Activities calendar

01 June 2017

21:52 - June 1, 2017

జమ్మూకాశ్మీర్ : సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదే పదే ఉల్లంఘిస్తున్న పాకిస్తాన్‌ తాజాగా జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి, పూంఛ్‌ సెక్టార్‌లలో భారత సైనిక శిబిరాలపై దాడులు చేసింది. ఇవాళ ఉదయం ఏడు గంటల ప్రాంతంలో నౌషెరా, కృష్ణఘాటి సెక్టార్‌లలో మోర్టార్లు, ఆటోమెటిక్‌ ఆయుధాలతో భారత ఆర్మీ పోస్టులపై పాకిస్తాన్‌ సైన్యం కాల్పులు జరిపింది. పాక్‌ జరిపిన కాల్పుల్లో రోడ్డు పనులు చేస్తున్న ఓ కార్మికుడు మృతి చెందాడు. పదే పదే ఉల్లంఘిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాకిస్తాన్‌కు భారత్‌ దీటైన జవాబిచ్చింది. ప్రతీకారంగా భారత సైనికులు నియంత్రణ రేఖవద్ద పాకిస్తాన్ సైన్యంపై విరుచుకు పడ్డారు. ఇరువర్గాల మధ్య హోరాహోరి పోరు జరిగింది. భారత్‌ ఆర్మీ జరిపిన కాల్పుల్లో ఐదుగురు పాకిస్తాన్‌ సైనికులు మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. సరిహద్దులో కాల్పుల ఘటనను పాకిస్థాన్‌ ఖండించింది. ఎల్వోసి వద్ద భారత్‌ కాల్పులు జరిపి తమ సైనికులను హతమార్చారంటూ పాక్‌లోని భారత డిప్యూటీ హై కమిషనర్‌ జెపి సింగ్‌కు పాకిస్తాన్‌ విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది.జమ్మూ కశ్మీర్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ఆర్మీ ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్‌తో పాటు ఏడుగురు కమాండర్లు అక్కడి పరిస్థితులను సమీక్షిస్తున్నారు.పాకిస్తాన్‌ సైన్యం ఉద్దేశపూర్వకంగానే సరిహద్దులో సాధారణ ప్రజలు నివసించే ప్రాంతాలపై తరచూ దాడులకు పాల్పడుతోంది. మే నెలలో సరిహద్దులోని వివిధ ప్రాంతాల్లో పాకిస్తాన్‌ జరిపిన దాడుల్లో ఇద్దరు పౌరులు మృతి చెందగా...ముగ్గురు గాయపడ్డారు. మరో12 వేలమందిపై కాల్పులు తీవ్ర ప్రభావం చూపాయి.  

21:50 - June 1, 2017

చెన్నై : చెన్నైలోని టీనగర్‌లో ఉన్న చెన్నై సిల్క్స్‌ షాపింగ్‌మాల్‌లో బుధవారం సంభవించిన అగ్నిప్రమాదం భారీ నష్టాన్నే మిగిల్చింది. గురువారం ఉదయానికి కూడా మంటలు అదుపులోకి రాలేదు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సివచ్చింది. అగ్నిప్రమాదం ధాటికి భవనంలో 4,5,6,7 అంతస్తులు కుప్ప కూలాయి.బుధవారం తెల్లవారుజామున చెన్నై సిల్క్‌ భవనంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దుకాణం నుంచి భారీగా పొగలు రావడంతో స్థానికులు పోలీసులకు, దుకాణం యాజమాన్యానికి, అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. తొలుత ఐదు అగ్నిప్రమాక యంత్రాలు అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించాయి. దట్టమైన పొగ, మంటలు ఎనిమిది అంతస్తుల వరకు వ్యాపించటంతో మంటలను అదుపులోకి తీసుకు వచ్చేందుకు 60 అగ్నిమాపక యంత్రాలను రంగంలోకి దించారు. సమీపంలోని వంద దుకాణాలను మూసివేసి మంటలను ఆర్పేయత్నం చేశారు. భవనంలో పెద్ద మొత్తంలో వస్త్రాలు, కలపతో అలంకరించిన సామగ్రి ఉండటంతో మంటలు అంతకంతకూ పెరుగుతూ వచ్చాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు 24 గంటల సమయం పట్టింది.అగ్నిప్రమాదానికి భవనంలోని కోట్లాది రూపాయిల విలువచేసే వస్త్రాలు, నగలు బూడిద పాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి హానీ జరగలేదు. ఎనిమిదో అంతస్థులో చిక్కుకున్న 12 మందిని సిబ్బంది రక్షించారు. రద్దీ ఎక్కువగా ఉండే టీనగర్ లోని వాణిజ్య సముదాయాల రోడ్డులో చెన్నై సిల్క్స్‌ షాపింగ్‌ మాల్‌ ఉంది. షాపింగ్‌ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో సమీపంలోని షాపుల యజమానులు భయాందోళనకు గురయ్యారు. ఈ అగ్నిప్రమాదాన్ని సీరియస్‌గా తీసుకున్న తమిళనాడు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. షాట్ సర్కూట్ వల్ల ప్రమాదం సంభవించిందా...ఇతరత్రా కారణాలేమైనా ఉన్నాయా... అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 

21:48 - June 1, 2017

గుంటూరు : అమరావతిలో ఏపీ కేబినెట్‌ భేటీ అయింది.. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. విభజన చట్టంప్రకారం రెండు రాష్ట్రాలమధ్య ఆస్తులు, అప్పుల పంపకాలపై డాక్టర్‌ షీలా బేడీ సిఫారసులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పనిచేస్తున్న టీచింగ్‌ మెడికల్‌ ఫ్యాకల్టీ పదవీ విరమణ వయసును 60నుంచి 63ఏళ్లకు పెంచే తీర్మానానికి మంత్రిమండలి అంగీకారం తెలిపింది.. విజయవాడ మెట్రో రైలు కార్పొరేషన్‌కు 18వందల 59కోట్లనుంచి 2వేల 175 కోట్లకు రుణపరిమితి పెంచుతూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది.. మెట్రో రైలు కార్పొరేషన్‌ ఈ రుణాన్ని హడ్కోనుంచి పొందనుంది.. ఆంధ్రప్రదేశ్‌ ఫార్మర్స్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫ్ ఇరిగేషన్‌ సిస్టమ్స్ 1997 చట్టంలో భారీ మార్పులకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.. కాలపరిమితిని ఐదేళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది..జూన్‌ 3 నుంచి వారం రోజుల పాటు నవ నిర్మాణ దీక్షలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీక్షల చివరిరోజైన జూన్‌ 8న మహాసంకల్పం, బహిరంగసభలు నిర్వహించాలని తీర్మానించారు. మూడేళ్లపాలనపై సమీక్షించుకుంటామన్న చంద్రబాబు.. అన్యాయం చేసినవారు... సిగ్గుపడేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని పునరుద్ఘాటించారు.

21:46 - June 1, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి బల్దియా ఘనంగా ఏర్పాట్లు చేసింది. నగర పరిధిలోని అన్ని కూడళ్లను... చారిత్రక కట్టడాలు, ప్రదేశాలను...పార్క్‌లు... ప్రభుత్వ కార్యాలయాలను అందమైన విద్యుత్‌ దీపాలతో అలంకరించింది. మొత్తం 87 ప్రాంతాల్లో కోటి 14 లక్షల వ్యయంతో జీహెచ్‌ఎంసీ అధికారులు లైటింగ్‌ ఏర్పాటు చేశారు. ఇందులో 400 వాట్ల సామర్థ్యం గల వెయ్యి 7 వందల 11 ఫ్లడ్‌ లైట్లు, వెయ్యి 5 వందల 88 కలర్‌ ఫ్లడ్‌ లైట్లు, వెయ్యి వాట్ల సామర్థ్యం గల 935 ఆలోజన్‌ లైట్లు ఉన్నాయి. అలాగే 2003 పార్కాన్లు, 4వేల 9 వందల 35 ప్రాంతాల్లో సిరీస్‌ లైట్లు, 392 బెలూన్‌ మాదిరి లైట్లు ఉన్నాయి.తెలంగాణ అమరవీరుల స్తూపం... గన్‌పార్క్‌ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు నివాళులు అర్పించే అమరవీరుల స్తూపానికి ఫ్లోరల్ డెకరేషన్‌ చేయనున్నారు. అదే విధంగా హుస్సేన్‌సాగర్‌లో ఉన్న బతుకమ్మ ఘాట్‌లో ప్రత్యేక అలంకరణలు చేశారు. పెద్ద ఎల్‌ఈడీ తెరను ఏర్పాటు చేశారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచే లక్ష్యంతో బల్దియా గన్‌పార్క్‌, టాంక్‌ బండ్‌ పరిసరాల్లో అదనపు పారిశుధ్య సిబ్బందిని నియమించింది. కాగా ఈ వేడుకల ఏర్పాట్లను మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పరిశీలిస్తున్నారు.

21:45 - June 1, 2017

సంగారెడ్డి : తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టాలను చూసే..సోనియాగాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చామన్నారు కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ. సంగారెడ్డిలో ప్రజాగర్జనలో పాల్గొన్న రాహుల్‌గాంధీ..తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ విశేష కృషి చేసందన్నారు. ఎంతమంది వ్యతిరేకించినా..చివరకు తెలంగాణ ప్రజల కోరిక మేరకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగిందన్నారు. 

21:41 - June 1, 2017

హైదరాబాద్ : హైదరాబాద్‌ మియాపూర్‌ భూకుంభకోణంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి.. మెట్రో రైల్‌ డిపో, ఇంటర్‌సిటీ టెర్మినల్‌లాంటి ప్రభుత్వ సంస్థలకు కేటాయించిన స్థలాలూ ఆక్రమణకు గురయ్యాయి.. వీటికీ నకిలీ దస్త్రాలు సృష్టించి కోట్ల రూపాయల విలువైన భూముల్ని కబ్జా చేశారు. 2003లో మియాపూర్‌ గ్రామంలోని 100, 101 సర్వే నంబర్లలో 550 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండేది.. ఇందులో 445 ఎకరాలను అప్పటి శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్‌.... హుడాకు అప్పగించారు. కొన్నాళ్లపాటు ప్రైవేటు కాపలాదారులతో ఈ భూముల్ని హుడా రక్షించింది... ఈ భూములపై కన్నేసిన ఆక్రమార్కులు... కొన్ని స్థలాలను కబ్జా చేశారు.. ఈ విషయం తెలుసుకున్న శేరిలింగంపల్లి తహశీల్దారు కోర్టులో పిటిషన్‌ వేశారు... కేసును విచారించిన న్యాయస్థానం.. ఆక్రమణదారులు ఆ భూముల్ని ఖాళీ చేయాలని ఆదేశించింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ కబ్జాదారులు హైకోర్టులో రిట్‌పిటిషన్‌ దాఖలు చేశారు... ఈ కేసునూ హైకోర్టు కొట్టివేసింది... అయినా ఊరుకోని ఆక్రమణదారులు ఈ భూములు తమవేనంటూ సుప్రీంకోర్టుకు వెళ్లారు... అత్యున్నత న్యాయస్థానంకూడా యథాతథ స్థితిని కొనసాగించాలంటూ ప్రభుత్వానికి అనుకూలంగా ఆదేశాలిచ్చింది... ఆ సమయంలో దాఖలైన అన్ని స్పెషల్‌ లీవ్‌ పిటిషన్లను తీర్పు వెలువడేదాకా పెండింగ్‌లో ఉంచింది. ఇంకా ఈ కేసు తేలలేదు... ఈలోపు హెచ్‌ఎండీఏకు అప్పగించగా మిగిలిన దాదాపు వంద ఎకరాల్లోఅక్రమ నిర్మాణాలువెలిశాయి.. కొన్ని నెలల్లోనే బస్తీలుగా మారిపోయాయి. ఈ భూముల పరిస్థితి ఇలా ఉంటే.. తాజా కుంభకోణంలో సర్వే నంబరు 100లోని 207 ఎకరాలు, 101లోని 231 ఎకరాల్ని కూకట్‌పల్లి సబ్‌రిజిస్ట్రార్‌ శ్రీనివాసరావు అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసినట్లు బయటపడింది.... అతన్ని అరెస్ట్‌చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు..

636 ఎకరాలు
కొన్నేళ్లక్రితం మియాపూర్‌లో వందలాది ఎకరాల ఖాళీ భూములుండేవి.. 20, 28 సర్వే నంబర్లలో 636 ఎకరాల పోరంబోకు భూములు ఖాళీగా ఉండేవి..... ఇందులోని 376 ఎకరాలను 1980లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ హుడాకు అప్పగించారు. ఈ 376 ఎకరాల్లో 271 ఎకరాలను హుడా లేఅవుట్‌లుగా అభివృద్ధి చేసి వేలం వేసింది... ఈ భూముల్ని కొన్నవారు కొందరు ఇళ్లు కట్టుకున్నారు..మరికొన్ని ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి... మిగిలిన భూమిలో 82 ఎకరాల్ని ఐసీబీటీలాంటి సంస్థలకు... 104 ఎకరాల్ని మెట్రో రైల్‌కు ప్రభుత్వం అప్పగించింది. మరో పది ఎకరాల్లో నడిగడ్డ తండా, సుభాష్‌చంద్రబోస్‌ నగర్‌, ప్రశాంత్ నగర్ పేరిట నిర్మాణాలు వెలిశాయి. ఈ వివాదం కొనసాగుతుండగానే సర్వే నంబరు 20లోని 109ఎకరాలు, 28లోని 145 ఎకరాల అక్రమ రిజిస్ట్రేషన్‌ బయటపడింది.. కూకట్‌పల్లి సబ్‌రిజిస్ట్రార్‌ కొన్ని కంపెనీల పేరిట రిజిస్ట్రేషన్‌ చేసినట్లుతేలింది.. ఈ కుంభకోణంలో ఓ మంత్రి పేరు ప్రధానంగా వినిపిస్తోందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది.. ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.

72 మంది సబ్‌, జాయింట్ రిజిస్ట్రార్లు
మియాపూర్‌ భూముల గోల్‌మాల్‌ తర్వాత ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది.. రిజిస్ట్రేషన్ల శాఖలో పెద్దఎత్తున బదిలీలు జరిపింది. రెండురోజుల్లో 141 కార్యాలయాల్లోని 72 మంది సబ్‌, జాయింట్ రిజిస్ట్రార్ల స్థానాల్లో మార్పులు జరిగాయి... వెంటనే విధుల్లో చేరాలన్న సర్కారు ఆదేశాలతో అధికారులంతా హడావుడిగా తమ కొత్త స్థానాల్లో చేరిపోయారు.. అయితే ఆక్రమణలకు పాల్పడ్డవారికి మంచి స్థానాలను కేటాయించి మరింత అవినీతికి పాల్పడే అవకాశం ఇచ్చారని టీడీపీ మండిపడుతోంది. భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల విషయంలో సీఎం కేసీఆర్‌ సీరియస్‌గా ఉన్నారు..ప్రక్షాళనలోభాగంగా ఉన్నతాధికారులనూ బదిలీ చేయాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది.. ఈ అంశంపై ఒకటి, రెండు రోజుల్లో ఉత్తర్వులు వచ్చే అవకాశముంది. అటు రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో తనిఖీలపై ఏసీబీ అధికారులు సీఎంకు నివేదిక ఇచ్చారు. ఈ నివేదికను ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నారు. భూకుంభకోణంపై సీఐడీ విచారణకూడా కొనసాగుతోంది.. నిందితులకు సహకరించినవారితోపాటు పరారీలోఉన్న నిందితులకోసం అధికారులు గాలిస్తున్నారు.. ఈ కేసుతో సంబంధంఉన్న దాదాపు 30 మందిమీద సీఐడీ ప్రత్యేకంగా దృష్టి సారించి వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.మరోవైపు ఈ భూకుంభకోణం కేసులో ముగ్గురు నిందితులు చర్లపల్లి జైలులో విచారణ ఖైదీలుగా ఉన్నారు.. వీరిని కస్టడీకి అనుమతించాలంటూ కూకట్‌పల్లి పోలీసులు సైబరాబాద్‌ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టులో రివిజన్‌ పిటిషన్‌ వేశారు... కూకట్‌పల్లి సబ్‌రిజిస్ట్రార్‌ శ్రీనివాస్‌రావు, ట్రినిటీ ఇన్‌ఫ్రా సంచాలకుడు పార్థసారథి, సువిశాల్‌ పవర్‌జెన్‌ జనరల్ మానేజర్ సంజీవరాయ శర్మలను కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు.. అయితే పోలీసుల అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది.. దీనిని సవాల్‌ చేస్తూ పోలీసులు మరోసారి రివిజన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. నిందితులను కస్టడీకి అప్పగిస్తే కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు బయటకువచ్చే అవకాశముందని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. మొత్తానికి మియాపూర్‌ భూముల గోల్‌మాల్‌ అంశం ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తోంది.. ఈ కేసుపై విచారణ ఇదే స్థాయిలో కొనసాగుతుందో... మరో మలుపు తీసుకుంటుందో వేచిచూడాలి.

