Activities calendar

18 June 2017

20న బీజేపీ పార్లమెంటరీ సమావేశం..

ఢిల్లీ : ఈ నెల 20న బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఎన్డీఏ తరపున రాష్ట్రపతి అభ్యర్థిని బీజేపీ పార్లమెంటరీ పార్టీ ఖరారు చేయనుంది.

కరీంనగర్ లో భారీ వర్షం..

కరీంనగర్ : జిల్లా కేంద్రంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. రోడ్లు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది.

హైకోర్టు విభజనకు కేంద్రం సుముఖం - ఇంద్రకిరణ్ రెడ్డి..

ఢిల్లీ : హైకోర్టు విభజనకు కేంద్రం సుముఖంగానే ఉందని, ఏపీ ప్రభుత్వ తీరువల్లే హైకోర్టు విభజన ఆలస్యం అవుతుందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి పీపీ చౌదరితో ఆయన భేటీ అయ్యారు.

పాక్ విజయం..

ఇంగ్లండ్ :ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫిని పాక్ ఎగురకేసుకపోయింది. ఫైనల్ లో భారత్ జట్టుపై 180 రన్స్ తేడాతో పాక్ విజయం సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 338 పరుగులు చేయగా భారత్ కేవలం 30.3 ఓవర్లలో 158 పరుగులకు భారత్ ఆలౌటయ్యింది.

21:31 - June 18, 2017

ఇంగ్లండ్ : ఐసీసీ ఛాంపియన్స్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ చేతులేత్తేసింది. చిరకాల ప్రత్యర్థిని అలవోకగా మట్టి కరిపిస్తుందని ఆశించిన క్రికెట్ అభిమానులు ఆశలు నెరవేరలేదు..ప్రత్యర్థిని చిత్తుగా ఓడించిన అదే జట్టు..ఇప్పుడు అదే ప్రత్యర్థి చేతిలో ఘోర పరాజయాన్ని చవి చూసింది..పాక్ ను ఓడిస్తుందని అనుకున్న జట్టు ఏకంగా 180 పరుగుల తేడాతో పరాజయం చవి చూసింది. బౌలింగ్..బ్యాటింగ్ లో భారత్ జట్టు ఘోరంగా విఫలం చెందింది...

158 పరుగులకు ఆలౌట్..
తొలుత టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ కోహ్లీ ఏ మాత్రం ఆలోచించకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పాక్ ఓపెనర్లు అజర్ ఆలీ, ఫఖర్ జమన్ లు ధాటిగా ఆడడం ఆరంభించారు. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 338 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్ ఏ మాత్రం పోరాటపటిను కనబర్చలేదు. పాక్ బౌలర్లు చెలరేగి బౌలింగ్ చేయడంతో పరుగులు చేయడానికి భారత బ్యాట్స్ మెన్స్ కష్టపడాల్సి వచ్చింది. భారత ఓపెనర్లకు పాక్ బౌలర్ అమీర్ చుక్కలు చూపించాడు. ఖాతా తెరవకుండానే శర్మ డకౌట్ అయ్యాడు. వెంటనే కోహ్లీ (5) కూడా అవుట్ కావడంతో జట్టు ఆందోళనలో పడిపోయింది. ధావన్..యువరాజ్ సింగ్ లు ఆదుకుంటారని క్రీడాభిమానులు అనుకున్నారు. కానీ అమీర్ మరోసారి రెచ్చిపోయి ధావన్ (21) వికెట్ తీశాడు. అప్పటికీ భారత్ స్కోరు 33 పరుగులు మాత్రమే. కొద్దిసేపు ఆడిన యువ రాజ్ సింగ్ (22) పెవిలియన్ చేరాడు. ధోని (4), జాదవ్ (9) వెంటనే వెనుదిరిగారు. ఈ తరుణంలో బ్యాటింగ్ కు వచ్చిన పాండ్యా ఒంటరి పోరాటం చేశాడు. కానీ జట్టు స్కోరు 152 పరుగుల వద్ద పాండ్యా (76) వెనుదిరిగాడు. అనంతరం ఇతర బ్యాట్స్ మెన్స్ వెనుదిరగడంతో 30.3 ఓవర్లలో 158 పరుగులకు భారత్ ఆలౌటయ్యింది.

పాక్ బ్యాట్స్ మెన్స్ జోరు..
పాక్ బ్యాట్స్ మెన్స్ చెలరేగిపోయారు. ఓపెనర్లు అజర్ ఆలీ, ఫఖర్ జమన్ లు ధాటిగా ఆడారు. స్కోరు బోర్డు పరుగెత్తుండడంతో వీరిని విడదీయడానికి భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. చివరకు జట్టు స్కోరు 128 పరుగుల వద్ద అజర్ ఆలీ (59) పెవిలియన్ చేరాడు. ఫఖర్ మాత్రం తన జోరును మరింత పెంచాడు. కేవలం 106 బంతులు ఎదుర్కొని 114 పరుగులు చేసి పాండ్యా బౌలింగ్ లో వెనుదిరిగాడు. అనంతరం వచ్చిన బాబర్ అజమ్ కూడా రాణించడంతో పాక్ భారీ స్కోరు దిశగా వెళుతోందని తెలిసిపోయింది. బాబర్ అజమ్ (46) పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. షోయబ్ మాలిక్ (12) కూడా వెంటనే వెనుదిరగడంతో స్కోరు బోర్డు మందగిస్తుందని క్రీడాభిమానులు ఆశించారు. కానీ మహ్మద్ హఫీజ్ వేగంగా ఆడడంతో పరుగుల వేగం పుంజుకొంది. కేవలం 37 బంతులను ఎదుర్కొన్న హఫీజ్ ఏకంగా 57 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. చివరకు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 338 పరుగులు చేసింది.

21:27 - June 18, 2017

చెన్నై : ఆర్కేనగర్‌ ఉపఎన్నిక సమయంలో ఓటర్లకు డబ్బులు ఇచ్చేందుకు ప్రయత్నించిన కేసు... ఇప్పుడు దినకరన్ వర్గాన్ని కుదిపేస్తోంది. ఈ కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఆరోగ్యశాఖ మంత్రి సి.విజయభాస్కర్‌, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి దినకరన్‌తో పాటు మరికొందరిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. ఉప ఎన్నిక సమయంలో అధికార అన్నాడీఎంకే నేతలు ఓటర్లకు విరివిగా డబ్బులు పంచుతున్నట్లు అప్పట్లో వచ్చిన ఓ వీడియో సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలోనే మంత్రి విజయభాస్కర్‌ ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. ఎన్నికల సమయంలో దాదాపు 90కోట్ల వరకు నగదు పంపిణీ చేసినట్లు ఉన్న కొన్ని కీలకమైన పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓటర్లకు డబ్బులు పంచుతున్నట్లు తెలియడంతో ఎన్నికల సంఘం అక్కడ జరిగే ఉప ఎన్నికను రద్దు చేసింది. తాజాగా నగదు పంచినందుకు వీరిపై కేసు నమోదుకు ఆదేశాలు జారీచేసింది.

21:26 - June 18, 2017

ఢిల్లీ : ఈనెల 20న ఎన్డీయే పక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి ఎవరన్న ఉత్కంఠకు తెరపడనుంది. 20న జరిగే బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్ధిని ఖరారు చేయనున్నారు. మరోవైపు విపక్షాల ఏకాభిప్రాయ సాధన దిశగా త్రిసభ్య కమిటీ ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. రాష్ట్రపతి అభ్యర్ధి ఎంపిక విషయంలో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. త్రిసభ్య కమిటీ పేరుతో బీజేపీ విపక్షాల అభిప్రాయాలను తెలుసుకుంటోంది. ఏకాభిప్రాయ సాధన దిశగా త్రిసభ్య కమిటీ ప్రయత్నాలు చేస్తోంది. అయితే అభ్యర్ధి పేరు చెప్పకుండా తమ అభిప్రాయాలను తెలుసుకునేందుకు రావడాన్ని విపక్షాలు తప్పుపట్టాయి. దీంతో రాష్ట్రపతి అభ్యర్ధిని నిలబెట్టే అంశంపై ఈనెల 20న బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహిస్తోంది. ఈ సమావేశంలోనే రాష్ట్రపతి అభ్యర్ధి ఎవరన్నది ఖరారు చేయనున్నారు.

త్రిసభ్య కమిటీ..
రాష్ట్రపతి అభ్యర్ధి ఎంపిక విషయంలో విపక్షాలతో సంప్రదింపులు జరపడానికి ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. విపక్షాల ఏకాభిప్రాయ సాధనకు కృషి చేస్తోంది. రాష్ట్రపతి అభ్యర్ధి ఎంపికపై ఇప్పటికే కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌, వెంకయ్య నాయుడు కాంగ్రెస్‌ , సీపీఎం, సీపీఐ, ఎన్సీపీ, ఎస్పీ పార్టీ నేతలను కలిసి చర్చలు జరిపారు. ఆ తర్వాత రాంవిలాస్‌ పాశ్వాన్‌, రాంగోపాల్‌యాదవ్‌, నరేష్‌ అగర్వాల్‌తో వెంకయ్య చర్చించారు. ఈ భేటీలో ప్రధాని నిర్ణయానికి కట్టుబడి ఉంటానని రాంవిలాస్‌ పాశ్వాన్‌ స్పష్టం చేశారు. వివిధ పార్టీ సభ్యులతో ఇప్పటికే మాట్లాడిన వెంకయ్య ... ఆ వివరాలను అమిత్‌షాకు వివరించారు. ఇక అరుణ్‌జైట్లీ కూడా తృణమూల్‌ కాంగ్రెస్‌, బిజు జనతాదళ్‌ నాయకులతో సంప్రదింపలు జరిపారు. మరోవైపు మిత్రపక్షం శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రేను... బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా .. కలిశాను. శివసేన గత కొంతకాలంగా బీజేపీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో అమిత్‌ ... ఉద్దవ్‌ ఠాక్రేతో భేటీ అయ్యారు. రాష్ట్రపతి అభ్యర్ధికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. గంటపాటు సాగిన చర్చల్లో... తమ రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతివ్వాలని కోరినట్లు సమాచారం. విపక్షాలు, మిత్రపక్షాలతో కమలనాథుల ప్రయత్నాలు ఎలా ఉన్నా... ఈనెల 20న జరిగే బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో అభ్యర్ధి ఎవరన్న ఉత్కంఠకు తెరపడే అవకాశముంది.

21:23 - June 18, 2017
21:22 - June 18, 2017

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా టీఆర్‌ఎస్‌ పాలన కొనసాగడం లేదని టీ జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మీడియా సమావేశంలో మాట్లాడిన ప్రొఫెసర్‌ కోదండరాం..రైతాంగానికి బ్యాంకులు అప్పులు ఇవ్వడం లేదన్నారు. ఈనెల 21 నుంచి అమరుల స్పూర్తియాత్ర ప్రారంభం అవుతుందని..ఈ యాత్రలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

21:21 - June 18, 2017

విశాఖపట్టణం : భూకుంభకోణంపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. డీఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ సిట్‌ చీఫ్‌ గా వ్యవహరించనున్నారు. దర్యాప్తు బృందం సభ్యులుగా విశాఖ జేసీ సృజనతో పాటు డీఎస్పీలు, ఆర్డీవోలు ఉన్నారు. రెండు నెలల్లోపు ఈ బృందం నివేదిక అందిస్తుందని ఏపీ డీజీపీ సాంబశివరావు తెలిపారు. విశాఖ భూవివాదంపై సీఎం చంద్రబాబు సీరియస్‌ అయ్యారని.... భూముల రికార్డ్స్ తారుమారు చేయడంపై స్పెషల్‌ టీమ్‌ను ఏర్పాటు చేశారని చెప్పారు. 25 భూరికార్డ్స్‌ ట్యాంపరింగ్‌ అయ్యాయని తెలిపారు. రికార్డ్స్‌ను ట్యాంపరింగ్‌ చేసిన వారిపై తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ట్యాంపరింగ్‌పై ఇప్పటికే మూడు కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. మొత్తంగా 270 ఎకరాల భూమి ట్యాంపరింగ్‌ అయ్యిందని.. ఇందులో 265 ఎకరాలు ప్రభుత్వ భూములున్నాయన్నారు.

21:19 - June 18, 2017

హైదరాబాద్ : ముస్లిం - మైనార్టీల విద్యావికాసానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ నాంపల్లిలో 20 కోట్ల రూపాయల వ్యయంతో ముస్లిం అనాథ పిల్లలకు ఆశ్రయం, విద్యను అందించడం కోసం నిర్మించే అనీస్ ఉల్ గుర్భాకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. ఎంతో మంది అనాథ పిల్లలకు ఉపయోగపడే అనీస్ ఉల్ గుర్భా భవన నిర్మాణానికి పూనుకోవడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన అనీస్ ఉల్ గుర్భా నూతన భవనాన్ని గొప్పగా నిర్మించాలని సీఎం సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహముద్ అలీ, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యేలు జాఫర్ హుస్సేన్, బలాలా, పాషాఖాద్రీ, మౌజంఖాన్, ఎమ్మెల్సీలు రాజేశ్వర్‌రెడ్డి, సలీమ్, ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

21:18 - June 18, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్‌ ఇచ్చి తీరుతామన్నారు సీఎం కేసీఆర్‌. రంజాన్‌ మాసం సందర్భంగా..ముస్లిం సోదరులకు ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్ ఇఫ్తార్‌ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ..మైనార్టీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని వారికి హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ఒక యూనివర్శిటీకి ముస్లింను వీసీగా నియమిస్తామన్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతో పాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పేద ముస్లింలకు రంజాన్ కానుకగా 4 లక్షల కుటుంబాలకు మూడు జతలతో కూడిన దుస్తుల గిఫ్ట్ ప్యాకెట్లను కేసీఆర్ అందజేశారు.

21:09 - June 18, 2017

ఇంగ్లండ్ : ఐసీసీ ఛాంపియన్స్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ చేతులేత్తేసింది. తొలుత టాస్ గెలిచిన భారత్ ఏ మాత్రం ఆలోచించకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పాక్ ఓపెనర్లు అజర్ ఆలీ, ఫఖర్ జమన్ లు ధాటిగా ఆడడం ఆరంభించారు. బంతిని బౌండరీలుగా మరల్చారు. స్కోరు బోర్డు పరుగెత్తుండడంతో వీరిని విడదీయడానికి భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. చివరకు జట్టు స్కోరు 128 పరుగుల వద్ద అజర్ ఆలీ (59) పెవిలియన్ చేరాడు. ఫఖర్ మాత్రం తన జోరును మరింత పెంచాడు. కేవలం 106 బంతులు ఎదుర్కొని 114 పరుగులు చేసి పాండ్యా బౌలింగ్ లో వెనుదిరిగాడు. అనంతరం వచ్చిన బాబర్ అజమ్ కూడా రాణించడంతో పాక్ భారీ స్కోరు దిశగా వెళుతోందని తెలిసిపోయింది. బాబర్ అజమ్ (46) పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. షోయబ్ మాలిక్ (12) కూడా వెంటనే వెనుదిరగడంతో స్కోరు బోర్డు మందగిస్తుందని క్రీడాభిమానులు ఆశించారు. కానీ మహ్మద్ హఫీజ్ వేగంగా ఆడడంతో పరుగుల వేగం పుంజుకొంది. కేవలం 37 బంతులను ఎదుర్కొన్న హఫీజ్ ఏకంగా 57 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. చివరకు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 338 పరుగులు చేసింది.

క్యూ కట్టిన భారత్ బ్యాట్స్ మెన్స్..
అనంతరం లక్ష్య చేధనకు బరిలో దిగిన భారత ఓపెనర్లకు పాక్ బౌలర్ అమీర్ చుక్కలు చూపించాడు. ఖాతా తెరవకుండానే శర్మ డకౌట్ అయ్యాడు. వెంటనే కోహ్లీ (5) కూడా అవుట్ కావడంతో జట్టు ఆందోళనలో పడిపోయింది. ధావన్..యువరాజ్ సింగ్ లు ఆదుకుంటారని క్రీడాభిమానులు అనుకున్నారు. కానీ అమీర్ మరోసారి రెచ్చిపోయి ధావన్ (21) వికెట్ తీశాడు. అప్పటికీ భారత్ స్కోరు 33 పరుగులు మాత్రమే. కొద్దిసేపు ఆడిన యువ రాజ్ సింగ్ (22) పెవిలియన్ చేరాడు. ధోని (4), జాదవ్ (9) వెంటనే వెనుదిరిగారు. ఈ తరుణంలో బ్యాటింగ్ కు వచ్చిన పాండ్యా ఒంటరి పోరాటం చేశాడు. ఇతనికి జడేజా సహకారం అందిస్తున్నాడు.

