Activities calendar

15 June 2017

ఇండియా ఘన విజయం

బర్మింగ్ హమ్ : ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్లో టీమిండియా బంగ్లాదేశ్ ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఫైనల్లోకి ప్రవేశించింది. మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో బంగ్లాదేశ్ ను 265/7 పరుగులకు కట్టడి చేసింది. బుమ్రా, భువి, జాదవ్ తలో రెండు వికెట్లు తీసుకోగా, జడేజా ఒక వికెట్ దక్కించుకున్నాడు. తదనంతరం బ్యాటింగ్ కు దిగిన టీమిండియా సునాయాసంగా.. కేవలం ఒక వికెట్ కోల్పోయి 266 పరుగులు చేసింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ హీరో రోహిత్ శర్మ సూపర్ సెంచరీ (123 నాటౌట్)తో అదరగొట్టాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ 96 నాటౌట్, దావన్ 46 రాణించడంతో 40.1 ఓవర్లలో విజయ ఢంఖా మోగించింది.

21:32 - June 15, 2017
21:31 - June 15, 2017
21:29 - June 15, 2017
21:22 - June 15, 2017

హైదరాబాద్: సంచలనం రేపిన బ్యూటీషియన్ శిరీష అనుమానాస్పద మృతి...కుకునూర్‌పల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య కేసుల్లో పోలీసులు దర్యాప్తు వేగం పెంచారు..ప్రతీ క్షణం సమయాన్ని వృధా చేయకుండా సీనియర్ ఐపీఎస్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.. స్వయంగా అధికారులే నిందితులను విచారిస్తున్నారు..అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు...హైదరాబాద్‌ షేక్‌పేట నాలా వద్ద ఉన్న రాక్‌సైడ్‌ అపార్ట్‌మెంట్లో ఆర్‌.కే స్టూడియోలో సాయంత్రం నుంచి డీసీపీలు..ఏసీపీలు..బంజారాహిల్స్ పోలీసులు రంగంలోకి దిగి శోధిస్తున్నారు...

21:20 - June 15, 2017

హైదరాబాద్: మియాపూర్‌ భూ కుంభకోణంపై అధికార పార్టీ... విపక్షాలపై ఎదురుదాడికి దిగింది. ఒక గజం భూమి కూడా పోలేదని.... ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ఆదాయానికి నష్టం చేకూరలేదని మంత్రి హరీష్‌రావు అన్నారు. విపక్ష నేతలు తమపై విమర్శలను ఆపాలని...మియాపూర్‌ భూముల కుంభకోణంతో సీఎం కుటుంబ సభ్యులకు సంబంధం ఉందని ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. దమ్ముంటే ఆధారాలను బయటపెట్టాలని సవాల్ విసిరారు.

21:17 - June 15, 2017

అమరావతి: తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణను మరింత పటిష్టం చేయడంపై చంద్రబాబు దృష్టిసారించారు. పదేపదే హెచ్చరిస్తున్నా తెలుగు తమ్ముళ్లు కట్టుదాటుతుండడంతో ఇక నుంచి కఠినంగా వ్యవహరించాలని డిసైడ్‌ అయ్యారు. లక్ష్మణ రేఖ దాటితే ఇక నుంచి క్షమించే ప్రసక్తే ఉండబోదని పార్టీ సమన్వయ కమిటీలో చంద్రబాబు తేల్చి చెప్పారు. ఈదిశగా మియాపూర్‌ భూకుంబకోణంలో ప్రధాన నిందితుడు, పార్టీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డిని సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. క్రమశిక్షణను పాటించని వారిని ముందు సస్పెండ్‌ చేస్తామని.. ఆ తర్వాతే విచారణ చేపడతానని హెచ్చరించారు. ఇష్టారాజ్యంగా బహిరంగ విమర్శలకు దిగినే తక్షణ చర్యలు ఉంటాయని నేతలకు స్పష్టం చేశారు చంద్రబాబు.

చంద్రబాబు నివాసంలో టీడీపీ సమన్వయ కమిటీ భేటీ
ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది.  ఈ సమావేశంలో పార్టీ క్రమశిక్షణపైనే ప్రధానంగా చర్చ జరిగింది.  బహిరంగంగా వ్యక్తిగత విమర్శలకు దిగిన మంత్రులు గంటా, అయ్యన్న వ్యవహారంపై చంద్రబాబు సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.  మంత్రుల స్థాయి వ్యక్తులు బహిరంగ విమర్శలు చేసుకోవడమేంటని ఇద్దరినీ ప్రశ్నించారు.   ఇద్దరికీ ఎన్నిసార్లు సర్దిచెప్పినా బహిరంగ విమర్శలు చేసుకోవడంపట్ల చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.  పార్టీ నాయకులు చేసుకునే విమర్శల కారణంగా ప్రతిపక్షాలకు అవకాశం కల్పించినట్టవుతోందని సీరియస్‌ అయ్యారు. గంటా, అయ్యన్న వ్యవహారంపై త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ కమిటీకి సీనియర్‌ మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షుడుగా నియమించారు. త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు.
పార్టీ క్రమశిక్షణకు అందరూ కట్టుబడి ఉండాలన్న చంద్రబాబు
పార్టీ క్రమశిక్షణకు అందరూ కట్టుబడి ఉండాలని చంద్రబాబు నేతలకు సూచించారు. క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఇక నుంచి సహించబోనని హెచ్చరించారు. ఇక నుంచి క్రమశిక్షణ ఉల్లంఘించే వారికి సర్దిచెప్పడాలు, హెచ్చరించడాలు ఉండబోవన్నారు.  లక్ష్మణరేఖ దాటే వారిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తానని... ఆ తర్వాతే విచారణ చేస్తానని నేతలను చంద్రబాబు హెచ్చరించారు.  బహిరంగ విమర్శలకు దిగుతూ పార్టీ, ప్రభుత్వం ప్రతిష్టతను దెబ్బతీస్తే సహించే ప్రసక్తే లేదన్నారు. పార్టీ క్రమశిక్షణపై త్వరలోనే క్యాడర్‌కు శిక్షణా తరగతులు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. 
టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డిపై వేటు
ఇక హైదరాబాద్‌లో పలుచోట్ల భూకబ్జాలకు పాల్పడిన టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డిపైనా చంద్రబాబు వేటు వేశారు.  ఆయనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.  నిజానిజాలు తేలేవరకు ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్‌  చేస్తున్నట్టు ప్రకటించారు.  జిల్లాల  పార్టీ ఇంచార్జ్‌ల పనితీరుపైనా సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించారు. జిల్లాల పార్టీ అధ్యక్షుల పేర్లను ఈ సమావేశంలో చంద్రబాబు ఖరారు చేసినట్టు తెలుస్తోంది.  మొత్తానికి ఏపీ సీఎం చంద్రబాబు సర్ది చెప్పే ధోరణికి స్వస్తి చెప్పాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇకపై నేతల పట్ల కఠినంగానే ఉండాలనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్టున్నారు.  మరి అధినేత తీసుకుంటున్న నిర్ణయాలతోనైనా తెలుగు తమ్ముళ్ల మైండ్‌సెట్‌ మారుతుందో.. లేదో చూడాలి. 

 

 

21:16 - June 15, 2017

హైదరాబాద్: టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో వీరంగం సృష్టించారు. బోర్డింగ్‌ పాస్‌ ఇవ్వలేదని సిబ్బందిపై ఆగ్రహంతో ఊగిపోయారు. ఎయిర్‌పోర్టులో రచ్చరచ్చ చేశారు. ఇండిగో విమానంలో హైదరాబాద్‌కు వెళ్లడానికి జేసీ విశాఖ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. బోర్డింగ్‌ పాస్‌ జారీ సమయం ముగియడంతో సిబ్బంది కౌంటర్‌ను మూసివేశారు. దీంతో జేసీ ఆగ్రహంతో ఊగిపోయారు. తనకు బోర్డింగ్‌ పాస్‌ ఇవ్వాల్సిందేనంటూ సిబ్బందితో వాదనకు దిగారు. సమయం ముగిసిందని... బోర్డింగ్‌ పాస్‌ ఇవ్వడం కుదరదని సిబ్బంది చెప్పినా వినిపించుకోలేదు. దీంతో కోపోద్రిక్తుడైన జేసీ... బోర్డింగ్‌ పాస్‌ ప్రింటర్‌ను ధ్వంసం చేశారు. ఫర్నీచర్‌ను పగులగొడుతూ విధ్వంసం సృష్టించారు. జేసీ చర్యతో అక్కడున్న వారంతా భయాందోళనకు గురయ్యారు. ఎయిర్‌పోర్టు సిబ్బంది జేసీపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. 

20:40 - June 15, 2017

హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీలు బిజీ... గెలుచుడు కాదు అంత వీజీ, ఎమ్మెల్సీని సస్పెండ్ చేసిన చంద్రాలు...మరి నీమీది ఆరోపణల కథేంది సారూ, భువనగిరి ఎమ్మెల్యే మీద షురూ అయిన ఏగిళం...విచారణకు పట్టుబడుతున్న జిట్టా కిట్టయ్య, మంచిర్యాల కాడ చిరుగుతున్న కారు వర...ఎమ్మెల్యే మీద ఎగిరి పడుతున్న బీసీలు, కాల్వకట్టకోసం జనం గుడెసెలు ఖతం....వరంగల్ జిల్లాలో సర్కార్ చేసిన ఉద్దార్కం, కోటర్ల బిస్కెట్లు అద్దుకుంటున్న ముసలోడు...సోషల్ మీడియాలో కొడుతున్నది చక్కెర్లు.. ఇత్యాది అంశాలతో మన ముందుకు మల్లన్న 'మల్లన్న ముచ్చట్లు ' కార్యక్రమంలో వచ్చాడు. మరి మీరు వినాలకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

20:37 - June 15, 2017

హైదరాబాద్: పూటకో ధర ఎవరికి లాభం? ఎవరికి నష్టం? ఇప్పటికే పన్నుల ధరలతో పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతుంటే సర్కార్ కొత్త విధానం ఎలాంటి మార్పులు తీసుకురానుంది. ఎవరికి మేలు చేయనుంది? ఈ మార్పులు అమలు చేయాలంటే ఓపక్క బొంకులు సాంకేతికంగా సిద్ధంగా లేవని తెలుస్తోంది. సిబ్బంది కూడా సరిపడా లేరనే వానదలు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రోజూ పెట్రోధరల రివైజ్ ఎంత వరకు సాధ్యం? ఇదే అంశం పై నేటి వైడాంగిల్. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

19:34 - June 15, 2017

అమరావతి: కర్నూలు జిల్లాలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి.. శిల్పా మోహన్‌ రెడ్డి వైసీపీలో చేరడంతో నంద్యాల ఉప ఎన్నికలో బ్రహ్మానందరెడ్డికి లైన్‌ క్లియర్‌ అయింది.. బ్రహ్మానందరెడ్డి పేరు పరిశీలించాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశామని.. మంత్రి అఖిల ప్రియ చెప్పారు.. తమ ప్రత్యర్థులు శిల్పా మోహన్‌ రెడ్డి, గంగుల ప్రతాపరెడ్డి ఒక్కటైనా భూమా కుటుంబాన్ని ఓడించలేరని ధీమా వ్యక్తం చేస్తున్నారు.. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

19:32 - June 15, 2017

కడప : జిల్లాలో వైసీపీ అధినేత జగన్‌ పర్యటిస్తున్నారు.. పులివెందులలో పార్టీ నేతలను అడిగి అక్కడి ప్రజాసమస్యలు తెలుసుకున్నారు.. నెలరోజులక్రితం మృతిచెందిన వైసీపీ కార్యకర్త రామకృష్ణారెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు.. అలాగే పులివెదుల డిగ్రీ కళాశాలలో అధ్యాపకుగా పనిచేస్తూ అనారోగ్యంతో చనిపోయిన రాణాప్రతాపరెడ్డి కుటుంబసభ్యులనూ కలుసుకున్నారు.. వారికి జగన్‌ ధైర్యం చెప్పారు..

19:30 - June 15, 2017

గుంటూరు : అమరావతిలో ఏపీ కేబినెట్‌ సమావేశం కొనసాగుతోంది.. ఈ భేటీలో పలు అంశాలపై చర్చిస్తున్నారు.. నవనిర్మాణ దీక్ష జరిగినతీరు, ఏరువాక కార్యక్రమం... తాగునీటి కార్పొరేషన్‌ ఏర్పాటు, నిరుద్యోగ భృతి విధివిధానాలు.. విశాఖలో భూకబ్జాలు, అమరావతి నగర నిర్మాణం అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు.. 

చైనాలో ఓ నర్సరీ పాఠశాలలో పేలుడు:7మంది విద్యార్థులు మృతి

హైదరాబాద్: చైనాలో ఘోరం చోటుచేసుకుంది. ఓ నర్సరీ పాఠశాల (కిండర్‌ గార్డెన్‌) వద్ద జరిగిన పేలుడులో ఏడుగురు విద్యార్థులు మృతిచెందగా.. సుమారు 60 మంది గాయపడ్డారు. తూర్పు చైనాలోని జియాంగ్సు ఫ్రావిన్స్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. జియాంగ్సు ఫ్రావిన్స్‌లోని ఫెంగ్జియాన్‌ కౌంటీలో సాయంత్రం 4.50గంటలకు పాఠశాల విడిచిపెట్టిన అనంతరం చిన్నారులు వస్తుండగా గేటు వద్ద పేలుడు సంభవించింది. అయితే పేలుడుకు గల కారణమేంటనే విషయం తెలియాల్సి ఉందని, దీనిపై విచారణ కొనసాగుతోందని ఓ పోలీసు ఉన్నతాధికారి చెప్పారు.

టీమిండియా విజయలక్ష్యం 265

హైదరాబాద్: ఇంగ్లండ్‌లో జ‌రుగుతున్న‌ ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భాగంగా ఈ రోజు కొన‌సాగుతున్న‌ భార‌త్‌, బంగ్లాదేశ్ మ్యాచులో టాస్ ఓడి మొద‌ట బ్యాటింగ్ చేసిన‌ బంగ్లాదేశ్.. టీమిండియా ముందు 265 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఉంచింది. బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్‌ సౌమ్య స‌ర్కార్ 0, ష‌బ్బిర్ 19, త‌మీమ్ 70, ర‌హీమ్ 61, షాకిబ్‌ 15, రియాద్ 21, మోస‌ద్దేక్ 15, మోర్టాజా 30 (నాటౌట్), టాస్కిన్ 11 (నాటౌట్) ప‌రుగులు చేశారు. బంగ్లాకి ఎక్స్‌ట్రాల రూపంలో 22 ప‌రుగులు వ‌చ్చాయి. దీంతో బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 264 ప‌రుగులు చేసింది.

జంటనగరాల్లోని పలుచోట్ల భారీ వర్షం...

హైదరాబాద్‌ : జంటనగరాల్లోని పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. నగరంలోని మోండా మార్కెట్‌, పార్శీగుట్ట, వారాసిగూడ, చిలకలగూడ, పద్మారావు నగర్‌, మారేడ్‌పల్లి అడ్డగుట్ట, బేగంపేట, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, ఆల్వాల్‌, బొల్లారం, జవహర్‌నగర్‌, బీఎన్‌రెడ్డినగర్‌; మీర్‌పేట, హయత్‌నగర్‌, నాచారం, ఓయూ క్యాంపస్‌, తార్నాక, దిల్‌సుఖ్‌నగర్‌, కొత్తపేట, పటాన్‌చెరు తదితర ప్రాంతాల్లో గంటకుపైగా ఎడతెరపిలేకుండా భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి సికింద్రాబాద్‌ పరిధిలోని లోతట్టు ప్రాంతాలైన వారాసిగూడ, మధురానగర్‌, న్యూ అశోక్‌నగర్‌ కాలనీల్లో రహదారులన్నీ వర్షపునీటితో నిండి ప్రవహిస్తున్నాయి.

నల్గొండ జిల్లాలో నకిలీపత్తి విత్తనాలు స్వాధీనం..

