Activities calendar

05 June 2017

22:11 - June 5, 2017

హైదరాబాద్‌ : నగరంలోని అభివృద్ధిలో వెనకడుగు లేదని మంత్రి కేటీఆర్ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ... ఇందులో కార్మికుల భద్రతకు కూడా పెద్దపీట వేస్తున్నట్టు ప్రకటించారు. స్వచ్ఛబారత్  కార్యక్రమ అమల్లో తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్‌ నగరాలు ముందున్నాయన్నారు. 
నగరంలో మంత్రి కేటీఆర్‌ పర్యటన
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్‌ పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మురుగునీటిని ప్రక్షాళన చేసేందుకు ఏర్పాటు చేసిన అత్యాధునిక ఎయిర్‌టెక్‌ మిషన్లను కేటీఆర్‌ ప్రారంభించారు. గ్రేటర్  హైదరాబాద్‌ మహానగరంలో సివరేజ్‌ పనులకు ఈ ఎయిర్‌టెక్ మిషన్‌లను జలమండలి ఉపయోగించనుంది. ఇప్పటి వరకు 20 ఎయిర్‌ టెక్‌ మిషన్లు మాత్రమే ఉన్నాయి. తాజాగా జలమండలి మరో 70 మిని ఎయిర్‌ టెక్‌ మిషన్లు సమకూర్చుకుంది.  ఈ యంత్రాల ఉపయోగంపై కార్మికుల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.  
టీ.ప్రభుత్వ కార్యక్రమాలు దేశానికే ఆదర్శం : కేటీఆర్‌ 
తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని కేటీఆర్‌ అన్నారు. స్వచ్ఛబారత్‌లో భాగంగా రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు నిర్వహించామని కేటీఆర్‌ చెప్పారు. నగరంలో ఆటో టిప్పర్లు కొనుగోలు  చేసి ఇంటింటి నుంచి తడి పొడి చెత్తను వేర్వేరుగా సేకరిస్తున్నామన్నామని తెలిపారు. 
బ్రాహ్మణ సంక్షేమ సదన్ నిర్మాణానికి కేటీఆర్‌ శంకుస్థాపన
అలాగే హైదరాబాద్ శివారు గోపన్నపల్లిలో బ్రాహ్మణ సంక్షేమ సదన్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు... జర్నలిస్టు కాలనీ సమీపంలోని ఆరెకరాల స్థలంలో.... ఈ సదన్ ఏర్పాటుచేస్తున్నారు. దూరప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చే బ్రాహ్మణులు బసచేయడానికి వసతి సౌకర్యాలు కల్పించనున్నారు. ఈ కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం మహమ్మూద్‌ అలీ, మంత్రి నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, పద్మారావు, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

21:57 - June 5, 2017

నెల్లూరు : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.. మరోసారి సత్తా చాటింది. చరిత్రలోనే అత్యంత బరువైన ఉపగ్రహాన్ని వియవంతంగా కక్ష్యలోకి పంపింది. జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3 డీ1 ప్రయోగం సక్సెస్‌ కావడంతో దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోంది. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 
నింగికి ఎగసిన జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3 డీ1
ఇది కేవలం ఓ రాకెట్‌ ప్రయోగం కాదు.. భారత కీర్తి పతాకాన్ని గగన వీధుల్లో రెపరెపలాడించిన అద్భుతం. అగ్ర దేశాల సరసన భారతదేశాన్ని నిలిపిన సగర్వమైన సందర్భం. అన్ని అనుమానాలనూ పటాపంచలు చేస్తూ.. 200 భారీ ఏనుగుల స్థాయి బరువున్నజీఎస్‌ఎల్‌వీ మార్క్‌ 3 డీ 1 రాకెట్‌.. నిప్పులు చిమ్ముతూ నింగికెగసి.. ఇస్రో శాస్త్రవేత్తలనే కాదు.. దేశ ప్రజలందరినీ తలెత్తుకునేలా చేసింది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన జీఎస్‌ఎల్‌వీ మార్క్‌ 3డీ1 రాకెట్‌ను శ్రీహరికోటలోని సతీష్‌ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ రెండో లాంచ్‌ప్యాడ్‌ నుంచి విజయవంతంగా ప్రయోగించారు.  సాయంత్రం 5.28 నిమిషాలకు జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. మొత్తం 16 నిమిషాల 20 సెకన్లలో జీశాట్‌ 19 ఉపగ్రహం విజ‌య‌వంతంగా కక్ష్యలోకి చేరుకుంది. ప్రయోగం సక్సెస్‌పై ఇస్రో శాస్త్రవేత్తలు హర్షం ప్రకటించారు. 
క్రయోజనిక్‌ ఇంజిన్‌ తో జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3 డీ1 ప్రయోగం
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్రయోజనిక్‌ ఇంజిన్‌ జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3 డీ1లో ఉపయోగించారు. దీనిద్వారా 3,136 కిలోల బరువైన కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ జీశాట్‌-19 ను కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఈ ప్రయోగానికి ఉపయోగించిన రాకెట్‌ బరువు 640 టన్నులు. ఎత్తు 43 మీటర్లు. మూడు దశల్లో రాకెట్‌ నింగిలోకి దూకెళ్లింది. మొదటి దశలో S-200 మోటార్లు రెండు, రెండో దశలో L-110  లిక్విడ్‌ కోర్‌ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇక మూడో దశలో  అత్యంత కీలకమైన సీ-25 క్రయోజెనిక్‌ ఇంజిన్‌ ను ఉపయోగించారు. మొత్తం 16 నిముషాల 20 సెకన్ల అనంతరం జీశాట్‌-19 శాటిలైట్‌ రాకెట్‌నుంచి విడిపోయి.. భూ అనువర్తిత బదిలీ కక్ష్య లోకి ప్రవేశించింది. 
జీశాట్‌ 19లో కేఏ, కేయూ బ్యాండ్‌ ట్రాన్స్‌పాండర్లు  
జీశాట్‌ 19 ఉపగ్రహంలో కేఏ బ్యాండ్‌ , కేయూ బ్యాండ్‌ ట్రాన్స్‌ఫాండర్లు ఉన్నాయి. వీటి ద్వారా హైస్పీడ్‌ ఇంటర్నెట్‌, కమ్యూనికేషన్‌ వ్యవస్థలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే వినియోగంలో ఉన్న 4జీ టెక్నాలజీ మరింత  మెరుగ్గా అందుబాటులోకి వస్తుంది. 
కమ్యూనికేషన్‌ ఉపగ్రహాల ప్రయోగంలో చేకూరిన సత్తా 
ఈ ప్రయోగం విజయవంతం కావడంతో  అత్యంత బరువైన కమ్యూనికేషన్‌ ఉపగ్రహాలను  మనదేశమే సొంతంగా   కక్ష్యలోకి పంపే సత్తా చేకూరింది. భారీ ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపేందుకు ఇస్రో ఇప్పటి వరకు ఫ్రాన్స్‌కు చెందిన ఏరియన్‌ రాకెట్‌పై ఆధారపడుతోంది. ఇకపై ఆ అవసరం ఉండదంటున్నారు శాస్త్రవేత్తలు. ఇక నుంచి ఉపగ్రహ ప్రయోగాలకు ఖర్చుకూడా భారీగా తగ్గనుంది. భవిష్యత్తులో ఏకంగా 4,500 నుంచి 5,000 కిలోల బరువు గల ఇన్‌శాట్‌-4 తరహా ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టే సామర్థ్యం ఇస్రోకు రానుంది. అటు చంద్రయాన్‌- 2తో పాటు, మంగళ్‌యాన్‌ లాంటి గ్రహాంతర ప్రయోగాల ద్వారా అంతరిక్షంలోకి మనుషులను పంపే వీలుందని అంతరిక్ష పరిశోధకులు చెబుతున్నారు.  

 

అధికార వ్యామోహంతోనే కాంగ్రెస్ రాష్ట్ర విభజన : సీఎం చంద్రబాబు

విజయవాడ : 4 వ రోజు నవ నిర్మాణ దీక్షలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అధికార వ్యామోహంతోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసిందని విమర్శించారు. ప్రత్యేకో హోదా, ప్యాకేజీ మధ్య వ్యత్యాసమేంటో కాంగ్రెస్ చెప్పాలన్నారు. ఏపీ కష్టాలకు బాధ్యులు ఎవరో చెప్పకుండా కాంగ్రెస్ కల్లబొల్లి మాటలు చెబుతోందని చెప్పారు. 

 

రైలు కిందపడి మెడికల్ విద్యార్థి ఆత్మహత్య

కర్నూలు : కార్బైడ్ ఫ్యాక్టరీ వద్ద రైలు కిందపడి మెడికల్ విద్యార్థి జయసాయికృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనంతపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జయసాయకృష్ణ ఎంబిబిఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు.

21:09 - June 5, 2017

ఢిల్లీ : విదేశాల్లో చిక్కుకుపోయిన 80 వేల మంది భారతీయులను సురక్షితంగా భారత్‌కు రప్పించామని కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ అన్నారు. మోది ప్రభుత్వం మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా  తమ శాఖకు చెందిన నివేదికను విడుదల చేస్తూ మీడియాతో మాట్లాడారు. పాస్‌పోర్టు సేవలను మరింత సరళతరం చేశామన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినపుడు 77 పాస్‌పోర్టు కేంద్రాలుండేవని, మరో 16 కేంద్రాలను పెంచినట్లు సుష్మా చెప్పారు. ఈ సేవలను పోస్టాఫీసులకు కూడా విస్తరించామన్నారు. కశ్మీర్‌ అంశంపై ద్వైపాక్షిక చర్చలు జరగాలని తృతీయ పక్షాన్ని అంగీకరించే ప్రసక్తే  లేదన్నారు. పారిస్‌ ఒప్పందంలో భారత్‌ ఒక భాగమని, ఎవరి ఒత్తిడుల వల్లో తాము సంతకం చేయలేదని మంత్రి స్పష్టం చేశారు. 

21:05 - June 5, 2017

ఢిల్లీ : ఎన్డీటీవీ సహ వ్యవస్థాపకుడు, ఎక్జిక్యూటివ్‌ ఛైర్మన్ ప్రణయ్‌రాయ్, ఆయన భార్య రాధికా రాయ్‌ ఇళ్లలో సోదాలు నిర్వహించింది. ఢిల్లీ, డెహ్రాడూన్‌, మొత్తం నాలుగుచోట్ల సీబీఐ దాడులు జరిపింది. ఓ ప్రయివేటు బ్యాంకుకు డబ్బు చెల్లించకుండా నష్టం కలిగించారన్న ఆరోపణలతో... ప్రణయ్ రాయ్‌తోపాటు ఆయన భార్య రాధికా రాయ్ సహా మరికొంత మందిపై కేసు నమోదైంది. ఐసీఐసీఐ బ్యాంకు నుంచి 48 కోట్లు రుణం తీసుకుని నష్టం కలిగించారని ప్రణయ్‌రాయ్‌పై ఆరోపణలున్నాయి.  ఆర్ఆర్‌పీఆర్ హోల్డింగ్స్ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ పేరిట ప్రణయ్ రాయ్ రుణం తీసుకుని తిరిగి చెల్లించలేదని సమాచారం. సిబిఐ దాడులపై ఎన్డీటీవీ స్పందించింది. అవే పాత, అబద్ధపు ఆరోపణలతో ఎన్డీటీవీ, సంస్థ ప్రమోటర్లను సీబీఐ వేధిస్తోందని పేర్కొంది. పలు ఏజెన్సీలు చేస్తున్న ఈ మాయలకు వ్యతిరేకంగా మేం నిర్విరామంగా పోరాడుతాం. దేశ ప్రజల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాన్ని హరించేందుకు చేసే ఇలాంటి ప్రయత్నాలకు మేం బెదిరిపోమని...మన దేశం కోసం పోరాడుతామని ఎన్డీటీవీ స్పష్టం చేసింది. 

 

20:59 - June 5, 2017

రాజస్థాన్ : మేకిన్‌ ఇండియా అంటూ గొప్పగా ప్రచారం చేసుకుంటున్న మోదీ సర్కార్‌.. దేశంలో సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ వ్యవస్థను సైతం పూర్తిస్థాయిలో కల్పించలేక పోతోంది. సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ అందక స్వయంగా కేంద్ర మంత్రే చెట్టుపైకి ఎక్కి ఫోన్‌ మాట్లాడాల్సి వచ్చింది. కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అర్జున్‌ మేఘవాల్‌ రాజస్థాన్‌లోని తన పార్లమెంట్‌ నియోజకవర్గంలో పర్యటించారు. ఇందులో భాగంగా.. ధూలియా గ్రామానికి వెళ్లి అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక ఆసుపత్రిలో నర్సుల కొరత ఉందని.. దీని వల్ల తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఓ గ్రామస్థుడు కేంద్రమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో వెంటనే స్పందించిన అర్జున్‌ మేఘవాల్‌.. ఈ విషయంపై మాట్లాడేందుకు ఆరోగ్యశాఖ అధికారికి ఫోన్‌ చేశారు. అప్పుడే అసలు సమస్య మొదలైంది. సమీప పట్టణానికి 85 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధూలియా గ్రామంలో నెట్‌వర్క్‌ సరిగా ఉండదు. దీంతోఅక్కడ ఫోన్‌ సిగ్నల్స్‌ రావని గ్రామస్థులు కేంద్రమంత్రికి చెప్పారు. చెట్టెక్కితే నెట్‌వర్క్‌ అందుతుందని చెప్పడంతో.. 62ఏళ్ల అర్జున్‌ మేఘవాల్‌ నిచ్చెన సాయంతో చెట్టెక్కి ఫోన్‌ మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. పరిస్థితిని స్వయంగా అర్థం చేసుకున్న కేంద్రమంత్రి అర్జున్‌ మేఘవాల్‌.. వెంటనే ఆ గ్రామంలో మొబైల్‌ టవర్‌ను ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. 

20:55 - June 5, 2017

ఢిల్లీ : హస్తినలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటతో జనం విలవిల్లాడుతున్నారు. టూరిస్ట్‌స్పాట్‌లు జనంలేక వెలవెల బోతున్నాయి. రాజస్థాన్‌ ఎడారి నుంచి వడగాలులు వీస్తుండటంతో.. ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:50 - June 5, 2017

హైదరాబాద్‌ : నగరంలో బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈనెల 25 నుంచి వచ్చే నెల 23 వరకు జంట నగరాల్లో బోనాల ఉత్సవాలు జరుగుతాయని.. మంత్రి చెప్పారు. పండుగ నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని... 15వ తేదీన అధికారులు, ఫీల్డ్‌ విజిట్‌ చేసి సమస్యలను పరిష్కరించాలని మంత్రి తలసాని ఆదేశించారు. 

