Activities calendar

06 June 2017

22:37 - June 6, 2017

హైదరాబాద్‌ : నగరంలోని మియాపూర్‌ భూ అక్రమణ ప్రాంతాలను కాంగ్రెస్‌ నేతలు సందర్శించారు. మాజీ హోమ్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. భూములకు సంబంధించిన వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. వేలకోట్ల రూపాయల ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతుంటే.. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆమె విమర్శించారు. మియాపూర్ అక్రమ భూ రిజిస్ట్రేషన్‌ కుంభకోణంలో ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. దీనిపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. 

 

22:33 - June 6, 2017

విజయవాడ : పేదల అభివృద్ధికోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని.. సీఎం చంద్రబాబు తెలిపారు. ఐటీ రంగంలో తాము చేపట్టిన చర్యలవల్లే మన విద్యార్థులు విదేశాల్లో రాణిస్తున్నారని చెప్పారు. నదుల అనుసంధానంద్వారా నీటి భద్రత కల్పిస్తామని ప్రకటించారు. పోలవరం ఏపీ ప్రజల జీవనాడిఅని.. త్వరగా పనులు పూర్తిచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. పేదరికం లేని సమాజమే తన లక్ష్యమన్నారు. ప్రజలకోసమే పనిచేయాలని నేతలకు సూచించారు. నవ నిర్మాణదీక్ష ఐదోరోజు మానవ వనరుల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ అంశంపై చర్చించారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సీఎం సమాధానమిచ్చారు.

 

22:29 - June 6, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు వర్షాలు మొదలయ్యాయి. ఏపీ రాజధాని అమరావతి, వెలగపూడి సచివాలయం పరిసరాల్లో ఉరుములు, మెరుపులతో కుండపోత వర్షంపడింది.  సచివాలయంలో వర్షపు నీరు చేరడంపై మంత్రి నారాయణ  అధికారులను వివరణ కోరారు. దీంతో సచివాలయంలోని పలు బ్లాకులను సీఆర్‌డీఏ కమిషనర్‌ సందర్శించారు. అటు గుంటూరు, కృష్ణ జిల్లాలతోపాటు తెలంగాణలోని మిర్యాలగూడ ప్రాంతంలో భారీ వర్షం పడింది.  మిర్యాలగూడ పట్టణంలో పశువుల పాక కూలి.. ఓ మహిళ మృతి చెందింది. పలు చోట్ల చెట్లు విరిగి రోడ్లకు అడ్డంగా పడ్డాయి. విద్యుత్‌ స్తంభాలు కూలిపోవడంతో పలుగ్రామాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. 
వర్షపునీటితో తడిసి మద్దయిన ఏపీ తాత్కాలిక సచివాలయం  
రుతుపవనాల రాకకు సంకేతంగా తెలుగు రాష్ట్రాల్లో తొలకరి వర్షాలు మొదలయ్యాయి. పలుచోట్ల ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ తాత్కాలిక సచివాలయం వర్షపునీటితో తడిసి మద్దయింది. భారీవర్షంతో వెలగపూడిలోని  సెక్రెటేరియట్‌ బిల్డింగ్‌లో నాలుగో  చాంబర్లలోకి నీరు చేరింది. ప్రతిపక్షనేత జగన్‌ చాంబర్‌లో సీలింగ్‌ లీకేజివల్ల సన్నని ధారగా నీరు చేరింది. దీనిపై వైసీపీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. సచివాలయ నిర్మాణ లోపాలపై తాము గతంలోనే స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా .. ప్రభుత్వం పట్టించుకోలేదంటున్నారు. సచివాలయంలో వర్షపు నీరు చేరడంపై మంత్రి నారాయణ సీఆర్‌డీఏ అధికారులను వివరణ అడిగారు.... 
గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కుండపోత వర్షం 
అటు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. కృష్ణా జిల్లా కంచికచర్లలో భారీ వర్షంతో చెట్లు నేలకూలాయి. రేకుల షెడ్ల పైకప్పులు గాలికి కొట్టుకుపోయాయి. కుండపోతగా కురిసిన వానతో రోడ్లపై ఎక్కడికక్కడ  నీరు నిలిచిపోయింది. దీనికి తోడు ఉరుములు మెరుపులు జనాల్ని బెంబేలెత్తిస్తున్నాయి.. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పలు గ్రామాల్లో చీకట్లు ఆవరించాయి. అటు గుంటూరుజిల్లా సత్తెనపల్లి పరిసర గ్రామాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది.
తెలంగాణలోనూ..భారీ వర్షాలు 
తెలంగాణలోనూ అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడుతున్నాయి. నల్లగొండజిల్లా మిర్యాలగూడలో పలుచోట్ల ఈదురుగాలులతో కుండపోతగా వర్షం పడింది.  వరదనీటితో మిర్యాలగూడలో రోడ్లు జలమయమయ్యాయి. నాలాలు పొంగిపొర్లాయి. పట్టణంలోని నర్సింబట్లలో ఈదురుగాలులకు.... పశువుల పాక కూలి మహిళ మృతిచెందింది. మరో రెండు రోజుల్లో ఏపీ, తెలంగాణలకు  రుతుపవనాలు చేరుకుంటాయని వాతావరణ శాఖ చెబుతుండగానే.. ముందుగానే వర్షాలు ప్రారంభమయ్యాయి. తొలకరి జల్లులతో ..రెండు రాష్ట్రాల్లో  ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది.

22:18 - June 6, 2017

కోడి ముందా గుడ్డ ముందా అనే ప్రశ్న.. అప్పుడప్పుడు వినిపిస్తూ ఉండేది...కానీ ఇప్పుడు కోడి లేదు.. గుడ్డూ లేదు. ప్లాస్టిక్ ఉంది. అవును ప్లాస్టిక్ బక్కెట్లు తెలుసు.. ప్లాస్టిక్ కవర్లు వాడుతాం... ప్లాస్టిక్ బాటిల్స్ లో నీళ్లు కూడా తాగుతాం... కానీ ప్లాస్టిక్ బియ్యం కూడా మన కంచంలోకి చేరుతుందా..? ప్లాస్టిక్ ఎగ్స్ ని మనం లాగిన్ చేసుకున్నామా...? చూద్దాం.. ఇదే అంశంపై ఇవాళ్టి వైడ్ యాంగిల్ స్టోరీ... పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

22:09 - June 6, 2017

మన మార్కెట్లకు దిగిన ప్లాస్టిక్ బియ్యం... ఊరువాడ సురువైతున్న కయ్యం, సర్కార్ బడికి చీమిడికారుతున్నదా...పైకం కరాబు చేసుకుంటున్న పబ్లిక్, గ్రూప్ 2 పరీక్ష ఫలితాలు గందరగోళం... ఒక్కటే సెంటర్ల రాసినోళ్లకు ర్యాంకులట, పితాని కబుర్లు చెప్తున్న జంపింగ్ మంత్రి.. ఏరుదాట్నంక తెప్పతగులవెట్టిన సత్యానారి, చెప్పుతోని కొట్టుకున్న తెలుగుదేశం నేత... అయినా మార్తదా అంటున్నడు మా రాత, ఎనిమిదేండ్ల పోరన్ని దేవున్ని జేసిన జనం.. ఎన్నిజూస్తలేం ఇసొంటి కథల్ని మనం.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

21:51 - June 6, 2017

 యాద్రాద్రి : యాదాద్రి క్షేత్ర నిర్మాణ పనులను మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి పరిశీలించారు. వచ్చే దసరానాటికి గర్భాలయ పనులు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారని మంత్రులు తెలిపారు.  ముఖ్యమంత్రి అంచనాలకు అనుగుణంగానే పనులు జరుగుతున్నాయన్నారు. నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతోందన్న విమర్శల్లో వాస్తవం లేదన్నారు . ఈసందర్భంగా మంత్రులకు ఆలయ మర్యాదలతో అర్చకులు స్వాగతం పలికారు. 

 

21:48 - June 6, 2017

కడప : ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి  గతంలో ఉన్న యూపీఏ ప్రభుత్వమే కారణమన్నారు.. బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు. అప్పట్లో రాహుల్‌ను ప్రధాని చేయాలన్న  దురుద్దేశంతోనే పార్లమెంట్‌లో విభజన బిల్లును హడావిడిగా ఆమోదించారని ఆయన విమర్శించారు. భద్రాచలాన్ని తెలంగాణకు ఇచ్చిన మన్‌మోహన్‌ ప్రభుత్వం ఆంధ్రప్రదేవ్‌కు ద్రోహం చేసిందని సోము వీర్రాజు ఆరోపించారు. 

21:45 - June 6, 2017

హైదరాబాద్ : ఏపీ, తెలంగాణ మధ్య మళ్లీ విద్యుత్‌ బకాయిల వివాదం మొదలైంది. తమకు రావల్సిన 4వేల 400 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించకుంటే..విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తామని ఏపీ జెన్‌కో... తెలంగాణకు లేఖ రాయనుంది. నెల క్రితమై ఈ విషయంలో ఏపీ జెన్‌కో తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. తమకు రావల్సిన 4,400 కోట్ల బకాయిల్లో సింగరేణి ద్వారా.. ఏపీ ప్రభుత్వానికి సరఫరా చేస్తున్న బొగ్గుకు చెల్లించాల్సిన.. 14వందల 37 కోట్లు మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని చెల్లించాలని కోరింది. 

 

21:40 - June 6, 2017

హైదరాబాద్ : ప్రత్యేక హోదా వల్ల ఉపయోగం లేదంటున్న సీఎం చంద్రబాబు ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. ఓటుకు నోటు కేసులో ఇరుకున్న చంద్రబాబు తన పదవిని కాపాడుకోడానికే  కేంద్రం ముందు సాగిలపడ్డారని ఆమె విమర్శించారు. మూడు సంవత్సరాలుగా జగన్‌ ప్రత్యేక హోదా కోసం ప్రయత్నిస్తున్నారని  రోజా అన్నారు. 

 

21:36 - June 6, 2017

విశాఖ : విభజనతో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందన్నారు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు. విభజించిన వారి కన్ను కుట్టేలా సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. విశాఖలో జరిగిన నవ నిర్మాణ దీక్షలో మంత్రి గంటా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్కిల్ డెవలప్‌మెంట్‌లో భాగంగా పలు రంగాల్లో శిక్షణ తీసుకున్న విద్యార్ధులకు మంత్రి సర్టిఫికేట్స్ అందజేశారు. 
నెల్లూరు..
విభజన తరువాత కష్టాల్లో ఉన్న రాష్ర్టాన్ని అభివృద్ధి వైపు నడిపించేందుకు సీఎం చంద్రబాబు తీవ్రంగా శ్రమిస్తున్నారన్నారు మంత్రి అమర్‌నాధ రెడ్డి.  నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలోని కొడవలూర్‌లో నవ నిర్మాణ దీక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఏపీని నిలబెట్టేందుకు అందరూ  కృషి చేయాలని అమర్‌నాధ రెడ్డి పిలుపునిచ్చారు. 
కడప
కడప జిల్లా జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయంలో 5వరోజు నవ నిర్మాణ దీక్షలు ఘనంగా జరిగాయి. మంత్రి ఆదినారాయణరెడ్డితో పాటు పలు శాఖలకు చెందిన అధికారులు ఈ దీక్షలో పాల్గొన్నారు. 2029 నాటికి దేశంలోనే నంబర్‌ వన్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ దూసుకుపోయేలా అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా మంత్రి ఆదినారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. 

