Activities calendar

08 June 2017

21:37 - June 8, 2017

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌ కుప్వారా జిల్లాలోని నౌగామ్‌ సెక్టార్‌లో నియంత్రణ రేఖవద్ద భద్రతాదళాలు ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఆపరేషన్‌లో ఓ ఆర్మీ జవాను అమరుడయ్యాడు. నౌగామ్‌ సెక్టార్‌లో ఉగ్రవాదుల కోసం బుధవారం సాయంత్రం నుంచి కొనసాగిన ఆపరేషన్‌ ముగిసింది. నిన్న మఛిల్‌ సెక్టార్‌లో జరిగిన మరో ఘటనలో భద్రతాదళాలు నలుగురు ఉగ్రవాదులను కాల్చి చంపాయి. గత 24 గంటల్లో నియంత్రణ రేఖ వద్ద మొత్తం ఏడుగురు ఉగ్రవాదులను ఆర్మీ మట్టుబెట్టింది. మృతి చెందిన ఉగ్రవాదుల నుంచి ఏకె 47 రైఫిల్‌, ఓ పిస్టల్‌, మూడు జిపిఎస్‌లు, మ్యాప్‌ షీట్‌, తదితర వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెండు ప్రాంతాల్లోనూ ఉగ్రవాదులు చొరబాటు యత్నాన్ని భద్రతాదళాలు అడ్డుకున్నాయి.

 

21:33 - June 8, 2017

హైదరాబాద్ : సీపీఎం జాతీయ ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరిపై హిందూసేన దుండగుల దాడిని ఆ పార్టీ నేతలు ఖండించారు. హైదరాబాద్‌ ఆర్టీసీక్రాస్‌రోడ్స్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వామపక్షాలపై బీజేపీ , ఆర్‌ఎస్‌ఎస్‌లు దాడులను ప్రేరేపిస్తున్నాయని సీపీఎం నేతలు విమర్శించారు.  

21:30 - June 8, 2017

కృష్ణా : కంచికచర్ల మండలం కీసర టోల్‌గేట్‌ వద్ద చందర్లపాడు ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌పై ద్విచక్రవాహనదారుడు వెంకటేశ్వరరావు దాడికి దిగాడు. కీసర వద్ద చందర్లపాడు ఎస్‌ఐతో పాటు పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వాహన పత్రాలు అడిగినందుకు.. తన కుమారుడిని పిలిపించి పోలీసులపై దాడికి యత్నించాడు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని కంచికచర్ల పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. 

 

 

21:17 - June 8, 2017
21:16 - June 8, 2017
20:51 - June 8, 2017
20:47 - June 8, 2017
19:14 - June 8, 2017

యాదాద్రి భువనగిరి : జిల్లాలో మూడురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనం అతలాకుతలం అవుతున్నారు. వర్షపు నీటితో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. జిల్లా కేంద్రంలోని పలు ప్రధాన కూడళ్లలో డ్రైనేజి వ్యవస్థ సరిగా లేకపోవడంతో మురికినీరు రోడ్లపైకి వచ్చి చేరింది. ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు రోడ్లపై అడ్డంగా పడిపోవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. 

 

19:13 - June 8, 2017

హైదరాబాద్‌ : నగరంలో నాలాల విస్తరణలో మరోసారి నిర్లక్ష్యం వెలుగుచూసింది. గత ఏడాది భారీగా కురిసిన వర్షాలతో నాలాలు సర్వే చేసి.. అక్రమ నిర్మాణాలు లెక్క తేల్చాలని ప్రభుత్వం  ఆదేశించింది. దీంతో 12 వేల అక్రమ నిర్మాణాలున్నాయని జీహెచ్‌ఎంసీ అధికారులు గుర్తించారు. వీటిలో బాటిల్‌ నెక్‌లో ఉన్న 800 ఆస్తులను.. 230 కోట్లతో క్లియర్‌ చేయాలని ప్రణాళిక సిద్దం చేశారు. అయితే ప్రభుత్వం.. వీటికి ఇప్పటి వరకు పరిపాలన అనుమతులు ఇవ్వలేదు. దీంతో మరో ఏడాది పాటు గ్రేటర్‌లో నాలాల ఇబ్బందులు తప్పేలా లేవు. 

 

19:12 - June 8, 2017

హైదరాబాద్ : రంజాన్‌ మాసం వచ్చిందంటే చాలు..హైదరాబాద్‌లో హలీం రుచులు గుమగుమలాడతాయి. ఏ గల్లీలో చూసినా హలీం బట్టీలే దర్శనమిస్తాయి. హలీంను చూడగానే లొట్టలేసుకుంటూ తినే జనం..హలీం తయారీలో వాడే మాంసం నాణ్యమైనదేనా అనే విషయాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. జీహెచ్‌ఎంసీ స్టాంప్‌ ఉన్న మాంసాన్ని మాత్రమే వాడాలన్న నిబంధనను హలీం వ్యాపారులు బేఖాతరు చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో దొరికే అపరిశుభ్రమైన మాంసాన్నే వినియోగిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. దీనిపై జీహెచ్‌ఎంసీ కూడా అంటీముట్టనట్లు వ్యవహరించడం పలు విమర్శలకు తావిస్తోంది. 
హ‌లీంకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ 
రంజాన్ మాసం అనేగానే ట‌క్కున గుర్తుకు వ‌చ్చేది హలీమ్. ముఖ్యంగా హైదారాబాద్..హాలీంకు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా మారింది. ఇక్కడ తయారయ్యే హ‌లీంకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ ఉంది. ఇక్కడ తయారయ్యే హ‌లీమ్ దేశంలోని వివిధ రాష్ట్రాల‌తో పాటు ప్రపంచంలోని ప‌లు దేశాల‌కు ఎగుమ‌తి అవుతుంది. 
హాలీం కోసం మటన్‌, బీఫ్‌, చికెన్‌ వాడకం
గ్రేటర్‌ హైదరాబాద్‌లో త‌యారయ్యే హాలీం కోసం మటన్‌, బీఫ్‌, చికెన్‌ను వాడతారు. అయితే వీటిని నగరంలోని జీహెచ్‌ఎంసీ అధికారిక గుర్తింపు ఉన్న కబేలాల నుండి మాత్రమే కొనుగోలు చేయాలి. కానీ హైద‌రాబాద్‌లో ఇటీవలే జీహెచ్‌ఎంసీ అధికారులు హోటల్స్‌లో ఆకస్మిక తనిఖీలు చేయగా నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. నగరంలో 90శాతం హోటల్స్‌లో శానిటేష‌న్ లోపించగా..80శాతం హోటల్స్‌లో జీహెచ్‌ఎంసీ గుర్తింపు లేని మాంసాన్నే స‌ర్వ్‌ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సందర్భంలో... రంజాన్‌ వేళ వండే హలీం పరిశుభ్రమైన మాంసంతోనే తయారు చేస్తున్నారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. 
జీహెచ్‌ఎంసీ స్టాంప్‌ లేని మాంసం వినియోగం 
గ‌త‌ నెల‌లో హాలీమ్ త‌యారీ దారుల‌తో జీహెచ్‌ఎంసీ ప్రత్యేక స‌మావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ప్రతి ఏటా న‌గ‌రంలో 1500 నుండి 2వేల వరకు హలీమ్‌ అమ్మక కేంద్రాలు ఉంటాయనే లెక్కలు తేలాయి. అయితే రంజాన్ మాంసం ప్రారంభమై..10రోజులు అవుతున్నా..ఇప్పటికీ నగరంలో ఎన్ని హాలీం బ‌ట్టీలను ఏర్పాటు చేశారో అధికారుల దగ్గర లెక్కలు లేవు. అంతేకాదు..నగరంలో ప్రస్తుతం ఉన్న హలీం బట్టీల్లో ఎన్ని బ‌ట్టీలకు జీహెచ్ఎంసి స్టాంప్‌ వేసిన మాంసం సరఫరా అవుతుందనే దానిపై కూడా జీహెచ్‌ఎంసీ వద్ద లెక్కలు లేవు. అయితే హలీం తయారీలో 95శాతం జీహెచ్‌ఎంసీ స్టాంప్‌ లేని మాంసాన్నే వినియోగిస్తున్నారనేది బహిరంగ రహస్యం. దీనిపై బల్దియా అధికారులు ఎలా స్పందిస్తారనేది చూడాలి. 

4బిజెపి పాలిత రాష్ట్రాల్లో రైతుల ఆందోళనలు

హైదరాబాద్: నాలుగు బిజెపి పాలిత రాష్ట్రాల్లో రైతులు ఆందోళన బాటపట్టారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, హర్యానాలల్లో అన్నదాతలు రోడ్లెక్కి ఆందోళనకు దిగుతున్నారు. మరో వైపు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్ సింగ్ మాత్రం యోగా శిబిరాల్లో కాలం గుడపుతుండడం కొసమెరుపు.

4బిజెపి పాలిత రాష్ట్రాల్లో రైతుల ఆందోళనలు

హైదరాబాద్: నాలుగు బిజెపి పాలిత రాష్ట్రాల్లో రైతులు ఆందోళన బాటపట్టారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, హర్యానాలల్లో అన్నదాతలు రోడ్లెక్కి ఆందోళనకు దిగుతున్నారు. మరో వైపు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్ సింగ్ మాత్రం యోగా శిబిరాల్లో కాలం గుడపుతుండడం కొసమెరుపు.

అక్టోబర్ 6న నాగ చైతన్య- సమంతల పెళ్లి

హైదరాబాద్ : అక్టోబర్ 6న హీరో నాగచైతన్య - సమంతల పెళ్లి జరగనుంది. ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ప్రెస్ మీట్ లో హీరో నాగచైతన్య పేర్కొన్నారు.

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

ముంబై: నేడు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. 58 పాయింట్లు నష్టపోయి 31,213 వద్ద సెన్సెక్స్, 17 పాయింట్లు నష్టపోయి 9,647 వద్ద నిఫ్టీ ముగిసింది.

పథకాలు అమలులో కేసీఆర్ ప్రభుత్వం విఫలం:తమ్మినేని

భద్రాద్రి : కొత్తగూడెంలో సీపీఎం తెలంగాణ ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రెస్ మీట్ నిర్వహించారు. తెలంగాణ లో ప్రభుత్వ పథకాలు అమలు చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలం అయ్యిందని విమర్శించారు. ఢిల్లీలో సీతారం ఏచూరి పై బిజెపి దాడిని ఖండిస్తున్నామని తమ్మినేని పేర్కొన్నారు.

