Activities calendar

21 June 2017

21:27 - June 21, 2017

ఢిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థిని బరిలోకి దింపి బిజెపికి గట్టి పోటీ ఇవ్వాలనుకుంటున్న విపక్షాలకు జెడియు షాకిచ్చింది. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌కు మద్దతివ్వాలని ఆ పార్టీ నిర్ణయించింది. పట్నాలో జరిగిన సమావేశంలో కోవింద్‌కే ఓటు వేయాలని ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ సూచించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయాన్ని నితీష్‌ అధికారికంగా ప్రకటించలేదు.

మహాగట్‌బంధన్‌ బీటలు వారే పరిస్థితి

జెడియు నిర్ణయంతో బిహార్‌ మహాగట్‌బంధన్‌ బీటలు వారే పరిస్థితి ఏర్పడింది. బిహార్‌లో జెడియు, ఆర్జేడి, కాంగ్రెస్‌ల సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఎన్డీయే అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ పేరు ప్రకటించగానే నితీష్‌ మాజీ గవర్నర్‌ను కలుసుకుని హర్షం వ్యక్తం చేశారు. కోవింద్‌తో తనకున్న అనుబంధాన్ని వివరించి రాష్ట్రపతి ఎన్నికల విషయంలో మినహా మిగతా అన్ని విషయాల్లోనూ విపక్షాలకు సహకరిస్తామని సోనియాగాంధీకి నితీష్ చెప్పినట్టు సమాచారం.

రాష్ట్రపతి ఎన్నికల్లో శివసేన బిజెపి అభ్యర్థి నే..

రాష్ట్రపతి ఎన్నికల్లో శివసేన బిజెపి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌నే సమర్థించింది. అభ్యర్థి ఎంపిక విషయంలో బిజెపి రాజకీయం చేసిందని ఆరోపించింది. రాష్ట్రపతి అభ్యర్థిగా ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, స్వామినాథన్‌ పేర్లను శివసేన సూచించిన విషయం తెలిసిందే.

కోవింద్‌కు మద్దతివ్వాలని కేంద్ర మంత్రి రాందాస్‌ అథావాలె

రాష్ట్రపతి ఎన్నికల్లో రామ్‌నాథ్‌ కోవింద్‌కు మద్దతివ్వాలని కేంద్ర మంత్రి రాందాస్‌ అథావాలె ప్రతిపక్ష పార్టీలను కోరారు. కోవింద్‌ను బలపరుస్తూ RPI పార్టీ తరపున నామినేషన్‌ పత్రాలపై ఆయన సంతకం చేశారు. రామ్‌నాథ్‌ కోవింద్‌ పేరును బలపరుస్తూ టిఅర్‌ఎస్‌ పార్టీ తరపున నామినేషన్‌ పత్రాలపై ఎంపీ జితేందర్‌రెడ్డి సంతకం చేశారు.

దళిత సామాజిక వర్గానికి చెందిన రామ్‌నాథ్‌ కోవింద్‌ను

దళిత సామాజిక వర్గానికి చెందిన రామ్‌నాథ్‌ కోవింద్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా బిజెపి ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆధ్వర్యంలో విపక్షాలు గురువారం పార్లమెంట్ లైబ్రరీలో సమావేశం కానున్నాయి. విపక్షాల అభ్యర్థిని బరిలోకి దింపే అంశంపై చర్చించనున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతుదారుడైన రామ్‌నాథ్‌ కోవింద్‌పై పోటీ పెట్టాలని వామపక్షాలు ఇప్పటికే స్పష్టం చేశాయి.  

21:21 - June 21, 2017

హైదరాబాద్: తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకంలో అధికారుల అలసత్వం బయటపడుతోంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకం పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గొర్రెల కోసం ఇతర రాష్ట్రాలకు యాదవ్‌లను తీసుకెళ్లిన అధికారులు.. వారిని మళ్లీ తీసుకురావడం మాత్రం మరించారు. పొరుగు రాష్ట్రంలో అన్నపానియాలు లేక అవస్థలు పడుతున్న అనాజ్‌పూర్‌ గ్రామస్తుల కష్టాలపై టెన్‌ టీవీ కథనం..

గొర్రె పిల్లల పంపిణీ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం గొల్ల కురుమలకు గొర్రె పిల్లల పంపిణీ పథకాన్ని ఈ నెల 20న ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. యాదవ్‌లకు చేయూత అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ ఈ పథకాన్ని ప్రారంభించారు. అయితే సదుద్దేశంతో ప్రారంభించిన ఈ పథకంలో లోపాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా అనాజ్‌పూర్‌లో ఈ పథకంలోని లోపాలు బహిర్గతం అయ్యాయి..

ధర్మవరంలో గొర్రెల కొనుగోలుకోసం అనాజీపూర్‌ యాదవ్‌లను తీసుకెళ్లిన అధికారులు

పొరుగు రాష్ట్రమైన ఏపీలో గొర్రె పిల్లలను కొనుగోలు చేసేందుకు అనాజ్‌పూర్‌ నుంచి పెద్ద సంఖ్యలను అధికారులు గొల్ల, కురుమలను తీసుకెళ్లారు. నాలుగు రోజుల కిందట అనంతపురం జిల్లా ధర్మవరంలో 120 గొర్రెలను కొనుగోలు చేశారు. మంగళవారం మంత్రి కార్యక్రమం ఉండడంతో కొనుగోలు చేసిన గొర్రెలతో అధికారులు హడావుడిగా వెనుదిరిగారు. అయితే వెంట తీసుకెళ్లిన గొల్ల కురుమలను మాత్రం అక్కడే వదిలేశారు. కొనుగోలు చేసిన గొర్రెలకు డబ్బులు చెల్లించకపోవడంతో అనాజ్‌పూర్‌వాసుల బస్సును స్థానికులు స్వాధీనం చేసుకున్నారు.

రెండురోజులుగా బస్సులోనే నిద్ర

రెండు రోజులుగా ధర్మవరంలోనే ఉన్న అనాజీపూర్‌ యాదవులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో బస్సులోనే నిద్రించాల్సిన దుస్థితి ఏర్పడింది. అన్నపానీయాలకైతే తీవ్ర అవస్థలు పడ్డారు. దీంతో వారు తమ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అధికారులను నిలదీస్తే వారి నుంచి సరైన సమాచారం రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.

10టీవీ ఈ విషయాన్ని వెలుగులోకి

10టీవీ ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకురావడంతో అధికారులు స్పందించారు. ప్రస్తుతం ధర్మవరంలో ఉన్న యాదవులను రప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. గురువారంకల్లా వారిని స్వగ్రామానికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని పశుసంవర్ధకశాఖ అధికారి ఒకరు టెన్‌టీవీకి తెలిపారు. 

21:19 - June 21, 2017

సిరిసిల్ల : రాజకీయంగా తనకు జన్మనిచ్చిన సిరిసిల్లను ఎన్నటికి విడిచిపెట్టేదిలేదని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. సిరిసిల్ల జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. సిరిసిల్ల ప్రాంత రైతులకు నీటి సమస్యను తీర్చేందుకు మిడ్‌మానేరు పనులను పూర్తిచేసి 10టీఎంసీల నీటిని నిల్వచేస్తామన్నారు. సిరిసిల్ల జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్‌..వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత సిరిసిల్ల పట్టణానికి సంబంధించి మిషన్‌ భగీరథ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక పొదుపు భవన్‌లో యాదవులకు గొర్రెలను పంపిణీ చేశారు. 

21:17 - June 21, 2017

హైదరాబాద్: విశాఖ భూకుంభకోణంలో సీఎం చంద్రబాబు, లోకేశ్‌ల హస్తం ఉందని... వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఆరోపించారు.. టీడీపీ నేతలు దాదాపు లక్ష ఎకరాలు ఆక్రమించారని మండిపడ్డారు.. ఈ విమర్శలపై మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో స్పందించారు.. వైసీపీ నేతలకు చంద్రబాబుపై విమర్శలు చేసే అర్హతలేదని ఫైర్ అయ్యారు.. 

20:36 - June 21, 2017

హైదరాబాద్: పోస్టు పెడితే బుక్కు...లైక్ కొడితే ముప్పు, అవును జరుగుతున్న తీరు అదే విధంగా ఉంది. సోషల్ మీడియాలో పోస్టులును డేగకళ్లలా ప్రభుత్వాలు గమనిస్తున్నాయా? తమకు వ్యతిరేకంగా అభిప్రాయాలు వస్తే భరించలేని అసహనంతో ఊగిపోతున్నారా? రాష్ట్రం ఏదైనా కావొచ్చు.... పార్టీ ఏదైనా కావొచ్చు. సోషల్ మీడియా రాతలు అరెస్టులు.. వేధింపులకు దారితీస్తున్నాయా? అస్సలు సోషల్ మీడియాకు అభిప్రాయాల వ్యక్తీకరణకు వున్న స్వేచ్ఛ ఎంత? ఇదే అంశంపై నేటి వైడాంగిల్ సోర్టీ. పూర్తి వివరా లకోసం ఈవీడియోను క్లిక్ చేయండి.

రెవెన్యూ శాఖ‌లో 2506 ఉద్యోగాల భర్తీకి ఆమోదం

హైదరాబాద్: తెలంగాణలోని రెవెన్యూ శాఖ‌లో 2506 ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలుపుతూ సీఎం కేసీఆర్ స‌ర్కారు ఇటీవ‌ల నిరుద్యోగుల‌కు శుభ‌వార్త అందించిన విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్ర అటవీశాఖలో కూడా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్న‌ల్ వచ్చింది. ఆ శాఖ‌లో మొత్తం 1857 బీట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలను భర్తీ చేయాలని కేసీఆర్ నుంచి ఆదేశాలు రావ‌డంతో ఆర్థికశాఖ ఈ రోజు ఇందుకు సంబంధించిన‌ ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉద్యోగాల‌ను త్వ‌ర‌లోనే తెలంగాణ రాష్ట్ర‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ భర్తీ చేయ‌నుంది.  

రైల్వే ప్రయాణీకులకు జీఎస్టీ దెబ్బ

ఢిల్లీ : రైల్వే ప్రయాణీకులకు జీఎస్టీ దెబ్బతో రైల్వే ఛార్జీలు పెరగనున్నాయి. 0.5 శాతం ఏసీ, ఫస్ట్ క్లాస్ రైల్వే టిక్కెట్ ధరలు 0.5 శాతం పెరగనున్నాయి.

20:06 - June 21, 2017

హైదరాబాద్: యోగాసనాలు వేసిన ప్రపంచ పఠం...కాళ్లుబారజాపి కూర్చున్న మోడీ, ఆడోళ్లను మోసం చేసిన చంద్రబాబు...ఊరునడిమిట్లోకి వస్తున్న వైన్ షాపులు, మల్కాజ్ గిరి మల్లారెడ్డి మాటే ఖదర్...తిడుతడో, పొగుడ్తడో పాపం ఆయనకే తెల్వదు, దళిత సర్పంచ్ ను గోస పెడుతున్న ప్రభాకర్ రెడ్డి....చిన్న కులమోళ్లనే చీదరించుకుంటున్నారట, బిచ్చగాళ్లకు ఆశ్రయం ఇచ్చేటే పాపం....పోలీస్ స్టేషన్ కు వచ్చిన సాయ సాధువు, బీరు తాగేటందుకే కాదు.. స్నానానికి కూడా.. స్నానానికి వాడేస్తున్న సర్ధార్ తాత ఇలాంటి అంశాల తో మల్లన్న ఈ రోజు మన ముందుకువచ్చారు. మల్లన్న ముచ్చట్లు కార్యక్రమంలో ఇంకా ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

19:28 - June 21, 2017

హైదరాబాద్: టీడీపీ ప్రభుత్వంలో కొద్దిరోజులుగా కలకలం రేపిన ఐవైఆర్‌ కృష్ణారావు వ్యవహారానికి ఏపీ ప్రభుత్వం చెక్‌ పెట్టింది. బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఐవైఆర్‌ను తొలగించడంతోపాటు.. టీడీపీ నేత వేమూరి ఆనంద సూర్యను కొత్త చైర్మన్‌గా నియమించింది. దీనిపై విపక్షాలు మండిపడుతున్నాయి. సీఎం చంద్రబాబు ప్రభుత్వ పదవులకు రాజకీయరంగు పులుముతున్నారని విమర్శిస్తున్నాయి. ఇదే అంశంపై హెడ్ లైన్ షోలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో తెలకపల్లి రవి, టిడిపి నేత విజయ్ కుమార్, ఎపీ కాంగ్రెస్ నేత మల్లాది విష్ణు పాల్గొన్నారు. పూర్తి వివరా లకోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

వైసీపీ కార్యకర్తలపై చిన రాజప్ప ఆగ్రహం

తూ.గో : వైసీపీ కార్యకర్తలపై ఏపీ హోంమంత్రి చిన రాజప్ప మండిపడ్డారు. టిడిపి ప్రభుత్వం రేషన్‌, ఫించన్‌ ఇస్తుంటే వైసీపీకి ఎలా సపోర్ట్‌ చేస్తారంటూ మహిళలపై చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలివిగా మాట్లాడితే..రేషన్‌, ఫించన్‌ తీసేస్తానంటూ వారిని మంత్రి బెదిరించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని ఓ కాలనీలో కొంతకాలంగా డ్రైనేజీ, రోడ్లు, వీదిలైట్ల సమస్యలున్నా పరిష్కరించడంలేదంటూ మహిళలు మంత్రిని నిలదీశారు. దీంతో ఆగ్రహించిన మంత్రి రాజప్ప..సదరు మహిళలను బెదిరించే ప్రయత్నం చేశారు. 

గవర్నర్‌తో ముగిసిన ఐవైఆర్‌ కృష్ణారావు భేటీ

హైదరాబాద్: గవర్నర్‌ నరసింహన్‌తో ఐవైఆర్‌ కృష్ణారావు భేటీ అయ్యారు. ఫేస్‌బుక్‌లో తనకు వ్యతిరేకంగా వస్తున్న పోస్టులపై గవర్నర్‌కు ఐవైఆర్‌ కృష్ణారావు ఫిర్యాదు చేశారు. అరగంటపాటు గవర్నర్‌తో భేటీ అయిన కృష్ణారావు..భేటీ అనంతరం మీడియాతో మాట్లాడడానికి నిరాకరించారు.

 

19:15 - June 21, 2017

హైదరాబాద్: గవర్నర్‌ నరసింహన్‌తో ఐవైఆర్‌ కృష్ణారావు భేటీ అయ్యారు. ఫేస్‌బుక్‌లో తనకు వ్యతిరేకంగా వస్తున్న పోస్టులపై గవర్నర్‌కు ఐవైఆర్‌ కృష్ణారావు ఫిర్యాదు చేశారు. అరగంటపాటు గవర్నర్‌తో భేటీ అయిన కృష్ణారావు..భేటీ అనంతరం మీడియాతో మాట్లాడడానికి నిరాకరించారు. 

19:13 - June 21, 2017

విశాఖ : అవినీతిపై మాట్లాడే హక్కు వైసీపీ అధినేత జగన్‌కు లేదని మంత్రి అయ్యన్నపాత్రులు అన్నారు. ప్రతిపక్షనేత జగన్‌ కుటుంబం మొత్తానిది అవినీతి చరిత్రేనని ఆరోపించారు. 2009 నుంచే విశాఖలో భూకుంభకోణాలు మొదలయ్యాయని చెప్పారు.

