Activities calendar

30 May 2017

21:38 - May 30, 2017
21:36 - May 30, 2017

హైదరాబాద్ : దాసరి మృతి పట్ల సుద్దాల అశోక్ తేజ సంతాపం వ్యక్తం చేశారు. ఒక శకం ముగిసిందని ఆయన ఆవేదన వెలుబుచ్చారు. దాసరి లేకుంటే తను లేను అని అశోక్ అన్నారు. ఓసెయ్ రాములమ్మ సినిమాలో తనతో ఎనిమిది పాటలు రాయించుకున్నారని దాంతో తన జీవితమే మారిందని తేజ గుర్తు చేశారు.  

21:03 - May 30, 2017

హైదరాబాద్ : తెలుగు సినీ పరిశ్రమ బంగారు కొండను కోల్పోయిందని నటుడు ఘంటమనేని నరేష్ అన్నారు. దాసరి ఎవరికి సమస్య వచ్చిన తలుపు కొడితే వచ్చేవారని ఆయన గుర్తుచేశారు.


 

20:58 - May 30, 2017

గుంటూరు : దర్శకరత్న దాసరి నారాయణ మృతి పట్ల ఏపీ సీఎం నారా చంద్రబాబు ప్రగాడ సానుభూతి తెలిపారు. దాసరితో తనకు మంచి పరిచయం ఉందని బాబు గుర్తు చేశారు. ఎన్టీఆర్ తో ఎన్నో సినిమాలు చేశారని అన్నారు. నారాయణ రావు రాజకీయాల్లో కూడా బాగా రాణించారని కొనియడారు. తెలుగు సినిమాకు ఆయన ఎంతో సేవ చేశారని బాబు తెలిపారు.

20:55 - May 30, 2017

హైదరాబాద్ : దాసరి మరణం తీరని లోటు అని ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు అన్నారు. దాసరి నటుడు కంటే వ్యక్తిగా బాగా తెలుసు, ఆయనతో తన పరిచయం ఎప్పటినుండో ఉందని కోట గుర్తు చేశారు.

20:46 - May 30, 2017
20:39 - May 30, 2017
20:30 - May 30, 2017
20:24 - May 30, 2017
20:22 - May 30, 2017

హైదరాబాద్ : తెలుగు సినీపరిశ్రమ బీష్మున్ని కోల్పోయిందని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహిత విశ్వనాథ్ అన్నారు. దాసరి తను ఒకేసారి కేరిర్ ప్రారంభించామని, దాసరి గొప్ప వ్యక్తి అని ఆయన కొనియడారు. దాసరికి తనకు 50 సంవత్సరాల అనుబంధం ఉందని ఆయన గుర్తు చేశారు.  

20:13 - May 30, 2017
20:11 - May 30, 2017

దాసరి వ్యక్తి కాదు ఒక వ్యవస్థ : చంద్రబాబు

గుంటూరు : దర్శకరత్న దాసరి నారాయణ మృతి పట్ల ఏపీ సీఎం నారా చంద్రబాబు ప్రగాడ సానుభూతి తెలిపారు. దాసరితో తనకు మంచి పరిచయం ఉందని బాబు గుర్తు చేశారు. ఎన్టీఆర్ తో ఎన్నో సినిమాలు చేశారని అన్నారు. నారాయణ రావు రాజకీయాల్లో కూడా బాగా రాణించారని కొనియడారు. తెలుగు సినిమాకు ఆయన ఎంతో సేవ చేశారని బాబు తెలిపారు.

దాసరి మృతి పట్ల సీఎం కేసీఆర్ దిగ్ర్భాంతి

హైదరాబాద్ : దర్శకుడు, నటుడు, మాజీ మంత్రి దాసరి నారాయణ రావు మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.   

19:22 - May 30, 2017

హైదరాబాద్ : ప్రముఖ నటుడు, దర్శకుడు, మాజీ మంత్రి దాసరి నారాయణ రావు(75) కిమ్స్ ఆసుపత్రిలో చికిత్ప పొందుతూ మృతి చెందారు. కొంత కాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. దాసరి తెలుగు, తమళ, కన్నడ, భాషల్లో నటించారు. 151 చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.  దాసరి రెండు జాతీయ, తొమ్మిది నంది, నాలుగు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. దాసరి అనేక మంది దర్శకులు, నటులు, నటీమణులకు అవకాశాలు కల్పించారు. ఆయన తారక ప్రభు ఫిలిమ్స్ బేనర్ పై 53 సినిమాలు నిర్మించారు. దాసరి తొలి సినిమా తాత మనవడు తో సినిఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా పాలకోల్లులో 1942 మే 2  జన్మించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. దర్శకరత్న కాంగ్రెస్ పార్టీ తరుపున రాజ్యసభకు ఎన్నికైయ్యారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా పనిచేశారు.  మరిన్ని వివరాలకు వీడియో చూడండి.

దాసరి నారాయణ రావు కన్నుమూత

హైదరాబాద్ : ప్రముఖ నటుడు, దర్శకుడు, మాజీ మంత్రి దాసరి నారాయణ రావు(75) కిమ్స్ ఆసుపత్రిలో చికిత్ప పొందుతూ మృతి చెందారు. కొంత కాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. దాసరి తెలుగు, తమళ, కన్నడ, భాషల్లో నటించారు. 151 చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. 

19:12 - May 30, 2017
19:11 - May 30, 2017
19:09 - May 30, 2017

ఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో మెడికల్‌ షాపు ఓనర్ల ఆందోళన హోరెత్తుతోంది. జంతర్‌ మంతర్‌ దద్దరిల్లుతోంది. ఆన్‌లైన్‌లో మెడిసిన్‌ విక్రయించాలన్న కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా మెడికల్‌ షాపుల బంద్‌ కొనసాగుతోంది. తాము డిజిటలైజేషన్‌కు వ్యతిరేకం కాదని.. ఆన్‌లైన్‌ ఔషధ విక్రయాలకు గైడ్‌లైన్స్‌ తీసుకురావాలని మెడికల్‌ షాపు ఓనర్లు డిమాండ్ చేస్తున్నారు. జంతర్‌మంతర్‌లో మెడికల్‌ షాపు ఓనర్ల ధర్నాపై మా ప్రతినిధి గోపి మరింత సమాచారం అందిస్తారు.

19:07 - May 30, 2017

హైదరాబాద్ : కాలపరిమితి ముగిసిన షెడ్యూల్డ్‌ పరిశ్రమలకు సంబంధించిన వేతనాల జీవోలను తక్షణమే సవరించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాలడుగు భాస్కర్‌ డిమాండ్‌ చేశారు. 52 రంగాల్లోని జీవోలకు ఎప్పుడో కాలపరిమితి ముగిసిందని.. అయినా వాటిని ఇంత వరకు ప్రభుత్వం సవరించడం లేదని మండిపడ్డారు. షెడ్యూల్డ్‌ పరిశ్రమల్లో పెండింగ్‌లో ఉన్న వేతనాల జీవోలను సవరించి విడుదల చేయాలంటూ హైదరాబాద్‌ కుషాయిగూడ పారిశ్రామిక వాడలో సీఐటీయూ రిలే దీక్షలకు దిగింది. ఈ దీక్షలను పాలడుగు భాస్కర్‌ ప్రారంభించారు. షెడ్యూల్డ్‌ పరిశ్రమల్లో పెండింగ్‌లో ఉన్న వేతనాల జీవోలను సవరించాలని సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు డిమాండ్‌ చేశారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు - షాద్‌నగర్‌ పారిశ్రామిక ప్రాంతంలో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు రిలే దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలను ప్రారంభించిన ఆయన.. తక్షణమే వేతనాల జీవోలను సవరించి నూతన జీవోలు విడుదల చేయాలన్నారు. కనీసవేతనం 18వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. జూన్‌ 2లోగా జీవోలు విడుదల చేయకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ప్రైవేట్‌ రంగంలో కనీస వేతనం 18 వేల రూపాయలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ బాలానగర్‌లోని నర్సాపూర్‌ చౌరస్తా వద్ద సీఐటీయూ నేతలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ప్రైవేట్‌ కంపెనీలలో ఉద్యోగులకు డీఏ పెంచాలని... కనీస సౌకర్యాలు కల్పించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

 

19:06 - May 30, 2017

విశాఖ : హోటల్స్‌లో 18శాతం జీఎస్టీ పన్ను పెంచడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్త హోటల్స్‌ బంద్‌ విశాఖలో సంపూర్ణంగా జరుగుతోంది. అన్ని హోటల్స్‌ను మూసివేసి.... యజమానులు ఆందోళన చేపట్టారు. నాన్‌ ఏసీ రెస్టారెంట్‌కు 12శాతం, ఏసీ రెస్టారెంట్‌కు 18శాతం పన్ను నిర్ణయించాన్ని వ్యతిరేకిస్తున్నారు. కేంద్రం తక్షణమే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారాం మా ప్రతినిధి జార్జ్‌ అందిస్తారు. హోటళ్లపై పెనుభారం మోపే విధంగా ఉన్న జీఎస్టీ పన్నురేటు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో హోటల్స్‌ యాజమాన్యాలు బంద్‌కు దిగాయి. దీంతో నగరాలు, పట్టణాల్లో హోటల్స్‌ మూతపడ్డాయి. ఒక్కరోజు బంద్‌లో భాగంగా విజయనగరంలోని హోటల్స్‌ యజమానులు ర్యాలీ నిర్వహించారు. ఏసీ హోటల్స్‌కు 18శాతం, నాన్‌ఏసీకి 12శాతం పన్ను పెంచడం మూలంగా వినియోగదారులపై భారం పడుతుందని మండిపడ్డారు. పెంచిన జీఎస్టీ పన్ను తక్షణమే తగ్గించాలని డిమాండ్‌ చేశారు.

18:57 - May 30, 2017

కృష్ణా : జిల్లా ముండ్లపాడు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. రెండోపెళ్లి కోసం కన్నకొడుకును ఓ తల్లి అతి దుర్మార్గంగా కడతేర్చింది. 8 నెలల క్రితం భర్త బ్రహ్మయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య సుజాత మళ్లీ పెళ్లికి సిద్ధపడింది. అయితే రెండోపెళ్లికి.. కుమారుడు అడ్డంకిగా నిలవడంతో... అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకుంది. అన్నంలో పురుగు మందు కలిపి తినిపించి.. చనిపోయిన తరువాత... వాగులో పడేసింది. స్థానికుల నుంచి సమచారం అందుకున్న పోలీసులు.. విచారణ జరిపి... తల్లి సుజాతను అరెస్ట్ చేశారు. 