హైదరాబాద్: నల్లగొండ జిల్లా దేవరకొండలో వ్యవసాయశాఖ అధికారులు పత్తి విత్తనాల విక్రయ దుకాణాలపై దాడులు చేశారు. ఈ సందర్భంగా జరిపిన సోదాల్లో రూ. 2 లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా దుకాణదారులు ఇప్పటికే రూ. 8 లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాలు విక్రయించినట్లు గుర్తించారు.

19:16 - June 15, 2017

హైదరాబాద్ : కేంద్రం అధిక పన్నులపై కన్ను వేసిందా? పన్నుల భారం అదేపనిగా వేయాలనుకుంటున్నారా? వినోదం, విలాసం, పర్యాటకం, సేవారంగం, ఆహారం, స్వేచ్ఛా వాణిజ్యం వీటన్నింటిపై ఒకే దేశం, ఒకే పన్ను పేరుతో భారం వేయనున్నారా? జీఎస్టీ... ఇక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశం పై 'హెడ్ లైన్ ' షోలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో ఆర్థిక రంగ నిపుణులు శశికుమార్, ప్రముఖ వ్యాపార వేత్త బొడ్డు రామకృష్ణారావు పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

19:12 - June 15, 2017

హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష, కుకునూరుపల్లి ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి ల ఆత్మహత్య కేసులో పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. గంట గంటకు అనేక అంశాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్జే ఫోటో స్టూడియో లో ఇద్దరు డీసీపీలు, క్లూస్ టీమ్, టాస్క్ ఫోర్స్, బంజారాహిల్స్ పోలీసులు విచారణ చేపట్టారు.

18:56 - June 15, 2017

విజయవాడ : ఎట్టకేలకు బెజవాడ బెంజ్‌ సర్కిల్‌ ఫ్లై ఓవర్‌కు మోక్షం కలగనుంది. ప్రభుత్వం ఫ్లై ఓవర్‌ను నిర్మించేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఫ్లై ఓవర్‌ ఆకృతులు కూడా ఖరారు కావడంతో.. త్వరగా పనులు ప్రారంభించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతంలో నిత్యం ట్రాఫిక్‌ చక్రవ్యూహంలో ప్రజలు.. వాహనదారులు అష్టకష్టాలు ఎదురుకుంటుండడంతో ఫ్లై ఓవర్‌ పనులకు శ్రీకారం చుట్టనున్నారు.

2017 జూన్ 12 ప్రారంభమైన వంతెన పనులు ....

విజయవాడలోని బెంజ్‌ సర్కిల్‌ ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి.. అడుగులు ముందుకు పడుతున్నాయి. ఈ ఫ్లై ఓవర్‌ బెజవాడ వాసుల చిరకాల కోరిక. అందులో భాగంగా 2017 జూన్‌ 12న పాలకులు భూమి పూజతో.. వంతెన పనులను ప్రారంభించారు. బెంజ్‌ సర్కిల్‌ పై వంతెన నిర్మాణానికి సంబంధించి ఇటీవలే అధికార యంత్రాంగం సమీక్ష జరిపింది. ఈ సమీక్షలో ఫ్లై ఓవర్‌ ఆకృతులకు లైన్‌ క్లియర్ అయ్యింది. 1.47 కిలో మీటర్ల పొడవునా ఒక్కో వంతెన మూడు వరసల చొప్పున మొత్తం ఆరు వరసలతో ఎక్స్‌ ప్రెస్‌ వే తరహాలో నిర్మించనున్నారు.

కేంద్రమంత్రులు నితిన్‌ గడ్కరీ, వెంకయ్యనాయుడు

గతంలో కేంద్రమంత్రులు నితిన్‌ గడ్కరీ, వెంకయ్యనాయుడు వచ్చి.. సీఎం చంద్రబాబుతో కలసి రిమోట్ కంట్రోల్‌తో ఫ్లై ఓవర్‌ శిలా ఫలకాన్ని ప్రారంభించారు. అయితే కార్యక్రమాన్ని చేపట్టి రెండేళ్లు కావస్తున్నా.. బెంజ్‌ సర్కిల్‌ ఫ్లై ఓవర్‌ పనులు ముందుకు సాగలేదు. దీంతో ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

తొలి దశలో రూ. 100 కోట్లు

వంతెనను తొలి దశలో 100 కోట్లతో, రెండో దశ వంతెనను మరో 120 కోట్లతో టెండర్లుగా విభజించారు. పై వంతెన సర్వే అధ్యయనం రైట్స్‌ సంస్థ రూపొందించి.. అదే సంస్థ ఆకృతులను రూపొందించింది. 2018 డిసెంబర్‌ నాటికి పూర్తి చేయాలని సదరు కాంట్రాక్ట్‌ సంస్థ నిర్ణయించుకున్నప్పటికీ.. 3 నెలల ముందుగానే ఫ్లై ఓవర్‌ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని ప్రజా ప్రతినిధులు తెలిపారు. అదే ఏడాది ఆగస్టులో ఫ్లై ఓవర్‌ అందుబాటులోకి తేనున్నట్లు అధికారులు కసరత్తు జరుపుతున్నారు.

సమన్వయంతో ముందుకెళ్లాలని సీఎం క్లాస్‌

మరోవైపు దుర్గగుడి ఫ్లై ఓవర్‌ విషయంలో.. కొత్తగా నిర్మించనున్న బెంజ్‌ సర్కిల్‌ ఫ్లై ఓవర్‌ పనుల విషయంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు అలసత్వం వహించొద్దని, సమన్వయంతో ముందుకెళ్లాలని సీఎం క్లాస్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. అభివృద్ధి కార్యక్రమాలలో అందరూ కలిసి కట్టుగా వ్యవహరించాలని.. ప్రజా ప్రతినిధులు కూడా చురుగ్గా నడుచుకోవాలని బాబు సున్నితంగా సూచించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే బెంజ్‌ సర్కిల్‌ పై వంతెన భూమి పూజకు మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, ఎంపీ కేశినేని నాని హాజరయ్యారు. 

18:55 - June 15, 2017

హైదరాబాద్: మాటలు కోటలు దాటుతాయి ఆచరణ గడపదాటదు.. కచ్చితంగా ఇలాగే ఉంది గ్రేటర్‌హైదరాబాద్‌ నగరపాలక సంస్థతీరు. నగరంలో పెరిగిపోతున్న నీటికరువుకు ఇంకుడు గుంతలే పరిష్కారం అని ఘనంగా చెప్పుకున్న బల్దియా అధికారులు .. ప్రస్తుతం వర్షపునీరంతా మూసీలోకలిసిపోతున్నా చూస్తూ ఉండిపోతున్నారు. బల్దియాలో పరిధిలో ఇంకుడుగుంతల పరిస్థితిపై టెన్‌టీవీ ఫోకస్‌..

ఎండకాలంలో గొంతెండుతున్న హైదరబాద్‌ నగరం

ఎండాకాలంలో చెప్పిన మాటలకు వానాకాలంలో నీళ్లొదిలింది జీహెచ్‌ఎంసీ. రోజురోజుకీ భూగర్భజలాలు అడుగంటిపోతున్న పరిస్థితుల్లో .. ఇంకుడు గుంతలకోసం ఎండకాలంలో తెగ హడావిడి చేశారు బల్దియా అధికారులు. ఇంకుడు గుంతలు తవ్వితేనే కొత్తగా నిర్మించే ఇళ్లకు అనుమతి ఇస్తామని చెప్పేశారు. మీరు ఏర్పాటు చేసుకోకపోతే.. మేమే గుంతలు తవ్వి ఫీజు వసూలు చేస్తామని బెదిరింపు ప్రకటనలు కూడా చేశారు. అంతేనా.. ఇంకుడు గుంతల తవ్వకం పేరుతో భన నిర్మాణ పర్మిషన్‌ ఫీజులో 8శాతం వసూలు చేసి .. కోట్లరూపాయలను ఖజానాలో వేసుకుంది జీహెచ్‌ఎంసీ. తీరా వర్షాలొచ్చి విలువైన జలవనరులన్నీ వ్యర్థంగా మురుగునీటిలోకలిసి పోతున్నా.. అధికారుల్లో చలనం లేకుండా పోయింది.

చిన్న వర్షం కురిసినా.. రోడ్లన్నీ జలమయంగా

హైదరాబాద్‌ నగరం కాంక్రీట్‌ జంగిల్‌గా మారిపోయిన పరిస్థితుల్లో .. చిన్న వర్షం కురిసినా.. రోడ్లన్నీ జలమయంగా మారిపోతున్నాయి. భూమిలోకి ఇంకిపోయే ఛాన్స్‌ లేకపోవడంతో.. నాలలన్నీ పొంగిరోడ్లను ముంచెత్తుతున్నాయి. జలరాసులన్నీ మూసీనదిలో కలిసి బయటికి వెళ్లిపోతుండటంతో.. నగరంలో క్రమంగా భూగర్భజలాలు ప్రమాదకర స్థాయికి పడిపోతున్నాయి. దీంతో ఎండాకాలం వచ్చిందంటే జనం గొంతుక ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఇదే ఛాన్స్‌గా తీసుకున్న నీటివ్యాపారులు కోట్లరూపాయలను సంపాదిస్తున్నారు. అయితే ఇన్ని కష్టాలు ఎదురవుతున్నా.. ఇటు జీహెచ్‌ఎంసీ కాని, అటు పౌరులు కాని భూగర్భజలాలను పెంచే ఇంకుడు గుంతలపై మాత్రం నిర్లక్ష్యంగా ఉంటున్నారు.

బల్దియా పరిధిలో 10వేల ఇంకుడు గుంతల నిర్మాణం

మొదట్లో హడావిడి చేసిన జలమండలి అధికారులు ..బ‌ల్దియాలో ప‌రిధిలో మొత్తం 10వేల వ‌ర‌కు ఇంకుడు గుంత‌ల‌ను నిర్మంచారు. అయితే వాటిలో చాలా వ‌ర‌కు మెంటెనేన్స్ లేక మూల‌న ప‌డ్డాయి. 2000వ సంవ‌త్సరం వ‌ర‌కు 3,370 ఇంకుడు గుంత‌ల‌ను కోటి ఇర‌వై ఐదు ల‌క్షల‌ ఖర్చుతో త‌వ్వారు. ఇక 2011నుండి 2014 సంవ‌త్సరాల మద్య 5,757 ఇంకుడు గుంత‌లకు ఏకంగా 10కోట్ల 77ల‌క్షల ఖ‌ర్చుచేశారు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది కాని.. ఆ త‌రువాతే వాటి మెయింట్‌నెన్స్‌ ను మ‌రిచిపోయారు. దాంతో ప‌డ్డచినుకు ప‌డినట్టే రోడ్లపై నిలిచిపోతున్నాయి.

ఇంకుడు గుంత లేకుండా ఆక్యూపెన్సీ స‌ర్టీఫిట్ ఇవ్వకూడాద‌ని

ఇక గ్రేట‌ర్ ప‌రిధిలో నూత‌న భ‌వ‌నాల్లో ఇంకుడు గుంత లేకుండా ఆక్యూపెన్సీ స‌ర్టీఫిట్ ఇవ్వకూడాద‌ని ఇప్పటికే నిర్ణయించిన అధికారులు చేతులు దులుపుకున్నారు. భ‌విష్యత్తులో వ‌చ్చే పెను ప్రమాదాన్ని లైట్ గా తీసుకుంటున్నారు. ఈ వ‌ర్షాకాలంలో కూడా ఇదేవిధంగా వ్యవ‌హ‌రిస్తే సిటికి వాట‌ర్ క‌ష్టాలుపెరుగడంతోపాటు, వ‌రదముప్పుకూడా పొంచి ఉంది. ఇప్పటికైన జీహెచ్‌ఎంసీ ఇంకుడు గుంతలపై దృష్టిపెట్టాలని హైదరాబాద్‌ పబ్లిక్‌కోరుతున్నారు. 

18:54 - June 15, 2017

ప్రకాశం : వస్త్రాలపై జీఎస్టీ రద్దు చేయాలంటూ ప్రకాశం జిల్లా చీరాలలో వస్త్ర వ్యాపారులు ర్యాలీ చేపట్టారు.. దుకాణాలుమూసి నిరసన తెలిపారు.. స్థానిక తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.. జీఎస్టీ తో తమపై ఆర్థికభారం పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.. ప్రభుత్వం ఈ నిర్ణయంపై వెనక్కి తగ్గాలని డిమాండ్ చేశారు..

రెండు కార్లు ఢీ: ఇద్దరి మృతి

వికారాబాద్‌ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నవాబ్‌పేట మండలం పులుమామిడి గేటు సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో హైదరాబాద్‌ కుషాయిగూడ పీఎస్‌లో ఏఎస్‌ఐగా పనిచేస్తున్న శివశంకర్‌ ఉన్నారు. వికారాబాద్‌లో ఓ పెళ్లికి హాజరై తిరిగివెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో ముందడుగు

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో ముందడుగు పడింది. 7920 ఎకరాల అటవీభూమిని వాడుకునేందుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ అనుమతి ఇచ్చింది. ఇవాళ ఢిల్లీలో భేటీ అయిన కేంద్ర అటవీశాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. బ్యారేజీలు, టన్నెళ్‌లు, కాల్వలు, మల్లన్నసాగర్‌తోపాటు అన్ని రిజర్వాయర్ల నిర్మాణానికి అవసరమైన అటవీ అనుమతులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. కేంద్ర అటవీశాఖ అనుమతులు ఇవ్వడంపట్ల సీఎం కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర నీటిపారుదల, అటవీశాఖ అధికారులను ఆయన అభినందించారు. 

18:51 - June 15, 2017

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో ముందడుగు పడింది. 7920 ఎకరాల అటవీభూమిని వాడుకునేందుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ అనుమతి ఇచ్చింది. ఇవాళ ఢిల్లీలో భేటీ అయిన కేంద్ర అటవీశాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. బ్యారేజీలు, టన్నెళ్‌లు, కాల్వలు, మల్లన్నసాగర్‌తోపాటు అన్ని రిజర్వాయర్ల నిర్మాణానికి అవసరమైన అటవీ అనుమతులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. కేంద్ర అటవీశాఖ అనుమతులు ఇవ్వడంపట్ల సీఎం కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర నీటిపారుదల, అటవీశాఖ అధికారులను ఆయన అభినందించారు. 

18:49 - June 15, 2017
18:48 - June 15, 2017

వికారాబాద్‌ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నవాబ్‌పేట మండలం పులుమామిడి గేటు సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో హైదరాబాద్‌ కుషాయిగూడ పీఎస్‌లో ఏఎస్‌ఐగా పనిచేస్తున్న శివశంకర్‌ ఉన్నారు. వికారాబాద్‌లో ఓ పెళ్లికి హాజరై తిరిగివెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 

17:18 - June 15, 2017

ఖమ్మం: ఎన్నికల్లో ఇచ్చిన ప్రతిఒక్క హామీని నెరవేర్చి తీరుతామని ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టంచేశారు. గురువారం ఖమ్మం జిల్లా దంసలాపురం ఆర్‌వోబీ శంకుస్థాపన కార్యక్రమంలో కేటీఆర్‌ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత ఏర్పాటైన తెరాస ప్రభుత్వ పాలనలో ఎవరూ వూహించని రీతిలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తొందని అన్నారు. ఇంకా ఎన్నికలు రెండేళ్ల దూరంలో ఉన్నాయని, ప్రభుత్వం ఇవ్వని హామీలను, అభివృద్ధి పనులను చేపడుతోందన్నారు. దశాబ్దాల దంసలాపురం రైల్వే వంతెన ఇప్పటికి సాకారం కావడం అదృష్టమన్నారు. ఈ కార్యక్రమంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మహేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మళ్లీ మంత్రి అయ్యన్న కౌంటర్..

విజయవాడ : విశాఖపట్టణ భూ వివాదంపై తాను మాట్లాడాకే సిట్ ఏర్పాటు చేశారని, తన వ్యాఖ్యలతో పార్టీ ఇమేజ్ పెరిగిందే తప్ప తగ్గలేదని ఏపీ మంత్రి అయ్యన్న పేర్కొన్నారు. పూర్తిస్థాయి విచారణ జరపాలనే తాను..గంటా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. గంటతో తనకు విబేధాలు లేవని మంత్రి అయ్యన్న వెల్లడించారు.

