Activities calendar

24 May 2017

22:00 - May 24, 2017

విశాఖ : ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ చైర్మన్‌ నన్నపనేని రాజకుమారి సంచలన వ్యాఖ్యలు చేశారు. యువతులు కత్తులు, చాకులు వెంటబెట్టుకుని తిరగాలన్నారు. ఎవరైనా అత్యాచారానికి ప్రయత్నిస్తే వారి మర్మాంగాన్ని కోసేయాలన్నారు. విశాఖ జిల్లా చింతపల్లి మండలం తాజంగీలో అత్యాచార బాధితులను మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడుతో కలిసి ఆమె పరామర్శించారు. కేరళలో అత్యాచారానికి పాల్పడ్డ సన్యాసిని ఓ యువతి ప్రతిఘటించిందన్నారు. సన్యాసి మర్మాంగాన్ని కోసిన బాధిత యువతిపై కేరళ సీఎం కేసు కూడా నమోదు చేయలేదని గుర్తు చేశారు. తాజంగీలో జరిగిన అత్యాచార బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీనిచ్చారు. వారి చదువు, పెళ్లి బాధ్యతను మహిళా కమిషన్‌ తీసుకుంటుందన్నారు. చిన్నారులపై అత్యాచారానికి పాల్పడ్డవారికి యావజ్జీవ శిక్ష విధించాలన్నారు.

 

 

21:55 - May 24, 2017

లక్నో : ఉత్తరప్రదేశ్‌ సహరాన్‌పూర్‌ జిల్లాలో ఠాకూర్లు, దళితుల మధ్య ఘర్షణలు తీవ్ర రూపం దాల్చడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మతపరంగా సున్నితమైన ఈ జిల్లాలో పలుచోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. బుధవారం ఉదయం సహారాన్‌పూర్‌లోని జనక్‌పురిలో ఓ వ్యక్తిని కాల్చిచంపారు. మంగళవారం నాటి ఘర్షణల్లో ఓ వ్యక్తి మృతి చెందగా...20 మంది గాయపడ్డారు.

మాయావతి పర్యటన సందర్భంగా
మంగళవారం బిఎస్పీ అధినేత్రి మాయావతి షబ్బీర్‌పూర్‌లో పర్యటన సందర్భంగా గుర్తు తెలియని దుండగులు ఇళ్లపై దాడులు చేసి తగలబెట్టారు. మాయావతి సభ ముగింపు తర్వాత తిరిగి వెళ్తున్న దళితులను చంద్‌పురా వద్ద ఠాకూర్లు అడ్డుకుని తుపాకులు, కత్తులతో దాడులు చేశారు. తుపాకులతో కాల్పులు జరపడంతో 24 ఏళ్ల ఆశిష్‌ మృతి చెందాడు. మరో ఆరుగురు గాయపడ్డారు. తాజా హింసాత్మక ఘటనలకు మాయావతియే కారణమని బిజెపి ఆరోపించింది.దళితులపై అగ్రవర్ణ దాడులను సిపిఎం తీవ్రంగా ఖండించింది. ఠాకూర్లకు మద్దతుగా హిందూ యువవాహిని కార్యకర్తలు దాడి చేశారని ఆరోపించింది. దళితులపై దాడికి పాల్పడ్డ ప్రతిఒక్కరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం రక్షణ కల్పించి, వారికి ఆర్థిక సహాయం అందించాలని సిపిఎం పేర్కొంది. దళిత నేతలపై పెట్టిన తప్పుడు కేసులను ప్రభుత్వం వెంటనే ఉపసంహించుకోవాలని స్పష్టం చేసింది.

సహరాన్‌పూర్‌కు ప్రత్యేక అధికార బృందం
ఈ ఘటనలో ఇప్పటివరకు 24 మందిని అరెస్ట్‌ చేసినట్లు అధికారులు చెప్పారు. శాంతిభద్రతలు కాపాడేందుకు యోగి ప్రభుత్వం సహరాన్‌పూర్‌కు ప్రత్యేక అధికార బృందాన్ని పంపింది. మృతి చెందిన ఆశిష్‌ కుటుంబానికి 15 లక్షలు, గాయపడ్డవారికి 50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.ఈ నెల 5న రాజ్‌పుత్‌ వంశస్తుడైన మహారాణా ప్రతాప్‌ జయంతి సందర్భంగా ఠాకూర్లు షబ్బీర్‌పూర్‌లో నిర్వహించిన ఊరేగింపు పట్ల ఓ దళితుల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణలకు దారితీసింది. దళితులు, అగ్రవర్ణ ఠాకూర్‌లకు మధ్య గత మూడు వారాల్లో నాలుగుసార్లు ఘర్షణలు చోటుచేసుకున్నాయి.


 

21:54 - May 24, 2017

ఢిల్లీ : ఏపీకి హోదాపై ఏపీ కాంగ్రెస్‌ నేతలు రాజకీయ పార్టీల మద్దతు కూడగడుతున్నారు. నిన్న ఢిల్లీకి వెళ్లిన కాంగ్రెస్‌ నేతలు.. ఇవాళ సీపీఐ, సీపీఎం జాతీయ నేతలను కలిశారు. జూన్‌లో భీమవరంలో నిర్వహిస్తోన్న సభకు హాజరుకావాలని వామపక్షాల నేతలను కోరారు. ఇందుకు వారు సానుకూలంగా స్పందించారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకుండా ద్రోహం చేస్తోందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరీ విమర్శించారు. ఏపీకి మోదీ ఇచ్చిన వాగ్దానాన్ని విస్మరించారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై సీపీఎం కట్టుబడి ఉందని... దీనిపై పార్లమెంట్‌లోపలా, బయట పోరాటం చేస్తామన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఏపీకి బీజేపీ ద్రోహం చేస్తోంటే దానికి టీడీపీ మద్దతు పలుకుతోందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. భీమవరంలో జరిగే సభలో తాము పాల్గొంటామని కాంగ్రెస్‌ నేతలకు హామీనిచ్చారు. అంతకుముందు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలిసిన కాంగ్రెస్‌ నేతలు... ఏపీలోని పరిస్థితులను వివరించారు. భూసేకరణ చట్టం 2013కు ఏపీ ప్రభుత్వం చేసిన సవరణలను ఆమోదించవద్దని ప్రణబ్‌ను కోరారు.

21:52 - May 24, 2017

అనంతపురం : రాయలసీమలో ఉరుముతున్న కరువును తరిమేయాలంటూ వామపక్షాలు కదం తొక్కాయి. కరవు సహాయక చర్యలు వెంటనే చేపట్టాలని డిమాండ్‌ చేశాయి. నష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని వామపక్ష, ప్రజాసంఘాల నేతలు నినదించారు. ధర్నాలు, రాస్తారోకోలతో హోరెత్తించారు. కామ్రేడ్ల నిరసనలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టాయి. మొత్తంగా రాయలసీమ బంద్‌ పిలుపు సక్సెస్‌ అయ్యింది. రాయలసీమ సమస్యలపై సీమ బంద్‌ పిలుపు నేపథ్యంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు కడపలో ఆందోళనకు దిగారు. వేలాది మంది ప్రజలతో భారీ ర్యాలీ నిర్వహిస్తున్న మధును పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రంలో అన్ని రాజకీయపక్షాలను కలుపుకుని ప్రభుత్వంపై మరింత ఉధృతంగా ఉద్యమిస్తామని మధు స్పష్టం చేశారు.

హోరెత్తిన బద్వేలు
వామపక్షాల ఆందోళనలతో బద్వేలు పట్టణం హోరెత్తింది. భారీ నిరసనలతో దద్దరిల్లింది. పట్టణంలో వ్యాపార వర్గాలు స్వచ్ఛందంగా షాపులు మూసివేసి బంద్‌కు సంఘీభావం ప్రకటించారు. లెఫ్ట్‌పార్టీల కార్యర్తల ఆందోళనతో భారీగా బస్సులు నిలిచిపోయాయి. పలువురు నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరువు నివారణ చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలం అయిందని సీపీఎం నాయకులు విమర్శించారు. వామపక్ష పార్టీలు చేపట్టిన రాయలసీమ బంద్ కర్నూలులో ప్రశాతంగా సాగింది. నగరంలో ప్రజలు స్వచ్చదంగా పాల్గొని వ్యాపారులు, ఆటో డ్రైవర్లు బంద్‌కు మద్దతు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 800 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. రాయలసీమ బంద్ సందర్భంగా కర్నూలులో సీపీఎం పార్టీ కేంద్ర కమీటి సభ్యులు ఎంఏ గఫూర్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. కరువుతో రాయలసీమ తీవ్రంగా నష్టపోయిందన్నారు. రైతులకు సబ్సిడి క్రింద పంట రుణాలు, విత్తనాలను అందించాలని ఆయన డిమాండ్ చేశాడు. సీమలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి తాగు,సాగునీటిని అందించాలని సీపీఎం పార్టీ కేంద్ర కమిటి సభ్యులు ఎంఏ గఫూర్ డిమాండ్ చేశారు.

బస్సులు డిపోలకే పరిమితం
అనంతపురం జిల్లాలో బస్‌ డిపోల నుంచి బస్సులు కదలకుండా వామపక్ష నేతలు అడ్డుకున్నారు. దీంతో జిల్లావ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. పుట్టపర్తిలో సీపీఎం, సీపీఐ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. బస్‌ డిపో ఎదుట బస్సులను అడ్డుకోవడంతో.. భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. దీంతో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు కదిరిలో వామపక్షాల ఆధ్వర్యంలో దుకాణాలు మూయించి ర్యాలీలు నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న వామపక్ష నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. బంద్‌నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ నాయకులు, కార్యర్తలను పెద్ద ఎత్తున అరెస్టు చేశారు.

చిత్తూరులో ఉద్రిక్తత
చిత్తూరు జిల్లాలోనూ రాయలసీమ బంద్‌ ఉద్రిక్తంగా కొనసాగింది. తిరుపతి బస్టాండ్‌ సర్కిల్‌ వద్ద వామపక్ష నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బస్టాండ్ల వద్ద బస్సులను అడ్డుకున్నారు. దీంతో భారీగా మోహరించిన పోలీసులు సీపీఎం, సీపీఐ నాయకులను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు రాయలసీమ పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారని నేతలు ఆరోపించారు. మొత్తానికి లెఫ్ట్‌పార్టీల ఆధ్వర్యంలో చేపట్టిన రాయలసీమ బంద్ విజయవంతగా కొనసాగింది.

21:50 - May 24, 2017

హైదరాబాద్‌ : నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో టీడీపీ మహానాడు జరిగింది. ఉదయం నుంచే పార్టీ నాయకులు, కార్యకర్తలు వివిధ జిల్లాల నుంచి తరలివచ్చారు. దీంతో నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ సందడిగా మారింది. మహానాడు ప్రారంభ సూచికగా టీ టీడీపీ నేతలు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు.టీ టీడీపీ మహానాడుకు ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని చంద్రబాబు అన్నారు. అందుకే తన కుటుంబం కంటే పార్టీ కార్యకర్తలకే ఎక్కువగా రుణపడి ఉంటానన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన టీడీపీ... తెలుగు జాతి ఉన్నంత వరకు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నారు. తెలంగాణలో పటేల్‌ , పట్వారీ వ్యవస్థను ఎన్టీఆర్‌ రద్దు చేశారని చెప్పారు. తెలంగాణలో కార్యకర్తలు సైనికుల్లా పనిచేస్తున్నారని ప్రశంసించారు. అధికారం వచ్చే వరకు తెలంగాణలో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. తరచూ తెలంగాణకు వస్తానని... కార్యకర్తలకు అండగా ఉంటానని చంద్రబాబు భరోసా ఇచ్చారు.

టీఆర్‌ఎస్‌ సర్కార్‌పై రేవంత్‌రెడ్డి మండిపాటు
టీఆర్‌ఎస్‌ సర్కార్‌పై రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్‌ మూడేళ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. కేసీఆర్‌ రాచరికపు పోకడలకు పోతూ... అధికార దుర్వినియోగానికి పాల్పుడుతున్నారని విమర్శించారు. కేసీఆర్‌ను గద్దె దింపేలా ప్రభుత్వంపై రాజీలేని పోరు చేస్తామన్నారు. మహానాడులో వివిధ సమస్యలపై తీర్మానాలను ఆమోదించారు. భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటించారు. మొత్తానికి టీడీపీ మహానాడు కార్యకర్తల్లో ఉత్తేజం నింపింది.

21:48 - May 24, 2017

నల్లగొండ : జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పర్యటించారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. తెలంగాణ సాయుధపోరాటంలో రజాకార్ల అకృత్యాలకు బలైపోయిన అమరుల కుటుంబాలను ఆయన పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులు తమ గోడును అమిత్‌షాతో వెళ్లబోసుకున్నారు.అనంతరం పంచాయితీ కార్యాలయ కూడలిలో ఏర్పాటు చేసిన పార్టీ బూత్‌ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన గుండ్రాంపల్లి పోరాటం దేశ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. అలాగే గుండ్రాపల్లి పోరాటాన్ని చరిత్రలో లిఖిస్తామన్నారు. అంతకుముందు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలం నాటి దృశ్యాలతో కూడిన ఫోటో ఎగ్జిబిషన్‌ను ఆయన తిలకించారు. నాటి రైతాంగ సాయుధ పోరాట యోధులను సన్మానించారు.

బహిరంగ సభలో అమిత్‌ షా
ఆ తర్వాత గుండ్రాంపల్లిలోని బహిరంగ సభలో అమిత్‌ షా మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ బలోపేతమే లక్ష్యంగా తాను పర్యటన చేపట్టినట్లు చెప్పారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. పోలింగ్ బూత్ నుంచి జాతీయ స్థాయి వరకూ నాయకులంతా ఇక్కడ ఉన్నారనీ...అలాగే క్షేత్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకూ విస్తరిస్తుందన్నారు. తెలంగాణాను భారత్‌లో అంతర్భాంగా చేసేందుకు పోరాడిన యోధులు అందరికి తాను నమస్కరిస్తునట్లు తెలిపారు. దేశం మొత్తం స్వాతంత్య్ర సంబరాల్లో ఉంటే కొన్ని ప్రాంతాలు మాత్రమే నిజాం బందిగా మారిపోయాయని అన్నారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన వారి కుటుంబాలను కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. గుండ్రాంపల్లి చరిత్రను వెలుగులోకి తీసుకొస్తామని అమిత్‌షా తెలిపారు.

