Activities calendar

22 June 2017

21:27 - June 22, 2017

కరీంనగర్ : ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన యువకుడి వీపు విమానం మోత మోగించారు స్థానికులు.. కరీంనగర్‌లో విద్యార్థికి ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ కొడుకు అసభ్యకరమైన మెసేజ్‌లు చేస్తూ ఫోన్‌లో విసిగించాడు.. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలి కుటుంబసభ్యులు రోమియోను పట్టుకునేందుకు ప్లాన్‌ వేశారు.. భగత్‌నగర్‌కు పిలిపించి చితకబాదారు.. చెప్పులతో బుద్దిచెప్పారు.. హెడ్‌ కానిస్టేబుల్‌ కొడుకే కీచకుడిగా మారడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు..

21:26 - June 22, 2017

ఖమ్మం : గ్రైన్‌ మార్కెట్‌ను గుర్రాలపాడుకే తరలించాలనే డిమాండ్‌తో ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో ఈరోజు నుంచి నిరాహార దీక్షలు చేపట్టారు. 29 వరకు నిరాహార దీక్షలు చేయనున్నారు. కాగా ఈ నిరసన కార్యక్రమానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సంఘీభావం తెలిపారు. మార్కెట్‌ను గుర్రాలపాడుకే తరలించడం న్యాయమైనదని...దీనిపై ప్రభుత్వానికి లేఖలు రాస్తామని సీపీఎం నేత వీరభద్రం అన్నారు.

21:24 - June 22, 2017

ఢిల్లీ: అధికార, విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధులు ఖరారయ్యారు. ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ను బరిలో దింపుతున్నట్టు ప్రకటించారు. ఎన్డీయే తరుపున బీహార్‌ గవర్నర్‌ రామ్‌నాథ్‌ కోవింద్‌ పేరును బీజేపీ ముందుగానే ప్రకటించింది. ఎన్డీయే అభ్యర్థిని ప్రకటించిన నాలుగు రోజుల తర్వాత ప్రతిపక్షాలు తమ అభ్యర్థిని ప్రకటించాయి. రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్న ఇద్దరు అభ్యర్థుల కూడా దళితులే.

ప్రకాశ్‌ అంబేద్కర్‌, మీరాకుమార్‌

ఢిల్లీలోని పార్లమెంటు లైబ్రరీలో సమావేశమైన 16 ప్రతిపక్షాలు.. అంబేద్కర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేద్కర్‌, మీరాకుమార్‌, కేంద్ర మాజీ హోం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే, గాంధీ మనవడు గోపాలకృష్ణగాంధీ పేర్లను పరిశీలించాయి. చివరికి మీరాకుమార్‌ అభ్యర్థిత్వంపై ఏకాభిప్రాయం కుదరడంతో ఈమె పేరును ప్రకటించాయి.

వచ్చే నెల 17న రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్‌

వచ్చే నెల 17న రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్‌ జరుగుతుంది. జులై 20 ఓట్లు లెక్కిస్తారు. విపక్షాల అభ్యర్థిగా ఖరారైన మీరాకుమార్‌ ఈనెల 27 లేదా 28 తేదీల్లో ఏదో ఒకరోజు నామినేషన్‌ దాఖలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. నామినేషన్‌ పత్రాలపై సంతకాల కార్యక్రమాన్ని కూడా విపక్షాలు ప్రారంభించాయి. బీహార్‌కు చెందిన మీరాకుమార్‌ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంలో సీపీఎం కీలక పాత్ర పోషించింది.

1945 మార్చి 31న జన్మించిన మీరాకుమార్‌

రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థిగా బరిలో దిగుతున్న మీరాకుమార్‌ 1945 మార్చి 31న జన్మించారు. మాజీ ఉపప్రధాని జగ్‌జీవన్‌రామ్‌ కుమార్తె. మీరాకుమార్‌ డెహ్రాడూన్‌, జైపూర్‌లో పాఠశాల విద్యాబ్యాసం చేశారు. బసస్థలి విద్యాపీఠంలో కొద్దికాలం పాటు చదివారు. ఢిల్లీ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ఇంద్రప్రస్థ కాలేజీ నుంచి ఎంఏ, ఎల్‌ఎల్‌బీ పట్టాలు పొందారు. ముందుగా న్యాయవాదిగా పనిచేసిన మీరాకుమార్‌, ఆతర్వాత యూపీఎస్‌సీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష రాసి 1970లో IFSకు సెలక్ట్‌ అయ్యారు. ఇండియన్‌ ఫారెన్‌ సర్వీసులో దౌత్యవేత్తగా పనిచేశారు. ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామాచేసి రాజకీయాల్లోకి వచ్చారు. 1985లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని బిజ్నోర్‌ నుంచి ఎన్నికయ్యారు. ఢిల్లీలోని కరోల్‌బాగ్‌ నుంచి మూడుసార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. 1999 పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోయారు.

2014 లోక్‌సభ ఎన్నికల్లో ససారం నుంచి ఓటమి

ఆ తర్వాత 2004, 2009 పార్లమెంటు ఎన్నికల్లో బీహార్‌లోని ససారం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ససారం నుంచి ఓడిపోయారు. 2004-2009 మధ్య ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమ, పర్యావరణ శాఖల మంత్రిగా పని చేశారు. 2009 జూన్‌ 4 నుంచి 2014 మే 18 వరకు లోక్‌సభ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహించారు. లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైన మొదటి మహిళ మీరాకుమార్‌.

మిగిలిన పార్టీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు

మీరాకుమార్‌ అభ్యర్థిత్వానికి మిగిలిన పార్టీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. ఎన్డీయే లౌకిక అభ్యర్థిని ప్రకటిస్తుందని ఆశించామని, ఇందుకు విరుద్ధంగా జరగడంతో ప్రతిపక్షాల తరుపున అభ్యర్థిని నిలబెడుతున్నట్టు వామపక్షాలు చెబుతున్నాయి. ప్రతిపక్షాల సమావేశానికి బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ నేతృత్వంలోని జనతాదళ్‌ (యూ) డుమ్మాకెట్టింది. నితీశ్‌ బీజేపీ అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌కు మద్దతు ప్రకటించారు. అయితే బీహార్‌ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఆర్జేడీ మాత్రం మీరాకుమార్‌కు మద్దతు ఇస్తోంది. విపక్షాల సమావేశంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌యాదవ్‌ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. 

21:13 - June 22, 2017

అనంతపురం: హిందూపురం పారిశ్రామిక వాడలోని హెరిటేజ్ కంపెనీలో రియాక్టర్ పేలింది. ఈ ప్రమాదం ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే సీఎం చంద్రబాబుకు చెందిన కంపెనీకావడంతో మీడియాను ఎవరినీ అనుమతించడం లేదు. మరో వైపు రేపు ఆ ప్రాంత ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన ఉన్న నేపథ్యంలో ఈ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

21:10 - June 22, 2017

రంగారెడ్డి: చేవెళ్ల మండలం ఇక్కారెడ్డిగూడలో విషాదం నెలకొంది. రెండేళ్ల చిన్నారి బోరుబావిలో పడింది. ఈ రోజు రాత్రి 7 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. చిన్నారిని రక్షించేందుకు పోలీసులు, స్థానికులు ప్రయత్నిస్తున్నారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న మంత్రి మహేందర్ రెడ్డి సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. జేసీబీల సహాయంతో సమాంతర గొయ్యి తొవ్వి రంక్షించేందుకు యత్నిస్తున్నారు. అంతేకాక వైద్య బృందం కూడా చేరుకుని పాపకు ఆక్సిజన్ అందించేందుకు యత్నిస్తున్నారు.

అనంతపురం హెరిటేజ్ కంపెనీలో భారీ పేలుడు: ముగ్గురికి గాయాలు

అనంతపురం: పారిశ్రామిక వాడలోని హెరిటేజ్ కంపెనీలో రియాక్టర్ము పేలి ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

బోరు బావిలో పడ్డ రెండేళ్ల చిన్నారి...

రంగారెడ్డి: చేవెళ్ల మండలం ఇక్యారెడ్డిగూడలో విషాదం నెలకొంది. రెండేళ్ల చిన్నారి బోరుబావిలో పడింది. చిన్నారిని రక్షించేందుకు పోలీసులు, స్థానికులు ప్రయత్నిస్తున్నారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న మంత్రి మహేందర్ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రి ఆదేశించారు.

నాలాల పూడికతీత స్కాం కేసులో 7గురు ఏఈల అరెస్ట్

హైదరాబాద్: జీహెచ్ ఎంసీ లో నాలాల పూడికతీత స్కాం కేసులో ఏడురుగు ఏఈలను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు.

ఉజ్వల్ హోమ్ నుంచి 12 మంది పరార్

హైదరాబాద్:  ఉప్పల్ ఉజ్వల్ హోమ్ నుంచి 12 మంది పరారయ్యారు. హోం నిర్వాహకులపై దాడి చేసి మహిళలు పరారయ్యారు. దీంతో ఉప్పల్ పీఎస్ లో ఉజ్వల్ హోమ్ నిర్వాహకులు ఫిర్యాదు చేశారు.

20:34 - June 22, 2017

హైదరాబాద్: కులమా..? ఇంకెక్కుడుంది బాసూ..? ఒకప్పుడుడెప్పుడో వుండేది. ఇంకా ఆ పాత మాటెందుకూ అంటారా? అస్సలు కుల వివక్ష అంటే ఏమిటి గురూ? దాని రూపం ఎలా వుంటుంది? రంగూ, రుచి, వాసన ఎలా వుంటాయని ప్రశ్నిస్తారా? ఇంకొంచెం డీప్ గా వెళ్లి 2017లో నూ ఇదేంటి బాస్ అంటారా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కావాలా? అయితే పశ్చిమగోదావరి జిల్లాలోని ఆ వూరికి వెళదాం. కులవివక్ష వికృతంగా మారి వెలి పేరుతో సాగిస్తున్న అరాచకాన్ని చూసొద్దాం. నేటి వైడాంగిల్ స్టోరీలో... పూర్తి వివరాలకోసం ఈవీడియోను క్లిక్ చేయండి...

20:07 - June 22, 2017

హైదరాబాద్: జోరుగా సాగుతున్న జేఏసీ యాత్ర...రాజకీయంలో ఉంటదా వీరి పాత్ర, అప్పుడే గొర్రెల లోన్ల కాడ అవినీతి...తెలంగాణకు మంచిదేనా ఈ ఖ్యాతి, ఆంధ్రలో అట్టుడుకుతున్న టీచర్లు...బడులు మూసేయొద్దని డిమాండ్లు, ఆకారం పుష్టీ.. నైవేధ్యం నష్టి...జడ్పీ ఆఫీసులకు నిధుల సుష్టి, పాలమూరు జిల్లాలో నకిలీ పత్తి ఇత్తులు... రైతన్నలు మోసపోకుండ్రీ బాంచన్, సంసారం చేయాలంటే పన్ను కట్టాలే... కొత్త చట్టం తెచ్చిన సౌదీ సర్కార్ వంటి అంశాలతో మల్లన్న 'మల్లన్న ముచ్చట్లు ' కార్యక్రమంలో మన ముందుకు వచ్చాడు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

భర్త వికృత చేష్టలతో పీఎస్ లో ఫిర్యాదు చేసిన భార్య

హైదరాబాద్‌: మహిళలపై వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా కొంతమంది ఆగడాలకు హద్దు అదుపులేకుండా పోతోంది. తాజాగా జరిగిన సంఘటన చూస్తుంటే మహిళల పట్ల కొందరు భర్తలు ఎలా వ్యవహరిస్తున్నారో స్పష్టంగా అర్థమవుతోంది. భర్త వికృత చేష్టలను భరించలేని ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పడకగదిలోని దృశ్యాలను తన భర్త కృష్ణచైతన్య ఆన్‌లైన్‌ ద్వారా కేరళలోని దీపక్‌ అనే వ్యక్తికి పంపారని ఓ వివాహిత తెలిపింది. బాధితురాలు ఫిర్యాదుతో భర్త కృష్ణచైతన్యను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

19:15 - June 22, 2017

ఢిల్లీ: ప్రతిపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ను ప్రకటించారు. శరత్‌పవార్‌ ఇంట్లో సమావేశమైన ప్రతిపక్ష నేతలు మీరాకుమార్‌ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఎన్డీఏ అభ్యర్థి రామనాథ్‌ కోవింద్‌పై మీరాకుమార్‌ పోటీ చేయనున్నారు. మీరాకుమార్‌ మాజీ ఉప ప్రధాని జగ్జీవన్‌రామ్‌ కుమార్తె. బీహార్‌లోని పాట్నాలో జన్మించిన మీరాకుమార్‌ 2009 నుంచి 14 వరకు లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు. ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా లోక్‌సభ మాజీ స్పీకర్‌, మాజీ కేంద్రమంత్రి మీరాకుమార్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు కాంగ్రెస్‌ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ తెలిపారు. మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రావు కుమార్తె అయిన మీరాకుమార్‌..పేరును 17 విపక్ష పార్టీలన్నీ ఏకగ్రీవంగా ఖరారు చేశాయని గులాంనబీ ఆజాద్ స్పష్టం చేశారు. మరో వైపు ఎన్డీ నుండి రామ్ నాథ్ మాథవ్ పోటీ చేస్తున్నారు. ఇదే అంశంపై హెడ్ లైన్ షో లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో నవతెలంగాణ ఎడిటర్ వీరయ్య, మాజీ ఎంపి మల్లు రవి, బిజెపి అధికార ప్రతినిధిశ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ గా గవన్నవరం

విజయవాడ : గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ అంతర్జాతీయ విమానాశ్రయంగా మారనుంది. ఆగస్టు 1నుంచి అంతర్జాతీయ సర్వీసులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తూ.. కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

మీరాకుమార్ ను 17 పార్టీల అంగీకారం: ఆజాద్

ఢిల్లీ : ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా లోక్‌సభ మాజీ స్పీకర్‌, మాజీ కేంద్రమంత్రి మీరాకుమార్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు కాంగ్రెస్‌ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ తెలిపారు. మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రావు కుమార్తె అయిన మీరాకుమార్‌..పేరును 17 విపక్ష పార్టీలన్నీ ఏకగ్రీవంగా ఖరారు చేశాయని గులాంనబీ ఆజాద్ స్పష్టం చేశారు. 