 

 

ధర్మన్నగూడెంలో విద్యార్థిని ఆత్మహత్య

రంగారెడ్డి : యాచారం మండలం ధర్మన్నగూడెంలో దారుణం జరిగింది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటి ఎదురుగా ఉంటున్న కానిస్టేబుల్ నర్సింహ్మ వేధింపులే విద్యార్థిని శ్యామల మృతికి కారణమని మృతురాలు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కానిస్టేబుల్ నర్సింహ్మపై యాచారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 

 

20:39 - June 5, 2017

పశ్చిమగోదావరి : జైల్లో ఉండాల్సిన వాళ్లు బెయిల్‌పై వచ్చి నీతులు చెబుతున్నారని... పరోక్షంగా జగన్‌పై కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు విమర్శలు సంధించారు. పశ్చిమ గోదావరి జిల్లా... భీమవరంలో జరిగిన సబ్‌ కా సాత్‌, సబ్‌ కా వికాస్‌ సమ్మేళన్‌లో ఆయన పాల్గొన్నారు. అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విడగొట్టారని అశోక్‌గజపతిరాజు అన్నారు.  ఎన్ని పథకాలు ఉన్నాయనే దానికంటే వాటిలో ఏ మేరకు లక్ష్యాలు సాధించామన్నదే ముఖ్యమన్నారు. 

 

20:35 - June 5, 2017
20:29 - June 5, 2017

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ నుంచి సివిల్స్‌కు సెలెక్టైన విజేతలను సీఎం చంద్రబాబునాయుడు ఘనంగా సన్మానించారు. విజయవాడ ఏ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు.. సివిల్స్‌ టాపర్లు పాల్గొన్నారు. ఈసారి రాష్ట్రం నుంచి 60 మందికి పైగా ఐఏఎస్‌లో టాప్‌ ర్యాంకులు సాధించారని చంద్రబాబు చెప్పారు. ఐఏఎస్‌లో 3వ ర్యాంకు సాధించిన గోపాల కృష్ణను సీఎం ప్రత్యేకంగా అభినందించారు. 

 

నవ నిర్మాణదీక్షలో ప్రసంగించిన సీఎం చంద్రబాబు

విజయవాడ : హేతుబద్దత లేకుండా రాష్ట్ర విభజన చేశారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. నవ నిర్మాణదీక్షలో ఆయన పాల్గొని, మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు సిగ్గులేకుండా మళ్లీ రాష్ట్రానికి వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి అయ్యే వరకు ఏపీ రాష్ట్రానికి కేంద్రం చేయూత ఇవ్వాలన్నారు. 

20:22 - June 5, 2017

విజయవాడ : హేతుబద్దత లేకుండా రాష్ట్ర విభజన చేశారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. నవ నిర్మాణదీక్షలో ఆయన పాల్గొని, మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు సిగ్గులేకుండా మళ్లీ రాష్ట్రానికి వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి అయ్యే వరకు ఏపీ రాష్ట్రానికి కేంద్రం చేయూత ఇవ్వాలన్నారు. తాను ఎవరికి భయపడనని.. స్పష్టం చేశారు. అందరికంటే తానే సీనియర్ నాయకుడినని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును సాధించుకున్నామని చెప్పారు. 2018సం. నాటికి గ్రావిటీతో నీళ్లు వస్తాయన్నారు. ఏపీ బాగుపడితే చూసి ఓర్వలేకపోతున్నారని పేర్కొన్నారు. గిరిజనులకు భూమికి భూమి ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ చేతకాని తనం, దుర్మార్గమైన పని వల్ల చాలా నష్టం పోయామని చెప్పారు. జీఎస్ ఎల్ వీ మార్క్ 3డీ1 రాకెట్ ప్రయోగం విజయంతం అయిందన్నారు. శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. ప్రపంచానికి గుర్తింపు తెచ్చే శాస్త్రవేత్తలు శ్రీహరికోటలో ఉన్నారని కొనియాడారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో పిడుగులు పడటాన్ని ముందే చెబుతున్నారని తెలిపారు. సెల్ ఫోన్ లకు వాయిస్ మెసేజ్ వస్తుందని.. చెప్పారు. దీంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉందన్నారు.

 

జీఎస్‌ఎల్‌వీ మార్క్‌ 3 డీ1 రాకెట్‌ ప్రయోగం విజయవంతం

నెల్లూరు : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో.. మరో చరిత్రను సృష్టించింది. అంతరీక్ష ప్రయోగాల్లో అగ్రరాజ్యాలకు దీటుగా ఎదిగింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన జీఎస్‌ఎల్‌వీ మార్క్‌-3 డీ1 రాకెట్‌ ను విజయవంతంగా ప్రయోగించింది. 3వేల 136 కిలోల బరువైన ఉపగ్రహాన్ని భూమికి 36వేల కిలోమీటర్ల ఎత్తులో .. జియోసింక్రోనస్‌ ఆర్బిట్‌లోకి పంపింది. 

ఫ్లోరిడాలో కాల్పులు..నలుగురు మృతి

అమెరికా : ఫ్లోరిడాలో మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకుంది. నలుగురు మృతి చెందారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు కాల్చి చంపారు. 

19:47 - June 5, 2017

రాజస్థాన్‌ : జైపూర్‌లో ఓ అరుదైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.  ఓ గుర్రం, కారును ఢీకొన్న ఘటన భీతి గొల్పే విధంగా ఉంది.  జైపూర్‌ క్లబ్ ముందు నుంచి ఓ కారు సాధారణ వేగంతోనే వెళ్తోంది. అదే సమయంలో ఓ వ్యక్తి గుర్రాన్ని తీసుకుని రైల్వే స్టేషన్‌ వైపు వెళ్తున్నాడు. కారు సమీపించగానే గుర్రం ఉన్నట్టుండి ముందు భాగంపై కాళ్లను కారుపై పెట్టేసింది. అంతే...కారు అద్దాలు పగలడంతో గుర్రం లోపలికి దూసుకెళ్లింది. గుర్రం శరీరం సగభాగం కారులోనే ఉండిపోయింది. దీంతో స్థానికులు అతి కష్టం మీద గుర్రం తలను బయటికి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో గుర్రానికి తీవ్ర గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు  కొద్దిపాటి గాయాలతో డ్రైవర్  బయటపడ్డాడు. విపరీతమైన ఎండవేడి కారణంగా నియంత్రణ కోల్పోవడంతో గుర్రం కారుపైకి దూసుకెళ్లినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాద దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి.

 

19:45 - June 5, 2017

గుంటూరు : నవ నిర్మాణ దీక్షల ద్వారా సీఎం చంద్రబాబు ఆశయం నెరవేరాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు ఏపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి. కడప జిల్లా జమ్మల మడుగులో 4వ రోజు జరిగిన నవ నిర్మాణ దీక్షలో ఆయన పాల్గొన్నారు. పేద ప్రజల కోసం చంద్రబాబు ఎన్నో సంక్షేమ పథకాలను చేపట్టారని వాటిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆదినారాయణ రెడ్డి సూచించారు. లోకేశ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి మెరుగుపడిందని మంత్రి కితాబిచ్చారు. 
తూ.గో జిల్లాలో 
తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా నవ నిర్మాణ దీక్షలు 4వ రోజు ఘనంగా జరిగాయి.  రాజమహేంద్రవరంలో జరిగిన దీక్షలో గూడా చైర్మన్ గన్ని కృష్ణ, పలువురు అధికారులు  పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సంక్షేమం, అభివృద్ధిపై చర్చలు జరిపారు. లోటు బడ్జెట్‌తో సంక్షేమ పథకాలు అమలు కావన్న ప్రతిపక్షాల విమర్శలకు ధీటుగా చంద్రబాబు పనిచేస్తున్నారని ఈ సందర్భంగా నేతలు చెప్పారు. 
ప.గో జిల్లాలో 
ఏపీ సర్కార్ ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేస్తోందని.. వాటిని పేదలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్సీ రాము సూర్యారావు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్‌లో జరిగిన నవ నిర్మాణ దీక్షల్లో ఆయన పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో సాంఘిక, సంక్షేమ కార్యక్రమాలపై చర్చ జరిగింది. ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలపై పేదలకు అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా రాములు సూర్యారావు అధికారులకు సూచించారు. 

 

విద్యుత్ షాక్ తో ప్రిన్సిపల్, విద్యార్థి మృతి

పశ్చిమగోదావరి : బుట్టాయిగూడెం మండలం కేఆర్ పురంలో విషాదం నెలకొంది. ఐటీడీఏ ట్రైబర్ వేల్ఫేర్ రెసిడెన్సీయల్ కాలేజీలో విద్యుత్ షాక్ తో ప్రిన్సిపల్, విద్యార్థి మృతి చెందారు. 

 

17:12 - June 5, 2017

కడప : జిల్లాలో దుండగులు రెచ్చిపోయారు. వ్యక్తిని దారుణ హత్య చేశారు. ప్రొద్దుటూరులో శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తిపై దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం బాధితున్ని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శ్రీనివాసరెడ్డి మృతి చెందాడు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

మాజీ ఏఎస్సై మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ తిరస్కరణ

కరీంనగర్ : అక్రమ ఆస్తుల కేసులో మాజీ ఏఎస్సై మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. ఈ నెల 9 వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది.

16:48 - June 5, 2017
16:47 - June 5, 2017

కడప : జిల్లాలోని బద్వేలులో 4వ రోజు నవనిర్మాణ దీక్షలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో వెలుగు, డీఆర్‌డీఏ , వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు. ఎస్సీ,ఎస్టీచ బీసీ వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమా కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే జయరాములు అన్నారు. 

16:44 - June 5, 2017

అనంతపురం : ఆంధ్రాకు అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్‌ అని బిజెపి నేత సోము వీర్రాజు మండిపడ్డారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన బిజెపి కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లాకు ఏం చేసిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. 

 

నగరంలో ఘరానా మోసగాడు అరెస్ట్...

హైదరాబాద్: నగరంలో ఘరానా మోసగాడు బాలాజీ అలియాస్ దేవకుమార్ అరెస్ట్ అయ్యారు. ప్రధానమంత్రి కృషి యోజన పథకంలో భాగంగా నిధులు ఇప్పిస్తామని ప్రజాప్రతినిధులకు ఫోన్లు చేశాడు. ఇదే క్రమంలో రేవంత్ రెడ్డికి కూడా ఫోన్ చేశాడు. నియోజకవర్గ పరిధిలో సామాజిక వర్గాల వారికి రూ. 2 కోట్లు ఇప్పిస్తానని దేవకుమార్ నమ్మపలికాడు. కొంత డబ్బు ఇస్తే నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చాడు. అప్రమత్తమైన రేవంత్ రెడ్డి పీఏ ఫిర్యాదుతో దేవకుమార్ ను వలపన్ని జూబ్లీహిల్స్ పోలీసులు పట్టుకున్నారు.

16:40 - June 5, 2017
16:37 - June 5, 2017

చిత్తూరు : తిరుమల మొదటి ఘాట్‌రోడ్డు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 16వ మలుపు వద్ద స్టీరింగ్‌ రాడ్డు విరిగి లారీ నిలిచిపోయింది. దీంతో 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రంగంలోకి దిగిన టీటీడీ క్విక్ రియాక్షన్ టీమ్.. లారీని అక్కడి నుంచి తరలించి.. ట్రాఫిక్ క్లియర్ చేసింది. 

16:31 - June 5, 2017
16:28 - June 5, 2017

చిత్తూరు : తిరుమల అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ధర్మగిరి వేద పాఠశాల సమీపంలోని అటవీ ప్రాంతంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది..మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

16:15 - June 5, 2017

ఢిల్లీ : ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ అదిరే ఆరంభాన్ని దక్కించుకుంది. ఐసీసీ టోర్నీలో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌పై మరో అద్భుత విజయం సాధించింది.  అటు బ్యాటింగ్‌... ఇటు బౌలింగ్‌లో తిరుగులేని ప్రదర్శన చేసి.. పాకిస్తాన్‌ను చిత్తు చేసింది.  దాయాది దేశంపై 124 పరుగుల తేడాతో తిరుగులేని విజయం సొంతం చేసుకుంది. 
తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై విజయం
చాంపియన్స్‌ ట్రోఫీని భారత్‌ ఘనంగా ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌పై సునాయాస విక్టరీతో తన విజయయాత్ర ప్రారంభించింది.  ఆదివారం బర్మింగ్‌హామ్‌లో జరిగిన వన్డేలో పాక్‌పై భారత్‌ అన్ని విభాగాల్లో దూకుడు ప్రదర్శించి... 124 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది.
భారత్‌.. 319/3 
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌  నిర్ణీత 48 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. పాకిస్తాన్‌ను భారీ టార్గెట్‌ను నిర్దేశించింది. రోహిత్‌ శర్మ 91 రన్స్‌తో చెలరేగిపోయాడు.  శిఖర్‌ ధావన్‌ 68 రన్స్‌ చేయగా.. యువరాజ్‌సింగ్‌ 32 బాల్స్‌లో 53 రన్స్‌ సాధించి భారీ స్కోరులో కీలకపాత్ర పోషించాడు. భారత్‌ కెప్టెన్‌ కోహ్లీ కూడా 68 బాల్స్‌లో 81 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. చివరి  4 ఓవర్లలో భారత్‌ ఏకంగా 72 పరుగులు సాధించింది. 
యూవీ, కోహ్లీ భారీ స్కోరుకు బాటలు 
నాలుగేళ్ల క్రితం చాంపియన్స్‌ ట్రోఫీలో తొలిసారి ఓపెనింగ్‌ జోడీగా బరిలోకి దిగిన రోహిత్‌శర్మ, శిఖర్‌ధావన్‌ ఐదు మ్యాచ్‌లలో వరుసగా 127,101,58,77,19 పరుగులు జోడించి జట్టును విజయతీరాలకు చేర్చడంలో కీరోల్‌ పోషించారు. ఈసారి కూడా వీరిద్దరూ భారత్‌కు అదిరే ఆరంభాన్ని ఇచ్చారు. మొదటి వికెట్‌కు 136 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆతర్వాత యువరాజ్‌సింగ్‌... కోహ్లీతో కలిసి భారీ స్కోరుకు బాటలు వేశారు. 
పాకిస్తాన్.. 164 పరుగులకు ఆలౌట్‌
వర్షంతో అంతరాయం కలగడంతో పాకిస్తాన్‌ లక్ష్యాన్ని 41 ఓవర్లలో 289 పరుగులుగా నిర్దేశించారు. 289 టార్గెట్‌తో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ వెనువెంటనే వికెట్లు కోల్పోయింది. 33.4 ఓవర్లలో 164 పరుగులు చేసి ఆలౌట్‌ అయ్యింది. పాక్‌ ఓపెనర్ అజార్‌ అలీ , మహ్మద్‌ హఫీజ్‌ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ పరుగులు చేయలేదు. దీంతో భారీ టార్గెట్‌ ముందు పాకిస్తాన్‌ బోర్లా పడింది.  భారత బౌలర్లలో ఉమేష్‌ యాదవ్‌కు  3వికెట్లు పడగా...హార్ధిక్‌ పాండ్యా, రవీంద్ర జడేలా తలా రెండువికెట్లు తీశారు. ఇక మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు యువరాజ్‌కు దక్కింది.

