Activities calendar

14 June 2017

21:27 - June 14, 2017

ఢిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై పార్లమెంట్‌ భవనంలో ప్రతిపక్ష పార్టీలు చర్చలు జరిపాయి. కాంగ్రెస్‌ నేతలు గులాంనబీ ఆజాద్‌, మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో చర్చలు జరిగాయి. ఈ సమావేశానికి ఆర్జేడి, ఎన్సీపి, వామపక్షాలు తదితర 9 పార్టీల నేతలు హాజరయ్యారు. దేశంలో మతోన్మాద ఘర్షణల పరిస్తితులు నెలకొన్న నేపథ్యంలో రాజ్యాంగ విలువలు కాపాడే వ్యక్తి రాష్ట్రపతిగా ఉండాలని ప్రతిపక్షాలు భావిస్తున్నట్లు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై ప్రతిపక్షాలతో చర్చలకు కేంద్రం ఇప్పటికే ఆలస్యం చేసిందన్నారు. ప్రభుత్వం తరపున అభ్యర్థిని ప్రకటించిన తర్వాతే విపక్షాలు నిర్ణయం తీసుకోనున్నాయని ఏచూరి తెలిపారు. 

21:26 - June 14, 2017

ఢిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధాని నేతృత్వంలో బిజెపి కోర్‌ కమిటి సమావేశమైంది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, వెంకయ్యనాయుడు రాష్ట్రపతి ఎన్నికపై ప్రధాని నరేంద్రమోదితో చర్చించారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై ఏకాభిప్రాయం కోసం బిజెపి ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీ సభ్యులుగా ఉన్నారు. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో పాటు, ఎన్సీపీ, బిఎస్పీ నేతలతో వెంకయ్యనాయుడు చర్చలు జరిపారు. త్రిసభ్య కమిటీ సభ్యులు శుక్రవారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఇతర పార్టీ నేతలతో సమావేశమై రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై చర్చించనున్నారు. జూన్‌ 23న ఎన్డీయే తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసే అవకాశముంది. మరోవైపు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పదవీకాలం జులై 24తో ముగుస్తున్నందున ఈసీ ఇవాళ నోటిఫికేషన్‌ జారీ చేసింది. నేటి నుంచి జూన్‌ 28 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. జులై 17న రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతాయి. జులై 20న ఫలితాలు వెల్లడిస్తారు.  

21:24 - June 14, 2017

హైదరాబాద్: మియాపూర్‌ భూ కుంభకోణంతో సీఎం కేసీఆర్‌కు సంబంధాలున్నాయని... కాంగ్రెస్‌ ఆరోపించింది.. మియాపూర్‌తోపాటు.. హఫీజ్‌పేట, బండ్లగూడ, ఇబ్రహీంపట్నంలో విలువైన భూముల్ని ప్రభుత్వ అండతో గోల్డ్ స్టోన్‌ సంస్థ దోచుకుందని.. తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మండిపడ్డారు.. ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.. మియాపూర్‌ భూముల్ని పరిశీలించిన తెలంగాణ కాంగ్రెస్‌ నేతల బృందం.. ఈ భూములపై గవర్నర్‌ నరసింహన్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు..

21:22 - June 14, 2017

సిద్ధిపేట : కుకునూరుపల్లి పీఎస్‌కు వచ్చిన ఎస్సై ప్రభాకర్‌రెడ్డి భార్య రచన..కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. శిరీషతో తన భర్తకు సంబంధం లేదన్నారు. పూర్తిగా నిర్ధారణ అయ్యే వరకు తన భర్త మృతదేహాన్ని తీసుకెళ్లనని రచన తేల్చిచెప్పారు.

21:20 - June 14, 2017

హైదరాబాద్‌ : గరంలో బ్యూటీషీయన్‌ శిరీష...సిద్దిపేట కమిషనరేట్‌ పరిధిలో ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ...ఈ రెండు సూసైడ్ కేసుల్లో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. ఈ రెండు ఘటనలకు లింకు ఉందని పోలీసుల కథనం. శిరీషపై ఎస్సై ప్రభాకర్‌రెడ్డి లైంగిక దాడి చేశాడని.. అవమానం భరించలేక శిరీష ఆత్మహత్య చేసుకుందని.. విషయం బయటపడుతుందన్నభయంతో ఎస్సై కూడా రివాల్వర్‌తో కాల్చుకున్నాడని చెబుతున్నారు. వీరిద్దరికీ ఉన్న లింకులేంటి..? అసలేం జరిగింది..?

ఎస్సై,శిరీష ఆత్మహత్యలో కొత్తకోణం..

హైదరాబాద్‌ బ్యూటీషియన్‌ శిరీష అనుమానాస్పద మృతిపై పోలీసులు ఆర్‌జే ఫోటోగ్రఫీ యజమాని రాజీవ్, అతని స్నేహితుడు శ్రావణ్‌లపై అనుమానాలు రావడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు...శిరీష కేసులో విచారిస్తుండగానే వారికి తెలిసిన నిజం విస్తుపోయేలా చేసింది...శిరీష ఆత్మహత్యకు కారణాన్ని వారు చెప్పడంతో షాక్‌కు గురయిన పోలీసు ఉన్నతాధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు...అప్పటివరకు ఆమె మరణానికి ఎన్నో అనుమానాలతో పోలీసులు దర్యాప్తు చేయగా అసలు నిజం తెలిసి కలరవపడ్డారు...

శిరీషపై ఎస్ఐ పైశాచిక పంజా...

బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య విషయాన్ని తెలుసుకున్న సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి కాల్చుకున్నట్లు తేలింది..శిరీషను రెండ్రోజుల ముందుకు కలుసుకున్న ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆమెపై పైశాచిక పంజా విసిరినట్లు తేలింది...ఈ విషయంలోనే వారి మధ్య గొడవలు జరుగుతుండగా శిరీష మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు తెలిసిన సమాచారం..ఇదే సమయంలో శిరీష మరణవార్త తెలిసి ఆందోళన చెందిన ఎస్సై క్వార్టర్స్‌లోనే రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు...

మద్యం మత్తులో జరిగిన ఘోరం..!

ఇదిలా ఉంటే జరిగిన ఘటనలో ఎన్నో అనుమానాలకు తావిస్తుంది...గతం నుంచే ఎస్సై ప్రబాకర్‌రెడ్డి, శిరీషల మధ్య పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది..అయితే ఎస్సై ఈ పరిచయంతోనే మద్యం మత్తులో పంజా విసిరినట్లు తెలుస్తోంది...

ఆదివారం రాత్రి కూకునూర్‌పల్లిలో పార్టీ...

ఆదివారం రాత్రి స్నేహితులైన రాజీవ్,శ్రావణ్,రాజీవ్‌ స్నేహితురాలు తేజస్విని,శిరీషలు కుకునూరుపల్లికి వెళ్లి పార్టీ చేసుకున్నారు..అక్కడే రాత్రి సమయంలో మత్తులో ప్రభాకర్‌రెడ్డి శిరీషపై అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది..దీంతో గొడవ మొదలుకాగా..అదే రాత్రి వచ్చినా వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి..ఇదే క్రమంలో శిరీష సోమవారం అర్థరాత్రి వరకు ఆఫీస్‌లోనే ఉండి వారితో ఇదే విషయంపై గొడవపడింది..వారంతా ఆపీస్ కిందకు వచ్చిన సమయంలో ఆమె ఉరేసుకుంది...మంగళవారం పోస్టుమార్టం కాగా...అనుమానాలపై పోలీసులు రాజీవ్,శ్రావణ్‌లను అదుపులోకి తీసుకున్నారు...ఈ విషయం బుధవారం ఉదయం కలకలం రేపగా విషయం తెలిసిన ఎస్సై తన పేరు బయటకు వస్తుందని...తన పరువుపోతుందని కాల్చుకున్నట్లు తెలుస్తోంది...

ఉన్నతాధికారులు రంగంలోకి...

ఇదిలా ఉంటే సంచలనం రేపిన ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్యలో కొత్త కోణం బయటపడ్డంతో తెలంగాణా డీజీపీ సీరియస్‌గా తీసుకుని వెంటనే అదనపు డీజీపీ గోపాలకృష్ణను విచారణ చేయాలని ఆదేశించారు...వెంటనే అధికార యంత్రాంగం కదిలింది...

20:37 - June 14, 2017

హైదరాబాద్: అరుణా చల్ ప్రదేశ్ షాక్ తో ప్రైవేటు ట్రావెల్స్ ఆగడాలకు చెక్ పడుతోందా? అనుమతి లేని సర్వీసులకు.. భద్రత లేని ప్రయాణాలకు చెక్ పడుతోందా? చిన్న రాష్ట్రం తీసుకున్న నిర్ణయాన్ని తెలుగు రాష్ట్రాలు తీసుకునే సత్తా లేదా? రాజకీయ నాయకులే బస్సులు నడపటం ఇందుకు కారణమా? ఎంత కాలం ఈ ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా? దీనికి అడ్డుకట్ట పడేదెప్పుడు? ఇదే అంశంపై నేటి వైడాంగిల్ స్టోరీ. పూర్తి వివరాల కోసం ఈవీడియోను క్లిక్ చేయండి...

సమ్మెను ఉపసంహరించుకున్న పెట్రోల బంకుల డీలర్లు...

ఢిల్లీ : ఈ నెల 16న తలపెట్టిన సమ్మెను పెట్రోల్ బంకుల డీలర్లు ఉపసంహరించుకున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల రోజువారీ సవరణను నిలిపివేస్తామని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటనతో పెట్రోల్ బంకుల డీలర్లు సమ్మెను ఉపసంహరించుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

20:11 - June 14, 2017

మంచిరాల్య : సింగరేణిలో రేపటినుంచి సమ్మె సైరన్‌ మోగనుంది. వారసత్వ ఉద్యోగాలు కల్పించాలన్న డిమాండ్‌తో కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు. 3 నెలల క్రితం సమ్మె నోటీసు ఇచ్చినా.. సింగరేణి యాజమాన్యం కోర్టుకు వెళ్తున్నామని జాప్యం చేసిందని ఏఐటియుసీ నేత వాసిరెడ్డి సీతారామయ్య మండిపడుతున్నారు. వారసత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎన్నికల్లో గెలిచిన టీజీబికెఎస్ ఇప్పుడు యాజమాన్యం పక్షాన నిలుస్తోందని ఆరోపించారు. మరిన్ని వివరాల కోసం ఈవీడియోను క్లిక్ చేయండి...

 

20:09 - June 14, 2017

అమరావతి: విశాఖ భూ ఆక్రమణలపై సిట్‌ విచారణ కొనసాగుతోందని... ఏపీ ఉపముఖ్యమంత్రి KE కృష్ణమూర్తి స్పష్టంచేశారు.. సిట్‌ విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందని చెప్పారు.. ఆక్రమణదారులను పట్టుకునేందుకే సిట్‌ ఏర్పాటు చేశామని తెలిపారు.. ప్రజలకు మేలుచేయాలని ప్రతిపక్షం భావిస్తే సిట్‌కు ఆధారాలు అందజేయాలని సూచించారు.. విశాఖ కలెక్టర్‌ అభియోగాలు వచ్చిన భూ రికార్డులు పరిశీలిస్తున్నారని కేఈ చెప్పుకొచ్చారు.. ఇప్పటికే ఇద్దరు తహశీల్దార్లు, ఒక డిప్యూటీ తహశీల్దార్‌, VRAను సస్పెండ్‌ చేశామని ప్రకటించారు.. రికార్డుల పరిశీలన పారదర్శకంగా జరిగేందుకు జిల్లాలో 27మంది తహశీల్దార్లు, 17మంది డిప్యూటీ తహశీల్దార్లను బదిలీ చేశామన్నారు..

20:07 - June 14, 2017

ఢిల్లీ : మధ్యప్రదేశ్‌లో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని... ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ ఆవేదన వ్యక్తం చేసింది. రైతు రుణమాఫీ భారం రాష్ట్రాలదే అన్న అరుణ్‌ జైట్లీ వ్యాఖ్యలను ఖండించింది. ఈ వ్యాఖ్యలకు నిరసనగా జూన్‌ 16న దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ, జైట్లీ దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చింది.. పోలీసుల కాల్పుల్లో మృతిచెందిన రైతు కుటుంబాలను కిసాన్‌ సభ సభ్యులు పరామర్శించారు.. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోనుక్లిక్ చేయండి...

20:05 - June 14, 2017

హైదరాబాద్: జూన్ నెలలో ఫూల్స్ అయిన జనం... మియాపూర్ లో లేదంట రణం, సింగరేణి కాడ మోగిన సమ్మె సైరన్....సర్కార్ దిక్కే కొడుతున్నది హారన్, పట్నంలో షురూ అవుతున్న బోనాలు...తయారు కావాలే జనాలు, నిడదవోలు బ్రిడ్జి మీద టోల్ ట్యాక్సులు...అడ్డంగా దొరికిన ఇరిగేషన్ దొంగలు, 12 మంది రెండు లక్షల కోట్లు... మాల్యాని మించిన మహాముదురుల్లు, వ్యవసాయానికి ఎరువులు, విత్తనాలు రెడీ....చూపెట్టురీ మీ వాడీ ఇత్యాది అంశాలపై 'మల్లన్న ముచ్చట్లు' కార్యక్రమంలో మల్లన్న మన ముందుకు వచ్చాడు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

19:59 - June 14, 2017

విజయవాడ : రాష్ట్రంలో సోలార్‌ ఎనర్జీ అభివృద్ధికి ఏపీప్రభుత్వం చర్యలు తీసుకంటోంది. నెడ్‌క్యాప్‌ ఆధ్వర్యంలో విజయవాడ ట్రాన్స్‌కో కార్యాలయంలో సోలార్‌ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. మర్ని వివరాలను మా ప్రతినిధి అందిస్తారు. 

