Activities calendar

25 May 2017

21:47 - May 25, 2017

కడప : చుట్టూ వందల మంది...ఎవరిపనుల్లోవారు బిజీ...మండుతున్న ఎండమరోవైపు..జనం చూస్తుండగానే ఓ ఘోరం..అందరూ అక్కడే ఉన్నా వేటకొడవలితో నరికి..పన్నెండు సార్లు నరికిన ప్రత్యర్థి..ఒకడు పట్టుకుని ఉండగా..మరొకడు నరుకుతూ..ఏ మాత్రం బెరుకులేకుండా పబ్లిక్‌గా మర్డర్..కోర్టు సమీపంలోనే కిరాతకం...కడప గడపలో మరోమారు మానవత్వం మంటగలిసింది...నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిని దారుణంగా చంపారు...ఆ తర్వాత అందరూ అక్కడే ఉన్నా ప్రత్యర్థులు తమ ప్రతీకారాన్ని ఎలా తీర్చుకున్నారో చూడండి...

పన్నెండుసార్లు వేటకొడవలితో నరికారు..
చనిపోయాడని నిర్ధారించుకున్నా పన్నెండుసార్లు వేటకొడవలితో నరికారు..ఒకడు పట్టుకుని ఉండగా..మరొకడు దారుణంగా నరికాడు..ఇదంతా అక్కడ వందల మంది చూస్తూనే ఉన్నారు...ఎవరికివారు భయంతో వణికిపోయారు కాని...ఏ ఒక్కరూ కాపాడేందుకు ముందుకు రాలేదు.... చుట్టూ అంతమంది ఉన్నా దుర్మార్గులు వేటకొడవళ్లతో వచ్చి ఏ మాత్రం బెరుకులేకుండా అనుకున్నట్లుగానే ఆ వ్యక్తిని దారుణంగా చంపారు...పసిడిపురిలో పైశాచికత్వం...ఆటోలోంచి దిగిన వ్యక్తిపై అటాక్..కత్తులతో పొడిచి..కొడవళ్లతో నరికి...కోర్టులో హాజరయ్యేందుకు మారుతీరెడ్డి వచ్చారు కడప జిల్లా జమ్మలమడుగు మండలం దేవగుడి చెందిన 32 ఏళ్ల బోరెడ్డి మారుతీరెడ్డి పాత కేసులకు సంబంధించి ప్రొద్దుటూరు కోర్టులో హాజరయ్యేందుకు నగరంలోకి వచ్చాడు...అప్పటికే మారుతీరెడ్డి కోసం మాటువేసిన ప్రత్యర్థులు ఇక కొన్ని క్షణాల్లో కోర్టు ప్రాంగణంలోకి వెళ్తాడనుకుని ఆటో దిగడంతోనే ఒక్కసారిగా అటాక్ చేశారు...కత్తితోనే దాడి చేయడంతో పడిపోయిన మారుతీరెడ్డిని విచక్షణారహితంగా వేటకొడవళ్లతో నరికి చంపారు...మంటగలిసిన మానవత్వం...అందరూ చూస్తున్నారుగాని ఎవరూ ఆపలేదు..ఒకరికొకరు తోడైతే హత్య జరిగేది కాదు..ఎవరికి వారు భయంతో...కొందరు వీడియో తీస్తూ..ఎందరో చూస్తుండగానే మారుతీరెడ్డిని నరికి చంపారు ప్రత్యర్థులు..మానవత్వంతో ఏ ఒక్కరూ ముందుకు రాలేదు..ఒకరిని చూసి మరొకరైనా వచ్చేవారు..కాని ఏ ఒక్కరూ ధైర్యం చేయలేదు...మానత్వాన్ని చూపించలేదు...మారుతీరెడ్డిని చంపుతుండగా కళ్లప్పగించి చూశారేగాని ఆపేందుకు ప్రయత్నించలేదు...వందల మంది ఇద్దరికి భయపడి దూరంగా ఉన్నారు..వీడియోలు తీశారు.

21:45 - May 25, 2017

కరీంనగర్ : డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల వ్యవహారం.. ప్రజల్లోనే కాదు.. పాలక పక్షం ఎమ్మెల్యేల్లోనూ తీవ్ర అసంతృప్తిని రగిలిస్తోంది. తాము ఊళ్లల్లో తలెత్తుకు తిరగలేక పోతున్నామని, టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు ఆవేదన చెందుతున్నారు. గృహనిర్మాణ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ సమక్షంలో, కరీంనగర్‌లో జరిగిన జిల్లా గృహనిర్మాణ శాఖపై జరిగిన సమీక్షలో.. 13 నియోజకవర్గాలకు చెందిన టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు.. డబుల్‌ బెడ్‌రూం అంశంపై మంత్రిని గట్టిగానే నిలదీశారు. దాదాపు రెండుగంటల పాటు జరిగిన రివ్యూలో.. ఈ పథకం, వచ్చే ఎన్నికల్లో తమకు ఉరితాడు కాబోతోందంటూ ఎమ్మెల్యేలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర పథకాలకు టెండర్లు వేసే కాంట్రాక్టర్లు డబుల్‌బెడ్‌ రూమ్‌ పథకంపై ఎందుకు ఆసక్తి చూపడం లేదంటూ నిలదీశారు.

ఇళ్ల నిర్మాణంపై ఎమ్మెల్యేల ఆవేదన
దాదాపుగా మిగిలిన ఎమ్మెల్యేలదీ ఇదే వాదన. డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణంపై ఎమ్మెల్యేల ఆవేదన వాస్తవమేనని గృహనిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అంగీకరించారు. కాంట్రాక్టర్లు లాభదాయకమైన పనులకే టెండర్లు వేస్తున్నారని గుర్తించిన ప్రభుత్వం.. డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి కొన్ని మినహాయింపులు, సదుపాయాలూ కల్పించిందని.. ఇప్పుడిప్పుడే కాంట్రాక్టర్లు ఈ పథకంపైనా ఆసక్తి చూపుతున్నారన్నారు. మొత్తానికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం విషయంలో.. సొంత పార్టీ ఎమ్మెల్యేలే బహిరంగంగా ఆవేదనను వ్యక్తీకరిస్తుండడం, టిఆర్ఎస్ సర్కారును ఇరుకున పెడుతోందనే చెప్పాలి. ఈ ప్రభావం వచ్చే ఎన్నికలపై పడకుండా, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. 

21:44 - May 25, 2017

విజయవాడ : నగరంలోని ఎ కన్వెన్షన్‌ సెంటర్‌లో కలెక్టర్ల సదస్సును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. రెండు రోజుల పాటు సదస్సు జరగనుంది. ఈ సదస్సులో రెండున్నరేళ్లలో సాధించిన ప్రగతి, రానున్నకాలంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ముఖ్యమంత్రి కలెక్టర్లతో చర్చించారు. ఈ సందర్భంగా, పీపుల్స్ ఫస్ట్ పేరుతో కాల్ సెంటర్‌ను చంద్రబాబు ప్రారంభించారు. 1100 నెంబర్‌కు ఎవరైనా ఏ సమస్యపైనైనా ఫోన్‌ చేయవచ్చని సీఎం తెలిపారు. సంస్కరణల్లో భాగంగానే పీపుల్స్‌ ఫస్ట్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఇకపై కలెక్టర్లు, అధికారుల పనితీరును పర్యవేక్షించడానికి ఐవీఆర్‌ సర్వే చేపడతామన్నారు.

అభివృద్ధి సాధనే లక్ష్యం
అధికారులందరూ ఆనందంతో కూడిన అభివృద్ధి సాధనే లక్ష్యంగా పనిచేయాలని చంద్రబాబు సూచించారు. టెక్నాలజీని వినియోగించుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. దక్షిణాది రాష్ట్రాలతో పోల్చితే తలసరి ఆదాయంలో వెనుకబడి ఉన్నామని, హ్యాపినెస్ ఇండెక్స్‌లో మాత్రం ఏపీ ర్యాంకు చాలా మెరుగుపడిందని చంద్రబాబు తెలిపారు. గతేడాది వర్షపాతం తక్కువగా ఉన్నా మంచి ఫలితాలే సాధించామన్నారు. సుస్థిర అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. 2050 నాటికి ప్రపంచంలోనే అత్యత్తమ కేంద్రంగా ఏపీని తీర్చిదిద్దాలని అన్నారు. పేదరిక నిర్మూలనకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. డబ్బుల కంటే సమన్వయ సమస్యలు ఉన్నాయని అన్నారు.ఆంధ్రప్రదేశ్‌ను కిరోసిన్‌ రహిత రాష్ట్రంగా ప్రకటిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. నరేగా నిధుల వినియోగంలో ఏపీ ముందు వరుసలో ఉందని, ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్లపై వారానికి ఒకసారి సమీక్షిస్తామన్నారు. ఐదేళ్లలో 10లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. విద్యుత్తు రంగంలో మిగులు సాధించినట్లు చెప్పారు. రాష్ట్రంలో 12శాతం వృద్ధి నిలకడగా ఉండాలని అన్నారు. రియల్‌టైం పరిపాలనపై దృష్టి పెట్టాలన్నారు.

చీరాలో దారుణం

ప్రకాశం : జిల్లా చీరాలలోని విఠల్ నడర్ లో దారుణం జరిగింది. ఓ కానిస్టేబుల్ భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. భార్య రమాదేవి పరిస్థితి విషమంగా ఉండడంతో గుంటూరుకు తరలించారు.  

21:13 - May 25, 2017
21:04 - May 25, 2017

యాదాద్రి జిల్లాలో ఈదురుగాలులు బీభత్సం

యాదాద్రి భువనగిరి : జిల్లాలో ఈదురుగాలులుల బీభత్సం సృష్టించాయి. యాదగిరిగుట్టలో రేకులు వీదపడి వృద్ధుడు శ్రీనివాస్ మృతి చెందారు. అలేరు మండలం కొలనుపాకలో పిడుగుపడి అక్ష్మి అనే మహిళ మృతి. 

కేంద్రానికి భారత విమానయాన సమాఖ్య లేఖ

ఢిల్లీ : విమానయాన రంగంలోమ 100 శాతం ఎఫ్ డీఐలను వ్యతిరేకిస్తూ కేంద్రానికి భారత విమానయాన సమాఖ్య లేఖ రాసింది. విదేశీ సంస్థలు భారత్ కార్యక్రమాలు ప్రారంభిస్తే రక్షణ స్థావరాల గురించి విదేశాలకు తెలిసే ప్రమాదముందిన వారు లేఖల పేర్కొన్నారు. 

కామన్వెల్త్ క్రీడల స్కామ్ పై సీబీఐ కోర్టు తీర్పు

ఢిల్లీ : కామన్వెల్త క్రీడల స్కాంపై సీబీఐ కోర్టు తీర్పు వెలువరించింది. కామన్వెల్త క్రీడల్లో అవకతవకలకు పాల్పడిన రాజా ఐదరి కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్, డైరెక్టర్ కు సీబీఐ కోర్టు రెండున్నరేళ్ల జైలుశిక్ష విధించింది. శివాజీ, తల్కతోరా స్టేడియాల పనుల్లో అక్రమాలకు పాల్పడిన మరో ఇద్దరు నిందితులకు రూ.5లక్షలు జరిమానా విధింపు.

విజయవాడ నుండే బీజేపీ జైత్రయాత్ర

కృష్ణా : విజయవాడ నుండే బీజేపీ జైత్రయాత్ర మొదలైందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. 13 రాష్ట్రాల్లో బీజేపీ సొంతంగా అధికారంలో ఉందని ఆయన గుర్తు చేశారు.

ఆర్థిక అభివృద్ధిలో తెలంగాణ నెం.1 : సీఎంవో

హైదరాబాద్ : ఆర్థికాభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ నెం.1గా నిలిచిందని సీఎంవో ప్రకటించింది. దేశంలో 17.82 శాతం వృద్ధిరేటుతో తెలంగాణ దేశంలోనే నెం.1 ఉందని సీఎంవో తెలిపింది. 

