Activities calendar

20 June 2017

కోచ్ పదవికి రాజీనామా చేసిన కుంబ్లే

హైదరాబాద్: టీంమిండియా ప్రధాన కోచ్‌ అనిల్‌ కుంబ్లే సంచలన నిర్ణయం తీసుకున్నాడు. బీసీసీఐ తీరుపై తీవ్ర మనస్తాపంతో కోచ్‌ పదవికి రాజీనామా చేశాడు. మంగళవారం టీమిండియాతో పాటు కుంబ్లే కూడా వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్సాల్సి ఉంది. అయితే... విండీస్ టూర్‌కు వెళ్లకుండా... ఎవరూ ఊహించని రీతిలో తన రాజీనామాను బీసీసీఐకి పంపించాడు. గత కొన్నాళ్లుగా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో కుంబ్లేకు తీవ్ర విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అనూహ్యంగా కుంబ్లే రాజీనామా చేశాడు.

21:29 - June 20, 2017

హైదరాబాద్: టీంమిండియా ప్రధాన కోచ్‌ అనిల్‌ కుంబ్లే సంచలన నిర్ణయం తీసుకున్నాడు. బీసీసీఐ తీరుపై తీవ్ర మనస్తాపంతో కోచ్‌ పదవికి రాజీనామా చేశాడు. మంగళవారం టీమిండియాతో పాటు కుంబ్లే కూడా వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్సాల్సి ఉంది. అయితే... విండీస్ టూర్‌కు వెళ్లకుండా... ఎవరూ ఊహించని రీతిలో తన రాజీనామాను బీసీసీఐకి పంపించాడు. గత కొన్నాళ్లుగా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో కుంబ్లేకు తీవ్ర విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అనూహ్యంగా కుంబ్లే రాజీనామా చేశాడు.

21:24 - June 20, 2017

హైదరాబాద్: కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న కోల్‌కత్తా హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్‌ కర్ణన్‌ ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. తమిళనాడులోని కోయంబత్తూరులో ఆయనను అరెస్ట్‌ చేసినట్లు కర్ణన్‌ తరఫు లాయర్లు వెల్లడించారు. కర్ణన్‌ను పోలీసులు కోల్‌కతా తరలిస్తున్నారు. అరెస్టును ఎదుర్కొంటూ అజ్ఞాతంలో ఉండి పదవీ విమరణ చేసిన తొలి న్యాయమూర్తిగా దేశ న్యాయచరిత్రలో కర్ణన్‌ నిలిచిపోయారు. కోర్టు ధిక్కారం నేరంపై సుప్రీంకోర్టు విధించిన జైలు శిక్ష నుంచి తప్పించుకు తిరుగుతున్నారు. మే9న సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఖేహర్‌ నేతృత్వంలోని ధర్మాసనం కర్ణన్‌ను అరెస్టు చేయాలని ఆదేశించినప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. జైలు శిక్షపై స్టే కోసం సుప్రీం ధర్మాసనానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా కర్ణన్‌కు ఊరట లభించలేదు.

21:22 - June 20, 2017

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉందన్నారు ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు. రాబడికి ఖర్చుకు మధ్య భారీ వ్యత్యాసం ఉంటుందని..దాంతో ఇప్పటికే 4వేల కోట్ల రూపాయల అప్పు చేశామన్నారు. కొన్ని శాఖలు అదనపు నిధులు అడగడం ఇబ్బందిగా ఉందన్నారు. 2016-17 నాల్గొవ క్వార్టర్‌లో దాదాపు 10వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు మంత్రి యనమల.

21:20 - June 20, 2017

అమరావతి: ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ఐవైఆర్‌ కృష్ణారావు, ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌ మధ్య మాటల తూటాలు పేలాయి. టీడీపీ నేతలు తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని కృష్ణారావు మండిపడ్డారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ సమస్యలు చెప్పడానికి ఆరు నెలులుగా ప్రయత్నిస్తున్నా సీఎం అపాయింట్‌మెంట్‌ దొరకలేదన్నారు. తనవల్ల పొలిటికల్‌ మైలేజ్‌ రావడం లేదని టీడీపీ నేతలు విమర్శలు చేయడం సరికాదన్నారు. ప్రభుత్వానికి భజన చేయడం తనవల్ల కాదన్నారు. తాను ఎవరిని కలిసినా రాద్ధాంతం చేయడమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వంపై పొలిటికల్‌ సెటైర్లు వేసిన వారిపైనా క్రిమినల్‌ కేసులు పెట్టడం తనకు బాధ కలిగించిందన్నారు. కృష్ణారావు ఆరోపణలపై ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌ మండిపడ్డారు. సీఎం అపాయింట్‌ దొరకడంలేదన్న ఐవైఆర్‌ వ్యాఖ్యల్లో వాస్తవం లేదన్నారు. ప్రభుత్వానికి భజన చేయాల్సిన అవసరం ఎవరికీ లేదన్నారు. కృష్ణారావు ఎవరిని కలిసినా తమకు అభ్యంతరం లేదని.. ఆయనపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని అన్నారు.

కోయంబత్తూరులో జస్టిస్ కర్ణన్ అరెస్ట్

హైదరాబాద్: కొయంబత్తూరులో జస్టిస్ కర్ణన్ అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ ను కర్ణన్ తరపు లాయర్ ధృవీకరించారు. కొంత కాలంగా అజ్ఞాతంలో ఉన్న కర్ణన్ కోర్టు ధిక్కరణ కింద కర్ణన్ కు 6 నెలల జైలు శిక్షను సుప్రీం విధించింది.

20:05 - June 20, 2017

హైదరాబాద్: తెలంగాణ లో గొర్రులు పంచుడు షురువూ...నిలబెట్టాలే మన సారు పరువు, మా పైసలు మాకివ్వమంటున్న రైతులు...గ్రామీణ వికాస్ బ్యాంకోడు పడుతుండు కథలు, దళితుల భూమి రక్షించొద్దంటున్న చంద్రాలు...సీపీఎం నేతలను అరెస్టు చేపిచ్చిన సీఎం, ఉద్యమకారుల మీద కేసులన్నీ కొట్టేసినం...ఇన్నేళ్లకు కబురు చెప్పిన నాయిని,బడిగావాలని ధర్నా చేస్తున్న పిల్లలు...గంటా శ్రీనివాసరావు ఏమాయే బడిగంట, మేడిపండు చూడుము మేలిమై ఉండును...కారంపొడి ప్యాకెట్లో కల్చర్ ఉండును. ఇలాంటి అనేక అంశాలతో మల్లన్న 'మల్లన్న ముచ్చట్లు' కార్యక్రమంలో మన ముందుకు వచ్చాడు పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

19:53 - June 20, 2017

హైదరాబాద్: డాడీ...పేరు సునిత్‌కుమార్...మల్కాజిగిరిలోని అన్నపూర్ణసొసైటీలో సేవ్‌ చైల్డ్‌ పేరుతో అనాథ ఆశ్రమాన్ని నెలకొల్పి నిర్వాహిస్తున్నాడు...ఎన్నో ఏళ్లుగా ఇక్కడే సేవ చేసుకుంటూ అనాథబాలికలను చేరదీస్తున్నాడు... ఇక్కడ చేరే ప్రతీ ఒక్కరితో తనకు తాను డాడీగా చెప్పుకుని పిలిపించుకునేవాడు...ఇలా దాదాపు 50 మందికి పైగా బాలికలున్నారు ఈ ఆశ్రమంలో...

తండ్రిలా కాపాడాల్సినవాడిలో పైశాచికం..

ఇదే ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న ఓ మైనర్ తనపై రెండు నెలలుగా నిర్వాహకుడు సునీత్‌కుమార్ లైంగిక దాడికి పాల్పడుతున్నాడంటూ మల్కాజిగిరి పోలీసులను ఆశ్రయించింది... ముందుగా పోలీసులు అనుమానించకపోయినా ఆ తర్వాత వెంటనే స్పందించి బాలికతో పాటు ఏసీపీ సందీప్, షీటీమ్స్‌ ఇన్‌చార్జి స్నేహితారెడ్డిలు సేవ్‌ చైల్డ్‌ ఆశ్రమానికి వెళ్లారు...

బాలికలలో మాటామంతి..

ఆశ్రమంలో ఏం జరుగుతుందో స్వయంగా తెలుసుకున్న పోలీసు అధికారులు వెంటనే నిర్వాహకుడు సునీత్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు...ఆ దుర్మార్గుడిపై 376 డి, 509 సెక్షన్‌లతో పాటు పోక్సోయాక్ట్‌కింద కేసులు నమోదు చేశారు..

ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న అనాథలకు దిక్కుఎవరు..? ఇలాంటివారిని చేరదీసి తాను చేస్తున్న సేవ చేస్తున్నట్లు చెబుతున్న సునీత్‌కుమార్‌ ఆశ్రమం ముసుగులో ఏం చేస్తున్నాడు..? ఓ మైనర్ దారుణాన్ని తట్టుకోలేక వెలుగులోకి వచ్చింది..ఇంకా ఎవరైనా ఆ దుర్మార్గుడి బాధితులుగా ఉన్నారాన్న అనుమానాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు....

19:49 - June 20, 2017

ఢిల్లీ: జిఎస్‌టి అమలును ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న కేంద్రం-ఈ చట్టం అమలును అందరికీ గుర్తుండేలా అట్టహాసంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకుగాను పార్లమెంట్‌ సెంట్రల్‌ హాలు వేదిక కానుంది. జూన్‌ 30న రాత్రి 11 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 12 గంటలు కాగానే పెద్ద గంటను మోగించి జిఎస్‌టి అమలును ప్రకటిస్తారు. అర్ధరాత్రి నుంచే జిఎస్‌టి అమలులోకి వస్తుంది. దేశానికి స్వాతంత్రం వచ్చిన సందర్భంగా 1947, ఆగస్టు 15న అర్ధరాత్రి 'ట్రైస్ట్‌ విత్‌ డెస్టినీ' పేరిట సెంట్రల్‌ హాల్లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ చేసిన ప్రసంగాన్ని గుర్తు చేసేలా ఈ కార్యక్రమం ఉండబోతోంది.

జిఎస్‌టి అమలుతో దేశ వాణిజ్యంలో కీలక మార్పులు

జిఎస్‌టి అమలుతో దేశ వాణిజ్యంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారు. జిఎస్‌టి అమలుకు అన్ని రాష్ట్రాలు అంగీకరించాయని, జూన్‌ 30 అర్థరాత్రి నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రానుందని ఆయన స్పష్టం చేశారు. జిఎస్‌టిపై గత ప్రభుత్వాలు కూడా ప్రధాన భూమికను పోషించినట్లు మంత్రి పేర్కొన్నారు.

జిఎస్‌టి ప్రారంభోత్సవ కార్యక్రమానికి

జిఎస్‌టి ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, లోక్‌సభ స్పీకర్‌, కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, ఎంపీలు, జీఎస్టీ మండలి సభ్యులు హాజరు కానున్నారు. మాజీ ప్రధానులు మన్మోహన్‌సింగ్‌, దేవెగౌడలకు కూడా కేంద్రం ఆహ్వానాలు పంపింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోది కీలక ప్రసంగం చేయనున్నారు. జిఎస్టీ ప్రచారకర్తగా బాలీవుడ్‌ బిగ్‌ బి అమితాబ్‌బచ్చన్‌ను ఎంపిక చేసింది. జిఎస్‌టి అమలులో భాగంగా షార్ట్‌ ఫిలిం ప్రదర్శించనున్నారు.జీఎస్టీ అమలులో భాగంగా జీఎస్టీ కౌన్సిల్‌ ఇప్పటివరకు 17 సార్లు సమావేశమై తుదిరూపు నిచ్చింది.

 

19:47 - June 20, 2017

ఢిల్లీ : మూడేళ్ల బీజేపీ పాలనలో దేశంలోని దళితులపై దాడులు పెరిగాయే తప్ప ఒరిగిందేమీ లేదని ఎద్దేవా చేశారు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి. దళితులు, మైనార్టీలే లక్ష్యంగా బీజేపీ దాడులు చేస్తోందన్నారు. నోట్ల రద్దు తర్వాత దేశ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిందని సురవరం అన్నారు. ఇంతవరకు బ్లాక్ మనీ ఎంత జమ అయిందో మోడీ ప్రభుత్వం లెక్కలు చెప్పడంలో విఫలమైందని విమర్శించారు.

19:46 - June 20, 2017

హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పాకిస్తాన్‌పై కఠిన చర్యలు చేపట్టనున్నారు. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై విచారణ జరిపేందుకు సిద్ధమవుతున్నారు. ఆఫ్గనిస్తాన్‌లో తరచూ ఉగ్రవాద దాడులు జరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ అమెరికా అధికారి రాయిటర్స్‌ న్యూస్‌ ఎజెన్సీకి వెల్లడించారు. పాకిస్తాన్‌ ఉగ్రవాద స్థావరాలపై అమెరికా డ్రోన్‌ దాడులను ముమ్మరం చేయనుంది. పలు అంశాల్లో పాకిస్తాన్‌కు అమెరికా మద్దతు ఉపసంహరించుకోనుంది. ఈ చర్యల ద్వారా ఉగ్రవాదంలో మార్పు వచ్చే అవకాశం ఉందని అమెరికా భావిస్తోంది. పాకిస్తాన్‌తో సంబంధాలు తెంచుకునే ప్రసక్తే లేదని అమెరికా పేర్కొంది. 16 ఏళ్లుగా ఆఫ్గనిస్తాన్‌లో జరుగుతున్న యుద్ధంపై అమెరికా సమీక్ష జరుపుతోంది. దీనిపై పెంటగాన్‌ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

19:45 - June 20, 2017

రాజసాన్ని ప్రదర్శించాడు..రాజబోగాలు అనుభవించాడు. విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు.. ఇప్పుడు జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు. యువరాజునంటూ... సమాజాన్ని నమ్మించాడు.. ఏళ్ల తరబడి.. రాజుగా చలామణి అయ్యాడు... చివరికి నిజం బయటపడి నకిలీ రాజు బతుకు జైలుపాలైంది.

యువరాజుగా పరిచయం చేసుకున్న ఇటలీకి చెందిన 56 ఏళ్ల వ్యక్తి

యువరాజునని చెప్పుకుంటూ...అందరినీ మోసం చేశాడో వ్యక్తి. ఏళ్ల తరబడి అందరినీ బురిడి కొట్టించి.. రాజభోగాలు అనుభవించాడు.. ఒక చిన్న పొరపాటుతో...కటకటాలపాలయ్యాడు. ఇటలీకి చెందిన 56 ఏళ్ల స్టీఫెన్‌ సెర్నెటిక్‌ తాను మాంటెనీగ్రో దేశానికి యువరాజునంటూ సమాజానికి పరిచయం చేసుకున్నాడు. రాజ కుటుంబీకుడిగా చెప్పుకుంటూ లగ్జరీ జీవితాన్ని గడిపాడు. తాను రాజ వంశస్థుడిగా అందరినీ నమ్మించేందుకు నకిలీ ధ్రువపత్రాలు, రాజ ముద్రలను సృష్టించాడు. తన పేరుతో ఓ వెబ్‌ సైట్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. 14-18 శతాబ్దాల మధ్య తమ వంశస్థులు అల్బెనియా, సెర్బియా దేశాలను పాలించినట్టుగా అందులో పేర్కొన్నాడు. దానికి సంబంధించిన వంశ వృక్షాన్ని కూడా వెబ్‌ సైట్‌లో పొందుపరిచాడు.

