Activities calendar

12 June 2017

10రోజుల క్రితం వేటకు వెళ్లి తిరిగి రాని మత్స్యకారులు

తూ.గో : సముద్రంలో 10 రోజుల క్రితం చేపల వేటకు వెళ్లిన 8 మంది మత్స్యకారులు తిరిగి రాలేదు. కాకినాడ వర్లవ పేటకు చెందిన 8 మంది మత్స్యకారుల కుటుంబ సభ్యులు అధికారులను ఆశ్రయించారు. వారి కోసం మెరైన్ సిబ్బంది ఆరా తీస్తోంది.

20:38 - June 12, 2017

సినారే ఈ పేరు వింటేనే ఓ సాహితీ విరాట్ కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. తెలుగు పంచె కట్టుకున్న తెలుగు భాషా సాహిత్య ప్రపంచంలో మేరు నగధీరు కళ్ల ముందు మొదులుతారు. అలాంటి తెలుగు ఆధునిక సాహిత్య దిగ్గజం ఆయన. ఎంత ఎత్తుకు ఎదిగినా మానవత్వం అయి పరిమళించిన నిరాడంబర సౌజన్య మూర్తి ఆయన. 20వ శతాబ్ధపు తెలుగు సాహిత్యానికి దశను, దిశను నిర్దేశించి వెండి తెర సినీ గేయ సాహిత్యానికి తన పధబంధాలతో సుమ సుగంధాలు అద్దిన సుప్రసిద్ధుడు ఆయన. కవీశ్వరుడు ఆయన, తెలుగు వినీలాకాశంలో మకుటం లేని కవిరాజులా ఎదిగిన కవితల నెలరాజు శాశ్వతంగా మొబ్బుల చాటుకు వెళ్లిపోయాడు. ఆ సాహితీ దిగ్గజానికి '10టివి' నివాళులర్పిస్తోంది. నేటి వైడాంగిల్ ప్రత్యేక కథనం...పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

20:08 - June 12, 2017

హైదరాబాద్: జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత, సాహితీవేత్త సినారే ఆత్మకు శాంతి కలగాలి, పరిపాలన నచ్చలేదంటున్న జేఏసీ... తెలంగాణ అవినీతి మయం అయ్యిందట, చంద్రబాబు రాష్ట్రపతి పదవి చేపట్టాలి...వెన్నుపోట్లు లేని భారతం నిర్మించాలి, ముసలామె ఫించను మింగిన పోస్టాఫీసోడు...గుండ్ల పోచం కాడా ఆసరా పంచాంగులు, చెత్తేరుకునేటేళ్లే అని విడిచిపెట్టకండి... సిసి కెమెరాల సిన్మా మొత్తం చూడుండ్రి, లండన్ లో ప్రశాంతత కోల్పోయిన మాల్యా...దొంగా దొంగాఅంటున్న అభిమానులు, మాటమీద నిలబడ్డ ప్రొఫెసర్ సార్...ఓడిపోయినంక బుక్ నమిలేసిండు.. ఇలాంటి అంశాలపై నేటి మల్లన్న ముచ్చట్లతో మల్లన్న మన ముందుకు వచ్చాడు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

19:41 - June 12, 2017

ప్రకాశం : జిల్లా విద్యాశాఖాధికారుల అత్యుత్సాహం విద్యార్థుల జీవితాలను రోడ్డున పడేస్తోందని.. మాజీ మంత్రి పాలేటి రామారావు అన్నారు.. స్కూళ్లు మూసివేయాలంటూ కొన్ని ప్రైవేటు పాఠశాలలకు నోటీసులు జారీ చేయడాన్ని రామారావు తప్పుబట్టారు.. చైతన్య, నారాయణలాంటి విద్యాసంస్థలకూ నోటీసులు జారీచేసి అధికారులు చిత్తశుద్ది చాటుకోవాలని కోరారు.. విద్యాసంస్థలకు నోటీసులపై ఒంగోలు కలెక్టర్‌ కార్యాలయంలో తల్లిదండ్రులతోకలిసి డిఆర్ ఓకు వినతిపత్రం అందజేశారు..

19:39 - June 12, 2017

మేడ్చల్‌ : జిల్లా కాప్రా మండలం జవహర్‌నగర్‌లో రెవెన్యూ అధికారులు ఇళ్లు కూల్చివేస్తున్నారు.. అంబేద్కర్‌నగర్‌ చెరువు స్థలంలోని ఇళ్ల కూల్చివేత చేపట్టారు.. తహశీల్దార్‌ ఆధ్వర్యంలో ఈ కూల్చివేత కార్యక్రమం కొనసాగుతోంది.. వర్షాకాలం ముందస్తు జాగ్రత్త చర్యల్లోభాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు..

19:38 - June 12, 2017

తూ.గో: జిల్లాలో మండపేట ఏఎస్సై దేవపూజిర రామానుజుల నిర్వాకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నష్టజాతకురాలంటూ 35 ఏళ్ల క్రితం కూతురు భవానీని వదలించుకున్నారు. దీంతో భవానీని చేరదీసిన అమ్మమ్మ, మావయ్య ఆమెను పెంచి పెద్దచేసి పెళ్లిచేశారు. చోడవరంలోని తండ్రి రామానుజుల ఇంటి ఎదుట కూతురు భవానీ దీక్షకు దిగింది. పెళ్లైనా కూడా తనను మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తోంది. జిల్లా ఎస్పీ తనకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తోంది.

19:36 - June 12, 2017

విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబుపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు నిప్పులు చెరిగారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో ఘరంగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలో వామపక్షాల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఉండవల్లి, పెనుమాక, నిడమర్రులో బలవంతపు భూసేకరణను అడ్డుకుంటామని హెచ్చరించారు. మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌లో జరిగే రైతు ఉద్యమాలకు మద్దతుగా ఏపీలోనూ ఉమ్మడి ఐక్య కమిటీలుగా ఏర్పడి పోరాటాలు చేస్తామన్నారు.

19:34 - June 12, 2017

అమరావతి: ఖరీఫ్‌ సీజన్ ప్రారంభంకానున్న నేపథ్యంలో విత్తనాలు, ఎరువులను సిద్ధం చేశామని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. నకిలీ విత్తన వ్యాపారులపై కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు. రైతులు నష్టపోకుండా.. పంటలపై అవగాహన కల్పిస్తున్నామని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

19:32 - June 12, 2017

కర్నూలు : ఈ నెల 14న టిడిపి నేత శిల్పామోహన్‌ రెడ్డి వైసీపీ లో చేరనున్నారు.. పార్టీ మార్పుకు సంబంధించి కార్యకర్తలతో శిల్పామోహన్‌ రెడ్డి సమావేశమయ్యారు.. 14వ తేదీన ఉదయం 10గంటల సమయంలో లోటస్ పాండ్ లో వైసీపీ అధ్యక్షుడు జగన్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది.

రద్దయిన నోట్లు చలామణి చేస్తున్న వ్యక్తులు అరెస్ట్

అనంతపురం : రూ.500, రూ.2వేల నకిలీ నోట్లను చలామణి చేస్తున్న వెంకటేష్, అశోక్ అనే వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 3.70 లక్షల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.

తూ.గో జెడ్సీ ఛైర్మన్ గా జ్యోతుల నెహ్రూ కుమారుడు!

తూ.గో : ప్రస్తుతం జెడ్పీ ఛైర్మన్ గా ఉన్న నామన రాంబాబు జిల్లా టిడిపి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. జ్యోతుల నెహ్రూ కుమారుడు నవీన్ కు జెడ్పీ ఛైర్మన్ పదవిని అప్పజెప్పాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.

'పద్మశ్రీ వనజీవి రామయ్యకు ప్రభుత్వ ఖర్చులతో వైద్యం'

హైదరాబాద్: పద్మశ్రీ వనజీవి రామయ్యకు ప్రభుత్వ ఖర్చులతో వైద్యం అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

మేడ్చల్ జిల్లాలో కొనసాగుతున్న ఇళ్ల కూల్చివేత

మేడ్చల్ :జిల్లాలో ఇళ్ల కూలివేతలు కొనసాగుతున్నాయి. కాప్రా మండలం జవహర్ నగర్ లోని అంబేద్కర్ నగర్ ఈ కార్యక్రమం కొనసాగుతోంది.

కృష్ణా డెల్టాకు సీలేరు నీరు ఇవ్వండి: చంద్రబాబు

అమరావతి : కృష్ణా డెల్టాలో నారుమళ్ల కోసం సీలేరు నుంచి నీటిని విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపథ్యంలో సహాయ, రక్షణ చర్యలకు అధికారులు సిద్ధంగా ఉండాలని, 14న రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ విడుదల చేయాలని బాబు ఆదేశించారు. వచ్చే ఏడాది నుంచి ఏరువాకను సంక్రాంతి పండుగలా జరుపుకోవాలన్నారు. ఏరువాక, గంగ పూజ, మొక్కలు నాటడం కార్యక్రమాలను రాష్ట్ర ఉత్సవాలుగా నిర్వహింస్తామని సీఎం పేర్కొన్నారు.

అవకతవకలకు పాల్పడితే పీడీ యాక్టు: చంద్రబాబు

అమరావతి: వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా చేసేందుకు రైతులకు ఉచితంగా సూక్ష్మ పోషకాల పంపినీ చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఎరువులు, సూక్ష్మ పోషకాల పంపిణీ లో అవకతవకలకు పాల్పడితే పీడీ యాక్టు కింద కేసు నమోదు చేస్తామని సీఎం హెచ్చరించారు.

ఆదిలాబాద్ - మంచిర్యాల మధ్య రాకపోకలకు అంతరాయం

హైదరాబాద్: ఆదిలాబాద్ - మంచిర్యాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగి పొర్లడంతో వాహనాలు నిలిచిపోయాయి.

18:35 - June 12, 2017

కాంట్రాక్టు ఉపాధ్యాయుల ఆందోళన.. అరెస్ట్

హైదరాబాద్: ప్రగతి భవన్ ముట్టడికి గిరిజన ఆశ్రమ పాఠశాలల కాంట్రాక్ట్ టీచర్లు యత్నించారు. కాంట్రాక్టు ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకుని గోషామహల్ స్టేడియానికి పోలీసులు తరలించారు. తమను రెగ్యులర్ చేయాలని కాంట్రాక్టు టీచర్లు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ టీచర్లను వామపక్ష నేతలు తమ్మినేని వీరభద్రం, చాడ వెంకట్ రెడ్డి పరామర్శించి సంఘీభావం తెలిపారు.

14న వైసీపీ గూటికి శిల్పా మోహన్ రెడ్డి

కర్నూలు : 14న శిల్పా మోహన్ రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. 14వ తేదీ ఉదయం 10.30 గంటలక హైదరాబాద్ లోటస్ పాండ్ లో జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.

సినారే మృతి సాహిత్య లోకానికి తీరని లోటు: ప్రధాని

ఢిల్లీ : సి.నారాయణ రెడ్డి మృతి పట్ల ప్రధాని మోదీ సంఘీభావం తెలిపారు. సినారే మృతి సాహిత్య లోకానికి తీరని లోటని మోదీ ఓ ప్రకటనలో తెలిపారు.

వనజీవి రామయ్యకు అస్వస్థత...

ఖమ్మం: పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి దరిపల్లి రామయ్య సోమవారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. ఖమ్మం రూరల్‌ మండలంలోని ముత్తగూడేనికి చెందిన వనజీవి రామయ్య వృక్ష సంపదను సంరక్షించి హరిత పుడమి కోసం పాటుపడ్డారు. ఆయన కృషికి గాను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో గౌరవించిన విషయం తెలిసిందే.

సంజయ్ దత్ ముందస్తు విడుదలపై కోర్టు సీరియస్

ముంబై: సంజయ్ దత్ ముందస్తు విడుదలను బాంబే హైకోర్టు తప్పు పట్టింది. వివరణ ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. సత్ర్పవర్తన కారనంగా 5ఏళ్ల జైలు శిక్ష పూర్తి కాకుండానే 8 నెలల 16 రోజులు ముందుగానే జైలు నుంచి దత్ ను విడుదల చేసినట్లు తెలిపింది.

ఢిల్లీ జన్ పథ్ సమీపంలో అగ్ని ప్రమాదం

ఢిల్లీ : ఢిల్లీలోని జన్ పథ్ రోడ్డుకి సమీపంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వెస్టర్న్ కోర్టు వెనుకభాగం నుంచి హఠాత్తుగా మంటలు చెలరేగాయి. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని 4 ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్ని ప్రమాదం జరగడానికి కారణాలపై విచారణ చేపట్టారు.

తెలంగాణ లో రుతుపవనాలు..