20:07 - May 25, 2017

ఖమ్మం :్ మిర్చీ పంట ధర పెంచాలని పోరాడితే రైతులకు సంకెళ్లువేశారని.. రైతుసంఘం జాతీయ నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి మండిపడ్డారు.. ఈ కేసులో జైలుకువెళ్లిన 10మంది రైతులను ఖమ్మం మంచికంటి భవన్‌లో రైతుసంఘం, గిరిజన సంఘం ఆధ్వర్యలో సన్మానించారు.. ఖమ్మం మిర్చీయార్డు ఘటనలో 10 టీవీ రైతులపక్షాన నిలబడిందని ప్రశంసించారు.. 10టీవీ ప్రతినిధి సైదులకు సన్మానం చేశారు. 

20:05 - May 25, 2017

సిద్దిపేట : సిద్ధిపేట జిల్లా కేంద్రానికి చెందిన సంతోషి అనే డిగ్రీ విద్యార్ధిని మరణం సంచలనంగా మారింది. ఆమె మృతికి పద్మావతి అనే మహిళ కారణమంటూ సంతోషి కుటుంబ సభ్యులు, విద్యార్ధులు సిద్ధిపేట ప్రభుత్వాసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. నిందితుల్ని శిక్షించాలంటూ నినాదాలు చేశారు. తల్లితండ్రులు లేని సంతోషి టీచర్‌గా పనిచేస్తున్న పద్మావతి అనే మహిళ ఇంట్లో ఉంటోంది. ఈ నేపథ్యంలో తీవ్ర అస్వస్థతకు గురైన సంతోషిని పద్మావతి కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ సంతోషి మరణించింది. సంతోషితో పద్మావతి టీచర్ వెట్టిచాకిరి చేయించుకునేదని .. ఆ కారణంగానే సంతోషి చనిపోయిందంటూ ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

20:04 - May 25, 2017
20:03 - May 25, 2017

కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పిల మారింది. కరీంనగర్ లో గృహనిర్మాణ శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి ఈటెల అధ్యక్షతన డబుల్ బెడ్ రూం సమీక్ష సమావేశం నిర్వహించారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల ఎమ్మెల్యేలు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఎక్కడి వెళ్లిన ప్రజలు డబుల్ బెడ్ రూంల గురించి అడుగుతున్నారని వారు మంత్రులకు వివరించారు. తాము గ్రామల్లో వెళ్తే తల ఎత్తులేకపోతున్నామని ఎమ్మెల్యేలు తెలిపారు.మిషన్ కాకతీయకు, మిషన్ భగీరథకు టెండర్లు వేస్తున్న వారు డబుల్ బెడ్ రూం స్కీమ్ కు కాంట్రాక్టర్ లు ఎందుకు టెండర్ వేయట్లేదని ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఎమ్మెల్యేలు వెల్లడించారు. ఈ అంశంపై బోడిగ శోభ, పుట్ట మధు తీవ్ర ఆవేదన వ్యక్త చేశారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

20:02 - May 25, 2017

శ్రీనగర్ : జమ్మూకాశ్మార్ లో విషాదం జరిగింది. మఘల్ రోడ్డులో స్కూల్ బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 12 మంది విద్యార్థులు మృతి చెందినట్లు సమాచారం...? ప్రమాద సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.విద్యార్థులు మధ్యాహ్నం రాజౌరి స్కూల్ నుంచి విహారయాత్రకు వెళ్లారు. బస్సు లోతైన లోయ్యలో పడడంతో సహాయ చర్యలకు ఇబ్బంది ఏర్పడుతున్నాయి. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

19:45 - May 25, 2017

ఒక్కరోజు బాగోతానికి మూతి మీసాలు కొర్గిచ్చుకున్నట్టు గాకుంట.. ఈసారి జూన్ రెండు తారీఖు నాడు అయ్యే తెలంగాణ ఏర్పాటు దినం పండుగను పసందుగ జేయాలే అనుకుంటున్నదట మన తెలంగాణ సర్కారు.. కుండెడు తేనెల ఒక నీళ్లు సుక్కు వోస్తె ఏమైతది..? సప్పుడు జేయరేందుల్లా..? ఏమైతది.? ఉంటదా..? కారవైతదంటరు..అవద్దాలు చెప్పొద్దు.. చెప్తె అత్కినట్టు చెప్పాలే అంటున్నడు తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి సారు.. సింగరేణిల ఓట్ల నగార మోగెతట్టే ఉన్నది ఈ నెల రెండు నెలలళ్ల.. ఊపు జూస్తుంటె అట్లనే గనవడ్తున్నది..ఇంట్లున్న తలె అమ్మి చెప్పులు గొన్కున్నోడు మొగోడా..? లేకపోతె చెప్పులమ్మి తలె గొన్నోడు మొగోడా చెప్పుండ్రి మీరే.. పేదోళ్లకు సర్కారు బడి సద్వు దగ్గర జేశిన ప్రభుత్వం దార్కార్ ప్రభుత్వం అయితదిని..బలవంతమైన సర్పము చలిచీమెల చేత జిక్కి సావదె సుమతి అని ఎన్కటి మా సారు ఒక పాఠం జెప్పిండు.. కని మా సారు గన్క ఇప్పటికి ఉండి నుంటే బలవంతమైన ఏన్గు..

 

19:43 - May 25, 2017

ఉత్తర్ ప్రదేశ్ లో దళితులను ఉచకోత కోశారని, ఆవు మాంసం తిన్నాడని ఆ వ్యక్తి చంపారని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను తుంగలో తోక్కారని కేబీసీఎస్ కార్యదర్శి మల్యాద్రి అన్నారు. గత మూడేళ్లలో దళితలపై దాడులు తగ్గాయని బీజేపీ అధికారన ప్రతినిధి ప్రకాశ్ రెడ్డి అన్నారు.

 

జమ్మూకాశ్మీర్ లో విషాదం

శ్రీనగర్ : జమ్మూకాశ్మార్ లో విషాదం జరిగింది. మఘల్ రోడ్డులో స్కూల్ బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 12 మంది విద్యార్థులు మృతి చెందినట్లు సమాచారం...? ప్రమాద సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

19:12 - May 25, 2017

హైదరాబాద్ : అమిత్ షాపై కేసీఆర్ మాటల యుద్ధాన్ని డ్రామాగా అభివర్ణించారు కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి. కేసీఆర్ మోడీతో రహస్య స్నేహాన్ని కొనసాగిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపి అభ్యర్థికి మద్దతు ఇవ్వబోమని ప్రకటించాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ వ్యతిరేక శక్తులతో కలిసి పనిచేస్తామని జైపాల్ రెడ్డి చెప్పారు. 

19:06 - May 25, 2017
19:01 - May 25, 2017
18:59 - May 25, 2017
18:58 - May 25, 2017
17:22 - May 25, 2017

లండన్ : మినీ వన్డే వరల్డ్‌ కప్‌గా పేరున్న చాంపియన్స్‌ ట్రోఫీకి కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. మరో 11 రోజుల్లో ప్రారంభంకానున్న ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం ప్రచార కార్యక్రమాలను ఐసీసీ వినూత్నంగా నిర్వహిస్తోంది. వరల్డ్‌ టూర్‌లో భాగంగా 20 దేశాలను చుట్టి వచ్చిన మినీ వరల్డ్‌కప్‌ ట్రోఫీ...ఇంగ్లండ్‌ చేరుకుంది. ఇంగ్లండ్‌,వేల్స్‌లోని అన్ని ప్రధాన నగరాల్లో చాంపియన్స్‌ ట్రోఫీ ప్రమోషనల్‌ ఈవెంట్స్‌ నిర్వహించారు. చాంపియన్స్ ట్రోఫీ కోసమే తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని బ్రాండ్‌ అంబాసిడర్స్‌ చార్లెట్‌ ఎడ్వర్డ్స్‌ చెబుతోంది.

 

17:15 - May 25, 2017

ముంబై : మహారాష్ట్ర మంత్రి గిరీష్‌ మహాజన్‌ వివాదంలో ఇరుక్కున్నారు. మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్ అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం బంధువు ఇంట్లో జరిగిన పెళ్లి వేడుకల్లో మంత్రి పాల్గొనడం వివాదస్పదంగా మారింది. నాసిక్‌లో దావూద్‌ సోదరుడు ఇబ్రహీమ్‌ భార్య పుట్టింట్లో మే 19న జరిగిన పెళ్లికి మంత్రి గిరీష్‌ మహాజన్‌తో పాటు, బిజెపి ఎమ్మెల్యే దేవయాని ఫరాందే తదితర ఎమ్మెల్యేలు, అసిస్టెంట్‌ పోలీస్‌ కమిషనర్, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. ఈ విషయం మీడియా ద్వారా వెలుగు చూడడంతో నాసిక్‌ పోలీస్‌ కమిషనర్ రవీంద్ర సింఘాల్‌ పోలీసులపై విచారణకు ఆదేశించారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ దీనిపై పూర్తి నివేదికను కోరారు. ఆ కుటుంబానికి దావూద్‌తో సంబంధం ఉన్న విషయం తనకు తెలియదని మంత్రి గిరీష్‌ చెప్పారు.

17:01 - May 25, 2017

ఢిల్లీ : పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి తనని బలవంతంగా పెళ్లిచేసుకున్నారని ఆరోపించిన భారతీయ మహిళ ఉజ్మా భారత్‌కు సురక్షితంగా చేరుకున్నారు. వాఘా సరిహద్దుకు చేరుకున్న ఉజ్మాకు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ ట్విట్టర్‌లో స్వాగతం పలికారు. ఉజ్మాను భారత పుత్రికగా పేర్కొన్నారు. పాకిస్తాన్‌కు చెందిన తాహిర్‌ తన తలకు తుపాకి గురిపెట్టి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని...అతని నుంచి రక్షించాలని నజ్మా ఇస్లామాబాద్‌లోని భారత దౌత్య కార్యాలయాన్ని ఆశ్రయించింది. ఉజ్మాను స్వదేశానికి పంపించేందుకు భారత అధికారులు ఇస్లామాబాద్‌ హైకోర్టులో కేసు వేశారు. మంగళవారం దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తాహిర్‌ హలఫ్‌నామాను తప్పుగా నిర్ధారించి ఉజ్మాను భారత్‌కు వెళ్లేందుకు అనుమతించింది. 

16:59 - May 25, 2017

లక్నో : ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బిజెపి అగ్రనేత అద్వానికి సిబిఐ కోర్టులో చుక్కెదురైంది. అద్వానితో సహా కేంద్ర మంత్రి ఉమాభారతి ఈ నెల 30న న్యాయస్థానం ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ఈ విషయంలో ఎవరికి మినహాయింపు ఇచ్చేది లేదని లక్నో కోర్టు స్పష్టం చేసింది. సిబిఐ న్యాయమూర్తి సమక్షంలో బాబ్రీ కేసు విచారణ ఇవాళ ప్రారంభమైంది. ఆరో ఆరోపితుడిగా ఉన్న సతీష్‌ ప్రధాన్‌ ఒక్కరే కోర్టుకు హాజరయ్యారు. దీంతో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారంతా వచ్చేవారం విచారణకు హాజరు కావాల్సిందేనని కోర్టు ఆదేశించింది. 1992 బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో అద్వాని, జోషి, ఉమాభారతి తదితరులపై విచారణ పునరుద్ధరించాలని గతనెల సుప్రీంకోర్టు సీబీఐకి అనుమతి ఇచ్చింది. రెండేళ్లలో విచారణ పూర్తి చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. బాబ్రీ ఘటనకు ముందు సమీపంలోని ఒక వేదికపై వీరంతా ఉద్రేకపూరిత ప్రసంగాలు చేసినట్లు సీబీఐ వాదిస్తోంది.

