Activities calendar

28 May 2017

21:38 - May 28, 2017

యాదాద్రి : నరేశ్‌ హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కేంద్రం భువనగిరిలో ధర్నా జరిగింది. నరేశ్‌ తల్లి, దండ్రులతోపాటు వివిధ ప్రజా సంఘాల నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వాతిని ప్రేమించినందుకు కక్ష కట్టిన ఆమె తండ్రి శ్రీనివాస్‌రెడ్డి తన కుమారుడ్ని హత్య చేయించాడని నరేశ్‌ తండ్రి వెంకటయ్య కన్నీరు మున్నీరు అయ్యారు. నరేశ్‌ను హత్య చేసిన నిందితులందర్నీ తన ముందు ప్రవేశపెట్టాలని వెంకటయ్య డిమాండ్‌ చేస్తున్నారు. ఈ కేసు విచారణకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలని ఎంబీసీ నేత ఆశయ్య డిమాండ్‌ చేశారు.

హైదరాబాద్ లో
నరేశ్‌ హత్యను నిరసిస్తూఈ సీపీఎం హైదరాబాద్‌లో ధర్నా నిర్వహించింది. గచ్చిబౌలిలో జరిగిన ఈ ఆందోళన కార్యక్రమంలో సీపీఎం తోపాటు ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. కుల రక్కసి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని సీపీఎం నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

కరీంనగర్ లో
నరేష్‌ హత్యను నిరసిస్తూ కరీంనగర్‌లో ఆగ్రహ జ్వాలలు ఎగసిపడ్డాయి. సీపీఎం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నరేష్‌ హత్య నిందితులకు ఉరిశిక్ష వేయాలంటూ కరీంనగర్‌లోని తెలంగాణ చౌరస్తాలో కులరక్కసి దిష్టిబొమ్మ దహనం చేశారు. పరువు హత్యలను నివారించేందుకు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు.----------

21:33 - May 28, 2017

హైదరాబాద్ : అద్దాల మేడలో ఉంటున్న సీఎం కేసీఆర్‌కు బయటి ప్రపంచం తెలియడం లేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. సర్వేల పేరుతో కేసీఆర్‌ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. సర్వేలపై నమ్మకం ఉంటే నల్గొండ పార్లమెంటు స్థానానికి గుత్తా సుఖేందర్‌రెడ్డితో రాజీనామా చేయించి మళ్లీ గెలుపించుకోవాలని సవాల్‌ చేశారు. ఆ ఎన్నికలో కాంగ్రెస్‌ ఓడిపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కోమటిరెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్‌కు సర్వేల మీద నమ్మకం ఉంటే 24 గంటల్లోగా ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని మండలి విపక్ష నేత షబ్బీర్‌ అలీ సవాల్ విసిరారు.

కేసీఆర్‌ సర్వే బూటకం
కేసీఆర్‌ చేయించిన సర్వే అంతా బూటకమని టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. మహానాడులో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన ఆయన .. దొంగ సర్వేలతో కేసీఆర్‌ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ సర్వే ఫలితాలు నిజమే అయితే తక్షణమే ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని ఎన్నికలకు వెళ్లాలని సండ్ర సవాల్‌ చేశారు.సీఎం కేసీఆర్ చేయించిన సర్వే ఫలితాలను విమర్శిస్తున్న విపక్షాలకు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు ధీటుగా కౌంటర్‌ ఇస్తున్నారు. కేసీఆర్ చేయించిన సర్వేలన్నీ నూటికి నూరు శాతం సరైనవే అంటున్నారు. సర్వే ఫలితాలను బయటపెట్టేసరికి..సత్తాలేని విపక్షాల్లో వణుకు మొదలైందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు.

 

 

 

 

21:30 - May 28, 2017

విశాఖ : టీడీపీ మహానాడు రెండోరోజు పలు అంశాలకూ తీర్మానాలు ఆమోదించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న అవార్డుతోపాటు పోలవరం, వ్యవసాయం, నీటిపారుదల, పారిశ్రామిక పెట్టుబడులు, ఉపాధి కల్పన, మౌలిక వసతులు, ఆకర్షణీయ గ్రామాలు తదితర అంశాలపై ప్రవేశపెట్టిన తీర్మానాలను మహానాడు ఏకగ్రీవంగా ఆమోదించింది. మహానాడులో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ జయతిని ఘనంగా నిర్వహించారు. చంద్రబాబుతోపాటు పలువురు నేతలు ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ కేక్‌ కట్‌ చేసి, పరస్పరం తినిపించుకుని, పార్టీ నేతలు, కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపారు.

ఎన్టీఆర్‌కు భారతరత్న అవార్డు ఇవ్వాని
ఎన్టీఆర్‌కు భారతరత్న అవార్డు ఇవ్వాని పరకాల ప్రభాకర్‌ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మంత్రి కళావెంకట్రావు బలపరిచారు. ఆ తర్వాత ఈ తీర్మానాన్ని మహానాడు ఏకగ్రీవంగా ఆమోదించింది. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇప్పించే వరకు అహర్నిశలు కృషి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. పోలవరంపై మహానాడులో ప్రవేశపెట్టిన తీర్మానం పలువురిలో భావోద్వేగాన్ని రగిల్చింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే వర్మ బలపరిచారు. ప్రతిఏటా వృధాగా సముద్రంలో కలుస్తున్న వేలాది టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకునేందుకు చేపట్టిన పోలవరం ప్రాజెక్టు పనులను మహానాడు వేదిక నుంచి చంద్రబాబు పర్యవేక్షించారు. ఈ ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టిస్తున్న ప్రతిపక్ష వైసీపీ వైఖరిపై చంద్రబాబు మండిపడ్డారు. విశాఖపట్నంకు నీరు అందించేందుకు ఉద్దేశించిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని ఈఏడాది ఆగస్టు 15న ప్రారంభించాలని మహానాడులో నిర్ణయించారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని ఏలేరు కాల్వతో అనుసంధానం చేయడం ద్వారా విశాఖపట్నం ప్రజల మంచినీటి అవసరాలతోపాటు పరిశ్రమలకు నీరు అందుతుంది. రైతులు, కౌలు రైతుల సంక్షేమం కోసం చట్టం తీసుకురాబోతున్నట్టు వ్యవసాయ రంగంపై ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చ సందర్భంగా చంద్రబాబు ప్రకటించారు.

తెలంగాణకు సంబంధించిన
తెలంగాణకు సంబంధించిన పలు తీర్మానాలను కూడా మహానాడులో ఆమోదించారు. తెలంగాణలో 3,365 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 490 మందికి మాత్రమే నష్టపరిహారం ఇచ్చిన విషయాన్నిగుర్తుచేస్తూ ఒంటేరు ప్రతాప్‌రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తెలంగాణలో సంక్షోభంలో సంక్షేమ రంగం అన్న తీర్మానాన్ని అరవింద్‌ కుమార్‌గౌడ్‌ ప్రవేశపెట్టారు. యుగపురుషుడు ఎన్టీఆర్‌కు నివాళి తీర్మానాన్ని తెలంగాణ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ప్రవేశపెట్టారు. ఏపీ రెవెన్యూ లోటును ఎదుర్కొంటున్నా తెలంగాణతో సమానంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. మహానాడులో రెండో రోజు ఏపీ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి లోకేశ్‌ రక్తదానం చేశారు. తెలుగుదేశం జాతీయ అధ్యక్షుణ్ని ఎన్నుకునేందుకు మహానాడులో నోటిఫికేషన్‌ జారీ చేశారు. చంద్రబాబు తరుపున 33 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారు.

 

21:28 - May 28, 2017

హైదరాబాద్ : ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే టీఆర్‌ఎస్‌కు 111 సీట్లు వస్తాయన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు. సర్వేల మీద కేసీఆర్‌కు నమ్మకం ఉంటే 24గంటల్లోగా ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లి గెలవాలని సవాల్ విసిరారు. నల్గొండలో పార్టీ మారిన గుత్తా చేత రాజీనామా చేయించి ఎన్నికల్లో గెలిస్తే తాను రాజకీయాల్లో పోటీచేయనని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సవాల్ విసిరారు. 

21:26 - May 28, 2017

హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ భారీగా సీట్లు గెలవడం ఖాయమన్నారు గ్రేటర్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మైనంపల్లి హనుమంతరావు. హైదరాబాద్ నాచారంలో జరిగిన టిఆర్ఎస్ ఆరవ డివిజన్ కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఉప్పల్ టిఆర్ఎస్ ఇంచార్జ్ సుభాష్ రెడ్డి, కార్పొరేటర్లతో పాటు భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. నాచారం డివిజన్‌లో అత్యంత చురుకైన కార్యకర్తలు ఉన్నారని.. పార్టీని బలోపేతం చేయడంలో ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు కోరారు. 

కూకట్ పల్లి సబ్ రిజిస్ట్రార్ అరెస్ట్

హైదరాబాద్ : ప్రభుత్వ స్థలాల రిజిస్ట్రేషన్ల వ్యవహరంలో కూకట్ పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్, బిల్డర్ పార్థసారథి, ట్రినిటీ డైరెక్టర్లు సార్థసారధి, పీవీస్ శర్మలను పోలీసులు అరెస్ట్ చేశారు. 

నెల్లూరులో రాజకీయ పరిస్థితి పై సదస్సు

నెల్లూరు : జిల్లాలోని పరమేశ్వరి కళ్యాణమండపంలో నేటి రాజకీయా పరిస్థితి సీపీఎం వైఖరిపై సదస్సు జరిగింది. ఈ సదుస్సు ప్రకిష్ కారత్ హాజరైయ్యారు.

19:24 - May 28, 2017

ఎమ్యెల్యేలతో సీఎం కేసీఆర్ భేటీ

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో నీటిపారుదల నిర్మాణం మరమ్మతులు, మిషన్ భగీరథ పనుల విషయంలో చొరవ తీసుకోవాలని కేసీఆర్ ఎమ్మెల్యేలను ఆదేశించారు.

 

18:41 - May 28, 2017
18:39 - May 28, 2017

కడప : కడప అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రత్యేక స్ధానం ఉంది. ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట అయిన కడపలో ఆ తరువాత వైసిపి పాగా వేసింది. గత ఎన్నికల్లో వైసిపి అభ్యర్ధికి 50 వేలకు పైగా మెజార్టీతో గెలుపు లభించింది. అయితే ఈ నియోజకవర్గంలో టిడిపి అభ్యర్ధి గెలిచింది చాలా తక్కువసార్లని చెప్పాలి. టిడిపికి సరైన నేత లేకపోవడం.. ఉన్నా కార్యకర్తలను పట్టించుకోకపోవడం.. ఈ అంశాలనే ఆసరాగా తీసుకుని వైసిపి కడప నియోజకవర్గంలో తిరుగులేని పార్టీగా ఎదిగింది. టిడిపి అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతోంది. మళ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో కడప నియోజకవర్గంలో టిడిపి తరపున ఎవరు పోటీ చేస్తారన్నది ఇప్పటికీ స్పష్టత లేదు. కనీసం పూర్తిస్ధాయి నియోజకవర్గ బాధ్యుడు కూడా టిడిపికి లేడు. దాంతో జిల్లా అధ్యక్షుడు అయిన శ్రీనివాసుల రెడ్డే అదనపు బాధ్యతగా నియోజకవర్గ ఇన్ చార్జ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. శ్రీనివాసుల రెడ్డి స్ధానికుడు కాకపోవడంతో కడపపై పెద్దగా దృష్టి పెట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి. దీంతో దిక్కు తోచనిస్థితిలో కార్యకర్తలు పార్టీకి దూరమవుతున్నారు.

