Activities calendar

04 June 2017

22:02 - June 4, 2017

హైదరాబాద్ : చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బర్మింగ్‌ హామ్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో... పాక్‌ ముందు భారత్.. 324 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడిపోవడంతో.. బ్యాటింగ్‌కు దిగిన ఓపెనర్లు రోహిత్ శర్మ 91 పరుగులు, శిఖర్ ధావన్ 68 పరుగులతో చెలరేగి ఆడటం... కెప్టెన్ కోహ్లీ, యువరాజ్ హాఫ్‌ సెంచరీలతో భారత్‌ నిర్దేశిత 48 ఓవర్లలో 319 పరుగులు చేసింది. అయితే డక్‌వర్త్ లూయిస్‌ మెథక్ ప్రకారం... పాక్‌ గెలవాలంటే 324 పరుగులు చేయాల్సి ఉంది. మ్యాచ్‌ మధ్యలో రెండుసార్లు వర్షం రావడంతో.. 2 ఓవర్లు తగ్గించారు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ 81 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అయితే ఓపెనర్ రోహిత్ శర్మ.. సెంచరీకి చేరువుతున్న సమయంలో అనవసర పరుగుకోసం ప్రయత్నించి రనౌట్ గా పెవిలియన్ చేరాడు. యువరాజ్ తరువాత వచ్చిన హార్దిక్ పాండ్యా చివర్లో రెచ్చిపోయాడు. చివరి 10 బంతుల్లో కోహ్లి-పాండ్యాలు 34 పరుగులు రాబట్టడంతో... భారత్ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. మరోవైపు పాక్ బ్యాటింగ్ ప్రారంభమైన కాసేపటికే వర్షం వచ్చి ఆట ఆగిపోయింది. 4.5 ఓవర్లు ఆడిన పాక్ వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేసింది. అనంతరం ఆట ప్రారంభం కాగా... మ్యాచ్‌ను 36.1 ఓవర్లకు తగ్గించి.. టార్గెట్‌ 267 పరుగులుగా నిర్ధారించారు. 

 

21:59 - June 4, 2017

హైదరాబాద్ : ఏ దిక్కూ లేని ఒంటరి మహిళలకు భరోసా ఇచ్చేందుకు ముందుకు వచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఒంటరి మహిళలు ఆత్మగౌరవంతో బ్రతకాలనే ఉద్దేశ్యంతో వెయ్యి రూపాయల పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఈ పథకం ద్వారా లక్షా 9వేల 50 మంది మహిళలు లబ్ధి చేకూరుతుంది. 
ఒంటరి మహిళలకు వెయ్యి రూపాయల పెన్షన్ 
పెళ్లై భర్త నుంచి విడిగా ఉన్నా.. లేక పెళ్లికాకుండా ఒంటరిగా ఉన్న మహిళలకు ఆసరాగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం వెయ్యి రూపాయల పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా తెలంగాణ వ్యాప్తంగా లక్షా 9వేల 50 మంది మహిళలకు పెన్షన్లు మంజూరు కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం ఆదివారం ప్రారంభమైంది. 
ఆసరా ఫించన్ పథకాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం మహమూద్ అలీ  
హైదరాబాద్‌ మలక్‌పేటలో ఒంటరి మహిళా ఆసరా ఫించన్ పథకాన్ని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ప్రారంభించారు. ఒంటరి మహిళలకు భరోసా ఇచ్చేందుకు దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ సర్కార్ ఈ పథకాన్ని అమలు చేస్తోందని ఆయన తెలిపారు. 
మహిళలు గొప్పగా బతకాలి : తలసాని
మహిళలు గొప్పగా బతకాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సికింద్రాబాద్‌ హరిహర కళాభవన్‌లో ఒంటరి మహిళలకు తలసాని పెన్షన్లు పంపిణీ చేశారు. మరోవైపు వికారాబాద్ జిల్లా పరిగిలో మంత్రి మహేందర్‌రెడ్డి ఒంటరి మహిళలకు ఆసరా పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో మహిళా వికాసం కోసం సీఎం కేసీఆర్ మంచి పథకాలను అమలు చేస్తున్నారని అభినందించారు. 
వనపర్తిలో
ఒంటరి మహిళలకు పెన్షన్‌ పథకాన్ని వనపర్తిలో రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి ప్రారంభించారు.. ఒంటరి మహిళలకు పెన్షన్లు అందజేశారు.. 
మెదక్‌లో 
మెదక్‌లో ఒంటరి మహిళ పెన్షన్ పథకాన్ని డిప్యూటి స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ భారతి ప్రారంభించారు. ఒంటరి మహిళలకు భృతిని కల్పించడంలో సీఎం కేసీఆర్ పెద్దన్న పాత్ర పోషిస్తున్నాడన్నారు పద్మా దేవేవందర్‌రెడ్డి. జిల్లాలో 3,614 మందికి ఒంటరి మహిళా పెన్షన్లు అందజేస్తున్నట్లు ఆమె చెప్పారు. 
ఒంటరి మహిళలను ఆదుకోవడం అభినందనీయం : ఎంపి మల్లారెడ్డి 
తెలంగాణలో ఒంటరి మహిళలను ఆదుకునే దిశగా చేయడం అభినందనీయం అన్నారు మల్కాజిగిరి ఎంపి మల్లారెడ్డి. హైదరాబాద్ జీహెచ్‌ఎంసి ఉప్పల్ సర్కిల్ కార్యాలయంలో ఒంటరి మహిళలకు పెన్షన్ మంజూరు కార్యక్రమాన్ని ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభాకర్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. 
నిజామాబాద్ జిల్లాలో
నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో ఒటరి మహిళలకు పెన్షన్ పథకాన్ని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి ప్రారంభించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని 7 మండలాల్లో లబ్దిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
నాగర్‌ కర్నూల్ జిల్లాలో 
నాగర్‌ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్‌గల్‌లో ఒంటరి మహిళ పెన్షన్ పథకాన్ని మంత్రి జూపల్లి ప్రారంభించారు. నియోజకవర్గంలోని 7 మండలాలకు చెందిన 796 మంది ఒంటరి మహిళలకు పెన్షన్ మంజూరు పత్రాలు అందజేశారు. గతంలో ఏ ముఖ్యమంత్రి పేదవారిని ఆదుకున్న పాపాన పోలేదని సీఎం కేసీఆర్‌ అందరికీ న్యాయం చేస్తున్నారని ఈ సందర్భంగా జూపల్లి అన్నారు. 
మెదక్ జిల్లాలో 
మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఒంటరి మహిళల పెన్షన్ పథకాన్ని ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రారంభించారు. నియోజకవర్గంలో 1100లకు పైగా లబ్దిదారుల్ని ఎంపిక చేశారు. ఇంకా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. నిరుపేదల సంక్షేమమే ధ్యాయంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు వర్థన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్. వరంగల్ జిల్లా వర్థన్నపేటలో ఒంటరి మహిళలకు పెన్షన్లను పంపిణీ చేశారు. 
సంగారెడ్డి జిల్లాలో 
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూర్ గెస్ట్ హౌస్ వద్ద ఒంటరి మహిళలకు పెన్షన్లు పంపిణీ చేశారు ఎమ్మెల్యే బాబు మోహన్. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు పరచడంలో దేశంలోనే ప్రథమ స్ధానంలో ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం తమను ఆదుకునేందుకు ముందుకు రావడం పట్ల మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పారు. 

 

21:52 - June 4, 2017

విజయవాడ : మూడవ రోజు నవ నిర్మాణ దీక్షలు ఘనంగా జరిగాయి. విజయవాడలో జరిగిన దీక్షలో  సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ప్రజాప్రతినిధుల, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వవ్యసాయం అనుబంధ రంగాలు, జల సంరక్షణపై  చర్చించారు.  రాష్ట్రాన్ని అధోగతి పాలుచేశారంటూ కాంగ్రెస్‌, వైసీపీలపై విమర్శలు గుప్పించారు.  
అన్ని వనరులు ఉన్నా..రాష్ట్రానికి నష్టం : చంద్రబాబు 
అన్ని వనరులు ఉన్నా.. రాష్ట్రానికి ప్రతి సందర్భంలోనూ నష్టం జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలోని ఎ కన్వెన్షన్‌ సెంటర్‌లో చేపట్టిన నవనిర్మాణ దీక్ష మూడో రోజు ఆయన పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌ను టెక్నాలజీ హబ్‌గా మార్చడానికి కృషిచేసినట్టు చంద్రబాబు చెప్పారు. హుద్‌హుద్‌ తుఫాన్‌ తో దెబ్బతిన్న విశాఖను తక్కువ  సమయంలోనే  కోలుకునేలా చేశామని మన్నారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు ప్రజలు సహకరిస్తే.. ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొని రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడుపుతానన్నారు సీఎం చంద్రబాబు. ఇష్టం వచ్చిన రీతిగా రాష్ట్రాన్ని కాంగ్రెస్‌పార్టీ విభజించిందని సీఎం  చంద్రబాబు ఆరోపించారు. ఆరోజు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అనాలోచిత చర్యవల్ల ఏపీ దేశంలోనే తక్కువ ఆదాయం ఉన్న రాష్ట్రంగా సమస్యల్లో చిక్కుకుందన్నారు. 
రైతులకు సాంకేతిక పరిజ్ఞానం : మంత్రి నారాయణ 
వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా పంటలు వేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందిస్తామని ఏపీ మంత్రి నారాయణ అన్నారు. దీనికి భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం సాయం తీసుకుంటామన్నారు.  నెల్లూరులో జరిగిన నవ నిర్మాణ దీక్షలో మంత్రి పాల్గొన్నారు. రాయలసీమలో కరువును ఎదుర్కోడానికి తమ ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. 
బాబుపై కాంగ్రెస్‌, వైసీపీలు విమర్శలు సిగ్గుచేటు : మంత్రులు 
వందల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన సీఎం చంద్రబాబుపై కాంగ్రెస్‌, వైసీపీలు విమర్శలు దిగడం సిగ్గుచేటని మంత్రులు అయ్యన్నపాత్రుడు, నక్కా ఆనందబాబు విమర్శించారు.  రాష్ట్రాన్ని విడదీసి.. ఏపీకి తీరని ద్రోహం చేసిన కాంగ్రెస్‌పార్టీ నేతలు మళ్లీ ఏ ముఖంపెట్టుకుని సభలు పెడుతున్నారని మంత్రులు  ప్రశ్నించారు. గుంటూరు జిల్లా తెనాలి, వేమూరు గ్రామాల్లో జరిగిన నవనిర్మాణ దీక్ష సభల్లో మంత్రులు పాల్గొన్నారు. 
దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆమంచి 
అటు ప్రకాశం జిల్లా చీరాలలో జరిగిన నవ నిర్మాణ దీక్షలో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ పాల్గొన్నారు. చీరాల మండల పరిధిలోని వ్యవసాయశాఖ మరియు పశు సంవర్ధక శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. విభజన అనంతరం వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను ఎలా అధిగమించాలనే అంశంపై ఆయన అధికారులతో చర్చించారు. 
దీక్షల్లో ఉత్సాహంగా పాల్గొన్న మంత్రులు 
అనంతపురం జిల్లాలో జరిగిన నవనిర్మాణ దీక్షల్లో రాష్ట్ర మంత్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పుట్టపర్తితో ఏర్పాటు చేసిన నవనిర్మాణ దీక్షలో మంత్రి పల్లెరాఘునాథ్‌రెడ్డి పాల్గొన్నారు. ఇటు అనంతపురం పట్టణంలో జరిగిన సభలో మంత్రులు గంటాశ్రీనివాసరావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పాల్గొన్నారు.  రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కృషిచేస్తోందని మంత్రులు అన్నారు. రైతులకు 1600 కోట్ల ఇన్‌ఫుట్‌ సబ్సిడీ ఇస్తున్నామని వ్యవసాయశాఖా మంత్రి సోమిరెడ్డి తెలిపారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ రకాల పంటలు, పండ్లు, వ్యవసాయ పనిముట్ల ప్రదర్శన ఆకట్టుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 3వ రోజుల నవనిర్మాణదీక్షల్లో మంత్రులు, ప్రజాప్రతినిధుల, అధికారులతో పాటు పెద్ద ఎత్తున రైతులు, ప్రజలు పాల్గొన్నారు. 

 

21:44 - June 4, 2017

గుంటూరు : ప్రత్యేక హోదా ఏపీ హక్కు అన్నారు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ. గుంటూరులో కాంగ్రెస్‌ నిర్వహించిన ప్రత్యేక హోదా భరోసా సభకు రాహుల్‌గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాహుల్‌... తిరుపతి సాక్షిగా ఏపీ ప్రజలను ప్రధాని మోదీ మోసం చేశారన్నారు. ప్రత్యేక హోదా అడిగేందుకు చంద్రబాబు భయపడుతున్నారని.. తాము మోదీకి భయపడేవాళ్లం కాదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తాము పార్లమెంట్‌లో పోరాడుతామన్నారు. విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధాని చెప్పారని తెలిపారు. ఏపీని దేశంలోనే శక్తివంతమైన రాష్ట్రంగా చేయాలనుకున్నామని చెప్పారు. ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని మోదీ తిరుపతిలో చెప్పారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎందుకు పోరాటం చేయడం లేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా వల్లే వచ్చే నిధులు చంద్రబాబు, జగన్‌లకు అవసరం లేదా? అన్నారు. ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్‌ పోరాడుతుందని తెలిపారు. మోదీని చూసి జగన్, చంద్రబాబులు భయపడుతున్నారు.. కానీ తాము భయపడం, ప్రత్యేక హోదా పోరాటం చేస్తామని భరోసా ఇచ్చారు. మోదీ, చంద్రబాబు అవినీతి గురించి..పెద్దపెద్ద ఉపన్యాసాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అవినీతికి వ్యతిరేకంగా 2013 భూసేకరణ చట్టం తెచ్చామని చెప్పారు. 2013 భూసేకరణ చట్టాన్ని సవరించేందుకు మోదీ మూడు సార్లు యత్నించారని.. మోదీ ప్రయత్నాలను తాము తిప్పికొట్టామని తెలిపారు. చంద్రబాబు భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కారని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్‌లో పోరాటం చేస్తామని చెప్పారు. మోదీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయినా నిరుద్యోగులు, రైతులకు ఒరిగిందేమీ లేదని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌ కేంద్రం కడితే.. తమకు కమీషన్లు రావని చంద్రబాబు భయపడుతున్నారన్నారు. ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్‌లో పోరాడుతామని.. 2019లో అధికారంలోకి వచ్చిన ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్‌ హామీ ఇచ్చారు. 
నిరుద్యోగులు, రైతులను మోసం చేసిన మోదీ : అఖిలేష్‌ 
నిరుద్యోగులు, రైతులకు ఇచ్చిన హామీలను మోదీ నెరవేర్చలేదన్నారు యూపీ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీతో పాటు.. ప్రత్యేక హోదా కూడా ఇవ్వాలని అఖిలేష్‌ డిమాండ్‌ చేశారు. ఏపీని ఎప్పుడు అభివృద్ధి చేస్తారో మోదీ చెప్పాలన్నారు. 
ప్రత్యేకహోదా వద్దంటున్న చంద్రబాబు : రఘువీరా
రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దంటున్న చంద్రబాబు.. ముఖ్యమంత్రిగా అర్హుడా అని ప్రశ్నించారు రఘువీరారెడ్డి. గుంటూరు హోదా భరోసా సభలో మాట్లాడిన రఘువీరా... రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడమే లక్ష్యమన్నారు. సభకు వచ్చే కాంగ్రెస్‌ కార్యకర్తలను టీడీపీ గూండాలను అడ్డుకోవడం సిగ్గుచేటు అన్నారు. భవిష్యత్‌లో టీడీపీ కార్యక్రమాలు ప్రశాంతంగా జరుపుకోకుండా చేస్తామని హెచ్చరించారు. 

 

21:26 - June 4, 2017
21:18 - June 4, 2017

పశ్చిమగోదావరి : నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు ఎంతగానో శ్రమిస్తున్నారన్నారు మంత్రి కొల్లు రవీందర్. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరిగిన మూడవరోజు నవ నిర్మాణ దీక్షలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో ప్రత్యేకంగా వ్యవసాయ, ఆక్వా రంగానికి చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని రవీందర్ తెలిపారు. ఏ రాష్ట్రంలో చేయని విధంగా 24 వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కుందన్నారు.

21:12 - June 4, 2017

గుంటూరు : వందల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన సీఎం చంద్రబాబుపై కాంగ్రెస్‌, వైసీపీలు విమర్శకలు దిగడం సిగ్గుచేటని మంత్రులు అయ్యన్నపాత్రుడు, నక్కా ఆనందబాబు విమర్శించారు. గుంటూరు జిల్లా తెనాలి, వేమూరు గ్రామాల్లో జరిగిన నవనిర్మాణ దీక్ష సభల్లో మంత్రులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని విడదీసి.. ఏపీకి తీరని ద్రోహం చేసిన కాంగ్రెస్‌పార్టీ నేతలు మళ్లీ ఏ ముఖం పెట్టుకుని సభలు పెడుతున్నారని మంత్రులు ప్రశ్నించారు. కాంగ్రెస్‌ రాష్ట్ర విభజనలో ఏపీకి తీరని అన్యాయం చేసిందని మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు.

