Activities calendar

13 June 2017

21:23 - June 13, 2017

హైదరాబాద్: సినారే రూపంలో తెలుగు జాతి ఒక అత్యున్నత సాహితీవేత్తను కోల్పోయిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. సినారె జీవితాంతం ఉన్నతమైన సంప్రదాయాలతో ముందుకెళ్లారని కొనియాడారు. తాను సినారెను కలిసినప్పుడు ఎంతో ఆప్యాయత, అనురాగంతో పలకరించేవారని గుర్తు చేసుకున్నారు. మా కుటుంబం గొప్ప ఆప్తుడిని కోల్పోయిందని, సినారె మృతి దేశానికి, సాహితీలోకానికి తీరనిలోటని చంద్రబాబు అన్నారు. సినారె పార్దీవదేహానికి చంద్రబాబు నివాళులు అర్పించారు. సినారె స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 

21:20 - June 13, 2017

హైదరాబాద్: ప్రజల ప్రాణాలతో ప్రైవేట్‌ బస్సుల మాఫియా చెలగాటమాడుతోందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వం విడుదల చేసిన సర్క్యులరే ఇందుకు నిదర్శమన్నారు. బుధవారం సీజ్‌ చేసిన బస్సుల నంబర్లు పంపిస్తామని అరుణాచల్‌ ప్రదేశ్‌ అధికారులు చెప్పారన్నారు. తెలంగాణలో అరుణాచల్‌ ప్రదేశ్‌ బస్సులు నడిచేందుకు వీలులేదన్నారు. ఇదే అంశంపై తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ కార్యదర్శి సునీల్‌శర్మను కలిశారు. అక్రమ పద్దతిలో తెలంగాణలో బస్సులు నడిస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. 

21:18 - June 13, 2017

హైదరాబాద్: సింగరేణి యాజమాన్యంతో కార్మిక నేతల చర్చలు విఫలమయ్యాయి. కొద్దిసేపటి క్రితం జరిగిన చర్చలు విఫలమవడంతో.. సమ్మె తప్పడం లేదు. ఎల్లుండి నుంచి సింగరేణి కార్మికులు సమ్మె సైరన్‌ మోగించనున్నారు. సమ్మెలో సిఐటియు, ఎన్ టియుసి, ఎఐటియుసి, హెచ్ఎంఎస్, బిఎంఎస్ పాల్గొంటున్నాయి. సంస్థలో వారసత్వ ఉద్యోగాలు కల్పించాలన్నది కార్మిక సంఘాల ప్రధాన డిమాండ్. 

20:41 - June 13, 2017

హైదరాబాద్: బడిగంట మోగింది...బండెడు పుస్తకాలు, బరువైన ఫీజులు.. కొత్త బట్టల హడావుడి.. ఓవరాల్ గా కొంత సందడి.. అంతులేని ఒత్తిడి. చదువు వ్యాపారంగా మారిన తెలుగు రాష్ట్రాల్లో జూన్ నెల అంటేనే వణికిపోవాల్సిందే. నెల నెలా వుండే రెగ్యులర్ ఖర్చులతో పాటుగా అదనంగా వచ్చే స్కూల్ ఫీజులు, ఈ డొనేషన్స్ కోసం పేరెంట్స్ పడే యాతన అంతా ఇంతా కాదు. మరి ఈ ఫీజులూం ఎన్నాళ్లు? చదువు ఎందుకు అందనిదైపోతోంది. విద్య వ్యాపారంగా నిలిచిపోవాల్సిందేనా? ఈప్రైవేటు విద్యా సంస్థలు, కార్పొరేట్ స్కూళ్ల దోపిడీ ఇంకా కొనసాగవలసిందేనా? ఇదే అంశం పై నేటి వైడాంగిల్. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

20:33 - June 13, 2017

ముంబై : రైతుల ఆందోళన నేపథ్యంలో మహారాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. తాత్కాలిక సహాయంగా రైతులకు 10 వేల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. రుతుపవనాలు రాకతో వ్యవసాయ పనులు ప్రారంభం కావడంతో తక్షణమే రైతులకు ఈ రుణాలు ఇవ్వాలని ఫడ్నవిస్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 31 లక్షల మంది చిన్నరైతులకు లాభం చేకూరనుంది. మరోవైపు మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. రెండురోజుల క్రితం అకోలాలో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బ్యాంకులో 40 వేలు రుణం తీసుకుని ఉల్లి సాగు చేయగా నష్టం వాటిల్లడంతో ఆ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహారాష్ట్రలో జూన్‌ 1 నుంచి ఇప్పటివరకు ఆరుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.

20:12 - June 13, 2017

కడప : జిల్లా సిద్దవటం మండలం వన్ మాధవరం గ్రామానికి చెందిన పేరూరు సుబ్బలక్షుమ్మ తన భర్త పెంచలయ్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తెతో జీవనం సాగిస్తుండేది...కూలీ పని చేసే పెంచలయ్య ప్రమాదానికి గురై ఏ పని చేసేందుకు వీలు లేక పోవడంతో కుటుంభ పోషణ బారం సుబ్బలక్షుమ్మ మీద పడింది. పిల్లలను, భర్తను పోషించుకునేందుకు మరోసారి గల్ఫ్ కు వెళ్లాలని నిర్ణయించుకుంది...

ఏజెంట్‌ మాటలు నమ్మిన అమాయకురాలు..

కడప జిల్లాలోని ఎజెంటు వెంకటేష్, ప్రొద్దుటూరుకు చెందిన గౌస్ పీర్, ఎర్రగుంట్లకు చెందిన జిలానీలు ఆమె కష్టాలు విని మాయమాటలు చెప్పి సౌదిలోని మరో ఎజెంట్ ద్వారా 80 వేలు తీసుకుని దుబాయికంటూ చెప్పి సౌదీకి పంపారు...ఇదే సమయంలో సౌదీలో షేక్‌ ఇంట్లో పనిచేసేందుకు ఒప్పందం చేసుకున్నవారు అతని నుంచి రెండున్నరలక్షలు తీసుకున్నారు...ఆ తర్వాత సుబ్బలక్ష్మమ్మను అప్పగించారు...

పనిలో చేరిన సుబ్బలక్ష్మి...

ఏజెంట్ల గోల్‌మాల్‌ తెలియని సుబ్బలక్ష్మమ్మ వారు చెప్పినట్లుగా సేఠ్‌ ఇంట్లో పనికి చేరింది..నెల రోజుల తర్వాత ఆమె అనారోగ్యానికి గురికావడంతో గదిలో బంధించిన సేఠ్ నానా రకాలుగా హింసించారు...డబ్బు ఇస్తేనే ఇండియాకు పంపిస్తామంటూ చెప్పి బందీని చేశారు...

నెలల కొద్దీ గదిలోనే ఒంటరిగా...

నెలల తరబడి గదిలో బందీగా ఉన్న సుబ్బలక్ష్మమ్మ అక్కడే పని చేస్తున్న వేరోకరి సాయంతో తాను పడుతున్న కష్టాలను వాట్సప్ ద్వారా తన భర్త కు చేర వేసింది. దీంతో సుబ్బలక్షుమ్మ భర్త సిద్దవటం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పిర్యాదును స్వీకరించిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గల్ఫ్ కు పంపిన ఎజెంట్లను పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో ఎజెంట్ల బాగోతం బయటపడింది. దీంతో సౌదిలో వున్న ఎజెంటు పోలీసులు తనపై కూడా కేసులు నమోదు చేస్తారేమోనని భయంతో అతను తీసుకున్న నగదును సేట్ కు చెల్లించి ఆమెను తిరగి ఇండియాకు పంపించారు. మోసపోయిన సుబ్బలక్షుమ్మను తమ ఇంటికి చేర్చామని, మోసగించిన ఎజెంట్లపైన కేసులు నమోదు చేసి మరో కరికి ఇలాంటి సంగటనలు జరగకుండా చూస్తామని రాయలసీమ డిఐజీ రమణ కుమార్ తెలిపారు..ఏజెంట్లను నమ్మి మోసపోతున్నవారెందరో ఉన్నారు...దేశం కాని దేశంలో బందీలయ్యారు.. ఉపాధి కోసం వెళ్లడం తప్పు కాదు..కాని ఏజెంట్లను నమ్మితే మాత్రం కష్టాలపాలు కావాల్సి వస్తుందని సుబ్బలక్ష్మమ్మ దీనగాథ హెచ్చరిస్తుంది...

20:09 - June 13, 2017

హైదరాబాద్: గురుకుల పాఠశాలలు చాలా గొప్పయ్...మంత్రులు మరి మీ పిల్లల్ని చేర్పిస్తారా అందులో, కొత్తగూడెం కాడ కదిలిని కొడవలి దండు...రగులుతున్న పోడు భూముల పంచాయతీ, ప్రజల అభిప్రాయం మేరకే పార్టీ జంప్...చీప్ గ కథలు చెప్తున్న శిల్పా మోహనుడు, ఆంధ్రలో ఆశా బిడ్డల ఆందోళనలు...పట్టించుకుంటున్నా చంద్రాలు, 68 ఏళ్లు వున్నా ఫించను ఇస్తలేరు...కామారెడ్డి కాడ పెద్ద మనిషి నిరాహార దీక్ష, ఆర్టీసీ బస్సు ఎక్కొద్దంటున్న డ్రైవర్...ఆక్యుపెన్సీ పెంచమంటున్న సంస్థ ఇలాంటి అంశాలతో మల్లన్న ముచ్చట్లు కార్యక్రమంలో మల్లన్న మన ముందుకు వచ్చాడు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

20:00 - June 13, 2017

యాదాద్రి భువనగిరి : తుర్కపల్లి మండలంలో భూమి కోసం రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో నలుగురుకు గాయాలయ్యాయి. వారంతా భువనగిరి ఏరియా ఆస్పత్రిలో చిరిత్స పొందుతున్నారు. తమ భూమిని సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో...కావాలనే దాడి చేశారని భూ యజమాని నర్సయ్య అన్నారు. 1990లో ఆ భూమిని కొనుగోలు చేశామని.. దానికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని అన్నారు.   

19:57 - June 13, 2017

హైదరాబాద్ : స్టార్‌ మా ఛానల్‌ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లోని స్టార్ మా ఛానల్ కార్యాలయంలోని 4వ అంతస్థులో షార్ట్ సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో దట్టంగా పొగలు వ్యాపించడంతో అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందించారు. అగ్నిమాపక వాహనాలు ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పాయి. దీంతో బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లో కాసేపు ట్రాఫిక్ స్థంబించిపోయింది. 

19:53 - June 13, 2017

పశ్చిమగోదావరి : జిల్లా తణుకులో విత్తన షాపులపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. రెండు దుకాణాల్లో సుమారు 7 లక్షల విలువైన విత్తనాలు సీజ్ చేశారు. బిల్లులు లేకుండా అక్రమంగా నిల్వ ఉండటంతో అధికారులు సీజ్ చేశారు. ఇతర షాపుల్లోనూ విజిలెన్స్ తనిఖీలు కొనసాగుతున్నాయి. 

19:51 - June 13, 2017

అమరావతి: అర్థరాత్రి నుంచి ఏపీలో సుమారు 900 ప్రైవేట్ బస్సులు నిలిచిపోనున్నాయి. సీఎం చంద్రబాబుతో రవాణాశాఖ ఉన్నతాధికారుల భేటీలో... దీనిపై నిర్ణయం తీసుకున్నారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లో రిజిస్ట్రర్ అయిన ట్రావెల్స్‌ బస్సుల రిజిస్ట్రేషన్లను అక్కడి ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఏపీలో సర్వీసులు నడిపితే ఈ బస్సులను సీజ్‌ చేయాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. ఈ అర్ధరాత్రి నుంచి బస్సుల సీజ్‌కు రవాణాశాఖ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసింది. 13 జిల్లాల రవాణాశాఖ అధికారులకు రవాణాశాఖ కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు.  

19:49 - June 13, 2017
19:47 - June 13, 2017

ఢిల్లీ : రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై అన్ని రాజకీయ పక్షాలతో...మాట్లాడి మద్దతు కోరాలని బీజేపీ నిర్ణయించింది. కేంద్ర కేబినెట్‌లో సీనియర్ మంత్రి వెంకయ్య నాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ విషయంలో ఇతర పార్టీల నుంచి సలహాలు ఏమైనా ఉంటే తీసుకుంటామని... వీలైనంత వరకు ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రయత్నిస్తున్నామని : వెంకయ్య నాయుడు తెలిపారు. ఈనెల 18 నుంచి రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై అన్ని పార్టీలతో చర్చలు జరుపుతామన్నారు. 

19:45 - June 13, 2017

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ పేదలకు లక్షా 93 వేల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ అమరావతిలో పట్టణ గృహ నిర్మాణంపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. పట్టణ ప్రాంతాల్లో సొంత స్థలం ఉన్నవారికి రెండున్నర లక్షల సబ్సిడీ, భూమి లేనివారికి 3లక్షల సబ్సిడీ ఇవ్వనున్నట్టు మంత్రి నారాయణ తెలిపారు. జీ-ప్లస్ 3 విధానంలో మూడు రకాల విస్తీర్ణంలో షేర్‌వాల్‌ టెక్నాలజీృతో ఇళ్ల నిర్మాణం చేపటతామని ఆయన ప్రకటించారు.

19:43 - June 13, 2017

విశాఖ : జిల్లా పెందుర్తి మండలం ప్రహ్లాదపురంలో దారుణం వెలుగుచూసింది. ఓ ఇంట్లో రామలక్ష్మి అనే వృద్ధురాలిని హత్య చేసిన దుండగులు... బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆ ప్రాంతంలో విషాధ ఛాలయలు నెలకొన్నాయి.

19:39 - June 13, 2017

ఘంటశాల : కృష్ణా నదిలో మనం ఇప్పటి వరకు ఇసుక మాఫియా, మట్టి మాఫియా గురించి విన్నాం. కాని రోడ్డు మాఫియా గురించి మీరెప్పుడైనా విన్నారా. కృష్ణా జిల్లాలోని కృష్ణానదిలో ఇప్పుడు రోడ్డు మాఫియా రెచ్చిపోతోంది. ఘంటసాల మండలంలోని శ్రీకాకుళం - గాజుల్లంక గ్రామాల మధ్య ఎలాంటి అనుమతులు లేకుండా కొంతమంది ప్రైవేట్‌ వ్యక్తులు రోడ్డు వేశారు. ఈ రోడ్డుకు లక్షల్లో ఖర్చు చేశామంటూ.. వాహనదారుల నుంచి దోపిడీకి తెరతీశారు. ప్రతిరోజూ ఈ దారిగుండా వెళ్లే వాహనదారుల నుంచి బలవంతంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. బైక్‌కు 30 రూపాయాలు, కారుకు 100, లారీకి 200 చొప్పున ముక్కుపిండిమరీ వసూళ్లకు తెగబడుతున్నారు. దీంతో వాహనాలదారులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా అధికారుల నుంచి ఎలాంటి స్పందనలేకపోవడంతో ఈ రోడ్డు మాఫియా మరింతగా బరితెగించింది. రోజూ లక్షలాది రూపాయలను దండుకుంటోంది. వచ్చిన డబ్బులతో రాత్రిపూట కృష్ణా నదిలోనే విందులు చేసుకుంటున్నారు. దీంతో నదినిండా మద్యం సీసాలే దర్శనమిస్తున్నాయి. ఇప్పటికైనా రోడ్డు మాఫియాపై అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

సీఆర్ పీఎఫ్ క్యాంపు పై ఉగ్రదాడి:9మందికి గాయాలు

జమ్మూకశ్మీర్ : త్రాల్ లో సీఆర్ పీఎఫ్ క్యాంపు పై ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో 9 మంది జవాన్లకు గాయాలు కాగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

రిజిస్ట్రేషన్ ను రద్దు చేసిన బస్సులు ఏపీలో తిరిగితే సీజ్

అమరావతి: సీఎం చంద్రబాబుతో రవాణ శాఖ ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. అరుణా చల్ ప్రదేశ్ రవాణ శాఖ రిజిస్ట్రేషన్ ను రద్దు చేసిన బస్సులు ఏపీలో తిరిగితే సీజ్ చేయాలని నిర్ణయించారు. రవాణా శాఖ ప్రత్యేక బృందాలు రాత్రి నుంచి రంగంలోకి దిగనున్నాయి. అన్ని జిల్లా రవాణ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

పెట్టుబడి గ్రంథం ప్రపంచ గతిని మార్చింది : బీవీ రాఘవులు

విజయవాడ: పెట్టుబడి గ్రంథం ప్రపంచ గతిని మార్చేసిందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు పేర్కొన్నారు. విజయవాడ ఎంబి భవన్ లో 'పెట్టుబడి గ్రంథం 150వ వార్షికోత్సవ సభ' సభ జరిగింది. ఈ సభలో ముఖ్య వక్తగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మార్క్స్ ప్రస్తావ లేకుండా పరిశోధన గ్రంథాలు రాసేవారు కాదని తెలిపారు.

