Activities calendar

27 May 2017

21:42 - May 27, 2017
21:41 - May 27, 2017

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లో వేర్పాటువాద మిలిటెంట్‌ సంస్థ హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హిజ్బుల్‌ కమాండర్‌ బుర్హాన్‌ వనీ స్థానంలో అతని వారసుడిగా పగ్గాలు చేపట్టిన మరో ఉగ్రవాది సబ్జర్‌ అహ్మద్‌ భట్‌ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. జమ్మూకశ్మీర్‌లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో మొత్తం ఎనిమిది మంది ఉగ్రవాదులు మరణించినట్లు భద్రతా దళాలు తెలిపాయి. పుల్వామా జిల్లాలోని ట్రాల్‌ సెక్టార్‌లో ఇద్దరు, బారాముల్లా జిల్లాలోని రాంపూర్‌ సెక్టార్‌లో ఎల్‌వోసీ మీదుగా చొరబాటుకు ప్రయత్నించిన ఆరుగురు టెర్రరిస్టులను ఆర్మీ మట్టుబెట్టింది. ట్రాల్‌ సెక్టార్‌లో 12 గదులున్న ఓ భవనంలో సబ్జర్‌ అహ్మద్‌ భట్‌తో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతాదళాలు ఆ భవనాన్ని చుట్టుముట్టాయి. ఈ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందగా మరో ఉగ్రవాది తప్పించుకున్నట్లు ఆర్మీవర్గాలు పేర్కొన్నాయి. ఎన్‌కౌంటర్‌లో హతమైన భట్‌ తలపై 10 లక్షల రివార్డ్‌ ఉంది.

21:40 - May 27, 2017

గుంటూరు : గుంటూరు జిల్లా ఫిరంగిపురం సమీపంలోని గొల్లపాలెం మైనింగ్‌ క్వారీలో ఘోర ప్రమాదం జరిగింది. క్వారీలో బ్లాస్టింగ్‌ కోసం గుంతలు తవ్వతుండగా.. పైనుంచి రాళ్లు విరిగి పడటంతో ఆరుగురు కూలీలు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో విజ్ఞానపురానికి చెందిన చినబాలశౌరి, నాగరాజు, ఫిరంగిపురానికి చెందిన రాయప్ప, కృష్ణా జిల్లా దొనబండకు చెందిన శరవణ, ఆంజనేయులు, వీరయ్య మృతిచెందారు.

రూ. 5 లక్షల చొప్పున చంద్రన్న బీమా
విషయం తెలుసుకున్న కలెక్టర్‌ కోన శశిధర్‌, గుంటూరు రూర‌ల్ ఎస్పీ నారాయణ నాయక్‌, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ ఘటనపై విచారణ జరిపిస్తున్నట్టు కలెక్టర్‌ తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున చంద్రన్న బీమా కింద పరిహారం అందజేయనున్నట్టు ప్రకటించారు. రెండు, మూడు రోజులు జిల్లాలోని అన్ని క్వారీలు మూసివేయాలని ఆదేశించారు. ఘటనకు కారణమైన క్వారీకి అనుమతి ఉందో లేదో పరిశీలించాల్సి ఉందని.. అనుమతి లేకపోతే నిర్వాహకులపై చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ అన్నారు.

21:38 - May 27, 2017

హైదరాబాద్ : తెలంగాణాలో అధికార పార్టీకి ప్రజాక్షేత్రంలో తిరుగులేదని ముఖ్యమంత్రి తమ పార్టీ నేతలకు భరోసా కల్పించారు. పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో తాజాగా నిర్వహించిన సర్వే ఫలితాలను ప్రకటించారు.. గత సర్వే వివరాలతో కొందరు నేతలు ఆందోళన చెందినా.... ప్రస్తుత సర్వే వారికి ఊరట ఇచ్చింది.. శాసనసభ్యులు విజయం సాధించడం ఖాయమని ఈ సర్వే తేల్చేసింది.

నెంబర్ వన్ కేసీఆర్
టీఆర్‌ఎస్‌ సర్వే ప్రకారం నేతలందరిలో కేసీఆర్‌ టాప్‌లో ఉన్నారు. 98 శాతంతో ప్రజామోదం పొందారు. ఆ తర్వాతి స్థానంలో సీఎం కొడుకు కేటీఆర్‌ 91 శాతంతో రెండో స్థానంలో నిలిచారు. మరో కీలక నేత హరీష్ రావు 88 శాతంతో మూడో స్థానంలో ఉన్నారు. కూకట్ పల్లి ఎమ్మెల్యే మాదవరం కృష్ణారావు 36 శాతంతో ఈ సర్వేలో ఆఖరి స్థానంలో నిలిచారు. ఈ సర్వే ప్రకారం అధికార పార్టీకి 111 స్థానాలు..... మిత్రపక్షం MIMకు 6 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి రెండు స్థానాలు దక్కనున్నాయి. సర్వే వివరాల్ని ప్రకటించిన సీఎం నేతలకు పలు సూచనలు చేశారు.. ఎమ్మెల్యేలంతా ఎక్కువ సమయం ప్రజల్లో ఉండేలా చూసుకోవాలన్నారు.. జిల్లాల వారిగా సమన్వయంతో వ్యవహరించాలని... నెలకోసారి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు భేటీ కావాలని ఆదేశించారు.. అదే విధంగా పార్టీ కార్యకర్తల కుటుంబాలతో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. 2019 ఎన్నికల్లో ప్రధాని మోదీ హవా కొనసాగదని సీఎం చెప్పుకొచ్చారు..

రాష్ట్రపతి ఎన్నిక
ఇక రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికీ మద్దతు ఇవ్వాలన్న అంశాన్ని కేసీఆర్‌కే వదిలేశారు.. ఈ నిర్ణయానికి సంబంధించిన తీర్మానాన్ని సీఎం తీసుకునేలా పార్టీ శాసనసభా పక్షం ఏకగ్రీవంగా ఆమోదించింది. మొత్తానికి ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉన్నా ప్రతి మూడు నెలలకోసారి సర్వేలు చేస్తూ నేతలను కేసీఆర్‌ ఇప్పటినుంచే అప్రమత్తం చేస్తున్నారు.

21:37 - May 27, 2017

విశాఖ : ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణంలో టీడీపీ మహానాడు ఘనంగా ప్రారంభమైంది.. ఉదయం మహానాడు ప్రారంభ సమయంలో చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్, రక్తదాన శిబిరాలను చంద్రబాబు ప్రారంభించారు. మా తెలుగు తల్లికి మల్లెపూవు దండ పాటతో మహానాడు మొదలైంది.. మహానాడుకు రెండు రాష్ట్రాలనుంచి పెద్దసంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. సభ నిర్వహణ బాధ్యతను శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌ నాయుడు, ఎమ్మెల్యే జయనాగేశ్వర్‌ రెడ్డి చూసుకున్నారు..

ఏదైనా చేయగల సత్తా
టీడీపీ 36వ ఏడాదిలోకి అడుగుపెట్టిన యువ పార్టీ అని.. ఏదైనా చేయగల సత్తా పార్టీకి ఉందని చంద్రబాబు అన్నారు. తెలుగు వారు గర్వపడేలా పోలవరం నిర్మించుకుందామని చెప్పారు.. తెలంగాణ టీడీపీ నేతలకు అన్ని విధాలుగా సహకారం అందిస్తామని, తెలంగాణలో ప్రజాసమస్యలపై పోరాడతామని స్పష్టం చేశారు. హైటెక్ సిటీ తెలుగువారి జీవితాల్లో వెలుగునింపిందని చంద్రబాబు చెప్పారు.. ఐటీ వల్ల ఎంతోమంది ఉపాధి పొందుతున్నారని గుర్తుచేశారు.. హైదరాబాద్‌లో అధిక ఆదాయం రావడానికి గతంలో టీడీపీ చేసిన అభివృద్ధేఅని తెలిపారు.

