Activities calendar

29 May 2017

21:47 - May 29, 2017
21:46 - May 29, 2017

సిమ్లా : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌కు పటియాల హౌస్‌ కోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో వీరభద్రసింగ్‌తో పాటు ఆయన భార్యకు బెయిలు మంజూరు చేసింది. లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు, అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని వీరభద్రసింగ్‌ను కోర్టు ఆదేశించింది. కేసు తదుపరి విచారణ జూలై 27వ తేదీకి వాయిదా పడింది. సిబిఐ దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగడం లేదని, రాజకీయ ప్రోద్బలంతో సిబిఐ పనిచేస్తోందని విచారణ సందర్భంగా వీరభద్రసింగ్‌ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వీరభద్రసింగ్‌ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో10 కోట్ల రూపాయల ఆస్తులను అక్రమంగా కూడబెట్టినట్లు ఆరోపణలున్నాయి. అక్రమాస్తుల కేసులో బెయిల్‌ కోరుతూ వీరభద్రసింగ్‌ ఈనెల 22న కోర్టును ఆశ్రయించారు.

 

21:44 - May 29, 2017
21:43 - May 29, 2017

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌కు 111 సీట్లు వస్తాయని చెప్పిన సర్వే ఫలితాలను కాంగ్రెస్‌ వాళ్లు బోగస్ సర్వే అనడంపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం నాటి నుంచి తామంతా ఎన్నోసార్లు రాజీనామాలు చేసి మళ్లీ ఎన్నికల్లో తమ సత్తా ఏంటో నిరూపించామన్నారు. కాంగ్రెస్‌ వాళ్లే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తే వారి సీట్లలో ఎవరు గెలుస్తారో ప్రజలే తీర్పునిస్తారని కేసీఆర్ సవాల్ విసిరారు. 

21:42 - May 29, 2017

హైదరాబాద్ : నగరంలో సంచలనం రేపిన ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్‌ కుంభకోణంలో ముగ్గురు నిందితులను కూకట్‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు. వేలకోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను అప్పనంగా భూములను పొందిన గోల్డ్‌ స్టోన్‌ ఇన్‌ఫ్రా ప్రతినిధి పార్థసారథి, అకౌంటెంట్‌ శర్మ, కూకట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి ముగ్గురిని మియాపూర్‌ కోర్టులో హాజరుపరుచగా..విచారణ అనంతరం మేజిస్ట్రేట్‌ ముగ్గురు నిందితులకు 14రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది. నిందితులను చర్లపల్లి జైలుకు తరలించాని కోర్టు పోలీసులను ఆదేశించడంతో..వెంటనే వీరిని ప్రత్యేక భద్రత నడుమ చర్లపల్లి జైలుకు తరలించారు.

అక్రమ రిజిస్ట్రేషన్‌
సుమారు 587కోట్ల విలువైన 693 ఎకరాల ప్రభుత్వ భూమిని పారిశ్రామిక వేత్తలకు అక్రమ రిజిస్ట్రేషన్‌ చేసిన ఈ భారీ భూ కుంభకోణంలో నిందితుల నుంచి సమాచారాన్ని రాబట్టాలని పోలీసులు భావిస్తున్నారు. విచారణ కోసం ముగ్గురు నిందితులను 10రోజుల కస్టడీకి అనుమతినివ్వాలిని పోలీసులు పిటీషన్‌ దాఖలు చేయనున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు ఈ భారీ భూ కుంభకోణంపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ఇప్పటి వరకూ జరిగిన రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

రిజిస్ట్రేషన్ల రద్దు...
కుంభకోణంపై పూర్తస్థాయి విచారణ జరగాలని డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ అన్నారు. 546 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా సబ్‌ రిజిస్ట్రార్‌ శ్రీనివాసరావు ఇతరుల పేరుమీద రిజిస్ట్రేషన్‌ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ఈ రిజిస్ట్రేషన్లను వెంటనే రద్దు చేశామన్నారు. దీనిపై అంతర్గత విచారణ కమిటీని నియమించామన్నారు. నగరంలో చాలాకాలంగా ఒకే చోట పనిచేస్తున్న ఉద్యోగులు స్థానికులతో సంబంధాలు ఏర్పరుచుకుని అక్రమాలకు పాల్పడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కువకాలం ఒకే చోట పనిచేస్తున్న ఉద్యోగులను జిల్లాలకు బదిలీ చేస్తామని మహమూద్ అలీ స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని,.ప్రభుత్వ భూముల సంరక్షణకు ప్రయత్నిస్తున్నామన్నారు. మరో రెండు రోజుల్లో మరిన్ని చర్యలు చేపడతామని..ఈ భూమిపై సుప్రీంకోర్టులో కేసు కూడా నడుస్తోందని డిప్యూటీ సీఎం వెల్లడించారు. మియాపూర్‌ భూ కుంభకోణంలో తవ్వేకొద్ది నిజాలు బయటపడుతుండడంతో ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద భూ స్కాంగా అభివర్ణిస్తున్నాయి విపక్షాలు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఇలాంటి కుంభకోణాలు మరిన్ని జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం కఠినమైన చట్టాలను తీసుకురావాలని కోరుతున్నారు. 

21:40 - May 29, 2017

విశాఖ : విశాఖపట్నంలో మూడు రోజుల పాటు జరిగిన తెలుగుదేశం మహానాడు ముగిసింది. చివరి రోజు చంద్రబాబును పార్టీ జాతీయ అధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ చేయగా, చంద్రబాబు తరుపున 33 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. టీడీపీ జాతీయ అధ్యక్ష పదవికి ఎవరూ నామినేషన్లు వేయకపోవడంతో చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు పార్టీ శ్రేణుల హర్షధ్వానాల మధ్య ఎన్నికల అధికారిగా వ్యవహరించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి ప్రకటించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడుగా ఎన్నికైన చంద్రబాబును రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు అభినందించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యున్నతికి, ఆర్థిక అసమానతలు లేని సుసంపన్న రాష్ట్ర స్థాపనకు శక్తివంచనలేకుండా కృషి చేస్తాని చంద్రబాబు హామీ ఇచ్చారు. మహానాడులో అత్యంత కీలకమైన రాజకీయ తీర్మానాన్ని ఆర్థిక మంత్రి యనమల రాకృష్ణుడు ప్రవేశపెట్టారు. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు బలపరిచారు. ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించిన తెలుగుదేశం.. ప్రారంభమైన కొద్ది కాలం నుంచే జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న విషయాన్ని యనమల గుర్తు చేశారు. పార్టీ జెండా, అజెండా ఎప్పటికీ మారదని రాజకీయ తీర్మానంలో స్సష్టం చేశారు. విశాఖ రైల్వే జోన్‌తోపాటు అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు, ఏపీ పునర్విభజన చట్టంలోని 9,10 షెడ్యూలు సంస్థల విభజన, ఆస్తుల పంపకం కోసం చేస్తున్న పోరాటం ఆగదని రాజకీయ తీర్మానంలో తేల్చి చెప్పారు.

పలు తీర్మానాలు
మహానాడులో చివరిరోజు పలు తీర్మానాలను ఆమోదించారు. యువజన, క్రీడలు, ఐటీ విధానంపై తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి నారా లోకేశ్‌ ప్రతిపక్ష వైసీపీపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. నారా లోకేశ్‌, ఏపీ ఐటీ శాఖ మంత్రిమూడు రోజులపాటు జరిగిన మహానాడులో 34 తీర్మానాలను ఆమోదించారు. 94 మంది ప్రసంగించారు. మొత్తం 27 గంటలపాటు చర్చలు జరిగాయి. మహానాడు ముగింపులో చంద్రబాబు పార్టీ సేవాదళ్‌ కార్యకర్తలతో ఫోటోలు దిగారు. 

20:29 - May 29, 2017
20:26 - May 29, 2017

ప్రేమ కథలు విషాదంగా ముగుస్తున్నాయి..కులదురహంకారం గెలుస్తోంది.. హత్యలు ఆత్మహత్యలవుతున్నాయి...బాధితులు మరింత బాధింపడుతున్నారు..ఆధిపత్య కులాల అరాచకం పెరుగుతోంది.పీడిత కులాల బతుకుల్లో విషాదం నిండుతోంది. మరి ఈ ఘటనల్లో దారితప్పుతున్న పోలీసుల దర్యాప్తు ఎంతవరకు కారణం? పోలీసులు అసలు ఎవరికి అండగా నిలబడుతున్నారు..? రక్షణ ఇవ్వాల్సిన వారు అడ్డంకులు సృష్టిస్తున్నారు..న్యాయం చేయాల్సిన వారు ఇబ్బందులు పెడుతున్నారు..అండగా నిలవాల్సినవారు అన్యాయం చేస్తున్నారు..తమ అధికారాన్ని ఆధిపత్య కులాలకు అనువుగా ఉపయోగిస్తున్నారు.. పీడిత కులాల యువకులతో ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. 

20:24 - May 29, 2017

తెలంగాణ ముఖ్యమంత్రి.. ఉద్యమ ఆణిముత్యం కేసీఆర్ సారుకు రకరకాల పేర్లు వెడ్తున్నరుగదా ఈ కాంగ్రెస్ పార్టోళ్లు..నయ్యం ఇంక పోలీసోళ్లు మేల్కోకుంటే.. మొత్తం హైద్రావాదునే అమ్మిపారేస్తుండెనేమో ఈ సబ్ రిజిస్ట్రార్ గాడు.. ఏమున్నదమ్మా అత్తసొమ్ము అల్లుడు దానం జేశినట్టు ఒక్కటిగాదు...మాజీ ఆదిలాబాద్ జిల్లా ఆణిముత్యం.. తాజా బంగారు తెలంగాణ జాతి రత్నం శ్రీ రమేష్ రాథోడ్ సారు సైకిల్ కండువ కిందవడేశి.. నందమూరి బాలికాకయ్యకు హిందూపురం జనం ఉరుసుతాకెతట్టే గొడ్తున్నది.. సీన్మల సీన్లు జెప్పినట్టనుకున్నడో ఏమో..అరే ప్రజలు గూడ అన్ని దెల్సి ఎంత అమాయకంగ మాట్లాడ్తరో సూడుండ్రి.. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ట్రాక్టర్లు సబ్సిడీ మీద ఇస్తున్నమని నియోజకవర్గానికి ఇన్ని చొప్పున వంచుతున్నది.. ఐదు లక్షల రూపాలియ్యి మీ కొడ్కుకు సర్కారు నౌకరి ఇపిస్తా అంటే ఏ తండ్రి ఆశపడడు చెప్పుండ్రి.. కొడ్కుకు సర్కారు నౌకరొస్తె మమ్ములను మంచిగ సాదుతడు మా ఇల్లు బాగుపడ్తదనుకుంటడుగదా.? అగో అట్ల అనుకోనే ఒక తండ్రి గుండెపోటుతోని సచ్చిపోయిండ్రు.. బాహుబలి సీన్మ ఎందుకు దీశిండు రాజమౌళి గానీ.. ఆ సీన్మ నిర్మాతలు గానీ..? లోకాన్ని ఉద్దరిచ్చెతందుకా.?? కాదుగదా..? మన్సులు మన్సులు పెండ్లి జేస్కుంటరుగని.. మన్షితోని రైల్వేస్టేషన్కు పెండ్లి జేయంగ ఏడనన్న సూశిండ్రానుల్లా మీరు..? లిశొచ్చె కాలానికి నడిశొచ్చె కొడ్కువుడ్తడంటే... నిజంగ అప్పుడే వుట్టిన పోరడు ఏడంగ నడుస్తడు అని అనుకున్నరు అందరుగని.. 

