Activities calendar

19 June 2017

21:34 - June 19, 2017

ఢిల్లీ :కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారం 47వ పడిలోకి అడుగు పెట్టారు. రాహుల్‌కు ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాహుల్ గాంధీ ఆయురారోగ్యాలతో ఉండాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు మోదీ ట్వీట్ చేశారు. ఇక దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తన అమ్మమ్మను చూడటానికి రాహుల్ ఇటలీ వెళ్లిన విషయం తెలిసిందే.

21:33 - June 19, 2017

చెన్నై : వరుస సమావేశాలతో హీరో రజనీకాంత్‌ బిజీ బిజీగా గడుపుతున్నారు. నిన్న రైతు సంఘాలతో సమావేశమైన రజనీ...ఇవాళ హిందూ మక్కల్ కట్చి నేతలతో సమావేశమయ్యారు. రజనీ రాజకీయాల్లోకి వస్తారని హిందూ సంస్థలు చెప్పుకొస్తున్నాయి. మరోవైపు తదుపరి సీఎం రజనీ అంటూ చెన్నైలో పోస్టర్లు వెలుస్తున్నాయి. భాషాతో సమావేశం అయ్యేందుకు పలు పార్టీల నేతలు పోటీపడుతున్నారు.. పాట్టాలి మక్కల్‌ కట్చి నేతలు, హిందు మక్కల్‌ కట్చి నేతలు రజనీతో భేటీ అయ్యారు.. సూపర్‌స్టార్‌ రాజకీయ ప్రవేశంపై చర్చించారు.. అటు రజనీ అభిమానులు, వివిధ పార్టీల నేతలు, తమిళ, రైతు, హిందుత్వ సంఘాల రాకతో రజనీ నివాసం ముందు సందడి ఏర్పడింది..

 

21:30 - June 19, 2017

కర్నూలు : కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై విశాల ఐక్య ఉద్యమాలు నిర్వహించాలని కేరళ సీఎం పినరయి విజయన్‌ పిలుపునిచ్చారు. మోదీ సర్కార్‌ వ్యవసాయరంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టిందన్నారు. రైతులు వలస కూలీలుగా మారుతున్నా పట్టించుకోకుండా... కార్పొరేట్లకు వంతపాడుతున్నారని ఆరోపించారు. కేంద్రం తీసుకొచ్చిన భూసేకరణ చట్టం రైతుల భూములను లాక్కొనేందుకే ఉపయోగపడుతోందని విమర్శించారు. కర్నూలులో ఏపీ వ్యవసాయ కార్మికసంఘం 27వ రాష్ట్ర మహాసభల సందర్భంగా నిర్వహించిన బహిరంగసభలో ఆయన పాల్గొన్నారు. కర్నూలులో ఎర్రదండు కదం తొక్కింది. ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం 27వ రాష్ట్ర మహాసభల సందర్భంగా కర్నూలు ఎరుపెక్కింది. రైతులు, వ్యవసాయ కార్మికులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కర్నూలులో ప్రధాన రహదారులగుండా సాగిన ర్యాలీ..ఎస్‌టీబీసీ కళాశాల గ్రౌండ్‌కు చేరింది. అక్కడ జరిగిన బహిరంగ సభకు రైతులు, వ్యవసాయ కార్మికులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. బహిరంగ సభలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వ్యవసాయ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా సంక్షోభంలోకి నెడుతోందంటూ నిప్పులు చెరిగారు. దేశంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని, వ్యవసాయ రంగానికి కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు తగ్గాయన్నారు. మోదీ సర్కార్‌ రైతులను వదిలి కార్పొరేటర్లకు ఎర్రతివాచీ పరుచుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్లకు లక్షలకోట్లు సబ్సిడీ ఇస్తోన్న మోదీ... దేశానికి అన్నంపెట్టే అన్నదాతకు మొండిచేయి చూపుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ రైతు , కార్మిక వ్యతిరేక విధానాలను ప్రజలంతా ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కేంద్ర వినాశకర విధానాలకు చరమగీతం పాడేందుకు అంతా విశాలవేదికపైకి రావాలన్నారు. కుల,మత, ప్రాంతాలకు అతీతంగా ప్రజలంతా వామపక్ష ప్రత్యామ్నాయాన్ని బలపర్చాలన్నారు.

గఫూర్ మండిపాటు..
చంద్రబాబు ప్రభుత్వంపై సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఏ. గఫూర్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం రైతుల నుంచి భూములను బలవంతంగా లాక్కొంటోందని ఆరోపించారు. రైతులను కొల్లగొట్టి పెట్టుబడిదారులకు చంద్రబాబు వంతపాడుతున్నారన్నారు. సంపన్నుల అభివృద్ధినే రాష్ట్రాభివృద్దిగా చెబుతున్నారని విమర్శించారు. రాయలసీమలో వలసల నివారణకు చంద్రబాబు ఏనాడైనా చర్యలు తీసుకున్నారా అంటూ ఆయన ప్రశ్నించారు. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నిర్వహించే ఉద్యమాలకు సంపూర్ణ సహకారం ఉంటుందని తెలంగాణ వ్యయసాయ కార్మికసంఘం నేత బి. వెంకట్‌ అన్నారు. ఇద్దరు చంద్రులు కలిసి రైతులను, వ్యవసాయకార్మికులను దగా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కర్నూలో ప్రదర్శన సందర్భంగా కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలు మంగళవారం ప్రతినిధుల సభ ప్రారంభమవుతుంది. బుధవారం మహాసభలు ముగుస్తాయి. ఈ మహాసభల్లో పలు తీర్మానాలను ఆమోదించనున్నారు. బుధవారం వ్యవసాయ కార్మికసంఘం రాష్ట్రనూతన కమిటీని ప్రతినిధులు ఎన్నుకుంటారు.

21:26 - June 19, 2017

కర్నూలు : మోదీ ప్రభుత్వం గిరిజనుల హక్కులను కాలరాసేలా వ్యవహరిస్తోందని ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ ఉపాధ్యక్షురాలు బృందా కరత్‌ అన్నారు. అడవిపై గిరిజనులకు హక్కులేకుండా చేయాలని చూస్తే సహించేది లేదన్నారు. విశాఖ జిల్లా అరకులో జరిగిన ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ సభలో పాల్గొన్న బృందాకారత్‌.. గిరిజనుల సమస్యలు- చట్టాలపై ప్రసంగించారు. మరోవైపు రేపటి నుంచి విశాఖలో ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ జాతీయ మహాసభలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేరళ సీఎం పినరయి విజయన్‌ హాజరుకానున్నారు. ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ జాతీయ మహాసభల నేపథ్యంలో అరకులో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఇందులో ఆదీవాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ జాతీయ ఉపాధ్యక్షులు బృందాకరత్‌ పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు, చట్టాలను ఆమె ప్రస్తావించారు. దేశంలో మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్‌ గిరిజనుల హక్కులను కాలరాసేలా వ్యవహరిస్తున్నారని బృందా కారత్‌ ఆరోపించారు. అడవిపై గిరిజనులకు హక్కులేకుండా చేయాలని చూస్తే సహించేది లేదని ఆమె హెచ్చరించారు. మంగళవారం నుంచి మూడు రోజుల పాటు విశాఖపట్నంలో ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ జాతీయ మహాసభలు జరగనున్నాయి.

17 రాష్ట్రాల ప్రతినిధులు..
మహాసభలను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రారంభించనున్నారు. దేశంలోని 17 రాష్ట్రాలకు చెందిన 500 మంది ప్రతినిధులు ఈ మహాసభల్లో పాల్గొననున్నారు. ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ దేశంలోని 16 రాష్ట్రాల్లో గిరిజనుల సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తోంది. ప్రధానంగా గిరిజనుల కోసం ప్రవేశపెట్టిన అటవీ హక్కుల చట్టం, ఆహార భద్రత చట్టం, విద్యా హక్కు చట్టాలు అమలయ్యేలా మహాసభలలో చర్చించనున్నారు. గిరిజన ప్రాంతాల్లో నేటికి తాగడానికి మంచినీళ్లు, విద్యుత్తు, రోడ్ల లాంటి మౌలిక సదుపాయాలు కూడా లేవని, వాటి సాధన కోసం పోరాటాలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.

 

21:23 - June 19, 2017

హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. వానల కారణంగా రహదారులన్నీ జలమయమయ్యాయి. వాగులు, కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. తెలంగాణలో విస్తృతంగా వర్షాలు పడుతున్నాయి. ఈ మేరకు ఆదిలాబాద్‌ జిల్లాలోని... ఉట్నూరు ఏరియాలో భారీ వర్షపాతం నమోదైంది. కొన్నిచోట్ల రోడ్లు కొట్టుకుపోయే పరిస్థితి కనిపిస్తోంది. అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో జహీరాబాద్‌, న్యాల్‌కల్‌, ఝరాసంగం, కోహీర్‌ మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది. జహీరాబాద్‌ ప్రాంతంలోని పలు వాగులు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రహదారులపై భారీగా వర్షపు నీరు చేరింది. మహబూబ్‌నగర్‌ జిల్లా... బాదేపల్లి పట్టణంలో 10 సెంటి మీటర్ల వాన కురిసింది. దీంతో రోడ్లు, ప్రధాన వీధులు చెరువులను తలపిస్తున్నాయి. జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో భారీగా వర్షపు నీరు చేరి...తరగతి గదులన్నీ బురదమయంగా మారాయి.

వాగు దాటడానికి ప్రయత్నించి..
ఏకదాటిగా కురుస్తోన్న వానలకు మెదక్‌ జిల్లా సత్యగామ వాగు పొంగిపొర్లుతోంది. వాగును దాటడానికి ప్రయత్నించిన ఇద్దరు యువకులు బైక్‌తో సహా కొట్టుకుపోయారు. స్థానికులు తాడు సాయంతో యువకులను రక్షించారు. వికారాబాద్‌ జిల్లా.. పరిగిలో ఉదయం నుంచి భారీగా వర్షం పడుతుంది. పరిసర ప్రాంతాలలోని చిన్న వాగులు పొంగిపొర్లుతున్నాయి. నస్కల్‌ సమీపంలోని వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పరిగి-వికారాబాద్‌ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే పిడుగు పడి పెద్దపల్లి జిల్లా... ఓదెల మండలం పొత్కపల్లి వద్ద రైల్వే సిగ్నల్‌ వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. రోడ్లపై భారీగా నీరు చేరడంతో.. ద్విచక్ర వాహనదారులు, ఉద్యోగులు, విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కారణంగా మేడ్చల్‌ జిల్లా.. కీసర మండలం నాగరం గ్రామంలో గురుకుల పాఠశాల గదుల్లో నీరు చేరింది. విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. కాగా మరో రెండు రోజులు పాటు రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సీజన్‌ ప్రారంభంలోనే వర్షాలు పడటంతో.. రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

21:20 - June 19, 2017
21:19 - June 19, 2017

విజయవాడ: విశాఖ భూకుంభకోణంలో సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లతో పాటు ప్రమేయం ఉన్న మంత్రులపై సిబిఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు వైసిపి నేత బొత్స సత్యనారాయణ. అప్పుడే విశాఖ ప్రజలకు న్యాయం జరగుతుందన్నారాయన. సుమారు 6 లక్షల ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యాయని మండిపడ్డారు. సిట్‌ల వల్ల ఉపయోగం లేదన్న బొత్స సిబిఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఈ భూములకు సంబంధించి ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాటాలు చేస్తామన్నారు. అందులో భాగంగా ఈనెల 22న పార్టీ అధినేత జగన్ ఆధ్వర్యంలో విశాఖలో ధర్నా నిర్వహించబోతున్నట్లు బొత్స చెప్పారు. ఈ ధర్నాలో అన్ని పార్టీలు పాల్గొనవచ్చని పిలుపునిచ్చారు.

21:18 - June 19, 2017

విజయవాడ : విశాఖ భూకుంభకోణంలో ఎవరున్నా సరే వదిలేది లేదని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ స్కాంపై విచారణ కొనసాగుతోందని చెప్పారు. వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుటున్నామని తెలిపారు.. దళిత నేతను రాష్ట్రపతి అభ్యర్థిగా చేయడం అభినందనీయమని ప్రశంసించారు.. రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చంద్రబాబు అన్నారు.. తృణమూల్‌ కాంగ్రెస్‌ మద్దతుకోసం మమతా బెనర్జీకి ఫోన్‌ చేశానని వివరించారు.. మమతా బెనర్జీ విదేశాల్లో ఉన్నారని... వచ్చాక ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశముందని చంద్రబాబు వెల్లడించారు..

21:17 - June 19, 2017

ఢిల్లీ : రాష్ట్రపతి పదవికి పోటీ తప్పదా? రాంనాథ్‌ కోవింద్‌ను ఎన్డీయే తరపున అభ్యర్థిగా బిజెపి ప్రకటించడంపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. బిజెపి ఏకపక్ష నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్‌ విమర్శించింది. ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వ్యక్తిని రాష్ట్రపతి పదవికి ఎంపిక చేయడాన్ని వామపక్షాలు వ్యతిరేకించాయి. రామ్‌నాథ్‌ కోవింద్‌కు పోటీగా ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి నిలపాలా... లేదా...అన్నదానిపై విపక్షాలు ఈ నెల 22న నిర్ణయించనున్నాయి. రాష్ట్రపతి ఎన్నికలకు పోటీ తప్పేలా కనిపించడం లేదు. ఎన్టీయే తరపున రామ్‌నాథ్‌ కోవింద్‌ను తమ అభ్యర్థిగా బిజెపి ఏకపక్షంగా ప్రకటించడాన్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి. రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించడానికి ముందు విపక్షాలతో సంప్రదిస్తామని సోనియాగాంధీతో బిజెపి త్రిసభ్య కమిటి భేటి సందర్భంగా చెప్పారని...ఇందుకు విరుద్ధంగా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని గులాంనబీ ఆజాద్‌ విమర్శించారు. రామ్‌నాథ్‌ కోవింద్‌కు పోటీగా ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి నిలపాలా లేదా అనే దానిపై ఈ నెల 22న జరిగే ప్రతిపక్ష పార్టీల సమావేశం అనంతరం నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

విపక్షాల స్పందన..
ఎన్డీయే రామ్‌నాథ్‌ కోవింద్‌ పేరును ప్రకటించడంపై వామపక్ష పార్టీలైన సిపిఎం, సిపిఐలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ మూలాలున్న వ్యక్తిని రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దింపవద్దని ఇటీవల తమను కలిసిన త్రిసభ్య కమిటీకి చెప్పామని పేర్కొన్నాయి. రామ్‌నాథ్‌.. ఆర్ఎస్‌ఎస్‌ దళిత శాఖకు చెందిన నేతగా ప్రసిద్ధి. అలాంటాయనను రాజకీయేతరుడిగా భావించలేమని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. రాష్ట్రపతి పదవికి పోటీ తప్పక పోవచ్చని, ఈ నెల 22న జరిగే విపక్ష పార్టీల సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశముందని ఏచూరి అన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా రాంనాథ్‌ కోవింద్‌ పేరు ప్రకటించడంపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు. సుష్మాస్వరాజ్‌, అద్వాని పేర్లను సూచించాల్సిందని అభిప్రాయపడ్డారు. మరోవైపు టిఆర్‌ఎస్‌, టిడిపి, బిఎస్‌పిలు రామ్‌నాథ్‌కోవింద్‌ అభ్యర్థిత్వాన్ని సమర్థించాయి. రాజకీయాలకు అతీతంగా ఉండే దళిత అభ్యర్థిని ఎన్డీయే ప్రకటిస్తే బాగుండేదని బిఎస్పీ అధినేత్రి మాయావతి అభిప్రాయపడ్డారు. బీహార్‌ సిఎం నితీష్‌ కుమార్‌కు గవర్నర్‌ రామ్‌నాథ్‌ కోవింద్‌ ఫోను చేసి మద్దతు కోరారు. బిహార్‌ గవర్నర్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడంపై నితీష్‌ హర్షం వ్యక్తం చేశారు. మద్దతుపై తమ పార్టీ నిర్ణయిస్తుందని నితీష్‌ అన్నారు. గవర్నర్‌తో నితీష్‌, ఆర్జేడి చీఫ్‌ లాలూలకు మంచి సంబంధాలున్నాయి.

