Activities calendar

10 June 2017

21:48 - June 10, 2017

సౌదీ అరేబియా : ఇరాన్‌ పార్లమెంట్‌పై దాడి చేసిన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ ఇపుడు సౌదీ అరేబియాను టార్గెట్‌ చేసింది. సౌదీ అరేబియాలో దాడి చేస్తామని ఐసిస్‌ హెచ్చరించింది. SITE ఇంటిలిజెన్స్‌ వర్గాలు ఈ వార్తను ధృవీకరించాయి. బుధవారం ఇరాన్‌ పార్లమెంట్‌, అయెతొల్లా ఖొమెని సమాధి వద్ద జరిపిన ఐసిస్‌ జరిపిన ఆత్మాహుతి దాడిలో 17 మంది మృతి చెందారు. చాలామంది గాయపడ్డారు. దీనికి తామే బాధ్యులమని తెలిపిన ఐసిస్‌ షియా దేశాలపై మరిన్ని దాడులు జరుపుతామని హెచ్చరించింది. ఇరాన్‌పై దాడికి ముందు ఐసిస్‌ రికార్డ్‌ చేసిన వీడియో ఒకటి వెలుగు చూసింది. ఈ వీడియోలో మాట్లాడిన ఐదుగురు ఉగ్రవాదులు సౌదీ అరేబియాలోని షియాలపై దాడులు చేస్తామని బెదిరించారు. మేము ఎవరి ఏజెంట్లు కామని...అల్లా ఆజ్ఞాపించారని... ఇరాన్‌ తర్వాత మీపైనే దాడి చేస్తామని సౌదీకి ఐసిస్‌ ఓ సందేశాన్ని పంపింది.

21:47 - June 10, 2017

అమెరికా : అమెరికాలో హ‌త్యకు గురైన భార‌తీయ టెకీ కూచిబొట్ల శ్రీనివాస్ కేసులో అభియోగాలు న‌మోదు అయ్యాయి.. జాత్యాంహ‌కార దాడి, మార‌ణాయుధాలు క‌లిగి ఉన్న కోణంలో కూచిబొట్ల కేసును ద‌ర్యాప్తు చేయ‌నున్నారు. క‌న్సాస్ సిటీ బార్‌లో జ‌రిగిన కాల్పుల ఘ‌ట‌న‌ను జాతి వివ‌క్ష దాడిగా విచార‌ణ చేప‌ట్టనున్నట్లు అమెరికా న్యాయ‌శాఖ పేర్కొంది. ఫిబ్రవ‌రి 22న కన్సాస్‌ సిటీలోని ఆస్టిన్ బార్‌లో పురింటన్‌ జరిపిన కాల్పుల్లో కూచిబొట్ల ప్రాణాలు కోల్పోయాడు. మ‌రో ఇద్దరు గాయ‌ప‌డ్డారు. ఈ కేసులో పురింటన్‌ను కోర్టు నిందితుడిగా పేర్కొంది. పిస్తోల్‌తో కాల్పులు జ‌రిపే ముందు మీ దేశానికి వెళ్లిపోవాలంటూ పురింట‌న్ అరుపులు పెట్టిన‌ట్లు సాక్ష్యులు తెలిపారు. జాతి వివ‌క్షతోనే పురింట‌న్ హ‌త్యకు పాల్పడిన‌ట్లు పోలీసులు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. ఈ కేసులో పురింటన్‌కు ఉరిశిక్ష లేదా జీవితఖైదు పడే అవకాశం ఉంది.

 

 

21:46 - June 10, 2017

నల్లగొండ : గుండెపోటుతో హిమాచల్‌ప్రదేశ్ కులులో శుక్రవారం ఆకస్మికంగా మృతిచెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అంత్యక్రియలు ఆయన స్వగ్రామం ఇడికుడిలో ఘనంగా ముగిశాయి. ఢిల్లీ నుంచి ఆయన మృతదేహాన్ని హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఆయన నివాసానికి తీసుకువచ్చారు. టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ఎంపీ కవిత, కాంగ్రెస్ నేత జానారెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్వాయి భౌతిక కాయానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

పలువురు నేతల నివాళులు
అనంతరం బంజారాహిల్స్‌ ఎమ్మెల్యే కాలనీలోని పాల్వాయి నివాసం నుంచి ఆయన భౌతిక కాయాన్ని ప్రభుత్వం లాంఛనాలతో గాంధీ భవన్‌కు అంతిమయాత్రగా తరలించారు. ఈ సందర్భంగా పాల్వాయి గోవర్దన్ రెడ్డి భౌతికకాయానికి పలువురు నేతలు నివాళులు అర్పించారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలతో పాటు, టీడీపీ, బీజేపీ, టీఆర్‌ఎస్, లెఫ్ట్‌ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు పాల్వాయి మృతిపై ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం గాంధీభవన్‌ నుంచి ఆయన స్వగ్రామం నల్గొండ జిల్లా ఇడికుడి గ్రామానికి పాల్వాయి భౌతికకాయాన్ని తరలించారు. పాల్వాయిని కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్వగ్రామం ఇడికూడలో పాల్వాయి మృతదేహానికి మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీలు గుత్తా సుఖేందర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, మాజీ మంత్రి సబితా, దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జస్టిస్ నాగార్జున రెడ్డి నివాళులు అర్పించారు.

ప్రభుత్వ లాంఛనాలతో పాల్వాయి అంత్యక్రియలు
ప్రభుత్వ లాంఛనాలతో పాల్వాయి అంత్యక్రియలకు ఏర్పాట్లుచేయగా పోలీసులు మూడుసార్లు గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం పాల్వాయి చితికి ఆయన కుమారుడు నిప్పంటించడంతో అంత్యక్రియలు ముగిసిపోయాయి.  

21:45 - June 10, 2017

గుంటూరు : వైసీపీ అధినేత జగన్‌... ఆయనతో ఉన్న ఎమ్మెల్యేలు కూడా అధికారంలోకి వచ్చేసినట్టు భ్రమల్లో బతుకుతున్నారని హోంమంత్రి చినరాజప్ప ఎద్దేవా చేశారు. ఉద్యోగులను ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఐపీఎస్‌, డీఎస్పీల బదిలీలను త్వరలోనే పూర్తిచేస్తామన్నారు.

21:44 - June 10, 2017

హైదరాబాద్ : పౌర సరఫరాల ద్వారా రాష్ట్రంలో జరుగుతున్న ధాన్యం సేకరణపై సీఎం కేసీఆర్‌ శనివారం సివిల్ సప్లయ్ కమిషనర్‌ సీవీ ఆనంద్, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేనంత పంట ఈసారి పండిందని, సిపిల్ సప్లయ్ కొనుగోలు కేంద్రాలకు రికార్డు స్థాయిలో ధాన్యం వస్తుందని కేసీఆర్‌ చెప్పారు. ఎంత ధాన్యమైనా సేకరించడానికి అవసరమైన నిధులు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ మేరకు ఆ డబ్బులు ఎలాంటి జాప్యం లేకుండా రైతులకు చేరే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.

ఇప్పటి వరకు 37 లక్షల టన్నుల ధాన్యం సేకరణ
కాగా ఇప్పటి వరకు 37 లక్షల టన్నుల ధాన్యం సేకరించామని, మరో రెండు లక్షల టన్నులు కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని అధికారులు సీఎం కేసీఆర్‌కు తెలియజేశారు. ఇప్పటి వరకు సేకరించిన ధాన్యానికి 5 వేల 300 కోట్ల రూపాయలు చెల్లింపులు జరపాల్సి ఉండగా రూ.4 వేల కోట్లు చెల్లించామన్నారు. అయితే పెండింగ్‌లో ఉన్న 1300 కోట్లను కూడా తక్షణం చెల్లించాలని సీఎం ఆదేశించారు. ఎఫ్‌సీఐ నుంచి వచ్చేదాకా ఎదురు చూడకుండా నిధులు సమకూర్చుకోవాలని సూచించారు. దీనికోసం ప్రభుత్వం తరపున బ్యాంకు గ్యారంటీ ఇవ్వనున్నట్టు సీఎం ప్రకటించారు. రైతులకు వెంటనే చెల్లింపులు చేయడంపై అధికారులు ఎక్కువ దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. చెల్లింపులపై రాష్ట్రస్థాయి అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. 

21:43 - June 10, 2017

యాదాద్రి : ఈ కన్నతండ్రి ప్రశ్నలకు సమాధానం ఏది..?? ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుని కూతురిని ఓ ఇంటికి ఇచ్చి బాధ్యత తీర్చుకోవాలనుకున్న ఆ కన్నవారికి మిగిలింది శోకమేనా...! ఇది ఒక్క తండ్రి మాట కాదు..ఇప్పటికే ఎందరో కన్నతండ్రులు ప్రశ్నిస్తున్నవే... కూతుళ్లు కళ్ల ముందు చనిపోతుంటే చూస్తూ కూడా ఏదీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఎందరో కన్నతండ్రుల మూగరోదనకు సమాధానం ఏది..? ఎన్నో కుటుంబాల్లో విషాదానికి కారణమవుతుంది ప్రేమ. ప్రేమ పేరుతో మోసం చేస్తున్నవారేగాకుండా...అదే ప్రేమ కోసం పిచ్చివాళ్లుగా మారి ఉన్మాదులుగా తయారయి ప్రాణాలు తీస్తున్నారు.యాదాద్రి జిల్లా యాదగిరిపల్లిలో దారుణం జరిగింది... ప్రేమోన్మాది ఘాతుకానికి మరో అమాయకురాలు బలయింది.... గ్రామంలోని గాయత్రి అనే యువతిని ప్రేమిస్తున్నానంటూ కొంతకాలంగా అదే ప్రాంతానికి చెందిన శ్రీకాంత్ వెంటపడుతున్నాడు..అతని ప్రేమను నిరాకరించినందుకు కక్షగట్టాడు..ఇదే సమయంలో గాయత్రికి పెళ్లి చేయాలని నిర్ణయించిన పెద్దలు సంబంధం ఖాయం చేసుకున్నారు.

కొన్ని గంటల్లో నిశ్చితార్థం
సరిగ్గా కొన్ని గంటల్లో గాయత్రికి నిశ్చితార్థం పెట్టుకున్నారు....ఆ ఏర్పాట్లలో కన్నవారు ఉండగా ఇది తెలుసుకున్న శ్రీకాంత్ ఇంటికి వచ్చి గొడవపడ్డాడు..ముందుగానే అనుకున్నట్లు కత్తితో వచ్చిన ఆ దుర్మార్గుడు గాయత్రిని పొడిచాడు...వెంటనే గాయత్రిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందింది. విషయం తెలిసిన పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు...గాయత్రి హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

21:41 - June 10, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో సీనియర్‌ నేత.. మాజీ పాత్రికేయుడు.. సీనియర్‌ లాయర్‌.. కె.కేశవరావు.. భూ వివాదంలో కూరుకుపోయారు. ఇప్పటికే సంచలనం సృష్టించిన మియాపూర్‌ భూ కుంభకోణంలో ప్రధాన సూత్రధారుడు, గోల్డ్‌స్టోన్‌ ప్రసాద్‌కు చెందిన దండుమైలారం భూముల్లో కేకే కుటుంబం 50 ఎకరాలు కొనుగోలు చేసింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారంలో కేకే కుటుంబం కొన్న ఆ 50 ఎకరాల్లో 38 ఎకరాలు ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయన్నది తాజా ఆరోపణ. ఇప్పుడీ వ్యవహారం.. రాష్ట్రంలో పెను దుమారాన్ని రేపుతోంది.

38 ఎకరాలను కేకే కుటుంబ సభ్యుల పేరిట
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో దొంగ జీపీఏల ద్వారా కబ్జా చేసిన ప్రభుత్వ, అటవీ భూముల్లో 38 ఎకరాలను కేకే కుటుంబ సభ్యుల పేరిట గోల్డ్‌స్టోన్‌ సంస్థ రిజిస్ట్రేషన్‌ చేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దండుమైలారం పంచాయతీ హఫీజ్‌పుర్ రెవెన్యూ పరిధిలో ఈ భూములున్నాయి. సర్వే నెంబర్‌ 36లోని కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మీ, కోడలు జ్యోత్స విప్లవ కుమార్‌ , భార్య కంచర్ల నవజ్యోతిలకు గోల్డ్‌స్టోన్‌ కంపెనీ ఈ భూమిని రిజిస్ట్రేషన్‌ చేసిందన్న విషయం వెలుగులోకి వచ్చింది. దండుమైలారం గ్రామంలోని హఫీజ్‌పుర్‌లో 2,244.22 ఎకరాల ప్రభుత్వ, అటవీ భూములున్నాయి. ఇందులో 422.29 ఎకరాలను 1965లో ప్రభుత్వం పేదలకు అసైన్‌ చేసి పట్టాలు ఇచ్చింది. మిగిలిన 1821.33 ఎకరాలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయి. అయితే గోల్డ్‌స్టోన్‌ టెక్నాలజీస్‌తో పాటు మరో 10 కంపెనీలు ఈ భూముల్లో 50 ఎకరాలకు తాము హక్కుదారులమని ప్రకటించుకున్నాయి. ఈ 50 ఎకరాల భూములను 2015లో.. హైదరాబాద్‌లో కేకే కుమార్తె ప్రస్తుత జీహెచ్ఎంసీ కార్పొరేటర్‌ గద్వాల విజయలక్ష్మీ ఆమె భర్త బాబిరెడ్డి, కేకే భార్య కంచెర్ల నవజ్యోతి తండ్రి వెంకటేశ్వరరావు, కేకే కొడుకు విప్లకుమార్‌లకు విక్రయించారు. ఈ మేరకు ఇబ్రహీంపట్నం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేయించారు. 2015లోనే ఈ భూముల రిజిస్ట్రేషన్‌ కోసం దరఖాస్తు వచ్చినప్పటికీ..అప్పటి సబ్‌రిజిస్ట్రార్‌ పెండింగ్‌లో పెట్టారు. దీని విషయంలో హైకోర్టుకు కూడా వెళ్లామని..కోర్టు ఆదేశాల మేరకే అన్ని ఎంక్వైరీలు పూర్తయ్యాకే 50 ఎకరాల భూమిని కొనుగోలు చేశామని కేకే చెబుతున్నారు.