16:58 - May 25, 2017

హైదరాబాద్ : 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బిజెపి ఇచ్చిన హామీలు బుట్ట దాఖలయ్యాయని విమర్శించారు సిపిఐ ఏపి కార్యదర్శి రామకృష్ణ. ఈ సందర్భంగా అమిత్ షాకు రామకృష్ణ బహిరంగ లేఖ రాశారు. రాయలసీమ కరవుతో అల్లాడుతోందని.. వలసలు పోతున్నారని వెంటనే కరవు నివారణ చర్యలు చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జూన్ 9న కడపలో కరవు మండలాల రైతులతో సదస్సు నిర్వహిస్తున్నట్లు రామకృష్ణ తెలిపారు.

 

16:56 - May 25, 2017

విశాఖ : ఎమ్మెల్సీ ఎంవీఎస్‌ మూర్తి వ్యాఖ్యలు దుమారం రేపడంతో.. మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రాయూనివర్సిటీ ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయమని.. దానికో చరిత్ర ఉందన్నారు. ఎందరో మేధావులను తయారు చేసిన ఘనత వర్సిటీ సొంతమన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ నుంచి కట్టమంచి రామలింగా రెడ్డి వరకు ఏయూకు సేవలందించినట్లు తెలిపారు. 

16:54 - May 25, 2017

గుంటూరు : టీడీపీ అధినేత చంద్రబాబుతో ఎలాంటి విభేదాలు లేవని... బీజేపీ నేత కన్నా లక్ష్మి నారాయణ స్పష్టం చేశారు..బీజేపీ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని తెలిపారు.. పొత్తుల విషయం తేల్చాల్సింది పార్టీ పెద్దలే అంటున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

16:45 - May 25, 2017

కడప : కడపజిల్లా వ్యాప్తంగా గత రాత్రి వీచిన భారీ గాలులకు వందలాది ఎకరాల అరటిపంట నేలకూలింది. ఒక్క లింగాల మండలంలోనే వంద ఎకరాల్లో పంట నేలకూలింది. భారీ ఎత్తున విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. కోటిరూపాయల మేర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. సంవత్సరం పాటు పెంచుకున్న పంట నేలపాలు కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. 

16:44 - May 25, 2017

విజయవాడ : పార్టీ కార్యక్రమంలో భాగంగా విజయవాడకు వచ్చిన బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను ఏపీ సీఎం చంద్రబాబు తన నివాసానికి ఆహ్వానించారు. అమిత్ షాకు, కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు శాలువ కప్పి సత్కరించారు చంద్రబాబు. ఈకార్యక్రమంలో కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి, రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, కామినేని శ్రీనివాస్, కళా వెంకట్రావ్, నారాలోకేష్ పాల్గొన్నారు. 

అమిత్ షాకు కె.రామకృష్ణ లేఖ..

హైదరాబాద్ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ లేఖ రాశారు. గత ఎన్నికల హామీలను బీజేపీ అమలు చేయాలని, విశాఖకు రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్ హామీ బుట్టదాఖలైందని తెలిపారు. ఏపీకి నిధులు ఇచ్చామనడం హాస్యాస్పదమన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలకు బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎయిర్ పోర్టు వద్దకు చంద్రబాబు అంబులెన్స్ లు తీసుకెళ్లి అమిత్ షాతో జెండా ఊపి ప్రారంభించడం అవమానకరమన్నారు.

విందు రాజకీయాలు సిగ్గు చేటు - ఎంపీ కేవీపీ..

విజయవాడ : రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి విందు రాజకీయాలు చేయడం సిగ్గు చేటని ఎంపీ కేవీపీ మండిపడ్డారు. అమిత్ షా అడుగులకు మడుగులొత్తుతూ చంద్రబాబు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మంటగలుపుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం నుండి వైదొలగాలని తెలిపారు.

కాంగ్రెస్ లో జైపాల్ వ్యాఖ్యల కలకలం..

హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి. టిడిపితో పొత్తుకు ఒకే చెప్పిన జైపాల్ వ్యాఖ్యలను పొంగులేటి ఖండించారు. పొత్తులపై మాట్లాడే అధికారం జైపాల్ రెడ్డికి ఎవరిచ్చారని, కాంగ్రెస్ బలంగా ఉన్నప్పుడు పొత్తులెందుకని సూటిగా ప్రశ్నించారు.

అద్వానీ..ఇతర కీలక నేతలకు కోర్టు ఆదేశాలు..

ఉత్తర్ ప్రదేశ్ : లక్నో కోర్టులో బాబ్రీ మసీదు కూల్చివేత కేసు విచారణ జరుగుతోంది. 30న విచారణకు హాజరు కావాలని అద్వానీ, ఎంఎం జోషి, ఉమాభారతికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

15:45 - May 25, 2017

ఢిల్లీ : కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ప్రతిపక్ష నేతలకు శుక్రవారం విందు ఏర్పాటు చేశారు. దిల్లీలోని పార్లమెంట్‌ హౌస్‌లో ఇచ్చే ఈ విందుకు పశ్చిమబెంగాల్‌, బిహార్‌ ముఖ్యమంత్రులు మమతాబెనర్జీతోపాటు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, విపక్ష నేతలు హాజరుకానున్నారు. అయితే ఈ విందులో పాల్గొనేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు మాత్రం ఆహ్వానం అందలేదు. ఎన్టీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గతంలో ప్రతిపక్షాలు చేపట్టిన ఏ కార్యక్రమంలోనూ కేజ్రీవాల్‌ పాల్గొనలేదు. ఈ కారణంతోనే విందుకు ఆయన్ని ఆహ్వానించలేదని తెలుస్తోంది.త్వరలో జరగబోయే రాష్ట్రపతి ఎన్నికపై చర్చించేందుకే ఈ విందు ఏర్పాటుచేసినట్లు సమాచారం. 

15:45 - May 25, 2017

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌ జాతీయ రహదారిపై దారుణం జరిగింది. బంధువుల ఇంటికి వెళ్లి కారులో తిరిగి వస్తున్న ఓ కుటుంబాన్ని దోపిడీ చేయడమే కాకుండా నలుగురు మహిళలపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. వారిని కాపాడేందుకు ప్రయత్నించిన అదే కుటుంబానికి చెందిన 45ఏళ్ల వ్యక్తిని హత్య చేసిన ఘటన కలకలం సృష్టించింది. జెవర్‌ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం కారులో బులంద్‌షహర్‌కు వెళ్తున్నారు...బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత యమునా ఎక్స్‌ప్రెస్‌ వేపై ముసుగులు ధరించిన ఆరుగురు వ్యక్తులు కారును ఆపి ప్రయాణికుల నుంచి 40 వేల నగదు, నగలు, మొబైల్‌ ఫోన్‌ దోచుకున్నారు. కారులో ఉన్న నలుగురు మహిళలను బలవంతంగా బయటికి లాగి వారిని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మహిళలను కాపాడేందుకు ప్రయత్నించిన అదే కుటుంబానికి చెందిన 45ఏళ్ల వ్యక్తిపై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడ్డ అతడిని ఆసుపత్రిని తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

15:43 - May 25, 2017

సంగారెడ్డి : బేకరీలకు పశువుల కొవ్వును సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు... సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు శాంతినగర్‌లో డ్రైనేజీ శుభ్రం చేసేందుకు సిబ్బంది వచ్చారు.. పక్కనున్న ప్రాంతంనుంచి దుర్వాసన రావడంగమనించి అధికారులు ఫిర్యాదుచేశారు.. సిబ్బంది సమాచారంతో ఆ స్థావరంపై అధికారులు దాడి చేశారు.. పశువుల కొవ్వుతో తయారుచేసిన కల్తీ నెయ్యి డబ్బాల్ని స్వాధీనం చేసుకున్నారు.. ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు... ఈ ఉత్పత్తులను బేకరీలకు సరఫరా చేస్తున్నట్లు నిందితులు అంగీకరించారు.

15:42 - May 25, 2017

పెద్దపల్లి : కులవృత్తుల్ని ప్రోత్సహిస్తామంటూ వరుస ప్రకటనలుచేస్తున్న ప్రభుత్వం.. ఆచరణలోమాత్రం దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది.. మిషన్‌ కాకతీయలోభాగంగా పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం లక్కారంలో మొత్తం ఈత, తాటిచెట్లను అధికారులు తీసేశారు.. రాత్రికిరాత్రే చెరువుకట్ట పక్కనున్న చెట్లను జేసీబీతో తొలగించారు... దీంతో వీటిపై ఆధారపడి బతుకుతున్న 50మంది గీతకార్మికులు రోడ్డునపడ్డారు.. పనులకు అడ్డువస్తున్న చెట్లను తొలగించి... మిగతావాటిని అలాగేఉంచాలని తాము కోరినా అధికారులు పట్టించుకోలేదని గీత కార్మికులు ఆరోపిస్తున్నారు.

15:40 - May 25, 2017

ఖమ్మం : జిల్లా సూర్యాపేట నుండి మద్దులపల్లి వరకు జాతీయ రహదారి విస్తరణ పనుల నేపథ్యంలో రైతులు పెద్ద ఎత్తున తమ భూములు కోల్పోనున్నారు. ఎకరాకు 20 లక్షలు పలికే భూమికి ప్రభుత్వం 6 లక్షలు చెల్లిస్తామని చెప్పడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. భూమి కోల్పోయి .. పనులు లేక ఎలా బతికేదని ప్రశ్నిస్తున్నారు. వారు టెన్ టివితో మాట్లాడారు పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

15:17 - May 25, 2017

విశాఖ : ఎమ్మెల్సీ ఎంవీఎస్ మూర్తి వ్యాఖ్యలపై ఏయూ విద్యార్థులు భగ్గుమంటున్నారు. ఆంధ్రయూనివర్సిటీని ఎంవీఎస్ మూర్తి దెయ్యాలకొంపతో పోల్చడం విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఆయన వ్యాఖ్యలకు నిరసనకు వ్యతిరేకంగా విద్యార్థులు రాస్తారోకో చేశారు. ఏయూ నుంచి డాక్టరేట్ తీసుకుని ఏయూని అవమానించడం మంచికాదని విద్యార్థులు అన్నారు. తక్షణమే ఎంవీఎస్ మూర్తి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. దీని మంత్రి గంట స్పందిస్తూ ఎంవీఎస్ వ్యాఖ్యలను ఖండించారు. విద్యావేత అలా మాట్లాడడం సబబు కాదన్నారు. 

ఎమ్మెల్సీ ఎంవీఎస్ మూర్తి వ్యాఖ్యలపై విద్యార్థుల ఆగ్రహం..

విశాఖపట్టణం : ఎమ్మెల్సీ ఎంవీఎస్ మూర్తి చేసిన వ్యాఖ్యలపై ఏయూ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏయూను దెయ్యాల కొంపతో పోల్చడంపై విద్యార్థులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ విద్యార్థులు రాస్తారోకో చేపట్టారు.

14:49 - May 25, 2017

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ 'అల్లు అర్జున్' తాజా చిత్రం 'డీజే..దువ్వాడ జగన్నాథమ్' రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన పాటలు ఒక్కోటి విడుదలవుతున్నాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలో 'పూజా హెగ్గే' హీరోయిన్ గా నటించింది. నిర్మాతగా 'దిల్' రాజు వ్యవహరించారు. ఈ చిత్రంలో బన్నీ 'బ్రాహ్మణుడి' గా మరొక మాస్ పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. బ్రాహ్మణ పాత్ర కోసం ఆయన పలు నిర్ణయాలు తీసుకున్నట్లు సోషల్ మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. నిజ జీవితంలో బ్రాహ్మణులు పాటించే పద్ధతులను 'బన్నీ' పాటించాడని..మాంసాహారాన్ని సైతం దూరం పెట్టాడని టాక్. ఇలా చేయడం వల్ల తెరపై అత్యంత సహజంగా కనపడేలా వీలుంటుందని అల్లు అర్జున్ భావించినట్లు తెలుస్తోంది. దాదాపుగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ ప్లాన్స్ చేస్తోంది.