16:15 - June 8, 2017

మధ్యప్రదేశ్ : కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పోలీసుల కళ్లుగప్పి మధ్యప్రదేశ్‌ మందసౌర్‌కు వెళ్లారు.  రాహుల్‌గాంధీ మందసౌర్‌ జిల్లా పర్యటనకు అధికారులు అనుమతించలేదు. దీంతో ఆయన రాజస్థాన్‌-మధ్యప్రదేశ్‌ సరిహద్దులో నిమోడా నుంచి పోలీసుల కళ్లుగప్పి మోటార్‌సైకిల్‌పై వెళ్లారు. ఆయన పర్యటనను అడ్డుకునేందుకు నయాగావ్‌ వద్ద 4 వందల మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించకుండా బిజెపి ప్రభుత్వం వారిపై కాల్పులు జరుపుతోందని రాహుల్‌ మండిపడ్డారు. నిషేధాజ్ఞలు ధిక్కరించినందుకు పోలీసులు రాహుల్‌ను అరెస్ట్‌ చేశారు. మరోవైపు కాల్పుల ఘటనపై శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ సర్కార్‌ దిగివచ్చింది. రైతులపై కాల్పులు జరిపింది పోలీసులేనని హోంమంత్రి భూపేంద్రసింగ్‌ ప్రకటించారు. మంద్‌సౌర్‌ జిల్లా పిపిలియ మండీలో మంగళవారం రైతుల ప్రదర్శనపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు రైతులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో రైతుల ఆందోళన మరింత ఉధృతం కావడంతో మందసౌర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మృతి చెందిన రైతుల కుటుంబాలకు కోటి చొప్పున పరిహారం ఇస్తామని సిఎం చౌహాన్‌ ప్రకటించినప్పటికీ ఆందోళనకారులు శాంతించడం లేదు.

 

20రోజుల్లో వ్యవసాయానికి అనుకూలమైన వర్షాలు:ఐఎండీ

హైదరాబాద్: మరో 20 రోజుల్లో దేశవ్యాప్తంగా వ్యవసాయానికి అనువైన వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఈ ఏడాది వర్షాభావ ప్రాంతాల్లోనూ వర్షాలు బాగా కరుస్తాయని ఐఎండీ పేర్కొంది.

16:12 - June 8, 2017

హైదరాబాద్‌ : నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో బత్తిన సోదరులు ఏర్పాటు చేసిన చేప ప్రసాద పంపిణీ కార్యక్రమం నిర్వరామంగా కొనసాగుతోంది. చేపప్రసాదాన్ని స్వీకరించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల నుంచి భారీసంఖ్యలో అస్తమా బాధితులు తరలివస్తున్నారు.  రేపు సాయంత్రం వరకు జరిగే చేపమందు ప్రసాదానికి ప్రభుత్వం విస్త్రత ఏర్పాట్లు చేసింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా 500 మంది పోలీసులతో బందోబస్త్‌ను ఏర్పాటు చేశారు. 

16:10 - June 8, 2017

గుంటూరు : సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిపై సంఘ్‌ పరివార్‌ కార్యకర్తలు దాడి చేయడాన్ని నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో గుంటూరులో ర్యాలీ జరిగింది. దాడిని సీపీఎం, సీపీఐ నేతలు తీవ్రంగా ఖండించారు. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో మతోన్మాద శక్తులు పెట్రేగిపోతున్నాయని వామపక్ష నేతలు విమర్శించారు. పౌరుల భావప్రకటనా స్వేచ్ఛను కేంద్రం హరిస్తోందన్నారు. 

 

16:02 - June 8, 2017

గుంటూరు : సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిపై మతోన్మాద శక్తులు దాడి చేయడాన్ని నిరసిస్తూ ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరులో సీసీఐ ఆధ్వర్యంలో ప్రదర్శన జరిగింది. పార్టీ నేతలు, కార్యకర్తలు నల్లరిబ్బన్లు ధరించిన నిరసన తెలిపారు. ఏచూరిపై జరిగిన దాడిని ఖండించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై గళం విప్పుతున్న నేతల గొంతు  నొక్కేందుకు మోదీ సంఘ్‌ పరివార్‌ శక్తులు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నాయని నేతలు విమర్శిస్తున్నారు. 

15:52 - June 8, 2017

మధ్యప్రదేశ్ : కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పోలీసుల కళ్లుగప్పి మధ్యప్రదేశ్‌ మందసౌర్‌కు వెళ్లారు. అక్కడ రైతులతో సమావేశం కానున్నారు. రాహుల్‌గాంధీ మందసౌర్‌ జిల్లా పర్యటనకు అధికారులు అనుమతించలేదు. దీంతో ఆయన రాజస్థాన్‌-మధ్యప్రదేశ్‌ సరిహద్దులో నిమోడా నుంచి పోలీసుల కళ్లుగప్పి మోటార్‌సైకిల్‌పై వెళ్లారు. ఆయన పర్యటనను అడ్డుకునేందుకు నయాగావ్‌ వద్ద 4 వందల మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. కాల్పుల ఘటనపై శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ సర్కార్‌ దిగివచ్చింది. రైతులపై కాల్పులు జరిపింది పోలీసులేనని హోంమంత్రి భూపేంద్రసింగ్‌ ప్రకటించారు. అంతకుముందు పోలీసులు కాల్పులు జరపలేదని ప్రభుత్వం ప్రకటించింది. మంద్‌సౌర్‌ జిల్లా పిపిలియ మండీలో మంగళవారం రైతుల ప్రదర్శనపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు రైతులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో రైతుల ఆందోళన మరింత ఉధృతం కావడంతో మందసౌర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మృతి చెందిన రైతుల కుటుంబాలకు కోటి చొప్పున పరిహారం ఇస్తామని సిఎం చౌహాన్‌ ప్రకటించినప్పటికీ ఆందోళనకారులు శాంతించడం లేదు.

15:51 - June 8, 2017

టీమిండియా ఆటగాడు 'జడేజా' శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన కాసేపటి క్రితం తండ్రయ్యాడు. జడేజా సతీమణి రీవా సొలంకి గురువారం ఉదయం ఆడపిల్లకు జన్మనిచ్చారు. ప్రస్తుతం 'జడేజా' ఇంగ్లాండ్ లో ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆయన ఇంగ్లండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. తాను తండ్రి అయ్యాడన్న విషయం తెలుసుకున్న 'జడేజా' ఆనందం వ్యక్తం చేశాడు. తోటి క్రీడాకారులు ఆయనకు శుభాకాంక్షలు తెలియచేశారు. 2016 ఏప్రిల్ లో జడేజా - రీవా సొలాంకి వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఛాంపియన్స్ ట్రోఫీ నిమిత్తం గర్భవతి అయిన తన భార్యను వదిలి వెళ్తున్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రవీంద్ర జడేజా పేర్కొనడం తెలిసిందే.

చాందినీ చౌక్ కినారి బజార్‌లో అగ్నిప్రమాదం

ఢిల్లీ : దేశ రాజధాని దిల్లీలోని చాందినీచౌక్‌ కినారి బజార్‌లోని మూడంతస్తుల భవనంలో గురువారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 15 ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

సీబీఐ వాదనలకు సుప్రీం సానుకూల స్పందన

ఢిల్లీ: బాబ్రి మసీదు కూల్చివేత కేసులో ముగ్గురికి ఊరట లభించింది. సీనియర్ నేత అద్వానీ, ఉమాభారతి, మురళీ మనోహర్ జోషీలకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు లభించింది. ఈ కేసులో అద్వానీ సహా బిజెపి అగ్రనేతలపై కేసులను పునరుద్ధరించాల్సిందేనన్న సీబీఐ వాదనలకు సుప్రీం కోర్టు సానుకూలంగా స్పందించింది. లఖ్ నవ్ కోర్టులో రోజువారి విచారణ చేపట్టాలని సుప్రీం ఆదేశించింది.

నాలాల సర్వే చేసి అక్రమ నిర్మాణాల లెక్క తేల్చండి: ప్రభుత్ం

హైదరాబాద్: నాలాల విస్తరణ లో నిర్లక్ష్యం స్పష్టం గా కనపడుతోంది. దీంతో అప్రమత్తమైన సర్కార్ నాలాల సర్వే చేసి అక్రమ నిర్మాణాల లెక్క తేల్చాలని అధికారులను ఆదేశించింది. ఈరోజు హైదరాబాద్ నగరంలో 7.5 సెంటీమీటర్ల వర్ష పాతం నమోదయ్యింది.

మరో ఐదు రోజులు వర్షాలు

హైదరాబాద్: నగరానికి వాన కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. రుతుపవనాలు ఇంకా రాకముందే రాత్రి కురిసిన వానతో సిటీ జనం నానా తిప్పలు పడుతున్నారు. అయితే తెలంగాణ వాసులకు వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. మరో ఐదు రోజులు వర్షాలు కురుస్తాయనే హెచ్చరించింది. రాత్రి కురిసిన వర్షాలకంటే ఎక్కువగా వర్షం పడుతుందని.. అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక హైదరాబాద్‌లో వర్షాలపై జీహెచ్ఎంసీ అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. రోడ్లపై నీరు తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు.

 

చంద్రబాబు సీఎం అవ్వడమే రాష్ట్రానికి దౌర్భాగ్యం: పార్థసారధి

అమరావతి : చంద్రబాబు సీఎం అవ్వడమే రాష్ట్రానికి దౌర్భాగ్యమని వైసీపీ నేత పార్థసారధి ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్లలో రాష్ట్ర భవిష్యత్ కి చంద్రబాబు అన్యాయం చేశారని, ఓటుకు నోటు కేసు కోసం ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టారని విమర్శించారు. ఈ మూడేళ్ల లో వ్యవస్థలన్నీ నాశనమయ్యాయని మండిపడ్డారు.

కాకినాడకు చేరుకున్న సీఎం చంద్రబాబు

తూ.గో :. సాయంత్రం 4గంటలకి కాకినాడలో నవ నిర్మాణ మహాసంకల్ప సభ జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కాకినాడకు చేరుకున్నారు.

కరీంనగర్ సబ్ రిజిస్టార్ మధుకర్ సస్పెండ్

కరీంనగర్ : కరీంనగర్ సబ్ రిజిస్టార్ మధుకర్ ను సస్పెండ్ చేస్తూ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ జాన్ ఉత్తర్వులు జారీ చేశారు. మూడు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లకు సంబంధించిన రూ. 5లక్షల 80 వేలు వాడుకున్నట్లు విచారణ లో వెల్లడించాడని పేర్కొన్నారు.