కోర్టు తీర్పు తర్వాతే కొనుగోలు
కోర్టు తీర్పు తర్వాత 2016 మే 12న కేకే కుటుంబానికి 38 ఎకరాల భూమిని డాక్యుమెంట్‌ నెంబర్‌ 4486/16 ప్రకారం సబ్‌ రిజిస్ట్రార్‌ సాలేహ్‌ ఖాదీర్‌ రిజిస్ట్రేషన్‌ చేశారు. అయితే 2013లోనే ఈసీ 14/58 తీర్పు ప్రకారం ఈ భూములు ప్రైవేటు వ్యక్తులకు చెందినవని కోర్టులు తీర్పునిచ్చాయని.. దాని ప్రకారమే భూములను కొనుగోలు చేశామని కేకే వివరణ ఇచ్చారు. ఒకవేళ భూముల వ్యవహారంలో తాను తప్పుచేసుంటే ఎలాంటి విచారణకైనా సిద్ధమైనని కేకే అంటున్నారు. సీఎం కేసీఆర్‌కు తాను లేఖ రాశానని ఈ భూముల వ్యవహారంపై విచారణకు తాను సిద్ధమేనన్నారు కేకే. మొత్తానికి, మియాపూర్‌ భూముల కుంబకోణంలోను, ప్రస్తుతం దండుమైలారం భూముల విషయంలోనూ టీఆర్ఎస్‌ సీనియర్‌లపైనే అభియోగాలు రావడం, పాలక పక్షాన్ని ఇరకాటంలో పడేస్తోంది. 

శంకరపట్నం పీఎస్ నుంచి పరారైన నిందితుడు

కరీంనగర్ : జిల్లా శంకరపట్నం పీఎస్ నుంచి పోలీసుల కళ్లుగప్పి శ్రీనివాసరావు అనే నిందితుడు పరారైయాడు. రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసి చెల్లని ఇచ్చిన శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు.

 

 

ఫ్రెంచ్ ఓపెన్ మహిళ విజేత ఒస్టా పెంకో

ఫ్రెంచ్ : ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగల్స్ విజేతగా ఒస్టా పెంకో నిలిచింది.ఫైనల్లో హాలెప్ పై ఒస్టాపెంకో విజయం సాధించింది.

 

20:24 - June 10, 2017

దొంగలు దొంగలు ఊర్లు వంచుకున్నట్టే ఉన్నదిగదా..? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంల భూముల పంపుకం జూస్తుంటే..? అయ్యా ఇంద్రకరణ్ రెడ్డిగారు.. విఠల్ రెడ్డిగారూ.. మీకు ఓట్లేశినందుకేనా సారూ.. నా సంసారం మొత్తం ఆగం జేశిండ్రు..? తండ్రి వొయ్యిండు కొడ్కు వొయ్యిండు.. ఇంక ఏంగావాలె సార్లూ మీకు..? నా పాణం గావాల్నంటే ఇగో తీస్కోండ్రి సార్లూ.. ఒక దొంగోడు ఇంటి ముంగటికొచ్చి.. మీ ఇంటోళ్లంత బైటికి ఎల్లిపోండ్రి.. నేనుదోస్కుంట.. లేదు మేము పోమంటె మట్టుకు నేను నిరాహార దీక్ష జేస్తంటే ఎంత గమ్మతుంటదో ముచ్చట.. అరే మన మంత్రి జూపల్లి క్రిష్ణారావుకు తెల్విలేదటగదా..? ఏం తెల్వదట ఆయనకు.. ఎట్లవడ్తె అట్ల పనిజేస్తడట.. ఈ మాట అన్నది ప్రతిపక్షాలోళ్లు గాదు.. సొంత పక్షం ఎంపీగారే అంటున్నడు.. ఏయ్ మహిపాల్ రెడ్డి..? పటాన్ చెర్వు ఎమ్మెల్యే.. వచ్చిన నీ ఊర్లె కొచ్చిన.. ఇంటి కాడికొచ్చినా..? రా ధమ్ముంటే సూస్కుందాం..? నా బాగోతం బైటవెడ్తాంటున్నవటగదా..?అరే నాయనా..? ఆ పుట్టపర్తి డీఎస్పీకి ఎవ్వలన్న జెప్పుండ్రిరా నాయనా..? మున్సిపల్ చైర్మన్ అంటే..? మున్సిపాల్టీకి ప్రధమ పౌరుడు అన్న సంగతి.?ట్రాఫిక్ కానిస్టేబుల్ డ్యూటీ ఏంది..? ట్రాఫిక్ క్లీయర్ జేయాలే.. ప్రయాణికులు సురక్షితంగ ఇంటికి వొయ్యె ఏర్పాట్లు జెయ్యాలే.. ఇంకా ఏమన్న పనులుంటే.. ముందే బస్సు ప్రయాణం అంటే భయపడ్తున్నరు నిన్నియాళ్ల జనం.. ఎన్నిజూస్తలేం మనం యాక్సిడెంట్లు... డ్రైవర్లు ఇష్టమొచ్చినట్టు నడ్పి జనం పాణాలు దీస్తున్నరు..

 

 

 

 

19:21 - June 10, 2017

కులంతర వివాహలు ఎప్పటినుండో వస్తున్నాయని, కృష్ణుడు జంబవతిని పెళ్లిచేసుకున్నారని, కొంత మంది కులం, మతం వచ్చినప్పుడు మనిషి తనను తాను మర్చిపోతున్నాడని, మొత్తం వ్యవస్థలో మార్పు రావలసిన అవసరం ఉందని, చర్చలో పాల్గొన్న రిటైర్డ్ జడ్జి చంద్రకుమార్, వినయ్ కుమార్, సుజాత, కులనిర్మూలన నేతలు వహిద్, జ్యోతి, సామాజిక నేతలు శాంతరావు, పద్మ అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

ముషీరాబాద్ లో దారుణం

హైదరాబాద్ : ముషీరాబాద్ లో దారుణం జరిగింది. బాలికపై పెంపుడు తండ్రి, ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. కూతురు గర్భం దాల్చడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ముగ్గురు నిందుతులను అదుపులోకి తీసుకున్నారు.

 

 

 

 

18:45 - June 10, 2017

విశాఖ : భూ ఆక్రమణల వ్యవహారం.. రోజురోజుకీ జటిలమవుతోంది. దీనిపై సాక్షాత్తు జిల్లా కలెక్టరే రెండు భిన్నమైన ప్రకటనలు చేయడంతో.. ప్రజల్లో అనుమానాలను పెంచుతోంది. భూ ఆక్రమణల వ్యవహారం వెలుగు చూసిన తొలి నాళ్లలో.. వేలాది ఎకరాల భూమి కబ్జా అయిందని... దాదాపు లక్ష ఎకరాలకు చెందిన ఎఫ్ఎంబీలు మాయమైనట్టు జిల్లా కలెక్టర్‌ ప్రకటించారు. కానీ, ఏమైందో ఏమో.. కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే ఆ సంఖ్యను గణనీయంగా తగ్గించి, నామమాత్రంగా 200 నుంచి మూడు వందల ఎకరాల భూమి మాత్రమే అన్యాక్రాంతం అయిందని ప్రకటించారు.

మాట మార్చిన కలెక్టర్...
నగర పరిధిలోని మధురవాడ, కొమ్మాది ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములన్నీ రెవెన్యూశాఖ ఆధీనంలోనే ఉన్నాయని, కొన్ని సర్వే సంఖ్యలు, విస్తీర్ణం వంటి అంశాలు 1బీ రిజిస్టర్‌లో తారుమారయ్యాయని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ చెప్పారు. ప్రభుత్వ భూములన్నీ 22(ఎ) జాబితాలో చేర్చామని వెల్లడించారు. కొమ్మాదిలో 2 వేల 9 వందల 86 ఎకరాల భూమి ఉందని, దీనిలో 2162.58 ఎకరాలు అటవీశాఖకు చెందినవన్నారు. కొండ, గెడ్డ పొరంబోకు భూములు 325.94 ఎకరాలు, జిరాయితీ భూములు 377.41 ఎకరాల భూములు, అసైన్డ్‌ భూములు 211.52 ఎకరాలు, సామాజిక పోరంబోకు భూములు 120.07 ఎకరాలు ఉన్నాయన్నారు. 13.79 ఎకరాల సామాజిక పోరంబోకు భూమి ఆక్రమణకు గురైనట్టు గుర్తించామని చెప్పారు. 16 సర్వే సంఖ్యల్లో 178.06 ఎకరాల భూముల రికార్డులు తారుమారయ్యాయని ప్రకటించారు. కొమ్మాదిలో 13 సర్వే సంఖ్యల్లో ఉన్న 1.47 ఎకరాల ప్రైవేటు భూమి ట్యాంపరింగ్‌కు గురైనట్టు గుర్తించామని, దిద్దుబాటు చర్యలను తీసుకుంటామన్నారు. అలాగే మధురవాడలోని భూములకు సంబంధించి రికార్డులు తారుమారయ్యాయని చెప్పారు.

లక్షా ఆరువేల కోట్లు....
అలాగే విశాఖ జిల్లా మొత్తంమీద ఉన్న 5.39 లక్షల ఎకరాల భూముల్లో ... ఏకంగా లక్షా ఆరువేల 2 వందల 39 ఎకరాలకు సంబంధించిన ఫీల్డ్‌ మెజర్‌మెంట్‌ బుక్‌లు మాయమయ్యాయి. 16 వేల 375 సర్వే నెంబర్లకు సంబంధించిన ఎఫ్‌ఎంబీలు అసలు ఉన్నాయో లేవో రెవెన్యూ, సర్వే సిబ్బందికే అంతుబట్టడం లేదు. పెందుర్తి, ఆనందపురం, చినగదిలి, భీమిలిలలో దాదాపు రూ.20 వేల కోట్ల భూములు ఆక్రమణకు గురైనట్టు అంచనా. అయితే రికార్డుల తారుమారు వ్యవహారంలో ఎవరున్నా వదిలేదని ..ఇప్పటిఏ ఇద్దరిపై కేసులు నమోదు చేశామని కలెక్టర్‌ చెప్పారు. కాగా అధికారుల తీరుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. తొలుత వేలాది ఎకరాలు అన్యాక్రాంతం అయిందని ప్రకటించిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు ఎందుకు మాట మారుస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. భూ ఆక్రమణలలో జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు హస్తం ఉందని వామపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నారు. భూములను ఆక్రమించిన పెద్దలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ మేరకు ఆందోళనకు కార్యాచరణ రూపొందిస్తున్నాయి.

 

18:43 - June 10, 2017

తూర్పు గోదావరి : ఫేస్‌బుక్‌.. పరిచయం లేని వారిని కూడా దగ్గరకు చేస్తుంది. ఫేస్‌బుక్‌ పరిచయంతో ప్రేమలో పడి పెళ్లాడిన జంటలనూ మనం చూశాం. కానీ, తూర్పుగోదావరి జిల్లాలో ఫేస్‌బుక్‌లో చేసిన కామెంట్‌ ఓ యువకుడి నిండు ప్రాణాలను బలిగొంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన, కాకినాడ రూరల్‌ ఇంద్రపాలెం శ్రీనివాసునగర్‌లో చోటుచేసుకుంది. స్థానికంగా మాంసం దుకాణం నిర్వహించే దుమ్ము విరేంద్ర, ఆను సూరిబాబు ప్రసాద్‌, జగదీష్‌, రమణ, లక్ష్మి, ఎర్రయ్య, బుల్లయ్యలు ఎనిమిదేళ్లుగా స్నేహితులు. కొన్ని రోజుల క్రితం ఫేస్‌ బుక్‌లోని లక్ష్మి పెట్టిన పోస్టింగ్‌కు దుమ్ము వీరేంద్ర ఛీ అని కామెంట్‌ పెట్టాడు. దీనిపై లక్ష్మి తమ్ముళ్లు ఎర్రయ్య, బుల్లయ్యలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోపాన్ని అణచుకోలేక, గత నెల 29వ తేదీన.. మద్యం పార్టీ అనంతరం, వారు వీరేంద్రని కత్తితో పొడిచి చంపారన్నది పోలీసుల కథనం.