21:46 - May 24, 2017

హైదరాబాద్ : భారతీయ జనతాపార్టీపై మొదటిసారి ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు. అమిత్‌ షా తన మూడురోజుల పర్యటనలో చెప్పేవన్నీ అబద్దాలేనని మండిపడ్డారు.. తెలంగాణకు కేంద్రం నుంచి లక్ష కోట్ల రూపాయల మేర నిధులిచ్చామని, అదనంగా ఏటా ఇరవై వేల కోట్లు ఇస్తున్నామన్న అమిత్‌ షా వ్యాఖ్యలను.. పూర్తి గణాంకాలతో తిప్పికొట్టారు. పన్నుల రూపంలో తెలంగాణ చెల్లించిన డబ్బులో సగమైనా కేంద్రం రాష్ట్రానికి ఇవ్వలేదన్నారు.. 2016-17లో తెలంగాణ నుంచి కేంద్రానికి 50వేల 13 కోట్ల రూపాయలు పన్నుల రూపంలో చెల్లించామని తెలిపారు.. అయినా కేంద్రంనుంచి కేవలం 24వేల 561కోట్లు మాత్రమే తెలంగాణకు వచ్చాయని కేసీఆర్‌ స్పష్టం చేశారు.. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాకింద తెలంగాణకు వచ్చింది 37వేల 773 కోట్లేనని వివరించారు.. కేంద్ర ప్రభుత్వ పథకాల కింద వచ్చింది 18వేల 574 కోట్లు, జాతీయ రహదారుల కింద మంజూరైంది 2వేల 55 కోట్లని కేసీఆర్‌ తెలిపారు.. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఈరోజు వరకు కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధులు 67వేల 390 కోట్లని లెక్కలు చెప్పారు. చిల్లర రాజకీయాలకోసం ప్రపంచంముందు తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే ఊరుకునేదిలేదని సీఎం హెచ్చరించారు.. అమిత్‌ షా చెప్పిన మాటలు రుజువుచేస్తే తన సీఎం పదవికి రాజీనామా చేస్తానని సవాల్‌ విసిరారు.. అబద్ధాలు చెప్పినందుకు అమిత్‌ షా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు..

దళితుల ఇంట్లో భోజనమంటూ
దళితుల ఇంట్లో భోజనమంటూ అమిత్‌ షా చేసిన హంగామా అంతా ఉట్టిదేనని కేసీఆర్‌ ఆరోపించారు.. అమిత్‌షా తిన్నది దళితుల భోజనం కాదని... తెరాట్‌పల్లిలో వండిన భోజనాన్ని దళితుల వాడకు తీసుకువచ్చి తిన్నారని ఫైర్ అయ్యారు.. అమిత్‌షా అవసరానికో రీతిన మాట్లాడతారంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎద్దేవా చేశారు. గతంలో ఆయనతో తన అనుభవాన్ని ఈసందర్భంగా గుర్తు చేసుకున్నారు. రాష్ట్రపతి ఎన్నికలగురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేసీఆర్‌ స్పష్టం చేశారు.. ప్రధాని మోదీ అంటే గౌరవముందని... కేంద్రంతో ఘర్షణలేని చెప్పారు.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ ఒక్క సీటులోకూడా గెలవదని చెప్పుకొచ్చారు.. మొత్తానికి అమిత్‌ షాపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన కేసీఆర్‌.. తెలంగాణను నిందించేవారు ఎవరైనా తమకు శత్రువులేనంటూ ఫైర్ అయ్యారు.

21:32 - May 24, 2017

హైదరాబాద్ : అధికారంలోకి వచ్చిన అయిదో నెలలోనే స్వచ్ఛభారత్ సంకల్పాన్ని చాలా గ్రాండ్ గా ఆవిష్కరించారు ప్రధాని నరేంద్రమోడీ. గాంధీజీ జయంతి సందర్భంగా 2014 అక్టోబర్ 2న ప్రారంభించిన స్వచ్ఛభారత్ సాధించిన పరిశుభ్రత ఎంత? దాని ప్రచారానికి పెట్టిన ఖర్చెంత? తొలినాళ్లలో స్వచ్ఛభారత్ అంటూ చీపుళ్లు పట్టుకున్న సెలబ్రిటీలంతా ఏమైపోయారు? బ్రాండ్ అంబాసిడర్ లు ఎక్కడున్నారు? స్వచ్ఛ భారత్ విషయంలో మోడీ చేస్తున్న మానిటరింగ్ ఏమిటి? స్వచ్ఛ భారత్ తో పాటు మరో ఆరు ఏడు పథకాల ప్రచారానికి గత సంవత్సరం 350 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అంతకు ముందు సంవత్సరం 200 కోట్లపైగా ఖర్చు పెట్టారు. ప్రచారానికి చేసిన ఖర్చుకు తగ్గట్టుగా ఫలితమొస్తోందా? తమ పట్టణాల్లో మునిపటి మాదిరిగానే మురుగునీరు ప్రవహిస్తున్నా స్వచ్ఛ భారత్ సెస్ పేరుతో జనం పన్ను కట్టుకోవాల్సి వస్తోంది.

మేకిన్ ఇండియా
స్వచ్ఛ భారత్ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించిన మరో సుందర స్వప్నం మేకిన్ ఇండియా. భారతదేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ప్రారంభించిన మేకిన్ ఇండియా సాధించిన పురోగతి ఏమిటి? 25 రంగాలలో నైపుణ్యాల అభివృద్ధి, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా 2014 సెప్టెంబర్ 25న ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించిన మేకిన్ ఇండియాకు రెండు నెలల్లోనే లక్షా 20 వేల కోట్ల రూపాయల విలువైన ప్రతిపాదనలొచ్చాయన్నారు. 2016 ఫిబ్రవరిలో వారం రోజుల పాటు ముంబైలో నిర్వహించిన మేకిన్ ఇండియా వీక్ ఎన్నెన్నో ఆశలు రేకెత్తించింది. 72 దేశాల నుంచి వాణిజ్య ప్రతినిధులు, 68 దేశాల నుంచి ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొన్న మేకిన్ ఇండియా వీక్ లో 15.2 లక్షల కోట్ల విలువైన ప్రతిపాదనలొచ్చినట్టు అమిత్ కాంత్ అప్పట్లోనే ప్రకటించారు. వాటిలో కార్యరూపం దాల్చినవెన్ని?

స్టాండప్ ఇండియా
2016 ఏప్రిల్ 5న ప్రధాన నరేంద్ర మోడీ ప్రారంభించిన స్టాండప్ ఇండియా ద్వారా ఎంత మంది ఎస్సీ, ఎస్టీ, మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించారు. పది లక్షల నుంచి కోటి రూపాయల వరకు బ్యాంక్ ల ద్వారా రుణ సదుపాయం పొందిన స్టాండప్ ఇండియా లబ్ధిదారులెందరు? స్కిల్ ఇండియా అంటూ 2015 జులై 15న నరేంద్రమోడీయే ప్రారంభించిన పథకంలో ఎంత మందికి నైపుణ్య శిక్షణనిచ్చారు? 2022 నాటికి 40 కోట్ల మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వాలన్న లక్ష్యం లో ఇప్పటికి సాధించిదెంత?

ఎన్ని పథకాలు
మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్కిల్ ఇండియా ఇలా ఎన్ని పథకాలు ప్రారంభించినా మోడీ పాలనలో ఉద్యోగాల సృష్టి పెరగలేదన్న సంగతిని కేంద్ర ప్రభుత్వ లేబర్ బ్యూరో లెక్కలే ఏకరువు పెడుతున్నాయి. నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు సంవత్సరంలో అంటే 2013లో మన దేశంలో 4,19,000 ఉద్యోగాలను సృష్టిస్తే, మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుసటి సంవత్సరం 2015లో అది 1,35,000కి పడిపోయింది. 2016లోనూ పరిస్థితి పెద్దగా మెరుగుపడలేదు. 2016లో సృష్టించింది కేవలం 2 లక్షల 31 వేల ఉద్యోగాలే. ఉద్యోగాల సృష్టిలో కనీసం 2011 స్థాయిని చేరుకోవాలంటే ఇంకెన్నేళ్లు పడుతుంది?. ఆ ఏడాది మన దేశంలో 9,30,000 ఉద్యోగాలు సృష్టించినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. రాబోయే రెండేళ్లలో మోడీ ప్రభుత్వం ఈ రికార్డును బద్దలు కొట్టగలదా? దేశంలో ఎనిమిది అతిపెద్ద ఉపాధి రంగాలైన టెక్స్ టైల్స్, లెదర్, మెటల్, ఆటోమొబైల్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, రవాణా, ఐటి, హ్యాండ్ లూమ్ రంగాల్లో ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. 2015లో జెమ్స్ అండ్ జువెలరీ రంగంలో 19వేల ఉద్యోగాలు, హ్యాండ్ లూమ్, పవర్ లూమ్ రంగాల్లో 11వేల ఉద్యోగాలు కోల్పోయారు. ఇప్పుడు ఐటిరంగంలో ఉద్యోగుల మీద వేటుపడుతోంది. కాగ్నిజెంట్, విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర, ఐబిఎం, సిస్కో ఇలా వివిధ దిగ్గజ సంస్థలు ఉద్యోగులను తొలగిస్తుండడంతో ఐటి ఉద్యోగులు హడలిపోతున్నారు.

వ్యవసాయం
వ్యవసాయం తర్వాత అత్యధిక శాతం మందికి ఉపాధి చూపిస్తున్న నిర్మాణరంగం ఈ మూడేళ్లలో పుంజుకోలేదు. నోట్ల రద్దు తర్వాత అది మరింతగా దెబ్బతింది. చిన్న సూక్ష్మ పరిశ్రమలు దెబ్బతిన్నాయి. ఓ వైపు ఉత్పత్తి వ్యయం పెరుగుతోంది. మరోవైపు పన్నుల భారం నడ్డివిరుస్తోంది. కార్పొరేట్ సంస్థల ఆదాయాలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంటే, ప్రోత్సాహకాలు లేక చిన్న సూక్ష్మ పరిశ్రమలు చతికిలపడుతున్నాయి. ఈ కామర్స్ లో లే ఆఫ్ లు. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల కోత. ఎప్పుడు ఎవరి ఉద్యోగం పోతుందో అన్న భయంతో ఐటీ రంగం. రోజూ ఇవే వార్తలు. ఉద్యోగుల తొలగింపునకు సంబంధించిన వార్తలే హెడ్ లైన్స్ లో వుంటున్నాయి.

నల్లధనం
విదేశీ బ్యాంక్ ల్లో దాచిపెట్టిన డబ్బు గుంజుకొస్తామన్న నరేంద్ర మోడీ హయాంలో మొండిబకాయిలు మరింతగా పెరిగి బ్యాంకింగ్ వ్యవస్థకే సవాలు విసురుతున్నాయి. గత డిసెంబర్ నాటికి మొండిబకాయిలు ఆరున్నర లక్షల కోట్లు దాటిపోవడం మోడీ ప్రభుత్వ వైఫల్యం కాదా? మొండిబకాయిల విలువ 11 లక్షలు కోట్లు దాటిందన్నది తాజా అంచనా. వీటి వసూళ్లకు నరేంద్రమోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలేమిటి? నిరర్ధక ఆస్తుల విలువ 12శాతానికి పెరగడం బ్యాంకింగ్ వ్యవస్థనే కలవరపెడుతోంది. ఈ మూడేళ్లలో స్టాక్‌ మార్కెట్‌ ఉరకలెత్తింది. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత సెన్సెక్స్‌ ఆరువేల పాయింట్లు పెరిగింది. 2014లో 75 లక్షల కోట్లున్న లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 125 లక్షల కోట్లకు పెరిగింది. అయితే, లాభాలలో అత్యధిక భాగం టాటా, బిర్లా, అంబానీ, అదానీ, బజాజ్‌, మహీంద్రా కంపెనీల ప్రధాన ప్రమోటర్లు ఎగరేసుకుపోయారు. భారతదేశ అభివృద్ధిలోనూ, ఉపాధి కల్పనలోనూ, సామాజిక బాధ్యతల నిర్వహణలో కీలకపాత్ర పోషించే ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్‌ విలువ పెద్దగా పెరగలేదు. ప్రభుత్వరంగ సంస్థల పట్ల మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే ఇందుకు కారణం కాదా?

నీట్ అర్హత మార్కులు తగ్గింపు అభినందనీయం : కామినేని

విజయవాడ : నీట్ అర్హత మార్కులు తగ్గింపు అభినందనీయమని ఏపీ మంత్రి కామినేని అన్నారు. అర్హత మార్కులను 7.5 శాతం తగ్గించారని ఆయన తెలిపారు. దీని వల్ల ప్రైవేట్ కాలేజీల్లో సీట్లు మిగలకుండా ఉంటాయని పేర్కొన్నారు.

20:28 - May 24, 2017

ప్రజలు పుట్టెడు దుఖంలో ఉంటే ప్రభుత్వం సంబరాలకు సన్నాహాలు చేస్తున్నదా? ఏం సాధించారని ఈ వేడుకలు..? ఎవరి జీవితాలు ఉత్సాహంగా ఉన్నాయని ఈ ఉత్సవాలు...? నమ్మి అధికారమిచ్చిన ప్రజలకు మిగిలింది వంచనేనా? మోడీ ఏలుబడి మొత్తం వైఫల్యాలమయమేనా? గడిచిన మూడేండ్లలో అడుగడుగునా అసహనపు జాడలు...! దారిపొడవునా విధ్వేషపు నీడలు..!! కనిపిస్తుంటే... వాటిని విస్మరించి మూడేళ్ల వేడులకు తెరలేపుతున్నారా? అసలు మూడేళ్ల కాలంలో మోడీ సర్కారు సాధించిందేమిటి? చెప్పటానికేం చాలా ఉంటాయి.. కానీ చేతలు కదా ముఖ్యం.. అధికారంలోకి వచ్చేంతవరకు ఓ లెక్క.. గద్దెనెక్కాక మరో లెక్క. మూడేళ్ల క్రితం నరేంద్రమోడీ చెప్పిన మాటలకు … ఈ మూడేళ్లుగా చేతలకు పొంతన ఉందా? మాటల గారడీతో, అధికారం నిలబెట్టుకునే ఎత్తులతో కాలం గడిపేస్తున్నారా...