నోరూరించే వంటకాలు
మహానాడులో వంటకాలు అందరికీ నోరూరించాయి.. యాపిల్‌ హల్వా, తాపేశ్వరం కాజా, దోసకాయ, టమాట పప్పు, ఉలవచారు వంటి వంటకాలను అందరూ రుచిచూశారు. మొదటి రోజు భోజన కమిటీ నేతృత్వంలో 18 రకాల వంటకాలను ఏర్పాటు చేశారు. భోజన కమిటీ ఛైర్మన్‌ అయ్యన్న పాత్రుడు, ఎంపీ మాగంటి బాబు, ఎమ్మెల్యే వెలగపూడి, కేఎస్‌ఎన్‌రాజు భోజనశాలలోనే ఉంటూ పర్యవేక్షించారు.మహానాడులో తనను అవమానించారంటూ సినీ నటి కవిత కన్నీటిపర్యంతమయ్యారు.. కార్యక్రమానికి ఆహ్వానించి వేదికపై కూర్చునే అవకాశం ఇవ్వలేదంటూ తిరిగి వెళ్లిపోయారు.మహానాడును విజయవంతంచేసేందుకు సీనియర్‌ నేతలు పనుల్ని పర్యవేక్షించగా.. యువ నేతలు కార్యకర్తల్లా స్వయంగా ఏర్పాట్లను చూసుకున్నారు.. మహానాడులో చంద్రబాబు, లోకేశ్‌ భారీ కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సోమవారం ముగియనున్న మహానాడు.. రెండురోజుల పాటు.. పలు అంశాలపై చర్చించనున్నారు. 

20:59 - May 27, 2017
20:53 - May 27, 2017
20:52 - May 27, 2017

ఎంత మంది బలి అవ్వాలి....? ఎందరికి ఈ అన్యాయం జరగాలి....? పరువు పేరుతో సిగ్గు ఎగ్గు లేకుండా కుల దురహకారమనే అదిమాజాతి లక్షాణాలతో విర్రవిగే కొందరు పశుప్రయులు చేస్తున్నా ఈ దారుణాలకు అంతం ఎప్పుడు...? నాడు కంచకర్ల కోటేశ్ నిన్న మంథని మధుకుర్, రాజేష్ ఇప్పుడు నరేష్ ప్రభుత్వాలలో చలనం రాదా...? ఖాకీ కళ్లకున్న పొరలు విడవా...? అదిపాత్య కులల అలోచన తీరులో మార్పచ్చేదేపుడు..పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

టీడీపీ యపొలిట్ బ్యూరో భేటీ

విశాఖ : మహానాడు అనంతరం టీడీపీ పొలిట్ బ్యూరో భేటీ అయింది. ఈ భేటీలో గవర్నర్ కోటాలో ఖాళీ కానున్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై చర్చించారు.

19:05 - May 27, 2017
18:36 - May 27, 2017
18:20 - May 27, 2017
18:13 - May 27, 2017

యాదాద్రి : జిల్లాలో సంచలనం రేపిన నరేష్ అదృశ్యం కేసు మిస్టరీ విడింది. మే 2న స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డి నరేష్ ను రాడ్ తో మోది హత్య చేశాడని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. నరేష్ అదృశ్యమైన రాత్రే హత్య చేసిన శ్రీనివాసరెడ్డి మహేష్ ను హత్య చేసినట్లు ఆయన చెప్పారు. శ్రీనివాసరెడ్డికి సోదరుడు, లారీ డ్రైవర్ సత్తిరెడ్డి సహిరించారని సీపీ వెల్లడించారు. హత్య అనంతరం నరేష్ మృతదేహన్ని ట్రాక్టర్ లోడ్ కంది కట్టెల్లో వేసి నిప్పు అంటించారు. కంది కట్టెలు మండకపోవడంతో వారు అత్మకూరు వెళ్లి పెట్రోల్ బంక్ లో 5 లీటర్ల పెట్రోల్ తీసుకొచ్చి టైర్లు వేసి మృతదేహన్ని కాల్చేశారు. మరుసటి రోజు ఉదయం నరేష్ అస్థిలకను మూసీలో శ్రీనివాసరెడ్డి కలిపేశారు. మే 16న స్వాతి ఆత్మహత్య చేసుకుందని, స్వాతి ఆత్మహత్యపై విచారణ జరుపుతున్నామని, స్వాతి వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ పంపామని సీపీ తెలిపారు. పూర్తి విచారణ కోసం నిందితుల రిమాండ్ తీసుకుంటామని ప్రటించారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.  

నరేష్ హత్యపై రాచకొండ సీపీ ప్రెస్ మీట్

రాచకొండ : నరేష్ హత్యపై రాచకొండ సీపీ ప్రెస్ మీట్ నిర్వహించారు. మే 2న అదృశ్యమైన హత్యగావించినట్లు తమ విచారణలో తేలిందని సీపీ మహేష్ భగవత్ తెలిపారు. 

17:22 - May 27, 2017

యాదాద్రిలో ప్రజా సంఘాల భారీ ర్యాలీ

యాదాద్రి : నరేష్ హత్యపై జిల్లా కేంద్రంలో సంఘాల ఆధ్యర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బాబు జగ్జీవన్ రాం విగ్రహం వద్ద రాస్తారోకో చేశారు. స్వాతి మృతిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. నరేష్ కేసులో నిర్లక్ష్యంగా వ్యవరించిన భువనగిరి రామన్నపేట సీఐలు, ఎస్పైలను సస్పెండ్ చేయాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేశారు. 

కొనసాగుతున్న టీఆర్ఎస్ఎల్పీ సమావేశం

హైదరాబాద్ : టీఆర్ఎస్ఎల్పీ సమావేశం కొనసాగుతోంది. పార్టీ కమిటీలు, రాష్ట్ర ఆవిర్భావ వేడుకలపై చర్చిస్తున్నారు. సీఎం కేసీఆర్ జిల్లా వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. సర్వే వివరాలను సమీక్షలో కేసీఆర్ వెల్లడిస్తున్నారు. 

16:46 - May 27, 2017

యాదాద్రి : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నరేష్‌ అదృశ్యం కేసులో 10టీవీ చెప్పిందే నిజమైంది. స్వాతి తండ్రి శ్రీనివాస్‌రెడ్డే.. నరేష్‌ను కిరాతకంగా హత్య చేశాడు. నరేష్‌ మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా దహనం చేసి బూడిదను మూసీలో కలిపారు. పోలీసుల దర్యాప్తులో స్వాతి తండ్రి శ్రీనివాస్‌రెడ్డి నేరాన్ని అంగీకరించడంతో అతడిని అరెస్ట్‌ చేశారు. మే 2 నుంచి కనిపించకుండా పోయిన నరేష్‌ హత్యకు గురయ్యాడు. స్వాతి తండ్రి శ్రీనివాస్‌రెడ్డే నరేష్‌ను హత్య చేసినట్టు పోలీసులు నిర్దారించారు. నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి తన నేరాన్ని అంగీకరించాడు. దీంతో అతడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. శ్రీనివాసరెడ్డి సోదరుడు, సోదరుడి కుమారుల పేర్లనూ నిందితుల జాబితాల్లో చేర్చారు. ఆద్యంతం మలుపులతో కూడిన ప్రేమగాథ చివరికి తీవ్ర విషాదాంతంగా ముగిసింది.