హైదరాబాద్: తెలుగురాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే రెండు మూడు రోజుల వరకు ఉత్తర తెలంగాణలో ప‌లు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. తెలంగాణలోని మ‌రికొన్ని ప్రాంతాల్లో, ఏపీలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయ‌ని పేర్కొంది. కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాలకు ఈ రోజు విస్తరించిన నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి పూర్తిగా ప్రవేశించాయని, మ‌రోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింద‌ని చెప్పారు. వీటి ప్ర‌భావంతోనే వ‌ర్షాలు కురుస్తాయ‌ని వివ‌రించింది.

25 నుండి మోదీ ముంబై పర్యటన

న్యూఢిల్లీ : భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన ఖరారైనట్లు సమాచారం. ఈ నెల 25, 26 తేదీల్లో మోదీ అమెరికాలో పర్యటించనున్నట్లు సమాచారం. డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మోదీ తొలిసారిగా అక్కడికి వెళ్తున్నారు. ట్రంప్ ఆహ్వానం మేరకు యూఎస్ వెళ్లనున్న మోదీ.. పలు కీలక అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. కొన్ని ముఖ్యమైన ఒప్పందాలు కూడా చేసుకోనున్నట్లు తెలుస్తున్నది. హెచ్1బీ వీసా నిబంధనలు కఠినతరం చేయడంతో భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలపై మోదీ ట్రంప్ వద్ద చర్చించే అవకాశం ఉంది. వాషింగ్టన్‌లో ప్రవాస భారతీయులతో మోదీ సమావేశం కానున్నారు.

17:33 - June 12, 2017

నాగర్ కర్నూలు : ఒకే రోజు రాష్ట్రంలో 240 గురుకుల పాఠశాలలు ప్రారంభించుకోవడం చారిత్రాత్మకమని మంత్రి జూపల్లి అన్నారు. నాగర్‌కర్నూలు జిల్లా కోడేరు, కల్వకుర్తి మండలాల్లో మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన జూపల్లి..ఉద్యమనాయకుడే సీఎం కావడంతో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నారని కొనియాడారు. గురుకులాల్లో ఎలాంటి అక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

17:32 - June 12, 2017

చిత్తూరు : తిరుమలలో చిన్నారి రాధ మిస్సింగ్ మిస్టరీ విషాదంగా ముగిసింది. రాధ అనే నాలుగేళ్ల చిన్నారిని సవతి తల్లి అతి కిరాతకంగా చంపిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కర్ణాటకకు చెందిన దేవరాజు తిరుమలలో కూలి పని చేస్తుంటాడు. ఇతనికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య కూతురు రాధ గతేడాది ఆగస్ట్ 24న అదృశ్యమైనట్లు తిరుమల టూటౌన్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. కేసుని పలుకోణాల్లో దర్యాప్తు చేసిన పోలిసులు..చివరకు సవతి తల్లిని గట్టిగా విచారించగా తానే చిన్నారిని మట్టుబెట్టినట్లు ఆమె నేరాన్ని అంగీకరించింది. మృతదేహాన్ని పాపవినాశనం నడకదారిలో పూడ్చినట్లు తెలిపింది. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు హత్యకు గురైన బాలిక అస్థికలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కి తరలించారు.

17:31 - June 12, 2017

వరంగల్ : పేదలకు ఒక్కపూటైనా శుభ్రమైన, రుచికరమైన భోజనం అందించాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన రూ.5 భోజన పథకానికి హైదరాబాద్‌లో విశేష స్పందన లభిస్తోంది. ఈ పథకాన్ని మరింత విస్తరించే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు వరంగల్ అర్బన్ జిల్లాలో ఈ పథకాన్ని ప్రారంభించింది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ పథకాన్ని ముందుగా 8 కేంద్రాల్లో అమలు చేస్తున్నారు.

8 కేంద్రాల వద్ద జనం క్యూ

పధకం ప్రారంభించిన ఎనుమాముల మార్కెట్, ఎంజీఎం, ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రితో సహా 8 కేంద్రాల వద్ద జనం క్యూ కడుతున్నారు. వీరిలో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులు, రోజు వారి కూలీలు, అనాథలు, నిరుపేదలు, రైతులు ఉంటున్నారు. ఐదురూపాయల మీల్స్‌ ప్రతి రోజు ఐదువేల మంది పేదల కడుపు నిండుతోంది. జీడబ్ల్యూఎంసీ, అక్షయ పాత్ర ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ పథకానికి ఒక ప్లేట్ మీల్స్‌కు దాదాపు రూ.24 ఖర్చు అవుతున్నట్లు అంచనా.. రూ.19 ప్రభుత్వం భరిస్తుంటే మిగతా ఐదు రూపాయలు లబ్దిదారుల నుంచి వసూలు చేస్తున్నారు. నిర్వహణ బాధ్యతల్ని హరే కృష్ణ స్వచ్ఛంద సంస్థ చూసుకుంటోంది. ఈ పథకం ప్రారంభానికి ముందే అక్షయపాత్ర ఫౌండేషన్‌కు వరంగల్ బిల్డర్స్ అసోసియేషన్ రూ.35 లక్షలు ఆర్ధిక సాయం అందించడం విశేషం. హైదరాబాద్ జీహెచ్ ఎంసీ తరహాలోనే ఓరుగల్లులోనూ రూ. 5 భోజన పథకం మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజల డిమాండ్ దృష్ట్యా రాబోయే రోజుల్లో అధికారులు వీటి సంఖ్యను పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

17:20 - June 12, 2017

హైదరాబాద్: మేఘం వర్షించింది.. పుడమి పులకించింది.. కుంటాల ఉప్పొంగింది.. ఆదిలాబాద్ జిల్లా కుంటాల జలపాతం జలకళతో ఉట్టిపడుతోంది. ప్రకృతి ప్రేమికుల్ని కట్టిపడేస్తోంది. గతంలో కంటే ఈ ఏడాది ముందుగా కురిసిన వర్షాలకు కుంటాలలోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. దీంతో ఎత్తైన కొండలపై నుంచి మనోహరంగా జాలువారుతున్న కుంటాల అందాల్ని చూడటానికి జనం క్యూ కడుతున్నారు. దీనిపై పూర్తి సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

17:18 - June 12, 2017

గుంటూరు : మద్యం షాపులను ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు కలిగించే బదులు ఆన్ లైన్ ద్వారా ఇంటికే మద్యం డోర్ డెలివరీ చేసే ఆలోచనను పరిశీలిస్తే బాగుంటుందంటూ గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు కలెక్టర్ కార్యలయం ఎదుట వేణుగోపాల్ నగర్, వెంకటరమణ కాలనీ వాసులు తమ ప్రాంతంలో మద్యం షాపులు పెట్టొద్దంటూ చేపట్టిన ధర్నా శిబిరాన్ని అయన సందర్శించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా మద్యం షాపులు ఏర్పాటు చేస్తే ఎట్టి పరిస్ధితుల్లో అంగీకరించేదిలేదని, ప్రజా నిర్ణయానికి వ్యతిరేకంగా దుకాణాలుపెడితే వాటిని పగల గొట్టాలంటూ ఎమ్మెల్యే మోదుగుల మహిళలకు సూచించారు. పట్టణాల్లోని కాలనీల్లో మద్యం షాపులను ఏర్పాటు చేసే బదులు, మద్యం అమ్మకాలకోసం ప్రత్యేక జోన్ లను ఏర్పాటు చేసి విక్రయాలన్నీ అక్కడే జరిగేలా చూడాలన్నారు. మద్యాన్ని డోర్ డెలివరి చేస్తే ఇంటి వద్దే మధ్యం సేవిస్తారన్నారు. ఇలా చేయటం వల్ల ప్రజలకు కొంతమేర ఇబ్బందులు తొలుగుతాయని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి సూచిస్తానని మోదుగుల చెప్పారు. 

మిజోరాంలో రాజ్ నాథ్ సింగ్ పర్యటన..

మిజోరాం : కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ మిజోరాంలో పర్యటిస్తున్నారు. కాసేపటి క్రితం ఇండో - మయన్మార్ సరిహద్దు సమస్యపై ఆయన సమీక్ష జరిపారు. ఈ సమీక్షలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మోడీకి సున్నా మార్కులు - రాహుల్..

బెంగళూరు : 40 మార్కులు సాధిస్తే పాస్ అవుతారని, కానీ ఉద్యోగాలు సృష్టించడంలో ప్రధాని నరేంద్ర మోడీకి 100కు సున్నా మార్కులు వచ్చాయని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు.

మద్యంపై మోదుగుల వ్యాఖ్యలు విన్నారా...

గుంటూరు : మద్యం పై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల మోదుగుల వేణుగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆన్ లైన్ మద్యాన్ని ఇంటికే సరఫరా చేయాలని, ఫోన్ ద్వారానైనా మద్యాన్ని డోర్ డెలివరీ చేయాలని పేర్కొన్నారు. జనావాసాల్లో మద్యం తొలగించాలని, ప్రభుత్వానికి సూచనలు చేస్తానని మోదుగుల వెల్లడించారు.

16:29 - June 12, 2017

హైదరాబాద్: ఇవాళ్టి నుంచి మొదలైన తెలంగాణా ఎంసెట్ కౌన్సెలింగ్ లో సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ప్రక్రియ ఉదయం నుంచి మొదలైంది. ఇవాళ 6వేల ర్యాంకు వరకు వెరిఫికేషన్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 21 హెల్ప్ లైన్ సెంటర్లలో జరిగే ఈ ప్రక్రియ ఈనెల 23 వరకు కొనసాగనుంది. ఈనెల 16నుంచి వెబ్ ఆప్షన్ల ఎంపిక చేసుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేశామంటున్న ఎంసెట్ క్యాంప్ ఆఫిసర్ శ్రీనివాస్‌ తెలిపారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

తెలంగాణలో నైరుతి పవనాలు..

హైదరాబాద్ : ఎప్పుడొస్తాయి అని ఎదురు చూసిన నైరుతి పవనాలు తెలంగాణ రాష్ట్రాన్ని పలుకరించాయి. తెలంగాణ అంతటా నైరుతి రుతుపవనాలు వ్యాపించినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. కోస్తా, మరికొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు వ్యాపించాయని తెలిపింది. ఇప్పటికే కురిసిన వర్షాలకు పలు జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. చెరువుల్లోకి నీరు చేరుతుంది.

15:45 - June 12, 2017

ఉసేన్ బోల్ట్ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. మైదానంలో చిరుతలాంటి పరుగుతో ప్రపంచాన్ని శాంసిచే అథ్లెట్. ఇతడిని ముద్దుగా 'జమైకా చిరుత' అంటుంటారు. ఇతను తన క్రీడా జీవితానికి గుడ్ బై చెప్పేశాడు. శనివారం రాత్రి సొంత గ్రౌండ్ కింగ్స్ ట్టన్ నేషనల్ స్టేడియంలో చివరి పరుగు తీశాడు. 100 మీటర్ల పరుగులు పందెంలో బోల్ట్ విజయాన్ని నమోదు చేసుకున్నాడు. కేవలం 10.03 సెకండ్లలోనే అధిగమించడం విశేషం. చివరి పరుగు చూసేందుకు అభిమానులు స్టేడియానికి పోటెత్తారు. 30 వలే మంది ఈ పరుగును తిలకించడం గమనార్హం. పరుగు ముగిసిన వెంటనే 'బోల్ట్‌' మైదానంలోని అభిమానులకు సెల్యూట్‌ చేసి అభివాదం చేశాడు. తనను మొదట్నుంచి ఆదరిస్తూ వచ్చిన జమైకన్ల ప్రోత్సాహం మరువలేనిదని తెలిపారు. 2002 అంతర్జాతీయంగా కెరీర్‌ను 'బోల్ట్' ప్రారంభించాడు. వరుసగా మూడు ఒలింపిక్స్‌ల్లోను 100, 200 మీటర్లు పరుగుతో పాటు 400 మీటర్లు పరుగు పందెంల్లో వరుసగా బీజింగ్‌, లండన్‌, రియో ఒలింపిక్స్‌ల్లో తొమ్మిది స్వర్ణాలు సాధించాడు. కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన 30 ఏళ్ల బోల్ట్‌ ఇక ఓ ఇంటి వాడు కావడంతో రెండో ఇన్నింగ్స్‌ మొదలెట్టనున్నాడు.