ఏళ్ల తరబడి విలాసవంతమైన జీవితం

నకిలీ పత్రాలతో... స్టీఫెన్‌ సెర్నెటిక్‌ ఏళ్ల తరబడి రాజుగా విలాసవంతమైన జీవితం గడిపాడు. అసలైన రాజ వంశస్థుల ఫంక్షన్లలో పాల్గొనేవాడు.. సినీ నటులు, సెలబ్రెటీలను కలుసుకునేవాడు. ప్రముఖ హాలీవుడ్‌ నటి పమీలా అండర్సన్‌ కూడా అతని చేతుల మీదుగా ఓ అవార్డునూ అందుకుంది. పార్టీల కోసం ప్రిన్సిస్‌ స్టీఫెన్‌ అని తన పేరు మీద ఓ వైన్‌ను కూడా తయారు చేయించాడు. సెలబ్రెటీలతో ఫోటోలు దిగి.. ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లోనూ పోస్ట్‌ చేసేవాడు.

ఏళ్ల తరబడి రాజుగా చలామణి

రాజుగా చలామణి అయ్యేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. ఎవరికి ఎటువంటి అనుమానాలు కలగకుండా.. ఏర్పాట్లు చేసుకున్నాడు. కానీ..చిన్న తప్పుతో దొరికిపోయాడు. గతేడాది ఇటలీలోని బ్రిందిసి పర్యటనకు వెళ్లి అక్కడి ఓ ఖరీదైన హోటళ్లలో బస చేసి.. బిల్లును మేస్‌డోనియా ఎంబసీకి పంపించమని సూచించాడు. హోటల్‌ యాజమాన్యం బిల్లును ఆ దేశ ఎంబసికీ పంపించగా.. అసలు విషయం బయటపెడింది. అలాంటి యువరాజు ఎవరూ తమ దేశంలో లేరని అధికారులు తేల్చారు. ఆ బిల్లును క్షుణ్ణంగా పరిశీలించి.. విచారణ మొదలుపెట్టారు.

బిల్లును మేస్‌డోనియా ఎంబసీకి పంపమని సూచన

అధికారులు ఏడాది పాటు రహస్య విచారణ జరిపి.. నకిలీ రాజు బాగోతాన్ని బట్టబయలు చేశారు. అతని ఇంట్లో సోదాలు నిర్వహించి.. నకిలీ ధ్రువపత్రాలు. అవార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఆపై స్టీఫెన్‌ను అరెస్ట్‌ చేశారు. లోకాన్ని బురిడీకొట్టిస్తూ వచ్చిన ఈ నకిలీ యువరాజు.. ఎట్టకేలకు గుట్టు రట్టయి జైలుపాలయ్యాడు. అతడి గురించిన వివరాలు వెల్లడికాగానే, ఇప్పటిదాకా అతని చుట్టూ చేరిన వారు.. దిగ్భ్రాంతితో దూరంగా జరుగుతున్నారు.

19:42 - June 20, 2017

అమరావతి: టీచర్ల అక్రమ బదిలీలను నిలుపుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. విజయవాడలో నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులను అరెస్ట్‌ చేసి భవానీపురం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వం ఇష్టానుసారంగా స్కూళ్లను మూసివేసేస్తోందని.. లక్షల రూపాయలు లంచంగా తీసుకుని అక్రమ బదిలీలు చేస్తున్నారని ఉపాధ్యాయ సంఘం నేతలు ఆరోపించారు. ఉపాధ్యాయుల ఆందోళనకు సంబంధించి విజయవాడ స్టూడియోలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో యూటీఎఫ్ నేత బాబురెడ్డి, ఏపీటీఎఫ్ పాండురంగ వరప్రసాద్, ఎస్టియు నేత జోసఫ్ సుధీర్ బాబు పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

కాళేశ్వరం ఆలయంలో పిడుగుపాటు

వరంగల్: కాళేశ్వరంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. కాళేశ్వరం దేవాలయంలో పిడుగు పడింది. ఆలయంలో పిడుగు పడడంతో ఆవరణలో కొంత భాగం దెబ్బతింది. పిడుగుపాటుతో ఆలయంలో కరెంట్ మీటర్‌ కొంత పాక్షికంగా ధ్వంసం అయిం ది. ఆలయంలో ఉన్న భక్తులకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కాళేశ్వరంలో ఆలయం ఆవరణలో పిడుగుపడడంపై అర్చకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు జరగకూడదని అర్చకులు తెలిపారు. ఆలయ ఆవరణ గోడ కొంత పాక్షికంగా ధ్వంసం అయింది. గోడ రాళ్లు కింద పడిపోయాయి. ఆ సమయంలో భక్తులు లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదని అర్చకులు చెబుతున్నారు.

ఐవైఆర్‌ వీధికెక్కడం బాగాలేదు -పరకాల

అమరావతి: ఐవైఆర్‌ వ్యాఖ్యలపై ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ స్పందించారు. ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ కోసం.. ప్రయత్నించామని ఐవైఆర్‌ చెప్పింది అబద్ధమన్నారు. భజన చేయాలని ఐవైఆర్‌ను ఎవరూ అడగలేదని.. బ్రాహ్మణుల అభివృద్ధికి చంద్రబాబు కట్టుబడి ఉన్నారని తెలిపారు. ఐవైఆర్‌ చేస్తున్న వాదన సరికాదని.. అలా వీధికెక్కడం బాగాలేదన్నారు.

18:58 - June 20, 2017

విజయవాడ: ఆటో కార్మికులకు బ్యాంక్‌ రుణాలు ఇప్పించాలని కోరుతూ సిఐటియు ఆటోవర్కర్లు ధర్నా నిర్వహించారు. విజయవాడ లోని ఇండియన్‌ బ్యాంక్‌ కార్యాలయం ఎదుట కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సీహెచ్‌ బాబురావు ధర్నా చేస్తున్న ఆటో కార్మికులకు సంఘీభావం తెలిపారు. టీడీపీ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆటో కార్మికులకు రుణాలు అందజేస్తామని .. అధికారంలోకి వచ్చాక కనీసం సమస్యలు కూడా పరిష్కరించడం లేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోని అమలు చేయాలని .. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆటో కార్మిక సంఘాలతో కలిసి బ్యాంకుల కార్యకలాపాలను స్తంభింప చేస్తామని బాబురావు హెచ్చరించారు.

18:56 - June 20, 2017

అనంతపురం: ప్రొటోకాల్‌ని పాటించకుండా.. ఎయిర్‌ పోర్ట్‌ దగ్గర తనను కావాలనే డీఎస్పీ అడ్డుకున్నారని .. పుట్టపర్తి మునిసిపల్‌ చైర్మన్‌ పీసీ గంగన్న ఆరోపించారు. తనకు జరిగిన అన్యాయాన్ని సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. ఈనెల 9న చంద్రబాబునాయుడును స్వాగతం పలకడానికి వెళ్లిన గంగన్నను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన ఆయన పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. దీంతో గంగన్నపై పోలీసులు 353 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు.. ఈ కేసులపై గంగన్నకు బెయిల్‌ మంజూరైంది. మూడేళ్లుగా తాను చేసిన అభివృద్ధి పనులను ఓ మంత్రి అడ్డుకుంటున్నారని .. తనను కావాలనే అవమానిస్తున్నారని గంగన్న ఆరోపిస్తున్నారు. తనకు చైర్మన్‌ పదవి నుంచి దిగిపోమని తనకు ఎటువంటి ఆదేశాలు అందలేదని ఆయన అన్నారు.

18:55 - June 20, 2017

కర్నూలు : వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. విభజన చట్టం ప్రకారం రాలయసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్యాకేజీ కల్పిస్తామని కేంద్రం చెప్పిందన్నారు. ఎన్డీఏ అధికారంలోకి 3ఏళ్లు గడుస్తుననా ఇంతవరకు ప్యాకేజీ ఊసేలేదన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ సాధించాల్సిన బాధ్యత టీడీపీ ప్రభుత్వంపై ఉందన్నారు. రెండు నెలల్లోగా కేంద్రం స్పెషల్‌ ప్యాకేజీ ప్రకటించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. ఇన్‌ఫుట్‌ సబ్సిడీ నిధులను ఒకే జిల్లాలకు కేటాయించి ఇతర జిల్లాల రైతులకు టీడీపీ ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన... వ్యవసాయ అధికారుల తప్పుడు లెక్కలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.

18:53 - June 20, 2017

అనంతపురం : జిల్లా సర్వశిక్ష అభియాన్‌లో భారీ కుంభకోణం జరిగింది. సుమారు 5కోట్ల రూపాయల మేర కుంభకోణం జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై విచారణ చేపట్టిన ఏపీ సర్వశిక్ష అభియాన్ డైరక్టర్.. జిల్లా డైరక్టర్ దరశథ రామయ్యతో పాటు..మరో ఐదుగురిని రిలీవ్ చేశారు.

18:52 - June 20, 2017

అమరావతి: ఐవైఆర్‌ వ్యాఖ్యలపై ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ స్పందించారు. ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ కోసం.. ప్రయత్నించామని ఐవైఆర్‌ చెప్పింది అబద్ధమన్నారు. భజన చేయాలని ఐవైఆర్‌ను ఎవరూ అడగలేదని.. బ్రాహ్మణుల అభివృద్ధికి చంద్రబాబు కట్టుబడి ఉన్నారని తెలిపారు. ఐవైఆర్‌ చేస్తున్న వాదన సరికాదని.. అలా వీధికెక్కడం బాగాలేదన్నారు.

18:49 - June 20, 2017
18:48 - June 20, 2017

హైదరాబాద్: రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రైతు సంఘం మరో పోరాటానికి సిద్ధమైంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ విత్తనాలు, ఎరువులు కొనేందుకు కావాల్సిన నగదు లభించడం లేదన్నారు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి సాగర్‌. రైతులు ఎదుర్కొంటున్న తక్షణ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 22, 23 తేదీల్లో మండల కేంద్రాల్లో ధర్నాలు చేపట్టనున్నట్టు తెలిపారు.

18:47 - June 20, 2017

హైదరాబాద్‌ : నగరంలో కల్తీ బాదామ్‌ మిల్క్‌ తయారీ గోదాముపై పోలీసులు దాడులు చేశారు. హబీబ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ ఇంట్లో కల్తీ బాదామ్‌ మిల్క్‌, జీరా సోడా, స్పోర్ట్‌ మిల్క్‌, ఫ్ర్టూట్‌ బీర్‌ తయారీ గోదాములపై పోలీసులు దాడులు చేశారు. గోదాం యజమాని ప్రవీణ్‌పై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. సుమారు 10 వేల బాదామ్‌ బాటిల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 5 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

 

18:46 - June 20, 2017

వరంగల్ : ఉన్నత విద్యలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో వరంగల్‌కు చెందిన ప్రొఫెసర్‌ తాళ్ల వంశీకి ప్రభుత్వం చోటు కల్పించింది. ఈ కమిటీ వచ్చే నెల 10నుంచి విదేశాల్లో పర్యటిస్తుంది. ఉన్నత విద్యపై అధ్యయనం చేస్తుంది. అసోసియేటెడ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, ఏఐసీటీఈ నేతృత్వం వహించే కమిటీలో ప్రొఫెసర్‌ వంశీ కీలకంగా వ్యవహరించనున్నారు. కేంద్ర ప్రభుత్వం తనకు అవకాశం కల్పించినందుకు తాళ్ల వంశీ సంతోషం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

18:35 - June 20, 2017

జగిత్యాల : జిల్లాలో కాబోయే నూతన జంట వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తమ నిశ్చితార్థానికి విచ్చేసిన అతిథులకి హెల్మెట్‌లు పంపిణీ చేశారు. రోడ్డు ప్రమాదాలతో అనేకమంది తమ ప్రాణలను కోల్పోతున్నారని, అందులో కొంతమంది ప్రాణాలనైనా కాపాడవచ్చునన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఈ ఆలోచన తమకి సంతోషాన్ని కల్గించిందని కుటుంబసభ్యులు తెలిపారు.

18:19 - June 20, 2017

హైదరాబాద్: సిటీలో ట్రాఫిక్‌ ఉల్లంఘన కేసులను... కట్టడి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మద్యం తాగి, లైసెన్స్‌లు లేకుండా వాహనాలు నడిపే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. జరిమానాలు... జైలు శిక్షలు పడినా వాహనదారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. అలాగే అధిక మొత్తంలో ఈ చలాన్లు పెండింగ్‌ అవుతున్నాయి. దీంతో ట్రాఫిక్‌ కోర్టులు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు.

ట్రాఫిక్‌ కోర్టులతో ప్రమాదాల నియంత్రణ

ట్రాఫిక్‌ కోర్టుల సేవలు అందుబాటులోకి వస్తే చాలావరకు ప్రమాదాలు అరికట్టే వీలుంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఫస్ట్‌ క్లాస్‌ జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ నేతృత్వంలో ప్రస్తుతం పూర్తిస్థాయిలో పనిచేసే ట్రాఫిక్‌ కోర్టు ఒకటే ఉంది. సెకండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్ల నేతృత్వంలో 18 కోర్టులున్నాయి. అయితే ఈ కోర్టుల్లో ట్రాఫిక్‌ కేసులతో పాటు.. వరకట్న వేధింపుల కేసుల్నీ విచారించాల్సి ఉంది. దీంతో రోడ్డు ప్రమాద కేసులు... డ్రంకన్‌ డ్రైవ్‌ కేసులు పరిష్కారం ఆలస్యం అవుతోంది. దీంతో పూర్తిస్థాయిలో ట్రాఫిక్‌ సమస్యలు పరిష్కారం కావాలంటే ట్రాఫిక్‌ కోర్టులు అందుబాటులోకి తేవాలని లాయర్లు, రిటైర్డ్‌ పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమావేశం

కోర్టుల ఏర్పాటుపై ట్రాఫిక్‌ విభాగం అధికారులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమావేశమయ్యారు. ట్రాఫిక్‌కి సంబంధించిన కేసుల గురించి.. ఆయనకు వివరించారు. వీటిపై సానుకూలంగా స్పందించిన హైకోర్టు.. కోర్టుల సంఖ్య పెంచడానికి అంగీకరించారు. రెండు ట్రాఫిక్‌ కోర్టు

18:07 - June 20, 2017

హైదరాబాద్: పని తక్కువ.. ప్రచారం ఎక్కువైందా? అదిగో వస్తుంది.. ఇదిగో వస్తోందంటూ కావాలనే ఊరిస్తున్నారా? మెట్రో రైలు విషయంలో.. అందరికీ ఇలాగే అనిపిస్తోంది. దక్షిణాది ప్రధాన నగరాల్లోని మూడు సిటీల్లో మెట్రో పరుగులు పెడుతోంటే.. మన దగ్గర మాత్రం ఎప్పుడు వస్తుందో చెప్పలేని స్థితి. కష్టాలు తీర్చడానికంటూ మొదలు పెట్టిన మెట్రో.. వాటిని తీర్చుడమేమో కానీ కొత్త కష్టాలు తెచ్చిపెట్టిందంటూ సిటీ జనం అంటున్నారు.

72 కిలోమీటర్ల ప్రాజెక్ట్

72 కిలోమీటర్లు, 14 వేల కిలోమీటర్లు.. దేశంలోనే అతి పెద్ద పబ్లిక్‌ ప్రయివేట్ పార్ట్‌నర్‌ షిప్‌ ప్రాజెక్ట్. ప్రతీ రోజు లక్షలాది మంది సిటిజన్స్‌ ప్రయాణం.. వేల కోట్ల కొత్త పెట్టుబడులు.. తద్వారా లక్షలాది మంది ప్రజలకు ఉపాధి..