కొనసాగుతున్న ఏపీ కేబినెట్..

విజయవాడ : ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. అవీనీతిపరుల ఆస్తుల స్వాధీనం..నిరుద్యోగ భృతి..తాగునీటి సరఫరా సంస్థ కార్పొరేషన్ ఏర్పాటు..ఏపీ ఎలక్ట్రానిక్స్ పాలసీని ఆమోదించే అవకాశం ఉందని తెలుస్తోంది.

రైతుల ప్లాట్ల కేటాయింపులో స్వల్పమార్పులు..

విజయవాడ : రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపులో ఏపీ ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది.

జేసీ వీరంగం..

విశాఖపట్టణం : ఎయిర్ పోర్టులో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి హల్ చల్ చేశాడు. ఆలస్యంగా వచ్చినందుకు బోర్డింగ్ పాస్ ఇచ్చేందుకు ఎయిర్ పోర్టు సిబ్బందిపై జేసీ విరుచుకపడ్డారు. ఆగ్రహంతో బోర్డింగ్ పాస్ ప్రింటర్ ను ధ్వంసం చేశారు.

రాణిస్తున్న బంగ్లాదేశ్..

ఇంగ్లాండ్ : భారత బౌలర్లను బంగ్లాదేశ్ బ్యాట్ మెన్స్ సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయినా తరువాత వచ్చిన బ్యాట్స్ మెన్స్ నిలదొక్కుని ఆడుతున్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ 25 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది.

15:55 - June 15, 2017

విశాఖ : వేట సమయం వచ్చేసింది. గంగపుత్రులు సముద్ర అలల్లో జీవన పోరాటం చేసే సమయం ఆసన్నమైంది. వలలు చేత పట్టి.. పడవలో సుదీర్ఘ ప్రయాణాలకు మత్స్యకారులు రెడీ అవుతున్నారు.

193 కిలో మీటర్ల సముద్ర తీరం

ఇది శ్రీకాకుళం జిల్లాలోని.. 193 కిలోమీటర్ల సుదూర సముద్ర తీరం. గడిచిన 45 రోజులుగా చేపల వేట నిషేధంతో మత్స్యకారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వేట నిషేధ సమయం పూర్తి కావడంతో.. బతుకు పోరుకు సన్నద్ధమవుతున్నారు. అయితే చేపల వేట నిషేధ సమయంలో.. మత్స్యకారులకు ఆసరాగా ప్రభుత్వం ప్రకటించిన పరిహారం ప్రకటనలకే పరిమితమైంది.

104 సముద్ర తీర గ్రామాలు

జిల్లాలోని పదకొండు మండలాల్లో.. 104 సముద్ర తీర గ్రామాలున్నాయి. అయితే కేవలం 5, 050 మంది మత్స్యకారులకు మాత్రమే నాలుగు వేల చొప్పున.. లీ మంత్‌ పరిహారం అందించాలని అధికారులు నిర్ణయించారు. దీనికి రెండు కోట్ల రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. వేట నిషేధం పూర్తయినా.. ఇంత వరకూ పరిహారం మాత్రం అందలేదని మత్య్సకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రూ. 10 వేలకు పెంచాలని డిమాండ్‌

పరిహారం 10 వేలకు పెంచడంతో పాటు.. వంద కేజీల బియ్యం పంపిణీ చేయాలన్న డిమాండ్‌ను పట్టించుకునే నాయకులు కరువయ్యారు. కొత్త ప్రతిపాదనల మాట పక్కన పెడితే.. ప్రభుత్వం ప్రకటించిన నాలుగు వేల రూపాయలు కూడా.. అందడం లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

12 వేల మంది మత్స్యకారులు

శ్రీకాకుళం జిల్లాలో 12 వేల మంది వరకూ మత్య్సకారులు మెకనైజ్‌డ్‌ బోట్లతో చేపల వేట సాగిస్తున్నారు. వీరిలో అరవై శాతం మందిని మాత్రమే గుర్తించి.. వారికి కూడా చెల్లింపులు చేయట్లేదు. ఇలాంటి పరిస్థితుల వల్ల గంగపుత్రులు వలస బాట పడుతున్నారు.

2 నెలల సుదీర్ఘ విరామం

ప్రభుత్వ ప్రకటనలు ఒక రకంగా.. జాబితాలలో ఇంకో రకంగా ఉంటోంది. వేటకు సిద్ధమవుతున్న మత్స్యకారులు.. ప్రభుత్వ తీరుపై పెదవి విరుస్తున్నారు.

 

కాళేశ్వరం ప్రాజెక్టు లో మరో ముందడుగు..

హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు లో మరో ముందడుగు పడింది. 7920 ఎకరాల అటవీ భూమిని వాడుకొనేందుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి లభించింది. బ్యారేజీలు..టన్నెళ్లు..కాల్వలు..మల్లన్న సాగర్ తో పాటు అన్ని రిజర్వాయర్లకు నిర్మాణానికి అవసరమైన అటవీ అనుమతులకు పర్యావరణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర అటవీ శౄఖ అనుమతుల పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

15:52 - June 15, 2017

హైదరాబాద్: ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి, శిరీష అనుమానాస్పద మృతులపై మిస్టరీ కొనసాగుతోంది. పోలీసుల అదుపులో ఉన్న రాజీవ్‌ను ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్న కుకునూర్‌పల్లికి తరలించారు. సంగారెడ్డి డీఎస్పీ ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ నుంచి తరలించారు. ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్యపై రాజీవ్‌ను విచారిస్తున్నారు. ప్రభాకర్‌రెడ్డి, శిరీష్‌ అనుమానాస్పద మృతిపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. రాజీవ్‌, శిరీష, శ్రవణ్‌లు అసలు ప్రభాకర్‌రెడ్డి దగ్గరకు ఎందుకు వెళ్లారు? అక్కడ రాజీవ్‌, శిరీష మధ్య ఏం జరిగి ఉంటుంది? రాత్రి సమయంలో ఎస్సై దగ్గరికి శ్రవణ్‌ ఎందుకు తీసుకెళ్లాడు? మార్గ మధ్యలో కారు ఎందుకు నిలిపివేశారు? శిరీష ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఎస్సై ప్రభాకర్‌రెడ్డి హైదరాబాద్‌కు వచ్చాడా? ఇవన్నీ అంతు చిక్కని ప్రశ్నలగానే మిగిలాయి. పోలీసులు వీటికి సమాధానం రాబట్టేపనిలో ఉన్నారు.

15:51 - June 15, 2017

కరీంనగర్ : వారసత్వ ఉద్యోగాల కోసం కార్మికులు చేస్తున్న సమ్మె విజయవంతమైందని సింగరేణి కార్మిక సంఘాల నేతలు గోదావరిఖనిలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో తెలిపారు. వారసత్వ ఉద్యోగాల డిమాండ్‌ సాధించుకునే వరకు సమ్మె కొనసాగుతుందని నేతలు హెచ్చరిస్తున్నారు. గుర్తింపు యూనియన్‌, సింగరేణి యాజమాన్యం కుమ్మక్కై కార్మికుల కుటుంబాల జీవితాల్లో మట్టి కొట్టాలని చూస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా దిగిరాకపోతే.. భవిష్యత్‌లో కార్మికులు తగిన గుణపాఠం చెబుతారని కార్మిక సంఘాల నేతలు హెచ్చరించారు. 

15:48 - June 15, 2017
15:47 - June 15, 2017

చిత్తూరు : చంద్రగిరి మండలం కలూరులో దారుణం జరిగింది. ఎంబీ ఏ మొదటి సంవత్సరం చదువుతున్న చెన్నైకి చెందిన మహ్మద్ తనీస్ అనే ప్రేమోన్మాది నాగకీర్తన అనే విద్యార్థిని పై కత్తితో దాడి చేశాడు. దాడి అనంతరం పారిపోయేందుకు ప్రయత్నించగా స్థానికులు వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే వీరిద్దరూ 10 వ తరగతి నుండి స్నేహితులని తెలుస్తోంది. తీవ్ర గాయాలైన నాగకీర్తనను రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే నాగకీర్తన మీడియాను గానీ, ఫోటో గ్రాఫర్లను కూడా అనుమతించడంలేదు. నాగ కీర్తనకు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు పేర్కొన్నారు. కేవలం ప్రేమ వివాహమే ఈ ఘటనకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మరికాసేపట్లో పోలీసులు నిందితుడి మీడియా ముందు ప్రవేశ పెట్టనున్నట్లు సమాచారం.

బంగ్లా సెకండ్ వికెట్..

ఇంగ్లండ్ : ఇండియా - బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ కొనసాగుతోంది. బ్యాటింగ్ ఆరంభించిన బంగ్లాకు ఇండియా బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. భువనేశ్వర్ మొదటి ఓవర్ లో రహ్మాన్ (19) వికెట్ తీశాడు. సర్కార్ (0) వికెట్ ను కూడా భువనేశ్వర్ తీయడం విశేషం. ప్రస్తుతం బంగ్లాదేశ్ 7.2 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది.

15:41 - June 15, 2017

అమరావతి: ఏపీ టీడీపీలో ఎమ్మెల్సీ పదవుల పోరు మొదలైంది. గవర్నర్‌కోటాలో నామినేట్‌ అయిన మండలి సభ్యుల పదివీకాలం మే 28తోనే ముంగిసింది. ప్రస్తుతం మండలి చైర్మన్‌గా ఉన్న చక్రపాణి, చిత్తూరుజిల్లాకు చెందిన రెడ్డప్పరెడ్డి పదవికాలం ముగిసిపోవడంతో ..కొత్తవారి ఎంపిక ప్రక్రియ మొదలైంది.

వర్గపోరుతో రామసుబ్బారెడ్డికి దూరమైన ఎమ్మెల్సీ ఛాన్స్‌..!

గవర్నర్‌కోటాలో పదవి దక్కించుకునేందుకు టీడీపీనేతలు పోటాపోటీగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. కడపజిల్లాకు చెందిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి ఇస్తామని గతంలోనే సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినట్టు సమాచారం. అయితే మారిన పరిణామాలతో రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవిపై నీలినీడలు కమ్ముకున్నాయి. స్థానికంగా వర్గపోరుతో ఇటీవల విశాఖలో జరిగిన మహానాడుకు కూడా హాజరుకాకపోవడంతో..ఇక రేసులోనుంచి రాబసుబ్బారెడ్డి తప్పుకున్నట్టేనని టీడీపీ వర్గాలు అంటున్నాయి.

టీడీపీ లీగల్‌సెల్‌ అధ్యక్షుడు రవీంద్రబాబుకు ఛాన్స్‌..!

మరోవైపు టీడీపీ లీగల్‌సెల్‌ అధ్యక్షుడు రవీంద్రబాబుకు ఈసారి ఎమ్మెల్సీ పదవి ఖాయం అంటున్నారు టీడీపీ నేతలు. దశాబ్దాలుగా పార్టీని నమ్మకుని ఉండటం, ఇంతవరకు ఎలాంటి పదవి దక్కక పోవడంలాంటి కారణాలతో రవీంద్రబాబుకు మండలిలో స్థానం దక్కవచ్చనే చర్చలు నడుస్తున్నాయి. ఇదిలావుంటే.. ప్రభుత్వ మీడియాసలహాదారు పరకాలప్రభాకర్‌ పేరుకూడా అనూహ్యంగా తెరమీదకు వచ్చింది. పార్టీ అధినేత చంద్రబాబుకు సన్నిహితం కారణంగా పరకాలకు పదవి దక్కే చాన్స్‌ ఉందని టీడీపీలో చెప్పుకుంటున్నారు.

గుంటూరుజిల్లా నుంచి జే ఆర్‌ పుష్పరాజ్‌, దాసరిమాస్టారు, చందూ సాంబశివరావు

అటు గుంటూరు, ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లా నుంచి పలువురు నేతలు మండలిసీటుకోసం తీవ్రంగా ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. గుంటూరుజిల్లా నుంచి జేఆర్‌పుష్పరాజ్‌, దాసరి రాజామాస్టారు, చందూసాంబశివరావు పోటీపడుతున్నట్టు సమాచారం. ఇక ప్రకాశం జిల్లానుంచి మాజీ ఎమ్మెల్సీ జూపూడిప్రభాకర్‌తోపాటు లంకాదినకర్‌ రేసులో ఉన్నారు. వీరితోపాటు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు, విశాఖజిల్లాకు నుంచి మాజీఎమ్మెల్యే రామానాయుడు, చిత్తూరుజిల్లా నుంచి ఎస్వీనాయుడు, మాజీఎమ్మెల్యే హేమలత తమ ప్రయత్నాలు మొదలు పెట్టారు. అటు పార్టీ అధికారప్రతినిధులైన వర్లరామయ్య, పంచుమర్తి అనురాధ, ముళ్లపూడి రేణుకతోపాటు మాజీ స్పీకర్‌ ప్రతిభాభారతి, శోభాహైమవతి కూడా ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు.

అధినేత కటాక్షం ఎవరిపై ఉండనుంది..?

ముందస్తు ఎన్నికల ఊహాగానాలు ఊపందుకున్న నేపథ్యంలో .. ఒకవేళ అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తే.. ఇక పదవులపై ఆశలు వదులుకోవాల్సిందేనని నేతలు భావిస్తున్నారు. చట్టసభకు వెళ్లేందుకు ఇదే ఆఖరు అవకాశం అని పలువురు నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పార్టీ అధినేత చంద్రబాబుతో నిరంతరం టచ్‌లో ఉంటున్నట్టు తెలుస్తోంది. మరి అధినేత ఎవరిని కనికరిస్తారో.. వేచి చూడాల్సిందే అంటున్నారు టీడీపీ నాయకులు. 

చిత్తూరులో ప్రేమోన్మాది దాడి..

చిత్తూరు : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించడం లేదంటూ ఎంబీఏ ఫస్టియర్ చదువుతున్న ఓ విద్యార్థినిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. తీవ్రగాయాలైన విద్యార్థినిని రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన చంద్రగిరి -కాలూరులో చోటు చేసుకుంది.

 

మ్యాచ్ ప్రారంభం..

ఇంగ్లండ్ : ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫిలో భాగంగా నేడు ఇండియా - బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతోంది. తొలుత టాస్ గెలిచిన ఇండియా పీల్డింగ్ ఎంచుకుంది. ఆదిలోనే బంగ్లాకు ఎదురు దెబ్బ తగిలింది. భువనేవ్వర్ మొదటి ఓవర్ లోనే వికెట్ తీశాడు.

ఇండియా - బంగ్లాదేశ్ మ్యాచ్..వర్షం..

ఇంగ్లండ్ : ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫిలో భాగంగా నేడు ఇండియా - బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతోంది. తొలుత టాస్ గెలిచిన ఇండియా పీల్డింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం వర్షం కురుస్తుండడంతో మ్యాచ్ కు అంతరాయం ఏర్పడింది.

రైతు ఉద్యమాలకు దేశ వ్యాప్త నిరసనలు..

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా జరుగుతున్న రైతాంగ పోరాటాలకు రైతు సంఘం..సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. మోడీ అధికారంలోకి వచ్చాక వ్యవసాయ రంగం మరింత సంక్షోభంలో పడిందని సాగర్, సాయిబాబు, వెంకట్రాములు పేర్కొన్నారు. రైతుల ఆదాయం పెంచకుండా కార్పొరేట్ల ఆదాయం పెంచారని, రైతు ఉద్యమాలకు సంఘీభావంగా రేపు దేశ వ్యాప్త నిరసనలు చేయనున్నట్లు ప్రకటించారు.

కొచ్చి మెట్రో రైలు ప్రారంభం..మెట్రో శ్రీధరన్ కు ఆహ్వానం లేదా ?

