Activities calendar

02 June 2017

21:20 - June 2, 2017
21:20 - June 2, 2017
20:26 - June 2, 2017

తాంబూలాలిచ్చేశారు... తన్నుకు చావమన్నారు..విభజించేశారు.. మీ గోల మీరు చూసుకోండి అంటున్నారు..విభజన చట్టం అమలు అంతంత మాత్రం.. ప్రత్యేక హోదా అమలు ఊసు లేదు.. పైగా ఇవ్వనివి కూడా ఇస్తున్నామంటారు. పంపకాల వివాదాలు పట్టించుకోరు.. వెరసి మూడేళ్లుగా రెండు రాష్ట్రాల్లో... కేంద్రం అలసత్వం స్పష్టంగా కనిపిస్తున్న తీరుపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. అన్నదమ్ములు విడిపోతే... భవిష్యత్తులో ఏ గొడవా రాకుండా పెద్దలు జాగ్రత్తగా పంపకాలు చేస్తారు. ఆ పంపకాలు కూడా వీలైనంత సమంజసంగా ఉండేలా చూస్తారు. కానీ, ఇక్కడ రాజకీయ ప్రయోజనాలు తప్ప రాష్ట్రాలకు మేలు చేసే ధోరణి కనిపిస్తోందా? మంచి జరిగితే తాము చేసినట్టు... నష్టం జరిగితే అది చట్టంలో లోపం.. ఇదేనా న్యాయం అని తెలుగు రాష్ట్రాలు ప్రశ్నిస్తున్నాయి. 

20:18 - June 2, 2017

ముందుగాళ్ల ముందుగాళ్ల.. తెలంగాణ ముఖ్యమంత్రి సారుకు శుభాకాంక్షలు... తెలంగాణ పువ్వుగుర్తోళ్లు ఊరువాడ గడ్పగడ్ప దిర్గుతున్నడు.. రెండేండ్ల తర్వాత వచ్చె ఎన్నికల కోసం ఇప్పటి సందే ప్రచారం సుర్వు జేశిండ్రు..అయ్యా శీన్మ ఏశకాడా... మురళి మోహను..? ఏడున్నవయ్యా..? నీ జాడ తెల్వక నీకు ఓట్లేశిన రాజమండ్రి జనం కండ్లళ్ల ఒత్తులేస్కోని ఎదురు సూస్తున్నరు.. మా ఎంపీగారు గనిపిస్తలేడని కన్నీళ్ల పర్వాంతమైతున్నరు.. పనులు జేపిచ్చుకుంటరుగని.. పైసలు ఇయ్యిమంటె ఇయ్యరా.. కొడ్కా మీరు..? రాండ్రి ఎన్నడన్న నాకు దొర్కకపోతరా..? నా ప్రతాపం జూపెట్టనా..? ఫలానాయిన పెండ్లాం మంచిది గాదని ఎవ్వడన్న ఒక కాయిదం రాశి వాళ్ల ఇంటిముంగట ఏశిపోతె ఎంత ఆగముంటది చెప్పుండ్రి..? ఆలూ లేదు సూలు లేదు కొడ్కుపేరు సోమిరెడ్డి అన్నట్టు.. తెలంగాణ ప్రభుత్వం గొర్లు గొననే లేదు అవ్వి కొంటె తీస్కనే రాలేదు.. తీస్కొస్తె గొల్ల కుర్మోళ్లకు ఇయ్యనే లేదు.. దేవున్ని జూశిండ్రా మీరు ఎన్నడన్న.. అంటే పోట్వలళ్ల జూసుడుగాదు..? నిజంగ జూశిండ్రా..? సూడలే... నేను జూపెడ్తరాండ్రి..? అభిమానం.. ఇది కట్టలు దెంచుకుంటే కేసీఆర్ ఫ్యాన్స్ అయితరేమో అనిపిస్తది.. కేసీఆర్ అంటె మెడగోస్కునె ఫాన్సేగాదు.. పొలం దున్ని కేసీఆర్ అనే ఇత్తునాలను గూడ సల్లెటోళ్లున్నరు.

 

 

 

 

 

20:15 - June 2, 2017

త్రివేడ్రం : జూన్‌ 8న కేరళ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. పశువధకు సంబంధించి సంతలో పశువుల కొనుగోళ్లు, అమ్మకాలను నిషేధిస్తూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి రాజు మీడియాకు తెలిపారు. అసెంబ్లీలో చర్చ అనంతరం దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పారు. వధించడం కోసం సంతలో పశువుల కొనుగోళ్లు, అమ్మకాలను కేంద్రం నిషేధిస్తూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను విజయన్‌ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. కేంద్రం నిర్ణయం రాష్ట్రాల అధికారాలను హరించేవిధంగా ఉందని...దీన్ని వ్యతిరేకిస్తామని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది.

20:14 - June 2, 2017

చెన్నై : తమిళనాడు కోయంబత్తూర్‌ సమీపంలోని పొడనూరు గ్రామంలో ఏనుగు బీభత్సం సృష్టించింది. తెల్లవారుజామున గ్రామంలోకి ప్రవేశించిన ఏనుగు ఇళ్లపై దాడి చేసి నలుగురు వ్యక్తుల ప్రాణాలు తీసింది. ఈ దాడిలో మరో ఇద్దరు గాయపడ్డారు. తెల్లవారుజామున మూడున్నర ప్రాంతంలో విజయ్‌కుమార్‌ ఇంటిపై దాడి చేసింది. ఈ ఘటనలో ఆయన కూతురు 12 ఏళ్ల గాయత్రి మృతి చెందగా...విజయ్‌కుమార్‌కు చేయి విరిగింది. కంజిక్కోనంపాలయంలో నాగరత్నం, జోతిమణి, పళనిసామిలను ఏనుగు పొట్టనపెట్టుకుంది. గాయపడ్డవారిని కోయంబత్తూర్‌ ఆసుపత్రికి తరలించారు. ఏనుగును వెల్లలూరు అడవిలోకి పంపేందుకు అటవీశాఖ సిబ్బంది చర్యలు చేపట్టింది.

 

20:13 - June 2, 2017

హైదరాబాద్ : ఇప్పటివరకు హైదరాబాద్‌ మహానగరంలో లోకల్‌ చోర్ గ్యాంగ్‌లను చూశాం...పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన ముఠాలను చూస్తున్నాం...ఎన్నో నేరాలు చేస్తూనే ఉన్నారు...పట్టుబడ్డా మళ్లీ మళ్లీ క్రైం చేస్తున్నారు...కాని ఇప్పుడు అంతర్జాతీయ నేరగాళ్ల కన్ను నగరంపై పడింది...పెరూ దేశం నుంచి వచ్చిన గ్యాంగ్‌ నగరంలో నేరాలు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడయింది...ఇది పోలీసు శాఖకు ఖంగుతినిపించినా ఈ మధ్యనే జరిగిన ఓ సంచలన కేసులో విదేశీ క్రిమినల్స్‌ ఉన్నట్లు తేలింది...దీంతో పోలీసులు అప్రమత్తమయి అంతర్జాతీయ ముఠాల కోసం గాలింపు ముమ్మరం సరిగ్గా నెలన్నర క్రితం నగరంలో సంచలనం రేపిన బంగారం వ్యాపారి అగర్వాల్‌ నుంచి మూడు కిలోల గోల్డ్‌ తస్కరించిన ముఠా అంతర్జాతీయ గ్యాంగే....నిందితులు ఓఎల్‌ఎక్స్‌లో కొనుగోలు చేసిన కారులో హైదరాబాద్‌లో ఏప్రిల్‌ 9 నుంచి 16వ తేదీ వరకు చోరీలు చేయడానికి సంచరించారు...చివరికి వ్యాపారి సొమ్మును చోరీ చేసిన నిందితులు సొత్తుతో పెరు దేశానికి పరారైనట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడయింది.

అభిషేక్ అగర్వాల్‌
బషీర్‌బాగ్‌లోని యషశ్రీ జువెల్లర్స్ చెందిన అభిషేక్ అగర్వాల్‌ వారు తయారు చేసిన వివిధ డిజైన్ల ఆభరణాలను నగరంలోని జువెల్లర్స్‌కు విక్రయిస్తుంటారు... దీంతోనే ఎప్రిల్ 16న మూడున్నర కిలోల బంగారు ఆభరణాలను తీసుకుని కారులో బయల్దేరి కూకట్‌పల్లి ,చందానగర్ ప్రాంతాల్లోని జువెల్లర్ షోరూంలకు వెళ్లాడు.. తిరుగు ప్రయాణం చేస్తున్న అగర్వాల్‌ కారు మధ్యలో టైర్ పంక్చరయింది. కారు టైరు పంక్చర్ కాగా తన అసిస్టెంట్‌తో మార్చుకునే సమయంలోనే మూడున్నర కిలోల బంగారం బ్యాగ్‌ను మాయం చేసింది ముఠా. నెలరోజుల పాటు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన సైబరాబాద్‌ పోలీసులు... పెరూ దేశానికి చెందిన నలుగురు వ్యక్తులకు సహకరించిన మరో నలుగురు బెంగళూరు వాసులను అరెస్టు చేశారు. నలుగురు నిందితుల నుంచి కొంత మేర బంగారం, కారు స్వాధీనం చేసుకున్నారు.చోరీ సొత్తుతో పెరూదేశానికి పారిపోయిన అంతర్జాతీయ నేరగాళ్ల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు...

 

20:11 - June 2, 2017

విశాఖ : విశాఖలో పోకిరీ నేవీ ఉద్యోగి. యువతి స్నానం చేస్తుండగా సెల్‌ఫోన్‌తో వీడియో చిత్రీకరణ. పోకిరీని పట్టుకుని చితగ్గొట్టిన జనం. దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగింత. ఆకతాయి వేషాలు వేసినందుకు విశాఖలో ఓ నేవీ ఉద్యోగిని స్థానికులు ఉతికారేశారు. యువతి స్నానం చేస్తుండగా వీడియో చిత్రీకరిస్తుండగా చూసిన జనంలో ఒక్కసారి ఆగ్రహం వచ్చింది..అంతే వెంటనే పట్టుకున్న వారంతా కలిసి దేహశుద్ది చేశారు. ఆ సమయంలో శివాలెత్తిన యువతి..నిందితుడిని చెప్పుతో రఫ్పాండించింది. నేవీ ఉద్యోగి ఒళ్లు హూనం చేసిన స్థానికులు పోలీసులకు అప్పగించారు...మహిళ ఫిర్యాదు మేరకు మల్కాపురం పోలీసులు కేసు నమోదు చేసి, స్టేషన్‌కు తరలించారు. పోలీసుల విచారణలో నిందితుడు నేవీ ఉద్యోగి అని...నేవల్ డాక్‌యార్డ్‌లో పని చేస్తున్నట్లు తేలింది. పోకిరీ వేషాలేస్తే చివరకు జరిగేది ఇదే.

20:10 - June 2, 2017

హైదరాబాద్ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సీపీఐ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. సీపీఐ కార్యాలయంలో జాతీయ జెండాను చాడా వెంకట్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. తెలంగాణను వ్యతిరేకించిన వారు కేసీఆర్‌ క్యాబినెట్‌లో మంత్రులుగా ఉన్నారని విమర్శించారు. లక్ష ఉద్యోగాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు , దళితులకు మూడు ఎకరాలు భూమి పంపిణీ వంటి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కేసీఆర్ మాటల గారడీలు చేస్తున్నారని మండిపడ్డారు

20:08 - June 2, 2017

హైదరాబాద్ : హైదరాబాద్‌ గన్‌పార్క్‌ దగ్గర పలు పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నేతలు అమరవీరులకు నివాళులు అర్పించారు.. పోరాడి తెలంగాణ సాధించుకున్నామని గుర్తుచేసుకున్నారు.. టీఆర్‌ఎస్‌ పాలనపై విమర్శలు గుప్పించారు.

 

శ్రీ హిందు కాలేజీ వద్ద ఉద్రిక్తత

రంగారెడ్డి : జిల్లాలోని ఇబ్రహీంపట్నం శ్రీ హిందు కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. గురువారం ఆత్మహత్య చేసుకున్న ఇంజనీరింగ్ విద్యార్థిని రోషిణి మృతదేహానకి ఉస్మానియాలో పోస్టుమార్టం అనంతరం మృతిదేహంతో కాలేజీ ముందు బైఠాయించారు. రోషిణి మృతికి కాలేజీ యాజమాన్యమే కారణమంటూ బంధువుల ఆందోళన నిర్వహించారు. కాలేజీ యాజమాన్యం రోషిణిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని వారు ఆరోపించారు. 

నాటి త్యాగానికి నేడు సాయం

నల్లగొండ : జిల్లా గరిడేపల్లి మండలం రాయినిగూడెం చెందిన పిడమర్తి నాగరాజుకు సీఎంవో రూ.10లక్షల ఆర్థిక సాయం అందించింది. ఉద్యమ సమయంలో నాగరాజు ఆత్మహత్యయత్నం చేశారు.

 

19:20 - June 2, 2017

టుడే అవర్ రీసెంట్ రిలీజ్ ఫిల్మ్... 'అంధగాడు'. మరి సినిమా కహాని ఎంటో ఇప్పుడు చూద్దాం.....

 

19:19 - June 2, 2017

టుడే అవర్ రిసెట్ రిలీజ్ ఫిల్మ్స్ లేడిస్ టైలర్ మరి సినిమా కహాని ఎంటో ఇప్పుడు చూద్దాం.....

19:10 - June 2, 2017

రంగారెడ్డి : జిల్లాలోని ఇబ్రహీంపట్నం శ్రీ హిందు కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. గురువారం ఆత్మహత్య చేసుకున్న ఇంజనీరింగ్ విద్యార్థిని రోషిణి మృతదేహానకి ఉస్మానియాలో పోస్టుమార్టం అనంతరం మృతిదేహంతో కాలేజీ ముందు బైఠాయించారు. రోషిణి మృతికి కాలేజీ యాజమాన్యమే కారణమంటూ బంధువుల ఆందోళన నిర్వహించారు. కాలేజీ యాజమాన్యం రోషిణిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని వారు ఆరోపించారు. కాలేజీ చైర్మన్ వెంకటరావును వెంటనే అరెస్ట్ చేయాలని రోషిణి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. సాగర్ హైవేపూ ధర్నా చేయడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. 

