Activities calendar

16 June 2017

21:52 - June 16, 2017

హైదరాబాద్: బిహార్‌లో పర్యటనలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ బుల్లెట్‌ ప్రూఫ్‌ గ్లాస్‌ వెనకాల నిల్చుని మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. దర్బంగాలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో యోగి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బుల్లెట్‌ ప్రూఫ్‌ గ్లాస్‌ వెనుక ఏర్పాటుచేసిన పోడియం వద్ద నుంచి ప్రసంగించారు. దర్బంగాలో ఉగ్రవాద సంస్థ ఇండియన్‌ ముజాహిదీన్‌కు మొదటి నుంచి పట్టు ఉండడంతో పోలీసులు ముందు జాగ్రత్తగా ఈ చర్య చేపట్టారని సమాచారం. ఉగ్రవాది యాసిన్‌ భత్కల్‌ చాలా రోజుల పాటు దర్బంగా నుంచే తన కార్యకలాపాలను కొనసాగించాడు. యూపీ సిఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా యోగి ఆదిత్యనాథ్‌ బిహార్‌లో పర్యటించారు. నితీష్‌-లాలూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

21:50 - June 16, 2017

హైదనాబాద్ : జైలు నుంచి పెరోల్‌ మీద బయటకు వచ్చిన ఓ సాధ్వి సినీఫక్కీలో తప్పించుకున్నారు. దర్జాగా ఓ మాల్‌లో మసాజ్‌ చేయించుకుని.... బాహుబలి-2 సినిమా చూసి ఎంజాయ్‌ చేశారు. ఇక తనకు పెరోల్‌ రాదని తెలుసుకున్న సాధ్వి- పోలీసుల కళ్లు గప్పి ఉడాయించారు. గుజరాత్‌లో జరిగిన ఈ ఘటన సిసిటివి కెమెరాలో రికార్డయింది.

45 ఏళ్ల జయశ్రీ గిరి సాధ్విగా

గుజరాత్‌లోని బన్సకంత జిల్లాకు చెందిన 45 ఏళ్ల జయశ్రీ గిరి సాధ్విగా అవతరించారు. పేరుకు మాత్రమే ఆమె సాధువు...ఆమె లైఫ్‌ స్టయిల్‌ మాత్రం పాశ్చాత్య పోకడలను తలపిస్తుంది. జువలరీ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సాధ్వి జయశ్రీ మెడికల్‌ చెకప్‌ పేరిట పెరోల్‌పై బయటకు వచ్చారు. మెడికల్‌ చెకప్‌ కోసం పోలీసులు హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అయితే తనను బయటకు తీసుకెళ్లాలని పోలీసులను వేడుకోవడంతో మాల్‌కు తీసుకెళ్లారు. మెడికల్‌ చెకప్ ముగిసాక...మాల్‌లో ఉన్న స్పాకు వెళ్లి సాధ్వి దర్జాగా మసాజ్‌ చేయించుకున్నారు. ఆ తర్వాత బాహుబలి-2 సినిమా చూశారు. ఈలోపు బెయిల్‌ గురించి తన లాయర్‌తో ఫోన్‌లో మాట్లాడుతున్నారు. తనకు బెయిల్‌ రాదని తెలుసుకున్న జయశ్రీగిరి పోలీసుల కళ్లు గప్పి పారిపోయారు.

సిసిటీవీలో రికార్డ్‌ ...

మాల్‌లో జరిగిన ఈ ఘటన సిసిటీవీలో రికార్డ్‌ అయింది. జయశ్రీగిరితో ఉన్న నలుగురు పోలీసులతో పాటు ఆమెకు సహకరించిన ఇద్దరు లాయర్లను ఉన్నతాధికారులు అరెస్ట్‌ చేశారు. జయశ్రీని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఓ జువలరీ షాపులో 5 కోట్ల విలువ చేసే ఆభరణాలు

జయశ్రీగిరి సాధ్వి గత ఏడాది నవంబర్‌లో ఓ జువలరీ షాపులో 5 కోట్ల విలువ చేసే ఆభరణాలు తీసుకుని బిల్లు ఎగ్గొట్టారు. ఈ కేసుకు సంబంధించి సాధ్విని ఈ ఏడాది జనవరిలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. సాధ్వి ఆశ్రమంపై దాడి చేయగా పెద్ద ఎత్తున నగదు, బంగారం, మద్యం బాటిళ్లు లభించాయి. 24 బంగారం బిస్కిట్లను స్వాధీనం చేసుకున్నారు.

21:43 - June 16, 2017

హైదరాబాద్: జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. గస్తీ బృందంపై విచక్షణారహితంగా కాల్పులకు తెగడబడంతో స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్‌హెచ్ఓ సహా ఆరుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో జీపు డ్రైవరు, నలుగురు పోలీసులు కూడా ఉన్నారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. అచబల్ టౌన్‌లో ఈ దాడి చోటుచేసుకుంది. 15 మంది ఉగ్రవాదులు ఈ దాడులో పాల్గొన్నట్టు తెలుస్తోంది. దాడికి పాల్పడింది తామేనని లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. దాడి అనంతరం పారిపోయిన ఉగ్రవాదుల కోసం పోలీసులు ముమ్మర గాలింపు జరుపుతున్నారు. ఉగ్రవాదులు పారిపోతూ భద్రతా సిబ్బంది ఆయుధాలు ఎత్తుకెళ్లారు

21:42 - June 16, 2017

ఢిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై ఏకాభిప్రాయం కోసం బిజెపి ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటి వివిధ పార్టీలతో సంప్రదింపులు జరుపుతోంది. ఇందులో భాగంగా కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, రాజ్‌నాథ్‌సింగ్‌లు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు గులాంనబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే కూడా పాల్గొన్నారు. దాదాపు అరగంటసేపు నేతలు చర్చలు జరిపారు. బిజెపి నేతలు రాష్ట్రపతి అభ్యర్థి పేరు వెల్లడించకుండా ఏకాభిప్రాయానికి వచ్చే ప్రసక్తే లేదని కాంగ్రెస్‌ స్పష్టం చేసింది. తమ పార్టీ తరపున ఎవరి పేరును సూచించలేదని ఆజాద్‌ తెలిపారు. విపక్ష పార్టీలన్ని కలిసి అభ్యర్థి ఎంపికపై తుది నిర్ణయం తీసుకుంటాయని ఖర్గే చెప్పారు.

ఏచూరితోనూ అభ్యర్థి ఎంపికపై చర్చలు..

అనంతరం కేంద్రమంత్రులు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితోనూ అభ్యర్థి ఎంపికపై చర్చించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతివ్వాలని కోరిన బిజెపి- ఏ పేరును తమవద్ద ప్రస్తావించలేదని ఏచూరి చెప్పారు. రాజ్యాంగ విలువలు కాపాడే వ్యక్తి రాష్ట్రపతిగా ఉండాలని బిజెపి నేతలకు సూచించినట్లు ఏచూరి తెలిపారు. అభ్యర్థి ఎవరన్నది తెలపకుండా సహకరించమంటే ఎలా అని ప్రశ్నించారు.

అరుణ్‌జైట్లీలతో త్రిసభ్యకమిటీ ఏర్పాటు చేసింది.

రాష్ట్రపతి అభ్యర్థిపై ఏకాభిప్రాయానికి వచ్చేలా బీజేపీ ముగ్గురు అగ్రనేతలు రాజ్‌నాథ్‌సింగ్, వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీలతో త్రిసభ్యకమిటీ ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఈ కమిటీ బీఎస్పీ, ఎన్సీపీ, డీఎంకే తదితర పార్టీలతో చర్చలు జరిపింది. ఎన్డీయే అభ్యర్థిపై స్పష్టత వచ్చే వరకు మద్దతుపై ఆలోచించబోమని ప్రతిపక్ష పార్టీలు తెగేసి చెబుతున్నాయి.

21:35 - June 16, 2017

తూ.గో : విశాఖ భూ కుంభకోణంపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సిట్‌ విచారణతో వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయన్నారు. దోషులు ఎంతటివారైనా శిక్ష తప్పదన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరిగిన సబ్‌ కా సాత్‌ - సబ్‌ కా వికాస్‌ సదస్సులో ఆయన పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం గత మూడేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. 

21:33 - June 16, 2017

జగిత్యాల: సీఎం కేసీఆర్ చండీయాగ ప్రభావంవల్లే రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడుతున్నాయని... ఎంపి కవిత అన్నారు.. జమీన్‌ బందీ కార్యక్రమంతో రెవెన్యూ సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు.. జగిత్యాల జిల్లాలో కవిత పర్యటించారు.. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.. కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.. 

21:32 - June 16, 2017

అమరావతి: తెలంగాణ ప్రభుత్వం ఏపీకి చెల్లించాల్సిన విద్యుత్‌ బకాయిలపై కేంద్ర హోంశాఖకు లేఖ రాస్తామని ఏపీ విద్యుత్‌శాఖ మంత్రి కళా వెంకట్రావు అన్నారు. విభజన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్‌ బకాయిలకు సంబంధించిన అంశాలను లేఖలో పేర్కొంటామన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న విద్యుత్‌ వివాదం నేపథ్యంలో.. ఆయన సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. మూడువేల కోట్ల విద్యుత్‌ బకాయిలు తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సి ఉందన్నారు. తెలంగాణ బకాయిల అంశాన్ని గవర్నర్‌ దగ్గర జరిగే మీటింగ్‌లోనూ లేవనెత్తుతామన్నారు. 

21:23 - June 16, 2017

హైదరాబాద్: సింగరేణి కార్మికుల సమ్మె విజయవంతంగా సాగుతోంది. వారసత్వ ఉద్యోగ ప్రక్రియ కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ... కార్మికులు చేపట్టిన సమ్మె రెండో రోజుకు చేరుకుంది. పలు ప్రాంతాల్లో కార్మికులు నిరసన కార్యక్రమాలు చేపట్టగా... కార్మిక నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

స్వచ్ఛందంగా విధులు బహిష్కరించి..

జాతీయ సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు కార్మికులు స్వచ్ఛందంగా విధులు బహిష్కరించి.. సమ్మెలో పాల్గొంటున్నారు. జయశంకర్‌ భూపాలపల్లిలోని సింగరేణి కార్మికులు సమ్మె విజయవంతంగా సాగుతోంది. ఈ ఏరియాలో 6 వేల 400 మంది కార్మికులుండగా.. అత్యవసర సిబ్బంది మినహా కార్మికులు ఎవరూ విధులకు హాజరు కాలేదు. అలాగే పెద్దపల్లి జిల్లా.. గోదావరిఖనిలో... భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు.

కార్మిక నాయకులను పోలీసులు అదుపులోకి

సమ్మెలో భాగంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కార్మిక నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెద్దపల్లి జిల్లాలో కార్మికుల ఆందోళనకు మద్దతు తెలపడానికి వెళ్లిన కార్మిక సంఘాల నాయకులను వన్‌టౌన్‌ సీఐ అరెస్ట్ చేశారు. అలాగే గనుల వద్దకు వెళ్తున్న వారిని అడ్డుకున్నారు. అలాగే కొత్తగూడెం ఏరియాలో జాతీయ సంఘాలకు చెందిన 35 మంది కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సమస్యలు పరిష్కరించాలని కోరితే ప్రభుత్వం అరెస్టులతో భయపెడుతోంది...

సమస్యలు పరిష్కరించాలని కోరితే ప్రభుత్వం అరెస్టులతో భయపెడుతోందని కార్మికులు మండిపడుతున్నారు. వారసత్వ ఉద్యోగాలపై సీఎం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఐదు జాతీయ కార్మిక సంఘాలు సమ్మెను కొనసాగిస్తాయని తేల్చి చెప్పారు. కాగా ..కార్మికులు విధులకు హాజరుకాకపోవడంతో...బొగ్గు బావులు వెలవెలపోయాయి. సమ్మె కారణంగా భారీగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 

21:21 - June 16, 2017

హైదరాబాద్: ప్రభుత్వానికి రైతు క్షేమం కన్నా అధిక ప్రాధాన్యత కలిగిన అంశం మరొకటి లేదన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడుతున్నారని, వారికి సాగునీరు అందివ్వడం ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమన్నారు. లిఫ్టులకు అయ్యే కరెంటు బిల్లును నీటి పారుదల శాఖ ద్వారా చెల్లించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎత్తిపోతల పథకాలకు ఎలాంటి విద్యుత్ సమస్య లేకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.

నీటిపారుదల, విద్యుత్‌ శాఖలపై సీఎం సమీక్ష

సచివాలయంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు నీటిపారుదల, విద్యుత్‌ శాఖలపై సమీక్ష నిర్వహించారు. నీటి పారుదల ప్రాజెక్టులకు రీ డిజైనింగ్ చేస్తున్న క్రమంలోనే, లిఫ్టుల నిర్వహణకు ఎంత విద్యుత్ అవసరమవుతుందనే అంశంపై సీఎం అంచనాలు రూపొందించారు. పంప్ హౌజ్‌ల నిర్మాణం జరిగే లోపు విద్యుత్ సరఫరా ఏర్పాట్లు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం, పాలమూరు, సీతారామ ప్రాజెక్టులు పూర్తయితే... మిగతా ప్రాజెక్టులకు కలిపి 11,500 మెగావాట్ల విద్యుత్ అవసరమని విద్యుత్ శాఖ అంచనా వేసింది. ఇప్పటివరకు జరిగిన పనులు, భవిష్యత్‌ కార్యాచరణ నివేదికను సీఎం కేసీఆర్‌కు ట్రాన్స్‌కో సిఎండి ప్రభాకర్ రావు అందించారు. 2020 నాటికి వ్యవసాయానికి కావాల్సిన విద్యుత్‌ను ఉత్పత్తి చేయడంతో పాటు.. నిరంతరాయంగా సరఫరా చేసేందుకు సిద్ధమన్నారు.