18:55 - May 30, 2017

విశాఖ : జిల్లాలో వేలకోట్ల రూపాయాల విలువగల భూకుంభకోణం వెలుగుచూసింది. అధికారులు ల్యాండ్ స్కామ్ జరిగిందని గుర్తించారు. అక్రమాలపై చర్యలు ప్రారంభించామని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. రికార్డుల తారుమారు, కబ్జా, దొంగ రికార్డుల సృష్టించినట్లు తెలుస్తోంది. మధురవాడ, కొమ్మాది, పెందుర్తి మండలంలో పరిధిలో విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయని కలెక్టర్ అన్నారు. ఈ భూముల విలువ దాదాపు రూ.3వేల కోట్లపైనే ఉంటుందని అంచన వేస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

18:54 - May 30, 2017

హైదరాబాద్ : దర్శకరత్న దాసరి నారాయణరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దాసరి నారాయణరావుకు తాజాగా ఇన్‌ఫెక్షన్‌ సోకింది. దీంతో దాసరిని హుటాహుటిన కిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. దాసరికి గ్యాస్ట్రిక్‌ బెలూన్‌ సర్జరీని కిమ్స్‌ వైద్యులు నిర్వహించారు. అయితే ఉదయం నుంచి దాసరికి బీపీ, హెచ్చుతగ్గులు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న దాసరి ఈ ఏడాది జనవరి 19న తీవ్ర అనారోగ్యంతో..కిమ్స్‌లో తొలిసారిగా చేరారు. కొంతకాలం ఆసుపత్రిలో ఉన్న తర్వాత మార్చి 19న దాసరిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. మళ్లీ ఆరోగ్యం కుదుటపడకపోవడంతో వారం రోజుల క్రితం తిరిగి దాసరి కిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు. ఉదయం నుంచి బీపీ హెచ్చు తగ్గులు ఉన్నట్లు గుర్తించిన వైద్యులు దానికి ట్రీట్‌మెంట్‌ నిర్వహిస్తున్నారు. దాసరి ఆరోగ్యంపై కిమ్స్‌ వైద్యులు కాసేపట్లో హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేయనున్నారు. 

18:52 - May 30, 2017

హైదరాబాద్ : ఎన్నికల్లో కేసీఆర్‌ ఇచ్చిన హామీలు మూడేళ్ల పాలనలో పది శాతం కూడా అమలు చేయలేదని... తెలంగాణాలో నిరంకుశ పాలన అమలవుతుందని ప్రజా సంఘాల..రాజకీయ పార్టీల నాయకులు ఆరోపించారు. తెలంగాణ జర్నలిస్ట్‌ ల వేదిక ఆధ్వర్యంలో మూడేళ్ల తెలంగాణ అనే అంశంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో నయా జాగిర్దార్‌ పాలన కొనసాగుతుందని... పోరాడే నాయకులపై దాడులు జరుగుతున్నాయని వక్తలు అభిప్రాయపడ్డారు.

18:50 - May 30, 2017
18:47 - May 30, 2017

యాదాద్రి : స్వాతి, నరేష్‌ హత్య ఘటనపై నిజనిర్ధారణ కమిటీ యాదాద్రి భువనగిరిజిల్లా పల్లెర్లలో పర్యటించింది. నివేదికను రేపు హోంమంత్రితో పాటు, డీజీపీ, రాచకొండ కమిషనర్‌కు అందజేయనున్నారు. నరేష్‌ను ఎక్కడో హత్య చేసి పొలంలో తగలబెట్టినట్లుగా ఉందని.. అలాగే స్వాతిని కూడా హత్య చేసినట్లుగా ఉందని నిజనిర్ధారణ కమిటీ అనుమానాలు వ్యక్తం చేసింది. గర్భవతిగాఉన్న స్వాతిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు. శ్రీనివాస్‌రెడ్డికి సహకరించిన ఆత్మకూరు ఎస్సై, రామన్నపే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.

16:57 - May 30, 2017

హైదరాబాద్ : రాజ్‌భవన్‌ పాఠశాలను సకల సదుపాయాలతో తీర్చిదిద్దాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నాలుగున్నర కోట్ల రూపాయలతో పునర్‌నిర్మించిన రాజ్‌భవన్‌ స్కూలును గవర్నర్‌ నరసింహన్‌తో కలిసి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పరిశీలించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ స్కూలులో పూర్తి స్థాయిలో ఇంగ్లీషు మీడియం బోధన చేపట్టాలని నిర్ణయించారు. ఇక్కడ చదువుతున్న తెలుగు మీడియం విద్యార్థులను పక్కనే ఉన్న పాఠశాలలోకి సర్దుబాటు చేస్తారు. స్కూలు పునఃప్రారంభమయ్యేనాటికి డైనింగ్‌ హాలు, బయో మెట్రిక్‌ యంత్రాలు, ఆర్వో ప్లాంటు, కంప్యూటర్‌ ల్యాబ్స్‌, సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 

16:56 - May 30, 2017

హైదరాబాద్ : కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు రావాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి మండిపడ్డారు. చేయించిన సర్వేలపై కేసీఆర్ కు నమ్మకం లేకపోవడంతోనే రాజీనామాలపై దాటవేస్తున్నారని ఉత్తమ్‌ విమర్శించారు. టీఆర్ఎస్ సర్వేలు బూటకమని, కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు సిద్ధం కావాలని సవాల్‌ విసిరారు. 

16:55 - May 30, 2017
16:42 - May 30, 2017

లక్నో : బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో బీజేపీ అగ్రనేతలకు ఊరట కలిగింది. ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమాభారతి సహా 12 మందికి సిబిఐ ప్రత్యేక కోర్టు బెయిలు మంజూరు చేసింది. 20 వేల వ్యక్తిగత పూచి కింద వీరికి బెయిలు మంజూరు అయింది. ఈ కేసులో అభియోగాల నమోదుకు నిందితుల నుంచి సంతకాలు తీసుకున్నారు. ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టు వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో అద్వాని సహా బిజెపి అగ్రనేతలపై కేసును పునరుద్ధరించాలన్న సిబిఐ వాదనను సుప్రీంకోర్టు అంగీకరించిన విషయం తెలిసిందే. దీంతో పాటు లక్నో కోర్టులోనూ రోజువారీ విచారణ చేపట్టాలని కోర్టు ఆదేశించింది. ఇందులో భాగంగా సిబిఐ ప్రత్యేక కోర్టు అద్వాని సహా సీనియర్‌ నేతలపై విచారణ జరిపింది. 

16:41 - May 30, 2017

హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండడంతో అనుకున్న సమయానికే రుతుపవనాలు ప్రవేశించాయి. దీంతో కేరళలోని దక్షిణభాగంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జూన్ రెండో వారంలో తెలుగు రాష్ట్రాల్లోని రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. 

16:40 - May 30, 2017

గుంటూరు : రాష్ట్రలో అధిక పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్న కారణంగా పోలవరం ప్రాజెక్టు కాంక్రీటు పనులను రాత్రుల్లో చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు పనులపై చంద్రబాబు సమీక్షించారు. భారీ వర్షంతో స్పిల్‌ వే చానల్‌లో నీరు చేరడంతో రెండు రోజుల పాటు పనులకు అంతరాయం కలిగిన విషయాన్ని నీటిపారుదల శాఖ అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తెచ్చారు. పోలవరం ప్రాజెక్టు పరిసరాలను పర్యాటకంగా అభివృద్ధి చేసే అంశంపై వచ్చే వారం నుంచి సమీక్షించాలని చంద్రబాబు నిర్ణయించారు. 

16:40 - May 30, 2017

గుంటూరు : రాష్ట్రలో అధిక పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్న కారణంగా పోలవరం ప్రాజెక్టు కాంక్రీటు పనులను రాత్రుల్లో చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు పనులపై చంద్రబాబు సమీక్షించారు. భారీ వర్షంతో స్పిల్‌ వే చానల్‌లో నీరు చేరడంతో రెండు రోజుల పాటు పనులకు అంతరాయం కలిగిన విషయాన్ని నీటిపారుదల శాఖ అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తెచ్చారు. పోలవరం ప్రాజెక్టు పరిసరాలను పర్యాటకంగా అభివృద్ధి చేసే అంశంపై వచ్చే వారం నుంచి సమీక్షించాలని చంద్రబాబు నిర్ణయించారు. 

16:04 - May 30, 2017

హైదరాబాద్ : ప్రభుత్వం తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త ప్రకటించింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీంఎ కేసీఆర్ 20 వేల ఉద్యోగ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విద్యాసంస్థల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కస్తూరిభాగాంధీ బాలికల విద్యాలయాల్లో 1428 ఉద్యోగాలు, అర్బన్ రెసిడెన్షియల్స్ స్కూళ్లలో 377 ఉద్యోగాలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో 7,300 టీచర్ పోస్టులు, పాఠశాలల్లో 8,792 పోస్టులు, కాలేజీలు, ప్రభుత్వ శాఖల్లో 2,437పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనునట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

పోలవరంపై చంద్రబాబు సమీక్ష

గుంటూరు : పోలవరం ప్రాజెక్టు పనులపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పగలు అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతున్న కారణంగా రాత్రి పూటనే కాంక్రీట్ పనులు చేస్తున్నామని, వర్షంతో స్విల్ చానల్ నీటితోమ నిండి పనులకు అంతరాయం కలిగిందని సీఎంకు సీఈ రమేష్ వివరించారు. 

బాబ్రీ కేసులో బీజేపీ నాయకులకు బెయిల్

లక్నో : బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో అద్వానీ, జోషి, ఉమాభారతి సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మొత్తం 12మంది కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

15:20 - May 30, 2017
14:22 - May 30, 2017

రిజిస్ట్రేషన్ శాఖ పై కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్ : మేడ్చల్ జిల్లాలోని మియాపూరు భూ కుంభకోణం పై సీఎం కేసీఆర్ రిజిస్ట్రేషన్ శాఖ వ్యవహారాలపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రిజిస్ట్రేషన్ శాఖను ప్రక్షాళన చేయాలని, అవినీతి కట్టడికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అలాగే ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానాన్ని రద్దు చేయాలని సీఎం ఆదేశించారు. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

14:18 - May 30, 2017

హైదరాబాద్ : మేడ్చల్ జిల్లాలోని మియాపూరు భూ కుంభకోణం పై సీఎం కేసీఆర్ రిజిస్ట్రేషన్ శాఖ వ్యవహారాలపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రిజిస్ట్రేషన్ శాఖను ప్రక్షాళన చేయాలని, అవినీతి కట్టడికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అలాగే ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానాన్ని రద్దు చేయాలని సీఎం ఆదేశించారు. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మియాపూర్ భూకుంభకోణం పై సీఐడీ విచారణకు కేసీఆర్ ఆదేశించారు.రిజిస్ట్రేషన్ శాఖ పై కేసీఆర్ సమీక్ష

 

13:34 - May 30, 2017

అలనాటి నటి 'గీతా కపూర్' ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. 'పాకీజా' వంటి పలు హిట్ చిత్రాల్లో ఆమె నటించింది. వృద్ధాప్యంలో ఉన్న ఆమెను ఆదరించాల్సిన కొడుకు నిస్సహయస్థితిలో పడేసి వెళ్లాడనే వార్త సోషల్ మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. గీతాకపూర్‌ కొడుకు రాజా కొరియోగ్రాఫర్ గా పనిచేస్తుండగా కూతురు పూజా ఎయిర్ హోస్టెస్ గా పనిచేస్తోంది. ప్రస్తుతం వీరిద్దరూ స్పందించడం లేదు. ఆమెను గత నెల ముంబై గురుగావ్‌లోని ఎస్‌వీఆర్‌ ఆస్పత్రిలో రాజా చేర్పించాడు. ఆస్పత్రిలో బిల్లు కట్టేందుకు ఏటీఎం నుంచి డబ్బు తీసుకొస్తానంటూ చెప్పి వెళ్లిపోయి తిరిగి రాలేదు. అప్పటి నుంచి గీతా కపూర్ ఆస్పత్రిలో బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది. ఈ సందర్భంగా ఆమె తన ఆవేదనను తెలియచేసింది. ''నాలుగు రోజులకు ఒకసారే అన్నం పెట్టేవాడు. చాలా రోజులు నన్ను గదిలో పెట్టి బంధించాడు. నేను వృద్ధాశ్రమానికి వెళ్లేందుకు నిరాకరించడంతోనే ఇలా చేశాడు. అతడు ఉద్దేశపూర్వకంగా ఆకలితో మాడ్చి.. నేను అనారోగ్యానికి గురయ్యేలా చేశాడు. ఆ తర్వాత ఆస్పత్రిలో చేర్చి పరారయ్యాడు' అని గీతా కపూర్‌ మీడియాతో చెప్పింది. రాజాను ఫోన్‌లో సంప్రదించామని, ఆస్పత్రి బిల్లు రూ.లక్ష చెల్లించి తన తల్లిని తీసుకెళ్లి పోవాలని చెప్పామని ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. గీతా కపూర్‌ కొడుకుపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నట్టు తెలిస్తోంది.