కేసీఆర్..బాబు మద్దతు..
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతు తెలిపారు. ఒక దళిత నేతను రాష్ట్రపతిగా ఎంపిక చేయాలన్న మీ సూచన మేరకే రామ్‌నాథ్‌ను ఎంపిక చేశామని, తమకు మద్దతివ్వాలని మోది ఫోన్‌ చేసి చెప్పినట్లు కేసీఆర్‌ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రామ్‌నాథ్‌ కోవింద్‌కు మద్దతు ప్రకటించారు. దళిత నేతను ఎంపిక చేయడంపై బాబు హర్షం వ్యక్తం చేశారు. ఎన్డీయే మిత్రపక్షమైన శివసేన మాత్రం తమ పార్టీ నేతలతో సమావేశమయ్యాకే రామ్‌నాథ్‌ కోవింద్‌కు మద్దతుపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ పేరును ప్రకటించాక ప్రధాని నరేంద్రమోది కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, ఇతర పార్టీల నేతలు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోనులో మాట్లాడి మద్దతు కోరారు.

మంగళవారం గొర్రెల పంపిణీ..

హైదరాబాద్ : గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనే ఉద్ధేశ్యంతో మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం గొర్రెల పంపిణీ చేయనుంది. సీఎం సొంత నియోజకవర్గంలో గొర్రెల పంపణీ పథకం కార్యక్రమం మొదలు కానుంది.

ఆ రోజున నామినేషన్ వేయనున్న కోవింద్..

ఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నిక కోసం రాంనాథ్ కోవింద్ 23 నామినేషన్ వేయనున్నారు. ఎన్డీయే తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా రాంనాథ్ కోవింద్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే.

 

'రాష్ట్రపతి అభ్యర్థి వెనుక ఓటు బ్యాంకు రాజకీయం'..

ముంబై : ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిపై శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే స్పందించారు. రామ్ నాథ్ కోవింద్ రాష్ట్రపతి అభ్యర్థిత్వం వెనుక ఓటు బ్యాంకు రాజకీయ ఉందని ఆరోపణలు గుప్పించారు.

సచివాలయం 2 బ్లాక్ లో కలకలం..

విజయవాడ : అమరావతి సచివాలయంలోని 2వ బ్లాక్ లో కలకలం రేగింది. 15 నిమిషాలుగా ఫైర్ అలారం మోగడమే ఇందుకు కారణం. ఎవరో కావాలనే ఫైర్ అలారం బటన్ నొక్కి ఉంటారని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్ కార్యాలయంలో పోలీసులు..అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

సాధించిన ప్రగతితో సంతృప్తి - బాబు..

విజయవాడ : మూడేళ్లలో సాధించిన ప్రగతి ఎంతో సంతృప్తినిచ్చిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నిర్మాణంలో ఉన్న 24 ప్రాజెక్టులు పూర్తయితే అన్ని రిజర్వాయర్లు పూర్తిగా నిండుతాయని, మరో 2 ,3 ఏళ్ల వరకు నీటి సమస్య ఉండదన్నారు. కైలాజ యాప్ ద్వారా నేరుగా సమస్యలు తెలుసుకుంటున్నట్లు, కైలాజ కనెక్ట్ టూ సీఎం యాప్ లో అవినీతిపై నేరుగా సీఎంకు ఫిర్యాదు చేసే అవకాశం ఉందన్నారు.

 

ఎవరో అడిగితే సీబీఐ విచారణకు ఇవ్వాలా - బాబు..

విజయవాడ : విశాఖలో భూ రికార్డులు తారుమారయ్యాయని, రికార్డులు మార్చిన వారు భయపడుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దీనిపై సిట్ దర్యాప్తు చేస్తోందని, భూ కుంభకోణంలో ఎవరున్నా చర్యలు తప్పవని హెచ్చరించారు. వైజాగ్ గొప్పనగరంగా అభివృద్ధి చెందుతోందని ఇలాంటి సమయంలో రాజకీయ సభలు పెట్టి విశాఖ నగర ప్రతిష్టను దెబ్బ తీస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఎవరి దగ్గర ఆధారాలున్నా సిట్ కు ఇవ్వొచ్చని సూచించారు. ఎవరో అడిగితే సీబీఐ విచారణకు ఇవ్వాలా ? చేతగాని కాంగ్రెస్ పార్టీ కూడా తనపై ఆరోపణలు చేస్తోందని విమర్శించారు.

రుజువు చేస్తే రాజకీయ సన్యాసం - జవహార్..

విజయవాడ : జగన్ పత్రికలో ముడుపుల కథనంపై ఎక్సైజ్ శాఖ మంతిర్ జవహార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై ఆరోపణలను 24గంటల్లోగా జగన్ నిరూపించాలని డిమాండ్ చేశారు. రుజువు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని లేనిపక్షంలో జగన్ రాష్ట్రం విడిచి వెళ్లాలని సవాల్ విసిరారు.

 

20:39 - June 19, 2017

నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు.. సైలెంట్ గా దందా సాగిస్తున్నారు. పిల్లలు లేని వారి ఆ కొరతను తీర్చే అపురూపమైన అవకాశాన్ని వ్యాపారంగా మార్చి.. పేద మహిళల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇన్ ఫెర్టిలిటీ సెంటర్ల మాటున జరుగుతున్న ఈ వ్యాపారానికి చెక్ పడేదెప్పుడు? సంతాన సాఫల్య కేంద్రాలు, బ్రోకర్ల ఆటకట్టించేదెప్పుడు? ఈ అంశంపై ప్రత్యేక కథనం..సరోగసీతో పిల్లల్ని కనండి తప్పులేదు. కానీ, వ్యాపారంగా మాత్రం కాదు.. మీ ఫీజు తీసుకోండి కానీ, లక్షలకు లక్షలు కొల్లగొడుతూ, అభాగ్యుల ఆరోగ్యాలతో మాత్రం ఆడుకోకండి.. ఇదీ చట్టం చెప్తున్న విషయం. మరి భాగ్యనగరంలో సరోగసీ ఏ రూపంలోకి మారింది?

అంగట్లో అమ్మతనం..
అంగట్లో అమ్మతనం అమ్ముడుపోతోందా? సరోగసీకి అడ్డాగా భాగ్యనగరం నిలుస్తోందా? అడ్డ గోలుగా సరోగసీ కేంద్రాలు నిర్వహిస్తూ అక్ర మార్జనకు కొన్ని ఆసుపత్రులు తెరదీశాయా? ఎంత వసూలు చేస్తున్నారు? ఎంత వెనకేసుకుంటున్నారు? సరోగసీ చట్టం ఏం చెప్తోంది? అమ్మతనం వ్యాపారం అయింది. నవమాసాలు మోసే తల్లి గర్భం వ్యాపారానికి పెట్టుబడి అవుతోంది. పేద మహిళలకు ఇది శాపంగా మారుతోంది. కేవలం 9నెలలు కళ్లు మూసుకుంటే లక్షలొస్తాయని ఆశపెట్టి ఇందులోకి దించుతున్నారు బ్రోకర్లు. బిడ్డల భవిష్యత్తు కోసం కొందరు, తమ బతుకులు మారతాయని మరికొందరు.. సరొగేట్‌ మదర్‌గా రెడీ అవుతున్నారు. ఆస్పత్రి ఉంది.., సరొగేట్ మందర్ ఉంది.. పిల్లలు కావలసిన దంపతులూ ఉన్నారు.. మరి సీన్ లో బ్రోకరెలా వస్తున్నాడు? సరొగేట్ మదర్ ని అక్రమంగా నిర్బంధిస్తున్నారా? ఆ తర్వాత కాంప్లికేషన్స్ పట్టించుకోవటం లేదా? పిల్లలకోసం తపించేవారికి వైద్యశాస్త్రం సరొగసీ లాంటి వరాలన్ని అందించింది. కానీ, కొందరు దీన్ని వ్యాపారంగా మార్చి, అసలు లక్ష్యాన్ని దెబ్బతీస్తున్నారు. చట్టాలను కఠినంగా అమలు చేసి, మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసినపుడే అటు పిల్లలు కావాలనుకునే తల్లిదండ్రులకు , ఇటు నిరుపేద మహిళలకు న్యాయం జరుగుతుంది. మరింత విశ్లేషణకు వీడియో క్లిక్ చేయండి.

20:36 - June 19, 2017

ఈటెల రాజేంద్ర సారు కొడ్కు పెండ్లి జోరు గయ్యింది.. అయితే కరీంనగర్ జిల్లా లీడర్లు ఆ పెండ్లి పండుగను ఇంక జర్రంత జొర్దార్ జేశిండ్రు.. పుట్ట మధు.. కరీంగనర్ మేయర్.. గంగుల కమలాకర్ వాళ్ల డ్యాన్సుగాదు వాళ్ల లెక్కగాదన్కోరాదుండ్రి.. తెలంగాణ రాష్ట్రమొచ్చిననాడు గూడ ఆ తీర్గ ఎగురకుండొచ్చు.. ఇన్నొద్దులు మనం ఎగిరితే వాళ్లు జూశిండ్రుగదా... చలో ఇప్పుడు వాళ్ల డ్యాన్సు జూడాలంటే వీడియో క్లిక్ చేయండి.

20:34 - June 19, 2017

పువ్వుగుర్తోళ్లు రాష్ట్రపతి అభ్యర్థి ఎవ్వలుంటరనేది చెప్పేశిండ్రు.. నిన్న ముఖ్యమంత్రి సారు ముస్లింలకు రంజాన్ దావత్ ఇచ్చెకాడ ఏం మాట్లాడిండో..? ఇంతకు ఎస్సీవర్గీకరణ అనేది నీకు ఇష్టమున్నదా..? లేదా..? గది జెప్పక..? ఎన్నిరోజులు తప్పిచ్చుక తిర్గుతవ్ సారూ..? అంటున్నరు మాదిగబిడ్డలు..తెలంగాణ ప్రభుత్వం మీకు గొర్లు గొనిస్తమని చెప్పిందిగదా..? అగో ఆ గడియరానే వచ్చింది..సర్కారు బడిలె సౌలతుల సక్కదనం సంగతి మాత్రం పట్టిచ్చుకుంటలేనట్టుండ్రు.. ఈటెల రాజేంద్ర సారు కొడ్కు పెండ్లి జోరు గయ్యింది.. అయితే కరీంనగర్ జిల్లా లీడర్లు ఆ పెండ్లి పండుగను ఇంక జర్రంత జొర్దార్ జేశిండ్రు.. మన్సులకే గాదు.. పాములకు గూడ పరేషాన్ ఉన్నట్టుంది ముసురువడ్తె..మీరు కార్లు గీర్లేస్కోని టోల్ గేట్లు దాటుతున్నరా..? ఆ అట్ల వొయ్యెటోళ్లు.. నెత్తికి హెల్మెంట్లు... ఒక ప్రథమ చికిత్స కిట్లు గూడ ఎంటవెట్టుకోని పోండ్రి.. గిసొంటి గరం..గరం ముచ్చట్లు సూడాలంటే వీడియో క్లిక్ చేయండి.

ఉపాధ్యాయ ఏకీకృత సర్వీసు దస్త్రానికి పీఎంవో ఆమోదం..!

హైదరాబాద్ : ఉపాధ్యాయ ఏకీకృత సర్వీసు దస్త్రానికి పీఎంవో ఆమోదం తెలిపింది. ఈ రోజు ప్రధాని సంతకం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అనంతరం రాష్ట్రపతి భవన్ కు పీఎంవో పంపనుంది. కేంద్ర మంత్రి వెంకయ్యకు సమాచారం అందించింది. త్వరలోనే ఉపాధ్యాయ ఏకీకృత సర్వీసు నిబంధనల దస్త్రానికి ఆమోదం తెలిపింది.

20:06 - June 19, 2017

కారన్ మార్క్స్..జర్మన్ శాస్త్రవేత్త..ఆర్థిక వేత్త..తత్వవేత్త..సామాజిక వేత్త..పాత్రికేయుడు..సోషలిస్టు..విప్లవకారుడు..కారల్ మార్క్స్ మానవ చరిత్రల్లోకెల్లా అత్యంత ప్రభావశీలమైన వ్యక్తుల్లో ఒకరిగా పేరొందారు. ఆయన రచించిన పెట్టుబడి గ్రంథానికి 150 ఏళ్ల సందర్భంగా దాస్ కేపిటల్ పై సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులతో టెన్ టివి ముచ్చంచింది. ఈ సందర్భంగా ఆయన ఎన్నో విషయాలను తెలియచేశారు. ఈ గ్రంధం ప్రజాజీవితం..సామాజిక పరిణామంపై ప్రభావం చూపింది. పెట్టుబడి దారి విధానం ఉన్నంతకాలం ప్రామాణికత దీని సొంతం.. ఈ గ్రంథం చదివితే రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రామ సీమల్లో పరిస్థితి అర్థమౌతుంది. ఇద్దరు చంద్రులు వేల కోట్ల భూ సేకరణ చేపడుతున్నారు. ఒకే మార్కెట్..ఒకే చట్టం దీని వెనుక పెట్టుబడి దారుల ప్రయోజనాలున్నాయి. ఇది కార్మిక ఉద్యమాలకు ఊపిరిపోయలేదు..ఉద్యమాలకు కారణాలు చూపింది.