19:57 - June 14, 2017

సూర్యాపేట : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు ఆర్థిక విధానాలపై సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులు మండిపడ్డారు.. జాతరకు బలి ఇచ్చినట్లుగా మూడేళ్ల పాలన ఉత్సవాలకు కేంద్రం రైతుల్ని బలిస్తోందని విమర్శించారు. కార్పొరేటర్లను అందలం ఎక్కిస్తూ... అన్నదాతల్ని చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు.. సూర్యాపేటలో కేవీపీఎస్ రాష్ట్ర శిక్షణాతరగతులకు రాఘవులు హాజరయ్యారు. 

19:24 - June 14, 2017

హైదరాబాద్: వివాదాస్పద భూములు కొనుగోలు నుంచి టిఆర్ ఎస్ ఎంపి కే. కేశవరావు వెనక్కి తగ్గారు. దండు మైలారంలో భూములు విక్రయించిన సంస్థకు లీగల్ నోటీసులు జారీ చేయనున్నట్లు కేకే పేర్కొన్నారు. భూముల సేల్ డీడ్ ను రద్దు చేసుకుంటానని తెలిపారు.

పొన్నూరు రైల్వేస్టేషన్ ఉద్యోగి రవి కిరణ్ మృతి!

గుంటూరు : బాపట్ల సూర్యలంక బీచ్ వద్ద హరిత రిసార్ట్స్ లో వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. మృతుడు పొన్నూరు రైల్వేస్టేషన్ ఉద్యోగి రవి కిరణ్ గా గుర్తించారు.

ఆ బస్సులు తిరిగే సీజ్ చేయండి: మంత్రి మహేందర్ రెడ్డి

హైదరాబాద్: అరుణా చల్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్ తో తెలంగాణ లో తిరుగుతున్న బస్సులను సీజ్ చేయానలి మంత్రి మహేందర్ రెడ్డి ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో 15 బస్సులను సీజ్ చేశారు. గరుడ, ఆరెంజ్, మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేశారు. బస్సులను సీజ్ చేసిన చోట ప్రయాణీకులు ఇబ్బంది పడకుండా ఆర్టీసీ అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. ఇక్కడ కఠిన నిబంధనలు ఉన్నాయనే ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారన్నారు. ఒక రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసుకుని మరో రాష్ట్రంలో తిరగడం నేరం అని మంత్రి మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.

ఆ భూముల సేల్ డీడ్ ను రద్దు చేసుకుంటా: కేకే

హైదరాబాద్: వివాదాస్పద భూములు కొనుగోలు నుంచి టిఆర్ ఎస్ ఎంపి కే. కేశవరావు వెనక్కి తగ్గారు. దండు మైలారంలో భూములు విక్రయించిన సంస్థకు లీగల్ నోటీసులు జారీ చేయనున్నట్లు కేకే పేర్కొన్నారు. భూముల సేల్ డీడ్ ను రద్దు చేసుకుంటానని తెలిపారు.

ఇద్దరు సైబర్ నేరస్తుల అరెస్ట్

హైదరాబాద్ : క్రెడిట్ కార్డుల ద్వారా మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేరగాళ్లు క్రెడిట్ కార్డుల ద్వారా రూ. 1.5 కోట్లు కాజేసినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుల నుంచి కారు, 14 స్వైపింగ్ మిషన్లు, 17 చెక్‌బుక్‌లు, 7 డెబిట్ కార్డులు, 4 క్రెడిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

19:01 - June 14, 2017

సిద్ధి పేట: కుకునూరు పీఎస్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉన్నతాధికారుల వేధింపులవల్లే ఎస్సై ఆత్మహత్య చేసుకున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారంటూ ఓ మీడియా వాహంనపై దాడికి పాల్పడ్డారు. సిద్దిపేట సీపీ శివశంకర్‌, గ‌జ్వేల్‌ ఏసీపీ గిరిధర్‌ను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. వారిద్దరి పై చర్యలు తీసుకున్నాకే ఎస్సై మృతదేహాన్ని తరలించాలని గ్రామస్థులు పట్టుబట్టారు. ఏసీపీ గిరిధ‌ర్‌‌ను డీజీపీ కార్యాలయానికి అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

సోలార్‌పవర్‌ అభివృద్దికి ఏపీ ప్రభుత్వం చర్యలు

అమరావతి: రాష్ట్రంలో సోలార్‌ ఎనర్జీ అభివృద్ధికి ఏపీప్రభుత్వం చర్యలు తీసుకంటోంది. నెడ్‌క్యాప్‌ ఆధ్వర్యంలో విజయవాడ ట్రాన్స్‌కో కార్యాలయంలో సోలార్‌ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. మర్ని వివరాలను మా ప్రతినిధి అందిస్తారు. 

తెలంగాణ సచివాలయ ఉద్యోగులకు ఆటవిడుపు

హైదరాబాద్: తెలంగాణ సచివాలయ ఉద్యోగులకు ఆటవిడుపు. పని ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు ఆటల పోటీలు నిర్వహించారు. ఇందులో ఉద్యోగినులు సైతం ఉత్సాహంగా పాల్గొన్నారు. ఏడాదికి ఒక్కసారి ఇలా ఆటలపోటీలు నిర్వహించడం వల్ల తమలో మానసిక ఒత్తిడి తొలగిపోతుందని ఉద్యోగినులు తెలిపారు. ఈ నెల 12వ తేదీన మొదలైన ఈ ఆటల పోటీలు.. నేటితో ముగిశాయి. విజేతలకు త్వరలోనే బహుమతులు ప్రదానం చేస్తారని తెలిపారు.

శిరీష మృతికి, ఎస్ఐ ఆత్మహత్యకు లింకు

హైదరాబాద్: సిద్ధిపేట్‌లో ఎస్ ఐ ప్రభాకర్‌ రెడ్డి ఆత్మహత్య కేసులో కొత్తకోణం వెలుగులోకివస్తోంది.. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో బ్యుటీషియన్‌ శిరీషను ప్రభాకర్‌ రెడ్డి రేప్‌ చేసినట్లుగా ఆరోపణలొస్తున్నాయి.. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో ఆత్మహత్య చేసుకున్న బ్యుటీషియన్‌ శిరీషతో ప్రభాకర్‌ రెడ్డికి లింక్‌ ఉందని పోలీసులు చెబుతున్నారు.. శిరీష పనిచేస్తున్న ఆర్‌జే ఫొటోగ్రఫీ ఓనర్‌ రాజీవ్‌, తేజస్విని అనే మరో యువతి, శిరీష, ప్రభాకర్‌ రెడ్డి ఆదివారం కుకునూర్‌పల్లికి వెళ్లారు.. రాత్రి తాగినమత్తులో ప్రభాకర్‌ రెడ్డి శిరీషపై అత్యాచారం చేశాడు..

18:55 - June 14, 2017

హైదరాబాద్: ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ విద్యానగర్‌లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ఎదుట ప్రజాసంఘాలు ధర్నా చేశాయి. ప్రైవేట్‌ పాఠశాలల్లో ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నారని ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుర్తింపు లేని స్కూల్స్‌ను మూసివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

18:54 - June 14, 2017

హైదరాబాద్: రాజ్‌భవన్ రోడ్ లోని ప్రభుత్వ పాఠశాలను ఇవాళ గవర్నర్ నరసింహన్ ప్రారంభించారు. ఈ పాఠశాల రాష్ట్రంలోనే టాప్ స్కూల్ గా తీర్చిదిద్దేంత వరకు తాను ఊరుకోనని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. ఈ స్కూల్ ని రాష్ట్రంలో సర్కారీ బడులన్నింటికి రోల్ మోడల్‌గా తయారుచేస్తానన్నారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాలను ప్రభుత్వ చొరవతో స్మార్ట్ స్కూల్ గా మారిందని రాష్ట్రంలో అన్నీ స్కూల్స్ కూడా ఈ విధంగా తయారవ్వాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

 

18:53 - June 14, 2017

హైదరాబాద్: సాహితీ దిగ్గజం, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి. నారాయణరెడ్డి అంత్యక్రియలు హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానం శ్మశానవాటికలో ముగిశాయి... అంతకుముందు తెలంగాణ సారస్వత పరిషత్తు నుంచి ఫిలింనగర్ మహాప్రస్థానం వరకు సినారే అంతిమయాత్ర కొనసాగింది.. అభిమానుల సందర్శనకోసం ఉదయం పదిగంటలకు నారాయణ రెడ్డి భౌతికకాన్ని సారస్వత పరిషత్తులో ఉంచారు.. దాదాపు 12గంటల సమయంలో నారాయణ రెడ్డి అంతిమయాత్ర మొదలైంది..

సినారె అంతిమయాత్రకు సీఎం కేసీఆర్, మంత్రులు

సినారె అంతిమయాత్రకు సీఎం కేసీఆర్, మంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, నాయిని నర్సింహారెడ్డి, సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతోపాటు... పార్టీలకు అతీతంగా పలువురు రాజకీయ నేతలు, రచయితలు, అధ్యాపకులు, ప్రజాసంఘాల నేతలు హాజరయ్యారు.. విశ్వంభరుడి పార్థీవ దేహానికి కడసారి నివాళులర్పించారు.

మహాప్రస్థానానికి సినారె పార్థీవదేహం చేరుకోవడానికిముందే కేసీఆర్‌.....

మహాప్రస్థానానికి సినారె పార్థీవదేహం చేరుకోవడానికిముందే కేసీఆర్‌ అక్కడికి వచ్చేశారు.. సినారె భౌతికకాయంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. సాహితీ దిగ్గజం అంత్యక్రియలు పూర్తయ్యేవరకూ మహాప్రస్థానంలోనే ఉన్నారు.. ప్రభుత్వ లాంఛ‌నాల‌మధ్య అంత్యక్రియలు పూర్తయ్యాయి.. సినారె మనవడు చితికి నిప్పంటించారు..

సినారె అంత్యక్రియల్లో స్వల్ప అపశ్రుతి ...

సినారె అంత్యక్రియల్లో స్వల్ప అపశ్రుతి చోటుచేసుకుంది. మహాప్రస్థానం దగ్గర ప్రముఖులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. అదుపు తప్పిన జనరేటర్‌ వాహనం గోడను ఢీకొని నిలిచిపోయింది. ఈ గోడకు పక్కనే మంత్రులు, ఇతర ప్రముఖులు ఉన్నారు. వాహనం గోడను ఢీకొని ఆగిపోవడంతో వారికి పెను ప్రమాదం తప్పింది.

18:49 - June 14, 2017
18:47 - June 14, 2017
18:46 - June 14, 2017

హైదరాబాద్‌ : సిద్ధిపేట జిల్లా కుకునూరుపల్లి ఎస్‌ఐ ప్రభాకర్‌ రెడ్డి ఆత్మహత్య కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌ ఫిల్మ్‌ నగర్‌లో బ్యూటీషియన్‌ శిరీష అనుమానాస్పద మృతి ఘటనకు ఎస్‌ఐకి సంబంధం ఉన్నట్లు పోలీసుల విచారణ లో వెల్లడైనట్లు సమాచారం. ఆదివారం రాత్రి శిరీష, ప్రభాకర్ ర ఎడ్డి, తేజస్వినీ, రాజీవ్ కుకునూరుపల్లి కి వెళ్లారు. అక్కడ మద్యం మత్తులో శిరీషపై ప్రభాకర్‌ రెడ్డి అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. గత కొంతకాలంగా ప్రభాకర్‌రెడ్డికి శిరీష పరిచయం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ రోజు ఉదయం శిరీష ఆత్మహత్య వ్యవహారం బయటకు రావడంతో ఎస్‌ఐ తన సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఈరోజు మధ్యాహ్నం మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా కృష్ణానగర్‌లో నివసించే అరుమిల్లి విజయలక్ష్మి అలియాజ్‌ శిరీష (28) ఫిలింనగర్‌లోని ఆర్‌జే ఫొటోగ్రఫీలో బ్యుటీషియన్‌గానే కాకుండా హెచ్‌ఆర్‌గా పనిచేస్తున్నది. మంగళవారం ఉదయం ఆమె తన కార్యాలయంలో మృతదేహమై కనిపించింది. దీంతో తన భార్య ఆత్యహత్య చేసుకొనే పిరికిది కాదని మరణం వెనుక పలు అనుమానాలున్నాయని సతీష్‌చంద్ర పోలీసులకు పిర్యాదు చేశాడు. దీంతో వివరాలన్నీ వెలుగులోకి వచ్చాయి. ఇంకా అనేక అంశాలు బయటకు రావాల్సి ఉంది.

పిడుగు పడుతుందంట..జాగ్రత్త..

గుంటూరు : పొన్నూరు..అమృతలూరు..టి.చండూరు..కారంపూడి..కొల్లిపర..తెనాలి మండలాల్లో పిడుగు పడే అవకాశం ఉందని..ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

కేసీఆర్ దోపిడిపై సీబీఐకి ఫిర్యాదు చేస్తా - వీహెచ్..

హైదరాబాద్ : అవినీతి పరులను పక్కన పెట్టుకుని అవినీతిని నిర్మూలిస్తానని కేసీఆర్ అనడం విడ్డూరమని వీహెచ్ పేర్కొన్నారు. కేసీఆర్ దోపిడిపై ఢిల్లీకి వెళ్లి సీబీఐకి ఫిర్యాదు చేస్తానని తెలిపారు.

సీఐడీ సాధించింది ఏమిటీ ? - షబ్బీర్..

హైదరాబాద్ : ఎంసెట్ స్కాం..నయీం కేసులో సీఐడీ సాధించింది ఏమిటని..సీబీసీఐడి నమ్మకం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ ఆలీ విమర్శించారు.

ఆక్రమణల వెనుక కేసీఆర్ ఫ్యామిలీ ఉందన్న ఉత్తమ్..

