Activities calendar

17 June 2017

21:33 - June 17, 2017

హైతదరాబాద్ :మినీ వరల్డ్‌కప్‌లో అసలు సిసలు సమరానికి రంగం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్ధులు భారత్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య చాంపియన్స్‌ ట్రోఫీ టైటిల్‌ ఫైట్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. మహా భారత్‌, పాకిస్థాన్‌ సై అంటే సై అంటున్నాయి.

ఓ వైపు వన్డేల్లో ఎదురులేని భారత్‌.....మరోవైపు ఎప్పుడెలా ఆడుతుందో అంచనాలకు అందని పాకిస్థాన్‌....ఇరు జట్ల మధ్య చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ ఫైట్‌...క్రికెట్‌ అభిమానులకు ఇంతకు మించి కావాల్సిందేముంటుంది.

ఇప్పటికే చాంపియన్స్‌ ట్రోఫీ గ్రూప్‌-బీ లీగ్‌ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో పోటీపడిన భారత్‌...సునాయాస విజయం సాధించింది. గ్రూప్‌ మ్యాచ్‌ ఓటమికి బదులు తీర్చుకోవాలని పాకిస్థాన్‌ పట్టుదలతో ఉండగా......ఆల్‌రౌండ్‌ పవర్‌తో చిరకాల ప్రత్యర్ధిని చిత్తు చేయాలని భారత్‌ తహతహలాడుతోంది.

విరాట్‌ కొహ్లీ నాయకత్వంలోని భారత జట్టులో అందరూ మ్యాచ్‌ విన్నర్లే. బ్యాటింగ్‌లో శిఖర్ ధావన్‌, రోహిత్‌ శర్మ, యువరాజ్‌ సింగ్‌, ధోనీ, కేదార్‌ జాదవ్‌,హార్దిక్‌ పాండ్య బౌలింగ్‌లో జస్ప్రీత్‌ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, వంటి పేసర్లతో పాటు రవీందర్‌ జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌ వంటి మ్యాజిక్‌ స్పిన్నర్లతో ఎప్పటిలానే పవర్‌ఫుల్‌గా ఉంది.

ఆరంభ ఓవర్లలో భువనేశ్వర్‌ కుమార్‌...ఆఖరి ఓవర్లలో బుమ్రా...మిడిల్ ఓవర్లలో అశ్విన్‌,జడేజా ప్రత్యర్ధి బ్యాట్స్‌మెన్‌కు చెక్‌ పెడుతూనే ఉన్నారు.

బౌలింగ్‌లో మునుపెన్నడూ లేనంతలా పదునుగా ఉన్న భారత జట్టుకు ప్రధాన బలం బ్యాటింగ్‌ మాత్రమే అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటివరకూ టీమిండియా టాప్‌ త్రీ...ధావన్‌,రోహిత్‌ ,విరాట్‌ ఎంతలా ఆధిపత్యం ప్రదర్శించారో అందరికీ తెలిసిందే.

వికెట్‌ కీపర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ నాయకత్వంలోని పాకిస్థాన్‌ జట్టు సంచలనం సృష్టించాలని తహతహలాడుతోంది. ఫఖార్‌, బాబర్‌ ఆజమ్‌,అజర్‌అలీ, షోయబ్‌ మాలిక్‌, మహమ్మద్‌ హఫీజ్‌, సర్ఫరాజ్‌ అహ్మద్‌ వంటి బ్యాట్స్‌మెన్‌తో ....జునైద్‌ ఖాన్‌, మహమ్మద్‌ అమీర్‌, హసన్‌ అలీ, ఇమాద్‌ వసీమ్‌,రయీస్‌ వంటి బౌలర్లతో పాకిస్థాన్‌ జట్టు సైతం బలంగానే కనిపిస్తోంది.

పేస్‌ బౌలింగ్‌ ఎటాక్‌ భారత్‌కు ధీటుగానే ఉన్నా.....అనుభవజ్ఞుడైన ప్రధాన స్పిన్నర్‌ లేకపోవడం, బ్యాటింగ్‌లో నిలకడ లేకపోవడం పాకిస్థాన్‌ జట్టుకు పెద్ద మైనస్‌ పాయింట్‌.

లండన్‌లోని ఓవల్‌ క్రికెట్‌ స్టేడియం వేదికగా జరుగునున్న ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు కూడా లేకపోలేదు. చాంపియన్స్‌ ట్రోఫీ ఆఖరాటలో పాకిస్థాన్‌ జట్టు కంటే అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న విరాట్‌ ఆర్మీ హాట్‌ఫేవరెట్‌గా బరిలోకి దిగబోతోంది.

మరి చిరకాల ప్రత్యర్ధుల మధ్య జరుగనున్న ఫైనల్‌ ఫైట్‌లో ఒత్తిడిని అధిగమించి....టైటిల్‌ గెలిచే జట్టేదో తెలియాలంటే మరికొద్దిగంటలు సస్పెన్స్‌ భరించక తప్పదు.

21:28 - June 17, 2017

అమరావతి:ఎయిర్‌పోర్టు సిబ్బందిపట్ల టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి దురుసుగా వ్యవహరించిన తీరుపై చంద్రబాబు సీరియస్‌ అయ్యారు. అనంతపురం జిల్లా నేతలతో భేటీ అయిన చంద్రబాబు... జేసీ ప్రవర్తనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నేతల ప్రవర్తనను ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటారన్నారు. ఇలాంటి వ్యవహారాలతో పార్టీకి, ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని చంద్రబాబు అన్నారు. జేసీ తరహా ప్రవర్తన సరికాదని.. పార్టీకి చేటు తెస్తుందని అసహనం వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలోఉన్న నాయకులు సంయమనంతో వ్యవహరించాలని అనంత నేతలకు సూచించారు. అనంతపురం జెడ్పీ చైర్మన్‌ పదవిని పూల నాగరాజుకు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. ప్రస్తుత చైర్మన్‌ చమన్‌ స్థానంలో నాగరాజును నియమించాలని సూచించారు. పుట్టపర్తి పురపాలక చైర్మన్‌ గంగన్న చేత రేపు సాయంత్రంలోగా రాజీనామా చేయించాలని మంత్రి దేవినేని ఉమాను ఆదేశించారు. కొత్త అభ్యర్ధిని ఎన్నుకునే బాధ్యతను కూడా దేవినేనికే అప్పగించారు. ఈ సమావేశానికి మంత్రులు కాలువ, జవహర్, దేవినేని ఉమ, ఎంపీ కిష్టప్ప హాజరయ్యారు. అనంతపురం ఎంపి జెసి.దివాకరరెడ్డి, మంత్రి పరిటాల సునీత, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు.

21:25 - June 17, 2017

అమరావతి: నంద్యా అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు టిడిపి తరుపున భూమా బ్రహ్మానందరెడ్డి పేరును సీఎం చంద్రబాబు నాయుడు ఖరారు చేసినట్లు ఆ పార్టీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణ మూర్తి తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడుతో కర్నూలు జిల్లా నేతలు భేటీ అయ్యారు.

21:23 - June 17, 2017

హైదరాబాద్ : బంజారాహిల్స్‌లోని సాయి కిరణ్‌ ఆస్పత్రిపై వైద్యాధికారులు, టాస్క్‌ఫోర్స్ దాడులు చేశారు.. సాయి కిరణ్‌ ఆస్పత్రిలో సరోగసీ చేస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు జరిపారు.. ఈ తనిఖీల్లో అద్దెగర్భం ద్వారా 48మంది మహిళలు పిల్లల్ని కనబోతున్నారని గుర్తించారు..

21:22 - June 17, 2017

హైదరాబాద్: ప్రగతి భవన్‌లో తెలంగాణ కేబినెట్‌ సమావేశం ముగిసింది. కేసీఆర్‌ అధ్యక్షతన నాలుగు గంటలుగా సమవేశం జరిగింది. కేబినెట్‌ సమావేశంలో నాలుగు ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపారు. అలాగే రెవెన్యూ శాఖలో 2,506 పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా హోంశాఖలోని 18,355 పోస్టుల భర్తీపై కూడా చర్చించారు. ఇక హైదరాబాద్‌లో కొత్తగూడ-కొండపూర్‌ మధ్య ఫ్లైఓవర్‌, గ్రేడ్‌ సపరేటర్ల నిర్మాణానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

అఖిలప్రియతో విభేదాలు తొలిగినట్లే : ఏవీ సుబ్బారెడ్డి

అమరావతి: ఎన్నో ఏళ్లు భూమా నాగిరెడ్డితో కలిసి పనిచేశానని జనరేషన్ గ్యాప్ కారణంగానే అఖిలప్రియతో కొంత ఇబ్బంది తలెత్తిందని ఏవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడుతో కర్నూలు జిల్లా నేతలు భేటీ అయ్యారు. అనంతరం సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ...భూమా అఖిలప్రియతో ఉన్న విభేదాలు దాదాపు తొలిగినట్లేనని, కలిసి పనిచేసుకోవాలని చంద్రబాబు సూచించినట్లు సుబ్బారెడ్డి చెప్పారు.

సాయికిరణ్ ఆస్పత్రి సీజ్

హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెం.14లోని సాయికిరణ్ ఆస్పత్రి పై అధికారులు, టాస్క్ ఫోర్స్ దాడులు చేసింది. అద్దె గర్భం ద్వారా పిల్లలను కనిస్తున్నారని గుర్తించారు. 48 మంది అద్దె గర్భం ద్వారా పిల్లలకు జన్మనిచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. ఒక్కో కస్టమర్ నుండి రూ.లక్షల్లో ఆస్పత్రి సిబ్బంది వసూలు చేసినట్లు పేర్కొన్నారు. జన్మనిచ్చిన ఒక్కో మహిళకు రూ.3 లక్షలు ఇస్తున్నారు.

తెలంగాణ లో కొలువుల జాతర...

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన కొనసాగుతోంది. రాష్ట్ర రెవెన్యూ శాఖలో 2,506 ఉద్యోగాల నియామకానికి సీఎం ఆమోదం తెలిపారు. ఉద్యోగాల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ను ఆదేశించారు. 1000 వీఆర్‌ఏలు, 700 వీఆర్‌వోలు, 400 టైపిస్టులు, 100 డిప్యూటీ సర్వేయర్లు, రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో 100 మంది సర్వేయర్ల పోస్టులకు సీఎం ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది. అలాగే మరోవైపు రాష్ట్ర హోంశాఖలో పెద్దఎత్తున 18,355 ఉద్యోగాలను భర్తీచేసే అంశంపై మంత్రివర్గంలో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.

20:09 - June 17, 2017

హైదరాబాద్: నిద్రలోకి జారుకున్న ఏపీ కాంగ్రెస్...నల్లధనం లెక్కలు చెప్తమన్న స్విస్ బ్యాంకు, యవ్వనం జారిపోయిందంటున్న రసమయి..అంగన్ వాడీ అక్కల మీటింగులో ఆవేదన, సర్కారు బడిలోనే సర్కార్ టీచరు పిల్లలు... ఆసిపా బాద్ జిల్లాలో అద్భుతమైన సారూ, పాతపాలమూరు జిల్లాలో పడ్డ పిడుగు... మేకను మింగిన కొండ చిలువ...జనం కంట్లో పడ్డాక మనం ఊకుంటాము ఇత్యాది అంశాలతో 'మల్లన్న ముచ్చట్లు' కార్యక్రమంలో మల్లన్న మన ముందుకు వచ్చాడు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

19:22 - June 17, 2017

హైదరాబాద్: ఎలాంటి అంచనాలు లేకుండా.. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘రాజా మీరు కేక’. నలుగురు స్నేహితుల మధ్య సాగే కథనంతో తెరకెక్కింది. ఈ సినిమాలో నటించిన అజయ్ హేమంత్, లాస్య, నోయల్ '10టివి' స్టూడియో సందడి చేశారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

జేసీ తీరు పై చంద్రబాబు అసంతృప్తి

విజయవాడ: విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో సిబ్బంది పట్ల ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి దురుసుగా వ్యవహరించిన తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తంచేశారు. అనంతపురం జిల్లా నేతలతో భేటీ అయిన ఆయన ఈ సందర్భంగా జేసీ అంశాన్ని ప్రస్తావించారు. ఈ తరహా ప్రవర్తన సరికాదని, పార్టీకి చేటు తెస్తోందని అభిప్రాయపడ్డారు.

ప్రజా జీవితంలో ఉన్న నేతలు సమయమనంతో వ్యవహరించాలి:చంద్రబాబు

అమరావతి: ప్రజా జీవితంలో ఉన్న నేతలు సమయమనంతో వ్యవహరించాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. అనంతపురం జిల్లా నేతలతో భేటీఅయ్యారు. ఈ సమావేశంలో అనంతపురం జడ్పీ ఛైర్మన్‌ పదవిని పూల నాగరాజుకు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రస్తుత ఛైర్మన్‌ చమన్‌ స్థానంలో నాగరాజును నియమించాలని సూచించారు. పుట్టపర్తి పురపాలక ఛైర్మన్‌ గంగన్న చేత రేపు సాయంత్రం లోగా రాజీనామా చేయించాలని మంత్రి దేవినేని ఉమకు ఆదేశించారు. కొత్త అభ్యర్థిని ఎన్నుకునే బాధ్యతను కూడా ఆయనకే అప్పగించారు.