 

21:29 - June 6, 2017

కరీంనగర్ : జిల్లాలో ప్రభుత్వం నిర్మించతలపెట్టిన మానేర్ రివర్ ఫ్రంట్ నిర్మాణ ప్రదేశాలను ముఖ్యమంత్రి కార్యాలయ ప్రధాన కార్యదర్శి స్మితా సబర్వాల్, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ పరిశీలించారు. మానేర్ డ్యామ్‌పై నుంచి రివర్ ఫ్రంట్ నిర్మాణ ప్రదేశాన్ని తిలకించారు. నిర్మాణపు పనులు, ప్రాజెక్టు నివేదికను జిల్లా కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్‌ను అడిగి తెలుసుకున్నారు. పనులు సాధ్యమైనంత త్వరగా మొదలయ్యే చూడాలని స్మిత సబర్వాల్ అధికారులకు సూచించారు.

 

21:20 - June 6, 2017

మహబూబ్‌నగర్‌ : జిల్లా పరిషత్‌ చైర్మన్‌ బండారి భాస్కర్‌ వ్యాఖ్యలు జిల్లాలో దుమారం రేపాయి.. జోగులాంబ గద్వాలలో మంత్రి జూపల్లి ఒంటరి మహిళలకు పెన్షన్‌ అందజేశారు.. ఈ కార్యక్రమంలో మొలకసీమ అమ్మాయిలు కత్తులు అంటూ బండారి భాస్కర్‌ అన్నారు.. ఈ కామెంట్స్‌పై మహిళా కాంగ్రెస్‌ నేతలు భగ్గుమన్నారు.. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.. ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు.. బండారి భాస్కర్‌ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు..

21:17 - June 6, 2017

హైదరాబాద్ : మియాపూర్‌ భూకుంభకోణంలో  సీఎం కేసీఆర్‌ కార్యాలయం ప్రమేయం ఉందని..  కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జీవన్‌ రెడ్డి ఆరోపించారు.. ఈ వ్యవహారానికి కేసీఆర్‌ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ స్కాంను గోల్డ్ స్టోన్‌ ప్రసాద్‌ ఒక్కడే చేయలేడని.. దీనివెనక పెద్దల హస్తముందని అన్నారు.. ఈ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

 

21:12 - June 6, 2017

హైదరాబాద్ : ఉద్యమాల ఖిల్లా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా టీఆర్ ఎసో ప్రభుత్వంపై మరో  పోరాటానికి తెలంగాణ కాంగ్రెస్‌ సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కారుపై నిరుద్యోగులు, విద్యార్థుల్లో నెలకొని ఉన్న  అసంతృప్తికి ఆజ్యం పోసి, తమకు అనుకూలంగా మార్చుకోవాలని నిర్ణయించింది. ఈనెల 18న ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ మహా సంగ్రామ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. 
ఉద్యమాల ఖిల్లా ఓయూ
పోరాటాల పోరు గడ్డ, ఉద్యమాల ఖిల్లా ఉస్మానియా యూనివర్సిటీ. తెలంగాణలో పుట్టిన ఉద్యమాలన్నింటికీ  ఈ విశ్వవిద్యాలయంలోనే బీజంపడ్డాయి. చాలా పోరాటాలు ఫలితాలిచ్చాయి. ఇటువంటి ఉస్మానియా యూనివర్సిటీని వేదికగా చేసుకుని మరో ఉద్యమానికి తెలంగాణ కాంగ్రెస్‌ సిద్ధమవుతోంది. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థిలోకాన్ని దూరం చేసుకున్న కాంగ్రెస్‌, ఇప్పుడు వీరి సమస్యలపై పోరాటాలకు ఊపిరిపోయాలని నిర్ణయించింది.  
ప్రభుత్వ శాఖల్లో రెండు లక్షల ఉద్యోగాల ఖాళీ
తెలంగాణ ఉద్యమ సమయంలో లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేస్తామని  టీఆర్‌ఎస్ హామీ ఇచ్చి, విద్యార్థులు, నిరుద్యోగులకు తమవైపు తిప్పుకుంది. అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచిపోయింది. కొన్ని నోటిఫికేషన్లు వేసి, కొద్ది పోస్టులను భర్తీ చేసి, విద్యార్థులు, నిరుద్యోగులకు ఆశలు కల్పించింది. ఇంకా రెండు లక్షల ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయాల్సివుందని నిరుద్యోగ సంఘాలు, ప్రతిపక్షాల నేతలు చెబుతున్నారు. టీఎస్‌పీఎస్సీ కొన్ని నోటిఫికేషన్లు జారీ చేసి రద్దు చేసిన సందర్భాలు ఉన్నాయి. పోటీ పరీక్షలు  నిర్వహించినా తప్పుల తడకలు. ఓఎంఆర్‌ షీట్లను ఫ్లూయిడ్‌ ఇంక్‌తో మార్పు చేసిన ఘనత టీఎస్‌పీఎస్సీదేనని నాయకులు గుర్తు చేస్తున్నారు. ఉపాధ్యాయ  ఉద్యోగాల ఖాళీల భర్తీకి మూడుళ్ల నుంచి టెట్‌, డీఎస్సీ నోటిఫికేన్లు జారీ చేయకుండా ఇదిగో, అదిగో అంటూ కాలక్షేపం చేస్తున్న అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. అటవీశాఖలో ఖాళీగా ఉన్న ఫారెస్టు రేంజి ఆఫీసర్లు, సెక్షన్‌ ఆఫీసర్లు, బీట్‌ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్‌ రద్దుల పద్దులో చేరింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ విధానాన్నీ విద్యార్థులు, నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా వీరందర్నీ సమీకరించి, సర్కారుపై పోరాటానికి సిద్ధం చేయాలని  తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు నిర్ణయించారు. 
నోటిఫికేషన్ల జారీ, పరీక్షల నిర్వహణలో లోపాలు 
నిరుద్యోగుల జీవితాలతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ చెలగాటమాడుతోందన్నది కాంగ్రెస్‌ నేతల వాదన. నోటిఫికేషన్ల జారీ, పరీక్షల నిర్వహణలో లోపభూయిష్టమైన విధానాలతో నిరుద్యోగులు బలిపశువులు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఉండవన్న టీఆర్‌ఎస్‌.... అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులు, ఉద్యోగుల మధ్య లడాయి పెట్టి, చోద్యం చూస్తోందన్న  వాదనలు ఉన్నాయి. ఈ విషయాలన్నిటినీ విద్యార్థులు, నిరుద్యోగుల దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరుసల్పే విధంగా చేయాలన్న లక్ష్యంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి, నిరుద్యోగ మహా సంగ్రామానికి సిద్ధమైంది. టీ పీసీసీ నేతృత్వంలో తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో జరిగే ఈ మహా సంగ్రామ సభకు అన్ని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నేతలను ఆహ్వానిస్తున్నారు. విద్యార్థి, నిరుద్యోగ మహా సంగ్రామ సభ ద్వారా టీఆర్‌ఎస్ నేతల గుండెల్లో దడపుట్టించి, ఈ వర్గాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. 

 

21:01 - June 6, 2017

నల్లగొండ : జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. పలుచోట్ల ఈదురుగాలులతో కుండపోత వర్షం పడుతోంది. భారీగా చేరుతున్న వరదనీటితో మిర్యాలగూడలో రోడ్లు జలమయమయ్యాయి. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. నర్సింబట్లలో ఈదురుగాలులకు.... పశువుల కొట్టంకూలి మహిళ మృతిచెందింది.

అమరావతి పరిసరప్రాంతాల్లో ఈదురు గాలులు, భారీ వర్షం

గుంటూరు : అమరావతి పరిసర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. సచివాలయం పరిసరాల్లో ఉరుములు, మెరుపులతో కుండపోత వర్షంతో నాలుగో బ్లాక్ లోకి వర్షపు నీరు చేరింది. దీంతో రెవెన్యూ శాఖ సెక్షన్‌లో ఉద్యోగుల పనికి ఆటంకం ఏర్పడింది. 

 

20:58 - June 6, 2017

గుంటూరు : అమరావతి పరిసర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. సచివాలయం పరిసరాల్లో ఉరుములు, మెరుపులతో కుండపోత వర్షంతో నాలుగో బ్లాక్ లోకి వర్షపు నీరు చేరింది. దీంతో రెవెన్యూ శాఖ సెక్షన్‌లో ఉద్యోగుల పనికి ఆటంకం ఏర్పడింది. 

 

20:55 - June 6, 2017

చిత్తూరు : రాయలసీమ రైతుల సమస్యల పరిష్కారంపై  సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ది లేదని సీపీఎం కేంద్రకమిటీ సభ్యుడు గపూర్ విమర్శించారు. రైతులకు ఇన్ పుట్ సబ్సిడీని చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని అన్నారు. 2013 నుంచి పెండింగ్ లో ఉన్న దాదాపు మూడు వేల కోట్ల రూపాయల ఇన్ పుట్ సబ్సిడీ వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై ఈ నెల 9న కడపలో నాలుగు సీమ జిల్లాల రైతు సదస్సు నిర్వహిస్తున్నట్టు గఫూర్‌ తెలిపారు. 

 

20:54 - June 6, 2017

పశ్చిమగోదావరి : పోడూరు మండలం గుమ్ములూరులో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 8 లారీలను పోలీసులు సీజ్‌ చేశారు.. గస్తీ నిర్వహిస్తున్న ఎస్ ఐ రవీంద్రబాబు బృందం ఇసుక లారీలను ఆపింది.. ఇసుక రవాణాకు సంబంధించి పత్రాలు చూపాలని అడిగారు.. డ్రైవర్లు ఎలాంటి పత్రాలు చూపకపోవడంతో 8 లారీలను సీజ్‌ చేశారు.. అయితే ఈ లారీలను ఎందుకు సీజ్‌ చేశారంటూ కొందరు రాజకీయ నేతలు పోలీస్‌ స్టేషన్‌కువచ్చి బెదిరిస్తున్నారని... ఇష్టంవచ్చినట్లు తిడుతున్నారని పోలీసులు చెబుతున్నారు.. 

 

20:49 - June 6, 2017

నెల్లూరు : పార్టీ నిర్మాణంలో బీజీగా ఉన్న జనసేన పార్టీ.. మహాయజ్ఞం పేరుతో నెల్లూరులో కార్యకర్తల ఎంపిక మొదలు పెట్టింది.  నగరంలోని స్థానిక టీటీడీ కల్యాణమండపంలో ఈ ఎంపికల ప్రయను ప్రారంభించారు. ఈ  సెలక్షన్స్‌కు జిల్లా వ్యాప్తంగా భారీ స్పందన ఉందని ఆ పార్టీ నేతలు అంటున్నారు.  తొలిరోజు ఎంపికలకు మూడువేల మంది హాజరైనట్టు జనసేన పార్టీ నాయకులు తెలిపారు. 