హైదరాబాద్ : కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని పిసిసి చీఫ్ ఉత్తమ్ పేర్కొన్నారు. భూములను ఆంధ్ర పాలకులు దోచుకుంటున్నారన్న కేసీఆర్ ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. భూ స్కామ్ ను ప్రభుత్వమే బయటపెట్టిందన్న కేసీఆర్ ఇప్పుడె స్కామ్ జరగలేదనడం దారుణమని, ఆక్రమణల వెనుక కేసీఆర్ కుటుంబం, టీఆర్ఎస్ నేతలున్నారని ఆరోపించారు. మియాపూర్ స్కామ్ లో కేసీఆర్ సన్నిహితుడు దామోదరరావు ఉన్నారని ఆరోపించారు. కూకట్ పల్లి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే కవితకు భూములు రిజిస్ట్రేషన్ చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఆక్రమణలో ఎవరున్నా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

16:47 - June 14, 2017

జొన్నలు..రాగులు..గోధుమలు..మొక్కజొన్నలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. పిండిల రూపంలో చేసుకొనే వంటలు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి. అందులో జొన్నలు కూడా ప్రధానమైంది. డైట్ లో చేర్చుకోవడం వల్ల విభన్నమైన ఆరోగ్యకర ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఇందులో యాంటి ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి.
గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్‌, టైప్‌ టు డయాబెటిస్‌, న్యూరోలాజికల్‌ వ్యాధులు రాకుండా యాంటీ ఆక్సిడెంట్స్‌ ప్రొటెక్ట్‌ చేస్తాయి.
క్యాన్సర్‌, మధుమేహం వంటి రోగాలను దూరం చేసేందుకు జొన్నలు ఎంతగానో ఉపయోగపడుతాయి.
పీచు పదార్థం అధికంగా ఉండడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా ఉండటానికి తోడ్పడుతుంది.
వీటిలో ఉండే పోషకాలు పాలిచ్చే తల్లులకు, బిడ్డలకు ఎంతో మంచిది.

16:47 - June 14, 2017

ఖమ్మం: ఖమ్మం నుంచి సూర్యాపేట వరకూ రాదారి నిర్మిస్తే రవాణా కష్టాలు తీరతాయని భావించిన స్థానికులకు సరికొత్త కష్టాలు పలుకరిస్తున్నాయి. రవాణా అభివృద్ధి మాటేమో కాని... తామంతా నిర్వాసితులయ్యే దుస్థితి తలెత్తిందని వీరు ఆందోళన చెందుతున్నారు. తాజాగా మంజూరైన ఖమ్మం-సూర్యాపేట రోడ్డు నిర్మాణం... చాలామంది జీవితాలను ప్రశ్నార్థకంగా మార్చింది. ఈ రహదారి నిర్మాణంలో చాలామంది తమ ఇళ్లను... భూములను కోల్పోవాల్సి వస్తోంది.

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రతిపాదనల మేరకు....

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రతిపాదనల మేరకు, కేంద్ర ప్రభుత్వం ఈ రోడ్డు నిర్మాణానికి వెంటనే రూ.వెయ్యి కోట్లు విడుదల చేసి, టెండర్‌ను పూర్తి చేసింది. ఈ మేరకు రెవెన్యూ అధికారులు సర్వే పనులు ప్రారంభించారు. సూర్యాపేట నుంచి ఖమ్మం వరకు సర్వేచేసి పెగ్‌మార్కింగ్ చేసేందుకు పనులు చేయగా, ఆ తరువాత భూ సర్వే.. భూ కొనుగోలు.. ప్రక్రియను వేగవంతం చేశారు.

సూర్యాపేట నుంచి మద్దులపల్లి వరకు 60 మీటర్ల రోడ్డుకు రూట్‌ మ్యాప్‌

ఈ మేరకు సూర్యాపేట నుంచి మద్దులపల్లి వరకు 60 మీటర్ల వెడల్పుతో రోడ్డు నిర్మాణం చేసేందుకు రూట్‌ మ్యాప్‌ను సిద్ధం చేశారు. అలాగే కూసుమంచి నుంచి సూర్యాపేట జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా మండల కేంద్రాలకు బైపాస్ మంజూరు చేశారు. సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల, మోతే... ఖమ్మం జిల్లాలోనే కూసుమంచి మండల కేంద్రాలకు ఊరిబయట నుంచే నాలుగు లైన్ల రోడ్డు వేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అలాగే నాయకన్‌గూడెం నుంచి కూసుమంచి మండల కేంద్రం వరకు బైపాస్‌ను నిర్మించేందుకు సర్కార్‌ నిర్ణయించింది. కూసుమంచి-నేలకొండపల్లి రోడ్డులోని సబ్‌స్టేషన్‌కు సమీపంలో టోల్‌ప్లాజాను ఏర్పాటు చేయాలని నేషనల్ అథారటి అధికారులు నిర్ణయించారు. అలాగే జీళ్ల చెరువు ఊరి శివారులో విశాంత్రి భవనాలు, బస్టాండ్ సెంటర్‌లు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయనున్నారు.

బలవంతంగా భూములు లాక్కోవడానికి అధికారుల యత్నం

అయితే ఈ రోడ్డు నిర్మాణానికి గ్రామస్థుల దగ్గర నుంచి అధికారులు బలవంతంగా ఇళ్లు, భూములు లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు,. ఖమ్మం జిల్లా రెవెన్యూ అధికారులు భూ సర్వే చేస్తూ, నష్టపరిహారం కోసం రైతులను బెదిరింపులకు పాల్పడుతున్నారంటున్నారు. సర్వే చేయకుండానే నేరుగా రైతుల భూములలో సరిహద్దు రాళ్లు పాతి వెళ్లిపోయారు. తాము చెప్పిన విధంగా ఉంటే ఎకరానికి రూ. 8 లక్షల పరిహారం ఇస్తాం లేదంటే మీరే ఇబ్బందులు పడుతారని తహసీల్దార్‌లు వార్నింగ్‌లు ఇస్తున్నారని రైతులు వాపోతున్నారు. కూసుమంచి మండల కేంద్రంలో వ్యాపారులు తమ కాంప్లెక్స్‌లు కోల్పోకుండా ...వారికి అనుగుణంగా.. అధికారులు రూట్‌ మ్యాప్‌ మార్చేశారనే ఆరోపణలు ఉన్నాయి.

అధికారుల తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రజలు...

దీంతో ఆయా గ్రామాల ప్రజలు అధికారుల తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అలాగే రహదారి నిర్మాణం గ్రామం బయట నుంచి కాకుండా మధ్యలో నుంచి వెళ్లటాన్ని మద్దులపల్లి గ్రామస్థులు అడ్డుకుంటున్నారు. గ్రామంలో ఉన్న ఇరువైపుల ఇళ్లను కూల్చివేస్తే సంహించేది లేదని గ్రామస్థులు హెచ్చరిస్తున్నారు. అయినా తమ ఇళ్లను, భూములను కోల్పోవటానికి తాము సిద్ధంగా లేమని నిర్వాసితులు స్పష్టం చేస్తున్నారు. తమ భూములకు మార్కెట్ ధరను కొత్తగా నిర్ణయించి ఆ భూములకు 2013 భూ సేకరణ ప్రకారం నష్ట పరిహారం చెల్లించాలని భూ నిర్వాసితులు డిమాండ్‌ చేస్తున్నారు. 

16:44 - June 14, 2017

.గో : జిల్లాలోని కాటన్ బ్యారేజ్‌పై లంచగొండి అధికారులు చెలరేగిపోతున్నారు. టెన్‌ టీవీ నిఘాలో ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ఉద్యోగుల అవినీతి బండారం బట్టబయలైంది. ధవళేశ్వర బ్యారేజీపై టూ వీలర్స్, ఆటోలు, కార్లకు మాత్రమే అనుమతి ఉండగా.. భారీ వాహనాలకు నిషేధం ఉంది. అయితే వందకొడితే చాలు బ్యారేజీపైకి ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌ ఉద్యోగులు అనుమతిస్తున్నారు. దీంతో కాటన్ బ్యారేజ్, విద్యుత్ ప్లాంటు ప్రమాదపు అంచుల్లో ఉన్నాయి. 

16:42 - June 14, 2017

తిరుమల : తిరుమలేశుడి లడ్డూకు జీఎస్టీ దెబ్బపడుతోంది. జూలై 1 నుంచి అమల్లోకి రానున్న జీఎస్టీ పన్నులభారంతో శ్రీవారిలడ్డూ మరింత ప్రియం కానుంది. దీంతో లడ్డు ప్రసాదంతోపాటు మరికొన్న ప్రసాదాల ద్వారా ఏటా వందకోట్ల రూపాయల భారం పడే అవకాశం ఉందని టీటీడీ అధికారులు అంటున్నారు. మరోవైపు జీఎస్టీ పరిధి నుంచి తిరుమలను మినహాయించాలన్న ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తిని కూడా కేంద్రం తోసిపుచ్చింది. దీంతో జూలై 1 నుంచి తీరుమల లడ్డూ ధరపెరిగనుంది. 

పిడుగు పాటుకు ముగ్గురు మృతి..

తూర్పుగోదావరి : జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు. కొత్తపేట (మం) బిల్లకూరులో పిడుగుపాటుకు ఉపాధి కూలి..తాళ్లరేవు మండలం చిన్నబొడ్డుపాలెంలో పిడుగుకు పాటు ఇద్దరు మృతి చెందారు.

కాటన్ బ్యారేజ్ పై లంచగొండి అధికారులు..

పశ్చిమగోదావరి : కాటన్ బ్యారేజ్ పై లంచగొండి అధికారులు చెలరేగిపోతున్నారు. టెన్ టివి నిఘాలో బయటపడింది. టూ వీలర్స్..కార్లకు..ద్విచక్రవాహనాలకు మాత్రమే అనుమతి ఉంది. కానీ ఇరిగేషన్ ఉద్యోగులకు వంద కొడితే చాలు భారీ వాహనాలకు కూడా అనుమతినిస్తున్నారు. దీనితో కాటన్ బ్యారేజ్..విద్యుత్ ప్లాంటు ప్రమాదంలో పడినట్లైంది.

16:23 - June 14, 2017

మెగాస్టార్ తనయుడు 'రామ్ చరణ్ తేజ' తన తాజా చిత్రం కోసం తీవ్రంగా కష్టపడుతున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా టైటిల్ ‘రంగస్థలం 1985’ అంటూ ఇటీవలే ప్రకటించారు. షూటింగ్ ను వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని 'చెర్రీ' భావిస్తున్నాడు. అందుకనుగుణంగా ఎలాంటి బ్రేక్ ఇవ్వకుండా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. అందుకని పెళ్లి రోజుకు కూడా బ్రేక్ తీసుకోలేదు. దీనితో ఆయన సతీమణి 'ఉపాసన' రాజమండ్రికి వెళ్లారు. 'మిస్టర్ అండ్ మిసెస్ సి'కి ఐదేళ్లు. స్నేహితులు, కుటుంబ సభ్యుల సపోర్ట్, ప్రేమ కారణంగా ఇన్ని రోజులు ఇంత అద్భుతంగా గడిచాయి.' అంటూ తమ శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలియజేసింది ఉపాసన.

తిరుమల లడ్డూపై జీఎస్టీ భారం..

చిత్తూరు : తిరుమల లడ్డూపై జీఎస్టీ భారం పడనుంది. శ్రీవారి లడ్డూ మరింత ప్రియం కానుంది. వంద కోట్ల రూపాయల భారం పడుతుందని టిటిడి అధికారులు అంచనాకు వస్తున్నట్లు తెలుస్తోంది. తిరుమలకు మినహాయింపు ఇవ్వాలని ఏపీ అభ్యర్థనను కేంద్రం తోసిపుచ్చింది. జులై 1 నుండి లడ్డూ ధరలు పెరిగే అవకాశం ఉంది.

16:04 - June 14, 2017

సిద్దిపేట: జిల్లాలో మరో ఎస్‌ఐ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుకునూరుపల్లి ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే అధికార వేధింపులే కారణమని ప్రభాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఏడాది క్రితం ఇదే స్టేషన్‌లో పని చేస్తున్న ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి కూడా ఇలాగే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మొన్న దుబ్బాక ఎస్సై చిట్టిబాబు కూడా ఇలాగే ఆత్మహత్య చేసుకోవడం... ఇప్పుడు ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం, అధికారుల వేధింపులపై అనుమానాలు బలపడుతున్నాయి.  

16:01 - June 14, 2017

ఇప్పుడిప్పుడే వరుస అవకాశాలు చేజిక్కించుకుంటూ వెళుతున్న 'హెబ్బా పటేల్' కు మరో సూపర్ ఛాన్స్ వచ్చిందని ప్రచారం జరుగుతోంది. తమిళంలో పాగా వేయాలని హెబ్బా అనుకొంటోంది. తెలుగులో ఘన విజయం సాధించిన '100% లవ్' ను తమిళంలో రీమెక్ చేయనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. సుకుమార్ స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్ కుమార్ కథానాయకుడిగా నటించబోతున్నారు. అయితే ఇందులో తొలుత 'లావాణ్య త్రిపాఠి' హీరోయిన్ గా నటిస్తోందని ప్రచారం జరిగింది. అంతేగాకుండా చిత్ర యూనిట్ కూడా ఆమెను ఖరారు చేశారని టాక్. అంతలోనే 'లావణ్య' స్థానంలో 'హెబ్బా పటేల్' ను ఎంపిక చేశారని తెలుస్తోంది. గతంలో సుకుమార్ నిర్మించిన 'కుమారి 21ఎఫ్' లో హెబ్బా హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. సుకుమార్ ప్రమేయం వల్లే ఆమెకు ఈ చాన్స్ దక్కిందని పుకార్లు షికారు చేస్తున్నాయి. మరి హెబ్బాకు తమిళంలో ఎలాంటి గుర్తింపునిస్తుందో చూడాలి.