 

సమస్యలను పరిష్కరించడం లేదు - జూలకంటి..

హైదరాబాద్ : బలిదానాలతో వచ్చిన తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకనుగుణంగా పాలన లేదని సీపీఎం నేత జూలకంటి పేర్కొన్నారు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం చెందిందని, ప్రతిపక్షాల గొంతునొక్కడంలో కేసీఆర్ సర్కార్ నెంబర్ వన్ అని విమర్శించారు.

కేసీఆర్ హామీలు మరిచారు - అజీజ్ పాషా..

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ హామలు మరిచిపోయారని, మూడేళ్లనా 20 శాతం హామీలు అమలు కాలేదని అజీజ్ పాషా పేర్కొన్నారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని, రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం రెండో స్థానంలో ఉందన్నారు. విమర్శించే వారిని ద్రోహులు అంటున్నారని తెలిపారు.

మూడేళ్ల తెలంగాణ పాలనపై రౌండ్ టేబుల్..

హైదరాబాద్ : తెలంగాణ జర్నలిస్టుల వేదిక ఆధ్వర్యంలో మూడేళ్ల తెలంగాణ పాలనపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కోదండరాం, జూలకంటి, అజీజ్ పాషాలు పాల్గొన్నారు.

 

13:23 - May 30, 2017

హైదరాబాద్ : స్వాతి అనుమానాస్పద మృతి..నరేష్ హత్య వివరాలు తెలుసుకొనేందుకు నిజనిర్ధారణ కమిటీ శోధన చేపట్టింది. కులదురహంకార హత్యలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం నిజనిర్ధారణ కమిటీ పల్లెర్లలో పర్యటించింది. నరేష్ తల్లిదండ్రులను..గ్రామస్తులను వివరాలను అడిగి తెలుసుకొంది. అనంతరం నరేష్ మృతదేహాన్ని కాల్చివేసిన ప్రదేశాన్ని కూడా పరిశీలించింది. ఈ సందర్భంగా వారు టెన్ టివితో మాట్లాడారు. మృతదేహాన్ని ఇక్కడ కాల్చివేయలేదని, శవాన్ని కాల్చివేసే సమయంలో సమీపంలో ఉన్న చెట్లకు ఎలాంటి ప్రమాదం ఏర్పడలేదన్నారు. ఎక్కడో హత్య చేశారని తెలుస్తోందని, శ్రీనివాస్ రెడ్డి మరోసారి చెబుతున్న కట్టుకథను పోలీసులు నమ్ముతున్నారని విమర్శించారు. నరేష్ ను ఎక్కడ హత్య చేశారు ? బూడిద ఎక్కడ కలిపారు ? అనే దానిపై విచారణ జరపాలని, స్వాతిని హత్య చేసి ఆత్మహత్య చేసుకుందని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. మృతదేహం కాల్చిన ప్రదేశానికి సమీపంలోనే రెండు గ్రామాలు..మెయిన్ రోడ్డు కూడా ఉందని పేర్కొన్నారు. నిజనిర్ధారణ కమిటీ..టెన్ టివి జరిపిన సత్యశోధన మరింత వివరాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

13:21 - May 30, 2017

హైదరాబాద్ : తమకు న్యాయం చేయాలని గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలను..ముఖ్యమంత్రులను..నాయకులను, అధికారులను అడుగుతూనే ఉన్నారు. కానీ అందరూ చేస్తాం... చూస్తాం... ఇస్తామని చెబుతున్నారు. కానీ వారికి మాత్రం అన్యాయమే ఎదురవుతూనే ఉంది. న్యాయం చేసినవారు లేరు. వారే 1998 డీఎస్సీ క్వాలిఫైడ్‌ అభ్యర్థులు. తమ గోడును మరోసారి వినిపించేందుకు ప్రగతి భవన్ కు మంగళవారం ఉదయం చేరుకున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కానీ అక్కడనే ఉన్న పోలీసులు వీరిని అడ్డుకున్నారు. తాము సీఎం కేసీఆర్ తో మాట్లాడుతామని, శాంతియుతంగా ఆందోళన చేపట్టామని వారు పేర్కొన్నారు. వంద మంది అభ్యర్థులను అరెస్టు చేసి గోషామహల్ పీఎస్ కు తరలించారు. అరెస్టులను డీఎస్సీ అభ్యర్థుల సంఘం నేత నర్సింహరెడ్డి ఖండించారు. సమస్యలను పరిష్కరించాలరని కోరితే అరెస్టులు చేయడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. న్యాయం చేస్తామని అధికారంలోకి రాకముందు చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత మాట మారుస్తున్నారని అభ్యర్థులు తెలిపారు.

జబర్దస్త్..ఫటాస్ ప్రొడ్యూసర్లకు..డైరక్టర్లకు నోటీసులు..

హైదరాబాద్ : జబర్దస్త్, ఫటాస్ షోలపై అభ్యంతరాలు చెబుతూ హెచ్చార్సీని సెన్సార్ బోర్డు సభ్యుడు దివాకర్ ఆశ్రయించారు. ఆగస్టు 10వ తేదీలోగా వివరణ ఇవ్వాలని ప్రొగ్రామ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్లకు నోటీసులు జారీ చేసింది.

ప్రగతి భవన్ ను ముట్టడించిన డీఎస్సీ అభ్యర్థులు..

హైదరాబాద్ : ప్రగతి భవన్ ను డీఎస్సీ అభ్యర్థులు ముట్టడించారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ అభ్యర్థులను అరెస్టు చేసి గోషామహల్ పీఎస్ కు తరలించారు.

కొనసాగుతున్న బాబ్రీ మసీదు కూల్చివేత విచారణ..

లక్నో : బాబ్రీ మసీదు కూల్చివేత కేసు విచారణ కొనసాగుతోంది. సీబీఐ కోర్టుకు బీజేపీ అగ్రనేతలు అద్వానీ, ఉమాభారతి, ఎంఎం జోషి సీబీఐ ప్రత్యేక కోర్టుకు హజరయ్యారు.

కొనసాగుతున్న నిజనిర్ధారణ కమిటీ పర్యటన..

యాదాద్రి : జిల్లాకు నిజనిర్ధారణ కమిటీ సభ్యులు చేరుకున్నారు. కాసపటి క్రితం పల్లెర్లలో కమిటీ సభ్యులు పర్యటించి నరేష్ తల్లిదండ్రులతో మాట్లాడారు.

అనంతరాజు పేట వద్ద లారీ..కారు ఢీ..

కడప : రైల్వే కోడూరు (మం) అనంతరాజు పేట వద్ద లారీ..కారు ఢీకొన్నాయి. ఇద్దరు మృతి చెందగా ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు.

12:39 - May 30, 2017

పరువు హత్యలు అంటే హర్యానా రాష్ట్రం గుర్తుకొచ్చేది. ఈ విష సంస్కృతి తెలుగు రాష్ట్రాలకు విస్తరించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గడచిన రెండున్నర సంవత్సరాల్లో 20 పరువు హత్యలు జరిగాయంటే ఎలాంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. కడుపున పుట్టిన బిడ్డలను పరువు పేరిట కడతేర్చితే పరువు నిలబెడుతుందా ? కడుపు తీపిని పరువు డామినేట్ చేస్తుందా ? అసలు పరువు హత్యలు పెరగడానికి కారణాలు ఏంటీ ? అనే దానిపై మానవి 'వేదిక' ప్రత్యేక చర్చ చేపట్టింది. సుమిత్ర (అంకురం స్వచ్ఛంద సంస్థ ఫౌండర్), అరుణ జ్యోతి (ఐద్వా) పాల్గొని వివరించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

12:35 - May 30, 2017

నల్గొండ : జిల్లాలో టీఆర్ఎస్ లో అంతర్గత విబేధాలు భగ్గుమన్నాయి. దేవరకొండ నియోజకవర్గంలోని చందంపేట మండలం కంబాలపల్లిలో గులాబీ నేతలు ఒకరినొకరు ఘర్షణకు తలపడ్డార. దీనితో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కర్రలు..పదునైన ఆయుధాలతో దాడులు చేసుకున్నారు. దీనితో ఇరువర్గాల్లో ఉన్న వారికి గాయాలయ్యాయి. ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలు కావడంతో దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కంబాలపల్లిలో ఇంతకుముందు కూడా పలు ఘర్షణలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన అనంతరం గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు.

12:30 - May 30, 2017

యాదాద్రి : పథకం ప్రకారమే నరేష్ ను హత్య చేశారని నిజనిర్ధారణ కమిటీ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. స్వాతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం..నరేష్ హత్యపై పలు ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో పోలీసుల హస్తం ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం నిజనిర్ధారణ కమిటీ యాదాద్రి జిల్లాలోని పల్లెర్లలో పర్యటించింది. న్యాయవాదులు, జర్నలిస్టులు, పౌర, ప్రజా సంఘాల నేతలు కమిటీల్లో ఉన్నారు. రెండు గంటల పాటు నరేష్ తల్లిదండ్రులు, గ్రామస్తులతో మాట్లాడారు. కొత్త విషయాలను కూడా సేకరించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు టెన్ టివితో మాట్లాడారు.

కఠినంగా శిక్షించాలి - జాన్ వెస్లీ..
స్థానికంగా ఉన్న శ్రీనివాస్ రెడ్డికి సహాయ పడ్డారో..ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి నేత జాన్ వెస్లీ పేర్కొన్నారు. నరేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని..స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. శ్రీనివాస్ రెడ్డి, సీఐ, ఎస్ఐలు..అగ్రకులాల కుట్ర వల్లే పథకం ప్రకారం హత్య చేశారని, ఎల్ బినగర్ లో కిడ్నాప్ చేసి హత్య చేశారని తెలిపారు. హత్యలో భాగమున్న సీఐ, ఎస్ఐలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతదేహాన్ని ఎక్కడ తగులబెట్టారో..బూడిదను ఎక్కడ వేశారో అనేది నిర్ధారించలేదని తెలిపారు. హత్య జరిగిన అనంతరం విందు భోజనాలు జరిగాయని, ఈ విందులో ఎవరు పాల్గొన్నారో విచారించాలని డిమాండ్ చేశారు. శ్రీనివాస్ రెడ్డి నరహంతకుడని, పోలీసు కుట్ర ఉందన్నారు. నాలుగో తేదీన 200 సంఘాల ఆధ్వర్యంలో ఓ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని, అప్పటికైనా స్పందించకపోతే 'చలో భువనగిరి' నిర్వహించడం జరుగుతోందన్నారు. అనంతరం జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. హోం మంత్రి, కలెక్టర్ వెంటనే ఘటనా ప్రదేశాన్ని సందర్శించాలని పేర్కొన్నారు.