ముగిసిన తెలంగాణ ప్రజాగర్జన సభ

సంగారెడ్డి : జిల్లాలో జరిగిన కాంగ్రెస్ తెలంగాణ ప్రజాగర్జన సభ ముగిసింది. సభలో కేసీఆర్, మోడీలపై రాహుల్ గాంధీ విమర్శల వర్షం కురిపించారు. 

20:39 - June 1, 2017
19:47 - June 1, 2017
19:26 - June 1, 2017
19:23 - June 1, 2017

హైదరాబద్ : సంగారెడ్డిలో జరిగే ప్రజాగర్జన సభకు హాజరయ్యేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ హైదరాబాద్‌ బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు వచ్చిన రాహుల్‌గాంధీకి తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఘనస్వాగతం పలికారు. టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దానం నాగేందర్‌, మాజీ మేయర్‌ బండకార్తీక్‌రెడ్డి తదితరులు రాహుల్‌కు ఘనస్వాగతం పలికారు. రాహుల్‌ నగరానికి వచ్చిన సందర్భంగా టీ కాంగ్రెస్‌ బైక్‌ ర్యాలీని నిర్వహించిది. అనంతరం బేగంపేట ఎయిర్‌పోర్టు నుండి రాహుల్‌ గాంధీ సంగారెడ్డికి రోడ్డు మార్గం గుండా బయలుదేరి వెళ్లారు. సరిగ్గా 5 గంటలకు సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన ప్రజాగర్జన సభకు రాహుల్‌గాంధీ ముఖ్య అతిధిగా హాజరై కీలక ప్రసంగం చేయనున్నారు. 

19:17 - June 1, 2017
19:03 - June 1, 2017

పూంచ్ సెక్టార్ ఎన్ కౌంటర్

జమ్మూకాశ్మీర్ : పూంచ్ నౌషెరా సెక్టార్ మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. పాకిస్థాన్ సైన్యం భారత భద్రతా దళాలపై కాల్పులకు పాల్పడింది. పాక్ సైన్యం కాల్పులను భారత్ సైన్యం తిప్పికొటట్టింది. భారత జవాన్ల కాల్పుల్లో ఐదుగురు పాక్ సైనికులు మృతి చెందారు. 

18:53 - June 1, 2017
18:50 - June 1, 2017
18:48 - June 1, 2017

హైదరాబాద్ : రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. 2,437 ఉద్యోగాలకు టీఎస పీఎస్సీ 15 నోటిఫికేషన్లు జారీ చేసింది. రేపు గ్రూప్ 1, గ్రూప్ 2 ఫలితాలు విడుదల చేస్తామని టీఎస్ పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. గ్రూప్ ఇంటర్వువ్యూకు 1: 2 నిష్పత్తిలో అభ్యర్థులను ప్రటిస్తామని తెలిపారు. రేపటి నుంచి గ్రూప్ 2 కు సంబంధించి ప్రకియ ప్రాంభం అవుతోందని ఆయన ప్రకటించారు. రెండు రోజుల్లో గురుకుల ఉపాధ్యాయుల పరీక్ష 'కీ' విడుదల చేస్తామని అన్నారు. వీలైనంత త్వరగా గురుకుల ఫలితాలు విడుదల చేస్తామని ఘంటా తెలిపారు. ఈ నెల 29,30 తేదీల్లో పీజీటీ మెయిన్ పరీక్షలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. జూలై మొదటి రెండు వారల్లో టీజీటీ పరీక్షలు నిర్వహిస్తామని ఆయన అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

నిరుద్యోగులకు శుభవార్త

హైదరాబాద్ : రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. 2,437 ఉద్యోగాలకు టీఎస పీఎస్సీ 15 నోటిఫికేషన్లు జారీ చేసింది. రేపు గ్రూప్ 1, గ్రూప్ 2 ఫలితాలు విడుదల చేస్తామని టీఎస్ పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. గ్రూప్ ఇంటర్వువ్యూకు 1: 2 నిష్పత్తిలో అభ్యర్థులను ప్రటిస్తామని తెలిపారు. రేపటి నుంచి గ్రూప్ 2 కు సంబంధించి ప్రకియ ప్రాంభం అవుతోందని ఆయన ప్రకటించారు. రెండు రోజుల్లో గురుకుల ఉపాధ్యాయుల పరీక్ష 'కీ' విడుదల చేస్తామని అన్నారు. వీలైనంత త్వరగా గురుకుల ఫలితాలు విడుదల చేస్తామని ఘంటా తెలిపారు.

16:47 - June 1, 2017

హైదరాబాద్ : హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్‌లో 150వ 5రూపాయల భోజన కేంద్రాన్ని మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్‌తో పాటు డిప్యూటీ మేయర్‌ ఫాసిద్ధున్‌, మంత్రి నాయిని నర్సింహారెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌, లక్షయ ఫౌండేషన్‌ ప్రతినిధులు పాల్గొన్నారు. 5 రూపాయల భోజన కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మేయర్‌, మంత్రితో పాటు డిప్యూటీ మేయర్‌ 5రూపాయల భోజనాన్ని స్వీకరించారు. 

16:44 - June 1, 2017

గుంటూరు : ఏపీ క్యాబినెట్‌ సమావేశం ముగిసింది. ఉదయం నుంచి సుధీర్ఘంగా సాగిన మంత్రి మండలి సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీ రీఆర్గనైజేషన్‌ యాక్ట్‌, 2014లోని షెడ్యూల్‌ 9 కింద బీసీ ఫెడరేషన్లకు సంబంధించిన రెండు రాష్ట్రాల మధ్య జరగాల్సిన ఆస్తులు, పంపకాలపై చర్చ జరిగింది. ఆస్తులు, ఆప్పుల పంపకాలపై డాక్టర్‌ షీలా భీడడీ చేసిన సిఫార్సులను ఆమోదిస్తూ మంత్రి మండలి నిర్ణయించింది. అలాగే ప్రభుత్వ వైద్య కాలేజీల్లో పనిచేస్తున్న టీచింగ్‌ మెడికల్‌ ఫ్యాకల్టీ పదవీ విరమణ వయస్సును 60 నుంచి 63 ఏళ్లకు పెంపుకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. అమరావతి మెట్రోరైలు కార్పొరేషన్‌కు 1859 కోట్ల నుంచి 2,175 కోట్లకు రుణ పరిమితి పెంచుతూ క్యాబినెట్‌ నిర్ణయించింది. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాల కోసం వినియోగించుకునేందుకు ఏపీ అగ్రికల్చరల్ యాక్ట్‌-3, 2--6లో సవరణలకు సంబంధించిన డ్రాఫ్ట్‌ ఆర్డినెన్స్‌కు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 

16:42 - June 1, 2017
16:40 - June 1, 2017

హైదరాబాద్ : మేడిపండు చూడ మేలిమై ఉండును.. పొట్టవిప్పిచూడ పురుగులుండు. ఇదీ మనం చిన్నప్పుడు చదువుతున్న పద్యం. ఇప్పుడు భారత్‌ వృద్ధిరేటుకూడా సరిగ్గా ఇలాగే ఉంది. కేంద్రంలో బీజేపీ సర్కార్‌ అధికారం చేపట్టాక భారత్‌ అభివృద్ధిలో దూసుకుపోతోందని.. వృద్ధిరేటు గణనీయంగా పెరుగుతోందని మోదీ బృందం ఊదరగొట్టింది. ఇంతకు ముందెన్నడూ లేనంతగా వృద్ధిరేటు పెరిగిందని నేతలు పదేపదే చెప్తూ వచ్చారు. మోదీ నిర్ణయాలతో స్టాక్‌మార్కెట్లు గతంకంటే భారీగా గరిష్ట సూచీలను తాకాయని... ఇదంతా మోదీ తీసుకుంటోన్న నిర్ణయాల ప్రభావమనే ప్రచారాన్ని విస్తృతంగా చేశారు. పైపై మెరుపులనే అభివృద్ధంటూ మోదీ సర్కార్‌ ప్రజలను భ్రమింపచేస్తున్న తరుణంలో... భారత ఆర్దిక వ్యవస్థ అసలు రూపు బయటపడింది.

ఒక్కసారిగా కుదుపునకు
ప్రపంచ వృద్ధికి చోదకశక్తిగా చెప్పుకునే భారత ఆర్ధిక వ్యవస్థ ఒక్కసారిగా కుదుపునకు లోనైంది. ఈ ఏడాది మార్చి 31వ తేదీతో ముగిసిన 2016-17 ఆర్ధిక సంవత్సరంలో ఆర్ధికాభివృద్ధిరేటు గణనీయంగా క్షీణించింది. 7.1శాతానికి ఆర్ధికవృద్ధిరేటు పడిపోయింది. దీంతో భారత్‌ వృద్ధి మూడేళ్ల కనిష్టానికి దిగివచ్చింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న దేశమని మనకున్న ఖ్యాతిని కోల్పోయినట్లయ్యింది. అంటే మోదీ సర్కార్‌ చెప్పుకున్నవన్నీ అవాస్తవాలేనని తేలిపోయింది. అవన్నీ పైపై మెరుగులేనని సీఎస్‌వో గణాంకాలతో తేటతెల్లమైంది. ఇన్నాళ్లూ కాషాయ నేతలంతా పటించిన అభివృద్ధిజపం.. బోగస్‌ అని అర్ధమైపోయింది.

గొప్పలు పోయిన సర్కార్
పెద్దనోట్ల రద్దు ఓ సాహసోపేతమైన నిర్ణయమంటూ మోదీ సర్కార్‌ గొప్పలు పోయింది. నల్లధనాన్ని అరికట్టేందుకే పెద్దనోట్ల రద్దంటూ కలరింగ్‌ ఇచ్చింది. ఈ నిర్ణయం భారత అభివృద్ధికి దోహదపడుతుందని కూడా కాషాయ నేతలు చెప్పుకొచ్చారు. కానీ సీన్‌ రివర్స్‌ అయ్యింది. పెద్దనోట్ల రద్దు కారణంగా జనవరి - మార్చి త్రైమాసికంలో వృద్ధిరేటు 6.1 శాతానికి క్షీణించింది. ఆర్ధిక సంవత్సరం వృద్ధిరేటునూ నోట్లరద్దు నిర్ణయం ప్రభావితం చేసింది. పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో ఆర్ధికవ్యవస్థలో 87శాతం నగదు చలామణి యోగ్యత కోల్పోయింది. దీని ప్రభావం మూడు, నాలుగు త్రైమాసికాలు రెండింటిపైనా పడింది. డీమానిటైజేషన్‌ ప్రభావంతో స్థూల విలువ జోడింపు క్యూత్రీలో 6.7శాతానికి, క్యూఫోర్‌లో 5.6శాతానికి దిగజారాయి. నిర్మాణ రంగంపై పెద్దనోట్ల రద్దు తీవ్ర ప్రభావాన్ని చూపింది. జనవరి - మార్చిలో ఈ రంగం గతంకంటే 3.7 వృద్ధితగ్గింది. తయారీరంగంలో జీవీఏ 12.7శాతం నుంచి 5.3 శాతానికి దిగజారింది. ఒక్క వ్యవసాయరంగం తప్పితే అన్ని రంగాలపైనా డీమానిటైజేషన్‌ ప్రభావం తీవ్రంగా పడింది. ఆర్ధిక వ్యవస్థపై పెద్దనోట్ల రద్దు ప్రభావం లేదని పదేపదే చెప్పిన పాలకులు పునరాలోచనలో పడేలా నోట్లరద్దు ఎకానమీపై విస్పష్ట ప్రభావం చూపింది.భారత్‌ ఆర్ధిక వ్యవస్థ మోదీ పాలనలో మూడేళ్ల కనిష్టానికి పడిపోయినా... వ్యవసాయరంగం మాత్రం కాస్తంత నిలదొక్కుకుంది. ఈఏడాది వ్యవసాయరంగం 4.9శాతం వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాది మంచి వర్షపాతం నమోదు కావడంతో ఆహారధాన్యాల దిగుబడి గణనీయంగా పెరగడం మూలంగా ఈ రంగంలో వృద్ధి సాధ్యమైంది. ఇక 2016-17 ఆర్ధిక సంవత్సరానికి ద్రవ్యలోటు లక్ష్యాన్ని ప్రభుత్వం సాధించింది. మార్చి చివరినాటికి ద్రవ్యలోటు నిర్దేశిత లక్ష్యమైన జీడీపీలో 3.51గా నమోదైంది దేశ ప్రజల సంపన్నతకు గీటురాయి అయిన తలసరి ఆదాయం ప్రస్తుత రేట్ల ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో 9.7 శాతం పెరిగింది. దీంతో జాతీయ తలసరి ఆదాయం 1,03,219 రూపాయలుగా అంచనావేశారు. మొత్తానికి మోదీ పాలనలో భారత్‌ వృద్ధిరేటు మూడేళ్ల కనిష్టానికి పడిపోయింది.పెద్దనోట్ల రద్దు ప్రతికూలతల ప్రభావానికితోడు తయారీ, సేవా రంగాలు డీలాపడటం ఇందుకు కారణమైంది.ఆర్థిక వృద్ధిరేటు గణనీయంగా పడిపోయిన ఈదశలో.. వృద్ధిరేటును పెంచేందుకు మోదీ సర్కార్‌ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

16:17 - June 1, 2017

మహబూబ్ నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాంపై ఏసీబీ దాడులు

మహబూబ్ నగర్ : జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు చేసింది. 

హైదరాబాద్ చేరకున్న రాహుల్ గాంధీ

హైదరాబాద్ : ఏఐసీసీ ఉపధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్ చేరకున్నారు. రాహుల్ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, సీఎల్పీ నేత జానారెడ్డి, ఇతర నేతలు స్వాగతం పలికారు.

హైదరాబాద్ లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు

హైదరాబాద్ : నగరంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ దాడు చేస్తోంది. ఏసీబీ దాడులతో ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ గనర్, పెద్దఅంబర్ పేట, అబ్దూల్లాపూర్ మెట్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అధికారులు లేక వెలవెబోతున్నాయి. 

వెంకయ్యకు ఆత్మీయ సత్కార సభ

ప్రకాశం : కేంద్ర మంత్రి వెంకయ్యనుయుడు ఆత్మీయ సత్కార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒంగోలును స్మార్ట్ చేయాలంటే అదేమీ అల్లావుద్దీన్ అద్భుత దీపం కాదని అన్నారు. 

16:11 - June 1, 2017

ఢిల్లీ : గత మూడేళ్లలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకుందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. ఎన్డీయే ప్రభుత్వం మూడేళ్ల పాలన పనితీరుకు సంబంధించిన రిపోర్టును జైట్లీ విడుదల చేశారు. మూడేళ్ల ముందు ప్రపంచంలోనే మన ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయిందన్నారు. మూడేళ్ల ఎన్డీయే పాలనలో రెండేళ్లు వాతావరణ పరిస్థితులు అనుకూలించలేదని....ఇలాంటి విషమ పరిస్థితుల్లో సైతం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల భారత ఆర్థికవ్యవస్థ మెరుగుపడిందని ఆర్థికమంత్రి చెప్పారు. విదేశీ పెట్టుబడులు కీలక పాత్ర పోషించాయని జైట్లీ తెలిపారు. జిఎస్‌టి అమలులోకి వస్తే ఎంతో లాభదాయకంగా ఉంటుందని పేర్కొన్నారు.