ఢిల్లీ : కొచ్చి మెట్రో రైలు ప్రారంభోత్సవం జరగనుంది. మెట్రో రైలును ప్రధాన మంత్రి మోడీ ప్రారంభించనున్నారు. వేదిక మీదకు మెట్రో శ్రీధరన్ ఆహ్వానం లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీధరన్ ను వేదిక మీదకు ఆహ్వానించాలంటూ సీఎం పినరయి విజయన్ పీఎంవోకు లేఖ రాశారు. దీనిపై శ్రీధరన్ స్పందించారు. మెట్రో రైలు ప్రారంభోత్సవానికి హాజరవుతానని, వేదిక మీదకు ఆహ్వానం లేకపోవడంపై నొచ్చుకోవడం లేదన్నారు. ఈ అంశాన్ని వివాదం చేయొద్దని, దేశ ప్రదాని భద్రతకే తొలి ప్రాధాన్యమివ్వాలని పేర్కొన్నారు.

మోడీకి ఏచూరి లేఖ..

ఢిల్లీ : రైతు సమస్యలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి లేఖ రాశారు. పంటలకు మద్దతు ధర కల్పించేలా పార్లమెంట్ సమావేశాల్లో చట్టం చేయాలని లేఖలో పేర్కొన్నారు. రైతు పండించిన ఉత్పాదక ధర కంటే 50 శాతం అదనపు ధర కల్పించాలని, పంటలకు మద్దతు ధర లేకనే ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు.

14:58 - June 15, 2017

శ్రీకాకుళం : ఇక్కడ చూస్తున్న వీళ్లు మట్టిలో మాణిక్యాలు. ఇటీవల వెలువడిన ఐఐటి అడ్వాన్స్‌ ఫలితాల్లో సోషల్‌ వెల్ఫేర్‌ కాలేజీకి చెందిన విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారు. చిన్నప్పటి నుండి ఉన్నత చదువులు చదవాలని ఆశగా ఉండేదని..కానీ ఆర్థికస్తోమత లేక చదవలేకపోయామని విద్యార్తులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. కానీ తమలాంటి పేద విద్యార్థులకు ఏపీ సొషల్‌ వెల్ఫేర్‌ ఐఐటీ మెడికల్ అకాడమీవారు అండగా నిలిచిందని విద్యార్ధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం జిజి వలస గ్రామానికి చెందిన తార గణేష్‌కు 947వ ర్యాంకు, కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం బాలాపురం గ్రామనికి చెందిన బాలకృష్ణకు 3602 ర్యాంకు రావడంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

14:56 - June 15, 2017

ఢిల్లీ: ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన పథకం అభాసుపాలవుతోంది. నిర్దేశించిన లక్ష్యం నీరుగారిపోతోంది. పంట నష్టపోతున్న రైతులకు ఆసరాగా ఉండేందుకు ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రైతు ఆదాయాన్ని స్థిరీకరించి, వ్యవసాయాన్ని తిరిగి కొనసాగించే వీలు కల్పించేందుకు ఈ పథకాన్ని రూపొందించింది. కేంద్రం నిర్దేశించిన ప్రాంతాన్ని యూనిట్‌గా పరిగణించి.. సాగుచేస్తున్న పంట రకాన్ని బట్టి ఒకటిన్నర నుంచి రెండు శాతం మేర ప్రీమియం వసూలు చేస్తారు. మిగతా ప్రీమియం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తాయి. ఈ పంటలకు బీమాను క్రాప్‌ కటింగ్‌ ద్వారా నిర్ణయించి పరిహారాన్ని నిర్ధారిస్తారు. పరిహారం చెల్లింపులో బీమా కంపెనీలు, అధికారులు కుమ్మకై రైతులను దోచుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. పీఎం ఫసల్‌ బీమా యోజన పథకం రూపకల్పన క్షేత్ర స్థాయి పరిస్థితులను అనుసరించి జరగలేదని రైతు సంఘాలు మండిపడుతున్నాయి. పరిహారం నిర్ణయించడం కూడా అశాస్త్రీయంగా ఉందని ఆక్రోషిస్తున్నారు.

బ్యాంకుల్లో ములుగుతున్న వేలాది కోట్ల ప్రీమియం సొమ్ము...

రైతులకు పీఎం ఫసల్‌ బీమా చేయించే బాధ్యతను దేశ వ్యాప్తంగా 10 ప్రైవేట్ బీమా కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. రైతు బ్యాంకు నుంచి పంట రుణం పొందినప్పుడే...బీమా ప్రీమియంను బ్యాంకులే మినహాయించుకుని ఇన్సూరెన్స్ కంపెనీలకు జమచేస్తున్నాయి. అయితే ఈ బీమా గడువు జూన్‌ 15 లోపే ఉండటంతో..సరైన సమయంలో రైతులకు రుణాలు అందక ప్రీమియం చెల్లించడం కష్టంగా మారుతోంది. తెలంగాణలో రైతు రుణమాఫీతో రుణాలు సెప్టెంబర్‌ అయినా అందడం లేదు. దీంతో బీమా గడువు ముగిసినా.. రుణాల మంజూరు సమయంలో బ్యాంకులు ప్రీమియం సొమ్మును తీసుకుంటున్నాయి. ఇలా గడువు ముగిసిన తర్వాత వసూలు చేసిన బీమా ప్రీమియం వేలాది కోట్లు బ్యాంకుల పాలయ్యాయని రైతులు ఆరోపిస్తున్నారు.

గతేడాది ప్రీమియం రూపేనా 22 వేల కోట్లు వసూలు

గతేడాది బీమా కంపెనీలు ప్రీమియం రూపేనా 22 వేల కోట్లు వసూలు చేసి పంటలకు పరిహారం కింద ఇచ్చింది కేవలం ఏడు వందల కోట్లు మాత్రమే. మొత్తం 21 వేల కోట్ల కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తినా.. ప్రభుత్వాలు పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. వాస్తవానికి క్రాప్‌ కటింగ్‌ అంచనాలు నిర్ణయించడం అత్యంత రహాస్యంగా జరగాలి. పరిహారం క్రాఫ్ కటింగ్‌ పైనే ఆధారపడి ఉండటంతో.. బీమా కంపెనీలు అంచనాలు తయారు చేసే అధికారులను ప్రలోభ పెడుతున్నారన్నది మరో ఆరోపణ. తెలంగాణను నాలుగు యూనిట్లుగా విభజిస్తే అందులో మూడు భాగాలు ఒకే కంపెనీ దక్కించుకోవడం గమనార్హం.

పటిష్టంగా అమలు చేసేందుకు సరైన చర్యలు తీసుకోవాలి...

ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన పథకం పటిష్టంగా అమలు చేసేందుకు సరైన చర్యలు తీసుకోవాలని రైతు సంఘాల నేతలు కోరుతున్నారు. గతేడాది జరిగిన కుంభకోణంపై విచారణ చేపట్టాలంటున్నారు. ఈ సంవత్సరం పంటల బీమా గడువును పెంచి, క్రాప్‌ కటింగ్‌ అంచనాలు పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రీమియం మొత్తం ప్రభుత్వాలే చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్..

ఇంగ్లండ్ : ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫఙలో భాగంగా భారత్ - ఇంగ్లండ్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఎలాంటి మార్పులు లేకుండానే భారత్ బరిలోకి దిగింది. తొలుత టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది.

14:40 - June 15, 2017

హైదరాబాద్: ఇటీవల మహిళలపై లైంగిదాడులు, గృహహింసలు, మోసాలు నిత్యకృత్యంగా మారిపోయాయి. మరి పోలీసులు వున్నారు, చట్టాలు ఉన్నాయి. కానీ మహిళలపై నేరాలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి కారణం ఏమిటి? ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి? సమాజంలో ఎటువంటి చైతన్యం రావాలి? ఈ నేపథ్యంలో 'మహిళలపై పెరుగుతున్న హింస' అనే అంశం పై మానవి 'ఫోకస్' లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో పిఓడబ్ల్యు నేత సంధ్య, సామాజిక కార్యకర్త, ఎన్జీఓ శ్యామల, సామాజిక కార్యకర్త దేవి పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

 

'నిరూపించకపోతే ఉత్తమ్ ముక్కు నేలకు రాయాలి'..

హైదరాబాద్ : భూ రిజిస్ట్రేషన్లలో అక్రమాలు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, గత ప్రభుత్వాలు తెచ్చిన ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానం వల్లే అక్రమాలు జరుగుతున్నాయని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఎనివేర్ రిజిస్ట్రేషన్ విధానాన్ని రద్దు చేయడం జరిగిందని, ఎవరి కుటుంబసభ్యులు భూ ఆక్రమణల్లో ఉన్నారో చెప్పాలని చర్యలు తీసుకొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఆరోపణలు రుజువు చేయకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ముక్కుకు నేలకు రాయాలని, మియాపూర్ భూముల్లో ఒక్క గజం కూడా కబ్జా కాలేదన్నారు.

'క్యూ కాంప్లెక్స్ లో హెల్ప్ డెస్క్..ఫోన్ సౌకర్యం'..

చిత్తూరు : వేసవి సెలవుల్లో గత ఏడాది కన్నా ఎక్కువ మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని ఈవో పేర్కొన్నారు. అన్నప్రసాదాల పంపిణీల్లో 24 శాతం పెరిగిందని, ఈ ఏఆడాది కోటి 95 వేలు లడ్డూలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. వేసవిలో బ్రేక్ దర్శనాలను నియంత్రించినట్లు, భక్తుల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకుని సౌకర్యాలు మెరుగుపరుస్తామన్నారు. క్యూ కాంప్లెక్స్ లో హెల్ప్ డెస్క్..ఫోన్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వెండివాకిలి వద్ద తోపులాట తగ్గించేందుకు క్యూ లైన్ లలో ఆన్ లైన్ టికెట్లకు లక్కీ డిప్ విధానం అమలు చేయడం జరుగుతుందన్నారు.

కేసీఆర్ ను కలిశా..దానిపై చర్చించలేదు - జానా..

హైదరాబాద్ : భూ కుంభకోణంపై సీఎం కేసీఆర్ తో మాట్లాడానంటూ వచ్చిన కథనాలపై సీఎల్పీ నేత జానారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మర్యాదపూర్వకంగానే కేసీఆర్ ను కలవడం జరిగిందని, తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. భూ కుంభకోణంలో సంబంధం ఉన్న కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవచ్చన్నారు. భూ కుంభకోణం నిగ్గు తేల్చే వరకు కాంగ్రెస్ పోరాడుతుందని స్పష్టం చేశారు.

కొత్త రైళ్లను ప్రారంభించిన రైల్వే మంత్రి ప్రభు..

విజయవాడ : కొత్త రైళ్లను రైల్వే మంత్రి ప్రభు ప్రారంభించారు. సీఎం చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు, అశోక్ గజపతి రాజులు పాల్గొన్నారు. విజయవాడ - హౌరా సూపర్ ఫాస్ట్ హంసఫర్ ఎక్స్ ప్రెస్, త్రీ ఫేజ్ ఎలక్ట్రికల్ లోకో సిమ్యులేటర్, ఎలక్ర్టిక్ ట్రాక్షన్ సెంటర్ జాతికి అంకితం చేశారు. గుత్తి - ధర్మవరం సెక్షన్ డబ్లింగ్ కు శంకుస్థాపన చేశారు.

14:01 - June 15, 2017

విశాఖ : రాష్ట్రంలో తొలి హెలి ప్యాట్ ఉన్న హాస్పిటల్‌గా ఖ్యాతికెక్కిన ప్రథమ హాస్పిటల్‌ను.. సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. నవ్యాంధ్రలోనే ఇది పెద్ద హాస్పిటల్‌ అని బాబు కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, రాష్ట్రమంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్లే డైరెక్టర్లుగా ఉన్న ఈ హాస్పిటల్‌ మరింత జయప్రదం కావాలని.. సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. 

13:59 - June 15, 2017

గుంటూరు : ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏడాది క్రితం ప్రారంభించిన ఆపరేషన్‌ ఆకర్ష్‌తో ప్రతిపక్ష వైసీపీకి షాక్‌ ఇచ్చారు. ఇప్పుడు అదే వైసీపీ టీడీపీకి షాక్‌ ఇస్తోంది. పార్టీలో ఇమడలేని టీడీపీ నేతలు ఇప్పుడు ఒక్కొక్కరుగా వైసీపీలోకి వస్తున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ నేతల గంగుల ప్రభాకర్‌రెడ్డి, శిల్పా మోహన్‌రెడ్డి వైసీపీలో చేరారు. దీంతో తెలుగుదేశంలో కలవరం మొదలైతే, వైసీపీలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. కడప జిల్లా టీడీపీకి చెందిన మరో నేత కూడా వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారన్న ప్రచారం ఊపందుకుంది.

పార్టీ మారిన 20 మంది ఎమ్మెల్యేలు
ఏపీలో టీడీపీని బలోపేతం చేసే ఉద్దేశంతో చంద్రబాబు ప్రారంభించిన ఆపరేషన్‌ ఆకర్ష్‌కు ప్రతిపక్ష వైపీసీకి చెందిన 20 మందికిపైగా ఎమ్మెల్యేలు ఆకర్షితులుయ్యారు. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. కడప జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డితో ప్రారంభమైన ఈ పరంపర విజయనగం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు వరకు కొనసాగింది. ఈ ఇద్దరు ఇప్పుడు ఏపీ కేబినెట్‌లో మంత్రులుగా ఉన్నారు. ఇక వైసీపీ నేతలు చాలా మంది చంద్రబాబు, లోకేశ్‌ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

వైసీపీలో చేరిన శిల్పామోహన్ రెడ్డి
కర్నూలు జిల్లాలో భూమా, శిల్పా వర్గాల మధ్య మొదటి నుంచి కూడా పచ్చగడ్డి వేస్తే భగ్గమనే పరిస్థితులు ఉన్నాయి. రెండు వర్గాలు కూడా టీడీపీలోనే కొనసాగాయి. శిల్పా మోహన్‌రెడ్డి ఇప్పుడు తెలుగుదేశం వీడి వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో శిల్పా మోహన్‌రెడ్డి టీడీపీ తరుపున, భూమా నాగిరెడ్డి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగారు. ఎన్నికల్లో నెగ్గిన భూమా నాగిరెడ్డి, తన కుమార్తె ఆళ్లగడ్డ వైసీపీ ఎమ్మెల్యే అఖిల ప్రియతో కలిసి టీడీపీలో చేరారు. అప్పట్లో దీనిని శిల్పా మోహన్‌రెడ్డి వ్యతిరేకిస్తే... చంద్రబాబు నచ్చచెప్పారు. టీడీపీలో ఈ ఇద్దరు నేతలు రెండు వర్గాలుగా చేరి పరస్పరం విమర్శించుకోవడంతో... పలుసార్లు చంద్రబాబు జోక్యం చేసుకుని సర్దిచెప్పారు. భూమా నాగిరెడ్డి మరణానంతరం నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో సీటు విషయంలో భూమా, శిల్పా వర్గాల మధ్య రగడ జరిగింది. నంద్యాల నుంచి తమ కుటుంబ సభ్యులే పోటీ చేస్తారని భూమా అఖిలప్రియ ప్రకటించడంతో శిల్పా మోహన్‌రెడ్డి విభేదించారు. నంద్యాల టీడీపీ టికెట్‌ కేటాయింపులో స్పష్టమైన హామీ ఇవ్వాలని శిల్పా మోహన్‌రెడ్డి... పలు దఫాలుగా చంద్రబాబును కోరినా ప్రయోజనం లేదు. దీంతో విసిగిపోయిన శిల్పా మోహన్‌రెడ్డి వైసీపీలో చేరారు. ఆళ్లగడ్డ టీడీపీలో భూమా అఖిలప్రియ, గంగుల ప్రభాకర్‌రెడ్డి మధ్య ఆధిపత్య పోరు కొనసాగింది. దీంతో గంగుల ప్రభాకర్‌రెడ్డి టీడీపీని వీడి వైసీపీలో

ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి మధ్య ఆధిపత్యపోరు
కడప జిల్లాలో కూడా మంత్రి ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి మధ్య ఆధిపత్యపోరు నడుస్తోంది. గత ఎన్నిల్లో వైసీపీ తరుపున ఎన్నికలపై ఆదినారాయణరెడ్డి పార్టీ అధినేత జగన్‌తో విభేధించి టీడీపీలో చేరారు. అప్పట్లో ఆదినారాయణరెడ్డి చేరికను రామసుబ్బారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించడంతో చంద్రబాబు సర్దిచెప్పారు. ఆదినారాయణరెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకునేటప్పుడు కూడా రామసుబ్బారెడ్డి వ్యతిరేకిస్తే చంద్రబాబు జోక్యం చేసుకుని నచ్చచెప్పారు. పార్టీ వీడతానని రామసుబ్బారెడ్డి బెదిరించడంతో నామినేటెడ్‌ కోటాలో ఎమ్మెల్సీ సీటు ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ చంద్రబాబు ఇంతవరకు హామీని నెరవేర్చకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న రామసుబ్బారెడ్డి..టీడీపీని వీడి వైసీపీలో చేరే ఆలోచనలో ఉన్నారన్న ప్రచారం ఊపందుకుంది. దీంతో కడప జిల్లాతోపాటు, రాష్ట్ర తెలుగుదేశం నేతల్లో కలవరం ప్రారంభమైంది. ప్రకాశం జిల్లా అద్దంకి వైసీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి టీడీపీలో చేరినప్పుడు ఆ జిల్లా తెలుగుదేశం నేత కరణం బలరాం తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో కరణంకు నచ్చచెప్పి ఎమ్మెల్సీ పదవి ఇచ్చినప్పటికీ బలరామ్‌, గొట్టిపాటి రవి మధ్య విభేదాలు భగ్గుమంటూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితితే మరికొన్ని జిల్లాల్లో కూడా ఉంది. టీడీపీ అసంతుష్టుల్లో కొంతమంది వైసీపీ వైపు చూడడం తెలుగుదేశంకు ఇబ్బందికర పరిణామంగా భావిస్తున్నారు. 