నెటిజన్ల దిగ్భ్రాంతి....
మే 29 నుంచి వీరేంద్ర కనిపించక పోవడంతో.. మిస్సింగ్‌ కేసు నమోదైంది. రంగంలోకి దిగిన పోలీసులు, విచారణలో లక్ష్మి సోదరులే వీరేంద్రను హత్య చేసినట్లు గుర్తించారు. పరారీలోని నిందితులను ప్రత్యేక బృందాల ద్వారా గాలించి, పట్టుకున్నారు. వీరితో పాటు, హత్యకు సహకరించిన వాళ్లనీ అరెస్టు చేసి, హత్యకు ఉపయోగించిన మారణాయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఫేస్‌బుక్‌లో చేసిన వ్యాఖ్యలు.. అందునా స్నేహితురాలి పోస్టును వ్యతిరేకిస్తూ చేసిన వ్యాఖ్యలు.. ఏకంగా యువకుడి ప్రాణాలనే బలిగొందన్న విషయం తెలియడంతో.. నెటిజన్‌లు కూడా దిగ్భ్రాంతికి గురవుతున్నారు. 

18:42 - June 10, 2017

తూర్పు గోదావరి : జనసేన పార్టీ కార్యకర్తల కోసం కాకినాడలో పరీక్షలు జరుగుతున్నాయి. పార్టీ సిద్ధంతాలు జనంలోకి తీసుకెళ్లేందుకు సమర్థులైన యువత ఎంపిక కోసం ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. జనసైనికులుగా ఎంపికయ్యేందుకు యువతీ యువకులు భారీగా హాజరయ్యారు. జిల్లాలో 4500 మంది ఆన్‌లైన్‌లో దరకాస్తు చేసుకున్నారు. పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి శిక్షణ అనంతరం... జిల్లా బాధ్యతలు అప్పగిస్తామని పార్టీ మీడియా ఇంఛార్జ్ హరిప్రసాద్ తెలిపారు.

 

18:41 - June 10, 2017

నెల్లూరు : రాష్ట్రంలో రైతులకు ఈ ఏడాది 92 వేల కోట్లు రుణాలను ఇచ్చే విధంగా టార్గెట్ పెట్లుకున్నామన్నారు వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. నెల్లూరు కోపరేటివ్ అర్బన్ బ్యాంకు లిమిటెడ్ శతాబ్ధి ఉత్పవాలకు మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. సహకార బ్యాంకులకు ప్రభుత్వం తరపున అన్ని సహాయ సహకాలు అందిస్తామన్నారు. 

17:58 - June 10, 2017

హైదరాబాద్ : బీఫ్‌పై ఆంక్షలు విధిస్తూ... బీజేపీ ప్రభుత్వం మైండ్‌ గేమ్‌ ఆడుతోందని నల్సార్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ వాగేసన్‌ అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పశు విక్రయాలపై ఆంక్షలు-పర్యవసనాలు అనే అంశంపై సెమినార్‌ జరిగింది. బీఫ్‌ ఆంక్షలు సరైనవి కావని.. దీని వల్ల రైతులపై తీవ్ర ప్రభావం పడుతుందని వాగేసన్‌ అభిప్రాయపడ్డారు. అలాగే రైతుల ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్న చేయడమే ప్రభుత్ ధ్యేయంగా ఉందని ఐఐటీ ప్రొఫెసర్‌ వెంకటేశ్‌ విమర్శించారు. 25 లక్షల మంది భారతీయులు చర్మ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. 

17:56 - June 10, 2017

వరంగల్ : వచ్చే జూన్‌ నాటికి వరంగల్‌ జిల్లాలోని ఆయకట్టు కింద ప్రతి ఎకరానికీ సాగు నీరందిస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. వరంగల్‌ రూరల్‌ జిల్లాలో ఆయనీరోజు పర్యటించారు..ఈ సందర్భంగా ఎఆర్ఎస్పీ కాలువ రెండో దశ పనులను పరిశీలించారు. అవసరమున్న చోట చెక్‌ డ్యాంల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కొత్తూరు గ్రామంలో చెక్‌డ్యాం నిర్మాణానికి 7కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నామని, వర్ధన్నపేట మండలంలోని ఆకేరు వాగు నీటిని పోలాలకు తరలించేలా చర్యలు తీసుకుంటామని హరీశ్‌రావు హామీ ఇచ్చారు. 

17:55 - June 10, 2017

హైదరాబాద్ : మియాపూర్ ల్యాండ్ స్కామంలో కేసీఆర్ హ‌స్తం ఉంద‌ని ఆరోపించారు ఎఐసీసీ సెక్రటరీమ‌ధు యాష్కీ గౌడ్ . ఈ స్కామ్ పై ప్రభుత్వాన్ని ముందు ప్రజాకోర్టులో నిలదీస్తామని... ఆ త‌ర్వాత కోర్టుకు వెళ‌తామ‌ని తెలిపారు. ఈ విషయంలో జాతీయస్థాయిలో తాము పోరాటం సాగిస్తామని ముధుయాష్కి హెచ్చరించారు.

17:53 - June 10, 2017
17:49 - June 10, 2017
17:20 - June 10, 2017

యాదాద్రి : యాదగిరిగుట్టలో దారుణం జరిగింది. ప్రియురాలు గాయత్రిని ప్రియుడు శ్రీకాంత్ కత్తితో పొడిచాడు. గాయత్రిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. శ్రీకాంత్, గాయత్రి గత కొద్ది కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వారి పెళ్లి విషయమై ఇరువురి తల్లిదండ్రలు చర్చించారు. శ్రీకాంత్ ఏ ఉద్యోగం లేదు కాబట్టి అమ్మాయి తరుపువారు పెళ్లి నిరాకరించారు. అంతేకాకుండా గాయత్రి మరో వ్యక్తితో పెళ్లి ఒప్పుకుంది. ఆ వ్యక్తితో రేపు ఎంగెజ్ మెంట్ జరుగనుంది. ఈ రోజు మధ్యాహ్నాం 2గంటల సమయంలో గాయంత్రి ఇంటి వచ్చిన శ్రీకాంత్ వచ్చి కత్తితో ఎడు పోట్లు పొడవడంతో గాయత్రి తమ్ముడు అరవడంతో చుట్టుపక్కలవారు వచ్చి ఆసుపత్రికి తరలించారు. తనకు దక్కాంది మరో వ్యక్తి దక్కకుండా గాయత్రిని చంపినట్లు తెలిసింది. నిందితుడు స్థానిక పోలీసు స్టేషన్ లో లొంగిపోయినట్లు సమాచారం. 

17:10 - June 10, 2017

హైదరాబాద్ : డీఎస్సీ నోటిఫికేషన్ పేరుతో మూడేళ్లు కాలయాపన చేసిన తెలంగాణ ప్రభుత్వం..ఇప్పుడు పాత జిల్లాల ప్రకారం కాకుండా కొత్త జిల్లాల ప్రకారం డీఎస్సీ నిర్వహిస్తామంటూ ఆందోళనకు గురిచేస్తున్నారని అభ్యర్ధులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే గురుకుల పోస్టుల భర్తీకి పాత జిల్లాల వారీగా నిర్వహించారని అదే ప్రకారం తమకు కూడా నిర్వహించాలని డైరెక్టర్ ఆఫ్‌ స్కూల్ ఎడ్యుకేషన్ ఎదుట అభ్యర్థులు ధర్నా నిర్వహించారు. నాలుగు జిల్లాల్లోనే 10వేల టీచర్ పొస్టులు ఉన్నాయని కొత్త జిల్లాల ప్రకారం డీఎస్సీ నిర్వహిస్తే కొన్ని జిల్లాలకు రెండు, మూడు పొస్టులు మత్రమే వస్తాయిని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ మూడు సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తుందని వారు విమర్శించారు. టెట్ తో పాటే డీఎస్సీకి కూడా నోటిఫికేషన్ ఇవ్వలని వారు డిమాండ్ చేశారు. 

16:58 - June 10, 2017

హైదరాబాద్ : బంజారాహిల్స్‌ ఎంఎల్‌ఏ కాలనీలోని పాల్వాయి నివాసం నుంచి ఆయన భౌతిక కాయాన్ని ప్రభుత్వం లాంఛనాలతో గాంధీ భవన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పాల్వాయి భౌతికకాయానికి పలువురు నేతలు నివాళులు అర్పించారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలతో పాటు, టీడీపీ, బీజేపీ, టీఆర్‌ఎస్, లెఫ్ట్‌ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు పాల్వాయి మృతిపై ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పాల్వయి మంచి మనిషని, ఆయన మాకు చుట్టం అవుతడాని హోం మంత్రి నాయిని అన్నారు. తెలంగాణ సమస్య గురించి ఢిల్లీ వెళ్లినప్పుడు పాల్వయి బాగా స్పందించేవారని టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ అన్నారు. 

16:57 - June 10, 2017

నల్లగొండ : గుండెపోటుతో కన్నుమూసిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పాల్వాయి గోవర్ధనరెడ్డి మృతదేహానికి కాసేపట్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. స్వగ్రామం నల్లగొండ జిల్లా ఇడికూడికి భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకున్నారు. కాసేపట్లో అధికార లాంఛనాలతో పాల్వాయి అంత్యక్రియలు నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

16:53 - June 10, 2017

గుంటూరు : ఉండవల్లిలోని తన నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీఆర్ డీఏ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో అమరావతిలోని ప్రభుత్వ భవనాల తుది మాస్టర్ ప్లాన్‌తో పాటు.. అందులోని రెండు ఐకానిక్ భవంతుల్లో ఒకటైన అసెంబ్లీ తుది నమూనా, హైకోర్టు ముసాయిదా నమూనాను... నార్మన్ పోస్టర్ సంస్థ ప్రతినిధులు అందించారు. వీటితో పాటు అమరావతిలో ఎకనామిక్స్ సిటీ, స్పోర్ట్స్ సిటీస్‌పై మెకెన్సీ సంస్థ తమ నివేదిక సమర్పించింది. రాజధానిలో ఇల్లులేని వ్యవసాయ కూలీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 10చోట్ల ఇల్లు కట్టించాలని సమావేశంలో నిర్ణయించారు.

ఉద్యోగులో పై ఎమ్మెల్యే చెవిరెడ్డి వ్యాఖ్యలు సరికాదు:చినరాజప్ప

అమరావతి: సీఎం చంద్రబాబు నాయుడుతో హోంమంత్రి శివరాజప్ప భేటీ అయ్యారు. ఉద్యోగులో పై వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి వ్యాఖ్యలు సరికాదని హోంమంత్రి చినరాజప్ప అన్నారు. అధికార పార్టీ గ్రాఫ్ ఏంటో బిజెపి, వైసీపీల కంటే ప్రజలకే ఎక్కువ తెలుసునన్నారు. టిడిపికి 80శాతం ప్రజల మద్దతు ఉందన్నారు. మరోసారి అధికారంలోకి వస్తామని జోస్యం చెప్పారు. త్వరలో ఐపీఎస్ ల బదిలీలు చేపడతామన్నారు.

అనంతపురం ఇందిరా నగర్ లో దారుణం...

అనంతపురం: ఇందిరానగర్ లో దారుణం జరిగింది. 10 ఏళ్ల బాలుడి పై దుండగులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

ఏరువాకతో రైతులకు ఒరింగేదమీలేదు: రఘువీరా

అనంతపురం: ఏరువాకతో రైతులకు ఒరిగిందేమీ లేదని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా అన్నారు. భూకబ్జాదారులు, రౌడీలను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. 2019లో మేం అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా ఇస్తామని తెలిపారు.

కాసేపట్లో పాల్వాయి అంత్యక్రియలు

నల్గొండ: పాల్వాయి అంత్యక్రియలు ప్రారంభం అయ్యాయి. కాసేపట్లో పాల్వాయి అంత్యక్రియలు జరగనున్నాయి. పలు పార్టీల నేతలు పాల్వాయికి నివాళులర్పించారు.

16:16 - June 10, 2017

భూపాలలపల్లి : ఉదయం నుంచి టెన్ టివిలో వరుస కథనలతో తాడ్వాయి మండలంలో సామూహిక అత్యాచారం ఘటనపై ఉన్నతధికారులు స్పందించారు. ఎస్పీ భాస్కర్ నిందితులపై కేసు నమోదుకు ఆదేశించారు. ఏటూరు నాగారం సీఐ ఆధ్వర్యంలో బాధితురాల నుంచి వివరాలు సేకరించారు. ఫారెస్ట్ ఉద్యోగి సంతోష్, బీట్ ఆఫీసర్ కల్యాణి భర్త విజయ్ కుమార్ లను తప్పించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

 

16:14 - June 10, 2017

వరంగల్ : 2017 లాసెట్ ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. టీఎస్ లాసెట్ కన్వీనర్ రంగారావు మాట్లాడుతూ వరుసగా మూడవ సంవత్సరం ప్రభుత్వం కాకతీయకు లాసెట్ నిర్వహించడానికి అవకాశం కల్పించిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగేడ్ల కోర్సు కు 21 కాలేజీలు, రెండేళ్ల కోర్సుకు 14 కాలేజీలు, పీజీ కోర్సుకు 13 కాలేజీలు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. 