మూడేళ్లు దాటి మూడు నెలలు

ఇవి హైదరాబాద్‌లో మెట్రో రైలు పాలకులు.. ఇటు అధికారులు చెప్పిన మాటలు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రకటనలు.. అన్నింటిలో తామే ముందున్నాం.. ప్రపంచంలోని రెండు వందల మెట్రో రైళ్లలో.. అదునాతన వ్యవస్థ తమ వద్దే ఉంది. ఇది మెట్రో రైలు నుంచి ఎన్వీఎస్‌ రెడ్డి పదే పదే చెప్పే మాటలు. 2015 మార్చి నాటికి నాగోల్ మెట్టు మార్గంలో.. మెట్రో సిటిజన్స్‌కు అందుబాటులోకి రావాలి. కానీ మూడేళ్లు దాటి మరో మూడు నెలలు పూర్తవుతున్నా.. అడుగు ముందుకు సాగడం లేదు.

2012లో ఎల్‌అండ్‌టీ ప్రభుత్వానికి జరిగిన ఒప్పందం ప్రకారం

2012లో ఎల్‌అండ్‌టీ ప్రభుత్వానికి జరిగిన ఒప్పందం ప్రకారం.. 2017 జులై నాటికి ఈ మెట్రో పనులు పూర్తి చేసి 72 కిలో మీటర్ల మేర మెట్రో రైలు సర్వీసులు ప్రజలకు అందుబాటులోకి రావాలి. కానీ ప్రారంభంలో కొద్ది రోజుల పాటు వేగంగా జరిగిన పనులు తరువాత మందగించాయి. కొన్ని ప్రాంతాల్లో భూ సమీకరణ ఆలస్యం కాగా.. మరి కొన్ని చోట్ల అలైన్‌మెంట్ మార్చడం కోసం ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలని ప్రభుత్వం ఆలస్యం చేసింది. గ్రేటర్‌ ఎన్నికల ముందు 2016 ప్రథమార్థంలో ప్రారంభిస్తామని చెప్పిన ప్రభుత్వం.. మళ్లీ 2016 జూన్‌ 2 రాష్ట్ర అవతరణ అంటూ డేట్‌ పొడిగించింది. కొన్నాళ్ల క్రితం 2017 చివరినాటికి కారిడార్ వన్‌ మియాపూర్‌ టూ ఎల్‌బీ నగర్‌ కారిడార్ త్రీ నాగోల్ టూ శిల్పారామం వరకు మెట్రోను సిటిజన్స్‌కు అందుబాటులోకి తీసుకొస్తామని మెట్రో రైలు అధికారులు ప్రకటించారు. అయితే జూన్‌ 2న సీఎం ఈ ఏడాది మెట్రో అందుబాటులోకి తెస్తామంటూ ప్రకటించారు.

66 కిలోమీటర్ల మేరకు పనులు

ఇక హైదరాబాద్‌లో 72 కిలోమీటర్ల మెట్రో రైలు అని ప్రకటించినా.. ప్రస్తుతం 66 కిలో మీటర్ల మేరకు మాత్రమే పనులు నడుస్తున్నాయి. మిగిలిన ఆరు కిలో మీటర్ల మార్గంలో అసలు మెట్రో ఉంటుందా? ఉంటే ఎప్పుడు పనులు చేస్తారు. అసలు ఉండదా అనే అంశాల్లో మాత్రం ఎలాంటి స్పష్టత లేదు. మెట్రో ఆలస్యమైతే అందుకు కారణమైనవారు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇందుకు ఎవరు కారణమనేది మాత్రం ఇప్పటికీ స్పష్టం కాలేదు. దీంతో ఈ భారం కూడా ప్రజలపై పడనుంది.

తీవ్ర స్థాయిలో మండిపడుతున్న సిటిజన్స్

ఇక మెట్రో వర్క్స్‌పై సిటిజన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. చాలా ప్రాంతాల్లో రోడ్లను వైడనింగ్‌ చేయకుండా పనులు చేపట్టారు. దాంతో ట్రాఫిక్ జామ్‌లతో సిటీలో నరకం కనిపిస్తుంది. రోడ్లను తవ్వేయడం, తమకేం సంబంధం లేదన్నట్లు ప్రవర్తించడం, ఫుట్ పాత్‌లు తీసేయడం, బస్టాప్‌లు తొలగించడం వంటి పనులు చేస్తున్నారు ఎల్‌ అండ్‌ టీ సంస్థ వారు. మెట్రో రైలు మార్గం అంతా ప్రధానమైన రోడ్లపై ఉండటంతో.. గుంతలు పడటం.. నిర్మాణ పనుల కారణంగా చాలా మంది వాహనదారులు ప్రమాదాలకు గురి కావడంతో పాటు ప్రాణాలు కూడా కోల్పోయారు. వర్షాకాలంలో గోతులు.. ఎండాకాలంలో దుమ్ముతో మెట్రో మార్గంలోని రోడ్లు మట్టి కొట్టుకుపోయి సిటిజన్స్‌కు నరకం చూపిస్తున్నాయి.

దేశంలోని ప్రధాన నగరాన్నింటిలో

ఇక దేశంలోని ప్రధాన నగరాన్నింటిలో ఒక్కొక్కటిగా మెట్రో రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా కొచ్చిలో ప్రధాని, బెంగళూరులో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రారంభించారు. కొచ్చిలో ప్రారంభించిన మెట్రోను వేగంగా పూర్తి చేసి.. ప్రారంభించారని నేతలు అభిప్రాయపడ్డారు. కానీ హైదరాబాద్‌లో 2015 ప్రారంభం నుంచి ఇదిగో అదిగో అంటున్నారే తప్ప ఖచ్చితంగా ఎప్పుడు ప్రారంభిస్తారనేది ఇటు హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్ కానీ.. నిర్మాణ సంస్థ ఎల్ అండ్‌ టీ కానీ స్పష్టత ఇవ్వడం లేదు. మరోవైపు ప్రభుత్వంలోని మంత్రులు అప్పుడు, ఇప్పుడు అంటూ ప్రకటనలు చేస్తున్నారు. పనులు పూర్తి అయిన ప్రాంతాల్లో మెట్రో ట్రైన్స్‌ ప్రారంభించాలని హైదరాబాదీలు కోరుతున్నారు.

ఐవైఆర్ చెప్పింది అబద్ధం - పరకాల..

విజయవాడ : ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నించామని ఐవైఆర్ చెప్పడం అబద్ధమని ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ స్పష్టం చేశారు. ఐవైఆర్ చేసిన విమర్శల పట్ల ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసే స్వేచ్ఛ..స్వాతంత్ర్యం ఉందని పేర్కొన్నారు. బ్రాహ్మణ్ కార్పొరేషన్ కు అధిక నిధులు ఖర్చు చేయడం జరిగిందని, ఐవైఆర్ పై బాబుకు చాలా నమ్మకం ఉండేదని, ప్రభుత్వ నిర్ణయాలను బహిరంగంగా విమర్శించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వానికి..శాసనసభ..మండలికి..వ్యతిరేకంగా పోస్టులు పెట్టడంపై ప్రభుత్వం అభ్యంతరం చెప్పిందన్నారు.

17:29 - June 20, 2017

'డీజే...’ సెన్సార్ పూర్తయ్యింది. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ 'అల్లు అర్జున్' దర్శకుడు 'హరీశ్ శంకర్' దర్శకత్వంలో 'డీజే..దువ్వాడ జగన్నాథమ్' తెరకెక్కిన సంగతి తెలిసిందే. కానీ సినిమాలో ఓ పాట తీవ్ర వివాదం సృష్టించింది. ‘గుడిలో బడిలో ఒడిలో మడిలో' అంటూ సాగే పాటపై ఉపయోగించిన 'అగ్రహారం..తమలపాకు..నమకం..చమకం' వంటి పదాలపై బ్రాహ్మణ సంఘాలు భగ్గుమన్న సంగతి తెలిసిందే. బ్రాహ్మణుల మనోభావాలను కించపరిచేలా సన్నివేశాలు..పాటలున్నాయని సభ్యులు ఆరోపణలు గుప్పించారు. పాటలోని పదాలను తొలగిస్తామని దర్శకుడు హరీశ్ శంకర్ ఇదివరకే ప్రకటించారు. జూన్ 23వ తేదీన సినిమా విడుదల కానుందని చిత్ర యూనిట్ పేర్కొంది. కానీ వివాదం నడుస్తుంటే సినిమా విడుదలవుతుందా ? లేదా ? అనే ఆందోళన అభిమానుల్లో ఏర్పడింది. తాజాగా పాటలోని పదాలను తొలగిస్తున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. 'డీజే...దువ్వాడ జగన్నాథమ్’ సినిమాలోని పాటల పదాలను మార్పు చేశారు. నమకం..చమకం..అనే పదాల చోట ' నాగమకం..నీ సుముఖం' పదాలను చిత్ర బృందం పొందుపరిచింది. సెన్సార్ అనమతిని దర్శక..నిర్మాతలు పొందినట్లు తెలుస్తోంది.

ర్యాగింగ్ పై మార్పు కోసం చర్యలు - సీపీ గౌతం సవాంగ్..

విజయవాడ : ర్యాగింగ్ పై విద్యార్థుల్లో మార్పు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు సీపీ గౌతం సవాంగ్ పేర్కొన్నారు. మార్పు కోసం మహిళా మిత్ర..మహిళా రక్షక్ బృందాలు పోరాడాలని సీపీ పిలుపునిచ్చారు. సమాజం పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు.

ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ గా..

విజయవాడ : ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ గా వేమూరి ఆనంద సూర్యను ప్రభుత్వం నియమించింది. రెండేళ్ల పాటు ఛైర్మన్ గా ఆనంద సూర్య కొనసాగనున్నారు. ఛైర్మన్ గా ఉన్న ఐవైఆర్ ను ప్రభుత్వం తొలగించిన సంగతి తెలిసిందే.

ర్యాగింగ్ పై మార్పు కోసం చర్యలు - సీపీ గౌతం సవాంగ్..

విజయవాడ : ర్యాగింగ్ పై విద్యార్థుల్లో మార్పు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు సీపీ గౌతం సవాంగ్ పేర్కొన్నారు. మార్పు కోసం మహిళా మిత్ర..మహిళా రక్షక్ బృందాలు పోరాడాలని సీపీ పిలుపునిచ్చారు. సమాజం పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు.

దేశంలో ముందున్నాం - పోచారం..

నిజామాబాద్ : సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే ముందున్నామని మంత్రి పోచారం పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చాక ఇంత పెద్ద ఎత్తున యాదవులకు నిధులను మంజూరు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. ఈ ఏడాది సగం..వచ్చే యేడు సగం మందికి గొర్రెల పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. గొర్రెల గ్రాసం కోసం సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

'డీజే...’ సినిమాలోని పాటల పదాల మార్పు..

హైదరాబాద్ : 'డీజే...దువ్వాడ జగన్నాథమ్’ సినిమాలోని పాటల పదాలను మార్పు చేశారు. నమకం..చమకం..అనే పదాల చోట ' నాగమకం..నీ సుముఖం' పదాలను చిత్ర బృందం పొందుపరిచింది. సెన్సార్ అనమతిని దర్శక..నిర్మాతలు పొందారు.

సమాధానం ఇవ్వడానికి సిద్ధం - తేజస్వీ యాదవ్..

బీహార్ : తమను పిలిస్తే సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు డిప్యూటి సీఎం తేజస్వీ యాదవ్ వెల్లడించారు. ఐటీ డిపార్ట్ మెంట్ దాడులు..ఆస్తులను సీజ్ చేసిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇదంతా రాజకీయ కక్షలో భాగమేనని, తాము ఏదీ దాచలేదని పేర్కొన్నారు.

16:50 - June 20, 2017
16:48 - June 20, 2017

కర్నూలు: కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో వ్యవసాయ రంగం నిర్వీర్యమవుతోందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎ. విజయరాఘవన్‌ అన్నారు. నయా ఉదారవాద విధానాలను ఏపీ సీఎం చంద్రబాబు వేగంగా అమలు చేస్తున్నారని మండిపడ్డారు. పేదలకు భూమి పంచడానికి భిన్నంగా.... వారి నుంచి లాక్కొంటున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కొంటూ వారిని నిరాశ్రయులను చేస్తోందని విమర్శించారు. కర్నూలులో జరుగుతున్న ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం 27వ రాష్ట్ర మహాసభలకు ఆయన హాజరయ్యారు. ప్రతినిధుల సభను ప్రారంభించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి హాజరైన ప్రతినిధులు అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన ప్రతినిధుల సభలో పలు తీర్మానాలను ఆమోదించారు.

16:46 - June 20, 2017

అమరావతి: మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తీరుపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ప్రస్తుతం ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ పదవిలో ఉన్న కృష్ణారావును తొలగించాలని ఆదేశించారు. ఈ మేరకు జీవో జారీ అయింది. మరోవైపు కొత్త ఛైర్మన్‌గా వేమూరి ఆనంద సూర్య..ను నియమించనున్నట్టు సమాచారం.

16:43 - June 20, 2017

ఖమ్మం : జిల్లా టీఆర్‌ఎస్‌లో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. అశ్వరావుపేట ఎమ్మెల్యే తాటివెంకటేశ్వరరావుపై దమ్మపేట జడ్పీటీసీ దొడ్డాకుల సరోజిని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే అయినా.. కలెక్టరైనా తనను కించపరిచేలా మాట్లాడితే చెప్పుదెబ్బలు తప్పవని హెచ్చరించారు. గొర్రెల పంపిణీ కార్యక్రమం సభలోనే జడ్పీటీసీ సరోజిని- ఎమ్మెల్యేపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో అక్కడున్న జనం విస్తుపోయారు. ఇటీవల దమ్మపేటకు చెందిన ఓ గిరిజనుడిపై ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు చేయిచేసుకున్నారు. అయితే గిరిజనుడికి జడ్పీటీసీ భర్త రాజేశ్వరరావు అండగా ఉండి తనను అభాసుపాలు చేస్తున్నాడని ఎమ్మెల్యే ప్రచారం చేశారు. దీనిపై జడ్పీటీసీ సరోజిని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పబ్లిక్‌గా నేతలు వ్యాఖ్యలు చేసుకోవడంతో జనం విస్తుపోయారు. 

రాంనాథ్ ఖరారు పట్ల ములాయం స్పందన..

ఉత్తర్ ప్రదేశ్ : ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రాంనాథ్ కోవింద్ ను ఖరారు చేయడం పట్ల యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ స్పందించారు. సరైన అభ్యర్థిని ప్రకటించారని, కోవింద్ తో తనకు సత్సంబంధాలున్నాయన్నారు.

దమ్మపేట జడ్పీటీసీ సంచలన వ్యాఖ్యలు..

ఖమ్మం : జిల్లాలో టీఆర్ఎస్ వర్గ విబేధాలు ముదిరిపోయాయి. అశ్వరావు పేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వరరావుపై దమ్మపేట జడ్పీటీసీ సరోజిని సంచలన వ్యాఖ్యలు చేశారు. గొర్రెల పంపిణీ కార్యక్రమం సభలో జడ్పీటీసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే అయినా..కలెక్టర్ అయినా..తప్పుగా మాట్లాడితే చెప్పుదెబ్బలు తప్పవని సరోజిని వ్యాఖ్యలు చేశారు. పబ్లిక్ గా నేతలు వ్యాఖ్యలు చేసుకోవడంపై జనాలు విస్తుపోయారు. ఇటీవలే దమ్మపేటకు చెందిన గిరిజనుడిపై ఎమ్మెల్యే చేయి చేసుకున్నారని, జడ్పీటీసీ భర్త రాజేశ్వరరావు గిరిజనుడికి అండగా ఉన్నాడని ఎమ్మెల్యే ప్రచారం చేశారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

15:58 - June 20, 2017
15:54 - June 20, 2017

విశాఖ: నగరంలో జరిగిన భూ కుంభకోణం విషయంలో ఎంతటి 'స్థాయి వ్యక్తులున్నా సహించేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఇప్పటికే దీనిపై సీఎం చంద్రబాబు సిట్ వేయడమేకాక రికార్డ్స్ టాంపరింగ్ జరిగడంతో పలువురు అధికారులను సస్పెండ్ చేసామన్నారు. దేశంలో అతిపెద్ద ముద్దాయి అయిన వైఎస్‌ జగన్..మహా ధర్నాలో పాల్గొంటా అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 

రామ్ నాథ్ కోవింద్ రాజీనామా..