నరేష్‌ కుటుంబంపై కేసు పెట్టిన శ్రీనివాస్‌రెడ్డి
ఆత్మకూర్‌ ఎం మండలం లింగరాజుపల్లికి చెందిన తుమ్మల స్వాతి, పల్లెర్లకు చెందిన అంబోజి నరేష్‌ మూడు నెలల క్రితం కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నారు. ముంబైలో కాపురం పెట్టారు. అయితే వీరి వివాహానికి నరేష్‌ కుటుంబ సభ్యులు అంగీకరించినా.... స్వాతి తల్లిదండ్రులకు ఇష్టం లేదు. దీంతో ఎలాగైనా నరేష్‌ను అంతమొందించి తన కుమార్తెను తమ దగ్గరికి తెచ్చుకోవాలనుకున్నారు. దీంతో నరేష్‌ మర్డర్‌కు పక్కా స్కెచ్‌ వేశారు. వేసుకున్న పథకం ప్రకారం స్వాతి, నరేష్‌ పెళ్లికి అంగీకరిస్తున్నట్టు ముంబై నుంచి రప్పించారు. స్వాతి పుట్టింటికి చేరగా... నరేష్‌ మాత్రం అదృశ్యమయ్యాడు. నరేష్‌ ఆచూకీ తెలియకపోవడంతో స్వాతి తల్లిదండ్రులను అనుమానించింది. మనస్తాపంతో యాసిడ్‌ తాగి ఆత్మహత్యాయత్నం చేయగా.. తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. స్వాతి ప్రాణాప్రాయం నుంచి బయటపడింది. 16వ తేదీన తెల్లవారుజామున స్వాతి ఇంట్లోని మరుగుదొడ్డిలో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. కొనప్రాణాలతో ఉన్న స్వాతిని తల్లిదండ్రులు భువనగిరి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా చనిపోయింది. స్వాతిది హత్యా లేక ఆత్మహత్యా అన్న అనుమానాలు రేకెత్తాయి. అయితే స్వాతి తల్లిదండ్రులు మాత్రం వరకట్నం కోసం నరేష్‌, అతడి కుటుంబం వేధించడంవల్లే ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హైకోర్టును ఆశ్రయించారు
మరోవైపు నరేష్‌ అదృశ్యం వెనుక స్వాతి కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని తల్లిదండ్రులు, దళితసంఘాలు అనుమానం వ్యక్తం చేశాయి. దీనిపై విచారణ వేగవంతం చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. జూన్‌ 1లోగా నరేష్‌ ఆచూకీ కనిపెట్టాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. కోర్టు గడువు సమీపిస్తుండడంతో చేసేదేమీలేక పోలీసులు శ్రీనివాస్‌రెడ్డిని తమదైన స్టైల్‌లో విచారించగా అసలు నిజం బయటపడింది. నరేష్‌ను తామే హత్యచేసినట్టు శ్రీనివాస్‌రెడ్డి అంగీకరించాడు. నరేష్‌ను చంపి మృతదేహాన్ని కాల్చి.. బూడిదను మూసీలో కలిపారు. నరేష్‌ చనిపోయాడని తెలియడంతో అతని తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకును హత్యచేశారంటూ కన్నీరుమున్నీరయ్యారు. శ్రీనివాస్‌రెడ్డిని, అతని కుటుంబ సభ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు స్వాతిది ఆత్మహత్యా లేక ఆమెను కూడా హత్య చేశారా అనేది అనుమానాలకు తావిస్తోంది. స్వాతి, నరేష్‌ల ప్రేమ కథ విషాదాంతంగా ముగియడం.. జిల్లాలో సంచలనంగా మారింది. 

16:39 - May 27, 2017

నరేష్ హత్య  ముమ్మాటికి పోలీసుల తప్పే అని కేవీపీఎస్ అధ్యక్షుడు భాస్కర్ అన్నారు. పెళ్లి చేసుకునే హక్కును సమాజం వ్యతిరేకిస్తుందని సమాజికవేత దేవి అన్నారు. హిందు భావజాలంలో వర్ణ సంకరనికి ఒప్పుకోరని సామాజికవేత కొలిపూడి ప్రసాద్ అన్నారు. టెన్ టివి చర్చలో వారు మాట్లాడారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

గుంటూరు ప్రమాదస్థలాన్ని పరిశీలించిన నన్నపనేని

గుంటూరు : జిల్లాలోపి ఫిరంగిపురంలో జరిగిన క్వారీ ప్రమాద స్థలాన్ని నన్నపనేని రాజకుమారి పరిశీలించారు. ప్రమాదంపై విచారణ జపాల్సిన అవసరం ఉందని ఆమె తెలిపారు. 

16:09 - May 27, 2017
15:47 - May 27, 2017

విజయవాడ : సంతల్లో పశువుల అమ్మకాలపై బీజేపీ షరతులు విధించడం సరికాదని...సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పీ మధు అన్నారు.. మత దురంహంకారాన్ని బీజేపీ నేతలు ప్రజలపై రుద్దుతున్నారని... దీనిని ప్రజలంతా ఖండించాలని సూచించారు.. కేంద్రం లక్షాల 5వేల కోట్లను ఏపీకి ఇచ్చినట్లు చెబుతున్నారని... ఆ డబ్బును చేశారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.. బీజేపీ నిర్ణయాలతో వ్యవసాయానికి పెద్దగా ఒరిగిందేమీలేదని విజయవాడలో విమర్శించారు.

15:40 - May 27, 2017
15:11 - May 27, 2017

యాదాద్రి : నల్లగొండ జిల్లాలో కుల దురహంకార హత్య జరిగింది. నరేష్ స్వాతి నరేష్ ప్రేమకథ విషాదాంతంగా ముగిసింది. మే1 నుంచి కనిపించకుండా పోయిన నరేష్ హత్యకు గురైనట్టు పోలీసులు నిర్ధారించారు. నరేష్ హత్య చేసి పొలంలోనే దహనం చేశారు. నరేష్ హత్య చేసింది శ్రీనివాపరెడ్డి అని పోలీసులు గుర్తించారు. మొన్న స్వాతి ఆత్మహత్య చేసుకుంది. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

టీఆర్ఎస్ఎల్పీ సమావేశం ప్రారంభం

హైదరాబాద్ : టీఆర్ఎస్ఎల్పీ సమావేశం ప్రారంభమైయింది. ఈ సమావేశంలో పార్టీ కమిటీలు, రాష్ట్ర ఆవిర్భావ వేడుకలపై చర్చిస్తున్నారు. 

14:28 - May 27, 2017
14:27 - May 27, 2017

గుంటూరు: జిల్లాలోని ఫిరంగిపురం క్వారీలో ప్రమాదం జరిగింది. క్వారీ లో ఒక్కసారిగా కుప్ప కూలడంతో ఆరుగురు కార్మికులు మృతి చెందారు. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

13:56 - May 27, 2017
13:49 - May 27, 2017
13:48 - May 27, 2017

తూ.గో : జులై 27న కిర్లంపూడి నుంచి 'చావో-రేవో' పేరుతో అమరావతికి పాదయాత్ర చేయనున్నట్లు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. చంద్రబాబుకి జ్ఞాపకశక్తి తగ్గిపోయిందని ఎద్దేవా చేశారు. కాపులకు ఇచ్చిన హామీలను మర్చిపోయారని విమర్శించారు. కాపులకు అన్యాయం చేసిన వాళ్లకు బుద్ధి చెప్తాం అని ముద్రగడ హెచ్చరించారు.

13:39 - May 27, 2017

గుంటూరు : జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే... ఫిరంగిపురం సమీపంలో రాళ్ల క్వారి ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ కొండ చర్యల కింద 8గురు చిక్కుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనలో 6గురు చనిపోయినట్లు అధికారులు తెలియజేశారు. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఇప్పటి వరకు ముగ్గురు మృతదేహాలను వెలికి తీశారు. మిగతా వారి కోసం ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు.

తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన ఖరారు

హైదరాబాద్: జూన్ 1సంగారెడ్డి జరగనున్న తెలంగాణ ప్రజాగర్జన సభకు రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. హైదరాబాద్ నుండి రోడ్డు మార్గం ద్వారా రాహుల్ గాంధీ సంగారెడ్డికి చేరుకోనున్నారు.

మహానాడుకు పిలిచి అవమానించారు : నటి కవిత

విశాఖ: టిడిపి మహానాడులో నటి కవితను వేదికపైకి ఆహ్వానించకపోవడంతో మనస్థాపం చెంది మహానాడు ప్రాంగణం నుంచి అలిగి వెళ్లిపోయింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహానాడుకు పిలిచి అవమానించారని కవిత ఆవేదన వ్యక్తం చేసింది. విపక్షంలో ఉన్నపుడు వేదికపైకి ఆహ్వానించిన నేతలు అధికారంలోకి వచ్చాక చిన్న చూపు చూస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో ఉండాలా లేదా అన్నదానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు.

