Activities calendar

11 June 2017

21:39 - June 11, 2017

సిద్దిపేట : సిద్దిపేటలో పేద ముస్లిం కుటుంబాలకు నిత్యావసర సరుకులు మంత్రి హరీష్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్‌రావు..ముస్లిం పిల్లలు చదువుకోసం 400 కోట్లతో 200 మైనార్టీ పాఠశాలలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో పేదలకోసం 2 వేల డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మిస్తున్నామని.. పైరవీలకు లంచాలకు తావు లేకుండా నిరుపేదలను గుర్తించి పంపిణీ చేస్తామన్నారు. రంజాన్‌ పండగ సందర్భంగా జిల్లాలో 4 లక్షల మంది ముస్లింలకు బట్టలు పంపిణీ చేస్తామన్నారు.  

21:38 - June 11, 2017

అనంతపురం : అభివృద్ధి నిరోధక పార్టీగా వైసీపీ తయారైందని మంత్రి కాల్వ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. ప్రజలు తమ వైపు లేరు అని నిర్ణయించుకున్నాక జగన్‌ పలువిధాలుగా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా..నిరుద్యోగులకు ఉపాధి లభించకూడదన్న దురుద్దేశంతో తునిలో ఎవరు విధ్వంసం సృష్టించారో అందరికీ తెలుసన్నారు. 

21:36 - June 11, 2017

విశాఖ : ప్రధాని మోడీపై విపక్షాలు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయని.. చౌకబారు ప్రచారాలు మానుకోవాలని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. విశాఖలో జరిగిన సబ్‌కా సాత్‌.. సబ్‌కా వికాస్‌ సమ్మేళనంలో పాల్గొన్నారు. గత ప్రభుత్వం పేదలకు మాటలు చెప్పి ధనికులకు మూటలు ఇచ్చిందని.. మోదీ ప్రభుత్వం పేదల కోసం ఎన్నో సంక్షేమపథకాలు ప్రవేశపెట్టిందన్నారు.

21:35 - June 11, 2017

ఢిల్లీ : విజ్ఞాన భవన్‌లో జీఎస్టీ మండలి 16వ సమావేశం నిర్వహించారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పలు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరయ్యారు.133 రకాల వస్తువులపై పన్నుల శాతాన్ని తగ్గించాలని ప్రతిపాదనల కమిటీ సిఫార్సు చేసింది.. అయితే ఇందులో 66 వస్తువులపై పన్ను తగ్గించేందుకు జీఎస్టీ కౌన్సిల్‌ అంగీకరించింది. అలాగే ఉత్పత్తిదారులు, వ్యాపారులు, రెస్టారెంట్ల యజమానులకు అందించే నష్టపరిహార పథకం పరిధిని పెంచాలని తీర్మానించింది.. గతంలో 50 లక్షల టర్నోవర్‌ ఉన్నసంస్థలకు మాత్రమే నష్టపరిహారం అందిస్తామన్న మండలి.... ఈ పరిధిని 75 లక్షలకు పెంచింది... కౌన్సిల్‌ సమావేశం తర్వాత పన్ను రేట్లు తగ్గించిన వస్తువుల వివరాలను జైట్లీ ప్రకటించారు.... సమానత్వం.. వినిమయంలో మార్పులు తీసుకురావడం కోసమే వీటిని సవరించామని తెలిపారు. జీడిపప్పుతో సహా కంప్యూటర్‌ ప్రింటర్లవరకూ పలు వస్తువులపై పన్ను తగ్గనుంది.. జీడిపప్పుపై 12 నుంచి 5 శాతానికి... ప్యాకింగ్‌ చేసిన ఆహారం, పండ్లు, కాయగూరలు, పచ్చళ్లు, టాపింగ్స్‌, ఇన్‌స్టెంట్‌ ఫుడ్‌, సాస్‌లపై 18 నుంచి 12 శాతానికి పన్ను తగ్గనుంది.. అగర్‌బత్తీలపై 12 నుంచి 5 శాతానికి.... ఇన్సులిన్‌పై 12 నుంచి 5 శాతానికి.. ప్లాస్టిక్‌ బెడ్స్‌పై 28 నుంచి 18శాతం పన్ను తగ్గించనున్నారు. ఇక స్కూల్‌ బ్యాగ్స్‌పై 28 నుంచి 18శాతం... ఎక్సర్‌సైజ్‌ బుక్స్‌పై 18 నుంచి 12 శాతం.... స్పూన్లు, ఫోర్క్‌లపై 18 నుంచి 12శాతం... ట్రాక్టరు విడిభాగాలపై 28 నుంచి 18శాతం... కంప్యూటర్‌ ప్రింటర్లపై 28 నుంచి 18శాతానికి పన్ను తగ్గిస్తూ జీఎస్‌టీ కౌన్సిల్‌లో నిర్ణయం తీసుకుంది.

సినిమాలపై కీలక నిర్ణయం..
సినిమాలపై జీఎస్‌టీకి సంబంధించికూడా జీఎస్‌టీ కౌన్సిల్‌ కీలక నిర్ణయం తీసుకుంది.. 100 రూపాయలకంటే తక్కువ ఉన్న టిక్కెట్ల పన్ను శాతాన్ని 28 నుంచి 18 శాతానికి తగ్గించారు. 100 దాటిన టికెట్లపై మాత్రం 28శాతం పన్ను కొనసాగుతుంది.... చాలా రాష్ట్రాలు తమ ప్రాంతానికి చెందిన భాషల్లో తీసిన సినిమాకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చాయి. ఇప్పుడు వాటికి కేంద్రం నుంచి ఎటువంటి మినహాయింపు ఉండదు. రాష్ట్రాలు డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ ఇవ్వాలనుకుంటే ఆ రాష్ట్రాలే స్థానిక చిత్రాలకు జీఎస్టీని రిఫండ్‌ చేయాల్సి ఉంటుంది..

రాష్ట్రాల వినతులు..
జీఎస్‌టీ సమావేశంలో కొన్ని అంశాలపైనే చర్చ జరిగిందని.. తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు.. సాగునీటి ప్రాజెక్టులు, మిషన్‌ కాకతీయకు సర్వీస్‌ పన్ను మినహాయింపు కొనసాగించాలని కేంద్రాన్ని కోరామని... ఈ విజ్ఞప్తులపై ఇంకా స్పందన రాలేదని చెప్పారు..తిరుమల తిరుపతి దేవస్థానాన్ని జీఎస్టీ పన్ను నుంచి మినహాయించాలని జీఎస్టీ కౌన్సిల్‌ను కోరామన్నారు ఏపీ ఆర్థికమంత్రి యనమల. పోలవరం ప్రాజెక్టుపై ప్రస్తుతమున్న సర్వీస్‌ ట్యాక్స్‌ మినహాయింపును జీఎస్టీ కింద కొనసాగించాలని కోరామని చెప్పారు.. వివిధ వస్తువుల పన్నుపై చర్చించిన జీఎస్‌టీ కౌన్సిల్‌... జూన్‌ 18న మరోసారి సమావేశం కానుంది.. ఆ మీటింగ్‌లో మరికొన్ని వస్తువులపై నిర్ణయం తీసుకోనున్నారు.

21:30 - June 11, 2017

బర్మింగ్ హోమ్ : చాంపియన్స్ ట్రోఫీలో సౌత్ అఫ్రికా పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సెమీఫైనల్లో భారత్ బంగ్లాదేశ్ తో తలపడనుంది. విరాట్ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ తో జట్టును ముందుండి గెలిపించా

20:03 - June 11, 2017
19:02 - June 11, 2017
18:38 - June 11, 2017

అనంతపురం : అనంత రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అనంత రైతులు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అసలే కరవుతో రైతులు అల్లాడిపోతుంటే, ప్రణాళిక ప్రకారం ముందుగా ఇవ్వాల్సిన ఇన్‌పుట్‌ సబ్సిడి, ఇన్సూరెన్స్‌ను విడుదల చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవేవీ పట్టించుకోకుండా ప్రభుత్వం వేరుశనగ విత్తన పంపిణీని చేపట్టింది. దీంతో అనంత వేరుశనగ రైతులు ఆగ్రహంతో మండిపడుతున్నారు.

చేతిలో డబ్బులు లేక ఇబ్బంది..
చేతిలో డబ్బులు లేక వేరుశనగ విత్తనాలను కొనలేక పోతున్నారు. పోనీ బ్యాంకుల్లో రుణాలు తీసుకుందామని అనుకున్నా, బ్యాంకర్లు లోన్స్ రెన్యువల్ చేయడం లేదు. కొన్ని బ్యాంకులు వడ్డీ కట్టించుకొని రెన్యువల్ చేస్తుండగా,.. చాలా బ్యాంకులు మాత్రం అంతా కడితేనే రెన్యువల్ చేస్తామంటున్నారు. దీంతో రైతులు తమ కష్టాలను ఏకరవు పెడుతుంటే.. ప్రభుత్వం మాత్రం ఏదోలా రైతులను ఆదుకుంటామనే అంటోంది. ఈనెలాఖరులోపు ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఇన్సూరెన్స్‌ను పంపిణీ చేస్తామని వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి అంటున్నారు. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఈనెలాఖరులోపు రైతులకు అందించేందుకు చర్యలు తీసుకొంటున్నామంటున్నారు.

ప్రభుత్వ రైతులు ఆగ్రహం
అసలు ముందస్తు ప్రణాళిక లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాగూ ఇచ్చే డబ్బులు ముందుగానే ఇచ్చి ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదంటున్నారు. విత్తనాల పంపిణీ ముందుగానే మొదలపెట్టి రైతులకు అందుబాటులోకి తెచ్చిన విధంగానే,. డబ్బులను కూడా ముందే ఇచ్చివుంటే బాగుండేదంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇన్‌పుట్‌ సబ్సిడి, ఇన్సూరెన్స్‌ పంపిణీని మొదలుపెట్టాలని.. రైతులు డిమాండ్ చేస్తున్నారు. దాంతో పాటు ఖరీఫ్‌ లోన్స్‌ రెన్యువల్ విషయంలో కూడా వడ్డీ మాత్రమే కట్టించుకొని లోన్‌ను రెన్యువల్‌ చేయాలని కోరుతున్నారు. 

18:36 - June 11, 2017

తూర్పు గోదావరి : తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో ఘోర అగ్నప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 6 దుకాణాలు కాలిబూడిదయ్యాయి. విద్యుత్‌షాట్‌సర్యూట్‌తోనే మంటలు చెలరేగినట్టు స్థానికులు చెబుతున్నారు. ప్రమాద స్థలానికి 1కిలోమీటరు దూరంలోనే ఫైర్‌స్టేషన్‌ ఉన్నా.. వారు చేరుకునే సరికే అంతా కాలిబూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది వైఖరిపై స్థానికులు మండిపడుతున్నారు. అటు విద్యుత్‌శాఖ అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారని గ్రామస్తులు అంటున్నారు. రాత్రి పదకొండు గంటల సమయంలో మంటలు చెలరేగినా.. ఉదయం వరకు కరంటు సరఫరా నిలిపివేయలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

18:35 - June 11, 2017

తూర్పు గోదావరి : బిసీలకు ఇబ్బంది లేకుండా కాపులను బిసీలో చేరుస్తామని డిప్యూటి సిఎం నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. కాపులను బిసీలో చేర్చే ప్రక్రియ పూర్తి చేసి త్వరలోనే కేంద్రానికి నివేదిక పంపిస్తామన్నారు. కాపుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడివుందని 30 ఏళ్ళ లో నెరవేరని కాపుల రిజర్వేషన్ల డిమాండ్‌ను మూడేళ్ళల్లో చేస్తున్నామని..ఇందుకు సిఎం చంద్రబాబు కృత నిశ్చయంతో వున్నారన్నారు. రాజమండ్రిలో కాపు వెల్ఫేర్ .కామ్ యాప్, జాబ్ మేళాను చినరాజప్ప ప్రారంభించారు. 

18:32 - June 11, 2017

ఢిల్లీ : తిరుమల తిరుపతి దేవస్థానాన్ని జీఎస్టీ పన్ను నుంచి మినహాయించాలని జీఎస్టీ కౌన్సిల్‌ను కోరామన్నారు ఏపీ ఆర్థికమంత్రి యనమల. పోలవరం ప్రాజెక్టుపై ప్రస్తుతమున్న సర్వీస్‌ ట్యాక్స్‌ మినహాయింపును జీఎస్టీ కింద కొనసాగించాలని చెప్పామన్నారు. గ్రానైట్‌ పరిశ్రమకు జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని ఏపీతో పాటు తెలంగాణ, రాజస్థాన్‌ రాష్ట్రాలు కోరాయని.. అందుకు కేంద్రం సుముఖం లేదని పేర్కొన్నారు. 

