Activities calendar

23 June 2017

22:17 - June 23, 2017

ఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల పోరుకు రంగం సిద్ధమైంది. ఎన్డీయే తరపున రాంనాథ్‌ కోవింద్‌ ఇవాళ నామినేషన్‌ వేశారు. విపక్షాల తరపున లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరా కుమార్‌ ఈ నెలాఖరులో నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. విపక్షాల తరపున  బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపడంతో పోటీ ఆసక్తిగా మారింది. 
పోటీ అనివార్యం
రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో అధికార బిజెపి, ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పోటీ అనివార్యమైంది. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీతో పాటు బిజెపి చీఫ్‌ అమిత్‌షా, అద్వాని, పలువురు కేంద్రమంత్రులు, బిజెపి పాలిత రాష్ట్రాల సిఎంలు తదితరులు  హాజరయ్యారు. కోవింద్‌ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్న తెలుగు రాష్ట్రాల సిఎంలు చంద్రబాబు, కేసీఆర్‌, తమిళనాడు సిఎం పళనిస్వామి తదితరులు నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. రామ్‌నాథ్‌ కోవింద్‌ తరపున నాలుగు నామినేషన్‌ పత్రాలు దాఖలయ్యాయి. తొలి నామినేషన్‌ పత్రంపై మోది, రెండో పత్రంపై చంద్రబాబు, మూడో సెట్‌పై అమిత్‌షా, నాలుగో సెట్‌పై ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ సంతకాలు చేశారు.
మద్దకిస్తున్నవారికి రామ్‌నాథ్‌ కోవింద్‌ కృతజ్ఞతలు 
ఎన్నికల్లో తనకు మద్దకిస్తున్న వారందరికీ రామ్‌నాథ్‌ కోవింద్‌ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రపతి పదవి రాజకీయాలకు అతీతమైనదని, బాబు రాజేంద్రప్రసాద్‌ వంటి మహామహులు ఆ పదవికి వన్నెతెచ్చారన్నారు. తాను కూడా ఆ పదవి గౌరవాన్ని కాపాడుతానని కోవింద్‌ తెలిపారు.
విపక్షాల అభ్యర్థిగా స్పీకర్‌ మీరా కుమార్‌ 
మరోవైపు విపక్షాల అభ్యర్థిగా లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరా కుమార్‌ ఈ నెల 27, 28 తేదీల్లో నామినేషన్‌ దాఖలు చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలోని 17 పార్టీలు తమ అభ్యర్థిగా దళితనేత బాబు జగ్జీవన్‌రామ్‌ కూతురు మీరాకుమార్‌ను ఏకగ్రీవంగా ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ఎన్నికకు పోటీ పడుతున్న రామ్‌నాథ్‌ కోవింద్‌, మీరా కుమార్‌  దళిత సామాజికవర్గానికి చెందినవారే కావడం గమనార్హం. మీరా కుమార్‌కు మద్దతు కూడగట్టేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. మొదట కోవింద్‌కు మద్దతు తెలిపిన బిఎస్పీ చీఫ్‌ మాయావతి-ఇపుడు మనసు మార్చుకున్నారు. సమర్థత, ప్రజాకర్షణ ఉన్న బిహార్‌కు చెందిన మీరా కుమార్‌కే తమ మద్దతని తెలిపారు. మరోవైపు బిహార్‌ సిఎం నితీష్‌ కుమార్‌...తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కోరారు. మీరా కుమార్‌ విజయం సాధిస్తుందన్న ఆశాభావాన్ని లాలూ వ్యక్తం చేశారు.

 

22:13 - June 23, 2017

హైదరాబాద్ : తెలంగాణలో కరీంనగర్‌కు స్మార్ట్ సిటీల జాబితాలో చోటు దక్కడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. స్మార్ట్ సిటీల ఎంపిక విధానం సహేతుకంగా లేదని ఇటీవల తాను ఢిల్లీ వెళ్లినపుడు కేంద్రమంత్రులకు తెలిపినట్లు కేటీఆర్ చెప్పారు. నిధులను కూడా నగర జనాభా ప్రాతిపదికన ఇవ్వాల్సిందిగా కేంద్రానికి సూచించినట్లు కేటీఆర్ చెప్పారు. 

22:10 - June 23, 2017

ఢిల్లీ : స్మార్ట్‌ సిటీస్‌ మిషన్‌లో భాగంగా ఆకర్షణీయ నగరాల జాబితాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మూడో విడతలో దేశవ్యాప్తంగా 30 నగరాలను ఎంపిక చేశారు. ఈ జాబితాలో కేరళలోని తిరువనంతపురం తొలిస్థానంలో నిలవగా ఆ తర్వాతి స్థానాలను ఛత్తీస్‌గడ్‌లోని నయా రాయ్‌పుర్‌, గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ దక్కించుకున్నాయి. నాల్గవ స్థానంలో ఏపి రాజధాని అమరావతి, ఆరో స్థానంలో కరీంనగర్‌కు చోటు దక్కింది. ఇప్పటి వరకు 90 నగరాలు స్మార్ట్‌ సిటీస్‌ మిషన్‌ కింద చేరాయి. దేశవ్యాప్తంగా 100 నగరాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు స్మార్ట్‌సిటీస్‌ మిషన్‌ను 2015లో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆకర్షణీయ నగరాల జాబితాలో 40 నగరాలు ఖాళీగా ఉన్నాయని....ఈ దశలో కేవలం 30 నగరాలు మాత్రమే చోటు దక్కించుకున్నట్లు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు.

 

22:08 - June 23, 2017

హైదరాబాద్ : స్టార్టప్‌ల విధానాన్ని మరింతగా ప్రోత్సహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. టీఎస్ ఐపాస్‌ మంచి ఫలితాలు ఇస్తోందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ఈ విధానంలో రాష్ట్రంలో భారీగా స్టార్టప్‌లు నమోదయ్యాయన్నారు. హైదరాబాద్‌లో వెస్ట్రన్‌ ఇన్ఫ్రా సంస్థ నిర్మిస్తున్న డాలస్‌ టవర్స్‌కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.

22:05 - June 23, 2017

రంగారెడ్డి : బోరుబావిలో ఉన్న చిన్నారి మీనాను బయటకు తీసేందుకు అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఆధునిక పరికరాలతో అధికారులు చేసిన ప్రయత్నాలన్నీ సఫలీకృతం కాకపోవడంతో బోరుబావికి సమాంతరంగా గోతి తవ్వుతున్నారు. మరోవైపు 27 గంటలుగా చిన్నారి బావిలోనే ఉండిపోయింది. మృత్యువుతో పోరాడుతోంది. చిన్నారి ప్రాణాలతో ఉందని తెలిసినా ఇప్పటి వరకు బయటకుతీయలేని దుస్థితి నెలకొంది. చిన్నారిని బయటకు తీసేందుకు మరికొన్ని గంటలు పడుతుందని అధికారులు చెప్తున్నారు.  ఇక రాష్ట్ర ప్రజలు చిన్నారి క్షేమంగా బయటకు రావాలని ఆశగా ఎదురుచూస్తున్నారు.

 

22:02 - June 23, 2017

రంగారెడ్డి : పొలంలోని బోరుబావిలో చిక్కుకున్న చిన్నారిని రక్షించేందుకు అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.  24 గంటలుగా అధికారులు శ్రమిస్తున్నప్పటికీ చిన్నారిని మాత్రం బయటకు తీయలేకపోయారు. పాపను రక్షించేందుకు బోరుబావికి సమాంతరంగా గోయి తవ్వుతున్నారు. పలుమార్లు వర్షం కురవడంతో ఈ పనులకూ కొంత ఆటంకం ఏర్పడింది. 
24 గంటలు గడిచిపోయాయి 
గంటలు క్షణాల్లా కరిగిపోతున్నాయి. 24 గంటలు గడిచిపోయాయి. అయినా ఇంతవరకు బోరుబావిలో పడిన చిన్నారిని మాత్రం బయటకు తీయలేకపోయారు. దీంతో క్షణక్షణానికి అందరిలోనూ టెన్షన్‌ పెరుగుతోంది. ఏం జరుగుతుందోనన్న ఆందోళన కలుగుతోంది.  రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఇక్కారెడ్డిగూడెంలో గురువారం సాయంత్రం బోరుబావిలో పడిన చిన్నారి మీనా ఇంకా బోరుబావిలో ఉంది. అధికారయంత్రాంగం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవటంతో... ఆ చిన్నారి బోరుబావిలో మృత్యువుతో పోరాడుతోంది. 
తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు
రోజు గడిచినా చిన్నారిని బయటకు తీయలేకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. చిన్నారి తల్లి రేణుక ఏడ్చిఏడ్చి కంటనీరు  ఇంకిపోయింది. బాధతో గుండెలు బరువెక్కాయి. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ప్రాంతమంతా హృదయవిదారకంగా మారింది.   త్వరగా బయటకు తీస్తే తన బిడ్డను మనసారా చేతుల్లోకి తీసుకోవాలని ఆ తల్లి గుండెలవిసేలా రోదిస్తోంది. 
కొనసాగుతున్న సహాయక చర్యలు  
చిన్నారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.  బోరుబావిలో పడిన చిన్నారులను రక్షించడంలో నైపుణ్యం కలిగిన నల్లగొండ జిల్లాకు చెందిన పుట్ట కరుణాకర్‌ బృందం రంగంలోకి దిగింది.  పాపను బయటకు తీసేందుకు ఈ బృందం చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. చిన్నారి ఎంతలోతులో ఉందో తెలుసుకోవడానికి లోనికి కెమెరాలను పంపారు. పాప 40 ఫీట్ల లోతులో ఉన్నట్టు గుర్తించారు. చిన్నారి చేయి కదులుతున్నట్టు కెమరాల్లో కనిపించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇక ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఆధునిక పరికరాలతో చిన్నారిని రక్షించేందుకు విశ్వప్రయత్నాలు చేసింది.  రోబోటిక్‌ హ్యాండ్‌తో చిన్నారిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నం కాస్త విఫలమైంది. మోటారు మాత్రమే బయటకు వచ్చింది. పైగా మరింత లోతుకు చిన్నారి వెళ్లినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పాప శరీరం 80 అడుగుల లోతుకు వెళ్లినట్టు సమాచారం.   దీంతో చిన్నారిని బయటకుతీసేందుకు  బోరుబావికి సమాంతరంగా మరో గోతిని తవ్వుతున్నారు. నాలుగు జేసీబీలతో గొయ్యి తవ్వుతున్నారు. పలుమార్లు వర్షం కురవడంతో సహాయకచర్యలకు కొంతసేపు ఆటంకం ఏర్పడింది. ఇక బోరుబావిలో ఉన్న చిన్నారికి ధైర్యం కలిగించేందుకు అధికారులు తల్లితో మాట్లాడించారు. ఆక్సీజన్‌ పైపుల సాయంతో చిన్నారికి ప్రాణవాయువును అందిస్తున్నారు. 
మంత్రి మహేందర్‌రెడ్డి, కలెక్టర్‌ రఘునందన్‌రావు పర్యవేక్షణ 
సహాయక చర్యలను మంత్రి మహేందర్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ రఘునందన్‌రావు పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయం చేస్తూ పాపను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. చిన్నారిని బయటకు తీసేవరకు సహాయక చర్యలు కొనసాగుతాయని మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు.
చిన్నారి తల్లిదండ్రులను పలువురు పరామర్శ 
చిన్నారి తల్లిదండ్రులను పలువురు పరామర్శించారు. మాజీ హోంమంత్రి సబితాఇంద్రారెడ్డి చిన్నారి తల్లిదండ్రులను ఓదార్చారు.  గంటలు గడుస్తున్న కొద్దీ చిన్నారిని బయటకు తీయకపోవడంతో అందరిలోనూ ఆందోళన పెరుగుతోంది.  మరికొన్ని గంటలు పడుతుందని అధికారులు చెప్తుండడంతో రాష్ట్ర ప్రజలు ఊపిరిబిగబట్టి ఎదురు చూస్తున్నారు. చిన్నారి క్షేమంగా ప్రాణాలతో బయటపడాలని ప్రార్థిస్తున్నారు. 

 

21:58 - June 23, 2017

గుంటూరు : అమరావతిని స్మార్ట్‌ సిటిగా కేంద్రం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఏపీ మున్సిపల్ మంత్రి నారాయణ. అమరావతి సెలక్ట్ కావడానికి కష్టపడిన అధికారులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. స్మార్ట్ సిటీ అభివృద్ధి కోసం కేంద్రం ఇచ్చే నిధులను 29 గ్రామాల్లో వినియోగిస్తామన్నారు మంత్రి నారాయణ. ఉండవల్లి, పెనుమాక గ్రామాల రైతులు సమీకరణకు ముందుకు వస్తున్నారని.. సమీకరణకు రాని భూములు ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా సేకరిస్తామని మంత్రి చెప్పారు. 

 

21:55 - June 23, 2017

ఆ నల్గురితాన్నే డబుల్ బెడ్ రూమ్ లు... మనసుల మాట బయటవెట్టిన ఈటెల చెరువుమీద కొంగలిగినట్టే ఉన్నది.. నంద్యాల కాడా చంద్రాలన్నది, ఎర్రవెళ్లికి, కడియానికి చెల్తలేదా.? ఓపనింగుల కాడా సుతికల్సుతలేదు.. అంబేద్కర్ విగ్రహం పెట్టుకున్న జనం... ఊర్లకెళ్లి వెలివేసిన అగ్రకులం., స్ఫూర్తి నింపుకొంటుస్తున్న జేఏసీ.. సర్కార్ మీద పెంచుకున్నరు కసీ, హెడ్ కానిస్టేబుల్ కొడుకు ఎవ్వారం..చెప్పుతోటి కొట్టితీర్సుకుంది ప్రతీకారం... ఈ అంశాలపై మల్లన్నమచ్చట్లను వీడియోలో చూద్దాం..... 

 

21:47 - June 23, 2017

అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారని దళితులను వెలివేడయం అన్యాయమని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఏపీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్, హెచ్ సీయూ అసోసియేట్ ప్రొఫెసర్ శ్రీపతిరాముడు పాల్గొని, మాట్లాడారు. వెలివేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మరిన్ని వివరానలు వీడియోలో చూద్దాం... 

