Activities calendar

09 June 2017

22:16 - June 9, 2017
22:15 - June 9, 2017

హైదరాబాద్ : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పాల్వాయి గోవర్ధనరెడ్డి ఈ తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ భేటీలో పాల్గొనేందుకు కులూ వెళ్లిన పాల్వాయి.. అక్కడే మృతి చెందారు. గోవర్ధనరెడ్డి మృతికి, కాంగ్రెస్‌ సీనియర్లతో పాటు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఇతర మంత్రులూ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం, పాల్వాయి స్వగ్రామం.. ఇడికూడలో అంత్యక్రియలు జరుపనున్నారు. 
గుండెపోటుతో పాల్వాయి గోవర్ధనరెడ్డి మృతి 
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధనరెడ్డి తెల్లవారుఝామున తుదిశ్వాస విడిచారు. పార్లమెంటు స్టాండింగ్‌ కమిటీ సమావేశాలకు హిమాచల్‌ ప్రదేశ్‌లోని కులుమనాలి వెళ్లిన పాల్వాయి గోవర్ధనరెడ్డికి గుండెపోటు రావడంతో, సహచరులు ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. 
కాంగ్రెస్‌ నేతలు దిగ్భ్రాంతి     
గోవర్ధనరెడ్డి మరణవార్త విని కాంగ్రెస్‌ సీనియర్లు దిగ్భ్రాంతికి గురయ్యారు. పాల్వాయి మృతి పార్టీకి తీరని లోటని పార్టీ నాయకులు వ్యాఖ్యానించారు. పాల్వాయి మృతిపట్ల.. రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మృతదేహాన్ని కులూ నుంచి హైదరాబాద్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరఫునే తరలించాలని అధికారులను ఆదేశించారు. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహా, కాంగ్రెస్‌ నాయకులు పలువురు, పాల్వాయి మరణవార్త విన్నవెంటనే.. ఆయన నివాసానికి వెళ్లి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి కూడా, పాల్వాయి నివాసానికి వెళ్లి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం, పాల్వాయి గోవర్ధనరెడ్డి కుమార్తె స్రవంతి సహా, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులు మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. 
పాల్వాయిది అపార రాజకీయ అనుభవం
పాల్వాయి గోవర్ధనరెడ్డిది అపార రాజకీయ అనుభవం. తప్పును ఎత్తిచూపడంలో తరతమ భేదాలు పాటించేవారు కాదు. ఆరుదశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో .. ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. విద్యార్థి దశనుంచే కాంగ్రెస్‌ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి.. 1967లో తొలిసారిగా నల్లగొండజిల్లా మునుగోడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇదే నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు అసెంబ్లీకి ఎన్నికయిన పాల్వాయి..1981- 82లో  అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి క్యాబినెట్‌లో  మంత్రిగా పనిచేశారు.  తర్వాత 2007 నుంచి 2009 వరకు ఎమ్మెల్సీగా  ఉన్నారు.  2012లో ఏఐసీసీ అధిక్షురాలు సోనియా  ఆశీస్సులతో  రాజ్యసభకు ఎన్నికయ్యారు పాల్వాయి. ఈ క్రమంలో   .. హిమాచల్‌ప్రదేశ్‌లోని కులూమానాలిలో  పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సమావేశాలకు వెళుతు గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ముఠాలు, వర్గపోరుకు నిలయంగా ఉండే కాంగ్రెస్‌ పార్టీలో పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, మాజీ సీఎం రాజశేఖర్‌రెడ్డి,  జానారెడ్డి తోపాటు నల్లగొండజిల్లాకు చెందిన కోమటిరెడ్డి బ్రదర్స్‌తోనూ పాల్వాయి అనేవిషయాల్లో విభేదించేవారు. అయితే, మంచి చెడుల ప్రాతిపదికనే ఆ విమర్శలుండేవి. 
పాల్వాయి మృతిపట్ల మోదీ, తెలుగు రాష్ట్రాల సీఎంలు సంతాపం 
పాల్వాయి గోవర్ధనరెడ్డి మృతిపట్ల, ప్రధాని మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం ప్రకటించారు. పాల్వయి మృతదేహాన్ని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ప్రజల సందర్శనార్థం ఉంచాక, శనివారం ఉదయం, ఆయన స్వగ్రామమైన నల్లగొండజిల్లా చండూరు మండలం ఇడికుడ గ్రామానికి తరలిస్తారు. సాయంత్రం అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

 

22:01 - June 9, 2017

ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం వహించిన అమీ తుమీ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి చిత్రం విశేషాలు, రివ్యూ, రేటింగ్ కోసం వీడియోను చూడండి...

 

21:57 - June 9, 2017

వాయిస్ కాల్, డేటా, బ్రాడ్ ప్యాట్..సీన్ మారుతోంది... టెలీ కంపెనీలు పోటీపడుతున్నాయి. ఆఫర్ల వరద సృష్టిస్తున్నారు. మరో భారత టెలికం రంగంలో విప్లవం రాబోతుందా..? అన్ని నెట్ వర్కలు దిగిరావాల్సిందేనా..? జియో ఆఫర్ల వరదలో చివరికి మోనోపలి ఏర్పడే...అవకాశముందా...? ఇప్పుడు ఆఫర్లతో ఆకర్షిస్తున్న టెలికం కంపెనీలు భవిష్యత్ లో వినియోగదారుల నడ్డి విరుస్తాయా....? భారత టెలికం రంగం ఫ్యూచర్ సీన్ ఏంటీ... ? ఇదే ఈరోజు వైడ్ యాంగిల్ స్టోరీ చూద్దాం...పూర్తి వివరాలను వీడియోలో చూడండి.

 

21:48 - June 9, 2017

సచ్చిపోయిన ఎంపీ పాల్వాయి.. అయ్యో మంచోడుండే అంటున్న జనం...ఏరువాక చేసేటందుకువొచ్చిన చంద్రాలు.. మీడియాకు చూపెట్టిండు అన్నీ అందాలు, వనవాసంల కెళ్లి..జనవాసంలోకి వస్తుండు.. భద్రాచాలం రాములవారికి ఏసీ బంగ్లా, దేవుండ్లకే దీవెనార్తిపెట్టిన జలీల్ ఖాన్...ప్రతిజ్ఞ చేసిన ఫాదర్ ఆప్ బికాం, మహెబూబాబాద్ దిక్కు కల్తీ పత్తిఇత్తులు.. గుంటూరుకెళ్లి నడుస్తున్న దొంగ దందా, క్షమాపణ చెప్పిన జెడ్పీ ఛైర్మన్ బందారి... మంకుపట్టుకుదిగొచ్చిన బూతు మాటలు... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లు వీడియోలో చూద్దాం...

 

21:35 - June 9, 2017

త్రివేండ్రం : కేరళ కోజికోడ్‌లోని సీపీఎం కార్యాలయంపై బాంబుదాడి జరిగింది. గురువారం అర్ధరాత్రి కార్యాలయంలోకి దుండగులు రెండు బాంబులు విసిరారు. ఈ బాంబు దాడిలో సిపిఎం కార్యలయంలోని కిటికి అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆఫీస్‌ ముందు పార్క్‌ చేసిన వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఆరెస్సెస్‌ కార్యకర్తలే దాడులు చేశారని సిపిఎం నేతలు ఆరోపిస్తున్నారు. సీపీఎం కార్యాలయంపై బాంబు దాడికి నిరసనగా సీపీఎం, ఎల్డీఎఫ్ పార్టీలు ఇవాళ కోజికోడ్ జిల్లాలో బంద్‌ పాటించాయి.

21:33 - June 9, 2017

రంగారెడ్డి : ఇబ్రహీంపట్నం యాచారం దళిత యువతి శ్యామలది ఆత్మహత్య కాదు ముమ్మాటికి హత్యేనని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. ఏఆర్‌ కానిస్టేబుల్‌ నర్సింహ నిప్పంటించాడని శ్యామల కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:30 - June 9, 2017

కరీంనగర్ : జిల్లా వీణవంక మండలం చల్లూరులో.. యువతిపై గ్యాంగ్ రేప్ కేసులో దోషులకు శిక్షపడింది. ఇందులో ఇద్దరు దోషులకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించగా... మరొకరిని జువైనల్ హోమ్‌కు తరలించారు. 2016 ఫిబ్రవరి 11న పోలీస్‌ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్న యువతిపై సామూహిక లైంగిక దాడిచేశారు. అంతేకాకుండా.. ఆ కీచకులు అత్యాచార దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. 
నిందితులకు ఉరిశిక్ష పడాలి : బాధితురాలి తండ్రి 
నిందితులకు ఉరిశిక్ష పడాలి. ముగ్గురికి శిక్ష పడాలి. నిందితులకు ఉరిశిక్ష పడేవరకు పోరాడుతాం. ఉరిశిక్ష పడకపోతే పై కోర్టుకు వెళ్తామని. చెప్పారు. 
నిందితులకు ఉరిశిక్ష పడాలి : బాధితురాలు 
నింతులకు ఉరిశిక్ష పడాలి. ముగ్గురికి ఉరిశిక్ష పడేవరకు పోరాడుతాం. ఉరిశిక్ష పడకపోతే పై కోర్టుకు వెళ్తాం. ఘటన దృశ్యాలను డిలిట్ చేయలేదు. పోలీసులు మాకు సహకరిస్తున్నారు. ఈటెల రాజేందర్ పర్మినెంట్ జాబ్ ఇస్తామని చెప్పారు...ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారని తెలిపారు.
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

21:23 - June 9, 2017

హైదరాబాద్ : తెలంగాణ సచివాలయంలో సమతా బ్లాక్‌ వద్ద.. దేవన్న అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అక్కడే ఉన్న పోలీసులు దేవన్నను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. దేవన్నది నిర్మల్‌ జిల్లా తిమ్మాపూర్‌ గ్రామం. ఇవాళ భార్యా ఇద్దరు పిల్లలతో దేవన్న సచివాలయానికి వచ్చాడు. దేవన్న వద్ద మూడు లేఖలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:19 - June 9, 2017

పశ్చిమగోదావరి : ట్రైన్‌లో ఇద్దరు చిన్నారుల్ని కుటుంబ సభ్యులు వదిలిపెట్టి వెళ్లిపోయిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా నవాబ్‌ పాలెం రైల్వేస్టేషన్‌లో జరిగింది. ఒంగోలు పాసింజర్‌ ట్రైన్‌లో ఒంటరిగా కనిపించిన చిన్నారుల్ని గమనించిన ప్రయాణికులు రైల్వే పోలీసులకు అప్పగించారు. చిన్నారులు తమ పేర్లు, జోత్స్న, భానుగా చెబుతున్నారు. తాతతో ఇద్దరూ ట్రైన్ ఎక్కారని .. అయితే తాత మనవరాళ్లను వదిలి మధ్యలో ట్రైన్ దిగిపోయాడని తెలుస్తోంది. చిన్నారుల నుంచి వివరాలు సేకరిస్తున్న పోలీసులు వారిని వారి తల్లిదండ్రులకు అప్పగించే పనిలో పడ్డారు. 

 

21:16 - June 9, 2017

హైదరాబాద్ : ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించడంలో రామిరెడ్డి ఎంతో కృషి చేశారని ఏపీ ఎమ్మెల్సీ వి.సుబ్రహ్మణ్యం అన్నారు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉద్యమం నేటి సవాళ్లు అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ మాజీ అధ్యక్షుడు దాచూరి రామిరెడ్డి చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయనపై స్మారకోపన్యాస కార్యక్రమం నిర్వహించారు. ఉపాధ్యాయ ఉద్యమం నేడు ఆటుపోట్లకు గురౌతోందని.. ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని అన్నారు 

 

21:09 - June 9, 2017

గుంటూరు : ఏపీ అసెంబ్లీలోని ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఛాంబర్‌ను మంత్రి నారాయణ పరిశీలించారు. సంఘటనపై విచారిస్తున్న సీఐడీ అధికారులతో మాట్లాడారు. ఈమేరకు మంత్రి నారాయణతో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. నీరు లోపలకి వచ్చే విధంగా పైప్‌ ఎవరు కట్‌ చేశారో విచారణలో తేలుతుందని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

20:43 - June 9, 2017

కడప : రాయలసీమ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై వామపక్షాలు ఉద్యమ బాట పట్టబోతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ కడపలో వామపక్షాలు రైతు సదస్సు నిర్వహించాయి. కేంద్రం తీరును నిరసిస్తూ ఈనెల 12న అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని వామపక్ష నేతలు నిర్ణయించారు. చంద్రబాబు రైతులకు రుణమాఫీ చేయకుండా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు. రైతులు కరవుతో అల్లాడుతుంటే పట్టించుకోని పాలక పెద్దలు.. భూకబ్జాలు, అక్రమాలలో మునిగిపోయారన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. భూ అక్రమాలకు పాల్పడిన ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డిపై చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రాయలసీమ రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోకపోతే ప్రత్యేక జేఏసీ ఏర్పాటు చేసి ఉద్యమం చేస్తామని వామపక్ష నేతలు హెచ్చరించారు. 