పాక్ జట్టు స్కోరు కార్డు : అజర్ ఆలీ (59, 71 బంతులు 6 ఫోర్లు 1 సిక్స్), ఫఖర్ జమన్ (114, 106 బంతులు 12 ఫోర్లు, 3 సిక్స్ లు), బాబర్ అజమ్ (46, 52 బంతులు 4 ఫోర్లు), షోయబ్ మాలిక్ (12, 16 బంతులు 1 సిక్స్), మహ్మద్ హఫీజ్ నాటౌట్ (57, 37 బంతులు 4 ఫోర్లు, 3 సిక్స్ లు), ఇమద్ వాసిమ్ నాటౌట్ (25, 21 బంతులు, 1 ఫోర్, 1 సిక్స్). ఎక్స్ ట్రాలు 25..మొత్తం 338/4.
భారత్ బౌలింగ్ : భువనేశ్వర్ కుమార్, పాండ్యా, జాదవ్ లు తలా ఒక వికెట్ తీశారు.

ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు..

హైదరాబాద్ : ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందుకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా అభివృద్ధి చెందుతోందని, 12 శాతం రిజర్వేషన్ల కోసం త్వరలో ఢిల్లీ వెళుతామని కేసీఆర్ వెల్లడించారు. 100 మంది ముస్లిం విద్యార్థులకు ఐఏఎస్, ఐపీఎస్ శిక్షణ కోసం కోచింగ్ సెంటర్లు పెడుతున్నట్లు తెలిపారు.

650 కిలోల అల్లం..వెల్లుల్లి పేస్టు స్వాధీనం..

హైదరాబాద్ : హబీబ్ నగర్ అబజాల్ సాగర్ ప్రాంతంలో ఓ ఇంటిపై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు జరిపారు. కల్తీ అల్లం..వెల్లుల్లి పేస్టు తయారు చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు. రసాయనాలు కలిపి అల్లం..వెల్లుల్లి పేస్టు తయారు చేస్తున్నారు. 650 కిలోల అల్లం..వెల్లుల్లి పేస్టును సీజ్ చేశారు.

తీవ్ర నిరుత్సాహంలో క్రికెట్ క్రీడాభిమానులు..

ఇంగ్లండ్ : భారత క్రికెట్ క్రీడాభిమానులు తీవ్ర నిరుత్సాహంలో మునిగిపోయారు. పాక్ జట్టుపై విజయం సాధించి కప్ సాధిస్తుందని ఎంతగానో ఎదురు చూసిన అభిమానులకు టీమిండియా బ్యాట్స్ మెన్స్ షాక్ ఇచ్చారు. త్వరత్వరగా పెవిలియన్ చేరారు. శర్మ (0), ధావన్ (21), కోహ్లీ (5), యువ రాజ్ (22), ధోని (4) లు పెవిలియన్ చేరడంతో భారత్ కష్టాల్లో పడిపోయింది. ప్రస్తుతం 14 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 58 పరుగులు చేసింది.

20:18 - June 18, 2017

యువీ కూడా అదే దారి..

ఇంగ్లండ్ : పాక్ నిర్ధేశించిన లక్ష్య చేధనను చేరుకోవడానికి టీమిండియా బ్యాట్స్ మెన్స్ తడబాటు పడుతున్నారు. ప్రధాన వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిపోయింది. శర్మ (0), ధావన్ (21), కోహ్లీ (5), యువ రాజ్ (22) లు పెవిలియన్ చేరడంతో అభిమానులు తీవ్ర నిరుత్సాహంలో మునిగిపోయారు.

ధోని..యువరాజ్ ఆదుకుంటారా ?

ఇంగ్లండ్ : పాక్ తో ఆడుతున్న భారత్ కష్టాల్లో పడింది. మూడు ప్రధాన వికెట్లను కోల్పోయింది. 12 ఓవర్లలో భారత్ మూడు వికెట్లు కోల్పోయి 50 పరుగులు చేసింది. శర్మ (0), ధావన్ (21), కోహ్లీ (5)లు తొందరగా అవుట్ అయ్యారు. వీరిని అమర్ అవుట్ చేశాడు.

19:57 - June 18, 2017

అలనాడు ఛైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి తాను ఎదుగుతూనే అదే విధంగా కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తూ అలనాటి నుండి నేటి వరకు సక్సెస్ ఫుల్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నారు..ఆమెనే సీనియర్ నటి 'తులసి'..ఈ మంగళవారం 'శంకరాభరణం' అవార్డు కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఈ శుక్రవారం 'తులసి' జన్మదినం కావడం..అందులో శంకరాభరణం ఈవెంట్ లో కళా తపస్వీ విశ్వనాథ్ కు 'తులసి' సన్మానించబోతున్నారు. తన సినిమాలో అవకాశం ఇచ్చిన గురువు పేరున ఆమె పురస్కారాలు అందించబోతున్నారు. 'శంకరాభరణం' సినిమాలో 'శంకరం' పాత్రతో తనను సినిమా రంగానికి తీసుకొచ్చిన కాశీనాథుని విశ్వనాథ్ పేరిట ఆమె పురస్కారాల్ని ఇవ్వబోతున్నారు. ఈసందర్భంగా టెన్ టివి ఆమెతో ప్రత్యేకంగా ముచ్చటించింది. ఈ సందర్భంగా 'తులసి' పలు విశేషాలు తెలియచేశారు. అంతేగాకుండా ఆమెతో పలువురు కాలర్స్ ముచ్చటించారు. విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి.

శర్మ..కోహ్లీ..ధావన్ అవుట్..

ఇంగ్లండ్ : పాక్ బౌలర్లు పై చేయి సాధిస్తున్నారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండడంతో భారత బౌలర్లు పరుగులు సాధించడానికి కష్టపడుతున్నారు. శర్మ (0), ధావన్ (21), కోహ్లీ (5)లు పెవిలియన్ చేరారు. ప్రస్తుతం యువరాజ్ సింగ్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. 9.0 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 33 పరుగులు చేసింది.

కోహ్లీ కూడా అవుట్ అయ్యాడు..

ఇంగ్లండ్ : ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో భారత్ కు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. శర్మ పరుగులేమి చేయకుండానే వెనుదిరగగా కోహ్లీ 5 పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రస్తుతం భారత్ 2.4 ఓవర్లలో ఆరు పరుగులుకు రెండు వికెట్లు కోల్పోయింది.

అయ్యో..టీమిండియాకు ఎదురు దెబ్బ..

ఇంగ్లండ్ : ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో ఆదిలోనే భారత్ కు ఎదురు దెబ్బ తగిలింది. 338 పరుగుల లక్ష్య చేధనలో బరిలోకి దిగిన భారత్ ఓపెనర్ శర్మ పరుగులు ఏమి చేయకుండానే వెనుదిరిగాడు.

19:02 - June 18, 2017

25 ఎక్స్ ట్రాలు..9 సిక్స్ లు..27 ఫోర్లు..

ఇంగ్లండ్ :ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో మ్యాచ్ లో భారత బౌలర్లు అంతగా రాణించలేదు. పాక్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చారు. ఏకంగా 25 ఎక్స్ ట్రాలు వేశారు. పాక్ బ్యాట్స్ మెన్స్ బ్యాట్ ను ఝులిపించారు. నిర్ణీత 50 ఓవర్ లలో పాక్ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 338 పరుగులు సాధించింది. ఇందులో 9 సిక్స్ లు, 27 ఫోర్లు ఉండడం గమనార్హం.

పాక్ స్కోరు కార్డు..

ఇంగ్లండ్ : ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో పాక్ బ్యాట్ మెన్స్ సత్తా చాటారు. భారత బౌలర్లపై పై చేయి సాధించారు. పాక్ ఓపెనర్ ఫఖర్ జమన్ శతకం సాధించగా అజర్ ఆలీ, హఫీజ్ లు అర్ధ సెంచరీలు సాధించి భారీ స్కోరుకు పునాది వేశారు.

భారత్ టార్గెట్ 339..

ఇంగ్లండ్ : ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో పాక్ బ్యాట్స్ మెన్స్ విజృంభించారు. ఓపెనర్లు భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని స్కోరు బోర్డును పరుగులెత్తించారు. నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయిన పాక్ 338 పరుగులు చేసింది.

300 పరుగులు దాటేసిన పాక్..

ఇంగ్లండ్ : ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో పాక్ బ్యాట్స్ మెన్స్ విజృంభించారు. 48.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 322 పరుగులు చేసింది.

18:33 - June 18, 2017
18:28 - June 18, 2017

పశ్చిమగోదావరి : రాజమండ్రి జనం అంతా ఇప్పుడు అమెరికా వైపు చూస్తున్నారు. తమకు అందుబాటులో ఉండాల్సిన ప్రజాప్రతినిధులంతా అమెరికాలో మకాం వేస్తే తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్ధం కాక సతమతమవుతున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేల అమెరికా టూర్లతో రాజమహేంద్రవరంలో పడకేసిన పాలనపై టెన్ టీవీ ప్రత్యేక కథనం. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి.. ఇక్కడ పేరుకే ప్రజా ప్రతినిధులన్న చందంగా తయారైంది. ప్రజల గోడు పట్టించుకోవాల్సిన ప్రజా ప్రతినిధులంతా ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో సమస్యలన్నీ పేరుకుపోయాయి. రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్.. మామూలుగానే ఆయన ప్రజలకు అందుబాటులో ఉండరనే విమర్శలు ఉన్నాయి. కాగా ప్రస్తుతం తానా మహాసభలంటూ గత 15 రోజులుగా ఆయన అమెరికా టూర్‌లో ఉన్నారు. దీంతో ఆయన నియోజకవర్గానికి వచ్చే అవకాశమే లేకుండా పోయింది. కొద్దిరోజుల క్రితం ఆయన కోడలు మాత్రం నియోజకవర్గంలో పర్యటించడం విశేషం. ఇక రాజమండ్రి సిటి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కూడా వ్యక్తిగత పనుల కోసం అమెరికా వెళ్లిపోయారు. పదిరోజులుగా ఆయన అక్కడే మకాం వేశారు. చివరకి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు వచ్చి సభ పెడితే ఆ సభకు ఆయన దూరంగా ఉన్నారు. దీంతో ప్రజా సమస్యలన్నీ పెండింగ్‌లో పడిపోయాయి.

ప్రజల ఇబ్బందులు..
ఇక వీళ్లిద్దరి కన్నా ముందే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అమెరికా వెళ్లారు. ఆయన వెళ్లి నెల రోజులు అవుతోంది. క్యాబినెట్ విస్తరణలో సీఎం చంద్రబాబు మీద కారాలు, మిరియాలు నూరిన ఆయన పార్టీ సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. మహానాడుకు కూడా గైర్హాజరైన ఆయన అమెరికాలో కూతురి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇలా వీరంతా అమెరికా బాట పట్టడంతో తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్ధం కావట్లేదని రాజమండ్రి ప్రజలు ఆవేదన చెందుతున్నారు. నియోజకవర్గానికి అందుబాటులో ఉండాల్సిన నేతలంతా ఇలా ఫారిన్ టూర్లో బిజీగా గడుపుతుంటే తమ సమస్యలు ఎవరు పరిష్కరిస్తారని ప్రశ్నిస్తున్నారు. తాము ఓటేస్తే గెలిచిన నేతలంతా పత్తా లేకుండా పోవడంపై రాజమండ్రి వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వీరికి తగిన బుద్ధి చెబుతామంటున్నారు.

18:25 - June 18, 2017

చిత్తూరు : తిరుమలకు భక్తులు పోటెత్తారు. అన్ని కంపార్టుమెంట్లు నిండి వెలుపల కిలోమీటర్‌ మేర క్యూలైన్‌ కొనసాగుతోంది. నడకదారి భక్తులు సంయమనం పాటించాలని టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు పేర్కొన్నారు. నడకదారిలో నిత్యం 30 వేల నుంచి 40వేల మంది భక్తులు వస్తుండటం వల్లే దర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం పడుతుందన్నారు. నడకదారిన వచ్చినంత మాత్రాన వెంటనే దర్శనం కాదని స్పష్టం చేశారు. నడకదారి భక్తులు టీటీడీకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

18:23 - June 18, 2017

ఢిల్లీ : జీఎస్టీ వల్ల ప్రజలు, రైతులు, వ్యాపారులకు ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లామని.. ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఢిల్లీలో జరిగిన సమావేశానికి యనమల హాజరయ్యారు. వ్యాపారస్తులకు ఇబ్బంది లేకుండా ఆన్‌లైన్‌ ద్వారా పన్ను విధానం సమర్ధవంతంగా అమలు పరచాలని విజ్ఞప్తి చేశామని చెప్పారు.. జులై 1నుంచి కొత్త పన్నుల విధానాన్ని అమలు చేయాలని జీఎస్టీ మండలి నిర్ణయించిందని తెలిపారు.

18:21 - June 18, 2017

విశాఖపట్టణం : భూకుంభకోణంపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. డీఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ సిట్‌ చీఫ్‌ గా వ్యవహరించనున్నారు. దర్యాప్తు బృందం సభ్యులుగా విశాఖ జేసీ సృజనతో పాటు డీఎస్పీలు, ఆర్డీవోలు ఉన్నారు. రెండు నెలల్లోపు ఈ బృందం నివేదిక అందిస్తుందని ఏపీ డీజీపీ ప్రసాదరావు తెలిపారు. విశాఖ భూవివాదంపై సీఎం చంద్రబాబు సీరియస్‌ అయ్యారని.... భూముల రికార్డ్స్ తారుమారు చేయడంపై స్పెషల్‌ టీమ్‌ను ఏర్పాటు చేశారని చెప్పారు. 25 భూరికార్డ్స్‌ ట్యాంపరింగ్‌ అయ్యాయని తెలిపారు. రికార్డ్స్‌ను ట్యాంపరింగ్‌ చేసిన వారిపై తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ట్యాంపరింగ్‌పై ఇప్పటికే మూడు కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. మొత్తంగా 270 ఎకరాల భూమి ట్యాంపరింగ్‌ అయ్యిందని.. ఇందులో 265 ఎకరాలు ప్రభుత్వ భూములున్నాయన్నారు.

వెనుదిరుగుతున్న పాక్ బ్యాట్ మెన్స్..

ఇంగ్లండ్ : పాక్ బ్యాట్స్ మెన్స్ వెనుదిరుగుతున్నారు. 42.3 ఓవర్లలో పాక్ 267 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది. అజర్ ఆలీ (59), ఫఖర్ జమన్ (114), బాబర్ అజమ్ (46), షోయబ్ మాలిక్ (12) పెవిలియన్ దారి పట్టారు.

హోటల్ బిల్లు రూ. 7500 దాటితే..

న్యూఢిల్లీ : హోటళ్లు..రెస్టారెంట్లపై జీఎస్టీ పన్నును తగ్గించారు. రెస్టారెంట్ లపై 18 శాతం పన్ను విధించారు. హోటల్ బిల్లు రూ. 2500 నుండి రూ. 7500 వరకు 18 శాతం పన్ను విధిస్తామని..రూ. 7500 పైబడితే 28 శాతం పన్ను ఉంటుందని ఆర్థిక మంత్రి జైట్లీ వెల్లడించారు.

పాక్ 263/3..

ఇంగ్లండ్ : పాక్ మరో వికెట్ కోల్పోయింది. షోయబ్ మాలిక్ (12) ను భువనేశ్వర్ అవుట్ చేశాడు. ప్రస్తుతం 41.3 ఓవర్లలో 263/3 పరుగులు చేసింది.

17:36 - June 18, 2017

హిందీలో సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా చేసిన 'బిగ్ బాస్' షో ఇప్పుడు తమిళం, తెలుగు భాషల్లో కూడా సందడి చేయనుంది. తమిళంలో కమల్ హాసన్ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా చేయనున్నారు. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ చేయనున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తెలుగు 'బిగ్ బాస్' కార్యక్రమానికి సంబంధించిన టీజర్ విడుదల చేశారు. ఇందులో ఎన్టీఆర్ తనదైన స్టైల్ లో..లుక్స్ తో ఆకట్టుకున్నాడు. పలువురు సెలబ్రెటీలతో సాగే ఈ గేమ్ షో ఉంటుందని సమాచారం.