శంషాబాద్ ఎయిర్ పోర్టులో కారు డ్రైవర్ కిడ్నీప్

హైదరాబాద్‌: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో కారు డ్రైవర్‌ కిడ్నాప్‌ కలకలం రేపింది. స్పైస్‌ జెట్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన కారు డ్రైవరు జావీద్‌ అలీని ఐదుగురు ప్రైవేటు కారు డ్రైవర్లు కిడ్నాప్‌ చేశారు. నగరంలోని ఓ గదిలో బంధించి చితకబాదారు. కారు పార్కింగ్‌ విషయంలో ప్రైవేట్‌ డ్రైవర్లతో అలీ ఘర్షణ పడడంతో వారు కిడ్నాప్‌కు పాల్పడ్డారు. నిర్బంధంలో ఉన్న అలీ కిడ్నాపర్ల చెర నుంచి చాకచక్యంగా తప్పించుకుని విమానాశ్రయ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. డ్రైవర్‌ ఫిర్యాదు మేరకు ఐదుగురు కిడ్నాపర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.

18:44 - June 17, 2017
18:43 - June 17, 2017

అమరావతి: రైతులకు ఇన్‌ఫుట్‌ సబ్సిడీ కింద 1680 కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నామని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. ఇన్సూరెన్స్‌ కింద మరో 534 కోట్ల 22 లక్షల రూపాయలను విడుదల చేస్తామన్నారు. 13 లక్షల మందికిపైగా రైతుల నేరుగా వారి అకౌంట్లలో ఇన్‌ఫుట్‌ సబ్సిడీ జమ చేస్తామన్నారు. ఇదంతా పారదర్శకంగా జరుగుతుందని చెప్పారు.

18:41 - June 17, 2017

అమరావతి: రెండోదశ విద్యుత్‌ సంస్కరణలతో విద్యుత్ వ్యయం తగ్గిస్తున్నామని... ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. వచ్చే ఏడాదినాటికి రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు తగ్గించే పరిస్థితికి తీసుకువస్తామని తెలిపారు.. రాష్ట్రంలో చేపట్టిన నాలుగు భారీ సోలార్‌ విద్యుత్‌ పార్కుల్లో అనంతపురంలోని 250 మెగావాట్ల ప్లాంట్‌ పూర్తికావడంపై సంతృప్తి వ్యక్తం చేశారు.. రాష్ట్రంలో మొదలుపెట్టిన అన్ని ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేసితీరాలని అధికారుల్ని ఆదేశించారు.. రాష్ట్రంలో ప్రతి సాంకేతిక ఆవిష్కరణకు పేటెంట్‌ రిజిస్ట్రేషన్‌ జరగాలని సూచించారు.. పెట్టుబడులు, మౌళిక వసతుల కల్పనపై అమరావతిలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు..

18:40 - June 17, 2017

అమరావతి: కర్నూలు జిల్లా నేతల పంచాయతీపై చంద్రబాబు దృష్టి దృష్టి సారించారు. జిల్లా నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీ నంద్యాల ఉప ఎన్నిక, అభ్యర్థి ఎంపికపై చర్చిస్తున్నట్టు సమాచారం. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

18:37 - June 17, 2017

హైదరాబాద్: సింగరేణి ప్రాంతంలోని ఆరు జిల్లాల్లో కార్మికుల నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వారసత్వ ఉద్యోగాలను కొనసాగించాలంటూ మూడురోజులుగా కార్మికులు ఆందోళన చేస్తున్నారు.. కార్మిక సంఘాల నేతల అరెస్టులకు వ్యతిరేకంగా

బంద్‌ పిలుపుతో పలు ప్రాంతాల్లో వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతబడ్డాయి..

వారసత్వ ఉద్యోగ ప్రక్రియ కొనసాగించాలని...

వారసత్వ ఉద్యోగ ప్రక్రియ కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ సింగరేణి కార్మికులు మూడోరోజు వివిధ రకాలుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా ఇల్లందులో కార్మికులు పలుచోట్ల ఆందోళనకు దిగగా... కార్మిక సంఘాల నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాము శాంతియుతంగా ఆందోళనలు నిర్వహిస్తుంటే... పోలీసులు సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సింగరేణి కార్మికులు మండిపడుతున్నారు.

సమ్మెకు మద్దతుగా అఖిలపక్ష నేతలు

సింగరేణి కార్మికుల సమ్మెకు మద్దతుగా అఖిలపక్ష నేతలు కొత్తగూడెంలో కోల్‌బెల్ట్‌ బంద్‌కు పిలుపునిచ్చారు.. బంద్‌తో వ్యాపార, వాణిజ్య సంస్థలూ మూతబడ్డాయి.. కాంగ్రెస్‌, సీపీఐ, టీడీపీ, బీజేపీ, సీపీఎంతోపాటు కార్మిక సంఘాలు పట్టణంలో ర్యాలీలు నిర్వహించాయి.. పలు పార్టీల నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పెద్దపల్లి జిల్లాలో కార్మికులకు మద్దతుగా నిలిచిన సీఐటీయూ నేతల్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు... గోదావరిఖని చౌరస్తాలో ధర్నా చేస్తున్న సిఐటియు నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

కోల్‌బెల్ట్‌ ప్రాంతాల్లో కూడా బంద్‌...

అసిఫాబాద్‌, మంచిర్యాల, భూపాలపల్లి, భద్రాద్రి జిల్లాల్లోని కోల్‌బెల్ట్‌ ప్రాంతాల్లో కూడా బంద్‌ చేపట్టారు.. గోదావరిఖనిలో బంద్‌కు మద్దతుగా ర్యాలీగా వెళుతున్న కార్మిక సంఘాల నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు.. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబుతోపాటు వందమందిని అరెస్ట్‌ చేశారు..

వారసత్వ ఉద్యోగాల న్యాయపరమైన చిక్కుల్ని పరిష్కరించడంలో

వారసత్వ ఉద్యోగాల న్యాయపరమైన చిక్కుల్ని పరిష్కరించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని.. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు.. గుర్తింపు సంఘం ఎన్నికలకోసం ఆదరాబాదరాగా ఉద్యోగాల భర్తీకి సిద్ధం కావడంవల్లే ఈ పరిస్థితి వచ్చిందని సిద్ధిపేటలో ఆయన ఆరోపించారు.. సమ్మెపై ప్రభుత్వం స్పందించకపోవడంతో...ఆందోళనలు ఉధృతం చేయాలని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. వారసత్వ ఉద్యోగాల్ని పునరుద్ధరించేవరకూ పోరాటం కొనసాగిస్తామని కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు.

18:34 - June 17, 2017

నిజామాబాద్: 2018 ఖరీఫ్‌నాటికి కాళేశ్వరం ప్రాజెక్టుద్వారా గోదావరి జలాలను నిజాంసాగర్‌ తీసుకువస్తామని... మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు.. ఏడాదికి రెండు పంటలకు నీరందిస్తామని చెప్పారు.. పేదల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు.. నిజామాబాద్ జిల్లా రుద్రూర్‌ మండలంలో మంత్రి సుడిగాలి పర్యటన జరిపారు.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు..

18:32 - June 17, 2017

రంగారెడ్డి : జిల్లా శంషాబాద్‌ మండలం ఘన్‌సిమియాగూడలో గోల్డ్‌స్టోన్‌ ప్రసాద్‌ ఆక్రమిత భూములను టీడీపీ నేతలు పరిశీలించారు. రైతులకు మద్దతుగా ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో రాష్ట్ర అధ్యక్షుడు రమణ, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డితో సహా పలువురు నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతుందన్నారు రేవంత్‌రెడ్డి. ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల భూఆక్రమణదారులకు బెయిల్‌ వచ్చిందన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు రేవంత్‌రెడ్డి.

తెలంగాణ కేబినెట్ భేటీ

హైదరాబాద్: ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభం అయ్యింది. సంచలనం సృష్టించిన మియాపూర్‌ భూ కుంభకోణంపై కఠిన చట్టాలను తీసుకొచ్చే దానిపై తెలంగాణ సర్కార్‌ ఫోకస్‌ పెట్టింది. ప్రస్తుతం ఉన్న చట్టాలను ర్యాడిపికేషన్‌ ద్వారా మార్పులు చేసేందుకు సిద్ధమవుతోంది. శనివారం సాయంత్రం జరిగే కేబినెట్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నారు. మూడేళ్ల పాలన, భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు, కొత్త పథకాల ప్రారంభంతో పాటు రాజకీయపరమైన అంశాలపైనా మంత్రివర్గం చర్చించనున్నట్లు సమాచారం.

17:00 - June 17, 2017

పశ్చిమ బెంగాల్‌ :డార్జిలింగ్‌లో గూర్ఖా జనముక్తి మోర్చా ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యమం హింసాత్మకంగా మారింది. పోలీసులు, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణలో ఇండియన్‌ రిజర్వ్‌ బెటాలియన్‌కు చెందిన అసిస్టెంట్‌ కమాండర్‌ ప్రాణాలు కోల్పోయారు. పోలీస్‌ అధికారిని ఆందోళనకారులు కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. భద్రతాదళాలు జరిపిన కాల్పుల్లో జిజెఎంకు ఇద్దరు కార్యకర్తలు మృతి చెందినట్లు గూర్ఖా జనముక్తి మోర్చా ఆరోపిస్తోంది. జిజెఎం మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళన కూడా ఉద్రిక్తతకు దారితీసింది. భారీ ఎత్తున తరలివచ్చిన మహిళా ఆందోళనకారులు ప్రత్యేక గూర్ఖాలాండ్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. పోలీసులు మహిళా ర్యాలీని అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. డార్జిలింగ్‌ ప్రత్యేక ప్రతిపత్తిని కోరుతూ గుర్ఖా జనముక్తి మోర్చా చేపట్టిన ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. జిజెఎం నిరవధిక బంద్‌కు పిలుపునివ్వడంతో జనజీవనం స్తంభించింది.

16:59 - June 17, 2017

కడప : వైఎస్‌ కుటుంబానికి పెట్టనికోటగా ఉండే... కడపలో జగన్‌ పట్టు నిలుపుకునే పనిలో పడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బాబాయ్ వివేకా ఓటమితో ... ఉలికిపడ్డ వైసీపీ .. జిల్లాపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. జిల్లాపై వైఎస్‌ జగన్ కుటుంబం మార్క్‌ కోల్పోకుండా... జగన్ వ్యూహాలు రచిస్తున్నారు.

పట్టు నిలుపుకునే ప్రయత్నంలో వైసీపీ

కడప జిల్లాలో తన ప్రాబల్యాన్ని నిలుపుకోవడానికి వైసీపీ ప్రయత్నిస్తుంది. వివేకా ఓటమిపై విశ్లేషణలు చేసుకుంటూ... ముందుకు కదులుతుంది. ఇందులో భాగంగా టీడీపీలోని అసంతృప్త నేతలకు గాలం వేయాలని ప్రయత్నిస్తోంది. వైఎస్ రాజారెడ్డి నుంచి రాజశేఖర రెడ్డి వరకు.. అంచెలంచలుగా జిల్లాలో తమ రాజకీయ బలాన్ని పెంచుకుంటూ వచ్చారు. వారి వారసత్వాన్ని జగన్ అందిపుచ్చుకున్నారు. అయితే ఇటీవల కాలంలో జిల్లాలో కొంత మేరకు వైసీపీ బలహీనపడుతుందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. జిల్లాలో పట్టు కోల్పోతున్నామన్న భావన జగన్‌లో కూడా ఉందని అంటున్నారు.

జగన్ వ్యవహర శైలిపై స్థానిక నాయకుల్లో అసహనం

జగన్ వ్యవహార శైలి వల్ల కూడా పార్టీలో నేతలు అసహనానికి గురవుతున్నట్టు తెలుస్తోంది. జగన్‌ వైఖరి కారణంగా చాలామంది పార్టీ నుంచి దూరమైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ పరిణామాల దృష్ట్యా జగన్‌ జిల్లాపై దృష్టి సారించారు. దీంతో ఒక్క పులివెందులకే పరిమితం కాకుండా.. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే నెలలో రెండు రోజులు జిల్లాలో పర్యటిస్తూ.. ప్రజల సమస్యలను వింటున్నారు. దీంతో పాటు ప్రతి నియోజకవర్గంలో పర్యటించాలనే యోచనలో ఉన్నారు. అదే సందర్భంలో టీడీపీ వ్యూహాలకు ప్రతి వ్యూహాలు పన్నుతున్నారు జగన్.

టీడీపీలో అసంతృప్తి నేతలకు గాలం...