6,000 కోట్లతో కొత్త సబ్‌ స్టేషన్లు, లైన్లు

మొత్తం లిఫ్టులకు 11,500 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేసేందుకు 6వేల కోట్లు ఖర్చవుతుందని... ఈ వ్యయాన్ని నీటి పారుదల శాఖ ద్వారా సేకరించనుంది. నిర్మాణ, నిర్వహణ బాధ్యతలు ట్రాన్స్‌కో చూస్తోంది. ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయిన తర్వాత ఏటా వాటి నిర్వహణకు 10వేల కోట్ల కరెంటు బిల్లు వస్తుందని అంచనా వేశారు. 2020 నాటికి తెలంగాణ బడ్జెట్ 2 లక్షల కోట్లు దాటుతుందని.. వీటిలో లిఫ్టులకు 10 వేల కోట్లు, ఉచిత విద్యుత్తుకు ఆరేడు వేల కోట్లు వెచ్చించేందుకు సిద్దంగా ఉన్నామని సిఎం వెల్లడించారు. ఎత్తిపోతల ప్రాజెక్టుల కోసం అత్యధిక సామర్థ్యం కలిగిన మోటార్లు వాడాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం గరిష్టంగా 139 మెగావాట్ల ఇంజన్లు వాడుతున్నట్లు తెలిపారు. బి.హెచ్.ఇ.ఎల్.కు మోటార్ల తయారీ బాధ్యత అప్పగించారు.

ప్రస్తుతం ఎత్తిపోతల ప్రాజెక్టులకు 1263 మెగావాట్ల విద్యుత్‌

ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని లిఫ్టులకు కలిపి 1263 మెగావాట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. రాబోయే కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు 4,600 మెగావాట్లు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు 4,000 మెగావాట్లు, సీతారామ ప్రాజెక్టుకు 690 మెగావాట్ల విద్యుత్..మిగతా ప్రాజెక్టులు కలిపి 11,500 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుందని విద్యుత్‌ శాఖ అంచనా వేసింది. 

21:18 - June 16, 2017

అమరావతి: రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వ ప్రాధాన్యత ఇస్తోందని... సీఎం చంద్రబాబు చెప్పారు.. ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న రుణమాఫీ పథకానికి సహకారం అందించాలని బ్యాంకర్లకు సీఎం విజ్ఞప్తి చేశారు.. ఈ ఏడాది మంచి వర్షాలు కురుస్తున్నాయని.. ఖరీఫ్‌లో ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని భావిస్తున్నామని చెప్పారు..

వార్షిక రుణ ప్రణాళిక 1,66,806 కోట్లు

అమరావతిలో ఏపీ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశమైంది.. ఇందులో 2017-18 రుణ ప్రణాళికను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు... కోటి 66లక్షల 806 కోట్లుగా వార్షిక రుణ ప్రణాళిక ప్రకటించారు... ఇది గత ఏడాదికంటే 14.4శాతం ఎక్కువని సీఎం చెప్పారు.. చిత్తంఉన్నా విత్తం ఉండాలని.... ఏ రంగానికైనా డబ్బులు చాలా ముఖ్యమని స్పష్టం చేశారు..

ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం

తమ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోందని చంద్రబాబు చెప్పారు.. ఇందుకు సంబంధించిన కార్యక్రమానికి సుభాష్ పాలేకర్‌ను సలహాదారుగా నియమించామని గుర్తుచేశారు.. అమరావతిలో ప్రకృతి వ్యవసాయ యూనివర్శిటీ నెలకొల్పుతామని ప్రకటించారు.. వ్యవసాయ అభివృద్ధికి అయోవా యూనివర్శిటీతో ఒప్పందం కుదుర్చుకున్నామని ప్రకటించారు.. వ్యవసాయశుద్ది పరిశ్రమలకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.. మేలురకమైన విత్తనాల అభివృద్ధికి కర్నూలులో మెగాసీడ్‌ పార్క్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు..

వర్షం అంచనాల్లో 85శాతం కచ్చితత్వాన్ని సాధించాం

రెండు, మూడు రోజుల్లో వర్షం కురుస్తుందనే అంచనాల్లో 85శాతం కచ్చితత్వాన్ని సాధించామని చంద్రబాబు చెప్పారు.. 8నుంచి 10రోజుల్లో వర్షాలు కురుస్తాయన్న అంచనాల్లో 70శాతం కచ్చితత్వాన్ని సాధించామని తెలిపారు.. పాంట్రిక్స్‌ యాప్‌తో మొక్కలకు ఏర్పడిన తెగుళ్లను గుర్తించి ముందస్తు నివారణ చర్యలు తీసుకుంటున్నామని వివరించారు..

రైతులకు రెట్టింపు ఆదాయానికి పథకాలు, ప్రణాళికలు

ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని బ్యాంకర్ల సమావేశంలో అధికారులకు చంద్రబాబు సూచించారు. వ్యవసాయరంగంలో సమూల సంస్కరణలు రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ప్రకటించారు... రైతులకు రెట్టింపు ఆదాయానికి పథకాలు, ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు బ్యాంకులు సహకరించాలని కోరారు. ఉద్యానవన పంటలు, పశుగణాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని అధికారులకు సీఎం వివరించారు... రాయలసీమలో రెయిన్ గన్స్‌తో కరవుపై యుద్ధం చేసిన విషయాన్ని అధికారులకు గుర్తు చేశారు. కౌలు రైతులకు ఉదారంగా రుణాలు ఇవ్వాలని బ్యాంకు అధికారులకు సూచించారు. రైతులకు మరింత మేలు జరిగేలా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

20:36 - June 16, 2017

హైదరాబాద్: నోటికి అడ్డూ అదుపూ ఉండదు...బండబూతులు తిడతారు.,కోపం వస్తే కాళ్లూ చేతులు కూడా ఆడిస్తారు. కంట్రోలు ఉండదు. తాము ప్రజా ప్రతినిధులమని కాదు.. అంతకన్నా ముందు మనుషులమనే సంగతి కూడా మర్చిపోతారు. ఆకాశం నుండి ఊడిపడ్డామని భ్రమపడతారు. అంతిమంగా ప్రజా ప్రతినిధులు ఎలా ఉండకూడదో అలానే తయారు అవుతున్నారు. ఒకరు కాదు ఇద్దరు... ప్రతి రాష్ట్రంలో ఇలాంటి నేతలు కొన్ని రాజకీయ పార్టీ కనిపిస్తున్న దురదృష్టకర పరిస్థితి. ఇదే అంశం పై నేటి వైడాంగిల్ స్టోరీ. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

20:06 - June 16, 2017

హైదరాబాద్: హన్మంతన్న బ్రాస్ లెట్ అర్రాసుపాట...20 లక్షల రూపాయలు జమైనట, 30 వేల మందికి ఓ మద్యం షాపు...మరి అదే జనాభాకు మంచినీళ్లు వద్దా బాబూ, గాలిమోటరోనితో జేసీదివాకర్ పంచాయతీ...ఇండిగో ఆఫీసు మీద ప్రింటర్ మీద ప్రతాపం, సింగరేణిలో మోగుడు ఆగిన సమ్మె సైరన్... సమ్మెను విచ్చగొట్టేటందుకు సర్కార్ కుట్ర, బీడీలు చేసే అమ్మలక్కల నోట్లో కేంద్రం మన్ను.....బీడీ కట్టల మీద 28 శాతం పన్ను, ప్రైవేటు బడికి పంపితే 50వేల జరిమానా...సర్కార్ బడి ప్రగతికి ఊరోళ్ల తీర్మానం.. ఇంకా అనేక అంశాలతో 'మల్లన్న ముచ్చట్లు' కార్యక్రమంలలో మల్లన్న మన ముందుకు వచ్చాడు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

19:53 - June 16, 2017

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన శిరీష అనుమానాస్పద మృతి కేసు మిస్టరీ వీడింది. శిరీష మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తేల్చారు. ఆమెది హత్యకాదని... ఆత్మహత్యేనని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి తెలిపారు. ఈ కేసులో ఏ-1గా శ్రావణ్‌, ఏ-2గా రాజీవ్‌ను నిందితులుగా చేర్చామన్నారు. శిరీష, శ్రావణ్‌, రాజీవ్‌ కలిసి సిద్దిపేట జిల్లాలోని కుకునూర్‌పల్లి వెళ్లారని చెప్పారు. ఆ రాత్రి శిరీషతోపాటు రాజీవ్‌, శ్రావణ్‌, ఎస్సై ప్రభాకర్‌రెడ్డి మద్యం సేవించారన్నారు. అనంతరం ఒంటరిగా ఉన్న శిరీషపట్ల ఎస్సై అసభ్యకరంగా ప్రవర్తించారని.. శ్రావణ్‌, రాజీవ్‌లు తమ విచారణలో తెలిపారన్నారు. ఎస్సై చేష్టలతో అవాక్కైన శిరీష మనస్తాపం చెందిందని.. ఒక్కసారిగా ఆమె పెద్దగా అరవడంతో బయట ఉన్న రాజీవ్‌, శ్రావణ్‌ లోనికి వచ్చారన్నారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత శిరీష మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్టు తేల్చారు. ఇదే అంశంపై 'హెడ్ లైన్ షో'లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో సామాజిక కార్యకర్త దేవి, డాక్టర్ సైక్రియాటిస్టు జవహర్ లాల్ నెహ్రూ, మాజీ ఏసీబీ రెడ్డన్న పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

 

టిడిపి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డికి బెయిల్

హైదరాబాద్: భూ కబ్జా కేసులో ఏపీ టిడిపి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. చెంచల్ గూడ జైల్ నుంచి విడుదలయ్యారు.

ఎదురు కాల్పుల్లో కమాండర్ మహేష్ మృతి

చత్తీస్ గఢ్ : బస్తర్ లో మావోయిస్టులపై కాల్పులు జరిగాయి. ఎస్పీఎఫ్, డీఆర్ వీ సంయుక్త కాల్పుల్లో హిట్ విభాగానికి చెందిన కమాండర్ మహేష్ మృతి చెందాడు. మహేష్ మృతితో మావోయస్టులకు భారీ నష్టం జరిగింది. దాదాపు 3 గంటల పాటు ఎదురు కాల్పులుజరిగాయి. కాల్పుల్లో 8 నుంచి 10 మంది మావోయిస్టులు మృతి చెంది ఉంటారని బస్తర్ ఐజీ వివేకానంద సిన్హా పేర్కొన్నారు. సంఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు లభ్యం అయ్యాయి.

కర్నూలు జిల్లా నేతలకు చంద్రబాబు కబురు

అమరావతి: కర్నూలు జిల్లా నేతలకు చంద్రబాబు కబురు పెట్టారు. రేపు అమరావతికి రావాలని జిల్లా నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లాకు చెందిన మంత్రలు, ఎంపి, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల ఇంఛార్జ్లు రావాలని ఆదేశించారు. నంద్యాల ఉప ఎన్నిక, నేతల మధ్య సమన్వం లోపం పై సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు.

19:05 - June 16, 2017

కర్నూలు: జిల్లా టీడీపీలో మరోసారి కలకలం రేగింది. మంత్రి భూమా అఖిలప్రియ వైఖరిపై ఏవీ సుబ్బారెడ్డి తిరుగుబాటు చేశారు. కర్నూల్లో టీడీపీ కౌన్సిలర్లతో అత్యవసభేటీ నిర్వహించారు. పార్టీ కార్యక్రమాల్లో తమను పట్టించుకోవడం లేదని మంత్రి అఖిలప్రియపై ఏవీ సుబ్బారెడ్డి మండిపడుతున్నారు. జిల్లా ఇంచార్జ్‌ మంత్రులు సుజనాచౌదరి, కాల్వశ్రీనివాసులు నుంచి ఫోన్‌ రావడంతో సుబ్బరారెడ్డి విజయవాడకు బయలుదేరి వెళ్లారు. ఇప్పటికే అఖిలప్రియ వర్గంతో పొసగని శిల్పా మోహన్‌రెడ్డి వైసీపీ కండువా కప్పుకున్నారు. తాజాగా ఏవీ సుబ్బారెడ్డి తిరుగుబాటు ఏమలుపు తీసుకుంటుందోనని టీడీపీ క్యాడర్‌ ఆందోళన పడుతోంది. 

19:01 - June 16, 2017

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు 2017-18 వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించారు. ఇవాళ బాబు అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం 2017-18 గాను రూ.1,66,806 కోట్లుగా వార్షిక రుణ ప్రణాళిక ప్రకటించారు.ఇందులో ప్రాధాన్యతారంగాలకు లక్షా 26వేల 806 కోట్లు, ప్రాధాన్యేతర రంగాలకు 40వేల కోట్ల రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సమావేశంలో అధికారులకు ఆయన సూచించారు. వ్యవసాయరంగంలో సమూల సంస్కరణలు రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని చంద్రబాబు పేర్కొన్నారు. రైతుకు రెట్టింపు ఆదాయానికి అనేక పథకాలు, ప్రణాళికలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రైతుల జీవన ప్రమాణాల మెరుగుదలకు బ్యాంకులు సహకరించాలని కోరారు. రైతులతో పాటు... కౌలు రైతులకు ఉదారంగా రుణాలు ఇవ్వాలని .. అన్నదాతలకు మరింత మేలు జరిగేలా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 

18:58 - June 16, 2017

ప్రకాశం :రైతుల సంక్షేమంకోసం ఏపీ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోందని... మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక మూడేళ్లలో రైతులు సకాలంలో పంటలు పండిస్తున్నారని తెలిపారు. ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో దేవినేని పర్యటించారు. 164కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేశారు. రోంపేరు బ్రిడ్జిని ఆరు నెలల్లో పూర్తిచేస్తామని ప్రకటించారు.. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నేతలు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు..

18:55 - June 16, 2017

హైదరాబాద్: ఉద్యోగాల కోసం... చదువుల కోసం.. ఇంటర్వ్యూలు జరగడం చూశాం... కానీ ప్రజాప్రతినిధులకు ఇంటర్వ్యూలు చేస్తోది ఆ పార్టీ. అదేంటి ప్రజాప్రతినిధులకు ఇంటర్వ్యూలు ఏంటా అనుకుంటున్నారా? అవును ఇది నిజం.. ఏపీ విపక్ష వైసీపీ.. తమ ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ ఆధ్వర్యంలో ఈ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి.