19:13 - June 13, 2017

ఖమ్మం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో.. పార్కలగండికి చెందిన ఎడమ వెంకప్ప అనే గిరిజనుడిపై.. అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు దాడి చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామంలో సొంతంగా ఇల్లు కట్టుకుంటుంటే, స్థానిక ఓ మహిళ, తన కుమార్తెకు ఎమ్మెల్యేకి సంబంధం అంటగడుతూఅసహ్యపు వదంతులు సృష్టిస్తోందని, దానిపై ఎమ్మెల్యేను కలిసేందుకు వెళ్లిన తనపై ఎమ్మెల్యే విచక్షణ రహితంగా దాడి చేశారని బాధితుడు ఆరోపిస్తున్నాడు.

ఎస్టీ వర్గానికే చెందిన ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు..

ఎస్టీ వర్గానికే చెందిన ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు.. సాటి గిరిజనుడిపై దాడి చేయడాన్ని బాధితుడి కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక పోతున్నారు. పైగా, పోలీసులతో కొట్టించడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు వ్యవహారశైలి గురించి తెలియడంతో.. విపక్షాలు ఏకమయ్యాయి. బాధితుడి పక్షాన నిలుస్తూ.. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఆందోళనకు సన్నాహాలు చేస్తున్నాయి. ఎమ్మెల్యే స్థాయిలో ఉండి, నిరక్షర గిరిజనుడిపై అకారణంగా దాడి చేసిన తాటి వెంకటేశ్వర్లుపై కఠిన చర్యలు తీసుకోవాలని, విపక్ష నాయకులు, సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు. 

19:12 - June 13, 2017

హైదరాబాద్: టిఎన్ ఆర్ సైనిక్‌ అకాడమీలో శిక్షణపొందిన వారు .. మంచి ఉద్యోగాలు పొందుతున్నారని .. దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల యోజన ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మధుకర్‌బాబు అన్నారు. పీఎంకెవివై పథకంలో భాగంగా అన్‌ఆర్మ్‌డ్‌ సెక్యురిటీగార్డులుగా శిక్షణపొందిన విద్యార్థులకు ఆయన సర్టిఫికెట్లు అందజేశారు. దాంతోపాటు వారికి సెక్యురిటీ ఏజెన్సీల ద్వారా అపాయింట్‌మెంట్‌ లెటర్స్‌కూడా అందించారు. ఇప్పటివరకు టిఎన్ ఆర్ సైనిక్‌ అకాడమీలో 1450 మందికి శిక్షణ ఇచ్చినట్టు సంస్థ చైర్మన్‌ టీఎన్‌రావు అన్నారు.  

19:11 - June 13, 2017

సంగారెడ్డి : ఐఐటి జేఈఈ అడ్వాన్స్‌ ఆల్‌ ఇండియా టాప్‌ ర్యాంకర్‌ సర్వేష్‌ సంగారెడ్డి జిల్లా రుద్రారాం శ్రీగాయత్రి విద్యాసంస్థల క్యాంపస్‌కు రావడంతో...యాజమాన్యం, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. రోజుకు తాను 12 నుంచి 14 గంటలు చదివానని, వాట్సాప్‌,ఫేస్‌బుక్‌, టీవీలకు దూరంగా ఉండేవాడినని సర్వేష్ తెలిపారు. ఓ ప్రణాళిక ప్రకారం కష్టపడి చదివితే ప్రతి ఒక్క విద్యార్థి టాప్‌ ర్యాంకులు సాధించవచ్చని శ్రీగాయత్రి విద్యాసంస్థల చైర్మన్‌ మూర్తి అన్నారు. 

18:59 - June 13, 2017

సిరిసిల్ల : ప్రభుత్వ అధికారుల తీరుపై ఓ కాంట్రాక్టర్‌ అసహనానికి గురయ్యాడు. బకాయి డబ్బులు ఇవ్వకుండా తిప్పించుకోవడంతో.. విసిగిన కాంట్రాక్టర్‌ ...సబ్‌రిజిస్ట్రార్‌ భవనానికి తాళం వేశాడు. 2014లో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని 55 లక్షలతో నిర్మించే బాధ్యతను కాంట్రాక్టర్‌ నారాయణరెడ్డికి అప్పగించారు. సంవత్సరం క్రితం భవనాన్ని పూర్తి చేసిన నారాయణరెడ్డి అందించారు. అయితే 30 లక్షలు చెల్లించిన ప్రభుత్వం.. మిగతా 25 లక్షలను చెల్లించకుండా.. నారాయణరెడ్డి ముప్పుతిప్పలు పెట్టింది. దీంతో అసహనానికి గురైన.. కాంట్రాక్టర్‌.. ఇవాళ 10.30 గంటలకు సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌కు తాళం వేశాడు.  

16:44 - June 13, 2017

కరీంనగర్‌ : నగరంలో స్కూల్‌ ఫీజులకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఏఐఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు యత్నించిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. వారి నుంచి బలవంతంగా దిష్టిబొమ్మను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో విద్యార్థి నాయకులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం రాస్తారోకోకు దిగిన నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

16:42 - June 13, 2017

విశాఖ : తనను భూకబ్జాకోరంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత ఖండించారు. ఆర్ధికనేరగాడైన విజయసాయిరెడ్డి తనను భూకబ్జాకోరనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మధురవాడ, కొమ్మాది ప్రాంతాల్లో అసలు తనకు బంధువులు కూడా లేరని.. అసలు ఆ ప్రాంతం తన నియోజకవర్గమే కాదన్నారు. విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై తాను బహిరంగ చర్చకు సిద్ధమని.. మరి విజయసాయిరెడ్డి సిద్దమేనా అంటూ ఆమె సవాల్‌ విసిరారు. 

16:41 - June 13, 2017

హైదరాబాద్: రైతులకు ఎకరానికి 4 వేల రూపాయలను పెట్టుబడి కింద ఇవ్వాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న గ్రామ సమగ్ర సర్వే విజయవంతంగా సాగుతుందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. వ్యవసాయ శాఖ 2017-18 వార్షిక కార్యాచరణ ప్రణాళికను ఆయనను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా.. గ్రామ సమగ్ర సర్వేలో భాగంగా 80 శాతం రైతుల వివరాల నమోదు పూర్తైందని.. మంత్రి పోచారం చెప్పారు. త్వరలోనే గ్రామ సభలు నిర్వహించి... రైతుల వివరాలు అక్కడ ప్రకటిస్తామని.. అనంతరం రైతులకు రూ.4 వేలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే రైతులకు ఏడు లక్షల క్వింటాళ్ల విత్తనాలను సబ్సిడీపై అందిస్తున్నట్టు చెప్పారు.

16:39 - June 13, 2017

కృష్ణా : విజయవాడలోని ఐరన్‌ యార్డ్‌లో ... కూలి రేట్లు పెంచాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన ముఠా కార్మికుల సమ్మె ఏడో రోజుకు చేరుకుంది. వారి సమ్మెకు సీఐటీయూ నేతలు మద్దతు పలికారు. ముఠా కార్మికుల ఆందోళనను యాజమాన్యాలు పట్టించుకోవడం లేదని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు సీహెచ్‌ బాబూరావు ఆరోపించారు. రెండేళ్లైనా కూలిరేట్లు పెంచకపోవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం కార్మికుల పొట్ట కొట్టి యాజమాన్యాలకు వత్తాసు పలకడం సరైంది కాదన్నారు. 

16:37 - June 13, 2017

హైదరాబాద్‌ : హబ్సిగూడలో స్వామిజీ పేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి వ్యవహారం వెలుగుచూసుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన తపస్వి అలియాస్ ప్రభాకర్.. మాయమాటలతో తన వద్దకు వచ్చేవారిని మోసం చేస్తున్నాడు. తన వద్దకు వచ్చిన జలజాక్షి అనే మహిళను బురిడీ కొట్టింది... ఆమె ఆస్తులు అమ్మించాడు. డబ్బులు అడిగితే... తనకేం సంబందం లేదని చెప్పంతో... బాధితురాలు ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయని పక్షంలో సూసైడ్ చేసుకుంటానని చెబుతోంది. 

16:35 - June 13, 2017

ఢిల్లీ: కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈసారి సెలవులు గడిపేందుకు ఆయన ఇటలీ వెళ్తున్నారు. త్వరలో తన అమ్మమ్మ ఇంటికి వెళ్లబోతున్నట్లు రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌ ద్వారా వివరాలు తెలిపారు. తల్లి సోనియాగాంధీ తరఫు బంధువులతో రాహుల్‌ కొన్నిరోజులు గడపనున్నారు. కాగా గతంలో రహస్యంగా సాగిన రాహుల్ విదేశీ పర్యటనలపై అనేక ఊహాగానాలు వెల్లువెత్తడంతో ఈసారి తన పర్యటనను ముందుగానే వెల్లడించారు.

16:34 - June 13, 2017

హైదరాబాద్: బిహార్‌లో ఆర్జేడి కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. తాజాగా ఆర్జేడి చీఫ్‌ లాలుప్రసాద్‌ యాదవ్‌ ప్రభుత్వ ఖర్చుతో ఇంట్లోనే వైద్యం చేసుకుంటున్న తీరు వివాదస్పదంగా మారింది. ఆసుపత్రిలో ఉండాల్సిన ప్రభుత్వ వైద్యులు గత 10 రోజులుగా లాలూ కుమారుడు, ఆరోగ్యశాఖ మంత్రి తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ ఇంట్లోనే తిష్ట వేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, నర్సులు మంత్రి ఇంట్లోనే ఉండి లాలూకు చికిత్స చేశారు. ఈ విషయం కాస్తా బయటకు పొక్కడంతో వైద్యులు, సిబ్బంది అక్కడి నుంచి తప్పుకున్నారు. ఆరోగ్యశాఖ మంత్రి తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ ఆదేశాలను తాము ధిక్కరించలేమని ఐజీఐఎంఎస్ మెడికల్‌ సూపరింటిండెంట్ పికె సిన్హా చెబుతున్నారు. దీనిపై విచారణ జరిపించాలని బిజెపి నితీష్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది.

 

16:32 - June 13, 2017

హైదరాబాద్: ఫ్రాన్స్‌ ఎయిర్‌ షోలో విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. విన్యాసాలకు సిద్ధమైన విమానం.. ఒక్కసారిగా రన్‌పై బోల్తాపడింది. వూహించని ఈ పరిణామంతో అక్కడున్నవారంతా షాక్‌కు గురయ్యారు. విమానం టెకాఫ్‌ అవుతున్న సమయంలో ఒక్కసారిగా అది అదుపుతప్పి పల్టీకొట్టింది. నేలను బలంగా ఢీకొంది. సందర్శకులకు కొద్ది మీటర్ల దూరంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా వారంతా ఆందోళనకు గురయ్యారు. ఘటనలో విమాన పైలట్‌ గాయపడటంతో అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. 

టి.సారస్వత్ పరిషత్ భవనానికి సినారె భౌతికకాయం..

హైదరాబాద్ : రేపు ఉదయం 9 నుండి 10గంటల వరకు తెలంగాణ సౌరస్వత్ పరిషత్ భవనంలో సినారె భౌతికకాయాన్ని ఉంచనున్నారు. అనంతరం మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి.

జైట్లీకి యనమల లేఖ..

విజయవాడ : కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి ఏపీ మంత్రి యనమల లేఖ రాశారు. రైతులకు అవసరమైన సూక్ష్మ పోషకాలపై జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని, పన్ను తగ్గింపు వల్ల ఎరువుల ధరలు తగ్గుతాయని లేఖలో పేర్కొన్నారు. స్థానిక పరిశ్రమల ప్రోత్సాహానికి ఉపయోగపడుతుందని తెలిపారు.

స్వామిజీ పేరిట మోసాలు..

హైదరాబాద్ : హబ్సిగూడలో ప్రభాకర్ అలియాస్ తపస్వి స్వామిజీ పేరిట మోసాలు చేస్తున్నాడని జలజాక్షి అనే మహిళ ఆరోపిస్తోంది. తన ఆస్తులు అమిఒ్మంచి డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్నాడని పేర్కొంది. న్యాయం చేయని పక్షంలో సూసైడ్ చేసుకుంటానని లేఖలో హెచ్చరించారు.

 

విజయసాయి వ్యాఖ్యలపై అనిత ఫైర్..

విశాఖపట్టణం : విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే అనిత ఫైర్ అయ్యారు. మధురవాడ, కొమ్మాదిలో భూ దందా ఆరోపణలపై బహిరంగ చర్చకు నేను సిద్ధం..మీరు సిద్ధమా అని ఎమ్మెల్యే అనిత సవాల్ విసిరారు. వైసీపీ నేతలపై ఒక్క అట్రాసిటీ కేసు కూడా పెట్టలేదని, అసభ్యపోస్టులు పెట్టిన వారిపైనే కేసులు పెట్టడం జరిగిందన్నారు.

జవాన్ ఇంటి ఎదుట యువతి ధర్నా..

వికారాబాద్ : కుల్కచర్ల (మం) అనంతసాగర్ లో ఆర్మీ జవాన్ ఆంజనేయులు ఇంటి వద్ద యువతి ధర్నా చేపడుతోంది. ప్రేమ పేరిట నమ్మించి తనను మోసం చేశాడని ఆరోపిస్తోంది.

15:53 - June 13, 2017

హైదరాబాద్: త్వరలో కొత్త సిరీస్‌లో 500 నోట్లు చలామణిలోకి రానున్నాయి. ఏ - అక్షరంతో కొత్త నోట్లను తీసుకొస్తున్నట్టు ఆర్‌బీఐ ప్రకటించింది. ఈ కొత్తనోట్లలోని నంబర్‌ ప్యానెల్‌లలో అంతర్లీనంగా ఆంగ్ల అక్షరం -ఎను చేర్చనున్నారు. ఇది మనిహా మిగతా డిజైన్‌ అంతా ఇప్పటి మహాత్మాగాంధీ సిరీస్‌ నోట్ల మాదిరిగానే ఉంటుందని ఆర్బీఐ ప్రకటించింది. కొత్తనోట్లు తీసుకొచ్చినా పాతనోట్లు చలామణిలోనే ఉంటాయని స్పష్టం చేసింది. 

ఇటలీకి వెళ్లనున్న రాహుల్..

ఢిల్లీ : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటలీకి వెళ్లనున్నారు. తన అమ్మమ్మ ఇంటికి వెళుతున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అమ్మమ్మతో పాటు ఇటలీలోని తన బంధువులతో గడిపి వస్తానని పేర్కొన్నారు.

ఇబ్బందుల్లో రైతులు - మంత్రి ఆనంద్ బాబు..

గుంటూరు : నరసరావు పేటలో ప్రకృతి వ్యసాయం - పాలేకర్ విధానంపై సదస్సు జరిగింది. మంత్రి నక్కా ఆనంద్ బాబు పాల్గొన్నారు. వ్యవసాయంలో ఎరువులు, పురుగుల మందులను ఎక్కువగా వాడడం వల్ల దిగుబడి రావడం లేదని, గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆనంద్ బాబు పేర్కొన్నారు. రైతులు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని, దీనిమూలంగా ఖర్చు తక్కువ..గిట్టుబాటు వస్తుందన్నారు. వ్యవసాయ రంగంలో దేశంలో ఏపీది నెంబర్ వన్ స్థానంలో ఉందని పేర్కొన్నారు.

15:45 - June 13, 2017

హైదరాబాద్: సింగరేణిలో కార్మికసంఘాలు సమ్మెకు సిద్ధమవుతున్నాయి. వారసత్వ ఉద్యోగాలు ప్రావిడెంట్ ఫండ్ విలీనం పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

ఈపిఎఫ్‌లో సిఎమ్‌పీఎఫ్‌ను విలీనం చేయవద్దంటున్న కార్మిక సంఘాలు

వారసత్వ ఉద్యోగాల పునరుద్దరణతోపాటు ఈపిఎఫ్‌లో సిఎమ్‌పీఎఫ్ ను విలీనం చేయవద్దని డిమాండ్‌ చేస్తున్నాయి. దీనిపై ఇప్పటికే కోల్ ఇండియా, సింగరేణి యాజమాన్యంతో జరిపిన చర్చలు విఫలం అవడంతో సమ్మేకు పిలుపునిచ్చాయి. ఈ నెల 15 నుండి 18 వరకు జాతీయస్థాయిలో సమ్మెకుదిగనున్నాయి.