ప్రధానంగా టీడీపీలో ఉంటూ అసంతృప్తిలో ఉన్న బలమైన నేతలను వైసీపీలోకి ఆహ్వానించాలని అనుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే టీడీపీలోని నాయకుల వద్దకు తన దూతలను పంపించాలని యోచిస్తున్నారు. జమ్మలమడుగులో ఆది నారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంపై రామసుబ్బారెడ్డి అసంతృప్తితో ఉన్నారు. దీంతో రామసుబ్బారెడ్డిని ఎలాగైనా పార్టీలోకి తీసుకురావాలని జగన్ ప్రయత్నిస్తున్నారు. అలాగే రాయచోటిలో మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు వర్గాన్ని కూడా వైసీపీలోకి ఆహ్వానించాలని జగన్ యోచిస్తున్నారు. మరోవైపు టీడీపీ కూడా జిల్లాపై పట్టు సంపాదించేందుకు తీవ్రంగా శ్రమిస్తుంది. అధికార, ప్రతిపక్షాల వ్యూహ ప్రతి వ్యూహాలతో వచ్చే ఎన్నికల నాటికి ఎవరు ఏ పార్టీలో ఉంటారనేదానిపై సందిగ్థత నెలకొంది.

16:56 - June 17, 2017

హైదరాబాద్: నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. వచ్చే రెండేళ్లలో ఎన్నికలు జరగనుండటంతో అధికార టిఆర్‌ఎస్, ప్రతిపక్ష పార్టీల నేతలు పార్టీలను బలపరుచుకునే పనిలో పడ్డారు. సీయం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా టిఆర్‌ఎస్ నేతలు ముందుకు పోతుంటే.. ప్రతిపక్ష పార్టీల నేతలు పట్టుకోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు.దీంతో జిల్లాల్లో రాజకీయం వేడెక్కుతోంది. .

నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసిన సీఎం కేసీఆర్

తాజాగా నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసిన సీఎం కేసీఆర్ నిజామాబాద్ మార్కెట్ కమిటీ మినహా.. ఉభయ జిల్లాల పరిదిలోని వ్యవసాయ మార్కెట్ కమిటీల నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఉభయ జిల్లాల పరిధిలో 10 వరకు దేవాదాయ కమిటీలను నియమించారు. దీంతో పార్టీ నేతల్లో హర్షం వ్యక్తం అవుతోంది. వారంతా గ్రామస్ధాయి నుంచి పార్టీని బలోపేతం చేసే దిశగా దృష్టి సారిస్తున్నారు. అధిక సంఖ్యలో పార్టీ సభ్యత్వ నమోదుపై దృష్టిపెట్టారు. పార్లమెంట్ సెగ్మెంట్‌లో రెండు సీట్లు పెరిగే అవకాశం ఉండటంతో రెండు జిల్లాలపై దృష్టి పెట్టారు నేతలు. రెండు జిల్లాల పరిధిలోను కొన్ని నెలలుగా ప్రతిపక్ష పార్టీల నేతలు సైతం జోరుగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అధికార పార్టీ నేతలను, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ధర్నాలు , ఆందోళనలు చేస్తున్నారు.

పట్టు సాధించే పనిలో కాంగ్రెస్, టిడిపి, బిజెపి

మరోవైపు కాంగ్రెస్, టిడిపి, బిజెపి నేతలు జిల్లాలో మరింత పట్టుకోసం ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ మధ్యనే సంగారెడ్డి జిల్లా కేంద్రంలో రాహుల్ సభను విజయవంతం చేయడంలో కాంగ్రెస్ నేతలు కీలక పాత్ర పోషించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గ ఇంఛార్జ్‌లు కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. రైతులు ఇతర వర్గాలతో కలిసి సమస్యలపై ఉద్యమిస్తున్నారు. ఇదే పంథాలో పయనిస్తున్నారు టిడిపి నేతలు.

అమిత్ షా పర్యటనతో బిజెపిలో వచ్చిన చలనం

గత నెలలొ బిజెపి జాతీయ అద్యక్షులు అమిత్ షా నల్గొండ జిల్లా పర్యటన తరువాత బిజెపి నేతలలో చలనం వచ్చింది. నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల పరిధిలో బిజెపి నేతలు ఇంటింటికి బిజెపి కార్యక్రమం చేపట్టారు. గ్రామస్ధాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. ఈనెలలో రెండురోజుల పాటు ఉభయజిల్లాల్లో పర్యటించిన కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. వామపక్ష పార్టీలైన సీపీఎం, సిపిఐలు కూడా ప్రజా సమస్యలపైనే దృష్టి పెట్టాయి. జిల్లాలో పలు ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వామపక్షాల నేతలు. ఏది ఏమైనా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఈసారి రాజకీయాలు వాడి వేడిగా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో అన్ని పార్టీలు మధ్య పోటీ గట్టిగానే ఉండేలా కనిపిస్తోంది.

కాసేపట్లో తెలంగాణ కేబినెట్

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మియాపూర్‌ భూ కుంభకోణంపై కఠిన చట్టాలను తీసుకొచ్చే దానిపై తెలంగాణ సర్కార్‌ ఫోకస్‌ పెట్టింది. ప్రస్తుతం ఉన్న చట్టాలను ర్యాడిపికేషన్‌ ద్వారా మార్పులు చేసేందుకు సిద్ధమవుతోంది. శనివారం సాయంత్రం జరిగే కేబినెట్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నారు. మూడేళ్ల పాలన, భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు, కొత్త పథకాల ప్రారంభంతో పాటు రాజకీయపరమైన అంశాలపైనా మంత్రివర్గం చర్చించనుంది.

16:53 - June 17, 2017

అమరావతి: జీఎస్టీ విషయంలో వైసీపీ రెండు నాలుకల ధోరణి అవలంభిస్తోందని ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. కేంద్రంలో జీఎస్టీ బిల్లుకు మద్దతిచ్చిన వైసీపీ... రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వం మీదికి కొందరిని రెచ్చగొట్టాలని చూస్తోందన్నారు. చేనేత, గ్రానైట్‌, టీటీడీ లాంటి విభాగాల మీద పన్నుల భారం పెరగకుండా చూడటానికి తాము ప్రయత్నిస్తున్నామన్నారు. వీటిపై జీఎస్టీ కౌన్సిల్‌ ముందు ప్రతిపాదనలు పెట్టామన్నారు. జీఎస్టీతో రాష్ట్రానికి నష్టం జరుగకుండా చూస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఆర్టీసీ బస్సు బోల్తా : ఒకరి మృతి

సిద్ధిపేట : కొండపాక మండలం దుద్దెడ వద్ద వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న స్థానికులు, పోలీసులు కలిసి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వేములవాడ డిపోకు చెందిన బస్సు (టీఎస్ 02 యూఏ 9903) వేములవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

డార్జిలింగ్ లో హింసాత్మకం...పోలీసు మృతి

డార్జిలింగ్‌: ప్రత్యేక గూర్ఖాలాండ్‌ డిమాండ్‌ చేస్తూ గుర్ఖా జనముక్తి మోర్చా (జీజేఎం) చేస్తున్న ఆందోళన హింసాత్మకంగా మారింది.పోలీసులు, ఆందోళనకారులకు మధ్య శనివారం జరిగిన ఘర్షణలో ఓ పోలీస్‌ అధికారి ప్రాణాలు కోల్పోయారు. ఇండియన్‌ రిజర్వ్‌ బెటాలియన్‌కు చెందిన అసిస్టెంట్‌ కమాండర్‌ను ఆందోళనకారులు పొడిచి హత్య చేసినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. మరోవైపు భద్రతాసిబ్బంది జరిపిన కాల్పుల్లో ఇద్దరు జీజేఎం మద్దతుదారులు మృతిచెందినట్లు ఆ పార్టీ ఆరోపిస్తోంది.

నాగరాజు పోస్టుమార్టం వాయిదా

కరీంనగర్ : వరంగల్‌ క్లినికల్‌ ట్రయల్‌ ఘటనలో పోస్టుమార్టమ్ వాయిదా పడింది. నాగరాజు మృతదేహం పోస్టుమార్టంపై సీఐ ప్రశాంత్‌రెడ్డి.. కలెక్టర్‌, సీపీతో చర్చించారు. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఫోరెన్సిక్‌ నిపుణులతో... పోస్టుమార్టం నిర్వహించాలని సీఐ ప్రశాంత్‌రెడ్డి నిర్ణయించారు. వరంగల్‌ కేఎంసీకి పోస్టుమార్టం కోసం జమ్మికుంట పోలీసులు విజ్ఞప్తి చేశారు. దీనిపై రెండు రోజుల్లో గ్రీన్‌సిగ్నల్‌ వచ్చే అవకాశం ముంది. దీంతో సోమ లేదా మంగళవారం ఫోరెన్సిక్‌ బృందం పోస్టుమార్టం నిర్వహించే అవకాశాలున్నాయి.

 

16:06 - June 17, 2017

కరీంనగర్ : వరంగల్‌ క్లినికల్‌ ట్రయల్‌ ఘటనలో పోస్టుమార్టమ్ వాయిదా పడింది. నాగరాజు మృతదేహం పోస్టుమార్టంపై సీఐ ప్రశాంత్‌రెడ్డి.. కలెక్టర్‌, సీపీతో చర్చించారు. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఫోరెన్సిక్‌ నిపుణులతో... పోస్టుమార్టం నిర్వహించాలని సీఐ ప్రశాంత్‌రెడ్డి నిర్ణయించారు. వరంగల్‌ కేఎంసీకి పోస్టుమార్టం కోసం జమ్మికుంట పోలీసులు విజ్ఞప్తి చేశారు. దీనిపై రెండు రోజుల్లో గ్రీన్‌సిగ్నల్‌ వచ్చే అవకాశం ముంది. దీంతో సోమ లేదా మంగళవారం ఫోరెన్సిక్‌ బృందం పోస్టుమార్టం నిర్వహించే అవకాశాలున్నాయి.

కర్నూలు జిల్లా నేతలతో చంద్రబాబు భేటీ

అమరావతి: కర్నూలు జిల్లా నేతల పంచాయతీపై చంద్రబాబు దృష్టి దృష్టి సారించారు. కాసేపట్లో జిల్లా నేతలతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ భేటీ నంద్యాల ఉప ఎన్నిక, అభ్యర్థి ఎంపికపై చర్చించే అవకాశం ఉంది.

డార్జిలింగ్‌లో కొనసాగుతున్న గూర్ఖా జనముక్తి మోర్చా ఆందోళన

పశ్చిమ బెంగాల్‌ : డార్జిలింగ్‌లో గూర్ఖా జనముక్తి మోర్చా ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. జిజెఎం మహిళా విభాగం ఆధ్వర్యంలో నిహ్వహించిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. భారీ ఎత్తున తరలివచ్చిన మహిళా ఆందోళనకారులు ప్రత్యేక గూర్ఖాలాండ్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. పోలీసులు మహిళా ర్యాలీని అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. మరోచోట జిజెఎం కార్యకర్తలు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు లాఠీ చార్జ్‌ జరిపి, భాష్పవాయువు ప్రయోగించారు.

16:03 - June 17, 2017

అమరావతి: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు అనుమతిచ్చేది లేదని ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. కాపులను ప్రభుత్వంపైకి రెచ్చగొట్టేలా ముద్రగడ పద్మనాభం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాపు రిజర్వేషన్లపై తమ ప్రభుత్వం న్యాయం చేస్తుందని స్పష్టం చేశారు. ముద్రగడ కుట్రలకు యువత లోనుకావొద్దని ఆయన కోరారు.

 

16:00 - June 17, 2017
15:58 - June 17, 2017

కాగజ్ నగర్ : అతనొక మామూలు స్కూల్‌ టీచర్. సమాజ సేవ చేయాలనే పట్టుదలతో.. అక్రమార్కులకు దడ పుట్టించాడు. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్‌తో ప్రభుత్వ సొమ్మును.. ఏకంగా 20 కోట్లు రికవరీ చేయించాడు. తప్పుడు మెడికల్ బిల్లులతో ప్రభుత్వానికి టోపీ వేసిన అధికారుల గుట్టు రట్టు చేశాడు. తన ఇద్దరు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి.. అందరికీ ఆదర్శంగా నిలుస్తోన్న ప్రభుత్వ టీచర్‌ పై 10 టీవీ ప్రత్యేక కథనం.

సమాజానికి మంచి చేయాలంటే

సమాజానికి మంచి చేయాలంటే నాయకులే కానక్కర్లేదు. అవినీతిని అణగదొక్కాలంటే అసాధ్యుడే కానక్కర్లేదు. మనస్సులో దేశం పట్ల ప్రేమ.. సమాజం పట్ల బాధ్యత ఉంటే చాలని నిరూపించాడు ఒక స్కూల్‌ టీచర్. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, కాగజ్‌నగర్‌ పట్టణానికి చెందిన మహ్మద్‌ అష్రఫ్‌.. నిరుపేద కుటుంబంలో పుట్టాడు. చిన్నతనం నుంచే ఎన్నో కష్టాలు అనుభవించి.. ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించాడు. పేదల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ..ప్రభుత్వ పథకాలపై దృష్టి పెట్టాడు. ప్రభుత్వ శాఖలలో జరుగుతున్న అక్రమాలను బయటకు తీసే పనిలో పడ్డాడు. ఇప్పటివరకు అష్రఫ్‌ ప్రభుత్వ శాఖలలో జరిగిన అక్రమాలను.. ఆర్టీఐ యాక్ట్‌ ద్వారా బయటకు తీసి దాదాపు 20 కోట్లను ప్రభుత్వానికి రికవరీ చేయించాడు. బెస్ట్‌ ఆర్టీఐ యాక్విస్ట్‌గా అవార్డు కూడా తీసుకున్నాడు.