21:03 - June 4, 2017

గుంటూరు : ప్రత్యేకహోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అని కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ అన్నారు. గుంటూరులో నిర్వహించిన కాంగ్రెస్ ప్రత్యేహోదా భరోసా సభలో ఆయన ప్రసంగించారు. ఏపీని దేశంలోనే శక్తివంతమైన రాష్ట్రంగా చేయాలనుకున్నామని చెప్పారు. విభజన సయమంలో ప్రత్యేకహోదా ఇస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారని... కానీ ప్రధానిగా ప్రత్యేకహోదాను వాయిదా వేశారని పేర్యొన్నారు. ఏపీకి 10 ఏళ్లు ప్రత్యేకహోదా ఇస్తామని తిరుపతిలో మోడీ చెప్పారని గుర్తు చేశారు. ప్రత్యేకహోదా కోసం అధికార పార్టీ ఎందుకు పోరాడటం లేదని ప్రశ్నించారు. 

ప్రత్యేకహోదా కోసం అధికార పార్టీ ఎందుకు పోరాడటం లేదు : రాహుల్ గాంధీ

గుంటూరు : ప్రత్యేకహోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అని కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ అన్నారు. గుంటూరులో నిర్వహించిన కాంగ్రెస్ ప్రత్యేహోదా భరోసా సభలో ఆయన ప్రసంగించారు. ఏపీని దేశంలోనే శక్తివంతమైన రాష్ట్రంగా చేయాలనుకున్నామని చెప్పారు. విభజన సయమంలో ప్రత్యేకహోదా ఇస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారని... కానీ ప్రధానిగా ప్రత్యేకహోదాను వాయిదా వేశారని పేర్యొన్నారు. ఏపీకి 10 ఏళ్లు ప్రత్యేకహోదా ఇస్తామని తిరుపతిలో మోడీ చెప్పారని గుర్తు చేశారు. ప్రత్యేకహోదా కోసం అధికార పార్టీ ఎందుకు పోరాడటం లేదని ప్రశ్నించారు. 

భారత్ భారీ స్కోర్

హైదరాబాద్ : ఛాంపియన్ ట్రోపీలో భాగంగా భారత్, పాకిస్థాన్ ల మధ్య జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ లో భారత్ భారీ స్కోర్ నమోదు చేసింది. 48 ఒవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. పాకిస్థాన్ విజయలక్ష్యం 320 పరుగులుగా ఉంది.
 

20:49 - June 4, 2017
20:45 - June 4, 2017

గుంటూరు : 2014 సం.లో బీజేపీ కూడా ప్రత్యేక హోదాతోపాటు అనేక హామీలు ఇచ్చిందని ఆర్జేడీ నేత శరద్ యాదవ్ గుర్తు చేశారు. ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. గుంటూరులో నిర్వహించిన కాంగ్రెస్ ప్రత్యేకహోదా భరోసా సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకు పోటీగా ప్రతిపక్షాల తరపున అభ్యర్థిని నిలబెడతామని చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాలకు చంద్రబాబు మద్దతిస్తే ఆ వెంటనే ప్రత్యేకహోదా వస్తుందన్నారు. 

ప్రత్యేక హోదా హామీ ఇచ్చిన బీజేపీ : శరద్ యాదవ్

గుంటూరు : 2014 సం.లో బీజేపీ కూడా ప్రత్యేక హోదాతోపాటు అనేక హామీలు ఇచ్చిందని ఆర్జేడీ నేత శరద్ యాదవ్ గుర్తు చేశారు. ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. గుంటూరులో నిర్వహించిన కాంగ్రెస్ ప్రత్యేకహోదా భరోసా సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకు పోటీగా ప్రతిపక్షాల తరపున అభ్యర్థిని నిలబెడతామని చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాలకు చంద్రబాబు మద్దతిస్తే ఆ వెంటనే ప్రత్యేకహోదా వస్తుందన్నారు. 

20:32 - June 4, 2017

గుంటూరు : ప్రత్యేకహోదా ఇస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ అన్నారు. గుంటూరులో నిర్వహించిన కాంగ్రెస్ ప్రత్యేకహోదా భరోసా సభలో ఆయన ప్రసంగించారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాల్సిన అవసరముందని చెప్పారు. హోదా విషయంలో జాతీయ నాయకులు మీ కోసం పని చేస్తున్నారని తెలిపారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతామని చెప్పారు. 

కాంగ్రెస్ ప్రత్యేకహోదా భరోసా సభలో ప్రసంగించిన అఖిలేష్

గుంటూరు : ప్రత్యేకహోదా ఇస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ అన్నారు. గుంటూరులో నిర్వహించిన కాంగ్రెస్ ప్రత్యేకహోదా భరోసా సభలో ఆయన ప్రసంగించారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాల్సిన అవసరముందని చెప్పారు. 

19:52 - June 4, 2017

గుంటూరు : ప్రత్యేకహోదా కోరితే రాష్ట్రానికి శత్రువులా అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు. గుంటూరులో నిర్వహించిన కాంగ్రెస్ ప్రత్యేకహోదా భరోసా సభలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ప్రత్యేకహోదా కోరితే ద్రోహులా అని నిలదీశారు. హోదా కోసం ఎవరు పోరాడినా మనం మద్దతు ఇవ్వాలన్నారు. ప్రత్యేకహోదా కోరే ప్రతి వ్యక్తికి మద్దతు ఇవ్వాలని..హోదాను బలపర్చాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేదని చంద్రబాబు ఆత్మవంచన చేసుకుంటున్నారని తెలిపారు. టీడీపీ శ్రేణులు నల్లజెండాలు పట్టుకుంది ప్రత్యేక హోదా వద్దనా... హోదా కోరితే నల్ల జెండాలు చూపించడం సిగ్గుచేటన్నారు. మతోన్మాద బీజేపీతో చంద్రబాబు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీతో పొత్తును సమర్థించుకోవడం కోసం చంద్రబాబు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయం కాదని.. హోదా సాధించే వరకు తెరిచి ఉన్న అధ్యాయమేనని తెలిపారు. ప్రత్యేకహోదా రాష్ట్రానికి జీవన్మరణ సమస్య అని అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో అన్ని పార్టీలను ఢిల్లీ తీసుకెళ్లి.. 
పార్లమెంట్ లోపల, బయట పోరాడి సాధించుకుందామని చెప్పారు. 

 

ప్రత్యేకహోదా కోరితే ద్రోహులా : సురవరం

గుంటూరు : ప్రత్యేకహోదా కోరితే రాష్ట్రానికి శత్రువులా అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు. గుంటూరులో నిర్వహించిన కాంగ్రెస్ ప్రత్యేకహోదా భరోసా సభలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ప్రత్యేకహోదా కోరితే ద్రోహులా అని నిలదీశారు. 

రెండో వికెట్ కోల్పోయిన భారత్

హైదరాబాద్ : ఛాంపియన్స్ ట్రోపీలో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ లో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. 192 పరుగుల వద్ద రోహిత్ శర్మ (91) ఔట్ అయ్యాడు. 

కాసేపట్లో కాంగ్రెస్ ప్రత్యేకహోదా బహిరంగ సభ

గుంటూరు : కాసేపట్లో కాంగ్రెస్ ప్రత్యేకహోదా బహిరంగ సభ ప్రారంభం కానుంది. సభలో పాల్గొనేందుకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ రానున్నారు. రాహుల్‌ గాంధీ గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అనంతరం ఆయన రోడ్డుమార్గం ద్వారా విజయవాడలోని హోటల్‌కు బయలుదేరి వెళ్లారు. 

 

18:25 - June 4, 2017
18:14 - June 4, 2017

హైదరాబాద్‌ : నగరంలో రెచ్చిపోతున్న బైక్ రేసర్లకు పోలీసులు చెక్ పెట్టారు. పాతబస్తీ చంచల్ గూడ జైలు నుండి నల్గొండ క్రాస్ రోడ్డు వరకు  బైక్ రేసింగ్ చేస్తున్న పదిహేను మంది యుేవకులను అదుపులోకి తీసుకున్నారు. వీరికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు. మళ్ళీ ఇలాంటి రేస్‌లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని చాదర్‌ఘాట్ పోలీసులు, యువకులకు హెచ్చరించారు.

 

18:09 - June 4, 2017

నెల్లూరు : రాయలసీమలో కరువును ఎదుర్కోడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఏపీ మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరులో జరిగిన నవ నిర్మాణ దీక్షలో మంత్రి పాల్గొన్నారు. వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా పంటలు వేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందిస్తామని మంత్రి నారాయణ అన్నారు. దీనికి భారత అంతరీక్ష పరిశోధనా కేంద్రం సాయం తీసుకుంటామన్నారు. నవ నిర్మాణ దీక్షలో మంత్రి , ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
 

18:02 - June 4, 2017
17:58 - June 4, 2017

విజయవాడ : గుంటూరు సభలో పాల్గొనేందుకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి ఘనస్వాగతం లభించింది. అనంతరం ఆయన రోడ్డుమార్గం ద్వారా విజయవాడలోని హోటల్‌కు బయలుదేరి వెళ్లారు. మరోవైపు రాహుల్ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు.. జాతీయ రహదారిపై.. టీడీపీ కార్యకర్తలు ప్లకార్డులు, నల్లజెండాలు పట్టుకొని రాహుల్‌ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు.

 

17:45 - June 4, 2017

85 డ్రమ్ముల కల్తీ నూనె స్వాధీనం...

రంగారెడ్డి : యాచారం మండలం కొత్తపల్లి సమీపంలో ఆగ్రోఫీడ్ కంపెనీపై ఎస్ వోటీ పోలీసులు దాడులు చేశారు. పశువుల వ్యర్థాలతో నూనె తయారు చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు. అంతే కాకుండా 85 డ్రమ్ముల కల్తీ నూనెను స్వాధీనం చేసుకున్నారు.

17:43 - June 4, 2017

విశాఖ : కేంద్రం ప్రవేశపెట్టిన మోటార్‌ వెహికల్ బిల్లును వ్యతిరేకిస్తూ విశాఖలో ఆల్‌ ఇండియా రోడ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ నేతలు ఆందోళనకు దిగారు. రైల్వే స్టేషన్‌ నుంచి వీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ బిల్లు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు ఏఐఆర్ టీడబ్ల్యుఎఫ్ నేత ఏకే.పద్మనాభన్. మోటారు వెహికల్ బిల్లు వస్తే వాహనదారులపై విపరీతమైన ఆంక్షలు పెరిగిపోతాయని ఆయన చెప్పారు. ఈ బిల్లులో ఉన్న లోపాలు తొలగించాలని డిమాండ్ చేస్తూ మూడురోజుల పాటు విశాఖలో మహాసభలు నిర్వహిస్తున్నట్లు ..భవిష్యత్‌లో ఈ బిల్లుకు వ్యతిరేకంగా పోరాటాలు చేయబోతున్నట్లు పద్మనాభన్ తెలిపారు. 

 

17:39 - June 4, 2017

హైదరాబాద్ : కేసీఆర్‌ సర్కార్‌పై సిఐటియూ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబు ధ్వజమెత్తారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాల్ని అమలు చేస్తోందని విమర్శించారు. జిఎస్‌టి పేరుతో కేంద్రం పేదలపై దాడి చేస్తుంటే టీఆర్‌ఎస్ సర్కార్ దానిని సమర్థించడం సిగ్గుచేటని విమర్శించారు బిజెపిని అన్ని విషయాల్లో బలపరుస్తున్న కేసీఆర్‌ అందుకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మూడు సంవత్సరాల పాలనలో ఒక్క హామీని నెరవేర్చలేకపోయిన టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి తెలంగాణ వారోత్సవాలు చేసుకునే హక్కులేదని సాయిబాబు ఆరోపించారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని ఆయన చెప్పారు. 

 

క్షమాపణ చెప్పి రాహుల్ అడుగు పెట్టాలి: మంత్రి నక్కా

విజయవాడ : గుంటూరులో రాహుల్ గాంధీ అడుగు పెట్టే ముందు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి నక్కా ఆనంద్ డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన వారిలో రాహుల్ ఒకరు అని, రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునే కుట్రలో భాగమే ఈ సభ అని దుయ్యబట్టారు.

తొలికి వికెట్ కోల్పోయిన భారత్

బర్మింగ్‌హామ్: చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఎడ్జ్‌బాస్టన్‌లో పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. శిఖర్ ధావన్ (68) ఔటయ్యాడు.

17:26 - June 4, 2017

ఇంగ్లాండ్ : లండన్‌లో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. రెండు చోట్ల ఏకకాలంలో దాడులు చేసి ఆరుగురు ప్రజలు ప్రాణాలు బలి తీసుకున్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగి దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఉగ్రదాడి అనంతరం లండన్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు పోలీసులు.  
ఉగ్రదాడితో ఉలిక్కిపడ్డ లండన్‌ 
ఉగ్రదాడితో లండన్‌ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రెండు చోట్ల ఏకకాలంలో దాడులు చేసి ఆరుగురి ప్రాణాలు తీశారు ముష్కరులు . బ్రిటన్‌ కాలమానం ప్రకారం శనివారం రాత్రి 10గంటల సమయంలో ఓ వ్యాన్‌లో వచ్చిన ఉగ్రవాదుల బృందం లండన్‌ బ్రిడ్జ్‌పై వెళ్తున్న పాదచారులను ఢీకొట్టారు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. అనంతరం అదపుతప్పిన ఆ వ్యాన్‌ ఓ రెస్టారెంట్‌ వద్ద గోడను ఢీకొట్టి ఆగిపోయింది. వ్యానులోంచి దిగిన ముగ్గురు ఉగ్రవాదులు..ఆ తర్వాత కత్తులతో స్వైరవిహారం చేశారు. సమీపంలోని స్పానిష్‌ రెస్టారెంట్‌కు వచ్చిన వారిపై కత్తులతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఓ బాలికను ఈ రకంగా సుమారు 15సార్లు పొడవడంతో బాలిక అక్కడికక్కడే మృతిచెందింది. ఈ దాడిలో ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా..దాదాపు 30 మందికి పైగా గాయపడ్డారు. గాయాలైన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. 
8 ని.ల్లోనే ఉగ్రవాదులను మట్టుబెట్టిన పోలీసులు 
దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఎనిమిది నిమిషాల్లోనే ఉగ్రమూకల ఆటకట్టించారు. స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి 10.08 నిమిషాలకు పోలీసులకు తొలి సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన భద్రతా దళాలు రాత్రి 10 గంటల 16 నిమిషాల కల్లా ముగ్గురు ముష్కరులను కాల్చేశారు. అయితే ఈ ముష్కరుల నడుముకు పేలుడు పదార్థాలు ఉండటాన్ని గుర్తించిన పోలీసులు..అవి పేలకుండా నిర్వీర్యం చేశారు. ఈ ఘటనల్లో గాయపడిన మొత్తం 30 మంది బాధితులను లండన్‌లోని ఆరు వైద్యశాలలకు తరలించనట్లు అధికారులు చెబుతున్నారు. దాడి జరిగిన వెంటనే లండన్‌ వంతెన సమీపంలోని ఆసుపత్రులను భద్రతా కారణాల రీత్యా మూసివేశారు.
ఉగ్రదాడులను ఖండించిన ప్రధాని థెరిస్సామే 
లండన్‌ ఉగ్రదాడి ఘటనపై బ్రిటన్‌ ప్రధాని థెరిస్సామే వెంటనే అప్రమత్తయ్యారు. ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించిన థెరిస్సామే..పరిస్థితిని సమీక్షించారు. దాడుల ఘటనను ఉగ్రవాదం భయకర రూపంగా చూస్తామని ఆమె తెలిపారు. ఈ దాడులను ఖండిస్తున్నట్లు ప్రకటించారు. ఇక లండన్‌లో జరిగిన ఉగ్రదాడిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్రంగా ఖండించారు. విపత్కర సమయంలో బ్రిటన్‌ ఏం సాయం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. లండన్‌ ఉగ్రదాడులపై భారత ప్రధాని మోదీ ట్విటర్‌లో స్పందించారు. లండన్‌పై దాడులు దిగ్భ్రాంతికరం, దారుణమన్నారు. దాడులను భారత్‌ తీవ్రంగా ఖండిస్తుందని..బాధితుల కుటుంబాలకు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. 

 

20 ఓవర్లకు 110 పురుగులు

బర్మింగ్‌హామ్: చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఎడ్జ్‌బాస్టన్‌లో పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ జోరు పెంచింది. రోహిత్ శర్మ 71 బంతుల్లో అర్థ సెంచరీ నమోదు చేశాడు. 49 పరుగుల వద్ద ఉన్నప్పుడు సిక్స్ బాది హాఫ్ సెంచరీ చేయడం గమనార్హం. రోహిత్ చేసిన అర్ధ సెంచరీలో 6 ఫోర్లు, సిక్స్ ఉన్నాయి. మరోవైపు శిఖర్ ధవన్ కూడా 48 బంతుల్లో 5 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తిచేశాడు. ప్రస్తుతం 20 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 110 పరుగులు చేసింది.

17:21 - June 4, 2017

విశాఖ : జిల్లాలో జరుగుతున్న భూ భాగోతాల వెనక పెద్దల హస్తం ఉందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖలో జరుగుతున్న వైసీపీ ప్లీనరీకి ఆయన హాజరై, మాట్లాడారు. వచ్చే రెండేళ్లలో చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. 2019సం.లో అధికారంలోకి వచ్చిన తర్వాత భూకబ్జాలపై విచారణ జరిపిస్తామన్నారు.