ఇంతకు మించిన ప్రామాణిక గ్రంథం లేదు..
ప్రపంచంలో ఆర్థిక శాస్త్రవేత్తలకు ఇంతకు మించిన ప్రామాణిక గ్రంథం లేదు. ప్రజా జీవితం, సామాజిక పరిణామంపై ప్రభావం చూపింది. పెట్టుబడి దారి విధానం ఉన్నంతకాలం దాస్ కేపిటల్ ప్రామాణికత ఉంటుంది. 2008లో ఆర్థిక మాంద్యం వస్తే ఫ్రాన్స్ అధ్యక్షుడు సర్కోజీ దీనినే చదివారు. పికేటీ లాంటి ఆర్థిక వేత్తలు కేపిటల్ గ్రంథ రచనకు దాస్ కేపిటలే మూలం. అడమ్ స్మిత్..రికార్డో వంటి రచనలు గొప్పవే కానీ ఇలాంటి వారికి అవగతం కాని అంశాలు..వైరుఢ్యాలను మార్క్స్ ప్రస్తావించారు.

1990 నుండి..
1990 నుండి మన దేశంలో పెట్టుబడి దారి పోకలు పెరిగిపోయాయి. 10 శాతం పెట్టి వ్యవసాయం చేయండి 90 శాతం మేం భరిస్తామని చెప్పరు. కానీ కార్పొరేట్లకు మాత్రం 10 శాతం పెట్టండి..90 శాతం మేం భరిస్తాం అంటారు. ఒక లక్ష 14 వేల కోట్ల కార్పొరేట్ల రుణాలను మాఫీ చేశారు. ఒక లక్ష 50 వేల కోట్లు పెడితే దేశమంతా రుణమాఫీ చేయొచ్చు. విద్యా..వైద్యంతో పాటు చాలా రంగాలు సరుకుగా మారాయి. వివాహం నుండి చావు వరకు అన్ని ఈవెంట్ మేనేజ్ మెంట్స్ గా మారాయి.

నోట్ల రద్దు..జీఎస్టీ..
నోట్ల రద్దు వల్ల బహుళ జాతి కంపెనీలకు మేలు జరిగింది. జీఎస్టీ, నోట్ల రద్దు రెండూ పెట్టుబడి దారి వినాశనాలకు ప్రత్యక్ష ఉదాహరణ. మానవ సంబంధాల మనుగడకు పెట్టుబడి విధానం సంకటంగా మారింది. మార్క్స్ ఇదే చెప్పారు..పెట్టుబడి ఎక్కడ ఉంటే అక్కడ సంబంధాలు కష్టమే. తన యజమానిని ఉరివేస్తే లాభం వస్తుందని అనుకుంటే పెట్టుబడి అదే పనిచేస్తుంది. విజ్ఞానం ప్రజలకు ఉపయోగడే సాధనం. పెట్టుబడి దారులకు ప్రజలను హింసించే లక్షణం. మానవ ప్రవర్తన వికృతానికి పెట్టుబడే కారణం. ప్రస్తుత పరిస్థితి డబ్బు కోసం రాజకీయాలున్నట్లు తయారైంది. రాజకీయాలను పెట్టుబడే ఉపయోగించుకొంటోంది. కోల్ స్కాం..కేజీ బేసిన్ వ్యవహారం ఉదాహారణలు కోకొల్లలు.

రచన..ముద్రణకు 20 ఏళ్లు..
గ్రంథ రచనకు..ముద్రణకు మార్క్స్ కు 20 ఏళ్లు పట్టింది. ఎక్కడా ఇలా జరగదు. పాత్రికేయుడిగా పనిచేశారు. రెండు కట్టెల దొంగతనం చట్టం ప్రస్తావన అప్పటిదే. 1848 యూరప్ విప్లవం, తిరుగుబాట్లను అధ్యయనం చేశారు. అర్ధశాస్త్రాన్ని కొందరు రచయితలు ఉత్పత్తి..పంపిణీ..చలామాణికే పరిమితం చేశారు. కానీ మార్క్స్ సరుకు..డబ్బు..మారకం..పెట్టుబడి అనే అంశాలను వివరించారు. దండలో దారంలా డబ్బు పాత్రను డబ్బు..మాయ చాఫ్టర్ లో ప్రస్తావించారు. ఉల్లిపొరలా ..లోపటి అంతరాలను ఆయన స్పృశించారు. మూడో భాగంలో రైతులు..వ్యవసాయాన్ని ప్రస్తావించారు'. అని రాఘవులు విశ్లేషించారు. ఇలాంటివి తెలియని ఎన్నో విషయాలను రాఘవులు విశ్లేషించారు.
మరి మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

18:56 - June 19, 2017

కర్నూలు : పనులు దొరక్క వీధుల్లో అడ్డుకుంటూ..వలసలకు వెళుతూ వ్యవసాయ రైతులు..కూలీలు తీవ్ర అవస్థలు పడుతుంటే అభివృద్ధి గురించి ఏం మాట్లాడుతారని ఏపీ సీపీఎం నేత గఫూర్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నించారు. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం 27వ రాష్ట్ర మహాసభలు కర్నూలు జిల్లాలో ప్రారంభమయ్యాయి. ఏస్ టీబీసీ కళాశాల గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన ఆవేశపూరిత ప్రసంగం చేశారు. అభివృద్ధి గురించి ఉపన్యాసం చెబుతారా ? రక్తం ఉడుకుతుందంటూ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బతకడం కోసం అక్క..చెల్లెళ్లను వ్యభిచార గృహాలకు అమ్మివేయబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమలో ఉద్యోగాలు..లేక..వలసలు పోతుంటే అభివృద్ధి గురించి చెబుతారా అంటూ నిలదీశారు. మరి గఫూర్ ప్రసంగం వినాలంటే వీడియో క్లిక్ చేయండి.

18:50 - June 19, 2017

ప్రకాశం : జిల్లాలో పరుచూరు మండలం దేవరపల్లికి వెళుతున్న ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధును పోలీసులు అరెస్టు చేశారు. బస్సులో వెళుతున్న ఆయన్ను..ఇతర నేతలను మార్గమధ్యంలోనే అరెస్టు చేయడం గమనార్హం. 29 ఎకరాల దళితుల భూముల్లో కొన్ని ఏళ్లుగా పంటలు సాగు చేస్తున్నారు. 'నీరు మీరు -చెట్టు'లో భాగంగా ఈ సాగు భూమిలో చెరువు తవ్వేందుకు అధికారులు ప్రయత్నించారు. దీనిపై హైకోర్టులో గ్రామస్తులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు చట్టపరమైన విధానాలు అవలింబిచాలని అధికారులను ఆదేశించారు. కోర్టు ఆదేశాల అనంతరం మధు గ్రామానికి వెళ్లేందుకు నిర్ణయించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు దేవరపల్లిలో 144 సెక్షన్ ఏర్పాటు..పోలిస్ పికెటింగ్ లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నేతలను రాత్రికి రాత్రి అరెస్టు చేయగా మధుతో పాటు గ్రామానికి చెందిన గ్రామానికి వస్తున్న హనుమంతరావు, ఆంజనేయులను అన్నంబొట్టువారిపాలెం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని మార్టూరు పీఎస్ కు తరలించారు. పోలీసుల తీరును మధు తీవ్రంగా తప్పుబట్టారు. దారి మధ్యలోనే చుట్టుపక్కల పది చెక్ పోస్టులు ఏర్పాటు చేసి కార్యకర్తలను..అరెస్టు చేయడం జరిగిందన్నారు. దేవరపల్లిలో మీటింగ్ పెట్టి తీరుతామని..ఎలా అడ్డుకుంటారో చూస్తామని పేర్కొన్నారు. దళితులపై జరుగుతున్న అన్యాయాలను ఎండగడుతాం అని తెలిపారు.

18:47 - June 19, 2017

తూర్పుగోదావరి : ఫీజు కట్టలేదని విద్యార్థులను ఎండలో నిలబెడుతారా ? అని వారి తల్లిదండ్రులు ఓ ప్రైవేటు స్కూల్ యాజమాన్యాన్ని..అధికారులను నిలదీశారు. ఫీజులు చెల్లించలేకపోవడంతో విద్యార్థులను ఎండలో నిలబెట్టిన దారుణ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో అమలాపురంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అమలాపురంలో పరంజ్యోతి పబ్లిక్ స్కూల్ యాజమాన్యం కొంతమంది విద్యార్థులను ఎండలో నిలబెట్టింది. కేవలం ఫీజులు కట్టడం లేదనే కారణంతో యాజమాన్యం ఈ విధంగా వ్యవహరించింది. మూడు నుండి పదేళ్ల వయస్సున్న వారు ఎండలో నిలబడిన వారిలో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు. వెంటనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అమలాపురం తహశీల్దార్..ఎంఈవో విచారణ జరిపించారు. కొంత గడువుతో ఫీజులు చెల్లించాలని తల్లిదండ్రులకు అధికారులు సూచించడంతో తాత్కాలికంగా వివాదం సద్దుమణిగింది. ఇదిలా ఉంటే యాజమాన్య వైఖరిని తల్లిదండ్రులు తప్పుబడుతున్నారు. ఫీజులన్నీ ఆన్ లైన్ లో చెల్లించాలని యాజమాన్యం పేర్కొందని..కానీ తమకు సమాచారం..ఫీజుల ఎలా చెల్లించాలనే దానిపై అవగాహన లేదని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. మరి మంగళవారం ఏం జరుగుతుందో చూడాలి.

18:43 - June 19, 2017

మహబూబ్ నగర్ : కరెంటు పోల్స్ తీసుకెళుతున్న ట్రాక్టర్ బోల్తా పడడంతో ముగ్గురు మృతి చెందిన విషాద ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. చిన్నంబావి మండలం వెల్లంగొండ గ్రామానికి గ్రామస్తులు కరెంటు పోల్స్ వేసుకుని వెళుతున్నారు. మార్గమధ్యంలో ట్రాక్టర్ ఒక్కసారిగా బోల్తా కొట్టడంతో ట్రాక్టర్ లో ఉన్న ముగ్గురు అక్కడికక్కడనే మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితి సమీక్షిస్తున్నారు. అధిక లోడ్ ఉండడమే కారణమని తెలుస్తోంది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రోడ్లు బురదమయంగా మారిపోవడం..ట్రాక్టర్ గుంతలో కూరుకపోవడం మరో కారణమని తెలుస్తోంది.

18:34 - June 19, 2017

కర్నూలు : ప్రస్తుతం ఉన్న పాలకులు వ్యవసాయాన్ని చంపేస్తున్నారని కేరళ సీఎం పినరయి విజయన్ పేర్కొన్నారు. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం 27వ రాష్ట్ర మహాసభలు కర్నూలు జిల్లాలో ప్రారంభమయ్యాయి. ఏస్ టీబీసీ కళాశాల గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పినరయి విజయన్ ప్రసంగించారు. కేంద్ర..రాష్ట్ర ప్రభుత్వాల తీరున ఎండగట్టారు. ప్రస్తుతం జరుగుతున్న పాలనలో రైతులు ఏ విధంగా కష్టపడుతున్నారో తెలియచేశారు. కర్నూలు ఏపీ రాష్ట్రానికి రాజధాని ఉండేదని, పుచ్చలపల్లి మొదటి ప్రతిపక్ష నేత ఉండడం గర్వకారణమని..కర్నూలు నగరం భిన్నమతాలకు..ప్రశాంతతకు పేరు గడిచిందన్నారు. రైతులు వెన్నెముక లాంటి వారని, కానీ వారు బ్రతికే పరిస్థితి ప్రస్తుతం లేదని ఇది ఆలోచించాల్సినవసరం ఉందన్నారు. వ్యవసాయాన్ని వదిలిపెడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతోందని..ఆత్మహత్యలు అధికం కావడం బాధాకరమన్నారు.

1991లో నూతన ఆర్థిక విధానాలు..
1991లో గొప్ప గొప్ప నూతన ఆర్థిక విధానాలు తీసుకొచ్చామని చెప్పారని కానీ 91 తరువాత దేశంలో కోటి మంది రైతు కుటుంబాలు వ్యవసాయానికి దూరమయ్యామరని పేర్కొన్నారు. పొలంపై ఆధారపడిన రైతు కార్మికుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఆలోచించవచ్చన్నారు. 3.20 లక్షల మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారని, 2005 తరువాత రోజుకు 55 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. వ్యవసాయం రంగం ఏ విధమైన దారుణ పరిస్థితుల్లో ఉందో ఈ లెక్కలు చూస్తే సరిపోతుందన్నారు.

వ్యవసాయంపై బీజేపీకి ఆసక్తి లేదు..
యూపీఏ అనంతరం అధికారంలోకి ఎన్డీయే వచ్చిందని ఈ బీజేపీ పెట్టుబడి దారులు..మతతత్వ రాజకీయ కోసం..కార్పొరేట్ల కోసం పని చేస్తుందని, వ్యవసాయంపై ఈ సర్కార్ కు ఆసక్తి లేదన్నారు. వ్యవసాయ బడ్జెట్ ఉపయోగపడుతుందని చెప్పుకున్నారని, కానీ ఈ బడ్జెట్ లో వ్యవసాయానికి కేటాయింపులు తక్కువగా కేటాయించారని అర్థమౌతుందన్నారు. 5.1 శాతంగా ఉన్న వ్యవసాయ కేటాయింపు...3 శాతానికి పడిపోయిందన్నారు. 2011లో 3.11 శాతం ఉంటే 1.1 పడిపోయిన విషయం కనిపిస్తోందన్నారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు..వ్యవసాయ రంగానికి మరణ శాసనం అని పేర్కొనవచ్చన్నారు. వ్యవసాయ రంగంపై పెట్టుబడులు..ఖర్చులను ప్రభుత్వం తగ్గిస్తోందని..దీనితో వ్యవసాయం చేయడం కష్టమైపోతోందన్నారు. ప్రభుత్వం నుండి సహాయం లేకపోవడంతో బయటి నుండి అప్పులు తీసుకొచ్చి వ్యవసాయం చేసే దౌర్బాగ్య పరిస్థితులు నెలకొన్నాయన్నారు.