18:56 - June 2, 2017

అనంతపురం : జిల్లా కేంద్రంలోని చంద్రబాబు కాలనీలో ఐదుగురు యువకులు ఆత్మహత్యయత్నం చేశారు. వారు పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం పాల్పడ్డారు. వారిని ఆసుపత్రికి తరిలించారు. పోలీసుల వేధింపులతోనే యువకులు ఆత్మహత్య యత్నం చేసుకున్నారని వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రెండు రోజుల క్రింద ప్రేమ విషయంలో ఐదుగురు యువకులను పోలీసు స్టేషన్ తీసుకెళ్లి చితబాదడంతో పాటు వారి రోజు పోలీసు స్టేషన్ రావాలని ఆదేశించడంతో యువకులు భయపడి ఆత్మహత్యకు పాల్పడ్డటు తెలుస్తోంది. పూర్తి విరాలకు వీడియో చూడండి.

 

18:54 - June 2, 2017

తూర్పు గోదావరి : మురళీ మోహన్‌.. తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నటుడు, నిర్మాత. రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఈ విషయాలు అందరికీ తెలుసు. కానీ ఆయన ఓ ఎంపీ. రాజమహేంద్రవరం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరపున విజయం సాధించారు. అయినా ఈయనకిప్పుడు సినిమా నటుడని గుర్తుంది కానీ.. తాను ఒక ఎంపీ అనే విషయం మర్చేపోయారు. అందుకే సొంత నియోజకవర్గానికి కూడా ఆయన చుట్టపు చూపుగానే వస్తున్నారు. ఇప్పుడు మురళీమోహన్ రాజమహేంద్రవరం ఎంపీ అనే విషయం.. ఈ నియోజకవర్గ ప్రజలు కూడా మరచిపోయారు. మురళీ మోహన్‌ ఇప్పుడు సినిమా ఫంక్షన్లు, కళారంగానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అదే ప్రజా సేవ అన్నట్టు వ్యవహరిస్తున్నారు. చివరగా ఆయన ఈ మధ్య ఇక్కడ జరిగిన నాటకోత్సవ కార్యక్రమాల్లో కనిపించారు.

 

18:53 - June 2, 2017

విజయవాడ : విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు పనులు నత్తనడకన నడుస్తున్నాయి. అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు విజయవాడలోని ఏలూరు రోడ్, బందర్ రోడ్ కారిడార్లకు సివిల్ వర్క్ కోసం టెండర్లు పిలిచి రెండు కంపెనీలను ఎంపిక చేశారు. దీనికి సంబంధించి ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులకు మెట్రో రైలు ప్రాజెక్టు వివరాలతో కూడిన సమగ్ర నివేదిక పంపారు. ఏఎంఆర్సీ ఎండీ రామకృష్ణారెడ్డి డీఎంఆర్సీ ఎండీ శ్రీధరన్‌కు ప్రాజెక్ట్‌పై కూలంకషంగా వివరించారు. ఇక టెండర్లు ఖరారవుతాయని భావిస్తున్న తరుణంలో ఏకంగా టెండర్లనే రద్దు చేస్తూ డిఎంఆర్సీ అధికారులు నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

టెండర్ల రద్దు....
ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్.. విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్ట్ టెండర్లను రద్దు చేయడం ఇది రెండవసారి. ఒకసారి టెండర్లు రద్దయిన తరువాత తిరిగి 2016 నవంబర్ 28న రెండోసారి టెండర్లు పిలిచింది. రెండో దఫా టెండర్లను పిలిచిన వెంటనే డీఎంఆర్సీ సవరింపునకు తెరలేపింది. సవరింపుకు ముందు పలు సంస్థలు టెండర్లలో పాల్గొనేందుకు ఆసక్తి చూపాయి. సవరింపు తర్వాత కేవలం సింప్లెక్స్ ఇండియా, ఎల్ అండ్ టీ, ఆఫ్కాన్స్ సంస్థలు మాత్రమే బరిలో నిలిచాయి. ఈ మూడు సంస్థలు టెక్నికల్, ఫైనాన్షియల్ బిడ్లను వేశాయి. అర్హతల ప్రకారం తగిన అనుభవం లేకపోవంతో సింప్లెక్స్ ఇండియాను టెండర్ల ప్రక్రియ నుంచి తప్పించారు. ఇక మిగిలిన రెండు సంస్థలు ఎల్ అండ్ టీ, ఆఫ్కాన్స్ సంస్థలు ఫైనాన్షియల్ బిడ్లను దాఖలు చేశాయి. డీఎంఆర్సీ ప్రతిపాదించిన అంచనా విలువ కంటే అధికమొత్తంలో సదరు రెండు సంస్థలు కోట్ చేయడంతో డీఎంఆర్సీ టెండర్లు రద్దు చేసింది.

తుది అనుమతులు
మరోవైపు క్షేత్రస్థాయిలో విజయవాడ మెట్రో ట్రైన్ ప్రాజెక్ట్‌కు తుది అనుమతులు రాలేదు. ఏపీ ప్రభుత్వ వాటాగా బ్యాంకుల నుంచి రుణం సర్దుబాటు కావాల్సి ఉంది. విదేశీ సంస్థల నుంచి రుణానికై అగ్రిమెంట్ కూడా జరగాల్సి ఉంది. వీటికితోడు భూ సేకరణపై సస్పెన్స్ నెలకొంది. 2019 నాటికల్లా మెట్రోను ప్రారంభించాలనేది సీఎం చంద్రబాబు భావిస్తున్నా అధికారులు సమన్వయంతో ముందుకెళ్తే తప్ప బెజవాడ మెట్రో సాకారమయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

 

18:52 - June 2, 2017

గుంటూరు : ఏపీ సచివాలయంలో ఎయిర్ పోర్ట్ అధికారులతో అధికారులతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు... రాష్ట్రానికి ఎయిర్ కనెక్టివిటీపై అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో ఎయిర్ కనెక్టివిటీ సరిగాలేదని వారితో అన్నారు.. ఈ సమస్య వల్ల పెట్టుబడులు పెట్టేందుకు ఐటీ కంపెనీలు ముందుకు రావడం లేదని చెప్పారు. రాష్ట్రంలోని ఎయిర్ పోర్టులను అభివృద్ధి చేయాలని... మరిన్ని విమాన సర్వీసులు అందించే సంస్థలను ఆహ్వానించాలని అధికారుల్ని లోకేష్ కోరారు.. వీటితోపాటు కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణం, అమరావతికి ఎయిర్ కనెక్టివిటీపై ప్రతిపాదనలు సిద్ధం చెయ్యాలని సూచించారు.. విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, రాజమండ్రి, కడప ఎయిర్ పోర్టుల ప్రస్తుత పరిస్థితి, వాటి అభివృద్ధికి రూపొందించిన ప్రణాళికలను అధికారులు లోకేష్‌కు వివరించారు.

18:50 - June 2, 2017

గుంటూరు : ప్రతిజ్ఞ బూనుదాం... ప్రగతి సాదిద్ధామనే నినాదంతో ఏపీ ప్రజలు ముందుకు కదిలారు. అన్ని జిల్లాల్లో నవనిర్మాణ దీక్ష కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా అనంతపురంలోని మున్సిపల్‌ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగం కావాలని కలెక్టర్ వీరపాండ్యన్‌ పిలుపునిచ్చారు.అలాగే గుంటూరు జిల్లా.. తెనాలిలోనూ నవ నిర్మాణ దీక్ష కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా మంత్రి నక్కా ఆనంద్‌ఆబు, ఎమ్మెల్యే ఆలపాటిరాజా పేదవారికి భూ పట్టాలు పంపిణీ చేశారు.పశ్చిమగోదావరి జిల్లా..ఏలూరు పేరెడ్‌ గ్రౌండ్‌ నుంచి ఫైర్‌ స్టేషన్‌ సెంటర్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి పితాని, ఎక్సైజ్‌ మంత్రి జవహర్‌... పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో నవనిర్మాణ దీక్షా కార్యక్రమాలు జరిగాయి. కాకినాడ కలక్టర్ కార్యాలయం నుంచి బాలజీ చెరువు సెంటర్ వరకూ..ర్యాలీ నిర్వహించారు. అనంతరం బాలాజీ చెరువు సెంటర్లో జరిగిన నవనిర్మాణ దీక్ష సభలో ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించారు. పట్టణంలో జరిగిన ర్యాలీని మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. జిల్లావాసులు పెద్దసంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. ఈ నెల 8న నవ నిర్మాణ దీక్ష ముగియనుంది. ముగింపు సభను .. కాకినాడలో నిర్వహించనున్నారు. దీని కోసం ఆనంద్‌ భారతి గ్రౌండ్‌ను హోంమంత్రి చినరాజప్ప, కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా పరిశీలించారు.  

18:49 - June 2, 2017

తూర్పు గోదావరి : జిల్లాలోని కాకినాడలో అధికారుల నిర్లక్ష్యాంతో యువతి బలి అయ్యింది. జ్యోతుల మార్కెట్ లో హోర్డింగ్ కూలి యువతి దుర్మరణం చెందారు. హోర్డింగ్ కు కాలం చెల్లిన అధికారులు దాన్ని తొలిగించకోవడంతో ఈ ఘనట జరిగింది. అధికారలు యాడ్ ఏజన్సీలతో కుమ్మక్కు కావడంతో హోర్డింగ్ లు తొలగించాలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మృతరాలు ఇంద్రపాలెం వాసిగా పోలీసులు గుర్తించారు. ఆమె బీ ఫార్మసీ చేస్తోనట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

18:48 - June 2, 2017

హైదరాబాద్ : నిన్న అర్దాంతరంగా మెడ్విన్ కాలేజీని మూసివేయడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ నిన్నటి నుంచి విద్యార్థులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం లక్షల్లో ఫీజులు వసూలు చేసి బోర్డు తిప్పేయడం దారుణమని అన్నారు. మూడు నెలలుగా అధ్యాపకులకు కూడా యాజమాన్యం జీతాలు ఇవ్వడంలేదని తెలిపారు. విద్యార్థులు అబిడ్స పోలీసలకు, డాఎంఈకి నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ కు ఫిర్యాదు చేశారు. 

18:47 - June 2, 2017

హైదరాబాద్ : తెలంగాణ ఆవిర్భావం తర్వాతనే సింగరేణి సంస్థ మునుపెన్నడూ లేని ప్రగతిని సాధించిందన్నారు ఆ సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్. అందుకు సీఎం కేసీఆర్‌ తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ కూడా కారణమన్నారు. హైదరాబాద్ సింగరేణి భవన్‌లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో శ్రీధర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతకు ముందు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఆయన మహాత్మాగాంధీ, తెలంగాణ తల్లి, తెలంగాణ సిద్ధాంతకర్త శ్రీజయశంకర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం హైదరాబాద్‌ కార్యాలయంలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను సన్మానించారు. 

తెలంగాణలో వీఆర్ఏల జీతాల పెంపు

హైదరాబాద్ : తెలంగాణలో వీఆర్ఏల జీతాలు పెంచుతూ ప్రభుత్వ నిర్ణయం. వీఆర్ఏల జీతం నెలకు రూ.6వేల నుంచి రూ.10,500 పెంచుతూ ప్రభుత్వ జీవో విడుదల చేసింది. పెరిగిన జీతాలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి.

 

16:49 - June 2, 2017

మానీలా : ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాలో దారుణం చోటుచేసుకుంది. కాసినో రిసార్ట్‌ పరిసరాల్లో సాయుధుడైన దుండగుడు కాల్పులు జరిపిన ఘటనలో 36 మంది మృతి చెందారు. ఎం-4 రైఫిల్‌తో కాల్పులకు తెగబడ్డ దుండగుడు ప్రత్యక్షంగా ఎవరిపైనా కాల్పులు జరపలేదు. ఆ తర్వాత రిసార్ట్‌లోని టేబుల్స్‌కు నిప్పటించాడు. దీంతో కాసినోలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు వ్యాపించడంతో లోపలివారంతా ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మృతులంతా శ్వాస తీసుకోలేక చనిపోయారని... మృతదేహాలపై కాల్పులు జరిపినట్లు ఎలాంటి ఆధారాలు లేవని అధికారవర్గాలు స్పష్టం చేశాయి. అనంతరం దుండగుడు తనకు తాను నిప్పంటించుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఇది ఉగ్రవాద చర్యగా భావించడం లేదన్నారు. దుండగుడు దొంగతనం కోసం వచ్చి ఈ దురగతానికి పాల్పడినట్లు భావిస్తున్నారు.

 

16:48 - June 2, 2017

ముంబై : ప్రభుత్వం రుణ మాఫీ చేయాలని కోరుతూ మహారాష్ట్ర రైతులు రోడ్డెక్కారు. నిత్యావసర వస్తువులు రోడ్లపై పారవేసి వినూత్నరీతిలో నిరసన తెలిపారు. రోడ్డుపై వెళ్లే లారీలు, మిల్క్‌ వాహనాలను ఆపి వాటిలోని కూరగాయలు, పళ్లు రోడ్డుపై పారవేశారు. శిరిడీలో నిరసనకారులు పాలను రోడ్డుపాలు చేశారు. టాంకర్ల నుంచి పాలను వదిలేయడంతో రోడ్డుపై ఏరును తలపించింది. కూరగాయలు, పళ్లు, పాలు మార్కెట్‌లోకి చేరకుండా రైతులు అడ్డుకుంటున్నారు. దీంతో నిత్యావసర వస్తువులు దొరకక జనం ఇబ్బందులు పడుతున్నారు. రుణమాఫీ చేయాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, రైతులకు పెన్షన్‌ సౌకర్యం కల్పించాలని, స్వామినాథన్‌ సిఫారసులు అమలు చేయాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేస్తున్నారు. రైతులు ఆందోళన విరమించి చర్చలకు రావాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ విజ్ఞప్తి చేశారు.