ఇంగ్లిష్ స్కూల్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న మహ్మద్‌ అష్రఫ్‌

మహ్మద్‌ అష్రఫ్‌ సిర్పూర్‌ మండల కేంద్రంలోని.. జిల్లా పరిషత్ స్కూల్లో ఇంగ్లిష్‌ స్కూల్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పేదలు, గిరిజనుల సాధక బాధకాలు తెలిసిన ఈ టీచర్‌.. 2004లో జాగృతి యువమంచ్‌ సేవ సంస్థను స్థాపించారు. ఎన్నో ఉపయోగకరమైన సేవలు మొదలుపెట్టాడు. అదే సమయంలో ఆర్టీఐ యాక్ట్‌ రావడంతో అతనికి ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలను బయటకు తీసే గొప్ప అవకాశం దొరికింది. 2006 నుంచి ఇప్పటివరకు కొన్ని వందల ఆర్టీఐ సమాచార లెటర్స్‌ వేశాడు. ఎన్నో అక్రమాలను బయటకు తీశాడు. ఫేక్‌ మెడికల్ బిల్లుల విషయం ఆర్టీఐ యాక్ట్ ద్వారా బయటకు తీయటం అప్పట్లో సంచలనం రేపింది. ఒకేసారి 2 కోట్లు రికవరీ చేశాడు. ఆ కేసులో కాగజ్‌నగర్‌ మండలం దరిగాం లాంటి మారుమూల గిరిజన గ్రామానికి మెటల్‌ రోడ్డు సౌకర్యం వచ్చేలా చేశాడు.

ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, నిజామాబాద్‌

ఉమ్మడి జిల్లాలైన ఆదిలాబాద్, కరీంనగర్‌, వరంగల్‌, నిజామాబాద్‌లలోని మున్సిపల్‌ కార్మికులకు ఇఎస్‌ఐ, పిఎఫ్‌ వచ్చేలా పోరాటం చేశాడు. ఇలా ఆర్టీఐ యాక్ట్‌ ద్వారా ప్రతీ ప్రభుత్వ శాఖలలో అక్రమాలు బయటకు తీసి.. 20 కోట్ల రూపాయలు రికవరీ చేయించాడు. ఈ క్రమంలో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో పురస్కారాలు, పదికి పైగా అవార్డులు, ఉత్తమ ప్రభుత్వ టీచర్‌ అవార్డులను అందుకున్నాడు.

అష్రఫ్‌ తన ఇద్దరు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో

అష్రఫ్‌ తన ఇద్దరు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాడు. కాగజ్‌నగర్‌ పెట్రోల్‌ పంప్‌ ఏరియాలోని మండల పరిషత్ స్కూల్లో వీరి పిల్లలు చదవడంతో.. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలను కూడా చేర్పించేందుకు కృషి చేస్తున్నాడు. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

ఎన్నో ఇబ్బందులు, తరచూ బెదిరింపులు

ఇంతటి సుదీర్ఘమైన పోరాటంలో మహ్మద్‌ అష్రఫ్‌ ఎన్నో ఒడిదుడుకులను ఎదురుకున్నాడు. కొందరు అక్రమార్కులతో ఎన్నో ఇబ్బందులు, తరచూ బెదిరింపులు, పోలీసు కేసులు, దాడులను సైతం జయించి అలుపెరగని పోరాటం చేస్తున్నాడు. ఈ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి ఎవరైనా సలాం చెప్పాల్సిందే.

15:55 - June 17, 2017

విశాఖ : ఒకటి కాదు రెండు కాదు వేలాది ఎకరాల భూమి అన్యాక్రాంతమయ్యింది. న్యాయం వైపు ఉండాల్సిన అధికారులు.. రోజుకో మాట మాట్లాడుతున్నారు. ఓ వైపు ప్రతిపక్షాలు భూ భాగోతాలపై.. సీబీఐ విచారణ జరపాలంటుంటే మరోవైపు ప్రభుత్వం సిట్‌ దర్యాప్తు అంటూ చేతులు దులుపుకుంది. విశాఖలో భూముల అన్యాక్రాంతంపై 10 టీవీ ప్రత్యేక కథనం

ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయని ఆరోపణలు

విశాఖ జిల్లాలో వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయనే.. అరోపణలు గుప్పుమంటున్నాయి. సాక్షాత్తూ జిల్లా అధికారులే విశాఖలో వేలాది ఎకరాల భూమి అన్యాక్రాంతమయ్యిందనీ.. లక్షకు పైగా ఎఫ్ఐబీలు కనిపించకుండా పోయాయని చెప్పారు. విశాఖ నగరం నడిబొడ్డున ఉన్న దస్ పల్లా ల్యాండ్స్‌లో 40 ఎకరాలు అక్రమార్కుల పాలయ్యింది. దీని వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ప్రతిపక్షాలు అరోపిస్తున్నాయి.

తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేసిన ప్రతిపక్షాలు

ఇంతకాలం మంత్రి నారా లోకేశ్‌ను టార్గెట్‌ చేసుకొని ఈ విమర్శలు కొనసాగాయి. ఈ ల్యాండ్ వ్యవహారంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో అందోళనలు చేయడంతో పాటు.. సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నాయి. అఖిలపక్షం ఆధ్వర్యంలో వైసీపీ, సీపీఎం, సీపీఐ తదితర పార్టీలు కలిసి ముదపాక, కొమ్మాధి మధురవాడ భూములలోను పరిశీలించడం జరిగింది. విశాఖలో జరుగుతున్న భూ ఆక్రమణలకు అక్కడ ఉన్న వలస నేతలే బాధ్యులని మంత్రి అయ్యన్నపాత్రుడు.. పరోక్షంగా గంటా శ్రీనివాసరావును, ఆయన అనుచరులను విమర్శించారు. పైగా ఆరోపణలు ఎదురుకొంటున్న వారంతా గంటా ఆయన అనుచరులే కావడం విశేషం.

బహిరంగ విచారణ చేపడతానన్న ప్రభుత్వం...

ఇదే సమయంలో విశాఖలో జరిగిన భూ కుంభకోణాలపై.. ఈ నెల 15న బహిరంగ విచారణ చేపడుతున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. విశాఖలో మంత్రి నారా లోకేశ్‌ టూర్ నిర్వహించిన రోజే కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టారు. అన్యాక్రాంతమయిన భూములు కేవలం 280 ఎకరాలు మాత్రమే అని ప్రకటించారు. మిగిలిన వాటిపై ఎంక్వైరీ జరుగుతుందని తెలిపారు. దీంతో మరో సారి ప్రతిపక్షపార్టీలు భగ్గుమన్నాయి. ముఖ్యమంత్రి తనయుడు మంత్రి నారా లోకేశ్‌ విశాఖలో ఉన్న రోజునే ఇలాంటి ప్రకటన రావడం వెనక పభుత్వ పెద్దల హస్తం ఉందని అరోపణలు వినిపిస్తున్నాయి.

సీబీఐ విచారణ చేయాలని ప్రతిపక్షాల డిమాండ్

విచారణ నిస్పక్షపాతంగా జరగాలంటే సీబీఐ విచారణ చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రభుత్వం మాత్రం ప్రతిపక్షాల మాటను పక్కడ పెడుతూ భూ బాగోతాలపై సిట్ విచారణకు అదేశించింది. రెవెన్యూ ఉద్యోగులతో పాటు పోలీసులు, ఉద్యోగులు ఈ సిట్‌లో సభ్యులుగా ఉంటారని తెలిపింది. దీనినే ప్రతిపక్షాలు అస్ర్తాలుగా చేసుకున్నాయి. జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటుగా ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని అరోపిస్తున్నాయి. నిందితులకు శిక్షపడాలంటే స్వతంత్ర సీబీఐ విచాణ జరగాలని.. సిట్ విచారణను ప్రతిపక్ష నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ప్రభుత్వ పెద్దల హస్తం ఉండటం వల్లనే ప్రభుత్వం సీబీఐ విచారణకు వెనుకాడుతుందని ఆరోపిస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం సిట్ ఎంక్వైరీ సరిపోతుందని దానికి జిల్లా యంత్రాంగం పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెబుతున్నారు.

15:52 - June 17, 2017

ఢిల్లీ: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌లో ఆదివారం పాక్‌, భారత్‌ తలపడబోతున్నాయి.. బ్యాటింగ్‌, బౌలింగ్, ఫీల్డింగ్‌ విభాగంలో బలంగాఉన్న కోహ్లీసేన... ఈ సిరీస్‌లోనే ఓ మ్యాచ్‌లో పాక్‌ను ఓడించింది.. రేపటి మ్యాచ్‌ ఎలా జరిగే అవకాశముంది.. క్రికెట్‌ ఎనలిస్టులు సుధీర్‌, విజయ్‌లతో చిట్ చాట్... పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి....

రెవెన్యూశాఖలో 137 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్ : తెలంగాణ లో రెవెన్యూశాఖలో 137 పోస్టుల భర్తీ టీ.సర్కార్ నిర్ణయం తీసుకుంది. టీఎస్ పీఎస్సీ ద్వారా పోస్టులు భర్తీ చేయాలని ఆదేశించింది. సీసీఎల్ ఏలో 109 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, 13 సీనియర్ స్టెనో, 15 జూనియర్ స్టెనో పోస్టుల భర్తీకీ ఆదేశాలు జారీ చేశారు.

'వారసత్వ ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది '

పెద్దపల్లి: వారసత్వ ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది అని సింగరేణి డైరెక్టర్ తెలిపారు. సాంకేతిక కారణాలతో ఆలస్మవుతోందని, జాతీయ కార్మిక సంఘాలు, కార్మికులను తప్పుదోవపట్టిస్తూ సమ్మెలకు పిలుపునిచ్చాయని ఆరోపించారు. మామూలు రోజులకంటే సమ్మె కాలంలో 13 శాతం బొగ్గు ఉత్పత్తి పెరిగిందని తెలిపారు.

చెంచల్ గూడ జైలుకు శ్రవణ్, రాజీవ్

హైదరాబాద్‌:బ్యుటీషియన్‌ శిరీష ఆత్మహత్య కేసులో నిందితులైన శ్రవణ్‌, రాజీవ్‌లను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో నిందితులైన ఇద్దరినీ బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ నుంచి నేరుగా ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పోలీసులు నాంపల్లి న్యాయస్థానంలో హాజరుపరిచారు. శిరీష ఆత్మహత్య ఘటనపై విచారించిన న్యాయస్థానం నిందితులిద్దరికీ 14 రోజుల పాటు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. దీంతో శ్రవణ్‌, రాజీవ్‌లను పోలీసులు చంచల్‌గూడ కారాగారానికి తరలించారు.

14:52 - June 17, 2017

జమ్మికుంట : నాగంపేట కెమికల్‌ ట్రయల్స్‌లో మృతి చెందిన నాగారాజు కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఫార్మా మాఫియా నిరు పేదలను లక్ష్యంగా చేసుకొని రెచ్చిపోతోంది. కేసుకు సంబంధించి జమ్మికుంట సీఐ పింగిలి ప్రశాంత్‌ రెడ్డి ఏమన్నారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

14:49 - June 17, 2017

హైదరాబాద్: కేటీఆర్‌ తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక శాఖా మంత్రి కావడం అదృష్టమని.. మంత్రి హరీశ్‌రావు అన్నారు. సీఎం విధానాలు, ప్రభుత్వ పనితీరు, మంత్రి కేటీఆర్‌ చొరవ వల్లే.. ఈ రాష్ట్రం ముందుకు దూసుకెళ్తోందని ఉద్ఘాటించారు.

14:47 - June 17, 2017

కొచ్చి : ట్రాన్స్ జెండర్ల సంక్షేమానికి పెద్ద పీట వేస్తోంది కేరళ ప్రభుత్వం. ఇప్పటి వరకూ దేశంలో ఏ రాష్ట్రం చేపట్టని విధంగా మెట్రోలో వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది. రాతపరీక్షలు, ఇంటర్వ్యూల ద్వారా 23 మందిని ఎంపిక చేసిన మెట్రో అధికారులు వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. వారి అర్హతలను బట్టి టికెట్ కౌంటర్, హౌస్ కీపింగ్ విభాగాల్లో నియమించారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన గుర్తింపు పట్ల ట్రాన్స్ జెండర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తమకు అప్పగించిన పనిని విజయవంతంగా పూర్తి చేస్తామంటున్నారు. కొచ్చిలో మెట్రో పట్టాలెక్కడంతో వీరంతా విధులకు హాజరుకాబోతున్నారు.