ప్రతిపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా మీరాకుమార్‌

ఢిల్లీ: ప్రతిపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ను ప్రకటించారు. శరత్‌పవార్‌ ఇంట్లో సమావేశమైన ప్రతిపక్ష నేతలు మీరాకుమార్‌ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఎన్డీఏ అభ్యర్థి రామనాథ్‌ కోవింద్‌పై మీరాకుమార్‌ పోటీ చేయనున్నారు. మీరాకుమార్‌ మాజీ ఉప ప్రధాని జగ్జీవన్‌రామ్‌ కుమార్తె. బీహార్‌లోని పాట్నాలో జన్మించిన మీరాకుమార్‌ 2009 నుంచి 14 వరకు లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు.

18:57 - June 22, 2017

విజయవాడ : గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ అంతర్జాతీయ విమానాశ్రయంగా మారనుంది. ఆగస్టు 1నుంచి అంతర్జాతీయ సర్వీసులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తూ.. కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

18:50 - June 22, 2017

సంగారెడ్డి: మిషన్‌ భగీరథ స్కీంలో అక్రమాలు జరుగుతున్నాయని... తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం ఆరోపించారు.. పైపులుండగానే మళ్లీ కొత్తగా పైపులు వేస్తున్నారని విమర్శించారు. 16వేల కోట్ల రూపాయలతో అయిపోయే పనులకు దాదాపు 46 వేల కోట్లు ఖర్చుపెడుతున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఉంటే ప్రగతి భవన్‌లో... లేకపోతే ఫాంహౌస్‌లో ఉంటారని. ప్రజల మధ్యకు వచ్చి వారి సమస్యలు వినే పరిస్థితే లేదని కోదండరాం ఫైర్ అయ్యారు. స్ఫూర్తియాత్రలోభాగంగా కోదండరాం బృందం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో పర్యటిస్తోంది.

18:48 - June 22, 2017

చిత్తూరు : తిరుపతి విమానాశ్రయ ఆవరణలో ఏర్పాటు చేసిన భారీ జాతీయ జెండాను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా ఆవిష్కరించారు. ఇందు కోసం వంద అడుగుల ఎత్తున్న జెండా స్తంభం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని అన్ని విమానాశ్రయాలతో పాటు, ప్రధాన రైల్వే స్టేషన్లలో తప్పనిసరిగా జాతీయ జెండాలను ఆవిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చంద్రబాబు చెప్పారు. 

18:42 - June 22, 2017

ఖమ్మం : జిల్లాలో పిల్లల బడి బస్సులకు భద్రత లేకుండా పోయింది. ఫిట్‌నెస్ లేని, కాలం చెల్లిన బస్సులను నడుపుతూ ప్రైవేటు స్కూల్స్ విద్యార్ధుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరిచి పదిరోజులు దాటుతున్నా తమ దగ్గరున్న స్కూలు బస్సులకు ఫిట్‌నెస్ పరీక్షలు చేయించకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. మరోవైపు రవాణా అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఖమ్మం జిల్లాలో భద్రత కరువైన ప్రైవేటు స్కూలు బస్సులపై టెన్ టీవీ ప్రత్యేక కథనం.

పిల్లల భద్రతను విస్మరిస్తున్న ప్రైవేటు స్కూల్స్

ఫీజులు దండుకునే ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలు పిల్లల భద్రత విషయాన్ని మాత్రం విస్మరిస్తున్నాయి. ఫిట్‌నెస్ లేని, కాలం చెల్లిన బస్సులు నడుపుతూ వారి ప్రాణాల మీదకు తెస్తున్నాయి. దీంతో స్కూలు బస్సెక్కిన పిల్లలు క్షేమంగా తిరిగి వస్తారో.. రారో అని వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

ఖమ్మం జిల్లాలో 152 ప్రైవేటు స్కూల్స్

ఖమ్మం జిల్లాలో 152 ప్రైవేటు స్కూల్స్ ఉన్నాయి. ఈ స్కూల్స్ కి 976 స్కూల్ బస్సులున్నాయి. ప్రైవేటు పాఠశాల్లో 37,500 మంది విద్యార్ధులు చదువుతున్నారు. ఇప్పటి వరకు 976 స్కూల్ బస్సుల్లో 500 బస్సుల వరకు ఫిట్ నెస్ కోసం రవాణా శాఖ కార్యాలయానికి వచ్చాయి. వీటిలో 120కి పైగా తిరస్కారాని గురయ్యాయి. 356 స్కూల్ బస్సులు ఇంకా ఫిట్ నెస్ కోసం రవాణా శాఖ కార్యాలాయానికి ఇంకా రాలేదు. ఈనెల 12 నుంచి పాఠశాలలు తెరిచారు.. విద్యార్ధులు స్కూళ్లకు వెళ్తున్నారు. అయినా నేటికి ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు తమ వద్ద ఉన్న బస్సులకు ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నిబంధనలు పాటించాల్సిన ప్రైవేటు స్కూల్స్

విద్యార్థుల రాకపోకలకు ప్రైవేటు స్కూల్స్ వినియోగించే బస్సులు రవాణా శాఖ నిర్దేశించిన నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. 15 ఏళ్లు దాటిన వాహనాలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరాదు. బస్సులో తప్పనిసరిగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫైర్ సేఫ్టీ సిలెండర్ ఉండాలి. బస్సు అద్దానికి ముందు భాగంలో వైపర్‌ని వినియోగించాలి. హ్యాండ్‌బ్రేక్, బ్రేక్ లైట్స్, ఇండికేటర్స్ తప్పనిసరిగా అమర్చుకోవాలి. 55 ఏళ్ల లోపు వ్యక్తులను మాత్రమే డ్రైవర్లుగా నియమించుకోవాలి. . బస్సుకు అత్యవసర ద్వారం ఖచ్చితంగా అమర్చాలి. రవాణాశాఖ అధికారులు ఈ నిబంధనలు పరిశీలించి నిర్ధారించుకున్న తర్వాతే అనుమతించాల్సి ఉంటుంది. అయితే కొన్ని పాఠశాలల్లో బస్సులు నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నట్లు తెలుస్తోంది.

చంద్రుగొండ మండలంలో జరిగిన పెదవాగు ఘటనలో

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చంద్రుగొండ మండలంలో జరిగిన పెదవాగు ఘటనలో చాలా మంది విద్యార్ధులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనతోనైనా కళ్లు తెరవని యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు, రవాణా శాఖ అధికారులు పిల్లల భద్రతపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

18:41 - June 22, 2017

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌ వ్యవసాయరంగాన్ని చిన్న చూపు చూస్తున్నాడని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ విమర్శించారు. ఖరీఫ్‌పై ఎటువంటి ప్లానింగ్ లేదని... ఖరీఫ్ ప్రణాళిక పై బ్యాంకర్లతో ప్రభుత్వం ఇప్పుడు వరకు మీటింగ్ నిర్వహించలేదని ఆయన అన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్‌ పార్టీ రైతులకు అండగా నిలుస్తోందని అంటున్న షబ్బీర్ అలీ తెలిపారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

18:40 - June 22, 2017
18:11 - June 22, 2017

కర్నూలు : నంద్యాల పర్యటనలో చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనతో లబ్దిపొందిన వారు తనకు ఓటు వెయ్యరా అని ప్రశ్నించారు. తాను ఇచ్చే రేషన్ బియ్యం తీసుకుంటున్నారని.. పింఛన్లు తీసుకుంటున్నారని.. తను వేసే రోడ్లపై నడుస్తున్నారని అన్ని ప్రయోజనాలు పొంది.. ఓటు మాత్రం వేరే పార్టీకి వేస్తారా అని చంద్రబాబు ప్రశ్నించారు. తనకు సహకరించని ఊళ్లకు దండం పెడతా అన్నారు. సహకరించని ఊళ్లకు ఎందుకు అభివృద్ధి చేయాలని చంద్రబాబు ప్రశ్నించారు. దీని పై స్పందించిన మాజీ ఎమ్మెల్యే గఫూర్ మాట్లాడుతూ...

ఇలాంటి బెదిరింపులు చంద్రబాబు దిగజారుడు నైజానికి, అప్రజాస్వామిక వైఖరికి అద్దంపడుతోందన్నారు. దీన్ని తీవ్రగంగా ఖండిస్తున్నామన్నారు. అభద్రతా భావంతో చంద్రబాబు జీవితస్తూ దిగజారుడు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో బెదిరింపులకు స్థానం లేదు అన్నారు.

 

17:20 - June 22, 2017

హైదరాబాద్: టీచర్లకు రాష్ట్రపతి శుభవార్త అందించారు. దీర్ఘకాలంగా కాలంగా పెండింగ్ లోఉన్న టీచర్ల ఏకీకృత సర్వీసు రూల్స్‌ ఫైలుకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆమోదం తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో గెజిట్‌ నోటిషికేషన్‌ విడుదల చేయనున్నారు. దీర్ఘకాంలగా ఉన్న సమస్యల పరిష్కారం అయినందుకు యూటీఎఫ్ ఏపీ, తెలంగాణ యూనియన్లు హర్షం వ్యక్తం చేశాయి.

16:51 - June 22, 2017

తూ.గో : ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా 7 నెలల గర్భిణి మృతిచెందిన ఘటన తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో చోటుచేసుకుంది. వై రామవరం మండలం కడారికోటకు చెందిన గిరిజన మహిళ మహాలక్ష్మి గర్భిణి గతవారం అస్వస్థతకు గురైంది. దీంతో గుర్తేడు ప్రాథమిక కేంద్రానికి చికిత్స కోసం తీసుకురాగా..పరీక్షించిన వైద్యులు రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పడంతో హుటాహుటిన తీసుకెళ్లారు. అయితే గర్భిణి మహాలక్ష్మిని పరీక్షించిన వైద్యులు..రక్తహీనత సమస్య ఉందని గుర్తించారు. అయితే సకాలంలో వైద్యులు రక్తం ఎక్కించకపోవడంవల్లే మహాలక్ష్మి మృతిచెందిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. 

16:49 - June 22, 2017

వనపర్తి : కొత్తకోట మండలంలోని రామకృష్ణాపురం, పామాపురం గ్రామాల్లో నిన్న కల్లు గీత కార్మికులపై జరిగిన దాడికి నిరసనగా స్థానికులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. దాడికి బాద్యులైన ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్‌తో పాటు దాడిలో పాల్గొన్న అధికారులను సస్పెండ్ చేయాలని గౌడ సంఘం నాయకులు కొత్తకోటలోని ఎక్సైజ్ కార్యాలయం ముందు బైఠాయించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. విషయం తెలుసుకున్న పోలసులు..ఆందోళన కారులతో చర్చలు జరిపారు. అయితే దాడికి పాల్పడిన అధికారులను సస్పెండ్‌ చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన నేతలు..వారికి శిక్ష పడేలా చేస్తామని హామీ ఇవ్వడంతో స్థానికులు శాంతించారు. 

ప్రతిపక్షాల సమావేశం..

ఢిల్లీ : ప్రతిపక్షాల సమావేశం ప్రారంభమైంది. రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. ఎన్డీయే నిలబెట్టిన రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నారు. మద్దతివ్వడం ? లేదా ? అభ్యర్థిని నిలబెట్టాలా ? అనే దానిపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు.