ఆరుగురు నేతలు ఎమ్మెల్యే టికెట్
కడప అసెంబ్లీ నియోజకవర్గంలో ఆరుగురు నేతలు ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. ముస్లింలు ఎక్కువగా ఉన్న కడప అసెంబ్లీ నియోజకవర్గంలో ఆ సామాజికవర్గం నుంచి మాజీ మంత్రి ఖలీల్ బాషా, అమీర్ బాబు, సుబాన్ బాషాలు పార్టీ ఇన్ చార్జీ బాధ్యతలను ఆశిస్తున్నారు. వీరితో పాటు గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన దుర్గా ప్రసాద్, గోవర్దన్ రెడ్డి, హరి ప్రసాద్‌లు టికెట్ ఆశిస్తున్నారు. టికెట్ ఆశించడం తప్ప.. వీరంతా పార్టీకోసం కలిసి పనిచేసిందీ లేదంటున్నారు టిడిపి కార్యకర్తలు. అందువల్లే కడప నియోజకవర్గంలో టిడిపి బలహీనపడిందని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్, వైసిపి హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగకపోయినా.. మళ్లీ మళ్లీ ఆ పార్టీలు గెలవడం తెలుగుదేశం పార్టీ అసమర్థతే అని టిడిపి క్యాడర్ చెప్పుకుంటున్నారు. వచ్చే ఎన్నికలనాటికైనా అధిష్టానం సరైన నేతను ఎంచుకుని అందరినీ కలుపుకుపోతేనే కడపలో టిడిపికి మనుగడ అంటున్నారు ఆ పార్టీ కార్యకర్తలు.

 

 

18:38 - May 28, 2017

గుంటూరు : నిబంధనలు పాటించని మైనింగ్ క్వారీలపై చర్యలు తీసుకుంటామని ఏపీ గనుల శాఖా మంత్రి సుజయకృష్ణ రంగారావు అన్నారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం క్వారీలో నిన్న జరిగిన ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మృతిచెందిన నేపథ్యంలో వారిని మంత్రి పరామర్శించారు. రాష్ట్రంలోని అన్ని మైనింగ్ క్వారీల్లో వారంరోజుల పాటు తనిఖీలు నిర్వహించాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశామని,.నిబంధనలు పాటించని క్వారీల్లో తవ్వకాలు నిలిపివేస్తామన్నారు. ఫిరంగిపురం ఘటనపై కలెక్టర్ మెజిస్ట్రీయల్ ఎక్వైరీకి ఆదేశించామని, నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

18:36 - May 28, 2017

విజయవాడ : అమిత్ షా తెలంగాణాకు లక్ష కోట్లు ఇచ్చామని చెప్తే కేసీఅర్ లెక్కలతో సహ చెప్పి గుడ్డలు ఊడతీశారని,..ఏపీలో మాత్రం చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. లక్ష 75 వేల కోట్లు ఇచ్చామన్న అమిత్ షా వ్యాఖ్యలను ఖండించకుండా చంద్రబాబు పరోక్షంగా అంగీకరించారని,..ఇప్పుడు ఆ డబ్బులు ఏం చేశారో చంద్రబాబు సమాధనం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. విజయవాడలోని ఆంధ్రరత్నభవన్‌లో మీడియాతో మాట్లాడిన రఘువీరారెడ్డి..చంద్రబాబు, అమిత్‌షాలపై మండిపడ్డారు. 

18:35 - May 28, 2017

విశాఖ : ఎన్టీఆర్‌ ట్రస్ట్‌కు ఆరున్నర లక్షల రూపాయల విరాళం ప్రకటించారు వాజీ అధినేత గణపతి శ్రీనివాసరావు. ఈ మొత్తంతో 10 మంది పేద విద్యార్థులకు ఏడాది పాటు విద్యావసతి సదుపాయాలకు వినియోగించాలని కోరారు. ఇదే సమయంలో సూర్యచంద్రుల పేరుతో ఎన్టీఆర్‌, చంద్రబాబు పై రాసిన పుస్తకాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో ఎన్టీఆర్‌-చంద్రబాబుల చరిత్రలలో అపురూప ఘట్టాలు ఉన్నాయన్నారు. 

18:34 - May 28, 2017

విశాఖ : విశాఖలో జరుగుతున్న తెలుగుదేశం మహానాడుకు రెండో రోజు పార్టీ నేతలు, కార్యకర్తలు పోటెత్తారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ మహానాడుతో ఘనంగా నిర్వహించారు. మహానాడు ప్రాంగణలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్విగ్రహాన్ని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆవిష్కరించి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకు ఎన్టీఆర్ చేసిన సేవలను స్మరించుకున్నారు. అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తుతించారు. రాజకీయాలంటే పేదలకు సేవ చేయడమని నిరూపించిన వ్యక్తి ఎన్టీఆర్ అని చంద్రబాబునాయుడు కొనియాడారు. ఎన్టీఆర్ ను ఒక్కసారి తలచుకుని ఏ కార్యక్రమం చేపట్టినా అది విజయవంతమవుతుందన్నారు. వివిధ అంశాలపై మహానాడులో ప్రవేశపెట్టిన తీర్మానాలను ఆమోదించారు. 

18:33 - May 28, 2017

హైదరాబాద్ : నరేశ్‌ హత్యను నిరసిస్తూ సీపీఎం హైదరాబాద్‌లో ధర్నా నిర్వహించింది. గచ్చిబౌలిలో జరిగిన ఈ ఆందోళన కార్యక్రమంలో సీపీఎం తోపాటు ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. కుల రక్కసి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని సీపీఎం నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. 

18:32 - May 28, 2017

యాద్రాద్రి : నరేష్‌, స్వాతి ట్రాజిడి లవ్‌ స్టోరీలో ఎన్నో అనుమానాలు, మరెన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగానే నరేష్‌ హత్య మిస్టరీ వీడినా..ఈ కేసులో పోలీసుల దర్యాప్తు ఎలా ముందుకు సాగనుందనేది ప్రశ్నార్థకంగా మారింది. నరేష్‌ను దహనం చేసిన ఆనవాళ్లు మిగల్చకుండా నిందితుడు పక్కా ప్లాన్‌తో అస్థికలు, బూడిదను మూసినదిలో కలిపేశాడు. ఇప్పుడు పోలీసులు న్యాయస్థానం ఎదుట.. హత్యకు గురైన వ్యక్తి నరేషే అని ఎలా నిరూపించగలరన్నది ఉత్కంఠ రేపుతోంది. అసలు నిందితుడు ఇంత పక్కాగా హత్య చేసి.. ఆనవాళ్లు కూడా మాయం చేయగలిగినంతటి తెలివైన వాడా..? అతడికి స్థానిక పోలీసుల సహకారం లేకుంటే అలా చేయగలిగేవాడా..? ఈ కేసును పరిశీలిస్తున్న వారిలో ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

సీసీ టీవీ ఫుటేజీ
నరేశ్‌, స్వాతిలు భువనగిరిలో దిగాక, స్వాతిని శ్రీనివాసరెడ్డి కారులో తీసుకు వెళ్లాడు. నరేశ్‌, తిరిగి హైదరాబాద్‌కు వెళ్లాడని స్థానిక పోలీసులు అంచనాకు వచ్చారు. అలాంటప్పుడు, భువనగిరి బస్టాండ్‌లోని సీసీ టీవీ ఫుటేజీ ద్వారా, నరేశ్‌ ఎక్కిన బస్సును గానీ, లేదా ఫ్రెండ్‌ బైక్‌లో వెళ్లి వుంటే, ఆ దారిలో ఉండే సీసీ టీవీ ఫుటేజీని కానీ స్థానిక పోలీసులు ఎందుకు పరిశీలించలేదు అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇదంతా ఓ ఎత్తయితే, స్వాతి ఆత్మహత్య చేసుకున్నాక, ఆమె మృతదేహానికి, శ్రీనివాసరెడ్డి తమ పొలంలో, నరేశ్‌ను తగులబెట్టి చంపిన స్థలానికి కేవలం మూడు, నాలుగు అడుగుల దూరంలోనే, దహన సంస్కారాలు చేశారు. మరి, ఆమె అంత్యక్రియలకు హాజరైన పోలీసులు, ఆ ప్రాంతంలో నల్లబారిన నేలను గానీ, అక్కడి టైర్లు కాలిన ఆనవాళ్లను కానీ ఎందుకు గుర్తించలేక పోయారు..? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలే.

నరేష్‌తో పాటు ఉన్న వ్యక్తి ఎవరు
ఈ కేసులో సమాధానం రావాల్సిన మరో ప్రశ్న కూడా ఉంది. హత్యకు కొన్ని గంటల ముందు వరకు నరేష్‌తో పాటు ఉన్న వ్యక్తి ఎవరు? నరేష్‌ను హతమార్చిన సంగతి అతడికి తెలుసా? తెలిస్తే అటు పోలీసులకు గానీ, ఇటు కుటుంబ సభ్యులకు గానీ ఎందుకు సమాచారం ఇవ్వలేదు. అసలింతకీ ఆ యువకుడు ఎక్కడికెళ్లాడు..? జీవించే ఉన్నాడా..? లేక నరేశ్‌ తరహాలోనే హతుడయ్యాడా..? ఇక స్వాతి ఆత్మహత్యపై ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. ఇది ఆత్మహత్య లేక తండ్రి శ్రీనివాస్‌రెడ్డి హత్య చేసి ఆత్మహత్యగా సృష్టించాడా? ఆమె హైకోర్టులో ఎక్కడ నిజం బయటపెడుతుందో అనే భయంతోనే ఉరివేసి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సెల్ఫీ వీడియో స్వాతినే రికార్డ్ చేసిందా లేక..తండ్రి బెదిరింపులకు భయపడిపోయి ఆ పనిచేసిందా? రెండు సార్లు ఆత్మహత్యకు యత్నించిన కూతురి స్వాతిని తండ్రి ఎందుకు జాగ్రత్తగా చూసుకోలేకపోయాడు. బాత్‌రూంలో ఉరివేసుకుంటే ఆమె ఎందుకు గడియ పెట్టుకోలేదు? ఎత్తు తక్కువగా ఉన్న ప్రాంతంలో ఆమె ఎలా ఉరివేసుకుంది? పోస్ట్ మార్టం నివేదిక ప్రకారం స్వాతిది ఆత్మహత్యే అని తేలటంతో పాటు ఒకనెల గర్బవతి అని నివేదికలో తేలింది. అసలే స్వాతి ప్రేమ పెళ్లిని వ్యతిరేకిస్తున్న శ్రీనివాసరెడ్డి, కుమార్తె గర్భవతి అని తేలడాన్ని జీర్ణించుకోలేక ఆమెను తుదముట్టించాడా..? సెల్ఫీ వీడియో స్వాతే రికార్డ్ చేసిందా..? లేక ఎవరైనా బెదిరించి రికార్డ్‌ చేశారా..? దీనిపై ఫోరెన్సిక్‌ నివేదికే స్పష్టతనివ్వాల్సి ఉంది.