15:54 - June 14, 2017

ఖమ్మం : గ్రెయిన్ మార్కెట్ తరలింపును గుర్రాలపాడుకు తరలించాలని, సీపీఎం నేత యర్రా శ్రీకాంత్‌పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం, వ్యాపారులు, కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రదర్శన వర్తకసంఘం కార్యాలయం నుంచి మున్సిపల్ కార్పొరేషన్‌ కార్యాలయం వరకు కొనసాగింది. 

15:52 - June 14, 2017

విశాఖ : జిల్లాలో భూ ఆక్రమణలపై సీబీఐతో విచారణ చేయించాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. జోరు వర్షాన్ని సైతం లెక్క చెయ్యకుండా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారు. భూ కబ్జాల వెనుక టీడీపీ, బీజేపీ పెద్దల హస్తం ఉందని... సీపీఎం నేతలు విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నేతలు గంగారామ్, మణి, లోకనాథం పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగారాం మాట్లాడుతూ...విశాఖ నగర చుట్టు పక్కల 20వేల కోట్ల రూపాయల విలువ కలిగిన భూమి ఆక్రమణకు గురి అయ్యిందని స్వయాన కలెక్టరే ప్రకటించారని తెలిపారు. ఈ అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు వాదన మరో వుందిని, అధికార పార్టీ నేతలే కుట్రకు తెరలేపుతున్నారని ఆరోపించారు. 

15:48 - June 14, 2017

చెన్నై: విశ్వాస పరీక్షలో నెగ్గేందుకు అన్నాడిఎంకె ఎమ్మెల్యేలకు భారీ ముడుపులు చెల్లించారన్న అంశంపై తమిళనాడు శాసనసభ దద్దరిల్లింది. అసెంబ్లీ సమావేశమైన కొద్ది సేపటికే సభలో తీవ్రగందరగోళ పరిస్థితి నెలకొంది. ఓ టీవీ ఛానల్‌ స్టింగ్‌ ఆపరేషన్‌లో వెలుగు చూసిన ఎమ్మెల్యేల ముడుపుల వ్యవహారంపై ముందుగా చర్చించాలని ప్రతిపక్ష నేత స్టాలిన్ పట్టుబట్టారు. దీనికి స్పీకర్ అంగీకరించకపోవడంతో డీఎంకే ఎమ్మెల్యేలు పోడియం వద్దకు వెళ్లి స్పీకర్‌కు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. సభకు అంతరాయం కలిగిస్తున్నారన్న కారణంతో ప్రతిపక్ష డిఎంకె ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. ప్రభుత్వ చర్యను నిరసిస్తూ డిఎంకే నేతలు స్టాలిన్‌ ఆధ్వర్యంలో అసెంబ్లీ వెలుపల ఆందోళన చేపట్టారు. అనంతరం స్టాలిన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పళనిస్వామి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని స్టాలిన్‌ డిమాండ్‌ చేశారు. జయలలిత మరణాంతరం సిఎం పదవి కోసం పన్నీర్‌ సెల్వం, శశికళ వర్గాలు పోటీ పడ్డాయి. శశికళ వర్గం ఎమ్మెల్యేల మద్దతు కోసం భారీ ఎత్తున లంచాలు ఎరవేసినట్లు స్టింగ్‌ ఆపరేషన్‌ ద్వారా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.

 

15:47 - June 14, 2017

హైదరాబాద్: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీని సొంత పార్టీకి చెందిన ఓ నేతే ఆయ‌న్ని ప‌ప్పు అనడం హస్తం నేతలకు ఆగ్రహం తెప్పించింది. ఉత్తరప్రదేశ్‌లోని మీర‌ట్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వివేక్ ప్రధాన్‌.. ఓ వాట్సాప్ గ్రూప్‌లో రాహుల్‌ను ప‌ప్పు అన్నట్లు సమాచారం. దీన్ని సీరియస్‌గా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ వివేక్‌ను అన్ని పార్టీ ప‌ద‌వుల నుంచి త‌ప్పించింది. త‌న‌ను ఇరికించ‌డానికే ఎవ‌రో వాట్సాప్ మెసేజ్‌ల‌ను ఫొటోషాప్ చేసిన‌ట్లు వివేక్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌ మాత్రం దీనిపై అధికారికంగా స్పందించ లేదు. అయితే కాంగ్రెస్ తీరుపై బిజెపి మండిపడింది. ఆర్మీ చీఫ్‌ను కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్‌.. వీధి రౌడీ అని అన్నా ప‌ట్టించుకోని అధిష్టానం.. రాహుల్‌ను ప‌ప్పు అన‌గానే స్పందించింద‌ని.. దీనిని బ‌ట్టే ఆ పార్టీ ఏంటో తెలుస్తోంద‌ని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర విమర్శించారు. సోషల్‌ మీడియాలో రాహుల్ గాంధీకి ప‌ప్పు అన్న నిక్‌నేమ్ వైరల్‌ అయిన విష‌యం తెలిసిందే. 

సోనియా..ఏచూరిలను కలువనున్న బీజేపీ కోర్ కమిటీ..

ఢిల్లీ : బీజేపీ కోర్ కమిటీ సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. జూన్ 23 లేదా 24 తేదీల్లో బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి ప్రకటన విడుదల కానుంది. 16న సోనియా, సీతారాం ఏచూరిలతో బీజేపీ త్రిసభ్య కమిటీ భేటీ కానుంది. రాష్ట్రపతి అభ్యర్థిపై సోనియా, ఏచూరి అభిప్రాయాలను రాజ్ నాథ్, వెంకయ్య నాయుడులు తెలుసుకోనున్నారు.

అంగన్ వాడీలు రోడ్డెక్కితే ఫలితం ఉండదన్న మంత్రి సునీత..

విశాఖపట్టణం : స్త్రీ, శిశు సంక్షేమ శాఖపై మంత్రి సునీత సమీక్ష జరిపారు. అన్న అమృత హస్తం పథకంలో అక్రమాలు సహించబోనని, అంగన్ వాడీలు రోడ్డెక్కితే ఫలితం ఉండదని, సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ఉద్యమాలు చేస్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు.

ఆడపిల్లలను వేధిస్తే తాట తీస్తా - నన్నపనేని...

విశాఖపట్టణం : ఆడపిల్లలను వేధించే వారి తాట తీస్తామని ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి పేర్కొన్నారు. ఆదివాసీ బాలికలపై అత్యాచారం కేసుల్లో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు.

కుకునూరుపల్లి పీఎస్ వద్ద ఆందోళనలు..

సిద్ధిపేట : కుకునూరుపల్లి పీఎస్ వద్ద ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి బంధువులు..వివిధ పార్టీల నేతలు ఆందోళనలు చేపట్టారు. పోలీసు అధికారులు ఆత్మహత్యలను చూస్తుంటే అధికార పార్టీ నేతల, అధికారుల వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమౌతోందని టిడిపి నేత వంటేరు పేర్కొన్నారు.

15:23 - June 14, 2017

తాను సినిమాల నుండి తప్పుకోనున్నట్లు ప్రకటించిన 'మంచు మనోజ్' ఇండస్ట్రీకి..అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చాడు. ఈయన చేసిన పోస్టు సోషల్ మాధ్యమాల్లో తెగ వైరల్ అయిపోయింది. త్వరలోనే 'మంచు మనోజ్' రాజకీయాల్లో వస్తాడని..ఇతరత్రా వాటిపై చర్చ జరిగిపోయింది. వీటన్నింటికీ కాసేపటి క్రితం 'మంచు మనోజ్' తెరదించాడు. పోస్టు డిలీట్ చేసి మరో పోస్టు పెట్టారు. తాను చేయబోయే కొత్త సినిమా ప్రకటించడానికే ఇలా వినూత్నంగా ఆలోచించాలని పోస్టులో పేర్కొన్నారు. మీడియా డార్లింగ్స్ నుండి ఇంత అనూహ్యంగా స్పందన వస్తుందని అనుకోలేదని, తన పోస్టును రకరకాలుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. చేయబోయే కొత్త సినిమా గురించి తన స్టైల్ లో ప్రకటించాలని అనుకున్నట్లు, కానీ ఇలా అవుతుందని అనుకోలేదని తెలిపారు. కొత్త సినిమా గురించి చెప్పాలంటే ఈ వేడి చల్లారాలి..ఓం శాంతి అంటూ పోస్టులో 'మంచు మనోజ్' పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం మంచు మనోజ్ 'ఒక్కడు మిగిలాడు' అనే చిత్రంలో నటిస్తున్నాడు. దర్శకుడు అజయ్ ఆండ్రూ నూతక్కి. శ్రీలంకలో తమిళుల హక్కుల కోసం ప్రభుత్వంపై పోరాటం చేసిన ఎల్టీటీఈ థీమ్ తో కథ సాగనుందని..'మనోజ్' ఎల్టీటీఈ కమాండర్ గా నటించనున్నట్లు తెలుస్తోంది. 'మ‌నోజ్' ఈ మూవీలో స్టూడెంట్ గా కూడా క‌నిపించ‌నున్నారు. సినిమా టీజ‌ర్ ను సాయంత్రం 4.15కి చిత్ర యూనిట్ విడుద‌ల చేయ‌నుంది.

 

14:33 - June 14, 2017

హైదరాబాద్: ప్రత్యేక వివాహ చట్టం అంటే ఏమిటి? వాటి తీరు తిన్నుల గురించి మానవి కార్యక్రమంలో 'మైరట్' ప్రోగ్రాంలో విశ్లేషణ చేశారు. న్యా సమస్యలు, సందేహాలపై ప్రముఖ న్యాయవాది పార్వతి వివరించారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

14:23 - June 14, 2017

అమరావతి: ఏపీలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడి మధ్య మళ్లీ వార్‌ ముదిరింది. విశాఖ జిల్లాలో భూఆక్రమణలపై మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన ఆరోపణలపై సీఎం చంద్రబాబుకు గంటా లేఖ రాశారు. అయ్యన్నపాత్రుడి ఆరోపణలతో పార్టీ ప్రతిష్ట దిగజారుతుందని.. ప్రతిపక్ష నేతలు విమర్శలు చేసేందుకు అవకాశం ఏర్పడుతుందని ఫిర్యాదు చేశారు. గతంలోనూ అయ్యన్నపాత్రుడు ఇలాంటి ఆరోపణలే చేశారన్నారు. ఈ ఆరోపణల్లో నిజాలు బయటకు రావాలంటే సీఐడీ చేతగాని సీబీఐ చేతగాని విచారణ జరిపించాలని గంటా విజ్ఞప్తి చేశారు. అయ్యన్నపాత్రుడిపై ఫిర్యాదు చేస్తూ గంటా.. చంద్రబాబుకు లేఖ రాయడం ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తోంది. 

14:21 - June 14, 2017

హైదరాబాద్: సినారె అంత్యక్రియల్లో స్వల్ప అపశ్రుతి చోటుచేసుకుంది. మహాప్రస్థానం వద్ద ప్రముఖులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. అదుపు తప్పి జనరేటర్‌ వాహనం దూసుకెళ్లింది. గోడను ఢీకొని జనరేటర్‌ వాహనం నిలిచిపోయింది. ఘటనాస్థలికి పక్కనే మంత్రులు, ఇతర ప్రముఖులు ఉన్నారు. వాహనం గోడను ఢీకొని ఆగడంతో ప్రముఖులకు పెను ప్రమాదం తప్పింది.

 

మహా ప్రస్థానం వద్ద తప్పిన ప్రమాదం..

హైదరాబాద్ : సినారె అంత్యక్రియల్లో పెను ప్రమాదం తప్పింది. అంతిమయాత్రలో మహాప్రస్థానం వద్ద ఓ జనరేటర్ అదుపుతప్పింది. ఓ గోడకు ఢీకొని ఆగిపోయింది. ఆ సమయంలో ప్రముఖులు చాలా మంది ఉన్నారు.

బాబుకు మంత్రి గంటా లేఖ..

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు లేఖ రాశారు. మంత్రి అయ్యన్న చేసిన విమర్శలపై లేఖలో ఫిర్యాదు చేశారు. మంత్రి అయ్యన్న చేసిన ఆరోపణల వల్ల పార్టీ ప్రతిష్ట దిగజారుతోందని, గతంలో విశాఖ ఉత్సవ్, ల్యాండ్ పూలింగ్, చంద్రన్న సంక్రాంతి కానుకలపై ఆరోపణలు చేసి ప్రభుత్వాన్ని ఇరకాటలో పెట్టారని తెలిపారు. మంత్రి అయ్యన్న తీరు వల్ల ప్రతిపక్ష నేతలు, టిడిపి వ్యతిరేకులు, వామపక్షాలు తీవ్రంగా విమర్శించడం జరుగుతోందని పేర్కొన్నారు. సీబీ, సీఐడీ, సిట్టింగ్ జడ్జితో జ్యూడిషియల్ విచారణ జరిపించి పార్టీపై ప్రజలకు నమ్మకం కలిగించాలని లేఖలో మంత్రి గంటా పేర్కొన్నారు.

కూకనూరు ఎస్ఐ ఆత్మహత్య..

సిద్ధిపేట : కూకునూరు ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. రివాల్వర్ కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏడాది క్రితం ఈ పీఎస్ లో ఎస్ఐ రామకృష్ణారెడ్డి కూడ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

శ్రీ చైతన్య టెక్నో స్కూల్ వద్ద ధర్నా..

హైదరాబాద్ : విద్యానగర్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ వద్ద ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, సీఐటీయూ, ప్రజా సంఘాలు ధర్నా నిర్వహించాయి. కార్పొరేట్ స్కూళ్లలో ఫీజుల దందా ఆపాలని డిమాండ్ చేశాయి. అనుమతులు లేకుండా స్కూల్ నడుపుతున్నాడని ఆరోపణలు చేశారు.