సమ్మెవద్దంటూ అధికారపార్టీ కార్మికసంఘం ప్రచారం

అయితే .. సమ్మెను విఫలం చేయడానికి అధికారపార్టీ విశ్వప్రయత్నం చేస్తోంది. టీఆర్‌ఎస్‌ అనుబంధ కార్మికసంఘం టీబీజీకేఎస్‌ ఇప్పటికే సమ్మెవ్యతిరేక ప్రచారం మొదలు పెట్టింది. ఓవైపు జాతీయ కార్మికసంఘాలైన ఐఎన్ టియుసి, సిఐటియు, ఎఐటియుసి, బిఎంఎస్, హెచ్ ఎంఎస్ టి యూనియన్లు సమ్మెకు అనుకూలంగా కరపత్రాలు పంచుతున్నాయి. ఈనేపథ్యంలో ఇవాళ హైదరాబాద్‌లోని ఆర్ఎల్సీ కార్యాయలంలో సింగరేణి యాజమాన్యం , జాతీయ కార్మిక సంఘాల మధ్య చర్చలు జరిగాయి.

వారసత్వ ఉద్యోగాలపై 2016 అక్టోబర్‌ 6 సీఎం కేసీఆర్‌ ప్రకటన

వారసత్వ ఉద్యోగాలు ఇస్తామంటూ 2016 అక్టోబర్‌ 6న సీఎం కేసీఆర్‌ ప్రకటించడంతో.. వేలాదిగా గనికార్మికులు తమ వారసులకు ఉద్యోగాలు కల్పించాలని దరఖాస్తు చేస్తుకున్నారు. అయితే కొందరు నిరుద్యోగులు కోర్టులో పిల్‌వేయడంతో ..వారసత్వ ఉద్యోగాలు చెల్లవంటూ ఈఏడాది మార్చి16న హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అక్కడకూడా రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురయింది. దీంతో వారసత్వ ఉద్యోగాలపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కార్మికసంఘాలు పోరుబాటపట్టాయి. వీఆర్‌ఎస్‌ ఉద్యోగాలపై తేల్చాలంటూ మార్చి 31న కార్మికయూనిన్లు సమ్మెనోటీసు ఇచ్చాయి. దీనిపై ఇప్పటికే నాలుగుసార్లు జరిగిన చర్చలు ఫలితం ఇవ్వలేదు. దీంతో జూన్ 15 నుంచి కార్మిక సంఘాలు నిరవధిక సమ్మేకు పిలుపునిచ్చాయి .అటు సీఎంపీఎఫ్‌ ను ఈపీఎఫ్‌లో విలీనం చేయడంపై మండిపడుతున్న కార్మికసంఘాలు ఈనెల 19 నుంచి.. వారసత్వ ఉద్యోగాలపై ఏదో ఒకటి తేల్చాలంటూ సింగరేణిలోనూ సమ్మెకు కార్మికసంఘాలు నిర్ణయించాయి.

జ్యోతిరాదిత్య అరెస్టు..

మధ్యప్రదేశ్ : కాంగ్రెస్ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియాను పోలీసులు అరెస్టు చేశారు. మంద్సార్ కు వెళ్లేందుకు ఆయన ప్రయత్నించగా సెక్షన్ 151 ప్రకారం ఆయన్ను ముందస్తు అరెస్టు చేశారు.

15:40 - June 13, 2017

కర్నూలు : జిల్లా టీడీపీ సీనియర్ నేత శిల్పా మోహన్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ సమక్షంలో తన అనుచరవర్గంతో వైసీపీ కండువా కప్పుకుంటానని శిల్పా మోహన్ రెడ్డి ప్రకటించారు. నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్ది ఎంపిక విషయంలో టీడీపీ నాన్చుడు ధోరణి వల్లే విసిగిపోయానని శిల్పా మోహన్ రెడ్డి తెలిపారు. నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ ఓడిపోయి వైసీపీ గెలిస్తే రాష్ట్రంలో టీడీపీ పతనం తప్పదని శిల్పా మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం శిల్పా మోహన్ రెడ్డితో పాటు నంద్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ దేశం సులోచన, మార్క్ ఫెడ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిపి నాగిరెడ్డి, 25 మంది కౌన్సిలర్లు, ఎంపిటీసీలు, సర్పంచులు, జగన్ సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు.

2009లో నంద్యాల నుంచి ఎమ్మెల్యేగా విజయం

2009లో నంద్యాల నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన శిల్పా మోహన్‌రెడ్డి..రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిల మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రజల్లో కాంగ్రెస్‌ వ్యతిరేకత పెరగడంతో ఆయన కాంగ్రెస్‌ పార్టీని వీడి టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ టిక్కెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీ అధికారంలోకి రావడంతో నియోజకవర్గం పార్టీ ఇన్‌చార్జిగా కొనసాగుతూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను తన కనుసన్నల్లో నడిపించారు. జిల్లాలో అధికార పార్టీకి కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉండడం వల్ల రాజకీయ సమీకరణలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు 2016 జనవరిలో నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియలను పార్టీలోకి చేర్చుకున్నారు. భూమాతో కలిసి సమన్వయంతో పనిచేయాలని శిల్పాకు సీఎం చంద్రబాబు సూచించారు. అయితే భూమా చేరికను వ్యతిరేకిస్తూ వచ్చిన శిల్పా మోహన్‌రెడ్డి..నియోజకవర్గంలో తన వర్గాన్ని బలోపేతం చేసుకుంటూ వచ్చారు. ఒకే పార్టీలో ఉన్నా ఒకరిపై ఒకరు వాడి విమర్శలు సంధించుకున్నారు. ఆ సమయంలో భూమా నాగిరెడ్డి గుండెపోటుతో అకాల మరణం చెందారు. దీంతో ఉప ఎన్నిక జరిగితే అభ్యర్థి ఎవరు..? అనే ప్రశ్న అధికార పార్టీలో తలెత్తింది.

నంద్యాల టికెట్‌ తనకే ఇవ్వాలని పట్టుబట్టిన శిల్పా

నంద్యాల టికెట్‌ తనకే ఇవ్వాలని శిల్పా మొదటి నుంచి అధిష్ఠానానికి ఘాటుగా చెబుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే శిల్పా మోహన్‌రెడ్డి సోమవారం సాయంత్రం శిల్ప సేవా సమితిలో కార్యకర్తలతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి నంద్యాల నియోజవర్గంలోని శిల్పా వర్గానికి చెందిన కార్యకర్తలు, వార్డు, గ్రామ స్థాయి టీడీపీ ఇన్‌చార్జిలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, వార్డ్‌ కౌన్సిలర్లు హాజరయ్యారు. అయితే ఈ నెలాఖరులో జిల్లా పర్యటనకు సీఎం చంద్రబాబు వస్తున్న సందర్భంగా తన బలాన్ని చాటి చెప్పేందుకే శిల్పా మోహన్‌రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నంద్యాల ఉప ఎన్నిక జూలై, ఆగస్టులో జరిగే అవకాశం ఉంది. దీంతో నంద్యాల ఉప ఎన్నిక ఇప్పుడు రసవత్తరంగా మారింది.

15:36 - June 13, 2017

విశాఖ : రెండు నెలల విరామం అనంతరం మత్స్యకారులు చేపలవేటకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. తమను సల్లగా చూడాలని కోరుతూ గంగమ్మ తల్లి జాతరను ఘనంగా నిర్వహిస్తున్నారు. రైతులకు ఏవిధంగా రుణమాఫీ చేస్తున్నారో తమకు కూడా రుణమాఫీ చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

15:33 - June 13, 2017

కర్నూలు: నగరంలో కిడ్నాప్‌ కలకలం చెలరేగింది. కీర్తిశ్రీ అనే బాలిక ఈనెల 7వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. నారాయణ కాలేజీలో ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతూ అదృశ్యమైంది. బాలిక తల్లిదండ్రులు తమ కూతురును ఎవరో కిడ్నాప్‌ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేశారు. 7వ తేదీన కనిపించకుండా పోయిన కీర్తిశ్రీ... ఇవాళ పోలీసుల ముందు ప్రత్యక్షమైంది. తనను ఎవరూ కిడ్నాప్‌ చేయలేదని తెలిపింది. తన తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేస్తుండడంతోనే తాను పారిపోయానని చెప్పింది. 

15:31 - June 13, 2017

సిద్దిపేట : జిల్లా కేంద్రం.. కల్వకుంటా కాలనీలో విషాదం చోటు చేసుకుంది. మిషన్‌ భగిరథ పనుల కోసం తీసిన గుంతలో పడి ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. 20 రోజులు క్రితం పైపులైన్‌ కోసం తవ్విన గుంతలోపడి ఆరేళ్ల షాభన బేగం, మూడేళ్ల జోయా బేగం మృతి చెందారు. కాగా కాలువ తీసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పిల్లల తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు. 

15:30 - June 13, 2017

చిత్తూరు :జిల్లా కుప్పంలో హోంగార్డు ఆత్మహత్యాయత్నం మును స్వామి చేసుకున్నాడు. దీనికి సీఐ రాజశేఖర్ వేధింపులే కారణమని రెండు పేజీల సూసైడ్‌ నోట్‌ రాశాడు. సీఐ వేధింపులు భరించలేక నెలక్రితం..ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లూ కూడా ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం ఆత్మహత్యాయత్నం చేసిన హోంగార్డు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చినా చూసీ చూడనట్లు వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

15:28 - June 13, 2017

వరంగల్‌ : నగరంలోని రాంపూర్‌ ఇండస్ట్రియల్‌ విత్తన కంపెనీలపై..విజిలెన్స్‌, వ్యవసాయ, పోలీస్‌ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. రెండు గంటలుగా సోదాలు కొనసాగుతున్నాయి. కంపెనీలో ఉన్న విత్తనాల గురించి..అధికారులు... యజమాన్యాన్ని విచారిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

తెలుగు రాష్ట్రాలకు త్వరలో భారీ వర్షాలు..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష గండం పొంచి ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. అరేబియా మహా సముద్రం..బంగాళాఖాతంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. రాబోయే రెండు..మూడు రోజుల్లో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని..ఒకటి..రెండు రోజుల్లో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖాధికారులు పేర్కొన్నారు. ఇక ఏపీలో కూడా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని, కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడుతాయన్నారు.

మాంద్సార్ లో కొనసాగుతున్న ఉద్రిక్తత..

మధ్యప్రదేశ్ : మాంద్సార్ లో ఇంకా ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇటీవలే పోలీసులు జరిపిన కాల్పుల్లో పలువురు రైతులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు నేతలు మాంద్సార్ కు వెళుతున్నారు. పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. కాసేపటి క్రితం కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియాను అడ్డుకున్నారు.

కుప్పంలో హోం గార్డు ఆత్మహత్యాయత్నం..

చిత్తూరు : కుప్పంలో హోం గార్డు ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేపింది. సీఐ రాజశేఖర్ వేధింపులే కారణమని సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు. సీఐ వేధింపులు భరించలేక ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు గతంలో ఆత్మహత్యకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే.

వరంగల్ లో విత్తన కంపెనీల్లో సోదాలు..

వరంగల్ : జిల్లాలోని రాంపూర్ ఇండస్ట్రియల్ విత్తన కంపెనీలపై అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. రెండు గంటలుగా సోదాలు కొనసాగుతున్నాయి. వరి విత్తనాల గురించి విచారణ జరుపుతున్నారు. విజిలెన్స్, వ్యవసాయ, పోలీసులు ఈ సోదాల్లో పాల్గొన్నారు.

14:57 - June 13, 2017

హైదరాబాద్: జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, ప్రముహసాహితీ వేత్త, సినీ రచయి సినారే మృతదేహాన్ని సీఎం కేసీఆర్ సందర్శించారు. . సీఎం వెంట మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు పలువురు ప్రముఖులు ఉన్నారు. సినారె నివాసంలోని సినారె గదిని సీఎం సందర్శించారు. బుధవారం సినారె  అధికారిక లాంఛనాలతో సినారె అంత్యక్రియలు నిర్వహించాలని సీఎస్‌కు సీఎం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలోని ఒక యూనివర్శిటీకి సినారె పేరు పెడతామని చెప్పారు. హైదరాబాద్ నడిబొడ్డున సినారె పేరిట మ్యూజియం, సాహితీ మందిరం నిర్మిస్తామని చెప్పారు. ట్యాంక్ బండ్ తో పాటు కరీంనగర్, సిరిసిల్ల హనుమాజీ పేటలో కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలుగు సాహిత్యంలో సినారె ఓ ధ్రువతార అని అన్నారు. ఆయనకు తాను పెద్ద అభిమానిని అని చెప్పారు. సినారె గొప్పదనాన్ని వెలికి తీసేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. 

14:53 - June 13, 2017

హైదరాబాద్: దువ్వాడ జగన్నాథం (డీజే) సినిమాపై సినిమాపై బ్రాహ్మణ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సినిమాలో అభ్యంతర సన్నివేశాలు, పాటలు తొలగించాలని డిమాండ్‌ చేశారు. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ అధికారులను కలిసి బ్రాహ్మన్‌ యూనిటి ఫర్‌ ఎవర్‌ సంఘం ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. దర్శకుడు, నిర్మాత దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. సినిమాలో అభ్యంతరకర పదాలు తొలగించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని బ్రాహ్మణ సంఘాల నేతలు హెచ్చరించారు. 

14:50 - June 13, 2017

హైదరాబాద్ : కింగ్‌ ఫిషర్‌ అధినేత విజయ్‌ మాల్యాను భారత్‌కు అప్పగింతపై లండన్‌ కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. కేసు విచారణ సందర్భంగా మాల్యా లండన్‌ వెస్ట్‌ మినిస్టర్‌ మెజిస్ట్రేట్‌ కోర్టుకు హాజరు కానున్నారు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం రెండున్నరకు విచారణ ప్రారంభం కానుంది. భారతీయ బ్యాంకులకు 9 వేల కోట్ల రుణాలను ఎగ్గొట్టి మాల్యా గత ఏడాది లండన్‌ పారిపోయిన విషయం తెలిసిందే. మాల్యాని తిరిగి భారత్‌కు రప్పించేందుకు గత నెల సిబిఐ, ఈడీ దర్యాప్తు సంస్థలు బ్రిటిష్‌ సంస్థలతో చర్చలు జరిపాయి. మాల్యాపై వెయ్యి పేజీల అభియోగ పత్రాలను లండన్‌ కోర్టుకు సమర్పించాయి. భారత్‌ తరపున సిపిఎస్‌ క్రౌన్‌ ప్రాసిక్యూషన్‌ సర్వీస్ వాదనలు వినిపిస్తోంది. భారత్‌ ఫిర్యాదు మేరకు ఏప్రిల్‌లో మాల్యాను స్కాట్‌లాండ్‌ యార్డ్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరిచారు. 6.50 లక్షల పౌండ్ల బాండ్‌తో మాల్యా బెయిల్‌ పొందారు.

14:48 - June 13, 2017

హైదరాబాద్: ముంబయికి చెందిన మోడల్‌, నటి కృతికా చౌదరి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ముంబై అంధేరీలోని కృతికా నివాసం నుంచి దుర్వాసన రావడంతో.. స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా.. ఆమె నిర్జీవంగా పడి ఉంది. కృతికను మూడు రోజుల క్రితమే హత్యకు గురై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు 

14:46 - June 13, 2017

జూన్ నెల వచ్చేసింది. ఇప్పటి సెలవుల్లో వరకు ఆటపాటలతో బాగా ఎంజాయ్ చేసిన పిల్లలు మళ్లీ స్కూలుకి వెళ్లాలంటే కొంత సమయం పడుతుంది. మరళా స్కూలికి పిల్లలు వెళుతుంటే కొత్త టీచర్లు, కొత్తపిల్లలు పరిచయం అవుతుంటారు. ఇలాంటి సమయంలో పిల్లలు స్కూలికి వెళ్లాలంటే మారాం చేస్తూ వుంటారు. ఈ సమయంలో తల్లిదండ్రులు తీసుకోవల్సిన జాగ్రత్తలు ఏమిటి? స్కూలు ఎంపిక విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పిల్లలతో తల్లిదండ్రులు ఎలా వ్యవహరించాలి ఇలాంటి అంశాలపై నేటి 'వేదిక'లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాననీయ మహా మహావిద్యాలయం ప్రిన్సిపల్ వసుధారాణి పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

హైదర్ గూడలో సూట్ కేసు కలకలం..