 

20:46 - June 6, 2017

రంగారెడ్డి : జిల్లాలో కానిస్టేబుల్ నర్సింహ వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న ఘటనపై బంధువులు ఆగ్రహంతో ఉన్నారు. విద్యార్థిని శ్యామల కుటుంబానికి న్యాయం చేయాలంటూ యాచారం ధర్మన్నగూడం అంబేద్కర్ విగ్రహం వద్ద మృతదేహంతో ధర్నాకు దిగారు. శ్యామల ఇంటికి ఎదురుగా ఉన్న కానిస్టేబుల్ నర్సింహాపై చర్యలు తీసుకోవాలంటూ ఆందోళనకు దిగారు. నిన్న శ్యామల ఆత్మహత్య అనంతరం...యాచారం పీఎస్‌లో ఫిర్యాదు చేసినా... ఇంతవరకు చర్య తీసుకోలేదని వారు ఆరోపించారు. 

20:37 - June 6, 2017

ఢిల్లీ : మధ్యప్రదేశ్‌లో రైతులపై కాల్పులను సీపీఎం పార్టీ ఖండించింది. బీజేపీ నేతలు కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్నారని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు విమర్శించారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వాలు.. రైతులను పట్టించుకోవడం లేదని ఆరోంపించారు. 

 

20:31 - June 6, 2017

హైదరాబాద్ : మియాపూర్ లాండ్ స్కాంలో..  నిందితుల కస్టడీకి మియాపూర్ కోర్టు అనుమతిచ్చింది. సబ్‌ రిజిస్ట్రార్లు యూసఫ్‌కు 8 రోజులు, మహ్మద్ మబరాజుద్దీన్‌, కిష్టారెడ్డికి,.. 4 రోజుల కస్టడీకి అప్పగిస్తూ.. మియాపూర్ కోర్టు ఆదేశాలు జారీచేసింది. 

 

20:31 - June 6, 2017
20:27 - June 6, 2017

గుంటూరు : జిల్లా బొంతపాడు వద్ద దారుణం బయటపడింది. మహిళా కండక్టర్‌ను చంపి తగలబెట్టిన ఘటన వెలుగుచూసింది. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కండక్టర్‌ కల్యాణికి భర్తతో విభేదాలున్నాయని.. భర్తే హత్య చేసి ఉంటాడని బంధువులు ఆరోపిస్తున్నారు.

20:24 - June 6, 2017

గుంటూరు జిల్లాలో దారుణం...

గుంటూరు : జిల్లా బొంతపాడు వద్ద దారుణం బయటపడింది. మహిళా కండక్టర్‌ను చంపి తగలబెట్టిన ఘటన వెలుగుచూసింది. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కండక్టర్‌ కల్యాణికి భర్తతో విభేదాలున్నాయని.. భర్తే హత్య చేసి ఉంటాడని బంధువులు ఆరోపిస్తున్నారు.

20:07 - June 6, 2017
20:06 - June 6, 2017

విశాఖ : కేంద్ర ప్రభుత్వం రోడ్డు రవాణ రంగాన్ని కార్పొరేట్‌ పరం చేయడానికి ప్రయత్నిస్తోందని.. దీనివల్ల ప్రజలకు, కార్మికులకు  వర్గాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆలిండియా రోడ్డు ట్రాన్స్‌పోర్టు వర్కర్స్‌ ఫెడరేషన్‌ జనరల్ సెక్రటరీ దివకరణ్ ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖలో జరుతున్న ఏఐఆర్ టీడబ్ల్యుఎఫ్ పదో జాతీయ మహాసభల్లో పాల్గొన్న ఆయన  మీడియాతో మాట్లాడారు. సమైక్య పోరాటాల ద్వారానే హక్కులను రక్షించుకోవాలని కార్మికులకు పిలుపునిచ్చారు. రవాణా రంగాన్ని కుదేలు చేసేందుకు మోడీ ప్రభుత్వం ముందుకు సాగుతోందని దివకరణ్‌ అన్నారు. 

 

20:02 - June 6, 2017

నెల్లూరు : తెలంగాణ సోదరులు రాయలసీమ, ఆంధ్రా ప్రాంత ప్రజల్ని వదులుకున్నందుకు పశ్చాత్తాపడే రోజు రావాలన్నారు ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. రాష్ట్రాభివృద్ధి దిశగా అందరూ ఐకమత్యంగా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. నెల్లూరు కస్తూరిబా కళాక్షేత్రంలో జరిగిన 5వరోజు జరిగిన నవ నిర్మాణ దీక్షలో మంత్రి పాల్గొన్నారు. ఏపీని నంబర్ వన్ స్ధానంలో నిలిపేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. 

 

18:56 - June 6, 2017
18:50 - June 6, 2017

భూపాల్ : మధ్యప్రదేశ్‌లో రైతుల ఆందోళన ఉధృత రూపం దాల్చింది. ఆగ్రహంతో ఉన్న రైతులు మంద్‌సౌర్‌ దలౌదా సమీపంలై రైలు పట్టాలను తొలగించి సిగ్నల్‌ సిస్టంను నష్టపరిచారు. దీంతో రైళ్లు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. రోడ్డుపై బైఠాయించిన  రైతులపై పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఓ రైతు మృతి చెందగా ముగ్గురికి గాయాలైనట్లు సమాచారం. పిపలియ్‌మండీలో ఆందోళనకారులు పాల ప్లాంట్‌కు నష్టం కలిగించారు. రుణమాఫీ, పంటలకు గిట్టుబాటు ధర..తదితర 20 డిమాండ్లపై రైతులు ఆందోళనకు దిగారు. జూన్‌ 1 నుంచి పది వరకు ఆందోళన చేయాలని నిర్ణయించారు. కూరగాయలు, పాలను రోడ్డుపై పారవేసి నిరసనకు దిగారు. ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ జోక్యంతో  రైతు సంఘాల్లో చీలిక వచ్చింది. ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థ భారతీయ్‌ కిసాన్‌ సంఘ్‌ ఆందోళన విరమించుకున్నా...మరో రెండు రైతు సంఘాలు భారతీయ కిసాన్‌ యూనియన్, కిసాన్‌ మజ్దూర్‌ సంఘ్‌ మాత్రం ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశాయి.

18:48 - June 6, 2017

మేఘాలయ : గోమాంసం నిషేధంపై మేఘాలయలో బిజెపికి ఎదురుదెబ్బ తగిలింది. వారం రోజుల్లో బిజెపికి చెందిన ఇద్దరు నేతలు రాజీనామా చేశారు. తాజాగా గోమాంసంపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ బిజెపి కీలక నేత బాచు మారక్‌ పార్టీకి రాజీనామా చేశారు. మారక్‌ నార్త్‌ గారో హిల్స్‌ జిల్లా అధ్యక్ష పదవిలో ఉన్నారు. 'మా పద్ధతులు, ఆచారాలు, సంప్రదాయాలను బీజేపీ పట్టించుకోవడం లేదు... బీఫ్‌ తినడం మా సంస్కృతిలో భాగమని....మా మనోభావాలు దెబ్బతిన్న కారణంగా నేను పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని పార్టీ అధ్యక్షుడు శిబున్‌ లింగ్‌దేవ్‌కు పంపిన లేఖలో బాచు మారక్‌ పేర్కొన్నారు. నాలుగు రోజుల క్రితం బెర్నార్డ్‌ మారక్‌ బిజెపికి రాజీనామా చేశారు. ఈ నెల 10 న బెర్నార్డ్‌ మారక్‌ బీఫ్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తున్నారు. దీనిపై బిజెపి గుర్రుగా ఉంది. ఈ ఫెస్టివల్‌లో బాచు మారక్‌ కూడా  పాల్గొని తన నిరసన తెలియజేయనున్నారు.  2018లో మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బిజెపి కీలక నేతల రాజీనామాలు ఆ పార్టీకి తీరని నష్టం కలిగించనుంది.

 

18:47 - June 6, 2017

విశాఖ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రోడ్‌ ట్రాన్స్‌పోర్టు బిల్లును సీఐటీయూ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ట్రాన్స్‌పోర్టు బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతోంది. అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించే పనిలో పడింది. విశాఖలో జరుగుతున్న ట్రాన్స్‌పోర్టు వర్కర్స్‌ ఫెడరేషన్‌ జాతీయ మహాసభల్లో ట్రాన్స్‌పోర్టు బిల్లుపై ప్రధానంగా చర్చించింది. కేంద్ర ప్రభుత్వం మెడలువంచైనా బిల్లును ఉపసంహరించుకునేలా చేయడానికి భారీ ఉద్యమం చేయాలని మహాసభ తీర్మానించింది.
వెయ్యి మంది ప్రతినిధులు హాజరు...  
విశాఖ నగరంలో రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్‌ 10వ జాతీయ మహాసభలు ఘనంగా సాగుతున్నాయి. ఈ మహాసభలకు 29 రాష్ట్రాల నుంచి దాదాపు వెయ్యి మంది ప్రతినిధులు హాజరయ్యారు. రవాణారంగంలో పనిచేస్తున్న వర్కర్స్‌ ఎదుర్కొంటున్న సమస్యలపై మహాసభలకు హాజరైన ప్రతినిధులు చర్చిస్తున్నారు. సమస్యల పరిష్కారానికి ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తున్నారు. భవిష్యత్‌ ఉద్యమానికి కార్మికులను సన్నద్దం చేయడానికి తీసుకోవాల్సిన కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు.
ట్రాన్స్‌పోర్టు బిల్లుపై చర్చ
ఇటీవల కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన ట్రాన్స్‌పోర్టు బిల్లుపైనా ప్రతినిధులు చర్చించారు. తక్షణమే ట్రాన్స్‌పోర్టు బిల్లులో ప్రభుత్వం చేసిన సవరణలను ఉపసంహరించుకోవాలని సీఐటీయూ జాతీయ నేతలు డిమాండ్‌ చేశారు. ట్రాన్స్‌పోర్టు బిల్లుపై ట్రాన్స్‌పోర్టు వర్కర్స్‌తోపాటుగా ప్రజలకు అవగాహన కల్పిస్తామంటున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ట్రాన్స్‌పోర్టు బిల్లుతో రాష్ట్ర రవాణా కార్పొరేషన్లు తీవ్రంగా నష్టపోనున్నాయని... వాటిని క్రమంగా నిర్వీర్యం చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపిస్తున్నారు. 
కార్పొరేట్ శక్తులకు ప్రజా రవాణా
కొత్త ట్రాన్స్‌పోర్టు బిల్లు వల్ల జరిగే పర్యవసానాల గురించి చిన్నాచితక రవాణా రంగంలోని యజమానులకు తెలియజెప్పి... వారితో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్‌ సేన్‌ అన్నారు. ట్రాన్స్ పోర్ట్ రంగంలోని వర్కర్స్ మాత్రమే కాకుండా సాధారణ ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు. ప్రజా రవాణాను, రాష్ర్టాల రవాణా రంగాలను గంపగుత్తగా కార్పోరేట్ సంస్థలకు అప్పచెప్పే ప్రయత్నం కేంద్రం చేస్తోందని ఆరోపించారు. కలిసొచ్చే అన్ని కార్మిక  సంఘాలను కలుపుకోని ప్రజా మద్దతుతో ట్రాన్స్‌పోర్టు బిల్లును అడ్డుకుంటామన్నారు. ఆదివారం నుంచి విశాఖలో జరుగుతున్న ఆల్‌ ఇండియా ట్రాన్స్‌పోర్టు వర్కర్స్‌ ఫెడరేషన్‌ జాతీయ మహాసభలు మంగళవారంతో ముగియనున్నాయి. ఇవాళ నూతన కమిటీని ఎన్నుకోనున్నారు. భవిష్యత్‌ కార్యచరణపై చర్చించనున్నారు. 