16:08 - June 1, 2017
16:07 - June 1, 2017
16:05 - June 1, 2017

నెల్లూరు : అవి రాష్ట్రంలో వెలుగులు నింపే పవర్‌ ప్రాజెక్ట్‌లు. జాతీయ స్థాయిలో ఉత్పాదక రంగానికి కేంద్ర బిందువులు. ఉద్యోగ, ఉపాధి రంగాలకు పునాది రాళ్లు. మరి ఆ వెలుగులే జన జీవితాలను చీకటిమయం చేస్తే? ప్రశాంత జీవనాన్ని గందరగోళమయం చేస్తే? నెల్లూరు జిల్లాలో చీకట్ల భారిన పడుతున్న బాధితులపై 10 టీవీ ప్రత్యేక కథనం. ఇది నెల్లూరు జిల్లా తీర ప్రాంతం. పచ్చదనం, ప్రశాంతత, ఆహ్లాదకరమైన వాతావరణానికి దర్పనం. ఒక్క మాటలో చెప్పాలంటే మరో కోనసీమ. ఇప్పుడీ ప్రాంతం కకావికలమవుతోంది. పక్కనే వెలుగులు విరజిమ్మే వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే పవర్ ప్రాజెక్ట్‌లున్నా.. ఇక్కడి పల్లెలు కారు చీకట్లలో మగ్గుతున్నాయి.

భూములను తీసుకున్నాయి
జిల్లా తీరప్రాంతంలో బడుగుల జీవితాల్లో వెలుగులు నింపుతామని.. పవర్‌ ప్రాజెక్ట్‌లు భూములను తీసుకున్నాయి. కానీ ఇప్పుడు కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. సామాన్యుల జీవితాలతో ఆడుకుంటున్నాయి. ప్రశాంత జీవితాలను అల్లకల్లోలం చేస్తున్నాయి. పవర్‌ ప్రాజెక్ట్‌లు అంటేనే ఇక్కడి స్థానికులు ఆందోళన చెందారు. దీంతో స్థానికులకు తాము అత్యాధునికి టెక్నాలజీని వినియోగిస్తున్నామని ప్రాజెక్ట్ అధికారులు నమ్మబలికారు. కాలుష్యం లేకపోవడం దీని ప్రత్యేకత అని చెప్పారు. కానీ తోటపల్లి, గూడూరు మండలంలో ఉన్న గాయత్రి, ఎన్‌సీసీ, సెంకార్బ్‌ పవర్‌ జనరేషన్ కూలర్లను చల్లబరిచేందుకు.. సముద్ర జలాలను శుద్ధి చేసి ఈ ప్రాజెక్ట్‌లు వాడాలి. ఇప్పుడు వాటిని ఎలా ఉన్నాయో అలాగే కూలర్లపై చల్లి ఆ బూడిదను అందులోని కాలుష్యాన్ని గ్రామాలపైకి వదులుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా, సోంపేటలో జనం చేత తరిమికొట్టించుకున్న ఈ పవర్‌ ప్రాజెక్ట్‌లు.. కథలు చెప్పి ఇక్కడ కొలువుదీరాయి. ఇప్పుడు తీరాన్ని కాలుష్యమయం చేస్తున్నాయని ఈ ప్రాంత వాసులు గగ్గోలు పెడుతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా వచ్చే వీటి కాలుష్యం వల్ల ఇప్పటికే పచ్చదనం హరించుకుపోయింది. బొగ్గు రవ్వలు ఇళ్లపై పడుతున్నాయి. కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. తినే తిండీ, తాగే నీరు కలుషితమై.. అన్నింటికీ మించి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. 

16:02 - June 1, 2017

విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి తలపెట్టిన నవనిర్మాణ దీక్షలు బూటకమని ఏపీ పీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి విమర్శించారు. ఇదో ప్రచార పటాటోపమని మండిపడ్డారు. మూడేళ్ల పాలనలో ఏం సాధించారని దీక్ష చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని రఘువీరారెడ్డి విమర్శించారు. 

16:01 - June 1, 2017

సంగారెడ్డి : టీఆర్‌ఎస్‌ వైఫల్యం వల్లే ఇవాళ రాష్ట్రంలో రైతులు కష్టాలు పడుతున్నారని కాంగ్రెస్‌ మాజీ విప్‌ జగ్గారెడ్డి అన్నారు. కాసేపట్లో సంగారెడ్డిలో జరిగే ప్రజా గర్జన సభకు కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ వస్తున్నారని జగ్గారెడ్డి తెలిపారు. 

16:00 - June 1, 2017

హైదరాబాద్ : మియాపూర్‌ భూకుంభకోణంలో విచారణ జరుగుతున్న కొద్దీ ఎన్నో కీలక అంశాలు బయటపడుతున్నాయి. సీఐడీ అధికారులు తవ్వినకొద్దీ అక్రమాలు ఎన్నెన్నో బయటపడుతున్నాయి. పాత్రధారులు, తెరవెనుక సూత్రధారులు ఒక్కక్కరుగా బయటకొస్తున్నారు. ఈ స్కామ్‌కు రియల్టర్లు అధికారులతో కలిసి పకడ్బందీ ప్రణాళిక రచించినట్టు తెలుస్తోంది. ఇందుకు కేబినెట్‌లో కీలకశాఖలు చూస్తున్న ఒక మంత్రి, ఆయన పేషీలోని అధికారులు పెద్ద స్థాయిలో సహకరించినట్లు సమాచారం.

50కోట్ల విలువైన భూమి
మియాపూర్‌ భూదందాకు ముందే నిందితులు సదరు మంత్రిగారిని కలిశారని సమాచారం. అంతా సాఫీగా జరిగితే 50కోట్ల విలువైన రెండెకరాల భూమిని ఇస్తామని ఆఫర్‌ చేశారని, ఇందుకు ఆశపడ్డ మంత్రివర్యులు వారికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేశారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. బేంగపేటకు చెందిన సన్నిహితుడు ఒకరిని బినామీగా పెట్టి రిజిస్ట్రేషన్‌ కూడా చేయించారని, మంత్రి నివాసంలో పనిచేసే ఇద్దరు ఉద్యోగులే ఈ వ్యవహారంలో సాక్షి సంతకం చేశారని భోగట్టా. ఈ బాగోతమంతా మంత్రిపేషీలో పనిచేసే ఓ అధికారి పర్యవేక్షణలో జరిగిందని... రిజిస్ట్రేషన్‌కు అవసరమైన స్టాంప్‌ డ్యూటీని కూడా సదరు సబ్‌రిజిస్ట్రార్‌తోనే కట్టించారని సమాచారం. ఇక మంత్రిగారికి భూ ముడుపు చెల్లించుకున్న అధికారులు... ఆ ధైర్యంతోనే ఎనీవేర్‌ రిజిస్ట్రేషన్‌ విధానంతో భూ కుంబకోణానికి తెరలేపారు. మియాపూర్‌ తోఫా గురించి తెలుసుకున్న మరో సబ్‌ రిజిస్ట్రార్‌, మంత్రి అనుమతితో మరో 7 రిజిస్ట్రేషన్‌లు చేయించారు. వాస్తవానికి మూసాపేటలో పనిచేస్తోన్న ఓ సబ్‌ రిజిస్ట్రార్‌పై తీవ్ర ఆరోపణలు రావడంతో సీఎంవో జోక్యం చేసుకుని ఆయన్ని బదిలీ చేసింది. దీనిపై మంత్రి జోక్యం చేసుకుని ఆ అధికారికి అదే జిల్లాలో పోస్టింగ్‌ ఇప్పించినట్లు సమాచారం. దీంతో మూసాపేట కేంద్రంగా జరిగే లావాదేవీలు బాలానగర్‌కు మారాయి. ఇదే సమయంలో మియాపూర్‌లో భారీగా వివాదాస్పద భూములున్నాయని గుర్తించిన ఆ మంత్రి... ఆయన పేషీ అక్కడ తమ సన్నిహితుడికి పోస్టింగ్‌ ఇప్పించినట్టు తెలుస్తోంది. వీరిపై తీవ్ర ఆరోపణలు వస్తుండడంతో చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ప్రతిపాదించినా.. పైస్థాయిలో తొక్కిపెట్టినట్టు తెలుస్తోంది.

ఎనీవేర్‌ విధానంలో అవకతవకలు
వివాదాస్పద భూమిలో వాటా దక్కించుకున్న మంత్రివర్యులు...మియాపూర్‌ భూదందాను ఏమాత్రం పట్టించుకోకపోగా... వారికి తనవంతు సహకారం అందించారని తెలుస్తోంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎనీవేర్‌ విధానంలో అవకతవకలు జరుగుతున్నాయని ఎప్పుడో బయటపడింది. రిజిస్ట్రేషన్‌ విభాగంలోని అధికారి ఒకరు ప్రభుత్వం దృష్టికి తీసుకురాగా.... లొసుగులను సరిదిద్దేదాకా ఈ విధానాన్ని ఆపేయాలని ఆశాఖ సిఫారసు చేసింది. ఈ సిఫారసును మంత్రిగారి పేషీ అడ్డంగా తొక్కిపెట్టిందన్న విమర్శలు ఉన్నాయి. మంత్రి - ఆయన పేషీ అండతోనే ముగ్గురు అధికారులు ఎనీవేర్‌ భూదందాకు పాల్పడ్డారని ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వివాదాస్పద భూమిని స్వాధీనం చేసుకునేందుకు మంత్రి మనుషులు ప్రయత్నించే క్రమంలోనే పంచాయతీ తలెత్తి దీన్నెలా రిజిస్ట్రేషన్‌ చేశారన్న వివాదం మొదలై అవినీతి బండారం బట్టబయలైంది. ఇప్పుడు ఈ భూస్కామ్‌ బాగోతాన్ని కప్పిపుచ్చేందుకు మంత్రిగారు ప్రయత్నాలు జరుపుతున్నట్టు సమాచారం. 

15:55 - June 1, 2017

హైదరబాద్ : మియాపూర్ భూ కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌ దిగ్విజయ్‌ సింగ్‌ డిమాండ్‌ చేశారు. ఈ స్కామ్‌తో సంబంధమున్న వారందరిపైనా చర్యలు తీసుకోవాలన్నారు. గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. మియాపూర్‌ స్కామ్‌లో ఓ మంత్రి పేరు ప్రముఖంగా వినిపిస్తోందన్నారు. కేసీఆర్‌ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం చెందారన్నారు.

 

15:03 - June 1, 2017

హైదరాబాద్ : మియాపూర్‌ భూముల కుంభకోణంపై ప్రభుత్వ తీరును.. టీడీపీ నేత రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. 7 వందల ఎకరాల భూమి.. 15 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేట్‌ భూములుగా రికార్డులను తారుమారు చేయడంపై మండిపడ్డారు. అక్రమాలకు పాల్పడిన అధికారులకు.. మంచి స్థానాలను కేటాయించి ఇంకా అవినీతికి పాల్పడే అవకాశం ఇచ్చారని అన్నారు. 

15:02 - June 1, 2017

పశ్చిమగోదావరి : గోదావరి డెల్టాకు సాగునీరు విడుదలైంది. గోదావరి నదికి ధవళేశ్వరం ఇరిగేషన్‌ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. మూడు డెల్టాల ప్రధాన కాల్వలకు రెండు వారాల ముందుగానే నీటి విడుదల చేపట్టారు. నీటి విడుదలతో గోదావరి డెల్టా కాల్వలు జలకళను సంతరించుకున్నాయి.

14:30 - June 1, 2017
14:20 - June 1, 2017
13:32 - June 1, 2017

యాదాద్రి : తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నరేష్ హత్యపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేసింది. నరేష్ హత్య కేసులో శ్రీనివాస్ రెడ్డి..సత్తిరెడ్డిలను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నరేష్ హత్య అనంతరం హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో పోలీసుల్లో కదలిక ప్రారంభమైన సంగతి తెలిసిందే. అంతేగాకుండా టెన్ టివి దీనిపై వరుస కథనాలు ప్రసారం చేసింది. ఈనెల 26వ తేదీన అదుపులోకి తీసుకున్న శ్రీనివాస్ రెడ్డి, సత్తిరెడ్డిలను కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోరారు. గురువారం వీరిని కస్టడీకి అప్పగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. దీనితో వీరిని కస్టడీకి తీసుకుని ఎల్ బినగర్ కు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నిందితుడు శ్రీనివాస్ రెడ్డి చెప్పిన ప్రకారం కాకుండా ఇతర కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఆధారాలు సేకరించేందుకు అన్వేషణ చేపడుతున్నారు. వీరి విచారణలో ఎలాంటి అంశాలు వెలుగులోకి వస్తాయో వేచి చూడాలి.

ఆర్థిక పరిస్థితి మెరుగు పడింది - జైట్లీ..

ఢిల్లీ : మోడీ హాయాంలో ఆర్థిక పరిస్థితి మెరుగు పడిందని, పారదర్శకత..విశ్వసనీయతను పెంపొందించడం జరిగిందని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. మూడేళ్లలో అవినీతిని అంతం చేయడం జరిగిందని, పెద్దనోట్లు రద్దు అనంతరం పన్ను వసూళ్లు పెరిగినట్లు పేర్కొన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షిస్తున్న నెంబర్ వన్ దేశంగా భారత్ ఎదిగిందన్నారు. తాము తీసుకున్న కఠిన నిర్ణయాలు మేలు చేశాయని, దేశానికి ముందున్న సవాళ్లేమిటో తమకు తెలుసన్నారు. యూపీఏ పాలనలో అవినీతి ఉందని, తమ పాలనలో అవినీతి లేకుండా చేసినట్లు జైట్లీ తెలిపారు.

11 ఏళ్ల శ్రమ ఫలించింది - గోపాల కృష్ణ..

శ్రీకాకుళం : సివిల్స్ లో టాపర్ అవ్వాలని 2006 నుండి కష్టపడడం జరిగిందని టెన్ సివిల్స్ థర్డ్ ర్యాంకర్ గోపాలకృష్ణ పేర్కొన్నారు. ఆయన టెన్ టివితో మాట్లాడారు. 11 ఏళ్ల తరువాత తన శ్రమ ఫలించిందని, సివిల్స్ మూడో ర్యాంకర్ గా ఎంపిక కావడం వెనుక తన కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉందన్నారు.

 

జీహెచ్ఎంసీ చివరి స్టాండింగ్ కమిటీ సమావేశం..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ చివరి స్టాండింగ్ కమిటీ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఏడాదికాలంలో 20 సార్లు కమిటీ సమావేశమైంది. 229 అంశాల్లో కమిటీ తీర్మానాలు..రూ. 5468 కోట్ల విలువైన పనులకు ఆమోదం తెలిపింది. గ్రేటర్ లో పలు అభివృద్ధి పనులకు స్టాండింగ్ కమిటీ శ్రీకారం చుట్టుందని మేయర్ బొంతు రామ్మోహన్ గౌడ్ వెల్లడించారు. త్వలరో కొత్త స్టాండింగ్ కమిటీ ఎన్నిక జరుగుతుందన్నారు.

 

13:08 - June 1, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరువు హత్యలపై ఉభయ రాష్ట్రాల హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. స్వాతి..నరేష్ కేసుపై హెబియస్ కార్పస్ పిటిషన్ ను కోర్టు క్లోజ్ చేసింది. దీనిపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే హైకోర్టును ఆశ్రయించవచ్చని నరేష్ తల్లిదండ్రులకు సూచించింది. మరోవైపు పరువు హత్యలపై కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. నరేష్ హత్య విషయంలో పోలీసులు ఎందుకు పారదర్శకంగా వ్యవహరించ లేదని ప్రశ్నించింది. ఈ సందర్భంగా టెన్ టివితో నరేష్ తండ్రి టెన్ టివితో మాట్లాడారు. తనకు న్యాయం జరిగే వరకు ఎంతవరకైనా ముందుకెళుతానని, తన కొడుకును హత్య చేసిన శ్రీనివాస్ రెడ్డికి యావజ్జీవ కారాగార శిక్ష వేయాలని డిమాండ్ చేశారు. సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని ఎంబీసీ నేత ఆశయ్య డిమాండ్ చేశారు. ఈ కేసుపై ప్రభుత్వం స్పందించాలని, నరేష్ కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. శ్రీనివాస్ రెడ్డిని కఠినంగా శిక్షించే వరకు తాము పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

13:00 - June 1, 2017

పెళ్లిళ్లు..శుభకార్యాలు..హోటల్స్ లో భోజనం ముగించిన అనంతరం 'సోంపు' తింటుంటారు. ఇళ్లల్లో కూడా చాలా మంది ఆహారం భుజించిన అనంతరం సోంపును నములుతుంటారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలను సులభంగా ఎదుర్కొనవచ్చని పలువురు పేర్కొంటున్నారు. సోంపు తీసుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చూడండి..సోంపును తీసుకోవడం వల్ల అజీర్ణం..ఉబ్బరం..కడుపునొప్పి..కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ధూమపానం చేసే వారిలో వచ్చే దగ్గుకు సత్తర ఉపశమనం కలిగిస్తుంది. తరచూగా సోంపు వాడితే ఉబ్బసం వ్యాధి నియంత్రణలో ఉంటుంది. చర్మం ఎండిపోయినట్లుగా ఉంటే..వాంతులు..చిన్న పిల్లల్లో వచ్చే ఊపిరితిత్తుల వ్యాధుల నివారణలకు సోంపు తైలాన్ని వాడుతుంటారు. నేతిలో వేయించిన సోంపును చూర్ణం చేసి ఇందులో కొద్దిగా పంచదార కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజు ఉదయం..సాయంత్ర ఒక స్పూన్ ప్రమాణంలో నీటితో తీసుకుంటే అతి వేడి వల్ల మూత్రంలో మంట తగ్గుతుంది.