16:13 - June 10, 2017

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ల బదిలీల్లో అసంతృప్త సెగలు మొదలైయ్యాయి. బదిలీలపై సీనియర్ అధికారులు మండిపడుతున్నారు. టీజీవో నేత మమత గంటల వ్యవధిలో తన ట్రాన్స్ ఫర్ అర్డర్స్ మార్పించుకున్నారు. ఆమెను జూబ్లీహిల్స్ కు బదిలీ చేస్తే ఆమె తిరిగి అదే స్థానంలో పొస్టింగ్ తెచ్చుకున్నారు. గత 6నెలల క్రితమే జీహెచ్ కమిషనర్ జనార్ధన్ రెడ్డి బదిలీలను నిర్ణయించారు. కానీ ప్రభుత్వ అనుమతి కోసం ఇన్నీ రోజులు చూసారు. కానీ బదిలీల్లో రాజకీయా జోక్యంపై సీరియస్ గా ఉన్నారు.

 

రాజధానిలో ఇల్లు లేని వ్యవసాయ కూలీలకు ఇళ్లు...

అమరావతి: సీఆర్డీఏ పై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఎకనామిక్స్ సిటీ, స్పోర్ట్స్ సిటీస్ పై నివేదిక అందిందని, జాతీయ క్రీడల నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారని మంత్రి నారాయణ తెలిపారు. రాజధానిలో ఇల్లు లేని వ్యవసాయ కూలీలు కేంద్రం సహకరాంతో 10 చోట్ల ఇళ్ల నిర్మాణం చేపడతామన్నారు. శాఖమూరు వద్ద 250 ఎకరాల్లో పార్క్ నిర్మాణం, సీడ్ యాక్సెస్ రోడ్డు, భూసేకరణ 45 రోజుల్లో పూర్తవుతుందన్నారు.

సోలార్ ప్రాజెక్టు నిర్వాసిత రైతు ఆత్మహత్య

అనంతపురం : కదిరి నియోజకవర్గం నంబలపూలకుంటలో సోలార్ ప్రాజెక్టు నిర్వాసిత రైతు మౌలాసాబ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నష్టపరిహారం చెల్లించలేదని మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని... తమకు న్యాయం చేయాలని మృతదేహంతో బంధువులు ఆందోళన చేపట్టారు.

ప్రేమించాలంటూ ఫోనులో వేధిస్తున్న కానిస్టేబుల్

కర్నూలు : శ్రీశైలంలో కానిస్టేబుల్ పోకిరి చేష్టలు ఎక్కువయ్యాయి. ప్రేమించాలంటూ బాలికను ఫోనులో వేధిస్తున్న కానిస్టేబుల్ ఉమ్లా నాయక్. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదు. దీంతో ఎస్పీకి నేరుగా బాధితురాలు ఫిర్యాదు చేసింది.

 

కాసేపట్లో పాల్వాయి అంత్యక్రియలు

నల్గొండ : పాల్వాయి స్వగ్రామానికి మృతదేహం చేరుకుంది. స్థానికులు పాల్వాయిని కడసారి చూసుకునేందుకు ప్రజలు తరలి వస్తున్నారు. కాసేపట్లో పాల్వాయి అంత్యక్రియలు జరగనున్నాయి.

డిప్యూటీ కమిషనర్ల బదిలీల్లో అసంతృప్తి సెగలు

హైదరాబాద్: జీహెచ్ ఎంసీ డిప్యూటీ కమిషనర్ల బదిలీల్లో అసంతృప్తి సెగలు అలముకున్నాయి. బదిలీలపై సీనియర్ అధికారులు మండిపడుతున్నారు. గంటల వ్యవధిలో ఉద్యోగ సంఘం నేతలు ఆర్డర్లను మార్చేశారు. హాట్ కేక్ గా శేరిలింగంపల్లి,గచ్చిబౌలి, కూకట్ పల్లి సర్కిళ్లు మారాయి. అక్కడికి వెళ్లేందుకు కొంత మంది అధికారులు ఆసక్తి చూపిస్తున్నారు.

శ్రీనగర్ లో ఉగ్రవాదల కలకలం

జమ్మూకశ్మీర్ : శ్రీనగర్ లో ఉగ్రవాదల కలకలం రేగింది. లాల్ చౌక్ లో ఆర్మీ ఆపరేషన్ కొనసాగుతోంది. పలువురు ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారంతో ఈ ఆపరేషన్ కొనసాగుతోంది.

గొత్తికోయ అత్యాచార ఘటనపై పోలీసులు స్పందన

జయశంకర్ భూపాలపల్లి: తాడ్వాఇయి మండలం ముసలమ్మ పేటలో గొత్తికోయ బాలికపై సామూహితక అత్యాచారం ఘటన పై కేసు నమోదు చేయాలని ఎస్పీ భాస్కరన్ ఆదేశించారు. ఏటూరునాగారం పోలీసులు బాధితురాలి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఇద్దరు ఫారెస్ట్ బేస్ క్యాంప్ ఉద్యోగుగులు విజయ్ కుమార్, సంతోష్ లను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు బయలుదేరారు.

14:36 - June 10, 2017

హైదరాబాద్ : సోమవారం నుంచి పాఠశాలలు ప్రారంభంకాబోతున్నాయి. ఇన్నాళ్లు వేసవి సెలవులను ఎంజాయ్‌ చేసిన విద్యార్ధులు మళ్లీ పుస్తకాలతో కుస్తీపట్టబోతున్నారు. ఇక తల్లిదండ్రులైతే తమ పిల్లలకు బుక్స్‌, నోట్‌బుక్స్‌, డ్రస్‌, షూస్‌తోపాటు వారి చదువులకు కావాల్సిన సకలం సమకూర్చే పనిలో బిజీబిజీగా ఉన్నారు. స్కూల్‌ ఫీజుల దగ్గరికి వచ్చే సరికే పేరెంట్స్‌ గుండెలు గుభేల్‌ మంటున్నాయి. ఎల్‌కేజీ చదువులకే వేలల్లో ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. హైదరాబాద్‌లో ఈ ఫీజుల భారం మరింత ఎక్కువగా ఉంది. కాస్తో కూస్తో మంచి ప్రేవేట్‌ స్కూల్‌లో తమ పిల్లలను చేర్పిస్తే ఎల్‌కేజీకే 20 నుంచి 28 వేలకు వరకు ఫీజు చెల్లించాల్సి వస్తోంది. డొనేషన్‌ ఫీజు దీనికి అదనం. ఇక కార్పొరేట్‌ స్కూల్ అయితే ఈఫీజు ఏకంగా డబుల్‌ అవుతుంది. ప్రైవేట్‌ , కార్పొరేట్‌ పాఠశాలలు ప్రతి ఏటా 10 నుంచి 20శాతం ఫీజులు పెంచుకుంటూ పోతున్నాయి. ఫీజులు పెంపునకు శాస్త్రీయత ఉండదు. దీంతో విద్యార్ధుల స్కూల్‌ ఫీజులు తల్లిదండ్రులకు తలకు మించిన భారం అవుతున్నాయి. ఏడాది సంపాదించినదాంట్లో 60 శాతానికిపైగా పిల్లల స్కూల్‌ ఫీజులకే చెల్లించాల్సి వస్తోంది.

ఫీజుల భారం మోయలేని తల్లిదండ్రులు
తెలంగాణలో ఫీజుల భారం మోయలేక తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు పోరాటాలు చేస్తున్నాయి. కానీ ఫీజుల భారం మాత్రం తగ్గలేదు. అయితే పేరెంట్స్‌, ప్రజాసంఘాల ఆందోళనలతో ప్రభుత్వం ఓయూ మాజీ వీసీ తిరుపతిరావు అధ్యక్షతన ఓ కమిటీని మాత్రం ఏర్పాటు చేసింది. తిరుమలరావు కమిటీ వివిధ వర్గాల అభిప్రాయాలను తీసుకుని ఓ నివేదికను తయారు చేసింది. అయితే ఆ రిపోర్ట్‌ ఇప్పటికీ బయటకు రాలేదు. దీనికి ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల ఒత్తిడి కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలు తమకు నష్టాలొస్తున్నాయంటూ ప్రభుత్వాన్ని సైడ్‌ట్రాక్‌ పట్టిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రైవేట్‌ స్కూల్స్‌ ఫీజులపై హైదరాబాద్‌ స్కూల్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌ ప్రభుత్వం నుంచి ఆర్‌టీఐ ద్వారా సమాచారాన్ని సేకరించింది. ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టులో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. విద్యాహక్కు చట్టం ప్రకారం ఫ్యాకల్టీకి 50శాతం వేతనాలు చెల్లించాల్సి ఉండగా.. ప్రైవేట్‌, కార్పొరేట్‌ స్కూల్స్‌ కేవలం 10 నుంచి 15శాతమే చెల్లిస్తున్నాయి. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు అరకొరకాగానే ఉంటున్నాయి. విద్యార్ధుల నుంచి వసూలు చేస్తున్న ఫీజుల్లో 60శాతానిపైగా యాజమాన్యాలు లాభాలు గడిస్తున్నట్టు రిపోర్ట్‌లో తేలింది.

ప్రభుత్వానికి దొంగ లెక్కలు
60శాతం లాభాలు ఆర్జిస్తున్న పాఠశాలల యాజమన్యాలు నష్టాల్లో ఉన్నామంటూ ప్రభుత్వానికి దొంగ లెక్కలు చూపుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ఆడిట్‌లో సిబ్బంది వేతనాలు, సదుపాయాలు, మెయింటనెన్స్‌ను ఎక్కువ చేసి చూపుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో టాప్‌ స్కూల్స్‌గా చలామణి అవుతున్న చిరాక్‌ పబ్లిక్‌స్కూల్‌, ఓక్రిడ్జ్‌, శ్రీచైతన్య, నారాయణ వంటి స్కూల్స్‌ తల్లిదండ్రుల ఏటా కోట్లాది రూపాయలు వసూలు చేస్తూ.. బయటకు మాత్రం తప్పుడు లెక్కలు చూపుతున్నాయని హెచ్‌ఎస్‌పీఏ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాల ఫీజుల దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పేరెంట్స్‌ కోరుతున్నారు. లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు.

 

14:34 - June 10, 2017

కృష్ణా : విజయవాడ సమీపంలోని గొల్లపూడిలో ఏరువాక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మంత్రి దేవినేని ఉమామహేవ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఈ సంవత్సరాం బాగానే ఉంటుందని, దుక్కులు దున్నడానికి, విత్తనాలు వేయడానికి వాతవరణం అనూకులంగా ఉందని రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది పంటులు బాగా పంగే అవకాశం ఉందని, టీతో సమస్యలేదని వారు తెలిపారు. 

14:33 - June 10, 2017

హైదరాబాద్ : తనపై వచ్చిన భూ ఆరోపణలను కే.కేశవరావు ఖండించారు. తాను భూములు కొన్న మాట వాస్తవమే కానీ.. అందులో ప్రభుత్వ భూములు లేవన్నారు కేకే. ఎవరో కావాలని తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. త్వరలోనే అన్ని వివరాలు తెలుస్తాయాని ఆయన తెలిపారు. 

13:42 - June 10, 2017

విజయవాడ : పటమట సమీపంలోని అశోక్‌నగర్‌లో మహిళా వైద్యురాలు సుష్మ ఆత్మహత్య చేసుకుంది. బుధవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. అయితే సుష్మ ఆత్మహత్యకు భర్త వేధింపులే కారణమని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సోమవారం వరకు అంత్యక్రియలు జరిపేది లేదంటున్నారు. 

సివిల్ సప్లై శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్: సివిల్ సప్లై శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సారి 37 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు అధికారులకు కేసీఆర్ వివరించారు. మరో 2 లక్షల టన్నులు వచ్చే అవకాశం ఉందని, దీనికి రూ.5,300 కోట్లు చెల్లించాల్సి ఉండగా రూ.4,500 కోట్లుచెల్లించామని అధికారులు తెలిపారు. మిగిలిన రూ.1000 కోట్లు సమకూర్చుకోవాలని సూచించారు. ఖరీఫ్ లో పెట్టుబడులకు రైతులకు డబ్బులు అవసరం కనుక ఎలాంటి జాప్యం లేకుండా రైతులకు డబ్బులు చెల్లించాలని, గతంలో ఎన్నడూ లేని విధంగా పంటలు రికార్డు స్థాయిలో పండాయని, అతే స్థాయిలో ధాన్యం కొనుగులుకు వస్తోందని కేసీఆర్ తెలిపారు.

13:37 - June 10, 2017

టీఎస్ పీఎస్సీ డైరెక్టర్ ను ముట్టడించిన డీఎడ్, బీఎడ్ అభ్యర్థులు

హైదరాబాద్: డీఎడ్, బీఎడ్ అభ్యర్థులు టీఎస్ పీఎస్సీ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయాలను ముట్టడించారు. పాత జిల్లాల ప్రకారమే డీఎస్సీ నిర్వహించాలని టెట్ తో పాటే డీఎస్సీ షెడ్యూల్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.