 

14:45 - June 17, 2017

విజయవాడ :దేశంలో మొదటిసారిగా ఎలివేటెడ్‌ కారిడార్‌ విధానంలో ఇన్నోవేటివ్‌ ఎలక్ట్రికల్‌ బస్సులు ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. దీంతో విజయవాడలో ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని భావించిన మెట్రో రైల్‌ నిర్మాణం దాదాపు రద్దయ్యే అవకాశం కనబడుతుంది. దీనిపై అమరావతి మెట్రో రైలు అధికారులతో చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు. విజయవాడలో మెట్రో రైలు మార్గాలని నిర్మించాలనే ఉద్దేశంతో అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా మెట్రో నిర్మాణం కోసం రెండు సార్లు టెండర్లు ప్రారంభించి, ఆ తర్వాత అనుకోకుండా వాటిని రద్దు చేసుకున్నారు. అయితే గత నెలలో చంద్రబాబు అమెరికా పర్యటనల అనంతరం, మెట్రో రైలు స్థానంలో, ఎలక్ట్రికల్‌ బస్సులు నడపాలనే యోచన చేశారు. దీనిపై సాధ్యా సాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.

ఎలక్ట్రికల్‌ బస్సుల ఏర్పాటుతో అన్ని రకాలుగా ఉపయోగం

ఎలివేటెడ్‌ ఎలక్ట్రికల్‌ బస్సులు ఏర్పాటు చేస్తే అన్ని రకాలుగా ఉపయోగకరంగా ఉంటుందనే భావనతో నిర్ణయం మార్చుకున్నట్టు తెలుస్తోంది. దీని ద్వారా ఖర్చు, సమయం, భూ సమీకరణలలో ఇబ్బందులు ఉండవని..కాలుష్య రహితం కావడం వంటి ప్రయోజనాలు కూడా ఉంటాయనే భావనతో ఎలక్ట్రికల్‌ బస్సులు వైపే ప్రభుత్వం ఎక్కువ ఆసక్తి చూపుతుంది.

ఎలక్ట్రికల్‌ బస్సుల కోసం మెట్రో తరహా నిర్మాణాలు

అయితే మెట్రో స్థానంలో నిర్మించాలనుకుంటున్న ఇన్నోవేటివ్ ఎలక్ట్రికల్‌ బస్సులు కోసం మెట్రో తరహా నిర్మాణాలనే చేస్తారు. రెండు అంతస్థులుగా నిర్మాణాలు చేసి ఎలక్ట్రికల్‌ బస్సులు, మిని ట్రైన్ లాంటి వాహనాలు నడపాలనేది ప్రభుత్వ ఆలోచన. ఎలక్ట్రికల్‌ బస్సులు ఏర్పాటుకు కేవలం 2500 కోట్లతో పూర్తి చేయోచ్చని మెట్రో అధికారులు నిర్ధారించారు. అలాగే మెట్రో కోసం సుమారుగా 70 ఎకరాలు భూ సేకరణ చేయాల్సి ఉండగా, ఎలక్ట్రికల్ బస్సుల కోసం కేవలం 20 ఎకరాల మాత్రమే సరిపోతుందని అధికారులు నివేదిక సిద్ధం చేశారు. సీఎం దీనిపై మరోసారి అధికారులతో చర్చించి..అనంతరంపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

14:43 - June 17, 2017

బీబీనగర్‌ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి పునాదిరాయి వేసి మూడేళ్లైంది. 70 శాతం పనులు పూర్తైన ఈ నిర్మాణానికి నిధుల్లేవంటూ పనులు నిలిపేశారు. దీంతో బీబీనగర్ ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. బ్రిడ్జి నిర్మాణానికి కింద ఉన్న రైల్వే గేటు దాటేలోపు ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా నిలిచిపోయిన బీబీనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణంపై టెన్ టీవీ ప్రత్యేక కథనం.

పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన బీబీనగర్

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతం. దాదాపు 150 పరిశ్రమలతో నిత్యం ఈ ప్రాంతం కళకళలాడుతుంటుంది. సికింద్రాబాద్-నడికుడి , సికింద్రాబాద్-కాజీపేట రైలు మార్గాలు ఈ మండల కేంద్రం మీదుగానే ఉన్నాయి. ఈ ప్రాంత వాసులు తమ అవసరాల కోసం హైదరాబాద్, భువనగిరి ప్రాంతాలకు ఇక్కడ ఉండే రైల్వే గేటు దాటి వెళ్తుంటారు. అయితే రెండు రాష్ట్రాలను కలిపే రైల్వే లైను కావడంతో ఒకసారి కనుక ఇక్కడ గేటు పడితే సుమారు 45 నిముషాల నుండి గంట దాకా అక్కడే నిలబడాల్సిన పరిస్థితి. మండల కేంద్రంలోని ప్రజలతో పాటు, మండల కేంద్రంలోని గ్రామాల ప్రజలు, గిరిజన తండావాసులు ఈ మార్గంలోనే ప్రయాణం చేస్తారు. పాము కాటు లేదా ప్రమాదాలకు గురైన చాలామంది ఈ రైల్వే గేటు దాటేలోపు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అనేకం ఉన్నాయి.

రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి పూనుకున్న టీసర్కార్

వీరి కష్టాలు గట్టెక్కించేందుకు ఇక్కడ రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి పూనుకుంది తెలంగాణ సర్కార్. 70 శాతం వరకూ పనులు పూర్తి చేశారు. ఈ ప్రాంతవాసులు తమ కష్టాలు తీరాయనుకునే సమయంలో నిధులు లేవనే సాకుతో కాంట్రాక్టర్ పనులు నిలిపేశాడు. అగ్రిమెంట్ గడువు పూర్తై ఏడాది కావొస్తున్నా ఏ పని కొంచెం కూడా ముందుకు సాగలేదు. స్ధానిక ఎమ్మెల్యే, ఎంపీలకు మొరపెట్టుకున్నా పనులు కాలేదు. కేంద్రం ఆధీనంలో ఉన్న రైల్వే బ్రిడ్జి నిర్మాణం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల అనుసంధానంతో పూర్తి కావాల్సి ఉంది. కానీ ఇరు శాఖల అధికారుల సమన్వయ లోపంతో పనులు ఆగిపోయాయి. ఇప్పటికైనా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంలో ప్రభుత్వాలు చొరవ చూపాలని బీబీనగర్ వాసులు కోరుతున్నారు.

ఎప్పుడూ రద్దీగా ఉండే బీబీనగర్

ఓవైపు పారిశ్రామిక కేంద్రం.. మరోవైపు హైదరాబాద్‌కు అతి చేరువలో ఉన్న ప్రాంతం కావడంతో ఇక్కడ రవాణా వ్యవస్థ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. గేటు తెరిచిన సమయాల్లో వెళ్లే భారీ వాహనాలతో ట్రాఫిక్ జామ్ సమస్య కూడా తలెత్తుతోంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని తెలంగాణ సర్కార్‌ ఎలాంటి చర్యలు చేపడుతుందో వేచి చూడాలి.

13:46 - June 17, 2017

కోచి : కేరళలోని కొచ్చిలో మెట్రో ట్రైన్ పట్టాలెక్కింది. ప్రధాని నరేంద్రమోదీ మెట్రో సేవల్ని ప్రారంభించారు. అనంతరం పలరివట్టం నుంచి పాతదిప్పలానికి మెట్రోలో ప్రయాణించారు. రైలులో ప్రయాణిస్తూ జనాలకు అభివాదం చేశారు మోదీ. ఆయన వెంటన కేరళ సీఎం పనరయి విజయన్, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తదితరులు ఉన్నారు. అంతకు ఐఎన్‌ఎస్ గరుడ నావెల్ ఎయిర్‌ స్టేషన్‌కు చేరుకున్న మోదీకి కేరళ సీఎం పనరయి విజయన్ సాదర స్వాగతం పలికారు. 2013లో కొచ్చిలో మెట్రో నిర్మాణం ప్రారంభమైంది. వాయు, జల, రోడ్డు, రైలు మార్గాలను అనుసంధానించి దేశంలో ఏర్పాటుచేసిన తొలి మెట్రో రైలు ప్రాజెక్టు ఇదే కావడం విశేషం. తొలిసారిగా ట్రాన్స్‌జెండర్లను కూడా ఇక్కడ సిబ్బందిగా నియమిస్తున్నారు. 80 శాతం మంది మహిళలకు మెట్రోలో ఉద్యోగాలు కల్పించడం మరో విశేషం.

 

13:37 - June 17, 2017

గుంటూరు : సీఎం చంద్రబాబు నివాసంలో అనంతపురం నేతలలో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా పార్టీలో నెలకొన్న సమస్యలు గురించి, నేతల మధ్య సమన్వయం గురించి చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి మంత్రులు కాల్వ శ్రీనివాసులు, దేవినేని ఉమా, ఎమ్మెల్యే నిమ్మల కిష్టప్ప ఇతర నేతలు హాజరైయ్యారు. ఈ భేటీకి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, మంత్రి పరిటాల సునిత, ఎమ్మెల్యేల బాలకృష్ణ హాజరు కాలేదు. మరో వైపు సాయంత్రం కర్నూలు జిల్లానేతలతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. 

13:17 - June 17, 2017

స్పోర్ట్స్ : సరిగ్గా 10 ఏళ్ల క్రితం ప్రపంచ వరల్డ్ కప్ లో పేలవ ఆటతీరుతో వెనుదిరిగిన భారత్ కొన్ని నెలల వ్యవధిలో ట్వీ20 వరల్డ కప్ గెలుచుకుంది. 2007 ట్వీ20 వరల్డ్ కప్ లో జరిగిన ఉత్కంఠ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై గెలవడం ప్రతి భారతీయుడు మరచిపోలేని అనుభవం. ఇప్పడు అదే అనుభవం మరోసారి రిపిట్ కాబోతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ లో భారత్, పాక్ మరో సారి ఫైనల్ మ్యాచ్ లో తలపడుతున్నాయి. లీగ్ మ్యాచ్ భారత్ చేతిలో చావు దెబ్బ తిన్న పాక్ తరువాత ఊహించని విధంగా ఫైనల్ కు చేరింది. అయితే అనిచ్చితికి మారుపేరుగా ఉన్న పాక్ ఎప్పుడు ఎలా ఆడుతుందో అర్ధం కాదు. దుర్భెజ్యమైన బ్యాటింగ్ లైనప్ గల భారత్ ను ఓడించడం పాక్కు  పెద్ద సవాలే. అంతకాకుండా ఐసీసీ ట్రోఫీల్లో పాక్ పై భారత్ దే పైచేయిగా ఉంది. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఒక భారత్ పాక్ అభిమానులకే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులకు ఆసక్తి కల్గించే మ్యాచ్ ఇది. ఫైనల్ సండే కావడంతో  ఈ మ్యాచ్ పై ఉత్కంఠ మరింతగా పెరిగింది. నరాలు తెగె ఉత్కంఠతో జరిగే మ్యాచ్ కోసం 100 కోట్ల భారతీయులు ఎదురు చూస్తున్నారు. ట్వీ20 ఫలితం రిపిట్ అవుతుందో లేదో చూడాలి...!

13:09 - June 17, 2017

కరీంనగర్ : లోటస్ ఫార్మా కెమికల్ ట్రయల్స్ లో మృతి చెందిన నాగరాజు మృతదేహానికి పొస్టుమార్టం పై ఉత్కంఠ నెలకొంది. డాక్టర్ల బృందం కోసం సీఐ ప్రశాంత్ రెడ్డి, ప్రజలు ఎదురు చూస్తున్నారు. జమ్మికుంట సివిల్ ఆసుపత్రి పొస్టుమార్టం పై చేతులెత్తాశారు. డాక్టర్తు ఫోరెన్సిక్ వైద్యులతో పొస్టుమార్టం చేయించాలని తెలిపారు. నాగరాజు పొస్టుమార్టం వాయిదా పడే అవకాశం ఉంది. అధికారులు సీపీ, కలెక్టర్ ఆదేశాలు కోసం చూస్తున్నారు.

 

విజయవాడలో బాలిక అదృశ్యం

విజయవాడ : నగరంలో ఇద్దరు బాలికల అదృశ్యాం కలకలం సృష్టించింది. గురునానక్ కాలనీలోని అనాథాశ్రమ బాలికలు మరియమ్మ, రోహిణి అదృశ్యమయ్యారు. అనాథాశ్రమం వార్డెన్ రజిత విజయవాడ పడమట పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

12:49 - June 17, 2017

కొత్తగూడెం : వారసత్వ ఉద్యోగ ప్రక్రియ కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ... ఖమ్మం జిల్లా ఇల్లందులో కార్మికులు చేపట్టిన సమ్మె మూడో రోజుకు చేరుకుంది. పలు ప్రాంతాల్లో కార్మికులు నిరసన కార్యక్రమాలు చేపట్టగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇల్లందులో సమ్మె ప్రభావం పెద్దగా కనిపించలేదు. జెఏసి నేతలు సమ్మెను తీవ్రతరం చేయాలని ప్రయత్నించగా పోలీసులు, టిజిబికెఎస్‌ నేతలు సమ్మె విచ్చిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సింగరేణి కార్మికులు మండిపడుతున్నారు.