 

విదేశాంగ శాఖ 3ఏళ్ల ప్రగతి ఇదే : సుష్మాస్వరాజ్

ఢిల్లీ : విదేశాంగ శాఖ 3ఏళ్ల ప్రగతిని ఆ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ వివరించారు. పాస్ పోర్టునిబంధనలను సులభతరం చేశాం. పాసుపోర్టు దరఖాస్తులు 50శాతం పెరిగాయి. మూడేళ్లలో 37.5 శాతం ఎఫ్ డీఐలు పెరిగాయి. అమెరికాలో హెచ్ 1బి వీసాల విధానంపై ఆందోళనలు ఉన్నాయి. ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో ఈ అంశంపై చర్చిస్తారని సుష్మా పేర్కొన్నారు. భారత్ - పాక్ ద్వైపాక్షిక సంబంధాల్లో మార్పులేదు. చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ - పాక్ చర్చలో మూడో పక్షం ప్రమోయాన్ని అంగీకరించమన్నారు.

 

16:06 - June 5, 2017

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లో ఎన్‌ఐఏ దాడులకు నిరసనగా ఇవాళ జరగాల్సిన వేర్పాటువాద నేతల సమావేశాన్ని పోలీసులు భగ్నం చేశారు. హురియత్‌ నేత గిలానీ ఇంటిని పోలీసులు సీజ్‌ చేశారు. మరో వేర్పాటువాద నేతలు యాసిన్‌ మాలిక్‌ను పోలీసులు అరెస్ట్‌ చేయగా...మీర్వాజ్‌ ఉమర్‌ ఫరూఖ్‌ను గృహ నిర్బంధం చేశారు. టెర్రరిస్టు ఫండింగ్‌ విచారణలో భాగంగా గత రెండు రోజుల్లో 40 స్థావరాలపై ఎన్‌ఐఏ దాడులు నిర్వహించింది. హురియత్‌ నేతల అయాజ్‌ అక్బరోతా, ఎల్వోసీ ట్రేడర్స్‌ అసోసియేషన్‌కు చెందిన తారిక్‌ అహ్మద్‌ ఖాన్, ఫారుఖ్‌ బగ్గూ, కమల్‌ బిట్టు ఇళ్లపై ఎన్‌ఐఏ సోదాలు చేసింది. సోదాల్లో భాగంగా సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, పాకిస్తాన్‌కు చెందిన కరెన్సీ దొరికినట్లు సమాచారం. 

 

16:04 - June 5, 2017

ఢిల్లీ : ఖతార్‌తో నాలుగు అరబ్‌ దేశాలు సౌదీఅరేబియా, ఈజిప్ట్‌, బహ్రేయిన్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ దౌత్య సంబంధాలు తెగతెంపులు చేసుకున్నాయి. ఖతార్‌ ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పిస్తోందని ఆరోపించాయి. చుట్టపక్కల దేశాలను ఖతార్‌ అస్థిరపరుస్తున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశాలు ప్రకటించాయి. ఖతార్‌తో ఉన్న తమ సరిహద్దులను సౌదీ అరేబియా ఇప్పటికే మూసివేసినట్లు ప్రభుత్వ వార్తా సంస్థ ఎస్‌పీఏ తెలిపింది. సముద్ర, వాయుమార్గాలను కూడా మూసివేసినట్లు సౌదీ పేర్కొంది. సౌదీ బాటలోనే యుఏఈ, ఈజిప్టు, బహ్రెయిన్‌ దేశాలు ఖతార్‌తో అన్నిరకాల సంబంధాలను తెంపుకున్నాయి. ఖతార్‌ పౌరులు తమ దేశాలను విడిచి వెళ్లేందుకు 14రోజుల గడువును ఇచ్చాయి. ఖతార్‌ దౌత్యవేత్తలను తమ దేశం విడిచి వెళ్లడానికి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ 48 గంటల సమయం ఇచ్చింది.

 

16:01 - June 5, 2017

హైదరాబాద్ : సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు డిమాండ్‌ చేశారు. కాంట్రాక్ట్‌, క్యాజువల్‌ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో సెంట్రల్‌ లేబర్‌ ఆఫీస్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్షణ రంగంలో ఎఫ్‌డీఐ ప్రైవేటీకరణ విరమించుకోవాలని హితవుపలికారు. కనీస వేతనం ఎక్కడా అమలు కావడం లేదని విమర్శించారు. 

15:56 - June 5, 2017

యాదాద్రి భువనగిరి : ప్రేమజంట నరేశ్, స్వాతిల మృతిపై సమగ్ర విచారణ జరపాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ డిమాండ్ చేశారు. ఈమేరకు వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. వామపక్ష నేతలు భువనగిరి కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జహంగీర్ మాట్లాడుతూ వీరి మృతిపై ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నరేశ్ హత్య కేసులో నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 

 

15:51 - June 5, 2017

జనగామ : జిల్లాలోని పెంబర్తికి చెందిన మనోజ్‌కుమార్‌ తన మూఢనమ్మకాలతో గ్రామ ప్రజలను బురిడీ కొట్టించాడు. జాతీయ రహదారి పక్కన భూగర్భంలో శివలింగం ఉందంటూ నమ్మబలికాడు. పది అడుగులు తవ్వితే శివుడు ప్రత్యక్షమవుతాడంటూ మూడేళ్లుగా చెబుతూ వస్తున్నాడు. ఇంతకాలం తన మాటలను విశ్వసించకపోవడంతోనే  పెంబర్తికి నష్టం జరిగిందంటూ మరోసారి గ్రామ పెద్దలకు నూరిపోశాడు. ఇకపై శివలింగాన్ని తవ్వకపోతే గ్రామానికి అరిష్టమని నమ్మబలికాడు. దీంతో ఈసారి మనోజ్‌ మాటలు నమ్మిన ప్రజలు  పెంబర్తిలో జాతీయ రహదారి పక్కన పదిహేను అడుగుడులమేర తవ్వినా శివలింగం కనిపింలేదు. రోడ్డు తవ్వడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో మనోజ్‌కుమార్‌తోపాటు, ఇతనికి సహకరించిన ఐదుగుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

15:47 - June 5, 2017

హైదరాబాద్ : మియాపూర్ లో భూస్కాంపై సమగ్ర విచారణ జరిపి... బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్‌ మియాపూర్‌లో అక్రమ రిజిస్ట్రేషన్‌ చేసిన భూములను తెలంగాణ టీడీపీ నేతలు పరిశీలించారు. వందలాది ఎకరాల భూమి కబ్జాకు గురవుతున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సర్కారు భూమిని కాపాడే విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రశ్నించారు. 

 

ప్రొద్దుటూరులో వేట కొడవళ్లతో దాడి

కడప: ప్రొద్దుటూరులోని కానేపల్లిలో శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి పై వేట కొడవళ్లతో దుండగులు దాడి చేశారు. తీవ్రగాయాలతో ఉన్న శ్రీనివాసరెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

14:48 - June 5, 2017

హైదరాబాద్: జూన్ 30 త‌రువాత వాట్సాప్ సేవ‌లు నిలిచిపోనున్నాయి. అయితే అన్ని ఫోన్ల‌లో కాదు. కేవ‌లం కొన్ని ఫోన్ల‌లో మాత్ర‌మే వాట్సప్ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ ఫోన్ల‌లో ఉండే ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌కు స‌పోర్ట్ నిలిపివేశామ‌ని దీంతో వాట్సాప్ ఆ ఫోన్ల‌లో ప‌నిచేయ‌ద‌ని గ‌తంలోనే ఆ సంస్థ తెలియ‌జేసింది. అయితే దీనిపై యూజ‌ర్ల నుంచి వ్య‌తిరేకత వ‌చ్చింది. దీంతో ఆ నిర్ణ‌యాన్ని వాట్సాప్ అప్ప‌టికి వాయిదా వేసింది. కానీ... జూన్ 30 త‌రువాత అదే నిర్ణ‌యాన్ని అమ‌లు చేయాల‌ని వాట్సాప్ యోచిస్తోంది.బ్లాక్‌బెర్రీ (బ్లాక్‌బెర్రీ 10 సహా), నోకియా ఎస్‌40, నోకియా సింబియన్‌ ఎస్‌60, ఆండ్రాయిడ్‌ 2.1 , ఆండ్రాయిడ్‌ 2.2, విండోస్‌ ఫోన్‌ 7.1, ఐఫోన్‌ 3జీఎస్‌/ఐవోఎస్ 6 ఫోన్లు, ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ల‌లో జూన్ 30 త‌రువాత వాట్సాప్ ప‌నిచేయ‌దు. క‌నుక ఈ ఫోన్ల‌ను వాడుతున్న వారు కొత్త ఫోన్‌కు లేదా కొత్త ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌కు అప్‌గ్రేడ్ కావాల‌ని వాట్సాప్ ఇప్ప‌టికే సూచిస్తున్న‌ది. ఇక ఈ ఫోన్లు కాకుండా మిగిలిన ఫోన్ల‌ను వాడుతున్న వారు య‌థావిధిగా జూన్ 30 త‌రువాత కూడా వాట్సాప్‌ను వాడుకోవ‌చ్చ‌ని, వారు ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేద‌ని వాట్సాప్ చెబుతున్న‌ది.

తిరుమల ఘాట్ రోడ్డు లో ట్రాఫిక్ జాం

తిరుమల: మొదటి ఘాట్ రోడ్డు 16వ మలుపు వద్ద స్టీరింగ్ రాడ్డు విరిగి లారీ నిలిచిపోయింది. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జాం అయ్యింది.

14:35 - June 5, 2017

జైపూర్‌: ఎండ వేడికి తట్టుకోలేక ఓ గుర్రం ఏకంగా కారు అద్దాలు బద్దలుగొట్టి దానిలోకి దూరిపోయింది. ఈ ఘటన రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

13:49 - June 5, 2017

హైదరాబాద్ : మునుపెన్నడూ లేనంతగా భాగ్యనగరాన్ని ఎండలు అట్టుడికించాయి. దీంతో నగరంలో మంచినీటికి డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. మరోవైపు నాగార్జున సాగర్‌లో నీటి నిల్వలు పడిపోవడంతో జలమండలి అధికారులు ప్రత్నామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించారు. నీటి సరఫరా చేయడానికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున సాగర్‌లోని పుట్టంగండి వద్ద ఏర్పాటుచేసిన పంప్‌ స్టేషన్‌ నుంచి నగరానికి 248 మిలియన్‌ గ్యాలన్ల నీరు సరఫరా అవుతోంది. అక్కడ నీటి మట్టం ఏ మాత్రం తగ్గినా మోటార్లకు నీరు అందక నీటి సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉంది. సాగర్‌లో వాస్తవ నిల్వ సామర్థ్యం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 503.300 అడుగులు మేర మాత్రమే నీళ్లున్నాయి. 502 అడుగుల కంటే దిగువకు వెళ్తే నీటి సరఫరాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ సమస్యనుంచి అధిగమించాలంటే రెండో దశ పంపింగ్ లేదా ఇతర మార్గాల ద్వారా నీరు తరలించాలి. ఇందుకోసం 35 నుంచి 40 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.

సాగర్ లో తగ్గిన నీటి మట్టం...
వాస్తవానికి 420 ఎంజీడీలు మంచినీరు నగరానికి అవసరం. ఇందులో 248 ఎంజీడీలు కృష్ణా జలాలే. కాగా సింగూరు, మంజీరా నుంచి 48, ఉస్మాన్‌ సాగర్‌ నుంచి 10, గోదావరి నుంచి 14తో కలిపి మొత్తం 420 ఎంజీడీల మంచినీరు సిటికి సరఫరా అవుతోంది. సాగర్‌లో నీటి మట్టం తగ్గి పంపింగ్ నిలిచిపోతే సిటీ.. నీటి కొరతతో అల్లాడాల్సి వస్తుంది. ప్రస్తుతం ఉన్న నీటితో మరో వారం పది రోజులు లాక్కొచ్చినా.. తరువాత ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని జలమండలి బోర్డు అంచనా వేస్తోంది. మరోవైపు ఎండ తీవ్రతకు జలాశయాల్లో నీరు ఆవిరై నీటిమట్టాలు వేగంగా తగ్గిపోతుండటంతో గ్రేటర్ పరిధిలోని కొన్ని ప్రాంతాలకు నీటి తిప్పలు తప్పేలా లేవు.

హిమాయత్ సాగర్‌....
గతేడాది వర్షాలకు జంట జలాశయాలు పూర్తిగా నిండాయి. గోదావరి, కృష్ణాల నుంచి నీరు పుష్కలంగా అందుబాటులో ఉండడంతో నగరంలో భూగర్భజలాల మెరుగుదల కోసం ఆ జలాశయాల్లో నీటిని అలానే ఉంచారు. ప్రస్తుతం నాగార్జునసాగర్‌లో నీటిమట్టం పూర్తిగా తగ్గడంతో నగర జంట జలాశయాల నుంచి నీటిని సరఫరా ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. త్వరలో హిమాయత్ సాగర్‌ నుంచి నీటి సరఫరా మొదలు పెట్టనున్నారు. వాస్తవంగా ఈ రెండు జలాశయాల నుంచి 40 ఎంజీడీల నీరు నగరానికి రావాలి. ఆక్రమణలు, వ్యర్థాల డంపింగ్‌తో ఆ జలాశయాల్లో నీటి నిల్వ సామర్ధ్యం ప్రస్తుతం 20 నుంచి 25 ఎంజీడీలు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. దీంతో నీటి ఇబ్బందిని అధిగమించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని నగరవాసులు వేడుకుంటున్నారు. ప్రస్తుతం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ల ద్వారా వచ్చే నీటితో నగరవాసులకు ఉపశమనం లభిస్తుంది. అయితే భవిష్యత్‌లో నీటి కొరత ఏర్పడకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని నగరవాసులు కోరుతున్నారు. మరి నీటి కొరత నుండి కాపాడటానికి జలమండలి ఎలాంటి చర్యలు చేపడుతుందో వేచి చూడాలి. 

