Activities calendar

26 May 2017

21:37 - May 26, 2017

ముంబై : స్టాక్ మార్కెట్లో బుల్‌ రంకేసింది. సొంత రికార్డులను బద్ధలుకొడుతూ.. కొత్త రికార్డులను లిఖించాయి. అంతర్జాతీయ సంకేతాలతో సెన్సెక్స్ చరిత్రలో తొలిసారిగా 31 వేల మైలురాయిని తాకింది. నిఫ్టీ కూడా సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయిని చేరుకుంది. ఇవాళ 278 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ 278 పాయింట్లు పెరిగిన సూచి 31వేల 28 పాయింట్ల వద్ద ముగిసింది. అటు నిఫ్టి 85 పాయింట్ల లాభంతో 9వేల 595 వద్ద క్లోజైంది. నిఫ్టీలో టాటాస్టీల్‌, వేదాంత లిమిటెడ్‌, హిందాల్కో, ఇండియన్‌బుల్స్‌ హౌసింగ్‌ లిమిటెడ్‌, భారత్‌పెట్రోలియం షేర్లు లాభపడగా.. సన్‌ఫార్మా, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, సిప్లా, లుపిన్‌, టీసీఎస్‌ షేర్లు నష్టపోయాయి.

 

21:34 - May 26, 2017

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం పశువధను దేశవ్యాప్తంగా నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. దళిత, ప్రజా సంఘాలు మోదీ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తక్షణమే మోదీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశాయి. లేకుంటే దేశ వ్యాప్త ఆందోళనకు సిద్దమవుతామని హెచ్చరించాయి. పేద, దళిత ప్రజల ఆహారపు అలవాట్లపై బీజేపీ సర్కార్‌ ప్రత్యక్ష దాడికి దిగిందని ప్రజాసంఘాల నేతలు మండిపడ్డారు. హిందూత్వ అజెండాను మోదీ అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. 

21:32 - May 26, 2017

 

ఢిల్లీ : మోదీ సర్కార్‌ మరో వివాదస్పద నిర్ణయం తీసుకుంది. పశువధపై దేశవ్యాప్త నిషేధం విధించింది. రేపటి నుంచి పవిత్ర రంజాన్‌ మాసం ప్రారంభంకాబోతుండగా..కేంద్రం ఈ అనూహ్య నిర్ణయాన్ని ప్రకటించింది. పశునిషేధం అమలు కోసం రూపొందించిన నిబంధనలు చూస్తే.. ప్రభుత్వం కావాలనే, ఓ వర్గంపై కక్ష సాధింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది. పశువధ నిషేధంపై కేంద్ర నోటిఫికేషన్‌ను విపక్షాలు తీవ్రంగా నిరసిస్తున్నాయి. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మరో వివాదానికి తెరలేపింది. దేశ వ్యాప్తంగా పశువధను నిషేధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పశువధపై పలు కొత్త నిబంధనలు రూపొందించింది. జంతు హింస నియంత్రణ చట్టం -1960 కింద నూతన నిబంధనలను నోటిఫై చేసింది.

భూములు ఉన్న రైతులకు మాత్రమే
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం ఇక నుంచి పశువులను వ్యవసాయ అవసరాల కోసమే విక్రయించాల్సి ఉంటుంది. వ్యవసాయ భూములు ఉన్న రైతులకు మాత్రమే పశువులను విక్రయించాలి. తాను వ్యవసాయ అవసరాల కోసమే కొనుగోలు చేస్తున్నట్టు రైతు హామీపత్రం అందజేయాల్సి ఉంటుంది. వధించడం కోసం కాదని రాతపూర్వంగా స్పష్టం చేయాలి. అంతేకాదు కొనుగోలు చేసిన ఆరు నెలల వరకు సదరు పశువును మళ్లీ అమ్మబోనంటూ రాసివ్వాలి. తాను సేద్యకారుడినంటూ సరైన ధృవపత్రాలు చూపిన వారికే ఇకపై పశువులను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్‌ స్పష్టం చేస్తోంది. అంతేకాదు.. విక్రయించే వ్యక్తి కూడా వ్యవసాయ అవసరాల నిమిత్తమే విక్రయిస్తున్నట్టు ఓ పత్రం సమర్పించాలని కేంద్రం పేర్కొంది. వీటన్నింటినీ పశువుల మార్కెట్‌ ధ్రువీకరించాల్సి ఉంటుంది.

నిబంధనలు...
పశు విక్రయ కేంద్రాలు జాతీయ సరిహద్దుకు 50 కిలోమీటర్లలోపు, రాష్ట్ర సరిహద్దుకు 25 కిలోమీటర్ల లోపు ఉండరాదని కేంద్రం నిబంధనల్లో స్పష్టం చేసింది. రాష్ట్రానికి వెలుపల పశువులు విక్రయించే పక్షంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతిని తప్పనిసరి చేసింది. ముసలి పశులను కూడా కబేళాలకు విక్రయించడానికి వీల్లేదని కేంద్రం నిబంధనల్లో పేర్కొంది. వధించకూడని పశువుల జాబితాలోఆవులు, ఎద్దులు, దూడలు, గేదెలు, కోడెలతోపాటు ఒంటెలను చేర్చింది.వాస్తవానికి మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచే దేశవ్యాప్తంగా గోవధను వివాదాస్పదం చేసింది. గోసంరక్షణ దళం పేరిట.. కొందరు హిందూశక్తులు.. పశువులను కబేళాలకు తరలించేవారిపై దాడులకు తెగబడ్డ ఘటనలూ కోకొల్లలు. ముఖ్యంగా కబేళాలు నిర్వహిస్తున్న ముస్లింలు, బీఫ్‌ తినే దళితులు లక్ష్యంగా దాడులు జరిగాయి. ఇలాంటి దాడుల్లో కొందరి ప్రాణాలు కూడా పోయాయి. ఈ నేపథ్యంలో.. బీజేపీ పాలిత రాష్ట్రాలు కొన్ని గోవధపై నిషేధాన్ని విధించాయి. ఇదే ఊపులో.. కేంద్ర ప్రభుత్వం కూడా పశువధపై నిషేధాన్ని విధించింది. పశువధను నిషేధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా రంజాన్‌ మాసం ప్రారంభం కావడానికి ఒక్కరోజు ముందు.. ఒంటెల వధను కూడా నిషేధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది. అభ్యుదయ, ప్రజాతంత్ర సంస్థలు, దళిత సంఘాలు కేంద్ర నిర్ణయంపై మండిపడుతున్నాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్దమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు కేంద్రం తీసుకున్న నిర్ణయం మాంసం ఎగుమతులపై తీవ్ర ప్రభావాన్ని చూపనుందని విశ్లేషకులు చెబుతున్నారు. విదేశాలకు ప్రతిఏటా భారత్‌ నుంచి లక్ష కోట్ల రూపాయల విలువైన మాంసం ఎగుమతి అవుతోంది. ఇందులో 90శాతం మాంసం రైతుల నుంచి విక్రయించిన పశువుల ద్వారానే ఎగుమతి చేస్తున్నారు. కేంద్రం నిర్ణయంతో మాంసం ఎగుమతుల మార్కెట్‌పైనా తీవ్ర ప్రభావం పడుతుందని ఈ రంగంలోని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

21:29 - May 26, 2017

ఢిల్లీ : రేపటి నుంచి పవిత్ర రంజాన్‌ మాసం ప్రారంభం కాబోతోంది. అట్లాంటి సందర్భంలో.. కేంద్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయాన్ని ప్రకటించింది. దేశవ్యాప్తంగా పశువధపై నిషేధం విధించింది. పశువిక్రేతలపై దాడులను అరికట్టేందుకే ఈ నిర్ణయం అంటూ కవరింగ్‌ ఇచ్చుకుంటోంది. అయితే.. పశునిషేధం అమలు కోసం రూపొందించిన నిబంధనలు చూస్తే.. ప్రభుత్వం కావాలనే, కక్ష సాధింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది. వ్యవసాయ భూములున్న రైతులకు మాత్రమే పశువులను విక్రయించాలని నిబంధన విధించింది. అంతేకాదు, కొనుగోలుదారు కూడా వ్యవసాయ పనుల నిమిత్తమే పశువును కొంటున్నానని, రైతు కూడా వ్యవసాయదారునికే పశువును అమ్మినట్లు రాతపూర్వంగా హామీ ఇవ్వాల్సి ఉంటుంది. పశువుల కొనుగోలుదారు తప్పనిసరిగా ధ్రువీకరణ పత్రం కలిగివుండాలని కూడా కేంద్రం తప్పనిసరి చేసింది. అంతేకాదు కొనుగోలు చేసిన ఆరు నెలల వరకు సదరు పశువును మళ్లీ అమ్మకూడదని కూడా షరతు విధించింది.  

కర్నూలులో నకిలీ విత్తనాల పట్టివేత

కర్నూలు : జిల్లాలోని కల్లూరు ఎస్టేట్ లో భారీగా నకిలీ విత్తనాల పట్టుబడ్డాయి. రూ.50లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాలు సీజ్ చేశారు. 

నల్లగొండ జిల్లా పలు చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు

నల్లగొండ : జిల్లా పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. తుమ్మడంలో పిడుగుపడి ఉస్మాన్ అనే కూలీ మృతి చెందాడు.

 

ఏయూలో టీడీపీ మహానాడుకు హైకోర్టు అనుమతి

హైదరాబాద్ : ఏయూలో టీడీపీ మహానాడుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. మహానాడు ఏర్పాట్లు పూర్తయిన నేపథ్యంలో ప్రభుత్వం అనుమతివ్వాలని హైకోర్టును కోరింది. సీఎం భద్రతా దృష్ట్యా ఏయూ అనుకూలమని కోర్టు అడ్వకేట్ జనరల్ తెలపడంతో కోర్టు పిటిషన్ కొట్టివేసింది.

కొల్లేరులో ఉద్రిక్తత

పశ్చిమ గోదావరి : జిల్లా ఏలూరు మండలం కొల్లేరు పైడిచింతపాడులో ఉద్రిక్తత నెలకొంది. చెరువుల మధ్యలో రియల్ ఎస్టేట్ వెంచర్ లు వేయడానికి ఎమ్మెల్యేల చింతమనేని అనుచరులు మిషనరీ తీసుకెళ్లారు. దీంతో ఫారెస్టుయ అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గ్రామస్తులు పోలీసులు, ఫారెస్టు అధికారులను నిర్భంధించారు. 

20:22 - May 26, 2017

అచ్చేదిన్ వచ్చేశాయా....? హామీలు నెరవేరాయా....? నల్లధనం వెనక్కు వచ్చిందా....?ఉపాధి పెరగిందా...? రైతుల పరిస్థితి మెరుగుపడిందా...? మహిళలకు రక్షణ వచ్చిందా...? మూడేళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి...? మోడీ సర్కారు వచ్చి మూడేళ్లవుతోంది. అంతులేని హామీలిచ్చి గద్దెనెక్కిన మోడీ ఇప్పుడు మోడీఫెస్ట్ జరుపుతున్న సందర్భం.. మరి మోడీ ఇచ్చిన హామీలన్నీ అమలవుతున్నాయా? గొంతు చించుకుంటూ చెప్పిన అచ్చేదిన్ వచ్చేశాయా? ఇదే అసలు ప్రశ్న.

20:13 - May 26, 2017

హైదరాబాద్ :  తల్లి తెలంగాణ రాష్ట్రం ధమ్మేందో మళ్లొకపారి బైటవడ్డదుల్లా.. దేశంలనే ఏ రాష్ట్రంతోని గానీ.. ఏ రాష్ట్రం జేయలేని పని మన తెలంగాణ రాష్ట్రం ఈ పోయిన అర్థిక సంవత్సరంల జేశిందట.. నవంబర్ 26 తారీఖు రెండువేల పద్నాలు.. భారతదేశానికి వజ్రం అసొంటి మన్షి.. గాలికి గొట్కపోని ఘటం.. నీళ్లళ్ల నానని 32 ఇంచుల చాతీ.. అగ్గిల కాలిపోని సంకల్ప మేధావి...అమ్మా ఆంధ్ర ప్రదేశ్ జనం ఎంత హుషారున్నరు సూశిండ్రా..? ఆణిముత్యం అసొంటి మన్షి మన కేసీఆర్ సారు.. ఆయన పరిపాలన ఆంధ్రల గూడ ఉండాలే అని అక్కడోళ్లు ఒక్కటే ఈమెయిళ్లు.. పోస్టు కారెట్లు.. ట్విట్టర్ కూతలు.. కొంతమందికి పామును జూడంగనే ఇసం పుర్గు గదా అన్న ఆలోచన వస్తది.. ఇంక కొంత మందికి అమ్మో నాగదేవత అనిపిస్తది.. మరికొంత మందికి మనలెక్కనే అదిగూడ ఒక జీవి అనిపిస్తది.. డబుల్ బెడ్రూం ఇండ్ల పథ్కం ఏ గడియల ప్రకటించిండ్రోగని.. అది మళ్లొచ్చె ఓట్లళ్ల మాకే ఉరితాడయ్యెతట్టున్నది.. టీఆర్ఎస్ పార్టీ అంటె జనం ఓట్లేశె పరిస్థితిలేకుంటైతదో ఏమో అని బుగులు వడ్తున్నరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ఉద్యోగాలు అడ్గితె ఉర్కిచ్చి తన్నుడే.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తె పరుగెత్తిచ్చి తోముడే.. ఇది తెలంగాణల నిరుద్యోగులు ఇనిపిస్తున్న నినాదాలు.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి దార్కార్.. మోతెవరి..? తోపు తురం అని మొన్నటిదాక మోస్కుంటొచ్చిందిగదా మీడియా..? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపుది ఇంకో వీడ్యో సోషల్ మీడియాల చక్కర్లు గొడ్తున్నది.

20:06 - May 26, 2017

బీజేపీ మనుషుల కన్నా పశువులకు ప్రాధ్యానత ఇస్తోందని, చట్టాన్ని ఉపయోగించుకుని పశువుల క్రయావిక్రియాలపై నిబంధనలు తీసుకురావటం లౌకిక స్ఫూర్తి విరుద్ధమని ప్రముఖ విశ్లెషకులు తెలకపల్లి రవి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్ అన్నారు. కాంగ్రెస్ చేసిన చట్టాన్ని తము అమలు చేస్తున్నామని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షులు రఘునాథ్ బాబు య అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

20:04 - May 26, 2017

హైదరాబాద్ : టుడే అవర్ రీసెంట్ రిలీజ్ '' రారండోయ్ వేడుక చూద్దాం''.....మన్మథుడు హిరోగా సోగ్గాడే చిన్నినాయనా హిట్ కొట్టి మళ్లి అక్కినేని ఫ్యామిలీతో జగకట్టిన డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో వచ్చిన సినిమా ''రారండోయ్ వేడుకచూద్దాం''..ఈ సినిమా ఈనాటి నేడే విడుదలలో ఉంది. లెట్ చేయకుండా ప్రేక్షకుల టాక్ చూద్దాం. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

19:25 - May 26, 2017
19:24 - May 26, 2017

పశ్చిమ గోదావరి : జిల్లా ఏలూరు మండలం కొల్లేరు పైడిచింతపాడులో ఉద్రిక్తత నెలకొంది. చెరువుల మధ్యలో రియల్ ఎస్టేట్ వెంచర్ లు వేయడానికి ఎమ్మెల్యేల చింతమనేని అనుచరులు మిషనరీ తీసుకెళ్లారు. దీంతో ఫారెస్టుయ అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గ్రామస్తులు పోలీసులు, ఫారెస్టు అధికారులను నిర్భంధించారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

19:22 - May 26, 2017
19:21 - May 26, 2017

ఢిల్లీ : పశువిక్రేతలపై దాడుల నేపథ్యంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ భూములు ఉన్న రైతులకు మాత్రమే పశులవును విక్రయించాలని కేంద్రం నిబంధనం విధిస్తుంది. పశువులను వధ కోసం విక్రయించరాదని కేంద్రం నిర్ణయించింది. గోవధపై దేశవ్యాప్తంగా కేంద్రం నిషేధం విధించింది. జంతుహింస నియంత్రణ చట్టం ప్రకారం ఆవులు, ఎద్దులు, దున్నపోతులు, బర్రెలు సరైన ధృపత్రాలు ఉంటే అమ్మడ గానీ కొనడం గానీ జరపాలని కేంద్ర గెజిట్ జారీ చేసింది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత గెజిట్ అమల్లోకి వస్తుంది. పూర్తి వివరలకు వీడియో చూడండి.