20:04 - May 29, 2017

పశ్చిమ గోదావరి : జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత రాజకీయ రూపురేఖలు మారిపోయాయి. ఎక్కువ సార్లు ఈ జిల్లాలో టిడిపి తన జెండాను రెపరెలాడించింది. ఓవైపు బీసి వర్గాల మద్దతు కూడగట్టుకుని విజయబాహుట ఎగరేసింది. ఇదంతా గతం..ప్రస్తుతం జిల్లా రాజకీయ సమీకరణాల్లో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు ఎన్నికలు మొత్తం వ్యక్తులు, పార్టీల మధ్య కాకుండా కుల సమీకరణల మధ్య జరుగుతుండటం గమనించాల్సిన అంశం.

టిడిపి, వైసిపి నువ్వానేనా...
గత ఎన్నికల్లో టిడిపి, వైసిపి నువ్వానేనా అన్నట్లు పోటీపడ్డా..జనసేనతో చేతులు కలిపి సైకిల్‌ పార్టీ అధికారం సొంతం చేసుకుంది. కాపు సామాజిక వర్గం మొత్తం టిడిపికి ఓట్ల వర్షం కురిపించడంతో జిల్లాలో టిడిపి 15 స్ధానాలు కైవసం చేసుకుంది. రాబోయే ఎన్నికల్లో కూడా ఇదే హవా కొనసాగించాలని టిడిపి ఓవైపు ప్రణాళికలు రచిస్తుంటే.. అటు ప్రతిపక్ష వైసిపి మాత్రం టిడిపి వ్యతిరేకతపై నిత్యం పోరాటం చేస్తూ తమ గెలుపుకోసం వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే పశ్చిమలో కాపు ఓట్లు రాబట్టుకోవడానికి అదే సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నానికి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టి తాము కాపులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్న సంకేతాలు పంపింది.

పవన్ సామాజిక వర్గం 
ఇక జనసేన విషయానికొస్తే పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా వాడిగా, సామాజిక వర్గం పరంగా ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే పశ్చిమలో ఏలూరు కేంద్రంగా పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తానని.. ఈ జిల్లానుంచే పోటి చేస్తానని పవన్ సంకేతాలు ఇచ్చారు. దాంతో ఈ జిల్లాకు చెందిన అభిమానులు, కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకునేవారు ఆ పార్టీ కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. కానీ పవన్ మాత్రం పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయకపోవడంతో ఆశావహులు పెదవి విరుస్తున్నారు.

రెండు రాష్ట్రాల్లో చతికిలపడ్డ కాంగ్రెస్ పార్టీ
మరోవైపు రెండు రాష్ట్రాల్లో చతికిలపడ్డ కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవం కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రత్యేక హోదా పేరుతో పశ్చిమలోని భీమవరంలో భారీ బహిరంగ సభ పెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆ సభకు రాహుల్ గాంధీని తీసుకువచ్చి ఎన్నికల ప్రచారానికి తెరలేపాలని భావిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో విజయం సాధించిన వారు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనే సెంటిమెంటు ఉంది. దీంతో అన్ని రాజకీయపార్టీల చూపు ఈజిల్లాపై ఉండటం విశేషం.

 

19:28 - May 29, 2017
19:26 - May 29, 2017

చిత్తూరు : చిత్తూరు జిల్లా, వెదురు కుప్పం, ఎమ్మార్వో కార్యాలయం వద్ద.. సీపీఎం, దళిత సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. జిల్లాలో జరిగే మహా భారత ఉత్సవాల్లో.. దళితులకు అవకాశాలు కల్పించాలంటూ నేతలు ఆందోళనకు దిగారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ ఆందోళనలో సీపీఎం రాష్ట్ర నేత కృష్ణయ్య, జిల్లా కార్యదర్శి కుమార్‌ రెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 

19:25 - May 29, 2017

తూర్పు గోదావరి : తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నం వద్ద నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం వ్యవహారంలో ప్రభుత్వం దూకుడును ప్రదర్శిస్తోంది. నష్టపరిహారం విషయంలో పట్టుబడుతున్న రైతుల పట్ల ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగడంతో ఈ ప్రాజెక్టు వివాదాస్పదంగా మారింది. రైతులు తమ ఖరీదైన భూముల్ని ప్రభుత్వానికి ఇవ్వడానికి ససేమీరా అంటున్నారు. భూ సేకరణ చట్టప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం దానికి భిన్నంగా వ్యవహరిస్తోంది. దీంతో అటు ప్రభుత్వానికి ఇటు రైతులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. నష్టపరిహారం విషయంలోనే వివాదం చెలరేగడంతో పురుషోత్తపట్నం రైతుల ఆందోళనలతో మార్మోగిపోతుంది.

ఎకరాకు 50 లక్షల
పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో రైతులకు ఎకరాకు 50 లక్షల వరకు నష్టపరిహారం చెల్లించింది ప్రభుత్వం. కానీ ఇప్పుడు పురుషోత్తపట్నం విషయంలో మాత్రం 28 లక్షలు మాత్రమే ఇస్తామని చెప్పి..కేవలం 18,19 లక్షలతోనే సరిపెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతులకు అన్యాయం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

భూ సేకరణ చట్టం ప్రకారం
భూ సేకరణ చట్టం ప్రకారం తమ భూములకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ పురుషోత్తపట్నం రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. ఎత్తిపోతల పనుల్ని రైతులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుండడంతో రంగంలోకి దిగిన పోలీసులు..రైతులను అరెస్ట్‌ చేశారు. తమ భూములకు నష్టపరిహారం చెల్లించకుండా ప్రభుత్వం లాక్కుంటుందని రైతులు ఆందోళన చేశారు. ఆందోళన చేసిన రైతులపై 353 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రైతుల ఆందోళనలతో పురుషోత్తపట్నం రణరంగంగా మారింది. పరిహారం అడిగిన రైతులపై కేసులు నమోదు చేయడంపై ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉద్రిక్తతల మధ్య గ్రామంలో పోలీసులు 144 సెక్షన్‌ విధించడంతో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. తగిన నష్టపరిహారం ఇచ్చేంతవరకు భూములిచ్చేది లేదని రైతులు తెగేసి చెప్పడంతో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నదానిపై ఉత్కంఠ

19:23 - May 29, 2017

విశాఖ : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రెండోసారి చంద్రబాబు నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విశాఖ మహానాడు చివరి రోజు నిర్వహించిన ఎన్నికల్లో చంద్రబాబును వరుసగా రెండోసారి పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు పార్టీ ఎన్నికల కన్వీనర్‌ పెద్దిరెడ్డి ప్రకటన చేశారు. అనంతరం పార్టీ శ్రేణుల హర్షధ్వానాల మధ్య జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషిచేస్తానన్నారు. రాష్ట్రంలోని రైతులు, వ్యవసాయ కూలీలు, చేతివృత్తులు, కులవృత్తులు, బీసీలు, మైనార్టీలు, దళితులు, మహిళల అభ్యున్నతికి, ఆర్థిక అసమానతలు లేని సుసంపన్న రాష్ట్ర స్థాపనకు కృషిచేస్తానని చంద్రబాబు ప్రతిజ్ఞ చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు పేరునుప్రకటించిన వెంటనే పలువురు నేతలు, కార్యకర్తలు వేదికపైకి వచ్చి చంద్రబాబుకు అభినందనలు తెలిపారు.

నిడదవోలులో దారుణం

పశ్చిమ గోదావరి : జిల్లా నిడదవోలు మండలం డి. ముప్పరంలో దారుణం జరిగింది. చెరుకుతోటలో శాంతి అనే యువతిపై అత్యాచారం జరిగింది. స్థానికులు అపస్మారక స్థితిలో ఉన్న యువతిని గుర్తించి ఆసుపత్రికి తరలించారు.

 

ఏపీ పెండింగ్ ప్రాజెక్టులపై వెంకయ్యనాయుడు సమీక్ష

ఢిల్లీ : ఏపీ పెండింగ్ ప్రాజెక్టులు, రహదారుల నిర్మాణంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో వెంకయ్య నాయుడు సమీక్ష నిర్వహించారు. సాగరమాల, బంకింగ్ హం కాలువ ప్రాజెక్టులకు సూత్రప్రాయ అంగీకారం తెలిపామని, డీపీఆర్ తర్వాత తదుపరి ప్రక్రియ చేపడతామని వెంకయ్యకు గడ్కరీ తెలిపారు.

19:11 - May 29, 2017
19:09 - May 29, 2017
19:08 - May 29, 2017

నిజామాబాద్ : స్మార్ట్‌ ఆగ్రో ఇండస్ట్రీస్‌ సంస్థ ఆధ్వర్యంలో నిజామాబాద్‌ జిల్లా... లక్కంపల్లిలో సెజ్‌ చేపట్టిన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు అనుకున్న స్థాయిలో వేగంగా సాగడం లేదు. 2015 నవంబర్ 15న కేంద్రమంత్రులు హర్షిమ్రత్ కౌర్ బాదల్, సాద్వి నిరంజన్లు మెగా ఫుడ్‌ పార్క్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ నిర్మాణం ఈ ఏడాది డిసెంబర్‌ కల్లా పూర్తి కావాలి. కానీ ప్రస్తుతం కొనసాగుతున్న రెండు గోదాములు.. ఒక శీతల గిడ్డంగి పనులు సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో గడువులోపు పనులు పూర్తి కావడం అన్నది సాధ్యం కాదు.

108 కోట్లతో
సుమారు 108 కోట్లతో వ్యయ అంచనాతో ప్రారంభించిన మెగా ఫుడ్‌పార్క్ పనులు ఏడాదిన్నర గడచినా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న.. గిడ్డంగి నిర్మాణ పనులు పునాది స్థాయిలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిర్మాణాల పూర్తయ్యే సరికి సంవత్సరానికి పైగా సమయం పట్టే అవకాశం ఉంది. ఇదే సమయంలో మెగాఫుడ్‌ పార్క్ అవసరాలకు కావాల్సిన నీటిని గోదావరి నుంచి తరలించాల్సి ఉంది. అయితే నీటి కేటాయింపులు ఇప్పటికి కొలిక్కి రాలేదు. ఈ తంతు ముగిసి నీటి తరలింపు పనులు మొదలు పెట్టడంపై కూడా సందిగ్థత నెలకొంది. నిర్మాణ పనులు మందకొడిగా సాగుతుండడంతో ఏడాది క్రితం అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే పనులు వేగవంతం చేయాలని నిజామాబాద్ ఎంపీ కవిత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్మార్ట్ ఆగ్రో ఇండస్ర్టీస్ యాజమాన్యానికి సూచించినా ఎలాంటి స్పందన లేదు. అలాగే స్థానికులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు కూడా దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. త్వరితగతిన పూర్తి చేసి.. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పించాలని కోరుతున్నారు. నిర్ధిష్ట గడువులోగా మెగా ఫుడ్‌ పార్క్‌ అందుబాటులోకి వస్తేనే...పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గుచూపే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టకుంటే కోట్లాది రూపాయలు వృథా అవుతాయి. ఇప్పటికైనా... ఈ పనులు వేగంగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.  