రాజకీయ పార్టీలకు పాకిన ఇంటర్వ్యూల కల్చర్‌

కంపెనీలు, సంస్థల్లో ఉద్యోగ, ఉపాధి కల్పనకు ఇంటర్వ్యూలు నిర్వహించడం సహజం.. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూల కల్చర్‌ రాజకీయ పార్టీలకు పాకినట్టుంది. ఇటీవల కాలంలో జనసేన పార్టీ కార్యకర్తల కోసం.. పరీక్షలు.. ఇంటర్వ్యూలు చేయగా.. తాజాగా వైసీపీ ఏకంగా తమ ఎమ్మెల్యేలకే ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ అనుసరిస్తున్న వ్యూహంలో భాగంగానే ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.

గెలుపు కోసం ప్రణాళికతో ముందుకు వెళ్తున్న జగన్‌

వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ అధినేత జగన్‌ పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ సలహాలు, సూచనలను కచ్చితంగా అమలు పరుస్తున్నారు. ఇప్పటికే ప్రశాంత్‌ కిషోర్ బృందం... నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, కో-ఆర్డినేటర్ల నేతల పనితీరుపై సర్వే ప్రారంభించింది. గ్రామాల్లో పర్యటించి... అభ్యర్థుల పనితీరు.. గెలుపు..ఓటమిలపై పరిశీలన మొదలుపెట్టింది. ప్రజా సమస్యలపై వైసీపీ చేస్తున్న పోరాటాలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. దీంతో పాటు ఐఐటీ ఖరగ్‌పూర్‌ విద్యార్థులతో వివిధ కోణాల్లో ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకూ 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలకు ఈ ఇంటర్వ్యూలు నిర్వహించినట్టు సమాచారం. ముఖ్యంగా నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి... ఎటువంటి అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఎమ్మెల్యేల బలాలేంటి.. బలహీనతలేంటి అనే అంశాలపై ప్రధానంగా ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.

విజయతీరాలకు చేర్చిన ఖ్యాతి ప్రశాంత్‌ కిశోర్‌కు

బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలను తన ఎన్నికల వ్యూహాలతో విజయతీరాలకు చేర్చిన ఖ్యాతి ప్రశాంత్‌ కిశోర్‌కు ఉంది. అందుకే, ఈసారి గెలుపుకోసం.. జగనమోహన్‌రెడ్డి ఆయన సలహాలు, వ్యూహాలను అనుసరిస్తున్నారు. మరి రాష్ట్రంలో ప్రశాంత్‌కిశోర్‌ సర్వేలు, ఇంటర్వ్యూలు జగన్‌కు ఏమేరకు సహకరిస్తాయో వేచి చూడాలి. 

18:54 - June 16, 2017

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లోనే అతిపెద్ద దేవాలయంగా ఉన్న విజయవాడ కనకదుర్గ దేవస్థానంలో అవినీతి, అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. తాత్కాలిక రాజధానిగా విజయవాడను ప్రకటించిన తరువాత దుర్గగుడికి విఐపీలతో పాటు భక్తుల తాకిడీ పెరిగింది. అదే స్థాయిలో దుర్గగుడిలో అవినీతి, అక్రమాలూ పెచ్చుమీరిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఆలయంలో అవినీతి అక్రమాలకు చెక్‌ పెట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం ఏకంగా, ఈవోగా ఐఏఎస్‌ అధికారి సూర్యకుమారిని నియమించింది. గాడి తప్పిన పరిపాలననను ఈవో సూర్యకుమారి ఆమె కొలిక్కి తీసుకువస్తారని అంతా భావించారు. అందుకు భిన్నంగా సూర్యకుమారి పాలనలో దుర్గగుడి విరుస వివాదాలకు కేంద్ర బిందువుగా మారిపోయింది.

ఆధునికీకరణ పేరుతో రూ.కోట్లు స్వాహా చేశారన్న ఆరోపణలు

సూర్యకుమారి ఈవోగా బాధ్యతలు చేపట్టాక దుర్గగుడి పూర్తిగా వాణిజ్యమయం అయ్యిందని.. సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం ఖరీదైన వ్యవహారంగా మారిందనే విమర్శలున్నాయి. ఆధునికీకరణ పేరుతో భక్తులు ఇచ్చిన కోట్లాది రూపాయల డిపాజిట్లను అధికారులు కరిగించేసారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ పనుల విషయంలో కొందరు ఉన్నతాధికారుల జేబుల్లోకి భారీ ఎత్తున కమీషన్లు చేరినట్లు సమాచారం. ఈ ఆరోపణలపై ఇప్పటికే విజిలెన్స్ అధికారులు విచారిస్తున్నారు. ఇదే తరుణంలోనే, ఆలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ.. కొందరు సిబ్బంది, పలువురు నిరుద్యోగుల నుంచి లక్షలాది రూపాయలు దండుకున్న వైనం తాజాగా వెలుగు చూసింది. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు దుర్గగుడి సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొందరిని స్టేషన్‌కు పిలిచి విచారిస్తున్నారు.

పోలీసుల దర్యాప్తులో కొత్త అంశాలు

నకిలీ ఉద్యోగాల వ్యవహారంపై విజయవాడ వన్ టౌన్ పోలీసులు జరుపుతున్న దర్యాప్తులో కొత్త అంశాలు బయటపడుతున్నాయి. ఆలయానికి చెందిన లెటర్ హెడ్‌పైనే నియామక పత్రాలు రూపొందించారని తేలింది. ఈ నకిలీ ఉత్తర్వుల వెనుక కొందరు ఉన్నతోద్యోగులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ముందుగా తాత్కాలిక ప్రాతిపాదికపై ఉద్యోగం ఇస్తామని, తరువాత పర్మినెంట్ చేస్తామంటూ నిరుద్యోగులను వంచించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఆరుగురు ఉద్యోగులకు పోలీసులు నోటీసులు అందాయి. గతంలో ఆలయ ఈవోగా పనిచేసిన నరసింగరావును కూడా విచారించారు.

ఆలయ రికార్డ్స్ పరిశీలిస్తున్న విజిలెన్స్ అధికారులు

ఓవైపు విజిలెన్స్ అధికారులు ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన రికార్డ్స్‌ను పరిశీలిస్తున్నారు. మరోవైపు విజిలెన్స్ విచారణలో తమ అవినీతి బయటపడుతుందని అధికారులు కంగారు పడుతున్నారు. కానీ, ఈవో సూర్యకుమారి మాత్రం ఈ అంశం తన దృష్టికే రాలేదంటున్నారు.

తాజాగా ప్రసాదాల తయారీ విషయంలో స్టోర్స్‌లో అక్రమాలు

తాజాగా ప్రసాదాల తయారీ విషయంలో స్టోర్స్‌లో అక్రమాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో మరోసారి అధికారుల తనిఖీలు చేసి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. అవినీతికి పాల్పడిన ఎవరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తున్నారు. దీంతో ఎప్పుడు ఎవరిపై వేటుపడుతుందోననే చర్చ ఉద్యోగుల్లో మొదలైంది. ఐఏఎస్ పాలనలోనూ అవినీతి పెరిగిపోవడంతో ఆలయ ప్రతిష్ట కాపాడేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. 

17:58 - June 16, 2017

హైదరాబాద్: తెలంగాణాలో మొదటి దఫా డిగ్రి అడ్మిషన్ల ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది. అయితే తాము డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ ఆఫ్‌ తెలంగాణ..దోస్‌ కిందకు రాలేమంటూ కొన్ని కాలేజీలు కోర్టు వెళ్లడం.. వీటిలో దాదాపు 7వేల మంది విద్యార్థులు ఆప్షన్లు ఎంచుకోవడంకూడా జరిగిపోయింది. దీనిపై స్పందించిన ఉన్నత విద్యామండలి ..కోర్టుతీర్పు వచ్చిన తర్వాత సీట్ల అలాట్‌మెంట్‌ చేస్తామని చెబుతోంది.

వెబ్‌ఆప్షన్లు ఎంచుకున్న 1లక్షా 50 వేలమంది స్టూడెంట్స్‌

2017-18 విద్యాసంవత్సరానికి గాను మొదటి విడతలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 50వేల మంది విద్యార్ధులు వెబ్‌ఆప్షన్లు ఎంపిక చేసుకున్నారు. అందులో లక్షా 40వేల మంది విద్యార్ధులకు సీట్ల అలాట్‌మెంట్ జరిగిందని దోస్త్‌ కన్వీనర్‌ తెలిపారు.

ఓయూ పరిధిలో 409 కాలేజీల్లో మొదటి దఫా 57,950 సీట్లు భర్తీ

రాష్ట్ర వ్యాప్తంగా ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలోనే 409 కాలేజీలున్నాయి. వాటిల్లో మొదటి దఫాలో 57వేల 950 సీట్లు భర్తీ చేశారు. కాకతీయ వర్శిటీ పరిధిలోని 292 కాలేజీల్లో 34వేల 812 సీట్లు అలాట్‌మెంట్ పూర్తయింది. అటు మహాత్మ గాంధీ యూనివర్శిటీ పరిధిలోని 107 కాలేజీల్లో 10వేల 547 సీట్లు.. తెలంగాణా యూనివర్శిటీ పరిధిలోని 71 కాలేజీల్లో 10వేల 303 సీట్లు భర్తీ చేశారు. ఇక శాతవాహన యూనివర్శిటీ పరిధిలో 121 కాలేజీలు ఉండగా.. మొత్తం 16వేల 407 సీట్లను కేటాయించారు. అటు పాలమూరు యూనివర్శిటీ పరిధిలోని 89 కాలేజీల్లో 10వేల 14 సీట్లు అలాట్‌మెంట్ కూడా పూర్తయిందని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ తెలిపారు.

కాలేజీల్లో రిపోర్ట్‌కు జూన్‌ 15 నుంచి 20 వరకు అవకాశం

మరోవైపు జూన్ 15వ తేది నుంచి ఈనెల 20 వరకు సీట్లు అలాట్‌అయిన విద్యార్థులు కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి వుంటుందని ఉన్నతి విద్యామండలి తెలిపింది. ఇక రెండవ దఫా అడ్మిషన్లు ఈనెల 17 నుంచి 24 వరకు నిర్వహిస్తారు. అలాగే ఈనెల 21 నుంచి 24 వరకు వెబ్ ఆప్షన్ లు పెట్టుకోవచ్చని దోస్త్‌ కన్వీనర్‌ తెలిపారు. అయితే గతేడాదితో పోలిస్తే ఈ యేడాది డిగ్రిలో అడ్మిషన్లు పెరిగారని అధికారులు స్పష్టం చేసారు. ఇదిలావుంటే దోస్త్‌లో డిగ్రి అడ్మిషన్లు చేసుకోని ప్రైవేటు కాలేజీయాజమన్యాలు కూడా మరోసారి ఆలోచించాలని ఉన్నత విద్యామండలి సూచిస్తోంది. 

17:53 - June 16, 2017

హైదరాబాద్: వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో ఫార్మా మాఫియా వేళ్లూనుకుంటుంది. నిరుపేదల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. నిరక్షరాస్యులతో క్లినికల్‌ ట్రయల్‌కు ఫార్మా సంస్థలు ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఔషధ ప్రయోగాలు నిర్వహించిన తర్వాత బాధితులను గాలికొదిలేస్తున్నాయి. ఫార్మా కంపెనీల దురాగతానికి కరీంనగర్‌ జిల్లా నాగంపేటలో వంగర నాగరాజు బలైపోయాడు. క్లినికల్‌ ట్రయల్‌ వికటించి ఇటీవలే మృతిచెందాడు. క్లినికల్‌ ట్రయల్‌ వ్యవహారాన్ని బయటకు పొక్కకుండా ఫార్మా సంస్థలు తొక్కిపెడుతున్నాయి. వడదెబ్బతో నాగరాజు మరణించినట్లు స్థానిక అధికారులు రికార్డులు సృష్టించారు. మృతుడి బ్యాగేజీలో క్లినికల్‌ ట్రయల్‌కు సంబంధించిన ఒప్పంద పత్రాలు బయటపడటంతో.. ఫార్మా మాఫియా కిరాతకం బయటపడింది. విషయం తెలిసి బెంగళూరులోని ఫార్మా కంపెనీ ప్రతినిధులను నాగరాజు కుటుంబ సభ్యులు నిలదీయడంతో.. వారిని యాజమాన్యం నిర్బంధించింది. దీంతో మృతుడు నాగరాజు కుటుంబ సభ్యులు చాకచక్యంగా అక్కడి నుంచి తప్పించుకున్నారు. 

16:51 - June 16, 2017

హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2017 ఫలితాల్లో ఫిట్జీ విద్యార్థులు సత్తాచాటారు.. జాతీయ స్థాయిలో 27వ ర్యాంక్‌, 34 ర్యాంకులతోపాటు... మరెన్నో ర్యాంకులు సాధించారు.. ఫలితాల్లో టాప్‌ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఫిట్జీ డైరెక్టర్‌ గుప్తా అభినందించారు.. 

16:48 - June 16, 2017

హైదరాబాద్: కేసీఆర్ కిట్ల పథకం, సీజనల్‌ వ్యాధులు, ఉద్యోగ నియామకాలపై సచివాలయంలో మంత్రి లక్ష్మారెడ్డి సమీక్ష నిర్వహించారు. కేసీఆర్‌ కిట్‌ పథకం అమలుతీరుపై ఉన్నతాధికారులతో చర్చించారు. ఇప్పటివరకూ 6వేల 279 కిట్లు పంపిణీ చేశామని అధికారులు మంత్రికి వివరించారు. ఈ పథకం అమలులో ఎలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. దోమల నివారణ, పారిశుధ్యం, వ్యాధుల నివారణపై అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. నగర, పట్టణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు పెట్టాలని సూచించారు. వ్యాధులు, నివారణ, చికిత్సలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

16:46 - June 16, 2017

హైదరాబాద్: ఢిల్లీలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో... కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, రాజ్ నాధ్ సింగ్ భేటీ అయ్యారు. రాష్ట్రపతి అభ్యర్థిపై ... వీరి మధ్య చర్చ జరుగుతోంది. రాష్ట్రపతి అభ్యర్థిపై ఏకాభిప్రాయం కోసం.. బిజెపిప్రభుత్వం... అన్ని పార్టీలతో చర్చలు జరుపుతోంది. ఉదయం సోనియాగాంధీని కలిసిన వెంకయ్య, రాజ్‌ నాథ్... ఇప్పుడు ఏచూరీతో భేటీ అయ్యారు. 