19:11 - June 21, 2017

అమరావతి:ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయులు కదం తొక్కారు. కలెక్టరేట్లు, డీఈఓ కార్యాలయాలను ముట్టడించారు. ఉపాధ్యాయ బదిలీలు పారద్శకంగా జరపాలని, పాఠశాలల మూసివేతను ఆపాలని డిమాండ్ చేశారు.. ఆందోళనకు దిగిన ఉపాధ్యాయులను.. పోలీసులు పలు ప్రాంతాల్లో అడ్డుకున్నారు.. పలువురు ఎమ్మెల్సీ లు, మాజీ ఎమ్మెల్సీలు సహా, ఉపాధ్యాయ సంఘాల నేతల్ని అరెస్ట్ చేశారు..

బదిలీల తీరును నిరసిస్తూ..

బదిలీల తీరును నిరసిస్తూ.. ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. పారదర్శకత లేకుండా, ఇష్టారాజ్యంగా బదిలీలు చేపడుతున్నారంటూ టీచర్లు ఆక్షేపించారు. అన్ని జిల్లాల్లోనూ.. కలెక్టరేట్లు, డీఈఓ కార్యాలయాలను ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులకు చాలాచోట్ల వాగ్వాదం జరిగింది.

ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో

ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో విద్యాశాఖ కార్యాలయాన్ని ఉపాధ్యాయులు ముట్టడించారు.. సిబ్బంది లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు.. అక్రమ బదిలీలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యండవల్లి శ్రీనివాసులు , పలువురు ఉపాధ్యాయసంఘాల నేతలు పాల్గొన్నారు... వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు.. పోలీసులతో ఉపాధ్యాయులు వాగ్వాదానికి దిగారు.. టీచర్ల ఆందోళనతో అక్కడ గంటకుపైగా ట్రాఫిక్ స్తంభించింది..

విపక్ష నేత జగన్‌ సొంత జిల్లా కడపలోనూ

అటు విపక్ష నేత జగన్‌ సొంత జిల్లా కడపలోనూ ఉపాధ్యాయులు కదం తొక్కారు. డిఈఓ కార్యాలయాన్ని టీచర్లు ముట్టడించారు.. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. సీఎం బదిలీల వ్యవహారంలో జోక్యం చేసుకొని వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.. లేకుంటే జూన్ 23న చలో అమరావతికి పిలుపునిస్తామని హెచ్చరించారు.

అనంతపురం, కర్నూలు జిల్లాల్లోనూ

అనంతపురం, కర్నూలు జిల్లాల్లోనూ టీచర్లు ఆందోళనకు దిగారు.. ఉపాధ్యాయుల బదిలీల్ని పారదర్శకంగా నిర్వహించాలని... పాఠశాలల మూసివేత ఆపివేయాలని.. డిమాండ్ చేశారు..

గుంటూరు కలెక్టర్‌ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ఉపాధ్యాయులు ప్రయత్నించారు.. కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఉపాధ్యాయులను పోలీసులు అడ్డుకున్నారు.. మాజీ ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావుతోపాటు పలువురు ఉపాధ్యాయసంఘాల ప్రతినిధుల్ని అరెస్ట్ చేశారు..

విజయవాడలోనూ ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. బదిలీల షెడ్యూల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ తీరును తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఆందోళనకారులను నిలువరించేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేశారు.

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో డీఈవో కార్యాలయాన్ని ఉపాధ్యాయులు ముట్టడించారు. బదిలీల షెడ్యూల్‌ సరిగాలేదంటూ మండిపడ్డారు..

విజయనగరం కలెక్టరేట్ దగ్గర ఉపాధ్యాయుల ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది... పెద్దసంఖ్యలో టీచర్లు తరలిరావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.. కలెక్టరేట్‌ గేట్లను మూసివేశారు.. ఈ గేట్లను తోసుకుంటూ టీచర్లు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆపేశారు.. రెండువర్గాలమధ్య తోపులాటతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.. ఎస్‌ఐకి స్వల్ప గాయాలయ్యాయి..

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఉపాధ్యాయుల అక్రమ బదిలీ లు నిలుపుద ల చేయాలని ప్రభుత్వ పాఠశాలలను ముసివేతా ఆపాలని కోరుతూ డీఈఓ ఆఫీసు వద్ద ఉపాధ్యయుల సంఘల ఆధ్వర్యంలో ధర్న చేస్తున్నవారిని పోలీసులు అరెస్ట్ చేశారు

నెల్లూరులోని డీఈవో కార్యాల‌యాన్ని టీచర్లు ముట్టడించారు.. కార్యాల‌యం ఎదుట బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. ఈ కార్యక్రమానికి పీడీఎఫ్ ఎమ్మెల్సీ బాలసుబ్రమణ్యం మద్దతు ప్రకటించారు.. ఉపాధ్యాయులతోపాటు బైఠాయించి నిరసన తెలియజేశారు..

ప్రకాశం జిల్లాలోనూ టీచర్లు డీఈవో కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు.. విధివిధానాల పేరుతో ప్రభుత్వం టీచర్లపై కక్షసాధింపు చర్యలకు దిగుతోందని మండిపడ్డారు.. ప్లకార్డులు పట్టుకుని నిరసనలు తెలిపారు. వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు..

విశాఖలోకూడా టీచర్లు డీఈవో కార్యాలయంముందు ఆందోళనకు దిగారు.. ఈ కార్యక్రమానికి భారీగా ఉపాధ్యాయులు తరలివచ్చారు.. టీచర్లను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో రెండువర్గాలమధ్య తోపులాట జరిగింది.. ఉపాధ్యాయ సంఘాల నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.. శ్రీకాకుళం జిల్లాలోనూ టీచర్లు నిరసన వ్యక్తం చేశారు

బదిలీలను తాము వ్యతిరేకించడం లేదని, అయితే అందులో పారదర్శకత లోపించడం, దీనికి అనుసరిస్తున్న తీరునే తాము తప్పు బడుతున్నామని టీచర్లు స్పష్టం చేస్తున్నారు. సర్కారు తమ డిమాండ్‌లకు స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని టీచర్లు హెచ్చరించారు..

19:06 - June 21, 2017

కర్నూలు : తంగేడంచ గ్రామంలో జైన్‌ డ్రిప్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు భూమి పూజ కార్యక్రమం సీఎం చంద్రబాబు వర్సెస్‌ ఎమ్మెల్యే ఐజయ్యగా మారింది.. భూమిపూజతర్వాత బహిరంగసభలో ఐజయ్య .... ప్రభుత్వతీరుపై విమర్శలు గుప్పించారు.. జైన్‌ సంస్థకు సారవంతమైన భూముల్ని అతి తక్కువ ధరకు అప్పగించారని ఆరోపించారు.. ఇలా చేయడంవెనక కారణమేంటని ప్రశ్నిస్తుండగానే... ఎమ్మెల్యే విమర్శలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.. మైక్‌ ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలని... ఇలాంటి తలాతోకాలేని వ్యాఖ్యలు సరికాదని మండిపడ్డారు.. జైన్‌ కంపెనీ పరిశ్రమద్వారా దాదాపు 3వేల 600మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు.. 

19:04 - June 21, 2017

విశాఖ : సేవ్‌ విశాఖ పేరుతో రేపు జరగబోతున్న ధర్నాకు పోలీసులు కొత్త ట్విస్ట్‌ ఇచ్చారు. ట్రాఫిక్‌ ఇబ్బందులుంటాయని వేదిక మార్చాలని వైసీపీ నేతలకు పోలీసులు సూచించారు. వేదిక మార్చేదిలేదని వైసీపీ నేతలు తేల్చిచెబుతున్నారు. వైసీపీ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.  

19:02 - June 21, 2017

తూర్పుగోదావరి :కాకినాడ కశింకోటలో డిప్యూటీ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సురేష్‌ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయన్న ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు..కరణంగారి సెంటర్‌లో ఉన్న భాను అపార్ట్‌మెంట్‌తో పాటు సురేష్‌ తల్లిదండ్రుల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహించారు. సోదాల్లో 10లక్షల విలువ చేసే డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. 

18:50 - June 21, 2017

అమరావతి: మొన్న వాకాటి నారాయణరెడ్డి, నిన్న దీపక్ రెడ్డి తాజాగా ఐవైఆర్.కృష్ణారావులకు టిడిపి నుంచి వేటు పడింది. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే వేటు తప్పదని సీఎం చంద్రబాబు చెప్పిన మాటను తూచ తప్పకుండా పాటిస్తున్నారు. చంద్రబాబు తాజా నిర్ణయం పట్ల కొందరు నేతలు హర్షం వ్యక్తం చేస్తుంటే..మరికొందరిలో గుబులు మొదలైంది.

టిడిపి గాడి తప్పిందని విమర్శలు

ఇటీవల తెలుగుదేశం పార్టీ గాడి తప్పిందన్న విమర్శలు ఎక్కువయ్యాయి. క్రమ శిక్షణ ఉల్లంఘించవద్దని అధినేత ఎన్నిసార్లు హెచ్చరించినా నేతలు వినే పరిస్థితి దాటిపోయారు. దీంతో చంద్రబాబే స్వయంగా రంగంలోకి దిగారు. క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ కొరడా ఝళిపిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటు వేశారు. సిబిఐ విచారణ ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిని తక్షణమే సస్పెండ్ చేసారు. అనంతపురానికి చెందిన మరో ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి భూకుంభకోణంలో అరెస్టు కావడంతో తాజాగా ఆయనను కూడా సస్పెండ్ చేశారు. ఇకపై ముందు వేటు.. ఆ తరువాతే విచారణ అన్న విషయాన్ని చంద్రబాబు క్యాడర్‌ మొత్తానికి పంపారు.

పార్టీకి ఇబ్బందికరంగా ఐవైఆర్ కృష్ణారావు వివాదం

తాజాగా ఐవైఆర్ కృష్ణారావు వివాదం పార్టీకి ఇబ్బందిగా మారింది. కీలకమైన సందర్భంలో ప్రభుత్వ వైఖరిని, చంద్రబాబు తీరును తప్పుబడుతూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వివాదాస్పదమైంది. అనేక అంశాలపై ఆయన గురించి అధినేతకు ఫిర్యాదులు అందినా తాజా అంశంపై చంద్రబాబు విస్తుపోయిన పరిస్థితి. దీంతో ఆయనపై ఒకటికి పదిసార్లు ఆరా తీసినట్లు సమాచారం. ఈ విషయంపై పార్టీ ముఖ్యనేతలతో చర్చించి ఐవైఆర్ పై వేటు వేసినట్లు తెలుస్తోంది. ఇక చంద్రబాబు తాజా నిర్ణయంతో టిడిపి నేతల్లో హర్షం వ్యక్తమవుతోంది. మరికొందరు ఏ తప్పు వెతికి తమపై వేటు వేస్తారోనని ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.

18:48 - June 21, 2017

హైదరాబాద్: బ్యుటీషియన్ శిరీష కేసులో నిందితులు రాజీవ్, శ్రావణ్‌ల కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని అందులో కోరారు. కేసులో అనుమానాల నివృత్తి కోసం కస్టడీ తప్పని సరని పిటిషన్‌లో పేర్కొన్నారు. శిరీష, రాజీవ్‌ల ఫోన్‌లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. కొత్తగా వెలుగుచూసిన ఆడియో టేపుల ఆధారంగా విచారణ కొనసాగిస్తున్నారు. శిరీష ఫోన్‌లో మరిన్ని ఆడియో టేపులు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

18:46 - June 21, 2017

ఢిల్లీ: అనూహ్యంగా రాష్ట్రపతి పదవికి రామ్‌నాథ్‌ కోవింద్‌ను ఎన్డీఏ ఎంపిక చేసింది. ప్రస్తుతం ఎన్డీఏకు ఉన్న బలం, మిగతా పక్షాల మద్దతు, ఎలక్ట్రోల్‌ ఓట్లతో రామ్‌ నాథ్‌ కోవింద్‌ గెలుపు ఖాయమేనని తెలుస్తోంది. ఇప్పుడు ఉప రాష్ట్రపతి ఎవరు అనే చర్చ ఢిల్లీ వర్గాల్లో మొదలైంది. చాలా సందర్భాల్లో ఉత్తరాది వారు రాష్ట్రపతిగా ఉంటే.. దక్షిణాది వారు ఉప రాష్ట్రపతిగా పని చేశారు. దక్షిణాది వారు రాష్ట్రపతిగా ఉంటే ఉత్తరాది వారు ఉప రాష్ట్రపతులుగా ఉన్నారు. మరి ఈ సారి ఆ సంప్రదాయాన్ని ఎన్డీఏ పాటిస్తుందా? లేదా? అనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.

రాష్ట్రపతిగా బాబు రాజేంద్రప్రసాద్‌

బాబు రాజేంద్రప్రసాద్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు దక్షిణాదికి చెందిన.. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ఉప రాష్ట్రపతిగా ఉన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఉత్తరాదికి చెందిన జాకీర్‌ హుస్సేన్ ఉప రాష్ట్రపతిగా ఉన్నారు. జాకీర్‌ హుస్సేన్‌ రాష్ట్రపతి అయ్యాక మళ్లీ దక్షిణాదికి చెందిన వివి గిరి ఉప రాష్ట్రపతి అయ్యారు. ఆర్‌ వెంకట్రామన్‌, కెఆర్‌ నారాయణన్‌లు రాష్ట్రపతులుగా ఉన్నప్పుడు ఉత్తరాదికి చెందిన శంకర్ దయాళ్‌ శర్మ, కృష్ణకాంత్‌లు ఉప రాష్ట్రపతులుగా ఉన్నారు. దక్షిణాదికి చెందిన ఏపీజే అబ్దుల్‌ కలాం రాష్ట్రపతిగా ఉన్నప్పుడు రాజస్థాన్‌కు చెందిన బైరాన్‌ సింగ్‌ షెకావత్‌ ఉప రాష్ట్రపతిగా పని చేశారు. మరి ఈ సారి ఇదే ఈక్వేషన్‌ రిపీట్‌ అవుతుందా లేదా అనే చర్చ పొలిటికల్‌ వర్గాల్లో మొదలైంది.

ఉప రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడుకు ఛాన్స్ ఉందని ప్రచారం

ఒక వేళ అదే జరిగితే దక్షిణాదిలో ఏ రాష్ట్రానికి ఆ ఛాన్స్‌ దక్కనుంది. ఉప రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడుకు ఛాన్స్‌ ఉందని మీడియాలో కొన్ని వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. అయితే వెంకయ్యనాయుడు ఆ పదవి తీసుకోవడానికి సుముఖంగా లేరంటున్నారు. తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్‌ నేత సీహెచ్ విద్యాసాగర్‌ రావు పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. విద్యాసాగర్‌రావు ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా పని చేస్తున్నారు. అలాగే తమిళనాడు నుంచి తంబిదురై పేరు వినిపిస్తోంది. అయితే ఉప రాష్ట్రపతి ఎంపిక కూడా ఆయా రాష్ట్రాల్లో.. రాజకీయ ప్రయోజనాలు ప్రాతిపదికన బీజేపీ నిర్ణయం తీసుకుంటుందని రాజకీయ విశ్లేషకులంటున్నారు. 

