Activities calendar

03 June 2017

21:37 - June 3, 2017

ఢిల్లీ : కేంద్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో ఈవీఎం ఛాలేంజ్‌ ముగిసింది. ఈవీఎంల‌ను హ్యాక్ చేయాలంటూ ఈసీ చేసిన ఛాలెంజ్‌ను ప్రతిప‌క్ష పార్టీలు స్వీక‌రించాయి. ఈసీ చేసిన ఛాలేంజ్‌కు కేవలం సిపిఎం, ఎన్సీపీకి చెందిన ప్రతినిధులే హాజరయ్యారు. ఈసీ ఈ రెండు పార్టీలకు యూపీ, ఉత్తరాఖండ్‌ ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలను నాలుగేసి చొప్పున ఇచ్చాయి. తాము కేవలం ఈవీఎంల ప్రక్రియను తెలుసుకునేందుకే వచ్చామని ఈసీ సవాల్‌ను స్వీకరించడానికి రాలేదని సిపిఎం, ఎన్‌సిపిలు స్పష్టం చేశాయి. ఈవిఎంలను హ్యాకింగ్‌ చేయలేరని, టాంపరింగ్‌ జరిగే ప్రసక్తే లేదని ఎన్నికల ప్రధాన కమిషనర్‌ నసీం జైదీ స్పష్టం చేశారు. ఎన్నికల్లో పారదర్శకత కోసం ఇకముందు వివిప్యాట్‌లను వినియోగిస్తామని తెలిపారు. 

21:36 - June 3, 2017

ఢిల్లీ : జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా జిఎస్‌టి అమలు చేయాలని జిఎస్‌టి కౌన్సిల్‌ నిర్ణయించింది. ఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అధ్యక్షతన జరిగిన జిఎస్‌టి మండలి సమావేశం ఈమేరకు నిర్ణయం తీసుకుంది. జూలై ఒకటి నుంచి జిఎస్‌టి అమలు చేసేందుకు అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సమ్మతించారు. బంగారంపై 3 శాతం పన్ను విధించాలని జిఎస్‌టి కౌన్సిల్‌ నిర్ణయించింది. బీడీల మీద 28 శాతం, బీడి ఆకుల మీద 18 శాతం పన్ను ఖరారైంది. 5 వందల లోపు పాదరక్షలకు 5 శాతం, 5 వందలు దాటితే 18 శాతం పన్ను విధించనున్నారు. బిస్కెట్ల మీద 18 శాతం పన్ను, వెయ్యిలోపు నూలు దుస్తులపై 5 శాతం పన్ను, రెడిమేడ్‌ వస్త్రాలపై 12 శాతం పన్ను విధించేందుకు జిఎస్‌టి కౌన్సిల్‌ సమ్మతించింది. సిల్కు, జనపనార ఉత్పత్తులపై పన్ను పూర్తిగా మినహాయించారు. గత నెల శ్రీనగర్‌లో జరిగిన సమావేశంలో 1,200కు పైగా వస్తువులు, 500 వరకు సేవలకు 5,12,18,28 శాతం శ్లాబులను కౌన్సిల్‌ నిర్ణయించింది. 

21:35 - June 3, 2017

విశాఖ : జిల్లాలో అడ్డగోలుగా భూములను ఆక్రమించుకుంటున్నారని వైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో భూ కబ్జా జరుగుతుందని .. భూ స్కామ్‌లతో విశాఖ బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నారని కబ్జాదారులపై విరుచుకుపడ్డారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

21:34 - June 3, 2017

సంగారెడ్డి : టీఆర్‌ఎస్‌ ఎంపీ బాల్క సుమన్‌పై కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. గుండు కొట్టిచ్చి హైదరాబాద్‌లో తిప్పుతానన్న సుమన్ సవాల్ స్వీకరిస్తున్నానని.. ఇదే సమయంలో సుమన్‌ను హైదరాబాద్‌లో తిరగకుండా చేయగలనని అన్నారు. సుమన్‌కు ధైర్యముంటే కేసీఆర్‌, హరీష్‌రావుతో ఓయూలో మీటింగ్‌ పెట్టించగలవా అని ప్రశ్నించారు. సంగారెడ్డికి రావాలంటే.. కేసీఆర్, హరీష్‌లే భయపడుతారని.. అలాంటిది సుమన్‌ ఎంత అని జగ్గారెడ్డి మండిపడ్డారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ మెప్పు కోసం బాల్క సుమన్‌ ఇద్దరు విద్యార్థులను బలి తీసుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బాల్క సుమన్‌ సంగతి తేల్చుతామంటూ జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

 

21:32 - June 3, 2017

గుంటూరు : గ్రామీణాభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని.. ప్రతి గ్రామంలో పూర్తిస్థాయిలో సిమెంట్ రోడ్లు.. ఎల్‌ఈడీ లైట్లు వేసేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి లోకేశ్‌ అన్నారు. అమరావతిలో 13 జిల్లాల సర్పంచ్‌లతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్‌లు లోకేశ్‌ను సన్మానించారు. గ్రామీణాభివృద్ధి కోసం రూ.700 కోట్లను విడుదల చేయడం జరిగిందని.. త్వరలోనే ఆ నిధులు అన్ని పంచాయతీలకు వస్తాయని మంత్రి లోకేశ్‌ అన్నారు. అలాగే టీడీపీ ప్రభుత్వం వేసిన రోడ్లుపై నుంచే ప్రతిపక్షాలు ఓట్లు అడగడానికి వస్తారన్నారు. ప్రతిపక్షాలకు పనులు చేయడం చేతకాదని... చేసిన పనులను చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. 

21:32 - June 3, 2017

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను అవమానపర్చేందుకే రేపు రాష్ట్రానికి రాహుల్‌గాంధీ వస్తున్నారని విమర్శించారు సీఎం చంద్రబాబు. విభజన సమయంలో ఏపీకి కాంగ్రెస్‌ చేసిన అన్యాయం జీవితంలో మర్చిపోలేమని.. అలాంటి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాల్సిన అవసరం ఉందన్నారు చంద్రబాబు. నవనిర్మాణ దీక్షలో భాగంగా విజయవాడలో రెండో రోజు నిర్వహించిన సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. విభజన తర్వత రాష్ట్రం కష్టాల్లో ఉందని.. అయినా అభివృద్ధిలో దేశంలోనే నెంబర్‌వన్‌ స్థానాన్ని నిలబెట్టుకున్నామన్నారు. 

పిడుగుపాటుకు ఇద్దరు రైతులు మృతి

మంచిర్యాల : కన్నెపల్లి మండలం లింగాలలో విషాదం నెలకొంది. పిడుగుపాటుకు ఇద్దరు రైతులు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వీరిని ఆస్పత్రికి  తరలించారు. మృతులు చంద్రయ్య (45), సిడాంబాబు (64)గా గుర్తించారు. 

హైదరాబాద్ లో కురుస్తోన్న వర్షం

హైదరాబాద్ : నగరంలోని పలు చోట్ల వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, దిల్ సుఖ్ నగర్, ఎల్బీ నగర్ లో వర్షం పడుతోంది. 

హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం..

హైదరాబాద్ : నగరంలోని పలు చోట్ల వర్షం కురుస్తోంది. ఖైరతాబాద్, కూకల్ పల్లి, లక్డికపూల్, అమీర్ పేట సహా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. 

హైదరాబాద్ లో ఇద్దరు బాలికల కిడ్నాప్

హైదరాబాద్ : ఎస్సార్ నగర్ దాసర బస్తీలో అక్షయ (6) అనే బాలికను కిడ్నాప్ చేశారు. చాక్లెట్ ఇస్తానని ఇద్దరు బాలికలను మహిళ కిడ్నాప్ చేశారు. బాలిక తప్పించుకుంది. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో అక్షయ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. 

20:07 - June 3, 2017

కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన ఆమ్లా

లండన్ : వన్డేల్లో వేగంగా సెంచరీలు చేసిన భారత్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లి రికార్డును దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లా బద్దలు కొట్టాడు. ఛాంపియన్స్ ట్రోఫిలో శ్రీలంకతో జరుగుతున్న వన్డేలో ఆమ్లా కోహ్లి రికార్డును అధికమించాడు. ఆమ్లా 103 వన్డేల్లో ఈ ఫీట్ చేశాడు. కోహ్లి గతేడాది జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో వేగంగా 25 సెంచరీలు సాధించాడు. వేగంగా సెంచరీలు సాధించాడనికి కోహ్లికి 162 ఇన్నిగ్స్ లు అవరమైతే ఆమ్లాకు 151 ఇన్నింగ్స్ ల్లో సాధించాడు. 

19:15 - June 3, 2017

లండన్ : వన్డేల్లో వేగంగా సెంచరీలు చేసిన భారత్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లి రికార్డును దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లా బద్దలు కొట్టాడు. ఛాంపియన్స్ ట్రోఫిలో శ్రీలంకతో జరుగుతున్న వన్డేలో ఆమ్లా కోహ్లి రికార్డును అధికమించాడు. ఆమ్లా 103 వన్డేల్లో ఈ ఫీట్ చేశాడు. కోహ్లి గతేడాది జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో వేగంగా 25 సెంచరీలు సాధించాడు. వేగంగా సెంచరీలు సాధించాడనికి కోహ్లికి 162 ఇన్నిగ్స్ లు అవరమైతే ఆమ్లాకు 151 ఇన్నింగ్స్ ల్లో సాధించాడు. 

శ్రీలంక విజయలక్ష్యం 300 పరుగులు

చాంపియన్ ట్రోఫీ : సౌతాఫ్రికా ఆరు వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ ఆమ్లా సెంచరీ చేశాడు. శ్రీలంక విజయలక్ష్యం 300 పరుగులుగా ఉంది. 

 

19:06 - June 3, 2017
19:02 - June 3, 2017

విజయనగరం : గ్రామాల అభివృద్ధే రాష్ట్రాభివృద్ధని.. అలాంటి గ్రామాలను దత్తత తీసుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు. విజయనగరంలో నిర్వహించిన నవ నిర్మాణ దీక్ష రెండో రోజు సమావేశంలో వక్తలు పాల్గొని, మాట్లాడారు. మూడేళ్ల కాలంలో జరిగిన ప్రగతితో పాటు జరగాల్సిన అభివృద్ధిపై చర్చించారు. విభజన తరువాత ఏపీలో పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల సంఖ‌్య  పెరిగిందన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు గ్రామాల దత్తతకు ప్రజలు స్వచ్ఛంధంగా ముందుకు రావాలని వారు విజ్ఞప్తి చేశారు. 

 

18:56 - June 3, 2017

అనంతపురం :  జిల్లాలో అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని ఎంపిడివో కార్యాలయంలో చేపట్టిన నవ నిర్మాణ దీక్షలో ఆయన పాల్గొన్నారు. మూడు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను పల్లె రఘునాథ రెడ్డి వివరించారు. రాబోయే కాలంలో అనంతపురం జిల్లాను కరవులేని జిల్లాగా మార్చే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా పాటించిన ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు ఒకరన్నారు. 

 

18:50 - June 3, 2017

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలోని హామీలను నెరవేరుస్తున్నామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య ఉన్న ఉద్యోగ విభజన.. షెడ్యూల్‌ 9, 10లోని సమస్యలను ఇరు ప్రభుత్వాలు కూర్చుని మాట్లాడుకుంటే సరిపోతుందని రాజ్‌నాథ్‌ అన్నారు.

 

18:47 - June 3, 2017

విశాఖపట్నం : 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపెట్టుకోవడం వల్లే మెజారిటీ తగ్గిందన్న ఎంపీ కేశినేని వాఖ్యలపై  బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ఘాటుగా స్పందించారు. కేశినేని తక్షణమే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్తే బలమెంతో తేలిపోతుందని అన్నారు. బీజేపీపై నిందలు వేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.   

 

18:45 - June 3, 2017
18:42 - June 3, 2017

శ్రీకాకుళం : సివిల్స్ ఫలితాలతో జాతీయస్థాయిలో మూడోర్యాంకు సాధించిన గోపాల కృష్ణ రోణం... ఇవాళ తన స్వగ్రామమైన శ్రీకాకుళం జిల్లా పారసంబకు విచ్చేశారు. జిల్లా అధికారులు, గ్రామస్థులు.. గోపాలకృష్ణకు ఘనస్వాగతం పలికారు. అనంతరం.. గ్రామంలోని గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు గోపాలకృష్ణ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనలాంటి పేద, బడుగు బలహీన విద్యార్థులకు సివిల్స్ ప్రిపరేషన్‌లో పూర్తిసహకారం అందిస్తానన్నారు. సమాజంలో పేదరికం నిర్మూలించేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. 

18:40 - June 3, 2017

యాదాద్రి : యాదాద్రి జిల్లాలో హత్యకు గురైన నరేశ్‌ కేసును పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు....ఇప్పటికే పోలీసుల కస్టడీకి తీసుకున్న నిందితులు శ్రీనివాస్‌రెడ్డి, సత్తిరెడ్డిలను విచారించి హత్య చేసిన స్థలానికి వెళ్లారు...అక్కడేం జరిగింది..? ఎలా మర్డర్ చేశారు..? నరేష్‌ను ఎలా తీసుకువచ్చారు..? ఇలాంటి విషయాలపై పోలీసులు అన్ని వివరాలు సేకరించారు..శ్రీనివాస్‌రెడ్డి వ్యవసాయ పొలంలో జరిగిన ఘాతుకాన్ని పరిశీలించిన పోలీసులు అక్కడ కొన్ని ఆనవాళ్లు సేకరించారు. నరేష్‌ను హత్య చేసిన తర్వాత కాల్చి ఎలాంటి ఆనవాళ్లు లేకుండా చేస్తూ అవశేషాలను మూసీ నదిలో కలిపిన తీరు...ఆ ప్రాంతాలను పోలీసులు పరిశీలించారు..నిందితులకు నరేష్ చేతికి చిక్కిన సమయం నుంచి ఎక్కడికి వెళ్లారు. నరేష్‌, స్వాతి కేసులో దర్యాప్తును వేగం చేసిన పోలీసులు ఆత్మకూరు (ఎం) పోలీస్‌స్టేషన్‌లో నరేష్‌ కుటుంబసభ్యులు, బంధువులను..ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించింది...నరేష్,స్వాతిలకు సంబంధించిన వివరాలన్నీ తీసుకున్న పోలీసులు ప్రతీ సమాచారాన్ని సేకరిస్తున్నారు...ఈ ఎపిసోడ్ పూర్తి చేసేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు

నరేష్‌తో ఉన్న ఆ మిత్రుడు ఎవరు...
ఇక మే 2న నరేష్‌తో పాటు తెల్లచొక్కా వేసుకున్న యువకుడు ఎవరన్నదానిపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు..ఇప్పటికే నరేష్ మిత్రులందరినీ విచారించిన పోలీసులు అసలు వ్యక్తి కోసం గాలిస్తున్నారు..అయితే నరేష్ మిత్రుల్లో ముగ్గురిని అనుమానించిన పోలీసులు అందులో ఒకరిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది....ఆ మూడో వ్యక్తి ఎవరని తేలితే ఈ కేసులో ప్రధాన సాక్ష్యం దొరుకుతుంది..అదే సమయంలో ఈ కేసుకు బలం చేకూరుతుంది.

18:37 - June 3, 2017

హైదరాబాద్ : మియాపూర్ ప్రభుత్వ భూముల ఆక్రమణపై... సీబీఐతో దర్యాప్తు చేయించాలని తెలంగాణ టీడీపీ డిమాండ్ చేసింది. ఇవాళ టీటీడీపీ బృందం.. సచివాలయంలో సీఎస్‌ను కలిసేందుకు వెళ్లింది. అయితే ఆ సమయంలో సీఎస్‌ లేకపోవడంతో.. దేశం సభ్యులు ఆయన ఛాంబర్‌లో బైఠాయించారు. రెండురోజులుగా సీఎస్ అపాయింట్‌ మెంట్ కోసం.. అడుగుతున్నా.. సమయం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు సీఎస్ OSDకి తమ వినతిపత్రం అందించారు. విపక్ష సభ్యులకు చీఫ్ సెక్రటరీ ఇలా అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా అవమానించడం సరికాదన్నారు.