12:51 - May 27, 2017

నల్గొండ : తమ కుమారుడు నరేశ్‌ను.. స్వాతి తండ్రే ఏదో చేసి ఉంటాడని.. నరేశ్‌ తల్లిదండ్రులు ముందునుంచీ అనుమానిస్తునే ఉన్నారు. ఇదే విషయాన్ని వారు పదే పదే.. పలు వేదికలపై వ్యక్తీకరిస్తూ వచ్చారు. ఈనెల 18న టెన్‌టీవీ స్టుడియోలో చర్చ సందర్భంగానూ వారు.. స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డిపైనే అనుమానం వ్యక్తం చేశారు. ఆరోజు.. నరేశ్‌ తల్లిదండ్రులు ఏమన్నారో ఇప్పుడు విందాం.

12:46 - May 27, 2017

భువనగిరి : జిల్లాలో అగ్ర కుల దురహంకారానికి, నరేశ్‌-స్వాతిల ప్రేమకథ విషాదాంతమైంది. మే 1 నుంచి కనిపించకుండా పోయిన నరేష్‌ హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. స్వాతి త్రండి శ్రీనివాసరెడ్డే నరేశ్‌ను చంపినట్టు పోలీసుల విచారణలో తెలిసింది. నరేశ్‌ను హత్యచేసి తన పొలంలోనే కాల్చివేశామని శ్రీనివాసరెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది. ఈ హత్యలో శ్రీనివాసరెడ్డికి మరో ఇద్దరు బంధువులు కూడా సహకరించినట్టు పోలీసు ఇంటరాగేషన్‌లో బయటపడింది. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

12:43 - May 27, 2017

హైదరాబాద్: తెలంగాణ లో రోజు రోజుకు పెరిగిపోతున్న కులదురహంకార హత్యలు, మోదీ పాలనకు మూడేళ్లు ముగిసిన సందర్భంగా కేంద్రం ప్రకటించిన గోవధ నిషేధం పై దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ఇదే అంశంపై'10టివి' ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో ప్రొ.కంచె ఐలయ్య పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

ఘనంగా ప్రారంభమైన మహానాడు

విశాఖ: ఘనంగా టిడిపి మహానాడు కార్యక్రమం ప్రారంభం అయ్యింది. టిడిపి జెండాను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఫోటో ఎగ్జిబిషన్, రక్తదాన శిబిరాన్ని చంద్రబాబు ప్రారంభించారు.

'స్వాతి తండ్రే నరేష్ ను హత్య చేశాడు'

భువనగిరి :స్వాతి, నరేష్ ల ప్రేమకథ విషాదంగా ముగిసింది. నరేష్ ను స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డే హత్య చేశాడు. ఇతనికి మరో ఇద్దరు సహకరించారు. వీరంతా కలసి నరేష్ ను నరికి చంపి, కాల్చి, వారి పొలంలోనే పూడ్చి పెట్టారు. పోలీసు విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. ప్రస్తుతం స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డి ఎల్బీనగర్ డీసీపీ స్పెషల్ టీమ్ అదుపులో ఉన్నాడు. హత్యకు ముందు స్వాతితో నరేష్ కు ఫోన్ చేయించాడు ఆమె తండ్రి. వివాహం జరిపిస్తామంటూ నమ్మించాడు. శ్రీనివాసరెడ్డి మాటలను నమ్మి వచ్చిన నరేష్ ను హత్య చేసి, కాల్చి, పాతిపెట్టారు. ఈ నెల 16న స్వాతి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.

ఎన్ కౌంటర్ లో 6గురు ఉగ్రవాదుల హతం

జమ్మూకశ్మీర్ : ఎన్ కౌంటర్ లో మరో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. రాంపూర్ వద్ద భద్రతాబలగాల కాల్పుల్లో మృతుల సంఖ్య 6కు చేరింది.

చంద్రబాబుకి జ్ఞాపకశక్తి తగ్గిపోయింది:ముద్రగడ

తూ.గో : జులై 27న కిర్లంపూడి నుంచి 'చావో-రేవో' పేరుతో అమరావతికి పాదయాత్ర చేయనున్నట్లు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. సీఎం చంద్రబాబుకి జ్ఞాపకశక్తి తగ్గిపోయిందని ఎద్దేవా చేశారు. కాపులకు ఇచ్చిన హామీలను మర్చిపోయారని విమర్శించారు. కాపులకు అన్యాయం చేసిన వాల్లకు బుద్ధి చెప్తాం అని ముద్రగడ హెచ్చరించారు.

10:52 - May 27, 2017

నల్గొండ :వన్ టౌన్ పీఎస్ లో టీఆర్ ఎస్ నేతలపై కేసు నమోదు అయ్యింది. 16వ తేదీన బత్తాయి మార్కెట్ శంకుస్థాపన సందర్భంగా జరిగిన ఘర్షణలో టీఆర్ ఎస్ నియోజకవర్గ ఇన్ ఛార్జి నర్శింహారెడ్డి, ఎమ్మెల్యే వీరేశం భార్య పుష్ప సహా 11 మంది కేసు నమోదు అయ్యింది.

10:43 - May 27, 2017

యాదాద్రి భువనగిరి : స్వాతి, నరేష్ ల ప్రేమకథ విషాదంగా ముగిసింది. నరేష్ ను స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డే హత్య చేశాడు. ఇతనికి మరో ఇద్దరు సహకరించారు. వీరంతా కలసి నరేష్ ను నరికి చంపి, కాల్చి, వారి పొలంలోనే పూడ్చి పెట్టారు. పోలీసు విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. ప్రస్తుతం స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డి ఎల్బీనగర్ డీసీపీ స్పెషల్ టీమ్ అదుపులో ఉన్నాడు. హత్యకు ముందు స్వాతితో నరేష్ కు ఫోన్ చేయించాడు ఆమె తండ్రి. వివాహం జరిపిస్తామంటూ నమ్మించాడు. శ్రీనివాసరెడ్డి మాటలను నమ్మి వచ్చిన నరేష్ ను హత్య చేసి, కాల్చి, పాతిపెట్టారు. ఈ నెల 16న స్వాతి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

విశాఖకు బయలుదేరిన సీఎం చంద్రబాబు

కృష్ణా : కాసేపట్లో ప్రారంభం కానున్న టిడిపి మహానాడు సభకు హాజరయ్యేందకు గన్నవరం ఎయిర్ పోర్టు నుండి సీఎం చంద్రబాబు విశాఖకు బయలు దేరారు.

ఎదురు కాల్పుల్లో 4గురు ఉగ్రవాదులు హతం

జ‌మ్మూక‌శ్మీర్‌ : రాంపూర్ సెక్టార్‌లో భ‌ద్ర‌తా ద‌ళాలు న‌లుగురు ఉగ్ర‌వాదుల్ని హ‌త‌మార్చాయి. ఇవాళ ఉద‌యం ఈ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. నియంత్ర‌ణ రేఖ వ‌ద్ద ఉగ్ర‌వాదులు చొర‌బాటుకు ప్ర‌య‌త్నించారు. పుల్వామా జిల్లాలోని త్రాల్ ఏరియాలోనూ ముగ్గురు ఉగ్ర‌వాదులు చొర‌బ‌డ్డారు. అక్క‌డ భ‌ద్ర‌తా ద‌ళాలు ఫైరింగ్‌కు దిగాయి. శుక్ర‌వారం రోజు యూరీ సెక్టార్‌లో దాడుల‌కు దిగిన పాక్ బోర్డ‌ర్ యాక్ష‌న్ టీమ్‌ను భార‌తీయ ద‌ళాలు తిప్పికొట్టిన విష‌యం తెలిసిందే. రాంపూర్ సెక్టార్‌లో ఇంకా ఎదురుకాల్పులు జ‌రుగుతున్న‌ట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.