మహారాష్ట్రలో రేపటి బంద్ ను ఉపసంహరించుకున్న రైతులు

ముంబై : మహారాష్ట్రలో రేపటి తలపెట్టిన బంద్ ను రైతులు ఉపసంరించుకున్నారు. రుణామాఫీ అమలు విధివిధానాలపై కమిటీ వేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో రైతులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

17:51 - June 11, 2017

యాదాద్రి : ప్రేమోన్మాది శ్రీకాంత్‌ ఇంటి ముందు గాయాత్రి మృతదేహంతో ఆమె బంధువులు ఆందోళనకు దిగడంతో యాదాద్రి జిల్లా యాదగిరిపల్లెలో ఉద్రిక్తత నెలకొంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసిన బంధువులు.. శ్రీకాంత్‌ ఇంటిపై దాడిచేశారు. ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేసి, నిప్పుపెట్టారు. అప్రమత్తమైన పోలీసులు.. వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. అంతకుముందు యాదగిరిగుట్ట రోడ్డుపై గాయత్రి మృతదేహంతో జైగౌడ నాయకులు, బంధువులు ధర్నా చేశారు. శ్రీకాంత్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ ధర్నాకు మహిళా సంఘాలు మద్దతుతెలిపాయి. నిందితుడిని ఉరితీయాలని డిమాండ్‌ చేశారు. మృతురాలి కుటుంబానికి 25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. మరోవైపు సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రేమోన్మాది శ్రీకాంత్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. 

17:45 - June 11, 2017

హైదరాబాద్ : సమాజాన్ని మార్చాలనుకునే వారు, మార్పు రావాలన్న పట్టుదల ఉన్నవారు కారల్‌ మార్క్స్ రచించిన పెట్టుబడి గ్రంథం చదవాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు సూచించారు. పెట్టుబడి గ్రంథం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ పుస్తకం ప్రాధాన్యతను వివరించేందుకు హైదరాబాద్‌ ఎస్ వీకేలో సెమినార్‌ నిర్వహించారు. కాపిటల్‌లోని పలు అంశాలను రాఘవులు, సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వివరించారు.

17:25 - June 11, 2017
17:20 - June 11, 2017

నాగర్ కర్నూల్ : జిల్లాలోని అమ్రాబాద్ మండలం దోమలపెట వద్ద టూరిజం మినీ బస్సు లోయలో పడింది. ప్రమాదంలో అక్కడికక్కడే ఒ మహిళ మృతి చెందగా, ఆసుపత్రికి తరలిస్తుండగా మరో నాలుగురు మృతి చెందారు. 15 మంది గాయపడ్డారు. వారిని సున్నిపేట ఆసుపత్రికి తరలించారు. టూరిజం బస్సును మహారాష్ట్రకు చెందిన అధికారులు గుర్తించారు. బస్సు వేగంగా ప్రయణిస్తూ డివైడర్ ను ఢీకొని బస్సు లోయలో పడినట్టు ప్రత్యేక్ష సాక్షులు తెలిపారు. సంఘటన స్థలిని అధికారులు సందర్శించి విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

నాగర్ కర్నూల్ లో లోయలో పడిన టూరిజం బస్సు

నాగర్ కర్నూల్ : జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెట వద్ద టూరిజం మినీ బస్సు లోయలో పడింది. ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. గాయపడ్డవారిని సున్నిపెంట ఆసుపత్రికి తరలించారు.

 

పిల్లల పుస్తకాలకు జీఎస్టీ మినహాయింపు

ఢిల్లీ : జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పలు వస్తువులపై కౌన్సిల్ పన్నులు తగ్గించింది. 133 వస్తువుల్లో 66 వస్తువులకు జీఎస్టీ కౌన్సిల్ పన్ను తగ్గించింది. జీఎస్టీ నుంచి పిల్లల పుస్తకాలకు మినహాయింపునిచ్చారు. జీడిపప్పుపై జీఎస్టీ పన్ను 12 నుంచి 5 శాతానికి, స్కూల్ బ్యాగులపై 28 శాతం నుంచి 18 శాతానికి, కంప్యూటర్ ప్రింటర్ పై 28 నుంచి 18 శాతానికి తగ్గించారు. రూ.100 లోపు సినిమా టిక్కెట్ పై 18 శాతం రూ.100దాటితే 28 జీఎస్టీ పన్ను విధించనున్నారు.

16:47 - June 11, 2017

యాదాద్రి : యాదాద్రి జిల్లాలో అంతర్జాతీయ దోపిడీ ముఠాను రాచకొండ స్పెషల్‌ ఆపరేషన్‌ టీం పట్టుకుంది.. చౌటుప్పల్‌లో వాహనాలను తనిఖీలు చేస్తున్న పోలీసులకు ఈ ముఠాతీరు అనుమానాస్పదంగా కనిపించింది.. వెంటనే ఏడుగురిని అదుపులోకితీసుకున్న పోలీసులు.. వారిదగ్గరనుంచి కారు, మోటార్ బైక్, ఆరు డాగర్లు, రెండు కత్తులు, ఐదు కత్తెరలు, ఒక స్క్రు డ్రైవర్, ఎనిమిది మొబైల్ ఫోన్లు, 71వేల 300 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.. అరెస్టయినవారు మహారాష్ట్రకు చెందిన పార్ధి, షికారి గ్యాంగ్ అని.. దొంగల్లో ఇద్దరు మైనర్లున్నారని పోలీసులు చెప్పారు.

16:45 - June 11, 2017

‌‌హైదరాబాద్ : శంషాబాద్‌లో తనకు గజం స్థలంకూడాలేదని... టీఆర్ఎస్ ఎంపీ కేకే అన్నారు.. తాను కాంగ్రెస్‌లో ఉన్నప్పుడే ఇబ్రహీంపట్నంలో భూమి కొన్నానని స్పష్టం చేశారు.. 2013లో ఈ స్థలం రిజిస్ట్రేషన్‌ అయిందని చెప్పారు.. తనకు శంషాబాద్‌లో భూములున్నాయన్న ఆరోపణల్ని కేకే ఖండించారు.

16:32 - June 11, 2017
16:25 - June 11, 2017

ఢిల్లీ : జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పలు వస్తువులపై కౌన్సిల్ పన్నులు తగ్గించింది. 133 వస్తువుల్లో 66 వస్తువులకు జీఎస్టీ కౌన్సిల్ పన్ను తగ్గించింది. జీఎస్టీ నుంచి పిల్లల పుస్తకాలకు మినహాయింపునిచ్చారు. జీడిపప్పుపై జీఎస్టీ పన్ను 12 నుంచి 5 శాతానికి, స్కూల్ బ్యాగులపై 28 శాతం నుంచి 18 శాతానికి, కంప్యూటర్ ప్రింటర్ పై 28 నుంచి 18 శాతానికి తగ్గించారు. రూ.100 లోపు సినిమా టిక్కెట్ పై 18 శాతం రూ.100దాటితే 28 జీఎస్టీ పన్ను విధించనున్నారు. 

16:11 - June 11, 2017

చెన్నై : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను హత్య చేసేందుకు తన సోదరుడు దీపక్‌ ప్రయత్నించాడని జయ మేనకోడలు దీప సంచలన ఆరోపణలు చేశారు. శశికళ కుటుంబంతో దీపక్‌ కుమ్మకయ్యాడని.. దీపక్‌ను అరెస్ట్‌ చేసి విచారించాలని ఆమె డిమాండ్‌ చేశారు. జయలలిత నివాసం పోయెస్‌ గార్డెన్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన దీపను పోలీసులు అడ్డుకున్నారు. దీప మద్దతుదారులకు.. పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోయెస్‌ గార్డెన్‌లో జయలలిత చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించేందుకు వెళ్తే శశికళ కుటుంబసభ్యులతో కలిసి దీపక్‌ తనపై దాడి చేశాడని ఆరోపించారు. జయలలిత నివాసం స్వాధీనానికి చట్టపరమైన చర్యలు తీసుకుంటానన్నారు. శశికళ కుటుంబం చేతుల్లో నుంచి అన్నాడీఎంకే పార్టీని కాపాడాలని దీప పిలుపునిచ్చారు. జయలలితకు తానే వారసురాలినన్న దీప.. జయ ఆస్తులు కూడా తనకే దక్కుతాయని చెప్పారు. జయలలితకు అధికారికంగా వారసులు లేకపోవడంతో ప్రస్తుతం ఆమె ఆస్తులన్నీ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి. అయితే పోయెస్‌ గార్డెన్‌లో తాను నివాసం ఉండేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ దీప అక్కడికి చేరుకోవడంతో పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. 

16:10 - June 11, 2017

చిత్తూరు : వెంకన్న భక్తులను వసతి సదుపాయాలు వెంటాడుతున్నాయి. శ్రీవారి దర్శనం కన్నా ఎక్కువసేపు గదులకోసం క్యూలైన్లలోనే ఉండాల్సి వస్తోంది. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతుండటంతో... కొండపై వసతి కష్టంగా మారుతోంది. రద్దీరోజుల్లో తిరుమలలో ఉన్న వసతి గదులు భక్తులకు ఏమాత్రం సరిపోవండం లేదు. గదులు దొరకని భక్తులు ఆరుబైటే పడిగాపులు కాయాల్సివస్తోంది. అటు టిటిడి ఏర్పాటు చేసిన యాత్రికుల వసతి సముదాయాలపై సరైన సమాచారం లేక భక్తులు అవస్థలు పడుతున్నారు.

రోజుకు 70 వేల నుంచి 80 వేలు..
తిరుమలకు వెళ్లే భక్తులకు దర్శనం కన్నా మొదటి సమస్య వసతి గదులు పొందటమే. ఒక్కోసారి స్వామివారి దర్శనం కన్నా ఎక్కువసేపు గదులకోసం క్యూలైన్లలోనే ఉండాల్సి వస్తోంది. సాధారణంగా రోజుకు 70 నుంచి 80 వేల మంది, వారాంతంలో ఇతర రద్దీ సమయాల్లో రోజుకు లక్షమందికి పైనే భక్తులు తిరుమల శ్రీవారిని దర్శిస్తుంటారు. అయితే రోజుకు లక్షమంది భక్తులకు సులభంగా దర్శనం చేయిస్తున్న టీటీడీ అంతమందికి వసతి కల్పించడంలో మాత్రం విఫలం అవుతోంది. వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి తిరుమల వచ్చిన భక్కులకు వెంటనే అద్దె గదులు దొరక్కపోతే ఆరుబయటే నానాపాట్లు పడుతున్నారు. టిటిడి యాత్రికుల వసతి సముదాయాలు ఏర్పాటు చేసినా వాటిపై సరైన సమాచారం తెలియక వెంకన్న భక్తులకు ఇక్కట్లు తప్పడం లేదు.

కొండపై 7వేల గదులు
తిరుమలలో మొత్తం 7 కౌంటర్ల ద్వారా భక్తులకు గదులు మంజూరు చేస్తారు. విఐపీలకు గదులు కేటాయించడానికి శ్రీపద్మావతి నగర్, అడ్వాన్స్ రిజర్వేషన్ గదులు పొందడానికి ఏఆర్పీ కౌంటర్, సామాన్య భక్తుల కోసం సీఆర్ఓ జనరల్, సిఫార్సు ఉత్తరాలు తెచ్చేవారికోసం టీబి కౌంటర్...ఇలా మొత్తంగా 7 కౌంటర్లు ద్వారా గదులు కేటాయిస్తున్నారు. కొండపై మొత్తం 7 వేల గదులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ గదుల్లో కేవలం 35 నుండి 40 వేల మంది భక్తులు మాత్రమే బస చేయడానికి వీలుంది. రద్దీరోజుల్లో గదులు దొరకని భక్తుల కోసం టిటిడి వివిధ ప్రాంతాల్లో నాలుగు భారీ వసతి సముదాయాలు ఏర్పాటు చేసింది. వీటిలోనే లాకర్ సదుపాయం, తలనీలాల సమర్పణకు కళ్యాణకట్ట, స్నానం చేయడానికి సదుపాయాలు కల్పించారు. ఒక్కో వసతి సముదాయంలో సుమారు రెండు వేలమంది భక్తులు భస చేయడానికి సౌకర్యలు ఉన్నాయి.

మాతా భవన్ పేరిట భారీ అతిథిగృహాం
గదులు దొరకని వారి కోసం యాత్రికుల వసతి సముదాయాలు ఏర్పాటు చేసిన విషయం భక్తులకు తెలియడంలేదు. ఇందులో బ్యాగులు పెట్టుకోవడానికి లాకర్‌ సదుపాయం ఉండటంతో.. శ్రీవారి దర్శనానికి వసతి సముదాయం నుంచే వెళ్లే అవకాశముంది. భక్తుల వసతి కోసం తిరుపతిలోకూడా విష్ణునివాసం, శ్రీనివాసం, మాదవం, గోవిందరాజ సత్రాలు ఉన్నాయి. వసతి గదుల సంఖ్యను పెంచి భక్తుల కష్టాలు తీర్చడానికి టిటిడి తిరుమలలో వకులమాతా భవన్ పేరిట భారీ అతిథిగృహాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికైనా టీటీడీ ఉన్నతాధికారులు స్పందించి యాత్రికుల వసతి సముదాయాలపై భక్తులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వసతి గదుల ఇబ్బందులు తొలగించి సంతృప్తికర దర్శనం అందేలా చూడాలని భక్తులు కోరుతున్నారు. 

