Activities calendar

07 June 2017

22:13 - June 7, 2017

భూకబ్జా దారులను కఠినంగా శిక్షించాలని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీపీఎం నేత శ్రీనివాస్, బీజేపీ నేత వేణుగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ నేత నందికొండ శ్రీనివాస్ రెడ్డి, టీడీపీ నేత బిఎన్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. భూ కబ్జాలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ భూములను రక్షించాలన్నారు. కబ్జాకు గురయ్యే భూములను రికవరీ చేయాలని కోరారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

22:09 - June 7, 2017

హైదరాబాద్ : దీపక్‌రెడ్డి..! ఎంపీ జేసీ దివాకరరెడ్డికి మేనల్లుడు..!! అంతేకాదు.. ఏపీ శాసనమండలి సభ్యుడు...!! పైగా ఏపీ ప్రజాప్రతినిధుల్లో అత్యంత ధనవంతుడు. ఇలాంటి వ్యక్తి.. భూకబ్జా ఆరోపణలపై కటకటాలు లెక్కిస్తున్నాడు. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ.. వందల కోట్ల రూపాయల భూముల కబ్జాకు దీపక్‌రెడ్డి చేసిన యత్నం తాజాగా వెలుగు చూసింది. అతను ఆధారాలతో సహా అడ్డంగా బుక్కయ్యాడు.  
సీమ ప్రజాప్రతినిధి భూదందా..
హైదరాబాద్‌లో సీమ ప్రజాప్రతినిధి భూదందా.. భూకబ్జా ఆరోపణలతో జుడిషియల్‌ రిమాండ్‌కు దీపక్‌రెడ్డి.. టీడీపీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి మేనల్లుడే దీపక్‌రెడ్డి.. ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి సభ్యుడు దీపక్‌రెడ్డి.. భూకబ్జా ఆరోపణలపై అరెస్టయ్యారు. హైదరాబాద్‌ నగరంలోనూ..  నగర శివారు ప్రాంతాల్లోనూ పలు భూములను కబ్జా చేసినట్లు ఈయనపై అభియోగాలున్నాయి. దీపక్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి.. చంచల్‌గూడ జైలుకు తరలించారు. నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్‌ విధించింది. దీపక్‌రెడ్డితో పాటు న్యాయవాది శైలష్‌ సక్సేనాను, స్టాంప్‌ వెండర్‌గా పనిచేస్తున్న శివభూషణ్‌నూ సీసీఎస్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.
నిందితులపై భూ కబ్జా కేసులు
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌, షేక్‌పేట్‌, బోజాగుట్ట, అసిఫ్‌ నగర్‌ తదితర ప్రాంతాల్లో దీపక్‌రెడ్డి సహా నిందితులపై భూ కబ్జా కేసులు నమోదయ్యాయి. మొత్తం ఆరు భూ కబ్జా కేసుల్లో, వివిధ సెక్షన్‌ల కింద,  దీపక్‌రెడ్డిపై సీసీఎస్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు. 
ఈనాం భూములను సొంతం చేసుకునేందుకు ప్లాన్‌
దీపక్‌రెడ్డి, శైలేంద్ర సక్సేనా మరో ముగ్గురు కలిసి.. గుడిమల్కాపూర్‌ పరిధిలోని బోజగుట్ట ప్రాంతంలో కోట్లాది రూపాయల విలువైన 78 ఎకరాల ఈనాం భూములను సొంతం చేసుకునేందుకు ప్లాన్‌ చేశారని, అసలు ఓనర్లను తప్పించి...ఆ స్థలాలను ఆక్రమించుకునేందుకు ప్రయత్నించారన్నది అభియోగం. దీనికోసం నిజాం నవాబుల నుంచి ఈ భూమిని బహుమతిగా పొందినట్లు నకిలీ పత్రాలు సృష్టించి, న్యాయస్థానం ద్వారా ఆ భూములను కొట్టేయాలని పావులు కదిపినట్లు చెబుతున్నారు. న్యాయస్థానం ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు, నిందితులు డాక్యుమెంట్లను పాతవని నమ్మించేందుకు వాటికి రసాయనాలు పూశారని, అవన్నీ నకిలీవేనని తేల్చారు. 
బంజరాహిల్స్‌లో 3ఎకరాల భూ వివాదం
అలాగే బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌-2లో సుమారు మూడు ఎకరాల భూమిని కాజేసేందుకు ప్రయత్నించినట్టు, మాదావ్‌పూర్‌లో ఓ వ్యాపారితోపాటు మరికొంతమంది ల్యాండ్‌ ఓనర్లను బెదిరించారన్న ఆరోపణలు దీపక్‌రెడ్డి, ఆయన అనుచరులపై ఉన్నాయి.  ఈ కేసుల్లో ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేసినా.. ఆయన నుంచి స్పందన రాలేదు.  వీరి కదలికలపై నిఘా ఉంచిన సీసీఎస్‌ పోలీసులు మంగళవారం వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితులు మాత్రం తమను కుట్రతో ఇరికించారని, తప్పుడు కేసులు బనాయించారని ఆరోపిస్తున్నారు.
దీపక్‌రెడ్డి అరెస్టు.. బోజగుట్ట వాసులు సంబరాలు 
మరోవైపు, దీపక్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారని తెలియగానే, ఆసిఫ్‌ నగర్‌ బోజగుట్ట వాసులు సంబరాలు చేసుకున్నారు. దీపక్‌ రెడ్డి అనుచరులు తమను ఎన్నోసార్లు వేధించారని.. చంపేస్తామని బెదిరించేవారని వారు ఆరోపిస్తున్నారు. దీపక్‌ రెడ్డితోపాటు అతని అనుచరులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. కాగా టీడీపీ ఎమ్మెల్సీగా పోటీ చేసిన దీపక్‌ రెడ్డి... తన కుటుంబ.. వ్యక్తిగత ఆస్తుల గురించి ఈసీకి తప్పుడు అఫిడవిట్‌ను సమర్పించినట్టు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి ఈ కేసుల్లో తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

22:03 - June 7, 2017

ఇక్కడ సంకెళ్లు వేశారు... అక్కడ కాల్చి చంపారు... మరోచోట అరెస్టులు చేశారు. లాఠీలతో తిరిమికొట్టారు..మొత్తానికి దేశంలో ఎక్కడైనా రైతు పరిస్థితి అదే. మంచి బహుమానే ఇస్తున్నారు. మంచి ప్రతిఫలమే దక్కుతుంది. దేశానికి పడికెడు తిండి పెట్టే తమ పట్ల ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు చూసి కడుపుమండుతుంది. గుండె రగిలిపోతుంది. రోడ్లెక్కుతున్నారు... ధర్నాలు చేస్తున్నారు. తమకు చేతనైన పోరాట రూపంలోకి దిగుతున్నారు. ప్రభుత్వాలు మాత్రం బలప్రయోగమే పరిష్కార మార్గంగా భావిస్తున్నాయి. కానీ తమకు జరిగే అన్యాయాన్ని చూస్తూ ఊరుకునేది లేదని రైతన్న హెచ్చరిస్తున్నాడు. ఇదే అంశంపై ఈరోజు వైడ్ యాంగిల్ స్టోరీ చూద్దాం.. పూర్తి వివరాలను వీడియోలో చూడండి. 

 

21:51 - June 7, 2017

ఢిల్లీ : హిందూసేన కార్యకర్తలు బరితెగించారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిపై దాడికి తెగబడ్డారు. అప్రమత్తమైన సీపీఎం కార్యకర్తలు దుండగులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీనిపై మార్క్సిస్ట్‌ పార్టీ నేతలు ఘాటుగా స్పందించారు. గూండాగిరికి బెదిరేది లేదని తేల్చి చెప్పారు. 
బరితెగించారు.
నిజాలు చెబితే సహించలేని అసహనం..
నిజాలు చెబితే సహించలేని అసహనం.. నిలదీసే గొంతు నొక్కే ప్రయత్నం.. ప్రజాస్వామ్యాన్ని పరిహసించేలా సంఘ్‌ గూండాగిరీ.. ప్రజలకు దూరమైన మోదీ ప్రభుత్వంపైనా.. మూడేళ్ల ఉత్సవాల హేతుబద్ధతపైనా ప్రశ్నిస్తోన్న సీపీఎం సారథి సీతారామ్‌ ఏచూరిపై.. సంఘ్‌ పరివార్‌ గూండాలు దాడికి యత్నించారు. ఏచూరి సంధించే ప్రశ్నాస్త్రాలకు బదులివ్వలేక.. అసహనంతో రగిలిపోతూ.. ఏకంగా, ఢిల్లీలోని సీపీఎం కార్యాలయంలోనే.. మీడియా సాక్షిగా.. బరితెగించిన సంఘ్‌ గూండాలు, ఏచూరిపై దాడికి యత్నించారు. నానా గందరగోళాన్నీ సృష్టించారు. 
ఏచూరిపై దాడికి ప్రయత్నం
ఢిల్లీలో సీపీఎం పొలిట్‌బ్యూరో సమావేశాల ముగింపు సందర్భంగా.. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రెస్‌మీట్‌లో మాట్లాడ్డానికి వస్తున్న సందర్భంగా .. రిపోర్టర్ల ముసుగులో వచ్చిన వ్యక్తులు.. ఒక్కసారిగా సీపీఎం పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు మొదలు పెట్టారు. అంతటితోనే ఆగకుండా ఏచూరిపై దాడికి ప్రయత్నించారు. వెంటనే తేరుకున్న సీపీఎం కార్యకర్తలు హంగామా చేస్తున్న వారిలో ఇద్దరిని పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. దాడికి ప్రయత్నించిన మరికొందరు సీపీఎం కార్యకర్తలు వెంబడించడంతో పారిపోయారు. దీనిపై  స్పందించిన సీతారాం ఏచూరి.. సంఘ్‌ పరివార్‌ గూండాగిరికి  భయపడేది లేదని ఘాటుగా స్పందించారు.      
ఘటన వెనుక బీజేపీ హస్తం : సీపీఎం  
ఈ ఘటన వెనుక బీజేపీ హస్తం ఉందని సీపీఎం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. రాజకీయపార్టీ కార్యాలయాల్లోకి దుండగులు చొరబడి అల్లరిచేస్తే.. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టాన్నారు వామపక్షనేతలు. అయితే.. ఇది సంఘ్‌ పరివార్‌ సంస్థలు చేస్తున్న చిల్లర చేష్టలుగా కొట్టిపారేశారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు తాము బెదిరేది లేదని.. దేశంలో పెచ్చరిల్లుతున్న మత గూండాగిరిని అడ్డుకుని తీరుతామని వామపక్ష నేతలు తేల్చి చెప్పారు. 

 

21:46 - June 7, 2017

విశాఖ : అర్బన్‌లోని పది మండలాల్లో ప్రభుత్వ భూమిని పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌. కొమ్మాదిలో 178 ఎకరాలు, మధురవాడలో 92.5 ఎకరాలు ట్యాంపరింగ్‌కు గురయ్యాయని తెలిపారు. ఆ భూమిని స్వాధీనం చేసుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. భూములు కబ్జాకు గురైనట్లు ఇప్పటివరకు 30 దరఖాస్తులు వచ్చాయని.. ఇలాంటి సమస్యలు ఉంటే తమకు ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్‌ తెలిపారు. 

 

21:44 - June 7, 2017

మంచిర్యాల : కవ్వాల్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌లోని గిరిజనులపై ఫారెస్ట్‌ అధికారులు దాడి చేస్తూ.. వారిని అడవికి దూరం చేసే కుట్ర జరుగుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మంచిర్యాల జిల్లా జిన్నారంలో పోడు భూముల నిర్వాసితులు, వృత్తిదారుల సమస్యలపై జరిగిన సదస్సుకు తమ్మినేని వీరభద్రం హాజరై, మాట్లాడారు. పులుల పేరుతో గిరిజనులకు అన్యాయం చేస్తే సీపీఎం పార్టీ ఊరుకోదన్నారు. 

 

20:50 - June 7, 2017

పల్చటివానకే పండ్లిగిలిచ్చిన సచివాలయం... అమరావతి అసెంబ్లీ లాబీలు ఆగమాగం, వానజల్లు కుట్రలను పసిగట్టిన స్పీకర్ సారు... ఎంక్వైరీ చేయమని సీఐడోళ్లకు అప్పగింత, చెరువులు చెల్కలపోంటి తిరుగుతున్న నేతలు... జనమే మార్చాలి ఇక వీళ్ల తలరాతలు, హైదరాబాద్ ల భూకబ్జావెట్టిన ఎమ్మెల్సీ... ఆరోపణ్లు నిజమే అంటున్న పోలీసొళ్లు, అగ్గైమండుతున్న అగిరిపల్లి దళితులు.. ఈనెల 10 తారీఖు నాడు ఉన్నదంట లడాయి, అక్రమాలు అడ్డుకున్నందుకు ఎస్సైకి గోస...మంత్రిగారి ఉష్కలారీలు ఆపుతారోస... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం....

తెలంగాణలో త్వరలో టెట్ పరీక్ష

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం త్వరలో టెట్ నిర్వహించనుంది. డీఎస్సీ కంటే ముందే టెట్ నిర్వహించనున్నారు. జూన్ 10న టెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. జులై 23న పరీక్ష నిర్వహించనున్నారు. ఆగస్టు 5న టెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. 