13:41 - June 5, 2017

హైదరాబాద్ : ఏపీ ఇండస్ట్రీస్ అడిషనల్ డైరెక్టర్ సరేష్ ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహిస్తుంది. ఆదాయనికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో సోదాలు చేస్తున్నారు. ఏకకాలంలో హైదరాబాద్, కర్నూలు, విజయవాడ, గుంటూరులో తనిఖీలు కొనసాగిస్తున్నారు. రూ.40 కోట్లకు పైగా అక్రమ ఆస్తులున్నట్లు ఏసీబీ అధికారలు గుర్తించారు. సరేష్ పై అనేక అవినీతి ఆరోపణలు ఎంతో కాలంగా వినిపిస్తున్నాయి. 

13:31 - June 5, 2017

వరంగల్ : జిల్లాలోని ఖిలావరంగల్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో దారుణం జరిగింది. ఓ వివాహిత తన ఇద్దరు కూతుళ్లపై కిరోసిన్ పోసి తాను నిప్పంటించుకున్నారు. తల్లితో పాటు చిన్న కూతురు వర్షిణి మృతి చెందింది. పెద్ద కూతరు ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కొద్ది రోజులుగా భార్యభర్తల మధ్య కుటుంబకలహాలు ఉన్నట్టు బంధువులు తెలిపారు. పోలీసులు భర్త శివతో పాటు అత్తను అదుపులోకి తీసుకున్నారు. అయితే పుట్టింటి వారు భర్తే హత్య చేశాడని ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.  

జలవనరులు, నీటి భద్రతపై సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి: జలవనరులు, నీటి భద్రతపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న వివిధ ప్రాజెక్టుల పనులపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. పరిశ్రమలు, వ్యవసాయం, తాగేందుకు నీరు ఇచ్చే బాధ్యత పూర్తిగా జలవనరుల శాఖ అధికారులదే అని చంద్రబాబు తెలిపారు. ఈ ఏడాది నీటి నిర్వహణ పక్కా ప్రణాళికతో జరగాలన్నారు. అన్ని జలవనరులను జియో ట్యాంగింగ్ చేయాలన్నారు. నోడల్ అధికారులను నియమించి రెయిన్ గన్లను సమర్థవంతంగా వినియోగించినట్లు చంద్రబాబు తెలిపారు.

కాళేశ్వరం - సుందిళ్ల బ్యారే జ్ కేసులో ఊరట

ఢిల్లీ: కాళేశ్వరం - సుందిళ్ల బ్యారే జ్ కేసులో టి.సర్కార్ కు సుప్రీంలో ఊరట లభించింది. ఈ కేసును డిస్మిస్ చేస్తాం సుందిళ్ల బ్యారేజ్ పై ఏక సభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. అవార్డు కేటాయించిన తర్వాత భూ సేకరణకు అవాంతరాలు ఏమున్నాయని సుప్రీం ప్రశ్నించింది. అవార్డులు ఇవ్వనంత వరకే స్టే అమల్లో ఉంటుందని టి.సర్కార్ ప్రభుత్వ తరపు న్యాయయవాది ద్విసభ్య ధర్మాసనం లేనందున జులై 2వ వారానికి వాయిదా వేసింది.

13:10 - June 5, 2017

తూర్పు గోదావరి : జిల్లాలోని యానాంలో దారుణం జరిగింది. స్థానిక బాలయోగి బ్రిడ్జ్ పైనుంచి ప్రియురాలిని గోదావరిలోకి ప్రయుడు తోసేశాడు. గమనించిన మత్స్యకారులు యువతిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రియుడు పరారీలో ఉన్నాడు. నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు. వీరి ఇద్దరి మధ్య గత ఐదేళ్లుగా ప్రేమ కొనసాగుతోంది. పెళ్లి చేసుకోమన్నందుకు నీటిలో తొశాడని యువతి పోలీసులకు తెలింది. 

బోనాల ఉత్సవాలపై మంత్రి తలసాని సమీక్ష

హైదరాబాద్‌ :నగరంలో బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 23 వరకు జంట నగరాల్లో ఆషాఢమాస బోనాల ఉత్సవాలు జరుగుతాయన్నారు. 25న గోల్కొండలోని జగదాంబ మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పిస్తారని చెప్పారు. బోనాల పండుగ నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ నెల 15వ తేదీన అధికారులు, కార్పొరేటర్లు ఫీల్డ్ విజిట్ చేసి సమస్యలను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.

జవాన్లపై నక్సల్స్‌ మెరుపుదాడి: ఒక జవాన్ మృతి

కాందమల్‌: జవాన్లపై నక్సల్స్‌ మెరుపుదాడికి దిగారు. ఒడిశాలో కాందమల్‌ జిల్లాలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహించి తిరిగి వస్తున్న జవాన్ల పై నక్సల్స్ మాటువేసి ఒక్కసారిగా జవాన్లపై కాల్పులు జరిపారు. పోలీసులు ఎదురుకాల్పులకు పాల్పడటంతో మావోలు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనలో స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూప్‌కు చెందిన లక్ష్మికాంత్‌ జానీ అనే జవాను మృతిచెందారు. మరో 10 మంది జవాన్లు గాయపడినట్లు కాందమల్‌ ఎస్పీ తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వీరిలో ముగ్గురు జవాన్ల పరిస్థితి విషమంగా ఉండటంతో బెర్హంపూర్‌లోని ఆసుపత్రికి తరలించారు.

ఏపీ ఇండస్ట్రీస్ అడిషనల్ డైరెక్టర్ ఏసీబీ సోదాలు

హైదరాబాద్: బేగంపేట ధరమ్ కరమ్ రోడ్డులో ఏపీ ఇండస్ట్రీస్ అడిషనల్ డైరెక్టర్ సురేష్ బాబు ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. అంతే కాకుండా మరో 8 ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు రూ.40 కోట్లు అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. మరో రూ.100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు సమాచారం.

12:42 - June 5, 2017

ఎదో సాధించలన్న తపన...తామేంటో నిరూపించుకోవాలనే పట్టుదల...ఎదురుగా ఉన్న లక్ష్యాన్ని అందుకునే క్రమంలో ఎదరరైన సవాళ్లను ఎదర్కొంటూ...అధికమిస్తూ అనుకున్న లక్ష్యాన్ని సాధించలనే పట్టుదలకు, ఆత్మవిశ్వానికి నిలువేత్తు ప్రతీకాలుగా ఉన్న ముగ్గురు మహిళ మణిరత్నాలు...వారే ఈఏటి సివిల్ ర్యాంకర్స్ మల్లవరపు బాల లత, శాలిని, నిశాంతి గారితో ముఖ మఖీ పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

బిజెపి, ప్రధాని పై రాహుల్ నిందలు గర్హనీయం:వెంకయ్యనాయుడు

ఢిల్లీ : బిజెపి, ప్రధాని పై రాహుల్ నిందలు వేయడం గర్హనీయం అని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ప్రత్యేక ప్యాకేజీని వ్యతిరేకిస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఏపీ ప్రత్యేక ప్యాకేజీ ద్వారా సహాయం చేస్తామన్నారు. కాలపరిమితి పూర్తయ్యే లోపు విభజన హామీలన్నీ పూర్తి చేస్తామనే నమ్మం ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేక హోదాను కాంగ్రెస్ చట్టంలో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ మర్చిపోయిన అంశాలన్నీ బిజెపి ప్రభుత్వం చేస్తోందన్నారు.

'కాళేశ్వరం' పనులు ఆపేందుకు సుప్రీం నిరాకరణ

ఢిల్లీ : కాళేశ్వరం ప్రాజెక్టు ఆపేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ప్రాజెక్టు పనులను నిరాటంకంగా కొనసాగించవచ్చని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.

భూ కుంభకోణం కేసును సీబీఐకి అప్పగించాలి: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: మియాపూర్ లో తెలంగాణ టీడిపి నేతలు ఎల్.రమణ, రేవంత్ రెడ్డిలు అన్యాక్రాంతమైన భూములను పరిశీలించారు. భూ కుంభకోణం కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.

శ్రీనివాస్ రెడ్డి, సత్తిరెడ్డి ని రిమాండ్ కు తరలింపు...

యాదాద్రి : భువనగిరి : నరేష్ హత్య కేసులోనిందితులు శ్రీనివాస్ రెడ్డి, సత్తిరెడ్డికి పోలీసు కస్టడీ ముగిసింది. భువనగిరి కోర్టు లో హాజరు పరచగా వారిని రిమాండ్ కు తరలించారు.

మోదీకి ప్రత్యామ్నాయంగా కూటమి:సీపీఐ

గుంటూరు: మోదీకి ప్రత్యామ్నాయంగా కలిసొచ్చే పార్టీలతో కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు సీపీఐ నేతలు తెలిపారు. 2నెల 17,18,19 తేదీల్లో జరగనున్న పార్టీ సమావేశాల్లో దీనిపై చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. టిడిపి మా సభకు నల్లబ్యాడ్జీలు, జెండాలతో నిరసన తెలిపి ప్రత్యేక హోదా అవసరం లేదని కేంద్రానికి సంకేతాలు పంపారని ఇది రాష్ట్రానికే కాదు.. చంద్రబాబుకు కూడా తీవ్ర నష్టమే సీపీఐ నేతలు సురవరం, ఎంపి రాజా పేర్కొన్నారు.

తిరుమల ధర్మగిరి వద్ద అగ్ని ప్రమాదం..

తిరుమల : తిరుమల ధర్మగిరి వేద పాఠశాల సమీప అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయి. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

12:15 - June 5, 2017

తూర్పు గోదావరి : జిల్లాలోని పెద్దాపురం సీతారామ సత్రం ఈవోగా పనిచేస్తునన్న చిమలకొండ సాయిబాబు ఇంట్లో ఏసీడీ తనిఖీలు నిర్వహింస్తుంది. ఏసీబీ అధికారులు ఏకకాలంలో భీమవరం, రేలంగి, తఱుకులో కొనసాగిస్తున్నారు. అధికారుల తనిఖీల్లో సమారు రూ.90 లక్షల అక్రమా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. సాయిబాబు భార్య, కుటుంబసభ్యుల పేరిట వివిధ బ్యాంకుల్లో 14 అకౌంట్లు ఉన్నట్లు అధికారులు కనుగొన్నారు. సాధారణ స్థాయి అధికారి పెద్ద మొత్తంలో అక్రమాస్తులు సంపదించాడాన్ని అధికారులు అశ్ఛర్యం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  

12:06 - June 5, 2017

కొత్తదనమున్న కథలను ఎంచుకుంటూ ప్రత్యేకతను చాటుకోవడానికి ప్రయత్నిస్తోన్న కుర్ర హీరో విజయ్ దేవర కొండ సోషల్ మీడియాలో ఓ ఇంటివాడైపోతున్నాడు అన్న కథనాల పై ఆయన ఆయన తనదైన శైలిలో స్పందించాడు. తన ప్రేమ .. పెళ్లి గురించి వస్తోన్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని ఆయన చెప్పాడు. తన పెళ్లికి చాలా సమయం ఉందనీ .. అప్పుడు అందరికీ తానే స్వయంగా చెబుతానని అన్నాడు. ప్రస్తుతం తన దృష్టి అంతా కెరియర్ పైనే ఉందని స్పష్టం చేశాడు.

11:58 - June 5, 2017

దుంప కూరల్లో కందగడ్డ రుచికి మరొకటి లేదు. అడవులలో తిరిగే మునులు “కందమూలాలు” తిని బతికేవారని పురాణాలు మనకు తెలుపుతున్నాయి. చూపులకు అందంగా కనిపించకపోయినా కంద వంటకాలన్నీ ఎంతో రుచిగా ఉంటాయి. కంద దుంప చాలా బలమైన ఆహారం. ఈ దుంప తింటే షుగర్, ఒబిసిటీలను అదుపులో ఉంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులో విటమిన్ ‘ఎ’ చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. కందలో పొటాషియం, ఫైబర్ నేచురల్ షుగర్స్ చాలా తక్కువ కేలరీస్‌తోనే ఎక్కువ బలం లభించేలా చేస్తాయి. ఇక గర్భిణులకు చేసే మేలు అంతా ఇంతా కాదు, పుట్టబోయే బిడ్డకు కూడా ఆరోగ్యాన్ని, రోగ నిరోధక శక్తిని ఇస్తుంది. కంద తీసుకోవడం వలన జీర్ణప్రక్రియ వేగమవ్వడమే కాకుండా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. చిన్న కంద గడ్డ ద్వారా మన శరీరానికి దాదాపు ఆరు గ్రాముల ఫైబర్ చేరుతుంది. కేన్సర్ బారిన పడకుండా కాపాడమే కాకుండా ప్రోస్టేట్ క్యాన్సర్ నివారణకు కంద ఓ దివ్యమైన ఔషధంలా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. .మీ ఆహరం లో కందని చేర్చుకోండి..ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

జెట్టింగ్ మిషన్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్: మురుగు నీటి నిర్వహణలో నూతనంగా ప్రవేశపెట్టిన జెట్టింగ్ మిషన్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నగరంలోని సివరేజ్ పైప్ లైన్లల బ్లాకింగ్, పూడికతీతకు ఈ జెట్టింగ్ మిషన్లను జలమండలి ఉపయోగించనుంది. పీపుల్స్‌ప్లాజ్‌లో సీవరేజ్ వాహనాలను మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 70 మినీ సివరేజ్ జెట్టింగ్ వాహనాలను జలమండలి కొనుగోలు చేసింది.

11:46 - June 5, 2017
11:44 - June 5, 2017

హైదరాబాద్ : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేపట్టిన జనసైనికుల ఎంపికకు యువత నుంచి మంచి స్పదన వస్తోంది. దీంతో క్రియాశీల కార్యకర్తల ఎంపికను వేగవంతం చేశారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలు సభ్యత్వ నమోదు ద్వారా కార్యకర్తలను ఎంపిక చేస్తుంటే, పవన్‌ కల్యాణ్‌ ఇందుకు భిన్నంగా అడుగులు వేస్తున్నారు. సామాజిక స్పృహ ఉండి, సమకాలీన రాజకీయ, ఆర్థిక పరిస్థితులు, సమస్యలపై అవగాహన ఉన్న యువతకు పార్టీలో పెద్దపీట వేస్తున్నారు. అనంతపురం జిల్లాలో ప్రారంభించిన కార్యకర్తల ఎంపిక ఉత్తరాంధ్ర, హైదరాబాద్‌ జిల్లాలకు పూర్తైంది.