19:06 - May 29, 2017

ఖమ్మం  : తొలకరి వచ్చేస్తోంది. ఈ సారి ఏం పంట సాగు చేయాలి. ప్రతీ సారి అన్నదాతకు ఎదురవుతోన్న బేతాళ ప్రశ్న ఇది. గతేడాది సర్కార్‌ చెప్పినట్లుగా సాగు చేసినా.. ఫలితం దారుణంగా కనిపించింది. దీంతో ఈ సారి ఏ పంటలు సాగు చేయాలో తెలియక రైతులు మధనపడిపోతున్నారు. ఓ వైపు ఖరీఫ్‌ సీజన్‌ దగ్గర పడుతోంటే.. ఎలాంటి పంటలు సాగు చేయాలనే అంశంపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవటంతో రైతులలో ఆందోళన ఎక్కువయ్యింది. మరి ఈ సారి ఏం సాగు చేయాలి? ఏం పంట వేస్తే అన్నదాత పంట పండుతుంది? తొలకరి దగ్గర పడుతోంది? ప్రభుత్వ ప్రకటన ఎప్పుడేస్తారు? అధికారులు దండోరా ఎప్పుడేస్తారు? ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో వర్షాలు కురిశాయి. దీంతో చేలను దున్ని విత్తనాలు వేయటానికి అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. పోయిన పంటలో పత్తి సాగు చేయొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. ఈ విషయాన్ని వ్యవసాయ అధికారులు అన్ని గ్రామాల్లో తిరిగి రైతులకు వివరించారు. దీంతో అన్నదాతలు ప్రభుత్వం చెప్పినట్లుగానే.. ఎక్కువ మొత్తంలో అపరాలు సాగు చేశారు. మరి కొందరు మిర్చి సాగు చేశారు. తీరా పంట చేతికొచ్చాక కోలుకోలేని దెబ్బ తగిలింది. పంట చేన్లో ఉన్నప్పుడు ఆకాశాన్నంటిన తృణ ధాన్యాల ధరలు చేతికొచ్చాక.. అమాంతం పాతాళానికి పడిపోయాయి.

కడుపు మండిన అన్నదాత
మిర్చి ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. అన్నదాతల కడుపు మండి ఖమ్మం మార్కెట్ కార్యాలయంపై దాడి చేసే వరకూ వెళ్లింది. పలువురు రైతులు సైతం అరెస్టయిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా.. సంచలనం సృష్టించింది. దీంతో ఈ సారి ఏ పంట సాగు చేయాలనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. మిర్చి మంటతో ఈ సారి.. రైతులు పత్తి వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. రెండు జిల్లాల్లో సుమారు 3.5 లక్షల ఎకరాల్లో పత్తి వేసే అవకాశాలున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో వరి విస్తీర్ణత బాగా తగ్గిపోయే అవకాశాలున్నాయి. సాధారణ వరి విస్తీర్ణత 1.82 లక్షల ఎకరాలు కాగా.. గతేడాది 92 వేల ఎకరాలకే పరిమితమైంది. ఇది ఇంకా తగ్గే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రైతన్న పంటను మార్కెట్‌కు తీసుకెళ్తే దళారులు.. వ్యాపారులు ఒక్కటై అన్నదాతను నిలువునా ముంచేస్తున్నారు. ఈ సారైనా సర్కార్ తమకు అండగా నిలవకపోతుందా అని.. అన్నదాతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. పంట వేసిన తరువాత ధరలు పడిపోతుండటంతో.. ముందుగానే మద్దతు ధరలు ప్రకటించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఖరీఫ్‌ సిద్ధమవుతున్న రైతులు
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో.. రైతులు ఖరీఫ్‌ పంటకు సిద్ధమవుతున్నారు. గతేడాది కంటే ఈ సారి పంట విస్తీర్ణం.. సుమారు 24 వేల హెక్టార్లు పెరిగే అవకాశం ఉందని అంచనా. విత్తనాలను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ నుంచి సరఫరా చేస్తారు. ఎరువులను 33 శాతం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు కేటాయించారు. మిగతా ఎరువులు ప్రైవేట్ డీలర్లు, మార్క్‌ఫెడ్ ద్వారా సరఫరా చేస్తారు. విత్తన సేకరణలో శాఖ వెనకబాటు అన్నదాతలను కలవరపాటుకు గురి చేస్తోంది. వాణిజ్య పంటల విషయంలో గతేడాది కోట్లల్లో అన్నదాతలకు పంట నష్టానికి గురి చేసిన నకిలీ విత్తన వ్యాపారులపై ఈ ఏడాది ఉక్కుపాదం మోపాలని రైతులు కోరుతున్నారు. అలాగే కౌలు చేస్తున్న రైతులకే రుణాలు దక్కాలని.. రుణమాఫీ తమకే జరగాలని రైతులు కోరుతున్నారు.

అధికారుల కాలయాపన
సమయం దగ్గర పడిన తరువాత విత్తనాలంటూ హడావిడి, ఆపై కాలయాపన చేయడం వ్యవసాయ శాఖ వంతు అవుతోంది. చేసేది లేక ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించడం రైతు వంతవుతోంది. వాణిజ్య పంట, జిల్లాలో అధికంగా సాగయ్యే అవకాశం ఉన్న పత్తి విత్తనాలను స్వయంగా తయారు చేసుకోవడంపై.. వ్యవసాయ శాఖ ద్వారా ప్రభుత్వం అవగాహన కల్పించలేకపోతోంది. దీంతో వేలు వెచ్చించి కొనుగోలు చేస్తున్న విత్తనాలు రైతులకు భారమవుతున్నాయి. జిల్లాలో అత్యధికంగా సాగు కానున్న వరి, మిరప, పత్తి విత్తనాలను.. రాయితీపై వ్యవసాయ శాఖ ద్వారా ప్రభుత్వం సరఫరా చేయలేకపోతోంది. కనీసం నకిలీ వ్యాపారుపైనైనా దృష్టి సారించాలని, అన్నదాతలు కోరుతున్నారు. మొత్తానికి వరికి ముందు పెసర వంటి అపరాలు సాగు చేస్తే బాగుంటుందని.. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు రైతులకు సూచిస్తున్నారు. 

19:02 - May 29, 2017

ఖమ్మం : గ్రానైట్‌పై కేంద్రం విధించిన 28శాతం GSTని 5శాతానికి తగ్గించాలంటూ ఖమ్మంలో గ్రానైట్‌ యాజమాన్యాలు, కార్మికులు మహా ధర్నా చేపట్టారు.. ఒకేసారి ఈ స్థాయిలో పన్ను పెంచితే పరిశ్రమలు మూతబడే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.. ఇదే అంశంపై జూన్‌ 2న ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ దగ్గర మహాధర్నా చేపడతామని ప్రకటించారు.

19:01 - May 29, 2017

హైదరాబాద్ : మియాపూర్‌ భూ కుంభకోణం నిందితులకు మెజిస్ట్రేట్‌ 14 రోజుల రిమాండ్‌ విధించారు. దీంతో వారిని చర్లపల్లి జైలుకు తరలించారు. మియాపూర్‌ భూ కుంభకోణం కేసులో సబ్‌ రిజిస్ట్రార్‌ శ్రీనివాస్‌తోపాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారిని ఈ ఉదయం న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. దీంతో వారికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారు. అయితే నిందితులను తమ కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు కోర్టులో పిటిషన్‌ను దాఖలు చేయనున్నారు.

18:32 - May 29, 2017
17:06 - May 29, 2017

విజయవాడ : మహిళలను వేధిస్తున్న ఆకతాయిలకు విజయవాడ పోలీసులు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. నాలుగు నెలల్లో 457 మంది ఆకాతాయిలను మహిళా మిత్ర బృందాలు గుర్తించి, అదుపులోకి తీసుకున్నాయి. మహిళా మిత్ర సభ్యులు, వాసవీ మహిళా మండలి సంయుక్త ఆధ్వర్యంలో ఆకతాయిలకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సత్ప్రవర్తన కలిగిన వారికి మానసిక వికాసం పుస్తకం అందచేశారు. కౌన్సెలింగ్‌ తర్వాత ఆకతాయిల్లో మార్పు వచ్చినట్టు గుర్తించారు.

17:04 - May 29, 2017

కేరళ : పశువధపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ కేరళలో యువజన కాంగ్రెస్‌ చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. నిరసన పేరిట కొందరు యువకులు బహిరంగంగా ఎద్దు తలను నరికేశారు. ఓ వాహనంలో ఎద్దును ఉంచి బహిరంగంగా తలను నరికిన యువజన కాంగ్రెస్‌ నేతల వీడియో వైరల్‌ కావడంతో ఈ ఘటన వెలుగు చూసింది. దీనిపై స్పందించిన కాంగ్రెస్‌ పార్టీ- ఈ చర్యకు పాల్పడ్డ ముగ్గురు కార్యకర్తలను సస్పెండ్‌ చేసింది. కేరళలో జరిగిన ఘటన అనాలోచిత చర్యగా పేర్కొన్న రాహుల్‌ గాంధీ ఇలాంటి వాటిని తమ పార్టీ సమర్థించదని రాహుల్ ట్వీట్‌ చేశారు. బిజెపి కార్యకర్తల ఫిర్యాదు మేరకు ఈ ఘటనకు పాల్పడ్డ వారిపై కేసు నమోదు చేసినట్లు కన్నూరు పోలీసులు తెలిపారు. 

17:02 - May 29, 2017

తూర్పు గోదావరి : విశాఖలో జరుగుతున్న మహానాడు అసత్యాల పుట్టని ఏపీపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. మహానాడు వేదికగా అసత్యాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇచ్చే ఫైలు ప్రధాని మోదీ టేబులపై ఉంటే మహానాడుతో తీర్మానం చేయాల్సిన అవసరం ఏముందని రఘువీరారెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఏ హామీని కూడా టీడీపీ ప్రభుత్వం అమలు చేయలేదని మండిపడ్డారు. 

17:00 - May 29, 2017

తూర్పు గోదావరి : తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తపట్నం దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పనుల్ని రైతులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుండడంతో రంగంలోకి దిగిన పోలీసులు..రైతులను అరెస్ట్‌ చేశారు. తమ భూములకు నష్టపరిహారం చెల్లించకుండా ప్రభుత్వం లాక్కుంటుందని రైతులు ఆందోళన చేస్తున్నారు. ఆందోళన చేసిన రైతులపై 353 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే రైతులపై కేసులు నమోదు చేయడంపై ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

 

16:59 - May 29, 2017

బెంగళూరు : బెంగళూరులో రోడ్డుపై నురగ ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించింది. నగరంలోని బెల్లందూర్‌ సరస్సులో కలుస్తున్న రసాయన వ్యర్థాల వల్ల ఏర్పడిన నురగ ప్రమాదస్థాయికి చేరుకుంది. తెల్లగా దూది పింజల్లా కనిపించే నురగ రోడ్డుపైకి దూసుకు రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. బెల్లందూర్‌ నుంచి వెలువడే నురగకు మండే స్వభావం ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పరిశ్రమలు, వాహనాల గ్యారేజీలు వ్యర్థాలను వదులుతున్న కారణంగానే ఇలాంటి పరిస్థితి తలెత్తుతోంది. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు బెల్లందూర్‌ సరస్సును కలుషితం చేస్తున్న 76 శాతం పరిశ్రమలను ప్రభుత్వం మూసివేయాలని ఆదేశించింది. మురుగు నీటిని సరస్సులోకి వదల రాదని 157 అపార్ట్‌మెంట్‌లకు ప్రభుత్వం ఆదేశించింది.

16:18 - May 29, 2017

8 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించిన కేసీఆర్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని 8కార్పొరేషన్లకు సీఎం కేసీఆర్ చైర్మన్లను నియమించారు. రాష్ట్ర రహదారి అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా నర్సారెడ్డి, మహిళ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్ పర్సన్ గా గుండు సుధారాణి, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా మడుపు భూమ్ రెడ్డి, గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గా గాంధీనాయక్, రాష్ట్ర ఫిల్మ్ టీవీ అండ్ ధియేటర్ డెవలప్ మెంట్ చైర్మన్ గా నియామకం రామ్మోహన్ రావు, వికలాంగుల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా కె.