 

17:17 - June 4, 2017

హైదరాబాద్ : నరేష్‌..స్వాతిల కుల దురహంకార హత్యను ఖండిస్తూ హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సామాజిక, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, గద్దర్‌, జస్టిస్‌ చంద్రకుమార్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నరేష్‌..స్వాతిల ఘటనపై ఇప్పటివరకు ముఖ్యమంత్రి ఎందుకు స్పందించలేదని తమ్మినేని ప్రశ్నించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని.. భవిష్యత్‌లో ఇలాంటి హత్యలు జరగకుండా చట్టం తీసుకురావాల్సిన అవసరముందని పలువురు డిమాండ్‌ చేశారు. ఇందుకోసం ఈనెల 7 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని.. 9వ తేదీ 'చలో భువనగిరి' నిర్వహించాలని నేతలు నిర్ణయించారు. 

 

'చంద్రబాబునాయుడు మాత్రం ఇంకా కళ్లు తెరవడం లేదు'

విజయవాడ : ఏపీకి ప్రత్యేక హోదాపై జాతీయ నాయకులు మద్దతు ఇస్తున్నా, చంద్రబాబునాయుడు మాత్రం ఇంకా కళ్లు తెరవడం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు విమర్శించారు. విభజన చట్టంలో హామీలను సాధించుకునే దమ్ము లేకనే, కాంగ్రెస్ పార్టీపై చంద్రబాబు నిందలు వేస్తున్నారని ఆరోపించారు. నాడు రెండు కళ్ల సిద్ధాంతం, నేడు కుమ్మక్కు రాజకీయాలతో ఆంధ్రా ప్రజలను చంద్రబాబు నిలువునా మోసం చేస్తున్నారని ఆరోపించారు.

16:49 - June 4, 2017

హైదరాబాద్ : కార్టూన్‌ షోలు పిల్లల పాలిట కిల్లర్‌ షోలుగా మారుతున్నాయి. కార్టూన్‌ ఛానళ్లలో వచ్చే షోలను చూసిన చిన్నారులు..వాటినే అనుకరిస్తూ తమ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. గతంలో శక్తిమాన్‌ సీరియస్‌ చూసి..కొంతమంది చిన్నారులు ప్రాణాలను పోగొట్టుకోగా..తాజాగా అలాంటి విషాద ఘటనే హైదరాబాద్‌లో జియాగూడలో చోటుచేసుకుంది. 
అనుకరణతో ప్రాణాలు కోల్పోతున్న చిన్నారులు 
కిల్లర్‌ షోలుగా మారుతున్న కార్టూన్‌ షోలు..అనుకరణతో ప్రాణాలు  కోల్పోతున్న చిన్నారులు.. అవును..! కార్టూన్‌ షోలలో వచ్చేవన్నీ నిజమని నమ్మే చిన్నారులు.. వాటినే అనుకరిస్తూ తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. గతంలో శక్తిమాన్‌ సీరియల్‌ చూసిన చిన్నారులు..శక్తిమాన్‌ చేసే సాహసాలను చూసి అచ్చం అలాంటి సాహసాలే చేయడానికి ప్రయత్నించే క్రమంలో ఓ ఇద్దరు చిన్నారులు తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. అలాంటి విషాద ఘటనే తాజాగా హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. 
కార్టూన్ చానల్‌ చూసి నిప్పంటించుకున్న బాలుడు 
బాలాపూర్‌ పీఎస్‌ పరిధిలోని వెంకటాపురంలో కార్టూన్ ఛానల్ చూసిన ఓ చిన్నారి..తనకు తాను నిప్పు పెట్టుకుని ప్రాణాలు కోల్పోయాడు. గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జియాగూడకు చెందిన 12ఏళ్ల జయదీప్..వెంకటాపురంలోని తన తాతయ్య దగ్గర ఉంటున్నాడు. శుక్రవారం టీవీలో కార్టూన్ ఛానల్ చూస్తూ..అందులోని బొమ్మలు ఒంటిపై పెట్రోల్‌ పోసుకోవడం గమనించాడు. అయినా అవి హ్యాపీగా నవ్వడం చూసి.. వెంటనే తనూ కూడా అలాగే చేయాలనుకున్నాడు. ఇంట్లోని కిరోసిన్ డబ్బా తీసుకుని డాబాపైకి వెళ్లాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటలంటుకుంటూ ఉంటే..అమ్మమ్మా..తాతయ్యా..అంటూ గట్టిగా అరిచాడు. దీంతో బాలుడి కేకలు విన్న అమ్మమ్మ, తాతా డాబాపైకి వెళ్లి చూసేసరికి జయదీప్‌ ఒంటికి మంటలంటుకొని కాలిపోతున్నాడు. వెంటనే బంధువుల సాయంతో మంటలు ఆర్పి..బాలుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే 90 శాతం శరీరం కాలిపోవటంతో చికిత్స పొందుతూ జయదీప్‌ మృతిచెందాడు. 
పెద్దల నిర్లక్ష్య ధోరణినీ 
జయదీప్‌ మృతి.. చిన్నారుల మానసిక స్థితితో పాటు.. పెద్దల నిర్లక్ష్య ధోరణినీ ఎత్తి చూపుతోంది. పిల్లలు ఏం చేస్తున్నారో ఇంట్లోని పెద్దలు ఓ కంట కనిపెడితే ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉండదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి కార్టూన్ షోలు చూడకుండా పిల్లలను నియంత్రించడమే ఉత్తమమని పిల్లల సైకాలజిస్టులు చెప్తున్నారు. 

 

16:45 - June 4, 2017

నెల్లూరు : వరుస విజయాలతో అంతరిక్ష ప్రయోగాల్లో అద్భుతాలు సాధిస్తున్న ఇస్రో  మరో భారీ ప్రయోగానికి సిద్ధమైంది.  నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి రేపు జీఎస్ ఎల్ వీ మార్క్‌ 3 డీ1 రాకెట్‌ను ప్రయోగించనుంది. ఈ రాకెట్‌ ద్వారా నాలుగు టన్నుల బరువు కలిగిన ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టే స్థాయికి  ఇస్రో ఎదుగుతుంది. జీఎస్ ఎల్ వీ మార్క్‌ 3 డీ1 రాకెట్ ప్రయోగంపై 10 టీవీ ప్రత్యేక కథనం...
రోదసీ ప్రయోగాల్లో తిరుగులేని విజయాలు 
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ.. ఇస్రో రాకెట్‌ ప్రయోగాల్లో వరుస విజయాలతో దూసుకుపోతోంది. అంతరిక్ష ప్రయోగాల్లో అద్భుతాలు సృష్టిస్తోంది. అటువంటి ఇస్రో ఇప్పుడు మరో సరికొత్త రాకెట్‌ ప్రయోగానికి సిద్ధమైంది. 
జీఎస్ ఎల్ వీ మార్క్‌ 3 డీ1 రాకెట్‌ ప్రయోగం 
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌ కేంద్రం నుంచి ఈనెల 5న జీఎస్ ఎల్ వీ మార్క్‌ 3 డీ1 రాకెట్‌ ప్రయోగాన్ని చేపట్టనున్నారు. అందివచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అడుగుడుగునా పదును పెడుతూ రోదసిలో తిరుగులేని విజయాలను సొంతం చేసుకుంటున్న ఇస్రో... జీఎస్ ఎల్ వీ మార్క్‌ 3 డీ1 రాకెట్‌ ప్రయోగంతో మరో సంచలనానికి తెరతీయబోతోంది. మూడు దశల్లో ద్రవ, ఘన ఇంధనంతో పని చేసే ఇంజిన్లతో తయారు చేసిన జీఎస్ ఎల్ వీ మార్క్‌ 3 డీ1 రాకెట్‌ అన్ని ప్రయోగ పరీక్షలను పూర్తి చేసుకుని, ఇప్పుడు ఉపగ్రహాలను మోసుకెళ్లేందుకు సిద్ధమైంది. 2014 జనవరి 18న ఎలాంటి ఉపగ్రహం లేకుండా ఈ రాకెట్‌ను ప్రయోగించి, ఫలితాలను విశ్లేషించిన ఇస్రో... ఇప్పుడు పూర్తిస్థాయిలో నింగిలోకి పంపేందుకు సిద్ధమైంది. 
అత్యంత ఆధునికమైన జీఎస్ ఎల్ వీ మార్క్‌ 3 డీ1  
జీఎస్ ఎల్ వీ మార్క్‌ 3 డీ1  అత్యంత ఆధునికమైనది. దీని ద్వారా 3,136 కిలోల బరువైన జీశాట్‌ 19 ఉపగ్రహాన్ని కక్షలోకి పంపనున్నారు. దేశ సమాచార రంగాన్ని కొత్త పుంతలు తొక్కిచేందుకు ఈ ఉపగ్రహాలు దోహదం చేస్తాయి. ఆండ్రాయిడ్‌ టెక్నాలజీ మొబైల్‌ సేవలు, డీటీహెచ్‌, ఇంటర్నెట్‌  సేవలు విస్తృతమవుతాయి.  కేఏ, కేయూ బ్యాండ్‌ టెక్నాలజీతో ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. భూమికి 36 వేల కిలో మీటర్ల ఎత్తులోని స్థిరకక్షలో దీనిని ప్రవేశపెడతారు. దీని ద్వారా 42 కొత్త ట్రాన్స్‌పాండర్లు అందుబాటులోకి వస్తాయి. ఈ ఉపగ్రహం 15 ఏళ్లపాటు సేవలు అందిస్తుంది.  దీంతోపాటు అంతరిక్షంలో రేడియో ధార్మికశక్తిని పరిశీలించేందుకు జియో స్టేషనరీ స్ప్రక్టా పరికరాన్ని కూడా రోదసిలోకి పంపుతారు. 
రాకెట్‌ ప్రయోగ పనులు పూర్తి
ఇప్పటికే జీఎస్ ఎల్ వీ మార్క్‌ 3 డీ1 రాకెట్‌ ప్రయోగ పనులు పూర్తయ్యాయి. నేడు తుది విడత ఎంఆర్‌ఆర్‌ సమావేశం జరుగుతుంది. ఈనెల 4న మధ్యాహ్నం 3 గంటల 58 నిమిషాలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభిస్తారు. 25 గంటల 30 నిమిషాల కౌంట్‌డౌన్‌ అనంతరం షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఈనెల 5న సాయంత్రం 5 గంటల 28 నిమిషాలకు నిర్వహించే ప్రయోగంలో నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్తుంది. మూడువేల కిలోలకు పైగా బరువున్న ఉపగ్రహ ప్రయోగాలను చేపట్టడం ఇస్రోకు ఇదే మొదటిసారి. ఇది విజయవంతమైతే ఐదువేల కిలో బరువున్న ఇన్‌శాట్‌ లాంటి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు ప్రణాళికలు రూపొందిస్తారు. ప్రస్తుతం మన సమాచార ఉపగ్రహాలను ఫ్రెంచిగయానలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగిస్తున్నారు. సమాచార ఉపగ్రహాలను సొంతంగా ప్రయోగించేస్థాయి ఇస్రో ఎదిగితే ఎంతో విలువైన విదేశీమారక ద్రవ్యం ఆదావడమేకాక, ఇతర దేశాల సమాచార ఉపగ్రహాలను కూడా ప్రయోగించే స్థాయికి ఎదిగితే వాణిజ్యపరంగా ఇస్రో మరింత వెసులుబాటు కలుగుతుంది. జీఎస్ ఎల్ వీ మార్క్‌ 3 డీ1 రాకెట్‌ ప్రయోగం విజయవంతం కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. 

 

16:37 - June 4, 2017

కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎవరికి వారే పార్టీలను బలోపేతం చేసుకునే పనిలో పడ్డారు. సర్వేలతో టీఆర్‌ఎస్, ఆకర్ష్‌తో బిజెపి, పునర్వైభవం కోసం టిడిపి పాకులాడుతున్నాయి. ఇక ఉద్యమాలతో వామపక్షపార్టీలు అధికార పార్టీని ముప్పు తిప్పలు పెడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో సత్తా చాటేందుకు జిల్లా వ్యాప్తంగా దూకుడు పెంచిన రాజకీయ పార్టీలపై టెన్ టీవీ ప్రత్యేక కథనం. 
కుస్తీపాట్లు 
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయాలు రంజుగా మారాయి. పట్టు సడలకుండా కొన్ని పార్టీలు..పట్టు సాధించే పనిలో కొన్ని పార్టీలో కుస్తీపాట్లు పడుతున్నాయి. టిఆర్‌ఎస్‌కు కంచుకోటగా ఉన్న జిల్లాలో గత ఎన్నికల్లో 13 శాసన సభ స్థానాల్లో 12 స్థానాలతో పాటుగా రెండు లోక్ సభ స్థానాలను గులాబి పార్టీ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఇదే జిల్లాలో పూర్వ వైభవం కోసం బిజెపి,టిడిపి,కాంగ్రెస్ పార్టీలు ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నాయి. జాతీయ పార్టీలైన బిజెపి,కాంగ్రెస్‌లు ఒకప్పుడు కరీంనగర్ జిల్లాలో సత్తా చాటిన పార్టీలే. అయితే మారుతున్న రాజకీయ సమీకరణలతో ప్రజలకు దూరం అయ్యాయి. ఇక తెలంగాణ ఉద్యమ  ప్రభావం టిడిపిపై తీవ్ర ప్రభావాన్ని చూపడంతో కరీంనగర్ జిల్లాలో పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది.  
పార్టీ కేడర్‌ను పెంచే పనిలో సీఎం కేసీఆర్
కరీంనగర్ జిల్లాలో టిఆర్‌ఎస్ బలంగా ఉన్నప్పటికీ మిగతా పార్టీలు బలం పెంచుకునే పనిలో ఉండటంతో సీఎం కేసీఆర్ ఇంకా పార్టీ కేడర్‌ను పెంచే పనిలో పడ్డారు. గతంలో ఓ వెలుగు వెలిగిన బిజెపి ప్రస్తుతం సరికొత్త వ్యూహాలు రచిస్తూ పుంజుకునే పనిలో ఉండంతో పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం కలుగుతోంది. మోడీ ఇమేజ్‌ జిల్లాలో ఎక్కువగా ఉండటంతో కేంద్ర ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బిజెపి శ్రేణులు తీవ్రంగా పనిచేస్తున్నాయి. జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సూచనలతో  కాంగ్రెస్,టిడిపిలలో ఉన్న బలహీన నేతల్ని పార్టీలోకి తీసుకువచ్చేందుకు రహస్య మంతనాలు పూర్తయ్యాయి. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులు బిజెపిలో చేరేందుకు మొగ్గుచూపుతున్నట్లు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. 
ఒకప్పుడు జిల్లాలో కాంగ్రెస్ హవా 
కాంగ్రెస్ పార్టీ ఒకప్పడు కరీంనగర్ జిల్లాలో తన హవా కొనసాగించింది. అలాంటి పార్టీకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తగిన ప్రాధాన్యత లభించకపోవడంతో  ప్రజా వ్యతిరేక ఉద్యమాలతో తిరిగి పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది. కమలనాథులు ఎంత ప్రయత్నించినా బలపడరని..టిడిపిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని భావిస్తున్న కాంగ్రెస్‌ నేతలు టిఆర్‌ఎస్‌కు ధీటైన ప్రత్యామ్నాయం తామేననే ధీమాలో ఉన్నారు. అందులో భాగంగా గ్రామస్థాయి మొదలు జిల్లా,రాష్ట్ర స్థాయి నేతలను కలుపుకుని పోయే ప్రయత్నాలు చేస్తూనే ఇతర పార్టీలు వేస్తున్న ఆకర్ష్ వలలో పడకుండా జాగ్రత్తలు పడుతున్నారు. రాహుల్‌ గాంధీ సభ విజయవంతం కావడంతో హస్తం పార్టీ నేతలు మరింత జోష్‌కు ముందుకు సాగుతున్నారు. 
పునర్వైభవం కోసం తపిస్తున్న టిడిపి
రెండు దశాబ్దాల పాటు చక్రం తిప్పిన తెలుగుదేశం పార్టీ తిరిగి పూర్వ వైభవం కోసం తపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ జగిత్యాల వాసి కావడంతో ఈసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పట్టు సాధించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల టిడిపి కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హుజురాబాద్‌లో నిర్వహించిన సభ సక్సెస్ కావడంతో ప్రస్తుతం పార్టీ శ్రేణుల్లో కాస్త ఉత్సాహం కనిపిస్తోంది. అయితే ఒకరిద్దరు నేతలు బిజెపివైపు మొగ్గు చూపుతున్నారన్న సమాచారంతో ఎవరిని విశ్వసించాలో తెలియని అయోమయంలో పడ్డారు టిడిపి సీనియర్‌ నేతలు. 
పోరాటాలతో ముందుకు సాగుతున్న వామపక్ష పార్టీలు
టిఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేస్తు ముందుకు సాగుతున్నాయి వామపక్షా  పార్టీలు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి జిల్లా వాసి కావడంతో తరుచు పర్యటనలు చేస్తూ ఆందోళనలు కొనసాగిస్తూ పట్టు సాధించే పనిలో పడ్డారు. ఈ ధపా జరగబోయే ఎన్నికల్లో హుస్నాబాద్ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనే పట్టుదలతో సిపిఐ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీర భద్రం చేపట్టిన పాదయాత్ర,ప్రాజెక్టు నిర్మాణాల విషయంలో నిర్వాసితుల పక్షాన చేసిన ఆందోళనలతో ప్రజల్లో ఆ పార్టీకి మంచి ఆదరణ లభించింది. 
పార్టీలు.. ఎత్తులు..పైఎత్తులు
మొత్తానికి జిల్లాలో అన్ని పార్టీలు ఎత్తులు..పైఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్నాయి. తీరా ఎన్నికల సమయానికి ఏ నేత ఏ పార్టీ కండువాతో ప్రజల్లోకి వస్తాడో మాత్రం సస్పెన్సే. ఇక పార్టీ సమీకరణలు ఏ విధంగా ఉంటాయో తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే. 