ఏపీలో విందు భేటీ..

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నివాసంలో బీజేపీ, టిడిపి నేతల విందు భేటీ జరుగుతోంది. ఈ భేటీలో ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, సురేష్ ప్రభు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, టిడిపి మంత్రులు తదితరులు పాల్గొన్నారు.

14:41 - May 25, 2017
14:40 - May 25, 2017

'రానా'కి ఉరిశిక్ష ఏంటీ ? కోర్టు ఏ విషయంలో తీర్పు చెప్పింది అని బెంబేలెత్తిపోకండి...పూర్తిగా చదవండి..టాలీవుడ్ కండల వీరుడు 'రానా'.. వైవిధ్యమైన కథా చిత్రాలు ఎంచుకుంటూ ముందుకెళుతున్నాడు. ఇటీవలే విడుదలైన 'బాహుబలి -2'తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఈ చిత్ర విజయం అనంతరం మరో వైవిధ్యమైన కథను ఎంచుకున్నాడు. తేజ దర్శకత్వంలో రూపొందుతున్న 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలో పవర్ పుల్ పాత్రలో పోషిస్తున్నాడంట. చట్టంలో వున్న లొసుగులు..వ్యవస్థలో వున్న డొల్లతనం పేరిట కథ ఉందని, దీనిపై అడ్డంగా ఎదిగే ఓ వ్యక్తి కథని అని ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమా క్లైమాక్స్ 'టెంపర్' సినిమాను పోలి ఉంటుందని టాక్. కోర్టు హీరో 'రానా'కి ఉరిశిక్ష విధిస్తుందని, 'టెంపర్' సినిమాలోని కోర్టు సీన్ లా ఇది కూడా అదిరిపోతుందని టాక్. మరి ఈ సినిమా ఎలా ఉండబోతోందో వేచి చూడాలి.

14:40 - May 25, 2017

కరీంనగర్‌ : జిల్లాకు చెందిన మైత్రి చానల్‌ యాజమాన్యం పెద్దమనసును చాటుకుంది. అనార్యోగ్యంతో మృతిచెందిన కేబుల్‌ ఆపరేటర్‌ కుటుంబాన్ని ఆదుకుంది. రామడుగు మండలం దేశరాజ్‌పల్లికి చెందిన తిరుపతిరెడ్డి కేబులు ఆరేటర్‌గా పనిచేస్తున్నాడు. అనారోగ్యంతో ఇటీవల మృతిచెందాడు. తిరుపతిరెడ్డి మృతితో కుటుంబం ఆసరా కోల్పోయింది. దీంతో తిరుపతిరెడ్డి కుటుంబానికి చేయూత నిచ్చారు.. మైత్రిచానల్‌ నిర్వహకులు సృజన్‌రావు, ఆకుల నర్సయ్య. 50వేల రూపాయల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ బాండ్‌ను కుటుంబానికి అందిచారు. 

14:37 - May 25, 2017

యాదాద్రి : అమిత్ షా అబద్దాలు చెప్పి తెలంగాణ ప్రజలను అవమానపర్చారని విమర్శించారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. కేంద్రం నుంచి వచ్చిన నిధులను ఏయే పథకాలకు ఖర్చు చేశారన్న దానిపై చర్చ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. భువనగిరిలో నేటి నుంచి మూడు రోజులపాటు జరుగనున్న సిపిఎం రాష్ట్రస్థాయి శిక్షణాతరగతుల్లో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. తెలంగాణ ఏర్పడిన మూడేళ్లలో కేంద్రం నుంచి వచ్చినదానికంటే కేంద్రానికి చెల్లించినవే ఎక్కువని... కేంద్రంతో పోరాడి నిధులు సాధించడంలో సీఎం కెసిఆర్ విఫలమయ్యారని తమ్మినేని విమర్శించారు. ఏమాత్రం ఆత్మాభిమానం ఉన్నా.. రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపి అభ్యర్థికి మద్ధతివ్వమని కెసిఆర్ స్పష్టంచేయాలని తమ్మినేని డిమాండ్ చేశారు. 

14:36 - May 25, 2017

హైదరాబాద్ : మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని.. 2006 ఫిబ్రవరి 2న అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దేశంలోని పేదలను కరవు బారి నుంచి కాపాడేందుకు, వలసలను నివారించడానికి ఉపాధి హామీ పథకం ప్రవేశ పెట్టారు. ప్రయోగాత్మకంగా 20 జిల్లాల్లో ఈ పథకాన్ని ప్రారంభించారు. పథకాన్ని అమలు చేసే క్రమంలో.. కూలీల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, పని చేసే చోట టెంట్లు వేయాలని, తాగునీటి వసతి కల్పించాలని నిబంధనలు పెట్టారు.

కానీ అధికారులు, ఉపాధి హామీ కూలీలకు వసతులు కల్పించే మాటే మరిచారు. ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గంలో ఉపాధి పనులు జరిగే చోట కనీస ఏర్పాట్లు చేయకుండా పనులు చేయించడంతో.. కూలీలు ఎండ తీవ్రతను తట్టుకోలేకపోతున్నారు. ఇప్పటికే వడదెబ్బకు జిల్లాలో 14 మంది కూలీలు చనిపోయారు. కూలీలు పని చేసే చోట అధికారులు కనీసం టెంట్‌లు కానీ.. వైద్య సదుపాయాన్ని కానీ ఇప్పటి వరకు కల్పించలేదు. మరి కొంతమంది పొట్ట కూటి కోసం ఎండలో పని చేయడంతో.. వడదెబ్బతో వడలిపోతున్నారు.

వసతులు కల్పించాలి కూలీలు
ఉపాధి పనులు జరిగే చోట తగిన వసతులు కల్పించాలని కూలీలు కోరుతున్నారు. అలాగే, తమకు పని దినాలు 100 రోజులు కాకుండా 200 రోజులకు పెంచాలని కోరుతున్నారు. భార్యా భర్తలకు ఒకటే జాబ్‌ కార్డు ఉంటే చెరో 50 రోజులు మాత్రమే కూలీ పని దొరుకుతోందని, అలా కాకుండా ప్రతి ఒక్కరికీ రెండు వందల పనిరోజుల ఉపాధిని కల్పించాలని కోరుతున్నారు. ఉపాధి హామీలో పని చేస్తున్న ప్రతీ వ్యక్తకి.. పని ముట్ల కోసం 10 రూపాలు అదనంగా ఇస్తున్నామని అధికారులంటున్నారు. ఉపాధి హామీ పథకం కింద జిల్లాకు 11 వేల మెడికల్ కిట్స్‌ మంజూరు కాగా ఇప్పటివరకు 7,300లకు పైగా పంపిణీ చేశామని డిఆర్‌ డిఏ ఇంచార్జ్‌ పిడి సురేశ్‌ బాబు తెలిపారు. గత పదేళ్ల నుంచి ఉపాధి హామీలో పని చేస్తున్న కూలీలకు పనిముట్లు, తట్టలు, గడ్డపారలు ఇవ్వాలని.. అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా ఇప్పటివరకూ ఇవ్వలేదు. ఇప్పటికైనా ఉపాధి హామీ కూలీలకు తగిన సౌకర్యాలు కల్పించి, ఉపాధి పనిదినాలను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 

14:34 - May 25, 2017

విజయవాడ : విభజన హామీలు నెరవేర్చని బిజెపి నేతలు సిగ్గులేకుండా ఆంధ్రప్రదేశ్‌లో ఎలా అడుగుపెడుతున్నారని మండిపడ్డారు ఏపి మహిళా కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ. విజయవాడ ఆంధ్రరత్న భవన్ వద్ద పెద్ద ఎత్తున మహిళా కార్యకర్తలతో జరిగిన నిరసన ప్రదర్శనలో ఆమె పాల్గొన్నారు. అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేసి అమిత్ షా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలన్నింటినీ అమలు చేయాలని ఈ సందర్భంగా సుంకర పద్మశ్రీ డిమాండ్ చేశారు. 

టిడిపి పాపులార్టీ తగ్గుతోందన్న కావూరి..

విజయవాడ : జన్మభూమి కమిటీల ఆలోచన సరికాదని బీజేపీ నేత కావూరి సాంబశివరావు పేర్కొన్నారు. ఏపీలో టిడిపి పాపులారిటీ తగ్గుతోందని, వైసీపీ పావులార్టీ అంగుళమైనా పెరగలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. టిడిపి పాపులార్టీ తగ్గడం బీజేపీ పై ప్రభావం చూపుతోందని తెలిపారు. ఎన్నికల్లో ఒంటిరిగా వెళ్లాలనే అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు.

బీజేపీ క్షమాపణలు చెప్పాలన్న హరీష్..

హైదరాబాద్ : బీజేపీ నేతలు ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు క్షమాపణలు చెప్పాలని టి. మంత్రి హరీష్ రావు సూచించారు. బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం మానుకోవాలని, అమిత్ షా పర్యటనతో బీజేపీ పదేళ్లు వెనక్కి పోయిందని పేర్కొన్నారు.

తెలంగాణ పోలీసు శాఖకు అవార్డులు..

ఢిల్లీ : ఫిక్కి స్మార్ట్ పోలిసింగ్ 2017 అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఐదు విభాగాల్లో తెలంగాణ పోలీసులకు అవార్డులు లభించాయి. సైబర్ క్రైమ్ విభాగంలో ఫోరెన్సిక్ ల్యాబ్ ఏర్పాటు..పాస్ పోర్టు తనిఖీ..వేలిముద్రల గుర్తింపు..స్మార్ట్ పోలీసింగ్..స్మార్ట్ ఇన్నోవేషన్ విభాగాల్లో అవార్డులు వచ్చాయి. హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డికి స్నాప్ట్ పోలీసు ఆఫీసర్ గా అవార్డు వచ్చింది.

14:20 - May 25, 2017

కొన్ని సంవత్సరాల తరువాత రీ ఎంట్రీ ఇచ్చి తనలో ఏమాత్రం సత్తా తగ్గ లేదని చూపెట్టిన నటుడు 'చిరంజీవి'. 'ఖైదీ నెంబర్ 150' సినిమా అనంతరం 151వ సినిమాపై 'చిరంజీవి' ప్రత్యేక దృష్టి పెట్టాడు. అత్యంత హై క్వాలిటీస్ తో చిత్రం రూపొందబోతోందని తెలుస్తోంది. 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' జీవిత కథతో సురేంద్ర రెడ్డి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర పాత్ర కోసం 'చిరంజీవి' ప్రత్యేక కృషి చేస్తున్నట్లు టాక్. త్వరలో ప్రారంభమయ్యే ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు సోషల్ మాధ్యమాల్లో పలు వార్తలు వెలువడుతున్నాయి. తాజాగా బాలీవుడ్ నటుడు 'సల్మాన్ ఖాన్' నటించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఓ ముఖ్యపాత్రలో 'సల్మాన్‌ ఖాన్‌'ని చూపించాలని చిత్ర యూనిట్ భావిస్తోందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సల్మాన్ నటిస్తే సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తోందని సమాచారం.

14:19 - May 25, 2017

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' 'కాటమరాయుడు' చిత్రం అనంతరం పలు సినిమాకుల సైన్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే తివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. వీరి కాంబినేషన్ లో 'అత్తారింటికి దారేది' సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. హారిక-హాసిని క్రియేషన్స్ బేనర్లో ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో 'కీర్తి సురేష్', 'అను ఇమ్మాన్యుయెల్' లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చిత్రం రూపొందుతోందని తెలుస్తోంది. ఇందులో 'పవన్' సాఫ్ట్ వేర్ ఇంజినీర్ పాత్ర పోషిస్తున్నారని టాక్. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ఇంతవరకు ప్రకటించలేదు. కానీ పలు టైటిల్స్ సోషల్ మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్నాయి. తాజాగా 'చుట్టేద్దాం రండి' అనే టైటిల్ ను చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నట్లు టాక్. ఈ చిత్రానికి అనిరుధ్‌ మ్యూజిక్ అందిస్తున్నాడు. త్వరలోనే ఏ టైటిల్ ను పెట్టబోతున్నారనేది తెలుస్తోంది.