టీడీపీ కౌన్సిలర్ మంచి బాబు అరెస్టు

నెల్లూరు : వెంకటగిరిలో టీడీపీ కౌన్సిలర్ మంచి బాబును అరెస్టు చేశారు. పోలీసులు అతన్ని కోర్టుకు తరలించారు. కోర్టు బాబుకు 14 రోజులు విధించింది. 24 వ వార్డులో ఆరుగురి వృద్ధాప్య పింఛన్లు కౌన్సిలర్ కాజేశారు. బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 

 

20:18 - June 7, 2017

హైదరాబాద్‌ : నగరంలో ప్లాస్టిక్ బియ్యం వ్యవహారం కలకలం రేపుతోంది. ఓ హోటల్లో ప్లాస్టిక్‌ రైస్‌తో బిర్యాని వడ్డించగా... ఓ కిరాణా షాపు యజమాని ప్లాస్టిక్‌ రైస్‌ అంటగట్టాడు. వినియోగదారులు విషయాన్ని గుర్తించి..  ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు.  
ఆహార ధాన్యాలకు నకిలీలు 
మొన్నటివరకూ.. పాలు కల్తీ, తినే పదార్థాలు కల్తీ..! కానీ ఇప్పుడు, కల్తీ దశను దాటి, ఆహార ధాన్యాలకు నకిలీలు సృష్టించే పరిస్థితి తలెత్తింది. రోజూ వాడే బియ్యపు గింజలనే ప్లాస్టిక్‌తో తయారు చేసి విక్రయిస్తున్న ఘటన.. రాజధాని హైదరాబాద్‌లో కలకలం సృష్టిస్తోంది. వారం రోజుల వ్యవధిలోనే, ప్లాస్టిక్‌ బియ్యానికి సంబంధించి రెండు కేసులు నమోదయ్యాయి.
వెలుగులోకి ప్లాస్టిక్‌ బియ్యం... పోలీసులకు ఫిర్యాదు 
మీర్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలోని నందనవనం కాలనీకి చెందిన అశోక్ కుమార్, కొన్ని రోజుల క్రితం సమీపంలోని కిరాణా దుకాణంలో బియ్యం కొన్నాడు. కొన్ని రోజులుగా ఇదే బియ్యంతో వండిన అన్నాన్ని తింటున్నారు. అప్పటి నుంచీ ఇంటిల్లిపాదికీ అజీర్తి, అసిడిటీ పెరిగిపోయింది. ఈ క్రమంలోనే మొన్న, అన్నం మెతుకులను ఉండగా చేసి తినబోగా, అది కాస్తా, జారి కిందపడి, రబ్బరు బంతిలా ఎగిరింది. దీంతో అనుమానం వచ్చిన అశోక్‌కుమార్‌ కిరాణా షాపు యజమానిని నిలదీశాడు. అప్పుడు ప్లాస్టిక్‌ బియ్యం విషయం బయటపడ్డంతో, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
ప్లాస్టిక్‌ రైస్‌తో బిర్యాని 
అలాగే  సరూర్ నగర్‌లోని ఒక హోటల్లో కూడా ప్లాస్టిక్‌ రైస్‌తో బిర్యానీ వండి పెడుతున్నట్టు ఓ వినియోదారుడు అనుమానం వ్యక్తం చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించిన వినియోగదారుడిపై హోటల్ యాజమాన్యం దురుసుగా ప్రవర్తించింది. దాంతో అనుమానం బలపడ్డ వినియోగదారుడు, తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ రెండు ఘటనలతో హైదరాబాద్‌లో ప్లాస్టిక్ బియ్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నట్టు  అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
నగరవాసుల్లో ఆందోళన
ప్లాస్టిక్‌ బియ్యం గురించిన వరుస ఘటనలతో... నగరవాసులు అసలు బియ్యం కొనేందుకు కూడా జంకుతున్నారు. కొన్న బియ్యం అసలువేనా..? కాదా? అనే ఆందోళన చెందుతున్నారు. అయితే ఇప్పటి వరకు కేవలం పోలీసులు కేసులు మినహా... ల్యాబ్‌రేటరీ నుంచి వీటికి సంబంధించిన నివేదికలేవీ  రాలేదు. ల్యాబ్  నివేదిక వస్తేనే కాని ఎటువంటి చర్యలు తీసుకోలేమని అధికారులు చెబుతున్నారు. కాగా ఈ అంశంపై జీహెచ్‌ఎంసీ అధికారులు కూడా పరిశీలన జరుపుతున్నట్టు సమాచారం.

20:12 - June 7, 2017

పశ్చిమగోదావరి : జిల్లాలో ప్లాస్టిక్ రైస్ కలకలం రేపింది. నిడదవోలు రైల్వేస్టేషన్ రోడ్డులోని శ్రీనివాస జనరల్ స్టోర్ లో తహశీల్దార్ తనిఖీలు చేపట్టారు. మూడు బస్తాల ప్లాస్టిక్ రైస్ స్వాధీనం చేసుకున్నారు. 

20:03 - June 7, 2017
20:00 - June 7, 2017

ప్లాస్టిక్ బియ్యం, గుడ్లు ఉన్నాయయన్నది అవాస్తవం అని జెవివి నేత రమేష్ అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. బహుళ దేశ కంపెనీలు, మతోన్మాద శక్తులు ప్లాస్టిక్ బియ్యం, గుడ్లు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. చైనాపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

19:47 - June 7, 2017
19:46 - June 7, 2017
19:44 - June 7, 2017

చిత్తూరు : అద్భుతమైన మెమరీతో తిరుపతిలో చిన్నారులు కొత్తరికార్డులు నెలకొల్పారు. మేక్‌బేబీ జీనియస్‌ సంస్థలో శిక్షణ పొందిన చిన్నారుల ప్రావిణ్యం అబ్బురపరిచింది. 197 మంది చిన్నారులు ఏకబిగిన వంద వేమనపద్యాలు చెప్పి సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నారు.  చిన్నారులు హేమవర్థన్‌,  స్రవంతి పెద్దలకే సాధ్యంకాని  స్పీడ్‌తో  25క్యూబ్‌రూట్‌ను 25సెకన్స్‌లో చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. వండర్‌బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్న ఈ వండర్‌కిడ్స్‌ను  పలువురు అభినందించారు. పదును పెడితే పిల్లలు ఎంతటి ఘనతనైనా సాధిస్తారని  మేక్‌బేబీ జీనియస్‌ సంస్థ నిర్వహకులు  చెప్పారు. 

 

19:42 - June 7, 2017

నిజామాబాద్ : తన పొలంలో నుండి వెళుతున్న కాలువకు నష్టపరిహరం చెల్లించటం లేదని మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన జిల్లాలో వెలుగుచూసింది. జిల్లాలోని కమ్మర్‌ పల్లిలోని తన పొలంలో రైతు ఏలేటి గంగాధర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లడంతో... ప్రమాదం తప్పింది. కమ్మర్ పల్లి గ్రామ శివార్లలో కప్పలొద్ది వద్ద చెక్ డ్యాం ఉంది. ఇక్కడి నుండి హన్మంత్ రెడ్డి ఎత్తిపోతల నీరు.. అలిసెకుంట చెరువులోకి పారుతుంది. ఈ కాలువ తమ పొలం నుంచి వెళ్తొందని.. అందుకు పరిహారం ఇప్పించాలని గంగాధర్ పలుమార్లు కోరినా ఇంతవరకు అధికారులు స్పందించలేదు. గతంలో కూడా బాధితుడు హైదరాబాద్‌లో ప్రగతి భవన్‌లో ప్రజావాణిలో ఆత్మహత్యయత్నం చేశాడు. అప్పటి నుంచి కూడా అధికారులు తమ సమస్యను పరిష్కరించడం లేదని... బాధిత కుటుంబసభ్యులు వాపోయారు. 

 

19:39 - June 7, 2017

శ్రీకాకుళం : డిమాండ్ల పరిష్కారం కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు రోడ్డెక్కారు. తెలంగాణ మాదిరిగా ఏ.పిలోనూ వేతనాలు పెంచాలంటూ వారు డిమాండ్ చేస్తూ  శ్రీకాకుళంలో ఆశా వర్కర్లు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తలకు దారితీసింది. వేలాది మంది ఆశా వర్కర్లు డి.ఎం.అండ్.హెచ్.ఓ కార్యాలయాన్ని ముట్టడించారు. పరిస్ధితి అదుపు తప్పటంతో పోలీసులు ఆశా వర్కర్లను అరెస్టు చేసారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

 

రోడ్డు ప్రమాదం.. భరతసింహారెడ్డికి గాయాలు

మహబూబ్‌నగర్ : జిల్లాలోని మరికల్‌ మండలం ఎలిగండ్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కాంగ్రెస్‌ నేత డీకే అరుణ భర్త భరత్‌సింహారెడ్డికి గాయాలయ్యాయి. అంబులెన్స్‌లో ఆయనను ఆస్పత్రికి తరలించారు. 

19:36 - June 7, 2017

మహబూబ్‌నగర్ : జిల్లాలోని మరికల్‌ మండలం ఎలిగండ్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కాంగ్రెస్‌ నేత డీకే అరుణ భర్త భరత్‌సింహారెడ్డికి గాయాలయ్యాయి. అంబులెన్స్‌లో ఆయనను ఆస్పత్రికి తరలించారు. 

 

19:32 - June 7, 2017

కరీంనగర్ : సైనిక దళాలు, పారా మిలటరీ బలగాల్లో చేరాలనుకునేవారికి సానపడుతోంది కరీంనగర్‌ జిల్లాలోని తేజస్‌ డిఫెన్స్‌ అకాడమీ. చిన్న వయసులోనే  సైన్యంలో చేరి దేశానికి సేవా చేయాలన్న తపన ఉన్నవారికి తర్ఫీదు ఇస్తోంది. ఎంపికకు అవసరమైన మెలకువలను ముందుగానే నేర్పించి సెలక్షన్‌ ర్యాలీలకు పంపుతోంది. తేజస్‌ డిఫెన్స్‌ అకాడమీలో శిక్షణ పొందిన అభ్యర్థులు త్రివిధ దళాలతోపాటు ప్రాదేశిక సైన్యం, సీఆర్‌పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌, ఐటీబీపీ వంటి పారా మిలటరీ బలగాలకు ఎంపిక అవుతున్నారు. 
సైనిక, పారా మిలటరీ బలగాల్లో కొలువులు ఎక్కువ
సైనిక, పారా మిలటరీ బలగాల్లో కొలువులు ఎక్కువ. సైనికులకు సమాజంలో మంచి గుర్తింపుతో పాటు.. మంచి వేతనం, సౌకర్యాలు ఉంటాయి. సైన్యంలో చేరడం ఎంతో కష్టంతో కూడిన వ్యవహారం. మిలటరీలో పనిచేయాలన్న ఆసక్తి చాలా మందికి ఉంటుంది. కానీ కారణాంతరాలతో చాలా మంది ఎంపిక కాలేకపోతున్నారు. ఇలాంటి వారికి సాన పెడుతోంది కరీంనగర్‌ జిల్లాలోని తేజస్‌ డిఫెన్స్‌ అకాడమీ.
2011లో తేజస్‌ డిఫెన్స్‌ అకాడమీ స్థాపన
రక్షణరంగంలో యువతకు ఉన్న ఉద్యోగావకాశాలను దృష్టిలో పెట్టుకుని సతీష్‌రావు 2011లో తేజస్‌ డిఫెన్స్‌ అకాడమీ స్థాపించారు.  ఇక్కడ శిక్షణ పొందిన అభ్యర్థులు సైనిక దళాలకు ఎంపిక అవుతున్నారు. తేజస్‌ అకాడమీలో చేరిన శిక్షణార్థులకు దేహదారుఢ్యం నుంచి రాత పరీక్షల వరకు  అన్ని అంశాల్లో ట్రైనింగ్‌ ఇస్తున్నారు. తెలంగాణతోపాటు ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్రల నుంచి వచ్చిన  అభ్యర్థులు ఇక్కడ శిక్షణ తీసుకుంటున్నారు. 
అన్ని రకాల శిక్షణ 
సైనిక ఎంపికకు అవసరమైన అన్ని రకాల శిక్షణ తేజస్‌ డిఫెన్స్‌ అకాడమీలో ఇస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రైనింగ్‌ ఇవ్వడంతో తమ సంస్థ నుంచి ఎక్కువ మంది  ఎంపిక అవుతున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. సామాన్య, మధ్యతరగతి అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని తమ  అకాడమీలో ఫీజులు నిర్ణయించినట్టు సంస్థ డైరెక్టర్‌ సతీశ్‌రావు చెబుతున్నారు. అన్ని అంశాల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉండటమే తేజస్‌ డిఫెన్స్‌ అకాడమీ సక్సెస్‌కు ప్రధాన కారణమని నిర్వహకులు, అభ్యర్థులు చెబుతున్నారు. 
 

రాష్ట్రపతి ఎన్నికలు షెడ్యూల్ విడుదల

ఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికలు షెడ్యూల్ రిలీజ్ అయింది. జులై 24న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం ముగియనుంది. ఈసీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా లోక్‌సభ కార్యదర్శిని నియమించింది.  

19:19 - June 7, 2017

ఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది. జులై 24న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం ముగియనుంది. ఈసీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా లోక్‌సభ కార్యదర్శిని నియమించింది. రాష్ట్రపతిని ప్రతిపాదించేందుకు 50 మంది, బలపర్చేందుకు 50 మంది సభ్యులు ఉండాలని సీఈసీ అన్నారు. ఒక్కో అభ్యర్థి 4 నామినేషన్లు దాఖలు చేయవచ్చు అన్నారు.

19:11 - June 7, 2017

గుంటూరు : ఏపీ అసెంబ్లీలో జగన్ ఛాంబర్‌లోకి వర్షం నీరు ప్రవేశించడంలో కొత్త కోణం వెలుగుచూసింది. ఛాంబర్‌లోకి వర్షం నీరు రావడం వెనక కుట్ర జరిగిందంటుని అధికారులు భావిస్తున్నారు. ఛాంబర్‌ను పరిశీలించిన సీఐడీ అధికారులు ఈ అనుమానాలు వ్యక్తం చేశారు. స్వయంగా స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు బిల్డింగ్‌ను పరిశీలించారు. చాంబర్‌లోకి నీళ్లు ఎలా చేరాయో అధికారులు స్పీకర్‌కు వివరించారు. వర్షపు నీరు లీకేజీపై సీఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్లు కోడెల తెలిపారు. పైప్‌లైన్‌ ఎవరో కట్‌ చేశారన్నారు. ఆధారాలన్నింటిని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపిస్తామని.. విచారణలో అన్ని విషయాలు బయటపడతాయన్నారు. 

 

19:08 - June 7, 2017

గుంటూరు : ఏపీ అసెంబ్లీలో జగన్ ఛాంబర్‌లోకి వర్షం నీరు ప్రవేశించడంలో కొత్త కోణం వెలుగుచూసింది. ఛాంబర్‌లోకి వర్షం నీరు రావడం వెనక కుట్ర జరిగిందంటుని అధికారులు భావిస్తున్నారు. ఛాంబర్‌ను పరిశీలించిన సీఐడీ అధికారులు ఈ అనుమానాలు వ్యక్తం చేశారు. 

 

19:05 - June 7, 2017

నెల్లూరు : దేశం మొత్తాన్ని వణికిస్తున్న ప్లాస్టిక్‌ మాఫియా ఇప్పుడు నెల్లూరు జిల్లాలోనూ విస్తరించింది. ఆత్మకూరు ఏసీఎస్‌ఆర్‌ కాలనీలోని అంగన్‌వాడీ కేంద్రంలో ప్లాస్టిక్‌ గుడ్లు ప్రత్యక్షమయ్యాయి. ప్రతి రోజు గర్భవతులకు ఇవే గుడ్లు పంపిణీ చేస్తున్నారు. అయితే... గుడ్లను ఉడికించి తినడానికి ప్రయత్నించగా అవి సాగుతూ ఉండడాన్ని గమనించారు. దీంతో గర్భిణులు ఐపీడీఎస్‌ పీఓకు సమాచారం అందించారు. గుడ్లు పంపిణీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గర్భిణీలు డిమాండ్‌ చేస్తున్నారు. 