 

21:41 - June 23, 2017

హైదరాబాద్ : గిరిజన రైతులు కదం తొక్కారు. ప్రభుత్వ అణచివేతపై... తిరుగుబావుటా ఎగురవేశారు. భూమి కోసం.. భుక్తి కోసం పోరుబాట పట్టారు.  తమ హక్కుల సాధనకు ర్యాలీగా కదులుతున్నారు... ధర్నాలతో నినదిస్తున్నారు. దున్నేవాడిదే భూమి అన్న నినాదంతో ముందుకు కదులుతున్నారు. 
కొత్తగూడెంలో గిరిజన రైతులు ఆందోళన 
పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ కొత్తగూడెంలో గిరిజన రైతులు ఆందోళనలు చేస్తున్నారు. పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గిరిజనుల పోరాటానికి వామపక్షాల, ప్రజా సంఘాల నాయకులు బాసటగా నిలుస్తున్నారు. కొంతకాలంగా అటవీ ప్రాంతాల్లో పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజన రైతాంగంపై దాడులు జరుగుతున్నాయి.  పోడు రైతులకు.. పోలీసు, అటవీ శాఖ సిబ్బందికి మధ్య తోపులాటలు, ఘర్షణలు, అరెస్ట్‌లు నిత్యకృత్యంగా మారాయి. 
హరితహారం పథకంతో పెరిగిన దాడులు
రాష్ట్ర ప్రభుత్వం హరితహారం పథకం ప్రవేశపెట్టిన దగ్గర నుంచి గిరిజన గ్రామాల్లో పోడు పోరు మరింత ఎక్కువైంది.  అటవీ భూముల్లో మొక్కలు నాటాలని ప్రభుత్వం ఆదేశించడంతో... రైతులు సాగుచేసుకుంటున్న పోడు భూముల్లో మొక్కలు నాటించేందుకు అటవీ శాఖ సిబ్బంది విశ్వప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో పోడుదారులకు ...అధికారులకు మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. గిరిజనులపై అక్రమ కేసులు బనాయించి...జైలుకు పంపుతున్నారు. వారి అరక, ఎద్దులను, ట్రాక్టర్లను పోలీస్‌ స్టేషన్‌లకు తరలిస్తున్నారు. బలవంతంగా వారి పోడు భూములను స్వాధీనం చేసుకుని..మొక్కలు నాటుతున్నారు. దీంతో గిరిజన కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి.  మౌనంగా రోదిస్తున్నాయి.
2005 అటవీ హక్కుల ప్రకారం పోడుదారులకు పట్టాలు
వాస్తవానికి.. 2005 అటవీ హక్కుల చట్టం ప్రకారం సాగు చేసుకుంటున్న పోడుదారులకు పట్టాలు ఇవ్వాలి. కానీ  నేటికి పట్టాలు ఇవ్వలేదు. జిల్లాలోని 24 మండలాల్లో 5 లక్షల ఎకరాల్లో గిరిజనులు, పేద గిరజనేతరులు పోడు వ్యవసాయం చేసుకుంటున్నారు. అయితే కేవలం 84 వేల ఎకరాలకు మాత్రమే పట్టాలు జారీ చేశారు. 60 వేల మంది దరఖాస్తులను ఫారెస్ట్ అధికారులు తిరస్కరించారు. ఈ నేపథ్యంలో ఇల్లందు, సింగరేణి, బయ్యారం, చండ్రుగొండ, ఏన్కూరు, గుండాల, టేకులపల్లి, భద్రాచలం, వెంకటాపురం, మణుగూరు, పినపాక, ఆశ్వరావుపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో గిరిజన రైతులు పట్టాల కోసం పోరాటం సాగిస్తూనే ఉన్నారు.
గిరిజనులపై పెరిగిన దాడులు 
అయితే హరిత హారం పథకంలో భాగంగా ఈ ఏడాది 40 లక్షల మొక్కలు నాటే క్రమంలో ... గిరిజనులపై దాడులు మరింత పెరిగాయి. బలవంతంగా భూముల నుంచి వారిని తరిమేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో ఆదివాసీలు... తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. 

 

21:38 - June 23, 2017

కొత్తగూడెం : గిరిజన రైతులు ఆందోళన బాట పట్టారు. తమ భూములపై హక్కుల కోసం.. పోరాటానికి దిగారు. ప్రభుత్వ నిర్బంధంపై మండిపడ్డారు. దశాబ్దాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న భూములకు పట్టాలివ్వాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.   
గిరిజన రైతాంగం పోరుబాట 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గిరిజన రైతాంగం.. పోరుబాట పట్టింది. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని..రైతులపై ప్రభుత్వ నిర్భందాన్ని ఆపాలని డిమాండ్‌ చేస్తూ.. గిరిజనులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సీపీఎం ఆధ్వర్యంలో కొత్తగూడెం పట్టణం మార్కెట్‌ యార్డ్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు  భారీ ప్రదర్శన నిర్వహించారు. సుమారు రెండు కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ జరిగింది. 
భారీ ర్యాలీ 
ర్యాలీగా కలెక్టరేట్‌ వద్దకు చేరుకున్న గిరిజనులు అక్కడే సభను నిర్వహించుకున్నారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం కేంద్రకమిటీ సభ్యులు, త్రిపుర ఎంపీ జితన్‌ చౌదరి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, పోతినేని సుదర్శన్‌రావు, కాసాని ఐలయ్య పాల్గొన్నారు. 
పోడు సాగుదారులపై నిర్బంధం ప్రయోగిస్తే తిరుగుబాటు : జితన్ చౌదరి 
బీజేపీ, టీఆర్‌ఎస్‌లు గిరిజనుల దగ్గర నుంచి భూములు లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని సీపీఎం నేతలు విమర్శించారు. ఆదివాసీలను అడవి నుంచి వెళ్లగొట్టే హక్కు ఎవరికి లేదని.. పోడు సాగుదారులపై నిర్బంధం ప్రయోగిస్తే తిరుగుబాటు తప్పదని..సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు జితన్‌ చౌదరి అన్నారు. పోడు వ్యవసాయదారులు ప్రభుత్వ నిర్బంధ చర్యలకు భయపడవద్దంటే భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య పిలుపునిచ్చారు.
పోడు వ్యవసాయదారులకు పట్టాలివ్వాలి : తమ్మినేని  
పోడు భూముల నుంచి గిరిజనుల వెళ్లగొట్టే హక్కు కేసీఆర్‌కు ఎవరిచ్చారని తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. గిరిజనుల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. గిరిజనులు తిరగబడితే పోలీసులు, ఫారెస్ట్‌ అధికారులు ఏమి చేయలేరని అన్నారు. పోడు వ్యవసాయదారులకు వెంటనే పట్టాలివ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ ప్రదర్శనలో సుమారు పది వేల మందికి పైగా గిరిజనులు పాల్గొన్నారు. మరోవైపు, పోడు వ్యవసాయదారులపై అణచివేతపై..నిరసనగా రేపు హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో సదస్సు జరగనుంది.

 

21:22 - June 23, 2017

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా.. హరీష్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన చిత్రం డిజె...దువ్వాడ జగన్నాథమ్..ఈ సినిమా ఇవాల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆ చిత్రం ఎలా ఉంది. రేటింగ్ విశేషాలను వీడియోలో చూద్దాం... 

టోలీచౌకీలో ఐసిస్ సానుభూతిపరుడు అరెస్టు

హైదరాబాద్ : టోలీచౌకిలో ఐసిస్ సానుభూతిపరున్ని అరెస్టు చేశారు. కొనకళ్ల సుబ్రమణ్య అలియాస్ ఒమర్ ను సిట్ బృందం అరెస్టు చేశారు. 

21:06 - June 23, 2017

హైదరాబాద్ : టోలీచౌకిలో ఐసిస్ సానుభూతిపరున్ని అరెస్టు చేశారు. కొనకళ్ల సుబ్రమణ్య అలియాస్ ఒమర్ ను సిట్ బృందం అరెస్టు చేశారు. టోలిచౌక్ భరత్ నగర్ లో సుబ్రమణ్యం నివాసం ఉంటున్నారు. సుబ్రమణ్యం నుంచి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. 2014 సం.లో సుబ్రమమణ్యం ఇస్లాం మతం స్వీకరించారు. ఒమర్ గా పేరు మార్చుకుని గుజరాత్ లో ఉగ్రవాద శిక్షణ తీసుకున్నాడు. శ్రీనగర్, ఉమ్రాబాద్, అంబర్ పూర్, తమిళనాడు, ముంబై తదితర ప్రాంతాల్లో సుబ్రమణ్యంకు నెట్ వర్క్ ఉంది. ఫేస్ బుక్, వాట్సాప్ టెలిగ్రామ్ లో ఐసిస్ ప్రతినిధులతో సుబ్రమణ్యం చాటింగ్ నిర్వహించారు. సుబ్రమణ్యం అలియాస్ ఒమర్ స్వస్థలం కృష్ణా జిల్లా చల్లపల్లి. మరిన్ని వివరాలు వీడియోలో చూద్దాం...

 

20:48 - June 23, 2017
20:47 - June 23, 2017
20:46 - June 23, 2017

నిర్మల్ : పోచంపాడు ప్రాజెక్టు ముంపుతో పొట్ట చేతబట్టుకుని వచ్చిన ఓ గ్రామం నిర్మల్‌ జిల్లాలో ఆదర్శ్‌నగర్‌గా స్థిరపడింది. ఇప్పుడిప్పుడే స్థిరపడుతున్న ఆ గ్రామం సదర్మట్‌ బ్యారేజ్‌ నిర్మాణం కారణంగా మరోసారి ముంపుకు గురి కాబోతోంది. ఈ కష్టం తట్టుకోవడం మావల్ల కాదంటున్నారు ఆదర్శనగర్ గ్రామస్తులు. దీనిపై మరింత సమాచారాన్ని వీడియోలో చూడండి. 

 

20:38 - June 23, 2017

కొత్తగూడెం : పోడు భూములపై హక్కుల కోసం కొత్తగూడెంలో గిరిజనులు కథం తొక్కారు. సీపీఎం ఆధ్వర్యంలో మార్కెట్‌ యార్డు నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ జరిగింది.  ర్యాలీలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు జితిన్‌ చౌదరి, పార్టీ తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య తదితరులు పాల్గొన్నారు. పోడు భూముల నుంచి గిరిజనులను తరిమేసే హక్కు ముఖ్యమంత్రి కేసీఆర్ కే లేదని తమ్మినేని చెప్పారు. దీనిపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం..

20:27 - June 23, 2017

రంగారెడ్డి : బోరుబావిలో పడిన చిన్నారి మీనాను బయటకు తీసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ రఘునందన్‌రావు తెలిపారు. మరింత మంది నిపుణులను రప్పిస్తున్నట్టు చెప్పారు. కలెక్టర్‌ రఘునందన్‌రావుతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:21 - June 23, 2017
20:19 - June 23, 2017
20:15 - June 23, 2017

హైదరాబాద్ : సింగరేణి కార్మికుల డిమాండ్లపై డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషన్ కార్యాలయంలో కార్మిక సంఘాలతో చర్చలు జరుగుతున్నాయి. వారసత్వ ఉద్యోగాలు కల్పించాలనీ డిమాండ్ చేస్తూ నెల 15 నుంచి సింగరేణి కార్మికులు సమ్మె బాట పట్టారు. పోలీసుల చేత బలవంతంగా విధులకు హాజరు కావాలనీ బెదిరిస్తున్నారని, విధులకు కార్మికులు తక్కువగా హాజరవుతున్నారని.. గోదావరి ఖనిలో డంపర్ ఢీకొని కార్మికుడు మృతి చెందాడని నేతలు తెలిపారు. కార్మికుని మృతికి యాజమాన్యం, ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె కొనసాగుతుందని నేతలు అధికారులకు స్పష్టం చేశారు. 

 

20:09 - June 23, 2017

పెద్దపల్లి : రామగుండంలోని సింగరేణి కాలరీస్‌ ఓసీపీ-3 బొగ్గు గనిలో  ప్రమాదం జరిగింది. డంపర్‌ ఢీ కొట్టడంతో హెడ్‌ ఓవర్‌మెన్‌గా పనిచేస్తున్న వనం రాజేంద్రప్రసాద్‌ మృతి చెందాడు. ఇందుకు కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ కార్మికులు ఆందోళనకు దిగారు. దీంతో సింగరేణిలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మృతుని కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కార్మిక నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. 

 

20:05 - June 23, 2017

గుంటూరు : అక్కడ ఇంటి కిరాయి ఎంతో చెబితే ఎవ్వరికైనా గుండె గుభేల్‌ మంటుంది.. నిత్యావసరాల ధరలు చూస్తే నిద్రే పట్టదు.. ప్రతి సరుకు రేటు సామాన్యులకు సమస్యలు సృష్టిస్తోంది.. మెట్రో నగరాల్లోకంటే ఎక్కువగాఉన్న ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.. అమరావతిలో పెరిగిన కాస్ట్‌ ఆఫ్ లివింగ్‌ ఖర్చులతో అక్కడికి రావాలంటేనే ఉద్యోగులు, వ్యాపారులూ వణికిపోతున్నారు.. 
సామాన్యుల జీవనం మరింత కష్టం
ఏపీ రాజధాని అమరావతి పరిసర ప్రాంతాల్లో సామాన్యుల జీవనం మరింత కష్టమైపోయింది.. కాస్ట్‌ ఆఫ్ లివింగ్ పెరిగిపోయి అక్కడ ఉండాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది.. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులేకాదు.. బడా వ్యాపారులుసైతం ఇక్కడి ధరలు చూసి వణికిపోతున్నారు.. 
నిత్యావసరాలకు రెట్టింపు ధరలు
సాధారణంగా మెట్రోపాలిటన్‌ నగరాల్లో ఇంటి అద్దెలు ఎక్కువగా ఉంటాయి.. అమరావతిలోమాత్రం అంతకంటే ఎక్కువ ధరలు జనాల్ని బెంబేలెత్తిస్తున్నాయి.. ఉండవల్లి, తాడేపల్లిలో మామూలు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల రెంట్‌ పదివేలరూపాయలకు పైమాటే ఉంది.. మందడం, తూళ్లూరు గ్రామాల్లో 12నుంచి 15వేల రూపాయలు పలుకుతోంది.
రాజధాని ప్రకటన తర్వాత అన్ని ధరలూ పెంపు 
అమరావతి రాజధాని కాకముందు ఇక్కడ అద్దెలు మామూలుగానే ఉండేవి.. రాజధాని ప్రకటన తర్వాత అన్ని ధరలూ పెరిగిపోయాయి.. నిత్యావసరాల విషయంలోనూ అదే పరిస్థితి ఉంది.... విజయవాడ రైతు బజార్‌నుంచి తక్కువ ధరకు కూరగాయలు తెచ్చి అమరావతి పరిసర ప్రాంతాల్లో రెట్టింపు ధరలకు అమ్ముతున్నారు వ్యాపారులు.. హొటల్స్, కూల్‌డ్రింక్స్, పాలు ఇలా ఏది ముట్టుకున్నా రేట్లు మండిపోతున్నాయి.. నిత్యావసరాల్ని ఇక్కడ కొనలేక.. సిటీకి వెళ్లి తెచ్చుకోలేక జనాలు అవస్థలు అనుభవిస్తున్నారు.. ధరలుచూసి ఇక్కడికి రావాలంటేనే వణికిపోతున్నారు.. 
పెరిగిన అద్దెలు, ఖర్చులతో స్థానికుల ఇబ్బంది   
పెరిగిన అద్దెలు, ఖర్చులు స్థానికులనూ ఇబ్బంది పెడుతున్నాయి.. ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజలకు ఈ రేట్లు తలకుమించినభారంగా మారాయి.. హైదరాబాద్‌నుంచి వచ్చిన ఉద్యోగులూ ఈ రేట్లుచూసి టెన్షన్ పడుతున్నారు.. ఈ సమస్యను గతంలో ఉద్యోగులు సీఎం దృష్టికితెచ్చారు.. దీనిపై స్పందించిన చంద్రబాబు ఇష్టానుసారంగా అద్దెలుపెంచితే రెంటల్‌ యాక్ట్‌ తీసుకొస్తామని అన్నారు.. అయితే అది ఇప్పటివరకూ అమల్లోకి రాలేదు. ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే అక్కడ అన్ని సౌకర్యాలు మామూలు ధరలకు లభించాలి.. సగటు మనిషి జీవించే స్థాయిలో వసతులు లేకపోతే ఏం చేసినా ప్రయోజనం ఉండదు.. ప్రభుత్వం ఇప్పటికైనా అమరావతిలో కాస్ట్‌ ఆఫ్‌ లింవింగ్‌పై దృష్టిపెట్టాల్సిన అవసరమెంతైనా ఉంది.