హైదరాబాద్ : హైదర్ గూడ లో సూట్ కేసు కలకలం సృష్టించింది. ఎమ్మెల్యే క్వార్టర్స్ సమీపంలో ముగ్గురు వ్యక్తులు సూట్ కేసు ను వదిలి వెళ్లినట్లు పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. పోలీసులు తనిఖీలు చేపట్టారు.

14:12 - June 13, 2017

బుల్లి తెరపై 'బిగ్ బాస్' ఎంత సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. హిందీ 'బిగ్ బాస్'కు బాలీవుడ్ కండల వీరుడు 'సల్మాన్ ఖాన్' యాంకర్ గా వ్యవహరించాడు. 'సల్మాన్' యాంకర్ కావడంతో షోకు మరింత పాపులార్టీ తెచ్చిపెట్టింది. అనంతరం వివిధ భాషల్లో టీవీ ఛానెళ్లు దీనిని నిర్వహించాయి. తెలుగులో కూడా దీనిని నిర్వహించాలని ప్రముఖ టీవీ ఛానల్ 'మా' టివి నిర్ణయించింది. 'బిగ్ బాస్' యాంకర్ గా 'జూనియర్ ఎన్టీఆర్' వ్యవహరించనున్నారనే వార్త హల్ చల్ చేసింది. తాజాగా దీనికి సంబంధించిన ఫొటోను ట్విట్టర్ ద్వారా 'జూనియర్ ఎన్టీఆర్' విడుదల చేశారు. జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా 'బిగ్ బాస్' ప్రారంభం కానుందని వెల్లడించింది. మరి 'బిగ్ బాస్' గా 'జూ.ఎన్టీఆర్' ఎలా అలరించనున్నాడో చూడాలి.

'డీజే' సినిమాపై తొలగని వివాదం..

హైదరాబాద్ : 'డీజే'..దువ్వాడ జగన్నాథమ్ సినిమాపై వివాదం ఇంకా తొలగిపోలేదు. సినిమాలో అభ్యంతర సన్నివేశాలు..పాటలు తొలగించాలని బ్రాహ్మణ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అభ్యంతరకరపదాలు తొలగించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ ఛాంబర్ కు బ్రాహ్మణ సంఘాలు వినతిపత్రం సమర్పించాయి.

13:51 - June 13, 2017
13:50 - June 13, 2017
13:49 - June 13, 2017

హైదరాబాద్ : మియాపూర్‌ భూ కబ్జా బాగోతంలో ముఖ్యమంత్రే అసలు దోషి అని టీడీపీ నేతలు ఆరోపించారు. కుంభకోణం బయటపడి 15రోజులు గడుస్తున్నా.. సీం కేసీఆర్‌ స్పందించకపోడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సహచరులు, అనుయాయులు ,అధికారులకు స్కాంలో పాత్ర ఉందని.. దీనిసమగ్ర విచారణ చేపట్టాలని గవర్నర్‌కు విజ్ఙప్తి చేశామని టీడీపీ నేతలు అన్నారు.

13:47 - June 13, 2017

గుంటూరు : ఈనెల 19 నుంచి ముస్లిం కుటుంబాలకు రంజాన్‌ తోఫా ఇస్తున్నట్లు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. తోఫా కింద వస్తువుల్లో నాణ్యత లేకుంటే.. అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ముస్లిం కుటుంబాలకు ఇచ్చే వస్తువుల విలువ మార్కెట్‌లో 515 రూపాయలు ఉంటుందని ప్రత్తిపాటి తెలిపారు. 

సింగరేణిలో మోగిన సమ్మె సైరన్..

హైదరాబాద్ : సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. ఐదు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో 15 నుండి సమ్మెలోకి వెళ్లనున్నారు. డిపెండెంట్ ఉద్యోగాలు కల్పించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కార్మికులు మండిపడుతున్నారు. మార్చి 31న సమ్మె నోటీసు ఇస్తే ఇప్పటి వరకు జరిగిన చర్చల్లో స్పష్టమైన హామీ రాలేదని కార్మికులు పేర్కొంటున్నారు. సమ్మెను అడ్డుకోవాలని చూస్తే ప్రతిఘటన తప్పదని సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్ టీయూసీ, హెచ్ఎం ఎస్ సి, బీఎంసీ పేర్కొన్నాయి.

13:43 - June 13, 2017

విజయనగరం : నెల్లిమర్ల నగర పంచాయతీ మున్సిపల్‌ కమిషనర్‌ అచ్చెన్నాయుడు ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఫిర్యాదుతో... విజయనగరంలోని స్వగృహంతో పాటు.. విశాఖలోని బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటీవలనే అచ్చెన్నాయుడు జీవీఎంసీకి బదిలీ అయ్యారు. అచ్చెన్నాయుడు రాజాం, నెల్లిమర్లలో విధులు నిర్వహించినప్పుడు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఏసీబీ అధికారుల సోదాల్లో భారీగా అక్రమ ఆస్తులు వెలుగుచూస్తున్నాయి. 

13:42 - June 13, 2017

హైదరాబాద్ : మియాపూర్‌ భూకుంభకోణం కేసులో నిందితుడు, కూకట్‌పల్లి సబ్‌రిజిస్ట్రార్‌ శ్రీనివాస్‌ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. బోయిన్‌పల్లిలోని శ్రీనివాస్‌ ఇంట్లో ఏసీబీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 50 కోట్లకుపైగా అక్రమాస్తులున్నట్లు అనుమానిస్తున్నారు. 

13:40 - June 13, 2017

హైదరాబాద్ : రుతుపవనాల రాకతో కాడెడ్లనాగలి కదిలింది. ముల్లుగర్రచేతబట్టిన కర్షకులు ఉత్సాహంగా ఏరువాకసాగారు. వాననీటితో తడిసిన నేలను పంటకు సిద్ధం చేస్తున్నారు. వర్షాధారంగా పంటలు సాగుచేసే తెలంగాణ రైతులు ఈ వానాకాలంపంటపై గంపెడాశలు పెట్టుకున్నారు. సకాలంలో వర్షాలు కురుస్తుండటంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, రుణసదుపాయం తదితర అంశాలపై ఖరీఫ్‌ కు ముందే అంచనాకు రావాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలబీమా, రుణమాఫీ లాంటివి ప్రహసనంగా మారాయని రైతుసంఘాలు విమర్శిస్తున్నాయి. ఇప్పటికే ఖరీఫ్ సీజన్‌ ప్రారంభమైనా ఇంతవరకు ప్రణాళిక తయారుచేయకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

తిప్పలు పడుతున్న కౌలురరైతులు
మరోవైపు తమను ఆదుకోవాలని ఉద్యానవన పంటలరైతులు కోరుతున్నారు. నెలల తరబడి పండ్ల తోటలపై పెట్టుబడులు పెట్టి ఆరుగాలం శ్రమించినప్పటికీ ప్రభుత్వశాఖల నుంచి ఏసాయం అందడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిగతా పంటల మాదిరిగా తమకు కూడా మద్దతు ధర అందించాలని వారు కోరుతున్నారు. గుర్తింపుకార్డులు, రుణమంజూరిలో సమస్యలతో తాము నానా తిప్పలు పడుతున్నామని కౌలురైతులు వాపోతున్నారు. అయితే ఈ సారి ఖరీఫ్‌ సీజన్‌కు ప్రభుత్వం అన్నివిధాల సిద్ధమయిందంటున్నారు వ్యవసాయ అధికారులు. ఇప్పటికే 6 లక్షల టన్నులను విత్తనాలను విక్రయ కేంద్రాలకు తరలించామన్నారు. రుణ సదుపాయాన్ని స్కేల్‌ ఆప్‌ పైనాన్స్ ప్రకారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటుమని చెబుతున్నారు.

ప్రభుత్వానిది ఆరంభశూరత్వాన్నే
అయితే వ్యవసాయశాఖ తీరు ప్రతిఏడాది ఆరంభశూరత్వాన్నే తలపిస్తోందని రైతుసంఘం నేతలు అంటున్నారు. సీజన్‌ ప్రారంభంలో అధికారులు ఎంత హడావిడి చేసినా.. ఎప్పటిలానే నకిలీవిత్తనాలు మార్కెట్లలో నిండిపోతున్నాయి. ఇక గిట్టుబాటుధరలు, పంటలబీమా, బ్యాంకురుణాలు పేరుకుమాత్రమే చెప్పుకునే పథకాలుగా మారిపోయాయి. ఇప్పటికైనా ప్రభుత్వం సమగ్రచర్యలు తీసుకోకుంటే.. ఈ ఖరీఫ్‌ సీజన్‌లోకూడా కర్షకులు నష్టపోయే ప్రమాదం ఉందని రైతుసంఘాలు హెచ్చరిస్తున్నాయి.

 

13:36 - June 13, 2017

విశాఖ : విశాఖ జిల్లా పెందుర్తి మండలం ముదపాకలో 40 ఏళ్ల క్రితం భూమిలేని దళిత రైతులకు 450 ఎకరాలు సాగుకోసం ఇచ్చింది ప్రభుత్వం. వాటికి డి ఫామ్ పట్టాలు కూడా ఇచ్చింది. అప్పట్లో సాగు బానే ఉన్నా.. ఆ తరువాత పట్టణీకరణ అభివృద్ధితో ఆ భూముల చుట్టూ భవనాలు వెలిశాయి. దీంతో ఒక్కసారిగా పెందుర్తిలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఇదే అదనుగా రైతుల భూములపై కొందరు బడాబాబులు కన్నేశారు. ఇటీవల విశాఖలోని పలు ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ చేస్తున్నట్లు వుడా ప్రకటించింది. దీనికి జీవో నెంబర్ 290 విడుదల చేసింది. దీంతో ఎలాగైనా గ్రామంలోని భూముల్ని కాజేయాలని ప్రయత్నాలు ప్రారంభించారు పెద్దలు.

నమ్మించి మోసం చేశారు...
రంగంలోకి దిగిన రాజకీయ నేతలు, బడాబాబులు ఎకరా 10 లక్షలకు కొనుగోలు చేస్తామని రైతుల్ని నమ్మించారు. లేదంటే మీ భూముల్ని ప్రభుత్వం లాక్కుంటుందని భయపెట్టారు. దీంతో 236 మంది రైతులు 280 ఎకరాల భూమికి సంబంధించిన పట్టాలు, పాసు పుస్తకాలు వారికి ఇచ్చేశారు. చివరికి వారికి రెండేసి లక్షల చొప్పున చెక్కులు ఇచ్చి తెల్లకాగితాలపై, ప్రామిసరీ నోట్లపై సంతకాలు చేయించుకున్నారు బడాబాబులు. ఆ భూములను వుడా సంస్ధకు భూ సేకరణ ద్వారా ఇస్తున్నట్లు పత్రాలను సృష్టించారు..అధికారుల సహాయంతో టైటిల్ డీడ్ లు కూడా మార్చేశారు. మాట వినని రైతులపై అక్రమ కేసులు కూడా బనాయించారు. దీంతో మోసపోయామని తెలుసుకున్న రైతులు తమ భూములు తమకు ఇచ్చేయాలని.. ల్యాండ్ పూలింగ్ జీవోను రద్దు చేయాని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భూములను పరిశీలించింది అఖిలపక్షం . గ్రామస్తులు కూడా అఖిలపక్షానికి తమ మద్దతు తెలిపారు. వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, సీపీఎం నేత నర్సింగరావు రైతులకు న్యాయం చేసేదాకా పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే భూ సేకరణపై ఇచ్చిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు అఖిలపక్షం నేతలు. లేదంటే రాబోయే రోజుల్లో ఉద్యమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. 

13:36 - June 13, 2017

గత ఏడాది 'జెంటిల్మన్' చిత్రంతో మంచి విజయం అందుకున్న దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి.. తాజాగా 'అమీ తుమీ'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అంతకుముందు 'నాని'తో..'అష్టా చమ్మా' చిత్రం కూడా తీసిన సంగతి తెలిసిందే. 'అమీ తుమీ' రిలీజ్ సందర్భంగా చిత్ర యూనిట్ తో టెన్ టివి ముచ్చటించింది. ఈ సందర్భంగా 'మోహన్ కృష్ణ ఇంద్రగంటి' పలు విశేషాలను తెలియచేశారు. ఈ నేపథ్యంలో నటి శ్యామల ఫోన్ చేసి చిత్ర యూనిట్ ను అభినందించారు. కామెడీతో హింస పెట్టారని..చిత్రం చాలా బాగుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

13:30 - June 13, 2017

హైదరాబాద్ : ఓయూలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. గ్రూప్ 2 రద్దు చేసి మరో 3 నెలల్లా తిరిగి పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తూ వంద మంది విద్యార్థులు శిరోముండన కార్యక్రమాం చేపట్టారు. విషయం తెలుసుకున్న ఓయూ పోలీసులు ఆర్ట్స్ కాలేజీ ఎదుట విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. వారిని నాచారం పోలీసు స్టేషన్ కు తరలించారు. అరెస్టైన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని, వైట్ నర్ తో దిద్దిన పేపర్ ను ఎలా గుర్తిస్తారని వారు ప్రశ్నించారు. 

ఓయూలో విద్యార్థుల ఆందోళన..

హైదరాబాద్ : అక్రమాలు జరిగిన గ్రూప్ 2 పరీక్షను రద్దు చేసి మూడు నెలల్లో తిరిగి పరీక్ష నిర్వహించాలని విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ఓయూలో ఆర్ట్స్ కళాశాల ఎదుట ఈ ఆందోళన జరిగింది.

13:20 - June 13, 2017

మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన 'అమీ తుమీ' సినిమా ఇటీవలే విడుదలైంది. మంచి ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈసందర్భంగా టెన్ టివి చిత్ర యూనిట్ తో ముచ్చటించింది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను వారు తెలియచేశారు. తన కొంత డిస్ అగ్రీ ఉందని అడవి శేష్ వ్యాఖ్యానించడం గమనార్హం. బడ్జెట్ పరంగా స్మాల్..కంటెంట్ పరంగా అంటూ పేర్కొన్నారు. తాను చిన్న సినిమా అన్నది ప్రొడక్షన్ పరంగా..క్వాలీటీ పరంగా పెద్ద సినిమాకు తీసిపోదన్నారు. అడుక్కోని తీశామండి..దయచేసి ఆదరించండి అంటూ చెప్పడం లేదన్నారు. మరింత విషయాలకు వీడియో క్లిక్ చేయండి.

13:10 - June 13, 2017

హైదరాబాద్ : వైసీపీ అధ్యక్షడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హై కోర్టులో చుక్కెదురైంది. కృష్ణా జిల్లా బస్సు ప్రమాద సమయంలో అక్కడికి వెళ్లిన జగన్ జిల్లా కలెక్టర్ బాబు పట్ల దురుసుగా ప్రవర్తించడనే ఆరోపణతో నాందిగామ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయింది. అయితే ఈ కేసు నుంచి తనను మినహాయించాలని జగన్ హై కోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ కేసు కొట్టివేతకు హై కోర్టు నిరాకరించింది. దీంతో కేసులో విచారణ నిమిత్తం జగన్ నాందిగామలో విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది.

 

రైతులకు అందించే డబ్బు సినిమా రంగంలోకి..

ప్రకాశం : జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీలో నిధుల గోల్ మాల్ జరిగింది. సొసైటీ నిధులను సినిమా రంగంలోకి తరలించారు. రైతులకు ఇవ్వాల్సిన డబ్బును డీసీఎంఏ సినిమా మార్కెటింగ్ చేసింది. ఏడుగురు అసిస్టెంట్ రిజిస్ట్రార్లను సస్పెన్షన్ వేశారు. ఒకరికి నోటీసులు అందచేశారు.

పెద్ద అంబర్ పేటలో గంజాయి ముఠా..

హైదరాబాద్ : పెద్ద అంబర్ పేటలో గంజాయి ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఏడుగురు ముఠా సభ్యులు ముంబైకి తరలిస్తుండగా ఎస్ వోటీ పోలీసులు పట్టుకున్నారు. 70 కిలోల గంజాయి, కారు, నాలుగు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు.