 

16:47 - June 2, 2017

చిత్తూరు : తిరుమలలోని పార్వేటి మండపం వద్ద ఐదు రోజులపాటు నిర్వహించిన కరీరిష్టి వరుణయాగం పూర్ణాహుతి కార్యక్రమంతో ముగిసింది. కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి పర్యవేక్షణలో ఈ యాగం జరిగింది. వరుణుడు కరుణించి సకాలంలో వర్షాలు కురిపించి, దేశాన్ని సుభిక్షంగా ఉంచాలని ప్రార్థిస్తూ ఈ యాగం చేశారు. ఐదు రోజులపాటు రుత్వికులు వేదపారాయణం చేశారు. 

16:45 - June 2, 2017

ఒడిశా : స్వదేశీ పరిజ్ఞానంతో అణు సామర్థ్యంతో రూపొందించిన పృథ్వీ-2 క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఉదయం 9 గంటల 50 నిముషాలకు పృథ్వి-2 మిసైల్‌ను ఒడిశాలోని చాందీపూర్‌ సమీపంలో గల ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ నుంచి మొబైల్‌ లాంఛర్‌ ద్వారా ప్రయోగించారు. డిఆర్‌డిఓ శాస్త్రవేత్తలు దీన్ని పర్యవేక్షించారు. ఈ ట్రయల్‌ విజయవంతమైందని డిఆర్‌డిఓ అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే ఈ క్షిపణి 350 కి.మీ.దూరంలోని లక్ష్యాలను సమర్థంగా చేధించగలదు. 5 వందల కేజీల నుంచి 1000 కేజీల వార్‌హెడ్స్‌ను మోసుకెళ్లే సామర్థ్యం పృథ్వి-2కు ఉంది. గతేడాది నవంబర్‌లోనూ ఇదే బేస్‌ నుంచి పృథ్వీ-2 క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. 9 మీటర్ల పొడవుండే ఈ మిసైల్‌ 2003లో భారత ఆర్మీ అమ్ముల పొదిలోకి చేరింది.

16:45 - June 2, 2017

ఢిల్లీ : దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే విధంగా ఏపీని తయారుచేయాలని కేంద్రమంత్రి అశోక్‌గజపతి రాజు అన్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో జరిగిన నవ నిర్మాణ దీక్షల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి అశోక్‌ గజపతి రాజు ఏపీ అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. త్యాగాలు లేకుండా ఏమీ జరగదని లక్ష్యం పెట్టుకుని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. 

16:43 - June 2, 2017

విశాఖ : జిల్లాలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్న వైనంపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, రాజకీయనాయకుల అండదండలు లేకుండా ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యే అవకాశంలేదని తేల్చి చెప్పారు. విశాఖలో జరిగిన నవనిర్మాణ దీక్షలో పాల్గొన్న అయ్యన్న.... కబ్జాదారులపై మండిపడ్డారు. అవినీతిలో ఆర్ అండ్‌ బీ చీఫ్‌ ఇంజినీరు 140 కోట్ల, ఎమ్మార్వో 40 కోట్ల రూపాయల సంపాదించిన విషయాన్ని అయ్యన్న పాత్రుడు ప్రస్తావించారు. వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు అక్రమార్కులు పాలవుతుంటే అధికారులు ఏం చేస్తున్నారంటూ నిలదీశారు.

16:42 - June 2, 2017

హైదరాబాద్ : తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగిన ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగురవేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం ప్రసంగించిన కేసీఆర్‌... రాష్ట్రావతరణ జరిగిన తర్వాత అతి తక్కువ సమయంలోనే తెలంగాణ ప్రభుత్వం సకల జనులకు సంక్షేమాన్ని పంచిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో సింహభాగాన్ని ప్రజాసంక్షేమానికే వెచ్చిస్తున్నామన్నారు. 40 లక్షల మంది అసహాయులకు ఆసరా పెన్షన్లు అందిస్తామన్నారు. 2016-17 ఆర్ధిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం 17.82శాతం ఆదాయ వృద్ధిరేటుతో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని తెలిపారు.

మిషన్‌ భగీరథ...
సంక్షేమంతోపాటు అభివృద్ధిలోనూ తెలంగాణ అద్భుతమైన ఫలితాలు సాధిస్తోందని కేసీఆర్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయని.. ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి నదీ జలాలు అన్ని గ్రామాలకు అందిస్తామని చెప్పారు. కొన్ని శక్తులు ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ప్రాజెక్టులను పూర్తిచేసే తీరుతామని, వీలైనంత తొందరగా సాగునీరు అందిస్తామన్నారు. విద్యుత్‌ రంగంలో అపూర్వమైన విజయం సాధించామని... రైతులకు ఈ ఏడాది యాసంగి నుంచే 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందిస్తామన్నారు.కులవృత్తులు, చేతివృత్తులకు ప్రభుత్వం చేయూతనందిస్తోందని కేసీఆర్‌ చెప్పారు. వృత్తిదారుల సంక్షేమం, అభివృద్ది కోసం భారతదేశంలో మరే రాష్ట్రం చేయని విధంగా బడ్జెట్‌ కేటాయింపులు చేశామన్నారు. సంచార జాతులకూ చేయూతనందిస్తున్నామన్నారు. అన్నార్తులు, అనాథలుండని శ్రేయోరాజ్యంగా తెలంగాణను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

ప్రముఖులకు సత్కారం...
వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులను కేసీఆర్ ఘనంగా సత్కరించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసులకు పథకాలతో సన్మానించారు. అంతకుముందు తెలంగాణ అమరవీరులకు కేసీఆర్‌ ఘన నివాళులు అర్పించారు. పరేడ్‌ గ్రౌండ్స్‌కు వెళ్లడానికి ముందు కేసీఆర్‌ గన్‌పార్క్‌కు వెళ్లారు. అక్కడ అమరవీరులకు పూలమాలలు ఉంచి నివాళులు అర్పించారు.

ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదు : పనగరియా

ఢిల్లీ : ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదని నీతి అయోగ్ ఉపాధ్యక్షడు అరవింద్ పనగరియా అన్నారు. ప్రత్యేక హోదా అంటే కేంద్రం కొన్ని నిధులను ప్రత్యేకంగా ఇవ్వడమే అని ఆయన అన్నారు. 14వ ఆర్థిక సంఘం అమలులోకి వచ్చాక మొత్తం నిధులు రాష్ట్రాలకు వెళ్తున్నాయని పనగరియా తెలిపారు.

 

16:32 - June 2, 2017

తెలంగాణలో డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్ల వేతనాల పెంపు

హైదరాబాద్ : తెలంగాణలోని డిగ్రీ కాలేజీ కాంట్రాక్ట్ లెక్చరర్ల వేతనాలు పెంచుతూ ప్రభుత్వ నిర్ణయం. డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్ల వేతనం నెలకు రూ.40,270 చూస్తూ జీవో జారీ చేసింది.

కేసీఆర్ కుటుంబ దోపిడీపై సమాధానం చెప్పాలి : మధుయాష్కి

హైదరాబాద్ : కేసీఆర్ కుటుంబ దోపిడీపై కేసీఆర్ సమాధానం చెప్పాలని మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనలో జరుగుతున్న అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలని అన్నారు. ప్రభుత్వ అవినీతిపై త్వరలో సీబీఐని ఆశ్రయిస్తామని యాష్కి తెలిపారు. 

16:06 - June 2, 2017

డిగ్రీ ఆన్ లైన్ అడ్మిషన్ల గడువు పొడిగింపు

హైదరాబాద్ : తెలంగాణ డిగ్రీ ఆన్ లైన్ అడ్మిషన్ల గడువును పొడిగించారు. ఈ నెల 4 నుంచి 7మ వరకు పొడిగించినట్టు ఉన్నత విద్యమండలి తెలిపింది. ఆలస్య రుసుముతో జూన్ 9 వరకు గడువు విధించారు. 

15:51 - June 2, 2017

హైదరాబాద్ : అమరవీరుల బలిదానాలవల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు.. మలిదశ ఉద్యమకారుల స్మృతిచిహ్నం నిర్మించుకోవాలని, ఈ పనులను ప్రభుత్వం వెంటనే చేపట్టాలని సూచించారు.. ఉద్యమకారులను ఆదుకోవాలని సర్కారును కోరారు. గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపానికి కోదండరాం పుష్పగుఛ్చం ఉంచి నివాళులు అర్పించారు.

33 పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతి

హైదరాబాద్ : పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయంలో 33 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. టీఎస్ పీఎస్సీ ద్వారా పోస్టులక భర్తీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో సీనియర్ అసిస్టెంట్ 13, వెటర్నరీ అసిస్టెంట్ 13, జూనియర్ అసిస్టెంట్ 4, ల్యాబ్ టెక్నీషియన్ 3 పోస్టులు ఉన్నాయి.

 

ఉస్మానియా ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్ : నగరంలోని ఉస్మానియా ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. గురువారం రోహిణి అనే ఇంజనీరింగ్ విద్యార్థిని రోహిణి అనుమానాస్పదంగా మృతిచెందింది. ఉస్మానియా వైద్యులు రోహిణి మృతదేహం పోస్టుమార్టం చేయడానికి నిరాకరించారు. తమ పరిధిలోకి రాదంటూ డాక్టర్లు పోస్టుమార్టానికి నిరాకరించారు. 

15:39 - June 2, 2017

హైదరాబాద్ : నగరంలోని ఉస్మానియా ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. గురువారం రోహిణి అనే ఇంజనీరింగ్ విద్యార్థిని రోహిణి అనుమానాస్పదంగా మృతిచెందింది. ఉస్మానియా వైద్యులు రోహిణి మృతదేహం పోస్టుమార్టం చేయడానికి నిరాకరించారు. తమ పరిధిలోకి రాదంటూ డాక్టర్లు పోస్టుమార్టానికి నిరాకరించారు. రోహిణి బంధువులు కాలేజీ యాజమాన్యంతో వైద్యులు కుమ్మక్కయ్యారంటూ మార్చరీ వద్ద ఆందోళన నిర్వహించారు. రోహిణి ఇందూ అనే ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతోంది. 

అబిడ్స్ లో ఉద్రిక్తత

హైదరాబాద్ : నగరంలోని అబిడ్స్ మెడ్విన్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. సమాచరం లేకుండా హాస్టల్ ను యజమాన్యం మూసివేసింది. విద్యార్థులు ఆగ్రహంతో ఆసుపత్రి ఫర్నిచర్ చేశారు. 

14:53 - June 2, 2017

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా విరుచుకుపడ్డారు. చంద్రబాబు ప్రారంభించింది నవ నిర్మాణ దీక్ష కాదని... నారావారి నయవంచన దీక్ష అని ధ్వజమెత్తారు. రాష్ట్రం విడిపోయి ప్రజలంతా ఇబ్బందుల్లో ఉంటే... చంద్రబాబు మాత్రం నవ నిర్మాణ దీక్షతో కొత్త డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. అవినీతిపై పోరాటం చేయాలంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు మిలీనియం జోక్ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రం ఏర్పడిందని తెలంగాణ ప్రజలు సంబరాలు చేసుకోవడంలో ఒక అర్థం ఉందని... అడ్డగోలుగా ఏపీని విభజించిన తర్వాత నవ నిర్మాణ దీక్షతో వారం పాటు మీ సంబరాలు ఏంటని ప్రశ్నించారు. 

14:40 - June 2, 2017

విశాఖ : ఓ నేవీ ఉద్యోగి యువతి బాత్రూమ్ లో స్నానం చేస్తుండగా సెల్ ఫోన్ తో వీడియో చిత్రీకరించాడు. యువతి కేకలు వేయడంతో స్థానికులు నిందితుడిని పట్టుకుని చితగొట్టారు. శివలెత్తిన యువతి నేవీ ఉద్యోగిని చెప్పుతో రఫ్ అడిచింది. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి.

 

14:28 - June 2, 2017
14:25 - June 2, 2017

రంగారెడ్డి : జిల్లాలోని శంషాబాద్ మండలం మల్కారంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామ సర్పంచ్, సెక్రెటరీ, వార్డుమెంబర్లు, టీఆర్ఎస్ నేతలను ట్యాంకర్ల యజమానులు పంచాయతీ కార్యాలయంలో నిర్భంధించి తాళం వేశారు. వారు ట్యాంకర్లతో సప్లై చేసిన నీటకి డబ్బులు ఇవ్వడం లేదని ఆరోపణపిస్తున్నారు. ఏడాది కాలంగా రూ. 4లక్షల వరకు ట్యాంకర్ల యజమానులకు గ్రామపంచాయతీ బకాయిపడ్డది. తక్షణమే బిల్లులు చెల్లించాలని ట్యాంకర్ల యజమానులు డిమాండ్ చేస్తున్నారు. ట్యాంకర్ల యజమానులకు బకాయిపడ్డది వాస్తవమే అని సర్పంచ్ తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

14:05 - June 2, 2017
13:54 - June 2, 2017

ఐదు సంవత్సరాల ప్రధాని..కావడం విన్నారా..తమిళ కాంగ్రెస్ అధికార ప్రతినిధి..నటి ష్బూ..బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు మధ్య ట్వీట్ల వార్...మగపిల్లల కంటే ఆడపిల్లల అవసరాల పైనే తండ్రి యొక్క మెదడు చురుగ్గా పనిచేస్తుందా ? ఉత్తర్ ప్రదేశ్ లో ఇద్దరిని వేధించిన పోకిరీలు..గోవధపై కేంద్రం నిషేధం విధించడం..తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై సినీ నటి జయప్రద స్పందించింది..సివిల్ సర్వీస్ పరీక్షా ఫలితాల్లో మహిళల హావా కొనసాగింది..ప్రపంచంలో ఏ దేశం అభివృద్ధి చెందాలన్న మహిళల భాగస్వామ్యం తప్పనిసరి..కానీ ఇందులో భారతదేశం వెనుకుందంట..గర్భిణీలు ఒత్తిడికి గురైతే జన్మించిన వారికి ఏం జరుగుతుంది ? ఈ అంశాలపై మానవి న్యూస్..పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

13:41 - June 2, 2017

కర్నూలు : జిల్లాలో లంచాలు తీసుకుంటూ పలువురు చిక్కుతున్నారు. డీఎంఅండ్ హెచ్ వో లో మరో అవినీతి తిమింగలం చిక్కింది. ఇటీవలే ఇక్కడ పనిచేసిన స్వరాజ్య లక్ష్మి బదిలీ అయిన సంగతి తెలిసిందే. ఈమె స్థానంలో వచ్చిన మరో అధికారి కూడా ఏసీబీ అధికారులకు చిక్కడం గమనార్హం. డీఎంఅండ్ హెచ్ వో గా మీనాక్షి ఇటీవలే బదీలీపై వచ్చారు. అనుమతులు ఇచ్చేందుకు ఆదిత్య నర్సింగ్ హోం యాజమాన్యానికి లంచం డిమాండ్ చేశారు. దీనితో యాజమాన్యం ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన వాళ్లు వలపన్ని శుక్రవారం లంచం తీసుకుంటున్న లక్ష్మిని పట్టుకున్నారు. రూ. 30వేలు స్వాధీనం చేసుకున్నారు.