 

12:48 - June 17, 2017

గుంటూరు : అమరావతిలో నిర్మిస్తున్న ఎస్‌ఆర్‌ఎమ్‌, విట్‌ యూనిర్శిటీలను మంత్రి నారాయణ పరిశీలించారు. అమరావతిని ఎకనామిక్‌ సిటీగా నిర్మించాలనే ఉద్దేశ్యంతోనే.. ప్రపంచస్థాయి సంస్థలను ఇక్కడకు తీసుకొస్తున్నామని మంత్రి అన్నారు. రెండు యూనివర్శిటీలు త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు. జులై 19న విట్‌ యూనివర్శిటీ, ఆగస్టు 7న ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటీ క్లాసులు ప్రారంభించబోతున్నాయి. యూనివర్శిటీలకు భూములు ఇచ్చినప్పుడు అందరూ విమర్శించారని గుర్తు చేసుకున్నారు. త్వరలోనే మరిన్ని విద్యా సంస్థల నిర్మాణాలను రాజధానిలో ప్రారంభిస్తామన్నారు. 

12:45 - June 17, 2017

కరీంనగర్ : లోటస్ ఫార్మా కంపెనీ ప్రయోగం వికటించి మరణించిని నాగరాజు ఘటన పై కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి ఆరా తీశారు. ఫోరెన్సిక్ నిపుణుల బృందంతో పొస్టుమార్టం నిర్వహించాలని సీఐ ప్రశాంత్ రెడ్డికి ఆదేశం. నాగరాజు మృతదేహానికి పొస్టుమార్టం చేయడానికి జమ్మికుంట ఏరియా ఆసుపత్రి నుంచి డాక్టర్ల బృందం వెళ్లింది. మరో వైపు పొస్టుమార్టం చేస్తున్నారని గ్రామస్తులు తండోపతండాలు తరలివస్తున్నారు.

 

12:38 - June 17, 2017
12:36 - June 17, 2017
12:35 - June 17, 2017

సంగారెడ్డి : పరిశ్రమలకు 24 గంటలు కరెంట్ ఇవ్వడమనేది ప్రభుత్వ విజయమని భారీ నీటిపారుదల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సంగారెడ్డి లో వైద్య పరికారల పరిశ్రమ శంకుస్థాపన సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణ ధ్యేయంగా లక్ష్యంగా సీఎం కేసీఆర్ గారు పాలన చేస్తున్నారని తెలిపారు. మొదటి రోజు 14 మంది పెట్టుబడి పెట్టడానికి వచ్చినందుకు అనందంగా ఉందన్నారు. ఈ రోజు తమ ఆలోచన ఒక్కటే అన్ని రంగాలు అభివృద్ధి చెందడమని ఆయన తెలిపారు. స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని పరిశ్రమికవేత్తలను హరీష రావు కోరారు. వారికి స్కిల్స్ లేకుంటే శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆయన ప్రకటించారు. 

12:34 - June 17, 2017

విజయవాడ : నగరంలో ఇద్దరు బాలికల అదృశ్యాం కలకలం సృష్టించింది. గురునానక్ కాలనీలోని అనాథాశ్రమ బాలికలు మరియమ్మ, రోహిణి అదృశ్యమయ్యారు. అనాథాశ్రమం వార్డెన్ రజిత విజయవాడ పడమట పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాలికలు ఇద్దరు స్థానికంగా ఉండే పాఠశాలలో చదువుతున్నారు. నిన్న సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత సహాచర పిల్లలతో అగుకున్నారు. అనంతరం రాత్రి భోజనం తర్వాత వార్డెన్ పిల్లలను లెక్కకడుతుంటే ఇద్దరు లేరని తెలుసుకున్న వార్డెన్ వెంటనే చుట్టుపక్కల వెతికి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలికల అదృశ్యాం పై పోలీసులు విచారణ ప్రారంభించారు. 

12:00 - June 17, 2017

ప్రేమ పెదవులు దాటి పెన్ను పట్టుకునేలా చేసింది. పెన్నుతో రాసింది అక్షరాలే కావొచ్చు. కానీ, వాటిలో తనకు అంజలి అంటే ఎంత ప్రేమో చెప్పే ప్రయత్నం చేశారు జై. తమిళ హీరో జై, తెలుగమ్మాయి అంజలి ప్రేమలో ఉన్నారని చెన్నై వర్గాలు ఎప్పట్నుంచో కోడై కూస్తున్నాయి. వీళ్లిద్దరూ సదరు వార్తలను కన్ఫర్మ్‌ చేయలేదు. కానీ, వీలైన ప్రతిసారీ పుకార్లకు ఫుడ్డు పెట్టేలా ఏదొకటి చేస్తుంటారు. శుక్రవారం అంజలికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ... జై రాసిన లేఖ పుకార్లకు ఫుల్‌ మీల్స్‌ పెట్టింది.
‘నువ్వంటే నాకు ఎంత ప్రత్యేకమో... నీ పుట్టిన రోజన్నా అంతే ప్రత్యేకం! నీకెంతో ప్రత్యేకమైన ఈ రోజున నీకో విషయం చెప్పాలనుకుంటున్నా. నువ్వు నీలానే ఉంటూ నా లైఫ్‌లో ప్రతి రోజును ఎంతో ప్రత్యేకంగా తీర్చిదిద్దావ్‌. దేవుడు, నేనూ ఎప్పుడూ నీతోనే ఉంటాం. హ్యాపీ బర్త్‌డే అంజూ. ప్రేమతో... జై..... జై స్వయంగా రాసి, సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన లేఖ సారాంశమిది. బదులుగా అంజలి నాతో ఉన్నందుకు థ్యాంక్స్‌ జై. నువ్వెప్పుడూ ఉంటావని ఆశిస్తున్నా’అన్నారు. ఈ సంభాషణ అంతా సోషల్‌ మీడియాలోనే జరిగింది.

11:51 - June 17, 2017

దర్శకుడు బోయపాటి శ్రీను ఇప్పుడు కొంచెం క్లాస్ టచ్ తో తెలుస్తోంది. తాజా బెల్లకొండ సురేష్ తనయుడు బెల్లకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా బోయపాటి శ్రీనివాస్ ఈ సినిమా చేస్తున్నారు.బోయపాటి 'జయ జానకి నాయక' పేరును తన సినిమాకి ఖరారు చేశారు. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాత. టైటిల్‌ లోగోను శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో చిత్రబృందం ఆవిష్కరించింది. సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్న జగపతిబాబు మాట్లాడుతూ బోయపాటి శ్రీను ఏం చేసినా బ్లాక్‌ బస్టరే. ఎందుకంటే సినిమాల్లేక గోడలు చూస్తోన్న నాకు లెజెండ్‌ లో అవకాశమిచ్చి ఇంత స్థాయికి తెచ్చాడు. బెల్లంకొండ శ్రీనివాస్‌ను పరిశ్రమలో మరొక స్టార్‌గా మలిచే ప్రయత్నం చేస్తున్నారు బోయపాటి. రకుల్‌ ఇందులో బాగా నటించింది. సినిమాకి శరత్‌కుమార్‌ మరో ఆకర్షణ అన్నారు. ‘‘సినిమాకి ఆసక్తికరమైన పేరు కుదిరింది. సినిమాలో భాగమైనందుకు సంతోషంగా ఉందని అన్నారు ప్రముఖ నటుడు శరత్‌కుమార్‌. బోయపాటి శ్రీను మాట్లాడుతూ కథకి ఎలాంటి పేరైతే బాగుంటుందో అదే నిర్ణయించాం. థియేటర్లలో అన్ని తరగతులవాళ్లు ఒకే వరసలో కూర్చుని సినిమా చూడాలనేది నా ఉద్దేశం. అలాంటి సినిమాల్ని తెరకెక్కించే ప్రయత్నమే నేను చేస్తుంటాఅన్నారు. సినిమా అని చెప్పింది. నిర్మాత మాట్లాడుతూ బోయపాటి ఇటు మాస్‌ ప్రేక్షకుల్ని, అటు కుటుంబ ప్రేక్షకుల్ని అలరించేలా కథ, పేరుని నిర్ణయించారు. ఇంత ఎక్కువ మంది తారాగణంతో ఈమధ్య కాలంలో ఏ సినిమా తెరకెక్కలేదేమో.

11:46 - June 17, 2017

గుంటూరు : వైసీపీ నాయకులకు, ప్రజా ప్రతినిధులకు.. ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్‌ కిశోర్‌ సర్వేల భయం పట్టుకుంది. ప్రశాంత్‌ కిశోర్‌ చేపడుతున్న అభిప్రాయ సేకరణలు... సర్వేలు.. వైసీపీ నాయకులను హడలెత్తిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ముందుకు వెళ్తున్న జగన్‌.. ప్రశాంత్‌ కిషోర్‌ సలహాలు, సూచనలను కచ్చితంగా అమలు పరుస్తున్నారు. ఇప్పటికే ప్రశాంత్‌ కిశోర్ బృందం... నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, కో-ఆర్డినేటర్ల నేతల పనితీరుపై సర్వే ప్రారంభించింది. గ్రామాల్లో పర్యటించి... అభ్యర్థుల పనితీరు.. గెలుపు..ఓటములపై పరిశీలన మొదలుపెట్టింది. సర్వేలలో తెలిసిన అంశాల మేరకు పార్టీలో పలు మార్పులు... చేర్పులు చేస్తున్నట్టు సమాచారం.

సర్వేలు ప్రభావం..
ప్రశాంత్‌ కిశోర్‌ సర్వేల ప్రభావం మిగిలిన ప్రాంతాలపై ఏమేరకు పడిందో గానీ, అనంతపురం జిల్లాలో మాత్రం, ప్రశాంత్‌ ఎఫెక్ట్‌ స్పష్టంగా కనిపిస్తోంది. వైఎస్‌ రాజశేఖరరెడ్డితోను, ఆయన కుటుంబ సభ్యులతోనూ అత్యంత చనువున్న అనంతపురం మాజీ శాసనసభ్యులు గురునాథరెడ్డినే జగన్‌ పక్కన పెట్టేశారు. వచ్చే ఎన్నికల్లో గురునాథరెడ్డి గెలుపు కష్టమని, ప్రశాంత్‌కిశోర్‌ సర్వేలో తేలిందని, అందుకే, ఆయన్ను పక్కన పెట్టారని జిల్లాలో ప్రచారం జరుగుతోంది. పార్టీ నియోజకవర్గం ఇంచార్జిగా గుర్నాథ్ రెడ్డిని తప్పించి మైనార్టీ వర్గానికి చెందిన నదీమ్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. గతంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సమయంలో, గుర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరి ఉప ఎన్నికల్లో మళ్లీ గెలిచారు. అప్పట్లో జగన్‌కు జిల్లా నుంచి తొలుతగా మద్దతు పలికింది గుర్నాథ్ రెడ్డే కావడం గమనార్హం. అలాంటి ఆత్మీయుడిని కూడా జగన్‌ ఇంచార్జి పదవికి దూరం చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

ప్రజబలం ఉన్నవారికే ఇంచార్జిలు
ఎన్నికల్లో గెలుపే ఏకైక అర్హతగా జగన్‌, నియోజకవర్గ ఇంచార్జిలను నియమిస్తున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామం చాలామంది నేతల్లో గుబులు రేకెత్తిస్తుంది. ఎంతో కాలం నుంచి పార్టీని...వైఎస్సార్‌ కుటుంబాన్ని నమ్ముకుని ఉన్న గురునాథ్‌రెడ్డికే ఈ పరిస్థితి వస్తే ఇక మిగిలిన వారి పరిస్థితి ఏమిటని అనుకుంటున్నారు. పార్టీ అధినేత జగన్‌ నిర్ణయాలను ప్రశాంత్‌ కిశోర్‌ సర్వే ఫలితాలే ప్రభావితం చేస్తుండడంతో, జిల్లాలోని వైసీపీ నాయకులంతా అలర్ట్‌ అయ్యారు. సీరియస్‌గా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. తమపై ఎక్కడ వేటు పడుతుందో అనే టెన్షన్లో పడ్డారు. మొత్తానికి, ప్రశాంత్‌ కిశోర్‌ వ్యూహాలు వైసీపీని గెలుపు తీరానికి చేరుస్తాయో లేదోగానీ, అనంతపురం జిల్లా వైసీపీ నాయకులను మాత్రం ఒళ్లొంచి కష్టపడేలా చేస్తున్నాయి. 