అవుట్ అయిన ఫఖర్..

ఇంగ్లండ్ : పాక్ ఓపెనర్ ఫఖర్ జమన్ జోరు కు బ్రేక్ పడింది. 105 బంతులను ఎదుర్కొన్న ఫఖర్ 114 పరుగులు సాధించి అవుట్ అయ్యాడు. ప్రస్తుతం పాక్ జట్టు 33.1 ఓవర్లలో 200/2 పరుగులు చేసింది.

పాక్ బ్యాట్స్ మెన్స్ జోరు..

ఇంగ్లండ్ : పాక్ బ్యాట్స్ మెన్స్ జోరు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ఓపెనర్ ఫఖర్ బ్యాట్ ను ఝులిపిస్తున్నాడు. ప్రస్తుతం 33.1 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 200 పరుగులు చేసింది.

17:23 - June 18, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత..సంగారెడ్డిలో నిర్వహించిన తెలంగాణ ప్రజా గ‌ర్జన కాంగ్రెస్‌లో కొత్త జోష్‌ను తీసుకొచ్చింది. స‌భ‌ ఊహించిన విధంగా సూప‌ర్ స‌క్సెస్ చేయ‌డంతో..ఖుషీగా ఉన్న టీ-కాంగ్రెస్.. ఇదే స్పీడ్‌ను కొన‌సాగించాల‌ని డిసైడ్ అయ్యింది. దీనికోసం ప్రత్యేక కార్యాచ‌ర‌ణ‌ను సిద్దం చేసింది హ‌స్తం పార్టీ. గాంధీభ‌వ‌న్లో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జ‌రిగిన పార్టీ విస్తృతస్థాయి స‌మావేశంలో రాష్ట్రంలో తాజా రాజ‌కీయ ప‌రిణామాల‌పై చ‌ర్చించారు నేత‌లు. మియాపూర్ భూ కుంబ‌కోణంపై పోరాటాన్ని ఉధృతం చేయాల‌ని నిర్ణయించారు నేత‌లు. ముఖ్యంగా మొన్నటి రాహుల్ గాంధీ పాల్గొన్న సంగారెడ్డి స‌భ స‌క్సెస్ టెంపోను కొన‌సాగించాల‌ని నిర్ణయించారు. తెలంగాణ ఆవిర్భావం త‌ర్వాత తొలిసారి బ‌హిరంగ స‌భలో రాహుల్ పాల్గొన‌డంతో పార్టీ లీడ‌ర్, క్యాడ‌ర్లలో నయా జోష వ‌చ్చింద‌ని భావిస్తున్నారు . అయితే జోష్‌ను క్షేత్రస్థాయికి చేర్చాల‌ని నిర్ణయించారు నేత‌లు.

రాహుల్‌ సభతో క్యాడర్లో నయా జోష్‌..
దీనికోసం విస్థృతస్థాయి స‌మావేశంలో కాంగ్రెస్ ప‌క్కా ప్రణాళిక‌ను సిద్దం చేసింది. సంగారెడ్డి బ‌హిరంగ స‌భ‌లో రాహుల్ కేసీఆర్‌కు సంధించిన ప్రశ్నలు తెలంగాణ ప్రజ‌ల‌కు బాగా చేరాయ‌ని భావిస్తున్నారు నేత‌లు. విద్యార్థుల త్యాగాలు, ప్రజ‌ల ఆకాంక్షలకు భిన్నంగా కేసీఆర్‌ పాల‌న సాగుతుందా అంటూ రాహుల్ సంధించిన ప్రశ్నలను క్షేత్రస్థాయి వర‌కు తీసుకుపోవ‌డం ద్వారా భ‌విష్యత్‌లో పార్టీకి లాభీస్తుంద‌ని అంచనావేస్తున్నారు నేత‌లు. అంతేకాదు కేసీఆర్, మోడి మూడేళ్ళ పాల‌న వైఫల్యాలపై రాహుల్ విడుద‌ల చేసిన చార్జ్ షీట్ ప్రజ‌ల్లోకి తీసుకువెళ్ళాల‌ని నిర్ణయించారు హ‌స్తం నేత‌లు. దీనికోసం పీసీసీ..రాహుల్ సందేశ్ యాత్రకు శ్రీకారం చుట్టాల‌ని నిర్ణించారు. సంగారెడ్డిలో రాహుల్ చేసిన ప్రసంగంతో పాటు..స‌భ‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైప‌ల్యాల‌పై రాహుల్ విడుద‌ల చేసిన ఛార్జ్ షీట్‌ను ప్రతి జిల్లా కేంద్రాల‌లో మీటింగ్‌ల ద్వారా..ప్రజల ముందు పెట్టనున్నారు హ‌స్తం నేత‌లు. అంతేకాదు..తాము అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఏమి చేయ‌బోతున్నార‌న్న దాంతో కూడిన మినీ మ్యానిఫెస్టోను కూడా ఈ రాహుల్ సందేశ్ యాత్రలో ప్రజ‌ల‌కు పంచిపెట్టనుంది కాంగ్రెస్. మొత్తానికి మియాపూర్ భూస్కాంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న గులాబి స‌ర్కార్‌ను..ఇదే అద‌నుగా డిఫెన్స్‌లోకి నెట్టాల‌ని భావిస్తుంది కాంగ్రెస్. దీనికోసం రాహుల్ సంగారెడ్డి వేదిక‌గా రాజేసిన తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుకోవ‌డంతోపాటు..కేసీఆర్, మోడి వైఫల్యాల‌ను ప్రజ‌ల‌కు వివ‌రిస్తూ..సొంత క్యాడ‌ర్‌లో జోష్ పెంచుకోవాల‌ని త‌హ‌త‌హ‌లాడుతుంది హ‌స్తం పార్టీ. మ‌రి ఈ యాత్ర కాంగ్రెస్‌కు ఏమేర‌కు లాభిస్తుందో చూడాలి.

17:17 - June 18, 2017

హైదరాబాద్ : జీఎస్టీ వల్ల తెలంగాణకు మొత్తం 11వేల కోట్ల భారం పడుతుందన్నారు మంత్రి కేటీఆర్‌. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, హౌసింగ్‌ స్కీం ప్రాజెక్టులకు జీఎస్టీ వల్ల ప్రభుత్వంపై భారీగా ఆర్థిక భారం పడుతుందని దీనిని సవరించాలని ఆర్థికమంత్రిని కోరామన్నారు మంత్రి కేటీఆర్. అలాగే గ్రానైట్‌ పరిశ్రమపై 28 శాతం ఉన్న జీఎస్టీని 12 నుంచి 18శాతానికి తగ్గించాలన్నారు. ఢిల్లీలో ఇవాళ జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశానికి మంత్రి కేటీఆర్‌ హాజరయ్యారు. వాస్తవానికి ఈ సమావేశానికి తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ హాజరుకావాల్సి ఉండగా...ఆయన కుమారుడి వివాహం ఉండడంతో మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొన్న జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన మొత్తం ఆరు కీలక సూచనలు చేశామన్నారు మంత్రి కేటీఆర్‌. 

పాక్ ఓపెనర్ శతకం..

ఇంగ్లండ్ : భారత్ తో జరుగుతున్న మ్యాచ్ లో పాక్ ఓపెనర్ ఫకర్ జమన్ విజృంభించి ఆడుతున్నాడు. ఫఖర్ 94 పరుగులతో సెంచరీ దిశగా దూసుకెళుతున్నాడు. ప్రస్తుతం పాక్ ఒక వికెట్ నష్టానికి 30.3 ఓవర్లలో 102 పరుగులు చేసింది.

17:06 - June 18, 2017

ఇంగ్లండ్ : ఐసీసీ చాంపియన్స్ షిప్ 2017లో ఫైనల్ మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థులు భారత్..పాక్ జట్లు తలపడ్డాయి. తొలుత టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. పాక్ ఓపెనర్లు అజర్ ఆలీ, ఫఖర్ జమన్ లు ధాటిగానే బ్యాటింగ్ ను ఆరంభించారు. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును పరుగెత్తించే ప్రయత్నం చేశారు. పాక్ స్కోరు 128 పరుగుల వద్ద ఉండగా అజర్ ఆలీ (59) రనౌట్ అయ్యాడు. మరో వైపు ఫఖర్ ఆలీ మాత్రం తన బ్యాట్ ను ఝులిపించాడు. 90 బంతులు ఎదుర్కొన్న ఫఖర్ 96 పరుగులు చేశాడు.

16:51 - June 18, 2017

విశాఖ ల్యాండ్ స్కాం..సిట్ అధికారుల ఖరారు..

విశాఖపట్టణం : విశాఖ భూ స్కాంపై సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం సిట్ అధికారులను ప్రభుత్వం నియమించింది. సిట్ సభ్యులుగా విశాఖ జేసీ సృజన..డీఎస్పీలు..ఆర్డీవోలు ఉండనున్నారు. ఇక సిట్ చీఫ్ గా డీఐజీ వినీత్ బ్రిజ్ లాల్ వ్యవహరించనున్నారు.

16:48 - June 18, 2017

నాన్నకు ప్రేమ .. సహనం ఎక్కువ.. ఓర్చుకునే గుణం కూడా ఎక్కువే. ఉద్యోగం అంటూ ఉదయాన్నే పరుగులు పెడతాడు. కుటుంబం కోసం నిద్రను కూడా మర్చిపోతాడు. ఇంటి బాధ్యతల్ని ఒంటి స్తంభంలా మోస్తాడు. ఏదీ పైకి చెప్పడు.. మనసునిండా ప్రేమిస్తాడు. ప్రతి ఒక్కరి జీవితంలో నాన్నే సూపర్ హీరో.. ఈరోజు ఫాదర్స్ డే.. నాన్నకు ప్రేమతో.. శుభాకాంక్షలు చెబుదాం.. కనిపెంచే దేవత అమ్మ అయితే..నడిపించే దైవం నాన్న. నాన్నంటే భద్రత.. భరోసా.. బాధ్యత.. అలాంటి నాన్నను పూజించుకునే రోజు ఫాదర్స్ డే.. ప్రపంచ వ్యాప్తంగా 52 దేశాల్లో జూన్ మూడో ఆదివారం రోజున ఫాదర్స్ డే జరుపుకుంటారు.
నాన్న పిల్లల్లో పిల్లాడైపోతాడు. ఆటలాడి బుజ్జగిస్తాడు.. ఎన్నో ఊసులు చెప్పి నిద్రపుచ్చుతాడు. మారాం చేస్తే బ్రతిమాలుతాడు. పిల్లల్తో తను గడిపేది తక్కువే అయినా అదే తనకు వెయ్యేళ్ల జీవితంగా భావిస్తాడు. నాన్నంటే ఒక రిలేషన్ మాత్రమే కాదు.. ఒక ఎమోషన్ కూడా..కూతుర్ని ప్రాణంగా పెంచుతాడు నాన్న. ఆమె పట్ల నాన్న బాధ్యత చాలా గొప్పది.. కూతురు ఎంత పెరిగినా ఇంకా నాన్నకు చిన్నపిల్లే. చదువుసంధ్యల దగ్గర్నుంచి ఆమెకు పెళ్లై అత్తారింటికి పంపే వరకు నాన్న పడే కంగారు అంతా ఇంతా కాదు. తీరా ఆమె పెళ్లై వెళ్లిపోతుంటే నాన్న కంట కన్నీరు ఆగదు.
కొడుకుకి నాన్నే రోల్ మోడల్.. కొడుకుతో ఒక ఫ్రెండ్‌లా ఆలోచనలు పంచుకుంటాడు నాన్న. ఏ తప్పు చేసినా .. చిరునవ్వుతో మందలించేస్తాడు. నాన్నంటే ఓ మానసిక స్థైర్యం. నాన్న హృదయం అనంత సాగరం. నాన్న .. వేలు పట్టుకుని నడిపిస్తాడు. భుజాలపై కూర్చోపెట్టుకుని ప్రపంచాన్ని చూపిస్తాడు. ఒళ్లో కూర్చోబెట్టుకుని చదువు నేర్పిస్తాడు. బిడ్డల బ్రతుకుకి బంగారు బాటలు వేస్తాడు. నాన్న డబ్బు మాత్రమే కాదు. వారసత్వాన్ని, పేరుని, సంస్కారాన్ని ఇస్తాడు. ఆయన దగ్గర అన్ని తీసుకుని తిరిగి నాన్నకు ఏమి ఇవ్వగలం.. ఏమిచ్చినా నాన్న రుణం తీరనిది.. ఇలా ఫాదర్స్ డే రోజే నాన్నను గుర్తు చేసుకోవడమే కాకుండా.. ప్రతిరోజు అమ్మనాన్నల్ని ప్రేమిద్దాం.

16:46 - June 18, 2017

విజయవాడ : ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి.. అమరావతి ఎయిర్‌లైన్స్‌ని ఏర్పాటు చేయాలని.. ఏపీ సర్కార్ భావిస్తోంది. ప్రపంచ ప్రసిద్ధ నగరాలన్నీ సొంత ఎయిర్‌ లైన్స్‌ కలిగి ఉన్నాయి. అమరావతిలో కూడా సొంత ఎయిర్‌ లైన్స్‌ను ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో మొదలుపెట్టిన అన్ని ప్రాజెక్టులను.. సకాలంలో పూర్తి చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీనికి సంబంధించి మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ అధికారులతో సీఎం తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. ఢిల్లీ-ఇండోర్‌-తిరుపతి-విజయవాడ-ముంబై, విజయవాడ-తిరుపతి-ఇండోర్‌-ఢిల్లీ మధ్య జులై నెలాఖరు నుంచి.. జూమ్‌ ఎయిర్‌ సర్వీసులు ప్రారంభం కానున్నట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ ద్వారా సర్వీసులు పెంచి.. ప్రజలందరికీ విమానయానం అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి కోరారు. విజయవాడ నుంచి దుబాయ్‌, హాంకాంగ్, కౌలాలంపూర్‌లకు నేరుగా విమాన సర్వీసులు నడపాలని సీఎం సూచించారు. ప్రపంచ ప్రసిద్ధ నగరాలన్నీ సొంత ఎయిర్‌ లైన్స్ కలిగి ఉన్నాయనీ, అమరావతిలో కూడా సొంత ఎయిర్‌ లైన్స్‌ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. దేశం మొత్తం మీద 18 శాతం ఎయిర్‌ ట్రాఫిక్ వృద్ధి రేటు నమోదవగా.. ఆంధ్రప్రదేశ్‌లో 35 శాతం ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. దీనికి అనుగుణంగా విమానాశ్రయాల్లో మౌలిక వసతులు అభివృద్ధి చేయాలని కోరారు. విజయవాడ విమానాశ్రయంలో రన్‌ వే, రెండో టెర్మినల్‌ భవనాల పనులు త్వరిత గతిన పూర్తి చేసి.. కార్గో విమాన సర్వీసులు ప్రారంభించాలని కోరారు.

21న శంకుస్థాపన..
ఓర్వకల్లు విమానాశ్రయానికి ఈ నెల 21న శంకుస్థాపన చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. 10 నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. భోగాపురం గ్రీన్‌ ఫీల్డ్‌ విమానాశ్రయం భూ సమస్యలను పరిష్కరించి సంవత్సర కాలంలో పూర్తి చేయాలన్నారు. అన్ని పట్టణాలు, మండల కేంద్రాలలో హెలిపాడ్‌లు నిర్మించాలని చెప్పారు. ప్రతీ యేటా విశాఖ, తిరుపతిలో ఎయిర్‌ షోలు ఏర్పాటు చేయాలని కోరారు. మచిలీపట్టణం, భావనపాడు గ్రీన్‌ ఫీల్డ్‌ పోర్టుల నిర్మాణం వేగంగా జరగాలని.. ముఖ్యమంత్రి ఆదేశించారు. రోడ్డు మార్గాలు, జల మార్గాలు, వాయు మార్గాలు, ఓడ రేవుల అనుసంధానంతో ఏపీని లాజిస్టిక్‌ హబ్‌గా మార్చే అంశంపై.. టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. లక్షా 30 వేల కోట్లతో సాగరమాల ప్రాజెక్ట్‌ పనులు రాష్ట్రంలో జరుగుతున్నట్టు అధికారులు సీఎంకు తెలిపారు. రోడ్డు, రైలు, ఫిషరీస్‌, ఇండస్ట్రీస్‌ శాఖల సమన్వయంతో ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయాలని బాబు చెప్పారు. గ్యాస్ పైపులైన్లను ఏర్పాటు చేయడంలో జరుగుతున్న జాప్యంపై కేంద్ర పెట్రోలియం శాఖా మంత్రికి లేఖ రాయాలని.. అధికారులకు సీఎం చెప్పారు. తిరుపతిలో సైన్స్‌ సిటీ, విజయవాడలో సిటీ స్క్వేర్ నిర్మాణాలను వెంటనే చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అనంతపురములో ఎనర్జీ యూనివర్శిటీని 400 కోట్లతో.. కాకినాడలో లాజిస్టిక్‌ యూనివర్శిటీని 350 కోట్లతో ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్థానిక యూనివర్శిటీలతో మాట్లాడుకొని తాత్కాలిక క్యాంపస్‌లతో ఈ విద్యా సంవత్సరం నుంచి కార్యకలాపాలను ప్రారంభించాలని ఆదేశించారు.