09:37 - May 27, 2017
09:36 - May 27, 2017

అనంతపురం : తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై సోషల్‌ మీడియాలో అనుచిత వ్యాఖలు చేశారంటూ.. ఇప్పల రవీంద్ర అనే యువకుణ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే టీడీపీ పై కామెంట్లు చేశారని రవీంద్ర వైజాగ్‌ సెంట్రల్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్నాడు. జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఫిర్యాదుతో రవీంద్రను అదుపులోకి తీసుకున్న పోలీసులు తాడిపత్రికి తరలించారు. అయితే.. వైసీపీ శ్రేణులు నిరసనకు దిగుతాయన్న అనుమానంతో ముందుజాగ్రత్తగా తాడిపత్రిలో భారీగా పోలీసులు మోహరించారు.

09:32 - May 27, 2017

విశాఖ : సాగర తీరం.. విశాఖ నగరం పసుపు వర్ణంగా మారింది. నేటి నుంచి మూడు రోజులపాటు 36వ మహానాడు విశాఖలో జరగనుంది. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఈ మహానాడులో ఏపీ రాష్ట్రాభివృద్ధి, ప్రభుత్వ విజయాలపై చర్చించనున్నారు. అలాగే పార్టీ భవిష్యత్‌ కార్యాచరణపై దృష్టి సారిస్తారు. ఈ మహానాడులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 16,.. తెలంగాణకు చెందిన 8 తీర్మానాలపై చర్చిస్తారు. మహానాడుకు 30 వేల మందికి పైగా ప్రతినిధులు, కార్యకర్తలు హాజరు కానున్నారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

08:54 - May 27, 2017

అనంతపురం: గుత్తి మండలం వన్నె దొడ్డి వద్ద జాతీయ రహదారిపై టీఎస్‌ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. 48 మంది ప్రయాణికులతో హైదరాబాద్-బెంగళూరు వెళ్తున్న టీఎస్‌ఆర్టీసీ గరుడ బస్సు ఓ లారీని ఓవర్ టేక్ చేయబోయి పది అడుగుల ఎత్తైన ఫ్లైఓవర్ నుంచి కింద పడింది.ఈ ఘటన శనివారం వేకువజామున 3.30 నుండి 4గంటల సమయంలో జరిగింది. ఈ ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయాలైన వారిని గుత్తి ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం కర్నూల్ ఆస్పత్రికి తరలి చికిత్స అందిస్తున్నారు.

'జేసీ ప్రభాకర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు'.వ్యక్తి అరెస్ట్

అనంతపురం: జేసీ ప్రభాకర్ రెడ్డిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఇప్పాల రవీందర్ పై ఆరోపణలు వచ్చాయి. విశాఖ సెంట్రల్ జైల్లో ఉన్న ఇప్పాల రవీందర్ ను తాడిపత్రి పోలీసులు అదుపులోకి తాడిపత్రికి తరలిస్తున్నారు.

నల్గొండ్ వన్ టౌన్ పీఎస్ లో టీఆర్ ఎస్ నేతలపై కేసు

నల్గొండ :వన్ టౌన్ పీఎస్ లో టీఆర్ ఎస్ నేతలపై కేసు నమోదు అయ్యింది. 16వ తేదీన బత్తాయి మార్కెట్ శంకుస్థాపన సందర్భంగా జరిగిన ఘర్షణలో టీఆర్ ఎస్ నియోజకవర్గ ఇన్ ఛార్జి నర్శింహారెడ్డి, ఎమ్మెల్యే వీరేశం భార్య పుష్ప సహా 11 మంది కేసు నమోదు అయ్యింది.

30న దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్:ఏఐవోసీడీ

హైదరాబాద్: ఈ నెల 30న దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు మూతపడనున్నాయి. మందుల విక్రయాలపై ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించడం, మార్జిన్‌ను తగ్గించడాన్ని తగ్గించడాన్ని వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్స్ (ఏఐవోసీడీ) 30న ఒక రోజు పాటు బంద్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ బంద్‌లో 9 లక్షల మంది పాల్గొననున్నట్టు ఏఐవోసీడీ ప్రతినిధులు తెలిపారు. నిబంధనల మార్పులపై ప్రభుత్వాన్ని కలిసి పలుమార్లు విన్నవించినప్పటికీ ఎటువంటి స్పందన లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.

చెట్టును ఢీ కొన్న కారు : 8మంది మృతి

మహారాష్ట్ర : అహ్మద్ నగర్ - మన్మాడ్ ఎన్ హెచ్ పై ఓ కారు చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందినట్లు సమాచారం.

భద్రతాదళాలు - ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు

జమ్మూకశ్మీర్ : ట్రాల్ ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులు చొరబడ్డారు. ఉగ్రవాదులు ఉన్న ప్రాంతాన్ని భద్రతా దళాలు చుట్టు ముట్టాయి. దీంతో ఆ ప్రాంతంలో భద్రతాదళాలు - ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

విశాఖ: తెలుగు రాష్ట్రాల్లో ఎండతీవ్రత కొనసాగింది. వడగాడ్పులు వీచాయి. తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. రాత్రి ఉష్ణోగ్రతలు సైతం సాధారణానికి 2-3 డిగ్రీలు మించి నమోదయ్యాయి. శనివారం ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు, తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడేందుకు ఆస్కారం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఈ వాతావరణం మరో నాలుగు రోజులపాటు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేసింది.

07:44 - May 27, 2017

హైదరాబాద్: మోదీ సర్కార్‌ మరో వివాదస్పద నిర్ణయం తీసుకుంది. పశువధపై దేశవ్యాప్త నిషేధం విధించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం ఇక నుంచి పశువులను వ్యవసాయ అవసరాల కోసమే విక్రయించాల్సి ఉంటుంది. వ్యవసాయ భూములు ఉన్న రైతులకు మాత్రమే పశువులను విక్రయించాలి. తాను వ్యవసాయ అవసరాల కోసమే కొనుగోలు చేస్తున్నట్టు రైతు హామీపత్రం అందజేయాల్సి ఉంటుంది. వధించడం కోసం కాదని రాతపూర్వంగా స్పష్టం చేయాలి. కేంద్రం నిర్ణయంతో మాంసం ఎగుమతుల మార్కెట్‌పైనా తీవ్ర ప్రభావం పడుతుందని ఈ రంగంలోని నిపుణులు అంచనా వేస్తున్నారు. అభ్యుదయ, ప్రజాతంత్ర సంస్థలు, దళిత సంఘాలు కేంద్ర నిర్ణయంపై మండిపడుతున్నాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్దమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే అంశంపై 'న్యూస్ మార్నింగ్ 'లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో సీనియర్ జర్నలిస్ట్ వినయ్ కుమార్, రాజేష్ గౌడ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, కుమార్ బిజెపి నేత పాల్గొన్నారు. అంతక ముందు నేటి నుండి విశాఖలో ప్రారంభం కానున్న టిడిపి మహానాడులో ఏఏ అంశాలను చర్చించ బోతున్నారో వాటి గురించి టిడిపి అధికార ప్రతినిధి దుర్గా ప్రసాద్ ఫోన్ ద్వారా వివరించారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

గోదావరిఖని ఎన్టీపీసీ వద్ద రోడ్డు ప్రమాదం: ఇద్దరి మృతి

పెద్దపల్లి : గోదావరిఖని ఎన్టీపీసీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రాజీవ్ రహదారిపై కారును లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో పెద్దపల్లికి చెందిన న్యాయవాది షబ్బీర్ ఉన్నట్లు తెలుస్తోంది.

గరుడ బస్సుబోల్తా: 15మందికి గాయాలు

అనంతపురం: గుత్తి మండలం వన్నెదొడ్డి సమీపంలో గరుడ బస్సు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో 15 మందికి తీవ్ర గాయాలు అవ్వగా.. వారిలో ముగ్గురి పరిస్థితి విషయంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

07:07 - May 27, 2017

ఢిల్లీ : 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయడమే తమ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోది స్పష్టం చేశారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా అస్సాంలో పర్యటించిన మోది... పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన దేశంలోనే అత్యంత పొడవైన ధోలా-సదియా వారధిని ఆయన ప్రారంభించారు.

ఎన్డీయే అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తి ...

కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోది అస్సాంలో పర్యటించారు. దేశంలోనే అత్యంత పొడవైన ధోలా-సదియా వారధిని మోది ప్రారంభించారు.

ఈ వంతెనకు భూపేన్‌ హజారికా పేరు...

ఈ వంతెనకు భూపేన్‌ హజారికా పేరు పెడుతున్నట్లు ప్రధాని ప్రకటించారు. 9 కిలోమీటర్ల పొడవున్న ఈ వంతెన దేశానికే గర్వకారమని... అసోం, అరుణాచల్‌ రాష్ట్రాల అభివృద్ధిలో ఈ బ్రిడ్జి కీలక పాత్ర పోషిస్తుందని మోది చెప్పారు. ఈ వంతెనతో అస్సాం-అరుణాచల్‌ ప్రదేశ్‌ల మధ్య రోడ్డు ప్రయాణం 165 కి.మీ.మేర తగ్గడమే కాకుండా.. ప్రయాణ సమయం 6 గంటల నుంచి గంటకు తగ్గనుంది. వంతెన నిర్మాణం ఆలస్యానికి కాంగ్రెసే కారణమని మోది ఆరోపించారు. 2004లో వాజ్‌పేయి తిరిగి అధికారంలోకి వస్తే 10 ఏళ్ల క్రితమే వంతెన పూర్తయ్యేదని...ఇప్పుడు ఆయన కలలను సాకారం చేశామని ప్రధాని చెప్పుకొచ్చారు.

ధీమాజీలో భారత వ్యవసాయ పరిశోధనా కేంద్రానికి శంఖుస్థాపన...

అనంతరం ఆయన ధీమాజీలో భారత వ్యవసాయ పరిశోధనా కేంద్రానికి శంఖుస్థాపన చేశారు. 2022 నాటికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్నందున రైతుల ఆదాయాన్ని ద్విగుణీకృతం చేయడమే తమ లక్ష్యమని ప్రధాని స్పష్టం చేశారు. వ్యవసాయరంగంలో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి ఆధునిక టెక్నాలజీ ఉపయోగించాలని రైతులకు ఆయన పిలుపునిచ్చారు.

అస్సాంలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటై నేటితో ఏడాది పూర్తి...

అస్సాంలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటై నేటితో ఏడాది పూర్తి చేసుకుందని ప్రధాని అన్నారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈశాన్య రాష్ట్రాలు పర్యాటకంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మోది పేర్కొన్నారు.

రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయడమే లక్ష్యం: మోదీ

ఢిల్లీ : 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయడమే తమ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోది స్పష్టం చేశారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా అస్సాంలో పర్యటించిన మోది... పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన దేశంలోనే అత్యంత పొడవైన ధోలా-సదియా వారధిని ఆయన ప్రారంభించారు.

07:03 - May 27, 2017

ఏలూరు : కొల్లేరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు వీరంగం సృష్టించారు. కొల్లేరు నిషేధిత ప్రాంతంలో ఇళ్ల స్థలాలకంటూ ప్రొక్లెయిన్లతో తవ్వేయడానికి ప్రయత్నించారు. అడ్డుకున్న ఫారెస్ట్ అధికారులను, పోలీసులను నిర్బందించారు. ఎమ్మెల్యే అండదండలతో మరో మాఫియాకు తెరతీస్తున్నారు చింతమనేని అనుచరులు.

కొల్లేరు అభయారణ్యంలో అక్రమంగా చేపల చెరువుల తవ్వకాలు

పశ్చిమ గోదావరి : జిల్లా ఏలూరు మండలంలోని పైడిచింతపాడు మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొల్లేరు అభయారణ్యంలో అక్రమంగా చేపల చెరువుల తవ్వకాల కోసం తరలిస్తున్నారన్న అనుమానంతో అటవీశాఖ అధికారులు ఏలూరు అశోక్‌నగర్‌ వంతెన వద్ద లారీపై తీసుకెళ్తున్న జేసీబీని నిలిపివేశారు. దీంతో జేసీబీ ఓనర్‌కు, అటవీశాఖ అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. లారీపై తరలిస్తున్న జేసీబీని అశోక్‌నగర్‌ వంతెన వద్ద నిలిపివేయడంతో ఏలూరులో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

యథేచ్చగా చెరువులు మాఫియా

ప్రభుత్వం అక్రమ చేపల చెరువులను కొల్లేరులో తొలగించినా ప్రస్తుతం ప్రజా ప్రతినిధుల అండదండలతో వాళ్ళ అనుచరులు యథేచ్ఛగా చెరువుల మాఫియాకు పాల్పడుతున్నారు. దెందులూరు నియోజకవర్గం పరిధిలో కొల్లేరు చాలా వరకు విస్తరించి ఉంది. దీంతో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరచు చేపల చెరువుల తవ్వకం కోసం జిల్లా రెవెన్యూ, ఫారెస్ట్, పోలీసు అధికారులతో ఢీ అంటే ఢీ అంటూ కయ్యానికి కాలుదువ్వుతున్నారు. ఇక ఆయన పేరుతో ఎమ్మెల్యే అనుచరులు కొల్లేరులో వీరంగం సృష్టిస్తున్నారు. ఏలూరు మండలంలోని పైడిచింతపాడులో నిషేధిత ప్రాంతంలో ఇళ్ల స్థలాల పేరుతో వెంచర్ వేయడానికి ప్రయత్నించారు. రెండు భారీ ప్రొక్లెయిన్‌లను పైడిచింతపాడు తరలించి పనులు చేస్తుండటంతో చెరువులు తవ్వుతున్నారనే సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు, పోలీసులు పనులను నిలిపివేసి ప్రొక్లెయిన్ లను సీజ్ చేసే ప్రయత్నం చేశారు. కోపంతో రగిలిపోయిన చింతమనేని అనుచరులు, గ్రామస్తులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ప్రొక్లెయిన్లను తరలించడానికి ఫారెస్ట్ అధికారులు వాహనాలను తీసుకువస్తే గ్రామస్తులు అడ్డగించి పైడిచింతపాడు గ్రామంలోకి రానీయకుండా అడ్డుకున్నారు. దాదాపుగా 80మంది ఫారెస్ట్ అధికారులను 20మంది పోలీసులను కదలకుండా నిర్బంధించారు.

జేసీబీ ఓనర్‌, అటవీ శాఖ అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం

ఈ ఉద్రిక్తత రాత్రి వరకు కొనసాగింది. ఏలూరు నగరంలో నుండి రాత్రి 9గంటల సమయంలో ప్రొక్లెయిన్లను కొల్లేరు వైపు తరలిస్తుండగా ఫారెస్ట్ అధికారులు అనుమానంతో తనిఖీలు నిర్వహించారు. అశోక్ నగర్ బ్రిడ్జి పై లారీలను నిలిపివేశారు...కొల్లేరులో రాత్రి సమయాల్లో యథేచ్ఛగా చేపల చెరువులను తవ్వేయడమే కాకుండా జీవారణ్యంలో కూడా ఇలా ప్రజాప్రతినిధుల పేరుతో ఆక్రమణలకు పాల్పడతుండటం ఎన్నో విమర్శలకు తావిస్తోంది... ఇప్పటికైనా కొల్లేరులో జరుగుతున్న అక్రమ చేపల చెరువుల తవ్వకాల మాఫియాను అడ్డుకోకపోతే జిల్లా అధికారులపై దాడులు నిత్యం జరిగే అవకాశం ఉంది

ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు వీరంగం

ఏలూరు : కొల్లేరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు వీరంగం సృష్టించారు. కొల్లేరు నిషేధిత ప్రాంతంలో ఇళ్ల స్థలాలకంటూ ప్రొక్లెయిన్లతో తవ్వేయడానికి ప్రయత్నించారు. అడ్డుకున్న ఫారెస్ట్ అధికారులను, పోలీసులను నిర్బందించారు. ఎమ్మెల్యే అండదండలతో మరో మాఫియాకు తెరతీస్తున్నారు చింతమనేని అనుచరులు.