12:50 - June 1, 2017

కోలీవుడ్ స్టార్ హీరో 'అజిత్' సినిమా కోసం ఆయన అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తుంటారు. ఆయన స్టైల్..ఆకట్టుకొనే వస్త్ర ధారణ..ఫైట్లతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న 'వివేగం' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే విడుదలైన టీజర్ రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. కానీ ఆయన షూటింగ్ పాల్గొంటుండగా గాయపడినట్లు వార్తలు వెలువడుతున్నాయి. యూరప్ లో జరుగుతున్న షూటింగ్ లో ‘అజిత్’ పాల్గొన్నట్లు..డూప్ లేకుండానే పలు సన్నివేశాల్లో ఆయన పాల్గొంటున్నారని తెలుస్తోంది. కొంత ఎత్తు నుంచి 'అజిత్' కింద పడడంతో భుజానికి గాయాలైనట్లు సమాచారం. 'అజిత్‌'కు వెంటనే ప్రథమ చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారని తెలుస్తోంది. గాయాల తీవ్రతపై స్పష్టమైన సమాచారం లేదు. 'అజిత్' ఇంటర్ పోల్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరో 'వివేక్ ఒబెరాయ్' విలన్ గా నటిస్తున్నాడు.

12:45 - June 1, 2017

సాయిధరమ్ తేజ నటిస్తున్న తాజా చిత్రం 'జవాన్' షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. బీవీఎస్ రవి దర్శకత్వంలో 'దిల్' రాజు సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో 'సాయి ధరమ్' సరసన 'మెహ్రీన్ ఫిర్జాదా' హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం టాకీ పార్ట్ పూర్తి చేసుకుందని..రెండు ఫైట్స్..పాటలు చిత్రీకరించాల్సి ఉందని దర్శకుడు బీవీఎస్ రవి పేర్కొన్నారు. ఆగస్ట్‌లో 'జవాన్‌' ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు. 'దేశానికి జవాన్‌ ఎంత అవసరమో... ప్రతీ ఇంటికి మా కథానాయకుడి లాంటి వాడు ఉండాలని చెప్పడమే తమ ఉద్దేశ్యం.జ మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఓ యువకుడికి ఎలాంటి కష్టాలు వచ్చాయి. తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడన్నదే కథ. అందుకే 'ఇంటికొక్కడు' అనే క్యాప్షన్‌ పెట్టడం జరిగిందని దర్శకుడు తెలిపారు.

బాబు క్యాంపు ఆఫీస్ ముట్టడికి విద్యార్థుల ప్రయత్నం..

విజయవాడ : విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలంటూ సీఎం క్యాంపు ఆఫీస్ ముట్టడికి విద్యార్థి సంఘాలు ప్రయత్నించాయి. పోలీసులు అడ్డుకుని విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేశారు.

నరేష్..స్వాతి కేసుపై పోలీసుల నివేదిక..

హైదరాబాద్ : నరేష్ హత్యపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు, నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవడం జరిగిందని కోర్టుకు సమర్పించిన నివేదికలో పోలీసులు పేర్కొన్నారు. నరేష్ ను హత్య చేసినట్లు శ్రీనివాస్ రెడ్డి ఒప్పుకున్నాడని, స్వాతి ఆత్మహత్యపై విచారణ జరుగుతోందని పేర్కొన్నార.

 

12:27 - June 1, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన స్వాతి..నరేష్ కేసుపై హైకోర్టులో విచారణ ముగిసింది. హెబియస్ కార్పస్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ ముగిసింది. ఇంకా అనుమానాలుంటే తమను ఆశ్రయించవచ్చని కోర్టు నరేష్ తల్లిదండ్రులకు సూచించింది. ఈసందర్భంగా న్యాయవాది మీడియాతో మాట్లాడారు. స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డిని విచారించిన సమయంలో నరేష్ ను ఎలా హత్య చేశామో వివరించాడని ప్రభుత్వ తరపు న్యాయవాది పేర్కొన్నారని తెలిపారు. మనిషి లేనప్పుడు విచారించాల్సిన అవసరం లేదని పిటిషన్ కోర్టు కొట్టివేసిందన్నారు. కానీ కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసిందని, తెలుగు రాష్ట్రాల్లో పరువు హత్యలు పెరగడం విచారకరమని జడ్జీ పేర్కొన్నారని తెలిపారు. ఈ కేసులో పోలీసుల తీరు శోచనీయమని కోర్టు వ్యాఖ్యానించిందన్నారు. మృతుడు అంబోజి నరేష్ తల్లిదండ్రులకు ఎలాంటి అనుమానాలున్నా తమను ఆశ్రయించవచ్చని కోర్టు సూచించడం జరిగిందన్నారు. నివేదికలోని అంశాలు పూర్తిగా తెలిపితే కేసుపై ప్రభావం పడుతుందని కోర్టుకు భావించి అందుకే తెలుపలేదని న్యాయవాది పేర్కొన్నారు. స్వాతి ఆత్మహత్య చేసుకోవడం..ఆమె తీసుకున్న సెల్ఫీ వీడియో ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించడం జరిగిందని, నివేదిక రావాల్సి ఉందని ప్రభుత్వం తరపు న్యాయవాది పేర్కొన్నారని ఆయన తెలిపారు.

నరేష్..స్వాతి కేసు హైకోర్టులో విచారణ..

హైదరాబాద్ : నరేష్..స్వాతి కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. నరేష్ అదృశ్యంపై పోలీసు శాఖ కోర్టుకు నివేదిక సమర్పించింది. హెబియస్ కార్పస్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ ముగిసింది. ఇంకా అనుమానాలుంటే తమను ఆశ్రయించవచ్చని కోర్టు నరేష్ తల్లిదండ్రులకు సూచించింది.

ఆర్టీసీ ఉద్యోగుల ఆసుపత్రి ప్రారంభం..

విజయవాడ : పండింట్ నెహ్రూ బస్టాండు లో ఆర్టీసీ ఉద్యోగుల ఆసుపత్రిని మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఆర్టీసీ ఉద్యోగులపై విద్యాధరపురంలో 50 పడకల ఆసుపత్రి, రాష్ట్రంలోని 45 ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆర్టీసీ ఉద్యోగులకు అన్ని రకాల చికిత్సలు చేయనున్నట్లు వెల్లడించారు. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే నష్టాలను తగ్గించుకుంటూ నడుస్తోందని, ప్రమాదాలు తగ్గితే ఆర్టీసీకి లాభాలు పెరుగుతాయన్నారు.

12:08 - June 1, 2017

విశాఖపట్టణం : ప్రజలు పరిశ్రమలు వద్దు బాబోయ్‌ అంటున్న ప్రభుత్వం తీరు మారడం లేదు.. ప్రజాభిప్రాయ సేకరణను వ్యతిరేకిస్తున్నా తూతూ మంత్రంగా మీటింగ్‌ పెట్టి పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. కాలుష్యం వెదజల్లే పరిశ్రమలతో పంటలు నాశనం కావడమే కాకుండా.. తమ జీవితాలు మట్టికరిచిపోతాయంటున్నా పట్టించుకోవడం లేదు. దీంతో ప్రజలు పరిశ్రమలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపడుతున్నారు. విశాఖ జిల్లా నక్కపల్లిలో ఏర్పాటు చేస్తున్న ఫార్మాస్యూటికల్‌ పరిశ్రమకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమబాట పట్టబోతున్నారు. విశాఖ జిల్లా నక్కపల్లి మండలం డి.ఎల్‌.పురం తీరంలో బిఎస్‌జి కెమికల్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్‌ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది. దీని ద్వారా 50 టన్నుల సామర్ధ్యం గల బహుళ ఔషధాలు, రసాయనాలు ఉత్పత్తి చేయనున్నారు. డి.ఎల్‌.పురం గ్రామంలో సర్వే నెం.3, 4, 5 మరియు 9 నుండి 14 వరకు సుమారు 70.4 ఎకరాల్లో పరిశ్రమను నెలకొల్పాలని భావించారు. ఈ పరిశ్రమ పరిధిలోకి 10 గ్రామాలు రానున్నాయి. డి.ఎల్‌.పురం, బంగారయ్యపేట, మలాపరం, నెల్లిపూడి, గునిపూడి, వేంపాడు, గొడిచర్ల, నామవరం, చినదొడ్డిగల్‌, గోపాలపట్నం గ్రామాలు కాలుష్యం బారిన పడనున్నాయి. దీంతో ఈ పరిశ్రమను ఆ గ్రామ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.

నక్కపల్లిలో...
జీడిమామిడి పంటకు ప్రసిద్ధి చెందిన నక్కపల్లిలో ఈ పరిశ్రమ వల్ల తీరని నష్టం కలుగుతుందని గ్రామస్తులంటున్నారు. కాలుష్యబారిన పడి ప్రాణాలకు నష్టం కలిగే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు. పర్యావరణానికి హాని కలిగే విధంగా వ్యవహరిస్తే.. ప్రజలతో కలిసి ఉద్యమం చేస్తామని వైసీపీ నేత గొల్ల బాబురావు హెచ్చరిచారు. ఇదిలావుంటే.. ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణను పలువురు వ్యతిరేకించారు. పరిశ్రమ వద్దంటూ ప్రజాభిప్రాయ సేకరణలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దీంతో పలువురి మత్స్యకారులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మత్స్యకారుల అరెస్టును నిరసిస్తూ గ్రామస్తులు ప్రజాభిప్రాయ సేకరణను బహిష్కరించారు. ఇదిలావుంటే.. అధికారులు మాత్రం గ్రామస్తులు లేకుండానే ప్రజాభిప్రాయ కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామంలో ఉన్న పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. అయితే.. గ్రామస్తులు మాత్రం పరిశ్రమ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే భారీ ఉద్యమానికి సిద్దమవుతున్నారు.

12:04 - June 1, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ టీ వ్యాలెట్ ను ఆవిష్కరించారు. అనంతరం ఐటీ శాఖకు సంబంధించిన 2016-17 వార్షిక నివేదికను కేటీఆర్ విడుదల చేశారు. తెలుగు..ఇంగ్లీష్..ఉర్దూ భాషల్లో ఈ వ్యాలెట్ ను రూపొందించారు. గురువారం తాజ్ దెక్కన్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ...టీ వ్యాలెట్ లో లావాదేవీలకు ఛార్జీలు ఉండవని, రాష్ట్ర ఐటీ, ఐటీ ఎగుమతుల వృద్ధి 13.85 శాతం..జాతీయవృద్ధి 10 శాతం నమోదైందని తెలిపారు. మీసేవ ఇ- లావావేదీలలో దేశంలోనే తెలంగాణది నెంబర్ 1 స్థానంలో ఉందన్నారు. ప్రతి వెయ్యి మందికి 12వేల ఇ లావాదేవీలతో తెలంగాణ రాష్ట్రం తొలి స్థానంలో నిలిచిందన్నారు. ఏడాదికాలంలో 3.62 కట్ల మందికి ఎలక్ట్రానిక్ సేవలు అందిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

పాక్ కాల్పులు..ఇద్దరు పౌరులకు గాయాలు..!

జమ్మూ కాశ్మీర్ : కాల్పుల విరమణ ఒప్పందాన్ని పలు మార్లు పాక్ ఉల్లంఘిస్తూనే ఉంది. తాజాగా కేజీ సెక్టార్ పై కాల్పులకు తెగబడింది. ఈ కాల్పులను భారత బలగాలు తిప్పి కొడుతున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు పౌరులకు గాయాలయ్యాయని తెలుస్తోంది.

రావులపాడులో ఉద్రిక్తత..

తూర్పుగోదావరి : రావులపాలెం (మం) రావులపాడులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఎస్సీ మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని యువకులు ఆందోళన చేపట్టారు.

 

టీ వ్యాలెట్ ఆవిష్కరణ..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ టీ వ్యాలెట్ ను ఆవిష్కరించారు. అనంతరం ఐటీ శాఖకు సంబంధించిన 2016-17 వార్షిక నివేదికను కేటీఆర్ విడుదల చేశారు. తెలుగు..ఇంగ్లీష్..ఉర్దూ భాషల్లో ఈ వ్యాలెట్ ను రూపొందించారు. టీ వ్యాలెట్ లో లావాదేవీలకు ఛార్జీలు ఉండవని, రాష్ట్ర ఐటీ ఎగుమతుల వృద్ధి 13.85 శాతం, జాతీయవృద్ధి 10 శాతం నమోదైందని కేటీఆర్ తెలిపారు. మీసేవ ఇ- లావావేదీలలో దేశంలోనే తెలంగాణది నెంబర్ 1 స్థానంలో ఉందన్నారు. ప్రతి వెయ్యి మందికి 12వేల ఇ లావావేదీలతో తెలంగాణ రాష్ట్రం తొలి స్థానంలో నిలిచిందన్నారు.

తప్పుకున్న రామచంద్ర గుహ..

ముంబై: బీసీసీఐలో లోధా క‌మిటీ సిఫార్సులను అమలు చేయ‌డానికి సుప్రీంకోర్టు నియ‌మించిన క‌మిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేట‌ర్స్ (సీఓఏ) నుంచి రామ‌చంద్ర గుహ త‌ప్పుకున్నారు. వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల తాను త‌ప్పుకుంటున్న‌ట్లు గుహ వెల్ల‌డించారు.

11:46 - June 1, 2017

మెడికల్ స్కాంపై ఏసీబీ సోదాలు..

ఢిల్లీ : మెడికల్ స్కాంపై ఆప్ ఆద్మీ బషిష్కృత నేత కపిల్ మిశ్రా చేసిన ఆరోపణలపై ఏసీబీ పలు ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. ఫార్మా కంపెనీలు మందులు భద్రపరిచే మూడు గోదాముల్లో తనిఖీలు చేపడుతోంది.

11:43 - June 1, 2017

రోడ్డుపై పాలు ఒలుకపోసి నిరసన..

మహారాష్ట్ర : రాష్ట్రంలో రైతులు నేటి నుండి సమ్మెలో పాల్గొంటున్నారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. షిర్డీ ప్రాంతంలో ట్యాంకర్ తో పాలను రోడ్డుపై ఒలకపోశారు.

11:26 - June 1, 2017

హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన నరేష్, స్వాతి కేసులో పోలీసు శాఖ హైకోర్టుకు నివేదిక సమర్పించనుంది. నరేష్ హత్య..స్వాతి ఆత్మహత్యలపై టెన్ టివి వరుస కథనాలు ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. కానీ నివేదికలో ఏముంటదనేది ఉత్కంఠ నెలకొంది. ఈ సందర్భంగా టెన్ టివితో మృతుడు నరేష్ తండ్రి మాట్లాడారు. శ్రీనివాస్ రెడ్డికి యావజ్జీవ కారాగార శిక్ష వేయాలని, అతను బయటకు వస్తే బెదిరించే ప్రయత్నాలు చేస్తాడని..దీనిపై చర్యలు తీసుకోవాలని రాచకొండ కమిషనర్ ను కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఆత్మకూరు ఎస్ఐ సస్పెండ్ చేసినందుకు సంతోషంగా ఉందని నరేష్ సోదరి పేర్కొన్నారు. అలాగే రామన్నపేట సీఐని కూడా సస్పెండ్ కావాలని ఆయనే వారిని విడదీశాడని పేర్కొన్నారు. శ్రీనివాస్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పోలీసుల ప్రమేయంతో హత్యలు జరిగాయని, ప్రత్యేక న్యాయస్థానం ద్వారా పూర్తి దర్యాప్తు జరపాలని ఎంబీసీ నేత ఆశయ్య పేర్కొన్నారు. వెంటనే స్పందించకపోతే చలో భువనగిరి తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. టెన్ టివి, రాచకొండ కమిషనర్ కు ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు తెలిపారు.