16:15 - May 29, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని 8కార్పొరేషన్లకు సీఎం కేసీఆర్ చైర్మన్లను నియమించారు. రాష్ట్ర రహదారి అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా నర్సారెడ్డి, మహిళ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్ పర్సన్ గా గుండు సుధారాణి, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా మడుపు భూమ్ రెడ్డి, గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గా గాంధీనాయక్, రాష్ట్ర ఫిల్మ్ టీవీ అండ్ ధియేటర్ డెవలప్ మెంట్ చైర్మన్ గా నియామకం రామ్మోహన్ రావు, వికలాంగుల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా కె. వాసుదేవరెడ్డి, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రేమ్ సింగ్ రాథోడ్, టెక్నికల్ సర్వీసెస్ కార్పొరేషన్ చైర్మన్ గా డా. రాకేష్ కుమార్ నియామకం. 

15:47 - May 29, 2017


కామారెడ్డి : రైతులను ఆదుకునేందుకు టిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన యంత్రలక్ష్మి పథకంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. రైతులు లబ్ధి పొందేలోపే అధికార పార్టీ నేతలు ట్రాక్టర్ల యూనిట్లను కార్యకర్తలకు మంజూరు చేయించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2016-17 సంవత్సరానికి గానూ నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని వివిధ మండలాలకు ప్రభుత్వం 224 ట్రాక్టర్ల యూనిట్లను మంజూరు చేసింది. ఆర్ధిక సంవత్సరం ముగింపులోనే ట్రాక్టర్ల యూనిట్లకు సబ్సిడి కోసం నిధులు కేటాయించింది. అయితే రైతులు దరఖాస్తు చేసుకునేలోపు టిఆర్ఎస్ నేతలకు మంజూరు కావడంతో రైతులు మండిపడుతున్నారు.

ఎమ్మెల్యేలు ఎంపిక చేసిన వారికే ట్రాక్టర్లు
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటిసారి యంత్రలక్ష్మి పథకం అమలు చేసినప్పుడు ఉమ్మడి జిల్లాకు 175 యూనిట్లు మంజూరు చేస్తే రైతులు పోటీపడ్డారు. ఎమ్మెల్యేలు ఎంపిక చేసిన వారికే ట్రాక్టర్లు మంజూరయ్యాయి. 2016లో రెండో విడత 212 యూనిట్లకు గానూ 300 మంది దరఖాస్తు చేసుకుంటే అప్పుడు కూడా ముఖ్య నేతల దరఖాస్తులకే అధికారులు ముద్ర వేశారు. దీనిపై తాళ్లరాంపూర్‌కు చెందిన రైతు నర్సారెడ్డి లోకాయుక్తలో ఫిర్యాదు చేయడంతో స్పందించిన లోకాయుక్త జేడిఏకు నోటీసులు జారీ చేసింది. ఈ పథకంలో ప్రజాప్రతినిధుల జోక్యం ఏంటని లోకాయుక్త మండిపడింది. అయితే యంత్రలక్ష్మి పథకం కింద లబ్ధి పొందేవారికి కనీసం రెండెకరాల వ్యవసాయభూమి ఉండాలి.. అంతకన్నా ఎక్కువ భూమి ఉంటే ఈ పథకానికి అర్హుడు కాదని ప్రభుత్వం నిర్ణయించడంతో అధికారులు ప్రభుత్వ నిబంధనలు చూపి తప్పించుకోగలిగారు.

సర్వత్రా విమర్శలు
ఇక యంత్రలక్ష్మి పథకంలో దరఖాస్తు చేసుకోవాలనే సమాచారం రైతులకు అందడం లేదు. ఒకవేళ తెలిసినా సమయం దగ్గరపడుతున్నా నిధులు విడుదల కాకపోవడంతో రైతులు ఆసక్తి చూపడం లేదు. ఇదే అదనుగా భావించిన కొందరు ముఖ్య నేతలు ట్రాక్టర్ల యూనిట్ల కోసం తమ అనుచరులతో గుట్టు చప్పుడు కాకుండా మీ సేవాకేంద్రాల్లో దరఖాస్తు చేయించి.. గ్రామజ్యోతి వ్యవసాయ కమిటీ, మండల కమిటీల ఆమోదం పొందేలా చేస్తున్నారు. జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయం తాజాగా వెల్లడించిన 224 మందిలబ్దిదారు జాబితాను పరిశీలిస్తే అందులొ అందరూ అధికార పార్టికి చెందిన ప్రజాప్రతినిదులు , మండల గ్రామ కమిటీల నాయకులు ఉన్నారు. వారితో పాటు ఒక ఎంపీపీ, పలువురు ఎంపీటీసి సభ్యులు, కొంతమంది సర్పంచ్‌లు, సహకార సంఘం చైర్మన్ డైరెక్టర్లు ఉన్నట్లు తేలడంతో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా యంత్రలక్ష్మి పథకం ద్వారా నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. 

15:45 - May 29, 2017
15:44 - May 29, 2017

విశాఖ : టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ మహానాడులో చేసిన తీర్మానంపై ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని మంత్రి నక్కా ఆనంద్‌బాబు తప్పు పట్టారు. ఎన్టీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు రఘువీరారెడ్డికి లేదన్నారు. 

15:43 - May 29, 2017

కరీంనగర్ : సీఎం కేసీఆర్‌ సర్వే ఒక పెద్ద జోక్‌ అంటూ విమర్శించారు కాంగ్రెస్‌ నేత పొన్నం ప్రభాకర్‌.. అభద్రతాభావంతోనే కేసీఆర్‌ సర్వే పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు... సర్వేలో నాలుగోస్థానంలోఉన్న రాజయ్యకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారా? అని కేసీఆర్‌ను ప్రశ్నించారు.

వరంగల్ లో దారుణం

వరంగల్ : జిల్లా పర్వతగిరి మండలం అనంతసాగరంలోమ దారుణం జరిగింది. అప్పు ఇచ్చి అడిగినందుకు వీరయ్య అనే వ్యక్తిపై జనార్ధన్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వీరయ్ పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. వీరయ్య దాదాపు 80 శాతం గాయాలతో పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు.

15:35 - May 29, 2017

వరంగల్ : జిల్లా పర్వతగిరి మండలం అనంతసాగరంలోమ దారుణం జరిగింది. అప్పు ఇచ్చి అడిగినందుకు వీరయ్య అనే వ్యక్తిపై జనార్ధన్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వీరయ్ పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. వీరయ్య దాదాపు 80 శాతం గాయాలతో పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. వీరయ్య గత కొన్న సంవత్సరాల క్రితం జనార్ధన్ అనే వ్యక్తి కి లక్ష రూపాయాలు అప్పుడా ఇచ్చాడు. అప్పు చెల్లించాలని అడిగెందుకు వెళ్లిన తన మీద పెట్రోల్ పోసి నిప్పంటించాడని వీరయ్య పోలీసులు వాగ్మూలం ఇచ్చారు. జనార్ధన్ కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. 

తూర్పు గోదావరి జిల్లాలో ఉద్రిక్తత

తూర్పు గోదావరి : జిల్లాలోని పురుషోత్తపట్నం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పనుల్ని రైతులు అడ్డుకున్నారు. నష్టపరిహారం చెల్లించే వరకు పనులు సాగనివ్వబోమని రైతులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడికి చెరకున్న పోలీసులుల రైతులను అరెస్ట్ చేశారు. వారి పై 353 సెక్షన్ క్రింద కేసు నమోదు చేశారు.

15:18 - May 29, 2017

తూర్పు గోదావరి : జిల్లాలోని పురుషోత్తపట్నం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పనుల్ని రైతులు అడ్డుకున్నారు. నష్టపరిహారం చెల్లించే వరకు పనులు సాగనివ్వబోమని రైతులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడికి చెరకున్న పోలీసులుల రైతులను అరెస్ట్ చేశారు. వారి పై 353 సెక్షన్ క్రింద కేసు నమోదు చేశారు. తమకు పట్టి సీమ తరహలో నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల అందోళన దృష్ట్యా అక్కడ 144 సెక్షన్ విధించారు. నేడు సాయంత్రం పురుషోత్తపట్నంలో రైతు సంఘాల నేతలు, రాజకీయ నేతలు పర్యటించనున్నారు.

మణిపూర్ సీఎం తనయుడికి జైలు శిక్ష

ఇంఫాల్ : మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ కుమారుడు అజయ్ మీతాయికి ట్రయల్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. 2011లో రోడ్డు రేసు కేసులో కోర్టు ఆయనకు ఈ శిక్ష విధించింది.

మహాభారత ఉత్సవాల్లో దళితులకు అవకాశం ఇవ్వాలి

చిత్తూరు : జిల్లాలోని వెదురు కుప్పం ఎమ్మర్వో కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. మహాభారత ఉత్సవాల్లో దళితుకు పాల్గొనే అవకాశం కల్పించాలని సీపీఎం, దళిత సంఘాల ఆందోళన నిర్వహించారు. 

సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి : నరేష్ తండ్రి

యాదాద్రి : నరేష్ హత్యకు నిరసిస్తూ భువనగిరిలో దళితసంఘాలు, నరేష్ కుటుంబ సభ్యులు ఆందోళన నిర్వహించారు. నిర్లక్ష్యంగా వ్యవరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఆందోళన అనంతరం వారు కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. 

14:40 - May 29, 2017

విశాఖ : వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీ అభివృద్ధికి జగన్‌ అడుగడుగునా అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా దాన్ని గుడ్డిగా వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. పారదర్శకంగా పాలనకొనసాగిస్తోంటే తమపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. విశాఖలో జరుగుతున్న మహానాడులో మాట్లాడిన లోకేష్‌... జగన్‌ చేసిన అవినీతి ఆరోపణలపై చర్చకు సిద్ధమా అని సవాల్‌ విసిరారు. జగన్‌ అడ్డంగా పడుకున్నా... ఏపీ అభివృద్ధిని అడ్డుకోలేరని హెచ్చరించారు.

14:38 - May 29, 2017

ఇంఫాల్ : మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ కుమారుడు అజయ్ మీతాయికి ట్రయల్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. 2011లో రోడ్డు రేసు కేసులో కోర్టు ఆయనకు ఈ శిక్ష విధించింది. అజయ్ వాహనాన్ని తన కారతో ఓవర్ టేక్ చేసిన ఇరోమ్ రోజర్ ను గన్ తో అజయ్ మీతాయి కాల్చేశాడు. 

14:28 - May 29, 2017

చిత్తూరు : జిల్లాలోని వెదురు కుప్పం ఎమ్మర్వో కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. మహాభారత ఉత్సవాల్లో దళితుకు పాల్గొనే అవకాశం కల్పించాలని సీపీఎం, దళిత సంఘాల ఆందోళన నిర్వహించారు. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత ఏర్పాండింది. గత కొన్ని సంవత్సరాల కాలంగా మహాభారత ఉత్సవాల్లో దళితులు అవకాశం ఇవ్వటంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

14:06 - May 29, 2017
13:24 - May 29, 2017

విశాఖపట్టణం : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విభజన అనంతరం బస్సులో పడుకుంటూ ఏపీ రాష్ట్రాన్ని పరిపాలించారని ఏపీ మంత్రి నారాయణ పేర్కొన్నారు. మహానాడులో ఆయన మాట్లాడారు. పది సంవత్సరాల వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉందని బిల్లులో పొందుపర్చారని పేర్కొన్నారు. కానీ చంద్రబాబు మాత్రం విజయవాడలో ఇరిగేషన్ శాఖ కార్యాలయం వద్ద బస్సులో పడుకుంటూ పరిపాలన చేశారని తెలిపారు. అప్పుడు పరిపాలన కుక్కలు చింపిన విస్తరగా తయారైందని తెలిపారు. వెంటనే 8 నెలల్లో ఆరు లక్షల రూపాయలతో బిల్డింగ్ లు కట్టి సచివాలయాన్ని తరలించడం జరిగిందని, దీనివల్ల పరిపాలన సౌకర్యంగా జరుగుతోందన్నారు. కానీ మంచి రాజధానిని నిర్మించాలని తలపుంతో సింగపూర్ రాష్ట్రంతో బాబు సంప్రదింపులు జరిపారని మంత్రి నారాయణ పేర్కొన్నారు.