చంద్రబాబు సీఎం అవ్వడమే రాష్ట్రానికి దౌర్భాగ్యం: పార్థసారధి

అమరావతి : చంద్రబాబు సీఎం అవ్వడమే రాష్ట్రానికి దౌర్భాగ్యమని వైసీపీ నేత పార్థసారధి ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్లలో రాష్ట్ర భవిష్యత్ కి చంద్రబాబు అన్యాయం చేశారని, ఓటుకు నోటు కేసు కోసం ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టారని విమర్శించారు. ఈ మూడేళ్ల లో వ్యవస్థలన్నీ నాశనమయ్యాయని మండిపడ్డారు.

ఏచూరి పై దాడిని ఖండిస్తున్నాం: చాడ

యాదాద్రి: యాదగిరిగుట్టలో అఖిల భారత జాతీయ మహిళా సమాఖ్య శిక్షణ తరగతులు ప్రారంభం అయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూడేళ్లలో ఒక్క హామీ నెరవేర్చలేదు చాడా వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. సంఘ్ పరివార్ వంటి శక్తులను రెచ్చగొట్టి సీతారం ఏచూరిపై దాడిని ఖండిస్తున్నాట్లు చాడ పేర్కొన్నారు. నయీమ్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. పోలీసులే దోషులుగా తేలుతుంటే సీఎం కేసీఆర్ పోలీసులను పొగడటం తగదన్నారు. భూ సేకరణ విధానంపై అకిల పక్ష సమావేశ ఏర్పాటు చేసి అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలన్నారు.

మియాపూర్ భూ స్కాం పై సీబీఐకి ఫిర్యాదు చేస్తా: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: మియాపూర్ భూ కుంభకోణంలో పోలీసులు గోల్డ్ స్టోన్ ప్రసాద్ పేరు ఎందుకు లేదని టిడిపి నేత రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో రూ. 15 వేల కోట్లకు సంబంధించిన కేసులో ప్రభుత్వం సాదాసీద న్యాయవాదిని పెట్టారని మండిపడ్డారు. ఈ కుంభకోణంపై కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని సూటిగా ప్రశ్నించారు. గవర్నర్ ఏ ఒత్తిడికి లొంగి మాకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదో చెప్పాలన్నారు. ఢిల్లీకి వెళ్లి ప్రధాని, సీబీఐకి ఫిర్యాదు చేస్తామని రేంత్ హెచ్చరించారు.

'భూ కుంభకోణాన్ని కేసీఆర్ మాయచేయాలని చూస్తున్నాడు'

హైదరాబాద్ : మియాపూర్ భూ కుంభకోణాన్ని సీఎం కేసీఆర్ మసిపూసి మారేడు చేయాలని చూస్తున్నాడని టిడిపి నేత ఎల్. రమణ విమర్శించారు. గవర్నర్, సీఎం కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదని, కేసీఆర్ పాలనలో కబ్జాదారులకు కాకుండా కర్షకులకు బేడీలు వేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత గవర్నర్ పై ఉందన్నారు.

జియో, ఎల్ అండ్ టీ సిబ్బందిపై క్రిమినల్ కేసు

హైదరాబాద్‌: తమ పనుల కోసం గుంతలు తవ్వి పూడ్చకుండా వదిలేసిన జియో, ఎల్‌అండ్‌టీ అధికారులపై క్రిమినల్ కేసు నమోదైంది. ఆర్బీఐ క్వార్టర్స్- యూసఫ్‌గూడ మధ్య, మెట్రో రైల్ ఫిల్లర్ల కోసం ఎల్‌అండ్‌టీ గుంతలు పూడ్చలేదు. దీంతో జూబ్లీహిల్స్ పీఎస్‌లో సెంట్రల్‌జోన్ జీహెచ్‌ఎంసీ అధికారుల ఫిర్యాదు చేశారు. బోరబండ సైట్-2లో జియో సిబ్బంది గుంతలు తవ్వి పూడ్చలేదు. జియో సిబ్బందిపై ఎస్సార్ నగర్ పీఎస్‌లో కేసు నమోదు చేశారు.

14:19 - June 8, 2017

ఎమ్మెస్సీ..బీకాం..బీటెక్..ఎల్ఎల్ బి..చేసిన వాళ్లు ఏమయితరు..?అయితే గొప్పోళ్లు అయితరు..ఇంకా మంచిగా ఉంటే ప్రభుత్వ ఆఫీసర్లు అయితరు కదా..కానీ ఒకతల డిగ్రీలు..పీజీలు చేసినా 13 మంది నవయువకులు ఏం అయిండ్రో తెలుసా ? రౌడీ షీటర్లు అయిండ్రు...కాదు..కాదు..రౌడీ షీటర్లను చేసిండ్రు...ఏలూరు ఎంపీ మాగంటి బాబు కుట్రల దళిత బిడ్డలు చట్టం చేతిలో అక్రమంగా ఇరుక్కపోయిన ముచ్చట..సూడుండ్రి వీడియోలో..

పోలీసుల అదుపులో రాహుల్..

మధ్యప్రదేశ్ : ఏఐసీసీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మాందసౌర్ జిల్లాకు బయలుదేరారు. రాహుల్ పర్యటనకు అధికారులు అనుమతించలేని విషయం తెలిసిందే. కానీ పోలీసుల కళ్లు గప్పి వెళ్లాలని ప్రయత్నించిన రాహుల్ ను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.

14:01 - June 8, 2017

హైదరాబాద్ : ఎల్ అండ్ టీ, జీయో సంస్థలపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఎల్ అండ్ టీ సిబ్బంది ఆర్బీఐ క్వార్టర్స్ యచూసఫ్ గూడ మధ్యలో మెట్రో ఫిల్లర్ కోసం గుంతలు తవ్వి పూడ్చలేదు దీంతో సెంట్రల్ జోన్ జీహెచ్ఎంసీ అధికారుల ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే జియో సిబ్బంది బోరబండలోమ గుంతులు దవ్వి పూడ్చనందుకు వారిపై ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ కేసు నమోదు చేశారు.  

14:00 - June 8, 2017

నిర్మల్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనుల పరిస్థితులు దారణంగా ఉన్నాయిని తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ప్రభుత్వం చెప్పెదానికి చేసేదానికి సంబంధం లేదని ఆయన అన్నారు. గిరిజనులు తమ ఊరుకు తాము వెళ్లడానికి చెక్ పొస్టు ఏర్పాటు చేయడం దారుణమన్నారు. వాస్తవానికి అడువులను నశనం చేసేది సర్కార్ అని తెలిపారు. రాబోయే కాలం కేసీఆర్ ఫలితం తప్పకుండా అనుభవిస్తాడాని తమ్మినేని అన్నారు.  

13:55 - June 8, 2017
13:54 - June 8, 2017

హైదరాబాద్ : చెత్తరహిత నగరంగా మార్చేందుకు గ్రేటర్‌ అధికారులు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు.. గ్రేటర్‌ అధికారుల లెక్కలప్రకారం నగరంలో రోజుకు 4వేల 500 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది.. ఈ స్థాయిలో తయారవుతున్న చెత్తను తరలించడం, శాస్త్రీయ పద్ధతిలో నాశనం చేయడం జీహెచ్‌ఎంసీకి పెద్ద సవాల్‌గా మారింది..ప్రతి ఇంటినుంచి తడి పొడి చెత్తను వేర్వేరుగా సేకరిస్తున్న అధికారులు.. 2వేల ఆటోలద్వారా ఈ చెత్తను జవహర్‌ నగర్‌ డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నారు.. ఇక గ్రేటర్‌ పరిధిలో దాదాపు 10వేల వరకు హోటళ్లు, ఫంక్షన్‌ హాళ్లు ఉన్నాయి.. హోటళ్లనుంచి రోజుకు సుమారు వెయ్యి టన్నుల చెత్త బయటకువస్తోంది.. ఈ స్థాయిలో తయారవుతున్న చెత్తను డంపింగ్‌ యార్డుకు తరలించడం బల్దియాకు పెద్ద సవాల్‌గా మారింది.. ఈ చెత్తపై ప్రధానంగా దృష్టిపెట్టిన గ్రేటర్‌ అధికారులు.. ఎక్కడి వేస్టేజ్‌ను అక్కడే డిస్పోజ్‌ చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు.. ఇందుకోసం శాస్త్రవేత్తల సహాయంకూడా తీసుకుంటున్నారు..

బయోడైజస్టర్‌ మిషన్‌
గ్రేటర్‌ అధికారుల విజ్ఞప్తితో శాస్త్రవేత్తలు చెత్తనుంచి ఎరువు, బయోగ్యాస్‌ తయారుచేసే బయోడైజస్టర్‌ మిషన్‌ను తయారుచేశారు.. హబ్సిగూడలోని సుప్రభాత్‌ హొటల్‌లో ఈ యంత్రాన్ని మేయర్‌ ప్రారంభించారు... ఈ యంత్రంద్వారా హొటల్‌లో ఉత్పత్తిఅయ్యే బయోబేస్ట్‌ను అక్కడే రీసైకిల్‌ చేసుకునేందుకు వీలవుతుంది.. చెత్తను రెండురకాలుగా ఉపయోగించుకునేలాచేసే బయోడైజస్టర్‌ మిషన్‌ ఖరీదు దాదాపు 4లక్షల రూపాయలవరకూ ఉంది.. మిగతా హోటళ్లు, ఫంక్షన్‌ హాళ్లలోనూ ఈ యంత్రాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు బల్దియా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.. ఈ మిషన్‌ను కొనేందుకు ఆర్థికంగా సహాయం చేయాలనికూడా చూస్తున్నారు..బయోడైజస్టర్‌ మిషన్లను పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్లు, కాలనీల్లోకూడా ఏర్పాటుచేస్తే చెత్త సమస్య తీరిపోయే అవకాశముంది.. జీహెచ్‌ఎంసీ ఆదిశగా చర్యలు చేపట్టాలని గ్రేటర్‌వాసులు కోరుతున్నారు.

13:52 - June 8, 2017

గుంటూరు : ఆంధ్ర ప్రదేశ్‌లో ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ కౌన్సిలింగ్ మొదలైంది.. రాష్ట్రవ్యాప్తంగా 35 కేంద్రాల్లో కౌన్సిలింగ్‌ ప్రక్రియ నిర్వహిస్తున్నారు.. ఈ నెల 17వరకూ ఈ కార్యక్రమం కొనసాగనుంది. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

ఎల్ అండ్ టి అధికారులపై క్రిమినల్ కేసులు..