12:36 - June 13, 2017

హైదరాబాద్ : డాక్టర్‌ సి.నారాయణరెడ్డి, సాహితీ శిఖరాలను అధిరోహించడానికి, బాల్యం నుంచే పునాదులు పడ్డాయి. 1931 జులై 29న కరీంనగర్‌ జిల్లా మారుమూల కుగ్రామం హనామాజిపేటలో జన్మించిన సినారె, అక్కడి వీధిబడిలోనే ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. మాధ్యమిక విద్యను సిరిసిల్లలో ఉర్దూ మాధ్యమంలో పూర్తి చేశారు. అప్పట్లో తెలుగు ఒక ఐచ్ఛికాంశాంగానే ఉండేది. ఆతర్వాత, కరీంనగర్‌లో ఉన్నత విద్యను పూర్తి చేశారు. అనంతరం, హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్‌ కళాశాలలో ఇంటర్మీడియట్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఏ కూడా ఉర్దూ మాధ్యమంలోనే చదివారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగు సాహిత్యంలో పోస్టుగ్రాడ్యుయేట్ డిగ్రీ, డాక్టరేటు డిగ్రీ పొందారు.

బాల్యంలోనే సాహిత్యంవైపు...
బాల్యదశలో విన్న హరికథలు, జానపదాలు, జంగం కథలు ఆయన్ను సాహిత్యంవైపు ఆకర్షితుడయ్యేలా చేశాయి. విద్యార్థిగా శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయంలో అనేక గ్రంథాలు చదివారు. విద్యాభ్యాసనంతరం, సికింద్రాబాద్‌లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అధ్యాపకుడిగా చేరిన సినారె, అటు తర్వాత నిజాం కళాశాలలో అధ్యాపకునిగా, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా పనిచేశారు. ఉద్యోగ ధర్మంతో పాటు, తనలోని రచనా వ్యాసంగాన్నీ కొనసాగించారు సినారె. సినారె కవిత తొలిసారి జనశక్తి పత్రికలో అచ్చయింది. విద్యార్థి దశలోనే ప్రహ్లాద చరిత్ర, సీతాపహరణం వంటి పద్య నాటికలు, భలే శిష్యులు తదితర సాంఘిక నాటకాలు రచించారు. 1953 లో నవ్వని పువ్వు సంగీత నృత్య నాటిక ప్రచురితమైంది. అది సి.నా.రె తొలి ప్రచురణ. వెంటనే జలపాతం, విశ్వగీతి, అజంతా సుందరి వెలువడ్డాయి. రామప్ప సంగీత నృత్య రూపకం అన్ని భారతీయ భాషల్లోకి అనువాదమైంది. ఆయన పరిశోధన గ్రంథం ఆధునికాంధ్ర కవిత్వము - సంప్రదాయములు, ప్రయోగములు అత్యంత ప్రామాణిక గ్రంథంగా పేరు పొందింది.

కవి అయనప్పటికీ....
సినారె ప్రముఖంగా కవి అయినప్పటికీ ఆయన పద్య కావ్యాలు, గేయ కావ్యాలు, వచన కవితలు, గద్య కృతులు, చలనచిత్ర గీతాలు, యాత్రా కథనాలు, సంగీత నృత్య రూపకాలు, ముక్తక కావ్యాలు, బుర్ర కథలు, గజళ్ళు, వ్యాసాలు, విమర్శనా గ్రంథాలు, అనువాదాలు మొదలైనవి ఎన్నో రాశారు. కళాశాల విద్యార్థిగా శోభ పత్రికకు సంపాదకత్వం వహించారు. రోచిస్, సింహేంద్ర పేరుతో కవితలు రచించేవారు. 1988లో విశ్వంభర కావ్య రచనకు గాను, సినారెకి, ప్రతిష్ఠాత్మక జ్ఞానపీఠ్‌ పురస్కారం లభించింది. విశ్వనాథ సత్యనారాయణ తరువాత జ్ఞానపీఠ పురస్కారం పొందిన తెలుగు సాహీతీకారుడు ఆయనే. సినారెకు కర్పూర వసంతరాయల కవిగా ఉన్న గుర్తింపు కాస్తా, విశ్వంభర అనంతరం, విశ్వంభర కవిగా మారిపోయింది. సినారె సాహిత్యంపై ఎన్నో పరిశోధనలు జరిగాయి. వివిధ విశ్వవిద్యాలయాలు, సినారె కవిత్వం విశిష్టతలపై 10 పిహెచ్‌డిలు, 18 ఎంఫిల్‌లు ప్రదానం చేశాయంటే, సినారె కవిత్వపు సత్తా ఏంటో అర్థమవుతుంది. పాటలో ఏముంది-నా మాటలో ఏముంది అంటూ ఆయన చెప్పిన ముచ్చట్లు రెండు పుస్తకాలుగా వెలువడ్డాయి.

అర్ధాంగి సంస్మరణార్థం మహిళా పురస్కారం
తన అర్ధాంగి సుశీల సంస్మరణార్థం, సినారె, ప్రత్యేక మహిళా పురస్కారాన్ని, ఓపెన్‌ యూనివర్సిటీలో ప్రతిభావంతులైన విద్యార్థులకు స్వర్ణ పతకాలను ఏటా ప్రదానం చేసేవారు సినారె. ఉత్తమ రచయిత్రులను ప్రోత్సహిస్తూ వారికి ప్రచురణ కోసం రూ.50వేలు అందించేవారు. 1994 నుంచి సాహిత్య పరిషత్‌ అధ్యక్షుడిగా, ఎన్నో ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలు, పుస్తకాలతో సాహితీలోకానికి వన్నె తెచ్చారు సినారె. 1977లో ఆయన్ను పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్‌ పురస్కారాలు వరించాయి. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, భారతీయ భాషా పరిషత్‌, రాజ్యలక్ష్మి పురస్కారాలతో పాటు, సోవియట్‌ నెహ్రూ, ఆసాన్‌ పురస్కారాలూ సినారెను వరించాయి. డాక్టర్‌ సి.నారాయణరెడ్డి, ఆంధ్రప్రదేశ్అధికార భాషా సంఘం అధ్యక్షులుగాను, అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగానూ కొనసాగారు. 

12:29 - June 13, 2017

ముంబై : ముంబయికి చెందిన మోడల్‌, నటి కృతికా చౌదరి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ముంబై అంధేరీలోని కృతికా నివాసం నుంచి దుర్వాసన రావడంతో.. స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా.. ఆమె నిర్జీవంగా పడి ఉంది. కృతికను మూడు రోజుల క్రితమే హత్యకు గురై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు 

జగన్ కు చుక్కెదురు..

హైదరాబాద్ : వైసీపీ అధ్యక్షుడు జగన్ కు హైకోర్టులో చుక్కెదురైంది. నందిగామలో నమోదైన కేసు కొట్టివేతకు కోర్టు నిరాకరించింది. బస్సు ప్రమాదంపై అధికారులతో దురుసుగా ప్రవర్తించారని జగన్ పై నందిగామ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు కొట్టివేయాలంటూ హైకోర్టులో జగన్ క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు.

12:28 - June 13, 2017

యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లాలో స్కూల్‌ బస్సుకు ప్రమాదం తప్పింది. మోత్కూరు శివారులో చెరువుకట్టపై వెళ్తున్న బస్సు టైర్ల బోల్టులు ఊడిపోయాయి. దీంతో బస్సు ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయింది. అప్రమత్తమైన డ్రైవర్‌ బస్సును నిలిపివేశాడు. లేకపోతే... బస్సు చెరువులోకి దూసుకెళ్లి ప్రమాదం జరిగి ఉండేది. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 10 మంది విద్యార్ధులున్నారు. ప్రమాదం తప్పడంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. 

12:25 - June 13, 2017

పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా ప్రభుత్వాస్పత్రిలో మద్యం మత్తులో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. అడ్డువచ్చిన ఆస్పత్రి సిబ్బందితో పాటు కానిస్టేబుల్‌పై కూడా దాడి చేశాడు. దీంతో వరప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

12:24 - June 13, 2017

నెల్లూరు : నెల్లూరు టిడిపి నగర అధ్యక్ష పదవి ఆ పార్టీలో పెద్ద దుమారం రేపుతోంది. ప్రస్తుతం నగర అధ్యక్షుడిగా ఉన్న కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డికి నుడా చైర్మన్ పదవి దక్కడంతో నగర అధ్యక్ష పదవి ఖాళీ అవుతోంది. దీంతో టిడిపి నేతలు అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. నగర అధ్యక్ష కుర్చీ ఖాళీ కాకముందే కుర్చీ కోసం నాయకులు ప్రయత్నాలు మొదలు పెట్టడంతో నెల్లూరు టీడీపీలో రాజకీయాలు ఆసక్తిగా మారాయి.

శ్రీనివాసులరెడ్డికే నగర అధ్యక్ష పగ్గాలు
గత నెలలో జరిగిన నగర టీడీపీ సంస్థాగత ఎన్నికల్లో మూడవసారి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డికే నగర అధ్యక్ష పగ్గాలు అప్పగించారు. మరోవైపు నుడా చైర్మన్ గా కోటంరెడ్డిని నియమించడంతో నగర భాధ్యతల నుంచి కోటంరెడ్డి తప్పుకుంటారని పార్టీలో విస్తృత ప్రచారం జరుగుతోంది. దీంతో మంత్రులు నారాయణ, సోమిరెడ్డి, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డితో పాటు జిల్లాలో ముఖ్య నేతలు తమ అనుచరులకు నగర అధ్యక్ష పదవి కట్టబెట్టాలని పావులు కదుపుతున్నట్లు సమాచారం. మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడుగా వ్యవహరిస్తున్న ఆనం జయకుమార్ రెడ్డికి నగర అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని ఆదాల గట్టిగా కోరుతున్నట్లు సమాచారం. మంత్రి నారాయణ అనుచరుడు వేమిరెడ్డి పట్టాభి కోసం కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇక ద్వితీయ శ్రేణి నేతలు కూడా తమకు అవకాశం ఇవ్వాలంటూ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా గతంలో ఎన్నడూ లేనీ విధంగా నగరాధ్యక్ష పదవి కోసం నేతల మధ్య పోటీ రసవత్తరంగా మారింది. నగరాధ్యక్ష పదవి పోటీలో పదిమంది నేతలు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈసారి ఈ పదవి బీసీ, కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా పార్టీ నిర్ణయాన్ని బట్టే అధ్యక్ష పదవిపై క్లారిటి వచ్చే అవకాశం ఉంది. 

జగన్ కు చుక్కెదురు..

హైదరాబాద్ : వైసీపీ అధ్యక్షుడు జగన్ కు హైకోర్టులో చుక్కెదురైంది. నందిగామలో నమోదైన కేసు కొట్టివేతకు కోర్టు నిరాకరించింది. బస్సు ప్రమాదంపై అధికారులతో దురుసుగా ప్రవర్తించారని జగన్ పై నందిగామ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు కొట్టివేయాలంటూ హైకోర్టులో జగన్ క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు.

సర్కార్ భూములు కాపాడుకుంటాం - ఎల్.రమణ..

హైదరాబాద్ : కేసీఆర్ పాలనలో సర్కార్ భూములు అన్యాక్రాంతమయ్యాయని, కేసీఆర్ నుండి సర్కార్ భూములను కాపాడుకుంటామని ఎల్.రమణ తెలిపారు. ఎన్నికల్లో మద్దతిచ్చిన వారికి కేసీఆర్ ఆ భూములను కట్టబెడుతున్నారని, గోల్డ్ స్టోన్ ప్రసాద్ ప్రభుత్వ అండదండలతో పెద్ద ఎత్తున భూములు కొల్లగొట్టారని ఆరోపణలు గుప్పించారు.

12:13 - June 13, 2017

మహబూబాబాద్ : జిల్లా కేంద్రలో జరుగుతున్న టెన్త్ సప్లిమెంటరీ పేపర్ లీక్ అయింది. అటు ఖమ్మం జిల్లా గార్లలో టెన్త్ మ్యాథ్స్ సప్లిమెంటరీ పేపర్ లీక్ అయింది. ఆ రోజు మ్యాథ్స్ పేపర్ కావడంతో ఉదయం 10.30 నిమిషాలకు పేపర్ లీక్ అయనట్టు తెలుస్తోంది. జిరాక్స్ సెంటర్ పేపర్ జిరాక్స్ చేస్తుండగా లీక్ పేపర్ లీక్ అయనట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు అధికారులు పేపర్ లీకేజీ పై ఎటువంటి ప్రకటన చేయలేదు. తుతుమంత్రంగా విచారణ జరిపి చేతులు దులుపుకున్నారు. కనీసం పోలీసు బందోబస్తు లేకుండా పరీక్షలు నిర్వహిస్తునట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తేలియాల్సి ఉంది.

 

 

 

శ్రీనివాస్ ఖాతాల్లో రూ. 10 కోట్లు - ఏసీబీ డీఎస్పీ..

హైదరాబాద్ : అక్రమాస్తులు కూడగట్టారనే సమాచారంతో కూకట్ పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ ఇంట్లో సోదాలు చేపట్టడం జరిగిందని ఏసీబీ డీఎస్పీ సునీతారెడ్డి పేర్కొన్నారు. అల్వాల్ తో పాటు పది చోట్ల సోదాలు కొనసాగుతున్నట్లు తెలిపారు. మూడు కంపెనీల నుండి రూ. 10 కోట్ల వరకు శ్రీనివాస్ ఖాతాల్లో జమైనట్లు గుర్తించినట్లు తెలిపారు.

మహారాష్ట్ర పదో తరగతి ఫలితాల విడుదల..

మహారాష్ట్ర : రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. 88.74 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 91.46 శాతం..బాలురు 86.51 శాతం ఉత్తీర్ణత సాధించారు.

12:07 - June 13, 2017

బాలీవుడ్ కండల వీరుడు 'సల్మాన్ ఖాన్'..టాలీవుడ్ రెబల్ స్టార్ 'ప్రభాస్' లు కలిసి నటిస్తే ఎలా ఉంటుంది ? అటు సల్మాన్..ఇటు ప్రభాస్ అభిమానులకు పండుగే పండుగ కదా. బాక్సాపీస్ వద్ద రికార్డులు నెలకొంటాయి కదా..ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న చిత్రంలో వీరిద్దరూ కలిసి నటిస్తారని ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ దర్శక..నిర్మాత కరణ్ జోహార్ కూడా 'ప్రభాస్' తో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 'ప్రభాస్' నటించిన 'బాహుబలి 2' సినిమా ఓ ఊపు ఊపిన సంగతి తెలిసిందే. హిందీలో కూడా ఈ సినిమా ప్రభంజనం సృష్టించింది. తాజాగా 'ప్రభాస్' సుజీత్ దర్శకత్వంలో 'సాహో' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు 'సల్మాన్' 'ట్యూబ్ లైట్' చిత్రంలో నటిస్తున్నాడు. రంజాన్ పండుగ సందర్భంగా రిలీజ్ కానుంది. మరి సల్మాన్..ప్రభాస్ లు కలిసి నటిస్తారా ? లేదా ? అనేది త్వరలోనే తెలియనుంది.

టెన్త్ మ్యాథ్స్ పేపర్ లీక్..

మహబూబా బాద్ : గార్లలో టెన్త్ మాథ్స్ సప్లిమెంటరీ పేపర్ లీక్ అయ్యింది. పేపర్ ను జిరాక్స్ తీస్తుండగా ఈ విషయం బయటకొచ్చింది. దీనిపై అధికారులు స్పందించడం లేదని తెలుస్తోంది.

11:35 - June 13, 2017

హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ నేతలు గవర్నర్ నరసింహాన్ కలిసారు. మియాపూర్ భూకంభకోణం పై వారు గవర్నర్ ఫిర్యాదు చేశారు. సీఐడీ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని, ఈ స్కామ్ పై సీబీఐతో విచారణ జరిపించాలని వారు గవర్నర్ ను కోరారు. కుంభకోణం వెనక టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. గోల్డ్ స్టొన్ ప్రసాద్ చెందిన కారు సీఎం కేసీఆర్ కార్యాలయంలకు వచ్చినట్లు సీసీ పుటేజ్ గవర్నర్ కు అందించారు. కుంభకోణంతో ప్రభుత్వానికి 15వేల కోట్ల నష్టం వటిలినట్లు తెలిపారు. గవర్నర్ కలినిన వారిలో రమణ, మోత్కపల్లి, రేవూరి, ప్రకాష్ రెడ్డి, రావుల ఉన్నారు.