గతంలో పరిపాలన కుక్కలు చింపిన విస్తరి - నారాయణ..

విశాఖపట్టణం : గతంలో పరిపాలన కుక్కలు చింపిన విస్తరిగా ఉండేదని ఏపీ మంత్రి నారాయణ పేర్కొన్నారు. మహానాడులో ఆయన మాట్లాడారు. విజయవాడలో ఇరిగేషన్ శాఖ కార్యాలయం వద్ద బస్సులో పడుకుంటూ బాబు పరిపాలన చేశారని తెలిపారు.

13:08 - May 29, 2017

చిత్తూరు : ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో డాన్ గా పేరొందిన శరత్ ను జిల్లా టాస్క్ పోర్స్ పోలీసులు పట్టుకున్నారు. గత కొద్దిరోజులుగా ఇతడిని పట్టుకోవడానికి కృషి చేస్తున్న పోలీసుల ప్రయత్నం ఎట్టకేలకు ఫలించినట్లైంది. ఇతడిని పట్టుకోవడం ద్వారా మరిన్ని వివరాలు రాబట్టవచ్చని..నెట్ వర్క్ వెనుక ఎంతమంది ఉన్నారనే సమాచారం సేకరించవచ్చని పోలీసులు భావిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా శరత్ ఎర్రచందనం స్మగ్లర్ గా పేరు గడించాడు. ఇతనిపై చాలా పోలీస్ స్టేషన్ లలో చాలా కేసులున్నాయి. ఎర్రచందనం సమకూర్చడంలో..విదేశాలకు తరలించడంలో దిట్ట అని పేరు ఉంది. ఇతనిపై నిఘా పెట్టిన పోలీసులకు పక్కా సమాచారం అందించింది. తమిళనాడులోని వేలూరులో తలదాచుకున్నాడన్న సమాచారం మేరకు చిత్తూరు జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసుల ప్రత్యేక బృందం అక్కడకు వెళ్లింది. అక్కడ అదుపులోకి తీసుకున్న శరత్ ను చిత్తూరు జిల్లాకు తీసుకొస్తున్నారు.

పశువుల నిషేధంపై నిరసన - స్టాలిన్

చెన్నై : పశువధపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధంపై నిరసన వ్యక్తం చేస్తామని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ వెల్లడించారు. మే 31వ తేదీన చెన్నైలో నిరసన చేపడుతామన్నారు.

శేరిలింగంపల్లిలో సర్కార్ భూముల రికార్డుల పరిశీలన..

హైదరాబాద్ : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ భూముల రికార్డులను అధికారులు తనిఖీలు నిర్వహించారు. నాలుగు సర్వే నెంబర్లలో 639 ఎకరాల ప్రభుత్వ భూమి గోల్ మాల్ జరిగిన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సర్వే నెంబర్ 101లో 231 ఎకరాలు..సర్వే నెంబర్ 20లో 109 ఎకరాలు..సర్వే నెంబర్ 28లో 145 ఎకరాలు..సర్వే నెంబర్ 100లో 207 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ అధికారులు గుర్తించారు.

బోల్తా పడిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు..

కర్నూలు : జిల్లాలో శ్రీ కొండారెడ్డి ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు. అమరావతి నుండి కర్నూలుకు ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వెళుతోంది.

 

ఎర్రచందనం స్మగ్లర్ శరత్ అరెస్టు..

హైదరాబాద్ : ఎర్రచందనం స్మగ్లర్ శరత్ ను తమిళనాడులో వేలూరు దగ్గర పోలీసులు అరెస్టు చేశారు. పలు హత్య కేసులు..స్మగ్లింగ్ కేసులో శరత్ నిందితుడిగా ఉన్నారు. తమిళనాడు నుండి ఎర్రచందనం కూలీలను తరలించారు.

కార్యకర్తల కోసం రూ. 42.92 కోట్లు - లోకేష్..

విశాఖపట్టణం : పార్టీ కార్యకర్తల కోసం రూ. 42.92 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. మహానాడులో ఆయన మాట్లాడారు. రాబోయే రెండు సంవత్సరాల్లో విశాఖపట్టణాన్ని ఐటీ హాబ్ గా మార్చడానికి కృషి చేస్తానని హామీనిచ్చారు.

12:46 - May 29, 2017

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్..డిగ్రి విద్య ప్రవేశాలకు ఆన్ లైన్ విధానాన్ని ప్రవేశ పెట్టారు. మరి ఈ ఆన్ లైన్ విధానం ఎంతవరకు లాభం..ఎంతవరకు నష్టం..చేకూర్చనుంది. ఈ ఆన్ లైన్ విధానం ద్వారా అధిక ఫీజులకు అడ్డుకట్ట వేయవచ్చా ? ఆన్ లైన్ విధానం ద్వారా అడ్మిషన్ల ప్రక్రియ ఏ విధంగా ఉండనుంది ? ఈ విషయాలపై టెన్ టివి 'మానవి' ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. డిగ్రీ కళాశాల ప్రిన్స్ పల్ శాంతి వివరించారు. ఈ అంశంపై కాలర్స్ అడిగిన సందేహాలను ఆమె నివృత్తి చేశారు. మరి మీరు చూడాలంటే వీడియో క్లిక్ చేయండి.

12:37 - May 29, 2017

విశాఖపట్టణం : తనకు విశాఖ పట్టణానికి రావాలంటే భయంగా ఉందని..ఇక్కడే ఉండాలని అనిపిస్తోందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. మూడు రోజుల పాటు జరుగుతున్న మహానాడు నేటితో ముగియనుంది. సోమవారం మహానాడులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నాయుడ అహర్నిశలు కృషి చేస్తున్నారని, ఇందుకు కుటుంబాన్ని సైతం పక్కన పెడుతున్నారని తెలిపారు. రూ. 42 కోట్ల 92 లక్షలను కార్యకర్తల సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నట్లు, కార్యకర్తల పిల్లల కోసం రూ. 10 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు భారతదేశంలో ఉన్న 1700 రాజకీయ పార్టీలు ఇలాంటి కార్యక్రమం చేపట్టాయా అని ప్రశ్నించారు. 2014లో రూ. 16వేల లోటు బడ్జెట్ తో ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, జీతాలు ఇస్తారా ? లేదా ? అనే సందేహం అందరిలో వ్యక్తమైందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేకుండా చేశారని, మూడు సంవత్సరాల్లో లక్షా 35వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు ఎక్కడున్నాయని ప్రతిపక్షం విమర్శలు చేస్తున్నాయని, ఆంధ్ర రాష్ట్రంలో ప్లాంట్ పెట్టాలని హీరో మోటార్స్ రెండో ప్లాంట్ నెలకొల్పాలని స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆ సంస్థ యాజమాన్యాన్ని కోరడం జరిగిందని తెలిపారు. అనంతపురం జిల్లాకు ప్రపంచంలోనే అతి పెద్ద కియో మోటార్స్ సంస్థ వస్తోందని పేర్కొన్నారు. రాబోయే రెండు సంవత్సరాల్లో విశాఖపట్టణం ఐటీ హాబ్ గా మార్చడానికి కృషి చేస్తానని హామీనిచ్చారు.

12:33 - May 29, 2017
12:32 - May 29, 2017

కరీంనగర్ : ప్రభుత్వ ఉద్యోగాల పేరిట టీఆర్ఎస్ నేత చేసిన మోసానికి నిండు ప్రాణం బలైంది. జూపాక సుదర్శన్ నేత ఇంటి ఎదుట మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. ఎంపీ వినోద్ కుమార్ అనుచరుడని చెప్పుకుంటూ..ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులకు వల వేశాడు. రామడుగు మండలం వన్నారం గ్రామానికి చెందిన కొప్పుల సత్యనారాయణ కుమారుడికి వ్యవసాయ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ. 6లక్షలు వసూలు చేశాడు. మూడేళ్లు గడిచినా ఉద్యోగం ఇప్పించకపోగా బెదిరింపులకు గురి చేయడంతో బాధిత కుటుంబం మనస్థాపానికి గురైంది. ఈ క్రమంలో చేసిన అప్పుకు వడ్డీలు పెరగడంతో సత్యనారాయణ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఈ క్రమంలో గుండెపోటు రావడంతో చనిపోయాడు. బాధితుల ఆందోళనతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. న్యాయం చేస్తామని పోలీసులు హామీనివ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. వ్యవసాయ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ. 10లక్షలు డిమాండ్ చేశాడని మృతుడి బంధువు పేర్కొన్నారు. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రూ. 80వేల చెక్ ఇచ్చాడని తెలిపారు.

కేరళకు రుతుపవనాలు..

ఢిల్లీ : రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. సోమ లేదా మంగళవారం రోజున కేరళకు రుతుపవనాలు తాకొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కొద్దిమేర ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి.

గ్రానైట్ ఉద్యమానికి సీపీఎం మద్దతు - తమ్మినేని..

ఖమ్మం : గ్రానైట్ పన్నును 28 శాతానికి పెంచడాన్ని నిరసిస్తూ గ్రానైట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహా ధర్నా జరిగింది. ఈ ధర్నాలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. గ్రానైట్ పరిశ్రమను నాశనం చేసేందుకు జీఎస్టీ 28 శాతం విధించారని, ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం దిగొచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని, ఈ ఉద్యమానికి సీపీఎం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందన్నారు. 2వ తేదీన జంతర్ మంతర్ వద్ద మహాధర్నా చేపట్టనున్నట్లు, గ్రానైట్ పరిశ్రమ కాపాడేందుకు కృషి చేస్తామని తమ్మినేని వెల్లడించారు.

11:56 - May 29, 2017

ఎంత శుభ్రంగా ఉన్నా కొంతమందికి ముఖం మురికిగా ఉంటూ ఉంటుంది. దీనితో పలు క్రీములు..ఫేషియల్స్ వాడుతుంటారు. ముఖ్యంగా ఎండాకాలం ఈ సమస్య అధికంగా ఉంటుంది. దీనికి ఆవిరి చక్కటి పరిష్కారం. బ్యూటీ క్లినిక్స్ లో సైతం ఫేషియల్ కంటే ముందుగా ఆవిరి పడుతుండడం తెలిసిందే.
ఆవిరి ముఖానికి పట్టడం వల్ల చర్మ సూక్ష్మ రంధ్రాలు తెరుచకుంటాయి. ఆవిరి పడుతున్న సమయంలో చిన్న పిల్లలు దగ్గరగా ఉండకపోవడమే మంచిది. ఒక పాత్రలో మరిగించిన నీరు తీసుకోండి. చర్మతత్వాన్ని బట్టి ఏదో ఒక నూనెను నాలుగు చుక్కలు కలపండి. సాధారణ స్కిన్‌ గలవారు నాలుగు ఆకులు తులసిని వేయండి. జిడ్డు చర్మం గలవారు నిమ్మకాయరసం, యూకలిప్టస్‌ నూనె నాలుగు చుక్కలు వేయండి. పొడిచర్మం గలవారు. గులాబీగాని చామంతి నూనె చుక్కలు కలపొచ్చు.