 

20:36 - June 9, 2017

అనంతపురం : ఎంపీ జేసీ దివాకరరెడ్డి మరోసారి.. తన వ్యాఖ్యలతో కలకలం సృష్టించారు. సాక్షాత్తు పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలోనే.. ఆయనపైనే సెటైర్లు వేస్తూ, మధ్యమధ్యలో పొగుడుతూ.. తన మాటల చాతుర్యాన్ని ప్రదర్శించారు. దివాకరరెడ్డి ప్రసంగాన్ని ఆసాంతం విన్నవారు, ఆయన చంద్రబాబును పొగిడారో..? తిట్టారో..? లేక పొగుడుతూ తిట్టిపోశారో..? తేల్చుకోలేక అయోమయానికి గురయ్యారు. 
చంద్రబాబుపైనే బహిరంగంగా సెటైర్లు 
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. శుక్రవారం అనంతపురం జిల్లాలో పర్యటించారు. రాయదుర్గం నియోజకవర్గం పరిధిలోని 74ఉడేగోళం గ్రామంలో.. ఏరువాక కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో.. అనంతపురం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకరరెడ్డి, సాక్షాత్తు పార్టీ అధినేత చంద్రబాబుపైనే బహిరంగంగా సెటైర్లు వేస్తూ ప్రసంగించారు. ఓ క్షణం పొగుడుతూ.. మరోక్షణం.. చురకలు వేస్తూ మాట్టాడారు. 
పోలీసుల తీరును ఆక్షేపించిన దివాకరరెడ్డి  
జిల్లా ఉద్యానవన రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ.. జిల్లా అధికారులు, పోలీసుల తీరును దివాకరరెడ్డి ఆక్షేపించారు. ముఖ్యంగా, రైతులను వేధిస్తున్న సూట్‌ సమస్యపై జేసీ తీవ్రంగా స్పందించారు. ప్రతి రైతు నుంచీ, అధికారులు ఓ రెండు క్వింటాళ్ల మేర దిగుబడులను లంచంగా తీసేసుకుంటున్నారు. దీనికి వారు పెట్టిన పేరే సూట్‌. ఈ సూట్‌ లంచగొండితనంతో విసిగిన రైతుల వేదనను వినిపించేందుకు, జేసీ దివాకరరెడ్డి ఏరువాక వేదికను వినియోగించుకున్నారు.  
రాజకీయ లబ్ధి కోసం జిమ్మిక్కులు 
చంద్రబాబు ఎప్పుడూ అమరావతి గురించే మాట్లాడుతున్నారన్న జేసీ.. తమకు రాజధాని కన్నా రైతుల గోడు తీర్చడమే కావాలని అన్నారు. 2018 నాటికల్లా పోలవరం ప్రాజెక్టు నుంచి, గ్రావిటేషన్‌ ద్వారా నీరు వస్తాయన్న చంద్రబాబు మాటలను తాను నమ్మబోనన్నారు. పోలవరం విషయంలో చంద్రబాబుకే తెలియని సమస్యలు వస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా, చంద్రబాబును గాంధీలాంటి వాడు అన్న నోటితోనే, ఆయన రాజకీయ లబ్ధి కోసం జిమ్మిక్కులూ చేస్తాడంటూ చురక వేశారు. చంద్రబాబు ఎవరి కాళ్లు, జుట్టు పట్టుకుంటున్నారో కానీ, సాంకేతికతను మాత్రం ఒడిసిపట్టుకుని, పనులు వేగంగా చేయిస్తున్నారని జేసీ దివాకరరెడ్డి కితాబునిచ్చారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లాలోని బైరవానితిప్ప ప్రాజెక్టుకు నీటి కేటాయించాలని, సీఎంకు విజ్ఞప్తి చేశారు. మొత్తానికి, దివాకరరెడ్డి ప్రసంగం విన్నవారు, ఆయన చంద్రబాబును పొగిడారో, తిట్టారో తేల్చుకోలేక సతమతమయ్యారు. 

 

20:22 - June 9, 2017

అనంతపురం : రాయలసీమను... రతనాల సీమగా మార్చే బాధ్యతను తాను తీసుకుంటున్నట్టు.. సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. రైతుల నుంచి లంచాలు తీసుకునే అధికారులను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అనంతపురం జిల్లాలో ఓ రైతు పొలంలో దుక్కి దున్ని ఏరువాక కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. 
ఏరువాక కార్యక్రమం 
అనంతపురం జిల్లా ..రాయదుర్గంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని, 74-ఉడేగోళం గ్రామంలో, ఓ రైతు పొలంలోని సేద్యపు కుంటకు గంగపూజ చేశారు. అనంతరం, పొలంలో నాగలితో దుక్కి దున్నారు. ఆ పక్కనే స్వయంగా, ట్రాక్టర్‌ నడిపి, సేద్యపు పనుల్లో పాల్గొన్నారు. ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించాక, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అక్కడి రైతులు, అధికారులతో కాసేపు ముచ్చటించారు. ఏరువాక కార్యక్రమాన్ని భవిష్యత్తులో ఉత్సవంగా నిర్వహించాలని సీఎం అన్నారు. జిల్లాలో రైతుల కష్టాలను తీర్చేందుకు, హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తిచేస్తానన్నారు. పట్టిసీమ ద్వారా జిల్లాకు నీరిచ్చినట్లే, హంద్రీనీవా, భైరవానితిప్ప ప్రాజెక్టుల హామీనీ నిలుపుకుంటానన్నారు. 
లంచాలు, కమిషన్‌లు తీసుకునేవారిని ఉపేక్షం
అనంతపురం జిల్లా రైతులను, సూట్‌ పేరిట లంచాల కోసం అధికారులు వేధిస్తున్నారన్న అంశంపై.. చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. లంచాలు, కమిషన్‌లు తీసుకునేవారిని ఉపేక్షించేది లేదన్నారు. ప్రత్యేక విమానంలో పుట్టపర్తి విమానాశ్రయానికి వచ్చిన చంద్రబాబుకు, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఘన స్వాగతం పలికారు. బుక్కపట్నం చెరువుకి హంద్రీనీవా నీటిని ఇచ్చినందుకు జిల్లా టీడీపీ నేతలు సత్యసాయి ట్రస్ట్‌ సభ్యులు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా పుట్టపర్తి మున్సిపల్‌ చైర్మన్‌ గంగన్నకు మాత్రం పోలీసులు లోపలికి అనుమతించలేదు. దీంతో ఆయన ఎయిర్‌పోర్ట్‌ ముందే బైఠాయించి ఆందోళనకు దిగారు. 

 

20:12 - June 9, 2017

నిర్మల్ : జిల్లాలో ధాన్యం అమ్ముకునేందుకు వచ్చిన రైతులు 25 రోజులుగా మార్కెట్ యార్డులలో పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ధాన్యం తడిసిపోతుంటే ఆందోళన చెందుతున్నారు. నిబంధనల పేరుతో అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. కొత్త పంటలేసుకునే సమయం వచ్చినా ఇంకా మార్కెట్ యార్డులలోనే మగ్గిపోతున్నామని రైతులు వాపోతున్నారు. దీనిపై పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం.. 

20:09 - June 9, 2017
20:08 - June 9, 2017
19:48 - June 9, 2017

మహబుబ్ నగర్ : జిల్లా సర్వసభ్య సమావేశం సభ్యుల వాగ్వాదాలతో అట్టుడికింది.  జిల్లా జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ కొద్దిరోజుల క్రితం ఒంటరి మహిళల పెన్షన్ పథకం ప్రారంభోత్సవంలో మహిళల మనోభావాలను కించపరచే విధంగా చేసిన వ్యాఖ్యలను... మంత్రి జూపల్లి ఖండించక పోవడాన్ని కొందరు మహిళ సభ్యులు తప్పుపట్టారు. ఇవాళ్టి సమావేశంలో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై సభలో గందరగోళం చెలరేగడంతో.. చివరకు జడ్పీ ఛైర్మన్ భాస్కర్‌ క్షమాపణలు చెప్పారు.

 

19:46 - June 9, 2017

హైదరాబాద్ : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి మృతికి పలువురు నేతలు సంతాపం తెలిపారు. తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శాసనసభ మాజీ స్పీకర్‌ సురేశ్‌రెడ్డి సంతాపం తెలిపారు.  60ఏళ్లపాటు రాజకీయాల్లో కొనసాగిన పాల్వాయి.. మంత్రిగా, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా  వివిధ పదవులు నిర్వహించారని నాయకులు  కొనియాడారు. పాల్వాయి టుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. 

 

19:42 - June 9, 2017
19:40 - June 9, 2017

ఢిల్లీ : పశు విక్రయాలపై ఆంక్షలు విధిస్తూ కేంద్రం తీసుకొచ్చిన నోటిఫికేషన్‌ను వ్యతిరేకిస్తూ ఆలిండియా కిసాన్‌ సభ దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తోంది. ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ దగ్గర ధర్నా నిర్వహించి.. నోటిఫికేషన్‌ ప్రతులను దగ్ధం చేశారు. ఈసందర్భంగా ఏఐకెఎస్‌ జాయింట్‌ సెక్రటరీ విజు కృష్ణతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. కేంద్రం తీసుకువచ్చిన నోటిఫికేషన్‌తో ఇబ్బందుల్లో ఉన్న రైతులు మరింత సంక్షోభంలోకి కూరుకుపోతారని ఆయన తెలిపారు. 

 

19:33 - June 9, 2017

విశాఖ : వీలయితే ఓ కప్పు కాఫీ..! ఇది సినిమా డైలాగ్‌ కాదు. ఏపీలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు చేపడుతున్న సరికొత్త వ్యూహం. రాత్రి12 గంటల తర్వాత వాహనం నడుపుతున్న డ్రైవర్లను ఆపి.. వీలయితే ఓ కప్పు టీ కూడా ఇవ్వాలని సీఎం చెప్పారని.. డీజీపీ సాంబశివరావు  తెలిపారు. రాష్ట్రంలోరోడ్డు ప్రమాదాల నివారణకు ఇక నుంచి   పోలీసు, రవాణశాఖలు సమన్వయంతో పనిచేస్తాయన్నారు. విశాఖలో జరిగిన ఉత్తరాంధ్ర, గోదావరిజిల్లాల  పోలీసు, రవాణశాఖ అధికారుల సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు.  మద్యంతాగి  వాహనం నడిపితే.. డ్రైవర్లుతోపాటు ఓనర్లపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు. 

 

19:28 - June 9, 2017

కరీంనగర్ : యువతిపై గ్యాంగ్ రేపు కేసులో దోషులకు శిక్ష పడింది. నిందితులకు కరీంనగర్ కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మరొకరికి జువైనల్ హోంకు తరలించారు. వీణవంక మండలం చల్లూరులో యువతి పోలీసు ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతోంది. ఈనేపథ్యంలో 2016 ఫిబ్రవరి 11న శ్రీనివాస్, అంజయ్యలు యువతికి మాయమాటలు చెప్పి సుదూర ప్రాంతానికి తీసుకెళ్లి... ఆమెపై అతికిరాతకంగా అత్యాచారం చేశారు. వారితోపాటు వెళ్లిన మరో మైనర్ బాలుడు దృశ్యాలను సెల్ ఫోన్ లో చిత్రీకరించాడు. ఈ ఘటనపై 15 నెలలపాటు విచారణ కొనసాగింది. 

యువతిపై గ్యాంగ్ రేపు కేసులో దోషులకు శిక్ష

కరీంనగర్ : జిల్లాలో యువతిపై గ్యాంగ్ రేపు కేసులో దోషులకు శిక్ష పడింది. ఇద్దరు నిందితులు శ్రీనివాస్, అంజయ్యల కరీంనగర్ కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మరొకరికి జువైనల్ హోంకు తరలించారు. 