11:41 - June 17, 2017

పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లాలో.. సింగరేణి కార్మికులకు మద్దతుగా నిలిచిన సీఐటీయూ నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సమ్మెలో పాల్గొన్న సింగరేణి కార్మికులు, కార్మిక నాయకుల అరెస్ట్‌లకు వ్యతిరేకంగా ఈరోజు కోల్‌ బెల్ట్‌ వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ బంద్‌ నేపథ్యంలో గోదావరిఖని చౌరస్తాలో ధర్నా చేస్తున్న CITU నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

11:39 - June 17, 2017

హైదరాబాద్ : తెలంగాణలో ఇంజినీరింగ్‌ కాలేజీల గుర్తింపు..ఆయా కాలేజీల్లో సీట్ల భర్తీపై జెఎన్టీయూ హైదరాబాద్‌ క్లారిటి ఇచ్చింది. ఈవిద్యా సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా 201 కాలేజీలకు అనుమతులు లభించగా..అందులో 90వేల 11 సీట్లను భర్తీ చేసేందుకు జెఎన్టీయూ రంగం సిద్ధం చేసింది. కన్వీనర్ కోటాలో 192 కాలేజీల్లో 61వేల 441 సీట్లు అందుబాటులో ఉన్నట్లు జెఎన్టీయూ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ విద్యాసంవత్సరానికి 18 ఇంజినీరింగ్ కాలేజీలు మూతపడనున్నాయి. మరోవైపు గతేడాదితో పోలిస్తే 14వేల 587 సీట్లకు కోతపడినట్లయింది.

కాలేజీల్లో ముమ్మర తనిఖీలు
అయితే ఇంజినీరింగ్ కాలేజీల గుర్తింపు కోసం కొన్ని రోజులుగా ఓయూ, కెయూ, జెఎన్టీయూ అధికారులు తీవ్ర కసరత్తు చేశారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. తుది నివేదిక పూర్తయ్యాకే..అనుబంధ గుర్తింపును ఖరారు చేశారు. కేవలం జెఎన్టీయూ పరిధిలో 174 కాలేజీలకు అనుమతులు మంజూరు చేయగా..అందులో 80వేల 121 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సంవత్సరం మూడు యూనివర్శిటీల పరిధిలో ఉన్న కన్వీనర్, మేనేజ్‌మెంట్ కోటాలకు సంబంధించి 187 ప్రైవేటు కాలేజీలకు అనుమతులు లభించాయి. అయితే గతేడాదితో పోలిస్తే ఎఐసిటిఇ ఈసారి సీట్లకు భారీగా కోత పెట్టారు. అంతేకాదు కొన్ని కాలేజీలు స్వచ్ఛందంగానే మూసివేతకు దరఖాస్తు చేసుకోగా..మరికొన్ని కాలేజీలు యూనివర్శిటీ మార్పు కోసం దరఖాస్తు పెట్టుకున్నాయి. గతంలో కంటే ఈ సారి 27 కాలేజీల్లో 13వేల 153 సీట్లకు కోత పెట్టింది.

 

11:32 - June 17, 2017

విశాఖ : విశాఖపట్నం భూ కుంభకోణం పై వైసీపీ పోరాటం ఉధృతం చేసింది. భూ కుంభకోణం వైసీపీ ఇప్పటికే సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తుంది. ఇతర పక్షాలతో కూడా నిరసనలు వ్యక్తం చేశారు. భూ కంభకోణంపై సమగ్ర విచారన జరిపించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఈ నెల 22 న విశాఖ కలెక్టరేట్ వద్ద మహాధర్నా చేపట్టనున్నారు. ధర్నాలో వైసీపీ అధ్యక్షుడు జగన్ పాల్గొననున్నారు. భూ కుంభకోణం వెనక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని వైసీపీ నేతు ఆరోపిస్తున్నారు. 

11:24 - June 17, 2017
10:39 - June 17, 2017

 

            మీరు విన్నది నిజమే అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని రెండో సినిమా రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభమయ్యింది. సాధారణంగా హీరో హీరోయిన్ మూవీ కాస్టింగ్ ను ముందే అనౌన్స్ చేస్తుంటారు. కానీ ఈ సినిమా హీరోయిన్ పేరును ఇప్పటి వరకు వెల్లడించలేదు. మొదట్లో మేఘా ఆకాష్, అనుపమా పరమేశ్వరన్ ల పేర్లు వినిపించినప్పటికీ వారు ఈ సినిమాలో లేరని స్వయంగా అక్కినేని నాగార్జున చెప్పేశారు. దీంతో ఇప్పటికే షూటింగ్ ప్రారంభమయ్యింది కానీ హీరోయిన్ ఎవరబ్బా అని ఎదురు చూస్తున్నారు సినీ ప్రేక్షకులు. 
           యితే ఈ సినిమా హైప్ పెంచేందుకోసమే ఈ ట్రిక్ ప్లే చేస్తున్నారంటున్నాయి సినీ వర్గాలు. ఇటీవల ఒక సినిమాకి చివరి క్షణం వరకు హీరో ఫేస్ చూపించకుండా ప్రచారం చేసుకున్న నేపథ్యంలో హీరోయిన్ పేరు కూడా చివరి వరకూ ప్రకటించరా అనే అనుమానం రాకమానదు. అయితే హీరోయిన్ ను ఇప్పుడే చూపించకుండా.. ఆమె షెడ్యూల్ స్టార్ట్ అయినప్పటినుంచి ప్రచారంలోకి తేవాలనే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. హీరోయిన్ అనౌన్స్ మెంట్ కోసం ఇంత హంగామా చేస్తున్నారంటే ఓ పేరుమోసిన స్టార్ కూతురును ఇంట్రడ్యూస్ చేసే అవకాశాలున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 

10:35 - June 17, 2017

హైదరాబాద్ : రాష్ట్రలో సంచలనం సృష్టించిన శిరీష ఆత్మహత్య కేసులో నిందితులు శ్రావణ్, రాజీవ్ లను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. శ్రావణ్ ను ఎ1 నిందితుడిగా, రాజీవ్ ను ఎ2 నిందితుడిగా కోర్టు ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు రిమాండ్ డైరీ తయారు చేశారు. అయితే శిరీష మృతిపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీని పై హెచ్ఆర్ సీ వెళ్తమని తెలిపారు. 

10:29 - June 17, 2017

చిత్తూరు : తిరుమలలో మరోసారి భద్రత లొపాలు బయటపడ్డాయి. తిరుమల కొండపై ఎక్సైజ్ పోలీసుల తనిఖీల్లో మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. ఆరుగురు కూలీల నుంచి 20 మద్యం బాటిళ్లు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎక్పైజ్ పోలీసులు కొండపైకి మద్యం బాటిళ్లు ఎలా వచ్చాయని దర్యాప్తు చేపట్టారు. కొండపై అతిథి గృహంలో పనిచేయడానికి కూలీలు వచ్చారు. మద్యం బాటిళ్లు వారు తాగడానికి తీసుకొచ్చార లేక అమ్మడానికా అనేది పోలీసులు విచారణ చేస్తున్నారు.  

10:28 - June 17, 2017

చెన్నై : తమిళనాడులోని కోయంబత్తూర్ సీపీఎం కార్యాలయం పై పెట్రో బాంబు దాడి జరిగింది. ఈ రోజు తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో పెట్రోల్ నింపిన సీసాను దుండగులు వీసిరినట్టు తెలుస్తోంది. ఘటన పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో కార్యాలయం స్వల్పంగా దిబ్బతింది. అలాగే ఆఫీస్ ముందున్న అంబాసిడర్ కారు కూడా దెబ్బతింది. ఈ దాడి హిందుత్వ కార్యకర్తలు చేసినట్టు కొంత మంది అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

09:52 - June 17, 2017

సామాన్యుల ప్రాణాలతో ఫార్మా అటలు

కరీంనగర్ : తెలంగాణ, ఏపీ, కర్ణాటకల సాగుతున్న లోటస్ అనే ఫార్మా కంపెనీ సామ్యాల ప్రాణాలతో చెలగటం ఆడుతోంది. క్లినికల్ ట్రయల్స పేరుతో ఓ వ్యక్తిని బలి తీసుకుంది. దీని పై టెన్ టివి వరుస కథనలతో పోలీసు శాఖ స్పందించింది. జమ్మికుంట మండలం నాగంపేటకు చెందిన వంగల నాగరాజు పై లోటస్ కంపెనీ క్లినికల్ ట్రయల్స్ లో ప్రాణాలను బలిగొంది. విషయం బయటకు రాకుండా బాదితులను కూడా బెదిరించింది.

09:46 - June 17, 2017

కరీంనగర్ : తెలంగాణ, ఏపీ, కర్ణాటకల సాగుతున్న లోటస్ అనే ఫార్మా కంపెనీ సామ్యాల ప్రాణాలతో చెలగటం ఆడుతోంది. క్లినికల్ ట్రయల్స పేరుతో ఓ వ్యక్తిని బలి తీసుకుంది. దీని పై టెన్ టివి వరుస కథనలతో పోలీసు శాఖ స్పందించింది. జమ్మికుంట మండలం నాగంపేటకు చెందిన వంగల నాగరాజు పై లోటస్ కంపెనీ క్లినికల్ ట్రయల్స్ లో ప్రాణాలను బలిగొంది. విషయం బయటకు రాకుండా బాదితులను కూడా బెదిరించింది. అయితే బాదితులు టెన్ టివిని ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బెంగళూరు కేంద్రంగా లోటస్ ఫార్మా కంపెనీ నడుస్తోంది. ఈ సంస్థ తెలంగాణలో వరంగల్ కేంద్రంగా కరీంనగర్, వరంగల్ లో తన కార్యాకాలపలు కొనసాగిస్తోంది. నాగరాజు మరణం పై జమ్మికుంట పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయింది. టెన్ టివి కథనాలతో కరీంనగర్ జిల్లా యంత్రంగం కదిలింది. కాసేపట్లో క్లినికల్ ట్రయల్స్ లో మృతి చెందిన వంగల నాగరాజు మృతదేహానికి హుజురాబాద్ డీఎస్పీ, తహసీల్దార్ ఆధ్వర్యంలో రీపొస్టుమార్టం నిర్వహించనున్నారు. 

బంద్ పిలుపునిచ్చిన సింగరేణి కార్మికులు

పెద్దపల్లి : నేడు జిల్లాలోని కోల్ బెల్ట్ వ్యాప్తంగా సింగరేణి కార్మిక సంఘాలు బంద్ కు పిలునిచ్చాయి. వారసత్వ ఉద్యోగాల కోసం సమ్మె చేస్తున్న అరెస్ట్ చేయడంతో బంద్ కు పిలుపునిచ్చినట్లు సంఘాలు తెలిపాయి. 

గోదావరిఖనిలో కోదండరాం పర్యటన

పెద్దపల్లి : నేడు జిల్లాలో గోదావరిఖనిలో ప్రొ.కోదండరాం పర్యటించనున్నారు. సింగరేణి కార్మికుల సదస్సులో కోదండరాం పాల్గొననున్నారు. 

07:40 - June 17, 2017

రాష్ట్రపతి అభ్యర్థి ప్రతిపాదన లేకుండా చర్చలు చేస్తే ఫలితం శూన్యమని, ఈ చర్చలు రాజకీయాలు చేయడం కోసమేనని, ఎల్. కే అద్వానీ రాష్ట్రపతి అభ్యర్థి కొన్ని పార్టీలు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని, దేశ అధినేతగా ఉండే రాష్ట్రపతి ప్రజాస్వామ్యాన్ని, లౌకికత్వాన్ని గౌరవిచే వారు ఉండాలని, టెన్ టివి న్యూస్ మార్నింగ్ పాల్గొన్న విశ్లేషకులు వినయ్ కుమార్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇందిరాశోభన్ అన్నారు. ఎన్డీఏకు రాష్ట్రపతి ఎన్నుకునే ఓట్లు ఉన్నాయని, అందరి సహకరంతో రాష్ట్రపతి ఎన్నోకొవడం మంచిదని చర్చలు జరుపుతున్నామని బీజేపీ నేత ప్రకాష్ రెడ్డి అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో జాతీయ పార్టీల కీలక పాత్ర పోషిస్తాయని, అద్వానీకి రాష్ట్రపతి ఇవ్వకపోతే అయనను అగౌరవించేనట్టేనని టీఆర్ఎప్ నేత సత్యనారాయణ అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

07:36 - June 17, 2017

ప్రస్తుతం వ్యవసాయ విధానంలో సేంద్రియ పద్దతిలో పటించడంలో వెనుక పడ్డారు. ప్రతిభ బయోటెక్ ప్రారంభించినప్పుడు దీని పై దృష్టి సాధించామని, జీవ ఎరువులపై రైతులకు అవగాహన కల్పించాలని, వ్యవసాయ భూమి ఎలా సంరక్షంచుకోవాలని, రసాయని ఎరువుల వల్ల భూ సారం దెబ్బతింటుందని ప్రతిభ బయోటెక్ సీఈవో రాజశేఖర్ అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

07:34 - June 17, 2017

హైదరాబాద్ : తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో హరిత హరం కార్యక్రమాన్ని మరింత స్పీడ్ పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే దీనిపై క్షేత్ర స్ధాయిలో ఎక్కడికక్కడ ప్రజా ప్రతనిధులు భాగస్వామ్యులు కావాలని స్వయంగా సీఎం కేసీఆర్ సూచించిన నేపథ్యంలో మరింత స్పీడ్ పెంచారు. అయితే త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా మూడవ విడత కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. అయితే దానికంటే ముందే ముందుగా తెలంగాణ వ్యాప్తంగా రోడ్లను హరిత వనాలుగా మార్చే కార్యక్రమంలో అటవీశాఖ భాగస్వామ్యం అయింది.