18:45 - June 21, 2017

ఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికలు బిజెపికి సానుకూలంగా మారుతున్నాయి. తాజాగా బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌కు మద్దతు ప్రకటించారు. నితీష్‌ కుమార్‌ ఇంట్లో జరిగిన జెడియు నేతల సమక్షంలో నితీష్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. నితీష్‌ నిర్ణయాన్ని బిజెపి స్వాగతించింది. జెడియు నిర్ణయంతో రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ పెడదామనుకుంటున్న విపక్షాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. బిహార్‌ మాజీ గవర్నర్‌, దళిత సామాజిక వర్గానికి చెందిన రామ్‌నాథ్‌ కోవింద్‌ను తమ అభ్యర్థిగా బిజెపి ప్రకటించింది. రామ్‌నాథ్‌ కోవింద్‌ ఎంపికపై సిఎం నితీష్‌ హర్షం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆర్జేడి చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ మాత్రం రామ్‌నాథ్‌కు మద్దతివ్వడం లేదు. బిహార్‌లో జెడియు, ఆర్జేడి, కాంగ్రెస్‌ల సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతోంది.

18:44 - June 21, 2017

బెంగళూరు : రైతుల రుణమాఫీపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 50 వేల వరకూ రైతులు తీసుకున్న స్వల్పకాలిక రుణాలను మాఫీ చేస్తున్నట్టు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు మాత్రమే ఈ రుణమాఫీ వర్తిస్తుందని ఆయన తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో 22 లక్షల 27 వేల 5 వందల మంది రైతులకు లబ్ది చేకూరనుంది. రుణ మాఫీ వల్ల 8 వేల 165 కోట్ల భారం ప్రభుత్వంపై పడనుంది. కో-ఆపరేటివ్‌ బ్యాంకులు రైతులకు 10 వేల 736 కోట్ల రుణాలను రైతులకిచ్చినట్లు సిద్ధరామయ్య తెలిపారు. రైతుల రుణమాఫీకి సంబంధించి కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సిద్ధరామయ్యపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం.

18:43 - June 21, 2017

హైదరాబాద్: కోల్‌కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ కర్ణన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ జస్టిస్‌ కర్ణన్‌ వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. జస్టిస్‌ కర్ణన్‌కు కోర్టు ధిక్కారం కేసు కింద 6 నెలల జైలు శిక్ష విధిస్తు ఏడుగురు న్యాయమూర్తుల సుప్రీం ధర్మాసనం మే 9న ఆదేశాలు జారీ చేసింది. బెంచ్‌ ఆదేశాల మేరకు కర్ణన్‌ ఆరు నెలల జైలుశిక్షను అనుభవించాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. సుప్రీ ధర్మాసనం ఆదేశాలపై ఎలాంటి విచారణ జరపలేమని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న కర్ణన్‌ను తమిళనాడులోని కొయంబత్తూర్‌లో పోలీసులు నిన్న అరెస్టు చేశారు. దేశ వ్యాప్తంగా న్యాయమూర్తులపై అవినీతి ఆరోపణలు చేసినందుకు కర్ణన్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే. విచారణకు హాజరు కాకుండా సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించడంతో ఆయనపై కోర్టు ధిక్కార కేసు నమోదైంది.

18:43 - June 21, 2017

హైదరాబాద్: గొర్రెల పంపిణీ కార్యక్రమం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌ మెట్టు మండలం అనాజ్‌పూర్‌లో వివాదాస్పదమైంది. గొర్రెల పంపిణీ కోసం యాదవ్‌లను ప్రభుత్వ సిబ్బంది ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లింది. 120 గొర్రెలను డబ్బులు చెల్లించకుండానే అనాజ్‌పూర్‌కు అధికారులు తరలించారు. గొర్రెలతో పాటు అధికారులూ అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. దీంతో గొర్రెలు విక్రయించిన అక్కడివారు అనాజ్‌పూర్‌ యాదవులను నిలిపివేశారు. దీంతో ఉదయం నుంచి వారు అక్కడే ఉండిపోయారు. అన్నపానీయాలు లేక అవస్థలు పడుతున్నా ఒక్క అధికారి కూడా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

18:42 - June 21, 2017

హైదరాబాద్: వర్షాకాలం మొదలవ్వడంతో హైదరాబాద్‌ వాసుల్లో ఆందోళన మొదలైంది. ఎప్పుడు ఏ నిర్మాణాలు కూలుతాయోనని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుంటున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే అధికారులు స్పందించడం.. ఆ తరువాత ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

శిథిలాస్థకు చేరిన నిర్మాణాలకు నోటిసులు ఇవ్వాలి

కార్పొరేషన్ పరిధిలో శిథిలావస్థకు చేరిన నిర్మాణాలకు నోటీసులు ఇవ్వడం.. నిర్మాణాల యజమానులు స్పందించకపోతే వాటిని కూల్చివేయడం అర్బన్ లోకల్ బాడీల బాధ్యత. ఇది నిత్యం చేయాల్సిన పనైనా వర్షాకాలంలో తప్పనిసరిగా నిర్వర్తించాల్సిన కర్తవ్యం. వర్షాకాలం వచ్చినా గ్రేటర్ అధికారులు ఈ అంశంపై ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం.

గతేడాది సికింద్రాబాద్‌లో కూలిన పురాతన భవనం

వర్షాకాలం వచ్చిందంటే చాలు హైదరాబాద్‌లో ఏదో ఒక చోట నిర్మాణాలు కూలడం.. ప్రమాదాలు జరగడం నిత్యకృత్యమైపోయింది. గతేడాది సికింద్రాబాద్ మార్కెట్ ప్రాంతంలో పురాతన భవనం మొదటి అంతస్తు నుండి బాల్కని విరిగిపడి కింద ఉండే షాపు యజమాని చనిపోయాడు. మరికొందరు గాయపడ్డారు. ప్యారడైజ్ సెంటర్‌లో ఉన్న చంద్రలోక్ కాంప్లెక్స్‌లో రెయిలింగ్ కూలి ఒకరు మరణించగా కార్లు, ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదాలు జరిగినపుడు అధికారులు హడావిడి చేసి చేతులు దులుపుకున్నారు.

జంట నగరాల్లో 804 పురాతన భవనాలు

జంట నగరాల్లో 804 పురాతన భవనాలు ఉన్నాయి. వీటిలో చాలా వరకూ ప్రమాదం అంచున ఉన్నాయి. వీటికి నోటీసులు జారీ చేసి వదిలేశారు అధికారులు. నోటీసులకు స్పందించకుంటే బలవంతంగా అయినా ఖాళీ చేయించాల్సిన అధికారులు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్ మోండా మార్కెట్, అబిడ్స్, నాంపల్లి, చార్మినార్, బేగంబజార్, సుల్తాన్ బజార్, కోఠి. గోషామ‌హాల్ తదితర ప్రాంతాలలో శిథిలావస్థలో ఉన్న భవనాలు ఎక్కువ‌గా ఉన్నాయి. ఇందులో అనేకం వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న బిల్దింగులే ఉన్నాయి. చార్మినార్, ఓల్డ్ సిటి , మ‌ల్లేప‌ల్లి త‌దిత‌ర ప్రాంతాల్లో 225పైగా శిథిలావస్థకు చేరిన భ‌వ‌నాలు ఉన్నాయి. వీటిలో అనేక ప్రభుత్వ ఆసుపత్రులు , పాఠశాలలు, కాలేజీలు ఉండటం గమనార్హం. ప్రమాదాలు జరిగినపుడు హడావిడి చేసి ఆ తరువాత ఆ విషయాన్ని అటకెక్కిస్తున్నారు అధికారులు. కొందరు భవన యజమానుల అత్యాశ కూడా ప్రమాదాలకు కారణమౌతోంది. ఇప్పటికైనా అధికారులు తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే గతంలో జరిగిన ప్రమాద ఘటనలు తిరిగి పునరావృతమయ్యే అవకాశం కనిపిస్తోంది. 

18:41 - June 21, 2017

సంగారెడ్డి : అందోల్ మండలంలోని ఎర్రారం గ్రామానికి చెందిన దళిత మహిళా సర్పంచ్‌.. మాజీ సర్పంచ్‌పై జోగిపేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మాజీ సర్పంచ్‌ ప్రభాకర్‌ రెడ్డితో తనకు ప్రాణభయం ఉందని.. జయమ్మ తెలిపారు. గ్రామంలో బోరు వేస్తుండగా టెంకాయ కొట్టమని పిలిపించారని.. నీళ్లు ఉన్న చోట ఎందుకు.. లేని చోట వేయండని తను చెప్పినట్లు జయమ్మ చెప్పారు. దానికి తనను, తన భర్తను కులం పేరుతోనే కాకుండా, అసభ్య పద జాలంతో దూషించి దాడికి ప్రయత్నించారని తెలిపారు. గత కొన్ని రోజులుగా సర్పంచ్‌ అయిన తనను.. గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులను చేయనివ్వడం లేదని ప్రతీ పనికి అడ్డం వచ్చి చెడ గొడుతున్నాడని సర్పంచ్‌ జయమ్మ చెప్పారు.

 

18:39 - June 21, 2017

నిజామాబాద్ :గతంలో ఓ వెలుగు వెలిగిన నిజామాబాద్‌ జిల్లా పరిషత్‌ ఇప్పుడు ఆ ప్రాభవం కోల్పోయింది. పాలనలో కలెక్టరేట్‌ తర్వాత అంతటి ప్రాధాన్యం జిల్లా పరిషత్‌కు ఉండేది. సమావేశాలు, ఇతర కార్యక్రమాలతో నిత్యం కళకళలాడుతూ... జడ్పీ అధికారులు ప్రజాప్రతినిధులతో కనిపించేది. ప్రస్తుతం జిల్లా పరిషత్‌ కళ తప్పింది. స్థానిక సంస్థలలో భాగమైన జిల్లా మండల పరిషత్‌లు క్రమంగా నిర్వీర్యమైపోతున్నాయి. రానున్న కాలంలో అవి రద్దయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఆర్థిక సంక్షోభంలో జడ్పీ

ప్రస్తుతం జడ్పీ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. జిల్లా మండల పరిషత్‌లకు కేటాయించే నిధుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా కోత పెట్టాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం బీఆర్ జీఎఫ్‌ను పూర్తిగా నిలిపివేయగా 14వ ఆర్థిక సంఘం నిధులను నేరుగా గ్రామ పంచాయితీలకు జమ చేస్తున్నారు. ఎస్.ఎఫ్.సి నిధులు జిల్లాకు సుమారుగా రూ.1.30 కోట్లు రావాలి. కానీ 2016-17 ఆర్థిక సంవత్సరంలో కేవలం 25 లక్షలు మాత్రమే మంజూరయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో నిధుల జాడ లేదు. దీనికి తోడు సీనరేజీ రాయల్టీలు, స్టాంపు డ్యూటీ వంటివి జడ్పీ ఖాతాలో జమ కావడం లేదు.

జిల్లాలో 36 మంది జడ్పీటీసీ సభ్యులు

నిధులు లేమితో జడ్పీటీసీ సభ్యులు అభివృద్ధి పనులు చేపట్టలేకపోతున్నారు. జిల్లాలో 36 మంది జడ్పీటీసీలు ఉన్నారు. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు నిలిపివేయడంతో వారికి పని లేకుండా పోయింది. దీంతో గ్రామాలలో తిరుగలేని పరిస్థితి నెలకొందని కొందరు నాయకులు వాపోతున్నారు.

పాత జీవోతో ఇబ్బందులు

2013లో మండల జిల్లా పరిషత్‌లకు పాలక వర్గాలు లేక రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక జీవో తీసుకొచ్చి... అధికారుల పాలన కొనసాగించింది. అయితే కొత్త పాలక వర్గాలు కొలువు తీరి ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు ఆ జీవో రద్దు చేయలేదు. అది జడ్పీటీసీలకు శాపంలా మారింది. ఐదంచెల వ్యవస్థను రద్దు చేయాలనే ఆలోచనతోనే ప్రభుత్వం జిల్లా పరిషత్‌లను ఉత్సవ విగ్రహాల్లా మారుస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

 

18:38 - June 21, 2017

హైదరాబాద్: వ్యవసాయాన్ని జీఎస్టీ పరిధిలోకి తెస్తే ఆ రంగం మరింత సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని అ్రగి బయోటెక్ మాన్యూఫాక్చర్స్ అసోసియషన్‌ నేతలు అన్నారు... రైతులకు ఉపయోగపడే పనిముట్లు, యంత్రాలు, ఎరువులు, పురుగుమందుల, విత్తనాలు జీఎస్టీ పరిధిలోకి తెస్తే తెలంగాణలోనే రైతులపై దాదాపు వెయ్యి కోట్ల భారం పడే అవకాశం ఉందని చెప్పారు.. తెలుగు రాష్ట్రాల సిఎంలు స్పందించి వ్యవసాయం దాని అనుబంధ రంగాలను జిఎస్టీ నుండి మినహాయించాలని కోరారు.

 

18:22 - June 21, 2017

మల్కాజ్‌గిరి : ఘట్‌కేసర్‌లో ప్రమాదం జరిగింది. డీజిల్‌ ట్యాంకర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే అవి భారీగా ఎగసిపడ్డాయి. టెర్మినల్‌ ముందే ప్రమాదం జరగడంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది హుటాహుటిన చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. 

మందమర్రిలో తమ్మినేని అరెస్టు చేసిన పోలీసులు

మంచిర్యాల: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రాన్ని పోలీసులు అరెస్టు చేశారు. మందమర్రిలో సింగరేణి కార్మికుల సమ్మెకు మద్దతుగా సదస్సు నిర్వహించారు. సదస్సులో పాల్గొన్న్ తమ్మినేని సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.

రాజీవ్, శ్రావణ్ ల కస్టడీకి ఇవ్వండి: బంజారా హిల్స్ పోలీసులు

హైదరాబాద్: బ్యుటీషియన్ శిరీష కేసులో నిందితులు రాజీవ్, శ్రావణ్ ల కస్టడీ కోరుతూ బంజారాహిల్స్ పోలీసులు 5 రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో అనుమానాల నివృత్తి కోసం కస్టడీ తప్పని సరంటూ పోలీసులు పిటీషన్ దాఖలు చేశారు. శిరీష, రాజీవ్ ఫోన్లను ఫొరెన్సిక్ ల్యాబ్ పోలీసులు పంపించారు. కొత్తగా వెలుగు చూసిన ఆడియో టేపుల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. శిరీష ఫోన్ లో మరిన్ని ఆడియో టేపులు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 

17:08 - June 21, 2017

కర్నూల్ : కొత్త బస్టాండ్ సమీపంలో ఆసుపత్రిపై.. విజిలెన్స్‌ అధికారులు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు దాడులు చేశారు. నకిలీ డాక్టర్‌ని అదుపులోకి తీసుకున్నారు. ఎంబీబీఎస్‌ చేయకుండానే నకిలీ వైద్యం చేస్తూ.. ప్రజల ఆరోగ్యంతో.. రోగుల ప్రాణాలతో వారు చెలగాటమాడుతున్నారు. ఇప్పుడు ఈ నకిలీ వైద్యున్ని అరెస్టు చేయడం జిల్లాలో కలకలం రేపింది. 

గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ కు సీఎం చంద్రబాబుశంకుస్థాపన

కర్నూలు: ఓర్వకల్లులో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ కు సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. వచ్చే ఏడాది కల్లా ఎయిర్ పోర్ట్ నిర్మాణం పూర్తి చేస్తామని పేర్కొన్నారు. మరో వైపు ఓర్వకల్లులో బాలభారతి స్కూల్ భవనాన్ని కూడా చంద్రబాబు ప్రారంభించారు.

ఉపాధ్యాయుల బదిలీల గైడ్ లైన్స్ లో మరోసారి మార్పులు

అమరావతి: ఉపాధ్యాయుల బదిలీల మార్గదర్శకాల్లో ఏపీ సర్కార్ మరోసారి మార్పులు చేసింది. ప్రతిభా పాయింట్లలో మార్పులు చేయడంతో ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టారు. దీంతో సర్కార్ బదిలీల గైడ్ లైన్స్ లో మార్పులు చేపట్టింది.