మియాపూర్ కుంభకోణంలో కేసీఆర్ హస్తం: మధుయాష్కీ

హైదరాబాద్: మియాపూర్ కుంభకోణంలో కేసీఆర్ హస్తం ఉంది ఈ స్కామ్ పై ముందు ప్రజా కోర్టులో తర్వాత కోర్టులో తేల్చుకుంటామని మధుయాష్కీ గౌడ్ డిమాండ్ చేశారు.

కేసీఆర్ పాలన అంతా డూప్లికేట్ : జీవన్ రెడ్డి

హైదరాబాద్: మియాపూర్ భూముల వ్యవహారంపై సీబీఐ విచారణకు సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రశ్నించారు. తక్షణమే భూమిని స్వాధీనం చేసుకొని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించాలని డిమాండ్ చేశారు. మియాపూర్, ఇబ్రహీంపట్నంలో భూ కుంభకోణాలు ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే జరిగాయని ఆరోపించారు. కేసీఆర్ పాలన అంతా డూప్లికేట్ పాలన అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.

13:11 - June 10, 2017

పశ్చిమగోదావరి : ఏలూరులో ముగ్గురిని హత్య చేసేందుకు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఓ ప్రజాప్రతినిధి, ప్రముఖవ్యక్తి, రౌడీషీటర్‌ను హత్య చేసేందుకు టీడీపీ నేత రెడ్డప్పలనాయుడు కుట్ర పన్నాడని పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేశారు. మరో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే చింతమనేనిని హత్య చేసేందుకు కుట్ర పన్నినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో చింతమనేని, రెడ్డప్పలనాయుడుకు మధ్య విభేదాలు ఉన్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

12:45 - June 10, 2017

ఢిల్లీ : టాలీవుడ్‌ హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో బాలకృష్ణ అభిమానులు, టీడీపీ నేతలు కేక్‌ కట్‌ చేశారు. అనంతరం అనేక స్వచ్చంద కార్యక్రమాల్లో అభిమానులు పాల్గొన్నారు. 

 

జాతీయ రహదారు విస్తరణ - అభివృద్ధి పై సదస్సు

హైదరాబాద్ : పర్యావరణ రహిత జాతీయ రహదారు విస్తరణ - అభివృద్ధి పై అరణ్య భవన్ లో సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో నేషనల్ హైవేస్ అథారిటీ సలహాదారు భట్టాచార్య ప్రధన అటవీ సంరక్షణ అధికారి పీకే ఝూ, హరితహారం ఓఎస్టీ ప్రియాంక వర్గీస్, జాతీయ రహదారులు, అభివృద్ధిలో వాటి పాత్ర, పర్యావరణ రక్షణ పై భట్టాచార్య పవర్ పాయింట్ ప్రజెంటేసన్ ఇవ్వనున్నారు. తెలంగాణ జాతీయ రహదారుల విస్తరణ, పర్యావరణ రోణ, అటవీ శాఖ పాత్ర పై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

ఏలూరులో ముగ్గురి హత్య కుట్ర భగ్నం

ప.గో: ఏలూరులో ముగ్గురి హత్య కుట్ర భగ్నం అయ్యింది. ఓ ప్రజాప్రతినిధి, ఓ ప్రముఖ వ్యక్తి, రౌడీషీటర్ ను హత్య చేసేందుకు రెడ్డప్పలనాయుడు కుట్ర పన్నాడు. టిడిపి నేత రెడ్డప్పల నాయుడు సహా 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

స్వగ్రామానికి పాల్వాయి మృత దేహం

హైదరాబాద్: నిన్న సిమ్లాలో గుండె పోటుతో మృతి చెందిన కాంగ్రెస్ ఎంపి పాల్వాయి గోవర్థన్ రెడ్డి మృతదేహాన్ని ఆయన స్వగ్రామానికి తరలించారు. ఈ రోజు సాయంత్రం నల్గొండ జిల్లా ఇడికుడలో అంత్యక్రియలు జరగనున్నాయి.

12:38 - June 10, 2017

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ నేత, రాజ్యసభ సభ్యుడు కేకేపై భూఆరోపణలు వచ్చాయి. మియాపూర్‌ భూకుంభకోణంలో పాత్ర ఉన్న గోల్డ్‌స్టోన్‌ ప్రసాద్‌ నుంచి భూములు కొనుగోలు చేసినట్లు వస్తున్న ఆరోపణలను కేకే ఖండించారు. ఈమేరకు ఆయన టెన్ టివితో మాట్లాడారు. అన్ని సరిచూసుకున్నాకే భూములు కొనుగోలు చేశామన్నారు. తాము కొనుగోలు చేసిన భూముల్లో ప్రభుత్వ భూములు లేవని స్పష్టం చేశారు. అన్ని సరిచూసుకున్నాకే భూములు కొనుగోలు చేశామని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే భూములు కొనుగోలు చేశామని చెప్పారు. ఎవరో కావాలని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. 

ఏలూరులో ముగ్గురి హత్య కుట్ర భగ్నం

ప.గో: ఏలూరులో ముగ్గురి హత్య కుట్ర భగ్నం అయ్యింది. ఓ ప్రజాప్రతినిధి, ఓ ప్రముఖ వ్యక్తి, రౌడీషీటర్ ను హత్య చేసేందుకు రెడ్డప్పలనాయుడు కుట్ర పన్నాడు. టిడిపి నేత రెడ్డప్పల నాయుడు సహా 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

12:33 - June 10, 2017

విజయనగరం :  జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కేఎల్‌పురం రైల్వే బ్రిడ్జి దగ్గర బైక్‌ను ఢీకొని లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. 

12:24 - June 10, 2017

జయశంకర్ భూపాలపల్లి : దేశంలో ఎన్ని అత్యాచార నిరోధక చట్టాలు వచ్చినా అత్యాచారాలు ఆగడం లేదు. ప్రతిరోజు ఏదో ఒకచోట మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారు. ఒక ఘటన మరిచిపోకముందే మరో ఘటన జరుగుతుంది. తాజాగా మేడారం అడవుల్లో మరో అత్యాచార ఘటన చోటుచేసుకుంది. చత్తీస్ గడ్ నుంచి వలసవచ్చిన గిరిజన కుటుంబం జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం అడవుల్లోని ముసలమ్మపెంటలో నివాసముంటున్నారు. ముగ్గురు యువతులు ఇప్పపువ్వు ఏరుకోవడం కోసం అడవికి వెళ్లారు. ఈనేపథ్యంలో భారత్ దేశ్ క్యాంప్ కు చెందిన విజయ్, సంతోష్ లు యువతుల వెంటపడ్డారు. నార్లాపూర్ శివారులోని గొత్తికోయగూడెంలో ఒక బాలికపై విజయ్, సంతోష్ లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

ఐపోలవరం మండలం కొమరగిరిలో ఉద్రిక్తత

తూ.గో : ఐపోలవరం మండలం కొమరగిరిలో ఉద్రిక్తత నెలకొంది. రొయ్యల చెరువు తవ్వకాలను స్థానికులు అడ్డుకున్నారు. అధికారులు స్పందించకపోవడంతో ఈశ్వరరావు అనే రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

నిరాహారదీక్షను ప్రారంభించిన మధ్యప్రదేశ్ సీఎం

భోపాల్: మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్ ఇవాళ నిరాహార దీక్ష‌కు దిగారు. త‌న భార్య సాధ‌న‌తో క‌లిసి ఆయ‌న దీక్ష‌లో కూర్చున్నారు. రాష్ట్రంలో శాంతియుత ప‌రిస్థితులు నెల‌కొనే వ‌ర‌కు దీక్ష కొన‌సాగించ‌నున్న‌ట్లు సీఎం శివ‌రాజ్ చెప్పారు. భోపాల్‌లోని దస‌రా మైదానంలో దీక్ష కొన‌సాగుతున్న‌ది.

 

వివాదాస్పద భూమిని కొనలేదు: కేకే

హైదరాబాద్: తాను వివాదాస్పద భూమి కొనలేదని తెరాస సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాలతోనే ఇబ్రహీంపట్నం వద్ద భూమి రిజిస్ట్రేషన్‌ అయిందని చెప్పారు. కోర్టు దిశా నిర్దేశంతోనే ప్రభుత్వం కూడా రిజిస్ట్రేషన్‌ చేయమని చెప్పిందని వివరించారు. భూమి కొనుగోలు చేసే ముందు రెవెన్యూ ముఖ్య కార్యదర్శి అభిప్రాయం కూడా తీసుకున్నామని చెప్పారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అభిప్రాయం కూడా కోరామని తెలిపారు. తనకు భూమి రిజిస్ట్రేషన్‌ చేసిన ఇంఛార్జి సబ్‌ రిజిస్ట్రార్‌ను సస్పెండ్‌ చేయడం కోర్టు ధిక్కారమేనని పేర్కొన్నారు.

భర్త వేధింపుల వల్లే డా.సుష్మఆత్మహత్య: బంధువులు

విజయవాడ: అశోక్ నగర్ లో సుష్మ అనే మహిళా డాక్టర్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త వేధింపుల వల్లే సుష్మఆత్మహత్య చేసుకుందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ రోజులవుతున్నా అంత్యక్రియలకు సుష్మ బంధువు అడ్డుకుంటున్నారు.

11:43 - June 10, 2017

యాదాద్రి భువనగిరి : కులదురహంకారంతో హత్యలు చేస్తున్న వారిని సామాజిక బహిష్కారం చేయాలని సీపీంఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. యాదాద్రిజిల్లా భువనగిరిలో జరిగిన  సభలో పెద్ద ఆయన పాల్గొన్నారు. నరేశ్‌ అంబోజి కుటుంబానికి వామపక్షాలు, ప్రజాసంఘాలు బాసటగా నిలుస్తాయని.. న్యాయం జరిగే వరకు , నిందితులకు శిక్షలు పడేవరకు పోరాటం చేస్తామన్నారు ప్రజాసంఘాల నేతలు.
భువనగిరిలో భారీ బహిరంగసభ 
అంబోజు నరేశ్‌..స్వాతిల హత్యలను నిరసిస్తూ వామపక్షాలు, 83 ప్రజాసంఘాలు భువనగిరిలో కదంతొక్కాయి. పట్టణంలోని జగ్జీవన్‌రామ్‌ విగ్రం వద్ద  పౌర, సామాజిక, ప్రజాసంఘాల పేరుతో బహిరంగసభను నిర్వహించారు. నరేశ్‌-స్వాతిల హత్యపై సమగ్ర న్యాయవిచారణ జరిపించాలని, నరేశ్‌కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. 
నరేశ్...స్వాతి హత్యలను కులాల ఘర్షణగా చిత్రించే కుట్ర..!
నరేశ్.. స్వాతిల హత్యను కులాల మధ్య సంఘర్షణగా చిత్రించేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని.. అలాంటి కుట్రలను విఫలం చేయాలన్నారు  సీపీఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం. నరేశ్‌ కుటుంబానికి న్యాయం జరిగేవరకు వామపక్షాలు రాజీలేని పోరాటం చేస్తాయని తేల్చి చెప్పారు. దీనికోసం మిగతా రాజకీయపార్టీలను, యాద్రాద్రిజిల్లా  టీఆర్‌ఎస్‌ నాయకులను కూడా కలుపుకుని పోరాడతామన్నారు.
నిందితులకే వత్తాసు పలుకుతున్న పోలీసులు
కులదురహంకారంతో జరిగిన స్వాతి నరేశ్‌ల హత్యలను ప్రజలందరూ ఖండించాలని వామపక్షాలు పిలుపునిచ్చాయి. పోలీసు వ్యవస్థసైతం నిందితుల పక్షం వహించడంపై ప్రజాసంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రక్షణలేకుండా పోయిందని మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగిపోయాయన్నారు.  మేజర్లైన యువకులు తమకు నచ్చిన వారిని పెళ్లిచేసుకునే హక్కును .. ఆదిపత్యకులాల ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని విమర్శించారు. 
ప్రజాసంఘాలు ధర్నా 
అంతకు ముందు ప్రజాసంఘాలు ధర్నాకు దిగాయి. సభాప్రాంగణానికి ఎదురుగా ఉన్న రోడ్డుపై బైఠాయించి.. నరేశ్‌కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌  చేశారు. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ స్థంభించింది. నిందితుడు శ్రీనివాసరెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్న  రామన్నపేట సీఐ శ్రీనివాస్‌, భువనగిరిపట్టణ సీఐ  శంకర్‌గౌడ్‌లపై హత్యకేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. కేసు విచారణకు ప్రత్యేకంగా ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టును ఏర్పాటు చేయాలని,  నరేశ్‌ కుటుంబానికి 25లక్షల రూపాయలు, 3ఎకరాలభూమిని  పరిహారంగా 
ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 
కులాంతర వివాహ రక్షణ చట్టం తేవాలి
ఇప్పటికైనా సీఎం కేసీఆర్‌ స్వాతి-నరేశ్‌ల హత్యపై ఉన్నత స్థాయి దర్యాప్తును చేపట్టి.. తెలంగాణలో సామాజిక న్యాయాన్ని బతికించాలని వామపక్షాలు, ప్రజాసంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.  భవిష్యత్తులో ఇలాంటి కులదురహంకార హత్యలు జరగకుండా.. కులాంతర వివాహాల రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. లేదంటే.. పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేశారు. 