19:03 - June 9, 2017

అనంతపురం : ఎంపీ జె.సి.దివాకరరెడ్డి మరో మారు, తన వ్యాఖ్యలతో కలకలం సృష్టించారు. సాక్షాత్తు చంద్రబాబు సమక్షంలోనే, ఆయనపై సెటైర్లు వేశారు. రాయదుర్గం పరిధిలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యారు. ఈసందర్భంగా, రైతుల సమస్యలను ప్రస్తావిస్తానంటూ.. మైకు అందుకున్న జేసీ.. జిల్లాలో సూట్‌ పేరిట, అధికారులుచేస్తున్న లంచగొండితనం గురించి సీఎం దృష్టికి తీసుకు వచ్చారు. ఆ బెడద నుంచి తమకు విముక్తి కల్పించాలన్నారు. ఈ సందర్భంగా పోలీసులు, అధికారుల తీరును ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. 
చంద్రబాబు జిమ్మిక్కులు చేస్తాడు : జేసీ
ఎంపీ జేసీ దివాకరరెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబును పొగుడుతూనే.. ఆయన రాజకీయాల కోసం జిమ్మిక్కులూ చేస్తారంటూ వ్యాఖ్యానించారు. కానీ దేవుడు ఎందుకో ఆయనకు సహకరించట్లేదన్నారు. చేతిలో పైసా లేకుండా చేతులు ఊపుకుంటూ అమరావతికి వచ్చిన చంద్రబాబు ఎవరి కాళ్లు, జుట్టు పట్టుకున్నారో తెలియదు కానీ.. టెక్నాలజీని అభివృద్ధి చేశారంటూ వ్యాఖ్యానించారు జెసి.దివాకర్‌ రెడ్డి. 
చంద్రబాబు చెప్పే మాటల్ని నమ్మను : జేసీ 
పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2018 కల్లా పోలవరం నీళ్లు వచ్చేస్తాయంటూ చంద్రబాబు చెప్పే మాటల్ని నమ్మబోనని స్పష్టం చేశారు. పోలవరం విషయంలో చంద్రబాబుకి కూడా తెలియని సమస్యలు వస్తున్నాయన్నారు. చంద్రబాబులో కూడా లోటుపాట్లు ఉన్నాయన్న జేసీ, జగన్ అధికారంలోకి వస్తే తామంతా చస్తామని, అయినా ఆయన వచ్చేది చచ్చేది లేదంటూ వ్యాఖ్యానించారు.  

 

18:54 - June 9, 2017

అనంతపురం : రాయలసీమను.. రతనాల సీమగా మార్చే బాధ్యతను తాను తీసుకుంటున్నట్టు సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. అనంతపురాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎడారిగా మారకుండా.. ప్రయత్నిస్తానన్నారు. అనంతపురంలో జరిగిన ఎరువాక కార్యక్రమంలో సీఎం చంద్రబాబునాయుడు పాల్గొన్నారు.  జిల్లాలో హంద్రీనీవా ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే జిల్లాలో అధికారులెవరైనా.. లంచాలు, కమీషన్లు తీసుకుంటే.. ఊరుకునేది లేదని హెచ్చరించారు.  

 

18:52 - June 9, 2017

హైదరాబాద్‌ : నగరంలో భారీ వర్షం మళ్లీ ముంచెత్తింది. దిల్‌సుఖ్‌నగర్, చార్మినార్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, పంజాగుట్ట, సికింద్రాబాద్‌లో భారీవర్షం కురిసింది. కురిసింది కొద్ది సమయమే అయినా... వర్షం జోరుగా కురిసింది. దీంతో ఎప్పటిలాగే రోడ్లపైకి వాననీరు చేరడంతో... వాహనదారులకు ఇక్కట్లు తప్పలేదు. మెట్రో పనులు జరుగుతున్న ప్రాంతంలో ఇరుక రహదారుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నిన్నటి వర్షం సమస్యలను గ్రేటర్ అధికారులు 
పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది. 

18:49 - June 9, 2017

ఢిల్లీ : పశు విక్రయాలపై కేంద్రం ఆంక్షలు విధిస్తూ తీసుకొచ్చిన నోటిఫికేషన్‌ను వ్యతిరేకిస్తూ ఆలిండియా కిసాన్‌ సభ దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా నిర్వహించి.. నోటిఫికేషన్‌ ప్రతులను దగ్ధం చేశారు. కేంద్రం వెంటనే నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మోదీ ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే విధంగా వ్యవహరిస్తున్నారన్నారని కిసాన్‌ సభ నేతలు ఆరోపించారు. 

 

18:41 - June 9, 2017
18:39 - June 9, 2017
18:07 - June 9, 2017

హైదరాబాద్ : వయస్సు చిన్నదే కానీ.. వండర్స్‌ సృష్టిస్తుంది... అద్భుత విన్యాసాలతో అందరినీ ఆకట్టుకుంటుంది. రికార్డులపై.. రికార్డులు సాధిస్తూ... ఆశ్చర్యపరుస్తోంది. కరాటేలో నైపుణ్యం సాధించడమే కాదు... సాహసోపేతమైన విన్యాసాలతో ఆకట్టుకుంటున్న బాలికపై ప్రత్యేక కథనం
కరాటేలో ప్రతిభ కనబరుస్తున్న అమృత
హైదరాబాద్‌కు చెందిన ... అమృత కరాటేలో అద్భుత ప్రతిభ కనబరుస్తోంది. చిన్న వయస్సులోనే వరల్డ్ రికార్డ్‌ సాధించి. అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రముఖుల ప్రశంసలు అందుకుంటుంది. సెవెన్త్‌ క్లాస్‌ చదువుతున్న అమృత బర్కత్‌పురాలోని జీవీఆర్‌ కరాటే అకాడమీలో రెండో సంవత్సరం నుంచే శిక్షణ తీసుకుంటోంది.
అమృత సాహోసోపేతమైన విన్యాసాల ప్రదర్శన
ఇటీవల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమృత సాహసోపేతమైన విన్యాసాలను ప్రదర్శించి అందరి దృష్టినీ ఆకర్షించింది. తెలంగాణ ఏర్పడి వెయ్యి అరవై తొమ్మిది రోజులైన సందర్భాన్ని పురస్కరించుకుని... అన్ని మేకులపై పడుకుంది. అలాగే రాష్ట్రమొచ్చి 36 నెలలు పూర్తైనందుకు చిహ్నంగా .. 36 గ్రానైట్స్‌ను పగలగొట్టింది. రెండు నిమిషాల 58 సెకండ్లలో ఇది పూర్తి చేసింది. దీంతో వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌, జీనియస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. అంతేకాదు, ఈ చిన్నారి ప్రతిభకు బుక్‌ ఆఫ్‌ లిటిల్‌ గౌరవమూ దక్కింది. సంబంధిత ప్రశంసా పత్రాలను అందుకుంది. ఈ సందర్భంగా అమృత సచివాలయంలో పలువురు ప్రముఖులను కలిసింది. తనకు మరింత ప్రోత్సాహం అందిస్తే..రాష్ట్రానికి పేరు తీసుకు వస్తానని అంటుంది. అమృత సాహసోపేత విన్యాసాలను రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు సహా పలువురు అభినందించారు. 

 

18:04 - June 9, 2017

రాజన్న సిరిసిల్ల : జిల్లా పోలీసులు అత్యుత్సాహం ఓ గీత కార్మికుడి ఉసురు తీసింది. జిల్లాలోని తంగళ్లపల్లి మండలం తాడూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. గుర్రం రఘుపతిగౌడ్‌ తాడూరులో కల్లు దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. షాపు  వద్దే  కొన్ని నెలలుగా పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించడంతో అమ్మకాలు తగ్గిపోయాయి. దీంతో ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ పోషణ భారంగా మారింది. మనస్తాపంతో కల్లు దుకాణం పక్కనే చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

17:51 - June 9, 2017

కరీంనగర్ : చారిత్రక కట్టడాలు, ప్రదేశాలు అభివృద్ధి మాటున కనుమరగవుతున్నాయి. దాదాపు 50 ఏళ్ల చరిత్ర కలిగిన కరీంనగర్ జూనియర్ కళాశాల, ఉర్దూ, తెలుగు మీడియం పాఠశాలలు, పురాతన మ్యూజియం  ప్రస్తుతం స్మార్ట్ సిటి కోసం తమ రూపాలను కోల్పోతున్నాయి. కళ్ల ముందే కళాశాల కూలిపోతుండడంతో... గత అనుభూతులను తలచుకుంటూ లెక్చరర్లు ఆవేదన చెందుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

17:04 - June 9, 2017

అనంతపురం : ఉద్యానవన పంటలకు అనంతపురం జిల్లా కేంద్రంగా నిలుస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. రాయదుర్గం మండలం 74ఉడేగోళంలో ఏరువాక కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొన్నారు.  
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

16:52 - June 9, 2017

యాదాద్రి భువనగిరి : నరేష్..స్వాతి మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. దోషులును కఠినంగా శిక్షించాలన్నారు. బాధితులకు భారీగా నష్టపరిహారం ఇప్పించాలని చెప్పారు. ఈమేరకు ప్రజాసంఘాలు యాద్రాద్రి భువనగిరిలో నిర్వహించిన ఆందోళనలో ఆయన పాల్గొని, మాట్లాడారు. నరేష్ హత్యను కులాల మధ్య సంఘర్షణగా చూపించేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని అన్నారు. శ్రీనివాస్ రెడ్డి ఆఖరుకు సొంత కూతురిని చంపేశాడని... ప్రజలే అతన్ని శిక్షిస్తారని చెప్పారు. అతన్ని ఒంటరి కుక్కను చేయాలని సూచించారు. శ్రీనివాస్ రెడ్డి వంటి కుల అహంకారిని శిక్షించేందుకు అన్ని కులాలు ఏకం కావాలని పిలపునిచ్చారు. శ్రీనివాస్ రెడ్డి లాంటి వారిని సహాయ నిరాకరణతో సమాజమే శిక్షించాలని కోరారు. చట్టం, పోలీసులు ఉన్మోళ్ల చుట్టాలైపోయాయని ఆరోపించారు. అగ్రకులంలో అహంకారం ఉండొద్దని.. అగ్రకులస్తులకూ అహంకారం ఉండకూడదన్నారు. అమానవీయంగా ఘటన జరిగితే స్పందించవద్దా...? ఈ హత్య ఘటనను తేలికగా వదిలిపెట్టవద్దన్నారు. నరేష్ కుటుంబానికి న్యాయం జరిగే వరకూ ఉద్యమం ఆగదని పేర్కొన్నారు. ఉద్యమంలో సీపీఎం ముందుంటుందని తెలిపారు. భువనగిరిలో వ్యక్తమవుతున్న ప్రజాగ్రహాన్ని సీఎం గుర్తించాలన్నారు. ఘటనపై సీఎంను కలవాలన్నారు. సామాజిక తెలంగాణ మాటలు ఉత్త మాటలు కావని..సీఎం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.  

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబై: నేడు ప్రారంభంలో స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయినా లాభాలతో ముగిశాయి. 49 పాయింట్లు లాభపడి 31,262 వద్ద సెన్సెక్స్, 21 పాయింట్లు లాభపడి 9,668 వద్ద నిప్టీ లాభాలతో ముగిసింది.

మాదాపూర్ లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్: మాదాపూర్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. యాక్సిస్ బ్యాంక్ సెల్లార్ లో జనరేటర్ కు మంటలు అంటుకోవడంతో ప్రమాదం సంభవించింది. భయంతో స్థానికులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

మిడ్ మానేరు పై మంత్రి హరీష్ రావు సమీక్ష

హైదరాబాద్: జలసౌధలో మిడ్ మానేరు పై మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఇరిగేషన్ అధికారులు హాజరయ్యారు.