16:08 - June 11, 2017

నిజామాబాద్ : నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లోని ప్రభుత్వ మినరల్‌ మిక్చర్‌ ప్లాంట్‌ నిరాదరణకు గురవుతోంది. లక్షలు పెట్టి ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో కునారిల్లుతోంది. పాల ఉత్పత్తి పెంచడం కోసం సదుద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్‌ మూతపడింది. ప్రభుత్వం స్పందించి వెంటనే మినరల్‌ మిక్చర్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.

2014 ఏర్పాటు..
నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో.... గ్రామీణాభివృద్ధి సంస్థ, ఇందిరాక్రాంతిపథం, జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో మినరల్‌ మిక్చర్‌ ప్లాంట్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2014 ఫిబ్రవరిలో ఈ ప్లాంట్‌ను నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్లాంట్‌ ఏర్పాటుపై ఉన్న శ్రద్ధ.. దాని డెవలప్‌మెంట్‌పై పెట్టకపోవడంతో మూతపడింది. దీంతో ఎంతో ఆర్భాటంగా ఏర్పాటు చేసిన మినరల్‌ మిక్చర్‌ ప్లాంట్ నిరుపయోగంగా మారింది. పశువుల్లో పాల ఉత్పత్తి పెంచడం, పాలల్లో నాణ్యత, పశువుల ఆరోగ్యం, వ్యాధి నిరోధక శక్తిని పెంచి రైతులకు మేలుచేయడానికి ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్‌ ద్వారా రాష్ట్రంలోని పశువులకు దానాను అందజేస్తారు. పశువులు పాలను అధికంగా ఇవ్వడానికి ఇది ఉపయోగ పడుతుంది. ఈ ప్లాంట్‌ ఏర్పాటుకు ప్రభుత్వం 40 లక్షలు ఖర్చు చేసింది. దీనికి ఇందూరు మిక్చర్‌ప్లాంట్‌గా నామకరణం చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ప్లాంట్‌ ఏర్పాటు లక్ష్యమే ప్రస్తుతం ప్రశ్నార్థకమైంది.

అధికారుల నిర్లక్ష్యం...
మినరల్ మిక్చర్‌ప్లాంట్‌ను ప్రతి రైతు ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమయ్యారు. ఫలితంగా రైతులు ఎవరూ ప్లాంట్‌ వైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో లక్షలుపెట్టి ఏర్పాటు చేసిన మిక్చర్‌ మినరల్‌ ప్లాంట్‌ వెలవెలబోతోంది. ఈ ప్లాంట్‌ ఏర్పాటు చేసి మూడు సంవత్సరాలు పూర్తైనా.. ఇప్పటి వరకు దీనిపై రైతులకు పూర్తి అవగాహనేలేదు. ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి అవుతున్న పశువుల దానాకు ప్రచారం కరువైంది. దీంతో ప్లాంట్‌ను మూసివేశారు.వాస్తవానికి మినరల్‌ మిక్చర్‌ ప్లాంట్‌ నిర్వహించేందుకు సాంకేతిక నిపుణులు, మార్కెటింగ్‌ సిబ్బంది అవసరం. వీరిని నియమించడంతోపాటు జిల్లాల్లోని అన్ని డ్వాక్రా సంఘాలకు, రైతులకు తప్పని సరిగా ఇక్కడ తయారయ్యే పశువుల దానా గురించి అవగాహన కల్పించాలి. ఈ ప్లాంట్‌ నుంచే పశువులు దానాను తీసుకోవాలని ప్రచారం చేయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్లాంట్‌ గురించి పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వం స్పందించి మినరల్‌ మిక్చర్‌ ప్లాంట్‌ను పునరుద్దరించాలని వ్యవసాయ నిపుణులు, రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు. రైతులకు ఎంతోమేలు చేసే ఈ ప్లాంట్‌ అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

16:01 - June 11, 2017

యాదాద్రి : నిన్న హత్యకు గురైన గాయత్రి మృతదేహనికి పొస్టుమార్ట పూర్తయింది. ప్రేమోన్మాది శ్రీకాంత్ శిక్షించాలనే డిమాండ్ తో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. గ్రామ పెద్దల హామీతో గాయత్రి కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు. కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.అలాగే నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ భువనగిరి జిల్లా వద్ద మహిళా సంఘాలు ధర్నాకు దిగాయి. దీంతో ఆస్పత్రి దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వారు మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. అనంతరం గాయత్రి మృతదేహాన్ని యాదగిరిగుట్టకు తరలించారు. 

15:58 - June 11, 2017

భూపాలపల్లి : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి అటవీప్రాంతంలో గిరిజన బాలికపై అత్యాచారం ఘటనలో 10టీవీ కథనానికి పోలీసులు స్పందించారు. భారత్‌దేశ్‌ బేస్‌ క్యాంప్‌నకు చెందిన విజయ్‌ కుమార్, సంతోష్‌లను పోలీసులు అరెస్ట్‌ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. అడవిలో ఎర్రచీమలను పట్టుకునేందుకు వెళ్లిన గిరిజన యువతిపై నిందితులు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వారిపై ఐపీసీ 366, 376 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచారు. 

15:56 - June 11, 2017

విజయవాడ : జీఎస్టీకి వ్యతిరేకంగా విజయవాడలో వస్త్రవ్యాపారులు సమావేశమయ్యారు. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. జీఎస్టీ అమలైతే తాము ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని .. వస్త్రాలు ఉత్పత్తి అవుతున్న రాష్ట్రాల్లో జీఎస్‌టీ పన్నుల మినహాయింపు ఇచ్చేలా సీఎం చంద్రబాబు కేంద్రాన్నికోరాలని వ్యాపారులు అంటున్నారు.జీఎస్టీతో పన్నుతో తమకు నష్టం జరుగుతోందని, దీనిపై ప్రభుత్వ ఆలోచించాలని వారు కోరారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

15:55 - June 11, 2017

యాదాద్రి : ప్రేమోన్మాదానికి బలైన గాయత్రి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ భువనగిరి జిల్లా వద్ద మహిళా సంఘాలు ధర్నాకు దిగాయి. దీంతో ఆస్పత్రి దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వారు మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. 

15:30 - June 11, 2017

భూపాలపల్లి : జిల్లా తడ్వాయి మండలం ముసలమ్మపేట లో గిరిజన బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. 10టీవీ వరుస కథనాలతో జిల్లా యంత్రంగం స్పందించింది. భారత్ దేశ్ క్యాంప్ నకు చెందిన విజయ్, సంతోష్ లను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. టెన్ టివి సామాజిక బాధ్యతతో గిరిజన అడవుల్లో జరిగిన ఘోరాన్ని టెన్ టివి బయటపెట్టింది. కథనాలతో జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే విచారణకు ఆదేశించారు. సమాజానికి టెన్ టివి అండగా ఉంటుందని మరోసారి నిరూపించింది. అయితే అటవీ శాఖ అధికారుల మాత్రం నిందితులను తప్పించే యత్నం చేశారు. 

13:23 - June 11, 2017

కామారెడ్డి : వేసవి సెలవులు ముగిసిపోయాయి. కొత్త విద్యా సంవత్సరంలో అడుగుపెట్టేందుకు విద్యార్ధులు సిద్ధం అవుతున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు విస్తృత ప్రచారానికి తెరలేపాయి. రంగు రంగుల బ్రోచర్లతో జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ప్రచార ఆర్భాటాన్ని చూసి ముచ్చట పడిన పేరెంట్స్ వారు చెప్పిన ఫీజుల లెక్కలు చూసి నోరెళ్లబెడుతున్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఫీజుల పేరుతో జనాన్ని దోచేస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలపై స్పెషల్ స్టోరి. నర్సరీకి 30 వేల రూపాయలు..టెన్త్ క్లాస్‌కి 80 వేల రూపాయలు.... ఇదెక్కడో రాష్ట్ర రాజధానిలోనో.. దేశ రాజధానిలోనో కాదు.. నిన్నా మొన్నటి వరకు సాధారణ నియోజకవర్గంగానే కొనసాగిన కామారెడ్డిలో. ఈ ప్రాంతం జిల్లాగా మారిందో లేదో.. ప్రైవేటు స్కూళ్ల యజమానులు తమదైన దందాను మొదలు పెట్టేశారు. పెద్దపెద్ద నగరాలకు తీసిపోని రీతిలో ఫీజులుం చేస్తున్నారు. ఈ రేంజ్‌ ఫీజులు చూసి.. స్థానిక విద్యార్థుల తల్లిదండ్రులు.. గుండెలు బాదుకుంటున్నారు. పిల్లలకు చదువు కొనిపెట్టినట్లుగానే ఉందంటూ వాపోతున్నారు.

300 ప్రైవేటు పాఠశాలలు..
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా సుమారుగా 300 పైగా ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ఇందులో లక్ష 10 వేల మంది విద్యార్ధులు చదువుకుంటున్నారు. కొత్త విద్యా సంవత్సరం మొదలు కానున్న నేపథ్యంలో తమ వ్యాపారాన్ని మరింత పెంచుకునే పనిలో పడ్డాయి ఇక్కడి ప్రైవేటు స్కూళ్లు. ఇప్పటికే విద్యార్థులను ఆకర్షించే ప్రచారానికి దిగాయి. రంగురంగుల బ్రోచర్లతో ఉపాధ్యాయులను ఇంటింటికి తిప్పుతూ ప్రచారం సాగిస్తున్నాయి. ముఖ్యంగా ప్రైవేటు స్కూళ్లన్నీ గ్రామీణ ప్రాంతాలపైనే దృష్టి పెట్టాయి. జిల్లాలోని కార్పొరేట్ పాఠశాలల్లో నర్సరీకి ఏడాదికి 30 వేలు ఖర్చు అవుతోంది. అదే సాధారణ పాఠశాలలో అయితే 6 వేల వరకు ఖర్చవుతుంది. ఇక టెన్త్ క్లాస్ ఫీజు సంవత్సరానికి 80వేలు దాటుతోంది. దీంతో మధ్య తరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతోంది. వచ్చే ఆదాయంలో ఎక్కువ భాగం పిల్లల చదువులకే ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. వేలకు వేలు ఫీజులతో పాటు పుస్తకాలు, యూనిఫాంలు, కల్చరల్ ప్రోగ్రాంలంటూ స్కూళ్ల యాజమాన్యాలు తల్లిదండ్రుల జేబులు గుల్ల చేస్తుంటే వారు లబోదిబోమంటున్నారు. మరోవైపు జిల్లాలో కొత్తగా మొదలైన స్కూళ్లు సైతం అడ్మిషన్ల పేరుతో వేలాది రూపాయలు దోచేస్తుండటంతో విద్యార్ధి సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వం వీటిని ఎందుకు నియంత్రించట్లేదని విద్యార్థి సంఘ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఫీజుల్ని భారీగా పెంచి సొమ్ము చేసుకుంటున్న ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వీటిని నియంత్రించాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు. మరి ప్రభుత్వం ఇలాంటి స్కూళ్లపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

13:09 - June 11, 2017

మంచిర్యాల : జిల్లాలో జూన్ మొదటి వారం నుండే కుంభవృష్టిగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తుండగా ఇతరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు చెట్లు..విద్యుత్ స్తంభాలు నేలకూలుతున్నాయి. దీనితో విద్యుత్ నిలిచిపోతోంది. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షం జనాలను అతలాకుతలం చేసింది. మహ్మదాబాద్, తపాలపూర్, దండేపల్లి మండలాల్లో భారీగా వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాళ్లపేట వాగు వంతెన వద్ద అప్రోచ్ రోడ్డు కొట్టుకపోవడంతో ఆదిలాబాద్ -- మంచిర్యాల జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

మంచిర్యాలలో భారీ వర్షాలు..

మంచిర్యాల : జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహ్మదాబాద్, తపాలపూర్, దండేపల్లి మండలాల్లో భారీగా వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

గాయత్రి మృతదేహంతో ఆందోళన..

యాదాద్రి : హత్యకు గురైన గాయత్రి మృతదేహంతో బంధువులు ఆందోళన నిర్వహించారు. నిందితుడు శ్రీకాంత్ కు ఉరిశిక్ష వేయాలని, గాయత్రి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

యాదాద్రికి పోటెత్తిన భక్తులు..

యాదాద్రి : శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. సెలవు దినం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. దీనితో కొండపైకి వాహనాలను అధికారులు అనుమతించడం లేదు.