18:35 - June 3, 2017

హైదరాబాద్ : తల్లి బిడ్డల సంరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన కేసీఆర్‌ కిట్‌ పంపిణీ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. హైదరాబాద్‌లో పేట్లబురుజు ఆస్పత్రిలో బాలింతలకు సీఎం.. కిట్‌లను అందజేశారు. ప్రభుత్వం అందజేసే ఈ కిట్‌లలో 16 రకాల వస్తువులను సమకూర్చారు. తల్లి..బిడ్డలకు బట్టలు, ఆయిల్, సబ్బులు, షాంపు, చిన్నారికి చిన్న పరుపు వంటి వస్తువులు అందులో పొందుపరిచారు.

ప్రభుత్వ దవఖానాలోనే
కేసీఆర్‌ కిట్‌లో భాగంగా ప్రభుత్వ దవఖానాలోనే వైద్య పరీక్షలు చేయించుకుని అక్కడ ప్రసవించిన తల్లికి మగ శిశువు పుడితే 12వేల రూపాయలు.. ఆడబిడ్డ పుడితే 13వేల రూపాయలు అందిస్తారు. అయితే ఇవి వాయిదా పద్ధతిలో అందజేస్తారు. ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భిణిగా నమోదు చేయించుకుని కనీసం రెండుసార్లు ప్రభుత్వ ఆస్పత్రిలోవైద్య పరీక్షలు చేయించుకున్న తర్వాత మూడు వేల రూపాయలు ఇస్తారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించిన తర్వాత ఆడబిడ్డ అయితే ఐదు వేలు... మగబిడ్డ అయితే నాలుగు వేలు వాటితో పాటు 2వేల రూపాయల విలువ చేసే కేసీఆర్‌ కిట్‌ ఇస్తారు. బిడ్డ పుట్టినప్పటి నుంచి మూడున్నర నెలల కాలంలో ఇవ్వాల్సిన టీకాలు తీసుకున్నాక రెండు వేలు... 9 నెలల కాలంలో టీకాలు తీసుకున్నాక మరో మూడు వేలు అందజేస్తారు. ఈ కిట్‌లను పొందడానికి గర్భిణులు ఆధార్ కాపీ, బ్యాంకు అకౌంట్ నెంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ని నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటుగా మొబైల్ నెంబర్ మాతాశిశు సంరక్షణ కార్డు కూడా సమర్పించాల్సి వుంటుంది. అయితే ఈ పథకం రెండు కాన్పులకు బతికి ఉన్న ఇద్దరు పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది. 

 

పోరుమామిళ్లలో 21 మంది ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు

కడప : పోరుమామిళ్లలో 21 మంది ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని నుంచి 400 కిలోల ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వారిలో అంతర్రాష్ట్ర స్మగ్లర్ అబ్దుల్ నయీమ్ ఉన్నాడు. 

జీఎస్టీ మండలి సమావేశం..పలు నిర్ణయాలు

ఢిల్లీ : జీఎస్టీ మండలి 15వ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ ఆర్థికమంత్రులు హాజరయ్యారు. పన్నులపై జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకుంది. బిస్కెట్లను 18 శాతం జీఎస్ టీ పరిధిలోకి కేంద్రప్రభుత్వం తీసుకొచ్చింది. రూ. 500 లోపు పాదరక్షలపై 5 శాతం, రూ.500 మించిన పాదరక్షలపై 18 శాతం పన్ను విధించారు. రెడీమేడ్ దుస్తులపై 12 శాతం, నూలు, మిల్లు వస్త్రాలపై 5 శాతం పన్ను విధించారు. 

 

18:17 - June 3, 2017

టీఎస్ ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

హైదరాబాద్ : తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల అయింది. ఈనెల 12నుంచి 21 వరకు సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయనున్నారు. 16 నుంచి 22 వరకు వెబ్ ఆప్షన్ల ఎంపిక జరుగనుంది. 22, 23 తేదీల్లో వెబ్ ఆప్షన్లు మార్చుకునేందుకు అవకాశం ఉంది. 28న సీట్లు కేటాయించనున్నారు. 

భూస్కామ్ పై సీఎస్ కు ఫిర్యాదు చేసేందుకు టీటీడీపీ నేతల యత్నం

హైదరాబాద్ : మియాపూర్ భూస్కామ్ పై సీఎస్ కు ఫిర్యాదు చేసేందుకు టీటీడీపీ నేతల యత్నించారు. సచివాలయంలో సీఎస్ అందుబాటులో లేరు. 2 రోజులుగా టీడీపీ నేతలకు సీఎస్ దొరకలేదు. ఈరోజు ఎలాగైనా సీఎస్ కు కలిసి భూస్కామ్ కు సంబంధించిన ఆధారాలను సమర్పించాలని టీడీపీ నేతలు నిర్ణయం తీసుకున్నారు. 

 

17:39 - June 3, 2017

హైదరాబాద్ : నగరంలోని హైలార్ దేవులపల్లిలో దారుణం జరిగింది. కూతురు అంత్యక్రియలకు డబ్బులు లేకపోవడంతో మృతదేహాన్ని తండ్రి పెంటయ్య డ్రైనేజీలో పడేశాడు. లక్ష్మిగూడకు చెందిన పెంటయ్య కూతురు భవాని ఆత్మహత్య చేసుకుంది. పక్క ఇంట్లో దొంగతనం చేసిందని ఆమెను మందలించడంతో ఆత్మహత్య చేసుకునట్టు తెలుస్తోంది. చేతిలో చిల్లిగవ్వలేని పెంటయ్య కూతురు మృతదేహాన్ని డ్రైనేజీలో పడేశాడు. మూడు రోజుల తర్వాత స్థానికులు డ్రైనేజీలో మృతదేహాన్నిన గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు విచారణ చేపట్టి పెంటయ్య కూతురుగా గుర్తించారు. పెంటయ్య పై ఐపిసి 176 సెక్షన్ కింద కేసు పెట్టారు. గత సంవత్సరం పెంటయ్య కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు అప్పుడు అప్పు చేసి అంత్యకియలు నిర్వహించారు. ప్రస్తుతం పైసాలు లేక ఈ పని చేశానని పెంటయ్య చెప్పారు. 

17:19 - June 3, 2017

నిర్మల్ : జిల్లాలోని దస్తూరాబాద్ మండలం మున్యాల్ లో వింతవ్యాధి సొకుతుంది. గ్రామంలోని 200 మంది చర్మంపై దద్దుర్లు, మంట, ఎలర్జీతో బాధపడుతున్నారు. గ్రామస్తులు పురుగులు కుట్టడమో...లేక నీటి కాలుష్యమో తెలియక ఇబ్బందిపడుతున్నారు. చర్మంపై దద్దుర్లు రావడంతో రాత్రి నిద్రపోవడం లేదని బాదితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వైద్య క్యాంపు ఏర్పాటు చేయాలంటూ గ్రామస్తులు కోరుతున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

16:30 - June 3, 2017
16:26 - June 3, 2017

జమ్మూకాశ్మీర్ : జమ్ముకశ్మీర్‌లో సైనిక దళాలపై ఉగ్రవాదులు దాడి చేశారు. అనంతనాగ్‌లోని ఖాజీగండ్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు ఆర్మీ కాన్వాయ్‌పై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. మరో ఐదుగురు జవాన్లు గాయపడ్డట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. మరోవైపు సరిహద్దులో పాకిస్తాన్‌ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. పూంఛ్‌ సెక్టార్‌లో పాక్‌ ఆర్మీ జరిపిన కాల్పుల్లో ఓ పౌరుడు గాయపడ్డాడు. పాక్‌ కాల్పులకు భారత్‌ సైన్యం దీటుగా సమాధానం చెబుతోంది.

16:21 - June 3, 2017

అనంతపురం : అధికార పార్టీని మించిన ఉత్సాహం.. దూకుడు చూపించి.. రాబోయే ఎన్నికలకు సిద్ధపడాల్సిన వైసీపీలో నిస్తేజం, నీరసం ఆవరించాయి. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ప్రతిపక్ష పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందనే విమర్శలు వస్తున్నాయి. అనంతపురం జిల్లాలో వైసీపీకి ముగ్గురు నలుగురు నేతలు తప్పితే.. పలు నియోజకవర్గాల్లో నాయకత్వలోపం స్పష్టంగా కన్పిస్తోంది. పార్టీలో ముఖ్యనేతలుగా అనంత వెంకటరామిరెడ్డి, గుర్నాథరెడ్డి, విశ్వేశ్వర రెడ్డి, కాపు రాంచంద్రారెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఇలా చెప్పుకొంటూ పోతే ఒకే సామాజికవర్గ నేతలు తప్పితే.. ఓటుబ్యాంకు బలంగా ఉన్న బీసీ నేతలెవ్వరు పార్టీలో లేకపోవడం వైసీపీలో ప్రధానలోపంగా కన్పిస్తోంది. పైగా ఉన్న నేతలు కూడా ఆదిపత్యంకోసం ఆరాటపడటంతో.. నేతల మధ్య సమన్వయం లేకుండాపోయింది. దీంతో జిల్లా వ్యాప్తంగా పార్టీకి అధికార టీడీపీని ఎదుర్కొనే దమ్ములేకుండా పోతుందనే విమర్శలు సొంతపార్టీ నేతల నుంచే వస్తున్నాయి.

హడావిడి మాత్రమే...
ఇప్పటి వరకు జిల్లా సమస్యలపై ప్రతిపక్షపార్టీగా వైసీపీ పెద్దగా స్పందించిన సందర్భాలే లేవు. రైతు భరోసా యాత్ర పేరుతో జగన్ చేసిన హడావిడి తప్పితే.. మరే కార్యక్రమాలు చేపట్టకపోవడంతో.. అనంతపురం జిల్లాలో వైసీపీ పరిస్థితి నిస్తేజంగా మారిందనే అభిప్రాయాలు వస్తున్నాయి. మరోవైపు రాబోయే ఎన్నికల నాటికి కాంగ్రెస్‌నేతలు పార్టీలోకి వస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అప్పటికి ఏం జరుగుతుందో చూద్దామన్న భావనలో వైసీపీనేతలు ఉన్నారు. ఇక ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల ఇంజార్జ్‌లు కూడా టికెట్‌ తమకే వస్తుందన్న ఆశలు కూడా పెట్టుకోవడం లేదు. దీంతో పార్టీ కార్యక్రమాల్లో వారు నామ్‌కేవాస్తేగా పాల్గొంటున్నారని క్యాడర్‌ నుంచి ఆరోపణలొస్తున్నాయి. జిల్లాలో పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారుతున్నా... అధినాయకత్వంలో మాత్రం కదలిక లేకుండా పోయిందని.. మరికొందరు పార్టీ నేతలంటున్నారు. గడపగడపకు వైసీపీ లాంటి కార్యక్రమాలు ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు నేతలు తలోదారిలో నిర్వహిస్తున్నారు. ఇవేవి అధినేత జగన్‌ పట్టించుకోవడంలేదనే అసంతృప్తి క్యాడర్‌లో వ్యక్తం అవుతోంది. అనంతపురం, కళ్యాణుదుర్గం, మడకశిర, తాడిపత్రి ప్రాంతాల్లో నేతలు వర్గాలుగా విడిపోయి.. పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. అటు పెనుకొండ, రాప్తాడు, కళ్యాణదుర్గం, గుంతకల్, కదిరి, ధర్మవరం లాంటి ప్రాంతాల్లో పార్టీ పరంగా ఇంతరకు ఒక్కసారైనా పెద్దకార్యక్రమం నిర్వహించలేదు. ఈ నిస్తేజం పార్టీలో ఎంతగా అలముకుందంటే.. జిల్లా పార్టీ అధ్యక్షుడైన శంకరనారాయణ పోటీ చేసిన పెనుకొండలో ఈ మూడేళ్లలో ఒక్క కార్యక్రమం కూడా చేపట్టని పరిస్థితి ఉంది.

నేతల్లో సమన్వయం లోపం
చివరికి ముఖ్యమంత్రి, మంత్రులు జిల్లాపర్యటనకు వచ్చిన సందర్భంలోకూడా పార్టీ తరపున మాట్లాడే నాయకుడు ఒక్కరు కూడా లేకుండా పోయారు. ఒక్క అనంత వెంకట్రామిరెడి తప్ప మిగిలిన నేతలెవ్వరు ప్రతిపక్షనాయకులుగా అధికారపార్టీపై స్పందించే పరిస్థితే అజిల్లాలో లేకుండా పోయిందని కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరో రెండేళ్లలో సాధారణ ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో పార్టీలో ఇవే పరిస్థితులు ఇలాగే కంటిన్యూ అయితే .. ఇక జిల్లాలో వైసీపీ కోలుకునే అవకాశమే లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వీటికితోడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనంతపురం జిల్లానుంచే పోటీలో వుంటానంటూ ప్రకటన చేసిన నేపథ్యంలో ఎవరికి ఎంతమేర అవకాశం వస్తుందో అర్థంకాక,రాజకీయాలు ఎటు దారితీస్తాయో తెలియక తీవ్ర గందరగోళంలో వున్నారు వైసీపీ నేతలు. ఇప్పటికైనా నియోజకవర్గాలవారీగా సమీక్షలు చేసి నాయకత్వాన్నిబలోపేతం చేయకపోతే పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందంటున్నారు వైసీపీ కార్యకర్తలు. 

16:20 - June 3, 2017

ఖమ్మం : టీఆర్ ఎస్ పై కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. సంక్షేమ పథకాల అమలులో టీ.ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి అనేది కనపడట్లేదని అన్నారు. ప్రాజెక్టులను పూర్తి కానివ్వకుండా కేసీఆర్ అడ్డుపడుతున్నారని ఆరోపించారు. కలిసి వచ్చే పార్టీలతో ఉద్యమాలు చేస్తామన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

16:19 - June 3, 2017

విజయవాడ : ప్రభుత్వం బెల్ట్ షాపులను రద్దు చేయాలని డిమాండ్ ఐద్వా డిమాండ్ చేసింది. ఈమేరకు విజయవాడలోని ఎంబీ భవన్‌లో ఆ సంఘం నేతలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మద్యం మత్తులో కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయని ఐద్వా నాయకురాలు రమాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో మంచినీరు దొరుకుతుందో లేదో కానీ మద్యం మాత్రం విచ్చలవిడిగా దొరుకుతోందని మండిపడ్డారు. ఇప్పటికైనా బెల్ట్ షాపుల్ని ఎత్తివేయాలని.. లేదంటే ఐద్వా ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని రమాదేవి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

16:11 - June 3, 2017

నిర్మల్ : భైంసా పరిధిలోని ధార్ కుబిర్ లో ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. భూ తగాదాల విషయంలో ఈ ఘర్షణ జరిగింది. వ్యవసాయ భూమి పంపకంలో తలెత్తిన గొడవ ఘర్షణకు దారి తీసింది. ఈ ఘర్షణలో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

సిజేరియన్లు చేస్తే కఠిన చర్యలు: మంత్రి హరీష్

సిద్ధిపేట : గర్భిణులకు అనవసరంగా సిజేరియన్లు చేసే ప్రైవేటు ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హరీష్‌రావు హెచ్చరించారు. సిద్ధిపేట మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి ప్రసంగించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గర్భిణుల కోసం కేసీఆర్ కిట్ పథకాన్ని సీఎం ప్రారంభించారని తెలిపారు. రాబోయే రోజుల్లో సిజేరియన్లు క్రమక్రమంగా తగ్గించాలని నిర్ణయించామని చెప్పారు.