19:19 - May 26, 2017

వాటికన్ సిటీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. తన వింత చేష్టలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇటీవల వాటికన్ సిటీకి వెళ్లిన ట్రంప్.. క్రైస్తవ మతగురువు పోప్‌ పక్కన నిలబడి ఫోటోలకు ఫోజులిస్తూ.. ఆయన చేతిని తాకేందుకు ప్రయత్నించారు. దీంతో పోప్‌ ట్రంప్‌ చేతిని విదిలించి పారేశారు. అంతకుముందు ఇజ్రాయెల్‌ పర్యటనలో.. ట్రంప్‌, తన సతీమణి మెలానియా చేతిని పట్టుకునేందుకు ప్రయత్నించగా ఆమె ఇలాగే విదుల్చుకుంది. 

19:18 - May 26, 2017

విశాఖ : జిల్లాలో ఓ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. ట్యాంకర్.. ఓ బైక్‌ను ఢీకొట్టడంతో మహిళ చనిపోయింది. షీలానగర్ వైపు బైక్‌పై వెళ్తున్న భార్యభర్తల్ని ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్య స్పాట్‌లో చనిపోయింది. భర్తకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. ట్రాఫిక్ పోలీసు సక్రమంగా విధులు నిర్వర్తించకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని స్థానికులు ఆరోపిస్తూ... అతనిపై దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. స్థానికులకు సర్దిచెప్పారు. పగటిపూట భారీ వాహనాలకు పర్మిషన్ ఇవ్వడంపై పోలీసుల మీద ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

19:17 - May 26, 2017

విశాఖ : రైతు సమస్యలను పరిష్కరించడంలో మోడీ సర్కార్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ. విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో మొయిలీ విరుచుకుపడ్డారు. ఏపీకి స్పెషల్ స్టేటస్, స్పెషల్ ప్యాకేజీలు కల్పించే అంశంలో ప్రభుత్వం మాట తప్పిందని ఆరోపించారు మొయిలీ. కోటి ఉద్యోగాలంటూ హామీలు గుప్పించడం తప్ప ఒక్కరికీ సరైన ఉపాధి చూపించలేకపోయారని మొయిలీ ఆరోపించారు. 2019లో తాము అధికారంలోకి రావడం ఖాయమని మొయిలీ స్పష్టం చేశారు.

 

19:15 - May 26, 2017

హైదరాబాద్ : బీజేపీ నేతలకు ప్రభుత్వంపై బురదచల్లడం అలవాటుగా మారిందని తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలపై దేశమంతా హర్షిస్తోంటే... బీజేపీ నేతలు మాత్రం కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని అన్నారు. తెలంగాణలో బీజేపీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మరిందని ఎద్దేవా చేశారు. నాగం జనార్దన్‌రెడ్డి వ్యాఖ్యలపై హరీశ్ కౌంటర్‌ ఇచ్చారు. పాలమూరు ప్రాజెక్టులకు నాగం ఓ శిఖండిలా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు చివాట్లు పెట్టినా నాగంకు జ్ఞానోదయం కలుగలేదన్నారు. నాగం చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమా లేక పార్టీ తరపున మాట్లాడారో తెలపాలని ఆయన డిమాండ్‌ చేశారు.

17:19 - May 26, 2017

హైదరాబాద్ : కేసీఆర్‌ అవినీతే.... తెలంగాణ ప్రగతికి అడ్డంకిగా మారిందని బీజేపీ నేత నాగం జనార్దర్‌రెడ్డి ఆరోపించారు. ఒక్క పాలమూరు - రంగారెడ్డి పంప్‌హౌస్‌లోనే 2400 కోట్ల అవినీతి జరిగిందన్నారు. ఈ అవినీతిపై ఆధారాలతో కేసీఆర్‌కు ఓ లేఖరాశానన్నారు. ఆరోపణల్లో వాస్తవంలేకుంటే తనపై చర్యలు తీసుకోవాలని కేసీఆర్‌కు సవాల్‌ విసిరారు. తెలంగాణ అభివృద్ధిలో కాదు... అవినీతిలో నంబర్‌వన్‌ అని అభివర్ణించారు.

17:10 - May 26, 2017

విజయవాడ : విజయవాడలో నిర్వహిస్తున్న కలెక్టర్ల సదస్సు రెండోరోజు కొనసాగుతోంది. వైద్యారోగ్య శాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, ప్రజా సాధికార సర్వేలపై సమీక్షలు నిర్వహించారు. పీపుల్స్‌ హబ్‌ సాఫ్ట్‌ కాపీని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. ప్రజాసాధికార సర్వే వివరాలను పుపుల్స్‌ హబ్‌ పేరిట ప్రభుత్వం భద్రపరిచిందని..ఇలాంటి విధానం ప్రపంచంలో ఎక్కడా లేదని సీఎం అన్నారు. ప్రజాసాధికార సర్వే 80శాతం పూర్తయిందని.. మిగిలిన 20 శాతాన్ని మూడు నెలల్లో పూర్తి చేస్తామని ఐటీ అధికారులు సీఎంకు తెలిపారు. ఆస్పత్రుల్లో వైద్యుల కొరతపై అధికారులను సీఎం నిలదీశారు. వైద్యుల కొరత సమస్య వెంటనే పరిష్కరించాలన్నారు. అవసరమైతే ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో వైద్యులను రిక్రూట్‌ చేసుకోవాలని సూచించారు.

కేసీఆర్ సవాల్ కు అమిత్ షా స్పందన..

ఢిల్లీ : సీఎం కేసీఆర్ సవాల్ కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమీత్ షా స్పందించారు. తెలంగాణకు ఇచ్చిన నిధులపై తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు, ఆ లెక్కలను తన దగ్గరకు తీసుకొస్తే నిరూపిస్తానని పేర్కొన్నారు.

పశు విక్రేతలపై కేంద్రం సంచలన నిర్ణయం..

ఢిల్లీ : గోవధపై దేశ వ్యాప్తంగా కేంద్రం నిషేధం విధించింది. పశువులను వధ కోసం విక్రయించరాదని, వ్యవసాయ భూములు న్న రైతులకు మాత్రమే పశువులను విక్రయించాలని కేంద్రం సూచించింది. పశు విక్రేతలపై దాడుల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

17:00 - May 26, 2017

 

లక్నో : ఉత్తరప్రదేశ్‌ సహరాన్‌పూర్‌లో దళితులపై జరిగిన దాడుల నేపథ్యంలో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పర్యటనకు అధికారులు అనుమతి ఇవ్వలేదు. షెడ్యూల్‌ ప్రకారం శనివారం సహరాన్‌పూర్‌లో రాహుల్‌ పర్యటించాల్సి ఉంది. ఇటీవల ఠాకూర్లు, దళితులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. మాయావతి పర్యటనతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఓ యువకుడు మృతి చెందిన విషయం తెలిసిందే. ఉద్రిక్త పరిస్థితుల కారణంగా రాజకీయ నేతల పర్యటనకు అనుమతివ్వమని యూపీ అడిషనల్ డీజీ ఆదిత్య మిశ్రా వెల్లడించారు. సహరాన్‌పూర్‌ అల్లర్లపై పూర్తి నివేదిక ఇవ్వాలని కేంద్రం యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పుకార్లు వ్యాపించకుండా ఉండేందుకు సహరాన్‌పూర్‌లో మొబైల్, ఇంటర్నెట్‌ సేవలు తాత్కాలికంగా నిలిపివేశారు.

16:59 - May 26, 2017

ఆడవారు..మగవారికి జుట్టు ఉంటేనే అందం. కొంతమందికి జుట్టు రాలిపోతుండడంతో పలు సమస్యలను ఎదుర్కొంటుంటారు. మొదట్లో జట్టు అందంగా..ఒత్తుగా ఉండేందుకు...కుంకుడు కాయలను ఉపయోగించే వారు. ప్రస్తుతం షాంపూలు అందుబాటులోకి రావడంతో కుంకుడుకాయలను మరిచిపోతున్నారు. కానీ కుంకుడుకాయలు ఉపయోగించడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు దాగున్నాయి.
రెండు టీ స్పూన్స్‌ చొప్పున కుంకుడుకాయ, ఉసిరి పొడులు..మరో రెండు స్పూన్స్‌ తేనెతో కలిపి ఆ మిశ్రమాన్ని తలకి పట్టించాలి. అరగంట తర్వాత తలస్నానం చేయండి.
తొలుత నూనెను జుట్టుకు పట్టించి మసాజ్ చేయాలి. అనంతరం గంట అనంతరం సహజంగా దొరికే కుంకుడుకాయ రసంతో తలస్నానం చేయడం వల్ల జుట్టు ఊడే సమస్య తీరుతుంది.
కుంకుడుకాయ రసంలో కొద్దిగా వెనిగర్ కలపాలి. అందులో కొంచెం నీరు పోసి ఒక బాటిల్ లో భద్ర పరచుకోండి. ఈ మిశ్రమంతో కిటికీలు..తలుపులు..గాజు వస్తువులను శుభ్రపరచుకోవచ్చు.
తేలు కుట్టిన చోట కుంకడు గింజను అరగదీసి రాస్తే నొప్పి తగ్గుతుంది.

16:57 - May 26, 2017

అస్సాం : 2022 నాటికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్నందున రైతుల ఆదాయం రెండింతలు పెరగడమే తమ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. వ్యవసాయరంగంలో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి ఆధునిక టెక్నాలజీ ఉపయోగించాలని రైతులకు ఆయన పిలుపునిచ్చారు. దేశంలో రెండో హరిత విప్లవం రావాల్సిన అవసరం ఉందని మోడీ అభిప్రాయ పడ్డారు. అస్సాంలో ఆగ్రో మెరైన్‌ ప్రాసెసింగ్‌ స్కీమును ప్రారంభించిన మోడీ సభనుద్దేశించి ప్రసంగించారు. తమ మూడేళ్ల పాలనలో రైతుల కోసం ఎన్నో స్కీములు ప్రవేశపెట్టామని మోది చెప్పారు.

కేపీఎస్ గిల్ కన్నుమూత..

పంజాబ్ : మాజీ డీజీపీ కేపీఎస్ గిల్ (82) గుండెపోటుతో మృతి చెందారు. ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. పంజాబ్ లో ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో గిల్ కీలక పాత్ర పోషించారు. భారత హాకీ అధ్యక్షుడిగా గిల్ పనిచేశారు.

మూడేళ్ల పాలనపై అమిత్ షా ప్రెస్ మీట్..

ఢిల్లీ : మూడేళ్ల పాలననపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రెస్ మీట్ నిర్వహించారు. మూడేళ్లలో దేశం ఆత్మ విశ్వాసం పెంచామని, మోడీ మూడేళ్ల పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ లేదన్నారు. ప్రతిపక్షాలు సైతం అవినీతి ఆరోపణలు చేయడం లేదని, నల్లదన నిర్మూలనను పెద్ద సవాల్ గా తీసుకున్నట్లు చెప్పారు. జీఎస్టీ బిల్లును ఆమోదింప చేసినట్లు, వన్ ర్యాంక్ వన్ పెన్షన్ ఇస్తున్నట్లు తెలిపారు. నోట్ల రద్దుతో సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నామన్నారు.

 

16:38 - May 26, 2017

రజనీకాంత్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ రోబో 2 .0. ఈ సినిమాని డైరెక్టర్ చేస్తుంది శంకర్. డైరెక్టర్ శంకర్ సినిమాల్లో కథ బాగుంటుంది, కథనం ఆసక్తిగా ఉంటుంది. చూస్తున్న ప్రతి ఫ్రేమ్ కొత్తగా ఉంటుంది. ఒక రకంగా శంకర్ సినిమా అంటే ఆడియన్స్ కి కన్నుల పండగే. 'రోబో' సినిమాతో ఇటు ప్రపంచ సినిమా ఆడియన్స్ ని అటు 'రజనీకాంత్' ఫ్యాన్స్ ని అలరించిన డైరెక్టర్ శంకర్ షణ్ముగం 'రోబో 2.0’ స్పెషల్ కేర్ తీసుకుని వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మొదటగా ఈ మూవీ బడ్జెట్ గా 350 కోట్ల రూపాయలు అనుకున్నారు కానీ ఇప్పుడు ఆ లెక్క 450 కోట్లవరకు వెళ్లిందని ఫిలిం ట్రేడ్ సమాచారం. 'బాషా', 'నరసింహ' వంటి పవర్ ఫుల్ సబ్జెక్ట్స్ చేసిన 'రజని కాంత్' డైలాగ్ డెలివరీ లో స్పెషాల్టీ ఉంటుంది. తనకంటూ ఒక స్టైల్ ఉంటుంది. 'కబాలి' సినిమాతో బాక్సాఫీస్ లని కొల్లగొట్టిన సూపర్ స్టార్ 'రజనీ కాంత్' మళ్ళీ సేమ్ కాంబినేషన్ రిపీట్ చెయ్యనున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన యదార్థ గాదని తెరపై 'కబాలి' రూపం లో చూపించాడు డైరెక్టర్ పా రంజిత్. సాధారణ మనిషి ఒక గ్యాంగ్ స్టార్ గా మారి ఎలా తనని నమ్ముకున్న ప్రజలకి మంచి చేశాడు అనే కథని అద్భుతంగా చూపించి ఆడియన్స్ ని మెప్పించాడు.

161వ సినిమా..
సూపర్ స్టార్ రజనీకాంత్ 161వ సినిమా 'కాలా' పోస్టర్ ని చిత్ర నిర్మాత, రజనీకాంత్ మేనల్లుడు ధనుష్ విడుదల చేశారు. 'కాలా' ఫస్ట్ లుక్ వచ్చింది. జీపు మీద కూర్చొని డాన్ లా కనిపిస్తున్న రజని ఈ సినిమాలో ఒక మాఫియా లీడర్ పాత్ర చేస్తున్నారని ఇప్పటికే టాక్. అక్కడ కూర్చున్న జీప్ నెంబర్ MH 01 BR 1956 అని ఉంది దాని ద్వారా మనం చాలానే డీకోడ్ చేసుకోవచ్చు. MH అంటే మహారాష్ట్ర అని అర్ధమవుతోంది. ఇక దేశంలోనే గొప్ప బిజినెస్ రాష్ట్రాలుగా పేరు పొందిన గుజరాత్ మహారాష్ట్ర ఒకప్పుడు కలిసుండేవి. 1956లో అవి చీలిపోయాయి. అదే ఏడాది బి.ఆర్.అంబేద్కర్ కూడా చనిపోయారు. చూస్తుంటే BR.. 1956.. అందుకే చిహ్నాలుగా లేవూ? అందుకే ఈ సినిమా ఖచ్చితంగా అప్పటి రాజకీయాల పైన బిజినెస్ పెత్తందారులు పైన ఏమైనా ఉద్రేకపూరిత సన్నివేశాలతో ఉండొచ్చని ఒక టాక్.

16:32 - May 26, 2017

ఒక పెద్ద సినిమా నిర్మించాలి అంటే పెద్ద నిర్మాత పెద్ద డైరెక్టర్ కలిస్తే చాలు. అలాంటి పరిణామమే చోటు చేసుకోవడానికి రెడీ గా ఉంది అనే టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ లో వరల్డ్ వైడ్ సినీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసిన డైరెక్టర్ తో హిట్ ప్రొడ్యూసర్ జత కట్టబోతున్నాడా..ఇండియా అంతా ఎంతో ఆత్రంగా చూసిన 'బాహుబలి ది కంక్లూజన్' మూవీ థియేటర్లలోకి వచ్చేసింది. మొదటి భాగంలో వదిలేసిన ఎన్నో పజిల్స్ కు ఆన్సర్ తెలుసుకునేందుకు జనాలు ఆత్రంగా థియేటర్లకు క్యూ కట్టేశారు. 'బాహుబలి2’ దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. అన్ని చోట్ల నుంచి మంచి రిపోర్టులే వచ్చాయి. రూ. 1500 కోట్ల మార్కుని కూడా అందుకుంది. విజువల్ విషయంలో 'బాహుబలి 1’ స్థాయిని అందుకోలేదనే విమర్శలు ఉన్నా.. మొత్తంగా కథకు ప్రాధాన్యత ఇవ్వడంతో సినిమాపై సంతృప్తిగానే ఉన్నారు ఆడియన్స్. ఎంత టీమ్ వర్క్ ఐన క్రెడిట్ మొత్తం డైరెక్టర్ కే వెళ్తుంది. మరి ఈ సినిమాకి డైరెక్షన్ చేసి వరల్డ్ వైడ్ ఆడియన్స్ ని జమ చేసుకున్న 'రాజమౌళి' నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి.