 

11:28 - June 13, 2017

విజయనగరం : విజయనగరంలో ఏసీబీ దాడులు చేస్తుంది. నెర్లిమర్ల మున్సిపల్ మాజీ కమిషనర్ అచ్చినాయుడు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏక కాలంలో అచ్చినాయుడు అతని బంధువుల ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయన పై చాలా కాలంగా అవనీతి ఆరోపణలు వస్తున్నాయి. ఏసీబీ అధికారుల తనిఖీల్లో భారీగా బంగారం, వెండి ఆభరణాలు బయపడుతున్నాయి. అచ్చినాయుడు గతంలో రాజం పేట మున్సిపల్ కమిసనర్ గా చేశారు. ఆయనకు చాలా ప్రాంతాల్లో భూములు, ఇళ్ల స్థలాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు.

 

11:27 - June 13, 2017

హైదరబాద్ : మియాపూర్ భూ కుంభకోణం నిందితుడు కూకట్ పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బోయిన్ పల్లిలోని ఆయన ఇంటిలో కొద్ది సేపటి నుంచి సొదాలు చేస్తున్నారు. ఏసీబీ అధికారులు పది బృందాలగా విడిపోయి శ్రీనివాసరావు బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహింస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన ఇంట్లో బంగారు, భూములకు సంబంధించిన పత్రాలు అధికారులు స్వాధినం చేసుకున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం శ్రీనివాస రావు అక్రమాస్తులు సుమారు రూ.50 కోట్లపైగా ఉంటాయని అధికారులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.

 

11:19 - June 13, 2017

నీలి కళ్లతో 'అనుష్క' భయంకరంగా కనిపిస్తోంది. టాలీవుడ్ స్వీటీ 'అనుష్క' కాదు. బాలీవుడ్ నటి 'అనుష్క'. బాలీవుడ్ లో ప్రాధాన్యత ఉన్న కథా చిత్రాలు ఎంచుకుంటూ 'అనుష్క' ముందుకెళుతోంది. అందులో భాగంగా 'పరి' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి ఆమె నిర్మాత కావడం విశేషం. ప్రోసిత్ రాయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బెంగాలీ నటుడు పరంబత్రా ఛటర్జీ కీలక పాత్ర పోషించనున్నారు. ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా 'అనుష్క' ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. గ్లామరస్ గా ఉండే 'అనుష్క' భయంకరమైన గెటప్ వేయడం విశేషం. దెయ్యం కథతో ఈ సినిమా రూపొందుతోందని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

రాష్ట్రపతి ఎన్నిక..బీజేపీ అగ్రనేతల భేటీ..

ఢిల్లీ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాసేపటి క్రితం కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు నివాసానికి చేరుకున్నారు. వెంకయ్య నివాసానికి కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్ నాథ్ సింగ్ కూడా రానున్నారు. రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో వీరు భేటీ కానున్నారు.

గవర్నర్ తో టి.టిడిపి నేతల భేటీ..

హైదరాబాద్ : ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తో టి.టిడిపి నేతలు భేటీ అయ్యారు. మియాపూర్ భూ కుంభకోణంపై గవర్నర్ కు వారు ఫిర్యాదు చేశారు. గవర్నర్ ను కలిసిన వారిలో ఎల్.రమణ, మోత్కుపల్లి, రేవూరి ప్రకాష్ రెడ్డి, రావుల ఉన్నారు.

ఎల్ బినగర్ లో ఎస్ వోటీ పోలీసుల దాడులు..

హైదరాబాద్ : ఎల్ బినగర్ లోని లక్ష్మీ నరసింహపురం కాలనీలో శ్రీ లక్ష్మీడెయిరీ ప్రొడక్ట్స్ పై ఎస్ వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. నిర్వాహకుడు యాదగిరిని పోలీసులు అరెస్టు చేశారు. 25 కేజీల పాలపొడి, 108 పాల ప్యాకెట్లు, 8 లీటర్ల ఆల్కాహాల్, 80 లీటర్ల పాడైన పెరుగు, 8 లీటర్ల యాసిడ్ ను సీజ్ చేశారు.

మెట్రో పిల్లర్లపై ట్రాఫిక్ పోలీసుల సర్వే..

హైదరాబాద్ : నగరంలో ప్రమాదాలకు గురవుతున్న మెట్రో పిల్లర్లపై ట్రాఫిక్ పోలీసులు సర్వే నిర్వహించారు. 74 ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నివారణ చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ, మెట్రో రైలు అధికారులకు లేఖ రాశారు.

నలుగురు డిప్యూటి డీఈవోలకు గాయాలు..

ప్రకాశం : మార్టూరు (మం) డేగర్లమూడి వద్ద డివైడర్ ను కారు ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు డిప్యూటీ డీఈవోలకు తీవ్రగాయాలయ్యాయి. విజయవాడ నుండి ఒంగోలు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

నెల్లిమర మున్సిపల్ మాజీ కమిషనర్ ఇంటిపై ఏసీబీ దాడి..

విజయవాడ : నెల్లిమర మున్సిపల్ మాజీ కమిషనర్ అచ్చినాయుడు ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న అనుమానంతో విజయనగరం, విశాఖలోని అచ్చినాయుడు ఇంట్లో తనిఖీలు నిర్వహించింది.

హార్ధిక్ పటేల్ అరెస్టు..

మధ్యప్రదేశ్ : పటీదార్ కోటా నేత హార్దిక్ పటేల్ ను పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రంలోని మంద్ సౌర్ కు వెళుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలే పోలీసులు జరిపిన కాల్పుల్లో పలువురు రైతులు మృతి చెందిన సంగతి తెలిసిందే. మృతి చెందిన రైతుల కుటుంబాలను ఆయన పరామర్శించేందుకు వెళుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

10:59 - June 13, 2017

ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ మ్యాచ్ పై ఆసక్తి నెలకొంటోంది. గత ట్రోఫీలో ఫైనల్ ఆడిన జట్లే మరోసారి తలపడనున్నాయా ? అనే చర్చ జరుగుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో లీగ్ దశ పోటీలు కొద్ది రోజుల కిందట ముగిశాయి. పలు జట్లు సెమీస్ కు చేరుకోగా మరికొన్ని జట్లు ఇంటి దారి పట్టాయి. గ్రూప్ ఏ నుండి ఇంగ్లండ్..బంగ్లాదేశ్ జట్లు సెమీ ఫైనల్ కు చేరుకున్నాయి. లీగ్ ఈ జట్లు నాలుగేసి పాయింట్లు సాధించాయి. ఏ మాత్రం అంచనాలు లేకుండా పసికూన బంగ్లాదేశ్ సెమీస్ లో స్థానం సంపాదించుకోవడం గమనార్హం. ఇక గ్రూప్ బి నుండి భారత్..పాక్ జట్లు సెమీస్ లో స్థానం సంపాదించుకున్నాయి. ఈనెల 14న తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇంగ్లండ్ - పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. మరుసటి రోజు అంటే 15వ తేదీన భారత్ - బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లలో గెలిచే జట్లు ఫైనల్ కు చేరుకుంటాయి. గత ట్రోఫీలో ఫైనల్ లో భారత్ - ఇంగ్లండ్ జట్లు తలపడిన సంగతి తెలిసిందే. అందులో భారత్ విజేతగా నిలిచింది. ఈసారి కూడా అదే జరుగుతుందా ? అని క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాకాకుండా ఫైనల్ లో భారత్ - పాక్ జట్లు చేరిత మ్యాచ్ మరింత ఉత్కంఠభరితంగా మారనుందని క్రీడావిశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి సెమీస్ లో ఏ జట్టు విజయం సాధిస్తాయో..ఫైనల్ లో ఏ జట్లు తలపడనున్నాయో చూడాలంటే 15వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

10:48 - June 13, 2017

గిదే లక్ అంటే. లాటరీలో ఏకంగా రూ. 2,888 కోట్లు చేజిక్కించుకున్నాడు. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ఓ వ్యక్తికి ఈ జాక్ పాట్ తగిలింది. ఇక్కడ లాటరీ నిర్వహించడం అధికారమనే సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మకమైన పవర్ బాల్ కంపెనీ నిర్వహించే లాటరీని కాలిఫోర్నియాకు చెందిన ఓ వ్యక్తి కొనుగోలు చేశాడు. ఈ లాటరీలో ఏకంగా 448 మిలియన్‌ డాలర్లు (2,888 కోట్ల రూపాయలు) గెలుచుకున్నారని సంస్థ ప్రకటించింది. భద్రతా కారణాల రీత్యా అతని గురించి పూర్తి వివరాలు వెల్లడించలేమని సంస్థ పేర్కొంది. ఈ మొత్తంలోంచి స్థానిక పన్నులు, ఇతర చార్జీలు మినహాయించి మిగిలిన మొత్తాన్ని విజేతకు అందజేస్తామని పేర్కొంది. కాలిఫోర్నియాలోని రివర్‌ సైడ్‌ కౌంటీ అనే ప్రాంతంలోని దుకాణం నుంచి విజేత కొనుగోలు చేశారని, ఆ దుకాణ దారులకు కోటిన్నర రూపాయలు అందచేయనున్నట్లు తెలుస్తోంది.

మధ్యప్రదేశ్ లో రైతు ఆత్మహత్య..

మధ్యప్రదేశ్ : రాష్ట్రంలో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 68సంవత్సరాల మఖన్ లాల్ చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందాడు. హోసంగబాద్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.

బుధవారం మంద్ సౌర్ కు మధ్యప్రదేశ్ సీఎం..

మధ్యప్రదేశ్ : రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మంద్ సౌర్ లో పర్యటించనున్నారు. ఇటీవలే నిర్వహించిన ఆందోళనల్లో పోలీసులు జరిపిన కాల్పుల్లో రైతులు మృతి చెందిన సంగతి తెలిసిందే. మృతుల కుటుంబాలను సీఎం పరామర్శించనున్నారు.

10:18 - June 13, 2017

హైదరాబాద్ : సోమవారం ఉదయం గుండె పోటుతో మరణించిన సి. నారాయణరెడ్డిని చివరి చూపు కోసం ప్రముఖులు, అభిమానులు తరలివస్తున్నారు. ఆయన లేని లోటు ఎవరు భర్తీ చేయాలేరని ఆయన శిష్యులు బాధ పడుతున్నారు. ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ రానున్నారు.  పూర్తి వివరాలు వీడియో చూడండి. 

10:10 - June 13, 2017

సిరిసిల్ల : జిల్లా తంగళ్లపెల్లి మండలంలోని జిల్లెలలో దారుణం జరిగింది. అప్పుడే పుట్టిన పసికందును తల్లి వదిలేసి వెళ్లింది. గమనించిన గ్రామస్తులు పసికందును చేరదీశారు. సమాజం తల దించుకునేల జరిగిన ఈ సంఘటన ప్రస్తుత పరిస్థితుకు నిదర్శనం. ఈ ఘటన స్థానికంగా కలంకలం రేపింది. దీని పై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆడప్లి అయినందుకు వదిలి వెళ్లినట్లు తెలుస్తోంది.  

చెరువులోకి ఒరిగిన స్కూల్ బస్సు..

యాదాద్రి భువనగిరి : స్కూల్ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. మోత్కురు శివారులో చెరువుకట్టపై నుండి వెళుతుండగా బోల్ట్ విరిగిపోవడంతో చెరువులోకి బస్సు ఒరిగిపోయింది. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును వెంటనే ఆపివేశాడు. ప్రమాద సమయంలో పది మంది విద్యార్థులు బస్సులో ఉన్నారు.

పోలీసు అధికారి ఇంట్లో డ్రగ్స్ లభ్యం..

పంజాబ్ : రాష్ట్రంలో భారీగా డ్రగ్స్ లభ్యం కావడం సంచలనం సృష్టిస్తోంది. పోలీసు అధికారి ఇంట్లో 4 కిలోల హెరాయిన్, ఏకే 47, రూ. 16 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.

 

కూకట్ పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ ఇంట్లో ఏసీబీ సోదాలు

హైదరాబాద్ : మియాపూర్ భూ కుంభకోణం నిందితుడు కూకట్ పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నగరంలోని ఆయన బంధువుల ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. రూ.50 కోట్ల అక్రమా ఆస్తులు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

పసికందును వదిలేసి వెళ్లిన తల్లి

సిరిసిల్ల : జిల్లా తంగళ్లపెల్లి మండలంలోని జిల్లెలలో దారుణం జరిగింది. అప్పుడే పుట్టిన పసికందును తల్లి వదిలేసి వెళ్లింది. గమనించిన గ్రామస్తులు పసికందును చేరదిశారు. 

యామిని అచూకీ లభ్యం

హైదరాబాద్ : కూకట్ పల్లిలో మిస్సింగ్ అయిన బాలిక యామిని అచూకీ లభ్యమయింది. ఆమె అచూకీ ఖమ్మం జిల్లాలో పోలీసులు కనుగొన్నారు. హైదరాబాద్ చదవడం ఇష్టలేక ఖమ్మం వెళ్లిపోయినట్టు బాలిక తెలిపింది. 

ఏపీలో ఐపీఎస్ బదిలీలకు రంగం సిద్దం

విజయవాడ : ఏపీలో ఐపీఎస్ ల బదిలీలకు రంగం సిద్దమయింది. పలువురు సీనియర్ ఐపీఎస్ లను 10 జిల్లాలకు ఎస్పీలకు బదిలీలకు సీఎం, డీజీపీ సమావేశంలో ఆమోదం తెలపనున్నారు. 

09:33 - June 13, 2017

ఖమ్మం : ఖమ్మంలో కల్తీ కల్లు తయారు చేస్తున్న దుకాణంపై పోలీసులు దాడులు నిర్వహించారు. స్ధానిక ఎంబి గార్డెన్స్‌ వెనుక ఉన్న దుకాణంలో మంచినీటిలో అమ్మోనియా, సోడా కలిపి కృత్రిమంగా కల్లు తయారు చేస్తున్నారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దుకాణంపై దాడి చేసి 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. స్పెషల్ బ్రాంచ్, టాస్క్‌ఫోర్స్, త్రీ టౌన్ పోలీసులు సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించారు. 

09:32 - June 13, 2017

విజయనగరం : భూగర్భ గనుల శాఖా మంత్రి ఆర్‌వీ సుజయ కృష్ణ రంగారావు ఏప్రిల్‌ మంత్రివర్గ విస్తరణలో స్థానం దక్కించుకున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు గెలిపొందిన సుజయకృష్ణ... సొంత జిల్లాలో విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పాలనపై పట్టు సాధించలేక.. పార్టీ వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకోలేక సతమతమవుతున్నారు. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి, సంక్షేమ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం మినహా...పాలనా పరంగా తన వ్యక్తిగత ముద్ర వేసుకోలేకపోతున్నారు.

టీడీపీకి కొత్త కావడం...
టీడీపీకి కొత్త కావడం, సీనియర్ నాయకులతో అంత చనువు లేకపోవడంతో మంత్రి సుజయ్‌కి ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా సీనియర్ నాయకుడైన కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు నీడలో ఉన్నందున...తన కంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకోలేని పరిస్థితి తలెత్తింది. ఈయనకు ముందు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన కిమిడి మృణాళిని తరహాలోనే సుజయ్ కూడా వెళ్తున్నారన్న అపవాదును మూటగట్టుకుంటున్నారు. అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు మంత్రి రంగారావుతో స్వేచ్చగా తమ సమస్యలను, అభిప్రాయాలను చెప్పలేకపోతున్నారట. ముఖ్యంగా టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి ఎన్నికలో సుజయ్‌ కృష్ణ రంగారావు అంటిముట్టనట్టు వ్యవహరించారు. కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావు పర్యవేక్షణలో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక వ్యవహారం జరుగుతుండగా సుజయ్ కేవలం ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారు. ఈ ఎన్నిక వివాదాస్పదంగా మారినా... సుజయ్‌కృష్ణ మాత్రం సైలెంట్‌గా ఉండిపోయారు.

జిల్లాలో అనేక సమస్యలు
జిల్లా అభివృద్ధిపై కూడా మంత్రి సుజయ్‌కృష్ణ దృష్టి పెట్టడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయి. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. కానీ రంగారావు వీటిని పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పదవి చేపట్టిన తర్వాత విజయనగరంలో తొలిసారి ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇటువంటి కార్యక్రమాలను నెలలో రెండుసార్లు నిర్వహించనున్నట్టు ప్రకటించారు. అయితే పార్వతీపురం డివిజన్‌లో జరగాల్సిన ఈ కార్యక్రమం మళ్లీ జరగలేదు. అలాగే తొలిసారి అందిన సమస్యల పరిష్కారం కాలేదు. దీంతో జిల్లాలో పాలన గాడి తప్పిందన్న ఆరోపణలు వస్తున్నాయి. పార్టీపరంగా స్వేచ్చగా తన అభిప్రాయాల్ని చెప్పలేని పరిస్థితిని రంగారావు ఎదుర్కొంటున్నారు. ఏ నిర్ణయం తీసుకుంటే ఏ ఇబ్బందులు వస్తాయోనన్న భయం మంత్రిని వెంటాడుతుందన్న విమర్శలు లేకపోలేదు. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తొలిరోజుల్లో కొంత స్పీడుగా కనిపించినా...తర్వాతర్వాత ఆయన జోరు తగ్గించేశారు. రానున్నది ఎన్నికల సీజన్.. మరి మున్ముందు రంగారావు పనితీరు ఎలా ఉంటుందో వేచి చూడాలి.