 

19:04 - June 7, 2017

గుంటూరు : వెలగపూడిలోని ఏపీ సచివాలయం, అసెంబ్లీలోకి వర్షం నీరు రావడంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై సీఆర్డీఏ కమిషనర్‌ను చంద్రబాబు వివరణ కోరారు. దీంతో ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావు, స్పీకర్‌ కోడెలతో కలిసి కమిషనర్ శ్రీధర్‌ అసెంబ్లీని పరిశీలిస్తున్నారు. 

 

18:59 - June 7, 2017
18:57 - June 7, 2017

ఢిల్లీ : ఉపాధి కల్పనలో మోడీ ప్రభుత్వం విఫలమైందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ఆ పార్టీ పొలిట్ బ్యూరో సమావేశాలు ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మోడీ పాలనలో రైతులపై తూటాలు ఎక్కుపెడుతున్నారని పేర్కొన్నారు. రైతులపై కాల్పులు జరిపి మూడేళ్ల ఉత్సవాలు జరుపుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఆర్ ఎస్ ఎస్ దాడులకు పాల్పడడం సరికాదని అన్నారు. దాడులను ఉపేక్షించేదని..ఎదుర్కొంటామని చెప్పారు. సంఘ్ గుండాగిరికి భయపడమని స్పష్టం చేశారు. తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

 

మోడీ పాలనలో రైతులపై తూటాలు : ఏచూరి

ఢిల్లీ : ఉపాధి కల్పనలో మోడీ ప్రభుత్వం విఫలమైందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ఆ పార్టీ పొలిట్ బ్యూరో సమావేశాలు ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మోడీ పాలనలో రైతులపై తూటాలు ఎక్కుపెడుతున్నారని పేర్కొన్నారు. రైతులపై కాల్పులు జరిపి మూడేళ్ల ఉత్సవాలు జరుపుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఆర్ ఎస్ ఎస్ గుండాగిరికి భయపడమన్నారు. 

ఏచూరీపై ఆర్ ఎస్ ఎస్ దాడిని ఖండిస్తున్నాం : పి.మధు

హైదరాబాద్ : సీతారాం ఏచూరీపై ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తల దాడిని ఖండిస్తున్నామని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు తెలిపారు. బీజేపీ ప్రజల నుంచి వేర్పడుతున్న క్రమంలో ఏచూరీపై దాడికి పాల్పడ్డారని చెప్పారు. ప్రజాస్వామ్య వాదులు, లౌకికవాదులు, ప్రజాతంత్ర వాదులు దాడిని ఖండించాలన్నారు. దాడికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సీపీఎం కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. దళితులు, మైనారిటీలపై ఆర్ ఎస్ ఎస్, బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడుతుంటే సీపీఎం అడ్డుకుంటుందని... ఆ ఆక్కసుతోనే ఏచూరీపై దాడికి యత్నించారని మండిపడ్డారు.

దాడులకు పాల్పడడం సరికాదు : ఏచూరీ

ఢిల్లీ : దాడులకు పాల్పడడం సరికాదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ అన్నారు. దాడులను ఉపేక్షించేది లేదని....దాడులను ఎదుర్కొంటామని చెప్పారు. తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. సంఘ్ గుండాగిరికి భయపడమని స్పష్టం చేశారు. 

ముగిసిన సీపీఎం పొలిట్ బ్యూరో సమావేశాలు

ఢిల్లీ : సీపీఎం పొలిట్ బ్యూరో సమావేశాలు ముగిశాయి. రెండు రోజులపాటు సమావేశాలు కొనసాగాయి. నిన్న ప్రారంభం అయిన సమావేశాలు నేటితో ముగిశాయి. ఈ సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక, కాశ్మీర్ సంక్షోభం, పశుమాంసం నిషేధం, ప్రజా సమస్యలు వంటి పలు అంశాలపై చర్చించారు.  

విశాఖ భూ స్కాంపై ఆ జిల్లా కలెక్టర్ ప్రెస్ మీట్

హైదరాబాద్: విశాఖ భూ స్కాంపై ఆ జిల్లా కలెక్టర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విశాఖ గ్రామీణ ప్రాంతంలో భూములు నోటిఫై అయి ఉన్నాయన్నారు. కొమ్మాదిలో 2986 ఎకరాల్లో 325 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందన్నారు. రెండు సర్వే నెంబర్లు తప్ప అన్ని భూములు రిజర్వ్ ఫారెస్టు కింద నోటిఫై అయిందని తెలిపారు.

16:30 - June 7, 2017

ఢిల్లీ : సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరిపై ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించేక్రమంలో ఏచూరిపై ఆర్ ఎ స్ ఎస్ అనుబంధ సంస్థ హిందూసేనకు చెందిన ఇద్దరు కార్యకర్తలు దాడికి యత్నించారు. మీడియా ముసుగులో టెక్నిషయన్స్ గా ప్రవేశించి, దాడికి ప్రయత్నించారు. సీపీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ, హిందుసేన జిందాబాద్ అంటూ నిందితులు నినాదాలు చేశారు. దాడికి యత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. దాడికి పాల్పడిన వారిలో ఒకరిని హిందూ కుమార్ గా గుర్తించారు. దాడికి పాల్పడిన ఇద్దరిని మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. సీపీఎం కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తదుపరి విచారణ కొనసాగుతుందని తెలిపారు. 
దాడులకు పాల్పడడం సరికాదు : ఏచూరీ
దాడులకు పాల్పడడం సరికాదని సీతారాం ఏచూరీ అన్నారు. దాడులను ఉపేక్షించేది లేదన్నారు. దాడులను ఎదుర్కొంటామని చెప్పారు. తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. సంఘ్ గుండాగిరికి భయపడమని స్పష్టం చేశారు. 
ఏచూరీపై దాడిని ఖండిస్తున్నాం : పి.మధు 
సీతారాం ఏచూరీపై ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తల దాడిని ఖండిస్తున్నామని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు తెలిపారు. బీజేపీ ప్రజల నుంచి వేర్పడుతున్న క్రమంలో ఏచూరీపై దాడికి పాల్పడ్డారని చెప్పారు. ప్రజాస్వామ్య వాదులు, లౌకికవాదులు, ప్రజాతంత్ర వాదులు దాడిని ఖండించాలన్నారు. దాడికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సీపీఎం కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. దళితులు, మైనారిటీలపై ఆర్ ఎస్ ఎస్, బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడుతుంటే సీపీఎం అడ్డుకుంటుందని... ఆ ఆక్కసుతోనే ఏచూరీపై దాడికి యత్నించారని మండిపడ్డారు. ఆర్ ఎస్ ఎస్ దౌర్జన్యాలను సహించమని హెచ్చరించారు. ఆర్ ఎస్ ఎస్, బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. కేంద్రప్రభుత్వం, ఇంటెలిజెన్సీ విభాగం అప్రమత్తంగా లేరన్నారు. రక్షణ కల్పించడంలో విఫలమ్యారని పేర్కొన్నారు. 

రైతులపై కాల్పులు జరిపి మూడేళ్ల ఉత్సవాలా?:ఏచూరి

ఢిల్లీ: మోదీ పాలనలో రైతులు తుపాకులు ఎక్కి పెడుతున్నారని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఢిల్లీ లో రెండు రోజుల పాటు జరిగిన సీపీఎం పొలిట్ బ్యూరో సమావేశాలు ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఉపాధి కల్పనలో మోదీ ప్రభుత్వం విఫలం అయ్యింది పేర్కొన్నారు. రైతులపై కాల్పులు జరిపి మూడేళ్ల ఉత్సవాలు జరుపుకుంటున్నారని మండిపడ్డారు.

ముగిసిన సీపిఎం పొలిట్ బ్యూరో సమావేశాలు...

ఢిల్లీ : సీపీఎం పొలిట్ బ్యూరో సమావేశాలు ముగిశాయి. రెండు రోజుల పాటు జరిగిన సమావేశాల్లో రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక, కశ్మీర్ సంక్షోభం, రైతు సమస్యలు, పశుమాంసం నిషేధం, ప్రజా సమస్యలపై పొలిట్ బ్యూరో చర్చించింనట్లు సమాచారం.

సీతారం ఏచూరిపై ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తల దాడి

ఢిల్లీ : సీపీఎం కేంద్ర కార్యాలయం, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పై ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. పొలిట్ బ్యూరో సమావేశాలు ముగిసిన అనంతరం మీడియా సమావేశం నిర్వహించే సమయంలో ఈ దాడి జరిగింది. బిజెపి జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. అప్రమత్తమైన పోలీసులు ఇద్దరు ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలను అరెస్టు చేశారు.

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబై: నేడు స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. 81 పాయింట్ల లాభంతో 31,271 వద్ద సెన్సెక్స్, 27 పాయింట్ల లాభంతో 9,664 వద్ద నిఫ్టీ ముగిసింది.

ప్లాస్టిక్ బియ్యంపై ఆందోళన వద్దు: సివిల్ సప్లై డీజీఎం

హైదరాబాద్: ప్లాస్టిక్ బియ్యంపై ఆందోళన చెందవద్దు అని సివిల్ సప్లై డీజీఎం నాగేశ్వరరావు తెలిపారు. మీర్ పేటలో ప్లాస్టిక్ రైస్ ఫిర్యాదులు అందాయని, ఆ బియ్యాన్ని టెస్ట్ చేయడంతో దాంట్లో ఎలాంటి ప్లాస్టిక్ లేదని తెలిపారు.

16:05 - June 7, 2017

ప్రస్తుతం సోషల్ మాధ్యమాల్లో ఈ ఫొటో వైరల్ గా మారుతోంది. ఈ హీరో ఎవరు అంటూ ప్రశ్నలు వేస్తున్నారు. తెలిసిన వారు చెబుతున్నారు...తెలియని వారు చెప్పండంటూ పోస్టులు చేస్తున్నారు. తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రం 'బాహుబలి'..’బాహుబలి-2’ సినిమాలు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలకు సంవత్సరాల తరబడి 'ప్రభాస్' కష్టపడి నటించిన సంగతి తెలిసిందే. అనంతరం సుజీత్ దర్శకత్వంలో 'సాహో' చిత్రానికి సైన్ చేశాడు. చిత్ర షూటింగ్ ప్రారంభం కాకముందే టీజర్ ను విడుదల చేసి అంచనాలను మరింతగా రేకేత్తించారు. ఇటీవలే ప్రముఖ కేశాలంకరణ నిపుణుడితో ఫొటో బయటకు వచ్చింది. అందులో 'ప్రభాస్' కొద్దిగా స్లిమ్ గా కనిపించాడు. దీనితో 'సాహో' చిత్రంలో ఇలా కనిపిస్తారా ? అని అభిమానులు అనుకున్నారు. కానీ తాజాగా 'ప్రభాస్'కు కు చెందిన ఫొటో వైలర్ అయిపోయింది. 'బాహుబలి'లో పొడవాటి జుట్టు, మెలి తిరిగిన మీసం, గడ్డంతో కనిపించిన 'ప్రభాస్' ఈ ఫోటోలో క్లీన్ షేవ్ లో కనిపిస్తున్నాడు. క్లీన్ షేవ్ లో 'ప్రభాస్' ఇప్పటి వరకు కనిపించ లేదనే సంగతి తెలిసిందే. ఒక్కసారిగా 'ప్రభాస్' ఇలా మారిపోవడానికి కారణం ఏంటబ్బా అని అభిమానులు తెగ ఆలోచిస్తున్నారంట.

ఏపీలో పలు చోట్ల భారీవర్షం....

అమరావతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప‌లు జిల్లాల్లో రెండు రోజులుగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. ప‌లుచోట్ల రోడ్ల‌పై నీళ్లు నిలిచిపోయాయి. విశాఖ‌ప‌ట్నంలోని ప‌లు ప్రాంతాల్లో జ‌ల్లుల‌తో కూడిన‌ వ‌ర్షం ప‌డుతోంది. పెందుర్తి, ఆనందపురంలో మరో అర్ధగంటలో పిడుగులు ప‌డే అవ‌కాశం ఉంద‌ని, అక్క‌డి ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని విపత్తు నిర్వ‌హ‌ణ శాఖ అధికారులు హెచ్చ‌రించారు. శ్రీ‌కాకుళం జిల్లాలోని రేగిడి, ఆముదాలవ‌ల‌స‌లో వ‌ర్షం కురుస్తోంది. ఉత్తర‌కోస్త్రాంధ్ర‌పై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, మరో 2, 3 రోజుల్లో కోస్త్రాంధ్రకు నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.      

15:57 - June 7, 2017

విశాఖ : నగరంలో ప్లాస్టిక్ రైస్ కలకలం రేపింది. పెందుర్తి ఏకలవ్య కాలనీలో ప్లాస్టిక్ రైస్ తిన్న పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. పెందుర్తి రైతు బజార్ లో బియ్యం కొనుగోలు చేశామని కాలనీవాసులు తెలిపారు. ప్లాస్టిక్ బియ్యం అమ్ముతున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

నిడదవోలులో 3బస్తాల ప్లాస్టిక్ రైస్ పట్టివేత

ప.గో: నిడదవోలు రైల్వే స్టేషన్ రోడ్డులో శ్రీనివాస జనరల్ స్టోర్ లో తహశీల్దార్ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మూడు బస్తాల ప్లాస్లిక్ రైస్ స్వాధీనం చేసుకున్నారు.

నిడదవోలులో 3బస్తాల ప్లాస్టిక్ రైస్ పట్టివేత

ప.గో: నిడదవోలు రైల్వే స్టేషన్ రోడ్డులో శ్రీనివాస జనరల్ స్టోర్ లో తహశీల్దార్ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మూడు బస్తాల ప్లాస్లిక్ రైస్ స్వాధీనం చేసుకున్నారు.

జగన్ చాంబర్ లో కి నీళ్లు ఎలా వచ్చాయంటే: కోడెల

అమరావతి: అసెంబ్లీలోకి వర్షం నీళ్లు అంటూ చాలా విమర్శలు వచ్చాయని స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు అన్నారు. జగన్ చాంబర్ లో ఏసీ పైప్ లైన్ కట్ చేసినట్లుందని స్పీకర్ తెలిపారు. ఎవరో ఉద్దేశపూర్వకంగా పైప్ ను కట్ చేశారని, ఆ పైప్ ద్వారానే జగన్ చాంబర్ లోకి నీళ్లు వచ్చాయన్నారు. పైప్ ఎవరు కట్ చేశారో నిజాలు బయటకు రావాలన్నారు. దోషులెవరో విచారణలో తేలుతుందన్నారు.

ఏసీబీకి చిక్కిన ఎమ్మిగనూరు ఎక్సైజ్ సీఐ

కర్నూలు :ఎమ్మిగనూరు ఎక్సైజ్ సీఐ ఏసీబీకి చిక్కాడు. నందనవనంలో ఐశ్వర్య వైన్ షాపు సూపర్ వైజర్ నుంచి రూ.50వేలు లంచం తీసుకుంటూ సీఐ లక్ష్మీదుర్గయ్య పట్టుపడ్డాడు.