15:52 - June 21, 2017

లక్నో: యోగా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం కావాలని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. లక్నో రమాబాయ్ మైదానంలో జరుగుతున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు మోదీ ముఖ్య అతిథిగా హాజరై యోగాసనాలు వేశారు. యోగా డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్న అందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ గవర్నర్ రామ్‌ నాయక్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, యోగా గురు రామ్‌ దేవ్‌ బాబాతో పాటు బిజెపి అగ్రనేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి 51 వేల 560 మంది ఔత్సాహికులు హాజరయ్యారు. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా 150 దేశాల్లోని భారతీయ దౌత్య కార్యాలయాల ఆధ్వర్యంలో యోగా వేడుకలు జరగనున్నాయి.

15:48 - June 21, 2017

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ కోసం గత 6నెలలుగా ప్రయత్నిస్తున్నా అపాయింట్‌మెంట్‌ దొరక్కపోవడం దారుణమన్నారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. తన జిల్లాకు సంబంధించిన మున్సిపల్ పనుల కోసం సీఎంను కలుద్దామని సెక్రటేరియట్‌కు వస్తే..సీఎం సెక్రటేరియట్లో లేకపోవడం విచారకరమన్నారు. సీఎం రిలీఫ్‌ఫండ్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే టీఆర్‌ఎస్‌ వాళ్లకు అత్యధికంగా..కాంగ్రెస్‌ వాళ్లకు తక్కువగా మంజూరు చేస్తున్నారని కోమటిరెడ్డి మండిపడ్డారు. 

15:45 - June 21, 2017

విజయవాడ : బదిలీలు ఆపాలంటూ డిమాండ్‌ చేస్తూ ఏపీలో ఉపాధ్యాయ సంఘాలు కలెక్టరేట్‌లను ముట్టడించాయి. విజయవాడలో ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. బదిలీల షెడ్యూల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ తీరును తీవ్ర స్థాయిలో విమర్శించారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు దిగాయి. బదిలీలు ఆపాలంటూ.. డీఈవో కార్యాలయం ముట్టడికి ఉపాధ్యాయులు ప్రయత్నించారు. కలెక్టరేట్ ప్రధాన గేటు ధ్వంసం చేసి లోపలకు.. ఉపాధ్యాయులు దూసుకెళ్లారు. దీంతో పోలీసులకు, ఉపాధ్యాయులకు మధ్య తోపులాట జరిగింది. తూర్పుగోదావరి: కాకినాడలో డీఈవో కార్యాలయాన్ని ఉపాధ్యాయులు ముట్టడించారు. బదిలీల షెడ్యూల్‌ విషయంలో ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. ఫ్యాట్పో, గ్యాప్టో పిలుపు మేరకు.. ఉపాధ్యాయులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఏపీ యూటిఎఫ్ నేత మాట్లాడుతూ.. ఉపాధ్యాయులతో చర్చించి బదిలీల ప్రక్రియ చేపట్టాలని, లేని పక్షంలో 23వ తేదీన అమరావతిని పట్టడిస్తామని హెచ్చరించారు.

రాయభూపాలపట్నంలో స్థానికులపై చినరాజప్ప అసహనం

తూ.గో : పెద్దాపురం మండలం రాయభూపాలపట్నంలో స్థానికులపై హోంమంత్రి చినరాజప్ప అసహనం వ్యక్తం చేశారు. కాలనీ సమస్యలు వచ్చి చూడండి అని అడిగినందుకు ఓ మహిళపై హోంమంత్రి చినరాజప్ప చిర్రుబుర్రులాడాడు. రేషన్, పింఛన్ తీసేస్తామని మహిళకు వార్నింగ్ ఇచ్చి.. మీరు వైసీపీకి చెందిన వారంటూ చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు.

15:21 - June 21, 2017

సంగారెడ్డి : తెలంగాణ అభివృద్ధి కోసమే పోరాడుతున్నామని ప్రొ. కోదండరాం అన్నారు. ఆయన సంగారెడ్డిలో అమరుల స్ఫూర్తి యాత్రను ప్రారంభించారు. ప్రొ.జయశంకర్ గారి వర్థంతి సందర్భంగా మొదలు పెట్టినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన '10టివి'తో మాట్లాడుతూ.. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. తెలంగాణ రాకముందు సాధన కోసం, తెలంగాణ వచ్చిన తరువాత అభివృద్ధి కోసం పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి కొరకు ఒక ఎజెండాను తయారు చేశామని ఆ అజెండానే ప్రభుత్వం దగ్గర ఉందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంట్రాక్టర్లు బాగా అభివృధ్ధి చెందారని, స్వరాష్ట్రంలో కుటీర పరిశ్రమ, గృహ పరిశ్రమలకు, ఉపాధి కల్పన అభివృధ్ధి లక్ష్యంగా ఉండాలన్నారు. అణిచితే కులాలకు లాభం చేకూరాలని, అభివృద్ధికి సంబంధించిన ఒక సమగ్ర ప్రణాళిక ఉండాలని, ఆ ప్రణాళిక రూపకల్పన అమల్లో ప్రజలకు భాగస్వామ్యం ఉండాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం ఈవీడియోను క్లిక్ చేయండి...

23న రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ తరపున రామ్ నాథ్ నామినేషన్

ఢిల్లీ : 23న రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ తరపున రామ్ నాథ్ కోవింద్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్ నాథ్ ను ప్రతిపాదిస్తూ నామినేషన్ పత్రాలపై ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, అమిత్ షా, పంజాబ్ మీజీ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ ప్రతిపాదనా సంతకాలు చేయనున్నారు. తొలి సెట్ పై ప్రధాని మోదీ, రెండో సెట్ పై తొలిసంతకం చంద్రబాబు, మూడో సెట్ పై తొలిసంతకం అమిత్ షా, నాలుగో సెట్ పై తొలి సంతకం ప్రకాష్ సింగ్ బాదల్ చేయనున్నారు. అనంతరం 4 సెట్లతో నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి లోక్ సభ సెక్రటరీ జనరల్ కు రామ్ నీథ్ అందజేయనున్నారు.

మురళీ మనోహర్ జోషిని కలిసిన ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి

ఢిల్లీ : బిజెపి సీనియర్ నేత మురళీ మనోహర్ జోషిని ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ కలిశారు. సాయంత్రం 6 గంటలకు ఎల్ కె అద్వానిని రామ్ నాథ్ కలవనున్నారు.

విజయనగరం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత

విజయనగరం: జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు దిగాయి. బదిలీలు ఆపాలంటూ.. డీఈవో కార్యాలయం ముట్టడికి ఉపాధ్యాయులు ప్రయత్నించారు. కలెక్టరేట్ ప్రధాన గేటు ధ్వంసం చేసి లోపలకు.. ఉపాధ్యాయులు దూసుకెళ్లారు. దీంతో పోలీసులకు, ఉపాధ్యాయులకు మధ్య తోపులాట జరిగింది. 

మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయుల ఆందోళన

మచిలీపట్నం: విజయవాడలో ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. బదిలీల షెడ్యూల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ తీరును తీవ్ర స్థాయిలో విమర్శించారు. 

14:52 - June 21, 2017

కడప: కమలాపురంలో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు వల్ల.. ఢిల్లీలో సివిల్స్‌ కోచింగ్‌ నిలిచిపోయిందనే మనస్తాపంతో ఇంద్రాసేనారెడ్డి, ఆయన తల్లి గౌరి పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సివిల్స్‌లో విజయం సాధించాలనే లక్ష్యంతో.. ఇంద్రసేనారెడ్డి ఢిల్లీ కోచింగ్‌ తీసుకుంటూ ఉండేవాడు. అయిటే 3 నెలల క్రితం తండ్రి మరణించడంతో... కోచింగ్ నిలిచిపోయింది. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. దీంతో వారు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

14:50 - June 21, 2017

హైదరాబాద్: బ‌ల్దియాలో అధికారులు, సిబ్బంది సెల్‌ఫోన్లు మూగబోయాయి. గ్రీవిఎన్స్ క్లియ‌రెన్స్ సమస్యతో అధికారులు, సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదు. బ‌ల్దియా ఇచ్చిన ప‌రిమితికి మించిన బిల్లులను ఉద్యోగులు చెల్లించుకోవాలని మూడెళ్ల క్రితం నిబంధన విధించారు. కానీ అప్పటి నుంచి ఎక్కువైన బిల్లులపై ఎలాంటి స‌మాచారం ఇవ్వలేదు. బిల్లులు చెల్లించకపోవడంతో ఎయిర్‌టెల్‌ సంస్థ సేవలు నిలిపేసింది.

14:46 - June 21, 2017

ఢిల్లీ: కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఓ యువతిపై అత్యాచారం జరిపిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగు చూసింది. ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైన 24 ఏళ్ల యువతికి ఓ హోటల్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పిన సోనూసింగ్‌- ఆమెను తన కారులో తీసుకెళ్లాడు. ఢిల్లీలోని సాకేత్‌ ప్రాంతంలో ఉన్న సిటీ వాక్‌ మాల్‌లోని పార్కింగ్‌లో కారును ఆపాడు. అనంతరం మత్తు మందు కలిపిన సాఫ్ట్‌ డ్రింక్‌ను ఆమెకు ఇచ్చాడు. మత్తులోకి జారుకున్నాక ఆ యువతిపై సోనుసింగ్‌ లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. సిసిటివి ఫుటేజీ ఆధారంగా పోలీసులు సోనుసింగ్‌ను అరెస్ట్‌ చేసేందుకు తనిఖీలు చేపట్టారు.

14:45 - June 21, 2017

జమ్ముకశ్మీర్‌ : బారాముల్లా జిల్లాలో భద్రతాదళాలు ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. బారాముల్లాలోని రఫియాబాద్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు భద్రతాసిబ్బంది ఆ ప్రాంతమంతా ముమ్మర తనిఖీలు చేపట్టారు. పజల్‌పొరా గ్రామంలోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు దాగి ఉన్నారని గుర్తించిన భద్రతాసిబ్బంది ఆ ఇంటిని చుట్టుముట్టారు. ఈ నేపథ్యంలో ముష్కరులు జవాన్లపై కాల్పులు జరిపారు. భద్రతాదళాలు జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనాస్థలంలో రెండు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

'జీఎస్టీతో పన్ను ఎగవేత దారులకు చెక్ పడుతుంది: '

విశాఖ : నగరంలో జీఎస్టీ పై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రధాన వక్తగా పాల్గొన్నారు. వర్తక, వ్యాపార వర్గాల ప్రతినిధులు గోయల్ ను కలిసి జీఎస్టీ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఆలయాల్లో సేవలపై పూర్తిగా పన్ను మినహాయింపు ఇవ్వాలని, పెట్రోల్ ధరలపై పన్నును తగ్గించాలని సిటిజన్స్ కోరారు. జీఎస్టీ ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని గోయల్ వివరించారు. ఒకే దేశం ఒకే పన్ను ఒకే వ్యవస్థ జీఎస్టీతోనే సాధ్యం అని స్పష్టం చేశారు. జీఎస్టీని ఏకగ్రీవంగా ఆమోదించడం చరిత్ర అని పేర్కొన్నారు. అనేక రకాల పన్నుల విధానం వల్ల అధికారులు సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు.

నకిలీ విత్తనాల కేంద్రంపై పోలీసుల దాడులు

మహబూబ్‌నగర్ : జిల్లా కేంద్రంలో నకిలీ విత్తనాల కేంద్రంపై పోలీసులు దాడులు నిర్వహించారు. గోకుల్‌కృష్ణ బ్రాండ్ పేరుతో నకిలీ విత్తనాలను తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. రూ. 2 లక్షల విలువ చేసే నకిలీ విత్తనాలను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. 

13:47 - June 21, 2017

ప్రతి రోజు ఎన్నో వస్తువులు..ఆహార పదార్థాలు ఉపయోగిస్తుంటాం. పనికి రావని మనం పాడేస్తుంటాం. కానీ బయటపాడేసే పదార్థాలతో చాలా ఉపయోగాలున్నాయి. మరి అవెంటో తెలుసుకోవాలంటే చదవండి...

  • చాలా మంది టిఫిన్..ఉదయం..రాత్రి వేళల్లో తింటుంటారు. అందులో ఇడ్లీ ప్రధానం. ఈ ఇడ్లీలు మిగిలితే పారేయకుండా ముక్కలుగా కట్ చేసుకుని నూనెలో దోరగా వేయించుకుని తిని చూడండి.
  • అన్నం కూడా అంతే..అన్నం మిగిలితే ఎవరు తింటారు అని పాడేస్తుంటారు. కానీ కొద్దిగా శనగపిండి..కారం..ఉప్పు..జీలకర్ర..వెల్లుల్లి రిబ్బలు..తరిగిన ఉల్లిగడ్డలు..గరం మసాల పొడి కొద్దిగా వేసి పకోడీలు చేసుకుంటే సరిపోతుంది.
  • పచ్చి మిరపకాయలు పారేయ్యకుండా ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి వేసి చట్నీ చేసి వాడుకోవచ్చు.
  • అల్లం పొట్టు..యాలకుల పొట్టులు పారేయకుండా టీలో వేసి తాగి చూడండి. మంచి రుచితో పాటు ఆరోగ్యం కూడా.
  • వాడిన టూత్‌ బ్రష్‌లను పారేయకుండా సింక్ మూలలు కడగడానికి ఉపయోగించవచ్చు.

 

13:37 - June 21, 2017

ఢిల్లీ : ఎన్డీయే తరపున రాష్ట్రపతి బరిలో నిలిచిన రామ్ నాథ్ కోవింద్ నామినేషన్ దాఖలుకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 23వ తేదీన ఉదయం 11 గంటలకు ఆయన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. ఇటీవలే ఎన్డీయే మిత్రపక్షాలు ఆయన్ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. లోక్ సభ సెక్రటరీకి ఆయన నాలుగు సెట్లతో కూడిన నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు. ఇక ఈ పత్రాలపై ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, అమిత్ షా, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాద్ లు సంతకాలు చేయనున్నారు. ఎన్డీయే మిత్రపక్షాల కీలక నేతలు..కోవింద్ కు మద్దతు తెలుపుతున్న వారందరూ ఈ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొననున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఢిల్లీకి రానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు గురువారం పార్లమెంట్ హాల్ లో మిత్రపక్షాల కీలక సమావేశం జరుగనుంది. ఎన్డీయే తరపున రాష్ట్రపతి అభ్యర్థి బరిలో నిలిపిన కోవింద్ కు మద్దతు తెలియచేయాలా ? లేక వేరే అభ్యర్థిని నియమించాలా ? అనే దానిపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు.

13:34 - June 21, 2017

ఛత్తీస్ గడ్ : అడవులను పోలీసులు జల్లెడ పడుతున్నారు. మావోయిస్టులను ఏరివేయాలని కేంద్రం పక్కా ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా పలు ఎన్ కౌంటర్ ఘటనల్లో మావోయిస్టులు మృతి చెందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా నారాయణపూర్ మావోయిస్టు బేస్ క్యాంపుపై పోలీసులు దాడులు జరిపారు. కాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. ఘటనాస్థలం నుండి భారీ స్థాయిలో ఆయుధాలు..విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు. గంట పాటు ఎదురు కాల్పులు జరిగాయి. బీజాపూర్ లో కూడా పోలీసులు గాలింపులు చేపడుతున్నారు.

మహిళా మావోయిస్టుల మృతి..