వికెట్ కోల్పోయిన పాక్..

ఇంగ్లండ్ : భారత్ ఆడుతున్న మ్యాచ్ లో పాక్ ఒక వికెట్ కోల్పోయింది. నిలకడగా రాణిస్తూ హాఫ్ సెంచరీ చేసిన అజర్ ఆలీ (59) రనౌట్ అయ్యాడు. ప్రస్తుతం 23 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 128 పరుగులు చేసింది.

16:38 - June 18, 2017

విశాఖపట్టణం : ఏపీ రాష్ట్రంలో విశాఖ భూ స్కాంపై చెలరేగిన కలకలంపై ప్రభుత్వం సీరియస్ గానే స్పందిస్తోంది. అందులో భాగంగా సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం సిట్ అధికారులను నియమించింది. సిట్ సభ్యులుగా విశాఖ జేసీ సృజన..డీఎస్పీలు..ఆర్డీవోలు ఉండనున్నారు. ఇక సిట్ చీఫ్ గా డీఐజీ వినీత్ బ్రిజ్ లాల్ వ్యవహరించనున్నారు.
కానీ ఈ భూకుంభకోణంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. వేల కోట్ల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయని, దీని వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. అందులో భాగంగా ఈనెల 22వ తేదీన వైసీపీ మహాధర్న చేపట్టడానికి నిర్ణయం తీసుకుంది. టిడిపి ప్రజాప్రతినిధులు కుంభకోణంలో కుమ్మక్కయ్యారని ప్రతిపక్షం విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ల్యాండ్ వ్యవహారంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో అందోళనలు చేయడంతో పాటు.. సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నాయి. విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే సీబీఐ విచారణ చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రభుత్వం మాత్రం ప్రతిపక్షాల మాటను పక్కడ పెడుతూ భూ బాగోతాలపై సిట్ విచారణకు అదేశించింది.

16:34 - June 18, 2017

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాలకు అధ్యక్షులను టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదివారం ఖరారు చేశారు. ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను ఎంపిక చేశారు. ఏపీలో ఇదివరకు జిల్లా అధ్యక్షులుగా ఉన్న వారినే కొనసాగించారు. కృష్ణా జిల్లాకు బచ్చునుల అర్జునుడు, గుంటూరు జిల్లాకు జివీఎస్ ఆంజనేయులు, ప్రకాశం జిల్లాకు దామర్లచెర్ల జనార్దన్, నెల్లూరుకు బీదా రవిచంద్రను నియమించారు. రాయలసీమలోని కడప జిల్లాకు శ్రీనివాసుల రెడ్డిని..అనంతపురానికి బీకే పార్ధసారధిని..కర్నూలుకు సోమిశెట్టి వెంకటేశ్వర్లు..చిత్తూరు జిల్లాకు పులివర్తి వెంటకమణిప్రసాద్ లను ఖరారు చేశారు. ఇదివరకే ఉన్న వారిని అధ్యక్షులుగా కొనసాగించడంతో ఆశావాహులకు నిరాశే మిగిలింది. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో కూడా జిల్లాల అధ్యక్ష..కార్యదర్శులను నియమిస్తారని తెలుస్తోంది.

 

16:25 - June 18, 2017

ఢిల్లీ : రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో మిత్రపక్షాల అభిప్రాయాలను తెలుసుకొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ఏర్పాటైన కమిటీ సభ్యులు ప్రతిపక్ష..మిత్రపక్షాల నేతలతో సమావేశాలు జరుపుతున్నారు. ఆదివారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా..శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రేతో సమావేశమయ్యారు. ఎన్డీయే తరపున ఎంపిక చేసే రాష్ట్రపతి అభ్యర్థి మద్దతివ్వాలని షా కోరినట్లు తెలుస్తోంది. గంటపాటు ఈ భేటీ కొనసాగింది. ఈ సమావేశానికి ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ లు హాజరయ్యారు. మిత్రపక్షమైన శివసేన గతకొంతకాలంగా బీజేపీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. ఇటీవల ఎన్డీయే తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేరును శివసేన సూచించిన సంగతి తెలిసిందే. ఒకవేళ భగవత్ అభ్యర్థిత్వానికి ఒప్పుకోకపోతే శాస్త్రవేత్త ఎం.ఎస్.స్వామినాథన్ పేరును పరిగణలోకి తీసుకోవాలని సూచించింది.

16:18 - June 18, 2017

పోర్చుగల్ : ఓ అడవిలో రగిలిన కార్చిచ్చు దావానాంలా వ్యాపించింది. ఏకంగా రోడ్లపై ఉన్న కార్లకు మంటలు అంటుకున్నాయి. ఈప్రమాదంలో 43 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 39 మందికి తీవ్రగాయాలయ్యాయి. కార్లలో కూర్చొన్న వారు కూర్చొన్నట్టే సజీవదహనమైపోయారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు 160 ఫైరింజన్లు..500 మంది అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మంటల కారణంగా వచ్చిన పొగతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా 16 మంది కార్లలో సజీవదహనమయ్యారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు అడవీ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్న గ్రామస్తులను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పోర్చుగల్ అధ్యక్షుడు బాధితుల కుటుంబాలను కలుసుకోనున్నారు. గతేడాది కార్చిచ్చు కారణంగా దాదాపు లక్షన్నర ఎకరాల అడవి కాలి బూడిదైంది.

వికెట్ తీయని భారత బౌలర్లు..

ఇంగ్లండ్ : పాక్ - భారత్ జట్ల మధ్య మ్యాచ్ కొనసాగుతోంది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత బౌలర్లను పాక్ ఓపెనర్లు సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు సాధిస్తున్నారు. ప్రస్తుతం ఒక వికెట్ నష్టపోకుండా 16.1 ఓవర్లలో 90 పరుగులు సాధించింది.

16:08 - June 18, 2017

హైదరాబాద్ : భారత బ్యాడ్మింటన్‌ కెరటం, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్‌ ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్ ఫైనల్ లో విజయం సాధించాడు. జపాన్ షెట్లర్ పై వరుస సెట్లలో కిదాంబి శ్రీకాంత్ గెలుపొందాడు. కుజుమస సకాయ్ పై 21-11, 21-19 తేడాతో శ్రీకాంత్ విజయం సాధించి కప్ ను కైవసం చేసుకున్నాడు. రెండో సీడ్‌, దక్షిణ కొరియా షట్లర్‌ సన్‌ వాన్‌ హోపై 21-15, 14-21, 24-22తో విజయం సాధించి ఫైనల్ లోకి ప్రవేశించాడు. నిలకడగా రాణిస్తూ భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలని క్రీడాభిమానులు కోరుకుంటున్నారు.

శ్రీకాంత్ విజయం..

హైదరాబాద్ : ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్ ఫైనల్ లో జపాన్ షెట్లర్ పై వరుస సెట్లలో శ్రీకాంత్ గెలుపొందాడు. కుజుమస సకాయ్ పై 21-11, 21-19 తేడాతో శ్రీకాంత్ విజయం సాధించాడు.

పశ్చిమబెంగాల్ లో రూ. 2000 ఫేక్ కరెన్సీ..

పశ్చిమ బెంగాల్ : రూ. 2000 ఫేక్ కరెన్సీని బీఎస్ఎఫ్ అధికారులు సీజ్ చేశారు. మాల్దా ప్రాంతంలో సీజ్ చేసిన కరెన్సీ విలువ రూ. 1.96 లక్షలు ఉంటుందని అంచనా.

15:43 - June 18, 2017

హైదరాబాద్ : ఆంగ్ల మాధ్యమంలో చదువు చెప్పించాలన్న మోజుతో.. తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల వైపు పరుగులు పెడుతున్నారు. పెద్దపెద్ద భవంతులు, హంగులు, ఆర్భాటాలను చూసి పిల్లలను చేర్పించేస్తున్నారు. అయితే తల్లిదండ్రుల ఆసక్తిని గమనించిన విద్యాసంస్థల యాజమాన్యాలు.. వారిని నిలువు దోపిడీ చేస్తున్నాయి. ప్రైవేటు పాఠశాలల ఫీజుల దందాపై 10టీవీ ప్రత్యేక కథనం. విద్యతోనే విజ్ఞానం వికసిస్తుంది. ఆటపాటలతో కూడిన చదువుతోనే మానసిక పరిపక్వత వస్తుంది. విశాలమైన తరగతి గదులు, క్రీడా మైదానాలు విద్యార్థుల చదువులపై ఎంతో ప్రభావం చూపుతాయి. మరి విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించబోయే పాఠశాల ఎంతవరకూ సురక్షితం.. బోధన ఎలా ఉంటుంది? ఈ విషయాలను ఎంతవరకూ ఆలోచిస్తున్నారు.

ఇష్టానుసారంగా ఫీజులను పెంచేస్తున్న విద్యా సంస్థలు..
ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీకి అడ్డూ అదుపూ లేకుండా లేకుండా పోతోంది. ఏటేటా ఫీజులను పెంచేస్తూ తల్లిదండ్రులకు నిద్రలేకుండా చేస్తున్నారు. సరస్వతి నిలయాలుగా విరాజిల్లే విద్యాసంస్థలను.. వ్యాపార కేంద్రాలుగా మార్చేస్తున్నారు. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను బాగా చదివించాలనే ఉద్దేశంతో ప్రైవేటు విద్య భారమైనా.. అందులోనే చేర్పిస్తున్నారు.

పట్టించుకోని అధికారులు..
కొన్ని పాఠశాలలు అనుమతి లేకుండా నిర్వహిస్తూ.. వేరే పాఠశాలల నుంచి బోనఫైడ్‌, టీసీ లాంటి ధ్రువపత్రాలను అందజేస్తున్నారు. విద్యార్థుల సంక్షేమాన్ని బాధ్యతగా తీసుకోవాల్సిన అధికారులు ఏమీ పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలలు ఒక్కటి కూడా పని చేసేందుకు వీల్లేదని ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ కాలం వెల్లదీస్తున్నారు.

సరిపడా తరగతి గదులు, క్రీడా మైదానం..
పాఠశాలల్లో సరిపడా తరగతి గదులు, క్రీడా మైదానం, అర్హత గల ఉపాధ్యాయులు, రక్షణ తప్పనిసరిగా ఉండాలి. అగ్నిమాపక శాఖ, గ్రామ పంచాయతీ, రెవెన్యూ శాఖల అనుమతి ఉండాలి. భవనం చుట్టూ అగ్నిమాపక వాహనం తిరిగే స్థలం ఉండాలి. అయితే నిబంధనల ప్రకారం వసతులు సమకూర్చడం, అనుమతి పొందడం ఖర్చుతో కూడుకున్న పని కావడంతో.. విద్యా వ్యాపారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. అధికారులను ప్రసన్నం చేసుకొని నిబంధనల ప్రకారం అన్ని వసతులు ఉన్నట్లు నివేదికలు తయారు చేయించుకొని అనుమతులు పొందుతున్నారు. ఉన్నత స్థాయిలో డిగ్రీ, బీఈడీ చేసిన వారు..ప్రాథమిక స్థాయిలో ఇంటర్మీడియట్‌తో పాటు డైట్‌లో శిక్షణ, టెట్‌లో ఉత్తీర్ణులైన వారు విద్యాబోధన చేయాలి. ఉన్నత స్థాయిలో డిగ్రీ, బీఈడీ చేసిన వారు బోధన చేయాలి. తల్లిదండ్రులు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారే తప్ప, పాఠశాలల్లో ఉండే నియమ నిబంధనలు, జీవోలను పట్టించుకోవడం లేదు.

2010లో 42వ ఉత్తర్వు విడుదల..
ఒకటవ ఉత్తర్వుని 1994లో విడుదల చేశారు. విద్యార్థుల నుంచి వసూలు చేసే ఫీజులో 50 శాతం ఉపాధ్యాయుల వేతనాలకు, 15 శాతం సాంస్కృతిక కళలు, ఆటలకు, 10 శాతం సామగ్రికి, 15 శాతం సౌకర్యాలకు, 5 శాతం ఇతర పనులకు ఖర్చు చేయాలి. యాజమాన్యాలు 5 శాతం మాత్రమే లాభాలుగా తీసుకోవాలి. 42వ ఉత్తర్వుని 2010లో విడుదల చేశారు. ప్రైవేట్‌ బడుల్లో తప్పనిసరిగా రుసుము పెంచాలనుకుంటే.. డీఎఫ్‌ఆర్‌సీ అనుమతి పొందాల్సి ఉంటుంది. అయితే ఏటేటా ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచుతున్నారు. 246 ఉత్తర్వు ప్రకారం పాఠశాలల్లో కమిటీలను ఏర్పాటు చేసి వారితోనే పర్యవేక్షించాలి. ముఖ్యంగా ఉపాధ్యాయ, తల్లిదండ్రుల కమిటీ. దీని ద్వారా పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను యాజమాన్యాలకు తెలపడం, వాటిని పరిష్కరించడం చేయాలి. బస్సుల సామర్థ్యాలను తెలుసుకోవాలి. ఖమ్మం జిల్లాలో ఎక్కడా కమిటీలను ఏర్పాటు చేయడం లేదు.

91 ఉత్తర్వు ప్రకారం..
91వ ఉత్తర్వు ప్రకారం ప్రైవేట్‌ పాఠశాలల్లో పుస్తకాలు, నోట్‌బుక్కులు, బెల్టులు, ఏకరూప దుస్తులు తదితర విద్యా సామగ్రిని ఉంచకూడదు. ఎవరికీ ఫలానా చోట కొనుగోలు చేయాలని సూచించకూడదు. కానీ ప్రస్తుతం ప్రతి పాఠశాలల్లో కౌంటర్లను ఏర్పాటు చేసి వ్యాపారం చేస్తున్నారు. 780 ఉత్వర్వు ప్రకారం పాఠశాలలకు తోక పేరు పెట్టకూడదు. దీనిపై కొంతమేర నియంత్రణ ఉన్నా.. అక్కడక్కడ ఇలాంటి పాఠశాలలు దర్శనమిస్తున్నాయి.

విద్యాహక్కు చట్టానికి తూట్లు..
ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు ఎవరికి వారు ఇష్టానుసారంగా నిర్ణయించుకొని పెంచేస్తున్నారు. ఈ విషయంలో విద్యాహక్కు చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. ఒకసారి విద్యార్థిని పాఠశాలలో చేర్చగానే ప్రైవేటు పాఠశాలలు కొత్తకొత్త నిబంధనల పాఠం వినిపిస్తాయి. దుస్తులు, పుస్తకాలు, టై, బెల్టు, యూనిఫామ్‌లు అన్నీ తమ దగ్గరే కొనాలని చెబుతున్నారు. పుస్తకాలు, దుస్తుల్లో సగానికి పైగా మిగులుతుండటంతో అప్పటికే తమకు తెలిసిన వారితో ఒప్పందాలు కుదుర్చుకొని.. అందరినీ అక్కడే కొనమని ఒత్తిడి చేస్తున్నారు. పాఠశాలల గవర్నింగ్‌ బాడీ తీర్మానం మేరకే ఫీజులు వసూలు చేయాలి. తీర్మానం చేసిన ఫీజుల వివరాలను ఆయా పాఠశాలలు నోటీస్‌ బోర్డులో పెట్టాలి. విద్యాహక్కు చట్టాన్ని తప్పనిసరిగా పాటించాలి. ప్రైవేటు పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం ఎక్కడా అమలు కావడం లేదు. పట్టణంలోని ఓ టెక్నో పాఠశాలలో గత ఏడాది ఆరో తరగతి విద్యార్థికి.. 28 వేలు వసూలు చేశారు. ప్రస్తుతం ఏడోతరగతికి వచ్చేసరికి ఫీజు 35 వేలకు పెరిగిపోయింది. వర్క్‌బుక్స్‌, దుస్తులు, ఇతర సామగ్రికి మరో 8 వేల ఖర్చు అదనం. కళలు, సాంకేతిక అంశాల్లో శిక్షణ ఇస్తామంటూ కొత్త తరహాలో ఫీజులు దండుతున్నారు. ఇకనైనా ప్రభుత్వ యంత్రాంగం స్పందించాల్సిన అవసరం ఉంది.