16:46 - June 22, 2017

చిత్తూరు: తిరుమలలో రోజుల క్రితం కిడ్నాపయిన బాలుడి ఆచూకీ దొరకలేదు...బాలుడి అదృశ్యం కలకలం రేపుతోంది. ఏడాది వయసున్న బాలుడిని గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లడం గుర్తించిన పోలీసులు సీసీ ఫుటేజీ ద్వారా ఫోటోలను రిలీజ్ చేశారు... అనంతపురం జిల్లా ఉరవకొండ వజ్రకరూర్‌కు చెందిన వెంకటేష్‌ దంపతులు కుమారుడు చెన్నకేశవులుతో కలిసి ఈ నెల 14న తిరుమలశ్రీవారి దర్శనానికి వచ్చారు....గొల్లమండపం వద్ద నిద్రిస్తుండగా తల్లిదండ్రుల వద్ద ఉన్న బాలుడిని దుండగులు అపహరించారు... తల్లిదండ్రులు ఆదమరిచి నిద్రపోతుండగా ఎత్తుకెళ్లిన దుండగులను పోలీసులు సీసీ ఫుటేజీ ద్వారా గుర్తించారు...బాబును ఎత్తుకెళ్లిన వ్యక్తిని గుర్తించి అతని ఫొటో విడుదల నాలుగు రాష్ట్రాల్లో గాలింపు..

కిడ్నాపర్ల కోసం విస్తృతంగా గాలిస్తున్న పోలీసులు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు..కర్నాటక ప్రాంతాల్లో కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు...ఆయా రాష్ట్రాల పోలీసులకు సమాచారం అందించిన పోలీసులు పోస్టర్లు రిలీజ్ చేశారు...సోషల్ మీడియా...మీడియా ద్వారా బాలుడి ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు... 

16:45 - June 22, 2017

కరీంనగర్ : సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్‌ నిలబెట్టుకోవాలని... టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి డిమాండ్ చేశారు.. కరీంనగర్‌లో సమ్మె చేస్తున్న సింగరేణి కార్మికులకు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మద్దతు తెలిపారు.. కార్మికులకు కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.. 

బాబు వ్యాఖ్యలపై విస్మయం..

చిత్తూరు : రాష్ట్రాన్ని తాను అభివృద్ధి చేయడం జరుగుతోందని..ఉచిత కరెంటు ఇస్తున్నట్లు, నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపిని గెలిపించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. లేకపోతే నంద్యాలను ఏ రకంగా అభివృద్ధి చేయలేమని పేర్కొనడం ప్రజలకు విస్మయాన్ని కలిగించింది.

 

బాబు వ్యాఖ్యలపై విస్మయం..

చిత్తూరు : రాష్ట్రాన్ని తాను అభివృద్ధి చేయడం జరుగుతోందని..ఉచిత కరెంటు ఇస్తున్నట్లు, నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపిని గెలిపించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. లేకపోతే నంద్యాలను ఏ రకంగా అభివృద్ధి చేయలేమని పేర్కొనడం ప్రజలకు విస్మయాన్ని కలిగించింది.

 

16:42 - June 22, 2017

కర్నూలు : కోవెలకుంట్లలో జరిగిన చోరీలో ఒకరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతని వద్ద నుంచి మూడున్నర కిలోల బంగారు ఆభరణాలు, 15 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

16:41 - June 22, 2017

హైదరాబాద్: సింగరేణిలో జరుగుతోన్న వారసత్వ సమ్మెకు.. మేము సైతం అంటూ కార్మికుల వారసులు ముందుకొస్తున్నారు. సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి సింగరేణి యాజమాన్యం, తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం చేస్తున్న కుట్రలను తిప్పి కొడతామంటున్నారు. మరో పోరాటానికి యువకులు సిద్ధమవుతున్నారు. దీనిపై మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

చోరీలో 15 లక్షల నగదు స్వాధీనం..

కర్నూలు : జిల్లా కోవెలకుంట్లలో జరిగిన చోరీలో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. మూడున్నర కిలోల బంగారం..15 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

కిర్లంపూడికి రానున్న రఘువీరా..

విజయవాడ : కిర్లంపూడి లో ముద్రగడను ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి కలువనున్నారు. ఈనెల 26 నుండి ముద్రగడ చేపట్టే పాదయాత్రపై రఘువీరా చర్చించనున్నారు.

16:37 - June 22, 2017

హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్‌లో రూ. 7 కోట్ల పాత నోట్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించి రవి, శ్రీనివాస్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో శ్రీనివాస్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ జైలుకు వెళ్లి వచ్చాడు. అయితే శ్రీనివాస్ నటి జీవిత తమ్ముడు అని మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీనిపై స్పందించిన జీవిత '10టివి'తో మాట్లాడుతూ.. మాకూ శ్రీనివాస్ కు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. మా బ్రెదర్ శ్రీనివాస్ అపోలో చికిత్స పొందుతున్నాడని పేర్కొన్నారు. రద్దయిన నోట్ల తో పట్టుబడిన శ్రీనివాస్ మాసినిమా మేనేజర్స్ లో ఒకరని తెలిపారు. అయితే మాకూ అతనికి ఎలాంటి సంబంధం లేదని, ఇంతా మీడియా సృష్టేనని, మీడియాలో వార్తను ప్రచురించేటపుడు వివరణ తీసుకుంటే బాగుండేదని ఆవేదన వ్యక్తం చేశారు.

నిరహార దీక్షలకు తమ్మినేని మద్దతు..

ఖమ్మం : ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ రిలే నిరహార దీక్షలకు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని మద్దతు తెలియచేశారు. గ్రీన్ మార్కెట్ ను గుర్రాలపాడుకు తరలించాలని రిలే నిరహార దీక్షలు చేస్తున్నారు. ప్రజలు..వ్యాపారులు..రైతులు అభీష్టం మేరకు గ్రీన్ మార్కెట్ ను గుర్రాలపాడుకు తరలించాలని డిమాండ్ చేశారు.

ఉత్తమ్ ను అడ్డుకున్న పోలీసులు..

పెద్దపల్లి : గోదావరిఖనిలో సింగరేణి కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపేందుకు వెళుతున్న ఉత్తమ్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ లో చోటు చేసుకుంది.

మాకు..సంబంధం లేదు - జీవిత..

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ లో రూ. 7కోట్లు స్వాధీనం చేసుకున్న ఘటనలో సినీ నటి జీవిత సోదరుడు ఉన్నట్లు కలకలం రేగింది. దీనిపై టెన్ టివితో జీవిత మాట్లాడారు. శ్రీనివాస్ ఎంటర్ ప్రైజెస్ తో తమకు సంబంధం లేదని, శ్రీనివాస్ మాత్రం తమ దగ్గర పనిచేసే వాడని తెలిపారు. తనకు తమ్ముడు లేడని, ఇదంతా మీడియా సృష్టే అని స్పష్టం చేశారు.

ఇద్దరు జర్నలిస్టులకు జైలు శిక్ష..

బెంగళూరు : ఇద్దరు జర్నలిస్టులకు కర్నాటక స్పీకర్ కోలినాడ్ ఏడాది జైలు శిక్ష విధించారు. అంతేగాకుండా రూ. 10వేల జరిమానాను విధించారు. ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా అభ్యంతకర వార్తలు రాశారని ఈ శిక్ష వేశారు.

సింధు విజయం..

ఢిల్లీ : ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ క్వార్టర్స్ కు పీవీ సింధు చేరింది. ఫ్రీ క్వార్టర్స్ లో చైనా క్రీడాకారిణి చెన్ జియాజిన్ పై సింధు గెలుపొందింది.

ఆ గర్భిణీల బాధ్యత ఎవరిది ?

హైదరాబాద్ : నగరంలోని ఓ ఆసుపత్రిలో అధికారులకు దొరికిన 48 మంది గర్భిణీల విషయంలో హైకోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. గర్భిణీల బాధ్యత ఎవరిదని, వారం రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆరోగ్య శాఖాధికారులకు నోటీసులు జారీ చేసింది.

15:43 - June 22, 2017

హైదరాబాద్: రద్దైన పెద్దనోట్ల మార్పిడి ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా హైదరాబాద్‌ నగరంలోని జూబ్లీహిల్స్‌లో పెద్ద ఎత్తున రద్దైన పాత కరెన్సీ నోట్లు పట్టుబడ్డాయి. పెద్ద మొత్తంలో నోట్ల మార్పిడి జరుగుతోందనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు..ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్‌ పీఎస్‌ పరిధిలో శ్రీనివాస్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ పేరుతో కంపెనీ నడుపుతున్న శ్రీనివాస్‌తో పాటు రవి అనే మరో వ్యక్తిని సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి 7 కోట్ల రద్దైన పాతనోట్లను స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో ఒకరు సినీనటి జీవితా రాజశేఖర్‌కు సమీప బంధువుగా తెలుస్తోంది. ఈ అంశంలో దీంట్లో సినీనటి జీవిత ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు దృష్టి సారించారు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 

ప్రియుడు మోసం చేశాడని..

పశ్చిమగోదావరి : ప్రియుడు మోసం చేశాడంటూ మనస్థాపంతో నాగరత్నం ఆత్మహత్యకు పాల్పడింది. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం తాళ్లపాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతి రాలి ఇంట్లో కల్యాణ్ రాసిన ప్రేమలేఖలు బయటపడ్డాయి. సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

15:41 - June 22, 2017

.గో : ప్రియుడు ప్రేమించి మోసం చేశాడంటూ ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది.. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం తాళ్లపాలెంలో ఈ ఘటన జరిగింది.. పెంటపాటి కల్యాణ్‌ అనే యువకున్ని మృతురాలు నాగరత్నం ప్రేమించింది.. కొంతకాలం ఇద్దరూ ప్రేమించుకున్నారు.. వివాహం విషయానికివచ్చేసరికి కల్యాణ్‌ ప్లేట్‌ ఫిరాయించాడు.. దీంతో మనస్తాపంచెందిన నాగరత్నం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.. దర్యాప్తు చేస్తున్న పోలీసులకు మృతురాలి ఇంట్లో కల్యాణ్‌ రాసిన ప్రేమలేఖలు, నాగరత్నం సుసైడ్‌ లెటర్‌ లభ్యమైంది.. 

రుణమాఫీ ఫ్యాషన్ గా మారిపోయిందన్న వెంకయ్య..

ఢిల్లీ : రైతుల రుణమాఫీపై కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీ ఫ్యాషన్ గా మారిపోయిందని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. అత్యవసర పరిస్థితుల్లోనే రుణమాఫీ చేయాలని, సమస్యలకు రుణమాఫీ పరిష్కార మార్గం కాదని పేర్కొన్నారు.

15:39 - June 22, 2017

చిత్తూరు: వచ్చే రెండేళ్లలో ఏపీలోని ఐటీ రంగంలో లక్ష, ఎలక్ట్రానిక్స్‌ రంగంలో ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. చిత్తూరు జిల్లా రేణిగుంట ఎలక్ట్రానిక్స్ క్లస్టర్‌లో సెల్‌కాన్ మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. సెల్‌కాన్ మొదటి మొబైల్‌ ఫోన్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. 2019 నాటికి రేణిగుంట ఎలక్ట్రానిక్స్ క్లస్టర్‌లో లక్ష ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు మంత్రి లోకేష్‌ చెప్పారు. ప్రతి నెలా ఒక పరిశ్రమకు శంకుస్థాపన, మరో పరిశ్రమకు ప్రారంభోత్సవం చేసే విధంగా ప్రణాళికలు రూపొందించామన్నారు. 

15:37 - June 22, 2017

హైదరాబాద్: ఆఫ్ఘనిస్థాన్‌లోని హెల్మండ్‌లో కారుబాంబు పేలుడు జరిగింది. ఓ బ్యాంక్‌ వద్ద కారును ముష్కరులు పేల్చివేశారు. ఈ ఘటనలో 24 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 60 మంది గాయపడ్డారు. మిలటరీ ప్రభుత్వ ఉద్యోగులు, పౌరులు తమ జీతాలను విత్‌డ్రా చేసుకునేందుకు బ్యాంకు ఎదుట క్యూలో నిలబడిన సమయంలో ఒక్కసారిగా బాంబు పేలుడు సంభవించింది. ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక సిబ్బంది క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. 

15:36 - June 22, 2017

హైదరాబాద్: గ్రూప్‌-2 వివాదంపై టీఎస్‌పీఎస్సీ కౌంటర్ దాఖలుకు గడువు కోరింది. దీనికి అంగీకరించిన హైకోర్టు... గ్రూప్‌-2 నియామకాలపై విధించిన స్టేను జులై 4 వరకు స్టే పొడిగించింది. 

15:34 - June 22, 2017

తూ.గో : ఓ వ్యక్తి ఛాతిలో దిగబడిన గునపాన్ని వైద్యులు చాకచక్యంగా తొలగించి అతని ప్రాణాలు నిలబెట్టారు. ఇంట్లో పాత గోడ కూలగొడుతుండగా రాజమండ్రిలోని.. దివాన్ చెరువుకు చెందిన చిటికిన వెంకటేశ్వరరావుకు ప్రమాదవశాత్తు కుడివైపు ఛాతిలో గునపం దిగబడింది. దీంతో వెంకటేశ్వరరావును కిమ్స్‌కు తరలించారు. బాధితుడిని పరీక్షించిన వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేసి గునపాన్ని తొలగించారు. అయితే రక్తస్రావం ఎక్కువగా జరిగిందని, ప్రస్తుతం వెంకటేశ్వరరావు కొలుకుంటున్నాడని డాక్టర్ సతీష్ చెప్పారు.