 

20:26 - May 24, 2017

గొంగట్ల గూసోని ఎంటికెలను ఎక్కిరిచ్చినట్టే ఉన్నది ఈ బీజేపోళ్ల పనితనం జూస్తుంటే.. తెలంగాణ మొత్తం తెర్లు తెర్లు అయితున్నది..కాశిల జేయవోయే దొంగతనానికి కాళహస్తి నుంచే వంగొంగి పొయ్యినట్టే.. కాంగ్రెస్ పార్టోళ్లు అధికారంలకొస్తె.. రెండు లక్షల రూపాల రైతు రుణమాఫీ అంట.. అధికారుల పనితీరు తోనె తెలంగాణ అంత తెర్లు తెర్లు ఉన్నది అంటున్నడు ఎవుసం మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి సారూ...పొయ్యి పొయ్యి శాంతి కపోతం అసొంటి మన్షి.. పశుసంవర్థక శాఖా మాత్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ సారుకే ఎదురు మాట్లాడ్తరా..? ముల్లును ముల్లుతోనే దియ్యాలే... పువ్వును పువ్వుతోనే కొయ్యాలే అన్న సామెతను బాగ వంటవట్టిచ్చుకున్నట్టున్నరు.. ఎవ్వలన్న అవయవాలు దానం జేస్తె అబ్బా ఎంత గొప్పపనిజేశిండు.. సచ్చిపోయినా నల్గురికి జన్మనిచ్చిండు అని పొగుడుకుంట.. పీన్గెల మీద ప్యాలాలు ఎర్క బుక్కుడంటే ఇదేగావొచ్చునుల్లా.. సచ్చిపోయినోడు సంసారం ఆగం జేశిపోతే.. బత్కున్నోన్ని బరివాతల నిలవెట్టె పనిజేశిండ్రు కర్నూలు జిల్లా ఎండోమెంట్ అధికారులు.. అమెరికా అధ్యక్షుడు తుమ్మినా..? దగ్గినా..? అవ్వి రెండు జేయకున్నా గూడ వార్తనే.. ఎందుకంటె ఆయన స్థానం అసొంటిది..

టీడీపీ ఎక్కడ ఉన్న ప్రజల కోసం : చంద్రబాబు

హైదరాబాద్ : టీడీపీ ఎక్కడ ఉన్న ప్రజల కోసం పని చేస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఆయన తెలంగాణ టీడీపీ పోరాటాలకు తన సంపూర్ణ మద్ధతు ప్రకటించారు.

రాష్ట్రపతి ఎన్నిక గురించి నిర్ణయం తీసుకోలేదు : కేసీఆర్

హైదరాబాద్ : రాష్ట్రపతి ఎన్నికల గురించి ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సీఎం కేసీఆర్ అన్నారు.

 

19:34 - May 24, 2017

మూడేళ్లలో 2.3లక్షలు ఉద్యోగాలు మాత్రమే కల్పించారని టెన్ టివి చర్చలో పాల్గొన్నా వక్తలు అన్నారు. 107 స్కీంలో ప్రజలకు తెలిసినవి కేవలం ఏడు, ఎనిమిది మాత్రమే సీఐటీయూసీ నేత సుధాభాస్కర్, కాంగ్రెస్ నేత ఇందిరా శోభన్, దీలిప్ విశ్లెషకులు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ 10 ఏళ్లు అధికారంలో ఉండి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని బీజేవైఎం గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

19:15 - May 24, 2017
19:11 - May 24, 2017

కాశ్మీర్ : పాకిస్తాన్‌ వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు ఉదయం సియాచిన్‌ గ్లేసియర్ సమీపంలో చక్కర్లు కొట్టడం కలకలం సృష్టించింది. సియాచిన్‌ వద్ద ఆర్మీ బేస్‌లను పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ మార్షల్‌ సోహైల్‌ అమన్‌ పర్యవేక్షించినట్లు పాక్‌ మీడియా పేర్కొంది. అయితే పాక్‌ మీడియా కథనాలను భారత వైమానిక దళం ఖండించింది. సియోచిన్‌లోని భారత గగనంలోకి పాకిస్తాన్‌ విమానాలు ఏవీ ఉల్లంఘనకు పాల్పడలేదని స్పష్టం చేసింది. భారత్‌ ముప్పును ఎదుర్కొనేందుకు సియాచిన్‌లో పాక్‌ ఫైటర్‌ జెట్‌ విమానం యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా పాక్‌ ఎయిర్‌ చీఫ్‌ అమన్ తానే స్వయంగా మిరాజ్‌ జెట్‌ విమానాన్ని నడుపుతూ సియాచిన్‌ సమీపంలోకి చొచ్చుకొచ్చినట్లు పాక్‌ మీడియాలో కథనాలు వచ్చాయి. నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్‌ శిబిరాలను ధ్వంసం చేస్తున్న దృశ్యాలతో కూడిన వీడియోలను భారత ఆర్మీ బహిర్గతం చేసిన నేపథ్యంలో పాక్‌ మీడియాలో కథనాలు రావడం గమనార్హం.

19:08 - May 24, 2017
19:04 - May 24, 2017
19:02 - May 24, 2017

హైదరాబాద్ : గత యేడాది అమిత్ షా తెలంగాణకు వచ్చారు. అప్పుడు కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని,అమిత్ షా అవాస్తవాలు చెబుతున్నారని సీఎం కేసీఆర్ ఆరోపించారు. అమిత్ షా మూడు రోజులు పర్యటనలో ప్రభుత్వంపై ఇష్టం వచ్చిన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. వ్యక్తిగతంగా నన్ను 10 మాటలు తిడితే పడతా కానీ రాష్ట్రాన్ని అవమానించేలా ఎలాంటి వ్యాఖ్యలు చేసినా ఊరుకోమని తెలిపారు. తెలంగాణ ప్రపంచంలో పోటి పడుతోందని, రాష్ట్ర అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ప్రధాని, కేంద్రమంత్రులు, పక్కా రాష్ట్రాల అధికారులు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ మెచ్చుకున్నారని గుర్తుచేశారు.

భారతదేశాన్ని పోషిస్తున్న తెలంగాణ
భారతదేశాన్ని తెలంగాణ పోషిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని కేసీఆర్ అన్నారు. 2016, 2017 సంవత్సరానికి తెలంగాణ కేంద్రానికి రూ. 50,013 కోట్లు పన్నులు చెల్లించామని ఆయన తెలిపారు. కానీ కేంద్రం మాత్రం తెలంగాణకు కేవలం రూ.24, 561 ఇచ్చారని పేర్కొన్నారు. తెలంగాణ ఇచ్చిన దాంట్లో సగం కూడా కేంద్రం ఇవ్వడంలేదని కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఈరోజు వరకు కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు రూ. 67,390 కోట్లు ఇచ్చారని అన్నారు. కేంద్రం పన్నుల్లో రాష్ట్రాల వాటా కింద తెలంగాణకు వచ్చింది రూ.37,773 కోట్లు, కేంద్ర ప్రభుత్వ పథకాల కింద రూ.18,574 కోట్లు వచ్చాయని పేర్కొన్నారు. జాతీయరహదారుల కింద మంజూరైనది కేవలం రూ. 2,055 కోట్లు అని అన్నారు.

రుజువు చేస్తే రాజీనామా చేస్తా
అమిత్ షా చెప్పిన మాటలు రుజువు చేస్తే నా సీఎం పదవికి రాజీనామా చేస్తానాని అన్నారు. తెలంగాణ నుంచి లక్ష కోట్ల విదేశి మారక ద్రవ్యం సంపాదించి పెడుతున్నామని స్ఫష్టం చేశారు. చిల్లర రాజకీయాల కోసం ప్రపంచం ముందు తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీయొద్దని అన్నారు. తెలంగాణ అడుక్కునే రాష్ట్రం కాదు.. దేశాన్ని పోషిస్తున్న రాష్ట్రమని పునర్ ఉద్ఘాగటించారు.

అమిత్ షా ను ఛాలెంజ్ చేస్తున్నా - కేసీఆర్..

హైదరాబాద్ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను తాను ఛాలెంజ్ చేస్తున్నానని చేస్తున్న విమర్శలపై సమాధానం చెప్పాలని సీఎం కేసీఆర్ ఛాలెంజ్ విసిరారు. ప్రభుత్వంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన విమర్శలపై సీఎం కేసీఆర్ స్పందించారు. బుధవారం మీడియాతో మాట్లాడారు.. 2016-17 లో కేంద్రం రూ. 24,561 కోట్లు కేంద్రం నుండి వచ్చిందని పేర్కొన్నారు. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 50,013 కోట్లు ఇస్తే కేంద్రం నుండి రూ. 24,561 కోట్లు ఇవ్వడం గమనించాలన్నారు. దేశానికి లక్ష కోట్లు ఇచ్చామనడం శుద్ధ అబద్ధమని, అదనంగా రూ. 20వేల కోట్లు ఎక్కడిచ్చారో అమిత్ షా..బీజేపీ నేతలు చెప్పాలని సవాల్ విసిరారు.

దేశానికి ఇచ్చే తెలంగాణ డబ్బు ఇదే - కేసీఆర్..

హైదరాబాద్ : లక్ష కోట్ల డబ్బు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పేర్కొనడం శుద్ధ అబద్ధమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన విమర్శలపై సీఎం కేసీఆర్ స్పందించారు. బుధవారం మీడియాతో మాట్లాడారు.. దేశానికి తెలంగాణ ఇచ్చే డబ్బు (2016-17) ఈ విధంగా ఉందని తెలిపారు. రూ.32,186 కోట్లు ఇన్ కం ట్యాక్స్..సర్వీస్ ట్యాక్స్ రూ. 7,671 కోట్లు...కస్టమ్స్ ట్యాక్స్ రూ. 3,328 కోట్లు..సెంట్రల్ ఎక్సైజ్ రూ. 6,828 కోట్లు..మొత్తంగా రూ. 50,013 కోట్లు..కేంద్రానికి చెల్లించినట్లు తెలిపారు.

అమిత్ షా అద్భుతమైన అబద్ధాలు చెప్పారు - కేసీఆర్..

హైదరాబాద్ : పార్టీని విస్తృతపరచడానికి ఏ పార్టీలైనా కృషి చేసుకోవచ్చని, అందులో తప్పు పట్టాల్సిందేమి లేదని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రభుత్వంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన విమర్శలపై సీఎం కేసీఆర్ స్పందించారు. బుధవారం మీడియాతో మాట్లాడారు..అమిత్ షా అధికార పార్టీ యొక్క అధ్యక్షుడని, ఇతరులు వ్యాఖ్యలు చేస్తే పట్టించుకొనే వ్యక్తి కాదని తెలిపారు. దేశంలో కొన్ని రాష్ట్రాలు లోటు రాష్ట్రాలున్నాయని, మరికొన్ని దేశాన్ని పెంచి పోషిస్తాయని..అందులో తెలంగాణ రాష్ట్రం కూడా ఉందన్నారు.

 

అమిత్ షా పై కేసీఆర్ ఫైర్..

హైదరాబాద్ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పై సీఎం కేసీఆర్ పలు విమర్శలు గుప్పించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన అమిత్ షా తెలంగాణ ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. దీనిపై సీఎం కేసీఆర్ బుధవారం సాయంత్రం స్పందించారు. మీడియాతో ఆయన మాట్లాడారు...దేశంలో అత్యంత ధనికమైన రాష్ట్రం తెలంగాణ అని, ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడుతోందని, దేశంలోని రాష్ట్రాలతో కాదని పేర్కొన్నారు. గత ఏడాది కూడా రాష్ట్రంలో పర్యటించిన అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఈసారి కూడా పలు వ్యాఖ్యలు చేశారని తెలిపారు.

అమిత్ షా వ్యాఖ్యలపై కేసీఆర్ స్పందన..

హైదరాబాద్ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ స్పందించారు. కాసేపటి క్రితం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతున్నారు. షా పేర్కొన్న మాటలు అవాస్తవాలని స్పష్టం చేశారు.

16:59 - May 24, 2017

మర్మాంగాలు కోసేయాలన్న నన్నపనేని..

విశాఖపట్టణం : మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యాచారాలకు పాల్పడే వారి మర్మాంగాలను కోసేయాలని, మహిళలు తమ వెంట చాకులు తీసుకెళ్లాలని సూచనలు చేశారు. అత్యాచార నిందితుల మొహాలకు మాస్క్ లు వేయవద్దని, కేరళలో స్వామికి జరిగిన శాస్తే జరగాలని పేర్కొన్నారు.

లాలు కుమార్తెకు ఐటీ సమన్లు..

ఢిల్లీ : లాలూ ప్రసాద్ కుమార్తె మీసా భారతికి ఐటీ సమన్లు జారీ చేసింది. జూన్ మొదటి వారంలో విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. బినామీ ఆస్తుల కేసులో ఈ సమన్లు జారీ చేసింది.

నేపాల్ ప్రధాని రాజీనామా..

ఢిల్లీ : నేపాల్ ప్రధాని ప్రచండ రాజీనామా చేశారు. ప్రభుత్వ ఏర్పాటు ఒప్పందంలో భాగంగా ఆయన రాజీనామా చేశారు. నేపాలి కాంగ్రెస్ చీఫ్ షేర్ బహదూర్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

 

గొర్రెల పెంపకం దారుల అవగాహన సదస్సులో ఉద్రిక్తత

వనపర్తి : గొర్రెల పెంపకం దారుల అవగాహన సదస్సులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పశుసంవర్ధక శాఖలో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ఒంటిపై కిరోసిన్ పోసుకుని మెరిట్ విద్యార్థులు నిరసనకు దిగారు. ఆందోళన చేసిన విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. పశుసంవర్ధక శాఖలో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీనిచ్చారు.

16:28 - May 24, 2017
16:23 - May 24, 2017

విశాఖ : జిల్లాలోని మహానాడు ప్రాంగణాన్ని ఏపీ హోంమంత్రి చినరాజప్ప పరిశీలించారు. ఆహుతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎవ్వరి ప్రభుత్వంలో ఫ్యాక్షన్ హత్యలు ఎక్కువగా జరిగాయో చూసుకోవాలన్నారు చినరాజప్ప. ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో హత్యలు జరగడం దురదృష్టకరమన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఫ్యాక్షన్‌ను రూపుమాపడానికే తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్న ఆయన.. ఎవరు ఫ్యాక్షన్ నేతలో రాష్ర్ట ప్రజలందరికీ తెలుసన్నారు.

16:18 - May 24, 2017

లక్నో : ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఎన్ని కఠిన చర్యలు చేపట్టినప్పటికీ ఉత్తరప్రదేశ్‌ పోలీసుల్లో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా బదయూ జిల్లా సదర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎస్పీ నేతను చితకబాదిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆధ్వర్యంలో ములాయం సింగ్‌ యువమోర్చా అధ్యక్షుడు స్వాలే చౌదరిని వంగబెట్టి లాఠీలతో చితకబాదారు. బయట జరిగిన ఓ గొడవను పరిష్కరించేందుకు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన స్వాలేను పోలీసులు కొట్టడమే కాకుండా కేసు నమోదు చేశారని బాధితుడి తండ్రి ఆరోపించారు. ఈ ఘటనపై బాధితులు సిఎం యోగికి ఫిర్యాదు చేయగా...అధికారులు సదరు ఇన్‌స్పెక్టర్‌ను తొలగించారు.