15:50 - June 9, 2017

హైదరాబాద్ : నగరంలో భారీ వర్షం కురుస్తోంది. దిల్ సుఖ్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, పంజాగుట్ట, సికింద్రాబాద్ లలో వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. మేఘాలు దట్టంగా అలుముకున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

15:46 - June 9, 2017

యాదాద్రి భువనగిరి : నరేష్..స్వాతి మృతి ఘటనపై యాదాద్రి భువనగిరిలో ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. నరేష్..స్వాతి మృతి ఘటనపై ప్రభుత్వం స్పందించాలన్నారు. మృతి ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ నరేష్..స్వాతి మృతి ఘటనపై స్పందించాలని... లేదంటే హోంమంత్రి ఇంటిని ముట్టడి ఇస్తామని హెచ్చరించారు. మహారాష్ట్ర పోలీసులు తమకు సపోర్టు చేస్తున్నారు..కానీ
ఇక్కడి పోలీసులసై నమ్మకం లేదన్నారు. ఇక్కడి పోలీసులు శ్రీనివాసురెడ్డికి సపోర్టు చేస్తున్నారని ఆరోపించారు. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

15:41 - June 9, 2017

ఢిల్లీ : పాన్ కార్డుకు ఆధార్ లింక్ చేయడంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో కోర్టు స్టే విధించింది. పాన్ కార్డుకు ఆధార్ లింక్ చేయాల్సిన అసవరం లేదని తేల్చి చెప్పింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

15:37 - June 9, 2017

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ డిప్యూటీ కమిషనర్లను బదిలీ చేశారు. లాంగ్ స్టాండింగ్, పలు అరోపణలతో పలువురు డిప్యూటీ కమిషనర్లను కమిషనర్ జనార్ధన్ రెడ్డి బదిలీ చేశారు. కొంతమందిని అదే జోన్ లోకి మార్చారు. మరికొంతమందిని వేరే జోన్లకు మార్చారు. జనార్ధన్ తీసుకున్న చర్యను పలువురు హర్షిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం

హైదరాబాద్: నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. రోడ్ల పై నీరు చేరుతోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పాతబస్తీ, అబిడ్స్, నాంపల్లి, కోఠీ, బషీర్ బాగ్ , సుల్తాన్ బజార్, బేగంబజార్, మేడ్చల్, మల్కాజ్ గిరి, షేక్ పేట, సూదాబాద్, పంజాగుట్డ, ఖైరతాబాద్, విద్యానగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్, బాగ్ లింగంపల్లిల్లో భారీ వర్షం పడుతోంది.

నరేష్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి: తమ్మినేని

యాదాద్రి: నరేష్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. నరేష్ హత్యను కులాల మధ్య సంఘర్షణగా చూపించేందుకు కొంత మంది ప్రయత్నిస్తున్నారని, శ్రీనివాస్ రెడ్డి వంటి కుల అహంకారిని శిక్షించేందుకు అన్ని కులాలు ఏకం కావాలని తమ్మినేని పిలుపునిచ్చారు. శ్రీనివాస్ రెడ్డి లాంటి వారిని సహాయ నిరాకరణతో సమాజమే శిక్షించాలని డిమాండ్ చేశారు. నరేష్ కుటుంబానికి న్యాయం జరిగే వరకూ ఉద్యమం చేస్తామని, భువనగిరిలో వ్యక్తమౌతోన్న ప్రజాగ్రహాన్ని సీఎం గుర్తించాలని హెచ్చరించారు.

14:53 - June 9, 2017

జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం 'జై లవకుశ' యమ స్పీడుగా షూటింగ్ జరుగుతోంది. ఇటీవలే సినిమాకు సంబంధించిన లుక్స్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ లుక్స్ లో ఎన్టీఆర్ ను చూసి అభిమానులు తెగ ఖుషీ అయిపోతున్నారు. సినిమాలో 'ఎన్టీఆర్' మూడు పాత్రలను పోషించనున్నట్లు పుకార్లు షికారు చేసినా మొదటి లుక్ లో మాత్రం అలాంటి ఛాయలు కనిపించలేదు. కానీ ఇది ఒక పాత్ర లుక్ మాత్రమేనని తెలుస్తోంది. జై..లవ..కుశ అనే ముగ్గురి పాత్రలను 'ఎన్టీఆర్' పోషిస్తున్నాడని టాక్. అందులో 'జై' అనే వ్యక్తి రాయల్ లైఫ్ లో గడుపుతాడని..రిచ్ గా ఉంటాడని ప్రచారం జరుగుతోంది. ఈ పాత్రకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఒక్క పాత్ర కోసమే రాయల్ ప్యాలెస్ సెట్ వేశారని, ఇందుకు రూ. 2 కోట్లు ఖర్చు పెట్టినట్లు సోషల్ మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. బాబి దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలోనే ఇతర పాత్రలకు సంబంధించిన లుక్స్ విడుదల చేస్తారని టాక్. మరి ఎన్టీఆర్ మూడు పాత్రలు పోషిస్తున్నారా ? లేదా ? అనేది రానున్న రోజుల్లో తెలియనుంది. 

జీహెచ్ఎంసీలో డిప్యూటీ కమిషనర్లు బదిలీలు

హైదరాబాద్: జీహెచ్ఎంసీలో డిప్యూటీ కమిషనర్లు బదిలీ చేస్తూ కమిషనర్ జనార్థర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. లాంగ్ స్టాండింగ్, పలు ఆరోపణలతో డిప్యూటీ కమిషనర్లను బదిలీ చేసినట్లు సమాచారం.

14:43 - June 9, 2017

తమిళ సూపర్ స్టార్ 'రజనీకాంత్' మరోసారి అభిమానులతో భేటీ కానున్నారు. ఇటీవలే ఆయన అభిమానులతో వరుస భేటీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. తమిళనాడులో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో 'రజనీ' రాజకీయ ప్రవేశం గ్యారంటీ అని పుకార్లు షికారు చేశాయి. దీనంతటికీ 'రజనీ' తెరదించారు. దేవుడు ఏది శాసిస్తే అదే..చేస్తానని కుంబద్ధలు కొట్టాడు. అనంతరం పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న 'కాలా' సినిమాలో 'రజనీ' నటిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ కూడా ప్రారంభమైంది. అంతేగాకుండా శంకర్ దర్శకత్వంలో 'రోబో 2.0' లో కూడా 'రజనీ' నటిస్తున్నాడు. ముంబైలో 'కాలా' చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుని చిత్ర యూనిట్ చెన్నైకి తిరిగి వచ్చింది. ఈ నేపథ్యంలో మరోసారి అభిమానులతో 'రజనీ' భేటీ అవుతారని తెలుస్తోంది. రాజకీయ రంగ ప్రవేశంపై కీలక ప్రకటన చేస్తారా ? అనే చర్చ జరుగుతోంది. కానీ భేటీకి సంబంధించిన తేదీలు ఖరారు కాలేదు. 

ట్యాక్స్ రిటర్న్స కు ఆధార్ తప్పని సరి కాదు: సుప్రీం

ఢిల్లీ: ట్యాక్స్ రిటర్న్స కు ఆధార్ తప్పని సరి కాదని సుప్రీం కోర్టు పేర్కొంది. పాన్ ను ఆధార్ తో అనుసంధానం చేయాలని కేంద్రం బలవంతం చేయొద్దని సుప్రీం సూచించింది.

14:41 - June 9, 2017

ప్రముఖ దర్శకుడు సుకుమార్, నటుడు రాంచరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా శరవేగంగా కొనసాగుతోంది. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సినిమాను రూపొందిస్తున్నారు. దీనితో తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ శాతం షూటింగ్ ను కొనసాగిస్తున్నారు. ఈ సినిమాలో 'చెర్రీ'కి జోడిగా 'సమంత' నటిస్తోంది. ఈ సినిమాకు 'రేపల్లే' అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తారని వార్తలు వచ్చాయి. దీనితో పాటు నాలుగు టైటిల్స్ అనుకున్నట్లు..ఒక టైటిల్ ను ఫిక్స్ చేయాలని ఈ మధ్యే రామ్ చరణ్ తన అభిమానులను కోరిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు ఓ టైటిల్ ను ఫిక్స్ చేశారు. 'రంగస్థలం 1985' అనే టైటిల్ ను ఖరారు చేశారు. కథ 1985 నేపథ్యంలో ఉంటుంది కనుకే ఆ టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. గ్రామీణ నేపథ్యంతో కూడిన కథ కనుక .. 'సంక్రాంతి' కి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందని తెలుస్తోంది. 

పేలిన ఎయిర్‌ఇండియా విమానం టైర్

శ్రీనగర్ : ఢిల్లీ-జమ్మూ ఎయిర్‌ఇండియా విమానం టైర్ పేలింది. శ్రీనగర్ నుంచి వచ్చిన ఎయిర్‌ఇండియా ఫ్లైట్ 821 జమ్మూ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన తర్వాత టైర్ పేలడంతో పెనుప్రమాదం తప్పింది. విమానంలో ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు. ప్రయాణికులంతా విమానంలో నుంచి దిగిన తర్వాత ఈ ఘటన జరిగింది.

ఇబ్రహీంపట్నం ఇన్‌ఛార్జి సబ్‌రిజిస్ట్రార్ సస్పెండ్

రంగారెడ్డి : ఇబ్రహీంపట్నం ఇన్‌ఛార్జి సబ్‌రిజిస్ట్రార్ సలేహా ఖాదర్‌పై ఉన్నతాధికారులు వేటు వేశారు. భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో ఖాదర్‌ను సస్పెండ్ చేశారు. దండుమైలారంలో సర్వే నం. 36లో 38 ఎకరాల ప్రభుత్వ భూమిని రిజిస్టర్ చేసినట్లు గుర్తించారు అధికారులు. ప్రైవేటు వ్యక్తులకు భూమి రిజిస్ట్రేషన్ చేసినట్లు అధికారులు గుర్తించారు. శాఖాపరమైన విచారణ లో ఈ అక్రమాలు వెలుగు చూశాయి.

14:07 - June 9, 2017
14:06 - June 9, 2017

గుంటూరు : ఏపీ అసెంబ్లీలో జగన్‌ చాంబర్‌లోకి వర్షం నీరు చేరడంపై CID దర్యాప్తు ముమ్మరమైంది. కేవలం ప్రతిపక్ష నేత గదిలోకే నీరు ప్రవేశించడంపై స్పీకర్‌ కోడెలతో సహా అసెంబ్లీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక ఉన్న కుట్ర కోణం దర్యాప్తులో బయటపడుతుందని అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు చెబుతున్నారు. పూర్తి వివరాలు వీడియో చూడండి. 

14:05 - June 9, 2017

హైదరాబాద్ : హదరాబాద్‌ కూకట్‌పల్లిలోని ధరణి చెరువు కాలుష్య కాసారంలా మారింది. జీడిమెట్లలోని పరిశ్రమలు విడుదలు చేస్తున్న వ్యర్థ రసాయనాలు ఈ చెరువులో కలుస్తున్నాయి. వర్షానికి రసాయన వ్యర్థాలు కలిసిన చెరువు నీరు నురగలు తేలుతోంది. దీంతో పరసర ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. 

14:00 - June 9, 2017

ప్రకాశం : జిల్లాలోని గోపవరపువారిపల్లె లో విషాదం జరిగింది. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పెదఅలవలపాడులో జరిగింది. కృష్ణవేణి అనే మహిళ తన భర్త చనిపోయిన తర్వాత కూలీ పనిచేసుకుట్టు జీవిస్తూ ఉన్నారు. ఉన్నట్టుండి మూడు రోజుల క్రితం పిల్లలను బట్టలు కొనిస్తానాని తీసుకెళ్లి పెద్ద కుమారుడు మదన్, చిన్నకుమారుడు మనిశ్ తో వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. 

13:59 - June 9, 2017

హైదరాబాద్ : పాల్వయి అనుకున్నది మాట్లాడే వ్యక్తి అని హోం మంత్రి నాయిని నిర్సింహారెడ్డి అన్నారు. ఆయన ఆరోగ్యం కేర్ పుల్ గా చూసుకునేది ఉండే అని అన్నారు. సిమ్లాలో వాతవరణం చల్లగా ఉంటుందని ఎందుకంటే బియస్ ప్రమాదనం తను అక్కడి వెళ్లిప్పుడు చల్లడా ఉంటుందని తెలిపారు. ఆయన మరణం రాష్ట్రానికి తీరని లోటు అని అన్నారు. పాల్వయి గోవర్ధన్ రెడ్డి మృతదేహాన్ని సిమ్లా నుంచి ఢిల్లీ తరలిస్తున్నామని, అక్కడ తమ ఎంపీ కొత్త ప్రభకర్ రెడ్డి ఉన్నారని తెలిపారు.