మరో మూడు జిల్లాల్లో
ఈనెల 6 నుంచి నెల్లూరు, ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లా కార్యకర్తల ఎంపిక ప్రారంభించనుంది. ఎంపికయ్యే జనసైనికులు ప్రజా సమస్యలను గుర్తించి, వీరి పక్షాల పోరాడే విధంగా శిక్షణ ఇవ్వనున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం ద్వారా రాజకీయంగా రాటుతేలతారన్న ఉద్దేశంతో జనసేన సమర్థులైన వారినే కార్యకర్తలుగా ఎంపిక చేసుకుంటోంది. జనసేన పోరాటం ద్వారానే శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యకు కొంతవరకు పరిష్కారం లభించింది.అనంతపురం జిల్లాలో కరవు సమస్యలపై పోరాటానికి జనసైనికులు సిద్ధమవుతున్నారు. ప్రజా సమస్యలపై పోరాటాలే కాదు..పార్టీ వ్యవహారాల్లో కూడా జనసైనికులు క్రియాశీల పాత్ర పోషించే విధంగా తీర్చిదిద్దుతున్నారు. పార్టీ సిద్ధాంతాలను జనాలకు వివరించి, ప్రజాభిప్రాయాన్ని జనసేనకు అనుకూలంగా మార్చే విధంగా చేస్తున్నారు. ఇప్పటి వరకు పవన్‌ కల్యాణ్‌ ఒక్కరే ప్రజా సమస్యలపై పెదవి విప్పుతున్నారు. ఇకపై జనసైనికులు కూడా దళపతి బాటలోనే నడవనున్నారు. తమ పరిధిలోని ప్రజా సమస్యలపై పోరాటాలకు సిద్ధమవుతున్నారు. తర్వాత ఎన్నికలకు సన్నద్ధం చేసే విధంగా పార్టీ కార్యకర్తలను సుశిక్షితులైన సైనికులుగా తీర్చిదిద్దతున్నారు. 

11:42 - June 5, 2017

హైదరాబాద్ : ఎల్బీనగర్‌ చింతల్‌కుంటలో విషాదం చోటుచేసుకుంది. ఫ్లై ఓవర్‌ కోసం తవ్విన గుంతలో బైక్‌ పడిపోయిన ఘటనలో గాంధీనగర్‌కు చెందిన రాఘవేందర్‌ మృతి చెందాడు. ఈ ప్రమాదంలో గాయపడ్డ మరో ఇద్దర్ని ఆస్పత్రికి తరలించారు. చింతల్‌కుంటలో పార్టీకి వెళ్లి తిరిగివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 

11:40 - June 5, 2017

నెల్లూరు : ప్రభుత్వ భవనాలు, రోడ్డు డివైడర్లపై పోస్టర్లు అంటిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని... ఏపీ మంత్రి నారాయణ హెచ్చరించారు.. నెల్లూరు గాంధీబొమ్మ దగ్గర పోస్టర్లను స్వయంగా క్లీన్‌ చేశారు.. సుందరీకరణలోభాగంగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీ గోడలను, రోడ్లను పెయింటింగ్‌లువేసి సుందరీకరిస్తామని తెలిపారు.. నెల్లూరులో ప్రపంచ పర్యావరణ దినోత్సవ ర్యాలీని మంత్రి ప్రారంభించారు.

11:39 - June 5, 2017

హైదరాబాద్‌ : మురుగునీటిని ప్రక్షాళన చేసేందుకు జీహెచ్‌ఎంసీ నూతన యంత్రాలను ప్రవేశపెట్టింది. నగరంలోని సివరేజ్‌ పైప్‌లైన్‌ల బ్లాకింగ్‌, పూడికతీతకు అత్యాధునిక జెట్టింగ్‌ మిషన్లను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మహానగరంలో సివరేజ్‌ పనులకు ఈ జెట్టింగ్‌ మిషన్‌లను జలమండలి ఉపయోగించనుంది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమ్మూద్‌ అలీ, మంత్రి నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, పద్మారావు, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ...హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని..కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్‌ సహకారంతో అనేక కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. 

 

11:39 - June 5, 2017

మనం ప్రతి రోజు ఇంట్లో అన్నం వడుతుంటాం. అంతకంటే ముందు బియ్యాన్ని కడిగిన తరువాత వండుతాం. అయితే బియ్యం కడిగి న నీటిలో బియ్యం కడిగిన నీటితో అనేక లాభాలున్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మొటిమల బాధ తగ్గుతుంది. ముఖారవిందాన్ని పెంచుతుంది. ఈనీటిలో దూదిని ముంచి ముఖంపై ఐప్లె చేయడం వల్ల ముఖం తాజాగా, మృదువుగా మారుతుంది. అందానికి.. ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతో ఉపయోగపడతాయని అంటున్నారు.-

అంతే కాదండోయ్ బియ్యం కడిగిన నీటిలో జుట్టుకు మేలు చేసే విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. జుట్టు పొడవుగా.. ఒత్తుగా పెరిగేందుకు ఈ నీరు ఎంతో ఉపయోగపడుతుంది.

మోచేతులు, కాళ్ల పై కొంత మందికి నలుపు ఉంటుంది. నలుపు ఉన్న ప్రాంతంలో బియ్యం కడిని నీటిని తీసుకుని కాటన్ బాల్స్ తో రుద్దితే కొన్ని రోజులకు నలుపు పోతుంది. ఇప్పటికీ కొందరు బియ్యం కడిగిన నీటితో జావ కాచుకొని తాగేవారు ఎంతో ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు.

మరి ఇంకెందుకు ఆలస్యం.. మనం కూడా ఒకట్రైల్ వేస్తే పోలా...

11:28 - June 5, 2017

కెరీర్ ఆరంభంలో వరుస వైఫల్యాలు చవిచూసినప్పటికి గత ఐదేళ్లుగా తన సినీ ప్రయాణం సంతృప్తికరంగా సాగిపోతుందని, స్టార్‌డమ్‌పై తనకు నమ్మకం లేదని, ప్రతిభావంతురాలైన నటిగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోవాలన్నదే తన లక్ష్యమని చెబుతున్నది శృతిహాసన్. ప్రస్తుతం దక్షిణాదితో పాటు హిందీ పరిశ్రమలో మంచి అవకాశాలు లభిస్తున్నాయి. నా మనసుకు నచ్చిన పాత్రలు చేసే అవకాశం లభిస్తున్నది. రాబోవు రోజుల్లో ఛాలెంజింగ్ రోల్స్ చేయాలనే లక్ష్యంతో ముందుకుసాగుతున్నాను అని శృతిహాసన్ చెప్పింది. మీ నాన్న కమల్‌హాసన్ నాస్తికుడు. మరి మీకు దేవుడిపై విశ్వాసం వుందా? అని అడిగితే...దేవుడిపై ఎవరి విశ్వాసాలు వారికుంటాయి. నేను దేవుణ్ణి బలంగా విశ్వసిస్తాను. జీవితంలోని ఎన్నో సంక్షోభాల నుంచి ఆ భగవంతుడే నన్ను గట్టెక్కించాడని భావిస్తున్నాను అని తెలిపింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో శృతిహాసన్ నటించిన బహెన్ హోగీ తేరి చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది.

11:28 - June 5, 2017

ఎన్డీటీవీ ప్రణయ్ రాయ్ ఇంట్లో సీబీఐ సోదాలు..

ఢిల్లీ: ఎన్డీటీవీ సహ వ్యవస్థాపకుల్లో ఒకరు, ఎగ్జిక్యూటివ్‌ కో-ఛైర్మన్‌ ప్రణయ్‌రాయ్‌ ఇంట్లో సీబీఐ సోదాలు చేపట్టింది. ఢిల్లీలోని ప్రణయ్‌ నివాసంలో తనిఖీలు కొనసాగుతున్నాయని సీబీఐ వెల్లడించింది. ఓ బ్యాంకుకు డబ్బులు చెల్లించకుండా నష్టం కలిగించారనే ఆరోపణలతో సీబీఐ ఈ సోదాలు చేపట్టింది. ఇందులో భాగంగా.. ప్రణయ్‌రాయ్‌, రాధికా రాయ్‌, మరో ప్రయివేటు కంపెనీపై సీబీఐ కేసు నమోదు చేసింది.

11:21 - June 5, 2017

తేజ దర్శకత్వంలో రానా, కాజల్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’. ఈ చిత్రాన్ని సురేశ ప్రొడక్షన్స్, బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌టైనమెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. డి.సురేష్‌బాబు, కిరణ్‌రెడ్డి, భరత్‌ చౌదరి తెలుగుతో పాటు తమిళంలోనూ నిర్మిస్తున్నారు. దివంగత నిర్మాత డి.రామానాయుడు జయంతిని పురస్కరించుకొని ఈ నెల 6వ తేదీన కథానాయకుడు రానా ట్విట్టర్‌ ద్వారా సినిమా టీజర్‌ని విడుదల చేస్తారు. డి.సురేష్‌బాబు మాట్లాడుతూ ‘‘నాన్నగారి జయంతి కానుకగా ‘నేనే రాజు నేనే మంత్రి’ టీజర్‌ని విడుదల చేయనుండడం ఆనందంగా ఉంది. రానా కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచిపోయే చిత్రమిద’’న్నారు. రానా మాట్లాడుతూ ‘‘సినిమాలో నేను పోషించిన జోగేంద్ర పాత్ర స్వభావాన్ని టీజర్‌ ద్వారా పరిచయం చేయబోతున్నామ’’న్నారు. రానాలోని వైవిధ్యమైన నటుడిని ఈ చిత్రంలో చూపించబోతున్నామని చెప్పారు దర్శకుడు. దీనికి సంగీతాన్ని అనూప్‌ రూబెన్స్‌ సమకూర్చుతున్నారు.

హైదరాబాద్‌లో ప్రస్తుతం షెడ్యూల్‌ జరుగుతోంది. మరోవైపు నిర్మాణానంతన పనులు కూడా సాగుతున్నాయి. తెలుగు, తమిళ్‌, హిందీ, మలయాళంలో సినిమాను విడుదల చేస్తాం. ‘టైటిల్‌ లోగో, ఫస్ట్‌లుక్‌ను త్వరలో ఆవిష్కరిస్తాం’’ అని అన్నారు. తేజ మాట్లాడుతూ ‘‘మన చుట్టుపక్కల ఏం జరుగుతున్నా మనం పట్టించుకోం. ఎవరి ఆక్రందనలూ మరొకరికి వినిపించవు. ఎవరి అవమానాలు మరొకరికి కనిపించవు. పోతేపోనీ అనుకుంటూ కాలం గడిపేస్తుంటాం. దశాబ్దాలుగా మనం ఇలాగే బతికేస్తున్నాం. ఈ దృక్పథాన్ని మార్చే సినిమా ‘నేనే రాజు నేనే మంత్రి’. రానా పాత్ర సరికొత్త ఆలోచనల్ని రేకెత్తిస్తుంది. సమాజంలో మార్పు తెస్తుంది. అదెలాగో చిత్రంలో చూడాల్సిందే’’ అని చెప్పారు. ‘‘తేజగారిని ఎప్పటినుంచో చూస్తున్నాను. ఆయన ఆకలి మాత్రమే కాదు.. మనందరి ఆకలిని తీర్చే చిత్రమిది’’ అని రానా అన్నారు . కాజల్‌ ఇందులో నాయిక. అశుతోష్‌ రాణా, కేథరిన ట్రెస్సా, నవదీప్‌, పోసాని, జేపీ, రఘు కారుమంచి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అభిరామ్‌ దగ్గుబాటి, వివేక్‌ కూచిభొట్ల ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతలు.

పోస్టర్ ఫ్రీ స్పెసల్ డ్రైవ్ ను ప్రారంభించిన మంత్రి నారాయణ

నెల్లూరు: పర్యావరణ దినోత్సవం సందర్భంగా పోస్టర్ ఫ్రీ స్పెసల్ డ్రైవ్ ను మంత్రి నారాయణ ప్రారంభించారు. నెల్లూరు గాంధీ బొమ్మ వద్ద పోస్టర్లను మంత్రి తొలగించారు. విజయమహల్ లో గోడలకు మంత్రి నారాయణ పెయింట్ వేశారు. ప్రభుత్వ భవనాలు, రోడ్డు డివిఐడర్లపై పోస్టర్లు అంటించినా, రాతలు రాసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మున్సిపాలిటీల్లో గోడలు, రోడ్లను 4 నెలల్లో సుందరీకరిస్తామన్నారు. నవంబర్ లోగా అన్ని పట్టణాలను హరితపట్టణాలుగా, అమరావతిని పర్యావరణ అనుకూల నగరంగా చేస్తామని తెలిపారు.