బహుళ జాతి కంపెనీలకు..
విత్తనాలపై కూడా కేంద్ర ప్రభుత్వానికి ఆసక్తి లేదని, విత్తన తయారీని బహుళ జాతీ కంపెనీలకు అప్పగించిన అనంతరం సమస్యలు అధికమయ్యారని తెలిపారు. వ్యవసాయ రంగం స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యం ఉండేదని, ప్రస్తుతం అది లేదని తెలిపారు. రైతులకు విత్తనాలు..క్రిమి సంహారాల మీద..ఎలాంటి సబ్సిడీ ఇవ్వవద్దని..ఇవ్వమని బహుళజాతి కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంటున్నారని తెలిపారు. కానీ విదేశాల నుండి మాత్రం దిగుమతులు చేయిస్తున్నారని పేర్కొన్నారు. విదేశాల నుండి మార్కెట్ లో సరుకుల ధరలు పెరిగిపోతున్నాయని, సామాన్య ప్రజలు నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి కష్టపడుతున్నారని తెలిపారు. ఆరోగ్యాలు దెబ్బతినడం..పౌష్టికాహారం లోపిస్తోందని, గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి అధికంగా కనిపిస్తుందన్నారు. పంట పండించిన పంట స్వేచ్ఛ కూడా లేకపోతోందని, ధర పెరగడమే కాదు..వ్యవసాయ రంగంపై పట్టణాలకు వలసపోవడం వల్ల విషవలయ పరిస్థితి ఏర్పడుతుందన్నారు.

రైతులను కాల్చి చంపుతారా ?
మధ్యప్రదేశ్ లో రైతులను నిర్ధాక్షిణ్యంగా కాల్చి చంపారని, గిట్టుబాటు ధర..బతకడానికి పరిస్థితులు కల్పించాలని ఆ రైతులు కోరడం జరిగిందన్నారు. బడా మీడియాకు ఇది సమస్యగా భావించలేదని..పాలక వర్గాలు..పెట్టుబడు వర్గాల పై ఆసక్తి తప్ప ఇతర ఆలోచన లేదన్నారు. వ్యవసాయ కార్మికులు..కూలీలు పని చేయకపోతే తిండి ఎవరు పెడుతారు ? ఎలా వస్తుందని ప్రశ్నిస్తూ ఉద్యమాలు చేపట్టడం జరుగుతోందన్నారు. అనంతరం జరుగుతున్న ఉద్యమాలతో రైతుల కోర్కెలు కొద్దిగా పరిశీలిస్తామని పాలకులు చెబుతున్నారని పేర్కొన్నారు.

ఎంతో మంది రక్తతర్పణం..
దోపిడిని ఎదుర్కొవడానికి వ్యవసాయ కార్మిక ఉద్యమం ప్రారంభమైందని..ఎంతో మంది రక్తతర్పణం చేశారని తెలిపారు. అమరవీరులరందరికీ జోహార్లు సమర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తే రైతుల నుండి భూములు లాక్కొంటారని దుష్ర్పచారం జరిగిందని కానీ కేరళ..బెంగాల్..తదితర రాష్ట్రాల్లో వ్యవసాయ రైతులకు రక్షణ కల్పించిందని కమ్యూనిస్టు ప్రభుత్వాలేనని స్పష్టం చేశారు. దున్నే వాడికి భూమి హక్కు కల్పించినట్లు, రైతులకు రక్షణ కల్పించడం జరిగిందన్నారు. ఏపీలో భూ సేకరణ..తదితర రూపాల్లో పేదల నుండి భూములను లాక్కొంటున్నారని తెలిపారు. వామపక్ష ప్రభుత్వాలు ఉన్న చోట రైతులకు రక్షణ ఉందని పేర్కొన్నారు. మరింత విషయాల కోసం వీడియో క్లిక్ చేయండి.

'రామ్ నాథ్ ఆర్ఎస్ఎస్ దళిత శాఖకు చెందిన నేత'..

ఢిల్లీ : ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ ఆర్ఎస్ఎస్ దళిత శాఖకు చెందిన నేత అని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. ఆయనను రాజకీయేతరుడిగా భావించలేమని, రాష్ట్రపతి ఎన్నిక పూర్తిగా రాజకీయ సంఘర్ణణే అని అభివర్ణించారు. రాష్ట్రపతి ఎన్నికకు పోటీ తప్పకపోవచ్చని, 22న విపక్ష పార్టీల సమావేశం జరుగుతుందని, కోవింద్ పై పోటీ అభ్యర్థిని నిలబెట్టాలా ? వద్దా ? అనే దానిపై విపక్ష పార్టీల భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఏచూరి తెలిపారు.

కర్నూలుకు కేరళ సీఎం..

కర్నూలు : ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం 27వ రాష్ట్ర మహాసభలు ప్రారంభమయ్యాయి. ఏస్ టీబీసీ కళాశాల గ్రౌండ్ లో బహిరంగసభ జరుగుతోంది. ఈ సభకు కేరళ సీఎం పినరయి విజయన్ హాజరయ్యారు.

కదం తొక్కిన సెన్సెక్..

ముంబై : సెన్సెక్స్ సోమవారం కదం తొక్కింది. నిప్టీ పరుగులు తీసింది. సెన్సెక్స్ 25..17 పాయింట్ల లాభంతో..31,311.57 వద్ద ..నిప్టీ 69.50 పాయింట్లు లాభపడి 9.657.55 వద్ద ముగిసింది.

కదం తొక్కిన సెన్సెక్..

ముంబై : సెన్సెక్స్ సోమవారం కదం తొక్కింది. నిప్టీ పరుగులు తీసింది. సెన్సెక్స్ 25..17 పాయింట్ల లాభంతో..31,311.57 వద్ద ..నిప్టీ 69.50 పాయింట్లు లాభపడి 9.657.55 వద్ద ముగిసింది.

హైదరాబాద్ కు రానున్న రాష్ట్రపతి..

హైదరాబాద్ : భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్ లో పర్యటించనున్నారు. ఎన్ఆర్ఐ సేవా సంస్థ మాదాపూర్ లోని శిల్పకళా వేదికలో నిర్వహించే ప్రపంచ డివైన్ కాంగ్రెస్ ను ఆయన ప్రారంభించనున్నారు.

అలపిరి వద్ద మద్యం బాటిళ్లు..

తిరుపతి : అలిపిరి వద్ద విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సుమోలో తరలిస్తున్న 35 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

16:59 - June 19, 2017

'రాష్ట్రపతి అభ్యర్థి..ఇంకా నిర్ణయం తీసుకోలేదు'..

ఢిల్లీ : రాష్ట్రపతి అభ్యర్థిపై కాంగ్రెస్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కాంగ్రెస్ నేత ఆజాద్ వెల్లడించారు. ఎన్డీఏ తరపున రామ్ నాథ్ కోవింద్ అభ్యర్థిత్వంపై ఎలాంటి వ్యాఖ్య చేయదలుచుకోలేదన్నారు. 22న సాయంత్రం 4.30కు అన్ని విపక్ష పార్టీల సమావేశ ఉందని, సోనియా నేతృత్వంలో విపక్ష పార్టీల సమావేశం జరుగుతుందన్నారు. అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటామని, ఇప్పటి వరకు విపక్షాలన్నీ ఏకతాటిపై ఉన్నాయన్నారు.

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి..ఆర్ఎస్ఎస్ వ్యక్తి- సురవరం..

ఢిల్లీ : ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ఆర్ఎస్ఎస్ వ్యక్తిని ప్రకటించారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి వెల్లడించారు. సంప్రదింపులు జరిపిన సమయంలో ఆర్ఎస్ఎస్ నుండి వద్దని తమ అభిప్రాయం చెప్పడం జరిగిందన్నారు. విపక్షాల తరపున అభ్యర్థిని నిలబెట్టాల్సినవసరం ఉందని, మిగిలినపక్షాలతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామన్నారు.

కోవింద్ కు జగన్ మద్దతు..

హైదరాబాద్ : వైసీపీ అధ్యక్షుడు జగన్ కు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్ నాథ్ కోవింద్ ఎంపిక విషయాన్ని జగన్ కు తెలియచేశారు. కోవింద్ అభ్యర్థిత్వానికి వైసీపీ మద్దతు ప్రకటిస్తుందని జగన్ తెలియచేశారు.

భూ స్కాం..సీబీఐతో విచారణ చేయించాలి - వైసీపీ..

కడప : విశాఖ భూ కుంభకోణంపై సిట్ తో కాకుండా సీబీఐ విచారణ జరిపించాలని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. సిట్ బృందం ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసే అవకాశం ఉందని, కుంభకోణంలో ఎవరి పాత్ర ఉన్నా..సీబీఐ విచారణలోనే బయటపడుతాయన్నారు.

16:44 - June 19, 2017

కర్నూలు : ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం 27వ రాష్ట్ర మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సీపీఎం నేత గఫూర్..ఇతర వ్యవసాయ కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు. ర్యాలీలో భారీ సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. మహాసభలో పాల్గొనేందుకు కేరళ సీఎం పినరయి విజయన్ కర్నూలు జిల్లాకు వచ్చారు. రాష్ట్రంలో పేదలు..వ్యవసాయ కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని దుయ్యబట్టారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

16:41 - June 19, 2017

మెదక్ : తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు..వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు రహదారులపై భారీ ఎత్తున వరద ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఇలాగే మెదక్ జిల్లాలోని సత్యగామ వాగు పొంగి పొర్లింది. అటు వైపు..ఇటు వైపు వాహనాలు..పాదచారులు నిలిచిపోయాయి. కానీ ఇద్దరు యువకులు బైక్ పై వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ వరద ఉధృతికి వీరు కొట్టుకపోయారు. ఇదంతా చూస్తున్న స్థానికులు తాడు సహాయంతో యువకులను రక్షించారు. ఇదంతా చూడాలంటే వీడియో క్లిక్ చేయండి.

16:35 - June 19, 2017
16:34 - June 19, 2017

హైదరాబాద్ : సమ్మె చేస్తున్న సింగరేణి కార్మికులపై నిర్బందం ఆపాలని సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు డిమాండ్ చేశారు. ఎస్వీకేలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అక్రమ అరెస్టులు చేస్తూ సమ్మె విచ్చిన్నానికి సర్కార్ పాల్పడుతోందని తెలిపారు. తక్షణమే కార్మిక సంఘాల నేతలతో ప్రభుత్వం చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేస్తుంటే కొత్త నమూనా..కొత్త మోడల్ నిరసనను తెలియచేయకుండా అణిచివేసే విధంగా ప్రభుత్వం చేస్తోందని, ప్రజాస్వామ్యానికి కొత్త అర్థం చెబుతున్నారని విమర్శించారు.

16:29 - June 19, 2017
16:28 - June 19, 2017

హైదరాబాద్ : త్యాగాల చరిత్ర గాంధీ కుటుంబానికి ఉంటే స్వార్థ చరిత్ర సీఎం కేసీఆర్ కుటుంబానిదని టి.కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల విమర్శలు సంధించారు. గాంధీ భవన్ లో రాహుల్ జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొని తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ప్రధాని అయ్యే అవకాశం ఉన్నా పదవులను తృణపాయంగా వదిలిపెట్టిన చరిత్ర సోనియా..రాహుల్ గాంధీలకు ఉందన్నారు. మరి పొన్నాల ఇంకా ఏమి మాట్లాడారో వీడియో క్లిక్ చేయండి.

పొంగుతున్న సత్యగామ వాగు..

మెదక్ : జిల్లాలో భారీ వర్షాలకు వాగులు పొంగి పొర్లుతున్నాయి. మెదక్ జిల్లా సత్యగామ వాగు పొంగి పొర్లుతోంది. ఈ సమయంలో ఆ దారి గుండా వెళుతున్న ఇద్దరు యువకులు బైక్ తో సహా కొట్టుకపోయారు. వెంటనే వీరిని తాడు సాయంతో స్థానికులు రక్షించారు.

 

16:15 - June 19, 2017

హైదరాబాద్ : విశాఖపట్టణం భూ కుంభకోణంలో సీఎం చంద్రబాబు నాయుడు..ఆయన తనయుడు నారా లోకేష్..మంత్రుల హస్తం ఉందని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా ఆరోపించారు. సోమవారం హైదరాబాద్ లోని ఇందిరా భవన్ లో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా రఘువీరా మాట్లాడుతూ..ఈ స్కాంపై సిబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. భూ వివాదంపై నిజాలు తేల్చాలని విశాఖ కలెక్టర్ ను కోరుతామని తెలిపారు. కుట్ర ప్రకారం చిన్న అధికారులపై నెపం మోపి కేసును క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.

రామ్ నాథ్ అత్యుత్తమ రాష్ట్రపతి అవుతారన్న ప్రధాని..

ఢిల్లీ : రామ్ నాథ్ అత్యుత్తమ రాష్ట్రపతి అవుతారని భారత ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. రామ్ నాథ్ కోవింద్ రైతు బిడ్డ అని..పేద..బలహీన వర్గాల కోసం జీవితం ధారపోశారని తెలిపారు. న్యాయపరమైన అంశాల్లో రామ్ నాథ్ కు మంచి పట్టుందని, రాజ్యాంగం పట్ల రామ్ నాథ్ కు ఉన్న అనుభవం..దేశానికి ఉపయోగపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

నాగరాజు మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి..

కరీంనగర్ : నాగంపేటలో ఔషధ ప్రయోగంతో మృతి చెందిన నాగరాజు మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయ్యింది. నాలుగు వారాల్లో పోస్టుమార్టం నివేదిక వస్తుందని, మృతదేహం కుళ్లిపోవడంతో ఔషధ ప్రయోగం జరిగిందని ప్రాథమికంగా చెప్పలేకపోయినట్లు ఫోరెన్సిక్ వైద్యుడు కృపాల్ సింగ్ వెల్లడించారు. మృతదేహ అవయావాలను సేకరించినట్లు తెలిపారు.

రాంనాథ్ కు బాబు మద్దతు..