13:48 - June 15, 2017

పెద్దపల్లి : వారసత్వ ఉద్యోగాల కోసం కార్మికులు చేస్తున్న సమ్మె విజయవంతమైందని సింగరేణి కార్మిక సంఘాల నేతలు గోదావరిఖనిలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో తెలిపారు. వారసత్వ ఉద్యోగాల డిమాండ్‌ సాధించుకునే వరకు సమ్మె కొనసాగుతుందని నేతలు హెచ్చరిస్తున్నారు. గుర్తింపు యూనియన్‌, సింగరేణి యాజమాన్యం కుమ్మక్కై కార్మికుల కుటుంబాల జీవితాల్లో మట్టి కొట్టాలని చూస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా దిగిరాకపోతే.. భవిష్యత్‌లో కార్మికులు తగిన గుణపాఠం చెబుతారని కార్మిక సంఘాల నేతలు హెచ్చరించారు. 

13:45 - June 15, 2017

పెద్దపల్లి : సింగరేణిలో సమ్మె సక్సెస్‌ అయింది. 5 జాతీయ కార్మిక సంఘాల పిలుపుమేరకు సింగరేణి కార్మికులు సమ్మె చేస్తున్నారు. వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణతో పాటు.. 9 డిమాండ్లతో సమ్మె చేస్తున్నారు. అయితే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం సమ్మెకు దూరంగా ఉంటుంది. మరోవైపు ఈ నెల 19 నుంచి దేశవ్యాప్తంగా బొగ్గు గనుల్లో కార్మికులు సమ్మె చేయనున్నారు. రామగుండంలో కార్మికులంతా విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. తమ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు సమ్మె విరమించేది లేదని కార్మిక సంఘ నేతలంటున్నారు.

 

13:40 - June 15, 2017

హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం రేపుతున్న శిరీష, ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యలు అనేక మలుపులు తిరుగుతుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న రాజీవ్, శ్రవణ్ లను జూబ్లీహిల్స్ స్టేషన్ నుంచి నార్త్ జోన్ కు తరలించారు. వీరిని విచారించిన అనంతరం కేసులో కొత్తగా రాజీవ్ ప్రియురాలు తేజస్వి తెరపైకి వచ్చారు. ఈ కేసుల పై విచారణ కొనసాగుతోందని, త్వరలో వివరాలు ప్రకటిస్తామని పోలీసులు ప్రకటించారు. పూర్తి వివరాలుకు వీడియో చూడండి.

 

13:20 - June 15, 2017

సబ్ రిజిస్ట్రార్ రమేష్ కు కోట్ల ఆస్తులు..?

హైదరాబాద్ : మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ రమేష్ చంద్రారెడ్డి బ్యాంకు లాకర్లను ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. మోహన్ నగర్ ఎస్ బీఐ లాకర్ లో రూ. 3 కోట్ల విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అల్కాపూర్ లోని మరో రెండు బ్యాంకు లాకర్లలో 3.5 కిలోల బంగారం..రూ. 30 లక్షల ఫిక్స్ డ్ డిపాజిట్లు..రూ. 8 లక్షల బ్యాంకు బ్యాలెన్స్ గుర్తించారు. గ్రామీణ కో ఆపరేటివ్ బ్యాంకులో రూ. 8 లక్షల డిపాజిట్లు, భవనగిరిలో 4.36 ఎకరాల భూమిని గుర్తించారు. కర్మన్ ఘాట్..కొత్తపేట ప్రాంతాల్లో ప్లాట్లు ఉన్నట్లు తెలుస్తోంది.

13:18 - June 15, 2017

గుంటూరు : విశాఖ భూ కుంభకోణం సంబంధించి అయ్యన్న పాత్రడు గంటా శ్రీనివాస రావు వివాదంపై పార్టీలోని ముగ్గురు సీనియర్ నాయకులతో కమిటీ వేశారు. ఈ కమిటీ మూడు రోజుల్లో నివేదిక ఇవ్వనున్నారు. అలాగే ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీపక్ రెడ్డి హైదరాబాద్ భూకబ్జాల విషయంలో అరెస్ట్ కావడంతో ప్రతిపక్షాల నుంచి విమర్శలు రావడంతో సస్పెన్షన్ విధించినట్టు తెలుస్తోంది. అలాగే కేశినేని నాని రవాణా శాఖ అధికారులపై చేసిన వ్యాఖ్యలు చర్చకు వచ్చినట్టు తెలిపారు. 

మచిలీపట్నం మున్సిపల్ సమావేశం రసాభాస..

మచిలీపట్నం : మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది. వైసీపీ..టిడిపి కౌన్సిలర్ల మధ్య వివాదం చెలరేగింది. మేకల సుబ్బన్నను ఛైర్మన్ సస్పెండ్ చేసింది. మున్సిపల్ కౌన్సిల్ వద్ద వైసీపీ ధర్నా చేపట్టింది. టిడిపి ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు గుప్పిస్తోంది.

13:10 - June 15, 2017

గుంటూరు : సీఎం నివాసంలో జరుగుతున్న టీడీపీ సమనవ్వయ కమిటీ భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి భూ కబ్జా పై చర్చించి, దీపక్ ను సస్పెండ్ చేస్తునట్టు ప్రకటించారు. ఆయన పై విచారణ ముగిసే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని తెలిపారు. అలాగే అయ్యన్న పాత్రడు, గంటా శ్రీనివాస రావు మధ్య వివాదంపై త్రిసభ్య కమిటీ వేసింది. కమిటీ నివేదిక తర్వాత దదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు. బహిరంగంగా పార్టీ నష్టం కల్గించే వ్యాఖ్యలు చేస్తే సస్పెండ్ చేసిన తర్వాత విచారణ ఉంటుందని నాయకులను చంద్రబాబు హెచ్చరించారు.

 

టిడిపి సమన్వయ కమిటీ..నిర్ణయాలు..

విజయవాడ : టిడిపి సమన్వయ కమిటీ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. సీఎం చంద్రబాబు నాయుడు నివాసంలో ఈ భేటీ కొనసాగింది. ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. విశాఖ భూ ఆక్రమణలపై పార్టీని ముగ్గురు వ్యక్తులతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయాలని..మూడు రోజుల్లో విచారణ జరిపి సీఎంకు నివేదిక ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

ఆ మత్సకారులు క్షేమంగా ఉన్నారు..

తూర్పుగోదావరి : కాకినాడలో గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ లభ్యమైంది. పారాద్వీప్ సమీపంలో ఏడుగురు మత్స్యకారులున్నట్లు గుర్తించారు. బోటుతో సహా వీరంతా క్షేమంగా ఉన్నట్లు సమాచారం రావడంతో మత్స్యకారుల కుటుంబీకులు..అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

జానా అధ్యక్షతన సీఎల్పీ..

హైదరాబాద్ : జానా అధ్యక్షతన సీఎల్పీ సమావేశం ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు..పార్టీ తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

 

12:26 - June 15, 2017

హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న బ్యూటీషియన్ శిరీష, కుకునూరుపల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యలపై విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం రాజీవ్, శ్రవణ్ లను విచారిస్తున్నారు. వీరి విచారణలో కొత్తగా రాజీవ్ ప్రియురాలు తేజస్వి తెరపైకి వచ్చింది. తేజస్వి గతంలో శిరీషపై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఇది ఇలా ఉంటే త్వరలో శిరీష ప్రాథమిక పొస్టుమార్టం రాబోతునట్టు పోలీసులు తెలిపారు. 

12:23 - June 15, 2017

గుంటూరు : నంద్యాల ఉపఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా బ్రహ్మనందరెడ్డి పేరు దాదాపు ఖరారు అయినట్టు తెలుస్తోంది. శిల్పామోహన్ రెడ్డి వైసీపీలో చెరడంతో టికెట్ అఖిల ప్రియా బంధువు బ్రహ్మనందరెడ్డి ఇవ్వనట్టు సమాచారం. ఈ అంశం పై టిడిపి సమన్వయ కమిటీ భేటీ చర్చించారు. సుమారు గంటనర జరిగిన సమావేశంలో ప్రధానంగా విశాఖ చెందిన మంత్రులు అయ్యన్న పాత్రుడు, గంట శ్రీనివాస రావు మధ్య వివాదం చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఎదైనా సమస్యలు తన దగ్గరకు వచ్చి మాట్లాడాలి తప్ప బహిరంగంగా మాట్లాడితే పార్టీ పరువు పోతుందని సీఎం తెలిపినట్టు సమాచారం. అలాగే ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి భూ కబ్జాలో అరెస్ట్ చేయడంతో అతని సస్పెండ్ చేయాల వద్ద అని చర్చించారు. 

ఖమ్మం సీపీఎం కార్యాలయం వద్ద పోలీసులు...

ఖమ్మం : జిల్లాలో మంత్రులు కేటీఆర్..మహేందర్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావులు పర్యటిస్తున్నారు. కాసేపటి క్రితం నూతన బస్టాండుకు శంకుస్థాపన..పునర్ నిర్మించిన భక్తరామదాసు కళాక్షేత్రాన్ని మంత్రులు ప్రారంభించారు. ఇదిలా ఉంటే సీపీఎం జిల్లా కార్యాలయాన్ని పోలీసులు ముట్టడించారు.

సమాజానికి పోలీసులు రోల్ మోడల్ గా నిలవాలి - సీపీ..

హైదరాబాద్ : నాంపల్లి రెడ్ రోస్ ఫంక్షన్ హాల్ గార్డెన్ లో మెగా హెల్త్ క్యాంపును సీపీ మహేందర్ రెడ్డి ప్రారంభించారు. సిటీ పోలీసులు సమాజానికి రోల్ మోడల్ గా నిలవాలని, పోలీసులు ఆహారపు అలవాట్లు మార్చుకుని ఆరోగ్యకరమైన సమాజం ఏర్పాటు చేయాలని సూచించారు. మొదట పోలీసులు రూల్స్..చట్టాన్ని పాటిస్తే ప్రజలు పాటిస్తారని, పోలీసులు విధులు నిర్వహించే ప్రదేశాలకే ఇంటి భోజనం సరఫరా చేసే స్కీం ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు సీపీ వెల్లడించారు.

కొనసాగుతున్న వస్త్ర వ్యాపారుల బంద్..

హైదరాబాద్ : జీఎస్టీకి వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాల్లో వస్త్ర వ్యాపారుల బంద్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా పలు జిల్లాల్లో వ్యాపారులు భారీ ర్యాలీలు నిర్వహించారు. తహశీల్దార్లకు వస్త్ర వ్యాపారులు వినతిపత్రాలు సమర్పించారు.

 

11:51 - June 15, 2017

టాలీవుడ్ కు చెందిన ప్రముఖ హీరోల కుమారులు..కుమార్తెలు వెండి తెరకు పరిచయం అయ్యేందుకు ఉత్సాహం చూపుతుంటారు. తల్లిదండ్రుల గ్రీన్ సిగ్నల్ తో వారు పలు సినిమాల్లో నటిస్తున్నారు. ఇప్పటికే మెగా కుటుంబం నుండి పలువురు అదృష్టం పరీక్షించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా టాలీవుడ్ పోలీసు ఆఫీసర్ పాత్రకు జీవం పోసే నటుడు అనిపించుకున్న 'రాజశేఖర్' కుమార్తెలు వెండి తెరకు పరిచయ్యేందుకు రంగం సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది. రాజశేకర్..జీవిత దంపతులు తెలుగు..తమిళ చిత్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. వీరికి శివాని..శివాత్మిక కూతుర్లున్నారు. వీరిలో 'శివాని' తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం కాబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే సినిమా వివరాలను శివాని మీడియాకు వెల్లడించనున్నట్లు టాక్. సినిమాల కోసం భరత నాట్యం..కూచిపూడి..గిటార్, వీణలను నేర్చుకున్నట్లు సమాచారం. ఇక శివాని సోదరి శివాత్మిక కూడా సినిమాల్లో రంగ ప్రవేశం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

11:36 - June 15, 2017
11:34 - June 15, 2017

గుంటూరు : ఉండవల్లిలోని సీఎం నివాసంలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీకి మత్రులు, జిల్లా నేతలు హాజరైయ్యారు. ఈ సమావేశంలో గంటా, అయ్యన్న పాత్రుడు వివాదం, కర్నూలు చెందిన శిల్పా మోహన్ రెడ్డి పార్టీని వీడడంపై చర్చించనున్నారు. అలాగే ఎంపీ కెశినేని నాని రవాణా శాఖ అధికారుల పై చేసిన వ్యాఖ్యల గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. పూర్తి వివరాలుకు వీడియో చూడండి. 

11:33 - June 15, 2017

హైదరాబాద్ : గత కొద్ది రోజులుగా తెలంగాణలో ఏసీబీ దాడులు నిర్వహిస్తున్నారు. తాజా మియాపూర్ భూకుంభకోణంలో మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ రమేష్ చందర్ రెడ్డి ఇంటిపై ఏసీబీ దాడులు చేస్తోంది. నాగోల్ లోని రమేష్ చందర్ రెడ్డి ఇంటిలో ఎనిమిది మందితో కూడిన అధికారుల బృందం సోదాలు నిర్వహిస్తుంది. హైదరాబాద్ పాటు మరో నాలుగు ప్రాంతాల్లో ఏబీసీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. మియాపూర్ భూకుంభకోణం కేసులో రమేష్ చందర్ రెడ్డి ఇప్పటికే అరెస్ట అయ్యారు. మెన్న కూకట్ పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు ఇంట్లో, నిన్న బాలనగర్ సబ్ రిజిస్ట్రార్ యూసఫ్ అలీ ఇంట్లో సోదాలు చేసిన విషయం తెలిసిందే. రమేష్ చందర్ రెడ్డి ఇంట్లో ముఖ్యమైన పత్రాలు, బ్యాంకు సంబంధించిన లాకర్లు ఉన్నాట్లు సమాచారం. కాసేపట్లో ఏసీబీ అధికారులు వివరాలను వెల్లడించనున్నారు. 