హైదరాబాద్ : ఆర్బీఐ క్వార్టర్స్ - యూసుఫ్ గూడ మధ్య మెట్రో ఫిల్లర్ కోసం గుంతలు తవ్వి వాటిని పూడ్చలేదు. సెంట్రల్ జోన్ జీహెచ్ఎంసీ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ ఎల్ అండ్ టీ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. జియో సిబ్బందిపై ఎస్ఆర్ నగర్ పీఎస్ లో..బోరబొండలో గుంతలు తవ్వ పూడ్చనందుకు కేసులు నమోదు చేశారు.

మాజీ ఏఎస్ఐ మోహన్ రెడ్డి ఇంటిపై ఏసీబీ దాడులు..

సిద్ధిపేట : కోహెడ (మం) రామచంద్రాపూర్ లో ఏసీబీ రైడ్స్ నిర్వహించింది. మాజీ ఏఎస్ఐ మోహన్ రెడ్డి ఇల్లు, రైస్ మిల్లులో సోదాలు నిర్వహించారు. పలు కీలక ఫైళ్లు స్వాధీనం చేసుకున్నారు.

 

ఏటూరు నాగారం ఐటీడీఏ పాలక మండలి సమావేశం..

జయశంకర్ భూపాలపల్లి : ఏటూరు నాగారం ఐటీడీఏ పాలక మండలి సమావేశం జరిగింది. మంత్రి చందులాల్, ఎంపీ సీతారాం నాయక్, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగడంతో ప్రజా ప్రతినిధులు ఇబ్బందులు పడ్డారు. గిరిజన యువతకు 80 శాతం సబ్సిడీతో లోన్లు ఏర్పాటు చేస్తే 20 శాతం ఇవ్వడానికి బ్యాంకర్లు ఎందుకు అభ్యంతరం చెబుతున్నాయని ఎంపీ సీతారాంనాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే బ్యాంకకర్లతో మాట్లాడి అర్హులైన వారికి లోన్లు ఇప్పించాలని కలెక్టర్ కు మంత్రి చందులాల్ ఆదేశాలు జారీ చేశారు.

 

13:12 - June 8, 2017

సంగారెడ్డి : జ‌గ్గారెడ్డి..అలియాస్ తూర్పు జ‌య‌ప్రకాష్ రెడ్డి. సంగారెడ్డి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే. టీఆర్‌ఎస్‌ పార్టీతో రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయన.. కేసీఆర్‌తో విభేదించి..హస్తం పార్టీలో చేరారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న స‌మ‌యంలో కూడా.. అప్పటి సిఎం కిర‌ణ్ కుమార్ రెడ్డికి ముఖ్య అనుచ‌రుడిగా ముద్ర ప‌డ్డారు. త‌న‌దైన శైలిలో తెలంగాణ వాదాన్ని వినిపించి..కేసీఆర్ ఫ్యామిలీతో ఢీ కొట్టి నిత్యం వార్తల్లో నిలిచారు. తాజాగా సంగారెడ్డిలో నిర్వహించిన తెలంగాణ ప్రజా గ‌ర్జణతో కాంగ్రెస్ పార్టీలో సెంట‌ర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారిపోయారు జ‌గ్గారెడ్డి.

ఉప్పు నిప్పుల కేసీఆర్, జగ్గారెడ్డి
కేసీఆర్ అంటే జగ్గారెడ్డికి అస్సలు పడదు. ఆయన పేరు వింటే ఒంటికాలుపై లేస్తారు. అయితే.. జగ్గారెడ్డికి ఢిల్లీ కాంగ్రెస్‌ పెద్దలతో పెద్దగా పరిచయాలు లేవన్న ప్రచారం ఉండేది. కానీ మొన్నటి తెలంగాణ ప్రజా గ‌ర్జనతో ఏకంగా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మ‌న‌సునే దోచుకున్నారట. స‌భ స‌క్సెస్‌ కావడంతో.. రాహుల్ వేదిక‌పైనే జ‌గ్గారెడ్డిని ప‌లు మార్లు అభినందించినట్లు తెలిసింది. అంతేకాదు..స‌భ‌కు ఆర్థిక‌ భారాన్ని సైతం జగ్గారెడ్డి భరించినట్లు వీహెచ్‌ ద్వారా రాహుల్ తెలుసుకున్నారట.. మీరేందుకు స‌హాయం చేయ‌కూడ‌ద‌న్న రాహుల్‌ సూచనతో విహెచ్‌ కూడా త‌న బ్రాస్లెట్‌ను జ‌గ్గారెడ్డికి కానుక‌గా ఇచ్చారు.

జంగ్గారెడ్డికి బ్రాస్ లెట్ ఇచ్చిన వీహెచ్
ఇక విహెచ్ ఇచ్చిన బ్రాస్ లెట్ ను వేలం వేసి..ఆ వ‌చ్చిన డ‌బ్బుతో ఖ‌మ్మం మిర్చిమార్కెట్‌ ఆందోళనలో అరెస్టయిన రైతుల‌కు ఇవ్వాల‌ని నిర్ణయించుకున్నారు జగ్గారెడ్డి. బ్రాస్లెట్‌ను గాంధీభవన్‌లో వేలం వేయనున్నారని తెలుస్తోంది. మరోవైపు జ‌గ్గారెడ్డి కోసం రాహుల్ గాంధీ కార్యాలయం ఆరా తీయ‌డం..ఇప్పుడు హస్తం పార్టీలో హాట్‌టాఫిక్‌గా మారింది. జ‌గ్గారెడ్డికి జ‌నంలో ఉండే ఇమేజ్‌పై రాహుల్‌ గాంధీ ఆఫీస్‌ త‌మ వేగుల ద్వారా వివ‌రాలు తెలుసుకుంద‌ట‌. కేసీఆర్ సొంత జిల్లాలో కేసీఆర్‌ను టార్గెట్ చేసే తెగువ‌ను రాహుల్ గుర్తించారని.. అందుకే జగ్గారెడ్డి గురించి ఆరా తీస్తున్నారని టికాంగ్రెస్‌లో చర్చించుకుంటున్నారట.  

13:08 - June 8, 2017

వరంగల్ : ఉత్తర తెలంగాణలో పేరుగాంచిన హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో సమస్యలు తిష్టవేశాయి. ఆస్పత్రిలో గర్భిణులకు అడుగడుగునా సమస్యలే స్వాగతం పలుకుతాయి. కనీసం తాగడానికి మంచినీరు కూడా దొరకని దుస్థితి. ప్రస్తుతం ఈ ఆస్పత్రిలో 100 పడకలుండగా... 170 మంది గర్భిణులకు ఇక్కడి వైద్యులు సేవలందిస్తున్నారు. కేసీఆర్‌ కిట్‌ ప్రకటన కారణంగా ఆస్పత్రికి వచ్చే గర్భిణుల సంఖ్య పెరిగింది. దీంతో సమస్యలు మరింత తీవ్ర మయ్యాయి. అరకొర వసతుల మధ్యే వైద్యులు గర్భిణులకు చికిత్స అందిస్తున్నారు.

కనీస సౌకర్యాలు కరువు...
గర్భిణులు ఎన్నో వ్యయప్రయసాల కోర్చి చాలా దూరం నుంచి ఆస్పత్రికి వస్తుంటారు. గంటల తరబడి ప్రయాణం చేసివచ్చిన గర్భిణులు కనీసం కూర్చుందామన్నా కుర్చీలుగానీ.. బెంచీలుగానీ లేవు. దీంతో వారంతా ఎండలోనే ఆస్పత్రి ఆవరణలోని చెట్లకింద, ఇతర ప్రాంతాల్లో సేద తీరుతున్నారు. గర్భిణులు స్కానింగ్‌ విషయంలో తీవ్ర ఇబ్బందులు లెదుర్కొంటున్నారు. స్కానింగ్‌ రిపోర్ట్‌ల కోసం సిబ్బంది మరునాడు రావాలని చెప్పడంతో.... వారు అష్టకష్టాలు పడుతున్నారు. దూర ప్రాంతాల నుంచి ఎలా రావాలంటూ గర్భిణులు ప్రశ్నిస్తున్నారు. స్కానింగ్‌ రిపోర్ట్‌లు వచ్చినరోజే ఇవ్వాలని కోరుతున్నారు.

కేసీఆర్ కిట్ తో ఆసుపత్రిలో రద్దీ
కేసీఆర్‌ కిట్‌ పథకాన్ని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత గర్భిణుల సంఖ్య పెరిగింది. ఇది భవిష్యత్‌లో మరింత పెరిగే అవకాశముంది. ఇప్పటికే హన్మకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో వసతులు లేక గర్భిణులకు సరైన వైద్యం అందడంలేదు. మూలిగేనక్కపై తాడిపండు పడ్డట్టు ఇప్పుడు గర్భిణుల సంఖ్య పెరగడంతో ఏంచేయాలో తెలియక వైద్యులు తలలుపట్టుకుంటున్నారు. కేసీఆర్‌ కిట్‌ పథకం గర్భిణులకు చేయూతనిచ్చే మంచి కార్యక్రమమే అయినా.. ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో అది వారిపట్ల శాపంగా మారింది. ఆస్పత్రుల్లో వసతులు పెంచకుండా కేసీఆర్‌ కిట్‌ పథకం అమలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. వివిధ కారణాలతో ముగ్గురు వైద్యులు విధులకు రావడం లేదు. వివిధ విభాగాల్లో సరిపడ సిబ్బంది లేరు. దీంతో బాలింతలకు వైద్యం అందించడం కత్తిమీద సాములా మారింది. వైద్యులు, సిబ్బంది పెంచాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోవాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం.. వైద్యుల సంఖ్యతో పాటు పడకల స్థాయిని పెంచినప్పుడే కేసీఆర్‌ కిట్‌ పథకం లక్ష్యం నెరవేరుతుందని గర్బిణులు, వారి బంధువులు అభిప్రాయపడుతున్నారు.

13:03 - June 8, 2017

హైదరాబాద్ : జంట నగరాల్లో భారీ వర్షం కురిసింది. వర్షం నీటితో జలమయమైన లోతట్టు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పర్యటించారు. వర్షం నీటితో పొంగిపొర్లుతున్న నాలాలు, డ్రెయిన్లను పరిశీలించారు. నీరు పోయేందుకు తీసుకోవాల్సిన చర్యలపై క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో నిలిచిపోయిన నీళ్లను మోటార్లతో తోడిపోసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నాలాలు ఆక్రమణలకు గురైన ప్రాంతాల్లో ముంపు సమస్య ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. 