'పవన్ కల్యాన్ హోదాను పట్టుకుని వేళాడుతున్నాడు'

అమరావతి : భార‌తీయ జ‌న‌తా పార్టీకి 2019 ఎన్నిక‌లు ఎంతో కీల‌కమ‌ని ఏపీ బీజేపీ నేత, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ఈ రోజు విశాఖ‌ప‌ట్నంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... ఏపీకి ప్ర‌త్యేక‌ హోదాపై సినీన‌టుడు, జ‌నసేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఎవ‌రో త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారని ఆరోపించారు. ఏపీకి తమ పార్టీ హోదాకు మించిన ప్యాకేజీని క‌ల్పించింద‌ని చెప్పారు. ప‌వ‌న్ హోదానే ప‌ట్టుకుని వేలాడుతున్నారని విమ‌ర్శించారు. 2014లో ప‌వ‌న్ త‌మ‌కు స‌హ‌క‌రించారని, 2019వ‌ర‌కు ఆయ‌న‌ను గుర్తుంచుకుంటామ‌ని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్రానికి ఎంతో సాయం చేస్తోంద‌ని ఆయ‌న చెప్పారు.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక

ఛాంపియన్స్ ట్రోఫి : సౌత్ ఆఫ్రికా, శ్రీలంక మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్ లో శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.  

'విశాఖ లో భూదందా పై సమగ్ర దర్యాప్తు జరపాలి'

విశాఖ: రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల్లో సింహ భాగం కేంద్రానిదే అని బిజెపి నేత పురందేశ్వరి అన్నారు. 2019లో పొత్తు నిర్ణయం పార్టీ అధిష్టానిదే అని తేల్చి చెప్పారు. ఎన్నికలు ఎపుడు వచ్చినా మేం సిద్ధం అని పురందేశ్వరి పేర్కొన్నారు. విశాఖ లో భూదందా పై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. మంత్రి అయ్యన్న వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.

సచివాలంయలో టి.టిడిపి నేతలకు చేదుఅనుభవం

హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో సీఎస్ ను కలిసేందుకు వచ్చిన టిడిపి నేతలకు చేదుఅనుభవం ఎదురయ్యింది. ఎల్. రమణ, రేవంత్ రెడ్డి, సీతక్క, రావుల సీఎస్ ను కలిసేందుకు ప్రయత్నించడంతో సీఎస్ అదుబాటులో లేకుండా పోయారు.

15:03 - June 3, 2017

మూడేళ్ల ప్రగతిని వివరిస్తూ పుస్తకాన్ని ఆవిష్కరించిన కేంద్ర హోంశాఖ

ఢిల్లీ: కేంద్ర హోంశాఖ మూడేళ్ల ప్రగతిని వివరిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఓ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని ఉద్యోగుల విభజన షెడ్యూల్ 9,10 విభజనపై సానుకూలంగా ఉన్నామని రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. చాలా విషయాల్లో ఇప్పటికే క్లారిటీ వచ్చిందని, రెండు రాష్ట్రాలు సమస్యలపై చర్చించుకుంటున్నాయన్నారు. విభజనకు సంబంధించిన అన్ని అంశాలు త్వరలోనే కొలిక్కి వస్తాయన్నారు.

సీఆర్డీఏ సదస్సులో అధికారులను నిలదీసిన రైతులు

అమరావతి: తుళ్లూరు మండలం లింగాయపాలెంలో భూసమీకరణపై సీఆర్డీఏ అవగాహన సదస్సు నిర్వహించింది. ఈ సదస్సులో అధికారులపై రైతులు ప్రశ్నల వర్షం కురిపించారు. గ్రామ సభలు నిర్వహించే సమయంలో మినిట్ బుక్ ఎందుకు తీసుకురాలేదని అధికారులను గ్రామస్తులు ప్రశ్నించారు. ఇప్పటి వరకు గ్రామ కంఠాల సమస్యలను ఎందుకు పరిష్కరించలేదో చెప్పాలని రైతులు డిమాండ్ చేశారు.

సీఆర్డీఏ సదస్సులో అధికారులను నిలదీసిన రైతులు

అమరావతి: తుళ్లూరు మండలం లింగాయపాలెంలో భూసమీకరణపై సీఆర్డీఏ అవగాహన సదస్సు నిర్వహించింది. ఈ సదస్సులో అధికారులపై రైతులు ప్రశ్నల వర్షం కురిపించారు. గ్రామ సభలు నిర్వహించే సమయంలో మినిట్ బుక్ ఎందుకు తీసుకురాలేదని అధికారులను గ్రామస్తులు ప్రశ్నించారు. ఇప్పటి వరకు గ్రామ కంఠాల సమస్యలను ఎందుకు పరిష్కరించలేదో చెప్పాలని రైతులు డిమాండ్ చేశారు.

14:51 - June 3, 2017

శ్రీకాకుళం :  జిల్లా వైసీపీలోని నాయకుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుంటుండగా... తాజాగా పార్టీలోకి కొత్త చేరికలు కలకలం రేపుతున్నాయి. కొత్త వారిని తీసుకోవడంతో పార్టీలోని సీనియర్‌ నాయకుల్లో గుబులు పెరుగుతుంది. అలాగే పార్టీ అధిష్ఠానం కొత్తగా చేరుతున్న నేతలకు కూడా ఇంచార్జ్ బాధ్యతలు కట్టబెడుతున్నారు. దీంతో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి.

సీనియర్‌ నాయకుల చేరిక
ఇతర పార్టీల సీనియర్‌ నాయకుల చేరికను...ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, ధర్మాన కృష్ణదాస్ లాంటి నేతలు వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వైసీపీలోకి చేర్చుకోవడానికి మంతనాలు జరుగుతుంటే.. ఈ ముగ్గురు వ్యతిరేకిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. టెక్కలి నియోజికవర్గానికి చెందిన కిల్లి కృపారాణి పార్టీలోకి ఆహ్వానించి అసెంబ్లీ బరిలో దించాలని బడా నాయకులు భావిస్తుండగా... ఈ సీనియర్ నేతలు అడ్డుపడుతున్నట్టు తెలుస్తోంది. సామాజిక సమీకరణాలు .. ప్రాధాన్యత తదితర అంశాల నేపథ్యంలో కిల్లి కృపారాణికి మంత్రి పదవి ఖాయమైనట్టేనని... దీని వల్ల సీనియర్లకు నిరాశే మిగులుతుందని స్థానిక నేతలు చర్చించుకుంటున్నారు.

చోటా నాయకుల్లో అసంతృప్తి
అలాగే కొత్తవారికి పదవులు కట్టబెట్టడంపై కూడా పార్టీలోని చోటా నాయకుల్లో అసంతృప్తి నెలకొంది. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో సాయిరాజ్, రామారావు, పలాసలో ఇద్దరు సీనియర్ నేతలను కాదని.. కొత్తగా డాక్టర్ అప్పలరాజుకు, టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్‌ను తప్పించి... పేడాడ తిలక్‌కు పదవులను కట్టబెట్టారు. జిల్లాలో రాజాం, పాలకొండ ఎమ్మెల్యేలు జోగులు, కళావతిలు ఉన్నా గుర్తింపు లేదు.. ఇలాంటి పరిస్థితుల్లో నియోజికవర్గ సమన్వయకర్తల ఎంపిక గందరగోళానికి దారితీస్తోందని.. వైసీపీ నేతలే బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.ఏదిఏమైనా.. జిల్లా నాయకుల మధ్య విభేదాలను తీర్చడంపై వైసీపీ అధిష్ఠానం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 

14:49 - June 3, 2017

హైదరాబాద్ : నగరంలోని మియాపూర్‌లో జరిగిన భారీ అక్రమ భూ రిజిస్ట్రేషన్‌పై తెలంగాణ రాష్ట్ర సీపీఐ, సీపీఎం నాయకులు మండిపడ్డారు. మియాపూర్‌లోని సర్వే నెంబర్‌ 100 ,101, 20 , 28లోగల ప్రభుత్వ భూములను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, సీపీఎం నాయకులు శోభన్‌లు పరిశీలించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో వేల కోట్ల ప్రభుత్వ స్థలాలకు రక్షణ లేకుండా పోయిందని.. సబ్ రిజిస్ట్రర్లే భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం దారుణమని చాడా వెంకట్‌రెడ్డి అన్నారు. దీనిపై అఖిలపక్షం ఏర్పాటు చేసి, సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంలోని మంత్రి అండదండలతోనే అక్రమ భూ రిజిస్ట్రేషన్ లు జరిగాయని సీపీఎం నాయకుడు శోభన్ ఆరోపించారు.

 

14:48 - June 3, 2017

ఢిల్లీ : జమ్మూక‌శ్మీర్‌లో శాంతి భద్రతల ప‌రిస్థితి మెరుగైందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. సర్జికల్‌ స్ట్రయిక్స్‌ తర్వాత కశ్మీర్‌లోకి ఉగ్రవాద చొరబాట్లు 45 శాతం తగ్గినట్లు ఆయన వెల్లడించారు. కేంద్రంలో మోది ప్రభుత్వం అధికారం చేపట్టి మూడేళ్లు అయిన సందర్భంగా హోంశాఖ పనితీరుపై రాజ్‌నాథ్‌సింగ్‌ మీడియాతో మాట్లాడారు. 2014-2017 మ‌ధ్య క‌శ్మీర్‌లో సుమారు 368 మంది ఉగ్రవాదుల‌ను భద్రతాదళాలు హ‌త‌మార్చినట్లు ఆయ‌న చెప్పారు. ఉగ్రవాద సంస్థ ఐసిస్‌కు అనుకూలంగా పనిచేస్తున్న 90 మందిని పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు పేర్కొన్నారు. భార‌త్‌లో ముస్లింల జ‌నాభా ఎక్కువే ఉన్నా, ఇస్లామిక్ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ మాత్రం దేశంలో త‌మ ప‌ట్టును సాధించ‌లేక‌పోయింద‌న్నారు. వామ‌ప‌క్ష తీవ్రవాదుల‌ను కూడా 60 శాతం నిర్మూలించిన‌ట్లు...మావోయిస్టుల హింసాత్మక ఘటనలు 25 శాతం తగ్గినట్లు హోంమంత్రి తెలిపారు. దేశ భద్రతలో చాలా మార్పు వచ్చిందన్నారు.

నరేష్ హత్య కేసు విచారణ వేగవంతం

యాదాద్రి : తెలంగాణలో సంచలనం సృష్టించిన జిల్లాకు చెందిన నరేష్ హత్య కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. నరేష్ హత్య గురైన ప్రాంతాన్ని పోలీసులు మరోసారి పరిశీలించారు. పోలీసులు హత్యాస్థలానికి నిందితులు శ్రీనివాస్ రెడ్డి, సత్తిరెడ్డిలను తీసుకువచ్చారు. హత్యచేసిన తీరును నిందితులద్వారా పోలీసుల తెలుసుకుంటున్నారు. 

14:15 - June 3, 2017

యాదాద్రి : తెలంగాణలో సంచలనం సృష్టించిన జిల్లాకు చెందిన నరేష్ హత్య కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. నరేష్ హత్యకు గురైన ప్రాంతాన్ని పోలీసులు మరోసారి పరిశీలించారు. హత్యాస్థలానికి నిందితులు శ్రీనివాస్ రెడ్డి, సత్తిరెడ్డిలను పోలీసులు తీసుకువచ్చారు. హత్య చేసిన తీరును నిందితుల ద్వారా పోలీసులు తెలుసుకుంటున్నారు. ఎల్బీనగర్ డీసీపీ ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా ఆత్మకూరులో విచారణ కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

'రవీంధ్రభారతి, సాంస్కృతి శాఖ సమన్వయంతో పనిచేయాలి'

హైదరాబాద్: తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యాలయాన్ని కూడా రవీంద్ర భారతిలోనే ఏర్పాటుచేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఆయన ఈ రోజు రవీంధ్ర భారతిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రవీంధ్రభారతి, సాంస్కృతి శాఖ సమన్వయంతో పనిచేయాలన్నారు. అక్టోబర్ లో నిర్వహించే తెలుగు మహాసభలకు ఏర్పాటు చేయాలని సూచించారు. తెలుగు భాషను కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి సూచనలు చేయాలని తెలిపారు.

అధికారులు లంచం తీసుకుంటే కఠిన చర్యలు

ఖమ్మం: అధికారులెవరైనా లంచం తీసుకున్నా... ప్రజలను ఇబ్బంది పెట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం జిల్లాల్లోని వైరాలో సాదాబైనామా పట్టాలను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తోందని, రైతులు ఇబ్బంది పడకూడదని రూపాయి ఖర్చు లేకుండా రెవెన్యూ రికార్డులు అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

13:28 - June 3, 2017

కరీంనగర్ : జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలు రసాభాసగా సాగుతున్నాయి. అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మరోవైపు అధికారపార్టీ నేతలే సమస్యలపై నిరసనగళం విప్పడంతో అధికారులకు అయోమయ పరిస్థితి ఎదురైంది. తూతూ మంత్రంగా సాగుతున్న కరీంనగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలపై టెన్ టివి ప్రత్యేక కథనం. కరీంనగర్ జిల్లా పరిషత్ పాలకవర్గం ఏర్పడి మూడేళ్లవుతోంది. పేరుకి సమావేశాలు నిర్వహిస్తున్నారు తప్ప.. ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా మాత్రం చర్యలు కనిపించట్లేదు. సరిపడా నిధులు లేవంటూ విపక్ష కాంగ్రెస్ జడ్పీటీసీలు, ఎంపీపీలు నిరసనలు తెలిపి పాలకవర్గం పనితీరును బయటపెట్టినా.. ఆశించిన ఫలితాలు రాలేదు. దాంతో తూతూమంత్రంగానే సమావేశాలు జరుగుతున్నాయి. మరోవైపు అధికార పార్టీ నేతలే సమస్యలపై నిరసన గళం ఎత్తడంతో సమాధానం చెప్పలేని అయోమయ పరిస్థితిలో సమావేశం జరిగింది.

మండిపడుతున్న జడ్పీటీసీలు..
జిల్లా పరిషత్ సమావేశాలకు ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలు విధిగా సర్వసభ్య సమావేశాలకు హాజరు కావాల్సి ఉంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 13 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు ఉన్నారు. వీరిలో జగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాత్రమే ఎక్కువసార్లు సమావేశాలకు హాజరయ్యారు. గత నెల 31 న జరిగిన సమావేశానికి ఒక్క ఎమ్మెల్యే హాజరు కాకపోవడంపై జడ్పీటీసీలు మండిపడుతున్నారు. స్ధానికంగా ఉండే ఎమ్మెల్యేలు ప్రోటోకాల్ కూడా పాటించకుండా అవమానపరుస్తున్నారంటూ వారు విమర్శిస్తున్నారు.

అయోమయానికి గురైన జడ్పీ చైర్మన్..
ఇక ప్రభుత్వ పథకాల పనితీరుపై పలువురు జడ్పీటీసీలు అధికారుల్ని నిలదీశారు. మిషన్ భగీరథ పనులు నత్తనడకన సాగుతున్నాయని.. ఇంటింటికి నల్లా నీరు ఉత్తమాటేనంటూ పలువురు జడ్పీటీసీలు అసహనం వ్యక్తం చేశారు. తమ పరిధిలో కొనసాగుతున్న మిషన్ భగీరథ పనులకు సంబంధించి వివరాలను కాంట్రాక్టర్లు అందించడం లేదంటూ అధికార పార్టీకి చెందిన ముస్తాబాద్, మానకొండూరు జడ్పీటీసీలు వాపోయారు. అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులే సమస్యలు లేవనెత్తడంతో జడ్పీ చైర్మన్ తుల ఉమ అయోమయానికి గురైన పరిస్థితి ఏర్పడింది. ప్రతి సమావేశంలోనూ ఇదే తంతు జరగడం.. పరిష్కార మార్గాలు చూపకుండానే సమావేశాలు ముగుస్తుండటంతో జిల్లా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు తీర్చాల్సిన ప్రజా ప్రతినిధులే ఇలా మాటల యుద్ధాలతో సమయం వృథా చేస్తే తమని ఎవరు పట్టించుకుంటారని ప్రశ్నిస్తున్నారు. దీనిపై ప్రజాప్రతినిధులు, అధికారులు ఏం సమాధానం చెప్తారో వేచి చూడాలి.