12:51 - June 11, 2017
12:34 - June 11, 2017

అద్భుతమైన కథలను సులభ శైలిలో రాస్తున్న కథారచయిత జియో లక్ష్మణ్. మధ్యతరగతి ప్రజల జీవన చిత్రలాలను కథలుగా అల్లిన కథనశిల్పి ఆయన. కేవలం కథలేకాదు, మానస సరోవరం లాంటి సంచలన నవలలను రాసిన నవలాకారుడాయన. సామాజిక స్పృహకు తాత్వికతను అద్ది రచనలు చేస్తున్న ప్రముఖ కథారచయిత నవలాకారుడు జియో లక్ష్మణ్ గురించి మరిన్ని విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి.

12:33 - June 11, 2017

సాహిత్యం సమాజంలోని ప్రజలకు దిశానిర్దేశం చేస్తుంది. వ్యక్తులను మహోన్నత శక్తులుగా మారుస్తుంది. మానవ సమాజ వికాసానికి తోడ్పడుతుంది. అలాంటి సాహిత్యాన్ని సృష్టిస్తున్న ఎందరో రచయితలు కవులు మన మధ్యలో ఉన్నారు. అలాంటి వారిలో ప్రముఖ కవయిత్రి పాతూరి అన్నపూర్ణ ఒకరు. కంటినుండి జారే భాష్పాన్ని కవిత్వం స్పర్శిస్తుంది. చలమలో ఊరే నీటిలా నిండిన హృదయవేదననీ స్పర్శిస్తుంది కవిత్వం...అంటూ హృదయాలను కదిలించే కవిత్వాలు రాశారు. గత మూడు దశాబ్దాలుగా కవితలు, కథలు రాస్తున్నారామె. అడవి ఉరేసుకుంది, నిశ్శబ్దాన్ని వెతక్కు, మనసు తడిలాంటి కవితా సంకలనాలు వెలువరించిన ప్రముఖ కవయిత్రి కథన శిల్పి పాతూరి అన్నపూర్ణ గురించి మరిన్ని విశేషాలకు వీడియో క్లిక్ చేయండి.

12:26 - June 11, 2017

విజయవాడ : విజయవాడలో దుర్గగుడి ఫ్లై ఓవర్‌ పనులు..ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్న చందంగా మారాయి. సాక్షాత్‌ సీఎం చంద్రబాబు కాంట్రాక్టు సంస్థలకు క్లాస్‌ తీసుకున్నా పనుల్లో పురోగతి కనిపించడం లేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఫ్లై ఓవర్‌పై తలోమాట మాట్లాడుతుండడం ప్రజలను అయోమయానికి గురిచేస్తోంది. నిర్మాణ సంస్థల డెడ్‌లైన్లు వాయిదాల మీద వాయిదాలు పడుతుండటంతో పై వంతెన నిర్మాణం ప్రశ్నార్థకంగా మారుతోంది. ఏపీ రాజధాని ప్రాంతంలోని దుర్గగుడి ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. కేంద్ర నిధులు పుష్కలంగా ఉన్నా..ఎప్పటికి పూర్తవుతుందన్నది అంతుపట్టని పరిస్థితి. దుర్గగుడి ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పడు ధర్నాలు చేశారు. అయితే అధికారంలోకొచ్చి మూడేళ్లు గడుస్తున్నా దుర్గగుడి ప్లై వోవర్ నిర్మాణం పూర్తికాలేదు. పైల్ క్యాప్స్ రెండు మినహా మిగిలిన పియర్ 4, పియర్ క్యాప్స్ 6, స్పైన్స్, విండ్స్ 150 నిర్మాణంతోపాటు ఏవీ పూర్తి కాలేదు. కనకదుర్గ గుడి ఫ్లై ఓవర్‌ పనులు ప్రారంభించి 18 నెలలు గడిచినా.. పనుల్లో మాత్రం పురోగతి కనిపించడం లేదు. ఈ పనులను దక్కించుకున్న సోమా కంపెనీ 2016 పుష్కరాలకు పనులు పూర్తి చేయాల్సి ఉన్నా 2017 సెప్టెంబర్ వరకు పూర్తి చేసే పరిస్థితి కనిపించట్లేదు. ఏదీ ఏమైనా ఆగస్టు, సెప్టెంబర్‌ కల్లా దుర్గగుడి ఫ్లై ఓవర్‌ పనులు పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్‌ చెబుతున్నారు. బెజవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాల విషయంలో అధికారులకు, పాలకుల మధ్య సమన్వయలోపం ఉందన్న విమర్శలున్నాయి. దీంతో దుర్గగుడి ఫ్లై ఓవర్‌ పనులు ఎప్పటికీ పూర్తవుతుందన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. దుర్గగుడి ప్లై ఓవర్ పనులు నిర్లక్ష్యంతో ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు వెంటాడుతున్నాయి. సర్కార్ చెబుతున్న మాటలకు పొంతనలేకపోవడంతో దుర్గగుడి ఫ్లై ఓవర్ నిర్మాణంపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయితే ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు త్వరితగతిన ఫ్లై ఓవర్ ను అందుబాటులోకి తేవాలని బెజవాడవాసులు డిమాండ్ చేస్తున్నారు.

12:25 - June 11, 2017

చిత్తూరు : వెంకన్న భక్తులను వసతి సదుపాయాలు వెంటాడుతున్నాయి. శ్రీవారి దర్శనం కన్నా ఎక్కువసేపు గదులకోసం క్యూలైన్లలోనే ఉండాల్సి వస్తోంది. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతుండటంతో... కొండపై వసతి కష్టంగా మారుతోంది. రద్దీరోజుల్లో తిరుమలలో ఉన్న వసతి గదులు భక్తులకు ఏమాత్రం సరిపోవండం లేదు. గదులు దొరకని భక్తులు ఆరుబైటే పడిగాపులు కాయాల్సివస్తోంది. అటు టిటిడి ఏర్పాటు చేసిన యాత్రికుల వసతి సముదాయాలపై సరైన సమాచారం లేక భక్తులు అవస్థలు పడుతున్నారు. తిరుమలకు వెళ్లే భక్తులకు దర్శనం కన్నా మొదటి సమస్య వసతి గదులు పొందటమే. ఒక్కోసారి స్వామివారి దర్శనం కన్నా ఎక్కువసేపు గదులకోసం క్యూలైన్లలోనే ఉండాల్సి వస్తోంది. సాధారణంగా రోజుకు 70 నుంచి 80 వేల మంది, వారాంతంలో ఇతర రద్దీ సమయాల్లో రోజుకు లక్షమందికి పైనే భక్తులు తిరుమల శ్రీవారిని దర్శిస్తుంటారు. అయితే రోజుకు లక్షమంది భక్తులకు సులభంగా దర్శనం చేయిస్తున్న టీటీడీ అంతమందికి వసతి కల్పించడంలో మాత్రం విఫలం అవుతోంది. వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి తిరుమల వచ్చిన భక్కులకు వెంటనే అద్దె గదులు దొరక్కపోతే ఆరుబయటే నానాపాట్లు పడుతున్నారు. టిటిడి యాత్రికుల వసతి సముదాయాలు ఏర్పాటు చేసినా వాటిపై సరైన సమాచారం తెలియక వెంకన్న భక్తులకు ఇక్కట్లు తప్పడం లేదు.

7 కౌంటర్లు..
తిరుమలలో మొత్తం 7 కౌంటర్ల ద్వారా భక్తులకు గదులు మంజూరు చేస్తారు. విఐపీలకు గదులు కేటాయించడానికి శ్రీపద్మావతి నగర్, అడ్వాన్స్ రిజర్వేషన్ గదులు పొందడానికి ఏఆర్పీ కౌంటర్, సామాన్య భక్తుల కోసం సీఆర్ఓ జనరల్, సిఫార్సు ఉత్తరాలు తెచ్చేవారికోసం టీబి కౌంటర్...ఇలా మొత్తంగా 7 కౌంటర్లు ద్వారా గదులు కేటాయిస్తున్నారు. కొండపై మొత్తం 7 వేల గదులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ గదుల్లో కేవలం 35 నుండి 40 వేల మంది భక్తులు మాత్రమే బస చేయడానికి వీలుంది. రద్దీరోజుల్లో గదులు దొరకని భక్తుల కోసం టిటిడి వివిధ ప్రాంతాల్లో నాలుగు భారీ వసతి సముదాయాలు ఏర్పాటు చేసింది. వీటిలోనే లాకర్ సదుపాయం, తలనీలాల సమర్పణకు కళ్యాణకట్ట, స్నానం చేయడానికి సదుపాయాలు కల్పించారు. ఒక్కో వసతి సముదాయంలో సుమారు రెండు వేల మంది భక్తులు బస చేయడానికి సౌకర్యలు ఉన్నాయి.

ఇబ్బందులు తొలగిస్తారా ?
గదులు దొరకని వారి కోసం యాత్రికుల వసతి సముదాయాలు ఏర్పాటు చేసిన విషయం భక్తులకు తెలియడంలేదు. ఇందులో బ్యాగులు పెట్టుకోవడానికి లాకర్‌ సదుపాయం ఉండటంతో.. శ్రీవారి దర్శనానికి వసతి సముదాయం నుంచే వెళ్లే అవకాశముంది. భక్తుల వసతి కోసం తిరుపతిలోకూడా విష్ణునివాసం, శ్రీనివాసం, మాదవం, గోవిందరాజ సత్రాలు ఉన్నాయి. వసతి గదుల సంఖ్యను పెంచి భక్తుల కష్టాలు తీర్చడానికి టిటిడి తిరుమలలో వకులమాతా భవన్ పేరిట భారీ అతిథిగృహాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికైనా టీటీడీ ఉన్నతాధికారులు స్పందించి యాత్రికుల వసతి సముదాయాలపై భక్తులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వసతి గదుల ఇబ్బందులు తొలగించి సంతృప్తికర దర్శనం అందేలా చూడాలని భక్తులు కోరుతున్నారు.

పోయెస్‌ గార్డెన్‌ వద్ద ఉద్రిక్తత..

చెన్నై : పోయెస్‌ గార్డెన్‌ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. జయలలిత నివాసం వేదనిలయంలోకి వెళ్లేందుకు జయలలిత మేనకోడలు దీప యత్నించారు. ఆమెతో పాటు భారీగా చేరుకున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగింది. జయలలితకు వారసులు లేకపోవడంతో.. ఆ నివాసం పోలీసుల ఆధీనంలో ఉంది.

 

12:20 - June 11, 2017

చెన్నై : వేదనిలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీప పోయిస్ గార్డెన్ లో హల్ చల్ చేశారు. వేదనిలయాన్ని స్వాధీనం చేసుకొనేందుకు దీప..తన మద్దతు దారులతో ప్రయత్నించారు. పోలీసులు దీనిని అడ్డుకున్నారు. తానే నిజమైన వారసురాలని మొదటి నుండి పేర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇల్లు తనదేనని..ఇక్కడ ఉండటానికి తనకు హక్కు ఉందని పేర్కొంటున్నారు. పళని స్వామి..శశికళకు సంబంధించిన కటౌట్లను చించివేశారు. పోలీసులు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఇంటిపై మరెవరికీ హక్కులు లేవని, ఇది తమకు వారసత్వంగా వచ్చిన భవంతి అని వ్యాఖ్యానించారు. పోలీసులు అడ్డుకోవడంతో వేదనిలయంలోకి మాత్రం వెళ్లలేకపోయారు. దీనితో కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

 

12:13 - June 11, 2017

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'..మాటల మాంత్రికుడు 'త్రివిక్రమ్ శ్రీనివాస్' కాంబినేషన్ లో వస్తున్న చిత్రానికి తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు సోషల్ మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. వీరి కాంబినేషన్ లో గతంలో 'జల్సా'..’అత్తారింటికి దారేది' సినిమాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో చిత్రం ప్రారంభం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో 'పవన్' నటించిన చిత్రాలు 'సర్దార్ గబ్బర్ సింగ్', ‘కాటమరాయుడు' చిత్రాలు ఆశించినంతగా రాణించలేదు. తొలుత శరవేగంగా షూటింగ్ కొనసాగిన ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. షూటింగ్ ఆలస్యం కావటంతో పాటు రాజకీయ కారణాలతో నెల రోజులు పాటు 'పవన్' షూటింగ్ కు బ్రేక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

జీఎస్టీ మండలి సమావేశం షురూ..

న్యూఢిల్లీ : విజ్ఞాన్‌ భవన్‌లో జీఎస్టీ మండలి సమావేశం ప్రారంభమయ్యింది. కేంద్రమంత్రి అరున్‌జైట్లీ అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరయ్యారు.