14:18 - May 25, 2017

తెలుగులో యాంగ్రీ యంగ్ మెన్ గా పేరు తెచ్చుకున్న నటుడు 'రాజశేఖర్' పోలీసు పాత్రలో ఆయన జీవించే వారు. పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఈ నటుడు ఈ మధ్య వరుస ప్లాప్స్ తో ఇబ్బందులు పడుతున్నాడు. ప్రస్తుతం ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో 'గరుడ వేగ' చిత్రంలో 'రాజశేఖర్' నటిస్తున్నాడు. తాజాగా ఈయనకు సంబంధించి ఓ వార్త సోషల్ మాధ్యమల్లో చక్కర్లు కొడుతోంది. తమిళ చిత్రానికి ఆయన సైన్ చేసినట్లు టాక్. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు ఇటీవల ఒక భిన్నమైన స్క్రిప్ట్ వినిపించారట. కథ, ప్రధాన పాత్ర నచ్చడంతో 'రాజశేఖర్' వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

 

ప్రభుత్వ స్థలాల వివరాలను పంపాలన్న ఈటెల..ఇంద్రకిరణ్..

కరీంనగర్ : ప్రభుత్వ స్థలాలను గుర్తించి ప్రతిపాదనలు పంపాలని అధికారులకు మంత్రులు ఈటెల, ఇంద్రకిరణ్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రతి నియోజకవర్గానికి 400 డబుల్ బెడ్ రూం ఇళ్లతో పాటు అదనంగా వెయ్యి ఇళ్లను మంజూరు చేయడం జరిగిందని ఇంద్రకిరణ్ రెడ్డి తెలిపారు. ఇరిగేషన్, రోడ్ల నిర్మాణం వల్ల కాంట్రాక్టర్ల కొరత ఉందని, అందుకే ఇళ్ల నిర్మాణంలో జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు.

14:02 - May 25, 2017

సంగారెడ్డి : జిల్లాలోని పటాన్ చెరులో పశువుల కళేబరాలతో కల్తీ నెయ్యి తయారుచేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కల్తీ నెయ్యిని సరఫరా చేస్తున్నామని నిందితులు ఒప్పుకున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

13:53 - May 25, 2017

ముంబై : మహారాష్ట్ర సీఎం పడ్నవీస్ కు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలిక్యాప్టర్ లాతుర్ లో క్రాష్ ల్యాండైంది. ఈ విషయాన్ని పడ్నవీస్ ట్వీట్టర్ ద్వారా తెలిపారు. హెలిక్యాప్టర్ నడిరోడ్డు పై అత్యవసర ల్యాండ్ కావడంతో అక్కడి ఆందోళనకు గురైయ్యారు. క్రాష్ ల్యాండింగ్ సమయంలో ఒకరికి గాయమైనట్లు తెలుస్తోంది. అయితే హెలిక్యాప్టర్ ఆరు ఏళ్ల క్రితం అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

13:42 - May 25, 2017

సినిమా సంస్కృతి ఆడవారి శరీరంపై నడుస్తోందని అది తెర వెనుక కావచ్చు, తెర ముందు కావచ్చని సామాజిక కార్యకర్త దేవి,జర్నలిస్ట్ సజయ్ అన్నారు. వారు మానవి చర్చలో పాల్గొని మాట్లాడారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

రాష్ట్రాలను దోపిడి చేస్తున్న కేంద్రం - తమ్మినేని..

యాదాద్రి భువనగిరి : సీపీఎం రాష్ట్రస్థాయి శిక్షణా తరగతులు కొనసాగుతున్నాయి. ఈ తరగతుల్లో గురువారం పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రాలను కేంద్రం దోపిడీ చేస్తోందని, మూడేళ్లుగా రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన దానికంటే రాష్ట్రం కేంద్రానికి ఇచ్చిందే ఎక్కువ అని తెలిపారు. న్యాయంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు కేంద్రం ఇస్తోందని రాష్ట్రాలను అవమానపరిచేలా మాట్లాడడం తగదన్నారు. కేసీఆర్ కు ఏ మాత్రం ఆత్మాభిమానం ఉన్నా రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతివ్వవద్దని సూచించారు.

ఢిల్లీ ఏపీ కాంగ్రెస్ నేతలు..

ఢిల్లీ : మూడు రోజుల పర్యటనలో రాష్ట్రపతి ప్రణబ్, రాహుల్, ఇతర పార్టీల జాతీయ నాయకులను కలవడం జరిగిందని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా వ్యాఖ్యానించారు. 2013 భూ సేకరణ చట్టాన్ని టిడిపి ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని, దొడ్డిదారిన కేంద్రానికి భూ సేకరణ సవరణ బిల్లు పంపారని తెలిపారు. దీనిని ఎట్టి పరిస్థుతుల్లో అమలు చేయవద్దని రాష్ట్రపతిని కోరినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం చేసిన సవరణలతో నిర్వాసితులకు సకాలంలో పరిహారం..పునరావాసం లభించదన్నారు. జూన్ 4వ తేదీన జరిగే బహిరంగసభకు రాహుల్ గాంధీ, ఇతర జాతీయ నాయకులు హాజరౌతారని వెల్లడించారు.

అందరూ చూస్తుండగానే నరికారు..

కడప : ప్రొద్దుటూరు మార్కెట్ యార్డు సమీపంలో దారుణ హత్య జరిగింది. దేవగుడికి చెందిన మారుతి ప్రసాద్ రెడ్డిని అత్యంత పాశవికంగా ప్రత్యర్థులు హత్య చేశారు. అందరూ చూస్తుండగానే ఈ హత్య చేయడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

షా పర్యటనతో రాజకీయ ప్రకంపనలు - లక్ష్మణ్..

హైదరాబాద్ : అమిత్ షా పర్యటనతో రాజకీయ ప్రకంపనాలు వచ్చాయని బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ నేతల్లో ఆందోళన ప్రారంభమైందని, సెప్టెంబర్ లో మరోసారి రాష్ట్రానికి అమిత్ షా రానున్నారని తెలిపారు. అమిత్ షాపై కేసీఆర్ వ్యాఖ్యలు చేయడం అభ్యంతరకరమని, ఆయన వ్యాఖ్యలు సీఎం స్థాయికి తగినట్లుగా లేవన్నారు. 90వేల ఇళ్లు రాష్ట్రానికి కేంద్రం కేటాయిస్తే కట్టలేని స్థితిలో కేసీఆర్ ప్రభుత్వం ఉందని, స్థానిక సంస్థల నిధులు దారి మళ్లిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు.

నరేష్ అదృశ్యంలో దర్యాప్తు ముమ్మరం - రాచకొండ సీపీ..

హైదరాబాద్ : యాదాద్రి జిల్లాకు చెందిన నరేష్ అదృశ్యం కేసులో దర్యాప్తు ముమ్మరం చేసినట్లు టెన్ టివితో రాచకొండ సీపీ వెల్లడించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు, స్వాతి ఆత్మహత్యకంటే ముందు తీసిన వీడియోలపై టెక్నికల్ గా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నరేష్ బంధువులున్న ప్రాంతాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు, స్వాతి తండ్రిని విచారించినట్లు తెలిపారు.

సివిల్ సప్లై అధికారులతో సీవీ ఆనంద్ సమావేశం..

యాదాద్రి భువనగిరి : సివిల్ సప్లై అధికారులతో పౌరసరఫరాల కమిషనర్ సీవీ ఆనంద్ సమావేశం నిర్వహింంచారు. ధాన్యం కొనుగోలులో జిల్లా యంత్రాగాన్ని అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి 42 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చిందని సీవీ ఆనంద్ తెలిపారు. రైతులకు రూ. 2200కోట్లు చెల్లించడం జరిగిందని, అవినీతి నిర్మూలనకు ఈపాస్ విధానాన్ని, దశలవారీగా అమల్లోకి తెస్తామన్నారు. తొలి దశలో ఐదువేల షాపులో ఈపాస్ విధానం అమల్లోకి తెస్తామన్నారు.

నలుగురు ఆత్మహత్య..

పశ్చిమగోదావరి : ఏలూరు బీడీ కాలనీ ద్వారకా నగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. నాగపద్మావతి, సంతోషి రూప, సాయి సిద్దార్థ, సాయిరాంలుగా గుర్తించారు.

అమిత్ షా కు అసదుద్దీన్ సవాల్..

హైదరాబాద్ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ సవాల్ విసిరారు. దమ్ముంటే అమిత్ షా తనపై పోటీ చేసి గెలవాలని, హైదరాబాద్ ప్రజలు ఎవరిని గెలిపిస్తారో చూద్దామని పేర్కొన్నారు. సికింద్రాబాద్ లోక్ సభ..అంబర్ పేట సీట్ ను ఎంచుకుందామని, తెలంగాణ వచ్చే ఎన్నికల్లో బీజేపీ వాష్ ఔట్ ఖాయమన్నారు.

13:12 - May 25, 2017

ఈ ఫొటో చూశారా...మనిషా కోయిరాల...అయ్యే ఇలా అయిపోయిందేమిటీ ? అని ఆశ్చర్యపోతున్నారా ? దీని గురించి తెలుసుకోవాలంటే చదవండి...బొంబాయి..దిల్ సే..తదితర చిత్రాల్లో తన నటన..అందాలను కనబర్చిన హీరోయిన్. ఈ అందాల రాశి ఇటీవలే అనారోగ్య కారణాలతో కొంతకాలం సినిమాలకు దూరమైంది. మళ్లీ ఇప్పుడు మేకప్ వేసుకొనేందుకు సిద్ధం అయ్యింది. 'డియర్ మాయ' చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇస్తోంది. ఇందులో ఓ వృద్ధురాలి పాత్రలో నటించనుంది. ఆ చిత్రానికి సంబంధించిందే ఈ చిత్రం. మరి అందమైన హీరోయిన్‌గా ప్రశంసలు అందుకున్నారు..కదా ఈ పాత్ర చేయడం ఏంటీ అని విలేకరులు ప్రశ్నించారంట. అందంగా ఉండే పాత్ర కన్నా భిన్నమైన పాత్రలు చేయడం ఇష్టమని 'మనీషా' వ్యాఖ్యానించిందంట. అందంగా కనిపించడం.. అభిమానులు.. ప్రేక్షకుల పొగడ్తలకు వ్యక్తిగతంగా ప్రాధాన్యతతో పాటు విలువ ఇస్తానని, కానీ నటిగా కాదని స్పష్టం చేసిందని తెలుస్తోంది. మరి ఈ వృద్ధ పాత్రలో 'మనీషా' కు ఎలాంటి మార్కులు పడుతాయో వేచి చూడాలి.

13:08 - May 25, 2017
10:16 - May 25, 2017

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్..పా.రంజిత్ కాంబినేషన్ లో తెరకెక్కే చిత్రంపై ఇప్పటి నుండే భారీ అంచనాలు నెలకొంటున్నాయి. వీరి కాంబినేషన్ లో 'కబాలి' చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. ధనుష్ తన ఉండర్ బార్ ఫిలిమ్స్ సంస్థ తరపున ఓ చిత్రం నిర్మితమౌతోంది. ఇందులో 'రజనీ' పవర్ పుల్ పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్. సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చనున్న ఈ చిత్రానికి 'కబాలి' చిత్ర సాంకేతిక నిపుణులు పనిచేయనన్నట్లు తెలుస్తోంది. తాజాగా కీలక పాత్రలో దర్శక నటుడు సముద్రగని నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది.