 

18:46 - June 6, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-2 పరీక్ష అంతా గోల్‌మాల్‌ వ్యవహరంగా మారింది. నాలుగు రోజుల క్రితం విడుదలైన గ్రూప్‌-2 ఫలితాలపై పరీక్ష రాసిన అభ్యర్థులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకే సెంటర్లో రాసిన వారందరికి గ్రూప్‌-2 ఇంటర్వ్యూ మెరిట్‌ లిస్ట్‌లో స్థానం సంపాదించారని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్‌-2 ఫలితాలపై రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు ఆందోళనలు చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాల్ని వీడియోలో చూద్దాం...

 

18:44 - June 6, 2017

మంచిర్యాల : జిల్లా బెల్లంపల్లి కాల్‌టెక్స్‌లో దారుణం జరిగింది. చదువుకోమని మందలించిన తండ్రిపై తనయుడు పెట్రోలు పోసి నిప్పంటించాడు. దీంతో శరీరం కాలిపోవడంతో   తండ్రి పరిస్థితి విషమంగా మారింది. అస్పత్రికి తరలించి చిక్సిత్స అందిస్తున్నారు. 

 

18:42 - June 6, 2017

కృష్ణా : విజయవాడ  పండింట్‌ నెహ్రూ బస్‌ స్టేషన్‌లో ప్రయాణికుడు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. టాయిలెట్స్‌లో బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. దీనిని గమనించిన ప్రయాణికులు పోలీసులు, ఆర్టీసి సిబ్బందికి సమాచారం చేరవేశారు. దీంతో బాధితుడ్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

18:41 - June 6, 2017

పశ్చిమగోదావరి : ఇప్పటివరకు కల్తీపాటు, కల్తీకారం, పసుపు, ఆవాలనే మాత్రమే మనం చూశాం. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్లాస్టిక్‌ బియ్యం, నకిలీ కోడిగుడ్లు హల్‌చల్‌ చేస్తున్నాయి. అంతేకాదు. తాజాగా ఈ లిస్ట్‌లోకి నకిలీ బెల్లం కూడా వచ్చి చేరింది. పశ్చిమగోదావరి జిల్లాలో నకిలీ బెల్లం తయారీ ముఠా గుట్టురట్టు అయింది. నిడదవోలు మండలం కోరుమామిడి, కాటకోటేశ్వరం, పెండ్యాల, కోరుపల్లి, పురుషోత్తపల్లి, జీడిగుంట ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నకిలీ బెల్లాన్ని తయారు చేస్తున్నారు. పాడైన బెల్లానికి కొన్ని హానికర రసాయనాలు కలిపి వందల కేజీల నకిలీ బెల్లాన్ని తయారీ చేస్తున్నారు మాయగాళ్లు. పాడైపోయిన బెల్లానికి హైడ్రోస్‌ డీఏసీ అమ్మోనియం ఫాస్పేట్‌ను అలాగే బెల్లానికి రంగు రావడం కోసం రసాయనాలను వాడుతున్నారు. ఇక ఈ నకిలీ బెల్లం తయారీని చూస్తే కళ్లు తిరిగి పడిపోవాల్సిందే. అపరిశుభ్ర వాతావరణంలో ఈగలు, దోమలు, పురుగులు, చెత్తాచెదారం మధ్య బెల్లం నకిలీ బెల్లాన్ని తయారు చేస్తున్నారు. బెల్లాన్ని ఉడికించేందుకు మంటకు ప్లాస్టిక్‌ వస్తువులు, చెప్పులు, ప్లాస్టిక్‌ డబ్బాలు, సెలైన్‌ బాటిళ్లను వాడుతున్నారు. దీంతో హానికర విషవాయువులు, రసాయనాలు బెల్లంతో కలిసిపోతున్నాయి. దీంతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇంత జరుగుతున్నా..అధికార యంత్రాంగం మాత్రం అటువైపు కన్నెత్తికూడా చూడడంలేదు. 

 

18:39 - June 6, 2017

హైదరాబాద్‌ : మీర్‌పేట్‌ పీఎస్‌ పరిధిలోని నందనవనంలో ప్లాస్టిక్‌  బియ్యం కలకలం రేగింది. ఓ కిరాణాషాపులో ప్లాస్టిక్‌ బియ్యాన్ని విక్రయించగా.. అశోక్‌ కుమార్‌ కొనుగోలు చేశారు. అన్నం వండి తింటుండగా ప్లాస్టిక్‌ రైస్‌గా గుర్తించారు. మీర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బియ్యాన్ని ల్యాబ్‌కు పంపించారు.

18:04 - June 6, 2017

నల్గొండలో భారీ వర్షం..

నల్గొండ : జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. తీవ్ర ఎండలతో ఇబ్బందులు పడిన ప్రజానీకం ఉపశమనం పొందారు. మిర్యాలగూడలో రోడ్లు జలమయం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

ధర్మన్నగూడెంలో శ్యామల కుటుంబీకుల ధర్నా..

రంగారెడ్డి : జిల్లా యాచారం ధర్మన్నగూడెంలో మృతి చెందిన శ్యామల మృతదేహంతో కుటుంబీకులు ధర్నా చేపట్టారు. కానిస్టేబుల్ వేధింపులతో శ్యామల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

ఎన్టీరామారావును ఎందుకు వెన్నుపోటు పొడిచారు - రోజా..

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత రోజా మరోసారి ధ్వజమెత్తారు. సీనియార్టీ నాయకుడిగా ఉన్న ఎన్టీరామారావును ఎందుకు వెన్నుపోటు పొడిచారని, బాబు కన్నా యనమల..అశోక్ గజపతి రాజులు సీనియర్లు అని, మరి వారిని ఎందుకు సీఎం చేయలేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ అధ్యక్షుడు జగన్ ఎన్నో దీక్షలు చేశారని పేర్కొన్నారు.

ఎన్టీరామారావును ఎందుకు వెన్నుపోటు పొడిచారు - రోజా..

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత రోజా మరోసారి ధ్వజమెత్తారు. సీనియార్టీ నాయకుడిగా ఉన్న ఎన్టీరామారావును ఎందుకు వెన్నుపోటు పొడిచారని, బాబు కన్నా యనమల..అశోక్ గజపతి రాజులు సీనియర్లు అని, మరి వారిని ఎందుకు సీఎం చేయలేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ అధ్యక్షుడు జగన్ ఎన్నో దీక్షలు చేశారని పేర్కొన్నారు.

వారం రోజల్లో తెలంగాణకు రుతుపవనాలు..

ఢిల్లీ : పశ్చిమ అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర తీరాన్ని ఆనుకుని ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రాగల మూడు రోజుల్లో రాయలసీలమ, దక్షిణ కోస్తాలో వర్షాలు పడే అవకాశం ఉంది. వారం రోజుల్లో తెలంగాణకు రుతుపవనాలు రానున్నాయని, నేడు, రేపు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

మియాపూర్ ల్యాండ్ స్కాం..నిందితులకు కస్టడీ..

హైదరాబాద్ : మియాపూర్ ల్యాండ్ స్కాం ఘటనలో ముగ్గురు సబ్ రిజిస్ట్రార్ల కస్టడీకి మియాపూర్ కోర్టు అనుమతి లభించింది. యూసఫ్ కు 8 రోజులు, మహ్మద్ మబరాజుద్దీన్, కిష్టారెడ్డికి 4 రోజుల కస్టడీ విధించింది.

 

టీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల పరపతి సహకార సంఘం రసాభాస..

హైదరాబాద్ : ఎస్వీకేలో టీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల పరపతి సహకార సంఘం ఉద్యోగుల సమావేశం రసాభాసాగా జరిగింది. సహకార సంఘం కార్యదర్శిగా ఏపీకి చెందిన నాగరాజును తొలగించాలని సభలో ఆందోళన చేశారు.

దుర్గమ్మ ఆలయంలో విజిలెన్స్ తనిఖీలు..

విజయవాడ : దుర్గమ్మ ఆలయంలో విజిలెన్స్ తనిఖీలు చేపట్టింది. నాణ్యత లేదన్న ఫిర్యాదుతో అన్నదానం..ప్రసాదాల కేంద్రాల్లో తనిఖీలు చేసింది.

మధ్యప్రదేశ్ సీఎం అత్యవసర సమావేశం..

మధ్యప్రదేశ్ : మంద్ సౌర్ లో రైతులపై జరిపిన కాల్పుల ఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. పోలీసుల కాల్పుల్లో రైతుల మృతిపై సీఎం అత్యవసర భేటీ జరిపారు. సీనియర్ మంత్రులు..ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మంద్ సౌర్, రత్లాం, ఉజ్జయినీలో ఇంటర్ నెట్ సేవలు నిలిపివేశారు.

గుంటూరు జిల్లాకు విపత్తు నిర్వాహణ హెచ్చరికలు..

గుంటూరు : జిల్లాకు విపత్తు నిర్వాహణ విభాగంగా హెచ్చరికలు జారీ చేసింది. రాజుపాలెం, పిడుగురాళ్ల, వేమూరు, ముప్పాల, భట్టిప్రోలు, వట్టిచెరుకూరు, నకరికల్లు, తెనాలి, కొల్లిపర, దుగ్గిరాల, అమరావతి, ఎడ్లపాడు, నాదెండ్ల మండలాల పరిధిలోని గ్రామాల్లో మరో 30 నిమిషాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వాహణ శాఖ హెచ్చరించింది.

మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు..

మంచిర్యాల : సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు నిర్వహిస్తోంది. అధికారులు రికార్డులను పరిశీలిస్తున్నారు.

మియాపూర్ భూ స్కాం వెనుక పెద్దల హస్తం - జీవన్ రెడ్డి..