 

16:33 - June 4, 2017

హైదరాబాద్‌ : కేపీహెచ్‌బీ కాలనీలోని బ్లూమింగ్‌ డెల్స్‌ స్కూల్‌లో ఫ్రీ హెల్త్ చెక్‌అప్ క్యాంప్‌ను ఎమ్మెల్యే కృష్ణారావు ప్రారంభించారు. ఈ క్యాంప్‌లో వైద్య చికిత్స కోసం పలువురు స్థానికులు క్యూ కట్టారు. వీరందరికీ ఉచిత వైద్య పరీక్షలు, మందులతోపాటు వికలాంగులకు సైకిళ్లను అందజేశారు. కింగ్‌డమ్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ సెంటర్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ వీటిని అందించారు. తమ సంస్థ 1989నుంచి సేవాకార్యక్రమాలు చేస్తోందని... సొసైటీ అధ్యక్షులు ప్రవీణ్ తెలిపారు.

 

కాసేపట్లో గుంటూరులో ప్రత్యేక హోదా భరోసా సభ

గుంటూరు : కాసేపట్లో గుంటూరు లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా భరోసా సభ జరగనుంది. ఈ సభకు ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ, మాజీ యూపీ సీఎం అఖిలేష్ యాదవ్, శరద్ యాదవ్, సీపీఐ జాతీయ నేత సురవరం సుధాకర్ రెడ్డి పాల్గొననున్నారు.

జీఎస్ ఎల్వీ మార్క్ -3 డీ1 కౌంట్ డౌన్ ప్రారంభం

శ్రీహరికోట : జీఎస్ ఎల్వీ మార్క్ -3 డీ1 కౌంట్ డౌన్ ప్రారంభం అయ్యింది. ఈ రోజు మధ్యాహ్నం. 3.58 గంటలకి కౌంట్ డౌన్ శాస్త్రవేత్తలు ప్రారంభించారు. రేపు సాయం.5.28 గంటలకు రాకెట్ ప్రయోగం జరగనుంది. జీశాట్ 99 ఉపగ్రహాని నింగిలోకి ఈ రాకెట్ తీసుకెళ్లనుంది.

బిజెపి మత విద్వేషాలను రెచ్చగొడుతోంది: డి.రాజా

విజయవాడ: దేశంలోనే పెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ అని అందుకే కాంగ్రెస్ తో కలిసి పని చేస్తున్నాం అని సీపీఐ నేత డి. రాజా అన్నారు. బిజెపి మత విద్వేషాలను రెచ్చగొడుతోందని, దేశంలో ప్రజలకు భద్రత కరువైందని రాజా ఆవేదన వ్యక్తం చేశారు.

16:19 - June 4, 2017
16:13 - June 4, 2017

విశాఖ : జిల్లాలోని గోపాలపట్నం లక్ష్మీనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. 25ఏళ్ల వివాహిత పెద్దాడ కుమారీ దారుణ హత్యకు గురైంది. అయితే భర్త రవికుమారే తమ కూతురును హత్యచేశాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ కూతురును భర్త రవికుమార్‌ నిత్యం చిత్రహింసులకు గురిచేసేవాడని ఆరోపిస్తున్నారు. అయితే భర్త రవికుమార్‌ పరారీలో ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి రవికుమార్‌  కోసం గాలిస్తున్నారు. 

 

16:09 - June 4, 2017

తూర్పుగోదావరి : కాకినాడ రామారావుపేటలోని కుసుమ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పాలిటెక్నిక్‌ విద్యార్థి సాయి దుర్గారావు మృతిచెందారు. వైద్యులు సకాలంలో చికిత్స అందించనందువల్లే అతను చనిపోయాడంటూ సాయి బంధువులు ఆస్పత్రిముందు ఆందోళనకు దిగారు. శనివారం తీవ్రస్థాయిలో కడుపునొప్పిరావడంతో మృతుడు ఆస్పత్రికి వచ్చాడు. చికిత్స అందిస్తుండగానే మరణించాడు. 

 

కేసుల భయంతోనే బిజెపితో చంద్రబాబు దోస్తీ:సురవరం

విజయవాడ: గుంటూరు లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రత్యేక హోదా భరోసా సభ రాజకీయాలకు అతీతంగా జరుగుందని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా సభకు వెళ్లే వారిని ప్రగతి నిరోధకులని చంద్రబాబు అనడం సరికాదని సుందరం అన్నారు. ప్రత్యేక హోదా వస్తే ప్రగతి నిరోధకం ఎలా అవుతుందని ప్రశ్నించారు. కేసుల భయంతోనే బిజెపితో చంద్రబాబు దోస్తీ అని విమర్శించరు. సీఎం చంద్రబాబు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి హోదా కోసం కేంద్రంపై పోరాడాలని సూచించారు.

16:05 - June 4, 2017

అనంతపురం : రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చెప్పారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ, బీమా ఎకరానికి  పది వేల రూపాయల కంటే తక్కువ వస్తే రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఐదు వేల రూపాయలు ఇస్తుందన్నారు. మొత్తం 1680 కోట్ల రూపాయల ఇన్‌పుట్‌ సబ్సిడీకి జీవో విడుదల చేశామని చెప్పారు. వ్యవసాయ యాంత్రీకరణకు రూ.450 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు.

 

16:01 - June 4, 2017

గుంటూరు : ఆంధ్ర ప్రజలకు ఇచ్చిన మాటను బీజేపీ నిలబెట్టుకోవాల్సిన అవసరముందని టీడీపీ నేత మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ యువనేత రాహుల్‌ గాంధీ గుంటూరుకు రావొద్దంటూ టీడీపీ చేపట్టిన నిరసనల్లో మోదుగుల పాల్గొని, మాట్లాడారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వనందువల్లే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కాంగ్రెస్‌ భావిస్తోందని చెప్పారు. ఇప్పటికైనా బీజేపీ ఏపీకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

 

15:57 - June 4, 2017

గుంటూరు : హిందూ కాలేజీ సెంటర్‌లో రాహుల్‌ గో బ్యాక్‌ అంటూ టీడీపీ ఆందోళన చేపట్టారు. నేడు గుంటూరులో రాహుల్‌ ప్రత్యేక హోదా భరోసా సభ ఉండగా..టీడీపీ కార్యకర్తలు నల్లజెండాలతో నిరసన చేపట్టారు. 

 

కాంగ్రెస్ సభకు చలసాని శ్రీనివాస్ మద్దతు

విజయవాడ: గుంటూరు లో కాంగ్రెస్ తలపెట్టిన హోదా పోరు సభకు ప్రత్యేక హోదా సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్ మద్దతు తెలిపారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చడానికి సభలో తీర్మానం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.

ఇండో పాక్ మ్యాచ్ కు వర్షం ..అంతరాయం

బ‌ర్మింగ్‌హామ్‌: ఇండోపాక్ మ్యాచ్‌కు వ‌ర్షం పడటంతో అంతరాయం ఏర్పడింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భార‌త్‌.. 9.5 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్ట‌పోకుండా 46 ర‌న్స్ చేసిన స‌మ‌యంలో వ‌ర్షం మొద‌లైంది. దీంతో మ్యాచ్‌ను నిలిపేశారు. టీమిండియా ఓపెన‌ర్లు మెల్ల‌గా గేర్ మారుస్తున్న స‌మయంలో వ‌ర్షం అడ్డుప‌డ‌టం అభిమానుల‌కు నిరాశ కలిగించింది. మొద‌ట్లో ఆచితూచి ఆడినా.. ఇప్పుడిప్పుడే ఓపెన‌ర్లు ఎదురుదాడి మొద‌లుపెడుతున్నారు. వికెట్ కాపాడుకుంటూనే అప్పుడ‌ప్పుడూ బౌండ‌రీలు బాదుతున్నారు. రోహిత్ 25, ధావ‌న్ 20 రన్స్ చేశారు.

15:44 - June 4, 2017

కడప : జిల్లాలో మరో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ప్రొద్దుటూరులో పట్టపగలే వ్యక్తిని దారుణ హత్య చేశారు. రిలయన్స్ పెట్రోల్ బంక్ వద్ద శ్రీనివాసులురెడ్డిని అమర్ నాథ్ రెడ్డి పొడిచి చంపాడు. శ్రీనివాస్ రెడ్డిని కత్తితో వెంటాడి అమర్ నాథ్ రెడ్డి హతమార్చాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

పార్టీ ముఖ్య నేతలతో రాహుల్ భేటీ..

విజయవాడ : ఓ హోటల్ లో పార్టీ ముఖ్య నేతలతో కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ భేటీ అయినట్లు సమాచారం. గుంటూరులో ని ఆంధ్రా - ముస్లిం కళాశాలలో సభకు యూపీ సీఎం అఖిలేష్ యాదవ్, శరద్ యాదవ్, సీపీఐ నేతలు సురవరం, డీ.రాజా హాజరు కానున్నట్లు సమాచారం.

రాహుల్ కు ఘన స్వాగతం

గన్నవరం : గుంటూరులో హోదా భరోసా సదస్సు లో పాల్గొనేందుకు కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ గనవ్నరవం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. రాహుల్ కి ఆ పార్టీ నేతలు దిగ్విజయ్ సింగ్, రఘువీరా, కేవీపీ, పళ్లం రాజులు ఘన స్వాగతం పలికారు. రాహుల్ గాంధీని అడ్డుకునేందుకు టిడిపి నేతలు, కార్యకర్తలు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

15:35 - June 4, 2017

విజయవాడ : కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. గుంటూరులో జరిగే 'కాంగ్రెస్ పార్టీ హోదా పోరు' బహిరంగ సభకు హాజరయ్యేందుకు రాహుల్ గాంధీ వస్తున్నారు. మరి కాసేపట్లో సభా స్థలికి ఆయన బయలుదేరనున్నారు. బహిరంగ సభలో రాహుల్ ప్రసంగించనున్నారు. 

6 ఓవర్లు ముగిసే సరికి 21 పరుగులు...

బర్మింగ్‌హామ్: చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఓపెనర్లు రోహిత్‌శర్మ (13), శిఖర్ ధవన్‌ (6) లు ఆచితూచి ఆడుతున్నారు. చెత్తబంతులను బౌండరీలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. రోహిత్ 2 ఫోర్లు బాదాడు. ప్రస్తుతం 6 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది.

గన్నవరం ఎయిర్ పోర్టుకు రాహుల్

విజయవాడ: గుంటూరులో జరిగే కాంగ్రెస్ పార్టీ హోదా పోరు బహిరంగ సభకు హాజరయ్యేందకు గవన్నవరం ఎయిర్ట్ కు కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ చేరుకున్నారు. మరి కాసేపట్లో సభా స్థలికి బయలుదేరనున్నారు.

రైళ్లలో దోపీడీ ముఠా అరెస్ట్...

ఖమ్మం : రైళ్లలో దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్రకు చెందిన పార్థు ముఠాను అరెస్టు చేసినట్లు ఎర్రుపాలెం పోలీసులు తెలిపారు. ముఠాలోని నలుగురిని మీనవోలు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

రాహుల్ ఫ్లెక్సీలపై నల్లరంగు పోసిన టిడిపి నేతలు

విజయవాడ : గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్‌ ఫ్లెక్సీలపై నల్లరంగు పోశారు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు రాహుల్‌ పర్యటనకు వ్యతిరేకంగా నిరసనలకు దిగారు. రాహుల్ గాంధీ ఫ్లెక్సీలపై నల్లరంగు పోయగా పోలీసులు అడ్డుకున్నారు. అయితే... టీడీపీ కార్యకర్తలు పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగారు. గుంటూరులో జరిగే కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు ఆపార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహూల్ గాంధీ వస్తున్న విషయం తెలిసిందే..

‘జీతేగా ఇండియా’ అని నినాదాలు చేస్తున్న జవాన్లు...

హైదరాబాద్: చాంపియన్స్ ట్రోఫీలో అమీతుమీ తేల్చుకునేందుకు భారత్‌-పాక్‌ జ‌ట్లు సిద్ధమయ్యాయి. అయితే ట్రోఫీని భారత్‌ జట్టే గెలవాలంటూ జమ్మూ కశ్మీర్‌లోని బీఎస్‌ఎఫ్‌ జవాన్లు డ్యాన్సులు చేస్తున్నారు. ‘జీతేగా ఇండియా’(ఇండియానే గెలవాలి) అని నినాదాలు చేస్తూ జవాన్లు డ్యాన్స్‌ చేస్తున్న వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన వారంతా టీం ఇండియా మైదానంలో అడుగుపెట్టే ముందు ఈ వీడియో చూస్తే బాగుంటుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

టాస్ గెలిచి పీల్డింగ్ ఎంచుకున్న పాక్..

బ‌ర్మింగ్ హ‌మ్ : చాంపియన్స్ ట్రోఫీలో అమీతుమీ తేల్చుకునేందుకు రెండు జ‌ట్లు సిద్ధమయ్యాయి. టాస్ గెలిచిన పాక్ ఇండియా ని బ్యాటింగ్ కి ఆహ్వ‌నించింది. న‌లుగురు పేస్ బౌల‌ర్లు, ఒక స్పిన్న‌ర్ తో భార‌త్ బ‌రిలోకి దిగుతుండగా, పాక్ కూడా ధీటుగా బ‌దులు ఇవ్వాల‌ని చూస్తుంది.

13:50 - June 4, 2017

హైదరాబాద్ : క్రికెట్‌లో చిరకాల ప్రత్యర్ధులు భారత్‌,పాకిస్థాన్‌ మధ్య వైరం ఈ నాటిది కాదు. భారత్‌, పాకిస్థాన్‌ మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ను ఉన్న ప్రాముఖ్యత, ప్రాధాన్యత, ప్రత్యేకత అంతా ఇంతా కాదు...భారత్‌-పాకిస్థాన్ మధ్య పోటీని..ఇరు దేశాల అభిమానులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటారు.రెండు దేశాల అభిమానులు క్రికెటర్లను ఎంతలా ఆరాధిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫార్మాట్‌ ఏదైనా....భారత్‌, పాకిస్థాన్‌ మధ్య పోరు ఎప్పటికీ ప్రత్యేకమే. ట్రెడిషనల్‌ టెస్ట్‌ ఫార్మాట్‌ అయినా...ఇన్‌స్టంట్‌ వన్డే ఫార్మాట్‌ అయినా...ఫటా ఫట్‌ ట్వంటీ ట్వంటీ ఫార్మాట్‌ అయినా దాయాదుల మధ్య హోరాహోరీ పోరు ఖాయం.

చాంపియన్స్ ట్రోఫీలో ఒక్క సారే గెలిచిన భారత్
1952లో తొలి సారిగా టెస్ట్‌ మ్యాచ్‌లో పోటీపడిన భారత్‌-పాకిస్థాన్‌....1978లో తొలి సారిగా వన్డే మ్యాచ్‌లో తలపడ్డారు.2007లో ఇరు జట్లు మొదటి సారి ట్వంటీ ట్వంటీ వరల్డ్‌కప్‌లో పోటీపడ్డాయి. గత కొంతకాలంగా పాకిస్థాన్‌ జట్టు బలహీనంగా ఉన్నా....భారత్‌తో పోటీ అంటే అంచనాలకు మించి రాణిస్తుంది. వన్డే వరల్డ్‌కప్‌లో భారత్‌ను ఒక్కసారి కూడా ఓడించలేకపోయిన పాకిస్థాన్‌...చాంపియన్స్‌ ట్రోఫీలో మాత్రం భారత్‌కు రెండు సార్లు షాకిచ్చింది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆస్ట్రేలియా-ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరిగే ప్రతిష్టాత్మక యాషెస్‌సిరీస్‌ను మించిన ప్రాధాన్యత భారత్‌-పాకిస్థాన్‌ పోరుకు మాత్రమే సొంతం.

 

 

13:47 - June 4, 2017

విజయవాడ : విజయవాడలో నవ నిర్మాణ దీక్ష మూడోరోజుకు చేరింది.. ఈ కార్యక్రమంలోభాగంగా చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.. ఈ కాన్ఫరెన్స్‌లో మంత్రులు, జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.. 339 చర్చలు జరిగాయి.. 112మంది ఎమ్మేల్యేలు, ఎమ్మేల్సీలు, మంత్రులు, లక్షా 98వేలమంది ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.. ఇదే స్ఫూర్తిని రాబోయే నాలుగురోజులపాటు కొనసాగించాలని వారందరికీ చంద్రబాబు సూచించారు.. ఆదివారంఅయినా పట్టుదల సడలకూడదనే దీక్షలు కొనసాగిస్తున్నమాని స్పష్టం చేశారు.

