, దీనిని మరింత అద్భుత కట్టడంగా మలిచేందుకు వీలుగా డిజైన్లలో కొన్ని మార్పులు, చేర్పులు చేయాలని చంద్రబాబు సూచించారు. శాసనసభ, శాసనమండలి మధ్య సెంట్రల్‌ హాల్‌ నిర్మాణం చేపడ్డతారు. నగరానికి రెండు వైపులా అతిపెద్ద పార్కులు, ఒక వైపు పరిపాలనా భవనాలు, మరోవైపు ప్రజల సందర్శనకు వీలుగా ప్రత్యేక టవర్‌ నిర్మించాలని నిర్ణయించారు. భారీ సభలు, సమావేశాలు, సదస్సుల నిర్వహణకు వీలుగా కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మాణం చేపడతారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేక భవనంతోపాటు, ఎగ్జిబిషన్‌ సెంటర్‌, వాణిజ్య సముదాయం ఏర్పాటు చేస్తారు.

రాజ్‌ భవన్‌కు సమీపంలోనే ముఖ్యమంత్రి నివాసం ..

పరిపాలనా నగరంలో రాజ్‌ భవన్‌కు సమీపంలోనే ముఖ్యమంత్రి నివాసం ఉండే విధంగా చూస్తారు. అలాగే న్యాయమూర్తులు, ప్రజా ప్రతినిధుల నివాస సముదాయాల నిర్మాణంపై కూడా చర్చించారు. పరిపాలనా నగరానికి ఉత్తరాన ఎన్టీఆర్‌ విగ్రహం, దక్షిణాన అంబేద్కర్‌ విగ్రహం ఉండేలా నిర్మాణాలు చేపడతారు. సచివాలయంకు అనుసంధానంగా డైరెక్టరేట్లు, కమిషనరేట్లు నిర్మించాలని నిర్ణయించారు. పరిపాలనా నగరంలో ప్రైవేటు ఆస్తులుకు చోటు ఉండరాదని నిర్ణయించారు. అమరావతిలో ప్రజా రవాణ కోసం బీఆర్‌టీఎస్‌, ఎమ్మార్‌టీఎస్‌, బస్‌ బేలను ఏర్పాటు చేస్తారు. రాజధానిలో నీటికి కొరత లేకుండా ప్రత్యేక చర్యలు చేపడతారు.

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ...

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. అన్ని కంపార్టుమెంట్లు నిండి క్యూలైన్ వెలుపల భక్తులు బారులు తీరారు. శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం, నడకదారి భక్తులకు 10 గంటల సమయం పడుతోంది.

ఇంగ్లడ్ లో ఆత్మాహుతి దాడి :19మంది మృతి

ఇంగ్లడ్ : మాంచెస్టర్ లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌ అరెనాలో అరియాణా గ్రాండే సంగీత కచేరి జరుగుతున్న ప్రాంతంలో ఆత్మహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో దాదాపు 19 మంది మృతి చెందగా పలువురికి తీవ్రగాయాలైనట్లు బ్రిటన్‌ మీడియా వెల్లడించింది. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంగీత కచేరి ప్రాంతంలో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భద్రతా దళాలు సంఘటన స్థలికి చేరుకొని సహాయక చర్యలను చేపడుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది..

Don't Miss