15:39 - June 12, 2017

గంగా నదిని కలుషితం చేసేందుకు ప్రయత్నించినా..కాలుష్యాన్ని సృష్టించినా ఇక నేరంగా భావిస్తారు. జీవా వరణానికి విఘాత కలిగించినా..నదీ పరివాహక ప్రాంతాల్లో కాలుష్యం సృష్టించినా నేరంగా పరిగణించేందుకు కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఇటీవల జాతీయ నది 'గంగా బిల్లు-2017'ను రూపొందించింది. ఏప్రిలో ఈ నివేదికను కేంద్రానికి సమర్పించింది. ఇందులో పలు సూచనలు చేసింది. నేరాలకు పాల్పడిన వారికి గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష..రూ. 100కోట్ల గరిష్ట జరిమానను విధించే అవకాశం ఉంది. గంగా నదిని ఆనుకుని ఉన్న కొండలను పేల్చడం..మైనింగ్..క్రషింగ్ కు పాల్పడితే ఐదేళ్ల జైలు శిక్ష లేదా రూ. 50 వేల జరిమాన..లేదా రెండూ శిక్షలను విధించనుంది. ఇక నదీ ప్రవాహానికి ఆటంకం కలగించే వారిపై కూడా కఠినంగా వ్యవహరించనున్నారు. రెండేళ్ల జైలుతో పాటు రూ. 100 కోట్ల జరిమాన విధించే అవకాశం ఉంది. అక్రమంగా నదీ జలాల్ని తరలించివారికి ఏడాది జైలు శిక్ష, రూ. 50 కోట్ల వరకూ జరిమానా విధించొచ్చని కమిటీ సూచించింది. నదిలో ప్లాస్టిక్..బ్యాటరీలు..రసాయనాలు..ఎరువులు పారబోసే వారికి రూ. ఏడాది జైలు..రూ. 50 వేల జరిమాన..లేదా రెండూ విధించొచ్చని పేర్కొంది. త్వరలో కేంద్రం ఈ బిల్లును ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. గంగా నదీ జలాల శుద్ధి కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం రూ. 100 కోట్లు ఖర్చు పెట్టిన సంగతి తెలిసిందే.

డెల్టా ప్రాంత రైతులకు రూ. 56.92 కోట్లు కేటాయింపు..

చెన్నై : డెల్టా ప్రాంత రైతులకు రూ. 56.92 కోట్లు కేటాయిస్తున్నట్లు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి పళనీ స్వామి వెల్లడించారు.

15:29 - June 12, 2017
15:18 - June 12, 2017

హైదరాబాద్ :తెలంగాణలో గ్రూప్‌-2 నియామక ప్రక్రియపై హైకోర్టు స్టే ఇచ్చింది. మూడు వారాల వరకు నియామక ప్రక్రియ చేపట్టవద్దని టీఎస్‌పీఎస్‌సీకి ఆదేశాలు జారీచేసింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వైట్‌నర్‌తో దిద్దిన జవాబు పత్రాలను పరిగణలోకి తీసుకున్నారంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది. గ్రూప్‌ 2 నియామక ప్రక్రియపై గత కొంతకాలంగా వివాదం చెలరేగుతోంది. జవాబు పత్రంపై వెట్నర్‌తో దిద్దివున్న పత్రాలను పరిగణలోకి తీసుకున్నారంటూ అభ్యర్థులు కొందరు ఆందోళన చేపడుతున్నారు. దీనిపై హైకోర్టును సైతం అభ్యర్థులు ఆశ్రయించారు. ఈ రోజు విచారణ చేపట్టిన న్యాయస్థానం మూడు వారాలపాటు గ్రూప్‌- 2 నియామక ప్రక్రియను నిలిపివేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.

టి.గ్రూప్ 2 నియామక ప్రక్రియపై స్టే..

హైదరాబాద్ : తెలంగాణ గ్రూప్ 2 నియామక ప్రక్రియపై హైకోర్టు స్టే విధించింది. మూడు వారాల వరకు ఎలాంటి ప్రక్రియను నిర్వహించవద్దని టీఎస్ పీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. గ్రూప్ 2లో అక్రమాలు జరిగాయని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. 1,032 పోస్టులకు నవంబర్ లో రాత పరీక్షలు నిర్వహించింది.

‘శ్రీమంతుడు' నిర్మాతకు హైకోర్టు సమన్లు..

హైదరాబాద్ : నాంపల్లి కోర్టులో 'శ్రీమంతుడు' సినిమా వివాదంపై కేసుపై విచారణ జరిగింది. కోర్టుకు హాజరు కాకపోవడంతో నిర్మాత ఎర్నేని నవీన్ కు మరోసారి కోర్టు సమన్లు జారీ చేసింది. హీరో మహేష్ కు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వలేమని కోర్టు తెలిపింది. తన నవల కాపీ కొట్టి శ్రీమంతుడు సినిమా తీశారని రచయిత శరత్ చంద్ర పిటిషన్ దాఖలు చేశారు.

ఏపీ, గుంటూరు కలెక్టర్ కు హైకోర్టు నోటీసులు..

హైదరాబాద్ : అమరావతి భూసేకరణపై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వం..గుంటూరు జిల్లా కలెక్టర్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తమ భూములను అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని హైకోర్టులో 31 మంది బాధితులు పిటిషన్ దాఖలు చేశారు. రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని హైకోర్టు సూచించింది.

15:02 - June 12, 2017

ఎండకాలం అయిపోయింది..వానాకాలం..వచ్చేసింది. అనంతరం చలికాలం..ఈ మాసాల్లో చాలా మంది వ్యాయామానికి మక్కువ చూపుతుంటారు. చెమట కారేలా వ్యాయామం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల కండల నిర్మాణం..అదనపు కొవ్వును కోల్పోయేలా చేస్తుంది. మరి వ్యాయామం అనంతరం ఎలాంటి ఆహారం తీసుకోవాలి. వ్యాయామం చేసే సమయంలో కోల్పోయిన ద్రావణాలను తిరిగి పొందాలంటే సరైన ఆహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అందులో 'సోరకాయ రసం' ఒకటి. బరువు తగ్గడానికి మంచిగా ఉపయోగ పడుతుంది. తక్కువ క్యాలరీలు అందించి..అధిక పీచును కలిగి ఉంటుంది. సొరకాయలో కార్పొహైడ్రైట్లు ఆకలిని తగ్గిస్తుంది. ఐరన్‌, పొటాషియం, సోడియం వంటి ఖనిజాలు కూడా ఈ సొరకాయ రసంలో ఎక్కువే. ఇది మూత్రాశయ సంబంధిత అన్ని రకాల ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచుతుంది.

 

14:58 - June 12, 2017
14:57 - June 12, 2017

హైదరాబాద్: హై రేంజ్‌ బుక్ ఆఫ్‌ రికార్డ్స్‌ సంస్థ వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను సన్మానించింది. సంస్థ మూడవ వార్షికోత్సవం సందర్భంగా ఆయా రంగాల్లో విశిష్ట కృషిచేసిన వారికి హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌, వరల్డ్‌ రికార్డులను అందజేసింది. 10 టీవీ అసిస్టెంట్‌ ఇన్‌పుట్‌ ఎడిటర్‌ టీ సతీశ్‌ కుమార్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ అవార్డు అందుకున్నారు. పాట్నా హైకోర్టు రిటైర్డ్‌ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ నరసింహారెడ్డి, నటుడు పృద్విరాజ్‌, TRS MLC సుధాకర్‌రెడ్డి, ఈశ్వరోపాసకులు దైవజ్ఞ శర్మ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

14:56 - June 12, 2017

ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ ఖచ్చితంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు..వైద్యులు సూచిస్తున్నారు. కానీ ఏదో ఒకటి అల్పాహారం కాకుండా విటమిన్స్..పోషకాలు అందించే టిఫిన్ తీసుకుంటే బెటర్. అందులో 'గోధుమరవ్వ' ఒకటి. దీనితో ఎన్నో రకాల వంటకాలు చేసుకోవచ్చు. ఇందులోని పోషకాలు పుష్కలమైన ఆరోగ్యాన్ని అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ప్రోటీన్లు..పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే రోజాంతా ఉత్సాహంగా ఉంచుతుంది. చాలా సమయం పాటు ఆకలిని తగ్గిస్తుంది. షుగర్ ఉన్న వారికి ఇది సరైన ఆహారం అని చెప్పవచ్చు. దీన్లోని తక్కువ గ్లైసేమిక్‌ ఇండెక్స్‌, కాంప్లెక్స్‌ కార్బ్స్‌ శరీరం లోకి గ్లూకోస్‌ ను నియంత్రిస్తాయి. దీనితో షుగర్‌ లెవెల్స్‌ సమతూకంలో ఉంటాయి.

భూ కుంభకోణంపై టి.టిడిపి ఆందోళన..

హైదరాబాద్ : మియాపూర్ భూ కుంభకోణాన్ని నిరసిస్తూ టి.టిడిపి నేడు ఆందోళన చేపట్టింది. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నాలో టి.టిడిపి కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

రాష్ట్రపతి ఎన్నిక కోసం బీజేపీ కమిటీ..

ఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో బీజేపీ ఓ కమిటీని నియమించింది. కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.

రవాణాశాఖపై ఎంపీ కేశినేని సంచలన వ్యాఖ్యలు..

విజయవాడ : రవాణాశాఖపై ఏపీ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. రవాణాశాఖ పనితీరుపై మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. రవాణాశాఖ మొత్తం అవినీతి మయంగా మారిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

14:30 - June 12, 2017

హైదరాబాద్: సినారె మృతి ఒక్క తెలుగు సాయిహిత్యానికే కాదు.. ప్రపంచసాహిత్యానికి తీరని లోటని పీపుల్స్‌స్టార్‌ నారాయణమూర్తి నివాళులర్పించారు. సినారె కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.   

ఏపీ కాంట్రాక్టు ఉద్యోగుల జీతాల పెంపు..

విజయవాడ : కాంట్రాక్టు ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. 50 శాతం జీతాలు పెంచుతూ ప్రభుత్వం కాసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ నుండి పెంచిన జీతాలు అమల్లోకి రానున్నాయి.

14:24 - June 12, 2017

హైదరాబాద్: మియాపూర్‌ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ రంగారెడ్డి కలెక్టరేట్‌ వద్ద టీడీపీ నాయకులు ధర్నా చేపట్టారు. ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్‌ఎస్‌కు అధికారాన్ని కట్టబెడితే ...కుటుంబ పాలనకు శ్రీకారం చుట్టిందని.. ప్రజా ప్రయోజనాలను విస్మరించిందని టీడీపీ నాయకులు విమర్శించారు. ఈ కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి, ఎల్‌.రమణ, పెద్దిరెడ్డి, రావుల పాల్గొన్నారు.

 

14:21 - June 12, 2017

ఖమ్మం: ధనవంతులు ఎలాంటి విద్యను అభ్యసిస్తున్నారో అంతకంటే మేలైన విద్యను, మెరుగైన వసతి భవనాల్లో అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం రాపర్తినగర్‌లో మహాత్మ జ్యోతిభా పూలే బిసి గురుకుల విద్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఇవాళ..రేపు 240 రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభిస్తున్నట్లు మంత్రి చెప్పారు. కేజీ టూ పీజీ విద్యను ఎన్నికల ముందే ప్రకటించిన సీఎం కేసీఆర్ తన హామీని నెరవేరుస్తున్నారని మంత్రి తుమ్మల అన్నారు. 

14:18 - June 12, 2017

హైదరాబాద్: జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత.. కవి, రచయిత సి.నారాయణ రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపుడుతున్న ఆయన .. ఇవాళ ఉదయం కన్నుమూశారు. సినారేగా ప్రసిద్ధి చెందిన సింగిరెడ్డి నారాయణరెడ్డి.. జూలై 29 1931లో జన్మించారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా హనుమాజీపేట సినారే స్వగ్రామం. తండ్రి మల్లారెడ్డి, తల్లి బుచ్చమ్మ.నారాయణ రెడ్డి ప్రాథమిక విద్య గ్రామంలోని వీధిబడిలో సాగింది. ఉర్దూ మాధ్యమంలో సిరిసిల్లలో మాధ్యమిక విద్య, కరీంనగర్లో ఉన్నత పాఠశాల విద్య అభ్యసించారు. హైదరాబాదులోని చాదర్‌ఘాట్ కళాశాలలో ఇంటర్మీడియట్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఏ కూడా ఉర్దూ మాధ్యమంలోనే చదివారు. ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి తెలుగు సాహిత్యములో పోస్టుగ్రాడ్యుయేట్ డిగ్రీ, డాక్టరేటు డిగ్రీ పొందారు. చిన్ననాటి నుంచే హరికథ, బుర్రకథ, ఇతర సాహిత్య ప్రక్రియలపై మక్కువ పెంచుకున్న సినారే... తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన ఎనలేని సేవచేశారు. సినారే రాసిన విశ్వంభర కావ్యానికి 1998లె ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. సినారె రాజ్యసభ సభ్యునిగా కూడా నియమితుడయ్యాడు. తెలుగు చలన చిత్ర రంగములో ఆయన రాసిన పాటలు ఎంతో ప్రసిద్ధి చెందాయి.