11:58 - June 11, 2017

ఆసక్తి ఉండి..అవగాహన ఉండి..తక్కువ టైంలో జీవితంలో స్థిర పడాలంటే సీఏ కోర్సు చక్కగా ఉపయోగపడుతుందని మాస్టర్ మైండ్స్ అధినేత మట్టుపల్లి మోహన్ రావు పేర్కొన్నారు. సీఏ కోర్సుకు విపరీతమైన డిమాండ్ నెలకొంది. సీఏ కోర్సుల్లో పలువురు విద్యార్థులను తీర్చిదిద్దిన ఘతన మాస్టర్ మైండ్స్ కు ఉంది. సీఎ చదవాలంటే ఏం చేయాలి ? ఎంపీసీ చదివిన వారు రాణిస్తారా ? బైపీసీ చదివిన వారు రాణిస్తారా ? తదితర ప్రశ్నలపై మట్టుపల్లి మోహన్ రావు సూచనలు..సలహాలు అందచేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

36 కోట్ల మాదక ద్రవ్యాలు..

ముంబై : ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మాదక ద్రవ్యాలను అధికారులు పట్టుకున్నారు. ఆదివారం ఉదయం కొలంబియా నుంచి వచ్చిన ఓ వ్యక్తి దగ్గర రూ. 36 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.

11:29 - June 11, 2017

'సరైనోడు' చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని తన ఖాతాలో వేసుకుని ముందుకెళుతున్న స్టైలిష్ స్టార్ ‘అల్లు అర్జున్’ తన తాజా చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. హరీశ్ శంకర్ దర్శకత్వంలో 'డీజే..దువ్వాడ జగన్నాథమ్' చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ చిత్ర టీజర్..పోస్టర్స్..విశేషంగా అభిమానులను అలరించిన సంగతి తెలిసిందే. తాజాగా పాటలు కూడా సామాజిక మాధ్యమాల్లో రిలీజ్ చేశారు. శనివారం సాయంత్రం ఆడియో ట్రాక్ లిస్ట్ రిలీజ్ చేసిన యూనిట్ తాజాగా చిత్రానికి సంబంధించిన అన్ని సాంగ్స్ నెట్ లో విడుద‌ల చేశారు. దేవి శ్రీ అందించిన సంగీతం ఉర్రుతలూగిస్తోంది. ఇదిలా ఉంటే ఆదివారం సాయంత్రం ప్రీ రిలీజ్ వేడుక‌ని అంగ‌రంగ వైభ‌వంగా జ‌ర‌పాల‌ని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ వేడుకకు మెగాస్టార్ ‘చిరంజీవి’ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన గ్లామ‌ర్ బ్యూటీ పూజా హెగ్డే నటించింది. 'దిల్' రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ మూవీని జూన్ 23న విడుద‌ల చేస్తున్నారు.

11:28 - June 11, 2017

హైదరాబాద్‌ : నగరంలో స్కూలు ఫీజుల్ని తలుచుకుంటేనే తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరుగెడుతాయి. ఫీజుల భారంపై కొన్నేళ్లుగా పేరెంట్స్ కమిటీలు, ప్రజాసంఘాలు పలుమార్లు ఆందోళనలు చేపట్టారు. అయినా ప్రభుత్వంలో మాత్రం ఎలాంటి చలనంలేదు. అసలింతకీ ఫీజుల నియంత్రణ ప్రతిపాదనపై పాఠశాల యాజమాన్యాలు ఏమంటున్నాయి? తల్లిదండ్రులు ఏమంటున్నారు? ఇప్పటికే అకడమిక్ ఇయర్ ప్రారంభం కావడంతో ఈ ఏడాది కూడా ఫీజుల భారాలు తప్పవా? కార్పొరేట్ దోపిడికి అంతం ఉండదా ఈ అంశంపై టెన్ టివి ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో సుబ్రమణ్యం (హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అధ్యక్షులు), అమర్ నాథ్ (విద్యావేత్త), పగడాల లక్ష్మయ్య (తెలంగాణ పేరెంట్స్ సెక్రటరీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

జేఈఈ ఫలితాల విడుదల..

హైదరాబాద్ : జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. మోహన్ అబ్యాస్ కు 64వ ర్యాంకు వచ్చింది. ఏపీ ఎంసెట్ లో మోహన్ అభ్యాస్ కు మొదటి ర్యాంకు.. తెలంగాణ ఎంసెట్ లో మోహన్ కు ఐదో ర్యాంకు రావడం గమనార్హం.

 

నేవీ ఘాట్ లో ప్రమాదం..

విశాఖపట్టణం : యారాడ నేవీ ఘాట్ లో కారు కొండను ఢీకొంది. నేవీ కమాండర్ అవినాష్ ఠాకూర్ మృతి చెందాడు. నలుగురు నేవీ ఉద్యోగులకు గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

10:52 - June 11, 2017

తూర్పుగోదావరి : జిల్లా రంపచోడవరంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 6 దుకాణాలు కాలిబూడిదయ్యాయి. విద్యుత్‌ షాట్‌సర్క్యూట్‌తోనే మంటలు చెలరేగినట్టు స్థానికులు చెబుతున్నారు. ప్రమాద స్థలానికి 1కిలోమీటరు దూరంలోనే ఫైర్‌స్టేషన్‌ ఉన్నా.. వారు చేరుకునే సరికే అంతా కాలిబూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది వైఖరిపై స్థానికులు మండిపడుతున్నారు. అటు విద్యుత్‌శాఖ అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారని గ్రామస్తులు అంటున్నారు. రాత్రి పదకొండు గంటల సమయంలో మంటలు చెలరేగినా.. ఉదయం వరకు కరంటు సరఫరా నిలిపివేయలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

10:50 - June 11, 2017

హైదరాబాద్ : సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కాబోతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు సమస్యలతో విద్యార్థులకు స్వాగతం పలుకుతున్నాయి. స్వరాష్ట్రంలోనూ సర్కార్‌ బడుల దుస్థితి ఏమాత్రం మారలేదు. సర్కార్‌ బడుల తలరాత మారుస్తామంటూ ప్రభుత్వం చేస్తున్న ఆర్భాట ప్రకటనలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల రీఓపెనింగ్‌ సందర్భంగా... సర్కార్‌ బడుల స్థితిగతులపై టెన్‌టీవీ స్పెషల్‌ స్టోరీ...వేసవి సెలవుల తర్వాత సోమవారం నుంచి మళ్లీ బడిగంటలు మోగనున్నాయి. వాస్తవానికి కొత్త విద్యాసంవత్సరం ఏప్రిల్‌లోనే ప్రారంభమయ్యింది. ప్రైవేట్‌ స్కూళ్ల పరిస్థితి ఎలా ఉన్నా... సర్కారీ బడులు మాత్రం సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి. 90శాతం ప్రభుత్వ పాఠశాలల్లో అరకొర సౌకర్యాలే ఉన్నాయి. స్వరాష్ట్రం ఏర్పడి మూడేళ్లైనా ప్రభుత్వ పాఠశాలల్లో ఏమాత్రం మార్పులేదు. బెంచీలు ఉంటే బ్లాక్‌ బోర్డులు ఉండవు. టాయిలెట్స్‌ ఉంటే వాటర్‌ ఉండదు. అన్నీ ఉంటే టీచర్లు ఉండరు. ఇదీ సర్కార్‌ బడుల దుస్థితి. తరాలు మారుతున్న సర్కారీ బడుల దుస్థితి మాత్రం మారడం లేదు. అందుకే ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం సన్నగిల్లుతోంది. ప్రభుత్వ బడుల్లో చదువంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రభుత్వ బడుల తలరాత మారుస్తామని కేసీఆర్‌ ఆర్భాటంగా ప్రకటించారు. ప్రభుత్వం మూడేళ్ల సంబరాలను ఘనంగా జరుపుకుంది. కానీ సర్కార్‌ బడుల అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలులేక విద్యార్ధులు ఏటా అష్టకష్టాలు పడుతున్నారు. వీటిని పరిష్కరించాల్సిన ప్రభుత్వం మాత్రం.. పైపై మెరుగులపై దృష్టి సారిస్తోంది. సర్కార్‌ బడులను ఒకవైపు సమస్యలు అతలాకుతలం చేస్తోంటే. . మరోవైపు టీచర్ల కొరత వేధిస్తోంది. మూడేళ్లైనా ఇప్పటి వరకు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయలేదు. టీచర్‌ పోస్టుల కోసం నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. టీచర్‌ పోస్టుల భర్తీపై ప్రభుత్వం మూడేళ్లలో 30 ప్రకటనలు చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటోంది. ఈ ఏడాది అన్ని పాఠశాలలను డిజిటల్‌ స్కూళ్లగా మార్చుతామని టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఊదరగొట్టింది. ప్రభుత్వం చెప్తున్న దానికి చేస్తున్న దానికి అసలు పొంతనేలేదు. నేటి వరకు చాలా పాఠశాలల్లో అసలు కంప్యూటర్లే లేవన్నది బహిరంగ రహస్యం. ఇక విద్యార్ధులకు గతేడాది ఇస్తామన్న యూనిఫామ్‌లు ఇప్పటి వరకు ఇవ్వలేదు. పుస్తకాలు పాఠశాలల ప్రారంభానికి ముందే స్కూల్స్‌కు పంపిణీ చేస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు అతీగతీ లేదు. సర్కారీ బడులు ఉద్దేశ్యపూర్వకంగానే నిరాదరణకు గురవుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేట్‌, కార్పొరేట్‌ స్కూళ్ల ధనదాహానికి సర్కార్‌ బడులు ఆదరణ కోల్పోతున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సిన బాధ్యత సర్కార్‌పై ఉంది. విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

10:47 - June 11, 2017

హైదరాబాద్‌ : నగరంలో స్కూలు ఫీజుల్ని తలుచుకుంటేనే తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరుగెడుతాయి. ఫీజుల భారంపై కొన్నేళ్లుగా పేరెంట్స్ కమిటీలు, ప్రజాసంఘాలు పలుమార్లు ఆందోళనలు చేపట్టారు. అయినా ప్రభుత్వంలో మాత్రం ఎలాంటి చలనంలేదు. అసలింతకీ ఫీజుల నియంత్రణ ప్రతిపాదనపై పాఠశాల యాజమాన్యాలు ఏమంటున్నాయి? తల్లిదండ్రులు ఏమంటున్నారు? ఇప్పటికే అకడమిక్ ఇయర్ ప్రారంభం కావడంతో ఈ ఏడాది కూడా ఫీజుల భారాలు తప్పవా? కార్పొరేట్ దోపిడికి అంతం ఉండదా అన్న ప్రశ్నలే సామాన్యులను కుదిపేస్తున్నాయి. తెలంగాణలో స్కూలు ఫీజులను నియంత్రించాల్సిందేనని పేరెంట్స్ అసోసియేషన్స్ పట్టుబడుతున్నాయి. ప్రభుత్వం జీవోలతో సరిపెట్టకుండా..నియంత్రణ కోసం చట్టం చేయాలని కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నారు. ప్రతి స్కూలు ఫీజును డీఎఫ్ఆర్ సీ నిర్ణయించాలని డిమాండ్ చేస్తున్నారు. టీచర్ల జీతాలు, నిర్వహణ, ఇతరాత్ర ఖర్చులు పోను..యాజమాన్యాలకు 5 శాతం లాభం ఉండేలా ఫీజులను ఖ‌రారు చేయాలని వారు సూచిస్తున్నారు. ఫీజులను ఇష్టానుసారంగా వసూలు చేయకుండా పేమెంట్స్ అన్నీ ఆన్‌లైన్ లేదా చెక్ రూపంలో ఉండాలని కోరుతున్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్లపై నిపుణులతో సోషల్ ఆడిటింగ్ జరిపేలా ప్రత్యేక వ్యవస్థ ఉండాలని ప్రతిపాదిస్తున్నారు. క్లాస్‌ల వారీగా గరిష్ట ఫీజును ప్రభుత్వమే నిర్ణయించాలని డిమాండ్ చేస్తున్నారు.