13:23 - June 14, 2017

రైతులు సకాలంలో రుణాలు చెల్లిస్తే..

ఢిల్లీ : రైతు రుణాలపై 2 శాతం వడ్డీ రాయితీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సకాలంలో రుణాలు చెల్లించిన రైతులకు మరో మూడు శాతం వడ్డీ రాయితీ ఇవ్వాలని నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.

సినారె అంత్యక్రియల్లో పాల్గొన్న కేసీఆర్..

హైదరాబాద్ : మహా ప్రస్తానానికి సినారే పార్థీవ దేహం చేరుకుంది. సారస్వత పరిషత్ నుండి మహా ప్రస్థానం వరకు అంతిమయాత్ర జరగనుంది. అంత్యక్రియల్లో సీఎం కేసీఆర్, మంత్రులు పాల్గొన్నారు.

12:41 - June 14, 2017

చెన్నై : తమిళనాడు ఆసెంబ్లీలో గందరగోళం నెలకొంది. ఆసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సమావేశమైన ఆసెంబ్లీలో డీఎంకే ఎమ్మెల్యేలు స్ట్ంగ్ ఆపరేషన్ పై విచారణ చేయాలని ఆందోళనకు దిగారు. స్పీకర్ ఎంత వాదించిన వారు వినకపోవడంతో డీఎంకే సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. సభ నుంచి డీఎంకే సభ్యులను మార్షల్స్ బలవంతంగా పంపించారు. గత ఫిబ్రవరిలో జరిగిన విశ్వాస పరీక్షలో ఓటు వేయడానికి ఎమ్మెల్యేల కోట్లు తీసుకునట్టు ఓ ఇంగ్లీష్ చానల్ నిర్వహించిన స్టిండ్ ఆపరేషన్ లో ఎమ్మెల్యేలు చిక్కారు. అయితే స్టింగ్ ఆపరేషన్ లోని టేపుల్లోని వాయిస్ తమది కాదని వారు వివరణ ఇచ్చారు.

 

12:34 - June 14, 2017

ఢిల్లీ : అమర్ నాథ్ యాత్ర పై ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. కాల్పులు, గెనేడ్ లతో దాడులు జరిగే అవకాశం ఉందని నిఘావర్గాలు తెలిపాయి. నిఘా వర్గాల హెచ్చరికలతో భద్రతాదళాలు అప్రమత్తం అయ్యాయి. అమర్ నాథ్ యాత్ర జూన్ 29న మొదలై ఆగస్టు వరకు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఉగ్రముప్పు ఉందని తెలియడందో భక్తులు ఆందోళన చెందుతున్నారు. మరో వైపు భద్రత అధికారులు ఎటువంటి ఆందోళన అవసరం లేదని భద్రత అధికారులు అంటున్నారు. 30 వేల మిలటిరితో భద్రత ఏర్పాగటు చేస్తున్నామని వారు తెలుతున్నారు. అమర్ నాథ్ యాత్రకు 13 ఏళ్ల పైబడి 70 ఏళ్ల లోపు వారికి అనుమతి ఇస్తారు. 12750 అడుగుల ఎత్తులో భక్తులు యాత్ర చేయాల్సి ఉంటుంది. 

12:31 - June 14, 2017

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ 'అల్లు అర్జున్' సినిమాల మీద సినిమాలు చేసేస్తున్నాడు. ఇటీవలే ఆయన నటిస్తున్న 'డీజే..దువ్వాడ జగన్నాథమ్' చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇటీవలే ఈ సినిమాలోని పాటలు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈనెల 23న విడుదల కానుంది. బన్నీకి జంటగా 'పూజా హెగ్డే' నటించింది. ఇదిలా ఉంటే వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో 'బన్నీ' నటించనున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైనట్లు 'అల్లు అర్జున్' ట్విట్టర్ ద్వారా వెళ్లడించారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆయన పోస్టు చేశారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో 'అల్లు అర్జున్' కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టైటిల్ లోగోను విడుదల చేశారు. ‘నా పేరు సూర్య' అని..నా ఇల్లు ఇండియా అంటూ క్యాప్షన్ పెట్టారు. మిలటరీ అధికారిగా 'బన్నీ' నటిస్తారని ప్రచారం జరుగుతోంది.

12:24 - June 14, 2017

గంటా శ్రీనివాస్..నారాయణ...వీళ్లిద్దరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు...గంటా శ్రీనివాస్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తుంటే నారాయణ పురపాలక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరిద్దరూ వియ్యంకులయ్యారు. గంటా తనయుడు రవితేజ...నారాయణ రెండో కుమార్తె శరణిల వివాహం రెండేళ్ల క్రితం జరిగిన సంగతి తెలిసిందే. ఈ దంపతులకు హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో మంగళవారం పండంటి మగ బిడ్డ జన్మించాడు. ఈ విషయం తెలియడంతో ఇద్దరు మంత్రులు ఆసుపత్రికి చేరుకుని మనవడిని ఎత్తుకొని మురిసిపోయారు. బిడ్డను చూసి వారు ఆనందం వ్యక్తం చేశారు. ఇటీవలే మంత్రి నారాయణ కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే.

12:20 - June 14, 2017

మహబూబ్ నగర్ : జిల్లాల విభజన తర్వాత రాష్ట్ర రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి జిల్లాపై పట్టుసాధించేందుకు ఇప్పటినుంచే కసరత్తు మొదలుపెట్టారు టి-టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి. అయితే రానున్న ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి ఎక్కడి నుంచి పోటి చేస్తారనేది ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో హట్ టాఫిక్ గా మారింది.

పునర్విభజన జరిగితే....

నియోజక వర్గాల పునర్విభజన జరిగితే ప్రస్తుతం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ ఎస్సీ రిజర్వు అయ్యే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం సాగడంతో 2019లో ఆయన తాండూరు నుంచి బరిలో దిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు వికారాబాద్ నియోజక వర్గం నుంచి పోటి చేయవచ్చని అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి అనుచరులు. మరోవైపు ఆయన అత్తగారి ఊరు మాడుగుల నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి నియోజక వర్గంలో ఉండడంతో కల్వకుర్తి నుంచే పోటీ చేయవచ్చనే ప్రచారం సాగుతోంది. అయితే జిల్లాకు చెందిన నేతలు మాత్రం రేవంత్ రెడ్డి కచ్చితంగా పాలమూరు జిల్లా నుంచే పోటి చేస్తారని భావిస్తున్నారు. రేవంత్‌రెడ్డి మీద కోపంతోనే కొడంగల్‌లోని 3 మండలలను వికారాబాద్ జిల్లాలో కలిపారని భావిస్తున్నారు. కొడంగల్ నుంచి కాకపోతే జడ్చర్ల నియోజక వర్గం నుండి పోటీ చేసేందుకు రేవంత్ రెడ్డి సిద్దమవుతున్నారని సన్నిహితులు భావిస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం కొడంగల్ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తారని కార్యకర్తల సమావేశంలో స్పష్టం చేశారు. రాజకీయంగా తనకు కొడంగల్ మంచి పేరు తెచ్చిందని,.గతంలో 2009 ఎన్నికలలో కొడంగల్ నుంచి పోటీ చేయగా..ఈ ప్రాంత ప్రజలు తనను అక్కున చేర్చుకొని గెలిపించారని..అందుకనే వారి రుణం తీర్చుకునేందుకు మరోసారి కొడంగల్ నుంచే పోటీ చేస్తానని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. అలాగే నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కారిస్తానని కొడంగల్ ప్రజలకు హామీ ఇచ్చారు.మొత్తానికి వచ్చే ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి ఎక్కడి నుండి పోటి చేస్తారనే దానిపై పాలమూరు జిల్లాలో చర్చ సాగుతోంది. మరి నిజంగానే రేవంత్ రెడ్డి 2019ఎన్నికల్లో కొడంగల్ నుంచే పోటీచేస్తారా లేక మరే నియోజకవర్గం నుంచి పోటిచేస్తారనేది తెలియాలంటే కొంత కాలం వేచిచూడాలి. 

తమిళనాడు అసెంబ్లీలో లొల్లి..లొల్లి..

చెన్నై : తమిళనాడు అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. బుధవారం ఉదయం సమావేశం ప్రారంభమైన అనంతరం ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై చర్చించాలని డీఎంకే పట్టుబట్టింది. దీనికి స్పీకర్ అనుమతించలేదు. దీనితో డీఎంకే సభ్యులు ఆందోళన చేపట్టారు.

సినారె అంతిమ యాత్ర ప్రారంభం..

హైదరాబాద్ : సినారె అంతిమ యాత్ర కాసేపటి క్రితం ప్రారంభమైంది. సారస్వత పరిషత్ నుండి మహా ప్రస్థానం వరకు యాత్ర జరగనుంది. అనంతరం ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ అంత్యక్రియల్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు..పలువురు మంత్రులు పాల్గొననున్నారు.

12:15 - June 14, 2017

చిత్తూరు : తిరుమలలో కిడ్నాపర్లను సీసీటీవీ ఫుటేజి బయటపెట్టింది. బాలుడిని ఎత్తుకెళుతున్న విజువల్స్‌ ఫుటేజిలో స్పష్టంగా కనిపించాయి. దీని ఆధారంగా కిడ్నపర్లను గుర్తించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అనంతపురంజిల్లా వజ్రకరూర్‌ కు చెందిన తల్లిదండ్రుల తమ బాలుడు కనిపించడంలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉదయం గొల్లమండపం వద్ద కిడ్నాప్ జరిగింది. నాలుగు నెలాల క్రితం బాలిక కిడ్నాప్ గురైన విషయం తెలిసిందే. 

12:12 - June 14, 2017

టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన 'మంచు మనోజ్' ఒక్కసారిగా షాకిచ్చాడు. తన చిత్రాలతో అలరిస్తున్న ఈ నటుడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇక మున్ముందు ఎలాంటి సినిమాలు చేయబోనంటూ ఫేస్ బుక్ ద్వారా వెల్లడించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ఆయన 'ఒక్కడు మిగిలాడు' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనంతరం మరో రెండు సినిమాల్లో 'మంచు మనోజ్' నటిస్తున్నాడు. ఈ చిత్రాల అనంతరం ఎలాంటి సినిమాలు నటించబోనని మనోజ్ ప్రకటించాడు. అందరికీ ధన్యవాదాలు ఫేస్ బుక్ లో తెలియచేశాడు. కానీ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో ఎవరికీ అర్థం కావడం లేదు. త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేస్తాడా ? అనే చర్చ జరుగుతోంది. 'మేజర్ చంద్రకాంత్' సినిమాలో 'మంచు మనోజ్' బాల నటుడిగా నటించారు. అనంతరం 'దొంగ దొంగది', ‘ప్రయాణం'..’మిస్టర్ నూకయ్య'..’వేదం' తదితర సినిమాల్లో నటించాడు.

అమర్ నాథ్ యాత్రకు ఉగ్ర ముప్పు..

ఢిల్లీ : అమర్ నాథ్ యాత్రకు ఉగ్రవాదుల ముప్పు ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. కాల్పులు..గ్రేనేడ్ దాడులు చేయవచ్చని హెచ్చరించడంతో నిఘా భద్రతాదళాలు అప్రమత్తమయ్యాయి.

12:06 - June 14, 2017
12:05 - June 14, 2017

హైదరాబాద్ : బొగ్గులకుంట సారస్వత పరిషత్‌లో సినారె భౌతికకాయానికి పలువురు నివాళులర్పిస్తున్నారు. ప్రజల సందర్శన అనంతరం ఇక్కడి నుంచి సినారె అంతిమయాత్ర కొనసాగుతుంది. మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో సినారె అంత్యక్రియలు నిర్వహిస్తారు. అంత్యక్రియలకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. 

మంద్ సర్ లో సీఎం చౌహాన్..

మధ్యప్రదేశ్ : రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మంద్ సర్ కు చేరుకున్నారు. పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన రైతుల కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. ఈ సందర్భంగా మంద్ సర్ లో 144 సెక్షన్ అమలు చేశారు.

12:04 - June 14, 2017

హైదరాబాద్ : సినారె మృతి సాహితీలోకానికి తీరని లోటు అని అన్నారు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. సీపీఎం నేతలు సినారె పార్థివదేహాన్ని సందర్శించి జోహార్లు అర్పించారు. 

బాబుతో పాలేకర్ భేటీ..

విజయవాడ : సీఎం చంద్రబాబు నాయుడితో ప్రకృతి సేద్య రంగ నిపుణులు పాలేకర్ భేటీ అయ్యారు. ఏపీలో ప్రకృతి వ్యవసాయ సాగు పెంపుపై చర్చించారు. సుభాష్ పాలేకర్ ను ప్రభుత్వ ప్రకృతి వ్యవసాయ సలహా దారుగా బాబు నియమించారు.

 

11:58 - June 14, 2017

కర్నూలు : టీడీపీ నేత శిల్పామోహన్ రెడ్డి వైసీపీలో చేరారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శిల్పామోహన్ రెడ్డితో పాటు మరికొందరు వైసీపీలో చేరారు. నంద్యాల ఉపఎన్నికలో టికెట్ విషయమై చంద్రబాబు నుంచి ఎలాంటి హామీ లేకపోవడంతో ఆయన వైసీపీలో చేరినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

వైసీపీలో శిల్పా..

హైదరాబాద్ : టిడిపికి రాజీనామా చేసిన శిల్పా మోహన్ రెడ్డి వైసీపీ కండువా కప్పుకున్నారు. జగన్ సమక్షంలో శిల్పా మోహన్ రెడ్డి, నంద్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ సులోచన, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, పలువురు టిడిపి కార్యకర్తలు వైసీపీ తీర్థం పుచ్చుకొన్నారు.

రాజ్ భవన్ కు నిన్న టిడిపి..రేపు టి.కాంగ్రెస్..