దానయ్యతో..
'జులాయి', 'కెమెరా మెన్ గంగతో రాంబాబు' సినిమాలతో హిట్ ట్రాక్ లో ఉన్న ప్రొడ్యూసర్ డి వి వి దానయ్య రీసెంట్ గా 'నాని' సినిమా 'నిన్ను కోరి', 'మహేష్ బాబు'తో 'భరత్ అను నేను' సినిమాలతో రెడీ గా ఉన్నాడు. ఎన్నో సినిమా లకు ప్రొడ్యూసర్ గా చేసి మంచి మంచి హిట్స్ ఇచ్చిన దానయ్య నెక్స్ట్ ప్రాజెక్ట్ పైన క్లారిటీ వచ్చింది అనే టాక్ ఫిలింనగర్ లో వినిపిస్తోంది. మధ్యలో జరిగిన స్టోరీ డిస్కషన్ల తర్వాత 'రాజమౌళి' తెలుగులో కాకుండా హిందీలో ఆల్ ఇండియన్ ప్రేక్షకుల్ని దృష్టిలో ఉంచుకుని సినిమా చేయాలని డిసైడైనట్లుగా వార్తలొస్తున్నాయి. ఐతే ఈ సినిమా ఏ భాషలో చేసినా.. హీరోగా ఎవరిని ఎంచుకున్నా.. ఆ ప్రాజెక్టును నిర్మించేది మాత్రం డీవీవీ దానయ్యే అని వార్తలు వస్తున్నాయి. రాజమౌళికి చాలా ఏళ్ల కిందటే దానయ్య అడ్వాన్స్ ఇచ్చాడు. కేఎల్ నారాయణకు కూడా కమిట్మెంట్ ఉన్నప్పటికీ ముందు దానయ్యకే సినిమా చేయాలని రాజమౌళి ఫిక్సయినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎంత ఖర్చయినా రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించాలని ఆయన భావిస్తున్నారట.

16:23 - May 26, 2017

వరస హిట్స్ తో జోరు మీద ఉంటూ హీరో సెలెక్టివ్ గా స్టోరీస్ ని పిక్ చేసుకుంటున్నాడు. రెగ్యులర్ మూస కథలు తీసి అట్టర్ ఫ్లాప్స్ మూటకట్టుకున్న ఈ హీరో తన పంధా మార్చి డిఫరెంట్ గెట్ అప్స్, డిఫరెంట్ స్టోరీస్ తో దూసుకుపోతున్నాడు ఈ యంగ్ హీరో. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని కూడా ఒక స్టార్ డైరెక్టర్ తో ఫిక్స్ చేసుకున్నాడు. నందమూరి నటవారసుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన 'నందమూరి తారక రామారావు' తన నటన, స్టయిల్‌, డ్యాన్సులు, ఫైట్స్‌తో అలరించి తన కంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సృష్టించుకొని నెంబర్‌వన్‌ రేసులో దూసుకెళ్లుతున్నాడు. భారీ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మాతగా విలక్షణ దర్శకుడు సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన 'నాన్నకు ప్రేమతో' చిత్రంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవర్‌సీస్‌లో కూడా కలెక్షన్స్‌ కొల్లగొట్టాడు. సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో వచ్చిన 'జనతాగ్యారేజ్‌'తో 100 కోట్ల హీరోగా రికార్డులను క్రియేట్‌ చేశాడు.

 పవన్ తో త్రివిక్రమ్..
తన మాటల తో గారడీ చెయ్యగల గుడ్ రైటర్ 'త్రివిక్రమ్ శ్రీనివాస్'. ప్రాసలు పంచులు పేలుస్తూ సీన్ ని ఆడియన్స్ కి ఇంజెక్ట్ చెయ్యగల త్రివిక్రమ్ 'పవన్' తో మళ్ళీ జతకట్టబోతున్నాడు. అత్తారింటికి దారేది సినిమా పవన్ కళ్యాణ్ కి అబ్రాడ్ మార్కెట్ లో ఉన్న క్రేజ్ ని అమాంతం పెంచింది. కాస్ట్లీ లవ్ స్టోరీ లైన్ ని అత్త సెంటిమెంట్స్ తో స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసాడు డైరెక్టర్ త్రివిక్రమ్. పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఎక్కడా డామేజ్ అవ్వకుండా చేసిన 'అత్తారింటికి దారేది' సినిమా మంచి కలక్షన్స్ తో హిట్ టాక్ తెచ్చుకుంది. 'ఆ ఆ' సినిమా తో మంచి కుటుంబ కథను తెరపై బాగా చూపించగలిగాడు త్రివిక్రమ్.

దశాబ్దం కిందటే..
దశాబ్దం కిందటే స్టార్ డైరెక్టర్ స్టేటస్ సంపాదించిన త్రివిక్రమ్.. ఎన్టీఆర్ తో ఇప్పటిదాకా సినిమా చేయకపోవడం ఆశ్చర్యమే. ఈ కాంబినేషన్ కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ ఎదురు చూపులు ఎట్టకేలకు ఫలించాయంట. అయితే 'ఎన్టీఆర్-త్రివిక్రమ్' సినిమా ఆరంభం కావడానికి ఇంకా చాలా సమయం ఉండగానే ఈ సినిమా కథాంశం గురించి ఆసక్తికర కథనాలు వినిపిస్తున్నాయి. ఇది ఒక పొలిటికల్ థ్రిల్లర్ అని ప్రచారం జరుగుతోంది. 'త్రివిక్రమ్' తన గత సినిమాలకు పూర్తి భిన్నంగా ఈ చిత్రానికి కథ ఎంచుకున్నాడట. 'తారక్' ఇందులో యంగ్ పొలిటీషియన్ పాత్రలో కనిపిస్తాడట. అదే సమయంలో ఎంటర్టైన్మెంట్ కు కూడా ఢోకా ఏమీ ఉండదట. ఏది ఏమైనా యంగ్ టైగర్ తో మాటల మాంత్రికుడి సినిమా ఇంటరెస్ట్ ని క్రియేట్ చేస్తోంది.

16:13 - May 26, 2017

కంటెంట్ ఏదైనా తన రోల్ కి న్యాయం చేసే నటులు చాల తక్కువ మంది ఇండస్ట్రీ లో ఉంటారు. లవ్ అండ్ రొమాంటిక్ సినిమాల్లో అదరగొట్టిన 'మన్మధుడు' ఇప్పుడు హారర్ ఎఫెక్ట్ తో రాబోతున్నాడు. కథ ఏదైనా ఆడియన్స్ కి నచ్చే అంశాలని జోడించి బిజినెస్ చేసుకోవడం బాగా తెలిసిన నిర్మాతకూడా ఈయనే. 'నాగార్జున'కు ఉన్న 'మన్మధుడు' అనే పేరును సార్ధకం చేసిన సినిమా 'సోగ్గాడే చిన్ని నాయన'. నాగార్జున డ్యూయెల్ రోల్ చేసి మెప్పించిన సోషియో ఫాంటసీ ఫిలిం సోగ్గాడే చిన్ని నాయన. ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ తో పాటు లావణ్య త్రిపాఠి స్క్రీన్ ని పంచుకున్నారు. ప్రతి ఫ్రేమ్ లో అందాన్ని చూపించిన ఈ సినిమా కి డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ. సినిమాల విషయం లో పర్టికులర్ గా ఉంటూ ..సెలెక్టివ్ గా స్టెప్ వేస్తున్న సీనియర్ హీరో నాగార్జున. ట్రెండ్ మిస్ అవ్వకుండా సినిమాలు తీస్తూ యంగ్ హీరోలకు పోటీ కూడా ఇస్తున్నాడు.

సంతృప్తి లేదన్న నాగ్..
'
రాజు గారి గది' అనే చిన్న సినిమా పెద్ద కలెక్షన్స్ కురిపించిన విషయం తెలిసిందే.. యాంకర్ గా తన కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు డైరెక్టర్ గా ఈ సినిమాతోనే హిట్ కొట్టాడు ఓంకార్. టైటిల్ తోనే మంచి కురియాసిటీ పెంచి ఆడియన్స్ ని ఆకర్షించాడు. ఒకే ఒక పాత భవనం లో జరిగే హారర్ సస్పెన్సు కథగా వచ్చిన 'రాజు గారి గది' సినిమా హిట్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. 'నాగ్' హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా 'రాజు గారి గది-2' తెరకెక్కుతోంది. షూటింగ్ యమ స్పీడ్ గా జరిగి రిలీజ్ కి పోటీ పడబోతున్న ఈ సినిమాలో రీషూట్ యాస్పెక్ట్ ఎంట్రీ ఇచ్చింది. నాగ్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా 'రాజు గారి గది-2'కి కూడా రీషూట్ సజెస్ట్ చేసినట్లు ఓ ఇంటర్వ్యూలో నాగ్ వెల్లడించడం విశేషం. ఈ సినిమాకు సంబంధించి తన పని పూర్తయిందని.. ఐతే రషెస్ చూశాక కొన్ని సన్నివేశాల విషయంలో సంతృప్తి చెందలేదని.. దర్శక నిర్మాతలకు ఆ సన్నివేశాలు రీషూట్ చేద్దామని చెప్పానని.. వాళ్లు సరే అన్నారని నాగ్ తెలిపాడు. మళ్లీ పది రోజుల పాటు ఈ సినిమా షూటింగులో పాల్గొనబోతున్నట్లు నాగ్ వెల్లడించడం విశేషం. ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పొట్లూరి వరప్రసాద్ నిర్మిస్తున్నారు.

16:09 - May 26, 2017

సూపర్ స్టార్ 'మహేష్ బాబు' కొత్త ప్రాజెక్ట్స్ తో రెడీ అయ్యాడు. ఫిలిం మేకింగ్ లో స్పీడ్ పెంచిన సూపర్ స్టార్ కి టైం సపోర్ట్ చెయ్యట్లేదు. అనుకున్న టైం లో కంప్లీట్ కావలిసిన ప్రాజెక్ట్ ని కంప్లీట్ చెయ్యలేక కష్టపడుతున్నాడు. ఫైనల్ గా ఫస్ట్ లుక్ అండ్ ఆడియో రిలీజ్ కి డేట్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. 'శ్రీమంతుడు' సినిమాతో మంచి జోష్ మీద ఉన్నాడు మహేష్ బాబు. తన కొత్త సినిమా నేషనల్ లెవెల్ లో రిలీజ్ సెలెక్టివ్ లేంగ్వేజెస్ లో రిలీజ్ చెయ్యడానికి ప్రయత్నాలు కూడా మొదలు పెట్టాడు. కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన 'శ్రీమంతుడు' సినిమా 'మహేష్'కి సోషల్ రెస్పాన్సిబిలిటీ ని కూడా ఇచ్చింది. గ్రామాలని దత్తత తీసుకుని సర్వీస్ కూడా మొదలు పెట్టాడు ఈ సూపర్ స్టార్. ఇప్పుడు ఒక పవర్ఫుల్ సబ్జెక్టు తో సినిమా చేస్తున్నాడు మహేష్. ఈ సినిమాలో 'రకుల్' హీరోయిన్ గా నటిస్తుంది.

సెప్టెంబర్ 22..
'శ్రీమంతుడు' సినిమాతో సరికొత్త ఇండస్ట్రీ రికార్డుల్ని సృష్టించిన మహేష్ బాబు, కొరటాల శివలు మరోసారి కలిసి పనిచేయనున్నారు. వీరిద్దరి కలయికలో ప్లాన్ చేసిన ‘భరత్ అనే నేను’ చిత్రం చెన్నైలో మొదలయిన విషయం తెలిసిందే. అయితే ఈ షూటింగ్లో మహేష్ పాల్గొనడంలేదు. మురుగదాస్ తో చేస్తున్న ‘స్పైడర్’ పూర్తైన తర్వాత జూన్లో మహేష్ షూటింగ్లో జాయిన్ అవుతారు. కొరటాల దర్శకత్వంలో మహేష్ చేయబోయే కొత్త సినిమాను మొదలుపెట్టే సమయంలోనే జనవరి 11న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కొరటాల శివ సినిమాల్లో ఉండే డెప్త్ ఆడియన్స్ ని కట్టిపడేస్తుంది. మహేష్ బాబు కొత్త సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇందుకు తగ్గట్లుగానే మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తుండడంతో సంతోషించారు కానీ.. జనవరి చివరలో వస్తుందని భావించిన సినిమా సమ్మర్ పూర్తయిపోయినా.. ఇంకా రిలీజ్ పై క్లారిటీ లేదు. ఈ నెల 31 సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ ఇస్తారని ఇప్పటికే చెప్పుకున్నాం. అలాగే ఆడియో లాంఛింగ్ డేట్ కూడా ఇప్పటికే ఫిక్స్ అయిపోయింది. హారిస్ జైరాజ్ సంగీతం అందించిన ఆడియోను.. సెప్టెంబర్ 1న లాంఛ్ చేయనున్నారట. సెప్టెంబర్ 22న వరల్డ్ వైడ్ గా స్పైడర్ ను గ్రాండ్ రిలీజ్ చేసేందుకు తగినట్లుగా మురుగదాస్ టీం ప్లాన్ చేసుకుంది.

15:43 - May 26, 2017

చెన్నై : రజనీకాంత్‌ రాజకీయ ప్రవేశంపై కమల్‌హాసన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రజనీకి కెమెరాల ముందు కనబడాలనే ఆరాటం ఎక్కువని కమల్‌ కామెంట్‌ చేశారు. అంతేకాదు.. కెమెరాలు ఎక్కడుంటే అక్కడ రజనీ ప్రత్యక్షమవుతారని చెప్పాడు. రజనీకాంత్‌ పొలిటికల్‌ ఎంట్రీకి సిద్ధమవుతున్నవేళ.... కమల్‌హాసన్‌ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కోలీవుడ్‌లో చర్చనీయాంశమయ్యాయి. కబాలి రాజకీయాల్లోకి రావడాన్ని కొందరు ఆహ్వానిస్తుండగా.... మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. అయితే కమల్‌ వ్యాఖ్యల వెనుక పరమార్ధం ఏంటని తమిళులు చర్చల్లో మునిగిపోయారు. కెరీర్‌ ప్రారంభం నుంచీ రజనీకాంత్, కమల్‌హాసన్‌ మంచి మిత్రులుగా కొనసాగుతున్నారు. అంతేకాదు.. ఇంతవరకు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న సందర్భాలు లేవు. అలాంటిది ఉన్నట్టుంది రజనీ రాజకీయ ఆరంగేట్రంపనై కమల్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని ఎవరూ ఊహించలేదు. దీంతో కమల్‌ చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో హాట్‌టాఫిక్‌గా మారాయి.

 

15:41 - May 26, 2017

విశాఖ : నగరం నడిబొడ్డున దసపల్లా హిల్స్‌ స్థలం.. చదరపు గజం విలువ లక్షల్లో ఉంటుంది. మొత్తం స్థలం 60 ఎకరాలు. ప్రస్తుతం దీని విలువ 1500 కోట్ల పైనే ఉంటుంది. నిన్న, మొన్నటి దాకా ప్రభుత్వ ఆధీనంలోని ఈ భూములు రాత్రికి రాత్రే ప్రైవేట్ భూములయ్యాయి. ఇంకేముంది వేల కోట్ల విలువ చేసే ఆ భూములను.. దక్కించుకోవడానికి ప్రభుత్వ పెద్దలే తెర వెనక మంత్రాంగం మొదలు పెట్టారు. ప్రభుత్వం స్వయంగా అధికార తెలుగుదేశం పార్టీ ఆఫీసుకు.. అదే సర్వే నంబర్‌లోని భూములను కేటాయించింది. విపక్ష వైసీపీ.. దీన్నే ప్రధాన అస్త్రంగా మలచుకుంటోంది.

దసపల్లా రాణీ కమలాదేవీ
సర్వే నంబర్ 1196, 1197 లలో దాదాపు 60.5 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి తనకే చెందుతుందని దసపల్లా రాణీ కమలాదేవీ.. 2000 సంవత్సరంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే 1999-2000లో విశాఖ జాయింట్ కలెక్టర్‌గా పని చేసిన కృష్ణబాబు.. ఈ భూములు ప్రభుత్వ భూములుగా తేల్చి చెప్పారు. 2009లో ప్రభుత్వం స్పందించక పోవడంతో .. ఈ భూములు దసపల్లా రాణికి చెందినవని రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది. 2012లో సుప్రీంకోర్టు ఎక్స్‌పార్టీ డిక్లేర్ కూడా ఇచ్చింది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. అసలు విషయం ఇక్కడి నుంచే ప్రారంభమైంది. 2014లో కొంతమంది వ్యక్తులు రాణి కమలాదేవి వద్ద నుంచి ఈ భూములను తమకు జీపీఏ చేయించుకున్నారు. ఈ భూములలో దాదాపు 52 మంది, వెయ్యి నుంచి రెండు వేల గజాలలోపు జీపీఏ చేయించుకొని నిర్మాణాలు ప్రారంభించారు.