15:40 - June 18, 2017

హైదరాబాద్ : తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కుమారుడు నితిన్‌ వివాహం ఇవాళ ఉదయం ఘనంగా జరిగింది. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో జరిగిన ఈ వివాహానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తదితరులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

 

15:36 - June 18, 2017

హైదరాబాద్ : మియాపూర్ భూకుంభకోణాన్ని ఎండ‌గ‌ట్టడంలో మ‌నం వెన‌క బ‌డి పోయాం... ఇది రాష్ట్ర కాంగ్రెస్ నేత‌ల్లో జ‌రుగ‌తున్న అంత‌ర్గత చర్చ. దీనికి రాష్ట్ర ముఖ్య నేత‌లే కార‌ణ‌మని కొంద‌రు..కాదు కాదు..కొంద‌రు ఢిల్లీ పెద్దలే కార‌ణ‌మ‌ని మ‌రి కొంద‌రు వాదించుకుంటున్నారు. ఇంత‌కు ఏది అస‌లు కార‌ణం..? మియాపూర్ భూకుంభకోణం. ఇప్పుడు రాష్ట్ర రాజ‌కీయాల‌ను షేక్ చేస్తున్న స్కాం. వేలకోట్ల విలువైన భూముల‌లో రాజకీయపార్టీల నేత‌ల పేర్లు బ‌య‌టికొస్తుండ‌టంతో..ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్‌ను హీటెక్కిస్తుంది. అయితే దీనిపై విపక్షాలు..ముఖ్యంగా టిడిపి మొద‌టి నుండి దూకుడుగా ముందుకు వెళ్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ప్రధాన ప్రతిప‌క్షం కాంగ్రెస్‌లో ఆ స్పీడు క‌న‌బ‌డ‌క పోవ‌డం..ఇప్పుడు సొంత పార్టీలో చ‌ర్చనీయాంశంగా మారింది. ఈ మియాపూర్ భూస్కాంపై టీడీపీ కంటే కాంగ్రెస్ ఆల‌స్యంగా మేల్కోవ‌డంపై ఇప్పుడు పార్టీలో తీవ్ర చ‌ర్చనీయాంశంగా మారింది. ఈ స్కాంకు క‌ర్త, క‌ర్మ, క్రియగా ఉన్న గోల్డ్ స్టోన్ ప్రసాద్‌కు కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌కు ఉన్న సంబంధాలు ఉండ‌టం..ఇదే రాష్ట్ర కాంగ్రెస్ దూకుడుకు బ్రేకులు వేస్తుంద‌న్న చ‌ర్చ సాగుతుంది. ఇప్పడికే మాజీ పీసీసీ చీఫ్‌లు ప్రస్తుతం టీఆర్ఎస్ ఎంపీలుగా ఉన్న కేకే, డీఎస్‌ల భూములు తెర‌పైకి రావ‌డంతో.. ఇదేవిధంగా ఇంకా చాలా మంది నేత‌లు ఉన్నార‌న్న చ‌ర్చ..ఇప్పుడు పార్టీ వ‌ర్గాల్లో వినిపిస్తుంది. ఇదే కార‌ణంతోనే పార్టీలో ముఖ్య నేత‌లు ఈ భూకుంబ‌కోణంపై పోరాటానికి ముందుకు రావ‌డంలేద‌ని..ఇప్పడికే మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి ల‌క్ష్మారెడ్డి బ‌హిరంగంగానే విమ‌ర్శలు గుప్పించిన‌ సంగ‌తి తెలిసిందే.

దిగ్విజయ్ ఆరోపణలు..
మియాపూర్ స్కాంపై రాష్ట్ర ముఖ్యనేత‌లు స్లో కావ‌డంపై గాంధీభ‌వ‌న్లో కొంద‌రు నేత‌లు మ‌రోలా విశ్లేషిస్తున్నారు. ఢిల్లీ పెద్ధల మ‌ధ్య ఉన్న ఆధిప‌త్యపోరు కూడా మియాపూర్‌పై పోరుకు కళ్ళెం వేస్తుంద‌ని టాక్. గోల్డ్ స్టోన్ ప్రసాద్‌కు ఏఐసీసీలో కీల‌క నేత‌గా ఉన్న అహ్మద్‌ పటేల్‌కు స‌న్నిహిత సంబందాలు ఉన్నాయన్నది కాంగ్రెస్‌లో జ‌గ‌మెరిగిన స‌త్యం. అయితే అహ్మద్‌ ప‌టేల్‌తో అంతగా పొసగని దిగ్విజ‌య్ దీన్ని అవ‌కాశంగా మ‌లుచుకున్నారని కొంద‌రు నేత‌లు గుసు గుస‌ లాడుకుంటున్నారు. దీనిలో భాగంగానే మియాపూర్ స్కాంపై గ‌తంలో ఎన్నడూ లేనివిధంగా దిగ్విజ‌య్ తీవ్రంగా ఆరోప‌ణ‌లు చేశార‌న్న చ‌ర్చ సాగుతుంది.

రాష్ట్ర నేతలపై వత్తిడి..
అయితే దిగ్విజ‌య్ తీరుపై గుర్రుగా ఉన్న అహ్మద్‌ప‌టేల్ రాష్ట్ర నేత‌ల‌పై ఒత్తిడి తెస్తుండ‌టంతో..రాష్ట్ర ముఖ్య నేత‌ల ప‌రిస్థితి ఇబ్బంది క‌రంగా మ‌రింద‌ని స‌మాచారం. అయినప్పటికీ..ఒక వైపు దిగ్విజ‌య్ సింగే స్వయంగా ఈ అంశంపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేయ‌డంతో..రాష్ట్ర పార్టీగా అంశాన్ని త‌ప్పనిసరిగా తీసుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింద‌ని పార్టీలో వినిపిస్తుంది. దీంతో చేసేదిలేక..ఆల‌స్యంగా మియాపూర్ భూముల‌ ప‌రిశీల‌న‌కు ముఖ్యనేతలు వెళ్ళార‌ని తెలుస్తోంది. మొత్తానికి మియాపూర్ భూ కుంబ‌కోణం రాష్ట్ర నాయ‌క‌త్వానికి..ముందు నుయ్యి వెన‌క గొయ్యిగా మారింది. ఒక‌వైపు టీడీపీ దూకుడుగా ముందుకెళ్తుంటే..మ‌రోవైపు సొంత పార్టీలోని పెద్ధల ఆదిప‌త్యపోరుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే మౌనంగా ఉంటే మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని గుర్తించిన నేత‌లు..పార్టీతో పాటు తాము రాజ‌కీయంగా బ‌త‌కాలంటే..ఇక పోరాటం త‌ప్పదని డిసైడ్ అయిన రాష్ట్ర నాయ‌క‌త్వం.. చేసేది లేక..లేటైనా గ్రౌండ్‌లో దిగిందని స‌మాచారం.

15:28 - June 18, 2017

చెన్నై : చిత్తూరు, కంగుంతి వద్ద.. పాలాడు నదిపై చెక్‌డ్యాం నిర్మాణాలను డీఎంకే నేత స్టాలిన్ సందర్శించారు. ఏపీ ప్రభుత్వం అక్రమంగా చెక్‌డ్యాంలను నిర్మించి.. తమిళ ప్రజలకు అన్యాయం చేస్తోందని స్టాలిన్‌ ఆరోపించారు. ఆంధ్రా-తమిళనాడు సరిహద్దుల్లో ఏపీ ప్రభుత్వం నిర్మిస్తోన్న.. చెక్‌డ్యాంలను వెంటనే నిలిపేయాలని నాలుగు రోజుల క్రితం సీఎం చంద్రబాబుకు తమిళనాడు సీఎం పళనిస్వామి లేఖ రాశారు.

బుద్దా వెంకన్న దాడులకు దిగుతున్నారు - వైసీపీ..

విజయవాడ : టీడీపీ గూండాలకు పచ్చ చొక్కాలు వేసి రోడ్ల మీదకు వదిలి దాడులు చేయిస్తున్నారని టిడిపి అవినీతిపై మాట్లాడితే తమ ఇంటిపై బుద్దా వెంకన్న దాడులకు దిగారని వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. టిడిపి దాడులకు భయపడేది లేదన్నారు.

ఆశ్రమాలకు లైసెన్స్ లు లేకపోతే..

విజయవాడ : చిన్న చిన్న కారణాలు..ప్రేమ..ఆర్థిక ఇబ్బందులు..విబేధాలతో ఇంటి నుండి వెళ్లిపోయిన కేసులే అధికంగా ఉన్నాయని డీసీపీ పాల్ రాజు, ట్రాఫిక్ డీసీసీ రానాలు వెల్లడించారు. ఆశ్రమాలకు లైసెన్స్ లు..సదుపాయాలు లేకపోతే ఎలాంటి చర్యలు తీసుకోవాలో త్వరలో సీపీ నిర్వహించే సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.

 

'తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచుతాం'..

హైదరాబాద్ : నిమ్స్ లో అత్యవసర విభాగం వైద్యుల ఆధ్వర్యంలో ఐక్యరాజ్యసమితి రోడ్డు భద్రత 4వ వారోత్సవాలను డిప్యూటి సీఎం మహమూద్ ఆలీ ప్రారంభించారు. మంత్రి మహేందర్ రెడ్డి, ఎంపీ నర్సయ్యగౌడ్ లు హాజరయ్యారు. తెలంగాణను ప్రమాదాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్ది బ్రాండ్ ఇమేజ్ పెంచుతామని మంత్రి మహేందర్ తెలిపారు.

మొదలైన మ్యాచ్..పాక్..4/0..

ఇంగ్లండ్ : ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ - పాక్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. తొలుత టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. అజర్ ఆలీ, ఫకర్ జమన్ లు బ్యాటింగ్ ఆరంభించారు. ప్రస్తుతం 2.3 ఓవర్లలో 7 పరుగులు చేసింది.

15:11 - June 18, 2017

ఇంగ్లండ్ : భారత్ - పాకిస్తాన్ జట్ల మధ్య పోరు తెరలేంచింది. కాసేపటి క్రితం ఓవల్ లో అంపైర్లు టాస్ వేశారు. టాస్ గెలిచిన అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకుని పాక్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. స్వల్ప స్కోరుకు పాక్ ను కట్టడి చేయాలని భారత్ యోచిస్తోంది. ఇక భారత్ ను ఎలాగైనా ఓడించాలని పాక్ తహతహలాడుతోంది. కానీ పాక్ జట్టుపై భారత్ ఎలాగైనా గెలుస్తుందని క్రీడాభిమానులు అంచనాలు వేసుకుంటున్నారు. కోహ్లీ..యువరాజ్ సింగ్ మెరుపులు మెరుస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. విజయవాడలో నెలకొన్న సందడి..తదితర వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

పాకిస్తాన్ బ్యాటింగ్..

ఇంగ్లండ్ : ఐసీసీ ఛాంపియన్స్ 2017 ట్రోఫిలో భాగంగా భారత్ -పాక్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. తొలుత టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది.

14:32 - June 18, 2017
14:20 - June 18, 2017

హైదరాబాద్ : రెండు జట్ల మధ్య పోటీ అంటేనే అంచనాలు భారీగా ఉంటాయని, భారత్ - పాక్ మ్యాచ్ కోసం క్రీడాభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారని టెన్ టివి స్పోర్ట్స్ ప్రతినిధి ప్రశాంత్ తెలిపారు. ఐసీసీ ఛాంపియన్స్ 2017లో ట్రోఫీలో భాగంగా ఓవల్ మైదానంలో భారత్ - పాక్ జట్లు ఢీకొననున్నాయి. ఈ మ్యాచ్ పై ఆయన విశ్లేషణ అందించారు. భారత్ కు ఏమాత్రం పాక్ జట్టు అంతగా సరితూగదని, పాక్ జట్టులో మహ్మద్, మాలిక్ ఇద్దరు సీనియర్లు మాత్రమే ఉన్నారని తెలిపారు. భారత్ లో చాలా మంది అనుభవం కలిగిన క్రీడాకారులున్నారని, కానీ పాక్ జట్టును ఏ మాత్రం తక్కువగా అంచనా వేయలేమన్నారు. ఎందుకంటే సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లండ్ జట్టును ఓడించి ఒక్కసారిగా అంచనాలు పెంచేసిందన్నారు. మరింత విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి.

14:19 - June 18, 2017

ఖమ్మం : విద్యతోనే విజ్ఞానం వికసిస్తుంది. ఆటపాటలతో కూడిన చదువుతోనే మానసిక పరిపక్వత వస్తుంది. విశాలమైన తరగతి గదులు, క్రీడా మైదానాలు విద్యార్థుల చదువులపై ఎంతో ప్రభావం చూపుతాయి. మరి విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించబోయే పాఠశాల ఎంతవరకూ సురక్షితం.. బోధన ఎలా ఉంటుంది? ఈ విషయాలను ఎంతవరకూ ఆలోచిస్తున్నారు.

ఫీజుల దోపిడీ
ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీకి అడ్డూ అదుపూ లేకుండా లేకుండా పోతోంది. ఏటేటా ఫీజులను పెంచేస్తూ తల్లిదండ్రులకు నిద్రలేకుండా చేస్తున్నారు. సరస్వతి నిలయాలుగా విరాజిల్లే విద్యాసంస్థలను.. వ్యాపార కేంద్రాలుగా మార్చేస్తున్నారు. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను బాగా చదివించాలనే ఉద్దేశంతో ప్రైవేటు విద్య భారమైనా.. అందులోనే చేర్పిస్తున్నారు. కొన్ని పాఠశాలలు అనుమతి లేకుండా నిర్వహిస్తూ.. వేరే పాఠశాలల నుంచి బోనఫైడ్‌, టీసీ లాంటి ధ్రువపత్రాలను అందజేస్తున్నారు. విద్యార్థుల సంక్షేమాన్ని బాధ్యతగా తీసుకోవాల్సిన అధికారులు ఏమీ పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలలు ఒక్కటి కూడా పని చేసేందుకు వీల్లేదని ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ కాలం వెల్లదీస్తున్నారు.

నిబంధనలు గాలికి....
పాఠశాలల్లో సరిపడా తరగతి గదులు, క్రీడా మైదానం, అర్హత గల ఉపాధ్యాయులు, రక్షణ తప్పనిసరిగా ఉండాలి. అగ్నిమాపక శాఖ, గ్రామ పంచాయతీ, రెవెన్యూ శాఖల అనుమతి ఉండాలి. భవనం చుట్టూ అగ్నిమాపక వాహనం తిరిగే స్థలం ఉండాలి. అయితే నిబంధనల ప్రకారం వసతులు సమకూర్చడం, అనుమతి పొందడం ఖర్చుతో కూడుకున్న పని కావడంతో.. విద్యా వ్యాపారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. అధికారులను ప్రసన్నం చేసుకొని నిబంధనల ప్రకారం అన్ని వసతులు ఉన్నట్లు నివేదికలు తయారు చేయించుకొని అనుమతులు పొందుతున్నారు. ప్రాథమిక స్థాయిలో ఇంటర్మీడియట్‌తో పాటు డైట్‌లో శిక్షణ, టెట్‌లో ఉత్తీర్ణులైన వారు విద్యాబోధన చేయాలి. ఉన్నత స్థాయిలో డిగ్రీ, బీఈడీ చేసిన వారు బోధన చేయాలి. తల్లిదండ్రులు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారే తప్ప, పాఠశాలల్లో ఉండే నియమ నిబంధనలు, జీవోలను పట్టించుకోవడం లేదు.