విద్యా, పాలనా రంగాల్లో ఉన్నత పదవులు అలంకరించిన సినారె...

సాహిత్య సేవలోనే కాదు.. సినారె విద్యాత్మకంగా,పాలనా పరంగా ఎన్నో పదవులు నిర్వహించారు.1981లో ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు గా పనిచేశారు. 1985లో అంబేద్కర్ విశ్వవిద్యాలయం, 1989 లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాలకు ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు. తర్వాత 1992లో ఆంధ్ర ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల సలహాదారు గా నియమితులయ్యారు. దాంతోపాటు రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షుడిగా ఏడేళ్ళపాటు సేవలు అందించారు. 1997లో రాజసభా సభ్యుడిగా నామినేట్‌ అయ్యారు. 1993 నుంచి అంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడిగా విలక్షణ కార్యక్రమాలు రూపొందించి తెలుగు భాషా సాహిత్య, సాంస్కృతిక అభ్యుదయానికి తోడ్పడ్డారు సినారె.

అవార్డులకే గౌరవం తెచ్చిన సినారె...

కవిగా, కావ్యరచయితగా, సినీగేయరచయితగా తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవచేసిన సినారెను పలు అవార్డులు వరించాయి. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. దాంతోపాటు భారతీయభాషా పరిషత్‌ అవార్డు, రాజాలక్ష్మీ సాహిత్య పుస్కారంతోపాటు ప్రతిష్టాత్మకమైన సోవియట్‌-నెహ్రూపురస్కారం, అసాన్‌ అవార్డు కూడా సినారేను వరించింది. భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ, పద్మభూషణ్ గౌరవాలతో సత్కరించింది. ఆంధ్ర, కాకతీయ, బీఆర్ అంబేద్కర్, మీరట్, నాగార్జున విశ్వ విద్యాలయాలు సినారెరకు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశాయి.

తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ...

సి. నారాయణరెడ్డి తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవచేశారు. ఆయన కలం నుంచి పద్య కావ్యాలు, గేయ కావ్యాలు, వచన కవితలు, చలనచిత్ర గీతాలు, యాత్రా కథనాలు, సంగీత నృత్య రూపకాలు, బుర్ర కథలు, గజళ్ళు, వ్యాసాలు, విమర్శనా గ్రంథాలు, లాంటి ఎన్నో సాహిత్య ప్రక్రియలు వెలువడ్డాయి. కళాశాలలో విద్యార్థిగా ఉండగానే ' శోభ పత్రి'కకు సంపాదకత్వం వహించారు. రోచిస్, సింహేంద్ర పేరుతో మొదట్లో కవితలు రచించేవారు. సినారె కవిత తొలిసారి 'జనశక్తి పత్రిక'లో అచ్చయింది. విద్యార్థి దశలోనే ప్రహ్లాద చరిత్ర, సీతాపహరణం వంటి పద్య నాటికలు, భలే శిష్యులు తదితర సాంఘిక నాటకాలు కూడా రచించారు. 1953 లో 'నవ్వని పువ్వు' సంగీత నృత్య నాటిక ప్రచురితమైంది. సినారె రాసిన 'రామప్ప సంగీత నృత్య రూపకం' అన్ని భారతీయ భాషల్లోకి అనువాదమైంది. ఆయన పరిశోధన గ్రంథం ఆధునికాంధ్ర కవిత్వము - సంప్రదాయములు, ప్రయోగములు అత్యంత ప్రామాణిక గ్రంథంగా పేరు పొందింది. ముఖ్యంగా సినారె రాసిన సినీగేయాలు పండిత పామరులను అలరించాయి.1962 లో గులేబకావళి కథ చిత్రం లోని నన్ను దోచుకుందువటే వన్నెల దొరసానీ అనే పాటతో ప్రారంభించి మొత్తం 3500 గీతాలు రచించారు.

14:10 - June 12, 2017

టాలీవుడ్ యంగ్ హీరోల్లో 'నితిన్' ఒకరు. ప్రేమ కథా చిత్రాలు ఎంచుకుంటూ ముందుకెళుతున్న ఈ నటుడు తాజాగా 'లై (లవ్ ఇంటెలిజెన్స్ ఎనిమిటి) చిత్రంలో నటిస్తున్నాడు. ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ' సినిమాతో సక్సెస్ అందుకున్న హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఎక్కువ భాగం అమెరికాలో షూటింగ్ జరుగుతోంది. నితిన్ సరసన మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా చికాగోలోని హిల్టన్‌ హోటల్‌లో ఈ చిత్రం మొదటి గీతాన్ని రిలీజ్‌ విడుదల చేసినట్టు చిత్రబృందం పేర్కొంది. మణిశర్మ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ గీతం 'బాంభాట్‌...అనే పల్లవితో సాగుతుంది. ఇదే పాటను సోమవారం ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్ లో విడుదల చేస్తారని తెలుస్తోంది. ఈ ఆల్బమ్‌లో తనకు ఎంతో ఇష్టమైన 'బాంభాట్‌' సాంగ్‌ ఈరోజు అమెరికాలో విడుదలైందని నితిన్ అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల విడుదలైన నితిన్‌, మేఘా ఆకాష్‌ల రొమాంటిక్‌ పోస్టర్స్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోందని నిర్మాతలు తెలిపారు.

డార్జిలింగ్ బంద్..

డార్జిలింగ్ : ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉందని డార్జిలింగ్ ఎడిజి సిద్ధినాత్ గుప్తా పేర్కొన్నారు. నిరవధిక బంద్ కు గూర్ఖా జనముక్తి మోర్చా పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఎడిజి పేర్కొన్నారు.

రాజస్థాన్ లో 'గో రక్షక్ దళం' దాడి..

రాజస్థాన్ : దేశంలోని పలు ప్రాంతాల్లో గో రక్షక్ పేరిట దాడులు పెరిగిపోతున్నాయి. తాజాగా రాజస్థాన్ లో ఆవులను తరలిస్తున్న వ్యాన్ పై దాడి చేసి ఓ వ్యక్తిని గాయపరిచారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

13:41 - June 12, 2017

ఇంట్లో ఉండే వస్తువులతో అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. అందులో చక్కెర కూడా ఒకటి. తీపిగా ఉండే ఈ పదార్థంతో అందాన్ని ఎలా ద్విగుణీకృతం చేసుకోవచ్చో చూద్దాం...

  • ఒక చెంచా చక్కెరలో ఒక చెంచా బెల్లం వేయండి. దీనిని మెత్తగా పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. ఇలా 15 నిమిషాలు ఉన్న అనంతరం గోరు వెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే మంచి ఫలితం కనబడుతుంది.
  • చక్కెరను పొడిలా చేసుకోవాలి. దీనితో ముఖానికి మాస్క్ లా వేసుకోవాలి. ఈ మాస్క్ ను 15-20 నిమిషాల పాటు ఉంచుకున్న అనంతరం చల్లటి నీటితో కడుక్కోవాలి.
  • చర్మంపై ఉన్న దుమ్ము..ధూలి పోవాలంటే చక్కెరను తీసుకుని ముఖంపై మెల్లిగా రుద్దాలి. మునివేళ్లతో నెమ్మదిగా రుద్దుకుని పది నిమిషాల అనంతరం చల్లటి నీటితో కడుక్కోవాలి.
  • గోరు వెచ్చని నీటిలో రెండు చెంచాల చక్కెరను కలుపుకోవాలి. ముఖానికి..మెడకు పెట్టుకుని 20 నిమిషాల అనంతరం కడిగితే సరిపోతుంది.
13:35 - June 12, 2017

పెట్రోల్..డీజిల్ వాహనం ఏదైనా ఉందా ? అయితే ఈ వార్త మీ కోసమే. వాహనంలో ముందుగానే పెట్రోల్..డీజిల్ ఉందా అని చెక్ చేసుకోండి. 16వ తేదీలోపుగానే ఫుల్ గా పెట్రోల్..డీజిల్ పోయించుకోండి. లేకపోతే ఆ రోజు అనంతరం బంకుల్లు బంద్ కానున్నాయి. పెట్రోల్..డీజిల్ ధరలను రోజువారీగా సవరించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెట్రోల్ బంక్ యజమానులు ఆందోనలకు సిద్ధమౌతున్నాయి. అందులో భాగంగా జూన్ 16వ తేదీ నుండి చమురు సంస్థల నుండి పెట్రోల్..డీజిల్ లను కొనకూడదని నిర్ణయం తీసుకున్నాయి. ఒకవేళ అదే జరిగితే వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు తప్పవు. జూన్ 16వ తేదీ నుండి దేశ వ్యాప్తంగా పెట్రోల్..డీజిల్ ధరలను రోజు వారీగా సవరిస్తామని పెట్రోలియం సంస్థలు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పెట్రోల్ బంకుల యజమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశ వ్యాప్త అమలుపై పునరాలోచించాలని సూచిస్తున్నారు. మరి ఎలా జరుగుతుందో వేచి చూడాలి.

పోలీసుల కస్టడీలోకి దీపక్ రెడ్డి..

హైదరాబాద్ : భూ కుంభకోణంలో టిడిపి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. సీసీఎస్ పోలీసులు ఐదు రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు.

 

13:24 - June 12, 2017

టాలీవుడ్ మన్మథుడిగా పేరొందిన 'అక్కినేని నాగార్జున' ‘అమల' వివాహ బంధానికి 25 ఏండ్లు నిండాయి. ఈ సందర్భంగా 'నాగార్జున' తమ పెళ్లి ఫొటోను ఫేస్ బుక్ లో పోస్టు చేస్తూ..నేటికి 25 ఏండ్లు అవుతోంది..అని పేర్కొన్నారు. 1987లో 'కిరాయిదాదా' చిత్రంలో నాగార్జున, అమలలు నటించారు. తరువాత 'చిన్నబాబు'..’శివ'..’ప్రేమ యుద్ధం'..’నిర్ణయం'..వంటి చిత్రాల్లో నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. 1992 జూన్ 11వ తేదీన వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వివాహమయ్యాక 'అమల' సినిమాలకు దూరంగా ఉంటూ సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. చాలా కాలం తర్వాత 2012లో విడుదలైన 'లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌' చిత్రంలో తల్లి పాత్రలో 'అమల' మెరిశారు. 'నాగార్జున' మాత్రం వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ అభిమానుల మన్ననలు పొందుతున్నారు. ప్రస్తుతం 'రాజుగారి గది 2' చిత్రంలో 'నాగార్జున' నటిస్తున్నారు.

13:19 - June 12, 2017

'సమంత' జోరు కొనసాగిస్తోంది. పలు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ యమ బిజీగా మారనుంది. టాలీవుడ్ మన్మథుడు 'నాగార్జున' తనయుడు 'అక్కినేని నాగ చైతన్య'..’సమంత' మధ్య ప్రేమాయణం నడుస్తున్న సంగతి తెలిసిందే. మరో నాలుగు నెలల్లో వీరిద్దరి వివాహం జరగనుంది. దీనితో నాలుగు నెలల్లో సినిమాలు కంప్లీట్ చేయాలని 'సమంత' యోచిస్తోందని తెలుస్తోంది. 'రామ్‌చరణ్‌' తో 'రంగ స్థలం 1985' చిత్రం..విజయ్ తో..విశాల్‌కి జోడీగా నటిస్తున్న 'ఇరుంబు థిరై' చిత్రాలుండగా, తాజాగా మరో చిత్రంలో నటించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 'శివకార్తికేయన్‌' హీరోగా నటించే చిత్రంలో నటించనుంది. ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్‌ కార్యక్రమాలు ఈనెల 16 నుంచి చెన్నైలో ప్రారంభం కానున్నాయి. పెళ్లి సమయం వచ్చే సరికి ఈ నాలుగు సినిమాలు కంప్లీట్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నాలుగు ప్రాజెక్ట్‌లను పూర్తి చేయాలనే లక్ష్యంతో క్షణం తీరిక లేకుండా షూటింగ్‌ల్లో గడిపేస్తున్నట్టు ట్వీట్‌ ద్వారా అభిమానులతో సమంత షేర్‌ చేసుకుంది.

13:11 - June 12, 2017
13:07 - June 12, 2017

హైదరాబాద్ : సి. నారాయణరెడ్డి వజ్రంలాంటి వ్యక్తి అని మాజీ ఎంపీ టీ. సబ్బిరామిరెడ్డి అన్నారు. ఆయన యొక్క వాక్కు శక్తి గొప్పదని ఆయన ఆత్మకు శాంతి చేకురాలని రామిరెడ్డి కోరుకున్నారు. 