జీవో నెంబర్ 556
2000లో జీవో నెంబర్ 556 అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం విడుదల చేస్తూ.. 1197లో ఉన్న 2 వేల చదరపు గజాలను.. టీడీపీ ఆఫీసుకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భూమి వివాదంలో ఉందని జీవోలో పేర్కొనడం జరిగింది. అప్పట్లో ఈ భూములు జిల్లా 422 (ఏ) సెక్షన్‌ ప్రకారం ఈ భూమి సర్వ హక్కులు ప్రభుత్వానికే ఉన్నాయని అధికారులు చెప్పారు. దసపల్లా భూములు.. నిత్యం మంత్రులు వచ్చి వెళ్లే సర్క్యూట్ హౌస్‌ను ఆనుకొని ఉన్నాయి. అయినా ఇక్కడ ఏం జరుగుతోందో పట్టించుకోని స్థితిలో అధికారులు, జీవీఎంసీ యంత్రాంగం ఉంది. అయితే అధికార పార్టీకి చెందిన నేతల ఒత్తిడి వల్లే ఇలా జరుగుతోందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. వైసీపీ నేతలు ఓ అడుగు ముందుకేసి చంద్రబాబు, లోకేశ్ బినామీలే ఈ తతంగమంతా నడిపిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నారు. ఈవిషయమై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు సీబీఐ అధికారులను కలిసి వినతి పత్రం కూడా అందించారు.

మండిపడుతున్న వైసీపీ నేతలు
ఈ దసపల్లా కుంబకోణంపై.. వైసీపీ నేతలు మండిపడుతున్నారు. వేల కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని గద్దల్లా తన్నుకుపోతోంటే.. ఈ విషయం అధికార యంత్రాంగానికి, ప్రభుత్వ పెద్దలకు తెలియడం లేదా అని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్‌పై ఎవరు ఒత్తిడి తీసుకొస్తున్నారు? భూములు ఎవరు కాజేశారు అనే అంశంపై చర్యలు చేపట్టాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేశారు. మహానాడు ఉత్సాహంలో ఉన్న టీడీపీ అధినాయకత్వానికి, వైసీపీ లేవనెత్తిన దసపల్లా భూముల వివాదం కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. మరి ప్రభుత్వం ఈ సమస్యను ఎలా అధిగమిస్తుందో వేచి చూడాలి.

 

15:39 - May 26, 2017

ఢిల్లీ : దేశంలో లష్కరే తోయిబా ఉగ్రవాదులు బాంబు పేలుళ్లకు వ్యూహరచన చేసినట్టు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. సుమారు 21 మంది ఉగ్రవాదులు చొరబడినట్లు ఇంటలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు జారీచేసింది. ఐఎస్‌ఐ సహకారంతో వీరంతా దేశంలోకి చొరబడినట్లు తెలిపింది. ఢిల్లీ, ముంబై, రాజస్థాన్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లో భారీ పేలుళ్లకు వ్యూహ రచన చేసినట్లుగా ఐబీ అనుమానిస్తోంది. ముందుజాగ్రత్తగా రైల్వేస్టేషన్లు, షాపింగ్‌మాల్స్‌, రద్దీ ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేయాలని ఐబీ సూచించింది. 

15:38 - May 26, 2017

జమ్మూకాశ్మీర్ : పాకిస్థాన్ నుంచి చొరబడిన ఉగ్రవాదులు యూరి సెక్టార్ లో ఆర్మీ పెట్రోలింగ్ వాహనంపై దాడికి యత్రించారు. వెంటనే స్పందించిన ఇండియాన్ ఆర్మీ ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెటింది. పూర్తి వివరాలకు వీడియో చూడిండి.

పాక్ జవాన్ల హతం..

జమ్మూ కాశ్మీర్ : యూరీ సెక్టార్ లో ఆర్మీ పెట్రోలింగ్ పాక్ జవాన్లు దాడికి యత్నించారు. భారత సైన్యం ఈ దాడిని తిప్పికొట్టింది. కాల్పుల్లో ఇద్దరు పాక్ జవాన్లు హతమయ్యారు.

ఐబీ హెచ్చరికలు..

ఢిల్లీ : దేశంలో ఉగ్రవాదులు ప్రవేశించారని ఐబీ పేర్కొంది. 21 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు చొరబడ్డారని, ఐఎస్ఐ సహకారంతో దేశంలోకి చొరబడ్డారని ఐబీ పేర్కొంది. ముంబై, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో భారీ పేలుళ్లకు పక్కా ప్రణాలికలు రచించినట్లు ఐబీ హెచ్చరించింది. రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్, రద్దీ ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

నాగంపై హరీష్ గుస్సా..

హైదరాబాద్ : బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డిపై టి.మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గొల, కురుమలు నాగంకు నక్కల్లా కనబడుతున్నారా ? బీసీలను, కుల వృత్తులనే అవమానిస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. నాగం పిచ్చి మాటలను మానుకోవాలని, నాగం వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ స్పందించాలని డిమాండ్ చేశారు. పాలమూరు ప్రాజెక్టు విషయంలో నాగం శిఖండిలా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు.

టిడిపి మహానాడు నిర్వాహణ..మళ్లీ విచారణ వాయిదా..

హైదరాబాద్ : ఏయూలో టిడిపి మహానాడు నిర్వహణపై హైకోర్టులో విచారణ జరిగింది. తొలుత జరిగిన విచారణ మధ్యాహ్నంకు వాయిదా పడింది. మధ్యాహ్నం విచారణ ప్రారంభమైంది. కోర్టు సాయంత్రం 4.30గంటలకు వాయిదా వేసింది.

ఢిల్లీలో విపక్షాల సమావేశం..

ఢిల్లీ : ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన విపక్షాల సమావేశం ప్రారంభమైంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలిపే అంశంపై చర్చ జరుగుతోంది. రాహుల్, మమత, లాలూ ప్రసాద్ యాదవ్, మాయావతి, సురవరం, సీతారాం ఏచూరి, మల్లిఖార్జున ఖర్గే, డి.రాజా, శరద్ పవార్, శరద్ యాదవ్, కనిమొళి, ఒమర్ అబ్దుల్లాలు హాజరయ్యారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ యాదవ్ హాజరు కాలేదు.

రాహుల్ పర్యటనకు నో..

ఉత్తర్ ప్రదేశ్ : షహరాన్ పూర్ లో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతి నిరాకరించారు. షెడ్యూల్ ప్రకారం రేపు ఆయన అక్కడ పర్యటించాల్సి ఉంది. గత కొద్ది రోజులుగా సహరాన్ పూర్ అట్టుడికిపోతోంది.

2019లో అధికారంలోకి కాంగ్రెస్ - హరీష్..

మెదక్ : ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ సన్నాహక సమావేశం జరిగింది. పీసీసీ చీఫ్ ఉత్తమ్, పొన్నం తదితరులు హాజరయ్యారు. రాహుల్ సభను కార్యకర్తలు విజయవంతం చేయాలని, 2014లో మోడీ, కేసీఆర్ లు ప్రజలకు భ్రమలు కల్పించి అధికారంలోకి వచ్చి ప్రజలను వంచించారని తెలిపారు. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ నంబర్ వన్ గా నిలిచిందని, 2019లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.

మీడియా ఎదుట వేమవరం నిందితులు

ప్రకాశం : వేమవరం హత్యల కేసులో 14 మంది నిందితులను పోలీసులు మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. పాతకక్షల నేపథ్యంలో ఈ హత్యలు జరిగాయని, మరో ఇద్దరు నిందితులను పట్టుకోవాల్సి ఉందని ఐజీ సంజయ్ వెల్లడించారు. నిఘా విభాగం వైఫల్యం కూడా ఒక కారణమని, గ్రామీణ ప్రాంతాల్లో పాతకక్షలపై ఆరా తీసి ఆదిలోనే తుంచేయాలని పోలీసులకు పిలుపునిచ్చారు. అవసరమైతే గ్రామాల్లో కౌన్సెలింగ్ ఏర్పాటు చేస్తామన్నారు.

14:52 - May 26, 2017

అరుణాచల్‌ ప్రదేశ్‌ : మూడు రోజుల క్రితం గల్లంతైన సుఖోయ్‌-30 యుద్ధవిమానం శకలాలను గుర్తించారు. చైనా సరిహద్దులోని అడవుల్లో సుఖోయ్‌ శకలాలు లభించినట్లు అధికారులు వెల్లడించారు. అసోంలోని తేజ్‌పూర్‌కు 60కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో విమానం కూలిపోయిందని అధికారులు తెలిపారు. సాధారణ శిక్షణలో భాగంగా ఇద్దరు పైలెట్లతో తేజ్‌పూర్‌ వైమానిక స్థావరం నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే విమానంతో రాడార్‌తో సంబంధాలు తెగిపోయినట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రతికూల వాతావరణం కారణంగాగానే సుఖోయ్‌ ఫైటర్‌ కూలిపోయిందని అధికారులు గుర్తించారు. ప్రమాద సమయంలో యుద్ధ విమానంలో ఉన్న ఇద్దరు పైలెట్లు ప్రాణాలతో బయటపడే అవకాశం లేదంటున్నారు. 

14:48 - May 26, 2017

చెన్నై : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై తోటి సహా నటుడు కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజులుగా రజనీ రాజకీయాల్లోకి ప్రవేశిస్తారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయన ఇటీవలే అభిమానులతో వరుసగా నాలుగు రోజుల పాటు భేటీలు జరిపారు. అభిమానులతో కలిసి రజనీ ఫొటోలు కూడా దిగార. దేవుడు ఆదేశిస్తే చూద్దామంటూ రజనీ పేర్కొన్నారు. తాజాగా తోటి నటుడు కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రజనీకి కెమెరాల ముందు కనపడాలన్న ఆసక్తి ఎక్కువని ఓ టివి ఛానల్ ఇచ్చిని ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తమిళనాడులో దుమారం రేగుతోంది.

 

14:40 - May 26, 2017

గుంటూరు : ఏపీ పనర్ విభజన చట్టంలోని సెక్షన్ 108ని మరో రెండేళ్లు పొడిగించాలని ఏపీసీఎస్ దినేశ్ కుమార్ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ రాశారు. రెండు రాష్ట్రాలకు సంబంధించి సమస్యలను పరిష్కారానికి రాష్ట్రపతి జోక్యం కోసం 2014 జూన్ 2 సెక్షన్ 108 తీసుకొచ్చారు. 9, 10 షెడ్యులలోని అంశలు ఇంకా కొలిక్కి రాలేదని, ఇరిగేషన్ ఉద్యోగుల పంపకం, ఆస్తులు బదలాయింపు, అసెంబ్లీ సీట్ల పెంపు అంశాలు స్పష్టత లేదని సీఎస్ లేఖలో పేర్కొన్నారు.

 

14:31 - May 26, 2017

కేంద్ర హోం శాఖ కార్యదర్శికి ఏపీ సీఎస్ లేఖ..

ఢిల్లీ : కేంద్ర హోం శాఖ కార్యదర్శికి ఏపీ సీఎస్ దినేష్ కుమార్ లేఖ రాశారు. స్థానికత..సెక్షన్ 108 అమలు గడువు ముగిసింది. మరో రెండెళ్ల పాటు పొడిగించాలని లేఖలో పేర్కొన్నారు. ఇరిగేషన్..ఉద్యోగుల పంపకం..ఆస్తులు..అప్పుల బదలాయింపు..అసెంబ్లీ సీట్ల పెంపు..సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు.

రజనీపై కమల్ సంచలన వ్యాఖ్యలు..

చెన్నై : ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ తోటి ప్రముఖ నటుడు రజనీకాంత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన పొలిటికల్ ఎంట్రీపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కెమెరాల ముందు కనబడాలనే ఆరాటమెక్కువ అని, కెమెరాలు ఎక్కుడుంటే అక్కడ రజనీ ప్రత్యక్షమవుతారని విమర్శలు గుప్పించారు.

14:23 - May 26, 2017

ఢిల్లీ : పార్లమెంట్ హౌస్ లో సోనియాగాంధీ లంచ్ సమావేశం ప్రారంభమైంది. ఈ లంచ్ సమావేశానికి సీపీఎం జాతీయ కార్యదర్శి ఏచూరి, అర్జేడీ అధ్యక్షుడు లాలూ, జేడీయా నేత శరద్ యాదవ్, త్రుణమూల్ అధినేత, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ ఇతర కాంగ్రెస్ నేతలు హాజరైయ్యారు. ఈ లంచ్ సమావేశంలో రాష్ట్రపతి ఎన్నికపై విపక్షాలతో సోనియా గాంధీ చర్చించనున్నారు. జూలై 20తో ప్రణబ్ ముఖర్జీ పదవి కాలం పూర్తి కావడంతో ప్రతిపక్షాల తరుపున అభ్యర్థిని బరిలో నిలపాలని కాంగ్రెస్ ఈ సమావేశం ఏర్పాటు చేసింది. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి 20వేల ఎక్ట్రోరల్ ఓట్లు తక్కుగా ఉండడంతో సోనియా గాంధీ అభ్యర్థిని నిలబెట్టాలని భావిస్తున్నారు. ప్రతిపక్షాల తరుపున రాష్ట్రపతి రేసులో మీర కుమారి, గోపాలకృష్ణ గాంధీ, శరద్ యాదవ్ ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.  

13:33 - May 26, 2017
13:30 - May 26, 2017

బాలీవుడ్ కండల వీరుడు 'సల్మాన్ ఖాన్' నటించిన 'ట్యూబ్ లైట్' చిత్రం ఈ రంజాన్ కు విడుదల కానుంది. సినిమాకు సంబంధించిన ట్రైలర్ గురువారం రాత్రి విడుదల చేశారు. విడుదలైన కొద్ది గంటల్లోనే చాలా మంది అభిమానులు చూశారు. కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రంలో చైనా నటి 'చూ చూ' నటిస్తుండడం విశేషం. భారత్ - చైనా యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. సల్మాన్ ఖాన్ సోదరుడు 'సోహైల్ ఖాన్' రీల్ లైఫ్ సోదరుడిగా సైనికుడు పాత్రలో నటించడం విశేషం. కానీ ఈ ట్రైలర్ లో 'షారూఖ్ ఖాన్' ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. చిత్ర ట్రైలర్ లో షారూఖ్ ఖాన్ సిగ్నేచర్ ఫోజ్ ఒకటుందని, జాగ్రత్తగా గమనిస్తే ఆ ఫోజు కనిపిస్తుందని అంటున్నారు. వారన్నట్లుగానే షారూఖ్ ఖాన్ ఉన్నట్లుగానే ఓ వ్యక్తి ఉండడం. షారూఖ్ లాగే ఫోజు పెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ఈ చిత్రంలో 'షారూఖ్' నటించాడా ? లేదా ? అనేది తెలియాలంటే రంజాన్ వరకు ఆగాల్సిందే.

సోనియా అధ్యక్షతన విపక్షాల సమావేశం

ఢిల్లీ : సోనియా అధ్యక్షతన విపక్షాల సమావేశం ప్రారంభమైంది. మమతా బెనర్జీ, లాలూ ప్రసాద్ యాదవ్, మాయావతిలు హాజరయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలిపే అంశంపై చర్చ జరుగుతోంది.

పోలీసులు బైక్ ను ఆపడంతో..

విశాఖపట్టణం : గాజువాక ఆటోనగర్ లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అందులో భాగంగా ఓ బైక్ ను ఆపారు. అకస్మాత్తుగా బైక్ ఆపడంతో వెనుక కూర్చొన్న మహిళ కిందపడడం..వెనుక నుండి లారీ దూసుకెళ్లడం జరిగిపోయాయి. మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆందోళన నిర్వహించారు.

విజయనిర్మలకు సన్మానం..

హైదరాబాద్ : ప్రముఖ సినీ నటి విజయ నిర్మలకు రాయల్ అకాడమీ గౌరవ డాక్టరేట్ ను మంత్రి తలసాని ప్రధానం చేశారు. ఈసందర్భంగా విజయనిర్మలను మంత్రి తలసాని సన్మానించారు. పద్మ భూషణ్ పురస్కారానికి విజయ నిర్మల పేరును ప్రతిపాదిస్తామని తలసాని తెలిపారు.

వైద్య శాలల పనితీరుపై మంత్రి లక్ష్మారెడ్డి సమీక్ష

హైదరాబాద్ : వైద్య శాలల పనితీరుపై మంత్రి లక్ష్మారెడ్డి సమీక్ష నిర్వహించారు. అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. మాతా శిశు సంరక్షణపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. మేడ్చల్ లో మాతా శిశువు కేంద్ర ఏర్పాటుపై ప్రత్యేక చర్చ జరిగింది.