ఛత్తీస్ గడ్ : మావోయిస్టుల క్యాంపుపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈసందర్భంగా జరిగిన కాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు.

13:21 - June 21, 2017

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'...మాటల మాంత్రికుడు 'త్రివిక్రమ్ శ్రీనివాస్' కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్ర షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. కొద్దిగా నిరాశపరిచిన ‘కాటమరాయుడు' అనంతరం 'పవన్' చేస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఇప్పటికే హై రేంజ్ లో మార్కెట్ కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యాక్షన్ సీన్స్ ను సారథి స్టూడియో వేసిన సెట్ లో చిత్రీకరిస్తున్నారు. అయితే షూటింగ్ సందర్భంగా 'పవన్' లుక్ సోషల్ మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. ఇవి ఆ చిత్రానికే సంబంధించిదా ? లేదా ? అనేది తెలియరాలేదు. ఈ లుక్ లో 'పవన్' యూత్ ఫుల్ లుక్ లో కనిపిస్తుండడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో కీలక పాత్రను 'వెంకటేష్' పోషిస్తారని ప్రచారం జరుగుతోంది. కీర్తి సురేష్..అనూ ఇమ్మాన్యూల్ లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు.

13:16 - June 21, 2017

తూర్పుగోదావరి : ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు గళమెత్తారు. ప్రభుత్వ..విద్యాశాఖ తీరును తీవ్రస్థాయిలో ఎండగట్టారు. బదిలీల్లో అక్రమాలు ఆపాలని, ఉపాధ్యాయ బదిలీల్లో సీనియార్టీని ప్రాతిపదికన తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. టీచర్ల ఆందోళనలతో ఆయా జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తుతున్నాయి. కాకినాడలోని డీఈవో కార్యాలయాన్ని ముట్టడించేందుకు పెద్ద ఎత్తున్న ఉపాధ్యాయులు వచ్చారు. వారి నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగిపోయింది. ఈ సందర్భంగా యూటీఎఫ్ నేత టెన్ టివితో మాట్లాడారు. విద్యారంగంలో ఈ విద్యా సంవత్సరం విషాదంగా ప్రారంభమయ్యిందని, దీనికి విద్యాశాఖ బాధ్యత వహించాలన్నారు. ఏప్రిల్ నెలలో బదిలీల ప్రక్రియ ప్రారంభించి ఇప్పటికీ కొనసాగుతుండడం సిగ్గు చేటన్నారు. సీఎం..విద్యాశాఖ మంత్రి జోక్యం చేసుకుంటారా ? లేదా ? అని నిలదీశారు. వెబ్ కౌన్సిలింగ్ వద్దు..మ్యాన్యువెల్ కౌన్సిలింగ్ కావాలని..ఫెర్మామెన్స్ పాయింట్స్ వద్దు అని చెబుతున్నా పట్టించుకోకుండా రోజుకో సవరణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ యొక్క వైఖరి తీవ్ర ఆందోళనకరంగా ఉందని..పాఠశాల ఉంటుందా ? టీచరు ఎక్కడకు వెళుతారో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. 23వ తేదీన వేలాది మందితో అమరావతిని దిగ్భందం చేస్తామని ఇదివరకే ప్రకటించడం జరిగిందని, వెంటనే ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.

13:11 - June 21, 2017

విజయవాడ : చదువులు చెప్పాల్సిన ఉపాధ్యాయులు రోడ్డు ఎక్కారు. తమ సమస్యలు పరిష్కరించాలని కదం తొక్కారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయలు ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్..డీఈవో కార్యాలయాల ముట్టడితో ఆయా జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ప్రభుత్వ తీరును తీవ్రస్థాయిలో ఎండగట్టారు. బదిలీలు ఆపాలంటూ ఆందోళన చేశారు. బదిలీల షెడ్యూల్ కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అనాలోచితంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయలపై లాఠీఛార్జీ చేయడం పట్ల వారు తీవ్రంగా గర్హించారు. పాఠశాలలను తెరిచిన అనంతరం కూడా బదిలీలు చేస్తున్నారని, రాజకీయ పైరవీలతో బదిలీలు చేస్తున్నారని వారు పేర్కొంటున్నారు. అంతేగాకుండా ఉపాధ్యాయులను వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 9వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించడం..6వేల పాఠశాలలను ఏకోపాధ్యాయగా నిర్ణయించడంపై వారు గుర్రుగా ఉన్నారు. మరి వీరి ఆందోళనతో ప్రభుత్వం స్పందిస్తుందా ? లేదా ? అనేది చూడాలి.

 

డీఎంకే అవిశ్వాస తీర్మానం..

చెన్నై : పళనిస్వామి సర్కార్ పై డీఎంకే అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టింది. తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. అసెంబ్లీ నుండి డీఎంకే వాకౌట్ చేసింది. సీబీఐ విచారణ కోరుతూ గవర్నర్ ను డీఎంకే కలువనుంది.

రాంనాథ్ కోవింద్ నామినేషన్ 23న..

ఢిల్లీ : ఈనెల 23వ తేదీన రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ తరపున రామ్ నాథ్ కోవింద్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్ నాథ్ కోవింద్ ను ప్రతిపాదిస్తూ నామినేషన్ పత్రాల ప్రతిపాదనపై ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, అమిత్ షా, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాద్ లు సంతకాలు చేయనున్నారు.

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ల ఆందోళనలు..

విజయవాడ : రాష్ట్ర వ్యాప్తంగా టీచర్లు ఆందోళనలు చేపట్టారు. జిల్లాల కలెక్టరేట్లు..డీఈవో ఆఫీసులను ముట్టడించారు. బదిలీల్లో అక్రమాలు ఆపాలని, ఉపాధ్యాయ బదిలీల్లో సీనియార్టీని ప్రాతిపదికన తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. టీచర్ల ఆందోళనలతో ఆయా జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తుతున్నాయి.

12:44 - June 21, 2017
12:24 - June 21, 2017

విజయనగరం : కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. భారీ ఎత్తున టీచర్లు కలెక్టరేట్ కు తరలివచ్చారు. బదిలీలో అక్రమాలు ఆపాలని..పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్, డీఈవో కార్యాలయ ముట్టడికి ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు కలెక్టరేట్ గేట్ ను మూసివేశారు. తెరిచేందుకు టీచర్లు ప్రయత్నించారు. భారీ సంఖ్యలో టీచర్లు ఉండడంతో గేట్ ను కూల్చివేసి ముందుకెళ్లారు. ఈక్రమంలో ఎస్ఐ ధనుంజయ్ కు..టీచర్లకు స్వల్పగాయాలయ్యాయి.

 

12:18 - June 21, 2017

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ 'అల్లు అర్జున్' నటించిన 'డీజే..దువ్వాడ జగన్నాథమ్' చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో బన్నీ సరసన 'పూజా హేగ్డే' హీరోయిన్ గా నటించింది. ‘అల్లు అర్జున్' బ్రాహ్మణ పాత్ర..మరో మాస్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇటీవలే దీనికి సంబంధించిన పోస్టర్లు..టీజర్ లు విడుదలైన సంగతి తెలిసిందే. కొన్ని యూ ట్యూబ్ లో విడుదల చేసిన చిత్ర యూనిట్ మరికొన్ని పాటలను ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో విడుదల చేశారు. పాటలకు సంబంధంచిన వివాదం కూడా సద్దుమణగడంతో సెన్సార్ బోర్డు క్లియర్ ఇచ్చింది. తాజాగా చిత్ర యూనిట్ తిరుమలకు బయలుదేరింది. బుధవారం హీరో అల్లు అర్జున్, దర్శకుడు హరీశ్ శ:కర్, నిర్మాత దిల్ రాజులు శ్రీవారిని దర్శంచారు. వీరికి టిటిడి అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. మరి డీజే రికార్డులు పగులగొడుతాడా ? లేదా ? అనేది చూడాలి.

12:11 - June 21, 2017

ఢిల్లీ : జస్టిస్ కర్ణన్ బెయిల్ పిటిషన్ ను సుప్రీం తిరస్కరించింది. ఆరు నెలల జైలు శిక్ష తీర్పు రద్దుకు సుప్రీంకోర్టు విముఖత చూపింది. అజ్ఞాతంలో ఉన్న కర్ణన్ ను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మే 9వ తేదీన కర్ణన్ కు కోర్టు ధిక్కరణ కింద జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అరెస్టును ఎదుర్కొంటూ అజ్ఞాతంలో ఉండి పదవీ విమరణ చేసిన తొలి న్యాయమూర్తిగా దేశ న్యాయచరిత్రలో కర్ణన్‌ నిలిచిపోయారు. మే9న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఖేహర్‌ నేతృత్వంలోని ధర్మాసనం కర్ణన్‌ను అరెస్టు చేయాలని ఆదేశించినప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. జైలు శిక్షపై స్టే కోసం సుప్రీం ధర్మాసనానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా కర్ణన్‌కు ఊరట లభించలేదు. మధ్యంతర బెయిల్ కోసం కర్ణన్ తరపు న్యాయవాది కోర్టును ఆశ్రయించారు. కానీ కర్ణన్ కు మధ్యంతర బెయిల్ ఇవ్వడం కుదరదని కోర్టు స్పష్టంగా చెప్పేసింది.

12:08 - June 21, 2017

హైదరాబాద్ : బాచుపల్లిలో చిన్నారి కిడ్నాప్ కలకలం సృష్టించింది. జనహిత అనే చిన్నారి స్కూల్ కు వెళ్లేందుకు బుధవారం ఉదయం ఇంటి నుండి బయటకు వచ్చింది. రోడ్డుపై ఉన్న ఓ వ్యాన్ లో ఎక్కేసింది. వ్యాన్ లో తమ కూతురును కిడ్నాప్ చేశారని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రెండు బృందాలుగా దిగిన పోలీసులు గాలింపులు చేపట్టారు. సమీపంలో ఉన్న సీసీ టివి ఫుటేజ్ లను పరిశీలించారు. కానీ జనహిత ఎక్కాల్సిన స్కూల్ బస్ ఎక్కక వేరే స్కూల్ బస్సు ఎక్కింది. యాజమాన్యం కూడా పొరపాటున గ్రహించి తల్లిదండ్రులకు జనహితను అప్పగించింది. ఈ ఘటన ఉదయం 8గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. దీనితో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

వేరే స్కూల్ బస్సు ఎక్కిన జనహిత..

హైదరాబాద్ : బాచుపల్లిలో ఐదేళ్ల చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. ఇంటి నుండి స్కూల్ కు బయలుదేరిన చిన్నారి జనహిత వేరే స్కూల్ బస్సు ఎక్కింది. దీనితో జనహిత కిడ్నాప్ కు గురైందని భావించారు.

మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద టీచర్లు..

కృష్ణా : మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయ సంఘాలు ధర్నా నిర్వహించాయి. అక్రమంగా ఉపాధ్యాయ బదిలీలు నిలిపివేయాలని పాఠశాల మూసివేతను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు..ఉపాధ్యాయ సంఘాల మధ్య ఘర్షణ తలెత్తింది. యూటీఎఫ్ నాయకుడు మనోహర్ తో పాటు పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.

 

కర్ణన్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ..

ఢిల్లీ : జస్టస్ కర్ణన్ బెయిల్ పిటిషన్ ను సుప్రీం తిరస్కరించింది. ఆరు న ఎలల జైలు శిక్ష తీర్పు రద్దుకు సుప్రీంకోర్టు విముఖత చూపింది.

బాచుపల్లిలో చిన్నారి కిడ్నాప్..

హైదరాబాద్ : బాచుపల్లిలో ఐదేళ్ల చిన్నారి కిడ్నాప్ కు గురైంది. ఇంటి నుండి స్కూల్ కు బయలుదేరిన చిన్నారి జనహిత కారు కోసం ఎదురు చూస్తోంది. దుండగులు మరో కారులో వచ్చి ఎత్తుకెళ్లారు.

11:39 - June 21, 2017

గోంగూర...ఆహార పదార్థంగా కాకుండా అందానికి కూడా దీనిని ఉపయోగించుకోవచ్చు. దీనిని తీసుకోవడం వల్ల ఆరోగ్యం ఎంతో మేలుగా ఉంటుంది. పోటాషియమ్, క్యాల్షియం, ఫాస్పరస్, సోడియం, ఐరన్ లు సమృద్ధిగా ఉంటాయి.
అంతేగాకుండా ఏ, బి 1, బి 9, సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇక దీనిని తీసుకోవడం వల్ల శరీర బరువును తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. తద్వార రక్తపోటు అదుపులో ఉంటుంది. గోంగూర చర్మ సంబంధమైన సమస్యలను చెక్ పెడుతుంది. గోంగూరని క్రమంగా వాడితే రక్తహీనత, నిద్రలేమి, అధిక రక్తపోటు తగ్గిపోతుంది. గోంగూరను అందానికి కూడా ఉపయోగించుకోవచ్చు. గోంగూర పేస్టును తలకు పట్టించి ఉదయం..స్నానం చేస్తే జుట్టు తగ్గడం..బట్టతల రాకుండా కాపాడుతుంది.

11:34 - June 21, 2017

పవన్ కళ్యాణ్...వెంకటేష్ కాంబినేషన్ లో మరో సినిమా వస్తోందా ? గతంలో వీరి కాంబినేషన్ లో 'గోపాల గోపాల' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వెంకటేష్ లీడ్ రోల్ లో నటించగా 'పవన్ కళ్యాణ్' ప్రధాన పాత్ర పోషించారు. కానీ ఆ సినిమాలో మొత్తం 'పవన్' పాత్ర హైలెట్ గా ఉంటుంది. ప్రస్తుతం మాటల మాంత్రికుడు 'త్రివిక్రమ్'..’పవన్ కళ్యాణ్' కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతోంది. ఇటీవలే పూజా కార్యక్రమాలు మొదలై షూటింగ్ ను కూడా ప్రారంభించారు. తాజాగా ఈ చిత్రంలో ప్రధాన పాత్రకు 'వెంకటేష్'ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్యారెక్టర్ సినిమాకే హైలెట్ గా ఉంటుందని..కీలక ములుపు తిరిగే చోట 'వెంకటేష్' ఎంట్రీ ఉండబోతోందని టాక్. ఈ పాత్ర చేసేందుకు 'వెంకటేష్‌' వెంటనే గ్రీన్‌సిగల్‌ ఇచ్చేశాడట. 'పవన్' సరసన 'కీర్తి సురేష్‌’, 'అను ఇమ్మానుయేల్‌' హీరోయిన్లుగా నటిస్తున్నారు.

11:26 - June 21, 2017

ప్రియాంక చోప్రా...బాలీవుడ్ నటి..పలు సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక హాలీవుడ్ లో కూడా అడుగు పెట్టింది. అక్కడ 'క్వాంటికో' అనే సీరియల్ తో పాటు 'బేవాచ్' చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో హాలీవుడ్ చిత్రంలో నటిస్తోందని ప్రచారం జరుగుతోంది. సిలాస్ హోవర్డ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఎ కిడ్ లైక్ జేక్' చిత్రంలో 'ప్రియాంక' కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ‘హోవార్డ్ 'ట్రాన్స్‌పరెంట్‌' సిరీస్‌ చిత్రాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. 'ది బిగ్‌ థియరీ' నటుడు జిమ్‌ పారిసన్‌, క్లారీ డేన్స్‌, ఒక్టావియా స్పెన్సర్‌ లాంటి ప్రముఖ హలీవుడ్‌ నటులతో కలిసి ప్రియాంక నటించనుందని టాక్. తాజాగా ‘ప్రియాంక’ ఓ ఫొటోను పోస్టు చేసింది. టాంజరిన్ డ్రెస్ తో కనపిస్తున్న ఈ పిక్ ‘ఎ కిడ్ లైక్ జేక్’ లోనిదేనని ప్రచారం జరుగుతోంది.