మంద్ సౌర్ ఘటనపై ప్రధాని సమీక్ష

ఢిల్లీ : మంద్ సౌర్ ఘటనపై ప్రధాని అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీనియర్ కేంద్ర మంత్రులు మంద్ సౌర్ లో నెలకొన్న పరిస్థితులను మోదీ తెలుసుకున్నారు.

మధ్యప్రదేశ్ రైతులపై కాల్పులు దురదృష్టకరం: ఉత్తమ్

హైదరాబాద్: మధ్యప్రదేశ్ రైతులపై కాల్పులు దురదృష్టకరం అని టి.పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మద్ధతు ధర కోసం ఆందోళన చేస్తున్న రైతులను పోలీసులు కాల్చి చంపాడం మోదీ వైఖరినికి నిదర్శనమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయని మండిపడ్డారు. కేంద్రం, రాష్ట్రం లో రైతు వ్యతిరేక ప్రభుత్వాలు ఉన్నాయన్నారు.

ఇరాన్ లో రెండు చోట్ల ఉగ్రవాదుల కాల్పులు

హైదరాబాద్: ఇరాన్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పార్లమెంట్ భవనం లోపల, ఖొమైని సమాధి వద్ద కాల్పులకు తెగబడ్డారు. ఇరాన్ పార్లమెంట్ లోకి దుండగులు చొరబడి కాల్పులకు దిగారు. దుండగుల కాల్పుల్లో 7గురు చనిపోయినట్లు సమాచారం. మరో వైపు ఇద్దరు దుండగులను పోలీసులు పట్టుకున్నారు.

 

విశాఖ లో ప్లాస్టిక్ బియ్యం కలకలం

విశాఖ : పెందుర్తిలోని ఓ దుకాణంలో ప్లాస్టిక్ బియ్యం కలకలం రేగింది. దుకాణం ముందు కస్టమర్లు ఆందోళనకు దిగారు. దీంతో జీవీఎంసీ అధికారులు, పెందుర్తి పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.

అసెంబ్లీలోకి వర్షం నీరు.. సీఎం ఆగ్రహం

అమరావతి: కొత్తగా నిర్మించిన ఏపీ అసెంబ్లీలో వర్షపు నీరు రావడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై సీఆర్డీఏ కమిషనర్ ను సీఎం చంద్రబాబు వివరణ కోరారు. ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావుతో కలిసి కమిషనర్ శ్రీధర్ అసెంబ్లీని పరిశీలిస్తున్నారు.

రాజకీయ భవిష్యత్ పై గద్దర్ ఆసక్తికర వ్యాఖ్యలు

కరీంనగర్ : తన రాజకీయ భవిష్యత్ పై గద్దర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు 3 నెలల ముందు పొత్తులపై ఆలోచిస్తానన్నారు. సాధ్యమైనంత వరకు కింగ్ మేకర్ గానే ఉంటానని, అవసరమైతే కింగ్ నవుతా అని గద్దర్ స్పష్టం చేశారు.

భూ కుంభకోణాలపై స్పందించిన మంత్రి గంటా...

విశాఖ : భూ కుంభకోణాలపై మంత్రి గంటా స్పందించారు. విశాఖ పేరును చెడగొట్టే ప్రయత్నం జరుగుతోందని గంటా ఆవేదన వ్యక్తం చేశారు. భూ కుంభకోణాలపై సీఎం స్పందించారని, రెవిన్యూ మంత్రి విశాఖ వచ్చి దర్యాప్తు చేస్తాని తెలిపారు. ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి అరెస్టు పై అన్ని విషయాలు తెలుసుకుని స్పందిస్తామన్నారు. భూ కుంభకోణాలు శంకర్రారవు ఆస్తులపై ఏసీబీ దాడులకు, భూకుంభకోణాలకు సంబంధం లేదన్నారు.

ఏపీ భవన్ పంపకాలపై హోంశాఖ తుది ఉత్తర్వులు

ఢిల్లీ : ఏపీ భవన్ ను ఇరు రాష్ట్రాలు 58.32:41.66 నిష్పత్తిలో పంచుకోవాలని కేంద్ర హోంశాఖ తుది ఉత్తర్వుల నేపథ్యంలో తెలంగాణ ముందు 3 ప్రతిపానదలు ఏపీ సర్కార్ పెట్టింది. ఆక్రమణలు, ప్రార్థనా మందిరాలు పోను మిగిలిన 19.375 ఎకరాల్లో ఏపీకి 11.510 ఎకరాలు, తెలంగాణకు 8.225 ఎకరాలు కేటాయించుకుందామని తెలిపింది. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై త్వరలో తెలంగాణ, ఏపీ రెసిడెంట్ కమిషనర్ల చర్చలు జరుగుతాయని, ఆ చర్చల్లో ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

13:47 - June 7, 2017

ప్రాజెక్టులు, పథకాలు కొనసాగింపు టీఎస్ సర్కార్ సమీక్ష

హైదరాబాద్: నాబార్డు నిధులతో నిర్మితమవుతున్న ప్రాజెక్టులు, పథకాలు కొనసాగింపు పై టీఎస్ సర్కార్ సమీక్ష నిర్వహించింది.

ముగిసిన వైసీపీ ఎమ్మెల్యేల ఆందోళన

అమరావతి: అసెంబ్లీ వద్ద వైసీపీ ఎమ్మెల్యేల ఆందోళన ముగిసింది. మీడియాను అనుమతించకపోవడం సరికాదని వైసీపీ పేర్కొంది. మీడియాను అనుమతించకపోవడంతో ఎమ్మెల్యేలు వెనుదిరిగారు. అసెంబ్లీ నిర్మాణంలో లొసుగులు లేకపోతే మీడియాను ఎందుకు అనుమతించరని ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

13:44 - June 7, 2017

మహబూబ్ నగర్ : జిల్లా నారాయణ పేట మండలం జజాపూర్ లో విషాదం జరిగింది. ఇంటి బయట పెన్సింగ్ పై కరెంట్ వైర్లు బడ్డాయి అది గమనించని తల్లి పెన్సింగ్ తగలడంతో షాక్ కొట్టింది. వెంటనే ఆమె కూతురు తల్లిని రక్షించబోయి ఆమె కూడా కంరెట్ షాక్ తో మృతి చెందింది. ఒకే కుటుంబంలో తల్లి కూతురు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

13:40 - June 7, 2017

పశ్చిమ గోదావరి : నిజాయితీగా విధులు నిర్వర్తిస్తున్న ఒ ఎస్సై కి ఏపీ ప్రభుత్వం గొప్ప బహుమానం ఇచ్చింది. ఓ మంత్రికి సంబంధించిన ఇసుకు లారీలను అడ్డుకున్నందుకు పొడూరు ఎస్పై రవీంద్రబాబును వీఆర్ కు పంపిస్తూ ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఎర్రకాలువ, తమ్మిలేరు, కొవ్వాడ ఇసుక కాలువల్లో గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ఇదేంటని అడ్డుకున్నందుకు ఎస్సైపై సర్కార్ వేటు వేసింది. నిన్న స్థానిక ప్రజల ఫిర్యాదు మేరకు ఎస్సై రవీంద్రబాబు లారీలను అడ్డుకోవడంతో అక్కడికి వచ్చిన పొడూరు సర్పంచ్ పోలీసు స్టేషన్ లో వీరంగ సృష్టించాడు. ఎస్సై ని తెల్లవారేలోపు బదిలీ చేయిస్తానాని సవాల్ విసి అనుకున్దది సాధించాడు. కానీ నిజాయితీగా విధులు నిర్వర్తించిన ఎస్సైకు బదిలీ వేటు పడింది. 

అది సచివాలయమా.. స్మిమ్మింగ్ పూలా: మల్లాది విష్ణు

విజయవాడ: సచివాలయం చూస్తే చంద్రబాబు పనితీరు తెలుస్తుందని కాంగ్రెస్ నేత మల్లాది విష్ణు అన్నారు. అది సచివాలయమా.. స్మిమ్మింగ్ పూలా అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని, నిర్మించి ఏడాది కాకముందే ప్రభుత్వం అవినీతి బయటపడిందన్నారు. నవ నిర్మాణం అంటే ఇదేనా చంద్రబాబు చెప్పాలని విష్ణు డిమాండ్ చేశారు. వివాఖ భూకబ్జా పై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

13:38 - June 7, 2017

 

టెహ్రాన్ : ఇరాన్ రాజధాని టెహ్రాన్ లోని పార్లమెంట్ పూ ఉగ్రవాదులు దాడికి దిగారు. ఉగ్రవాదులు ఏకకాలంలో మూడుచోట్ల దాడులు జరిపారు. ముగ్గురు ఉగ్రవాదులు ఏకే 47 తో పార్లమెంట్ లోకి చొరబడ్డారు. అక్కడ ఉన్న సెక్యురిటీ పై కాల్పులు జరుపుకుంటూ పార్లమెంట్ లోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల్లో 8 మంది గాయపడ్డారని. అక్కడి అధికార వార్తా సంస్థ తెలిపింది. దుండగులకు, భద్రతా సిబ్బందికి మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.ముష్కరులు పార్లమెంట్ లో పలువురిని నిర్భంధించినట్లు సమాచారం.అయితే అక్కడి కొన్నొ ఛానల్స్ ఉగ్రదాడిలో ముగ్గు మృతి చెందినట్టు ప్రసారాలు చేస్తున్నాయి. టెహ్రాన్ లోని మరోచోట హతుల్లా ఖోమైనీ ప్రార్థన స్థలం వద్ద కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు చనిపోయినట్లు సమాచారం ఉంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

13:35 - June 7, 2017

ఛైన్ స్నాచర్లు మళ్లీ తెగబడుతున్నారా ? నగర శివారులలోని కాలనీలను..పర్యాటక ప్రాంతాల్లో ..పుణ్యక్షేత్రాల్లో సంచరిస్తూ దోచేస్తున్నారా ? కొన్నాళ్లుగా స్నాచర్ల ఊసే లేదు. పోలీసుల దృష్టిని మరలించిన దొంగలు మళ్లీ చెలరేగుతున్నారు. వేసవి కాలంలో వేడిమికి జనసంచారం తక్కువగా ఉండడం..పుణ్యక్షేత్రాల్లో రద్దీ పెరుగుతుండడాన్ని టార్గెట్ చేసుకున్నారు. వేములవాడలో 14 తులాల బంగారం లాక్కెళ్లడం సంచలనం సృష్టించింది. బోడుప్పల్ కాలనీలో పద్మావతి నగర్ కాలనీలో వాకింగ్ చేసిన మహిళ మెడలో నుండి మూడు తులాల బంగారం స్నాచింగ్ కు పాల్పడ్డారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

13:08 - June 7, 2017

శరీర బరువు పెరిగిపోతోంది..ఆహారం తగ్గించాలి..ఏదైనా సర్జరీ చేయించుకోవాలని పలువురు అనుకుంటూ ఉంటారు. అంతేగాకుండా చాలా మంది డైట్ కంట్రోల్ కూడా చేస్తుంటారు. దీనికి చక్కటి పరిష్కారం 'స్కిప్పింగ్' చేయడమే. దీని ద్వారా ఊబకాయాన్ని నివారించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. అబ్బా..ఎప్పుడో చిన్నప్పుడు ఆడుకున్న తాడాట. ఇంత వయస్సులో ఆడటమా అని మాత్రం అనుకోకండి. స్కిప్పింగ్‌ చేస్తే శరీరం బరువు దానంతటదే తగ్గి చాలా నాజూకుగా మారతారని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. పాదాలకు ఎలాంటి రక్షణ అంటే చెప్పులు..షూస్ వేసుకుని స్కిప్పింగ్ చేయడం మంచిది. ఇలా రోజు స్కిప్పింగ్ చేయడం వల్ల శరీరం ధృఢంగా ఉండడంతో పాటు ఎముకలు గట్టిపడడం..చర్మంపై ముడతలు తొలిగిపోతాయి. బరువు తగ్గించడంలో స్కిప్పింగ్‌ కీలకపాత్ర పోషిస్తుంది. స్కిప్పింగ్‌ ప్రారంభించే ముందు 5 నిమిషాల పాటు వార్మ్‌అప్‌చేయటం వల్ల శరీరం ఉల్లాసంగా ఉంటుంది.

12:49 - June 7, 2017

గుంటూరు : రాష్ట్ర విభజన తర్వాత మూడేళ్లుగా ఏపీ రాజకీయాలన్నీ ప్రత్యేక హోదా చుట్టూనే తిరిగాయి. అధికార టీడీపీతో ప్రతిపక్ష వైపీసీ, కాంగ్రెస్‌ సహా ఇతర పార్టీలన్నీ హోదా కోసమే పోరడాయి. కానీ ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చింది. ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్న తర్వాత హోదాతో పనేముందని టీడీపీ ప్రశ్నిస్తుండగా, కాంగ్రెస్‌ ఇప్పుడు పోరాటం చేస్తోంది. మొదటి నుంచి పోరాటం చేసిన వైసీపీ ఇప్పుడు తటస్థ వైఖరి అవలంభిస్తోంది.

మార్పుకు కారణం...
హోదా విషయంలో వైసీపీ వైఖరిలో మార్పు రావడానికి కారణం లేకపోలేదు. కొద్దికాలం కిత్రం ప్రతిపక్ష నేత జగన్‌ ప్రధాని మోదీని కలిశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ఇస్తామని బహిరంగ ప్రకటన చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల తర్వాత వైసీపీ పార్లమెంటు సభ్యులు ఎప్పుడైనా రాజీనామా చేస్తారని ప్రకటించిన జగన్‌, మోదీని కలిసిన తర్వాత మాట మార్చారు. ఇదే అంశంపై జగన్‌ను ప్రశ్నిస్తే.. వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే ప్రత్యేక హోదా గురించి పార్లమెంటులో ఎవరు అడుగుతారని ఎదురు ప్రశ్న వేస్తున్నారు. వైసీపీ నేతలు కూడా హోదా అంశంపై ఆచితూచి స్పందిస్తున్నారు. ప్రధాని మోదీతో జగన్‌ భేటీ తర్వాత వైసీపీ బీజేపీకి దగ్గరవుతోందన్న ప్రచారం నేపథ్యంలో హోదా ఉద్యమం విషయంలో ప్రధాన ప్రతిపక్షం భవిష్యత్‌ రాజకీయ వ్యూహం ఎలా ఉంటుందో చూడాలి.