13:23 - June 3, 2017

హైదరాబాద్ : ఒకరు కాదు.. ఇద్దరు కాదు వేల సంఖ్యలో కాంట్రాక్టు కార్మికులు బల్దియాలో పనిచేస్తున్నారు. వారు లేకపోతే ఒక్క అడుగు ముందుకు పడదు. అలాంటి వారి సంక్షేమాన్ని జీహెచ్‌ఎంసీ విస్మరిస్తోంది. విధుల్లో ఉండి ప్రాణాలు కోల్పోతున్న వారి కుటుంబాలకు ఇన్సూరెన్స్ చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తోంది. వారికి న్యాయం చేయాలంటూ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్ కోటిమందికి సేవలందిస్తున్న పాలక సంస్థ. బల్దియా పరిధిని విస్తరించడం..రిటైర్ అయిన వారి స్ధానంలో కొత్తవారిని నియమించకపోవడంతో కార్పొరేషన్‌లో భారీగా ఔట్‌సోర్సింగ్ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. బల్దియాలోని పలు విభాగాల్లో దాదాపు 27 వేల మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు.

కొందరికి రెండు, మూడు నెలలకోసారి వేతనాలు..
ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులే లేకుంటే బల్దియాలో ఒక్క పని కూడా ముందుకు సాగదు. తమ కంప్యూటర్లు తాము ఆపరేట్‌ చేసుకునే పరిస్థితుల్లో లేరు కొందరు అధికారులు. ఇంత ప్రాధాన్యమున్న ఔట్ సోర్సింగ్‌ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది బల్దియా. కార్మికులకు చెల్లించాల్సిన వేతనాలు, ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లింపుల అంశాల్ని పట్టించుకోకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. అనారోగ్యంతో ఉన్నా.. విధులకు హాజరు కావాల్సిందేనంటూ అధికారులు ఒత్తిడి తెస్తున్నారని కార్మికులు వాపోతున్నారు. కొంతమంది ఉద్యోగులకైతే రెండు, మూడు నెలలకొకసారి వేతనాలు చెల్లిస్తున్నట్లు చెబుతున్నారు.

ఇన్సూరెన్స్ రెన్యువల్ కాక ఆందోళనలో కార్మికులు..
వేతనాల సంగతి అలా ఉంచితే కార్మికులకు చెల్లించాల్సిన ఇన్సూరెన్స్‌ కూడా చెల్లించకపోవడంతో కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రమాదాల కారణంగా మరణించిన వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. జిహెచ్ఎంసిలో పారిశుధ్య, మలేరియా, రవాణా, వెటర్నరీ, డ్రైవర్లు, హౌస్ కీపింగ్, సెక్యూరిటి గార్డ్స్, అర్బన్ బయోడైవర్సిటీ తదితర విభాగాల్లో 26,400 మంది పనిచేస్తున్నారు. వీరికి ఏటా జీహెచ్‌ఎంసీ 31 లక్షల 68 వేల రూపాయలు ఇన్సురెన్స్ ప్రీమియం చెల్లిస్తోంది. ఎవరైనా కార్మికుడు ప్రమాదంలో చనిపోతే వారికి కుటుంబానికి ఈ ప్రీమియం ద్వారా 5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తారు. అయితే ఈ ఏడాది జనవరి 20నాటికి చెల్లించాల్సిన ప్రీమియం గడువు తీరిపోయింది. దీంతో కార్మికుల‌కు ఇన్సూరెన్స్‌ రెన్యూవ‌ల్ కాకపోవడంతో న్యాయం చేయాలని కోరుతున్నాయి కార్మిక సంఘాలు. వేల కోట్లతో భారీ ప్రాజెక్టులు చేపడుతున్న బల్దియా..31 లక్షలు చెల్లించడానికి ఇబ్బందులు పడుతోంది. ఇప్పటికైనా కార్మికులకు చెల్లించాల్సిన ప్రీమియం చెల్లించి వారికి న్యాయం చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

రవీంధ్ర భారతిని సందర్శించిన సీఎం కేసీఆర్

హైదరాబాద్: రవీంధ్ర భారతిని సీఎం కేసీఆర్ సందర్శించారు. నూతన భవనం నిర్మాణానికి స్థలాన్ని సీఎం కేసీఆర్ పరిశీలించారు.

13:19 - June 3, 2017

తూర్పుగోదావరి : నేతల మధ్య సమన్వయం లేదు ... ఉత్సాహం నింపే కార్యక్రమం లేదు... ప్రజా సమస్యలపై దృష్టి లేదు... ఇది తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ పరిస్థితి. కనీసం ఇక్కడ సరైన నిర్మాణం కూడా లేదు. కానీ వచ్చే ఎన్నికల్లో తమదే అధికారం అనుకుంటూ నాయకులు కలల్లో విహరిస్తున్నారు. ఏపీలో తూర్పుగోదావరి జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ ఏ పార్టీ మెజార్టీ సాధిస్తే ఆ పార్టీకే అధికారం దక్కుతుందని అందరూ భావిస్తుంటారు. దీంతో ఇక్కడ బలోపేతం అయ్యేందుకు పార్టీలన్నీ పోటి పడుతూ ఉంటాయి. కానీ వైసీపీ పరిస్థితి మాత్రం దీనికి భిన్నంగా ఉంది. నాయకుల మధ్య విభేదాలతో పాటు పార్టీ నిర్మాణం కూడా లోప భూయిష్టంగానే ఉంది. దీంతో స్థానిక వైసీపీ నాయకులందరూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ప్రవర్తిస్తున్నారు.

కన్నబాబు మాట పట్టించుకోని కార్యకర్తలు..
స్థానిక వైసీపీ నాయకులకు పార్టీపై పట్టు కూడా లేదు. జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న కురసాల కన్నబాబుకు పార్టీ మీద ఏ విధమైన అవగాహన ఉన్నట్టు కనిపించడం లేదు. సీనియర్‌లున్నా... ఏడాది క్రితం పార్టీలో చేరిన కన్నబాబుకు పదవిని ఇవ్వడంతో ఈయన మాటను ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. కన్నబాబు కూడా కాకినాడ రూరల్‌ మీదే దృష్టి కేంద్రీకరిస్తున్నారు..మిగిలిన నియోజకవర్గాలను పట్టించుకోవడం లేదు. అలాగే రాజమండ్రి ప్రాంతంలో జక్కంపూడి కుటుంబం కనుసన్నల్లో పార్టీ సాగుతోంది. జక్కంపూడి విజయలక్ష్మికి రాజానగరంపై దృష్టి పెట్టాలని ఆదేశాలున్నా.. ఆమె మాత్రం చుట్టు పక్కల అన్ని నియోజకవర్గాల్లోనే పనులు నిర్వహిస్తున్నారు. దీంతో పార్టీలో పలు సమస్యలు తలెత్తుతున్నాయి. ఇక రామచంద్రాపురం ఏరియాలో ఎమ్మెసీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ ఉన్నప్పటికీ అంటిముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. అదే విధంగా అమలాపురంలో విశ్వరూప్‌ గెస్ట్‌ పొలిటిషియన్‌ తరహాలో వ్యవహరిస్తున్నారు.

మెట్టలో పార్టీని నడిపంచే నాధుడు కరువు..
జిల్లాలోని 19 నియోజకవర్గాల పరిస్థితి దాదాపు ఒకేలా ఉంది. కోనసీమలో, మండపేట నియోజకవర్గాల్లో నేతల మధ్య ఐక్యత లేదు. గన్నవరంలో పార్టీ రెండు ముక్కలుగా.. ముమ్మడి వరంలో మూడు ముక్కలుగా ఉంది. జగ్గంపేట, ప్రత్తిపాడు స్థానాలకు తగిన నేతలను ఎంపిక చేయలేదనే విమర్శలు ఉన్నాయి.మెట్టలో పార్టీని నడిపించే నాధుడే కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో తూర్పు వైసీపీకి చికిత్స అత్యవసరంగా మారుతోంది. అది జరగకపోతే జగన్‌ ఆశలకు గండి పడడం ఖాయం.

13:09 - June 3, 2017

హైదరాబాద్ : టీవీల్లో వచ్చే సీరియల్స్..కార్టూన్లు పిల్లలపై ఎంత ప్రభావం చూపిస్తాయో ఈ ఘటన నిరూపిస్తోంది. ఓ కార్టూన్ లో వచ్చిన దృశ్యాన్ని అనుకరించే ప్రయత్నం చేసిన ఓ బాలుడు తీరనిలోకాలకు వెళ్లిపోయాడు. ఈ విషాద ఘటన బాలానగర్ లో చోటు చేసుకుంది. జియాగూడలో నివాసం ఉంటున్న ఓ కుటుంబానికి చెందిన కుమారుడు జయదేవ్ (12) అమ్మమ్మ నివాసం ఉంటున్న బాలానగర్ లోని వెంకటాపురం ప్రాంతానికి వచ్చాడు. ఓ కార్టూన్ సీరియల్ చూసిన జయదేవ్ అందులో వచ్చిన దృశ్యాన్ని అనుకరించే ప్రయత్నం చేశాడు. మేడపైకి వెళ్లిన జయదేవ్ వెంట తెచ్చుకున్న కిరోసిన్ ను శరీరంపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. కిందనే ఉన్న అమ్మమ్మకు తాను నిప్పంటించుకున్నానని చెప్పడంతో ఆమె తీవ్ర భయాందోళనకు గురైంది. వెంటనే స్థానికుల సహాయంతో ఆసుపత్రికి తరలించారు. కానీ జయదేవ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పంచనామా నిర్వహించి మృతదేహాన్ని అప్పగించారు. జియాగూడ..వెంకటాపురం ప్రాంతాల్లో తీవ్ర విషాదం నింపింది.

నరేష్ హత్య కేసు విచారణ వేగవంతం

యాదాద్రి: నరేష్ హత్య కేసు విచారణను వేగవంతం చేసింది. నరేష్ హత్యకు గురైన ప్రాంతాన్ని ఎస్ టీవో పోలీసులు, క్లూస్ టీం పరిశీలించింది. అంతేకాకుండా ముద్దయిలను కూడా ఆ ప్రాంతానికి తీసుకువచ్చి నరేష్ ను ఎలా హత్య చేసింది, హహనం చేసిన తీరును ప్రత్యక్షంగా చేయించి పోలీసులు తెలుసుకుంటున్నారు.

ఇంతపెద్ద కుంభకోణం ఇప్పటి వరకు చూడలేదు:బొత్స

విశాఖ : తన ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఇంతపెద్ద కుంభకోణం చూడలేదని వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ, భూకుంభకోణాలతో విశాఖ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో భారీ కుభకోణానికి తెరతీశారని ఆయన ఆరోపించారు. 3 లక్షల అడంగల్ కాపీలు కనిపించడం లేదని ఆయన చెప్పారు. అడ్డగోలుగా భూములు ఆక్రమించుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. 

కేసీఆర్ కిట్ల కోసం ఎండలో బాలింతల ఎదురుచూపులు

రంగారెడ్డి : శంషాబాద్ పీహెచ్ సిలో బాలింతలు పడిగాపులు కాస్తున్నారు. ఉదయం 10 గంటలకు కేసీఆర్ కిట్లు అందజేస్తామని చెప్పి ఇంత వరకు ప్రభుత్వ వైద్యులు ఇవ్వలేదని వారు ఆరోపిస్తున్నారు. మంత్రి మహేందర్ రెడ్డి రాకపోవడంతో ఎండలోనే బాలింతలు పడిగాపులు కాస్తున్నారు.

12:38 - June 3, 2017

భారతదేశంలో ఎన్నో అమానవీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కానీ అధికారులు..ప్రజాప్రతినిధులు ఏమాత్రం స్పందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంబులెన్స్ లేక మృతదేహంతో కిలో మీటర్ల నడక..వీల్ ఛైర్ లేక ఆసుపత్రిలో సమస్యలు..ఇలా ఎన్నో ఘటనలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. రోగుల పట్ల కనీసం కనికరం కూడా చూపడం లేదు. తాజాగా ఓ ఆసుపత్రిలో నడవలేని భర్తను వీల్ ఛైర్ ఇవ్వకపోవడంతో లాక్కెళ్లింది. ఈ వీడియో సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కర్ణాటక శివమొగ్గ నగరంలో మెగ్గాన్స్ ప్రభుత్వాసుపత్రికి గత నెల 25వ తేదీన భర్త అమీర్ సాబ్ తో భార్య పామీదా వచ్చింది. అక్కడ స్కానింగ్ చేయాలని వైద్యులు సూచించారు. తన భర్త నడవలేడని..వీల్ ఛైర్ ఇవ్వాలని పామీదా అభ్యర్థించింది. వీల్ ఛైర్ ఇవ్వకపోవడంతో స్కానింగ్ సెంటర్ వరకు తన భర్తను నేలపైనే లాక్కెళ్లింది. అక్కడున్న వారు ఈ దృశ్యాలను చరవాణిలో బంధించే ప్రయత్నం చేశారు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసింది. ఘటనకు బాధ్యులుగా భావించి నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు.

కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలపై విరుచుకుపడ్డ జైపాల్ రెడ్డి

హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మాజీ ఎంపీ జైపాల్ రెడ్డి విమర్శలు గుప్పించారు. మూడేళ్లలో సాధించింది ఏమీ లేదన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి, ఇచ్చిన హామీలను మోదీ మరిచిపోయారని ఆరోపించారు. నల్ల కుబేరులను కేంద్రం వెనుకేసుకోస్తోందని, నల్లధనం విషయంలో ఏం చేశారో చెప్పాలని జైపాల్ రెడ్డి సవాల్ విసిరారు. నోట్ల రద్దు కష్టాలు ఇంకా తీరనే లేదన్నారు.

గోవధ నిషేధాన్ని వ్యతిరేకిస్తూ సీపీఐ ధర్నా

విజయవాడ : గోవధ నిషేధాన్ని నిరసిస్తూ లెనిన్ సెంటర్ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజా హక్కులను నిషేధించే అధికారం ఎవరికీ లేదన్నారు. ప్రజా హక్కులను కాలరాసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం మత విద్వేషాలను రెచ్చగొడుతోందని విమర్శించారు.