13:02 - June 8, 2017

గుంటూరు : ఏపీలో కొత్తగా ఎన్నికైన ఇద్దరు టిడిపి ఎమ్మెల్సీల వ్యవహారం టీడీపీ ప్రతిష్టను దిగజారుస్తోంది. అందులో ఒక‌రు నెల్లూరు జిల్లాకు చెందిన వాకాటి నారాయ‌ణ‌రెడ్డి కాగా.. మ‌రొక‌రు అనంత‌పురం జిల్లాకు చెందిన శాసనమండలి సభ్యుడు దీప‌క్‌రెడ్డి. వీరిద్దరు ఇటివ‌లే స్దానిక సంస్థల కోటాలో తెలుగుదేశం పార్టీ త‌రుపున ఎమ్మెల్సీలుగా గెలుపొందారు. ఎన్నికైన రెండు నెలలకే ఇరువురు వివాదాల్లో ఇరుక్కున్నారు. వాకాటి నారాయ‌ణ‌రెడ్డిపై సిబిఐ దాడులు జ‌ర‌గ‌డం..బ్యాంకులకు రుణాలు ఎగ‌వేశార‌నే ఆరోపణతో కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన చంద్రబాబు ఎమ్మెల్సీ వాకాటిని పార్టీ నుంచి స‌స్పెండ్ చేశారు. వాకాటి ఎపిసోడ్‌ మ‌రువ‌క ముందే ఎమ్మెల్సీ దీప‌క్ రెడ్డి భూ కబ్జా కేసులో అరెస్ట్ కావడం చంద్రబాబుకు కొత్త తలనొప్పి తెచ్చింది.

చంద్రబాబు ఆగ్రహాం...
దీప‌క్‌రెడ్డి అరెస్ట్ విషయం పార్టీని మ‌రింత ఇర‌కాటంలోకి నెట్టింది. గతంలోనూ దీపక్‌రెడ్డిపై ఈ తరహా అభియోగాలు ఉన్నా...ఎమ్మెల్సీగా అవ‌కాశం క‌ల్పించ‌డం ప‌ట్ల పార్టీలో విమ‌ర్శలు వినిపిస్తున్నాయట. వాకాటి,దీప‌క్ రెడ్డిల కేసులు, అరెస్టుల వ్యవహారం...ప్రతిపక్షానికి వెలెత్తి చూపించే అవ‌కాశం క‌ల్పించామనే భావ‌న పార్టీ నేత‌ల్లో వ్యక్తమవుతోంది. దీప‌క్‌ రెడ్డి అరెస్ట్...అటు తెలంగాణ టిడిపి నేత‌ల‌ను డిఫెన్స్‌లో ప‌డేసింది. మియాపూర్ ల్యాండ్‌స్కామ్‌లో కేసీఆర్ సర్కార్‌పై తీవ్ర విమ‌ర్శలు చేస్తున్న తరుణంలో..అదే కేసులో దీపక్‌రెడ్డి అరెస్ట్ కావడం వారికి మింగుడుపడని పరిణామంగా మారింది. ఇప్పటికే చంద్రబాబు వాకాటి నారాయణరెడ్డిని స‌స్పెండ్ చేసినా.. దీప‌క్ రెడ్డిపై ఇంకా ఎలాంటి యాక్షన్‌ తీసుకొలేదు. దీపక్‌రెడ్డి వ్యవహారంపై చంద్రబాబు ఆగ్రహంగానే ఉన్నారని... సీరియస్‌ యాక్షనే ఉంటుందన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. 

12:59 - June 8, 2017

హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కో-ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీకీ మంచి గుర్తింపు ఉండేది. ఆర్టీసీ కార్మికుల ఆర్ధిక అవసరాల కోసం 1952లో ఈ సొసైటీ ఏర్పడింది. ఈ సొసైటీ ద్వారా ఆర్టీసీ కార్మికులు రుణాలు తీసుకుని తమ అవసరాలు తీర్చుకుంటున్నారు. కో ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ పూర్తిగా స్వతంత్ర సంస్థ. దీనికి ఆర్టీసీ నుంచి కానీ... రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఏవిధమైన ఆర్ధికసాయం అందడంలేదు. ఈ సంస్థను నడిపించేందుకు ఆర్టీసీ కార్మికులు ఒక కమిటీని ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకుంటారు. ప్రతిడిపో, ఇతర యూనిట్ల నుంచి ప్రాతినిధ్యం ఉండేలా సభ్యుల ఎన్నికల జరుగుతుంది. ఎన్నికైన ప్రతినిధితులు మేనేజ్‌మెంట్‌ బాడీని ఎన్నుకుంటారు. దీనికి ఆర్టీసీ ఎండీ... చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఈడీ స్థాయి అధికారి వైస్‌ చైర్మన్‌గా ఉంటారు. సంస్థ కార్యకలాపాలు యావత్తు సెక్రటరీ నిర్వహిస్తారు. ఒకరకంగా చెప్పాలంటే కో ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీకి సెక్రటరీ గుండెకాయలాంటి వారన్నమాట.

పదవీ విరమణ తర్వాత కూడా పొస్టింగ్
ఆర్టీసీ కార్మికుల కో ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ కార్యదర్శి ఎంవీ నాగరాజుపై అవినీతి ఆరోపణలు రావడం సంచలనం రేపుతోంది. ఆర్టీసీ పాలనాపరంగా విడిపోయినప్పుడు నాగరాజు ఆర్టీసీ కోఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీకి కార్యదర్శి అయ్యారు. గతేడాది ఆయన పదవీ విరమణ చేశారు. అంతర్గతంగా ఏం జరిగిందో తెలియదుకానీ..పదవీ విరమణ చేసిన నాగరాజును మళ్లీ కార్యదర్శిగా నియమించారు. అప్పటి నుంచి ఆయనపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. నిబంధనలకు విరుద్దంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయిలో నాగరాజుకు వేతనం ఇస్తున్నారని కార్మిక సంఘాలు మండిపడ్డాయి. అంతేకాదు.. రుణపరిమితికి మించి నాగరాజు రుణంపొందారని...ఆయన నియామకే చెల్లదంటూ కొన్ని సంఘాలు కోర్టుకెక్కాయి. రిటైర్డ్‌ అయిన వ్యక్తిని సహకారశాఖా నిబంధనల ప్రకారం తిరిగి నియమించే అవకాశం లేదని వాదించాయి.

విచారణ కమిటీ నివేదిక...
ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం నిజాలను నిగ్గుతేల్చేందుకు ఓ విచారణ కమిటీని నియమించాలని సహకారశాఖను ఆదేశించింది. దీంతో విచారణ కమిటీ విచారణ జరిపి ఓ నివేదికను సమర్పించింది. సెక్రటరీ నాగరాజు ప్రతిరోజు ఉదయం డబ్బులు తీసుకుని మధ్యాహ్నం తిరిగి జమచేసేవారని.. అలా 45 లక్షల మేర లావాదేవీలు జరిగాయని విచారణ కమిటీ తేల్చింది. ఇక నాగరాజు తీసుకుంటున్న వేతనం నిబంధనలకు విరుద్దమని స్పష్టం చేసింది. అతనికి ఇచ్చిన వేతనాన్ని రికవరీ చేయాలని నివేదికలో విచారణ కమిటీ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం నాగరాజుకు క్లీన్‌చిట్‌ ఇవ్వడం దుమారం రేపింది. విచారణ కమిటీ నివేదికతో తాము చేసిన ఆరోపణలన్నీ నిజమయ్యాయని ... అన్నిరకాలుగా నాగరాజు అక్రమాలకు పాల్పడ్డారని కార్మిక నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఇటీవల జరిగిన ఆర్టీసీ కో ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ జనరల్‌ బాడీ సమావేశం రసాభాసగా మారింది. నాగరాజు అవినీతిపై కొంతమంది నిలదీశారు. నాయకులతో వాగ్వాదానికి దిగారు. నాగరాజును వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు.

సెక్రటరీకి వెనుకేసుకొస్తున్న టీఎంయూ
ఇంతజరిగినా గుర్తింపు సంఘం మాత్రం నాగరాజును వెనుకేసుకొస్తోంది. కొంతమంది నాయకులు కావాలనే ఇదంతా చేస్తున్నారని... కో ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ ప్రతిష్టకు భంగం కలిగించేందుకు కంకణం కట్టుకున్నారని గుర్తింపు సంఘం నేతలు అంటున్నారు.వందలాది కోట్ల రూపాయల కార్మికుల సొమ్ముకు జవాబుదారిగా ఉండాల్సిన అధికారులకే అవినీతి మరక అంటడంతో కార్మికుల్లో ఆందోళన మొదలయింది. ఇలాంటి విషయాల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన యాజమాన్యం... అవినీతికి పాల్పడిన నాగరాజుకు క్లీన్‌చిట్‌ ఇవ్వడం విమర్శలకు దారితీసింది.

12:51 - June 8, 2017

 

మాతృత్వం అనేది మహిళలకు ప్రకృతి ఇచ్చిన ఆదనపు భారం...ఇది మహిళలకు వరమా లేక శాపమా...అనేది పక్కనపెడితే... ప్రస్తుత జీవన విధనంలో మార్పులో అనేక జంటలు సంతానం కోసం పరితపిస్తున్నాయి....బిడ్డల కోసం అద్దె గర్బాలను ఆశ్రయిస్తున్నారు....ఈ పరిస్థితులు రోజురోజుకు పెరుగుతున్నాయని చెప్పాలి...ప్రస్తుత కాలంలో అమ్మతనం అనేతి ఒక వ్యాపారంగా మారింది...కోట్లాది రూపాయాలు అమ్మతనం చుట్టూ తిరుగుతున్నాయి....అమ్మకంగా మారిపోతున్న అమ్మతనం పై మానవి స్పెషల్ ఫోకస్.....

12:43 - June 8, 2017
12:36 - June 8, 2017

చీకట్లో ఇంటి ముందు కాల్పుల శబ్ధం..పరుగున వచ్చిన ఆ ఇంటి ఇల్లాలు..అప్పటికే రక్తపు మడుగులో కొడుకు..భర్త..ప్రతిఘటించబోతే ఆమెపైనా కాల్పులు...

ఉత్తర్ ప్రదేశ్ లో క్రిమినల్స్ పెరిగిపోతున్నారు..దోచుకొనేందుకు కూడా కాల్చేస్తున్నారు..విరివిగా దొరుకుతున్న తుపాకులతో సంచరిస్తూ దారుణాలకు పాల్పడుతున్నారు..రాజధానికి 90 కి.మీటర్ల దూరంలో ఓ కుటుంబాన్ని దుండగులు కాల్చిపారేశారు..వ్యాపారవేత్త..ఆయన కొడుకు..భార్యను కాల్చిపారేశారు..ఈ దాడుల దృశ్యాలు సీసీ కెమెరాలో రిక్డారయ్యాయి. ఆ దృశ్యాలు చూడండి..