13:24 - June 4, 2017

హైదరాబాద్ : ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడే పార్టీలకు మద్దతిస్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలిపారు. ట్విట్టర్ వేదికగా అన్ని పార్టీలు కలిసిరాలవాలని పవన్ కోరారు. ప్రత్యేక హోదా కోసం పోరుడుతున్న ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి పవన్ ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

13:18 - June 4, 2017

తెలంగాణాలో ఎందరో గేయరచయితలున్నారు. పాటను తూటాగా పేల్చిన కలం యోధులున్నారు. అలాంటి వారిలో రామమూర్తి ఒకరు. ఆయన ఎన్నో పాటలు రాశాడు. పాంచజన్యం పేరుతో ఒక పుస్తకంగా వెలువరించారు. తన పాటల ద్వారా ప్రజలను చైతన్య పరుస్తున్నబూరుగు రామమూర్తి జనం పాట ఈ వారం అక్షరంలో...రెండు తెలుగు రాష్ట్రాల్లో నిత్యం అనేక సాహితీ సమావేశాలు జరుగుతూ ఉంటాయి. సామాజిక మాధ్యమాల ద్వారా, వ్యక్తిగతంగా అందుతున్న సమాచారాన్ని అనుసరించి వీలైనంతవరకు కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. మీ మీ ప్రాంతాల్లో జరిగే సాహితీ సమావేశాల వివరాలు టెన్ టీవీకి తెలియజేయండి.. అక్షరం శీర్షికలో తప్పకుండా కవర్ చేస్తాం. ఈ వారం జరిగిన సాహిత్య సమావేశాల వివరాలు చూద్దాం.

13:16 - June 4, 2017

సాహిత్యం సమాజానికి దిశానిర్దేశం చేస్తుంది. ప్రజలను చైతన్య పరుస్తుంది. వారికి విజ్ఞాన వినోదాలను పంచి పెడుతుంది. కవులు రచయితలు సృజనకారులందరూ మంచి సమాజం కోసమే కలలు గంటారు. అందుకోసమే రచనలు చేస్తారు. అలాంటి వారిలో ప్రముఖ గేయరచయిత శ్రీకళ రామమూర్తి జనంపాటతో పాటు ఎనిమిది మంది యువకవుల కవితా సంకలనం స్వప్నసాధకుల సమీక్షణంతో ఈ వారం మీ ముందుకొచ్చింది.10 టి.వి.అక్షరం. 

12:51 - June 4, 2017

ఓ వ్యక్తి అన్నం తినుకుంటూ..అన్నాన్ని ముద్దాల కట్టి..నేలకొసి కొడుతాడు..అది అంతే వేగంతో పైకి ఎగురుతుంది. అన్నం ముద్దలా ఉంటుంది. కదా ఎలా ఎగురుతుంది ? అని అనేక ప్రశ్నలు ఉదయిస్తాయి కదా..కానీ ప్రస్తుతం సోషల్ మాధ్యమాల్లో ఇలాంటి వీడియోలు వైరల్ అవుతున్నాయి. అంతేగాకుండా పలు హోటల్స్ లో ఇలాంటి రైస్ పెడుతున్నారనే పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇటీవలే సరూర్ నగర్ లో ఓ ఫుడ్ హోటల్ లో బిర్యాని తీసుకెళ్లిన ఓ యువకుడికి ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. ముద్దలా కట్టి నేలకేసి కొడితే పైకి లేచ్చిందని..దీనిని ప్రశ్నిస్తే యాజమాన్యం తనపై దాడి చేశారని బాధితుడు చెప్పిన మాటలు..దాడి దృశ్యాలు ఇటీవలే మీడియాలో వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 'ప్లాస్టిక్ బియ్యం' సరఫరా అవుతున్నాయనే విషయం ప్రజల్లో తీవ్ర గందరగోళం నెలకొంటోంది. ఈ బియ్యం ఎక్కువగా చైనా దేశం నుండి వస్తున్నట్లు టాక్. అచ్చం బియ్యాన్ని పోలి ఉండే ప్లాస్టిక్ రైస్ ను కలిపి ఇండియన్ మార్కెట్లోకి వదులుతున్నారని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇలాంటి బియ్యం తినడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నట్లు తెలుస్తోంది.

12:48 - June 4, 2017

చిన్నారుల్లో సహజంగా సృజనాత్మకత ఉంటుంది. దాన్ని తరగతి గది మరింత వికసించేలా చేస్తుందా లేక ముడుకుచుపోయేలా చేస్తుందా అనేది అసలు ప్రశ్న. సమాజం సంక్లిష్టభరితంగా మారుతున్న తరుణంలో భవిష్యత్ యంత్రాలుగా మారే విద్యార్ధులపై అలవికాని బరువు పెరుగుతున్న సందర్భం ఇది. ఈ సమయంలో విద్యార్థుల్లోని సృజనాత్మకతను బతికించాలంటే అది ఉపాధ్యాయులకే సాధ్యం. కష్టసాధ్యమైనా ఆ బాటలో సాగుతా అంటున్నాడా ఉపాధ్యాయుడు. ఆ క్రమంలో మొదటి ఫలితాన్ని కూడా సాధించాడు. తన విద్యార్థులతో కవిత్వం రాయించి నిరూపించాడు. స్వప్న సాధకులుగా పాఠకుల ముందుకొచ్చిన ఆ ఎనిమిదిమంది విద్యార్ధుల విశేషాలు చూద్దాం.

12:40 - June 4, 2017

విశాఖ : జిల్లా కేంద్రంలోని మధురవాడ తారకరామారావు నగర్ లో విషాదం చోటు చేసుకుంది. అపార్ట్ మెంట్ లిప్ట్ లో చిక్కుకుని పదేళ్ల బాలిక స్వాతి మృతి చెందింది. స్వాతి అపార్ట్ మెంట్ వాచ్ మెన్ బంధువు కూతురు, వేసవి సెలవులు కావడంతో విశాఖ వచ్చారు. స్వాతి విజయనగరం జిల్లా చెందినవారు. ఈ ప్రమాదం పై పోలీసులు విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

అపార్ట్ మెంట్ లిఫ్ట్ లో చిక్కుకుని చిన్నారి మృతి

విశాఖ : మధుర వాడ తారకరామారావు నగర్ లో విషాధం నెలకొంది. అపార్ట్ మెంట్ లిఫ్ట్ లో వాచ్ మెన్ కుమార్తె చిక్కుకుని పదేళ్ల బాలిక స్వాతి మృతి చెందింది. చిన్నారి విజయనగరం జిల్లా పూసపాటి రేగ వాసి అని తెలుస్తోంది.

రాష్ట్రాన్ని పోస్టర్ రహితంగా చేయాలి: మంత్రి నారాయణ

అమరావతి: మున్సిపల్ కమిషనర్లు, శాఖాధిపతులతో మంత్రి నారాయణ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రాన్ని పోస్టర్ రహితంగా చేయాలని మంత్రి నారాయణ పిలుపునిచ్చారు. పోస్టర్ ఫ్రీ పై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని తెలిపారు. రేపు నెల్లూరులో పర్యావరణ ర్యాలీలో పాల్గొంటున్నట్లు నారాయణ తెలిపారు.

కాంగ్రెస్ సభకు జనసేన మద్దతు: పవన్ కల్యాన్

విజయవాడ: కాంగ్రెస్ ప్రత్యేక హోదా భరోసా సభకు జనసేన మద్దతు ఇస్తున్నట్లు పవన్ కల్యాన్ తెలిపారు. సభ పెట్టినందుకు పీసీసీ చీఫ్ రఘువీరాకు అభినందనలు తెలిపారు. ప్రత్యేక హోదా కోసం ఎవరు పోరాడినా నా మద్ధతు వుంటుందని పవన్ కల్యాన్ స్పష్టం చేశారు. సమయం లేకపోవడంతో సభకు రాలేకపోతున్నానని, హోదా కోసం అన్ని పార్టీలు కలిసి రావాలని సూచించారు. సభ విజయవంతం కవాలని కోరుకుంటున్నట్లు పవన్ ఆకాంక్షించారు.

నవనిర్మాణ దీక్షపై సీఎం టెలీకాన్ఫరెన్స్

అమరావతి: 3వ రోజు నవనిర్మాణ దీక్షపై సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో పర్యటించే హక్కు రాహుల్ కు లేదు : కేఈ

అమరావతి: రాష్ట్రంలో పర్యటించే హక్కు రాహుల్ గాంధీకి లేదని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణ మూర్తి అన్నారు. ఏపీ ప్రజలను కట్టుబట్టలతో బయటకు పంపించి ఈ రోజు ఎలా ఉన్నారో చూడటానికి రాహుల్ వచ్చారా అని ప్రశ్నించారు. రాహుల్ పర్యటన రాజకీయ ప్రయోజనం కోసమే అని మండిపడ్డారు.

రాష్ట్రంలో పర్యటించే హక్కు రాహుల్ కు లేదు : కేఈ

అమరావతి: రాష్ట్రంలో పర్యటించే హక్కు రాహుల్ గాంధీకి లేదని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణ మూర్తి అన్నారు. ఏపీ ప్రజలను కట్టుబట్టలతో బయటకు పంపించి ఈ రోజు ఎలా ఉన్నారో చూడటానికి రాహుల్ వచ్చారా అని ప్రశ్నించారు. రాహుల్ పర్యటన రాజకీయ ప్రయోజనం కోసమే అని మండిపడ్డారు.

12:19 - June 4, 2017
12:13 - June 4, 2017

హైదరాబాద్ : జనసేన పార్టీ జనసైనికుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేశారు. మరో మూడు జిల్లాల్లో జనసైనికుల కోసం జనసేన శిబిరాలు ఏర్పాటు చేస్తారు. నెల్లూరు, ప్రకాశం తూర్పుగోదావరి జిల్లాలోమ జనసేన ఎంపికలు జరగనున్నాయి. నెల్లూరులో ఈ నెల జిల్లాలో 6,7 ప్రకాశం జిల్లాలో 7,8 తూర్పు గోదావరి జిల్లాలో 10,11తేదీల్లో జనసేన ఎంపికలు జరుగుతాయి. ఈ మూడు జిల్లాల నుంచి 7వేలకుపైగా దరఖాస్తులు అందాయని జనసేన తెలిపింది. క్రియాశీలక రాజకీయాల్లో యువతకు ప్రాధాన్యం ఇవ్వలని జనసేన భావిస్తుంది. జననసైనికుల ఎంపికలో భాగంగా మొదటగా అనంపురం తర్వాత ఉత్తరాంధ్ర, గ్రేటర్ హైదరాబాద్ లో ఎంపిలు పూర్తి చేశారు.

 

క్రియాశీల రాజకీయాల్లో యువతకు ప్రాధాన్యం:పవన్ కల్యాన్

హైదరాబాద్: క్రియాశీల రాజకీయాల్లో యువతకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాన్ తెలిపారు. మరో మూడు జిల్లాలో జన సైనికుల కోసం జనసేన శిబిరాలు ప్రారంభించింది. నెల్లూరు జిల్లాలో 6,7 తేదీలు, ప్రకాశం జిల్లాలో 7,8 తేదీలు,తూగో జిల్లాలో 10,11 తేదీల్లో జన సైనికుల ఎంపిక ప్రక్రియ జరగనుంది. మూడు జిల్లాల నుంచి 7వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు పవన్ కల్యా న్ తెలిపారు. 

గోవధ నిషేధం పై కొన్ని రాష్ట్రాల్లో చట్టం ఉంది: వెంకయ్యనాయుడు

హైదరాబాద్: శాఖాహారం దేశంగా భారత్ ను మార్చేందుకు యత్నిస్తున్నామని మాపై ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఆరోపించారు. గోవులను రక్షించేందకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, గోవధ నిషేధం పై కొన్ని రాష్ట్రాల్లో చట్టం ఉందన్నారు.

11:54 - June 4, 2017

విశాఖ : విశాఖ సాగరతీరంలో ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ అందరినీ ఆకట్టుకుంది.. సీనియర్‌ ఫొటోగ్రాఫర్‌ భాస్కర్‌ తీసిన ఫొటోలను విశాఖ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు.. ఈ ఎగ్జిబిషన్‌ ఆంధ్ర యూనివర్శిటీ వీసీ నాగేశ్వరరావు ప్రారంభించారు.. నడిసముద్రంలో ఉదయిస్తున్న సూర్యుడు, గిరిజన జీవన శైలి, ధింసా నృత్యాలకు సంబంధించిన ఫొటోలు ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

11:53 - June 4, 2017

కడప : ఎర్రచందన స్మగ్లర్లపై కడప జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. జిల్లాలో మూడు వేరు వేరు ప్రాంతాలలో ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ పోలీసులు నిర్వహించిన దాడులలో 21 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 21 ఎర్రచందనం దుంగలతో పాటు 14 సెల్ ఫోన్లు, 12 కిట్ బ్యాగ్‌లు, నాలుగు గొడ్డళ్లు, ఒక రంపాన్ని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో స్మగ్లర్ల అరెస్టుకు సంబంధించిన వివరాలను ఓఎస్డీ ఆఫరేషన్స్ సత్యయేసు బాబు మీడియాకు వివరించారు. అరెస్ట్ అయిన వారిలో అంతరాష్ట్ర స్మగర్ల ప్రధాన అనుచరుడు కర్నాటక రాష్ట్రం బళ్లారికి చెందిన అబ్దుల్ నయిమ్ తో పాటు తమిళనాడు రాష్ట్రం ధర్మపురి జిల్లాకు చెందిన 20మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేశామన్నారు. వీరందరిని పోరుమామిళ్ల అటవీ ప్రాంతంలోని మూడు వేరు వేరు ప్రాంతాలలో నిఘా ఉంచి అదుపులోకి తీసుకున్నామని ఓఎస్డీ తెలిపారు. 

11:42 - June 4, 2017

వ్యక్తి ఆహారపు విషయాల్లో కేంద్రం జోక్యం చేసుకోదు: వెంకయ్యనాయుడు

హైదరాబాద్: వ్యక్తి ఆహారపు విషయాల్లో కేంద్రం జోక్యం చేసుకోదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సెలవిచ్చాడు. పశువధ నిషేధాన్ని విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ఆరోపించారు. సుప్రీం ఆదేశాలను మేం అమలు చేస్తున్నాని తెలిపారు.

11:39 - June 4, 2017

జూనియర్ ఎన్టీఆర్..’జనతా గ్యారేజ్' ఘన విజయం అనంతరం జోరు మీదున్నాడు. బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'జై లవకుశ' చిత్రంలో నటిస్తున్నాడు. సోదరుడు కళ్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన లుక్స్ విడుదలై అలరించాయి. సినిమాలో ఎన్టీఆర్ మూడు పాత్రలు పోషించనున్నట్లు, అందులో ఒకటి విలన్ పాత్ర అయి ఉంటుందని ప్రచారం జరిగింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే ఈ చిత్ర టీజర్ ఇప్పుడు విడుదలవుతుందా ? అని అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్ర టీజర్ ని రంజాన్ పర్వదినాన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతేడాది కూడా రంజాన్ రోజున 'జనతా గ్యారేజ్' చిత్ర లుక్స్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనితో రంజాన్ పండుగ రోజున తప్పకుండా చిత్ర టీజర్ వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. దీనిపై చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటన వెలువరించాల్సి ఉంది.

11:38 - June 4, 2017

చిత్తూరు : తిరుమల తిరుపతి దేవస్థానం కొత్తపాలక మండలి ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. దీనిపై ఈనెల 9న సీఎం చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. దీంతో తమ అదృష్టాన్ని పరీక్షించుకోడానికి ఢిల్లీలెవల్లో ఆశావహులు ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు సమాచారం. టీటీడీ ప్రస్తుత చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి , ఇతర పాలకమండలి సభ్యుల పదవీకాలం గత ఏప్రిల్‌ నెలలోనే ముగిసింది. ఈనేపథ్యంలో వారు మరోసారి అవకాశం కోసం ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నట్టు తెలుస్తోంది. అటు అధికారపార్టీ ఎంపీలు మురళీమోహన్, రాయపాటి సాంబశివరావు కూడా టిటిడి చైర్మన్ పదవి తమకు ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి అభ్యర్థించారు. పాలకమండలిలో సభ్యులుగా తమకు అవకాశం కల్పించాలంటూ పలువురు ఎమ్మెల్యేలు, టిడిపి నేతలు కూడా సీఎం దగ్గరకు భారీగానే క్యూ కట్టారు.

కొత్తవారికే అవకాశం...
అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఒకరిద్దరు పాతవాళ్లు మినహా.. అందరూ కొత్తవారినే నియమించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీనిపై కసరత్తు ప్రారంభించిన సీఎం .. ఇప్పటికే కొందరు పేర్లను ఖరారు చేసినట్టు సమాచారం. ఈనెల 9న కొత్త పాలకమండలి లిస్టుకు ఆమోద ముద్ర పడనున్నట్టు రాజధాని అమరావతిలో చర్చలు నడుస్తున్నాయి. అటు తెలంగాణ నుంచి ప్రస్తుతం ముగ్గురికి స్థానం ఉండగా ఈసారి నలుగురికి చోటు కల్పించే అవకాశం ఉందని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణ టీడీపీ నేతలకు చోటు లభించక పోవడంతో.. ఆలోటును టీటీడీ పాలమండలి సభ్యత్వంతో తీర్చాలని చంద్రబాబు నిర్ణయంచినట్టు తెలుస్తోంది.

భక్తుల ఇబ్బందులు...
దాదాపుగా నెలరోజులు గడిచినా కొత్త పాలమండలి ఏర్పాటు చేయకపోవడంతో.. భక్తులు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోంది. తిరుమలలో పాలన మొత్తం అధికారుల చేతుల్లోనే ఉండటంతో స్వామివారి దర్శనంకోసం సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమకు వెంకన్న దర్శనం కష్టంగా మారిందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై దృష్టిపెట్టి.. త్వరగా పాలకమండలి ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. 