12:23 - June 3, 2017

టీమిండియా...భారత్ క్రికెట్ జట్టు కోచ్ ఎవరు ? చాంఫియన్స్ ట్రోఫితో ప్రస్తుత కోచ్ అనీల్ కుంబ్లే పదవీ కాలం ముగుస్తున్న సంగతి తెలిసిందే. మరలా కోచ్ పదవి తీసుకోవడానికి కుంబ్లే విముఖత వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం జరుతోంది. తాజాగా..బీసీసీ..టీమిండియాకు సంబంధించిన వార్తలు సోషల్ మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. సెహ్వాగ్ కోచ్ పదవి రేసులో ఉన్నాడని ఇటీవలే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా కోచ్ పదవికి 'సెహ్వాగ్' దరఖాస్తు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తొలుత కుంబ్లే పదవీ కాలాన్ని పొడిగిస్తారని వార్తలు వచ్చాయి. కానీ కెప్టెన్ కోహ్లీ..కోచ్ కుంబ్లే మధ్య విబేధాలు ఉన్నాయని పుకార్లు షికారు చేశాయి. ఓ అధికారి సూచన మేరకు సెహ్వాగ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నాడని తెలుస్తోంది. సెహ్వాగ్ కు కోచింగ్ లో పెద్దగా అనుభవం లేనప్పటికీ...ఐపీఎల్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మెంటార్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

12:19 - June 3, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 'కేసీఆర్ కిట్' పథకం అమల్లోకి వచ్చింది. రాష్ట్ర అవతరణ దిన్సోవత్సాల్లో భాగంగా ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. కాసేపటి క్రితం ప్లేట్ల బురుజు ఆసుపత్రికి చేరుకున్న సీఎం కేసీఆర్ సౌకర్యాలు..ఇతరత్రా సమస్యలపై కేసీఆర్ ఆరా తీశారు. వైద్యులతో మాట్లాడి పలు సూచనలు..సలహాలు అందచేశారు. అనంతరం 'కేసీఆర్ కిట్' వెబ్ సైట్ ప్రారంభం చేశారు. ఆసుపత్రిలోనే ఏర్పాటు చేసిన వేదిక నుండి 'కేసీఆర్ కిట్' లను బాలింతలకు అందచేశారు. మేకల సబిత..రిషీదా బేగం..నూకల నవనీత..మహజీబీన్..పి.సరితమ్మ..తపస్సుమ్ లు కిట్ లు తీసుకున్న వారిలో ఉన్నారు. కేసీఆర్ వెంట కేంద్ర మంత్రి దత్తాత్రేయ, డిప్యూటి సీఎం మహమూద్ ఆలీ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, హోం మంత్రి నాయినీ..సయ్యద్ అహ్మద్ ఫాషా ఖాద్రీ, సీఎస్, ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిభ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

రెండు కాన్పుల వరకు..
రెండు కాన్పుల వరకు ఈ పథకం వర్తిస్తుంది. ఒక్కో కాన్పుకు రూ. 2వేల విలువైన కిట్లు అందచేయనున్నారు. ఆడ బిడ్డ పుడితే 13 వేల రూపాయలు, మగ బిడ్డ పుడితే 12 వేల రూపాయలు తల్లి అకౌంట్లో జమ చేస్తారు.  ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఆధార్‌ నంబర్‌ అనుసంధానంతో గర్భిణిల పేరిట బ్యాంకు అకౌంట్లు ప్రారంభిస్తారు. ప్రభుత్వ అందించే ఆర్థిక సహాయాన్ని ఖాతాలో జమ చేస్తారు. గర్భిణిలకు వైద్య పరీక్షల సమయంలో నాలుగు వేల రూపాయలు, ప్రసూతి వైద్యం అందించేటప్పుడు మరో నాలుగు వేల రూపాయలు జమ చేస్తారు. ప్రసవానంతరం బిడ్డకు టీ కాల కోసం ఇంకో నాలుగు వేల రూపాయలు..ఇలా మూడుదశల్లో మొత్తం 12 వేల రూపాయలు ఇస్తారు.

దేశభద్రతకు ఎలాంటి ముప్పు లేదు: రాజ్ నాథ్ సింగ్

ఢిల్లీ : దేశభద్రతకు ఎలాంటి ముప్పు లేదని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్ లో పరిస్థితులు అదుపులోకి వచ్చాయన్నారు. భారత్ పై ఐఎస్ఐ కాలుమోపనివ్వం అని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 90 మంది ఐఎస్ఐ సానుభూతిపరులను అరెస్టు చేశామన్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్లామని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు.

కేసీఆర్ కిట్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం

హైదరాబాద్: సీఎం కేసీఆర్ కిట్ల పంపిణీ పథకం ప్రారంభం అయ్యింది. పేట్లబూరుజు ఆసుపత్రిలో ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా కాన్పు జరిగిన వెంటనే కేసీఆర్ కిట్ ను అందజయనున్నారు. కేసీఆర్ కిట్ లో 16 రకాల వస్తువులు వున్నాయి. ఆడబిడ్డకు రూ. 13వేలు, మగబిడ్డకు రూ.12 వేల ఆర్థిక సాయం అందించనున్నారు.అయితే ఈ ఆర్థిక సాయం 3 విడతలుగా లబ్ధిదారుల ఖాతాలో సర్కార్ జమచేయనుంది.

దేశభద్రతకు ఎలాంటి ముప్పు లేదు: రాజ్ నాథ్ సింగ్

ఢిల్లీ : దేశభద్రతకు ఎలాంటి ముప్పు లేదని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్ లో పరిస్థితులు అదుపులోకి వచ్చాయన్నారు. భారత్ పై ఐఎస్ఐ కాలుమోపనివ్వం అని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 90 మంది ఐఎస్ఐ సానుభూతిపరులను అరెస్టు చేశామన్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్లామని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు.

ప్రారంభమైన జీఎస్టీ మండలి సమావేశం...

ఢిల్లీ: ఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో జీఎస్టీ మండలి 15వ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశలో అత్యంత కీలకమైన బంగారంపై పన్ను అంశాన్ని కూడా చర్చించనున్నారు. దీంతోపాటు దుస్తులు, బిస్కెట్లు వంటి వాటిని ఏ స్లాబ్‌లోకి తీసుకురావాలో నేడు నిర్ణయించనున్నారు. శ్రీనగర్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై కూడా జీఎస్టీ మండలి సమీక్షించనుంది. తెలుగు రాష్ట్రాల తరపున యనమల రామకృష్ణుడు, ఈటల రాజేందర్‌లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

11:56 - June 3, 2017

లండన్ : మినీ వరల్డ్‌కప్‌లో అసలు సిసలు సమరానికి రంగం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్ధులు భారత్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య చాంపియన్స్‌ ట్రోఫీ చాలెంజ్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. చాంపియన్స్‌ ట్రోఫీ గ్రూప్‌-బీ లీగ్‌లో బ్లాక్‌ బస్టర్‌ ఫైట్‌కు భారత్‌, పాకిస్థాన్‌ సై అంటే సై అంటున్నాయి.ఓ వైపు వన్డేల్లో ఎదురులేని భారత్‌.....మరోవైపు ఎప్పుడెలా ఆడుతుందో అంచనాలకు అందని పాకిస్థాన్‌....క్రికెట్‌ అభిమానులకు ఇంతకు మించి కావాల్సిందేముంటుంది. విరాట్‌ కొహ్లీ నాయకత్వంలోని భారత జట్టులో అందరూ మ్యాచ్‌ విన్నర్లే. బ్యాటింగ్‌లో శిఖర్ ధావన్‌, రోహిత్‌ శర్మ, యువరాజ్‌ సింగ్‌, ధోనీ, కేదార్‌ జాదవ్‌,హార్దిక్‌ పాండ్య బౌలింగ్‌లో జస్ప్రీత్‌ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, మహమ్మద్‌ షమీ, వంటి పేసర్లతో పాటు రవీందర్‌ జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌ వంటి మ్యాజిక్‌ స్పిన్నర్లతో ఎప్పటిలానే పవర్‌ఫుల్‌ ఉంది. అజింక్య రహానే, దినేష్‌ కార్తీక్‌, ఉమేష్‌ యాదవ్‌లతో భారత జట్టు బెంచ్‌ స్ట్రెంత్‌ సైతం ధీటుగానే ఉంది. బౌలింగ్‌లో మునుపెన్నడూ లేనంతలా పదునుగా ఉన్న భారత జట్టుకు ప్రధాన బలం బ్యాటింగ్‌ మాత్రమే అనడంలో ఎటువంటి సందేహం లేదు.టాప్‌ ఆర్డర్‌లో రోహిత్‌, ధావన్‌, విరాట్ కొహ్లీ, లోయర్‌ ఆర్డర్‌లో ధోనీ రాణిస్తే భారత జట్టుకు తిరుగుండదు.

పాక్ జట్టు..
వికెట్‌ కీపర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ నాయకత్వంలోని పాకిస్థాన్‌ జట్టు సంచలనం సృష్టించాలని తహతహలాడుతోంది.అహ్మద్ షెజాద్‌, బాబర్‌ ఆజమ్‌, అజర్‌ అలీ, షోయబ్‌ మాలిక్‌, మహమ్మద్‌ హఫీజ్‌, సర్ఫరాజ్‌ అహ్మద్‌ వంటి బ్యాట్స్‌మెన్‌తో ....జునైద్‌ ఖాన్‌, మహమ్మద్‌ అమీర్‌, హసన్‌ అలీ, ఇమాద్‌ వసీమ్‌, వంటి బౌలర్లతో పేపర్‌మీద బలంగానే కనిపిస్తోంది. పేస్‌ బౌలింగ్‌ ఎటాక్‌ భారత్‌కు ధీటుగానే ఉన్నా.....అనుభవజ్ఞుడైన ప్రధాన స్పిన్నర్‌ లేకపోవడం, బ్యాటింగ్‌లో నిలకడ లేకపోవడం పాకిస్థాన్‌ జట్టుకు పెద్ద మైనస్‌ పాయింట్‌.బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌ క్రికెట్‌ స్టేడియం వేదికగా జరుగునున్న ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ జట్టు కంటే అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న విరాట్‌ ఆర్మీ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగబోతోంది.మరి చిరకాల ప్రత్యర్ధుల మధ్య జరుగనున్న వన్డే వార్‌లో ఒత్తిడిని అధిగమించి....పోటీలో నిలిచి గెలిచే జట్టేదో తెలియాలంటే మరికొద్దిగంటలు సస్పెన్స్‌ భరించక తప్పదు. మినీ వరల్డ్‌ కప్‌లో మహాసమరం.

ఎవరు రాణిస్తారు ?
చిరకాల ప్రత్యర్ధుల మధ్య చాంపియన్స్‌ ట్రోఫీ చాలెంజ్‌. పాకిస్థాన్‌తో భారత్‌ బ్లాక్‌ బస్టర్‌ ఫైట్‌. సై అంటే సై అంటోన్న భారత్‌, పాకిస్థాన్‌. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా భారత్‌,పాక్‌ సమరం. విజయమే లక్ష్యంగా విరాట్‌ ఆర్మీ. పాకిస్థాన్‌ కంటే పటిష్టంగా విరాట్‌ కొహ్లీ అండ్‌ కో. శిఖర్ ధావన్‌, రోహిత్‌ శర్మ, యువరాజ్‌ సింగ్‌, ధోనీ, కేదార్‌ జాదవ్‌,హార్దిక్‌ పాండ్య జస్ప్రీత్‌ బుమ్రా, భువనేశ్వర్‌ ,షమీ, రవీందర్‌ జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, అజింక్య రహానే, దినేష్‌ కార్తీక్‌, ఉమేష్‌ యాదవ్‌బౌలింగ్‌లో మునుపెన్నడూ లేనంతలా పదునుగా భారత్‌. అహ్మద్ షెజాద్‌, బాబర్‌ ఆజమ్‌, అజర్‌అలీ, షోయబ్‌ మాలిక్‌, మహమ్మద్‌ హఫీజ్‌, సర్ఫరాజ్‌ జునైద్‌ ఖాన్‌, మహమ్మద్‌ అమీర్‌, హసన్‌ అలీ, ఇమాద్‌ వసీమ్‌బ్యాటింగ్‌లో నిలకడలేని పాకిస్థాన్‌ ఎలా రాణిస్తుందో చూడాలి.

ఆర్మీ కాన్వాయ్ పై దాడి:5గురు జవాన్లకు గాయాలు

జమ్మూకశ్మీర్ : సరిహద్దు ఇండియన్ ఆర్మీ కాన్వాయ్ పై పాక్ దాడి చేసింది. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లకు గాయలయ్యాయి.

11:16 - June 3, 2017

గుంటూరు : 'ప్రత్యేక హోదా' కోసం మళ్లీ కాంగ్రెస్ పోరాటం చేస్తోంది. ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బతికించుకోవాలని..బలం పెంచుకోవాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అందులో భాగంగా 'హోదా' అవకాశాన్ని వినియోగించుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో గుంటూరులో ఆదివారం భారీ బహిరంగసభ ఏర్పాటు చేస్తోంది. ఈ సభకు ఏఐసీసీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. వారితో పాటు పలువురు జాతీయ నాయకులు హాజరు కానున్నారు. ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సభలో పాల్గొంటారని తెలుస్తోంది. సభ ఏర్పాట్లను ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, కుంతియా, నాదెండ్ల మనోహర్, కనుమూరి బాపిరాజు..ఇతర నేతలు పర్యవేక్షించారు. ఈసందర్భంగా రఘువీరా..బాపిరాజులు వేర్వేరుగా టెన్ టివితో మాట్లాడారు. ప్రత్యేక హోదా ప్రజల పక్షాన నిలబడుతామని, రాష్ట్రానికి ఏం మంచిది జరుగుతుందో అది ప్రాధాన్యమని రఘువీరా పేర్కొన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

11:08 - June 3, 2017

హైదరాబాద్ : విషాదకరమైన వార్త. టీవీల్లో వస్తున్న పలు సీరియల్స్..ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో పలు ఘటనలు రుజువు చేశాయి. ప్రధానంగా చిన్నపిల్లలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. తాజాగా ఓ సీరియల్ కు ప్రభావితమైన ఓ బాలుడు అనంతలోకాలకు వెళ్లిపోయాడు. 12 ఏళ్ల జయదీప్ అనే బాలుడు బాలానగర్ లోని వెంకటాపురంలో ఉంటున్న అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. ఓ సీరియల్ చేసిన జయదీప్ మేడ మీదకు వెళ్లాడు. వెంట తెచ్చుకున్న కిరోసిన్ పైకి పోసుకుని నిప్పంటించుకున్నాడు. మేడ కింద ఉన్న అమ్మమ్మతో తాను ఎలా నిప్పంటించుకున్నానో చూడూ...అంటూ జయదీప్ మాట్లాడాడు. ఒక్కసారిగా హతాశురాలైన అమ్మమ్మను బాలుడిని రక్షించేందుకు ప్రయత్నించింది. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ జయదీప్ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కవ్వింపు చర్యలు లేకుండా కాల్పులు

పూంచ్‌: పాకిస్థాన్‌ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. శనివారం ఉదయం నుంచి ఎటువంటి కవ్వింపు చర్యలు లేకుండానే పూంచ్‌ సెక్టార్‌లో జరిపిన కాల్పుల్లో ఒక పౌరుడు గాయపడ్డాడు. చిన్న ఆయుధాలు, ఆటోమేటిక్‌ తుపాకులు, 82 ఎంఎం, 120 ఎంఎం మోర్టార్‌ షెల్స్‌ ఉపయోగించి దాడులు చేస్తోంది. వీటికి భారత్‌ సైన్యంగా గట్టిగా సమాధానమిస్తోంది. 

కేసీఆర్ ప్ర‌జ‌ల క‌ష్టాలు తెలిసిన మ‌నిషి :ఎమ్మెల్యే జలగం

భద్రాద్రి కొత్తగూడెం : ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌జ‌ల క‌ష్టాలు తెలిసిన మ‌నిషి. ప్ర‌జ‌ల సంక్షేమం కోసం నిరంత‌రం ఆలోచిస్తుంటార‌ని కొత్తగూడెం శాసన సభ్యులు జలగం వెంకటరావు తెలిపారు. కొత్తగూడెం జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ ఆస్పత్రి లో " కెసిఆర్ కిట్స్ పంపిణీ కార్య‌క్ర‌మ‌మం జ‌రిగింది. కార్య‌క్ర‌మంలో కొత్తగూడెం శాసన సభ్యులు జలగం వెంకటరావు పాల్గొన్న జాయింట్ కలెక్టర్ ముస్త్యాల రాంకిషన్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే జ‌ల‌గం మాట్లాడుతూ...