విజయవాడ : ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రాంనాథ్ కోవింద్ కు టిడిపి మద్దతు తెలియచేస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

15:59 - June 19, 2017
15:57 - June 19, 2017
15:55 - June 19, 2017

హైదరాబాద్ : గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనే ఉద్ధేశ్యంతో రేపు రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల పంపిణీ చేయనున్నట్లు మంత్రి తలసాని పేర్కొన్నారు. ఈ పథకం పట్ల అవగాహన లేని పార్టీలు కొన్ని విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. ప్రతిదీ రాజకీయం చేయకుండా సామాజిక వర్గాలను అభివృద్ధి చేసేందుక సహకరించాలని తలసాని పేర్కొన్నారు. మంగళవారం సీఎం సొంత నియోజకవర్గంలో గొర్రెల పంపణీ పథకం కార్యక్రమం మొదలు కానుంది. ఈసందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తో టెన్ టివి ముచ్చటించింది. పకడ్బందీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

 

15:48 - June 19, 2017
15:47 - June 19, 2017

హైదరాబాద్ : ఎన్డీయే పక్ష రాష్ట్రపతి అభ్యర్థి గా రాంనాథ్ కోవింద్ పేరు ఖరారు చేశారు. కాసేపటి క్రితం ఈ విషయాన్ని బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వెల్లడించారు. ఎన్డీయే పక్ష ముఖ్యమంత్రులు..తటస్థంగా ఉన్న ముఖ్యమంత్రులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేసి రాష్ట్రపతి అభ్యర్థి పేరును తెలియ చేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ లతో మోడీ మాట్లాడారు.

పలు అంశాలపై చర్చ - వెంకయ్య..
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడారు. పట్టణ అభివృద్ధి పథకాలు చర్చించడం కోసం మంత్రి కేటీఆర్ తనను కలవడం జరిగిందన్నారు. ఆకర్షణీయ నగరాల జాబితాలో కరీంనగర్ పెండింగ్ లో ఉందని, 23వ తేదీన పరిశీలన పూర్తయి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగిందన్నారు. మిగతా కార్యక్రమాల అమలు విషయంలో పట్టణాభివృద్ధికి సంబంధించి త్వరలో తెలంగాణ రాష్ట్రానికి వెళ్లి కేంద్ర..రాష్ట్ర అధికారులు..సీఎం..తాను మాట్లాడడం జరుగుతుందన్నారు. పెండింగ్ లో ఉన్న అంశాలను పూర్తి చేయడం జరుగుతుందని హామీనివ్వడం జరిగిందన్నారు. కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. దీనితో పాటు రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్ నాథ్ కోవింద్ ను ఖరారు చేయడం జరిగిందని, ఈ విషయాన్ని తెలంగాణ..ఆంధ్రప్రదేశ్ సీఎంలతో ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ లో మాట్లాడడం జరిగిందని తెలిపారు. రామ్ నాథ్ కోవింద్ కు మద్దతు తెలియచేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడం జరిగిందని, మద్దతిస్తామని ఇదివరకే సీఎం బాబు ప్రకటించడం జరిగిందని తెలిపారు. మిగత రాష్ట్ర ముఖ్యమంత్రులు..ఇతరులతో మోడీ మాట్లాడడం జరుగుతోందన్నారు. తాను సీపీఐ నేతలతో మాట్లాడడం జరిగిందని, సీపీఎం నాయకులతో మాట్లాడానికి ప్రయత్నించడం జరుగుతోందన్నారు. రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఏకగ్రీవానికి రావాలని కోరడం జరుగుతోందన్నారు.

మద్దతు - కేటీఆర్..
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రాంనాథ్ కోవింద్ కు మద్దతు తెలియచేస్తున్నట్లు సీఎం కేసీఆర్ పేర్కొనడం జరిగిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ..కేసీఆర్ కు ఫోన్ చేయడం జరిగిందన్నారు. వెంకయ్య నాయుడిని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కరీంనగర్ పట్టణాన్ని స్మార్ట్ సిటీలో ఎంపిక చేయాలని, రియల్ ఎస్టేట్ రెగ్యులేటర్..త్వరలో తెలంగాణ రాష్ట్రానికి రావాలని ఆహ్వానించడం జరిగిందన్నారు. 73 పట్టణాలు ఓడీఎఫ్ గా జులై మాసంలో డిక్లేర్డ్ చేయబోతున్నట్లు, ఇందుకు వారిని ఆహ్వానించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సత్సంబంధాలు కొనసాగిస్తూ ముందుకు వెళుతుందన్నారు. రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో సహకరించాలని ప్రధాన మంత్రి మోడీ ఫోన్ చేశారని, దళిత జాతి నుండి విద్యావంతుడిని ఎంపిక చేసిన సమయంలో వారికి మద్దతివ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ నిర్ణయం వారికి తెలియచేయడం జరిగిందన్నారు.

15:38 - June 19, 2017

ఢిల్లీ : ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ఏకగ్రీవం చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేపట్టింది. కాసపేటి క్రితం రాష్ట్రపతి అభ్యర్థి పేరును బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మీడియా సమావేశంలో వెల్లడించారు. బీహార్ గవర్నర్ రామ్ నాథ్ కోవింద్ ను ఖరారు చేసినట్లు వెల్లడించారు. ఎన్డీయే మిత్రపక్షాలతో సుదీర్ఘ చర్చల అనంతరం రామ్ నాథ్ పేరును ఖరారు చేయడం జరిగిందని షా పేర్కొన్నారు. బీజేపీలో అత్యంత ఉన్నత స్థాయికి ఎదిగిన దళిత వ్యక్తి అని, రామ్ నాథ్ పేరును ఖరారు చేసిన విషయం విపక్షాలకు ఫోన్ లో తెలియచేయడం జరిగిందన్నారు.

మోడీ ఫోన్ లు..
ఎన్డీయే పక్ష ముఖ్యమంత్రులు..తటస్థంగా ఉన్న ముఖ్యమంత్రులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ లతో మోడీ మాట్లాడారు. మరోవైపు సోనియా, మన్మోహన్ తో ప్రధాని మోడీ మాట్లాడారు. రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్ నాథ్ కోవింద్ ను ఎంపిక చేసినట్లు ఎన్డీయే పక్ష..ఇతర పక్షాల నేతలకు ప్రధాని తెలిపారు. మమతా బెనర్జీతో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ..అద్వానీ..మురళీ మనోహర్ జోషి..వామపక్ష నేతలతో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడులు మాట్లాడారు. ఆయా పార్టీలు చర్చించి తమకు మద్దతిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

1945లో జననం..
రాంనాథ్ 1945 అక్టోబర్ 1న ఉత్తర్ ప్రదేశ్ లో జన్మించారు. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన దళిత నేత. యూపీ నుండి 12 ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. బీజేపీ దళిత మోర్చా అధ్యక్షుడిగా..బీజేపీ అధికార ప్రతినిధిగా పనిచేశారు. హైకోర్టు..సుప్రీంకోర్టులో రాంనాథ్ న్యాయవాదిగా పనిచేశారు. రాష్ట్రపతి ఎన్నిక కోసం రాంనాథ్ కోవింద్ 23 నామినేషన్ వేయనున్నారు.

15:30 - June 19, 2017

మగువు అందానికి మరింత వన్నె కావాలంటే ఆభరణాలదే ప్రధాన ప్రాత. అతివలు అలంకరించుకొనే ఆభరణాలు..తామే ధరించే దుస్తులకు మ్యాచింగ్ ఉంటే వారికి మరింత నిండుదనం చేకూరుతుంది. అలా నచ్చిన ఆకృతి..నచ్చే రంగులతో ఆభరణాలు తయారు చేసుకోవచ్చు. అదే టెర్రకోటి జ్యువెల్లరీ..మరి ఈ జ్యువెల్లరీని ఎలా తయారు చేసుకోవచ్చో,..తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి...

ఏం చేశారో సమాధానం చెప్పాలి - బృందా కారత్..

విశాఖపట్టణం : ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ మూడో జాతీయ మహాసభల సందర్భంగా అరకు లోయలో భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో బృందాకారత్ పాల్గొన్నారు. చంద్రబాబు దత్తత తీసుకున్న పెదలబుడు పంచాయతీకి ఏం చేశారో సమాధానం చెప్పాలని బృందా నిలదీశారు. గిరిజన ప్రాంతాల్లో విలువైన ఖనిజాలను కొల్లగొట్టడానికి గిరిజనులపై దాడులు చేయిస్తున్నారని, జీవో 98ను ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు. ఖనిజాలపై వచ్చే ఆదాయాన్ని గిరిజనుల అభివృద్ధికే కేటాయించాలని సూచించారు.

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థికి టీఆర్ఎస్ మద్దతు..

హైదరాబాద్ : బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థికి టీఆర్ఎస్ మద్దతు తెలియచేసింది. కాసేపటి క్రితం ఎన్డీయే పక్ష అభ్యర్థిగా బీహార్ గవర్నర్ రామ్ నాథ్ కోవింద్ ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే.

ఫోన్లు చేస్తున్న మోడీ..ఇతరులు..

ఢిల్లీ : ఎన్డీయే పక్ష ముఖ్యమంత్రులు..తటస్థంగా ఉన్న ముఖ్యమంత్రులకు ప్రధాన మంతిల్ర నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. చంద్రబాబు, కేసీఆర్ లతో మాట్లాడారు. సోనియా, మన్మోహన్ తో ప్రధాని మోడీ మాట్లాడారు. రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్ నాథ్ కోవింద్ ను ఎంపిక చేసినట్లు ఎన్డీయే పక్ష..ఇతర పక్షాల నేతలకు ప్రధాని తెలిపారు. మమతా బెనర్జీతో అరుణ్ జైట్లీ..అద్వానీ..మురళీ మనోహర్ జోషి..వామపక్ష నేతలతో వెంకయ్య నాయుడులు మాట్లాడారు.

14:40 - June 19, 2017

ఆడపిల్లలను స్కూలుకు పంపించడమే నేరంగా భావించే కాలం నుండి మహిళలను నింగిలోకి పంపించే రోజులలో అడుగు పెట్టాం. తమకు అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ తమదైన ముద్ర వేసుకుంటున్నారు..నేటి తరం..అమ్మాయిలు..అమ్మాయిల చదువు..ఆవనికే వెలుగు..అనే నానుడిని నిజం చేస్తూ విద్యారంగంలో తనదైన ముద్ర వేసుకున్నారో ఓ అతివ. మానవి 'స్పూర్తి'లో ఆమె గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

14:35 - June 19, 2017

విశాఖపట్టణం : ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్ మూడో జాతీయ మహాసభల సందర్భంగా విశాఖ జిల్లా అరకులో గిరిజన గర్జన మహాసభ జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సోమవారం అరకులో భారీ ర్యాలీ నిర్వహించారు. ఏపీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ ఉపాధ్యక్షురాలు బృందాకారత్ హాజరు కానున్నారు.

14:29 - June 19, 2017

ఢిల్లీ : ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్ నాథ్ కోవింద్ ను బీజేపీ ఖరారు చేసింది. కాసేపటి క్రితం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ముగిసింది. అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమీత్ షా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి అభ్యర్థిగా బీహార్ గవర్నర్ రామ్ నాథ్ కోవింద్ ను ఖరారు చేసినట్లు ప్రకటించారు. రాష్ట్రపతి అభ్యర్థి ఖరారు విషయంలో టెన్ టివి ఇన్ పుట్ ఎడిటర్ కృష్ణ సాయిరాం విశ్లేషణ అందించారు. రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో బీజేపీ, ఎన్డీయే పక్షాలు ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించాయని, పేరుకు సంబంధించిన విషయంలో అద్వానీ, సుమిత్రా మహజన్ తదితర పేర్లు రాజకీయ వర్గాల్లో..మీడియాలో ప్రచారం జరిగిందన్నారు. రాంనాథ్ కోవింద్ కు మూడు అంశాలు కలిసి వచ్చినట్లు తెలుస్తోందని తెలిపారు. ఇతను రాజ్యసభలో రెండు సార్లు ప్రాతినిధ్యం వహించడం..1994-2006 ఉత్తర్ ప్రదేశ్ నుండి రాజ్యసభకు ఎంపిక..బీజేపీ అధికార ప్రతినిధిగా పనిచేసిన అనుభవం..న్యాయపరమైన పరిజ్ఞానం..రాజ్యాంగంపై అనుభవం ఉండడం..కలిసి వచ్చాయన్నారు. ఇంకా మరింత విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి.

14:20 - June 19, 2017

ఢిల్లీ : రాష్ట్రపతి అభ్యర్థిని బీజేపీ ఎట్టకేలకు ఖరారు చేసింది. ఎవరూ ఊహించని విధంగా అభ్యర్థిని ఖరారు చేసింది. అభ్యర్థి విషయంలో బీజేపీ ఓ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ ప్రతిపక్షాల నేతలు..మిత్రపక్షాల నేతలతో సమావేశమయ్యారు. అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయానికి రావాలని కోరారు. ఈ నేపథ్యంలో సోమవారం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశమైంది. ఈ సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో సుదీర్ఘంగా చర్చించారు. పలువురి పేర్లను బోర్డు ప్రతిపాదించిందని తెలుస్తోంది.
అనంతరం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమీత్ షా మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించారు. బీహార్ గవర్నర్ రాంనాథ్ కోవింద్ ను ఖరారు చేశామని అమీత్ షా వెల్లడించారు. ఈయన వయస్సు 71 ఏళ్లు. అభ్యర్థి ఖరారు చేసే విషయంలో ఎన్డీయే మిత్రపక్షాలు..ప్రతిపక్షాలకు సమాచారం అందివ్వడం జరిగిందన్నారు. ఇప్పటికే మిత్రపక్షాలు..ప్రతిపక్షాలతో తాము సమావేశాలు నిర్వహించడం జరిగిందని, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ..మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్..ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో కూడా సమావేశం జరిగిందని గుర్తు చేశారు. పేదలు..అణగారిన వర్గాల కోసం రాంనాథ్ కృషి చేయడం జరిగిందన్నారు. రాజకీయాల్లోకి రాకముందు సుప్రీంకోర్టు లాయర్ గా పనిచేశారని, నాలుగేళ్ల పాటు బీజేపీ దళిత మోర్చా అధ్యక్షుడిగా అనుభవం ఉందన్నారు. 12 ఏళ్లుగా రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన అనుభవం రామ్ నాథ్ కు ఉందని తెలిపారు. 2015 నుండి బీహార్ గవర్నర్ గా కొనసాగుతున్నారు. మరి ప్రతిపక్షాలు అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయానిక వస్తాయా ? లేదా ? అనేది చూడాలి.