13:36 - June 2, 2017

హైదరాబాద్ :మూడేళ్ల టీఆర్ఎస్ పాలనలో జీహెచ్ఎంసీ అభివృద్ధి అంతంతమాత్రంగా కూడా లేదన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. విశ్వనగరం ప్రణాళిక అటకెక్కినట్టేనని భావిస్తున్నారు. మూసీనది ప్రక్షాళన మృగ్యంగా మారింది. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రణాళిక కార్యరూపం దాల్చలేదు. కొద్దిపాటి వర్షానికే పొంగిపొర్లే డ్రెయిన్లు. విస్తరణకు నోచుకోని నాలాలు. ఇంటింటికి నల్లా నీరు సరఫరా.... ఇలా హామీలన్నీ నీటి మూటలుగానే మిగిలిపోయాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ పాలకులు కార్పొరేషన్‌ ఎన్నికల వేళ.. జంట నగరాల ప్రజలకు ఎన్నో ఆశలు కల్పించారు. ఎన్నెన్నో హామీలు ఇచ్చారు. అస్తవ్యస్తంగా ఉన్న జీహెచ్‌ఎంసీ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతామన్న ప్రకటనతో జనాన్ని మురిపించారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రణాళికలో భాగంగా భారీ స్కైవేలు, ఫ్లై ఓవర్లు నిర్మిస్తామని ఊదరగొట్టారు. భారీ వర్షం కురిసినా ఒక్కచుక్క కూడా రోడ్లపై నిల్వకుండా నాలాలను విస్తరిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నుంచి అన్ని స్థాయిల నేతలు ప్రకటనల మీద ప్రకటనలు చేశారు. అధికారంలోకి వచ్చే మూడేళ్లు గడిచిపోయినా... ఏ ఒక్క పథకం కూడా కార్యరూపం దాల్చకపోవడం విమర్శలకు తావిస్తోంది.

నత్తనడకన సాగుతున్న మెట్రో రైలు నిర్మాణం..
అస్తవ్యస్తంగా ఉన్న నరాభివృద్ధిని కొత్త పుంతలు తొక్కించేందుకు శివారు ప్రాంతాల్లో శాటిలైట్‌ టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేస్తామన్న పాలకుల హామీ ప్రకటనకే పరిమితమైపోయింది. ట్రాఫిక్‌ సమస్యలకు తరుణోపాయం చూపిస్తామన్న హామీ అమలు దిశగా తీసుకున్న చర్యలు శూన్యమన్న విమర్శలు వినవస్తున్నాయి. ఎప్పుడో పరుగులు తీయాల్సిన మెట్రోరైలు పథకం పనులు నత్తనడకన సాగుతున్నాయి. విశ్వనగర ప్రణాళికలో భాగంగా హైదరాబాద్‌ను, టర్కీలోని ఇస్తాంబుల్‌ నగరంలా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. అమెరికాలోని న్యూయార్క్‌, శాన్‌ఫ్రాన్సిస్కో మాదిరిగా అందంగా తీర్చిదిద్దుతామన్న హామీ కూడా ప్రకటనలకే పరిమితమైంది.

నాలాల విస్తరణకు రూ.12 వేల కోట్లు అవసరమని అంచనా..
కొద్దిపాటి వర్షం కురిసినా నగరంలో ప్రయాణం నరకప్రాయంగా మారుతుంది. పొంగిపొర్లే డ్రెయిన్లు, వర్షంనీరు సాఫీగా ప్రవహించే మార్గంలేక నాలాల నీటితో నిండిపోయే రోడ్లు, ముగిపోయే కాలనీలు కళ్లముందు కనిపిస్తాయి. నాలాలపై ఉన్న ఆక్రమణలను తొలగించి, ఒక్కచుక్క వర్షం నీరు కూడా రోడ్లపైకి రాకుండా చేస్తామన్న పాలకుల మాటలు నీటిమూటలుగానే మిగిలిపోయాయి. దాదాపు 12 వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యే ఈ పనిని చేపట్టేందుకు జీహెచ్‌ఎంసీ వద్ద నిధులు లేవు. ప్రభుత్వం పైసా విదల్చదు. దీంతో ఈ వర్షాకాలంలో కూడా నాలల పరిధిలోని బస్తీలు, కాలనీ వాసులకు కష్టాలు తప్పే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు.

ఖర్చు రూ.3,300 కోట్లు..
రెండు పడకల గదుల ఇళ్లు లక్ష కట్టిస్తామని హామీ ఇచ్చారు. ఐడీహెచ్‌ కాలనీలో కొన్ని ఇళ్లు కట్టి పేదల్లో ఆశలు పెంచారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ముందు చాలా డివిజన్లలో శంకుస్థానలు చేసి, హడావుడిచేసి మురిపించారు. చివరికి ఇదంతా భ్రమగానే మిగిలిపోయిందని రెండు పడక గదుల ఇళ్లకు దరఖాస్తున్నచేసుకున్న నగరవాసులు నిట్టూరుస్తున్నారు. బల్దియా బడ్జెట్‌ ఘనం. ఖర్చు మాత్రం హీనం. ఏటా 5,600 కోట్లకు తక్కువగా కాకుండా బడ్జెట్‌ ప్రతిపాదనలు ప్రవేశపెడుతున్నారు. ప్రభుత్వం నిధులు అందకపోవడంతో, జీహెచ్‌ఎంసీ ఆశించిన ఆదాయం రాకపోవడంతో ఖర్చు మాత్రం 3,300 కోట్లకు మించడంలేదు. దీనిలో కూడా రెండు వేల కోట్ల రూపాయలు నిర్వహణ వ్యయానికే సరిపోతుంటే అభివృద్ధికి నిధులు ఎక్కడ నుంచి వస్తాయని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నగరానికి నాలుగువైపుల నిమ్స్‌ తరహాలో ఆధునిక హంగులతో ప్రభుత్వాస్పత్రులను నిర్మిస్తామన్న హామీ అమలుకు నోచుకోలేదు. నగరాభివృద్ధిని పరుగులు పెట్టిస్తామన్న టీఆర్‌ఎస్‌ పాలకులు మాటల కోటలు దాటుతున్నా చేతలు గడప దాటడంలేదన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇప్పటికైనా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వట్టిమాటలు కట్టిపెట్టి, నగరాభివృద్ధికి గట్టి ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని నగరపౌరులు కోరుతున్నారు.

తిరుమలలో ముగిసన వరుణయాగం..

చిత్తూరు : తిరుమలలో వరుణయాగం ముగిసింది. పార్వేటీ మంటపం వద్ద వరుణయాగానికి పూర్ణాహుతితో రుత్విక్కులు ముగింపు పలికారు. ఈవో..జేఈవో పాల్గొన్నారు.

బీహార్ టాపర్స్ స్కాంలో కీలక మలుపు...

పాట్నా : బీహార్ టాపర్స్ స్కాంలో కీలక మలుపు చోటు చేసుకుంది. టాపర్ స్కాంపై ఈడీ మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేసింది.

13:12 - June 2, 2017

బాలీవుడ్ బాద్ షా 'షారూఖ్ ఖాన్' మృతి చెందాడంటూ యూరప్ కు చెందిన ఓ న్యూస్ ఛానెల్ ప్రసారం చేయడం కలకలం రేగింది. ఇది కాస్తా వైరల్ గా మారడంతో 'షారూఖ్' అభిమానులే కాకుండా చిత్ర అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ వార్తలు అవాస్తవమని..ఇలాంటివి నమ్మవద్దని 'షారూఖ్' అభిమానులు విజ్ఞప్తులు చేస్తున్నారంట. షారూఖ్ ఫొటోను చూపిస్తూ..'షారూఖ్ బిజినెస్ పని మీద పారీస్ చేరుకోవాల్సి ఉందని..ఆయన ప్రయాణీస్తున్న గల్ఫ్ స్ట్రీం జీ 550 జెట్ కూలిపోయిందని..ఈ ప్రమాదంలో షారూఖ్ తో పాటు మరో ఏడుగురు చనిపోయారు' అంటూ ఆ ఛానెల్ ప్రసారం చేసింది. దీనితో ముంబై పోలీసులకు పలు ఫోన్స్ కాల్స్ వస్తున్నాయని, షారూఖ్ ఎలా ఉన్నారో తెలియచేయాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాద్ షా ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో 'డ్వార్ఫ్' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే షూటింగ్ సమయంలో సెట్ టాప్ కూలిపోవడం..అందులో నుండి షారూఖ్ తృటిలో తప్పించుకున్న సంగతి తెలిసిందే.

13:04 - June 2, 2017

సివిల్స్ 2016 ఫలితాలు విడుదలయ్యాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఈ అఖిల భారత సర్వీసుల్లో కే.ఆర్.నందిని మొదటి స్థానంలో..అనుమోల్ షేర్ సింగ్ బేడీ రెండో స్థానంలో..జి.రొనాంకి మూడో స్థానంలో నిలిచారు. హైదరాబాధ్ కు చెందిన బాలాలత 167వ ర్యాంకు సాధించారు. పలువురు ర్యాంకులను సైతం సాధించి విజయవంతం అయ్యారు. ఈ సందర్భంగ టెన్ టివి వారితో ముఖాముఖి నిర్వహించింది. షాలిని..అనుశాంతి..కుమార్..మను..బాలాలత..పాల్గొని అభిప్రాయాలు తెలియచేశారు. పట్టువదలకుండా నిరంతరం సాధన అవసరమని, లక్ష్య సాధన కోసం కష్టానికి నెరవొద్దని బాలాలత పేర్కొన్నారు. ప్రాపర్ ప్లానింగ్ ఉంటేనే సివిల్స్ సాధ్యమని, రోజూ దినపత్రికలు చదివి నోట్స్ రాసుకోవాలని కుమార్ తెలిపారు. పట్టుదలతో కృషి చేస్తే ఎప్పటికైనా విజయం సాధిస్తుందని శాలిని పేర్కొన్నారు. కష్టపడి 4వ ప్రయత్నంలో విజయం సాధించినట్లు కుమార్ తెలిపారు. మరిన్ని విషయాలకు వీడియో క్లిక్ చేయండి.

నిరంకుశ పాలన - కోదండరాం..

హైదరాబాద్ : టీజాక్ కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరిగాయి. జాతీయ జెండాను కోదండరాం ఆవిష్కరించారు. తెలంగాణలో నిరంకుశ పాలన కొనసాగుతోందని, చిన్న పట్టణాలు, కొత్త జిల్లాల అభివృద్ధిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపారు. రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని పేర్కొన్నారు.

12:49 - June 2, 2017

'టబు'..బాలీవుడ్ నటి తెలుగులో పలు చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. 'నాగార్జున' 'టబు' జంటగా నటించిన 'నిన్నే పెళ్లాడితా' సినిమా ఆ రోజుల్లో ఎంత సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. క్రేజీ ఫెయిర్ గా వారికి పేరు తెచ్చింది. 'నాగార్జున' తనయుడు 'అఖిల్' మొదటి సినిమా అనంతరం రెండో సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. 'మనం' ఫేమ్‌ విక్రమ్‌కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై ఈ నాగార్జున నిర్మిస్తున్నారు. ఇందులో తల్లి పాత్ర కోసం 'టబు'ను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కీలక పాత్రకు 'టబు' అయితే బాగుంటుందని భావించిన చిత్ర బృందం ఆమెను కలిశారని తెలుస్తోంది. కథ విన్న తరువాత ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ చిత్ర కొత్త షెడ్యూల్ వచ్చే నెలలో హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. చిత్రంలో టబు..అఖిల్ కు తల్లిగా నటిస్తారా ? లేదా ? ఏదైనా కీలక పాత్ర పోషిస్తారా ? అనేది చిత్ర యూనిట్ స్పందిస్తే గాని తెలియదు.

12:39 - June 2, 2017

బాలీవుడ్ అందాల రాశి 'ఐశ్వర్య రాయ్' వివాహం అనంతరం పలు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఈమెను టాలీవుడ్ కి రప్పించేందుకు తాజాగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు సోషల్ మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. ఇందులో ప్రముఖంగా మెగాస్టార్ 'చిరంజీవి' 151వ చిత్రం 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' చిత్రంలో నటింప చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు టాక్. ఇప్పటికే ఈ చిత్రం కోసం 'చిరంజీవి' పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నారని తెలుస్తోంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభయ్యే ఈ సినిమాలో హిందీ..తెలుగు భాషల్లో నిర్మాణం కానున్నట్లు సమాచారం. బాలీవుడ్ మార్కెట్ ను కొల్లగొట్టాలంటే అక్కడి వారు సినిమాలో నటిస్తే బాగుటుందని చిత్ర యోనిట్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఓ కీలక పాత్ర కోసం బిగ్ బి 'అమితాబ్' ను..చిరంజీవి సరసన 'ఐష్'ను నటింప చేయాలని చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు 'రామ్ చరణ్' చిత్రంలో కూడా 'ఐశ్వర్య రాయ్' నటించబోతోందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే 'చెర్రీ' సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం అనంతరం 'మణిరత్నం' లో 'రామ్ చరణ్' ఓ సినిమా చేయబోతున్నాడని అప్పటి నుండి ప్రచారం జరుగుతోంది. దీనిని పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు, దీనికి 'యోధ' టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఓ కీలక పాత్ర కోసం ఆమెను ఎంపిక చేస్తారని పుకార్లు షికారు చేస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో..తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే.