'డిసెంబర్ 31 లోగా బ్యాంకు ఖాతాలకు ఆధార్ లింక్ చేయాలి'

హైదరాబాద్: బ్యాంకు ఖాతాలకు ఆధార్ కార్డు లింక్ తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా, మరో ప్రకటన చేసింది. బ్యాంకు ఖాతాదారులు తమ ఖాతాలను డిసెంబర్ 31 లోగా ఆధార్ కార్డుతో లింక్ చేయాలని సూచించింది. ‘ఆధార్’ అనుసంధానం లేని బ్యాంకు ఖాతాలు చెల్లవని ప్రకటించింది. రూ.50 వేలకు పైగా లావాదేవీలకు ‘ఆధార్’ ను తప్పనిసరి చేయడం విదితమే. బ్యాంకు ఖాతాలకు ‘ఆధార్’ తప్పనిసరి చేయడంపై ఖాతాదారులకు ఆయా బ్యాంకులు అవగాహన కల్పించాలని ప్రభుత్వం సూచించింది. 

15:59 - June 16, 2017

హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష(28) ది ఆత్మహత్యేనని హైదరాబాద్ కమిషనర్ మహేందర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. బ్యూటీషియన్ శిరీష మృతి కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ కేసును వెస్ట్ జోన్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు దర్యాప్తు చేశారని చెప్పారు. ఈ క్రమంలో శిరీష మరణానికి కారణమైన రాజీవ్, శ్రవణ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. 13 ఏళ్ల క్రితం సతీష్ చంద్ర అనే వ్యక్తిని శిరీష పెళ్లి చేసుకుందని... వీరికి 12 ఏళ్ల కుమార్తె ఉందని ఆయన చెప్పారు. ఆమె పెట్టిన బ్యూటీషియన్ బిజినెస్ లాభదాయకంగా లేని సమయంలో, ఆమెకు వల్లభనేని రాజీవ్ కుమార్ అనే వ్యక్తితో పరిచయం అయిందని తెలిపారు. ఎంబీయే చదివిన రాజీవ్ ఆర్జే ఫొటో గ్రాఫర్స్ అనే స్టూడియోను పెట్లుకున్నాడని... పెళ్లికార్యక్రమాలను కూడా నిర్వహించేవాడని చెప్పారు. గత నాలుగేళ్లుగా రాజీవ్ తో కలసి శిరీష పనిచేస్తోందని... ఈ క్రమంలో వారిద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడిందని చెప్పారు. ఈ సమయంలో... బెంగళూరులో హెచ్ ఆర్ మేనేజర్ గా ఉన్న తేజస్వినితో రాజీవ్ కు ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయిందని.. ఏడాది కింద బెంగళూరు నుంచి తేజస్విని హైదరాబాదుకు వచ్చిందని... ఈ నేపథ్యంలో రాజీవ్, తేజస్వినిల మధ్య శారీరక సంబంధం ఏర్పడిందని, వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారని చెప్పారు.
రాజీవ్ తనను నెగ్లెక్ట్ చేస్తున్నాడనే అనుమానంతో
ఈ క్రమంలో గత మూడు నెలల నుంచి రాజీవ్ తనను నెగ్లెక్ట్ చేస్తున్నాడనే అనుమానం తేజస్వినిలో ఏర్పడింది. దీంతో, ఒక రోజు రాజీవ్ స్టూడియోకు తేజస్విని వెళ్లగా... ఇప్పుడే రాజీవ్ ఆయన భార్యతో కలసి బయటకు వెళ్లారని ఆఫీస్ బాయ్స్ ఆమెతో చెప్పారు. దీంతో, 'ఇదేంటి తామిద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం కదా... మధ్యలో ఈ భార్య ఎవరు?' అని ఆమె షాక్ కు గురైంది. ఈ తర్వాత ఆమె పలుమార్లు అక్కడకు వెళ్లడంతో శిరీష, రాజీవ్ ల సంబంధం ఆమెకు అర్థమయింది. ఆ తర్వాత వాళ్లతో తేజస్విని గొడవ పడింది.

శిరీష, శ్రావణ్‌, రాజీవ్‌ కలిసి సిద్దిపేట జిల్లాలోని కుకునూర్‌పల్లి వెళ్లారని చెప్పారు. ఆ రాత్రి శిరీషతోపాటు రాజీవ్‌, శ్రావణ్‌, ఎస్సై ప్రభాకర్‌రెడ్డి మద్యం సేవించారన్నారు. అనంతరం ఒంటరిగా ఉన్న శిరీషపట్ల ఎస్సై అసభ్యకరంగా ప్రవర్తించారని.. శ్రావణ్‌, రాజీవ్‌లు తమ విచారణలో తెలిపారన్నారు. ఎస్సై చేష్టలతో అవాక్కైన శిరీష మనస్తాపం చెందిందని.. ఒక్కసారిగా ఆమె పెద్దగా అరవడంతో బయట ఉన్న రాజీవ్‌, శ్రావణ్‌ లోనికి వచ్చారన్నారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత శిరీష మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్టు తేల్చారు.

ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి, శిరీష అనుమానాస్పద మృతులపై మిస్టరీ కొనసాగుతోంది.  పోలీసుల అదుపులో ఉన్న రాజీవ్‌ను ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్న కుకునూర్‌పల్లికి తరలించారు. సంగారెడ్డి డీఎస్పీ ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ నుంచి తరలించారు. ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్యపై రాజీవ్‌ను విచారిస్తున్నారు. ప్రభాకర్‌రెడ్డి, శిరీష్‌ అనుమానాస్పద మృతిపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి.  రాజీవ్‌, శిరీష, శ్రవణ్‌లు  అసలు ప్రభాకర్‌రెడ్డి దగ్గరకు ఎందుకు వెళ్లారు? అక్కడ రాజీవ్‌, శిరీష మధ్య ఏం జరిగి ఉంటుంది? రాత్రి సమయంలో ఎస్సై దగ్గరికి శ్రవణ్‌ ఎందుకు తీసుకెళ్లాడు? మార్గ మధ్యలో కారు ఎందుకు నిలిపివేశారు? శిరీష ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఎస్సై ప్రభాకర్‌రెడ్డి హైదరాబాద్‌కు వచ్చాడా? ఇవన్నీ అంతు చిక్కని ప్రశ్నలగానే మిగిలాయి. పోలీసులు వీటికి సమాధానం రాబట్టేపనిలో ఉన్నారు.

 

 

15:56 - June 16, 2017
15:54 - June 16, 2017
15:52 - June 16, 2017
15:50 - June 16, 2017

సంగారెడ్డి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై.. టీడీపీ నేత ఒంటేరు ప్రతాప్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎస్సై ప్రభాకర్‌ రెడ్డి చనిపోతే.. పరామర్శించడానికి వెళ్లిన తన మీద 4 సెక్షన్లపై కేసు పెట్టారని మండిపడ్డారు. తప్పుడు ప్రెస్‌ మీట్‌లు పెట్టి ప్రతిపక్షాలపై దాడి చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యమా? కాదా అని ప్రతాప్‌ రెడ్డి ప్రశ్నించారు. 

15:47 - June 16, 2017

వనపర్తి :జిల్లాలో పిడుగుపడి ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఆత్మకూరు మండలం బాలకృష్ణాపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పొయ్యిలో కట్టెలకోసం పొలాల్లోకి వెళ్లిన వారిపై పిడుగు పడ్డంతో వారంతా అక్కడికక్కడే మృతి చెందారు. 

పిడుగుపడి ముగ్గురి మృతి

వనపర్తి :జిల్లాలో పిడుగుపడి ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఆత్మకూరు మండలం బాలకృష్ణాపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పొయ్యిలో కట్టెలకోసం పొలాల్లోకి వెళ్లిన వారిపై పిడుగు పడ్డంతో వారంతా అక్కడికక్కడే మృతి చెందారు. 

ఢిల్లీ ఉపముఖ్యమంత్రి ని విచారించిన సీబీఐ

ఢిల్లీ: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా ఇంటికి శుక్రవారం సీబీఐ అధికారులు వచ్చారు. ఇవి దాడులు కావని ఓ కేసులో ఆయనను ప్రశ్నించేందుకు ఇంటికి వచ్చినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ చేపట్టిన సోషల్‌మీడియా ప్రచారం ‘టాక్‌ టూ ఏకే’ కేసు ప్రాథమిక విచారణలో భాగంగా సిసోడియాను విచారించేందుకు సీబీఐ అధికారులు మంత్రి ఇంటికి చేరుకున్నట్లు సమాచారం. 

15:38 - June 16, 2017

మేడ్చల్: నిజమైన లౌకిక వాది ఎవరన్నా వున్నారంటే వారు సీఎం కేసీఆరే అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన కీసర లో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ... ఎన్నో ఆదర్శవంతమైన పనులను టీఆర్ ఎస్ చేస్తోంది. ఎట్టిపనికైనా, మట్టి పనికి అయినా మనోడే ఉండాలి అన్న జయశంకర్ తెలిపిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. విపక్షాలు లేని పోని ఆరోపణలు చేస్తూ అభివృద్ధి పనులకు ఆటంకాలు కలుగజేస్తున్నాయని ఆరోపించారు.

ఏచూరితో కేంద్రమంత్రులు వెంకయ్య, రాజ్ నాథ్ భేటీ

ఢిల్లీ: సీపీఎం కేంద్ర కార్యాలయం ఏకేజీ భవన్ సీతారం ఏచూరితో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, రాజ్ నాధ్ సింగ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సీపీఎం కార్యాలయం వద్ద పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.

శిరీష ది ఆత్మహత్యే :సీపీ మహేందర్ రెడ్డి

హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష(28) ది ఆత్మహత్యేనని హైదరాబాద్ కమిషనర్ మహేందర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. బ్యూటీషియన్ శిరీష మృతి కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ కేసును వెస్ట్ జోన్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు దర్యాప్తు చేశారని చెప్పారు. ఈ క్రమంలో శిరీష మరణానికి కారణమైన రాజీవ్, శ్రవణ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. 

14:04 - June 16, 2017

ఢిల్లీ : మియాపూర్ భూకుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న ట్రినిటి ఇన్‌ ఫ్రా పార్థసారధి.. సువిశాల్ డైరెక్టర్ శర్మలకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు కొట్టివేసిన బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంను ఆశ్రయించడంతో అగర్వాల్, కౌల్‌ లతో కూడిన ధర్మాసనం వీరికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సివిల్ లిటిగేషన్‌ను క్రిమినల్‌ లిటిగేషన్‌తో కన్‌వర్ట్‌ చేయడం తప్పని 2009లో వచ్చిన జడ్జిమెంట్‌ను నిందితుని తరపు లాయర్లు సుప్రీం దృష్టికి తీసుకొచ్చారు. వీరి వాదోపవాదనలు విన్న కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఫోర్జరీ అనేది జరగలేదని.. నిజం నిగ్గుతేలుతుందని.. ఏదో ఒకరోజు విజయం తమదే అన్నారు నిందితుల తరపు న్యాయవాది. 

14:02 - June 16, 2017

ఢిల్లీ : రాష్ట్రపతి అభ్యర్థిపై ఏకాభిప్రాయంకోసం సోనియాగాంధీతో రాజ్‌నాథ్‌, వెంకయ్యనాయుడు భేటీలో ఏవిషయం తేల్చలేదు. అభ్యర్థి ఎవరో లేల్చకుండా ఏకాభిప్రాయం ఎలాసాధ్యమని కాంగ్రెస్‌ నేత గులాంనబిఆజాద్‌ ప్రశ్నించారు. అభ్యర్థి ఎంపికపై ఇంకా కసరత్తు జరుగుతూనే ఉందని.. తాముకూడా తమ మిత్రపక్షపార్టీలతో చర్చించి ఓ నిర్ణాయానికి రావల్సి ఉందని ఆజాద్‌ వ్యాఖ్యానించారు.  

13:55 - June 16, 2017

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో రేషన్‌ పంపిణీ వ్యవస్థకు మంగళం పాడబోతున్నారా? పేద ప్రజలకు సరఫరా చేసే బియ్యం, పంచదార,కిరోసిన్‌కు నగదు బదిలీ విధానాన్ని అమలు చేయబోతున్నారా? రేషన్‌ షాపుల సరుకుల పట్టికలో ఒక్కొక్కటిగా కనమరుగవుతున్న తీరు పేదప్రజల్లో గుబులు రేపుతోంది. ఇప్పటికే రూపాయికి కిలో బియ్యం పథకానికి నగదు బదిలీ చేస్తామని కేంద్రం ప్రకటించింది. నగదు బదిలీని ఏపీలో అమలు చేయడానికి ప్రయత్నిస్తుంది. దీనిలో భాగంగా వంట గ్యాస్ సబ్సిడీ విధానాన్ని రేషన్ షాపుల్లోనూ అమలు చేయాలని భావిస్తోంది. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ నేరుగా లబ్దిదారుడి ఖాతాలో జమచేయనున్నారు. ఇందుకు లబ్ధిదారుడి కార్డుకు ఆధార్, బ్యాంక్ ఖాతాను లింక్ చేస్తారు.