 

19:58 - June 23, 2017

హైదరాబాద్ : చేనేతల అభివృద్ధి కోసం మరిన్ని పథకాలు తీసుకురాబోతుంది తెలంగాణ సర్కార్‌. చేనేత కార్మికుల కోసం నూతన పొదుపు పథకాన్ని రేపు పోచంపల్లిలో ప్రారంభించబోతుంది. ఈ పథకం ద్వారా చేనేత కార్మికులతో పాటు.. పవర్‌లూమ్‌ కార్మికులకు అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. తెలంగాణలోని నేతన్నల కోసం నూతన పొదుపు పథకాన్ని తెలంగాణ సర్కార్‌ ప్రారంభించబోతుంది. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లిలో ఈ పథకాన్ని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు. చేనేత జౌళిశాఖ అధికారుల సమీక్ష సమావేశంలో కేటీఆర్‌ ఈ పథకాన్ని ప్రకటించారు. 
రేపు పోచంపల్లిలో ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్‌ 
గతంలో ఉన్న పథకాన్ని పూర్తిగా మార్చి నేతన్నలకు అత్యధిక ప్రయోజనాలు కలిగేలా దీన్ని రూపొందించినట్లు కేటీఆర్‌ తెలిపారు. ఈ పథకం ద్వారా కార్మికుల వేతనాల్లో పొదుపు చేసుకునే మ్యాచింగ్‌ గ్రాంటు 8 శాతం నుంచి 16 శాతానికి పెంచుతామన్నారు. ఇక పవర్‌లూమ్‌ కార్మికులకు పొదుపునకు 8 శాతం మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు తెలంగాణ హ్యాండ్‌లూమ్‌ వీవర్స్‌ థ్రిఫ్ట్‌ ఫండ్‌ సేవింగ్స్‌ అండ్‌ సెక్యూరిటీ స్కీమ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ పథకం ద్వారా నేతన్నలకు ఆర్థిక భరోసాతో పాటు.. సామాజిక భద్రత కల్పించేందుకు ఉపయోగపడుతుంది. నేత కార్మికులకు భవిష్యత్‌ అవసరాలకు పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చే అవకాశం ఉంది. కో ఆపరేటివ్‌ సొసైటీల పరిధిలో పని చేస్తున్నవారితో పాటు.. సొంతంగా పని చేస్తున్న కార్మికులకు ఈ పథకం వర్తించనుంది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి నేత కార్మికుడు ఈ పథకంలో చేరేందుకు అర్హత ఉంది. శనివారం మంత్రి కేటీఆర్‌ ఈ పథకాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 

 

19:48 - June 23, 2017

చిత్తూరు : శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్లే భక్తులు.. ఇకపై ఆధార్ కార్డును తప్పని సరిగా వెంట తీసుకెళ్లాలి. భవిష్యత్‌లో ఆధార్ కార్డు ఉంటే గానీ.. శ్రీవారి దర్శనం లభించదు. త్వరలోనే ఏడుకొండల వాడి దర్శనానికి ఆధార్‌ కార్డ్‌ తప్పనిసరి కానుంది. బ్యాంకు ఖాతా, పాన్‌కార్డులకు ఆధార్‌ అనుసంధానాన్ని సుప్రీంకోర్టు సమర్థించిన నేపథ్యంలో.. టీటీడీ తన కార్యాచరణను వేగవంతం చేసింది.
నిత్యం 75 వేల నుండి లక్షమంది మంది భక్తులు 
శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమలకు.. నిత్యం 75 వేల నుండి లక్షమంది మంది భక్తులు వస్తుంటారు. ఇందులో ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్‌పై 20 నుండి 25 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. కాలి బాటలో 15 వేల నుండి.. రద్దీరోజుల్లో 40 వేల మంది వరకూ వస్తుంటారు. మిగిలిన వాళ్లు ధర్మదర్శనం చేసుకుంటారు. ఇప్పటిదాకా ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు పొందడానికి మాత్రమే గుర్తింపు కార్డులను సమర్పిస్తున్నారు. అయితే ఈ విధానంలో అక్రమాలు జరిగే అవకాశం ఉందని.. ఆధార్‌ గుర్తింపు సంఖ్యను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే పూర్తి స్థాయిలో అక్రమాలను అరికట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. 
ఆధార్‌ ఉన్నవారికే దివ్య దర్శనం టోకెన్లు 
ఇప్పటికే కాలినడకన తిరుమలకు వచ్చే భక్తులకు.. ఆధార్ కార్డు ఉన్న వారికే దివ్యదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు. అంతేకాకుండా విజయాబ్యాంకులో ఉచితంగా జారీ చేసే అంగప్రధక్షిణం టోకెన్లు, ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో విక్రయించే ఆర్జితసేవా టికెట్లకు కూడా ఆధార్‌ను తప్పనిసరి చేసారు. టిబి కౌంటర్ లో సిఫారసు ఉత్తరాలపై ఇచ్చే వసతి గదులకు కూడా.. ఆధార్ కార్డునే గుర్తింపుగా తీసుకుంటున్నారు. 
ఆధార్‌ తప్పనిసరిపై భక్తులకు అవగాహన 
ఈ నెల 16న తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్‌లైన్‌ ద్వారా.. 44, 896 ఆర్జిత సేవా టిక్కెట్లను విడుదల చేసింది. గతంలో ఏదైనా గుర్తింపు కార్డును ఆన్‌లైన్‌లో పొందుపర్చి టిక్కెట్‌ బుక్‌ చేసుకునే వీలుండేది. ఇప్పుడు ఆధార్‌ను మాత్రమే చూపాల్సి వస్తోంది. విదేశాల్లో ఉండే వారు నమోదు చేసుకునేందుకు పాస్‌పోర్టు నెంబర్‌ను మాత్రమే ఆప్షన్‌గా ఇచ్చారు. ఆధార్‌ తప్పనిసరిపై భక్తులకు అవగాహన కల్పించి తర్వాత అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు.
నడకదారి భక్తులకు తప్పనిసరి కానున్న ఆధార్ 
తిరుమలకు వస్తున్న భక్తుల్లో ఇప్పటికే ఎంతమంది ఆధార్‌ కార్డును వెంట తీసుకువస్తున్నారనే అంశంపై.. టిటిడి శ్రీవారి సేవకులతో ఓ సర్వే నిర్వహించింది. ఇందులో కుటుంబ యజమాని, ప్రధాన నమోదుదారుగా ఉన్నవారిలో.. సుమారు 98 శాతం భక్తుల వద్ద ఆధార్‌ కార్డులు ఉన్నట్లు తేలింది. అయితే కొందరు ఆధార్‌ కార్డు వెంట ఉన్నా చూపించకుండా ఇతర గుర్తింపు కార్డులను చూపిస్తున్నారు. దీంతో ఇకపై ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఆర్జిత సేవలు, నడకదారి భక్తులకు ఆధార్‌ తప్పనిసరి కానుంది. దీనికి భక్తులు కూడా సానుకూలంగానే వ్యవహరిస్తున్నారు.  
ఆధార్‌ను అనుసంధానించేందుకు సిద్ధమవుతోన్న టీటీడీ 
మొత్తం మీద తిరుమలలో అన్ని సేవలు, కార్యకలాపాలకు.. ఆధార్‌ను అనుసంధానించేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. అయితే భక్తుల వెసులుబాటు కోసం ఇతర గుర్తింపు కార్డులను కూడా అనుమతిస్తున్నారు. దీని వల్ల టీటీడీ అధికారులు నిబంధనలను పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతున్నారు. అందువల్ల ఇకపై అన్నింటికీ ఆధార్‌ తప్పనిసరి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆర్జిత సేవా టికెట్లను ఆన్ లైన్లో ఒకసారి బుక్‌ చేసుకుంటే.. తిరిగి 90 రోజుల తర్వాతే లభించేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు.

 

19:43 - June 23, 2017

హైదరాబాద్ : నీరు ఉన్న సాగు నీటి ప్రాజెక్టుల నుంచి.. ఖరీఫ్‌కు నీటిని విడుదల చేయాలని ఇరిగేషన్‌ శాఖా మంత్రి హరీశ్‌ రావు ఆదేశించారు. ఖరీఫ్‌ సీజన్‌ సాగునీటి కార్యాచరణ ప్రణాళికపై.. సెక్రటరియేట్‌లో వీడియో కాన్ఫరెన్స్‌ జరిగింది. ప్రాజెక్టుల నుంచి ఖరీఫ్‌కు ముందస్తు నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్‌ సూచించారు. సాగు నీటి ప్రాజెక్ట్‌ల నుంచి ఖరీఫ్‌ పంటకు నీటిని విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకవసరమైన సన్నాహాలను ముమ్మరం చేయాలని.. మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. 
రైతు అవగాహన సదస్సులు నిర్వహణ 
నీరున్న ప్రాజెక్ట్‌లలో సింగూరు నుంచి.. 40 వేల ఎకరాలు, ఘనపురం నుంచి 20 వేల ఎకరాలు, కడెం నుంచి 50 వేల ఎకరాలు, గొల్లవాగు నుంచి 6 వేల ఎకరాలు, కొమురం భీం నుంచి 21 వేల ఎకరాలు, మత్తడి వాగు నుంచి 6 వేల ఎకరాలు, గొల్లవాగు నుంచి 6 వేల ఎకరాలు, కొమురం భీం నుంచి 21 వేల ఎకరాలు, మత్తడి వాగు నుంచి 6 వేల ఎకరాల ఆయకట్టుకు.. సాగు నీటిని అందించాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ఇందుకు గానూ ఎస్ఆర్‌ఎస్‌పి, నాగార్జున సాగర్‌, ఏఎమ్‌ఆర్‌పి, నిజాం సాగర్‌, తదితర ప్రాజెక్టుల పరిధిలో వెంటనే ఇరిగేషన్‌, వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులతో రైతు అవగాహన సదస్సులు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. 
మరమ్మత్తు పనులను వెంటనే పూర్తి చేయాలి : హరీశ్‌రావు 
వివిధ ప్రాజెక్టులు, డ్యాంల గేట్లను పటిష్టం చేయాలని, మరమ్మత్తు పనులను వెంటనే పూర్తి చేయాలని హరీశ్‌రావు కోరారు. ఖరీఫ్ సీజన్‌ను ముందస్తుగా ప్రారంభించడం వలన యాసంగిలో ఎక్కువ ఆయకట్టుకు నీరందించే వీలవుతుందని మంత్రి చెప్పారు. గతేడాది వివిధ ప్రాజెక్టుల కింద జరిగిన ఆయకట్టు వివరాలను రెవెన్యూ, ఇరిగేషన్‌ శాఖలు సంయుక్తంగా పర్యవేక్షించి రూపొందించిన నివేదికలతో పోల్చాలని కోరారు. ఖరీఫ్‌ యాక్షన్ ప్లాన్‌పై మరో వారంలో జిల్లా కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నట్టు హరీశ్‌ తెలిపారు. పెద్దపల్లి ప్రాంతంలో గతేడాది అమలు చేసిన టెయిల్‌ టు హెడ్‌ విధానం విజయవంతం అవడంతో.. ఇదే ప్రయోగాన్ని వీలైనన్ని ప్రాజెక్టుల ప్రధాన కాలువలు, డిస్ట్రి బ్యూటరీలలో ప్రవేశ పెట్టాలని సూచించారు. నిజాం సాగర్‌ కింద గతేడాది సమర్థంగా.. సాగు జరిగిందని మంత్రి అన్నారు. అదే స్ఫూర్తిని మిగతా ప్రాజెక్ట్‌లలోనూ కొనసాగించాలని కోరారు. ప్రతీ ప్రాజెక్ట్‌ కింద నిర్ధారిత ఆయకట్టు లక్ష్యాల సాధనకు పకడ్బందీగా ప్రణాళికలు రచించి.. అమలు చేయాలని హరీశ్‌రావు ఆదేశించారు. ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో భాగంగా నిర్వాసితులైన ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీలను.. గ్రామ పంచాయతీలుగా మార్చడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత ప్రాజెక్ట్‌ చీఫ్‌ ఇంజనీర్లను ఆదేశించారు. 
కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశం 
మిషన్ కాకతీయ మూడో దశ పనులు జరుగుతుండటంతో.. కింది స్థాయి ఇంజనీరింగ్‌ సిబ్బంది ఆయా మండల కేంద్రాల్లోనే ఉండాలని మంత్రి ఆదేశించారు. భారీ వర్షాలు కురిసినప్పుడు తలెత్తే పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి.. ఉన్నతాధికారులకు, ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని కోరారు. వర్షాకాలంలో చెరువుల పరిస్థితిని తెలుసుకుంటూ, ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించడానికి ఒక కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని మైనర్‌ ఇరిగేషన్‌ సీఈలను  హరీశ్‌రావు ఆదేశించారు.
కలెక్టర్‌లతో మంత్రి హరీశ్‌రావు వీడియో కాన్ఫరెన్స్‌ 
ఖరీఫ్‌ ఇరిగేషన్‌ యాక్షన్‌ ప్లాన్‌పై సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల.. కలెక్టర్‌లతోనూ మంత్రి హరీశ్‌రావు వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఆయకట్టులో ఎక్కడెక్కడ లీకేజీలున్నాయో గుర్తించి వాటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. లీకేజీలపై ఎమ్మెల్యేల నుంచి తరచూ ఫిర్యాదులు వస్తున్నాయని హరీశ్‌రావు గుర్తు చేశారు. బాటిల్ నెక్స్‌ సమస్యలు ఎక్కడున్నాయో, ఏ ప్రాంతంలో శాశ్వత ప్రాతిపదికన మరమ్మత్తులు ఎలా చేపట్టాలో గుర్తించాలన్నారు. కాలువలలో క్యారీయింగ్ కెపాసిటీ సవ్యంగా ఉండేలా చూడాలని.. సాగునీటి క్రమబద్ధీకరణ సమర్ధంగా జరగాలన్నారు. 

 

భువనగిరిలోని పద్మజా సంతాన సాఫల్య కేంద్రంపై దాడులు

యాదాద్రి : భువనగిరిలోని పద్మజా సంతాన సాఫల్య కేంద్రంలో డీఎంహెచ్ వో, ఆర్డీవో ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా సరోగసి నిర్వహిస్తున్నారన్న సమాచరంతో దాడులు జరిపారు. అద్దె గర్భం కోసం ఉంచిన 82 మహిళలను అధికారులు గుర్తించారు. పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. 

పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి : తమ్మినేని

కొత్తగూడెం : పట్టణంలో గిరిజనులు కదం తొక్కారు. సీపీఎం ఆధ్వర్యంలో మార్కెట్ యార్డు నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ పోడు భూముల నుంచి గిరిజనులను వెళ్లగొట్టే హక్కు కేసీఆర్ కు లేదని స్పష్టం చేశారు. అటవీ హక్కుల చట్టాన్ని కేసీఆర్ చదవాలని సలహా ఇచ్చారు. 

ఇద్దరు చిన్నారుల మృతి

తూర్పుగోదావరి : జిల్లాలోని సామర్లకోటలో విషాదం నెలకొంది. ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. విజయనగరం జిల్లా పార్వతీపురంకు చెందిన దంపతులు తన ఇద్దరు పిల్లలతో కలిసి సామర్లకోటలోని ఓ లాడ్జీలో పురుగుల మదు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో ఇద్దరు పిల్లలు మృతి చెందారు. తల్లిదండ్రుల పరిస్థితి విషమంగా ఉంది. 

19:25 - June 23, 2017
19:21 - June 23, 2017

ఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవంగా జరిగే బాగుండేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్ డీఏకి మెజారిటీ ఉందని తెలిసినా కూడా ప్రతిపక్షాలు పోటీ పెట్టడం సరికాదన్నారు. రామ్‌నాథ్‌ కోవింద్‌కు మద్దతు కూడగట్టే అంశంపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో మరోసారి మాట్లాడతానని బాబు చెప్పారు. 
 