 

12:45 - June 7, 2017

తెలుగు రాష్ట్రాల్లో 'పరువు హత్యలు' తీవ్ర సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే మంచిర్యాలలో మధుకర్ దళిత యువకుడు దారుణ హత్య..యాదాద్రి భువనగిరి..స్వాతి..నరేష్..హత్య...ఏపీ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా తూర్పుపాలెంలో ఓ యువకుడిని హత్య చేసి బీచ్ పాతిపెట్టిన ఘటనలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ పరువు హత్యలపై న్యాయస్థానాలు తీవ్రంగా స్పందించాయి. ఈ పరువు హత్యలపై టెన్ టివి 'మై రైట్' కార్యక్రమంలో లాయర్ పార్వతి విశ్లేషించారు. అలాగే కాలర్స్ న్యాయ సందేహాలను నివృత్తి..సూచనలు అందచేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

12:27 - June 7, 2017

గుంటూరు : గత రెండు గంటలుగా అమరావతి అసెంబ్లీ గేట్ 2వద్ద వైసీపీ ఎమ్మెల్యేల ఆందోళన కొనసాగుతోంది. అసెంబ్లీలోని జగన్ ఛాంబర్ ను పరిశీలించడానికి తమతో పాటు వీడియాను అనుమతించాలని ఎమ్మెల్యేలు అధికారులను కోరారు. పోలీసులు మీడియు అనుమతిని నిరాకరించారు. ఆందోళన చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యేల వద్దకు అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ వచ్చి అసెంబ్లీ రూల్ ప్రకారం అసెంబ్లీలోకి మీడియాను అనుమతించమని తెలిపారు. వెంటనే ఎమ్మెల్యేలు కలుగజేసుకుని రోజా సస్పెండ్ విషయంలో రూల్ లేవా అని ప్రశ్నించారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

ప.గో జిల్లా పోడూరు ఎస్సై రవీంద్ర బాబు పై వేటు

ప.గో : గుమ్ములూరులో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న 8లారీలను సీజ్ చేసిన ఘటనల్లో ఎస్సై ను వీర్ కు అధికారులు పంపించారు. ఓ మంత్రి ఇసుక లారీలు సీజ్ చ ఏసినందుకు ఎస్సై పై చర్యలు తీసుకున్నారు.

12:25 - June 7, 2017

హైదరాబాద్ : ఆసీఫ్ నగర్ భోజగుట్ల భూ కబ్జా కేసులో దర్యాప్తు ముమ్మరం చేశామని, పక్కా ఆధారాలతోనే దీపక్ రెడ్డి కేసు నమోదు చేశామని సీసీఎస్ అడిషనల్ డీసీపీ జోగయ్య తెలిపారు. కబ్జా కేసులో చాలామంది పాత్ర ఉందని ఆయన పేర్కొన్నారు. భోజగుట్టలో పేదల భూమిని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని డీసీపీ తెలిపారు. కోర్టుకు దొంగపత్రాలు సమర్పించారిని ఆయన అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

12:19 - June 7, 2017

ఆడవారు చేతివేళ్లు మరింత అందంగా కనిపించాలని పలు రకాల నెయిల్ పాలిష్ ను వాడుతుండడం చూస్తూనే ఉంటాం. ఒక రంగులోనే కాకుండా ఎన్నో రంగులను వీరు ఉపయోగిస్తుంటారు. నెయిల్ పాలిష్ ను తొలగించుకోవడానికి చాల కష్టాలు పడుతుంటారు. ఏవో రకాల క్రీమ్స్..లోషన్స్ వాడుతుంటారు. ఇలా చేయడం వల్ల చేతి వేళ్ల గోర్లు కళావిహీనంగా మారుతాయి. అందుకోసం కొన్ని చిట్కాలు...

 • కొద్దిగా టూత్ పేస్ట్ ను తీసుకుని గోళ్లపై రాయాలి. అనంతరం కాటన్ క్లాత్ తీసుకుని నెమ్మదిగా రుద్దాలి. కొద్దిసేపటిలో గోళ్లపై ఉన్న రంగు తొలగిపోతుంది.
 • వెనిగర్ సహాయంతో కూడా రంగును తొలగించుకోవచ్చు. కాటన్ బాల్ ను తీసుకుని వెనిగర్ లో ముంచి గోళ్లపై రుద్దాలి.
 • ఓ గిన్నెలో గోరువెచ్చని నీటిని తీసుకుని చేతివేళ్లను అందులో ఉంచాలి. గోళ్ల మటుకే నీటిలో ఉంచేలా చూడాలి. పది నిమిషాల వరకు ఉంచాలి. తర్వాత చేతులను గోళ్లను మాత్రమే కాటన్‌ క్లాత్‌తో తుడవాలి.
 • పాతబడిపోయిన నెయిల్‌ పాలిష్‌ను తీసుకొని గోళ్లపై పోయాలి. మొత్తంగా నెయిల్‌పాలిష్‌ సులువుగా తొలగిపోతుంది.
12:14 - June 7, 2017

ఇరాన్ పార్లమెంట్ లో కాల్పుల కలకలం

హైదరాబాద్: ఇరాన్ పార్లమెంట్ పై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది. ముగ్గురు ఉగ్రవాదులు ఈ కాల్పులకు తెగబడినట్లు సమాచారం.

12:05 - June 7, 2017

బాలీవుడ్ లో ఎక్కువగా బయోపిక్ చిత్రాలు నిర్మితమౌతున్నాయి. ఆయా చిత్రాలు బాక్సాపీస్ వద్ద ఘన విజయం సాధిస్తున్నాయి. దంగల్..సుల్తాన్..తదితర చిత్రాలు ఆ కోవలోకి చెందినవే. తాజాగా మాజీ ప్రధాన మంత్రి 'మన్మోహన్ సింగ్' జీవిత కథ ఆధారంగా సినిమా రూపొందుతోంది. ఇందులో మన్మోహన్‌ పాత్రను ప్రముఖ బాలీవుడ్‌ నటుడు 'అనుపమ్‌ ఖేర్‌' పోషించనున్నారు. మన్మోహన్ సింగ్ మాజీ సలహాదారు సంజయ్ ‘ది మేకింగ్ అండ్ అన్ మేకింగ్ ఆఫ్ మన్మోహన్ సింగ్’ అనే పుస్తకం రాసిన సంగతి తెలిసిందే. ఈ పుస్తకం 2014 ఎన్నికలకంటే ముందుగా విడుదలైంది. ఈ పుస్తకాన్ని ఆధారం చేసుకుని హన్సల్ మెహతా దర్శకత్వంలో ఈ సినిమా రూపొందబోతోంది. బుధవారం ఫస్ట్‌లుక్‌ని విడుదల చేయనున్నారు. 2019 ఎన్నికలకంటే ముందుగానే ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోందంట.

11:57 - June 7, 2017

హైదరాబాద్ : 2019లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ చేస్తామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమకుమార్ రెడ్డి అన్నారు. అలాగే వరికి 2వేలు, మిర్చికి 12వేలు, కంది, పసుపుకు కూడా మద్దతు ప్రకటిస్తామని తెలిపారు. గత ఏడాది కల్తీ విత్తనాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఒక్క రూపాయి నష్టపరిహారం ఇవ్వలేదని, కేంద్ర ప్రభుత్వం అట్టహసంగా ప్రవేశపెట్టిన అటల్ పసల్ భీమా యోజన లో భీమా కంపెనీలకు కేంద్రం 17 వేల కోట్లు చెల్లించిందన్నారు. అయితే బీమా కంపెనీలు రైతులకు కేవలం రూ. 6800కోట్లు మాత్రమే చెల్లించిందని, కంపెనీలకు 10,300 కోట్లు లాభం వచ్చిందని ఉత్తమ్ తెలిపారు. ఖమ్మంలో మిర్చికి మద్దతు ధర కోసం రైతులు ఆందోళన చేస్తే ప్రభుత్వం వారిపై జాతి విద్రోహం కేసు పెట్టడం దారుణమని అన్నారు. కేంద్రరాష్ట్రాలు కలిసి వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టారని ఆయన ఆరోపించారు. 

11:50 - June 7, 2017

టాలీవుడ్ ప్రిన్స్ 'మహేష్ బాబు' ముఖ్యమంత్రిగా రావడం ఏంటీ ? ఆయన రాజకీయాల్లోకి రాలేదు కదా ? అని అనుకుంటున్నారా ? రియల్ లైఫ్ లో కాదు లేండి...రీల్ లైఫ్ లో ...గతంలో 'దూకుడు' సినిమాలో కొద్దిసేపు ఎమ్మెల్యేగా కనిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఓ సినిమాలో సీఎం పాత్రలో నటించనున్నాడని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం 'మహేష్'..మురుగదాస్ కాంబినేషన్ లో 'స్పైడర్' సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అయిన తరువాత కొరటాల దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో 'మహేష్' నటించనున్నాడు. ‘భగత్ సింగ్ అనే నేను' అనే టైటిల్ ను ఖరారు చేయనున్నట్లు, పొలిటికల్ థ్రిల్లర్ గా సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం హైదరాబాద్‌ శివార్లలో వేసిన భారీ అసెంబ్లీ సెట్‌లో ‘మహేష్’ పాల్గొననున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ 'మహేష్‌' లేకుండానే ఒక షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. మరి ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

యాదాద్రిలో జానారెడ్డి

యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని సీఎల్పీ నేత జానారెడ్డి కుటుంబ సమేతంగా ఈ ఉదయం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రతిపక్ష నాయకుడికి మంగళ వాయిద్యాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయ మండపంలో ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ప్లాస్టిక్ కోడి గుడ్ల కలకలం

నెల్లూరు : ఆత్మకూరులో ప్లాస్టిక్ కోడి గుడ్ల కలకలం రేగింది. అంగన్ వాడీ కేంద్రాల్లో ప్లాస్టిక్ గుడ్లు గర్భిణీలకు పంపిణీ చేశారు. అది ఇలా వుండగా ప్రభుత్వం సరఫరా చేసిన గుడ్లనే గర్భిణీలకు పంపిణీ చేశామని అంగన్ వాడీ సిబ్బంది పేర్కొన్నారు.

అద్వానీ, జోషీ, ఉమాభారతిలకు ఊరట

ఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ కురువృద్ధుడు అద్వానీ, సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి, కేంద్ర మంత్రి ఉమాభారతిలకు సీబీఐ కోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. కోర్టు విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి వీరికి మినహాయింపును ఇచ్చింది కోర్టు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లక్నోలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ కేసును విచారిస్తున్న సంగతి తెలిసిందే. 

11:26 - June 7, 2017

హైదరాబాద్ : పలు ఎకరాల భూమిని కబ్జా చేశారని ఏపీ టిడిపి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి అక్రమాలకు పాల్పడినట్లు తమ దర్యాప్తులో తేలిందని సీసీఎస్ డీసీపీ పేర్కొన్నారు. రూ. 163 కోట్ల విలువైన భూ కబ్జా కేసులో ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సీసీఎస్ డీసీపీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని సర్వే నెంబర్ 102లో మూడు ఎకరాల భూమి కబ్జా చేసేందుకు ప్రయత్నం జరిగిందన్నారు. భోజగుట్ట భూములు ప్రభుత్వం పేదలకు పంచిందని, దాని వారు తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకొనే ప్రయత్నాలు జరిగాయన్నారు. కేసులో ఇంకా కొందరి పాత్ర ఉందని, షేక్ పేటలో 12 ఎకరాల భూమికి నకిలీ పత్రాలు సృష్టించారని తెలిపారు. ఎన్ని కోట్ల కుంభకోణం అనేది దర్యాప్తు అనంతరం తేలుతుందన్నారు. సైబరాబాద్ లో కూడా వీరిపై కొన్ని కేసులున్నాయన్నారు. అందరూ ప్లాన్ ప్రకారం చేసినట్లు కనిపిస్తోందన్నారు. నకిలీ వ్యక్తుల పేరు మీద కేసులు వేశారని ఆ అగ్రిమెంట్లు తప్పుడవన్నీ తేలిందన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

వీసా క్యాష్ లెస్ సిటీగా మార్చాలి మంత్రి లోకేష్

విశాఖ : వీసా క్యాష్ లెస్ సిటీగా మార్చాలి మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఐటీ కంపెనీలు ఏపీకి తేవడానికి సీఎం కృషి చేస్తున్నారని తెలిపారు. విశాఖ ను క్యాష్ లెస్ సిటీగా మార్చి దేశంలోనే నెం.1 చేయాలని, ఫీజుల చెల్లింపు, హాస్టల్స్, క్యాంటీన్ ఛార్జీల చెల్లింపులన్నీ క్యాష్ లెస్ లావాదేవీలు జరిగేలా చర్యలు తీసుకున్నామని లోకేష్ స్పష్టం చేశారు.

11:12 - June 7, 2017

గుంటూరు : ఏపీ అసెంబ్లీ గేట్ 2 వద్ద వైసీపీ చెందిన నలుగురు ఎమ్మెల్యేల ఆందోళన నిర్వహిస్తున్నారు. అసెంబ్లీలోని జగన్ ఛాంబర్ ను పరిశీలించడానికి తమతో పాటు మీడియాను కూడా అనుమతించాలని ఎమ్మెల్యేలు పోలీసులను కోరారు. పోలీసులు మీడియాకు అనుమతి నిరాకరించారు. లోపల ఎలాంటి ఇబ్బంది లేకపోతే బయటకు చూపించడానికి ఇబ్బందేంటని ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో అనుభవం ఉందని చెప్పుకుని తిరిగే చంద్రబాబు సచివాలయంతో ఆయన ఎంత అనుభవం ఉందో తెలుస్తోందని ఎద్దేవా చేశారు. కేవలం 2 సెం.మీ వర్షం కురిస్తేనే ఇంత ఇబ్బంది ఎదురైతే భవిష్యత్ లో ఏ విధంగా ఉంటుందో ఆలోచించాలని వైసీపీ ఎమ్మెల్యేలు అన్నారు.

 

వీసా కంపెనీ ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ

విశాఖ: వీసా కంపెనీ ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఈ భేటీలో కలెక్టర్ ప్రవీణ్ కుమార్, వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.

వీసా కంపెనీ ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ

విశాఖ: వీసా కంపెనీ ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఈ భేటీలో కలెక్టర్ ప్రవీణ్ కుమార్, వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.

ఏపీ అసెంబ్లీ గేట్ - 2 ముందు వైసీపీ ఎమ్మెల్యేలు ఆందోళన

అమరావతి: ఏపీ అసెంబ్లీ గేట్ - 2 ముందు వైసీపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. అసెంబ్లీలోని జగన్ ఛాంబర్ ను పరిశీలించడానికి తమతో పాటు మీడియాను అనుమతించాలని డిమాండ్ చేస్తున్నారు.

కలెక్టర్ బట్టలను చించివేసిన రైతులు

మధ్యప్రదేశ్ : మాండ్ సోర్ లో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన జిల్లా కలెక్టర్ పై రైతులు దాడి చేశారు. కలెక్టర్ స్వతంత్ర సింగ్ దుస్తులను రైతులు చించివేశారు.

ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి 14 రోజుల రిమాండ్

రంగారెడ్డి : రూ.163 కోట్ల విలువైన భూ కబ్జా కేసులో ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి 14 రోజుల రిమాండ్ విధించారు. శైలేంద్ర సక్సేనా, శ్రీనివాస్ కి 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం వారిని చంచల్ గూడ జైలుకు తరలించారు.

నా సంతకాన్ని ఫోర్జరీ చేశారు: ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి

హైదరాబాద్: నా పై తప్పుడు కేసులు బనాయించారని ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఆరోపించారు. ఆ సంతకం నాది కాదు.. నా సంతకాన్ని ఫోర్జరీ చేశారని మండిపడుతున్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపితే నిజాలు తేలుతాయని దీపక్ పేర్కొన్నారు. నా వెనుక కుట్ర జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

పోలీసు కస్టడీకి మియాపూర్ భూ స్కాం నిందితులు

హైదరాబాద్: మియాపూర్ భూ కుంభకోణం కేసు లో సబ్ రిజిస్టార్ శ్రీనివాసరావు, ట్రినిటి డైరెక్టర్ పార్ధసారధి, సువిశాల్ డైరెక్టర్ శర్మలను పోలీసు కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. 3 రోజుల పాటు విచారించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. తిరిగి 10వ తేదీ ఉదయం 10.30 గంటలకుజైలులో హాజరు పరచాలనిఆ దేశించింది. లాయర్ల సమక్షంలోనే నిందితులను ప్రశ్నించాలని కోర్టు పేర్కొంది. కాసేపట్లో నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు.

ఓమహిళతో సహా.1.20కోట్ల డ్రగ్స్ పట్టివేత...

హైదరాబాద్: మత్తు పదార్థాలు రవాణా చేస్తున్న ఓ మహిళను ఎక్సైజ్ పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. ఈ ఘటన ఒడిశాలోని బాలేశ్వర్‌లో చోటుచేసుకుంది. మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు ఆమె వద్ద నుంచి రూ. 1.20 కోట్ల విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మహిళ పశ్చిమ బెంగాల్ నుంచి బాలేశ్వర్‌కు మత్తు పదార్థాలు తీసుకొస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

10:41 - June 7, 2017

హైదరాబాద్ : భూ కబ్జాల త్వరలో నిజాలు బయటపెడతానాని దీపక్ రెడ్డి అన్నారు. అనవసరంగా తనపై కేసు పెట్టారని ఆయన ఆరోపించారు. దీని వెనుక రాజకీయ హస్తం ఉందని ఆయన తెలిపారు. భూ కబ్జా కేసులో ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డికి ప్రత్యేక మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించింది. చంచల్ గూడ జైలుకు తరలించాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. దీపక్ రెడ్డి రంగారెడ్డి రూ.165కోట్ల విలువైన భూ కబ్జా కేసులో నిన్న రాత్రి దీపక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు దీపక్ రెడ్డితో పాటు అతని అడ్వకేట్ సక్సెనా, అనుచరుడు శ్రీనివాస్ ను కూడా అరెస్ట్ చేశారు. దీపక్ రెడ్డి అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మేన అల్లుడు. దీపక్ రెడ్డి ప్రస్తుతం అనంతపురం నుంచి టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

10:41 - June 7, 2017

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ నటిస్తున్న 'డీజే..దువ్వాడ జగన్నాథమ్' చిత్ర డైలాగ్స్ పాపులర్ అవుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఈ చిత్రంలో 'బన్నీ' సరదా..సరదాగా..మాస్ డైలాగ్స్ తో అలరించారు. ఆయన పలికిన డైలాగ్స్ విన్న అభిమానులు తెగ సంతోష పడుతున్నారంట. హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈసినిమాలో 'అల్లు అర్జున్' సరసన 'పూజా హెగ్డే' నటిస్తోంది. రెండు విభన్న పాత్రలో బన్నీ కనిపించబోతున్నాడు. మరి ఆయన పలికిన డైలాగ్స్....

 • ‘ఇంగువ లేకుండా పులిహోర చేస్తూ సభ్య సమాజానికి మనమేం మెస్సేజ్ ఇస్తున్నట్లు'..
 • ‘పైగా నాది మాములు లవ్వా...లవహ: లవస్య..లవోభ్యహ:’..
 • ‘మనం చేసే పనిలో మంచి కనపడాలి కానీ మనిసి కనపడక్కర్లేదు'..
 • 'ప్లబ్బులో వాయించే డీజే కాదురా..పగిలిపోయేలా వాయించే డీజేని'..
 • ‘ఈ రోజుల్లో మనం అనాల్సింది బుద్ధం శరణం గచ్ఛామి కాదు సర్..యుద్ధం శరణం గచ్ఛామి'..
 • 'సత్యనారాయణపురం అగ్రహారం సాక్షిగా చెబుతున్నా..నేను వాడి చూసిన రోజే చంపకపోతే నా పేరు దువ్వాడ జగన్నాథమే కాదు..నేను శ్రీవత్సస గోత్రంలోనే పుట్టలేదు’...
 • ‘జూన్ 23న కలుద్దాం' అంటూ 'అల్లు అర్జున్ డైలాగ్స్ పలికారు....

ఎదురు కాల్పుల్లో జవాన్ మృతి...

నాగాలాండ్‌ : మౌ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున ఉగ్రవాదులు.. భద్రతా బలగాలపైకి దాడులకు తెగబడ్డారు. ఇరు వర్గాల మధ్య భీకరమైన కాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. కాగా ఈ కాల్పుల్లో ఓ ఆర్మీ అధికారి, పౌరుడు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం గాయపడిన జవాన్లను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఎంతమంది ఉగ్రవాదులు దాడిలో పాల్గొన్నారనే విషయం తెలియరాలేదు.

స్థంభాన్ని ఢీ కొన్న బైక్ : ఒకరి మృతి

మేడ్చల్: ఘట్‌కేసర్ మండలం జోడిమెట్ల వద్ద అదుపుతప్పిన బైక్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఓ వ్యక్తి మరణించగా మరొక వ్యక్తికి గాయాలయ్యాయి. మృతుడు భువనగిరి మండలం తొక్కాపురం వాసి హరీశ్‌యాదవ్(21). గాయపడ్డ వ్యక్తి యాదాద్రికి చెందిన హరికృష్ణను చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు.

10:33 - June 7, 2017

పశ్చిమ గోదావరి : జిల్లా పెద్దవేగి మండలం రామన్నపాలెం వద్ద ట్రాక్టర్ అదుపు తప్తి బోల్తా పడింది. ఈ ఘటనలో తండ్రికొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. రాట్నాలమ్మ గుడికి మొక్కు చెల్లించుకునేందుకు వెళుతుండగా ప్రమాదం జరగింది. మృతులు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మడిచెర్లకు చెందిన వెంకటేశ్వరరావు, సత్యనారాయణలుగా గుర్తించారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

10:32 - June 7, 2017

తాను పాడితే ఎవరూ నిద్రపోరని బాలీవుడ్ కండల వీరుడు 'సల్మాన్ ఖాన్' వ్యాఖ్యానించాడు. వరుసగా విజయవంతమైన చిత్రాల్లో నటిస్తూ దూసుకెళుతున్న ఈ నటుడు తాజాగా 'ట్యూబ్ లైట్' చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల సంగతి తెలిసిందే. భారత్ - చైనా యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో 'సల్మాన్ ' సరసన చైనా నటి నటించింది. ఇదిలా ఉంటే సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా 'సల్మాన్' ని ఓ విలేకరి 'రెడియో' పాట పాడమని కోరింది. ఇందుకు 'సల్మాన్' అస్సలు ఒప్పుకోలేదు. ‘ఆ పాట తాను పాడలేదని..పాడితే టెక్నిషీయన్లు కొన్ని రోజుల పాటు నిద్రపోరని' పేర్కొన్నారు. గతంలో 'సల్మాన్' ‘కిక్'..’హీరో' సినిమాల్లో పాటలు పాడిన సంగతి తెలిసిందే. జూన్ 23వ తేదీన 'ట్యూబ్ లైట్' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

10:25 - June 7, 2017

గుంటూరు : కాసేపట్లో ఏపీ నూతన రాజధానిలో వైసీపీ నేతలు పర్యటించనున్నారు. వర్షానికి కురిసిన అసెంబ్లీ, సచివాలయ భవనాలను వైసీపీ నేతలు పరిశీలిచంనున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

10:23 - June 7, 2017

బాలీవుడ్ నటి 'కంగానా రనౌత్' ప్రధాన పాత్రలో నటించిన 'క్వీన్' చిత్రం గుర్తుండే ఉంటుంది కదా.. 2013లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. అంతేగాకుండా రూ. 100 కోట్ల క్లబ్ లో చేరి 'కంగానా'కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమాను తమిళంలో రీమెక్ చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమాను ‘రేవతి’ తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకు ప్రముఖ నటి ‘సుహాసిని’ డైలాగులు అందచేయనున్నారు. అయితే 'క్వీన్'గా ఎవరిని నటింప చేయాలని చిత్ర యూనిట్ యోచిస్తోంది. ‘క్వీన్' గా మిల్క్ బ్యూటీ 'తమన్నా' నటించనుందని తొలుత వార్తలు వచ్చాయి. కానీ 'తమన్నా' పక్కకు తప్పుకోవడంతో 'కాజల్' వరించిందని వార్తలు వస్తున్నాయి. మరో పక్క 'కాజల్' తెలుగులో 'నేనే రాజు నేనే మంత్రి'..’ఎమ్మెల్యే' సినిమాలో 'కాజల్' నటిస్తున్న సంగతి తెలిసిందే.

10:21 - June 7, 2017

హైదరాబాద్ : భూ కబ్జా కేసులో ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డికి ప్రత్యేక మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించింది. చంచల్ గూడ జైలుకు తరలించాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. దీపక్ రెడ్డి రంగారెడ్డి రూ.165కోట్ల విలువైన భూ కబ్జా కేసులో నిన్న రాత్రి దీపక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు దీపక్ రెడ్డితో పాటు అతని అడ్వకేట్ సక్సెనా, అనుచరుడు శ్రీనివాస్ ను కూడా అరెస్ట్ చేశారు. దీపక్ రెడ్డి అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మేన అల్లుడు. దీపక్ రెడ్డి ప్రస్తుతం అనంతపురం నుంచి టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు.  

హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షం..

హిమాచల్ ప్రదేశ్ : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మండి ప్రాంతంలో గత వారం కురిసిన వర్షానికి చెట్లు నేలకూలాయి. దీనితో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.

పరువు హత్య కేసులో నిందితుల అరెస్టు..

తూర్పుగోదావరి : తూర్పుపాలెం పరువు హత్య కేసులో నిందితులు విజయ్ కుమార్ తో పాటు మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు. కాసేపట్లో నిందితులను మీడియా ఎదుట ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.

కాసేపట్లో పోలీసుల కస్టడీకి మియాపూర్ ల్యాండ్ స్కాం నిందితులు..

హైదరాబాద్ : మియాపూర్ భూ కుంభకోణంలో సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు, ట్రినిటి డైరెక్టర్ పార్థసారధి, సువిశాల్ డైరెక్టర్ శర్మలను పోలీసు కస్టడీకి కోర్టు అనుమతి లభించింది. మూడు రోజుల పాటు విచారించేందుకు కోర్టు అనుమతినిచ్చింది. తిరిగి 10వ తేదీన ఉదయం 10.30గంటలకు చంచల్ గూడ జైలులో హాజరు పరచాలని ఆదేశాలు జారీ చేసింది. లాయర్ల సమక్షంలో విచారించాలని కోర్టు పేర్కొంది. ఈ రోజు ఉదయం 10.30గంటలకు పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు.

చంచల్ గూడ జైలుకు ఏపీ టిడిపి ఎమ్మెల్సీ..

రంగారెడ్డి : రూ. 163 కోట్ల విలువైన భూ కబ్జా కేసులో ఏపీ టిడిపి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది. చంచల్ గూడ జైలుకు తరలించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ట్రాక్టర్ బోల్తా..

పశ్చిమగోదావరి : పెదవేగి మండలం రామన్నపాలెం వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది. ఈఘటనలో ఇద్దరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. మృతులు కృష్ణా జిల్లా బాపులపాడు (మం) మడిచర్ల వాసులుగా గుర్తించారు.

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

కడప : జిల్లా రైల్వేకోడూరు మండలం రాఘవరాజపురం వద్ద తెల్లవారుజామున 5గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి వస్తున్న బొలెరోను కడప నుంచి వస్తున్న లారీ ఢీకొనడంతో బొలోరోలో ప్రయాణిస్తున్నా ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

విశాఖ ఎమ్మార్వో శంకర్ రావు ఇంటిపై ఏసీబీ దాడులు

విశాఖ : విశాఖ ఎమ్మార్వో శంకర్ రావు ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. విశాఖలో జరిగిన భూ రికార్డల మాయంలో శంకర్ రావు ప్రధాన నిందితుడుగా ఉన్నారు. ఆయన గతంలో విశాఖ రూరల్ ఎమ్మర్వోగా పనిచేశారు. విశాఖలోని శంకర్ రావు ఇల్లు, మరో 4చోట్ల ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ నేతృత్వంలోని అధికారులు సోదాలు చేస్తున్నారు. 

నాగాలాండ్ లో విరుచుకుపడ్డ ఉగ్రవాదులు

కోహిమ : ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ లోని మావ్ జిల్లాలో సైన్యం పై ఉగ్రవాదులు విరుచుపడ్డారు. ముష్కరులు ప్రాదేశిక సైన్యం పై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. వెంటనే స్పందించిన సైన్యం ఎదురు కాల్పులు జరిపింది. ఉగ్రవాదులు జవాన్ల మధ్యం ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.