భూక్యాతండాలో రాహుల్ పుట్టిన వేడుకలు..

మహబూబాబాద్ : కొరవి మండలం భూక్యాతండాలో రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. వీహెచ్ ఇచ్చిన బ్రాస్ లెట్ వేలంలో వచ్చిన డబ్బును రైతు కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అందచేశారు.

నాగరాజు మృతదేహానికి పోస్టుమార్టం..

కరీంనగర్ : నాగంపేటలో ఔషధ ప్రయోగంతో నాగరాజు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు కేఎంసీ వైద్య నిపుణులు ఘటనా స్థలికి చేరుకున్నారు.

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ఇతనే..

ఢిల్లీ : ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా బీహార్ గవర్నర్ రాంనాథ్ కోవింద్ ను ఖరారు చేశామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమీత్ షా వెల్లడించారు.

పైనంపల్లి వద్ద హైవే నిర్వాసితుల ఆందోళన

ఖమ్మం : ఖమ్మం సూర్యాపేట సరిహద్దులోని పైనంపల్లి హైవే నిర్వాసితులు ఆందోళనకు దిగారు. వారు కోదాడ, ఖమ్మం రహదారిని దిగ్భంధించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. హైవే రోడ్డ రూట్ మార్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గ్రామం నుంచి కాకుండా బైపాస్ నుంచి రోడ్డు వేయాలని వారు పట్టుపడుతున్నారు.

ముగిసిన బీజేపీ పార్లమెంటరీ భేటీ

ఢిల్లీ : బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న బీజేపీ పార్లమెంటరీ భేటీ ముగిసింది. సుమారు గంట పాటు జరిగిన సమావేశం రాష్ట్రపతి అభ్యర్థి గురించి చర్చించినట్టు తెలుస్తోంది. రాష్ట్రపతి రేసులో ప్రధానంగా జార్ఖండ్ గవర్నర్ ద్రౌపతి ముర్మ పేరు ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం.

13:49 - June 19, 2017

ఆరోగ్యానికి ఆలివ్ ఆయిల్ మంచిదే కానీ కొన్నిసార్లు చర్మ సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఈ ఆయిల్ చర్మానికి వాడడం వల్ల పలు దుష్రభావాలు వచ్చే అవకాశం ఉందంట. అలర్జీలున్న వారు ఆలివ్ ఆయిల్ కు దూరంగా ఉండడం మంచిది. అలర్జీ కలిగి ఉండి చర్మానికి రాయడం వల్ల పలు అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఇక అప్పుడే జన్మించిన శిశువుకు ఆలివ్ ఆయిల్ రాయకూడదంట. చిన్న పిల్లలకు ఆలివ్‌ ఆయిల్‌తో మసాజ్‌ చేయకూడదని, దీనివల్ల పలు సమస్యలు ఏర్పడుతాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. జిడ్డు చర్మం ఉన్నవారు ఆలివ్‌ ఆయిల్‌ ను వాడకూడదు. ఒకవేళ ఈ ఆయిల్‌ వాడినట్లయితే, సీబం ఉత్పత్తి అధికమవుతుంది.
పొడి చర్మం కలిగిన వారు ఆలివ్ ఆయిల్ ఉపయోగించకపోవడం మంచిది. మరి ఎలా ఉపయోగించాలి ? అంటే చర్మ వైద్య నిపుణుడిని కలిస్తే చర్మ రకాన్ని తెలుసుకుని తగిన ఉత్పత్తులు..ఏ ఆయిల్ లను ఉపయోగించాలో పలు జాగ్రత్తలు చెప్పే అవకాశం ఉంది.

13:43 - June 19, 2017

మీరు వంట చేస్తున్నారా ? ఒక్క నిమిషం ఆగండి..వంటలో వాడుతున్న పదార్థాలు బాగానే ఉంటున్నాయా ? అవి ఆరోగ్యానికి మేలు చేస్తున్నాయా ? లేక హానీ చేస్తున్నాయా ? అని ఆలోచించారా ? వాటిలోని పోషక విలువలు గుర్తించారా ? ఆ..ఇవన్నీ ఎక్కడ ఆలోచిస్తాం..వంట చేశామా...తిన్నామా అనే ఆలోచనలో ఉంటున్నారు..కానీ ఒక్కసారి వంటలో వాడుతున్న పదార్థాలు..వాటిలోని పోషక విలువలు ఆలోచించాలని పలువురు వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ప్రతి రోజు తినే ఆహారంలో ఆకుకూరలు..తాజా పళ్లు..రసాలు..పెరుగు..గుడ్డు..పాలు వంటివి ఉండేలా చూసుకోండి.
పెరుగును తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెంచుతుంది. ఇందులో మంచి చేసే బ్యాక్టీరియా ఉంటుంది.
వంట చేసే సమయంలో ఉపయోగించే నూనె ఆలివ్ ఆయిల్..ఆవనూనెలను వాడి చూడండి..
టీ..కాఫీలు..ఐస్ క్రీమ్..స్వీట్స్ వంటి అధికంగా తీసుకోకండి. మితిమీరిన తీపి పదార్థాలు తినకండి.
తీపి తినడం వల్ల ఊబకాయం..చక్కెర..కీళ్ల నొప్పులు వంటి అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుంది.
ఎక్కువ ప్రొటీన్స్‌ గల పదార్థాలు తీసుకుంటే దీర్ఘకాలంలో సైడ్‌ఎఫెక్ట్స్‌కి దారితీయొచ్చు.
వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియా, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. గాయాలకు, చర్మ వ్యాధులకు, ఫ్లూ, అల్సర్, రక్తపోటు, పెద్దపేగు క్యాన్సర్, జలుబు, మూత్రపిండాల వ్యాధులకు, బ్లాడర్ సమస్యలకు వెల్లుల్లి చక్కటి ఔషధంగా పనిచేస్తుంది.
గోధుమల్లో పిండి పదార్థాలతో పాటు ప్రోటీన్లు, పీచు, ఐరన్, విటమిన్లు, బీ కాంప్లెక్స్, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్ వంటి పోషకాలు ఉన్నాయి. ఇందులో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి.

13:41 - June 19, 2017

ఆదిలాబాద్ : జిల్లాలో రెండురోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉట్నూరు ఏరియాలో భారీ వర్షపాతం నమోదవుతోంది. జిల్లాలోని ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కొన్ని చోట్ల రోడ్లు కొట్టుకుపోయే పరిస్థితి కనిపిస్తోంది. పలు చోట్ల విద్యుత్ వైర్లు తెగిపడుతున్నాయి. దీంతో చాలా చోట్ల విద్యుత్ సౌకర్యానికి అంతరాయం ఏర్పడింది. వర్షాకాలం నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు కానీ, వైద్య సిబ్బంది కానీ ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు తలెత్తుతున్నాయి. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.. 

13:40 - June 19, 2017

విజయవాడ : భవిష్యత్‌లో పేద ప్రజలకు నాణత్యతో కూడిన విలువైన ఇళ్లు ఇవ్వడమే తన అభిమతమన్నారు సీఎం చంద్రబాబు. విజయవాడలో ప్రధాని ఆవాస్‌ యోజన ఎన్టీఆర్‌ నగర్‌ పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఒకే రోజు ఏపీలో లక్షా 20 వేల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం పేరుతో 4 వేల కోట్లను బొక్కేశారని ఆరోపించారు. లక్షా 58 వేల ఇళ్ల నిర్మించాలంటే 9480 కోట్లు, మౌలిక సదుపాయాలకు సుమారు 1100 కోట్ల ఖర్చవుతుందన్నారు. 

13:36 - June 19, 2017

ఖమ్మం : ఖమ్మం సూర్యాపేట సరిహద్దులోని పైనంపల్లి హైవే నిర్వాసితులు ఆందోళనకు దిగారు. వారు కోదాడ, ఖమ్మం రహదారిని దిగ్భంధించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. హైవే రోడ్డ రూట్ మార్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గ్రామం నుంచి కాకుండా బైపాస్ నుంచి రోడ్డు వేయాలని వారు పట్టుపడుతున్నారు. భూమిని సేకరించాలనుకుంటే 2013 భూ సేకరణ చట్ట ప్రకారం సేకరించాలని కోరుతున్నారు. రైతులు ఆందోళనతో కోదాడ ప్రధాన రహదారిపూ 2 గంటలుగా రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణీకులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.. 

13:34 - June 19, 2017

హైదరాబాద్ : గచ్చిబౌలి సుదర్శన్ నగర్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పద్మజది హత్యే అని ఆమె అన్నయ్య ఆరోపిస్తున్నారు. పద్మజను భర్త గిరిష్ ఎప్పుడు కొట్టేవాడని, పంచాయతీలు కూడా జరిగాయని, చెల్లి ప్రతి ఆదివారం తమ ఇంటికి వస్తుందని, నిన్న కూడా ఆమె వస్తుందని ఫోన్ చేశారని తెలపారు. తమ చెల్లి ఒంటిపై దెబ్బలు ఉన్నాయని, నుదిటి పై కట్టు ఉందని పద్మజ అన్నయ్య తెలిపారు. ఇంది ముమ్మటికి హత్యే అని ఆయన అన్నారు. పద్మజ మృతదేహనికి పొస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. 

13:33 - June 19, 2017

ఢిల్లీ : బీజేపీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ పార్లమెంటరీ భేటీ కొనసాగుతోంది. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక పై చర్చించనున్నారు. రాష్ట్రపతి రేసులో ఎల్ కే అద్వానీ, సుష్మాస్వరాజ్, ద్రౌపతి ముర్ము, సుమిత్ర మహజన్, మురళి మనోహర్ జోషి ఉన్నారు. ఇందులో ప్రధానంగా దళితురాలు ద్రౌపతి ముర్ము పేరు వినబడుతోంది. ముర్ముకు ప్రతిపక్షాలు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. నిన్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా శివసేన అధ్యక్షుడు బాల్ థక్రే తో భేటీ అయ్యారు. పార్లమెంటరీ భేటీలో మోడీ, అమిత్ షా, వెంకయ్య, రాజ్ నాథ్, అరుణ్ జైట్లీ సహా 12 మంది పార్లమెంటరీ సభ్యులు పాల్గొన్నారు.  

13:28 - June 19, 2017

కాజల్ అగర్వాల్...తెలుగు..తమిళ..హిందీ భాషల్లో ప్రధాన స్టార్స్ తో నటించి ఎందరో అభిమానులను సొంతం చేసుకుంది. తన నటన..అభినయం..ఆకట్టుకొనే అందంతో మెప్పిస్తోంది. జులై 19వ తేదీ ఆమె పుట్టిన రోజు.. తనకు స్పెషల్ డే అంటోంది ఈ ముద్దుగుమ్మ. తెలుగు చలన చిత్ర సీమకు ఈమెను పరిచయం చేసింది 'తేజ'.. ‘లక్ష్మీ కళ్యాణం' చిత్రం ద్వారా ఈమె వెండితెరకు పరిచయమైంది. మళ్లీ ఈ అమ్ముడు 'తేజ' దర్శకత్వంలోనే సినిమా చేస్తోంది. దాదాపు పదేళ్ల తరువాత 'తేజ' దర్శకత్వంలో నటిస్తుండడం చాలా సంతోషంగా ఉందని..అంతేగాకుండా తనకు ఈ చిత్రం 50వది కావడం విశేషమని 'కాజల్' పేర్కొంటోంది. ‘రానా' హీరోగా 'నేనే రాజు నేనే మంత్రి' 'తేజ' దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న విషయం తెలిసిందే. ఇందులో 'రానా' సరసన 'కాజల్' నటిస్తోంది. ఈ చిత్రంలో తాను రాధ అనే పాత్ర పోషిస్తున్నట్లు, తన పాత్ర చాలా వైవిధ్యంగా ఉండబోతోందని ‘కాజల్’ పేర్కొన్నారు. ‘రానా’ తో కలిసి పనిచేయడం సరదాగా ఉంటుందని, తన పుట్టినరోజుకు ఇంతకు మించిన బహుమతి మరొకటి ఉండదు అని 'కాజల్' పేర్కొన్నారు.

13:19 - June 19, 2017

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ 'అల్లు అర్జున్' 64వ ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకున్నారు. ‘సరైనోడు' చిత్రానికి గాను ఈ అవార్డు ఆయనను వరించింది. ఈ సందర్భంగా అవార్డును ప్రముఖ దివంగత దర్శకుడు 'దాసరి నారాయణ రావు'కు అంకితం ఇస్తున్నట్లు ప్రకటించాడు. 64వ ఫిల్మ్ ఫేర్ అవార్డు ప్రధానోత్సవం ఇంటర్నేషనల్ కన్వన్షన్ సెంటర్ లో జరిగింది. పలువురు తారలు విచ్చేయడంతో సందడిగా మారిపోయింది. ఈ సందర్భంగా 'అల్లు అర్జున్' ట్విటర్‌ ద్వారా ఫిల్మ్‌ఫేర్‌కు ధన్యవాదాలు చెప్పారు. ఈ అవార్డును దర్శకరత్న దాసరి నారాయణ రావుకు అంకితం చేస్తున్నట్లు ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో దిగిన ఫొటోను పోస్ట్‌ చేశారు. ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌ చేతుల మీదుగా అవార్డును 'అల్లు అర్జున్' అందుకున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ‘అల్లు అర్జున్’ హరీశ్ శంకర్ కాంబినేషన్ లో ‘దువ్వాడ జగన్నాథమ్’ చిత్రం రూపుదిద్దుకొంటోంది. ఇందులో 'బన్నీ' సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తోంది. జూన్‌ 23న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

13:18 - June 19, 2017

64వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రధానోత్సవం హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. ఇంటర్నేషనల్ కన్వన్షన్ సెంటర్ కు నటీనటులు రావడంతో సెంటర్ సందడిగా మారిపోయింది. ఇక అవార్డుల విషయానికి వస్తే...
టాలీవుడ్‌ నుంచి ఉత్తమ నటుడుగా ఎన్టీఆర్‌ (నాన్నకు ప్రేమతో), ఉత్తమ నటిగా సమంత (అ..ఆ)లు అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు.
ఉత్తమ చిత్రం- పెళ్లి చూపులు, ఉత్తమ దర్శకుడు, వంశీ పైడిపల్లి (ఊపిరి), ఉత్తమ సహాయ నటుడు - జగపతిబాబు (నాన్నకు ప్రేమతో), ఉత్తమ సహాయ నటి- నందితా శ్వేతా (ఎక్కడికి పోతావు చిన్నవాడా), ఉత్తమ నేపథ్య గాయకుడు - కార్తిక్‌ (అ..ఆ-వెల్లిపోకే శ్యామల..), ఉత్తమ నేపథ్య గాయని - చిత్ర (నేను శైలజ-ఈ ప్రేమకీ..), ఉత్తమ గేయ రచయిత - రామజోగయ్య శాస్త్రి (జనతా గ్యారేజ్‌), ఉత్తమ మ్యూజిక్‌ ఆల్బమ్‌ : దేవిశ్రీ ప్రసాద్‌ (నాన్నకు ప్రేమతో) , ఫిల్మ్‌ఫేర్‌ క్రిటిక్‌ అవార్డు (నటుడు) - అల్లు అర్జున్‌ (సరైనోడు), ఫిల్మ్‌ఫేర్‌ క్రిటిక్‌ అవార్డు (నటి) - రీతూ వర్మ (పెళ్లి చూపులు), బెస్ట్‌ కొరియోగ్రాఫర్‌(ఉపిరి), జీవిత కాల సాఫల్య పురస్కారం-విజయనిర్మల అవార్డులను తీసుకున్నారు.