హైదరాబాద్ : రాజ్ భవన్ కు టి.కాంగ్రెస్ నేతలు గురువారం వెళ్లనున్నారు. మియాపూర్ భూ కుంభకోణంపై గవర్నర్ కు నేతలు ఫిర్యాదు చేయనున్నారు. ఉదయం 11గంటలకు ఈ భేటీ జరగనుంది.

11:44 - June 14, 2017

హైదరాబాద్ : మియాపూర్ భూ కుంభకోణంలో పాత్ర ఉన్న అధికారులపై ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. నిన్న కూకట్ పల్లి సబ్ రిజిస్ట్రాలర్ శ్రీనివాసరావు ఇంట్లో సోదాలు జరిపిన ఏసీబీ నేడు బాలనగర్ సబ్ రిజిస్ట్రార్ యూసఫ్ అలీ ఇంట్లో దాడులు నిర్వహిస్తోంది. ఏకకాలంలో పంది బృందాలతో యూసఫ్ అలీ బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో 20 నుంచి 30 మంది అధికారులు పాల్గొంటునట్టు తెలుస్తోంది. యూసఫ్ అలీ వద్ద దాదాపు 100 కోట్ల వరకు అక్రమాస్తులు ఉన్నట్లు సమాచారం ఉంది. ఈ దాడులు మధ్యాహ్నం వరకు కొనసాగుతాయి.

 

11:43 - June 14, 2017

విశాఖ : తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిస్తాయని వాతవరణ శాఖ తెలిపింది. బంగాళఖాతంలో వాయుగుండంతో రాష్ట్రాల్లో రుతుపవనాలు చాలా చురుగ్గా కదులుతున్నాయని ఆ శాఖ తెలిపింది. రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు కర్ణాటకలో కూడా విస్తారించయని పేర్కొన్నారు. మరో వైపు వాయుగుండం బంగ్లాదేశ్ తీరం దిగ్గు పయణిస్తుందని 48 గంటల్లో వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా మారుతుందని తెలిపారు. అటు ఉత్తరాంధ్ర నిన్నటి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. అధికారులు అంచన వేసినట్లే రుతుపనాలు గమనం నడుస్తుంది. వాయుగుండం కారణంగానే రుతుపవనాలు వేగంగా విస్తరించాయని వాతవరణ అధికారులు తెలిపారు.

 

రాజ్ భవన్ ప్రభుత్వ స్కూల్ ప్రారంభం..

హైదరాబాద్ : రాజ్ భవన్ ప్రభుత్వ స్కూల్ ప్రారంభమైంది. ఉన్నత పాఠశాలను గవర్నర్ దంపతులు ప్రారంభించారు. హోం మంత్రి నాయినీ, డిప్యూటి సీఎం కడియంలు హాజరయ్యారు. రూ. 4.50కోట్లతో పాఠశాల భవనం నిర్మించారు. ఒకటి నుండి 10వ తరగతి వరకు డిజిటల్ బోధన జరగనుంది.

రాష్ట్రపతి ఎన్నిక నోటిఫికేషన్ విడుదల..

ఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 28 వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. జులై 17న ఎన్నికలు..20న కౌంటింగ్ జరగనుంది.

బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ దాడి..

హైదరాబాద్ : బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ యూసుఫ్ ఆలీ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడని ఆరోపణలు వెళ్లువెత్తాయి. యూసుఫ్ బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్, నల్గొండ, సూర్యాపేటతో పాటు 8 చోట్ల సోదాలు నిర్వహించింది. ఇప్పటికే యూసుఫ్ ఆలీని బాలానగర్ పోలీసులు అరెస్టు చేశారు. 2300 ఎకరాలు గోల్డ్ స్టోన్ సంస్థలకు యూసుఫ్ కట్టబెట్టాడు. యూసుఫ్ ఆస్తులు రూ. 100 కోట్లు ఉంటాయని ఏసీబీ అంచనా వేస్తోంది.

ఉత్తమ కమ్యూనిస్టు సినారె - తమ్మినేని..

హైదరాబాద్ : సినారె ఉత్తమ కమ్యూనిస్టు అని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. సారస్వత పరిషత్ లో సినారె పార్థివదేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..కమ్యూనిజం చచ్చిపోయిందని ఎవడురా అన్నాడు..? ఎర్రజెండాకు చావు లేదని చెప్పిన గొప్ప దార్శనికుడని కొనియాడారు. ఆయన మృతి సాహితీ లోకానికి..తెలుగు ప్రజానీకానికి తీరని లోటని పేర్కొన్నారు.

10:33 - June 14, 2017

చిత్తూరు : తిరుమలలో కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఈ రోజు ఉదయం 5 గంటలకు శ్రీవారి దర్శనం అనంతరం గుడి ముందు గొల్లమండపం సమీపంలో తల్లిదండ్రులతో నిద్రిస్తున్న ఏడాది వయసున్న బాలున్ని గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. తెరుకున్న తల్లిదండ్రులు వెంటెనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉదయం ఐదు గంటల సమయంలో బాలుడిన ఎత్తుకెళ్లినట్టు సీసీ పుటెజ్ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా కిడ్నాపర్లను గుర్తించారు. పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. బాధితులు అనంతపురం జిల్లా వజ్రకరూర్ కు చెందినవారిగా తెలుస్తోంది. జిల్లా సరిహద్దుల వద్ద పోలీసులు గాలిస్తున్నారు. సాయంత్రంలోగా కిడ్నాపర్లను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. 

లండన్ లో అగ్నిప్రమాద బీభత్సం..

లండన్ : వెస్ట్ ఏస్టేట్ లోని 27 అంతస్తుల గ్రెన్ టవర్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గత రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో అత్యధికులు నిద్రిస్తుండడంతో మృతుల సంఖ్య భారీగానే ఉంటుందని తెలుస్తోంది.

రూ. 70 లక్షల గుట్కా..జర్ధా స్వాధీనం..

శంషాబాద్ :ఎయిర్ పోర్టులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రూ. 70 లక్షల విలువైన గుట్కా, జర్ధాను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

తిరుపతిలో ఏడాది బాలుడి కిడ్నాప్..

చిత్తూరు : తిరుపతిలో దుండగుడు బాలుడిని అపహరించారు. గొల్లమండపం వద్ద దగ్గర తల్లిదండ్రుల వద్ద నిద్రిస్తున్న బాలుడిని ఎత్తుకెళ్లాడు. నుండి ఉదయం 5గంటలకు బాలుడిని ఎత్తుకెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు.

 

కాసేపట్లో సినారె అంత్యక్రియలు..

హైదరాబాద్ : ప్రజల సందర్శనార్థం సారస్వత పరిషత్ లో సినారె పార్థివదేహాన్ని తరలించారు. జిల్లాల నుండి భారీగా అభిమానులు తరలివస్తూ ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. అధికార లాంఛనాలతో మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగనున్నాయి. సినారె అంత్యక్రియల్లో సీఎం కేసీఆర్..మంత్రులు పాల్గొననున్నారు.

10:12 - June 14, 2017

హైదరాబాద్ సీపీఎం రాష్ట్ర కమిటీ సినారె మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని సీపీఎం నాయలకులు అన్నారు. నమ్మిన సిద్దాతంతో ముందుకెళ్లిన వ్యక్తి సినారె అని, సిద్దాతాన్ని నమ్ముకున్న కమ్యూనిస్టులు ఆధైర్యపడవద్దని సినారె చెప్పరాని వారు తెలిపారు. సాహిత్య లోకానికి, తెలంగాణకి తీరని లోటు అని, కదిలింది అరుణా సైన్యం అంటూ సినారె రాసిన పాట అందరికి ఆదర్శం అని సీపీఎం నాయకులు అన్నారు. భారతదేశంలోనే గొప్ప వ్యక్తిగా మన మధ్య లేకపోవటం బాధకరమని మంథని మాజీ ఎమ్మెల్యేల శ్రీధర్ బాబు అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

09:53 - June 14, 2017

ఖమ్మం : ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ యార్డు..నగరానికి గుండెకాయ లాంటిది. ముప్పై ఎకరాల్లో విస్తరించివున్న ఈ మార్కెట్‌ యార్దుపై ఆధారపడి వేలాది మంది జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి మార్కెట్‌ యార్డు తరలింపు విషయం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. మార్కెట్‌ యార్డు తరలింపు అంశం తెరపైకి వచ్చిన తర్వాత దీనిని తన నియోజకవర్గం పరిధిలోని రఘునాథపాలెం తరలించాలని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ పట్టుపడుతున్నారు. మరో వైపు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు అసెంబ్లీ స్థానం పరిధిలోని గుర్రాలపాడుకు తరలించుకుపోవాలని చూస్తున్నారు. వ్యాపారులు, వాణిజ్య వర్గాలు కూడా ఇందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నాయి. తొలుత నయా బజార్‌ స్కూలు వద్ద ఏర్పాటు చేసిన మార్కెట్‌ యార్డును ఆ తర్వాత గాంధీచౌక్‌కు అక్కడ నుంచి ప్రస్తుతం ఉన్న గుట్టల బజార్‌కు తరలించారు. దీనికి అనుబంధంగా కోల్డు స్టోరేజీలు, ఎరువులు, పురుగుమందుల, వస్త్ర దుకాణాలు,బంగారం షాపులు ఏర్పాటయ్యాయి. ఈ మార్కెట్‌ యార్డుకు ఖమ్మం జిల్లా నుంచే కాకుండా వరంగల్‌, మహబూబాబాద్‌తోపాటు ఏపీలోని కృష్ణా జిల్లా నుంచి కూడా రైతులు వ్యవసాయ ఉత్పత్తులును తీసుకొస్తారు.

2009లోనే జీవో...
ఈ మార్కెట్‌ యార్డును రఘునాథపాలెం తరలించేందుకు అప్పటి ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరావు ప్రభుత్వంపై ఒత్తిడితెచ్చి 2009లోనే జీవో తెచ్చుకున్నారు. కానీ సీపీఎంతోపాటు వ్యాపార, వాణిజ్య వర్గాలు దీనిని వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేపట్టడంతో దిగొచ్చిన ప్రభుత్వం ఆ జీవోను రద్దు చేసింది. 2014 ఎన్నికల్లో పువ్వాడ అజయ్‌ కుమార్‌ కాంగ్రెస్‌ తరపున, తుమ్మల నాగేశ్వరరావు టీడీపీ అభ్యర్థిగా ఖమ్మం బరిలో దిగారు. మార్కెట్‌ తరలింపు విషయంలో తుమ్మలపై వ్యతిరేకత రావడంతో ప్రజలు పువ్వాడకు ఓటేశారు. పువ్వాడ అజయ్‌ కుమార్‌ టీఆర్‌ఎస్‌లో చేరిన తర్వాత మార్కెట్‌ యార్డును రఘునాథపాలెం తరలించాలని పట్టుపడుతూ వస్తున్నారు. ఏ ప్రయోజనాలు ఆశించి మార్కెట్‌ యార్డును తరలించాలని చూస్తున్నారో చెప్పాలని ఈ ప్రాంత ప్రజలు, వ్యాపారులు పువ్వాడను ప్రశ్నిస్తున్నారు.

తరలింపు వెనుక రియల్ ఎస్టేట్
రఘునాథపాలెంకు మార్కెట్‌ యార్డును తరలించాలని ఎమ్మెల్యే పువ్వాడ చేస్తున్న ప్రయత్నాల వెనుక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. రఘునాథపాలెం ఖమ్మకు 15 కి.మీ. దూరంలో ఉంది. అక్కడకు తరలించడం వలన రైతులపై అదనపు రవాణా భారం పడుతుంది. వ్యాపారులు, కార్మికులకు అంతదూరం వెళ్లిరావడం ఇబ్బందిగా మారుతుంది. తరలిస్తే ప్రస్తుతం మార్కెట్‌ యార్డు ఉన్న త్రీటౌన్‌లో వ్యాపారాలు దెబ్బతింటాయి. షాపులను మూసివేయాల్సి సవ్తే వేలాది ఉపాధి కోల్పోతారు. ఇది పువ్వాడకు రాజకీయంగా పెద్ద సమస్యగా మారుతుంది. గుర్రాలపాడు మంత్రి తుమ్మల ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలోకి వస్తుంది. ఖమ్మకు అతి దగ్గర్లో ఉంది. అక్కడకు తరలిస్తే అనుకూలంగా ఉంటుందని కొందరు వ్యాపారులు కోరుతున్నారు. వీరు కూడా రెండు వర్గాలుగా చీలిపోయారు. కొందరు రఘునాథపాలెం తరలించాలని పట్టుపడుతుంటే మరికొందరు గుర్రంపాడులో ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. గుర్రాలపాడు అందరికీ అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. సీపీఎం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా మార్కెట్ యార్డును గుర్రాలపాడుకు బదులు వేరే ప్రాంతానికి తరలిస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదని వ్యాపారులు హెచ్చరిస్తున్నారు. రైతుల కూడా గుర్రాలపాడువైపే మొగ్గు చూపుతున్నారు. అక్కడ ప్రభుత్వ భూములు ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. మార్కెట్‌ యార్డును రఘునాథపాలెంకు తరలించే విషయంలో ఎమ్మెల్యే అజయ్‌ కుమార్‌ తన పంతం నెగ్గించుకుంటారో, గుర్రాలపాడు అంశంపై వ్యాపారుల పోరాటం ఫలిస్తుందో, ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి. 