పంచదార కూడా నిలివేత...
ఇక పంచదార సరఫరాను కూడా కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. పంచదారపై కేంద్ర ప్రభుత్వం రాయితీని ఎత్తేయడంతో, రాష్ట్ర ప్రభుత్వం ఆ భారాన్ని మోయాలా వద్దా అని తర్జనభర్జన పడుతోంది. వాస్తవానికి రాష్ట్రంలోని రేషన్ షాపుల ద్వారా నెల‌కు 7 వేల 41 ట‌న్నుల చ‌క్కెర రాయితీపై పేదప్రజలకు పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ అందిస్తోంది. రాష్ట్రంలో కోటి న‌ల‌భై రెండు కోట్ల కార్డుదారులున్నారు. బ‌హిరంగ మార్కెట్‌లో 43.10పైస‌ల‌కు కొనుగోలు చేసి..సామాన్యులకు 7 రూపాయ‌ల‌కు అర‌కేజీ పంచదార పంపిణీ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం 18 రూపాయల 50 పైసల రాయితీ ఇస్తోంది. అయితే ఏప్రిల్ నుంచి ఈ రాయితీని కేంద్రం నిలిపి వేసింది. మేలో చక్కెరను ఎలాగోలా సర్దుబాటు చేసినా.. జూన్‌లో పూర్తిగా పంచదార స‌ర‌ఫ‌రా చేయ‌డం మానేశారు. పంచదార పై ఏటా 290 కోట్లు కేంద్ర ప్రభుత్వం రాయితీకింద రాష్ట్రానికి ఇచ్చేది.

రేషన్ డీలర్ల ఆందోళన...
ఏపీని కిరోసిన్‌ రహిత రాష్ట్రంగా మార్చే క్రమంలో సివిల్ సప్లై శాఖ ఈ నెల నుంచి కిరోసిన్‌ను నిలిపివేసింది. అయితే జూన్ ఒక‌టి నుంచే అంద‌రికి గ్యాస్ స‌ర‌ఫ‌రా చేస్తాన‌ని ప్రకటించిన ప్రభుత్వం ఈనెల 20 నుంచి అమ‌లు చేయాల‌ని నిర్ణయించింది. మరోవైపు రేషన్ షాపుల్లో నిత్యావసరాలను తగ్గిస్తుండటం.. రేషన్ డీలర్లను ఆందోళనకు గురిచేస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలతో తాము పూర్తిగా నష్టపోతున్నామని వాపోతున్నారు. తమకు ప్రత్యమ్నాయ మార్గాలు చూపాలని ఆ సమైఖ్య సభ్యులు పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటితో మొరపెట్టుకున్నారు. కిరోసిన్ రద్దు నేపథ్యంలో దీపం పధకం సిలిండర్ల పంపిణీ బాధ్యతను రేషన్ డీలర్లకు అప్పగించాలన్నారు. రేషన్ షాపులను మీ సేవా కేంద్రాలుగా మార్చి విద్యుత్‌ బిల్లులు, సామాజిక పించన్ల పంపిణీ బాధ్యతను ఇవ్వాలన్నారు. రాయితీ భారం పేరుతో రేషన్ షాపుల్లో ప్రభుత్వం నిత్యావసరాలు నిలిపివేస్తే ఆందోళన చేపడతామని రేషన్‌ డీలర్ల సంఘం హెచ్చరిస్తోంది. 

13:53 - June 16, 2017

హైదరాబాద్ : ప్రైవేట్‌విద్యా సంస్థల బస్సులు ఏదో ఒక చోట నిత్యం ప్రమాదానికి గురికావడం.. విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం లేదా గాయాలపాలవడం ప్రతి ఏడాది జరుగుతూనే ఉంది. ఫీజుల వసూలుపై శ్రద్ధచూపే ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుల భద్రతను మాత్రం విస్మరిస్తున్నాయి. ఫిట్‌నెస్ లేని, కాలం చెల్లిన బస్సులను నడుపుతూ పిల్లల భవిష్యత్‌తో చెలగాటమాడుతున్నాయి.

బస్సు డ్రైవర్‌పైనే ఆధారపడి ఉంటుంది
విద్యార్థులు క్షేమంగా స్కూల్‌కు వెళ్లాలన్నా.. తిరిగి ఇంటికి రావాలన్నా బస్సు డ్రైవర్‌పైనే ఆధారపడి ఉంటుంది. అందుకే డ్రైవర్‌కు ఐదేళ్ల అనుభవం ఉండాలన్న నిబంధన ఉంది. బస్సులో ఏపార్టు సరిగా లేకున్నా ప్రమాదం పొంచివున్నట్లే. అందుకే ప్రతి ఏడాది స్కూళ్లు ప్రారంభానికి నెలరోజుల ముందుగానే రవాణాశాఖ అధికారులు బస్సులను తనిఖీచేసి ఫిట్ నెస్ సర్టిఫికెట్ ఇస్తారు. ఇక విద్యార్థులు చేతులు బయటపెట్టకుండా బడిబస్సులకు గ్రిల్స్ తప్పనిసరి. మేడ్చల్ జిల్లాలో 4,342 బస్సులకు గానూ 3,900ల బస్సులు మాత్రమే ఫిట్ నెస్ సర్టిఫికెట్‌ పొందాయి. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి 4,350 స్కూల్‌ బస్సుల్లో.. 3,300ల బస్సులకు ఫిట్ నెస్ పరీక్షలు నిర్వహించారు. హైదరాబాద్‌లో 2,059 పాఠశాల బస్సులకు.. వెయ్యి బస్సులు మాత్రమే ఫిట్ నెస్ పరీక్షలు చేయించారు. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. గత యేడాది రాష్ట్రవ్యాప్తంగా 19వేల 717 బస్సులు రవాణాశాఖ కార్యాలయాల్లో రిజిష్టర్ చేసుకున్నాయి. ఇప్పటి వరకు గ్రేటర్ పరిధిలో 62...రంగారెడ్డి జిల్లాలో 32, మేడ్చల్ జిల్లాలో 10 బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు.

ఎన్నో నిబంధనలు
బడిబస్సులో పిల్లలు ఎక్కేందుకు మెట్లు కిందివరకు ఉండాలి. క్లీనర్ ఉండడంవల్ల పిల్లలను నిరంతరం పరిశీలించే అవకాశం ఉంటుంది. ప్రతి బడి బస్సుకు స్టీరింగ్‌, బ్రేకులు కండిషన్‌ పక్కాగా ఉండాలి. ప్రతి వాహనంలో ఒక అత్యవసర ద్వారం ఏర్పాటు చేయాలి. దానిపై స్పష్టంగా కనిపించేలా అత్యవసరం డోర్ అని రాసుండాలి. రవాణా శాఖ ఇచ్చిన సర్టిఫికెట్ పర్మిట్‌, దానిపై బస్‌ కండీషన్ వివరాలు ఉండాలి. డ్రైవర్‌ ఆరోగ్యంతో పాటు మూడు నెలలకొసారి అతనికి కంటి పరీక్షలు నిర్వహించాలి. పాఠశాలల బస్సులు తరచూ ప్రమాదాలకు గురవడంతో ప్రభుత్వం నిబంధనలకు కఠినతరం చేసింది. అయినప్పటికీ నిబంధనలకు తుంగలో తొక్కి విద్యార్థులను తరలించేందుకు బస్సులను ఉపయోగిస్తున్నారు. పాఠశాలలు పునఃప్రారంభమవడంతో...నిజామాబాద్‌ జిల్లాలో ఆర్టీవో అధికారులు ప్రైవేట్‌ పాఠశాలల వాహనాలను విస్తృతంగా తనిఖీ

అధికారుల దృష్టి...
జిల్లా వ్యాప్తంగా మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 867 స్కూల్ బస్సులు ఉన్నాయి. నిబంధనలు ప్రకారం పాఠశాలల ప్రారంభానికి ముందే ప్రతి బస్సు ఫిట్‌నెస్‌ చేయించుకోవాలి కానీ ఇప్పటి వరకు 495 బస్సులను మాత్రమే ఫిట్‌నెస్‌ చేయించినట్టు సోదాల్లో తేలింది. మిగతా వాటికి సామర్థ్య పరీక్షలు నిర్వాహించాల్సి ఉంది. రూల్స్‌ పాటించకపోతే...ఇక జరిమానాలు రాసేది లేదని నేరుగా కోర్టుకు పంపిస్తామని ఇంచార్జ్‌ డీటీసీ హెచ్చరించారు. అదేవిధంగా 60 సంవత్సరాలకు పైబడిన డ్రైవర్లను నియమించకూడదని ఆయన సూచించారు. అలాగే పాఠశాలల బస్సులపై ఆ సంస్థ పేరు, ఫోన్ నెంబర్‌తో సహా పూర్తి చిరునామాను రాయాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రమాదాల నివారణకు ఫిట్‌నెస్‌ బస్సులనే నడిపేలా స్కూళ్ల యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలి. దాంతో పాటు పాఠశాల ప్రారంభసమయంలోనే కాకుండా ఆర్టీఏ అధికారుల నిరంతర తనిఖీలు కొనసాగాలని పేరెంట్స్ కోరుతున్నారు.

 

13:51 - June 16, 2017

సంగారెడ్డి : కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి బ్రాస్‌లెట్‌ 20 లక్షల రూపాయలు పలికింది. రాహుల్‌ పర్యటన సందర్భంగా జగ్గారెడ్డికి వీహెచ్‌ తన బ్రాస్‌లెట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. రాహుల్‌ సూచనతో వీహెచ్‌ జగ్గారెడ్డికి ఈ బ్రాస్‌లెట్‌ను ఇచ్చాడు. అయితే.. బ్రాస్‌లెట్‌ను వేలం వేసి.. వచ్చిన డబ్బును మిర్చి రైతులకు ఇస్తానని అప్పుడు జగ్గారెడ్డి ప్రకటించాడు. దీంతో ఈరోజు బ్రాస్‌లెట్‌కు వేలం నిర్వహించారు. దీనిని కృషి డెవలపర్స్‌ 20 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. బ్రాస్‌లెట్‌ను కొనుగోలు చేసిన కృషి డెవలపర్స్‌కు జగ్గారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నగదును ఖమ్మం, వరంగల్‌ మిర్చి రైతులకు.. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ద్వారా అందజేస్తామని జగ్గారెడ్డి తెలిపారు. 

13:49 - June 16, 2017

రాజస్థాన్ : మోదీ ఏలుబడిలో.. హిందుత్వశక్తులు పెట్రేగిపోతున్నాయి. దొరికిన ప్రతి అవకాశాన్నీ సాటివారిపై హిందుత్వాన్ని రుద్దేందుకే ఉపయోగించుకుంటున్నారు. తాజాగా, రాజస్థాన్‌లో ఇలాంటిదే ఓ దురాగతం వెలుగు చూసింది. నాగూర్‌ జిల్లాలో ఓ మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యంత పాశవికంగా ప్లాస్టిక్‌ పైప్‌తో దాడి చేశారు. కనీసం ఆ మహిళ మతిస్థిమితం లేనిదన్న జాలి కూడా లేకుండా, జై శ్రీరామ్‌ అనాలంటూ చితకబాదారు. ఆమె పెట్టే కేకలు అక్కడున్నవారిని కదిలిస్తున్నా.. వారెవరూ ఆ దుర్మార్గుల ఆగడాన్ని ఆపలేకపోయారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. హిందుత్వ శక్తుల దురాగతాలను, నెటిజన్లు తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నారు.

 

13:26 - June 16, 2017

ఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షరాలు సోనియా గాంధీతో బీజేపీ నేతల భేటీ ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ ఎటుంటి అభ్యర్థిని కోరుకుంటున్నారో వారి సలహాలు, సూచనలు తీసుకునట్టు సమాచారం. ఈ భేటీలో మల్లిఖార్జున ఖర్గే, గులాంనబీ ఆజాద్ పాల్గొన్నారు. చర్చల అనంతరం మీడియాతో మాట్లాడకుండా బీజేపీ నేతలు వెళ్లిపోయారు. వీరు కాసేపట్లో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో సమావేశం కానున్నారు. అనంతరం అరుణ్ జైట్లీతో భేటీ అయ్యి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. 

13:19 - June 16, 2017

ముంబై : 1993 ముంబై పేలుళ్ల కేసులో టాడా కోర్టు తీర్పు వెల్లడించింది. కోర్టు అబూసలెంతో సహా ఆరుగురిని దోషులుగా తేల్చింది. 1993లో మార్చి 12న 12 ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో 259 మంది పౌరులు మరణించారు. 24 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పును వెల్లడించింది. అనాడు జరిగిన పేలుళ్లు భారత దేశంలో విషాదకారంగా నిలిచింది. అబూసలేం ను పోర్చుగీస్ అరెస్ట్ చేసి ఇండియాకు తీసుకొచ్చారు. అబూసలేం పేలుళ్లకు పేలుడు పదార్థలు సమకుర్చాడు. బాదితులు టాడా కోర్టు తీర్పు పై అనందం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.  

ముంబై పేలుళ్ల కేసులో తీర్పు వెల్లడించిన కోర్టు

ముంబై : 1993 ముంబై పేలుళ్ల కేసులో కోర్టు తీర్పు వెల్లడించింది. ముస్తాఫా దోస్సా, ఫిరోజ్ ఖాన్ లను కోర్టు దోషులుగా తేల్చింది. 

వెడేక్కిన కర్నూలు రాజకీయాలు

కర్నూలు : జిల్లాలో రాజకీయాలు మరోసారి వెడేక్కాయి. భూమా అఖిలప్రియ వైఖరిపై ఏవీ సబ్బారెడ్డి ఆగ్రహంగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో తనను పక్కన పెట్టేస్తున్నారని ఆయన గుర్రుగా ఉన్నారు. తాజాగా ఏవీ సబ్బారెడ్డి కర్నూలు టీడీపీ కౌన్సిలర్లతో అత్యవసర భేటీ అయ్యారు. తనవైపు ఉంటారో లేదో తేల్చుకోవాలని కౌన్సిలర్లకు ఏవీ సబ్బారెడ్డి అల్టిమేటం జారీ చేశారు. జిల్లా ఇంఛార్జ్ మంత్రులు సుజనా, కాల్వశ్రీనివాసులు సుబ్బారెడ్డి ఫోన్ చేయడంతో ఆయన హుటాహుటిన విజయవాడకు బయలదేరారు.