09:37 - June 7, 2017

విశాఖ : ఎమ్మార్వో శంకర్ రావు ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. విశాఖలో జరిగిన భూ రికార్డుల మాయం కావడంలో శంకర్ రావు ప్రధాన నిందితుడుగా ఉన్నారు. ఆయన గతంలో విశాఖ రూరల్ ఎమ్మర్వోగా పనిచేశారు. విశాఖలోని శంకర్ రావు ఇల్లు, మరో 4చోట్ల ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ నేతృత్వంలోని అధికారులు సోదాలు చేస్తున్నారు. కొడుకు అత్తగారు కోటవురట్ల ఎంపిపి ఇంట్లోలనూ సోదాలు కొనసాగుతున్నాయి. విజయనగరం, బొబ్బిలిలో బంధువుల ఇళ్లల్లోనూ తనిఖీలు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

09:35 - June 7, 2017

కడప : జిల్లా రైల్వేకోడూరు మండలం రాఘవరాజపురం వద్ద తెల్లవారుజామున 5గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి వస్తున్న బొలెరోను కడప నుంచి వస్తున్న లారీ ఢీకొనడంతో బొలోరోలో ప్రయాణిస్తున్నా ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. రోడ్డు ప్రమాదం జరగడంతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ప్రమాదం తర్వాత క్షతగాత్రులను బొలేరో నుంచి బయటకు తీయడానికి స్థానికులు తంటాలు పడ్డారు. లారీ డ్రైవర్ ను క్లీనర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

09:17 - June 7, 2017

కోహిమ : ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ లోని మావ్ జిల్లాలో సైన్యం పై ఉగ్రవాదులు విరుచుపడ్డారు. ముష్కరులు ప్రాదేశిక సైన్యం పై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. వెంటనే స్పందించిన సైన్యం ఎదురు కాల్పులు జరిపింది. ఉగ్రవాదులు జవాన్ల మధ్యం ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ పౌరుడు, సైనికాధికారి మృతి చెందారు. ఉగ్రవాద దాడి తర్వాత మావ్ లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. రెండు రోజుల క్రితం కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈశాన్య రాష్ట్రాల్లో చొరుబాట్లు తగ్గి, ఉగ్రవాదం తగ్గిందని ప్రకటించిన తర్వాత ఉగ్ర దాడి జరగడం గమనార్హం. దాడి సంబంధించి ఎవరు స్పందించలేదు. 

సిరిసిల్ల జిల్లాలో రివాల్వర్ కలకలం

రాజన్న సిరిసిల్ల : జిల్లా ఎల్లారెడ్డి మండలం దూమాలలో అశోక్ అనే వ్యక్తి ఇంట్లో సీసీఎస్ పోలీలసులు తనిఖీలు చేశారు. అశోక్ రివాల్వర్ లభించడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. రవాల్వర్ బెదిరించి భూదందాలకు పాల్పడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో సోదాలు చేశారు.

 

08:52 - June 7, 2017
08:51 - June 7, 2017

దేశ వ్యాప్తంగా వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని, విదేశాల నుంచి 50 లక్షల పప్పు ధన్యాలు దిగుమతి చేసుకున్నారని, మధ్యప్రదేశ్ ఘటన పై ప్రభుత్వం బాధ్యత వహించాలని, రైతుల పై కాల్పులు జరపడం అమానుషమని టెన్ టివిలో పాల్గొన్న వక్తలు సీపీఎం నేత నంద్యాల నర్సరెడ్డి, టీఆర్ఎస్ నేత శ్రీనివాస్ అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్దతు ప్రకటించిందని బీజేపీ నేత రవళి అన్నారు. భూ కబ్జా విషయంలో ఎంత పెద్ద నాయకులైన చర్యలు తీసుకుంటామని టీడీపీ అధికార ప్రతినిధి దుర్గాప్రసాద్ అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

08:50 - June 7, 2017

భోపాల్ : పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ మధ్యప్రదేశ్‌లోని మాందసౌర్‌లో రైతులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. పెద్ద మొత్తంలో రోడ్లపైకి వచ్చిన రైతులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ వాహనాలను అడ్డుకోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జీ చేసి అనంతరం కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఐదుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారు ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు.

రాళ్లు రువ్వడం వల్లే...
రైతులు పోలీసులపైకి రాళ్లు రువ్వడం వల్లే కాల్పులు జరపాల్సి వచ్చిందని అధికారులు చెప్పారు. ప్రభుత్వం మాత్రం పోలీసులు కాల్పులు జరపలేదని చెబుతోంది. కాల్పులు ఎవరు జరిపారన్నదానిపై విచారణ జరుపుతున్నట్లు హోంమంత్రి భూపేంద్రసింగ్‌ ప్రకటించారు. హింసాత్మక ఘటన వెనక జాతి విద్రోహక శక్తుల హస్తం ఉండే అవకాశం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌ ఘటనను ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి. ప్రభుత్వం రైతులపై యుద్ధం చేస్తోందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. బిజెపి రైతు వ్యతిరేక విధానాలకు ఇది నిదర్శనమని సిపిఎం పొలిట్‌ బ్యూరో విమర్శించింది. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, గాయపడ్డవారికి ఆర్థిక సహాయం అందించాలని, కాల్పులకు అనుమతించిన అధికారులను సస్పెండ్‌ చేయాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. రైతులపై కాల్పులకు బాధ్యత వహిస్తూ మధ్యప్రదేశ్‌ హోంమంత్రి రాజీనామా చేయాలని సిపిఐ డిమాండ్‌ చేసింది. వదంతులు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. మాందసోర్‌, రత్లాం, ఇండోర్‌, ఉజ్జయిని, దీవాస్‌ తదితర ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. రుణమాఫీ, గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ జూన్‌ 1 నుంచి రైతులుఆందోళన బాట పట్టారు. ఆగ్రహంతో 12 వేల లీటర్ల పాలు, కూరగాయలను రోడ్లపై పారబోశారు. రైతులపై కాల్పులను నిరసిస్తూ రాష్ట్రీయ కిసాన్‌ మజ్దూర్‌ సంఘ్‌ బుధవారం రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది.

 

08:49 - June 7, 2017

గుంటూరు : ఏపీలో నవ నిర్మాణ దీక్షలు 5వరోజుకు చేరుకున్నాయి. విజయవాడ బెంజ్ సర్కిల్‌లో జరిగిన నవ నిర్మాణ దీక్షలో సీఎం చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ జరుగుతున్న దీక్షల్లో పలు శాఖలకు చెందిన మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలు, ప్రజా సమస్యలపై చర్చలు జరిగాయి. విజయవాడ నవ నిర్మాణ దీక్షలో పాల్గొన్న చంద్రబాబు పేదల అభివృద్ధికోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఐటీ రంగంలో తాము చేపట్టిన చర్యలవల్లే మన విద్యార్థులు విదేశాల్లో రాణిస్తున్నారని చెప్పారు. నదుల అనుసంధానం ద్వారా నీటి భద్రత కల్పిస్తామని ప్రకటించారు.. పోలవరం ఏపీ ప్రజల జీవనాడి అని.. త్వరగా పనులు పూర్తిచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. నవ నిర్మాణదీక్ష ఐదోరోజులోభాగంగా మానవ వనరుల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ అంశంపై చర్చించారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సీఎం సమాధానమిచ్చారు.

విశాఖలో......
విశాఖ జిల్లా అరకులోయలో ఉదయం జరిగిన దీక్షలో చంద్రబాబు పాల్గొనాల్సి ఉంది. వాతావరణం అనుకూలించకపోవడంతో ఆయన పర్యటన రద్దైంది. అయితే చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ప్రజా సంక్షేమ పథకాలు అమలవుతున్న తీరుపై అధికారుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారం దిశగా పలు సూచనలు , ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పథకాల్లో ఎక్కడ అవకతవకలు జరిగినా వెంటనే 1100 నంబర్‌కి ఫోన్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఏపీ డిప్యూటీ సీఎం చిన రాజప్ప. విశాఖపట్నంలో నిర్వహించిన నవ నిర్మాణ దీక్ష సభలో ఆయనతో పాటు మంత్రులు అయ్యన్నపాత్రుడు, ప్రత్తిపాటి పుల్లారావులు పాల్గొన్నారు.విభజనతో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందన్నారు మంత్రి గంటా శ్రీనివాసరావు. విభజించిన వారి కన్ను కుట్టేలా సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. విశాఖలో జరిగిన ఈ కార్యక్రమంలో స్కిల్ డెవలప్‌మెంట్‌లో భాగంగా పలు రంగాల్లో శిక్షణ తీసుకున్న విద్యార్ధులకు మంత్రి సర్టిఫికేట్స్ అందజేశారు.

పశ్చిమ గోదావరిలో
పశ్చిమగోదావరి జిల్లా కాళ్లమండలం సీసలి గ్రామంలో జరిగిన దీక్షలో కేంద్రమంత్రి అశోక్‌ గజపతిరాజు పాల్గొన్నారు. అనంతరం మహదేవపట్నంలో దళితులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి మాణిక్యాలరావు హాజరయ్యారు.తెలంగాణ సోదరులు రాయలసీమ, ఆంధ్రా ప్రాంత ప్రజల్ని వదులుకున్నందుకు పశ్చాత్తాపడే రోజు రావాలన్నారు ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. రాష్ట్రాభివృద్ధి దిశగా అందరూ ఐకమత్యంగా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. నెల్లూరు కస్తూరిబా కళాక్షేత్రంలో జరిగిన 5వరోజు జరిగిన నవ నిర్మాణ దీక్షలో మంత్రి పాల్గొన్నారు.నెల్లూరు జిల్లా కొడవలూర్‌ దీక్షలో మంత్రి అమర్‌నాధ రెడ్డి పాల్గొన్నారు. విభజన తరువాత కష్టాల్లో ఉన్న రాష్ర్టాన్ని అభివృద్ధి వైపు నడిపించేందుకు సీఎం చంద్రబాబు తీవ్రంగా శ్రమిస్తున్నారన్నారు. ఇక ఇదే జిల్లాలోని ఆత్మకూరు ఎంపిడివో కార్యాలయంలో జరిగిన దీక్షలో మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పాల్గొన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ రాగి వనమ్మ అధ్యక్షతన జరిగిన దీక్షకు పలు శాఖలకు చెందిన అధికారులు హాజరయ్యారు. విజయనగరం జిల్లా సాలూరులో జరిగిన దీక్షలో మంత్రి సుజయకృష్ణ రంగారావుతో పాటు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, జిల్లా జడ్పీ చైర్మన్ శోభారాణి తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.

రాయలసీమలో.....
మంత్రులు భూమా అఖిలప్రియ, కాల్వ శ్రీనివాసులు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో జరిగిన దీక్షలో పాల్గొన్నారు. నవ నిర్మాణ దీక్షలు రాష్ట్రం ముందుకు వెళ్లటానికి ఎంతగానో ఉపకరిస్తాయన్నారు మంత్రి అఖిలప్రియ. రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు అలసట లేకుండ పనిచేస్తున్నారన్నారు మంత్రి కాల్వ శ్రీనివాసులు. కడప జిల్లా జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయంలో 5వరోజు నవ నిర్మాణ దీక్షలు ఘనంగా జరిగాయి. మంత్రి ఆదినారాయణరెడ్డితో పాటు పలు శాఖలకు చెందిన అధికారులు ఈ దీక్షలో పాల్గొన్నారు. రైల్వేకోడూరులో జరిగిన దీక్షల్లోనూ మంత్రి పాల్గొన్నారు. ఇదే జిల్లాకు చెందిన బద్వేలులో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నవ నిర్మాణ దీక్షలు జరిగాయి. జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జయరాములుతో పాటు జిల్లాకు చెందిన పలువురు డాక్టర్లు, రెవెన్యూ అధికారులు, భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో జరిగిన దీక్షలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పాల్గొన్నారు. రెండురోజుల్లో బుక్కపట్నం చెరువుకి హంద్రీనీవా కాల్వ ద్వారా నీరు విడుదల చేస్తున్నట్లు ఆయన చెప్పారు. రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని పల్లె రఘునాథరెడ్డి తెలిపారు.

ప్రకాశం, శ్రీకాకుళంలో...
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపల్ కమిషనర్ రవిబాబు అధ్యక్షతన జరిగిన నవ నిర్మాణ దీక్షలో మంత్రుల అచ్చెన్నాయుడు, కిమిడి కళా వెంకటరావు, ఎమ్మెల్యేలు గుండ లక్ష్మిదేవి, కలమట వెంకటరమణలు పాల్గొన్నారు పలాస టిడిపి జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష ఈనెల 8న జరగబోయే మహా సంకల్పం కార్యక్రమం విజయవంతం చెయ్యాలని కోరారు.ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో జరిగిన దీక్షలో ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పదవ తరగతిలో పదికి పది మార్కులు తెచ్చుకున్న విద్యార్ధుల్ని సన్మానించారు. తొమ్మిదవ తరగతి విద్యార్ధులకు సైకిళ్లు పంపిణీ చేశారు.ఇదే జిల్లాలోని గిద్దలూరు దీక్షలో ఎమ్మెల్యే ముతుముల్ల అశోక్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్ధుల ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. 

08:46 - June 7, 2017

హైదరాబాద్ : స్వాతి, నరేస్‌ కులహంకార హత్యలను వ్యతిరేకిస్తూ ఈనెల 9న ఛలో భువనగిరి నిర్వహిస్తున్నట్టు ప్రజా సంఘాల నేతలు ప్రకటించారు. ఈమేరకు హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో.. ఛలో భువనగిరి కార్యక్రమ వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. నరేష్‌ను హత్య చేసిన శ్రీనివాస్‌రెడ్డిపై హత్యకేసు నమోదు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు డిమాండ్‌ చేశారు. స్థానిక పోలీసులను సస్పెండ్‌ చేసి వారిపైనా కేసులు నమోదు చేయాలన్నారు. కులాంతర వివాహం చేసుకునే వారికి రక్షణగా నిలవడానికి ఓ చట్టం తీసుకురావాలని డిమాండ్‌ చేశారు.

08:45 - June 7, 2017

విశాఖ : విశాఖలో మూడు రోజులపాటు జరిగిన ఆల్‌ ఇండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ 10వ జాతీయ మహాసభలు ముగిశాయి. మూడు రోజులపాటు వివిధ అంశాలపై మహాసభ మొత్తంగా 10 తీర్మానాలను ఆమోదించింది. ఇందులో ప్రధానమైదని ఎంవీ యాక్టు సవరణ బిల్లుపై తీర్మానం.ఈ తీర్మానాన్ని మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. మోటార్‌ వెహికిల్‌ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం సవరణలు తీసుకొచ్చింది. ఈ బిల్లు ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొందింది. అయితే రాజ్యసభలో మాత్రం ఆమోదం పొందలేకపోయింది. ఎంవీయాక్టు బిల్లుపై ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ జాతీయ మహాసభల్లో సుదీర్ఘంగా చర్చ సాగింది. ఈ బిల్లు ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని మహాసభ నిర్ణయించింది. కలిసి వచ్చే అన్ని కార్మిక సంఘాలతో కలిసి బిల్లుకు వ్యతిరేకంగా ఉద్యమించాలని సీఐటీయూ నిర్ణయించింది. సంఘటిత పోరాటాల ద్వారానే హక్కులను రక్షించుకోవాలని మహాసభ పిలుపునిచ్చింది. రవాణా రంగాన్ని కుదేలు చేసే ఎంవీ యాక్టుపై భారీ ఉద్యమాన్ని నిర్వహించనున్నట్టు సీఐటీయూ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌ నర్సింగరావు అన్నారు. ఎంవీ యాక్టు సవరణ బిల్లు వల్ల రోడ్డు రవాణా రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతుందన్నారు. 11 కోట్ల మంది ఉపాధిని ఈ బిల్లు దెబ్బతీస్తుందన్నారు.