15:05 - June 22, 2017

గిదెండి చికెన్ కోసం లీవ్ అడగడం ఏంటీ ? అనుకుంటున్నారా ? కానీ ఇది నిజంగానే జరిగింది. తనకు చికెన్ తినాలని ఉందని..ఓ ఏడు రోజులు లీవ్ కావాలని ఉద్యోగి రాసిన లెటర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఛత్తీస్ గడ్ రాష్ట్రంలోని బిలాస్ పూర్ జిల్లాకు చెందిన పంకజ్ రావ్ స్టేషన్ మాస్టర్ గా పని చేస్తున్నాడు. తనపై అధికారికి ఆయన ఒక లీవ్ లెటర్ అందించాడు. త్వరలో శ్రావణ మాసం రాబోతోందని..ఈ మాసంలో తనింట్లో చికెన్ వండరని పేర్కొన్నాడు. ప్రస్తుతం చికెన్ తినడానికి లీవ్ కావాలని వేడుకున్నాడు. ఈనెల 20 నుండి 27 వరకు లీవ్ కావాలని..వారం రోజులు బాగా చికెన్ తిని బలం తెచ్చుకుని బాగా పనిచేస్తానని లెటర్ లో రాశాడు. మరి అధికారులు చికెన్ తినేందుకు లీవ్ ఇచ్చారో లేదో తెలియదు. కానీ వార్త మాత్రం హల్ చల్ చేస్తోంది.

హైకోర్టులో గ్రూప్ 2 వివాదం..

హైదరాబాద్ : గ్రూప్ 2 వివాదంపై కౌంటర్ దాఖలుకు టీఎస్పీఎస్సీ గడువు కోరింది. గ్రూప్ 2 ప్రక్రియపై జులై 4వరకు హైకోర్టు స్టే పొడిగించింది.

 

మైలార్ దేవ్ లో నకిలీ కారం..

రంగారెడ్డి : మైలార్ దేవ్ పల్లి పల్లె చెరువు సమీపంలో నకిలీ కారం పొడి తయారీ కేంద్రంపై ఎస్ వోటీ పోలీసులు దాడులు జరిపారు. రూ. 15లక్షల విలువైన కారం పొడి, ముడిసరుకులను స్వాధీనం చేసుకున్నారు. కారం పొడి తయారు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

14:45 - June 22, 2017

విశాఖ : అన్యాయం చేస్తోన్న ప్రభుత్వాన్ని.. గట్టిగా నిలదీయడం కోసమే మహాధర్నాను నిర్వహిస్తున్నట్లు వైసీపీ అధినేత జగన్‌ అన్నారు. విశాఖలో జరుగుతోన్న స్కాం.. మామూలు స్కాం కాదని చెప్పారు. ముఖ్యమంత్రి, మంత్రులు, కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు.. అందరూ మాఫియాలా తయారై భూములను దోచుకుంటున్నారని జగన్‌ ఆరోపించారు. చంద్రబాబునాయుడి తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

రెవెన్యూ రికార్డులు మొత్తం మాయం

విశాఖ వాసులకు సీఎం చంద్రబాబు భూకుంభకోణాలని బహుమతిగా ఇచ్చారని వైసీపీ అధినేత జగన్‌ ఆరోపించారు. రెవెన్యూ రికార్డులు మొత్తం మాయం చేశారని ధ్వజమెత్తారు. భూకుంభ కోణాలపై సీఎం చంద్రబాబు రోజుకో మాట మాట్లుడుతున్నారని మండిపడ్డారు. సిట్‌ విచారణతో ఎలాంటి న్యాయం జరగదన్నారు. ల్యాండ్‌స్కామ్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఉన్నారని.. చంద్రబాబు కింద పనిచేసే అధికారులతో సిట్‌ వేస్తే న్యాయం జరుగుతుందా అని ప్రశ్నించారు. 

14:42 - June 22, 2017

.గో : గరగపర్రులో దళితుల బహిష్కరణ అంశంపై '10 టీవీ'లో ప్రసారమైన కథనాలకు ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు స్పందించారు. దళితుల్ని వెలివేయడం క్షమించరాని అంశమన్నారు మంత్రి ఆనందబాబు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్‌తో మాట్లాడతానని.. సాంఘిక సంక్షేమ శాఖ అధికారులను గ్రామానికి పంపించి నివేదిక తెప్పిస్తామని మంత్రి చెప్పారు. నిజంగా అలాంటి ఘటన జరిగినట్లు రుజువైతే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని ఆనందబాబు స్పష్టం చేశారు. 

14:40 - June 22, 2017

హైదరాబాద్: హెచ్ఎండీఏ ఔటర్‌ రింగ్‌రోడ్డు పనుల్లో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయి. పనుల నిర్వహణలో కోట్ల రూపాయల అవినీతి జరుగుతుంది. హెచ్ఎండీఏ అధికారులు మొదట ప్యాకేజీలో కేటాయించిన పనులు పూర్తికాకుండానే.. పనులు పూర్తి చేసినట్టు చూపి కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించారు. అలాగే మొదట కేటాయించిన ప్యాకేజీలో చేయాల్సిన పనులకు అధికారులు మళ్లీ టెండర్లు వేశారు. టెండర్‌ ధర కన్నా 16 నుంచి 42 శాతం అధిక రేటుకు కట్టబెట్టారు. ఇప్పుడు కొత్త కాంట్రాక్టర్లతో పనులు చేయిస్తున్నారు.. దీంతో సంస్థపై 350 కోట్ల వరకు భారం పడుతుంది. ప్రాజెక్ట్‌ ఆలస్యమవుతున్నా.. కాంట్రాక్టర్‌పై పెనాల్టీలు వేయకుండా హెచ్‌ఎండీఏ చెల్లిస్తుంది.  

14:39 - June 22, 2017

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సహించరా ? అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడిస్తే అంతేనా ? షేరింగ్ చేస్తే కటకటాల వెనక్కి నెట్టేస్తారా ? ఈ ప్రశ్నలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టింగ్ లు చేసినా..ప్రశ్నించినా చర్యలు తీసుకొంటోంది అక్కడ ప్రభుత్వం.

సామాజిక మాధ్యమం..రోజు రోజుకు విస్తరిస్తోంది. ప్రధానంగా ఫేస్ బుక్ లో ఓ విషయం పోస్టింగ్ చేస్తే క్షణాల్లో వైరల్ అవుతుంటుంది. పలువురు సెలబ్రెటీలు..రాజకీయ నేతలు తమ విషయాలను షేర్ చేస్తుంటారు. ప్రభుత్వాలు కూడా తమ కార్యక్రమాలు..సంక్షేమ పథకాలు..ఇతరత్రా విషయాలను కూడా సామాజిక మాధ్యమాల్లో వెల్లడిస్తుంటుంది. ఆయా సమస్యలపై కూడా వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటున్నాయి.

ఏపీ ప్రభుత్వం కొరడా..
ఫేస్ బుక్ లో పోస్టింగ్ చేసిన వారిపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొరడా ఝులిపిస్తోంది. కానీ బాహాటంగానే రచ్చ రచ్చ చేస్తున్న నేతలపై మాత్రం చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏపీ బ్రాహ్మణ సంఘ ఛైర్మన్ ఐవైఆర్ ఫేస్ బుక్ లో పోస్టింగ్ లు షేర్ చేయడంపై బాబు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఏకంగా ఆయన్ను పదవి నుండి తొలగించడంతో పోస్టింగ్ పై చర్చ జరుగుతోంది. ఇటీవలే పొలిటికల్ పంచ్ నిర్వాహకుడు రవికిరణ్ ను కూడా ఇదే విధంగా అరెస్టు చేశారు. ఇటీవలి కాలంలో కొత్తగా మంత్రి పదవి చేపట్టిన లోకేష్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. అంబేద్కర్ జయంతి నాడు వర్ధంతి.. అంటూ..పైగా వర్ధంతి శుభాకాంక్షలు చెప్పడం లోకేష్ పై సోషల్ మీడియా యాక్టివిస్టులు విరుచుకుపడ్డారు.

నేతలపై చర్యలేవీ ?
ఇలాంటి సంఘటనలనే పొలిటికల్ పంచ్ హైలైట్ చేసింది. ఇటీవలే ఎయిర్ పోర్టులో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన రచ్చపై ఎందుకు చర్యలు తీసుకోలేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అంతేగాకుండా విజయవాడ రోడ్డు రవాణా సంస్థ కమిషనర్ ను ఎంపీ కేశినేని..బొండా ఉమలు దుర్భాషలాడిన ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న విషయం తెలిసిందే. రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.

14:32 - June 22, 2017

సెల్ కాన్ మొబైల్ తయారీ పరిశ్రమ ప్రారంభం..

విజయవాడ : రేణిగుంట ఎయిర్ పోర్టు సమీపంలో సెల్ కాన్ మొబైల్ తయారీ పరిశ్రమను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. రానున్న రోజుల్లో పరిశ్రమలు రావడానికి కృషి చేస్తానని..ఉద్యోగాలు సృష్టించే బాధ్యత తీసుకుంటానని లోకేష్ హామీనిచ్చారు.

విమానంలోని బాత్ రూంలో బంగారం..

ముంబై : దుబాయికు వెళుతున్న జెట్ ఎయిర్ వేస్ విమాన బాత్ రూంలో దాచిపెట్టిన బంగారాన్ని ఏఐయు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 10 గోల్డ్ బార్స్ ను స్వాధీనం చేసుకున్నారు. దీనివిలువ రూ. 34,80,000 ఉంటుందని అంచనా.

13:47 - June 22, 2017

నోట్ల రద్దు..రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు ప్రజాజీవితంపై పెద్ద మార్పు తీసుకొచ్చింది. ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా ఎంతో మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉగ్రవాదం..అవినీతి..డిజిటల్ పేమెంట్ లను ప్రోత్సాహించాలని నోట్ల రద్దుకు కారణం అని కేంద్రం పేర్కొంది. మరి డిజిటల్ పేమెంట్ లు పెరిగాయా ? తగ్గాయా ? వాస్తవంగా పెరగాల్సి ఉంటుంది. కానీ నోట్ల రద్దు అనంతరం కొద్దిగా డిజిటల్ పేమెంట్ లు పెరిగాయి. తరువాత రోజుల్లో ఈ పేమెంట్లు తగ్గిపోతున్నాయి. ఈ విషయాన్ని ఓస్వాల్ సెక్యూర్టీస్ సంస్థ పేర్కొంది. ముంబయికి చెందిన ఫైనాన్షియల్ సర్వీసెస్ వ్యవహారాలను చూస్తుంటుంది. డిజిటల్ పేమెంట్ల విషయంలో పలు విషయాలను ఓస్వాల్ సెక్యూర్టీస్ వెల్లడించింది. నోట్ల రద్దు అనంతరం డిజిటల్ పేమెంట్ ల విషయంలో పెద్దగా మార్పు రాలేదని వెల్లడించడం గమనార్హం. నోట్లు రద్దు చేసిన తొలి రోజుల్లో డిజిటల్ పేమెంట్లు పెరిగినా మళ్లీ తగ్గిపోతున్నాయని పేర్కొంది. నోట్ల రద్దు పూర్వపు రోజులకు ఇప్పటికీ తేడా ఏమీ లేదని వెల్లడించడం విశేషం.

13:34 - June 22, 2017

పశ్చిమ గోదావరి : పశ్చిమ గోదావరి : జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో కుల దురహంకారం పడగవిప్పింది. రాజ్యంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహం పెట్టారని గ్రామస్తులపై పగబట్టాయి అగ్రవర్ణాలు. గత2 నెలలుగా దళితులను పనులు చేయకుండా సామాజిక బహిష్కరణ విధించారు అగ్రకులస్తులు. దీంతో పనుల్లేక.. ఆకలితో అలమటించిపోతున్నారు గ్రామస్తులు. దళితుల వద్ద ఉన్న కౌలు పొలాల్ని కూడా వెనక్కి తీసుకుని పనులకు రావొద్దని హుకుం జారీ చేశారు. 14 కులాలతో సమావేశం ఏర్పాటు చేసిన గ్రామ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దళితులకు ఎవరైనా పనులు ఇస్తే రూ.10వేలు జరిమానా విధిస్తామని ప్రకటన చేశారు. గ్రామానికి వచ్చేవారిపై కూడా సిసి కెమెరాలతో నిఘా వేశారు. జిల్లా కలెక్టర్‌కు నివేదించినా న్యాయం జరగకపోవడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు గరగపర్రులోని దళితులు. అధికారులు కలగజేసుకుని తమకు న్యాయం చేయాలని చేతులెత్తి వేడుకుంటున్నారు.