సాక్ష్యాధారాలు సేకరించాలి..
ముంబైలో పెళ్లి చేసుకున్నారని, ఇందులో పోలీసులు ఎందుకు పిలిపించారని మరో ప్రజా సంఘం నేత ప్రశ్నించారు. ఇందులో పోలీసు కుట్ర ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన అనంతరం ఆరు హత్యలు జరిగాయని తెలిపారు. అగ్రకులంహకార హత్యలు జరిగితే ఏ రాజకీయ పార్టీ ఎందుకు స్పందించడం లేదని, సీఎం కేసీఆర్ ఏం చేస్తున్నట్లు ప్రశ్నించారు. ప్రేమించడం..పెళ్లి చేసుకోవడం తప్పా అని నిలదీశారు. హత్యల పేరిట మనుధర్మ శాస్త్రం పోషించబడుతోందని, కులరక్కసిని కేసీఆర్ ప్రోత్సాహిస్తున్నారని పేర్కొన్నారు. పోలీసు తన పని తాను చేయడం లేదని, డబ్బులున్న వారి పనిచేస్తోందని సీనియర్ జర్నలిస్టు తెలిపారు. ఆధారాలు మాయమయ్యే విధంగా ఎవరు చేశారని, సాక్ష్యాధారాలు నిజమే చెబుతాయన్నారు. ఫోన్ కాల్స్ ఆధారంగా అన్ని వివరాలు బయటకొస్తాయన్నారు.

అన్యాయంగా చంపేశారు - ఆశయ్య..
నరేష్..స్వాతి హత్యలపై పలు ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయని, పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటనలు జరిగాయని ఎంబీసీ నేత ఆశయ్య తెలిపారు. అన్యాయంగా చంపేసి..ఇతరులను దాచిపెట్టి వ్యతిరేకిస్తున్న వారిని బెదిరిస్తున్నారని తెలిపారు. ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి న్యాయం చేయాలని..స్వాతి కుటుంబాన్ని ఆదుకోవాలని..మూడుకెరాల భూమి ఇవ్వాలి..సీఐ..ఎస్ఐలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. భరోస కల్పించాల్సింది పోయి ఇలా చేయడం దారుణమని సీఐటీయూ మహిళా నేత రమ పేర్కొన్నారు. నరేష్ హత్య విషయం ఎక్కడ చెబుతుందోమన్న ఉద్ధేశ్యంతో స్వాతిని కూడా హత్య చేశారని, శ్రీనివాస్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

12:18 - May 30, 2017

ఢిల్లీ : రుతుపవనాలు వచ్చేస్తున్నాయి. మంగళవారం ఉదయం కేరళను రుతుపవనావలు తాకాయి. వాతావరణ శాఖ అంచనా వేసినట్లే రుతుపవనాలు విస్తారంగా విస్తరిస్తున్నాయి. వాతావరణం అనుకూలంగా ఉండడంతో రుతుపవనాలు విస్తరిస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. కేరళలో రుతుపవనాలు తాకడంతో దక్షిణ భాగంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరొక రెండు రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం అంతటా విస్తారిస్తాయని, దేశంలోని పలు ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. తుపాన్ కారణంగా రుతుపవనాలు చురుగ్గా కదిలాయని, మరో రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు రుతుపవనాలు విస్తరిస్తాయన్నారు. కోస్తాంధ్రాలో చెదురుముదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖాధికారులు వెల్లడించారు.

కేరళను తాకిన రుతుపవనాలు..

కేరళ : రుతుపవనాలు ప్రవేశించాయి. జూన్ మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలుస్తోంది. రెండోవారంలో రాష్ట్రాల్లో పూర్తిగా విస్తరించే అవకాశం ఉంది.

తిరుమల ఎగువ ఘాట్ రోడ్డులో బండరాయి..

చిత్తూరు : తిరుమలలో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఎగువ ఘాట్ రోడ్డులో బండరాయి విరిగిపడింది. వాహనాలు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇంజినీరింగ్ సిబ్బంది బండరాయిని తొలగిస్తున్నారు.

తిరుమల ఎగువ ఘాట్ రోడ్డులో బండరాయి..

చిత్తూరు : తిరుమలలో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఎగువ ఘాట్ రోడ్డులో బండరాయి విరిగిపడింది. వాహనాలు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇంజినీరింగ్ సిబ్బంది బండరాయిని తొలగిస్తున్నారు.

11:33 - May 30, 2017

హైదరాబాద్ : చాలా కాలంగా బదిలీలకోసం ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల ఆశలపై సర్కారు నీళ్లు చల్లింది.. వివిధ కారణాలతో బదిలీలను పక్కనపెట్టింది.. ముందు ప్రమోషన్లు, ఆ తర్వాత ఖాళీల భర్తీ... అది పూర్తయ్యాకే బదిలీలని తేల్చేసినట్లు తెలుస్తోంది. అదిగో ఇదిగో బదిలీలంటూ ఉద్యోగులను ఊరించిన తెలంగాణ ప్రభుత్వం.. చివరకు ఊస్సూరుమనిపిస్తోంది.. సీఎం కేసీఆర్‌ నిర్ణయం ప్రకారం ఇప్పట్లో సాధారణ బదిలీలు లేవని తేలిపోయింది.. తెలంగాణలో వివిధ శాఖలకింద రెండు లక్షల 88 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారు.. ఐదేళ్లుగా వీరంతా ఒకే చోట విధులు నిర్వహిస్తున్నారు.. ఇందులో చాలామందికి ప్రమోషన్లుకూడా ఇవ్వలేదు.. ఈ సమస్యలను పరిష్కరించాలంటూ ఉన్నతాధికారులతోపాటు ప్రభుత్వానికి ఉద్యోగులు చాలాసార్లు విజ్ఞప్తి చేశారు. వీరి ఒత్తిడితో స్పందించిన ఉన్నతాధికారులు.. ఆర్థిక శాఖ తయారుచేసిన ఫైల్‌తో పాటు బదిలీల వల్ల ఏర్పడే సమస్యలను వివరిస్తూ మరో ఫైల్‌ను సీఎంకు పంపారు.. అటు సీఎం కార్యాలయం, ఇతర సీఎం కోర్‌ గ్రూప్‌ అధికారులు సాధారణ బదిలీలకు ఇప్పుడే అనుమతి ఇవ్వద్దని సీఎంకు సూచించారు.. ప్రస్తుత పరిస్థితుల్లో బదిలీలు చేపడితే కొత్త జిల్లాల్లో ఒక్కరు కూడా ఉండని తెలిపారు.. అందరూ హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే పోస్టింగ్‌ కావాలంటారని... ఇందుకోసం పెద్ద ఎత్తున పైరవీలు కూడా చేస్తారని సీఎం దృష్టికి తెచ్చారు.

త్వరలో కేసీఆర్ సానుకూల నిర్ణయం..
అలాగే ఈ సమస్యకు అధికారులు పరిష్కారం కూడా చూపించారు.. ముందు పదోన్నతులు పూర్తిచేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.. ఆ తర్వాత ఏర్పడే ఖాళీను భర్తీ చేయాలన్నారు.. అధికారుల అంచనా ప్రకారం ప్రస్తుతం 90వేల ఖాళీలున్నట్లు తెలుస్తోంది.. ఈ ఖాళీల్లో ఉద్యోగాల భర్తీ తర్వాత సాధారణ బదిలీలకు అనుమతిస్తే ఉపయోగంగా ఉంటుందని సీఎంకు నివేదించారు.. అప్పటివరకూ బదిలీలపై నిషేదాన్ని యధావిధిగా కొనసాగించాలని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు కేసీఆర్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. వీరి సూచనపై సానుకూలంగా స్పందించిన కేసీఆర్‌.. బదిలీల ఫైల్‌ పక్కనపెట్టినట్లు సమాచారం.. అయితే సర్కారు తాజా నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. మొత్తానికి బదిలీలపై శాఖాపరమైన కమిటీలు వేసిన ప్రభుత్వం... ఇప్పుడు బదిలీలు వద్దన్న ఆలోచనలో ఉంది. ఉద్యోగులు మాత్రం ఈ పరిణామాలపై సీఎం త్వరలో సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశాభావంతో ఉన్నారు.

11:30 - May 30, 2017
11:28 - May 30, 2017
11:27 - May 30, 2017

యాదాద్రి : నరేష్..స్వాతి లది కులదురంహకార హత్యేనని కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి నేత జాన్ వెస్లీ పేర్కొన్నారు. పల్లెర్లలో నిజనిర్ధారణ కమిటీ పర్యటించింది. స్వాతి అనుమానాస్పద మృతి..నరేష్ హత్యలతో పలు ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం నిజనిర్ధారణ కమిటీ పర్యటించింది. ఈసందర్భంగా టెన్ టివితో జాన్ వెస్లీ మాట్లాడారు. నరేష్..స్వాతి హత్యలు కులదురంహకార హత్యలుగా అభివర్ణించారు. మేజర్ల అయిన స్వాతి..నరేష్ లను పోలీసులు ఎందుకు పిలిపించారని, నరేష్ కుటుంబసభ్యులను బంధించి..హింసించారని పేర్కొన్నారు. ఇందుకు రామన్న పేట సీఐ, ఆత్మకూరు సీఐలపై చర్యలు తీసుకోవాలన్నారు. హైకోర్టు స్పందించిన అనంతరం చలనం వచ్చిందని తెలిపారు. హత్య చేసిన అనంతరం రెండుసార్లు విందు భోజనాలు జరిగాయని, ఇందులో విచారణ జరపడంలో విఫలం చెందారని తెలిపారు. మూడు నెలల్లో విచారణ పూర్తయ్యేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

యాదాద్రికి చేరుకున్న నిజనిర్ధారణ కమిటీ..

యాదాద్రి : నరేష్ హత్యపై వివరాలు సేకరించేందుకు నిజనిర్ధారణ కమిటీ పర్యటిస్తోంది. కాసేపటి క్రితం జిల్లాకు చేరుకున్నారు. నరేష్ హత్యపై వాస్తవాలు కమిటీ తెలుసుకొంటోంది. పల్లెర్ల, లింగరాజుపల్లిలో నిజనిర్ధారణ కమిటీ పర్యటించనుంది.