రాజ్ భవన్ లో టి.కాంగ్రెస్ నేతలు..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల గవర్నర్ ను టి.కాంగ్రెస్ నేతల బృందం కలిసింది. మియాపూర్ భూ కుంభకోణంపై నేతలు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో టిడిపి కూడా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

11:19 - June 15, 2017

వెండితెరపై ఓ వెలుగు వెలిగిన తారలు బుల్లితెరపై అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇందులో బాలీవుడ్ హీరోలు..నటీమణులు కూడా ఉండడం తెలిసిందే. తాజాగా టాలీవుడ్ కు చెందిన ప్రముఖ హీరోలు సైతం బుల్లితెరపై కనిపిస్తున్నారు. గతంలో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' ఎపిసోడ్ లో 'నాగార్జున' అలరించిన సంగతి తెలిసిందే. దీనికి కొనసాగింపుగా మెగాస్టార్ 'చిరంజీవి' కొనసాగించారు. అనంతరం దీనికి తాత్కాలిక బ్రేక్ పడింది. తాజాగా 'జూనియర్ ఎన్టీఆర్' 'బిగ్ బాస్' ద్వారా బుల్లితెర అభిమానులను అలరించనున్నాడు. వీరి జాబితాలో టాలీవుడ్ కండల వీరుడు 'రానా' కూడా చేరిపోయాడు. 'బాహుబలి' సినిమా ద్వారా అంతర్జాతీయ స్థాయిలో 'రానా' పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. 'నెంబర్‌ వన్‌ యూరీ విత్‌ రానా' పేరుతో ఓ షో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ఫస్టులుక్‌ను 'రానా' తన ట్విట్టర్‌ ద్వారా బుధవారం ఉదయం విడుదల చేశారు. జెమిని ఛానల్ దీనిని నిర్వహిస్తోంది.

టిడిపి సమన్వయ కమిటీ భేటీ షురూ..

విజయవాడ : ఉండవల్లిలో సీఎం నివాసంలో టిడిపి సమన్వయ కమిటీ సమావేశం జరుగుతోంది. టిడిపి మంత్రులు..జిల్లా పార్టీల నేతలు హాజరయ్యారు. గంటా..అయ్యన్న వివాదం..రవాణా శాఖపై కేశినేని నాని చేసిన వ్యాఖ్యలపై ప్రధానంగా చర్చ జరుగనున్నట్లు తెలుస్తోంది.

10:57 - June 15, 2017

అల్లు అర్జున్..కొత్త సినిమా స్టార్ట్ చేశాడో లేదో..అప్పుడే సోషల్ మాధ్యమాల్లో తెగ వార్తలు వచ్చేస్తున్నాయి. ఇందులో హీరోయిన్ ఎవరు ? విలన్ ఎవరు ? తదితర అంశాలతో పుకార్లు షికారు చేస్తున్నాయి. ‘బన్నీ' నటించిన 'డీజే..దువ్వాడ జగన్నాథమ్' చిత్ర షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఈ నెలలో ఈ చిత్రం విడుదలవుతోంది. ఇదిలా ఉంటే వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాకు 'బన్నీ' ఒకే చెప్పిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర ప్రారంభోత్సవం నిరాడంబరంగా జరిగింది. ఈ షూటింగ్ ప్రారంభోత్స కార్యక్రమంలో 'అల్లు' కుటంబం..నాగబాబు తదితరులు హాజరయ్యారు. అనంతరం చిత్రానికి సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు. 'నా పేరు సూర్య' టైటిల్ నిర్ణయించగా 'నా ఇల్లు ఇండియా' అనేది ట్యాగ్ లైన్ నిర్ణయించారు. ఇక ఇందులో తమిళ నటుడు 'శరత్ కుమార్' కీలక పాత్ర పోషించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. షూటింగ్ ప్రారంభోత్సవంలో ఆయన కూడా పాల్గొన్నారు. అదే నిజమైతే చాలాకాలం తరువాత ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు. హీరోయిన్ ను ఇంకా ఫైనల్ చేయకపోయినా కథానాయికగా 'రష్మిక మందన'ను తీసుకునే అవకాశాలు ఎక్కువగా వున్నాయనే టాక్ వినిపిస్తోంది. జులై మూడో వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కొనసాగనుంది. విశాల్-శేఖర్ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.

సిట్ కోరలు లేని పామని అన్న రోజా..

విజయవాడ : టిడిపి నేతలు విశాఖను హోల్ సేల్ గా దోచేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు నిప్పు అని చెప్పుకుంటూ రాష్ట్రాన్ని తుప్పు పట్టిస్తున్నారని, కాలయాపన కోసమే సిట్ విచారణ ప్రకటించారని తెలిపారు. సిట్ కోరలు లేని పాము అని ఎలాంటి ఉపయోగం లేదని అభివర్ణించారు. నిజాలు నిగ్గు తేల్చాలంటే సీబీఐ విచారణకు ఆదేశించాలని, తెలంగాణ రాష్ట్రంలో భూ స్కామ్ లపై సీబీఐ విచారణ జరిపించాలని అంటున్న టిడిపి ఇక్కడ జరిగిన స్కాంపై సీబీఐ విచారణ ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు. సీబీఐ విచారణ వేస్తే తండ్రి..కొడుకు జైల్లో ఉంటారని భయమని ఎద్దేవా చేశారు.

సబ్ రిజిష్ట్రార్ రమేష్..కొనసాగుతున్న దాడులు..

హైదరాబాద్ : నాగోల్ లోని మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ రమేష్ చంద్రారెడ్డి ఇంటిపై ఏసీబీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్ తో సహా నాలుగు ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. మియాపూర్ భూ స్కాంలో రమేష్ ఇప్పటికే అరెస్టయిన సంగతి తెలిసిందే.

జీజేఎం నేత ఇంట్లో పోలీసుల సోదాలు..

డార్జిలింగ్ : గోర్ఖా జనముక్తి మోర్చా చీఫ్ బీమల్ గురుంగ్ ఇల్లు, కార్యాలయాల్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

10:40 - June 15, 2017

హైదరాబాద్ : సీఎం చంద్రబాబు నుంచి ఎమ్మెల్యేల వరకు విశాఖను హోల్‌సేల్‌గా దోచుకున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. నిప్పు అని చెప్పుకునే సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని తుప్పు పట్టిస్తున్నారని ఎద్దేవా చేశారు. భూకబ్జాకు పాల్పడినట్లు సీఎం సహా మంత్రులు లోకేష్‌, గంటాపై ఆరోపణలు వస్తుంటే సీబీఐ విచారణకు ఎందుకు అప్పగించడం లేదని ప్రశ్నించారు. 233 గ్రామాల్లో రెవెన్యూ రికార్డులు గల్లంతయ్యాయంటే..అందులో చంద్రబాబు హస్తం లేదా అని ప్రశ్నించారు. సిట్‌ అనేది కాలయాపన కోసమే అని విమర్శించారు. 

10:36 - June 15, 2017

నెల్లూరు : జిల్లా మర్రిపాడు మండలంలోని కదిరినాయుడుపల్లి అటవీప్రాంతంలో పోలీసులు కూంబంగ్ నిర్వహిస్తుండగా ఎర్రచందనం కూలీలు తరసపడడంతో 25 మంది ఎర్రచందనం కూలీలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 23 ఎర్రచందన దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఓమ ఐషర్ వాహనాన్ని సీజ్ చేశారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్న ఎర్రచందనం కోసం కూలీలను స్మగ్లర్లు ఎర వాడుతున్నారు. కొంత మంది అటవీ ప్రాంతంలో ఎర్రచందనం చెట్లు నరుకుతున్నారన్న సమాచారంతో పోలీసుల కూంబింగ్ నిర్వహించారు. 

ప్రభాకర్ రెడ్డి, శిరీష ఆత్మహత్య కేసులో కొత్త కోణం

హైదరాబాద్ : బ్యూటీషియన్ శిరీష, కుకునూరుపల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. రాజీవ్ ప్రియురాలు తేజస్వి పేరు కొత్తగా తెరపైకి వచ్చింది. తేజస్వి గతంలో శిరీష తనను వేధింపులకు గురిచేస్తోందని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సోమవారం శ్రావన్ తెలిసిన కుకునూరుపల్లి ఎస్ఐ తనకు తెలుసని అక్కడికి రాజీవ్, శిరీష ను తీసుకెళ్లారు. అక్కడ ప్రభాకర్ రెడ్డి ముందు రాజీవ్ శిరీష పై చేయి చేసుకున్నాడు దీంతో ప్రభాకర్ రెడ్డి వారిని అక్కడ నుంచి వెళ్లిపోవాలని కోరినట్టు తెలుస్తోంది. అసలు ఆరోజు ఏం జరిగింది.

10:26 - June 15, 2017

హైదరాబాద్ : బ్యూటీషియన్ శిరీష, కుకునూరుపల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. రాజీవ్ ప్రియురాలు తేజస్వి పేరు కొత్తగా తెరపైకి వచ్చింది. తేజస్వి గతంలో శిరీష తనను వేధింపులకు గురిచేస్తోందని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సోమవారం శ్రావన్ తెలిసిన కుకునూరుపల్లి ఎస్ఐ తనకు తెలుసని అక్కడికి రాజీవ్, శిరీష ను తీసుకెళ్లారు. అక్కడ ప్రభాకర్ రెడ్డి ముందు రాజీవ్ శిరీష పై చేయి చేసుకున్నాడు దీంతో ప్రభాకర్ రెడ్డి వారిని అక్కడ నుంచి వెళ్లిపోవాలని కోరినట్టు తెలుస్తోంది. అసలు ఆరోజు ఏం జరిగింది. రాజీవ్, శిరీష కుకునూరుపల్లి ఎందుకు వెళ్లారని పోలీసులు విచారణ చేస్తున్నారు. శిరీష హత్యపై రాజీవ్ భిన్నవాదానలు వినుస్తున్నాడు. ఒసారి ఉరి వేసుకుందని, మరోసారి బత్ రూంలో ఆత్మహత్య చేసుకుందని తెలుపుతున్నాడు. అయితే కుకునూరుపల్లి లో ప్రభాకర్ రెడ్డి శిరీష మధ్య ఎదో ఉందని కొన్ని మీడియా చానల్ లో రావడంతో ఆ మీడియా చానల్ ఓపి వ్యాన్ కాల్చరు.

 

తిరుమలలో కిడ్నాపైన బాలుడు ఎక్కడ ?

చిత్తూరు : తిరుమలలో ఏడాడి బాలుడి కిడ్నాప్ కేసు వీడడం లేదు. బాలుడి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు కొనసాగుతోంది. తిరుమల అడిషనల్ ఎస్పీ మురళీకృష్ణ నేతృత్వంలో తిరుపతి అర్బన్ ఎస్పీ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు. బాలుడి తల్లిదండ్రులకు న్యాయం చేస్తామని ఈ సందర్భంగా ఎస్పీ హామీనిచ్చారు.

వంతెనపై నుండి దూకిన ఎర్రచందనం కూలీలు..

నెల్లూరు : మర్రిపాడు మండలం కదిరినాయుడు పల్లి అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. 25 మంది ఎర్రచందనం కూలీలను అరెస్టు చేశారు. 28 ఎర్రచందనం దుంగలు..ఐషర్ వాహనాన్ని సీజ్ చేశారు. పారిపోయేందుకు వంతెనపై నుండి దూకిన నలుగురు కూలీలకు గాయాలయ్యాయి.

గుట్కాను నిషేధించారు..కానీ...

హైదరాబాద్ : మైలార్ దేవ్ పల్లి పరిధిలోని దానమ్మ జోపిడి కాలనీలో గుట్కాతయారీ కంపెనీపై ఎస్ వోటీ పోలీసులు దాడులు జరిపారు. రూ. 10 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు..గుట్కా తయారీకి ఉపయోగించే సామాగ్రీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఐదుగురిని అరెస్టు చేశారు.

బోల్తా పడిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు..

కృష్ణా : మోపిదేవి సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. 17 మందికి గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుండి రేపల్లేకు వెళుతోంది.

 

భూపాలపల్లిలో..

భూపాలపల్లి : సింగరేణి కార్మికులు విధులకు హాజరు కాలేదు. భూపాలపల్లి ఓపెన్ కాస్ట్ మినహా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. బొగ్గు గనుల వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

ఇల్లందులో..

మంచిర్యాల : ఇల్లందు సింగరేణి అత్యవసర విభాగంలో మినహా ఎక్కడా సింగరేణి కార్మికులు విధులకు హాజరు కాలేదు. ఇల్లందు 21 ఇన్ క్లైన్ మైన్, ఇల్లందు కేవోసీ, టేకులపల్లిలో వేయి మంది కార్మికులు విధులకు హాజరు కాలేదు.

పెద్దపల్లిలో...

పెద్దపల్లి : రామగుండం సింగరేణి ఒకటో గని ఎదుట హెచ్ఎంఎస్ కార్మికులు ఆందోలన చేపట్టారు. పోలీసులు వీరిని అడ్డుకున్నారు. వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొత్తగూడెం, మణుగూరులో బంద్ లో కార్మికులు పాల్గొన్నారు.

సింగరేణిలో కొనసాగుతున్న సమ్మె..

హైదరాబాద్ : సింగరేణిలో సమ్మె కొనసాగుతోంది. వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ సమ్మె కొనసాగుతోంది. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్ టీయూసీ, హెచ్ఎంఎస్, బీఎంఎస్ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు సమ్మె చేపట్టారు. కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు, భూపాలపల్లిలో సమ్మె కొనసాగుతోంది. కార్మికులు విధులకు హాజరు కాలేదు. విధులకు హాజరు కావాలని టీబీజీకేఎస్ నేతలు ఫోన్లు చేస్తున్నారు.

 

10:14 - June 15, 2017

పెద్దపల్లి : రామగుండం రీజియన్ లో సమ్మె విజయవంతంగా కొనసాగుతోందని కార్మిక సంఘాల నేతలు వెల్లడించారు. జిల్లాలోని రామగుండం, గోదావరిఖనిలో సింగరేణి కార్మికుల సమ్మె కొనసాగుతోంది. కార్మిక సంఘాల నేతలు గనుల వద్దకు రాకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. దాదాపు 500 మంది పోలీసులతో భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. దీనితో కార్మికులు..కార్మిక సంఘాల నేతలు గనులకు దూరంగానే ఆందోళనలు కొనసాగిస్తున్నారు. రామగుండం రీజియన్ లోని 11 ఏవీ బొగ్గు గని వద్ద గనులు బోసి పోయ్యాయి. జాతీయ సంఘాలు..సీఐటీయూ..పలు కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె విజయవంతంగా జరిగిందన్నారు. పోయిన హక్కు సాధించుకోవాలంటే సమ్మె తప్పదని పేర్కొన్నారు. సమ్మెను విచ్చిన్నం చేయాలని యాజమాన్యం ప్రవర్తిస్తోందని, ఈ నేపథ్యంలో పోలీసులను మోహరించారని తెలిపారు. కానీ నూటికి 99 శాతం కార్మికులు సమ్మెలో పాల్గొన్నారని పేర్కొన్నారు.

కొత్తగూడెం లో కొనసాగుతున్న సింగరేణి సమ్మె

కొత్తడూడెం : జిల్లాలోని మణుగూరులో సింగరేణి కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఇల్లందు సింగరేణి అత్యవసర మినహా కార్మికులు ఎక్కడ విధులకు హాజరు కాలేదు.