టెన్ టివి వరుస కథనాలు..
నరేష్..స్వాతి కేసులపై 10టీవీ వరుస కథనాలపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. తమ శాఖపై పెద్దఎత్తున వస్తోన్న విమర్శల పట్ల దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆత్మకూరు ఎస్సై శివనాగ ప్రసాద్‌ను సస్పెండ్ చేశారు. అలాగే.. భువనగిరి ఏసీపీ, డీసీపీతో పాటు.. చౌటుప్పల్‌ ఏసీపీ, రామన్నపేట, భువనగిరి సీఐలకు మెమోలు జారీ చేశారు. నెలరోజుల పాటు ఎన్నో మలుపులు తిరిగిన నరేష్‌-స్వాతిల కేసులో పోలీసుల నిర్లక్ష్యం ఉందని బయటపడింది. అదేవిధంగా స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డి ఒత్తిడికి లొంగి పోలీసులు ఆయనకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. మరోవైపు మేజర్లు అయిన నరేష్‌-స్వాతిలు ముంబైలో పోలీసుల అనుమతితో వివాహం చేసుకున్నప్పటికీ.. ఆత్మకూరు (ఎం) ఎస్‌ఐ శివనాగప్రసాద్‌ వారిద్దరిని తిరిగి స్వగ్రామం వచ్చేటట్టు చేసిన రాయభారం ఇప్పటికే ఆధారాలతో సహా బయటపడింది. వారిద్దరూ వచ్చిన తర్వాత రామన్నపేట సీఐ శ్రీనివాస్‌ సమక్షంలో పంచాయతీ నిర్వహించి ప్రేమజంటను బలవంతంగా విడదీసేందుకు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు.

11:08 - June 1, 2017

మద్రాస్ ఐఐటీ క్యాంపస్ వద్ద ఆందోళన..

చెన్నై : మద్రాస్ ఐఐటీ క్యాంపస్ వద్ద విద్యార్థులు నిరసన నిర్వహించారు. పశువధపై కేంద్రం నిషేధం విధించడంపై వారు ఆందోళన చేపట్టారు. ఇటీవలే వీరు నిర్వహించిన బీఫ్ ఫెస్టివల్ లో పాల్గొన్న ఓ విద్యార్థిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే.

కార్యదర్శులు..శాఖాధిపతులతో బాబు సమీక్ష..

విజయవాడ : కార్యదర్శులు..శాఖాధిపతులతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించారు. నవనిర్మాణ దీక్ష నిర్వాహణపై అధికారులకు బాబు దిశానిర్ధేశం చేశారు. జూన్ 2వ తేదీన నవనిర్మాణ దీక్ష జరుపుకోనున్నట్లు, చరిత్ర ఉన్నంత వరకు జరుగుతుందని, ఇది ఎవరినో నిందించేందుకు జరుగుతున్న కార్యక్రమం కాదని బాబు తెలిపారు. జూన్ 8న మహాసంకల్పం జరుపుకుంటున్నట్లు, జూన్ 3 నుండి మూడేళ్లలో సాధించిన ప్రగతిపై అంతటా చర్చ జరగాలని సూచించారు.

10:53 - June 1, 2017

‘మహేష్ బాబు' నటిస్తున్న తాజా చిత్రం 'స్పైడర్' చిత్ర టీజర్ వచ్చేసింది. ఎన్నో రోజులుగా వేచి చూసిన అభిమానుల ఉత్కంఠ నేటితో తెరపడింది. కానీ టీజర్ లో 'మహేష్' డైలాగ్స్ ఎలా ఉంటాయి..ఆయన మేనరిజం ఎలా ఉంటుందో చూడాలనే వారికి దర్శకుడు మురుగదాస్ మరింత ఉత్కంఠను కలిగించాడు. టీజర్ లో 'మహేష్' ఓ సిస్టంపై పని చేస్తుండగా ఓ 'స్పైడర్' అతనిపై పాకుతున్నట్లుగా ఉంది. చివరిలో 'మహేష్' ‘ష్...’ అనే పలికాడు. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో 'మహేష్' ఇంటిలెజిన్స్ ఆఫీసర్ గా నటిస్తుండగా ఆయన సరసన 'రకూల్ ప్రీత్ సింగ్' నటిస్తోంది. ఏదో ఒక సామాజిక అంశాన్ని తెరపైకి చూపించే 'మురుగదాస్' ఈ చిత్రంలో ఎలాంటి సామాజిక అంశాన్ని సృశించారో తెలుసుకోవాలంటే దసరా వరకు వేచి చూడాల్సిందే.

నరేష్ హత్య కేసులో నిందితుల విచారణ..

యాదాద్రి : నరేష్ హత్య కేసులో నిందితులకు పోలీస్ కస్టడీ విధించింది. నిందితులు శ్రీనివాస్ రెడ్డి, సత్తిరెడ్డిలను పోలీసులు విచారించనున్నారు. నరేష్ హత్య..స్వాతి ఆత్మహత్యపై విచారణ జరగనుంది.

10:40 - June 1, 2017

హైదరాబాద్ : విశ్వనగరంగా చేస్తామంటూ ఎన్నికల ముందు టిఆర్‌ఎస్ హామీలు గుప్పించింది. టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా అభివృద్ధి మాత్రం జరగలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇంతకీ అధికారంలోకి రాకముందు టిఆర్‌ఎస్ ఇచ్చిన హామీలేంటి? వాటిని ఎంతవరకు నెరవేర్చగలిగింది? దీనిపై ప్రత్యేక కథనం..దేశంలో కోటి జనాభా కలిగిన నగరాల్లో హైదరాబాద్‌ కూడా ఒకటి. ఇక్కడ ఎన్ని సౌకర్యాలున్నాయో.. అన్ని ఇబ్బందులూ ఉన్నాయి. అయితే వాటన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది టిఆర్‌ఎస్ ప్రభుత్వం. అందులో భాగంగా హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామని ప్రకటించింది. బస్తీల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, స్కైవేలు.. ఫ్లైఓవర్లు.. మూసీనది ప్రక్షాళన.. హుస్సేన్ సాగర్ క్లీనింగ్.. నాలాల అభివృద్ధితో పాటు స్వచ్ఛ హైదరాబాద్ తమ లక్ష్యమని చెప్పింది. జూన్ 2 నాటికి ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లవుతున్న తరుణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై నగరవాసుల్లో చర్చ మొదలైంది.

మెట్రో రైలు ఎప్పుడొస్తుందో చెప్పలేని పరిస్థితి..
పాలకమండలి జీహెచ్‌ఎంసీకి నిధులు కేటాయించడం.. ఆ నిధులు అభివృద్ధికి ఖర్చు అయ్యేలా చూడటం ప్రభుత్వ బాధ్యత. మూడేళ్లలో నిధులు అరకొరగానే ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఏడాది వెయ్యి కోట్లు హైదరాబాద్ పాలకమండలికి కేటాయించామని ప్రభుత్వం ప్రకటించింది. గత రెండేళ్లు కూడా కేటాయింపులు చేసినా నిధులు విడుదల చేయడంలో పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. ఇక సిటీలో ట్రాఫిక్ వ్యవస్థను డెవలప్ చేయడానికి సిగ్నల్ ఫ్రీ వ్యవస్థను తీసుకువస్తామని చెప్పి అందులో భాగంగా సమగ్ర రోడ్డు అభివృద్ధి కార్యక్రమం రూపొందించింది. అందులో భాగంగా 50 ప్రాంతాల్లో స్కైవేలు, ఫ్లైఓవ‌ర్లు, మ‌ల్టిలేవ‌ల్ రోడ్స్ నిర్మిస్తామ‌ని ప్రకటించింది. అందుకోసం 20 కోట్లు అవసరం అవుతాయని కేసీఆర్ ప్రకటించారు. కానీ రెండు మూడు ప్రాంతాల్లో మినహా వీటిలో పురోగతి లేదు. మూసీ నదిపై నిర్మించతలపెట్టిన 6 లైన్ల రోడ్డు ప్రాజెక్టు కూడా అటకెక్కింది. సిటీలో జంక్షన్ ఇంప్రూవ్‌మెంట్ ద్వారా ట్రాఫిక్ ఫ్లోను వేగవంతం చేయడానికి 60 కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించారు. అదీ ముందుకు వెళ్లలేదు. ఇక మెట్రో రైల్ ఎప్పుడు వస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి.

లక్ష ఇళ్లు నిర్మిస్తామని హామీ..
హైదరాబాద్‌లో నిరుపేదలకు ఇళ్లు నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా సికింద్రాబాద్ ఐడిహెచ్ కాలనీలో మాత్రం 396 గృహాలు నిర్మించారు. లక్ష ఇళ్లు నిర్మిస్తామంటూ సీఎం కేసీఆర్ ప్రకటించినా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో బిల్డర్లకు పనులు అప్పగించేందుకు ముందుకు వచ్చింది ప్రభుత్వం. 40వేల ఇళ్లు టెండ‌ర్ ద‌శ‌లో ఉన్నాయంటున్నారు బల్దియా అధికారులు. అయితే సమగ్ర సర్వేలో 2 లక్షల మందిని ఇళ్లు లేని వారిగా గుర్తించామని వారికి ఇళ్లు నిర్మిస్తామని చెప్పిన మాటలు ఆచరణలోకి రావాలంటే ఎంతకాలం పడుతుందోనని జనం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ నగరంగా అంటే మురికివాడలు లేని నగరంగా హైదరాబాద్ మారాలి. మురికివాడల నిర్మూలనకు ఇప్పటివరకు ప్రభుత్వం దగ్గర ఎలాంటి ప్రణాళికలు లేవు.

ముందుకు జరగని నాలా అభివృద్ధి పనులు..
ఇక భాగ్యనగరంలో మరో ప్రధాన సమస్య నాలాల ఆక్రమణ. సిటీలో సక్రమంగా వర్షపు నీటి పారుదల వ్యవస్థ లేకపోవడం.. ఉన్న నాలాలు ఆక్రమణలకు గురికావడంతో గతేడాది కురిసిన వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలం అయ్యింది. నాలాల అభివృద్ధికి 10 వేల కోట్లు ఖర్చు అవుతుందని వాటన్నింటినీ అభివృద్ధి చేస్తామని కేసీఆర్‌ ప్రకటనా.. ముందుకు సాగలేదు. ఇక వర్షాకాలం రానుండటంతో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో అని జనం ఆందోళన చెందుతున్నారు. మూసీనదిని గుజరాత్‌లోని సబర్మతి నదిలా మారుస్తామన్నారు. ఈ బడ్జెట్లో 370 కోట్లు కేటాయించారు కూడా. హుసేన్‌సాగర్‌ను సందర్శించిన సీఎం కేసీఆర్ దానిని శుద్ధి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. గ్రేటర్ ఎన్నికల ముందు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సాగర్ నీటిని తాగునీటిగా మారుస్తామని హామీ ఇచ్చారు. కూకట్‌పల్లి నాలా మినహాయించి పెద్దగా పురోగతి లేదు.

నగరంలో 900 గ్రేవ్ యార్డ్స్ ఏర్పాటుకు శ్రీకారం..
హైద‌రాబాద్ న‌గ‌రంలో అన్ని వ‌స‌తుల‌తో ఏర్పాటు చేసిన అత్యాధునిక గ్రేవ్ యార్డును జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేశారు. అంతేకాకుండా నగరంలో 900 కు పైగా గ్రేవ్ యార్డ్స్‌లో పచ్చదనం ఏర్పాటు చేయడంతోపాటు మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టారు. అయితే పంజాగుట్ట స్మశాన వాటిక మినహా ఏ ఒక్కటి పూర్తికాలేదు. హైదరాబాద్‌లోని ఎర్రగుంట స్మశానవాటికకు 2 కోట్ల నిధులు కేటాయించినా ఒక్క అడుగు ముందుకు పడలేదు.

స్వచ్ఛభారత్‌ ర్యాంకింగ్‌లో 22వ స్ధానంలో హైదరాబాద్..
స్వచ్ఛ హైదరాబాద్‌ పేరుతో జీహెచ్‌ఎంసీ పరిధిలో శానిటేష‌న్ పై స‌మ‌గ్ర కార్యక్రమాన్ని నిర్వహించింది ప్రభుత్వం. ఈ కార్యక్రమం ద్వారా నగరంలో శానిటేషన్ కొంత మెరుగుపడిందని మాత్రం చెప్పవచ్చు. ఇటీవల ప్రకటించిన స్వచ్ఛభారత్ ర్యాంకింగ్‌లో హైదరాబాద్‌కు 22వ స్ధానం లభించింది. కానీ చాలా ప్రాంతాలు ఇప్పటికీ అపరిశుభ్రంగానే ఉన్నాయి. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా నగరంలోని ప్రధాన సమస్యలపై ప్రత్యేక శ్రద్ధపెట్టలేదని ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. నగరంలోని ప్రధాన సమస్యల్ని పరిష్కరించడంలో కూడా విఫలమైందని, దాంతో సిటీలో అభివృద్ధి కుంటుపడిందని సిపిఎం నేత శ్రీనివాస్ ఆరోపించారు. అయితే ప్రతిపక్షాల విమర్శలు సరికాదంటున్నారు అధికార పార్టీ నేతలు. గత ప్రభుత్వాల పాలన కంటే తమ పాలనలోనే అభివృద్ధి జరిగిందని చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా హైదరాబాద్ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తామని చెబుతున్నారు.

10:35 - June 1, 2017

హైదరాబాద్ : తెలంగాణలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తామన్న టీఆర్ఎస్ ప్రభుత్వం.. అందులో ఎంతవరకూ విజయవంతమైంది? మూడేళ్ల పాలనలో రైతులకు ఏం చేసింది? వ్యవసాయానికి అందిన సాయమెంత? సిఎం కేసీఆర్‌ హామీలు ఎంతవరకూ అమలయ్యాయి? 10 TV ప్రత్యేక కథనం.. తెలంగాణ ఏర్పాటైనప్పటినుంచి ఇప్పటి వరకు పదిహేడు వందల ఇరవై మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇందులో 680 కుటుంబాలకు పరిహారం అందించామని సర్కారు స్పష్టం చేస్తోంది. అయితే ప్రభుత్వ లెక్కలు అసంపూర్ణంగా ఉన్నాయన్న విమర్శలొస్తున్నాయి. కేవలం 28 జిల్లాల్లో ఆత్మహత్యలనే అధికారులు పరిగణలోకి తీసుకున్నారని రైతు సంఘాల నేతలు అరోపిస్తున్నారు. వాస్తవానికి ఈ మూడేళ్లలో 2వేల 600 మందికిపైగా రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని రైతు సంఘాల నేతలు పేర్లతో సహా వివరిస్తున్నారు.

త్రిసభ్య కమిటీ విచారణ పేరుతో మరిన్ని ఇబ్బందులు..
అటు పరిహారం చెల్లింపులోనూ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబసభ్యులను ముప్పుతిప్పలు పెడుతోంది ప్రభుత్వం. ఆత్మహత్య అని నిర్ధరించేందుకు 13 రకాల పత్రాలను అధికారులు అడుగుతున్నారు. ఆ పత్రాలన్నీ సమర్పించినా మళ్లీ త్రిసభ్య కమిటీ విచారణ పేరుతో బాధితుల్ని చెప్పులరిగేలా తిప్పుకుంటున్నారు. మరోవైపు రైతుల ఆత్మహత్యలకు ఆర్థిక ఇబ్బందులే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కేవలం భారత దేశంలో మాత్రమే వ్యవసాయం కోసం ప్రయివేటు అప్పులపై రైతన్నలు ఆధారపడుతున్నారు. ఈ డబ్బుకు అధిక వడ్డీలు చెల్లిస్తూ మరిన్ని ఇబ్బందుల్లో పడిపోతున్నారు. పెట్టుబడులు పెరిగిపోయి దిగుబడి సరిగారాక అన్నదాతలు అప్పుల్లో కూరుకుపోతున్నారు. వీటికితోడు నకిలీ విత్తనాలు, కల్తీ ఎరువులు, పురుగుల మందులు రైతులను నట్టేట ముంచుతున్నాయి. ఈ సమస్యలన్నీ దాటుకొని పంటను మార్కెట్‌కు తీసుకువెళితే అక్కడా గిట్టుబాటు ధర రావడం లేదు. వరుసగా రెండున్నరేళ్లు కరువు విలయతాండవం చేయడంతో పంటలు పండలేదు. ఇన్ని కష్టాలమధ్య వ్యవసాయం చేయలేక రైతులు బలవంతంగా తమ ఊపిరి తీసుకుంటున్నారు.