రోడ్డుకిరువైపులా మొక్కలు
రాష్ట్రంలో ఏ రోడ్డు వెంట ప్రయాణం చేసినా, రోడ్డుకిరువైపులా పచ్చదనం, పూలమొక్కలతో కళకళలాడాలని, ఒక వనంలో ప్రయాణించిన అనుభూతి ఉండాలని సీఎం కేసీఆర్ అటవీశాఖ అధికారులకు సూచించారు. దీంతో ఆ తరహాలోనే రోడ్లను నందనవనాల్లా తీర్చి దిచ్చే ప్రయత్నాన్ని ఎవెన్యూ ప్లాంటేషన్ ద్వారా అటవీ శాఖ చేపట్టింది. తెలంగాణలో 52 అటవీ డివిజన్లలో ఒక్కో ప్రాంతానికి 10 కిలో మీటర్లకు తక్కువ కాకుండా రోడ్ల వెంట ఎవెన్యూ ప్లాంటేషన్‌ను ఈ యేడాదిలో తొలి విడతగా అటవీ శాఖ అధికారులు చేపట్టారు. అయితే ఈ ఎవెన్యూ ప్లాంటెషన్ ద్వారా పెట్టిన ప్రతీ మొక్క బతికేలా చర్యలు తీసుకోవటం ఈ సారి ప్లాంటేషన్ ప్రత్యేకత. ఎండాకాలంలోనే ఈ ప్లాంటేషన్‌కు అవసరమైన ఏర్పాట్లు చేసిన అధికారులు,.జూన్ నెలలో పనులను ముమ్మరం చేశారు. ఈ సారి అవెన్యూ ప్లాంటేషన్‌కు కొత్త టెక్నిక్‌ను అందుబాటులోకి తెచ్చారు. గుంత తీయడం దగ్గర నుంచి,.మొక్క చుట్టూ వర్మీ కంపోస్ట్, ఎరువు వేయటం, నాటిన మొక్క నిటారుగా పెరిగేందుకు సపోర్ట్ స్టిక్‌తో పాటు ప్రతీ మొక్కకు ట్రీ గార్డును కూడా ఒకే సారి ఏర్పాటు చేయటం ఎవెన్యూ ప్లాంటేషన్ ప్రత్యేకత. ఈయేడాది తెలంగాణ వ్యాప్తంగా 3,500 కిలో మీటర్ల మేర ఈ తరహా ప్లాంటేషన్ చేయాలని అటవీశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా సుమారు 500కిలో మీటర్ల పరిధిలో ప్రారంభమైన పనులు కొనసాగుతున్నాయి. మర్రి, రావి, వేప, గానుగ, చైనా బాదమ్, రెయిటీ ట్రీ లాంటి నీడను ఇచ్చే చెట్లతో పాటు రంగు రంగుల పూలతో, కాలానుగుణంగా పూసి అందంగా కనిపించే గుల్ మొహర్, తబూబియా, బహూనియా, అవలాండియా, టెకోమా, పెల్టా ఫోరమ్ రకాలను రోడ్ల వెంట నాటుతున్నారు.ఇటీవల రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగురామన్న ఢిల్లీ పర్యటనలోనూ, గత వారం హైదరాబాద్‌లో పర్యటించిన నేషనల్ హైవేస్ అధికారులు విజయవాడ, బెంగుళూరు జాతీయ రహదారుల వెంట ప్లాంటేషన్‌ను స్వయంగా పరిశీలించి అటవీ శాఖ పనితీరును మెచ్చుకున్నారు.

07:32 - June 17, 2017

హైదరాబాద్ : అవిభక్త కవలలు వీణా-వాణి సంరక్షణపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. వీరిని ఆదరించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. వీణా-వాణిలను హైదరాబాద్‌ నీలోఫర్‌ ఆస్పత్రి నుంచి స్టేట్‌ హోంకు తరలించిన తర్వాత వీరి ఆలనా, పాలన ఎలా ఉందన్న అంశాన్ని ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిశీలిచడంతోపాటు, పర్యవేక్షిస్తోంది. దీనిలో భాగంగానే స్త్రీ, శిశు సంక్షేమ, రోడ్లు, భవనాల శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్టేట్‌ హోంకు వెళ్లి వీణా-వాణిలను పరామర్శించారు.

ప్రత్యేక ఏర్పాట్లు
నీలోఫర్‌ ఆస్పత్రి ఉంచి వీణా-వాణిలను స్టేట్‌ హోంకు తరలించి ఆరు నెలలు పూర్తైంది. వీరికి ఇప్పుడు 13 ఏళ్ల వయసు. ఈ అవిభక్త కవలల సంరక్షణ కోసం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కంటికి రెప్పలా కాపాడేందుకు ప్రత్యేక గది కేటాయించారు. టీవీ, కూలరు ఏర్పాటు చేయడంతోపాటు 24 గంటలు పని చేసేందుకు మూడు షిప్టుల్లో ముగ్గురు ఆయాలను నియమించారు. డాక్టర్లు వీరి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వీణా-వాణిల చదువుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ అవిభక్త కవలలు తెలివితేటల్లో ఎవరికీ తీసిపోరు. తెలివితేటలు బాగా ఉండటంతో ఐదో తరగతి పూర్తి చేసిన వీరికి నేరుగా ఏడో తరగతి విద్యా బోధన చేస్తున్నారు. చదువు కోసం ప్రత్యేక కౌన్సెలర్‌ను నియమించి, ప్రభుత్వమే పాఠ్యపుస్తకాలు సమకూరుస్తోంది. తెలుగు, ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడే విధంగా తీర్చిదిద్దారు. వీరు అద్భుతంగా పాటలు కూడా పాడుతున్నారు.

ప్రత్యేక బడ్జెట్....
వీణా-వాణిల ఆలనా, పాలన చూసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్‌ కేటాయించింది. వీరి సంరక్షణకు 6.46 లక్షల రూపాయాలు వెచ్చిస్తున్నారు. ఆయాల వేతనాలకు 4.32 లక్షలు వెచ్చిస్తుండగా..టీచర్‌ కోసం 1.14 లక్షలు కేటాయించారు. మున్ముందు ఈ వ్యయాన్ని మరింత పెంచనున్నారు. వీణా-వాణిలకు సంరక్షణకు ఎటువంటిలోటు లేకుండా ప్రభుత్వమే చూసుకుంటుదని వీరిని పరామర్శించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భరోసా ఇచ్చారు. 

07:30 - June 17, 2017

కడప : జిల్లా కుప్పాలపల్లిలో ఫ్యాక్షన్ మర్డర్ జరిగింది. పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లి మండలం వేంపల్లిలో దారుణంగా ఒక వ్యక్తి ని చంపారు. వేంపల్లిలో సిమెంట్‌ వ్యాపారి నాగబుసనంరెడ్డి రాత్రి తన ఇంటికి వెళ్లుతున్న సమయంలో మార్గమధ్యలో కొంత మంది వ్యక్తులు కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు నాగభూషణంరెడ్డికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. నాగభూషణం రెడ్డిని ప్రత్యర్థులు దారుణంగా హత్యచేయడంపై కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

07:28 - June 17, 2017

గుంటూరు : పర్యాటక, విద్యా రంగాల అభివృద్ధిలో భాగంగా ఏపీ రాజధాని అమరావతిలో స్టార్‌ హోటళ్లు, అంతర్జాతీయ స్కూళ్ల ఏర్పాటుకు ఏ సంస్థలూ ఆసక్తి చూపడంలేదు. ఇందుకోసం టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఈసారి ఇన్విటేషన్‌ పద్ధతిని అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్టార్‌ హోటళ్లు, అంతర్జాతీయ స్కూళ్ల యాజమాన్యాలను పిలిపించి చర్చించేందుకు చర్యలు చేపట్టింది.  

07:24 - June 17, 2017

గుంటూరు : ఏపీ రాజధాని అమరావతిలో రెండో విడత భూ సమీకరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈసారి 14 వేల ఎకరాలు సమీకరించాలని చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్ డీఏ సమావేశంలో నిర్ణయించారు. ఇప్పటికే సమీకరించిన 33 వేల ఎకరాల భూమికి ఇది అదనం. ఈ భూమిన రోడ్ల నిర్మాణం కోసం వినియోగిస్తారు. అయితే ముందుగా భూసమీకరణ చేసిన 29 గ్రామాల రైతులకు ప్లాట్లు కేటాయించిన తర్వాతే రెండో విడత భూసమీరణ చేపట్టాలని ప్రతిపాదించింది. రాజధానిలో నిర్మించే రోడ్లన్నింటికీ వచ్చే నెల మొదటివారంలో టెండర్లు పిలవాలని నిర్ణయించింది.అమరావతిలో స్టార్‌ హోటళ్లు, అంతర్జాతీయ స్కూళ్లు ఏర్పాటు చేసేందుకు ఆయా సంస్థలను ఆహ్వానించి చర్చించేందుకు చర్యలు చేపట్టారు. 

07:10 - June 17, 2017

హైదరాబాద్ : మూడేళ్ల పాలనతో ఒక్క అవినీతి మచ్చలేదని బీరాలుపోతున్న టీఆర్‌ఎస్‌ సర్కార్‌కు మియాపూర్‌ భూ కుంభకోణం చుక్కలు చూపించింది. 900 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించడంతో భారీ కుంభకోణంగా మారింది. కేకే సహా ఇతర టీఆర్‌ఎస్‌ నేతలకూ ఈ స్కామ్‌తో సంబంధమున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. పారదర్శక పాలన అందిస్తున్నామని చెప్పుకునే టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ప్రతిష్టకు ఈ స్కామ్‌ భంగం కలిగించింది. మియాపూర్‌ భూ స్కామ్‌పై ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించినా... అసలు సూత్రధారులను కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. సీబీఐతో విచారణ జరిపించాలని పట్టుబడుతున్నాయి. ఇదే అంశంపై శనివారం సాయంత్రం 5గంటలకు జరిగే కేబినెట్‌ ప్రధానంగా చర్చించనుంది. భూకబ్జాలపై కఠిన చట్టాలు తీసుకురావడంపై చర్చించే అవకాశముంది. ప్రస్తుతం ఉన్న చట్టాలను ర్యాడిపికేషన్‌ ద్వారా మార్పులు చేసేందుకు కేబినెట్‌లో చర్చించనున్నారు.

గొర్రెల పంపిణీపై కేబినెట్‌ చర్చ
గొల్ల, కుర్మలకు గొర్రెల పంపిణీపై కేబినెట్‌ చర్చించనుంది. ఈనెల 20న గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. రెండేళ్లలో 84 లక్షల గొర్రెలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది 42 లక్షల గొర్రెలను పంపిణీ చేయనుంది. గొర్రెల పంపకం కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే విషయంపైనా కేబినెట్‌ చర్చించనుంది. ఆహార పదార్థాల కల్తీలు, మోసాలు, నకిలీ సర్టిఫికెట్లు, అక్రమ ఆయుధాలు, మందు సామాగ్రిలాంటి అంశాలపైనా కేబినెట్‌లో చర్చించనున్నారు. వీటిపై కేసీఆర్‌ సీరియస్‌గా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వీటికి ఫుల్‌స్టాప్‌ పెట్టేలా కేబినెట్‌ చర్చించనుంది. నకిలీ సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు, నకిలీ కరెన్సీ నోట్లు చలామణి చేసే వారిపట్ల కూడా అత్యంత కఠినంగా వ్యవహరించాలని, అలాంటి ముఠాలను గుర్తించి వారి అక్రమ కార్యకలాపాలను అడ్డుకునేలా సర్కార్‌ ఓ ప్రణాళిక రూపొందించనుంది. వీటిని పూర్తిగా నియంత్రించడానికి ఉన్న చట్టాలు సరిపోతాయా? లేక సవరణలు కావాలా? కొత్త చట్టం రూపొందించాలా? అనే అంశంపై మంత్రివర్గం చర్చించనుంది. గాంబ్లింగ్‌పై ఆర్డినెన్స్‌ తీసుకురావడంపైనా మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకోనుంది. ఇక నకిలీ విత్తన నిరోధక చట్టం ఆర్డినెన్స్‌కు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనుంది.

 

బంజారాహిల్స్ లో డ్రంక్ అండ్ డ్రైవ్

హైదరాబాద్ : నగరంలనో బంజారాహిల్స్ లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన 10 మంది పై కేసు నమోదు చేశారు. 

Don't Miss