11:20 - May 30, 2017

యాదాద్రి : నరేష్ హత్య ఎలా జరిగింది ? హత్యకు గల కారణాలు ఏమిటీ ? హత్యకు ఎవరు సహకరించారు ? స్వాతి ఆత్మహత్య చేసుకుందా ? చంపేశారా ? కులదురంహకార హత్యలు ఎలా జరిగాయి ? తదితర అంశాలు రాబట్టేందుకు నిజనిర్ధారణ కమిటీ రంగంలోకి దిగింది. స్వాతి అనుమానాస్పద మృతి..నరేష్ హత్య తీవ్ర ప్రకంపనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసుఅలో పోలీసుల హస్తం ఉందనే బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిజనిర్ధారణ కమిటీ మంగళవారం యాదాద్రి జిల్లాకు చేరుకున్నారు. సీనియర్ జర్నలిస్టులు, న్యాయవాదులు, ప్రజా సంఘాల నేతలు కమిటీలో ఉన్నారు. పల్లెర్లలో నరేష్ కుటుంబసభ్యులను కలిసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టెన్ టివితో సీనియర్ జర్నలిస్టు యాదగిరితో టెన్ టివి మాట్లాడింది. హత్య చేయాల్సిన పరిస్థితి గల కారణాలు..హత్య జరిగిన అనంతరం క్లూ దొరకకుండా ఎలా చేశారు ? వీరికి పోలీసులు సహకరించారా ? హత్య జరగకముందు కూడా సహకరించారా ? అనేది పరిశీలిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని, వారు బరితెగించారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధులు సోయిలోకి రావాలని హితవు పలికారు. రోగానికి మందు వేయాలని, రోగ లక్షణానికి కాదన్నారు. సీఐ రామన్న పేట, ఆత్మకూరు సీఐ పదవుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. హత్యకు ఉపయోగపడినందుకు నేరం మోపి వెంటనే వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

11:02 - May 30, 2017

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ 'అల్లు అర్జున్' త్వరలోనే తన తాజా చిత్రం 'డీజే'...దువ్వాడ జగన్నాథమ్‌' ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రముఖ దర్శకులు హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే కథనాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన సాంగ్స్ సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేస్తున్నారు. ఇటీవలే 'డీజే..శరణం భజే..భజే' గీతాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. రెండో గీతాన్ని సోమవారం సాయంత్రం ఆరు గంటలకు రిలీజ్‌ చేశారు. 'గుడిలో బడిలో మడిలో... అనే పల్లవితో సాంగ్ సాగనుంది. ప్రమోషన్‌ స్టంట్‌లో భాగంగా ఇలా వారానికో గీతాన్ని విడుదల చేసి సినిమాని ప్రేక్షకుల్లోకి దూసుకుపోయేలా చేస్తున్నారు. ఈ ఒరవడికి మెగా ఫ్యామిలీయే శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇక చిత్ర విషయానికి వస్తే 'బన్నీ' బ్రాహ్మణుడిగా..ప్రొఫిషనల్ కిల్లర్ గా కనిపించబోతున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్‌ బ్యానర్‌పై దిల్‌ రాజు నిర్మిస్తున్నాడు.

10:57 - May 30, 2017

నందమూరి బాలికాకయ్యకు హిందూపురం జనం ఉసురు తాకెతట్టే గొడ్తున్నది.. సీన్మల సీన్లు జెప్పినట్టనుకున్నడో ఏమో.. అప్పుడెప్పుడో ఎన్కట ఒకపారి హిందూపురానికి వొయ్యి ఓట్లేశిన జనానికి ఎన్నో ఒట్లు వెట్టిండు.. మీకు ఇది జేస్తా అది జేస్త.. ఆడకట్టు ఆడకట్టుకు మంచినీళ్లు తాపిస్తాని.. ఇప్పుడు పత్తాకే లేకుంట ఏడు చెర్వుల నీళ్లు దాపిస్తున్నడట కాకయ్య..మరి పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

10:47 - May 30, 2017

మరో వారం పది రోజుల్లో వేసవి సెలవులు ముగుస్తున్నాయి. ఇప్పటికే ప్రయివేట్ కార్పొరేట్ స్కూళ్లలో అడ్మిషన్ల పర్వం నడుస్తోంది. అయితే, ప్రయివేట్ కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల దందాకు కళ్లెం పడలేదు. గత రెండు మూడేళ్లుగా విద్యార్థుల తల్లితండ్రులు ఎన్నిరకాలుగా ఆందోళనలు చేస్తున్నా కొన్ని ప్రయివేట్, కార్పొరేట్ స్కూళ్ల బుద్ధి మారడం లేదు. ఫీజుల దాహం తీరడం లేదు. ఫీజుల నియంత్రణ కోసం పోరాడుతున్న వివిధ సంఘాలు మరోసారి గళమెత్తుతున్నాయి. ప్రయివేట్ కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల దందాకు కళ్లెం పడాలంటే ఏం చేయాలి? ఈ అంశంపై టెన్ టివి జనపథంలో టిపిఈఆర్ఎం రాష్ట్ర కార్యదర్శి పగడాల లక్ష్మయ్య విశ్లేషించారు. మరిన్ని విశేషాలకు వీడియో క్లిక్ చేయండి.

రాజస్థాన్ క్రికేట్ అసోసియేషన్ ఎన్నికల కౌంటింగ్ కు అనుమతి..

రాజస్థాన్ : రాష్ట్ర క్రికేట్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ కు అక్కడి హైకోర్టు అనుమతినిచ్చింది. జూన్ 2వ తేదీన కౌంటింగ్ చేసుకోవచ్చని సూచించింది.

 

టీఆర్ఎస్ లో రెండు వర్గాల ఘర్షణ..

నల్గొండ : చందంపేట (మం) కంబాలపల్లిలో టీఆర్ఎస్ లో రెండు వర్గాలు ఘర్షణకు తలపడ్డాయి. పరస్పరం కర్రలతో దాడులు చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి.

జూన్ 1 నుండి రోడ్ల తవ్వకాలపై నిషేధ: - జీహెచ్ఎంసీ కమిషనర్..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ, జలమండలి ఇంజినీర్లతో జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. జూన్ 1వ తేదీ నుండి నగరంలో రోడ్ల తవ్వకాలపై నిషేధం విధిస్తున్నట్లు, ఇప్పటికే తవ్విన రోడ్లను వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించారు. వర్షాకాలం పూర్తయ్యేంత వరకు అనుమతి లేకుండా రోడ్లు ఎవరూ తవ్వినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

 

10:30 - May 30, 2017

విశాఖపట్టణం : టిడిపి మహానాడులో పార్టీ నేతలు తమ వారసులను భావి నేతలుగా ఫోకస్‌ చేశారు. అన్ని విషయాల్లో యువ నేతలు హడావుడి చేశారు. మహానాడు ఏర్పాట్ల నుంచి తీర్మానాల వరకు ఈసారి యువకులకు ప్రాధాన్యత ఇచ్చారు. మహానాడులో యంగ్‌టర్క్‌ల పై 10 టీవీ ప్రత్యేక కథనం. మూడు రోజులపాటు జరిగిన టీడీపీ మహానాడు వారసత్వ రాజకీయాలకు తెరతీసింది. పార్టీ నేతలు తమ కుమారులు, కుమార్తెలను భావి నేతలుగా ఫోకస్‌ చేందుకు ప్రయత్నించారు. ముప్పై ఆరేళ్ల టీడీపీ మహాప్రస్థానంలో తొలితరం నేతలు వయోభారంతో రాజకీయాల నుంచి వైదొలగే ఆలోచన ఉన్నవాళ్లు తమ వారసులను ముందుకు తెచ్చారు. మహానాడులో అన్ని దశల్లో యువకులు హల్‌చల్‌ చేశారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి లోకేశ్‌ మహానాడు ఏర్పాట్లలో యువతకు ప్రాధాన్యత ఇచ్చి, బాధ్యతలు అప్పగించారు. పార్టీ పండుగ నిర్వహణలో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు పోషించిన పాత్రను పార్టీ అధినేత చంద్రబాబు ప్రశంసించారు. మంత్రి అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్‌ భోజన కమిటీ బాధ్యతలు నిర్వహించి, అందరి మన్ననలు అందుకున్నారు. 2019 ఎన్నికల్లో నర్సీపట్నం నుంచి అయ్యన్నపాత్రుడుకి బదులు చింతకాయల విజయ్‌ పోటీ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

తనయులు..తనయలు..
అనంతపురం రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్‌ మహానాడు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కుమారుడు చిన్నా మహానాడుకు హాజరై నేతలు, కార్యకర్తలకు తన వంతు సేవలు అందించారు. టీడీపీ మహిళా అధ్యక్షురాలు శోభాహైమావతి కుమార్తె స్వాతి ప్రస్తుతం విజయనగరం జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో స్వాతి పోటీ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో కరణం బలరాం తనయుడు, కృష్ణా జిల్లాలో దేవినేని అవినాశ్‌, కర్నూలు జిల్లాలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు కీలక బాధ్యతలు నిర్వహించారు. విశాఖ జిల్లా టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కుమారుడు సేవాదళ్‌లో కీలక పాత్ర నిర్వహించారు. యంగ్‌టర్క్‌ల విషయం ఇప్పుడు ఏపీ టీడీపీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల పుత్రరత్నాల్లో కొందరు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

10:23 - May 30, 2017

వరంగల్ : జిల్లాలోని ఏనుమాముల గ్రామంలో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర సంచలనం రేకేత్తించింది. అత్తింటి వారే దీనికి కారణమని కూతురి మృతదేహానిన్ని ఏకంగా వారి నట్టింటోనే పాతి పెట్టారు. ఈఘటన కలకలం రేపింది. రాధిక అనే యువతి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బాధితురాలికి న్యాయం చేయాలంటూ తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. వీరి ఆందోళనలకు గ్రామస్తులు సైతం మద్దతు తెలిపారు. భారీ సంఖ్యలో ఆందోళనకారులు చేరుకున్నారు. అనంతరం కుటుంబసభ్యులు రాధిక మృతదేహాన్ని అత్తారింట్లో పాతిపెట్టారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చివరకు ఏసీపీ రంగంలోకి దిగి వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, న్యాయం చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.

లక్నోకు బయలుదేరిన అద్వానీ..జోషీ..

ఢిల్లీ : బీజేపీ అగ్రనేతలు అద్వానీ..మురళీ మనోహర్ జోషి..ఉమా భారతిలు లక్నోకు బయలుదేరారు. బాబ్రీ మ‌సీదు కూల్చివేత కేసులో బీజేపీ సీనియ‌ర్ నేత‌లు సీబీఐ ప్ర‌త్యేక కోర్టు ముందు హాజ‌రుకానున్నారు.

ఎల్ బినగర్ లో మేయర్ పర్యటన..

హైదరాబాద్ : నగరంలోని ఎల్బీనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో మేయర్ బొంతు రామ్మోహన్ పర్యటన చేపట్టారు. డ్రైనేజీ వ్యవస్థ, పారిశుద్ధ్య పనులను మేయర్ పరిశీలించారు.

జర్మన్ ఛాన్స్ లర్ తో మోడీ భేటీ..

బెర్లిన్ : భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జర్మనీలో పర్యటిస్తున్నారు. ఆ దేశ ఛాన్సలర్ ఎంజెలా మెర్కెల్ తో మంగళవారం భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం మోడీ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు.