ప్రజల జీవితాల్లో మార్పు రాలేదన్న దత్తన్న..

నిజామాబాద్ : రాష్ట్రం ఏర్పాటై మూడేళ్లు గడుస్తున్నా జీవితాల్లో మార్పు రాలేదని కేంద్ర మంత్రి దత్తాత్రేయ విమర్శించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మోపాల్ మండలం మంచిప్ప గ్రామంలో ఆయన పర్యటించారు.

12:16 - June 2, 2017

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. చంద్రబాబు ప్రారంభించింది నవ నిర్మాణ దీక్ష కాదని.. నారావారి నయవంచన దీక్ష అని విమర్శించారు. రాష్ట్రం విడిపోయి ప్రజలంతా ఇబ్బందుల్లో ఉంటే బాబు మాత్రం నవనిర్మాణ దీక్ష అంటూ కొత్త డ్రామాలు అడుతున్నారని, అవినీతిపై పోరాటం చేయాలని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు మిలీనియం జోక్ అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు సంబరాలు చేసుకోవడంలో అర్థం ఉందని, వారు ఒక్క రోజు సంబురాలు జరుపుకుంటుంటే చంద్రబాబు దీక్షల పేరిట 8 రోజులు సంబరాలు చేసుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రానికి పుట్టిన రోజు లేకుండా బాబు చేశారని విమర్శించారు. ఓటుకు నోటు కేసు విషయంలో రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని తెలిపారు.

బాబుపై రోజా ఫైర్..

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. చంద్రబాబు చేస్తున్నది నవ నిర్మాణ దీక్ష కాదని, నారావారి నయవంచన దీక్ష అని తెలిపారు. తెలంగాణ ప్రజలు రాష్ట్రం ఏర్పడినందుకు ఒక్క రోజు సంబురాలు జరుపుకుంటుంటే చంద్రబాబు దీక్షల పేరిట 8 రోజులు సంబరాలు చేసుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రానికి పుట్టిన రోజు లేకుండా బాబు చేశారని విమర్శించారు.

12:04 - June 2, 2017
11:59 - June 2, 2017

నల్గొండ : నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి జూన్ 2తో మూడేళ్లు. మరి తొలి తెలంగాణ ప్రభుత్వం.. ప్రజల ఆకాంక్షలను ఏ మేరకు నెరవేర్చింది? నల్గొండ జిల్లాలో సాగు, తాగునీటి సమస్యలు ఇప్పటికీ అలానే ఉన్నాయి. దీర్ఘకాలిక సమస్యలు తిష్ట వేసుకు కూర్చున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీఆర్‌ఎస్‌ పాలన, ప్రగతి పై టెన్ టీవీ ప్రత్యేక కథనం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించి.. జూన్ 2తో మూడేళ్లవుతోంది. ఉద్యమ పార్టీగా ప్రజల ముందుకు వచ్చిన టీఆర్‌ఎస్ ఎన్నికలలో ఎక్కువ సీట్లు సాధించింది. ప్రత్యేక రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎం కేసీఆర్ ఉద్యమ సమయంలో, అధికారం చేపట్టాక.. ఎక్కువ దృష్టి పెట్టిన జిల్లా నల్గొండ. సీఎంగా ఎక్కువ సార్లు పర్యటించింది నల్గొండ జిల్లానే. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఎస్సెల్బీసీ ప్రాజెక్టును.. కాల్వకట్ట మీద కూర్చొని రెండేళ్లలో పూర్తిచేయిస్తానని ఎన్నికల సభలో కేసీఆర్‌ చెప్పారు. తండాలను గ్రామపంచాయతీలుగా మార్చుతానన్నారు. ఐటిడిఏ ఏర్పాటు చేయించి... ఫ్లోరైడ్ రహిత తాగునీటిని అందిస్తానని కేసీఆర్‌ చెప్పారు.

ఎస్సెల్బీసీ ప్రాజెక్టు..
అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా.. ఎస్సెల్బీసీ ప్రాజెక్టు ముందుకు కదలలేదు. తెలంగాణ రాష్ట్ర సాధన తరువాత ప్రాజెక్టుకు మోక్షం లభిస్తుందని జిల్లావాసులు ఆశ పడ్డారు. రాష్ట్రం ఏర్పడే నాటికి 23.07 కిలోమీటర్ల టన్నెల్‌ పూర్తయ్యింది. తర్వాత మూడేళ్లలో తవ్వింది 4.83 కిలోమీటర్లు. అంటే ఏడాదికి సగటున 2 కిలోమీటర్ల కన్నా తక్కువ. ఈ లెక్కన మిగతా 15.98 కిలోమీటర్ల పనులు జరిగేందుకు మరో 8 ఏళ్లు పడతాయన్నది నీటి పారుదల వర్గాల అంచనా. ఎస్సెల్బీసీని అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పేరుతో.. హైదరాబాద్‌ తాగునీటికే పరిమితం చేయాలని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చూస్తోంది. అలా అని రైతులు, రైతుసంఘాల నేతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

బీళ్లుగా మారే అవకాశముందని ఆవేదన..
ప్రభుత్వం ఎస్‌ఎల్‌బీసీ సొరంగాన్ని పక్కన పెట్టి.. పాలమూరు నుంచి డిండి వరకూ లిఫ్టు పథకాన్ని రూపొందించిందని రైతులు విమర్శిస్తున్నారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగాన్ని వదిలేస్తే.. నల్గొండ జిల్లాలో 7.50 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి రాకుండా.. బీళ్లుగా మారే అవకాశముందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ముంపుకు గురవుతున్న భూములకు సంబంధించి.. చాలా మంది రైతులకు ఇప్పటికీ ఎటువంటి పరిహారం అందలేదు. జిల్లాలో దేవరకొండతో పాటు సమీపంలోని తండా ప్రాంతాలను కలుపుకొని ఐటిడిఎ ఏర్పాటు చేస్తామని.. కేసీఆర్‌ హామీ ఇచ్చారు. శిశు అమ్మకాలను అడ్డుకునేందుకు గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. కానీ ఇప్పటికీ అక్కడక్కడా శిశువిక్రయాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. జిల్లాల పునర్విభజన సమయంలో దేవరకొండ, అచ్చంపేటలను కలుపుకొని.. గిరిజన జిల్లాగా ఏర్పాటు చేయాలని వినతులు వచ్చాయి. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదని జిల్లాకు చెందిన గిరిజనులు.. గిరిజనసంఘాల నేతలు విమర్శిస్తున్నారు.

మెడికల్ కాలేజీ..డబుల్ బెడ్ రూం..
నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలో మెడికల్ కాలేజ్‌.. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో రెండు, మూడు నిమ్స్‌లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పటికీ వాటి ఊసే లేదు. నాగార్జున సాగర్ ప్రాంతాన్ని ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని సాగర్ లో జరిగిన ఎన్నికల సభలో హమీనిచ్చారు. ఒక సారి మంత్రులు, అధికారులతో.. మరోసారి ఫార్మా రంగానికి సంబంధించిన వ్యాపారవేత్తలతో రాచకొండ గుట్టలపై ఏరియల్ సర్వే నిర్వహించారు. కానీ తర్వాత ఆ విషయాల గురించి ప్రస్తావనే లేదు. సూర్యాపేట, తుంగతుర్తి ప్రాంతాలకు.. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాల్ని తీసుకొచ్చి సాగునీరందిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు అందుకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా రూపొందించలేదు. దళితులకు మూడెకరాలు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 30 వేల అర్హులైన దళిత కుటుంబాలు ఉన్నాయని అధికారులే తేల్చారు. ఇప్పటికి 150 కుటుంబాలకు 200 ఎకరాల వరకు మాత్రమే పంచారు. అవి కూడా సాగుకు వీలు కాని భూములు. ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్న డబుల్ బెడ్ రూమ్‌ పథకం కింద.. జిల్లాలో ఒక ఇల్లు కూడా నిర్మించలేదని ఆరోపిస్తున్నారు.

అమలైన హామీలు..
జిల్లాకు సంబంధించి ఎన్నికల్లో ఇచ్చిన కొన్ని హామీలను సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారు. సూర్యాపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడంతో పాటు.. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించారు. అయితే రైతులకు సంబంధించి సాగునీటి ప్రాజెక్టులు నత్తనడకన సాగుతున్నాయి. దామరచర్ల మండల పరిధిలోని కృష్ణా పరివాహక ప్రాంతంలో.. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనులు మొదట వేగంగా సాగినా.. ఇప్పుడు వేగం తగ్గాయి. కానీ టీఆర్‌ఎస్‌ నేతలు మాత్రం.. ఎప్పుడూ లేనంత అభివృద్ధి జరుగుతోందని చెబుతున్నారు. మూడేళ్ల టీఆర్ఎస్ పాలనలో సీఎం కేసీఆర్.. నల్లగొండకు సంబంధించి యాదాద్రి ఆలయ అభివృద్ధి తప్ప వేరే కనిపించడంలేదని జిల్లావాసులు విమర్శిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో పెద్దగా మార్పులు లేవని.. పెదవి విరుస్తున్న వారే ఎక్కువగా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం చెప్పుకుంటున్న ఏ ఒక్క పథకం పూర్తి స్థాయిలో అమలైన దాఖలాలు కనిపించడం లేదు.

11:42 - June 2, 2017

హైదరాబాద్ : విభజన జరిగిన అనంతరం తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం అవుతుందని ఆనాడు చెప్పిన తన మాటలు అక్షర సత్యాలు అయ్యాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఆశలు..ఆకాంక్షలు నెరవేర్చుకొనే దిశగా పయనిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా పరేడ్ గ్రౌండ్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రతిభావంతులకు అవార్డులను అందచేశారు. ప్రజలనుద్ధేశించి ప్రసంగించారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన వారికి నివాళులర్పిస్తున్నట్లు, సమైక్య రాష్ట్రంలో తెలంగాణ మరుగున పడిందని, 2016-17లో తెలంగాణ రాష్ట్ర ఆదాయం 17.82 శాతం నమోదై వృద్ధి రేటులో దేశంలో అగ్రగామిగా నిలవడం గర్వకారమన్నారు. మూడు సంవత్సరాల్లో చేసిన కృషిలో భాగమన్నారు.

  • '40వేల కోట్లతో 35 సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. ఈ సంవత్సరం నుండి ఎస్టీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు. ఒంటరి మహిళలకు రూ. 1000 భృతి ఎల్లుండి నుండి లభిస్తుంది.
  • మాతా, శిశు రక్షణ కోసం రూ. 15వేల విలువ చేసే కేసీఆర్ కిట్ రేపటి నుండి అందుబాటులోకి వస్తుంది.
  • గర్భిణీ స్రీలు పనిలోకి వెళ్లకుండా ఉండేందుకు ఈ పథకం ప్రారంభిస్తున్నాం.
  • మూడు విడతలుగా రూ. 12వేలు అందుతాయని, ఆడబిడ్డ జన్మిస్తే మరో వెయ్యి ప్రోత్సాహం కింద అందిస్తాం.
  • తీవ్రమైన విద్యుత్ కొరతను అధిగమించాం. కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్నాం.
  • యాసంగి పంటల నుండే 24గంటలు విద్యుత్ అందిస్తాం.
  • ఐటీ రంగంలో భారీగా ఉత్పత్తులు..పెట్టుబడులు. వ్యవసాయ రంగంలో శాస్త్రీయ పద్ధతులు అవలింబిస్తున్నాం. 50 శాతం సబ్సిడీపై వ్యవసాయ ట్రాక్టర్లు అందిస్తున్నాం. రూ. 17వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేశాం. 40 లక్షల మందికి ఆసరా పెన్షన్లు అందిస్తున్నాం.
  • డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తున్నాం. హరిత హారం మూడో దశ వచ్చే నెల నుండి ప్రారంభం.
  • మిషన్ కాకతీయతో చెరువులు కళకళలాడుతున్నాయి. మిషన్ భగీరథ పథకం దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఈ ఏడాది చివరికి అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ ఫలాలు అందుతాయి. ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసి పంటలకు సాగునీరందిస్తాం' . అని సీఎం కేసీఆర్ తెలిపారు. పూర్తి ప్రసంగాన్ని వినేందుకు వీడియో క్లిక్ చేయండి.

ధనిక రాష్ట్రం అన్న మాట నిజమైంది - కేసీఆర్..

హైదరాబాద్ : విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం అవుతుందని ఆనాడు చెప్పిన మాటలు నిజమయ్యాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అవతరణ దినోత్సవాల్లో భాగంగా ఆయన పరేడ్ గ్రౌండ్ లో ప్రసంగించారు.

గ్రూప్ 1, 2 ఫలితాల విడుదల.

హైదరాబాద్ : గ్రూప్ 1, గ్రూప్ 2 ఫలితాలు విడుదల అయ్యాయి. కానున్నాయి. అవతరణ దినోత్సవ సందర్భంగా ఫలితాలను రిలీజ్ చేస్తామని టీఎస్పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి వెల్లడించిన సంగతి తెలిసిందే. టీఎస్పీఎస్సీ వెబ్ సైట్ లో ఫలితాలను ఉంచారు.

11:13 - June 2, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పరేడ్ గ్రౌండ్ లో సీఎం కేసీఆర్ జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు. 2017 ఏడాదికిగానూ పలు రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 52 మంది ప్రముఖులకు అవార్డులను అందచేశారు.