16:16 - May 24, 2017
16:04 - May 24, 2017
15:41 - May 24, 2017

కరీంనగర్ : సింగరేణి సంస్థలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు యాజమాన్యం, కార్మిక శాఖ సన్నద్ధం అవుతున్నాయి. ఈ మేరకు ఎన్నికల నిర్వహణకు సంబంధించి కార్మిక సంఘాలతో... యాజమాన్యం బేటీలు నిర్వహించింది. ప్రాంతీయ ఉప కమిషనర్‌ శ్యాం సుందర్‌ను ఎన్నికల అధికారిగా నియమిస్తూ.. ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో సంక్షేమ, పరిపాలన అధికారులు సింగరేణి డైరెక్టర్ ఫా పవిత్రన్‌ కుమార్‌తో భేటి కానున్నారు. ఈ బేటీలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి అంశాలతో పాటు గత ఎన్నికల్లో జరిగిన లోపాలపై ప్రధానంగా చర్చించనున్నారు. సజావుగా ఎన్నికల నిర్వహించేందుకు చర్యలు చేపట్టనున్నారు.

అధికారుల సమావేశం
ఈ నెల 31న కార్మిక సంఘాలు, యాజమాన్యంతో కార్మిక శాఖ అధికారులు సమావేశం నిర్వహించి ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కార్మిక శాఖ.. కార్మిక సంఘాల వార్షిక నివేదికలను... ఎన్నికల నియమావళిపై అభిప్రాయాలను సేకరించింది. అయితే ఎన్నికల నియమావళి మార్చాలంటూ... కొన్ని కార్మిక సంఘాలు.. యథావిధిగా కొనసాగించాలంటూ మరికొన్ని సంఘాలు పట్టుబడుతున్నాయి. ప్రస్తుతం రెండేళ్ల కాలపరిమితితో ఎన్నికలు నిర్వహించాలని కొన్ని సంఘాలు ...మాత్రం రెండు ఓట్ల విధానాన్ని తీసుకురావాలని మరికొన్ని సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. కార్మిక సంఘాల మధ్య ఏర్పడిన ఈ వివాదం కారణంగానే ఈ ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. కార్మిక సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా పోయాయి.

15:38 - May 24, 2017

అసోమ్ : భారతీయ వాయుసేనకు చెందిన సుఖోయ్‌ యుద్ధ విమానం ఆచూకి ఇంతవరకు దొరకలేదు. సుఖోయ్‌ ఆచూకి కోసం సి-130 విమానం, హెలిక్యాప్టర్‌ రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టాయి. వాతావరణం అనుకూలించక పోవడం వల్ల ఆ విమానం ఎక్కడుంతో కనుక్కోవడం కష్టంగా మారిందని అధికారవర్గాలు తెలిపాయి. తప్పిపోయిన విమానం ఆచూకి కోసం భారతీయ వాయుసేనతో పాటు, ఆర్మీ, స్థానిక ప్రభుత్వ యంత్రాంగం కూడా కృషి చేస్తోంది. 24 గంటలు గడిచిపోయిన సుఖోయ్‌ ఆచూకి తెలియలేదు. నిన్న ఉదయం పదిన్నరకు అసోంలోని తేజ్‌పూర్‌ ఎయిర్‌బేస్‌ నుంచి బయలు దేరిన సుఖోయ్‌ తప్పిపోయింది. విమానం ఎగిరిన 40 నిముషాలకో రేడియో రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. చైనా సరిహద్దుకు 2 వందల కిలోమీటర్ల దూరంలో విమానం తప్పిపోయినట్లు సమాచారం.

ఏచూరిని కలిసిన ఏపీ కాంగ్రెస్ నేతలు..

ఢిల్లీ : ఏపీ కాంగ్రెస్ నేతల హస్తిన పర్యటన కొనసాగుతోంది. కాసేపటి క్రితం సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని కలిశారు. భీమవరంలో జరిగే ప్రత్యేక హోదా సభకు రావాలని ఆహ్వానించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఏమైందో సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని ఏచూరి డిమాండ్ చేశారు.

ఆసుపత్రులో రోజుకో బెడ్ షీట్..

విజయవాడ : రాష్ట్రంలోని 13,200 డీఎంఈ ఆసుపత్రుల్లో బెడ్లపై ప్రతి రోజు ఒక కలర్ బెడ్ షీట్లు మార్చే కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారని మంత్రి కామినేని పేర్కొన్నారు. ప్రతి దుప్పటి మీద వారం పేరు రాస్తున్నట్లు, ఒక్క రోజు దుప్పటి మార్చకపోయినా ఫిర్యాదు చేయాలని సూచించారు. వైద్య శాఖలో సాంకేతిక సహాయంపై బిల్ గేట్స్ మేలిండా సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు, వైద్యశాఖలో బదిలీలు ఇంకా ప్రారంభం కాలేదన్నారు.

మరో ఏడాది పాటు ఐదు రోజుల పనిదినాలు..

విజయవాడ : అమరావతికి తరలివచ్చిన ఉద్యోగులకు ఐదు రోజుల పని దినాలు మరో ఏడాది పాటు ప్రభుత్వం పొడిగించింది. 2018 జూన్ వరకు 5 రోజుల పనిదినాలుంటాయని తెలిపింది.

15:26 - May 24, 2017

హత్యలకు రాజకీయ కక్షలే కారణం - చిన రాజప్ప..

విశాఖపట్టణం : కర్నూలు, ప్రకాశంలో జరిగిన హత్యలకు రాజకీయ కక్షలే కారణమని హోం మంత్రి చిన రాజప్ప వెల్లడించారు. శాంతిభద్రతలకు విఘాతం కాదని, శాంతిభద్రతలపై ప్రభుత్వం కఠినంగా ఉంటుందన్నారు. ఆదివాసీ యువతుల అత్యాచారంపై విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు.

15:14 - May 24, 2017

హైదరాబాద్ : మోటర్ వెహికిల్ ఇన్ స్పెక్టరర్ స్వాతిగౌడ్ ను ఆ శాఖ ఉన్నధికారులు సస్పెన్షన్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఎల్ బీనగర్ చౌరస్తాలో బౌన్సర్లతో కలిసి వాహన తనిఖీలు నిర్వహించారు. తనిఖీలో భాగంగా ఓ లారీ డ్రైవర్ ను లంచం ఇవ్వలేదని బౌన్సర్లతో దాడి చేయించింది. లారీ డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన పోలీసులు సీసీ ఫుటెజీ ఆధారంగా నివేదిక రూపొందించి రవాణా శాఖకు పంపించారు. దీంతో రవాణా శాఖ ఉన్నధికారులు ఆమెను సస్పెండ్ చేశారు.

కాల్ మనీలో పలువురిపై కేసులు నమోదు.

గద్వాల : కాల్ మనీ దందాలో పది మందిపై కేసులు నమోదు చేశారు. 8మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. రూ. 11 కోట్ల విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

ప్రజాగర్జనపై టి.కాంగ్రెస్ సమావేశం..

సూర్యాపేట : సంగారెడ్డి ప్రజాగర్జన సభపై కాంగ్రెస్ సమావేశం నిర్వహించింది. ఏఐసీసీ కార్యదర్శి కుంతియా, పీసీసీ చీఫ్ ఉత్తమ్ ఇతర నేతలు హాజరయ్యారు. టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకే జూన్ 1న సంగారెడ్డిలో సభ నిర్వహించనున్నట్లు, 2019 అధికారంలోకి వస్తే రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. రూ. 3వేల నిరుద్యోగ భృతి, లక్ష ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తామన్నారు. వరికి రూ. 2వేలు, మిర్చికి రూ. 12వేల పైచిలుకు మద్దతు ధర కల్పించనున్నట్లు వెల్లడించారు. రాహుల్ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

కాల్ మనీలో పలువురిపై కేసులు నమోదు...

గద్వాల : కాల్ మనీ దందాలో పది మందిపై కేసులు నమోదు చేశారు. 8మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. రూ. 11 కోట్ల విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ స్వాతిగౌడ్ సస్పెండ్..

హైదరాబాద్ : మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ స్వాతిగౌడ్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. సరూర్ నగర్ లో వాహనాల తనిఖీల తీరుపై విచారణ జరిపి అధికారులు వేటు వేశారు.

14:57 - May 24, 2017

హైదరాబాద్: ఫీజుల విషయంలో ప్రైవేటు స్కూల్స్ నిబంధనలకు నీళ్లొదిలేస్తున్నాయి. అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తూ తప్పుడు లెక్కలు చూపించి లాభాలు గడిస్తున్నాయి. అలాంటి స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే డ్రాఫ్ట్ రిపోర్టును తయారు చేసిన ఫీజుల నియంత్రణ కమిటి దీనికి సంబంధించి ఈనెల 29న ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.

కమిటీ నివేదిక తరువాతే
ఇందులో భాగంగా ఫీజుల నియంత్రణ కమిటి ప్రతి ప్రైవేటు స్కూల్ వద్దకు వెళుతుంది. అలా వచ్చిన కమిటీ మెంబర్స్ కు స్కూల్ యాజమాన్యం ఆడిటెడ్ అకౌంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అవి సరిగా ఉన్నాయో లేదో కమిటీ పరిశీలిస్తుంది. లెక్కల్లో ఏ మాత్రం తేడా వచ్చినా అటువంటి స్కూళ్ల జాబితాను ప్రభుత్వానికి అందజేస్తుంది. ప్రభుత్వ తనిఖీల్లోనూ ఏ మాత్రం తేడాలు జరిగినట్లు తేలినా ఆ స్కూలు అనుమతి రద్దు అవుతుంది. అయితే కమిటి నివేదిక తరువాతే ప్రభుత్వం ఫీ నియంత్రణపై గత నెలలోనే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం చెప్పినప్పటికీ తాము నిరంతరం ఫీజుల నియంత్రణపై శ్రమించామని తమకు తక్కువ సమయం ఇవ్వడం వల్లే ఆలస్యమైందని అంటున్నారు తిరుపతిరావు. మరో వారం రోజుల్లో పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి అందించబోతున్నట్లు ఆయన చెప్పారు. ఈ నివేదికలో సూచించే ప్రతీది న్యాయసలహాతో కూడినదని.. అందుకే ఫీ రెగ్యులేషన్ చేపట్టిన తరువాత ప్రభుత్వమే దానికి చట్టబద్ధత కల్పిస్తోందని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు కొన్ని ప్రైవేట్ స్కూల్స్ తమ స్కూళ్లలోనే డ్రెస్సులు,బుక్స్, స్టేషనరీ అమ్మకాలు చేపడుతున్నాయని ఇలా నిబంధనలు అతిక్రమించే పాఠశాలలపై చర్యలు తప్పవని తిరుపతిరావు హెచ్చరించారు.

 

14:55 - May 24, 2017

గుంటూరు : ఏపీలో ప్రభుత్వ పాఠశాలలకు మంగళం పాడేందుకు సర్కార్‌ వ్యూహ రచన చేస్తోంది. ప్రభుత్వ జిల్లా పరిషత్, మున్సిపల్ పాఠశాలల హేతుబద్ధీకరణకు సంబంధించిన విధి విధానాలను.. జీవో నెంబర్ 29లో పొందుపరిచారు. ఆ మేరకు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను హేతుబద్ధీకరించనున్నారు. విడుదల చేసిన జీవోలో నిబంధనలను పరిశీలిస్తే.. దాదాపు 9 వేలకు పైగా ప్రభుత్వ స్కూళ్లను మూసేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

500లకు పైగా ప్రాథమిక పాఠశాలలు మూత
గ్రామీణ నిరుపేద కుటుంబాలకు అందుబాటులో ఉన్న .. 6 వేల 500లకు పైగా ప్రాథమిక పాఠశాలలు మూత పడతాయేమోనన్న సందేహాలు నెలకొన్నాయి. అలాగే ఏకోపాధ్యాయ పాఠశాలలన్నీ కూడా మూత పడబోతున్నాయి. 2, 800లకు పైగా ప్రాథమికోన్నత పాఠశాలలు, 80 నుంచి 100కు పైగా ఉన్నత పాఠశాలలు మూత పడనున్నాయని అంచనాలు రూపొందిస్తున్నారు. ప్రభుత్వం మూసివేత పేరుతో కాకుండా విలీనం సాకుతో ప్రభుత్వ పాఠశాలలపై వేటు వేయడానికి పూనుకుంది. మరిన్ని పాఠశాలలు మూత పడితే సహించేది లేదని.. ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. అయితే ఈ విషయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్ 2017 మే 22న ఉత్తర్వులు జారీ చేయడం.. అనేక అనుమానాలకు తావిస్తోంది.

స్కూళ్లు నష్టదాయకం..
సాధారణంగా 6, 7 తరగతులున్న ప్రాథమికోన్నత స్కూళ్లలో.. 30 మంది లోపు పిల్లలున్న పాఠశాలలను, షెడ్యూల్‌ ఏరియాల్లో 20 మంది లోపు పిల్లలున్న స్కూళ్లను నష్టదాయకంగా పరిగణిస్తారు. డౌన్ గ్రేడ్ చేసిన ప్రాథమికోన్నత పాఠశాలల్లో 80 మంది, ఆ పైన ఉంటే మోడల్ స్కూల్‌గా పరిగణిస్తారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6, 7, 8 తరగతుల పిల్లలు 80 మందికి పైన ఉంటే.. అందుబాటులో ఉన్న ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తారు. 141 మందికి పైన విద్యార్థులున్న పాఠశాలల్లో.. అన్ని సబ్జెక్ట్ ప్యాట్రన్‌లను అనుసరించి అదనపు పోస్టులను కేటాయిస్తారు. 6, 7, 8 తరగతులున్న అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో 41-140 మంది విద్యార్థులున్న చోట.. 6 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉంటాయి. షెడ్యూల్ ఏరియాల్లో 40 లోపు విద్యార్థలున్న పాఠశాలలను నష్టదాయక పాఠశాలలుగా పరిగణిస్తారు. ఇదిలా ఉంటే గతంలో ప్రభుత్వ పాఠశాలలను మూసివేయమని ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు.

14:53 - May 24, 2017

తూర్పుగోదావరి : జిల్లా కాకినాడలోని కలెక్టరేట్‌లో ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కోబ్బరి తోటల వివాదంలో అధికారులు స్పందించడం లేదని.. మనస్తాపంతో రైతు పురుగుల మందు తాగేందుకు యత్నించాడు. దీనిని గమనించిన కలెక్టరేట్‌ సిబ్బంది అడ్డుకుని.. ఉన్నతాధికారుల దగ్గరకు తీసుకెళ్లారు.

 

14:51 - May 24, 2017

విజయవాడ : ప్లీనరీ సమావేశాలకు వైసీపీ రెడీ అవుతోంది. ప్లీనరీ వేదికగా..పార్టీలో ఎన్నిక‌ల వేడి రాజేయ‌డంతో పాటు క్యాడ‌ర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు వైసీపీ అధినేత జ‌గ‌న్ క‌స‌రత్తు చేస్తున్నారు. అందులో భాగంగానే పార్టీ మూడ‌వ ప్లీన‌రి స‌మావేశాల‌ను ఘ‌నంగా నిర్వహించాలని నిర్ణయించారు. జూలై 8న వైఎస్ జ‌యంతి రోజున పార్టీ ప్లీన‌రి జ‌రుగ‌నుంది. ఈ ప్లీన‌రీ స‌మావేశాల్లో రాష్ట్రంలో ప్రజ‌లు ఎదుర్కొంటున్న స‌మస్యలు, ప్రభుత్వ వైఫ‌ల్యాలు, వైసిపి బ‌లాబ‌లాలు, ఎన్నిక‌ల్లో అనుస‌రించాల్సిన వ్యూహాలు వంటి అంశాలపై పార్టీ క్యాడ‌ర్‌కు జ‌గ‌న్ దిశానిర్దేశం చేయ‌నున్నారు.