13:14 - May 26, 2017

గోవధకు పాల్పడడం ఆ రాష్ట్రంలో నిషేధించారు. అంతేగాకుండా అసెంబ్లీ సైతం దీనిని ఆమోదించింది. ఆ రాష్ట్రమే గుజరాత్. గోవధకు పాల్పడే వారికి యావజ్జీవ కారాగార శిక్షను విధించనున్నారు. మరి గోవుల అక్రమ రవాణాను ఎలా అరికట్టాలనే దానిపై ఆక్కడి రాష్ట్ర ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. మనుషులకు జారీ చేసిన 'ఆధార్' ను జంతువులకు కూడా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. తొలి దశ కింద రూ. 2.8 కోట్లు ఖర్చు చేసి 37వేల ఆవులకు 'ఆధార్' ఇవ్వాలని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందట. రాష్ట్ర మంతటా ఓ టెక్నిషీయన్ల బృందం పర్యటించనుంది. 37వేల ఆవుల చెవుల్లో ఐడీ నెంబర్ తో ఉండే డిజిటల్ చిప్ లను ఏర్పాటు చేస్తారు. అక్రమ రవాణాకు డిజిటల్ చిప్ లు చెక్ పెడుతుందని అధికారుల విశ్వాసం. చిప్ ఆధారంగా ఆవులు ఎక్కడకు వెళుతున్నాయి..గోవుల ఆరోగ్యం..తదితర వివరాలు చిప్ లు అందిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటోంది. అంతేగాకుండా చిప్ ల్లో ఆవులకు కేటాయించిన నెంబర్..వాటి అడ్రస్..రంగు..ఆరోగ్య పరిస్థితులను డిజిటల్ గా నమోదు చేయనున్నారు. మరి ఈ చిప్ ల ప్రయోగం ఎంతమేర సత్ఫలితాలిస్తుందో చూడాలి.

13:07 - May 26, 2017
12:47 - May 26, 2017

హైదరాబాద్: మహిళల్లో గర్భాసయ సమస్యలు రావడానికి కారణాలు ఏమిటి? దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఈ అంశాలపై మానవి 'హెల్త్ కేర్'లో ప్రముఖ డాక్టర్లు వివరించారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

ఆవులను దొంగిలిస్తున్న ముఠా చిక్కింది..

హైదరాబాద్ : పాతబస్తీలో ఆవులను దొంగిలిస్తున్న ముఠాను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈఘటనలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుకున్న ముఠాపై ఇప్పటికే వంద కేసులున్నట్లు తెలుస్తోంది.

12:38 - May 26, 2017

భువనగిరి నరేష్ కోసం గాలింపు...ఎక్కడా దొరకని క్లూ..23 రోజులయినా జాడలేని ప్రేమికుడు..హైకోర్టు గడువుతో దర్యాప్తు ముమ్మరం..ఐదు ప్రత్యేక బృందాలతో శోధన..

కోర్టు ఇచ్చిన గడవు దగ్గర పడుతోంది..ఈలోగా ప్రేమికుడు నరేష్ ఎక్కడున్నాడో తెలుసుకోవాలి..కోర్టు ఎదుట హాజరు పరచాలి..లేకుంటే ఈ కేసుకు సంబంధించి విచారణ పూర్తి చేసి నివేదికను సమర్పించాలి. ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో ఐదు స్పెషల్ టీమ్స్ పనిచేస్తున్నాయి. కానీ నరేష్ జాడ మాత్రం దొరకడం లేదు. నరేష్ ఆచూకీ చెప్పిన వారికి పారితోషకం ఇస్తామని పోలీసు శాఖ ప్రకటించింది. యాదాద్రి భువనగిరికి చెందిన నరేష్ ఆచూకీ తెలియడం లేదు. ఈనెల 2వ తేదీన కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న స్వాతి అనుమానాస్పదస్థితిలో మృతి చెందడంతో కేసు ఇంకా జఠిలమైంది. మరి గడువులోగా నరేష్ ఆచూకీ కనిపెడుతారా ? లేదా ? అనేది చూడాలి.

12:36 - May 26, 2017
12:33 - May 26, 2017
12:32 - May 26, 2017

వైద్య ఆరోగ్య శాఖపై బాబు సమీక్ష..

విజయవాడ : రెండో రోజు కలెక్టర్ల సమావేశం కొనసాగుతోంది. వైద్య ఆరోగ్య శాఖపై ప్రస్తుతం సమీక్ష జరుగుతోంది. ప్రభుత్వ ఆసుపత్రులు..పీహెచ్ సీల్లో వైద్యుల కొరత ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ సమస్య ఉత్పన్నం కావద్దని, అవసరమైన చోట ఔట్ సోర్సింగ్ పద్ధతిన డాక్టర్లను రిక్రూట్ చేసుకోవాలని సీఎం బాబు సూచించారు. కిడ్నీ సమస్యలపై శ్రీకాకుళం..ప్రకాశం జిల్లాలో రీసెర్చ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేశారు.

వెటర్నరీ విద్యార్థులను విడుదల చేయాలి - రేవంత్..

హైదరాబాద్ : వెటర్నరీ విద్యార్థులపై పోలీసుల దాడి అమానుషమని టి.టిడిపి నేత రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఉద్యోగాలు కోరితే కేసీఆర్ సర్కార్ నిరంకుశంగా వ్యవహరిస్తోందని, అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణపై సిస్కో ఛైర్మన్ ప్రశంసలు..

హైదరాబాద్ : సిస్కో ఛైర్మన్ జాన్ చాంబర్స్ తెలంగాణపై ప్రశంసలు కురిపించారు. డిజిటల్ మౌలిక వసతుల కల్పనపై జాన్ ప్రశసించారు. డిజిటలైజేషన్ మార్పులు..ప్రభావాలపై చాంబర్ ప్రజంటేషన్ ఇచ్చింది. తెలంగాణలో తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ కోరారు. టెక్నాలజీ డెమాన్ స్ట్రేషన్ నెట్ వర్క్ నిర్మాణానికి సిస్కో సహకారం అందించనుంది.

వాజ్ పేయి అప్పుడే గెలిచి ఉంటే..

అసోం : 2004లో వాజ్ పాయి ప్రధానిగా గెలిచి ఉంటే ఈ బ్రిడ్జీ పదేళ్ల ముందే నిర్మాణమయ్యేదని, పదేళ్ల కాంగ్రెస్ పాలనలో బ్రిడ్జీ నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయారని భారత ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. ధోలా - నదియా వంతెనను మోడీ జాతికి అంకితం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే బ్రిడ్జీని పూర్తి చేసిందని మోడీ పేర్కొన్నారు.

12:18 - May 26, 2017

అసోం : ధోలా - నదియా వంతెనను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు. కాసేపటి క్రితం అసోంకు చేరుకున్న మోడీ ఈ వంతెనను ప్రారంభించారు. అరుణాచల్ ప్రదేశ్ లోని ధోలా..అసోంలోని సాదియా ప్రాంతాలకు కలుపుతూ ఈ వంతెన నిర్మాణం జరిగింది. ఈ సందర్భంగా మోడీకి రాష్ట్ర గవర్నర్, సీఎంలు ఘన స్వాగతం పలికారు. రూ. 950 కోట్లతో వంతెన నిర్మాణమైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మోడీ ప్రసంగించారు. బ్రిడ్జీ నిర్మాణం కావాలని కన్న కలలు అలాగే మిగిలిపోయాయని, 2004లో వాజ్ పాయి ప్రధానిగా గెలిచి ఉంటే ఈ బ్రిడ్జీ పదేళ్ల ముందే నిర్మాణమయ్యేదని, పదేళ్ల కాంగ్రెస్ పాలనలో బ్రిడ్జీ నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే బ్రిడ్జీని పూర్తి చేసిందని పేర్కొన్నారు. మౌలిక సదుపాయల కల్పనతోనే సమ్మిళిత వృద్ది సాధ్యమౌతుందని తెలిపారు. అసోంలో నెలకొన్న సమస్యలు పరిష్కారమౌతున్నాయని, అందులో భాగంగా బ్రిడ్జీని అంకితం చేస్తున్నట్లు తెలిపారు. దేశంలోనే అతిపెద్ద బ్రిడ్జి నిర్మాణం కావడం అసోంతో పాటు దేశ ప్రజలు గర్వపడే అంశమన్నారు. ఐదు నుండి ఆరు గంటల సమయం ఆదా అవుతుందని, ఆర్థిక వికాసానికి మార్గం సుగమమైందన్నారు. వంతనె నిర్మాణంతో అసోం..అరుణాచల్ ప్రదేశ్ మధ్య దూరం తగ్గిందన్నారు. వంతెన నిర్మాణంతో ఆర్థిక..వికాసం..విప్లవానికి నాంది పలికినట్లైందన్నారు. బ్రహ్మపుత్ర ఉపనది లోహిత్ పై 9.5కి.మీటర్ల మేర బ్రిడ్జీ నిర్మాణం జరిగింది. వంతెనపై కారులో మోడీ ప్రయాణించారు. మధ్యలో ఆగి నిర్మాణ పనులను పరిశీలించారు.

12:03 - May 26, 2017

బాలీవుడ్ సినిమా 'రబ్తా' చిత్ర యూనిట్..టాలీవుడ్ నిర్మాత 'అల్లు అరవింద్' మధ్య వివాదం నెలకొంది. 'రబ్తా' సినిమా తాము నిర్మించిన 'మగధీర' చిత్రాన్ని పోలినట్లుగా ఉందని పేర్కొంటూ 'అల్లు అరవింద్' కోర్టును ఆశ్రయించారు. 'సుశాంత్‌ సింగ్‌రాజ్‌పుత్', 'కృతిసనన్' జంటగా 'రబ్తా' చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం జూన్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే చిత్ర ట్రయలర్ విడుదల చేసింది. ఈ సినిమాలో చిత్ర హీరో..హీరోయిన్స్ గతంలో ప్రేమికులుగా ఉంటారని..మళ్లీ వీరిద్దరూ కలవడం..విలన్ అందుకు అడ్డు పడడంలాంటి సన్నివేశాలు అందులో ఉన్నాయి. 'రబ్తా' చిత్ర కథ తాము నిర్మించిన 'మగధీర' చిత్రాన్ని పోలి ఉందని, బాలీవుడ్ నిర్మాతలు కాపీరైట్ నిబంధనలను ఉల్లంఘించి ఈ చిత్రాన్ని నిర్మించారంటూ 'అల్లు అరవింద్', 'ఎన్వీప్రసాద్' లు ఆరోపించారు. దీనిపై 'రబ్తా' చిత్ర యూనిట్ స్పందించింది. చిత్ర ట్రైలర్ చూసి ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించింది. 'మగధీర' టీం చేసిన ఆరోపణలను ఖండిస్తున్నట్లు, ఓ కాలరహిత ప్రేమ కథగా సినిమాను తీశామని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని విడుదల చేయాలా? వద్దా? అనేది జూన్ 1న తేలనుంది. ఆ రోజు దీనిపై న్యాయస్థానం నిర్ణయాన్ని వెలువరించనుంది.

11:52 - May 26, 2017

విశాఖపట్నం :నేటి నుండి నుంచి 29 వరకు మూడు రోజుల పాటు జరిగే టీడీపీ మహానాడు భద్రతకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. శాంతిభద్రతలు, ట్రాఫిక్‌ విభాగాల్లో 2,500 మంది పోలీసులకు మహానాడు విధులు అప్పగించారు. పాసులు ఉన్న వారిని మాత్రమే మహానాడుకు అనుమతి ఇస్తారు.

టీడీపీ మహానాడుకు అన్ని ఏర్పాట్లు పూర్తి..

విశాఖపట్నంలోని ఆంధ్రాయూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కాలేజీలో జరిగే టీడీపీ మహానాడుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపు 30 వేల మంది ప్రతినిధులు మహానాడుకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. మహానాడు భద్రతా విధుల నిర్వహణకు 2,500 మందితో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పసుపు పండుగకు వచ్చే ప్రతి ఒక్కరికీ ఏ, బీ, సీ, డీ కేటరిగి పాసులను జారీ చేస్తున్నారు.

ఏ కేటగిరి పాసుదారులు నేరుగా మహానాడుకు అనుమతి

అత్యంత ప్రముఖులకు A కేటగిరి పాసులు జారీ చేస్తున్నారు. వీరు నేరుగా మహానాడు ప్రాంగణంలోకి వెళ్లొచ్చు. ఏ కేటగిరి పాసులు ఉన్నవారికి ఇంజినీరింగ్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ ఆఫీసు వద్ద కార్లు నిలుపుకునే అవకాశం కల్పించారు. వీఐపీలకు500 వరకు B కేటగిరి పాసులు ఇస్తున్నారు. వీరికి భాస్కర, జేసీ బోస్‌ హాస్టళ్ల వద్ద వాహనాలు పార్కింగ్‌ ఏర్పాటు చేశారు. C కేటగిరి పాసులు 3,500 జారీ చేస్తున్నారు. మహానాడు వేదిక సమీపంలోని ఎగ్జిబిషన్‌ మైదానం, సర్‌ ఐజాక్‌ న్యూటన్‌ బ్లాక్‌ ప్రాంగణం సమీపంలో వాహనాల పార్కింగ్‌ సౌకర్యం కల్పించారు. బస్సులు, ఇతర వాహనాల్లో వచ్చే వారికి కేటగిరి D కేటగిరి పాసులు జారీ చేస్తున్నారు. డీ కేటగిరి పాసులున్న వాహనాలకు ఫుట్‌బాట్‌ గ్రౌండ్‌లో పార్కింగ్‌ ఏర్పాటు చేశారు.

మహానాడుకు వచ్చే వాహనాలకు ప్రత్యేక మార్గాలు...

జిల్లాల నుంచి మహానాడుకు వచ్చే వాహనాలకు ప్రత్యేక మార్గాలు కేటాయించారు. నిర్ణీత మార్గాల్లో పార్కింగ్‌ ప్రదేశానికి చేరుకుని, అక్కడ నుంచి మహానాడుకు రావాల్సి ఉంటుంది. మహానాడుకు వచ్చే వారి భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. సీసీటీవీ కెమెరాలతో శాంతిభద్రతను పర్యవేక్షిస్తారు. ఇందుకు కోసం ప్రత్యేక కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ రూమును ఏర్పాటు చేశారు. మహానాడుకు వచ్చే ప్రతి ఒక్కరూ విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు సహకరించాలని సీపీ యోగానంద్‌ విజ్ఞప్తి చేశారు.

11:49 - May 26, 2017

అస్సాం: దేశంలోనే అత్యంత పొడవైన ధోలా-సాదియా బ్రిడ్జిని ప్రధాని ప్రారంభించారు.అసోంలోని బ్రహ్మపుత్రా ఉపనది అయిన లోహిత్‌నదిపై ఈ బ్రిడ్జిని నిర్మించారు. మొత్తం 9కిలోమీటర్ల పొడవైన ఈ వంతన చైనా సరిహద్దుకు సమీపంలో ఉంది. భారత్‌కు రక్షణ పరంగా కీలకంగా మారనుంది. 2వేల 5వందల కోట్ల రూపాలయ వ్యయంతో 7ఏళ్లలో ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేశారు. ధోలా -సాదియా బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో అసోం ,అరుణాచల్‌ రాష్ట్రాల మధ్య ప్రయాణసమయం 4గంటలకు తగ్గిపోనుంది. మన్మోహన్‌ సింగ్‌ హయాంలో ఈ బ్రిడ్జి నిర్మాణానికి శంఖుస్థాపన జరిగింది. దీన్ని ఛాలెంజ్‌గా తీసుకున్న ప్రధాని మోది త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. బ్రహ్మపుత్ర ఉపనది లోహిత్‌ నదిపై ధోలా సదియా బ్రిడ్జిని నిర్మించారు. గౌహతికి 540 కిలోమీటర్ల దూరంలో సదియ వద్ద బ్రిడ్జి ఏర్పాటు చేశారు. ఈ బ్రిడ్జి ప్రారంభంతో అస్సాం-అరుణాచల్‌ ప్రదేశ్‌ల మధ్య ప్రయాణంలో 4 గంటల సమయం ఆదా కానుంది. 2 వేల 5 వందల కోట్ల వ్యయంతో.. ఏడేళ్ల పాటు ఈ వంతెన నిర్మాణం సాగింది. భారత్‌-చైనా సరిహద్దు రక్షణ సామాగ్రిని చేరవేయడానికి ఇది అత్యంత కీలకంగా మారనుంది. బ్రిడ్జి ప్రారంభం అనంతరం భీమాజీ జిల్లా బోగాముఖ్‌ కు చేరుంటారు. అక్కడ భారత వ్యవసాయ పరిశోధానా కేంద్రాన్ని మోదీ ప్రారంభిస్తారు. తర్వత గౌహతిలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఇండియన్‌ మెడికల్ సైన్సెస్‌ భవనానికి శంకుస్థాపన చేస్తారు.