పోలీసులపై విమర్శలు
నరేష్‌- స్వాతి కేసు దర్యాప్తులో నిష్పక్షపాతంగా వ్యవహరించలేదని భువనగిరి పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ కుమారుడి ఆచూకీకోసం ఆందోళన చెందుతున్న నరేష్‌ తల్లిదండ్రులకు సీపీఎం నేతలు బాసటగా నిలవడంతో..వారు హైకోర్టును ఆశ్రయించడంతో యువకుడి మిస్సింగ్‌ దర్యాప్తు మొదలైంది. అనుమానాలు స్వాతి తండ్రిపైనే వ్యక్తమవుతున్నా ఆ దిశగా ఎందుకు విచారించలేదు. ఒకవేళ నరేష్‌ తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించకపోతే పరిస్థితి ఎలా ఉండేది. మేజర్ల పెళ్లి వియషంలో పోలీసులు ఎందుకు జోక్యం చేసుకున్నారన్నది మరో ప్రశ్న. పెళ్లైన స్వాతి-నరేశ్‌ను ముంబై నుంచి ఎందుకు రప్పించారు? వారిని విడదీసేందుకు ఎందుకు ప్రయత్నించారు..? భువనగిరి పోలీసులపై చర్యల్లేవా, ఈ దారుణానికి భువనగిరి పోలీసులు బాధ్యులు కారా అని బంధువులు ప్రశ్నిస్తున్నారు. నరేశ్‌ హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కేంద్రం భువనగిరిలో ధర్నా జరిగింది. నరేశ్‌ తల్లి, దండ్రులతోపాటు వివిధ ప్రజా సంఘాల నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వాతిని ప్రేమించినందుకు కక్ష కట్టిన ఆమె తండ్రి శ్రీనివాస్‌రెడ్డి తన కుమారుడ్ని హత్య చేయించాడని నరేశ్‌ తండ్రి వెంకటయ్య కన్నీరు మున్నీరు అయ్యారు. నరేశ్‌ను హత్య చేసిన నిందితులందర్నీ తన ముందు ప్రవేశపెట్టాలని వెంకటయ్య డిమాండ్‌ చేస్తున్నారు. ఈ కేసు విచారణకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలని ఎంబీసీ నేత ఆశయ్య డిమాండ్‌ చేశారు. 

18:30 - May 28, 2017

హైదరాబాద్ : జూన్‌ 1వ తారీఖున ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సంగారెడ్డికి వస్తున్నారని అధికారికంగా ప్రకటించారు టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. జూన్‌ 1న మధ్యాహ్నం 3 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న తర్వాత రోడ్డు మార్గం గుండా సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ ప్రజాగర్జన సభకు ముఖ్య అతిథిగా హాజరవుతారని ఉత్తమ్‌ ప్రకటించారు. 

18:29 - May 28, 2017

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌కు 111 సీట్లు వస్తాయని కేసీఆర్ చేయించిన సర్వే అంతా బోగస్‌ అన్నారు టి-పిసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. ఏం సాధించారని ప్రజలు టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేస్తారని అనుకుంటున్నారని కేసీఆర్‌ను ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వనందుకు వారంతా కేసీఆర్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఉత్తమ్‌ అన్నారు.

 

18:07 - May 28, 2017
17:36 - May 28, 2017
17:00 - May 28, 2017

విశాఖ : కేసీఆర్‌కు దమ్ముంటే తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. మందు తాగి 111 సీట్లు వస్తాయని చెప్పడం చూస్తుంటే నవ్వోస్తుందన్నారు. కేసీఆర్‌కు 111 సీట్లు కాదని 150 సీట్లు వస్తాయని ఆయన వ్యంగ్యంగా అన్నారు. టీఆర్ఎస్ ఏ ప్రాతిపదికన సర్వే చేసిందో చెప్పాలని సండ్ర డిమాండ్ చేశారు. తెలంగాణ టీడీపీ ఉనికిలో లేదన్న ఎర్రబల్లి దయాకరావు వ్యాఖ్యలపైనా సండ్ర మండిపడ్డారు. 

16:58 - May 28, 2017

విశాఖ : మహానాడును వెన్నుపోటు మహానాడు అంటూ రోజా వ్యాఖ్యానించడంపై టిడిపి మహిళా లీడర్లు మండిపడ్డారు. ప్రెస్ మీట్‌ పెట్టి మరీ కడిగి పారేశారు. వెన్నుపోటు రాజకీయాల గురించి రోజాకు మాట్లాడే హక్కు లేదని.. తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని మరీ రాజకీయాలు చేసిన ఘనత ఎవ్వరిదని ప్రశ్నించారు ఎమ్మెల్యే అనిత. మహానాడులో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనడం వాస్తవం కాదన్నారు టిడిపి అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ. వైసిపి వల్ల జీవితనం నాశనం చేసుకున్న ఐఏఎస్ అధికారిణికి మీరేం చేశారని ఆమె రోజాను ప్రశ్నించారు. తను చేసే షోల చూసి మహిళలు ఎంత అసహ్యించుకుంటున్నారో రోజా ఒకసారి ఆలోచించుకోవాలని.. నైతికత గురించి మాట్లాడే హక్కు రోజాకు లేదని టిడిపి మహిళా అధ్యక్షురాలు శోభా హైమావతి విమర్శించారు. 

16:57 - May 28, 2017

యాదాద్రి : నరేశ్‌ హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ అతని స్వగ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా పల్లెరలో ధర్నా జరిగింది. నరేశ్‌ తల్లి, దండ్రులతోపాటు వివిధ ప్రజా సంఘాల నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వాతిని ప్రేమించినందుకు కక్ష కట్టిన ఆమె తండ్రి శ్రీనివాస్‌రెడ్డి తన కుమారుడ్ని హత్య చేయించాడని నరేశ్‌ తండ్రి వెంకటయ్య కన్నీరు మున్నీరు అయ్యారు. నరేశ్‌ను హత్య చేసిన నిందితులందర్నీ తన ముందు ప్రవేశపెట్టాలని వెంకటయ్య డిమాండ్‌ చేస్తున్నారు. ఈ కేసు విచారణకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలని MBC నేత ఆశయ్య డిమాండ్‌ చేశారు. 

16:56 - May 28, 2017

విశాఖ : పశ్చిమ మధ్య, దక్షిణ మధ్య బంగాళాఖాతాల్ని కలుపుకొంటూ తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. దీని ప్రభావం వల్ల నైరుతి రుతు పవనాలు దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, దక్షిణ కేరళకు ఈ నెల 30, 31వ తేదీల్లో చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ మధ్యప్రదేశ్‌ నుంచి కర్ణాటక వరకు ద్రోణి ఏర్పడి ఉందని వివరించించారు. వీటి ప్రభావంతో ఏపీలో పలుచోట్ల తీవ్ర ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని, ఇవి మరో 4 రోజులు కొనసాగనున్నట్లు అధికారులు ప్రకటించారు.

 

16:55 - May 28, 2017

విజయవాడ : విశాఖలో జరుగుతున్న తెలుగుదేశం మహానాడులో రాష్ట్రంలో నెలకొన్న కరవుపై చర్చించకపోవడాన్ని వామపక్షాలు తప్పుపట్టాయి. దీనిని బట్టి చూస్తే వ్యవసాయ రంగ సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏపాటి చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చని సీపీఎం, సీపీఐ... ఏపీ కార్యదర్శులు పీ మధు, రామకృష్ణ వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం లక్షా 70 వేల కోట్ల సాయం అదించిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా చేసిన ప్రకటనపై శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. కరవుపై వచ్చే నెల 9న కడపలో రైతు సదస్సు నిర్విహించాలని వామపక్షాల నిర్ణయించాయి. 

16:53 - May 28, 2017

విశాఖ : ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. విశాఖలో నూతనంగా నిర్మించిన పార్టీ కార్యాలయంలో 10 అడుగులపైనే ఉనన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని చంద్రబాబునాయుడు ఆవిష్కరించారు. అనంతరం కార్యాలయంలో మొక్కనాటారు. టీడీపీ కార్యాలయాన్ని అద్భుతంగా నిర్మించారని, ఈ కార్యాలయానికి ప్రజా నిలయం అని పేరు పెట్టాలని చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్‌కు జయంతి రోజును మహనాడు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.

 

16:35 - May 28, 2017

జమ్మూకాశ్మీర్ పాక్ సైన్యం కాల్పులు

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ లోని కెరాన్ సెక్టార్ లో పాక్ సైన్యం కాల్పులు జరిగింది. కాల్పుల్లో ఓ కూలీ మృతి మరొకరికి గాయామైంది. 