12:29 - June 8, 2017

మహబూబాబాద్ : ఉమ్మడి వరంగల్ జిల్లా తొర్రూరు మండలం మాటేడులో నకిలీ పత్తి విత్తనాల ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టెన్ టివి సమాచారంతో తొర్రూరు సీఐ ఆధ్వర్యలో నకిలీ విత్తనాల తయారీ కేంద్రంలో దాడులు నిర్వహించారు. విత్తనాలు చీడ పీడలను తట్టుకుంటాయని నమ్మబలికి, రూ.800అమ్మాల్సిన పత్తి విత్తనాలను బీటి పేరుతో రూ.1200 అమ్ముతున్నారు. నకిలీ విత్తనాలు పక్కనున్న ఏపీ రాష్ట్రంలోకి తీసుకొచ్చిమాటేడులో ప్యాకింగ్ చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా రైతులు అప్పటికే కల్తీ విత్తనాలు కొనుగోలు చేశారు. 

12:27 - June 8, 2017

ఆస్తి కోసం గొడవలు..అల్లుడికి సపోర్టుగా అత్తామామలు..చెలరేగిపోయిన కుమారుడు..భార్యపేరున ఆస్తి రాసివ్వాలని దాడి..వారు ప్రాణాలతో ప్రస్తుతం కొట్టుమిట్టాడుతున్నారు..

ఆస్తులు అరాచకాలకు కారణమౌతున్నాయి..డబ్బు మనిషిని మృగంగా మార్చేస్తోంది..రక్తం చిందిస్తుంది..పేగు బంధాలను తెంచేస్తోంది..ఈ ఆస్తుల కోసం ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి...కన్న తల్లిదండ్రులను అత్తామామల సహకారంతో చంపేందుకు కట్ర చేశాడో ఓ దుర్మార్గుడు..ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ విషాద ఘటన చూడాలి..వినాలంటే వీడియో క్లిక్ చేయండి.

చంద్రగిరిలో ఉద్రిక్తత

చిత్తూరు : చంద్రగిరిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నేడు చంద్రగిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ నూతన భవనం ప్రారంభోత్సవం కాగా, ప్రొటోకాల్ వివాదం చెలరేగి అది తెలుగు తమ్ముళ్ల మధ్య వాగ్వాదానికి, అధికారులతో కొట్లాటకు కారణమైంది. 

ఫోర్బ్స్‌ జాబితాతో విరాట్ కోహ్లీ..

న్యూయార్క్: భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీ మరో అరుదైన ఘనతను సాధించాడు. అత్యధిక పారితోషికాన్ని అందుకుంటోన్న 100మంది అథ్లెట్ల జాబితాను ప్రముఖ ఫోర్బ్స్‌ సంస్థ తాజాగా ప్రకటించింది. ఈ జాబితాలో భారత్‌ నుంచి ఎంపికైన ఏకైక క్రీడాకారుడు విరాట్‌ కోహ్లీ కావడం విశేషం.

12:22 - June 8, 2017

కూతురి ప్రేమలో ఉన్నాడని తెలిసి కక్ష...కసితో రగిలిపోయాడు...తన కూతురికి కనిపించకుండా చేయాలని...నమ్మకస్తుడిని పిలిపించి చంపేసిన దుర్మార్గం...

ఆస్తి..అంతస్తుల ముందు పేగు బంధం తెగిపోతోంది. మనుషుల్లో పెరుగుతున్న స్వార్థం..ఎన్నో ఘోరాలకు దారి తీస్తోంది..ప్రాణాలు తీస్తోంది..ఈ ఆస్తుల కోసం జన్మనిచ్చిన వారిని అంతం చేస్తున్నారు..రక్తసంబంధాన్ని కాలరాస్తూ..రక్తాన్ని చిందిస్తున్నారు..ఎందుకు కక్షలు..కార్పణ్యాలు.. ? అన్నదమ్ముల మధ్య అనుబంధాలు మాయమౌతున్నాయి.. దీనితో సాధిస్తున్నది ఏమిటీ ?
ప్రేమించడమే శాపమైంది..మనస్సుకు నచ్చిన వారిని ఎంచుకోవడం పాపంగా మారుతోంది..రెండు హృదయాలు కలవడం అంటే పెద్దల అంగీకారం కావాల్సిందే..లేదంటే ప్రాణాలు తీస్తున్నారు..తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన పరువు హత్యలో రెండు కుటుంబాల్లో విషాదం నింపింది... యావత్తు తెలుగు రాష్ట్రాల్లో ప్రేమికుల గుండెలు పగిలేలా భయాన్ని సృష్టించాయి. మరి పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి....

నకిలీ పత్తి విత్తనాల తయారీ ముఠా అరెస్ట్

మహబూబాబాద్: తొర్రూరు మండలం మాటేడులో నకిలీ పత్తి విత్తనాల తయారీ కేంద్రం పై పోలీసులు దాడులు నిర్వహించారు. ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.

ఫైరింగ్ వల్లే రైతుల మృతి : హోం మంత్రి...

మంద్ సౌర్: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని మంద్ సౌర్ జిల్లాలో జ‌రిగిన రైతుల మృతి ఘ‌ట‌న ప‌ట్ల ఆ రాష్ట్ర హోంమంత్రి భూపేంద్ర సింగ్ స్పందించారు. పోలీసులు జ‌రిపిన కాల్పుల వల్లే అయిదుగురు రైతులు మృతిచెందిన‌ట్లు ఆయ‌న వాళ అంగీక‌రించారు. ప్ర‌భుత్వం చేప‌ట్టిన‌ ద‌ర్యాప్తులో ఈ విష‌యం వెల్ల‌డైన‌ట్లు ఆయ‌న చెప్పారు. మ‌రోవైపు ఇవాళ కూడా మంద‌సౌర్ జిల్లాలో రైతులు భారీ ఆందోళ‌న నిర్వ‌హిస్తున్నారు. 

'జీహెచ్ ఎంసీ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి'

హైదరాబాద్: జీహెచ్ ఎంసీ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. రోడ్ల పై వర్షపు నీటి తొలగింపు చర్యలను జోనల్, డిప్యూటీ కమిషనర్లు, ఇంజనీర్లు పర్యవేక్షించాలన్నారు. ప్రజలకుఇ బ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కేటీఆర్ సూచించారు.

'ఏరువాక' కార్యక్రమంపై టెలికాన్ఫరెన్స్

అమరావతి: 'ఏరువాక' కార్యక్రమంపై సీఎస్, దినేష్ కుమార్, మంత్రి సోమిరెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్లు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రేపటి ఏరువాకను వేడుక నిర్వహించాలని సీఎస్, మంత్రి సూచించారు. ఈ ఏడాది సకాలంలో తొలకరి వర్షాలు పడుటం శుభసూచికమన్నారు. అనంతపురంలో జరిగే ఏరువాక లో సీఎం పాల్గొంటారని పేర్కొన్నారు. 

జూలై 16న టీఎస్ ఎడ్ సెట్

హైదరాబాద్: బీఎడ్ కాలేజీలలో సీట్ల భర్తీ కోసం జూలై 16న ఎడ్‌సెట్-2017 పరీక్ష నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించి ఇవాళ పూర్తిస్థాయి షెడ్యూల్ విడుదల చేస్తామన్నారు. ఎడ్‌సెట్ నిర్వహణ బాధ్యతలను ఉస్మానియా యూనివర్సిటీకి అప్పగించినట్లు వెల్లడించారు.

జూలై 16న టీఎస్ ఎడ్ సెట్

హైదరాబాద్: బీఎడ్ కాలేజీలలో సీట్ల భర్తీ కోసం జూలై 16న ఎడ్‌సెట్-2017 పరీక్ష నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించి ఇవాళ పూర్తిస్థాయి షెడ్యూల్ విడుదల చేస్తామన్నారు. ఎడ్‌సెట్ నిర్వహణ బాధ్యతలను ఉస్మానియా యూనివర్సిటీకి అప్పగించినట్లు వెల్లడించారు.

11:36 - June 8, 2017

పశ్చిమ గోదావరి : ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి పోలవరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మండిపడ్డారు. విపక్షాలు ఎన్ని అవరోధాలు కల్పించినా పోలవరం నిర్మాణం ఆగదని, 2019 నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి, ఉభయ గోదావరి జిల్లాల్లో మూడు పంటలకు నీళ్లిస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం, స్పిల్‌ చానల్‌పై ఐకానిక్‌ బ్రిడ్జి నిర్మాణానికి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఐకానిక్‌ బ్రిడ్జి పనుల పైలాన్‌ను ఆవిష్కరించారు. క్రెస్ట్‌గేట్ల తయారీని పరిశీలించారు. 

11:32 - June 8, 2017

మంద్ సౌర్ రైతులను పరామర్శిస్తోన్న రాహుల్ గాంధీ

భోపాల్: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ఇవాళ మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని మంద్‌సౌర్ వెళ్తున్నారు. పోలీసులు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాల‌ను ఆయ‌న క‌లుసుకోనున్నారు. మ‌రోవైపు మంద‌సౌర్ జిల్లా క‌లెక్ట‌ర్‌, ఎస్పీల‌ను ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం బ‌దిలీ చేసింది. ఓమ్ ప్ర‌కాశ్ శ్రీవాస్త‌వ్‌ను మంద‌సౌర్ జిల్లా క‌లెక్ట‌ర్‌గా నియ‌మించారు. జిల్లాలో చెల‌రేగిన హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌ను అదుపు చేసేందుకు రాపిడ్ యాక్ష‌న్ ఫోర్స్‌ను రంగంలోకి దించారు. 

11:23 - June 8, 2017

'పవన్ కళ్యాణ్'...'త్రివిక్రమ్' కాంబినేషన్ లో రూపుదిద్దుకొంటున్న చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న 'త్రివిక్రమ్' సినిమా అంటే పాత్రలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందనే సంగతి తెలిసిందే. ఇటీవలే వచ్చిన 'అత్తారింటికి దారేది' సినిమాలో అత్త..మామ..ఇలా కొన్ని పాత్రలు అలరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టైటిల్ నిర్ణయించని ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. ఇందులో 'పవన్' ఇంజినీర్ గా నటిస్తున్నాడని టాక్. ఇక ప్రధాన పాత్రలో 'ఖుష్బూ' నటిస్తున్నారు. ఇందులో ఆమె పాత్ర అత్త అని తెలుస్తోంది. ఇక మామ పాత్రకు ఎవరు నటిస్తే బాగుంటుందనే విషయంలో చిత్ర యూనిట్ తర్జనభర్జనలు పడుతోందని తెలుస్తోంది. కోలీవుడ్..బాలీవుడ్..ఇతర వుడ్ లకు సంబంధించిన ప్రముఖ హీరోలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. మమ్ముటి..మోహన్ లాల్ తారల పేర్లు వినిపిస్తున్నాయి. మరి 'పవన్' కు మామగా ఎవరు నటిస్తారనే విషయం త్వరలో తెలియనుంది.