బీహార్ : ఎన్డీయే తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన బీహార్ గవర్నర్ రామ్ నాథ్ కోవింద్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపారు. రామ్ నాథ్ రాజీనామాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించారు.

15:52 - June 20, 2017

అమరావతి: రెండు రూపాయలకే 20 లీటర్ల మంచినీరు అందించే ఎన్టీఆర్‌ సుజల పథకాన్ని ఏపీ సీఎం చంద్రబాబు అమరావతిలోని వెంకటపాలెంలో ప్రారంభించారు. ఈ పథకంతో తొలిదశలో 29 గ్రామాలకు లబ్ది చేకూరుతుందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మంచినీటిని అందిస్తున్నామని.. దీన్ని ప్రజలంతా వినియోగించుకోవాలని చంద్రబాబు అన్నారు. ఈ మంచినీటి పథకానికి మెగా గ్రూప్‌కు చెందిన కృష్ణారెడ్డి, హెటిరో కంపెనీకి చెందిన పార్థసారథిరెడ్డి దాతలుగా ముందుకు వచ్చినందుకు వారిని సీఎం అభినందించారు.  

లాలూ కుమార్తె ఆస్తుల సీజ్..

బీహార్ : లాలూ కుమార్తె ఆస్తులను ఐటీ సీజ్ చేసింది. బినామీ ఆస్తులుగా గుర్తించి సీజ్ చేశారు. 12 ప్లాట్లను అటాచ్ చేసినట్లు తెలుస్తోంది.

15:34 - June 20, 2017

హైదరాబాద్: రాజకీయ భజన చేయడం నావల్ల కాదని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. ఏపీ సర్కార్ కు వ్యతిరేకంగా కృష్ణారావు ఫేస్ బుక్ లో చేసిన పోస్టులు కలకలం రేపాయి. ఇదే అంశంపై ఆయన్ను తొలగిస్తున్నట్లు సర్కార్ పేర్కొంది. దీని పై స్పందించిన కృష్ణారావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆమట్లాడుతూ.. బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి నేను అడిగి తీసుకున్నాను. 6 నెలల నుండి సీఎం చంద్రబాబును కలవడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ కలవకపోడంతో నా ఇగో హర్టయ్యింది. రిజైన్ చేయమని అడిగితే చేసేవాడిని. నేను జవాబుదారీతనంతో పనిచేయడం లేదనే విమర్శలు అవాస్తవం. నా పదవికి కేబినెట్ ర్యాంకు లేదు. బ్రాహ్మణ కార్పొరేషన్ లోని సబార్డినేటర్లంతా టీడీపీ కార్యకర్తలే ఉన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ను సజావుగా నడపడమే నా కర్తవ్యం. వేతనం తీసుకోకుండా పని చేస్తున్నాను. జర్నలిస్ట్ రవికిరణ్ ను అరెస్టు చేసినపుడు బాధపడ్డాను. విశాఖ ఎయిర్ పోర్టులో జేసీ కొండవపై ఫేస్ బుక్ లో కామెంట్ పెట్టాను. అదే నేను చేసిన నేరమా? మనం ఫాసిస్ట్ రాజ్యంలో ఉన్నామా? నేను ఏ తప్పు చేశానని నాపై ఆరోపణలు చేస్తున్నారు. గౌతమిపుత్రశాతకర్ణి సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వడం సరికాదని పోస్ట్ చేశాను. టీటీడీ ఈవోగా తెలుగువారిని నియమించే సంప్రదాయం ఉంది. దాన్ని ఎందుకు భగ్నం చేశారని కామెంట్ చేశాను. రాజకీయ భజన చేయడం నావల్ల కాదు. ఛైర్మన్ భజన చేసేవారిని తెచ్చుకుంటే బాగుండేది. నా పోస్టులకు రాజకీయ రంగు పులిమారు' అని తన ఆవేదనను మీడియాకు తెలిపారు. ఇదిలా వుంటే బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి ఐవైఆర్ కృష్ణారావును తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది.

ఫేస్ బుక్ లో షేర్ చేయడం నేరమా - ఐవైఆర్..

హైదరాబాద్ : ఫేస్ బుక్ లో చేయడం నేరమా అని ఐవైఆర్ కృష్ణా రావు ప్రశ్నించారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టులపై ప్రభుత్వం సీరియస్ అయిన విషయం తెలిసిందే. దీనితో బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి నుండి తప్పించింది. ఈ సందర్భంగా ఐవైఆర్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వివరణనిచ్చే ప్రయత్నం చేశారు. ఒకనాటి వార్త..ఉదయం లాంటి న్యూట్రల్ పేపరు లేవని, టిటిడి ఈవోగా తెలుగు వారిని నియమించే సంప్రదాయం ఉందన్నారు. దానిని ఎందుకు భగ్నం చేశారని కామెంట్ చేశానన్నారు. రాజకీయ భవన చేయడం తన వల్ల కాదని, భజన చేసే వారిని తెచ్చుకుంటే బాగుంటుందని హితవు పలికారు.

15:22 - June 20, 2017

భారీ తలతో ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కిన చిన్నారి ఇక లేదు. సోమవారం రాత్రి ఆ చిన్నారి తుదిశ్వాస విడిచింది. త్రిపురకు చెందిన అబ్దుల్లా రెహమన్, ఫాతిమాలకు 'రూనా' కూతురు ఉంది. కానీ రూనా జననంతోనే పే...ద్ద తలకాయతో జన్మించింది. అరుదైన వ్యాధితో మంచమెక్కిన కూతురును బతికించుకోవాలని ఆ తల్లిదండ్రులు ఎన్నో ఆసుపత్రులకు తిరిగారు. రూనాను ఢిల్లీ సమీపంలోని గుర్గావ్ లోని ఎఫ్ఎమ్ఆర్ఐ ఆసుపత్రిలో చేరిపించారు. 2013 నుండి రూనాకి ఉచితంగా చికిత్స అందిస్తోంది. రూనాకు వందలకొద్ది వైద్యులు ఆపరేషన్లు చేశారు. అయినా లాభం లేదని వైద్యులు పేర్కొనడంతో తల్లిదండ్రులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కానీ ఓ సందర్భంలో చిన్నారి రూనా హాయిగా నవ్వుతుండడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. వైద్యచరిత్రలో రూనా ఒక అద్భుతం అంటూ వైద్యులు తెగపొడిగారు. దీనితో రూనాను త్వరలోనే స్కూల్ లో చేరిపించాలని తల్లిదండ్రులు అనుకున్నారు. కానీ చికిత్స మధ్యలోనే రూనా కన్నుమూయడంతో వారి ఆశలు ఆవిరయ్యాయి. సోమవారం తాను పనికి వెళ్లడం జరిగిందని సాయంత్రం 8:30 సమయంలో తన భార్య ఫోన్ చేసి.. రూనా బాగోలేదని చెప్పడంతో ఇంటికొచ్చానని తండ్రి తెలిపారు. కానీ అప్పటికే బిడ్డ ఊపిరి పీల్చడం ఆగిపోయిందని గద్గత స్వరంతో పేర్కొన్నారు. రూనా చికిత్స కోసం 'మై గుడ్ యాక్ట్' పేరిట సోషల్ మీడియాలో ప్రచారం కూడా జరిగింది. ఇందుకు రూ. 40 లక్షల వరకు డబ్బులు సమకూరాయి. కానీ రూనా ప్రాణాలు కోల్పోవడంతో విచారం వ్యక్తం చేస్తున్నారు.

రిజైన్ చేయమని అడిగితే చేసే వాడిని - ఐవైఆర్ కృష్ణారావు..

విజయవాడ : బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని తాను అడిగి తీసుకున్నట్లు, రిజైన్ చేయమని అడిగితే చేసే వాడినని ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. ఆరు నెలల నుండి తనకు సీఎం అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని, ఈ వివాదంలో ప్రభుత్వం తనను వివరణ అడగలేదన్నారు. ప్రత్యేక ఎన్నికల్లో పాల్గొనే బలం తనకు లేదని, జవాబుదారితనంతో పని చేయలేదన్న విమర్శల్లో వాస్తవం లేదని, తన ప్రోగ్రాంల సమాచారం కో ఆర్డినేటర్లకు అందించడం..వారే ఎమ్మెల్యేలకు అందచేయడం జరుగుతుందన్నారు. వేతనం తీసుకోకుండా పనిచేస్తున్నట్లు, బ్రాహ్మణ కార్పొరేషన్ లో 13 జిల్లా కో ఆర్డినేటర్లు టిడిపి వాళ్లేనని స్పష్టం చేశారు.

14:56 - June 20, 2017

విశాఖ : ఛత్తీస్‌గఢ్‌లో ఆదివాసిలపై రమణ్‌సింగ్‌ ప్రభుత్వం పోలీసులు, భద్రతా దళాలతో దాడులు చేయిస్తుందని బృందాకారత్‌ ఆరోపించారు. మహిళల పట్ల అరాచకాలు కొనసాగిస్తుందని..మద్దతుగా ఉన్నవారిపై అక్రమకేసులు బనాయిస్తుందని మండిపడ్డారు. భద్రతా దళాలు ఆదివాసి మహిళలపై అత్యాచారాలు చేస్తున్నా..రమణ్‌సింగ్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. బాధిత మహిళలకు ఆదివాసి అధికార్‌ మంచ్‌ తోడుగా ఉంటుందన్నారు. 

14:55 - June 20, 2017

2 వేల మంది కూతుళ్లు ఏంటీ ? వారికి వివాహం చేయడం ఏంటీ ? అని ఆశ్చర్యపోతున్నారు. ఇతర అర్థాలు మాత్రం తీసుకోకండి. ఓ తండ్రి నిజంగానే కూతుళ్లు కాని కూతుర్లకు వివాహం చేశాడు. దీని వెనుక ఓ విషాదం దాగి ఉంది. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. గుజరాత్ రాష్ట్రంలో వజ్రాల వ్యాపారం చేసే మహేష్ సవానికి ఇద్దరు కుమారులున్నారు. కానీ కూతుర్లు లేరు. 2008లో ఆయన సోదరుడు ఈశ్వర్ కూతుళ్ల వివాహం సందర్భంగా నగలు కొనేందుకు ఓ దుకాణానికి వెళ్లాడు. కానీ ఆ నగలకు మొత్తం ఒకేసారి డబ్బు ఇవ్వాలని చెప్పడంతో ఈశ్వర్ గుండెపోటుతో అక్కడికక్కడనే మృతి చెందాడంట. తాను ఎంతగానే ప్రేమించే సోదరుడు ఈశ్వర్ మృతితో మహేష్ తీవ్ర దిగ్ర్భాంతికి లోనయ్యారంట. ఆయన కుమార్తెల వివాహ బాధ్యతలను భుజాన వేసుకున్నాడు. అంతేగాకుండా వివాహం జరగకుండా నిస్సహాయ స్థితిలో ఉన్న యువతులకు వివాహం చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. అంతే 2వేల మంది యువతులకు సర్వం తానై వివాహలు జరిపించారు. ఒక్కో యువతి వివాహానికి సుమారుగా రూ. 4 లక్షళ చొప్పున వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. బాలికల కోసం ప్రత్యేకంగా పాఠశాల కూడా నడుపుతున్నారు. ఇప్పటి వరకు ఆయన పాఠశాలల్లో 8,400 మంది, కళాశాలల్లో 392 మంది విద్యార్థినీల చదువులకు సాయం చేశారు. తనను 'నాన్న' అని పిలిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని మహేశ్ సగర్వంగా చెబుతున్నాడు.

14:55 - June 20, 2017

విశాఖ : దేశంలో ఆదివాసీల సమానత్వం, సమన్యాయం కోసం ఆదివాసి అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ విశేషమైన కృషి చేసిందని కేరళ సీఎం పినరాయి అన్నారు. విశాఖలో ఆదివాసి అధికార్‌ రాష్ట్రీయ సభకు హాజరైన ఆయన... మన దేశంలో ఆదివాసిలపై ఇంకా వివక్ష కొనసాగుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు సామాజిక, ఆర్థిక న్యాయం అందడం లేదన్నారు. ఆదివాసి హక్కుల కోసం 2010లో జాతీయస్థాయిలో ఆదివాసి అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ పోరాటం చేసిన విషయాన్ని గుర్తుచేశారు.

14:51 - June 20, 2017

ఢిల్లీ: నిఘా వర్గాల సూచనల మేరకు ఢిల్లీ స్పెషల్ సెల్‌ పోలీసులు.. హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీ ఎన్సిఆర్‌ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. ఉగ్రదాడులు జరగవచ్చనే కోణంలో.. భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. రైల్వే స్టేషన్‌లు, బస్‌స్టాప్‌లు, మెట్రో స్టేషన్‌లు తదితర రద్దీ ప్రాంతాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్ర పోలీసులను ఢిల్లీ పోలీసులు అప్రమత్తం చేశారు. యోగా దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో 3 వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. యూపీ, హర్యానా సరిహద్దులలో అనుమానితులను పోలీసులు తనిఖీ చేస్తున్నారు.

14:41 - June 20, 2017

హైదరాబాద్: వివాహం అనేది ఇద్దరిమనుషులను, ఇద్దరి మనస్సులను కలిపే ప్రక్రియ. వివాహంతోనే సమాజాం వారిని భార్యా భర్తలుగా గుర్తింస్తుంది. సాధారంగా వివాహం అంటే ఒకే కులానికి చెందిన అమ్మాయికి అదే కులానికి చెందిన అమ్మాయితో వివాహం జరుగుతుంది. కానీ వీటికి భిన్నంగా కులాంతర వివాహాలు ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే పెద్దలను ఎదరించి కులాంతర వివాహాలు చేసుకుంటున్న వారి పై దాడులు కూడా పెరుగుతున్నాయి. కులం, మతం ఆస్థి, సమాజంలో హోదా వంటి విషయాలను పరిగణలోకి తీసుకుంటున్న క్రమంలో కులాంతర వివాహాలు చేసుకుంటున్న వారిపై దాడులు జరగడం పరిపాటిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో వారికి కావాల్సిన రక్షణ ఆవశ్యకత ఏర్పడింది. చట్టం ఒక కావాలి. ఎలాంటి విషయాలను ఈచట్టంలో పొందుపరచాలి. అనే అంశంపై నేటి 'వేదిక'లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో ప్రొ.లక్షి, జర్నలిస్టు సలీమ పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

14:06 - June 20, 2017

ఖమ్మం : గ్రెయిన్ మార్కెట్‌ను గుర్రాలపాడుకే తరలించాలని డిమాండ్‌ చేస్తూ గాంధీచౌక్‌లో.. సీపీఎం, ఛాంబర్ ఆఫ్ కామర్స్, త్రీటౌన్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్రజా బ్యాలెట్‌ను నిర్వహించారు. వ్యాపారులు, ప్రజలు పాల్గొని బ్యాలెట్‌ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం, మంత్రులు, అధికారులు స్పందించాలని స్థానికులు కోరారు.