15:06 - May 28, 2017
15:00 - May 28, 2017

ఖమ్మం : జీఎస్టీ..! వస్తు సేవల పన్ను..! ఈ పదాలు వింటే చాలు.. గ్రానైట్‌ పరిశ్రమ ఉలిక్కిపడుతోంది. అసలే పుట్టెడు కష్టాల్లో ఉన్న పరిశ్రమను ఇప్పుడు జీఎస్టీ మరింతగా బెదరగొడుతోంది. గ్రానైట్‌ పరిశ్రమకు, గూడ్స్‌ సర్వీస్‌ ట్యాక్స్‌.. GST, మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది. జులై ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్న జీఎస్టీ చట్టం.. గ్రానైట్‌ పరిశ్రమను మూసివేత దిశగా పురికొల్పుతోంది. ఇప్పటివరకూ, పరిశ్రమకు విధించే పన్ను కేవలం రెండు శాతం ఉండేది. అయితే జీఎస్టీ అమల్లోకి వస్తే.. పన్ను 2 నుంచి ఏకంగా 28 శాతానికి పెరగనుంది. ఇప్పటి వరకూ పదివేల రూపాయల వ్యాపారం చేస్తే.. రెండు వందల రూపాయలు పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఇకపై, జీఎస్టీ అమల్లోకి వస్తే.. పదివేల వ్యాపారానికి మూడు వేల రూపాయల పన్ను చెల్లించాల్సి వస్తుంది. దీంతో, గ్రానైట్‌ పరిశ్రమ నిర్వాహకులు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో గ్రానైట్‌ రంగంలో కొనసాగుతున్న వారు.. పరిశ్రమలను మూసివేయడమే మంచిదన్న నిర్ణయానికి వస్తున్నారు. గ్రానైట్‌ పరిశ్రమనే నమ్ముకున్న ఆధారిత పరిశ్రమలూ మూసివేత దిశగా సాగుతున్నాయి. పెనుబల్లి, ఏన్కూరు, తల్లాడ, మధిర, బోనకల్‌ తదితర ప్రాంతాల్లో గ్రానైట్‌, దాని ఆధారిత పరిశ్రమలు ఉన్నాయి. జిల్లాలో 500 వరకూ గ్రానైట్ పరిశ్రమలు ఉన్నాయి. పరిశ్రమలు బాగా నడిచిన సమయంలో.. జిల్లా నుంచి నలుపు, తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ, గోధుమ రంగు, పింక్‌ రాళ్లను ఎగుమతి చేసేవారు. ఏడాదికి సుమారు 1000 కోట్ల వ్యాపారం జరిగేది. ఇక్కడ ప్రత్యక్షంగా 20 వేల మంది, పరోక్షంగా మరో 80 వేల మంది ఉపాధి పొందేవారు. జిల్లా పరిశ్రమల నుంచి శ్రీలంక, మలేషియా, బ్రిటన్‌, టర్కీ, కొరియా, సౌదీ, చైనా ఇలా 15 దేశాలకు ఎగుమతి జరిగేది. ప్రభుత్వ తీరు వల్ల చిన్న పరిశ్రమలు.. నష్టపోయే ప్రమాదముందని గ్రానైట్ అసోసియేషన్‌ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధ్వానంగా గ్రానైట్‌ ఇండస్ట్రీ
ఇప్పుడు వివిధ కారణాల వల్ల గ్రానైట్‌ ఇండస్ట్రీ పరిస్థితి అధ్వానంగా తయారైంది. విద్యుత్‌ బిల్లుల భారం, పెరిగిన డీజిల్ రేట్లు, రవాణా చార్జీలు విపరీతంగా పెరగడం లాంటి కారణాల వల్ల.. పరిశ్రమలను నడపలేమని యజమానులు చేతులెత్తేస్తున్నారు. వీటికి తోడు రాష్ట్ర ప్రభుత్వానికి క్యూబిక్ మీటరుకు 1925 రూపాయల సెస్ చెల్లించాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే జిల్లాలోని ఐదు వందల పరిశ్రమల్లో 200 మూతబడ్డాయి. మరో 150 పరిశ్రమలు.. తీవ్ర నష్టాల కారణంగా మూతపడే దశలో ఉన్నాయి. ప్రభుత్వ విధానాల వల్ల చిన్న పరిశ్రమలే మూత పడతాయని.. గ్రానైట్ అసోసియేషన్‌ సభ్యులు మండిపడుతున్నారు.

ఒక్క ఖమ్మం జిల్లాలోనే
జీఎస్టీ అమలు వల్ల.. గ్రానైట్‌ ఇండస్ట్రీలో ఉద్యోగాలూ ఊడే పరిస్థితి తలెత్తింది. ఒక్క ఖమ్మం జిల్లాలోనే.. లక్ష మందికి పైగా ఉపాధిని కోల్పోతారని అంచనా. ఇప్పుడు వీరందరి పరిస్థితీ అయోమయంగా తయారైంది. గ్రానైట్ పరిశ్రమలో 50 శాతం మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పని చేసేవారు. పరిశ్రమలు మూతపడడంతో.. కార్మికులు దుర్భర జీవితం గడుపుతున్నారు. తమిళనాడు, ఒరిస్సా, బంగ్లాదేశ్‌, పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌, బీహార్‌, కర్ణాటక, మహారాష్ట్ర, తదితర రాష్ట్రాల నుంచి వచ్చి గ్రానైట్‌ పరిశ్రమల్లో పని చేసిన కూలీలు.. తిరిగి వారి ప్రాంతాలకు వెళ్లిపోయారు. రాజస్థాన్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, పంజాబ్‌, కేరళ, పాండిచ్చేరి, గోవా తదితర రాష్ట్రాల నుంచి గ్రానైట్‌ వ్యాపారులు వచ్చి గ్రానైట్‌ రాళ్లను కొనుగోలు చేసేవారు. విదేశాలకు ఎగుమతులు చేసిన వ్యాపారులు కూడా వారి ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఇలా ఒక పక్క కార్మికులు, మరోపక్క వ్యాపారులు ఉపాధిని కోల్పోయారు.

నిర్మాణ రంగం కుప్పకూలిపోయే ప్రమాదం
గ్రానైట్ పరిశ్రమలు కుదేలైపోవడానికి దేశీయంగా, అంతర్జాతీయంగా.. నిర్మాణ రంగం కుప్పకూలిపోవడమే కారణమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. రెండు వేల మందితో ప్రారంభమైన గ్రానైట్ పరిశ్రమ.. ఇవాళ లక్ష మందికి పైగా ఉపాధి కల్పించేలా అభివృద్ధి చెందింది. వివిధ కారణాల వల్ల... అసలే ఇబ్బందులు పడుతోన్న గ్రానైట్‌ పరిశ్రమను.. జీఎస్టీ చట్టంతో మరింత కుదేలు చేయడం భావ్యం కాదని గ్రానైట్‌ యజమానులు, కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం.. ఇండస్ట్రీపై ఆధారపడ్డవారిని దృష్టిలో ఉంచుకొని, జీఎస్టీ వడ్డన భారాన్ని తగ్గించాలని కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించకుంటే, జీఎస్టీ అమల్లోకి వచ్చే జులై ఒకటో తేదీన.. బ్లాక్‌ డే పాటించాలని గ్రానైట్‌ పరిశ్రమ వర్గాలు నిర్ణయించాయి. 

14:58 - May 28, 2017

నల్లగొండ : నరేష్‌ హత్యపై నల్లగొండ, యాదాద్రి జిల్లాల్లో ఆందోళనలు మిన్నంటాయి. సీపీఎం, ప్రజాసంఘాల నేతలు పలుచోట్ల ఆందోళనకు దిగారు. కులరక్కసి దిష్టిబొమ్మను దహనం చేశారు. పలుచోట్ల రాస్తోరోకో నిర్వహించారు. నరేష్‌ హత్య నిందితులను కఠినంగా శిక్షించి అతడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. నరేష్‌ కుటుంబ సభ్యులకు 25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పరువు హత్యను అరికట్టేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని .. లేకుంటే తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని నేతలు హెచ్చరించారు. 

14:57 - May 28, 2017

కరీంనగర్ : నరేష్‌ హత్యను నిరసిస్తూ కరీంనగర్‌లో ఆగ్రహ జ్వాలలు ఎగసిపడ్డాయి. సీపీఎం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నరేష్‌ హత్య నిందితులకు ఉరిశిక్ష వేయాలంటూ కరీంనగర్‌లోని తెలంగాణ చౌరస్తాలో కులరక్కసి దిష్టిబొమ్మ దహనం చేశారు. పరువు హత్యలను నివారించేందుకు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు.

14:18 - May 28, 2017
13:31 - May 28, 2017

గద్వాల్ : జిల్లాలో కాల్ మనీ ఘటనలపై జిల్లా ఎస్పీ విజయ్ కుమార్ సీరియస్ అయ్యారు. కాల్ మనీ వ్యాపారులపై ఉక్కుపాదం మోపుతామని, జిల్లాలో కాలనాగుల దుర్మార్గాలు, దౌర్జన్యాలు సహించేది లేదన్నారు. ఈ అంశంపై టెన్ టివితో ఎస్పీ మాట్లాడారు. ఏ స్థాయిలో ఉన్నా వదిలేది లేదని స్పష్టం చేశారు. ఇంకా ఎలాంటి అంశాలు మాట్లాడారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

కడపలో రైతులతో భారీ సదస్సు - మధు..

విజయవాడ : రాష్ట్రంలో భయంకరమైన కరవు ఉంటే మహానాడులో హత్యా రాజకీయాలపై మాట్లాడడం హాస్యాస్పదమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. కరవుపై జూన్ 9న కడపలో రైతులతో భారీ సదస్సు నిర్వహిస్తామని, స్మార్ట్ గవర్నెన్స్ అని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఒక్క రైతుకు కూడా నష్ట పరిహారం అందలేదని తెలిపారు.

నమ్మకం లేక సర్వేలు - జీవన్ రెడ్డి..

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ కి ఎమ్మెల్యేలపై నమ్మకం లేక సర్వేలు చేయిస్తారని టి.కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి పేర్కొన్నారు. సర్వేల పేరిట ప్రజలను మభ్య పెడుతున్నారని తెలిపారు.

కేసీఆర్ సర్వే బోగస్ - షబ్బీర్..

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ కు సర్వేలపై నమ్మకం ఉంటే రేపే ఎన్నికలకు రావాలని ఎమ్మెల్సీ షబ్బీర్ ఆలీ సవాల్ విసిరారు. గత సర్వేలో మంత్రి కేటీఆర్ కు 46 శాతం వస్తే ఇప్పుడు 91 శాతం ఎలా వచ్చిందని ప్రశ్నించారు. కేసీఆర్ సర్వే ఓ బోగస్ అని పేర్కొన్నారు.

 

క్షమాపణలు చెప్పిన ఎంవీఎస్ మూర్తి..

విశాఖపట్టణం : టిడిపి మహానాడు వేదిక నుండి విద్యార్థులకు ఎమ్మెల్సీ ఎంవీఎస్ మూర్తి క్షమాపణలు చెప్పారు. ఇటీవల ఏయూని దెయ్యాల కొంప అని ఎమ్మెల్సీ మూర్తి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

 

టీఆర్ఎస్ గెలిస్తే రాజీనామా - కోమటిరెడ్డి..

నల్గొండ : రూ. 500 కోట్లతో నిర్మించిన అద్దాల మేడలో ఉన్న సీఎం కేసీఆర్ కు బయట ప్రపంచం గురించి తెలియదని టి.కాంగ్రెస్ నేత ఎమ్మెల్యే కోమటిరెడ్డి విమర్శించారు. ఆంధ్రా కాంట్రాక్టర్ల చేతిలో తెలంగాణను పెట్టి భ్రష్టు పెట్టిస్తున్నారని, దమ్ముంటే నల్గొండ ఎంపీతో రాజీనామా చేయించి గెలవాలని సవాల్ విసిరారు. టీఆర్ఎస్ గెలిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కు ఓట్లకు బదులు రాళ్లు పడుతాయన్నారు.