కోటి ఎకరాలకు పడిపోయిన సాగు విస్తీర్ణం..
ప్రభుత్వం రుణమాఫీ అమలు చేశామంటూ గొప్పగా చెప్పుకుంటున్నా రైతులకు ఇది ఏమాత్రం ఉపయోగపడలేదు. మొత్తం రుణంలో సంవత్సరానికి నాలుగో వంతు మాఫీ చేస్తామన్న సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం ఏడాదికి నాలుగు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయల చొప్పున బ్యాంకులకు జమ చేసింది. ఈ డబ్బుకు మూడు వంతులు కలిపి బ్యాంకులు కొత్త రుణాలివ్వాలి. బ్యాంకులు మాత్రం పాత రుణాలకు వడ్డీ లెక్కగట్టి... అదే పావు వంతు నగదును రైతులకు చెల్లిస్తున్నారు. ఇలా బ్యాంకుల మాయాజాలంతో రైతన్నలకు రుణమాఫీ వల్ల పెద్దగా ఒరిగిందేమీ లేకుండా పోయింది. బ్యాంకులు మాత్రం బుక్ అడ్జెస్ట్ మెంట్ చేసి అన్నదాతలకు మొత్తం రుణం ఇచ్చినట్టు పత్రాలు సిద్ధం చేస్తున్నాయి. దీంతో రుణమాఫీ ప్రహసనంగా మారింది. కొత్త రుణాలు పుట్టక.. పెట్టుబడులకు డబ్బు అందక.. రైతులు కాడి దించేయడంతో.. గడచిన మూడేళ్లలో సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. కోటిన్నర ఎకరాలు ఉన్న సాగు విస్తీర్ణం కోటి ఎకరాలకు తగ్గిపోయింది. చెరకు రైతుల సమస్యల్ని తీర్చేందుకు టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీకూడా మాటలకే పరిమితమైంది. నిజామాబాద్ జిల్లాలో చెరుకు పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేస్తామన్న వాగ్దానం ఆచరణకు ఆమడదూరంలో నిలిచింది. నిజాం షుగర్స్ మూసివేత ముగిసిన అధ్యాయమని శాసన సభలో సిఎం స్వయంగా ప్రకటించారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటు అంశంకూడా అదే పరిస్థితిలో ఉంది.

ఐదు సీజన్లలో రైతులను వేధించిన కరవు..
ఈ మూడేళ్లలో గత రబీ మినహా మిగతా ఐదు సీజన్లలో రైతుల్ని కరువు విపరీతంగా వేధించింది. మొదటి ఏడాదిలో కరవును రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదు. రెండో ఏడాది కరవు మండలాలు ప్రకటించినా ఇప్పటికీ కరువు సాయం అందించలేదు. కేంద్రం మంజూరు చేసిన 13వందల కోట్ల రూపాయలూ రైతన్నలకు ఇవ్వడానికి ముందుకు రాలేదు.. కరవు సాయంతోపాటు ప్రకృతి వైపరిత్యాల పరిహారం పంపిణీలోనూ ఇదే దారిలో సాగుతోంది.. రైతులకు ఎకరాకు 4వేల రూపాయలు ఇస్తామన్న హామీకూడా ఎన్నికల జిమ్మిక్కేఅంటున్నారు రైతు సంఘాల నేతలు. ఇలా రైతన్నలకు ఎన్నో చేస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం.. వాస్తవానికి రైతులకు మొండిచేయే చూపిస్తోంది. వ్యవసాయానికి మాటల్లోనే సాయం అందిస్తూ చేతల్లో చతికిలబడుతోంది.

పరిశ్రమ..ఫుడ్ ప్రాసెసింగ్ కొత్త ఛాంబర్ ప్రారంభం..

విజయవాడ : పరిశ్రమ..ఫుడ్ ప్రాసెసింగ్ కొత్త ఛాంబర్ ను మంత్రి అమర్ నాథ్ రెడ్డి ప్రారంభించారు. డి.నోటిఫికేషన్ పై సంతకం చేశారు. పరిశ్రమలకు రాష్ట్రం అనుకూలంగా ఉందని, రాష్ట్రంలో 950 కి.మీటర్ల కోస్టల్ కారిడార్ ఉందని విశాఖ టు చెన్నై, కాకినాడ టు చెన్నై పోర్టులు అభివృద్ధి చేస్తామని అమర్ నాథ్ రెడ్డి తెలిపారు. రానున్న రోజుల్లో విద్యుత్ ఛార్జీలు తగ్గే అవకాశం ఉందని, ఫుడ్ ప్రాసెసింగ్ కు చెందిన పరిశ్రమలను అభివృద్ధి చేస్తామన్నారు.

భార్యను రోకలిబండతో కొట్టి..

గుంటూరు : వినుకొండలో భార్యభర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. భార్య కళావతిని రోకలిబండతో భర్త కుమార్ కొట్టి చంపేశాడు. అనంతరం నిందితుడు కుమార్ పరారయ్యాడు.

నేవనల్ డాక్ యార్డులో విషాదం..

విశాఖపట్టణం : నేవనల్ డాక్ యార్డులో విషాదం చోటు చేసుకుంది. ఐఎన్ఎస్ రాణా యుద్ధ నౌకలో వికాస్ అనే ఉద్యోగి గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

చెన్నైలో అగ్నిప్రమాదం..24 గంటలూ గడిచినా..

చెన్నై : ఓ వస్త్ర దుకాణంలో చెలరేగిన మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. 24 గంటలుగా 60 ఫైరింజన్ల సహాయంతో 250 మంది సిబ్బంది నిరంతరాయంగా శ్రమిస్తున్నారు. భవనం కూలిపోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది.

 

10:04 - June 1, 2017

రాహుల్ శర్మపై కాల్పులు..

ఢిల్లీ : పీడబ్ల్యూడీ విభాగంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు..బన్సల్ తో పాటు పలువురు అధికారుల ప్రమేయం ఉన్నట్లు ఫిర్యాదు ఇచ్చిన రాహుల్ శర్మపై ఓ ఆగంతకుడు కాల్పులు జరిపడం కలకలం రేగుతోంది. ఈ ఘటనలో తాను తప్పించుకున్నట్లు రాహుల్ పేర్కొన్నారు. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. దాడి జరిగిన దృశ్యాలు సమీప సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

 

కొనసాగుతున్న కాల్పులు..

జమ్మూ కాశ్మీర్ : సోపోర్ లో భారత బలగాలు..ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. కాల్పుల్లో ఇద్దరు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు హతమయ్యారు. వీరివద్ద రెండు ఎకే 47, 5 మ్యాగజైన్ లు, రూ. 2000 వేల నోట్లు, 2 రబ్బర్ స్టాంపులను భారత బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

09:15 - June 1, 2017

‘లెగ్స్ ఫర్ డేస్..ఇది జీన్స్ వల్ల వచ్చిన అందం' అంటూ ప్రియాంక చోప్రా పేర్కొంటోంది. ఇలా పేర్కొనడానికి ఓ కారణం ఉంది. బాలీవుడ్ నటి 'ప్రియాంక చోప్రా' తన నటన..అందంతో అభిమానులను ఆకట్టుకొంటోంది. పలు హిందీ సినిమాల్లోనే కాక ఇటీవలే హాలీవుడ్ లో కూడా అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ‘బేవాచ్' మూవీ ప్రమోషన్ లో భాగంగా 'ప్రియాంక' బెర్లిన్ వెళ్లింది. ఇదే సమయంలో విదేశీ పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోడీ సోమవారం బెర్లిన్‌కు చేరుకున్నారు. ప్రధాని రాక గురించి తెలుసుకున్న ప్రియాంక.. ఆయనను కలిసింది. వీరి భేటీకి సంబంధించిన ఫోటోను 'ప్రియాంక' తన ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫొటోపై బిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి. ‘అంత పెద్ద మనిషి ఎదుట కాలు మీద కాలు వేసుకుని కూర్చొంటారా' అంటూ నెటిజన్లు మండిపడ్డారు. కానీ ఇది ఏ మాత్రం తప్పు కాదని అనుకుంటూనే మరో ఫొటోను 'ప్రియాంక' పోస్టు చేసింది. ఓ హోటల్ లో తన తల్లి మధుచోప్రాతో కలిసి పొట్టి దుస్తులు వేసుకుని ఫొటో దిగి ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు చేసింది. ‘లెగ్స్ ఫర్ డేస్..ఇది జీన్స్ వల్ల వచ్చిన అందం' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. విమర్శలకు డ్రెస్ తోనే సమాధానం ఇచ్చారని పలువురు పేర్కొంటున్నట్లు తెలుస్తోంది.

నెల్లూరు..ప్రకాశం జిల్లాల్లో వెంకయ్య..సుజనా పర్యటన..

ప్రకాశం : నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, సుజనా చౌదరిలు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

08:55 - June 1, 2017

తమిళ సూపర్ స్టార్ 'రజనీకాంత్' నటిస్తున్న 'కాలా' సినిమా షూటింగ్ హల్ చల్ చేస్తోంది. ఇటీవలే షూటింగ్ ప్రారంభించిన ఈసినిమా ప్రస్తుతం ముంబైలో కొనసాగుతోంది. ‘కబాలి' సినిమా విజయం అనంతరం 'రజనీ'..’రోబో 2’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా 'కబాలి' సినిమాకు దర్శకత్వం వహించిన పా.రంజిత్ తోనే మరో చిత్రానికి 'రజనీ' గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘కాలా' పేరిట రూపొందుతున్న సినిమాలో 'రజనీ' మాఫియా డాన్ గా కనిపించనున్నాడని టాక్. ఈ చిత్ర షూటింగ్ ముంబైలో జరుగుతోంది. దీనితో 'రజనీ' చూసేందుకు అభిమానులు భారీగా పోటెత్తుతున్నారు. దీనితో షూటింగ్ కు అంతరాయం కలుగుతున్నట్లు తెలుస్తోంది. పోలీసులతో పాటు ప్రైవేటు సెక్యూర్టీని చిత్ర యూనిట్ ఏర్పాటు చేసుకొంటోంది. షూటింగ్ అనంతరం 'రజనీ'తో ఫొటోలు తీసుకొనేందుకు అభిమానులు ఉత్సాహం చూపుతున్నారు. ముస్లింలు సంప్రదాయబద్దంగా ధరించే టోపితో రజనీకాంత్ నడిచే వెళ్లే కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక్కడ చిత్రీకరణ పూర్తయిన అనంతరం రెండో షెడ్యూల్ ను చెన్నై పూందమల్లి సమీపంలోని ఓ పార్కులో చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. రిలీజ్ అయిన అనంతరం 'కాలా' ఎలా అలరిస్తాడో చూడాలి.

08:50 - June 1, 2017

భారతీయ చలన చిత్ర పరిశ్రమ ఊహించని రికార్డులను 'బాహుబలి పార్ట్‌-2’ సాధిస్తోంది. విడుదలైన ప్రతిచోటా విజయవిహారం చేస్తోంది. కేవలం 17 రోజులకు రూ. 1620 కోట్లు రాబట్టి రికార్డ్స్ సాధించింది. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రభాస్..రానా..తమన్నా..అనుష్క, రమ్యకృష్ణ, నాజర్, ఇతర నటీనటుల నటనకు హాట్సాఫ్ అంటున్నారు. అంతేగాకుండా చిత్ర గ్రాఫిక్స్..ఆసక్తికర కథనం..ఉండడంతో సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా చేస్తోన్న సందడి అంతా ఇంతా కాదు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 33 రోజుల్లో రూ. 301 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. హిందీ విషయానికి వస్తే .. 33 రోజుల్లో రూ. 500 కోట్లను రాబట్టింది. రానున్న రోజుల్లో రూ. 2000 కోట్ల వరకూ వసూలు చేయవచ్చని సినీ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమాపై పలువురు సినీ దిగ్గజాలు..విమర్శకులు..సైతం ప్రశంసలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే.

08:40 - June 1, 2017

టాలీవుడ్ ప్రిన్స్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గడియలు రానే వచ్చేస్తున్నాయి. కొద్ది గంటల్లో 'స్పైడర్' టీజర్ విడుదల కాబోతోంది. ఉదయం 10.30 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో 'మహేష్' పోలీస్ ఇంటిలెజిన్స్ ఆఫీసర్ పాత్ర పోషిస్తుండగా ఆయన సరసన 'రకూల్ ప్రీత్ సింగ్' నటిస్తున్నారు. షూటింగ్ మొదలు పెట్టి చాలా రోజులు అయినా చిత్రానికి సంబంధించిన ఏ విషయమూ బయటకు పొక్కనీయడం లేదు. అంతేగాకుండా చిత్రానికి సంబంధించిన పోస్టర్స్ రిలీజ్ చేయలేదు. అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురి కావడంతో ఇటీవలే పలు పోస్టర్స్ రిలీజ్ చేశారు. మే 31వ తేదీన టీజర్ రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ పేర్కొన్న విషయం తెలిసిందే. కానీ ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు హఠాన్మరణంతో టీజర్ విడుదలను వాయిదా వేసుకున్నారు. గురువారం ఉదయం 10.30గంటలకు టీజర్ విడుదల కానుందని చిత్ర యూనిట్ పేర్కొంది.

08:15 - June 1, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అగ్నిమాపక పనితీరు ఎలా ఉందో ఈ ఘటన చూస్తే అర్థమౌతోంది. ఫైర్ స్టేషన్ కు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో స్వయంగా వెళ్లి తెప్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరూర్ నగర్ లోని కర్మన్ ఘాట్ లో ఉన్న టింబర్ డిపోలో గురువారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద వార్త తెలుసుకున్న టింబర్ యజమాని ఫైర్ స్టేషన్ కు ఫోన్ చేశాడు. కానీ అక్కడి నుండి స్పందన లేకపోయేసరికి నేరుగా ఫైర్ స్టేషన్ కు వెళ్లి ఘటనా స్థలికి ఫైర్ వాహనాన్ని తీసుకొచ్చే విధంగా చేశారు. కానీ వచ్చిన రెండూ శకటాల్లో మంచినీరు కూడా అయిపోయింది. దీనితో యజమాని స్వయంగా నీళ్లు తె ప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదంతా అయ్యేసరికి టింబర్ డిపోలో మంటలు చెలరేగాయి. చివరకు ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పారు. సుమారు రూ. 20 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.

08:11 - June 1, 2017

విజయవాడ : పెళ్లికి వెళ్లి వస్తున్న కానిస్టేబుళ్లు ఆసుపత్రి పాలయ్యారు. వీరు ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. మైలవరం వద్ద ఓ లారీ అదుపు తప్పి కారును ఢీకొంది. పెళ్లికని వెళ్లి వస్తున్న కానిస్టేబుళ్ల కారును ఢీకొంది. దీనితో కారులో ఉన్న ఆరుగురు కానిస్టేబుళ్లకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారయ్యాడు. అనంతరం క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని, మరో 42గంటలు గడిచేదాక ఎలాంటి పరిస్థితి చెప్పలేమని వైద్యులు పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. మెరుగైన వైద్యం అందించాలని పోలీసు ఉన్నతాధికారులు వైద్యులకు సూచించినట్లు తెలుస్తోంది.

07:36 - June 1, 2017

హైదరాబాద్ శివారులోని మియాపూర్ భూ కుంభకోణం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖలోని సబ్ రిజిష్ట్రార్లపై వేటు వేసింది. తొలి దశలో దాదాపు 72 రిజిష్ట్రార్లకు స్థాన చలనం కలిగించింది. మియాపూర్ లోని 1000 ఎకరాల బూమిని ఆక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన నేపథ్యంలో ప్రభుత్వానికి వందల కోట్ల మేర ఆదాయం నష్టం జరిగింది. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో నంద్యాల నర్సింహ రెడ్డి (సీపీఎం), రాకేష్ (టీఆర్ఎస్), రామచంద్రారెడ్డి (టి.కాంగ్రెస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

నరేష్ - స్వాతి కేసులో దిద్దుబాటు చర్యలు..