అంబులెన్స్ లను ప్రారంభించిన షా..బాబు..

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు గన్నవరంకు చేరుకున్నారు. కాసేపటి క్రితం 13 అంబులెన్స్ లను బాబు..షాలు ప్రారంభించారు.

10:09 - May 25, 2017

హైదరాబాద్: మందుబాబుల ర్యాష్‌ డ్రైవింగ్‌కు బ్రేకులు వేసేలా రాచకొండ కమిషనరేట్‌ పోలీసులు సరికొత్త పద్దతులతో ముందుకు వెళుతున్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ స్పెషల్‌ డ్రైవ్‌ సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చారు.. ఇందులోభాగంగా డ్రంక్‌ అండ్ డ్రైవ్‌ను పగటి సమయాల్లోనూ చేపడుతున్నారు..

ఆకస్మికంగా స్పాట్‌లు నిర్ణయించి అప్పటికప్పుడు తనిఖీలు

డ్రంక్‌ డ్రైవ్‌లో ఏ ఒక్క మందుబాబూ తప్పించుకోకుండా పోలీసులు పకడ్బందీగా వ్యవహిస్తున్నారు. సాధారణంగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల సమాచారం ముందే తెలుసుకుంటున్న మందుబాబులు వేరే మార్గాల్లో వెళ్లిపోతున్నారు.. ఇలాంటివారిని పట్టుకునేందుకు పోలీసులు స్పెషల్‌ స్కెచ్‌ వేశారు.. ఆకస్మికంగా స్పాట్‌లు నిర్ణయించి అప్పటికప్పుడు సిబ్బందిని రంగంలోకి దించుతున్నారు.. మందుబాబులు ఏయే సమయాల్లో.. ఎక్కడ ఎక్కువగా రోడ్లపైకి వస్తున్నారో సమాచారం సేకరిస్తున్నారు.. అక్కడే తనిఖీలను పెంచడంతో మందుబాబులు పోలీసులకు దొరికిపోతున్నారు..

తనిఖీల్లో దొరికితే కఠిన చర్యలు తీసుకుంటున్న పోలీసులు

డే అండ్‌ నైట్‌ తనిఖీలతో పోలీసులు మందుబాబుల పనిపడుతున్నారు.. తనిఖీల్లో దొరికితే కఠిన చర్యలు తీసుకుంటున్నారు.. ఇలా రాచకొండ కమిషనరేట్‌ ఏర్పాటైనప్పటినుంచి 575మందిని జైలుకు పంపారు.. 2కోట్ల రూపాయలకు పైగా ఫైన్‌ రూపంలో వసూలు చేశారు.. వీటితోపాటు... అవగాహన కార్యక్రమాల్నికూడా చేపడుతున్నారు..

స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో డీ అడిక్షన్‌ కౌన్సిలింగ్‌

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డవారు మళ్లీ తాగి రోడ్లపైకి రాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు దొరికితే వారిలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.. మద్యానికి అలవాటైన బాధితులను గుర్తించి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో డీ అడిక్షన్‌ కౌన్సిలింగ్‌ ఇప్పిస్తున్నారు.. హెచ్‌ఎండీఏ నుంచి అధునాతన పరికరాలు అందడంతో పోలీసులు మరింత సమర్ధవంతంగా పని చేస్తున్నారు.. రాచకొండ పరిధిలోని ఔటర్‌ రింగ్‌రోడ్‌తోపాటు... నేషనల్‌ హైవేలు... ఇంటర్నల్‌ రోడ్లపై మందుబాబుల భరతం పడుతున్నారు.. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ను వందశాతం విజయవంతం చేయడమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నారు..

10:07 - May 25, 2017

నిర్మల్ : అభివృద్ధిపేరుతో ఆదివాసీలను ప్రభుత్వం అనాధల్ని చేస్తోంది.. టైగర్‌జోన్‌, హరితహారాలు అంటూ గిరిజనుల్ని అడవులనుంచి గెంటేస్తోంది.. నిర్మల్‌ జిల్లాలోని గోండుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది.. వీరి గుడిసెలను అధికారులు పీకేశారు.. దీంతో ఆగ్రహించిన ఆదివాసీలు నిర్మల్‌ కలెక్టరేట్‌ ఎదుట దీక్షలు చేపట్టారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

10:03 - May 25, 2017

నిజామాబాద్: దక్షిణ కాశీగా పేరుగాంచిన నిజామాబాద్‌ జిల్లా బిక్కనూరు సిద్ద రామేశ్వర ఆలయంలో భారీ అవినీతి జరిగింది. దేవుడి సొమ్మును అక్రమార్కులు కొల్లగొట్టారు. భక్తులు ఇచ్చిన విరాళాలతోపాటు... వివిధ సేవల కోసం చెల్లించిన డబ్బులనూ ఆలయ సిబ్బంది మింగేశారు. రసీదు పుస్తకాలనూ మాయం చేశారు. అంతేకాదు... ఆలయానికి చెందిన 10కోట్ల విలువైన భూములను ఖద్దరు చొక్కాలు కాజేశాయి. తమపేరు మీద ఆలయ భూములను రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. ఆడిట్‌ అధికారుల తనిఖీలతో సిద్ద రామేశ్వరాలయంలో జరిగిన అవినీతి బాగోతం బయటపడింది.

 

10:01 - May 25, 2017

హైదరాబాద్: తెలంగాణలో పాగా వేసేందుకు బీజేపీ చేస్తున్న ఎత్తుగడలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌..చెక్‌పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని రోజులుగా కేంద్ర ప్రభుత్వంతో సయోధ్యగా ఉంటున్న కేసీఆర్‌..పార్టీ విషయంలో మాత్రం అంతే సీరియస్‌గా ఉంటున్నారు. తెలంగాణాలో బలోపేతం అయ్యేందుకు బీజేపీ వేస్తున్న ఎత్తుగడలకు ధీటుగా సమాధానం ఇస్తామన్నారు కేసీఆర్‌. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమీత్ షా నల్గొండ జిల్లాలో చేసిన పర్యటనను గులాబీ పార్టీ నేతలు లైట్‌గా తీసుకున్నా,.కేసీఆర్‌ మాత్రం రాజకీయంగా ఆ పార్టీకి ఇక్కడ స్థానం దక్కదన్న అభిప్రాయన్ని వ్యక్తం చేశారు

అమీత్‌ షా పర్యటనలో బీజేపీ చేసిన తప్పులను...

అమీత్‌ షా పర్యటనలో బీజేపీ చేసిన తప్పులను స్పష్టంగా ఎత్తి చూపారు. దళితుల సహపంక్తి భోజనం, ఇతర అంశాలపై ముఖ్యమంత్రి తనదైన స్టైల్లో స్పందించారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కొత్తగా సహాయం చేయడంలో కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా..ఆ నిధులు రాష్ట్రానికి రావాల్సినవేనని స్పష్టం చేశారు. అదే సమయంలో బీజేపీ తెలంగాణాలో రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ది పొందాలని చేస్తోందని,.ఇక్కడ అది సాధ్యం కాదని తేల్చి చెప్పారు సీఎం కేసీఆర్‌.

కేంద్రంతో సయోధ్యగా మెలుగుతున్నంత మాత్రానా ...

మరో వైపు కేంద్రంతో సయోధ్యగా మెలుగుతున్నంత మాత్రానా బీజేపీ చేస్తున్న రాజకీయాన్ని ఏమాత్రం సహించబోమని హెచ్చరించారు. తెలంగాణాలో ఆ పార్టీ పరిస్థితి అందరికీ తెలిసేందేనన్నారు. తాజా సర్వేల ప్రకారం బీజేపీకి రాష్ట్రంలో ఒక్క శాసనసభా స్థానం కూడా దక్కదని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. తెలంగాణా కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన పార్టీగా అభివృద్ధి కోసం కూడా దేనికైనా సిద్ధంగా ఉంటామన్నారు కేసీఆర్‌. బీజేపీ లాంటి పార్టీలకు మాత్రం తెలంగాణాలో చోటు దక్కదన్నారు గులాబి దళపతి.

గన్నవరానికి అమిత్ షా, చంద్రబాబు

విజయవాడ : టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఏపీకి బయల్దేరారు. వీరిద్దరూ ఒకే విమానంలో హైదరాబాద్‌ నుంచి గన్నవరం బయలుదేరారు. అక్కడ కేంద్ర మంత్రి సురేశ్‌ప్రభు తన ఎంపీల్యాడ్స్‌ నిధుల తో సమకూర్చిన 13 అంబులెన్స్‌లను అమిత్‌షా ప్రారంభిస్తారు. మధ్యాహ్నం భోజన సమయంలో చంద్రబాబుతో అమిత్‌షా భేటీ అవుతారు. ఇటీవల టీడీపీ - బీజేపీ మధ్య మాటలయుద్ధం, టీడీపీతో పొత్తు ఏపీకే పరిమితం అని ఇప్పటికే అమిత్‌షా తేల్చి చెప్పిన నేపథ్యంలో ఇద్దరు నేతల భేటీ ఆసక్తిగా మారింది.

09:59 - May 25, 2017

ప్రకాశం: కొండెపిలో దారుణం చోటు చేసుకుంది. నూడిల్స్‌ బండి వద్ద పని చేసే బాలుడు ఆరుముళ్ల విజయ్‌కుమార్‌.. అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నూడిల్స్‌ బండి యజమాని మురగళ్ల సుబ్రహ్మణ్యమే బాలుడిని హత్య చేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు. పనిలోకి రావడం లేదని విజయ్‌కుమార్‌ని సుబ్రహ్మణ్యం చిత్రహింసలు పెట్టాడని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు.. కందుకూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం పూర్తి కాగానే పోలీసులు మతదేహాన్ని బాక్సులో పెట్టి.. ఊరు దాటించాలని ప్రయత్నించారు. వెంటనే పోలీసులను ఎమ్మార్పీఎస్‌ నాయకులు అడ్డుకున్నారు. ముత్తరాసుపాలెం వద్ద రోడ్డుపై బైటాయించి.. రాస్తారోకో నిర్వహించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సీఐ, ఎస్‌ఐలు.. పోస్టుమార్టం రిపోర్టు తెప్పించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

09:57 - May 25, 2017

హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఏపీకి బయల్దేరనున్నారు. వీరిద్దరూ ఒకే విమానంలో హైదరాబాద్‌ నుంచి గన్నవరం చేరుకుంటారు. అక్కడ కేంద్ర మంత్రి సురేశ్‌ప్రభు తన ఎంపీల్యాడ్స్‌ నిధుల తో సమకూర్చిన 13 అంబులెన్స్‌లను అమిత్‌షా ప్రారంభిస్తారు. మధ్యాహ్నం భోజన సమయంలో చంద్రబాబుతో అమిత్‌షా భేటీ అవుతారు. ఇటీవల టీడీపీ - బీజేపీ మధ్య మాటలయుద్ధం, టీడీపీతో పొత్తు ఏపీకే పరిమితం అని ఇప్పటికే అమిత్‌షా తేల్చి చెప్పిన నేపథ్యంలో ఇద్దరు నేతల భేటీ ఆసక్తిగా మారింది.