 

సంగారెడ్డిలో పగిలిన మంజీరా పైప్ లైన్

సంగారెడ్డి: నగరానికి మంచినీరు సరఫరా అయ్యే మంజీరా పైపులైన్‌ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో పగిలిపోయింది. దీంతో భారీయెత్తున నీరు పొంగి పొర్లడంతో సమీప ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు నీట మునిగాయి. పక్కనే ఉన్న మండల ప్రజాపరిషత్‌ కార్యాలయం, ఎక్సైజ్‌ కార్యాలయం ఆవరణల్లోకి నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇబ్రహీంపట్నంలో శ్యామల కుటుంబ సభ్యుల ఆందోళన

హైదరాబాద్: ఇబ్రహీంటప్రం అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత యువతి శ్యామల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ కార్యాలయం వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. శ్యామల ది హత్యే అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

13:24 - June 9, 2017

హైదరబాద్ : పండించిన పంటలకు గిట్టుబాటు ధరల విషయంలో రైతు సమాఖ్యలకు విస్తృతాధికారాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దుత ధరల కంటే కొద్దిగా ఎక్కువ రేటు వచ్చినప్పుడే అమ్ముకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతులకు సూచించారు. లేకపోతే రైతు సమాఖ్యలకే మిల్లింగ్‌ అధికారులు కల్పిస్తామని చెప్పారు. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో రైతు సమాఖ్యలు ఏర్పాటు చేశాయని కేసీఆర్‌ నిర్ణయించారు. బడ్జెట్‌లో 500 కోట్ల రూపాయలు కేటాయించి రైతు సమాఖ్యలతో గిట్టుబాటు ధరలతో పంటలు కొనుగోలు చేయిస్తామని కేసీఆర్‌ చెప్పారు. 

13:22 - June 9, 2017
13:21 - June 9, 2017

గుంటూరు : అమరావతిలోని నూతన అసెంబ్లీ భవనంలోకి వర్షం నీరు రావడంపై 3వ రోజు సీఐడీ విచారణ కొనసాగుతోంది. వాటర్‌ లీక్‌ అయిన ప్రాంతాన్ని సీఐడీ చీఫ్‌ ద్వారకా తిరుమల రావు పరిశీలించారు. జగన్‌ చాంబర్‌ను జేఎన్‌టీయూ ప్రొఫెసర్ల బృందం పరిశీలించింది. సివిల్‌ పనులను పరిశీలించి సీఐడీ అధికారులకు ప్రొఫెసర్ల బృందం రిపోర్టు ఇవ్వనుంది. 

13:19 - June 9, 2017
13:16 - June 9, 2017

నిజామాబాద్ : ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మారినా పనులు మాత్రం వేగం అందుకోవటం లేదు. ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్న చందంగా మారాయి. అధికార పార్టీ నాయకుల మాటలు కోటలు దాటుతున్నా... వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రాజెక్టు పనులు ప్రారంభించి 8 ఏళ్లు గడచినా..సొరంగ మార్గం పనులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ప్రభుత్వం డిజైన్ మార్చటం వలన పనుల్లో తీవ్ర జాప్యం నెలకొంటుంది. అప్పటి సీఎం వైఎస్సార్ ప్రాణహిత చేవెళ్ల 20,21,22, ప్యాకేజీ పనులకు పరిసాలన ఆమోదం తెలిపారు. ఈ పనులకు నవంబర్ 2008లో శంకుస్తాపన చేశారు. 3 ప్యాకేజీల ద్వారా ఉమ్మడి జిల్లాలో 3.5 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు డిజైన్ రూపొందించారు. మొదట ఐదేళ్ల లోపు పనులు పూర్తి చేయాలని ఆదేశించినా.. భూసేకరణ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రాణహిత చేవెళ్ల ప్యాకేజీ 20,21, పనులు మాత్రం కొనసాగుతున్నాయి. 22 వ ప్యాకేజీ పనులపై ఇప్పటికి ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు ఈ రెండు ప్యాకేజీ పనుల ద్వారా 1.60 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు ప్రాజెక్టు రీ డిజైన్ చేశారు.

21వ ప్యాకేజీ పనుల్లో మొత్తం సొరంగ మార్గం
ప్రాణహిత చేవేళ్ల 21వ ప్యాకేజీ పనుల్లో మొత్తం సొరంగ మార్గం పనులు ఉన్నాయి. పొతంగల్ నుండి నిజామాబాద్ చివరి వరకు 17.79 కిలోమీటర్ల సొరంగ మార్గం తవ్వుతున్నారు. ఇప్పటి వరకు 15.289 కిలోమీటర్ల మేరకు పనులు పూర్తి చేశారు. ఈ ప్యాకేజీ పనులను 890.70కోట్లు కేటాయించగా 444.98 కోట్లు ఖర్చు వెచ్చించారు. పంప్ హౌస్ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. 1133 కోట్లతో చేపట్టినా 21వ ప్యాకేజీ పనులు ఇప్పటి వరకు చేసింది కేవలం 25 శాతం మాత్రమే. సొరంగ మార్గం పనులు 8.875 కిలోమీటర్లు ఉండగా... 8.375 కిలోమీటర్ల మేర పనులు చేశారు. దీనికోసం ఇప్పటి వరకు 280.69 కోట్లు ఖర్చు చేసారు. ఈ ప్యాకేజీ పనుల్లో ఎక్కువగా భూసేకరణ అవసరం ఉంది. ప్యాకేజీలో భాగంగా మోపాల్ మండలం పరిదిలో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను ఏర్పాటు చేస్తున్నారు. డిజైన్ రూపొందిస్తున్న అదికారులు ప్రభుత్వం ఒప్పందం తరువాత ప్రకటించే అవకాశం ఉంది. 20, 21 ప్యాకేజీ పనుల పురోగతి చూస్తే.. నిర్దేశించిన గడువులోగా పూర్తయ్యేలా కనిపించడం లేదని ప్రభుత్వం స్పందించి ప్రాణహిత చేవెళ్ల పనులు యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి సాగునీరు అందివ్వాలని నిజామాబాద్ జిల్లా రైతులు కోరుతున్నారు. 

13:13 - June 9, 2017

విజయవాడ : తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. గన్నవరం విమానాశ్రయంలో చంద్రబాబును ఈటల కలిశారు. ఈనెల 18న జరిగే తన కుమారుడి పెళ్లికి రావాలని చంద్రబాబును ఆహ్వానించారు. 

13:06 - June 9, 2017

హైదరాబాద్ : ప్రస్తుతం ఉన్న మండల వ్యవస్థలో మార్పులు చేయాలన్న ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. పరిపానాల సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మండలాల స్థానంలో బ్లాక్‌లను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలలో సౌలభ్యం కోసం మండల వ్యవస్థ స్థానంలో బ్లాక్‌ వ్యవస్థలను తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించిన ఫైలు రెవెన్యూ అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలనకు పంపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆమోదించిన వెంటనే బ్లాక్‌ వ్యవస్థ అమల్లోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ప్రతిపాదనల ప్రకారం తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 584 మండలాల స్థానంలో బ్లాక్‌లు వస్తాయి. ఉమ్మడి రాష్ట్రంలో 1987లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ బ్లాక్‌లను రద్దు చేసి, మండల వ్యవస్థను తీసుకొచ్చారు. 

బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో హంగ్

లండన్ : బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో హంగ్ దిశగా ఫలితాలు విడుదలఅయ్యాయి. అతి పెద్ద పార్టీ కన్సర్వేటివ్ అవతిరించింది. మొత్తం స్థానాలు 650 కాగా మేజిక్ ఫిగర్ 326. కన్సర్వేటివ్ పార్టీకి 315, లేబర్ పార్టీకి 261, ఇతరులకు 74 స్థానాలు వచ్చాయి.

12:51 - June 9, 2017

17 సంవత్సరాల ఇంద్రాణిదాస్ కు న్యూరో శోదనాలే ఆమె ఆటవిడుపు ఇటివల అమెరికాలో జరిగిన సైన్స్ టాలెంట్ విజేతగా నిలిచి రూ.1.6 కోట్ల బహుమతి గెలుచుకున్నారు....అమెరికాలో ప్రతిష్టత్మకంగా నిర్వహించిన స్పెల్లింగ్ బీ పోటీలో భారతీయ మూలాలున్న విద్యార్థులు మరోసారి తమ సత్తా నిరూపించుకున్నారు, ప్రథమ, ద్వితీయ స్థానాలను వారే గెలుచుకున్నారు......ఐసీస్ ఉగ్రముకల చేతికి చిక్కిన మహిళల దుస్థితి ఊహించకోవడానికి భీతవహాంగా ఉంటుంది....ఉగ్రవాదుల బారిన పడి మూడేళ్ల తర్వాత స్వంత ఇంటికి చేరింది ఓ యువతి.....త్వరలో భారత ఆర్మీలోకి మహిళలు కాలు పెట్టబోతున్నారు...త్వరలో దీనిని అమల్లోకి తీసుకొస్తామని బీపిన్ రావత్ తెలిపారు....

నరేష్, స్వాతి కులదుహంకార హత్యకు నిరసనగా సభ

యాదాద్రి భువనగరి : నరేష్, స్వాతి కులదుహంకార హత్యకు నిరసనగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సభ జరుగుతోంది. ఈ కార్యక్రమానికి జాన్ వెస్లీ, ఆశయ్య, చెరుపల్లి సీతారాములు హాజరుయ్యారు.

ఏపీ అసెంబ్లీలో సీఐడీ విచారణ

అమరావతి: అసెంబ్లీలో మూడో రోజు సీబీఐ విచారణ జరుగుతోంది. వాటర్ లీక్ అయిన ప్రాంతాన్ని సీఐడీ చీఫ్ ద్వారకా తిరుమలరావు పరిశీలించారు.

జవాన్లు ప్రయాణీస్తున్న వాహనం బోల్తా...

మధ్యప్రదేశ్ : పోలీస్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం బోల్తా పడిన ఘటన షాజాపూర్ జిల్లాలోని టుక్రానాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో 10 మంది జవాన్లకు గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయాలైన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

ముగిసిన చేప ప్రసాదం పంపిణీ

హైదరాబాద్‌: ఆస్తమా వ్యాధిలో బాధపడుతున్న బత్తిని సోదరులు ఇచ్చే చేప ప్రసాదం పంపిణీ ముగిసింది. హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో నిన్న ఉదయం ప్రారంభమైన చేప ప్రసాదం పంపిణీ ఈరోజు ఉదయం 9 గంటలకు ముగిసింది.

12:27 - June 9, 2017

ఎండాకాలంలో మామిడి పండ్లు.. శీతాకాలంలో జామ, నారింజ, బత్తాయిలు బాగా దొరుకుతాయి. ఈకాలంలో మాత్రం అల్ల నేరేడు పండ్లు విపరీతంగా లభిస్తాయి. తీపీ, పులుపూ, వగరు కలబోతగా నిగనిగలాడుతూ నోరూరించే నేరేడు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే ఈ పండు పోషకాల గని.. అనారోగ్యాల ... ఆరోగ్యానికి మేలు చేయడమే కాదు.. కొన్నిరకాల రోగాలనూ నియంత్రించే శక్తి నేరేడు సొంతం. అయితే వీటి ధరమాత్రం అదిరిపోతోంది.

నేరేడు పండ్లలో అధిక మోతాదులో ఉంటే సోడియం, పొటాషియం, క్యాల్షియం, ఫాస్ఫరస్‌, మంగనీస్‌, జింక్‌, ఇరన్‌, విటమిన్‌ సి, ఎ రైబోప్లెవిన్‌, ఫోలిక్‌ యాసిడ్లు అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. ఈ పండ్లలో పుష్కలంగా లభించే ఐరన్‌ శరీరంలో ఎర్ర రక్తకణాలను వృద్ధి చేస్తుంది. అంతేకాదు రక్తాన్ని శుద్ధి చేస్తే శక్తి కూడా ఉంది. కాలేయం పనితీరును మెరుగు పరచడానికి నేరేడు దివ్యౌషధంలా పనిచేస్తుందని కొన్ని అధ్యయనాల్లో స్పష్టమైంది.

వీటిని నిత్యం తినడం వల్ల వేసవిలో వచ్చే జీర్ణసంబంధ సమస్యలు అదుపులోకి వస్తాయి. జీర్ణవ్యవస్థ శుభ్రపడి దాని పనితీరు వేగవంతం అవుతుంది. శరీర జీవక్రియల రేటు మెరుగుపడుతుంది.