11:37 - June 4, 2017

అనంతపురం : జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ వద్ద మంత్రి సోమిరెడ్డిని వామపక్ష, రైతు సంఘం నేతలు కలిశారు. రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడి,పంట ఇన్సూరెన్స్‌లను వేర్వేరుగా ఇవ్వాలని మంత్రి సోమిరెడ్డికి విజ్ఞానపత్రాన్ని అందచేశారు. ఇక ఉపాధిహామీ పెండింగ్‌ బిల్లులను వెంటనే చెల్లించాలని రైతు సంఘం నేతలు డిమాండ్ చేశారు. అయితే వీరి సమస్యలపై సీఎం చంద్రబాబుతో చర్చించి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. 

11:34 - June 4, 2017

గుంటూరు : ఇవాళ గుంటూరులో కాంగ్రెస్‌ 'ప్రత్యేక హోదా భరోసా' పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఇప్పటికే నేతలంతా ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ సభలో పాల్గొనేందుకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ వస్తున్నారు. అలాగే సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌, జేడీయూ నేత శరద్‌యాదవ్‌, సీపీఐ జాతీయ నేతలు సురవరం సుధాకర్‌రెడ్డి, డి. రాజా తదితరులు కూడా సభకు రానున్నారు. దీంతో సభ నిర్వహణను రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జాతీయ నేతలు వస్తుండడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

 

 

11:33 - June 4, 2017

హైదరాబాద్ : మియాపూర్ భూ కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని టీడీపీ నేత రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. భూ కుంభకోణంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నారని ఆయన విమర్శించారు. తోడేళ్లను వదిలేసి మేకలను బలి ఇస్తున్నారని అన్నారు. ఉప ముఖ్యమంత్రిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని రేవంత్ ప్రశ్నించారు. కేసీఆర్ సమీక్షల పేరు మీద కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. గతంలో బోధన్ కుంభకోణం లాగా ఈ కేసును కూడా తొక్కెస్తున్నారని అన్నారు. ఈ భూకుంభకోణంలో ముఖ్యమంత్రి తనకు గిట్టనివారిపై చర్యలు తీసుకునేందుకు ఉపయోగించుకుంటున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. 

11:27 - June 4, 2017

నందమూరి బాలకృష్ణ 'గౌతమిపుత్ర శాతకర్ణి' ఘన విజయం అనంతరం నెక్ట్స్ సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన 101వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య సరసన మరోసారి 'శ్రియ' ఆడి పాడనుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ లుక్ సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఉండదనుందని తెలుస్తోంది. ఇటీవలే పోర్చుగల్ లో చిత్ర షూటింగ్ జరిగింది. ఇక 'బాలయ్య' ఈ సినిమాలో రెండు పాత్రల్లో కనిపించనున్నాడని టాక్. మాఫియా డాన్ గా పవర్ పుల్ రోల్ పాత్ర ఒకటి..ట్యాక్సీ డ్రైవర్ గా మరో పాత్రలో కనిపించనున్నాడని ప్రచారం జరుగుతోంది. తాజాగా రిలీజైన ఫొటో చూస్తే ఇది నిజమనిపిస్తోంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.

ఒంటరి మహిళలకు పెన్షన్ పథకం ప్రారంభం...

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మతకంగా చేపట్టిన ఒంటరి మహిళల పెన్షన్ పథకం ఈ రోజు ప్రారంభం అయ్యింది. సమాజంలో ఎలాంటి ఆదరణ లేకుండా జీవిస్తున్న ఒంటరి మహిళలకు అండగా నిలబడటంతోపాటు వారి సంక్షేమానికి పెద్దపీట వేయాలని భావించిన టీ.సర్కార్ ఈ పథకాన్ని చేపట్టింది. ఈ పథకం కింద ఒంటరి మహిళలకు నెలకు రూ. 1000 చొప్పున ఆర్థిక భృతిని టీ. సర్కార్ అందజేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు పెన్షన్ పథకాన్ని ప్రారంభించి ఒంటరి మహిళలకు ఆసరా అందజేశారు.

11:21 - June 4, 2017

టాలీవుడ్ రెబల్ స్టార్ 'ప్రభాస్' 'బాహుబలి'..'బాహుబలి-2’ చిత్రాల కోసం ఏకంగా ఐదు సంవత్సరాల పాటు కష్టపడ్డాడు. అనంతరం తన తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టాడు. తొలుత సుజీత్ దర్శకత్వంలో 'సాహో' సినిమాలో నటించేందుకు అంగీకరించాడు. ఈ సినిమా టీజర్ మొదట్లోనే విడుదలై ప్రేక్షకుల అంచనాలు రెట్టింపు చేసింది. ‘బాహుబలి2’ విడుదలైన అనంతరం 'ప్రభాస్' విదేశీ పర్యటనకు వెళ్లారు. ఇటీవలే భారత్ కు వచ్చిన 'ప్రభాస్' కేశాలంకరణ నిపుణుడు 'ఆలీమ్ హకీమ్' ను 'ప్రభాస్' కలిశాడు. దీనికి సంబంధించిన ఫొటోను ఆలీమ్ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. ఈ ఫొటోలో 'ప్రభాస్' బరువు తగ్గినట్లు..స్లిమ్ గా కనిపించాడు. ‘సాహో' చిత్రం కోసం ఇలా సిద్ధమౌతున్నాడని తెలుస్తోంది. 'సాహో' చిత్రానికి సంబంధించిన హీరోయిన్స్..విలన్ ల ఎంపిక చేయాల్సి ఉంది. యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో తెలుగు..తమిళ..హిందీ భాషల్లో ఈ చిత్రా నిర్మిస్తోంది.

'ఎవరెస్టును అధిరోహించిన విద్యార్థు లకు సన్మానం'

రంగారెడ్డి : శంషాబాద్ మండలం ముచ్చింతల స్వర్ణభారత్ ట్రస్ట్ లో ఎవరెస్టును అధిరోహించిన విద్యార్థు లకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సన్మానించారు.

11:08 - June 4, 2017

ఏంటీ తారక్ కరెక్టు మొగుడ 'అభయ్' అని మంచు మనోజ్ అనడం ఏంటీ ? అసలు అభయ్ అనే వ్యక్తి ఎవరు ? అని అనుకుంటున్నారా ? టాలీవుడ్ నటులు పలువురు స్నేహంగా మెలగడం చూస్తూనే ఉంటాం. అందులో 'మంచు మనోజ్'..’జూనియర్ ఎన్టీఆర్' ఒకరు. తాజాగా 'మంచు మనోజ్' ఓ ఫొటోను ట్విట్టర్ లో పోస్టు చేశారు. 'చల్లటి నీళ్లతో నాకు స్వాగతం. తారక్‌కి కరెక్ట్‌ మొగుడు నా బుజ్జి అభయ్‌ కుట్టి’ 'అభ‌య్' ఎనర్జీ 'ఎన్టీఆర్' ఎనర్జీ క‌న్నా వందరెట్లు అధిక‌ం' అంటూ ట్వీట్ చేశాడు. అభయ్ కుట్టి..జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు. ఓ గాజు గ్లాసులో నీరు తీసుకొచ్చి మంచు మనోజ్ కు తాగించాడు. ఆ సమయంలో తీసిన ఫొటోనే అది. ఈ ఫొటో అటు మంచు అభిమానులను..ఇటు నందమూరి అభిమానులను అలరిస్తోంది.

రాహుల్ పర్యటనకు వ్యతిరేకంగా టిడిపి నిరసన

గుంటూరు : రాహుల్ పర్యటనకు వ్యతిరేకంగా పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద నల్ల జెండాలతో టీడీపీ నిరసన చేపట్టింది. రాహుల్ గో బ్యాక్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. నిరసన కార్యక్రమంలో జిల్లా టిడిపి నేతలు చందు సాంబశివరావు, మన్నవ, లాల్ వజీర్, హర్ష , వెంకట్, ముత్తినేని, గోళ్ళ ప్రభాకర్ పాల్గొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన పోరును జాతీయ స్థాయిలో నిర్వహించేందుకు కాంగ్రెస్‌ పార్టీ సన్నద్ధమయ్యింది. ఇవాళ సాయంత్రం 5.30గంటలకు ఆంధ్రా ముస్లిం కళాశాల ఆవరణలో బహిరంగ సభ జరగనుంది.

'ప్రజలు సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలి'

హైదరాబాద్: ప్రజలు సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. వైద్య, విద్యా రంగాలకు ప్రధాని ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. సేవాభావంతో ఆస్పత్రులు, కాలేజీలు పని చేయాలన్నారు. పేదల కోసం కేంద్రం సంక్షేమ పథకాలు పెట్టిందన్నారు.

10:44 - June 4, 2017

చెన్నై : టి. నగర్ ఉస్మాన్ రోడ్డులో ఉన్న చెన్నై సిల్క్ భవనంలో ఇటీవలే అగ్నిప్రమాదం జరిగి కాలి బూడిదైన సంగతి తెలిసిందే. ఈ భవనాన్ని కూల్చివేయాలని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కూల్చివేతల కోసం ఓ ప్రత్యేక బృందాన్ని నియమించింది. కూల్చివేతలకయ్యే ఖర్చును తొలుత ప్రభుత్వం భరించి తరువాత యాజమాన్యం నుండి వసూలు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి జయకుమార్ వెల్లడించారు. అగ్నిప్రమాదం వల్ల రూ. 300 కోట్ల నష్టం వాటిల్లిందని పోలీసులు వెల్లడించారు.

లండన్ ఉగ్రదాడిలో 6కి చేరిన మృతుల సంఖ్య

హైదరాబాద్: లండన్ బ్రిడ్జిపై జరిగిన ఉగ్రదాడిలో మృతుల సంఖ్య 6కు చేరింది. 30 మందికి పైగా తీవ్ర గాయాలయాయ్యయి. ఈ క్రమంలో ముగ్గురు టెర్రరిస్టులను పోలీసులు కాల్చి చంపారు. అత్యంత వేగంతో వ్యాన్ నడుపుతూ పాదచారులను ఢీకొంటూ ఉగ్రవాదులు నరమేథం సృష్టించారు. ఆ తర్వాత మార్కెట్ ఉన్న ఓ ప్రదేశంలో వ్యాన్ ను ఆపి, కిందకు దిగి, పక్కనే ఉన్న బార్లు, రెస్టారెంట్లపై దాడులు జరిపారు. 

ఉరుములతో కూడినభారీ వర్షసూచన

హైదరాబాద్: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందనివాతావరణశాఖ తెలిపింది. రానున్న 24గంటల్లో రెండు రాష్ర్టాల్లో అక్కడక్కడా ఉరుములు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

10:33 - June 4, 2017

నిర్మల్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ నీటి కుంటలో ఇద్దరు యువతుల మృతదేహ లభ్యమయ్యాయి. ఖానపూర్ మండలంలోని మస్కాపూర్ గ్రామంలో ఓ నీటి కుంటలో యువతుల మృతదేహాలు ఉండడాన్ని స్థానికులు గమనించారు. వీరు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు యువతుల మృతదేహాలను బయటకు తీశారు. ఖానాపూర్ కు చెందిన కొందవేని హరిత (22), తోంటుకురి హరీష (22) లుగా గుర్తించారు. వీరు ప్రైవేటు స్కూల్లో టీచర్లుగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంటినుండి బయటకు వెళ్లిన వీరు విగతజీవులుగా ఎలా మారారనేది తెలియరావడం లేదు.

17,18 తేదీల్లో నగరానికిరాష్ట్రపతి రాక

హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఈనెల 17, 18 తేదీల్లో రాష్ట్ర పర్యటనకు రానున్నారు. మరో నెలన్నరలో పదవీకాలం పూర్తి చేసుకోబోతున్న ఆయన రెండ్రోజులపాటు బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌లో బస చేయనున్నారు. ఈ పర్యటన సందర్భంగా ప్రణబ్‌ ‘ఎట్‌ హోం’ ఆతిథ్యమివ్వనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్‌, చంద్రబాబు.. తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులు, ఇరు రాష్ట్రాల మంత్రులు, అధికారులు, ప్రముఖుల్ని ఆహ్వానించనున్నారు.

10:27 - June 4, 2017

కరీంనగర్ : కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్లి వస్తున్న ఆటో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఓ బాలిక మృతి చెందగా పది మందికి గాయాలయ్యాయి. మంచిర్యాల ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం కొండగట్టుకు ఆటో ట్రాలీలో బయలుదేరింది. ధరూర్ బ్రిడ్జీ వద్దకు రాగానే ఒక్కసారిగా ఆటో బోల్తా పడింది. శ్రావణి అనే బాలిక మృతి చెందగా మరో 10 మందికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాజు పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. గతంలో కూడా ఈ బ్రిడ్జీపై ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నా ప్రమాద నివారణకు చర్యలు తీసుకోలేదనే విమర్శలున్నాయి.

10:22 - June 4, 2017

బర్మింగ్ హోమ్ : కొద్ది గంటల్లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఇండియా పాకిస్థాన్ మధ్య పోరుకు తెరలేవనుంది. క్రికేట్ అభిమానులే కాదు యావత్తు ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే ఇప్పుడు ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న దానిపై సందేహాలు తలెత్తున్నాయి. బ్రిటన్ లో చోటు చేసుకుంటున్న ఉగ్రదాడులు. బ్రిటన్ మాంచెస్టర్ కొద్దిరోజుల్లో క్రితం ఓ సంగీత కార్యక్రమంలో నిర్వహించిన ప్రాంగణంలో జరిగిన ఉగ్రదాడిలో 20 మంది మృతి చెందారు. ఈ ఘటన మరవకముందే స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి 10 గంటలకు లండన్ లోని ఓ వంతెనపై ఉగ్రవాదులు పాదచారులను వ్యాన్ తో ఢీకొట్టారు. అదే సమయంలో బోరోహ్ మార్కెట్ లో కొందరు ఉగ్రవాదులు ప్రజలపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. తాజా ఉగ్ర ఘటనతో భారత్ పాక్ మ్యాచ్ జరుగుతుందో లేదో అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఐసీసీ ప్రకటన...
ఈ నేపథ్యంలో ఐసీసీ భారత్ పాకిస్థాన్ మ్యాచ్ గురించి ఓ ప్రకటన విడుదల చేసింది. మ్యాచ్ నిర్వహిస్తామని ప్రకటించింది.అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, భారీ బందోబస్తు మధ్య మ్యాచ్ నిర్వహిస్తామని ఐసీసీ ప్రకటించింది.

10:16 - June 4, 2017

2019లో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్లు టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఆయనతో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పాలన..రానున్న రోజుల్లో కాంగ్రెస్ అనుసరించే వ్యూహంపై మాట్లాడారు. రెండు లక్షల రూపాయలను ఏకకాలంలో రుణమాఫీ చేయడం జరుగుతుందని, గిట్టుబాటు ధరతో ప్రతి గింజ కొనుగోలు చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం కావడానికి సోనియా..కాంగ్రెస్సే కారణమని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ చేసిందేమి లేదని, ఆరు సూత్రాలు..లేదు..మన్ను లేదని ఎద్దేవా చేశారు. రుణమాఫీ..గతంలో కాంగ్రెస్ ఏకకాలంలో రుణమాఫీ చేయడం జరిగిందని, బ్యాంకు వడ్డీ భరిస్తామని స్వయంగా కేసీఆర్ చెప్పి నిలబెట్టుకోలేదన్నారు. ఒక్క విద్యుత్ యూనిట్ ఉత్పత్తి కాలేదని, గతంలో కాంగ్రెస్ చేపట్టిన ప్రాజెక్టులు ఇప్పుడు ప్రారంభించారన్నారు. ఇంకా ఎలాంటి ఆసక్తికరమైన అంశాలు మాట్లాడారో వీడియోలో చూడండి.

10:13 - June 4, 2017

గుంటూరు : 'రాహుల్ జీ..ఏ ముహం పెట్టుకుని వస్తున్నారు'..అంటూ టిడిపి ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఏపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్యహించతలపెట్టిన బహిరంగ సభపై టిడిపి నేతలు పలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆదివారం ఉదయం హిందూ కాలేజీ సెంటర్ వద్ద పెద్ద ఎత్తున టిడిపి శ్రేణులు చేరుకుని నిరసన ప్రదర్శనలు చేపట్టారు. పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. కార్యకర్తలు..నేతలు..నల్లబ్యాడ్జీలు..నల్లజెండాలు ప్రదర్శిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా టెన్ టివితో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన జరగడానికి నాంది..పునాది కాంగ్రెస్ అని, అనాలోచితంగా..దుస్సాహాసంగా రాష్ట్రాన్ని విభజించిందన్నారు. రాహుల్ ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని..సభకు రావాలని కాంగ్రెస్ నేతలు ఎలా పిలుపునిస్తారని ప్రశ్నించారు. సభకు వెళ్లే వారు రాష్ట్ర ద్రోహులు అవుతారని పేర్కొన్నారు. కాంగ్రెస్ కు బీజేపీ అవకాశం ఇవ్వవద్దని..ఆ పార్టీ బలపడితే బీజేపీయే కారణమని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

10:13 - June 4, 2017

తెలంగాణ రాష్ట్రంలో మూడేళ్ల ప్రభుత్వ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ పేర్కొన్నారు. టెన్ టివితో ఆయనతో ముచ్చటించింది. ఇటీవలే సంగారెడ్డిలో నిర్వహించిన రాహుల్ సభకు లక్షలాదిగా ప్రజలు తరలివచ్చారని తెలిపారు. ప్రధాన మంత్రిగా కాదల్చుకొనే అవకాశం సోనియా గాంధీకి వచ్చిందని, రాహుల్..సోనియా గురించి మాట్లాడే హక్కు మంత్రి కేటీఆర్ కు లేదని చెప్పారు. నలుగురు రాష్ట్రాన్ని కబ్జా చేసుకుని..లూఠీ చేసుకుని ఎంజాయ్ చేసుకుంటున్నారని తీవ్రస్థాయిలో ధ్వజ మెత్తారు. ఇంకా ఏమన్నారో వీడియోలో చూడండి.