14:04 - June 20, 2017

ఢిల్లీ :కేంద్రమంత్రి అరుణ్‌ జైట్లిని ...తెలంగాణ ఐటీశాఖా మంత్రి కేటీఆర్‌ కలిశారు. సాగునీటి ప్రాజెక్టులకు, బీడి పరిశ్రమ, చిన్న, మధ్య తరహా గ్రానైట్‌ పరిశ్రమలకు జీఎస్‌టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కేటీఆర్‌ కోరారు. ఐదు ప్రధాన అంశాలపై అరుణజైట్లితో చర్చించామని...వెనుకబడిన జిల్లాల నిధులు, సీఎస్‌టీ పరిహారం వెంటనే విడుదల చేయాలని కోరామని.. మంత్రి కేటీఆర్‌ చెప్పారు. కంటోన్మెంట్‌లో భూముల బదలాయింపు వేగవంతం చేయాలని కోరగా, రక్షణశాఖ కార్యదర్శితో చర్చిస్తామని అరుణ్‌జైట్లి చెప్పారన్నారు. 

13:50 - June 20, 2017

రాజధాని వాసులకు సురక్షిత మంచినీరు..

విజయవాడ : రాజధాని ప్రాంత వాసులకు నేటి నుండి సురక్షిత మంచినీరు అమల్లోకి రానుంది. వెంకటపాలెంలో మదర్ ప్లాంట్లను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఆధునాతనంగా మదర్, డిస్పెన్సింగ్ యూనిట్ల నిర్మాణం చేపట్టారు. ఎన్టీఆర్ ట్రస్టు..సీఆర్డీఏ సహకారంతో రూ. 4 కోట్ల వ్యయంతో పథకం చేపట్టారు. ఈ పథకం ద్వారా 29 గ్రామాలకు నీరు సరఫరా జరగనుంది.

 

యాదవుల దగ్గర రూ. 25 వేల కోట్లు - కేసీఆర్..

సిద్ధిపేట : గొర్రెల పంపిణీ ద్వారా యాదవుల దగ్గర రూ. 25వేల కోట్ల సంపాదన వస్తుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కొండపాకలో గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్ ప్రసంగించారు. యాదవులు సంపద సృష్టిస్తారని పేర్కొన్నారు. అర్ధం కాని గొర్రెలకు ఏం చెప్పాలని ఎద్దేవా చేశారు.

13:38 - June 20, 2017

సిద్దిపేట : దేశంలో తెలంగాణ ధనిక రాష్ట్రాంగా ఉందని, ఆంధ్రపాలకులతో మన తెలంగాన సంపదను ఆంధ్రాకు తరలించరని తెలిపారు.వచ్చే సంవత్సరం తెలంగాణ బడ్జెట్ 5లక్షల కోట్ల చేరుతుందని అన్నారు. కేసీఆర్ ఏది చెప్పతే అది తప్పక జరుగుతుందని, ఆనాడు తెలంగాణ రాదని అందరు అన్నారు కానీ మెండిగా ముందుకెళ్లి తెలంగాణ సాధించుకున్నాం. గొర్రెలకు రోగలు వస్తే 1962 నెంబర్ ఫోన్ చేస్తే అంబులెన్స్ ఎట్ల వస్తాదో 1962 వస్తుతుందని, తెలంగాణలో గోల్ల, కుర్మలు ధనవంతులు కావాలని సీఎం కేసీఆర్ అన్నారు. ముదిరాజ్ కులస్తులకు కూడా కోట్ల సంపద సృష్టిస్తామని తెలిపారు. గొర్రెలతో 25వేల కోట్ల సంపద సృష్టిస్తున్నామని అన్నారు. వచ్చే ఏడాది రైతులకు ఎకరానికి 4వేలు ఇస్తామని అన్నారు. తెలంగాణ మొత్తంలో రైతు సంఘాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

ఆదివాసీ మహాసభలో పాల్గొన్న పినరయి..

విశాఖపట్టణం : ఆదివాసీ గ్రామ సభల తీర్మానాలకు విలువ లేకుండా గత, ప్రస్తుత ప్రభుత్వ చట్టాలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయని కేరళ సీఎం పినరయి విజయన్ పేర్కొన్నారు. విశాఖలో అఖిలభారత ఆదివాసీ మహాసభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పెట్టుబడుదారులకు వంత పలుకుతున్న ప్రభుత్వాలు గిరిజన భూములను వారికి ధారాదత్తం చేస్తున్నాయన్నారు. గిరిజనులు మరో మార్గం లేక వలస కూలీలుగా మారుతున్నారని, గిరిజన హక్కులు, చరిత్ర..సంస్కృతులపై ఎన్డీఏ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఆర్ఎస్ఎస్..సంఘ్ పరివార్..తమ ఏజెండాను గిరిజనులపై రుద్దుతున్నారని తెలిపారు.

13:22 - June 20, 2017
13:21 - June 20, 2017

1.50 లక్షల గొర్రెల దిగుమతి - కేసీఆర్..

సిద్ధిపేట : గొర్రెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా 7 లక్షల 61 వేల దరఖాస్తులు వచ్చాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కొండపాకలో గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్ ప్రసంగించారు. అందులో 7 లక్షల 18 వేల యూనిట్లు మంజూరయ్యాయని, ఇందుకు లక్షా 50 వేల గొర్రెల దిగుమతు చేసుకున్నట్లు కేసీఆర్ తెలిపారు.

'ఆర్థిక ప్రగతి నెంబర్ వన్ స్టేట్ మనదే'..

సిద్దిపేట : ఆర్థిక ప్రగతిలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్టేట్ గా నిలిచిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కొండపాకలో గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్ ప్రసంగించారు. 2024 నాటికి బడ్జెట్ 5 లక్షల కోట్లు ఉంటుందని గవర్నర్ తో ఇటీవల తాను పేర్కొన్నట్లు తెలిపారు.

 

13:03 - June 20, 2017
13:02 - June 20, 2017

మహబూబ్ నగర్ : తెలుగు రాష్టాల్లో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువన ఉన్న కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో..జూరాల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు పోటెత్తుతొంది. కృష్ణా బేసిన్‌లోని ఆల్మట్టి రిజర్వాయర్‌కు 1,875 క్యూసెక్కులు, నారాయణపూర్‌కు 2,031 క్యూసెక్కులు, జూరాలకు 6,365 క్యూసెక్కుల ఇన్‌ఫ్లోగా ఉంది. అలాగే తుంగభద్ర జలాశయానికి 227 క్యూసెక్కులు, నాగార్జున సాగర్‌కు 400 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో 19.65 టీఎంసీలు నీరు ఉండగా.. నాగార్జున సాగర్‌లో 118.17 టీఎంసీల నీరుంది.  

13:01 - June 20, 2017

విజయవాడ : కాపులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ జూలై 26న కిర్లంపూడి నుంచి అమరావతికి పాదయాత్ర చేపడుతున్నట్లు ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. కాపుల రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న తన వెనక జగన్‌, మోదీ ఉన్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత ఆగస్టులో హామీలు నెరవేరుస్తానన్న చంద్రబాబు.. ఇంతవరకు తన మాట నిలుపుకోలేదన్నారు. 

12:57 - June 20, 2017

ఢిల్లీ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం అమలులో అత్యుత్తమ ప్రగతి కనబర్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. జాతీయస్థాయిలో ఐదు అవార్డులను దక్కించుకున్నది. యువతకు ఉపాధి శిక్షణ, అవకాశాలు కల్పించడంలో విశేష కృషి చేసినందుకు.. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన అవార్డును తెలంగాణ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ సొంతం చేసుకొంది. నేషనల్ రిసోర్స్ ఆర్గనైజేషన్ - నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ఉత్తమ అవార్డును.. తెలంగాణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ సొంతం చేసుకుంది. ఢిల్లీలోని విజ్ఞానభవన్‌లో ఈ అవార్డులను కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, గ్రామీణ తాగునీటిశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, సహాయమంత్రి రాంకృపాల్ యాదవ్.. రాష్ట్ర అధికారులకు అందజేశారు.

కోరిన వారికి జాబుకార్డు
కోరిన ప్రతి ఒక్కరికీ జాబుకార్డు అందించడం.. వికలాంగులకు, అంతరించి పోతున్న ఆదిమ తెగలకు ప్రత్యేక జాబ్‌కార్డులు జారీ చేయడంతోపాటు కూలీలకు వేతన స్లిప్పులను అందజేయడం, సోషల్ ఆడిట్ కార్యక్రమాలు సమర్థంగా నిర్వహించడం వంటి కార్యక్రమాలకు జాతీయస్థాయిలో పారదర్శకత, జవాబుదారీతనం విభాగంలో తెలంగాణ అవార్డును సొంతం చేసుకుంది. ఈ పథకంలో కల్పించిన ఆస్తులకు భువన్ సాఫ్ట్‌వేర్ ద్వారా జియోట్యాగింగ్ చేయడంతో.. అత్యంత ఎక్కువ ఆస్తులను కంప్యూటరీకరించినందుకు మరో జాతీయస్థాయి అవార్డును తెలంగాణ సొంతం చేసుకుంది. ఈ రెండు అవార్డులను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్ నీతూప్రసాద్ అందుకున్నారు.

సకాలంలో వేతన చెల్లింపులు
ఎక్కువ మందికి ఉపాధి కల్పించడం, సకాలంలో వేతన చెల్లింపులు చేయడం, అత్యధిక సరాసరి వేతన రేటు చెల్లించిన క్యాటగిరీలో దక్కిన జాతీయ ఉత్తమ జిల్లా అవార్డును వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్, డీఆర్‌డీవో అధికారి శేఖర్‌రెడ్డి అందుకున్నారు. గ్రామస్థాయిలో సుస్థిర ఆస్తులను ఎక్కువ మొత్తంలో కల్పించినందుకుగానూ.. నిజామాబాద్ జిల్లా, మనోహరాబాద్ గ్రామ సర్పంచ్‌ తిరుపతిరెడ్డి అవార్డు అందుకున్నారు. కూలీలకు సకాలంలో కూలీ డబ్బులు చెల్లించినందుకు.. నిజామాబాద్ జిల్లా ఇందల్‌వాయి మండలం, గన్నారం గ్రామ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ అబ్దుల్ సత్తార్ అవార్డును అందుకున్నారు

 

12:54 - June 20, 2017

వెండితెరపై నటిస్తున్న పలువురు హీరో..హీరోయిన్లు ఇతరత్రా కారణాల వల్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు చూస్తుంటాం. అంతేగాకుండా నటీనటులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతున్నాయి. తాజాగా బోజ్ పురి నటి 'అంజలి శ్రీవాత్సవ' (29) కూడా చేరింది. ముంబైలోని జుహు రోడ్ లోని పరిమల్ సొసైటీలో ఉన్న తన నివాసంలో ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందివ్వడంతో ఇతర తాళంతో డోర్ ను ఓపెన్ చేయగా 'అంజలి' విగతజీవిగా కనిపించినట్లు సమాచారం. దీనితో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఏంటో తెలియరాలేదు. ఆమె ‘కెహు తా దిల్ మే బా’ చిత్రంలో నటించారు. గతంలో ‘గోపాల్ రాయ్, ఆదిత్య కశ్యప్, రాజా, ప్రేమ్ దూబే’ వంటి చిత్రాల్లో 'అంజలి' ప్రధాన పాత్రలు పోషించారు. మరి ఆత్మహత్యకు గల కారణాలు ఏంటో రానున్న రోజుల్లో తెలియనున్నాయి.

12:43 - June 20, 2017

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' ఏదైనా చిత్రంలో నటిస్తున్నారంటే చాలు ఆ సినిమాపై భారీ అంచనాలు నెలకొంటాయి. అంతేగాకుండా భారీ స్థాయిలో మార్కెటింగ్ జరుగుతుందనేది తెలిసిందే. ‘కాటమరాయుడు' చిత్రం అనంతరం 'పవన్' పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అందులో త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. అంతేగాకుండా పలు చిత్రాలను ఒప్పుకున్నట్లు..ఈ చిత్రాలను అత్యంత వేగంగా కంప్లీట్ చేయాలని 'పవన్' యోచిస్తున్నట్లు టాక్. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం నిర్మించబోయే చిత్రంలోనే కాకుండా మరో చిత్రంలో నటించేందుకు 'పవన్' అంగీకరించినట్లు తెలుస్తోంది. 'హైపర్‌' చిత్రానికి దర్శకత్వం వహించిన సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఈ చిత్రం ఉంటుందని..తమిళంలో 'విజయ్' నటించిన 'పోలీస్' చిత్రాన్ని రీమెక్ గా సినిమా ఉంటుందని తెలుస్తోంది. మరోమారు పవర్‌ఫుల్‌ పోలీస్‌గా 'పవన్' కనిపించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం ‘పవన్’ ఏకంగా పారితోషకం రూ. 40 కోట్లు తీసుకుంటున్నాడని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది.

గజ్వేల్ లో గొర్రెల పంపిణీ..

మెదక్ : జిల్లాలోని గజ్వేల్ లో గొర్రెల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై గొర్రెల పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ను గొర్రెల కాపరులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

జూన్ 30 అర్ధరాత్రి నుండి..

ఢిల్లీ : జూన్ 30వ తేదీ అర్ధరాత్రి నుండి జీఎస్టీ అమలు కానున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. జీఎస్టీపై పార్లమెంట్ ప్రత్యేక సమావశం ఉంటుందని, పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో జీఎస్టీ ప్రారంభ కార్యక్రమం జరుగనుందని తెలిపారు. రాష్ట్రపతి ప్రణబ్ చేతుల మీదుగా జీఎస్టీ ప్రారంభం ఉంటుందన్నారు. సమావేశానికి రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని, మాజీ ప్రధానులు ప్రారంభోత్సవానికి హాజరు కానున్నారని తెలిపారు.

రహేజా భూములు..ఏసీబీ కేసును కొట్టి వేసిన హైకోర్టు..

హైదరాబాద్ : రహేజా భూముల వ్యవహారంలో ఏసీబీ కోర్టు కేసును హైకోర్టు కొట్టివేసింది. ఐఏఎస్ అధికారులు బీపీ ఆచార్య, ఎల్వీ సుబ్రమణ్యం, రత్నప్రభ, పీఎస్ మూర్తి, ఐపీఎస్ గోపికృష్ణలపై కేసు కొట్టివేసింది.

12:24 - June 20, 2017

మెగాస్టార్ 'చిరంజీవి' తదుపరి చిత్రం గురించి అప్పుడే సోషల్ మాధ్యమల్లో తెగ ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంపై చిత్ర యూనిట్..దర్శక..నిర్మాతలు మాత్రం పెదవి విప్పడం లేదు కానీ సినిమాకు సంబంధించిన విషయాలు హల్ చల్ చేస్తున్నాయి. దాదాపు దశాబ్దకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న 'చిరు' ఇటీవలే 'ఖైదీ నెంబర్ 150’ తో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం 151 సినిమా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'చిరు' నటించనున్నాడని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. స్వాతంత్ర్య సమరయోధుడు 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కబోతోందని..ఇందుకు చిత్ర యూనిట్ భారీ సన్నాహాలు..ఏర్పాట్లు చేస్తున్నట్లు టాక్. ఫ్రీ ప్రొడక్షన్ పనులు చురుగ్గా సాగుతున్నాయని టాక్. పలు భాషల్లో ఈ సినిమాను రూపొందించాలని పక్కా ప్లాన్ చేస్తున్నారంట. అందుకని బాలీవుడ్..ఇతర వుడ్ లకు సంబంధించిన వారిని చిత్రంలో నటింప చేయాలని చిత్ర యూనిట్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 'చిరంజీవి' పక్కన నటించే హీరోయిన్ విషయంలో తర్జనభర్జనలు పడుతున్నారని..తొలుత 'ఐశ్వర్యరాయ్' అనుకున్నారని ప్రచారం జరిగింది. తాజాగా 'సోనాక్షి సిన్హా' అని టాక్ వినిపిస్తోంది. చిత్ర షూటింగ్ మొదలు పెడితే కానీ అసలు విషయాలు తెలియవు.