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం..

చిత్తూరు : తిరుమల మొదటి ఘాట్ రోడ్డు ఆరో మలుపు వద్ద రెయిలింగ్ ను కారు ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. కారు బ్రేకులు ఫెయిల్ కావడంతో ప్రమాదం చోటు చేసుకుంది.

 

మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ కార్యాలయంపై విజిలెన్స్ దాడులు..

గుంటూరు : పట్టాభిపురంలో మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ కార్యాలయంపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. 135 ప్యాకెట్ల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.

కాకినాడ ఎస్ఈజెడ్ లో ఉద్రిక్తత..

కాకినాడ : ఎస్ఈజెడ్ లో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. రమనక్కపేటలో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహారావు, సీపీఎం జిల్లా కార్యదర్శి శేషబాబ్జిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ పంచాయతీ ఆఫీసు ఎదుట రైతులు బైఠాయించారు.

 

శంషాబాద్ ఎయిర్ పోర్టులో హై అలర్ట్..

హైదరాబాద్ : జికా వైరస్ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్టులో హై అలర్ట్ ప్రకటించారు. ఎయిర్ పోర్టులో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. విదేశాల నుండి వచ్చే ప్రయాణీకులను వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

 

11:33 - May 29, 2017
11:30 - May 29, 2017

ఢిల్లీ : నేటి నుంచి యూరప్‌, రష్యాల్లో ప్రధాని మోదీ పర్యటన ప్రారంభం అవుతోంది. ఆరు రోజుల పాటు కొనసాగనున్న ఈ పర్యటనలో వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, ఉగ్రవాద వ్యతిరేకపోరు లాంటి కీలక అంశాలపై చర్చలు జరపనున్నారు. పలు ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. ఆరు రోజుల పాటు సాగనున్న ఈ పర్యటనలో ప్రధాని మోదీ జర్మనీ, స్పెయిన్‌, రష్యా, ఫ్రాన్స్‌ దేశాల్లో పర్యటించనున్నారు. జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌తో సమావేశమై ఇరు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరపనున్నారు. అనంతరం జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్‌ వాల్టర్‌తో సమావేశం కానున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, భద్రత, ఉగ్రవ్యతిరేక పోరు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ తదితర అంశాల గురించి ఇరు దేశాధినేతలు చర్చిస్తారు. జర్మనీ రాజధాని బెర్లిన్‌లో జరిగే ఇరు దేశాల ప్రముఖ పారిశ్రామికవేత్తలతో ఏర్పాటు చేసిన సదస్సులో మోదీ, మెర్కెల్‌ పాల్గొననున్నారు.

మూడు దశాబ్దాల తరువాత..
జర్మనీ పర్యటన అనంతరం ప్రదాని మోదీ మంగళవారం స్పెయిన్‌ చేరుకుంటారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత భారత ప్రధాని తొలిసారిగా స్పెయిన్‌లో పర్యటిస్తుండటం విశేషం. స్పెయిన్‌ రాజు ఆరవ ఫిలిప్‌, అధ్యక్షుడు మారియానో రోజోయ్‌తో భేటీ అవుతారు. అక్కడ నుంచి మే 31న రష్యాలోని సెయింట్‌పీటర్స్‌ బర్గ్‌కు ప్రధాని మోదీ చేరుకుంటారు. జూన్‌ 2వరకు రష్యాలో పర్యటిస్తారు. 18వ భారత్‌-రష్యా వార్షిక సదస్సులో మోదీ పాల్గొని ప్రసంగిస్తారు. జూన్‌ 2న జరిగే అంతర్జాతీయ ఆర్థిక సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కలిసి ప్రసంగిస్తారు. జూన్‌ 3న ఫ్రాన్స్‌కు చేరుకుని అక్కడ కొత్తగా ఎన్నికైన ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానుయేల్‌ మాక్రోన్‌తో మోదీ జరుపుతారు. అనంతరం భారత్‌కు తిరుగు పయనం అవుతారు.

విదేశాలకు మోడీ..

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటనకు బయలుదేరారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా జర్మనీ, స్పెయిన్, రష్యా, ఫ్రాన్స్ లలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటించనున్నారు.

రాజస్థాన్ సర్కార్ కు సుప్రీం నోటీసులు..

ఢిల్లీ : రాజస్థాన్ సర్కార్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. జైలు కేంద్రాలకు 500 మీటర్ల లోపు ఉన్న సెల్ టవర్స్ లను తొలగించాలని ఆదేశించింది.

11:14 - May 29, 2017

అనంతపురం : 'బాహుబలి' సినిమా చూసేందుకు అనుమతించాలంటూ మందుబాబులు ఓ థియేటర్ సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లా గుత్తిలో చోటు చేసుకుంది. గుత్తిలోని కేపీఎస్ మూవీల్యాండ్ థియేటర్ లో 'బాహుబలి' సినిమా ప్రదర్శితమౌతోంది. గత అర్ధరాత్రి ఐదుగురు యువకులు పూటుగా మద్యం సేవించి థియేటర్ కు వచ్చారు. లోనికి అనుమతించాలని వారు డిమాండ్ చేశారు. సినిమా చివరిలో ఉందని..ఇప్పుడు అనుమతించడానికి వీలు లేదంటూ సిబ్బంది పేర్కొన్నారు. తీవ్ర ఆగ్రహానికి గురైన మందబాబులు సిబ్బందిపై పిడుగుద్దుల వర్షం కురిపించారు. దీనితో సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. దాడి చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. థియేటర్ యాజమాన్యం చేసిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

11:10 - May 29, 2017

హైదరాబాద్ : నగరంలో వందల కోట్ల ప్రభుత్వ ల్యాండ్ స్కాం ప్రకంపనలు రేకేత్తిస్తోంది. ఏకంగా కూకట్ పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ ఈ స్కాంలో ఉండడం గమనార్హం. దీనిపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ నేపథ్యంలో అదుపులోకి తీసుకున్న శ్రీనివాస్, ట్రివిటీ సంస్థ డైరెక్టర్లు పార్థసారధి, పీవీస్ శర్మలను పోలీసులు సోమవారం న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. అనంతరం వీరికి 14 రోజుల రిమాండ్ ను న్యాయమూర్తి విధించారు. నిందితులను తమ కస్టడీకి అనుమతించాలంటూ పోలీసులు పిటిషన్ దాఖలు చేయనున్నారు. మియాపూర్ లో వందల ఎకరాల్లోని ప్రభుత్వ భూములను రిజిష్టర్ చేసినట్లు తెలుస్తోంది. 690 ఎకరాల ప్రభుత్వ భూమిని 3 రియల్ ఎస్టేట్ సంస్థలకు శ్రీనివాస రావు రిజిస్ట్రేషన్ చేశారు. సర్వేనెం 20, 28, 100, 101 సర్వే నెంబర్ లో ఇష్టానుసారం రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలుస్తోంది.

మద్రాస్ ఐఐటీ స్టూడెంట్స్ బీఫ్ ఫెస్టివల్..

తమిళనాడు : బీఫ్ పై నిషేధం ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఐఐటీ మద్రాస్ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. సుమారు 50 మంది విద్యార్థులు బీఫ్ ఫెస్టివల్ ను నిర్వహించారు.

10:21 - May 29, 2017

ఆదిలాబాద్ : జిల్లాలో పలు చెరువులు కబ్జాలో చిక్కుకున్నాయని, అధికార పార్టీకి చెందిన నేతలు కబ్జాలు చేశారని టి.కాంగ్రెస్ ఆరోపిస్తోంది. నిర్మల్ లోని చెరువుల భూములపై అధికార పార్టీ నేతల కన్ను పడిందని టెన్ టివితో టి.కాంగ్రెస్ నేత పేర్కొన్నారు. రాజుల కాలంలో గొలుసుకట్టు చెరువులకు అక్రమంగా పట్టాలిచ్చారని ఆరోపించారు. చెరువుల కబ్జాపై కాంగ్రెస్ పోరుకు సిద్ధమౌతోందని వెల్లడించారు. ఇంకా ఆయన ఏం మాట్లాడారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

 

ల్యాండ్ స్కాంలో ముగ్గురి అరెస్టు..

హైదరాబాద్ : భూ కుంభకోణంలో కూకట్ పల్లి పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. మియాపూర్ లో మెజిస్ట్రేట్ పోలీసులు హాజరు పరిచారు. ముగ్గురికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. వీరిని చర్లపల్లి జైలుకు తరలించారు. కాసేపట్లో ముగ్గురిని కస్టడీ ఇవ్వాలని కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేయనున్నారు.

పటాన్ కోర్టులో హై అలర్ట్..

పంజాబ్ : పటాన్ కోట్ లో భద్రతా బలగాలు హై అలర్ట్ ప్రకటించారు. అనుమానాస్పదంగా ఓ బ్యాగును భద్రతా బలగాలు గుర్తించాయి. దీనితో బలగాలు అప్రమత్తమై సోదాలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

10:08 - May 29, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఆదివారం తెల్లవారుజామున వాయుగుండం ఏర్పడిందని వాతావరణ శాఖ పేర్కొంది. తుపాన్ గా మారే అవకాశం ఉందని, రేపు బంగ్లాదేశ్ తీరాన్ని తాకనుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సాయంత్రానికి కోల్‌ కతాకు దక్షిణ ఆగ్నేయంగా 800 కిలోమీటర్ల దూరంలో, బంగ్లాదేశ్‌ లోని చిట్టగాంగ్‌ కు దక్షిణ నైరుతి దిశగా 740 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. ఇది రానున్న 24 గంటల్లో తుపానుగా మారనుందని, అనంతరం 30న మధ్యాహ్నానికి బంగ్లాదేశ్‌ తీరాన్ని తాకుతుందని వారు వెల్లడించారు. దీని ప్రభావంతో ఉత్తరకోస్తాలో 2 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలుస్తోంది. మరోవైపు పశ్చిమగోదావరి, అనంతపురం, విజయనగరం జిల్లాల్లో ఆరు సెం.మీ. వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ పేర్కొంది. తుపాన్ గా మారిన సమయంలో దిశ మార్చుకొనే అవకాశం ఉంటుందని, ఈ నేపథ్యంలో ఆంధ్రా తీరం వైపు పయనించే అవకాశం ఉందని పేర్కొన్నారు. వాయుగుండం ప్రభావంగా రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, మంగళవారంకు కేరళను తాకనుందని వెల్లడించారు.

బ్యాటరీ సైకిళ్లను ప్రారంభించిన బాబు..

విశాఖపట్టణం : పారిశుధ్య నిర్వాహణ కోసం 100 బ్యాటరీ సైకిళ్లను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. రూ. 23వేల చొప్పున బ్యాటరీ సైకిళ్లను జీవీఎంసీ కొనుగోలు చేసింది.