13:08 - May 28, 2017

హైదరాబాద్ : నరేష్ పరువు హత్యను నిరసిస్తూ తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలోని 'కుల రక్కసి' దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. సీపీఎం...వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. నల్గొండ..యాదాద్రిలో పలువురు ఆందోళన నిర్వహించి కుల రక్కసి దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, నరేష్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లాలోని తెలంగాణ చౌరస్తాలో దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నరేష్ కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం అందించాలని, స్వాతి మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.

టీఆర్ఎస్ లో చేరుతున్నా - రమేష్ రాథోడ్..

ఆదిలాబాద్ : ఈనెల 29వ తేదీన టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు రమేష్ రాథోడ్ వెల్లడించారు. నిర్మల్ అధ్యక్షుడుతో సహా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 99 శాతం టిడిపి నేతలు టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు, కేసీఆర్ రాష్ట్ర దశా..దిశను మార్చే ముందు చూపున్న నేత అని కొనియాడారు. అభివృద్ధి..సంక్షేమ పథకాలు నచ్చి టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు వెల్లడించారు.

12:46 - May 28, 2017

నందిని సిద్దారెడ్డి..ప్రముఖ రచయిత..సామాజిక ఉద్యమకారులు. రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడారు. పలు సాహిత్య కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు కవితా సంకలాలను వెలువరించారు. ఆయన పలు పురస్కారాలు కూడా అందుకున్నారు. తెలంగాణ‌ సాహిత్య‌ అకాడ‌మి చైర్మ‌న్ గా బాద్య‌త‌లు స్వీక‌రించిన‌ డా. నందిని సిద్దారెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయనతో టెన్ టివి అక్షరం ఇంటర్వ్యూ నిర్వహించింది. ఆయన ఎలాంటి విశేషాలు తెలియచేశారో వీడియో క్లిక్ చేయండి.

12:28 - May 28, 2017

క్వారీ క్షతగాత్రులను పరమార్శించిన పత్తిపాటి..సుజయ..

గుంటూరు : ఫిరంగిపురం రాళ్ల క్వారీలో జరిగిన ప్రమాదంలో గాయపడిన వారిని మంత్రులు పత్తిపాటి పుల్లారావు, సుజయ కృష్ణ రంగారావులు పరామర్శించారు. ఘటనపై విచారణకు ఆదేశించడం జరిగిందని, నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి సుజయ తెలిపారు. నిబంధనలు పాటించని గ్రానైట్ పరిశ్రమలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

12:10 - May 28, 2017

మేడ్చల్ : తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కలుషిత నీటితో లక్షలాది చేపలు మృతి చెందుతున్నాయి. అయినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా కీసర మండలం రాంపల్లిలో ఉన్న పెద్ద చెరువు కలుషితం కావడంతో చేపలు మృత్యువాత పడ్డాయి. సుమారు 10 లక్షల చేపలు మృతి చెందాయని మత్స్యకారులు పేర్కొంటున్నారు. దీనిపైనే తాము ఆధారపడి జీవిస్తున్నామని, తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. చర్లపల్లి పారిశ్రామిక వాడలోని వ్యవర్థ జలాలు కలవడంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది.

రాంపల్లి పెద్ద చెరువులో చేపల మృతి..

మేడ్చల్ : జిల్లాలోని కీసర మండలం రాంపల్లిలో పెద్ద చెరువులో పది లక్షల చేపలు మృత్యువాత పడ్డాయి. చర్లపల్లి పారిశ్రామిక వాడలోని పరిశ్రమల వ్యర్థ జలాలు చెరువులో కలవడంతోనే చేపలు మృతి చెందాయని మత్స్యకారులు పేర్కొంటున్నారు.

 

11:33 - May 28, 2017

ఖమ్మం : టీఆర్ఎస్ పాలనలో కుల దురంహకార హత్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని కేవీపీఎస్ పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏడు పరువు హత్యలు జరిగాయని, తక్షణమే పరువు హత్యలు నివారించే విధంగా చర్యలు తీసుకోవాలని ఖమ్మం జిల్లా కేపీవీఎస్ నందిపాటి మనోహర్ డిమాండ్ చేశారు. నరేష్ పరువు హత్యను నిరసిస్తూ ఖమ్మం జిల్లాలోని సరిత క్లినిక్ సెంటర్ వద్ద కుల రక్కసి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నరేష్ కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం అందించాలని, స్వాతి మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.

11:24 - May 28, 2017

హైదరాబాద్ : నరేష్ హత్యకు ముందు స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డి..అతని సమీప బంధులు పక్కా ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. నరేష్..స్వాతిలను భువనగిరికి రప్పించేందుకు అత్యంత పకడ్బందీ ప్లాన్ వేశారని, మిస్సింగ్ కేసు పెట్టి పోలీసులపై వత్తిడి తెచ్చి నరేష్ ను భువనగిరికి రప్పించినట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. పెళ్లి అయిన కొత్తలో ఆత్మకూరు ఎస్ఐ జరిపిన సంభాషణ టెన్ టివికి చిక్కింది. దీనిని బట్టి స్వాతిని..నరేష్ లను భువనగిరికి రప్పించేందుకు జరిగిన ప్రయత్నం ఏంటో అర్థమౌతుంది. స్వాతితో ఆత్మకూరు ఎస్ఐ జరిపిన మాటలు వినేందుకు వీడియో క్లిక్ చేయండి.

11:19 - May 28, 2017

హైదరాబాద్ : వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీతో దోస్తికి కాంగ్రెస్ ఎందుకు సై అంటుంది..? రాజ‌కీయ వైరాన్ని ప‌క్కనపెట్టిన టీడీపీ,..హ‌స్తంతో జోడికి ఎందుకు రెఢీ అంటుంది..? ఎన్నిక‌లు అల్లంత దూరాన ఉన్నా..ప్రతిప‌క్షాలు ఇంత‌గా అల‌ర్ట్ కావడానికి కారణాలేంటీ..? అవును ఇవే ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. తెలంగాణ‌లో ఎన్నిక‌ల వేడి రాజుకుంది. 2019లో అధికారంపై ఆశ‌లు పెట్టుకున్న పార్టీలు ఇప్పడి నుండే స‌మాయ‌త్తం అవుతున్నాయి. టీఆర్ఎస్‌ను ఎట్టి ప‌రిస్థితుల్లో గ‌ద్దే దించ‌డానికి వ్యూహాలు ప‌న్నుతున్నాయి. దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టిన‌ ప్రధాన ప్రతిప‌క్షం కాంగ్రెస్ వేగంగా పావులు క‌దుపుతోంది. దీనిలో భాగంగా..ఇప్పుడి నుండే పొత్తుల మంత్రాంగానికి తెర‌తీసిన హ‌స్తం పార్టీ..ద‌శాబ్దాల రాజ‌కీయ వైరం ఉన్న టీడీపీతో దోస్తికి సై అన‌డం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ హాట్‌గా మారింది.

టీడీపీతో దోస్తీకి సై అంటున్న హస్తం పార్టీ..
ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి రాష్ట్రంలో ఆవిర్భవించిన టీడీపీ..ఆది నుండి కాంగ్రెస్‌కు ప్రత్యర్తిగానే ఆవిర్భవించింది. అలాంటి టీడీపీతో..ఇప్పుడు కాంగ్రెస్ సై అంటుంటే..ఈ స్నేహ హ‌స్థం అందుకునేందుకు తెలంగాణ తెలుగు దేశం పార్టీ సైతం రెఢీ అంటుంది. అయితే ఇదే ఇప్పుడు రాష్ట్ర రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. రాజ‌కీయ‌ వైరీ వ‌ర్గాలుగా ఉన్న కాంగ్రెస్,..టీడీపీలు ఇప్పుడు క‌లిసి పోవాల‌నే నిర్ణయానికి రావ‌డం వెన‌క కార‌ణాలు ఏంట‌న్నదానిపై తీవ్ర చ‌ర్చ జ‌రుగుతుంది.

కాంగ్రెస్‌కు ఆది నుండి టీడీపీ ప్రత్యర్థే..
అయితే కాంగ్రెస్-టీడీపీ పొత్తుల చిత్రాల వెన‌క పెద్ద క‌స‌ర‌త్తే జ‌రిగింద‌ని తెలుస్తుంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఉండి కూడా ప్రస్తుతం ప్రతిపక్షానికి ప‌రిమితం కావ‌డంపై ఇప్పడికీ జీర్ణించుకోలేక పోతున్న కాంగ్రెస్..టార్గెట్ 2019 పెట్టుకుంది. తాము అధికారంలోకి రావాలంటే..త‌మ బ‌లానికి కొంత ఇత‌రుల బ‌లం తోడుకావాల‌ని..అప్పుడే అది టీఆర్ఎస్ గెలుపుకు బ్రేకులు వేస్తుంద‌ని డిసైడ్ అయిన కాంగ్రెస్ పార్టీ.. టీఆర్ఎస్‌కు వ్యతిరేక శ‌క్తుల‌ను ఏకం చేయాల‌ని నిర్ణయానికి వ‌చ్చింది. దీనిలో భాగంగా వామ‌ప‌క్షాలు, జేఏసీతో ఇప్పటికే స‌త్సాంబందాల‌ను కొన‌సాగిస్తునే..ఇప్పుడు టీడీపీకి కూడా స్నేహ హ‌స్తాన్ని చాచింది.

పొత్తుల వెనక పెద్ద కసరత్తే జరిగింది..
కాంగ్రెస్-టీడీపీ దోస్తీపై ఆ రెండు పార్టీల‌లో అనేక త‌ర్జనభర్జనల త‌ర్వాతనే పొత్తుల ప్రక‌ట‌న‌లు తెర‌పైకి వ‌చ్చిన‌ట్లు తెలుస్తుంది. గ‌తంలో ఎన్నిక‌ల్లో పార్టీల‌కు వ‌చ్చిన ఓటింగ్ శాతంతోపాటు..ప్రస్తుతం రాష్ట్రంలో టీఆర్ఎస్ న‌డుపుతున్న పాలిటిక్స్ కూడా ఈ రెండు పార్టీలు క‌లవాల్సిన పరిస్థితికి కార‌ణమైంద‌న్నది ఆ పార్టీ నేతల్లో టాక్. మొన్నటి గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ గెలిచినా..టీడీపీకీ 14శాతం ఓట్లు రాగా..బీజేపీకి 8 శాతం.,కాంగ్రెస్ 9 శాతం, టీఆర్ఎస్ 36 శాతం, ఎంఐఎంకు 14 శాతం ఓట్లు వ‌చ్చాయి. దీనికితోడు ఇటీవ‌లే వ‌చ్చిన ఓ స‌ర్వేలో టీఆర్ఎస్ 40 శాతం, కాంగ్రెస్ 22 శాతం, టీడీపీ 16 శాతం, బీజేపీకి 7శాతం ప్రజ‌లు మ‌ద్దతు తెలిపారు. ఈ స‌ర్వేలో వ్యక్తిగతంగా కేసీఆర్ త‌ర్వాత స్థానం రేవంత్ రెడ్డికి వ‌చ్చింది.