నేరేడులో విటమిన్‌ సి ఎక్కువగా లభిస్తుంది. ఇది రోగనిరోధకశక్తిని పెంచుతుంది. ఫలితంగా కాలానుగుణంగా వచ్చే పలు సమస్యలు అదుపులో ఉంటాయి.

ఈ పండ్లలో పొటాషియం వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇవి గుండె పనితీరును మెరుగుపరుస్తాయి, అధిక రక్తపోటుని అదుపులోకి తీసుకొస్తాయి.

యాంటీ ఆక్సిడెంట్లు నేరేడులో సమృద్ధిగా దొరుకుతాయి. ఇవి శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి శుభ్రం చేస్తాయి.ఫలితంగా అధిక బరువునీ అదుపులో ఉంచుకోవచ్చు. చిన్నవయసులో వచ్చే వృద్ధాప్య ఛాయలూ తగ్గించుకోవచ్చు.

మధుమేహం ఉన్నవారికి నేరేడు చక్కటి ఉపశమనాన్నిస్తుంది. దీనిలో యాంటీ డయాబెటిక్‌ గుణాలుంటాయి. రోజూ తినడం వల్ల రక్తంలోని చక్కెర శాతం క్రమబద్ధమవుతుంది. అలానే తరచూ మూత్రం రావడం, దాహం వంటివి కూడా బాధించవు.

12:20 - June 9, 2017

గుంటూరు : ఏపీ అసెంబ్లీ భవనాల సందర్శనకు స్పీకర్ కోడెల శివప్రాసాదరావు అనుతిచ్చారు. భవనాలు సందర్శించడానికి మీడియాకు అవకాశం కల్పించారు. భవనాలకు సందర్శనకు వైసీపీ సభ్యులు అనుమతి కోరితే ఇచ్చే వాడినని స్పీకర్ కోడెల అన్నారు. మరో వైపు ప్రతిపక్ష నేగ వైఎస జగన్ ఛాంబర్ లోకి నీరు రావడంపై సీఐడీ విచారణ మూడవ రోజు కొనసాగుతోంది. 

తానా ఛైర్మన్ గా కొండ్రకుంట చలపతిరావు...

గుంటూరు: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) పాలక మండలి చైర్మన్‌గా రాజుపాలెం మండలం ఇనిమెట్ల గ్రామానికి చెందిన కొండ్రకుంట చలపతిరావు ఏక గ్రీవంగా ఎన్నికయ్యారు. చలపతిరావు రెండు దశాబ్దాల నుంచి అమెరికాలోని డల్లాస్‌లో ఉంటున్నారు. ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ సలహాదారుడిగా పని చేస్తున్నారు. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా నరసరావుపేట.

12:11 - June 9, 2017
12:08 - June 9, 2017

మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ చేస్తున్న చిత్రం ‘జవాన్‌’. కృష్ణ దర్శకత్వంలో దిల్‌ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ ఫేమ్‌ మెహరీన్‌ కౌర్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా ప్రీ-లుక్‌ను విడుదల చేశారు. వర్షంలో పరిగెడుతున్న హీరో ఇమేజ్‌తో ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. టైటిల్‌ డిజైనింగ్‌ కూడా వెరైటీగా ఉన్న ఈ పోస్టర్‌ చాలా అసక్తికరంగా ఉన్న ఈ పోస్టర్‌ సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఈ సినిమాకు ఎస్‌ఎస్‌ థమన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌.

12:01 - June 9, 2017

పాల్వాయి మృతి సంతాపం తెలిపిన పలువురు నేతలు

హైదరాబాద్: కాంగ్రెస్ మాజీ ఎంపి పాల్వాయి గోవర్థన్ రెడ్డి మృతికి పలువురు సంతాపం తెలిపారు. సంతాపం తెలిపిన వారిలో తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేంద్ర, పీసీసీ చీఫ్ ఉతమ్, జానారెడ్డి, షబ్బీర్ అలీ, పొంగులేటి, వైసీపీ అధ్యక్షుడు జగన్, సీపీఐ నేతలు చాడ వెంకట్ రెడ్డి, సీపీఎం నేతలు చెరుపల్లి సీతారులు ఉన్నారు.

12:00 - June 9, 2017

ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించిన చంద్రబాబు

అనంతపురం: రాయదుర్గం మండలం ఉడేగోళం ఏరువాక కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.

11:57 - June 9, 2017

తిరుగునంతపురం : వధ కోసం పశువులను విక్రయించరాదంటూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై కేరళ అసెంబ్లీలో ప్రత్యేక సమావేశం జరిగింది. పశువధకు సంబంధించి అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పశువధ నిబంధనల కారణంగా కేరళ తీవ్రంగా నష్టపోయిందని తెలిపారు. దాదాపు ఐదు లక్షల మంది ప్రజలు జీవనోపాధి కోల్పోయారని పేర్కొన్నారు. కేరళలో ఏటా రెండున్నర లక్షల టన్నుల మాంసం విక్రయాలు జరుగుతాయనీ.... దాని విలువ 6 వేల 5 వందల కోట్లకు పైగా ఉంటుందని చెప్పారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు హాజరయ్యే ముందు అధికారపార్టీ ఎమ్మెల్యేలు బ్రేక్‌ఫాస్ట్ కింద గొడ్డుమాంసం ఫ్రై తిని సభకు హాజరయ్యారు.  

11:56 - June 9, 2017

బర్మింగ్ హోమ్ : ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌కు ఊహించని షాక్‌ తగిలింది. టీమ్‌ ఇండియాపై శ్రీలంక ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 322 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన శ్రీలంక సునాయాసంగా విజయం సాధించింది. 48.3 ఓవర్లలో 3వికెట్లు కోల్పోయి విక్టరీ కొట్టింది. శ్రీలంక ఓపెనర్‌ గుణతిలక 72 బంతుల్లో 76 పరుగులు చేయగా... కుశల్‌ మెండిస్‌ 93 బంతుల్లో 89 పరుగులు చేసి శ్రీలంక విజయంలో కీలకపాత్ర పోషించారు. శిఖర్‌ ధావన్‌ సెంచరీతో రాణించినా జట్టును గెలిపించలేకపోయారు. ధోనీ, రైనా అర్ధసెంచరీలతో చెలరేగినా... బౌలర్లు చేతులెత్తేయడంతో భారత్‌ విజయం ముందు బోల్తా పడింది. శ్రీలంక విజయంలో కీరోల్‌ ప్లేచేసిన కుశల్‌ మెండిస్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. 

11:55 - June 9, 2017

నెల్లూరు : రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా.. జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల దూరం వరకు ఎలాంటి మద్యం విక్రయాలు జరపరాదని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించింది. మద్యం అర్థం వచ్చే బ్యానర్లు, ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయొద్దని పేర్కొంది. 500 మీటర్ల వరకు వైన్‌ షాపు, బార్‌ షాపులు నిర్వహించరాదని చెప్పడంతో..ఈ నిబంధనల పరిధిలోకి రాకుండా ఉండేందుకు నెల్లూరు జిల్లాలో లిక్కర్‌ మాఫియా కొత్త ఎత్తులు వేసింది. కొన్ని సాంకేతిక అంశాలు, లొసగులు అడ్డం పెట్టుకుని కోర్టు ఉత్తర్వులనుంచి తప్పించుకునేందుకు పెద్ద పథకమే వేసింది.

కార్పొరేషన్ పరిధిలోకి రహదారులు
నగర, పట్టణాల పరిదిలో ఉన్న రాష్ట్ర రహదారులన్నింటినీ మున్సిపాలిటీ, కార్పొరేషన్ పరిధిలోకి తీసుకొచ్చే వ్యూహాలకు పథకం వేశారు. ఇలా చేస్తే..సుప్రీం ఆదేశాలే కాదు..రాజ్యాంగంలోని నిబంధనలు కూడా ఏమాత్రం అడ్డు రావన్న లా పాయింటును పట్టుకున్నారు. వీరి ఆలోచనలకు కత్తెర వేయాల్సిన ప్రజాప్రతినిదులు వీరికి వంత పాడుతున్నారు. త్వరలోనే ఈ తతంగం పూర్తి కానుందన్న ప్రచారం జిల్లాలో ఊపందుకుంది. నెల్లూరుజిల్లాలో మొదలుకానున్న రోడ్ల మార్పిడి ప్రక్రియను.. మున్ముందు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయించుకోవాలన్నది లిక్కర్‌ మాఫియా వ్యూహాంగా కనిపిస్తోంది. నెల్లూరు నగరంలో మూడు ప్రదాన రహదాలు విస్తరించి ఉన్నాయి. వీటిలో నగరం మద్యలో ఉండేది గ్రాండ్ ట్రంకు రోడ్డు. ఈ రోడ్డు ఇరువైపుల రెండు స్టేట్ హైవేలు ఉన్నాయి. మిని బైపాస్ రోడ్డు 11 కిలోమీటర్లు ఉండగా.. పొదలకూరు రోడ్డు 7 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ రెండు రహదారుల వెంబడి దాదాపు 64 మద్యం షాపులు ఉన్నాయి. సుప్రీం ఆదేశాలతో రెండు రోడ్లకు ఇరు వైపుల ఉన్న షాపులన్నీ మూత పడాల్సిందే. ఈ రహదారులను నగరపాలక సంస్థ పరిధిలోకి తెస్తే అవేమీ వర్తించవు. అయితే ఈ ప్రతిపాదనను స్థానిక మేయర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రోడ్ల నిర్వహణకు ప్రభుత్వం నిధులు ఇస్తే సరి ..లేదంటే అంగీకరించమని ఖరాఖండిగా చెబుతున్నారు.

ప్రజల ఆందోళన...
లిక్కర్ మాఫియాకు సహకరించేలా రోడ్ల మార్పిడికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ప్రజలు, నాయకులుమండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రహదారులపై మద్యం అమ్మకాలకు సంబంధించి సుప్రీం ఆదేశాలు అమలయ్యేలా చూడాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 

11:51 - June 9, 2017

వరంగల్ : ఉత్తర తెలంగాణలోనే వరంగల్‌లోని రీజనల్ కంటి ఆస్పత్రి అతిపెద్దది. హైదరాబాద్‌లోని సరోజిని కంటి ఆస్పత్రి తర్వాత రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. వరంగల్‌ ఎంజీఎంకు ఎదురుగా ఉన్న ఈ ఆస్పత్రికి వరంగల్‌ చుట్టుపక్కల జిల్లాల నుంచి రోగులు వస్తుంటారు. ఉత్తర తెలంగాణలో కంటి సమస్యలతో బాధపడుతున్న వారంతా ఇక్కడికి వస్తుంటారు. ఈ నేత్ర వైద్యశాలకు ప్రతిరోజు 300 నుంచి 400 మంది ఔట్‌ పేషెంట్స్‌ వస్తుంటారు. వీరితోపాటు కంటి పరీక్షల నిమిత్తం రోజు సుమారు 50 మంది వరకు ఆస్పత్రిలో అడ్మిట్‌ అవుతుంటారు.

సమస్యలతో సతమతమం...
ఎంతో ప్రాధాన్యత కలిగిన వరంగల్‌ నేత్ర వైద్యశాల... ప్రస్తుతం సమస్యలతో సతమతమవుతోంది. కంటి పరీక్షలు, ఆపరేషన్‌ కోసం వచ్చే రోగులు, వారి బంధువులకు ఈ ఆస్పత్రిలో ఎలాంటి వసతులు లేవు. వీటికి తోడు వైద్యుల కొరత వేధిస్తోంది. సరిపడ వైద్యులు లేకపోవడంతో రోగులకు సకాలంలో ఆపరేషన్లు జరుగడం లేదు. ఆపరేషన్‌ చేసిన వారికి మందులూ కూడా ఇవ్వడం లేదన్నది మరో ఆరోపణ. అదేమంటే ప్రైవేట్‌ మెడికల్‌ షాపుల్లో కొనుక్కోండని వైద్యులు ఉచిత సలహాలు ఇస్తున్నారని రోగులు చెబుతున్నారు.కంటి ఆపరేషన్‌ చేయాల్సి వస్తే.. ముందు పలు రకాలైన టెస్ట్‌లు చేయాలి. సరిపడ సిబ్బంది లేకపోవడంతో టెస్ట్‌లు చేయడం రోజలు తరబడి సాగుతోంది. ఎప్పుడు పరీక్షలు నిర్వహిస్తారా అనీ రోజుల తరబడి ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితి దాపురించింది. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక కార్నియా, రెటీనా, గ్లోకోమా పరీక్ష కోసం ప్రత్యేక యూనిట్లను ఆస్పత్రిలో ఏర్పాటు చేశారు. కానీ వాటిని చేసేందుకు ప్రొఫెసర్లు, వైద్యులను నియమించలేదు. వైద్యుల కొరత ఉండడంతో ఈ యూనిట్లన్నీ దుమ్ము పట్టిపోయాయి. లక్షలు పెట్టి కొనుగోలు చేసిన విలువైన యంత్రాలు వృధాగా పడిఉన్నాయి.