06:59 - May 27, 2017

హైదరాబాద్: వర్షాకాలం వచ్చిందంటే జంట నగరాలు నరకాన్నితలిపిస్తాయి. ఏ నాలా ఎప్పుడు పొంగుతుందో, ఏ రోడ్డు ఎప్పుడు మునుగుతుందో ఎవరూ చెప్పలేరు. అస్తవ్యస్తమైన డ్రెయినేజీ వ్యవస్థతో ప్రజలకు తీవ్ర అవస్థలు తప్పవు. మూతలులేని మ్యాన్‌హోల్స్‌, శిథిలావస్థలకు చేరుకున్న పురాతన భవనల్లో ఎప్పుడు ఏది కూలుతుందో చెప్పలేని పరిస్థితి. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి వీటన్నింటిని ముందుగానే పరిష్కరించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది.

వర్షం నీరు నిల్వ ఉండే ప్రాంతాలు 220

వచ్చే వర్షాకాలంలో ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు లేకుండా చూసేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు ముందు నుంచే కార్యాచరణ ప్రణాళికలు అమలు చేస్తున్నారు. జంటనగరాల్లో వర్షంనీరు నిలిచే 220 ప్రాంతాలను గుర్తించారు. నలభై చోట్ల ఇప్పటికే సమస్యను పరిష్కరించారు. మిగిలిన 180 చోట్ల పనులు చేపట్టారు. ఈ పనుల్లో ఆయా ప్రాంతాల్లోని పౌరులను కూడా భాగస్వాములను చేస్తున్నారు. నాలాలపై 12 వేల ఆక్రమణలు ఉన్నట్టు గుర్తించారు. వీటిని తొలగించేందుకు 12 వేల కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తుందని లెక్క తేల్చారు. ఈ వ్యయాన్ని భరించే శక్తి జీహెచ్‌ఎంసీకి లేదు. దీంతో సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. కుంచించుకుపోయిన నాలాలను వెడల్పుచేసి, వర్షంనీరు పోయే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలోని 882 చోట్ల కుంచించుకుపోయిన నాలాలను వెడల్పు చేసేందుకు 230 కోట్ల ఖర్చు అవుతుందని లెక్క తేల్చారు. త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించే విధంగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించారు.

తవ్విన రోడ్లను సిమెంటు కాంక్రీటు, తారుతో పూడ్చివేత

రోడ్ల తవ్వకాల పనులను వచ్చే నెల 10 నాటికి పూర్తి చేయాలని జీహెచ్‌ఎంసీ ఆయా కాంట్రాక్టు సంస్థలను ఆదేశించింది. ఇప్పటికే తవ్విన రోడ్లను సిమెంటు కాంక్రీటు లేదా తారువేసి గుంతలు లేకుండా చేస్తారు. శిథిలావస్థకు చేరుకుని కూలిపోయే ప్రమాదం ఉన్న భవనాలను గుర్తించి, వీటిలో ఉంటున్న వారిని ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చారు. స్పందించిన ఇళ్ల యజమానులు, అద్దెకు ఉంటున్నవారిని జీహెచ్‌ఎంసీ ఆఫీసుకు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇవ్వాలని అధికారలు నిర్ణయించారు. జీహెచ్‌ఎంసీ చేపట్టిన వర్షాకాల కార్యాచరణ ప్రణాళికలు ఎంతవరకు ఫలితాలు ఇస్తాయో చూడాలి.

వర్షాకాల కార్యాచరణ ప్రణాళికలు ప్రకటించిన జీహెచ్‌ఎంసీ

హైదరాబాద్: వర్షాకాలంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు జీమెచ్ ఎంసీ సిద్ధమైంది. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. గతేడాది అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని కుంచించుకుపోయిన నాలాలను వెడల్పు చేసేందుకు చర్యలు చేపట్టింది. జూన్‌ 10 నాటికి రోడ్లపై ఉన్న గుంతలను పూడ్జివేయడంతోపాటు వివిధ పనుల కోసం జరుపుతున్న తవ్వకాలను పూర్తి చేయాలని జీమెచ్ ఎంసీ నిర్ణయించింది.

 

06:56 - May 27, 2017

హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రల్లో ప్రసవాలను ప్రోత్సహిచేందుకు ఉద్దేశించిన అమ్మ ఒడి పథకం అమలును తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. వచ్చే నెల 3న హైదరాబాద్‌లోని పేట్ల బురుజు ఆస్పత్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

తెలంగాణలో తొమ్మిది బోధనాస్పత్రులు

అమ్మ ఒడి కార్యక్రమం అమలుకు వీలుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యలు మెరుగుపరుస్తారు. తెలంగాణలోని 9 బోధనాస్పత్రులు, ఆరు జిల్లా వైద్యశాలలు, మాతా, శిశు సంరక్షణ కేంద్రాలు, ముప్పై ఏరియా ఆస్పత్రుల్లో ఈ పథకం అమలు చేస్తారు. అలాగే 114 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 24 గంటలకు పనిచేసే 314 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 365 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కేసీఆర్‌ కిట్ల పంపిణీకి ఎంపిక చేశారు. రాష్ట్రంలో ఏటా 6,28,319 ప్రసవాలు జరుగుతున్నాయి. వీటిలో యాభై శాతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగే విధంగా చూస్తారు. ప్రస్తుతం 30 నుంచి 40 శాతం ప్రసవాలు మాత్రమే సర్కారు దవాఖానల్లో జరుగుతున్నారు. అమ్మ ఒడి పథకం ప్రారంభించిన తర్వాత ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

గర్భిణిలకు మూడు విడతలుగా రూ.12 వేల ఆర్థిక సాయం.....

అమ్మ ఒడి పథకం కింద కేసీఆర్‌ కిట్లు అందించేందుకు ఇంతవరకు మూడు లక్షల మంది గర్భిణిలను నమోదు చేశారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. వీరికి మూడు విడతలుగా 12 వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తారు. ఆడిపిల్ల పుడితే మరో వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తారు. ప్రసవం తర్వాత రెండు వేల రూపాయల విలువచేసే 16 రకాల వస్తువులు ఉండే కేసీఆర్‌ కిట్‌ను అందిస్తారు. ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అమ్మఒడి పథకం ప్రారంభానికి సర్వం సిద్ధం

హైదరాబాద్: అమ్మఒడి పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింది గర్భిణిలకు కేసీఆర్‌ కిట్లు అందిస్తారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కానుకగా ఈ పథకం అమలుకు శ్రీకారం చుడతారు. జూన్‌ 3 న ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమ్మ ఒడి కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభిస్తారు.

కేంద్ర నిర్ణయంపై వెల్లువెత్తుతోన్న విమర్శలు

హైదరాబాద్: పశువధను నిషేధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా రంజాన్‌ మాసం ప్రారంభం కావడానికి ఒక్కరోజు ముందు.. ఒంటెల వధను కూడా నిషేధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది. అభ్యుదయ, ప్రజాతంత్ర సంస్థలు, దళిత సంఘాలు కేంద్ర నిర్ణయంపై మండిపడుతున్నాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్దమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు కేంద్రం తీసుకున్న నిర్ణయం మాంసం ఎగుమతులపై తీవ్ర ప్రభావాన్ని చూపనుందని విశ్లేషకులు చెబుతున్నారు.

పశువధపై కేంద్రం కీలక నిర్ణయం

ఢిల్లీ : మోదీ సర్కార్‌ మరో వివాదస్పద నిర్ణయం తీసుకుంది. పశువధపై దేశవ్యాప్త నిషేధం విధించింది. పవిత్ర రంజాన్‌ మాసం ప్రారంభంకాబోతుండగా..కేంద్రం ఈ అనూహ్య నిర్ణయాన్ని ప్రకటించింది. పశునిషేధం అమలు కోసం రూపొందించిన నిబంధనలు చూస్తే.. ప్రభుత్వం కావాలనే, ఓ వర్గంపై కక్ష సాధింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది. పశువధ నిషేధంపై కేంద్ర నోటిఫికేషన్‌ను విపక్షాలు తీవ్రంగా నిరసిస్తున్నాయి.