ఫీజులో 50 శాతం ఉపాధ్యాయుల వేతనాలకు
ఒకటవ ఉత్తర్వుని 1994లో విడుదల చేశారు. విద్యార్థుల నుంచి వసూలు చేసే ఫీజులో 50 శాతం ఉపాధ్యాయుల వేతనాలకు, 15 శాతం సాంస్కృతిక కళలు, ఆటలకు, 10 శాతం సామగ్రికి, 15 శాతం సౌకర్యాలకు, 5 శాతం ఇతర పనులకు ఖర్చు చేయాలి. యాజమాన్యాలు 5 శాతం మాత్రమే లాభాలుగా తీసుకోవాలి. 42వ ఉత్తర్వుని 2010లో విడుదల చేశారు. ప్రైవేట్‌ బడుల్లో తప్పనిసరిగా రుసుము పెంచాలనుకుంటే.. డీఎఫ్‌ఆర్‌సీ అనుమతి పొందాల్సి ఉంటుంది. అయితే ఏటేటా ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచుతున్నారు.

ఇండియా టీం...

లండన్ : ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2017లో భాగంగా భారత్ - పాక్ జట్లు ఢీకొననున్నాయి. టీండియాలో విరాట్ కోహ్లీ, అశ్విన్, బుమ్రా, ధావన్, ధక్షని, జడేజా, జాదవ్, కార్తిక్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, పాండ్యా, రహానే, శర్మ, ఉమేష్ యాదవ్, యువరాజ్ సింగ్ జట్టులో ఉన్నారు.

ఓవల్ మైదానం వద్ద అభిమానుల సందడి..

లండన్ : ఐసీసీ ఛాంపిన్స్ ట్రోఫీ 2017 ఫైనల్ మ్యాచ్ మరికాసేపట్లో జరగనుంది. లండన్ లోని ఓవల్ మైదానంలో భారత్ - పాక్ మ్యాచ్ ను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో మైదానానికి తరలివస్తున్నారు.

14:06 - June 18, 2017

చిత్తూరు : ఐసీసీ ఛాంపిన్స్ ట్రోఫీలో భాగంగా కాసేపట్లో ఇండియా - పాకిస్తాన్ జట్ల మధ్య కాసేపట్లో మ్యాచ్ జరగనుంది. సెమీస్ లో బంగ్లాదేశ్ ను చిత్తు చేసిన టీమిండియా ఫైనల్ లో అడుగు పెట్టగా ఇంగ్లండ్ జట్టుపై పాక్ విజయం సాధించి ఫైనల్ అడుగు పెట్టింది. దీనితో దాయాదుల మధ్య మళ్లీ పోరు జరగనుంది. రెండు సార్లు ఛాంపిన్ గా భారత్ నిలిచింది. మూడోసారి కప్పు చేజిక్కించుకోవాలని భారత్ తహతహలాడుతోంది. దీనితో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా క్రికెట్ ఫీవర్ నెలకొంది. చిత్తూరు జిల్లాలో టీమిండియా గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరింత విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి.

13:43 - June 18, 2017

టీడీపీ జిల్లా అధ్యక్షులను ప్రకటించిన చంద్రబాబు

గుంటూరు : టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ జిల్లా అధ్యక్షులను ప్రకటించారు. శ్రీకాకుళం గైతు శిరీష, విజయనగరం చిన్నంనాయుడు

 

ఏపీ తమిళనాడు మధ్య జలవివాదం

చిత్తూరు : ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య్ అంతరాష్ట్ర జలవివాదం తలెత్తింది. జిల్లాలోని కుప్పం సిరిహద్దుల్లో డీఎంకె అధినేత స్టాలిన్ పర్యటించారు. ఆయన డీఉంకె ఎమ్మెల్యేలతో కలిసి కంగుంతి వద్ద పాలాడు నదిపై చెక్ డ్యాం నిర్మాణాలను సందర్శించారు. ఏపీ ప్రభుత్వం అక్రమంగా చెక్ డ్యాంలలను నిర్మిస్తుందని ఆయన ఆరోపించారు. తమిళ ప్రజలకు అన్యాయం చేస్తున్నారంటూ స్టాలిన్ విమర్శించారు. చెక్ డ్యాంల నిర్మాణం పై ఉన్నత స్థాయి కమిటీ వేయాలని ఆయన కోరారు. స్టాలిన్ రాకతో ఏపీ తమిళనాడు సరిహద్దుల్లో భారీగా పోలీసలను మోహరించారు.

13:21 - June 18, 2017

చిత్తూరు : ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య్ అంతరాష్ట్ర జలవివాదం తలెత్తింది. జిల్లాలోని కుప్పం సిరిహద్దుల్లో డీఎంకె అధినేత స్టాలిన్ పర్యటించారు. ఆయన డీఉంకె ఎమ్మెల్యేలతో కలిసి కంగుంతి వద్ద పాలాడు నదిపై చెక్ డ్యాం నిర్మాణాలను సందర్శించారు. ఏపీ ప్రభుత్వం అక్రమంగా చెక్ డ్యాంలలను నిర్మిస్తుందని ఆయన ఆరోపించారు. తమిళ ప్రజలకు అన్యాయం చేస్తున్నారంటూ స్టాలిన్ విమర్శించారు. చెక్ డ్యాంల నిర్మాణం పై ఉన్నత స్థాయి కమిటీ వేయాలని ఆయన కోరారు. స్టాలిన్ రాకతో ఏపీ తమిళనాడు సరిహద్దుల్లో భారీగా పోలీసలను మోహరించారు. ఆంధ్రా తమిళనాడు సరిహద్దుల్లో ఏపీ ప్రభుత్వం చేపుడుతున్న చెక్ డ్యాంలను నలిపి వేయాలని నాలుగు రోజుల క్రితం సీఎం చంద్రబాబుకు తమిళనాడు సీఎం పళనిస్వామి లేఖ రాశారు.

 

12:52 - June 18, 2017

అధునిక తెలుగు సాహిత్యాన్ని తన కలం బలంతో సుసపన్నం చేసిన కవి దిగ్గజం సినారె...కవిత రాసిన, పాట రాసిన, గజల్ రాసిన తనదైనా ముద్రతో సంచలనం సృష్టించిన గొప్ప కవి ఆయన...తెలుగు భాషకు సాహిత్యానికి సుమారు ఆరు దశాబ్దల పాటు ఎనలేని సేవ చేసిన ఆ మహాకవి ఇటివల కన్నుమూయటం తెలుగు సాహిత్యానికి తీరని లోటు....తెలుగు సాహితి లోకలంలో మకుటం లేని కవిరాజుగా వెలిగిన కవితల నెలరాజు శాశ్వతంగా మబ్బుల చాటుకు వెళ్లిపోయారు... సినారె ఒక సామాన్య రైతు బిడ్డగా పుట్టి సాహితి విశ్వభరునిగా ఎదిగినా మట్టి బిడ్డ....తన సాహిత్య ద్వారా మానవతా కేతనాన్ని ఎగరేసి జ్ఞాన పీఠం అధిరోహించిన కవిత చక్రవర్తి... సినారె అన్న మూడు అక్షరాలు తెలుగు సాహిత్యంపై చెరగాని ముద్ర వేశాయి....అధునిక తెలుగు కవిత్వానికి జవసత్వాలు అందించిన కవి దిగ్గజం సినారె.... ఆయన ఉరికే కవితల జలపాతం...పరవశాలు పంచే పాటల పారిజాతాల వనం.. విశ్వమానవ హృదయంతరాలలోని చైతన్య జలపాతల సవ్వడిని కవితలుగా వినిపించిన విశ్వంభర కవితా విరాట్ స్వరూపం..తెలుగు శబ్దాల రంగు, రుచి, వాసనల మత్తును సినిగేయల రూపంలో వెదజల్లిన వెండితెర కవిరాజు కవితల నెలరాజు సినారె....ఆ మహాకవి అక్షరం ఘన నివాళి పూర్తి వివరాలకు వీడియో చూడండి.

జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం

ఢిల్లీ : విజ్ఞాన్ భవన్ లో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల నుంచి కేటీఆర్, యనమల హాజరైయ్యారు. 

జీఎస్టీ సమావేశంలో పాల్గొనున్న మంత్రి కేటీఆర్

ఢిల్లీ : నేడు దేశ రాజధాని హస్తినపురంలో జరిగే జీఎస్టీ సమావేశంలో రాష్ట్ర మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు.

కృష్ణలంకలో విషాదం

విజయవాడ : కృష్ణలంక రణదివే నగర్ లో విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. ఓ వ్యక్తి తన భోజనంలో విషం కలిపి భార్య, ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తాను సేవించాడు. భార్య, భర్త, కొడుకు మృతి చెందారు. ఇద్దరు కూతుళ్ల పరిస్థితి వషమంగా ఉంది. బాలికలకు విజయవాడ ఆంధ్ర ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

బద్వేల్ లో మున్సిపల్ కౌన్సిలర్లు దీక్షలు

కడప : జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ కౌన్సిలర్లు నిరాహారదీక్షలకు దిగారు. బద్వేల్ మున్సిపలిటి అభివృద్ధికి మంత్రులు, ఎమ్మెల్యేలు సహకరించడం కౌన్సిలర్లు దీక్షలకు దిగినట్టు తెలుస్తోంది. మున్సిపలిటి అభివృద్ధికి రూ.100 కోట్లు ఇస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని వారు తెలిపారు.

తిరుమలకు పోటెత్తిన భక్తజనం

చిత్తూరు : తిరుమలకు భక్తులు పోటెత్తారు. అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయి వెలుపల కిలోమీటర్ మేర క్యూలైన్ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తుల 12గంటలు, నడకదారిన వారికి 10 గంటల సమయం పడుతోంది.నడకదారి భక్తులు సంయమనం పాటించాలని టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు కోరారు. నడకదారిలో నిత్యం 30 వేల నుంచి 40వేల మంది భుక్తులు వస్తున్నారని ఆయన తెలిపారు. 

కర్నూలులో భారీ దొంగతనం

కర్నూలు : కర్నూలు లో భారీ దోపిడీ జరిగింది. కొంత మంది నగల దుకాణాన్ని కొల్లగొట్టారు. దుకాణంలో ఉన్న రూ. 15లక్షలు, 6కిలోల బంగారం చోరి జరిగినట్టు యజమాని తెలిపారు. పోలీసులు సంఘటన స్థలానికి విచారణ చేస్తున్నారు.

12:15 - June 18, 2017

విజయవాడ : కృష్ణలంక రణదివే నగర్ లో విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. ఓ వ్యక్తి తన భోజనంలో విషం కలిపి భార్య, ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తాను సేవించాడు. భార్య, భర్త, కొడుకు మృతి చెందారు. ఇద్దరు కూతుళ్ల పరిస్థితి వషమంగా ఉంది. బాలికలకు విజయవాడ ఆంధ్ర ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. నిన్న కొడుకు పుట్టిన రోజు ఎంతో ఘనంగా జరిపిన భార్యభర్తలు నేడు ఆత్మహత్యలు చేసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఒకే కుటుంబంలో ముగ్గరు చనిపోవడంతో కృష్ణలంకలో విషాదం నెలకొంది.  

12:06 - June 18, 2017

స్పోర్ట్స్ : దాయాది పోరుకు ఇండియా సై అంటుంది. ఆత్మవిశ్వాసంతో కోహ్లీ సేన సంచలనం సృష్టించేందుకు సిద్దంగా ఉంది. అటు పాక్ సర్ఫరాజ్ కెప్టన్ గా విజయం సాధించాలని తహతహాలుడుతుంది. మరోవైపు ఇండియా విజయం కోసం దేశవ్యాప్తంగా అభిమానులు పూజలు చేస్తున్నారు. ఇండియా గెలవలని తిరుమలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారత్ గెలవాలంటూ జాతీయ జెండాల ప్రదర్శన చేశారు. 

12:05 - June 18, 2017

కడప : జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ కౌన్సిలర్లు నిరాహారదీక్షలకు దిగారు. బద్వేల్ మున్సిపలిటి అభివృద్ధికి మంత్రులు, ఎమ్మెల్యేలు సహకరించడం కౌన్సిలర్లు దీక్షలకు దిగినట్టు తెలుస్తోంది. మున్సిపలిటి అభివృద్ధికి రూ.100 కోట్లు ఇస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని వారు తెలిపారు. మూడేళ్లు పూర్తయిన కూడా నిధులు విడుదల కాకపోవడంతో ప్రజలకు సమాధానం చెప్పుకోలేకపోతున్నామని కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. బద్వేలు జాతీయ రహాదారిలో లోపాలు ఉన్నాయని అధికారులకు ఫిర్యాదు చేస్తే స్పందించడం లేదని వారుఅ అంటున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించక పోతే అందురు కలిసి రాజీనామా చేస్తామని హెచ్చరించారు. 

11:49 - June 18, 2017

చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్ చాలెంజ్‌కు చిరకాల ప్రత్యర్ధులు సన్నద్ధమయ్యాయి. భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మహా సమరం ఎప్పుడెప్పుడు ఆరంభమవుతుందా అని క్రికెట్‌ ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. భారత్‌,పాకిస్థాన్‌ మ్యాచ్‌కు ...రెండుదేశాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులకు ఎక్కడలేని ఆసక్తి.అంతర్జాతీయ క్రికెట్‌ చరిత్రలో భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. సాదారణ మ్యాచ్‌ల్లోనే భారత్, పాక్ జట్లు తలపడుతున్నాయంటేనే పోటీ తారాస్థాయిలో ఉంటుంది....ఇక ఫైనల్‌ మ్యాచ్‌ల్లో ఇరు జట్ల మధ్య ఆధిపత్య పోరు ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఢీ అంటే ఢీ
చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌ ఫైట్‌కు చిరకాల ప్రత్యర్థులు టీమిండియా, పాకిస్తాన్ ఎప్పటిలానే ఢీ అంటే ఢీ అంటున్నాయి. లండన్‌లోని కెన్నింగ్టన్‌ ఓవల్‌ స్టేడియం వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగబోతున్నాయి. భారత జట్టు 4వ సారి చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌కు అర్హత సాధించగా......పాకిస్థాన్‌ జట్టు తొలి సారిగా మినీ వరల్డ్‌ కప్‌ టైటిల్‌ ఫైట్‌కు క్వాలిఫై అయింది. ఆల్‌రౌండ్‌ పవర్‌తో అన్ని విభాగాల్లో పాకిస్థాన్‌ కంటే పటిష్టంగా ఉన్న భారత జట్టు ...హాట్‌ఫేవరెట్‌గా బరిలోకి దిగబోతోంది. వన్డే ప్రపంచకప్‌లో పాకిస్తాన్ ప్రత్యర్థిగా తిరుగులేని ట్రాక్‌ రికార్డ్‌ కలిగిన టీమిండియా... చాంపియన్స్‌ ట్రోఫీలో మాత్రం అంతగా ఆధిపత్యం ప్రదర్శించలేకపోయింది. రెండు సార్లు చాంపియన్స్‌ ట్రోఫీ విజేతగా నిలిచిన భారత్‌ ...4 సార్లు పాకిస్థాన్‌తో పోటీ పడగా రెండు మ్యాచ్‌ల్లో నెగ్గింది. రెండు కీలక మ్యాచ్‌ల్లో పాక్‌...భారత్‌కు షాకిచ్చింది.

భారత్‌పై పాకిస్తాన్‌ పైచేయి
ఓవరాల్‌గా వన్డే ఫేస్‌ టు ఫేస్‌ రికార్డ్‌లో మాత్రం భారత్‌పై పాకిస్తాన్‌దే మెరుగైన రికార్డుగా ఉంది. ఇప్పటి వరకూ ఈ రెండుజట్లు 128 వన్డేల్లో తలపడితే...పాక్ 72, టీమిండియా 52 విజయాలు సాధించాయి. చాంపియన్స్‌ ట్రోఫీతో పాటు వన్డేల్లో ట్రాక్‌ రికార్డ్‌ పరంగా పాకిస్థాన్‌కే అనుకూలంగా ఉన్నా.....ప్రస్తుతం విరాట్‌ కొహ్లీ నాయకత్వంలోని భారత జట్టును ఓడించడం ప్రస్తుతం పాక్‌ జట్టుకు పెద్ద సవాలే. ఇప్పటికే ఇరు జట్ల మధ్య జరిగిన గ్రూప్‌-బీ పోటీలో పాకిస్థాన్‌పై భారత్‌పై సునాయాస విజయం సాధించింది. బ్యాట్స్‌మెన్‌ అదరగొట్టడంతో పాటు , బౌలర్లు సైతం సమిష్టిగా చెలరేగడంతో చెలరేగడంతో విరాట్‌ అండ్ కో చాంపియన్స్‌ ట్రోఫీ టైటిల్‌

చాంపియన్స్‌ ట్రోఫీలో తిరుగులేని భారత్‌ మరోసారి చరిత్రను పునరావృతం చేస్తుందో....లేక విరాట్ ఆర్మీకి పాకిస్థాన్‌ షాకిస్తుందో... తెలుసుకోవాలంటే మాత్రం..మ్యాచ్‌ ఫలితం కోసం ఆసక్తిగా ఎదురుచూడాల్సిందే.