 

మేడారం అడవుల్లో దారుణం

జయశంకర్ భూపాలపల్లి: మేడారం అడవుల్లో దారుణం జరిగింది. తాడ్వాయి మండలం నార్లాపూర్ శివారులోని గొత్తికోయగూడెంలో బాలికపై అత్యాచారం జరిగింది. భారత్ దేశ్ క్యాంప్ కు చెందిన యువకుడిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఛత్తీస్ గఢ్ నుంచి వలస వచ్చిన బాధిత కుటుంబం అని తెలుస్తోంది.

11:13 - June 10, 2017

కర్నూలు : నగరంలో కానిస్టేబుళ్లు వీరంగం సృష్టించారు. నిన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పై స్పెషల్ పార్టీ పోలీసులు దాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడిన మనోజ్, మనికుమార్ లను అధికారులు సస్పెండ్ చేశారు.  మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

భూ కుంభకోణంలో కేకే కుటుంబం

రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం లోని 38 ఎకరాల భూమిని టిఆర్ ఎస్ నేత కేకే కూతురు, కోడలి పేర్ల మీద రిజిస్టేషన్లు అయి ఉన్నాయి. దరఖాస్తు చేసుకున్న ఏడాదికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయ్యింది. సబ్ రిజిస్ట్రార్ సెలవులపై వెళ్లిన సమయంలో ఇన్ ఛార్జ్ రిజిస్ట్రార్ సాహెల్ ఖాద్రి భూమి రిజిస్ట్రేషన్ చేశాడు. దీంతో సాహెల్ ఖాదిర్ ను సస్పెండ్ చేస్తూ రిజిస్ట్రేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

 

11:08 - June 10, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి నేతలను పదవులు ఊరిస్తున్నాయి.. మండలితో పాటు నామినేటెడ్ పోస్టుల కోసం అధికార పార్టీ నేతలు జోరుగా పైరవీలు చేస్తున్నారు.. అధినేతను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు.. మరి ఈ పోస్టుల కోసం పార్టీ మారిన వాళ్లు సైతం ఆశిస్తుండటం గులాబీ శిబిరంలో ఆందోళన కలిగిస్తోంది..
పదవుల కోసం ముమ్మర ప్రయత్నాలు 
అధికారం చేపట్టిన మూడేళ్ల తర్వాత గులాబీ పార్టీలో పదవుల పందేరం మొదలు కావడంతో నేతలు ఆ పదవులు దక్కించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని రోజులుగా అధినేత కేసీఆర్‌ భారీగా పదవులను భర్తీ చేస్తుండటంతో.. ఆయన్ని ప్రసన్నం చేసుకునే పనిలో లీడర్లు నిమగ్నమయ్యారు. గతంలో చెలరేగిన అసంతృప్తులను దృష్టిలో ఉంచుకుని ఈ విడత ఉద్యమకారులకే  పెద్ద పీట వేస్తున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ కావడంతో....రాష్ట్ర స్థాయి పదవులకు, జిల్లా స్థాయి పదవులపై పార్టీ నేతలు భారీగా ఆశలు పెంచుకున్నారు.
జిలాల, రాష్ట్ర కమిటీ, పొలిట్ బ్యూరో త్వరలో భర్తీ 
31 జిల్లాలతో పాటు రాష్ట్ర కమిటీ, పొలిట్ బ్యూరోను త్వరలో భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి సీఎం కెసిఆర్ సీరియస్‌గా కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకుని పదవులను భర్తీ చేయాలనే నిర్ణయాన్ని పార్టీ తీసుకుంది. ఈ విడత పార్టీ పదవుల్లో జిల్లా కమిటీల స్థానంలో ఒక్కరు లేదా ఇద్దరికే పార్టీ పరంగా అవకాశం దక్కనుంది. రాష్ట్ర స్థాయి పదవులు ఆశిస్తున్న వారిలో పలువురు  ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా  ఉన్నట్లు పార్టీ నేతల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ముఖ్యమంత్రి మాత్రం ప్రస్తుతం పదవుల్లో ఉన్న వారికి కాకుండా సీనియర్లతో పాటు పార్టీ అవసరాలకు అనుగుణంగా పనిచేసే నేతలకే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. మరోవైపు పొలిట్ బ్యూరోను సైతం అతి తక్కువ మంది నేతలతో కుదించాలని భావిస్తున్నారట. మొత్తంగా టీఆర్‌ఎస్‌లో భారీగా పదవుల భర్తీ చేస్తుండటంతో.. ఆశావహుల జాబితా అంతకంతకు పెరిగిపోతుండటం పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. వలస నేతలు సైతం ఈ పదవులను ఆశిస్తుండటం గులాబీ శిబిరంలో ఆందోళన కలిగిస్తోంది.

 

10:56 - June 10, 2017

కరీంనగర్ : కోర్టు తీర్పు పట్ల వీణవంకలో అత్యాచారానికి గురైన యువతి హర్షం వ్యక్తం చేస్తోంది. అయితే.. దోషులకు ఉరిశిక్ష వేయాలని కోరుతుంది. ప్రభుత్వం ఆదుకుంటానని హామీ ఇచ్చినా ఇంతవరకు తనకు ఎలాంటి సాయం చేయలేదని బాధితురాలు అంటోంది. మరోవైపు తనకు అండగా నిలిచిన 10టీవీకి బాధితురాలు కృతజ్ఞతలు తెలిపింది. 

 

అస్సాంలో నకిలీ రెండువేల నోట్ల కలకలం

గౌహ‌తి: అస్సాంలో న‌కిలీ రెండు వేల నోట్ల‌ను ప‌ట్టుకున్నారు. సుమారు ఆరు ల‌క్ష‌ల విలువైన న‌కిలీ రెండు వేల నోట్ల క‌ట్ట‌ల‌ను పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి గౌహ‌తి పోలీసులు విచార‌ణ చేప‌డుతున్నారు.

10:50 - June 10, 2017

హైదరాబాద్ : గుండెపోటుతో కన్నుమూసిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పాల్వాయి గోవర్ధనరెడ్డిని కడసారి చూసేందుకు నేతలంతా జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి తరలివస్తున్నారు. కాసేపట్లో గాంధీభవన్‌కు పాల్వాయి భౌతికకాయాన్ని తరలించనున్నారు. అనంతరం నల్లగొండ జిల్లా ఇడికూడికి తీసుకువెళ్తారు. సాయంత్రం అధికార లాంఛనాలతో పాల్వాయి అంత్యక్రియలు నిర్వహిస్తారు. పాల్వాయి భౌతికదేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. పాల్వాయితో తమకున్న అనుబంధాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటున్నారు. 

గాంధీ భవన్ కు పాల్వాయి మృతదేహం

హైదరాబాద్: పాల్వాయి గోవర్ధన్ రెడ్డి భౌతిక కాయాన్ని గాందృ భవన్ కు తరలించారు. అంతక ముందు పాల్వాయి నివాసంలో పలువురు నేతలు నివాళులర్పించారు.

శ్యామల మృతి కేసులో నిందితుడు లొంగుబాటు

రంగారెడ్డి : ధర్మన్న గూడ శ్యామల మృతి కేసులో నిందితుడు కానిస్టేబుల్ నరసింహన ఇంబ్రహీం పట్నం కోర్టు లో లొంగిపోయాడు. నర్శింహను చెంచల్ గూడ జైలు తరలించారు. నర్శింహ పై ఐపీసీ 306,554 డీ, 324 తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

దాడికి పాల్పడిన కానిస్టేబుళ్ల పై వేటు

కర్నూలు : స్పెషల్ పార్టీ కానిస్టేబుళ్లు మనోజ్, మరణికుమార్ లపై సస్పెన్షన్ వేటు పడింది. రాజ్ విహార్ సెంటర్ లో ట్రాఫిక్ హోంగార్డు హుస్సేన్ పై మనోజ్, మణికుమార్ దాడికి పాల్పడ్డారు.

10:29 - June 10, 2017
10:24 - June 10, 2017

పెద్దపల్లి : జిల్లాలోని మంథని మండలంలో పోతారం సోలార్‌ ప్లాంట్‌తో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నపాటి గాలులకే విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. రోడ్లపై 11కేవీ విద్యుత్‌ వైర్లు తెగిపడడంతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. నాణ్యతాలేని విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటు చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులంటున్నారు. 

 

శ్రీనగర్ లో ఐటీబీపీ కాన్వాయ్ పై ఉగ్రదాడి

జమ్మూకశ్మీర్ : శ్రీనగర్ లో ఐటీబీపీ కాన్వాయ్ పై ఉగ్రదాడి జరిగింది. ఉగ్రవాదుల కాల్పులను జవాన్లు తిప్పి కొడుతున్నారు. ఎదురు కాల్పుల్లో ఓ పౌరుడికి గాయాలయ్యాయి.

తెలంగాణ లాసెట్ ఫలితాలు విడుదల

వరంగల్: తెలంగాణ లాసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. లాసెట్ మూడు, ఐదు సంవత్సరం ఫలితాలును కేయూ రిజిస్ట్రార్ రంగారావు, వైస్ ఛాన్సలర్ సాయిన్న విడుదల చేశాడు. లాసెట్ ఫలితాల్లో 87శాతం ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాది కంటే రెండు శాతం ఉత్తీర్నత పెరిగిందని తెలిపారు.

పైప్ కట్ చేసినందుకే వర్షపు నీరు

అమరావతి: ఏపీ అసెంబ్లీలో వర్షపు నీరు లీకేజీ ఘటనపై జేఎన్టీయూ ప్రొఫెసర్ల బృందం సీఐడీకి నివేదిక ఇచ్చింది. పైప్ కట్ చేసినందుకే వర్షపు నీరు వచ్చిందని నిర్ధారించారు.

ఉత్తరాఖండ్ లో కూలిన హెలికాప్టర్ :ఒకరి మృతి

హైదరాబాద్: ఉత్తరాఖండ్‌లోని బద్రినాథ్‌ నుంచి హరిద్వార్‌కు భక్తులను తీసుకొని వెళ్తున్న ఓ హెలికాప్టర్‌ టేకాఫ్‌ సమయంలో కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఒకరు మీతి చెందారు. ఈ హెలికాప్టర్‌లో ఐదుగురు ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు, ఒక ఇంజినీరు ఉన్నారు. ప్రమాదంలో ఇంజినీరు ప్రాణాలు కోల్పోగా.. పైలెట్లు స్వల్పంగా గాయపడ్డారు. ప్రయాణికులు క్షేమంగానే ఉన్నారని డీజీసీఏ అధికారులు తెలిపారు.

09:51 - June 10, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి 900 ప్రైవేట్ బస్సులు నిలిచిపోనున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్ తో ఏపీ, తెలంగాణలో 900 బస్సులు తిరుగుతున్నాయి. బస్సుల రిజిస్ట్రేషన్లను అరుణాచల్ ప్రదేశ్ రవాణాశాఖ రద్దు చేసింది. ముగ్గురు అధికారులను సస్పెండ్ చేశారు. రిజిస్ట్రేషన్లు రద్దు చేసిన బస్సులను సమీప పోలీసు స్టేషన్లలో అప్పగించాలని ఉత్తర్వులు జారీ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

09:48 - June 10, 2017

ఆటో-లారీ ఢీ: ఏడుగురి మృతి

హైదరాబాద్: ఒడిశాలోని జగత్‌సింగ్‌పూర్‌లో ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న ఆటో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను జగత్‌సింగ్‌పూర్‌లోని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో 12ఏళ్ల బాలిక ఉంది. మచగాన్‌కు చెందిన పది మంది సమీప బంధువు అంత్యక్రియలకు వెళ్లి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

పాల్వాయికి నివాళులర్పించిన ఎంపి కవిత

హైదరాబాద్: ఎంపి పాల్వాయి గోవర్థన్ రెడ్డి భౌతికాయం బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని స్వగృహంలో ఉంచారు. భౌతికగాయానికి ఎంపి కవిత, నేతలు జానారెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, డీఎస్ వంటి పలువురు నేత నివాళులు అర్పించారు.

09:17 - June 10, 2017

హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ హీరోగా 101 సినిమా పూరి జగన్ డైరక్షన్లో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఎప్పటినుండో పోర్చుగల్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా టైటిల్ ను ఫిక్స్ చేసి .. బాలకృష్ణ ఫస్టులుక్ ను వదిలారు. పూరీ తనదైన స్టైల్లో ఈ సినిమాకి 'పైసా వసూల్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. బాలకృష్ణ డాన్స్ మూమెంట్ తో కూడిన పోస్టర్ ఒకటి .. ఆయన ఫైట్స్ చేస్తోన్న దృశ్యానికి సంబంధించిన పోస్టర్ ఒకటి వదిలారు. రేపు బాలకృష్ణ పుట్టిన రోజు కావడం వలన, ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఫస్టులుక్ ను వదలడం విశేషం. మొత్తానికి బాలకృష్ణ అభిమానులను పూరీ ఖుషీ చేశారు.