06:51 - May 27, 2017

హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. జూన్ 2 నుంచి మూడు రోజుల జరగనున్న ఈ ఉత్సవాలను పార్టీపరంగా కూడా ఘనంగా నిర్వహించేందుకు నేతల్ని సమాయత్తం చేస్తున్నారు గులాబీ బాస్. అందులో భాగంగా శనివారం పార్టీ శాసనసభ పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

టీఆర్ఎస్ పగ్గాలు చేపట్టి జూన్ 1కి మూడేళ్లు

తెలంగాణలో టీఆర్ఎస్ పగ్గాలు చేపట్టి మూడేళ్లు కావస్తోంది. జూన్ 2 నాటికి మూడేళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకల్ని నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ పరంగా తాము చేపట్టిన పలు కార్యక్రమాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. పార్టీ నేతల్ని కూడా భాగస్వాముల్ని చేస్తూ కార్యాచరణ అమలు చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా శనివారం తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం ఏర్పాటు చేశారు.

రాష్ట్ర అవతరణ వేడుకలతో పాటు, పార్టీ అంశాలపై..

తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల ఏర్పాట్లతో పాటు.. పార్టీకి సంబంధించిన అంశాలపై కూడా శాసనసభా పక్ష సమావేశంలో కేసీఆర్ చర్చించనున్నట్లు సమాచారం. టిఆర్ఎస్ చేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సోసోగా సాగుతుండంపై కేసీఆర్ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు పార్టి కమిటీలు, నామినేటెడ్ పోస్టులపై ఈ మీటింగ్‌లో కేసీఆర్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు అనుకుంటున్నారు. మూడు నెలలకొకసారి చేయిస్తున్న సర్వేపై శాసనసభ్యులకు కేసీఆర్ పలు సూచనలు చేసే అవకాశం కూడా ఉంది. మరోవైపు రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి అన్ని పార్టీలు అభిప్రాయాలు వెల్లడిస్తున్న నేపథ్యంలో శాసనసభా పక్ష సమావేశం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఆసక్తి నెలకొంది.

నేడు టీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం

హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. జూన్ 2 నుంచి మూడు రోజుల జరగనున్న ఈ ఉత్సవాలను పార్టీపరంగా కూడా ఘనంగా నిర్వహించేందుకు నేతల్ని సమాయత్తం చేస్తున్నారు గులాబీ బాస్. అందులో భాగంగా శనివారం పార్టీ శాసనసభ పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

06:47 - May 27, 2017

కృష్ణా : విజయవాడలో రెండో రోజు కలెక్టర్ల సదస్సులో వైద్యారోగ్య శాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, ప్రజా సాధికార సర్వేలపై సీఎం సమీక్షలు నిర్వహించారు. పీపుల్స్‌ హబ్‌ సాఫ్ట్‌ కాపీని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. ప్రజాసాధికార సర్వే వివరాలను పీపుల్స్ హబ్‌ పేరిట ప్రభుత్వం భద్రపరిచిందని.. ఇలాంటి విధానం ప్రపంచంలో ఎక్కడా లేదని సీఎం అన్నారు. ప్రజాసాధికార సర్వే 80శాతం పూర్తయిందని.. మిగిలిన 20 శాతాన్ని మూడు నెలల్లో పూర్తి చేస్తామని ఐటీ అధికారులు సీఎంకు వివరించారు. సంక్షేమ పథకాల అమలు ద్వారా వచ్చే ఫలితాలను బేరీజు వేసుకోవాలని సూచించారు. ఒక్కపైసా కూడా అవినీతి జరగకుండా వంద శాతం లబ్ధి చేకూర్చాలని చెప్పారు.

ఆస్పత్రుల్లో వైద్యుల కొరతపై సీఎం సీరియస్‌

ఆస్పత్రుల్లో వైద్యుల కొరతను తీవ్రంగా పరిగణించిన సీఎం చంద్రబాబు.. అధికారులను నిలదీశారు. వైద్యుల కొరత సమస్యను వెంటనే పరిష్కరించాలన్నారు. అవసరమైతే ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో వైద్యులను రిక్రూట్‌ చేసుకోవాలని సూచించారు. తన స్వగ్రామంలోనూ వైద్యుల కొరత ఉందన్నారు. కిడ్నీ బాధిత ప్రాంతాలైన శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో రీసెర్చ్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నెలకు ఒక్కసారైనా జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు ప్రభుత్వాస్పత్రులను సందర్శించాలని పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని పంచాయతీల్లో బాలింతలు, గర్భిణుల కోసం ఆర్గానిక్ కూరగాయల సాగుచేస్తున్నారని.. ఈ విధానాన్ని రాష్ట్రమంతా అమలు చేయాలన్నారు.

అంగన్‌వాడీ స్కూల్‌ టీచర్లకు స్మార్ట్‌ఫోన్లు పంపిణీ

అంగన్‌వాడీ స్కూల్‌ టీచర్లకు స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేస్తామన్నారు చంద్రబాబు. అంగన్‌ వాడీ స్కూళ్ల నిర్వహణపై నెలరోజుల్లో సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు గార్డెనింగ్‌ వర్క్‌ నేర్పించాలన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు పాఠశాల ప్రాంగణంలోనే కూరగాయలు పండించాలని చెప్పారు. ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి విద్యార్థుల్లో సామాజిక బాధ్యత పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

కీ పెర్మామెన్స్‌ ఇండికేటర్లపై అవగాహన కల్పించేందుకు ...

జీవీఏ, సుస్థిర సమ్మిళిత వృద్ధి, కుటుంబ వికాసం, సమాజ వికాసం, కీ పెర్మామెన్స్‌ ఇండికేటర్లపై అవగాహన కల్పించేందుకు అధికారులకు క్యాంప్‌ కార్యాలయంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. క్యాంప్‌ కార్యాలయాన్ని ఇకపై సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ కోసం వినియోగిస్తామన్నారు. పాలన సవ్యంగా జరగాలంటే సమయపాలన ఎంతో ముఖ్యమన్నారు చంద్రబాబు. టెక్నాలజీని ఉపయోగించి అధికారులు విధులను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఐటీ కంపెనీలకు భూ కేటాయింపు,ఇ ప్రగతి, మీ సేవా, స్టేట్‌ న్యూట్రిషన్‌ మిషన్‌ తదితర పథకాలపై సీఎం సమీక్షించారు.

వంద శాతం లబ్ధి చేకూర్చేలా చేయాలి: చంద్రబాబు

కృష్ణా : విజయవాడలో రెండో రోజు కలెక్టర్ల సదస్సులో వైద్యారోగ్య శాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, ప్రజా సాధికార సర్వేలపై సీఎం సమీక్షలు నిర్వహించారు. పీపుల్స్‌ హబ్‌ సాఫ్ట్‌ కాపీని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. ప్రజాసాధికార సర్వే వివరాలను పీపుల్స్ హబ్‌ పేరిట ప్రభుత్వం భద్రపరిచిందని.. ఇలాంటి విధానం ప్రపంచంలో ఎక్కడా లేదని సీఎం అన్నారు. ప్రజాసాధికార సర్వే 80శాతం పూర్తయిందని.. మిగిలిన 20 శాతాన్ని మూడు నెలల్లో పూర్తి చేస్తామని ఐటీ అధికారులు సీఎంకు వివరించారు. సంక్షేమ పథకాల అమలు ద్వారా వచ్చే ఫలితాలను బేరీజు వేసుకోవాలని సూచించారు.

నేడు విశాఖలోని ఏయూలో టీడీపీ మహానాడు

విశాఖ : మూడేళ్ల పాలనపై అంతర్మథనం..రానున్న ఎన్నికలకు రాజకీయ తీర్మానాలు.. ఇలా మూడు రోజుల పాటు సాగనుంది టీడీపీ జాతీయ మహానాడు. తెలుగు రాష్ట్రాల నుంచి వేలాదిగా వచ్చే ప్రతినిధుల కోసం విశాఖలోని ఏయూ ప్రాంగణం సిద్ధమైంది. భద్రతా పరంగా పోలీసులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Don't Miss