 

09:34 - June 15, 2017

పెద్దపల్లి : వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరణ లక్ష్యంగా సింగరేణి కార్మికులు సమ్మెకు దిగాయి. గోదావరిఖని, రామగుండంలో ఉదయం నుంచి కార్మిక సంఘాలు నిరసన తెలుపుతున్నాయి. ఈనెల 19వ తేదీ నుండి దేశ వ్యాప్తంగా సమ్మె చేపట్టనున్నారు.
34 భూగర్భ గనులు..17 ఓపెన్ కాస్టు గనుల్లో సమ్మె ప్రభావం కనిపిస్తోంది. దాదాపు పది శాతం కార్మికులు మాత్రమే హాజరయ్యారు. గుర్తింపు పొందిన కార్మిక సంఘం టీజీబీకెఎస్ కార్మికులు మాత్రమే హాజరయ్యారు. రామగుండం 4 ఓపెన్ కాస్ట్ 9 భూగర్భ గనుల్లో సమ్మె ప్రభావం కనిపిస్తోంది. గనుల ప్రాంతం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. సమ్మెను విజయవంతం చేయాలంటూ ఆయా కార్మిక సంఘాలు ప్రదర్శనలు..ర్యాలీలు నిర్వహిస్తున్నారు. గనులకు కొద్దిదూరంలో ఆందోళనలు చేయాలని పోలీసులు సూచించడంతో అక్కడే ఆందోళనలు..ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. 13వేల కార్మికులు వీఆర్ఎస్ కు దరఖాస్తు పెట్టుకోవడం జరిగిందని, తమ కుమారులకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ వారు కోరుతున్నారు. వీరంతా సమ్మెకు పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నారు.

09:33 - June 15, 2017

మంచిర్యాల : జిల్లాలో సమ్మె విజయవంతంగా కొనసాగుతోంది. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఎలాగైతే పోరాటం చేశారో అదే విధంగా పోరాట స్పూర్తిని కొనసాగిస్తున్నారు. వారసత్వ హక్కు కోసం పోరాట బాట పట్టారు. సమ్మె చేస్తుండడంతో సింగరేణి పరిసర ప్రాంతాలు నిర్మానుష్యంగా మారిపోయాయి. మూడు నెలల క్రితం ఐదు జాతీయ కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు అందచేశాయి. గురువారం ఉదయం కార్మికులు విధులకు హాజరు కాలేదు. ఇదిలా ఉంటే టీఆర్ ఎస్ అనుబంధ సంస్థ టీజీబీకెఎస్ దుష్ర్పచారం సాగిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సమ్మెలో పాల్గొనడం మూలంగా సింగరేణి సంస్థ నష్టాల బాట పడుతుందని, రూ. 41 కోట్ల నష్టం వాటిల్లుతుందని..దీని ఫలితంగా జీతాలపై ప్రభావం పడుతుందని ప్రచారం చేస్తున్నట్లు సమాచారం. దీనిని ఇతర కార్మిక సంఘాలు పూర్తిగా వ్యతిరేకిస్తూ సమ్మెలో పాల్గొంటున్నాయి. ఈసమ్మెకు కార్మికులు పూర్తిగా మద్దతునిస్తూ సమ్మెలో పాల్గొంటున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

09:31 - June 15, 2017

హైదరాబాద్ : బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. బంజారాహిల్స్ పీఎస్ లో పోలీసులు రాజు, శ్రవణ్ ను విచారిస్తున్నారు. సోమవారం రాత్రి జరిగిన విషయాల పై వారిని విచారణ చేస్తున్నారు. వారు కేసు సంబంధించిన కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం.శిరీష ఆత్మహత్య కేసు విచారణ జరుపుతుండగా ఆమె ఫోన్ ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి నెంబర్ ఉండడం, అదే సమయంలో ప్రభాకర్ రెడ్డి ఆత్మ హత్య చేసుకోవటం పలు అనుమానాలకు వ్యక్తం అవుతున్నాయి. అటు సద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి మృతదేహానికి పొస్టుమార్టం పూర్తి చేశారు. ప్రభాకర్ రెడ్డి మృతదేహం ఆయన స్వగ్రామం యాదాద్రి జిల్లా టంగుటూరు చేరుకుంది.

 

కృష్ణా జిల్లాలో బస్సు బోల్తా

కృష్ణా : మోపిదేవి సమీపంలో ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 17 మందికి గాయాలు అవ్వడంతో ఆసుపత్రికి వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ బస్సు హైదరాబాద్ నుంచి రెపల్లె వెళ్లుతుంది.

 

సింగరేణిలో మోగిన సమ్మె సైరన్

గోదావరిఖని : సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణ కోసం కార్మికులు సమ్మె నిర్వహిస్తున్నారు. నిరవధిక సమ్మెకు 5 జాతీయ సంఘాలు పిలుపునిచ్చాయి. కార్మిక సంఘాలు తమ డిమాండ్లను పరిష్కారించాలని మార్చి 31 న సమ్మె నోటిస్ ఇచ్చారు. కానీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో కార్మికులు సమ్మె దిగినట్టు తెలుస్తోంది.

08:57 - June 15, 2017

గోదావరిఖని : సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణ కోసం కార్మికులు సమ్మె నిర్వహిస్తున్నారు. నిరవధిక సమ్మెకు 5 జాతీయ సంఘాలు పిలుపునిచ్చాయి. కార్మిక సంఘాలు తమ డిమాండ్లను పరిష్కారించాలని మార్చి 31 న సమ్మె నోటిస్ ఇచ్చారు. కానీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో కార్మికులు సమ్మె దిగినట్టు తెలుస్తోంది. ఈ సమ్మెకు తెలంగాన బొగ్గుగని కార్మిక సంఘం దూరంగా ఉంది. మరోమైపు సింగరేణి సమ్మెకు మావోయిస్టు పార్టీ సింగరేణి కోల్ బెల్ట్ కార్యదర్శి ప్రభాత్ మద్దతు ప్రకటించారు. సమ్మె పిలుపుతో కోల్ బెల్ట్ లో పోలీసులను భారీగా మోహరించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే తాము సమ్మె చేయాల్సి వస్తుందని సీఐటీయూ నేత రాజిరెడ్డి అన్నారు. సమ్మెను విఫలం చేయడానికి యాజమాన్యం ప్రయత్నిస్తుందని వారు ఆరోపించారు. అటు ఈ నెల 19 నుంచి దేశవ్యాప్తంగా బొగ్గు గనుల్లో సమ్మెకు కార్మికులు నిర్ణయించారు. 

నెల్లూరు లో పోలీసుల కూంబింగ్

నెల్లూరు : జిల్లా మర్రిపాడు మండలం కదిరినాయుడుపల్లి అటవీప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహించి 25 మంది ఎర్రచందన కూలీలు అరెస్ట్ చేశారు. 28 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

 

నేడు ఖమ్మంలో పర్యటించనున్న మంత్రులు

ఖమ్మం : నేడు జిల్లాలో మంత్రులు కేటీఆర్, మహేందర్ రెడ్డి, తుమ్మల పర్యటించనున్నారు. కేటీఆర్ ఐటీ హబ్ కు శంకుస్థాపన చేయనున్నారు. 

08:55 - June 15, 2017

భూ కుంభకోణం పై సీబీఐ విచారణ జరపాలని, హైదరాబాద్ నగంలో రాజకీయా భూ కబ్జాలు జరుగుతున్నాయి. రాజకీయా నాయకులు నగరంలో వేల ఎకరాలు ఎలా కొంటున్నారు. అసలు వారు ప్రజలకు సేవ చేయడానికి వస్తున్నారా లేక ఆస్తుల సంపదన కోసమా, సీఎం నష్టం జరగలేదని ఎలా ప్రకటిస్తారని, గోల్డ్ స్టోన్ ప్రసాద్ ముఖ్యమంత్రికి సంబంధం ఉందని, టెన్ టివి న్యూస్ మార్నింగ్ లో పాల్గొన్న నేతలు సీపీఎం నేత వెంకట్, కాంగ్రెస్ నేత కైలాసం అన్నారు. కేకే భూములు కొనుగోలు ఆయన వ్యక్తిగతం అని, దీనికి టీఆర్ఎస్ పార్టీ సంబంధం లేదని టీఆర్ఎస్ నేత రాజామోహన్ అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

08:54 - June 15, 2017

నేటి నుంచి జరుగనున్న సింగరేణి సమ్మే రాష్ట్ర ప్రభుత్వం కారణంతోనే మేం సమ్మే చేస్తున్నామని, టీఆర్ఎస్ ఎన్నికల హామీలో డిపెండెంట్ ఉద్యోగులు ఇస్తామని ప్రకటించిందని, సింగరేణి కార్మికులతో ప్రభుత్వం చలగటం అడుతోందని తెలంగాణ సీఐటీయూ అధ్యక్షుడు సాయిబాబా గారు అన్నారు. అధికార గుర్తింపు యూనియన్‌ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం మాత్రం సమ్మెకు దూరంగా ఉంది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.  

నేడు భారత్ తో బంగ్లాదేశ్ ఢీ

చాంపియన్స్ ట్రోఫీ : నేడు భారత్ బంగ్లాదేశ్ మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. బర్మింగ్ హోమ్ మధ్యాహ్నాం 3గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 

విజయవాడలో జీఎస్టీకి వ్యతిరేకంగా వస్త్రవ్యాపారుల బంద్

విజయవాడ : జీఎస్టీకి వ్యతిరేకంగా నేడు విజయవాడ వస్త్ర వ్యాపారులు బంద్ నిర్వహించనున్నారు. 

నేడు ఏపీ కేబినెట్ భేటీ

గుంటూరు : నేడు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. సాయంత్రం 4గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీలో తాగునీటి కార్పొరేషన్, భూముల కేటాయింపు, నవనిర్మాణ దీక్షల జరిగిన తీరు, విశాఖ భూ అక్రమణలు గురించి చర్చించనున్నారు. 

08:50 - June 15, 2017

చాంపియన్స్ ట్రోఫీ : డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌..ఛాంపియన్స్‌ ట్రోఫీని నిలబెట్టుకునే దిశగా కీలక సమరానికి సన్నద్ధమైంది. ఇవాళ జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌ను ఢీకొంటుంది. తొలిసారి ఐసీసీ టోర్నీ సెమీస్‌ చేరినా..బంగ్లాను తేలిగ్గా తీసుకుంటే పొరపాటే. ఇటీవల రెండు జట్ల మధ్య పెరిగిన వైరం కూడా మ్యాచ్‌ను ఆసక్తికరంగా మారుస్తోంది. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో గట్టిగా పోరాడినా భారత్‌ చేతిలో ఓడడంతో నిరాశ చెందిన బంగ్లాదేశ్‌..ఈసారైనా నెగ్గాలనే పట్టుదలతో ఉంది. అది జరగాలంటే బంగ్లా అద్భుతంగా ఆడాల్సిందే. కోహ్లీసేన ఇప్పుడు సూపర్‌ ఫామ్‌లో ఉంది. గత ఏడు ఐసీసీ టోర్నీల్లో ఆరోసారి సెమీఫైనల్‌ బరిలోకి దిగుతున్న భారత్‌..బంగ్లాతో సవాల్‌కు సై అంటోంది.

ఫామ్ లో ఉన్న భారత్, బంగ్లా..
ఇక ఇరుజట్ల బలాబలాలు పోలిస్తే..బంగ్లా కన్నా భారత్‌ చాలా ముందుంది. దక్షిణాఫ్రికాపై ప్రదర్శన నేపథ్యంలో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న భారత్‌..అదే తీవ్రతతో ఆడాలనుకుంటోంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లలో మంచి ఫామ్‌లో ఉన్న టీమ్‌ఇండియాను ఆ ఫామ్‌లో ఎదుర్కోవడం బంగ్లాదేశ్‌కు కఠిన సవాలే. ఐతే భారత్‌ ఓడితే..మాత్రం విమర్శల దాడికి గురికాక తప్పదు. కాబట్టి ఈ పోరు భారత్‌కూ పరీక్షే. మ్యాచ్‌ కోసం భారత్‌ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. ఉమేశ్‌ యాదవ్‌ స్థానంలో గత మ్యాచ్‌లో ఆడిన స్పిన్నర్‌ అశ్విన్‌ను కొనసాగించే అవకాశముంది. మరోవైపు బంగ్లాదేశ్‌ అంతా ఇప్పడు క్రికెట్‌ జపంతో ఊగిపోతోంది. ఓ ఐసీసీ టోర్నీలో బంగ్లాదేశ్‌కు తొలిసారి ఫైనల్‌ చేరే అవకాశమున్న నేపథ్యంలో అక్కడి అభిమానులు ఎంతో ఆశతో తమ జట్టు విజయం కోసం ఎదురుచేస్తున్నారు. అది అంత తేలిక కాకపోయినా..భారత జట్టుపై 2007 వన్డే ప్రపంచకప్‌లో సాధించిన విజయం,.నిరుడు టీ20 ప్రపంచకప్‌లో ప్రదర్శన, సొంతగడ్డపై 2015లో వన్డే సిరీస్‌ విజయం బంగ్లాదేశ్‌కు స్ఫూర్తినిస్తాయనడంలో సందేహం లేదు. పైగా ఈ టోర్నీలో న్యూజిలాండ్‌కు షాకిచ్చిన ఉత్సాహంతో ఆ జట్టు ఉంది. ఐతే ఫైనల్‌ కల నెరవేరాలంటే ఆ జట్టు అసాధారణంగా ఆడాల్సిందే.

300 వన్డే అడనున్న యువరాజ్
బంగ్లా ఓపెనర్లు తమిమ్‌ ఇక్బాల్‌, సౌమ్య సర్కార్‌ల కంటే భారత్‌ ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మలు చాలా మెరుగైన బ్యాట్స్‌మెన్‌. ఇక 300వ వన్డే ఆడనున్న యువరాజ్‌ అత్యుత్తమ శ్రేణి ఆటగాడు. ఐతే తాము సమష్టిగా ఆడితే ఎలాంటి బౌలింగ్‌నైనా ఎదుర్కొని జట్టుకు విజయాలను అందించగలమని బంగ్లా బ్యాట్స్‌మెన్‌ నిరూపించిన సందర్భాలున్నాయి. ముస్తాఫిజుర్‌, మొర్తజా, తస్కిన్‌, రుబెల్‌ రూపంలో బంగ్లాకు మంచి బౌలర్లే ఉన్నారు. తమదైన రోజున జట్టును గెలిపించగలరు. భారత్‌కు షాకివ్వాలంటే వీళ్లే బంగ్లాకు కీలకం. ఐతే ఈ విభాగంలోనూ భారత్‌ భువనేశ్వర్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, హార్దిక్‌ పాండ్యలతో ప్రత్యర్థి కన్నా చాలా బలంగా ఉంది.

08:48 - June 15, 2017

చాంపియన్స్ ట్రోఫీ : 42 సంవత్సరాల నుంచి కలలు కంటున్న ఇంగ్లాండ్ ఆశలపై పాక్ నీళ్లు చల్లింది. ఐసీసీ చాపియన్స్‌ ట్రోఫీలో పాక్‌ సంచలన విజయాన్ని నమోదుచేసింది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో బుధవారం జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై పాకిస్తాన్‌ సంచలన విజయాన్ని నమోదుచేసింది. ఇంకా 8 ఓవర్లు మిగిలి ఉంగానే...నిర్థేశిత లక్ష్యాన్ని పాక్‌ సునాయసంగా సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ టీం..49 .5 ఓవర్లలో 211 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ జానీ బెయిర్‌ స్టో 57 బంతుల్లో 43 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత జో రూట్‌ 46 పరుగులు చేసి తృటిలో అర్థశతకాన్ని చేజార్చుకున్నాడు. ఇయాన్‌ మోర్గాన్‌ 33, బెన్‌స్టోక్స్‌ 34 పరుగులు మాత్రమే చేశారు. అయితే ఇంగ్లాండ్ క్రికెట్ అభిమానులు ఆశించిన విధంగా బ్యాట్స్‌మెన్స్‌ ఎలాంటి మెరుపులు చేయలేదు. అంతకుముందు 400 పరుగులు సాధించిన ఇంగ్లాండ్..పాక్‌ను చిత్తును చేయడం ఖాయమనుకున్నారు. కానీ ఆటలో అలా సాధ్యంకాదనేలా పాక్ టీం విరుచుకుపడింది. పాక్‌ బౌలర్లు హసన్‌ అలీ 3 వికెట్లు, జువైద్‌ ఖాన్‌, రుమాన్‌ రైస్‌ చెరో 2 వికెట్లు తీసి కీలకపాత్ర పోషించారు. మరో బంతి మిగిలి ఉండగానే 211 పరుగుల వద్ద ఇంగ్లాండ్ టీం కుప్పకూలింది.