09:52 - May 29, 2017

టాలీవుడ్..బాలీవుడ్..కోలీవుడ్..ఇలా ఏ వుడ్ చిత్రాలు అయినా ఆయా చిత్రాలకు పబ్లిషిటీ ఇచ్చే విషయంలో దర్శక, నిర్మాతలు, హీరోలు వినూత్న పంథాలను అవలింబిస్తుండడం చూస్తూనే ఉంటాం. ఆడియో ఫంక్షన్లకు స్వస్తి చెప్పిన పలువురు హీరోలు సామాజిక మాధ్యమాల్లో గీతాలను విడుదల చేస్తున్నారు. ఇందులో మెగా ఫ్యామిలీ హీరోలు మొదటి వరుసలో నిలుస్తున్నారు. అదే విధంగా మరో ట్రెండ్‌ను కూడా తీసుకొస్తున్నారు. సినిమా ప్రారంభం నుంచి ఎక్కువగా ఏ విధంగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నారు. అందులో భాగంగా మెగాస్టార్ తనయుడు 'రామ్ చరణ్ తేజ' వినూత్న స్టెప్ వేశారు. తాను నటిస్తున్న చిత్రానికి టైటిల్ సూచించాలని అభిమానులను కోరుతున్నాడు. చెర్రీ, సమంత హీరో హీరోయిన్లుగా, సుకుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి టైటిల్‌ను ఇంకా ఖరారు చేయలేదు. పలు రకాల టైటిల్స్‌ గురించి ఊహాగానాలు వచ్చాయి. సినిమాకు ఏదో మంచి టైటిల్‌ ఫిక్స్‌ చేయాలని టీమ్‌ మొత్తం దర్శకుడు సుకుమార్‌ను కోరుతున్నట్లు, నాలుగైదు మంచి టైటిల్స్‌ను సుకుమార్‌ చెప్పాడని పేర్కొన్న చెర్రీ వీటిలో ఏ టైటిల్‌ను ఫైనలైజ్‌ చేశారనే విషయాన్ని మాత్రం ఆయన చెప్పలేదు. ఇందుకు తనకు అభిమానులు సాయం చేయాలని కోరారు. ఆదివారం సాయంత్రం ఏడు గంటల నుంచి సినిమాకు వారం నుంచి పది రోజుల్లోగా టైటిల్‌ను ఖరారు చేయమని చెర్రీ అభ్యర్థించాడు.

09:30 - May 29, 2017

అమెరికా : మరో దారుణం చోటు చేసుకుంది. మిసిసిప్పిలో దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినట్టు మిసిసిపి బ్యూరో ఆఫ్‌ ఇన్విస్టిగేషన్‌ అధికార ప్రతినిధి వారెన్‌ స్ట్రైన్‌ వెల్లడించారు. మిసిసిపి రాజధాని నగరమైన జాక్సన్‌కు 109 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రూరల్‌ లింక్లన్‌ కౌంటీ ప్రాంతంలోని బ్రూక్‌హెవెన్‌లో రెండు ఇళ్లు, బోగ్‌చిట్టోలోని మరో ఇంటి వద్ద కాల్పులు జరిగాయి. దుండగుడు జరిపిన కాల్పుల్లో రూరల్‌ లింక్లన్‌ కౌంటీ ఉన్నతాధికారి సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న భద్రతా సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని నిందితుడు గాడ్‌బోల్ట్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఆధారాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

09:27 - May 29, 2017
08:57 - May 29, 2017

పలు విజయవంతమైన చిత్రాల్లో నటిస్తూ తన మార్కును చూపిస్తున్న నటుడు 'నాని'. వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ ప్రేక్షకాభిమానులను పొందుతున్నాడు. ఆయన నటించిన పలు సినిమాలు బాక్సాపీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన 'నిన్నుకోరి' సినిమాలో నటిస్తున్నాడు. ‘నివేదా థామస్' హీరోయిన్ గా నటిస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పాటలను విడుదల చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా సాంగ్స్ రిలీజ్ చేసే బాటను 'నాని' కూడా ఎంచుకున్నాడు. ఇటీవలే పలు సినిమాల పాటలను యూ ట్యూబ్ ద్వారా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో 'అడిగా అడిగా' అనే సాంగ్‌ను 'నాని' ట్విట్టర్‌ ద్వారా రిలీజ్‌ చేశాడు. చిత్ర ప్రమోషన్‌ కోసం ఈ సాంగ్ విడుదల చేశారు. పోస్టు చేసి 24 గంటలు గడవక ముందే ఐదున్నర లక్షలకుపైగా వ్యూస్‌ వచ్చాయి.

తిరుమలలో కారిరిష్టి యాగం..

చిత్తూరు : ఈ రోజు నుండి తిరుమలలో ఐదు రోజుల పాటు కారి రిష్టి యాగం జరగనుంది. కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో యాగం నిర్వహించనున్నారు. భక్తుల రద్దీతో ప్రోటోకాల్ ప్రకారమే వీఐపీ బ్రేక్ దర్శనం అమలు చేయనున్నారు.

భారీ కుంభకోణంపై సర్కార్ సీరియస్..

హైదరాబాద్ : భారీ కుంభకోణంపై సర్కార్ సీరియస్ తీసుకొంటోంది. భూ కుంభకోణంలో గోల్డ్ స్టోన్ ప్రసాద్ పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. భూ కుంభకోణం వ్యవహారంలో గోల్డ్ స్టోన్ ప్రసాద్ పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని తానై నడిపించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. రిజిస్ట్రేషన్ లావాదేవీలను ప్రభుత్వం రద్దు చేసింది.

ఇంటింటికి బిజెపి..

హైదరాబాద్ : నేటి నుండి ఇంటింటికి కార్యక్రమాన్ని బీజేపీ నిర్వహించనుంది. ఈ రోజు నుండి జూన్ 12వ తేదీ నుండి వరకు ఈ కార్యక్రమం జరగనుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు..టీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలపై ప్రచారం నిర్వహించనుంది. రాష్ట్రంలోని అన్ని పోలింగ్ బూత్ లు చుట్టి రావాలని బీజేపీ భావిస్తోంది.

నేడు లాస్ట్ డే మహానాడు..

విశాఖపట్టణం : మహానాడు చివరి రోజుకు చేరుకుంది. మూడు రోజులుగా విశాఖలో మహానాడు జరుగుతున్న సంగతి తెలిసిందే. నేడు టిడిపి అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు.

 

08:03 - May 29, 2017

టాలీవుడ్ ప్రిన్స్ 'మహేష్ బాబు'..దర్శకుడు కొరటాల కాంబినేషన్ లో రూపొందబోయే చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ‘మహేష్' లేకుండానే చిత్ర షూటింగ్ ప్రారంభం కావడం విశేషం. ‘శ్రీమంతుడు' తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రూపొందుతోంది. ‘శ్రీమంతుడు' ఘనవిజయం సాధించడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2018 సంక్రాంతి సందర్భంగా జనవరి 11న చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు ముందుగానే ప్రకటించడం గమనార్హం. అంచనాలకు తగ్గట్టుగానే 'కొరటాల' పక్కా స్ర్కిప్ట్ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ‘మహేష్' నటిస్తున్న 'స్పైడర్' సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో ఈ అవకాశాన్ని 'కొరటాల' సద్వినియోగం చేసుకున్నట్లు సమాచారం. వ్యక్తిత్వం ప్రధానంగా ఈ చిత్ర కథను రూపొందించినట్లు, అంచనాలకు తగ్గట్టు సినిమా ఉంటుందా ? లేదా ? అనేది చూడాలి.

07:53 - May 29, 2017

తమిళ సూపర్ స్టార్ 'రజనీకాంత్' సినిమా కోసం ఎంతో మంది అభిమానులు ఎదురు చూస్తుంటారు. ఆయన పలికే డైలాగ్స్..మేనరిజం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ‘కబాలి'గా ముందుకొచ్చిన 'రజనీ' శంకర్ దర్శకత్వంలో 'రోబో 2.0’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా 'కబాలి' దర్శకుడు పా.రంజిత్ తెరకెక్కిస్తున్న 'కాలా' చిత్రంలో 'రజనీ' పవర్ పుల్ పాత్రను పోషించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ‘బాషా' సినిమాలో చెప్పిన విధంగా 'బాషా ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే' అనే డైలాగ్ మరోసారి పలుకుతున్నట్లుగా ఉంది. సినిమాను అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువలోనే తీర్చిదిద్దాలని చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. 'ధనుష్' నిర్మాణంలో తెలుగు..తమిళ..హిందీ భాషల్లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘రజనీ' సరసన 'హ్యుమా ఖురేషి' హీరోయిన్ గా నటిస్తోంది.

టీఆర్ఎస్ లో చేరనున్న రమేశ్ రాథోడ్..

హైదరాబాద్ : టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, పలువురు టీడీపీ, కాంగ్రెస్ ముఖ్య నేతలంతా సోమవారం టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. వీరంతా తమ అనుచరులతో కలిసి సోమవారం సాయంత్రం తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా ధరించనున్నారు.

సిర్పూర్ పేపర్ మిల్లులో ఫైర్ ఆక్సిడెంట్..

కాగజ్ నగర్ : సిర్పూర్ (టి) మూతపడిన పేపర్ మిల్లులో అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

06:46 - May 29, 2017

విజయవాడ : ఒక అడుగు ముందుకు.. పది అడుగులు వెనక్కు అన్న చందంగా ఉంది అమరావతిలో నిర్మిస్తున్న సీడ్ యాక్సిస్ రోడ్డు పరిస్థితి. రోడ్ల డైరెక్షన్లలో మార్పులు చేయడం.. నిర్వాసితులకు పరిహారం విషయంలో క్లారిటీ లేకపోవడంతో పనులు మందకొడిగా సాగుతున్నాయి. మరోవైపు రోడ్ల నిర్మాణం కోసం వందల ఏళ్ల నాటి చెరువులు పూడ్చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆగస్టు నాటికి రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలనుకున్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందా..? దీనిపై ప్రత్యేక కథనం.. ఏపీ రాజధానిలోని 29 గ్రామాల్ని కలిపే విధంగా సీడ్ యాక్సిస్ రోడ్ నిర్మాణం చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. కనకదుర్గ వారధి నుంచి బోరుపాలెం వరకు 23 కిలోమీటర్ల మేర రెండు భాగాలుగా ఈ నిర్మాణం చేయాలని ప్రభుత్వం భావించింది. అందుకోసం గతేడాది జూన్ 25న ఏపీ సీఎం చంద్రబాబు వెంకటపాలెం వద్ద శంఖుస్థాపన చేశారు. అయితే ఈ నిర్మాణం పనులు అనుకున్న విధంగా ముందుకు సాగడం లేదు.

18.5 కి.మీటర్ల వరకు రోడ్డు..
మొదటి దశలో సీతానగరం కొండవీటి లాకుల నుండి బోరుపాలెం వరకు 18.5 కిలోమీటర్ల వరకు రోడ్డు నిర్మించడానికి నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ నిర్మాణ బాధ్యతలు స్వీకరించింది. అమరావతి డెవలప్ మెంట్ కార్పొరేషన్ పర్యవేక్షణలో సీడ్ యాక్సిస్ రోడ్ పనులు గతేడాది ఆగస్టు నుంచి ప్రారంభించారు. అయితే ఎటువంటి ప్రణాళికలు లేకుండా ప్రభుత్వం నిర్మాణం చేపట్టడంతో అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. వెంకటపాలెం నుండి సీతానగరం కొండవీటి లాకుల వరకు 3 కిలోమీటర్ల మేరకు ఉన్న భూముల్ని సేకరించకుండా.. అధికారులు నిర్మాణం పనులు చేపట్టారు. కృష్ణానది కరకట్టను ఆనుకుని ఉన్న ఉండవల్లి, పెనమాక, కృష్ణపాలెం భూములను రైతులు ఇంకా ప్రభుత్వానికి ఇవ్వలేదు. ఇప్పటికీ ఆ భూముల్లో రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారు. అయితే ప్రభుత్వం రోడ్డు పనులు ప్రారంభించిన తరువాత భూసేకరణ నోటిఫికేషన్ ఇవ్వడంతో వ్యతిరేకించిన రైతులు కోర్టుల్ని ఆశ్రయించారు. దీంతో ప్రభుత్వం ఆ భూములు తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ మూడు గ్రామాలకు సంబంధించి భూములు తీసుకుంటే గాని సీడ్ యాక్సిస్ రోడ్ పూర్తి అయ్యే అవకాశం లేదు.