కొనసాగుతున్న మెడికల్ షాపుల బంద్..

హైదరాబాద్ : జీఎస్టీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్ పాటిస్తున్నాయి. జీఎస్టీ అమలులోకి వస్తే, ఆన్ లైన్ ద్వారా కూడా మందుల విక్రయం ప్రారంభమవుతుంది. దీంతో ఆన్ లైన్ లో మందుల విక్రయానికి వ్యతిరేకంగా మెడికల్ షాపులు బంద్ నిర్వహిస్తున్నాయి.

బంగ్లాదేశ్ వద్ద 'మోరా' తుపాన్..

ఢిల్లీ : బంగాళాఖాతంలో ఏర్పడిన 'మోరా' తుపాను బంగ్లాదేశ్ వద్ద తీరాన్ని దాటేసింది. వాయుగుండం తుపానుగా మారి తన దిశను మార్చుకుని బంగ్లాదేశ్ వైపు కదిలి, ఈ ఉదయం చిట్టగాంగ్ వద్ద తీరం దాటింది.

09:14 - May 30, 2017

యాదాద్రి : నరేష్ ..స్వాతి మిస్టరీలో ఎన్నో అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కులదురహంకారంపై తీవ్ర ఆందోళనలు..నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం..స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించకపోవడంపై ప్రజా సంఘాలు..ఇతరులు విమర్శలు గుప్పిస్తున్నారు. పోలీసు శాఖ అధికారుల ప్రమేయం ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిజనిర్ధారణ కమిటీ మంగళవారం పర్యటించనుంది. హత్యపై కమిటీ వాస్తవాలు తెలుసుకోనుంది. కమిటీలో సభ్యులుగా న్యాయవాదులు, ప్రజా పౌర హక్కుల సంఘాల నేతలు ఉన్నారు. పల్లెర్ల, లింగరాజుపల్లిలో కమిటీ పర్యటించనుంది. ఈ సందర్భంగా ఐద్వా నేత టెన్ టివితో మాట్లాడారు. హైకోర్టు స్పందించిన అనంతరం పోలీసులు స్పందించారని, శ్రీనివాస్ రెడ్డిని కఠినంగా శిక్షించాల్సినవసరం ఉందన్నారు. నరేష్ కుటుంబాన్ని ఆదుకోవాల్సినవసరం ఉందని, రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

08:29 - May 30, 2017

యాదాద్రి : నరేష్ హత్య..స్వాతి అనుమానాస్పద మృతిపై ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నరేష్ హత్య సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో పలువురు పోలీసు అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో నరేష్ హత్యపై నిజనిర్ధారణ కమిటీ మంగళవారం పర్యటించనుంది. హత్యపై కమిటీ వాస్తవాలు తెలుసుకోనుంది. కమిటీలో సభ్యులుగా న్యాయవాదులు, ప్రజా పౌర హక్కుల సంఘాల నేతలు ఉన్నారు. పల్లెర్ల, లింగరాజుపల్లిలో కమటీ పర్యటించనుంది.

08:15 - May 30, 2017

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం మెడికల్ షాపుల నిర్వాహణపై కొత్త నిబంధనలు విధించింది. ఈ నిబంధనలు వ్యతిరేకిస్తూ మెడికల్ షాపుల యజమానులు దేశ వ్యాప్త బంద్ పాటించనున్నారు. ఆన్ లైన్ కొనుగోళ్లు, అమ్మకాల వల్ల నష్టాలు వస్తాయని గ్రేటర్ హైదరాబాద్ రిటైర్ మెడికల్ షాప్ ల అసోసియేషన్ పేర్కొంది. డిజిటల్ వినియోగానికి తాము వ్యతిరేకం కాదని, ఈ పోర్టల్ నమోదులో చాలా లొసుగులున్నాయని అసోసియేషన్ సభ్యులు పేర్కొంటున్నారు. కంపెనీలు తయారు చేసే మందులను ఈ పోర్టల్ లో కొనుగోళ్లు..అమ్మకాలను నమోదు చేసుకోవాలని కేంద్రం సూచించింది. ఈ పోర్టల్ పై మందుల షాపు యజమానులకు..గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన లేదన్నారు. ఎవరితో చర్చలు జరపకుండా కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరికాదని, ఫిబ్రవరిలోనే నోటీసు ఇచ్చామని తప్పనిపరిస్థితుల్లో బంద్ కు పిలుపునివ్వడం జరిగిందన్నారు.

08:03 - May 30, 2017

కలిశొచ్చె కాలానికి నడిశొచ్చె కొడ్కువుడ్తడంటే... నిజంగ అప్పుడే వుట్టిన పోరడు ఏడంగ నడుస్తడు అని అనుకున్నరు అందరుగని.. అగో ఆ ముచ్చటను నిజం జేశిండు ఒక పోరడు.. అప్పుడే వుట్టి అప్పుడే నడుస్తున్నడు.. ఏంది నమ్ముతలేరా..? మీరు నమ్మరనేగదా.?? నేను వీడ్యో దీస్కోచ్చింది.. వీడియోలో సూడుండ్రి పోరడు ఎట్ల అడ్గులేస్తున్నడో..

07:58 - May 30, 2017

తమిళ సూపర్ స్టార్ 'రజనీకాంత్' నటిస్తున్న చిత్రాలపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ‘కబాలి' సినిమా విజయవంతమైన అనంతరం 'రోబో 2.0’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా 'కబాలి' దర్శకుడు పా.రంజిత్ తోనే 'రజనీ' మరో సినిమా చేస్తున్నాడు. ‘కాలా' పేరిట సినిమా నిర్మితమౌతోంది. ఇప్పటికే షూటింగ్ కూడా ప్రారంభించేశారు. ముంబై మాఫియా నేపథ్యంలో కథ కొనసాగుతోందని ప్రచారం జరగడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతేగాకుండా 'రజనీ' లుక్స్ కూడా మాస్ నేపథ్యంలో ఉంటుండడంతో మరోసారి 'భాషా' ను తెరపైకి చూస్తామని అభిమానులు అనుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ నటుడు 'నానా పటేకర్' చిత్రంలో నటించనున్నారు. ఒక కీలకమైన పాత్రలో ఆయన కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం తమిళ నటుడు సముద్రఖనిని .. హుమా ఖురేషిని తీసుకున్న సంగతి తెలిసిందే. తమిళ .. తెలుగు .. హిందీ భాషల్లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

07:53 - May 30, 2017

తెలుగు చలన చిత్ర సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పిన సినిమాల్లో 'బాహుబలి 2’ ఒకటి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. దీనితో పలు సినిమాలు కూడా భారీ బడ్జెట్ తో రూపొందబోతున్నాయి. అందులో 'సంఘమిత్ర' ఒకటి. సుందర్ సి.దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను తేనాడాళ్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మితమౌతోంది. ఈ సినిమాలో 'శృతి హాసన్' ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన లుక్స్ విడుదలైన సంగతి తెలిసిందే. కానీ తాజాగా ఓ వార్త సోషల్ మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అనివార్య కారణాల వల్ల 'శృతి' కొనసాగించలేకపోతున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ తేనాండళ్ ఫిలిమ్స్ ప్రకటించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ సినిమా కోసం 'శృతి హాసన్' పలు ప్రత్యేకమైన శిక్షణలు తీసుకున్న సంగతి తెలిసిందే. ‘శృతి' సినిమాలో నటించడం లేదనే వార్త హల్ చల్ చేస్తోంది. పూర్తి స్ర్కిప్ట్ ను అందించలేదని, షెడ్యూల్స్ కూడా సరిగ్గా ఇవ్వలేదని 'శృతి' ప్రతినిధి పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి శ్రుతికి, నిర్మాతలకూ మధ్య ఏదో గొడవ జరిగిందని ప్రచారం జరుగుతోంది. ఆర్య .. జయం రవి కీలకమైన పాత్రలను పోషించనున్నారు.

07:50 - May 30, 2017

టాలీవుడ్ యంగ్ హీరో 'నితిన్' సైలెంట్ గా షూటింగ్ కానిచ్చేస్తున్నాడు. పలు విజయవంతమైన చిత్రాలు చేస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందిన ఈ నటుడు హను రాఘవపూడి దర్శకత్వంలో 'లై' సినిమా చేస్తున్నాడు. పూర్తిగా అమెరికా నేపథ్యంలో చిత్ర కథ ఉంటుందని తెలుస్తోంది. అందులో భాగంగా ఎక్కువ భాగం అక్కడే షూటింగ్ కానిచ్చేస్తున్నారంట. పలు లోకేషన్స్ లలో పాటలు..కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ షూట్ చిత్రీకరించారు. భారీ సంఖ్యలో గల విమానాల మధ్య క్లైమాక్స్ చిత్రీకరించారని టాక్. ఈ క్లైమాక్స్ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చిత్ర యూనిట్ పేర్కొంటోందంట. హాలీవుడ్ కి .. ఇండియాకి సంబంధించిన స్టంట్ మాస్టర్స్ అధ్వర్యంలో ఈ ఫైట్స్ ను కంపోజ్ చేశారని సమాచారం. మణిరత్నం సంగీతాన్ని అందించిన ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉందంట.

07:48 - May 30, 2017

టీఆర్ఎస్ ప్రకటించిన సర్వేపై ప్రతిపక్షాలు విమర్శలు సంధిస్తున్నాయి. దీనిపై టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పౌరుషం ఉంటే రాజీనామా చేయాలని విపక్షాలకు సవాల్ విసిరారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో భూ స్కాం కలకలం రేగుతోంది. మియాపూర్ లో ప్రభుత్వ భూమిని వందల ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో నంద్యాల నర్సింహారెడ్డి (సీపీఎం), రాజమోహన్ (టీఆర్ఎస్), ఇందిరా శోభన్ (టి.కాంగ్రెస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

పీజీ దంత వైద్య సీట్లకు తుది విడత ప్రవేశాలు..

హైదరాబాద్ : నేడు పీజీ దంత వైద్య సీట్లకు తుది విడత ప్రవేశాలు జరగనున్నాయి. ఉదయం 11 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఓయూలో సర్టిఫికేట్ల పరిశీలన జరగనుంది.

గుంటూరులో హోటళ్ల బంద్..

గుంటూరు : 18 శాతం జీఎస్టీని వ్యతిరేకిస్తూ నేడ జిల్లా వ్యాప్తంగా హోటళ్లు బంద్ కానున్నాయి. జులై నుంచి దేశమంతా ఒకటే ధర అమలు కానున్న విషయం తెలిసిందే.

నేడు కోర్టుకు బీజేపీ అగ్రనేతలు..

ఢిల్లీ : బాబ్రీ మసీద కూల్చివేత కేసులో అగ్రనేతలపై నేడు అభియోగాల నమోదు కానుంది. నేడు అద్వానీ, జోషి, ఉమలు కోర్టుకు హాజరు కానున్నారు.

ఆత్మకూరులో నిజనిర్ధారణ కమిటీ పర్యటన..

యాదాద్రి భువనగిరి : నేడు ఆత్మకూరు (ఎం) మండలంలో నిజనిర్ధారణ కమిటీ పర్యటించింది. నరేష్ హత్య, స్వాతి మృతిపై కమిటీ వివరాలు సేకరించనుంది.