19:17 - June 23, 2017

హైదరాబాద్ : పాతబస్తీ ముస్లిం సోదరుల ప్రార్థనలతో మారుమోగింది. పవిత్ర రంజాన్ నెల చివరి శుక్రవారం సందర్భంగా వేలాదిమంది ముస్లింలు నమాజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అల్విదా జుమ్మా పేరుతో నమాజు కార్యక్రమం నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుంచి ముస్లిం సోదరులు తరలి వచ్చారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. దీనిపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం...

 

17:13 - June 23, 2017

యాదాద్రి : భువనగిరిలోని పద్మజా సంతాన సాఫల్య కేంద్రంలో డీఎంహెచ్ వో, ఆర్డీవో ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా సరోగసి నిర్వహిస్తున్నారన్న సమాచరంతో దాడులు జరిపారు. అద్దె గర్భం కోసం ఉంచిన 82 మహిళలను అధికారులు గుర్తించారు. పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వివరాలకు వీడియో చూడండి..

 

17:02 - June 23, 2017

కొత్తగూడెం : పట్టణంలో గిరిజనులు కదం తొక్కారు. సీపీఎం ఆధ్వర్యంలో మార్కెట్ యార్డు నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ పోడు భూముల నుంచి గిరిజనులను వెళ్లగొట్టే హక్కు కేసీఆర్ కు లేదని స్పష్టం చేశారు. అటవీ హక్కుల చట్టాన్ని కేసీఆర్ చదవాలని సలహా ఇచ్చారు. పోలీసు బూట్ల చప్పుళ్లతో గిరిజనులను భయపెట్టలేరన్నారు. చట్టంపై గౌరవం ఉంటే గిరిజనులకు 10 ఎకరాల వంతున పోడు భూమి ఇవ్వాలని కోరారు. ఈ ప్రదర్శనలో త్రిపుర గిరిజన సంఘం నేత జితిన్ చౌదరి, భద్రాచలం సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య పాల్గొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తో సీఎం బాబు..

ఢిల్లీ : పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్ ను సీఎం చంద్రబాబు నాయుడు కలిశారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని 12,444,89 హెక్టార్ల అటవీ భూమిని ఏపీ సీఆర్డీఏ కు బదలాయించాలని విజ్ఞప్తి చేశారు. ఏలూరు డివిజన్ లో ఉన్న అటవీ భూములను ఏపీఐఐసీకి బదలాయించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు అటవీ, పర్యావరణ అనుమతుల ఎన్ వోసీ మూడేళ్ల పాటు పొడిగించాలని కేంద్ర మంత్రి హర్షవర్దన్ ను కోరారు.

16:42 - June 23, 2017

రంగారెడ్డి : బోరుబావిలో పడిన చిన్నారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్ డీఆర్ ఎఫ్ సిబ్బంది ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. బోరుబావికి సమాంతరంగా అధికారులు గొయ్యి తవ్వుతున్నారు. ఇక్కారెడ్డిగూడెంలో భారీ వర్షం పడుతుంది. దీంతో కాసేపు సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. నిన్న సాయంత్రం 6.30 నిమిషాలకు చిన్నారి బోరుబావిలో పడిపోయింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

సింగరేణి కార్మికుడి మృతిపై కార్మికుల ఆగ్రహం..

పెద్దపల్లి : గోదావరిఖని సింగరేణి ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్మికుడి మృతికి నిరసనగా ఆర్బీ -2 జనరల్ మేనేజర్ విజయ్ బాబుపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అటవీ హక్కుల చట్టాన్ని కేసీఆర్ చదవాలి - తమ్మినేని..

నల్గొండ : అటవీ హక్కుల చట్టాన్ని కేసీఆర్ చదవాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సూచించారు. చట్టంపై గౌరవం ఉంటే గిరిజనులకు పది ఎకరాల వంతున పోడు భూమి ఇవ్వాలన్నారు. పోలీసుల బూటు చప్పుళ్లతో గిరిజనులను భయపెట్టలేరని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సింగరేణి కార్మికుడి మృతిపై కార్మికుల ఆగ్రహం..

పెద్దపల్లి : గోదావరిఖని సింగరేణి ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్మికుడి మృతికి నిరసనగా ఆర్బీ -2 జనరల్ మేనేజర్ విజయ్ బాబుపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అటవీ హక్కుల చట్టాన్ని కేసీఆర్ చదవాలి - తమ్మినేని..

ఖమ్మం : అటవీ హక్కుల చట్టాన్ని కేసీఆర్ చదవాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సూచించారు. చట్టంపై గౌరవం ఉంటే గిరిజనులకు పది ఎకరాల వంతున పోడు భూమి ఇవ్వాలన్నారు. పోలీసుల బూటు చప్పుళ్లతో గిరిజనులను భయపెట్టలేరని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

బ్రాహ్మణులకు కుల ధృవీకరణ పత్రాలు..

హైదరాబాద్ : బ్రాహ్మణులకు కుల ధృవీకరణ పత్రాలు జారీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ సందర్భంగా బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫర్ ఎవర్ కో ఆర్డినేటర్లు కృష్ణ మోహన్, అలూరి పిల్లుట్ల ఆనంద్ మోహన్ హర్షం వ్యక్తం చేశారు.

పాస్ పోర్టు దరఖాస్తు దారులకు శుభవార్త..

హైదరాబాద్ : పాస్ పోర్టు దరఖాస్తు దారులకు ఆ శాఖ శుభవార్త అందించింది. 8 ఏళ్ల లోపు చిన్నారులకు..65 ఏళ్లు దాటిన వృద్ధులకు పాస్ పోర్టు ఫీజు 10 శాతానికి తగ్గించింది.

16:26 - June 23, 2017

రాజన్న సిరిసిల్ల : జిల్లాలో విషాదం నెలకొంది. ఈత సరదాకు ముగ్గురు బలయ్యారు. ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. జిల్లాలోని కోణరావుపేట మండలం పల్లిమక్తాకు చెందిన మణి (14), రాజు (13), సంజీవ్ (16)లు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. ఈరోజు పాఠశాలకు సెలవు ఇవ్వడంతో ముగ్గురు విద్యార్థులు స్థానికంగా ఉన్న కుమ్మరికుంట చెరువులోకి ఈతకు వెళ్లారు. ఈత రాకపోడవంతో చెరువులో మునిగి మృతి చెందారు. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. విద్యార్థులు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

భువనగరిలో సరోగసి..

యాదాద్రి భువనగిరి : భువనగిరిలో పద్మజా సంతాన సౌఫల్యత కేంద్రంలో డీఎంహెచ్ వో, ఆర్డివో ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా సరోగసి నిర్వహిస్తున్నారన్న సమాచారంతో అధికారులు దాడులు నిర్వహించారు. అద్దె గర్భం కోసం 82 మంది మహిళలున్నట్లు గుర్తించారు. పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.

 

పోలీసు అధికారిని చంపిన ఘటనను ఖండించిన ముఫ్తీ..

శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్ లో పోలీసును అత్యంత దారుణంగా కొట్టి చంపిన ఘటనను రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, ఎన్ సీపీ చీఫ్ ఒమర్ అబ్దుల్లాలు తీవ్రంగా ఖండించారు.

15:55 - June 23, 2017

బోరు బావిలో పడిన చిన్నారి..కొనసాగుతున్న సహాయక చర్యలు..అధికార..నేతలు..ఆగమనం..మరొక్కసారి కాకుండా చూస్తాం..బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం...ఘటన జరిగిన అనంతరం జరిగే హడావుడి...కొద్ది రోజుల అనంతరం మరిచిపోవడం..మళ్లీ ఏదైనా ఘటన జరగగానే మళ్లీ గుర్తుకు రావడం..ఇలా పరిపాటిగా మారిపోయింది. ఎందుకంటే బోరు బావిలో పడి ఎంతో మంది చిన్నారులు మృత్యువాత పడుతున్నా అధికారులు..ఇతరుల్లో స్పందన రావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం ఇక్కారెడ్డి గూడెంలో 14 నెలల చిన్నారి మీనా పడడంతో మరొక్కసారి హాట్ టాపిక్ అయ్యింది.మళ్లీ చర్చ..
బోరు బావులపై మళ్లీ చర్చ ప్రారంభమైంది...రైతులు ఇష్టమొచ్చినట్లుగా తవ్వేసిన బోరు బావులను మూయలేరా ? ఓ బండరాయి..లేదా..ఏదైనా వస్తువు పెట్టి మూయలేమా ? నోళ్లు తెరిచిన బోరు బావులపై అధికారులు చర్యలు తీసుకోరా ? ఇందులో నిర్లక్ష్యం ఎవరిది ? పంట పొలాల్లో రైతులు నీళ్ల కోసం బోరు బావులు వేస్తుండడం తెలిసిందే. కానీ భూగర్భ జలాలు అడుగంటిపోవడం..తదితర కారణాల వల్ల కొన్ని ప్రాంతాల్లో నీరు రాకపోయేసరికి తవ్విన బోరు బావిని అలాగే వదిలివేస్తున్నారు. ఆ స్థలంలో ఆడుకుంటుండగా..ఇతర కారణాల వల్ల చిన్నారులు అందులో పడి మృతి చెందుతున్నారు.

బుద్ధి రాదా ?
ఎంతో మంది చిన్నారులు కన్నుమూస్తున్నా బుద్ధి రావడం లేదు. బోర్లు వేసిన వెంటనే వాటికి పైకప్పులు బిగించకుండా వదిలేయడంతో నిర్లక్ష్యానికి బిడ్డలు బలవుతున్నారు. అనుమతులు లేకుండానే రైతులు బోర్లు తవ్వుతున్నారనే ఆరోపణలున్నాయి. ఒకవేళ అదే జరిగితే అధికారులు చర్యలు తీసుకోకపోవడాని కారణం ఏంటీ ? బోరు బావి తవ్వడానికి వాల్టా చట్టం ప్రకారం గ్రౌండ్ వాటర్ అథార్టీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. బోరు వేసిన అనంతరం నీరు రాకపోతే ఆ బోరును మూసివేసే విధంగా అధికారులు చూడాలని గతంలో పాలకులు ఆదేశాలు జారీ చేసింది. కానీ ఈ నిబంధనలు ఎవరైనా పట్టించుకుంటున్నారా ? అయితే అదంతా ఏమీ లేదని తెలుస్తోంది.

వాల్టా చట్టం ప్రకారం...
వాల్టా చట్టం ప్రకారం బోరో, బావో తవ్వాలనుకున్న రైతులు ముందుగా తహసీల్దార్‌ నుంచి అనుమతి తీసుకోవాలి. తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకుంటే ఆయన జియాలజిస్ట్‌తో భూమిని పరీక్ష చేయించి నీరు లభిస్తుందని సర్టిఫికెట్‌ వస్తే, చుట్టుపక్కల తవ్విన బోరు లేదా బావికి 250 మీటర్ల దూరంలో ఉంటేనే బోరు లేదా బావి తవ్వుకోవడానికి తహసీల్దార్‌ అనుమతి ఇస్తారు.

సాధ్యమేనా ?
వాల్టా చట్టం ప్రకారం తహసీల్దార్‌ అనుమతికోసం దరఖాస్తు చేసుకుంటే జియాలజిస్ట్‌ పరీక్ష చేసి సమృద్ధిగా నీరు ఉంటేనే, ఇతర బోరు లేదా బావికి 250 మీటర్ల దూరంలో ఉంటేనే ఆయన ఫీజుబులిటి సర్టిఫికెట్‌ ఇస్తారు. కొద్దిగా నీరు వస్తే సర్టిఫికెట్‌ ఇవ్వరు. అలాంటప్పుడు కొద్దిగా నీరు వచ్చినా సరే బోరు లేదా బావి తవ్వుకుందామనుకుంటున్న రైతులకు ఆ అవకాశం లేకుండా పోతోంది. వాల్టా చట్టంలో పక్క రైతు బోరు లేదా బావికి 250 మీటర్ల దూరంలో తవ్వుకోవాలని పేర్కొనడంతో కొత్తగా బావులు, బోర్లు తవ్వుకునే వారు చట్టప్రకారం తవ్వుకోలేక పోతున్నారని తెలుస్తోంది.
 

బోరు బావులు తవ్విన అనంతరం మూతలు పెట్టడం..పూడ్చడం వంటివి చేయండి.. నిర్లక్ష్యానికి పసిబిడ్డలు బలి కావడం ఎంతవరకు న్యాయమో ఆలోచించండి...
 

15:42 - June 23, 2017
15:34 - June 23, 2017

అనంతపురం : ఎమ్మెల్యే బాలకృష్ణ అనంతపురం జిల్లా... హిందూపురంలో పర్యటించారు.  ఈ సందర్భంగా చిలమత్తూరులో ఆయనకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కార్యకర్తల నడుమ  బాలకృష్ణ చిలమత్తూరు నుంచి లేపాక్షి వరకు  బుల్లెట్‌ను నడుపుతూ ర్యాలీగా తరలివచ్చారు. అనంతరం హిందూపురంలో 22 కోట్లతో నిర్మించిన మాతా శిశు వైద్యశాలను మంత్రి కామినేని శ్రీనివాస్‌తో కలసి బాలకృష్ణ ప్రారంభించారు. ఆస్పత్రిలోని సౌకర్యాలను పరిశీలించారు.  

15:29 - June 23, 2017

హైదరాబాద్ : కేంద్ర సాహిత్య పురస్కారం 2017 సం.రానికి గానూ.. ఈసారి దళిత క్రిస్టియన్ మహిళ మెర్సీ మార్గరేట్ దక్కించుకున్నారు. ఆమె ఎన్నో కవితలు రాసి ఇప్పటికే మంచి కవయిత్రిగా పేరు తెచ్చుకుంది. ఈ మధ్య కాలంలో బీఫ్ బ్యాండ్ పైన కవితలు రాసి.. ఆమె వార్తల్లోకి వచ్చింది. తన చుట్టూ జరుగుతున్న చిన్న చిన్న సంఘటనలతో మొదలుపెట్టిన కవిత్వం.. ఈ రోజు కేంద్ర సాహిత్య యువ పురస్కారాన్ని అందుకునేంత వరకు వచ్చింది. వివక్ష నుంచి మొదలైన తన  సాహిత్యానికి ఇంత గొప్ప పురస్కారం అందుకోబోతున్న మెర్సి మార్గరేట్ తో టెన్ టివి ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంగా మెర్సీ పలు విషయాలు తెలిపారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

 

15:24 - June 23, 2017

చిత్తూరు : సిరిసిల్ల చేనేత కార్మికుడు తిరుమల శ్రీవారికి అరుదైన కానుకను సమర్పించాడు. అగ్గిపెట్టెలో ఇమిడిపోయే చీరను, శాలువను నల్ల విజయ్‌ కానుకగా అందించాడు. 2012సం.లో జరిగిన తెలుగు మహాసభలలో కూడా అగ్గిపెట్టెలో ఇమిడే చీరను ఆవిష్కరించి అందరి మన్ననలు పొందినట్టు ఈ సందర్భంగా దాత తెలిపారు. 

 

15:22 - June 23, 2017

గుంటూరు : జీఎస్టీ అమలు వల్ల రాష్ట్రానికి రూ.2900 కోట్ల రెవెన్యూ నష్టం వాటిల్లుతుందని ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. రెవెన్యూ నష్టపరిహారం కేంద్రం ఇస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఈమేరకు ఆయన అమరాతిలో మీడియాతో మాట్లాడారు. ఈనెల 30 అర్ధరాత్రి నుంచి వాణిజ్య పన్నుల శాఖకు చెందిన అన్ని చెక్‌పోస్టులను తొలగిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు, టీటీడీని జీఎస్టీ నుంచి మినహాయించాలని వచ్చే కౌన్సిల్‌లో కోరుతామని యనమల అన్నారు. ఎరువులు, ట్రాక్టర్లు, హ్యాండ్లూమ్స్‌, ప్రాంతీయ సినిమాలు, పొగాకు, ప్లాస్టిక్,కాటన్, పంచదారపై పన్ను తగ్గించాలని ప్రతిపాదిస్తామన్నారు. 