రోడ్ల కోసం భూములివ్వమంటున్న రైతులు..
రైతులు మాత్రం రోడ్ల కోసం తమ భూములను ఎట్టి పరిస్థితిల్లో ఇచ్చేది లేదని తెల్చి చెబుతున్నారు. ఇక సీడ్ యాక్సిస్ కోసం రూట్‌లను మార్చి గ్రామాల మధ్యకు మళ్లీంచడం వివాదాస్పదం అవుతోంది. ఈ మార్పుల కారణంగా రాయపూడిలో 200 కుటుంబాలు ఇళ్లు కోల్పోవాల్సి వస్తోంది. రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలోనే రూట్ మార్చారంటూ రాయపూడి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీడ్ యాక్సిస్ రోడ్ కోసం వందల ఏళ్ల నాటి డొండపాడు చెరువును పూడ్చేస్తుండటం రైతుల్ని ఆగ్రహానికి గురిచేస్తోంది. ఈ గ్రామంలో అనేక సంవత్సరాల నుండి తాగునీటి సమస్య ఉంది. దీని కోసం గ్రామంలో మంచినీటి చెరువును తవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ చెరువు పూడ్చేస్తే , త్రాగునీటి సమస్య మరింత పెరుగుతుందని గ్రామస్తులు చెబుతున్నారు. ఆగస్టు నాటికి సీడ్ యాక్సిస్ రోడ్ నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే గ్రామాల్లో నిర్వాసితులు.. రైతులు భూములు ఇవ్వకపోవడం.. చెరువులు పూడ్చాల్సి రావడం.. ఇన్ని సమస్యల మధ్య రోడ్డు నిర్మాణం పనులు పూర్తవడం అంటే కాస్త అనుమానమే.

06:43 - May 29, 2017

నెల్లూరు : గోహింస పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆహార అలవాట్లపై ఆంక్షలు విధిస్తోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాశ్‌ కరత్‌ విమర్శించారు. ఈ చర్చ దుర్మార్గమని మండిపడ్డారు. ముస్లింలు, దళితులపై దాడి చేసేందుకు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న కుట్రని ఆరోపించారు. నేటి వర్తమాన రాజకీయాల పరిస్థితి-సీపీఎం పాత్ర అన్న అంశంపై నెల్లూరులో జరిగిన సదస్సులో కారత్‌ ప్రసంగించారు. ప్రధాని మోదీ మూడేళ్ల పాలనలో దేశం అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందన్నారు. విద్య, ఉద్యోగ, ఉపాధి, వ్యవసాయ రంగాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయని కరత్‌ విమర్శించారు.

06:40 - May 29, 2017

హైదరాబాద్ : కేసీఆర్‌ సర్వేలపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. బోగస్‌ సర్వేల పేరుతో అటు రాష్ట్ర ప్రజలను,..ఇటు సొంతపార్టీ నేతలను కేసీఆర్ మోసం చేస్తున్నారని విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్‌కు సర్వేల మీద నమ్మకం ఉంటే. ఇప్పటికిప్పుడు ప్రభుత్వాన్ని రద్దు చేసి వెంటనే ఎన్నికలకు వెళ్లాలని సవాల్‌ విసిరారు. సర్వేల పేరుతో కుటుంబసభ్యులకే ఎక్కువ మార్కులు వేసుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా..అధికార పక్షం, ఇటు విపక్షాలు సైతం ముందస్తు రాగాన్ని అందుకుంటున్నాయి. ఇప్పటికే సీఎం కేసీఆర్‌..సర్వేల పేరుతో ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతుంటే..అటు విపక్షాలు సైతం ముందస్తు ఎన్నికలకు ప్రిపేర్‌ అవుతున్నాయి. సీఎం కేసీఆర్‌ రెండు రోజుల క్రితం ప్రకటించిన సర్వే ఫలితాలపై విపక్షాలన్నీ భగ్గుమంటున్నాయి. సర్వే ఫలితాలపై జెండాలను పక్కన బెట్టి అధికార పక్షంపై మూకుమ్మడిగా ఒక్కటై విమర్శలు గుప్పిస్తున్నారు. కేసీఆర్ నిర్వహించిన సర్వేలపై విపక్ష కాంగ్రెస్ మండిపడుతోంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్లీ గెలిపించుకుంటే తమ ఓటమిని ఒప్పుకుంటామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు సవాల్‌ విసిరారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్‌ఎస్‌కు 11 సీట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. అవినీతిలో కూరుకుపోయిన టీఆర్‌ఎస్‌..బోగస్‌ సర్వేలతో గోబెల్స్‌ ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు.

కోమటిరెడ్డి..
అద్దాల మేడలో ఉంటున్న సీఎం కేసీఆర్‌కు బయటి ప్రపంచం తెలియడం లేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. సర్వేల పేరుతో కేసీఆర్‌ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. సర్వేలపై నమ్మకం ఉంటే నల్గొండ పార్లమెంటు స్థానానికి గుత్తా సుఖేందర్‌రెడ్డితో రాజీనామా చేయించి మళ్లీ గెలుపించుకోవాలని సవాల్‌ చేశారు. ఆ ఎన్నికలో కాంగ్రెస్‌ ఓడిపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కోమటిరెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్‌కు సర్వేల మీద నమ్మకం ఉంటే 24 గంటల్లోగా ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని మండలి విపక్ష నేత షబ్బీర్‌ అలీ సవాల్ విసిరారు.

సండ్ర వెంకట వీరయ్య..
కేసీఆర్‌ చేయించిన సర్వే అంతా బూటకమని టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. మహానాడులో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన ఆయన .. దొంగ సర్వేలతో కేసీఆర్‌ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ సర్వే ఫలితాలు నిజమే అయితే తక్షణమే ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని ఎన్నికలకు వెళ్లాలని సండ్ర సవాల్‌ చేశారు.

ధీటుగా కౌంటర్..
సీఎం కేసీఆర్ చేయించిన సర్వే ఫలితాలను విమర్శిస్తున్న విపక్షాలకు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు ధీటుగా కౌంటర్‌ ఇస్తున్నారు. కేసీఆర్ చేయించిన సర్వేలన్నీ నూటికి నూరు శాతం సరైనవే అంటున్నారు. సర్వే ఫలితాలను బయటపెట్టేసరికి..సత్తాలేని విపక్షాల్లో వణుకు మొదలైందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. మొత్తానికి సీఎం కేసీఆర్‌ చేయించిన సర్వే ఫలితాలు రాష్ట్రంలో పొలిటికల్‌ హీట్‌ను పెంచాయి. అధికార విపక్షాల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం ఎందాక వెలుతుందో చూడాలి.

06:35 - May 29, 2017

హైదరాబాద్‌ : మియాపూర్‌లో ప్రభుత్వ భూమిని అక్రమంగా రియల్టర్లకు ధారాదత్తం చేసిన కేసులో కూకట్‌పల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ రాచకొండ శ్రీనివాస్‌రావును పోలీసులు అరెస్టు చేశారు. శ్రీనివాస్‌రావుతోపాటు ట్రినిటీ హోమ్స్‌ అధిపతి పార్థసారథి, అకౌంటెంట్‌ శర్మలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 693 ఎకరాల నాలుగు గుంటల ప్రభుత్వ భూమిని శ్రీనివాస్‌రావు అక్రమంగా రిజస్ట్రేషన్‌ చేశాడు. ఈ భూ కుంభకోణంలో ఏకంగా సబ్‌రిజిస్ట్రార్‌ కీలకంగా పాత్ర పోషించారు. వందల కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూముల్ని అడ్డగోలుగా రిజిస్ట్రేషన్ చేసి భూకంపం సృష్టించిన కూకట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావును, వ్యాపార వేత్త గోల్డ్ స్టోన్ ప్రసాద్ సోదరుడు పార్థసారధితో పాటు ఈ అక్రమాల్లో పాలు పంచుకున్న పార్థసారధి అనుచరుడు పీవీఎస్ శర్మను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. చట్టంలో లొసుగుల్ని అడ్డం పెట్టుకుని కబ్జారాయుళ్లు రెచ్చిపోయారు. శేరిలింగంపల్లి మియపూర్ ప్రాంతంలోని 20, 28, 100, 101 సర్వే నెంబర్‌లలో 693 ఎకరాల ప్రభుత్వ భూముల్ని రియల్టర్లకు కట్టబెట్టారు. వ్యాపార వేత్త పార్థ సారధితో పాటు మరి కొందరు బడాబాబులు తప్పుడు రిజిస్ట్రేషన్‌లతో భూములను సొంతం చేసుకున్నారు. సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ నిర్వాకంతో ప్రభుత్వ ఖజానాకు అక్షరాలా 587కోట్ల 11 లక్షల 48వేల 3వందల రూపాయలు లూఠీపడిందని అధికారులు లెక్కలు వేశారు. ఇంత పెద్దమొత్తంలో భూ దందాలకు పాల్పడ్డం వెనుక రాజకీయ నాయకులు హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు బడా లీడర్ల ప్రోత్సాహంతోనే సబ్‌రిజిస్ట్రార్‌ అక్రమ రిజిష్ట్రేషన్లకు తెరతీశారని.. స్థానికులు అంటున్నారు. ప్రభుత్వం ఇంప్పటికైన నిష్పాక్షింగా దర్యాప్తు జరిపిస్తే.. తెరవెనుక ఉన్న భూ బకాసురులు బయటికి వచ్చే అవకాశం ఉంది. మరి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏం చేస్తుందో వేచి చూడాలి అంటున్నారు హైదరాబాద్‌ పబ్లిక్‌.

గొర్రెల మందపైకి దూసుకెళ్లిన బస్సు...

కామారెడ్డి : సదాశివనగర్ మండలం కుప్రియాల వద్ద గొర్రెల మందపైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 20గొర్రెలు మృతి చెందాయి.

ప్రభుత్వ స్థలాలను రిజిస్ట్రేషన్ చేసిన కూకట్ పల్లి సబ్ రిజిష్ట్రార్..

హైదరాబాద్ : ప్రభుత్వ స్థలాల అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం బయటపడింది. కూకట్ పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్, బిల్డర్ పార్థసారధిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 690 ఎకరాల ప్రభుత్వ భూమిని 3 రియల్ ఎస్టేట్ సంస్థలకు శ్రీనివాస రావు రిజిస్ట్రేషన్ చేశారు. ట్రివిటీ సంస్థ డైరెక్టర్లు పార్థసారధి, పీవీస్ శర్మలను అరెస్టు చేశారు.

ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ..

హైదరాబాద్ : ప్రగతి భవన్ లో ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ ఆదివారం భేటీ అయ్యారు. నీటిపారుదల కాల్వల నిర్మాణం - మరమ్మత్తులు, మిషన్ భగీరథ పనుల విషయంలో చొరవ తీసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు పనుల పురోగతిని పరిశీలించాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు. ఎక్కడ ఏ సమస్యల తలెత్తినా మిషన్ భగీరథ వైస్ ఛైర్మన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, విలీన గ్రామాలకు గొర్రెల యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు.

 

విదేశీ పర్యటనకు మోడీ..

ఢిల్లీ : జూన్ 3న ఫ్రెంచ్ నూతన అధ్యక్షుడు మాక్రోన్ తో భేటీ కానున్నారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా జర్మనీ, స్పెయిన్, రష్యా, ఫ్రాన్స్ లలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటించనున్నారు.

Don't Miss