 

900 ప్రైవేటు బస్సుల రిజిస్ట్రేషన్లు రద్దు...

హైదరాబాద్: తెలుగు రాష్ర్టాల్లోని ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన 900 బస్సుల రిజిస్ట్రేషన్లు రద్దయ్యాయి. అరుణాచల్‌ప్రదేశ్ రవాణాశాఖ రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అరుణాచల్‌ప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్ చేయించిన ట్రావెల్స్ యాజమాన్యాలు బస్సులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల్లో తిప్పుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించాయంటూ 900 బస్సు రిజిస్ట్రేషన్లు రద్దు చేశారు. నిబంధనలు పాటించకుండా బస్సులకు రిజిస్ట్రేషన్లు చేసిన ముగ్గురు కీలక అధికారులను అరుణాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

తిరుమలో కొనసాగుతున్న రద్దీ...

హైదరాబాద్: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు అన్ని కంపార్ట్‌మెంట్లలో నిండి వైకుంఠం వెలుపల కిలోమీటరు దూరం క్యూలో బారులు తీరారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం, కాలినడకన భక్తులకు 10 గంటల సమయం పడుతోంది.

పలు దేశీయ విమానాలు రద్దు..

హైదరాబాద్ : శంషాబాద్‌ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన పలు దేశీయ విమానాలు రద్దవడంతో ప్రయాణికులు చాలా ఇబ్బంది పడ్డారు. ముందుగా ప్లాన్ చేసుకుని ప్రయాణం పెట్టుకుంటే...గోవా, కడప, చెన్నై, రాజమండ్రి తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన ట్రూజెట్‌ విమానాలతో పాటు చండీగఢ్‌ వెళ్లాల్సిన ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి. విమానాలు రద్దైనట్టు ఆలస్యంగా ప్రకటించడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఎయిర్ పోర్టుకు చేరుకున్న తరువాత సమాచారం ఇవ్వడం ఏంటని? అధికారులను నిలదీశారు. ఈ సందర్భంగా కొందరు ప్రయాణికులు ఆందోళనకు దిగారు.

విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు

కృష్ణా : జిల్లాలోని ఇబ్రహీంపట్నం వద్ద ప్రైవేట్ బస్సుకు ప్రమాదం జరిగింది. విద్యుత్ స్తంభాన్ని బస్సు ఢీకొట్టింది. ఈప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి.

 

హైదరాబాద్ లో భద్రత పెంపు

హైదరాబాద్‌ : కేంద్ర నిఘా సంస్థ ఇంటలిజెన్స్‌ బ్యూరో (ఐబీ) హెచ్చరికల మేరకు తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. హైదరాబాదులోని హైటెక్ సిటీ, షాపింగ్ మాల్స్, ఇతర కీలక ప్రాంతాల్లో భద్రతను పెంచారు. ఇనార్బిట్ మాల్ ను డాగ్, బాంబు స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. గత నెల 7న జమ్మూకశ్మీర్‌ టాంట ప్రాంతంలోని పోలీసు పికెట్‌ పై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో కశ్మీర్ పోలీసులు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) గత నెల 13న కశ్మీర్‌ లో ఐదుగురు ఉగ్రవాదుల్ని అరెస్టు చేసింది.

జీహెచ్‌ఎంసీ కార్మికులకు రెయిన్‌కోట్స్...

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసిలో పనిచేస్తున్న పారిశుధ్య, ఎంటమాలజీ, రవాణా తదితర విభాగాల కార్మికులకు రెయిన్‌కోట్‌లు అందజేస్తున్నట్లు జీహెచ్ఎంసి కమిషనర్ డా.బి. జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించడంతో ప్రస్తుత వర్షాకాల సీజన్‌లో వీటిని పంపిణీచేస్తున్నట్లు తెలిపారు. రూ. 500విలువగల ఈ కోట్‌లను 22వేలమంది కార్మికులకు పంపిణీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వీటితోపాటు యథావిథిగా సమకూర్చే రేడియం జాకెట్‌లు, సబ్బులు, కొబ్బరినూనె తదితరవాటిని కూడా వెంటనే పంపిణీచేయాలని ఆదేశించారు. 

08:11 - June 10, 2017

సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకు అధికారంలో ఉన్న పార్టీల నేతలు దీక్షలు చేస్తున్నారని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన ఇవాళ్టి న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో ప్రముఖ విశ్లేషకులు వినయ్ కుమార్, కాంగ్రెస్ నేత పున్న కైలాష్, బిజెపి అధికార ప్రతినిధి మాధవి పాల్గొని, మాట్లాడారు. రైతు సమస్యలను పరిష్కరించకుండా మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్ దీక్షలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రైతుకు మద్దతు ధర కల్పించాలని కోరారు. రైతులను ఆదుకోవాల్సిన అవసరముందన్నారు. రైతుల బాగు కోసం కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

07:47 - June 10, 2017
07:47 - June 10, 2017

హైదరాబాద్ : ఖరీఫ్ సీజన్‌లో పక్కా ప్రణాళికతో ముందుకు వెళితేనే సాగులో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చంటున్నారు  వ్యవసాయ నిపుణులు. ప్రభుత్వం రైతులకు ఏలాంటి సమస్యలేకుండా చూడాలని కోరారు. అన్నదాతకు అండగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఖరీఫ్‌లో వ్యవసాయ ప్రణాళిక ఏవిధంగా ఉండాలనే అంశంపై వ్యవసాయ అధికారులు, రైతు నేతలను భాగస్వామ్యం చేస్తూ తెలంగాణ రైతు సంఘం సదస్సు నిర్వహించింది. రైతుల నుంచి వచ్చిన సందేహాలకు వ్యవసాయశాఖ అధికారులు సమాధానమిచ్చారు.  
ఖరీఫ్‌సాగుపై రైతు సంఘం ఆధ్వర్యంలో సదస్సు
ఖరీఫ్‌ సాగులో రైతులు తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ఈ సదస్సులో రైతులు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.  సాగులో తాము ఎదుర్కొంటున్న సమస్యలను, గత సంవత్సరం అనుభవాలను వ్యవసాయ అధికారులకు రైతులు వివరించారు. ఎలాంటి మెలకువలు పాటించాలో తెలుసుకున్నారు. ఖరీఫ్‌ సాగు కోసం రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, రుణసదుపాయంతోపాటు గిట్టుబాటు ధరలపై ముందే ఓ అంచనాకు రావాలని సీనియర్‌ రైతు సంఘాల నేతలు అభిప్రాయపడ్డారు. పంటలకు భీమా సదుపాయం, రుణమాఫీ ప్రహసనంగా మారాయన్నారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైనప్పటికీ ప్రభుత్వం నేటికీ ప్రణాళిక తయారు చేయలేదని మండిపడ్డారు.  వర్షాలు కురుస్తున్నప్పటికీ రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో వారంతా వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారన్నారు. 
ఉద్యానవన పంటల సాగు రైతులు ఆవేదన 
వ్యవసాయం అంటే కేవలం పంటల సాగుగానే చూస్తున్నారని ఉద్యానవన పంటలు సాగుచేస్తున్న రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నెలల తరబడి పండ్ల తోటలపై పెట్టుబడులు పెట్టి ఆరుగాలం శ్రమించినప్పటికీ ప్రభుత్వం నుంచి సరైన సాయం అందడం లేదన్నారు. ప్రభుత్వం నుంచి చేయూత అందకపోయినా అప్పులతో నెట్టుకువస్తున్నామన్నారు. ఇంతచేసినా చివరికి గిట్టుబాటు ధర ఉండడం లేదన్నారు.  ఇక కౌలు రైతులు కూడా గుర్తింపు కార్డులు, రుణ సమస్యలతో సతమతమవుతున్నారని సదస్సుకు హాజరైన రైతులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో దాదాపు 30శాతం ఉన్న కౌలు రైతులపై దృష్టిపెట్టాలని వారు కోరారు.
రైతులను ఆదుకునేందుకు చర్యలు  
రైతులను ఆదుకునేందుకు, ఖరీఫ్‌ సీజన్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని వ్యవసాయశాఖ అదనపు సంచాలకుడు విజయ్‌కుమార్‌ తెలిపారు. ఇప్పటికే రైతులకు కావాల్సిన  6 లక్షల టన్నుల విత్తనాలను విక్రయ కేంద్రాలకు తరలించామన్నారు.  రుణ సదుపాయాన్ని స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు కోరారు. కల్తీరాయుళ్లపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించాలన్నారు. 

 

07:38 - June 10, 2017

గుంటూరు : ఏపీ అసెంబ్లీలోని జగన్‌ చాంబర్‌లోకి వర్షపు నీరు చేరడంపై సీఐడీ విచారణ వేగవంతమైంది.  లీకేజీకి కారణాలను అన్వేషించే పనిలో పడింది సీఐడీ. సీఐడీతోపాటు కాకినాడ జేఎన్టీయూ ఇంజనీరింగ్‌ నిపుణులు, ఫోరెన్సిక్‌ బృందం నిజాలను నిగ్గుతేల్చేందుకు శ్రమిస్తున్నారు.  మరోవైపు వాస్తవ పరిస్థితిని  ప్రజలు కూడా తెలుసుకోవచ్చంటూ అసెంబ్లీలోకి రెండురోజులపాటు అందరికీ అనుమతించారు స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు.
రాజకీయ దుమారం 
ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జగన్‌ చాంబర్‌లోకి వర్షపునీళ్లు రావడం రాజకీయ దుమారం రేపుతోంది.  అంతేకాదు.. అసెంబ్లీ నిర్మాణంలో పాటించిన నాణ్యతా ప్రమాణాలను ప్రశ్నిస్తోంది.  దీంతో అప్రమత్తమమైన ప్రభుత్వం ఈ ఘటనపై విచారణను సీఐడీకి అప్పగించింది. జగన్‌ చాంబర్‌లోకి నీరెలా వచ్చింది? పైపు కట్‌ చేయడం వల్లా? లేక నిర్మాణ లోపాలతోనా? అన్న ప్రశ్నలపై సీఐడీ దృష్టి సారించింది. మూడు రోజులుగా ముమ్మర దర్యాప్తు చేపట్టింది. అసెంబ్లీ సిబ్బందితోపాటు అక్కడి భద్రతా సిబ్బందిని ప్రశ్నించారు.  సీఐడీ చీఫ్‌ ద్వారకా తిరుమలరావు అసెంబ్లీని పరిశీలించారు. మరోవైపు కాకినాడ జేఎన్టీయూకు చెందిన ఇంజనీరింగ్‌ నిపుణులు కూడా అసెంబ్లీ భవనాన్ని పరిశీలించారు. జగన్‌ చాంబర్‌లో నీరు లీకయిన ప్రాంతాన్ని , అక్కడి పైపులను పరిశీలించారు. జగన్‌ చాంబర్‌లోకి నీరు వచ్చిన విధానాన్ని, పైప్‌లైన్‌ ద్వారా నీరు పంపించి వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు.
రాజకీయ విమర్శలు 
ఒకవైపు సీఐడీ విచారణ కొనసాగుతుండగానే మరోవైపు రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో  ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని స్పీకర్‌ కోడెల ఫైర్‌ అయ్యారు.  వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రజలను కూడా అసెంబ్లీలోకి అనుమతిస్తున్నామని చెప్పారు.  అసెంబ్లీ సిబ్బందితోసహా ప్రతి ఒక్కరి వివరాలు నమోదు చేసుకుని పంపిస్తున్నారు.
నీరు లీకైన ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి నారాయణ 
అసెంబ్లీ నిర్మాణ బాధ్యతలు దగ్గరుండి పర్యవేక్షించిన మంత్రి నారాయణ నీరు లీకైన ప్రాంతాన్ని పరిశీలించారు. కేవలం పైపులైన్‌ కట్‌ చేయడం మూలంగానే జగన్‌ చాంబర్‌లోకి నీరు వచ్చిందని చెప్పారు.  సీఐడీ విచారణ తర్వాత అసలు దోషులు బయటపడతారన్నారు. సీఐడీ విచారణ వేగవంతం కావడంతో త్వరలోనే లీకేజీ వ్యవహారం గుట్టువీడనుంది. మరో రెండుమూడు రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక ప్రభుత్వానికి సీఐడీ అందజేయనుంది. దీంతో సీఐడీ నివేదికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

 