13:05 - June 12, 2017

కళ్యాణ్ రామ్ యమ జోరు మీదున్నట్లే కనిపిస్తోంది. సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ తో జై..లవ..కుశ..కు నిర్మాణ బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పూరి జగన్నాథ్..నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో ఓ మూవీ ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి క్రిష్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలకృష్ణ..క్రిష్ తో ముచ్చటించారు. వీరిద్దరీ కాంబినేషన్ లో 'గౌతమి పుత్ర శాతకర్ణి' ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మరో ప్రాజెక్టు ఏంటీ అని బాలయ్య అడిగినట్లు..కళ్యాణ్ రామ్ తో పవర్ ఫుల్ ప్రాజెక్టు చేయబోతున్నట్లు క్రిష్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. మే నుండి ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్ళాలనే ఆలోచనలో క్రిష్ ఉన్నాడని సమాచారం.

12:58 - June 12, 2017

ఢిల్లీ : కర్నన్ ఎక్కడ ఉన్నాడు ? ఆయనను ఎప్పుడు అరెస్టు చేస్తారు ? అనే ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కర్నన్‌ కోసం పోలీసులు గాలిస్తున్న సంగతి తెలిసిందే. సుప్రీంకోర్ఉట ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఆయనపై అరెస్టు వారెంట్ జారీ చేసింది. అప్పటి నుండి ఆయన ఎక్కడున్నారో తెలియడం లేదు. తమిళనాడు పోలీసుల సహకారంతో గాలించినా ఆయన ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. దాదాపు 20మంది సుప్రీం కోర్టు, హైకోర్టు ల న్యాయమూర్తులపై అవినీతికి పాల్పడ్డారని, వివక్ష చూపారని ఆరోపణలు చేస్తూ జస్టిస్‌ కర్నన్‌ ప్రధాన మంత్రికి, న్యాయశాఖ మంత్రికీ, సుప్రీం కోర్టు రిజిస్ట్రా ర్‌కు లేఖలు రాయడాన్ని కోర్టు నేరంగా పరిగణించింది. ఇదిలా ఉంటే జస్టిస్‌ కర్నన్‌ అజ్ఞాతంలో ఉండగానే పదవీ విరమణ చేయనున్నారని సోషల్ మీడియాలో వార్త ప్రచారం అవుతోంది.

ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలో అగ్నిప్రమాదం..

ఢిల్లీ : ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు.

12:31 - June 12, 2017

ఆయన తరగతి గదిలో పాఠ్యంశ చెబుతుంటే వింటుండేవాళ్లం. ఆ స్వరం ఇక వినిపించదు అని, భారతి అనే పత్రికలో సినారె కవిత, తన కవిత ఒక రోజు పత్రికలో వచ్చాయని, శంకరం అని పిలిచి మెచ్చుకున్నారు. కొంత మంది ప్రముఖ కవుల్లో సినారె ప్రముఖుడని, నిలకడ నీటిలో కమలంలే కాదు క్రిములు కూడా పుడతాయని ఆయన రాసిన కవిత ఆదర్శమని ప్రముఖ కవి నలేశ్వర శంకరం, విశ్లేషకులు తెలకపల్లి రవి అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

మళ్లీ పాక్ కాల్పులు..

జమ్మూ కాశ్మీర్ : పాక్ మళ్లీ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతోంది. నౌషెరా సెక్టార్ లో పాక్ కాల్పులకు తెగబడింది. పాక్ ఆర్మీ చిన్న..పెద్ద మిషెల్స్ ప్రయోగిస్తోందని, పలు జాగ్రత్తలు తీసుకున్నట్లు ఎస్డీపీవో నౌషెరా అధికారి ఎన్ ఏ చౌహాన్ ఓ జాతీయ ఛానెల్ కు వెల్లడించారు.

ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు..

జమ్మూ కాశ్మీర్ : నార్త్ కాశ్మీర్ లోని హంద్వారాలో పోలీసులు..భారత బలగాలు జరిపిన జాయింట్ యాక్షన్ ఆపరేషన్ లో ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేశారు.

12:13 - June 12, 2017

హైదరాబాద్ : సి. నారాయణరెడ్డి తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవచేశారు. ఆయన కలం నుంచి పద్య కావ్యాలు, గేయ కావ్యాలు, వచన కవితలు, చలనచిత్ర గీతాలు, యాత్రా కథనాలు, సంగీత నృత్య రూపకాలు, బుర్ర కథలు, గజళ్ళు, వ్యాసాలు, విమర్శనా గ్రంథాలు, లాంటి ఎన్నో సాహిత్య ప్రక్రియలు వెలువడ్డాయి. కళాశాలలో విద్యార్థిగా ఉండగానే ' శోభ పత్రి'కకు సంపాదకత్వం వహించారు. రోచిస్, సింహేంద్ర పేరుతో మొదట్లో కవితలు రచించేవారు. సినారె కవిత తొలిసారి 'జనశక్తి పత్రిక'లో అచ్చయింది. విద్యార్థి దశలోనే ప్రహ్లాద చరిత్ర, సీతాపహరణం వంటి పద్య నాటికలు, భలే శిష్యులు తదితర సాంఘిక నాటకాలు కూడా రచించారు. 1953 లో 'నవ్వని పువ్వు' సంగీత నృత్య నాటిక ప్రచురితమైంది. సినారె రాసిన 'రామప్ప సంగీత నృత్య రూపకం' అన్ని భారతీయ భాషల్లోకి అనువాదమైంది. ఆయన పరిశోధన గ్రంథం ఆధునికాంధ్ర కవిత్వము - సంప్రదాయములు, ప్రయోగములు అత్యంత ప్రామాణిక గ్రంథంగా పేరు పొందింది. ముఖ్యంగా సినారె రాసిన సినీగేయాలు పండిత పామరులను అలరించాయి.1962 లో గులేబకావళి కథ చిత్రం లోని నన్ను దోచుకుందువటే వన్నెల దొరసానీ అనే పాటతో ప్రారంభించి మొత్తం 3500 గీతాలు రచించారు.

12:12 - June 12, 2017

హైదరాబాద్ : సాహిత్య సేవలోనే కాదు.. సినారె విద్యాత్మకంగా,పాలనా పరంగా ఎన్నో పదవులు నిర్వహించారు.1981లో ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు గా పనిచేశారు. 1985లో అంబేద్కర్ విశ్వవిద్యాలయం, 1989 లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాలకు ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు. తర్వాత 1992లో ఆంధ్ర ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల సలహాదారు గా నియమితులయ్యారు. దాంతోపాటు రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షుడిగా ఏడేళ్ళపాటు సేవలు అందించారు. 1997లో రాజసభా సభ్యుడిగా నామినేట్‌ అయ్యారు. 1993 నుంచి అంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడిగా విలక్షణ కార్యక్రమాలు రూపొందించి తెలుగు భాషా సాహిత్య, సాంస్కృతిక అభ్యుదయానికి తోడ్పడ్డారు సినారె. కవిగా, కావ్యరచయితగా, సినీగేయరచయితగా తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవచేసిన సినారెను పలు అవార్డులు వరించాయి. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. దాంతోపాటు భారతీయభాషా పరిషత్‌ అవార్డు, రాజాలక్ష్మీ సాహిత్య పుస్కారంతోపాటు ప్రతిష్టాత్మకమైన సోవియట్‌-నెహ్రూపురస్కారం, అసాన్‌ అవార్డు కూడా సినారేను వరించింది. భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ, పద్మభూషణ్ గౌరవాలతో సత్కరించింది. ఆంధ్ర, కాకతీయ, బీఆర్ అంబేద్కర్, మీరట్, నాగార్జున విశ్వ విద్యాలయాలు సినారెరకు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశాయి. 

వ్యవసాయ రంగంలో 145 శాతం వృద్ధి - బాబు..

విజయవాడ : అమరావతిలో జలవనరులు..వ్యవసాయం..హార్టికల్చర్ పై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష జరిపారు. 13 జిల్లాల కలెక్టర్లతో బాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యవసాయ రంగంలో 145 శాతం వృద్ధి సాధించినట్లు, రెయిన గన్ లను ప్రయోగాత్మకంగా వినియోగించాలన్నారు. మూడు భారీ తుపాన్లను సమర్థవంతంగా ఎదుర్కోవడం జరిగిందన్నారు. విపత్తులు వస్తే సహాయక - రక్షణ చర్యలకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని సూచించారు. గోదావరి డెల్టాకు నీటిని విడుదల చేసినట్లు, ఖరీఫ్ సాగుపై కలెక్టర్లు దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. చెరువులు..చెక్ డ్యాంలను నీటితో నింపాలని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

12:05 - June 12, 2017

కర్నూలు : జిల్లాలో రోడ్డు ప్రమాదం విషాదం నింపింది. జిల్లా కేంద్రంలోని వెంకటరమణ కాలనీ దగ్గర హైవేపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ యాక్సిడెంట్‌లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులకు కర్నూల్లో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో మృతిచెందినవారు రాజశేఖర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డిగా గుర్తించారు. మృతులందరూ కోడుమూరు మండలం ప్యాలకుర్తి వాసులుగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి కేసును నమోదు చేశారు. 

బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ పనులకు శంకుస్థాపన..

విజయవాడ : బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ పనులకు మంత్రి దేవినేని, ఎంపీ కేశినేని నాని శంకుస్థాపన చేశారు. ఆరు వరుసలతో 1.47 కి.మీ. పొడవు ఫ్లై ఓవర్ నిర్మాణం చేస్తున్నట్లు, నిర్మాణానికి రూ. 220 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఎంపీ కేశినేని నాని వెల్లడించారు.

ఉండవల్లిలో సీపీఎం..రైతు సంఘాల ధర్నా..

విజయవాడ : ఉండవల్లిలో సీపీఎం రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా జరుగుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభకు అనుమతి లేదని నేతలను పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ, టీడీపీ ప్రభుత్వాల ప్రజా, రైతు వ్యతిరేక చర్యలు ...బలవంతపు భూ సేకరణను వ్యతిరేకిస్తూ ఆందోళన నిర్వహించారు.

అరాచకపాలన సాగుతోంది - మధు..

విజయవాడ : రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. భూ సేకరణ పేరిట వేల ఎకరాలు లాక్కొంటున్నారని, ఉండవల్లి ప్రాంతంలో భూ సేకరణ చేస్తే ఆందోళన చేస్తామన్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ లో రైతులు చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలియచేస్తున్నట్లు పేర్కొన్నారు. చంద్రబాబు ప్రజా వ్యతిరేక చర్యలపై జేఏసీగా పోరాడుతామన్నారు.

ఎల్లుండి సినారె అంత్యక్రియలు..

హైదరాబాద్ : సినారె అంత్యక్రియలు ఎల్లుండి జరగనున్నాయి. విదేశాల్లో ఉంటున్న సినారే మనవడు రావాల్సి ఉండడంతో ఆయన అంత్యక్రియలు ఎల్లుండి నిర్వహించాలని కుటుంసభ్యులు నిర్ణయించారు.

ఇండస్ట్రియల్ పాలసీ వార్షిక నివేదిక విడుదల..

హైదరాబాద్ : ఇండస్ట్రియల్‌ పాలసీ వార్షిక నివేదిక విడుదలైంది. సోమవారం హరిత ప్లాజాలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్..జగదీష్ రెడ్డిలు పాల్గొని నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ..టీఎస్‌ ఐపాస్‌కు నేటితో రెండేళ్లు పూర్తయ్యాయని తెలిపారు.

నీట్ ఫలితాలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్..

ఢిల్లీ : నీట్ ఫలితాల వెల్లడికి సుప్రీం కోర్టు అనుమతి లభించింది. నీట్ ఫలితాలను వెంటనే వెల్లడి చేయాలని సుప్రీం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. నీట్ పరీక్ష ఫలితాల వెల్లడిపై గతంలో సుప్రీం స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ స్టేను ఎత్తి వేస్తూ ఫలితాలు ప్రకటించి కౌన్సెలింగ్ చేపట్టాల్సిందిగా సీబీఎస్ఈని ఆదేశించింది.

250 ఇంజినీరింగ్ కాలేజీలకు జేఎన్టీయూహెచ్ గుర్తింపు..

హైదరాబాద్ : 2017-418 విద్యా సంవత్సరానికి 250 ఇంజినీరింగ్ కాలేజీలకు జేఎన్టీయూహెచ్ గుర్తింపునిచ్చింది. ఇందులో 1,26,315 సీట్లు ఉన్నాయి. బీ ఫార్మసీ 137 కాలేజీలు, 12,931 సీట్లు ఉన్నాయి. గత ఏడాదికంటే 27 కాలేజీలు, 13,153 సీట్లు తగ్గాయి. గత ఏడాది కంటే 7 బీ ఫార్మసీ కాలేజీలు, 1529 సీట్లు తగ్గాయి.