పక్కా స్కెచ్..
వీట‌న్నింటి నేప‌థ్యంలో టీడీపీ, వామ‌ప‌క్షాల‌ను క‌లుపుకుని పోవ‌డం వ‌ల‌న ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందని కాంగ్రెస్ భావిస్తుంది. టీఆర్ఎస్‌పై ప్రస్తుతం కాంగ్రెస్ క్యాడ‌ర్‌కు ఉన్నదానికి ప‌దింత‌లు కోపం..టీడీపీ క్యాడ‌ర్‌కు ఉండ‌టం కూడా..పొత్తుకు క‌లిసి వ‌స్తుంద‌ని హ‌స్తం పార్టీ అంచనా. అయితే ఈ పొత్తును ఈ రెండు పార్టీల్లోని కొంద‌రు నేత‌లు వ్యతిరేకిస్తున్నప్పటికీ..వారంద‌రు ఎప్పుడు ప్రత్యక్ష ఎన్నిక‌ల్లో పోటి చేసిన వారు కాక‌పోవ‌డంతో..ముఖ్య నేత‌లు వారి అభిప్రాయాల‌ను లైట్ తీసుకుంటున్నారు. మ‌రోవైపు కాంగ్రెస్-టీడీపీలు గ‌తంలో క‌ల‌సి ప‌నిచేసిన అంశాన్ని గుర్తు చేస్తున్నారు. గ‌తంలో టీడీపీ క్యాబినెట్లో ఉన్న గుజ్రాల్ ప్రభుత్వానికి..కాంగ్రెస్ మ‌ద్దతు ఇచ్చింద‌ని..ఇప్పటి రాజ‌కీయ అవ‌స‌రాల‌కు అనుగుణంగా పొత్తు పెట్టుకోవ‌డం త‌ప్పుకాద‌దన్నది ముఖ్య నేత‌ల వాద‌న‌. మొత్తానికి అధికార టీఆర్ఎస్ పార్టీని గ‌ద్దేదింపండ‌మే ల‌క్ష్యంగా..2019లో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌కు ఇప్పడి నుండే శ్రీకారం చుడుతున్న కాంగ్రెస్ పార్టీ..సైకిల్‌తో స‌వారి చేసేందుకు రెఢీ అంటుంది. బ‌ల‌వంతుడిని ఢీ కొట్టాలంటే..తాము గుంపు పెంచుకోవాల‌న్న సూత్రాన్ని అమ‌లు చేసేందుకు పక్కా స్కెచ్ వేస్తుంది హ‌స్తం పార్టీ. మ‌రీ ఈ పొత్తుల సిత్రాలు..గులాబీ పార్టీని ఏ మేర‌కు బ‌ల‌హీన ప‌రుస్తాయో చూడాలి.

కుల రక్కసి దిష్టిబొమ్మల దహనం..

హైదరాబాద్ : నరేష్ హత్య, స్వాతి అనుమానాస్పద మృతిపై ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. కులాలు వేరు కావడంతో స్వాతి తండ్రి తుమ్మల శ్రీనివాస్ రెడ్డి..నరేష్ ను దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రజా సంఘాలు తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కుల రక్కసి దిష్టిబొమ్మలు దహనం చేశారు.

కొనసాగుతున్న టిడిపి మహానాడు..

విశాఖపట్టణం : టిడిపి మహానాడు రెండో రోజు కొనసాగుతోంది. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఘనంగా నివాళులర్పించారు.

10:11 - May 28, 2017

హైదరాబాద్ : ధర్నా చౌక్ ఉండడం వల్ల తమకు ఎలాంటి సమస్యలు లేవని అక్కడి స్థానికులు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం ధర్నా చౌక్ పరిరక్షణ కమిటీ నేతలు బస్తీల్లో పర్యటించారు. ధర్నా చౌక్ తరలింపు విషయంలో స్థానికుల అభిప్రాయాలను నేతలు అడిగి తెలుసుకున్నారు. ధర్నా చౌక్ పై పునరాలోచించుకోవాలని, ప్రభుత్వం ఉద్ధేశ్యపూర్వకంగా తరలిస్తోందన్నారు. ధర్నా చౌక్ ఉండడం వల్ల తమకు ఎలాంటి ఇబ్బంది లేదని స్థానికులు పేర్కొంటున్నారని కమిటీ నేతలు తెలిపారు. కొనసాగించేందుకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేనప్పుడు ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది అని సూటిగా ప్రశ్నించారు. తరలింపు వెనుక రియల్ ఎస్టేట్ ఉందనే అనుమానాలున్నాయని తెలిపారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు.

10:10 - May 28, 2017

చిత్తూరు : రాయలసీమలో మరో నేత హత్యకు గురయ్యాడు. ఇటీవలే పలువురు నేతలు దారుణ హత్యలకు గురైన సంగతి తెలిసిందే. తాజాగా కేవీబీ పురంలో కాంగ్రెస్ నేత రాజశేఖరరెడ్డిని దారుణ హత్యకు గురయ్యాడు. తనకున్న ఇటుకల బట్టీ నుండి శనివారం రాత్రి రాజశేఖరరెడ్డి ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యంలో దుండగులు అటకాయించి కత్తులపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఆయన శరీరంపై 20 కత్తిపోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. హత్యకు గల కారణాలు ఏంటనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రాజశేఖరరెడ్డికి కొంతమంది ప్రత్యర్థులున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ నేత దారుణ హత్య..

చిత్తూరు : జిల్లాలో కేవీబీపురంలో అర్ధరాత్రి కాంగ్రెస్ నేత దారుణ హత్యకు గురయ్యాడు. రాజశేఖరరెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.

ధాన్యం కొనుగోలు చేయండంటై రైతుల ఆందోళన..

జగిత్యాల : రాయికల్ మండలం రామోజీపేటలో రైతులు ధర్నా నిర్వహించి రాస్తారోకో చేపట్టారు. ఐకేపీ సెంటర్ లో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

మాజీ ఎంపీ హర్షకుమార్ ఆందోళన..

తూర్పుగోదావరి : రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు వద్ద మాజీ ఎంపీ హర్షకుమార్ ఆందోళన నిర్వహించారు. తప్పుడు కేసులతో యువకులను వేధిస్తున్నారంటూ నిరసన వ్యక్తం చేశారు.

విశాఖ పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ..

విశాఖపట్టణం : టిడిపి కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆవిష్కరించి నివాళులర్పించారు.

09:19 - May 28, 2017
09:10 - May 28, 2017

విశాఖపట్టణం : మహానాడు రెండో రోజుకు చేరుకుంది. విశాఖలో జరుగుతున్న మహానాడు శనివారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆదివారం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పలు కార్యక్రమాలు జరగనున్నాయి. పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆవిష్కరించనున్నారు. అనంతరం మహానాడు వేదికపై ఎన్టీఆర్ కు నివాళులర్పించనున్నారు. అనంతరం 12 తీర్మానాలను ఆమోదించనున్నారు. పోలవరం..తెలంగాణ రాష్ట్రంలో పడకేసిన ఆరోగ్యం..కరవు రహిత రాష్ట్రంగా ఏపీ..జలసంరక్షణ..నదుల అనుసంధానం తదితర తీర్మానాలున్నాయి. మరోవైపు నేడు జరిగే మహానాడులో పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి నామినేషన్ల ను స్వీకరించనున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

08:29 - May 28, 2017
08:24 - May 28, 2017

జంతువధను నిషేధిస్తామని కేంద్రం చేసిన ప్రకటనపై ప్రజల నుండి వ్యతిరేకత వ్యక్తమౌతోంది. తక్కువ ధరకు లభిస్తూ మంచి ప్రొటీన్స్ లభించే 'బీఫ్'ను నిషేధిస్తే ఏం తిని బతకాలని పలువురు ప్రశ్నిస్తున్నారు. చికెన్..మటన్..చేపల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ‘బీఫ్' ను నిషేధిస్తే వాటి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని, సామాన్యులు నాన్ వెజ్ తినలేని పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొంటున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

08:10 - May 28, 2017

హైదరాబాద్ : దివంగత నందమూరి తారకరామారావు జయంతి వేడుక సందర్భంగా నటుడు జూ.ఎన్టీఆర్, ఎన్టీఆర్ కుటుంబసభ్యులు నివాళులర్పించారు. ఆదివారం తెల్లవారుజామున ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చిన వీరు పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. దర్శకుడు కోరాటల శివతో వచ్చిన జూ.ఎన్టీఆర్ నివాళులర్పించారు. అనంతరం కాసేపు ఘాట్ వద్ద కొద్దిసేపు కూర్చొన్నారు. ఈ సందర్భంగా జూ.ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడారు. తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ ఆశీస్సులుంటాయని, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. పలువురు సినీ సెలబ్రిటీలు, ప్రముఖులు వస్తుండటంతో ఘాట్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

07:42 - May 28, 2017

రాజ్ తరుణ్..’ఉయ్యాల జంపాల' సినిమాతో కథనాయకుడిగా పరిచయమైన ఈ నటుడు వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ ముందుకెళుతున్నాడు. హిట్ ట్రాక్ లో దూసుకెళుతున్న ఈ నటుడు తాజాగా 'అంధగాడు'తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరోసారి ‘రాజ్ తరుణ్’ తో ‘హెబ్బా పటేల్’ జత కట్టింది. ఈ సందర్భంగా టెన్ టివి వారితో ముచ్చటించింది. రోటిన్ కు భిన్నంగా ఈ పాత్రను పోషించడం జరిగిందని, సినిమా మొత్తం అంధగాడిగా ఉండనని 'రాజ్ తరుణ్' పేర్కొన్నారు. పలు సినిమాల్లో ఇద్దరం కలిసి నటించడం వల్ల అవగాహన పెరిగిందని 'హెబ్బా పటేల్' తెలిపారు. వరుసగా ఇద్దరూ కలిసి సినిమాల్లో నటించడంలో ఎంటీ అనే ప్రశ్నకు అలా జరిగిపోతోందని 'రాజ్ తరుణ్' తెలిపారు. వచ్చే సినిమాల్లో 'హెబ్బా పటేల్'తో నటించడం జరగదని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి...

టిడిపి మహానాడు రెండో రోజు..

విశాఖపట్టణం : టిడిపి మహానాడు రెండో రోజుకు చేరుకుంది. ఈ రోజు మహానాడులో 12 తీర్మానాలను ప్రవేశ పెట్టనున్నారు. మహానాడులో జాతీయ అధ్యక్షుడు ఎన్నిక జరగనుంది.

విశాఖలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ..

హైదరాబాద్ : నేడు ఎన్టీఆర్ జయంతి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలు కార్యక్రమాలు జరగనున్నాయి. విశాఖలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించనున్నారు.