11:20 - June 8, 2017
11:14 - June 8, 2017

హైదరాబాద్ : నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాద పంపిణీ ప్రారంభమైంది. బత్తిని సోదరులు పూజ చేసి చేప మందు పంపిణీని మొదలుపెట్టారు. చేప మందు కోసం రాష్ట్రం నుంచి కాకుండా ఇతరు రాష్ట్రాలయిన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, పశ్చిమ బెంగాల్ నుంచి ఆస్తమా రోగులు వస్తున్నారు. చేప ప్రసాదం కోసం వచ్చిన వారికి అధికారుల అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తాగు నీరు, ఆహరాన్ని ఉచితంగా అందిస్తున్నారు. 32 కౌంటర్లలో చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. చేప మందు కోసం మత్స్యశాఖ అధికారులు దాదాపు 2 లక్షల చేప పిల్లలను అందుబాటులో ఉంచారు. జీహెచ్ఎంసీ, జలమండలి, ఆర్ అండ్ బీ శాఖ సమన్వయంతో చేప మందు పంపిణీ చేస్తున్నారు. చేప ప్రసాద పంపణీ రేపు సాయంత్రం వరకు కొనసాగుతోంది.  

చేపమందు ప్రసాదం పంపిణీ ప్రారంభం...

హైదరాబాద్: నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహిస్తున్న చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి చేప ప్రసాదం స్వీకరించారు. అనంతరం అక్కడి ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు.

11:05 - June 8, 2017

నందమూరి బాలకృష్ణ జోరు మీదున్నాడు. 100వ చిత్రం 'గౌతమి పుత్ర శాతకర్ణి' ఘన విజయం అనంతరం 101 సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. తన తదుపరి చిత్రాలపై కూడా 'బాలయ్య' ఇప్పటినుండే ఫోకస్ పెట్టాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 101 సినిమా తెరకెక్కుతోంది. ఇందులో 'శ్రియ' హీరోయిన్ గా మరోసారి కనిపించబోతోంది. ప్రస్తుతం పోర్చుగల్ లో సినిమా షూటింగ్ జరుపుకొంటోంది. ‘బాలకృష్ణ'కు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన టైటిళ్ల విషయంలో చిత్ర యూనిట్ తర్జనభర్జనలు పడుతున్నట్లు టాక్. ఈనెల 10వ తేదీన 'బాలకృష్ణ' పుట్టిన రోజు కావడంతో ఆ రోజున ఫస్ట్ లుక్ విడుదల చేయాలని, టైటిల్ లేకుండా ఫస్ట్ లుక్ విడుదల చేస్తే బాగుండదని చిత్ర యూనిట్ యోచిస్తున్నట్లు సమాచారం. ‘జై బాలయ్య'...’ఉస్తాద్'..’తేడా సింగ్'..’పైసా వసూల్'..ఇలా నాలుగు టైటిళ్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. టైటిల్ తో పాటుగా ఫస్ట్ లుక్ విడుదల చేయాలా ? లేదంటై టైటిల్ కోసం మరికొన్ని రోజులు ఆగాలా ? అని చిత్ర బృందం ఆలోచిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఆయన మొదటి లుక్ ఎలా ఉంటుంది ? చిత్ర టైటిల్ ఏంటీ అనేది తెలుసుకోవాలంటే ఈనెల 10వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

10:50 - June 8, 2017

బాలీవుడ్..టాలీవుడ్..ఇలా ఏ వుడ్ లో నైనా హీరో..హీరోయిన్లు..కొత్త కొత్త పాత్రల్లో నటిస్తూ అభిమానులను సంతృప్తి పరుస్తుంటారు. తొలుత ఓ మోస్తరుగా కనిపించిన హీరోయిన్లు తరువాత హాట్ హాట్ గా కనిపిస్తూ కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెత్తిసుంటారు. తాజాగా 'దంగల్' సినిమాలో 'గీతా ఫొగట్' పాత్రలో 'ఫాతిమా సనా' తన అభినయంతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈమెకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో రచ్చ రచ్చ చేస్తున్నాయి. ‘దంగల్' సినిమాలో సంప్రదాయబద్ధంగా కనిపించిన ఈ నటి హాట్ హాట్ గా కనిపించడం చర్చనీయాంశమైంది. తన ఇన్ స్ట్రాగ్రామ్ ద్వారా విడుదల చేసిన ఫొటోలు వైరల్ గా మారాయి. మాల్టాలోని సముద్రతీరం వద్ద ఓ కుర్చీలో హాట్ ఫొజిస్తూ కూర్చొన్న ఫొటోను ఆమె పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్'.. చిత్రంలో నటిస్తోంది. విజయ్ ఆచార్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్..కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

లారీని ఢీకొన్న కారు: ఒకరి మృతి

వనపర్తి: లారీని వెనుకనుంచి వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారు డ్రైవర్ మృతిచెందగా మరో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వనపర్తి ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన కారు మహారాష్ట్ర బీజేపీ నాయకుడికి చెందిన కారుగా పోలీసులు గుర్తించారు. జిల్లాలోని పెబ్బేరు మండలం రంగాపూర్ జాతీయ రహదారి 44పై రోడ్డు ప్రమాదం జరిగింది.

 

10:44 - June 8, 2017

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో వైవిధ్యమైన వాతావరణం నెలకొంది. ఆయా చిత్రాలకు సంబంధించిన వేడుకలను వినూత్నంగా నిర్వహిస్తున్నారు. అందులో మెగా ఫ్యామిలీ ముందుంది. తాము నటించిన చిత్రాల పాటలు..టీజర్స్..మోషన్ పిక్చర్స్..వాటిని సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసి కొత్త ట్రెండ్ కు నాంది పలికారు. ఇతర హీరోలు సైతం వీరి బాటనే పడుతున్నారు. ఆడియో ఫంక్షన్ లు లేకుండా పాటలు యూ ట్యూబ్ లో విడుదల చేసి ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను నిర్వహిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ 'అల్లు అర్జున్' నటించిన 'డీజే..దువ్వాడ జగన్నాథమ్' చిత్ర పాటలు కూడా యూ ట్యూబ్ ద్వారా విడుదల చేశారు. ముందుగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ మాత్రమే చేయాలని చిత్ర యూనిట్ భావించిందని టాక్. కానీ అభిమానుల కోసం పాటల పండుగ జరిపాలని తాజాగా నిర్ణయించిందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలను రిలీజ్ చేశారు. మిగతా పాటలను ఈ వేడుకలో విడుదల చేయనున్నారు. ఈ నెల 11వ తేదీన పాటల పండుగ జరపడానికి చిత్ర యూనిట్ నిర్ణయించిందని తెలుస్తోంది. అనంతరం 18వ తేదీన ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసి .. 23న సినిమాను విడుదల చేయనున్నారు. మరి పాటల పండుగకు రెడీనా...

ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

విశాఖ: ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలను మంత్రి గంటా శ్రీనివాస్ విశాఖ లో విడుదల చేశారు. ఇంటర్ సప్లిమెంటరీలో 77.3 శాతం ఉత్తీర్ణులయ్యారని తెలిపారు.

ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ జవాను మృతి

జమ్మూకశ్మీర్ : నమ్ గామ్ లో చొరబాటుకు ఉగ్రవాదులు విఫలయత్నం చేశారు. చొరబాటుకు యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాదళాలు హతమార్చాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ జవాను మృతి చెందాడు.

10:18 - June 8, 2017
10:17 - June 8, 2017

పశ్చిమ గోదావరి : జిల్లాలోని పోలవరం ప్రాజెక్టులో నేడు కీలక ఘట్టం మొదలౌతుంది. ప్రాజెక్టులో భాగంగా ఐకానిక్ బ్రిడ్జ్, కాఫర్ డ్యామ్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టులో 70 శాతం పనులు పూర్తియ్యాయని, డయాఫ్రంవాల్ పనులు ఈ సీజన్ కు 50 శాతం పూర్తికావాలని అధికారులను సీఎం ఆదేశించారు. 48 గేట్ల పనులు అనుకున్న విధంగా జరుగుతున్నాయని చంద్రబాబు తెలిపారు. కోన సీమను పర్యటక ప్రాంతాంగా మారుస్తామని సీఎం ప్రకటించారు. జరిగే అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓరువలేక పోతున్నాయని ఆయన ఆరోపించారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరి జవాన్లకు గాయాలు

జమ్మూకశ్మీర్ : ఉరి సెక్టార్ లో ఎన్ కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు కాల్పుల్లో ఇద్దరు జవాన్లకు గాయాలయాయ్యి

చేప ప్రసాదాన్ని ప్రారంభించిన మంత్రి తలసాని

హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.

పోలవం కాఫర్ డ్యామ్ నిర్మాణానికి శంకుస్థాపన

ప.గో:పోలవం కాఫర్ డ్యామ్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. పోలవరం స్కిల్ వే క్రస్ట్ గేట్ల నిర్మాణాన్ని చంద్రబాబు పరిశీలించారు.

09:59 - June 8, 2017

గుంటూరు : వెలగపూడిలోని ఏపీ సచివాలయం, అసెంబ్లీలోకి వర్షపు నీళ్ల లీకేజీ వ్యవహారం ఇప్పుడు అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దానికి దారితీస్తోంది. నాసిరకం పనుల వల్లే వర్షపు నీళ్లు లీకేజీ అయ్యాయని వైసీపీ నేతలు ఆరోపిస్తుండగా... ఇందులో కుట్ర కోణం దాగి ఉందని ప్రభుత్వమంటోంది. ఇదిలావుంటే ఈ వ్యవహారంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లు ఎలా లీక్‌ అయ్యాయో సీఆర్డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ను వివరణ కోరారు. అటు స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, ఇంటెలిజెన్స్‌ డీజీ వెంకటేశ్వరరావు కూడా అసెంబ్లీని పరిశీలించారు.