1993ముంబై పేలుళ్ల కేసులో కోర్టు తీర్పు

ముంబై : కాసేపట్లో 1993 బాంబు పేలుళ్ల కేసులో ముంబైలోని టాడా కోర్టు తీర్పును వెల్లడించనుంది. 24 ఏళ్ల తర్వాత కోర్టు కీలక తీర్పు ఇవ్వనుంది. ఈ పేలుళ్లలో 257మందికి పైగా మృతి చెందారు. 700మందికి గాయాలయ్యాయి.

శిరీష మృతి కేసులో కొనసాగుతున్న సస్పెన్స్

హైదరాబాద్ : శిరీష మృతి కేసులో సస్పెన్స్ కొనసాగుతోంది. నిన్న ఆర్జే స్టూడియోలో రాజీవ్, శ్రవణ్ లను పోలీసులు 7గంటల పాటు విచారించారు. గత మూడు రోజుల నుంచి పోలీసులు విచారణలో నిమగ్నమయ్యారు. శిరీష మృతదేహనికి గాయాలైనట్లు తెలుస్తోంది. 

12:39 - June 16, 2017

కొత్తగూడెం : జిల్లా గుండాలలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. పాల్వంచలోని కిన్నెరసాని వాగులోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. దీంతో ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. మరోవైపు అనుకున్న సమయానికి వర్షాలు కురవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

12:37 - June 16, 2017

హైదరాబాద్ : పేదల సంక్షేమ పథకాల అమలుకి సంబంధించిన కార్యక్రమాల్లో ఎవరితోనూ రాజీ పడకుండా పనిచేస్తామన్నారు మంత్రి కేటీఆర్. ఒక్క పేదవాడికి కూడా అన్యాయం జరగకుండా చేసే బాధ్యత ప్రభుత్వానిదన్నారు. హైదరబాద్ భాగ్‌లింగంపల్లిలోని లంబడాతండాలో నిర్మించ తలపెట్టిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. లంబడాతండాలో మొత్తం 126 డబుల్ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణం చేపట్టామని.. ఒక్కొక్క ఇంటికి 8 లక్షలా 65 వేలు ఖర్చు చేస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. ఈ ఇళ్ల నిర్మాణంలో ఎవరు అవినీతికి పాల్పడ్డా క్రిమినల్ కేసులు పెట్టడం తథ్యమని ఎవర్నీ విడిచిపెట్టేది లేదని కేటీఆర్ హెచ్చరించారు. 

12:33 - June 16, 2017

కర్నూలు : జిల్లాలో రాజకీయాలు మరోసారి వెడేక్కాయి. భూమా అఖిలప్రియ వైఖరిపై ఏవీ సబ్బారెడ్డి ఆగ్రహంగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో తనను పక్కన పెట్టేస్తున్నారని ఆయన గుర్రుగా ఉన్నారు. తాజాగా ఏవీ సబ్బారెడ్డి కర్నూలు టీడీపీ కౌన్సిలర్లతో అత్యవసర భేటీ అయ్యారు. తనవైపు ఉంటారో లేదో తేల్చుకోవాలని కౌన్సిలర్లకు ఏవీ సబ్బారెడ్డి అల్టిమేటం జారీ చేశారు. జిల్లా ఇంఛార్జ్ మంత్రులు సుజనా, కాల్వశ్రీనివాసులు సుబ్బారెడ్డి ఫోన్ చేయడంతో ఆయన హుటాహుటిన విజయవాడకు బయలదేరారు. నంద్యాల ఉపఎన్ని నేపథ్యంలో టీడీపీ కుమ్ములాటలు కార్యకర్తలను ఆందోళను గురి చేస్తున్నాయి. 

12:24 - June 16, 2017
12:20 - June 16, 2017
12:17 - June 16, 2017

ముంబై : కాసేపట్లో 1993 బాంబు పేలుళ్ల కేసులో ముంబైలోని టాడా కోర్టు తీర్పును వెల్లడించనుంది. 24 ఏళ్ల తర్వాత కోర్టు కీలక తీర్పు ఇవ్వనుంది. ఈ పేలుళ్లలో 257మందికి పైగా మృతి చెందారు. 700మందికి గాయాలయ్యాయి. 2003 నుంచి 2010 మధ్య ఈ కేసులో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పేలుళ్లలో ప్రధాన నిందితుడు అండర్ వల్డ్ డాన్ అబూసలేం ఉన్నాడు. నిందితులపై కుట్ర, హత్య నేరాల కింద కేసులు నమోదు చేశారు. బాదితులు మాత్రం 24 ఏళ్లు గడిచిన నిందితులకు శిక్ష వేయకపోవడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

12:06 - June 16, 2017

ఇంగ్లాండ్ : ఛాంపియన్స్ ట్రోఫీలో మొత్తం 12 మ్యాచ్ లు జరిగితే అందులో 8 మ్యాచ్ లు సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు విజయం సాధించాయి. ఇండియా రెండు మ్యాచ్ ల్లో సెకండ్ బ్యాటింగ్ చేసి గెలిచింది. ఛాంపియన్స్ ట్రోఫీ చివరి నాలుగు మ్యాచ్ ల్లో కూడా సెకండ్ బ్యాంటింగ్ చేసిన వారు గెలిచారు. ఇండియా, పాక్ ఫైనల్ మ్యాచ్ లో టాస్ కీలకం కానుంది. ఇండియా టాస్ గెలిస్తే కోహ్లీ సందేహం లేకుండా ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఇండియాకు చేధనలో మంచి రికార్డు కూడా ఉంది. చిరకాల ప్రత్యర్థుల మధ్య జరిగే ఛాపియన్స్ ట్రోఫీ ఫైనలకు ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

11:46 - June 16, 2017

భూపాలపల్లి : వాసత్వ ఉద్యోగాల పునరుద్ధరణ లక్ష్యంగా సింగరేణి కార్మికుల చేస్తున్న సమ్మె రెండవ రోజుకు చేరింది. కార్మికులు సమ్మెతో భూపాలపల్లి ఏరియాలో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. బొగ్గ గనుల ప్రాంతంలో 144 సెక్షన్ విధించి పోలీసులను భారీగా మోహారించారు. ఈ సమ్మెలో ఒక్క సంఘం మినహా అన్ని సంఘాలు పాల్గొంటున్నాయి. కార్మికుల సమ్మె వల్ల 25వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పాడింది. దీంతో సింగరేణి సంస్థకు 8 కోట్ల నష్టం వటిల్లినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

11:39 - June 16, 2017

ఢిల్లీ : గురువారం విశాఖ ఎయిర్ పోర్టులో జేపీ దివాకర్ రెడ్డి చేసిన అనుచిత ప్రవర్తన పట్ల ఆయన క్షమాపణలు చెప్పారు. జేసీ ఫ్లైట్ కు లేట్ రావడంతో ఇండిగో సంస్థ కౌంటర్ మూసేసింది. దీంతో ఆగ్రహించిన జేసీ ఆ సంస్థ కార్యాలయాంలోకి వెళ్లి సిబ్బందిని కొట్టినంత పని చేశాడు. దీంతో విమాన సంస్థలు ఆయన నిషేధం వింధించాయి. ఇదిఇలా ఉంటే ఈ ఘటన పై కేంద్ర పౌర విమానయాన శాఖ విచారణకు ఆదేశించింది. ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజీలను అందించాలని అధికారులను ఆదేశించింది. 

11:37 - June 16, 2017

హైదరాబాద్ : శిరీష మృతి కేసులో సస్పెన్స్ కొనసాగుతోంది. నిన్న ఆర్జే స్టూడియోలో రాజీవ్, శ్రవణ్ లను పోలీసులు 7గంటల పాటు విచారించారు. గత మూడు రోజుల నుంచి పోలీసులు విచారణలో నిమగ్నమయ్యారు. శిరీష మృతదేహనికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఒకవేళ శిరీషది హత్య అయితే ఆ హత్య ఎవరు చేశారు. హత్యకు ప్రభాకర్ రెడ్డి సంబంధం ఉందా లేక రాజీవ్ శిరీష హత్య చేశాడా..అసలు ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవలసిన అవసమేమిటి..? అన్నిటికి సమాధానం మధ్యాహ్నం తెలియనుంది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కేసు సంబంధించి వివరాలు వెల్లడిస్తారు. 

10:48 - June 16, 2017

హైదరాబాద్ : బాగ్ లింగంపల్లిలో మంత్రి కేటీఆర్ డబుల్ బెడ్ రూం ఇళ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రం చేయని పని టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుందని అర్హుడైన ప్రతి పేదవాడికి డబుల్ బెడ్ రూం ఇళ్ల వస్తుందని అన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం ప్రభుత్వం 18 వేల కోట్లు ఖర్చు చేస్తుందని కేటీఆర్ తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

10:46 - June 16, 2017

చిత్తూరు : తిరుమలో బుధవారం కిడ్నాప్ గురైన ఏడాది బాలుడి కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. పోలీసులు కిడ్నాపర్ల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. కిడ్నాపర్లు ప్రైవేట్ బస్సులో తిరుపతి నుంచి చిత్తూరు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసును పోలీసుల ప్రతిష్టాత్మంగా తీసుకున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కిడ్నాపర్లను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. చిత్తూరు కిడ్నాపర్ల కదలిలను పోలీసులు గుర్తించారు. బాలుడు కిడ్నాప్ జరిగి 36 గంటలు గడిచిన బాలుడి ఆచూకీ లభించకపోవడంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 

10:21 - June 16, 2017

ఢిల్లీ : అనంతపురం ఎంపీ జేపీ దివాకర్ రెడ్డి విశాఖ ఎయిర్ పోర్ట్ లో చేసిన అనుచిత ప్రవర్తనకు నిరసనగా ఇండిగో, ఎయిర్ ఇండియా నిషేధం విధించాయి. తాజాగా అదే బాటలో మరో మూడు విమాన సంస్థలు స్పెస్ జెట్, గోఎయిర్, జెట్ ఎయిర్ వేస్ లు జేసీ నిషేధం విధించాయి. జేసీ పై మూడు నుంచి ఆరు నెలాలు నిషేధం వర్తించే అవకాశం ఉంది. విమాన సంస్థల జేసీ నుంచి క్షమాపణలు కోరుతున్నాయి. గతంలో ఎయిర్ ఇండియా సిబ్బందిపై శివసేన ఎంపీ గైక్వాడ్ దాడి చేసిన సంగతి తెలిసిందే.

10:10 - June 16, 2017

భూపాలపల్లిలో రెండో రోజు కొనసాగుతున్న సింగరేణి సమ్మె

భూపాలపల్లి : జిల్లాలో రెండు సింగరేణి కార్మికుల సమ్మె కొనసాగుతోంది. గనుల వద్ద పోలీసులను భారీగా మోహరించారు.

రెండవ రోజుకు సింగరేణి సమ్మె

పెద్దపల్లి : సింగరేణి సమ్మె రెండవ రోజుకు చేరుకుంది. కార్మికులు గనుల్లోకి విధులకు హాజరుకాకపోవడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.

గగన్ పహాడ్ వద్ద ఆర్టీఏ అధికారుల తనిఖీలు

రంగారెడ్డి : జిల్లాలోని గగన్ పహాడ్ వద్ద ఆర్టీఏఅధికారులు తనిఖీ నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 20 స్కూల్ బస్సులను సీజ్ చేశారు. 

రాష్ట్రపతి అభ్యర్థిపై బీజేపీ కసరత్తు

ఢిల్లీ : దేశా అత్యున్నత పదవి రాష్ట్రపతి అటువంటి పదవి సరైన వ్యక్తి ఉండాలి. త్వరలో జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ కసరత్తు ముమ్మరం చేస్తుంది. బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక పై కమిటీ వెసింది. ఈ కమిటీలో వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ, రాజ్ నాథ్ సింగ్ ఉన్నారు. ఈ కమిటీ నేడు ప్రతిపక్షాలతో చర్చించనున్నారు. వారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సొనియా గాంధీ, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో సమావేశం కానున్నారు.

09:22 - June 16, 2017
09:21 - June 16, 2017

ఢిల్లీ : దేశా అత్యున్నత పదవి రాష్ట్రపతి అటువంటి పదవి సరైన వ్యక్తి ఉండాలి. త్వరలో జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ కసరత్తు ముమ్మరం చేస్తుంది. బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక పై కమిటీ వెసింది. ఈ కమిటీలో వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ, రాజ్ నాథ్ సింగ్ ఉన్నారు. ఈ కమిటీ నేడు ప్రతిపక్షాలతో చర్చించనున్నారు. వారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సొనియా గాంధీ, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో సమావేశం కానున్నారు. ప్రతిక్షాల అభిప్రాయలు తీసుకుని అభ్యర్థిని ప్రకటించాలని బీజేపీ భావిస్తునంటూ తెలుస్తోంది. ఎందుకంటే బీజేకి 39 శాతం మాత్రం ఓట్లు ఉన్నాయి కాబట్టి. మరో వైపు బీజేపీ తరుపున అభ్యర్థి రేసులో అద్వానీ, మురళీ మనోమర్ జోషి, సుష్మాస్వరాజ్, సుమిత్రా మహాజన్ ఉన్నారు. ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ ను రాష్ట్రపతిని చేయాలని డిమాండ్ చేస్తుంది. ఈ నెల 24లోపు బీజేపీ తరుపున రాష్ట్రపతి అభ్యర్తి నామినేషన్ వేసే అవకాశం ఉంది. 25 ప్రధాని అమెరికా పర్యటన ఉండడంతో 24లోపే ప్రక్రియా పూర్తి చేయాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నారు. 

విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం

విజయనగరం : జిల్లా శృంగవరపుకోటలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఏవీహోమ్స్ వద్ద ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహలను కేజీహెచ్ తరలించారు. అరకు నుంచి విశాఖ వస్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

08:56 - June 16, 2017

విజయనగరం : జిల్లా శృంగవరపుకోటలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఏవీహోమ్స్ వద్ద ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహలను కేజీహెచ్ తరలించారు. అరకు నుంచి విశాఖ వస్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మృతులు ఎస్.కోటకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. 