మాట్లాడితే రూ.1000 జరిమాన
గ్రామ పెద్దలు అందరు కలిసి దళితులతో మాట్లాడితే రూ.1000 జరిమాన, వారిని పనికి పిలిస్తే రూ.10, 000 వేల జరిమాన అని తీర్మానించారు. రాజ్యంగ నిర్మాత విగ్రహం పెడితే తమని బహిష్కరించారని దళితులు ఆవేదన వ్యక్తం చేశారు.సర్పంచ్, ఎంపీటీసీ దళితులైనా కూడా ఆ గ్రామంలో అగ్రకులాలదే అధిపత్యం చేలయిస్తున్నారని వారు తెలిపారు. గ్రామ తీర్మాణం లేకుండా విగ్రహం పెట్టడమే వారి నేరమా అని సీపీఎం నేతలు అన్నారు.

విగ్రహం పెడితే ఊరు మైల పడుతుందా.....
రాజ్యంగ నిర్మాత విగ్రహం పెడితే ఊరు మైల పడుతుందని అగ్రవర్ణాలు అనడం వారి దురహకరానికి ప్రతిక అని గ్రామ ఎంపీటీసీ అన్నారు. కనీసం వృద్ధులకు మందులు కూడా ఇవ్వకుండా చేయడం దారుణమని ఆయన తెలిపారు. ఎమ్మెల్యేల చెప్పెది అబద్దాలని ఆయన స్పష్టం చేశారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి. 

రైలు ఛార్జీలు పెరుగుతాయంట..

హైదరాబాద్ : జీఎస్టీతో రైలు ప్రయాణం మరింత భారం కానుంది. ఎసీ, ఫస్ట్ క్లాస్ ఛార్జీలు పెరగనున్నాయి. 4.5 శాతం నుండి 5 శాతానికి రైల్వే టికెట్ల సర్వీస్ ట్యాక్స్ పెరగనుంది.

దళితుల వెలి..టెన్ టివికి స్పందన..

విజయవాడ : టెన్ టివి కథనానికి స్పందన లభించింది. ప.గో.జిల్లా గరగపర్రులో సామాజిక బహిష్కరణ ఘటనపై సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి ఆనంద్ బాబు స్పందించారు. దళితులను బహిష్కరించడం అమానుషమని, పూర్తి విచారణ జరిపి న్యాయం చేస్తామన్నారు.

 

జీవీఎంసీ వద్ద వైసీపీ మహాధర్నా..

విశాఖపట్టణం : జీవీఎంసీ వద్ద వైసీపీ మహాధర్నా చేపట్టింది. వైసీపీ అధ్యక్షుడు జగన్ పాల్గొని ప్రసంగించారు. విశాఖలో భూ ఆక్రమాలకు వ్యతిరేకంగా ఈ ధర్నా జరిగింది. ధర్నాలో వామపక్ష నేతలు కూడా పాల్గొన్నారు. విశాఖలో జరుగుతున్నది మాములు స్కామ్ కాదని, సీఎం..మంత్రులు..కలెక్టర్లు..రెవెన్యూ అధికారులు..మాఫియాలా తయారై భూములు దోచుకుంటున్నారని ఆరోపించారు. అసెన్డ్ భూములు కాజేసేందుకు ప్రభుత్వం స్కెచ్ వేసిందని, పేదలను బెదిరించి అసైన్డ్ భూములను లాక్కొంటున్నారని పేర్కొన్నారు.

జూబ్లీహిల్స్ లో రూ. 5కోట్ల పాతనోట్లు..

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ లో రూ. 5కోట్ల పాతనోట్లు స్వాధీనం చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. శ్రీనివాస్ ఎంటర్ ప్రైజెస్ లో వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల అదుపులో రవి, శ్రీనివాస్ లున్నారు.

13:18 - June 22, 2017

విశాఖ : కడుపు మండుతూ మనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడం కోసం, మన బాధ చెప్పకోవడానికి , చంద్రబాబుకు బుద్ధిరావాలని కోరుకుందాం. ప్రభుత్వం పెద్దలు, అధికారుల మాఫియాగా మారి భూములు కబ్జా చేసుకుంటున్నారు. ల్యాండ్ పులింగ్ పేరుతో పేదల భూములను ప్రభుత్వం పెద్దలు అక్రమించుకున్నారని జగన్ ఆరోపించారు. పథకం ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీల భూములను లాకుంటున్నారు. జగన్ బాదితులతో మాట్లాడించారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

13:15 - June 22, 2017

విశాఖ : విశాఖలో ప్రభుత్వ భూములను మంత్రులు వారి బంధువులు అక్రమించుకుంటున్నారని, మంత్రి గంటా బంధవు ఏకంగా ప్రభుత్వ భూమిని బ్యాంక్ లో కుదవపెట్టి అప్పు తీసుకున్నారని, చంద్రబాబు బంధువు ఎంబీఎస్ మూర్తి గీతం యూనివర్సిటీ అధినేత ఋషికొండ బీచ్ లో 50 ఎకరాలు కబ్జా చేశారని, సీఎం చంద్రబాబు ఆ భూమిని మూర్తి అప్పగీస్తూ కేబినెట్ లో తీర్మాణం చేశారని జగన్ ఆరోపించారు. భూ కుంభకోణం మొదట బహిరంగ విచారణ చేయిస్తామని చెప్పి ఇప్పుడు సిట్ వేశారని తెలిపారు. రావణుడు కుంభకర్ణునితో విచారణ చేస్తే ఎలా ఉంటది, అదే హనుమంతునితో విచారణ చేయిస్తే రాక్షసులు, రావణుని భరతం పడతడాని జగన్ అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

 

12:54 - June 22, 2017

తెలంగాణ రాష్ట్ర సర్కార్ ప్రవేశ పెట్టిన పథకంతో 'గొర్రెల'కు యమ డిమాండ్ ఏర్పడిందంట. మన రాష్ట్రంలో కాదు..పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో. ఇటీవలే గొల్ల కురుమలకు 'గొర్రెల ప్రత్యేక ప్యాకేజీ'ని ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఇతర రాష్ట్రాల నుండి దిగుమతులు చేసుకోవడం ఆగిపోయి తెలంగాణ రాష్ట్రం నుండే గొర్రెలు ఎగమతులు చేసే పరిస్థితి ఉత్పన్నం కావాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల నుండి గొర్రెలను కొనుగోలు చేసి ఇక్కడ వారికి అందచేస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంలో 'గొర్రెల' డిమాండ్ పెరిగిందంట. పశు సంవర్ధక అధికారులు అనంతపురానికి చేరుకుని గొర్రెలను కొనుగోలు చేసి తెలంగాణ రాష్ట్రానికి తరలిస్తున్నారు. వేల సంఖ్యలో గొర్రెలు తరలివెళ్లినట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద ఎత్తున్న గొర్రెలు తరలిపోతే భవిష్యత్ లో ఇబ్బందులు తలెత్తుతాయని పలువురు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. అప్పటికప్పుడు బేరాలు కుదుర్చుకుని గొర్రెలతో వెనుదిరుగుతున్నాయి. ఇందులో దళారులు కూడా ప్రవేశించినట్లు తెలుస్తోంది. దళారుల సాయంతో ఎక్కువగా బేరసారాలు సాగిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి అనంతపురంలో గొర్రెలకు డిమాండ్ ఏర్పడడం పట్ల రైతులు సంతోషంగానే ఉన్నారంట.

ఐవైఆర్ తొలగింపు సమర్థనీయమన్న రాయపాటి..

గుంటూరు : ఐవైఆర్ కృష్ణారావు తొలగింపుపై సీఎం నిర్ణయం సమర్ధనీయమేనని ఎంపీ రాయపాటి వ్యాఖ్యానించారు. రాజధానిని దొనకొండలో పెట్టాలని ఐవైఆర్ ప్రయత్నించారని, అక్కడ ఆయన భూములు కొనడమే అందుకు కారణమని ఆరోపించారు. ఆ విషయాన్ని సీఎం దృష్టికి అప్పుడే తీసుకెళ్లామని, ఐవైఆర్ ఓ పార్టీ అడుగుజాడల్లో పనిచేస్తున్నారని తెలిపారు. కృష్ణారావు పుస్తకం రాసినా ప్రయోజనం లేదని, చదవి పక్కన పడేస్తారని ఎద్దేవా చేశారు.

ఔటర్ రింగ్ రోడ్డు పనుల్లో భారీ అక్రమాలు..

హైదరాబాద్ : హెచ్ఎండీఏ ఔటర్ రింగ్ రోడ్డు పనుల్లో భారీ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. మొదట కేటాయించిన ప్యాకేజీలో చేయాల్సిన పనులకు మళ్లీ టెండర్లు వేశౄరు. టెండర్ ధర కన్నా 16 నుండి 42 శాతం అధిక రేటుకు టెండర్లను హెచ్ఎండీఏ అధికారులు కట్టబెట్టారు. కాంట్రాక్టర్ పనులు పూర్తి చేసినట్లు బిల్లులు చెల్లించారు. హెచ్ఎంటీఎస్, టోల్ ప్లాజాలు, టోల్ బిల్డింగ్, నాయిస్ బారియర్స్ నిర్మాణం కోసం కొత్త కాంట్రాక్టర్లతో హెచ్ఎండీఏ పనులు చేయిస్తోంది.

వీహెచ్..జగ్గారెడ్డి అరెస్టు..

హైదరాబాద్ :ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద వ్యవసాయ ఉత్పత్తులపై జీఎస్టీకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. వీహెచ్ దీక్షకు జగ్గారెడ్డి సంఘీభావం తెలిపారు. వీహెచ్, జగ్గారెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు.

12:32 - June 22, 2017

ఒక్క ఆడియో ఫంక్షన్ కు రూ. 25 కోట్లా ? అని ఆశ్చర్యపోతున్నారా ? తమిళ సూపర్ స్టార్ 'రజనీకాంత్'..'శంకర్' దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రోబో 2.0’ షూటింగ్ పూర్తయి నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోటంది. భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్..డ్రామాగా తెరకెక్కుతున్న సినిమాకు ఏకంగా రూ. 400 కోట్లు ఖర్చు పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆడియో వేడుకను కనీవినీ ఎరుగని రీతిలో తీయాలని చిత్ర యూనిట్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దుబాయిలో ఆడియో వేడుక జరుపనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఆడియో వేడుక గురించి చిత్ర యూనిట్ మాత్రం ఎలాంటి అధికారికంగా ప్రకటన మాత్రం చేయలేదు. రజనీ సరసన అమీ జాక్సన్‌ హీరోయిన్ గా నటిస్తుండగా అక్షయ్ కుమార్‌ విలన్ నటిస్తున్నారు.

12:24 - June 22, 2017

పశ్చిమ గోదావరి : జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో కుల దురహంకారం పడగవిప్పింది. రాజ్యంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహం పెట్టారని గ్రామస్తులపై పగబట్టాయి అగ్రవర్ణాలు. గత2 నెలలుగా దళితులను పనులు చేయకుండా సామాజిక బహిష్కరణ విధించారు అగ్రకులస్తులు. దీంతో పనుల్లేక.. ఆకలితో అలమటించిపోతున్నారు గ్రామస్తులు. దళితుల వద్ద ఉన్న కౌలు పొలాల్ని కూడా వెనక్కి తీసుకుని పనులకు రావొద్దని హుకుం జారీ చేశారు. 14 కులాలతో సమావేశం ఏర్పాటు చేసిన గ్రామ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దళితులకు ఎవరైనా పనులు ఇస్తే రూ.10వేలు జరిమానా విధిస్తామని ప్రకటన చేశారు. గ్రామానికి వచ్చేవారిపై కూడా సిసి కెమెరాలతో నిఘా వేశారు. జిల్లా కలెక్టర్‌కు నివేదించినా న్యాయం జరగకపోవడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు గరగపర్రులోని దళితులు. అధికారులు కలగజేసుకుని తమకు న్యాయం చేయాలని చేతులెత్తి వేడుకుంటున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి. 