ఏపీలో నిలిచిపోయిన ప్రైవేటు బస్సులు

విజయవాడ : ఏపీలో ప్రైవేటు బస్సులు నిలిచిపోయాయి. అరుణాచల్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్ బస్సులు అధికారులు నిలిపివేశారు. దీంతో బెంగళూరు, చెన్నై మార్గంలో ప్రైవేటు బస్సుల కొరత ఏర్పాడింది. 

09:24 - June 13, 2017

ముంబై : బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్కు చిక్కులు తప్పడం లేదు. మహారాష్ట్ర ప్రభుత్వం పెరోల్ పై సంజయ్ దత్‌ను జైలు నుంచి త్వరగా విడుదల చేయడాన్ని బాంబే హైకోర్టు తప్పుపట్టింది. జైలు నుంచి 8 నెలల ముందే ఎలా విడుదల చేస్తారని కోర్టు ప్రశ్నించింది. జైలు కాలంలో సగ భాగం ఆయన పెరోల్‌లోనే ఉన్నందున ముందుగానే ఆయనను ఎలా విడుదల చేశారని హైకోర్టు ప్రశ్నించింది. సంజయ్ ముందస్తు విడుదలపై సమాధానం చెప్పాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో అక్రమంగా ఆయుధాలను కలిగి ఉన్నారన్న నేరంపై కోర్టు సంజయ్ దత్కు అయిదేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. సత్ర్పవర్తన కారణంగా ఎనిమిది నెలల శిక్ష మిగిలి ఉండగానే ఆయనను జైలు నుంచి విడుదల చేశారు.

 

09:21 - June 13, 2017

హైదరాబాద్ : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. చాలా మంది తమకు అనుకూలమైన ప్రాంతానికి ట్రాన్స్‌ఫర్‌ చేయించుకునేందుకు సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు సిఫారసు చేయించుకున్నారు. ఇలా ఎవరి ప్రయాత్నాలు వారు చేసుకున్న తరుణంలో బదీల ఫైలును ముఖ్యమంత్రి కేసీఆర్‌ పక్కన పెట్టడంతో వీరి ఆశలు ఆవిరయ్యాయి. కొందరు భార్యా, భర్తలైన ఉద్యోగులు వేర్వేరు ప్రాంతాల్లో పని చేస్తున్నారు. ఈసారి బదిలీలు జరిగితే ఒకేచోట పనిచేయొచ్చని అనుకున్నారు. ట్రాన్స్‌ఫర్స్‌లో ఇలాంటి వారికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినా, ఇప్పుడు ఈ విషయంలో కూడా వెనక్కి తగ్గింది. పిల్లల విద్య కోసం అనకూలమైన ప్రాంతానికి ట్రాన్స్‌ఫర్‌ చేయించుకోవాలని కొందరు యత్నించారు. కానీ బదిలీల ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతకం చేయకపోవడంతో వీరంతా నిరాశకు లోనువుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయంతో ఉద్యోగ సంఘాల నేతలు అవాక్కయ్యారు. బదిలీలు జరిగితే హైదరాబాద్‌ చుట్టుపక్కల జిల్లాల్లోనే పోస్టింగ్‌లు అడుగుతారన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ అంశాన్ని పక్కన పెట్టిందని అధికార వర్గాల్లో వినిపిస్తోంది. ట్రాన్స్‌ఫర్స్‌ జరిగితే కొత్త జిల్లాలకు వెళ్లడానికి చాలా మంది సుముఖంగా లేరన్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది.

జిల్లాల్లో పాలన కుంటుపడుతుంది...
ఇలా అయితే కొత్త జిల్లాల్లో పరిపాలన కుంటుపడుతున్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ బదిలీల ఫైలును పక్కన పెట్టారని అధికార వర్గాల్లో వినిపిస్తోంది. ప్రమోషన్లు, నియామకాల ప్రక్రియ పూర్తైన తర్వాత సాధారణ బదిలీలకు అనుమతించాలన్న అధికారుల సూచనను ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిగణలోకి తీసుకున్నట్టు సమాచారం. రాష్ట్రంలో 2.88 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో చాలా మంది ఐదేళ్లుగా ఒకేచోట విధులు నిర్వహిస్తున్నారు. ప్రమోషన్లు నిలిచిపోయాయి. పదోన్నతులు, నియమాకాల ప్రక్రియ పూర్తైన తర్వాత బదిలీలు చేపడితో పాలన సజావుగా సాగుతుంది. దిగువస్థాయిలో సిబ్బంది లేకపోతే పరిపాలన అస్తవ్యస్తంగా మారుందన్న ఉద్దేశంతో ఉన్న సర్కారు... ట్రాన్స్‌ఫర్లను ప్రస్తుతానికి పక్కన పెట్టింది. ప్రజాప్రనిధులతోపాటు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు బదిలీలపై నిషేధాన్ని తొలగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి విజ్ఞప్తి చేశారు. కానీ ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఇందుకు అనుమతి ఇవ్వొద్దన్న సూచనలను కేసీఆర్‌ పరిగణలోకి తీసుకోవడంతో బదిలీల ప్రక్రియ ఆగిపోయిందని చెబుతున్నారు. ఉద్యోగుల్లో ఇది కొంత అసంతృప్తికి కారణం అవుతోంది. 

09:18 - June 13, 2017

హైదరాబాద్ : నగరంలోని పాతబస్తీ లో ఓ చిన్నారి మొదటి అంతస్తు నుంచి క్రింద పడింది. క్రింద వారు వెంటెనే స్పందించి పాపను రక్షించాడానికి ప్రయత్నించారు. కానీ అప్పటికే పాప అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో వాళ్ల అమ్మనాన్నలకు తెలపడంతో వారు పాపను లక్డీకపుల్ లోని ఆసుపత్రికి తీసుకెళ్తున్నామని చెప్పి వెళ్లారు. దీని పై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని, దర్యాప్తు చేస్తున్నామని బహదుర్ పుర పోలీసులు తెలిపారు. పాప ప్రమాదవశత్తు పడింద లేక కావాలనే తోసేశారా అనేది చూడాలి. 

09:11 - June 13, 2017

ఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతో టీఆర్ఎస్ ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్‌ భేటీ అయ్యారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని వినపత్రి అందజేశారు. రాష్ట్ర జీడీపీ 19 శాతానికి పెరిగిన విషయాన్ని ప్రస్తావించారు. FRBM చట్టం ద్వారా తీసుకునే రుణ పరిమితిని పెంచాలని కోరారు. తెలంగాణలోని తొమ్మిది వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన 450 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని అరుణ్‌ జైట్లీకి విన్నవించారు. 

09:09 - June 13, 2017

హైదరాబాద్ : తెలంగాణాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మూడేళ్లు పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌..ఇప్పటి నుంచే వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ప్రణాళిక‌లు అమ‌లు చేస్తున్నారు. త‌మ పార్టీ నేత‌లు క‌డుపు, నోరు క‌ట్టుకుని తెలంగాణా రాష్ట్రాభివృద్ధి కోసం ప‌నిచేస్తున్నార‌ని ఎన్నో వేదిక‌ల‌పై కేసీఆర్ చెప్పుకొచ్చారు. అయితే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడ్డ త‌ర్వాత వెలుగు చూస్తున్న వివాదాలు ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా బ‌య‌ట‌ప‌డుతున్నాయి. పార్టీలో కీల‌కంగా వ్యవహరించే నేత‌ల‌కు వివాదాల‌కు సంబంధం ఉంటుంద‌న్న విమర్శలు అధికార పార్టీ నేత‌ల‌ను అయోమ‌యానికి గురి చేస్తున్నాయి. బ‌య‌ట ప‌డుతున్న బాగోతాలు పార్టీ ప్రతిష్టకు భంగం క‌లిగించేవిగా ఉన్నాయ‌న్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

ఎంసెట్ లీకేజీతో మొదలు..
అధికార పార్టీ నేత‌ల చుట్టూ బిగుసుకున్న వివాదాలను ఓసారి ప‌రిశీలిస్తే..ఎంసెంట్ లీకేజీ వ్యవహారంలో కీల‌క నేత‌ల‌కు సంబంధం ఉంద‌న్న ఆరోప‌ణ‌లు వెలుగు చూసినా..పార్టీ నేత‌ల‌కు ఎలాంటి సంబంధం లేద‌న్నట్లుగానే విచార‌ణ‌ పూర్తయింది. అలాగే గ్యాంగ్‌స్టర్‌ న‌యూం వ్యవహారంలో కూడా గులాబీ నేత‌ల‌కు ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్నాయ‌న్న విష‌యం స్పష్టమైనా త‌మ పార్టీ నేత‌ల‌కు ఎలాంటి సంబంధం లేద‌ని ముఖ్యమంత్రి అసెంబ్లీలో స్వయంగా వెల్లడించారు. ఈ విష‌యంలో ఇంకా సిట్ విచార‌ణ కొనసాగుతూనే ఉంది.అయితే తాజాగా వెలుగుచేస్తున్న వివాదాలు అధికార పార్టీ నేత‌ల‌కు కొత్త చిక్కులు తెచ్చి పెట్టేవిగా క‌నిపిస్తున్నాయి.

ఇప్పుడు గ్రూపు 2....
గ్రూప్-2 వ్యవహారం రోజురోజుకు వివాదాస్పదంగా మారుతోంది. ఓ జిల్లాకు చెందిన అభ్యర్థులు భారీగా ఎందుకు ఎంపిక‌వుతార‌న్న ప్రశ్నలకు అధికార పార్టీ నేత‌ల నుంచి సమాధాన‌మే లేదు. వేల కోట్ల రుపాయ‌ల భూ కుంభకోణంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అత్యంత స‌న్నిహితులుగా ఉన్న వారి వివరాలు వెలుగు చూసినా...వివాదం ముదురుతున్న కొద్దీ సీఎంకు స‌న్నిహితులుగా ఉన్న వారి వ్యవహారం మ‌రుగున ప‌డుతోంది. కొత్త పేర్లు తెర‌పైకి వ‌స్తున్నాయి. ఇందులో భాగంగానే రాజ్యసభ స‌భ్యుడు కేకే కొనుగోలు చేసిన భూముల అంశం పార్టీలో చ‌ర్చనీయాంశంగా మారింది. తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్న స‌మ‌యంలో ప్రభుత్వ అధికారుల సూచ‌న‌ల‌తోనే భూ కొనుగోళ్లు చేసిన‌ట్లు కేకే స్పష్టం చేస్తున్నారు. భూ కొనుగోళ్లు అక్రమాలనుకుంటే తాను కోర్టుకు వెళ్లి స‌మ‌స్యను పరిష్కరించుకుంటానన్న ధీమాను కెకె వ్యక్తం చేస్తున్నారు. అయితే పార్టీ ప‌రంగా మాత్రం నేత‌లు కెకే విష‌యంలో త‌మ‌కు ఎలాంటి సంబంధం లేద‌ని చెప్పుకునే ప్రయ‌త్నాలు చేస్తున్నాయి. ముఖ్యమంత్రి స‌న్నిహితుల వ్యవహారంపై నేత‌లు స్పందించేందుకు సాహసం చేయ‌డంలేదు. అధికార పార్టీ నేత‌ల చుట్టూ ముసురుకుంటున్న వివాదాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవహరిస్తున్న తీరు కూడా చ‌ర్చకు దారి తీస్తోంది. ఈ వివాదాల‌పై సీఎం కేసీఆర్‌ స్పందించ‌కపోవ‌డం మ‌రిన్ని అనుమానాల‌ను పెంచుతోంది.

నేడు కరీంనగర్ కు కేంద్ర కార్మిక డిప్యూటీ కమిషనర్

కరీంనగర్ : నేడు కేంద్ర కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ శ్యాంసుందర్ సమక్షంలో సింగరేణి యాజమాన్యం జాతీయ కార్మిక సంఘాలతో సమ్మెపై చర్చలు జరపునున్నారు.

 

07:46 - June 13, 2017

నేడు ప్రమాదకార స్థితికి ఆర్థిక నేరాలు జరుగుతున్నాయని, ప్రస్తుతం డబ్బున్న వారు భూముల మీద పెట్టుబడి పెడుతున్నారని, అధికారంలో ఉన్న నాయకులు కబ్జాదారులకు సపోర్ట్ చేయడం, సిట్ కంటితుడుపు చర్య, రాష్ట్రంలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని టెన్ టివి న్యూస్ మార్నింగ్ చర్చలో పాల్గొన్న విశ్లేషకులు లక్ష్మీనారాయణ, వైసీపీ నేత రమేష్ అన్నారు. గతంలో 293 ఎకరాలు కబ్జాకు గురైందని టీడీపీ నేత దుర్గప్రసాద్ అన్నారు. 

07:44 - June 13, 2017

 

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది... గ్రూప్ 2 పరీక్షల నియామక ప్రక్రియపై న్యాయస్థానం మూడు వారాలపాటు స్టే ఇచ్చింది... కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చేపట్టిన గ్రూప్‌ 2 పరీక్షలు వివాదాస్పదమయ్యాయి.. గ్రూప్‌ 2 నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలొచ్చాయి.. జవాబు పత్రంపై వైట్‌నర్‌ వాడితే ఆ పత్రాలను పెండింగ్‌లో పెడతామంటూ అధికారులు ముందు ప్రకటించారు.. అయితే ఫలితాల్లోమాత్రం వైట్‌నర్‌వాడిన ఆన్సర్‌షీట్లనూ పరిగణలోకి తీసుకున్నారంటూ కొందరు అభ్యర్థులు ఆరోపించారు.. దీనిపై హైకోర్టును సైతం అభ్యర్థులు ఆశ్రయించారు.

ప్రతి పరీక్షలోను గందరగోళం
తెలంగాణ ఏర్పాటైన మూడేళ్లతర్వాత టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదలచేసింది.. 1032 పోస్టులకు నోటిఫికేషన్ రాగా... గత నవంబర్‌లో పరీక్షలు నిర్వహించారు.. దాదాపు 5లక్షల 65వేల మంది ఈ పరీక్షలకు హాజరయ్యారు.. ఈ ఫలితాలను గతవారం టీఎస్‌పీఎస్‌సీ ప్రకటించింది.. మూడువేలమందిని ఎంపిక చేసిన సర్వీస్‌ కమిషన్‌... సర్టిఫికెట్లు వెరిఫికేషన్‌ చేయించుకోవాలని సూచించింది..

అయితే టీఎస్‌పీఎస్‌సీ ఎంపిక చేసినవారిలో డబుల్ బబ్లింగ్ చేసినవారు.. ఆన్సర్‌షీట్లలో వైట్‌నర్‌ వాడినవారు ఎక్కువమంది ఉన్నారని ఆరోపణలొచ్చాయి.. అలాగే 42 ప్రశ్నలు తప్పులతడకలుగా వున్నాయంటూ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఒప్పుకోవడంపైకూడా విమర్శలు వచ్చాయి.. దీనిపై నిరుద్యోగులు భగ్గుమన్నారు.. పరీక్షా ఫలితాలపై ప్రతిపక్షాలూ సందేహం వ్యక్తం చేశాయి.

మళ్లి పరీక్షలు నిర్వహించాలి
గ్రూప్‌ 2 ఫలితాలు వివాదాస్పదంకావడంతో ఈ పరీక్షలు మళ్లీ నిర్వహించాలన్న డిమాండ్ మొదలైంది.. ఓయూలో ఘంటా చక్రపాణి టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్‌ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.. ఘంటా చక్రపాణి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.రాష్ట్ర ఏర్పాటుకుముందు APPSC అనేక ఆరోపణలు ఎదుర్కొంది... ఇప్పడు TSPSC కూడా అదేబాటలో నడుస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి.. రాష్ట్రం విడిపోయినా కమిషన్ విధానం మారలేదంటూ అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి.