11:05 - June 5, 2017

మహబూబ్ నగర్ :  జిల్లాలో కొత్తూరు మండలం తిమ్మాపూర్ నుంచి అలంపూర్ మండలం బూరెల్లి గ్రామం వరకు 179 కిలోమీటర్ల పొడవున జాతీయ రహదారి ఉంది. ఈ దారి ఇప్పుడు మృత్యు మార్గంగా మారింది. నిత్యం వేలాది వాహనాలు ప్రయాణించే ఈ దారిలో సరైన రక్షణ చర్యలు లేకపోవడంతో పలు ప్రాంతాల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొత్తూరు మండలం నుంచి అలంపూర్ మండలం వరకు జాతీయ రహదారిపై 30గ్రామాలున్నాయి. ఈ గ్రామాల వద్ద 60 ప్రమాద ప్రాంతాలను గుర్తించారు. జాతీయ రహదారిపై ఉన్న సమస్యలను గుర్తించిన ఆర్టీఏ అధికారులు ఓ నివేదికను తయారు చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించారు. అయితే దీనిపై ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. అందుకే అంతర్జాతీయ స్ధాయిలో సంచలనం సృష్టించిన పాలెంలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

రద్దీతో ప్రమాదాలు
44వ నంబర్ జాతీయ రహదారి పై వాహనాల రద్దీతో ప్రమాదాలు జరుగుతున్న అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బైపాస్‌పై ఉన్న చౌరస్తాలు చావురాస్తాలుగా మారిపోతున్నాయని ఆవేదన చెందుతున్నారు. ఈ మార్గంలో ఉన్న 7 చౌరస్తాల్లో ఇప్పటి వరకు 207 మంది చనిపోయారు. ఇక 44వ నంబర్ జాతీయ రహదారిపై మొత్తం మూడు టోల్ గేట్స్ వున్నాయి. వాహన దారుల నుంచి ఛార్జీలు వసూలు చేసే టోల్ గేట్ యాజమాన్యం వారికి ప్రమాదాలపై అవగాహన కల్పించడంలో విఫలమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నిబంధనలకు విరుద్ధంగా....
జాతీయ రహదారిపై నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతున్నారు. పోలీసు, రవాణా శాఖ అధికారులు నిత్యం తనిఖీలు చేస్తే తప్ప ప్రమాదాలు తగ్గే అవకాశం కనిపించట్లేదు. మరోవైపు జాతీయ రహదారి పై స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేసిన అధికారులు అవి ఉన్న ప్రాంతంలో ఎలాంటి బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. హైవేలపై ఆటోలు నడపకూడదనే నిబంధన ఉన్నా దాదాపు ఎక్కువ ఆటోలు జాతీయ రహదారిపై ప్రత్యక్షమవుతూనే ఉన్నాయి. వాహనదారులు నిబంధనలకు మించి జనాన్ని వాహనాల్లో ఎక్కించడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధిక లోడ్ తో వెళ్లుతున్న లారీలను తనీఖీలు చేయాల్సి ఉంటుంది. వాటి పై కఠినమైన చర్యలు తీసుకోవల్సిన అధికారులు వాహనదారుల్ని చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అధిక వేగంతో ప్రయాణించడం.. వాహనాలకు ఫిట్ నెస్ లేకపోవడం.. డ్రైవింగ్ లైసెన్స్‌లు తనిఖీలు చేయకపోవడం వల్ల కూడా ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అదేవిధంగా హైవే పై వున్న దాబాలలో మద్యం కూడా ఏరులై పారుతున్నా జిల్లా పోలీస్‌ యాంత్రాగం పట్టించుకోవట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వాహనదారులు రాత్రివేళల్లో మద్యం మత్తులో వాహనాలు నడిపించడం వల్ల కూడా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వాహనదారుల అతివేగం..అధికారుల నిర్లక్ష్యం తోడై 44వ నంబర్ జాతీయ రహదారి మృత్యు కుహరంగా మారింది. ప్రమాదాలను నివారించే దిశగా చర్యలు చేపట్టాల్సిన అధికారుల అలసత్వం ప్రదర్శిస్తుండటంతో జాతీయ రహదారిపై వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టి ప్రమాదాలను నిలువరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

11:03 - June 5, 2017

హైదరాబాద్ : ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని..హైదరాబాద్‌ కేబీఆర్‌ పార్క్‌ దగ్గర పర్యావరణ ర్యాలీని నిర్వహించారు. జలమండలి ఎండీ దానకిషోర్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో అనేక స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొన్న జలమండలి ఎండీ దానకిషోర్‌ స్పందిస్తూ..ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో మరింత కాలుష్యం పెరిగే సూచనలు ఉన్నాయని..కాలుష్యం పెరగకుండా ప్రతిఒక్కరు పర్యావరణాన్ని కాపాడే చర్యలు చేపట్టాలన్నారు. 

11:01 - June 5, 2017

 

మెదక్ :  జిల్లాలో హల్‌చల్‌ చేస్తున్న చిరుత అటవీ అధికారులకు చిక్కింది.. కొద్దిరోజులుగా చిన్న శంకర్‌పేట్‌ మండలం కామారంలో చిరుత తిరుగుతోంది.. గ్రామస్తుల ఫిర్యాదుతో అటవీ అధికారులు అక్కడ బోను ఏర్పాటుచేశారు.. ఈ బోనులోఉన్న జంతువును తినేందుకువచ్చిన చిరుత అందులో చిక్కుకుపోయింది.

ఎన్టీఆర్‌ ట్రస్టు సౌజన్యంతో వధూవరులకు పట్టువస్త్రాలు

మెదక్: నూతన వధూవరులకు ఎన్టీఆర్‌ ట్రస్టు సౌజన్యంతో టీడీపీ నాయకులు పట్టువస్త్రాలు అందించారు. ఆదివారం మిర్జాపల్లి గ్రామానికి చెందిన సీనియర్‌ టీడీపీ నేత టాళ్ల కృష్టాగౌడ్‌ కూతురు స్వాతి వివాహం శివశంకర్‌తో జరిగింది. వారి వివాహానికి ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ పట్టువస్త్రాలు, 20 వేల రూపాయలను అందించింది. టీడీపీ మండల శాఖాధ్యక్షుడు ప్రభాకర్‌ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ ఆశయాలకు అనుగుణంగా టీడీపీ సేవలు చేస్తూనే ఉందన్నారు. దానికి నిదర్శన ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నూతన వ స్త్రాలు, డబ్బులు అందించమే ఓ నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో కుంట రమేష్‌, కృష్ణాగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

10:58 - June 5, 2017

హైదరాబాద్ : రాబోయే ఎన్నికలపై ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టిన ముఖ్యమంత్రి KCR అందుకు అనుగుణంగా క్యాబినెట్లో మార్పులు చేర్పులు చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. ప్రభుత్వం ఏర్పాటై మూడేళ్లు పూర్తయిన నేపథ్యంలో..ఎన్నికలను ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకనుగుణంగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే నేతలపై ముఖ్యమంత్రి దృష్టి సారించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సుమారు ఏడాది కాలంగా మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందన్న ప్రచారం జరుగుతున్నా..అది ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. అయితే ప్రస్తుతం క్యాబినెట్‌లో కొందరు మంత్రుల పనితీరుపై సీఎం కేసీఆర్ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. మూడేళ్లు గడుస్తున్నా శాఖాపరంగా పట్టు సాధించక పోవడం..పార్టీపరంగా ఆయా జిల్లాల్లో విపక్షాలపై పైచేయి సాధించకపోవడం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారట.

మంత్రుల్లో ఉత్కంఠ...
పనితీరు నచ్చని మంత్రులకు సీఎం అపాయింట్ మెంట్ సైతం కొన్ని రోజులుగా ఇవ్వడం లేదన్న చర్చ పార్టీ నేతల్లో జరుగుతోంది. ప్రభుత్వంలో ప్రాధాన్యతనిచ్చినా..పార్టీ పరంగా ఇంకా కొన్ని జిల్లాల్లో బలపడకపోవడడం పట్ల సిఎం అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఆదిలాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో పార్టీ పరిస్థితులను మెరుగుపరుచుకోవాలని వారికి సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మియాపూర్‌ భూకుంభకోణంలో హైదరాబాద్‌కు చెందిన మంత్రి పేరు వినిపిస్తుండటంతో.. ఆయనను పదవి నుంచి తప్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ జరిగితే సగం మందికి పైగా మంత్రుల శాఖల మర్పులు...మరికొందరికి మంత్రి మండలి నుంచి ఉద్వాసన తప్పదని పార్టీలో చర్చించుకుంటున్నారట. 

గల్ఫ్ దేశాల మధ్య ముదురుతున్న విభేదాలు

హైదరాబాద్: గల్ఫ్ దేశాల మధ్య విభేదాలు ముదురుతున్నాయి. తాజాగా ఖతార్ తో అన్ని రకాల సంబంధాలను తెంచుకుంటున్నామంటూ సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఈజిప్ట్, యూఏఈలు ఈ రోజు ప్రకటించాయి. ఆల్ ఖైదా, ఐసిస్ లకు ఖతార్ సహాయ సహకారాలు అందిస్తోందని... అందుకే ఆ దేశంతో సంబంధాలకు ఫుల్ స్టాప్ పెడుతున్నామని ప్రకటించాయి.

25 నుండి బోనాల జాతర మొదలు

హైదరాబాద్ : జంటనగరాల్లో సంప్రదాయబద్ధంగా జరుపుకొనే బోనాల జాతర ఈ నెల 25న మొదలుకానున్నది. ఆషాఢ మాసం మొదటి ఆదివారం లేదా మొదటి గురువారం బోనాల జాతర మొదలవడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఈ ఏడాది ఆషాఢమాసం తొలి ఆదివారం (జూన్ 25) గోల్కొండ బోనాల జాతర ప్రారంభమవుతుందని గొల్కొండ ఎల్లమ్మ (మహంకాళి) ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు.జూలై 23న తొమ్మిదో బోనంతో జాతర ముగుస్తుందని చెప్పారు. సికింద్రాబాద్‌లోని జనరల్ బజార్‌లో కొలువుదీరిన శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలు జూలై 9, 10వ తేదీల్లో జరుగనున్నాయి.

చంద్రబాబు, మోడీని తిట్టడానికే కాంగ్రెస్ సభ:మంత్రి దేవినేని

విజయవాడ: కాంగ్రెస్ పార్టీపై మంత్రి దేవినేని ఫైర్ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంటే తట్టుకోలేకపోతున్నారని, చంద్రబాబు పై నమ్మకంతోనే ప్రాజెక్టు బాధ్యత రాష్ట్రానికి అప్పగించారని దేవినేని పేర్కొన్నారు. బాబు కృషి వల్లే పోలవరం పనులు ముందుకెళ్తున్నాయని, కాంగ్రెస్ పార్టీకి ప్రాజెక్టులపై మాట్లాడే అర్హత లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యాయం ముగిసిందని, కాంగ్రెస్ అంతియ యాత్ర ఎపుడో అయిపోందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మోడీని తిట్టడానికే కాంగ్రెస్ సభ పెట్టిందని దేవినేని విమర్శించారు. రాహుల్ ను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టే అని దేవినేని ఫైర్ అయ్యారు.

పెద్దాపురంలోని సీతార సత్రం ఈవో ఇంటి పై ఏసీబీ దాడులు

తూ.గో : పెద్దాపురంలోని సీతార సత్రం ఈవో వేమనకొండ సాయిబాబా ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఈ సోదాల్లో సుమారు 90లక్షల రూపాయల అక్రమ ఆస్తులను అధికారులు గుర్తించారు. అంతే కాకుండా భీమవరం, రేలంగి, తణుకు లో బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

జెట్టింగ్ మిషన్లను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్

హైదరాబాద్: మురుగు నీటి నిర్వహణలో నూతనంగా ప్రవేశపెట్టిన జెట్టింగ్ మిషన్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. నగరంలోని సివరేజ్ పైప్ లైన్లల బ్లాకింగ్, పూడికతీతకు ఈ జెట్టింగ్ మిషన్లను జలమండలి ఉపయోగించనుంది.

ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షం

కుమ్రంభీం : ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షం పడింది. కాగజ్ నగర్, బెజ్జూరు, దహెగాం, కౌటాల, చింతలమనెపల్లి, పెంచికల్ పేట్ మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది.

ప్రియురాలిని గోదావరిలోకి తోసేసిన ప్రియుడు

కాకినాడ : యానంలో దారుణం జరిగింది. బాలయోగి వారధి పై నుంచి ప్రియురాలిని గోదావరిలోకి తోసేసి ప్రియుడు పరారయ్యాడు. దాన్ని గమనించిన మత్స్యకారులు యువతిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

09:35 - June 5, 2017

ముంబై : మహారాష్ట్ర లోని షిరిడిలో నిన్న సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందారు. మృతులు నల్లగొండ జిల్లా మర్రిగూడ, నిడమనూరు వాసులుగా పోలీసులు గుర్తించారు. నిన్న మర్రిగూడ, నిడమనూరు ప్రాంతాకు చెందిన 3 కుటుంబాలకు చెందిన 14 మంది సాయి బాబ దర్శనానికి రైల్లో షిరిడి వెళ్లారు. రైలు దిగి ఆటోలో షిరిడి ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల కుటుంబాలను ఎమ్మెల్యేల ప్రభాకర్ ఫోన్ ద్వారా పరామర్శించారు. ఎమ్మెల్యే ప్రభాకర్ షిరిడి స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్ తో ఫోన్లో మాట్లాడారు. మృతదేహలను తొందరగా పంపాలని, గాయాపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలని ఆయన కోరారు. వారి మరణంతో మర్రిగూడ, నిడమనూరులో విషాదం నెలకొంది. 

బరేలీలో ఘోర రోడ్డు ప్రమాదం:22 మంది మృతి

ఉత్తరప్రదేశ్ : బరేలీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు-ట్రక్కు ఢీకొనడంతో 22 మంది మృతి చెందగా.. మరో 17 మంది కి గాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

షిరిడిలో రోడ్డు ప్రమాదం:5గురి మృతి

మహారాష్ట్ర : షిరిడిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో- లారీ ఢీ కొనడంతో 5గురుమృతి చెందగా... ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులంతా నల్గొండ జిల్లా వాసులుగా గుర్తించారు. రైల్వే స్టేషన్ నుండి ఆలయానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ...

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు 22 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనానికి 8గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం, కాలినడకన కొండ ఎక్కి వచ్చిన భక్తులకు 6 గంటల సమయం పడుతోంది.