టి.టిడిపి రాష్ట్ర స్థాయి సమావేశం..

హైదరాబాద్ : ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో టి.టిడిపి రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఎల్.రమణ, రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి, సీతక్క, అమర్ నాథ్, గరికపాటిలు హాజరయ్యారు.

12:19 - June 20, 2017

మల్కాజ్ గిరి : జిల్లాలోని సేవ్ ఎ చైల్డ్ సంస్థ నిర్వకుడు సునిత్ కుమార్ బాలికను లైంగిక వేధింపులకు గురి చేసినట్టు మల్కాజ్ గిరి పోలీస్ స్టేషన్ లో బాలిక ఫిర్యాదు చేసింది. పోలీసులు సునిత్ పై నిర్భయ కేసు నమోదు చేశారు. గత 30 ఏళ్ల నుంచి సునిత్ సంస్థను నడుపుతున్నాడు. 16 తేదిన బాలిక తన సంరక్షకుణికి తెలపడంతో అందరు కలిసి ఫిర్యాదు చేశారు. ఈ స్వచ్చంద సంస్థలో 40 పల్లలు ఉన్నారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడిండి.

 

12:10 - June 20, 2017

గుంటూరు : బ్రహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి ఐవీఆర్ కృష్ణా రావు ను ఏపీ ప్రభుత్వం తొలగించింది. రాష్ట్ర విభజన తర్వాత ఆయన ఏపీకి సీఎస్ గా పని చేశారు. రిటైర్డ్ అనంతరం ఆయనను బ్రహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించింది. అయితే కృష్ణారావు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫేస్ బుక్ లో పొస్టులు చేశారు. ప్రభుత్వంలోని వ్యక్తుల పై కూడా ఆయన పొస్టులు పెట్టారు. బ్రహ్మణ కార్పొరేషన్ కు నిధులు కేటాయించడం లేదని ఆయన విమర్శించారు. దీని పై ఆరా తీసిన సీఎం చంద్రబాబు నిజానిజలు తెలసుకుని కృష్ణారావును తొలగించారు. ఆయన ప్రభుత్వం శాతకర్ణికి పన్ను రాయితీ, బాహుబలి సినిమా టికెట్ల ధర పెంపు పై ప్రభుత్వం పై సోషల్ మీడియాలో విమర్శలు చేయడంతో ఈ నిర్ణయం తీసుకునట్టు తెలుస్తోంది. కృష్ణారావు తొలగించడం పై బ్రహ్మణ సంఘాలు తీవ్ర వ్యతిరేకిస్తున్నాయి. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

కిర్లంపూడి నుండి అమరావతికి ముద్రగడ పాదయాత్ర..

విజయనగరం : కాపు రిజర్వేషన్లపై ప్రభుత్వంతో ముద్రగడ అమీతుమీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది. జులై 26వ తేదీన కిర్లంపూడి నుండి అమరావతికి పాదయాత్ర చేయనున్నట్లు వెల్లడించారు. జగన్..మోడీ ఉన్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.

 

ఉత్తరాఖండ్ కు భారీ వర్ష సూచన..

ఢిల్లీ : ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హరిద్వార్, డెహ్రాడూన్, రుద్రప్రయోగ్, చమోలి, నైనిటాల్, పితోరగఢ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

సీబీఐ గురించి మాట్లాడే హక్కు జగన్ లేదు - సోమిరెడ్డి..

నెల్లూరు : విశాఖపట్టణం భూ ఆక్రమణపై విచారణకు సిట్ వేయడం జరిగిందని, విచారణకు సీనియర్ ఐపీఎస్ అధికారిని నియమించినట్లు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. పలువురు అధికారులను సస్పెండ్ చేసినట్లు, రికార్డులు ట్యాపరింగ్ జరిగినట్లు గుర్తించినట్లు తెలిపారు. భూముల వ్యవహారం కేంద్రానికి సంబంధించి కాదని, భూ స్కామ్ తో ఎంత వ్యక్తులున్నా చర్యలు తీసుకుంటామన్నారు. సీబీఐ గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదన్నారు.

11:59 - June 20, 2017

మెగాస్టార్ చిరంజీవి తనయుడు 'రాం చరణ్' నెక్ట్స్ మూవీ కోసం చాలా కష్టపడుతున్నాడంట. ఆయన నటించిన 'ధృవ' ఘన విజయం సాధించడంతో తదుపరి చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ప్రస్తుతం యమ స్పీడుగా షూటింగ్ కొనసాగుతోంది. గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ 'రంగస్థలం 1985’ గా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. తూర్పుగోదావర జిల్లాలో అధిక శాతం షూటింగ్ జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ కోసం 'రాంచరణ్' ఏకంగా రోజంతా షూటింగ్ లో పాల్గొంటున్నాడని చిత్ర యూనిట్ వర్గాల కథనం..ఉదయం షూటింగ్ స్టార్ట్ చేస్తే రాత్రి వరకు కొనసాగుతోందని సమాచారం. అటవీ ప్రాంతాల్లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోందని, ఇందులో ‘రాం చరణ్’ కు కొన్ని గాయాలైనా లెక్క చేయడం లేదని సోషల్ మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ నెలాఖరువరకు ఈ షూటింగ్ కొనసాగుతుందనీ, అనంతరం హైదరాబాద్‌లో నిర్మించిన గ్రాండ్‌ సెట్‌లో ఉంటుందని చిత్ర యూనిట్ పేర్కొంటోంది. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ వర్షపు సీన్లలో కూడా సుకుమార్ షూటింగ్ కొనసాగిస్తున్నారంట. లుంగీ క‌ట్టుకొని న్యూలుక్‌లో చెర్రీని చూసి అక్క‌డి అభిమానులు మురిసిపోతున్నార‌ట‌. స‌మంతా కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోందంట. మరి 'చెర్రీ' కష్టానికి ప్రతిఫలం దక్కుతుందా ? లేదా ? అనేది చూడాలి.

బాబుతో డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీపీల భేటీ..

విజయవాడ : సీఎం చంద్రబాబు నాయుడితో డీజీపీ సాంబశివరావు, ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వర్లు సమావేశమయ్యారు.

సేవ్ ఏ ఛైల్డ్ సంస్థ నిర్వాహకుడి నిర్వాకం..

హైదరాబాద్ : మల్కాజ్ గిరి పీఎస్ పరిధిలోని సేవ్ ఏ ఛైల్డ్ సంస్థ నిర్వాహకుడి నిర్వాకం బయటపడింది. బాలికపై నిర్వాహకుడు సునీత్ కుమార్ లైంగికంగా వేధించాడని ఆరోపణలున్నాయి. మల్కాజ్ గిరి పీఎస్ లో బాలిక ఫిర్యాదు చేసింది. నిందితుడు సునీల్ కుమార్ పై నిర్భయ కేసు నమోదు చేశారు.

11:49 - June 20, 2017

గుంటూరు : ఏపీలో ఐపీఎస్‌ల బదిలీల లిస్ట్‌ రెడీ అయింది. బదిలీల నేపథ్యంలో ఐపీఎస్‌లతో సీఎం చంద్రబాబు ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. ఎస్పీలు, రేంజ్‌ డిజీలు, జోనల్‌ ఐజీలతో ముఖాముఖిగా మాట్లాడనున్నారు. అధికారుల సమర్ధత, పని తీరుపైన నివేదిక తెప్పించుకున్నారు. భేటీ అనంతరం బదిలీల జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. 

11:48 - June 20, 2017

ప్రకాశం : ప్రకాశం జిల్లా చీరాల మండలంలో ఓ కారు డ్రైవర్‌ అతివేగం..బాలుడి ప్రాణాలు బలితీసుకుంది. ఓడరేవు జంక్షన్‌లో రోడ్డు దాటుతున్న 12 ఏళ్ల బాలుడిని కారు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో బాలుడు దూరంగా ఎగిరిపడి అక్కడికక్కడే మృతిచెందాడు. కీర్తివారిపాలెంకు చెందిన ఆరో తరగతి విద్యార్థి కొండెపి యానాదిరావు చనిపోవడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. సీసీటీవీ పుటేజీతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు వాహనాన్ని చేజ్‌ చేసి పట్టుకున్నారు

11:47 - June 20, 2017

హైదరాబాద్ : తెలంగాణలో సంచలనం రేపిన బ్యూటీషన్‌ శిరీష ఆత్మహత్య తర్వాత ఆమెకు సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆమె ఆడియో టేపు ఇప్పుడు రాష్ట్రంలో హాట్‌టాఫిక్‌గా మారింది. రాజీవ్ తేజస్విని సంబంధంపై శిరీష ఆరా తీసింది. రాజీవ్ తేజస్విని ఫోన్ సంభాషణలు కావాలని నవీన్ అనే వ్యక్తిని శిరీష కోరింది. ఈ సందర్భంగా తేజస్విని తన శత్రువు అని పేర్కొంది. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

11:47 - June 20, 2017

వెండితెరపై ఓ వెలుగు వెలుగుతున్న నటీ నటులు తమ కూతురు..కుమారులను కూడా వెండితెరకు పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో ప్రముఖ హీరోల కుమార్తెలు..కుమారులు రీ ఎంట్రీ ఇవ్వడానికి తహ తహలాడుతున్నారు. తాజాగా బాలీవుడ్ బాద్ షా 'షారూఖ్ ఖాన్' తనయ వెండితెరకు పరిచయమవుతోందని..ఇప్పటికే రంగం సిద్ధమయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవలే ముంబైలో ఓ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఇందులో 'షారూఖ్' సతీమణి 'గౌరీఖాన్' కూడా హాజరయ్యారు. తన తనయ 'సుహాన'తో హాజరవడం చర్చనీయాశమైంది. ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకుని ఆమె ఎంట్రీ ఇచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అనిల్‌ కపూర్‌, అర్జున్‌ కపూర్‌, సోనమ్‌ కపూర్‌, కరణ్‌ జోహార్‌, సిద్ధార్థ మల్హోత్ర, అలియా భట్‌ తదితరులంతా హాజరయ్యారు. దీనితో అభిమానులు భారీ ఎత్తున పోటెత్తారు. ఈ నేపథ్యంలో కార్యక్రమాన్ని ముందుగానే ముగించుకున్నారంట. సుహన ఇలా ఎంట్రీ ఇవ్వడం..దీనిని బట్టి త్వరలోనే ఎంట్రీ ఉండబోతుందని ప్రచారం జరుగుతోంది. మరి నిజమా ? కాదా ? అనేది రానున్న రోజుల్లో తెలిసిపోతుంది.

11:46 - June 20, 2017

విజయవాడ : విజయవాడ, సత్యనారాయణ పురం శిశు విద్యామందిర్‌ పాఠశాల సమీపంలో.. విషాదం చోటు చేసుకుంది. హర్ష అనే బాలుడు .. ఉదయాన్నే పాల ప్యాకెట్‌ కోసం వెళ్తున్న సమయంలో ఘోర ప్రమాదం జరిగింది. చెట్టు కొమ్మ ఉన్నట్లుండి విరిగిపడి.. బాలుడి గొంతులో దిగబడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. హర్ష 8వ తరగతి చదువుతున్నాడు. ఈ ఘటనలో మృతి చెందిన హర్ష కుటుంబాన్ని ఆదుకుంటామని.. 42వ డివిజన్‌ కార్పొరేటర్‌ గందురీ మహేశ్‌ తెలిపారు. 

11:45 - June 20, 2017

ఆదిలాబాద్ : అపరిశుభ్ర వాతావరణం.. తరగతి గదుల్లో వర్షం.. కూర్చునేందుకు బల్లలు ఉండవు.. తాగేందుకు మంచినీరు దొరకదు.. టాయిలెట్ సౌకర్యం అసలే ఉండదు.. ఇది మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల దుస్థితి. కొత్త విద్యాసంవత్సరంలో కోటి ఆశలతో తరగతి గదిలోకి అడుగుపెట్టిన విద్యార్ధులకు సమస్యలు స్వాగతం పలికాయి. జిల్లా వ్యాప్తంగా చాలా పాఠశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వర్షాకాలం మొదలవడంతో విద్యార్ధులకు కష్టాలు మొదలయ్యాయి. విద్యార్ధులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్న ప్రభుత్వం తాగునీరు అందించలేని దుస్థితి నెలకొంది. దీంతో తాగునీటిని ఇంటి నుంచి తెచ్చుకుని దాహార్తి తీర్చుకుంటున్నారు విద్యార్ధులు. కంప్యూటర్ విద్య అందుబాటులో ఉన్న ఈరోజుల్లో ఇప్పటికీ 94 పాఠశాలలకు విద్యుత్తు సౌకర్యం లేదన్నది వాస్తవం. ఇక జిల్లాలోని స్కూళ్లలో టాయిలెట్స్ సమస్య తీవ్రంగా ఉంది. జిల్లాలో బాలురకు సంబంధించి 65, బాలికలకు సంబంధించి 36 పాఠశాలల విద్యార్ధులు బహిరంగ ప్రదేశాలకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో బాలికలు అవస్థలు పడుతున్నారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని విద్యార్ధులు కోరుతున్నారు.

వంటశాలల కొరత
ఇక పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తయారీకి సంబంధించి సమస్య వెంటాడుతూనే ఉంది. జిల్లాలోని 283 పాఠశాలల్లో అనువుగా వంటశాలలు నిర్మాణం చేయకపోవడంతో ఆరుబయటే వంట చేయాల్సి వస్తోంది. ముఖ్యంగా వర్షాకాలంలో పాఠశాల్లోని అపరిశుభ్రత వాతావరణంలో వంటలు చేస్తుండటంతో విద్యార్ధులకు నాణ్యమైన భోజనం అందడం లేదు. విద్యార్ధులకు పాత గదుల స్ధానాల్లో నూతన గదుల కోసం సర్వశిక్ష అభియాన్ కింద గత నాలుగేళ్లుగా నిర్మాణం చేపట్టారు. ఆ నిర్మాణాలు ఈ ఏడాది కూడా పూర్తి కావడం అనుమానమే. ప్రభుత్వం నిర్మాణాల బిల్లుల మంజూరులో జాప్యం చేస్తుండటంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి.