11:45 - May 26, 2017

కర్నూలు : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఎమ్మిగనూరులో కూతురు వరుస అయ్యే బాలికపై బంధువే అత్యాచారానికి తెగబడ్డాడు. బాలిక గర్భవతి కావడంతో విషయం బయటికి పొక్కింది. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికపై అత్యారానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

 

11:40 - May 26, 2017

భారత క్రికెట్ జట్టుకు కొత్త కోచ్ కావలెను అంటూ బీసీసీఐ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. మహిళ టీం కు కోచ్ మాత్రం కాదు..పురుషుల జట్టుకు...కోచ్ గా దరఖాస్తు చేయడానికి నిర్ధిష్ట అర్హతలు పెట్టింది. మే 31లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇంటర్వ్యూలో క్రికెట్‌ సలహా కమిటీతో సహా పాలకుల కమిటీ నామినేట్‌ చేసిన సభ్యుడొకరు ఉంటారని బీసీసీఐ స్పష్టం చేసింది. ప్రస్తుత కోచ్ గా అనీల్ కుంబ్లే వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. మరో వారం రోజుల్లో మినీ ప్రపంచ కప్ సమరం ఉన్న సంగతి తెలిసిందే. టోర్నీ నిలుపుకొనేందుకు జట్టు బయలుదేరి కనీసం ఒక్క రోజు కాలేదు..అప్పుడే కోచ్ అనీల్ కుంబ్లేపై వేటు వేసేందుకు బీసీసీఐ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దిగ్గజ ఆటగాళ్లు సచిన్‌ టెండూల్కర్‌, వి.వి.ఎస్‌ లక్ష్మణ్‌, సౌరభ్‌ గంగూలీలతో కూడిన క్రికెట్‌ సలహా కమిటీ తదుపరి టీమ్‌ ఇండియా చీఫ్‌ కోచ్‌ను ఎంపిక చేయనున్నది బోర్డు వెల్లడించింది. అనిల్‌ కుంబ్లే నేరుగా ఎంపిక ప్రక్రియలో భాగమవుతాడని పేర్కొంది. దరఖాస్తు, వడపోత, తుది జాబితాలతో సంబంధం లేకుండా నేరుగా ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు కుంబ్లేకు మినహాయింపు ఇచ్చింది. మరి కోచ్ గా ఎవరు రానున్నారో త్వరలో తెలియనుంది.

రెండు రోజులు ముందుగానే..

ఢిల్లీ : ఈ ఏడాది రుతుపవనాలు అనుకున్న దానికన్నా రెండు రోజులు ముందుగానే దేశంలోకి ప్రవేశించనున్నాయని ఢిల్లీలోని వాతావరణ కార్యాలయ వర్గాలు మంగళవారం తెలిపాయి. రుతు పవనాలు ఈ నెల 30న దక్షిణ కేరళ తీర ప్రాంతాన్ని తాకే అవకాశముందని పేర్కొంది.

మహానాడు నిర్వాహణపై విచారణ వాయిదా..

హైదరాబాద్ : ఏయూలో మహానాడు నిర్వహించుకొనేందుకు అనుమతినివ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై విచారణ మధ్యాహ్నం 2.30కి హైకోర్టు వాయిదా వేసింది.

11:10 - May 26, 2017

క్రికేట్ దేవుడిగా అభిమానులు పిలుచుకొనే 'సచిన్ టెండూల్కర్' పేరు మళ్లీ మారుమోగుతోంది. ఆయన ఇప్పటికే రిటైర్ మెంట్ తీసుకున్నారు..కదా..మళ్లీ నినాదాలు మోగడం ఏంటీ ? అని అనుకుంటున్నారా..మైదానం కాదు..థియేటర్ లో 'సచిన్..సచిన్' అంటూ నినాదాలు హోరెత్తుతున్నాయి. మాస్టర్ బ్లాస్టర్ జీవిత చరిత్రపై తెరకెక్కిన 'సచిన్ : ఎ బిలియన్ డ్రీమ్స్' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. తమ అభిమాన క్రికేటర్ ను చూసేందుకు అభిమానులు థియేటర్ లకు పోటెత్తుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాను చూసిన పలువురు సెలబ్రెటీలు..నేతలు..ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఎట్టి పరిస్థుతల్లో సినిమా మిస్ కావద్దని..మాస్టర్ గురించి తెలియని ఎన్నో విషయాలు సినిమాలో చూసే అవకాశం ఉందని మాజీ కెప్టెన్ ధోని అభిమానులకు పిలుపునిచ్చాడు. 'సచిన్ నీకెవరూ సాటిరారు'..అంటూ కపిల్ దేవ్ ట్వీట్ చేశాడు. పలువురు 'సచిన్' ను ఆకాశానికెత్తేశారు.

11:00 - May 26, 2017

'అంజలి పాటిల్' నటి గుర్తుండే ఉంటుంది కదా...తెలుగులో అంజలి పాటిల్ చేసిన 'నా బంగారు తల్లి' చిత్రం ప్రేక్షకాదరణ పొందిన సంగతి తెలిసిందే. సినిమాలో నటించిన 'అంజలి' నటనకు మంచి మార్కులే పడ్డాయి. అత్యంత సహజంగా నటించిన ఈ నటికి మంచి ఆఫర్ వచ్చిందని టాక్ వినిపిస్తోంది. ఏకంగా తమిళ సూపర్ స్టార్ 'రజనీ' చిత్రంలో నటించేందుకు అవకాశం వచ్చిందని సోషల్ మాధ్యమాల్లో ఓ వార్త వైరల్ అవుతోంది. రజనీ..పా.రంజిత్ కాంబినేషన్ లో వచ్చిన 'కబాలి' చిత్రం విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ లోనే మరో చిత్రం రూపొందబోతోంది. తాజాగా ఈ సినిమా టైటిల్ ను ఆవిష్కరించారు. 'కాలా' పేరిట చిత్రం తెరకెక్కనుంది. మాఫియా నేపథ్యంలో చిత్రం ఉంటుందని తెలుస్తోంది. 'అంజలి పాటిల్' కి 'కాలా' సినిమాలో దక్కిన పాత్రేమిటో చూడాలి. 'రజనీ' సరసన 'హుమా ఖురేషి' కథానాయికగా నటించనున్న సంగతి తెలిసిందే.

 

దిబ్రాఘర్ కు మోడీ..

అసోం : దిబ్రాఘర్ కు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేరుకున్నారు. 'ధోలా - సాదియా' వంతెనను కాసేపట్లో ప్రారంభించనున్నారు. అరుణాచల్ ప్రదేశ్ లోని ధోలా..అసోంలోని సాదియా ప్రాంతాలకు కలుపుతూ ఈ వంతెన నిర్మాణం జరిగింది.

ప్రపంచంలో ఎక్కడా ఈ విధానం లేదన్న బాబు..

విజయవాడ : రెండో రోజు ప్రారంభమైన కలెక్టర్ల సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. పీపుల్స్ హబ్ సాఫ్ట్ కాపీని బాబు ఆవిష్కరించారు. ఇలాంటి విధానం ప్రపంచంలో ఎక్కడా లేదని, ప్రజాసాధికార సర్వే 80 శాతం పూర్తయ్యిందని..అన్ని శాఖలను ఆన్ లైన్ కు అనుసంధానం చేయాలని సూచించారు.

ఎన్డీయేతర పార్టీల నేతల భేటీ..

ఢిల్లీ : పార్లమెంట్ లో ఏన్డీయేతర పార్టీల నేతలు భేటీ కానున్నారు. సోనియా, మమత బెనర్జీ నేతృత్వంలో మధ్యాహ్నం 1గంటకు పార్లమెంట్ లైబ్రరీ హాల్ లో ఈ సమావేశం జరగనుంది. రాష్ట్రపతి పదవికి ఉమ్మడి అభ్యర్థి ఎంపికపై చర్చ జరగనుంది.

10:51 - May 26, 2017

బాలీవుడ్ కండల వీరుడు 'సల్మాన్ ఖాన్' తన చిత్ర ట్రైలర్ తో మరోసారి దుమ్ము రేపుతున్నాడు. ఇప్పటికే ఆయన నటించిన పలు చిత్రాలు రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ట్యూబ్ లైట్' చిత్రంలో 'సల్మాన్' నటిస్తున్నారు. ఈ చిత్రంలో చైనా నటి 'చూ చూ' నటిస్తుండడం విశేషం. ఇదిలా ఉంటే ఈ చిత్ర ట్రైలర్ ఎప్పుడు విడుదలవుతుందా ? అని అభిమానులు ఎదురు చూశారు. ఎట్టకేలకు గురువారం రాత్రి 'ట్యూబ్ లైట్' ట్రైలర్ విడుదల చేశారు. ఇందులో ఉన్న సన్నివేశాలను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. భారత్ - చైనా యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. సల్మాన్ ఖాన్ సోదరుడు 'సోహైల్ ఖాన్' రీల్ లైఫ్ సోదరుడిగా సైనికుడు పాత్రలో నటించడం విశేషం. సైనికుడిగా ఉన్న సోహైల్ ను వెనక్కి తీసుకొస్తానని 'సల్మాన్' పేర్కొనడం ఉత్కంఠను రేకేత్తిస్తోంది.

10:45 - May 26, 2017

చిత్తూరు :జిల్లాలో ఓ ప్రవైట్‌ బస్సు కాలిబూడిదయింది. వి.కోట మండలం తోటకానుమ గ్రామ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు బస్సుకు నిప్పంటించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

 

10:43 - May 26, 2017

హైదరాబాద్: ఔటర్‌పై ప్రమాదాల నియంత్రణకు అధికారుల చర్యలు చేపట్టారు.. ఔటర్‌ రింగ్‌ రోడ్డులో వాహనాల వేగ పరిమితి తగ్గిస్తూ ఆదేశాలు జారీచేశారు.. ఈ రోడ్డుపై 120 నుంచి 100 కిలోమీటర్లకు తగ్గిస్తూ ఉత్తర్వులిచ్చారు.. అప్పా, నానక్‌రామ్‌గూడ, కొల్లూరు వద్ద ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు గుర్తించారు.. 2016లో ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ప్రమాదాల్లో 33 మంది దుర్మరణం చెందారు.. ఈ ఏడాది ఇప్పటివరకూ 15 మంది మృతి చెందారు..

10:41 - May 26, 2017

టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు 'రాజమౌళి' తెరకెక్కించిన 'బాహుబలి 2' సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజై రికార్డుల సునామీ సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని చూసిన పలువురు సినీ ప్రముఖులు..విమర్శకులు..రాజకీయ నేతలు రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రభాస్..రానా..ఇతర నటుల ప్రతిభను మెచ్చుకున్నారు. కానీ బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ గా పేరొందిన 'అమీర్ ఖాన్' ఈ సినిమాను ఇంకా చూడలేదంట. కానీ 'బాహుబలి 2' సినిమాపై 'అమీర్' పలు వ్యాఖ్యలు చేశారు. తాను నటించిన 'దంగల్' సినిమాతో పోల్చవద్దని సూచించారు. 'సచిన్..ది బిలియన్ డ్రీమ్స్' ప్రత్యేక షొకు ఆయన హాజరై మీడియాతో మాట్లాడారు. 'దంగల్'..'బాహుబలి 2' సినిమాలు బాక్సాపీసు వద్ద వసూళ్లు రాబడుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా 'దంగల్' రూ. 1,565 కోట్లు రాబడితే ఇప్పటికే చైనాలో ఏకంగా రూ. 778 కోట్లను కొల్లగొట్టింది. ఈ నేపథ్యంలో 'బాహుబలి 2' సినిమా 'దంగల్' ను బీట్ చేస్తుందా అని మీడియా 'అమీర్'ను ప్రశ్నించింది. రెండూ మంచి చిత్రాలని..దేశం గర్వపడేలా చేశాయన్నారు. ఇప్పటి వరకు 'బాహుబలి 2' సినిమాను చూడలేదని, చిత్రం గురించి గొప్పగా మాట్లాడడం విన్నానని తెలిపారు.

10:41 - May 26, 2017

ప్రకాశం : చీరాలలో పోలీస్‌ కానిస్టేబుల్‌ భార్య అనుమానాస్పద మృతి విషాదం నింపింది. హరిప్రసాద్‌నగర్‌లో ఉండే ఏఆర్‌ కానిస్టేబుల్‌ తిరుమలరావు -రమాదేవి దంపతులు తరచు గొడవపడేవారు. మద్యానికి బానిస అయిన తిరుమలరావు తరచు భార్యను కొడుతూ హింసించేవాడని స్థానికులు చెబుతున్నారు. ఈనేపథ్యంలో వంటగదిలో భార్యపై కిరోసిన్‌పోసి నిప్పంటించాడని స్థానికులు అనుమానిస్తున్నారు. వివాహేతర సంబంధమే ఇద్దరి మధ్య గొడవలకు కారణంగా మరికొందరు చెబుతున్నారు.

10:39 - May 26, 2017

అమరావతి : ఏపీ రాజధాని అమరావతిలో రెండోరోజు కలెక్టర్ల సదస్సు జరుగుతోంది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

10:36 - May 26, 2017

రంగారెడ్డి : రాజేంద్రనగర్‌లో వెటర్నరీ విద్యార్థులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఎం క్యాంప్‌ ఆఫీసు ముట్టడికి బయలుదేరిన స్టూడెంట్స్‌ను పోలీసులు అడ్డుకున్నారు. పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే నంబర్‌ 130 వద్ద కు రాగానే విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సును ఆపేశారు. ఈసందర్భంగా పోలీసులతో వెటర్నరీ విద్యార్థులు వాగ్వాదానికి దిగారు.

ఔటర్ రింగ్ రోడ్డుపై దూసుకెళుతున్నారా..

హైదరాబాద్ : ఔటర్ రింగ్ రోడ్డులో వాహనాల వేగ పరిమితిపై ఆంక్షలు విధించారు. 120 నుండి 100 కి.మీ.కు వేగ పరిమితి విధించారు. సైబరాబాద్ సీపీ సందీప్ శాండిల్య ఆదేశాలు జారీ చేశారు. అప్పా, నానక్ రామ్ గూడ, కొల్లూరు వద్ద ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. 2016లో ఔటర్ రింగ్ రోడ్డుపై 33 మంది దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఇప్పటి వరకు ఔటర్ రింగ్ రోడ్డుపై 15 మంది మృతి చెందారు.

ప్రైవేటు బస్సు అగ్నికి ఆహుతి..

చిత్తూరు : జిల్లాలో ప్రైవేటు బస్సు అగ్నికి ఆహుతైంది. వి.కోట మండలం తోటకానుమ గ్రామ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆగి ఉన్న బస్సుకు దుండగులు నిప్పు పెట్టారు.

కలెక్టర్ల సదస్సు రెండో రోజు..

విజయవాడ : జిల్లా కలెక్టర్ల సదస్సు రెండో రోజు ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సమావేశాలు జరుగుతున్నాయి. కలెక్టర్లతో బాబు పలు అంశాలపై చర్చిస్తున్నారు.

సీఎం క్యాంపు ఆఫీసు ముట్టడికి..

రంగారెడ్డి : వెటర్నరీ విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. సీఎం క్యాంపు ఆఫీసు ముట్టడికి బస్సులో రాజేంద్రనగర్ నుండి సీఎం క్యాంపు ఆఫీసు ముట్టడికి వెటర్నరీ విద్యార్థులు బయలుదేరారు.

కూతురు వరసయ్యే బాలికపై..

కర్నూలు : ఎమ్మిగనూరులో దారుణం చోటు చేసుకుంది. కూతురు వరుసయ్యే బాలికపై అత్యాచారం జరిపాడు. బాలిక గర్భవతి కావడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

తహశీల్దార్ కు బెదిరింపులు..

ఖమ్మం : నేలకొండపల్లి తహసీల్దార్ సైదులుకు ఆర్థిక మంత్రి ఓఎస్డీ పేరిట బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. దీనితో తహసీల్దార్ పోలీసులను ఆశ్రయించారు. హుజూర్ నగర్ (మం) అమరారం గ్రామానికి చెందిన నరేష్ ను నేలకొండపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆటో బోల్తా..ఇద్దరు మృతి..

అనంతపురం : పెనుగొండ (మం) మడకశిర రైల్వే గేట్ వద్ద ఆటో బోల్తా పడింది. ఈఘటనలో ఇద్దరు మృతి చెందగా 9మందికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మహిళపై యాసిడ్ దాడి..