13:09 - June 19, 2017

టాలీవుడ్ లో తమ తమ చిత్రాలను వెరైటీగా ప్రమోట్ చేస్తూ..ప్రచారం నిర్వహిస్తూ చిత్రాలపై మరింత ఉత్కంఠ రేకేత్తిస్తున్నారు. మొదటగా మోషన్ పిక్చర్ అంటూ..తరువాత మూవీకి సంబంధించిన పలు లుక్స్ విడుదల చేస్తుండడంతో ఆయా చిత్రాలపై క్యూరియాసిటీ పెరుగుతోంది. తాజాగా టాలీవుడ్ ప్రిన్స్ 'మహేష్ బాబు' నటిస్తున్న 'స్పైడర్' చిత్రాన్ని కూడా అదే బాటలో పయనిస్తోంది. మొదట లుక్స్ విడుదల చేసిన చిత్ర యూనిట్ ఎలాంటి మాటలు లేకుండానే టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఒకటో తేదీన విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో టీజర్ ను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 'మహేష్‌' పుట్టిన రోజు ఆగస్టు తొమ్మిదో తేదీన రెండో టీజర్‌ను విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. అందులో 'మహేష్‌' పలికే డైలాగ్స్ ఉంటున్నట్లు సమాచారం. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో 'మహేష్ బాబు'.. 'రా'అధికారిగా నటిస్తున్నాడు. ఇతనికి జోడిగా 'రకూల్ ప్రీత్ సింగ్' నటిస్తోంది.

కాసేపట్లో బీజేపీ పార్లమెంటరీ భేటీ

ఢిల్లీ : కాసేపట్లో బీజేపీ పార్లమెంటరీ భేటీ కానుంది. ఈ సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక పై చర్చించనున్నారు. రాష్ట్రపతి రేసులో అద్వానీ, సుష్మాస్వరాజ్, సమిత్రా మహజన్, మురళీ మనోహర్ జోషి ఉన్నట్టు తెలుస్తోంది.

12:41 - June 19, 2017

ఆదిలాబాద్ : జిల్లాలోని పోలీసు ట్రైనింగ్ క్యాంపులో పుడ్ పాయిజన్ జరిగింది. 30 మంది ట్రైనీ పోలీసు కానిస్టేబుళ్లకు నిన్న వండిన ఆహారం పెట్టడంతో వారు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఫుడ్ పాయిజన్ తోనే కానిస్టేబుళ్లు అస్వస్థతకు గురయినట్లు డాక్టర్లు తెలిపారు. వారిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కానిస్టేబుళ్లు బాగానే ఉన్నారని డాక్టర్లు తెలిపారు. గతంలోను ఇదే ట్రైనింగ్ క్యాంపులో పుడ్ పాయిజన్ జరినట్లు సమాచారం. కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వంటలు చేస్తున్నారని, నాణ్యమైన ఆహారం అందడంలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. 

12:32 - June 19, 2017

ఢిల్లీ : కాసేపట్లో బీజేపీ పార్లమెంటరీ భేటీ కానుంది. ఈ సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక పై చర్చించనున్నారు. రాష్ట్రపతి రేసులో అద్వానీ, సుష్మాస్వరాజ్, సమిత్రా మహజన్, మురళీ మనోహర్ జోషి ఉన్నట్టు తెలుస్తోంది. ఎటువంటి అభ్యర్థిని ఎంపిక చేయాలి, త్రిసభ్య కమిటీ ప్రతిపక్షాల భేటీలో ఎటువంటి అభిప్రాయలు వచ్చాయో చర్చించనున్నారు. మరో వై ఎన్డీఏ మిత్ర పక్షాలు ఎటువంటి అభ్యర్థిని ఎంపిక చేసిన మద్దతు ఇస్తామనిత తెలిపాయి. ప్రధాని అమెరికా పర్యటన ఈ నెల 25 నుంచి ఉండడంతో అలోపే అభ్యర్థిని ప్రకటించి, నామినేషన్ వేయించాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి మోడీ, అమిత్ షా, అరుణ్ జైట్లీ, రాజ్ నాథ్ సింగ్, వెంకయ్య, నితిన్ గడ్కరీ, సుష్మాస్వరాజ్, జేపీ నడ్డా హాజరు కానున్నారు. రాష్ట్రల నుంచి బీజేపీ ఎమ్మల్యేలు, ఎంపీలు ఢిల్లీ చేరకున్నారు. 

12:14 - June 19, 2017

విశాఖ :  గాజువాక సబ్‌రిజిస్ట్రార్‌ వెంకయ్య ఇంటిపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేశారు. తిరుపతిలో 6, రాజమండ్రిలో 3 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. వెంకయ్య అక్రమాస్తులు కలిగివున్నట్లు అధికారులు గుర్తించారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

12:10 - June 19, 2017
12:09 - June 19, 2017

విశాఖ : భూకుంభ కోణంపై ప్రభుత్వం చెప్పేదొకటి చేసేదొకటి అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులు అన్నారు. కేసును నీరుగార్చేలా, పక్కదోవ పట్టించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. భూకుంభకోణం దర్యాప్తును మధురవాడ, కొమ్మాది గ్రామాలకే ఎందుకు పరిమితం చేశారని ప్రశ్నించారు. మిగతా వాళ్లను రక్షించేందుకు ఈ ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

11:57 - June 19, 2017

కరీంనగర్ : కాసేపట్లో కరీంనగర్ జిల్లా నాగంపేట నాగరాజు మృతదేహానికి రీ పొస్టుమార్టం చేయనున్నారు. నాగరాజు ఈ నెల 2 లోటస్ ఫార్మా కంపెనీ క్లినికల్ ట్రయల్ వికటించి మరణించాడు. కానీ అధికారులు మాత్రం వడదెబ్బ గురై నాగరాజు మరణించినట్లు రికార్డులు సృష్టించారు. నాగరాజు కుటుంబం ఇళ్లు సర్దెటప్పుడు ఆయన లోటస్ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పద పత్రాలు లభించడంతో క్లినికల్ ట్రయల్స్ వెలుగోకి వచ్చాయి. దీంతో నాగరాజు కుటుంబ సభ్యులు బెంగళూరు వెళ్లి కంపెనీ ప్రతినిధులను నిలదీసారు. కంపెనీ ప్రతినిధులు వారిని నిర్భంధించారు. వారు తప్పించుకుని కరీంనగర్ వచ్చారు. వారు జమ్మికుంట పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.. 

వివాహిత అనమానాస్పద మృతి

హైదరాబాద్ : సుదర్శన్ నగర్ లో పద్మజ అనే వివాహిత మృతి చెందింది. పద్మజ ఉరివేసుకుని చనిపోయింది. గిరిష్ అనే వ్యక్తితో పద్మజకు ఏడాది క్రితం వివాహం జరిగింది. ఆమె బ్యాంక్ ఆఫ్ అమెరికాలో మేనేజర్ గా పనిచేస్తుంది. స్థానికులు భార్యభర్తల మధ్య మనస్పర్థలున్నట్లు చెబుతున్నారు. అదనపు కట్నం కోసం భర్తే చంపాడంటూ పద్మజ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.ప్రతి రోజు భర్యను కొట్టేవాడని వారు చెబుతున్నారు.

10:17 - June 19, 2017

హైదరాబాద్ : సుదర్శన్ నగర్ లో పద్మజ అనే వివాహిత మృతి చెందింది. పద్మజ ఉరివేసుకుని చనిపోయినట్లు చెబుతున్నారు. గిరిష్ అనే వ్యక్తితో పద్మజకు ఏడాది క్రితం వివాహం జరిగింది. ఆమె బ్యాంక్ ఆఫ్ అమెరికాలో మేనేజర్ గా పనిచేస్తుంది. స్థానికులు భార్యభర్తల మధ్య మనస్పర్థలున్నట్లు చెబుతున్నారు. అదనపు కట్నం కోసం భర్తే చంపాడంటూ పద్మజ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.ప్రతి రోజు భర్యను కొట్టేవాడని వారు చెబుతున్నారు. పద్మజ చనిపోయిన విషయాన్ని కూడా తమకు తెలపలేదని వారు తెలిపారు. దీంతో గిరిష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.. 

ప్రకాశం జిల్లా దేవరపల్లిలో ఉద్రిక్తత

ప్రకాశం : జిల్లా పర్చూరు మండలం దేవరపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. దళితుల భూములను నీరు, మట్టి పేరుతో ప్రభుత్వం లాక్కుంటుదంటూ దళితులు నిరసనకు దిగారు. దలితుల నిససనకు సీపీఎం మద్దతు తెలిపింది. 

గాజువాక సబ్ రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ దాడులు

విశాఖ : గాజువాక సబ్ రిజిస్ట్రార్ వెంకయ్య ఇంటిపై ఏసీబీ దాడులు చేస్తోంది. అధికారులు ఏకకాలంలో విశాఖలో 6 చోట్ల , రాజమండ్రిలో 4చోట్ల, తరుపతిలో 4 చోట్ల సోదాలు చేస్తున్నారు. వెంకయ్య స్నేహితులు, బంధువుల ఇళ్లలో కూడా ఏసీబీ సోదాలు నిర్వహిస్తుంది. ఆయన ఇంట్లో విలువై పత్రాలు స్వాధీనం చేసుకునట్టు తెలుస్తోంది.

09:23 - June 19, 2017

ప్రకాశం : జిల్లా ఒ్గెలులో విషాదం జరిగింది. భాగ్యనగర్ లోని ఓ అపార్ట్ మెంట్ లో తెల్లవారుజామున 3.30 గంటలకు సమయంలో బిటెక్ విద్యార్థిని త్రిపుర సెల్ ఫోన్ లో మాట్లాడుతూ భవనం పై నుంచి జారిపడింది. తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలిస్తుండగా విద్యార్థిని మృతి చెందింది. ఆమె ఐదో ఫ్లోర్ లోని పిట్ట గోడ పై ఫోన్ మాట్లాడుతూ ఉండగా ఫోన్ జారిపోవడంతో దాన్ని పట్టుకునే క్రమంలో ఒకటో ఫ్లోరో పడింది. ఈ ప్రమాదం పై పోలీసులు విచారణ చేస్తున్నారు. త్రిపుర బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. త్రిపుర లక్ష్యాన్ని జయించిన చావును జయించలేదు. ఆమె మరణించడంతో స్థానికంగా విషాదం నెలకొంది.

09:15 - June 19, 2017

జీఎస్టీ పై నరేద్రమోడీకి రాష్ట్రాలన్ని కూడా సహకరించాయి కేంద్రం కూడా రాష్ట్రాల అభిప్రాయం తీసుకోవాలని, పెద్ద దేశం, రాష్ట్రాల్లో తక్కువ ఆదాయం వస్తున్నాయిని దీని పై మరింత కసరత్తు చేయాలని, రాష్ట్రాలకు వచ్చే నష్టాన్ని కేంద్రం భరించాలని, మిషన్ భగీరథ పై కేంద్రం ఆలోచించాలని, ముస్లిం రిజర్వేషన్ల పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నటకాలు అడుతున్నాయని టెన్ టివి న్యూస్ మార్నింగ్ పాల్గొన్న విశ్లేషకులు తెలకపల్లి రవి, టీడీసీ నేత దుర్గాప్రసాద్, వైసీపీ నేత కొండ రాఘవరెడ్డి, టీఆర్ఎస్ నేత రాకేష్ అన్నారు. మతపరమైన రిజర్వేషన్లు బీజేపీ వ్యతిరేకిస్తుందని, జీఎస్టీతో పేదప్రజలకు న్యాయం జరుగుతోందని బీజేపీ నేత ప్రకాష్ రెడ్డి అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

09:14 - June 19, 2017

రాష్ట్రంలో ప్రైవేట్ బస్సులు అగడలతో ఆర్టీసీ తీవ్ర నష్టాన్ని కల్గిస్తున్నాయని, ప్రైవేటు ట్రావేల్స్ బస్సులు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులతో రాష్ట్రంలో బస్సులు నడుపుతున్నాయని, ఆర్టీసీ ఎన్ఎంయూ నాయకులు అశోక్ అన్నారు. ప్రయివేట్‌ ట్రావెల్స్‌ అక్రమాలకు కళ్లెం వేయాలంటూ ఎన్నోఏళ్లుగా కార్మిక సంఘాలు నెత్తీనోరు బాదుకుంటున్నా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు స్పందించలేదు. ఇప్పుడు అరుణాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం తమ రాష్ట్రంలో నమోదైన ఇతర రాష్ట్రాల బస్సుల రిజిస్ట్రేషన్లు రద్దు చేయడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హడావిడి మొదలైంది. ఇప్పుడు కొన్ని బస్సులు సీజ్‌ చేస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో బస్సులు నడుపుతున్నవారు అరుణాచల్‌ ప్రదేశ్‌ ను ఉపయోగించుకుని మన రాష్ట్రాల ఖజనాకు భారీగా గండికొట్టారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

09:10 - June 19, 2017

చెన్నై : తమిళనాడు రైతులను ఆదుకుంటానని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హామీ ఇచ్చారు. ఆయన చెన్నైలో నేషనల్‌ సౌత్‌ఇండియన్‌ రివర్స్‌ ఇంటర్‌ లింకింగ్‌ ఫార్మర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పి.అయ్యకన్నుతో పాటు పదహారు మంది రైతులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల గురించి రజనీకాంత్‌ అడిగి తెలుసుకున్నారు. తమిళ రైతులను ఆదుకుంటానని... ఈ విషయాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. నదుల అనుసంధానం కోసం.. కోటి రూపాయలు ఇవ్వనున్నట్టు తెలిపారు. రజనీ తీరు చూస్తుంటే.. ఆయన రాజకీయ రంగ ప్రవేశానికి ఇదొక సూచన అని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

09:10 - June 19, 2017

చిత్తూరు : ఆహ్లాదకర వాతావరణానికి మారు పేరు తిరుపతి నగరం. శ్రీవారి దర్శనం కోసం వచ్చే వేలాది మంది భక్తులతో నగరం నిత్యం సందడిగా ఉంటుంది. ఆధ్యాత్మిక వాతావరణంతో ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఈ నగరం ఇపుడు చెత్త సమస్యతో సతమతం అవుతోంది.