లండన్ బోరోహ్ మార్కెట్ లో కత్తితో ఉగ్రవాదుల దాడి

బ్రిటన్ : లండన్ లోని మోరోహ్ మార్కెట్ లో ఉగ్రవాదులు కత్తితో దాడికి దిగారు. ఈ దాడిలో ఆరుగురు మృతి చెందారు. 20 మందికి పైగా గాయాలయ్యాయి. 

తిరుమల లడ్డూ కౌంటర్ సిబ్బంది చేతివాటం

చిత్తూరు : తిరుమలలో లడ్డూ కౌంటర్ సిబ్బంది చేతి వాటం చూపారు. రూ. 500 విలువైన 20 లడ్డూలను బ్లాక్ లో రూ.1400కు విక్రయించారు.

 

 

09:29 - June 4, 2017

విజయవాడ : పొట్టకూటి కోసం వచ్చిన ఓ కుటుంబం రోడ్డున పడింది. ఇద్దరు కుమారులు కోల్పోయి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది ఆ కుటుంబం. ఓ లారీ సృష్టించిన బీభత్సానికి ఇద్దరు యువకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన ఓ కుటుంబం పొట్టకూటి కోసం విజయవాడకు వచ్చింది. మహానాడు ప్రాంతంలోని ఓ ఇంటిలో నివాసం ఉంటున్నారు. ఇద్దరు కుమారులు నాగేంద్ర, రంగారావులు ఆరు బయట నిద్రించారు. తెల్లవారుజాము సమయంలో లోడ్ తో ఓ లారీ చేరుకుంది. ఒక్కసారిగా లారీని డ్రైవర్ వెనక్కి వేగంగా పోనిచ్చాడు. అక్కడనే మంచాలపై నిద్రిస్తున్న నాగేంద్ర..రంగారావులపైకి దూసుకెళ్లింది. రంగారావు అక్కడికక్కడనే మృతి చెందగా నాగేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని, కారులు కూడా ప్రయాణించే వీలు లేని రోడ్డుపై లారీ వెళ్లడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు కుమారులు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

గుంటూరులో టీడీపీ కార్యకర్తల ఆందోళన

గుంటూరు : జిల్లా కేంద్రంలో హిందు కాలేజీ సెంటర్ లో రాహుల్ గో బ్యాక్ అంటూ టీడీపీ ఆందోళనకు దిగింది. నల్ల జెండాలతో నిరసన తెలుపుతున్నారు. 

 

09:15 - June 4, 2017

గుంటూరు : ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏపీ పర్యటన ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశాలు కనపడుతున్నాయి. ఆయన పర్యటనను టిడిపి నిరసిస్తోంది. హిందూ కాలేజీ సెంటర్ లో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏపీ పీసీసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగసభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సభకు రాహుల్ గాంధీ..8మంది జాతీయ నేతలు హాజరు కానున్నారు. ఈ సభపై టిడిపి నేతలు పలు విమర్శలు గుప్పిస్తున్నారు. స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు రాహుల్ పర్యటనపై స్పందించారు. సభకు ఎవరూ వెళ్లవద్దని ప్రజలకు పిలుపునివ్వడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద టిడిపి నేతలు నల్ల జెండాలు ప్రదర్శిస్తూ బైఠాయించారు. సభ జరుగుతున్న ప్రాంతం వద్ద కూడా టిడిపి నేతలు ఆందోళన చేపడుతున్నారు. ‘రాహుల్ గో బ్యాక్' అంటూ నేతలు నినాదాలు..ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. దీనితో అక్కడ కొంత ఉద్రిక్త వాతారణం నెలకొంది. ప్రత్యేక హోదాపై మాట్లాడే హక్కు రాహుల్ కు లేదని పేర్కొంటున్నారు.

09:14 - June 4, 2017

బ్రిటన్ : లండన్ ఒక్కసారిగా వణికిపోయింది. ప్రపంచంలోని పలు దేశాలపైకి ఉగ్రవాదులు దాడులు చేస్తూ మారణహోమాన్ని సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా లండన్ వంతెనపై నడుస్తున్న పాదాచారులపైకి ముష్కరులు వ్యాన్ తో ఢీకొట్టారు. కిందపడిన పాదాచారులపై అలాగే వ్యాన్ ను తీసుకెళ్లారు. దీనితో ఆరుగురు అక్కడికక్కడనే మృతి చెందగా 20 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అప్రమత్తమైన పోలీసులు లండన్ వంతెనను మూసివేసి పూర్తిగా రాకపోకలు నిలిపివేయించారు. ముగ్గురు అనుమానితుల కోసం పోలీసులు గాలింపులు చేపట్టి వారిని హతమార్చారు. ఘటనపై బ్రిటన్ ప్రధాని ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఘటనకు ఎవరు కారమనేది తెలియరావడం లేదు.

 

విజయవాడలో టిప్పర్ బీభత్సం

విజయవాడ : నగరంలోని ఆటోనగర్ లో టిప్పర్ బీభత్సం సృష్టించింది. ఓ టిప్పర్ రోడ్డుపక్కన నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. 

08:41 - June 4, 2017

రాంగోపాల్ వర్మ..ఆయన ఏది చేసినా సంచలనమే. ఫక్తు వివాదాల్లో ఉంటుంటాడు. వివాదాస్పద కామెంట్లు చేస్తూ వార్తల్లోకి ఎక్కుతుంటారు. ప్రస్తుతం 'రాంగోపాల్ వర్మ'పై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఇటీవలే ఆయన తీస్తున్న సినిమాలు పరాజయమవుతున్న సంగతి తెలిసిందే. దీనితో ఆయన వెబ్ సిరీస్ పై దృష్టి సారించారు. సినిమాల్లో సెన్సార్ కట్స్ వంటివి ఉంటాయని భావించిన 'వర్మ' ఏకంగా యూ ట్యూబ్ లో బూతు నేపథ్యంలో రూపొందిన షార్ట్ ఫిల్మ్స్ ను ప్రసారం చేయడానికి 'వర్మ' సిద్ధమయ్యాడు. ఆయన రూపొందించిన 'గన్స్ అండ్ థైస్' వెబ్ సిరీస్ ట్రైలర్ తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఈ షార్ట్ ఫిలింలో పలు న్యూడ్ సన్నివేశాలున్నాయి. తన సిరీస్ లోనూ సందర్భానుసారం కొన్ని అలాంటి దృశ్యాలు ఉంటాయని, ముంబై మాఫియా గురించి తనకు తెలిసినంతగా ఎవరికి తెలియదని వర్మ పేర్కొన్నట్లు తెలుస్తోంది. మరి 'వర్మ' ఈ వెబ్ సిరీస్ పై ఎలాంటి స్పందనలు వ్యక్తమౌతాయో వేచి చూడాలి.

08:25 - June 4, 2017

గుంటూరు : ప్రత్యేక హోదా వస్తేనే ఏపీ అభివృద్ధి జరుగుతుందని మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లాలో ప్రత్యేక హోదా పేరిట ఓ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. రాహుల్..పలువురు జాతీయ నేతలు సభకు హాజరౌతున్నారు. ఈసందర్భంగా టెన్ టివితో నాదెండ్ల మనోహర్ ముచ్చటించారు. ప్రత్యేక హోదాను టిడిపి..బీజేపీ పార్టీలు విస్మరించాయని, ప్యాకేజీని ఒప్పుకోవడం ద్వారా ఏపీకి తీరని అన్యాయం జరిగిందన్నారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని ఎన్డీయే అమలు చేయలేదని తెలిపారు. హోదా ముగిసిన అధ్యాయమని నీతి ఆయోగ్ ప్రకటన చేసిందని, ఇలా చేయడం సరికాదన్నారు. అఖిలపక్షాన్ని ప్రధాన మంత్రి దగ్గరకు తీసుకెళ్లాలని మూడు సంవత్సరాలుగా చెప్పడం జరిగిందని కానీ అలా చేయడం లేదన్నారు. ప్యాకేజీ..విషయంలో చట్టబద్ధత కల్పించలేదని, ప్రజలను అయోమయంలోకి గురి చేస్తున్నారని విమర్శించారు. 2016లో మార్చి రాజమండ్రి పర్యటనలో ఏపీకి లక్షా 40వేల కోట్లు ఇచ్చినట్లు అమిత్ షా పేర్కొన్నారని, టిడిపి నేత ఒక్కరూ కూడా స్పందించలేదని..ప్రభుత్వం కూడా వివరణ ఇవ్వలేదన్నారు. అనంతరం వేరే సభలో లక్షా 75వేల కోట్లు సహాయం చేశామని అమిత్ షా పేర్కొంటే రూ. 2.36 కోట్ల సహాయం చేశామని వెంకయ్య నాయుడు పేర్కొన్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలపై రిలీజ్ చేసింది పది శాతమేనని తేలిందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

08:04 - June 4, 2017

వరుస విజయాలతో తనదైన స్టైల్ తో చిత్రాలు చేస్తూ యంగ్ హీరోల్లో దూసుకెళుతున్నాడు 'నాని'.. ఆయన నటించిన పలు సినిమాలు బాక్సాపీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. నేచురల్ స్టార్ గా ముద్రపడిన ఈ హీరో తాజాగా 'నిన్నుకోరి'తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. రొమాంటిక్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. తాజాగా చిత్ర టీజర్ ను విడుదల చేయనున్నట్లు 'నాని' సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించాడు. జూన్ 9వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పై ఆసక్తిని రేకేత్తించింది. ఇటీవలే ఓ పాటని కూడా విడుదల చేసారు. 'నాని' సరసన 'జెంటిల్ మన్' ఫేమ్ 'నివేదా థామస్' హీరోయిన్ గా నటిస్తోంది. జులై 7 న చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

కరీంనగర్ జిల్లాలో మంత్రి ఈటెల పర్యటన

కరీంనగర్ : జిల్లాలోని చొప్పదండిలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఒంటరి మహిళలకు పింఛన్లు అందించనున్నారు. 

నేటి నుంచి ఒంటరి మహిళలకు పింఛన్లు

హైదరాబాద్ : తెలంగాణలో నేటి నుంచి ఒంటరి మహిళలకు పింఛన్ల కార్యామాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. తెలంగాణ ప్రభుత్వం ఒంటరి మహిళలకు నెలకు రూ.1000 భృతి ఇవ్వనుంది.

06:55 - June 4, 2017

ఢిల్లీ : చాంపియన్స్‌ ట్రోఫీ చాలెంజ్‌కు డిఫెండింగ్‌ చాంపియన్ టీమిండియా,పాకిస్థాన్ జట్లు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాయి. మరకొద్దిసేపట్లో చిరకాల ప్రత్యర్ధుల మధ్య మహా సమరం మొదలు కానుంది. సాదారణ మ్యాచ్‌ల్లోనే భారత్, పాక్ జట్లు తలపడుతున్నాయంటేనే పోటీ తారాస్థాయిలో ఉంటుంది, ఇక ప్రపంచకప్,చాంపియన్స్‌ ట్రోఫీ వంటి మెగాటోర్నీల్లో ఇరు జట్ల మధ్య ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాంపియన్స్‌ ట్రోపీతో పాటు వన్డేల్లో భారత్‌, పాక్‌ జట్ల ఫేస్ టు ఫేస్ రికార్డు.. చాంపియన్స్‌ ట్రోఫీ సమరానికి చిరకాల ప్రత్యర్ధులు సన్నద్ధమయ్యాయి. భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మహా సమరం ఎప్పుడెప్పుడు ఆరంభమవుతుందా అని క్రికెట్‌ ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. భారత్‌,పాకిస్థాన్‌ మ్యాచ్‌కు ...రెండుదేశాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులు ఎక్కడలేని ఆసక్తి. భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. సాధారణ మ్యాచ్‌ల్లోనే భారత్, పాక్ జట్లు తలపడుతున్నాయంటేనే పోటీ తారాస్థాయిలో ఇక ప్రపంచకప్,చాంపియన్స్‌ ట్రోఫీ వంటి మెగాటోర్నీల్లో ఇరు జట్ల మధ్య ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2017 చాంపియన్స్ ట్రోఫీ గ్రూప్‌-B రౌండ్ రాబిన్ లీగ్‌లో కీలక మ్యాచ్‌కు...చిరకాల ప్రత్యర్థులు టీమిండియా, పాకిస్తాన్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఎడ్జ్‌బాస్టన్‌ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగబోతున్నాయి.

ఎదురు చూడాలి..
ఆల్‌రౌండ్‌ పవర్‌తో అన్ని విభాగాల్లో పాకిస్థాన్‌ కంటే పటిష్టంగా ఉన్న భారత జట్టు ...హాట్‌ఫేవరెట్‌గా బరిలోకి దిగబోతోంది. వన్డే ప్రపంచకప్‌లో పాకిస్తాన్ ప్రత్యర్థిగా తిరుగులేని ట్రాక్‌ రికార్డ్‌ కలిగిన టీమిండియా... చాంపియన్స్‌ ట్రోఫీలో మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. రెండు సార్లు చాంపియన్స్‌ ట్రోఫీ విజేతగా నిలిచిన భారత్‌ ...3 సార్లు పాకిస్థాన్‌తో పోటీ పడగా ఒక్క మ్యాచ్‌లో మాత్రమే నెగ్గింది. రెండు మ్యాచ్‌ల్లో పాక్‌...భారత్‌కు షాకిచ్చింది. ఓవరాల్‌గా వన్డే ఫేస్‌ టు ఫేస్‌ రికార్డ్‌లో మాత్రం భారత్‌పై పాకిస్తాన్‌దే మెరుగైన రికార్డుగా ఉంది. ఇప్పటి వరకూ ఈ రెండుజట్లు 127 వన్డేల్లో తలపడితే...పాక్ 72, టీమిండియా 51 విజయాలు సాధించాయి. చాంపియన్స్‌ ట్రోఫీలో, వన్డేల్లో ట్రాక్‌ రికార్డ్‌ పరంగా పాకిస్థాన్‌కే అనుకూలంగా ఉన్నా.....విరాట్‌ కొహ్లీ నాయకత్వంలోని భారత జట్టును ఓడించడం ప్రస్తుతం పాక్‌ జట్టుకు పెద్ద సవాలే. చాంపియన్స్‌ ట్రోఫీలో తిరుగులేని భారత్‌ మరోసారి చరిత్రను తిరగరాస్తుందో....లేక విరాట్ ఆర్మీకి పాకిస్థాన్‌ షాకిస్తుందో... తెలుసుకోవాలంటే మాత్రం..మ్యాచ్‌ ఫలితం కోసం ఆసక్తిగా ఎదురుచూడాల్సిందే.

06:52 - June 4, 2017

ఢిల్లీ : ప్రేమకు, పెళ్లికి వయసు అడ్డంకి కాలేదు వారిద్దరికి. 60 ఏళ్ల వయసులో తనకన్నా సగం వయస్సు తక్కువ ఉన్న హీరోయిన్‌ను పెళ్లాడడు ఓ దర్శకుడు. ఇది రీల్‌ లైఫ్‌లోనే కాదు... రియల్‌లైఫ్‌లోనూ నిజం చేశాడు ఆ దర్శకుడు. ఇప్పుడు ఇదే అంశం తమిళ సినీ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. వేలు ప్రభాకరన్‌. కోలివుడ్‌లో ఎన్నో హిట్స్‌ తీసిన డైరెక్టర్‌. తాజాగా తమిళంలో 'ఒరు ఇయక్కునరిన్‌ కాదల్‌ డైరీ', తెలుగులో 'ఓ దర్శకుడి ప్రేమ డైరీ' పేరుతో సినిమాను తెరకెక్కించాడు. అంతేకాదు.. హీరో కూడా ఈయనే. ఈ సినిమాలో ఓ వృద్ధ దర్శకుడు 30 ఏళ్ల మహిళను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఇదీ సినిమా స్టోరీ.. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ప్రివ్యూ చూసేందుకు చెన్నై ఫోర్‌ ఫ్రేమ్‌ థియేటర్‌లో మీడియాను ఆహ్వానించారు. అయితే.. ఇక్కడ జరిగిన ఒక సంఘటన అందరికి షాక్‌ ఇచ్చింది. అది ఏంటంటే..

గ్రేట్ అంటున్న అభిమానులు..
తన గత సినిమాలో నటించిన హీరోయిన్‌ షెర్లీని పెళ్లి చేసుకుంటున్నట్లు వేలు ప్రభాకరన్‌ ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. అంతేకాదు.. అప్పటికప్పుడే వారిద్దరూ రింగ్స్‌ మార్చుకున్నారు. ఓ వృద్ధ దర్శకుడు హీరోయిన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకునే కథాంశంతో రూపొందించిన సినిమా రిలీజ్‌ రోజునే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించడం ఇప్పుడు కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. అయితే.. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా ప్రేమ కొనసాగుతోంది. ఇక్కడ మరో విశేషమేంటంటే.. ఈయన వయసు 60 కాగా.. ఆమె వయసు 30. ఇదంతా చూస్తుంటే.. వీళ్ల ప్రేమ కథనే వేలు ప్రభాకరన్‌ సినిమాగా తీశాడనిపిస్తోంది. ఈ సినిమా రిలీజ్‌ రోజునే ప్రేమికులిద్దరూ ఒక్కటయ్యారు. అయితే.. వేలు ప్రభాకరన్‌ ఈ వయసులో తనకన్నా సగం వయసున్న హీరోయిన్‌ను పెళ్లి చేసుకోవడం తమిళ సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు తమ ప్రేమ కథనే సినిమాగా తీసి.. విడుదల రోజునే ఇద్దరూ పెళ్లి చేసుకుంటామని ప్రకటించడం నిజంగా గ్రేట్‌ అంటున్నారు సినీ అభిమానులు.