క్లాసుల వారీగా ఫీజులను ప్రభుత్వమే నిర్ణయించాలి..
ఫీజుల భారంపై తల్లిదండ్రులు ఆందోళనలు చేస్తున్నా..ప్రైవేటు యాజమాన్యాలు మాత్రం ఫీజుల్ని పెంచుతూనే ఉన్నాయి. ఇదేంటని ప్రశ్నిస్తే సమాధానం ఇచ్చేవారే కరువయ్యారు. ఇదిలా ఉంటే ప్రతిఏటా నూతన విద్యా సంవత్సరం జూన్ 12తో ప్రారంభంకావాలి. కానీ..కేవీ, నవోదయ, సీబీఎస్సీ షెడ్యుల్‌కు అనుగుణంగా గతేడాది మార్చి 21నే విద్యా సంవత్సరాన్ని మొదలు పెట్టింది ప్రభుత్వం. దీంతో ఆడ్మిషన్ల ప్రక్రియను వేగం చేసాయి ప్రైవేటు స్కూళ్లు. ఈ ఏడాది ఫీజు నియంత్రణ చట్టం రావచ్చోన్న ఉద్దేశంతో తక్షశీల, గ్రీక్ ప్లానెట్ వంటి కార్పొరేట్ స్కూళ్లు ఇప్పటికే ఫీజులను 25 శాతం మేర పెంచాయి. ఫీజుల దోపిడిపై పేరెంట్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే 25శాతం ఫీజుల్ని పెంచిన కార్పొరేట్‌ స్కూళ్లు..
మరోవైపు ఫీజుల నియంత్రణను ప్రైవేటు స్కూల్స్ వ్యతిరేకిస్తున్నాయి. అందరిని ఒకే గాటాన కట్టి దోపిడి దారులుగా చిత్రీకరించడం తగదంటున్నారు. కేవలం పదిశాతం ఉన్న కార్పోరేట్ స్కూళ్లే విద్యను వ్యాపారంగా మార్చి, లక్షల ఫీజును వసూలు చేస్తున్నాయన్నారు. ప్రభుత్వం చేతనైతే అలాంటి స్కూళ్లపై చర్యలు తీసుకోవాలి తప్ప తక్కువ ఫీజు వసూలు చేస్తున్న తమ మీద అజమాయిషి చేయడం సరైందికాదంటున్నారు. ఫీజు నియంత్రణ పేరుతో తమను వేధిస్తే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు. లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ స్కూల్స్‌ వైఖరిపై మేధావులు, విద్యావేత్తలు తప్పుబడుతున్నారు. ఎంత మంచి విద్యా బోధనైనా గరిష్ట మొత్తానికి మించి ఫీజులు వసూలు చేయకూడదని గుర్తు చేస్తున్నారు. అదే సందర్భంలో కామన్ స్కూల్ విధానం తీసుకొచ్చి కార్పొరేట్ విద్యా వ్యాపారాన్ని అడ్డుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందక..ప్రైవేటు పాఠశాలల్లో చదువు కొనలేక సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే కేజీ టు పీజీ ఉచిత నిర్భంద విద్య అందే వరకు ఫీజుల భారాన్ని తగ్గించాలని కోరుతున్నారు. అయితే ప్రభుత్వం ఫీజులను నియంత్రిస్తుందా లేక ప్రైవేటు యాజమాన్యాల ఒత్తిల్లకు తలొగ్గి చేతులెత్తేస్తుందా అనేది వేచిచూడాలి.

10:43 - June 11, 2017

హైదరాబాద్ : ఎన్ని నిబంధనలున్నా ప్రైవేట్ స్కూల్స్ ఫీజు దోపిడికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. స్టేషనరీ పేరుతో లక్షల రూపాయలు వసూలు చేయడమే కాకుండా డొనేషన్ల పేరుతో తల్లిదండ్రులను నిలువు దోపిడి చేస్తున్నారు. దీన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలన్ని బూడిదలో పోసిన పన్నీరులా మారుతోంది. ఫీజులను నియంత్రించే హక్కు ప్రభుత్వానికి లేదని కార్పొరేట్ స్కూల్స్‌ అంటుంటే..ఫీజు భారాలు భరించలేమని పేరెంట్స్ లబోదిబోమంటున్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో ఫీజు నియంత్రణ సాధ్యాసాధ్యాలపై 10టీవి స్పెషల్ స్టోరీ. దేశంలో ఎన్నో కార్పోరేట్ స్కూళ్లు ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత దోపిడి మరెక్కడా లేదు. టెక్నో స్కూలు, ఇంటర్నేషనల్ స్కూలు, ఒలంపియాడ్ స్కూల్ వంటి పేర్లతో తల్లిదండ్రుల నుంచి లక్షల రూపాయలను దండుకుంటున్నారు. ఇక్కడ విద్య వ్యాపారమైనందు వల్ల ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలు ప్రతి సంవత్సరం ఫీజులు అమాంతం పెంచేస్తున్నాయి.

లక్షల్లో ఫీజులు వసూలు..
మరోవైపు ఓక్రిడ్జ్ వంటి స్కూళ్లల్లో సంవత్సరానికి 4 లక్షల ఫీజును వసూలు చేస్తున్నారు. సీబీఐటీ వంటి టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో బీటెక్ వంటి ప్రొఫెషనల్‌ కోర్సులకు లక్షా 13 వేల కంటే ఎక్కువ వసూలు చేయోద్దని స్వయంగా సుప్రీంకోర్టే తేల్చి చెప్పింది. అలాంటిది 4, 5 తరగతులు చదివే పిల్లలపై ఏలాంటి ఆంక్షలు లేకుండా లక్షల ఫీజుల వసూలు చేస్తున్నారు. ఇంత భారీ ఎత్తున ఫీజుల దందా జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మేధావులు మండిపడుతున్నారు. అంతేకాదు దాదాపుగా ప్రైవేటు స్కూల్స్ అన్నింటిలో స్టేషనరీ పేరుతో వేలకు వేలు వసూలు చేస్తున్నా వాటికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

స్టేషనరీ పేరుతో రూ.లక్షల్లో వసూలు..
తమిళనాడు, ఢిల్లీ, కేరళ వంటి రాష్టాల్లో విద్యా చట్టాలు పకడ్బందిగా అమలవుతున్నాయి. అందుకే అక్కడ ఫీజుల మోత ఉండదు. అక్కడ ప్రతి స్కూలుకు ఫీజును ప్రభుత్వాలే నిర్ధారిస్తాయి. స్కూలు ఖర్చులు, టీచర్ల ఫీజులు, నిర్వహణ, ఇతరాత్ర ఖర్చులకు లెక్కగట్టి..మేనేజ్‌మెంట్‌ లాభాన్ని కలుపుకుని ఫీజులను నిర్ధారిస్తున్నాయి అక్కడి ప్రభుత్వాలు. అంతకు మించి వసూలు చేస్తే ఏ స్కూల్ అయినా సరే కఠిన చర్యలు తప్పవు. అయితే తెలుగు రాష్ట్రాల్లో అలాంటి చట్టాలు లేకపోవడంతో ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. అయితే ఫీజు నియంత్రణ కోసం ప్రభుత్వాలు ఎన్నో జీవోలు తీసుకొచ్చినా అవి న్యాయ స్థానంలో నిలవలేకపోయాయి..దీంతో ప్రైవేటు స్కూల్స్ ఆడిందే ఆట, పాడింది పాటగా సాగుతోంది.

అంతకు మించి వసూలు చేస్తే కఠిన చర్యలు..
మరోవైపు ఒకే యాజమాన్యం కింద ఉన్న విద్యాసంస్థలు కూడా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ఫీజులను వసూలు చేస్తూ ఫీజుల డిపిఎస్‌లో చదివే విద్యార్ధుల పేరెంట్స్‌ని కంగారుపెడుతున్నారు. ఢిల్లీలో ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్లో విద్యార్థి ఫీజు సంవత్సరానికి 36 వేలుంటే తమిళనాడులో 80 వేలు ఉంది. అదే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం లక్షన్నరకు మించి ఉంది. ఒకే మేనేజ్ మెంట్, ఒకేరకమైన విద్యాబోధన, సేమ్ సిలబస్ ఉన్నప్పటికీ ఫీజుల్లో ఇంత వ్యత్యాసం ఎందుకు ఉందో అర్ధం కావడం లేదని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు అప్లికేషన్ ఫీజు, డొనేషన్స్, ట్యూషన్ ఫీజు, కాషన్ డిపాజిట్, ఎక్జామ్ ఫీ, ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్, ఇతరాత్ర ఖర్చుల పేరుతో ఇష్టారాజ్యంగా డబ్బులను వసూలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ స్కూళ్ల తీరు అంతంత మాత్రంగానే ఉండటంతో ప్రైవేట్ స్కూళ్ల వైపే తల్లిదండ్రులు మొగ్గుచూపుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రైవేట్ విద్యార్ధులు సగటున 31 శాతం ఉండగా తెలంగాణలో మాత్రం అత్యధికంగా 54 శాతం ఉన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 11 వేల 700 ప్రైవేట్ స్కూళ్లలో 32 లక్షల 71 మంది విద్యార్దులు విద్యనభ్యసిస్తున్నారు. గతేడాది ఫీజుల రూపంలో ప్రైవేట్ స్కూల్స్ 12 వేల 500 కోట్లను సమకూర్చుకున్నాయి. ఇది తెలంగాణ విద్యా బడ్జెట్ కంటే 3 వేల కోట్లు అదనం కావడం గమనార్హం.

తెలంగాణలో ప్రైవేటు విద్యార్థులు 54 శాతం..
ఇక ఏడాదికేడాది పెరుగుతున్న ఫీజులను తల్లిదండ్రులు భరించలేకపోతున్నారు. దీంతో కొన్ని సంవత్సరాలుగా ఫీజుల నియంత్రణ కోసం పేరెంట్స్‌ కమిటీలు ఉద్యమిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫీజుల నియంత్రణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఉస్మానియా యూనివర్శిటీ మాజీ వీసీ ప్రొఫెసర్‌ తిరుపతిరావు అధ్యక్షతన కమిటీని వేసింది. ఇందులో పాఠశాల విద్యా కమిషనర్‌ కన్వీనర్‌గా, పలువురు విద్యా నిపుణులు, పేరెంట్స్ నుంచి ఇద్దరు ప్రతినిధులు, పాఠశాల యాజమాన్యాల నుంచి ఆరుగురు ప్రతినిధులున్నారు. ఫీజుల నియంత్రణకు మార్గదర్శకాలను రూపొందించేందుకు ఇప్పటికే కమిటీ పలుమార్లు సమావేశమై దాదాపుగా ఏకాభిప్రాయానికి వచ్చింది. కానీ రిపోర్టును తయారు చేసేందుకు మరో నెల సమయం కావాలని కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. నివేదిక సిద్ధమైనా..ప్రభుత్వానికి అందజేసేందుకు కమిటీ కాలయాపన చేస్తోందని పేరెంట్స్‌ కమిటీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒకవేళ రిపోర్టును ప్రభుత్వానికి ఇప్పుడే అందజేస్తే తప్పనిసరిగా ఫీజుల నియంత్రణ కమిటిని ఏర్పాటుచేయాల్సి ఉంటుందని..అందుకే ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపించడంలేదని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కమిటీ రిపోర్టును అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

10:36 - June 11, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో విద్య రోజురోజుకు ఖరీదైన వ్యవహారంగా మారుతోంది. పాఠశాల నుంచి మొదలుకొని ఉన్నత విద్య వరకు లక్షల్లోనే బేరం నడుస్తోంది. అయితే దేశమంతా చదువును కొనడం ఒకెత్తయితే హైదరాబాద్‌లో కొనడం మరింత ఖర్చుతో కూడుకున్నదనే చెప్పుకోవాలి. విద్యార్ధులకి సమ్మర్ హాలీడేస్ పూర్తవుతున్నాయనగానే తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరుగెడుతాయి. స్కూళ్లు రీఓపెన్ అవగానే ఫీజులు ఏ రేంజీలో ఉంటాయోనన్న టెన్షన్‌ మొదలవుతుంది. జూన్‌ నెల అప్పుడే వచ్చేసింది. కొత్త విద్యాసంవత్సరం మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతుంది. దీంతో తల్లిదండ్రుల్లో గుబులు మొదలైంది. అప్పులకు సిద్ధం కావాలంటూ వారి చెవుల్లో సైరన్‌లు మోగుతుంటాయి. పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫాం, షూస్, బెల్ట్‌ ఇలా లిస్ట్ చాంతాడంత ఉంటుంది. ఈ లిస్టు వింటేనే గుండెల్లో దడ మొదలవుతుంది. ఇవన్నీ కొనాలంటే జేబులో నిండుగా పచ్చనోట్లు ఉండాల్సిందే. ఇదంతా ఒకత్తెయితే స్కూల్లో జాయిన్ చేయించడం తలకు మించిన భారంగా మారుతోంది. ఫీజులు, డొనేషన్లు, స్పెషల్ ఫీజులు, ట్రాన్స్ పోర్టు, టర్మ్‌ ఫీజులు..ఇలా వీటి లిస్ట్ మొత్తం తీస్తే తల్లిదండ్రులకు మిగిలేది అప్పుల తిప్పలే.