వివిధ రంగాలు.. అవార్డు గ్రహీతలు
సాహిత్యం - వెలపాటి రమారెడ్డి, అశారాజు, జుపాక సుభద్ర, అస్లాం ఫర్షోరి(ఉర్దూ)
సంగీతం - ఎం. రాజోల్కర్, వార్సి సోదరులు
సామాజిక సేవ - వందేమాతరం ఫౌండేషన్, యాకుబ్ బీ
జర్నలిజం - పీవీ శ్రీనివాస్, ఏ రమణకుమార్, బిత్తిరి సత్తి- సావిత్రి (రవి - శివజ్యోతి) ఎలక్ట్రానిక్ మీడియా, వి.సతీష్, మహ్మద్ మునీర్
ఫొటో జర్నలిజం - అనిల్ కుమార్
సినిమా జర్నలిజం - హెచ్. రమేశ్ బాబు
కామెంటరీ/ యాంకరింగ్ - మడిపల్లి దక్షిణామూర్తి
వైద్య రంగం - డాక్టర్ బిరప్ప, నిమ్స్, డాక్టర్ చారి (వెంకటాచారి), సిద్ధా మెడికల్ ఆఫీసర్
శాస్త్రీయ నృత్యం - రాఘవరాజ్ భట్-మంగళా భట్, బి. సుదీర్ రావు
పేరిణి నృత్యం- పేరిణి కుమార్
జానపద కళలు - దురిశెట్టి రామయ్య, కేతావత్ సోమ్లాల్, గడ్డం సమ్మయ్య
టీచర్స్ - డాక్టర్ ఏ వేణుగోపాల్ రెడ్డి, టీఎస్ఎం అండ్ జీ జూనియర్ కాలేజీ, వీణవంక, కరీంనగర్
అంగన్‌వాడీ టీచర్ - ఎం బిక్షపమ్మ
ఉద్యమ గానం- కోడారి శ్రీను, వొళ్లాల వాణి, అవునూరి కోమల, అభినయ శ్రీనివాస్
పెయింటింగ్ - తోట వైకుంఠం
శిల్పకళలు - శ్రీనివాస్ రెడ్డి
శాస్త్రవేత్త - డా. ఎస్ చంద్రశేఖర్, ఐఐసీటీ డైరెక్టర్
అర్చకుడు - పురాణం నాగయ్య స్వామి, కొక్కెర కిష్టయ్య (మేడారం)
గ్రామ పంచాయతీ - శ్రీనివాస్‌నగర్‌ (మానకొండూరు)
ఉత్తమ ఉద్యోగి - నేతి మురళీధర్‌ (ఎండీ, టెస్కాబ్‌ ), ఎన్ అంజిరెడ్డి, ఏఈఎస్
ఉత్తమ రైతు - కండ్రె బాలాజీ (కెరమెరి గ్రామం, కొమురం భీమ్ జిల్లా)
ఆథ్యాత్మికవేత్త - ఎం సంగ్రామ్ మహరాజ్, ఉమాపతి పద్మనాభ శర్మ, మహ్మద్ ఖాజా షరీఫ్ షేక్ ఉల్ హదీస్ (మౌల్వీ), ప్రొఫెసర్ పెనుమాళ్ల ప్రవీణ్ ప్రబు సుధీర్ (బిషప్/ ఫాదర్)
థియేటర్ - దెంచనాల శ్రీనివాస్, వల్లంపట్ల నాగేవ్వర్ రావు
క్రీడలు - తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ - హకీంపేట్, యెండల సౌందర్య (హాకీ)
వేదపండిత్‌ - నరేంద్ర కాప్రె
బెస్ట్‌ లాయర్‌ - జె.రాజేశ్వరరావు
మున్సిపాలిటీ - సిద్దిపేట
స్పెషల్ కేటగిరీ (ఈల పాట) - గడ్డం నర్సయ్య అవార్డులు పొందిన వారిలో ఉన్నారు.

11:10 - June 2, 2017

స్టాక్ మార్కెట్లు జోరు..

ముంబై : లాభనష్టాల్లో ఊగిసలాడిన స్టాక్ మార్కెట్లు శుక్రవారం జోరుగా మొదలయ్యాయి. ఆరంభ ట్రేడింగ్ లో సెన్సెక్స్ 200 పాయింట్లపైకి..నిఫ్టీ కూడా రికార్డు స్థాయిలో మొదలైంది. సెన్సెక్స్ 100 పాయింట్ల లాభంతో 31,246 వద్ద..నిఫ్టీ 35 పాయింట్ల లాభంతో 9,650 వద్ద కొనసాగుతోంది.

పర్వదినం - స్పీకర్ మధుసూధనాచారి..

హైదరాబాద్ : జూ 2 అంటే తెలంగాణ ప్రజలకు పర్వదినమని స్పీకర్ మధుసూధనాచారి పేర్కొన్నారు. అవతరణ వేడుకల్లో భాగంగా ఆయన శాసనసభలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. 60వ ఏళ్ల పోరాట కృషి ఫలితాన్ని ప్రజలందరూ అనుభవిస్తున్నారని, అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతుందని స్పీకర్ పేర్కొన్నారు.

సిద్ధిపేటలో మంత్రి హరీష్ రావు..

సిద్ధిపేట: రాష్ర్టావతరణ దినోత్సవం సందర్భంగా రంగధామ్ పల్లి చౌరస్తాలోని అమరవీరుల స్థూపం వద్ద మంత్రి హరీశ్‌రావు నివాళులర్పించారు. అనంతరం డిగ్రీ కాలేజీ దగ్గర జయశంకర్ విగ్రహానికి హరీష్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు

వేడుకల్లో హర్యానా కంటింజెంట్..

హైదరాబాద్ : పరేడ్ గ్రౌండ్ లో జాతీయ పతాకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా ఆయన పోలీసుల నుండి గౌరవవందనం స్వీకరించారు. ఈ వేడుకల్లో హర్యానా నుంచి ఒక కంటింజెంట్ పాల్గొంది.

అన్యాయం చేయవద్దని కోరా - బాబు..

విజయవాడ : రెండు రాష్ట్రాలకు అన్యాయం జరగవద్దని..ఇద్దరికీ న్యాయం చేయాలని ఆనాడు కోరడం జరిగిందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బెంజ్ సర్కిల్ లో ఆయన నవనిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ చేయించిన అనంతరం ప్రసంగించారు. ఎనిమిది రోజులు ఎనిమిది శ్వేతపత్రాలు విడుదల చేయడం జరిగిందని, జరుగబోయే కష్టాలను వివరించినట్లు చంద్రబాబు పేర్కొన్నారు.

పరేడ్ గ్రౌండ్ కు చేరుకున్న కేసీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పరేడ్ గ్రౌండ్ కు చేరుకున్నారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల గౌరవవందనాన్ని ఆయన స్వీకరించారు.

10:33 - June 2, 2017

వరంగల్ : జిల్లాలో తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. వేడుకల్లో పాల్గొన్న డిప్యూటి సీఎం కడియం శ్రీహరి కళ్లు తిరిగిపడిపోయారు. శుక్రవారం జిల్లాలోని పరేడ్ గ్రౌండ్ లో అవతరణ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా డిప్యూటి సీఎం కడియం శ్రీహరి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రభుత్వ ప్రగతిని వివరించేందుందుకు సిద్ధమయ్యారు..జై..తెలంగాణ..జై..జై..తెలంగాణతో మొదలు పెట్టిన కడియం ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోయారు. స్టేజ్ మీదనే పడిపోవడంతో ఒక్కసారిగా అక్కడ కలకలం రేగింది. వెంటనే తేరుకున్న అధికారులు..సిబ్బంది ఓ వ్యాన్ లోకి తీసుకెళ్లి సపర్యియలు చేపట్టారు. వైద్య సిబ్బంది చికిత్స చేశారు. ఎండ వేడిమి..బిజీ..బిజీగా కార్యక్రమాల్లో పాల్గొనడంతోనే ఇది జరిగిందని తెలుస్తోంది. అనంతరం తేరుకున్న మంత్రి కడియం ప్రగతి నివేదికను ప్రసంగించారు.

10:27 - June 2, 2017

విజయవాడ : జూన్ 2వ తేదీ చీకటి రోజుగా సీఎం చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. నవనిర్మాణ దీక్షలో భాగంగా ఆయన బెంజ్ సర్కిల్ ప్రసంగించారు. ప్రతిజ్ఞ చేయించిన అనంతరం ఆయన ప్రసంగంలో ఆనాటి విభజన విషయాలను మరోసారి గుర్తు చేశారు. రాష్ట్రానికి చీకటి రోజు..జీవితంలో మరిచిపోలేని రోజు..మరవకూడని రోజు..అని పేర్కొన్నారు. రాష్ట్ర నిర్మాణం కోసం మండుటెండల్లో వచ్చారని ఈ స్పూర్తి మరిచిపోవద్దని సూచించారు. మళ్లీ రాష్ట్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని, ప్రజల కష్టాలను అర్థం చేసుకుంటానని తెలిపారు. రాష్ట్రావతరణ దినోత్సవాలు..స్వాతంత్ర్య దినోత్సవాలు జరుపుకుంటారని..కానీ ఏపీ రాష్ట్రానికి ఇది చీకటి రోజని పేర్కొన్నారు. 1953లో అక్టోబర్ 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని, కర్నూలు రాజధానిగా ఉన్నామన్నారు. 1956లో హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని, 2014 జూన్ 2వ తేదీన రెండు రాష్ట్రాలు విడిపోయాయని, ఉభయ రాష్ట్రాలకు హైదరాబాద్ రాజధాని ఏర్పడిందని గుర్తు చేశారు. ఇక్కడ ప్రజలకు అవమానం..ఘోర పరాభావం జరిగిందని దీనిని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. విజయవాడలో ఎక్కడైతే ఆందోళనలు జరిగాయో అక్కడే 'నవ నిర్మాణ దీక్ష'కు పూనుకున్నట్లు తెలిపారు. ఆనాటి కాంగ్రెస్ నాయకులకు ఇక్కడి పరిస్థితి అర్థం చేసుకోలేకపోయారని, మానవతాభావం లేకుండా చేశారని మండిపడ్డారు. ఆనాడు ధర్నాలు..నిరవధిక దీక్షలు..ప్రజాజీవనాన్ని స్తంభింపచేశారని ఆనాటి విషయాలను మరోసారి గుర్తు చేశారు. రెండు రాష్ట్రాలకు అన్యాయం జరగవద్దని..ఇద్దరికీ న్యాయం చేయాలని ఆనాడు కోరడం జరిగిందన్నారు. ఎనిమిది రోజులు ఎనిమిది శ్వేతపత్రాలు విడుదల చేయడం జరిగిందని, జరుగబోయే కష్టాలను వివరించినట్లు చంద్రబాబు పేర్కొన్నారు.

10:23 - June 2, 2017

విజయవాడ : జూన్ 2వ తేదీ..తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రావతరణ వేడుకలు..ఏపీలో నవ నిర్మాణ దీక్షలు జరుగుతుంటాయనే విషయం తెలిసిందే. ఈ సంవత్సరం కూడా అలాగే జరిగాయి. కాసేపటి క్రితం బెంజ్ సర్కిల్ లో జరిగిన 'నవ నిర్మాణ దీక్ష' లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిజ్ఞ చేయించారు. ఆయన మాటల్లోనే..'అవినీతి..కుట్ర రాజకీయాల పట్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని మన కష్టంతో పూరించడానికి సంసిద్ధంగా ఉన్నాం. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో అలుపెరుగని శ్రమ జీవులం..మనం ప్రతి సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకుందాం. దేశభక్తితో సామాజిక బాధ్యతతో క్రమశిక్షణతో మన రాష్ట్ర ప్రజల కోసం..శ్రేయస్సు కోసం మనందరం భుజం..భుజం కలిసి పనిచేద్దాం. 2022 నాటికి మన రాష్ట్రాన్ని దేశంలో మూడో అగ్రరాష్ట్రాల్లో ఒకటిగా..2029 నాటికి దేశంలో అత్యుత్తమ రాష్ట్రంగా..2050 నాటికి ప్రపంచలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే పవిత్ర లక్ష్యంగా నిర్ధేశించుకుందాం. అవినీతి లేని ఆర్థిక..అసమానతలు లేని..అందరికీ ఉపాధి కల్పించే ఆరోగ్యకరమైన ఆనందదాయకమైన రాష్ట్రాన్ని నిర్మించుకుందాం. ఈ లక్ష్య సాధనకు సమర్పభావనతో నిష్టతో త్రికరణ శుద్ధిగా కృషి చేద్దాం..నవనిర్మాణ దీక్ష లక్ష్యాన్ని సాదిద్ధాం. జై ఆంధ్రప్రదేశ్..జై..జై ఆంధ్రప్రదేశ్..జై జన్మభూమి..జై జై జన్మభూమి జైహింద్..జై హింద్'..అని ప్రతిజ్ఞ చేయించారు.

గన్ పార్కు వద్దకు చేరుకున్న కేసీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ గన్ పార్కు వద్దకు చేరుకున్నారు. రాష్ట్రావతరణ వేడుకల్లో భాగంగా ఆయన అమవీరులకు ఘనంగా నివాళులర్పించారు.

సిరిసిల్లలో రాష్ట్రావతరణ వేడుకల్లో మంత్రి కేటీఆర్..

సిరిసిల్ల : రాష్ట్రావతరణ వేడుకల్లో మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. డిసెంబర్ నాటికి తాగు, సాగు నీటి కష్టాలు తీరుతాయని, మిషన్ భగీరథ పనులు త్వరలోనే పూర్తవుతాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. చేనేత కార్మికులకు 50 శాతం రాయితీపై ముడిసరుకు ఉంటుందని, కార్మికుల అభివృద్ధి కోసం, త్రిముఖ వ్యూహం అవలింబిస్తున్నట్లు తెలిపారు. రైల్వే ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు వెల్లడించారు.

కళ్లు తిరిగి పడిపోయిన కడియం..

వరంగల్ : జిల్లాలో జరిగిన రాష్ట్రావతరణ వేడుకల్లో డిప్యూటి సీఎం కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఆయన ప్రసంగిస్తూ కళ్లు తిరిగి పడిపోయారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం ప్రసంగించారు.

ప్రతిజ్ఞ చేయించిన బాబు..