09:53 - May 25, 2017

నెల్లూరు :జిల్లాలోని కోవూరు పోలీస్‌స్టేషన్‌లో లాకప్‌డెత్‌ జరిగింది. ఓ దొంగతనం కేసులో పెళ్లకూరు కాలనీకి చెందిన రమణయ్య అనే వ్యక్తిని పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చారు. స్టేషన్‌కు తీసుకువచ్చిన కొద్దిసేపటికే రమణయ్య మృతిచెందాడు. పోలీసు దెబ్బలకే రమణయ్య చనిపోయాడని మృతుని బంధువులు ఆరోపించారు. పోలీసుల తీరును నిరసిస్తూ పీఎస్‌ ముందు మృతుని బంధువులు ఆందోళనకు దిగారు. మరోవైపు గన్నేరుపప్పు తిని రమణయ్య చనిపోయాడని పోలీసులు చెబుతున్నారు. మృతుడి కుటుంబసభ్యులతో పోలీసు అధికారుల రాజీ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

09:51 - May 25, 2017

.గో : ఏలూరు ద్వారకానగర్‌లో విషాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. నాగపద్మాపతి, సంతోషి రూప, సాయి సిద్దార్థ, సాయిరాం ఈ నెల 18వ తేదీన ఊరు వెళ్తున్నామని చెప్పి ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లోనుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

 

07:13 - May 25, 2017

హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాపై సీఎం కేసీఆర్ అగ్గిమీద గుగ్గిలమే అయ్యారు. అధికార పార్టీ అధ్యక్షుడై ఉండి ప‌చ్చి అబ‌ద్దాలు మాట్లాడార‌ని మండిపడ్డారు.. తెలంగాణ‌కు ల‌క్ష కోట్ల రూపాయ‌లు ఇచ్చామ‌ని అమిత్ షా ప‌చ్చి అబ‌ద్దం మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు.. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధుల్ని లెక్కలతో సహా వివరించారు.. తన లెక్కలు తప్పని రుజువు చేస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తానని కూడా సవాల్‌ విసిరారు. తెలంగాణకు లక్ష కోట్లు ఇచ్చామన్న మాటకు కట్టుబడి ఉంటానన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా. హైదరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో మరోసారి స్పష్టం చేశారు. ఇదే అంశంపై 'న్యూస్ మార్నింగ్ ' లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో నంద్యాలనరసింహయ్య సీపీఎం నేత,రాకేష్ టిఆర్ఎస్ నేత, అల్జాపూర్ శ్రీనివాస్ బిజెపి నేత పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

06:52 - May 25, 2017

హైదరాబాద్: గతంలో కేంద్ర ప్రభుత్వాలు దాదాపు 66కు పైగా సంక్షేమ, ఉపాధి కల్పన పథకాలకు రూపకల్పన చేశాయి. వివిధ ప్రజా ఉద్యమాలు, కోర్టు తీర్పుల కారణంగా వీటిలో కొన్ని పథకాలు పురుడు పోసుకున్నాయి. ఆయా పథకాల నిర్వహణలో కొన్ని లోపాలున్నా, సత్ఫలితాలు సాధించిన మాట వాస్తవం. అయితే, కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ సంక్షేమ పథకాలను చిన్న చూపు చూస్తోందన్న విమర్శలున్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకాల సంఖ్యను కుదించడం, కొన్ని పథకాలకు నిధుల కేటాయింపు తగ్గించడం , మరికొన్నింటిని ప్రయివేటీకరించేందుకు ప్రయత్నించడం లాంటి పరిణామాలు ఈ మూడేళ్లలో ఊపందుకున్నాయి. కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మూడేళ్లలో కేంద్ర ప్రభుత్వ స్కీమ్ లు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి? స్కీమ్ ల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఎలా వుంది? ప్రజాసంక్షేమమే ధ్యేయంగా రూపొందించిన పథకాలను మరింత సమర్ధవంతంగా నిర్వహించాలంటే చేయాల్సిందేమిటి? ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో ఏపి కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగ, కార్మిక సంఘాల జెఏసి చైర్మన్ ఏవి నాగేశ్వరరావు పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

06:47 - May 25, 2017

హైదరాబాద్: వచ్చే నెల 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని తెలంగాణ విద్యావంతుల వేదిక నిర్ణయించింది. అమరవీరులను స్మరించుకుని ఆవిర్భావ దినోత్సం జరుపుకోవాలని జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ కోరారు. కరీంనగర్‌లో జరిగిన విద్యావంతుల వేదిక మహాసభ కార్యక్రమానికి కోదండరామ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

 

అమరవీరులను స్మరించుకుని ఆవిర్భావ దినోత్సం జరుపుకోవాలి

హైదరాబాద్: వచ్చే నెల 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని తెలంగాణ విద్యావంతుల వేదిక నిర్ణయించింది. అమరవీరులను స్మరించుకుని ఆవిర్భావ దినోత్సం జరుపుకోవాలని జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ కోరారు. కరీంనగర్‌లో జరిగిన విద్యావంతుల వేదిక మహాసభ కార్యక్రమానికి కోదండరామ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

06:45 - May 25, 2017

హైదరాబాద్: కేసీఆర్‌ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక స్టాఫ్ట్‌వేర్‌ రూపొందించింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సురక్షిత ప్రసవాల కోసం ఉద్దేశించిన ఈ కార్యక్రమాన్ని వచ్చే నెల 3 నుంచి అమలు చేస్తారు. గర్భిణిల పేర్లను ముందుగానే నమోదుచేసి, మాతా, శిశు సంరక్షణ చర్యల్లో భాగంగా నెలవారీ వైద్య పరీక్షలు చేయిస్తారు. గర్భస్థ శిశువుల్లో జన్యుపరమరైన లోపాలు గుర్తించి,.ముందునుంచే మందుల వాడకం ద్వారా సమస్యను పరిష్కరిస్తారు. సిజేరియన్‌ ఆపరేషన్‌కు అవకాశం లేకుండా సాధారణ ప్రసవానికి వీలు కల్పిస్తారు. గర్భిణితోపాటు, కుటుంబ సభ్యుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని కాన్పు కోసం ముందుగానే అస్పత్రిని నిర్ధరిస్తారు.

గర్భిణిలకు ప్రభుత్వ అందించే ఆర్థిక సాయం బ్యాంకు ఖాతాలో జమ

ఆధార్‌ నంబర్‌ అనుసంధానంతో గర్భిణిల పేరిట బ్యాంకు అకౌంట్లు ప్రారంభిస్తారు. ప్రభుత్వ అందించే ఆర్థిక సహాయాన్ని ఖాతాలో జమ చేస్తారు. గర్భిణిలకు వైద్య పరీక్షల సమయంలో నాలుగు వేల రూపాయలు, ప్రసూతి వైద్యం అందించేటప్పుడు మరో నాలుగు వేల రూపాయలు జమ చేస్తారు. ప్రసవానంతరం బిడ్డకు టీ కాల కోసం ఇంకో నాలుగు వేల రూపాయలు..ఇలా మూడుదశల్లో మొత్తం 12 వేల రూపాయలు ఇస్తారు. కేసీఆర్‌ కిట్‌ కార్యక్రమం అమలు కోసం ప్రత్యేకంగా అభివృద్ఢి చేసిన సాఫ్ట్‌వేర్‌లో గర్భస్థ పిండం దశ నుంచి ప్రసవానంతరం టీకాలు ఇచ్చే వరకు సమస్త సమాచారం భద్రపరుస్తారు. ఈ కార్యక్రమం అమలు కోసం అన్ని ప్రభుత్వ ఆస్పత్రల్లో మెటర్నిటీ వార్డులను ఏర్పాటు చేస్తారు. ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాల్లో కూడా సదుపాయాలను మెరుగుపరుస్తారు.

వచ్చే నెల 3 నుంచి కేసీఆర్‌ కిట్ల పంపణీ

హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన అమ్మఒడి-కేసీఆర్‌ కిట్‌ కార్యక్రమాన్ని వచ్చే నెల 3 నుంచి అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. బాలింతలకు ఇచ్చే ఈ కిట్‌లో 16 రకాల వస్తువులు ఉంటాయి. వీటిలో 14 పసికందులకు సంబంధించినవి. మరో నాలుగు తల్లికి సంబంధించినవి ఉంటాయి.

06:42 - May 25, 2017

కృష్ణా : విజయవాడలోని ఎ కన్వేషన్‌ సెంటర్‌లో రేపటి నుంచి రెండు రోజుల పాటు కలెక్టర్ల సదస్సు జరగనుంది. సీసీఎల్‌ ఎ.అనిల్‌ చంద్ర పునేఠా స్వాగత ఉపన్యాసంతో సదస్సు ప్రారంభంకానుంది. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్‌ ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించనున్నారు. ఈ సదస్సులో ప్రభుత్వ లక్ష్యాలపై సీఎం చంద్రబాబునాయుడు... కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వ పథకాల అమలు గురించి తెలుసుకుని... మరింత సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లే చర్యలపై చర్చించనున్నారు. ఈసారి ముఖ్యమంత్రి మిషన్‌ మోడ్‌ విధానానికి ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. మొత్తం అన్ని విభాగాలను ఏడు మిషన్లుగా విభజించి మిషన్‌ మోడ్‌ పద్ధతిలో రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేసింది.

శాఖలు సాధించిన ప్రగతిపై ప్రజెంటేషన్‌

మిషన్‌ మోడ్‌ విధానంలో... శాఖాధిపతులు తమ శాఖలు సాధించిన ప్రగతిని 15 నిమిషాల ప్రజెంటేషన్‌ ద్వారా తెలియజేయనున్నారు. అదే సమయంలో ఆయా జిల్లాల కలెక్టర్లు ఇంటర్యాక్ట్‌ కానున్నారు. తొలిరోజు వ్యవసాయం-అనుబంధ రంగాలు, పరిశ్రమల రంగం , సర్వీస్‌ సెక్టార్‌ మిషన్‌, నాలెడ్జ్‌ సెక్టార్‌ మిషన్‌లపై చర్చించనున్నారు.

అమరావతి పురోగతిపై వివరించనున్న సీఆర్‌డీఏ కమిషనర్‌

రెండోరోజు రాజధాని అమరావతి నిర్మాణం పురోగతిపై సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీధర్‌ వివరించనున్నారు. వృద్ధి రేటు, టాస్క్‌ఫోర్స్‌పై మాజీ సీఎస్‌ ఎస్పీ టక్కర్‌ వివరించనున్నారు. అలాగే మౌలిక వసతుల మిషన్‌లో విద్యుత్‌, పోర్ట్‌, పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పనపై అజయ్‌ జైన్‌, సుమిత్రా దావ్రాలు వివరించనున్నారు. కాగా సాయంత్రం 4 గంటలకు శాంతి భద్రతలపై డీజీపీ, జిల్లా ఎస్పీలతో సీఎం చర్చిస్తారు. అలాగే ప్రగతి ఆధారంగా జిల్లాలకు ర్యాంక్‌లను ప్రకటిస్తారు. మూడేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ సదస్సు ప్రాధాన్యత సంతరించుకుంది. భవిష్యత్తులో ప్రభుత్వ ప్రవేశపెట్టబోయే పథకాలు.. వాటిని ఎలా అమలు చేయాలనే అంశాలు సదస్సులో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

నేటి నుండి విజయవాడలో రెండు రోజులపాటు కలెక్టర్ల సదస్సు

విజయవాడ : ప్రభుత్వ ప్రాథమ్యాలపై కలెక్టర్లకు, ఎస్పీలకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు దిశానిర్దేశం చేయనున్నారు. గురువారం ప్రారంభం కాబోయే కలెక్టర్ల సదస్సులో ప్రభుత్వ పథకాలను మరింత పటిష్ఠంగా అమలు పరిచాల్సిన విధానాలపై చర్చించనున్నారు. ప్రగతి ఆధారంగా జిల్లాలకు సీఎం అవార్డులను కూడా ప్రకటించనున్నారు.

తెలంగాణలో అధికారం వచ్చే వరకు పోరాడుతాం: చంద్రబాబు

హైదరాబాద్: తెలంగాణలో అధికారం వచ్చే వరకు పోరాడుతామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. టీడీపీకి కార్యకర్తలే బలమన్న ఆయన... తెలంగాణలో కార్యకర్తలకు అండగా ఉంటానని చెప్పారు. తెలంగాణలో టీడీపీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేస్తున్నారని... భవిష్యత్‌లోనూ ఇదే ఒరవడి కొనసాగించాలన్నారు.