రోగులకు అన్యాయం
వరంగల్‌ కంటి ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యులు గ్రూపులుగా విడిపోయి.. రోగులకు అన్యాయం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రిలో ఆధిపత్యం కోసం డాక్టర్లు తరచూ ఘర్షణ పడుతుంటారని చెప్తున్నారు. రోగులను పట్టించుకోవాల్సిన వైద్యులు గొడవలతో కాలం వెల్లదీస్తున్నారని మండిపడుతున్నారు.వరంగల్‌ కంటి ఆస్పత్రిలో సమస్యలు తిష్టవేస్తే.. అక్కడ పనిచేస్తున్న వైద్యులు మాత్రం అదేంలేదని కొట్టిపారేస్తున్నారు. ఆస్పత్రిలో అసలు సమస్యలే లేవని చెబుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా వరంగల్‌ ఐ ఆస్పత్రిపై దృష్టిసారించి రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. 

10న దాసరి సంతాప సభ

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు దర్శకరత్న దాసరి నారాయణరావు సంతాపసభను ఈనెల 10న సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టుగా సి.కళ్యాణ్ తెలిపారు. దాసరి సమకాలీనులైన తెలుగు సినీ ప్రముఖుల చాలా మంది ప్రస్తుతం అందుబాటులో లేని కారణంగానే సంతాప సభ ఆలస్యమయ్యిందని తెలిపారు.

11:44 - June 9, 2017

ముంబయి: హీరోయిన్ దీపిక పదుకొణెపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ‘మ్యాక్సిమ్‌’ మ్యాగజీన్‌ కోసం దీపిక తెల్లటి దుస్తుల్లో దిగిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. దాంతో ‘నీ నుంచి ఇలాంటివెప్పుడూ ఆశించలేదు దీపిక. హాలీవుడ్‌కి వెళ్లి మన భారతీయ సంప్రదాయం మర్చిపోతావనుకోలేదు’ అంటూ చాలా మంది కామెంట్లు గుప్పిస్తున్నారు. దాంతో దీపిక మరో ఫొటో పోస్ట్‌ చేసి నెటిజన్లకు కౌంటర్‌ వేసింది. కానీ ఆ ఫొటో చూసి నెటిజన్లుకు దీపికపై కోపం మరింత పెరిగిపోయింది. ‘అవి కూడా వేసుకోవడమెందుకు’ అంటూ మరీ ఘాటుగా కామెంట్లు చేశారు. అయితే ఈ విషయం గురించి దీపిక నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.

11:41 - June 9, 2017

ముంబై : మహారాష్ట్రలో ఓవైపు రైతుల ఆందోళన జరుగుతుంటే మరోవైపు అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా సోలాపూర్‌ జిల్లాకు చెందిన ధనాజీ చంద్రకాంత్‌ తన ఇంటి సమీపంలోని ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ వచ్చేవరకు తనకు అంతిమ సంస్కారం చేయరాదన్న సుసైడ్‌ లేఖ ధనాజీ జేబులో దొరికింది. 45 ఏళ్ల ధనాజీకి లక్ష రూపాయల అప్పు ఉంది. బుధవారం రైతుల ఆందోళనలో కూడా పాల్గొన్నాడు. ధనాజీ మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి రైతులు భారీగా తరలిరావడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. రుణమాఫీ చేయాలని కోరుతూ మహారాష్ట్రలో రైతులు గత వారం రోజులుగా ఆందోళన చేస్తున్నారు. జూన్‌1న ఆందోళన మొదలైన తర్వాత ఐదుగురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడడం గమనార్హం.

11:40 - June 9, 2017

పశ్చిమ గోదావరి : కాఫర్ డ్యామ్‌, స్పిల్ ఛానల్ ఐకాన్ వంతెనలకు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. 2018 నాటికి పోలవరం ప్రాజెక్టు ద్వారా నీరివ్వాలంటే అందులో కాఫర్ డ్యామ్‌ది కీలకపాత్ర. ఆ కాఫర్ డ్యామ్‌ పనులతో పాటు.. స్పిల్‌ ఛానల్‌ నిర్మించే ఐకాన్‌ వంతెన పనులకు సీఎం చంద్రబాబు గురువారం శంకుస్థాపన చేశారు. కాఫర్‌ డ్యామ్‌ పనుల కోసం తీసుకొచ్చిన జెట్‌ గ్రౌంటింగ్‌ యంత్రాన్ని సీఎం ప్రారంభించారు.

70శాతం పూర్తయిన మట్టిపనులు
పోలవరం ప్రాజెక్టు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయన్నారు సీఎం చంద్రబాబు. మట్టిపనులు 70శాతం పూర్తయ్యాయని.. డయాఫ్రం వాల్‌ పనులు కూడా ఈ సీజన్‌కు 50 శాతం పూర్తి చేస్తామన్నారు. 48గేట్ల పనులు అనుకున్న ప్రకారం జరుగుతున్నాయన్నారు. పోలవరం పనుల్లో 4వేల మంది పనిచేస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించి నెలవారీగా.. సీజన్‌ వారీగా లక్ష్యాలు పెట్టుకున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో కేరళను తలపించే ప్రకృతి అందాలున్నాయని.. పర్యాటకంగా వాటిని అభివృద్ధి చేస్తామన్నారు చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టుకు అన్నీ అనుకూలిస్తున్నాయని.. దీంతో అనుకున్న సమయానికే దీన్ని పూర్తిచేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తామన్నారు. చంద్రబాబు వెంట మంత్రులు దేవినేని ఉమ, ప్రతిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌లతో పాటు పలువురు అధికారులు ఉన్నారు. 

టీఎస్ ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మే 15 నుంచి 22 వరకు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. వీటి ఫలితాలను ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యాలయంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య విడుదల చేశారు. www.ntnews.com, ttp://bie.telangana.cgg.gov.in , tsbie.cgg.gov.in వెబ్‌సైట్లలో చూడొచ్చు.

పాల్వాయి మృతి పట్ల సీఎం కేసీఆర్ దిగ్ర్భాంతి..

హైదరాబాద్: కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి హఠాన్మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన గోవర్ధన్ రెడ్డి తో తనకు ఉన్న అనుబంధాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. కులు లో చనిపోయిన పాల్వాయి మృత దేహాన్ని ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు తీసుకు వచ్చేందుకు ప్రభుత్వ పరంగానే అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ , ఢిల్లీ రెసిడెంట్ కమిషనర్ అరవింద్ కుమార్‌ల‌ను సీఎం ఆదేశించారు. మృత దేహం తరలింపు తో పాటు అవసరమైన అన్ని కార్యక్రమాలను పర్యవేక్షించాలని ఎంపీ లు కె. కేశవ రావు, జితేందర్ రెడ్డి లను సీఎం కోరారు.

11:33 - June 9, 2017

విజయవాడ : నవ్యాంధ్ర రాజధాని ప్రాంతమైన విజయవాడలో మరో భూ సంతర్పణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. బందరు రోడ్‌లోని పీడబ్ల్యూడీ గ్రౌండ్ స్థలాన్ని కారుచౌకగా చైనా కంపెనీకి అప్పగించడానికి పావులు కదుపుతోంది. బినామీల పేరిట 26 ఎకరాల విస్తీర్ణం కలిగిన స్వరాజ్య మైదానాన్ని అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధపడింది.

నగరపాలక పోటిఫికేషన్...
పీడబ్ల్యూడీ గ్రౌండ్‌ను.. స్క్వేర్‌ తరహాలో అభివృద్ధి చేస్తున్నట్టు నగర పాలక సంస్థ తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 2017 జూన్ 7న నగరపాలక సంస్థ ద్వారా అర్హత నిర్ధరణ దరఖాస్తులను ఆహ్వానించడంతో విజయవాడ సిటీ స్క్వేర్ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. పీపీపీ పద్ధతిలో పీడబ్ల్యూడీ గ్రౌండ్ స్థలంలో 3/5 స్టార్ హోటళ్లు, ఆర్ట్ గ్యాలరీ నిర్మించనున్నట్టు పేర్కొన్నారు. అయితే దీనిపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

చైనా సంస్థలకు
రాజకీయ సభలు, క్రీడలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, బుక్ ఫెస్టివల్స్‌తో ప్రజా ప్రయోజనకరంగా ఉన్న స్థలాన్ని చైనాకు చెందిన జీఐఐసీ సంస్థకు కట్ట బెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజా సంఘాలు, వామపక్ష నేతలు వ్యతిరేకిస్తున్నారు. అభివృద్ధి ముసుగులో ప్రభుత్వమే భూ కబ్జాలకు పాల్పడుతోందని విమర్శిస్తున్నారు. ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

స్వరాజ్య మైదానం విలువ రూ.2 వేల 6 వందల కోట్లు
స్వరాజ్య మైదానం విలువ రూ.2 వేల 6 వందల కోట్లు ఉంటుందని అంచనా. మాస్టర్ ప్లాన్, జోనల్ ప్లాన్ ప్రకారం ఈ స్వరాజ్య మైదాన్‌ స్థలం ఓపెన్ స్పేస్ రిక్రియేషన్ కింద ఉంది. ఓపెన్ స్పేస్‌గా నమోదైన స్థలాన్ని వ్యాపార ఉపయోగాల కోసం కేటాయించడం చట్ట విరుద్ధం. లే అవుట్‌లో ఉన్న ఖాళీ స్థలాన్ని సైతం ఖాళీగానే ఉంచాలని నిబంధనలున్నాయి. స్వరాజ్య మైదానం వంటి స్థలాన్ని మార్చే అధికారం కౌన్సిల్ కు, ప్రభుత్వానికి లేదు. అయితే, నిబంధనలను పటిష్టంగా అమలు చేయాల్సిన పాలకులే, వాటికి తిలోదకాలు ఇస్తుండడం పట్ల, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్వరాజ్యమైదాన్‌ను ప్రైవేటు పరం చేసే యోచనను విరమించాలని కోరుతున్నారు. 

11:30 - June 9, 2017

నూనత డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో నిన్ను కోరి చిత్రం తెర‌కెక్క‌గా, ఈ చిత్రం లో నేచుర‌ల్ స్టార్ నాని, నివేదా థామస్ కథానాయికగా నటిస్తున్నారు. ఆది పినిశెట్టి క్రూషియల్ రోల్ లో కనిపించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన టీజ‌ర్‌ను ఈ రోజు విడుద‌ల చేశారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రం జూన్ 23న విడుద‌ల కానుంది. ఇటీవ‌ల ఈ చిత్ర ప్రోమో సాంగ్ ని విడుద‌లచేసిన సంగతి తెలిసిందే... ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే ప్రీ రిలీజ్ వేడుక జ‌రుపుకోనుంది. గోపి సుంద‌ర్ నిన్ను కోరి చిత్రానికి సంగీతం అందించాడు.

11:28 - June 9, 2017

సిమ్లా : కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వయి గోవర్థన్ రెడ్డి కన్నుమూశారు. ఆయన ఎరువుల విషయంలో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చర్చలో పొల్గొనేందుకు హిమాచల్ రాజధాని సిమ్లా వెళ్లారు. సమావేశానికి హాజరైయ్యేందుకు కారు దిగుతుండగా గుండె పోటు రావడంతో నెలకోరిగారు. పాల్వయితో పాటు ఆయన భార్య వెంటే ఉన్నారు. పాల్వయితో పాటు తెలంగాణ తరుపున టీఆర్ఎస్ మెదక్ ఎంపీ కొత్త ప్రభకర్ రెడ్డి ఉన్నారు. పాల్వయి గోవర్థన్ రెడ్డి మహబూనగర్ జిల్లా అచ్చంపెట మండలం నందిపల్లి లో 1936 నవంబర్ 20 జన్మించారు. 1967 నుంచి 1987వరకు వరుసగా ఎమ్మెలేగా గెలుపొందారు. మళ్లి 1999 నుంచి 2004 వరకు ఎమ్మెల్యేగా, 2005 నుంచి 2011 వరకు ఎమ్మెల్సీగా, ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. రాజ్యసభలో తెలంగాణ సాగునీరు ప్రజెక్టుల సమస్యలను లెవనెత్తారు. కాసేపట్లో ఆయన మృతదేహాన్ని ఢిల్లీ తరలించనున్నారు.