ఖమ్మం : కల్లూరు (మం) పెద్దకోరుకొండిలో యాసిడ్ దాడి జరిగింది. ఆరు బయట నిద్రిస్తున్న కృష్ణకుమారి అనే మహిళపై దుండగులు యాసిడ్ చల్లారు. తీవ్రగాయాలైన ఆమెను ఆసుపత్రికి తరలించారు.

అసోంలో పర్యటించనున్న మోడీ..

ఢిల్లీ : భారత్ లో అత్యంత పొడవైన బ్రిడ్జిని భారత ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేయనున్నారు. అసోంలో మోడీ పర్యటించనున్నారు. తీన్ సుకియా జిల్లా - చైనా సరిహద్దుకు సమీపంలో బిడ్జిని జాతికి అంకితం చేయనున్నారు. ఉదయం 10.45గంటలకు ఈ ప్రారంభోత్సవం జరగనుంది. రూ. 2500 కోట్ల వ్యయంతో 9.5 కి.మీ.బ్రిడ్జి నిర్మాణం చేశారు. భారత్ - చైనా సరిహద్దులో రక్షణ పరంగా ధోలా - సాదియా వంతెన కీలకం కానుంది.

మోడీ మూడేళ్ల పాలనపై ఏచూరీ స్పందన..

ఢిల్లీ : మూడేళ్ల మోడీ పాలనలో దళితులు, ముస్లింపై దాడులు పెరిగాయని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామన్న హామీ నిలబెట్టుకోలేదని, 8 కీలక రంగాల్లో ఉద్యోగాల కల్పన పడిపోయిందని విమర్శించారు. ఈ రంగాల్లో 2015లో 1.35 లక్షల ఉద్యోగాలు..2016లో 2.31 లక్షల ఉద్యోగాలను మాత్రమే సృష్టించారని తెలిపారు. 45 లక్షల మంది పనిచేస్తున్న ఐటీ సెక్టార్ ఒత్తిడికి గురవుతోందని, మోడీ పాలనలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని తెలిపారు.

09:24 - May 26, 2017

ఢిల్లీ : కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ప్రతిపక్ష నేతలకు ఇవాళ విందు ఏర్పాటు చేశారు. దిల్లీలోని పార్లమెంట్‌ హౌస్‌లో ఇచ్చే ఈ విందుకు పశ్చిమబెంగాల్‌, బిహార్‌ ముఖ్యమంత్రులు మమతాబెనర్జీతోపాటు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, విపక్ష నేతలు హాజరుకానున్నారు. త్వరలో జరగబోయే రాష్ట్రపతి ఎన్నికపై ఇందులో చర్చించనున్నారు..

09:22 - May 26, 2017

అనంతపురం: మడకశిరలో ఆటోబోల్తాపడిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరో 9 మందికి గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు.

09:21 - May 26, 2017

ఖమ్మం: జిల్లాలో దారుణం జరిగింది. కల్లూరుమండలం పెదకూరుకుండి గ్రామంలో మహిళపై యాసిడ్‌ దాడి జరిగింది. గత రాత్రి ఆరుబయట నిద్రిస్తున్న మహిళపై 12, 1 గంటల మధ్య దుండగులు యాసిడ్‌ పోశారు. ఈ ఘటనలో మహిళ తీవ్రంగా గాయపడింది. ఖమ్మంలోని అభయ ఆస్పత్రికి తరలించిన కుటుంబసభ్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. వివరాల్లోకి వెళితే భార్యా భర్తల మధ్య గొడవ ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది. బాధితరులరాలి తల్లిదండ్రులు కూడా ఆమె భర్తే ఈ ఘటనకు పాల్పడి ఉంటాడని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

07:23 - May 26, 2017

హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణలో చేసిన మూడు రోజుల పర్యటన సృష్టించిన రాజకీయ దుమారం బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య వివాదానికి తెరలేపింది. అంతులేని రాజకీయ అగాధాన్ని సృష్టించింది. కేసీఆర్ పై ఈడీ నీడ వుందని కాంగ్రెస్ అరోపిస్తోంది. బిజెపిని విధానపరంగా కేసీఆర్ ఎక్కడా విమర్శించలేదు ఎందుకు? ప్రధాని మోదీ పాలనకు నేటితో మూడేళ్లు పూర్తయ్యింది. ఈ మూడేళ్లలో మోదీ సాధించిన ప్రగతి ఏమిటి? ఇవే అంశం పై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో నవతెలంగాణ ఎడిటర్ ఎస్. వీరయ్య, కాంగ్రెస్ నేత కైలాస్, బిజెపి నేత కొల్లి మాధవి, టిఆర్ ఎస్ చీఫ్ విప్ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

పెను ప్రమాదం నుండి తప్పించుకున్న గ్రీస్ మాజీ ప్రధాని

హైదరాబాద్: గ్రీస్ మాజీ ప్రధాని లుకాస్ పపాడెమొస్ పెను ప్రమాదం నుంచి తృటిలో గాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. 2011 నుంచి 2012 వరకు గ్రీస్ ప్రధానిగా పని చేసిన లుకాస్ పపాడెమొస్ ఎథెన్స్ లో ప్రయాణిస్తుండగా, ఆయన కారులో పెట్టిన లెబర్ బాంబు పేలుడు చోటుచేసుకుంది. ఈ బాంబు పేలుడులో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయనకు ప్రాణాపాయం తప్పిందని చెబుతున్న వైద్యులు, ఆయన శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు.

శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత...

హైదరాబాదు: శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు 12 కోట్ల రూపాయలు విలువైన డ్రగ్స్ ను పట్టుకున్నారు. కార్గో ఫ్లైట్ లో మలేసియాకు ఎపిడ్రిన్ అనే డ్రగ్ ను స్మగ్లర్లు తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. పట్టుబడిన ఎపిడ్రిన్ డ్రగ్ విలువ 12 కోట్ల రూపాయలు ఉంటుందని వారు చెప్పారు. ఈ సందర్భంగా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న అధికారులు సింగపూర్‌, హాంకాంగ్‌, శ్రీలంకకు ఈ డ్రగ్ తీసుకెళ్తున్నట్టు గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.

మోదీ సర్కార్ కొలువుదీరి మూడేండ్లు పూర్తి

హైదరాబాద్: ప్రధాని మోదీ సర్కార్ కొలువుదీరి నేటికి మూడేండ్లు పూర్తయ్యింది. ఎన్నికల హామీలను ఇప్పటి వరకూ నెరవేర్చలేదని విపక్షాలు పెదవి విరుస్తున్నాయి.

06:56 - May 26, 2017

హైదరాబాద్: రాబోయే అయిదేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం. ఇది అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వాగ్ధానం. సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం మూడేళ్ల పాలన పూర్తి చేసుకుంది. ఈ మూడేళ్లలో నరేంద్రమోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఇచ్చిన కానుకలేమిటి? వ్యవసాయ రంగం పట్ల మోడీ ప్రభుత్వ విధానాలు ఎలా వున్నాయి? రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే విధంగానే ప్రయత్నాలున్నాయా? ప్రస్తుతం భారతదేశ వ్యవసాయం రంగం ఎదుర్కొంటున్న సవాళ్లేమిటి? వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరలు ప్రకటిస్తున్న సంతృప్తికరంగా వుందా? ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో తెలంగాణ రైతు సంఘం నేత టి. సాగర్ పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో దారుణం..

హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌ జాతీయ రహదారిపై దారుణం జరిగింది. గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి కారుపై దాడి చేసి ఓ కుటుంబాన్ని దోపిడీ చేశారు. అంతేకాదు... కారులో ఉన్న నలుగురు మహిళలపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. వారిని కాపాడేందుకు ప్రయత్నించిన కుటుంబ సభ్యున్ని తుపాకి కాల్చి హతమార్చారు.

06:49 - May 26, 2017

హైదరాబాద్ భారత్‌లో అత్యంత పొడవైన బ్రిడ్జిని ప్రధానమంత్రి నరేంద్రమోది అస్సాంలో నేడు ప్రారంభించనున్నారు. 9 కిలోమీటర్ల పొడవైన ఈ బ్రిడ్జిని పూర్తి చేయడానికి మూడేళ్ల సమయం పట్టింది. మన్మోహన్‌ సింగ్‌ హయాంలో ఈ బ్రిడ్జి నిర్మాణానికి శంఖుస్థాపన జరిగింది. దీన్ని ఛాలెంజ్‌గా తీసుకున్న ప్రధాని మోది త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. బ్రహ్మపుత్ర ఉపనది లోహిత్‌ నదిపై ధోలా సదియా బ్రిడ్జిని నిర్మించారు. గౌహతికి 540 కిలోమీటర్ల దూరంలో సదియ వద్ద బ్రిడ్జి ఏర్పాటు చేశారు. ఈ బ్రిడ్జి ప్రారంభంతో అస్సాం-అరుణాచల్‌ ప్రదేశ్‌ల మధ్య ప్రయాణంలో 4 గంటల సమయం ఆదా కానుంది.

06:47 - May 26, 2017

ప్రకాశం : తెలుగుదేశం పార్టీకి పండగ లాంటి మినీ మహానాడు ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రశాంతంగా ముగిసింది. ఈ వేదిక మీదనుంచి పలు సమస్యలపై నేతలు గళమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రకాశం జిల్లాకు కేటాయించిన పరిశ్రమలు, విశ్వ విద్యాలయాలు, రామాయపట్నం పోర్టు వంటి అంశాలపై నేతలంతా ఏక తాటిపైకి వచ్చారు. వీరంతా ఈ విషయంలో ఒకే గళం వినిపించారు. మినీ మహానాడు సందర్భంగా నేతలు చేసిన తీర్మానాలన్నీ ఆమోదించారు.

రాజధాని నిర్మాణం ఒక్క చంద్రబాబుతోనే సాధ్యం...

అలాగే జిల్లా రాజకీయ పరిశీలకులుగా వచ్చిన మంత్రి నారాయణ మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం ఒక్క చంద్రబాబుకే సాధ్యమన్నారు. విపత్కర పరిస్థితుల్లో విడిపోయిన రాష్ట్రాన్ని కాపాడుకుంటూ ముందుకు నడిపిస్తోన్న అధినేత చంద్రబాబును ప్రజలు ఆదరిస్తారని కొనియాడారు.

ఫ్యాక్షన్ రాజకీయాలకు ఊపిరిపోస్తోంది ప్రతిపక్షనేత వైఎస్‌ జగనే

మరోవైపు మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ ఫ్యాక్షన్ రాజకీయాలకు ఊపిరిపోస్తోంది ప్రతిపక్షనేత వైఎస్‌ జగనేనని ఆరోపించారు. కర్నూలులో ఇటీవల జరిగిన నారాయణ రెడ్డి హత్యను ప్రస్తావించారు. ఇటువంటి వాటిని నేతలు కార్యకర్తలు ప్రజలు తిప్పికొట్టాలని తీర్మానం పెట్టారు.

అందరు ఎమ్మెల్యేలకు తీర్మానాలు చేసేందుకు దక్కని అవకాశం

అయితే సభలో జిల్లాలోని అందరు ఎమ్మెల్యేలకు తీర్మానాలు చేసే అవకాశం కానీ, బలపరిచే అవకాశం కానీ దక్కలేదు. చీరాల ఎమ్మెల్యే ఆమంచి క్రిష్ణ మోహన్, గొట్టిపాటి రవి, ఎమ్మెల్సీ పోతుల సునీత, పలువురు నియోజకవర్గ బాధ్యులకు మాట్లాడే అవకాశం దక్కలేదు. ఇటీవల జరిగిన సంఘటనల ద్రుష్ట్యా సభను విజయవంతంగానే ముగించారు పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్థన్ రావు.

రాజధాని నిర్మాణం ఒక్క చంద్రబాబుతోనే సాధ్యం...

ప్రకాశం : తెలుగుదేశం పార్టీకి పండగ లాంటి మినీ మహానాడు ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రశాంతంగా ముగిసింది. ఈ వేదిక మీదనుంచి పలు సమస్యలపై నేతలు గళమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రకాశం జిల్లాకు కేటాయించిన పరిశ్రమలు, విశ్వ విద్యాలయాలు, రామాయపట్నం పోర్టు వంటి అంశాలపై నేతలంతా ఏక తాటిపైకి వచ్చారు. వీరంతా ఈ విషయంలో ఒకే గళం వినిపించారు. మినీ మహానాడు సందర్భంగా నేతలు చేసిన తీర్మానాలన్నీ ఆమోదించారు. అలాగే జిల్లా రాజకీయ పరిశీలకులుగా వచ్చిన మంత్రి నారాయణ మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం ఒక్క చంద్రబాబుకే సాధ్యమన్నారు.

06:41 - May 26, 2017
06:40 - May 26, 2017

హైదరాబాద్: తెలంగాణ సంపన్న రాష్ట్రం అన్న విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సందర్భానుసారం చెబుతూ వస్తున్నారు. ఆదాయం అధికంగా ఉండటంలో పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. అయితే కాగ్‌ వెల్లడించిన గణాంకాలతో తెలంగాణ దేశంలోనే సంపన్న రాష్ట్రం అన్న విషయం మరోసారి రుజువైంది.

ప్రధాన పన్నుల ఆదాయంలో 17.82 శాతం వృద్ధి

తెలంగాణ రాష్ట్ర ఆదాయం బాగా పెరుగుతోంది. ప్రధానంగా పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో 17.82 శాతం వృద్దిరేటు సాధించింది. అన్ని రకాల పన్నులను కలుపుకుంటే ఇది 17.81 శాతంగా ఉంటుంది. సేల్స్ టాక్స్, ఎక్సైజ్, స్టాంప్స్- రిజిస్ట్రేషన్ ల ద్వారా 17.82 శాతం వృద్ధిరేటు సాధించింది. 2015-16 సంవత్సరంలో మార్చి నుంచి ఫిబ్రవరి వరకు 33,257 కోట్ల ఆదాయం రాగా, ఇదే సమయానికి 2016-17 ఆర్థిక సంవత్సరంలో 39,183 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. దీంతో తెలంగాణ రాష్ట్రం ప్రధాన పన్నుల ద్వారా 17.82 శాతం ఆదాయ వృద్ధిరేటును పెంచుకోగలిగింది. సేల్స్ టాక్స్, ఎక్సైజ్, స్టాంప్స్- రిజిస్ట్రేషన్ లతో పాటు రవాణా రంగం, ఇతర మార్గాలన్నీ కలుపుకుని 2015-16 ఆర్థిక సంవత్సరంలో 36,130 కోట్ల రూపాయల ఆదాయం వస్తే, 2016-17లో 42,564 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఎస్.ఓ.ఆర్., ఎస్.ఓ.టి.ఆర్. రెండు విభాగాల్లోనే దాదాపు 17 శాతానికి పైగా వృద్దిరేటు సాధించింది. దీనిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతోషం వ్యక్తం చేశారు.

ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆదాయం పెరగడం విశేషం -కేసీఆర్‌ .....

తెలంగాణ ధనిక రాష్ట్రమవుతుందని ఉద్యమ సమంయలోనే తాను వాదించానని, ఈ మూడేళ్ల సమయంలో ఈ విషయం అనేక సార్లు రుజువైందని కేసీఆర్‌ అధికారుల దృష్టికి తెచ్చారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా తెలంగాణ రాష్ట్రానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గకుండా, పెరుగుదల సాధించడం గొప్ప విశేషంగా భావిస్తున్నారు. రాష్ట్ర అధికారులు, ప్రజలకు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఆదాయ వృద్ధిరేటులో అనుకున్న పెరుగుదల వస్తున్నందువల్ల రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు తీసుకుపోతామని సీఎం ప్రకటించారు.

సంపన్న రాష్ట్రంగా కొనసాగుతున్న తెలంగాణ

హైదరాబాద్: తెలంగాణ దేశంలోనే ధనిక రాష్ట్రమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్తున్న విషయం మరోమారు అక్షర సత్యమని రుజువైంది. రాష్ట్ర ఆదాయ వృద్ధి రేటు ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గదని సీఎం పలుమార్లు చెప్పారు. కేసీఆర్‌ చెప్పిన విధంగానే గత ఆర్థిక సంవత్సరం గణాంకాలున్నాయి. 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను కాగ్‌ వెల్లడించిన గణాంకాలు తెలంగాణ సంపన్న రాష్ట్రమన్న విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నాయి. ఆదాయాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం మరోసారి దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచింది.