06:39 - May 25, 2017

అమరావతి: విభేధాలతో కుస్తీ పట్లు పట్టే బదులు ఏపీలో దోస్తీతో ముందుకు సాగడమే మంచిదని తెలుగుదేశం, బీజేపీ అధినేతలు ఓ అంగీకారానికి వచ్చారు. పోరు నష్టం, పొందు లాభం అన్న విషయాన్ని వంటపట్టించుకున్న టీడీపీ నేతలు, కమలనాథులు ఐకమత్యమే బలమన్న అంశాన్ని అర్థం చేసుకున్నారు. దీంతో 2019 ఎన్నికల్లో కూడా కలిసి పని చేసే విధంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

హైదరాబాద్‌ నుంచి ఒకే విమానంలో ప్రయాణం ...

విజయవాడలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, కమలదళాధిపతి అమిత్‌ షా, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, రైల్వే మంత్రి సురేశ్‌ ప్రభు హైదరాబాద్‌ నుంచి విజయవాడకు ఒకే విమానంలో ప్రయాణం చేయబోతున్నారు. ప్రయాణంలోనే చంద్రబాబు, అమిత్‌ షా ఏపీలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉందని భావిస్తున్నారు. వైసీపీ అధినేత జగన్‌..ఇటీవల ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన తర్వాత టీడీపీ, బీజేపీ నేతల మధ్య అభిప్రాయబేధాలు తలెత్తాయి. రెండు పార్టీల నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తుతో టీడీపీకి ఓట్ల శాతం తగ్గిందన్న తెలుగుదేశం నేతల వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్టు అయ్యింది. దీనిపై బీజేపీ నేతలు భగ్గమంటున్నారు. టీడీపీ, బీజేపీ అధినేతల ఐక్య పర్యటన ద్వారా వీటన్నింటికీ తెరపడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఎంపీ ల్యాడ్స్‌ నిధులతో 13 అంబులెన్స్‌ల కొనుగోలు

ఏపీ నుంచి బీజేపీ తరుపున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న రైల్వే మంత్రి సురేశ్‌ ప్రభు తన ఎంపీ ల్యాడ్‌ నిధులతో కొనుగోలు చేసిన 13 అంబులెన్స్‌లను గన్నవరం విమానాశ్రయంలో అమిత్‌ షా, చంద్రబాబు ప్రారంభిస్తారు. ఆ తర్వాత అమిత్‌ షా తోపాటు, కేంద్ర మంత్రులకు చంద్రబాబు తన వివాసంలో మధ్యాహ్నం విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంలో కూడా ప్రభుత్వం, రాజకీయపరమైన పలు అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. విభజన తర్వాత ఆర్థిక లోటు ఎదుర్కొంటున్న ఏపీకి అన్ని విషయాల్లో కేంద్రం తోడ్పాటు ఎంతో అవసరం. ఈ తరుణంలో బీజేపీతో కయ్యానికి కాలుదువ్వడం కంటే, నెయ్యంతో ముందుకు సాగడమే మంచిదని చంద్రబాబుతోపాటు పలువురు టీడీపీ నేతలు, ఏపీ మంత్రులు ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నారు. పార్టీ కార్యకర్తలు, నేతలకు ఇప్పుడు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు.

టీడీపీతో విభేదాలను పెంచుకోవడం మంచిదికాదంటున్న షా

కమలదళాధిపతి అమిత్‌ షా కూడా టీడీపీతో కలిసి పనిచేయాలంటూ తమ పార్టీ నేతలకు హితబోధ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. చీటికి, మాటికి ప్రతి చిన్న విషయంపై తీవ్రంగా ప్రతిస్పందిస్తూ విభేదాలను పెంచుకోవడం మంచిదికాదని సూచించే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఏపీలో పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అమిత్‌ షా దిశా, నిర్దేశం చేస్తారు. ఏపీ మంత్రివర్గంలో ఇద్దరు బీజేపీ మంత్రులు ఉన్నా, ప్రభుత్వంలో తగిన గుర్తింపు, ప్రాధాన్యతలేదన్న భావంతో ఉన్నారు. నామినేటెడ్‌ పదవుల భర్తీలో తమకు స్థానం కల్పించడంలేదన్న ఆవేదన కమలనాథుల్లో కనిపిస్తోంది. అన్ని విషయాల్లో టీడీపీ వివక్ష చూపుతోందన్న వాదాన్నిచాలా సందర్భాల్లో ఏపీ బీజేపీ నేతలు లేవనెత్తారు. ఈ విషయాలను పార్టీ నేతలు అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. మొత్తంమీద అమిత్‌ షా పర్యటన ఏపీలో టీడీపీ, బీజేపీల మధ్య సమన్వయం సాధనకు ఉపయోగపడే చాన్స్‌ ఉంది.

నేడు ఏపీలో అమిత్ షా పర్యటన

హైదరాబాద్: 2019 ఎన్నికల్లో కూడా ఏపీలో కలిసి అడుగులు వేసే దిశగా టిడిపి, బిజెపి లు పావులు కదుపుతున్నాయి. రెండు పార్టీల నేతలు పరస్పరం చేసుకుంటున్న విమర్శలను పక్కనపెట్టి, కలిసి ముందుకు సాగేందుకు వీలుగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా ఇవాళ విజయవాడలో జరిగే పలు కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సురేశ్‌ ప్రభు కలిసి పాల్గొనబోతున్నారు.

06:35 - May 25, 2017

హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని బైసన్‌ పోలో మైదానంలో తెలంగాణ సచివాలయం, శాసనసభ, శాసనమండలి నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఆర్మీ ఆధీనంలో ఉన్న బైసన్‌ పోలో గ్రౌండ్‌ను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించేందుకు ఇటీవలే రక్షణ మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా అంగీకరించింది. దీంతో అక్కడ సచివాలయం, అసెంబ్లీ, మండలికి అద్భుత కట్టడాలు నిర్మించాలని కేసీఆర్ నిర్ణయించారు.

బైసన్‌ పోలో మైదానంలో కొత్త సచివాలయం-కేసీఆర్‌

హైదరాబాద్: రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న సికింద్రాబాద్‌ బైసన్‌ పోలో మైదానాన్ని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం సుమఖత వ్యక్తం చేసింది. దీంతో ఇక్కడ కొత్త సచివాలయంతోపాటు అసెంబ్లీ, శాసనసభ భవనాలు నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. దీనికి పక్కనే ఉన్న పరేడ్‌ గ్రౌండ్‌ జోలికి వెళ్లకూడదన్న నిర్ణయానికి వచ్చారు.

అరవై ఏళ్లు ఉమ్మడి ఏపీ పాలనలో ...

అరవై ఏళ్లు ఉమ్మడి ఏపీ పాలనలో రాష్ట్రానికి సొంత పరేడ్‌ మైదానం కూడా లేకుండా పోయిందని కేసీఆర్‌ విమర్శించారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో ఏ కార్యక్రమం జరుపుకోవాలన్న రక్షణ శాఖ నుంచి అనుమతి తీసుకునే పరిస్థితి ఉన్న విషయాన్ని కేసీఆర్‌ గుర్తు చేశారు.

రక్షణ మంత్రిత్వ శాఖ తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించిన తర్వాత..

బైసన్‌ పోలో మైదానాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించిన తర్వాత..ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుని, సచివాలయం, శాసనసభ, శాసనమండలి నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తారు.

పరేడ్‌ మైదానం అలాగే కొనసాగుతుంది -సీఎంకేసీఆర్‌

హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని బైసన్‌ పోలో మైదానంలో తెలంగాణ సచివాలయం, శాసనసభ, శాసనమండలి నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఆర్మీ ఆధీనంలో ఉన్న బైసన్‌ పోలో గ్రౌండ్‌ను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించేందుకు ఇటీవలే రక్షణ మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా అంగీకరించింది. దీంతో అక్కడ సచివాలయం, అసెంబ్లీ, మండలికి అద్భుత కట్టడాలు నిర్మించాలని కేసీఆర్ నిర్ణయించారు.

06:32 - May 25, 2017

హైదరాబాద్: తెలంగాణాకు లక్ష కోట్ల రూపాయలిచ్చామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మరోసారి స్పష్టం చేశారు. ఈ విషయంపై పచ్చి అబద్ధాలు చెబుతున్నారన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోపణలను అమిత్‌ షా కొట్టిపారేశారు. తెలంగాణకు కేంద్రం ఏం చేసిందో గణాంకాలతో వివరించారు. మొత్తం 96,406 కోట్ల రూపాయల నిధులిచ్చినట్లు అమిత్‌ షా లెక్కలు చెప్పారు. వివిధ పథకాల అమలుకు 12 వేల కోట్ల రూపాయలిస్తున్న విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు ఎన్నడూ ఇవ్వనంత మొత్తాన్ని తెలంగాణకు ఇచ్చామని వివరించారు.

తెలంగాణకు ఎయిమ్స్‌ ,అగ్రికల్చర్, హార్టీకల్చర్, వెటర్నరీ యూనివర్శిటీలు

తెలంగాణలో ఎయిమ్స్, అగ్రికల్చర్, హార్టీకల్చర్, వెటర్నరీ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తున్నామని అమిత్‌ షా తెలిపారు. 70 ఏళ్లలో సాధ్యం కానిది మూడేళ్లలో చేసి చూపించామన్నారు. ఏడాదిలో 4.5 కోట్ల మరుగుదొడ్లు కట్టించామని,.బీసీ కమిషన్‌కు చట్టబద్ధత కల్పించడంతో పాటు 28 కోట్ల జన్‌ధన్ అకౌంట్లు తెరిపించామన్నారు. 7.5 కోట్ల మందికి ఉపాధి కల్పించడంతో పాటు సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్ లక్ష్యంగా నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆర్ధిక వ్యవస్థ పరుగులు తీస్తోందని అమిత్ షా చెప్పారు.

తెలంగాణాలోనూ బీజేపీ అధికారంలోకి

పార్టీ విస్తరణలో భాగంగా తెలంగాణలో పర్యటిస్తున్నట్లు తెలిపిన అమిత్‌ షా..13 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందన్నారు. బీజేపీకి మొత్తం 1327 మంది ఎమ్మెల్యేల బలం ఉందన్నారు. బిజెపి ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ అని అమిత్‌ షా తెలిపారు. మోదీ అధికారంలోకి వచ్చాక ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా బీజేపీ గెలుస్తోందని,..తెలంగాణాలోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందని అమిత్ షా చెప్పారు.

తెలంగాణకు లక్ష కోట్లు ఇచ్చామన్న మాటకు కట్టుబడి ఉంటా-అమిత్‌ షా

హైదరాబాద్: తెలంగాణకు లక్ష కోట్లు ఇచ్చామన్న మాటకు కట్టుబడి ఉంటానన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా. హైదరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన..తమ పార్టీ తెలంగాణ‌లోనూ అధికారంలోకి వ‌చ్చి తీరుతుంద‌న్నారు. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం 106 ప‌థ‌కాల‌ను అమ‌లుప‌రుస్తోందని అమిత్ షా అన్నారు.

బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాపై సీఎం కేసీఆర్‌ ఫైర్

p { margin-bottom: 0.21cm; }

హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాపై సీఎం కేసీఆర్ అగ్గిమీద గుగ్గిలమే అయ్యారు. అధికార పార్టీ అధ్యక్షుడై ఉండి ప‌చ్చి అబ‌ద్దాలు మాట్లాడార‌ని మండిపడ్డారు.. తెలంగాణ‌కు ల‌క్ష కోట్ల రూపాయ‌లు ఇచ్చామ‌ని అమిత్ షా ప‌చ్చి అబ‌ద్దం మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు.. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధుల్ని లెక్కలతో సహా వివరించారు.. తన లెక్కలు తప్పని రుజువు చేస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తానని కూడా సవాల్‌ విసిరారు.

Don't Miss