 

 

10:47 - June 18, 2017

థాయ్ లాండ్ : జంతుప్రదర్శనశాలలో తృటిలో ప్రమాదం తప్పింది. మొసలి నోట్లో తలపెట్టి ప్రదర్శన ఇవ్వబోయిన ఉద్యోగిపై అది దాడి చేసింది. మొత్తానికి బతుకుజీవుడా అంటూ ప్రాణాలతో బయటపడ్డాడు ఆ ఉద్యోగి. థాయిలాండ్‌లోని కొహ్‌ సముయి అనే జంతుప్రదర్శనశాలలో ఈ ఘటన జరిగింది. సందర్శకుల కోసం ముందు రెండు కర్రలతో మొసలి నోటికి తాకించి చూశాడు. అదేం కామ్‌గా ఉండటంతో.. అంతా బాగానే ఉందనుకుని ఆ ఉద్యోగి దాని నోట్లో తల పెట్టాడు. మొసలి అమాంతం తలను పట్టేసింది. గట్టిగా కొరుకుతూ అతడి తల వూడిపోయేలా ఊపేసింది. బాధతో ఉద్యోగి పెట్టిన కేకలతో పాటు సందర్శకుల హాహాకారాలకు మొసలి భయపడి పారిపోయింది. తీవ్రగాయాలైన ఉద్యోగిని ఆస్పత్రికి తరలించారు. 

10:44 - June 18, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత..సంగారెడ్డిలో నిర్వహించిన తెలంగాణ ప్రజా గ‌ర్జన కాంగ్రెస్‌లో కొత్త జోష్‌ను తీసుకొచ్చింది. స‌భ‌ ఊహించిన విధంగా సూప‌ర్ స‌క్సెస్ చేయ‌డంతో..ఖుషీగా ఉన్న టీ-కాంగ్రెస్.. ఇదే స్పీడ్‌ను కొన‌సాగించాల‌ని డిసైడ్ అయ్యింది. దీనికోసం ప్రత్యేక కార్యాచ‌ర‌ణ‌ను సిద్దం చేసింది హ‌స్తం పార్టీ గాంధీభ‌వ‌న్లో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జ‌రిగిన పార్టీ విస్తృతస్థాయి స‌మావేశంలో రాష్ట్రంలో తాజా రాజ‌కీయ ప‌రిణామాల‌పై చ‌ర్చించారు నేత‌లు. మియాపూర్ భూ కుంబ‌కోణంపై పోరాటాన్ని ఉధృతం చేయాల‌ని నిర్ణయించారు నేత‌లు. ముఖ్యంగా మొన్నటి రాహుల్ గాంధీ పాల్గొన్న సంగారెడ్డి స‌భ స‌క్సెస్ టెంపోను కొన‌సాగించాల‌ని నిర్ణయించారు. తెలంగాణ ఆవిర్భావం త‌ర్వాత తొలిసారి బ‌హిరంగ స‌భలో రాహుల్ పాల్గొన‌డంతో పార్టీ లీడ‌ర్, క్యాడ‌ర్లలో నయా జోష వ‌చ్చింద‌ని భావిస్తున్నారు . అయితే జోష్‌ను క్షేత్రస్థాయికి చేర్చాల‌ని నిర్ణయించారు నేత‌లు.

ప‌క్కా ప్రణాళిక‌
దీనికోసం విస్థృతస్థాయి స‌మావేశంలో కాంగ్రెస్ ప‌క్కా ప్రణాళిక‌ను సిద్దం చేసింది. సంగారెడ్డి బ‌హిరంగ స‌భ‌లో రాహుల్ కేసీఆర్‌కు సంధించిన ప్రశ్నలు తెలంగాణ ప్రజ‌ల‌కు బాగా చేరాయ‌ని భావిస్తున్నారు నేత‌లు. విద్యార్థుల త్యాగాలు, ప్రజ‌ల ఆకాంక్షలకు భిన్నంగా కేసీఆర్‌ పాల‌న సాగుతుందా అంటూ రాహుల్ సంధించిన ప్రశ్నలను క్షేత్రస్థాయి వర‌కు తీసుకుపోవ‌డం ద్వారా భ‌విష్యత్‌లో పార్టీకి లాభీస్తుంద‌ని అంచనావేస్తున్నారు నేత‌లు. అంతేకాదు కేసీఆర్, మోడి మూడేళ్ళ పాల‌న వైఫల్యాలపై రాహుల్ విడుద‌ల చేసిన చార్జ్ షీట్ ప్రజ‌ల్లోకి తీసుకువెళ్ళాల‌ని నిర్ణయించారు హ‌స్తం నేత‌లు. దీనికోసం పీసీసీ..రాహుల్ సందేశ్ యాత్రకు శ్రీకారం చుట్టాల‌ని నిర్ణించారు. సంగారెడ్డిలో రాహుల్ చేసిన ప్రసంగంతో పాటు..స‌భ‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైప‌ల్యాల‌పై రాహుల్ విడుద‌ల చేసిన ఛార్జ్ షీట్‌ను ప్రతి జిల్లా కేంద్రాల‌లో మీటింగ్‌ల ద్వారా..ప్రజల ముందు పెట్టనున్నారు హ‌స్తం నేత‌లు. అంతేకాదు..తాము అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఏమి చేయ‌బోతున్నార‌న్న దాంతో కూడిన మినీ మ్యానిఫెస్టోను కూడా ఈ రాహుల్ సందేశ్ యాత్రలో ప్రజ‌ల‌కు కాంగ్రెస్ పార్టీ పంచిపెట్టనుంది. మొత్తానికి మియాపూర్ భూస్కాంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న గులాబి స‌ర్కార్‌ను..ఇదే అద‌నుగా డిఫెన్స్‌లోకి నెట్టాల‌ని భావిస్తుంది కాంగ్రెస్. దీనికోసం రాహుల్ సంగారెడ్డి వేదిక‌గా రాజేసిన తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుకోవ‌డంతోపాటు..కేసీఆర్, మోడి వైఫల్యాల‌ను ప్రజ‌ల‌కు వివ‌రిస్తూ..సొంత క్యాడ‌ర్‌లో జోష్ పెంచుకోవాల‌ని త‌హ‌త‌హ‌లాడుతుంది హ‌స్తం పార్టీ. మ‌రి ఈ యాత్ర కాంగ్రెస్‌కు ఏమేర‌కు లాభిస్తుందో చూడాలి.

10:42 - June 18, 2017

విజయవాడ : నికేధన్‌ ఆశ్రమంలో ఇద్దరు బాలికల మిస్సింగ్‌ ఘటనపై కలెక్టర్‌ లక్ష్మీకాంతం సీరియస్‌ అయ్యారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు చైల్డ్‌ వెల్ఫేర్‌ అధికారులు ఆశ్రమాన్ని సీజ్‌ చేశారు. ఆశ్రమంలోని 16 మంది బాలికలను సీడబ్ల్యూ అధికారులకు అప్పగించారు. బాలికలు అదృశ్యానికి ఆశ్రమ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణమని చెల్డ్‌వెల్ఫేర్‌ డైరెక్టర్‌ కృష్ణకుమారి అన్నారు.  

10:31 - June 18, 2017

చిత్తూరు : తిరుమలకు భక్తులు పోటెత్తారు. అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయి వెలుపల కిలోమీటర్ మేర క్యూలైన్ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తుల 12గంటలు, నడకదారిన వారికి 10 గంటల సమయం పడుతోంది.నడకదారి భక్తులు సంయమనం పాటించాలని టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు కోరారు. నడకదారిలో నిత్యం 30 వేల నుంచి 40వేల మంది భుక్తులు వస్తున్నారని ఆయన తెలిపారు. నడకదారిన వచ్చినంత మాత్రాన వెంటనే దర్శనం కాదని శ్రీనివాసరాజు అన్నారు.

 

10:21 - June 18, 2017

కర్నూలు : కర్నూలు లో భారీ దోపిడీ జరిగింది. కొంత మంది నగల దుకాణాన్ని కొల్లగొట్టారు. దుకాణంలో ఉన్న రూ. 15లక్షలు, 6కిలోల బంగారం చోరి జరిగినట్టు యజమాని తెలిపారు. పోలీసులు సంఘటన స్థలానికి విచారణ చేస్తున్నారు. యజమాని అమ్మ ఆరోగ్యం బాగాలేదని హైదరాబాద్ వెళ్లారు. అయితే వ్యాపారి షాప్ లో సీసీ కెమెరాలు పెట్టకపోవడంతో దొంగలు పట్టుకొవడం పోలీసులకు సవాల్ గా మారింది. ఇప్పటికే క్లూస్ టీం చేరుకుని ఆధారలు సేకరిస్తున్నారు. షాప్ రూ15 రూపాయాలు ఉంచడాన్ని పై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

10:10 - June 18, 2017

హైదరాబాద్ : అమ్మతనం అంగట్లో సరుకైపోయింది. 9 నెలలు గర్భాన్ని మోస్తే 3 నుంచి 4లక్షల రూపాయలు. కాసులకు ఆశపడుతున్న అమాయక మహిళలు..తమ అమ్మతనాన్ని అంగట్లో సరుకులా అమ్మేస్తుకుంటున్నారు. హైదరాబాద్‌లో నిబంధనలకు విరుద్ధంగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న అద్దె గర్భాల వ్యాపారాన్ని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, వైద్యాధికారులు శనివారం బట్టబయలు చేశారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 14లోని సాయికిరణ్‌ ఇన్‌ఫెర్టిలిటీ హాస్పిటల్‌ అక్రమ సరోగసీలు జరుపుతున్నారన్న సమాచారంతో ఈ దాడులు నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ పద్మజ, సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరావు నేతృత్వంలో జరిపిన తనిఖీల్లో అనేక విస్మయకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.

సాయికిరణ్‌ ఆసుపత్రి
అద్దె గర్భాలు మోసేవారి కోసం సాయికిరణ్‌ ఆసుపత్రి రాష్ట్రంలోనే కాదు దేశమంతటా నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకొంది. హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తెలంగాణలోని వివిధ జిల్లాల మహిళలను ఈ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఏపీ, తెలంగాణ, ఢిల్లీ, నాగాలాండ్, డార్జిలింగ్‌తోపాటు నేపాల్‌కు చెందిన 50 మంది అద్దె గర్భం మోస్తున్న మహిళలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించారు. ఈ 50మంది మహిళల్లో హైదరాబాద్‌కు చెందినవాళ్లు 16 మంది ఉండగా..మిగతా వారిని దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చినట్లుగా గుర్తించారు. పిల్లల్లేని దంపతులు తమకు పిల్లలు కావాలని కోరుకుంటున్నవారు సాయికిరణ్‌ ఇన్‌ఫెర్టిలిటీ సెంటర్‌ నిర్వహకులకు ఒకొక్కరికి 5లక్షల చొప్పున ఇస్తున్నట్లుగా అధికారులు వెల్లడించారు. ఈ 5లక్షల్లో గర్భాన్ని మోస్తున్న మహిళలకు రెండున్నర నుంచి మూడు లక్షల వరకు ఇస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో బయటపడింది.

రిజిస్ట్రేషన్‌ లేని ఆసుపత్రి...
కనీసం ఇలాంటి సరోగసి ఆసుపత్రి పెట్టాలంటే ప్రభుత్వం దగ్గర రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి. కానీ సాయి కిరణ్ ఆసుపత్రి యాజమాన్యం మాత్రం ఎలాంటి రిజిస్ట్రేషన్ చేయించకుండానే అక్రమంగా ఆసుపత్రిని నడిపిస్తున్నారు. కనీసం అద్దె గర్భాన్ని మోస్తున్న మహిళలను బయట స్వేచ్చగా తిరగనీయడంలేదు. 9 నెలల పాటు కాలు బయటపెట్టకుండా ఓ జైల్లో బంధించినట్లుగా ఇక్కడ బంధిస్తున్నారని అధికారులు గుర్తించారు. కేంద్రంలోని రికార్డులను స్వాధీనం చేసుకొని, గ్రౌండ్‌ ప్లోర్‌ను అధికారులు సీజ్‌ చేశారు. రానున్న రోజుల్లో నగరంలోని మరిన్ని కేంద్రాలపై దాడులు నిర్వహిస్తామని వారు తెలిపారు. పిల్లల్లేని దంపతులు, కొందరు ధనవంతుల అవసరాలను ఆదాయంగా మల్చుకునేందుకు నగరంలో అడ్డగోలుగా సాగుతున్న సరోగసీ వ్యాపారానికి ఈ ఆసుపత్రి ఉదంతం ఓ పరాకాష్టగా నిలిచింది. ఇలాంటి ఆసుపత్రులు దేశమంతటా ఉన్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. అక్రమంగా సరోగసీ నిర్వహిస్తున్న ఇలాంటి ఆసుపత్రులన్నింటిని వెంటనే మూసివేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 

10:07 - June 18, 2017

హైదరాబాద్ : కులాంతర వివాహాలు చేసుకున్న వారి రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు చెప్పారు. హదరాబాద్‌ సందరయ్య విజ్ఞాన కేంద్రంలో కులాంతర వివాహాలు-రక్షణ చట్టం ఆవశ్యకత అన్న అంశంపై జరిగిన సదస్సుకు రాఘవులు హాజరయ్యారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారిపై దాడులను నివారించాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి వారి కోసం ప్రత్యేక భవనాన్ని నిర్మించడంతోపాటు చట్టం తీసుకురావాలని చెప్పారు. 

10:05 - June 18, 2017

హైదరాబాద్ : మియాపూర్ భూకుంబ‌కోణం. ఇప్పుడు రాష్ట్ర రాజ‌కీయాల‌ను షేక్ చేస్తున్న స్కాం. వేలకోట్ల విలువైన భూముల‌లో రాజకీయపార్టీల నేత‌ల పేర్లు బ‌య‌టికొస్తుండ‌టంతో..ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్‌ను హీటెక్కిస్తుంది. అయితే దీనిపై విపక్షాలు..ముఖ్యంగా టిడిపి మొద‌టి నుండి దూకుడుగా ముందుకు వెళ్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ప్రధాన ప్రతిప‌క్షం కాంగ్రెస్‌లో ఆ స్పీడు క‌న‌బ‌డ‌క పోవ‌డం..ఇప్పుడు సొంత పార్టీలో చ‌ర్చనీయాంశంగా మారింది.