 

07:42 - June 13, 2017

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న గురుకుల విద్యాలయాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో బోధన జరిగే విధంగా చర్యలు తీసుకుంటోంది. కేజీ టూ పీజీ ఉచిత విద్య హామీని అమలు చేసే క్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల కోసం ప్రత్యేకంగా గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి గురుకుల పాఠశాలలను ప్రారంభిస్తున్నారు. మొత్తం 255 రెసిడెన్షియల్‌ స్కూళ్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. విద్యా సంవత్సరం ప్రారంభం రోజే 169 పాఠశాలలను అందుబాటులోకి తీసుకురావడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. వీటిలో 119 బీసీ, 50 మైనారిటీ విద్యాసంస్థలు ఉన్నాయి. బీసీ గురుకులాల్లో 56 బాలురకు, 63 బాలికలకు కేటాయించారు. ఈనెల 15న మరో 50, 19న ఇంకో 21 స్కూళ్లను ప్రారంభిస్తారు. ఇంతకు ముందు రాష్ట్రంలో 259 గురుకుల పాఠశాలలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు వీటి సంఖ్య 527కు చేరింది. వీటిని 786కు పెంచాలని నిర్ణయించింది. ఈ స్కూళ్లలో చేరే బాలికలకు ప్రత్యేక భద్రత కల్పిస్తారు. ఒక్కో విద్యార్థికి ఏడాదికి లక్షా 25 వేల రూపాయలు ఖర్చు చేస్తారు.

కొత్తగా మైనార్టీలకు
తెలంగాణ రాక ముందు మైనారిటీలకు గురుకుల పాఠశాలలు లేవు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 71 రెసిడెన్షియల్‌ స్కూళ్లను ప్రారంభించారు. మరో 12 ప్రభుత్వ పాఠశాలలను గురుకుల విద్యాలయాలుగా మార్చారు. ఇక ఈ విద్యా సంవత్సరంలో 121 స్కూళ్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటిలో 5,6,7 తరగతుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఒక్కో ఏడాది ఒక్కో తరగతి పెంచుకుంటూ పోతారు. ప్రతి స్కూల్లో 240 మంది విద్యార్థులు ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇంటర్‌కు వచ్చే వరకు ఈ సంఖ్య 640కి చేరుతుంది. ప్రస్తుతం అద్దె భవనాల్లో నడుస్తున్న గురకుల పాఠశాలలకు దశలవారీగా సొంత భవనాలు నిర్మిస్తారు. అన్ని రెసిడెన్షియల్‌ స్కూళ్లలో 24 వేల మంది ఉపాధ్యాయులు అవసరం అవుతారని లెక్క తేల్చారు. దశలవారీగా నియామకాలు చేపడతారు. ఈ స్కూళ్లలో ప్రవేశం పొందిన విద్యార్థుల కోసం యూనిఫారాలు సరఫరా చేసే బాధ్యతలను తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంఘానికి అప్పగించారు. గురుకుల పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అన్ని రకాల పోటీ పరీక్షలకు హాజరయ్యే విధంగా తర్ఫీదు ఇస్తారు. 

07:39 - June 13, 2017

హైదరాబాద్ : ప్రధాన ప్రతిప‌క్షం..ప్రజ‌ల వాణీగా ఉంటూ..ప్రభుత్వాన్ని ఎండ‌గ‌ట్టడ‌మే డ్యూటీ,..ప్రభుత్వం ప‌నితీరుపై భూత‌ద్దంతో చూస్తూ..ప్రజ‌ల‌కు అన్యాయం జ‌ర‌గ‌కుండా చూడాల్సిన బాధ్యత. ఇక స‌ర్కార్ వైఫల్యాల‌ను అందడ‌మే తరువాయి..వాటిని ఆయుధాలుగా చేసుకుని..స‌ర్కార్‌పై పోరుకు కార్యాచరణ తీసుకోవ‌డం ప్రతిప‌క్షపార్టీ విధానంగా ఉంటుంది. అయితే ఇదే అంశం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో హాట్ హాట్‌గా మారింది. ప్రధాన ప‌తిప‌క్షంగా ఉండి కూడా ఆ స్థాయిలో ప్రభుత్వంపై పోరాడ‌టం లేద‌న్న అభిప్రాయం ఇప్పుడు నేత‌ల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పార్టీకి పెద్ద దిక్కులుగా ఉన్న పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి వ్యవహార‌శైలిపై నేత‌లు గుసగుస లాడుకుంటున్నారు. ప్రభుత్వ వైఫల్యాల‌పై పోరుకు పార్టీకి కార్యాచ‌రణ ఇస్తూ..క్యాడ‌ర్‌ను ముందుండి న‌డ‌పాల్సిన పీసీసీ చీఫ్ ఉత్తమ్‌, సీఎల్పీ నేత జానారెడ్డిలు ఆప‌ని చేయ‌డం లేద‌న్న అభిప్రాయం నేత‌ల్లో వ్యక్తమవుతోంది. దీనికి వారు రాష్ట్రంలో జ‌రుగుతున్న అంశాల‌ను ఉద‌హ‌రిస్తున్నారు.

ప్రెస్ మీట్లకే పరిమితం..
ముఖ్యంగా టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన త‌ర్వాత‌ ఈ మ‌ధ్య కాలంలో ప్రభుత్వం త‌ప్పిదాలు చేస్తున్నా ఈ ఇద్దరు నేత‌లు వాటిని రాజ‌కీయంగా పార్టీకి అనుకూలంగా మ‌లుచుకోవడంలేదన్నది నేత‌ల వాద‌న‌. ప్రాజెక్టుల కోసం భూ సేక‌ర‌ణ‌, రీడిజైన్ అంశంలో జరుగుతున్నఅవినీతిపై ప్రెస్ మీట్లకే ప‌రిమిత‌మ‌య్యార‌ని విమర్శిస్తున్నారు. ఇక ఈ మ‌ధ్య ప్రభుత్వాన్ని షేక్ చేసే అంశాలు వ‌చ్చినా..వాటిని ప‌ట్టుకోవ‌డ‌లో వీరిద్దరు విఫలం అయ్యారని అనుకుంటున్నారు. ముఖ్యంగా ఖ‌మ్మం జిల్లాలో రైతుల ఆందోళ‌న‌ల‌పై పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ భ‌ట్టి విక్రమార్క, వీహెచ్‌లు కొంత హ‌డావిడి చేసినా..పీసీసీ చీఫ్‌ ఆమేర‌కు ప‌ట్టించుకోలేదని టాక్. ముఖ్యంగా రైతుల‌కు బేడీలు వేసిన అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా కార్యాచరణ తీసుకోవాల్సింది పోయి..ఉత్తమ్‌, జానారెడ్డి ప్రెస్ మీట్‌కే ప‌రిమితమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ఏకంగా సీఎం కేసీఆర్ సొంత గ్రామంలో ఓ మ‌హిళా రైతు ఆత్మ హ‌త్య చేసుకుంటే..టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆ గ్రామానికి వెళ్లి హ‌డావిడి చేసినా..కాంగ్రెస్ పార్టీ నుండి ఉత్తమ్‌, జానా రెడ్డిలు ఆ అంశాన్ని కనీసం ప్రస్తావించలేదు. ఇక సీఎం క్యాంప్ ఆఫిస్ ముందు ఓ రైతు ఆత్మహత్యకు ప్రయత్నించడం,.అంతేకాకుండా స‌చివాల‌యంలో దేవ‌న్న అనే రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసిన ఘ‌ట‌న‌పై ప్రభుత్వాన్ని ఎండ‌గ‌ట్టే అవ‌కాశం ఉన్నా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి దాన్ని క‌నీసం ప‌ట్టించుకోకపోవ‌డంలేదని నేత‌లు గుర్రుగా ఉన్నారు. ఇదే కాకుండా..ధ‌ర్నాచౌక్ త‌రిలింపుకు నిర‌స‌న‌గా కోదండరాం, వామ‌ప‌క్షాలు, రేవంత్‌రెడ్డిలు హడావిడి చేస్తే..కాంగ్రెస్ నుండి వీహెచ్ మినాహా..ఈ ఇద్దరు నేత‌లు స‌రిగ్గా వ్యవహరించలేదన్నది పార్టీలో టాక్.

భూ కుంభకోణం పై
ఇక తాజాగా రాష్ట్రవ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారిన మియాపూర్ భూ కుంబ‌కోణం వ్యవహారంలో కూడా వీరిద్ధరు నేత‌ల తీరును కార్యకర్తలు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈస్కాంలో కేసీఆర్ ఫ్యామిలీ, మంత్రులు, పలువురు అధికారుల ప్రమేయం ఉంద‌నే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు..ఏకంగా పార్టీ ఎంపీ కే కేశ‌వ‌రావ్ ల్యాండ్ కొనుగోలు బ‌య‌ట‌ప‌డ్డా..దీనిపై ఉత్తమ్‌ ప్రెస్ మీట్‌కే పరిమితం అయితే..ఇక జానారెడ్డి దీనిపై ఇప్పడి వర‌కు స్పందించ‌నే లేదు. స‌ర్కార్‌కు వ్యతిరేకంగా నిర‌స‌న‌ల‌తో హోరెత్తించి..ప్రధాన ప్రతిప‌క్షంగా ప్రభుత్వాన్ని షేక్ చేయాల్సింది పోయి..దానిపై మౌనాన్ని పాటిస్తుడంతో..ఇప్పుడు పార్టీ క్యాడ‌ర్‌లో తీవ్ర చ‌ర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వంపై పైచేయి సాధించేందుకు ఇంత‌టి సువ‌ర్ణ అవ‌కాశం ద‌క్కినా..దాన్నిప‌ట్టించుకోకుండా..ఉత్తమ్‌, జానారెడ్డిలు మౌనవ్రతం వ‌హిస్తుండ‌టం ఏంటీని నేత‌లు గ‌రం గ‌రం అవుతున్నారు.మొత్తానికి పార్టీ క్యాడ‌ర్‌కు దిశా నిర్ధేశం చేస్తూ..ప్రభుత్వ వైఫల్యాల‌ను ఆయుధంగా చేసుకుని..స‌ర్కార్‌పై పోరు సాగించాల్సిన ఉత్తమ్‌, జానారెడ్డి ఇలా అవ‌కాశాల‌పై అంటీముట్టన‌ట్లు వ్యవహరిస్తే..ఎలా అన్నదే ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. మ‌రి ఇప్పడికైనా..వీరు రూట్ మార్చుతారో లేదో చూడాలి.

07:37 - June 13, 2017

గుంటూరు : నీరు-ప్రగతి, వ్యవసాయరంగం, పోలవరం సహా ప్రాధాన్య ప్రాజెక్టులకు సంబంధించి జలవనరులు, వ్యవసాయ శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సమీక్షకు, 13 జిల్లాల కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా చేసేందుకు సూక్ష్మపోషకాలను ఉచితంగా పంపిణీ చేయాలని...పత్తి మినహా మిగతా పంటలకు సంబంధించి విత్తన రాయితీని 35 శాతం నుండి 70 శాతం వరకు పెంచాలని నిర్ణయించారు. రైతులకు ఇచ్చే ఇన్ పుట్ సబ్సిడి 1600 కోట్లను ఈ నెల 14 నుంచి 20వరకు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

90 రోజుల్లో పూర్తి చేయాలి
నీరు-ప్రగతి 90 రోజుల కార్యక్రమం కింద నిర్దేశించుకున్న లక్ష్యాలను పూర్తిచేసేందుకు ఇంకా 38 రోజుల సమయమే మిగిలివుందని, పనులు మరింత వేగం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గోదావరి డెల్టాకు ఈ సీజన్‌లో ముందుగానే నీటిని విడుదల చేశామని, కృష్ణా డెల్టాలో నారుమళ్లు త్వరగా పూర్తిచేసేందుకు సీలేరు నుంచి నీటిని తక్షణం అందించాలని సీఎం సూచించారు. ఖరీఫ్‌ సాగుపై అన్ని జిల్లాల కలెక్టర్లు దృష్టి పెట్టాలని, నారుమళ్లు ఆలస్యం కాకుండా చూడాలన్నారు. ఏరువాక, గంగపూజలు రాష్ట్ర ఉత్సవాలుగా జరుపాలని సీఎం సూచించారు. ఈ నెల 16న రెయిన్ గన్లను ప్రయోగాత్మకంగా వినియోగించాలని, ఈసారి వ్యవసాయరంగ వృద్ధి రేటును గణనీయంగా పెంచాలని చంద్రబాబు, అధికారులను ఆదేశించారు.

07:35 - June 13, 2017

గుంటూరు : విశాఖ భూకుంభకోణంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరైన భేటీలో భూకుంభకోణంపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు మూడు గంటలపాటు ఈ సమావేశం జరిగింది. విశాఖలోని మధురవాడ, కొమ్మాది ప్రాంతాల్లో వందల ఎకరాల భూమి అన్యాక్రాంతమైంది. దీనిలో ప్రభుత్వ, ప్రైవేటు భూములతోపాటు అటవీశాఖ భూములు ఉన్నాయి. దాదాపు 300 ఎకరాలు ఆక్రమణలకు గురైనట్టు గుర్తించారు. భూకబ్జాల వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆరోపణలు వచ్చాయి. సమీక్షలో పాల్గొన్న విశాఖ జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ భూఆక్రమణలపై పెద్ద ప్రాథమిక సమాచారం అందజేశారు. దీనిని పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు..ఈ వ్యవహారం వెనుక ఎంతటివారున్నా ఉపేక్షిచేందిలేదని స్పష్టం చేశారు. సిట్‌ దర్యాప్తు నివేదిక అధారంగా ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

బహిరంగ విచారణ లేనట్టే...
విశాఖ భూఆక్రమణలపై ఈనెల 15న బహిరంగ విచారణ జరగాల్సి ఉంది. సిట్‌ ఏర్పాటు నేపథ్యంలో ఇది లేనట్టేనని భావిస్తున్నారు. ఇద్దరు ఉప ముఖ్యమంత్రు కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప కూడా ఈ అంశాన్ని దాట వేశారు. సిట్‌ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు ఉంటాయని ముక్తాయింపు ఇచ్చారు. విశాఖ భూకుంభకోణంపై సిట్‌ దర్యాప్తుకు నిర్ధిష్ట కాలపరిమితి నిర్ణయించలేదు. దీంతో నివేదిక ఎప్పటి వస్తుందో ఎవరికీ అంతుపట్టని పరిస్థితి. ఈ వ్యవహారంలో ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. దీంతో టీడీపీ ప్రభుత్వ ప్రతిష్ఠ మసకబారుతోండటంతో సిట్‌ దర్యాప్తుకు ఆదేశించారు. భూఆక్రమణల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు సిట్‌ దర్యాప్తు ఓ ఎత్తుగడ అన్న వాదనలు లేకపోలేదు. కుంభకోణానికి పాల్పడ్డ ప్రభుత్వ పెద్దలు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశంలేకపోతేదని భావిస్తున్నారు. సిట్‌ ఏం తేలుస్తుందో, ఎవరిని నిందితులుగా గుర్తిస్తుందో, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

 

07:08 - June 13, 2017

పెట్రోల్, డీజిల్ ధరలు ఇక ఏ రోజుకారోజే నిర్ణయిస్తారు. 15 రోజుల కొకసారి పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షించే విధానానికి ఇక స్వస్తి చెబుతున్నారు. ఈ నెల 16 నుంచి కొత్త విధానం అమలులోకి తెస్తున్నట్టు ఇప్పటికే ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. అయితే, ఏ రోజుకారోజు ధరలను నిర్ణయించే విధానంపై పెట్రోల్ బంక్ ల యజమానులు తీవ్ర అసంతృప్తిని వ్యతిరేకిస్తున్నారు. రోజువారీ ధరల సమీక్షకు వ్యతిరేకంగా ఈ నెల 16న ఒక రోజు సమ్మె చేపట్టేందుకు పెట్రోల్ బంక్ ల యజమానులు సిద్ధమవుతున్నారు. ఈ అంశంపై టెన్ టివి జనపథంలో ఆంధ్రప్రదేశ్ పెట్రోల్ డీజిల్ డీలర్స్‌ అసోసియేషన్ నాయకులు చుంచు నరసింహారావు విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.....

 

నేడు గవర్నర్ కలవనున్న టీ.టీడీపీ

హైదరాబాద్ : నేడు తెలంగాణ టీడీపీ నేతలు గవర్నర్ ను కలవనున్నారు. వియాపూరు భూస్కామ్ పై టీడీపీ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. 

నేటి నుంచి కంచిలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పర్యటన

తమిళనాడు : నేటి నుంచి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కంచిలో పర్యటించనున్నారు. ఆయన పలు దేవాలయాలు సందర్శించనున్నారు. 

Don't Miss