11:13 - June 21, 2017

టాలీవుడ్ లో ఓ వెలుగు వెలుగొందిన 'సిమ్రాన్' మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఆమె పలు విజయవంతమైన సినిమాల్లో నటించారు. సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ సినిమాలో విలన్ గా నటిస్తోందని తెలుస్తోంది. శివ కార్తికేయన్, పొన్ రామ్ కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో శివ కార్తీకేయన్..సమంత తొలిసారిగా నటిస్తున్నారు. వీరితో పాటు 'సిమ్రాన్'..’నెపోలియన్' కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో 'శివ కార్తికేయన్' తండ్రి పాత్రలో 'నెపోలియన్' నటిస్తున్నట్లు..ప్రతి నాయకిగా 'సిమ్రాన్' నటిస్తోందని తెలుస్తోంది. అంబ సముద్రంలో ఇటీవలే పూజా కార్యక్రమాలు జరిగాయి. శివ కార్తికేయన్‌తో 'రెమో’, 'వేలైక్కారన్‌' చిత్రాన్ని నిర్మించిన 24 ఎ.ఎం. స్టూడియోస్‌ సంస్థ ఈ చిత్రాన్నీ నిర్మిస్తోంది.

హన్మకొండలో ప్రొ.జయశంకర్ వర్ధంతి వేడుకలు..

వరంగల్ : హన్మకొండలో ప్రొ.జయశంకర్ వర్ధంతి వేడుకలు జరిగాయి. జయశంకర్ విగ్రహానికి డిప్యూటి సీఎం కడియం, మంత్రి హరీష్..ఎంపీలు..ఎమ్మెల్యేలు..పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అసంతృప్తిలో ప్రజలు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రజలు అసంతృప్తితో ఉన్నారని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య పేర్కొన్నారు. తెలంగాణ టీజేఏసీ చేపట్టిన అమరుల స్పూర్తి యాత్రను గన్ పార్క్ వద్ద ఆయన జెండా ఊపి ప్రారంభించారు.

10:39 - June 21, 2017

హైదరాబాద్ : వరుసగా వెలుగులోకి వస్తున్న శిరీష ఆడియో టేపులు సంచలనం రేపుతున్నాయి. తేజస్విని గురించి నందు, నవీన్‌తో మాట్లాడింది. రాజీవ్‌కు తనకు మధ్య తేజస్విని రాకుండా చూడాలని వారితో చెప్పింది. తేజస్వినిపై ఉన్న అక్కసును ఈ ఆడియోలో బయటపెట్టింది. అదే సమయంలో రాజీవ్‌ అంటే తనకు ప్రాణమని..తనను అసభ్యంగా మాట్లాడితే చంపేస్తానని హెచ్చరించింది.

10:34 - June 21, 2017

కరీంనగర్ : వారసత్వ ఉద్యోగాల సాధన కోసం నల్ల సూర్యులు చేస్తున్న సమ్మెతో తట్ట, చెమ్మస్‌లు మూలన పడ్డాయి. యంత్రం ఆగిపోవడంతో బొగ్గు బయటకు రావడం లేదు. కార్మికుల సమ్మె దెబ్బతో యాజమాన్యం ఉక్కిరిబిక్కిరి అవుతుండగా.. బొగ్గు గనులన్నీకార్మికులు లేక బోసి పోతున్నాయి. ఓ వైపు సమ్మె విచ్ఛిన్నం చేయడానికి యాజమాన్యం కుట్ర...మరో వైపు సమ్మె పై పోలీసులు ఉక్కుపాదంమోపుతుండడంతో కోల్ బెల్ట్ లో అప్రకటిత యుద్ధం కొనసాగుతోంది. సింగరేణిలో జరుగుతోన్న నిరవధిక సమ్మె పై 10టీవీ స్పెషల్ స్టోరీ. సింగరేణిలో కార్మికులు చేస్తున్న సమ్మెతో.. యాజమాన్యం ఉక్కిరిబిక్కిరవుతోంది. ప్రస్తుత ఉద్యమ అంతిమ లక్ష్యం వారసత్వ ఉద్యోగాలు అయినప్పటికీ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ తీరును విప్లవ కార్మిక సంఘాలు బయట పెట్టాయి. కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు నోరు మెదపక పోవడం కార్మిక వర్గానికి ఆగ్రహం తెప్పిస్తోంది. హక్కుల కోసం సింగరేణిలో ఇప్పటి వరకు.. 217 సమ్మెలు జరిగినా అందులో కార్మికుల డిమాండ్‌లకు యాజమాన్యం తలవంచక తప్పలేదు.

నిరసన గళాలు, ఆందోళనలు, అరెస్ట్‌లు
సింగరేణి ప్రాంతమంతా నిరసనలతో అట్టుడుకిపోతోంది. నిరసన గళాలు, ఆందోళనలు అరెస్ట్‌లతో నల్ల బంగారు నేల మరో ఉద్యమం రగులుతోంది. పోలీసులు నిర్భందం కొనసాగిస్తున్నా... అక్రమ అరెస్ట్ చేస్తున్నా కార్మికులు మాత్రం గనుల పైకి రావడం లేదు. వారసత్వ ఉద్యోగాలను అమలు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో 5 జాతీయ సంఘాలు సిఐటియు, ఐఎన్టీయూసీ, ఎఐటియుసి, హెచ్ ఎంఎస్, బిఎంఎస్ సంఘాలు ఇచ్చిన పిలుపుకు మద్దతుగా.. 7 విప్లవ సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. సింగరేణిలో సమ్మె విజయ వంతంగా కొనసాగుతోంది. వారసత్వ ఉద్యోగాలను అమలు చేయలంటూ మార్చి 31 న కార్మిక సంఘాలు.. సమ్మెకు నోటీసులు ఇచ్చాయి. 4 సార్లు చర్చలు జరిగినా సానుకూలత లభించలేదు. జూన్ 15 నుంచి కార్మిక సంఘాలు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చాయి. 2016 అక్టోబర్ 6 న సీఎం కేసీఆర్‌ సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తూ ప్రకటన చేయడంతో వయోభారం, అనారోగ్యం, రిటైర్మెంట్ దగ్గరలో ఉన్న వేలాది మంది కార్మికులు విఆర్ఎస్ కు దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. ఫిభ్రవరి 1 న ఓ నిరుద్యోగి వారసత్వ ఉద్యోగాలపై.. హైకోర్టులో పిల్‌ దాఖలు చేశాడు. మార్చి 16 న వారసత్వ ఉద్యోగాలు రాజ్యాంగ విరుద్ధమని మార్గదర్శకాలను మార్చలంటూ.. న్యాయ స్థానం తీర్పునిచ్చింది. దీంతో సింగరేణి వ్యాప్తంగా ఉద్యోగాల కోసం ఆందోళనలు.. తీవ్ర రూపం దాల్చాయి. ఏప్రిల్ 17న హైకోర్ట్ తీర్పును సమర్ధిస్తూ సుప్రీం కోర్ట్ తీర్పునిచ్చింది. ఉద్యోగాల అమలుకు మార్గాలున్నా యాజమాన్యం విఆర్ఎస్ అమలు చేయడంలో మాత్రం.. ఆసక్తి చూపడం లేదని కార్మిక సంఘాలు అంటున్నాయి.

15న మొదలు..
ఈ నెల 15 న మొదలైన సమ్మె ఇవాళ్టికి 6వ రోజు గడుస్తున్నా.. కొనసాగుతూనే ఉంది. ప్రతి రోజు సింగరేణి వ్యాప్తంగా 2 లక్షల మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. ఆర్ధికంగా చూసినట్లయితే రోజుకు 40 కోట్ల ఆదాయం వస్తుండగా.. కార్మికులకు వేతనాల రూపంలో 20 కోట్లను యాజమాన్యం చెల్లిస్తుంటుంది. అయితే ప్రస్తుత సమ్మె నేపధ్యంలో సింగరేణి సంస్థ పై పెనుభారం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అయినా యాజమాన్యం సమ్మెతో నష్టం లేదంటూ ప్రచారం చేస్తోంది. సింగరేణి యాజమాన్యం చేస్తున్న ప్రచారాన్ని కార్మిక సంఘాలు తప్పు పట్టాయి. పూర్తి స్థాయిలో కార్మికులు విధులకు హాజరై ఉత్పత్తి చేస్తే రాని ఉత్పత్తి సమ్మె జరుగుతున్న సమయంలో ఎలా వస్తుంది అంటూ ప్రశ్నించారు. 16 శాతం అధికంగా వస్తుందని చెప్తున్న యాజమాన్యం సమ్మె లేని ఈ ఉత్పత్తి మరింత పెరిగే అవకాశం ఉన్న తప్పుడు లెక్కలు చూపి.. మోసం చేస్తుందంటూ సిఐటియు నాయకులు ఆరోపించారు.

40 శాతం పెద్దపల్లిలో..
సింగరేణి సంస్థ చేసే బొగ్గు ఉత్పత్తిలో.. 40శాతం పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్‌లో నుండి ఉత్పత్తి జరుగుతుంది. ఈ రీజియన్‌లో 4 ఓపెన్ కాస్ట్, 9 భూగర్భ గనులు ఉండగా రోజు వారిగా 50 వేల మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న సమ్మె ప్రభావం ఇక్కడి గనులపై పడడంతో.. భూ గర్బ గనుల్లో ఉత్పత్తి పూర్తిగా నిలిచి పోగా ఓపెన్ కాస్ట్ గనుల్లో మాత్రం టిబిజికెఎస్ సంఘానికి సంబంధించిన కార్మికుల సహకారంతో ఉత్పత్తి జరుగుతోంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఉత్పత్తి పెద్దగా పరిగణలోకి తీసుకోనవసరం లేదని కార్మిక సంఘాలు అభిప్రాయ పడుతున్నాయి.

టీఆర్ఎస్ అనుబంధ సంస్థ..
సింగరేణిలో కార్మికులు సమ్మె చేస్తుంటే ఈ టిఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం.. యాజమాన్యం వైపు ఉండడం కార్మికులకు ఆగ్రహం తెప్పిస్తోంది. విఆర్ఎస్ ఉద్యోగాలను అమలు చేస్తామనే హమీ ఇవ్వడంతో.. టిబిజికెఎస్‌కు కార్మికులు పట్టం కట్టారు. అయితే ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీతో పాటు టిబిజికెఎస్ అవలంబిస్తున్న తీరు రానున్న ఎన్నికల పై పడే అవకాశం ఉంది. సమ్మె ప్రభావం లేదంటూ ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ.. యాజమాన్యం కార్మికులను ఎలాగైనా విధుల్లోకి రప్పించేందుకు తంటాలు పడుతోంది. ఎప్పుడూ లేనిది భోజన వసతి కల్పిస్తూ.. కార్మికులు విశ్రాంతి తీసుకోవాడానికి బెడ్లను గనుల పై ఏర్పాటు చేసింది. బీరు, బిర్యాని ప్యాకెట్లు అందిస్తూ మభ్య పెట్టే పనిలో పడింది. సింగరేణి చరిత్రలో లేని విధంగా సెలవు దినాన్ని పని దినంగా యాజమాన్యం ప్రకటించింది. సుదీర్ఘంగా 35 రోజుల పాటు కొనసాగిన తెలంగాణ ఉద్యమంలో కూడా యాజమాన్యం ఇలాంటి ఆఫర్ కార్మికులకు ఇవ్వలేదు.

10:28 - June 21, 2017

శ్రీకాకుళం : జిల్లాలో యోగాకి క్రేజ్ పెరిగింది. పిల్లల నుంచి వృద్ధుల దాకా యోగాకి ప్రాధాన్యత ఇస్తున్నారు. యోగాభ్యాసంతో శారీరక, మానసిక ఆరోగ్యం తథ్యమంటున్న శ్రీకాకుళం జిల్లా వాసుల మనోగతంపై స్పెషల్ స్టోరి. యోగాసనాలు వేస్తున్న స్పాట్ వేయండి.. శ్రీకాకుళం వాసుల్లో యోగా ఇప్పుడు భాగమైపోయింది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ యోగాలో శిక్షణ తీసుకుంటున్నారు. యోగా మానసిక ఒత్తిడిని తగ్గించడమే కాకుండా.. శారీరక మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తోందంటున్నారు జిల్లావాసులు.

శిక్షణా తరగతులు..
గతంలో ఎప్పుడూ కనిపించని విధంగా జిల్లాలోని ప్రతి ప్రాంతంలో యోగా శిక్షణ తరగతులు మొదలయ్యాయి. ఇక ప్రచారం కూడా జోరుగా సాగుతుండటంతో జిల్లా వాసులు యోగాపై ఆసక్తి కనపరుస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని జిల్లాలో యోగా శిక్షణా కేంద్రాలు వెలుస్తున్నాయి. యోగా మంచి ఫలితాలిస్తోందని చాలామంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల స్ధాయిలో సైతం యోగా శిక్షణ చేపడితే వారికి మంచి ఫలితాలు ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో యోగ సర్టిఫికేట్ కోర్సు, పి.జి యోగా డిప్లొమా కోర్సులను ప్రవేశపెట్టింది. భవిష్యత్ లో ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగాలు లభిస్తాయన్న ఆశతో చాలామంది యోగా కోర్సులలో చేరుతున్నారు. దీనిని బట్టి భవిష్యత్‌లో యోగాకి మరింత ప్రాధాన్యత పెరుగుతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

అన్యాయంపై మాట్లాడిన జయశంకర్ - కేసీఆర్..

హైదరాబాద్ : ప్రొ.జయశంకర్ వర్ధంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయన్ను స్మరించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు జరిగిన మహా ఉద్యమంలో ప్రొ.జయశంకర్ ఆద్యంతం స్పూర్తిగా నిలిచారని, సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడే తెలంగాణకు జరిగే అన్యాయంపై జయశంకర్ మాట్లాడారు.

శిరీష మృతి వెనుక మరో ట్విస్ట్..

హైదరాబాద్ : శిరీష మృతి వెనుక మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. రెండో ఆడియో క్లిప్ సంచలనం సృష్టిస్తోంది. తేజశ్విని వ్యవహారం గురించి నందు..నవీన్ తో శిరీష మాట్లాడింది. తనకు రాజీవ్ అంటే ప్రాణమని..రాజీవ్ ను ఏమన్నా అంటే చంపేస్తానని శిరీష చెప్పింది. రాజీవ్ కు..తనకు మధ్య తేజశ్విని రాకుండా చూడాలని నవీన్ కు శిరీష చెప్పింది.

7వ ఎల్ ఈసీ గని సమీపంలో ప్రమాదం..

పెద్దపల్లి : గోదావరిఖని 7వ ఎల్ ఈసీ గని సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. రెండు గూడ్స్ రైళ్లు ఢీకొనడంతో గార్డు కిరణ్ కుమార్ మృతి చెందాడు.

09:59 - June 21, 2017

టీజాక్ అమరుల స్పూర్తి యాత్ర..

హైదరాబాద్ : అధికారం అనేది కొంతమంది భూదాహం తీర్చడానికి..కాంట్రాక్టులు ఇప్పించడానికి కాదని టీజేఏసీ జాక్ ఛైర్మన్ కోదండరాం పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న అమరుల స్పూర్తి యాత్ర సందర్భంగా ఆయన అమరువీరులకు నివాళులర్పించారు. సీఎం కెసిఆర్ సొంత జిల్లా నుంచి టీ జేఏసీ ఈ యాత్ర ప్రారంభిస్తోంది.