నెల్లూరుకు రానున్న ప్రకాష్ కారత్..

నెల్లూరు : పరమేశ్వరీ కళ్యాణ మండపంలో 'దేశంలో నేటి వర్తమానం రాజకీయ పరిస్థితిపై సీపీఎం వైఖరి'పై సభ జరగనుంది. ఈ సభకు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాష్ కారత్, ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పాల్గొననున్నారు.

ఎన్టీఆర్ ఘాట్ కు జూ.ఎన్టీఆర్..

హైదరాబాద్ : ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకున్నారు. అక్కడ ఎన్టీఆర్ సమాధికి నివాళులర్పించారు. ఎన్టీఆర్ ఆశీస్సులు తెలుగు రాష్ట్రాలకు ఉంటాయని జూ.ఎన్టీఆర్ పేర్కొన్నారు.

నేడు ఎన్టీఆర్ జయంతి..

హైదరాబాద్ : ఎన్టీఆర్ జయంతిని టిడిపి అభిమానులు, కార్యకర్తలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పలు కార్యక్రమాలు జరగనున్నాయి.

06:48 - May 28, 2017

జమ్మూ కాశ్మీర్ : జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 10 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. భద్రతాదళాల ఎదురు కాల్పుల్లో హిజ్బుల్‌ కమాండర్‌ సబ్జర్‌ అహ్మద్‌ భట్‌ మృతి చెందాడు. సబ్జర్‌ భట్‌ బుర్హాన్‌ వాని స్థానంలో కమాండర్‌ బాధ్యతలు చేపట్టాడు. దీంతో కశ్మీర్‌ లోయలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేశారు. జమ్ముకశ్మీర్‌లో వేర్పాటువాద మిలిటెంట్‌ సంస్థ హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హిజ్బుల్‌ ముజాహిదీన్‌ టాప్‌ కమాండర్ సబ్జర్‌ అహ్మద్‌ భట్‌ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. జమ్మూకశ్మీర్‌లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో మొత్తం తొమ్మిది మంది ఉగ్రవాదులు మరణించినట్లు భద్రతా దళాలు తెలిపాయి. పుల్వామా జిల్లాలోని త్రాల్‌ సెక్టార్‌లో ముగ్గురు, బారాముల్లా జిల్లాలోని రాంపూర్‌ సెక్టార్‌లో ఎల్‌వోసీ మీదుగా చొరబాటుకు ప్రయత్నించిన ఆరుగురు టెర్రరిస్టులను ఆర్మీ మట్టుబెట్టింది.

త్రాల్ సెక్టార్ లో..
ఉగ్రవాదులు పుల్వామా జిల్లాలోని త్రాల్‌ సెక్టార్‌లో ఓ ఇంట్లో దాక్కున్నారన్న సమాచారం మేరకు భద్రతా దళాలు ఆ ఇంటిని చుట్టుముట్టాయి. ఆర్మీ, సిఆర్‌పిఎఫ్, జమ్ముకశ్మీర్‌ పోలీసులు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో హిజ్బుల్‌ టాప్‌ కమాండర్‌ సబ్జర్‌ అహ్మద్‌ భట్‌తో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. హిజ్బుల్‌ కమాండర్‌ బుర్హాన్‌ వనీ స్థానంలో సబ్జర్‌ అహ్మద్‌ భట్‌ పగ్గాలు చేపట్టాడు. ఎన్‌కౌంటర్‌లో సబ్జర్‌ అహ్మద్‌ భట్‌ హతమవ్వడంతో కశ్మీర్‌లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దక్షిణ కశ్మీర్‌లో పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. అనంతనాగ్‌లో భద్రతాదళాలతో జరిగిన ఘర్షణల్లో ఓ వ్యక్తి గాయపడ్డాడు. పరిస్థితి విషమిస్తుండడంతో అధికారులు కశ్మీర్‌లో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. లోయలో షాపులు మూతపడ్డాయి. గత ఏడాది హిజ్బుల్‌ కమాండర్‌ బుర్హాన్‌ వనీ ఎన్‌కౌంటర్‌ తర్వాత కశ్మీర్‌లో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా విషమించింది. భద్రతాదళాలపై ఆందోళనకారులు రాళ్లు రువ్వడంలాంటి హింసాత్మక ప్రదర్శనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. తాజాగా సబ్జర్‌ అహ్మద్‌ భట్‌ ఎన్‌కౌంటర్‌తో లోయలో పరిస్థితి విషమించే అవకాశం ఉండడంతో అధికారులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

06:42 - May 28, 2017

హైదరాబాద్ : మీకు ఉన్న స‌మ‌స్యలు ప‌రిష్కరిస్తాం,..మీ వీధికి రోడ్డు వేస్తాం,..డివిజ‌న్‌ను ఆద‌ర్శ డివిజ‌న్‌గా తీర్చిదిద్దడ‌మే త‌మ ల‌క్ష్యం. ఇవీ జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో కార్పొరేట‌ర్లు ఇచ్చిన హామీలు. కొందరూ అందుకోసం చిత్త శుద్దితో ప‌నిచేస్తుంటే,..మ‌రికొందరు మాత్రం విరుద్దంగా ప‌ని చేస్తున్నారు. ప‌ద‌విలో ఉన్నంత‌సేపు అందిన కాడికి దండుకోవ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నారు బ‌ల్దియాలోని కొందరు కార్పొరేట‌ర్లు. స్ట్రీట్ వెండ‌ర్ నుంచి,.బిల్డర్‌ దాక ఎవర్నీ వ‌ద‌ల‌డం లేదు గ్రేట‌ర్‌లోని కార్పొరేట‌ర్లు. వీడియోలో మీరు చూస్తున్న ఈ విజువల్స్ ఎవరో మాఫియా గ్యాంగ్‌ బెదిరిస్తున్నట్లుగా ఉంది కదూ. కానీ ఇక్కడ వీరిని బెదిరిస్తున్నది ఎవరో మాఫియా గ్యాంగ్‌ కాదు..హైదరాబాద్‌ నగరంలోని ఓ కార్పొరేటర్‌ మనుషులు. డివిజన్‌లో కొత్త ఇళ్లు కట్టుకుందామనుకొని మెటిరియ‌ల్ డంప్ చేస్తే చాలు,.కార్పొరేటర్‌ కంటే ముందుగానే..ఆయన మనుషులు వాలిపోతూ అందిన కాడికి దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ , ప్రైవేటు అనే తేడా లేకుండా ఎక్కడ ఖాళీ జాగా క‌నిపిస్తే చాలు అక్కడ కార్పొరేటర్‌ మనుషులు వాలిపోతూ వసూళ్ల పర్వానికి పాల్పడుతున్నారు.

ఉప్పల్ సర్కిల్ లో..
ఉప్పల్‌ స‌ర్కిల్లో ఒక కార్పొరేట‌ర్ భ‌రత్‌పై భూక‌బ్జా కేసు న‌మోదు అయ్యింది. ఎల్బీ న‌గ‌ర్ స‌ర్కిళ్లో కూడా ప‌లువురు కార్పొరేట‌ర్లపై కేసులు న‌మోదు అయ్యాయి. ఈ వ్యవహారంలో చైత‌న్యపురి కార్పొరేట‌ర్ అందరికంటే ముందున్నారు. ఓ భ‌వ‌న నిర్మాణం దగ్గరకు వెళ్లి వారిని తన మనుషులతో బెదిరించ‌డం ఇప్పుడు గ్రేటర్‌లో హాట్ టాఫిక్‌గా మారింది. త‌మ‌ను 10 లక్షల రూపాయ‌లు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నార‌ని అవి ఇవ్వనందుకే అనుచ‌రుల‌తో కలిసి దాడికి పాల్పడ్డారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీసీ 447, 385, 324, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక వీరి అరాచకాలతో విసిగిన మరికొందరు..ఏకంగా హెచ్చార్సీకి కూడా ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా కార్పొరేట‌ర్ల ఇంటిముందు ధర్నాలు కూడా చేశారు. కూకట్‌పల్లి సర్కిల్లో ప్రభుత్వ స్థలాన్ని కార్పొరేట‌ర్ క‌బ్జా చేశారని వార్త రాసిన ఓ విలేఖరి ఇంటిపై దాడిచేశారు ఓ కార్పొరేట‌ర్.

చేతులు కలుపుతున్న ఎమ్మెల్యేలు..అధికారులు..
కేసు పెట్టినందుకు పోలీస్‌స్టేషన్‌ ముందు కూడా ధర్నాకు దిగారు స‌ద‌రు కార్పొరేట‌ర్. శేరిలింగంపల్లి స‌ర్కిల్‌లో మరో కార్పొరేటర్ భూ కబ్జాదారుకు వత్తాసు పులుకుతూ బెదిరింపుల‌కు పాల్పడుతున్నారని..తమకు రక్షణ కల్పించాంటూ హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించారు బాధితులు. ఎల్బీనగర్‌ స‌ర్కిల్లో పేద‌లు ఎంతో కాలంగా నివాసం ఉంటున్న స్థలంపై కార్పొరేట‌ర్ క‌న్నేశారు. దాన్ని ఖాళీ చేయించేందుకు ఆయ‌న విశ్వ ప్రయత్నాలు చేయడంతో ప్రజలు ఆయ‌న ఇంటిముందు ధర్నాకు దిగారు. హైద‌రాబాద్‌లో రోజు రోజుకు పెరిగిపోతున్న అక్రమ నిర్మాణాల‌కు కార‌ణం కార్పొరేట‌ర్లే అనే ఆరోప‌ణ‌లున్నాయి. వీరికి ఎమ్మెల్యేలు, అధికారులు కూడా చేతులు కలుపుతున్నారు.

కమిషనర్ చెక్ పెడుతారా ?
త‌మ మాట విన‌ని వ్యాపారులు, నిర్మాణ దారుల‌పైకి అధికారుల‌ను పంపిస్తూ వారిని భ‌య‌బాంత్రుల‌కు గురిచేస్తున్నారు కార్పొరేటర్లు. దీంతో వీరి సంపాదన మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది. మహిళా కార్పొరేటర్లు సైతం తక్కువేం తినలేదు. మల్కాజ్‌గిరి స‌ర్కిల్లో ప్రైవేటు వ్యక్తి స్థలాన్ని ప్రభుత్వ స్థలమంటూ ఓ కార్పొరేట‌ర్ భ‌ర్త బేదిరింపుల‌కు పాల్పడుతున్నారు. ఇలా చెప్పుకుంటూపోతే వీరి లిస్ట్‌ చాంతడంతా ఉంటుంది. ప్రైవేటు హాస్టళ్లు,హోట‌ళ్లు, రెస్టారెంట్లు వంటి వాటిని కూడా వ‌ద‌లడం లేదు. ప్రైవేటు అంశాలే కాదు అభివృద్ది ప‌నుల్లో సైతం.. వీరు చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. కార్పొరేష‌న్ నుండి శాంక్షన్‌ అయిన ప‌నులు శంకుస్థాప‌న చేయాలంటే..కాంట్రాక్టర్లు వీరిని ప్రసన్నం చేసుకోవాల్సిందే. ఎరియాను బ‌ట్టి,.ప‌నిని బ‌ట్టి రేటు మారుతు ఉంటుంది. మరి వీరి ఆగడాలకు బల్దియా కమిషనర్‌ చెక్‌పెడతారా లేదా అన్నది చూడాలి.