28శాతం జీఎస్టీ పన్ను పై కమల్ హాసన్ అసంతృప్తి

చెన్నై: చిత్ర పరిశ్రమపై 28శాతం జీఎస్టీ పన్ను విధించడంపై ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సినిమాలపై జీఎస్టీ పన్ను తగ్గించకపోతే తాను చిత్రపరిశ్రమ తప్పుకోవాల్సి వస్తుందని అన్నారు. ఈ అంశంపై చెన్నైలోని ఫిల్మ్‌ఛాంబర్‌ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆయన..ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు.

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ...

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 24 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం, కాలినడక భక్తులకు 8 గంటల సమయం పడుతోంది.

10:27 - June 3, 2017

రియల్ ఎస్టేట్..’రేరా' బిల్లు ఏం చెబుతోంది ? కేంద్ర ప్రభుత్వం 'రేరా' బిల్లు ఏం చెబుతోంది. ఎప్పటి నుండి అమల్లోకి రానుంది. కస్టమర్లకు..బిల్డర్లకు ఎలాంటి ప్రయోజనాలు కలిగిస్తుంది ? బిల్డర్లు ఏం చెబుతున్నారు ? శాంతారామ్ కన్ స్ట్రక్షన్ న్యూ వెంచర్..హైదరాబాద్ వెస్ట్ ఏరియా కాస్ట్లీ ఏరియా..తదితర వివరాల కోసం వీడియో క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? తదితర అంశాల గురించి తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

10:26 - June 3, 2017

గుంటూరు : తెలుగు రాష్ట్రాలపై ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డిలో 'ప్రజాగర్జన'లో పాల్గొన్న రాహుల్ ఏపీలో పర్యటించనున్నారు. గుంటూరులో ఏపీ కాంగ్రెస్ నిర్వహించే బహిరంగసభలో ఆయన పాల్గొననున్నారు. ‘ప్రత్యేక హోదా' పేరిట కాంగ్రెస్ ఓ భారీ బహిరంగసభ నిర్వహిస్తోంది. ఈ సభకు రావాలని జాతీయ నేతలకు ఏపీ కాంగ్రెస్ నేతలు ఆహ్వానం పలికారు. ఆంధ్ర ముస్లిం కాలేజీలో సభ ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాట్లను కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మీ, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, తదితర నేతలు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు టెన్ టివితో మాట్లాడారు. పార్లమెంట్ లో ఆనాడు బిల్లు పెట్టబోయే ముందు తాము రాహుల్ కలవడం జరిగిందని, హోదాపై మాట్లాడడం జరిగిందని పనబాక లక్ష్మీ తెలిపారు. ప్రత్యేక హోదాపై ప్రకటించాలని రాహుల్ ఆనాటి ప్రధాని మన్మోహన్ కు సూచించడం జరిగిందని, విభజన బిల్లులో ప్రత్యేక హోదా పెట్టడం జరిగిందని తెలిపారు. ఐదు సంవత్సరాలు చాలదని..పది సంవత్సరాలు కావాలని ఆనాడు వెంకయ్య నాయుడు పార్లమెంట్ లో ప్రస్తావించారని గుర్తు చేశారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అనేక హామీలు గుప్పించారని..అధికారంలోకి వచ్చిన తరువాత హామీలు మరిచిపోయారన్నారు. మరింత వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

నేడు ఢిల్లీలో జీఎస్టీ మండలి15వ సమావేశం...

హైదరాబాద్ : నేడు ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) మండలి 15వ సమావేశం జరుగనున్నది. రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, వాణ్యిజ్య పన్నుల శాఖ అధికారులు హాజరుకానున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఆర్థికమంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి సోమేశ్‌కుమార్, వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ ఈ సమావేశంలో పాల్గొననున్నారు. 

మధ్యప్రదేశ్ లో లారీ బోల్తా: 7గురు మృతి

మధ్యప్రదేశ్: రాష్ట్రంలోని డిండోరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ బోల్తాపడటంతో జరిగిన ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, 39 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

10:20 - June 3, 2017

హైదరాబాద్ : కేసీఆర్ కిట్ బాలింతలకు..శిశువులకు ఎంతో ప్రయోజనమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ప్లేట్ల బురుజు ప్రాంతంలో 'కేసీఆర్ కిట్'లను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఎంపిక చేసిన బాలింతలు ముందుగానే ఇక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మంత్రి లక్ష్మారెడ్డి టెన్ టివితో మాట్లాడారు. ఆరోగ్యవంతమైన తెలంగాణ..సమాజం కోసం ఈ పథకం ఉపయోగ పడుతుందని, గర్భిణీలైన పేదలు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని, అందుకనే రాష్ట్ర ప్రభుత్వం 'కేసీఆర్ కిట్' తీసుకొచ్చిందని పేర్కొన్నారు. పుట్టబోయే బిడ్డ అనారోగ్యానికి గురవుతున్నారని, ఈ కార్యక్రమంలో రెండు అంశాలుంటాయని పేర్కొన్నారు. ఆడబిడ్డ పుడితే రూ. 13వేలు, మగబిడ్డ పుడితే రూ. 12వేలు అందచేయడం జరుగుతుందన్నారు. నాలుగు విడతలుగా చెల్లింపులు జరుగుతుందని, వారి ఖాతాల్లోకి నేరుగా చేరుతాయన్నారు. తల్లి..బిడ్డకు అవసరమయ్యే విధంగా 'కేసీర్ కిట్' ను అందచేయడం జరుగుందని, 16 ఐటమ్స్ అందచేయడం జరుగుతుందన్నారు.

రెండు బైకులు ఢీ: ఇద్దరి మృతి

తూ.గో : పెద్దాపురం లూథరన్‌ హైస్కూల్‌ ఎదురుగా రెండు బైకులు ఢీకొని ఇద్దరు మృతి చెందారు.. ఈ ప్రమాదంలో పైలా లక్ష్మి(25), అమె చెల్లెలు పైలా శిల్ప(18) అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో లక్ష్మి భర్త శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. వీరు ముగ్గురు సామర్లకోటలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో పని చేస్తున్నారు. శనివారం ఉదయం పెద్దాపురం నుంచి సామర్లకోటలోని స్కూల్‌కు వెళ్తుండగా వీరి ద్విచక్ర వాహనం అదుపుతప్పి మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

బాలాపూర్ పీఎస్ పరిధిలో విషాధం

హైదరాబాద్: బాలాపూర్ పీఎస్ పరిధిలో విషాధం నెలకొంది. టివీలో కార్టూన్ షో చూసి ఒంటి పై కిరోసిన్ పోసుకుని 12 ఏళ్ల బాలుడు జయదీస్ నిప్పటించుకున్నాడు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

ఇద్దరు ఆర్మీ ఆఫీసర్లపై సీబీఐ కేసు

ఢిల్లీ : భార‌తీయ ఆర్మీ హెడ్‌క్వార్ట‌ర్స్‌లో చోటుచేసుకున్న భారీ ట్రాన్స్‌ఫ‌ర్ రాకెట్‌ను సీబీఐ అధికారులు బ‌ట్ట‌బ‌య‌లు చేశారు. ఈ ఘ‌ట‌న‌తో సంబంధం ఉన్న ఇద్ద‌రు ఆఫీస‌ర్ల‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. ప్ర‌ధాన కార్యాల‌యంలో ఉంటున్న ఆ ఆఫీస‌ర్లు అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు తెలిసింది. ఆఫీస‌ర్ల పోస్టింగ్‌ల‌ విష‌యంలో భారీగా లంచాలు వ‌సూల్ చేస్తున్న‌ట్లు వాళ్ల‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆర్మీ హెడ్‌క్వార్ట్స్‌లో లెఫ్టినెంట్ క‌ల్న‌ల్‌గా పనిచేస్తున్న వ్య‌క్తిపై సీబీఐ ఇవాళ అవినీతి కేసును న‌మోదు చేసింది. ప‌ర్స‌న‌ల్ డివిజ‌న్‌లో ప‌నిచేస్తున్న మ‌రో బ్రిగేడియ‌ర్ పేరును కూడా ఎఫ్ఐఆర్‌లో న‌మోదు చేశారు. 

సిటీ కన్వర్జెన్సీ సమావేశం ప్రారంభం

హైదరాబాద్: జలమండలి కార్యాలయంలో సిటీ కన్వర్జెన్సీ సమావేశం ప్రారంభం య్యింది. ఈ సమావేశానికి జీహెచ్ ఎంసీ కమిషనర్ జనార్థన్ రెడ్డి, జనలమండలి ఎండీ దానకిషోర్, మెట్రో ఎండీ ఎన్ వీఎస్ రెడ్డి, రెవెన్యూ, పోలీసు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

10:11 - June 3, 2017

ఖమ్మం : మళ్లీ అడవిలో కాల్పులు దద్దరిల్లాయి. పోలీసులకు..మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో మావోయిస్టు కమాండర్ చిన్నబ్బాయి మృతి చెందాడు. ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇటీవలే సీఆర్పీఎఫ్ జవాన్ల లక్ష్యంగా మావోయిస్టులు విరుచుకపడుతున్న సంగతి తెలిసిందే. కాల్పుల్లో పలువురు సీఆర్పీఎఫ్ జవాన్లు నేలకొరిగారు. ప్రతికార చర్యగా పలువురు మావోయిస్టులను కూడా పోలీసులు హతమారుస్తున్నారు. తాజాగా మల్కన్ గిరి ప్రాంతంలోని చిత్రకొండ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశమవుతున్నారని పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీనితో ఆంధ్రా ఛత్తీస్ గడ్ రాష్ట్ర సరిహద్దులో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. చిత్రకొండ వద్ద పోలీసులను చూసిన మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే పోలీసులు ఎదురు కాల్పులు చేపట్టారు. ఇందులో మావోయిస్టు కమాండర్ చిన్నబ్బాయి మృతి చెందగా పలువురు మావోయిస్టులకు గాయాలయినట్లు తెలుస్తోంది. అంతేగాకుండా భారీ స్థాయిలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించాల్సి ఉంది.

10:04 - June 3, 2017

కేంద్ర ప్రభుత్వం 'రేరా' బిల్లు ఏం చెబుతోంది. ఎప్పటి నుండి అమల్లోకి రానుంది. కస్టమర్లకు..బిల్డర్లకు ఎలాంటి ప్రయోజనాలు కలిగిస్తుంది ? బిల్డర్లు ఏం చెబుతున్నారు ? రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ యాక్ట్..పకడ్బందీకగా అమలు కానుంది. ఇష్టా రాజ్యంగా ప్రవర్తించిన రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ముకుతాడు పడనుంది. కస్టమర్లు డబ్బులు చెల్లించినా ఇంటిని అప్పగించకుండా పలు సందర్భాల్లో చోటు చేసుకుంటుండడం తెలిసిందే...పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

నక్సల్ కోసం పనిచేస్తున్న పిల్లలు..

ఛత్తీస్ గడ్ : బస్తర్ ప్రాంతంలో నక్సల్ కోసం పనిచేస్తున్న ముగ్గురు విద్యార్థులను పోలీసులు పట్టుకున్నారు. స్వస్థలాలకు పోయేందుకు పిల్లలు నిరాకరిస్తున్నారని, వీరిని స్కూల్ లో చేరిపించి సహాయ పడుతామని ఓ జాతీయ ఛానెల్ తో బస్తర్ ఎస్పీ పేర్కొన్నారు.

మావోయిస్టు కమాండర్ మృతి..

విజయవాడ : ఆంధ్ర - ఛత్తీస్ గడ్ రాష్ట్ర సరిహద్దులో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. చిత్రకొండ పీఎస్ పరిధిలోని కప్పదొడ్డి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టు కమాండర్ చిన్నబ్బాయి మృతి చెందాడు.

09:21 - June 3, 2017

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ 'అల్లు అర్జున్' చిత్రం వివాదంలో చిక్కుకుంది. బన్నీ లెటెస్ట్ ఫిలిం 'డీజే..దువ్వాడ జగన్నాథమ్' చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన సాంగ్స్ యూ ట్యూబ్ లో విడుదలవుతున్నాయి. సాంగ్స్ బన్నీ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. కానీ ఓ సాంగ్ పై వివాదం నెలకొనడం చర్చనీయాంశమైంది. ‘గుడి..బడిలో'..అనే పాటలో 'రుద్ర స్తోత్రా'న్ని కించపరిచేలా ఉందంటూ బ్రాహ్మణ..హిందూ సంఘాలు పేర్కొంటున్నాయి. రుద్రస్తోత్రంలోని వ్యాఖ్యలను యుగళగీతానికి వాడుతారా అంటూ అభ్యంతరం వ్యక్తం చేశాయి. నమక చమకాలు..ప్రవరనను..ఆగ్రహారాలు..తాంబూలాలను కించపరుస్తూ రాసిన 'ఆస్మిక యోగ తస్మిక బోగ' అనే పాటను తొలగించాలంటూ బ్రాహ్మణ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై దర్శకుడు హరీష్ శంకర్ స్పందించారు. వైదిక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన తాను ఆయా సంప్రదాయాలను కించపరిచే విధంగా సినిమా తీయనన్నాడు. బ్రాహ్మణ సమాజం తలెత్తుకునేలా డీజే ఉంటుందని ఆయా సంఘాలకు భరోసా ఇచ్చాడు.

09:14 - June 3, 2017

బుల్లి తెర..కోట్లాది మంది వీక్షకులను చేరుకోవడానికి చక్కటి మార్గం. అందుకే పలువురు బుల్లితెరపై కనిపించాలని కోరుకుంటుంటారు. వెండితెరపై ఏలిన ప్రముఖులు సైతం బుల్లితెరపై మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే పలు వుడ్ లకు చెందిన స్టార్స్ ఈ బుల్లితెరపై కనిపించగా మరికొందరు కనిపించడానికి సిద్ధం అవుతున్నారు. టాలీవుడ్ స్టార్ నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి బుల్లితెరపై కనిపించి అభిమానులను సంతృప్తి పరిచిన సంగతి తెలిసిందే. ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ కూడా బుల్లితెరపై కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. తాజాగా టాలీవుడ్ కండల వీరుడు 'రానా' కూడా కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఓ కామెడీ టెలివిజన్ కార్యక్రమానికి 'రానా' సంతకం చేశారని..షూటింగ్ కూడా మొదలైందని ప్రచారం జరుగుతోంది. ఈ షోలో పాల్గొనే నటీనటులతో 'రానా' ముచ్చట్లు పెడుతాడని..వ్యక్తిగత..వృతి విషయాలను ప్రేక్షకులతో పంచుకుంటారని తెలుస్తోంది. వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ మెప్పిస్తున్న 'రానా' బుల్లితెరపై కనిపిస్తారా ? లేదా ? అనేది చూడాలి. దీనిపై 'రానా' నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

09:04 - June 3, 2017

టాలీవుడ్ రెబల్ స్టార్ 'ప్రభాస్' తదుపరి చిత్రాలపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. కొన్ని సంవత్సరాల వరకు 'బాహుబలి'..’బాహుబలి-2’ చిత్రాల వరకు మాత్రమే 'ప్రభాస్' పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన సంగతి తెలిసిందే. తాజాగా సుజీత్ దర్శకత్వంలో 'సాహో' సినిమాలో 'ప్రభాస్' నటిస్తున్నాడు. సినిమాకు సంబంధించిన టీజర్ ను షూటింగ్ కంటే ముందుగానే రిలీజ్ చేశారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలు సోషల్ మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇంకా కథానాయికగా కూడా ఫైనల్ కాలేదు. ప్రతి నాయక పాత్రలో బాలీవుడ్ నటుడు 'నీల్ నితిన్ ముఖేష్' నటిస్తాడని ప్రచారం జరుగుతోంది. మురుగదాస్ చిత్రం 'కత్తి'లో విలన్ గా ఇతను నటించిన సంగతి తెలిసిందే. అంతేగాకుండా సల్మాన్ ఖాన్ 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' చిత్రంలో కూడా 'నీల్ నితిన్ ముఖేష్' విలన్ గా కనిపించి మెప్పించాడు. మరి హీరోయిన్ ఎవరు ? విలన్ ఎవరు ? తదితర వివరాలు రానున్న రోజుల్లో తెలియనున్నాయి.