11:16 - June 12, 2017

'బాహుబలి-2’ మేనియా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏప్రిల్ 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. రూ. 1500 కోట్లు కొల్లగొట్టి రూ. 2000 వేల కోట్ల క్లబ్ లోకి దూసుకెళుతోంది. విదేశాల్లో సైతం 'బాహుబలి2’ ప్రభంజనం కొనసాగడం విశేషం. దర్శకుడు రాజమౌళి సినిమాను తీర్చిదిద్దిన విధానం..గ్రాఫిక్స్ అబ్బుర పరిచాయి. ప్రభాస్..ఇతర నటీ నటుల యాక్టింగ్ కు అభిమానులు ఫిదా అయ్యారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో వీడియో సాంగ్స్ ఒక్కోటి యూ ట్యూబ్ లో విడుదల చేస్తున్నారు. తాజాగా టైటిల్ ట్రాక్ 'ఒక ప్రాణం' అనే సాంగ్ ని తెలుగు, త‌మిళ భాష‌ల‌లో విడుద‌ల చేశారు. రానున్న రోజుల్లో మరిన్ని వీడియో సాంగ్స్ విడుదల చేస్తారని తెలుస్తోంది.

11:10 - June 12, 2017

లండన్ : బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి లండన్ లో ఉంటున్న విజయ్ మాల్యాకు చేదు అనుభవం ఎదురైంది. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పలు మ్యాచ్ లో లండన్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. భారత్ ఆడుతున్న మ్యాచ్ లకు విజయ్ మాల్యా హాజరవుతున్నారు. మ్యాచ్ ను తిలకిస్తున్న ఆయన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ కు కూడా ఆయన హాజరయ్యారు. మ్యాచ్ జరుగుతున్న ఓవల్ గ్రౌండ్ కు చేరుకోగానే అక్కడున్న భారత అభిమానులు..హేళన చేశారు. ‘దొంగ..దొంగ' అంటూ అరిచారు. దీనితో మాల్యాకు ఏమి చేయాలో అర్థం కాలేనట్టుంది. కోహ్లి ఫౌండేష‌న్ నిర్వ‌హించిన చారిటీ డిన్న‌ర్‌కు కూడా మాల్యా వ‌చ్చాడని..అక్క‌డ కూడా ఇండియ‌న్ టీమ్ అత‌నికి మొహం చాటేసిందని సమాచారం.

 

3500 పాటలు రాసిన సినారె..

హైదరాబాద్ : ఉత్తమ పాటల రచయితగా నంది పురస్కారం (సీతయ్య)..71 సినిమాలకు పాటలు రాశారు. మొత్తం 3500 పాటలు రాశారు. సంస్కృతం, హిందీ, మలయాళం, ఉర్దూ, కన్నడం, ఇంగ్లీష్, ఫ్రెంచ్ మొదలైన భాషల్లో సినారె గ్రంథాలు అనువాదమయ్యాయి. హిందీ, ఉర్దూ భాషల్లోనూ కవితలు రాశారు.

సినారెకు లభించిన పురస్కారాలు..

హైదరాబాద్ : సి.నారాయణరెడ్డికి వివిధ పురస్కారాలు లభించాయి. డిగ్రీ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగు సాహిత్యములో సినారెకు డాక్టరేట్..1977లో పద్మశ్రీ పురస్కారం..1988లో విశ్వంభర కావ్యానికి ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం..లు లభించాయి.

వివిధ హోదాల్లో పనిచేసిన సినారె..

హైదరాబాద్ : 1981లో ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా, 1985లో అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా 1989లో పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ ఉపాధ్యక్షులుగా 1992లో ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల సలహాదారుగా, రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షుడిగా పనిచేశారు. 1997లో రాజ్యసభ సభుడిగా సి.నారాయణరెడ్డి ఎంపికయ్యారు.

స్వగృహంలో సినారె భౌతికకాయం..

హైదరాబాద్ : కవితి, సాహితీవేత్త డాక్టర్ సినారె కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన హైటెక్స్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశారు. మణికొండలోని స్వగృహానికి సినారె భౌతికకాయాన్ని తరలించారు.

మూడేళ్ల చిన్నారిని హత్య చేసిన సవితి తల్లి..

చిత్తూరు : తిరుమలలో అదృశ్యమైన మూడేళ్ల చిన్నారి రాధ హత్యకు గురైంది. చిన్నారి రాధను సవితి తల్లి కొట్టి చంపేసింది. పోలీసుల విచారణలో నేరాన్ని తల్లి అంగీకరించింది. గత ఆగస్టు 24వ తేదీన చిన్నారి రాధ అదృశ్యమైన సంగతి తెలిసిందే. తిరుమల అటవీ ప్రాంతంలో రాధ మృతదేహం బయటపడింది.

 

సినారె మృతి పట్ల పలువురి సంతాపం..

హైదరాబాద్ : సినారె మృతి పట్ల పలువురు సంతాపం తెలియచేశారు. ఏపీ స్పీకర్ కోడెల, మంత్రులు లోకేష్, చినరాజప్ప, మాణిక్యాలరావు, తెలంగాణ మంత్రి లక్ష్మారెడ్డి, వైసీపీ అధ్యక్షుడు జగన్, సీపీఎం ఏపీ, తెలంగాణ కార్యదర్శులు మధు, తమ్మినేనిలు సంతాపం తెలియచేశారు.

సినారె మృతికి కేసీఆర్ సంతాపం..

హైదరాబాద్ : సినారె మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. సాహిత్య రంగంలో సినారె కృషి ఎప్పటికీ మరిచిపోలేనిదని, సాహితీ వేత్తగా కాకుండా రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారన్నారు. ఆయన రాసిన గజల్స్, కవితలు, కథనాలు మరిపోలేనిదని, జ్ఞానపీఠ్ అవార్డు పొందిన తెలంగాణ బిడ్డ అని కొనియాడారు.

10:37 - June 12, 2017

హైదరాబాద్ : సినారె మృతదేహం ఆయన ఇంటికి చెరుకుంది. ఆయనకు నివాళులు అర్పించడానికి ప్రముఖులు ఆయన ఇంటి చేరుకున్నారు. కొద్ది సేపటి క్రితమే హీరో వెంకటేష్ సినారెకు నివాళులు అర్పించారు. ఆర్ నారాయణ కూడా సినారెకె నివాళులుల అర్పించారు. సినారె కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం హన్మజీపేటలో జన్మించారు. చిత్రం భలారే విచిత్రం పాట ఇప్పటికి తెలుగు ప్రేక్షకుల హృదయంలో మెదులుతోంది. సినారె సినిమా పాటలే కాదు విప్లవ పాటలు కూడా రాశారు. పూర్తి వివరాలు వీడియోలో చూడండి. 

సినారె మృతి పట్ల బాబు సంతాపం..

విజయవాడ : సినారె మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం తెలియచేశారు. జ్ఞానపీట్ పురస్కారానికి వన్నె తెచ్చిన మహారచయిత అని, ఎన్టీఆర్ తో సన్నిహిత సంబంధాలు ఉండేవని పేర్కొన్నారు. రచయితగా, రాజ్యసభ సభ్యుడిగా సినారె అందించిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. సినారె రాసిన పాటలు ఆణిముత్యాలు అని కొనియాడారు.

10:18 - June 12, 2017

హైదరాబాద్ : తెలుగు సాహిత్యంలో అనన్యప్రతిభ ఉన్న వ్యక్తి సి.నారాయణరెడ్డి అని సాహితీవేత్త శికమణి అన్నారు. సినారె లెజెండర్ అని తెలిపారు. తెలుగు యూనివర్శిటీ వీసీగా ఉన్నప్పుడు తనను ప్రొఫెసర్ గా నియమించాడని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆయన తెలుగు భాషకు నిలువెత్తు సంతకం అని కొనియడారు.

 

10:04 - June 12, 2017

హైదరాబాద్ : సి. నారాయణరెడ్డి అధికార భాష సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అనేక మంది కవులకు సయం అందించారని ప్రముఖ సాహితీవేత్త యాకుబ్ అన్నారు. సినారె గొప్ప వ్యక్తి అని ఆయనతో తనకు దగ్గరి బంధం ఉందని తెలిపారు. కొత్త కవులు ఉత్తరాల ద్వారా తమ కవితలను పంపితే ఓపిక చదివి అభినంధిస్తూ ఉత్తరాలు రాశారని కొనియడారు. ఆయన మరణం తనకు తీరని లోటు అని యాకుబ్ అన్నారు.

 

 

సి. నారాయణ రెడ్డి కన్నుమూత

హైదరాబాద్ : తెలుగు సినీ పరిశ్రమ మరో ధృవ తారను కోల్పోయింది. జ్ఞాన్ పీఠ్ అవార్డు గ్రహీత సి. నారాయణ రెడ్డి కన్నుమూశారు. ఉదయం 7గంటల సమయంలో హైటెక్ సిటీలోని కేర్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. కానీ అప్పటికే ఆయన మరణించినట్టు డాక్టర్లు తెలిపారు.

09:42 - June 12, 2017

హైదరాబాద్ : సి.నారాయణ రెడ్డి గొప్ప వ్యక్తి అని అజరమరుడని ప్రముఖ దర్శకుడు విశ్వనాథ్ అన్నారు. సినారెతో తనకు మొట్టమొదటి సినమా నుంచి బంధం ఉందని తెలిపారు. ఆయన మరణం సినీ పరిశ్రమే కాదు సాహిత్యానికి తీరని లోటు అని కొనియడారు. ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు విశ్వనాథ్. 

09:33 - June 12, 2017

హైదరాబాద్ : ప్రముఖ కవి, రచయత, జ్ఞాన్ పీఠ్ అవార్డు గ్రహీత సి. నారాయణ రెడ్డి మృతి పట్ల ప్రముఖ విశ్లేసకులు తెలకపల్లి రవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు సాహిత్యాన్ని ప్రజుల్లోకి తీసుకెళ్లిన వ్యక్తి సినారె అని, సినీ ప్రరిశ్రమ గొప్ప వ్యక్తి కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సినారె వందల, వేల మంది విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారని తెలకపల్లి కొనియడారు. ఒక మహా శిఖరం కోల్పోయినందుకు బాధగా ఉందని తెలిపారు. నిలకడ ఉన్న నీటిలో కమలు కాదు క్రిములు కూడా పుడతాయని సమాజానికి దారి చూపాడని ఆయన అన్నారు.

 

09:14 - June 12, 2017

హైదరాబాద్  : తెలుగు సినీ పరిశ్రమ మరో ధృవ తారను కోల్పోయింది. జ్ఞాన్ పీఠ్ అవార్డు గ్రహీత సి. నారాయణ రెడ్డి కన్నుమూశారు. ఉదయం 7గంటల సమయంలో హైటెక్ సిటీలోని కేర్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. కానీ అప్పటికే ఆయన మరణించినట్టు డాక్టర్లు తెలిపారు. సినారె నిద్రలో గుండె పోటు రావడంతో చనిపోయినట్లు తెలుస్తోంది, ఆయన పూర్తి పేరు సింగిరెడ్డి నారాయణరెడ్డి. సినారె 1931 జూలై 29న కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం హన్మాజీపేటలో మల్లారెడ్డి, బుచ్చమ్మ దంపతులకు జన్మించారు. ప్రథమిక విద్యను సిరిసిల్లలో, ఉన్నత విద్యను కరీంనగర్ లో, ఇంటర్ హైదరాబాద్ లోని చాదర్ ఘట్ లో, డిగ్రీని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేశారు. ఓయూ నుంచి తెలుగు సాహిత్యంలో డాక్టరేటు పొందారు. తెలుగు యూనివర్శిటీ ఉపకులపతిగా చేశారు. ఈయనకు 1988లో విశ్వంభర కావ్యానికి జ్ఞాన్ పీఠ్ అవార్డు అందుకున్నారు. ఉత్తమ పాటల రచయితగా సీతయ్య అనే సినిమాకు నంది పురస్కారం పొందారు. నారాయణరెడ్డి 1997లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక అయ్యారు. తన రచనలతో తెలుగు సినీ పరిశ్రమకు ఎంతో సేవ చేశారు. 71 సినామాలకు ఆయన పాటలు రాశారు. సినారె మొత్తం 3500 పాటలు రాశారు. సంస్కృతం, హిందీ, మలయాళం, ఉర్ధూ, కన్నడం, ఫ్రెంచ్ మొదలైన భాషల్లో సినారె గ్రంథాలు అనువాదం చేశారు. ఈయన హిందీ, ఉర్ధూ భాషల్లో కవితలు రాశారు. 