హైదరాబాద్ : మియాపూర్ భూ స్కాం వెనుక పెద్దల హస్తం ఉందని టి.కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పేర్కొన్నారు. గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఒక్కడితో ఇది సాధ్యం కాదని, స్కాంలో దోషులను తేల్చే శక్తి సీఐడీకి లేదన్నారు. సీబీఐ విచారణకు ఆదేశించి కేసీఆర్ తన సచ్చీలతను నిరూపించుకోవాలన్నారు. నయీం కేసులో మండలి ఛైర్మన్ నేతి విద్యాసాగర్ రావు పేరు ఎఫ్ఐఆర్ లో ఉన్నా ఆయనపై చర్యలు లేవని, మియాపూర్ భూముల కేసూ అలాగే చేస్తారని తెలిపారు.

మహారాష్ట్ర రైతులపై కాల్పులు..

మహారాష్ట్ర : రైతులపై పోలీసులు కాల్పులు జరిపారు. మంద్ సార్ జిల్లాల్లో రైతులు బైఠాయించగా పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ రైతు మృతి చెందగా ముగ్గురికి గాయాలయ్యాయి. మద్దతు ధర కోసం గత రెండు రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.

ఏపీలో త్వరలో కొత్త మద్యం పాలసీ - జవహార్..

విజయవాడ : కొత్త మద్యం పాలసీ అమలు చేయనున్నట్లు ఎక్సైజ్ మంత్రి జవహార్ వెల్లడించారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా కొత్త మద్యం పాలసీ అమలు చేయడం జరుగుతుందని, మద్యం కల్తీకి పాల్పడితే లైసెన్స్ లు రద్దు చేస్తామని హెచ్చరించారు. కొత్తబార్ పాలసీని త్వరలోనే అమలు చేస్తామని, ఎక్జైజ్ శాఖ ద్వారా గత ఏడాది ప్రభుత్వానికి రూ. 3వేల కోట్ల ఆదాయం వచ్చిందన్నారు.

బ్లేడుతో కోసుకుని ప్రయాణీకుడు ఆత్మహత్యాయత్నం..

విజయవాడ : పండిట్ నెహ్రూ బస్టాండులోని టాయిలెట్స్ లోని బ్లేడుతో గొంతుకోసుకుని ప్రయాణికుడు ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. ఆర్టీసీ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు.

 

13:33 - June 6, 2017

హైదరాబాద్: గ్రూప్‌-2 పరీక్ష ఫలితాలపై నిరుద్యోగులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. నిర్దిష్టమైన కేంద్రాల్లో పరీక్షలు రాసిన వారు గంపగుత్తగా ఇంటర్వ్యూకు ఎంపిక కావడంపై వారు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. పాలక పక్షంలోని కీలక పెద్దలకు చెందిన నియోజకవర్గాల్లోని అభ్యర్థులే ఇలా లాటులో పాస్‌ కావడంలో లొసుగు ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇందులో ప్రభుత్వ పెద్దలకు సంబంధం ఉందని ఆరోపిస్తున్నారు. గ్రూప్‌ 2లో కొన్ని సెంటర్లలో వరుస నెంబర్లతో పరీక్ష రాసిన అభ్యర్థులు పాస్‌ కావడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై, ప్రజాసంఘాల మద్దతుతో న్యాయపోరాటం చేయాలని వారు భావిస్తున్నారు . ఇదే అంశంపై '10టివి' ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో నిరుద్యోగ జేఏసీ నేత మానవతరాయ్, పిడిఎస్ యూ నేత ప్రదీప్, శ్రీనివాస్,పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

కాబూల్ లో భారతీయ గెస్ట్ హౌస్ పై దాడి..

అప్ఘనిస్తాన్ : కాబూల్ లోని భారతీయ గెస్ట్ హౌస్ పై ఉగ్రదాడి జరిగింది. రాకెట్ లాంచర్ తో ఉగ్రవాదులు దాడి జరిపారు. గెస్ట్ హౌస్ లోని టెన్నిస్ కోర్టులో రాకెట్ లాంచర్ పడింది. ఆసమయంలో శాంతిసమావేశం జరుగుతోంది.

12:45 - June 6, 2017

ఢిల్లీ: కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం జరుగుతోంది. ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ అధ్యక్షతన జరగుతున్న భేటీలో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి పదోన్నతి తదితర అంశాలపై చర్చిస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికల బరిలో ప్రతిపక్షాల తరుపున ఉమ్మడి అభ్యర్థిని నిలిపే అంశాన్ని పరిశీలిస్తున్నారు. గత ఏడాది నవంబర్‌ 7న జరిగిన సిడబ్ల్యుసి సమావేశంలో కూడా రాహుల్‌ పదోన్నతిపై నేతుల చర్చించారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, ఏకే ఆంటోనీ, గులాంనబీ ఆజాద్‌ ఇతర సీనియర్‌ నేతలు హాజరయ్యారు. 

12:43 - June 6, 2017

తూ.గో: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన స్వాతి, నరేష్‌ల పరువు హత్య ఘటన మర్చిపోకముందే తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం తూర్పుపాలెంలో మరో పరువు హత్య జరిగింది. తన కూతుర్ని ప్రేమించాడని ప్రియుడిని యువతి తండ్రి దారుణంగా హత్యచేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని గొల్లపాలెం వద్ద ఉన్న కరవాక బీచ్‌లో పాతిపెట్టాడు. మే 2న ప్రియుడిని హత్య చేసినట్లు పోలీసుల విచారలో తేలింది. అయితే ప్రియుడి మృతదేహాన్ని బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. నిందితుడు, యువతి తండ్రి అయిన కందుల విజయ్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

12:40 - June 6, 2017
12:37 - June 6, 2017

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధనలో మహిళల పాత్ర చాలా కీలకమైనది. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర సాధించుకుని 3 సంవత్సరాలు అవుతోంది. ఈ కాలంలో మహిళలకు వరింగింది ఏమిటి. ఇదే అంశం పై మానవి 'వేదిక'లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో కాంగ్రెస్ ఇంద్ర శోభన టీఆర్ ఎస్ కార్పొరేటర్ స్వర్ణ లత పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

గోవధ నిషేధంపై బీజేపీ నేత రాజీనామా..

మేఘాలయ : గోవధ నిషేధంపై బీజేపీకి సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత వస్తోందని తెలుస్తోంది. గోవధ నిషేధానికి వ్యతిరేకంగా మేఘాలయ బీజేపీ నేత బచూమారక్ పార్టీకి రాజీనామా చేశారు.

12:22 - June 6, 2017

యూరి పవర్ ప్లాంట్ వద్ద హై అలర్ట్..

జమ్మూ కాశ్మీర్ : యూరి పవర్ ప్లాంట్ వద్ద హై అలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాదుల నుండి పవర్ ప్లాంట్ కు ముప్పు ఉందని హెచ్చరికలతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఏపీలో పరువు హత్య..

తూర్పుగోదావరి : మామిడికుదురులో పరువు హత్య జరిగింది. కూతురిని ప్రేమించాడని యువకుడు రామాంజనేయులను తండ్రి విజయకుమార్ హత్య చేసి బీచ్ లో పాతిపెట్టాడు. పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

నవ నిర్మాణ దీక్షపై బాబు టెలీకాన్ఫరెన్స్..

విజయవాడ : నవనిర్మాణం దీక్షపై సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సకాలంలో వర్షాలు పడడం శుభసూచికమని, ఇస్రో విజయం..సివిల్స్ విజయాలు స్పూర్తిదాయకమన్నారు. ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా ఏపీని రూపొందించాలని, రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సొంత ఇళ్లు..స్థలం ఉండాలన్నారు. ప్రతి కుటుంబానికి భరోసా..భద్రత పెంచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా ఏపీని రూపొందించడమే మహాసంకల్పమన్నారు.

12:08 - June 6, 2017

ప్రారంభమైన సీపీఎం పొలిట్ బ్యూరో సమావేశం..

ఢిల్లీ : సీపీఎం పొలిట్ బ్యూరో సమావేశం ప్రారంభమైంది. ఏచూరి, ప్రకాష్ కారత్, పినరయి, రాఘవులు హాజరయ్యారు. రాష్ట్రపతి ఎన్నిక..కేరళ..త్రిపురలో రాజకీయ పరిణామాలపై చర్చ జరగనుంది.

బాబు..వెంకయ్యలు బరి తెగిస్తున్నారు - సీపీఐ..

విజయవాడ : ప్రత్యేక హోదా భరోసా సభపై సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు బరితెగించి మాట్లాడుతున్నారని సీపీఐ నేత రామకృష్ణ పేర్కొన్నారు. విభజన కోసం లేఖ రాసిన సంగతి చంద్రబాబు మరిచారా ? అని ప్రశ్నించారు. టిడిపి, బిజెపి మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా ఇస్తామన్నారని, వెంకయ్య, చంద్రబాబులు ప్రజలని మోసం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు నవనిర్మాణ దీక్షలు రాష్ట్రం కోసమా ? ప్రతిపక్షాలపై దాడి కోసమా ? అని ప్రశ్నించారు.

11:44 - June 6, 2017

రంగారెడ్డి :జిల్లాలోని జల్‌పల్లిలో నకిలీ రిజిస్ట్రేషన్‌ పత్రాలతో ఆరు వందల గజాల స్థలాన్ని కాజేసేందుకు కుట్రలు పన్నిన ఒక ముఠాను మైలార్‌దేవ్‌ పోలీసులు అరెస్టు చేశారు. నగరానికి చెందిన నజ్మా పసియుద్దీన్‌కు జల్‌పల్లిలో 600 గజాల స్థలం ఉంది. బెంగళూరులో ఉంటున్న నజ్మా నివాసంలో 2014లో దొంగలుపడి ఈ స్థలానికి సంబంధించిన ఒరిజనల్‌ పత్రాలు తస్కరించారు. FIR నమోదు చేసినా, రికరీకాలేదు. బెంగళూరు నుంచి అమెరికా వెళ్లే యత్నంలో ఉన్న నజ్మా స్థలాన్ని అమ్మకానికి పెట్టారు. దీనిని ఆసరాగా చేసుకుని ఇంజియాజ్‌ ఖాన్‌, అబ్దుల్‌ ఖాదర్‌, హఫీజ్‌ అల్లావుద్దీన్‌, సయ్యద్‌ అక్బర్‌, అహ్మద్‌ ఖలీల్‌ తదితరులు కలిసి నజ్మా స్థలానికి నకిలీ రిజిస్ట్రేషన్‌ పత్రాలు సృష్టించి, తక్కువ రేటుకు కొట్టేసేందుకు ప్రయత్నించడంతో బాధితురాలు పోలీసులు అశ్రయించారు. దీంతో రాజేంద్రనగర్‌ పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. 

11:42 - June 6, 2017

తూర్పుగోదావరి : జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది ఓఎన్ జీసీ బావి నుంచి గ్యాసు లీకువుతోంది. దీంతో రెండు కిలో మీటర్ల దూరం వరకు గ్యాసు పొగమంచులా కమ్ముకుంది. ఈ ఘనటతో భయాందోళనకు గురైన గ్రామ ప్రజలు భయంతో పరుగులు తీశారు. విషయం తెలిసిన వెంటనే ఓఎన్ జీసీ అధికారులు గ్యాస్‌ సరఫరాను నిలిపివేశారు.