09:24 - June 5, 2017

లక్నో : యూపీలోని బరేలీ షాజహాన్ పూర్ నేషనల్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోజు తెల్లవారుజామున 1.30 యూపీఎస్ ఆర్టీసీకి చెందిన బస్సును ట్రాక్కు ఢీ కొట్టింది. ఢీకొన్న వెంటనే బస్సులోని డీజిల్ ట్యాంక్ పగలడంతో బస్సులో మంటలు చెలరేగాయి దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 22 మంది సజీవదహనమయ్యారు. 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వారిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. దుర్ఘటన తెల్లవారుజామున జరగడంతో బస్సులో అందరు నిద్రపోవడంతో ప్రాణా నష్టం ఎక్కువ జరిగింది. ఈ బస్సు ఢిల్లీ నుంచి యూపీ సెంట్రల్ కు వెళ్తుతోంది. నేషనల్ హైవేపై మరమత్తులు జరుగుతుండంతో బస్సు డ్రైవర్ రాంగ్ రూట్ లో బస్సు నడపడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అయితే మంటలు చెలరేగిన 90 నిమిషాల తర్వాత ఫైర్ ఇంజన్ లు చేరకున్నాయి కానీ అప్పటికే బస్సు మొత్తం కాలిపోయింది. ఈ ఘటన పై యూపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 

08:58 - June 5, 2017

శ్రీనగర్ : ఉత్తర కాశ్మీర్ లోని బందిపార జిల్లా సంబాల్ వద్ద ఈ రోజు తెల్లవారుజామున 4.30సీఆర్ ఫీఎఫ్ 45 బెటాలియన్ పై ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. వెంటనే స్పందించిన సైన్యం ఉగ్రవాదులపై కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల, జవాన్ల మధ్య హోరాహోరి కాల్పులు జరిగాయి. కాల్పుల్లో నాలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.ఉగ్రవాదల నుంచి భారీ స్థాయిలో మరుణాయుధాలను సీఆర్ పీఎష్ స్వాధీనం చేసుకుంది. సైన్యం సంబాల్ ప్రాంతాన్ని చుట్టుముట్టి గాలింపు చర్యలు చేపడుతున్నాయి. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

08:55 - June 5, 2017

రాష్ట్రంలో పాఠశాల విద్యను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. విద్య శాఖలో రేషనలైజెషన్, బదిలీలు తప్ప మరో విషయం లేకుండా చేస్తున్నారని ఏపీయూటీఎఫ్ నాయకులు బాబు రెడ్డి గారు అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

08:53 - June 5, 2017

ఖమ్మం : ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం భాగ్యనగర్ తండా గురించి ఒకప్పుడు పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు. కానీ ఇప్పుడు భూక్య నందూలాల్‌ వల్ల ఆ ఏరియా ఫేమస్ అయిపోయింది. ఆ తండాలో నందూలాల్ పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు. తాజాగా ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో నందూలాల్ 922 వ ర్యాంకు సాధించి తండావాసుల్ని సంతోషంలో ముంచేశాడు. అస్లీ, హర్యాలు నందూలాల్ తల్లిదండ్రులు. ఇద్దరూ వ్యవసాయ కూలీలు. నందూ అన్న కూడా వ్యవసాయం చేస్తుంటాడు. నందూలాల్‌కు చిన్నతనం నుంచి చదువుమీద ఉన్న ఆసక్తిని గమనించిన కుటుంబసభ్యులు ఎంతో ప్రోత్సహించారు. పేదరికంలో ఉన్నా అతని చదువుకోసం ఇంట్లో గేదెలు, మేకలు అమ్మడానికి కూడా వెనుకాడలేదు. తమ కొడుకు సాధించిన విజయంతో తాము పడ్డ కష్టాన్ని సైతం మర్చిపోయామంటున్నారు నందూలాల్ కుటుంబ సభ్యులు.

గవర్నమెంట్‌ స్కూల్లో...

5వ తరగతి వరకు తండాలోని గవర్నమెంట్‌ స్కూల్లో చదువుకున్న నందూలాల్ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నవోదయా స్కూల్లో చదువుకున్నాడు. టెన్త్‌లో మంచి మార్కులు తెచ్చుకున్న నందూలాల్‌కు నారాయణ కాలేజ్‌ యాజమాన్యం హైదరాబాద్‌లో ఫ్రీ సీటు ఇచ్చింది. ఆ తర్వాత ఐఐటీలో 152వ ర్యాంకు సాధించిన నందూలాల్‌ బాంబేలో ఐఐటీ పూర్తి చేశాడు. ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ తీసుకున్న నందూలాల్ 2015లో రాసిన సివిల్స్‌లో ఒక్క మార్కులో ర్యాంకు మిస్సయ్యాడు. ఈసారి పట్టుదలతో చదివి 922వ ర్యాంకు సాధించాడు. సమాజ సేవ చేయాలనే లక్ష్యంతోనే తాను సివిల్స్ పరీక్షలు రాసినట్లు నందూలాల్ చెప్పాడు. తన ఫ్యామిలీ.. ఫ్రెండ్స్ సహకారంతోనే ఇదంతా సాధించానంటున్నాడు. ఇప్పుడు వచ్చిన ర్యాంకుతో నందూలాల్‌కు ఇండియన్ రెవెన్యూ సర్వీస్‌లో జాబ్ వస్తుంది. అయితే ఐఏఎస్‌ కావడమే తన లక్ష్యమని నందూలాల్ చెబుతున్నాడు. భవిష్యత్‌లో నందూలాల్‌ కోరిక నెరవేరి అతను ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనమూ మనసారా కోరుకుందాం. ఆల్‌ ది బెస్ట్‌ నందూలాల్. 

08:50 - June 5, 2017

లండన్ : చాంపియన్స్‌ ట్రోఫీని భారత్‌ ఘనంగా ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌పై సునాయాస విక్టరీతో తన విజయయాత్ర ప్రారంభించింది. ఆదివారం బర్మింగ్‌హామ్‌లో జరిగిన వన్డేలో పాక్‌పై భారత్‌ అన్ని విభాగాల్లో దూకుడు ప్రదర్శించి... 124 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 48 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. పాకిస్తాన్‌ను భారీ టార్గెట్‌ను నిర్దేశించింది. రోహిత్‌ శర్మ 91 రన్స్‌తో చెలరేగిపోయాడు. శిఖర్‌ ధావన్‌ 68 రన్స్‌ చేయగా.. యువరాజ్‌సింగ్‌ 32 బాల్స్‌లో 53 రన్స్‌ సాధించి భారీ స్కోరులో కీలకపాత్ర పోషించాడు. భారత్‌ కెప్టెన్‌ కోహ్లీ కూడా 68 బాల్స్‌లో 81 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. చివరి 4 ఓవర్లలో భారత్‌ ఏకంగా 72 పరుగులు సాధించింది.

ఓపెనర్ల శుభరంభం...
నాలుగేళ్ల క్రితం చాంపియన్స్‌ ట్రోఫీలో తొలిసారి ఓపెనింగ్‌ జోడీగా బరిలోకి దిగిన రోహిత్‌శర్మ, శిఖర్‌ధావన్‌ ఐదు మ్యాచ్‌లలో వరుసగా 127,101,58,77,19 పరుగులు జోడించి జట్టును విజయతీరాలకు చేర్చడంలో కీరోల్‌ పోషించారు. ఈసారి కూడా వీరిద్దరూ భారత్‌కు అదిరే ఆరంభాన్ని ఇచ్చారు. మొదటి వికెట్‌కు 136 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆతర్వాత యువరాజ్‌సింగ్‌... కోహ్లీతో కలిసి భారీ స్కోరుకు బాటలు వేశారు. వర్షంతో అంతరాయం కలగడంతో పాకిస్తాన్‌ లక్ష్యాన్ని 41 ఓవర్లలో 289 పరుగులుగా నిర్దేశించారు. 289 టార్గెట్‌తో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ వెనువెంటనే వికెట్లు కోల్పోయింది. 33.4 ఓవర్లలో 164 పరుగులు చేసి ఆలౌట్‌ అయ్యింది. పాక్‌ ఓపెనర్ అజార్‌ అలీ , మహ్మద్‌ హఫీజ్‌ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ పరుగులు చేయలేదు. దీంతో భారీ టార్గెట్‌ ముందు పాకిస్తాన్‌ బోర్లా పడింది. భారత బౌలర్లలో ఉమేష్‌ యాదవ్‌కు 3వికెట్లు పడగా...హార్ధిక్‌ పాండ్యా, రవీంద్ర జడేలా తలా రెండువికెట్లు తీశారు. ఇక మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు యువరాజ్‌కు దక్కింది.

08:48 - June 5, 2017

హైదరాబాద్ : వర్షాకాలం వస్తే జంటనగరాలు నరకాన్ని తలిపిస్తాయి. మూతలు తెరుచుకున్న మ్యాన్‌హోల్స్‌ ఎప్పుడు ఎవరిని ప్రాణాలను కబళిస్తాయో తెలియని పరిస్థితి. పైపులైన్ల కోసం తవ్విన గుంతల్లో పడి ఎవరు ప్రాణాలు కోల్పోతారో తెలియని పరిస్థితి. ఏటా వర్షాకాలంలో ఇలాంటి ఘటనలు సర్వసాధారణంగా మారింది. దీంతో ఈసారికి వీటికి ముగింపు పలకాలని హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ వర్క్స్‌ నిర్ణయించింది. మ్యాన్‌హోల్స్‌, నాలాల్లో పడి ప్రజలు ప్రాణాలు కోల్పోయిన ఘటనలతో ప్రభుత్వంతోపాటు, జీహెచ్‌ఎంసీ, వాటర్‌ వర్స్స్‌ ప్రతిష్ఠ మసకబారింది. ఈసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ ఆదేశించడంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కేబుల్స్‌, వాటర్‌ పైపులైన్లు వేసే పనులను నిలివేయాలని జల మండలి నిర్ణయించింది. ఇప్పటి వరకు తవ్విన రోడ్లకు పడిన గుంతలను ఈనెల 15 లోగా పూడ్చి వేసేందుకు చర్యలు చేపట్టింది. వర్షాకాలంలో మురుగునీరు రోడ్లపైన ప్రవహించకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు తక్షణం స్పందించి, పరిష్కరించేందుకు ప్రత్యేక బృందాలను నియమించింది. వర్షాకాలం ముగిసే వరకు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే క్షమించబోమంటూ జలమండలి ఉద్యోగులతో ఎండీ దాన కిషోర్‌ ప్రతిజ్ఞ చేయించారు.  

08:46 - June 5, 2017

 

కడప : జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఇప్పుడు వైసిపికి బలమైన జిల్లా. టీడీపీకి మింగుడు పడని ఫలితాలిచ్చే జిల్లా. అయితే ఈసారి టిడిపి కడపజిల్లాలో పాగా వేయాలనుకుంటోంది. అందులో భాగంగా వైసిపితో విసిగిన నేతల్ని పచ్చ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తోంది. పార్టీ బలోపేతం చేసే ఉద్దేశ్యంతో మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి కడప.. ఆదినారాయణ రెడ్డికి రాజంపేట ఎంపీ సెగ్మెంట్ బాధ్యతలను అప్పగించింది. మంత్రులైతే కష్టపడుతున్నారు కానీ.. నియోజకవర్గాల్లో వర్గపోరు తప్పట్లేదు.

రామసుబ్బారెడ్డి వర్గం..
జమ్మలమడుగులో ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం పట్ల బహిరంగంగా వ్యతిరేకించిన రామసుబ్బారెడ్డి వర్గం..ఇటీవల జరిగిన మహానాడుకు కూడ హాజరుకాలేదు. నియోజకవర్గాల పునర్విభజన జరగకపోతే ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డిల పరిస్థితి ఏంటనే చర్చ జిల్లాలో జోరుగాసాగుతోంది. జమ్మలమడుగు టికెట్ ఇద్దరిలో ఎవరికిచ్చినా.. ఇంకొకరు వైసీపీ నుంచి పోటీ చేయడం ఖాయం. మరోవైపు బద్వేల్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే జయరాములు, టీడీపీ ఇన్‌ఛార్జ్‌ విజయజ్యోతి టికెట్ ఆశిస్తున్నారు. ఎస్సీ రిజర్వుడ్ కావడంతో మాజీ మంత్రి వీరారెడ్డి కూతురు విజయమ్మకు అవకాశంలేదు. నేతల మధ్య విభేదాలే బద్వేల్ టిడిపికి శాపంగా మారింది. ఇదే పరిస్థితి కడప అసెంబ్లీలో కూడ ఉంది. ఏకంగా ఆరుగురు నేతలు ఇక్కడ టికెట్ రేసులో ఉన్నారు. పోయిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన దుర్గా ప్రసాద్ బలంగా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. రాయచోటి నియోజకవర్గంలో కూడ మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడులు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఇప్పటి నుంచి తమ బలం పెంచుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు అయినప్పటికీ.. ఇక్కడ కూడ టీడీపీ నేతల మధ్య కుమ్ములాటలు తీవ్రం అయ్యాయి. ఇటీవల కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన చెంగల్రాయుడు తో ...పార్టీ ఇన్చార్జీ విశ్వనాథనాయుడికి అసలే పడటంలేదు.

వైసీపీ కంచుకోట పులివెందుల...
ఇక పులివెందుల సంగతికొస్తే... ఇక్కడ వైఎస్ కుటుంబాన్ని కదిలించే పరిస్థితి టీడీపీకి లేదనే చెప్పుకోవాలి. టికెట్ కోసం మాత్రం సతీష్ రెడ్డి, రామ్ గోపాల్ రెడ్డిలు ప్రయత్నిస్తున్నారు. టికెట్ ఎవరికిచ్చినా వైఎస్ కుటుంబాన్ని ఢీ కొట్టలేని పరిస్థితి ఉంది. ఇక ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ లింగారెడ్డి మధ్య విభేదాలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. అయితే.. వచ్చే ఎన్నికల్లో ఇద్దరూ టికెట్ ఆశిస్తున్నారు. కమలాపురం నియోజకవర్గంలో కూడ టీడీపీలో ఇదే పరిస్థితి. వీరశివారెడ్డి, పుత్తనరసింహారెడ్డి మధ్య తీవ్రమైన విబేదాలున్నాయి. వీరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా... రెండో వ్యక్తి దెబ్బతీస్తాడు. ఇక్కడ కూడ వైసీపీకి ఇదే ప్లస్ పాయింట్. జగన్ మేనమామ రవీంద్రరెడ్డి టీడీపీ నేతల మధ్య ఉన్న విబేధాల కారణంగానే గెలిచాడని జనం చెప్పుకుంటారు. నియోజకవర్గాల పునర్విభజన మీద ఆశలతోనే టిడిపి వలస నేతలకు రెడ్ కార్పెట్ పరిచింది. ఒకవేళ అది జరగకపోతే మాత్రం ఆ పార్టీకి కడపజిల్లాలో భంగపాటు తప్పేలా లేదు. టిడిపిలో విభేదాలు వైసిపికి లాభం చేకూరుస్తాయనే వాదన బలంగా వినిపిస్తోంది.

08:43 - June 5, 2017

శ్రీకాకుళం : డయాలసిస్‌...కిడ్నీ రోగులు ఈ దశకు వచ్చారంటే వారి పరిస్థితి వర్ణాతీతం. కూర్చోలేరు..నిలబడలేరు..కాళ్లవాపుతో అల్లాడిపోతారు. కిడ్నీతో సాధారణంగా జరిగే రక్తశుద్ధి ప్రక్రియ నిలిచిపోతే..వారానికోసారైనా డయాలసిస్‌ తప్పనిసరి. కిడ్నీ వ్యాధులకు శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలు కిడ్నీ సంబంధిత రోగాలతో అల్లాడిపోతున్నారు. సోంపేట మండలంలో డయాలసిస్‌ సెంటర్‌ ప్రారంభించడంతో ఉద్దానం కిడ్నీ రోగులు ఊపిరి పీల్చుకుంటున్నారు. సోంపేట మండల కేంద్రంలో డయాలసిస్ కేంద్రాన్ని మంత్రులు కామినేని శ్రీనివాస్, కింజరాపు అచ్చెన్నాయుడులు ప్రారంభించారు. ఉద్దాన ప్రాంతంలో పర్యటించి బారువ సి.హెచ్.సిని తనిఖీ చేశారు. ఇక్కడ రోజుకు 30 మంది రోగులకు డయాలసిస్ సేవలు అందే విధంగా ఏర్పాటు చేశామని.