విజయవాడ : బెంజ్ సర్కిల్ నవ నిర్మాన దీక్షలను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజల చేత బాబు ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం భుజం..భుజం కలిపి పనిచేద్దామని పిలుపునిచ్చారు.

09:28 - June 2, 2017

హైదరాబాద్ : భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి మూడేళ్లు పూర్తి చేసుకుని నాలుగో వసంతంలోకి అడుగు పెడుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ఏర్పాట్లు చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వేడుకలు నిర్వహించాలని ఇందులో మంత్రులు..ఎమ్మెల్యేలు పాల్గొనాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. దీనితో ఆయా జిల్లాలకు మంత్రులు చేరుకుని వేడుకలు నిర్వహిస్తున్నారు. మరోవైపు 9.45గంటలకు అమరవీరుల స్థూపానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించి పరేడ్ గ్రౌండ్ కు చేరుకుని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. పోలీసు వందనం స్వీకరించిన అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం జరుగుతున్న ప్రయత్నాలన్నింటిని ప్రజలకు సవివరంగా తెలియజేస్తారు. ఈ సందర్భంగా 52 మంది తెలంగాణ ప్రతిభామూర్తులను కేసీఆర్‌ సత్కరిస్తారు. మరోవైపు..నవ నిర్మాణ దీక్షకు మరోసారి ఏపీ సర్కార్‌ సిద్దమైంది. విభజనతో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ నేటి నుంచి వారం రోజుల పాటు ఈ దీక్షలు చేపట్టనుంది. మూడేళ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి.. భవిష్యత్‌లో చేపట్టాల్సిన కార్యక్రమాలకు రూపకల్పన చేయనున్నారు. చివరి రోజైన 8వ తేదీ కాకినాడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

గన్ పార్క్ కు చేరుకోనున్న సీఎం కేసీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ కాసేపట్లో గన్ పార్క్ కు చేరుకోనున్నారు. అక్కడ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి నేరుగా పరెడ్ గ్రౌండ్ కు చేరుకోనున్నారు.

 

తెలంగాణ భవన్ లో రాష్ట్రావతరణ వేడుకలు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కాసేపటి క్రితం తెలంగాణ భవన్ లో డిప్యూటి సీఎం మహమూద్ ఆలీ, హోం మంత్రి నాయినీలు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. అందరి ఆకాంక్ష వల్లే తెలంగాణ సాకారమైందని, ప్రజలకు ఉపయోగపడే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని నాయినీ తెలిపారు. కొన్ని పార్టీలకు భవిష్యత్ లో అడ్రస్ ఉండదని జోస్యం చెప్పారు.

08:41 - June 2, 2017

విజయవాడ : విజయవాడ మెట్రో రైలు రుణపరిమితిని ఏపీ ప్రభుత్వం పెంచేసింది. ఏకంగా 316 కోట్ల మేర పరిమితిని పెంచింది. ఈమేరకు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. కరవు, తుపాన్లను ఎదుర్కొనే అంశాలతో పాటు.. నవనిర్మాణ దీక్ష, నీరు-ప్రగతి, అగ్రిగోల్డ్‌ ఆస్తులు, ఇన్‌పుట్‌ సబ్సిడీ తదితర 25 అంశాలపైనా మంత్రివర్గం చర్చించింది. విభజన చట్టంప్రకారం రెండు రాష్ట్రాలమధ్య ఆస్తులు, అప్పుల పంపకాలపై డాక్టర్‌ షీలా బేడీ సిఫారసులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పనిచేస్తున్న టీచింగ్‌ మెడికల్‌ ఫ్యాకల్టీ పదవీ విరమణ వయసును 60నుంచి 63ఏళ్లకు పెంచే తీర్మానానికి మంత్రిమండలి అంగీకారం తెలిపింది.. విజయవాడ మెట్రో రైలు కార్పొరేషన్‌కు 18వందల 59కోట్లనుంచి 2వేల 175 కోట్లకు రుణపరిమితి పెంచుతూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది.. మెట్రో రైలు కార్పొరేషన్‌ ఈ రుణాన్ని హడ్కోనుంచి పొందనుంది.. ఆంధ్రప్రదేశ్‌ ఫార్మర్స్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫ్ ఇరిగేషన్‌ సిస్టమ్స్ 1997 చట్టంలో భారీ మార్పులకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.. కాలపరిమితిని ఐదేళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది..
జూన్‌ 3 నుంచి వారం రోజుల పాటు నవ నిర్మాణ దీక్షలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీక్షల చివరిరోజైన జూన్‌ 8న మహాసంకల్పం, బహిరంగసభలు నిర్వహించాలని తీర్మానించారు. మూడేళ్ల పాలనపై సమీక్షించుకుంటామన్న చంద్రబాబు.. అన్యాయం చేసినవారు... సిగ్గుపడేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని పునరుద్ఘాటించారు.

కొనసాగుతున్న రాష్ట్రావతరణ వేడుకలు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. కొత్తగూడెంలోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జలగం వెంటకరావు జాతీయ జెండాను ఎగురవేశారు. అసెంబ్లీలో జాతీయ జెండాలను స్పీకర్ చారి, మండలిలో డిప్యూటి ఛైర్మన్ లు ఎగురవేశారు.

08:19 - June 2, 2017

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్రో చల్లని కబురు అందించింది. ఎండ వేడిమి..ఉక్కపోతతో అల్లాడుతున్న వారికి ఇది ఉపశమనం కలిగించే వార్తగా భావించవచ్చు. ఇప్పటికే రుతు పవనాలు కేరళలను తాకిన సంగతి తెలిసిందే. ఈ పవనాలు ఈనెల 7వ తేదీన రాష్ట్రానికి చేరే అవకాశం ఉందని సమాచారం చేరవేసింది. తొలుత రాయసీమ ప్రాంతాల్లోకి ప్రవేశించిన అనంతరం కోస్తాకు చేరుకుంటాయని పేర్కొంది. కోస్తాకు చేరుకోవడానికి రెండు రోజుల సమయం పడుతుందని తెలిపింది. మరోవైపు ఎండ వేడి మాత్రం కొనసాగుతోంది. దీనితో జనాలు అల్లాడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సగటున 41 నుండి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి.

08:13 - June 2, 2017

ఢిల్లీ : దేశ రాజధానిలో శుక్రవారం ఉదయం భూ ప్రకంపనాలు చోటు చేసుకున్నాయి. తెల్లవారుజామున చోటు చేసుకున్న ఈ ఘటనతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. పలువురు బయటకు పరుగులు తీశారు. హర్యానా కేంద్రంగా భూ ప్రకంపనాలు నమోదైనట్లు గుర్తించారు. రిక్టర్ స్కేల్ పై 4.7గా నమోదైంది. ఎలాంటి ఆస్తి..ప్రాణ నష్టం సంభవించలేదు. రిక్టర్ స్కేల్ పై 5.0 ఎక్కువగా నమోదు అయితే అధిక తీవ్రతగా భావిస్తారనే సంగతి తెలిసిందే. నార్త్..ఈస్ట్ స్టేట్ లలో గురువారం సాయంత్రం పలు ప్రాంతాల్లో భూప్రకంపనాలు చోటు చేసుకున్నాయని, మణిపూర్..త్రిపురలో కూడా భూమి కొద్దిగా కంపించింది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

బెంజ్ సర్కిల్ నవ నిర్మాణ దీక్ష..

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నవనిర్మాణ దీక్షను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపట్టనున్నారు. విజయవాడలోని బెంజ్ సర్కిల్ లో దీక్షపై బాబు ప్రమాణం చేయనున్నారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేల సారథ్యంలో ఏపీలోని 13 జిల్లాల్లో నవ నిర్మాణ దీక్ష ప్రమాణం చేస్తారు.

08:10 - June 2, 2017

రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు తెలంగాణ రాష్ట్రం ముస్తాబైంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అంగరంగ వైభవంగా రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద కేసీఆర్‌ నివాళులర్పించనున్నారు. మరి మూడు సంవత్సరాల పాలనలో పాలన ఎలా ఉంది ? ప్రజల ఆకాంక్షలు నెరవేరాయా ? అనే అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో వీరయ్య (నవతెలంగాణ ఎడిటర్), బెల్లయ్య నాయక్ (టి.కాంగ్రెస్), మన్నె గోవర్ధన్ (టీఆర్ఎస్), ప్రకాష్ రెడ్డి (బీజేపీ), దుర్గాప్రసాద్ (టిడిపి) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

08:04 - June 2, 2017

రాజమౌళి..ప్రభాస్..టాలీవుడ్ లో వీరి కాంబినేషన్ లో వచ్చిన 'బాహుబలి'..'బాహుబలి-2' సినిమాలు ఎంతటి ఘనవిజయం సాధించాయో తెలిసిందే. అనంతరం 'ప్రభాస్' సుజీత్ దర్శకత్వంలో 'సాహో' సినిమాలో నటిస్తున్నాడు. అనంతరం 'ప్రభాస్' ఏ చిత్రాల్లో నటిస్తాడనే దానిపై అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. మళ్లీ 'రాజమౌళి'..'ప్రభాస్' తోనే సినిమాను తీయనున్నారని టాక్ వినిపిస్తోంది. 'రాజమౌళి' తదుపరి సినిమాకు నిర్మాత ఎవరు అనేదానిపై ఓ చర్చ జరిగిన సంగతి తెలిసిందే. డీవీవీ దానయ్య నిర్మాతలో ఓ చిత్రం రూపొందబోతోందని తెలుస్తోంది. అందుకు సంబంధించిన లైన్ ఓకే అయిందని అంటున్నారు. ఈ చిత్రంలో 'ప్రభాస్' హీరోగా నటింపచేయాలని 'రాజమౌళి' అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కానీ 'సాహో' పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుందని..అందువల్ల వెంటనే 'ప్రభాస్' తో 'రాజమౌళి' సినిమా ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

08:03 - June 2, 2017

టాలీవుడ్ ప్రిన్స్ 'మహేష్ బాబు' తాజా సినిమా 'స్పైడర్' కోసం చాలా మంది అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. టీజర్ ఎప్పుడు విడుదలవుతుందా ? అని ఉత్కంఠగా ఎదురు చూసిన అభిమానులకు దర్శకుడు మురుగదాస్ ఫుల్ స్టాప్ పెట్టాడు. గురువారం ఉదయం 10.30గంటలకు 'స్పైడర్' సోషల్ మాధ్యమాల్లో టీజర్ ను విడుదల చేశారు. 'రోబో స్పైడర్' ను చూడగానే .. ఈ సినిమాకి ఈ టైటిల్ ఎందుకు పెట్టారనేది ఆడియన్స్ కి అర్థమైపోయింది. ఈ టీజర్ విడుదలైన కొద్ది గంటల్లోనే వైరల్ అయిపోయింది. 5 గంటల్లోనే ఈ సినిమా టీజర్ వ్యూస్ పరంగా మిలియన్ మార్క్ ను దాటేసింది. శుక్రవారం ఉదయం 40,66,351 మంది వ్యూయార్స్ చూడగా 1,80,806 లైక్స్..15,644 డిస్ లైక్స్ ఉండడం విశేషం. ఈ టీజర్ కి లభిస్తోన్న విశేషమైన స్పందన చూసి ఈ సినిమా టీమ్ తో పాటు, మహేశ్ అభిమానులంతా ఆనందంతో పొంగిపోతున్నారు. మరి చిత్రం ఎలా ఉండనుందో తెలుసుకోవాలంటే దసరా వరకు వేచి చూడాల్సిందే.

06:47 - June 2, 2017

తెలంగాణ రాష్ట్రం నాలుగో వసంతంలోకి అడుగుపెట్టింది. తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కెసిఆర్ కూడా ముఖ్యమంత్రిగా మూడేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్నారు. గత మూడేళ్లలో సాధించిన విజయాలేమిటి? వేసిన తప్పటడుగులేమిటి? సాఫల్య వైఫల్యాలేమిటి? ఈ మూడేళ్లలో టిఆర్ఎస్ పాలన లో ఎదురైన అనుభవాలేమిటి? ఈ అంశంపై టెన్ టివి జనపథంలో తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్ గా పాల్గొన్న న్యూడెమోక్రసీ నేత గోవర్ధన్ పాల్గొని విశ్లేషించారు. ఆయన ఎలాంటి అంశాలపై మాట్లాడారు ? కాలర్స్ ఏ విధమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారో వీడియో క్లిక్ చేయండి.

06:41 - June 2, 2017

హైదరాబాద్ : సంచలనం సృష్టించిన నరేశ్‌-స్వాతి ప్రేమ జంట విషాదంతం కేసులో దాఖలైన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై విచారణను హైకోర్టు మూసివేసింది. నరేశ్‌ హత్యకు గురైనట్టు ప్రభుత్వ న్యాయవాది నివేదించడంతో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ అవసరంలేదని న్యాయస్థానం చెప్పింది. ఈ కేసు దర్యాప్తులో ఏవైనా సమస్యలు ఉంటే కోర్టును ఆశ్రయించవచ్చని పిటిషనర్‌కు సూచించింది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరువు హత్యలపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. స్వాతి తండ్రి శ్రీనివాస్‌రెడ్డి చేతిలో నరేశ్‌ హత్యకు గురైనట్టు దర్యాప్తులో తేలిన విషయాన్ని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు నివేదించారు. నరేశ్‌ ఆనవాళ్లు కూడా లేకుండా చేసిన స్వాతి తండ్రి శ్రీనివాస్‌రెడ్డిని అరెస్టు చేసినట్టు న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ఈ కేసు భువనగిరి కోర్టులో విచారణ జరుగుతున్న విషయాన్ని వివరించారు. నరేశ్‌ హత్యకు గురరైనట్టు తేలడంతో హెబయస్‌ కార్పస్‌ పిటిషన్‌పై విచారణ మూసివేయాలన్న ప్రభుత్వ న్యాయవాది వాదనతో హైకోర్టు బెంచ్‌ ఏకీభవించింది. మరోవైపు ఈ కేసులో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై నరేశ్‌ తరుపు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. ఆత్మకూరు ఎస్‌ఐ శివనాగప్రసాద్‌ను సస్పెండ్‌ చేయడంతోపాటు భువనగిరి పట్టణ సీఐ శంకర్‌, రామన్నపేట సీఐ శ్రీనివాస్‌లకు అధికారులకు చార్జ్‌మెమోలు ఇచ్చినట్టు న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. దీంతో ఈ కేసులో అనుమానాలుంటే మరో కేసు వేసుకోవచ్చని న్యాయస్థానం సూచించింది. స్వాతి తండ్రి శ్రీనివాస్‌రెడ్డికి శిక్ష పడి, తమకు న్యాయం జరిగే వరకు ఎంతదూరమైన వెళతామని నరేష్‌ తండ్రి వెంకటయ్య తేల్చి చెప్పారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో పరువు హత్యలు పెరిగిపోవడం పట్ల హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. నరేశ్‌-స్వాతి ప్రేమ జంట విషాదాంతం కేసు ఇకపై భువనగిరి కోర్టులో విచారణ కొసాగుతుంది.