ఆల‌స్యంగా మేల్కోన్న నాయకులు
ఈ మియాపూర్ భూస్కాంపై టీడీపీ కంటే కాంగ్రెస్ ఆల‌స్యంగా మేల్కోవ‌డంపై ఇప్పుడు పార్టీలో తీవ్ర చ‌ర్చనీయాంశంగా మారింది. ఈ స్కాంకు క‌ర్త, క‌ర్మ, క్రియగా ఉన్న గోల్డ్ స్టోన్ ప్రసాద్‌కు కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌కు ఉన్న సంబంధాలు ఉండ‌టం..ఇదే రాష్ట్ర కాంగ్రెస్ దూకుడుకు బ్రేకులు వేస్తుంద‌న్న చ‌ర్చ సాగుతుంది. ఇప్పడికే మాజీ పీసీసీ చీఫ్‌లు ప్రస్తుతం టీఆర్ఎస్ ఎంపీలుగా ఉన్న కేకే, డీఎస్‌ల భూములు తెర‌పైకి రావ‌డంతో.. ఇదేవిధంగా ఇంకా చాలా మంది నేత‌లు ఉన్నార‌న్న చ‌ర్చ..ఇప్పుడు పార్టీ వ‌ర్గాల్లో వినిపిస్తుంది. ఇదే కార‌ణంతోనే పార్టీలో ముఖ్య నేత‌లు ఈ భూకుంబ‌కోణంపై పోరాటానికి ముందుకు రావ‌డంలేద‌ని..ఇప్పడికే మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి ల‌క్ష్మారెడ్డి బ‌హిరంగంగానే విమ‌ర్శలు గుప్పించిన‌ సంగ‌తి తెలిసిందే. మియాపూర్ స్కాంపై రాష్ట్ర ముఖ్యనేత‌లు స్లో కావ‌డంపై గాంధీభ‌వ‌న్లో కొంద‌రు నేత‌లు మ‌రోలా విశ్లేషిస్తున్నారు. ఢిల్లీ పెద్ధల మ‌ధ్య ఉన్న ఆధిప‌త్యపోరు కూడా మియాపూర్‌పై పోరుకు కళ్ళెం వేస్తుంద‌ని టాక్. గోల్డ్ స్టోన్ ప్రసాద్‌కు ఏఐసీసీలో కీల‌క నేత‌గా ఉన్న అహ్మద్‌ పటేల్‌కు స‌న్నిహిత సంబందాలు ఉన్నాయన్నది కాంగ్రెస్‌లో జ‌గ‌మెరిగిన స‌త్యం. అయితే అహ్మద్‌ ప‌టేల్‌తో అంతగా పొసగని దిగ్విజ‌య్ దీన్ని అవ‌కాశంగా మ‌లుచుకున్నారని కొంద‌రు నేత‌లు గుసు గుస‌ లాడుకుంటున్నారు. దీనిలో భాగంగానే మియాపూర్ స్కాంపై గ‌తంలో ఎన్నడూ లేనివిధంగా దిగ్విజ‌య్ తీవ్రంగా ఆరోప‌ణ‌లు చేశార‌న్న చ‌ర్చ సాగుతుంది.

గుర్రుగా ఉన్న అహ్మద్ పటేల్
అయితే దిగ్విజ‌య్ తీరుపై గుర్రుగా ఉన్న అహ్మద్‌ప‌టేల్ రాష్ట్ర నేత‌ల‌పై ఒత్తిడి తెస్తుండ‌టంతో..రాష్ట్ర ముఖ్య నేత‌ల ప‌రిస్థితి ఇబ్బంది క‌రంగా మ‌రింద‌ని స‌మాచారం. అయినప్పటికీ..ఒక వైపు దిగ్విజ‌య్ సింగే స్వయంగా ఈ అంశంపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేయ‌డంతో..రాష్ట్ర పార్టీగా అంశాన్ని త‌ప్పనిసరిగా తీసుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింద‌ని పార్టీలో వినిపిస్తుంది. దీంతో చేసేదిలేక..ఆల‌స్యంగా మియాపూర్ భూముల‌ ప‌రిశీల‌న‌కు ముఖ్యనేతలు వెళ్ళార‌ని తెలుస్తోంది.మొత్తానికి మియాపూర్ భూ కుంబ‌కోణం రాష్ట్ర నాయ‌క‌త్వానికి..ముందు నుయ్యి వెన‌క గొయ్యిగా మారింది. ఒక‌వైపు టీడీపీ దూకుడుగా ముందుకెళ్తుంటే..మ‌రోవైపు సొంత పార్టీలోని పెద్ధల ఆదిప‌త్యపోరుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే మౌనంగా ఉంటే మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని గుర్తించిన నేత‌లు..పార్టీతో పాటు తాము రాజ‌కీయంగా బ‌త‌కాలంటే..ఇక పోరాటం త‌ప్పదని డిసైడ్ అయిన రాష్ట్ర నాయ‌క‌త్వం.. చేసేది లేక..లేటైనా గ్రౌండ్‌లో దిగిందని స‌మాచారం. 

10:01 - June 18, 2017

కరీంనగర్ : ఔషధ కంపెనీలు తాము తయారు చేసిన మందులను ముందుగా ఎలుకలపై ప్రయోగించి, ఆ తర్వాత మనుషులపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించి పరీక్షిస్తాయి. దీనికి చాలా రకాల అనుమతులు కావాల్సి ఉన్నా, కొన్ని కంపెనీలు అనైతికంగా వ్యవహరిస్తూ, అడ్డదార్లు తొక్కుతున్నాయి. ఏజెంట్లను నియమించుకుని అమాయకులను బుట్టలో వేసుకుని ఔషధ ప్రయోగాలు నిర్వహిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి.

ప్రయోగం వికటించి నాగరాజు మృతి
ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇతని పేరు నాగరాజు. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం నాగంపేటకు చెందిన నాగరాజు బెంగళూరుకు చెందిన లోటస్‌ ఫార్మాతో ఔషధ ప్రయోగ ఒప్పందం కుదుర్చుకున్నాడు. నాగరాజుపై సదరు ఔషధ కంపెనీ మెలటోనియన్‌-2ఎంజీ మెడిసన్‌ పరీక్షించింది. మొత్తం 60 మందిపై ప్రయోగిస్తే 19 మందికి వెంటనే పార్శ్వపు నొప్పులు వచ్చాయి. సైడ్‌ ఎఫెక్ట్స్‌కు గురైనవారిలో నాగరాజు కూడా ఒకరు. ఔషధ ప్రయోగం వికటించడంతో నాగరాజు కుప్పకూలిపోయినా లోటస్‌ ఫార్మా పట్టించుకోలేదు. దీంతో ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత నాగరాజు ఈనెల 2న ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబ సభ్యులు ఆరా తీస్తే నాగరాజు లోటస్‌ ఫార్మా క్లినికల్‌ ట్రయల్స్‌తో ఒప్పందం కుదుర్చకున్నట్లు తేలింది. అగ్రిమెంట్‌ కాపీలను తీసుకుని బెంగళూరులోని లోటస్‌ ఫార్మాను సంప్రదిస్తే చీత్కారమే ఎదురైందని బాధితుడి కుమారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రెండు లక్షల మందిపై ఔషధ ప్రయోగాలు
వంద మంది కాదు, వేల మంది కాదు..తెలంగాణలో రెండు లక్షల మందిపై ఔషధ కంపెనీలు క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తున్నాయని అఖిల భారత ఔషధ ప్రయోగ బాధితుల సంక్షేమ సంఘం వంటి కొన్ని స్వచ్ఛంద సంస్థలు అంచనా వేస్తున్నాయి. నిబంధనల ప్రకారం ప్రతి మూడు నెలలకు ఒకసారి ఔషధ పరీక్షలు నిర్వహించాలి. కానీ చాలా కంపెనీలు తాము తయారుచేసిన మెడిసిన్‌ను త్వరగా మార్కెట్‌లోకి తీసుకొచ్చి వందల కోట్లు కొల్లగొట్టాలన్న లక్ష్యంతో పది రోజులకు ఒకసారి అమాయకులపై ఔషధ ప్రయోగాలు చేస్తున్నాయని చెబుతున్నారు. తెలంగాణలో ఔషధ ప్రయోగాలకు ఒప్పుకున్న మరింత మంది మృత్యువాత పడకముందు ప్రభుత్వం నాగరాజు మృతిపై విచారణ జరిపించాలని మరికొన్ని సంస్థలు డిమాండు చేస్తున్నాయి. క్లినికల్‌ ట్రయల్స్‌తో మృతి చెందిన నాగరాజు మృతదేహాన్ని కుటుంబ సభ్యుల ఖననం చేశారు. ఇతడి మృతిపై టెన్‌ టీవీలో ప్రసారమైన కథనాలకు స్పందించిన కరీంనగర్‌ జిల్లా యంత్రాంగం విచాణకు ఆదేశించింది. తెలంగాణలో పెద్ద కలవరం సృష్టిస్తున్న అనైతిక, అక్రమి క్లినికల్‌ ట్రయల్స్‌ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు, వీటి ఆధీనంలోని ఔషధ నియంత్రణ విభాగాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. 

09:57 - June 18, 2017

గుంటూరు : వర్గ విభేదాలతో రచ్చకెచ్చిన కర్నూలు జిల్లా తెలుగుదేశం రాజకీయాలను చంద్రబాబునాయుడు చక్కబెట్టారు. జిల్లా టీడీపీ నేతలతో నిర్వహించిన సమావేశంలో నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికకు తెలుగుదేశం అభ్యర్థిగా భూమా బ్రహ్మానందరెడ్డి పేరును ఖరారు చేయడం సహా వివిధ అంశాలపై చర్చించారు.

పంతం నిలబెట్టుకున్న అఖిలప్రియ
మంత్రి అఖిల ప్రియ అనుకున్నది సాధించారు. నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక సీటు తన కుటుంబానికే దక్కాలన్న పంతాన్ని నిలబెట్టుకున్నారు. తన పెదనాన్న కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డిని అభ్యర్థిగా ఖరారు చేయించుకున్నారు. నంద్యాల టీడీపీ అభ్యర్థిత్వంపై కొంతకాలంగా జిల్లా నేతల్లో విభేదాలు భగ్గుమంటున్నాయి. అఖిల ప్రియకు వ్యతిరేకంగా ఏవీ సుబ్బారెడ్డి తిరుగుబాటు చేశారు. శిల్పా మోహన్‌రెడ్డి వంటి నేతలు అఖిల ప్రియతో విభేదించి, టీడీపీకి రాజీనామా చేసి, వైసీపీలో చేశారు. ఈ పరిణామాలన్ని అధినాయకత్వానికి తలనొప్పిగా మారడంతో చంద్రబాబునాయుడు జిల్లా నేతలతో ప్రత్యేకంగా సమావేశమై విభేదాలు సమచిపోయే విధంగా చేశారు. అఖిల ప్రియతోపాటు, ఏపీ సుబ్బారెడ్డితో విడివిడిగా భేటీ నిర్వహించి, అందిరి అభిప్రాయాలు తీసుకుని నంద్యాల అభ్యర్థిగా భూమా బ్రహ్మానందరెడ్డి పేరును ఖరారు చేశారు. ఈ విషయంలో అఖిల ప్రియతో విభేదించిన ఏవీ సుబ్బారెడ్డికి చంద్రబాబు నచ్చచెప్పారు. అన్ని విషయాలు తాన చూసుకుంటానని, మున్ముందు మంచి జరుగుతుందని ఏవీ సుబ్బారెడ్డికి హామీ ఇచ్చి, బ్రహ్మానందరెడ్డి అభ్యర్థిత్వానికి ఒప్పించినట్టు టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది.

కలిసికట్టుగా పని చేయాలి
నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో నేతలందరూ కలిసికట్టుగా సమన్వయంతో పని చేయాలని చంద్రబాబు ఆదేశించారు. విభేదాలు విస్మరించి బ్రహ్మానందరెడ్డి గెలిపించే బాధ్యతలు తీసుకోవాలని కోరారు. కర్నూలు జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి కాల్వ శ్రీనివాసులు, మున్సిపల్‌ మంత్రి నారాయణకు నంద్యాల ఉప ఎన్నిక బాధ్యతలు అప్పగించారు. నాయకులకు ఏవైనా ఇబ్బందులు ఉంటే మంత్రులతో చర్చించాలని సూచించారు. ఇక కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షడుగా ఎవర్ని నియమించాలన్న అంశంపై కూడా చంద్రబాబు చర్చించారు. అందరి అభిప్రాయాలను తీసుకుని సోమిశెట్టి వెంకటేశ్వర్లు పేరును ఖరారు చేసినట్టు సమాచారం. ఈ నెల 21న నంద్యాలలో తన పర్యటన వివరాలను కూడా చంద్రబాబు కర్నూలు జిల్లా టీడీపీ నేతలకు వివరించారు. ఆ రోజు 13 వేల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఉప ఎన్నికలో టీడీపీకి ఈ అంశం ఉపకరిస్తుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు.

09:55 - June 18, 2017

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్యక్షతన మూడు గంటలకుపైగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రెవెన్యూ, పోలీసు శాఖల్లో 28,796 ఉద్యోగాల ఆమోదం తెలపడంతోపాటు నాలుగు చట్ట సవరణ ఆర్డినెన్స్‌లకు ఆమోదం తెలిపింది.

రెవెన్యూ శాఖలో 2,506 ఉద్యోగలు
పరిపాలనలో కీలకమైన రెవెన్యూ శాఖలో 2,506 ఉద్యోగలు భర్తీ చేస్తారు. వెయ్యి గ్రామ రెవెన్యూ సహాయకుల పోస్టులు భర్తీ చేస్తారు. మరో 700 మంది గ్రామ రెవెన్యూ అధికారులను నియమిస్తారు. జూనియర్‌ అసిస్టెంట్‌, టైపిస్టు పోస్టులను 400 భర్తీ చేస్తారు. డిప్యూటీ సర్వేయర్‌ ఉద్యోగాలు వంద, రిజిస్ట్రేషన్ల కార్యాలయాల్లో వంద మంది సర్వేయర్లను నియమిస్తారు. అలాగే కంప్యూటర్‌ ఆపరేటర్‌ డ్రాఫ్ట్స్‌మెన్‌ పోస్టులు 50, జిల్లా రిజిస్ట్రార్‌ పోస్టులు ఏడు, సబ్‌ రిజిస్ట్రార్లు 22 మందిని నియమించేందుకు మంత్రివర్గం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సీసీఎల్‌ఏ కార్యాలయంలో 21 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, డిప్యూటీ కలెక్టర్లు ఉద్యోగాలు ఎనిమిది , డిప్యూటీ తహశీల్దార్ పోస్టులు 38 భర్తీ చేస్తారు. అలాగే రిజిస్ట్రేషన్ల కార్యాలయాల్లో 50 జూనియర్‌ అసిసెంట్‌ పోస్టులు భర్తీ చేస్తారు.

పోలీసు శాఖ 26,290 పోస్టులు

పోలీసు శాఖను మరింత పటిష్టం చేసేందుకు వీలుగా 26,290 పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. మూడేళ్లలో ఈ ఉద్యోగ నియామకాలు చేపడతారు. ఉద్యోగ నియమాకల్లో జోన్‌ వ్యవస్థ రద్దుకు కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్ర, జిల్లా స్థాయి పోస్టులు మాత్రమే ఉంటాయి. ఈ నిర్ణయాన్ని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపుతారు. జోనల్‌ వ్యవస్థ రద్దుపై ధ్యయనానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ అధ్యక్షతన కమిటీ ఏర్పాటుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

నాలుగు ఆర్డినెన్స్ లు
నాలుగు కీలకమైన చట్టాలను సవరిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ చట్టాలు వెంటనే అమల్లోకి వచ్చేలా ఆర్డినెన్స్‌ల జారీకి నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దుచేస్తూ రిజిస్ట్రేషన్ల చట్ట సవరణ ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపింది. రిజిస్ట్రేషన్ల చట్టంలోని లొసుగులను ఆధారంగా చేసుకుని కొందరు బడా బాబులు ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల అండదండలతో వేల కోట్ల రూపాయల విలువచేసే సర్కారు భూములను కబ్జా చేస్తున్నట్టు తేలడంతో ఈ నిర్ణయం తీసుకుంది. సబ్‌ రిజిస్ట్రార్ల అధికారాలను తొలగిస్తారు. పీడీ యాక్ట్ పరరిధిలోకి పది కొత్త నేరాలను తీసుకొస్తూ ఈ చట్ట సవరణ ఆర్డినెన్స్‌ కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆన్‌లైన్‌ పేకాటను నిషేధిస్తూ గేమింగ్‌ అండ్‌ గ్యాంబ్లింగ్‌ చట్ట సవరణ ఆర్డినెన్స్‌కు ఆమోదముంద్ర వేసేంది. విలువల ఆధారిత పన్ను చట్ట సవరణ ఆర్డినెన్స్‌ తీసుకొస్తున్నారు.

ఈనెల 20 నుంచి గొర్రెల పంపిణీ
ఈనెల 20 నుంచి గొర్రెల పంపిణీ కార్యక్రమం ప్రారంభించాలని మంత్రివర్గంలో నిర్ణయించారు. గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ గొర్రెల పంపిణీ ప్రారంభిస్తారు. నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యేలు, మంత్రులు గొర్రెల పంపిణీ చేస్తారు. అలాగే వచ్చే నెలలో సంచార పశు వైద్యశాలలు ప్రారంభించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం 24 వేల చెరువుల్లో చేపల పెంపకం చేపడతారు. వచ్చే నెల మొదటి వారం నుంచి నిర్వహించే హరితహారంలో 40 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ రుణ పరిమితి 5 వేల కోట్లకు పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది ఈ మొత్తంలో 1200 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఉంటుంది. ఈ విధంగా తెలంగాణ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 

Don't Miss