06:48 - June 4, 2017

హైదరాబాద్ : జీఎస్టీ అమలుకు అడ్డంకులు తొలగిపోయాయి. వస్తువులపై పన్ను రేట్లు ఖరారు కావడంతో జూలై 1 నుంచి జీఎస్‌టీ అమల్లోకి రానుంది. శనివారం ఢిల్లీలో జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో అన్ని అడ్డంకులు తొలగిపోయినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. జులై 1 నుంచి వస్తు, సేవల పన్ను.. జీఎస్‌టీని అమలులోకి తెచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. శనివారం ఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో కొన్ని వస్తువులపై రేట్లను ఖరారు చేశారు. దీంతో వచ్చేనెల నుంచి దేశవ్యాప్తంగా ఒకే రకమయిన వస్తు సేవల పన్నులు అమల్లోకి రానున్నాయి. కొత్తగా ఖరారు చేసిన రేట్ల ప్రకారం..బంగారం, ఆభరణాలు, వజ్రాలు, వెండిపై 3శాతం పన్ను విధించాలని జీఎస్‌టీ మండలి నిర్ణయించింది. రెడీమేడ్‌ దుస్తులపై 12శాతం, నూలు, చేనేత వస్త్రాలపై 18శాతం, 500 రూపాయల లోపు ఖరీదు ఉండే పాదరక్షలపై 5శాతం, 500లు దాటినవాటిపై 18శాతం చొప్పున పన్ను విధించాలని నిర్ణయించారు.

తగిన వాతావరణం లేదన్న తెలుగు రాష్ట్రాల మంత్రులు..
అటు సిల్కు, జనపనార ఉత్పత్తులకు పూర్తిగా పన్ను మినహాయింపు ఇచ్చిన జీఎస్‌స్టీ మండలి.. వెయ్యిరూపాయల లోపు దుస్తులపై 5శాతం పన్ను విధించాలని నిర్ణయించింది. ఇక బీడీలపై 28 శాతం, బ్రాండెడ్‌ బిస్కెట్లపై 18శాతం, సోలార్‌ప్యానెల్స్‌ పై 5శాతం చొప్పున పన్ను విధించడానికి కౌన్సిల్లో నిర్ణయించారు. అయితే గత నెలలో జరిగిన సమావేశంలో 1200కు పైగా వస్తువులు, 500ల వరకూ సేవలకు నాలుగు శ్లాబుల్లో ... రేట్లు నిర్ణయించారు. 5, 12, 18, 28 శాతం చొప్పున గత సమావేశంలో నిర్ణయించిన కౌన్సిల్‌ .. శనివారం జరిగిన భేటీలో బంగారం, దుస్తులు, బిస్కెట్లు , చెప్పులు, తదితర వస్తువులకు సంబంధించిన పన్నురేట్లను ఖరారు చేసింది. అయితే.. జూలై 1 నుంచి జీఎస్టీని అమలు చేయాలని నిర్ణయించినా.. క్షేత్రస్థాయిలో అందుకు తగిన వాతావరణం లేదని తెలుగు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు యనమల రామకృష్ణుడు, ఈటల రాజేందర్‌ అంటున్నారు. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ఆలస్యంగా జరుగుతున్నాయని, సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేయడంపై దృష్టిపెట్టకుంటే.. గందరగోళం తలెత్తే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. అందుకే ఇప్పటికే నిర్ణయించిన శ్లాబులపై ఈనెల 11న ఢిల్లీలో జరగనున్న సమావేశంలో తమ అభ్యంతరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతాం అంటున్నారు ఇరురాష్ట్రాల ఆర్థిక మంత్రులు. మొత్తానికి ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న దేశవ్యాప్తంగా ఒకే పన్నుల విధానం పట్టాలకెక్కినట్టే కనిపిస్తున్నా.. క్షేత్రస్థాయిలో అందుకు తగిన వాతావరణం నెలకొనాలంటే మరికొంతకాలం వేచి చూడక తప్పదంటున్నారు ఆర్థికరంగ నిపుణులు.

06:43 - June 4, 2017

కర్నూలు : కులజాడ్యం ఓ విద్యార్థిని నిండు ప్రాణాలు బలి తీసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. కులాలు వేరు కావడంతో పెద్దలు వారిద్దరిని బలవంతంగా వేరు చేశారు. మరోవైపు తన భర్తకు మరో పెళ్లి చేశారు. ఇది తట్టుకోలేని ఆమె తనువు చాలించింది. కర్నూలు జిల్లా గూడురు మండలం కె.నాగలాపురానికి చెందిన టీటీసీ విద్యార్థిని గీత, పెంచికలపాడుకు చెందిన డిగ్రీ విద్యార్థి సోమశేఖరరెడ్డి మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. అయితే.. కులాలు వేరు కావడంతో.. అబ్బాయి తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో వారిద్దరూ మార్చి నెలలో ఓ గుళ్లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత సోమశేఖరరెడ్డి.. గీతను ఇంటికి తీసుకెళ్లాడు. అయితే.. నాలుగైదు రోజుల తర్వాత వారిద్దరిని విడదీసేందుకు కుట్రలు మొదలుపెట్టారు తల్లిదండ్రులు. తమ అబ్బాయికి ఆరోగ్యం బాగాలేదని రాత్రికి రాత్రే సోమశేఖర్‌రెడ్డిని వేరే ఊరికి తీసుకెళ్లారు. ఒంటరిగా ఉన్న గీతను.. తెలిసిన వారి ద్వారా పుట్టింటికి పంపించారు. ఎన్ని రోజులైనా భర్త రాకపోవడంతో.. ఆమే అత్తారింటికి వెళ్లింది. అక్కడ భర్త కనిపించకపోవడంతో.. అత్తామామలను అడిగింది. వారినుంచి సరైన సమాధానం రాకపోవడంతో.. ఏమి చేయాలో తెలియక పోలీసులను ఆశ్రయించింది. అయితే.. గీత మైనర్‌ కావడంతో.. మేజర్‌ అయిన తర్వాత వస్తే పెళ్లి చేస్తామని పోలీసులు తెలిపారు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.

శిక్షించాలంటున్న గ్రామస్తులు..
మరోవైపు ఆమెకు గ్రామ కుల పెద్దల నుంచి బెదిరింపులు వచ్చాయి. మేజర్‌ కాకుండానే చేసుకున్న పెళ్లి చెల్లదని.. చదువుకున్న తర్వాత వేరే అబ్బాయిని వివాహం చేసుకోవాలని సూచించారు. ఇదే సమయంలో తన భర్త వేరే వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న గీత.. మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తమ కూతురు ఆత్మహత్యకు సోమశేఖర్‌రెడ్డి కుటుంబ సభ్యులే కారణమని గీత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకుని ఓ అమ్మాయి ఆత్మహత్యకు కారణమైన సోమశేఖర్‌రెడ్డి కుటుంబాన్ని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

06:38 - June 4, 2017

హైదరాబాద్ : న‌గ‌రంలో మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటిఆర్ సుడిగాలి ప‌ర్యట‌న చేశారు. ప‌లు అభివృద్ది ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశారు. బాలాన‌గ‌ర్, కైత్లాపూర్ ప్రాంతాల్లో డ‌బుల్ బెడ్ రూం ఇళ్లకు శంకుస్థాప‌న చేశారు. కూక‌ట్‌ప‌ల్లిలో ఇండోర్ స్టేడియాన్ని ప్రారంభించారు. ఖాయిలాప‌డ్డ ప‌రిశ్రమ‌ల‌కు అండ‌గా ఉంటామ‌ని పారిశ్రమికవేత్తల‌కు హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం దేశంలో మ‌రెక్కడాలేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంద‌న్నారు మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్‌. హైద‌రాబాద్‌లో ఆయన సుడిగాలి ప‌ర్యట‌న చేశారు. వెస్ట్‌జోన్‌లోని ప‌లు ప్రాంతాల్లో ప‌ర్యటించారు. ముందుగా బాలాన‌గ‌ర్ ప్రారిశ్రామిక ప్రాంతంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలతో మాట్లాడారు. చిన్న ప‌రిశ్రమ‌ల‌కు ప్రభుత్వం అండ‌గా ఉంటుంద‌ని మంత్రి కేటీఆర్‌ పారిశ్రామికవేత్తలకు హామీ ఇచ్చారు. దీనికోసం 100కోట్ల మూల నిధిని ఎర్పాటు చేసి..ప‌రిశ్రమ‌లు ఎదుర్కోంటున్నా ఇబ్బందుల‌ నుంచి తాత్కాలికంగా గట్టెక్కిస్తామన్నారు. అవసరమైతే కేంద్ర సహకారం కూడా తీసుకుంటామన్నారు. మరోవైపు బాలానగర్‌ పారిశ్రామిక ప్రాంతంలో 50ఏళ్ల క్రితం పరిశ్రమలకు కేటాయించిన భూములు కొందరు పారిశ్రామిక వేత్తలు సబ్‌లీజుకు ఇచ్చుకుని.. ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడిచారని మంత్రి అన్నారు. అలాంటి భూములను స్వాధీనం చేసుకుని ప్రస్తుతం పరిశ్రమలు నడుపుతున్న వారికే కేటాయిస్తామన్నారు. మరోవైపు బాలానగర్‌ పారిశ్రామిక ప్రాంతం చుట్టూ నివాస ప్రాంతాలు పెరిగిపోయినందున.. ప్రజలు కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్‌ అన్నారు. దీనికి ప్రత్యామ్యాయ మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తోందన్నారు. ఒకవేళ బాలానగర్‌ ప్రాంత పారిశ్రామిక వేత్తలు పరిశ్రమలను తరలించడానికి ఒప్పుకుంటే.. ఔటర్‌రింగ్‌ రోడ్డు బయట 300 ఎకరాల స్థలం కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

రాజీ పడబోం..
అటు ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లోనూ తమ ప్రభుత్వం రాజీపడకుండా పనిచేస్తోందన్నారు మంత్రి కేటీఆర్‌. కైతలాపూర్‌లో డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దాదాపు 18వేల కోట్ల రూపాయల ఖర్చుతో రాష్ట్రంలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను నిర్మాణాన్ని చేపట్టిందన్నారు. ఇటు హైద‌రాబాద్ న‌గ‌రంలో ల‌క్ష డ‌బుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మించాల‌ని ల‌క్ష్యంగా నిర్ణయించుకోగా .. ఇప్పటికే 40వేల ఇళ్ల నిర్మాణాల‌కు టెండ‌ర్లు పూర్తయ్యాయన్నారు. అయితే.. తాము చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్‌పార్టీ జీర్ణించుకోలేక పోతోందన్నారు. దశాబ్దాల కాంగ్రెస్‌ పాలనలో ప్రజలకు పేదరికమే మిగిలిందని మంత్రి విమర్శించారు. హైదరాబాద్‌ నగరంలో సుడిగాలి పర్యటన చేసిన మంత్రి కేటీఆర్‌.. తమ ప్రభుత్వం చేస్తున్న పథకాలను ఏకరువుపెట్టారు. ఓవైపు అభివృద్ధి పథకాలు చేపడుతూనే.. మరోవైపు పేదప్రజల సంక్షేమానికి కూడా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పుకున్నారు.

06:34 - June 4, 2017

హైదరాబాద్ : ఒంటరి మహిళలకు పింఛన్లు అందించేందుకు తెలంగాణ సర్కార్‌ అన్ని ఏర్పాట్లు చేసింది. అన్ని జిల్లాల్లోనూ మంత్రుల చేతుల మీదుగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ ఆసరా లేని లక్షా ఎనిమిది వేల మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. ఇప్పటికే ఈ పథకాన్ని కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించగా.. ఏప్రిల్‌ నుండి ఆచరణలోకి వచ్చింది. అయితే.. ప్రస్తుతం అర్హుత జాబితా పూర్తి కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో 150 కేంద్రాల్లో లక్షా 8 వేల 302 మంది ఒంటరి మహిళలకు ఈ పింఛన్‌ మంజూరీ పత్రాలను ఇవ్వనున్నారు. 18 ఏళ్లు నిండి.. వివాహం జరిగిన తర్వాత కనీసం ఏడాదిపాటు భర్తకు దూరంగా ఉంటున్న మహిళలు ఈ పథకానికి అర్హులు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 30 ఏళ్లు దాటిన అవివాహిత మహిళలు, పట్టణ ప్రాంతాల్లో 35 ఏళ్లు దాటిన పెళ్లికాని స్త్రీలు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అయితే.. ఆసరాలాంటి ఇతర పెన్షన్లు తీసుకోని వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు.

లక్షా 47 వేల 357 దరఖాస్తులు..
అయితే ఈ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా లక్షా 47 వేల 357 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో అర్హులైన వారిని సర్కార్‌ ఎంపిక చేసింది. జిల్లాలవారీగా ఈ జాబితాను ఖరారు చేశారు. ఇందులో ఖమ్మం జిల్లాలో అధికంగా 6,412 మంది ఎంపిక కాగా.. నిర్మల్‌లో అత్యధికంగా 1,277 మంది ఎంపికయ్యారు. వీరందరికి ఈరోజు రాష్ట్ర మంత్రుల చేతుల మీదుగా పింఛన్‌ పత్రాలు అందించనున్నారు. వీరికి బ్యాంక్‌ అకౌంట్‌, పోస్టల్‌, నగదు రూపంలో చెల్లింపులు చేస్తారు. ఏప్రిల్‌, మే నెలలకు కలిపి మొదటి దఫా రెండు వేల రూపాయలు జమ చేయనున్నారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వంపై 130 కోట్ల రూపాయలకు పైగా అదనపు భారం పడనుంది. ఏ ఆధారం లేని మహిళలకు పింఛన్‌ పథకం అందిస్తుండడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఈ పథకం పక్కదారి పట్టకుండా లబ్ధిదారులకు పింఛన్లు అందేలా చూడాలని కోరుతున్నారు.

06:31 - June 4, 2017

గుంటూరు : కాంగ్రెస్‌ 'ప్రత్యేక హోదా భరోసా' పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఇప్పటికే నేతలంతా ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ సభలో పాల్గొనేందుకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ వస్తున్నారు. అలాగే సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌, జేడీయూ నేత శరద్‌యాదవ్‌, సీపీఐ జాతీయ నేతలు సురవరం సుధాకర్‌రెడ్డి, డి. రాజా తదితరులు కూడా సభకు రానున్నారు. దీంతో సభ నిర్వహణను రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జాతీయ నేతలు వస్తుండడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

06:28 - June 4, 2017

హైదరాబాద్‌ : శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. సాయంత్రం నుంచే వాతావరణం చల్లబడగా.. రాత్రి ఈదురుగాలులతో వర్షం కురిసింది. నగరంలోని పంజాగుట్ట, ఖైరతాబాద్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, కూకట్‌పల్లి, సికింద్రాబాద్‌, అంబర్‌పేట, దిల్‌సుక్‌నగర్‌, ఎల్బీనగర్‌ ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈదురు గాలులతో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నెలకొరిగాయి. అనేక ప్రాంతాల్లో రాత్రంతా విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు ఎండలు భగభగమండుతుండడంతో రాత్రి కురిసిన వర్షానికి నగరవాసులు ఉపశమనం పొందారు.

నేడు భారత్..పాక్ జట్ల మధ్య మ్యాచ్..

ఢిల్లీ : ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు ఆసక్తికర పోరు జరగనుంది. మధ్యాహ్నం 2.50గంటలకు భారత్..పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

జీఎస్ ఎల్వీ మార్క్ 3 డీ 1 రాకెట్ కౌంట్ డౌన్ ..

శ్రీహరికోట : ఆదివారం మధ్యాహ్నం 3.58గంటలకు జీఎస్ ఎల్వీ మార్క్ 3 డీ 1 రాకెట్ కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. సోమవారం రాకెట్ ను ప్రయోగించనున్నారు.

 

నేడు గుంటులో ప్రత్యేక హోదా భరోసా సభ..

గుంటూరు : నేడు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా భరోసా సభ జరగనుంది. ఈ సభకు రాహుల్, అఖిలేష్ యాదవ్ హాజరు కానున్నారు. వీరితో పాటు 8 జాతీయ పార్టీల ప్రతినిధులు పాల్గొననున్నారు.

శ్రీలంకపై దక్షిణాఫ్రికా విజయం..

హైదరాబాద్ : ఛాంపియన్స్ ట్రోఫిలో భాగంగా శ్రీలంకపై దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. 96 పరుగుల తేడాతో గెలుపొందింది. సౌతాఫ్రికా స్కోర్ 299/6, శ్రీలంక స్కోర్ 203 ఆలౌట్.

లండన్ బ్రిడ్జీపై దూసుకెళ్లిన వ్యాన్..

ఇంగ్లండ్ : లండన్ బ్రిడ్జిపై పాదాచారులపైకి వ్యాన్ దూసుకెళ్లింది. ఈఘటనలో ఇద్దరు మృతి చెందగా 10 మందికి పైగా గాయాలయ్యాయి. దీనితో పోలీసులు లండన్ బ్రిడ్జీని మూసివేశారు. ముగ్గురు అనుమానితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇది ఉగ్రవాదుల చర్య అని పోలీసులు పేర్కొంటున్నారు. ఇంగ్లండ్ ప్రధాని అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.

Don't Miss