09:21 - June 21, 2017

హైదరాబాద్ : అధికారం అనేది కొంతమంది భూదాహం తీర్చడానికి..కాంట్రాక్టులు ఇప్పించడానికి కాదని టీజేఏసీ జాక్ ఛైర్మన్ కోదండరాం పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న అమరుల స్పూర్తి యాత్ర సందర్భంగా ఆయన అమరువీరులకు నివాళులర్పించారు. సీఎం కెసిఆర్ సొంత జిల్లా నుంచి టీ జేఏసీ ఈ యాత్ర ప్రారంభిస్తోంది. మూడు రోజల పాటు జిల్లాల్లో ఈ యాత్ర జరగనుంది. ఈ సందర్భంగా మీడియాతో కోదండరాం మాట్లాడారు. రాష్ట్రంలో ఎటు చూసిన భూ కుంభకోణాలు..కాంట్రాక్టర్ల అవినీతి కనిపిస్తోందని దుయ్యబట్టారు. ప్రజల జీవితాల్లో వెలుగు నింపే తెలంగాణ కోరుకోవడం జరిగిందని, కానీ కల నెరవేరలేదని విమర్శించారు. ప్రజలు చైతన్యవంతులైతే ప్రజాస్వామిక తెలంగాణ సాధ్యమేనని వొక్కాణించారు. ప్రజలతో కలసి పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు.

09:15 - June 21, 2017
09:13 - June 21, 2017

హైదరాబాద్ : రాజ్ భవన్ లో అంతర్జాతీయ యోగా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దంపతులు యోగాసనాలు వేశారు. అనంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడారు. యోగా అనేది పూర్వీకులు ఇచ్చిన గొప్ప సంపద అని పేర్కొన్నారు. ఒక్కరోజు చేసేది కాదని రోజు పది నిమిషాల పాటు చేయాలని గవర్నర్ నరసింహన్ పిలుపునిచ్చారు.

09:12 - June 21, 2017

విజయవాడ : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలో యోగా వేడుకలు జరిగాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు యోగా శుభాకాంక్షలు తెలియచేశారు. ఏ 1 కన్వెన్షన్ సెంటర్ లో యోగా డేలో సహచర మంత్రులతో బాబు యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ..యోగా భారతదేశానికి పరమితమని తెలిపారు. కానీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 2014 ఐక్య రాజ్యసమితిలో యోగా విషయాన్ని ప్రతిపాదించడం జరిగిందన్నారు. ప్రపంచ మానవాళికి ఉపయోగ పడుతుందని చెప్పడంతో 177 దేశాల్లో యోగాసనాల కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. యోగా వల్ల మనస్సు, శరీరం రెండూ సమన్వయం చేసుకుంటాయని, దివ్యమైన జీవితం గడపడానికి యోగా దోహద పడుతుందన్నారు.

08:44 - June 21, 2017

హైదరాబాద్ : నేడు అంతర్జాతీ యోగా దినోత్సవం. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా యోగా వేడుకలు జరుగుతున్నాయి. దేశ రాజధానితో పాటు తెలుగు రాష్ట్రాల్లో వేడుకల్లో ప్రముఖులు పాల్గొన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వం ఆయూష్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా డే వేడుకలు జరిగాయి. యోగా వేడుకలను డిప్యూటి సీఎం ఆలీ ప్రారంభించారు. మంత్రులు లక్ష్మారెడ్డి, మహేందర్ రెడ్డిలు పాల్గొన్నారు. ఢిల్లీలోని సెంట్రల్‌పార్క్‌లో యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. లక్నోలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ప్రారంభయ్యాయి. యోగా వేడుకల్లో ప్రధాని మోడీ, సీఎం యోగి ఆదిత్య నాథ్ పాల్గొన్నారు. లక్నోలో ఒకేసారి 55 వేల మందితో యోగాసనాలు చేశారు. ఉదయం 6.30 గంటలకు మొదలయ్యే ఈ కార్యక్రమం 80 నిమిషాలపాటు కొనసాగింది. ఏ కన్వెన్షన్ సెంటర్ జరిగిన యోగా వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని యోగాసనాలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో యోగాడేను సెలబ్రేట్‌ చేసుకోడానికి అభిమానులు సిద్ధం అయ్యారు. అమెరికా, ఇంగ్లండ్‌ తోపాటు ప్రపంచ ప్రసిద్ద చైనాగోడపై కూడా యోగాడే ను ఘనంగా జరుపుకోనున్నారు. మరి నేతలు..ఇతరులు యోగాసనాలు ఎలా చేశారో చూడాలంటే వీడియో క్లిక్ చేయండి.

లక్నోలో ఘనంగా అంతర్జాతీయ యోగా..

ఉత్తర్ ప్రదేశ్ : లక్నోలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ప్రారంభయ్యాయి. యోగా వేడుకల్లో ప్రధాని మోడీ, సీఎం యోగి ఆదిత్య నాథ్ పాల్గొన్నారు. లక్నోలో ఒకేసారి 55 వేల మందితో యోగాసనాలు చేశారు.

గచ్చిబౌలీలో యోగా డే..

హైదరాబాద్ : గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వం ఆయూష్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా డే వేడుకలు జరిగాయి. యోగా వేడుకలను డిప్యూటి సీఎం ఆలీ ప్రారంభించారు. మంత్రులు లక్ష్మారెడ్డి, మహేందర్ రెడ్డిలు పాల్గొన్నారు.

07:50 - June 21, 2017

విశాఖపట్టణంలో జరుగుతున్న ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ మహాసభలు ఇవాళ్టితో ముగుస్తున్నాయి. మహాసభల తొలిరోజు గిరిజన గర్జన పేరుతో అరకులో భారీ ర్యాలీ నిర్వహించారు. మన సంపద మన హక్కు అంటూ గిరిజనులు నినదించారు. నిన్న, ఇవాళ విశాఖలోని గురుజాడ కళాక్షేత్రంలో ప్రతినిధుల సభలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా గిరిజన ఉద్యమాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 500 మంది ప్రతినిధులు ఈ మహాసభల్లో పాల్గొంటున్నారు. ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ మహాసభల ఉద్దేశం ఏమిటి? ఈ మహాసభల్లో ఏయే అంశాలను చర్చిస్తున్నారు? ప్రస్తుతం గిరిజనులు ఎదుర్కొంటున్న అత్యంత ప్రధానమైన సవాలేమిటి? ఈ అంశంపై ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ మహాసభలకు హాజరైన ప్రతినిధులు 'జనపథం' పాల్గొని మాట్లాడారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

07:37 - June 21, 2017

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ప్రతిపక్షాలు స్పందిస్తున్నాయి. ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన వ్యక్తి రాష్ట్రపతిగా ఎలా ఖరారు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నాయి. దీనిపై ప్రతిపక్షాలు 22వ తేదీన సమావేశమై అభ్యర్థి విషయంలో ఓ నిర్ణయం తీసుకోనున్నాయి. ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. సుశీష్ కుమార్ షిండే..మీరా కుమార్ లలో ఒకరిని బరిలోకి దింపాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో సుందర రామశర్మ (ఏపీ కాంగ్రెస్), ప్రకాష్ రెడ్డి (టి. బీజేపీ), రాకేష్ (టీఆర్ఎస్), జూలకంటి రంగారెడ్డి (సీపీఎం) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

07:29 - June 21, 2017

హైదరాబాద్ : మోదీ పాలనలో సమగ్ర అభివృద్ధి ఏమోగానీ.. దేశం సర్వనాశనం అవుతుందని కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్‌ అయ్యర్‌ ఆరోపించారు. ప్రస్తుతం దేశానికి ఇందిరాగాంధీ వంటి నాయకత్వం అవసరం అని ఆయన అన్నారు. ఇందిర శతజయంతి ఉత్సవాల సందర్భంగా జూబ్లీ హాల్‌లో దేశ వ్యవసాయ రంగంలో ఇందిర పాత్రపై సెమినార్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మణిశంకర్‌ అయ్యర్‌ ఇందిర హరితవిప్లవం తీసుకువస్తే.. మోదీ అబద్దాలతో పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. మోదీ రైతులపై తుపాకీ గుండ్లు కురిపిస్తే.. రాష్ట్రంలో కేసీఆర్‌ అన్నదాతలకు బేడీలు వేయిస్తున్నారని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు.

07:23 - June 21, 2017

హైదరాబాద్ : బ్యూటిషన్‌ శిరీష మరణం వెనుక నిజాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయా..? పోలీసుల దర్యాప్తులో బయటికొస్తున్న నిజాలు ఏంటి..? శిరీష మృతి చెందిన సమయంలో ఆమె లోదుస్తులపై రక్తపుమరకలు కొత్త అనుమానాలకు తావిస్తున్నాయా..? చనిపోవడానికి ముందు శిరీషపై అత్యాచారం జరిగిందా.. ? శిరీష మృతిలో తప్పంతా నిందితుడు శ్రవణ్‌దేనా..? ఇదే అనుమానంపై దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు పోలీసులు. శిరీష కేసులో ఏ1 నిందితుడిగాఉన్న శ్రవణ్‌ వ్యవహరంపైనే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో పలుమార్లు ఎస్సై ప్రభాకర్‌రెడ్డి దగ్గరకు అమ్మాయిలను పంపేవాడని, సమస్య పరిష్కారం పేరుతో శిరీషను కుకునూర్‌పల్లికి తీసుకెళ్లకముందే ఆమె ఫోటోలను ఎస్సైకి వాట్సాప్‌లో పంపినట్టు పోలీసులు కోర్టుకు ఆధారాలు అందించినట్టు తెలుస్తోంది.

12న అర్ధరాత్రి..
ఈనెల 12న అర్ధరాత్రి కుకునూర్‌పల్లి పోలీస్‌ క్వార్టర్‌లో చోటుచేసుకున్న పరిణామాలన్నీ పోలీసులు కోర్టుకు సమర్పించినట్టు తెలుస్తోంది. 'సెక్స్‌వర్కర్ల దగ్గరికి వెళ్లాలని ఎస్సై ప్రభాకర్‌రెడ్డి.. రాజీవ్‌, శ్రవణ్‌లను క్వార్టర్స్‌నుంచి బయటికే పంపే ప్రయత్నం చేయడం. శ్రవణ్‌.. సిగరేట్‌ నెపంతో రాజీవ్‌ను బయటికి తీసుకెళ్లడం.. గదిలో ఒంటరిగా చిక్కిన శిరీషపై ప్రభాకర్‌రెడ్డి అనుచితంగా ప్రవర్తించడంతోపాటు ఆమె ప్రతిఘటించడం లాంటి విషయాలను కోర్టుకు వివరించామంటున్నారు ఖాకీలు. ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి ప్రవర్తన శృతిమించడంతో శిరీష బిగ్గరగా కేకలు వేసినట్టు కూడా రిమాండ్‌ డైరీలో పోలీసులు పేర్కొన్నట్టు తెలుస్తోంది. శిరీష మృతదేహంపై ఉన్న దుస్తులను ఇప్పటికే ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించిన పోలీసులు.. ఆ రిపోర్టు వస్తే అసలు విషయాలు తెలుస్తాయంటున్నారు. శిరీషపై అత్యాచారం జరిగిందని అనుమానం వక్తం అవుతున్న నేపథ్యంలో.. అసలు ఆమెది ఆత్మహత్యా.. లేక హత్యచేశారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.

07:00 - June 21, 2017

విశాఖపట్టణం : ఆదివాసీలపై నేటికీ వివక్ష కొనసాగుతూనే ఉందని ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఛత్తీస్‌గఢ్‌లో ఆదివాసీలపై పోలీసు, భద్రతా దళాల దాడులకు ఆక్షేపణ తెలిపింది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ప్రారంభమైన సంస్థ మూడవ జాతీయ మహాసభలు..ఆదివాసీల హక్కుల సాధన, పరిరక్షణ కోసం ఉద్యమ రూపకల్పన చేసే దిశగా సాగుతున్నాయి. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్‌ 3వ జాతీయ మహసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ మహాసభల ప్రారంభోత్సవానికి కేరళ ముఖ్యమంత్రి పినరాయివిజయన్‌, సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు, ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ ఉపాధ్యక్షురాలు బృందా కరత్‌ హాజరయ్యారు. కేరళ సీఎం పినరాయి విజయన్‌కు విశాఖ ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం పలికిన సీపీఎం శ్రేణులు.. భారీ ర్యాలీగా స్టీల్ ప్లాంట్‌కు చేరుకున్నారు.

తోడుగా ఆదివాసి అధికార్‌ మంచ్‌..
మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరైన కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌ మాట్లాడుతూ..దేశంలో ఆదివాసిలపై నేటికీ వివక్ష కొనసాగుతోందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు సామాజిక, ఆర్థిక న్యాయం అందడం లేదన్నారు. ఆదివాసి హక్కుల కోసం 2010లో జాతీయస్థాయిలో ఆదివాసి అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ పోరాటం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఛత్తీస్‌గఢ్‌లో ఆదివాసిలపై రమణ్‌సింగ్‌ ప్రభుత్వం పోలీసులు, భద్రతా దళాలతో దాడులు చేయిస్తోందని ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ ఉపాధ్యక్షురాలు, సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌ ఆరోపించారు. రమణ్‌ సర్కారు, మహిళల పట్ల అరాచకంగా వ్యవహరిస్తోందని, వారికి మద్దతునిచ్చే వారిపై అక్రమ కేసులు బనాయిస్తోందని మండిపడ్డారు. భద్రతా దళాలు ఆదివాసీ మహిళలపై అత్యాచారాలు చేస్తున్నా..రమణ్‌సింగ్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. బాధిత మహిళలకు ఆదివాసి అధికార్‌ మంచ్‌ తోడుగా ఉంటుందన్నారు.

బుధ..గురువారాల్లో..
మంగళవారం ప్రారంభమైన ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ జాతీయ మహాసభలు బుధ, గురువారాల్లో కూడా జరగనున్నాయి. ఈ మహాసభలకు దేశంలోని 17 రాష్ట్రాలకు చెందిన 500 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ దేశంలోని 16 రాష్ట్రాల్లో గిరిజనుల సమస్యలపై పోరాడుతోంది. ప్రధానంగా గిరిజనుల కోసం తెచ్చిన అటవీ హక్కుల చట్టం, ఆహార భద్రత చట్టం, విద్యా హక్కు చట్టాలు అమలయ్యేలా మహాసభలలో చర్చించనున్నారు. గిరిజన ప్రాంతాల్లో నేటికి తాగడానికి మంచినీళ్లు, విద్యుత్తు, రోడ్ల లాంటి మౌలిక సదుపాయాలు కూడా లేకపోవడంపై చర్చించి, సమస్యల పరిష్కారం దిశగా పోరాటాలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు.

06:57 - June 21, 2017

విజయవాడ : ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మంచినీటిని అందిస్తున్నామని.. దీన్ని ప్రజలంతా వినియోగించుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. రాజధాని ప్రాంతంలో 29 గ్రామాలకు మంచినీరు అందించే మదర్ ఫ్లాంట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అమరావతి ప్రాంత ప్రజలకు రక్షిత మంచినీరు అందించేందుకు వెంకటపాలెంలో.. ఏర్పాటు చేసిన ఎన్‌టీఆర్‌ సుజల పథకాన్ని సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ ప్లాట్‌ను నిర్మించారు. ఈ సందర్భంగా ప్లాంట్‌ ఏర్పాటుకు సహకరించిన వారిని చంద్రబాబు సన్మానించారు. సీఎస్‌ఆర్‌ నిధులను ఈ ప్లాంట్‌ కోసం ఖర్చు పెట్టిన మెగా కృష్ణారెడ్డి, హెటిరో పార్థసారధి రెడ్డిని ఆయన అభినందించారు.