బహుళజాతి సంస్థల ప్రయోజనాల కోసమే
కేవలం బహుళజాతి సంస్థల ప్రయోజనాల కోసమే కేంద్రం మోటార్‌ వెహికిల్‌ బిల్లుకు సవరణలు తీసుకొస్తోందని రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్‌ ఫెడరేషన్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి కెకె దివాకరన్‌ అన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందితే రోడ్లపై ఓలా, ఓబ్రా లాంటి సంస్థల వాహనాలు మాత్రమే తిరుగుతాయన్నారు. రెండు చక్రాల వాహనాలపై ఆంక్షలు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న మోటార్‌ వెహికల్‌ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటాలు నిర్వహిస్తామన్నారు. ఇందుకు కార్యాచరణ రూపొందించేందుకు విశాఖ మహాసభలు ఎంతగానో ఉపయోగపడ్డాయన్నారు. మూడు రోజులపాటు జరిగిన ఈ మహాసభలకు 29 రాష్ట్రాల నుంచి దాదాపు 1000 మంది ప్రతినిధులు హాజరయ్యారు. రోడ్డు, రవాణా రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. సమస్యల పరిష్కారానికి భవిష్యత్‌ కర్తవ్యాలు తీసుకున్నారు. మొత్తానికి విశాఖలో జరిగిన మహాసభలు ట్రాన్స్‌పోర్టు వర్కర్స్‌ ఫెడరేషన్‌ నిర్వహించే భవిష్యత్‌ ఉద్యమాలకు దిక్సూచిగా నిలవనున్నాయి.

08:43 - June 7, 2017

గుంటూరు : ఏపీ నూతన రాజధాని అమరావతి మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. సుమారు గంటపాటు పడిన కుండపోత వర్షం సచివాలయాన్ని ముంచెత్తింది. పెద్ద ఎత్తున కురిసిన వర్షంతో సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణాల్లో ఉన్న లోటుపాట్లు బహిర్గతమయ్యాయి. సెక్రటేరియట్‌ 4వ బ్లాక్‌లోని రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లోకి వర్షపునీరు రావడంతో ఉద్యోగుల విధులకు ఆటంకం ఏర్పడింది. బ్లాక్‌లకు ఉన్న కిటికీలు, బిల్డింగ్‌పైనున్న సన్‌రూఫ్‌ కారణంగా నీరు లోపలికి వచ్చిందని అధికారులు నిర్దారించారు. సన్‌రూఫ్‌ను వెంటనే కిందకి దించి.. వర్షపునీరు లోపలికి రాకుండా చర్యలు తీసుకున్నారు.

జగన్‌మోహన్‌రెడ్డి చాంబర్‌లోకి వర్షపునీరు
అమరావతిలో కురిసిన భారీ వర్షాంతో అసెంబ్లీలోని ప్రతిపక్షనేత జగన్‌మోహన్‌రెడ్డి చాంబర్‌లోకి వర్షపునీరు వచ్చిచేరింది. అసెంబ్లీ గ్రౌండ్‌ప్లోర్‌లో ఉన్న జగన్‌ చాంబర్‌లోకి సీలింగ్‌ ద్వారా నీరు వచ్చింది. సీలింగ్‌ నుంచి నీరు ధారలుగా కారడంతో బకెట్లతో నీటిని బయటకు ఎత్తిపోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ప్రభుత్వంపై విమర్శలకు దారి తీసింది. అసెంబ్లీకి నీరు వచ్చి చేరడంతో సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ కుమార్‌ హుటాహుటిని అక్కడికి చేరుకున్నారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రతిపక్షనేత చాంబర్‌ విషయంలో ఆఖరు నిమిషంలో కొన్ని మార్పులు చేయాల్సి వచ్చిందన్నారు. గా ఎలక్ట్రికల్‌ కేబుల్స్‌ మొదటి అంతస్తు నుంచి గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న జగన్‌ చాంబర్‌లోకి రావడం వల్ల నీరు చేరిందన్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. నిర్మాణం విషయంలో ఎక్కడా లోపాలు లేవని, చిన్నచిన్న సమస్యల కారణంగానే ఇలా జరిగిందని చెప్పారు.

నిర్మాణంలో లోపాలు....
సచివాలయం గేటు బయట ఏర్పాటు చేసిన సెక్యూరిటీ ఆఫీస్‌ వద్ద నీరు నిలిచింది. దీన్ని ప్రొక్లెయిన్లతో తొలగించే క్రమంలో సెక్యూర్టీ పోస్టుగోడ కూలింది. మొత్తంగా చాలా కాలం తర్వాత కురిసిన వర్షం.. ఉద్యోగుల్లో, ప్రజల్లోనూ ఆనందం నింపినప్పటికీ.... మరోవైపు అసెంబ్లీ నిర్మాణంలోని లోపాలను ఎత్తిచూపింది. వేలకోట్లు ఖర్చుపెట్టి నిర్మాణం చేసిన సచివాలయంలో చిన్నపాటి వర్షానికే ఇబ్బందులు తలెత్తడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. వేగంగా నిర్మాణాలు చేయడం, నాణ్యతా ప్రమాణాలు విషయంలో అలసత్వం వహించడం కారణంగానే ఇలా జరిగిందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సచివాలయం , అసెంబ్లీ భవనాల్లోని లోపాలను గుర్తించి, భవిష్యత్‌లో ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

08:41 - June 7, 2017

హైదరాబాద్ : రుతుపవనాల రాకకు సంకేతంగా తెలుగు రాష్ట్రాల్లో తొలకరి వర్షాలు మొదలయ్యాయి. పలుచోట్ల ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది.కంచికచర్లలో భారీ వర్షంతో చెట్లు నేలకూలాయి. రేకుల షెడ్ల పైకప్పులు గాలికి కొట్టుకుపోయాయి. కుండపోతగా కురిసిన వానతో రోడ్లపై ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది. దీనికి తోడు ఉరుములు మెరుపులు జనాల్ని బెంబేలెత్తిస్తున్నాయి.. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పలు గ్రామాల్లో చీకట్లు ఆవరించాయి.

తెలంగాణలో...
తెలంగాణలోనూ అక్కడక్కడ ఉరుములు , మెరుపులతో భారీ వర్షాలు పడుతున్నాయి. నల్లగొండజిల్లా మిర్యాలగూడలో పలుచోట్ల ఈదురుగాలులతో కుండపోతగా వర్షం పడింది. రెడ్డి కాలనీలో విద్యుత్ స్తంభం కూలిపోయింది. పలుచోట్ల విద్యుత్‌ వైర్లు తెగిపడ్డాయి. శాలిగౌరారం, నకిరేకల్‌ మండలాల్లో భారీ వర్షం కురిసింది. నర్సింగ్‌బట్లలో ఈదురుగాలులకు.... పశువుల పాక కూలి మహిళ చనిపోయింది. భూదాన్‌పోచంపల్లి వంకమామిడిలో రెండు గంటలపాటు రాళ్ల వాన పడింది.

రంగారెడ్డిలో ఆస్తి నష్టం
రంగారెడ్డి జిల్లా కేశంపేటలో ఈదురుగాలులకు పాలీహౌస్‌ నేలమట్టమయ్యింది. సుమారు 40 లక్షల నష్టం వాటిల్లింది. మంచాల మండలం లోయపల్లిలో చెట్లు విరిగి గేదెపై పడడంతో అది అక్కడికక్కడే చనిపోయింది. ఇబ్రహీంపట్నంలో ఈదురుగాలులతో కూడిన వర్షంతో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో భారీ వర్షానికి వీధులన్నీ జలమయమయ్యాయి. ప్రధాన కూడళ్లు, జాతీయ రహదారి 65పై నీరు నిలిచింది. మెదక్‌ జిల్లా తూప్రాన్‌, వెల్దుర్తి మండలాల్లో ఈదురుగాలుతో కూడిన వర్షం కురిసింది. కరీంనగర్‌లో వీచిన ఈదురుగాలులకు విద్యుత్‌ అంతరాయం ఏర్పడింది. జగిత్యాల జిల్లాలో చిరుజల్లులు కురిశాయి.

పిడుగు పాటుతో వ్యక్తి మృతి
వర్షంతోపాటు పలు జిల్లాల్లో పిడుగులు పడి ఆరుగురు చనిపోయారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. రెండు గేదెలు మృత్యువాత పడ్డాయి. మరో రెండు రోజుల్లో ఏపీ , తెలంగాణలకు రుతుపవనాలు చేరుకుంటాయని వాతావరణ శాఖ చెబుతుండగానే.. ముందుగానే వర్షాలు ప్రారంభమయ్యాయి. తొలకరి జల్లులతో ..రెండు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. 

08:39 - June 7, 2017

హైదరాబాద్ : పాలమూరు జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టులపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో నీటిపారుదలశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పాలమూరు ప్రాజెక్టులో భాగంగా నిర్మించ తలపెట్టిన నార్లాపూర్‌, ఏదుల, వట్టెం, కరివెన రిజర్వాయర్లను గరిష్ట నీటినిల్వ సామర్ధ్యంతో నిర్మించాలని అధికారులను ఆదేశించారు. పాలమూరు రైతులకు నీరందించడాకి, రైతుల వలసలు నిరోధించడానికి ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టుల పనుల పురోగతి గురించి కేసీఆర్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాది నాలుగున్నర లక్షల ఎకరాలకు నీరందించడంతో రైతులు సంతోషంగా ఉన్నారని అన్నారు. ఇదే ఒరవడి కొనసాగించాలని సూచించారు. వచ్చే ఏడాది ఖరీప్‌ నాటికి ఆన్‌ గోయింగ్‌ ప్రాజెక్టులు నూటికి నూరుశాతం పూర్తి చేసి ఆయకట్టుకంతా నీరందించాలని ఆదేశించారు.

కాళేశ్వరం వేగంగా పూర్తి చేయాలి
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించే మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ రిజర్వాయర్ల నిర్మాణం కూడా వేగంపుంజుకోవాలని కేసీఆర్‌ అన్నారు. మల్లన్నసాగర్‌ ద్వారా నిజాంసాగర్‌ వరకు నీరిందించడం సాధ్యపడుతుందన్నారు. హైదరాబాద్‌కు మంచినీరు కూడా మల్లన్నసాగర్‌ ద్వారానే అందించాలన్నారు. కొండపోచమ్మ రిజర్వాయర్‌ ద్వారా పాలకుర్తి వరకు నీరు నింపాలని చెప్పారు. మల్లన్నసాగర్‌ నుంచే గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్లకు నీరిందించాలని సూచించారు. గజ్వేల్‌, భువనగిరి,ఆలేరు నియోజకవర్గాల్లోని చెరువులన్నీ ఈ రిజర్వాయర్ల ద్వారానే నింపాలన్నారు. పాములపర్తి, రంగనాయక సాగర్‌ రిజర్వాయర్ల నిర్మాణం కూడా పూర్తిచేసి వాటి పరిధిలోని చెరువులకు నీరందించాలని ఆదేశించారు. 2019 నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. ఇక ఖమ్మం జిల్లా రైతులకు నీరందించే సీతారామ ప్రాజెక్టునకు కూడా ఏడాదిలో పూర్తి చేయాలన్నారు. సమగ్రమైన వ్యూహంతో సింగూరు ప్రాజెక్టును సమర్ధవంతంగా వినియోగించుకోవాలని, గ్రావిటీ ద్వారా సింగూరుకు నీరందాలని అధికారులకు కేసీఆర్‌

కేసీఆర్ సంతృప్తి...
సుందిళ్ల బ్యారేజీ నిర్మాణానికి స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించినా కొందరు పద్దతి మార్చుకోకుండా ఎన్జీటీకి వెళ్లాలనుకోవడం పట్ల కేసీఆర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్టులను అడ్డుకోవడానికి ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా వెనక్కి పోయేది లేదని స్పష్టం చేశారు. గ్రానైట్స్, నీటిపారుదల, మంచినీటి సరఫరా అంశాలను జీఎస్టీ పరిధిలోకి తేవడంపట్ల కేసీఆర్‌ ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మూడు అంశాలను జీఎస్టీ పరిధి నుంచి తప్పించాలని కోరుతూ ప్రధానమంత్రికి లేఖరాయనున్నట్టు చెప్పారు.

08:35 - June 7, 2017

హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీకి చెందిన శాసనమండలి సభ్యుడు దీపక్‌రెడ్డిని సీసీఎస్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయనతోపాటు న్యాయవాది శైలేశ్‌ సక్సేనాను కూడా అరెస్ట్‌ చేశారు. భూకబ్జా కేసుల్లో నిందితుడిగా ఉన్న దీపక్‌రెడ్డి... కొంతకాలంగా తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో డీసీపీ అవినాశ్‌ మహంతి నేతృత్వంలో పోలీసులు బృందం.. రాత్రి హైదరాబాద్‌లో దీపక్‌రెడ్డిని పట్టుకున్నారు. న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌, ఆసిఫ్‌నగర్‌ సహా ఆరేడు ప్రాంతాల్లోని భూములకు తప్పుడు పత్రాలు సృష్టించిన కబ్జా చేశారనే ఆరోపణలు దీపక్‌రెడ్డిపై ఉన్నాయి. ఆయా భూముల అసలు యజమానులు పోలీసులను ఆశ్రయించడంతో దీపక్‌రెడ్డి అక్రమాల గుట్టు రట్టైంది. ఈ కేసులకు సబంధించి సీసీఎస్‌ పోలీసులు పలుమార్లు నోటీసులు పంపినప్పటికీ దీపక్‌రెడ్డి స్పందించలేదు. దీంతో ఆయనను నిన్న అరెస్ట్‌ చేశారు. అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అయిన దీపక్‌రెడ్డి... ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి అల్లుడవుతారు. ఒక రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధిని మరో రాష్ట్ర పోలీసులు అరెస్ట్‌ చేయడంపై రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది.

07:38 - June 7, 2017
06:59 - June 7, 2017

టీఎస్ పీఎస్పీ విడుదల చేసిన గ్రూప్ 2 ఫలితాల్లో అనుమానాలు ఉన్నాయిని జనపథంలో పాల్గొన్న డీవైఎష్ రాష్ట్ర కార్యదర్శి విజయ్ అన్నారు. సిద్దిపేటలో ఒకే కేంద్రం నుంచి 100 సెలక్ట్ చేయడం, 1:2 చెప్పిన టీఎస్ పీఎస్సీ ఇప్పుడు 1:3 ప్రకటించడం వెనుక అవినీతి జరిగిందని ఆయన అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.  

Don't Miss