యాదాద్రి భువనగరి : నరేష్ - స్వాతి కేసులో టెన్ టివి వరుస కథనాలపై పోలీసులు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. ఆత్మకూరు ఎస్ఐ శివనాగ ప్రసాద్ సస్పెన్షన్ వేటు వేశారు. రామన్నపేట సీఐ శ్రీనివాస్, భువనగిరి సీఐ శంకర్ గౌడ్ కు భువనగిరి డీసీపీ యాదగిరి, భువనగిరి ఏసీపీ మోహన్ రెడ్డి, చౌటుప్పల్ ఏసీపీ స్నేహితకు ఛార్జ్ మెమో జారీ చేశారు.

నేడు సంగారెడ్డికి రాహుల్..

మెదక్ : ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. గురువారం మ‌ధ్యాహ్నాం మూడున్నర‌కు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రాయానికి రాహుల్ చేరుకుంటారు. అనంత‌రం పంజాగుట్ట లోని రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూల‌మాల వేస్తారు. అక్కడి నుంచి వేలాదిగా మోటార్ బైక్ ల‌ ర్యాలీతో రాహుల్ సంగారెడ్డికి బ‌య‌లుదేరుతారు. అనంతరం ప్రజాగర్జన బహిరంగసభలో పాల్గొననున్నారు.

నేడు ఏపీ మంత్రివర్గ భేటీ..

విజయవాడ : జూన్ రెండు నుంచి ప్రారంభ‌మ‌య్యే న‌వ‌నిర్మాణ దీక్షలే పధాన ఎజెండాగా ఇవాళ ఏపీ మంత్రివర్గం భేటీ అవుతోంది. పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

టి.మున్సిపల్ కార్మికుల ధర్నాలు..

హైదరాబాద్ : తెలంగాణలో మున్సిపల్ కార్మికులు మరోసారి పోరుబాట పడుతున్నారు. జిహెచ్ఎంసి పరిధిలో పనిచేస్తున్నవారి వేతనాలు పెంచినట్టే తమ వేతనాలూ పెంచాలంటూ జిల్లాల్లో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులు ఇవాళ ధర్నాలు చేసేందుకు సమాయత్తమవుతున్నారు.

07:11 - June 1, 2017

తెలంగాణలో మున్సిపల్ కార్మికులు మరోసారి పోరుబాట పడుతున్నారు. జిహెచ్ఎంసి పరిధిలో పనిచేస్తున్నవారి వేతనాలు పెంచినట్టే తమ వేతనాలూ పెంచాలంటూ జిల్లాల్లో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులు ఇవాళ ధర్నాలు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. తెలంగాణలోని మున్సిపల్ కార్మికులు ఇవాళ ధర్నాలు చేపట్టడానికి కారణం ఏమిటి? ప్రభుత్వం ముందు పెడుతున్న ప్రధానమైన డిమాండ్ ఏమిటి? . జిహెచ్ఎంసి కార్మికులతో పోల్చుకుంటే జిల్లాల్లోని వివిధ మున్సిపాలిటీలలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు ఎలా వున్నాయి? వేతన వ్యత్యాసాలకు కారణం ఏమిటి?. జిహెచ్ఎంసి పరిధిలోని కార్మికుల వేతనాలు పెంచిన ప్రభుత్వం ఇతర మున్సిపాలిటీలలో వేతనాలు పెంచకపోవడానికి మీరెలా అర్ధం చేసుకుంటున్నారు? తెలంగాణలో మున్సిపల్ వర్కర్స్ వర్కింగ్ కండిషన్స్ ఎలా వున్నాయి? సమాన పనికి సమాన వేతనం అన్న సుప్రీంకోర్టు తీర్పు ఎంత వరకు అమలవుతోంది?. తెలంగాణలో మున్సిపల్ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుంది? తెలంగాణలో మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ అంశంపై టెన్ టివి జనపథంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు వెంకటేష్ విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

06:53 - June 1, 2017

ఢిల్లీ :  15 మ్యాచ్‌లు....8 జట్లు.....4 హాట్‌ఫేవరెట్లు...ఒక్కటే టార్గెట్‌....

ఇంగ్లండ్‌లో ఇన్‌స్టంట్‌ వన్డే వార్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్‌-8లో ఉన్న జట్ల చాంపియన్స్‌ ట్రోఫీలో అసలు సిసలు సమరానికి రంగం సిద్ధమైంది. 18 రోజుల పాటు జరగనున్న మినీ వరల్డ్‌ కప్‌ సమరంలో 8 జట్లు టైటిల్‌ వేటలో బరిలోకి దిగబోతున్నాయి. క్రికెట్‌ హోంనేషన్‌...ఇంగ్లండ్‌లో ఇన్‌స్టంట్‌ వన్డే వార్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. టాప్‌-8 ర్యాంక్స్‌లో ఉన్న జట్ల చాంపియన్స్‌ ట్రోఫీలో అసలు సిసలు సమరానికి రంగం సిద్ధమైంది. 18 రోజుల పాటు జరుగనున్న మినీ వరల్డ్‌ కప్‌ సమరంలో 8 జట్లు టైటిల్‌ వేటలో బరిలోకి దిగబోతున్నాయి. గ్రూప్‌ అండ్‌ నాకౌట్ రౌండ్లలో నిర్వహించనున్న చాంపియన్స్‌ ట్రోఫీ క్రికెట్‌ ఫ్యాన్స్‌ను అలరించడానికి ముందుకొస్తోంది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మొదటి 8 స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య మహా సంగ్రామం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గ్రూప్‌ -Aలో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌, ఇంగ్లండ్‌ , న్యూజిలాండ్‌ జట్లు......గ్రూప్‌ -Bలో భారత్‌, పాకిస్థాన్‌, సౌతాఫ్రికా, శ్రీలంక జట్లు పోటీపడనున్నాయి. గ్రూప్‌ దశలో A,B లీగ్‌ నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌ రౌండ్‌కు అర్హత సాధిస్తాయి. సెమీస్‌లో గ్రూప్‌-ఎ విన్నర్‌తో గ్రూప్-బీ రన్నరప్‌ జట్టు....గ్రూప్‌-ఎ రన్నరప్‌తో గ్రూప్-బీ టాపర్‌ జట్టు ....ఫైనల్‌ బెర్త్‌ కోసం పోటీపడతాయి. ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరుగనున్న మ్యాచ్‌తో చాంపియన్స్‌ ట్రోఫీ ఆరంభం కానుంది.డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇండియా, రెండు సార్లు చాంపియన్‌ ఆస్ట్రేలియా, ఆతిధ్య ఇంగ్లండ్, సౌతాఫ్రికా జట్లు హాట్‌ఫేవరెట్లుగా బరిలోకి దిగనున్నాయి. మూడు వారాల పాటు జరుగనున్న ఈ మినీ వరల్డ్‌కప్‌లో నెగ్గి.....చాంపియన్స్‌ ట్రోఫీ సొంతంచేసుకునే జట్టేదో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్‌ చేయాల్సిందే.

06:49 - June 1, 2017

ఢిల్లీ : అఫ్ఘనిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో... ఉగ్ర బాంబు పేలుడుకు.. 80 మంది బలయ్యారు. దాదాపు 325మంది తీవ్రంగా గాయపడ్డారు.. భారత రాయబార కార్యాలయానికి అతి చేరువలో జరిగిన ఈ దాడిని తామే జరిపినట్లు ఐసిస్‌ ప్రకటించుకుంది. కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయానికి 50 మీటర్ల దూరంలో ఈ పేలుడు సంభవించింది.. క్షణాల్లో ఈ ప్రాంతమంతా నెత్తుటి చారికలు, క్షతగాత్రుల హాహాకారాలతో భయంకరంగా మారింది.. పేలుడు తర్వాత వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎంబసీ ఉద్యోగులను స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించారు.. పేలుడు ధాటికి భారత రాయబార కార్యాలయం కిటికి అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆ వెంటనే రాయబార కార్యాలయాన్ని మూసివేశారు. వివిధ దేశాల దౌత్యకార్యాలయాలున్న ఈ ప్రదేశానికి జర్మన్‌ గేటు ముఖద్వారంగా ఉంటుంది. దీనికి సమీపంలోనే జర్మనీ రాయబార కార్యాలయం ఉంది. ఈ పేలుడులో భారత ఎంబసీ సిబ్బంది ఎవరూ గాయపడలేదు.. వారంతా సురక్షితంగా ఉన్నారని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ ట్విట్టర్‌లో తెలిపారు.ఈ బాంబు దాడి చేసింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది.

06:46 - June 1, 2017

ఢిల్లీ : ఆమ్‌ ఆద్మీ పార్టీ బహిష్కృత నేత, మాజీ మంత్రి కపిల్‌ మిశ్రాపై దాడి జరిగింది. అసెంబ్లీ సాక్షిగా మిశ్రాపై శాసనసభ్యులు పిడిగుద్దులు కురిపించారు. జీఎస్టీపై చర్చించేందుకు నేడు దిల్లీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సమావేశానికి మిశ్రా కూడా హాజరయ్యారు. ఆ సమయంలో ఆప్‌ నేతలకు, మిశ్రాకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మిశ్రాను సభ నుంచి వెళ్లిపోవాలని స్పీకర్‌ రామ్‌ నివాస్‌ గోయల్‌ ఆదేశించారు. అయితే మిశ్రా వెళ్లకుండా అక్కడే ఉండేసరికి శాసనసభ్యులు ఆయనపై దాడి చేశారు. ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో మార్షల్స్‌ సాయంతో మిశ్రాను బయటకు పంపించారు. ఘటన అనంతరం మిశ్రా కేజ్రీవాల్‌పై విరుచుకుపడ్డారు. అసెంబ్లీలో ఓ శాసనసభ్యుడిపై తోటి ఎమ్మెల్యేలు దాడి చేయడం ఇదే తొలిసారి అని విచారం వ్యక్తం చేశారు. సీఎం కేజ్రీవాల్‌ అవినీతి గురించి తాను స్పీకర్‌కు లేఖ రాశానని, అసెంబ్లీలో మాట్లాడేందుకు అనుమతినివ్వాలని తాను ముందుగానే కోరినందుకే... తనపై ఇలా దాడి చేశారనని ఆరోపించారు.

06:43 - June 1, 2017

యాదాద్రి : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన నరేష్, స్వాతి కేసులో 10టీవీ వరుస కథనాలపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. తమ శాఖపై పెద్దఎత్తున వస్తోన్న విమర్శల పట్ల దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆత్మకూరు ఎస్సై శివనాగ ప్రసాద్‌ను సస్పెండ్ చేశారు. అలాగే.. భువనగిరి ఏసీపీ, డీసీపీతో పాటు.. చౌటుప్పల్‌ ఏసీపీ, రామన్నపేట, భువనగిరి సీఐలకు మెమోలు జారీ చేశారు. నెలరోజుల పాటు ఎన్నో మలుపులు తిరిగిన నరేష్‌-స్వాతిల కేసులో పోలీసుల నిర్లక్ష్యం ఉందని బయటపడింది. అదేవిధంగా స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డి ఒత్తిడికి లొంగి పోలీసులు ఆయనకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. మరోవైపు మేజర్లు అయిన నరేష్‌-స్వాతిలు ముంబైలో పోలీసుల అనుమతితో వివాహం చేసుకున్నప్పటికీ.. ఆత్మకూరు (ఎం) ఎస్‌ఐ శివనాగప్రసాద్‌ వారిద్దరిని తిరిగి స్వగ్రామం వచ్చేటట్టు చేసిన రాయభారం ఇప్పటికే ఆధారాలతో సహా బయటపడింది. వారిద్దరూ వచ్చిన తర్వాత రామన్నపేట సీఐ శ్రీనివాస్‌ సమక్షంలో పంచాయతీ నిర్వహించి ప్రేమజంటను బలవంతంగా విడదీసేందుకు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు.

మే 2న నరేష్ అదృశ్యం..
మే 2న నరేష్‌ అదృశ్యం అయిన వెంటనే పోలీసులను ఆశ్రయించారు తల్లిదండ్రులు. కానీ వారు సరిగ్గా స్పందించకపోగా... ఒకానొక సమయంలో నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. పోలీసుల తీరుతో విసుగు చెందిన నరేష్‌ తల్లిదండ్రులు న్యాయం కోసం... సీపీఎం, ప్రజాసంఘాలతో పాటు 10టీవీని ఆశ్రయించారు. హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో కేసు డీజీపీ వరకు వెళ్లింది. హైకోర్టు అక్షింతల అనంతరం కేసును ఎల్బీనగర్‌ డీసీపీ వెంకటేశ్వర్లుకు అప్పజెప్పడంతో కేసు ముందుకు కదిలింది. అయితే అప్పటికే పోలీసుల నిర్లక్ష్యం.. వేగంగా స్పందించకపోవడం వల్ల స్వాతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నరేష్‌ అదృశ్యమైనప్పుడు,... స్వాతి అనుమానాస్పద స్థితిలో మరణించినప్పుడు స్థానిక డివిజన్‌ పోలీసులు నరేష్‌ కుటుంబ సభ్యులనే అనుమానించారు. బాధిత కుటుంబ సభ్యులు శ్రీనివాసరెడ్డిపై అనుమానం వ్యక్తం చేసినా పోలీసులు ఆయన పట్ల సానుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. ఆ తర్వాత విచారణ చేపట్టిన ఎల్బీనగర్‌ డీసీపీ, ఎస్‌వోటీ పోలీసులను సైతం స్థానిక పోలీసులు తప్పుదోవ పట్టించారనే విమర్శలు తలెత్తాయి. అందుకే వారు మొదట నరేష్‌ తల్లిదండ్రులను, అక్కాబావలను, మిత్రులను విచారించారు. ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో మే 25న శ్రీనివాసరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించారు. శ్రీనివాసరెడ్డి చెప్పే విషయాలు ఒకదానికొకటి పొంతన లేకపోవడంతో ఆయనపై అనుమానం బలపడింది. తమదైన శైలిలో విచారించడంతో నిజాలు బయటపడ్డాయి.

10టివి బాసట..
లింగరాజుపల్లి శివారులోని తన పొలంలో శ్రీనివాసరెడ్డి నరేష్‌ను హత్య చేసి దహనం చేసినా.. ఆ కేసును కోర్టులో నిరూపించడం పోలీసులకు సాధ్యం కాదు. కనీసం నరేష్‌ చనిపోయినట్లు నిరూపించేందుకు సాంకేతిక ఆధారాలను కోర్టుకు అందించే అవకాశం లేదు. దీంతో పోలీసుల తీరుపై ప్రజాసంఘాలు భగ్గుమంటున్నాయి. ఈ దారుణానికి కారణమైన స్థానిక పోలీసులపై చర్యలు తీసుకోవాలని నరేష్‌ కుటుంబ సభ్యులతో పాటు.. ప్రజాసంఘాలు డిమాండ్‌ చేశాయి. వారికి 10టీవీ బాసటగా నిలిచింది. తాజాగా 30 సంఘాలతో ఏర్పాటైన నిజ నిర్ధారణ కమిటీ లింగరాజుపల్లి, పల్లెర్ల గ్రామాల్లో పర్యటించగా.. నిందితుడు శ్రీనివాసరెడ్డికి స్థానిక పోలీసుల మధ్య ఉన్న సఖ్యత బయటపడింది. మే 2 తర్వాత శ్రీనివాసరెడ్డి పోలీసులకు రెండుసార్లు విందు ఇచ్చినట్లు తెలిసింది.

దిద్దుబాటు చర్యలు..
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ కేసులో 10టీవీ పలు ఆధారాలను బయట పెట్టడంతో ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. ఇవాళ హైకోర్టులో పూర్తిస్థాయి నివేదిక అందజేయాల్సి ఉండడంతో .. దర్యాప్తులో నిర్లక్ష్యం వహించిన ఆత్మకూర్(ఎం) ఎస్ఐ శివనాగప్రసాద్‌ను రాచకొండ సీపీ మహేష్ భగవత్ సస్పెండ్ చేశారు. కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన రామన్నపేట సిఐ శ్రీనివాస్, భువనగిరి సిఐ శంకర్ గౌడ్‌లకు చార్జీ మెమో జారీ చేశారు. ఇక ఇంత జరుగుతున్నా సీరియస్‌గా తీసుకోకుండా బాధ్యతల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన యాదాద్రి జిల్లా డీసీపీ యాదగిరి, భువనగిరి ఎసీపీ మోహన్ రెడ్డి, చౌటుప్పల్ ఏసీపి స్నేహితలకు సైతం మెమోలు జారీ చేశారు. ఒకే కేసులో ఐదుగురు అధికారుల పట్ల చర్య తీసుకోవడం సంచలనం కలిగించింది. ఇప్పటికే వివిధ కేసుల్లో రాచకొండ కమీషనరేట్ పోలీసులు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలోనే సీపీ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారని.. అది నరేష్‌-స్వాతి కేసుతోనే ప్రారంభించారని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది.