విస్తృత స్థాయి సమావేశాలు
దీనిలో భాగంగా ఈనెల 25 నుండి జూన్ 5 లోపు విస్తృత స్థాయి సమావేశాలు పూర్తి చెయ్యాల‌ని టార్గెట్ పెట్టుకున్నారు. మూడు అంచెల్లో ప్లీనరీలు నిర్వహిస్తామని అన్నారు. నియోజవర్గం, జిల్లా స్థాయిలతో పాటు విజయవాడలో జాతీయ స్థాయి సమావేశాలు నిర్వహించ‌నున్నారు. ఇవే కాకుండా జూన్ 18, 19 తేదీల్లో జిల్లా స్థాయి ప్లీనరీలు నిర్వహించనున్నారు. ఇక చివ‌ర‌గా జూలై 8,9 తేదీల్లో జరిగే జాతీయస్థాయి సమావేశాలతో ముగుస్తాయి. ఈ ప్లీనరీల్లో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ బలోపేతంపై చ‌ర్చించేవిధంగా ఎజెండా సిద్దం చేస్తున్నారు నేత‌లు. అంతే కాకుండా ఈ నెలాఖ‌రుకి గ్రామ స్టాయిలో బూత్ లెవ‌ల్ క‌మిటీల ప‌క్రియ కూడా పూర్తి చేయనున్నారు. విజ‌య‌వాడ‌లో రెండు రోజుల పాటు వైసీపీ ప్లీనరీ జరుగనుంది. రాష్ట్ర స్ధాయిలో జ‌రిగే ప్లీన‌రిలో ప్రభుత్వ వైఫ‌ల్యాలు, ఎన్నిక‌ల ముందు అధికార పార్టీ ఇచ్చిన వాగ్ధానాలు, వాటి అమ‌లు వంటి విష‌యాల‌పై చ‌ర్చిస్తామ‌ని వైసీపీ నేతలు అంటున్నారు. ప్లీన‌రి అనంత‌రం స‌భ్యత్వ న‌మోదు కార్యక్రమంపై దృష్టిసారిస్తామంటున్నారు వైసీపి నేత‌లు.

14:40 - May 24, 2017

విశాఖ : విశాఖ జిల్లా అనకాపల్లి సెషన్స్‌ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావుతో సహా 15 మందికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది. పదేళ్ల క్రితం నక్కపల్లి మండలం బంగారమ్మపేటలో జరిగిన హత్య కేసులో కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో మరో ఐదుగురికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.

14:30 - May 24, 2017

హైదరాబాద్ : నగరంలోని కూకట్ పల్లి సాయిబాబ నగర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. స్ర్కాప్ గోదాంపై కరెంటు వైర్లు తెడిపడడంతో గోదాముల్లో భారీగా మంటలు చెలరేగాయి. భారీ స్థాయిలో మంటలు రావడంతో స్థానికులు భయందోళ చెందారు. ఇక్కడ ఇళ్ల మధ్యలో గోదాములు ఉండడంతో స్థానిక ప్రజలు ఆందోళనకు గురౌతున్నారు. అంతే కాకుండా ప్రక్కనే జీడిమెట్ల పారిశ్రామివాడ నుంచి భారీ స్థాయిలో స్ర్కాప్ రావడంతో కూకట్ పల్లిలో గోదాములు ఎక్కువగా నిర్మిస్తున్నారని వెంటనే గోదాములు అని ఇక్కడి నుంచి తరలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

సియాచిన్ వద్ద పాక్ విమానం చక్కర్లు..

ఢిల్లీ : పాక్ మరోసారి దుందుడుకు చర్యకు పాల్పడింది. భారత్ - పాక్ సరిహద్దు సియాచిన్ గ్లేషియర్ సమీపంలో బుధవారం ఆ దేశ యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టినట్లు వార్తలు వెలువడుతున్నాయి. పాక్ ఆర్మీ చీఫ్ మార్షల్ సోహైల్ అమన్ సియాచిన్ వద్ద పర్యవేక్షించినట్లు పాక్ మీడియా పేర్కొన్నట్లు తెలుస్తోంది.

అమెరికాలో మంత్రి కేటీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మరోసారి అమెరికా పర్యటనకు వెళ్లారు. తెలంగాణకు పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించ‌డ‌మే ల‌క్ష్యంగా ఆయన పర్యటన కొనసాగుతోంది. ప‌లువురు ప్ర‌ముఖుల‌తో భేటీ అవుతూ బిజీబిజీగా ఉన్నారు. ఈ రోజు ఆయ‌న‌ సిలికాన్ వ్యాలీలోని సాంటాక్లారాలో ఎరిక్సన్ కంపెనీ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో ఆ సంస్థ ప్ర‌తినిధుల‌తో స‌మావేశ‌మ‌య్యారు.

 

14:17 - May 24, 2017

విజయవాడ : రేపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఏపీకి వెళ్లనున్నారు. హైదరాబాద్ నుంచి గన్నవరం వరకు చంద్రబాబు, అమిత్ షా ఒకే విమానంలో వెళ్తారు. మధ్యాహ్నభోజన సమయంలో అమిత్ షా చంద్రబాబుతో భేటీ కానున్నారు. టీడీపీ, బీజేపీ నేతల మాటలయుద్ధం నేపథ్యంలో వారి భేటీ ఆసక్తికరంగా మారింది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

కూకట్ పల్లిలో అగ్నిప్రమాదం..

హైదరాబాద్ : కూకట్ పల్లిలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. స్ర్కాప్ గోదాంపై కరెంటు వైరు పడడంతో మంటలు భారీగా చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.

ఒకే ఫ్లైట్ లో బాబు..షా..

విజయవాడ : ఏపీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వెళ్లనున్నారు. హైదరాబాద్ నుండి గన్నవరానికి విమానంలో వెళ్లనున్న అమిత్ షా తో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా వెళ్లనున్నారు. మధ్యాహ్న భోజన సమయంలో బాబు..అమిత్ షా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

13:20 - May 24, 2017

కడప : రాయలసీమ సమస్యలపై బంద్‌ పిలుపు నేపథ్యంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు కడపలో ఆందోళనకు దిగారు. వేలాది మంది ప్రజలతో భారీ ర్యాలీగా వస్తున్న మధు ను పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రంలో అన్ని రాజకీయపక్షాలను కలుపుకుని ప్రభుత్వంపై మరింత ఉధృతంగా ఉద్యమిస్తామని మధు స్పష్టం చేశారు.

13:18 - May 24, 2017

విశాఖ : అనకాపల్లి సెషన్స్‌ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావుతో సహా 15 మందికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది. పదేళ్ల క్రితం నక్కపల్లి మండలం బంగారమ్మపేటలో జరిగిన హత్య కేసులో కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో మరో ఐదుగురికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.

మాజీ ఎమ్మెల్యే చెంగలకు జీవిత ఖైదు శిక్ష..

విశాఖపట్టణం : అనకాపల్లి సెషన్ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. మాజీ మెఎ్మల్యే చెంగల వెంకట్రావుతో సహా 15 మందికి జీవిత ఖైదీ శిక్ష విధిస్తూ తెర్పును వెలువరించింది. నక్కపల్లి మం(మం) బంగారమ్మ పేటలో హత్య కేసులో కోర్టు పై విధంగా తీర్పును వెలువరించింది.

13:11 - May 24, 2017

అనంతపురం : ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాయలసీమ లో కరువు తాండవిస్తోందని జిల్లా సీపీఎం జిల్లా ఓబుల కొండా రెడ్డి ఆరోపించారు. బంద్ లో పాల్గొన్న ఆయన '10టివి'తో మాట్లాడుతూ...వ్యవసాయ కూలీల బకాయలను కూడా ఈ ప్రభుత్వం నిలిపేవేయడంతో వారంతా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారని వారందని వెనక్కు తీసుకువచ్చే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తీవ్రంగా తాగునీటి సమస్య ఉందని వీటన్నింటిని పట్టించుకోకుండా చంద్రబాబు సింగపూర్ , అమెరికా పర్యటన చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

మెరిట్ విద్యార్థులతో బాబు భేటీ..

విజయవాడ : వెలగపూడి సచివాలయంలో టెన్త్..ఇంటర్..ఐఐటీ..జేఈఈ మెరిట్ విద్యార్థులు..తల్లిదండ్రులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. మెరిట్ విద్యార్థులను చదివించే బాధ్యత తనదని, గ్రామీణ ప్రాంత విద్యార్థులు సత్తా చాటారని తెలిపారు. విద్యార్థులు ఓటమిని అంగీకరించకూడదని, విద్యార్థులను ప్రోత్సాహించడం కోసం ప్రతిభ అవార్డులు..ర్యాంకులు సాధించిన విద్యార్థుల ఉన్నత చదువుల కోసం సాయం అందించేందుకు ప్రత్యేక జీవో తెస్తామన్నారు. తెలంగాణ ఎంసెట్ లో సైతం ఏపీ విద్యార్థులు సత్తా చాటారని, నాణ్యత లేని వర్సిటీలు, కాలేజీలపై చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

12:42 - May 24, 2017
12:39 - May 24, 2017

హైదరాబాద్: ఉన్నత స్థానంలో వున్న పురుషులు మహిళలను కించపరిచే విధంగా, అగౌరపరిచే విధంగా మాట్లాడుతున్నారు. అలాంటి పురుషల పై ఏ విధమైన చట్టాలు ఉన్నాయి. ఇదే అంశం పై మానవి 'వేదిక'లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో ప్రముఖ న్యాయవాది పార్వతి పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

 

12:37 - May 24, 2017

అనంతపురం : రాయలసీమలో బంద్‌ కొనసాగుతోంది. ఉదయం నుంచి నాలుగు జిల్లాల్లో వామపక్షాల నేతలు ఆందోళనలు చేపట్టారు. బస్‌ డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. షాపులను మూసివేశారు. అయితే.. బంద్‌ నిర్వహస్తున్న వామపక్షాల నేతలను అడ్డుకున్న పోలీసులు... పలువురిని అరెస్ట్‌ చేశారు. దీంతో అనేక ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనేకచోట్ల శాంతియుతంగా బంద్‌ చేస్తున్నా... వామపక్షాల నేతలు, కార్యకర్తలను బలవంతంగా అరెస్ట్‌ చేసి.. దురుసుగా ప్రవర్తించారు. పోలీసుల వైఖరిపై నేతలు మండిపడుతున్నారు.

 

12:35 - May 24, 2017

గుంటూరు : ప్రేమించి మోసం చేసిన వ్యక్తిపై యువతి యాసిడ్‌తో దాడిచేసింది. పెదకాకాని మండలం వెనిగండ్లలో ఈ ఘటన చోటు చేసుకుంది. మరో పెళ్లికి సిద్ధపడిన ప్రియుడుని ఇంటికి పిలిచి నోట్లో యాసిడ్‌ పోసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రియుడు ఇలియాజ్‌ ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతిచెందాడు. ప్రియుడిపై దాడిచేసిన తర్వాత యువతి ఇంటినుంచి పరారైందని పోలీసులు తెలిపారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు.

వరంగల్ లో ఉద్యోగ మేళ..

వరంగల్ : ఉద్యోగ మేళాను డిప్యూటి సీఎం కడియం, హోం మంత్రి నాయినీలు ప్రారంభించారు. ఉద్యోగ మేళాకు నిరుద్యోగులు భారీగా తరలివచ్చారు. హైదరాబాద్ లాగా వరంగల్ ను రెండో నగరంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి నాయినీ వెల్లడించారు.

కాకినాడ కలెక్టరేట్ లో రైతు ఆత్మహత్యాయత్నం..

తూర్పుగోదావరి : కాకినాడ కలెక్టరేట్ లో ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కొబ్బరి తోటల వివాదంలో అధికారులు స్పందించడం లేదని ఓ రైతు పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కలెక్టరేట్ సిబ్బంది అడ్డుకుని ఆ రైతును ఆసుపత్రికి తరలించారు.

12:29 - May 24, 2017

తూర్పుగోదావరి : జిల్లా ధవళేశ్వరంలో ఇరిగేషన్‌ అధికారుల నిర్వాకంతో ఓ మహిళ మృతి చెందింది. పిచ్చుకలంక సమీపంలో బ్యారేజి దిగువన స్నానాలు చేస్తుండగా.. అధికారులు గేట్లు ఎత్తివేయడంతో పలువురు ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా మరో నలుగురు గల్లంతయ్యారు. బాధితులంతా మచిలీపట్నం వాసులుగా తెలుస్తోంది.

గొగోయికి రివార్డుపై నిరసనలు..

జమ్మూ కాశ్మీర్ : మేజర్ గొగోయికి రివార్డు ప్రకటించడం పట్ల జమ్మూ కాశ్మీర్ లో నిరసనలు వ్యక్తమౌతున్నాయి. ఇటీవలే ఓ జీపుకు యువకుడిని కట్టిన సంగతి తెలిసిందే.

బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం - అమిత్ షా..

నల్గొండ : గుండ్రాంపల్లిలో బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొన్నారు. స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన వారిని కలుసుకోవడం ఆనందంగా ఉందని అమిత్ షా వెల్లడించారు. రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర గుండ్రాంపల్లి వాసులకు చెందుతుందని, బీజేపీ నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. తెలంగాణ పల్లెపల్లెలో బీజేపీని బలోపేతం చేసేందుకే మూడు రోజుల పాటు పర్యటన చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో బీజేపీకి అధికారం తీసుకరావాలని పిలుపునిచ్చారు.

ప్రియుడిపై ప్రియురాలు యాసిడ్ దాడి..

గుంటూరు : పెదకాకాని మండలం వెనిగండ్లలో ప్రియుడిపై యువతి యాసిడ్ దాడికి పాల్పడింది. ప్రేమ పేరుతో మోసం చేసి మరొకరిని ప్రియుడు పెళ్లాడాడు. ఇంటికి పిలిపించుకుని ఇలియాజ్ నోట్లో యువతి యాసిడ్ పోసింది. ఆసుపత్రికి తరలిస్తుండగా ఇలియాజ్ మృతి చెందాడు. దాడి అనంతరం యువతి పరారైంది.

సీపీఎం నేత మధు..వి.ఉమామహేశ్వర్ ల అరెస్టు..