 

ప్రధాని మోదీతో నవాజ్ షరీఫ్ భేటీ

హైదరాబాద్: కజకిస్థాన్‌ రాజధాని అస్తానాలో జరుగుతున్న షాంఘై కోపరేటివ్‌ సమ్మిట్‌(ఎస్‌సీవో) రిసెప్షన్‌లో భారత్‌ ప్రధాని నరేంద్రమోదీ, పాకిస్థాన్‌ పీఎం నవాజ్‌ షరీఫ్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఒకరికొకరు అభినందనలు తెలుపుకొని కాసేపు ముచ్చటించుకున్నారు. షరీఫ్‌ ఆరోగ్యం, కుటుంబసభ్యుల క్షేమ సమాచారాన్ని మోదీ అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. 2015లో ప్రధాని మోదీ లాహోర్‌ వెళ్లిన సమయంలో షరీఫ్‌ను కలుసుకున్నారు. ఆ తర్వాత రెండు దేశాధినేతలు కలుసుకోవడం ఇదే ప్రథమం.

సీఎం కేజ్రీవాల్ ఇంటి వద్ద ఉద్రిక్తత...

ఢిల్లీ : సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన బహిష్కృత మంత్రి కపిల్ మిశ్రాను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కేజ్రీవాల్ సెక్యూరిటీ సిబ్బంది లోనికి వెళ్లేందుకు మిశ్రాకు అనుమతించకపోవడంతో, ఆయన వాగ్వాదానికి దిగారు. ఆపై మీడియాతో మాట్లాడుతూ, ఢిల్లీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని విమర్శలు గుప్పించారు. ఢిల్లీ సర్కారు లంచాల బాగోతంపై తనకు తెలిసిన సమాచారాన్ని, సాక్ష్యాలను ఇప్పటికే విచారణ అధికారులకు అందించానని చెప్పారు.

ఎంపి పాల్వాయి గోవర్థన్ రెడ్డి హఠాన్మరణం

హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపి పాల్వాయి గోవర్థన్ రెడ్డి గుండె పోటు రావడంతో మృతి చెందారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సమావేశానికి హాజరయ్యేందుకు సిమ్లా వెళ్లిన పాల్వాయి గుండె పోటుతో మృతి చెందారు. 2012లో రాజ్యసభ సభ్యుడిగా పాల్వాయి ఎన్నికయ్యారు. 1967లో తొలిసారిగా ఎమ్మెల్యే అయిరన పాల్వాయి ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. పాల్వాయి స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా నడింపల్లి. ఆయన నవంబర్ 19, 1936లో జన్మించారు.

అమరావతి ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ యత్నం

బళ్లారి: హుబ్లీ- విజయవాడ మధ్య ప్రయాణించే అమరావతి ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ యత్నం జరిగింది. కర్ణాటకలోని బళ్లారి-తోరణగల్లు మధ్య శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. మహిళా ప్రయాణికుల నుంచి నగలు లాక్కునేందుకు ప్రయత్నించిన నలుగురిని ప్రయాణికులు పట్టుకున్నారు. అనంతరం దొంగలను రైల్వే పోలీసులకు అప్పగించారు.

నేడు,రేపు అసెంబ్లీ పరిశీలనకు అనుమతి: స్పీకర్ కోడెల

అమరావతి: ఏపీ అసెంబ్లీని పరిశీలించేందుకు అందరికీ అవకాశం కల్పిస్తున్నామని స్పీకర్ కోడెల శివప్రసాద్ అన్నారు. ఈ రోజు, రేపు అసెంబ్లీలోకి ప్రజలు, ప్రజాప్రతినిధులు, మీడియాకు అనుమతిస్తున్నామని అన్నారు. అసెంబ్లీ భవనాలపై ప్రతిపక్ష సభ్యులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, మీడియాను తీసుకువెళ్లేందుకు ముందుగా అడిగి ఉంటే అనుమతి ఇచ్చేవాడినని అన్నారు.

వనపర్తి జిల్లాలో దారుణం..

వనపర్తి:ఆత్మకూరు మండల కేంద్రం భరత్‌నగర్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. చాకలి శ్రీను(45) అనే వ్యక్తిని అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గొంతుకోసి హత్య చేశారు. మృతుడు హైదరాబాద్ వాసిగా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

10:25 - June 9, 2017

విజయవాడ : సోషల్ మీడియాలో మహిళను వేధిస్తున్న యువకుడికి దేహశుద్ధి చేశారు. విజయవాడ వన్ టౌన్ చెందిన ఓ మహిళకు మాచవరం ప్రాంతానికి చెందిన సబానిని ఫెస్ బుక్ లో అశ్లీల చిత్రాలు, అసభ్య మేసేజ్ లు పంపడంతో ఆ మహిళ తన భర్త, బంధువుల సహాయంతో సబాని అడ్రస్ కనుక్కొని సబానిని చితక్కొట్టారు. బాదిత మహిళ సబానిపై చెప్పుతో విరుచుకుపడింది. సబాని చాలా మంది మహిళలకు ఇలానే మేసేజ్ లు చేశాడని, సబాని దెబ్బకు కొందరు మహిళలు తమ ఫెస్ బుక్ అకౌంట్ క్లోజ్ చేశారు. కానీ ఈ మహిళ ధైర్యం చేసి పోకిరిని పోలీసులకు పట్టించింది.

 

ఖతార్ ఉగ్రజాబితా ఇదే: సౌదీ కూటమి...

హైదరాబాద్: తమ దేశంపై జరుగుతున్న దౌత్య దాడిని అడ్డుకుని తీరుతామని, సౌదీ అరేబియా ఆంక్షలకు తలొగ్గేది లేదని ఖతార్ స్పష్టం చేసిన గంటల వ్యవధిలో, ఆదేశానికి, ఉగ్రవాద సంస్థలకు మధ్య ఉన్న లింకులను సౌదీ విడుదల చేసింది. ఖతార్ లో ఉండి ఉగ్రవాదులకు నిధులందిస్తున్న సంస్థలు, వ్యక్తులతో కూడిన జాబితాను విడుదల చేసింది.

10:24 - June 9, 2017

విశాఖ : ఈ నెల 4వ తేదీన జిల్లా కేంద్రంలోని ఓ స్టార్ హోటల్లో విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న యువతిని కొందరు యువకులు వెంబండించి, బెదిరించి కారులో ఎక్కించుకుని మద్యం తాగించి అత్యాచారం చేశారు. స్పృహ కోల్పోయిన యువతిని దుండగులు బీచ్ రోడ్డులో విడిచిపెట్టి వెళ్లారు. అక్కడే గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన నాలుడు రోజుల తర్వాత బయటకు వచ్చింది. ఈ కేసులో యువకులు ఉన్నత వర్గాలకు చెందిన వారు కావడంతో కేసును పోలీసులు రహాస్యంగా విచారణ జరుపుతున్నారు.  

10:23 - June 9, 2017

హైదరాబాద్ : నగరంలోని మదాపూర్ ఐటీ కారిడర్ ఉగ్రవాద ముప్పు ఉందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. కేంద్ర ఇంటలిజెన్స్ నుంచి రాష్ట్ర పోలీసులకు సమాచారం అందింది. దీంతో రాష్ట్ర పోలీసులు ఐటీ కారిడార్ పరిధిలో విస్తృతంగా సోదాలు, తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉగ్రవాదులు షాపింగ్ మాల్స్ ను లక్ష్యంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది.అనుమానాస్పదంగా కనిపించే ఏ వస్తువు ఉన్న పోలీసుల సమాచారం ఇవ్వండి అని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

10:21 - June 9, 2017

ఓ హోటల్ ఉద్యోగిని పై అఘాయిత్యం...

విశాఖ: నగరంలోని ఓ ప్రముఖ హోటల్ లో పనిచేస్తున్న ఓ యువతిపై సిబ్బంది అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి ఫిర్యాదు మేరకు త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు ఆ ఫిర్యాదులో పేర్కొంది. విచారణ చేపట్టిన పోలీసులు, యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి పంపారు.

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు..

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 66 పాయింట్లు కోల్పోయింది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 31,147 పాయింట్ల వద్ద, నిఫ్టీ 9,635 పాయింట్ల వద్ద కొనసాగుతున్నాయి.

08:50 - June 9, 2017

యాదాద్రి : జిల్లాలో నేడు 83 ప్రజాసంఘాల ఆధ్యర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. కుల దురహంకారానికి బలైన నరేష్ కుటుంబానికి న్యాయం చేయాలని, స్వాతి మృతిపై సమగ్ర విచారన జరిపించాలని ప్రజాసంఘాల డిమాండ్ చేస్తున్నాయి. ఈ బహిరంగట సభకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, ప్రజా యుద్ధనౌక గద్దర్, జస్టిస్ చంద్రకుమార్ హాజరుకానున్నారు.

 

 

08:48 - June 9, 2017

గుంటూరు : జిల్లా రెంటచింతల మండలం జెట్టిపాలెంలో దారుణం జరిగింది. స్వంత తమ్ముడే ఆస్తి కోసం అన్న, వదినను నరికి చంపాడు. ఉదయం పొలానికి వెళ్లిన అన్న వెంకటేశ్వర్ రెడ్డి, వదిన పద్మ పై తమ్ముడు పిచ్చి రెడ్డి పంటపొలంలోనే నరికి హత్య చేశాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందివడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహలను పొస్టుమార్టానికి తరలించారు. హత్యలు ఎందుకు జరిగాయో స్థానికులను పోలీసులు అడిగి తెలుసుకున్నారు. స్థానికులు చెప్పెదాని ప్రకారం వారి ఇద్దరు అన్నదమ్ముల మధ్య గత కొంత కాలంగా ఆస్తి తగాదాలు ఉన్నాయిని తెలిపారు. ఈ హత్యలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసుల తెలపుతున్నారు. పిచ్చిరెడ్డి కోసం గాలిస్తున్నామని ఎస్సై తెలిపారు. ఈ హత్యలోమ పిచ్చి రెడ్డి ఒక్కడే చేశాడా..లేక ఇంక ఎవరైన ఉన్నార అనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. 

నేడు ఆస్తానాలో షాంఘై సంస్థ శికరాగ్ర సదస్సు

అస్తానా : నేడు ఆస్తానాలో జరిగే షాంఘై సంస్థ శికరాగ్ర సదస్సు జరుగనుంది. ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. 

నేడు రాష్ట్రాలతో నౌకా మంత్రిత్వ శాఖ సమావేశం

ఢిల్లీ : నేడు రాష్ట్రాలతో నౌకా మంత్రిత్వ శాఖ సమావేశం కానుంది. సమావేశానికి నీతిఅయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, రాష్ట్రాల అదనపు కార్యదర్శులు, పోర్టుల చైర్మన్లు హాజరు కానున్నారు. 

నేడు హైదరాబాద్ కు రానున్న హర్యానా సీఎం

హైదరాబాద్ : హర్యానా సీఎం మనోహర్ ఖట్టర్ నేడు నగరానికి రానున్నారు. మోడీ మూడేళ్ల పాలన ఉత్సవాల్లో పాల్గొనేందుకు మనోహర్ కట్టర్ హైదరాబాద్ రానున్నారు. 

నేడు యాదాద్రిలో ప్రజాసంఘాల ఆందోళన

యాదాద్రి : నేడు జిల్లాలోని భువనగిరిలో 83 ప్రజాసంఘాల ఆందోళన చేయనున్నాయి. ఆందళనలో సీపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ, జాతీయా బీసీ సంఘాల అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య పాల్గొననున్నారు. నరేష్ , స్వాతి మృతి కేసులో పోలీసుల నిర్లక్ష్యంపై ఆందోళ చేస్తున్నారు. 

Don't Miss