06:36 - June 2, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా నిరుద్యోగులకు రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్ కమిషన్‌ శుభవార్తను ప్రకటించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్‌-1, గ్రూప్‌-2 ఫలితాలను ఇవాళ విడుదల చేయనుంది. గ్రూప్‌ ఫలితాలతో పాటు 2,437ఉద్యోగాలకు సంబంధించి దాదాపు 15 నోటిఫికేషన్లను జారీ చేస్తామన్నారు ఘంటా చక్రపాణి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్‌-1, 2 ఫలితాలను ఈ రోజు వెల్లడించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి తెలిపారు. ఈ ఫలితాలను వెబ్‌సైట్‌లో ఉంచుతామన్నారు. గ్రూప్‌-1లో 128 పోస్టులకు 1 ఈస్ట్‌ 2 నిష్పత్తి చొప్పున 256 మంది అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. గ్రూప్‌-2లో 1,032 పోస్టులకు 1 ఈస్ట్‌ 3 చొప్పున అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. 15 రోజుల్లోగా అభ్యర్థుల ధృవపత్రాలను పరిశీలించి ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. గ్రూప్‌-1, 2 అభ్యర్థులు అవసరమైన ధృవపత్రాలు సిద్దం చేసుకోవాలని ఘంటా సూచించారు.

2437 పోస్టులు..
ఇక రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా 2,437 పోస్టులకు 15 నోటిఫికేషన్లు విడుదల చేసినట్లు ఘంటా చక్రపాణి తెలిపారు. వీటిలో గురుకులాల డిగ్రీ, జూనియర్‌ కాలేజీల్లో లెక్చరర్లు, ఫిజికల్‌ డైరెక్టర్లు, లైబ్రరియన్లతో పాటు మరిన్ని పోస్టులున్నాయన్నారు. వీటికి ప్రిలిమినరీ రాత పరీక్ష జులై 16న నిర్వహిస్తామన్నారు. మెయిన్స్‌ పరీక్షలు ఆగస్టులో 12, 13 తేదీల్లో నిర్వహిస్తామన్నారు. ఇక అభ్యర్థులంతా కష్టపడి చదవాలన్నారు ఘంటా చక్రపాణి. ఉద్యోగాలిప్పిస్తామని దళారులు, పైరవీకారులు చెప్పే మాటలు నమ్మవద్దన్నారు. తాము ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటివరకు 15 వేల ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహించామని ఆయన తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున మరిన్ని ఉద్యోగాలకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేయడం పట్ల నిరుద్యోగ యువత సంతోషం వ్యక్తం చేస్తోంది.

06:33 - June 2, 2017

విజయవాడ : నవ నిర్మాణ దీక్షకు మరోసారి ఏపీ సర్కార్‌ సిద్దమైంది. విభజనతో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ నేటి నుంచి వారం రోజుల పాటు ఈ దీక్షలు చేపట్టనుంది. మూడేళ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి.. భవిష్యత్‌లో చేపట్టాల్సిన కార్యక్రమాలకు రూపకల్పన చేయనున్నారు. చివరి రోజైన 8వ తేదీ కాకినాడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన జరిగి నేటితో మూడేళ్లు పూర్తయ్యింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు బదులు నవ నిర్మాణ దీక్ష చేపట్టాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఇప్పటికే రెండుసార్లు నవ నిర్మాణ దీక్ష చేపట్టిన ప్రభుత్వం.. ఈరోజు నుండి మూడోసారి నవ నిర్మాణ దీక్ష చేపట్టబోతుంది. రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా జరిగిందని.. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేయడంతో రాష్ట్ర అవతరణ దినోత్సవాలు జరపకుండా నవ నిర్మాణ దీక్ష చేస్తున్నారు సీఎం చంద్రబాబు. ఈరోజు ఉదయం 9 గంటలకు విజయవాడ బెంజి సర్కిల్‌లో చంద్రబాబు నవ నిర్మాణ దీక్షను చేపట్టనున్నారు. వారం రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. శనివారం ఏపీ విభజన చట్టం హామీలు-అమలుపై చంద్రబాబు సమీక్ష చేయనున్నారు. భవిష్యత్‌లో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక శని, ఆదివారాలు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు చేసిన ప్రభుత్వం.. ప్రతి ఉద్యోగి నవ నిర్మాణ దీక్షలు పాల్గొనాలని ఆదేశాలు జారీ చేసింది.

జూన్ 8న...
ఇక నవ నిర్మాణ దీక్షలో భాగంగా ప్రతిరోజు అనేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. నాలుగో తేదీ 'ప్రజలే ముందు-పారదర్శక, జవాబుదారీ సుపరిపాలన' మీద చర్చిస్తారు. అన్ని శాఖల్లో అవినీతికి ఆస్కారం లేకుండా తీసుకోవాల్సిన అంశాలపై చర్చిస్తారు. ఐదో తేదీన రైతులకు రెట్టింపు ఆదాయం, సుస్థిర అభివృద్ధి వ్యూహంపై సమీక్షిస్తారు. ఆరోతేదీ వెల్లువలా పెట్టుబడులు-వేలాదిగా ఉద్యోగాలు అంశంపై చర్చిస్తారు, ఏడో తేదీన సంక్షేమ రంగాలపై చంద్రబాబు సమీక్షిస్తారు. నవ నిర్మాణ దీక్షలో చివరి రోజైన 8వ తేదీన... మహా సంకల్పం పేరిట చంద్రబాబు ప్రతిజ్ఞ చేయనున్నారు. జూన్‌ 8వ తేదీకి చంద్రబాబు సర్కార్‌ కొలువుదీరి మూడేళ్లు పూర్తి చేసుకుని నాలుగో వసంతంలోకి అడుగుపెట్టనుంది. దీంతో కాకినాడలో భారీ బహిరంగసభను నిర్వహించనున్నారు. మహా సంకల్పం పేరుతో ఏర్పాటు చేయనున్న సభను విజయవంతం చేసేందుకు ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

06:30 - June 2, 2017

సంగారెడ్డి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై రాహుల్‌గాంధీ విరుచుకుపడ్డారు. మూడేళ్ల పాలనలో మోదీ, కేసీఆర్‌లు సాధించిందేమీ లేదన్నారు. తెలంగాణ ఇస్తే ప్రజల జీవితాలు బాగుపడతాయనుకుంటే.. కొందరు మాత్రమే ఆ ప్రయోజనం పొందుతున్నారన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల డిమాండ్లతో ఏర్పడిన రాష్ట్రంలో అవి సక్రమంగా కొనసాగడం లేదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులు, నిరుద్యోగుల సమస్యలు పరిష్కారమిస్తామని యువరాజు హామీలు గుప్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూడేళ్ల పాలనలో పూర్తిగా విఫలమయ్యాయన్నారు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ. సంగారెడ్డిలో తెలంగాణ కాంగ్రెస్‌ నిర్వహించిన 'తెలంగాణ ప్రజాగర్జన' సభకు హాజరైన రాహుల్‌.. మోదీ, కేసీఆర్‌ పాలనలపై మండిపడ్డారు. ఇచ్చిన హామీలు, చేసిన వాగ్ధానలు అమలు చేయకుండా మోదీ, కేసీఆర్‌లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. దేశంలో అవినీతి మొత్తం భూమిపైనే జరుగుతుందన్నారు. పేదల భూములు వారికి చెందకుండా చేస్తున్నారన్నారు. యూపీఏ తెచ్చిన 2013 భూ సేకరణ చట్టానికి మోదీ సర్కార్‌ తూట్లు పొడిచిందన్నారు. మూడుసార్లు ఆర్డినెన్స్‌ తెచ్చేందుకు ఎన్డీఏ సర్కార్‌ యత్నించగా.. తాము అడ్డుకున్నామన్నారు రాహుల్‌. గుజరాత్‌ తరహాలో దేశంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్‌ అమలు చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజల కష్టాలను చూసి సోనియాగాంధీ తెలంగాణ ఇస్తే.. కేసీఆర్‌ సర్కార్‌ ఆ ప్రజలను కష్టాలకు గురి చేస్తుందన్నారు.

నేతల సంతోషం..
తెలంగాణలో రైతులు, నిరుద్యోగులకు అనుకూలంగా పాలన సాగడంలేదని,..కాంట్రాక్టర్లు, ల్యాండ్‌ మాఫియాకు అనుకూలంగా పరిపాలన సాగుతుందని రాహుల్‌గాంధీ విమర్శించారు. రైతులు మద్దతు ధర కోసం ఇవాళ ప్రభుత్వాన్ని అడిగితే వారికి భేడీలు వేసే పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రజలందరి కోసం పనిచేయాల్సిన కేసీఆర్‌ సర్కార్‌.. వారి కుటుంబం కోసం మాత్రమే పని చేస్తుందన్నారు. రీ డిజైన్‌ పేరుతో ప్రాజెక్టుల అంచనాలు పెంచుతున్నారని ఆరోపించారు. 2019లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు రాహుల్‌గాంధీ. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు, నిరుద్యోగులకు న్యాయం చేస్తామన్నారు. కేంద్రంలో ఉన్న మోదీ, రాష్ట్రంలో ఉన్న కేసీఆర్‌ కల్లబొల్లి కబుర్లు చెప్తూ కాలం వెల్లదీస్తున్నారని.. వెంటనే వాటిని పక్కనపెట్టి దేశం, రాష్ట్రం కోసం ఏం చేస్తున్నారో చెప్పాలని రాహుల్‌గాంధీ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహిస్తామన్నారు రాహుల్‌. మొత్తానికి రాహుల్‌ సభకు భారీ ఎత్తున ప్రజలు తరలిరావడంతో హస్తం నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

06:28 - June 2, 2017

హైదరాబాద్ : రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు తెలంగాణ రాష్ట్రం ముస్తాబైంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అంగరంగ వైభవంగా రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద కేసీఆర్‌ నివాళులర్పించనున్నారు. అనంతరం పరేడ్‌ గ్రౌండ్స్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉదయం 9 గంటల 55 నిమిషాలకు నివాళులర్పించనున్నారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి.. 10 గంటల 25 నిమిషాలకు పరేడ్‌ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. పోలీసు వందనం స్వీకరించిన అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం జరుగుతున్న ప్రయత్నాలన్నింటిని ప్రజలకు సవివరంగా తెలియజేస్తారు. ఈ సందర్భంగా 52 మంది తెలంగాణ ప్రతిభామూర్తులను కేసీఆర్‌ సత్కరిస్తారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సందర్భంగా గవర్నర్‌ నరసింహన్‌ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తుందని కొనియాడారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు ప్రతి పేదవాడికి చేరేలా చూడాలని సూచించారు. ఇక రాష్ట్రావిర్భావ వేడుకలకు అన్ని జిల్లాల్లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి. జిల్లాల్లోనూ ప్రతిభామూర్తులను సత్కరించనున్నారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా.. అసెంబ్లీ మొదలుకుని పల్లెల్లోని ప్రతి ప్రభుత్వ కార్యాలయం ముస్తాబైంది. నగరంలోని అన్ని కార్యాలయాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. రవీంద్రభారతిలో మూడు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు..

హైదరాబాద్ : రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు తెలంగాణ రాష్ట్రం ముస్తాబైంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అంగరంగ వైభవంగా రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద కేసీఆర్‌ నివాళులర్పించనున్నారు. అనంతరం పరేడ్‌ గ్రౌండ్స్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు.

నేడు గ్రూప్ 1, 2 ఫలితాలు..

హైదరాబాద్ : గ్రూప్ 1, గ్రూప్ 2 ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ఫలితాలను రిలీజ్ చేస్తామని టీఎస్పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి వెల్లడించారు. గ్రూప్‌-2కు సంబంధించిన ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. 2,437 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ఘంటా చక్రపాణి తెలిపారు.

రాహుల్ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందన..

హైదరాబాద్: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. వ్యాఖ్యలు మిలీనియం జోక్‌గా అభివర్ణించారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ నిర్వహించిన ప్రజాగర్జనలో పాల్గొన్న రాహుల్ తెలంగాణ సర్కార్ పై విమర్శలు గుప్పించారు.

ఆర్టీసీ బస్సుకు ప్రమాదం..

ఖమ్మం : సత్తుపల్లి నుండి హైదరాబాద్ వెళుతున్న ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. హయత్ నగర్ సమీపంలో వెనుకనుండి లారీ ఢీకొట్టింది. ఈఘటనలో పలువురు ప్రయాణీకులకు గాయాలైనట్లు సమాచారం.

విద్యుత్ కాంతుల్లో ప్రభుత్వ కార్యాలయాలు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి బల్దియా ఘనంగా ఏర్పాట్లు చేసింది. నగర పరిధిలోని అన్ని కూడళ్లను... చారిత్రక కట్టడాలు, ప్రదేశాలను...పార్క్‌లు... ప్రభుత్వ కార్యాలయాలను అందమైన విద్యుత్‌ దీపాలతో అలంకరించింది. మొత్తం 87 ప్రాంతాల్లో కోటి 14 లక్షల వ్యయంతో జీహెచ్‌ఎంసీ అధికారులు లైటింగ్‌ ఏర్పాటు చేశారు.

Don't Miss