12:12 - June 22, 2017
11:44 - June 22, 2017

హైదరాబాద్ : శిరీష కేసులో కొత్త ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. శిరీషను కుకునూరుపల్లి పోలీస్ క్వార్టర్స్‌కు కాకుండా వేరే చోటకు తీసుకెళ్లారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన భర్తకు ఫోన్ నుంచి రెండు లోకేషన్లు శిరీష షేర్‌ చేయగా.. ఒకటి కుకునూరు పల్లి హైవే, మరొకటి దగ్గర్లోని ఫామ్‌హౌస్‌ను చూపిస్తోంది. ఫామ్‌హౌస్‌లో శిరీషను హత్య చేశారని ఆమె బాబాయి శ్రీనివాస్‌రావు ఆరోపిస్తున్నారు. రాజీవ్‌,శ్రవణ్‌, ఎస్సై ప్రభాకర్‌ రెడ్డి ముగ్గురు కలిసి ఆమెను మట్టుబెట్టారని అంటున్నాడు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

11:41 - June 22, 2017

హైదరాబాద్ : రైతులకు రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌ గన్‌ఫౌండ్రీ ఎస్‌బిఐ ఎదుట టీటీడీపీ నేతలు ఆందోళన చేశారు. రుణాలు రీ షెడ్యూల్ చేయాలని ధర్నా నిర్వహించారు. ధర్నాలో కొత్తకోట దయాకరరెడ్డి, అరవింద్‌కుమార్ గౌడ్, ఒంటేలు ప్రతాప్‌ రెడ్డిలు పాల్గొన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

మహారాష్ట్రంలో రైతుల ఆందోళన హింసాత్మకం..

మహారాష్ట్ర : రైతుల ఆందోళన హింసాత్మకంగా మారింది. తమ భూములను రక్షణ శాఖ స్వాధీనం చేసుకోవడంపై నిరసన వ్యక్తమౌతోంది. థానె - బలదాపూర్ హైవేపై రైతులు ఆందోళన చేపట్టారు. పలు వాహనాలను తగులబెట్టారు.

శ్రీకాంత్ సంచనాలు...

ఢిల్లీ : బ్యాడ్మింటెన్ సూపర్ సిరీస్ లో సంచనాలు నమోదవుతున్నాయి. ఆస్ట్రేలియన్ సూపర్ సిరీస్ రెండో రౌండ్ లో నెంబర్ వన్ ర్యాంకర్ సన్ వాన్ పై గెలుపొందాడు. సవన్ వాన్ పై 15-21, 21-13 తేడాతో శ్రీకాంత్ విజయం సాధించాడు. ఆస్ట్రేలియన్ సూపర్ సిరీస్ మూడో రౌండ్ కు సాయి ప్రణీత్ చేరాడు.

11:39 - June 22, 2017

పశ్చిమ గోదావరి : జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో కుల దురహంకారం పడగవిప్పింది. అంబేడ్కర్ విగ్రహం పెట్టారని గ్రామస్తులపై పగబట్టాయి అగ్రవర్ణాలు. 2 నెలలుగా దళితులను పనులు చేయకుండా సామాజిక బహిష్కరణ విధించారు అగ్రకులస్తులు. దీంతో పనుల్లేక.. ఆకలితో అలమటించిపోతున్నారు గ్రామస్తులు. దళితుల వద్ద ఉన్న కౌలు పొలాల్ని కూడా వెనక్కి తీసుకుని పనులకు రావొద్దని హుకుం జారీ చేశారు. 14 కులాలతో సమావేశం ఏర్పాటు చేసిన గ్రామ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దళితులకు ఎవరైనా పనులు ఇస్తే రూ.10వేలు జరిమానా విధిస్తామని ప్రకటన చేశారు. గ్రామానికి వచ్చేవారిపై కూడా సిసి కెమెరాలతో నిఘా వేశారు. జిల్లా కలెక్టర్‌కు నివేదించినా న్యాయం జరగకపోవడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు గరగపర్రులోని దళితులు. అధికారులు కలగజేసుకుని తమకు న్యాయం చేయాలని చేతులెత్తి వేడుకుంటున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి. 

11:28 - June 22, 2017

కర్నూలు : కర్నూలు ప్రభుత్వాసుపత్రిలోని.. ప్రసూతి విభాగంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. లైన్‌ కట్ అవ్వడంతో 15 గంటలు విద్యుత్ సరఫరా ఆగిపోయింది. దీంతో బాలింతలు, పసిపిల్లలు నానా అవస్థలు పడ్డారు. అయితే అధికారులు విద్యుత్‌ను పునరుద్ధరించారు. జరిగిన ఘటనపై మంత్రి కామినేని అధికారులపై.. ఫైరయ్యారు. 

11:26 - June 22, 2017

విజయవాడ : ఏపీకే కీలకంగా మారిన బెజవాడలో భద్రతను పెంచి ... క్రైం రేట్‌ను తగ్గించే పనిలో పడ్డారు పోలీసులు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటూ... నేరాలను అరికడుతున్నారు. ఈ ప్రక్రియలో పోలీసుల దర్యాప్తుకు సీసీ కెమెరాలు అత్యంత కీలకంగా మారాయి. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో అమర్చిన సీసీ కెమెరాల ఆధారంగానే పోలీసులు సుమారు వెయ్యికిపైగా కేసులను పరిష్కరించగలిగారు.

సీసీ కెమెరాల కీలకం...
సీసీ కెమెరాల దృశ్యాలను ఆధారంగా చేసుకుని ఖాకీలు తమదైన శైలిలో సఫలీకృతులవుతున్నారు. గతేడాది నగరంలో సంచలనం సృష్టించిన ఎన్నో కేసులు.. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ఆధారంగానే పరిష్కరించారు. కానిస్టేబుల్ అయూబ్ మృతి కేసు.. బీఆర్టీఎస్ రోడ్‌లో ఓ బాలికపై సామూహిక అత్యాచారం కేసు... నాలుగు నెలల క్రితం కంకిపాడులో ఓ వివాహిత హత్య కేసు.. ఇలా నగరంలో సంచలనం కలిగించిన పలు కేసులను పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగానే ఛేదించారు. అలాగే వీఐపీల పర్యటనలు, బందోబస్తు, ఆందోళనలు, ట్రాఫిక్ సమస్యలు, అల్లర్లు ఇలా ప్రతి అంశాన్నీ సీసీ కెమెరాల ద్వారా నిత్యం పర్యవేక్షిస్తున్నారు. అలాగే వాహనాలతో ఢీ కొట్టి పరారవుతున్న వ్యక్తులను, చోరులను సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగానే చెక్‌ పెడుతున్నారు.కాగా నేరాలను అరికట్టేందుకు అన్నిరకాలుగా కృషి చేస్తున్నట్టు పోలీసు అధికారులు చెబుతున్నారు.

అత్యంత జాగ్రత్తగా
విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో వివిఐపీల పర్యటనలు ఎక్కువగా ఉన్నాయి. సీఎం చంద్రబాబు ఈ ప్రాంతంలోనే నివాసం ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో వివిఐపీల పర్యటనల్లో ఎలాంటి అవాంతరాలూ ఎదురుకాకుండా పోలీసులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఈ పనిలోనూ వారు అత్యధికంగా సీసీ టీవీ ఫుటేజీపైనే ఆధారపడుతున్నారు. ఇంటెలిజెన్స్, విజయవాడ, గుంటూరు పోలీసులు సీసీ కెమెరాల డేగ కన్నుతో వివిఐపీల రూట్‌మ్యాప్‌ను పర్యవేక్షిస్తున్నారు. కేంద్రమంత్రులు, సీఎం, రాష్ట్రమంత్రులు, వీవీఐపీలు తరచూ పర్యటిస్తుండడంతో వీటిని సైతం కెమెరాల్లో నమోదయ్యేలా ఎటాచ్ చేస్తున్నారు. ఈ మేరకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని.. పోలీసుల వ్యవహారాల్లోనూ మార్పులు చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. మొత్తానికి నగరంలో దొంగతనాలు... దోపిడీలు.. హత్యలు.. తగ్గించేందుకు.. పోలీసులు సీసీ కెమెరాల నిఘాను మరింత పటిష్టం చేస్తున్నారు.

 

 

11:24 - June 22, 2017

ఢిల్లీ : కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఇవాళ విపక్షాలు సమావేశం కానున్నాయి. రాష్ర్టపతి అభ్యర్థి ఎంపికపై చర్చించనున్నారు. పరిశీలనలో మీరాకుమార్‌, ప్రకాశ్‌ అంబేడ్కర్‌, షిండే పేర్లు వినిపిస్తున్నాయి. దళిత నేతనే రాష్ర్టపతి అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరింత సమాచారం కోసం వీడియో చూడండి. 

ప్రభుత్వ విధానాలు..మహిలలపై ప్రభావం..

విశాఖపట్టణం : ప్రభుత్వ విధానాలు..మహిలలపై ప్రభావం స్టీల్ ప్లాంట్ ఐద్వా కమిటీ ఆధ్వర్యంలో సెమినార్ జరుగుతోంది. సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారత్ పాల్గొన్నారు.

ఎస్ బీఐ ఎదుట టి.టిడిపి ధర్నా..

హైదరాబాద్ : గన్ ఫౌండ్రీ ఎస్ బీఐ ఎదుట టి.టిడిపి ధర్నా చేపట్టింది. రైతులకు రుణాలు మంజూరు చేయాలని..రుణాలు రీ షెడ్యూల్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నా జరుగుతోంది. బ్యాంకులోకి చొచ్చుకొనేందుకు వెళ్లిన నేతలను పోలీసులు అడ్డుకున్నారు.

పాదయాత్రకు అనుమతి తీసుకోవాలి - చిన రాజప్ప..

తూర్పుగోదావరి : పిఠాపురం బైపాస్ రోడ్డులో రూరల్ పీఎస్ భవనాన్ని హోం మంత్రి ప్రారంభించారు. పాదయాత్ర కోసం ముద్రగడ అనుమతి తీసుకోవాల్సిందేనని, జాతీయ రహదారిపై రాస్తారోకోలకు అనుమతి లేదన్నారు.

11:19 - June 22, 2017

జూ.ఎన్టీఆర్ నటిస్తున్న 'జై..లవ..కుశ' చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఈచిత్రంలో 'ఎన్టీఆర్' ఏకంగా మూడు పాత్రలను పోషిస్తుండడంపై అభిమానుల్లో తెగ ఉత్కంఠ రేపుతోంది. ఇటీలే ఈ చిత్ర ఫొటో విడుదలైన సంగతి తెలిసిందే. మరలా ఎలాంటి ఫొటోలు..ఇతరత్రా విడుదల కావడం లేదు. తమ అభిమాన హీరో ఎలా ఉంటాడు ? టీజర్ ఎప్పుడొస్తుందని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ కొనసాగుతున్న సినిమా టీజర్ త్వరలోనే విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం టీజర్‌ను వచ్చే నెల మొదటి వారంలో అభిమానుల ముందుకు తీసుకురానున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాశీ ఖన్నా, నివేదా థామస్‌ హీరోయిన్లుగా చేస్తున్నారు. కళ్యాణ్‌ రామ్‌ ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌పై నిర్మిస్తున్నారు.

11:15 - June 22, 2017

హైదరాబాద్ : శిరీష కేసులో కొత్త ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. శిరీషను కుకునూరుపల్లి పోలీస్ క్వార్టర్స్‌కు కాకుండా వేరే చోటకు తీసుకెళ్లారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన భర్తకు ఫోన్ నుంచి రెండు లోకేషన్లు శిరీష షేర్‌ చేయగా.. ఒకటి కుకునూరు పల్లి హైవే, మరొకటి దగ్గర్లోని ఫామ్‌హౌస్‌ను చూపిస్తోంది. ఫామ్‌హౌస్‌లో శిరీషను హత్య చేశారని ఆమె బాబాయి శ్రీనివాస్‌రావు ఆరోపిస్తున్నారు. రాజీవ్‌,శ్రవణ్‌, ఎస్సై ప్రభాకర్‌ రెడ్డి ముగ్గురు కలిసి ఆమెను మట్టుబెట్టారని అంటున్నాడు. హత్యను ఆత్మహత్యగా చిత్రికరించారని ఆరోపిస్తున్నాడు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

11:13 - June 22, 2017

 

విశాఖ : విశాఖలో వెలుగు చూసిన 3 వేల కోట్ల భూ కుంభకోణం.. రాజకీయ రచ్చకు దారి తీసింది. దీని గురించి అధికార, విపక్ష నేతలు పరస్పరం ఆరోపణలకు తెగబడుతున్నారు. భూ కుంభకోణాలపై గురువారం విశాఖ జీవిఎంసీ ఎదుట మహాధర్నాకు వైసీపీ పిలుపునిచ్చిన కాసేపటికే.. టీడీపీ నాయకులు వైసీపీకి వ్యతిరేకంగా మహా సంకల్పానికి అదే స్థలం వద్ద పిలుపునిచ్చారు. ఈ ఆందోళనలకు పోలీసులు అధికారికంగా అనుమతులు ఇస్తారా? లేదా? అన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. విశాఖలో భారీ భూ కుంభకోణం రాష్ట్ర స్థాయిలో చర్చకు దారితీసింది. ఇక్కడ మహానాడు ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తొలిసారిగా ఈ విషయంపై స్పందించారు. భూముల విలువలు పెరగడంతో అక్రమాలు ఎక్కువవుతున్నాయని.. వీటికి అడ్డుకట్ట వేయడానికి ప్రత్యేక విధానం తెరపైకి తెస్తామని ప్రకటించారు. ఆ మరుసటి రోజే రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి స్పందించి.. ఈ నెల 15న కలెక్టర్‌ కార్యాలయంలో బహిరంగ విచారణ నిర్వహిస్తామని ప్రకటించారు. ఈలోగా మంత్రివర్గ సమావేశం జరగడం.. సిట్‌ను ఏర్పాటుచేసి అక్రమాల వెలికితీతకు ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగిపోయాయి.