 

15:13 - June 23, 2017

రంగారెడ్డి : బోరుబావి నుంచి చిన్నారిని బయటకుతీసే విషయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. రోబోటిక్‌ హ్యాండ్‌ ద్వారా చిన్నారిని బయటకు తెచ్చే యత్నం విఫలమైంది. మోటార్‌ సహా చిన్నారిని బయటకు తెచ్చేందుకు యత్నించగా.. మోటార్‌ మాత్రమే వెలుపలికి వచ్చి రెండడుగుల లోతుకు చిన్నారి జారిపోయింది. మరోవైపు బోరుబావికి సమాంతరంగా తవ్వకాలు కొనసాగుతున్నాయి. 19 గంటలుగా సహాయక చర్యలు నిర్విరామంగా సాగుతున్నాయి. 40 అడుగుల లోతులో చిన్నారి చిక్కుకోవడంతో.. సహాయక సిబ్బంది బోరుబావిలోకి నిరంతరాయంగా ఆక్సిజన్‌ను పంపుతున్నారు. ఇక చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

పీవీ సింధు పరాజయం..

ఢిల్లీ : ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ లో ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు పరాజయం చెందింది. మహిళా సింగిల్స్ లో భాగంగా క్వార్టర్స్ ఫైనల్లో పీవీ సింధు..చైనీస్ తైపీ క్రీడాకారిణి ప్రపంచ నెంబర్ వన్ తై జు యింగ్ చేతిలో ఓటమి చెందింది.

 

హిందూపురంలో బాలయ్య..

అనంతపురం : సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురానికి వచ్చారు. మంత్రి కామినేని శ్రీనివాస్ తో కలిసి ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోని మాతా శిశు ఆసుపత్రిని ప్రారంభించారు. మూడు రోజుల పాటు ఆయన హిందూపురంలోనే ఉండనున్నారు.

 

జైపాల్ రెడ్డి గల్లీ నేతగా మారారు - కర్నె ప్రభాకర్..

హైదరాబాద్ : జైపాల్ రెడ్డి గల్లీ నేతగా మారారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ కు చీకటి ఒప్పందాలు ఉండవని, ముస్లిం రిజర్వేషన్ల కోసం అవసరమైతే కేంద్రంతో పోరాడుతానని కేసీఆర్ ప్రకటించారని తెలిపారు. కేసీఆర్ సూచనతోనే రాష్ట్రపతి అభ్యర్థిగా దళిత నేతను ఎన్డీఏ ప్రకటించిందన్నారు. మద్దతు కోసం కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ ను సంప్రదించలేదన్నారు.

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి అజ్ఞాత వ్యక్తి - జైపాల్ రెడ్డి..

ఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికలు ఇద్దరు వ్యక్తుల పోటీ కాదని..మీరాకుమార్ స్వచ్చమైన రాజ్యాంగ స్పూర్తికి ప్రతీక అని ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి అజ్ఞాత వ్యక్తి అని కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ పాఠశాలలో పాఠాలు నేర్చుకున్న వ్యక్తిని రాష్ట్రపతిగా నియమించడం ప్రమాదకరమని తెలిపారు. కేసీఆర్ రహస్య ఒప్పందంతో బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.

14:19 - June 23, 2017
14:18 - June 23, 2017

అనంత విశ్వగ్రహంలో మీ పేరు చూసుకుంటే అంతకంటే థ్రిల్ల్ ఎముంటుంది చెప్పండి.అటువంటి అరుదైన గౌరవం దక్కించుకుంది సాహితి పింగళి...... ఒడిశా చెందిన బాలిక సంచలనం సృష్టించింది. లిటిల్ మిస్ యూనివర్స్ 2017 ఎంపికతో పాటు మూడు టైటిళ్లు గెలుచుకున్న బాలికగా రికార్డ్ స్వంతం చేసుకుంది...... రెండేళ్ల క్రిందటి హర్యానాలో పుట్టిన ప్రచారమిది. బిందు జిల్లా బీబీపూర్ మాజీ సర్పంచ్ సునిల్ జగ్లాన్ దీన్ని ప్రారంభించారు. కూతురును ప్రేమించే ప్రతి తల్లి, ప్రతి దండ్రి ఆమెతో సెల్ఫీ తీసుకోని అప్ లోడ్ చేయాలన్నదే ప్రచారం. పూర్తి సమాచారం కోసం వీడియో చూడండి.

 

14:14 - June 23, 2017

బాలీవుడ్ లో విజయంతమైన చిత్రాలు సీక్వెల్ గా వస్తుండడం తెలిసిందే. బాలీవుడ్ కండల వీరుడు నటించిన 'దబాంగ్' సినిమా ఎంత ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దీనికి కొనసాగింపుగా 'దబాంగ్ 2’ కూడా వచ్చింది. ఇది కూడా మంచి ప్రేక్షకాదరణ పొందింది. తాజాగా 'దబాంగ్ 3’ కూడా తీసుకరావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 'సల్మాన్‌ఖాన్‌' సోదరుడు అర్బాజ్‌ఖాన్‌ అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో వచ్చిన ‘దబాంగ్ 2’ సినిమాకు ఆర్బాజ్ దర్శకత్వం వహించగా ఈ సినిమాకు ఆయన దర్శకత్వం వహిస్తారా ? లేదా ? అనేది తెలియరావడడం లేదు. ఇదిలా ఉంటే ‘దబాంగ్’..’దబాంగ్ 2’ సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించిన ‘సోనాక్షి సిన్హా’నే తీసుకోవాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 'సోనాక్షి' ప్రస్తుతం 'ఇత్తేఫాక్‌'చిత్రంలో నటిస్తోంది.

14:09 - June 23, 2017

శరీరానికి తగిన పోషకాలు అందుతున్నాయా ? లేదా ? తెలుసుకోవడం ఎలానో చదవండి..
పోషకాలు..ఇవి సమతుల్యంగా ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. కొన్ని ప్రత్యేకమైన పోషకాలు మాత్రం తప్పనిసరిగా అవసరం ఉంటుంది. గోర్లు ఆరోగ్యంగా కనపడట్లేదా? లేదా గోళ్లపై తెల్లటి మచ్చలు, చీలికలు వంటివి ఉంటే ఐరన్ అందలేదని అర్థం చేసుకోవాలి. ఐరన్‌ లోపం వలన చేతి గోళ్లపై చీలికలు.గీతలు ఏర్పడతాయి.
శరీర భాగాలపై మొటిమలు అధికంగా వస్తుంటాయి. ఇలా వస్తే విటమిన్ ‘ఇ’ లోపం ఉందని గ్రహించాలి. చర్మ రంధ్రాలు మూసుకపోయి..బ్యాక్టీరియా పేరుకపోవడం వల్ల మొటిమలు వస్తాయి.
శరీరానికి సరిపోయేంత అయోడిన్‌ను తీసుకోవాలి. అయోడిన్‌ను సరైన మోతాదులో తీసుకుంటే థైరాయిడ్‌ ఆరోగ్యం కూడా మెరుగవుతుంది.
పొటాషియం అధికంగాగల అరటిపండు, స్పినాచ్‌, బ్రోకలీ, ద్రాక్ష పండ్లను తినాలి. ముఖం లేదా ఈ విటమిన్‌ అధికంగాగల క్యారెట్‌, చిలకడదుంపలని ఎక్కువగా తినాలి.

14:05 - June 23, 2017

జూనియర్ 'ఎన్టీఆర్' నటిస్తున్న 'జై లవ కుశ' చిత్రం గురించి ఏదో ఒక వార్త హల్ చల్ చేస్తోంది. సామాజిక మాధ్యమాల్లో ఆయా విషయాలు ప్రచారం జరుగుతున్నాయి. బాబీ దర్శకత్వంలో 'జై లవ కుశ' సినిమా రూపొందుతోంది. ఎన్.టి.ఆర్‌. ఆర్ట్స్‌ పతాకంపై నందమూరి కల్యాణ్‌ రామ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇందులో 'ఎన్టీఆర్' మూడు భిన్నమైన పాత్రలను పోషించనున్నాడని..రాశి ఖన్నా, నివేదా థామస్‌లు హీరోయిన్లు నటిస్తున్నారు. ఈ చిత్రంలో విలన్ పాత్ర కోసం చిత్ర యూనిట్ తర్జనభర్జనలు పడినట్లు తెలుస్తోంది. తొలుత కన్నడ నటుడు ‘దునియా విజయ్’ను ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కానీ ఆయన ‘ఎన్టీఆర్’ కు అతను సరిపోడని భావించిన చిత్ర యూనిట్ తాజాగా బుల్లితెర హిందీ నటుడు 'రోనిత్‌ రాయ్‌'ను చిత్ర బృందం ఎంపిక చేసింది. గురువారం ‘జై లవకుశ’ చిత్ర బృందాన్ని కలిసిన ఆయన అనంతరం షూటింగ్‌లో పాల్గొన్నారు. ఇప్పటికే ‘జై’ స్టైలిష్‌ లుక్‌ను విడుదల చేయగా, ‘లవ’, ‘కుశ’ లుక్స్‌ ఎలా ఉంటాయనే దానిపై అందరూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. హీరోయిన్‌ నందిత ఇందులో ఓ కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం.

14:00 - June 23, 2017

ఢిల్లీ : ఎన్‌డీఏ పక్షాలతరపున రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద్ నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మోదీ, మిత్‌షా, కేంద్రమంత్రులు.. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఎన్‌డీఏ మిత్రపక్ష పార్టీల సీఎంలు. కోవింద్‌కు మద్దతు పార్టీల నేతలు పాల్గొన్నారు. 4 సెట్ల నామినేషన్‌ పత్రాలను లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు రామ్‌నాథ్ అందజేశారు. మొదటి సెట్‌పై ప్రధాని మోదీ సంతకం చేయగా.. రెండో సెట్‌పై చంద్రబాబు, మూడో సెట్‌పై అమిత్‌ షా, నాలుగో సెట్‌పై ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ సంతకాలు చేశారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ రామ్ నాథ్ కోవింద్ మద్దతుగా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

13:58 - June 23, 2017

నెల్లూరు : జిల్లా శ్రీహరికోటలోని షార్‌ మరో ఘనత సాధించింది... పీఎస్‌ఎల్‌వీ సీ 38 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది.. శుక్రవారం ఉదయం 9గంటల 29 నిమిషాలకు సతీష్ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌నుంచి పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది.. 31 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్లింది.. ఇందులో భారత్‌కుచెందిన రెండు ఉపగ్రహాలున్నాయి.. 712 కిలోల బరువు కలిగిన కార్టోశాట్‌-2ఈ తోపాటు దేశీయ యూనివర్సిటీకి చెందిన చిన్న ఉపగ్రహం ఉంది. ఇవికాకుండా 14 దేశాలకు చెందిన 29 ఉపగ్రహాలను రాకెట్‌ అంతరిక్షంలో ప్రవేశపెట్టింది.పీఎస్‌ఎల్వీ తీసుకెళ్లిన 30 నానో ఉపగ్రహాల బరువు 243 కిలోలు. ఈ ఉప్రగహాలను నింగిలోకి మోసుకెళన రాకెట్‌ 55 కిలోమీటర్ల ఎత్తు ధ్రువ సూర్య అనువర్తిత కక్ష్యలో ప్రవేశపెట్టింది..

కార్టోశాట్‌-2 ఉపగ్రహం ఐదేళ్లపాటు సేవలు
కార్టోశాట్‌-2 ఉపగ్రహం ఐదేళ్లపాటు సేవలు అందించనుంది. దీనిలో అమర్చిన ఫ్రాంక్రోమాటిక్‌ మల్టీస్పెక్ట్రల్‌ కెమెరా భూమిని పరిశోధిస్తూ అత్యంత నాణ్యమైన ఛాయాచిత్రాలను అందిస్తుంది. పట్టణ, గ్రామీణాభివృద్ధి ప్రణాళికలు, సముద్ర తీరప్రాంతాల నిర్వహణ, రహదారుల పర్యవేక్షణ, నీటి పంపిణీ, భూవినియో గంపై మ్యాప్‌ల తయారు, విపత్తులను విస్తృతంగా అంచనా వేసే పరిజ్ఞానం, వ్యవసాయ సమాచారం ఈ ఉపగ్రహంద్వారా అందుబాటులోకి వస్తుంది.ప్రయోగాన్ని విజయవంతంచేసిన శాస్త్రవేత్తలపై ప్రశంసల జల్లు కురిసింది.. ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబుతోపాటు... పలువురు అభినందించారు.. రాకెట్‌ ప్రయోగం విజయవంతానికి కృషి చేసిన వారందరికీ ఇస్రో అభినందనలు తెలిపింది.దేశీయ అవసరాల కోసం ఇస్రో కార్టోశాట్‌ సిరీస్‌ ప్రయోగాలను వరుసగా నిర్వహిస్తోంది. భౌగోళిక సమాచారం కోసం కార్టోశాట్‌ ఉపగ్రహాల సిరీస్‌ను 2005లోనే రూపొందించారు.

13:56 - June 23, 2017

హైదరాబాద్ : సింగరేణి కార్మికుల ఆందోళనకు సీపీఎం సంపూర్ణ మద్దతు ప్రకటించింది.. సింగరేణి కార్మికుల పోరాటం న్యాయమైందని... ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.. రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు విధానాలు అవలంభించి వారసత్వ ఉద్యోగాలు తిరస్కరించేలా చేసిందని విమర్శించారు

13:55 - June 23, 2017

వికారాబాద్ : శంషాబాద్‌ ఔటర్‌రింగ్‌ రోడ్డుపై అంబులెన్స్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే అంబులెన్స్‌ను మంటలు చుట్టుముట్టాయి. హైదరాబాద్‌ నుంచి రాజమండ్రికి అంబులెన్స్‌లో మృతదేహం తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అంబులెన్స్‌లో మంటలు చెలరేగడంతో మృతదేహం సగానికి పైగా కాలిపోయింది. అయితే డ్రైవర్‌ అప్రమత్తతో.. అంబులెన్స్‌లో ప్రయాణిస్తున్న వారు వాహనం నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. కొత్వాల్‌ గూడ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. 

13:53 - June 23, 2017

హైదరాబాద్ : రంజాన్‌ మాసం చివరి శుక్రవారం కావడంతో.. రాష్ట్రంలో మసీదులన్నీ కిటకిటలాడుతున్నాయి. నమాజ్‌ చేసేందుకు ముస్లిం సోదరులు.. మసీదులకు తరలి వస్తున్నారు. ముస్లిం భక్తులు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి మక్కా మసీదుకు వస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

జీఎస్టీ అమలుపై యనమల సమీక్ష..

విజయవాడ : అమరావతిలో ఏపీలో జీఎస్టీ అమలుపై మంత్రి యనమల సమీక్ష నిర్వహించారు. ఈనె 30 అర్ధరాత్రి నుండి జీఎస్టీ అమలు కానుందని, వాణిజ్య పన్నుల శాఖకు చెందిన అన్ని చెక్ పోస్టులు తొలగిస్తున్నట్లు తెలిపారు. చెక్ పోస్టుల్లో పనిచేసే ఉద్యోగులను శాఖాపరంగా సర్దుబాటు చేస్తామని, రాష్ట్రంలో ఈ వే బిల్లులు తాత్కాలికంగా అమలు చేస్తున్నట్లు యనమల పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు..టిటిడికి జీఎస్టీ మినహాయింపుపై వచ్చే కౌన్సిల్ లో చర్చిస్తామన్నారు.