06:37 - May 26, 2017

హైదరాబాద్: తెలంగాణ‌లో అప్పుడే రాజ‌కీయాలు వేడెక్కుతున్నాయి. పార్టీలు త‌మ‌ ప‌దునైన వ్యూహాల‌కు ఇప్పటి నుండే ప‌దును పెడుతున్నాయి. సార్వత్రిక ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా..ఎదుర్కొనేందుకు స‌ర్వసన్నద్దమవుతున్న రాజ‌కీయ‌ పార్టీలు అధికార‌మే ల‌క్ష్యంగా త‌మ ఎత్తులకు తెర‌లేపుతున్నాయి. ఎన్నిక‌లు 2019లో వ‌చ్చినా..లేదంటే ముంద‌స్తు వ‌చ్చినా..అధికార‌మే టార్గెట్‌గా ఉన్న పార్టీలు,..ఇప్పటి నుండే పొత్తు రాజ‌కీయాల‌కు ప్లాన్‌లు గీస్తున్నాయి.

సార్వత్రిక ఎన్నికలకు పార్టీలు రెఢీ

తెలంగాణ‌లో దూకుడు మీదున్న టీఆర్ఎస్‌ను 2019లో ప్రతిప‌క్షానికి ప‌రిమితం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక అడుగులు మొద‌లు పెట్టింది. తెలంగాణ ఇచ్చినా ప్రతిప‌క్షానికి ప‌రిమిత‌మ‌వ‌డాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్న కాంగ్రెస్ పార్టీ,.వచ్చే ఎన్నిక‌ల్లో అది పునరావృతం కాకుండా ప‌ట్టుద‌ల‌తో ఉంది కాంగ్రెస్. అదేవిధంగా..తెలంగాణ తెలుగుదేశం పార్టీ సైతం ఇదే ప‌ట్టుద‌ల‌తో ఉంది. ఇప్పడికే టీఆర్ఎస్‌తో అమీతుమీ అంటున్న రేవంత్‌రెడ్డి,..కేసీఆర్‌ను గ‌ద్దేదింప‌డ‌మే ల‌క్ష్యం అంటున్నారు. అంతేకాదు ఒక అడుగు ముందుకేసిన‌ రేవంత్,.కాంగ్రెస్‌తో క‌లిసి టీఆర్ఎస్‌పై పోరాడుతామంటూ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సానుకూలంగా స్పందించ‌డంతో ఇప్పుడు టీడీపీ-కాంగ్రెస్ పొత్తుకు పురుడు పోసుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. టీ-టీడీపీ స్వతంత్ర నిర్ణయం తీసుకుంటే..తాము పొత్తుకు సిద్ధమే అన్న సంకేతాల‌ను సీనియ‌ర్ నేత జైపాల్ రెడ్డి చెప్పడమే దీనికి నిదర్శనంగా కన్పిస్తోంది.

టీఆర్‌ఎస్‌ను ప్రతిపక్షానికి పరిమితం చేయాలనే లక్ష్యం ...

అంతేకాదు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అన్ని విప‌క్షాలను ఏకం చేసే ప‌నిలో ఉంది. కేసీర్‌ను గ‌ద్దెదింపాలంటే..తెలంగాణ‌లో ప్రగతి శీల శ‌క్తులు ఏకం కావాలంటున్న హ‌స్తం పార్టీ..ఇప్పడికే వామ‌ప‌క్షాల‌తో తెర‌వెన‌క రాజ‌కీయం చేస్తున్నట్లు స‌మాచారం. అంతేకాదు ఇక నుండి ఉమ్మడిగా ప్రభుత్వంపై ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలన్న యోచ‌న‌లో ఉన్నారు హ‌స్తం నేత‌లు. మ‌రోవైపు టీ-జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండ‌రాంతో స్నేహ పూర్వకంగా వెళ్తూ..ఆయ‌న చేప‌డుతున్న కార్యక్రమాలకు మద్దతిస్తూ వస్తున్న కాంగ్రెస్..ఇదే బంధాన్ని 2019లో మ‌రింత బ‌లోపేతం చేసుకోవాల‌ని ఆశ‌ప‌డుతోంది. ఇలా అంద‌రిని ఒకే గొడుగు కింద‌కి తీసుకురావాల‌న్న వ్యూహంతో ఉంది కాంగ్రెస్.

ప్రగతిశీల శక్తులు ఏకం కావాలన్న హస్తంపార్టీ

మొత్తానికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేసీఆర్‌ను గ‌ద్దేదింప‌క‌పోతే రాజ‌కీయంగా ఎదుర్కోవ‌డం క‌ష్టంమ‌న్న నిర్ణయానికి వ‌చ్చిన ప్రతి ప‌క్షాలు..తామంతా ఏకం అయితేనే అది సాధ్యమ‌వుతంద‌ని భావిస్తున్నాయి. దీన్నే త‌మకు అనుకూలంగా మ‌లుచుకుంటున్న ప్రధాన ప్రతిప‌క్షం కాంగ్రెస్,.బీజేపీని మిన‌హాయిస్తూ టీఆర్ఎస్‌ను వ్యతిరేకిస్తున్న పార్టీల‌న్నింటిని ఏకం చేయాల‌ని డిసైడ్ అయ్యింది. అదే జరిగితే..కాంగ్రెస్‌కు వ్యతితిరేకంగా పుట్టిన టీడిపి సైతం..హ‌స్తంతో అలాయ్ బ‌లాయ్ వేసుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

06:34 - May 26, 2017

హైదరాబాద్: అంతుచిక్కని రాజకీయ వ్యూహాలు..ప్రత్యర్థులకు అందని ఎత్తుగడలు.. ఎవరిని కరుణిస్తారో..ఎవరిని దూరం పెడతారో అంచనాకు దొరకని చాణక్యం. తిట్టాలన్నా ..పెట్టాలన్నా ఆయనదో స్పెషాలిటీ..దటీజ్ కేసీఆర్. రాష్ట్రపతి ఎన్నికల్లో ఇప్పుడు ఆయనేం చేయబోతున్నారన్నదే దేశరాజకీయాల్లో చర్చ.

రాష్ట్రపతి ఎన్నికల్లో కేసీఆర్ బీజేపీకి మద్దతిస్తారని ప్రచారం

నిన్నామొన్నటివరకూ రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థికి తెలంగాణ రాష్ట్రసమితి మద్దతు ఇవ్వడం ఖాయమని రాజకీయ వర్గాలు దాదాపు ఒక అభిప్రాయానికి వచ్చేశాయి. తాజాగా మొత్తం వ్యవహారాన్ని మలుపు తిప్పేశారు కేసీఆర్. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణలో చేసిన మూడు రోజుల పర్యటన సృష్టించిన రాజకీయ దుమారం బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య వివాదానికి తెరలేపింది. అంతులేని రాజకీయ అగాధాన్ని సృష్టించింది.

టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందంటూ అమిత్‌ షా వ్యాఖ్యలు

బీజేపీని బలోపేతం చేయాలనే రాజకీయ లక్ష్యంతో అమిత్ షా ...టీఆర్ ఎస్ ప్రభుత్వాన్ని ఎండగడుతూ కేంద్రపథకాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో రాష్ట్రప్రభుత్వం విఫలమవుతోందంటూ ధ్వజమెత్తారు. పైపెచ్చు లక్ష కోట్లరూపాయలను రాష్ట్రానికి ఇచ్చామంటూ గొప్పలు చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన కేసీఆర్. బీజేపీ మూలాల్లోకి వెళ్లి వేళ్లు పెకలించే యత్నం చేశారు. ఇదే ఇప్పుడు బీజేపీ, టీఆర్ఎస్ మధ్య చిచ్చుపెడుతోంది. రాష్ట్రపతి ఎన్నికల మద్దతు విషయంలోనూ టీఆర్ఎస్ను పునరాలోచనలో పడేసింది.

మతపరమైన విభజన తేవడం ద్వారా బలపడవచ్చనే అంచనాలో బీజేపీ

దక్షిణాదిన తెలంగాణలో మతపరమైన విభజన తేవడం ద్వారా బీజేపీ బలపడవచ్చనే అంచనాలో అధిష్ఠానం ఉంది. టీఆర్ఎస్ సర్కారు మైనారిటీ రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చింది. దళితులను సీఎం చేస్తానంటూ, భూమిలేని ప్రతిదళిత కుటుంబానికి మూడెకరాల భూమి పేరిట హామీ కూడా ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ. ఈరెండు అంశాలను ఆసరాగా చేసుకుంటూ బలపడేందుకు పావులు కదుపుతోంది బీజేపీ. దళితులతో సహపంక్తి భోజనం, రజాకార్ల బాధిత గ్రామాల సందర్శన అమిత్ షా పర్యటనలో కీలకం కావడం వెనుక ఉద్దేశమిదే. దళితులను అధికార టీఆర్్ఎస్ కు దూరం చేయడం, రజాకార్ల అంశం, మైనారిటీ రిజర్వేషన్ల అంశం చర్చకు తేవడం ద్వారా హిందూ ఓటు బ్యాంకును పోలరైజ్ చేసుకోవడం బీజేపీ

మునుపెన్నడూ లేని విధంగా బిజెపిపై ఫైరైన కేసీఆర్

రాజకీయంగా బీజేపీ ఎత్త్తుగడ ఫలిస్తే టీఆర్ఎస్కు చిక్కులు తప్పవు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీపై గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడమే కాకుండా కడిగి పారేశారు. తెలంగాణ ను కించపరిస్తే సహించేది లేదంటూ కొత్తవాదనను తేవడం ద్వారా బీజేపీని ఇక్కడి ప్రజలకు దూరం చేసే పాచికను తెలివిగా ప్రయోగించారు. అద్వానీ హోం మంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణకు మద్దతు ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే పోలవరం సరిహద్దు మండలాలను ఆంధ్రలో కలిపేశారు. హైకోర్టు విభజన పూర్తి చేయకుండా ఉంచేశారు. అంటూ బీజేపీపై కత్తులు నూరారు. ఇవన్నీ కూడా తెలంగాణలో బీజేపీ ఎదుగుదల యత్నాలకు గండికొట్టే అంశాలే. ఆ పార్టీ ఎదుగుదల ఎత్తుగడలను మొదట్లోనే తుంచేయాలన్న వ్యూహంలో భాగంగానే కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారని పరిశీలకులు భావిస్తున్నారు.

రాష్ట్రపతి ఎన్నికలకు కీలకం కానున్న టీఆర్ఎస్ ఓట్లు

అయితే రాష్ట్రపతి ఎన్నికలకు టీఆర్ఎస్ ఓట్లు చాలాకీలకం. ఈ పార్టీకి రాష్ట్రపతిని ఎన్నుకొనే ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీలో 20 వేల వరకూ ఓట్లు ఉన్నాయి. పదకొండు లక్షల ఓట్లతో కూడిన రాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీలో నాలుగు లక్షల 30 వేల వరకూ ఎన్డీఏ పక్షాల ఓట్లు ఉన్నాయి. ఈ మధ్యనే ప్రధానిని కలిసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్డీఏ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించింది. ఆ పార్టీకి 16 వేల వరకూ ఓట్లున్నాయి. టీఆర్ఎస్ సహకరిస్తే బీజేపీ అభ్యర్థి రాష్ట్రపతిగా ఎన్నిక కావడం ఖాయం. కానీ తాజాగా బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఏర్పడిన రాజకీయ వైరం రాష్ట్రపతి ఎన్నికను సైతం ఉత్కంఠభరితంగా మార్చేసింది. ఆశలు వదిలేసుకుంటున్న స్థితిలో విపక్షానికి టీఆర్ఎస్ తురుపు ముక్కగా మారబోతోందా? లేదా చివరలో తుస్సుమనిపిస్తారా? అన్నదే వేచి చూడాలి.

 

06:30 - May 26, 2017

కృష్ణా : విజ‌య‌వాడ‌లో జరిగిన బీజేపీ కార్యకర్తల మ‌హా స‌మ్మేళ‌నంలో..అమిత్‌ షా కాంగ్రెస్‌ పార్టీపై విరుచుకుపడ్డారు. ప్రత్యేకహోదా ఇవ్వలేని పరిస్థితులు కల్పించింది కాంగ్రెస్సే అని విమర్శించారు. ఏపీకి కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదని..ఇప్పుడు త‌మను ప్రత్యేక హోదా కావాలని ప్రశ్నించడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్ర విభ‌జ‌న బిల్లులో హోదాకు సంబంధించి స్పష్టమైన అంశాన్ని కాంగ్రెస్ ఇవ్వలేదన్న ఆయన.. ఇప్పుడు త‌మ‌ను విమ‌ర్శించడం తగదన్నారు. ప్రత్యేక హోదా చట్టంలో లేదని..అయినా ప్రత్యేక ప్యాకేజీ ద్వారా హోదాకు స‌మాన‌మైన ప్రయోజ‌నాలు ఏపీకి అందిస్తున్నామ‌న్నారు.

రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు ఎన్నో ఇచ్చాం...

న‌రేంద్ర మోదీ ఏపీకి ఏం చేశారని కొంద‌రు ప్రశ్నిస్తున్నారని, తాను మోదీ త‌ర‌ఫున జ‌వాబు ఇస్తున్నానంటూ అమిత్‌షా కొన్ని అంకెలు వెల్లడించారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు ఎన్నో ఇచ్చామని.. పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే భరిస్తోందన్నారు. లక్షా 75వేల కోట్లు రూపాయలు ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఆర్థిక సాయం అందించిందన్నారు. కాంగ్రెస్‌ నేతలు పూర్తిగా తెలుసుకుని మాట్లాడాలని ఎద్దేవా చేశారు. 60 ఏళ్ల తరబడి జరగని వృద్ధి ఈ మూడేళ్లలో చేసి చూపామని షా వివరించారు.

25 వేల బూత్ క‌మిటీలు నియ‌మించుకోవ‌డం పట్ల హర్షం ...

న‌రేంద్ర మోదీ పాల‌న‌లో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంద‌ని షా చెప్పారు. ఏపీలో 25 వేల బూత్ క‌మిటీలు నియ‌మించుకోవ‌డం సంతోషమ‌ని అన్నారు. 12 కోట్ల స‌భ్యత్వంతో బీజేపీ ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిందని అన్నారు. ఈ మ‌హా స‌మ్మేళ‌నం చ‌రిత్రలో నిలిచిపోతుందన్నారు. బూత్ స్థాయి స‌మావేశాల‌ను విజ‌య‌వంతం చేసిన రాష్ట్ర క‌మిటీకి అభినంద‌న‌లు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. జులైలో ప్రధాని మోదీ ఏపీకి వస్తారని వెల్లడించారు.

బీజేపీని శ‌క్తిమంత‌మైన పార్టీగా...

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీని శ‌క్తిమంత‌మైన పార్టీగా త‌యారుచేయాలని కేంద్ర మంత్రి వెంక‌య్య నాయుడు అన్నారు. మోదీ పాల‌న‌లో అవినీతికి తావులేదని చెప్పారు. మోదీకి వ్యతిరేకంగా ప‌లువురు చేస్తోన్న త‌ప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఇప్పటికిప్పుడు ఎన్నిక‌లు నిర్వహిస్తే బీజేపీకి 360 స్థానాల‌కు పైగా వ‌స్తాయ‌ని స‌ర్వేలు చెబుతున్నాయని అన్నారు. ఆర్థిక అస‌మాన‌త‌లు త‌గ్గించ‌డం మోదీ ప్రభుత్వ ల‌క్ష్యమ‌న్నారు.

అమిత్ షా ప్రసంగిస్తుండగా..

అమిత్ షా ప్రసంగిస్తుండగా.. ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఆందోళ‌నకు దిగారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. దీంతో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపుచేశారు. ఇదే సందర్భంగా, కొందరు బీజేపీ కార్యకర్తలు.. టీడీపీని వీడండి, బీజేపీని కాపాడండి అన్న అర్థం వచ్చే స్లోగన్‌లతో ప్లకార్డులు ప్రదర్శించి.. హడావుడి చేశారు.

దక్షిణాదిలో పార్టీ బలోపేతానికి ఏపీనే వేదిక కావాలి

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ నుంచి బీజేపీ కొత్త అధ్యాయం ప్రారంభం కావాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఆకాంక్షించారు. బీజేపీ కార్యకర్తల మ‌హా స‌మ్మేళ‌నంలో మాట్లాడిన షా.. విజ‌య‌వాడ అంటే విజ‌యానికి సూచిక అని...ఏపీలో బీజేపీ గెలుపు విజయవాడ నుంచే ప్రారంభం కావాలన్నారు. రాష్ట్రానికి కేంద్రం లక్షా 75 వేల కోట్ల ప్రోత్సహాకాలు అందించినట్లు తెలిపారు. ప్రత్యేక హోదా చట్టం లేదని...హోదా కంటే ప్యాకేజీ ద్వారా ఎక్కువ లబ్ది చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో బూత్‌ స్థాయిలో బీజేపీని బలోపేతం చేస్తామన్నారు.

Don't Miss