కడప : రాయలసీమ కరువు నివారణ చర్యలు తీసుకోవాలని కోరుతూ వామపక్షాల ఆధ్వర్యంలో కడపలో శాంతియుతంగా బంద్ నిర్వహిస్తున్న సిపిఎం, సిపిఐ కార్యకర్తలను పోలీసులు అరెస్టులు చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.ఉమామహేశ్వరరావులను పోలీసులు అరెస్టు చేశారు.

ఫ్లాష్..ఫ్లాష్..ఇరిగేషన్ అధికారుల నిర్వాకం..

తూర్పుగోదావరి : ధవళేశ్వరంలో పిచ్చుకలంక సమీపంలో బ్యారేజీ దిగువన పలువురు స్నానాలు చేస్తుండగా ఇరిగేషన్ అధికారులు గేట్లు ఎత్తివేశారు. దీనితో ఒక మహిళ మృతి చెందగా మరో నలుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం స్థానికులు గాలిస్తున్నారు.

11:29 - May 24, 2017

బాలీవుడ్ నటుడు 'సంజయ్ దత్' త్వరలోనే రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ముంబై బాంబు పేలుళ్ల ఘటనలో శిక్ష అనుభవించి జైలు నుండి రిలీజైన 'సంజయ్' మళ్లీ మేకప్ వేసుకొనేందుకు సిద్ధమౌతున్నాడు. తాజాగా ఆయన న్యూ గెటప్ బయటకొచ్చింది. సోషల్ మీడియాలో ఈ ఫొటో వైరల్ అవుతోంది. గ్యాంగ్ స్టర్ పాత్రలో 'సంజయ్ దత్' నటించనున్నారని తెలుస్తంది. గతంలో 'వాస్తవ్', 'ఖల్ నాయక్', 'కాంటే', 'మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్' లాంటి చిత్రాల్లో 'సంజయ్' ఆయా పాత్రల్లో ఒదిగిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి డాన్ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. తిగ్మన్షు దులియా 'సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్ స్టర్' సిరీస్ లో వస్తున్న చిత్రంలో 'సంజయ్' గ్యాంగ్ స్టర్ నటించనున్నారు. ఆగస్టు నుండి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందని టాక్. ఇందులో ఆయన పాత్ర ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే చిత్రం విడుదలయ్యే వరకు ఓపిక పట్టాల్సిందే.

మోడీతో భేటీ కానున్న పళనీస్వామి..

ఢిల్లీ : తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.పళనీస్వామి లోక్ కళ్యాణ్ మార్గ్ కు చేరుకున్నారు. అక్కడ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు.

బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం..

నల్గొండ : గుండ్రాంపల్లిలో బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం జరుగుతోంది. అమిత్ షా, దత్తాత్రేయ, లక్ష్మణ్, కిషన్ రెడ్డిలు హాజరయ్యారు.

మహానాడులోపు ప్రభుత్వం స్పందించాలి - మధు..

కడప : మహానాడు లోపు రాయలసీమ సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. రాయలసీమలో చుక్కనీరు కూడా దొరకడం లేదని, రాయలసీమ అభివృద్ధిపై చంద్రబాబు చర్చకు రావాలని సవాల్ విసిరారు. సీమ సమస్యలపై స్పందించకుంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఎన్టీఆర్ విగ్రహానికి టి.టిడిపి నేతల నివాళులు..

హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబీషన్ గ్రౌండ్ లో టిటిడిపి మహానాడు జరగనుంది. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలతో నేతలు నివాళులర్పించారు. ఎల్.రమణ, రేవంత్ రెడ్డి, పెద్దిరెడ్డి, రావుల, మోత్కుపల్లి, సండ్ర, సీతక్క పలువురు కార్యకర్తలు హాజరయ్యారు.

 

11:16 - May 24, 2017

కర్నూలు : రాయలసీమలో అరెస్ట్ ల పర్వం కొనసాగుతోందని అరెస్ట్ లతో ఉద్యమాన్ని ఆపలేరు సీపీఎం నేత గఫూర్ అన్నారు. ఆయన కర్నూల్లో వామపక్షాలు చేపట్టిన బంద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొంటున్నారని తెలిపారు. రాయలసీమ కరువు సమస్య రాజకీయ సమస్యల కాదని ఇది ప్రజల సమస్య తెలిపారు. వెనకపడ్డ ప్రాంతాల అభివృద్ధి కోసం చంద్రబాబు కట్టుబడి ఉంటే ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాయలసీమ పై సీఎం చంద్రబాబు సీతకన్ను వేశారని మండి పడ్డారు. వెంటనే సీమలో కరువుపై దృష్టి పెట్టి సమస్యను పరిష్కరించేవిధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ముఖ్యనేతలతో బాబు సమావేశం..

విజయవాడ : ముఖ్యనేతలతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. క్రమశిక్షణా రాహిత్యంపై బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా ఘటనపై కమిటీ వేస్తామని, క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కర్నూలు జిల్లాలో జంట హత్యల విషయంలో వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, హత్యలు జరగడం దురదృష్టకరమని టిడిపిని తప్పుపడితే ఎలా అని ప్రశ్నించారు. బీజేపీలో మిత్రపక్షంగా ఉన్నామని..ఉండబోతున్నట్లు, బీజేపీ నేతలు టిడిపిని విమర్శిస్తే ఆ పార్టీ అధిష్టానం మిత్రధర్మాన్ని పాటించాల్సిందేనన్నారు.

11:11 - May 24, 2017

కర్నూలు : రాయలసీమలో కరువు మండలాలను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలిన సీపీఐ రామకృష్ణ డిమాండ్ చేశారు. రాయల సీమ కరువు పై వామపక్షాలు బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్నా ఆయన మాట్లాడుతూ.. వేల కుటుంబాలు వివిధ రాష్ట్రాలకు వలస వెళ్లి బతుకుతున్నారంటే ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి. వలస వెళ్లిన వారిని వెనక్కి రప్పించాలి. పశుగ్రాసం లేదు, చాలా గ్రామాల్లో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాల ప్రజలు చదువులు మానేస్తున్నారు. కాబట్టే ఈ బంద్ లో అన్ని రంగాలకు చెందిన ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని కరువు సమస్యను పరిష్కారించాలని డిమాండ్ చేశారు.

ఏపీ బయోమెట్రిక్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం..

ప్రకాశం : ఒంగోలు గ్రోత్ సెంటర్ లోని ఏపీ బయోమెట్రిక్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.

10:51 - May 24, 2017

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' కెరీర్ లో 'తొలి ప్రేమ' ఎలాంటి ఘన విజయం సాధించిందో అందిరికీ తెలిసిందే. ఈ చిత్రాన్ని 'కరుణాకరన్' తెరకెక్కించారు. కెరీర్ ఆరంభంలో ఎన్నో మంచి ప్రేమ కథా చిత్రాలు అందించిన 'కరుణాకరన్' ఇప్పుడు కాస్త వెనుకబడ్డాడు. ఈయన చివరిగా తెరకెక్కించిన 'ఎందుకంటే ప్రేమంట' చిత్రం పరాజయాన్ని మూటగట్టుకుంది. దీనితో చాలాకాలంగా ఆయన సినిమాలు చేయడం లేదు. తాజాగా 'తొలి ప్రేమ' వంటి కథతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నారంట. ఈ సినిమాలో 'సాయి ధరమ్ తేజ'ని హీరోగా కనిపించబోతున్నట్లు టాక్. ఇప్పటికే కథను సాయి ధరమ్ తేజకు వినిపించారని, ఇందుకు ఒకే కూడా చెప్పాడని తెలుస్తోంది. యూత్..మాస్ ఆడియన్స్ ను మెప్పించే కథలను ఎంచుకుంటూ వెళుతున్న 'సాయి ధరమ్ తేజ' ప్రేమ కథా చిత్రాన్ని ఎంచుకోవడం గమనార్హం. ప్రస్తుతం 'సాయి ధరమ్ తేజ' 'నక్షత్రం' సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగా, బీవీఎస్ రవి దర్శకత్వంలో చేస్తోన్న 'జవాన్' షూటింగ్ దశలో ఉంది.

10:44 - May 24, 2017

కడప :జిల్లాలో పూర్తిస్థాయిలో బంద్‌ జరుగుతోంది. వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజలు నిరసనలు దిగుతున్నారు. పలు పట్టణాల్లో భారీసంఖ్యలో వాహనాలు ఎక్కడివక్కడే నిలిపోయాయి. ప్రొద్దుటూరు ఆందోళనకు దిగిన వామపక్షాలు, కాంగ్రెస్‌ నాయకులన, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. అటు తిరుపతిలో బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. బస్టాండ్‌ సర్కిల్‌వద్ద బైఠాయించిన ఆందోళనకారులు వాహనాలను అడ్డుకుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు పలువుకు కార్యకర్తలను ఈడ్చిపడేశారు. శాంతియుతంగా బద్‌ నిర్వహిస్తున్న వారిపై పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని సీపీఎం, సీపీపై నేతలు మండిపడ్డారు. అటు కర్నూలు జిల్లాలో బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. కోడుమూరు, గూడూరు, సి.బెలగళ్‌ మండలాల్లో బంద్‌ ఎఫెక్ట్‌ కనిపిస్తోంది.

10:42 - May 24, 2017

నల్లగొండ : జిల్లాలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పర్యటన కొనసాగుతోంది. కాసేపట్లో చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో తెలంగాణసాయుధ పోరాట అమర వీరుల కుటుంబాలతో అమిత్‌షా భేటీ కానున్నారు.

ఉత్తరాఖండ్ ప్రమాద ఘటనలో మోడీ పరిహారం..

ఢిల్లీ : ఉత్తరాఖండ్ ప్రమాద ఘటనలో మృతులకు..క్షతగాత్రులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పరిహారాన్ని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు..క్షతగాత్రులకు రూ. 50వేల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు.

నల్గొండలో అమీత్ షా మూడో రోజు పర్యటన..

నల్గొండ  : జిల్లాలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమీత్ షా పర్యటన మూడో రోజు కొనసాగుతోంది. చిట్యాల (మం) గుండ్రాంపల్లిలో తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల కుటుంబాలను అమీత్ షా పరామర్శించనున్నారు.

డెహ్రాడూన్ లో ఈడీ సోదాలు..

ఉత్తరాఖండ్ : డెహ్రాడూన్ లో ఓ షాపింగ్ మాల్ లో ఈడీ సోదాలు నిర్వహించింది. రూ. 51 లక్షలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫెమా చట్టం కింద షాపింగ్ మాల్ యజమానిపై కేసు నమోదు చేశారు.

అరెస్టులు చేయడం హేయం - వామపక్ష నేతలు..

అనంతపురం : జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా బంద్ కొనసాగుతోంది. ప్రజల ఆస్తులకు భంగం వాటిల్లకుండా బంద్ నిర్వహిస్తుంటే పోలీసులు అరెస్టు చేయడం హేయమైన చర్య అని వామపక్ష నేతలు పేర్కొన్నారు.

తిరుపతి బస్టాండ్ వద్ద వామపక్ష నేతల ఆందోళన..

చిత్తూరు : తిరుపతి బస్టాండ్ సర్కిల్ వద్ద వాహనాలను వామపక్ష నేతలు అడ్డుకున్నారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. మదనపల్లి అమ్మ చెరువు వద్ద రాస్తారోకో జరిపారు. పోలీసుల తీరుపై వామపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి.

కొనసాగుతున్న రాయలసీమ బంద్..

విజయవాడ : వామపక్షాల ఆధ్వర్యంలో రాయలసీమ బంద్ కొనసాగుతోంది. తాగు..సాగునీటి సమస్య పరిష్కరించాలని, కరవు, ఉపాధి, పంట నష్టపరిహారం, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ బంద్ కొనసాగుతోంది. బంద్ కారణంగా జేఎన్టీయూ పరిధిలో జరిగాల్సిన పరీక్షలన్నీ వాయిద వేశారు. బంద్ కు కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది.

షా ను కలిసిన మందకృష్ణ..

నల్గొండ : జిల్లాలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమీత్ షా పర్యటన మూడో రోజు కొనసాగుతోంది. కాసేపటి క్రితం అమిత్ షాను ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కలిశారు. పార్లమెంట్ లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశ పెట్టాలని ఈ సందర్భంగా మందకృష్ణ కోరారు.

ఛత్తీస్ గఢ్ లో బాంంబు పేలుడు...

ఛత్తీస్ గఢ్ : బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు బాంబు పేల్చారు. పోలీసులకు ఎలాంటి ప్రాణనష్టం కలుగలేదు. ఓ మావోయిస్టును పోలీసులు అరెస్టు చేశారు.

తిరుమలలో అనూహ్య రద్దీ..

చిత్తూరు : తిరుమలలో అనూహ్యంగా రద్దీ నెలకొంది. 31 కంపార్ట్ మెంట్ లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుందగా నడక దారి గుండా వచ్చే భక్తులకు 10 గంటల సమయం పడుతోంది. తిరుమలలో అనూహ్యంగా ఏర్పడిన రద్దీ నేపథ్యంలో రేపు కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలు దర్దు చేసినట్లు జేఈవో శ్రీనివాస రాజు వెల్లడదించారు. సెలవుల కారణంగా రద్దీ ఏర్పడిందని భక్తులకు సహకరించాలని సూచించారు.

ఎగ్జిబీషన్ గ్రౌండ్ లో టి.టిడిపి మినీ మహానాడు..

హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబీషన్ గ్రౌండ్ లో టి.టిడిపి మినీ మహానాడు జరగనుంది. సాయంత్రం నాలుగు గంటకు ఏపీ సీఎం, పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. 8 తీర్మానాలను ప్రవేశ పెట్టనున్నారు. నిరుద్యోగ సమస్య, టీఆర్ఎస్ హామీలు వైఫల్యాలు, అస్తవ్యవస్త పాలన తదితర అంశాలపై చర్చ జరగనుంది. మినీ మహానాడు సందర్భంగా నగరంలో కట్టిన బ్యానర్లను జీహెచ్ఎంసీ అధికారులు తొలగిస్తున్నారు.

అనంతలో ప్రశాంతంగా బంద్..

అనంతపురం : జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పుట్టపర్తి, తాడిపత్రి, అనంతపురంలో ఆర్టీసీ బస్లాండుల వద్ద బస్సులను వామపక్ష నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. హిందూపురం ఎన్టీఆర్ సర్కిల్ లో వామపక్ష నేతలను పోలీసులు అరెస్టు చేశారు. సీపీఎం కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అరెస్టులను సీపీఎం ఖండించింది.