ఆంగ్ల భాష బోధన పై స్పష్టత కరువు
ఇక ప్రాథమిక పాఠశాల్లో ఆంగ్ల భాష బోధనపై స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో ఉపాధ్యాయులు ముందడుగు వేయడం లేదు. దీంతో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపించడానికి ఇష్టపడుతున్నారు. చాలా పాఠశాలల్లో విద్యార్ధులకు బెంచీలు లేకపోగా నేలపై కూర్చుని చదువుకోవాల్సి వస్తోంది. సర్కారీ బడిలో ఇన్ని సమస్యలుండటంతో ఈ ఏడాది మంచిర్యాల జిల్లాలో విద్యార్ధుల సంఖ్య 10 కంటే తక్కువగా ఉండటంతో 172 పాఠశాలలు మూతపడనున్నాయి. 20 కంటే తక్కువగా ఉన్న 142 పాఠశాలలు దగ్గరలోని పాఠశాలల్లో విలీనం చేసే ఆలోచనలో ఉన్నారు అధికారులు. లక్షెట్టిపేట మండలంలోని మోదెల గ్రామంలో ప్రాథమిక పాఠశాలకు తాళం వేసి ఉండటంతో పిల్లలు పాఠశాలకు రావడం లేదు.ఊత్కూరు గ్రామ పంచాయితీ పరిధిలోని ఆంధ్రకాలనీలో అదే పరిస్థితి. లక్షెట్టిపేట మండల కేంద్రంలోని UPS పాఠశాలలో ఉన్న ఇద్దరు ఉపాధ్యాయుల్లో ఒకరు సెలవులో ఉంటే మరొకరు 10వ తరగతి పరీక్ష విధులు నిర్వహిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో అటెండర్లు లేక విద్యార్ధులచే పాఠశాలలు శుభ్రం చేయిస్తున్నారు. దీంతో విద్యార్ధి సంఘాలు, తల్లిదండ్రులు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

11:26 - June 20, 2017

విశాఖ : కేరళ సిఎం పినరయి విజయన్ విశాఖ కు చేరుకున్నారు. నేటి నుండి విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరగనున్న అదివాసీ అదికార్ రాష్ట్రీయ మంచ్ 3వ జాతీయ మహాసభల్లో ఆయన పాల్గోంటారు..విశాఖ ఎయిర్ పోర్టు నుండి సిపిఎం కార్యకర్తలు భారీ ర్యాలీగా స్టీల్ ప్లాంట్ కు తరలివెళ్లారు..గిరిజనులు ఎదుర్కోంటున్న ప్రదాన సమస్యలపై ఈ మహసభల్లో చర్చిస్తారు..15 రాష్ట్రల నుండి 640 మంది ప్రముఖులు ఈ మహా సభలకు హాజరు కానున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ్‌ అందిస్తారు.

ప్రెస్ మీట్ నిర్వహించనున్న ఐవైఆర్..

విజయవాడ : మధ్యాహ్నం 3గంటలకు ఐవైఆర్ కృష్ణారావు ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. సోషల్ మీడియాలో చేసిన పోస్టింగ్ లపై ఆయన వివరణ ఇవ్వనున్నారు.

ఐవైఆర్ కృష్ణారావుపై వేటు..

విజయవాడ : బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ ఐవైఆర్ కృష్ణారావుపై వేటు పడింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫేస్ బుక్ లో ఆయన పలు పోస్టులు పెట్టారు. షేర్ చేసిన పోస్టులపై బాబు సర్కార్ సీరియస్ అయ్యింది.

బిచ్చగాళ్లను తీసుకెళ్లి..

హైదరాబాద్ :నగరంలోని ఎల్ బినగర్ లో కొంతమంది బిచ్చగాళ్లను ఎవరో తీసుకెళ్లారనే ఘటన కలకలం రేగింది. కానీ ఈ బిచ్చగాళ్లను తీసుకెళ్లింది ఉప్పల్ లోని స్వచ్చంద సంస్థ ప్రతినిధులుగా గుర్తించారు. నలుగురు బిచ్చగాళ్లకు ఆ సంస్థ ఆశ్రయం కల్పించింది.

నారా లోకేష్ ఆధ్వర్యంలో పార్లమెంటరీ సమావేశం..

విజయవాడ : కేశినేని భవన్ లో నారా లోకేష్ ఆధ్వర్యంలో విజయవాడ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో విజయవాడ పార్లమెంట్ పరిధి నేతలు..ముఖ్యనేతలు హాజరయ్యారు.

రూ.35వేలు తీసుకుని చిన్న గొర్రె పిల్లలా ?

మహబూబ్ నగర్ : గొర్రె పిల్లల పంపిణీ కార్యక్రమంలో గొల్లకురుమలు ఆందోళన చేశారు. రూ. 35వేలు తీసుకొని చిన్న గొర్రె పిల్లలు ఇస్తున్నారంటూ నిరసన వ్యక్తం చేశారు.

హస్తినలో భారీ బందోబస్తు..

ఢిల్లీ : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హస్తినలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. యూకేలో ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో భద్రతను పెంచారు.

 

జైట్లీతో కేటీఆర్ భేటీ..

ఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కాసేపటి క్రితం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. ఆర్థికపర అంశాలు..కంటోన్మెంట్ ఏరియాలో రోడ్ల విస్తరణపై కేటీఆర్ చర్చించారు.

ఆరుగురు కానిస్టేబుళ్లకు గాయాలు..

చిత్తూరు : జిల్లాలోని శ్రీకాళహస్తి వన్ టౌన్ పోలీసు వాహనం బోల్తా పడింది. ఆరుగురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కేసు విచారణకై వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

పురుగుల మందు తాగిన రైతు..

భద్రాద్రి కొత్తగూడెం : జూలూరు పాడు (మం) బేతాలపాడులో పురుగుల మందు తాగి రైతు గుగ్లొతు మంచ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బకాయి డబ్బులు చెల్లించనందుకు వ్యాపారి దూషించడంతో మనస్థాపంతో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జూలూరు పాడు ప్రధాన రహదారిపై రైతు మృతదేహంతో బంధువులు ఆందోళన చేపట్టారు. దీనితో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది.

చెట్టును ఢీకొన్న కారు..ఇద్దరు మృతి..

మహబూబ్ నగర్ : కోయిలకొండ సమీపంలో ప్రమాదవశాత్తు చెట్టును కారు ఢీకొననడంతో ఇద్దరు మృతి చెందారు. మృతులు దామరగిద్ద వాసులుగా గుర్తించారు.

పాలప్యాకెట్ కు వెళ్లిన బాలుడు..అనంతలోకాలకు..

విజయవాడ : సత్యనారాయణపురంలో విషాదం చోటు చేసుకుంది. శిశు విద్యామందిర్ పాఠశాల సమీపంలో చెట్టుకొమ్మ విరిగిపడడంతో హర్ష అనే విద్యార్థి మృతి చెందాడు. పాలప్యాకెట్ కోసం దుకాణానికి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

ఏపీలో ఐపీఎస్ ల బదిలీల జాబితా..

విజయవాడ : ఏపీలో ఐపీఎస్ ల బదిలీల జాబితా సిద్ధమైనట్లు తెలుస్తోంది. బదిలీల నేపథ్యంలో ఐపీఎస్ లో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఎస్సీలు, రేంజ్ డీజీలు, జోనల్ ఐజీలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. అధికారుల సమర్థత, పనితీరుపై చంద్రబాబు నివేదిక తెప్పించుకున్నారు. సీఎంతో ఐపీఎస్ ల భేటీలు పూర్తయిన తరువాత బదిలీల జాబితా విడుదల చేసే అవకాశం ఉంది.

గ్రేటర్ నోయిడాలో దారుణం

 

ఉత్తర్ ప్రదేశ్ : గ్రేటర్ నోయిడాలో దారుణం జరిగింది. ఓ మహిళను కిడ్నాప్ చేసి సామూహిక అత్యచారం చేశారు. అనంతరం మహిళను కారులో నుంచి తోసెశారు.

09:30 - June 20, 2017

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా జూలూరుపాడులో మండలం బేతాలపాడు విషాదం జరిగింది. అప్పుల బాధతో ఓ రైతు పురుగుల మందు తాగి హత్మహత్య చేసుకున్నాడు. బకాయి డబ్బులు ఇవ్వలేదని వ్యాపారి రైతును దూషించడంతో మనస్తాపంతో రైతు గుగ్లోతు ఆత్మహత్య చేసుకున్నారు. గగ్లోతు గత ఖరీప్ లో వ్యాపారి దగ్గర విత్తనాలు పురుగుల మందు తీసుకున్నాడు. కానీ పంట గిట్టుబాటు ధర లేక బకాయిలు చెల్లించలేకపోయాడు. నిన్న వర్షం పడడంతో విత్తనాల కోసం అదే వ్యాపారి దగ్గరకు వెళ్లాడు. ఆ వ్యాపారి అందిరి రైతుల ముందు తిట్టడంతో ఇంటికొచ్చిన గుగ్లోతు ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాలకు వీడియో చూడిండి.

 

09:19 - June 20, 2017

సినిమా : చెన్నైలో గౌతమ్‌నంద చిత్రీకరణలో దర్శకుడు సంపత్ నంది పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన గౌతమ్ నంద చిత్రం గురించి మాట్లాడుతూ ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌ను ఇప్పటివరకు 25 లక్షలమంది చూశారని. దీన్ని ప్రేక్షకులు నాకు ఇచ్చిన బహుమతిగా భావిస్తున్నానని తెలిపారు.
ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌లో స్థానం సంపాదించిన బిలియనీర్‌ కొడుకు పాత్రను గోపీచంద్‌ పోషిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఫోర్బ్స్‌లో స్థానం సంపాదించిన వ్యక్తులు, వాళ్ల పిల్లల లైఫ్‌ స్టైల్ ఎలా ఉంది? అని రీసెర్చ్‌ చేసి ఈ లుక్‌ ఫైనలైజ్‌ చేశారు. హీరో క్యారెక్టర్‌లో రెండు షేడ్స్‌ ఉంటాయి. హిందీ చెన్నై ఎక్స్‌ప్రెస్‌ లో తంగబలిగా నటించిన నికితిన్‌ ధీర్, ముఖేష్‌ రుషి... ఇద్దరూ విలన్లుగా నటిస్తున్నారు. అలాగే, ఇది పవన్‌కల్యాణ్‌గారి కోసం రాసిన కథ కాదని సంపత్ నంది వెల్లడించారు. ఎవరి దగ్గరో మార్కులు కొట్టేయడానికి గౌతమ్‌నంద టైటిల్‌ పెట్టలేదని అన్నారు. సినిమా చూస్తే టైటిల్‌ జస్టిఫికేషన్‌ తెలుస్తుంది. కథ, క్యారెక్టర్‌ ప్రకారం చేసింది తప్ప... ఏదో స్టైల్ కోసం పెట్టలేదు. హీరోను నేను ఎలా ఊహించుకున్నానో గోపీచంద్‌గారు అంతకంటే బాగున్నారని దర్శకుడు చెప్పుకొచ్చారు. సినిమా కోసం ఆయన స్కైడైవ్, వింగ్‌ వాక్‌ (ఫ్లైట్‌పై నుంచుని నడిచే షాట్స్‌), ఎడారిలో బైక్‌ రైడింగ్‌ వంటి వైల్డ్‌ అడ్వెంచర్స్‌ అన్నీ చేశారని తెలిపారు. దర్శకుడిగా నేను ఏదైనా రాసుకోవచ్చు కానీ, హీరో నుంచి సహకారం లేకుంటే ఏదీ చేయలేమని సంపత్ నంది ఈ సందర్భంగా హీరో గోపీ చంద్ ను ప్రశంసించారు. 

09:11 - June 20, 2017

నెల్లురు : ఇస్రో మరో ఘనతను సాధించింది. ఇస్రో ప్రయోగించిన మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌ విజయవంతంగా వెయ్యి రోజులను పూర్తి చేసుకొంది. అంగారక గ్రహం అధ్యయనం కోసం 2013 నవంబరు 5న మామ్‌ను ప్రయోగించింది. 2014 సెప్టెంబరు 24న ఉపగ్రహం అంగారక కక్ష్యలోకి ప్రవేశించింది. మామ్‌ జీవితకాలం 6 నెలలుగా ఇస్రో ప్రకటించింది. అయితే మామ్‌ అంచనాలను తల్లకిందులు చేస్తూ నిర్విరామంగా సేవలు అందిస్తోంది. ఇప్పటికి అంగారకుడి చుట్టూ 388 ప్రదక్షిణలను పూర్తి చేసింది. వెయ్యిరోజుల తర్వాతకూడా ఉపగ్రహం పూర్తిఆరోగ్యంగా ఉందని ఇస్రో ప్రకటించింది. ఇప్పటి వరకు మార్స్‌కు సంబంధించిన 715 చిత్రాలను భూమికి చేరవేసిందని ఇస్రో అధికారులు తెలిపారు. 

09:10 - June 20, 2017

హైదరాబాద్ : హైదరాబాద్‌ గచ్చిబౌలి సుదర్శన్‌ నగర్‌లో నివాసముంటున్న ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని అనుమానాస్పద మరణం కలకలం రేపుతుంది....ఇంట్లో ఉరితాడుకు వేలాడుతున్న ఆమెను భర్తే చంపాడంటున్న కుటుంబీకులు..ఉరేసుకున్న ఆమె ఒంటిపై గాయాలెలా వచ్చాయని ప్రశ్నిస్తున్నారు.మాదాపూర్‌లోని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిగా పనిచేస్తున్న పద్మజకు టెక్‌ మహీంద్రలో పనిచేస్తున్న గిరీశ్‌ నరసింహకు గత ఏడాది ఏప్రిల్‌ 20న పెళ్లయింది...పెళ్లయిన కొద్ది కాలం తర్వాత వీరిద్దరి మధ్య విబేధాలు తలెత్తాయి...వరకట్నం కోసం నరసింహ తరచూ వేధిస్తుండేవాడని పద్మజ తల్లిదండ్రులు చెబుతున్నారు...ఇదిలా ఉంటే పద్మజ తన ఇంట్లోనే ఉరితాడుకు వేలాడింది. ఇదిలా ఉంటే పద్మజ ఉరేసుకుని చనిపోయిందని పోలీసులు చెబుతుండగా...తమ కూతురిని అల్లుడే చంపాడంటున్నారు.. పోలీసులు ఫిర్యాదుపై కేసు నమోదు చేసి గిరీష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.ఇక పద్మజ ప్రతీ ఆదివారం ఇంటికి వచ్చేదని...అయితే రాకపోవడంతో ఫోన్ చేస్తే వస్తున్నానని చెప్పిందన్నారు..సాయంత్రం ఫోన్ చేస్తే లిఫ్ట్‌ చేయకపోవడంతో అల్లుడికి ఫోన్ చేశామని..పద్మజ ముక్కు,చెవులోంచి రక్తం వస్తుందని ఆస్పత్రికి తీసుకువెళ్తున్నట్లు చెప్పాడన్నారు...ఆస్పత్రికి వెళ్లేసరికి ఐసీయూలో ఉంచారని వైద్యులు కూడా ఏమీ చెప్పలేదంటున్నారు..ఆ తర్వాత చనిపోయిందని తెలిసిందంటున్నారు కుటుంబీకులు..తమ కూతురిని కొట్టేవాడని...ఈ క్రమంలోనే ఏదో జరిగిందన్న అనుమానాలున్నాయంటున్న కుటుంబీకుల ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

09:08 - June 20, 2017

నిజామాబాద్ : నిజామాబాద్‌లో చేపట్టిన అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి పనులన్నీ పూర్తి చేయాలన్న ప్రభుత్వ ఆలోచన కార్యరూపం దాల్చేటట్లు కనిపించడం లేదు. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనుల కోసం తొలుత 94 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఆ తర్వాత వంద కోట్లకు చేరింది. ఈ పనులను అయ్యప్ప ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్‌ చేపట్టింది. గతేడాది మార్చిలో పనులకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే.. పనుల్లో మాత్రం తీవ్ర జాప్యం జరుగుతోంది. స్థానిక ఎమ్మెల్యే కూడా చూసీచూడనట్లు వ్యవహరించడంతో ఈ పనులు మరింత ఆలస్యమవుతున్నాయి.