 

11:41 - June 6, 2017

హైదరాబాద్: ఢిల్లీలో సీపీఎం పొలిట్‌బ్యూరో సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ, రేపు జరిగే ఈ సమావేశాల్లో దేశంలో ప్రస్తుత ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, కశ్మీర్‌ సంక్షోభం, రాష్ట్రపతి ఎన్నికలు, పశుమాంసం నిషేధం, పార్టీ సంస్థాగత సమావేశాలతో పాటు ఇతర అంశాలపై చర్చించనున్నారు. మరోవైపు సీపీఎం కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తలు దాడులకు పాల్పడవచ్చని నిఘా వర్గాల సమాచారంతో ఢిల్లీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

11:39 - June 6, 2017

కృష్ణా : విజయవాడ ధర్నాచౌక్‌ వద్ద ఉద్యోగ సంఘాలు ఆందోళన చేపట్టాయి. కాంట్రిబ్యూషన్‌ పెన్షన్‌ పథకం, ఔట్‌సోర్సింగ్‌ విధానం రద్దు చేయాలని ఉద్యోగులు డిమాండ్‌చేశారు. అలాగే కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్ చేశారు. వీరి ఆందోళనకు ఉఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు అశోక్‌బాబు, ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు హాజరయ్యారు. 

ధర్నా చౌక్ వద్ద ఉద్యోగ సంఘాల ఆందోళన..

విజయవాడ : ధర్నా చౌక్ వద్ద ఉద్యోగ సంఘాలు ఆందోళన చేపట్టాయి. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ బాబు, ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావులు హాజరయ్యారు.

సీడబ్ల్యూసీ సమావేశం ప్రారంభం..

ఢిల్లీ : టెన్ జన్ పథ్ లో సీడబ్ల్యూసీ సమావేశం ప్రారంభమైంది. సోనియా అధ్యక్షతనలో జరుగుతున్న ఈ సమావేశంలో రాష్ట్రపతి ఎన్నిక..తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరుగుతోంది.

సీపీఎం కేంద్ర కార్యాలయం వద్ద బందోబస్తు..

ఢిల్లీ : సీపీఎం పొలిట్ బ్యూరో సమావేశాలు ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తలు దాడులకు పాల్పడవచ్చని నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

10:59 - June 6, 2017

'నేనేప్పుడు చావాలో నేనే డిసైడ్ చేస్తా'..అంటున్నాడు రానా. టాలీవుడ్ లో వైవిధ్యమైన కథా చిత్రాలు ఎంచుకుంటూ ముందుకెళుతున్న నటుడు 'రానా'. 'బాహుబలి'..'బాహుబలి-2' సినిమాల ద్వారా ఒక్కసారిగా 'రానా' రేంజ్ పెరిగిపోయింది. తాజాగా ఆయన నటిస్తున్న 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. తేజ దర్శకత్వంలో రూపొందుతున్న ఈసినిమాలో 'రానా' సరసన 'కాజల్ అగర్వాల్' నటిస్తోంది. దివంగత నిర్మాన డి.రామానాయుడు జయంతి సందర్భంగా 'రానా' తన ట్విట్టర్ ద్వారా టీజర్ ను విడుదల చేశారు. 'రానా'కు ముసుగు వేసి ఉరి వేయడానికి తీసుకెళుతుండడం..అప్పుడు నటుడు 'పోసాని కృష్ణ మురళి' 'పుట్టిన వాడు మరణించక తప్పదు..మరణించిన వాడు పుట్టకా తప్పదు..ఆమెన్' అని అంటారు. దానికి ధీటుగా రానా..'నేనేప్పుడు చావాలో నేనే డిసైడ్ చేస్తా..నువ్వెప్పుడు చావాలో కూడా నేనే డిసైడ్ చేస్తా' ..నా జీవితానికి నేనే రాజు నేనే మంత్రి' అని చెబుతున్న డైలాగ్ విశేషంగా ఆకట్టుకొంటోంది. ఈ సినిమాలో రానా రాధా జోగేంద్ర అనే మంత్రి పాటలో నటిస్తున్నాడు. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళంలోనూ నిర్మితమౌతోంది.

10:39 - June 6, 2017

నిజామాబాద్: ఒక వ్యాపారం దెబ్బతింటే పెట్టుబడిదారులకు మాత్రమే నష్టం ... కానీ ఓ పరిశ్రమ మూతబడితే వందలాది మంది జీవనోపాధిని కోల్పోవాల్సి వస్తోంది. నిజామాబాద్ జిల్లాలో దశాబ్దకాలంగా పారిశ్రామిక రంగం అనేక ఒడిదుడుకులకు గురవుతోంది. ఇక్కడ కొత్తగా ఏర్పడుతున్న పరిశ్రమల కంటే మూతబడుతున్న పరిశ్రమల సంఖ్యే ఎక్కువగా ఉంటోంది.

ఏటా తాళాలు పడుతున్న చిన్నతరహా పరిశ్రమలు...

జిల్లాలో ఏటా సగటున యాభై నుంచి వంద చిన్నతరహా పరిశ్రమలకు తాళాలు పడుతున్నాయి. జిల్లాలో ప్రస్తుతం 2 వేల 900 పరిశ్రమలుండగా, పదేళ్లలో 960 మూతపడ్డాయి. నిజామాబాద్ నగర చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు కామారెడ్డి, బోధన్ పట్టణాల్లోని పారిశ్రామిక వాడల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. శివార్లలోని ఖానాపూర్, సారంగపూర్, ముదక్ పల్లి ప్రాంతాల్లో అనేక మిల్లులకు తాళాలు పడ్డాయి. కామారెడ్డిలోని ఇండస్ట్రియల్ ఏరియా ప్రస్తుతం ఎలాంటి లావాదేవీల్లేకుండా వెలవెలబోతోంది.

కష్ట, నష్టాల్లో ఇండస్ట్రీలు...

జిల్లాలో కుటీర పరిశ్రమలతో పాటు ఓ స్థాయి పెట్టుబడులతో ప్రారంభించిన ఇండస్ట్రీలు నష్టాల పాలవుతున్నాయి. నిర్వహణ భారమై కొందరు, రాబడులు లేక మరికొందరు పరిశ్రమలను మూసేస్తున్నారు. బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు, ప్రైవేటుగా చేసిన అప్పులు తీర్చలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. పరిశ్రమల కోసం కొనుగోలు చేసిన భూములు వృథాగా మారుతున్నాయి. వాటిపై ఆధారపడ్డ వేలాది మంది ఉపాధి కోల్పోతున్నారు. పదేళ్లలో మూతపడ్డ పరిశ్రమలకు సంబంధించి కనీసం పది వేల మంది ఉపాధి కోల్పోయినట్టు అనధికారిక అంచనా. కొంతకాలంగా ముడి సరుకుల ధరలు పెరగడం, రవాణా ఛార్జీలు తడిసి మోపెడవడంతో చిన్నతరహా పరిశ్రమలకు తాళాలు వేయక తప్పడం లేదని స్థానికులంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పరిశ్రమలను తెరిచి ..నిరుద్యోగ సమస్యను తీర్చాలని కోరుతున్నారు. తెలంగాణాలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు సమాయత్తమవుతున్న ప్రభుత్వం.. పాత వాటికి పునరుజ్జీవం పోయాల్సిన అవసరాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. 

10:36 - June 6, 2017

హైదరాబాద్: సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ ముందు కాంట్రాక్ట్‌ నర్సులు ఆందోళన చేపట్టారు. వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. అప్పటికే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు కాంట్రాక్ట్‌ ఉద్యోగులను బలవంతంగా అరెస్ట్‌ చేశారు.

 

10:34 - June 6, 2017

హైదరాబాద్: ఓ పెళ్ళి వేడుక ఓ వ్యక్తి చావుకు దారితీసిన ఘటన మీర్‌పేట పీఎస్‌ పరిధిలో చోటుచేసుకుంది. తన అన్న కూతురు పెళ్లి విందుకు సతీష్ కుమార్ అనే రిటైర్డ్‌ ఫైర్‌ సర్వీస్‌ ఉద్యోగి హాజరయ్యారు. అయితే అక్కడ విందులో DJ ప్లే అవుతుండగా ఇద్దరు మీర్‌పేట పీఎస్‌కు చెందిన హోంగార్డులు అక్కడకొచ్చి DJని ఆపటానికి వచ్చి స్థానికులతో వాగ్వాదానికి దిగారు. ఇంతలో సతీష్ కుమార్ కలుగజేసుకొని..కొద్దిసేపు తర్వాత DJని ఆపేస్తామన్నాడు. కానీ లోకేశ్ అనే హోంగార్డు వినిపించుకోకుండా సతీష్‌కుమార్ ఛాతిపై బలంగా కొట్టాడు. దాంతో సతీష్‌కుమార్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే గమనించిన పోలీసులు తమ రక్షక వాహనంలో సమీప ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆసుపత్రికి వెళ్లేలోపే మార్గమధ్యలోనే సతీష్‌కుమార్ చనిపోయాడు. పోలీసుల కారణంగానే సతీష్‌కుమార్‌ చనిపోయాడని మృతుని బందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం తమ తప్పు ఏమి లేదని బుకాయిస్తున్నారు.

 

10:33 - June 6, 2017

నిజామాబాద్‌ : జిల్లా నవీపేట మండలం సిరంపల్లిలో ట్రాక్టర్‌ బోల్తా పడి, మంటలు చెలరేగిన ఘటనలో డ్రైవర్‌ ఆంజనేయులు సజీవదహనమయ్యాడు. మలుపు వద్ద ట్రాక్టర్‌ అదుపుతప్పి పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. సిరంపల్లి గ్రామంలో వ్యవసపాయ ఉపకరణాలు దింపి తిరిగివస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

10:31 - June 6, 2017

రంగారెడ్డి: జిల్లా చేవెళ్ల మండలం ముడిమ్యాల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు-కారు ఢీ కొన్న ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తారు. ఘటనా స్థలాన్ని రవాణశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పరిశీలించారు. 

10:29 - June 6, 2017

రంగారెడ్డి జిల్లాలోని యాచారంలో విషాదం చోటు చేసుకుంది. కానిస్టేబుల్ వేధింపులకు యువతి బలైంది. విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇంటిఎదురుగా ఉండే కానిస్టేబుల్‌ వేధింపులే శ్యామల ఆత్మహత్యకు కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామస్తుల ఫిర్యాదుతో నిందితుడిపై యాచారం పోలీసులు కేసు నమోదు చేశారు. 

ధర్మన్నగూడెంలో దారుణం..