08:55 - June 16, 2017

విశాఖ : జేసీ విశాఖ ఎయిపోర్ట్ లో వీరంగం సృష్టించారు. దీంతో ఆయన పై రెండు విమానయాన సంస్థలు నిషేధం విధించాయి. విమానం ప్రయాణించలంటే రెండు గంటల ముందు రావాలి కానీ జేసీ 40 నిమిషాల ముందు రావడంతో అప్పకిటకే ఇండిగో వారు కౌంటర్ మూసేశారు. దీంతో బోర్డింగ్ పాస్ లేక జేసీ వెళ్లలేపోయారు. జేసీ ఇండిగో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దాదాపు కొట్టినంత పని చేశారు. మరోవైపు కేంద్రం త్వరలో మార్గదర్శకాలు తీసుకురానుంది. 

08:53 - June 16, 2017

అధికారంలో ఉన్నమని కొంత మంది నాయకులు ఇష్టం వచ్చినట్లు చెస్తున్నారని, బాధ్యయుత పదవిలో ఉన్న వ్యక్తులు ఇటువంటి పనులు చేయడం తప్పని, దీన్ని ఏ మాత్రం అంగీకరించకుడదని, న్యూస్ మార్నింగ్ లో పాల్గొన్న నవతెలంగాణ ఎడిటర్ వీరయ్య, టీఆర్ఎస్ నేత గోవర్ధన్ రడ్డి అన్నారు. టీడీపీ ఎప్పుడు ఇటుంటి సంఘటలను సమర్ధించదని టీడీపీ నేత పట్టాభీరామ్ అన్నారు. అలాగే మియాపూర్ భూ కుంభకోణంలో కేవలం పాత్రదారులనే బలి పశువులను చేస్తున్నారని వీరయ్య అభిప్రాయ పడ్డారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

08:51 - June 16, 2017

మన దేశంలోని అనేక రాష్ట్రాలు రైతు ఉద్యమాలతో అట్టుడుకుతున్నాయి. రుణాలు మాఫీ చేయాలంటూ రైతులు పోరుబాట పట్టారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లలో మొదలైన రైతు ఉద్యమాలు చత్తీస్ గఢ్; గుజరాత్, కర్నాటక, పంజాబ్ రాష్ట్రాలకు విస్తరించాయి. దేశవ్యాప్తంగా రైతుల రుణాలు మాఫీ చేయాలంటూ 67 రైతు సంఘాలు ఇవాళ దేశవ్యాప్త ఆందోళనలు చేపడుతున్నాయి. రైతు ఉద్యమాలకు కార్మిక సంఘాలు సైతం మద్దతు ప్రకటిస్తుండడం విశేషం. మఖ్యంగా వ్యవసాయ రంగం సంక్షోభంలో పడింది. ప్రతి అంశంలో రైతులకు అన్యాయం జరుగుతుంది. మహారాష్ట్రలో మొదలైన పోరాటం మధ్యప్రదేశ్ వ్యాపించింది. వ్యవసాయం చేసే రైతులు రుణాగ్రస్తులు అవుతున్నారు. రుణాన్ని చెల్లించలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. రైతు తను పండించిన పంటకు ధరకు రావడం లేదు. కిలో బియ్యం పండించడానికి 31 రూపాయి ఖర్చు అయితే కేవలం 22 రూపాయాలు వస్తున్నాయని తెలంగాణ రైతు సంఘం కార్యదర్శి జంగరెడ్డి అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

నేటి ఉదయం 11గంటలకు ఆన్ లైన్ శ్రీవారి సేవా టికెట్లు

చిత్తూరు : తిరుమల ఉదయం 11 గంటల నుంచి ఆన్ లైన్ లో శ్రీవారి సేవా టికెట్లు అందుబాటులో ఉంటాయి. టీటీడీ సెప్టెంబర్ నెలకు సంబంధించి 44,895 టికెట్లు ఆన్ లైన్ లో ఉంచనున్నారు.

పార్వతీపురం ఐటీడీఏలో ప్రజాసమస్యలపై గ్రీవెన్స్ కార్యక్రమం

విజయనగరం : జిల్లా పార్వతీపురం ఐటీడీఏలో నేడు ప్రజాసమస్యలపై గ్రీవెన్స్ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో మంత్రి సుజయకృష్ణ రంగారావు పాల్గొననున్నారు.

నేటి నుంచి టీఎస్ ఎంసెట్ వెబ్ ఆప్షన్లు

హైదరాబాద్ : నేటి నుంచి తెలంగాణలో ఇంజనీరింగ్ కోర్సుల్లో వెబ్ ఆప్షన్లు మొదలు. నేటి నుంచి 22 వరకు వెబ్ ఆప్షన్లు నమోదుకు అవకాశం. 

హైదరాబాద్ లో నేడు డబుల్ బెడ్ రూంలకు శంకుస్థాపన

హైదరాబాద్ : నేడు నగరంలో డబుల్ బెడ్ రూం ఇళ్లకు శంకుస్థాపన చేయనున్నారు. బాగ్ లింగంపల్లి, కీసర మండలం అహ్మద్ గూడలో 4,554 ఇళ్లకు కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.

 

నేడు ప్రతిపక్షాలతో బీజేపీ భేటీ

ఢిల్లీ : నేడు ప్రతిపక్షా నేతలతో వెంకయ్య నాయుడు, రాజ్ నాథ్ భేటీ కానున్నారు. ఉదయం 11గంటలకు సోనియాతో, మధ్యాహ్నం ఏచూరితో భేటీ కానున్నారు. వారు రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై చర్చించనున్నారు. 

08:47 - June 16, 2017

విశాఖ : మొన్న వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి, నిన్న మహారాష్ట్ర శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌, ఇవాళ ఏపీ టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి... ఇలా విమానయాన సంస్థల సిబ్బందిపై దురుసుగా ప్రవర్తిస్తున్న ప్రజాప్రతినిధుల సంఖ్య పెరిగిపోంతోంది. విశాఖపట్నం విమానాశ్రయంలో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వీరంగం సృష్టించారు. అక్కడి సిబ్బందితో వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదమైంది. ఇండిగో విమానానికి బోర్డింగ్‌ పాస్‌ ఇవ్వడంలేదన్న కోపంతో విమానాశ్రయ అధికారులపై దురుసుగా ప్రవర్తించారు.

ప్రింటర్‌ను ధ్వంసంచేసేందుకు యత్నం
విశాఖలో జరిగిన ఎంపీ రామ్మోహన్‌నాయుడు వివాహ వేడుకలో పాల్గొనేందుకు విశాఖకు వచ్చిన జేసీ.. హైదరాబాద్‌ తిరిగి ప్రయాణమమయ్యేందుకు ఆలస్యంగా విమానాశ్రయానికి చేరుకున్నారు. డివాకర్‌రెడ్డి వచ్చేటప్పటికే ఇండిగో విమానం కౌంటర్‌ మూసివేశారు. దీంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. అక్కడే ఉన్న ప్రింటర్‌ను ధ్వంసంచేసేందుకు ఆయన ప్రయత్నించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అంతేకాకుండా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించడంతోపాటు, దిల్లీకి వెళ్లిన తర్వాత తేల్చుకుంటానని హెచ్చరించారు. దీంతో సిబ్బంది ఆయనకు ఇండిగో టికెట్‌ ఇచ్చి అదే విమానంలో పంపించినట్టు సమాచారం.తీవ్ర వివాదాస్పదమైన ఈ ఘటనపై జేసీ స్పందిస్తూ.. బొర్డింగ్‌ పాస్‌ సమయం పూర్తవడంతో అధికారులు కౌంటర్‌ను మూసివేశారని వివరణ ఇచ్చారు. తనకు బోర్డింగ్‌ పాస్‌ ఇవ్వకపోవడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. అంతేకానీ.. తానెలాంటి విధ్వంసానికి పాల్పడలేదని ఆయన స్పష్టంచేశారు. బోర్డింగ్‌ పాస్‌ ఇవ్వాలని మాత్రమే అడిగినట్టు చెప్పారు. ఈ ఘటనపై మీడియా అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు.

దివాకర్ రెడ్డిపై నిషేధం
ఈపరిణామాల అనంతరం ఇండియో, ఎయిర్‌ ఇండియా విమానయాన సంస్థలు తమ విమానాల్లో ప్రయాణించకుండా దివాకర్‌రెడ్డిపై నిషేధం విధించాయి. జరిగిన దానికి క్షమాపణ చెప్పి, విచారం వ్యక్తం చేస్తే జేసీపై విధించిన నిషేధాన్ని ఇండిగో, ఎయిర్‌ ఇండియా విమానయాన సంస్థలు తొలగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. విమానాశ్రయ సిబ్బందితో గొడవ పడటం దివాకర్‌రెడ్డికి ఇది కొత్తేమీ కాదు. గతేడాది అక్టోబర్‌లో కూడా గన్నవరం విమానాశ్రయంలో గలాటా సృష్టించారు. విమానాశ్రయానికి ఆలస్యంగా వచ్చేటప్పటియిన జేసీ ప్రయాణించాల్సిన విమానం వెళ్లిపోయింది. విమానాన్ని అందుకోలేకపోయిన దివాకర్‌రెడ్డి ఆగ్రహంతో ఊగిపోయి, ఇండియా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.సంస్థ కార్యాలయంలో ఫర్నిచర్‌ ధ్వంసం చేశారన్న ఆరోపలు ఉన్నాయి.  

08:43 - June 16, 2017

హైదరాబాద్ : కొన్ని అంశాలకు జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీకి లేఖ రాశారు. మిషన్‌ భగీరథ, నీటిపారుదల ప్రాజెక్టు పనులను వస్తు-సేవల పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. బీడీ, గ్రానైట్‌ పరిశ్రమలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావొద్దని విజ్ఞప్తి చేశారు. బీడీ పరిశ్రమపై అధిక పన్నులు వేస్తే ఉపాధికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 2వేలకు పైగా గ్రానైట్‌ యూనిట్లు ఉన్నాయని, వీటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 7లక్షల మంది ఉపాధి పొందుతున్నారని లేఖలో ప్రస్తావించారు. ఈ ఉత్పత్తులపై 12, 28 శాతం పన్నులు విధిస్తే గ్రానైట్‌ పరిశ్రమ దెబ్బతింటుందని, లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. 

08:42 - June 16, 2017

గుంటూరు : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన అమరావతిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో కొత్త మద్యం విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించారు.

ఆదాయమే లక్ష్యంగా..
మద్యం ఆదాయాన్ని గణనీయంగా పెంచుకునేందుకు వీలుగా కొత్త పాలసీ జారీ తెస్తున్నారు. బార్ల లైసెన్సుల జారీలో మార్పులు చేస్తున్నారు. ముప్పైవేల జనాభా ఉన్న గ్రామాలు, నగర పంచాయతీల్లో కూడా కొత్తగా బార్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 759 బార్లు నడుస్తున్నాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుగుణంగా వీటి లైసెన్స్‌లను రెన్యూవల్‌ చేస్తారు. వీటికి అదనంగా మరో 85 బార్లను కొత్త మంజూరు చేయాలని నిర్ణయించారు. ఇప్పుడున్న విధానంలో ఏటేటా బార్ల లైసెన్స్‌లను రెన్యూవల్‌ చేయించుకోవాల్సి ఉంది. కొత్తగా తీసుకొస్తున్న పాలసీలో ఏటా పది శాతం ఫీజు పెంపుతో ఐదేళ్ల కాలపరిమితికి లైసెన్సులు జారీ చేస్తారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 24 సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసి, వచ్చే ఏడాది నుంచి వ్యవసాయానికి నీరు అందించాలని మంత్రివర్గం నిర్ణయిచింది. సత్వర సాగునీటి ప్రయోజన పథకం కింది చేపట్టే ప్రాజెక్టులకు కేంద్రంతో అవగాహన ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించింది.

రైల్వే మౌలికసదుపాయాల సంస్థ
రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులను పరుగులు తీయించేందుకు ఏపీ రైల్వే మౌలికసదుపాయాల సంస్థను ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. గ్రామీణ రహదారుల అభివృద్ధి, నిర్వహణకు ప్రత్యేక సంస్థను తీసుకొస్తారు. వివిధ అంశాల్లో సింగపూర్‌తో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాల కాలాన్ని పొడిగించాలని మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్రంలోని 21 వేల పాఠశాలల్లో మౌలికవసతులు కల్పించి, ఐదేళ్లు నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో టెండర్లు పిలిచేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. తెలుగుదేశం కార్యాలయం నిర్మాణానికి గుంటూరు జిల్లా మంగళగిరిలో మూడు ఎకరాల 65 సెంట్ల భూమిని 99 ఏళ్ల లీజు ప్రాతిపదికన కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 

08:40 - June 16, 2017

హైదరాబాద్ : అక్రమ కట్టడాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతోంది జిహెచ్‌ఎంసి. 2015 అక్టోబర్ 28 తరువాత ఎలాంటి అక్రమ నిర్మాణాలు కనిపించినా కూల్చివేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. అలాంటి నిర్మాణాలను కూల్చివేయాలంటూ గ్రేటర్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అయినా గ్రేటర్‌లో రోజురోజుకి అక్రమ కట్టడాల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. బల్దియాలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో కొందరు లంచగొండి అధికారులు అక్రమ కట్టడాలకు అనుమతులిచ్చేస్తున్నారు. అనుమతుల కోసం నకిలీ పత్రాలు సృష్టిస్తే ముడుపుల మత్తులో అనుమతులు మంజూరు చేసేస్తున్నారు.