వెంకయ్య వ్యాఖ్యలను ఖండించిన యనమల..

విజయవాడ : రుణమాఫీ అడగడం ఫ్యాషన్ అయిపోయిందన్న వెంకయ్య నాయుడి వ్యాఖ్యలను మంత్రి యనమల ఖండించారు. రుణమాఫీ ఫ్యాషన్ కాదని..అవసరమని యనమల తెలిపారు. రుణమాఫీని మొదట ప్రారంభించింది తామేనని తెలిపారు.

13:40 - June 23, 2017

రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లాలో బోరుబావి నుంచి చిన్నారిని బయటకుతీసే విషయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. 18గంటలుగా సహాయ చర్యలు చేపడుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాల ప్రయత్నాలు విఫలమైయ్యాయి. అధికారులు సింగరేణి నుంచి నిపుణులను రప్పిస్తున్నారు. బోరుబావిలో ఉన్న మోటార్ తీసేందుకు యత్నం చేస్తున్నారు. బోరుబావిలోకి ఆక్సిజన్ ను సహాయక సిబ్బంది పంపుతున్నారు. సీసీ కెమెరాలతో చిన్నారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నారు. మరోవైపు చిన్నారి తల్లి చిన్నితల్లి ఎప్పుడోస్తావ్ అంటూ సొమ్మసిలింది. మరింత సమాచారం కోసం వీడియో చూడిండి. 

13:38 - June 23, 2017

గుంటూరు : ప్రజా ఆరోగ్య చీఫ్ ఇంజనీర్ పాము రంగారావు ఇంటి పై ఏసీబీ దాడులు నిర్వహిస్తుంది. గుంటూరులోని గౌతమి అపార్ట్ మెంట్ ఉన్న రంగారావు ఇంట్లో ఏసీబీ అధికారులు బంగారం, వెండి నగలు స్వాధీనం చేసుకున్నారు.య అలాగే రూ.30 కోట్ల విలువై ఆస్తుల పత్రాలను కూడు స్వాధీనం చేసుకున్నారు. గత మూడు గంటలుగా ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

13:18 - June 23, 2017

అవినీతి లేని పాలన సాగుతోంది..లంచం ఇవ్వకండి..అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం..టెక్నాలజీ సాయంతో అవినీతిని అరికడుతున్నాం..ఇవి పాలకులు చెబుతున్న మాటలు. మరి వాస్తవ పరిస్థితి కరెక్టుగానే ఉందా ? అంటే లేదనే సమాధానం వస్తోంది. ఎందుకంటే ఏపీలో జరుగుతున్న ఏసీబీ దాడుల్లో కోట్లు రాలుతున్నాయి. ఇబ్బడి ముబ్బడిగా ఆస్తులు బయటపడుతుండడం విశేషం. గత కొన్ని రోజులుగా పలువురు అధికారులపై ఏసీబీ దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ దాడుల్లో ఉద్యోగి నుండి అధికారుల వరకు పట్టుబడుతుండడం గమనార్హం.

ప్రభుత్వ ఉద్యోగం..
చేసేది ప్రభుత్వ ఉద్యోగం..ప్రభుత్వం ఇచ్చిన జీతం తీసుకుంటూనే పలువురు అధికారులు అడ్డదారులు తొక్కుతున్నారు. కోట్లు..ఆస్తులను వెనక్కి వేసుకుంటున్నారు. అవినీతి ఆరోపణలు బయటకు రావడంతో ఏసీబీ రంగంలోకి దిగి వారి పని పడుతోంది. అది ఆర్ అండ్ బి శాఖ కావచ్చు..మున్సిపల్ శాఖ..రెవెన్యూ శాఖ...ఇలా ఏ శాఖలో చూసినా అవినీతి రాజ్యం ఏలుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ మోస్తారు ఉద్యోగి నుండి కీలక స్థానాల్లో ఉన్న వారు ఏసీబీకి పట్టుబడుతుండడం అవినీతి ఏ విధంగా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. మీడియాలో వీరి ఆస్తులు..డబ్బులు చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.

కోట్లలో ఆస్తులు..
ఇటీవలే పలువురు అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు. అక్రమాస్తుల విలువ చూసి ఏసీబీ అధికారులే షాక్ తింటున్నారంట. మొన్నటికి మొన్న తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మహారాణి సత్రంలో ఏసీబీ అధికారులు దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఏపీ ఇండస్ట్రియల్ అడిషనల్ డైరెక్టర్ సురేష్ బాబు ఇంటిపై కూడా ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈ దాడులు తీవ్ర కలకలం సృష్టించాయి. హైదరాబాద్లో 5 చోట్ల, విజయవాడ, గుంటూరు, కర్నూల్లో ఏసీబీ సోదాలు చేసింది. రూ. 40 కోట్లకు పైగా అక్రమాస్తులను గుర్తించారని, మొత్తం రూ. 100 కోట్లకు పైగానే ఆస్తులు కూడబెట్టారని మీడియాలో ప్రచారం జరిగింది. అంతేగాకుండా పలు చెక్ పోస్టులపై కూడా ఏసీబీ అధికారులు దాడులు జరిపి అవినీతికి పాల్పడుతున్న వారికి చెక్ పెట్టింది. వీరి దాడుల్లో నగదు..విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకొంటోంది. గాజువాక సబ్‌ రిజిస్ట్రార్‌ వెంకయ్యనాయుడు ఇంటిపై ఏసీబీ అధికారులు చేసిన దాడుల్లో భారీగా ఆస్తులు బయటపడ్డాయని వార్తలు వెలువడ్డాయి. వెంకయ్యపై ఆరోపణలు రావడంతో దాడులు చేసిన ఏసీబీ సోదాల్లో సుమారు రూ. 50 కోట్లకు పైగా అక్రమాస్తులున్నట్లు గుర్తించారు.

తాజాగా...
ప్రజా ఆరోగ్య చీఫ్ ఇంజనీర్ పాము రంగారావు ఇంటి పై శుక్రవారం ఏసీబీ దాడులు నిర్వహించింది. గుంటూరులోని గౌతమి అపార్ట్ మెంట్ ఉన్న రంగారావు ఇంట్లో ఏసీబీ అధికారులు బంగారం, వెండి నగలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రూ.30 కోట్ల విలువైన ఆస్తుల పత్రాలను కూడ స్వాధీనం చేసుకున్నారు. గత మూడు గంటలుగా ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. దాడులు ముగిసిన అనంతరం ఎన్ని కోట్లు..ఎంత విలువైన ఆస్తులు బయటపడ్డాయో తెలియనుంది.

ఉపేక్షించవద్దు...
రాష్ట్ర ప్రభుత్వంలోని చిన్న ఉద్యోగి నుంచి ఉన్నతాధికారి వరకు ఎవరైనా అవినీతికి పాల్పడితే వారిని పట్టుకోవాల్సిన బాధ్యత ఏసీబీకి ఉంటుంది. ఎక్కడైనా ఏసీబీ దాడులు జరుగుతున్నాయంటే ఇతర ఉద్యోగులు..అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతుంటాయి. ఆయా ప్రభుత్వ శాఖలు లేదా విభాగాల్లో ఏసీబీ కేసు నమోదు అయితే వెంటనే ఆయా ఉద్యోగిని విధుల్లోంచి తొలగించాల్సి ఉంటుంది. కేసు తేలే దాకా విధులకు దూరంగా ఉంచుతారు. ఇంత భారీ స్థాయిలో అవినీతి అధికారులు బయటపడుతుండడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అవినీతికి పాల్పడుతున్న వారు చిన్న స్థాయి ఉద్యోగి నుండి అధికారుల వరకు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఒక అధికారి వద్ద ఇంత దొరుకుతుంటే పైనున్న వారు ఇంకెంత ఆవినీతికి పాల్పడి ఉంటారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎవరూ అవినీతికి పాల్పడినా వారిని ఉపేక్షించవద్దని ప్రజలు కోరుతున్నారు.

బోరుబావిలో చిన్నారి..కొనసాగుతున్న ఉత్కంఠ..

రంగారెడ్డి : బోరు బావి నుండి చిన్నారిని వెలికి తీసే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇబ్రహీంపట్నం మండలం ఇక్కారెడ్డి గూడెంలో 14 నెలల చిన్నారి మీనా బోరుబావిలో పడిపోయిన సంగతి తెలిసిందే. చిన్నారిని వెలికి తీసేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. కానీ ఎన్డీఆర్ ఎఫ్ ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీనితో సింగరేణి నుండి నిపుణులను రప్పిస్తున్నారు. బోరుబావిలోకి ఆక్సిజన్ ను పంపుతున్నారు. బండరాళ్లు అడ్డురావడంతో పనులను నిలిపివేశారు.

12:52 - June 23, 2017

పార్లమెంట్ లో సినిమా ట్రైలర్ విడుదల చేయడం ఏంటీ ? అని ఆశ్చర్యపోతున్నారా ? కానీ ఇది వాస్తవం. భారతీయ చలన చిత్ర పరిశ్రమలోనే తొలిసారిగా ఓ సినిమా ట్రైలర్ విడుదల కానుంది. దర్శకుడు తిగ్మాంషు దులియా తెరకెక్కించిన 'రాగ్ దేశ్' సినిమా ట్రైలర్ ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశ స్వాతంత్ర్య పోరాటంలో ముగ్గురు ఐఏఎస్ అధికారులు ఏం చేశారు ? అన్న దానితో సినిమాను రూపొందించడం జరిగిందని దులియా పేర్కొన్నారు. ఈ చిత్ర ట్రైలర్ ను పార్లమెంట్ లో విడుదల చేయాలని..ఇందుకు అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. పార్లమెంట్ లో ఇలాంటి అవకాశం ఇవ్వడం ఇదే తొలిసారి అని, తమ సినిమాకు ఎంతో గౌరవమన్నారు. కునాల్ కపూర్, అమిత్ సాధ్, మోహిత్ మార్వాలు ఈ సినిమాలో నటించగా గుర్దీప్ సింగ్ సప్పల్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. జులై 28న సినిమా విడుదల కానుంది.

పబ్లిక్ హెల్త్ చీఫ్ ఇంజినీర్ నివాసంపై ఏసీబీ దాడి..

విజయవాడ : పబ్లిక్ హెల్త్ చీఫ్ ఇంజినీర్ పాండురంగారావు నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్, విజయవాడతో సహా 11 చోట్ల తనిఖీలు నిర్వహించింది. తాడేపల్లి నవోదయ కాలనీలో నివాసంలో సోదాలు నిర్వహించింది. తాడేపల్లితో పాటు విశాఖ, తిరుపతిలో ఆస్తులు గుర్తించారు. పాండు రంగారావుకు వ్యాపార సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు.

సెమీస్ కు కిదాంబి శ్రీకాంత్

ఢిల్లీ : ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ సెమీస్ కు శ్రీకాంత్ చేరుకున్నాడు. సాయి ప్రణీత్ పై 25-23, 21-17 తేడాతో శ్రీకాంత్ గెలుపొందాడు.

సీబీఐ కోర్టుకు జగన్..

హైదరాబాద్ : వైసీపీ అధినేత జగన్ సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు విజయసాయిరెడ్డి కూడా హాజరయ్యారు. అక్రమాస్తుల కేసులో జులై 7కు విచారణ వాయిదా పడింది.

12:42 - June 23, 2017

విశాఖపట్టణం..ఉక్కు నగరం..ప్రస్తుతం ప్రతి రోజు వార్తల్లో నిలుస్తుంది. ఇక్కడ జరిగిన భూ కుంభకోణమే ఇందుకు కారణం. దీనితో ప్రతిపక్షాలు పోరాటం ఉధృతం చేస్తున్నాయి. సర్కార్ పై తీవ్ర ఆరోపణలు..విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ తారాస్థాయిలో పోరాటం చేసేందుకు సిద్ధమౌతోంది. ఇప్పటికే భూములు..రైతులు..కార్మికులు..ఇతరత్రా సమస్యలపై చురుగ్గా పోరాటం చేస్తున్న వామపక్షాలను కలుపుకుని పోరాటం చేయాలని వైసీపీ భావిస్తోంది.

భూముల చుట్టూ రాజకీయాలు..
విశాఖపట్టణంలో భూ కుంభకోణాలు తీవ్ర వివాదాన్ని సృష్టిస్తున్నాయి. నెల రోజుల నుండి భూముల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. విశాఖ జిల్లాలో భూ రికార్డులు మార్చివేసి అధికార పార్టీ నేతలు..ప్రభుత్వ భూములను కొట్టేశారని, 6,000 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూములు మాయమయ్యాయని వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా ఏపీలో పరిస్థితులు మారిపోయాయి. దీనిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. మధురవాడ..కొమ్మాది ప్రాంతాల్లో భూముల రికార్డులు తారుమారు అయినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని పేర్కొంటూ సిట్ దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసింది.

గంటా శ్రీనివాస్ రావుపై ఆరోపణలు..
మంత్రి గంటా శ్రీనివాసరావు భీమునిపట్నం ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తుండడంతో ఆయన అనుచరుల పాత్రే ఈ భూముల ట్యాంపరింగ్‌లో అధికంగా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీలో అత్యంత సీనియర్ నేత, సీనియర్ మంత్రి అయిన అయ్యన్నపాత్రుడు బహిరంగంగానే విశాఖలో భూ స్కామ్ జరిగిందని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈవిషయంలో చంద్రబాబు మౌనం ఎందుకు వ్యవహించారనే విమర్శలు వినిపించాయి. ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి గంటా శ్రీనివాసరావే సీబీఐ, సిట్టింగ్ జడ్జి విచారణ కావాలని కోరుతుండడం విశేషం. మరోవైపు హుద్ హుద్ తుఫాన్‌లో రికార్డులు కొట్టుకుపోయాయంటూ విశాఖ జిల్లాలో కొందరు అధికారులు..నేతలు కుమ్మక్కై భూ అక్రమణలకు పాల్పడ్డారని ప్రచారం జరుగుతోంది.

వైసీపీ ధర్నా..
ఇప్పటి వరకు హోదా..జోన్..ప్రత్యేక నిధులు వంటి అంశాలతో ఉద్యమం చేస్తున్న ప్రధాన ప్రతిపక్షం దీనిపై పోరాటం చేసేందుకు నడుం బిగించింది. విశాఖలో 'సేవ్ విశాఖ' పేరిట మహాధర్నా చేపట్టింది. ఈధర్నాకు వామపక్షాలు సైతం మద్దతిచ్చి ధర్నాలో పాల్గొన్నాయి. ధర్నాలో పాల్గొన్న జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. చంద్రబాబు..లోకేష్..మంత్రులు..ఇతరులపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ‘తాము వస్తాం..కబ్జా రాక్షసులను జైళ్లో పెట్టిస్తాం..సీబీఐ చేత విచారణ చేయించాలి..చంద్రబాబును..లోకేష్ ను తన్ని జైల్లో పెడుతారు' అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వివాదం సృష్టిస్తున్నాయి.

తిప్పికొడుతున్న అధికారపక్షం..
దీనిపై అధికారపక్షం స్పందిస్తూ విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తోంది. వారు చేసిన ధర్నా ప్రాంతం అశుద్ధం అయ్యిందని పేర్కొంటూ నేతలు శుద్ధి చేసే ప్రయత్నం చేశారు. పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేసే హక్కు లేదని విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సీబీఐ చేత విచారణ చేయించాలన్న డిమాండ్ ను కూడా కొట్టిపారేస్తున్నారు.

కానీ విశాఖలో జరిగిన భూ దందాపై నిజాలు బయటకొస్తాయా ? లేదా ? అనేది రానున్న రోజుల్లో తేలనుంది.