బహిరంగ విచారణ
బహిరంగ విచారణను ఉపయోగించుకుని భూ అక్రమాలపై రచ్చ చేయాలనుకున్న.. ఇతర పార్టీల వ్యూహం బెడిసికొట్టింది. తాజా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ వ్యవహారంపై సీఐడీ విచారణ జరపాలని కోరుతూ ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. వైసీపీ గురువారం జివిఎంసీ వద్ద మహాధర్నాకు పిలుపునిచ్చింది. దీనికి పోటీగా టీడీపీ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద.. మహా సంకల్పానికి సిద్ధమయ్యింది. వైసీపీ మహాధర్నాలో ఆ పార్టీ అధినేత జగన్‌ పాల్గొంటారని చెబుతున్నారు. ఒకేరోజు రెండు భారీ కార్యక్రమాలతో శాంతిభద్రతలకు ఏమైనా సమస్య వస్తుందేమోనన్న వాదనల నేపథ్యంలో.. పోలీసులు అప్రమత్తమయ్యారు. మరోవైపు వామపక్షాలు ఈ భూ వ్యవహారం నిగ్గుతేలే వరకు విశ్రమించమని ప్రకటిస్తున్నారు. మొత్తం మీద విశాఖలో భూ వాడీ వేడీ సాగుతోంది.

బొత్స 16 ఎకరాల దొంగ భూమి
పదేళ్లపాటు రాష్ట్రాన్ని ఇష్టం వచ్చినట్లు దోచుకున్న వైసీపీ నేతలు.. ఇప్పుడు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని టీడీసీ నగర అధ్యక్షుడు, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ విమర్శించారు. వైఎస్సార్‌సీపీ నేతల తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉండగా జగన్‌ పెద్ద ఎత్తున దోచుకున్నారని, అదే సమయంలో మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. బొత్స 16 ఎకరాల దొంగ భూమిని తనకు అంటగట్టాడని తాను ఎవ్వరికి చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ గ్రామీణ మండల పరిధిలో భూ రికార్డులు తారుమారు విషయం తెలియగానే జిల్లాకు చెందిన మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావులు సమగ్ర విచారణ జరపాలని ముఖ్యమంత్రిని కోరారని గుర్తుచేశారు. సీఎం సిట్‌ను ఏర్పాటు చేసి.. విచారణకు ఆదేశించారన్నారు. ఇది పట్టించుకోని వైసీపీ నేతలు గురువారం ధర్నా నిర్వహిస్తున్నామని, దానికి జగన్‌ హాజరవుతారని ప్రకటిస్తున్నారన్నారు. గురువారం వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు 'మహా సంకల్పం' పేరుతో జీవీఎంసీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసే కార్యక్రమానికి జిల్లా టీడీపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరవుతారన్నారు. దీని ద్వారా వైఎస్సార్‌సీపీ నిజస్వరూపాన్ని ప్రజలకు తెలియచేస్తామన్నారు.

10:57 - June 22, 2017

టాలీవుడ్ స్టార్ 'జూ.ఎన్టీఆర్' ‘సావిత్రి' చిత్రంలో నటిస్తున్నాడా ? ప్రస్తుతం దీనిపై సోషల్ మాధ్యమాల్లో తెగ వార్తలు వస్తున్నాయి. పలు విజయవంతమైన సినిమాల్లో నటించిన 'జూనియర్ ఎన్టీఆర్' ‘జై..లవ..కుశ' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మూడు పాత్రలు పోషించనున్నట్లు టాక్. ఇదిలా ఉంటే మహానటి 'సావిత్రి' జీవిత కథ ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో 'ఎన్టీఆర్' పాత్ర కోసం 'జూ.ఎన్టీఆర్' ను చిత్ర యూనిట్ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ కు దగ్గరగా కనిపించే 'జూ.ఎన్టీఆర్' కరెక్టుగా సరిపోతాడని చిత్ర బృందం యోచిస్తున్నట్లు టాక్. కానీ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న 'జూ.ఎన్టీఆర్' దీనిపై ఎలాంటి నిర్ణయం చెప్పలేదని తెలుస్తోంది. మరి ఆయన ఒకే చెబుతారా ? లేదా ? అనేది చూడాలి.

వాజ్ పాయి నివాసానికి రాంనాథ్..

ఢిల్లీ : ఎన్డీయే పక్ష రాష్ట్రపతి అభ్యర్థి రాంనాథ్ కోవింద్ మాజీ ప్రధాని వాజ్ పాయి నివాసానికి చేరుకున్నారు. ఆయన రాష్ట్రపతి పదవికి నామినేషన్ దాఖలు చేయనున్న సంగతి తెలిసిందే.

10:44 - June 22, 2017

ఢిల్లీ : కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఓ యువతిపై అత్యాచారం జరిపిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగు చూసింది. ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైన 24 ఏళ్ల యువతికి ఓ హోటల్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పిన సోనూసింగ్‌- ఆమెను తన కారులో తీసుకెళ్లాడు. ఢిల్లీలోని సాకేత్‌ ప్రాంతంలో ఉన్న సిటీ వాక్‌ మాల్‌లోని పార్కింగ్‌లో కారును ఆపాడు. అనంతరం మత్తు మందు కలిపిన సాఫ్ట్‌ డ్రింక్‌ను ఆమెకు ఇచ్చాడు. మత్తులోకి జారుకున్నాక ఆ యువతిపై సోనుసింగ్‌ లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. 

10:40 - June 22, 2017

విశాఖ : వైసీపీ అధినేత జగన్‌ ఇవాళ విశాఖలో ధర్నాకు దిగుతున్నారు. భూ కుంభకోణాలనేపథ్యంలో టీడీపీ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తున్నారు. జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ బొమ్మదగ్గర జగన్‌ ఆందోళనలో పాల్గొంటారు. విశాఖ భూ కుంభకోణంపై సీబీఐతో విచారించాలనని డిమాండ్‌ చేస్తున్న జగన్‌ ..మహాధర్నాతో ప్రజల్లో అధికారపార్టీని మరింత ఇరుకున పెట్టేందుకు విశాఖను వేదికగా ఎంచుకున్నారు. విశాఖ మహాధర్నా ఏర్పాట్లను వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి తదితరలు పరిశీలించారు. అటు తాముకూడా ఆందోళనలో పాల్గొంటామని పలు ప్రజాసంఘాలు ప్రకటించాయి. మరింత సమాచారం కోసం వీడియో చూడండి. 

శిరీష..మరో ట్విస్టు..

హైదరాబాద్ : బ్యూటీషియన్ శిరీష కేసులో మరో ట్విస్టు చోటు చేసుకుంది. శిరీష మృతిపై ఆమె బాబాయి శ్రీనివాసరావు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శిరీషను పీఎస్ కు కాకుండా రిసార్ట్స్ కు తీసుకెళ్లారని, కేసు పరిష్కరిస్తున్న సమయంలో శిరీషను కొట్టారని పేర్కొన్నారు. జుట్టుపట్టిలాగి కొట్టడంతో శిరీష తలకు గాయమైందని, వాట్సప్ షేర్ చేసిన లొకేషన్..రిసార్ట్స్ ఏరియాతో సరిపోయిందని శ్రీనివాసరావు తెలిపారు. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని, ప్రభాకర్ రెడ్డి, రాజీవ్, శ్రావణ్ లు హత్య చేశారని ఆరోపించారు.

10:37 - June 22, 2017

 

విశాఖ :  జరగుతున్న ఆదివాసి రాష్ర్టీయ అధికారి మంచ్ మహాసభల్లో రెండో రోజు ఆసక్తికర చర్చలు జరిగాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన సంప్రదాయాలపై జరుగుతున్న దాడులపై ప్రధానంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా కళాప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.గిరిజనులను అడవి నుంచి వెళ్లగొట్టడానికే చత్తీస్‌గఢ్‌ , జార్ఖండ్‌ , ఒడిశా తదితర రాష్ట్రాల్లో భారీగా సాయుధ బలగాలను ఉపయోగిస్తున్నారని ఆదివాసీ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసి మహిళలపై భద్రతా బలగాలు చెస్తున్న అత్యాచారాలపై కూడా సభలో చర్చించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలే గిరిజనులపై యుద్ధం చేస్తున్నాయని మహాసభ అభిప్రాయపడింది. ఏపీ , చత్తీస్‌గఢ్‌లోని గిరిజన ప్రాంతాల్లో వందలాదిగా పాఠశాలకు మూసివేసి గిరిపుత్రులను చదువులకు దూరం చేస్తున్నారని మహాహసభలో ఆగ్రహం వ్యక్తం అయింది. ఆదివాసీల భూములను కార్పొరేట్‌ కంపెనీలకు ధారాదత్తం చేసేందుకు ప్రభుత్వం కేంద్ర సాయుధబలగాలను ఉపయోగిస్తోందని గిరిజన ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.

5,6 షెడ్యూల్స్‌ ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నయి
రాజ్యాంగంలోని 5,6 షెడ్యూల్స్‌ ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విస్మరిస్తున్నాయని మహాసభ అభిప్రాయపడింది. ఇటు పోలవరం ప్రాజెక్టు వల్ల నిర్వాసితులవుతున్న గిరిజనులను ప్రభుత్వమే ఆదుకోవాలని మహాసభ తీర్మానం చేసింది. గోవధ పేరుతో సంఘ్‌పరివార్‌ శక్తులు గిరిజనులపై చేస్తున్న దాడులను వెంటనే ఆపాలని తీర్మానం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన వ్యతిరేక విధానాలు మానుకునేంతవరకు ఉద్యమాలు కొనసాగిస్తామని గిరిజన మహాసభ తీర్మానించింది.
 

అంబేద్కర్ విగ్రహం పెట్టినందుకు..

పశ్చిమగోదావరి : పాలకోడేరు (మం) గరగపర్రులో ప్రజలను సామూహికంగా వెలి వేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అంబేద్కర్ విగ్రహం పెట్టినందుకు అగ్రవర్ణాలు వెలేశారు. రెండు నెలలుగా ఎలాంటి పనులు చేయనీయకుండా సామాజికంగా బహిష్కరణ చేశారు. కౌలు పొలాలను వెనక్కి తీసుకుని ఇంటి పనులకు కూడా రావద్దని హుకుం జారీ చేశారు. దళితులను పనులు పిలిస్తే రూ. 10వేల జరిమాన విధిస్తామని హెచ్చరించారు. గ్రామంలోకి వస్తున్న వారిని సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేస్తున్నట్లు సమాచారం. జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు.

10:35 - June 22, 2017

హైదరాబాద్ : తెలంగాణ ఇచ్చి కూడా ప్రతిప‌క్షానికే ప‌రిమిత‌మై జీర్ణించుకోలేక పోతున్న కాంగ్రెస్‌పార్టీ..2019 కోసం ఇప్పటినుంచి జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. అధికారంలోకి రావ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌క్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తోంది. ఇప్పటికే ప్రభుత్వ విధానాల‌పై పోరాటం చేస్తున్న కాంగ్రెస్..ముఖ్యంగా గ‌తంలో త‌మ‌కు కంచుకోట‌లుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ ఎల్డీఎంఆర్సీ పాల‌సికి శ్రీకారం చుట్టింది తెలంగాణ కాంగ్రెస్. ఎల్డీఎంఆర్సీ-మిష‌న్ 31 పేరుతో ఎస్టీ, ఎస్టీ నియోజ‌వ‌ర్గాల‌లో సంస్థాగ‌త నిర్మాణం ల‌క్ష్యంగా ముందుకెళ్తుంది. దీనికోసం ఇప్పటికే రాష్ట్రంలోని 31 రిజ‌ర్వ్‌డ్‌ నియోజ‌క‌వ‌ర్గాల‌పై గ్రౌండ్ వ‌ర్క్‌ను పూర్తి చేసిన కాంగ్రెస్ ..ఆ ప్రతినిధులకు తొలిసారిగా ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజ‌రైన‌ కేంద్ర మాజీ మంత్రి కిశోర్‌ చంద్రదేవ్‌, కొప్పుల రాజు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి..క్యాడ‌ర్‌కు దిశా నిర్ధేశం చేశారు. ఎల్డీఎంఆర్సీ అంటే..లీడ‌ర్‌షిప్ డెవ‌ల‌ప్‌మెంట్ మిష‌న్. ముఖ్యంగా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ రిజ‌ర్వుడ్‌ నియోజ‌క‌వ‌ర్గాల్లో అమ‌లు చేసే ఈ పాల‌సీని నేరుగా ఏఐసీసీ ప‌ర్యవేక్షిస్తుంది. ఇప్పటికే ఈ ఎల్డీఎంఆర్సీ పాల‌సీలో భాగంగా..రాష్ట్రంలోని 31 ఎస్సీ, ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గాలలో త‌మ ప‌నిని మొద‌లు పెట్టింది కాంగ్రెస్. దీనిలో భాగంగా ఒక్కో అసంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో,.కో ఆర్డినేష‌న్ క‌మిటి నుండి మొద‌లుకొని.. మండ‌ల, బ్లాక్, బూత్ కో ఆర్డినేట్ క‌మిటీ, గ్రామ‌క‌మిటీ, బూత్ లెవ‌ల్ ఎజెంట్స్ క‌మిటీ వ‌ర‌కు అన్ని క‌మిటీలను పూర్తిచేసుకోవాలి. ఇలా అన్ని కమిటీలను క‌లుపుకొని నియోజ‌వ‌క‌ర్గంలో దాదాపు 3,750 సుశిక్తులైన క్యాడ‌ర్ పార్టీకి లభిస్తుంది. ఇలా ఈ కమిటీలన్నీ అక్టోబ‌ర్‌లోపు పూర్తి చేసుకోవాల‌ని పార్టీ నిర్ణయించింది.