09:40 - June 14, 2017

విజయవాడ : సోలార్ కాలుష్యం ఉండదని, సోలార్ పవర్ ప్లాంట్స్ కు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని, ఇంటి పై సోలార్ ప్లెట్స్ ల ఉంటే కొంచెం చల్లగా కూడా ఉంటుందని ట్రాన్స్

లండన్ లో భారీ అగ్నిప్రమాదం

ఇంగ్లాండ్ : లండన్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. 24 అంతస్తుల్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. 40 ఫైర్ ఇంజన్లు 200 మంది అగ్నిమాకప సిబ్బంది మంలార్పుతున్నారు. భవనంలో 200 మంది చిక్కుకున్నట్లు సమాచారం. ఈ భవనంలో మొత్తం 120 కుటుంబాల వారు నివసిస్తున్నారు. 25 అంతస్తులో మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. మంటలు వచ్చిన వెంటనే ఫైర్ సిబ్బంది వచ్చి నీరు పైకి విరజిమ్మెల చేస్తూ రీస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు.

శంషాబాద్ అనుపమ లాడ్జిలో అగ్నిప్రమాదం

రంగారెడ్డి : జిల్లా శంషాబాద్ లోని అనుమప లాడ్జిలో తెల్లవారుజామున 5గంటల సమయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఎనిమిది అంతస్తుల భవనంలో మొదటి రెండంతస్తుల్లో మంటలు చెలరేగాయి. లాడ్జిలో సమారు 50 మంది చిక్కుకున్నట్టు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలార్పుతున్నారు. దాదాపు మంటుల అదుపులోకి వచ్చాయని, లాడ్జి వెనక నిచ్చెన వేసి మందిని బయటకు పంపిస్తున్నారు.

సినారెకు నివాళులు అర్పించిన గవర్నర్

హైదరాబాద్ : గవర్నర్‌ నరసింహన్‌ సినారె మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. సినారె కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. జ్ఞాన్‌పీఠ్‌ అవార్డ్‌ గ్రహీత సినారెను కోల్పోవడం తెలుగుజాతితోపాటు, భారతదేశానికే తీరని లోటన్నారు.

09:31 - June 14, 2017

హైదరాబాద్ : గవర్నర్‌ నరసింహన్‌ సినారె మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. సినారె కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. జ్ఞాన్‌పీఠ్‌ అవార్డ్‌ గ్రహీత సినారెను కోల్పోవడం తెలుగుజాతితోపాటు, భారతదేశానికే తీరని లోటన్నారు.

09:26 - June 14, 2017
09:25 - June 14, 2017

ఇంగ్లాండ్ : లండన్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. 24 అంతస్తుల్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. 40 ఫైర్ ఇంజన్లు 200 మంది అగ్నిమాకప సిబ్బంది మంలార్పుతున్నారు. భవనంలో 200 మంది చిక్కుకున్నట్లు సమాచారం. ఈ భవనంలో మొత్తం 120 కుటుంబాల వారు నివసిస్తున్నారు. 25 అంతస్తులో మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. మంటలు వచ్చిన వెంటనే ఫైర్ సిబ్బంది వచ్చి నీరు పైకి విరజిమ్మెల చేస్తూ రీస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. ఈ అగ్నిప్రమాదం షాట్ సర్క్యుట్ తో జరిగినట్టు ప్రాథమిక సమాచారం ఉంది. 

09:24 - June 14, 2017

రంగారెడ్డి : జిల్లా శంషాబాద్ లోని అనుమప లాడ్జిలో తెల్లవారుజామున 5గంటల సమయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఎనిమిది అంతస్తుల భవనంలో మొదటి రెండంతస్తుల్లో మంటలు చెలరేగాయి. లాడ్జిలో సమారు 50 మంది చిక్కుకున్నట్టు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలార్పుతున్నారు. దాదాపు మంటుల అదుపులోకి వచ్చాయని, లాడ్జి వెనక నిచ్చెన వేసి మందిని బయటకు పంపిస్తున్నారు. శంషాబాద్ నుంచి ఎయిర్ పోర్ట్ వెళ్లె దారిలో ఈ లాడ్జి ఉంది. స్టోర్ రూంలో షాట్ సర్క్యూట్ జగడంతో మంటలు అంటుకునట్టు తెలుస్తోంది. మొత్తనికి పెద్ద ప్రమాదం దప్పింది. 5గంటల నుంచి 7 గంటల వరకు మంటలు కొనసాగాయి. ఈ ప్రమాదంలో భారీ స్థాయిలో ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. 

09:22 - June 14, 2017

భూ కబ్జాల పై బహిరంగ విచారణ చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి కానీ దాన్ని ప్రభుత్వం రద్దు చేసిందని, కలెక్టర్ గారు భిన్న ప్రకటనలు చేయడం, మధ్యలో లోకేష్ విశాఖ రావడం, ఇది ప్రజల సమస్య 25వేల కోట్ల విలువైన భూమి అక్రమానలకు గురైయ్యాయని, భూ కబ్జాల వెనుక నేతలు ఉన్నారని ఏపీ సీపీఎం నేత నర్సింగరావు, నడిపంపల్లి సీతారామరాజు అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వ భూములకు తండ్రిల వ్యవరిస్తున్నాడని, విషయం తెలిసిన వెంటనే విచారణ ఆదేశించారని టీడీపీ నేత సుబ్బారావు అన్నారు.  

09:21 - June 14, 2017

రంగారెడ్డి : జిల్లా శంషాబాద్ లోని అనుమప లాడ్జిలో తెల్లవారుజామున 5గంటల సమయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఎనిమిది అంతస్తుల భవనంలో మొదటి రెండంతస్తుల్లో మంటలు చెలరేగాయి. లాడ్జిలో సమారు 50 మంది చిక్కుకున్నట్టు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలార్పుతున్నారు. దాదాపు మంటుల అదుపులోకి వచ్చాయని, లాడ్జి వెనక నిచ్చెన వేసి మందిని బయటకు పంపిస్తున్నారు. శంషాబాద్ నుంచి ఎయిర్ పోర్ట్ వెళ్లె దారిలో ఈ లాడ్జి ఉంది. స్టోర్ రూంలో షాట్ సర్క్యూట్ జగడంతో మంటలు అంటుకునట్టు తెలుస్తోంది. మొత్తనికి పెద్ద ప్రమాదం దప్పింది. 5గంటల నుంచి 7 గంటల వరకు మంటలు కొనసాగాయి. ఈ ప్రమాదంలో భారీ స్థాయిలో ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. 

09:19 - June 14, 2017

విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల విషయంలో బిజెపి ఎంపి హరిబాబు చేసిన వ్యాఖ్యలపై కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలకు యాజమాన్యం అసమర్ధతే కారణమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను పలువురు తప్పుపడుతున్నారు. మరి ఇంతకీ విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలకు కారణమెవరు? బాధ్యులెవరు? ఎంపి హరిబాబు వ్యాఖ్యల వెనక వ్యూహమేమిటి? విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల నుంచి గట్టెక్కాలంటే కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలేమిటి? ఇదే అంశంపై ఇవాళ్టి జనపథం. 60 సంవత్సరాల క్రితం 32 మంది ప్రాణ త్యాగం ఫలితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించామని, బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. స్టీల్ ప్లాంట్ కు గనులు సమకుర్చడంలో బీజేపీ, కాంగ్రెస్ గానీ విఫలం చెందాయని దీంతో ప్లాంట్ నష్టల ఊబిలో చిక్కుకుందని, ఏపీ సీఐటీయూ అధ్యక్షుడు నర్సింగరావు అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

09:18 - June 14, 2017

హైదరాబాద్ : తెలంగాణా ఉద్యమ ప్రస్థానం మొదలైన నాటి నుంచి గులాబీ పార్టీకి నెంబర్‌-2 స్థానం కలిసివచ్చేలా లేదు. ఈ స్థానంలో ఉన్నామని చెప్పుకునే నేతలకు నిత్యం టెన్షన్‌ టెన్షనే. ఏదో ఓ రకంగా పార్టీలో అవమానానికి గురికాక తప్పడం లేదు. పార్టీ మొదలైన నాటి నుంచి కూడా అవే పరిస్థితులు పునరావృత్తమవుతున్నాయి. కాకతాళియంగా జరుగుతున్నాయా..లేదా పార్టీ అధినేత కేసీఆర్‌ కదిపే రాజకీయ పావులకు బలవుతున్నారా అన్నది పార్టీ నేతలకు అంతు చిక్కకుండా మారింది.

ఉద్యమంతోనే తెలంగాణ
ఉద్యమంతోనే తెలంగాణ సాధించాలని పార్టీ ఆవిర్భవించిన తొలి నాళ్లలోనే బీజేపీ సీనియర్ నేత ఆలే నరేంద్ర తెలంగాణ సాధన సమితి పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. అయితే నరేంద్ర పెట్టిన తెలంగాణ సాధన సమితిని టీర్‌ఎస్‌లో విలీనం చేసే పరిస్థితులను కేసీఆర్ కల్పించారు. ఆ తర్వాత పార్టీలో నరేంద్రకు అదే స్థాయిలో అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. గులాబీ పార్టీ కేంద్రంలో భాగస్వామ్యం కావడంతో నరేంద్రకు మంత్రి పదవి కూడా వరించింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో పార్టీ నుంచి నరేంద్ర సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇక తల్లి తెలంగాణా పార్టీని స్థాపించిన విజయశాంతి పరిస్థితి కూడా దాదాపు అదే. పార్టీ విలీనం తర్వాత కేసీఆర్ విజయశాంతి కోసం మెదక్ ఎంపీ స్థానాన్ని కూడా వదులుకున్నారు. ఉద్యమంలో తెలంగాణా గళం విప్పారు. ఆ తర్వాత విజయశాంతి కూడా గులాబీ పార్టీకి దూరం కావాల్సి వచ్చింది. వీరిద్దరికి పార్టీలో సెక్రటరీ జనరల్ పదవులు నిర్వహించిన వారే. ఇప్పుడు పార్టీ సెక్రటరీ జనరల్‌గా కొనసాగుతున్న కేకే పరిస్థితి కూడా అయోమయంగా మారింది.

కేకే భూముల వ్యవహరం 
లీకేజీ ఇవ్వడంతోనే కేకే భూముల వ్యవహారం బయటపడిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. అధినేత కేసీఆర్‌పై తెరవెనుక చేసిన వ్యాఖ్యలే కేకేకు ఈ పరిస్థితులు తెచ్చిపెట్టాయన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భూ కుంభకోణంలో ఎంతో మంది పెద్దల పేర్లు వినిపిస్తున్నా..కేకే సంబంధించిన భూ వివరాలు మాత్రమే బయటపడడం ఆరోపణలకు మరింత బలం చేకూర్చినట్లువుతోంది. సీనియర్ నేతగా నిన్న మొన్నటి వరకు పార్టీలో కీలకంగా వ్యవహరించిన కేకే..తాజా పరిస్థితులతో ఆత్మరక్షణలో పడేలా చేశాయి. పార్టీలో రెండో స్థానంపై ఆశపడితే ఎలా ఉంటుందో చెప్పేందుకు ఈ ఘటనలు అద్దం పడుతున్నాయి. పరోక్షంగా హరీష్‌రావ్‌కు కూడా ఈ పరిణామాలు ఓ హెచ్చరిక లాంటివిగానే భావించాల్సి ఉంటుందన్న అనుమానాలు కలుగుతున్నాయి. మొత్తం మీద పార్టీలో రెండో స్థానం కోసం ప్రయత్నాలు జరిగితే..వారి మెడపై కత్తి వేలాడుతూనే ఉంటుందన్న సంకేతాలు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తున్నట్లు కనిపిస్తోంది.

08:59 - June 14, 2017

ఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ..125 ఏళ్ళ రాజ‌కీయ చ‌రిత్ర. దేశాన్ని ద‌శాబ్దాల పాటు ఏలిన చరిత్ర. ఇంత చ‌రిత్ర కలిగిన పార్టీ..మోదీ గాలితో ప్రస్తుతం కేంద్రంలో ప్రతిప‌క్షానికి పరిమితం అయ్యింది. ఇక చాలా రాష్ట్రాల‌లో అధికారాన్ని కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అధికారం కోల్పోవడం..తిరిగి ప‌వ‌ర్లోకి రావ‌డం..పార్టీకి కొత్త కాన‌ప్పటికీ..ఈ స్థాయిలో ఓట‌మి పాలు కావ‌డాన్ని మాత్రం కాంగ్రెస్‌పార్టీ జీర్ణించుకోలేక పోతుంది. దీంతో భ‌విష్యత్‌పై ఆశ‌లు పెట్టుకున్న కాంగ్రెస్..ఇప్పటి నుండే అత్యంత జాగ్రత్తగా అడుగులు వేస్తుంది.

పార్టీ బ‌లోపేతంపై దృష్టి
దీనిలో భాగంగా దేశ వ్యాప్తంగా పార్టీ బ‌లోపేతంపై దృష్టి పెట్టారు పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ. రాష్ట్రా వారిగా..పీసీసీల ప‌నితీరును..ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. అంతేకాదు..పార్టీ చేప‌ట్టాల్సిన‌ కార్యక్రమాలపై ఆయా పీసీసీల‌కు దిశా నిర్ధేశం కూడా చేస్తున్నారు. దీనిలో భాగంగా ప్రతి రాష్ట్రం నుండి వ‌స్తున్న సొంత మీడియా డిమాండ్‌పై రాహుల్ గాంధీ ప్రత్యేక దృష్టి పెట్టారు. మోదీ అధికారంలోకి వ‌చ్చేందుకు మీడియా పాత్ర ఎంతో ఉంద‌న్న దానిపై ఇప్పటికే ఓ అంచ‌నాకు వ‌చ్చిన రాహుల్ గాంధీ,.తాము కూడా సొంత మీడియాతో బ‌ల‌లోపేతం కావాల‌ని డిసైడ్ అయ్యార‌ని టాక్.దీనికోస‌మై ఏఐసీసీ ఇప్పుడు త‌మ నేష‌న‌ల్ హేరాల్డ్ ప‌త్రిక‌ను విస్తరించాలని నిర్ణయించింది. స్వాతంత్ర్యానికి ముందు 1938లో జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ నేష‌న‌ల్ హేరాల్డ్ ప‌త్రికను స్థాపించారు. అయితే ఏడు ద‌శాబ్దాల చ‌రిత్ర ఉన్న ఈ ప‌త్రిక‌ను..కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వాడుకోలేదన్న వాస్తవాన్ని గ్రహించిన రాహుల్..ఇక దీన్ని ఇప్పుడు దేశ వ్యాప్తంగా విస్తరించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇంగ్లీష్‌లోనే ఉన్న ఈ ప‌త్రిక‌ను..హిందీ, ఉర్దూతో పాటు ప్రాంతీయ భాషల్లోనూ ప‌త్రిక‌ను తీసుకురాబోతున్నారు. దీనిలో భాగంగా..మొన్న బెంగుళూర్లో జ‌రిగిన ద‌క్షినాది రాష్ట్రాల పీసీసీ స‌మావేశంలో దీనిపై రాహుల్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది.