నేటి నుంచి టీఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్

హైదరాబాద్ : నేటి తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. నేటి నుంచి 22 తేదీ వరకు కౌన్సిలింగ్ జరుగుతుంది.

07:56 - June 12, 2017

వాస్తవంగా రాజకీయం అంటే భూ అక్రమాలు అని ప్రజలు అనుకుంటున్నారని, సాక్షాత్ మంత్రిగారు ఆవేదన వ్యక్తం చేసిన ప్రభుత్వం పట్టించుకోకపోవడం, టీడీపీ ఎమ్మెల్సీ సస్పెండ్ చేయకపోవడం, వివాదల్లో ఉన్న భూమిని కేశవరావు కొనడం వీటిపై సమగ్రా విచారణ జరగాలని న్యూస్ మార్నింగ్ పాల్గొన్న విశ్లేషకులు తెలపల్లి రవి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసులు అన్నారు. భూ కుంభకోణంలో కేవలం ఒక్క పార్టీకి చెందిన వారు కదని అన్ని పార్టీలకు చెందివారు ఉన్నారని, కుంభకోణం ప్రభుత్వం విచారణ జరుపుతోందని టీడీపీ నేత సాంబశివరావు, టీఆర్ఎస్ నేత గోవర్ధన్ రెడ్డి తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

07:55 - June 12, 2017

విద్యసవంత్సరం ప్రారంభమనగానే విద్యార్థులకు అనేక సమస్యల ఎదురౌతున్నాయి. టీఆర్ఎస్ తన ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానలు అమలు చేయడంలో విఫలం చెందింది. సమస్యల వలయంలో ప్రభుత్వ విద్యరంగము ఉన్నదని, మరో పక్క ప్రైవేట్ స్కూల్స్ దొపిడీ ఉందని తెలంగాణ ఎస్ఎఫ్ఐ కార్యదర్శి రమేష్ అన్నారు పూర్తి వివరాలు వీడియో చూడండి.

 

07:53 - June 12, 2017

లండన్ : ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ సెమీస్‌కు చేరింది. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 192 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్‌ 38 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ తక్కువ స్కోరుకే వెనుదిరిగినప్పటికీ.. ధావన్‌ 78, కోహ్లీ76, యువరాజ్‌సింగ్‌ 23 పరుగులతో రాణించి భారత్‌కు విజయాన్ని అందించారు. అంతకుముందు భారత బౌలింగ్‌ దాటికి సఫారీలు 44.3 ఓవర్లలో 191 పరుగులకు అలౌటయ్యారు. భారత్‌ సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది.

 

07:51 - June 12, 2017

ఖమ్మం : కొత్త విద్యాసంవత్సరం ఆరంభమవుతున్నా .. ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల లేమి విద్యార్థులను వెక్కిరిస్తోంది. ప్రతి ఏడాది ఇవే సమస్యలు ఎదురువుతున్నా ..విద్యాశాఖాధికారులు మాత్రం పాఠం నేర్వడంలేదు. తాగునీరు, మరుగుదొడ్లు, అవసరాలు తీర్చటంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 504 మరుగుదొడ్లు నిర్మించాలని, 1016 పాఠశాలల్లో మరుగుదొడ్లకు నీటి సౌకర్యం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పాఠశాలలు తెరిచిన కనీసం 50 శాతం కూడా పూర్తయ్యే పరిస్థితి కన్పించటం లేదు.

ఉపాధి హామీ ద్వారా గదుల నిర్మాణం
ఉపాధిహామీ ద్వారా 231 వంట గదుల నిర్మాణం పూర్తిచేయాలని.. పాఠశాలలు ప్రారంభంనాటికి వీటిని అందుబాటులోకి తెస్తామని గొప్పగా చెప్పిన అధికారులు..ఇంక మొద్దునిద్రలోనే ఉన్నారు. కొన్నిచోట్ల నిర్మాణాలు ప్రారంభంకాకపోగా, మరికొన్ని పాఠశాలల్లో నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో మళ్లీ చెట్ల కిందనే మధ్యాహ్న భోజనం వంట చేసే పరిస్థితులునెలకొన్నాయి. ఇక యూనిఫాంల సంగతి సరేసరి.. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా విద్యాసంవత్సరం ముగింపువరకు దుస్తులు వచ్చే అవకాశాలు కనిపించడంలేదు. గత ఏడాదంతా యూనిఫాం లేకుండానే విద్యార్థులు స్కూల్‌కు వెళ్లారు. అయితే ఈ ఏడాది సకాలంలోనే యూనిఫాం అందిస్తామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నా.. ఆచరణలో మాత్రం అంత ఉత్సాహం కనిపించడంలేదు.

శిథిలావస్తకు స్కూల్ భవనాలు
ఉమ్మడి ఖమ్మంజిల్లాలో శిథిలావస్తకు చేరుకున్న స్కూల్‌ బిల్డింగ్‌లు ఎపుడు కూలతాయోకూడా తెలియని పరిస్థితి నెలకొంది. రాజీవ్‌ విద్యామిషన్‌, రాజీవ్‌ మాధ్యమిక శిక్షా అభియాన్‌ పథకాల ద్వారా 2014లో ప్రారంభించిన అదనపు తరగతి గదుల నిర్మాణం ఇంకా కొన్ని మండలాల్లో పూర్తి కాలేదు. బిల్లులు రావటం లేదని గుత్తేదారులు చెబుతూ అసంపూర్తి నిర్మాణాలను వదిలేశారు. దీంతో రూ.కోట్లలో నిధులు ఖర్చవుతున్నా విద్యార్థులకు మాత్రం సౌకర్యాలు అందుబాటులోకి రావడం లేవు. ఇక గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు ఉచితంగా భోజనం, నివాస వసతిని కల్పించే గిరిజన సంక్షేమ , ఆశ్రమ పాఠశాలలు కూడా సమస్యలతో సతమతమవుతున్నాయివిద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు కరవవుతోంది. పాఠశాలలో ఏర్పాటుచేసిన శుద్ధజల ప్లాంట్లు మొరాయించడంతో కలుషిత నీటినే తాగాల్సి వస్తోంది. విద్యార్థులు స్నానం చేయడానికి కాలకృత్యాలు తీర్చుకోడానికి, ఇతర అవసరాల కోసం ఏర్పాటుచేసిన కుళాయిలు పనిచేయడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వ పాఠశాలల దుస్థితిపై అధికారులు మొద్దునిద్ర మానుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పేదపిల్లలు చుదువుకునే సర్కార్‌ స్కూళ్లలో సమస్యలు తొలగించడకుంటే .. పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నాయి. 

07:49 - June 12, 2017

హైదరాబాద్ : వేసవి సెలవుల్లో ఆటపాటలతో హాయిగా పడిని విద్యార్థులంతా ఇప్పుడు మళ్లీ బడిబాట పట్టారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు ఇవాళ్టి నుంచి పునఃప్రారంభమవుతున్నాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్‌ 24 నుంచి వేసవి సెలవులు ప్రకటించాల్సి ఉంది. కానీ ఉష్ణోగ్రతల తీవ్రతతో నిర్ణీత గడువుకు ఐదు రోజుల ముందే అంటే ఏప్రిల్‌ 16 నుంచే సెలవులు ఇచ్చారు. వేసవి సెలవుల్లో ఒక్కసారిగా మూలన పడేసిన స్కూలు బ్యాగ్‌లకు బాలల తల్లిదండ్రులు దమ్ముదులుపుతున్నారు. కొత్త పుస్తకాలు, యూనిఫారాలు కొని పిల్లలకు స్కూలుకు పంపేందుకు సిద్ధం చేస్తున్నారు. వాటర్‌ బాటిళ్లు, టిఫిన్‌, లంచ్‌ బ్యాంకులకు పట్టిన బూజు దులుపుతున్నారు. వేసవి సెవుల్లో హాయిగా అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు, మామయ్యలతో గడిపి పిల్లలు... ఇప్పుడు ఒక్కసారిగా స్కూలుకు వెళ్లాలంటే మారాయం వేయడం సహజం అటువంటి వారికి నయాన నచ్చచెప్పో, భయన బెదిరించే పాఠశాలలకు పంపేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతకాలం అర్థరాత్రి వరకు టీవీలు చూస్తూ ఆలస్యంగా పడుకుని ఉదయం పొద్దెక్కిన తర్వాత నిద్రలేవడానికి అలవాటు పడిన పిల్లలను ఇప్పుడు ఉదయం నిద్రలేపడం కుటుంబ సభ్యులకు కొద్దిగా కష్టంగా బండెడు పుస్తకాలు, నోట్‌ బుక్‌, వాటల్‌ బాటిల్‌, టిఫిన్‌, లంచ్‌ బాక్స్‌లు చిన్నారులకు మోయలేని భారంగా మారాయి. కిక్కిరిసిన ఆటోలు, వ్యాన్లతో మళ్లీ కుస్తీ పట్టాల్సి వస్తోంది. ప్రైవేటు స్కూళ్లలో అసలుకే ఫీజుల మోత, ఆపై వర్క్‌ షీట్లు, క్రేయాన్స్‌, మ్యాప్‌లు... ఇలా అన్నింటినీ ఒక్కసారే కొనాల్సి వస్తోంది. తల్లిదండ్రులకు ఇది భారంగా మారింది. బిడ్డల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఎంత ఖర్చుకైనా వెనకాడకుండా అప్పోచొప్పోచేసి... అన్నింటిని సమకూరుస్తున్నాయి.

అంగడి సరకుగా విద్య...
విద్య అంగడి సరకుగా మారింది. వ్యాపార వస్తువుగా మారింది. ప్రమాణాలు లేకపోయినా విద్యాసంస్థల పేరుచెప్పుకుని తల్లిదంద్రుడు ముక్కుపిండి మరీ ఫీజులు వసూలు చేస్తున్నాయి. బోధన వేరు, బోధనేతర వ్యాపకాలు వేరు. ఈత, నృత్యం, పాటలు, పెయింటింగ్‌, గేమ్స్‌, కరాటే, డిజిటల్‌ క్లాసులంటూ ప్రత్యేకంగా ఫీజులు గుంజుతున్నాయి. బోధనేతర అంశాలు కేవలం ఐచ్ఛికం అంటూనే ఆస్తకి ఉన్న వాటిలో ఏదో ఒక అంశాన్ని ఎంచుకునే విధంగా తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నాయి. క్రీడా మైదానాలు లేకపోయినా ఫీజులు మాత్రం తప్పడంలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫీజులపై నియంత్రణ లేకపోవడంతో ఎవరికి ఫిర్యాదు చేసిన ప్రయోజనం ఉండటంలేదని నిట్టూరుస్తున్నారు. పేదలకు దిక్కైన ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దయనీయంగా ఉంది. బాలబాలికలు చదువుకు అవసరమైన కనీస సౌకర్యాలు లేవు. శిథిలావస్థకు చేరుకున్న భనాల్లోనే చదువులు కొనసాగించాల్సిన దుస్థితి దాపురించింది. పైకప్పులు సరిగాలేని స్కూళ్లలో సూర్యడితో సహవాసం చేయాలి. వర్షం వస్తే తడిచి ముద్దవ్వాలి. చలికి వణికిపోయవాలి. ఎండకు ఎండాలి. ఇప్పటికే చెట్ల కింది బోధన జరిగే ప్రభుత్వ స్కూళ్లు లేకపోలేదు. సమస్యల తోరణాలు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్వాగతం పలుకుతుంటే, ఫీజుల మోతతో ప్రవేటు స్కూళ్ల యాజమాన్యాలు దోచుకుంటున్నాయన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. 