ఐవోటో టెక్నాలజీ..
ఎన్‌టీఆర్‌ సుజల పథకం ద్వారా అందరికి 2 రూపాయలకే 20 లీటర్ల తాగునీరు అందుతుందని సీఎం సీఎం చంద్రబాబు అన్నారు. ఐవోటీ టెక్నాలజీని ఉపయోగించి వెంకటపాలెంలో ప్లాంట్‌ను ఏర్పాటు చేశారన్నారు. ఎన్‌టీఆర్‌ సుజల పథకం కింద ప్లాంట్‌ల ఏర్పాటుకు మరికొన్ని సంస్థలు ముందుకొచ్చాయని...త్వరలో తొమ్మిది ప్లాంట్లను పెట్టబోతున్నామని చంద్రబాబు చెప్పారు. కిడ్ని బాధితులు ఎక్కువగా ఉన్న ఉద్దానం, కనిగిరిల్లో ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే రాజధాని నిర్మాణం త్వరితగతిన జరుగుతోందని.. త్వరలోనే శాశ్వత సెక్రటేరియట్‌ నిర్మాన పనులను ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు లోకేష్, ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ, ఆనందబాబు, ఎంపీలు రాయపాటి, గల్లాజయదేవ్ తదితరులు పాల్గొన్నారు.

06:50 - June 21, 2017

హైదరాబాద్ : ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు టీజాక్ గులాబి కోటనే టార్గెట్ గా ఎంచుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న అమరుల స్పూర్తి యాత్రను సీఎం కెసిఆర్ సొంత జిల్లా నుంచి టీ జేఏసీ ప్రారంభిస్తోంది. మూడు రోజల పాటు జిల్లాల్లో జరిగే యాత్రపై గులాబి శ్రేణులు విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. తెలంగాణా జాయింట్‌ యాక్షన్‌ కమిటీజాక్ వ్యూహాలు గులాబి పార్టీకి కొత్త చిక్కులు తెచ్చి పెడుతున్నాయి. జాక్ చైర్మన్ కోదండరాం గులాబి బాస్ కెసిఆర్ కు కొత్త తలనొప్పిగా మారుతున్నారు. ప్రతిపక్షపార్టీలను రాజకీయ వ్యూహాలతో ఎదుర్కొంటున్నా..టీజాక్ ను ఎదుర్కొనేందుకు అధికార పార్టీ అవస్థలు పడక తప్పడం లేదు. తెలంగాణాలో పట్టు సాధించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలను టార్కెట్‌ చేసే విధంగానే టీజాక్ ను దెబ్బతీసే వ్యూహాన్ని అధికార పార్టీ అమలు చేసింది. జాక్ లో ఓ నేతను తమ వైపుకు తిప్పుకున్నా.. పెద్దగా ప్రయోజనం దక్కకుండా పోయిందని గులాబీపార్టీ నేతలు చెప్పుకుంటున్నారు.

కేసీఆర్ సొంత ఇలాఖా నుండే..
టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారం చేపట్టి మూడేళ్లు గడవడంతో.. అధికారపార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను క్యాష్‌ చేసుకునేందుకు రాజకీయ పార్టీలు కూడా ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాన్ని ఎండగడుతున్నాయి. పేరుకు రాజకీయపార్టీ కానున్నా.. అదేస్థాయిలో ప్రభుత్వాన్ని టార్గెట్‌చేస్తోంది టీజాక్‌. దీన్లో భాగంగానే తెలంగాణా వ్యాప్తంగా పర్యటించాలని టీజేఏసీ నిర్ణయం తీసుకుంది. మొదటి యాత్ర బుధవారం సంగారెడ్డి జిల్లా నుంచి మొదలై.. 24 వ తేదీన సిద్దిపేటలో ముగియనుంది. ఏకంగా ముఖ్యమంత్రి సొంతజిల్లా నుంచి టీజేఏసీ యాత్రను ప్రారంభిస్తుండటంతో గులాబీపార్టీలో హడావిడి మొదలైంది. కోదండరాంను ఎదుర్కొనేందుకు గులాబి పార్టీ కొత్త అస్త్రాన్ని సిద్ధం చేసుకుంటోంది. టీజాక్ కాంగ్రెస్ అనుబంధ సంస్థగా మారిందన్న ఆరోపణలు చేస్తూ....కోదండరాం కాంగ్రెస్ ఏజెంట్ అన్న విమర్శలను తెరపైకి తెస్తోంది. మొత్తం మీద టీజాక్ చేపడుతున్న యాత్ర అధికారపార్టీకి పంటికింద రాయిలా మారిందనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి.

06:46 - June 21, 2017

హైదరాబాద్ : ఆర్థిక ప్రగతిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. గ్రామసీమల్లోనే నైపుణ్యం కలిగిన మానవ వనరులున్నాయన్నాయన్న కేసీఆర్.. గొల్ల కురుమలు గొప్ప సంపదను సృష్టించేవారని అన్నారు. సిద్ధిపేటజిల్లా కొండపాకలో గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించిన సీఎం..మూడేళ్ల తర్వాత ఇండియాలో అత్యంత ధనవంతమైన గొల్లకురుమలు తెలంగాణలో ఉంటారని కేసీఆర్‌ అన్నారు. గొల్లకురుమల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గొల్లకురుమలను దేశంలోనే నెంబర్‌ వన్‌ ధనవంతులుగా తీర్చడమే లక్ష్యమంటూ గొర్రె పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. సిద్ధిపేట జిల్లా కొండపాకలో గొర్రెల పంపిణీ పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..తెలంగాణ గొల్లకురుమలు తన దృష్టిలో గొప్ప సంపదన్నారు. మూడేళ్ల తర్వాత ఇండియాలో అత్యంత ధనవంతులైన గొల్లకురుమలు తెలంగాణలో ఉన్నారని చెప్పుకుంటామని కేసీఆర్ అన్నారు. రాబోయే మూడేళ్లలో 25 వేల కోట్ల సంపదను గొల్లకురుమలు సృష్టించబోతున్నారని తెలిపారు. ఆర్థిక ప్రగతిలో దేశంలోనే తెలంగాణ నెంబర్‌వన్‌గా నిలిచిందని కేసీఆర్..2024 నాటికి రాష్ట్ర బడ్జెట్ 5లక్షల కోట్లు ఉంటుందని ఉద్ఘాటించారు.

కొండపాక..
గొర్రెల పంపిణీకి కొండపాక నుంచి బలమైన పునాది పడిందన్నారు సీఎం కేసీఆర్. దాదాపు కోటిన్నర గొర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టామన్నారు. 7 లక్షల 61 వేల దరఖాస్తులు వస్తే 7 లక్షల 18 వేల మందికి గొర్రెలు మంజూరయ్యాయని స్పష్టం చేశారు. ప్రతి రోజు రాష్ర్టానికి 650 లారీల గొర్రెలు హైదరాబాద్‌కు వస్తున్నాయని చెప్పారు. తెలంగాణలో 35 లక్షల గొల్లకురుమలున్న రాష్ట్రంలో.. 650 లారీల గొర్రెలను దిగుమతి చేసుకోవడం సిగ్గుపడాల్సిన విషయమన్నారు. 650 లారీలను దిగుమతి చేసుకోవడం కాదు.. ప్రతీ రోజు ఆరు వేల లారీల గొర్రెలను ఎగుమతి చేసే స్థాయికి పోవాలన్నారు. గొర్రెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రగతికి చిహ్నంగా నిలుస్తున్న సాగునీటి ప్రాజెక్టులను అడ్డుంకులు సృష్టిస్తున్న ప్రతిపక్షాలను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చిత్తశుద్దితో కోటి ఎకరాలను నీరందించే బృహత్తర కార్యక్రమాన్ని చేపడితే..ప్రతిపక్షాలు మాత్రం కోర్టులకెళ్లి స్టేలు తెస్తున్నాయని విమర్శించారు. కొండపాకలో సీఎం కేసీఆర్ గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. వరంగల్‌ నగరంలో గొర్రెల పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గొర్లపంపిణీ కార్యక్రమం ప్రారంభమైనప్పటికీ..కొన్ని జిల్లాల్లో మాత్రం గొర్రెలు అందుబాటులో లేక పంపిణీ కార్యక్రమాలు వాయిదా పడ్డాయి.

06:42 - June 21, 2017

విజయవాడ : టీడీపీ ప్రభుత్వంలో కొద్దిరోజులుగా కలకలం రేపిన ఐవైఆర్‌ కృష్ణారావు వ్యవహారానికి ఏపీ ప్రభుత్వం చెక్‌ పెట్టింది. బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఐవైఆర్‌ను తొలగించడంతోపాటు.. టీడీపీ నేత వేమూరి ఆనంద సూర్యను కొత్త చైర్మన్‌గా నియమించింది. దీనిపై విపక్షాలు మండిపడుతున్నాయి. సీఎం చంద్రబాబు ప్రభుత్వ పదవులకు రాజకీయరంగు పులుముతున్నారని విమర్శిస్తున్నాయి. రెండేళ్ల కిత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఐవైఆర్‌ కృష్ణారావును.. పదవీ విరమణ చేసిన వెంటనే బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమించడంపై అప్పట్లోనే వ్యతిరేకత వ్యక్తం అయిందని టీడీపీ నేతలు అంటున్నారు. అయితే అప్పట్లో చంద్రబాబు పార్టీ నేతలకు నచ్చజెప్పడంతో అంతా సర్దుకున్నారు. కాని ఐవైఆర్‌ ఇపుడు సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వానికే వ్యతిరేకంగా పోస్టులు పెట్టడంతో.. ఆయన్ను పదవి నుంచి తొలగించాల్సిందేనని బాబుదగ్గర పార్టీనేతలు పట్టుబట్టినట్టు సమాచారం.  తనపై వేటు వేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారన్న సమాచారంతో ఐవైఆర్.. హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ పెట్టాలని నిర్ణయించటం... అందుకు కౌంటర్‌గా తొలగింపు ఉత్తర్వులు వెలువడటం చకచకా జరిగిపోయాయి. దీనిపై ఐవైఆర్‌ సీరియస్‌గా స్పందించారు. ప్రభుత్వానికి భజన చేయనందునే తనపై కక్షగట్టారని ఆరోపించారు.

పరకాల కౌంటర్..
ఐవైఆర్‌ కృష్ణారావు ఆరోపణలకు ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌ కౌంటర్‌ ఇచ్చారు. సీఎం అపాయింట్‌మెంట్‌ కోసం ఆరునెలలుగా కృష్ణారావు ప్రయత్నించారన్నది అవాస్తవమన్నారు. ప్రభుత్వానికి భజన చేయాలా ..అన్న కృష్ణారావు వ్యాఖ్యలపై పరకాల మండిపడ్డారు. బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి నుంచి ఐవైఆర్‌ కృష్ణారావుకు ఉద్వాసన పలికిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ స్థానాన్ని వేమూరి ఆనంద సూర్యతో భర్తీ చేసింది. ఐవైఆర్ పై వేటు వేస్తూ ఉత్తర్వులు వెలువడిన కాసేపటికే... బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్‌ కొత్త ఛైర్మన్‌గా వేమూరిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన ఆనందసూర్య ఇప్పటిదాకా రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన అధ్యక్షుడిగా ఉన్నారు. టీడీపీ అనుబంధ ట్రేడ్‌యూనిన్‌.. టీఎన్ టీయూసీకి అధ్యక్షుడిగాను వ్యవహరించారు. ఐవైఆర్‌ కృష్ణారావు విషయంలో ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందని విపక్షనేతలు ఆరోపణలు ఎక్కుపెడుతున్నారు. ఐవైఆర్‌ను తొలగించడంతోపాటు కొత్త చైర్మన్‌గా వేమూరు ఆనంద సూర్యను నియమించిన సీఎం చద్రబాబు ప్రభుత్వ పదవులకు రాజకీయ రంగు పులుముతున్నారని విమర్శిస్తున్నారు.

06:40 - June 21, 2017

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు. ఉదయం 11.30కు జూపాడు మండలం తంగడంచ చేరుకుంటారు. అక్కడ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఓర్వకల్లు మండలంలో 800 కోట్లతో నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అక్కడే 7కోట్ల రూపాయలతో నిర్మించిన బాలభారతి పాఠశాలను ప్రారంభిస్తారు. అనంతరం ఓర్వకల్లులో బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారు. తర్వాత సాయంత్రం 5గంటలకు నంద్యాలకు చేరుకుంటారు. అక్కడే ఇఫ్తార్‌విందుకు హాజరై రాత్రికి నంద్యాలలో బసచేస్తారు. అనంతరం గురువారం చిత్తూరుజిల్లా పర్యటనకు వెళ్లతారని మంత్రి కాల్వశ్రీనివాసులు చెప్పారు. బహిరంగసభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.

06:32 - June 21, 2017

ఢిల్లీ : నేడు అంతర్జాతీ యోగా దినోత్సవం. ఈ సందర్భంగా దేశరాజధాని ఢిల్లీతో పాటు ప్రపంచవ్యాప్తంగా యోగా వేడుకలు జరగనున్నాయి. ఢిల్లీలోని సెంట్రల్‌పార్క్‌లో యోగా కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు. యూపి రాజధాని లక్నోలో జరగనున్న యోగా వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఉదయం 6.30 గంటలకు మొదలయ్యే ఈ కార్యక్రమం 80 నిమిషాలపాటు కొనసాగుతుంది. ఈసందర్భంగా యూపీ ప్రభుత్వం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. అటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో యోగాడేను సెలబ్రేట్‌ చేసుకోడానికి అభిమానులు సిద్ధం అయ్యారు. అమెరికా, ఇంగ్లండ్‌తో పాటు ప్రపంచ ప్రసిద్ద చైనా గోడపై కూడా యోగాడే ను ఘనంగా జరుపుకోనున్నారు.

 

నేడు తృతీయ అంతర్జాతీయ యోగా దినోత్సవం..

హైదరాబాద్ : నేడు తృతీయ అంతర్జాతీయ యోగా దినోత్సవం. లక్నోలో యోగా కార్యక్రమంలో ప్రధాన మంత్రి మోడీ పాల్గొననున్నారు. 150 దేశాలలో యోగా కార్యక్రమాలకు విస్తృత ఏర్పాట్లు చేశారు.

నేడు గోదావరిఖనికి తమ్మినేని..

పెద్దపల్లి : గోదావరిఖనిలో సింగరేణి కార్మిక సమ్మె పోరాట సదస్సు జరగనుంది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొనున్నారు.

రాజన్న సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటన..

రాజన్న సిరిసిల్ల : నేడు జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.

నేడు డయల్ యువర్ వ్యవసాయ శాఖ కమిషన్..

విజయవాడ : అమరావతిలో నేడు డయల్ యువర్ వ్యవసాయ శాఖ కమిషన్ కార్యక్రమం జరగనుంది. రైతుల తమ సందేహాలను నివృత్తి చేసే అవకాశాన్ని కల్పించింది. ఉదయం 10 నుండి 11.30 గంటల మధ్య రైతులు కాల్ చేయవచ్చు. ఫోన్ 0863-2216461

రాజ్ భవన్ లో నేడు యోగా దినోత్సవ వేడుకలు..

హైదరాబాద్ : రాజ్ భవన్ లో నేడు యోగా దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. గవర్నర్ నరసింహన్ దంపతులు హాజరు కానున్నారు.

Don't Miss