ప్రాంతీయ భాషతో
ఇలా ప్రాంతీయ భాష‌ల్లో నేష‌న‌ల్ హేరాల్డ్‌ను తీసుకురావ‌డం వెన‌క..కాంగ్రెస్‌కు పెద్ద ఫ్యూహమే కన్పిస్తోంది. ముఖ్యంగా ద‌క్షినాది రాష్ట్రాల‌పై బీజేపీ..ప్రత్యేక దృష్టి పెట్టిన నేప‌థ్యంలో..సౌత్‌లో బిజేపీ..స్పీడ్‌కు బ్రేకులు వేయాల‌ని డిసైడ్ అయ్యింది. దీనిలో భాగంగా..పార్టీ బ‌లోపేతంతోపాటు..స్థానిక భాష‌ల్లో సొంత మీడియాను తీసుకురావాల‌ని డిసైడ్ అయ్యింది. మ‌రి దీనితో కాంగ్రెస్ టార్గెట్ ఏమేర‌కు రీచ్ అవుతుందో చూడాలి.

08:58 - June 14, 2017

హైదరాబాద్ : అంతరిక్ష పరిశోధనల్లో అద్భుతాలు సాధిస్తున్న ఇస్రో శాస్త్రవేత్తలను హైదరాబాద్‌ రవీంద్ర భారతిలో ఘనం సన్మానించారు. ప్లాంజరీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పీఎస్ఎల్వీ సీ-37 రాకెట్‌ ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టిన పది మంది శాస్త్రవేత్తలను సన్మానించారు. విక్రం సారాబాయ్‌ అంతరిక్ష కేంద్రం డైరెక్టర్‌ డాక్టర్‌ కే శివన్‌, సద్గురు సాయి బాబా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. 

08:56 - June 14, 2017

విజయవాడ : ప్రభుత్వ కార్యాలయాల్లో సౌర విద్యుత్‌ను ఉపయోగించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలను ఏపీ ట్రాన్స్‌కో ఆచరణలో పెట్టింది. విజయవాడలోని విద్యుత్‌ సౌధలో మినీ సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంటు ఏర్పాటు చేశారు. రాష్ట్ర సాంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థ సహకారంతో 50 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్‌ కేంద్రాన్ని నెలకొల్పారు. దీని వలన విద్యుత్‌ బిల్లులు ఆదాఅవుతాయని అధికారులు చెబుతున్నారు. 

08:55 - June 14, 2017

గుంటూరు : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం జరిగింది. వివిధ శాఖల మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరైన ఈ భేటీలో రెండేళ్లలో వివిధ పారిశ్రామిక సంస్థలతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఎంవోయులు, వచ్చిన పెట్టుబడులను సమీక్షించారు. ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో వస్తున్నఅనూహ్య పరిణామాలతో ఇంథన రంగంలో వస్తున్న మార్పులను చంద్రబాబు ప్రస్తావించారు. సౌర విద్యుత్‌ ఉత్పత్తి గణనీయంగా పెరుగుతోండటంతో కరెంటు చార్జీలు తగ్గుతున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇందుకు అనుగుణంగా పరిశ్రమలకు సరఫరా చేసే విద్యుత్‌కు రాయితీలు ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పారిశ్రామీకరణతోనే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, అనుమతులకు ఏకగవాక్ష విధానాన్ని అమలు చేయాలని కోరారు. మొత్తం 3,808 కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదనలతో ఆరు మెగా పారిశ్రామిక ప్రాజెక్టులకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపిన అంశాన్ని అధికారులు చంద్రబాబు దృష్టికి తెచ్చారు. వీటి ద్వారా 5,325 మంది ఉద్యోగాలు లభిస్తాయని లెక్కకట్టారు. కేసీపీ, చెట్టినాడ్‌ సిమెంట్‌, రెయిన్‌ గ్రూపు, మోహన్ స్పిన్‌టెక్‌ ఇండియా, ఇండో కౌంట్‌ ఇండస్ట్రీస్‌, విశ్వ అప్పెరల్స్‌ సంస్థలు వీటిలో ఉన్నాయి. కేసీపీ సంస్థ కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం ముక్త్యాల దగ్గర వంద ఎకరాల్లో సిమెంటు ఉత్పత్తి ప్లాంటు ఏర్పాటు చేస్తోంది. 531.61 కోట్ల పెట్టుబడితో నెలకొల్పే ఈ కంపెనీ ద్వారా వంద మందికి ప్రత్యక్షంగా, 1900 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపిన కంపెనీలు సాధ్యమైనంత త్వరగా పనులు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు

వంద ఎకరాల్లో యూనిట్‌
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒకచోట వంద ఎకరాల్లో యూనిట్‌ ఏర్పాటుకు ఇండో-కౌంట్‌ ఇండస్ట్రీస్‌ ముందుకొచ్చింది. 250 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుచేసే ఈ వస్త్ర మిల్లు ద్వారా 2,600 మంది ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. 2018 నాటికి ఉత్పత్తి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మోహన్‌ స్పిన్‌టెక్స్‌ కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలో 611 కోట్ల రూపాయల పెట్టుబడితో దుస్తుల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. దీని వలన రెండు వేల మందికి ఉపాధి లభిస్తుంది. ఐటీ రంగంలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ 700 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడానికి ముందుకు చ్చింది. దీని ద్వారా 7,500 మందికి ఉపాధి లభిస్తుందని లెక్క వేశారు. విశాఖలో జరిగిన రెండు భాగస్వామ్య సదస్సుల్లో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాల్లో ఎన్ని కార్యరూపందాల్చాయన్న అంశంపై కూడా చంద్రబాబు సమీక్షించారు. రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉద్యోగాలు లభించే విధంగా నైపుణ్య శిక్షణ ఇవ్వాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 

08:54 - June 14, 2017

హైదరాబాద్ : మియాపూర్‌తో సహా జంటనగరాల శివార్లలోని వివిధ ప్రాంతాల్లో వెలుగు చూసిన భూకుంభకోణాల వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూములకు అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయని ఫిర్యాదులు వచ్చాయి. సర్కారీ పెద్దల సహకారంతో కొందరు రియల్టర్లు భూములను కాజేశారని ఆరోపణలు గుప్పుమన్నాయి. ఈ ఆరోపణల్లోని నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖలతోపాటు పోలీసు అధికారులు హాజరైన ఈ సమావేశంలో విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో నిజంలేదన్న నిర్ధారణకు వచ్చారు.

గజం ప్రభుత్వ భూమి కూడా అన్యాక్రాంతం కాలేదు
ఒక్క గజం ప్రభుత్వ భూమి కూడా అన్యాక్రాంతం కాలేదని ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. మియాపూర్‌, బాలానగర్, ఇబ్రహీంపట్నం, శంషాబాద్‌ ప్రాంతాల్లో ప్రభుత్వ భూములపై హక్కుల కోసం కొందరు చేసిన ప్రయత్నాల వల్ల ఖజానాకు ఒక్క రూపాయి కూడా నష్టం వాటిల్లలేదని తేల్చింది. ఈ ప్రాంతాల్లో ప్రైవేటు వ్యక్తులకు రిజిష్టర్‌ అయిందని చెబుతున్న భూమి అంతా ప్రభుత్వ ఆధీనంలోనే ఉందని అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తెచ్చారు. అయితే రిజిస్ట్రేషన్ల విషయంలో కొందరు అవకతవకలకు పాల్పడినట్టు తేలిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే కొందరిపై క్రిమినల్‌ కేసులు నమోదుకావడంతోపాటు, ఇప్పటి వరకు జరిగిన అరెస్టుపై అధికారులు వివరణ ఇచ్చారు. సీఐడీ దర్యాప్తు జరుగుతున్న తరుణంలో సీబీఐ విచారణకు విపక్షాలు డిమాండ్‌ చేయడాన్ని కేసీఆర్‌ తప్పుపట్టారు. ప్రతిపక్షాలు ప్రతి విషయాన్ని చిలవలుపలవలు చేస్తూ, రాజకీయ రాద్ధాంతం చేస్తుండటంపై సీఎం మండిపడ్డారు.

ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్‌ చేయడం కుదరదు...
పాత జాగీరు భూములపై హక్కులు సాధించడానికి కొందరు వ్యక్తులు జీపీఏలు సృష్టించిన విషయంపై సమీక్షించారు. కోర్టు కేసుల్లో బలం చేకూరడానికి తప్పుడు పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్న అంశంపై కూడా చర్చించారు. ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్‌ చేయడం కుదరదని, ఎవరైనా అలా చేయించుకుంటే అవి చెల్లవని అధికారులు వివరణ ఇచ్చారు. అక్రమ రిజిస్ట్రేషన్లకు చట్ట బద్ధత కూడా ఉండదని, ప్రభుత్వ భూమి మార్పిడయ్యే అవకాశమేలేదని చెబుతున్నారు. రాష్ట్రంలో భూముల రక్షణ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్న విషయాన్ని కేసీఆర్‌ ప్రస్తావించారు. తప్పుడు పద్ధతిలో అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకున్న వారిపై సీఐడీ విచారణ నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని సీఎం స్పష్టం చేశారు. దోషులని తేలినవారు ఎంతటివారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మియాపూర్‌లో 810 ఎకరాల ప్రభుత్వ భూమికి ప్రైవేటు వ్యక్తులకు లిటిగేషన్‌ హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్‌ చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఇది కేవలం భూబదలాయింపేనని, రిజిస్ట్రేషన్‌ కాదని అధికారులు వివరించారు. రిజిస్టర్‌ చేస్తే రిజిస్ట్రేషన్‌ విలువు 415 కోట్లు అయ్యేదని, కానీ 60 లక్షలు మాత్రమే చెల్లించిన అంశాన్ని గుర్తు చేస్తున్నారు. జాగీర్దారీ భూములపై హక్కుల పత్రాలు సృష్టించుకుని, ప్రభుత్వ భూములను కాజేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఇలాంటి భూములపై సుప్రీంకోర్టులో కేసులు ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వ తరపున సర్వోన్నత న్యాయస్థానానికి పూర్తి వివరాలు అందించాలని కోరారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికే నేరుగా వివరాలు పంపి, కేసు విచారణ సందర్భంగా పరిగణలోకి తీసుకునే విధంగా చూడాలని కేసీఆర్‌ ఆదేంచారు. 

08:52 - June 14, 2017

విజయవాడ : సమాజంలో ఎదుర్కొంటున్న ఏ సమస్యకైనా పెట్టుబడిదారి గ్రంధంలో సమాధానం దొరుకుతుందన్నారు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులు. విజయవాడ ఎంబీకే భవన్‌లో ప్రపంచ గతిని మార్చిన పెట్టుబడిదారి గ్రంధం 150వ వార్షికోత్సవ సభలో పాల్గొన్నారు. దేశంలో ప్రజల అప్పులు పెరగడం లేదని.. వారితో పెట్టుబడిదారులు చేయిస్తున్నారని ఆరోపించారు. వాయిదాల పద్ధతిలో చెల్లించాలంటూ అప్పుల ఊబిలోకి దింపుతున్నారని చెప్పారు. క్రెడిట్‌ పద్ధతి గురించి మార్క్స్ పెట్టుబడిదారి గ్రంధంలో రాసినంత గొప్పగా మరెక్కడా రాయలేదన్నారు. 

పెట్రోలియం మంత్రితో డీలర్ల సమావేశం

 

ఢిల్లీ : నేడు కేంద్ర పెట్రోలియం మంత్రి పెట్రోల్ డీలర్ల తో సమావేశం నిర్వహించనున్నారు. రోజువారి ధరల నిర్ణయంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. 

మందసర్ లో శివరాజ్ సింగ్ చౌహన్ పర్యటన

 

భోపాల్ : నేడు మందసర్ లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ పర్యటించనున్నారు. కాల్పుల్లో చనిపోయిన రైతు కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. 

ప్రజల సందర్శనార్థం సినారె భౌతికకాయం

హైదరాబాద్ : ప్రజల సందర్శనార్ధం సినారె భౌతికకాయాన్ని ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు తెలంగాణ సారస్వత్ పరిషత్ భవనంలో ఉంచనున్నారు. అంనతరం మహాప్రస్థానంలో సినారె అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు.

నేడు రాజ్ భవన్ లో గవర్నర్ ఇఫ్తార్ విందు

హైదరాబాద్ : నేడు రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహాన్ రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు.
గవర్నర్ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానించారు.

నేడు చాంపియన్స్ ట్రోఫీలో మొదటి సెమీస్

చాంపియన్స్ ట్రోఫీ : నేడు చాంపియన్స్ ట్రోఫీలో తొలి సెమీస్ జరగనుంది. సెమీస్ లో ఇంగ్లాండ్ తో పాకిస్థాన్ తలపడనుంది. మధ్యాహ్నం 3గంటలకు మ్యాచ్ ప్రాంరభం కానుంది.

 

Don't Miss