07:31 - June 10, 2017

ఖమ్మం : జిల్లాలో గిరిజన బాలికపై ఓ మానవ మృగం దాడి చేసింది. ప్రేమపేరుతో దగ్గరై ఆమె జీవితాన్ని నాశనం చేసింది. గర్భవతి అని తెలియడంతో నయవంచకుడు ముఖం చాటేశాడు. ఈ దుర్మార్గాన్ని ఖండించాల్సిన గ్రామ పెద్దలు..బాలిక శీలానికి 40 వేలు వెల కట్టారు. అబార్షన్‌ వికటించడంతో చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది. మృగాడి కామదాహానికి బాలిక బలైపోయింది. 
రెచ్చిపోతున్న కామంధులు  
ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఆడపిల్లలు కనపడితే చాలు కామంధులు రెచ్చిపోతున్నారు. తమ కామవాంచ తీర్చుకోవడానికి ఎంతకైనా బరితెగిస్తున్నారు. మహిళలపై రోజు రోజుకు అత్యాచారాలు, దాడులు, హత్యలు అడ్డు అదుపులేకుండా పోతున్నాయి. పసిపిల్ల నుంచి పండు ముదుసలి వరకు అత్యాచారానికి గురువుతూనే ఉన్నారు. నేరప్రవృత్తిని పెంచిపోషిస్తున్న ఆశ్లీల చిత్రాలు కూడా ఇందుకు కారణమవుతున్నాయని మహిళ సంఘాలు భగ్గుమంటున్నాయి. 
బాలికపై లైంగికదాడి
ఖమ్మం జిల్లాలో మరో కీచకపర్వం ఆలస్యంగా వెలుగుచూసింది. కల్లూరు మండలం ఎర్రబంజార గ్రామంలో ఓ మృగాడి పశువాంఛకు గిరిజన బాలిక బలైపోయింది. చెన్నకేశవ అనే యువకుడు బాలికకు ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి లోబర్చకున్నాడు. కొన్ని  నెలలుగా లైంగికదాడికి తెగబడుతున్నాడు. విషయం తెలిసి తల్లిదండ్రులు మూడు నెలల క్రితం గ్రామంలోని కుల పెద్దలతో పంచాయతీ పెట్టించారు. దీంతో వారు బాలిక శీలానికి 40 వేలు వెల కట్టారు. అప్పటికే బాధితురాలు 2 నెలల గర్బీణి కావడంతో.. యువకుడి తల్లి అబార్షన్ చేయించింది. అప్పటి నుంచి తీవ్ర అస్వస్థతకు గురైన బాలిక...తీవ్రమైన కడుపునొప్పి రావడంతో.. ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించడంతో బాలిక చనిపోయింది. అబార్షన్ సరిగా చేయకపోవడం వల్లే గర్బసంచికి ఇన్ఫెక్షన్‌ సోకిందని..సరైన సమయంలో గుర్తించకపోవడంతో బాలిక మరణించినట్లు వైద్యులు తెలిపారు. 
దర్యాప్తు ముమ్మరం 
బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కోసం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో  రంగంలోకి దిగిన కల్లూరు పోలీసులు పంచాయతీ చేసిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.  

 

07:22 - June 10, 2017

రంగారెడ్డి : రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న దళిత యువతి శ్యామల కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. శ్యామలను హత్య చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రధాన నిందితుడిని వెంటనే అరెస్ట్‌ చేయాలని దళిత సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు.  ఇబ్రహింపట్నంలోని ఏసీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. 
శ్యామలది హత్యేనంటున్న కుటుంబ సభ్యులు
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం యాచారంలో జరిగిన శ్యామల హత్య కేసు మరో మలుపు తిరిగింది. ఆమెది ఆత్మహత్య కాదు.... హత్యేననే వాదన వినిపిస్తోంది. స్థానికుల, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఈ సందేహం బలపడుతుంది. హైదరాబాద్‌ అంబర్‌పేట్‌లో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న.. సోమ నర్సింహ శ్యామలను గత కొన్నాళ్లుగా వేధిస్తున్నాడు.  ఈ క్రమంలో నర్సింహ ఫోన్ నుంచి కాల్ వచ్చిన కొన్ని నిమిషాలలోపే శ్యామల మంటల్లో చిక్కుకుంది. స్థానికులు గాంధీ ఆసుపత్రికి తరలించిన గంటలోనే మృతి చెందింది. 
నర్సింహే కిరోసిన్‌ పోసి ప్రాణాలు తీశాడంటూ ఆరోపణలు
అయితే..శ్యామలను బయటకు రమ్మని నర్సింహే...కిరోసిన్‌ పోసి ప్రాణాలు తీశాడని బాధిత కుటుంబం ఆరోపిస్తుంది.  శ్యామల ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ..ఆమెను హత్యే చేశారని కుటుంబ సభ్యులంటున్నారు. హత్య చేసినప్పుడు  నర్సింహ చేతులు కూడా కాలాయని.. వెంటనే గోడ దూకి పారిపోయాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఘటన అనంతరం నిందితుడి మేనమామ కూడా వచ్చి శ్యామల మొబైల్‌ ఇవ్వాలంటూ..  బేరసారాలాడడని బాధితులు చెబుతున్నారు.
ఏసీపీ కార్యాలయాన్ని ముట్టడించిన బాధిత కుటుంబం
ఇదిలా ఉండగా యాచారం పోలీసులు 306, 354డీ, ఎస్సీ, ఎస్టీ న్యూ అమిడ్‌మెంట్‌ ప్రకారం కేసులు నమోదు చేశారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా ఘటన జరిగి నాలుగు రోజులు అవుతున్నా ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేయకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నాయకులు ఇబ్రహీంపట్నంలో ఏసీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. నర్సింహను వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్ చేశారు. ఏది ఏమైనా నర్సింహను అరెస్ట్ చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. 

 

07:17 - June 10, 2017

కరీంనగర్ : దారుణానికి ఒడిగట్టిన మృగాళ్లకు శిక్షపడింది. 15 నెలల విచారణ అనంతరం దోషులకు శిక్ష ఖరారు చేసింది ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ప్రత్యేక కోర్టు. 2016 ఫిబ్రవరి 11న కరీంనగర్‌ జిల్లా వీణవంకలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు దోషులకు 20 ఏళ్ల శిక్షపడగా.. మైనర్‌ను జువైనల్‌ హోమ్‌కు తరలించాలని కోర్టు ఆదేశించింది. 
దళిత యువతిపై గ్యాంగ్‌రేప్‌
కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామానికి చెందిన దళిత యువతిపై గ్యాంగ్‌ రేప్‌ కేసులో దోషులకు శిక్షపడింది. 15 నెలల విచారణ అనంతరం దోషులు శ్రీనివాస్‌, అంజయ్యలకు జీవిత ఖైదు విధిస్తూ కరీంనగర్‌ ప్రత్యేక అట్రాసిటీ కోర్టు తీర్పునిచ్చింది. మరొకరు మైనర్‌ కావడంతో జువైనల్‌ హోమ్‌కు తరలించాలని ఆదేశించింది. 
ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి : బాధితురాలు 
ఈ ఘటన 2016 ఫిబ్రవరి 11న చోటు చేసుకుంది. పోలీసు ఉద్యోగంలో చేరడమే లక్ష్యంగా వీణవంకలో పోలీసులు ఏర్పాటు చేసిన కేంద్రంలో చేరింది యువతి. ఇక్కడే పరిచయమైన యువకులు యువతిని నమ్మించి అత్యాచారానికి ఒడిగట్టారు. వారం రోజుల అనంతరం యువతి 10టీవీని ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. బాధితురాలికి 10టీవీతో పాటు.. ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు అండగా నిలిచాయి. నిందితులను శిక్షించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు ఉధృతమయ్యాయి. దీంతో స్పందించిన సర్కార్‌.. విచారణను వేగవంతం చేసింది. జిల్లా ఎస్పీ కేసు నమోదు దర్యాప్తు వేగవంతం చేసి దర్యాప్తు చేపట్టారు. దాదాపు 15 నెలలపాటు విచారణ అనంతరం అట్రాసిటీ కోర్టు తీర్పునిచ్చింది. ఇప్పటికైనా దోషులకు శిక్ష పడడంతో బాధితురాలు, మహిళాసంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బాధితురాలు కోరుతున్నారు. 

 

07:07 - June 10, 2017

గుంటూరు : ఈ విద్యా సంవత్సరం నుంచి ఫిజికల్‌ లిటరసీ పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. నృత్యం, యోగాభ్యాసం, సంగీతంపై విద్యార్థులకు తరగతులు నిర్వహించాలని పేర్కొన్నారు. హేతుబద్దత లేని రాష్ట్ర విభజనపై విద్యార్థులకు వివరించాలని  అధికారులకు ఆదేశించారు. మరికొన్ని రోజుల్లో స్కూళ్లు పునఃప్రారంభమవుతున్నందున అవసరమైన ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. 
పాఠశాల విద్యపై సీఎం చంద్రబాబు సమీక్ష
పాఠశాల విద్యపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విద్యాశాఖ అధికారులతో తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం 4000 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో స్కూళ్లకు టాయిలెట్లు, బయోఫెన్సింగ్, కాంపౌండ్‌  వాల్‌, తరగతి గదుల్లో సరిపడా బెంచీలు తదితర అవసరాలను వెంటనే తీర్చాలన్నారు. డ్రాపౌట్స్‌ను తగ్గించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు పెంచడానికి బయోమెట్రిక్‌ విధానాన్ని నూరు శాతం అమలుచేయాలన్నారు. స్కూళ్లలో డిజిటల్‌ తరగతులు  నిర్వహించేలా నిరంతర పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. 
హేతుబద్దత లేని రాష్ట్ర విభజనపై విద్యార్థులకు వివరించాలి : సీఎం 
హేతుబద్దత లేని రాష్ట్ర విభజనపై విద్యార్థులకు వివరించాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. మూడేళ్ల పాటు ప్రభుత్వం సాధించిన విజయాలపై అన్ని పాఠశాలల విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. వారికి వ్యాసరచన, వక్తృత్వం పోటీలు  నిర్వహించాలన్నారు. విజేతలను ఎంపిక చేసి వారిని పోలవరం ప్రాజెక్టు, అమరావతి సందర్శనకు తీసుకెళ్లాలన్నారు. అలాగే ప్రతిభ కనబరిచినవారికి బహుతులు కూడా ఇవ్వాలన్నారు. ఉపాధ్యాయులు రూపొందించే లెసన్‌ బ్యాంక్స్‌  రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు  పంపి.. వారి మధ్య నాలెడ్జ్‌ షేరింగ్‌ జరగాలని చెప్పారు. సాంకేతిక అంశాలలో టీచర్లందరికీ అత్యాధునిక శిక్షణ ఇప్పించాలన్నారు చంద్రబాబు. 
ఫిజికల్‌ లిటరసీ పూర్తిస్థాయిలో అమలుకు ఆదేశం 
ఈ ఏడాది పరీక్ష ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని.. ప్రైవేట్‌ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్న టీచర్లను అభినందిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఫిజికల్‌ లిటరసీ పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నారు.  నృత్యం, యోగాభ్యాసం, సంగీతంపై విద్యార్థులకు తరగతులు నిర్వహించాలని పేర్కొన్నారు. మన సంప్రదాయ నృత్యమైన కూచిపూడిని ప్రోత్సహించాలని చెప్పారు. 

 

నేడు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఢీ

హైదరాబాద్ : ఛాంపియన్స్ ట్రోఫిలో భాగంగా నేడు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఢీ కొననున్నాయి. కార్డిఫ్ లో మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 

నేడు ఫ్రెంచ్ ఓపెన్ లో మహిళల ఫైనల్స్

హైదరాబాద్ : నేడు ఫ్రెంచ్ ఓపెన్ లో మహిళల ఫైనల్స్ జరుగున్నాయి. సాయంత్రం 6.25 గంటలకు టైటిల్ కోసం హలాప్, జెలెనా మధ్య పోరు జరుగనుంది. 

 

నేటి నుంచి మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్ నిరవధిక దీక్ష

మధ్యప్రదేశ్ : నేటి నుంచి మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్ నిరవధిక దీక్ష చేయనున్నారు. మధ్యప్రదేశ్ లో శాంతి నెలకోవాలని సీఎం చౌహాన్ నిరాహార దీక్ష చేపట్టనున్నారు.  

ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో నేడు మంత్రి కేటీఆర్ పర్యటన

మంచిర్యాల : ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో నేడు మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

 

నేడు స్వగ్రామంలో పాల్వాయి అంత్యక్రియలు

హైదరాబాద్ : ఇవాళ ఉదయం 10.30 గంటలకు పాల్వాయి గోవర్ధన్ భౌతిక కాయాన్ని గాంధీభవన్ కు తీసుకురానున్నారు. సాయంత్రం నల్లగొండ ఇడికుడలో పాల్వాయి అంత్యక్రియలు జరుగనున్నాయి. పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.  

నేడు 'పశు విక్రయాలపై ఆంక్షలు...పర్యవసానాలు'పై సెమినార్

హైదరాబాద్ : బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'పశు విక్రయాలపై ఆంక్షలు...పర్యవసానాలు' అనే అంశంపై సెమినార్ జరుగనుంది. ఈ సెమినార్ కు చెన్నై ఐఐటీ రిటిర్డ్ ఫ్రొఫెసర్ వెంకటేష్ ఆత్రేయ, నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ హారతి వాగీన్ హాజరుకానున్నారు. 

 

Don't Miss