12:16 - June 23, 2017

బాలీవుడ్ కండల వీరుడు 'సల్మాన్ ఖాన్' నటించిన 'ట్యూబ్ లైట్' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం రిలీజ్ అయ్యింది. రంజాన్ పండుగ సందర్భంగా ఆయన తన చిత్రాలను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు 'ఏక్ థా టైగర్', ‘బజరంగి భాయిజాన్' లాంటి సూపర్ హిట్లు అందించిన కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో 'సల్మాన్' సరసన చైనా న 'జుజు' నటించింది. భారత్‌కు చెందిన ఓ యువకుడు, చైనాకు చెందిన యువతి ప్రేమలో పడుతారు. భారత, చైనా యుద్దంలో వారు ఎలాంటి పరిస్థుతులను ఎదుర్కొన్నారనే కథ నేపథ్యంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ అతిథి పాత్రను పోషిస్తుంచినట్లు తెలుస్తోంది. రూ. 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 'సల్మాన్' ఫిల్మ్ బ్యానర్ లో స్వయంగా సల్మాన్ నిర్మించడం విశేషం. ‘సల్మాన్' సోదరుడు' సోహైల్ ఖాన్' కూడా ఈ చిత్రంలో నటించాడు. ఇదిలా ఉంటే గత సినిమాల్లోగా 'ట్యూబ్ లైట్' చిత్రం లేదని టాక్ వినిపిస్తోంది. సినిమా పూర్తి గా డిసప్పాయింటింగ్ ఉందని సోషల్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. కానీ సినిమా అద్బుతంగా ఉందని 'సల్మాన్' అభిమానులు మాత్రం పేర్కొంటున్నారు.

12:16 - June 23, 2017
12:09 - June 23, 2017

తూర్పుగోదావరి : మరోసారి ఎన్జీసీ పైప్‌లైన్‌ లీక్‌ స్థానికుల్లో టెన్షన్ పెంచింది.. తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో గ్యాస్‌ లీకవుతోంది.. ఓఎన్జీసీ బావి నెంబర్‌ 20 నుంచి ఈ గ్యాస్‌ లీకవుతోంది.. పైప్‌లైన్‌ నుంచి గ్యాస్‌ ఎగజిమ్ముతుండటంతో.. స్థానికులు భయాందోళన చెందుతున్నారు. రంగంలోకి దిగిన ఓఎన్జీసీ అధికారులు గ్యాస్‌ లీకేజీను అదుపుచేసేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. 

12:07 - June 23, 2017

ఢిల్లీ : ఎన్‌డీఏ పక్షాలతరపున రాష్ట్రపతి అభ్యర్థిగా కాసేపట్లో రామ్‌నాథ్‌ కోవింద్ నామినేషన్‌ వేయనున్నారు.. ఈ కార్యక్రమంలో మోదీ, అమిత్‌షా, కేంద్రమంత్రులు.. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఎన్‌డీఏ మిత్రపక్ష పార్టీల సీఎంలు.. తెలంగాణ, తమిళనాడు ముఖ్యమంత్రులు, కోవింద్‌కు మద్దతు పార్టీల నేతలు పాల్గొనబోతున్నారు.. 4 సెట్ల నామినేషన్‌ పత్రాలను లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు రామ్‌నాథ్ అందజేయనున్నారు.. ఉదయం 11గంటలకు పార్లమెంటులో కోవింద్‌ నామినేషన్ దాఖలు చేయనున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

కోవింద్ నామినేషన్ దాఖలు..

ఢిల్లీ : ఎన్డీయే పక్ష రాష్ట్రపతి అభ్యర్థిగా రాంనాథ్ కోవింద్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా లోక్ సభ సెక్రటరీ జనరల్ వ్యవహించనున్నారు. మోడీ..అమిత్ షా..కేంద్ర మంత్రులు..బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు..ఎన్డీయే మిత్రపక్ష పార్టీల సీఎంలు..ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్నాటకకు చెందిన సీఎంలకు పాల్గొన్నారు.

11:58 - June 23, 2017

రంగారెడ్డి : జిల్లాలో బోరుబావి నుంచి చిన్నారిని బయటకుతీసే విషయంపై ఉత్కంఠ నెలకొంది. బండరాళ్లు అడ్డురావడంతో అధికారులు తవ్వకాలు నిలిపివేశారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, కరుణాకర్‌ చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో.. సింగరేణి నుంచి నిపుణులను రప్పిస్తున్నారు. బోరుబావిలో ఉన్న మోటార్‌ను బయటకు తీసేందుకు యత్నిస్తున్నారు. మోటార్‌ బయటకు వస్తే.. చిన్నారిని రక్షించవచ్చని అధికారులు భావిస్తున్నారు. చిన్నారి రావాలని అందురు కోరుకుంటున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి. 

11:56 - June 23, 2017

నెల్లూరు : నెల్లూరు జిల్లా శ్రీహరి కోటోని షార్‌ మరో ఘనత సాధించింది.. పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సీ38 ప్రయోగం విజయవంతమైంది.. పీఎస్ఎల్వీ సీ 38 ద్వారా కార్డోషాట్‌ 2 ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్లింది.. ఉదయం 9గంటల 29 నిమిషాలకు రాకెట్‌ అంతరిక్షంలోకి బయలుదేరింది.. పీఎస్ఎల్వీ ఎక్స్ఎల్ మిషన్‌తో చేస్తున్న 17వ ప్రయోగం ఇది.. పీఎస్ఎల్వీ తీసుకెళ్లిన 30 నానో ఉపగ్రహాల బరువు 243 కిలోలుకాగా... మొత్తం కార్డోషాట్‌ బరువు 712కిలోలుగా ఉంది.... ఈ ఉపగ్రహంద్వారా భూగర్భ జలాలు గుర్తింపు, మ్యాపింగ్‌కు ప్రయోజనం చేకూరనుంది.. ఐదేళ్లపాటు ఈ ఉపగ్రహం సేవలు అందించనుంది.. పీఎస్ఎల్వీ ద్వారా కార్డోషాట్‌తోపాటు 29 ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టారు.

11:49 - June 23, 2017

కరీంనగర్ : జిల్లాలో విజిలెన్స్ సీఐగా పనిచేస్తున్న తుంగ రమేష్ పై లైంగిక వేధింపుల ఆరోపణలతో వన్ టౌన్ పోలిస్ స్టేషన్ కేసు నమోదు అయింది. వివాహిత పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు మాట వినకుంటే ఫోటోలు నెట్ లో పోస్ట్ చేస్తానని బెదిరింపులకు దిగడంతో వేధింపులు భరించలేక బాదితురాలి భర్త పోలీసులను ఆశ్రయించారు. రమేష్ పై 497 సెక్షన్ క్రింద కేసు నమోదు చేశారు. దీని పై కరీంనగర్ సీపీ కమలసన్ రెడ్డి విచారణకు ఆదేశించారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

అంతర్వేదికర వద్ద గ్యాస్ లీక్..

తూర్పుగోదావరి : సఖినేటిపల్లి మండలంలోని మళ్లీ అంతర్వేదికర వద్ద గ్యాస్ లీక్ అయ్యింది. ఓఎన్జీజీసీ 20వ నెంబర్ బావి నుండి గ్యాస్ లీక్ అవుతోంది. లీక్ ను అరికట్టేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

రౌండ్ 3.. స్మార్ట్ సిటీస్ ఇవే..

ఢిల్లీ : స్మార్ట్ సిటీ మిషన్ లో భాగంగా మూడో రౌండ్ లో 30 కొత్త స్మార్ట్ సిటీస్ ను కేంద్ర మంత్రి వెంకయ్య వెలువరించారు. తిరువనంతపురం, నయా రాయ్ పూర్, రాజ్ కోట్, అమరావతి, పాట్నా, కరీంనగర్, ముజఫర్ నగర్, పాండిచ్చేరి, గాంధీనగర్, శ్రీనగర్, సాగర్, కర్నరల్, సాట్నా, బెంగళూరు, షిమ్మా, డెహ్రాడూన్, తిరుపూర్, పింపిరి చిన్ చౌద్, బిల్సాపూర్, పసీగట్, జమ్మూ, దహోడ్, తిరునివెల్లి, తూతుకుడి, తిరుచిరాపల్లి, ఝాన్సీ, అజ్వల్, అలహాబాద్, అలీఘర్, గాంగ్ టక్ లున్నాయి.

స్మార్ట్ సిటీస్ 90 – వెంకయ్య..

ఢిల్లీ : స్మార్ట్ సిటీ మిషన్ లో భాగంగా మూడో రౌండ్ లో 30 కొత్త స్మార్ట్ సిటీస్ ను ఎంపిక చేయడం జరిగిందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. మొత్తంగా స్మార్ట్ సిటీస్ సంఖ్య 90కి చేరిందన్నారు.

పార్లమెంట్ కు బాబు.

ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పార్లమెంట్ హాల్ కు చేరుకున్నారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ నామినేషన్ పత్రంపై సంతకం చేశారు.

11:22 - June 23, 2017

‘వంద మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లి స్టార్ హోటల్ లో పెడితే..సాయంకాలానికి సీఎం అవుతా'..అంటూ 'దగ్గుబాటి రానా' పలికిన డైలాగ్స్ తో అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఆయన నటించిన 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాలో 'రానా' పవర్ ఫుల్ డైలాగ్స్ తో అదరగొట్టారు. ఇటీవలే ఆయన పలు విభిన్నమైన పాత్రలు పోషించుకుంటూ ముందుకెళుతున్న సంగతి తెలిసిందే. ‘బాహుబలి’ చిత్రంతో ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా 'రానా’కు మంచి పేరు వచ్చింది. తేజ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో 'రానా' సరసన 'కాజల్' నటించింది. ట్రైలర్ ఆసక్తికరంగా ఉందని అభిమానులు పేర్కొంటున్నారు. సినిమాపై అభిమానుల అంచనాలను ట్రైలర్ అమాంతం పెంచేసిందని టాక్. 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాను సొంత బేనర్ సురేష్ ప్రొడక్షన్స్ లో దగ్గుబాటి సురేష్ బాబు నిర్మిస్తున్నారు. సంగీతం అనూప్ రూబెన్స్ అందిస్తున్నారు.

నామినేషన్ వేయనున్న కోవింద్..

ఢిల్లీ : ఎన్డీఏ పక్ష రాష్ట్రపతి అభ్యర్థిగా రాంనాథ్ కోవింద్ కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. నాలుగు సెట్ల నామినేషన్ ను సమర్పించనున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా లోక్ సభ సెక్రటరీ జనరల్ వ్యవహించనున్నారు. మోడీ..అమిత్ షా..కేంద్ర మంత్రులు..బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు..ఎన్డీయే మిత్రపక్ష పార్టీల సీఎంలు..ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్నాటకకు చెందిన సీఎంలకు పాల్గొననున్నారు.

కరీంనగర్..అమరావతి స్మార్ట్ సిటీలు..

ఢిల్లీ : స్మార్ట్ సిటీల జాబితాలో 30 నగరాలకు చోటు దక్కింది. తెలుగు రాష్ట్రాల్లోని కరీంనగర్..అమరావతి చోటు సంపాదించాయి. తమిళనాడు 4, కేరళ 1, యూపీలో 3 నగరాలకు చోటు దక్కాయి. కర్నాటక 1, గుజరాత్ 3, ఛత్తీస్ గఢ్ 2 నగరాలకు చోటు దక్కింది. స్మార్ట్ సిటీల్లో మౌలిక సదుపాయాలకు రూ. 57,393 కోట్లు విడుదల చేయనున్నట్లు, 25న స్మార్ట్ సిటీ మిషన్, పీఎంఈవై పథకాలు ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.

సింగరేణి ఓపెన్స్ కాస్ట్ లో ప్రమాదం..

పెద్దపల్లి : రామగుండం సింగరేణి ఓపెన్ కాస్ట్ -3లో ప్రమాదం చోటు చేసుకుంది. డంపర్ కింద పడి ఓవర్ మెన్ రాజేంద్రప్రసాద్ మృతి చెందాడు.

10:38 - June 23, 2017

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ 'అల్లు అర్జున్' తాజా చిత్రం 'డీజే..దువ్వాడ జగన్నాథమ్' ప్రేక్షకులు ముందుకొచ్చేసింది. శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది. ఈ చిత్రం గురించి అభిమానులు ఎంతో ఉత్కంగా ఎదురు చూశారు. ‘హరీశ్ శంకర్' దర్శకత్వంలో 'పూజా హేగ్డే' హీరోయిన్ గా నటించారు. 'దిల్' రాజు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాలో బ్రాహ్మణుడిగా...మాస్ గా రెండు పాత్రల్లో 'బన్నీ' నటించడం విశేషం. బ్రాహ్మణ పాత్రలో ఉన్న 'బన్నీ' వంటవాడిగా చేస్తుంటాడు. ఈవెంట్స్ అన్ని ఇతనే నిర్వహిస్తుంటాడు. ఇతనికి స్నేహితుడు 'వెన్నెల కిశోర్' ద్వారా 'పూజా హేగ్డే' పరిచయం అవుతుంది. ఈ మధ్యలో ‘అల్లు అర్జున్’ ప్రేమిస్తుంటాడు. కానీ పూజ తండ్రి హోం మినిస్టర్ పోసాని కృష్ణ మురళి..రొయ్యల నాయుడు (రావు రమేష్) కుమారుడు సుబ్బరాజుతో వివాహం నిశ్చయించుకుంటారు. కానీ ‘పూజా’ మాత్రం ‘శాస్త్రీ’నే పెళ్లి చేసుకుంటానని అంటుంది. ఇదిలా ఉండగా డీజే.. తెరపై వస్తాడు. రియల్ ఎస్టేట్ ..తదితర స్కాంలపై పోరాటం చేస్తుంటాడు. న్యాయం కోరుతున్న వారికి ఇతను అండగా నిలుస్తుంటాడు. మరి అసలు డీజే....దువ్వాడ జగన్నాథమ్ కు సంబంధం ఏంటీ ? చిత్రంలో డ్యూయల్ రోల్ ఉందా ? లేక ఒక్కడేనా అనేది చిత్రం చూస్తే తెలిసిపోతుంది. కామెడీ మాత్రం బాగుందని టాక్ వినిపిస్తోంది. డ్యాన్స్ లో మరోసారి 'బన్నీ' విరగదీశాడని అభిమానులు అనుకుంటున్నారు. ఫైట్స్ కూడా బన్నీ తనదైన శైలిలో చేశాడని తెలుస్తోంది.

10:33 - June 23, 2017

రంగారెడ్డి : జిల్లా రంగాపూర్ మండలంలోని మంచాల గ్రామంలో విషాదం నెలకొంది. అప్పుల బాధతో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మోహన చారి బ్యాంక్ ఉద్యోగం విడిచి వెళ్లి వ్యవసాయం మొదలు పెట్టారు. సుమారు 10 ఎకరాల భూమిలో సాగు చేశారు. కానీ నీటి ఎద్దడి రావడంతో దాదాపు 10 బోర్లు వేశాడు. ఈ బోర్ల కోసం రూ.10లక్షలు ఖర్చు చేశాడు. అయిన కూడా నీరు లేకపోవడంతో గొర్రెలు, పశువులు కొనుగోలు చేశారు. దీని కోసం బ్యాంక్ లో రుణం తీసుకున్నారు. అప్పుల బాధ ఎక్కువ కావడంతో నిన్న రాత్రి మోహన చారి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. 

విజిలెన్స్ సీఐపై కేసు నమోదు..

కరీంనగర్ : విజిలెన్స్ సీఐ తుంగ రమేష్ పై వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. వివాహితపట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలున్నాయి. మాట వినకుంటే ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తానని బెదిరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేధింపులు భరించలేక భాదితురాలి భర్త పోలీసులను ఆశ్రయించాడు.