షిప్టుల్లో డయాలసిస్
మరో పదిమంది రోగులకు షిఫ్టుల రూపంలో డయాలసిస్ చేసే ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కామినేని శ్రీనివాస్‌ తెలిపారు. కిడ్నీ బాధితులకు ఫించన్ పంపిణీ విషయంపై కేబినెట్‌ మీటింగ్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉద్దానం కిడ్నీ రోగులకు ఇచ్చిన హామీని తమ ప్రభుత్వం సంవత్సరం లోపు నెరవేర్చిందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. సోంపేట తో పాటు..టెక్కలి డయాలసిస్ సెంటర్ల ద్వారా స్థానికంగా ఉన్న రోగులకు ఉపశమనం లభిస్తుందన్నారు. 35 కోట్లతో ఉద్దాన ప్రాంతం లోని అన్ని గ్రామాలకు రక్షిత మంచినీటి సరఫరాకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలన్న దశాబ్దాల కల సాకారమవడంతో ఉద్దానం ప్రాంతంలోని కిడ్నీ రోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  

08:41 - June 5, 2017

సిద్దిపేట : తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో రైతుల భూములు లాక్కొంటోందని కాంగ్రెస్‌, లెప్ట్‌, ప్రజాసంఘాల నేతలు ఆరోపించారు. దేశానికి అన్నంపెట్టే రైతుల పొట్టగొట్టి... బడాబాబుల జేబులు నింపేందుకు పాలకులు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అరాచక పాలన సాగిస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ప్రజలే మట్టుబెడతారని హెచ్చరించారు. మల్లన్నసాగర్‌ భూ నిర్వాసితులు చేపట్టిన దీక్షలకు ఏడాది పూర్తైన సందర్భంగా భారీ సభను నిర్వహించారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని మల్లన్నసాగర్‌ ముంపు గ్రామమైన వేములఘాట్‌లో రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారంతో ఏడాది పూర్తి చేసుకున్నాయి. ఈ సందర్భంగా గ్రామస్తులు భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభకు లెప్ట్‌, కాంగ్రెస్‌ , బీజేపీ , టీజేఏసీతోపాటు పలువురు ప్రజాసంఘాల నేతలు హాజరయ్యారు. 365వ రోజు దీక్షలను హైకోర్టు అడ్వకేట్‌ రచనారెడ్డి ప్రారంభించారు. అనంతరం ప్రసంగించిన టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం... రైతుల నుంచి భూములను లాక్కుంటే పంటలెలా పండిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. రైతుల భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కోవడం సరికాదని, వారికి న్యాయం చేసిన తర్వాతనే ప్రాజెక్టు నిర్మించాలని డిమాండ్‌ చేశారు. ప్రజలను మభ్యపెట్టి మోసం చేయడంలో ప్రపంచంలోనే కేసీఆర్‌ ప్రథముడిగా నిలుస్తారని విమర్శించారు.

ఫాంహౌస్‌ పక్కనే
కేసీఆర్‌ ఫాంహౌస్‌ పక్కనే ఏడాది కాలంగా మల్లన్నసాగర్‌ భూనిర్వాసితులు దీక్షలు చేస్తోంటే వినిపించడం లేదా అని కాంగ్రెస్‌ నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మూడు పంటలు పండే భూములను తీసుకుంటున్న కేసీఆర్‌ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుందన్నారు. మట్టిని నమ్ముకున్న రైతులను మోసం చేస్తే... కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఆ రైతులే మట్టుబెడతారని హెచ్చరించారు. న్యాయం జరిగే వరకు దీక్షలను ఆపబోమని మహిళా రైతు లక్ష్మి స్పష్టం చేశారు. ఏడాదిగా దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం తమ గోడును ఎందుకు పట్టించుకోవడంలేదో చెప్పాలన్నారు.

మల్లన్నసాగర్‌ భూ నిర్వాసితులకు అండగా ఉంటామని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు భరోసా ఇచ్చారు. సర్కార్‌ మెడలు వంచైనా సమస్యను పరిష్కరిస్తామన్నారు. ప్రభుత్వం అడ్డంకులు ఎన్ని సృష్టించినా పోరును మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

08:40 - June 5, 2017

నెల్లూరు : ఆకాశమే హద్దుగా అప్రతిహత విజయాలను సాధిస్తున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ.. మరో ఘనతను సాధించడానికి సిద్ధమైంది. దాదాపు 17 సంవత్సరాల కృషి ఫలితంగా క్రయోజనిక్‌ టెక్నాలజీని ఒడిసిపట్టిన ఇస్రో.. జీఎఎస్‌ల్‌వీ సిరీస్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన మాక్‌-3డీ1 రాకెట్‌ ప్రయోగానికి రెడీ అయింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌ అంతరీక్ష కేంద్రం నుంచి ప్రయోగాన్ని నిర్వహించడానికి ఆదివారం మధ్యాహ్నం 3గంటల 58 నిముషాలకు ఇస్రోశాస్త్రవేత్తలు కౌంట్‌డౌన్‌ మొదలు పెట్టారు. మొత్తం 25 గంటల 30 నిమిషాల కౌంట్‌డౌన్‌ అనంతరం సోమవారం సాయంత్రం 5గంటల 28నిముషాలకు జీఎస్ఎల్వీ మార్క్‌ 3 D1 నింగిలోకి దూసుకుపోనుంది.

అగ్రరాజ్యాలకే పరిమితం..
నిన్నటివరకు అమెరికా, రష్యాలాంటి అగ్రరాజ్యాలకే పరిమితం అయిన క్రయోజనిక్‌ సాంకేతక పరిజ్ఞానాన్ని ఇపుడు ఇస్రో సాధించింది. చేపట్టిన ప్రతిప్రయోగాన్ని సక్సెస్‌ఫుల్‌గా నిర్వహిస్తున్న ఇస్రోకు.. క్రయోజనిక్‌ టెక్నాలజీ అందకుండా అమెరికాలాంటి దేశాలు అడ్డుకున్న పరిస్థితుల నుంచి మన శాస్త్రవేత్తలు సొంతంగా ఈ ఫలితాలను సాధించారు. హైడ్రోజన్‌, ఆక్సిజన్‌లను అత్యంత పీడనంలో ఎక్కువసాంద్రత కలిగిన ద్రవ ఇంధనంగా మర్చి.. ఎక్కువసేపు రాకెట్‌కు పెలోడ్‌ శక్తిని అందించేదే క్రయోజనిక్‌ టెక్నాలజీ. ఈ ఇంజన్లు ఏకంగా మైనస్‌ 269 డిగ్రీల సెల్సీయస్‌ల అతిచల్లని పరిస్థితుల్లో కూడా ఇంధనాన్ని మండించి రాకెట్‌కు దూసుకుపోయే శక్తిని ఇస్తుంది. దాదాపు 17 సంవత్సరాల సుదీర్ఘ శ్రమ ఫలితంగా సాధించిన సాంకేతక సత్తాను ప్రపంచానికి చాటడానికి ఇస్రో సిద్ధం అయింది.

ఏకంగా మూడు టన్నులు
ఇప్పటివరకు తేలికయిన ఉపగ్రహాలను పంపగలిగే సామర్థ్యమున్న మన రాకెట్లు .. టన్నుల కొద్ది బరువైన శాటిలైట్స్‌ను నింగిలోకి పంపేందుకు ఫ్రాన్స్‌లాంటి దేశాలపై ఆధారపడుతూ వస్తోంది. ప్రస్తుతం మన సమాచార ఉపగ్రహాలను ఫ్రెంచిగయానలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగిస్తున్నారు. ఇపుడు జీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో రాకెట్లకు క్రయోజనిక్‌ పరిజ్ఞానాన్ని వియవంతంగా జోడించగలిగిన ఇస్రో... ఏకంగా మూడు టన్నులకు పైగా బరువైన శాటిలైట్స్‌ను కూడా భూమికి 36వేల కిలోమీటర్ల ఎత్తువరకు లిఫ్ట్‌ చేయగల సత్తాను సొంతం చేసుకుంది. మూడు దశల్లో ద్రవ, ఘన ఇంధనంతో పని చేసే ఇంజిన్లతో తయారు చేసిన జీఎస్ఎల్వీ మాక్‌ 3డీ1 రాకెట్‌ అన్ని ప్రయోగ పరీక్షలను పూర్తి చేసుకుంది. 2014 జనవరి 18న ఎలాంటి ఉపగ్రహం లేకుండా ఈ రాకెట్‌ను ప్రయోగించి, ఫలితాలను విశ్లేషించిన ఇస్రో... ఇప్పుడు పూర్తిస్థాయిలో శాటిలైట్‌ను నింగిలోకి పంపేందుకు సిద్ధమైంది. జీఎస్ఎల్వీ మాక్‌ 3డీ1 ద్వారా 3,136 కిలోల బరువైన జీశాట్‌ 19 ఉపగ్రహాన్ని కక్షలోకి పంపనున్నారు. దీంతో దేశ సమాచార రంగాన్ని కొత్త పుంతలు తొక్కిచేందుకు ఈ ఉపగ్రహాలు దోహదం చేయున్నాయి. కేఏ, కేయూ బ్యాండ్‌ టెక్నాలజీతో ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. భూమికి 36 వేల కిలో మీటర్ల ఎత్తులోని స్థిరకక్షలో దీనిని ప్రవేశపెడతారు. ఈ ఉపగ్రహం 15 ఏళ్లపాటు సేవలు అందించనుంది. దీంతోపాటు అంతరిక్షంలో రేడియో ధార్మికశక్తిని పరిశీలించేందుకు జియో స్టేషనరీ స్ప్రక్టా పరికరాన్ని కూడా రోదసిలోకి పంపుతున్నారు.

ఇస్రోకు ఇదే మొదటిసారి
మూడువేల కిలోలకు పైగా బరువున్న ఉపగ్రహ ప్రయోగాలను చేపట్టడం ఇస్రోకు ఇదే మొదటిసారి. ఇది విజయవంతమైతే ఐదువేల కిలో బరువున్న ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు ప్రణాళికలు రూపొందిస్తామంటున్నరు ఇస్రో శాస్త్రవేత్తలు. భవిష్యత్తుల్లో మనావసహిత అంతరీక్షయాత్రలకూ జీఎస్ఎల్వీ మార్క్‌ 3డీ1 రాకెట్‌ ప్రయోగం బాటలు వేస్తుందని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇస్రోకు కీలకమైన ఈ ప్రయోగం విజయవంతం కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు.

 

08:37 - June 5, 2017

గుంటూరు : ఏపీకి ప్రత్యేక హోదా గిఫ్ట్ కాదని..ఇక్కడి ప్రజల హక్కు అని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. గుంటూరులో ప్రత్యేక హోదాకు భరోసా సభలో మాట్లాడిన ఆయన...అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీపై నిప్పులు చెరిగారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎందుకు పోరాడటం లేదని ప్రత్యేక హోదాతో వచ్చే ప్రయోజనాలను చంద్రబాబు, జగన్ ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో తిరుపతిలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక హోదాపై ఇచ్చిన వాగ్ధానం ఏమైందని రాహుల్‌ ప్రశ్నించారు. దేవుడి స్థలంలో పదేళ్లు హోదా ఇస్తామని హామీ ఇచ్చారని, మరి ఆ హామీని ఎందుకు నెరవేర్చడంలేదని నిలదీశారు. ప్రత్యేక హోదా వద్దనడానికి అధికార, ప్రతిపక్షాలకు ఉన్న ప్రత్యేక ప్యాకేజీయే కారణమని ఆరోపించారు. 2019లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని రాహుల్ అన్నారు.

నిరసన ఎందుకు సుధాకర్ రెడ్డి
ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్‌ సభ నిర్వహిస్తుంటే.. టీడీపీ నేతలు నల్లజెండాలతో నిరసనలు తెలపడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం సీసీఐ ఎప్పటికీ పోరాడుతుందన్నారు సురవరం. నిరుద్యోగులు, రైతులకు ఇచ్చిన హామీలను మోదీ నెరవేర్చలేదన్నారు యూపీ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీతో పాటు.. ప్రత్యేక హోదా కూడా ఇవ్వాలని అఖిలేష్‌ డిమాండ్‌ చేశారు. ఏపీని ఎప్పుడు అభివృద్ధి చేస్తారో మోదీ చెప్పాలన్నారు అఖిలేష్‌. ఒకప్పుడు మాతో ఉన్న చంద్రబాబు.. ఇప్పుడు పల్టీ కొట్టి మోదీతో కలిసి గుజరాత్‌ తరహా విధానాన్ని అమలు చేస్తున్నారన్నారు శరద్‌యాదవ్‌. దేశాలు తిరుగుతున్న మోదీ.. దేశ ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు.

హాట్ టాఫిక్ ప్రత్యేక హోదా
మొత్తంగా ఏపీకి ప్రత్యేక హోదా భరోసా సభకు రాహుల్‌తో పాటు జాతీయస్థాయినేతలు సురవరం సుధాకర్‌ రెడ్డి, డి. రాజా, అఖిలేష్‌ యాదవ్‌, శరద్‌యాదవ్‌ హాజరై మద్దతు పలకడం హాట్‌ టాఫిక్‌గా మారింది. 

జమ్మూలో ఎన్ కౌంటర్

శ్రీనగర్ : జమ్మూకాశ్మార్ లోని బందిపార జిల్లా సంబాల్ వద్ద సీఆర్ పీఎఫ్ 45వ బెటాలియన్ పూ ఉగ్రవాదులు దాడి చేశారు. వెంటనే స్పందించిన భద్రతాబలగాలు నలుగురు ఉగ్రవాదులను హతమార్చరు.

 

కొనసాగుతున్న జీఎస్ఎల్వీ కౌంట్ డౌన్

నెల్లూరు : జీఎస్ఎల్వీ మార్క్ 3డి1 కౌంట్ డౌన్ కొనసాగుతోంది. సాయంత్రం 5.28 జీఎస్ఎల్వీ మార్క్ డీ1 ప్రయోగించనున్నారు. 

Don't Miss