 

మళ్లీ పాక్ కాల్పులు..

జమ్మూ కాశ్మీర్ : పాకిస్తాన్ కాల్పుల విరణమ ఒప్పందానికి తూట్టు పొడుస్తూనే ఉంది. తాజాగా శనివారం ఉదయం ఫూంచ్ జిల్లాలోని ఓ ప్రాంతంపై కాల్పులు జరిపింది. దీనితో ఓ పౌరురాలికి గాయాలయ్యాయి.

టిటివి దినకరన్ కు బెయిల్..

చెన్నై : టిటివి దినకరన్ కు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పార్టీ గుర్తు కేటాయించాలని ఈసీకి లంచం ఇవ్వజూపారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. బెయిల్ మంజూరు కావడంతో ఆయన చెన్నైకి బయలుదేరారు.

08:45 - June 3, 2017

ప్రముఖ సినీ నటుడు 'కమల్ హాసన్' ‘పన్ను విధించడంపై' స్పందించారు. చిత్ర సీమపై 28 శాతం వస్తు సేవల పన్ను విధించిన సంగతి తెలిసిందే. 28 శాతం పన్ను ఉంటే తాను నటన నుండి తప్పుకోవాల్సి వస్తుందని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై చెన్నైలో దక్షిణ భారత సినీ వాణిజ్య మండలి మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. సభ్యుడు..నటుడు కమల్ మాట్లాడారు. ప్రాంతీయ చిత్రాలు..చిన్న సినిమాలు దేశీయ సినిమాలకు బలమని, అధిక పన్నుల ద్వారా చిత్ర పరిశ్రమ నష్టపోవాల్సి వస్తుందన్నారు. దేశంలో నిర్మిస్తున్న చిత్రాల్లో కేవలం పది శాతమే విజయవంతమవుతాయని తెలిపారు. నల్ల ధనం నిరోధానికి పెద్ద నోట్లను రద్దు చేశారని, సినిమా రంగంపై జీఎస్టీలో 28 శాతం పన్ను విధిస్తే ఈ పరిశ్రమ రెండు రెట్లు వెనక్కి వెళ్తుందని కమల్ హాసన్ ఆందోళన వ్యక్తం చేశారు. 28 శాతం పన్నును 12-15 శాతానికి తగ్గించాలని సూచించారు. మరి కమల్ డిమాండ్స్ పై కేంద్రం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

08:38 - June 3, 2017

మహారాష్ట్ర : ప్రభుత్వం రుణమాఫీ చేయాలని కోరుతూ రైతులు రోడెక్కారు. నిత్యావసర వస్తువులు..ఇతరత్రా వాటిని రోడ్లపై పారబోస్తూ వినూత్నంగా నిరసన తెలియచేస్తున్నారు. వెళుతున్న వాహనాలను..పాలన వాహనాలను ఆపుతున్నారు. వాహనాల్లోని కూరగాయలు..పళ్లు..పాలు రోడ్డుపై పారబోస్తున్నారు. ట్యాంకర్ల నుండి పాలను వదిలేయడంతో రోడ్డు ఏరును తలపించింది. కూరగాయలు..పాలు..పళ్లు..మార్కెట్ లోకి చేరకుండా రైతులు అడ్డుకుంటున్నారు. నిత్యావసర వస్తువులు దొరక్కపోతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రుణమాఫీ..పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. స్వామినాథన్ కమిషన్ అమలు చేయాలని కోరుతున్నారు. రైతులు చేస్తున్న నిరసనపై ప్రభుత్వం స్పందించింది. నిరసనలు వదిలిపెట్టి చర్చలకు రావాలని సీఎం సూచించారు.

ఎన్ఐఏ సోదాలు..

ఢిల్లీ : కాశ్మీర్..ఢిల్లీలో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. కాశ్మీర్ లో 14, ఢిల్లీలో 7 చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉగ్రవాదులకు నిధుల సమీకరణ వ్యవహారంపై సోదాలు చేస్తోంది.

శ్రీలంక వర్సెస్ సౌతాఫ్రికా..

ఢిల్లీ : ఛాంపియన్స్ ట్రోఫిలో భాగంగా నేడు శ్రీలంక - సౌతాఫ్రికా మ్యాచ్ జరగనుంది. లండన్ వేదికగా మధ్యాహ్నం 2.50గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

సీఎస్ ను కలువనున్న టి.టిడిపి నేతలు..

హైదరాబాద్ : నేడు టి.టిడిపి నేతలు సీఎస్ ను కలువనున్నారు. మియాపూర్ భూముల స్కాంపై సీఎస్ కు వినతిపత్రం ఇవ్వనున్నారు.

భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో కేసీఆర్ కిట్ల పంపిణీ..

భద్రాద్రి కొత్తగూడెం : నేడు భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో కేసీఆర్ కిట్లను మంత్రి తుమ్మల పంపిణీ చేయనున్నారు.

 

08:17 - June 3, 2017

 

హైదరాబాద్ : బాలింతలకు కేసీఆర్ కిట్ల పథకం నేటి నుండి అమలు కానుంది. రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో భాగంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. హైదరాబాద్ లోని ప్లేట్ల బురుజు ఆసుపత్రిలో సీఎం కేసీఆర్ పాల్గొని కిట్లను పంపిణీ చేయనున్నారు. రెండు కాన్పుల వరకు ఈ పథకం వర్తిస్తుంది. ఒక్కో కాన్పుకు రూ. 2వేల విలువైన కిట్లు అందచేయనున్నారు. ఆడ బిడ్డ పుడితే 13 వేల రూపాయలు, మగ బిడ్డ పుడితే 12 వేల రూపాయలు తల్లి అకౌంట్లో జమ చేస్తారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
ఆధార్‌ నంబర్‌ అనుసంధానంతో గర్భిణిల పేరిట బ్యాంకు అకౌంట్లు ప్రారంభిస్తారు. ప్రభుత్వ అందించే ఆర్థిక సహాయాన్ని ఖాతాలో జమ చేస్తారు. గర్భిణిలకు వైద్య పరీక్షల సమయంలో నాలుగు వేల రూపాయలు, ప్రసూతి వైద్యం అందించేటప్పుడు మరో నాలుగు వేల రూపాయలు జమ చేస్తారు. ప్రసవానంతరం బిడ్డకు టీ కాల కోసం ఇంకో నాలుగు వేల రూపాయలు..ఇలా మూడుదశల్లో మొత్తం 12 వేల రూపాయలు ఇస్తారు.

08:02 - June 3, 2017

జూన్ 2వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో భిన్నంగా జరిగాయి. తెలంగాణలో సంబరాలు జరగగా ఆంధ్రప్రదేశ్ లో నవ నిర్మాణ పేరిట దీక్షలు జరిగాయి. మూడేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకపోతోందని, అన్నార్తులు, అనాథులండని తెలంగాణ కావాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. మరోవైపు విభజన అంశాన్ని మళ్లీ సీఎం చంద్రబాబు నాయుడు లేవనెత్తారు. జూన్ 2 చీకటి రోజంటూ అభివర్ణించారు. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో వినయ్ కుమార్ (విశ్లేషకులు), దుర్గా ప్రసాద్ (టిడిపి), రాజ్ మోహన్ (టీఆర్ఎస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

08:00 - June 3, 2017
06:49 - June 3, 2017

చిత్తూరు : ఒక్కటే లక్ష్యం.. ఒక్కటే గమ్యం.. ఎలాగైనా ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించాలి. ఇదే లక్ష్యంతో అహర్నిశలు కష్టపడ్డారు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు. ఇందుకోసం ఎంతో కఠోర శ్రమ చేశారు. అనేక శిక్షణలు పొందారు. మైనస్‌ 60 డిగ్రీల ఉష్ణోగ్రతల్లోనూ వెనకడుగు వేయలేదు. యాత్ర మధ్యలో శవాలు కనిపించినా బెదరలేదు. విశ్వాసం ఉంటే ఎన్ని క్లిష్టపరిస్థితులనైనా ఎదుర్కోవచ్చని నమ్మారు. అంతే.. అదే నమ్మకంతో ముందుకు సాగారు. ఎవరెస్ట్‌ శిఖరంపై భారత జెండాను రెపరెపలాడించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 14 మంది విద్యార్థులు ఒకేసారి ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించారు. ఎంతో సాహసోపేతమైన యాత్రను మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థులు చేపట్టి.. మరెంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎవరెస్ట్‌ను అధిరోహించిన విద్యార్థులకు ఇప్పుడు అమరావతిలో ప్రతి ఒక్కరూ బ్రహ్మరథంపడుతున్నారు.

19 మంది ఎంపిక..
ఎవరెస్ట్‌ అధిరోహణకు విద్యార్థులను పంపించాలనే యోచన సాంఘిక సంక్షేమ యువజన సర్వీసుల శాఖకు వచ్చింది. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి విద్యార్థుల ఎంపిక చేపట్టారు. ఎవరెస్ట్‌ అధిరోహణకు మొత్తం 350 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. అందులో 65 మందిని ఎంపిక చేశారు. వారికి నాలుగు దశల్లో శిక్షణ ఇచ్చి చివరకు 19 మందిని ఎంపిక చేశారు. వీరిలో ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు. వీరికి అనేక నెలలపాటు.. శిక్షణ ఇచ్చారు. మంచు ప్రాంతాల్లో నివాసం ఉండడం, కొండలు ఎక్కడం, ఈదురుగాలులకు తట్టుకోవడం లాంటి అంశాల్లో వారికి శిక్షణ ఇచ్చారు. ఎవరెస్ట్‌ ప్రాంతంలో ఆక్సిజన్‌ తక్కువ ఉంటుంది కాబట్టి విద్యార్థులకు బ్రీతింగ్‌, యోగాలో శిక్షణ ఇచ్చారు.

యాత్ర ఆరంభంలో..
అయితే.. యాత్ర ప్రారంభంలోనే 19 మందిలో ఐదుగురు వెనుదిరిగారు. అయినా మొక్కవోని దీక్షతో మిగతా 14 మంది యాత్రను చేపట్టారు. మే 8వ తేదీన విజయవాడ నుంచి బయల్దేరిన విద్యార్థులు.. అనేక సవాళ్లను ఎదుర్కొని యాత్రను పూర్తి చేశారు. 29,100 అడుగుల ఎత్తులో ఉన్న ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించి భారత జెండాను రెపరెపలాడించారు. 8 రోజుల పాటు భయానక వాతావరణాన్ని ఎదుర్కొన్నామని.. అయినా కూడా కోచ్‌, తల్లిదండ్రుల ఆశీస్సులతో యాత్ర విజయవంతంగా పూర్తి చేశామని విద్యార్థులంటున్నారు. ఆడపిల్లలమైనా కుటుంబ సభ్యులు, అధికారుల ప్రోత్సాహంతో ఈ యాత్రను దిగ్విజయంగా పూర్తి చేశామంటున్నారు విద్యార్థినులు. స్త్రీలు పురుషులతో పోల్చుకుంటే ఏ విషయంలోనూ తక్కువ కాదని.. సహకారం ఉంటే ఏ విషయంలోనైనా విజయం సాధించవచ్చు అంటున్నారు. ఎవరెస్ట్‌ ఎక్కి రాష్ట్ర ప్రతిష్టను చరిత్రలో లిఖించిన విద్యార్థులను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. సీఎం చంద్రబాబు విద్యార్థులందరిని ఘనంగా సత్కరించారు. ఎవరెస్ట్‌ ఎక్కిన విద్యార్థులకు ప్రభుత్వం నజారానా ప్రకటించింది. ఇలాంటి సాహసాల వల్ల జీవితంలో సాధించాలనే పట్టుదల పెరుగుతుందన్నారు సీఎం. ప్రతి ఒక్కరూ వీరిని ఆదర్శంగా తీసుకోవాలని చంద్రబాబు సూచించారు.

06:46 - June 3, 2017

హైదరాబాద్ : వర్షాకాలం వచ్చేస్తోంది. వర్షాలు ఎప్పుడైనా కురువొచ్చు. అయితే... హైదరాబాద్‌లోని నాలాల్లో పూడికతీత పనులు పూర్తి కాకపోవడంతో నగరవాసులు బెంబేలెత్తుతున్నారు. చిన్నపాటి వర్షానికే రోడ్లపై నీళ్లు నిలుస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో.. భారీ వర్షాలు కురిస్తే పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే నాలాల పూడికతీత పనులు పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ.. అధికారుల నిర్లక్ష్యంతో పనులు నత్తనడకన కొనసాగడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఇబ్బందులు తప్పవా అని ఆందోళన చెందుతున్నారు. వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు.. వర్షపు నీరు సాఫీగా వెళ్లేందుకు ప్రతి ఏడాది జీహెచ్‌ఎంసీ.. ప్రధాన నాలాలు, కాలువల్లో పూడిక తీస్తుంది. ఇందుకోసం 25 నుంచి 30 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. అయితే ఈ ఏడాది నాలాల శుద్ధి కోసం 317 పనులుగా విభజించి టెండర్లు పిలిచారు. ఇందుకుగాను 28 కోట్ల 49 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. వీటిలో 114 పనులు మనుషుల ద్వారా.. 58 పనులు మిషన్ల ద్వారా చేయించడంతో పాటు.. మిగిలిన వాటిని ఇతర మార్గాల ద్వారా చేయించాలని నిర్ణయించారు. ఈ పనులన్నీ మే 31 వరకు పూర్తి చేయాల్సి ఉంది. కానీ.. ఇప్పటివరకు కేవలం 56 శాతం పనులు మాత్రమే పూర్తి అయ్యాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీటిలో సౌత్‌జోన్‌లో 90 శాతం పనులు కాగా.. ఈస్ట్‌జోన్‌లో 76 శాతం, నార్త్‌జోన్‌లో 63 శాతం, వెస్ట్‌జోన్‌లో 39 శాతం పనులు పూర్తయ్యాయి. సెంట్రల్‌ జోన్‌లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కేవలం 32 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి.

పలువురు అధికారుల సస్పెన్షన్..
గతేడాది వర్షాకాలం ఇబ్బందుల సమయంలో ఏడాది పొడవునా నాలాల్లో పూడికతీత పనులు చేస్తామని మంత్రితో పాటు.. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ చెప్పారు. కానీ.. పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. పైగా నాలాల్లో పూడికతీత వ్యవహారంలో భారీ కుంభకోణం బయటపడింది. 18 మంది కాంట్రాక్టర్లపై క్రిమినల్‌ కేసులు నమోదు కాగా... 12 మంది అసిస్టెంట్‌ ఇంజనీర్లు సస్పెన్షన్‌కు గురయ్యారు. అయినా కూడా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో పనులు నత్తనడకన కొనసాగుతుండడంపై నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు మాటలు చెప్పడం మానేసి చేతల్లో చూపించాలంటున్నారు. మరీ.. జీహెచ్‌ఎంసీ నాలాల పూడికతీత పనుల్లో వేగం పెంచుతుందా.. లేక ప్రతి ఏడాది మాదిరిగానే నగరవాసులను ఇబ్బందికి గురి చేస్తుందా.. చూడాలి !