ముద్రగడను కలిసిన రఘువీరా..

విజయవాడ : 'చలో అమరావతి' పాదయాత్రకు ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా మద్దతు తెలియచేశారు. కాసేపటి క్రితం కిర్లంపూడి చేరుకున్న ఆయన ముద్రగడను కలిశారు. రఘువీరా తో పాటు కేంద్ర మాజీ మంత్రి పళ్లం రాజు కూడా ఉన్నారు.

చిన్నారి క్షేమంగా రావాలని..

రంగారెడ్డి : ఇబ్రహీంపట్నం మండలం ఇక్కారెడ్డి గూడెంలో బోరుబావిలో పడిపోయిన 14 నెలల చిన్నారి మీనా క్షేమంగా బయటకు రావాలని ప్రతొక్కరూ కోరుకుంటున్నారు. ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, సీఐఎస్ఎఫ్, రెవెన్యూ తదితర యంత్రాంగం సహాయకచర్యలు చేస్తున్నారు. కొచ్చి నుంచి ఎన్డీఆర్ఎఫ్ కు చెందిన నిపుణులు చేరుకోనున్నారని అధికారులు పేర్కొంటున్నారు.

ఇస్రో విజయాలకు దేశం గర్విస్తోంది - బాబు..

విజయవాడ : పీఎస్ ఎల్వీ -సీ -38 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల సీఎం చంద్రబాబు నాయుడు హర్షం వెలిబుచ్చారు. ఇస్రో విజయాలకు యావత్ దేశం గర్విస్తోందని, ప్రయోగంలో భౄగమైన శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియచేస్తున్నట్లు వెల్లడించారు. 14 దేశాలకు చెందిన 31 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశ పెట్టి ఇస్రో తన సత్తాను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిందని తెలిపారు.

పీఎస్ ఎల్వీ -సీ -38 రాకెట్ ప్రయోగం సక్సెస్..

నెల్లూరు : శ్రీహరికోట నుండి పీఎస్ ఎల్వీ -సీ -38 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. కార్టోశాట్ 2ఇ తో సహా 31 ఉపగ్రహాలు నింగిలోకి దూసుకెళ్లాయి.

 

10:13 - June 23, 2017
09:33 - June 23, 2017

ఢిల్లీ : నేడు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీతో పాటు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, వెంకయ్య, అరుణ్ జైట్లీ పాల్గోంటారు. రామ్ నాథ్ కోవింద్ ఉదయం 11 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 10గంటల వరకు దేశంలోని బీజేపీ రాష్ట్రాపాలిత ముఖ్యమంత్రులు పార్లమెంట్ కు చేరుకుంటారు. కోవింద్ మద్దతుగా తెలంగాణ, తమిళనాడు ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కోవింద్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. సాయంత్రం ప్రధాని మోడీ విందు ఇవ్వనున్నారు. మరోవైపు విపక్షాల అభ్యర్థి మీరా కుమారి రెండు, మూడు రోజుల్లో నామినేషన్ వేసే అకాశం ఉంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

నేడు వెస్టిండీస్ భారత్ తొలి వన్డే మ్యాచ్

 

వేస్టిండీస్ : నేడు వెస్టిండీస్ భారత్ మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ సాయత్రం 6.30 గంటలకు ప్రారంభం అవుతుంది. 

హిందుపురంలో బాలకృష్ణ పర్యటన

అనంతపురం : ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నేడు హిందుపురం నియోజవర్గంలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. 

నేడు ముద్రగడను కలవనున్న రఘువీరా

తూర్పుగోదావరి : నేడు కిర్లంపూడిలో ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా కాపు నేత ముద్రగడ కలవనున్నారు. ఈ నెల 26 నుంచి ముద్రగడ చేపట్టే పాదయాత్ర పై చర్చంచే అవకాశం ఉంది. 

నేడు ఢిల్లీకి చంద్రబాబు

 

గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబు నేడే ఢిల్లీ వెళ్లనున్నారు. ఎన్డీఏ అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ నామినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. 

నేపాల్ నుంచి ఢిల్లీ చేరుకోనున్న తెలుగు యాత్రికులు

ఢిల్లీ : నేడు నేపాల్ నుంచి ఢిల్లీకి తెలుగు యాత్రికులు చేరుకోనున్నారు. తెలుగు వారు నేపాల్ లోని మానస సరోవరం యాత్రకు వెళ్లి 21 మంది తెలుగు వారు కొండల్లో చిక్కుకున్నారు.

09:12 - June 23, 2017
09:11 - June 23, 2017

రంగారెడ్డి : జిల్లా చేవెళ్ల మండలం ఇక్కారెడ్డిగూడలో నిన్న రాత్రి బోరుబావిలో పడిన చిన్నారిని రక్షించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. స్థానిక పద్దతులు కొక్కెం ద్వారా పైకి తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. తెల్లవారుజామూన 3గంటల వరకు పాప గొంతు రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళ చెందుతున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

09:04 - June 23, 2017

చిత్తూరు : ఉపాధికి ఊతమిచ్చే ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల తయారీ పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యత ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన అన్ని రకాల మౌలికసదుపాయాలను అభివృద్ధికి చర్యలు చేపట్టింది. చిత్తూరు జిల్లా రేణిగుంటలోని ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల తయారీ సముదాయంలో సెల్‌కాన్‌ మొబైట్‌ ఫోన్ల తయారీ పరిశ్రమను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. ఇక్కడ తయారైన మొదటి మొబైల్‌ఫోన్‌ను ఆవిష్కరించారు. స్పాట్‌ రేణిగుంట ఎలక్ట్రానిక్స్‌ క్లస్టర్‌లో 20 ఎకరాల విస్తీర్ణంలో 150 కోట్ల పెట్టుబడితో సెల్‌కాన్‌ మొబైల్‌ ఫోన్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 12 వేల మందికి ఉపాధి లభిస్తోంది. ప్రస్తుతం ఒక షిఫ్టులో పని చేస్తున్న సెల్‌కాన్‌లో త్వరలో మూడు షిఫ్టుల్లో ఉత్పత్తి ప్రారంభించాలని సంస్థ నిర్ణయించింది. దీంతో మరి కొన్నివేల మందికి ఉపాధి లభిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రేణిగుంట ఎలక్ట్రానిక్స్‌ సముదాయంలో వచ్చే రెండేళ్లలో లక్షల మందికి ఉపాధి కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఏపీ విద్యుత్‌ మిగులు రాష్ట్రంలో ఆవిర్భవించడంతో వచ్చే ఏడాది విద్యుత్‌ చార్జీలు తగ్గించే విషయాన్ని పరిశీలిస్తామని సీఎం హామీ ఇచ్చారు. కొంతమంది అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని, ఇలాంటి వారి ఆటలుసాగవని పరోక్షంగా ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్‌ను హెచ్చరించారు.వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో ఐటీ రంగంలో లక్ష మందికి, ఎలక్ట్రానిక్స్‌లో ఐదు లక్షల మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ మంత్రి లోకేశ్‌ చెప్పారు. ప్రతి నెలా రాష్ట్రంలో ఒక పరిశ్రమకు శంకుస్థాపన చేయడం లేక ఒక పరిశ్రమను ప్రారంభించే విధంగా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. 

09:03 - June 23, 2017

నెల్లూరు : వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఇస్రో శాస్త్రవేత్తలు పీఎస్ఎల్వీ సీ 38 ద్వారా మరో ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరి కోటలోని సతీష్ దావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల 29 నిమిషాలకు పీఎస్ఎల్వీ సీ38 వాహన నౌకను రోదసీలోకి పంపనున్నారు. దీనికి సంబంధించిన రిహార్సల్స్‌ సైతం ఇస్రో శాస్త్రవేత్తలు దిగ్విజయంగా పూర్తి చేశారు. బుధవారం జరిగిన ఎంఆర్ఆర్ సమావేశంలో ఉపగ్రహంలోని డేటా పక్కాగా ఉందని నిర్ధారించుకుని రాకెట్ ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

కౌంట్‌డౌన్ ప్రారంభం
ఈ రాకెట్‌ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ గురువారం ఉదయం 5.08 గంటల నుంచి ప్రారంభమైంది. 28 గంటల అనంతరం షార్‌లోని మొదటి వేదికపై నుంచి పీఎస్ఎల్వీ సీ 38.. 31 ఉపగ్రహాలతో కక్ష్య వైపు దూసుకెళ్లనుంది. ఇందులో మన దేశానికి చెందిన 712 కిలోల కార్టోశాట్‌-2ఇ ఉపగ్రహం.. తమిళనాడులోని నూరుల్‌ ఇస్లాం విశ్వవిద్యాలయానికి చెందిన 15 కిలోల ఐఎన్‌యూ శాటిలైట్‌తో పాటు... విదేశాలకు చెందిన 29 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది. షార్ డైరెక్టర్ కున్హి క్రుష్ణన్ సారథ్యంలో పీఎస్‌ఎల్వీ సీ-38 వాహన నౌక ప్రయోగ సమయాన్ని నిర్ణయించారు. ఇస్రో చైర్మన్‌ కిరణ్‌కుమార్‌ ఈ ప్రయోగాన్ని పర్యవేక్షించనున్నారు.

అందుబాటులోకి మరిన్ని సేవలు
ప్రస్తుతం రోదసీలోకి పంపుతున్న కార్టోశాట్‌ ద్వారా భారత్‌కు మరిన్ని సేవలు అందనున్నాయి. ఇప్పటివరకు పంపిన కార్టో సిరీస్ ఉపగ్రహాల్లో ఇది ఆరోది. దీన్ని ద్వారా అత్యాధునిక పాంక్రోమేటిక్, మల్టీ స్పెక్టర్లు కెమెరాలతో మనదేశ భూభాగంలోని స్పష్టమైన చిత్రాలను అందజేస్తుంది. దీని ద్వారా భూముల వినియోగం, నీటి సరఫరా వ్యవస్థల పరిశీలన, రోడ్ నెట్‌వర్క్‌ల సేవలు అందుబాటులోకి రానున్నాయి. కాగా ఈ ప్రయోగంలో శాస్త్రవేత్తలు PSLV ఎక్స్‌ఎల్‌ తరహా రాకెట్‌ను ఉపయోగిస్తున్నారు.

09:00 - June 23, 2017

రంగారెడ్డి : జిల్లా చేవెళ్ల మండలం ఇక్కారెడ్డిగూడలో నిన్న రాత్రి బోరుబావిలో పడిన చిన్నారిని రక్షించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నిన్న సాయంత్రం 6గంటలకు బోరు బావిలో పడ్డ చిన్నారి 12 గంటలు గడిచిన కూడా బయటకు రాకపోవడం పై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. బోరు బావి సమాంతరంగా గోయ్యి తవ్వుతున్న మధ్యలో రాయి రావడంతో ఈ ప్రయత్నాన్ని తత్కాలికంగా అపివేశారు. పాపను పైపు ద్వారా ఇప్పటికే 40 అడుగుల పైకి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.  

08:59 - June 23, 2017

రంగారెడ్డి : జిల్లా చేవెళ్ల మండలం ఇక్కారెడ్డిగూడలో నిన్న రాత్రి బోరుబావిలో పడిన చిన్నారిని రక్షించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పొలం దగ్గరకు తల్లిదండ్రులతో వెళ్లిన చిన్నారి వీణ ఆడుకుంటూ అక్కడే ఉన్న బోరుబావిలోకి పడిపోయింది. పాప అరుపులను విన్న తల్లిదండ్రులు, ఇతర కూలీలు అధికారులకు సమాచారం అందించడంతో.. జిల్లా అధికారులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. ప్రత్యేక పరికరాల ద్వారా పాపను బయటకు తీసుకువచ్చేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక రంగంలోకి దిగిన NDRF బృందాలు రోబోటిక్‌ యంత్రం ద్వారా పాపను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు జేసీబీలతో తవ్వకాలు జరుపుతున్నారు. అయితే.. గంటకు 5 అడుగల మేర తవ్వకాలు మాత్రమే జరుగుతున్నాయి. 15 అడుగుల తర్వాత రాయి అడ్డురావడంతో కొద్దిసేపు తవ్వకాలు ఆపివేసి.. ఇతర మార్గాల ద్వారా పాపను బయటకు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. ఆ ప్రయత్నాలు కూడా సఫలీకృతం కాకపోవడంతో మళ్లీ జేసీబీలతో తవ్వకాలు జరిపిస్తున్నారు. పాప బోరుబావిలో 40 అడుగుల లోతులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే.. పాప బోరుబావిలో క్షేమంగానే ఉందని.. కదలికలు కనిపిస్తున్నాయంటున్నారు. ఇదిలావుంటే ఈ సహాయకచర్యలన్నింటిని మంత్రి మహేందర్‌రెడ్డి, కలెక్టర్‌లు దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు.

 

08:16 - June 23, 2017

రాజకీయ వివాదం కాదు ఇది ప్రజల ఆస్తులకు సంబంధించిన విషయం, ప్రతిపక్షాలు, ప్రజలు గత కొన్ని నెలలుగా దీనిపై పోరడుతోందని, బహిరంగ విచారణ చేస్తామని చెప్పి సిట్ వేయడం, మంత్రి గంటా శ్రీనివాస్ సీబీఐ విచారణ డిమాండ్ చేశారని సీపీఎం బాబురావు అన్నారు. పేదల భూములు లాక్కొవటం, గంటా శ్రీనివాస్ బీనామి పేరుతో వందల ఎకరాలు కబ్జా చేశారని, వైసీపీ నేత మదన్ మోహన్ అన్నారు. జగన్ పై సీబీఐ 14 కేసులు ఉన్నాయని, కొంత మంది లంచం తీసుకున్నవారు భూములు బదలియించారు. వైసీపీ దగ్గర ఆధారాలు ఉంటే వెంటనే సిట్ కు అందించాలని, దీనికి ప్రభుత్వానికి సంబంధం లేదని టీడీపీ నేత కేవీపీ చౌదరి అన్నారు. 

07:58 - June 23, 2017

ప్రభుత్వం నిరుపేదలైన వారికి బతుకమ్మ సందర్భంగా చీరల పంపిణీ మంచి కార్యక్రమం, చీరల అర్డర్ కేవలం సిరిసిల్ల కాకుండా నల్లగొండ, యాదాద్రి ఉన్న చేనేత కార్మికులకు కూడా అర్డర్స్ ఇవ్వాలని టెన్ టివి జనపథంలో చర్చలో పాల్గొన్న చేనేత కార్మిక సంఘం నేత రమేష్ అన్నారు. రాజీవ్ విద్య మిషన్ ద్వారా స్కూల్ యూనిఫామ్ లు అర్డర్ ఇచ్చే ముందు 6 నెలలు ఇస్తే బాగుటుందని, ఆయనా అన్నారు. ప్రభుత్వం చేనేత కార్మికులకు సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదని తెలిపారు.

 

నేడు పీఎస్ఎల్వీ సీ38 రాకెట్ ప్రయోగం

నెల్లూరు : నేడు సీఎస్ఎల్వీ సీ38 రాకెట్ ప్రయోగం చేయనున్నారు. రాకెట్ ఉదయం 9.29 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లనుంది. స్పదేశీ కార్టోశాట్ 2ఈ ఉపగ్రహం సహా 14 దేశాలకు చెందిన 29 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. 

లాటరీ ద్వారా శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు

చిత్తూరు : తిరులమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఈ రోజు లాటరీ ద్వారా కేటాయిస్తారు. నమోదుకు ఉదయం 10 గంటల వరకే అవకాశం ఉంది. 

Don't Miss