పంజాబ్‌లో విజయవంతం
ఈ ప్రయోగం ఇటీవలే పంజాబ్‌లో జరిగిన ఎన్నిక‌ల్లో విజ‌య‌వంత‌మైంది. ఆ ఎన్నిక‌ల్లో 33 నియోజ‌క‌వ‌ర్గాలకుగాను 23 నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో..ఇప్పుడు ఇదే పాల‌సీని తెలంగాణ‌లో ప‌క్కాగా అమ‌లు చేస్తుంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలకు కేసీఆర్ ఇచ్చిన హామీల‌ను క్షేత్రస్థాయికి చేరేలా పోరాడితే.. ఖ‌చ్చితంగా భ‌విష్యత్‌లో కాంగ్రెస్‌కి లాభం జ‌రుగుతుందని హస్తం నేతలు నమ్ముతున్నారు. అంతేకాదు ఇలా పార్టీకి క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేసిన వారికే..భ‌విష్యత్‌లో పార్టీ టికెట్‌లు అంటు క్యాడ‌ర్‌లో జోష్ నింపుతున్నారు హ‌స్తం నేత‌లు. మొత్తానికి గ‌తంలో కాంగ్రెస్ కంచుకోట‌లుగా ఉండి..మొన్నటి ఎన్నిక‌ల్లో పార్టీకి దూర‌మైన రిజర్వుడ్‌ నియోజ‌క‌వ‌ర్గాల‌ను సొంతం చేసుకోవ‌డమే ల‌క్ష్యంగా ఎల్డీఎంఆర్సీ పాల‌సీని అస్త్రంగా చేసుకుంటుంది హ‌స్తం పార్టీ. మ‌రి ఈ ఎల్డీఎంఆర్సీపాల‌సీ ఏ మేర‌కు కాంగ్రెస్‌కు లాభం చేస్తుందో చూడాలి.

10:33 - June 22, 2017

హైదరాబాద్ : తెలంగాణకు హరితహారం.. ఇప్పటికే రెండు విడతల్లో మొక్కలు నాటిన తెలంగాణ ప్రభుత్వం.. ఇపుడు మూడోవిడత హరితహారం కార్యక్రమానికి రంగం సిద్ధం చేస్తోంది. జూలై మూడోవారంలో ఈ కార్యక్రమాన్ని కరీంనగర్‌జిల్లాలో నుంచి సీఎం ప్రారంభించనున్నారు. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా 40కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్ కలెక్టర్లకు తెలిపారు. హరితహారం కార్యక్రమానికి సన్నద్ధతపై అన్నిజిల్లాల కలెక్టర్లతో సీఎస్‌ వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

మున్సిపాలిటీ.. తమ పరిధిలో 5 కిలోమీటర్లకు
గ్రామీణ ప్రాంతాలతోపాటు మున్సిపాలిటీ, పట్టణప్రాంతాలకు ప్రత్యేకంగా హరితహారం ప్రణాళికలు రెడీ చేయనున్నారు. ఈసారి ప్రతీ మున్సిపాలిటీ.. తమ పరిధిలో 5 కిలోమీటర్లకు తక్కువ కాకుండా రోడ్లకు ఇరువైపుల మొక్కలు నాటించాలని నిర్ణయించారు. ప్రభుత్వ భూముల్లో బ్లాక్‌ప్లాంటేషన్, మిషన్ కాకతీయలో పునరుద్ధరించిన చెరువుకట్టలపై బండ్ ప్లాంటేషన్‌ చేపట్టాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అటు ఎన్.టి.పి.సి, సింగరేణి లాంటి సంస్థల పరిధిలోని భూముల్లో కూడా మొక్కలు నాటించాలని, హౌసింగ్ కాలనీలను, స్వచ్ఛంద సంస్థలతోపాటు ప్రజలనూ ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తామంటోంది తెలంగాణ ప్రభుత్వం.

ఫారెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం ..
మొక్కలు నాటడమేకాదు వాటి సంరక్షణకూడా పథకంలో భాగమేనని.. నాటిన ప్రతిమొక్కను కాపాడితేనే.. అసలు లక్ష్యం నెరవేరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం అటవీ, రెవెన్యూ, పంచాయతీరాజ్‌, ఎక్సైజ్‌శాఖల అధికారులు, సమన్వయంతో పనిచేయాలని సీఎస్‌ సూచించారు. నాటిన ప్రతి మొక్క వివరాలను తెలంగాణ ఫారెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం ..టీజీఎఫ్ ఎంఐఎస్ వెబ్ సైట్‌ లో ఎప్పటికపుడు అప్ లోడ్ చేయాలని సీఎస్‌ కలెక్టర్లకు సూచించారు. మూడో విడత కార్యక్రమానికి మరో రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో.. ఈలోగా నిర్దేశిత ప్రాంతాల్లో మొక్కలు నాటేందుకు గుంతలు,పాదులు సిద్ధంచేయాలని సీఎస్‌ ఆదేశించారు. కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ , ప్రైవేట్‌ సంస్థలతోపాటు పెద్ద ఎత్తున పాఠశాలు, కళాశాల విద్యార్థులను మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములను చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. 

పూజలు చేసిన ఇస్త్రో శాస్త్రవేత్తలు..

చిత్తూరు : తిరుమల శ్రీవారిని ఇస్రో శాస్త్రవేత్తలు దర్శించుకున్నారు. పీఎస్ ఎల్వీ -సీ 38 వాహన నౌక నమూనాకు పూజలు నిర్వహించారు.

బాబు పర్యటన అడ్డుకుంటారని..

చిత్తూరు : నేడు జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. తొట్టంబేడు వద్ద ఖజేరియా, ఫ్లోరియా పరిశ్రమలకు శంకుస్థాపన చేయనున్నారు. బాబు పర్యటనను అడ్డుకుంటారనే అనుమానంతో వైసీపీ, సీపీఎం, సీపీఐ నేతలను ముందస్తు అరెస్టు చేశారు.

'నేనెలాంటి తప్పు చేయలేదు'..

విజయవాడ : తనపై వస్తున్న అవినీతి ఆరోపణలు అవాస్తవమని, రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన పేరిట విరాళాలు సేకరించలేదని ఏపీ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ ఛైర్మన్ ఆనంద సూర్ వెల్లడించారు. బ్రాహ్మణ నాయకులమని చెప్పుకొనే కొందరు అసూయతో తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.

కర్నూలు సర్కార్ ఆసుపత్రిలో కరెంటు లేదు..

కర్నూలు : ప్రభుత్వాసుపత్రికి కరెంటు సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ వైర్ తెగిపోవడంతో సరఫరా నిలిచిపోయింది. దీనితో బాలింతలు..పసిపిల్లలు రాత్రంతా ఇబ్బందులు పడ్డారు. 12గంటల తరువాత విద్యుత్ సబ్బంది మరమ్మత్తులు చేసి విద్యుత్ ను సరఫరా చేశారు.

10:11 - June 22, 2017

ఉపాధ్యాయులు రోడ్డు మీదకు రావడం కారణం ప్రభుత్వం అశాస్త్రీయంగా బదిలీలు జరపడం, ఉపాధ్యాయులకు వేధింపులు గురి చేయడం, బదిలీలో ఫర్మమెన్స్ పాయింట్లను తీసకుకోవడంతో అవి అశాస్త్రీయంగా ఉన్నాయని యూటీఎఫ విశాఖ అధ్యక్షడు ప్రసాద్ అన్నారు. స్కూల్స్ రెషనైజలెషన్ తో పాఠశాలలను ప్రభుత్వం మూసివేయడానకి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు.  

09:23 - June 22, 2017

విశాఖ : భూకుంభకోణం పై వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మహాధర్నా చేపట్టనున్నారు. భూ అక్రమాణలపై గళం విప్పేందుకు బాధితులు సిద్ధమయ్యారు. విశాఖ మహాధర్నా ఏర్పాట్లను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పరిశీలించారు. భూ కుంభకోణం సీబీఐతో విచారణ జరిపించాలని వైసీపీ డిమాండ్ చేస్తున్నారు. భూ రికార్డుల ట్యాపిరింగ్ కుంభకోణంలో అధికార పార్టీ పెద్దల హస్తం ఉన్నట్లు ప్రతిపక్షం ఆరోపిస్తుంది. వైసీపీ 5వేల మందితో మహాధర్నా చేయనున్నారు. అయితే మొదటగా కల్టెరేట్ వద్ద అని తెలిపిన వైసీపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోడంతో వారు జీఎంసీ వద్ద ధర్నా వేదిక తరలించారు. అక్కడ కూడా పోలీసులు అనుమతి నిరాకరించి ఆర్టీసీ కంప్లెక్స్ వద్ద వేదిక మార్చుకోవాలని వైసీపీని కోరారు.

09:11 - June 22, 2017

వనపర్తి : జిల్లాలోని కొత్తకోట ఎక్సైజ్ శాఖ అధికారుల దైర్జన్యానికి పాల్పడ్డారు. రామకృష్ణాపురం, పామాపురం గ్రామాల్లో అర్ధరాత్రి తనిఖీలు చేస్తూ కల్లులో కలిపే మత్తు పదార్థాలు విక్రయిస్తున్నారనే నెపంతో ఇద్దరిపై కిరాతకంగా దాడి చేశారు. అధికారుల దాడిలో గీత కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. మాముళ్లు ఇవ్వలేదనే దాడులు చేశారని తెలుస్తోంది. అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని గౌడ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. 

09:10 - June 22, 2017

మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలో అవినీతి జరిగితే నిరూపించాలని ఎంబీసీ టీఆర్ఎస్ నేత చైర్మన్ శ్రీనివాస్జేఏసీ విధానాల కోసం పోరాడుతోందని, అందరికి సమాన విద్య, అందరికి సమాన వైద్యం అందించాలని, జేఏసీ రాజకీయం కోసం పాదయాత్ర చేయడం లేదని ప్రజల కోసమే అని జేఏసీ నేత అశోక్ అన్నారు. ప్రభుత్వం మాటలు వట్టి మూటలు అయ్యాయి. ఉద్యమం చేసి తెచ్చుకున్న తెలంగాణ మళ్లి పూర్వం పాలన కొనసాగుతోందని కాంగ్రెస్ నేత కైలాష్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మూడేళ్లు పూర్తి అయింది. క్రింది స్థాయి నుంచి పై స్థాయికి అవినీతి జరుగుతోందని, ప్రభుత్వానికి పర్యవేక్షణ లేదని, రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో నీతి వంతమైన పాలను కోసం పోరాడతామని సీపీఎం నేత జూకలకంటి రంగారెడ్డి అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

గోదావరిఖనిలో ఉత్తమ్ పర్యటన

పెద్దపల్లి : నేడు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించనున్నారు. ఆయన సింగరేణి కార్మికులకు సంఘీభవం తెలుపుతారు.

 

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధి పై ఎస్పీ నిర్ణయం

లక్నో : ఎన్డీయో రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ కు మద్దతు అంశం పై నేడు ఎస్పీ నిర్ణయం తీసుకోనుంది. 

జమ్మూలో ఎన్ కౌంటర్

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ లోని పల్వామాలో ఎన్ కౌంటర్ జరిగింది. సైన్యం ముగ్గురు ఉగ్రవాదులను కాల్చి చంపింది. రెండు రైఫిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు.

 

పీఎస్ఎల్వీ సీ32 రాకెట్ కౌంట్ డౌన్ ప్రారంభం

నెల్లూరు : పీఎస్ఎల్వీ సీ 32 రాకెట్ కౌంట్ డౌన్ ప్రారంభమైంది. కౌంట్ డౌన్ 28 గంటల పాడు కొనసాడుతోంది. పీఎస్ఎల్వీ సీ 32 రేపు ఉదయం 9.29 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లనుంది. 

Don't Miss