 

10:02 - May 24, 2017
10:00 - May 24, 2017
09:57 - May 24, 2017

టాలీవుడ్ మన్మథుడు 'నాగార్జున' తనయుడు 'అఖిల్' మొదటి చిత్రం అనంతరం చాలా గ్యాప్ తీసుకున్నాడు. మొదటి చిత్రం అంతగా ఆకట్టుకోలేక పోయేసరికి చాలా రోజులు విరామం తీసుకుని రెండో సినిమాకు సన్నద్ధం అయిన సంగతి తెలిసిందే. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. విక్రమ్ దర్శకత్వంలో 'మనం' చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందని సోషల్ మాధ్యమాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అఖిల్ పై యాక్షన్ పార్ట్ షూటింగ్ జరిగిన అనంతరం నెక్ట్స్ షెడ్యూల్ హీరోయిన్ తో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ హీరోయిన్ ఇంకా ఫైనల్ కాలేకపోవడంతో షూటింగ్ కు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నలుగురి అమ్మాయిలను ఫైనలైజ్ చేసినట్లు..అందులో ఒకరిని సెలక్ట్ చేస్తారని టాక్. ఎవరనేది తేలిన తరువాత అఖిల్ సినిమాకు సంబంధించి రెండో షెడ్యూల్ స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది.

09:49 - May 24, 2017

హైదరాబాద్: పార్టీ మహానాడును ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని తెలంగాణ టిడిపి నిర్ణయించింది. హైదరాబాద్‌ ఎగ్జిబిషన్‌ మైదానంలో ఇవాళ జరిగే మహానాడుకు ఏపీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు హాజరుకానున్నారు. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న ప్రజా సమస్యలతోపాటు, రాజకీయ పరిస్థితులపై ఎనిమిది తీర్మానాలను ఆమోదిస్తారు.

సర్వం సిద్దం...

తెలంగాణ టీడీపీ మహానాడుకు సర్వంసిద్ధమైంది. మొదటిసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మహానాడును వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌ ఎగ్జిబిషన్‌ మైదానంలో జరిగే పార్టీ పండుగను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు టీడీపీ నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై

తెలంగాణ టీడీపీ మహానాడుకు ఏపీ ముఖ్యమంత్రి, పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు హాజరవుతున్నారు. పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై మహానాడులో చర్చిస్తారు. పార్టీ నేతలు చంద్రబాబు దిశా, నిర్దేశం చేస్తారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలు సహా, వివిధ అంశాలపై ఎనిమిది తీర్మానాలు ఆమోదిస్తారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను...

విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను మహానాడు ద్వారా ఎత్తి చూపాలని తెలంగాణ టీడీపీ నేతలు నిర్ణయించారు. తెలంగాణ టీడీపీ మహానాడుకు చంద్రబాబునాయుడు హాజరుకావడం ద్వారా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వస్తుందని భావిస్తున్నారు.

09:47 - May 24, 2017

టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించి ఇటీవలే బాలీవుడ్ కు చెక్కేసిన అందలా భామ 'తాప్సీ' మళ్లీ తెలుగు ప్రేక్షకులకు కనిపించబోతోంది. బాలీవుడ్ లో వైవిధ్యమైన సినిమా కథలను ఎంచుకుంటున్న ఈ ముద్దుగుమ్మ నటనపై విమర్శకులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. 'నేనే షబానా' అంటూ 'నామ్‌ షబానా' తెలుగు డబ్బింగ్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన తాప్సీ, 'ఘాజీ' అనే స్ట్రెయిట్‌ సినిమాలోనూ నటించినా, అందులో ఆమె పాత్ర నిడివి చాలా తక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా తెలుగు చిత్రంలో నటించబోతోంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. చిత్ర టైటిల్ ను రివర్స్ లో పెట్టి..భయానికి నవ్వంటే భయం అనే ట్యాగ్ లైన్ పెట్టి రిలీజ్ చేశారు. టైటిల్ ను రివర్స్ లో పెట్టినా అది 'ఆనందో బ్రహ్మ' అనే టైటిల్ ను ప్రేక్షకులు గుర్తు పట్టేశారు. తెలుగులో స్ట్రెయిట్‌ సినిమా చేయబోతున్నాననీ, చాలా ఆనందంగా వుందనీ, ఈ ప్రీ లుక్‌ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ తాప్సీ వ్యాఖ్యానించింది. మరి ఈ చిత్రంతో 'తాప్సీ' ఎలా కనిపించబోతోందో ? తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా ? లేదా అనేది చూడాలి.

09:32 - May 24, 2017

పెళ్లి చేసుకున్న భర్త గణేష్ కు అవకాశం రావడంతో దుబాయి పయనం..అత్తారింట్లో తన బాధ్యతలను నెరవేరుస్తోంది...అందరితో మమేకమై..తన కొత్త జీవితాన్ని తీర్చిదిద్దుకొంటోంది..కోడలు కాదని..ఈ ఇంటికి వచ్చిన కూతురని అత్తారింటి వారు పేర్కొంటున్నారు.ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు చేసి అప్పుల పాలయ్యాడు. కొడుకును ప్రయోజకుడిని చేసేందుకు చేసిన అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయి. దుబాయికి పంపిస్తే దేశం కాని దేశంలో కొడుకు జైలు పాలయ్యాడు. వీటిని తట్టుకుని శక్తిని కూడదీసుకుంటున్న తరుణంలో తోడుగా ఉన్న భార్య అనారోగ్యంతో కన్నుమూసింది. విధి వెంటాడుతున్న తన బాధ్యతను నెరవేర్చాలనుకున్నాడు. చిన్న కూతురిని ఓ ఇంటిదానిని చేయాలని అనుకున్నాడు. మహూర్తం పెట్టుకున్నాడు..రోజులు దగ్గర పడుతున్నాయి. కానీ చేతికి మాత్రం డబ్బు అందలేదు. ఎక్కడ పెళ్లి ఆగిపోతుందన్న ఆందోళన..పరువు పోతుందన్న ఆవేదన...ఆ పెద్దాయన ఉసురు తీసింది..కానీ ఆ పెళ్లి మాత్రం ఆగిపోలేదు..ఆయన ఆత్మహత్య చేసుకున్నా తలపెట్టిన కార్యం మాత్రం నెరవేరింది. ఖాకీల వెనుక కాఠిన్యమే కాదు కారుణ్యం ఉందని నిరూపించారు. ఓ ఆడబిడ్డ జీవితాన్ని నిలబెట్టేందుకు కాప్స్ కన్యాదానం చేశారు. అత్తారింటిలో ప్రస్తుతం అమ్మాయి తన బాధ్యతలను నెరవేరుస్తోంది. కొత్త జీవితాన్ని తీర్చిదిద్దుకొంటోంది..కోడలు కాదని..ఈ ఇంటికి వచ్చిన కూతురని అత్తారింటి వారు పేర్కొంటున్నారు. అనూష పెళ్లి చేయాలన్న సంకల్పాన్ని సబ్ ఇన్ స్పెక్టర్ నరేష్ రెడ్డి నెరవేర్చారు. ఆమె జీవితాన్ని పూర్తిస్థాయిలో తీర్చిదిద్దే వరకు తోడుగా ఆమె కాపురం కలకలం సాఫీగా సాగుతూ ఆనందమయం కావాలని ప్రతొక్కరం కోరుకుందాం..మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి...

09:30 - May 24, 2017

కడప: జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మించి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని ఆ జిల్లా నేతలు అభిప్రాపడ్డారు. రాయలసీమ కరువుపై వామపక్షాలు ఇచ్చిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామలను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు.

09:27 - May 24, 2017

తిరుపతి : రాయలసీమలో కరువు పై వామక్షాలు చేపట్టిన బంద్ ను విఫలం చేసేందుకు చంద్రబాబు కంకణం కట్టుకున్నాడని సీపీఎం నేత వి. కృష్ణయ్య విమర్శించారు. చేతకాని చంద్రబాబు అరెస్ట్ లతో ఉద్యమాన్ని ఆపలేరని... సమస్య పరిష్కరించే వరకు ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు. అలాగే డిపోవద్ద ఆందోళన చేస్తున్న సీపీఎం జిల్లా కార్యదర్శి కుమార్ ను, ఇదితర నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

09:21 - May 24, 2017

అనంతపురం: పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి అయితే రాయలసీమకు నీళ్లు ఇస్తామంటున్నారాని దానికీ.. దీనికి ఏమైనా సంబంధం ఉందాని అని వామపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. పట్టి సీమ ఏమైనా చంద్రబాబు తాత సీమనా అని మండిపడుతున్నారు. రాయలసీమ కరువుపై నేడు సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో సంపూర్ణ బంద్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా అనంతపురం బస్టాండ్ వద్ద ఆందోళన చేపడుతున్న కార్యకర్తలను '10టివి' పలుకరించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడిన మాటలు. ఇంకా ఏమన్నారంటే ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ కూడా రైతులకు అందండం లేదని, రాయలసీమ ఎడారి అయిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తరువాత మరో మాట మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. నీటి ప్రాజెక్టులన్నింటినీ పెండింగ్ లో పెట్టారని. దీంతో ప్రజలంతా వలసలు వెళుతున్నారు. చంద్రబాబుకు సీమ పై చిత్తశుద్ధి ఉందా ప్రశ్నించారు.

నూతన పరిశ్రమలు తీసుకువచ్చి... మూతపడిన పరిశ్రమలను తెరిపించాలని డిమాండ్ చేశారు.

కపడ జిల్లాలో డిపోల వద్ద ఆందోళన

కడప: రాయసీమల బంద్ లో భాగంగా జిల్లాలో అన్ని డిపోల వద్ద వామపక్ష కార్యకర్తలు ఆందోళనను చేపట్టాయి. వామపక్షాల బంద్ కు జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది.

తిరుపతి లో వామపక్షాల కార్యకర్తల అరెస్ట్

తిరుపతి : బస్టాండ్ సర్కిల్ వద్ద వాహనాలను అడ్డుకుంటున్న వామపక్ష కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై తీవ్ర నిరసనను కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు.

కర్నూలు కొత్త బస్టాండ్ ఎదుట వామపక్షాల ఆందోళన

కర్నూలు : కొత్తబస్టాండ్ ఎదుట వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపో వద్ద వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఈ సందర్భంగా పోలీసులు పలువురు వామపక్ష కార్యకర్తలను అరెస్టు చేశారు.

అనంత సీపీఎం కార్యాలయం వద్ద పోలీసుల మోహరింపు

అనంతపురం: సీపీఎం కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఏపీ, వామపక్షాల ఆధ్వర్యంలో రాయలసీమ బంద్ జరుగుతోంది. తాగు, సాగునీటి సమస్య పరిష్కరించాలని, కరువు, ఉపాధి, పంట నష్టపరిహారం, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. బంద్ కారణంగా జేఎన్టీయూ పరిధిలో నేడు జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. రాయలసీమ బంద్ కు కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది.

08:35 - May 24, 2017

హైదరాబాద్: హైదరాబాద్: దక్షిణాదిన పార్టీ బలోపేతంపై దృష్టిసారించామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా అన్నారు. 2019 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాయలసీమ..! నిత్య క్షామపీడిత ప్రదేశం. పాలకులు నిర్లక్ష్యానికి గురైన ప్రాంతం. ఈ జిల్లాల్లో పదేళ్ల సగటు తీసుకుంటే.. ఏడేళ్లు కరవు కరాళ నృత్యం చేస్తుంటుంది. ఈ ఏడాది కూడా కరవు.. వరుసగా ఆరోసారి పిలవని చుట్టంలా వచ్చేసింది. ఫలితంగా వ్యవసాయం కుదేలైంది. ఉపాధి కరవైంది. తాగునీటికీ కటకట ఏర్పడింది. వలసలు మొదలయ్యాయి. ప్రజల కష్టాలు పాలకుల చెవికెక్కడం లేదు. రాష్ట్ర విభజన వేళ ఈ ప్రాంతాన్ని నందనవనం చేస్తామన్న హామీ ఎప్పుడో అటకెక్కేసింది. ఈ దశలో, అలో లక్ష్మణా అని అలమటిస్తోన్న సీమ గోడును.. సర్కారు దృష్టికి తెచ్చేందుకు.. వామపక్ష, ప్రజాసంఘాలు.. ఇవాళ రాయలసీమ బంద్‌ను నిర్వహిస్తున్నాయి. ఈ అంశాలపై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో లోక్ సత్తా నే శ్రీనివాస్, టిడిపి గుంటూరు చందూరి సాంబశివరావు, సిఐటియు నేత ఉమామహేశ్వరరావు, వైసీపీ నేత మదన్ మోహన్ రెడ్డి కడప నుండి పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

06:50 - May 24, 2017

హైదరాబాద్: రాయలసీమ కరువు సమస్యను పరిష్కరించాలంటూ వామపక్షాల ఇవాళ రాయలసీమ బంద్‌ కు పిలుపునిచ్చాయి. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో రాయలసీమ బంద్‌ జరుగుతోంది. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి....

06:47 - May 24, 2017
06:45 - May 24, 2017

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2వేల గ్రూప్‌-1, గ్రూప్‌-2 పోస్టులను భర్తీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి రక్షిత మంచినీరు సరఫరా చేసేందుకు ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. దీనికి సంబంధించి రెండు, మూడు ప్రతిపాదనలపై అధ్యయనం చేస్తోంది. త్వరలో జరిగే జిల్లా కలెక్టర్ల సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయించారు.

పథకాలు పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ పథకాలు పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్షించారు. మంత్రి లోకేశ్‌తోపాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

మంచినీటి సరఫరాకు ప్రత్యేక వ్యవస్థ

ప్రజా సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర వహించే ప్రభుత్వ అధికారుల పోస్టుల ఖాళీలను భర్తీ చేసి, త్వరలో నియామకాలు చేపట్టాలని ఈ సమావేశంలో చంద్రబాబు నిర్ణయించారు. రాష్ట్రంలో మంచినీటి సరఫరా కోసం ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేసే అంశంపై చర్చించారు. ఆరు నెలల్లో తాగునీటి కాలుష్యాన్ని నివారించాలని నిర్ణయించారు. వచ్చే వర్షాకాలంలో ఎక్కడా కూడా అంటువ్యాధులు ప్రబలకుండా ఇప్పటి నుంచే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. పారిశుధ్య నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఇందుకోసం జాతీయ, గ్రామీణ ఉపాధి హామీ కార్మికులను వినియోగించుకునేందుకు వెసులుబాటు కల్పించారు. దోమల వ్యాప్తికి కారణమయ్యే చెత్తా, చెదారాలను రహదారులు, నివాస ప్రాంతాల్లో పడేయకండా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

స్వచ్ఛాంధ్రప్రదేశ్‌ కార్యక్రమంలో ఎన్జీవోలు, సెలబ్రిటీలు, విద్యార్థులు

స్వచ్ఛాంధ్రప్రదేశ్‌ కార్యక్రమంపై కూడా చంద్రబాబు సమీక్షించారు. దీనిలో ప్రభుత్వేతర సంస్థలు, ఎలబ్రిటీలు, విద్యార్థులు భాగస్వాములను చేయాలని నిర్ణయించారు. గ్రామాల్లో సిమెంటు రోడ్ల నిర్మాణానికి ప్రధాన్యత ఇస్తారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మిస్తారు. గ్రామాల్లోని పరిశుభ్రత, మౌలిక వసతుల కల్పన ఆధారంగా ర్యాంకులు ఇస్తారు. వీటి ఆధారంగా ఉత్తమ గ్రామాలకు ప్రోత్సహకాలు, పురస్కారాలు అందించాలని సమీక్షలో నిర్ణయించారు. వర్షాకాలంలో అన్ని చోట్ల కూడా మొక్కలు నాటేందుకు ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య పై సమీక్ష...

శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య కూడా ఈ సమీక్షలో ప్రస్తావనకు వచ్చింది. వచ్చే జులై ఆఖరు నాటికి ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తామని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి లోకేశ్‌... ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తెచ్చారు. ఉద్దానంలోని సమస్యాత్మక ప్రాంతాలన్నింటికీ ఎన్టీఆర్‌ సుజల పథకం ద్వారా రక్షిత మంచినీరు అందించాలని నిర్ణయించారు.

ఏపీలో 2వేల గ్రూప్‌-1, గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి చర్యలు

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2వేల గ్రూప్‌-1, గ్రూప్‌-2 పోస్టులను భర్తీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి రక్షిత మంచినీరు సరఫరా చేసేందుకు ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. దీనికి సంబంధించి రెండు, మూడు ప్రతిపాదనలపై అధ్యయనం చేస్తోంది. త్వరలో జరిగే జిల్లా కలెక్టర్ల సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయించారు

06:41 - May 24, 2017

హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భవించి మూడేళ్లు పూర్తవుతోంది. వచ్చే నెల 2న నిర్వహించాల్సిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణ అవిర్భావ దినోత్సవాల సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు.

గ్రామం నుంచి ఢిల్లీ వరకు పండుగ వాతావరణం

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకులను ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. గ్రామం నుంచి దేశ రాజధాని ఢిల్లీ వరకు ప్రత్యేక పండుగ వాతావరణం ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లతో సహా అన్ని చోట్ల రాష్ట్రావతరణ వేడుకల వాతావరణం కనిపించేలా చూస్తారు. వచ్చే నెల 2న అమరవీరులకు నివాళులర్పించి, జిల్లా కేంద్రాల్లో ఉత్సవాలను ప్రారంభిస్తారు. హైదరాబాద్‌ గన్‌ పార్కులో అమరవీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాళులర్పించి ఉత్సవాల్లో పాల్గొంటారు. జిల్లా కేంద్రాల్లో అమరవీరుల స్థూపాల వద్ద నివాళులర్పిస్తారు. స్థాపాలు లేనిచోట్ల తాత్కాలిక స్థూపాలు ఏర్పాటు చేయాలని సమీక్షలో నిర్ణయించారు.

రాష్ట్ర వ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలు

రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్‌ దీపాలతో అలంకరించాలని సమీక్షలో నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. జూన్‌ 3న కేసీఆర్‌ కిట్స్‌ పంపిణీ కార్యక్రమం చేపడతారు. వచ్చే నెల 4న ఒంటరి మహిళలకు జీవన భృతి పంపిణీ కార్యక్రమం చేపడతారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు.

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సం

హైదరాబాద్: వచ్చే నెల 2న రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణ ఉద్యమంలో అశువులు బాసిన అమరవీరులకు నివాళులు అర్పించి, అవతరణ ఉత్సవాలను ప్రారంభించాలని ఆదేశించారు. అదేరోజు ఒంటరి మహిళలకు జీవన భృతి ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభింస్తారు. ఆ మరుసటి రోజు జూన్‌ 3న కేసీఆర్ కిట్స్‌ పంపిణీకి శ్రీకారం చుడతారు. మండలాన్ని యూనిట్‌గా తీసుకుని ఈ కార్యక్రమాలను నిర్వహిస్తారు.

06:38 - May 24, 2017

హైదరాబాద్: దక్షిణాదిన పార్టీ బలోపేతంపై దృష్టిసారించామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా అన్నారు. 2019 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లాలో రెండోరోజూ పర్యటించిన అమిత్‌షా.. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే మోదీ లక్ష్యమని చెప్పారు.

నల్లగొండ జిల్లాలో రెండోరోజూ...

నల్లగొండ జిల్లాలో రెండోరోజూ... బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా పర్యటన బిజీబిజీగా సాగింది. నల్లగొండ, కనగల్‌ మండలాల్లోని వెలుగుపల్లి, చిన్నమాదారం, పెద్దదేవులపల్లిలో ఆయన పర్యటించారు. వెలుగుపల్లిలో దీన్‌దయాల్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడి దళితవాడకు దీన్‌ దయాళ్‌ బస్తీగా నామకరణం చేశారు. అక్కడి నుంచి చిన్నమాదారం వెళ్లిన అమిత్‌షా....గ్రామస్థులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు.

చిన్నమాదారంలో వివేకానందుడి విగ్రహాన్ని ఆవిష్కరణ....

అనంతరం అమిత్‌షా, చిన్నమాదారంలో వివేకానందుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. గ్రామంలో ఇంటింటికి తిరిగి కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరును తెలుసుకున్నారు. తర్వాత, పెద్దదేవులపల్లిలో జరిగిన సభలో మాట్లాడిన అమిత్‌షా ... తెలంగాణలో బూత్‌స్థాయి నుంచి బీజేపీ బలోపేతానికి కృషి చేస్తున్నామన్నారు. దక్షిణ భారతదేశంలో కచ్చితంగా బీజేపీ పాగా వేస్తుందన్నారు. అది తెలంగాణ నుంచే ప్రారంభమవుతుందని చెప్పారు. 2019 ఎన్నికల్లో తెలంగాణలో అధికారం బీజేపీదేనని ఆశాభావం వ్యక్తం చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో పొత్తులపైనా

తెలుగు రాష్ట్రాల్లో పొత్తులపైనా అమిత్‌షా మాట్లాడారు. ఏపీలో టీడీపీతో పొత్తు కొనసాగుతుందని చెప్పారు. అయితే తెలంగాణలో మాత్రం టీడీపీతో పొత్తుపై ఆయన క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం అంతవరకే చెప్పదల్చుకున్నానంటూ సమాధానాన్ని దాటవేశారు. తెలంగాణలో బీజేపీని బలమైన రాజకీయశక్తిగా తయారు చేస్తున్నామన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందని

తెలంగాణ కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందని అమిత్‌షా చెప్పారు. 60ఏళ్లలో ఇంతకుముందెన్నడూ లేనివిధంగా ఎక్కువ నిధులు ఇచ్చామన్నారు. వేర్వేరు పథకాల కోసం తెలంగాణకు దాదాపు లక్ష కోట్ల నిధులు ఇచ్చామన్నారు. తెలంగాణకు ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థలను ఇచ్చామని చెప్పారు.

తెలంగాణలో 2019లో అధికారం మాదే: అమిత్‌ షా

హైదరాబాద్: దక్షిణాదిన పార్టీ బలోపేతంపై దృష్టిసారించామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా అన్నారు. 2019 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లాలో రెండోరోజూ పర్యటించిన అమిత్‌షా.. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే మోదీ లక్ష్యమని చెప్పారు.

నేడు వామపక్షాల ఆధ్వర్యంలో సీమబంద్‌

హైదరాబాద్: రాయలసీమ..! నిత్య క్షామపీడిత ప్రదేశం. పాలకులు నిర్లక్ష్యానికి గురైన ప్రాంతం. ఈ జిల్లాల్లో పదేళ్ల సగటు తీసుకుంటే.. ఏడేళ్లు కరవు కరాళ నృత్యం చేస్తుంటుంది. ఈ ఏడాది కూడా కరవు.. వరుసగా ఆరోసారి పిలవని చుట్టంలా వచ్చేసింది. ఫలితంగా వ్యవసాయం కుదేలైంది. ఉపాధి కరవైంది. తాగునీటికీ కటకట ఏర్పడింది. వలసలు మొదలయ్యాయి. ప్రజల కష్టాలు పాలకుల చెవికెక్కడం లేదు. రాష్ట్ర విభజన వేళ ఈ ప్రాంతాన్ని నందనవనం చేస్తామన్న హామీ ఎప్పుడో అటకెక్కేసింది. ఈ దశలో, అలో లక్ష్మణా అని అలమటిస్తోన్న సీమ గోడును.. సర్కారు దృష్టికి తెచ్చేందుకు.. వామపక్ష, ప్రజాసంఘాలు..

06:34 - May 24, 2017

హైదరాబాద్: రాయలసీమ..! నిత్య క్షామపీడిత ప్రదేశం. పాలకులు నిర్లక్ష్యానికి గురైన ప్రాంతం. ఈ జిల్లాల్లో పదేళ్ల సగటు తీసుకుంటే.. ఏడేళ్లు కరవు కరాళ నృత్యం చేస్తుంటుంది. ఈ ఏడాది కూడా కరవు.. వరుసగా ఆరోసారి పిలవని చుట్టంలా వచ్చేసింది. ఫలితంగా వ్యవసాయం కుదేలైంది. ఉపాధి కరవైంది. తాగునీటికీ కటకట ఏర్పడింది. వలసలు మొదలయ్యాయి. ప్రజల కష్టాలు పాలకుల చెవికెక్కడం లేదు. రాష్ట్ర విభజన వేళ ఈ ప్రాంతాన్ని నందనవనం చేస్తామన్న హామీ ఎప్పుడో అటకెక్కేసింది. ఈ దశలో, అలో లక్ష్మణా అని అలమటిస్తోన్న సీమ గోడును.. సర్కారు దృష్టికి తెచ్చేందుకు.. వామపక్ష, ప్రజాసంఘాలు.. ఇవాళ రాయలసీమ బంద్‌ను పాటించబోతున్నాయి.

కరువుతో విలవిలలాడుతోన్న సీమ....

రాయలేలిన రతనాల సీమ.. నేడు కరవు కోరల్లో విలవిలలాడుతోంది. పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా.. సీమవాసులు తీవ్ర దుర్భిక్షంతో తల్లడిల్లుతున్నారు. ముఖ్యంగా సీమలోని నాలుగు జిల్లాల పశ్చిమ ప్రాంతాలైతే.. దుర్భర క్షామాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ ప్రాంతంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆదుకోక.. చేసిన పనులకూ డబ్బులు రాక కూలీలు ఆకలితో నకనకలాడుతున్నారు. వీరిని ఆదుకోవాల్సిన సర్కారు కానీ, అధికార యంత్రాంగం కానీ మౌన ప్రేక్షక పాత్ర పోషిస్తోంది.

సాగునీటి ప్రాజెక్టులు తగినన్ని లేనికారణంగా...

సాగునీటి ప్రాజెక్టులు తగినన్ని లేనికారణంగా ఇక్కడి రైతులు అత్యధికం వర్షంపైనే ఆధారపడి సేద్యం చేస్తారు. హంద్రీనీవా, గాలేరు నగరి లాంటి బృహత్తర ప్రాజెక్టులు దశాబ్దాలుగా నత్తనడకన సాగుతున్నాయి. నదుల అనుసంధానంలో భాగంగా పట్టిసీమ ద్వారా, సీమకు, కొంతమేర కృష్ణా నీటిని మళ్లించే ప్రయత్నం చేసినా.. అది ఈ ప్రాంత అవసరాల్లో ఒక్క శాతం కూడా తీర్చలేని పరిస్థితి. వరుణుడి కరుణ లేక కొంత.. ప్రకృతి ప్రకోపానికి మరికొంత.. పంటలు నాశనమయ్యాయి. దీంతో రైతులకు పెట్టుబడులే కాదు, కనీసం పశువులకు గ్రాసమూ దొరకని పరిస్థితి ఏర్పడింది. ఉపాధి దొరక్క, యువత వలసబాటన సాగుతోంది.

సీతమ తలరాత మారుస్తామని పాలకులు....

రాయలసీమ తలరాతను మారుస్తామని, పాలకులు ఎన్నో హామీలు గుప్పించారు. రాష్ట్ర విభజన వేళ.. కడపలో స్టీల్‌ ఫ్యాక్టరీని ప్రారంభిస్తామన్నారు. జలవనరులను ఎంతెంతగానో పెంచుతామన్నారు. అంతెందుకు ఈ ప్రాంతానికి బుందేల్‌ఖండ్‌ తరహాలో ప్రత్యేక ప్యాకేజీని ఇస్తామన్నారు. కానీ, ఇవేవీ నెరవేరలేదు.

రాయలసీమపై ప్రభుత్వ ఉదాసీనతను నిరసిస్తూ..

రాయలసీమపై ప్రభుత్వ ఉదాసీనతను నిరసిస్తూ.. వామపక్ష, ప్రజాసంఘాలు బుధవారం రాయలసీమ బంద్‌ను పాటిస్తున్నాయి. బంద్‌కు ప్రజలను చైతన్య పరిచేందుకు, ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్నాయి. అనంతపురం నగరంలో ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు, తలపై బిందెలు, వంటపాత్రలు, దుస్తుల మూటలతో.. వలస పరిస్థితులను ప్రతిబింబించేలా ర్యాలీ నిర్వహించారు. అటు కడప నగరంలోనూ వామపక్షనాయకులు బైక్‌ ర్యాలీని నిర్వహించారు.

బంద్‌కు ప్రజలను చైతన్యపరచడంలో భాగంగా...

బంద్‌కు ప్రజలను చైతన్యపరచడంలో భాగంగా... సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు.. మంగళవారం, అనంతపురం జిల్లా కదిరి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం, అక్కడి గొర్రెల సంతను సందర్శించి, పశుగ్రాసం కొరత వల్ల.. జీవాలను అమ్ముకుంటున్న రైతుల వెతలను తెలుసుకున్నారు. అక్కడి నుంచి ఉపాధి హామీ పథకం కింద పనులు చేస్తున్న వారి కష్టాలనూ తెలుసుకున్నారు. కూలీలకు రెండు వందల రోజులు పని దొరికేలా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

బంద్ కు విపక్షాల మద్దతు....

బుధవారం నాటి రాయలసీమ బంద్‌కు, ప్రతిపక్ష వైసీపీ కూడా మద్దతు ప్రకటించింది. ఉదయం నుంచే బంద్‌లో పాల్గొనాలని తద్వారా రైతులు, ఇతర ప్రజల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాలని వామపక్ష, ప్రజాసంఘాలు పిలుపునిచ్చాయి.

నదిలో బస్సు బోల్తా:22 మంది మృతి

హైదరాబాద్ : ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది.నదిలో బస్సు బోల్తా పడి 22 మంది మృతి చెందారు. ఉత్తరకాశీ నుంచి గంగ్రోతి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మృతులు మధ్యప్రదేశ్ వాసులుగా గుర్తించారు.

Don't Miss