మణిపూర్ సీఎం కుమారుడికి జైలు శిక్ష..

ఢిల్లీ : మ‌ణిపూర్ సీఎం ఎన్‌. బీర‌న్ సింగ్ కుమారుడికి ఆ రాష్ట్ర కోర్టు అయిదేళ్ల జైలు శిక్ష విధించింది. సీఎం బీర‌న్ కుమారుడు అజ‌య్ మీతాయిపై 2011లో రోడ్డు రేసు కేసు న‌మోదైంది. ఆ కేసులో ట్రయ‌ల్ కోర్టు తీర్పును వెలువ‌రించింది.

హిమాచల్ ప్రదేశ్ సీఎంకు ఊరట..

ఢిల్లీ : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌కు పటియాల హౌస్‌ కోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో వీరభద్రసింగ్‌తో పాటు ఆయన భార్యకు బెయిలు మంజూరు చేసింది.

శ్రీలంకకు భారత్ ఆపన్న హస్తం..

ఢిల్లీ : శ్రీ‌లంక‌కు భారత్‌ ఆపన్న హస్తం అందించింది. భారత నౌకాదళానికి చెందిన రెండు నౌకల్లో అత్యవసర సహాయక సామాగ్రిని పంపింది. శ్రీలంకలో భారీ వరదల కారణంగా 177 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.

శ్రీలంకలో 177 మంది మృతి..

శ్రీలంక : వరదల కారణంగా మృతుల సంఖ్య 177కి చేరింది. మరో 109 మంది ఆచూకి తెలియడం లేదు. భారీ వర్షాలకు 15 జిల్లాల్లోని 5 లక్షల 57 వేల మంది నిరాశ్రయులయ్యారు. 75 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

06:54 - May 30, 2017

ఢిల్లీ : ఒకటే సరుకు... ఒక్కో ప్రాంతంలో ఒక్కో రేటు... ఐదారు రకాల పన్నులు.. ఇక ఈ విధానానికి చెక్‌ పడనుంది. జులై నుంచి దేశమంతా ఒకటే ధర... అమలు కానుంది. గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ అమలుతో పన్నులన్నీ ఒకే గొడుగు కిందకు రానున్నాయి. ఈ విధానంతో వ్యాపార రంగంలో గొప్ప మార్పు వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఒక వస్తువు ధర దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటుంది. కేంద్రం విధించే పన్నుతో పాటు ... రాష్ట్రాలు తమకనుగుణంగా ఇతర పన్నులు వేసుకోవడంతో వస్తువుల ధరల్లో కూడా మార్పులు ఉంటున్నాయి. దీంతో వస్తువుల, సేవల ధరలు దేశమంతా ఒకేలా ఉండేలా... జులై నుంచి జీఎస్‌టీ విధానం అమల్లోకి రానుంది. దీంతో ఒకటే పన్ను విధానం అమల్లోకి వస్తుంది. ఈ విధానంలో దాదాపు 12 వందల 11 సరుకులను ఐదు విభాగాలుగా విభజించి పన్నులు నిర్ణయించారు. వీటిలో ఆరు సరుకులు మినహా మిగిలిన వాటిపై 5 శాతం, 12 శాతం, 18 శాతం, 20 శాతం, 28 శాతంగా పన్నుల శ్లాబ్‌లు ఫిక్స్‌ చేశారు. ఆహార ధాన్యాలు, పాలు, పెరుగు, విద్యా, ఆరోగ్య సేవలపై పన్ను పూర్తిగా మినహాయించారు. దీంతో చాలా అంశాల్లో గతంలో ఉన్న పన్నులు తగ్గనున్నాయి.
జీఎస్టీ అమలుతో ఆహార ధాన్యాల ధరలు తగ్గుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. పేద, మధ్య తరగతి వారిపై కేవలం 5శాతం...12 శాతం మాత్రమే పన్నుల భారం పడే అవకాశం ఉంటుందంటున్నారు. అలాగే ఐదారు రకాల పన్నులు లేకుండా ఒకేసారి పన్ను చెల్లించవచ్చు... పన్నుల ఎగవేతకు వీలుకాదు. పన్నులు వసూలుకయ్యే వ్యయం కూడా భారీగా తగ్గనుంది. అయితే జీఎస్‌టీతో కొన్ని రాష్ట్రాలకు ఇబ్బందులు రాగా.. మరికొన్ని రాష్ట్రాలకు ఎక్కువ ఆదాయం వచ్చేలా ఉందనే వాదనలున్నాయి. ముఖ్యంగా ఉత్పత్తి అధికంగా ఉన్న మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడులు ఆదాయాన్ని కోల్పోవలసి వస్తుందని.. తెలంగాణకు లాభమేనని అంటున్నారు.

06:51 - May 30, 2017

ముంబై : బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌, ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు మావోయిస్టుల నుంచి హెచ్చరికలు వచ్చాయి. ఛత్తీస్‌గడ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టుల దాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసినందుకు గాను వీరికి ఈ హెచ్చరికలు జారీ అయ్యాయి. జవాన్లకు మద్దతిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మావోయిస్టులు అక్షయ్‌, సైనాలను హెచ్చరించారు. ఈ హెచ్చరికలకు సంబంధించి హిందీ, గోండీ భాషలో రాసిన కరపత్రాలు దక్షిణ బస్తర్‌ జిల్లాలో పోలీసులకు లభించాయి. మార్చి 16న మావోయిస్టులు జరిపిన దాడుల్లో మరణించిన 12 మంది సిఆర్‌పిఎఫ్‌ జవాన్లకు అక్షయ్‌ కుమార్‌ 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. సైనా నెహ్వాల్‌ 50 వేల చొప్పున మొత్తం 9 లక్షలు ప్రకటించారు. మావోయిస్టుల హెచ్చరికలపై అక్షయ్‌, సైనాలు ఇంతవరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు.

06:48 - May 30, 2017

ఢిల్లీ : ఉగ్రవాద వ్యతిరేక పోరాటానికి ఐరోపా దేశాలు నేతృత్వం వహించాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు నిచ్చారు. ఆరు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రస్తుతం ఆయన జర్మనీలో పర్యటిస్తున్నారు. ఈసందర్భంగా బెర్లిన్‌లో స్థానిక న్యూస్‌ ఏజెన్సీలతో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ ఉగ్రవాదమేనని.. దానిని ఎదుర్కోడానికి ప్రపంచ దేశాలు కలిసి కట్టుగా పోరాడాలన్నారు ప్రధాని మోదీ. ప్రస్తుతం యూరోప్‌ దేశాలు అనుసరిస్తున్న రక్షణాత్మక ధోరణిని విడిచిపెడితేనే ప్రపంచ ఆర్థిక రంగానికి మేలు జరుగుతుందన్నారు. సరుకుల చేరవేత, పెట్టుబడుల ప్రవాహం, ప్రజల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు ఉండరాదని మోదీ అన్నారు. ఇవాళ జర్మనీ ఛాన్సలర్‌ ఎంజెలా మార్కెల్‌తో సమావేశంలో పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరుపుతారు.

06:46 - May 30, 2017

భువనగిరి : నరేశ్‌ హత్య కేసులో న్యాయం కోసం పోరాటం మొదలైంది. ఈ కేసులో సిట్టింగ్‌ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని అతడి తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు, దళిత సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. నరేశ్‌ హత్యకు పోలీసులే కారణమంటూ భువనగిరిలోని అంబేద్కర్‌ విగ్రహం ఎదుట ధర్నా చేశారు. నరేశ్‌ను హత్యచేసిన వారికి కఠిన శిక్ష విధించేలా చర్యలు తీసుకోవాలంటూ యాదాద్రి కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. యాదాద్రి జిల్లా భువనగిరి నిరసనలతో హోరెత్తింది. అతిదారుణంగా నరేశ్‌ను హత్యచేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ ప్రజాసంఘాలు, నరేశ్‌ తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు భువనగిరిలో అంబేద్కర్‌ విగ్రహం దగ్గర ధర్నా చేపట్టారు. నరేష్‌ అదృశ్యం కేసులో ఆత్మకూరు, రామన్నపేట, భువనగిరి పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. వెంటనే పోలీసులను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

కలెక్టర్ కార్యాలయం..
భువనగిరి నుంచి ప్రజాసంఘాల నేతలు పగిడిపల్లిలోని కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చారు.. పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌కు అందజేశారు.. సిట్టింగ్‌ జడ్జ్‌తో నరేశ్‌ కేసును విచారించాలని డిమాండ్ చేశారు. హత్యకు కారణమైన వారికి కఠిన శిక్ష విధించాలన్నారు.. కొడుకు మృతితో రోడ్డునపడ్డ అతని తల్లిదండ్రులకు ప్రభుత్వం తరపున నష్టపరిహారం ఇవ్వాలని కలెక్టర్‌ను కోరారు.. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.. పరువు హత్యల నివారణకోసం ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. నరేశ్‌ను నమ్మించి భువనగిరికి రప్పించారని... అతని సోదరి ఆరోపించారు.. ఆర్థికంగా ఆదుకుంటామంటూ మాయమాటలు చెప్పి దారుణంగా తన సోదరుడి ప్రాణాలు తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే దశలవారీగా ఉద్యమం చేస్తామని ప్రజాసంఘాలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి.

06:43 - May 30, 2017

హైదరాబాద్ : నగరంలో భూ కుంభకోణంతో ప్రభుత్వంలో చలనం వచ్చింది. అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ప్రభుత్వ భూములను అప్పనంగా కాజేసిన రియల్‌ఎస్టేట్‌ సంస్థలపై చర్యలకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే అరెస్టయిన నిందితులును 10 రోజుల కస్టడీకి ఇవ్వాల్సిందిగా పోలీసులు కోర్టును అభ్యర్థించారు. హైదరాబాద్‌ కూకట్‌పల్లి పరిధిలోని పదివేల కోట్ల రూపాయల విలువైన 693 ఎకరాల ప్రభుత్వ భూమిని పారిశ్రామిక వేత్తలకు అక్రమ రిజిస్ట్రేషన్‌ చేయడంతో రాష్ట్రంలో కలకలంగా మారింది. ఈ కుంభకోణంలో మూసాపేట రిజిస్ట్రార్‌ శ్రీనివాసరావుతోపాటు అక్రమంగా ప్రభుత్వ భూములను పొందిన గోల్డ్‌ స్టోన్‌ ఇన్‌ఫ్రా ప్రతినిధి పార్థసారథి, అకౌంటెంట్‌ శర్మను కూడా పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలని మియాపూర్ కోర్టులో కస్టడి పిటిషన్ దాఖాలు చేశారు. వాస్తవానికి సర్వేనంబరు 20,28,100,101 లోని ధర్మపురి క్షేత్రం, ప్రశాంత్ నగర్, నడిగడ్డుతాండ లు ఈ కబ్జా ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఈవిలువైన ప్రభుత్వ భూములను సైతం రిజిస్ట్రార్ శ్రినివాసరావు ప్రైవేట్ సంస్ధలకు కట్టబెట్టారు. అక్రమంగా డాక్యుమెంట్లను సృష్టించి ఎకరాకు 2 కోట్ల చొప్పున కమీషన్‌లు కూడా వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఇలా మొత్తం 693ఎకరాల 4గుంటల భూమిపై ప్రభుత్వ ఖజానాకు రూ. 587 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని అదికారుల అంచనా వేస్తున్నారు.