ఫీజులు, డొనేషన్లు, స్పెషల్‌ ఫీజులు, ట్రాన్స్‌పోర్ట్‌, టర్మ్‌ ఫీజులు
రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో విద్య పరిస్థితి చూస్తే అంతంత మాత్రంగానే ఉంటోంది. దీంతో సాధారణ, మధ్యతరగతి తల్లిదండ్రులంతా ప్రైవేటు స్కూళ్ల వైపే మొగ్గు చూపుతున్నారు. ఇదే అదనుగా తీసుకున్న ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు ఫీజుల దందాకు తెరలేపారు. దీంతో ప్రైవేటు స్కూళ్లల్లో పిల్లల్ని జాయిన్ చేయాలంటేనే తల్లిదండ్రులు వణికిపోతున్నారు. పిల్లల చదువుల కోసం అప్పులు చేస్తూ నానా అవస్థలు పడుతున్నారు. అది కూడా ఒక్కో స్కూల్‌ కి ఒక్కో రకమైన ఫీజులు ఉండడంతో హడలెత్తిపోతున్నారు. గల్లీలో ఉండే చిన్న స్కూల్లో నర్సరీలో జాయిన్ చేయాలంటే 25 వేలకు తగ్గటం లేదు. ఇక కార్పొరేట్, కాన్వెంట్ చదువులకు లక్షలు కుమ్మరించాల్సిందే. దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్‌ నగరంలో స్కూళ్ల ఫీజులు మోత మోగిస్తుండడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫీజుల మోతకు తట్టుకోలేక తల్లిదండ్రులంతా కలిసి సంఘాలను ఏర్పాటు చేసారు. తలకు మించిన భారంగా మారిన స్కూళ్ల ఫీజులను ప్రభుత్వం వెంటనే నియంత్రించాలని పేరెంట్స్‌ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఏడాదంతా కష్టపడి ఏదో నాలుగు రాళ్లు సంపాదించి వెనకేసుకుంటే..అవన్నీ స్కూలు ఫీజులకు కట్టడానికి కూడా సరిపోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫీజులు తలకు మించిన భారంగా మారడంతో..కుటుంబ పోషణ భారంగా మారుతుందని ఆవేదన చెందుతున్నారు. ప్రతిఏటా స్కూలు యాజమాన్యాలు ఫీజుల్ని 4, 5 రెట్లకు పెంచుకుంటుపోతుంటే..తమ ఆదాయం మాత్రం పెరగగపోవడంతో అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వాల అలసత్వం..
దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా హైదరాబాద్‌లో ఫీజుల దోపిడి పేరుతో దందా నడుస్తోంది. బుడిబుడి అడుగులు వేస్తూ ఏ, బి, సి, డి లు కూడా పలకడం రాని నర్సరీ పిల్లలకు టాప్ స్కూల్స్ తీసేకునే ఫీజులు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌ లో నర్సరీ స్టూడెంట్‌కి అడ్మిషన్ ఫీజు 80వేలు, మాదాపూర్‌లోని మెరిడియన్ స్కూల్‌ లో ప్రీ ప్రైమరీ విద్యార్ధులకు ప్రారంభంలోనే లక్షా 25వేలు, గ్లెండెలా స్కూల్లో LKGకి 75వేలు, ఐదొవ తరగతి వరకు అయితే అక్షరాల లక్ష చెల్లించాల్సిందే. ఇలాంటి లెక్కలు చెప్పుకుంటూ పోతే నర్సరీకి LKGకి లక్షకు తక్కువ ఏ కార్పొరేట్ స్కూల్ తీసుకోవడం లేదంటే నమ్మక తప్పదంటున్నారు పేరెంట్స్. ప్రస్తుతం ఉన్న ప్రైవేటు, కార్పొరేట్ స్కూల్స్‌లో వేల రూపాయలు మొదలుకుని లక్షల్లో ఫీజులు వసూలు చేసినా మౌళిక సదుపాయాలు..నాణ్యత ప్రమాణాలు పాటించడటంలో పూర్తిగా వైఫల్యం చెందాయి. మరోవైపు లక్షలు పెట్టి చదివించినా పిల్లల ప్రాణాలకు భరోసా ఉండడం లేదంటున్నారు తల్లిదండ్రులు. గతేడాది లిఫ్ట్‌లో ఇరుక్కుని ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. స్కూల్ బస్సులు ప్రమాదానికి గురవడం వంటి ఘటనలతో పిల్లల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫీజుల పేరుతో ప్రైవేటు యాజమాన్యాలు తల్లిదండ్రుల రక్తాన్ని పీల్చి పిప్పిచేస్తుంటే ప్రభుత్వం ఏమి పట్టనట్టు చోద్యం చూస్తున్నాయంటూ విద్యార్ధిసంఘాలు, పేరెంట్స్ అసోసియేషన్లు మండిపడుతున్నాయి. ఫీజుల నియంత్రణపై వేసిన ప్రొఫెసర్‌ తిరుమలరావు కమిటి ఇప్పటికీ రిపోర్టు అందజేయకపోవడంతోనే ప్రభుత్వ అలసత్వం అర్ధమవుతోందంటున్నారు నేతలు. ఇప్పటికైనా ఫీజులను నియంత్రించి విద్యార్ధుల భవిష్యత్‌ని కాపాడాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

09:20 - June 11, 2017

హైదరాబాద్ : విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికులను ఓ కారు ఢీకొట్టింది. ఈఘటనలో ముగ్గురు కార్మికులకు గాయాలయ్యాయి. ఈ ఘటన ఖైరతాబాద్ చింతల్ బస్తీలో చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం రోడ్డుపై..గల్లీలు..బస్తీల్లో పారిశుధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. చింతల్ బస్తీలో బాబురావు, మరో ఇద్దరు మహిళలు రోడ్లు ఊడుస్తున్నారు. ఆ సమయంలో ఓ కారు వీరిని ఢీకొట్టింది. దీనితో ఇద్దరు మహిళలకు గాయాలు కాగా మరో కార్మికుడు బాబురావుకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే సమీపంలో ఉన్న ఈఎస్ఎస్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. స్పందించిన జీహెచ్ఎంసీ కమిషనర్ వైద్యాధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.

09:05 - June 11, 2017

ఉత్తర్ ప్రదేశ్ : రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు అదుపు తప్పి నదిలోకి దూసుకెళ్లడంతో 10 మంది జలసమాధి అయ్యారు. ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. మధుర సమీపంలో జరిగిన ఈ ఘోర దుర్గటనపై సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మృతులు ఏ ప్రాంతానికి చెందిన వారనేది తెలియరావడం లేదు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలుస్తోంది. తీర్థయాత్రకు వెళుతున్నట్లు సమాచారం. డ్రైవర్ తప్పిదం కారణంగానే ఈ ఘోర దుర్ఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది.

 

లిబియాలో మరో విషాదం..

లిబియా : మరో మారు విషాదం చోటు చేసుకుంది. వలసదారులతో వెళ్తున్న పడవ లిబియా తీరంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా 100 మంది గల్లంతైనట్టు తీర రక్షక దళం అధికారులు తెలిపారు.

08:53 - June 11, 2017

ముందే బస్సు ప్రయాణం అంటే భయపడుతున్నరు జనాలు. ఎన్ని చూస్తలేం..ఆక్సిడెంట్లు..డ్రైవర్లు ఇష్టమొచ్చినట్లు జనాల ప్రాణాలు తీస్తున్నరు. సరే..వాళ్ల ప్రాణాలు కూడా పోతున్నయి గని. మరి వంద స్పీడుతో పోతున్నప్పుడు డ్రైవర్ ఎంత జాగ్రత్తతో ఉండాలె. కర్నూలు జిల్లా నుండి వేరే ఊరికి పోతున్న ఎక్స్ ప్రెస్ డ్రైవర్ తమాషా చూడాలంటే వీడియో క్లిక్ చేయండి.

07:44 - June 11, 2017

దొంగలు..దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు ఉంది కదా..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూముల పంపకం చూస్తుంటే..తెలుగులోకాన్ని ఉద్ధరిస్తున్న తెలుగుదేశం పార్టీ నూరేళ్ల పాటు నిలువ నీడ బతికేందుకు గుంటూరు కాడ మూడున్నర ఎకరాల భూమి తీసుకున్నదట. అరే అసలు రాష్ట్రంలో ఇళ్లు లేవని పేదలు ఏడుస్తుంటే వీళ్లకు మూడున్నర ఎకరాలా ? తమషా చూడాలంటే వీడియో క్లిక్ చేయండి..

07:35 - June 11, 2017

జమ్ము కాశ్మీర్‌ : సరిహద్దులో ఉగ్రవాదుల చొరబాటు యత్నాలు కొనసాగుతున్నాయి. తాజాగా గురేజ్‌ సెక్టార్‌లో చొరబాటుకు యత్నించిన ఉగ్రవాదిని భద్రతదళాలు కాల్చి చంపాయి. ఉగ్రవాది నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. శుక్రవారం చొరబాటుకు యత్నించిన ఆరుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టిన విషయం తెలిసిందే. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే పాక్‌ నుంచి చొరబాట్లను అడ్డుకోవడం ఇది ఆరోసారి. ఇవాళ ఉదయం అనంత్‌నాగ్‌లో టెర్రరిస్టులు ఆర్మీ కాన్వాయ్‌పై దాడికి పాల్పడ్డారు. క్వాజిగుండ్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు భద్రతా బలగాల వాహనాలపైకి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అటువైపుగా కారులో వస్తున్న పౌరుడు గాయపడ్డాడు. మరోవైపు లాల్‌చౌక్‌లో ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారం మేరకు ప్రత్యేక భద్రతా బలగాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి.

రెండు రోజుల్లో రుతుపవనాలు..

హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు మరో రెండు రోజుల్లో రాష్ర్టాన్ని పలుకరించనున్నాయి. మంగళవారం నుంచి రాష్ట్రంలో నైరుతి వానలు ప్రారంభమవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ వైకే రెడ్డి వెల్లడించారు.

 

నేడు జీఎస్టీ సమావేశం..

న్యూఢిల్లీ : జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఆదివారం ఢిల్లీలో జరుగనుంది. వచ్చే నెల 1 నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీ విధానం అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకున్నది.

కోదాడలో కార్డన్ సెర్చ్..

సూర్యాపేట: జిల్లా కోదాడలో పోలీసులు ఆదివారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మాతానగర్‌లో సోదాలు చేపట్టిన పోలీసులు ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

06:42 - June 11, 2017
06:40 - June 11, 2017
06:35 - June 11, 2017

కరీంనగర్ : తెలంగాణలో రాజకీయంగా అత్యంత కీలకమైనది ఉత్తర తెలంగాణ. ఉత్తర తెలంగాణలో పట్టు సాధించాలంటే ముందు కరీంనగర్‌ కోటపై జెండా ఎగురవేయాలి. కరీంనగర్‌పై పట్టు సాధిస్తేనే ఉత్తర తెలంగాణలో పార్టీ పాగా వేస్తుందన్న పొలిటికల్‌ సెంటిమెంట్ కూడా ఉంది. ఒకప్పుడు కాంగ్రెస్‌... ఆ తర్వాత టీడీపీ... ఇప్పుడు టీఆర్‌ఎస్‌.. ఈ సెంటిమెంట్‌ ఆధారంగానే రాజకీయ వ్యూహం రచించి సక్సెస్‌ అయ్యాయి. ఇప్పుడు భారతీయ జనతాపార్టీ కూడా ఇదే వ్యూహాన్ని ఫాలోఅవుతుంది. కరీంనగర్‌లో బీజేపీ జెండా ఎగురవేయాలని కమలనాథులు తహతహలాడుతున్నారు. ఇందుకోసం ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించారు. ముందుగా తమ బలహీనతలపై దృష్టిపెట్టిన కమలనాథులు... వాటిని సరిద్దిద్దుకుంటూ నిరంతర కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

2004 నుంచి సీన్‌ రివర్స్‌..
కరీంనగర్‌లో బీజేపీకి గతంలో బలమైన క్యాడర్‌ ఉండేది. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న విద్యాసాగర్‌రావు ఇదే జిల్లా నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అంతేకాదు... ఎంపీగా కూడా విజయం సాధించారు.1999 వరకు జిల్లాలో ఎమ్మెల్యే, ఎంపీ సీట్లను కొన్ని కాషాయ నేతలు గెలుస్తూ వచ్చారు. 2004 ఎన్నికల నుంచే వారిని పరాజయం వెంటాడుతోంది. నాటి నుంచి నేటి వరకు కమలనాథులు ఎన్ని ప్రయత్నాలు చేసినా కోలుకోలేకపోతున్నారు.