06:36 - May 28, 2017

విశాఖపట్టణం : తెలుగువారి జీవితాల్లో వెలుగు తెచ్చిన పార్టీ టిడిపి అని సీఎం చంద్రబాబు అన్నారు. ఏదైనా చేయగల సత్తా పార్టీకి ఉందని చెప్పారు. వైసీపీ దశదిశ లేని పార్టీ అని విమర్శించారు. తెలంగాణలో పార్టీ నేతలకు అన్ని విధాలుగా సహకారం అందిస్తామని, తెలంగాణలో ప్రజాసమస్యలపై పోరాడతామని విశాఖ మహానాడులో స్పష్టం చేశారు. ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణంలో టీడీపీ మహానాడు ఘనంగా ప్రారంభమైంది.. ఉదయం మహానాడు ప్రారంభ సమయంలో చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్, రక్తదాన శిబిరాలను చంద్రబాబు ప్రారంభించారు. మా తెలుగు తల్లికి మల్లెపూవు దండ పాటతో మహానాడు మొదలైంది.. మహానాడుకు రెండు రాష్ట్రాలనుంచి పెద్దసంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. సభ నిర్వహణ బాధ్యతను శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌ నాయుడు, ఎమ్మెల్యే జయనాగేశ్వర్‌ రెడ్డి చూసుకున్నారు.. టీడీపీ 36వ ఏడాదిలోకి అడుగుపెట్టిన యువ పార్టీ అని.. ఏదైనా చేయగల సత్తా పార్టీకి ఉందని చంద్రబాబు అన్నారు. తెలుగు వారు గర్వపడేలా పోలవరం నిర్మించుకుందామని చెప్పారు.. తెలంగాణ టీడీపీ నేతలకు అన్ని విధాలుగా సహకారం అందిస్తామని, తెలంగాణలో ప్రజాసమస్యలపై పోరాడతామని స్పష్టం చేశారు..

సోమవారం ముగింపు..
హైటెక్ సిటీ తెలుగువారి జీవితాల్లో వెలుగునింపిందని చంద్రబాబు చెప్పారు.. ఐటీ వల్ల ఎంతోమంది ఉపాధి పొందుతున్నారని గుర్తుచేశారు.. హైదరాబాద్‌లో అధిక ఆదాయం రావడానికి గతంలో టీడీపీ చేసిన అభివృద్ధేఅని తెలిపారు. మహానాడులో వంటకాలు అందరికీ నోరూరించాయి.. యాపిల్‌ హల్వా, తాపేశ్వరం కాజా, దోసకాయ, టమాట పప్పు, ఉలవచారు వంటి వంటకాలను అందరూ రుచిచూశారు. మొదటి రోజు భోజన కమిటీ నేతృత్వంలో 18 రకాల వంటకాలను ఏర్పాటు చేశారు. భోజన కమిటీ ఛైర్మన్‌ అయ్యన్న పాత్రుడు, ఎంపీ మాగంటి బాబు, ఎమ్మెల్యే వెలగపూడి, కేఎస్‌ఎన్‌రాజు భోజనశాలలోనే ఉంటూ పర్యవేక్షించారు. మహానాడులో తనను అవమానించారంటూ సినీ నటి కవిత కన్నీటిపర్యంతమయ్యారు.. కార్యక్రమానికి ఆహ్వానించి వేదికపై కూర్చునే అవకాశం ఇవ్వలేదంటూ తిరిగి వెళ్లిపోయారు. మహానాడును విజయవంతంచేసేందుకు సీనియర్‌ నేతలు పనుల్ని పర్యవేక్షించగా.. యువ నేతలు కార్యకర్తల్లా స్వయంగా ఏర్పాట్లను చూసుకున్నారు.. మహానాడులో చంద్రబాబు, లోకేశ్‌ భారీ కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సోమవారం ముగియనున్న మహానాడు.. రెండురోజుల పాటు.. పలు అంశాలపై చర్చించనున్నారు.

06:34 - May 28, 2017

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్‌ తమ పార్టీ ఎమ్మెల్యేలకు తీపి కబురు చెప్పారు. సర్వేలతో హడలెత్తిన నేతలకు తాజా సర్వేతో ఊపిరి పీల్చుకునేలా చేశారు. ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో 117 స్థానాలు TRS మిత్ర పక్షాలకే దక్కుతాయని తేల్చి చెప్పారు. తెలంగాణాలో అధికార పార్టీకి ప్రజాక్షేత్రంలో తిరుగులేదని ముఖ్యమంత్రి తమ పార్టీ నేతలకు భరోసా కల్పించారు. పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో తాజాగా నిర్వహించిన సర్వే ఫలితాలను ప్రకటించారు.. గత సర్వే వివరాలతో కొందరు నేతలు ఆందోళన చెందినా.... ప్రస్తుత సర్వే వారికి ఊరట ఇచ్చింది.. శాసనసభ్యులు విజయం సాధించడం ఖాయమని ఈ సర్వే తేల్చేసింది. టీఆర్‌ఎస్‌ సర్వే ప్రకారం నేతలందరిలో కేసీఆర్‌ టాప్‌లో ఉన్నారు. 98 శాతంతో ప్రజామోదం పొందారు. ఆ తర్వాతి స్థానంలో సీఎం కొడుకు కేటీఆర్‌ 91 శాతంతో రెండో స్థానంలో నిలిచారు. మరో కీలక నేత హరీష్ రావు 88 శాతంతో మూడో స్థానంలో ఉన్నారు. కూకట్ పల్లి ఎమ్మెల్యే మాదవరం కృష్ణారావు 36 శాతంతో ఈ సర్వేలో ఆఖరి స్థానంలో నిలిచారు. ఈ సర్వే ప్రకారం అధికార పార్టీకి 111 స్థానాలు..... మిత్రపక్షం MIMకు 6 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి రెండు స్థానాలు దక్కనున్నాయి.

రాష్ట్రపతి ఎన్నికలు..
సర్వే వివరాల్ని ప్రకటించిన సీఎం నేతలకు పలు సూచనలు చేశారు.. ఎమ్మెల్యేలంతా ఎక్కువ సమయం ప్రజల్లో ఉండేలా చూసుకోవాలన్నారు.. జిల్లాల వారిగా సమన్వయంతో వ్యవహరించాలని... నెలకోసారి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు భేటీ కావాలని ఆదేశించారు.. అదే విధంగా పార్టీ కార్యకర్తల కుటుంబాలతో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. 2019 ఎన్నికల్లో ప్రధాని మోదీ హవా కొనసాగదని సీఎం చెప్పుకొచ్చారు.. ఇక రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికీ మద్దతు ఇవ్వాలన్న అంశాన్ని కేసీఆర్‌కే వదిలేశారు.. ఈ నిర్ణయానికి సంబంధించిన తీర్మానాన్ని సీఎం తీసుకునేలా పార్టీ శాసనసభా పక్షం ఏకగ్రీవంగా ఆమోదించింది. మొత్తానికి ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉన్నా ప్రతి మూడు నెలలకోసారి సర్వేలు చేస్తూ నేతలను కేసీఆర్‌ ఇప్పటినుంచే అప్రమత్తం చేస్తున్నారు.

నేడు వామపక్షాల ప్రజా సంఘాల పాదయాత్ర..

హైదరాబాద్ : ఇందిరాపార్కు వద్ద కాలనీలో నేడు వామపక్షాల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పాదయాత్ర జరగనుంది. ధర్నా చౌక్ ను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ ఈ పాదయాత్ర జరగనుంది.

పశువధపై నిషేధం ఎత్తివేయాలి - నారాయణ..

ఢిల్లీ : కేంద్రం పశువధ నిషేధాన్ని ఉపసంహరించుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. పశుమాంస నిషేధంతో దేశ ఆర్థిక వ్యవస్థకు భంగం వాటిల్లిందని, ప్రజమ ప్రాథమిక హక్కులపై మోడీ ప్రభుత్వం దాడి చేస్తోందన్నారు. కరవు పరిస్థితుల్లో పశువులను రైతులు పోషిస్తారని, జంతు ప్రేమ ఉంటే కోడి, మేక, గొర్రెలు, కుందేలు మాంసంపై ఎందుకు నిషేధం విధించలేదని ప్రశ్నించారు. భజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ లు మైనార్టీలపై దాడులు చేయడానికే ఇలాంటి నిర్ణయాలు చేస్తున్నారని విమర్శించారు.

మాట్లాడే హక్కు ముద్రగడకు లేదన్న అన్నం సతీష్..

హైదరాబాద్ : కాపుల పక్షాన మాట్లాడే నైతిక హక్కు ముద్రగడకు లేదని ఎమ్మెల్సీ అన్నం సతీష్ పేర్కొన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం కాపులను వాడుకోవడం తగదని, ఏ పార్టీ చేయనంతగా టిడిపి కాపులకు న్యాయం చేస్తోందన్నారు. కాపులంతా తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారని తెలిపారు.

 

26న ముద్రగడ పాదయాత్ర..

తూర్పుగోదావరి : జులై 26వ తేదీన కిర్లంపూడి నుండి 'చావో-రేవో' పేరిట అమరావతికి ముద్రగడ పాదయాత్ర చేయనున్నారు. చంద్రబాబుకు జ్ఞాపకశక్తి తగ్గిపోయిందని, కాపులకు ఇచ్చిన హామీలను మర్చిపోయారని..కాపులకు అన్యాయం చేసిన వాళ్లకు బుద్ధి చెబుతామన్నారు.

 

తెలంగాణలో రాహుల్ గాంధీ షెడ్యూల్..

హైదరాబాద్ : తెలంగాణలో రాహుల్ గాంధీ షెడ్యూల్ ఖరారైంది. జూన్ 1వ తేదీన మధ్యాహ్నం 3.30గంటలకు రాహుల్ హైదరాబాద్ చేరుకోనున్నారు. రోడ్డుమార్గంలో రాహుల్ సంగారెడ్డికి చేరుకోనున్నారు. తెలంగాణ ప్రజాగర్జనలో రాహుల్ పాల్గొననున్నారు.

మరో ఇద్దరు టెర్రరిస్టుల హతం..

జమ్మూ కాశ్మీర్ : ఎన్ కౌంటర్ లో మరో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. రాంపూర్ వద్ద భద్రతా బలగాల కాల్పుల్లో మృతుల సంఖ్య ఆరుకు చేరింది.

 

Don't Miss