చలనం..
ఈ భూ దందాలో ప్రైవేట్‌ సంస్థలు ఎకరాకు 14.5 కోట్ల రూపాయలు చొప్పున డీల్ కుదుర్చుకున్నాయి. రిజిస్ట్రార్ శ్రినివాసరావుతో పాటు మరో ఇద్దరు అధికారులు కూడా ఈ డీల్‌లో వాటాలు పొందినట్టు సమాచారం. దీంతో పాటు కబ్జా కోరల్లో చిక్కుకున్నవి, కోర్టు పరిధిలో లిటిగేషన్ లో ఉన్న ప్రభుత్వ భూములను కూడా వీరు ప్రైవేట్ సంస్ధలకు రిజిస్ట్రేషన్ చేశారన్న అరోపణలు వినిపిస్తున్నాయి. నిజానికి ఈ భూ కుంభకోణం బయటికి రావడానికి బస్సు టెర్మినల్ ప్రతిపాదనే కారణం. కూకట్‌పల్లి ప్రాంతంలో ఓ బస్సు టెర్మినల్‌ నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌ చేతులమీదుగా శంకుస్థాపన చేయించాలని అధికారులు పనులు ప్రారంభించారు. ఇదే క్రమంలో ట్రినిటీ సంస్థ భూ భాగోతం బయటపడింది. బస్‌ టెర్మినల్‌ నిర్మాణానికి భూమికి సంబంధించిన రెవెన్యూ రికార్డులు పరిశీలించిన అధికారులకు కళ్లుతిరిగినంత పనైంది. ప్రభుత్వ భూమి కాస్తా ప్రైవేట్‌ సంస్థపేరుతో రిజిస్టర్‌ అయింది. దీంతో అవాక్కైన అధికారులు .. హెచ్ ఎండిఏ కమిషనర్‌ చిరంజీవులు దృష్టికి తీసుకెల్లారు. దీంతో తీగలాగితే డొంకంతా కదిలినట్టు మొత్తం భూ కుంభకోణం వెలుగు చూసింది. దీనిపై రెవెన్యూ యంత్రాంగం దర్యాప్తు చేపట్టింది. అనంతరం సైబరాబాద్ పోలీసులు అసలు దొంగలను అరెస్ట్ చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అతిపెద్ద భూ స్కాం వెలుగు చూడ్డంతో ప్రభుత్వం కలకలం మొదలైంది. ఓవైపు ప్రభుత్వ ఉద్యోగులకు ఫిట్ మెంట్ తో పాటు వేతనాలను పెంచినా ... కొందరు అధికారుల తీరుమాత్రం మారడంలేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు .. భూ కుంభకోణం జరిగాక ప్రభుత్వం తెగ హడావిడి చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. దాదాపు పదివేల కోట్ల రూపాయల భూ అక్రమాల్లో తెరవెనుక ఉన్న అసలు పెద్దలు బయటికి వస్తారా అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి.

06:39 - May 30, 2017

హైదరాబాద్ : తమ సర్వే.. బోగస్‌ అంటున్న విపక్షాలపై గులాబీపార్టీ బాస్‌ కస్సుబుస్సులాడుతున్నారు. సర్వేపై నమ్మకం కలగాలంటే విపక్షాలే రాజీనామా చేయాలంటున్నారు. సర్వేకు ప్రజల్లో మరింత ప్రచారం వచ్చేందుకు.. ప్రతిపక్షాలపై మాటలదాడి పెంచారు. సవాళ్లతో పాలిటిక్స్‌ హీటెక్కిస్తున్నారు టీఆర్‌ఎస్‌ అధినేత. ముఖ్యమంత్రి కెసిఆర్ సర్వేలతో సొంత పార్టీ నేతల్లో ఆత్మ విశ్వాసంనింపుతూ ప్రతి పక్ష పార్టీ లను ఆత్మరక్షణ లో పడవేసే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. టిఆర్ ఎస్ ఏల్పీ సమావేశంలో వెల్లడించిన సర్వే వివరాలు రాష్ట్రంలో చర్చ నియంశంగా మారడంతో.. గులాబీబాస్‌ విపక్షాలపై మాటలదాడి మరింత పెంచారు. సర్వే బోగస్ అంటూ ప్రతిపక్షనేతలు తీవ్ర విమర్శలు చేస్తుండటంతో సీఎం కేసీఆర్‌ ఎదురుదాడి వ్యూహాన్ని అమల్లో పెట్టారు. రాబోయే ఎన్నికల్లో తమకు తిరుగులేదంటూ మూణ్నెల్లకోసారి సర్వేలను రిలీజ్‌ చేస్తున్న గులాబీబాస్‌.. తమ సర్వేపై అనుమానం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్‌పై తోకతొక్కిన తాచుల కస్సుబ్సులాడారు. తెలంగాణ ఉద్యమం నాటి నుంచి ఎన్నోసార్లు రాజీనామాలు చేసి ఎన్నికల్లో సత్తా నిరూపించుకున్నామని ఆయన గుర్తు చేశారు. సర్వేను బోగస్‌ అంటున్న కాంగ్రెస్‌ వాళ్లు దమ్ముంటే రాజీనామా చేయాలని కేసీఆర్‌ సవాల్ విసిరారు. మరోవైపు కొన్ని రోజులుగా నిశ్శబ్దంగా ఉన్న వలసల హడావిడి మరోసారి మొదలైంది. తాజాగా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పలువురు నేతలు గులాబీపార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ ఎంపి, టీడీపీ నేత రమేశ్ రాథోడ్‌ సీఎం కేసీఆర్‌ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. రాబోయే రోజుల్లో ఆకర్ష్‌ వ్యూహాన్ని మరింత జోరుగా అమలు చేసి.. విపక్షాలపై ఒత్తిడిని పెంచాలని టీఆర్‌ఎస్‌ అధినేత యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే విపక్షాలు కూడా అధికార పార్టీపై మాటల దాడిని మరింతగా పెంచుతున్నాయి. ప్రజల్లో నిజంగా పట్టుఉంటే.. పదపదే సర్వేల పేరుతో ఈ హడావిడి ఎందుకని కాంగ్రెస్‌, వామపక్షాలు, టీడీపీ తదితర పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. ప్రజల్లో రోజు రోజుకు పెరుగుతున్న అసంతృప్తితో కారుగుర్తుపార్టీకి కలవరం మొదలైందని.. అందుకే సర్వేల పేరుతో అంతా బాగున్నట్టు కలరింగ్‌ ఇస్తున్నారని.. సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పిస్తున్నాయి విపక్షాలు.

06:35 - May 30, 2017

విశాఖపట్టణం : టిడిపి మహానాడుతో ప్రజలకు ఎలాంటి ఉపయోగంలేదని... వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. మహానాడులో మంచి తీర్మానాలు వస్తాయని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలిందని బొత్స విమర్శించారు. పెద్ద జాతరను తలపించేలా నిర్వహించి మహానాడుతో ప్రజలకు ఏం ఒరిగిందని బొత్స ప్రశ్నించారు.
రఘువీరా..
విశాఖలో జరిగిన టీడీపీ మహానాడు అసత్యాల పుట్టని ఏపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. మహానాడు వేదికగా అసత్యాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇచ్చే ఫైలు ప్రధాని మోదీ టేబులపై ఉంటే మహానాడుతో తీర్మానం చేయాల్సిన అవసరం ఏముందని రఘువీరారెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఏ హామీని కూడా టిడిపి ప్రభుత్వం అమలు చేయలేదని మండిపడ్డారు.

06:30 - May 30, 2017

హైదరాబాద్ : రుతుపవనాలు దూసుకొస్తున్నాయి. మరో 24 గంటల్లో ఏ క్షణాన్నైనా కేరళ తీరాన్ని తాకుతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ దిక్కు నుంచి వీస్తున్న గాలులు క్రమంగా బలపడుతున్నాయని, ప్రస్తుతం లక్షద్వీప్ మీదుగా 45నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని అధికారులు చెప్పారు. గత 48 గంటలుగా లక్షద్వీప్, దక్షిణ కేరళలోని పలు ప్రాంతాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవి ఉత్తర కేరళవైపు క్రమంగా విస్తరిస్తున్నాయని ఇది రుతుపవనాల రాకకు సంకేతమని వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. అన్ని అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నందున ఇవాళ రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని తెలిపారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో జూన్‌ మొదటి వారంలోనే నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచానా వేస్తున్నారు. ప్రస్తుతం క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు.

హోటళ్ల బంద్..

హైదరాబాద్ : రాష్ర్టవ్యాప్తంగా నేడు హోటళ్లు మూతపడనున్నాయి. హోటల్ పరిశ్రమపై కేంద్ర ప్రభుత్వం మోపిన జీఎస్‌టీకి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త బంద్ పాటిస్తున్నట్లు తెలంగాణ స్టేట్ హోటల్స్ అసోసియేషన్ ప్రకటించింది.

కేరళను తాకనున్న నైరుతి పవనాలు..

ఢిల్లీ : నైరుతి రుతుపవనాలు మరో 24 గంటల్లో ఏ క్షణాన్నైనా కేరళ తీరాన్ని తాకే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇందుకు అనుకూలమైన వాతావరణం ఇప్పటికే ఏర్పడిందన్నారు.

నేతలకు బాబు క్లాస్..

విశాఖపట్టణం : మహానాడు వేదికపై నేతలకు టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు క్లాస్ తీసుకున్నారు. వేదికపై గ్రూప్ మీటింగ్ లు పెడుతున్నారని, చాలా ప్రాంతాల్లో గ్రూప్ లు ఏర్పాటు చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారి జాబితా తన దగ్గర ఉందని, కూర్చొని ప్రసంగాలు వినడానికి ఇబ్బంది ఏమిటీ ? అని, అన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.

 

 

టీఆర్ఎస్ పాలనలో 3300 రైతుల ఆత్మహత్యలు - రేవంత్..

విశాఖపట్టణం : టీఆర్ఎస్ పాలనలో 3300 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని టిటిడిపి నేత రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ కోసం బలిదానం చేసుకున్న 1250 మంది గుర్తింపునకు నోచుకోవడం లేదని, 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ఇవ్వకుండా సవరణ చేశారని తెలిపారు. ఇరు రాష్ట్రాల సమస్యల్లో తాము ఏ వైపు అని కేసీఆర్ ప్రశ్నించారని, తాము ప్రజల పక్షాన ఉంటామని..చంద్రబాబును ఒప్పించుకుంటామన్నారు.

గడ్కరితో వెంకయ్య భేటీ..

ఢిల్లీ : ఏపీ పెండింగ్ ప్రాజెక్టులు, రహదారుల నిర్మాణంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరితో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సమీక్ష జరిపారు. సాగరమాల, బంకింగ్ హాం కాలువ ప్రాజెక్టులకు సూత్రప్రాయ అంగీకారం తెలపడం జరిగిందని, డీపీఆర్ పూర్తయిన తరువాత తదుపరి ప్రక్రియ చేపడుతామని వెంకయ్యకు గడ్కరి తెలిపారు.

Don't Miss