రంగారెడ్డి : యాచారం మండలం ధర్మన్నగూడెం దారుణం చోటు చేసుకుంది. కానిస్టేబుల్ వేధింపులు భరించలేక ఒంటిపై కిరోసిన్ పోసుకుని విద్యార్థిని శ్యామల మృతి చెందింది. కానిస్టేబుల్ వేధింపులే కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. యాచారం పీఎస్ లో కేసు నమోదైంది.

ముడిమ్యాలలో రోడ్డు ప్రమాదం..

రంగారెడ్డి : ముడిమ్యాల సమీపంలో రోడ్డు ప్రోమాదం చోటు చేసుకుంది. బస్సు - కారు ఢీకొనడంతో చిన్నారి మృతి చెందింది. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఆ సమయంలో అటువైపు వెళుతున్న రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.

10:17 - June 6, 2017

టాలీవుడ్ లో అగ్ర హీరోల సరసన నటించిన ముద్దుగుమ్మ 'కాజల్' 'నందమూరి కళ్యాణ్ రామ్'తో జత కడుతోంది. 'తేజ' దర్శకత్వంలో 'లక్ష్మీ కళ్యాణం' చిత్రం ద్వారా 'కాజల్' తెలుగు తెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో 'కళ్యాణ్ రామ్' హీరోగా నటించాడు. దాదాపు పదేళ్ల అనంతరం 'కాజల్' మరోసారి 'కళ్యాణ్'తో జత కడుతోంది. సి.భరత్ చౌదరి..ఎమ్.వి.కిరణ్ రెడ్డిలు నిర్మిస్తున్న ఈ సినిమాకు 'ఎమ్మెల్యే' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత భరత్‌చౌదరి తనయుడు కరణ్ క్లాప్‌నివ్వగా, కల్యాణ్‌రామ్ కూతురు తారక అద్విత, ఎమ్.వి.కిరణ్‌రెడ్డి కూతురు ఐక్రా కెమెరా స్విఛాన్ చేశారు. తొలి సన్నివేశానికి కోన వెంకట్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు భరత్ సినిమా విశేషాలను వెల్లడించారు. ఆద్యంతం వినోదభరితంగా సాగుతుందని, 9వ తేదీ నుండి రెగ్యులర్ గా షూటింగ్ కొనసాగుతుందన్నారు. మరి ఈ 'ఎమ్మెల్యే' తెరపై ఎలా ఉంటాడో చూడాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు..

హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో బుధవారం నుండి పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. క్యుములోనింబస్ ఏర్పడి మూడు రోజుల పాటు ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

కాంట్రాక్ట్ నర్సులను అరెస్టు చేస్తున్న పోలీసులు

హైదరాబాద్: తమను రెగ్యులరైజ్ చేయాలని, వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ సీఎం క్యాంప్ ఆఫీసు ఎదుట కాంట్రాక్టు నర్సులు ఆందోళన చేపట్టారు. ఆందోలన చేస్తున్న కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు.

అంతర్వేది వద్ద ఓఎన్జీసీ బావిలో గ్యాస్ లీక్

తూ.గో: అంతర్వేది వద్ద ఓఎన్జీసీ 29వ బావి నుండి గ్యాస్ లీక్ అవుతోంది. లీకేజీ కారణంగా గ్యాస్ సరఫరానుసిబ్బంది నిలిపివేశారు.

సీఎం చంద్రబాబు అరకు పర్యటన రద్దు

అమరావతి: సీఎం చంద్రబాబునాయుడు అరకు పర్యటన అర్థంతరంగా రద్దయింది. వాతావరణం ప్రతికూలంగా ఉన్నందున హెలికాప్టర్ లో చంద్రబాబు ప్రయాణించేందుకు అధికారులు అంగీకరించలేదు. ఉత్తర కోస్తాపై క్యుములో నింబస్ మేఘాలు ఉన్నందున హెలికాప్టర్ లో వెళ్లడం క్షేమకరం కాదని అధికారులు చెప్పడంతో, బాబు తన పర్యటనను విరమించుకున్నారు. దీంతో చంద్రబాబు అమరావతి నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విశాఖ అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారని సమాచారం.

09:45 - June 6, 2017

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ 'అల్లు అర్జున్' లెటెస్ట్ ఫిల్మ్ 'డీజే..దువ్వాడ జగన్నాథమ్' చిత్ర ట్రైలర్ అదరగొడుతోంది. ఈ సినిమాకు సంబంధించిన లెటెస్ట్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ ట్రైలర్ లో 'బన్నీ' డైలాగ్స్ దుమ్ము రేపేలా ఉన్నాయి. ఈ డైలాగ్స్ అభిమానులను ఎంతో ఉర్రూతలూగిస్తున్నాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో 'అల్లు అర్జున్' హీరోగా 'పూజా హెగ్డే' హీరోయిన్ గా నటిస్తున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకొంటోంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన పాటలను యూ ట్యూబ్ ఛానెల్ ద్వారా విడుదలువుతున్నాయి. అంతేగాకుండా ఫొటోలు..టీజర్ కూడా విడుదల చేశారు. అభిమానులను మరింత అలరించడానికి చిత్ర యూనిట్ ట్రైలర్ ను విడుదల చేసింది. 'పబ్బుల్లో వాయించే డీజేను కాదురా...పగిలిపోయేలా వాయించే డీజే'...అంటూ..బుద్ధం శరణం గచ్ఛామి కాదు సార్..యుద్ధం శరణం గచ్ఛామి అనాలి సార్' అంటూ బన్నీ పలికే డైలాగ్స్ చెప్పారు. ఒక వైపు బ్రాహ్మణ యువకుడి గెటప్..మరోవైపు సూట్ లో బన్నీ కనిపించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 'దిల్' రాజు ఈ సినిమాను నిర్మించారు. చివరగా జూన్ 23న వస్తున్నా..అంటూ బన్నీ డైలాగ్ తో చిత్ర ట్రైలర్ ముగుస్తుంది.

09:38 - June 6, 2017

అమరావతి: సీఎం చంద్రబాబునాయుడు అరకు పర్యటన అర్థంతరంగా రద్దయింది. వాతావరణం ప్రతికూలంగా ఉన్నందున హెలికాప్టర్ లో చంద్రబాబు ప్రయాణించేందుకు అధికారులు అంగీకరించలేదు. ఉత్తర కోస్తాపై క్యుములో నింబస్ మేఘాలు ఉన్నందున హెలికాప్టర్ లో వెళ్లడం క్షేమకరం కాదని అధికారులు చెప్పడంతో, బాబు తన పర్యటనను విరమించుకున్నారు. దీంతో చంద్రబాబు అమరావతి నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విశాఖ అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారని సమాచారం.

09:23 - June 6, 2017

నెల్లూరు : జిల్లాలో బీజేపీ ఆశించిన స్థాయిలో బలోపేతం కావడం లేదు. వెంకయ్యనాయుడు కేంద్రం నుంచి జిల్లాకు నిధులు వెల్లువలా తీసుకొస్తున్నా పార్టీకి జిల్లాలో పట్టు దొరకడం లేదు. నేతల మధ్య తలెత్తిన విభేదాలు, సమన్వయం లేకపోవడం, కేంద్రం అభివృద్ధి పనులపై తగిన ప్రచారం లేకపోవడంతో ప్రజల అభిమానం పొందలేకపోతుంది. జిల్లాకు చెందిన కమలనాధులు వెంకయ్య వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవడంలో విఫలమవుతున్నారు. కేంద్రం చేసే అభివృద్ధిని కిందకు తీసుకెళ్లాలని వెంకయ్యనాయుడు సూచిస్తున్నా ఫలితం మాత్రం ఉండడం లేదు.

జిల్లా నేతల మధ్య ఆధిపత్య పోరు...

జిల్లాలో నేతలు పార్టీ అభివృద్ధిని పక్కన పెట్టి ఆధిపత్య పోరుకు దిగారు. కమలంలో కొత్త కుమ్ములాటలు తెర పైకి వస్తున్నాయి. ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు అగ్రనేతలు రెండు వర్గాలుగా చీలిపోయారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు పి.సురేంద్రరెడ్డి , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్ రెడ్డిల మధ్య అంతర్గత విభేదాలు సాగుతున్నాయి. వీరిద్దరి మధ్య చోటుచేసుకున్న అనేక సంఘటనలు రెండు వర్గాల మధ్య మరింత దూరాన్ని పెంచాయి.

మూడేళ్లు దాటిపోతున్నా భర్తీకి నోచుకోని నామినేటెడ్‌ పదవులు

పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటిపోతున్నా జిల్లాలో నామినేటెడ్‌ పదవుల భర్తీకి నోచుకోలేదు. ఒకటి..రెండు పదవులు జిల్లాకు కేటాయించినప్పటికీ అధ్యక్షుడు వర్గానికి చెందిన నేతలకే దక్కాయి. దీంతో సురేష్‌ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సురేంద్ర రెడ్డి పదవీకాలం అయిపోయినా అధ్యక్ష పీఠాన్ని తిరిగి దక్కించుకోవాలని పావులు కదుపుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఒకరితో ఒకరు పోటీ పడడంతో పార్టీ నష్ట పోవాల్సి వస్తోంది. పార్టీ క్రమేణా కనుమరుగవుతుందని ఆ పార్టీకి చెందిన నేతలే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో బీసీ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గాల మధ్య ఆధిపత్య పోరు సాగుతూ ఉండేది. పార్టీ పెద్దలు జోక్యంతో ఆ వివాదం సర్దుమణిగింది. తాజాగా తలెత్తిన విభేదాలను ఏ విధంగా పరిష్కరిస్తారో వేచి చూడాలి.

09:21 - June 6, 2017

వరంగల్‌ : జిల్లాలో ఓ అనాథ యువతి పెళ్లి వేడుక అంబరాన్నంటింది. ఏ దిక్కులేని ఆమెకు..అధికారులే కుటుంబ సభ్యులై వివాహాన్ని వైభవోపేతంగా నిర్వహించారు.

అనాథ ఆశ్రమమే ఈమెకు పుట్టినిల్లు.....

ఈ నవ వధువు పేరు శిరీష. అనాథ ఆశ్రమమే ఈమెకు పుట్టినిల్లు. ఆడపిల్ల అన్న వివక్షో లేక పేదరికం ముందు పేగుబంధం ఓడిపోయిందో..మూడేళ్ల వయసులోనే వీధిన పడేసి తల్లిదండ్రులు చేతులు దులుపుకున్నారు. అమ్మానాన్నల ఆప్యాయతకు దూరమై విలపిస్తున్న చిన్నారిని వరంగల్‌ జిల్లాలోని మడికొండ అనాథ ఆశ్రమం అక్కున చేర్చుకుంది. తోటి అనాథలే తోబుట్టువులుగా..నిర్వాహకులే తల్లిదండ్రులుగా భావించి పెరిగింది. ఐదో తరగతి పూర్తి చేసుకున్న శిరీష.. ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు జఫర్‌గడ్ సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విద్యాభ్యాసం చేసింది. ఇంటర్ మంచి మార్కులతో పాస్ కావడంతో ఆనాటి కలెక్టర్ వాకాటి కరుణ సెయింట్ జోసఫ్ నర్సింగ్ కాలేజీలో జనరల్ నర్సింగ్ కాలేజీలో చేర్పించారు. నర్సింగ్ పూర్తిచేసుకుని.. హైదరాబాద్‌ యశోదా ఆస్పత్రిలో అప్రెంటీస్ పూర్తి చేసింది.