వివాదంలో ఉన్న భూమికి అనుమతి
జిహెచ్‌ఎంసి పరిధిలోని భాగ్‌ హయత్‌నగర్‌లో సర్వే నంబర్ 103లోని రెండు ఎకరాల 12 గుంటల భూమి కోర్టు వివాదంలో ఉంది. దీనిలోని ఒక ఎకరం భూమికి అశోక్‌రెడ్డి, నర్సింహారెడ్డి జిపిఎ పొందారు. దానిని 2014లో వెంచర్ చేసి అమ్మేశారు. దీనిపై కోర్టు కేసు ఉండడంతో.. నరసింహారెడ్డి ఫిర్యాదు మేరకు, అప్పట్లో కోర్టు దీనికిచ్చిన అనుమతులను తోసిపుచ్చింది. అయితే, ఇదే వెంచర్‌కు 2016లో మళ్లీ ఒకే చెప్పారు బల్దియా టౌన్ ప్లానింగ్ అధికారులు. ఎల్‌ఆర్‌ఎస్‌, లేఅవుట్‌ లేకున్నా దీనికి అనుమతులిచ్చేశారు. 1976 గ్రామపంచాయితీ ఇచ్చిన లే అవుట్ కు ఒకే చెబుతూ నిర్మాణాల‌కు అనుమ‌తులు ఇచ్చారు. దీనిపై నర్సింహారెడ్డి మరోసారి కోర్టును ఆశ్రయించడంతో.. అనుమతులు ఇవ్వవద్దంటూ న్యాయస్థానం అధికారులను ఆదేశించింది. 

08:39 - June 16, 2017

హైదరాబాద్ : తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదించడంపై దృష్టి పెట్టారు ప్రైవేటు ట్రావెల్స్‌ యజమానులు. అందులో భాగంగా రిజిస్ట్రేషన్ పన్ను తక్కువగా ఉండే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంపై కన్నేశారు. టూరిజంను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో అరుణాచల్‌ ప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న అవకాశాన్ని కొంతమంది ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అరుణాచల్ ప్రదేశ్ లో రిజిస్ట్రేషన్ చేయించుకుని వచ్చి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బస్సులను తిప్పుతున్నారు. అక్కడ స్లీపర్‌ సీట్ల విధానం అమలులో ఉండటం.. బస్ బాడీ నిర్మాణానికి కూడా తక్కువ ఖర్చు అవుతుండటంతో ట్రావెల్స్‌ యజమానులు అరుణాచల్‌ వైపు క్యూ కడుతున్నారు.

నెలలో ఒక్కసారైనా బస్సులు
నిబంధనల ప్రకారం ఎక్కడ రిజిస్ట్రేషన్ చేయిస్తే అక్కడకు నెలలో ఒక్కసారైనా బస్సులు వచ్చి వెళ్తుండాలి. అలా చేయక పోవడంతో అనుమానం వచ్చిన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం తమ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ అయిన ఇతర రాష్ట్రాల బస్సుల రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. దీంతో మేల్కొన్న తెలంగాణ రవాణా శాఖ అధికారులు అరుణాచల్‌ ప్రదేశ్‌ నుంచి వస్తున్న బస్సులను సీజ్‌ చేసే పనిలో పడ్డారు. అరుణాచల్ ప్రదేశ్‌లో రిజిస్టర్ అయ్యి పలు రాష్ట్రాల్లో తిరుగుతున్న బస్సులు 935 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. వాటిలో తెలంగాణకు చెందినవి సగంపైనే ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయానికి గండికొట్టి ఇతర రాష్ట్రాల బస్సులను ఇక్కడ తిప్పి ఆర్టీసి నష్టాలకు కారణం అవుతున్నారని కార్మిక నేతలు చెబుతున్నారు.

ఆలస్యంగా మేల్కొన్న రవాణా శాఖ
టోల్‌గేట్ల వద్ద చెక్ పోస్టుల వద్ద సర్వే చేపట్టి అక్రమంగా తిరుగుతున్న ప్రైవేటు వాహనాల వివరాలను రవాణా శాఖ అధికారులకు ఇచ్చినా స్పందన లేదని కార్మిక సంఘాల నేతలు అంటున్నారు. మరోవైపు ఆలస్యంగా మేల్కొన్న రవాణా శాఖా అధికారులు ప్రయివేటు బస్సుల వివరాలు తమ వద్ద లేవనే విచిత్ర సమాధానం ఇస్తున్నారు. ఇప్పటికైనా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర పేరుతో రిజిస్ట్రేషన్ అయిన బస్సులను రవాణాశాఖ అధికారులు నిలిపివేయాలనిఆర్టీసీ కార్మిక సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు . 

08:37 - June 16, 2017

గుంటూరు :కంపెనీలు, సంస్థల్లో ఉద్యోగ, ఉపాధి కల్పనకు ఇంటర్వ్యూలు నిర్వహించడం సహజం.. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూల కల్చర్‌ రాజకీయ పార్టీలకు పాకినట్టుంది. ఇటీవల కాలంలో జనసేన పార్టీ కార్యకర్తల కోసం.. పరీక్షలు.. ఇంటర్వ్యూలు చేయగా.. తాజాగా వైసీపీ ఏకంగా తమ ఎమ్మెల్యేలకే ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ అనుసరిస్తున్న వ్యూహంలో భాగంగానే ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.

పక్కా వ్యూహంతో ముందుకు
వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ అధినేత జగన్‌ పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ సలహాలు, సూచనలను కచ్చితంగా అమలు పరుస్తున్నారు. ఇప్పటికే ప్రశాంత్‌ కిషోర్ బృందం... నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, కో-ఆర్డినేటర్ల నేతల పనితీరుపై సర్వే ప్రారంభించింది. గ్రామాల్లో పర్యటించి... అభ్యర్థుల పనితీరు.. గెలుపు..ఓటమిలపై పరిశీలన మొదలుపెట్టింది. ప్రజా సమస్యలపై వైసీపీ చేస్తున్న పోరాటాలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. దీంతో పాటు ఐఐటీ ఖరగ్‌పూర్‌ విద్యార్థులతో వివిధ కోణాల్లో ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకూ 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలకు ఈ ఇంటర్వ్యూలు నిర్వహించినట్టు సమాచారం. ముఖ్యంగా నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి... ఎటువంటి అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఎమ్మెల్యేల బలాలేంటి.. బలహీనతలేంటి అనే అంశాలపై ప్రధానంగా ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలను తన ఎన్నికల వ్యూహాలతో విజయతీరాలకు చేర్చిన ఖ్యాతి ప్రశాంత్‌ కిశోర్‌కు ఉంది. అందుకే, ఈసారి గెలుపుకోసం.. జగనమోహన్‌రెడ్డి ఆయన సలహాలు, వ్యూహాలను అనుసరిస్తున్నారు. మరి రాష్ట్రంలో ప్రశాంత్‌కిశోర్‌ సర్వేలు, ఇంటర్వ్యూలు జగన్‌కు ఏమేరకు సహకరిస్తాయో వేచి చూడాలి. 

08:35 - June 16, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బ్యూటీషియన్‌ శిరీష్‌ ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు పూర్తి చేశారు. ఉస్మానియా వైద్యులు అందజేసిన శిరీష శవపరీక్ష నివేదికను పోలీసులు పరిశీలించారు. శిరీష మెడ, చెవి, పెదవులపై బలమైన గాయాలు ఉన్నట్టు పోస్టుమార్టంలో నిర్థారణ అయింది. దీంతో ఈమెను ఎవరైనా హత్యచేసి ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నాలు చేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. నిఘా విభాగం కూడా ఈ కేసును దర్యాప్తు చేసింది. పశ్చిమ మండల డీసీపీ వెంకటేశ్వరరావు, ఇంటెలిజెన్స్‌ అధికారులు శిరీష ఆత్మహత్య చేసుకున్న గదిలోకి వెళ్లి రెండు గంటలకు పైగా వివిధ కోణాల్లో పరిశీలించారు. బయోమెట్రిక్‌ అమర్చే ప్రతినిధులను పిలిపించి శిరీష ఆత్మహత్య చేసుకున్న గదిని క్షణ్ణంగా తనిఖీ చేశారు. ఎవరెవరు శిరీష కార్యాలయానికి వచ్చి వెళ్లారన్న వివరాలు సేకరించారు. వారి థంబ్‌ప్రింట్‌ వివరాలపై ఆరా తీశారు.

ఘటనా స్థలానికి నిందితులు...
శిరీష ఆత్మహత్య కేసులో నిందితులుగా అనుమానిస్తున్న రాజీవ్‌, శ్రవణ్‌లను ఆర్‌జే స్టూడియోలోనే ఏడు గంటలపాటు పోలీసులు ప్రశ్నించారు. సాంకేతిక ఆధారాలతో నిందితులను విచారించారు. రాజీవ్‌, శ్రవణ్‌లను ఘటనా స్థలానికి తీసుకెళ్లి దర్యాప్తు జరిపారు. శిరీష ఆత్మహత్య కేసులో ప్రతి సన్నివేశాన్ని అత్యంత పకడ్బందీగా, అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. ఈ నెల 12న రాజీవ్‌, శ్రవణ్‌లతో కలిసి కుకునూరుపల్లికి వెళ్లి వచ్చాక శిరీష ఆత్మహత్య చేసుకొంది. ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలోనే కుకునూరుపల్లి ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ రెండు ఘటనలు సంచలనం సృష్టించాయి. అయితే, కుకునూరుపల్లి నుంచి వచ్చాక అసలు ఏం జరిగిందనే కోణంలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేశారు. శిరీషను ఎవరైనా హత్యచేసి .. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారా? అనే కోణంలో దర్యాప్తు పూర్తైంది. ఈ మధ్యాహ్నం నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టినప్పుడు వాస్తవాలు వెల్లడవుతాయి. 

06:59 - June 16, 2017

ఎడ్జ్‌బాస్టన్‌ : ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ-2017లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ ఫైనల్‌కు భారత్‌ చేరుకొంది. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరిగిన సెమీస్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తుచిత్తుగా ఓడించింది. తన అద్వితీయ ఆటతో అలరించింది. ప్రత్యర్థి నిర్దేశించిన 265 పరుగుల లక్ష్యాన్ని 40.1 ఓవర్లలో వికెట్‌ నష్టపోయి ఛేదించింది. రోహిత్‌శర్మ 129 బంతుల్లో పదిహేను ఫోర్లు, ఒక సిక్సర్‌ కొట్టి 123 పరుగులు సాధించాడు.

ముందుండి నడిపించిన కోహ్లీ
సారథి విరాట్‌కోహ్లీ 78 బంతుల్లో 13 ఫోర్లతో 96 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ 34 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో చెలరేగిపోయాడు. 46 పరుగులతో తన సూపర్‌ ఫామ్‌ కొనసాగించాడు. టీమిండియా 87 పరుగుల వద్ద 15వ ఓవర్‌లో ధావన్‌ వికెట్‌ కోల్పోయింది.ధావన్‌ నిష్క్రమణ తర్వాత సారథి విరాట్‌కోహ్లీతో కలిసిన రోహిత్‌ చెలరేగి ఆడాడు. ట్రోఫీలో తొలి శతకం బాదేశాడు. ఈ క్రమంలో కోహ్లీ అర్ధశతకం బాదాడు. ఇద్దరూ బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించారు. రెండో వికెట్‌కు 178 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. ఛాంపియన్స్‌ ట్రోఫీ-2004లో కెన్యాపై గంగూలీ, లక్ష్మణ్‌ల 161 పరుగుల రికార్డును బద్దలు చేశారు. ఈ క్రమంలోనే కోహ్లీ వన్డేల్లో అత్యంత వేగంగా 8000 పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా అవతరించాడు. 175 ఇన్నింగ్స్‌లో కోహ్లీ ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు.

రోహిత్ సెంచరీతో రికార్డ్...
ఇక రోహిత్‌ సాధించిన శతకం చరిత్ర పుటల్లోకి ఎక్కింది. అది ఇంగ్లాండ్‌ గడ్డపై ఓ క్రికెటర్‌ సాధించిన 1000వ శతకం కావడం అపూర్వం. ఇక ధావన్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీలో అత్యధిక పరుగులు (680) చేసిన భారతీయుడిగా ఘనతకెక్కాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీలో ధావన్‌ 680 పరుగులు చేశాడు. ఇంతకు ముందు 665 పరుగులు చేసిన గంగూలీని వెనక్కినెట్టాడు. అంతకు ముందు బంగ్లా ఇన్నింగ్స్‌లో తమీమ్‌ ఇక్బాల్‌ 82 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 70 పరుగులు చేశాడు. ముష్ఫికర్‌ రహీమ్‌ 85 బంతుల్లో నాలుగు ఫోర్లతో 61 పరుగులతో సాధించాడు.

ఐదోసారి ఫైనల్ కు భారత్ 
ఐసీసీ టోర్నీల్లో టీమిండియా ఫైనల్‌కు చేరడం ఇది పదో సారి కాగా, ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఐదోసారి. 2007లో టీ20 ప్రపంచకప్‌ లీగ్‌ మ్యాచ్‌లో పాక్‌ను బౌల్‌ఔట్‌లో ఓడించింది టీమిండియా. ఉత్కంఠగా జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో గెలిచింది. ఈ ఛాంపియన్స్‌ ట్రోఫీలోనూ లీగ్‌లో పాక్‌ను 124 పరుగుల తేడాతో చిత్తుచేసిన కోహ్లీసేన ఫైనల్‌లో చిత్తుగా ఓడించాలని ప్రతి భారతీయ అభిమాని కోరుకుంటున్నాడు.

నేడు దేశవ్యాప్తంగా రైతు ఉద్యమం

ఢిల్లీ : నేడు దేశవ్యాప్తంగా రైతు ఉద్యమం ప్రారంభం కానుంది. 67రైతు సంఘాలు దేశ వ్యాప్తంగా ప్రదర్శనకు పిలుపునిచ్చారు. రైతు సమస్యలు సరిష్యరించాలని డిమాండ్ తో ఈ ఉద్యమం చేయనున్నారు. 

నేడు దేశవ్యాప్తంగా రైతు ఉద్యమం

ఢిల్లీ : నేడు దేశవ్యాప్తంగా రైతు ఉద్యమం ప్రారంభం కానుంది. 67రైతు సంఘాలు దేశ వ్యాప్తంగా ప్రదర్శనకు పిలుపునిచ్చారు. రైతు సమస్యలు సరిష్యరించాలని డిమాండ్ తో ఈ ఉద్యమం చేయనున్నారు. 

Don't Miss