డంపింగ్‌ యార్డులుగా తిరుపతి వీధులు..
చెత్త తరలింపులో సమస్య రావడంతో తిరుపతి వీధులు డంపింగ్‌ యార్డులుగా మారిపోయాయి. నగరంలో ప్రతిరోజు సుమారు 190 మెట్రిక్ టన్నుల చెత్త పోగుపడుతుంది. తిరుపతి కార్పొరేషన్ కు చెందిన సుమారు 50 ట్రాక్టర్లు ఈ చెత్తను తరలించే పనిలో ఉంటాయి. ఈ చెత్తను తిరుపతికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న రామాపురం గ్రామ శివారులో డంప్‌చేసేవారు. అయితే రామాపురం పరసర గ్రామాలప్రజలు చెత్తడంపింగ్‌ను వ్యతిరేకించడంతో సమస్యవచ్చిపడింది. చుట్టుపక్కల ఉన్న పది పంచాయితీల ప్రజలు తమ నివాసాల సమీపంలో తిరుపతి చెత్తను పారవేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

స్థానికుల ఆగ్రహం..
తిరుపతినుంచి చెత్తను మోసుకొచ్చే ట్రాక్టర్లను స్థానికులు అడ్డుకుంటున్నారు. డంపింగ్‌ యార్డువల్ల తమ గ్రామాల్లో వ్యాధులు విజృంభిస్తున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్య మరింత ముదరకుండా ఎంపి శివప్రసాద్ సైతం సమస్య పరిష్కరించే ప్రయత్నం చేశారు. ఈ నెల 22న సిఎం తిరుపతి పర్యటనకు ఉన్నందున పంచాయతీని ముఖ్యమంత్రికే వివరించి సమస్యను పరిష్కరిస్తానని ఎంపీ శివప్రసాద్‌ హామీ ఇచ్చారు. ఎంపీ శివప్రసాద్‌ హామీతో బాధిత గ్రామాల ప్రజలు తాత్కాలికంగా శాంతించారు. అయితే ముఖ్యమంత్రి పర్యటన తర్వాత సమస్యను పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. బాధిత గ్రామాల ప్రజలకు వైసీపీ నేతలు అండగా నిలిచారు. డంపింగ్‌యార్డును మార్చాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఏదిఏమైనా.. తిరుపతి నగరానికి డంపింగ్‌ యార్డు సమస్య అంత తొందరగా తేలేలా కనిపించడంలేదు. డంపింగ్‌ కోసం కనీసం 50ఎకరాల స్థలం అవసరం. తిరుపతికి సమీపంలో అంతటి విశాలస్థలం ఇప్పటికిపుడు అందుబాటులోకి తేవాలంటే సమస్యే అంటున్నారు అధికారులు. ముఖ్యమంత్రి జోక్యంతో అయినా ఈ చెత్తసమస్యకు పరిష్కారం లభించాలని తిరుపతి వాసులు కోరుకుంటున్నారు.

09:01 - June 19, 2017

హైదరాబాద్ : ముస్లిం సోదరులకు సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌లో ఇఫ్తార్‌ విందు ఇచ్చారు. ఎల్బీస్టేడియంలో జరిగిన ఈ విందుకు పలువురు ముస్లిం మత పెద్దలు, మంత్రులు, హాజరయ్యారు. విందు సందర్భంగా పేద ముస్లిం కుటుంబాలకు మూడు జతల దుస్తులతో కూడిన గిఫ్ట్‌ప్యాకెట్లను కేసీఆర్‌ అందించారు. అటు మైనార్టీసంక్షేమశాఖ, తెలంగాణ వక్ఫ్‌బోర్డుల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 800 మసీదుల వద్ద ఇఫ్తార్‌ విందులు ఇస్తున్నారు. ముస్లింల సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు ముఖ్యమత్రి కేసీఆర్. ముస్లీంల సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్న సీఎం కేసీఆర్‌కు రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ మహ్మద్‌సలీం, మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ సయ్యద్‌ అక్బరుహుస్సేన్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈ విందుకు సీఎం కేసీఆర్‌, డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, స్పీకర్‌ ధుసూదనాచారి, కేంద్రమంత్రి దత్తాత్రేయ, డీఎస్‌, కేకేతోపాటు పలువురు ముస్లిం మతపెద్దలు హాజరయ్యారు. 

09:00 - June 19, 2017

హైదరాబాద్ : ఏపీ , తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు ముంచెత్తుతున్నాయి. పలుచోట్ల భారీవర్షాలతో వరదనీరు ఉరకలెత్తుతోంది. హైదరాబాద్‌ నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. పలుప్రాంతాల్లో భారీ వర్షం కుమ్మరిస్తోంది. సిటీలోని ఓయూ క్యాంపస్‌, తార్నాక, హబ్సిగూడ, నాచారం, లాలాపేట్‌, మల్లాపూర్‌, కాచిగూడ, ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అటు కాప్రా, రామాంతపూర్‌, నేరేడ్‌మెట్‌, మల్కాజిగిరి, హయత్‌నగర్‌, రాజేంద్రనగర్‌ ప్రాంతాల్లోనూ భారీ వర్షానికి నాలాలు పొంగిపొర్లాయి. పలుచోట్ల రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

ఏపీలో భారీవర్షాలు
ఏపీలో భారీవర్షాలకు జనం నానా అవస్థలు పడుతున్నారు. ఉత్తరాంధ్రజిల్లాల్లో ఆదివారం పిడుగులతో భారీవర్షం పడింది. పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తునిర్వహణశాఖ హెచ్చరికలతో ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. విశాఖ జిల్లాలోని పద్మనాభం, భీమునిపట్నం, దేవరాపల్లి, యలమంచిలి, నక్కపల్లి, కోటవురట్ల, ఎస్‌.రాయవరం, అచ్యుతాపురం, రాంబిల్లి ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. అటు విజయనగరం జిల్లాలోని డెంకాడ, జామి, భోగాపురంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

తెలంగాణవ్యాప్తంగా జోరుగా వానలు
తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాలోనూ భారీ వర్షం కురుస్తోంది. రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలో భారీ వర్షం పడుతోంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం గంగారంలో పిడుగు పడి ఇద్దరు మృతిచెందారు. కామారెడ్డి జిల్లా మద్నూరు మండలం అవల్‌గావ్‌లో పిడుగుపాటుకు హనుమంత్‌ అనే రైతు మృతి చెందారు. మహబూబ్‌నగర్‌ జడ్చర్లలో భారీ వర్షానికి గోడకూలి ఓ మహిళ దుర్మరణం పాలైంది. భారీ వర్షాలతోపాటు పిడుగులు కూడా విరుచుకుపడుతుండటంతో.. అప్రమత్తంగా ఉండాలని విపత్తునిర్వహణశాఖ హెచ్చరిస్తోంది. 

08:52 - June 19, 2017

స్పోర్ట్స్ : అంచనాలు లేకుండా అండర్‌డాగ్‌ వచ్చిన పాకిస్థాన్‌.. హాట్‌ ఫేవరేట్‌కు షాకిచ్చింది. అద్భుత ప్రదర్శనలతో చిరకాల ప్రత్యర్థి భారత్‌పై చిరస్మరణీయ విజయం సాధించింది. తొలిసారి పాకిస్థాన్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీ కైవసం చేసుకుంది. టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న విరాట్‌ కోహ్లీకి మొదటి నుంచే ఎదురుదెబ్బ తగిలింది. బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ బ్యాట్స్‌మెన్లు మెరుగు ఇన్నింగ్స్‌తో పరుగుల వరద కురిపించారు. ఓపెనర్లు ఫకర్‌ జమన్‌, అజార్‌ అలీ చెలరేగి ఆడారు. ఫకర్‌ జమన్‌ 106 బంతుల్లో 114 పరుగులు చేసి.. కెరీర్‌లో తొలి సెంచరీ నమోదు చేశాడు. ఇక మరో ఓపెనర్‌ అజార్‌ అలీ 71 బంతుల్లో 59 పరుగులు చేశారు. ఓపెనర్లూ ఇద్దరు తెగువతో ఆడటంతో.. తొలి వికెట్‌కు 128 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. వికెట్లు పడగొట్టేందుకు కోహ్లీ ఎన్ని ప్రయోగాలు చేసినా పెద్దగా ఫలితం లేకుండాపోయింది. భారత బౌలర్లు వికెట్ల పడగట్టడంలో విఫలమయ్యారు. చివర్లో భువనేశ్వర్‌కుమార్‌ పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో పాక్‌ 338 పరుగుల స్కోర్‌ వద్ద నిలిచిపోయింది. లేకుంటే 350 పరుగుల మైలు రాయి దాటి ఉండేది. భారత బౌలర్లలో భువనేశ్వర్‌కుమార్‌, హార్థిక్‌పాండ్యా, కేదార్‌ జాదవ్‌లకు మాత్రమే ఒక్కొక్క వికెట్‌ లభించింది. స్పిన్నర్లు అశ్విన్‌, జడేజాలు వికెట్లు పడగొట్టేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వీరిద్దరూ 18 ఓవర్లు వేసి 137 పరుగులిచ్చారు. ఇది భారత్‌

రోహిత్‌శర్మ డకౌట్‌
ఇక లక్ష్యఛేదనకు దిగిన భారత్‌ బ్యాట్స్‌మెన్లకు పాక్‌ బౌలర్లు చుక్కలు చూపించారు. తొలి ఓవర్‌లోనే రోహిత్‌శర్మను అమిర్‌ డకౌట్‌ చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన విరాట్‌కొహ్లీకి ఐదు పరుగల వద్ద లైఫ్‌ వచ్చింది. కానీ సద్వినియోగం చేసుకోని విరాట్‌.. వెంటనే ఔటయ్యాడు. దీంతో భారత్‌కు కష్టాలు మొదలయ్యాయి. ఆ తర్వాత జోరుమీదున్న శిఖర్‌ధావన్‌ కూడా ఔటు కావడంతో మ్యాచ్‌ పాకిస్థాన్‌ పరమైంది. ఆ తర్వాత యువీ, ధోనీ, కేధార్‌లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. మిడిలార్డర్‌ ఘోర వైఫల్యంతో భారత్‌ 72 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత హర్థిక్‌పాండ్యా ఒంటరిపోరాటం చేసినా పెద్దగా ఫలితం లేకుండాపోయింది. దీంతో భారత్‌ 30.3 ఓవర్లలోనే చేతులెత్తేసి... 158 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది.

టోర్నీలో బాగానే ఆడామన్నారు కోహ్లీ
ఫైనల్‌లో తమ ఆట నిరాశపరిచిందన్నారు విరాట్‌కొహ్లీ. పాకిస్థాన్‌ అద్భుతంగా ఆడి విజేతగా నిలిచిందన్నారు. అయితే... ఫైనల్‌లో తాము నిరాశపరిచినా... టోర్నీలో బాగానే విరాట్‌ ఆడామన్నారు . ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఫైనల్‌లో భారత్‌పై పాక్‌ సునాయాసంగా గెలిచి తొలిసారి ఛాంపియన్స్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది. సెంచరీతో చెలరేగి పాక్‌ విజయంలో కీలకపాత్ర పోషించిన ఫకర్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ దక్కింది. మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ పాక్‌కు చెందిన హసన్‌ అలీకి దక్కింది. ఇక ఈ సిరీస్‌లో ఉత్తమ బ్యాట్స్‌మెన్స్‌గా శిఖర్‌ధావన్‌, ఉత్తమ బౌలర్‌గా హసన్‌అలీ ఎంపికయ్యారు. 

ప్రకాశం జిల్లాలో విషాదం

ప్రకాశం : జిల్లా ఒ్గెలులో విషాదం జరిగింది. భాగ్యనగర్ లో తెల్లవారుజామున 3.30 గంటలకు సమయంలో ఓ బిటెక్ విద్యార్థిని సెల్ ఫోన్ లో మాట్లాడుతూ భవనం పై నుంచి జారిపడింది. తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలిస్తుండగా విద్యార్థిని మృతి చెందింది. పూర్తి వివరాలు తెలియ్సాలి ఉంది. 

కర్నూలులో వ్యవసాయ కార్మిక 27వ రాష్ట్ర మహాసభలు

కర్నూలు : నేటి నుంచి ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం 27వ రాష్ట్ర మహాసభలు ప్రారంభం కానున్నాయి. ఎస్ టీబీసీ కళాశాల గ్రౌండ్ లో బహిరంగ సభ జరగనుంది. బహిరంగ సభలో కేరళ సీఎం పినరయ్ విజయన్ పాల్గొంటారు.

 

ఏపీలో నేటి నుంచి రంజాన్ తోఫా

గుంటూరు : ఏపీలో నేటి నుంచి రంజాన్ తోఫా ప్రారంభం కానుంది. విజయవాడ తుమ్మలపల్లి కళాఖక్షత్రంలో సీఎం చంద్రబాబు రంజాన్ తోఫా ప్రారంభిస్తారు.  

లండన్ లో పాదచారులపై దూసుకెళ్లిన వ్యాన్

ఇంగ్లాండ్ : లండన్ లోని ఫిన్స్ బరీ పార్క్ లోని సెవెన్ సిస్టర్ రోడ్డులో మసీదు సమీపంలో పాదచారులపైకి వ్యాన్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. 

హైదరాబాద్ పలు ప్రాంతాల్లో వర్షం

హైదరాబాద్ : నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. తిరుమలగిరిలో 40, బండ్లగూడలో 37మి.మీ వర్షపాతం నమోదైయింది. 

Don't Miss