రాణించిన పాక్ అటగాళ్లు
ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాక్‌..37.1 ఓవర్లలోనే ఇంగ్లాండ్ నిర్ధేశించిన 212 పరుగులు లక్ష్యాన్ని అలవోకగా అధిగమించింది. ఓపెనర్లు ఫకర్ జమా, అజ్‌హర్‌ అలీ అద్బుతమైన ఇన్సింగ్‌ ఆడారు. ఫఖర్‌ జమా 58 బంతుల్లో 57 పరుగులు, అజహర్‌ అలీ 100 బంతుల్లో 76 పరుగులు చేసి ఓపెనింగ్‌ జోడీ 118 పరుగులు సాధించారు. ఆ తర్వాత ఫఖర్ అవుటయ్యాకా..అజహర్‌, బాబర్‌ ఆజంలు కలిసి రెండో వికెట్‌ జోడిగా 55 పరుగులు సాధించారు. ఆ తర్వాత వచ్చిన మహమ్మద్‌ హఫీజ్‌ 27 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక ఆదివారం జరిగే ఫైనల్‌ మ్యాచ్‌ కోసం పాక్‌ సమరోత్సాహంతో సన్నద్ధమవుతోంది. 

08:47 - June 15, 2017

విశాఖ : దివంగత టీడీపీ నేత కింజారపు ఎర్రంనాయుడు కుమారుడు, శ్రీకాకుళం తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్‌ నాయుడు వివాహం రంగరంగ వైభంగా జరిగింది. టీడీపీ ఎమ్మేల్యే బండారు సత్యనారాయణమూర్తి కుమార్తె శ్రీశ్రావ్యను రామ్మోహన్‌నాయుడు పెళ్లి చేసుకున్నరారు. ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరంగ్‌ కాలేజీ మైదానంలో శాస్త్రోక్తంగా జరిగిన ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహా పలువులు ప్రముఖులు హాజరై వధూ, వరులను ఆశీర్వదించారు. కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, అశోక్‌ గజపతిరాజు, సురేష్‌ప్రభు, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, చినరాజప్ప, కళా వెంకట్రావు, కె.ఎస్‌.జవహార్‌, దేవినేని ఉమామహేశ్వరరావు, పరిటాల సునీత తదితరులతోపాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు.

08:46 - June 15, 2017

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని హఫీజ్‌పూర్‌ గ్రామంలో భూముల విషయంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు ప్రకటించారు. భూమి విషయంలో న్యాయపరమైన అంశాలను పరిశీలించాకే కొనుగోలు చేసినట్టు చెప్పారు. ఆ భూముల జోలికి వెళ్లేదిలేదని స్పష్టంచేశారు. ఈ భూముల కోసం తాము చెల్లించిన నగదును తిరిగి ఇప్పించే ఏర్పాటు చేయాలని కేకే కోరారు. హఫీజ్‌పూర్‌ గ్రామంలోని భూముల కొనుగోలులో తమ కుటుంబ సభ్యులు ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదన్నారు. ఈ భూములు ప్రభుత్వ భూములని వివాదం తలెత్తడంతో సేల్‌డీడ్‌ నుంచి తప్పుకోవాలని కుటుంబ సభ్యులకు సూచించినట్టు చెప్పారు. భూముల కొనుగోలు సొమ్మును వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని విర్గో గ్లోబల్‌ మీడియా లిమిటెడ్‌ను కేకే డిమాండ్‌ చేశారు. తనకు జరిగిన పరువు నష్టానికి పరిహారం చెల్లించాలన్నారు. ఈ మేరకు లీగల్‌ నోటీసులు పంపనున్నట్టు చెప్పారు. 

08:44 - June 15, 2017

హైదరాబాద్ : హైదరాబాద్ మియాపూర్‌ భూకుంభకోణంపై కాంగ్రెస్‌ నేతలు వాయిస్ పెంచారు. మియాపూర్‌కు వెళ్లి భూముల్ని పరిశీలించిన తెలంగాణ హస్తం నేతలు.. ఈ అక్రమాల వెనక సీఎం కేసీఆర్‌ ఉన్నారని ఆరోపించారు. ఈ స్కాంపై సీఎల్‌పీ సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు. 15కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూముల్ని కాపాడటంలో సర్కారు విఫలమైందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. సర్కారు భూముల్ని కాపాడే ప్రయత్నం ప్రభుత్వం ఎందుకు చేయడంలేదని... సీఎల్‌పీ నేత జానారెడ్డి ప్రశ్నించారు. ఈ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.. సర్కారుతీరును ప్రజాకోర్టులో ఎండగడతామన్నారు..భూముల స్కాంపై దూకుడుపెంచిన టీ కాంగ్రెస్‌ నేతలు.. ఈ కుంభకోణంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలని తీర్మానించారు. ఈ కేసులో సీబీఐ విచారణకోరుతూ ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకువెళ్లాలన్న ఆలోచనలో హస్తం నేతలు ఉన్నారు..

 

08:43 - June 15, 2017

గుంటూరు : ఏపీ మంత్రివర్గం ఇవాళ సాయంత్రం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి, నిర్ణయం తీసుకోనున్నారు.

నిరుద్యోగభృతిపై చర్చ...
నిరుద్యోగులకు భృతి చెల్లిస్తామని గత ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామీ అమలుపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేబినెట్‌ అజెండాలో దీనిని ప్రాధాన్యతా క్రమంలో చేర్చినట్టు సమాచారం. నిరుద్యోగ భృతి విధివిధానాలపై చర్చిస్తారు. బడ్జెట్‌లో ఇందుకు 500 కోట్ల రూపాయలు కేటాయించారు. కేరళ, త్రిపుర, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో నిరుద్యోగ భృతి ఏ విధంగా చెల్లిస్తున్నారన్న అంశంపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసే అంశాన్ని మంత్రివర్గం పరిశీలిస్తుంది. వచ్చే ఎన్నికల్లో నిరుద్యోగులను తమవైపు తిప్పుకునేందుకు వీలుగా ప్రభుత్వ ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. రాష్ట్ర ప్రజలందరికీ రక్షిత మంచినీరు అందించాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిని అమలు చేసేందుకు వీలుగా మంచినీటి సరఫరా సంస్థ ఏర్పాటుపై మంత్రివర్గంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులకు రాష్ట్రాన్ని కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ ఎలక్ట్రానిక్స్‌ పాలసీ 2014-2020పై చర్చించి, ఆమోదించే అవకాశం ఉంది.

విశాఖ భూకుంభకోణంపై...
మరోవైపు విశాఖ భూకుంభకోణంపై మంత్రివర్గంలో సమీక్షించే అవకాశం ఉందని భావిస్తున్నారు. విశాఖలోని మధురవాడ, కొమ్మాది ప్రాంతాల్లో 300 ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూములతోపాటు అటవీ భూములు అన్యాక్రాంతమయ్యాయని ప్రభుత్వం గుర్తించింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నేతల హస్తం ఉందని ఆరోపణలు వెల్లువెత్తడంతో చంద్రబాబు సర్కారుతోపాటు, టీడీపీ ప్రతిష్ఠ కొంత మసకబారింది. కుంభకోణం సూత్రధారులు, పాత్రధారుల నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు రెవెన్యూ, న్యాయ, పోలీసు శాఖల అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుకు చంద్రబాబు ఆదేశించారు. దీనిపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

రాష్ట్రంలో జరిగిన నవనిర్మాణ దీక్షలు జరిగిన తీరుతెన్నులను మంత్రివర్గం సమీక్షించే చాన్స్‌ ఉంది. చౌకధరల దుకాణాల ద్వారా రేషన్‌ కార్డులపై అందించే పంచదారపై ఇచ్చే రాయితీని కేంద్రం నిలివేయడంతో ఉత్పన్నమవుతున్న పరిణామాలను చర్చిస్తారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వమే ఈ రాయితీని భరించడంపై చర్చిస్తారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో రిజిస్టరై ఏపీలో తిరుగున్న బస్సులు లైసెన్స్‌ రద్దు, ఏపీ-తెలంగాణ మధ్య తలెత్తిన విద్యుత్‌ బకాయిల వివాదం, అసెంబ్లీలోని జగన్ చాంబర్‌లోకి వర్షం నీరు చేరడం తదితర అంశాలు కేబినెట్‌లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.

మంత్రులు మధ్య విమర్శలు...
మంత్రివర్గ సమావేశానికి ముందుకు ఉండవల్లిలోని సీఎం నివాసంలో టీడీపీ సమన్వయ కమిటీ భేటీ జరుగుతుంది. పార్టీ జిల్లా అధ్యక్షులను ఖరారు చేసే అవకాశం ఉంది. విశాఖ భూ కబ్జాలపై మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు పరస్పరం చేసుకున్న బహిరంగ విమర్శలతో ప్రభుత్వానికి, పార్టీకి జరిగిన నష్టంపై సమన్వయ కమిటీలో చర్చించే అవకాశం ఉంది. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి ఆగ్రహంతో ఉన్నారు. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన టీడీపీ నేత శిల్పా మోహన్‌రెడ్డి వైసీపీలో చేరిన అంశంపై కూడా సమీక్షిస్తారు. అలాగే టీటీడీ చైర్మన్‌ పదవి కోసం ఎంపీలు రాయపాటి సాంబశివరావు, మురళీమోహన్‌, ఎన్టీఆర్‌ తనయుడు హరికృష్ణ చేస్తున్న ప్రయత్నాలు కూడా సమన్వయ కమిటీలో ప్రస్తావనకు రావొచ్చని భావిస్తున్నారు. 

08:41 - June 15, 2017

సిద్దిపేట : కుకునూర్‌పల్లి ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య కేసు విచాణలో ఎవరూ ఊహించని ట్విస్ట్‌ బయటకు వచ్చింది. హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లో ఆత్మహత్య చేసుకున్న బ్యూటీషియన్‌ శిరీషతో ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డికి సంబంధం ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.

శిరీష ఆత్మహత్యకు కారణం..
ఆదివారం నాడు స్నేహితులు శ్రవణ్‌, రాజీవ్‌లతో కలిసి కుకునూర్‌పల్లి వెళ్లిన శిరీష అక్కడ ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డితో కలిసి విందు చేసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఆ సందర్భంగా శిరీషతో ప్రభాకర్ రెడ్డి అసభ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం. దీంతో మ‌న‌స్తాపానికి గురై శిరీష హైద‌రాబాద్‌లో ఆత్మహత్య చేసుకొని ఉంటుంద‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంపై బంజారాహిల్స్ పోలీసులు రెండు రోజులుగా లోతుగా విచారణ జరుపుతున్నారు. రాజీవ్, శ్రవ‌ణ్‌ల‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారం అంతా బయటకు వస్తుందన్న ఉద్దేశంతోనే ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మరోవైపు ప్రభాకర్‌ రెడ్డి తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై డీజీపీ అనురాగ్‌ శర్మ ఆరా తీశారు. ఉన్నతాధికారుల వేధింపుల వల్లే ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారనే ఆరోపణలు విన్పిస్తుండటంతో..ఈ ఘటనను ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు అత్యవసరంగా భేటీ అయ్యారు. అదనపు డీజీ గోపీకృష్ణ, ఇంటెలిజెన్స్‌ ఐజీ నవీన్‌చంద్‌తో డీజీపీ చర్చించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అదనపు డీజీని అనురాగ్‌ శర్మ ఆదేశించారు. ఉన్నతాధికారులు మామూళ్ల కోసం వేధించారన్న కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. అన్ని కోణాల్లో విచారణ జరపాలని అదనపు డీజీ గోపీకృష్ణ, హైదరాబాద్ ఐజీ స్టీఫెన్ రవీంద్రను డీజీపీ అనురాగ్ శర్మ ఆదేశించారు. అదనపు డీజీ గోపీకృష్ణ సిద్ధిపేట జిల్లాకు వెళ్లారు. ఏసీపీ గిరిధర్ ను బాధ్యతలను తప్పించి.. డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు.

ఉన్నతధికారుల వేధింపులు
అయితే ఉన్నతాధికారుల వేధింపుల వల్లే ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన బ్యూటీషియన్‌ శిరీషతో సంబంధాన్ని అంటగట్టడాన్ని తప్పుపడుతున్నారు. సిద్దిపేట పోలీసు కమిషనర్‌ శివశంకర్‌, గ‌జ్వేల్‌ ఏసీపీ గిరిధర్‌ను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనకు దిగారు. ఇద్దరిపై చర్యలు తీసుకున్నాకే ఎస్సై మృతదేహాన్ని తరలించాలని గ్రామస్థులు పట్టుబట్టారు. ఆత్మహత్యకు కార‌ణాల‌ను వివ‌రిస్తూ ఎస్సై రాసిన లేఖ‌ను బ‌హిర్గతం చేయాల‌ని గ్రామ‌స్థులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో గజ్వేల్‌ ఏసీపీ గిరిధ‌ర్‌‌ను డీజీపీ కార్యాలయానికి అటాచ్‌ చేస్తూ బదిలీ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్యకు బాధ్యులైన ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్థులు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో కుకునూర్‌పల్లిలో పోలీసులు భారీగా మోహరించారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, తెదేపా నేత ప్రతాప్‌ రెడ్డి, కలెక్టర్‌ వెంకటరామిరెడ్డి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎస్‌ఐ ఆత్మహత్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎస్సై కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. కుకునూరుపల్లి పీఎస్‌కు వచ్చిన ఎస్సై ప్రభాకర్‌రెడ్డి భార్య రచన..కేసును తప్పుదోవ పట్టించేందుకు పోలీసు ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బ్యూటీషియన్‌ శిరీషతో తన భర్తకు సంబంధం లేదన్నారు. పూర్తిగా నిర్ధారణ అయ్యే వరకు భర్త మృతదేహాన్ని తీసుకెళ్లనని రచన తేల్చిచెప్పారు.

2012లో ఎస్ఐగా ప్రభాకర్ రెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం టంగుటూరుకు చెందిన ప్రభాకర్‌రెడ్డి 2012లో ఎస్‌ఐగా ఎంపికయ్యారు. 2016 ఆగస్టు 26న ఆయన కుక్కునూరుపల్లి పీఎస్‌లో ఎస్‌ఐగా విధుల్లో చేరారు. గతంలో ఆయన మల్కాజ్‌గిరి, శామీర్‌పేట, కౌడిపల్లి పోలీస్‌స్టేషన్లలో పనిచేశారు... కుక్కునూరుపల్లి పోలీస్‌స్టేషన్‌లో పది నెలల్లో ఇద్దరు ఎస్‌ఐలు ఆత్మహత్యకు పాల్పడటం పోలీస్‌శాఖలో చర్చనీయాంశమైంది. 2016, ఆగస్టు 16న ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన స్థానంలో ప్రభాకర్‌రెడ్డి అదేరోజు విధుల్లో చేరారు. రామకృష్ణారెడ్డి ఆత్మహత్య చేసుకున్న గదిలోనే ప్రభాకర్‌రెడ్డి కూడా బలవన్మరణానికి పాల్పడటం గమనించదగ్గ విషయం. 

నేడు టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం

గుంటూరు : నేడు అమరావతిలో ఉదయం 10 గంటలకు టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది. సమావేశానికి మంత్రులు, జిల్లా పార్టీ నేతలు హాజరు కానున్నారు. 

నేడు విజయవాడ హౌరా హమ్ సఫర్ ఎక్స్ ప్రెస్ ప్రారంభం

విజయవాడ : నేడు విజయవాడ హౌరా మధ్య హమ్ సఫర్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభం కానుంది. మధ్యాహ్నాం 12.30 రైల్వే మంత్రి జెండా ఊపి ప్రారంభించనున్నారు.

నేడు గవర్నర్ ను కలవనున్న కాంగ్రెస్ నేతలు

హైదరాబాద్ : నేడు ఉదయం 11గంటలకు గవర్నర్ ను కాంగ్రెస్ నేతల సమావేశం కానున్నారు. కాంగ్రెస్ నేతలు మియాపూర్ భూ కుంభకోణం ఫిర్యాదు చేయనున్నారు. 

Don't Miss