06:43 - June 3, 2017

ఢిల్లీ : వరుస విజయాలతో అంతరిక్ష ప్రయోగాల్లో అద్భుతాలు సాధిస్తున్న ఇస్రో మరో భారీ ప్రయోగానికి సిద్ధమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి ఈనెల 5న జీఎస్ ఎల్ వి మార్క్ 3 డీ 1 రాకెట్‌ను ప్రయోగించనుంది. ఈ రాకెట్‌ ద్వారా నాలుగు టన్నుల బరువు కలిగిన ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టే స్థాయికి ఇస్రో ఎదుగుతుంది. జీఎస్ ఎల్ వి మార్క్ 3 డీ 1 రాకెట్ ప్రయోగంపై 10 టీవీ ప్రత్యేక కథనం. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌ కేంద్రం నుంచి ఈనెల 5న జీఎస్ ఎల్ వి మార్క్ 3 డీ 1రాకెట్‌ ప్రయోగాన్ని చేపట్టనున్నారు. అందివచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అడుగుడుగునా పదును పెడుతూ రోదసిలో తిరుగులేని విజయాలను సొంతం చేసుకుంటున్న ఇస్రో... జీఎస్ ఎల్ వి మార్క్ 3 డీ 1 రాకెట్‌ ప్రయోగంతో మరో సంచలనానికి తెరతీయబోతోంది. మూడు దశల్లో ద్రవ, ఘన ఇంధనంతో పని చేసే ఇంజిన్లతో తయారు చేసిన జీఎస్ ఎల్ వి మార్క్ 3 డీ 1రాకెట్‌ అన్ని ప్రయోగ పరీక్షలను పూర్తి చేసుకుని, ఇప్పుడు ఉపగ్రహాలను మోసుకెళ్లేందుకు సిద్ధమైంది. 2014 జనవరి 18న ఎలాంటి ఉపగ్రహం లేకుండా ఈ రాకెట్‌ను ప్రయోగించి, ఫలితాలను విశ్లేషించిన ఇస్రో... ఇప్పుడు పూర్తిస్థాయిలో నింగిలోకి పంపేందుకు సిద్ధమైంది. జీఎస్ ఎల్వీ మార్క్‌ 3డీ1 అత్యంత ఆధునికమైనది. దీని ద్వారా 3,136 కిలోల బరువైన జీశాట్‌ 19 ఉపగ్రహాన్ని కక్షలోకి పంపనున్నారు. దేశ సమాచార రంగాన్ని కొత్త పుంతలు తొక్కిచేందుకు ఈ ఉపగ్రహాలు దోహదం చేస్తాయి. ఆండ్రాయిడ్‌ టెక్నాలజీ మొబైల్‌ సేవలు, డీటీహెచ్‌, ఇంటర్నెట్‌ సేవలు విస్తృతమవుతాయి. కేఏ, కేయూ బ్యాండ్‌ టెక్నాలజీతో ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. భూమికి 36 వేల కిలో మీటర్ల ఎత్తులోని స్థిరకక్షలో దీనిని ప్రవేశపెడతారు. దీని ద్వారా 42 కొత్త ట్రాన్స్‌పాండర్లు అందుబాటులోకి వస్తాయి. ఈ ఉపగ్రహం 15 ఏళ్లపాటు సేవలు అందిస్తుంది. దీంతోపాటు అంతరిక్షంలో రేడియో ధార్మికశక్తిని పరిశీలించేందుకు జియో స్టేషనరీ స్ప్రక్టా పరికరాన్ని కూడా రోదసిలోకి పంపుతారు.

4న ప్రయోగం..
ఇప్పటికే జీఎస్ఎల్వీ మార్క్ 3డీ 1 రాకెట్‌ ప్రయోగ పనులు పూర్తయ్యాయి. నేడు తుది విడత ఎంఆర్‌ఆర్‌ సమావేశం జరుగుతుంది. ఈనెల 4న మధ్యాహ్నం 3 గంటల 58 నిమిషాలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభిస్తారు. 25 గంటల 30 నిమిషాల కౌంట్‌డౌన్‌ అనంతరం షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఈనెల 5న సాయంత్రం 5 గంటల 28 నిమిషాలకు నిర్వహించే ప్రయోగంలో నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్తుంది. మూడువేల కిలోలకు పైగా బరువున్న ఉపగ్రహ ప్రయోగాలను చేపట్టడం ఇస్రోకు ఇదే మొదటిసారి. ఇది విజయవంతమైతే ఐదువేల కిలో బరువున్న ఇన్‌శాట్‌ లాంటి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు ప్రణాళికలు రూపొందిస్తారు. ప్రస్తుతం మన సమాచార ఉపగ్రహాలను ఫ్రెంచిగయానలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగిస్తున్నారు. సమాచార ఉపగ్రహాలను సొంతంగా ప్రయోగించేస్థాయి ఇస్రో ఎదిగితే ఎంతో విలువైన విదేశీమారక ద్రవ్యం ఆదావడమేకాక, ఇతర దేశాల సమాచార ఉపగ్రహాలను కూడా ప్రయోగించే స్థాయికి ఎదిగితే వాణిజ్యపరంగా ఇస్రో మరింత వెసులుబాటు కలుగుతుంది. జీఎస్ఎల్వీ మార్క్ 3డీ 1 రాకెట్‌ ప్రయోగం విజయవంతం కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు.

06:39 - June 3, 2017

హైదరాబాద్ : భాగ్యనగరంలో రాజకీయ నేతలే కాదు.. వాళ్ల అనుచరులు కూడా రెచ్చిపోతున్నారు. బిర్యానీ బాగా లేదని అడిగిన పాపానికి సరూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ వ్యక్తిని కార్పొరేటర్‌ అనుచరులు దాడి చేశారు. పోలీస్‌స్టేషన్‌లో సైతం బూతులు తిడుతూ వీరంగం సృష్టించారు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామంటున్నారు.

06:37 - June 3, 2017

హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజును చీకటి రోజు అనడం సరికాదని... మంత్రి హరీశ్ రావు అన్నారు.. విభజన పేరుతో తెలంగాణపై చంద్రబాబు విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు.. ఏపీ సీఎం వెంటనే తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని సిద్ధిపేట్‌లో డిమాండ్ చేశారు.

06:33 - June 3, 2017

హైదరాబాద్ : మియాపూర్‌ భూముల కుంభకోణంలో ఏసీబీ కొరడా ఝుళుపిస్తోంది. మియాపూర్ ప్రభుత్వ భూముల గోల్‌మాల్‌ పై దూకుడు పెంచింది. ఈ స్కాంలో ఇప్పటికే సబ్‌ రిజిస్ట్రార్‌లు శ్రీనివాసరావు, యూసఫ్ లు అరెస్ట్‌కాగా.. తాజాగా హెచ్‌ఎండీఏ పరిధిలోని 14 మంది రిజిస్ట్రేషన్‌ అధికారుల ఇళ్లపై ఏసీబీ దాడులు నిర్వహిచింది. ఈ తనిఖీల్లో కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ భూములను అప్పనంగా ప్రైవేట్ సంస్దలకు అప్పగించిన అధికారుల ఇళ్లపై సోదాలు జరిపిన ఏసీబీ అధికారులు.. తాజాగా వల్లభ్‌నగర్‌లో ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న ముజీబుద్దీన్‌ ఇళ్లు, కార్యాలయంపై దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో కంప్యూటర్లతో పాటు కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వల్లభ్‌నగర్‌ ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ట్రార్‌గా ముజీబుద్దీన్‌ బాధ్యతలు చేపట్టిన కాసేపటికే ఏసీబీ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. ఇప్పటివరకు ఇక్కడ సబ్‌ రిజిస్ట్రార్‌గా పనిచేసిన సుబ్రహ్మణ్యంను మూడు రోజుల క్రితం అధికారులు బదిలీ చేశారు. ఆయన స్ధానంలో ముజిబ్‌ను ప్రభుత్వ నియమించింది. ఇక్కడ విశేషం ఏంటంటే.. ముజిబుద్దీన్‌ హైదరాబాద్‌ టీఎన్‌జీవో అధ్యక్షుడుగా కూడా ఉన్నారు. పైగా ఈ భూముల దందాలో కూకట్‌పల్లి, మియాపూర్ సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్‌తో ముజీబ్‌కు మంచి దోస్తానా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుమానిత సబ్‌ రిజిస్ట్రార్‌ల ఇళ్లలో సోదాలు నిర్వహించిన ఏసీబీ పాత తేదీలతో ఉన్న స్టాంపు పేపర్లు, రిజిస్ట్రేషన్‌ పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.

ప్రభుత్వం సీరియస్..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం ఇంత పెద్ద భూ స్కాం వెలుగులోకి రావడంతో ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రార్‌ కార్యాలయాలు, సంబంధిత అధికారులకు ఇప్పటికే స్ధాన చలనం కలిగించింది. ఇదే సమయంలో ఆరోపణలు వస్తున్న అధికారుల ఇళ్లలో ఏసీబీ అధికారులు వరుసగా దాడులు నిర్వహిస్తున్నారు. మొత్తం 45 మంది రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ అధికారులు, 16 మంది సూపరింటెండెంట్లతోపాటు ఆపై స్థాయిలో ఉన్న అధికారులపై విచారణకు ఏసిబి రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకు జరిపిన తనిఖీల్లో ఏయే అధికారి ఎంత స్థాయిలో అవినీతికి పాల్పడ్డారో.. ప్రభుత్వ భూములను కాజేయడంలో ఏనేతకు ఏ స్థాయిలో సహకరించారో అనే వివరాలతో ప్రభుత్వానికి నివేదిక అందించనుంది ఏసీబీ. ఇదిలావుంటే ఎల్‌బినగర్ లోని బుచ్చిబాబు అనే సబ్ రిజిస్ట్రార్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరోవైపు ఏసీబీ వరుస దాడులతో అవినీతి అధికారులు ప్రభుత్వ పెద్దల దగ్గరకు రాయబారాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. ఈ భూ కుంభకోణం వెనుక కొందరు అధికారపార్టీ పెద్దలు కూడా ఉన్నట్టు వస్తున్న ఆరోపణలతో .. అటు ప్రభుత్వం.. ఇటు దర్యాప్తు సంస్థ అధికారులు ఆచితూచి అడుగేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అతిపెద్ద అవినీతి భాగోతం బయటపడటంతో.. ప్రభుత్వానికి ఓవైపు పరువు సమస్య, మరోవైపు అధికారపార్టీ నేతల ప్రమయే ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ఎంతవరకు అసలు దోషులకు శిక్షలు పడతాయో వేచి చూడాలి.

06:29 - June 3, 2017

హైదరాబాద్ : రుణ శేషం..శత్రు శేషం ఉండరాదనేది ఓ నానుడి. ఇదే విధానాన్ని అమలు చేస్తోంది టీఆర్‌ఎస్‌పార్టీ. తెలంగాణా సెంటిమెంట్‌తో టీడీపీని కోలుకోలేని దెబ్బ తీసిన గులాబి పార్టీ.. మిగిలిన కొద్ది మంది నేతలను కూడా రా రమ్మంటూ పిలుస్తోంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీ- టీడీపిని టార్గెట్‌ చేశారు టీఆర్‌ఎస్‌ నేతలు. ఆపరేషన్ ఆకర్ష్ తో తెలంగాణలోటీడీపీని దాదాపు ఖాళీచేస్తున్న గులాబి పార్టీ.. తాజాగా పసుపుపార్టీని పూర్తిగా నిర్వీర్యం చేసే పనిలో పడ్డట్లు కనిపిస్తోంది. తెలంగాణాలో సైకిల్‌ పార్టీ నుంచి ఎదురౌతున్న సమస్యలను అధిగమించేందుకు ఆ పార్టీని ఖాళీ చేయడమే లక్ష్యంగా గులాబి బాస్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ప్రారంభమైన వలసలను మరింత ముమ్మరం చేయడంతో పాటు మిగిలిన కొంత మంది తెలుగు తమ్ముళ్లను కారెక్కించుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే మాజీ ఎంపీ రమేష్ రాథోడ్‌కు గులాబి కండువ కప్పిన అధికారపార్టీ నేతలు ..రాబోయే రోజుల్లో వలసలను మరింత ప్రోత్సహిస్తామన్న సంకేతాలను ఇస్తున్నారు.

పుచ్చుకుంటారా ?
తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దినోత్సవం సందర్భంగా విభజన అంశం ఇరు రాష్ట్రాల్లో సెంటిమెంట్ ను మరోసారి రాజేసింది. రాష్ట్ర విభజనపై ఎపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తెలంగాణా రాష్ట్ర సమితి సీరియస్ గా తీసుకుంటోంది. రాష్ట్ర విభజనను జీర్ణించుకోలేని బాబు తెలంగాణాపై విషం చిమ్ముతున్నారని గులాబి పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణా వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటే బాబు దాన్ని జీర్ణించుకోలేక తెలంగాణా అవతరణ దినోత్సవాన్ని ఓ చీకటి రోజుగా అభివర్ణించడాన్ని టీఆర్ఎస్ నేతలు తప్పుబడుతున్నారు. బాబు వైఖరిని గమనించి ఇప్పటికైనా టీ-టిడిపీ నేతలు గులాబీ గూటికి చేరుకోవాలని పిలుపునిస్తున్నారు. ఉద్యమ సమయంలోనే టీడీపీ నుంచి పెద్ద ఎత్తున వలసలను ప్రోత్సహించిన గులాబి పార్టీ.. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కూడా అదే పంథా కొనసాగించింది. సైకిల్‌ పార్టీ శాసనసభా పక్షాన్ని లేకుండా చేయడంలో విజయవంతం అయిన కార్‌ గుర్తు పార్టీ ..రాబోయే ఎన్నికల నాటికి టీ-టీడీపీని ఖాళీ చేయాలనే లక్ష్యంగా మరోసారి ఆకర్ష్‌ వ్యూహాన్ని అనుసరిస్తోంది. ముందు ముందు మరెంత మంది గులాబీతీర్థం పుచ్చుకుంటారో వేచిచూడాలి.

డీజే పాటపై వివాదం..

హైదరాబాద్ : డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో ఓ పాటపై వివాదం నెలకొంది. తమ మనోభావాలను కించపరిచారంటూ బ్రాహ్మణ సంఘాలు ఆందోళనకు సిద్ధమౌతున్నాయి. నమక చమకాలు..ప్రవరనను..ఆగ్రహారాలు..తాంబూలాలను కించపరుస్తూ రాసిన 'ఆస్మిక యోగ తస్మిక బోగ' అనే పాటను తొలగించాలంటూ బ్రాహ్మణ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

మార్కెటింగ్ శాఖపై బాబు సమీక్ష...

విజయవాడ : మార్కెటింగ్ శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో పౌరసరఫరాలు, మార్క్ ఫెడ్, గిడ్డంగుల శాఖలు సమన్వయంతో పనిచేయాలని బాబు సూచించారు.

నేడు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం..

ఢిల్లీ : నేడు జీఎస్టీ కౌన్సిల్ 15వ సమావేశం జరగనుంది. రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఈ సమావేశాలకు హాజరు కానున్నారు. పన్ను రేట్లపై జీఎస్టీ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకోనున్నారు.

28 పన్ను సరికాదన్న కమల్..

చెన్నై : చలన చిత్ర పరిశ్రమపై జీఎస్టీలో విధించిన 28 శాతం పన్ను సరికాదని ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయం వల్ల చలన చిత్ర పరిశ్రమ కుదేలవుతుందని, 28 శాతం పన్నును 12-15 శాతానికి తగ్గించాలని సూచించారు.

కుంబ్లే విముఖత..

ఢిల్లీ : టీమిండియా కోచ్ గా కొనసాగేందుకు కుంబ్లే విముఖత చూపించారు. కోహ్లీతో విబేధాలే కారణమని తెలుస్తోంది. తదుపరి కోచ్ గా సెహ్వాగ్ ను నియమించే అవకాశం ఉందని సమాచారం.

రష్యాలో మోడీ పర్యటన..

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రష్యాలో పర్యటించారు. సెయింట్ పీటర్స్ బర్గ్ ఆర్థికయ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. భారత్ లో పెట్టుబడులకు రష్యాను ఆహ్వానించారు. మౌలిక సదుపాయాలు, రక్షణ తయారీ రంగాలలో పెట్టుబడులకు రష్యాను ఆహ్వానించారు.

Don't Miss