లీకేజీలో కుట్ర....
వర్షపు నీళ్ల లీకేజీని పరిశీలించిన కోడెల ఇందులో కుట్ర కోణం దాగి ఉందన్నారు. ఎవరో కావాలని జగన్‌ చాంబర్‌లోకి వెళ్లే ఏసీ పైప్‌ను కట్‌ చేశారన్నారు. ఆధారాలన్నీ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కి పంపించి విచారణ జరిపిస్తామన్నారు. అలాగే ఈ అంశంపై సీఐడీ ఎంక్వయిరీ వేస్తున్నట్లు.. విచారణలో అన్ని విషయాలు బయటపడతాయన్నారు కోడెల. జగన్‌ చాంబర్‌లో వర్షపు నీళ్లు లీకేజ్‌ కావడంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం చెప్పేవన్నీ కట్టుకథలేనని వైసీపీ నేతలంటున్నారు. సాక్ష్యాలన్నీ తారుమారు చేసి సీఐడీ ఎంక్వయిరీకి ఆదేశించారన్నారు. ప్రభుత్వ తీరును, ఘటనాస్థలికి మీడియాను అనుమతించక పోవడాన్ని నిరసిస్తూ.. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలో ధర్నా చేశారు. ఈ వ్యవహారంలో వాస్తవాలన్నీ వెలుగు చూడాలంటే సీబీఐతో దర్యాపు చేయించాలని డిమాండ్‌ చేశారు. మొత్తానికి అధికార, ప్రతిపక్షం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనడమే కాదు.. వర్షపు నీళ్లు కూడా మాటల మంటలు పుట్టిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ వ్యవహారంలో కుట్ర ఉందా.. లేక పనుల్లో నాణ్యతాలోపం తెలియాలంటే సీఐడీ నివేదిక వచ్చేదాకా వేచిచూడాల్సిందే !

09:57 - June 8, 2017

హైదరాబాద్ : నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ఇవాళ, రేపు చేపప్రసాదం పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఉదయం 9.00 గంటల నుంచి చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమవుతుంది. చేప ప్రసాదం పంపిణీ మొదటి రోజు వెయ్యి మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటుచేస్తున్నారు. 35 సీసీ కెమెరాలతో కార్యక్రమాన్ని పోలీసులు పర్యవేక్షించనున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

వెటర్నటీ వర్శిటీలో147 పోస్టు భర్తీకి అనుమతి

హైదరాబాద్: పీవీ నర్సింహరావు వెటర్నరీ యూనివర్సిటీలో 147 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యూనివర్సిటీలో ప్రొఫెసర్లు-18, అసోసియేట్ ప్రొఫెసర్లు-32, అసిస్టెంట్ ప్రొఫెసర్లు-97 పోస్టుల భర్తీకి అనుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

09:40 - June 8, 2017

హైదరాబాద్ : నగరంలో కుండపోత వర్షం కురిసింది. వర్షం దాదాపు మూడు గంటల పాటు కురిసింది. దీంతో జంట నగరాల్లోని లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. కొన్ని ఏరియాల్లో చెట్లు విరిగి పడడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కల్గింది. భారీ వర్షంతో నగరంలోని నాళాలు పొంగిపొర్లుతున్నాయి. సిటీలో మొత్తం 390 నాళాలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు పుడిక నిండిపోయింది. కేవలం 40 శాతం నాళాల్లో మాత్రమే పుడిక తీయడంతో నీరు రోడ్లపై వచ్చింది. అన్ని ప్రధాన ప్రాంతాల్లో వర్షం కురవడంతో నగరం స్థంభించ్చింది. బేగంపేట, రామంతాపూర్ లో రోడ్లపైకి నీరు చెరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. హైదరాబాద్ లో దాదాపు 7సెం. మీ వర్షంపాతం నమోదు కావడం జరిగింది. రోడ్ల పూ నీరును క్లియర్ చేయడానికి జీహెచ్ సిబ్బంది రంగంలోకి దిగారు. జీహెచ్ఎంసీ నగరంలో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. అవసరం ఉంటే ప్రజలు బయటకు రావద్దని జీహెచ్ ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి సూచించారు. 

కందుకూరులో భారీ అగ్ని ప్రమాదం

ప్రకాశం: కందుకూరులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కేబుల్ నెట్ వర్క్ కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు వ్యాపించాయి. అగ్ని మాపక సిబ్బంది సహాయంతో మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో రూ. 2 కోట్లకు పైగా ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం.

హైదరబాద్ లో పలు చోట్ల భారీ వర్షం

హైదరాబాద్: నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. తెల్లవారుజామున 3 గంటల నుంచి పలుచోట్ల వర్షం పడడంతో రోడ్ల పైకి భారీగా వర్షపు నీరు చేరుకుంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. నగరంలోని ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. హుస్సేన్ సాగర్ కు దారితీసే నాలాలన్నీ పొంగి పొరలుతున్నాయి. రోడ్లపై నిలిచిన నీటిని సాధ్యమైనంత త్వరగా తొలగించేందుకు జీహెచ్ఎంసీ అత్యవసర బృందాలు రంగంలోకి దిగాయి.

రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జీహెచ్ ఎంసీ

హైదరాబాద్: నగరంలో జీహెచ్ ఎంసీ రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని వాహనదారులకు జీహెచ్ ఎంసీ అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. నగరంలో దాదాపు 838 పురాతన భవాలను అధికారులు గుర్తించారు. వాటిలో నివాసం వుంటున్న ప్రజలను వెంటనే ఖాళీ చేయాలని సూచించారు.

నేటి నుంచి ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్

విజయవాడ: నేటి నుంచి ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ జరగనుంది. ఈ నెల 17 వరకు సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు. ఈనెల 11 నుంచి 20 వరకు వెబ్ ఆప్షన్ల ఎంపిక 21,22 తేదీల్లో ఆప్షన్లు మార్చుకునే అవకాశం ఉంది. 2 నెల 25న సీట్ల కేటాయింపు, ఓసీ, బీసీ అభ్యర్థులకు కౌన్సిలింగ్ ఫీజు రూ.12 వేలు ఎస్సీ, ఎస్టీలకు కౌన్సిలింగ్ ఫీజు రూ. 6 వేలు వుంటుంది.

నేడు, రేపు చేపమందు పంపిణీ.. ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్: నేడు,రేపు నాంపల్లి ఎగ్గిబిషన్ గ్రౌండ్స్ లో చేపమందు పంపిణీ కార్యక్రమాన్ని బత్తిన సోదరులు చేపట్టారు. ఈ సందర్భంగా నగరంలోని నాంపల్లి ఎగ్గిబిషన్ గ్రౌండ్స్‌కు వచ్చే వాహనదారులకు పార్కింగ్ విషయంపై నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి పలు సూచనలు చేశారు. దానితో పాటు నాంపల్లి వైపు వచ్చే వాహనాలకు డైవర్షన్ పాయింట్ల గూర్చి ప్రకటనలో వివరించారు. మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమ వ్యాధిగ్రస్తుల కోసం పంపిణీ చేసే చేపప్రసాదం కోసం రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి భారీ సంఖ్యలో జనం వస్తున్నారు.

నేడు, రేపు చేపమందు పంపిణీ.. ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్: నేడు,రేపు నాంపల్లి ఎగ్గిబిషన్ గ్రౌండ్స్ లో చేపమందు పంపిణీ కార్యక్రమాన్ని బత్తిన సోదరులు చేపట్టారు. ఈ సందర్భంగా నగరంలోని నాంపల్లి ఎగ్గిబిషన్ గ్రౌండ్స్‌కు వచ్చే వాహనదారులకు పార్కింగ్ విషయంపై నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి పలు సూచనలు చేశారు. దానితో పాటు నాంపల్లి వైపు వచ్చే వాహనాలకు డైవర్షన్ పాయింట్ల గూర్చి ప్రకటనలో వివరించారు. మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమ వ్యాధిగ్రస్తుల కోసం పంపిణీ చేసే చేపప్రసాదం కోసం రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి భారీ సంఖ్యలో జనం వస్తున్నారు.

నిండు కుండలా మారిన హుస్సేన్ సాగర్

హైదరాబాద్ : నగరంలో గత అర్ధరాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు జలమయం కాగా, నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ జలాశయంలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. పలు ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. నగరంలోని ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. హుస్సేన్ సాగర్ కు దారితీసే నాలాలన్నీ పొంగి పొరలుతున్నాయి. రోడ్లపై నిలిచిన నీటిని సాధ్యమైనంత త్వరగా తొలగించేందుకు జీహెచ్ఎంసీ అత్యవసర బృందాలు రంగంలోకి దిగాయి.

హైదరాబాద్ లో రెండో ప్రమాదా హెచ్చరిక

హైదరాబాద్ : నగంలో భారీ వర్షం కారణంగా రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అత్యవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని ప్రకటించారు. 

కందుకూరులో అగ్నిప్రమాదం

ప్రకాశం : జిల్లాలోని కందుకూరులో అగ్నిప్రమాదం జరిగింది. కేబుల్ నెట్ వర్క్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. దాదాపు రూ.2కోట్ల ఆస్తినష్టం జరినట్లు సమాచారం ఉంది. 

హైదరాబాద్ లో కుంభవృష్టి

హైదరాబాద్ : నగరంలో అతి భారీ వర్షం కురిసింది. నగరంలో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వర్షంతో రవాణా అస్తవ్యస్తంగా మారింది. జంట నగరాల్లోని చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. వనస్థలిపురం, అంబార్ పేట, బేగంపేటలో రోడ్ల పైకి నీరు రావడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.

08:46 - June 8, 2017
08:45 - June 8, 2017

హైదరాబాద్ : నగరంలో అతి భారీ వర్షం కురిసింది. నగరంలో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వర్షంతో రవాణా అస్తవ్యస్తంగా మారింది. జంట నగరాల్లోని చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. వనస్థలిపురం, అంబార్ పేట, బేగంపేటలో రోడ్ల పైకి నీరు రావడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వర్షపు నీరు మోకాలిలోతుకు చేరింది. చాలా ప్రాంతోల్లో విద్యుత్ కు అంతరాయం కల్గింది. జీహెచ్ఎంసీ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

08:44 - June 8, 2017

కరువుతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో రైతులు తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తున్నారు. మన రాష్ట్రలో కూడా రైతుల ఇబ్బంది పడుతున్నారు. ఆరు రైతులను కాల్చి చంపడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తుందని న్యూస్ మార్నింగ్ లో పాల్గొన్న ప్రముఖ విశ్లేషకులు వినయ్, కాంగ్రెస్ నేత రజనీశ్ గౌడ్ అన్నారు. నిన్న జరిగిన దురదృష్టకరణ సంఘటన అని తెలిపారు. దీనిపై విచారణ జరుపుతున్నారని బీజేపీ నేత ప్రకాష్ రెడ్డి అన్నారు. వీడియో చూడండి.

Don't Miss