06:39 - June 1, 2017

విజయవాడ : జూన్ రెండు నుంచి ప్రారంభ‌మ‌య్యే న‌వ‌నిర్మాణ దీక్షలే పధాన ఎజెండాగా ఇవాళ ఏపీ మంత్రివర్గం భేటీ అవుతోంది. కొత్తగా వ్యవసాయ పనులు మొదలవుతున్న తరుణం.. దాంతో పాటు మరో 13 రోజుల్లో కొత్త విద్యాసంవత్సరం కూడా ప్రారంభం అవుతున్న నేపథ్యంలో.. ఏపీ కేబినెట్‌ భేటీ ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో వ్యవసాయ, విద్యా కార్యక్రమాల అమలుపై మంత్రివర్గ సహచరులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో సినీ దర్శకుడు దాసరి నారాయణరావు మృతికి మంత్రివర్గం సంతాపం ప్రకటించనుంది. అటు జూన్ 2 నుంచి 8 వ‌ర‌కు రాష్ట్రవ్యాప్తంగా న‌వ‌నిర్మాణ దీక్షలు చేప‌ట్టాల‌ని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని జిల్లాల్లో దీక్షలు విజ‌యవంతం చేయాల‌ని సీయం భావిస్తున్నారు. దీనిపై మంత్రులంద‌రికి బాధ్యతలు అప్పగించనున్నారు. జూన్ 2న 9 గంట‌ల‌కు విజ‌య‌వాడ‌లోని బెంజ్ స‌ర్కిల్ వ‌ద్ద న‌వ‌నిర్మాణ దీక్షలో సీఎం చంద్రబాబు ప్రతిజ్ఙ చేస్తారు. అధికారం చేపట్టి జూన్‌ 8నాటికి 3సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కాకినాడలో భారీ బహిరంగసభను ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై కూడా క్యాబినెట్‌ భేటీలో మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ఇక వ్యవ‌సాయ భూమిని వ్యవ‌సాయేత‌ర భూమిగా మార్పు చేయడంలో భాగంగా పన్నులు భారీగా తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వం.. పన్నుల విధానాన్ని మరింత సరళతరం చేసింది. తాజాగా దీనికి సంబంధించి చట్ట సవరణ కోసం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చేందుకు ఆమోదం తెలపనున్నట్టు సమాచారం.

పలు అంశాలపై చర్చ..
మరోవైపు జూన్ నెల ప్రారంభం కావ‌డంతో.. రాష్ట్రంలో ఎక్కడా.. విత్తనాలు.. ఎరువులు కొరత లేకుండా చూసే అంశంపై కూడా మంత్రి వ‌ర్గంలో చ‌ర్చించ‌నున్నారు. అటు వ్యవ‌సాయ అధికారులు కూడా 'పోలం పిలుస్తోంది' పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అంశం పై చ‌ర్చించ‌నున్నారు. మ‌రో వైపు కృష్ణా డెల్టా కింద నారుమ‌డుల‌కు నీరు విడుద‌ల అంశంపై కూడా చ‌ర్చించ‌నున్నారు. ఇదిలావుంటే జూన్‌ 13 నుంచి విద్యాసంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో బడిఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించే 'బడి పిలుస్తోంది' కార్యక్రమం అమలు పై కూడా కేబినెట్‌ భేటీలో చర్చించనున్నారు. ఇక విశాఖలో భూ కుంభకోణంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో దీనిపై మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. దాంతోపాటు రాయలసీమ జిల్లాల్లో ఏపీఐఐసీ కి భూముల కేటాయింపు అంశం కూడా కేబినెట్‌ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

06:35 - June 1, 2017

మెదక్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ త‌ల‌పెట్టిన ప్రజా గ‌ర్జన‌కు స‌ర్వం సిద్దం అయింది. కేసీఆర్, మోదీ మూడేళ్ళ పాల‌న వైల్యాల‌పై ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఛార్జ్‌షీట్‌తో ఎండ‌గ‌ట్టడానికి రెడీ అయ్యారు. మినీ మ్యానిఫెస్టోను విడుద‌ల‌ చేసి, రాబోయే ఎన్నిక‌ల‌కు ఇక్కడ నుంచే సమరశంఖం పూరించడానికి రెడీ అవుతోంది హస్తం పార్టీ. గురువారం మ‌ధ్యాహ్నాం మూడున్నర‌కు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రాయానికి రాహుల్ చేరుకుంటారు. అనంత‌రం పంజాగుట్ట లోని రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూల‌మాల వేస్తారు. అక్కడి నుంచి వేలాదిగా మోటార్ బైక్ ల‌ ర్యాలీతో రాహుల్ సంగారెడ్డికి బ‌య‌లుదేరుతారు. దారి పొడవునా ..రాహుల్ భారీగా స్వాగ‌తం ప‌లికేలా ఏర్పాట్లు చేశారు. సంగారెడ్డి స‌భ‌ వేదిక‌గా కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల‌ను టార్గెట్ చేయ‌నుంది. తెలంగాణ ఆవిర్భావం త‌ర్వాత మూడేళ్ళ పాల‌న‌పై విమ‌ర్శలు గుప్పిస్తున్న హ‌స్తం పార్టీ.. కేసీఆర్ పాల‌న వైఫల్యాల‌ను గ‌ర్జన‌ ద్వారా ఎండ‌గడతామంటోంది. మ‌రోవైపు రాబోయే ఎన్నికలకు ఈ ప్రజాగర్జన సభ నుంచే రాహుల్ ఎన్నికల శంఖారావం పూరిస్తారని కాంగ్రెస్‌నేతలు అంటున్నారు. దానిలో భాగంగా రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ, నిరుద్యోగభృతి లాంటి పది హామీలతో కూడిన మినీ మ్యానిఫెస్టోను విడుదల చేస్తారని చెబుతున్నారు. మొత్తానికి తెలంగాణలో ఇప్పటికే రాజుకున్న పొలిటిక‌ల్ సెగ‌ను .. త‌మ‌కు అనుకులంగా మ‌లుచుకునేందుకు కాంగ్రెస్ ఈ ప్రజాగ‌ర్జన స‌భ‌ను వాడుకోనుంది. స‌భలో రాహుల్‌తో మోదీ, కేసీఆర్‌ల‌ను ఘాటుగా టార్గెట్ చేయించ‌డం ద్వారా... పార్టీ క్యాడ‌ర్‌లో ఉత్సాహం పెంచడంతోపాటు భారీగా జనసమీకరణ చేసి గులాబీ సర్కార్‌కు తమ బలం ఏంటో చాటుతామంటున్నారు హస్తం పార్టీ నేతలు.

06:31 - June 1, 2017

హైదరాబాద్ : తెలంగాణలో ఓ వైపు సబ్‌ రిజిస్ట్రార్ల బదిలీలు కొనసాగుతుండగానే.. మరోవైపు సబ్‌ రిజిస్ట్రార్ల కార్యాలయాలపై ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. ఎనీవేర్‌ విధానంతో జరిగిన అక్రమాలను కనిపెట్టేందుకు ప్రభుత్వం సిద్దమైంది. అవకతవకలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్దం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలపై ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో ఒకేసారి ఏసీబీ అధికారులు ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, మెదక్‌, నిజామాబాద్‌ జిల్లాలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలపై దాడులు చేశారు. కార్యాలయాలు, సబ్‌ రిజిస్ట్రార్‌ నివాసాలలో సోదాలు నిర్వహించారు. కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌కు అనుసరిస్తున్న తీరును పరిశీలించారు. మొత్తం 14 బృందాలు ఈ దాడుల్లో పాల్గొన్నాయి. అన్ని కార్యాలయాల్లో డాక్యుమెంట్లు అప్‌లోడింగ్‌, డాక్యుమెంట్లపై పూర్తి సమాచారం లేకపోవడం, దళారులపై ఆధారపడి పనులు చేయడంతో పాటు.. కొన్ని డాక్యుమెంట్లలో రిజిస్ట్రేషన్‌ చేస్తున్న స్థలానికి హద్దులను కూడా సూచించలేదని అధికారులు గుర్తించారు. దాడుల సందర్భంగా అధికారులు గుర్తించిన అవినీతి, అక్రమాలు, సిబ్బంది తీరు తదితర అంశాలపై పూర్తిస్థాయి నివేదిక ప్రభుత్వానికి అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లపై నిఘా నిరంతరంగా కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే అక్రమాలకు పాల్పడిన సబ్‌ రిజిస్ట్రార్లను అరెస్టు చేయగా.. తాజా దాడులతో రాష్ట్రవ్యాప్తంగా సబ్‌ రిజిస్ట్రార్లు భయాందోళనలకు గురవుతున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతోందనన్న టెన్షన్‌ వారిని వెంటాడుతోంది. ఇదిలావుంటే ప్రభుత్వం మాత్రం అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారు ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేస్తోంది.

06:29 - June 1, 2017

ఢిల్లీ : యూపీఎస్సీ సివిల్‌ సర్వీస్‌ ఫలితాలను ప్రకటించింది. కర్ణాటకకు చెందిన కె.ఆర్‌. నందిని టాపర్‌గా నిలవగా.. రెండో ర్యాంక్‌ అన్మోల్‌షేర్‌ సింగ్‌ సాధించారు. మూడో ర్యాంక్‌ తెలుగు రాష్ట్రానికి చెందిన గోపాలకృష్ణ రోణంకికి దక్కింది. మొత్తం 1099 మంది అభ్యర్థులను యూపీఎస్సీ ఎంపిక చేసింది. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సివిల్‌ సర్వీసెస్‌-2016 ఫలితాలను విడుదల చేసింది. కర్ణాటకకు చెందిన కె.ఆర్‌.నందిని టాపర్‌గా నిలిచారు. రెండో ర్యాంక్‌ అన్మోల్‌షేర్‌సింగ్‌ బేడీ, మూడో ర్యాంక్‌ గోపాలకృష్ణ రోణంకి, నాలుగో ర్యాంక్‌ సౌమ్య పాండే, ఐదో ర్యాంక్‌ అభిలాష్‌ మిశ్రా, ఆరో ర్యాంక్‌ కె.దినేశ్‌కుమార్‌, ఏడో ర్యాంక్‌ ఆనందర్‌వర్దన్‌, ఎనిమిదో ర్యాంక్‌ శ్వేతా చౌహాన్‌, తొమ్మిదో ర్యాంక్‌ సుమన్‌ సౌరవ్‌ మెహంతి, పదో ర్యాంక్‌ బిలాల్‌ మొహియుద్దీన్‌లు దక్కించుకున్నారు.

1099 మంది..
గత ఏడాది ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ పరీక్షలను యూపీఎస్సీ నిర్వహించింది. ఈ ఏడాది మార్చి-మే మధ్యలో ఇంటర్వ్యూలు చేపట్టి.. ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఆర్‌ఎస్‌లకు మొత్తం 1099 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. ఇందులో జనరల్‌ కేటగరిలో 500 మంది ఎంపిక కాగా.. ఓబీసీలో 347 మంది, 163 మంది ఎస్సీ, 89 మంది ఎస్టీ కేటగిరిలకు చెందిన వారున్నారు. ఎంపికైన వారిలో 44 మంది దివ్యాంగులు కూడా ఉన్నారు. మరో 220 మంది అభ్యర్ధులను యూపీఎస్సీ వెయిటింగ్‌ లిస్ట్‌లో పెట్టింది. గతేడాది 1206 పోస్టులకు సివిల్‌ సర్వీసెస్‌ నోటిఫికేషన్‌ విడుదల కాగా.. దేశవ్యాప్తంగా 11.36 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇక దేశ విద్యారంగాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నదే తన ఆకాంక్ష అని సివిల్‌ సర్వీసెస్‌ టాపర్‌ నందిని అన్నారు. నాలుగో ప్రయత్నంలో ఐఏఎస్‌ సాధించిన ఆమె.. నా కల ఫలించిందన్నారు. 2014లో సివిల్స్‌ రాసిన నందిని.. అప్పుడు ఐఆర్‌ఎస్‌కు ఎంపికయ్యారు. సివిల్స్‌ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు కూడా సత్తా చాటారు. మొదటి 25 ర్యాంకుల్లో 3వ ర్యాంక్‌ గోపాలకృష్ణ రోణంకి, 22వ ర్యాంక్‌ ముజమిల్‌ఖాన్‌లు సాధించారు. అలాగే తొలి 100 ర్యాంకుల్లో మిక్కిలినేని మనుచౌదరి 36వ ర్యాంక్‌, సురభి గౌతమ్‌ 50వ ర్యాంక్‌, పి.అన్వేషారెడ్డి 80వ ర్యాంక్‌ సాధించారు. ఇక పవన్‌ సమీర్‌కుమార్‌ చిర్రావురి 142వ ర్యాంక్‌, కర్నాటి వరుణ్‌రెడ్డి 166వ ర్యాంక్‌, మల్లవరపు బాలలత 167 ర్యాంక్‌ సాధించి.. సివిల్స్‌ తెలుగు సత్తా చాటారు.

మంత్రులు పరిటాల..సునీత నారాయణలు సమావేశం..

విజయవాడ : మున్సిపల్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల అధికారులతో మంత్రులు పరిటాల సునీత, నారాయణలు సమావేశం నిర్వహించారు. మున్సిపల్, అర్బన్ ప్రాంతాల్లోని అంగన్ వాడీ స్కూళ్లలో నర్సరీ, ఎల్.కె.జి. యు.కె.జి తరగతుల ఆరంభంపై చర్చ జరిగింది.

తెలంగాణలో లక్షే..ఇక్కడ లక్షన్నర - బాబు..

విజయవాడ : తెలంగాణ రాష్ట్రంలో రూ. లక్ష మాత్రమే రుణమాఫీ చేశారని, ఏపీలో రైతులందరికీ రూ. లక్షన్నర రుణమాఫీ చేయడం జరిగిందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

 

2016 సివిల్స్ ర్యాంకులు..

ఢిల్లీ : 2016 సివిల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. గ్రూప్ -ఏ, బీ ఫలితాలను యూపీఎస్పీ విడుదల చేసింది. 1 ర్యాంకు కేఆర్ నందిని (కర్నాటక), 2వ ర్యాంక్ ఆన్ మోల్ షేర్ సింగ్ బేడీ, 3 ర్యాంకు గోపాలకృష్ణ (శ్రీకాకుళం), 4వ ర్యాంకు సౌమ్యా పాండే, 5వ ర్యాంకు అభిలాష్ మిశ్రా, 6వ ర్యాంకు కొత్తలమాసు దినేష్ కుమార్, 7వ ర్యాంకు ఆనంద్ వర్ధన్, 8వ ర్యాంకు శ్వేతా చౌహాన్, 9వ ర్యాంకు సుమన్ సౌరవ్ మహంతి, 10వర్యాంకు బిలాల్ మొహిద్దీన్ భట్.

దొరవారిసత్రం వద్ద రోడ్డు ప్రమాదం..

నెల్లూరు : దొరవారిసత్రం (మం) కారికాడు వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు - ఆటో ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు నాగయ్య, శేషయ్య, చంద్రయ్య, సుబ్రమణ్యంలుగా గుర్తించారు.

చంద్రన్న బీమా పథకం అమలుపై బాబు సమీక్ష..

విజయవాడ : చంద్రన్న బీమా పథకం అమలుపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. బీమా క్లయిమ్ చేయడానికి అవసరమయ్యే పత్రాలు ఇవ్వాల్సిన శాఖలన్నీ సమన్వయం చేసుకొని పనిచేయాలని బాబు పేర్కొన్నారు. కాల్ స ఎంటర్ దగ్గరి నుండి పరిహారం చెల్లించే బీమా కంపెనీ..ప్రతి శాఖ సేవా ప్రమాణాలు పాటించాలని సూచించారు.

Don't Miss