కోల్‌బెల్ట్‌ ప్రాంతలో కార్మికుల సమస్యలపై కార్యక్రమాలు..
దక్షిణ భారతదేశంలో పాగా వేసేందుకు బీజేపీ అధినాయకత్వం వ్యూహాలు రచిస్తోంది. మొదట తెలంగాణనే టార్గెట్‌ చేసింది. ఇందులో భాగంగా కరీంనగర్‌ జిల్లాపై ఫోకస్‌ పెట్టారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పట్టుసాధించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. కరీంనగర్‌ ఎంపీ సీటుతోపాటు... జిల్లాలో 4 అసెంబ్లీ స్థానాలు దక్కించుకోవాలన్న వ్యూహంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా స్వయంగా క్షేత్రస్థాయిలో సర్వే చేయించుకుంటున్నట్టు సమాచారం. ఆ సర్వే ఫలితాల ఆధారంగా నేతలకు దిశానిర్దేశ చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే గతంలో కంటే పార్టీ నిరంత కార్యక్రమాలను రూపొందిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇందులో భాగంగానే బీజేపీ కార్మికులు ఎక్కువగా ఉన్న కోల్‌బెల్ట్‌ ప్రాంతంపై గురిపెట్టింది. కార్మిక సమస్యలు ఎజెండాగా తీసుకుని ముందుకు పోతోంది. బీజేపీ ప్రతిపక్షనేత కిషన్‌రెడ్డి ఈ ప్రాంతంలో పర్యటించి కార్మికుల సమస్యలపై పోరాటాలకు శ్రీకారం చుట్టారు. గోదావరిఖనిలో ఆరు జిల్లాల స్థాయి ప్రాంతీయ సభ నిర్వహించి విజయవంతం చేసి.. క్యాడర్‌లో ఉత్సాహం నింపారు. కేంద్రమంత్రుల నుంచి రాష్ట్రస్థాయి నేతల వరకు కరీంనగర్‌లో వరుసగా పర్యటిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. మొత్తానికి కరీంనగర్‌ కోటపై బీజేపీ జెండా ఎగురవేయడానికి కమలనాథులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వీరి ప్రయత్నాలు ఫలిస్తాయా? కారు జోరుకు బీజేపీ బ్రేక్‌ వేస్తుందో లేదా తెలియాలంటే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.

06:33 - June 11, 2017

కృష్ణా : జిల్లా మైలవరంలోని పీతురు కాల్వ డ్రైన్ నిర్మాణం పనులు అక్కడి ప్రజలకు ప్రాణగండంగా మారాయి. ఇప్పటికే పూర్తి కావాల్సిన నిర్మాణం పనులు అధికారుల నిర్లక్ష్యంతో వర్షాకాలం వచ్చినా పూర్తి కాలేదు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నిర్మాణం పనులు జరుగుతున్న నారాయణ నగర్‌లో 70 ఇళ్లు నీట మునిగాయి. వందలాది మంది జనం నిర్మాణాల కోసం తవ్విన గోతుల్లో తిరగలేని పరిస్థితి ఏర్పడింది. కొన్ని భవనాలు, స్తంభాలు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు ఈ కాల్వ నిర్మాణాన్ని రెండు ఛానెల్స్‌గా నిర్మించాల్సి ఉండగా ఒకే ఛానెల్‌వైపు నిర్మిస్తుండటంతో జనంలో ఆందోళన నెలకొంది. నిర్మాణం ఇలాగే కొనసాగితే వర్షాకాలంలో మూడు నాలుగు వార్డులు మునిగిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఈ సమస్యపై ఇప్పటికే స్ధానికులు పలు ఆందోళనలు చేసినా అధికారుల్లో చలనం లేకపోవడంతో నారాయణ నగర్ గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

06:30 - June 11, 2017

హైదరాబాద్ : సీఏ, సీపీటీ పరీక్షల్లో జాతీయ స్ధాయిలో అత్యధిక మార్కులే లక్ష్యంగా మాస్టర్ మైండ్స్ సీడీ రూపొందించినట్లు ఆ సంస్ధ డైరెక్టర్ మట్టుపల్లి మోహన్ తెలిపారు. సీఏ,సీపీటీలో జాతీయ స్ధాయిలో అత్యధిక సార్లు మొదటి ర్యాంకు సాధించటానికి ప్రణాళికా బద్ధమైన విద్యాభోదనే కారణమన్నారు. మాస్టర్ మైండ్స్ రూపొందించిన సీడీని సీఏ, సీపీటీ పరీక్ష రాయబోయే ప్రతి విద్యార్ధి సద్వినియోగం చేసుకుని అత్యధిక మార్కులు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

06:29 - June 11, 2017

పశ్చిమ గోదావరి : జిల్లా ప్రశాంతత భగ్నమవుతోంది. హత్యలు, హత్యాయత్నాలతో ఈ ప్రాంతం ఎరుపెక్కుతోంది. తాజాగా, ఓ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని హతమార్చేందుకు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఈ విషయం వెలుగు చూడ్డంతో.. ప్రశాంత గోదావరి జిల్లాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కొన్నాళ్లుగా పశ్చిమగోదావరి జిల్లాలో హత్యలు, హత్యాయత్నాలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి హత్యకే స్కెచ్‌ వేశారు కొందరు దుండగులు. ఈ కుట్రను పోలీసులు చాకచక్యంగా బయటపెట్టి, ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వారంరోజుల క్రితం ఓ హత్య కేసులో పట్టుబడ్డ నలుగురు నిందితులను విచారించగా.. ఓ ఎమ్మెల్యే హత్యకు పన్నిన పథకం బయటపడింది. ఈ కేసులో కీలక నిందితుడిగా రెడ్డప్పనాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. తన భర్తను కావాలనే ఇందులో ఇరికించారని రెడ్డప్ప భార్య ఆరోపిస్తున్నారు. మొత్తానికి ప్రశాంతతకు మారుపేరుగా నిలిచిన పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇటీవలి కాలంలో, ప్రాణాలు తీసే సంస్కృతి పెరిగిపోవడం జిల్లా వాసులను ఆందోళనకు గురి చేస్తోంది. కత్తులతో తలపడడం నుంచి.. కిరాయి గూండాలతో హత్యలు చేయించేదాకా, ప్రత్యర్థులు ప్రణాళికలు రచిస్తున్నారు. పినకడిమికి జంటహత్యలు, నాగరాజు వర్గీయుడి హత్య, ఏలూరులో న్యాయవాది, రౌడీషీటర్‌ హత్యలు, కొల్లేరుకు చెందిన మాజీ సర్పంచ్‌ హత్యలు జిల్లాలో కలకలం సృష్టించాయి. వీటికితోడు, ఎమ్మెల్యే బడేటి బుజ్జిని కలవడానికి వెళ్తున్న బాబురావు, రాంబాబులపై దాడి కూడా స్థానికంగా సంచలనం రేపింది. గడచిన ఐదు నెలల్లో సగటున ప్రతి నెలా ఓ హత్య జరిగిందంటే.. పశ్చిమ ప్రశాంతత ఏరీతిగా భగ్నమవుతోందో అర్థమవుతోంది. పోలీసులు మాత్రం ఈ హత్యా పథకాల్లో ఇంకా ఎవరెవెరు ఉన్నారనే కోణంలో ఇప్పటికీ దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. ఏది ఏమైనా, పశ్చిమగోదావరి ప్రశాంతతను కాపాడాలని, జిల్లా వాసులు కోరుతున్నారు.

06:26 - June 11, 2017

విజయవాడ : రాజధాని నిర్మాణానికి భూములివ్వని ఉండవల్లి, పెనమాక గ్రామాలను గ్రీన్ బెల్ట్‌గా ప్రకటించాలని సీఎం చంద్రబాబు సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. ఇంకా వేచి చూసే పద్దతి వద్దని..ఇప్పటికే చాలా ఆలస్యం చేశామన్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో రాజధాని నిర్మాణంపై సీఆర్డీఏ అధికారులతో సమీక్షించారు. రాజధానిలో రోడ్ల నిర్మాణ పనులను డెడ్‌లైన్‌లోగా పూర్తిచేయని కాంట్రాక్ట్‌ సంస్థలపై చర్యలు తీసుకోవాలన్నారు. రాజధాని నిర్మాణంపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు గ్రీన్ బెల్ట్ అంశాన్ని అధికారుల వద్ద ప్రస్తావించారు. రాజధానిలో నిర్మిస్తున్న రహదారులు, పరిపాలన, విద్యా నగరాల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా భూసేకరణలో ఉండవల్లి, పెనుమాక మరో గ్రామం నుంచి ఎదురైన అవరోధాలను ఒక్కొక్కటీగా అధిగమిస్తున్నామని సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ ముఖ్యమంత్రికి వివరించారు. ఈ మూడు గ్రామాల్లో భూ సమీకరణకు ముందుకొస్తున్న వారి నుంచి ముందుగా భూములు తీసుకోవాలన్నారు సీఎం. ఆ తరువాతే భూసేకరణకు వెళ్లాలని సూచించారు. ఇంకా సాగు చేసుకుంటామని ఒత్తిడి తెస్తే.. రాబోయే కాలంలో ఆ భూములను వ్యవసాయేతర అవసరాలకు వినియోగించకుండా ఆ ప్రాంతాన్ని గ్రీన్ బెల్ట్ కింద ప్రకటించాలన్నారు.

వ్యతిరేకం..
రాజధానిలో నిర్మిస్తున్న సీడ్ యాక్సెస్, సబార్టేరియల్ రోడ్ల నిర్మాణంలో జాప్యాన్ని ఇక ఏమాత్రం సహించబోమని సీఎం హెచ్చరించారు. పనులు నిర్ణిత గడువులోగా వేగవంతంగా పూర్తిచేసేలా నిర్మాణ సంస్థలకు అల్టిమేటం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు పరిపాలన నగరం మాస్టర్ ప్లాన్ దాదాపు పూర్తయ్యిందని, వచ్చే వారంలో ప్రభుత్వానికి అందజేస్తామని నార్మన్ ఫోస్టర్స్ అండ్ పార్టనర్స్ చెప్పినట్లు సీఆర్‌డీఏ కమిషనర్ సీఎం దృష్టికి తెచ్చారు. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో ఇళ్లు లేని రైతు కూలీలకు ఇళ్లు నిర్మించాలన్నారు సీఎం చంద్రబాబు. కేంద్ర, రాష్ట్రం ప్రభుత్వం సబ్సిడీ కింద 3 లక్షల వరకు ఇవ్వనుంది. దీని కోసం ఇప్పటికే సీఆర్డీఏ అధికారులు సర్వే చేసి 5 వేల మంది రైతు కూలీలను గుర్తించారు. ఒక్కో ప్రాంతంలో 500 ఇళ్ల చొప్పన మొత్తం 10 ప్రాంతాల్లో ఇళ్లు నిర్మిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఇక ఈ సమావేశంలో పాల్గొన్న విట్, అమృత, ఎస్ఆర్ఎం, ఎన్ఐడీ తదితర విద్యా సంస్థల ఏర్పాటు పురోగతిపై ఆయా సంస్థల ప్రతినిధులు సీఎంకు ప్రెజెంటేషన్ ఇచ్చారు. అమరావతిలో ఏర్పాటవుతున్న యూనివర్శిటీలపై రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు నిరంతర చర్చ జరపడం ద్వారా మన రాష్ట్ర విద్యాసంస్థలకు జాతీయస్థాయి బ్రాండింగ్ వస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. మొత్తంగా ఉండవల్లి, పెనమాక గ్రామాలను గ్రీన్ బెల్ట్‌గా ప్రకటించాలన్న సీఎం నిర్ణయం ఆ ప్రాంత రైతుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. మూడు పంటల పండే వ్యవసాయ భూముల కోసం రెండున్నర ఏళ్లుగా పోరాటం చేస్తున్న రైతులు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

'పెట్టుబడి గ్రంథం - ప్రాధాన్యత'పై రాష్ట్ర సదస్సు..

హైదరాబాద్ : సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉదయం 10.30గంటలకు 'పెట్టుబడి గ్రంథం - ప్రాధాన్యత'పై రాష్ట్ర సదస్సు జరగనుంది. సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు ప్రసంగించనున్నారు.

శేషాచలం అడవుల్లో పోలీసుల కూంబింగ్..

చిత్తూరు : చంద్రగిరి (మం) శేషాచలం అడవుల్లో అటవీ శాఖాధికారులు కూంబింగ్ నిర్వహించారు. చినరామాపురం చెరువు వద్ద అటవీ అధికారులకు 30 మంది తమిళ కూలీలు తారసపడ్డారు. అటవీ శాఖ అధికారులపై తమిళ కూలీలు రాళ్లు రువ్వారు. దీనితో అధికారులు గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరిపారు.

నేడు భారత్ - సౌతాఫ్రికా మ్యాచ్..

లండన్ : ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ - సౌతాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. లండన్ లో మధ్యాహ్నం 3గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

 

ఇంగ్లండ్ విజయం..

లండన్ : ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా జట్టుపై ఇంగ్లండ్ జట్టు విజయం సాధించింది. డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 40 పరుగుల తేడాతో ఇంగ్లండ్ గెలుపొందింది. దీనితో ఛాంపియన్స్ ట్రోఫి నుండి ఆస్ట్రేలియా వెనుదిరిగింది.

అనకాపల్లికి యూపీ మంత్రి సిదార్థ్

విశాఖపట్టణం : అనకాపల్లిలో నేడు మోడీ ఫెస్ట్ జరగనుంది. యూపీ మంత్రి సిదార్థ్ సింగ్ హాజరు కానున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు.

విశాఖకు వెంకయ్య..

విశాఖపట్టణం : నేడు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు జిల్లాలో పర్యటించనున్నారు. పోర్టు స్టేడియంలో 'సబ్ కా సాత్ - సబ్ కా వికాస్' సమ్మేళన్ లో వెంకయ్య పాల్గొని ప్రసంగించనున్నారు.

Don't Miss