స్నేహితురాలి అన్నయ్య సోమ కళ్యాణ్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా ...

నర్సింగ్ కోర్సు చేస్తున్న క్రమంలో స్నేహితురాలి అన్నయ్య సోమ కళ్యాణ్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆ ప్రేమేనే పెళ్లి పీఠలదాకా తీసుకెళ్లాలనుకున్నారు. హైదరాబాద్‌ చింతల్‌లో ఉంటున్న తల్లిదండ్రులకు కల్యాణ్‌ తన ప్రేమ విషయాన్ని చెప్పాడు. వారు పెళ్లికి ఓకే చెప్పడంతో.. చైల్డ్ ప్రొటెక్షన్ ఆధీనంలో ఉన్న శిరీష.. విషయాన్ని తన గార్డియన్ సునీతకు చెప్పింది. సునీత పై అధికారులకు సమాచారం ఇవ్వడంతో.. విషయం జిల్లా కలెక్టర్ వరకు చేరింది. కలెక్టర్‌ ఆమ్రపాలి శిరీష, కళ్యాణ్‌ను పిలిపించుకొని.. అబ్బాయి తల్లిదండ్రులతో పెళ్లి విషయాన్ని ప్రస్తావించారు. అందరూ ఒప్పుకోడంతో పెళ్లికి ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ మౌకిక ఆదేశాలతో ఐసీడీఎస్, డీడబ్ల్యూవో అధికారులు తమకు తోచిన విధంగా సాయం చేశారు.

మహబూబాబాద్ జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ కౌన్సెలర్‌...

మహబూబాబాద్ జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ కౌన్సెలర్‌ అనుముల మాధవి దంపతులు వరుడి కాళ్లుకడిగి కన్యాదానం చేశారు. శిరీష అనాథ అన్న విషయం తెలుసుకున్న పూజారి సైతం ఉచితంగానే పెళ్లి తంతు జరిపించి తన ఔనత్యాన్ని చాటుకున్నాడు. వరంగల్‌ జిల్లా యంత్రాంగం దగ్గరుండి జరిపించిన పెళ్లి సందడిపై ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. 

08:57 - June 6, 2017

హైదరాబాద్: అమెరికాలోని ఫ్లోరిడా స్టేట్‌ ఓర్లాండోలో ఓ దుండుగుడు కాల్పులకు తెగబడ్డాడు. బిజినెస్‌ హెడ్‌క్వార్టర్స్‌లోని ఉద్యోగులపైకి తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఐదుగురు మృతి చెందినట్లు ఆరెంజ్‌ కౌంటీ షెరిఫ్‌ కార్యాలయ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మరో పది మంది వరకు గాయపడినట్టు తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎమర్జెన్సీ వాహనాలతో కాల్పులు జరిగిన ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు తెలిపారు. సరిగ్గా సంవత్సరం క్రితం ఓర్లాండో గే నైట్‌క్లబ్‌లో దాడి జరిపిన ఉగ్రవాదులు 49 మందిని బలితీసుకున్నారు. ఇప్పుడు అదే ఏరియాలో కాల్పులకు తెగబడి బీభత్సం సృష్టించారు. 

08:52 - June 6, 2017

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నవ నిర్మాణ దీక్షలు కొనసాగుతున్నాయి. 4వరోజు జరిగిన దీక్షల్లో ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు ప్రజలు భాగస్వాములయ్యారు.

విజయవాడ ఎ కన్వెన్షన్ సెంటర్‌లో

విజయవాడ ఎ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన నవ నిర్మాణ దీక్షలో సీఎం చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. నాటి యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర విభజన అడ్డగోలుగా చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్‌ విభజన హామీలను అమలు చేయాలని కోరారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ కింద అధిక నిధులు ఇవ్వాలన్నారు. అన్ని రాష్ట్రాల మాదిరిగా ఏపీ ఎదిగేంతవరకు కేంద్రం చేయూతనందించాలని కోరారు.

విశాఖ జిల్లాలో పలుచోట్ల

విశాఖ జిల్లాలో పలుచోట్ల ప్రజలు నవ నిర్మాణ దీక్షల్లో పాల్గొన్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు ఏయూ ప్లాటినం జూబ్లీ గెస్ట్‌హౌస్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందని అన్నారు. ముఖ్యమంత్రి రాష్ట్రాభివృద్ధికి చేస్తున్న ప్రయత్నాలకు రాష్ట్ర ప్రజానీకమంతా మద్దతు ఇవ్వాలని కోరారు.

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా...

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా నవ నిర్మాణ దీక్షలు కొనసాగాయి. పర్చూరులోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో జరిగిన నవ నిర్మాణ దీక్షలకు మంత్రి నారాయణ హాజరయ్యారు. చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. రాష్ట్రం లోటుబడ్జెట్‌లో ఉన్నా... సంక్షేమ కార్యక్రమాలను ఆపలేదని మంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను అన్నిరంగాల్లో అగ్రస్థానంలో నిలిపేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు.

.గో జిల్లాలో...

పశ్చిమ గోదావరి జిల్లా పోడూరులో నిర్వహించిన నవ నిర్మాణ దీక్ష కార్యక్రమంలో మంత్రి పితాని సత్యనారాయణ పాల్గొన్నారు. ఐకేపీ మహిళల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రాన్ని అడ్డదిడ్డంగా విడగొట్టి ఏపీకి తీరని అన్యాయం చేసిందని పితాని మండిపడ్డారు. ఏపీ సమగ్రాభివృద్ధికి చంద్రబాబు పట్టుదలతో కృషి చేస్తున్నారని చెప్పారు.

గుంటూరు జిల్లా వ్యాప్తంగా

గుంటూరు జిల్లా వ్యాప్తంగా నవ నిర్మాణ దీక్షలు ఘనంగా జరిగాయి. పొన్నూరు నియోజకవర్గంలో పలుచోట్ల జరిగిన నవ నిర్మాణ దీక్షల్లో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వం పనిచేస్తోందని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.

నవ నిర్మాణ దీక్షలు అన్ని జిల్లాల్లోనూ ఉత్సాహంగా సాగుతున్నాయి. నాయకులు ప్రజలచేత దీక్షలు చేయిస్తున్నారు. నవ్యాంధ్ర ప్రదేశ్‌కు పునరంకితం అవుతామంటూ ప్రజలు దీక్షలు చేపడుతున్నారు.

08:48 - June 6, 2017

పశ్చిమ గోదావరి : జిల్లా బుట్టాయగూడెం మండలం ఐటీడీఏ కె.ఆర్ పురం ఏపీఆర్జేసీ లో దారుణం జరిగింది. కాలేజ్ బోర్డు సరిచేయడానికి విద్యార్థులు, ప్రిన్సిపాల్ ప్రయత్నిస్తుండగా గ్రిల్ పై ఉన్న 11 కె వి లైన్ తగలడంతో విద్యార్థులకు, ప్రిన్సిపాల్‌కు కరెంటు షాక్ తగిలింది. దీనితో కాలేజీ ప్రిన్సిపాల్ రవికిరణ్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి సందీప్ అక్కడికక్కడే మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో విద్యార్థి రామ్మూర్తి చనిపోయాడు. మృతులను జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో ముగ్గురు విద్యార్థులకు గాయాలవడంతో రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు.

08:40 - June 6, 2017

హైదరాబాద్: ఇరు రాష్ట్రాలో భూ మాఫియా కట్టలు తెంచుకుంటున్నాయి. ఇదే అంశం పై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో టి.కాంగ్రెస్ నేత రఘుమోహన్ , వైసీపీ నేత కొండా రాఘవరెడ్డి, టిడిపి దినకర్ పాల్గొన్నారు. పూర్తి వివరా లకోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

అనుమతిలేని పెళ్లిలో అపశృతి

హైదరాబాద్: అనుమతి లేని పెళ్లి వేడుకలో డీజేను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బంధువులు పోలీసులతో వాగ్వివాదానికి దిగడంతో సతీష్ అనే వ్యక్తిని హోంగార్డు నెట్టేశారు. స్పృహ కోల్పోయిన సతీష్ ను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. పోలీసుల వల్లే సతీష్ చనిపోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు.

ప.గో జిల్లా బుట్టాయిగూడెంలో విషాదం

ప.గో : బుట్టాయిగూడెం ఐటీడీఏ గిరిజన రెసిడెన్షియల్ కాలేజీలో విద్యుత్ షాక్ ఘటనలో మృతుల సంఖ్య మూడుకి చేరింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉదయం మరో విద్యార్ధి రామ్మూర్తి మృతి చెందాడు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

మక్కామసీదుకు అరబ్ రాజు బహుమతి

చార్మినార్‌ : రంజాన్‌ ఉపవాసదీక్షలో ఉన్న ముస్లింల కు అరబ్ రాజు బహుమతి అందించారు. మక్కామసీదు వద్ద దీక్ష విరమణ సమయంలో ఉచితంగా అందించేందుకుగాను అరబ్‌ దేశ రాజు(యూఏఈ కింగ్‌) 500 కిలోల వరకు ఖర్జూర ఫలాలను బహుమతిగా ఇటీవల పంపించారు. వీటిని పవిత్ర కార్యంగా భావించి రోజా దీక్ష విడిచేవారికి ఇఫ్తార్‌ సమయంలో అందిస్తున్నామని మసీదు సూపరింటెండెంట్‌ ఖదీర్‌సిద్ధికీ, మేనేజరు మన్నాన్‌లు తెలిపారు.

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం...

ఓర్లాండో : అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. ఓర్లాండోలో గుర్తు తెలియని దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఆరేంజ్ కౌంటీలోని బిజినెస్‌ హెడ్‌క్వార్టర్స్‌లోకి చొరబడిన దుండగుడు ఉద్యోగులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో పలువురు మృతి చెందినట్లు ఆరెంజ్‌ కౌంటీ షెరిఫ్‌ కార్యాలయ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. కాల్పుల్లో ఎంతమంది మృతి చెందారనే విషయంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కాల్పులు జరిపిన వ్యక్తితో పాటు మరికొంతమంది మృతి చెందినట్లు తెలుస్తోంది. కాల్పుల ఘటనపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు 28 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం, కాలినడకన కొండ ఎక్కి వచ్చిన భక్తులకు ఆరు గంటల సమయం పడుతోంది. 

సీఎం చంద్రబాబు పై పెద్దపల్లి పీఎస్ లో కేసు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ఏపీలో బ్లాక్ డేగా జరుపుకోవాలని వ్యాఖ్యానించిన ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణలోని పెద్దపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 

Don't Miss