07:47 - June 12, 2017

హైదరాబద్ : తెలంగాణలో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికి కౌన్సెలింగ్‌ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేటి నుంచి ఈనెల 21 వరకు వెబ్‌ కౌన్సెలింగ్‌ చేపడతారు. జనరల్‌ అభ్యర్థులకు 21 కేంద్రాలు, ఎస్సీలకు పది కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎంసెట్‌లో విద్యార్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా కౌన్సెలింగ్‌కు పిలుస్తున్నారు. ఏయే ర్యాంకులవారు ఏయే కేంద్రాల్లో హాజరుకావచ్చన్న వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. గ్రేటర్‌లో ఐదు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈస్టు మారేడుపల్లిలోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రిటింగ్‌ అండ్‌ టెక్నాలజీ, పాతబస్తీలోని క్యూ క్యూ పాలిటెక్నికల్‌ కాలేజీ, రామంతాపూర్‌లోని ప్రభుత్వ పాలిటెక్నికల్‌ కళాశాల, కూకట్‌పల్లిలోని జేఎస్‌టీయూ అడ్మిషన్ల విభాగం, మాసాబ్‌ ట్యాంక్‌లో ఉన్న సాంకేతిక విద్యాభవన్‌లో హెల్ప్‌లైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

సరైన ధృవపత్రాలు...
కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులు వెయ్యి రూపాయలు, ఎస్సీ, ఎస్టీలు 500 రూపాయలు నగదు రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. కౌన్సెలింగ్‌కు హారజయ్యే అభ్యర్థుల వెంట ఒక సహాయకుణ్ని అనుమతిస్తారు. తెలంగాణ ఎంసెట్‌ రాసిన ఏపీ విద్యార్థులు స్థానికేతర కోటాలో కౌన్సెలింగ్‌కు హాజరుకావచ్చు. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు ఎంసెట్‌ ర్యాంకు కార్డుతోపాటు హాల్‌ టికెట్‌, ఆధార్‌ కార్డు, ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌ మార్కులు జాబితాలు, ఆరోతరగతి నుంచి ఇంటర్‌ వరకు స్టడీ సర్టిఫికెట్లు, టీసీ వెంట తెచ్చుకోవాలి. అలాగే ఈ ఏడాది జనవరి 1 తర్వాత జారీ చేసిన ఆదాయ, కుల ధృవీకరణ పత్రాలు, ఎన్‌సీసీ, క్రీడల సర్టిఫికెట్లు ఉంటే తెచ్చుకోవాలి.

16 నుంచి వెబ్ ఆప్షన్లు
ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాలకు వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. ఈనెల 16 నుంచి 22 వరకు వెబ్‌ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. మొదటి పెట్టుకున్న ఆప్షన్‌లో కాలేజీ మార్చుకోడానికి ఈనెల 22,23 తేదీల్లో అవకాశం కల్పించారు. మొదటిదశలో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైన విద్యార్థులకు ఈనెల 28న సీట్లు కేటాయిస్తారు. వచ్చే నెల 3 నుంచి తరగలు ప్రారంభమవుతాయి. కౌన్సెలింగ్‌కు పకడ్బందీ ఏర్పాటు చేశారు. 

07:45 - June 12, 2017

చిత్తూరు : చిత్తూరు జిల్లా తిరుపతిలో మహాభారతం అందరిది దళితులపై వివక్షను ఎదుర్కొందాం అంశంపై సంఘీభావ సదస్సు నిర్వహించారు.. జిల్లాలో ఏటా జరిగే మహాభారత ఉత్సవాల్లో దళితుల పట్ల వివక్షకు వ్యతిరేకంగా మహాభారత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటైంది. లౌకిక భారత దేశంలో ప్రభుత్వం ఏ మత విధానాలనూ ప్రోత్సహించొద్దని.. అలా చేయడం రాజ్యాంగ వ్యతిరేకం అవుతుందని కర్నాటక హైకోర్టు రిటైర్డ్ జడ్జి నాగమోహన్‌ దాస్ అన్నారు.. అయితే దురదృష్ట వశాత్తూ నేడు అదే జరుగుతోందని చెప్పారు.

కులవివక్షకు వ్యతిరేకంగా
కులవివక్షకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో తమ వంతు పాత్ర పోషిస్తామని... రాయలసీమ తూర్పు ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.. కులవివక్ష అనేది కేవలం దళితులకు మాత్రమే సంబంధించిన సమస్య కాదని చెప్పారు..ఈ కార్యక్రమంలో విఠపు బాలసుబ్రమణ్యం, మహాభారత హక్కుల కమిటీ కన్వినర్‌ కొత్తపల్లి సుబ్రమణ్యం, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర కార్యదర్శి అండ్ర మాల్యాద్రి, సీపీఎం నేత వీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.. మహాభారతం అందరిదీ.. ఇక్కడ జరుగుతున్న వివక్షను రూపుమాపేందుకు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని సదస్సులో తీర్మానించారు.. అంటరానితరానికి వ్యతిరేకంగా ఉంటామంటూ సభికులతో ప్రతిజ్ఞ చేయించారు. సదస్సు ప్రారంభానికి ముందు మహాభారతం ప్రదర్శన సభకులను అలరించింది.

07:44 - June 12, 2017

అనంతపురం : అనంతపురంలోని కక్కలపల్లి పంచాయితీలో వైసిపి రాప్తాడు నియోజకవర్గ ప్లీనరి సమావేశం జరిగింది. రాప్తాడు నియోజకవర్గ ఇన్చార్జ్ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆద్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ప్రజలకు మాయ మాటలు చెప్పి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని..మూడేళ్లలో సాధించిందేమీ లేదన్నారు. ఇప్పటివరకు రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ విడుదల చేయలేదన్నారు. సీఎం చంద్రబాబు అనంతపురం జిల్లాకు 14 సార్లు వచ్చినా జిల్లా అభివృద్ధికి చేసిందేమి లేదని ఆరోపించారు ప్రకాష్‌రెడ్డి. 2019 ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డిని సీఎంను చేస్తే రాజన్న రాజ్యం వస్తుందని ప్రజల అన్ని సమస్యలు తీరుతాయన్నారు. 

07:36 - June 12, 2017

చిత్తూరు : టీడీపీకి తొత్తులుగా మారిన కొందరు ప్రభుత్వ అధికారులు, ఉద్యోగలపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నారని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఏపీ ఎన్జీవోల సంఘం నేతలు అశోక్‌బాబు, సాగర్‌ తెలుగుదేశం కుటుంబ సభ్యులుగా మారిపోయారని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ పార్టీ నేతలు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన అధికారులను క్షమించి విడిచిపెట్టబోమని మరోసారి స్పష్టం చేశారు.  

07:35 - June 12, 2017

హైదరాబాద్ : రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు... ఇలా ప్రజా సమస్యలపై పోరాటులు చేసిన టీ జేఏసీ ఇప్పుడు మరో ఉద్యమానికి సిద్ధమైంది. టీఆర్‌ఎస్‌ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించాలని నిర్ణయించారు. తెలంగాణ సిద్ధించి మూడేళ్లు పూర్తైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో ఏర్పాటైన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అధికారంలో మూడేళ్లు ముగిశాయి. అయినా ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరలేదన్నది టీజేఏసీ అభిప్రాయం. ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్రుల పాలనకు, ప్రస్తుత టీఆర్‌ఎస్‌ పాలనకు పెద్దగా తేడా లేదన్నది వీరి వాదన. కాంట్రాక్టర్లకు దోచిపెట్టే విధానాలనే అవలంభిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీజేఏసీ నిర్ణయించింది. ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా పాలిస్తున్నముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు టీజేఏసీ నేతలు సిద్ధమవుతున్నారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజలను చైతన్యపరిచే లక్ష్యంతో కోదండరాం తెలంగాణ అమరులు స్ఫూర్తియాత్ర తలపెట్టారు.

భూ కుంభకోణలపై..
ఈమధ్యకాలంలో భూకుంభకోణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న అంశాన్ని టీజేఏసీ ప్రస్తావిస్తోంది. అధికార పార్టీ నేతలపై ఆరోపణలు వస్తున్నాయి. వేల కోట్ల రూపాయల విలువచేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్న విషయాన్ని గుర్తు చేస్తోంది. అధికార పార్టీ నేతల అండదండలతో ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు గద్దల్లా తన్నుకుపోతున్నా పాలకులు ఉదాసీనంగా ఉండటాన్ని టీజేఏసీ నేతలు తప్పుపుడుతున్నారు. కబ్జాకోరులు రాబందుల్లా సర్కారు భూములపై వాలిపోతున్నా అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ వైఖరి ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని టీ జేఏసీ నేతలు నిర్ణయించారు. ఈ వ్యవహారంపై రౌండ్‌టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. భూకుంభకోణంపై హైకోర్టు ప్రస్తుత న్యాయమూర్తితో విచారణ జరిపించాలని టీజేఏసీ డిమాండ్‌ చేస్తోంది. ప్రభుత్వ పెద్ద అండతోనే మియాపూర్‌ భూకుంభకోణం జరిగిందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సీఐడీ దర్యాప్తు కంటితుడుపు చర్యే అన్నది టీ జేఏసీ నేతల విమర్శిస్తున్నారు. సీఐడీ దర్యాప్తు అన్ని దశల్లోనూ ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు టీఆర్‌ఎస్‌ సర్కారు నిజాయితీతో న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్‌ చేస్తున్నారు. గ్యాంగ్‌స్టర్‌ నయూంతో రాజకీయ నేతలు మిలాఖత్‌ అయినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ... డైరీని బహిర్గతం చేయాలని కోరుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి అనుమానాలకు తావిస్తోందని టీజేఏసీ నేతలు విమర్శిస్తున్నారు.

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ పై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, నిరుద్యోగులను అయోమయం చేస్తోందన్న విషయాన్ని టీజేఏసీ నేతలు ప్రస్తావిస్తున్నారు. గ్రూప్ 2 నిర్వహణ అస్తవ్యస్తంగా మారిన అంశాన్ని గుర్తు చేస్తున్నారు. ఓఎంఆర్‌ షీట్ల దిద్దుడు, ఒకే సెంటర్‌లో ఒకే గదిలో పరీక్ష రాసిన అభ్యర్థులకు వరుస ర్యాంకులు రావడాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ విషయాల్లో అభ్యర్థులు లేవనెత్తుతున్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత అటు టీఎస్‌పీఎస్‌సీతోపాటు, ఇటు ప్రభుత్వంపైనా ఉందంటున్నారు. ఇక రైతు సమస్యలపైనా ప్రభుత్వం స్పందిస్తున్న తీరును టీ జేఏసీ తప్పుపడుతోంది. నాలుగో విడత రుణమాఫీ పూర్తి చేయాలని టీ జేఏసీ కోరుతోంది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తోంది. విఫణి శక్తులు విజృంభణతో, మార్కెట్‌ మాయాజాలంలో చిక్కుకుని అన్నదాతలు అడ్డకొత్తెరలో పోకచక్కలా నలిగిపోతున్నా ప్రభుత్వ ధోరణి మారని విషయాన్ని టీజేఏసీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఉద్యమం ద్వారా సాధించిన తెలంగాణాలో ప్రజల భాగస్వామ్యం లేకుండానే పాలన జరుగుతోందని టీజాక్ చైర్మన్ కోదండరాం ప్రభుత్వ తీరును ఎండగట్టారు. తెలంగాణా, ఎపీల మధ్య విద్యుత్ కొనుగోళ్లు నిలిచి పోవడం మంచిదేనన్న అభిప్రాయాన్ని జేఏసీ వ్యక్తం చేసింది. ప్రస్తుత్తం ఉన్న విద్యుత్ కోనుగోళ్ల ఒప్పందాలను రద్దు చేయాలన్న డిమాండ్‌ను ముందుకు తెచ్చింది. ప్రభుత్వం అమలు చేస్తన్న మిషన్ భగీరథ పై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని టీజేఏసీ నిర్ణయించింది. మొత్తంమీద టీజేఏసీ నేతల తీరు చూస్తుంటే టీఆర్‌ఎస్‌ సర్కారుపై యుద్ధం ప్రకటించినట్టుగా ఉందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. 

మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి అనుచరులతో భేటీ

కర్నూలు : మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి తన అనుచరులతో భేటీ అవుతున్నారు. నేడు గోస్పాడు మండల కార్యకర్తలో శిల్పా సమావేశం కానున్నారు. 

నేడు బెంగళూరులో రాహుల్ గాంధీ పర్యటన

కర్ణాటక : నేటి నుంచి బెంగళూరులో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. దక్షిణాది రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులతో రాహుల్ భేటీ కానున్నారు. 

నేడు కర్నూలులో లలితా సంగమేశ్వరం కల్యాణోత్సవం

కర్నూలు : నేడు కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరంలో లలితా సంగమేశ్వర కల్యాణక్షత్సవం జరగనుంది. 

నేటి నుంచి బడిపిలుస్తోంది విద్యావారోత్సవాలు

విశాఖ : ఏపీలో నేటి బడిపిలుస్తోంది విద్యావారోత్సవాలు విశాఖలోని ఎండాడ ప్రభుత్వస్కూల్ లో మంత్రి గంటా శ్రీనివాస్ ప్రారంభించనున్నారు. 

నేడు విశాఖలోని ఆసైన్డ భూములను పరిశీలించనున్న అఖిలపక్షం

విశాఖ: నేడు విశాఖలోని ముదపాక ఆసైన్డ్ భూములను అఖిలపక్షం పరిశీలించనున్నది. 

Don't Miss