2550 మ్యాన్‌హోల్స్‌ నిర్మించాలి
మొత్తం 2550 మ్యాన్‌హోల్స్‌ నిర్మించాల్సి ఉండగా... వెయ్యి మాత్రమే పూర్తయ్యాయి. అయితే వర్షాకాలం కావడంతో ఈ పనులకు బ్రేక్‌ పడింది. ఇక లోతట్టు ప్రాంతాల్లో పనులు ముందుకు సాగడం లేదు. అదేవిధంగా 12.4 కిలోమీటర్ల మేర మెయిన్‌ పైపులైన్లు నిర్మించాల్సి ఉండగా.. ప్రస్తుతానికి 4 కిలోమీటర్ల పనులు మాత్రమే పూర్తి చేశారు. అయితే.. అనేక సమస్యలతో ఈ పనులకు అడుగడుగున అడ్డంకులు ఏర్పాడుతున్నాయి. నగరంలోని ఇళ్లను అనుసంధానం చేస్తూ 85 కిలోమీటర్ల మేర పైపులైన్‌ వేయాల్సి ఉండగా.. 34 కిలోమీటర్లు మాత్రమే పూర్తి చేశారు. వర్షాలు పడుతుండడంతో పనులు ముందుకు సాగడం లేదు. మొత్తానికి డిసెంబర్‌ చివరినాటికి నగరంలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. కానీ.. నత్తనడకన సాగుతున్న పనులతో ఇది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. 

09:06 - June 20, 2017

సిద్దిపేట : సిద్ధిపేట జిల్లా, రాజీవ్‌ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొండపాక మండలం, తిమ్మారెడ్డి పల్లికి చెందిన గ్రామస్థులు డీసీఎంలో పెళ్లికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో.. వేములవాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో డీసీఎంలో ఉన్న పెళ్లి బృందంలో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మిగతావారిని సిద్ధిపేట జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. 

08:50 - June 20, 2017

అభ్యర్థి దళతుడు ఆర్ ఎస్ ఎస్ అనుబంధ వ్యక్తి అని టెన్ టివి న్యూస్ మార్నింగ్ పాల్గొన్న సీపీఎం నేత బాబురావు అన్నారు. ఎన్డీఏ అభ్యర్థిగా దళిత వ్యక్తి నియమించడం మంచి పరిణామం అని టీడీపీ నేత విజయ్ కుమార్ అన్నారు. దళిత నేతను అభ్యర్థిగా ఎంపిక పై రాజకీయాలు చేయడం మంచిది కాదని బీజేపీ నేత శ్రీధర్ అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

08:46 - June 20, 2017

కర్నూలు : ఎర్రదండు కదం తొక్కింది. ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం 27వ రాష్ట్ర మహాసభల సందర్భంగా కర్నూలు ఎరుపెక్కింది. రైతులు, వ్యవసాయ కార్మికులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కర్నూలులో ప్రధాన రహదారులగుండా సాగిన ర్యాలీ..ఎస్‌టీబీసీ కళాశాల గ్రౌండ్‌కు చేరింది. అక్కడ జరిగిన బహిరంగ సభకు రైతులు, వ్యవసాయ కార్మికులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. బహిరంగ సభలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వ్యవసాయ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా సంక్షోభంలోకి నెడుతోందంటూ నిప్పులు చెరిగారు. దేశంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని, వ్యవసాయ రంగానికి కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు తగ్గాయన్నారు. మోదీ సర్కార్‌ రైతులను వదిలి కార్పొరేటర్లకు ఎర్రతివాచీ పరుచుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్లకు లక్షలకోట్లు సబ్సిడీ ఇస్తోన్న మోదీ... దేశానికి అన్నంపెట్టే అన్నదాతకు మొండిచేయి చూపుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ రైతు , కార్మిక వ్యతిరేక విధానాలను ప్రజలంతా ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కేంద్ర వినాశకర విధానాలకు చరమగీతం పాడేందుకు అంతా విశాలవేదికపైకి రావాలన్నారు. కుల,మత, ప్రాంతాలకు అతీతంగా ప్రజలంతా వామపక్ష ప్రత్యామ్నాయాన్ని బలపర్చాలన్నారు.

రైతులను కొల్లగొడుతున్నారు...
చంద్రబాబు ప్రభుత్వంపై సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఏ. గఫూర్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం రైతుల నుంచి భూములను బలవంతంగా లాక్కొంటోందని ఆరోపించారు. రైతులను కొల్లగొట్టి పెట్టుబడిదారులకు చంద్రబాబు వంతపాడుతున్నారన్నారు. సంపన్నుల అభివృద్ధినే రాష్ట్రాభివృద్దిగా చెబుతున్నారని విమర్శించారు. రాయలసీమలో వలసల నివారణకు చంద్రబాబు ఏనాడైనా చర్యలు తీసుకున్నారా అంటూ ఆయన ప్రశ్నించారు.ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నిర్వహించే ఉద్యమాలకు సంపూర్ణ సహకారం ఉంటుందని తెలంగాణ వ్యయసాయ కార్మికసంఘం నేత బి. వెంకట్‌ అన్నారు. ఇద్దరు చంద్రులు కలిసి రైతులను, వ్యవసాయకార్మికులను దగా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కర్నూలో ప్రదర్శన సందర్భంగా కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలు మంగళవారం ప్రతినిధుల సభ ప్రారంభమవుతుంది. బుధవారం మహాసభలు ముగుస్తాయి. ఈ మహాసభల్లో పలు తీర్మానాలను ఆమోదించనున్నారు. బుధవారం వ్యవసాయ కార్మికసంఘం రాష్ట్రనూతన కమిటీని ప్రతినిధులు ఎన్నుకుంటారు.

 

08:44 - June 20, 2017

గుంటూరు : రాష్ట్ర ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రతి సోమ, గురువారం ఏపీ ప్రభుత్వం గ్రీవెన్స్‌ డే నిర్వహిస్తోంది. సమస్యలను ప్రజల నుంచి అధికారులు నేరుగా తెలుసుకోవడం, వాటిని పరిష్కరించాలన్న సదుద్దేశంతో ఏపీ ప్రభుత్వం గ్రీవెన్స్‌ డే నిర్వహిస్తోంది. ప్రతివారం దీన్ని నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీంతో వారంలోని ఈ రెండు రోజుల్లో తమ కష్టాలను చెప్పుకునేందుకు వెలగపూడిలోని సచివాలయానికి ప్రజలు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. తమ కష్టాలు తీరుతాయన్న భరోసాతో వ్యవప్రయాసల కోర్చి వస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి సచివాలయానికి వస్తున్న ప్రజల ఆశలు అడియాసలే అవుతున్నాయి. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి అధికారులుకానీ... మంత్రులుగానీ ఉండడం లేదు. ప్రజలకు వారు సమయమే కేటాయించడం లేదు. ఇవాళ మంత్రి కొల్లు రవీంద్ర తప్ప మరో మంత్రి సచివాలయానికి రాలేదు. దీంతో వివిధ ప్రాంతాల నుంచి సమస్యలు చెప్పుకుందామని ఆశపడ్డ ప్రజలకు నిరాశే మిగిలింది.

నిరాశకు గురౌతున్న ప్రజలు
ప్రభుత్వం ప్రతి సోమ, గురువారాలను గ్రీవెన్స్‌డేగా ప్రకటించడంతో ప్రజలు సచివాలయానికి వస్తున్నారు. సుదూరు ప్రాంతాల నుండి వచ్చేవారు ముందురోజు రాత్రే సచివాలయానికి చేరుకుంటున్నారు. శ్రీకాకుళం నుండి వెలగపూడికి వచ్చి సమస్యను చెప్పుకోవడానికి ఒకపేదవాడికి కనీసం ఎంత తక్కువ వేసుకున్న 1000 రూపాయలు ఖర్చవుతుంది. మంత్రులు అందుబాటులో లేకపోవడంతో, మళ్లీ అతను సచివాలయానికి తిరిగి రావాలంటే సాధ్యం అయ్యే పని కాదు . ఇలా అనేక మంది పూట గడవకపోయినా, సమస్య పరిష్కారం అవుతుందనే ఆశతో సచివాలయానికి వస్తారు. కాని మంత్రులు మాత్రం సామాన్య ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మంత్రులను కలవడానికి ఎంతో ఖర్చు పెట్టి వచ్చామని....కాని అధికారులు లోపలికి రానివ్వకుండా తోసేస్తున్నారని గుంటూరు నుండి వచ్చిన బాధితులు చెబుతున్నారు. ఇప్పటికి అనేక సార్లు సచివాలయానికి వచ్చామని , కాని ఎప్పుడు వచ్చిన పోలీస్ లు అనుమతి ఇవ్వడం లేదని ఓ వృద్ధురాలు ఆవేదన చెందుతోంది.

సొంత జిల్లా కూడా అంతే
సీఎం సొంత జిల్లా చిత్తూరు నుండి వచ్చిన బాధితులది మరో గోడు. జిల్లాకు సీఎం వస్తే సమస్యలు చెప్పుకుందామని ఎదురుచూశామని... అయితే చంద్రబాబు జిల్లాకు రాకపోవడంతో సచివాలయానికి వచ్చామన్నారు. ఎంతో ఖర్చు పెట్టి చిత్తూరు నుండి వస్తే , పోలీసులు చులకనగా చూస్తున్నారని... బాధ్యతాహిత్యంగా వ్యవహరిస్తూ తమను కనీసం సచివాలయంలోకి కూడా పోనివ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒంగోలు నుండి తాము ఇప్పటికీ 7 సార్లు వచ్చినా ఒక్కసారి కూడా పోలీసులు లోపలికి పంపడం మరికొంతమంది చెబుతున్నారు. ఓట్ల కోసం ఇంటింటికి వచ్చిన నాయకులు ఇప్పుడు కనీసం తమను పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.అధికారుల ఆంక్షలు, మంత్రుల గైర్హాజరుతో... ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రీడెన్స్‌ డే లక్ష్యం నీరుగారుతోంది. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు.. దీనిపై దృష్టిపెట్టి... గ్రీవెన్స్‌ డేలో ప్రజల సమస్యలు తీరేలాచర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

08:41 - June 20, 2017

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకు పొలిటికల్‌ సీన్‌ మారుతూ వస్తుంది. ఇటీవల టీడీపీ, వైసీపీ, బీజేపీల మధ్య అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఇన్ని రోజులు మిత్రపక్షంగా ఉన్న టీడీపీ, బీజేపీల మధ్య దూరం పెరుగుతున్న ఛాయలు కనబడుతున్నాయి. బీజేపీ... వైసీపీకి చేరువవుతూ...టీడీపీ మద్దతు లేకపోయినా... తమకు ఇబ్బంది లేదన్న సంకేతాలు ఇస్తోంది. పార్టీ పరంగా బలపడేందుకు బీజేపీ.. ఏపీపై దృష్టి సారిస్తుంది. రాష్ట్రంలో పట్టు కోసం టీడీపీతో కలిసి పని చేసిన బీజేపీ ఇప్పుడు వైసీపీ కూడా తమకు శతృవు కాదన్నట్టుగా వ్యవహరిస్తోంది. ఈ మేరకు రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసిన బీజేపీ అధిష్టానం...వైసీపీ మద్దతు కోరింది. స్వయంగా...పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్‌షా... జగన్‌కు ఫోన్‌ చేసి మద్దతు కోరారు.

వైసీపీ కూడా స్నేహ హస్తం
అలాగే వైసీపీ కూడా బీజేపీకి స్నేహ హస్తం అందిస్తోంది. బీజేపీ ఎంపిక చేసిన అభ్యర్థి దళిత సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో తమ మద్దతు సంపూర్ణంగా ఉంటుందని జగన్‌ కూడా ప్రకటించారు. అలాగే ఇటీవల జగన్‌ ప్రధానమంత్రి మోదీని కలవడం.. నిన్నటి వరకు ప్రత్యేకహోదాపై పోరాటం చేసిన వైసీపీ...ఇప్పుడు ఆ విషయాన్ని ప్రస్తావించకపోవడం వంటి అంశాలు వైసీపీ...బీజేపీకి అనుగుణంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో వైసీపీ కేంద్రం ప్రభుత్వంతో రాజకీయంగా పావులు కదుపుతున్నట్టు పలువురు భావిస్తున్నారు. రాబోయే ఎన్నికల నాటికి ఈ మూడు పార్టీల మధ్య ఇంకెన్ని మార్పులు జరుగుతాయోననే చర్చా సాగుతుంది.

 

07:56 - June 20, 2017

గజ్వేల్ : గొల్ల కురుములకు గొర్రెలు అందించే కార్యక్రమానికి ఈరోజు తెలంగాణ ముఖ్యమత్రి కేసీఆర్‌ శ్రీకారం చుట్టబోతున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలోని కొండపాక మండల కేంద్రంలో కేసీఆర్‌ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షల యాదవ కుటుంబాలకు లబ్ధి చేకూరేలా 75 శాతం సబ్సిడీపై 84 లక్షల గొర్రెలు పంపిణీ చేయనున్నారు. అన్ని జిల్లాల్లోనూ ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు లబ్దిదారులకు గొర్రెలు పంపిణీ చేస్తారు. తొలి ఏడాది 50 శాతం, వచ్చే ఏడాది మరో 50 శాతం అందించనున్నారు. ఎంపికైన లబ్దిదారులకు 20 గొర్రెలతో పాటు.. ఒక పొట్టేలును ఇవ్వనున్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు
అయితే.. గొర్రెల పంపిణీకి ఆదిలోనే కష్టాలు వచ్చిపడ్డాయి. ఇతర రాష్ట్రాల నుంచి గొర్రెలను కొనుగోలు చేసి.. లబ్దిదారులకు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయానికి ఎదురుదెబ్బ తగిలింది. లబ్దిదారులకు సరిపడా గొర్రెలు లబించలేదన్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఎవరికి గొర్రెలు ఇస్తారో.. లేదో అర్ధం కావడం లేదని లబ్ధిదారులంటున్నారు. అయితే... అన్ని రాష్ట్రాల నుంచి గొర్రెలను కొనుగోలు చేస్తున్నామని... ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి కేసీఆర్‌ ఈ గొప్ప నిర్ణయం తీసుకున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్తర పథకం ద్వారా యాదవుల బతుకుల్లో మార్పులు వస్తాయా ? లేదో ? చూడాలి. 

నేటి నుంచి ఆస్ట్రేలియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ

ఆస్ట్రేలియా : నేటి నుంచి ఆస్ట్రేలియా ఓపెన్ సిరిస్ బ్యాడ్మింటన్ టోర్నీ ప్రారంభం కానుంది.

ఐపీఎస్ లతో చంద్రబాబుతో ముఖాముఖి

గుంటూరు : నేటి నుంచి ఐపీఎస్ లతో సీఎం చంద్రబాబు ముఖాముఖి జరపనున్నారు. నేడు తొలి విడతగా 8 మంది ఐపీఎస్ లతో భేటీ కానున్నారు.

తెలంగాణలో నేటి గొర్రెల పంపిణీ

హైదరాబాద్ : తెలంగాణలో నేటి నుంచి గొర్రెల పంపిణీ చేయనున్నారు. సిద్దిపేట జిల్లా కొండపాకలో గొర్రెల పంపిణీ సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.

నేడు కరీంనగర్ ఈటెల పర్యటన

కరీంనగర్ : నేడు కరీంనగర్ జిల్లాలో మంత్ర ఈటెల రాజేందర్ పర్యటించనున్నారు. హుజూరాబాద్ మండలం వెంకటపూర్ లో యాదువులకు గొర్రెల పంపిణీ చేయనున్నారు.

Don't Miss